ధార్మిక విద్య ప్రాముఖ్యత & ఇమాం బుఖారి (రహిమహుల్లాహ్) జీవిత చరిత్ర ఘట్టాలు [వీడియో]

బిస్మిల్లాహ్
ధార్మిక విద్య ప్రాముఖ్యత & ఇమాం బుఖారి (రహిమహుల్లాహ్) జీవిత చరిత్ర ఘట్టాలు
https://youtu.be/B98wCOesg2s

[32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ అబూ బక్ర్ బేగ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)
విజ్ఞానం : https://teluguislam.net/others/ilm-knowledge/

దీనికి సంబంధించిన ఇతర లింకులు:

ధార్మిక విద్య నేర్చుకునే వారికి శుభవార్తలు [వీడియో]

బిస్మిల్లాహ్
ధార్మిక విద్య నేర్చుకునే వారికి శుభవార్తలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/i0pZfkrpsFo

[30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
విజ్ఞానం : https://teluguislam.net/others/ilm-knowledge/

దీనికి సంబంధించిన ఇతర లింకులు:

నెలసరి (Menses) ఆగిపోయిందని ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[2:24 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

బహిష్టు, బాలింత స్త్రీలు:

స్త్రీలు తమ ఋతుస్రావము మరియు బాలింత గడువులో ఉన్నప్పుడు నమాజ్, ఉపవాసాలు పాటించకూడదు. హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«إِذَا أَقْبَلَتِ الحَيْضَةُ، فَدَعِي الصَّلاَةَ، وَإِذَا أَدْبَرَتْ، فَاغْسِلِي عَنْكِ الدَّمَ وَصَلِّي»

“నీవు ఋతువు గడువు దినాల్లో నమాజ్ చేయడం మానేయి. ఋతు స్రావం ముగిసాక నీ వొంటి మీది రక్తాన్ని కడిగి (తలంటు స్నానం చేసి) నమాజ్ చేస్తూ ఉండు”. (బుఖారి 331, ముస్లిం 333).

తప్పి పోయిన నమాజులు తిరిగి చేయకూడదు. కాని తప్పి పోయిన ఉపవాసాలు మాత్రం పూర్తి చేయాలి. అలాగే వీరు కాబా ప్రదక్షిణం (తవాఫ్) కూడా చేయకూడదు. ఈ గడువులో భర్త తన భార్యతో సంభోగించడం కూడా నిషిధ్ధం. అయితే రమించడం తప్ప పరస్పరం ఏ రకమైన ఆనందం పొందినా తప్పు లేదు. ఈ స్థితిలో స్త్రీ ఖుర్ఆనును తాక వద్దు.

రక్త స్రావం ఆగిన తరవాత స్నానం చేయడం విధిగా ఉంది([1]). స్నానం తర్వాత వారి గడువులో నిశిద్ధంగా ఉన్నవన్నీ ధర్మ సమ్మతం అవుతాయి.

నమాజ్ సమయం ప్రవేశించిన తరువాత, ఆ నమాజ్ చేయక ముందే ఏ స్త్రీకైనా ఋతు స్రావం మొదలవుతే, లేదా ప్రసవిస్తే ఆమె పరిశుద్ధురా- లయిన తరువాత ఆ నమాజును తిరిగి చేయాలి. (ఉదా: జొహ్ర్ నమాజ్ వేళ ఆరంభమయింది పగలు పన్నెండు గంటల నలబై నిమిషాలకు, ఒక స్త్రీ ఒకటింటి వరకు కూడా  జొహ్ర్ నమాజ్ చేసుకోలేక పోయింది. అప్పుడే ఋతు స్రావం మొదలయింది, లేదా ప్రసవించింది. అలాంప్పుడు ఆ స్త్రీ పరిశుద్ధురాలయిన తరువాత జొహ్ర్ నమాజ్ చేయాలి). ఒక రకాతు మాత్రమే చేయునంత సమయం ఉన్నప్పుడు పరిశుద్ధుమైన స్త్రీ గుస్ల్ చేసిన తరువాత ఆ నమాజ్ చేసుకోవాలి. ఒక వేళ అది అస్ర్ లేదా ఇషా నమాజ్ అయితే అస్ర్ తో పాటు జొహ్ర్, మగ్రిబ్ తో పాటు ఇషా కూడా చేయుట అభిలషణీయం. ఉదాః సూర్యాస్తమయానికి ఒక రకాత్ చేయునంత ముందు పరిశుద్ధమైతే అస్ర్ నమాజ్ మాత్రం తప్పక చేయాలి. అయితే జొహ్ర్ కూడా ఖజా చేస్తే మంచిది. అర్థ రాత్రికి కొంచెం ముందు పరిశుద్ధురాలయితే ఇషా మాత్రం చేయవలసిందే, అయితే మగ్రిబ్ కూడా చేయడం మంచిది.


[1]  కొందరు బాలింత స్త్రీలు 15, లేదా 20, 25 రోజుల్లో రక్త స్రావం నిలిచిపోయినా 40 రోజుల తరువాతే గుస్ల్ చేస్తారు. ఆ తరువాతే నమాజు ఆరంభిస్తారు. వారు ఇలా చేసేది చాలా ఘోరమైన తప్పు. ఎప్పుడు రక్త స్రావం నిలిచినదో అప్పుడే గుస్ల్ చేయాలి. నమాజు మొదలెట్టాలి.

హైజ్ (ముట్టు, బహిష్టు), నిఫాస్ (పురిటి రక్తం)

ధర్మ జ్ఞానం నేర్చుకునే విద్యార్థుల్లారా! ప్రవక్త ఇచ్చిన ఈ శుభవార్తను అందుకోండి [వీడియో]

బిస్మిల్లాహ్

[4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
విజ్ఞానం : https://teluguislam.net/others/ilm-knowledge/

దీనికి సంబంధించిన ఇతర లింకులు:

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 11 – నమాజ్ లో మరచిపోవుట, సున్నతె ముఅక్కద, విత్ర్, ఫజ్ర్ సున్నతులు, చాష్త్ నమాజ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[49 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజులో మరచిపోవుట:

ఎవరైనా నమాజులో మరచిపోతే, అంటే; నమాజులో ఏదైనా అదనపు కార్యం లేదా ఏదైనా కొరత జరుగుతే, లేదా అలాంటి అనుమానం ఏదైనా కలుగుతే రెండు సజ్దాలు చేయాలి. వీటిని సహు సజ్దా అంటారు.

మరచిపోయి నమాజులో ఏదైనా హెచ్చింపు జరిగినప్పుడు, అంటే; ఖియాం, లేదా రుకూ, లేదా సజ్దా లాంటిదేదైనా అదనంగా చేసినప్పుడు సలాం త్రిప్పిన తరువాత రెండు సహ్ వ్ సజ్దాలు చేయాలి.

ఒకవేళ మరచిపోయి నమాజులో ఏదైనా కొరత జరిగినప్పుడు అంటే; నమాజులో చేయవలసిన ఏదైనా కార్యం చేయక, చదవ వలసినా ఏదైనా దుఆ, సూరా చదవక కొరత జరుగుట. ఒకవేళ అది ‘రుకున్’ అయితే, దాని రెండు స్థితులుః ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు వస్తే, వెంటనే ఆ ‘రుకున్’ నెరవేరుస్తూ, ఆ రకాతులో దాని తరువాత ఉన్నవాటిని పూర్తి చేయాలి([1]). సలాం తిప్పేకి ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు రాకుంటే ఆ రకాత్ కానట్లే లెక్క. ఇప్పుడు చేస్తున్న రకాతే దాని స్థానం తీసుకుంటుంది([2]).

మరచిపోయిన రుకున్ సలాం తరువాత కొద్ది క్షణాలకే గుర్తుకు వస్తే, పూర్తి ఒక రకాత్ చేసి, సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. తొందరగా గుర్తుకు రాలేదు, లేదా వుజూ భంగమయితే తిరిగి పూర్తి నమాజ్ చేయాలి.

మొదటి తషహ్హుద్ లాంటి వాజిబ్ మరచిపోయినప్పుడు సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేస్తే సరిపోతుంది.

ఇక అనుమాన స్థితికి గురైనప్పుడు; ఈ అనుమానం రకాతుల సంఖ్యలో ఉంటే, ఉదాః రెండు రకాతులు చదివానా లేదా మూడా? అని సందేహం కల్గితే, తక్కువ సంఖ్యపై నమ్మకం ఉంచుకొని, మిగిత రకాతులు పూర్తి చేసుకోవాలి. సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఒకవేళ రుకున్ విషయంలో సందేహం కలుగుతే, దాన్ని చేయలేని కింద లెక్క కట్టి, దాన్ని నెరవేర్చాలి. దాని తరువాత రకాతులు చేసుకోవాలి. సజ్దా సహ్ వ్ చేయాలి.

సున్నతె ముఅక్కద

స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారు:

 (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).

“ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజ్ చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును”. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజ్ లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

 (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజ్ నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).

జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

 (فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).

“మనిషి తనింట్లో చేసే నమాజ్ అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజ్ తప్ప”. (బుఖారి 6113).

విత్ర్ నమాజ్

అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి గడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఒకటి. ప్రవక్త మహా నీయులు విత్ర్ మరియు ఫజ్ర్ కు ముందు గల రెండు రకాతుల సున్నతులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా. విత్ర్ యొక్క కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో 11 రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః

أَنَّ رَسُولَ الله كَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).

రాత్రి నమాజ్ రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

 (صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).

“రాత్రి వేళ నఫిల్ నమాజ్ రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయు. దీనివల్ల మొత్తం నమాజ్ విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”.  (బుఖారి 991, ముస్లిం 749).

అప్పుడప్పుడు విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.

రాత్రి నమాజ్ చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజ్ తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.

ఫజ్ర్ సున్నతులు

ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్న, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేది. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:

أَنَّ النَّبِيَّ ﷺ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنْ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى رَكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ.

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్న తులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు”. (బుఖారి 1163, ముస్లిం 724).

వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారుః

لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.

“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).

మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.

ప్రవక్త అనుసరణలో వాటిని సంక్షిప్తంగా చేయాలి. ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజ్ తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.

చాష్త్ నమాజ్

దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

عَنْ أَبِي ذَرٍّ عَنْ النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيٌ عَنْ الْمُنْكَرِ صَدَقَةٌ وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنْ الضُّحَى).

“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళున్నాయో వాటి లో ప్రతి దానికీ ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయం లో 2 రకాతులు సరిపోతాయి”.

عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ: صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ.

హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదిలి- పెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).

దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.


[1]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడ్డాడు కాని ఖిరాత్ ఆరంభానికి ముందే అతనికి మరచిపోయిన రుకూ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అతను రుకూ చేయాలి, రెండు సజ్దాలు చేయాలి. మళ్ళీ రెండవ రకాతు కొరకు నిలబడి యథా ప్రకారంగా నమాజు పూర్తి చేయాలి.

[2]) దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడి, ఖిరాత్ ఆరంభించిన తర్వాత గుర్తుకు వస్తే అతని ఆ రకాతు, ఎందులో అతను రుకూ మరచిపోయాడో అది కానట్లే. అందుకు ఈ రెండవ రకాతు మొదటి రకాతు స్థానంలో ఉంటుంది.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ధార్మిక విద్యా విధానం [వీడియో]

బిస్మిల్లాహ్

[56:10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

విజ్ఞానం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/ilm-knowledge/

దీనికి సంబంధించిన ఇతర లింకులు:

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 10 – నమాజు విధానం, నమాజ్ తర్వాత జిక్ర్, మస్బూఖ్, నమాజ్ భంగపరుచు కార్యాలు,నమాజ్ వాజిబులు,రుకున్ లు [వీడియో]

బిస్మిల్లాహ్

[1: 00 :14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజ్ విధానం:

నమాజ్ చేసేటప్పుడు నియ్యత్ (సంకల్పం) తప్పనిసరిగా చేయాలి. అలాగే ఇతర ఆరాధనల్లో కూడా చేయాలి. అయితే నియ్యత్ మనుస్సులో చేయాలి. నోటితో కాదు.

నమాజ్ చిత్రాలు చూడండి:

నమాజు పద్ధతి చిత్రాలు

ఇక నమాజ్ పద్ధతి ఇలా వుందిః

1- పూర్తి శరీరము మరియు పూర్తి శ్రద్ధాభక్తుల తో ఖిబ్లా దిశలో నిలబడాలి. చూపులు, శరీరము అటూ ఇటూ ఉండకూడదు. (చూపులు సజ్దా చేసే చోట కేంద్రికరించాలి).

2- ‘తక్బీరె తహ్రీమ’ అల్లాహు అక్బర్ అంటూ

రెండు చేతులు భుజాల వరకు లేదా చెవుల వరకు ఎత్తాలి. చూడండి (చిత్రం1)

3- కుడి అర చెయ్యిని ఎడమ చెయ్యిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి. (చిత్రం2)

4- దుఆయె ఇస్తిఫ్ తాహ్ చదవాలిః

అల్ హందులిల్లాహి హందన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్. (ముస్లిం 600).

(الْحَمْدُ لله حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ).

(శుభాలు గల, అనేకానేక మంచి స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందును).

సుబ్ హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబార కస్ముక వతఆల జద్దుక వలాఇలాహ గైరుక.

سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ وَتَبَارَكَ اسْمُكَ وَتَعَالَى جَدُّكَ وَلَا إِلَهَ غَيْرُكَ

ఓ అల్లాహ్ నీవు పరమ పవిత్రునివి, నీకే సర్వ స్తోత్రములు, నీ నామము శుభం గలది. నీ మహిమ చాలా ఘనమయినది. నీవు తప్ప ఆరాధ్యుడెవడు లేడు.

ఇవి రెండే గాకుండా ఇతర దుఆలు కూడా చదవవచ్చును. ఎల్లప్పుడూ ఒకే దుఆ కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు దుఆలు చదవడం ఉత్తమం. ఇలా నమాజులో నమ్రత, శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.

5- అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్,

6- బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ చదివి, సూరె ఫాతిహ చదవాలిః అల్ హమ్ దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మా నిర్రహీమ్, మాలికి యౌమిద్దీన్, ఇయ్యాక నఅ బుదు వఇయ్యాక నస్త ఈన్, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్ త అలైహిం,  గైరిల్ మగ్ జూబి అలైహిమ్ వలద్జాల్లీన్. (ఆమీన్).

بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ* الْحَمْدُ للهِ رَبِّ العَالَمِينَ* الرَّحْمَنِ الرَّحِيمِ* مَالِكِ يَوْمِ الدِّينِ* إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ* اهْدِنَا الصِّرَاطَ المُسْتَقِيمَ*صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ المَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ

అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో * ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, * అపార కరుణా మయుడు, పరమ కృపాశీలుడు. * ప్రతిఫల దినానికి (అంటే ప్రళయ దినానికి) యజమాని. * మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము. * మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు. * నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోనుకాని వారి మార్గం.

7- కంఠస్తం చేసి ఉన్న ఖుర్ఆనులోని ఏదైనా సూరా లేదా కొన్ని ఆయతులు పఠించాలి.

8- చేతులు భుజాల వరకు ఎత్తి, అల్లాహు అక్బర్ అంటూ రుకూ చేయాలి. రుకూలో అరచేతుల తో మోకాళ్ళను పట్టుకోవాలి. వ్రేళ్ళు దగ్గరదగ్గరగా కాకుండా విడిగా ఉండాలి. సుబ్ హాన రబ్బియల్ అజీం మూడు సార్లు చదువుట సున్నత్. అంతకంటే ఎక్కువ చదవవచ్చు. ఒక్క సారి చదివినా సరిపోవును. చూడండి (చిత్రం3)

9- ఒంటరి నమాజ్ చేయు వ్యక్తి మరి ఇమాం రుకూ నుండి తల లేపుతూ సమిఅల్లాహు లిమన్ హమిద అంటూ భుజాల వరకు చేతులెత్తాలి. ముఖ్తదీ సమిఅల్లాహు లిమన్ హమిదహ్ కు బదులుగా రబ్బనా వలకల్ హమ్ ద్ అనాలి. ఈ స్థితిలో కుడి చెయి ఎడమ చెయిపై పెట్టి ఛాతిపై కట్టుకోవాలి.

10- రుకూ తర్వాత నిలబడి ఉన్నప్పుడు ఈ దుఆ కూడా చదవవచ్చునుః అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ దు మిల్ఉస్ సమావాతి వ మిల్ఉల్ అర్జి వ మిల్ఉ మాషిఅత మిన్ షైఇమ్ బఅదు.

اللَّهُمَّ رَبَّنَا لَكَ الْـحَمْدُ مِلْءُ السَّمَاوَاتِ وَمِلْءُ الْأَرْضِ وَمِلْءُ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ

ఓ అల్లాహ్, మా ప్రభువా! నీకే ఆకాశముల నిండుగాను, భూమి నిండుగాను, అవి గాకా నీవు కోరిన వస్తువుల నిండుగాను స్తుతి గలదు. (ముస్లిం 476).

11- అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలో వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలిః (1) నొసటి, ముక్కు. (2,3) రెండు అరచేతులు. (4,5) రెండు మోకాళ్ళు. (6,7) రెండు పాదముల వ్రేళ్ళు. చేతులను పక్కల నుండి దూరముంచాలి. కాళ్ళ వ్రేళ్ళను ఖిబ్లా దిశలో ఉంచి, సజ్దాలో సుబ్ హాన రబ్బియల్ అఅలా మూడు సార్లు పలుకుట సున్నత్. ఎక్కువ పలు- కుట మంచిదే. ఒక్క సారి చదివినా సరిపోతుంది. ఈ స్థితిలో ఎక్కువ దుఆ చేయాలి. ఎందుకనగా ఇది దుఆ అంగీకార స్థితుల్లో ఒకటి. చిత్రం4

12- అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి తలెత్తి ఎడమ పాదముపై కూర్చోవాలి. కుడి కాలు పాదమును నిలబెట్టాలి. కుడి చెయ్యి కుడి మోకాలుకు దగ్గరగా తోడపై, ఎడమ చెయ్యి ఎడమ మోకాలుకు దగ్గరగా తోడపై పెట్టాలి. చేతి వ్రేళ్ళను విడిగా పరచి ఉంచాలి. రబ్బిగ్ ఫిర్లీ రబ్బిగ్ ఫిర్లీ అని చదవాలి. (చిత్రం5,6,7)

13- రెండవ సజ్దా మొదటి సజ్దా మాదిరిగా చేసి, సజ్దాలో అదే దుఆ చదవాలి.

14- అల్లాహు అక్బర్ అంటూ రెండవ సజ్దా నుండి లేస్తూ నిటారుగా నిలబడాలి.

15- రెండవ రకాత్ మొదటి రకాత్ మాదిరిగా చేయాలి. అందులో చదివిన దుఆలే ఇందులో చదవాలి. దుఆయె ఇస్తిఫ్ తాహ్ మరియు అఊజు బిల్లాహి…. తప్ప. ఈ రెండవ రకాత్ లోని రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ లేచి రెండు సజ్దాల మధ్యలో కూర్చున్న విధంగా కూర్చోని, కుడి చెయి వ్రేళ్ళను ముడుచుకొని నడిమి వ్రేళిని బొటన వ్రేళి మధ్యలో పెట్టి, చూపుడు వ్రేళితో సైగా చేస్తూ, కదలిస్తూ తషహ్హుద్ చదవాలిః

అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకా తుహూ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లా హిస్సాలి హీన్ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (బుఖారి 831).

التَّحِيَّاتُ لله وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ الله وَبَرَكَاتُهُ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

నా వాక్కు, దేహా, ధన సంబంధమైన ఆరాధన లన్నియూ అల్లాహ్ కొరకే ఉన్నవి. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు ఆయన శుభాలు కురువుగాకా. అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు, సందేశహరుడని సాక్ష్యమిస్తున్నాను.

ఇక్కడి వరకు చదివిన తరువాత, చేతులు భుజాల వరకు ఎత్తుతూ అల్లాహు అక్బర్ అంటూ నిలబడాలి, ఒక వేళ మగ్రిబ్ లాంటి మూడు రకాతుల నమాజ్ లేదా జొహ్ర్, అస్ర్ మరియు ఇషా లాంటి నాలుగు రకాతుల నమాజ్ చేస్తుంటే, రెండవ రకాతు మాదిరిగా మిగిత నమాజ్ పూర్తి చేయాలి. అయితే ఖియామ్ (నిలబడి ఉన్న స్థితి)లో కేవలం సూరె ఫాతిహ చదువుతే సరిపోతుంది. చివరి రకాతు రెండవ సజ్దా నుండి లేచి కూర్చోని తషహ్హుద్, దరూద్ ఇబ్రాహీమ్ మరియు ప్రవక్త నేర్పిన తనికిష్టమైన దుఆలు అధికంగా చదవడం మంచిది. (ఇది కూడా దుఆ అంగీకార సందర్భాల్లో ఒకటి). క్రింద దరూద్ మరియు ఒక దుఆ ఇవ్వబడుతుంది.

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి వమిన్ అజాబిన్నారి వమిన్ ఫిత్నతిల్ మహ్ యా వల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ ، اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ وَمِنْ عَذَابِ النَّارِ وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ.

ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నేను సమాధి శిక్షల నుండి, నరక యాతన నుండి, జీవన్మరణ పరీక్షల నుండి మరియు దజ్జాల్ మాయ నుండి రక్షణకై నీ శరణు కోరుతున్నాను

16- అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటూ కుడి వైపున మెడ త్రిప్పాలి. అలాగే అంటూ ఎడమ వైపున మెడ త్రిప్పాలి. చూడండి (చిత్రం8,9)

17- జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజుల్లోని చివరి తషహ్హుద్ లో కూర్చుండే పద్ధతి ఇలా ఉండాలి. కుడి పాదాన్ని నిలబెట్టి ఎడమ పాదాన్ని కుడి కాలి పిక్క క్రింది నుంచి బైటికి తీయాలి. ఎడమ పిరుదును భూమిపై ఆనించాలి. కుడి చెయ్యి కుడి తోడపై, ఎడమ చెయ్యి ఎడమ తోడపై మోకాలుకు దగ్గరగా పెట్టాలి. చూడండి (చిత్రం10)

నమాజ్ తర్వాత జిక్ర్:

సలాం తింపిన తరువాత ఈ దుఆలు చదవాలి.

అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అస్తగ్ ఫిరుల్లాహ్, అల్లాహుమ్మ అంతస్సలాం వ మిన్ కస్సలాం తబారక్ త యాజల్ జలాలి వల్ ఇక్రాం. లా ఇలాహ ఇల్లల్లాహు     వహ్ దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅతైత వలా ముఅ తియ లిమా మనఅత వలా యన్ ఫఉ జల్ జద్ది మిన్ కల్ జద్ద్. లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లాఇలాహ ఇల్లల్లా హు వలా నఅబుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅమతు వలహుల్ ఫజ్లు వలహుస్సనా ఉల్ హసన్, లాఇలాహ ఇల్లల్లాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్.

أَسْتَغْفِرُ الله (3). اَللهُمَّ أَنْتَ السَّلامُ ومِنْكَ السَّلامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ وَ الإكْرَام. لا إله إلا الله وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيءٍ قَدِير. اَللهُمَّ لا مَانِعَ لِمَا أعْطَيْتَ وَلا مُعْطِيَ لِمَا مَنَعْتَ وَلا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الْجَدُّ. لا حَوْلَ وَلا قُوَّةَ إِلاَّ بِاللهِ، لاَ إِلهَ إِلاَّ اللهُ وَلاَ نَعْبُدُ إِلاَّ إِيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الْفَضْلُ وَلَهُ الثَّنـاءُ الْحَسـَن، لاَ إلَهَ إِلاَّ اللهُ مُخْلِصِينَ لَه الدِّينَ وَلَوكَرِهَ الكَافرون.

అల్లాహ్ తో క్షమాభిక్ష కోరుచున్నాను (3). ఓ అల్లాహ్ నీవు ఏలాంటి లోపాలు లేనివాడవు. నీవే రక్షణ నొసంగువాడవు. ఓ ఘనుడవు, పరమదాతయువు నీవు శుభములు గలవాడవు. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన అద్వితీయుడు. ఆయనకు సాటి మరొకడు లేడు. ఆయనకే అధికారము చెల్లును. ఆయనకే సర్వ స్తోత్రములు గలవు. ఆయనే సర్వ శక్తుడు. ఓ అల్లాహ్ నీవు నొసంగిన వరాలను ఎవడు అడ్డగింపజాలడు. నీవు ఇవ్వని దానిని ఎవ్వడూ ఇవ్వజాలడు. ధనికుడు తన ధనముతో నీ శిక్షల నుండి తప్పించుకు- పోజాలడు. పాపాములను వదులుకొనుట మరియు పుణ్యాలు చేయుట అల్లాహ్ దయవలననే కలుగును. అల్లాహ్ దప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన్నే మేము ఆరాధించుచున్నాము. ఆయనే సర్వ అనుగ్రహాలు దయ చేయువాడు. ఆయనకే ఘనత, మంచి స్తోత్రములు గలవు. అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యు డెవ్వడూ లేడు. చిత్తశుద్ధితో మేము ఆయన్నే ఆరాధించుచున్నాము. ఈ విషయము సత్య తిరస్కారులకు నచ్చకున్నా సరే. (ముస్లిం 591, 593, 594, బుఖారి 844).

తరువాత సుబ్ హానల్లాహ్ 33, అల్ హందు లిల్లాహ్ 33, అల్లాహు అక్బర్ 33 సార్లు చదివి, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ తో 100 పూర్తి చేయాలి. (ముస్లిం 597).

తరువాత ఆయతుల్ కుర్సీ([1]) ఒకసారి.

ఖుల్ హువల్లాహు అహద్(5), ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(5), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్([2]) సూరాలు ఫజ్ర్ మరియు మగ్రిబ్ తరువాత మూడేసి సార్లు మిగిత నమాజుల తరువాత ఒక్కొక్క సారి చదవాలి.

మస్బూఖ్:

ఎవరైనా జమాఅతుతో ఒకటి లేదా కొన్ని రకాతులు తప్పి పోతే (మస్బూఖ్) ఇమాం రెండవ సలాం తింపిన తర్వాత వాటిని పూర్తి చేసుకోవాలి. అతను ఇమాంతో ఏ రకాతులో కలిసాడో అదే అతని మొదటి రకాతు. ఇమాంను రుకూ స్థితిలో పొందినవాని ఆ రకాతు అయినట్లే. ఇమాంను రుకూలో పొందకుంటే ఆ రకాత్ తప్పిపోయి నట్లే లెక్క.

జమాఅతు నిలబడిన తర్వాత వచ్చేవారు జమాఅతును ఏ స్థితిలో చూసినా అదే స్థితిలో కలవాలి. వారు రుకూ, లేదా సజ్దా ఇంకే స్థితిలో ఉన్నా సరే. వారు మరో రకాతు కొరకు నిలబడే వరకు నిరీక్షించవద్దు. నిలబడి తక్బీరె తహ్రీమ అల్లాహు అక్బర్ అనాలి. రోగి లాంటి ఏదైనా ఆటంకం ఉన్నవారు కూర్చుండి అల్లాహు అక్బర్ అంటే ఏమీ తప్పు లేదు.

నమాజును భంగపరుచు కార్యాలు:

  • 1- తెలిసి, కావాలని మాట్లడడం, అది కొంచమైనా సరే.
  • 2- పూర్తి శరీరముతో ఖిబ్లా దిశ నుండి పక్కకు మరలడం.
  • 3- వుజూను భంగపరిచే కారణాల్లో ఏ ఒకటైనా సంభవించడం.
  • 4- అనవసరంగా ఎడతెగకుండా ఎక్కువ చలనము చేయడం.
  • 5- కొంచం నవ్వినా నమాజ్ వ్యర్థమవుతుంది.
  • 6- తెలిసి కూడా ఎక్కువ రుకూ, సజ్దాలు, ఖియాం, జుల్సాలు చేయడం.
  • 7- తెలిసి కూడా (రుకూ, సజ్దా వగైరా) ఇమాంకు ముందు చేయడం.

నమాజ్ యొక్క వాజిబులు:

  • 1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగితావన్నీ.
  • 2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్ హాన రబ్బియల్ అజీం అనడం.
  • 3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
  • 4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
  • 5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్ హాన రబ్బియల్ అఅలా అనడం.
  • 6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
  • 7- మొదటి తషహ్హుద్ చదవడం.
  • 8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.

నమాజ్ యొక్క రుకున్ లు:

  • 1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం ముఖ్యం లేదు. కాని కూర్చుండి నమాజ్ చేసేవానికి, నిలబడి చేసేవానికంటే సగం పుణ్యం తక్కువ.
  • 2- తక్బీరె తహ్రీమ.            
  • 3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
  • 4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
  • 5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
  • 6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
  • 7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
  • 8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
  • 9- చివరి తషహ్హుద్.
  • 10- దాని కొరకు కోర్చోవడం.
  • 11- దరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
  • 12- సలాం తింపడం.
  • 13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం

[1])اللهُ لَا إِلَهَ إِلَّا هُوَ الحَيُّ القَيُّومُ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ لَهُ مَا

فِي السَّمَاوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالأَرْضَ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ العَلِيُّ العَظِيمُ] {البقرة:255}

[2]) قُلْ هُوَ اللهُ أَحَدٌ(1) اللهُ الصَّمَدُ(2) لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ(3)  

وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا أَحَدٌ(4) قُلْ أَعُوذُ بِرَبِّ الفَلَقِ(1) مِنْ شَرِّ مَا خَلَقَ(2) وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ(3) وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِي العُقَدِ(4) وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ(5).  قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ(1) مَلِكِ النَّاسِ(2) إِلَهِ النَّاسِ(3) مِنْ شَرِّ الوَسْوَاسِ الخَنَّاسِ(4) الَّذِي يُوَسْوِسُ فِي صُدُورِ النَّاسِ(5)  مِنَ الجِنَّةِ وَالنَّاسِ أَجْمَعِينَ(6)


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 9 – నమాజు ప్రాముఖ్యత, నమాజు సమయాలు, నమాజు చేయకూడని ప్రదేశాలు, ప్రశ్నోత్తరాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[43:07 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజ్ ఆదేశాలు

నమాజ్ ఇస్లాం మూల స్థంబాలలో రెండవది. అది ప్రతీ ప్రాజ్ఞ, ఈడేరిన స్త్రీ పురుషునిపై విధిగా ఉంది. నమాజ్ విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజ్ చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని అధిక సంఖ్యలో ప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హుమ్) ఏకీభవించారు. ప్రళయదినాన మానవునితో తొలి లెక్క నమాజ్ గురించే జరుగును. నమాజుకు సంబంధించిన ఖుర్ఆన్ ఆదేశం చదవండిః

[إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى المُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا] [النساء:103]

నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. (సూరె నిసా 4: 103).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

عَنْ ابْنِ عُمَرَ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ الله وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَالْحَجِّ وَصَوْمِ رَمَضَانَ).

“ఇస్లాం పునాది ఐదు విషయాలపై ఉంది:

  • 1- అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట.
  • 2- నమాజు స్థాపించుట.
  • 3- జకాత్ (విధిదానం) చెల్లించుట.
  • 4- హజ్ చేయుట.
  • 5- రమజాను ఉపవాసాలు పాటించుట”.

(బుఖారి 8, ముస్లిం 16).

عَنْ جَابِرٍ t يَقُولُ: سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكَ الصَّلَاةِ).

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను:

“ఒక మనిషి మరియు షిర్క్, కుఫ్ర్ (బహుదైవారాధన, సత్యతిరస్కారం) మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం”.

(ముస్లిం 82).

నమాజ్ పాటించడంలో చాలా గొప్ప ఘనతలున్నాయి, వాటిలో కొన్ని:

عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

عَنْ أبِي هُرَيرَةَ t، أنَّ رَسُولَ الله ﷺ قَالَ: (أَلاَ أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولُ اللهِ. قَالَ: (إِسبَاغُ الْوُضُوءِ عَلَى الْمَكَارِه ، وَكَثْرَةُ الْخُطَا إِلَى الْمَسَاجِد ، وَانْتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ ، فَذَلِكُمُ الرِّبَاط).

అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అడిగారు:

“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః ” (1) వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([1])“. (ముస్లిం 251).

[1] రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.

وَعَن أَبِي هُرَيرَة t عَنِ النَّبِيِّ ﷺ قَالَ:(مَنْ غَدَا إلَى المَسْجِدِ أَو رَاحَ ، أَعَدَّ اللهُ لَهُ فِي الْجَنَّةِ نُزُلاً،كُلَّمَا غَدَا أو رَاحَ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజ్ చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు”. (బుఖారి 662. ముస్లిం 669).

నమాజుకు సంబంధించిన ముఖ్య విషయాలు:

1- సామూహికంగా నమాజ్ చేయడం పురుషుల పై విధిగా ఉంది, ఈ హదీసు ఆధారంగా:

(لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِالصَّلَاةِ فَتُقَامَ ثُمَّ أُخَالِفَ إِلَى مَنَازِلِ قَوْمٍ لَا يَشْهَدُونَ الصَّلَاةَ فَأُحَرِّقَ عَلَيْهِمْ).

“నమాజ్ చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”. (బుఖారి 2420, ముస్లిం 651).

2- శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావడం చాలా మంచిది.

3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి అల్లా హుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక చదవండి. (ముస్లిం 713).

اللهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరువు).  

4- కూర్చునే ముందు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవడం సున్నత్.

عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا دَخَلَ أَحَدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని, అబూ ఖతాద (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశిస్తే కూర్చునే ముందు రెండు రకాతుల నమాజ్ చేసుకోవాలి”. (బుఖారి 444, ముస్లిం 714).

5- నమాజులో సతర్ (శరీరంలో కప్పి ఉంచే భాగం) తప్పనిసరి. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు, స్త్రీల పూర్తి శరీరమే సతర్, నమాజులో కేవలం ముఖము,చేతులు తప్ప.

6- కాబా వైపునకు అభిముఖమై ఉండుట తప్పనిసరి. నమాజ్ అంగీకారానికి ఇది ఒక షరతు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. ఉదా: వ్యాది లేదా మరేదైనా కారణం.

7- ప్రతీ నమాజ్ దాని సమయములో చేయాలి. సమయానికి ముందు చేయుట సమ్మతం కాదు. సమయం దాటి చేయడం నిషిద్ధం.

8- నమాజుకై శీఘ్రముగా సమయంలో రావడం, తొలి పంక్తిలో చేరుకోవడం, నమాజ్ కొరకు వేచించడం, ఇవన్నియూ చాలా గొప్ప ఘనతగల కార్యాలు.

عَنْ أَبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ…).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).

عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“నమాజ్ కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజ్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది”. (బుఖారి 659, ముస్లిం 649).

నమాజ్ సమయాలు:

  • జొహ్ర్ నమాజ్ నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
  • అస్ర్ నమాజ్ సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
  • మగ్రిబ్ నమాజ్ సమయం: సూర్యాస్తమయం నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
  • ఇషా నమాజ్ సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
  • ఫజ్ర్ నమాజ్ సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.

నమాజ్ చేయరాని స్థలాలు:

1- ఖననవాటిక (స్మశాన వాటిక): ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

(الْأَرْضُ كُلُّهَا مَسْجِدٌ إِلَّا الْحَمَّامَ وَالْمَقْبَرَةَ).

“భూభాగమంతయూ మస్జిదే. స్నానశాల, మరుగుదొడ్లు మరియు ఖనన వాటిక (ఖబరస్తాన్) తప్ప”. (అబూ దావూద్ 492, తిర్మిజి 317).అయితే జనాజ నమాజ్ మట్టుకు ఖబరస్తానులో చేయడం ధర్మమే.

2- సమాధి, గోరీల వైపు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అబూ మర్సద్ గనవీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

(لَا تُصَلُّوا إِلَى الْقُبُورِ وَلَا تَجْلِسُوا عَلَيْهَا).

“గొరీలు ఎదురుగా ఉండగా నమాజ్ చేయడం గానీ, వాటిపై కూర్చోవటం గానీ చేయకండి”. (ముస్లిం 972).

3- ఒంటెశాల అంటే ఒంటెలు కట్టే చోటు. అలాగే అశుద్ధ స్థలాల్లో నమాజ్ చేయరాదు.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : నమాజు చేయరాని వేళలు [వీడియో]

బిస్మిల్లాహ్

[13:31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజ్ చేయరాని వేళలు:

కొన్ని సమయాల్లో నమాజ్ చేయుట యోగ్యం లేదు. అవిః

  • 1- ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
  • 2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
  • 3- అస్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.

కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చును. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.

అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగాః

 (مَنْ نَسِيَ صَلَاةً أَوْ نَامَ عَنْهَا فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا)

“ఎవరైనా ఏదైనా నమాజ్ మరచిపోతే, లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం”. (ముస్లిం 684, బుఖారి 597).

ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ఫిఖ్’ హ్ జనాజా నమాజ్ & ప్రశ్నోత్తరాలు [వీడియో]

బిస్మిల్లాహ్

https://youtu.be/rkz1UCIFbyo&rel=0

[39:41 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

జనాజ నమాజ్

(مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ قِيلَ وَمَا الْقِيرَاطَانِ قَالَ مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః “ఎవరైతే జనాజలో హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 1325, ముస్లిం 945).

జనాజ నమాజ్ యొక్క నిబంధనలు:

  • నియ్యత్ (సంకల్పం).
  • ఖిబ్లా దిశలో నిలబడుట.
  • సత్ర్ (అచ్ఛాదన).
  • వుజూ.

జనాజ నమాజ్ విధానం:

ఇమాం (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు ఎదురుగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమాం వెనక నిలబడాలి. అల్లాహు అక్బర్ అని అఊజు బిల్లా…. బిస్మిల్లా….. మరియు సూరె ఫాతిహ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూదె ఇబ్రాహీం (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్…) చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలిః అల్లా హుమ్మగ్ ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వసగీరినా వకబీరినా వ జకరినా వ ఉన్ సానా, అల్లాహుమ్మ మన్ అహ్ యయ్ తహూ మిన్నా ఫ అహ్ యిహీ అలల్ ఇస్లామ్ వమన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్ రిమ్ నా అజ్రహూ వలా తుజిల్లనా బఅదహూ. మళ్ళీ అల్లాహు అక్బర్ అని కొన్ని సెకండ్లు నిలిచి సలాం తింపాలి.

اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ

భావం : ఓ అల్లాహ్ మాలో బ్రతికున్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్నవారిని, దూరముగా ఉన్నవారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమింపుము. ఓ అల్లాహ్ మాలో ఎవరిని సజీవంగా ఉంచదలుచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలిచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము. ఓ అల్లాహ్ అతని చావుపై మేము వహించిన ఓపిక పుణ్యాలు మాకు లేకుండా చేయకుము. అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.

ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తరువాత గర్భము పడిపోయి, చనిపోయినచో దాని యొక్క జనాజ నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాక ముందు గర్భము పడిపోయి, చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.

[శుద్ధి & నమాజు (Tahara and Salah) అను పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో జనాజా నమాజ్ (అంత్యక్రియల ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, పద్ధతి మరియు ధర్మశాస్త్రపరమైన ఆదేశాలను వివరిస్తారు. ఇస్లాం ఒక వ్యక్తిని మరణించిన తర్వాత కూడా ఎలా గౌరవిస్తుందో, వారిపై జీవించి ఉన్నవారికి ఉన్న హక్కులను గుర్తుచేస్తూ ప్రసంగం ప్రారంభమవుతుంది. అంత్యక్రియలలో పాల్గొనడం, మృతదేహానికి స్నానం చేయించడం (ఘుస్ల్), మరియు కఫన్ (శవ వస్త్రం) తొడిగించడం వంటి చర్యలకు లభించే గొప్ప పుణ్యఫలాల గురించి హదీసుల ఆధారంగా చర్చిస్తారు. జనాజా నమాజ్ చెల్లుబాటు కావడానికి అవసరమైన నియమాలు (నియ్యత్, ఖిబ్లా, సత్ర్, వుదూ) మరియు నమాజ్ చేసే విధానం (నాలుగు తక్బీర్‌లు, సూరహ్ ఫాతిహా పారాయణం, దరూద్ ఇబ్రాహీం, మృతుని కోసం ప్రత్యేక దుఆ) వివరంగా చెప్పబడింది. నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భస్రావం జరిగితే, ఆ పిండానికి కూడా జనాజా నమాజ్ చేయాలనే ముఖ్యమైన ఆదేశాన్ని నొక్కి చెబుతారు. ప్రసంగం చివరలో, జనాజా నమాజ్‌కు సంబంధించిన సఫ్ (వరుసలు) ఏర్పాటు, గాయబానా నమాజ్ (పరోక్ష ప్రార్థన), స్త్రీ-పురుషుల కోసం దుఆలో తేడాలు మరియు చిన్న పిల్లల జనాజా వంటి అంశాలపై శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సోదర మహాశయులారా!

అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయవల్ల మనం కొన్ని రోజుల నుండి శుద్ధి మరియు నమాజ్ అనే అంశంపై ఏ మంచి పాఠాలు అయితే మొదలు పెట్టామో, అల్హందులిల్లాహ్ దాని యొక్క చివరిలో ఈ రోజు చేరుకున్నాము. ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల జనాజా నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము.

ఇందులో మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, జనాజా నమాజ్ దీని యొక్క వివరణ, దీని యొక్క పద్ధతి తెలుసుకునే ముందు, ఇస్లాం యొక్క మంచితనాన్ని, మేలును, గొప్పతనాన్ని, స్వయంగా మీరు విని అర్థం చేసుకొని ప్రత్యేకంగా అవిశ్వాసులకు ఇస్లాం యొక్క ఈ మంచి విషయాన్ని బోధించండి.

అదేమిటంటే, ఇస్లాం యొక్క సంబంధం ఎవరితో ఏర్పడుతుందో వారి యొక్క హక్కు మనపై వారు బ్రతికి ఉన్నంతవరకే కాదు, చనిపోయిన తర్వాత కూడా మనపై ఉంటుంది. మన ఒక ముస్లిం సోదరుడు బ్రతికి ఉన్నంతవరకే అతని హక్కు మనపై కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికి ఉన్నాము, మన యొక్క ముస్లిం సోదరుడు లేదా సోదరీమణి చనిపోయింది, అప్పుడు కూడా అతని యొక్క హక్కు మనపై ఉంటుంది. అల్లాహు అక్బర్.

ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు అంటే స్నానం చేపించడం, కఫన్ దుస్తులు ధరింపజేయడం, సమాధిలో దించడం, అంతకుముందు నమాజ్ చేయడం, అతని గురించి, ఆమె గురించి అల్లాహ్ తో క్షమాభిక్ష, పాపాల మన్నింపు, అల్లాహ్ యొక్క కరుణ వారిపై కురుస్తూ ఉండాలి అని అల్లాహ్ ను వేడుకోవడం, ఆ తర్వాత ఇంకా వారి కొరకు దుఆ చేస్తూ ఉండటం, ఇవన్నీ ఎలాంటి సత్కార్యాలు? అల్లాహు అక్బర్.

సహీహ్ హదీసులో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ అహ్కాముల్ జనాయిజ్ లో ప్రస్తావించారు, ఒక బ్రతికి ఉన్న ముస్లిం, చనిపోయిన ఒక ముస్లింకి స్నానం చేపించాడు, స్నానం చేపిస్తున్న సందర్భంలో ఏమైనా లోపాలు, దోషాలు, ఏమైనా విషయాలు చూశాడు, , కప్పి ఉంచాడు, ఎవరికీ చెప్పలేదు,

غَفَرَ اللَّهُ لَهُ أَرْبَعِينَ مَرَّةً
(గఫరల్లాహు లహు అర్బయీన మర్ర)
అల్లాహ్ అతన్ని నలభై సార్లు క్షమిస్తాడు.

ఎవరైతే ఒక ముస్లింకి కఫన్ దుస్తులు ధరింపజేస్తారో, అల్లాహు త’ఆలా స్వర్గంలో మంచి అక్కడి స్వర్గపు పట్టు వస్త్రాలు ఇలాంటి వ్యక్తికి ధరింపజేస్తాడు.

ఇక అతని కొరకు నమాజ్ చేశాడంటే, సహీహ్ బుఖారీలోని హదీస్. ఇప్పుడు కూడా ఇన్ షా అల్లాహ్ ఆ హదీస్ వస్తుంది, రెండు పెద్ద కొండలు. ఇక రెండు పెద్ద పర్వతాలు అంటే మీ ఇష్టం. మీలో ఎంత ఇఖ్లాస్, మీలో ఎంత ముతాబా’అ. ఈ పదాలు ఇంతకు ముందు ఎన్నో సార్లు వచ్చి ఉన్నాయి. గుర్తుంది కదా? ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి. కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం. ముతాబా’అ అంటే ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని అనుసరించడం. ఎంత ఇఖ్లాస్, ఎంత ముతాబా’అ ఉంటుందో అంతే పెద్ద పర్వతాలు. ఈ హిమాలయా కూడా చిన్నదే. అలా మీరు ఊహించారంటే, నమాజ్ చేయడం మరియు అతన్ని సమాధిలో పెట్టేవరకు ఖబరిస్తాన్ లో, స్మశాన వాటికలో ఉండటం ఎంత గొప్ప పుణ్యాలో ఒకసారి గ్రహించండి.

ఇక్కడ మీకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి కదా? ఒకటి, ఒక ముస్లిం చనిపోయాడు అంటే, చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క బాధ్యత మనపై ఎంత గొప్పగా ఉందో. ఒక విషయం ఇది. ఈ బాధ్యతను గనక మనం కరెక్ట్ ఇఖ్లాస్ మరియు ముతాబా’అ ప్రకారంగా నెరవేర్చామంటే, అల్లాహ్ వైపు నుండి మనకు ఎన్ని అనుగ్రహాలు, వరాలు, పుణ్యాలు, సత్ఫలితాలు, మంచి ప్రసాదాలు ఉన్నాయో గమనించండి.

రండి. జనాజా యొక్క చాలా వివరాలతో కూడిన పాఠం. అది కూడా బహుశా ఎంత లేకున్నా గానీ ఒక 10 పాఠాలు కావచ్చు. ఇన్ షా అల్లాహ్, త్వరలో ఎప్పుడైనా మనం వివరాలతో తెలుసుకుందాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు సంక్షిప్తంగా నమాజ్ విషయం మీకు తెలియజేస్తున్నాము.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరైతే జనాజాలకు హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో, అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో, అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును.”

“రెండు ఖీరాతులు అంటే ఏమిటి?” అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నారు, రెండు ఖీరాతులు అంటే ఏంటి, ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు సల్లల్లాహు అలైహి వసల్లం? రెండు పెద్ద పర్వతాలు, పెద్ద కొండలు అని. జబలైనీ అజీమైనీ, అజీం అజీం. ఇది చాలా గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది.

అయితే వేరే కొన్ని మరి సహీహ్ హదీసులో ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతం అని కూడా ప్రస్తావన వచ్చి ఉంది. ఏంటి? మదీనా నగరంలో ఉన్నటువంటి ఉహుద్ పర్వతం. అయితే ఇక్కడ విరుద్ధం, విభేదం కాదు. కొన్ని సందర్భాల్లో ఒకే సత్కార్యానికి వేరువేరు రకాలుగా మనం పుణ్యాలు లేదా పుణ్యాల ప్రస్తావన చూస్తూ ఉంటే ఇది విరుద్ధం అనరు. దీని యొక్క భావం ఏమిటంటే, ఎవరు ఎంత స్వచ్ఛంగా, ఇఖ్లాస్ మరియు ముతాబా’అ. ఆ రెండు పదాలు మీరు మరిచిపోకండి. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అవి. చిత్తశుద్ధి మరియు ప్రవక్త విధానాన్ని అనుసరించడం. ఇఖ్లాస్, ముతాబా’అ ఎవరిలో ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా వారు ఆ పుణ్యాన్ని పొందుతారు అనే భావం.

జనాజా నమాజ్ లో నాలుగు విషయాలు తప్పనిసరి. ఏమిటి అవి?

నియ్యత్ (సంకల్పం), ఖిబ్లా దిశలో నిలబడుట, సతర్ (అచ్ఛాదన), వుజూ.

ఈ నాలుగు విషయాలు మీకు అర్థమయ్యాయి. నియ్యత్ అంటే మనసులో మనం సంకల్పించుకుంటాము. నోటితో నియ్యత్ చేయడం ఇది ప్రవక్త పద్ధతి కాదు. రెండవది, ఖిబ్లా దిశలో నిలబడటం. ఖిబ్లా వైపునకు. ఇది కూడా విషయం అర్థమైనదే. సత్ర్, అచ్ఛాదన అంటే నమాజ్ చేసే సందర్భంలో మన శరీరంపై ఎంత దుస్తులు ఉండాలో అంత దుస్తులు ఉండడం. ఇది కూడా తప్పనిసరి. జనాజా నమాజ్ కొరకు వుజూ చేసుకొని ఉండటం కూడా తప్పనిసరి. ఇవి నాలుగు షరతులు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా గానీ అతను నమాజ్ చేసినప్పటికీ అతని నమాజ్, నమాజ్ కాదు. అంగీకరింపబడదు.

ఇమామ్ (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు దగ్గరగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమామ్ వెనక నిలబడాలి.

అల్లాహు అక్బర్ అని

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

మరియు సూరె ఫాతిహా చదవాలి.

మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ పూర్తిగా చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలి.

ఇక్కడ గమనించారు కదా? నమాజ్ యొక్క విధానం, జనాజా నమాజ్ ఎలా చేయాలి అనే విధానం ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అయితే గమనించండి, ఇమామ్ ఎవరైతే నమాజ్ చేయిస్తారో, వారు ఎలా ఎక్కడ నిలబడాలి అనే విషయం ఇక్కడ ముందు చెప్పడం జరిగింది.

మయ్యిత్, శవం పురుషునిది అయ్యేదుంటే, అతని యొక్క తలకు సమానంగా ఇలా నిలబడాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఒకవేళ స్త్రీ అయ్యేది ఉంటే, ఆమె యొక్క మధ్యలో, నడుము కాడ. ఈ విషయం అర్థమైపోయింది కదా? ఇక ముక్తదీలు అందరూ కూడా ఇమామ్ వెనక నిలబడతారు. అయితే ఇమామ్ అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. ఎందుకంటే, జనాజా నమాజ్ కు సంబంధించి హదీసులు ఏవైతే వచ్చాయో, జనాజా నమాజ్ కు సంబంధించిన హదీసుల్లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సనా చదివారా, చదవలేదా, ఏ ప్రస్తావన లేదు. చదివారు అని లేదు, చదవలేదు అని లేదు. అందుకొరకే ఇక్కడ ధర్మవేత్తలు ఎంతో మంది ఏమని అభిప్రాయపడ్డారు? ఒకవేళ ప్రవక్త చదివి ఉండేది ఉంటే, ప్రస్తావన ఉండేది. కానీ వేరే ఎంతో మంది సర్వసామాన్యంగా ధర్మవేత్తలు అంటారు, నమాజు ఆరంభంలో సనా చదవడం సర్వసామాన్య విషయం. అందుకొరకు ఇక్కడ దాని ప్రస్తావన ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ చదవడమే మంచిది. అయితే మీ ఇష్టం. చదివినా అల్హందులిల్లాహ్, చదవకపోతే ఎలాంటి పాపం లేదు. కానీ ఏం చదవాలి? అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకున్న వెంటనే,

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

చదివి సూరె ఫాతిహా పూర్తిగా చదవాలి. సూరె ఫాతిహా తర్వాత ఏదైనా సూరా చదివినా అల్హందులిల్లాహ్. చదవకపోయినా అల్హందులిల్లాహ్. ఆ తర్వాత రెండవసారి అల్లాహు అక్బర్ అని మళ్ళీ చేతులు కట్టుకొని దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం… మనం తషహ్హుద్ లో చదువుతాము కదా? అది పూర్తిగా చదవాలి. మళ్ళీ మూడోసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని మయ్యిత్ కొరకు దుఆ చేయాలి.

ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో సహీహ్ హదీసుల్లో నాలుగు రకాల దుఆలు వచ్చి ఉన్నాయి. ఆ నాలుగింటిలో కూడా చాలా మంచి లాభదాయకమైన, శవానికి, మయ్యిత్ కు ఎంతో ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించగలుగుతారా?

ఒక సందర్భంలో ఒక సహాబీ బ్రతికి ఉన్నారు. ప్రవక్త వెనక ఉండి ఒక మయ్యిత్, ఒక శవం యొక్క, ఒక ముస్లిం జనాజా నమాజ్ చేస్తున్నారు. ప్రవక్త ఈ దుఆ, ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో మీకు, ఈ దుఆ ఏదైతే చదివారో వెనక ఉన్న ఆ సహాబీ ఏమంటున్నారు? ఆ దుఆ విని నాకు అనిపించింది, అయ్యో! ఆ శవం కాడ నా శవం ఉండేది ఉంటే ఎంత బాగుండేది. ప్రవక్త వారి దుఆలు అన్నీ కూడా నాకు ప్రాప్తమయ్యేవి అని. అల్లాహు అక్బర్. గమనించండి సోదర మహాశయులారా, ఇలాంటి దుఆలు మనం నేర్చుకోవాలి. మన గ్రామాల్లోనే కాదు, పెద్ద పెద్ద నగరాల్లో చాలా, చాలా బాధాకరమైన విషయం నా కొరకు. ఏంటో తెలుసా? చాలా మంది ఈ జనాజా నమాజ్ లో చదివే దుఆ వారికి తెలిసే ఉండదు. అడిగారు నేను ఎన్నో సందర్భాలలో. సంవత్సరం క్రితం కూడా నేను ఏదైతే ఇండియాకు వెళ్లానో ఒక నెల గురించి, అక్కడ సుమారు రెండు, మూడు జనాజాలలో చదవడం, చదివించే అవసరం పడింది. ఇక మన వద్ద చిన్నపాటి ఇఖ్తిలాఫ్ కూడా. ఈ జనాజా నమాజ్ చదివించే వారు శబ్దంగా చదవాలా? మనసులో చదువుకోవాలా? మెల్లగా నిశ్శబ్దంగా? లేదా శబ్దంగా చదవాలా? సర్వసామాన్యంగా మన వద్ద హనఫీ సోదరులు మెల్లగా చదువుతారు. హనాబిలా వద్ద కూడా మెల్లగానే చదవాలి అని ఉంది. అహ్లుల్ హదీస్ వారు శబ్దంగా చదువుతారు. అయితే ప్రతి ఒక్క దాని గురించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లను నేను. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పిన విషయం సహీహ్ బుఖారీలో, నేను శబ్దంగా ఇప్పుడు ఇక్కడ మీకు చదివింది ఎందుకంటే, ఈ సూరె ఫాతిహా కూడా జనాజాలో చదవడం ప్రవక్త వారి సున్నత్ అని మీకు తెలియాలి.

ఈ విధంగా సోదర మహాశయులారా, కనీసం జనాజా సందర్భాలలో మనం ప్రజలకు చెప్పాలి. అయ్యలారా, అవ్వలారా, కొంచెం నేర్చుకోండి దుఆలు. ఓ కొడుకా, ఓ నా బిడ్డా, నీవు ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఏమి లాభం నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు కనీసం “అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా” చదవలేకపోతే. నీవు బంగళాలు కట్టించి, మీ నాన్న సమాధి మీద ఎంత పెద్ద గోపురం కట్టినా గానీ ఏమి లాభం, నీవు నీ తండ్రి గురించి క్షమాభిక్ష ఎలా కోరాలో నీకు తెలియకుంటే.

సోదర మహాశయులారా, వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. సౌదీ అరబ్ లో కొన్ని సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఒకేషన్ లో వెళ్ళాడు, సెలువులో. కానీ కరోనా కారణంగా చిక్కిపోయాడు అక్కడే. రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న నాలుగు రోజుల క్రితం అతనితో మాట్లాడినప్పుడు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. “షేఖ్, ఎందుకో నాకు ఇక్కడ ఇండియాలో భార్యా పిల్లలు అందరిలో కలిసి ఉన్నాను కానీ ఉండబుద్ధి అయితే లేదు. అటే రావాలి అనిపిస్తుంది.” నేనన్నాను, ఇది కూడా నువ్వు అదృష్టంగా భావించు. అల్లాహ్ ఏదైనా పరీక్షలో మనల్ని పడవేసాడు అంటే అందులో కూడా ఏదైనా మేలు ఉంటుంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి, గ్రహించాలి. ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అని అడిగాను. “షేఖ్, ఇప్పటికి సుమారు నేను ఇక్కడికి వచ్చేసి ఏడు నెలలు అయిపోయినాయి, కేవలం ఎవరితోనైనా కలిసినప్పుడు అస్సలాము అలైకుమ్ అంటే వ అలైకుమ్ అస్సలాం. ఇంతే కానీ, అక్కడ అరబులో ఉండి పరస్పరం దుఆలు ఇచ్చుకోవడం, జజాకల్లాహు ఖైర్, బారకల్లాహు ఫీక్, అహ్సనల్లాహు ఇలైక్, కైఫల్ హాల్, ష్లోనక్, అల్లా యహ్ఫజక్, అల్లా యర్హమక్, ఇలాంటి దుఆలు ఏదైతే ఇచ్చుకుంటారో పరస్పరం అది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసుకు చాలా బాధ కలుగుతుంది” అని అన్నాడు.

ఇంతకుముందు కూడా నేను ఒక విషయం మీకు తెలియజేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందు వచ్చే ఎన్నో సూచనలు తెలుపుతూ, ధర్మం ఎంత బలహీనంగా అయిపోతుందో తెలియజేస్తూ, వారిలో కొందరిని ప్రశంసించారు. ఎవరు? అల్ హమ్మాదూన్, అధికంగా అల్లాహ్ ను ప్రశంసించే వారు, అల్లాహ్ తో వేడుకునే వారు.

క్షమించండి, జనాజా నమాజ్ కు సంబంధించిన పద్ధతులు, దుఆల గురించి మనం తెలుసుకుంటున్నాము. కానీ మనం ఈ రోజుల్లో ధర్మం నేర్చుకోకుండా, దుఆలు నేర్చుకోకుండా ప్రపంచ విషయాలు రోజు ఎంత తిరిగేస్తా ఉంటామో మనం, కానీ మన జీవితంలో అతి ముఖ్యమైన ఒక విషయం మనం నేర్చుకోము. రండి, ముందు నేను మీకు దీని యొక్క అనువాదం వినిపిస్తాను, ఆ తర్వాత ఈ దుఆ చదువుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను దుఆ ముందు చదివేశాను, అరబీలో ఉంది. భావం తెలిస్తే కదా మీకు దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. చూడండి భావం.

ఓ అల్లాహ్! మాలో బ్రతికి ఉన్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్న వారిని, దూరముగా ఉన్న వారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమించుము. ఓ అల్లాహ్! మాలో ఎవరిని సజీవంగా ఉంచదలచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము.ఓ అల్లాహ్! అతని చావుపై మేము వహించిన ఓపిక, పుణ్యాలు మాకు లేకుండా చేయకుము.

గమనిస్తున్నారా, ఎంత మంచి భావాలు ఉన్నాయి? ఏం తెలుస్తుంది? మనకు ఎంత దగ్గరి బంధువు అయినా గానీ, భార్య కొరకు ఒక భర్త చనిపోయినా, భార్య విధవ అయిపోయినా, తండ్రి చనిపోయి పిల్లలు అనాథలు అయిపోయినా, భార్య చనిపోయి భర్త ఒంటరిగా అయిపోయాడు అన్నటువంటి వ్యధకు, బాధకు గురి అయినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహించాలి. ఓపిక సహనాలు వహిస్తూ, అల్లాహ్ దానికి సరియైన ఫలితం కూడా ప్రసాదించాలి అని ఆశిస్తూ ఉండాలి. “ఫల్ తస్బిర్ వల్ తహ్తసిబ్” అదే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సొంత కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా వారికి నసీహత్ చేసింది? ఇంకా ఆ దుఆలోని మరో పదం గుర్తుంచుకోండి: “అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.” ఎంత మంచి భావం ఉందో ఇక్కడ గమనిస్తున్నారా మీరు? సోదర మహాశయులారా,

اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ
(అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాఇబినా వ సగీరినా వ కబీరినా వ దకరినా వ ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్యైతహు మిన్నా ఫ అహ్యిహి అలల్ ఇస్లాం వ మన్ తవఫ్ఫైతహు మిన్నా ఫ తవఫ్ఫహు అలల్ ఈమాన్ అల్లాహుమ్మ లా తహ్రిమ్నా అజ్రహు వ లా తుదిల్లనా బ’అదహు)

ఈ దుఆ యొక్క అనువాదం మీరు విన్నారు. మరొక దుఆ ఉంది, అది కూడా అందులో ఎంత గొప్ప భావం ఉంది?

اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ
(అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్ హమ్హు వ ఆఫిహి వ’అఫు అన్హు)
ఓ అల్లాహ్, అతన్ని క్షమించు, అతన్ని కరుణించు. ఓ అల్లాహ్, అతన్ని సుఖంగా, శాంతిగా ఉంచు. అతనిని నీవు అన్ని రకాలుగా అతని పాపాలను తుడిచివేసి నీవు మన్నించేసెయ్.

وَأَكْرِمْ نُزُلَهُ
(వ అక్రిమ్ నుజులహు)
అతడు ఇప్పుడు నీకు అతిథిగా అయ్యాడు. నీవు అతన్ని మంచిగా చూసుకో.

وَوَسِّعْ مُدْخَلَهُ
(వ వస్సి’అ ముద్ఖలహు)
అతడు సమాధిలో ప్రవేశించాడు, సమాధిని నీవు విశాలపరచు.

وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ
(వగ్సిల్హు బిల్ మాయి వస్సల్జి వల్ బరద్)
నీవు అతని యొక్క పాపాలను నీటితో, బర్ఫ్ (ఐస్)తో, కడగండ్లతో పూర్తిగా కడిగి వేసెయ్. ఏమి పాపాలు లేకుండా చేయి అతన్ని.

وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ
(వ అబ్ దిల్హు దారన్ ఖైరమ్ మిన్ దారిహి)
ఈ ఇక్కడి గృహం కంటే, నీవు ఉత్తమమైన గృహం అక్కడ అతనికి ప్రసాదించుము.

وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ
(వ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహి)
ఇక్కడ ఉన్న అతని జంట కంటే, మంచి ఓ జంట నీవు అతనికి ప్రసాదించు.

وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ
(వ అహْلన్ ఖైరమ్ మిన్ అహ్లిహి)
ఇక్కడ ఇతని యొక్క కుటుంబం ఏదైతే ఉందో, ఇంతకంటే మంచి కుటుంబం నీవు అతనికి ప్రసాదించుము.

وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ
(వ అ’ఇద్హు మిన్ అదాబిల్ ఖబ్ర్)
ఇతన్ని నీవు సమాధి శిక్ష నుండి కాపాడు, శరణు ప్రసాదించు.

وَعَذَابِ النَّارِ
(వ అదాబిన్నార్)
నరక శిక్ష నుండి కూడా ఇతనికి శరణు ప్రసాదించు.

وَأَدْخِلْهُ الْجَنَّةَ
(వ అద్ఖిల్హుల్ జన్నహ్)
మరియు ఇతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము.

గమనిస్తున్నారా ఎంత గొప్ప భావాలు ఉన్నాయో?

అయితే సోదర మహాశయులారా, ఈ దుఆ ఏదైతే ఇక్కడ తెలుగులో కూడా రాసి ఉందో, మళ్లీ అంటే ఈ మూడు తక్బీర్, మూడోసారి అల్లాహు అక్బర్ అని చేయి కట్టుకున్న తర్వాత ఈ దుఆ చదివాము కదా, గుర్తుంది కదా మీకు? మరోసారి కొత్తగా చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. మధ్యలో చాలా విషయాలు, మాటలు వచ్చాయి కదా? మొదటిసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, సనా చదివితే చదవచ్చు లేకపోతే పర్వాలేదు. అ’ఊదుబిల్లాహ్, బిస్మిల్లాహ్, సూరె ఫాతిహా మొత్తం చదివి, ఆ తర్వాత ఏదైనా సూరా చదివితే చదవచ్చు లేకపోయినా పర్వాలేదు. మళ్ళీ అల్లాహు అక్బర్ అని దరూద్ ఇబ్రాహీం పూర్తిగా చదవాలి, ఏదైతే మనం తషహ్హుద్ లో చదువుతామో. మూడోసారి అల్లాహు అక్బర్ అని ఈ దుఆలు చదవాలి, ఇప్పటివరకు మనం తెలుసుకున్న దుఆలు. నాలుగోసారి అల్లాహు అక్బర్ అని అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్, ఒకవైపున సలాం తింపినా సరిపోతుంది, సహీహ్ హదీస్ తో రుజువు అయి ఉంది. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని రెండో వైపున కూడా ఒకవేళ సలాం తెంపితే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రెండు సలాముల విషయం కూడా ఒక సలాం అయినా, రెండు సలాములైనా, ఈ రెండు విషయాలు సహీహ్ హదీసులతో రుజువు అయి ఉన్నాయి.

సోదర మహాశయులారా, ఆ తర్వాత…

ఎవరైనా పాఠాలు వింటున్నారు కదా?

షేఖ్, వింటున్నాం షేఖ్. జజాకుముల్లాహు ఖైరన్ షేఖ్.

జజాకుముల్లాహు ఖైరన్. వాస్తవానికి ఇది ఒక క్లాసే. కానీ సమయం సరిపోవడం లేదు. డిస్టర్బెన్స్ కూడా చాలా అవుతుంది అని అందరినీ సైలెంట్ చేసి మ్యూట్ చేసి పాఠం చెప్పడం జరుగుతుంది. లేదా అంటే క్లాస్ అన్నప్పుడు క్లాస్ గా ఒక మాట చెప్పి, ఆ అబ్దుల్లా, అర్థమైందా? ఖాజా, ఆ చెప్పండి. అస్మా గారు చెప్పండి. ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న అడుగుకుంటూ వెళితే చాలా బాగుండేది. కానీ క్షమించండి, అల్లాహు త’ఆలా మన సమయంలో బరకత్ ప్రసాదించుగాక. చదవండి అబ్దుల్ ఖాదిర్ గారు.

గర్భిణీల గర్భస్రావంపై ఆదేశం

ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భము పడిపోయినచో, దాని యొక్క జనాజా నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాకముందు గర్భము పడిపోయి చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.

ఈ విషయం కూడా చాలా అవసరం. అనేక మంది ఈ ఆదేశం పట్ల కూడా చాలా అశ్రద్ధగా ఉన్నారు. కొందరు కొందరి గురించి అయితే తెలుస్తుంది, తొమ్మిది నెలలు పూర్తి నిండి పుట్టిన వెంటనే లేదా పుట్టినప్పుడే చనిపోయాడు అని తెలిస్తే కూడా జనాజా నమాజ్ చదవకుండానే తీసుకెళ్లి దఫన్ చేసి వచ్చేస్తారు. కానీ అబూ దావూద్ లో వచ్చిన హదీస్ ఆధారంగా అనేక ధర్మవేత్తలు, ప్రస్తుత కాలంలోని ఎందరో మషాయిఖ్ ఇదే ఫత్వా ఇచ్చారు. ఏంటి? నాలుగు నెలలు గర్భం పూర్తి అయింది, 120 రోజులు పూర్తిగా నిండిపోయాయి, ఆ తర్వాత తల్లి గర్భంలో పిండం చనిపోతే అతని యొక్క జనాజా నమాజ్ తప్పకుండా చదవాలి. ఎందుకు? ఇంతకు ముందు నేను మీకు చూపించాను ‘Z Daroos’ అని మా YouTube ఛానల్ ఏదైతే ఉందో ఆఫీస్ వైపు నుండి, అందులో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఆదేశాలు కొంచెం వివరంగా ఉన్నాయి, తప్పకుండా వినండి అక్కడ. సంక్షిప్తం ఏమిటి? సుమారు 80 నుండి 90 రోజుల తర్వాత తల్లి గర్భంలో పిండం సంపూర్ణ మానవ ఆకారం పొందుతాడు. కళ్ళు, చేతులు, మొత్తం శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో, పూర్తి ఒక మానవ రూపంలో వచ్చేస్తాడు. అంతకుముందు 40 రోజులు నుత్ఫా, 40 రోజులు అలకా, తర్వాత 40 రోజులు ముద్గా, ఈ విధంగా 120 రోజులు పూర్తి అయిపోయేసరికి ఇక అతడు సంపూర్ణ ఒక మనిషి, మనిషి రూపం దాల్చేశాడు. 120 రోజుల తర్వాత అతనిలో రూహ్, ఆత్మ కూడా వేయడం జరిగింది. ఇక అతడు ఒక సంపూర్ణ ఒక మనిషిగా ఉన్నాడు, చిన్న సైజులో, తల్లి గర్భంలో. ఆ తర్వాత మరణిస్తే తప్పకుండా అతని యొక్క జనాజా నమాజ్ చేయాలి. “అస్సిక్తు యుసల్లా అలైహ్” హదీసులో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

ఇక నాలుగు నెలల కంటే ముందు, నాలుగు నెలలు పూర్తి కాకముందే చనిపోతే, జనాజా నమాజ్ చేయకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇక్కడ వరకు సోదర మహాశయులారా, అల్హందులిల్లాహ్ జనాజా నమాజ్ కు సంబంధించిన ఆదేశాలు పూర్తి అయ్యాయి.

ప్రశ్న-జవాబులు

సలాం అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అడగండి, మాట్లాడండి.

షేఖ్, నమాజ్, జనాజా నమాజ్ కొరకు సఫ్ ఎలా ఏర్పాటు చేయాలి షేఖ్?

సర్వసామాన్యంగా నమాజుల కొరకు ఎలాగైతే సఫ్ ఉంటుందో అలాగే ఉండాలి. ఇక్కడ కొందరు అంటారు మూడు, ఐదు, ఏడు, ఇలా తప్పనిసరి ఏమీ లేదు కానీ ఉంటే మంచిది. కానీ సఫ్ కంప్లీట్ కూడా ఉండాలి. ఇది మంచి విషయం. సఫ్ కంప్లీట్ కాకుండా ఎక్కువ సఫ్ లు చేయడం మరియు బేసి సంఖ్యలో చేయడం ఇది అంత తప్పనిసరి కాదు. సఫ్ కంప్లీట్ గా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం.

జజాకల్లాహు ఖైరన్ షేఖ్.

వ ఇయ్యాక.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

షేఖ్, ఈ కువైట్ లో రాజు చనిపోయాడు కదా, అయితే అతని యొక్క జనాజా నమాజ్ అన్ని మస్జిద్ లలో చదివించడం జరిగింది. ఇలా ఎక్కడైనా నమాజ్ చదివించవచ్చా? లేక జనాజా ముందరనే జనాజా నమాజ్ చదవాలా షేఖ్?

జనాజా ముందట కూడా చదివించడం జరిగింది. జనాజా ముంగట పెట్టుకొని అక్కడ కూడా చదివించడం జరిగింది. కానీ దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఆధారంగా ముస్లిం ప్రభుత్వంలోని నాయకుడు ఎవరి జనాజా నమాజ్ గాయబానా వేరేచోట చదివించడానికి ఆదేశం ఇస్తాడో, అక్కడ చదవచ్చు. ఇక్కడ సౌదీ అరబ్ లో కూడా ఇక్కడి రాజు ఆదేశం ఇచ్చారు. అందుకని కువైత్ రాజు యొక్క జనాజా నమాజ్ గాయబానా ఇక్కడ మక్కా, మదీనాలో, హరమైన్ లో కూడా చేయడం జరిగింది.

ఇంకొక ప్రశ్న షేఖ్. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకే దుఆ చదవవచ్చా లేక వేరే దుఆలు చదవవచ్చా షేఖ్, జనాజా నమాజ్ లో?

పర్వాలేదు, ఒకే దుఆ చదివితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక రెండో దుఆ ఏదైతే నేను చదివానో, అందులో
“అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్హమ్హు వఆఫిహి వఅఫు అన్హు”
ఈ ఏదైతే పదాలు ఉన్నాయో చివరిలో హూ, హీ అని, అక్కడ,
“అల్లాహుమ్మగ్ఫిర్ లహా వర్హమ్హా వఆఫిహా వఅఫు అన్హా వఅక్రిమ్ నుజులహా”
ఈ విధంగా చదవడం మంచిది. కానీ ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం మయ్యిత్, మయ్యిత్ పదం ముజక్కర్. ఇది ఆహ్, మేల్ వర్డ్. అందుకొరకు “అల్లాహుమ్మగ్ఫిర్ లహు” చదివినా ఎలాంటి అభ్యంతరం లేదు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

షేఖ్, జనాజా నమాజ్ చదివేటప్పుడు ఎవరికైనా దుఆ పూర్తిగా రాకపోతే అలాంటి నమాజ్ నెరవేరుతుందా? లేకపోతే అది మరలా వచ్చిన వాళ్ళు చదవాలా? అంటే కొన్ని సందర్భాల్లో ఎవరు నమాజ్ చదివించడానికి దుఆలు వచ్చిన వాళ్ళు ఉండరు.

ఏం చదువుతారు మరి ఆ సందర్భంలో?

అంటే ఏదైతే దుఆలు అయితే వాళ్లకు తెలిసి ఉంటాయో అలాంటి దుఆలు చదవవచ్చినా అనేది ప్రశ్న.

ఇక్కడ ఎవరు ఫత్వా ఇచ్చారో ప్రస్తుతం నాకు గుర్తు రావట్లేదు కానీ నేను ఎవరో ఎవరిదో ఫత్వా చదివాను. జనాజా నమాజ్ లో ఒకవేళ ఎవరికైనా దుఆ కంఠస్థం లేకపోతే వారు రాసుకొని ఏదైనా మొబైల్ లో గానీ లేదా కాగితంలో గానీ చూసి చదవడంలో ఇబ్బంది లేదు ఇన్ షా అల్లాహ్. కానీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి, కనీసం ఒక్క దుఆనైనా. అల్లాహు ఆ’లమ్.

జజాకల్లాహు ఖైర్ షేఖ్.

వ ఇయ్యాక, బారక ఫీక్.

ఈ అంశానికి సంబంధించి ఇంకా ప్రశ్న ఉంటే ఎవరిదగ్గరైనా మైక్ ఆన్ చేసుకొని అడగవచ్చు లేదా రేస్ హ్యాండ్ చేయవచ్చు.

అహ్సనల్లాహు ఇలైక్ షేఖ్.

వ ఇలైకుమ్, వ బారక ఫీకుమ్. తఫద్దల్, హయ్యాకల్లాహ్.

షేఖ్, అరబీలో దుఆ రాకపోతే, జనాజా సలాత్ లో, వేరే ఇంకా వేరే భాషలో ఏమైనా చేసుకోవచ్చా షేఖ్ దుఆ?

నేను చెప్పాను కదా ఇంతకుముందు, రాసి ఉండాలి అరబీలో. దాన్ని చూసి చదివితే ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది “హాదా అహ్వను అలైక మిన్ గైరిల్ అరబియ్యా”. అరబీ భాషలో కాకుండా వేరే భాషలో చదవడం కన్నా చూసి నమాజ్ లో అరబీలో ఆ దుఆ చదవడం ఉత్తమం. అల్లాహు ఆ’లమ్.

జజాకల్లాహు ఖైరన్ షేఖ్. బారకల్లాహు ఫీక్.

వ ఇయ్యాక.

షేఖ్, ఇక్కడ మన ఇండియాలో చాలా జనాజాలు నేను చేశాను. రెండు మూడు జనాజాలు. రెండు నిమిషాల్లో జనాజా నమాజ్ పూర్తి చేసేస్తారు షేఖ్. అది ఎలాగ అనేది నాకు అర్థం కావడం లేదు. ఏం దుఆలు చదువుతారు? ఏం పఠిస్తారు?

చెప్తాను, వినండి. మన వద్ద సర్వసామాన్యంగా మన హనఫీ సోదరులు అల్లాహ్ మాకు, వారికి అందరికీ హిదాయత్ ఇవ్వుగాక, హనఫీ సోదరులు సూరతుల్ ఫాతిహా చదవరు. సనా చదువుతారు. ఇదే చాలా విచిత్ర విషయం అనిపిస్తుంది. అందుకొరకే అంధానుసరణ ఉండకూడదు. అంటే ఈ అంధానుసరణ, తక్లీద్ ఏదైతే ఉందో, దీని కారణంగా ఏం జరుగుతుంది? వారు సనా ప్రస్తావన లేదు, అది చదువుతున్నారు. సూరె ఫాతిహా ప్రస్తావన ఉంది, దాన్ని వదులుతున్నారు. అందుకొరకు కూడా వారి యొక్క నమాజ్ సంక్షిప్తంగా అయిపోతుంది. ఇంకా వేరే ఏదైనా ఎవరైనా వేరే కారణాలతో సంక్షిప్తంగా చేస్తే నాకు తెలియదు. నాకు తెలిసిన విషయం చెప్పాను. అల్లాహు ఆ’లమ్. ఇక్కడ ముఖ్యంగా నేను గుర్తు చేస్తున్నది ఏమిటంటే, సూరె ఫాతిహా కూడా జనాజా నమాజ్ లో చేయాలి.

జజాకుముల్లాహు ఖైర్ షేఖ్. ఇంకొక విషయం షేఖ్. ఎందుకు జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు ఉండవు? శవం ముందర ఉన్నదానా? లేకపోతే ఎందుకు షేఖ్?

ఎలా? జనాజా… ఏంటి ఏంటి? రుకూలు, రుకూ, సజ్దాలు. అల్లాహు ఆ’లమ్. ముందు ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిలో మనకు నేర్పిన విషయంలో జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు లేవు. కారణం ఏంటి? మీరు చెప్పినట్లు, ముందు ఒక శవం ఉంటుంది గనక చూసే వారికి మనం అతని కొరకు రుకూ చేస్తున్నట్లు, అతని కొరకు సజ్దా చేస్తున్నట్లు ఏర్పడకూడదు కావచ్చు. అల్లాహు ఆ’లమ్. ఇదే అల్లాహ్ యొక్క ఇష్టం. అందుకొరకే విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి? తూచా తప్పకుండా ఎందుకు, ఎలా, ఇలా ఎందుకు, అలా ఎందుకు లేదు అన్నటువంటి ప్రశ్నలు లేకుండా అల్లాహ్ చెప్పిన మాటను, ప్రవక్త చూపిన పద్ధతిని మనం అనుసరించాలి. బారకల్లాహు ఫీకుమ్.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

వ అలైకుమ్ అస్సలాం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

షేఖ్, ఈ జనాజా నమాజ్ లోని ఒక ప్రశ్న షేఖ్. చిన్న పిల్లలకు నమాజ్ చదివించవచ్చు, చదివించవచ్చుకూడదు ఎలాగైనా ఒకటే అంటారు షేఖ్. దీని గురించి.

ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇచ్చేకి బదులుగా, ఒకవేళ మీరు గ్రహించారంటే, ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. ఇంతకు ముందే నేను ఇచ్చేసాను, ఇదే పాఠంలో, ఈ రోజే. కానీ అది కొందరికి డైరెక్ట్ గా అర్థం అయ్యింది కావచ్చు, మరి కొందరికి డైరెక్ట్ గా అర్థం కాలేదు కావచ్చు.

అయితే మీలోనే ఎవరైనా సమాధానం ఇవ్వాలి అని కోరుతున్నాను. సోదరుడు అబ్దుల్ అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వండి. అడపదడప మిమ్మల్ని కూడా అడగాలి కదా మరి నేర్చుకున్నది ఏం నేర్చుకుంటున్నారు మీరు అనేది తెలియాలి కదా.

అదే కదా షేఖ్, గర్భంలో నాలుగు నెలలు పూర్తి నిండితే చదివించాలి, పూర్తి నిండకపోతే చదివించకూడదు. ఇలాగేనా షేఖ్, ఇదేనా షేఖ్?

కరెక్ట్. ఈ విషయం ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ నాలుగు నెలల గర్భం నిండిన తర్వాత ఒకవేళ చనిపోతే నమాజ్ చేయాలి అని అన్నప్పుడు, ఇక చిన్నపిల్లలు ఎవరైతే పుట్టి కొద్ది రోజులు బ్రతికి చనిపోయారో, వారి జనాజా నమాజ్ చదవకపోవడానికి ఏంటి దలీల్? ఏంటి కారణం? ఏంటి రీజన్? అర్థమైంది కదా?

అర్థమైంది షేఖ్.

నమాజు మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/