మరణాంతర జీవితం – పార్ట్ 12: పరలోకంలో మహా మైదానంలో పుణ్యాత్ముల పరిస్థితి [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 12 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 12. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:35 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలుల్లాహ్ అమ్మాబాద్.

ఈనాటి మన శీర్షిక విశ్వాసుల్లో మరీ ఉత్తమమైన వారు, పుణ్యాత్ములు, భక్తులు, అల్లాహ్ యొక్క భయభీతి కలిగి తమ జీవితం గడిపి పుణ్యాల్లో, సత్కార్యాల్లో తమ జీవితం గడిపిన వారు. వారి యొక్క స్థానం సమాధుల నుండి లేపబడిన తర్వాత పరలోకంలో, ఆ మహా మైదానంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది?

ఎప్పుడైతే ప్రజలందరూ సమాధులు నుండి లేపబడతారో, ఆకాశాల్లో, భూమిలో ఉన్నవారందరూ కూడా భయకంపితులు అయిపోతారు, సొమ్మసిల్లి పోతారు. వారి యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. కానీ విశ్వాసులు, పుణ్యాత్ములు, ఎల్లవేళల్లో సత్కార్యాల్లో జీవితం గడుపుతూ పాపాల నుండి దూరం ఉండే వారు, ఎంతో భయ భక్తితో తన జీవితం గడిపేవారు, వారి గురించి అల్లాహ్ సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 101 నుండి 103 వరకు:

إِنَّ الَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا الْحُسْنَىٰ أُولَٰئِكَ عَنْهَا مُبْعَدُونَ لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِي مَا اشْتَهَتْ أَنفُسُهُمْ خَالِدُونَ لَا يَحْزُنُهُمُ الْفَزَعُ الْأَكْبَرُ

అయితే ముందు నుంచే మా వద్ద ఎవరి కొరకు మేలు ఖరారై ఉందో వారంతా నరకానికి దూరంగానే ఉంచబడతారు.వారు నరకం సవ్వడి అయినా వినరు. తమ మనసు మెచ్చిన సుఖవిలాసాల మధ్య వారు శాశ్వతంగా ఉంటారు. ఆ మహాకలవరం (కూడా) వారిని వ్యాకుల పరచదు.

అల్లాహు అక్బర్!. ఎలాంటి అదృష్టవంతులు వారు గమనించండి. మనం కూడా వారిలో ఒకరు కావడానికి ప్రయత్నం చేయాలి. ఈలోకంలో ఒకేసారి మనకి ఈ అవకాశం దొరుకుతుంది.

సూరత్ జుక్రూఫ్ ఆయత్ 68 మరియు 69 లో వారి గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు –

يَا عِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ الْيَوْمَ وَلَا أَنتُمْ تَحْزَنُونَ الَّذِينَ آمَنُوا بِآيَاتِنَا وَكَانُوا مُسْلِمِينَ

ఓ నా దాసులారా! ఈ రోజు మీకెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు. మా ఆయతులను (సూచనలను) విశ్వసించి, విధేయులు (ముస్లింలు)గా ఉన్న వారినుద్దేశించి (ఈ విధంగా అనబడుతుంది:)

ఆయతులు అంటే ఖురాన్ ఆయతులు. అల్లాహ్ పంపిన మహిమలు. ఈ ప్రపంచంలో అల్లాహ్ ఏ సూచనలు అయితే చూపిస్తున్నాడో, వేటి ద్వారానైతే మనము ఆయన ఏకత్వాన్ని గ్రహించి, పరలోకం రానున్నది, ఆయనను ఆరాధించి ఆ పరలోకదిన గాంభీర్యం, వ్యాకులత, అక్కడి యొక్క కఠినాల నుండి మనము రక్షణ పొందగలుగుతామో అని విశ్వసిస్తారో. మరియు వారు ముస్లిములుగా ఇస్లాం ప్రకారంగా జీవించి ప్రాణం పోయేంత వరకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉంటారో వారు ప్రళయ దినాన ఎప్పుడైతే అల్లాహ్ (తఆలా) వారికి అన్ని రకాల సుఖశాంతులు ప్రసాదిస్తాడో స్వయంగా వారి నోట ఇహలోకంలో కూడా అల్లాహ్ (తఆలా) చెప్పించాడు. ఏమని?

సూరతుల్ ఇన్సాన్ మరొక పేరు దానిది సూరతు ద్దహ్ర్. ఆయత్ నెంబర్ పదిలో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు –

76:10  إِنَّا نَخَافُ مِن رَّبِّنَا يَوْمًا عَبُوسًا قَمْطَرِيرًا

“నిశ్చయంగా మేము మా ప్రభువు తరఫున సంభవించే అత్యంత కఠినమైన, సుదీర్ఘమైన రోజు గురించి భయపడుతున్నాము.”

“నిశ్చయంగా మేము భయపడతాము. మా ప్రభువుతో చాలా సుదీర్ఘకాలం అయిన, మరి ఎంతో కఠినతరమైన ఆ పరలోక దినం ఏదైతే ఉందో ఆ రోజున మా ప్రభువు మాకు అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించాలి లేదా అంటే ఆ రోజు చాలా కష్టతరమైనది అని మేము మా ప్రభువుతో భయపడుతూ ఉండేవారము”. అలా భయపడుతూ జీవితం గడిపి సత్కార్యాల్లో, ఎళ్లవేళల్లో నిమగ్నులై పాపాలకు దూరం ఉన్నందువల్ల అల్లాహ్ తప్పకుండా అలాంటి వారిని ఆ రోజున ఏ వ్యాకులత, ఏ కఠినతరం ఉంటుందో దాని నుండి వారిని రక్షిస్తాడు.

ఒక హదీస్ లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు – షేక్ అల్బానీ (రహిమహుల్లా) సిల్ సిలతుల్ సహీహాలో దానిని హసన్ అని అన్నారు. సహీహాలో హదీత్ నెంబర్ 742. అల్లాహ్ ఇలా అంటున్నాడు – “స్వయంగా అల్లాహ్ (తఆలా) తాను అందరిపై అన్ని రకాల అధికారం కలిగి అందరికీ మానం, అవమానం పాలు చేసే అటువంటి శక్తిసామర్థ్యం గల ఆయన, ఎంతో గాంభీర్యం, ఔన్నత్యం గల ఆయన, తన ప్రమాణం చేస్తూ ఏమంటున్నాడు? నేను నా దాసునికి రెండు రకాల శాంతులు మరియు రెండు రకాల భయాలు కలిపి ఇవ్వను. అంటే ఏంటి? ఎవరైతే ఇహలోకంలో భయపడుతూ, పరలోకం నాటి గురించి భయపడుతూ ఉంటారో వారికి అల్లాహ్ (తఆలా) పరలోకంలో శాంతి, ప్రశాంతత, సుఖం ప్రసాదిస్తాడు. మరి ఎవరైతే ఇహలోకంలో పరలోకానికి సంబంధించిన విషయంలో ఎలాంటి భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవిస్తాడో అలాంటి వ్యక్తి తప్పకుండా ప్రళయదినాన భయకంపితులకు గురి అవుతాడు. ఒకవేళ అతను ఇహలోకంలో ప్రశాంతంగా జీవించాడు. ఎలాంటి భయ కంపితులకు గురికాలేదు. పరలోకం పట్ల రవ్వంత కూడా అతనిలో భయం అనేది కలగలేదు. అలాంటి వ్యక్తిని నేను ప్రళయ దినాన, పరలోకంలో అందరినీ సమీకరించినప్పుడు అతన్ని భయానికి గురి చేస్తాను. ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడి ఉన్నాడు అంటే, ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడుతూ జీవించాడు అంటే నేను ఏ రోజునైతే ప్రజలందరినీ సమీకరిస్తానో ఆ రోజు అతనికి ప్రశాంతత, సుఖము ప్రసాదిస్తాను“.

ఈ విధంగా మనం విశ్వాసాన్ని అవలంబించి, సత్కార్యాలు చేస్తూ పాపాలకు దూరంగా ఉండి మహా గొప్ప పుణ్యాత్ముల్లో కలిసే ప్రయత్నం చేస్తే ఆ పరలోకంలో ఎంతో సుఖం ఉంటుంది. ఇదే కాకుండా ఇంకా ఎన్నో రకాల పుణ్యాలు ఉన్నాయి.

మరియు ఆరోజు ఏ రోజైతే మైదానంలో కేవలం ఒకే ఒక మైలు దూరంలో సూర్యుడు ఉంటాడో దాని వేడితో ప్రజలు తమ యొక్క చెమటలో మునిగిపోతూ ఉంటారో అక్కడ ఏదైనా నీడ ఉంటె కేవలం అల్లాహ్ యొక్క అర్ష్ సింహాసనం నీడ ఉంటుంది. దాని కింద దాని యొక్క ఛాయ, నీడ పొందే వారిలో కలిసే అదృష్టవంతులు ఎవరో ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.

ఏడు రకాల వారిని అల్లాహ్ (తఆలా) ఆరోజు ఏ రోజునైతే ఆయన నీడ, ఛాయ తప్ప మరి ఎక్కడ ఏ నీడ లభించదో ఏడు రకాల వారిని తన నీడలో వారికి ఛాయ ప్రసాదిస్తాడు. ఎవరు ఆ ఏడు రకాల వారు?

1. న్యాయ వంతుడు అయిన నాయకుడు. ఇక్కడ ఇమామ్ అంటే ఇంటికి కూడా నాయకుడు. వీధికి కూడా నాయకుడు. కుటుంబానికి నాయకుడు. గల్లి నుండి ఢిల్లీ వరకు, గ్రామం నుండి మొత్తం దేశం వరకు ఏఏ లెవెల్లో ఎవరు నాయకత్వం వహిస్తున్నార్రో ఎవరు తమ నాయకత్వం లో ఉన్నవారి పట్ల న్యాయం వహిస్తారో వారికి కూడా ఆ రోజు నీడ లభిస్తుంది.

2. రెండో రకమైన వారు యువకుడు, ఏ యువకుడు అయితే తన యవ్వనాన్ని తన ప్రభువు యొక్క ఆరాధనలో గడిపాడో!. అల్లాహు అక్బర్ . యువకులారా ఆరాధనా అంటే ఇరవై నాలుగు గంటలు మస్జిద్ లో ఉండటమే కాదు, మన జీవితంలోని ప్రతి క్షణం ఎక్కడ ఉన్నా ఏది చేసినా అక్కడ ఆ సందర్భంలో, ఆ సమయంలో, ఆ స్థితిలో అల్లాహ్ యొక్క ఆదేశం ఏంటి తెలుసుకొని జీవించడమే అల్లాహ్ యొక్క ఆరాధన. ఇలాంటి యువకుడు ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో తన యవ్వనాన్ని గడిపాడో.

3. మూడో వ్యక్తి, అతని మనస్సు మస్జిద్ లో లగ్నమై ఉంటుంది. ఒక నమాజ్ చేసి వచ్చాడు అంటే తన ఇహలోక పనుల్లో, తన యొక్క బాధ్యతల్లో, తన భార్య పిల్లల్లో ఎవరు ఎవరి పట్ల ఏ బాధ్యత నెరవేర్చాలో అన్నిటిలో ఉంటాడు. కానీ నమాజ్ సమయం గుర్తు పెట్టుకొని మరో నమాజ్ వచ్చింది అంటే వెళ్లి సామూహికంగా నమాజ్ పాటించే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడ ఉన్నా గాని నమాజ్ సామూహికంగా చేస్తూ ఉండాలి అన్న విషయం అతని మదిలో నుండి బయటికి వెళ్ళదు. అతని హృదయం మస్జిద్ లో లగ్నమై ఉన్నది.

4. నాలుగో రకం వ్యక్తి ఎవరు? ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే అల్లాహ్ గురించి పరస్పరం ప్రేమాభిమానాలు పాటించి కలిస్తే అల్లాహ్ సంతోషానికి, అల్లాహ్ ప్రేమను పొందడానికి కలుస్తారు. వేరే అయిపోయినప్పుడు, విడిపోయినప్పుడు కూడా అల్లాహ్ ప్రేమ పొందే ఉద్దేశంతోనే విడిపోతారు. కలిసినా అల్లాహ్ ప్రేమకు పాత్రులు అవ్వడానికి, విడిపోయినా, అల్లాహ్ యొక్క ప్రేమను పొందడానికి మాత్రమే.

5. ఐదవ రకం. ఐదవ మనిషి ఎలాంటి వాడు? ఒక అందమైన మరియు హోదా, అంతస్తులు గల ఒక స్త్రీ అతన్ని చెడు వైపునకు ఆహ్వానిస్తే అతనంటాడు, నేను కేవలం అల్లాహ్ తో భయపడతాను. ఇలాంటి చెడుకు నేను సమీపించను. అల్లాహు అక్బర్. గమనించారా? అల్లాహ్ యొక్క భయం.

6. ఆరో రకం. ఆరో రకమైన వ్యక్తి అతను దానధర్మాలు చేస్తాడు. కుడి చేయితో ఏదైనా దానం చేశాడు అంటే ఎడమ చెయ్యికి కూడా తెలియకుండా అంత గోప్యంగా, రహస్యంగా కేవలం అల్లాహ్ సంతోషాన్ని పొందడానికి. ప్రజల చూపుగోరు తనానికి కాదు. కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టికి అతను ఖర్చు చేస్తూ ఉంటాడు.

7. ఏడో రకమైన వ్యక్తి. ఒంటరిగా ఉండి అల్లాహ్ ను గుర్తు చేసుకొని, కన్నీరు కార్చేటువంటి మనిషి. అల్లాహ్ ను గుర్తు చేస్తున్నప్పుడు అతని కళ్ల ద్వారా అశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తి.

ఈ ఏడు గుణాలు గల ఏడు రకాల మనుషులు ఆ ప్రళయ దినాన సుదీర్ఘ కాలాన్ని గానీ, ఆ కఠినతరమైన ఆ సమస్యలను కానీ ఎదుర్కోకుండా అల్లాహ్ యొక్క నీడలో ఉంటారు”.

సోదర సోదరీమణులారా! మనందరం కూడా విశ్వాస మార్గాన్ని అవలంభించి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటే, ఎంత గొప్ప లాభాన్ని పొందుతాము ఆ పరలోక దినాన. ఈ ఏడుగురే కాకుండా అల్లాహ్ యొక్క ఛాయ, నీడను పొందే అదృష్టవంతుల్లో మరొకరు. సహీ ముస్లిం షరీఫ్ హదీత్ నెంబర్ 3006 లో ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

ఎవరైతే తన నుండి అప్పు తీసుకున్న వ్యక్తికి మరి కొంత వ్యవధి ఇస్తాడో మరి కొంత సమయం ఇస్తాడో ఎక్కువగా. సరే మంచిది. మరో పదిహేను రోజుల తర్వాత ఇవ్వు. లేదా నీవద్ద పర్వాలేదు మరొక నెల తర్వాత ఇవ్వు. ఈ విధంగా వ్యవధి ఇస్తాడో లేదా ఆ వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి అతని వద్ద ఏమీ లేదు. అప్పు తిరిగి ఇవ్వడానికి అని తెలిసి అతని యొక్క అప్పు మాఫీ చేసేస్తాడు. కేవలం అల్లాహ్ సంతోషానికి ప్రళయ దినాన ఆయన యొక్క నీడ పొందడానికి నేను ఈ రోజు నీ యొక్క అప్పును తిరిగి తీసుకోను. ఇక మాఫీ చేసేస్తున్నాను. నువ్వు ఎలాంటి రంది పడకు అని తృప్తిని ఇస్తాడు. అలాంటి వ్యక్తికి కూడా అల్లాహ్ అతనికి కూడా ప్రళయ దినాన తన ఛాయలో స్థలం ఇస్తాడు“.

ఇంకా ఎవరు పరలోక దినాన ఆ సుదీర్ఘ కాలంలో ఆ కష్టతర సమయాల నుండి, ఆ స్థితిలో నుండి బయట పడతారు. ఎవరైతే విశ్వాస మార్గంలో నడుస్తూ ప్రజల పట్ల కూడా ఎంతో మృదువుగా మెలుగుతారో, వారి యొక్క కష్టాల్లో వారికి తోడుగా ఉండి, వారు ఇబ్బంది లో ఇరుక్కొని ఉన్నారో వాటి నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. సహీ ముస్లిం షరీఫ్ లో ఈ భావం ఉంది. కానీ ఇప్పుడు నేను చదివే హదీత్ సునన్ అబూదావూద్ లోనిది. సునన్ అబూదావూద్ హదీత్ నెంబర్ 4946 ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.

ఎవరైతే తన ముస్లిం సోదరుల యొక్క ఇహలోక కష్టాల్లోని ఏదైనా ఒక కష్టం దూరం చేస్తాడో అల్లాహ్ అతని పరలోక కష్టాల్లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు. ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తికి గానీ లేదా మరే రకమైన ఇబ్బందులు ఉన్న వ్యక్తికి గాని ఏదైనా సులభతరం కలిగిస్తాడో అల్లాహ్ అతనికి ఇహ, పరలోకాల్లో సులభతరాలు కలుగజేస్తాడు. మరి ఎవరైతే ఒక ముస్లిం లోపాల్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ ఇహలోకంలో, పరలోకంలో అతన్ని కప్పిపుచ్చుతాడు“.

మరొక హదీత్ లో ఉంది. ఆ హదీత్ ను షేక్ అల్బానీ (రహిమహుల్లా) గారు కూడా సహీహాల్లో ప్రస్తావించారు. హదీత్ నెంబర్ 1217. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు.

ఎవరైతే తన యొక్క సోదరునికి సహాయం దూరం నుండి, అతని వెనక ఉండి చేస్తాడో అల్లాహ్ ఇహ, పరలోకాల్లో ఇతనికి సహాయం చేస్తాడు.”

దగ్గర ఉన్నప్పుడు అయితే కనీసం చేయకుంటే ఎలా అని మనసులో వస్తుంది. సహాయం చేస్తాము. కానీ ఇక్కడ ఈ హదీస్ లో దూరం ఉండి అతను చూడకున్నా అతనికి ఎలాంటి సహాయం అవసరం ఉందో మనం చెప్పకుండా అతనికి సహాయం చేసేశాము. అల్లాహ్ అలాంటి వ్యక్తికి ఇహ, పరలోకాల్లో సహాయాలు చేస్తాడు”.

ఇంకా ఎలాంటి సత్కార్యాలు మనకు పనికి వస్తాయి పరలోకంలోని కష్టాలను మనం అనుభవించకుండా సుఖాలు పొందడానికి ఏ సత్కార్యాలు చేయాలి. వినండి మరొక హదీత్.

నిశ్చయంగా న్యాయం చేసేవారు, ఎవరైతే ప్రజల మధ్య ఏదైనా తీర్పు చేస్తున్న సందర్భంలో తీర్పులో న్యాయం చేసేవారు. వారి కుటుంబంలో ఇంటి వారిలో అందరిపట్ల న్యాయం చేసేవారు. మరి ఎవరైతే నాయకులుగా ఉండి, జడ్జీలుగా ఉండి న్యాయవాదిగా ఉండి, ఎక్కడ ఏ బాధ్యత ఉందో తన బాధ్యతలు ఉన్నవారి పట్ల న్యాయం చేస్తారో ఇలాంటి వారు ప్రళయ దినాన కరుణామయుడైన అల్లాహ్ యొక్క కుడి వైపున కాంతి యొక్క మింబర్ ల మీద ఆసీనులై ఉంటారు. అల్లాహ్ యొక్క రెండు చేతులు కూడా కుడియే“.

ఈ విధంగా జీవితంలోని ప్రతి వ్యవహారంలో న్యాయం పాటించడం ఎంత గొప్ప విషయమో గమనించండి.

ఇంకా మహాశయులారా! ఎవరైతే తమ యొక్క కోపాన్ని మింగేస్తారో, శక్తి ఉండి కూడా ఎదుటి వానితో ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమిస్తారో, అలాంటి వారు కూడా ప్రళయ దినాన ప్రజల అందరి ముంగటి నుండి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పిలిచి ఆహ్వానించి, ఇహ లోకంలో నీవు నా తృప్తి కొరకు, నా సంతోషాన్ని పొందడానికి మాత్రమే నీ కోపాన్ని దిగమింగావు. ఈ రోజు నీకు ఇష్టమైన స్వర్గ కన్యలో ఇష్టమున్న వారిని ఎన్నుకోండి అని అంటాడు.

ఇంకా వుదూ చేయడం, నమాజ్ చేయడం. ఇది కూడా చాలా గొప్ప విషయం. ఎవరైతే ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ పాటిస్తూ ఉంటారో, తప్పకుండ వుదూ చేయాల్సింది. ఎవరైతే వుదూ సంపూర్ణంగా చేస్తారో వారి యొక్క వుదూ అవయవాలు, ప్రళయ దినాన మెరుస్తూ ఉంటాయి. వారిని ఆ రకంగా పిలవడం జరుగుతుంది.

ఇంకా ఇలాంటి ఎన్నో సత్కార్యాలు గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. కానీ ముఖ్యమైన కొన్ని విషయాలు తెలపడం జరిగింది. పరలోక దినాన మనం ఆ కష్టాలనుండి దూరం ఉండాలంటే పరలోకాన్ని విశ్వసించాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించాలి. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గాన్ని అవలంభించి ఇస్లాం ప్రకారంగా జీవించాలి. అల్లాహ్ ఈ సత్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక!

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 9 – నమాజు ప్రాముఖ్యత, నమాజు సమయాలు, నమాజు చేయకూడని ప్రదేశాలు, ప్రశ్నోత్తరాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[43:07 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజ్ ఆదేశాలు

నమాజ్ ఇస్లాం మూల స్థంబాలలో రెండవది. అది ప్రతీ ప్రాజ్ఞ, ఈడేరిన స్త్రీ పురుషునిపై విధిగా ఉంది. నమాజ్ విధిని తిరస్కరించే వాడు కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడని ఏకాభిప్రాయం ఉంది. ఇక బద్ధకం, నిర్లక్ష్యంతో మొత్తానికే నమాజ్ చేయనివాడు కూడా కాఫిర్ అవుతాడని అధిక సంఖ్యలో ప్రవక్త సహచరులు (రదియల్లాహు అన్హుమ్) ఏకీభవించారు. ప్రళయదినాన మానవునితో తొలి లెక్క నమాజ్ గురించే జరుగును. నమాజుకు సంబంధించిన ఖుర్ఆన్ ఆదేశం చదవండిః

[إِنَّ الصَّلَاةَ كَانَتْ عَلَى المُؤْمِنِينَ كِتَابًا مَوْقُوتًا] [النساء:103]

నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. (సూరె నిసా 4: 103).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

عَنْ ابْنِ عُمَرَ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ الله وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَالْحَجِّ وَصَوْمِ رَمَضَانَ).

“ఇస్లాం పునాది ఐదు విషయాలపై ఉంది:

  • 1- అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరొకడు లేడు, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట.
  • 2- నమాజు స్థాపించుట.
  • 3- జకాత్ (విధిదానం) చెల్లించుట.
  • 4- హజ్ చేయుట.
  • 5- రమజాను ఉపవాసాలు పాటించుట”.

(బుఖారి 8, ముస్లిం 16).

عَنْ جَابِرٍ t يَقُولُ: سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكَ الصَّلَاةِ).

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా విన్నాను:

“ఒక మనిషి మరియు షిర్క్, కుఫ్ర్ (బహుదైవారాధన, సత్యతిరస్కారం) మధ్య ఉన్న వ్యత్యాసం నమాజును విడనాడడం”.

(ముస్లిం 82).

నమాజ్ పాటించడంలో చాలా గొప్ప ఘనతలున్నాయి, వాటిలో కొన్ని:

عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఎవరైనా తన ఇంట్లో వుజూ చేసుకొని, అల్లాహ్ యొక్క విధుల్లో ఒక విధి నిర్వహించుటకు అల్లాహ్ గృహాల్లోని ఒక గృహం (మస్జిద్)లో ప్రవేశిస్తే, అతను వేసే అడుగుల్లో ఒక దానికి బదులుగా ఒక పుణ్యం లభిస్తే, మరో దానికి బదులుగా ఒక స్థానం పెరుగుతుంది”. (ముస్లిం 666).

عَنْ أبِي هُرَيرَةَ t، أنَّ رَسُولَ الله ﷺ قَالَ: (أَلاَ أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا ، وَيَرْفَعُ بِهِ الدَّرجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولُ اللهِ. قَالَ: (إِسبَاغُ الْوُضُوءِ عَلَى الْمَكَارِه ، وَكَثْرَةُ الْخُطَا إِلَى الْمَسَاجِد ، وَانْتِظَارُ الصَّلاَةِ بَعدَ الصَّلاَةِ ، فَذَلِكُمُ الرِّبَاط).

అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మహానీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అడిగారు:

“పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో అలాంటి విషయాలు మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారుః ” (1) వాతవరణం, పరిస్థితులూ అనుకూలంగా లేనప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం, ఇది రిబాత్ తో సమానం([1])“. (ముస్లిం 251).

[1] రిబాత్ అంటే సత్యాసత్యాల మధ్య పోరాటం సాగే రోజుల్లో రాత్రిళ్ళు పహరా కాయడం అన్న మాట. శాంతి కాలంలో నమాజ్ పట్ల మక్కువ, పోరాటపు రోజుల్లో ప్రాణాలొడ్డి పహరాకాయడంతో సమానమని అర్థం.

وَعَن أَبِي هُرَيرَة t عَنِ النَّبِيِّ ﷺ قَالَ:(مَنْ غَدَا إلَى المَسْجِدِ أَو رَاحَ ، أَعَدَّ اللهُ لَهُ فِي الْجَنَّةِ نُزُلاً،كُلَّمَا غَدَا أو رَاحَ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజ్ చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు”. (బుఖారి 662. ముస్లిం 669).

నమాజుకు సంబంధించిన ముఖ్య విషయాలు:

1- సామూహికంగా నమాజ్ చేయడం పురుషుల పై విధిగా ఉంది, ఈ హదీసు ఆధారంగా:

(لَقَدْ هَمَمْتُ أَنْ آمُرَ بِالصَّلَاةِ فَتُقَامَ ثُمَّ أُخَالِفَ إِلَى مَنَازِلِ قَوْمٍ لَا يَشْهَدُونَ الصَّلَاةَ فَأُحَرِّقَ عَلَيْهِمْ).

“నమాజ్ చేయించడానికి ఒకరిని ఆదేశించి, సామూహిక నమాజులో పాల్గొనని వారి వైపుకు తిరిగి వారు ఇండ్లల్లో ఉండగా వారి గృహాలను తగలబెడదామని ఎన్నో సార్లు అనుకున్నాను”. (బుఖారి 2420, ముస్లిం 651).

2- శాంతి, నిదానంగా త్వరగా మస్జిదుకు రావడం చాలా మంచిది.

3- మస్జిదులో ప్రవేశిస్తూ కుడి కాలు ముందు వేసి అల్లా హుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక చదవండి. (ముస్లిం 713).

اللهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలు తెరువు).  

4- కూర్చునే ముందు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవడం సున్నత్.

عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ t أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (إِذَا دَخَلَ أَحَدُكُمْ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని, అబూ ఖతాద (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశిస్తే కూర్చునే ముందు రెండు రకాతుల నమాజ్ చేసుకోవాలి”. (బుఖారి 444, ముస్లిం 714).

5- నమాజులో సతర్ (శరీరంలో కప్పి ఉంచే భాగం) తప్పనిసరి. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు, స్త్రీల పూర్తి శరీరమే సతర్, నమాజులో కేవలం ముఖము,చేతులు తప్ప.

6- కాబా వైపునకు అభిముఖమై ఉండుట తప్పనిసరి. నమాజ్ అంగీకారానికి ఇది ఒక షరతు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. ఉదా: వ్యాది లేదా మరేదైనా కారణం.

7- ప్రతీ నమాజ్ దాని సమయములో చేయాలి. సమయానికి ముందు చేయుట సమ్మతం కాదు. సమయం దాటి చేయడం నిషిద్ధం.

8- నమాజుకై శీఘ్రముగా సమయంలో రావడం, తొలి పంక్తిలో చేరుకోవడం, నమాజ్ కొరకు వేచించడం, ఇవన్నియూ చాలా గొప్ప ఘనతగల కార్యాలు.

عَنْ أَبِي هُرَيرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ…).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించారని, అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“అజాన్ పలకడం మరియు మొదటి పంక్తిలో చేరడం ఎంత పుణ్యకార్యమో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటి (ఖుర్అ) పద్దతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటి వేసుకొందురు. అలాగే వేళ కాగానే తొలి సమయంలో నమాజుకు రావడంలో ఎంత పుణ్యముందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటిపడుదురు. …..”. (బుఖారి 615, ముస్లిం 437).

عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ الله قَالَ: (لَا يَزَالُ أَحَدُكُمْ فِي صَلَاةٍ مَا دَامَتْ الصَّلَاةُ تَحْبِسُهُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని, అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“నమాజ్ కొరకు వేచిస్తూ ఉన్న వ్యక్తికి నమాజ్ చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది”. (బుఖారి 659, ముస్లిం 649).

నమాజ్ సమయాలు:

  • జొహ్ర్ నమాజ్ నమయం: తల నుండి పొద్దు వాలినప్పటి నుండి ప్రతీ వస్తువు నీడ దానంత అయ్యే వరకు.
  • అస్ర్ నమాజ్ సమయం: ప్రతీ వస్తువు నీడ దానంత అయినప్పటి నుండి సూర్యాస్తమయం వరకు.
  • మగ్రిబ్ నమాజ్ సమయం: సూర్యాస్తమయం నుండి ఎర్రని కాంతులు కనుమరుగయ్యే వరకు.
  • ఇషా నమాజ్ సమయం: ఎర్రని కాంతులు మరుగైన మరుక్షణం నుండీ అర్థ రాత్రి వరకు.
  • ఫజ్ర్ నమాజ్ సమయం: ఉషోదయము నుండి సూర్యోదయము వరకు.

నమాజ్ చేయరాని స్థలాలు:

1- ఖననవాటిక (స్మశాన వాటిక): ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

(الْأَرْضُ كُلُّهَا مَسْجِدٌ إِلَّا الْحَمَّامَ وَالْمَقْبَرَةَ).

“భూభాగమంతయూ మస్జిదే. స్నానశాల, మరుగుదొడ్లు మరియు ఖనన వాటిక (ఖబరస్తాన్) తప్ప”. (అబూ దావూద్ 492, తిర్మిజి 317).అయితే జనాజ నమాజ్ మట్టుకు ఖబరస్తానులో చేయడం ధర్మమే.

2- సమాధి, గోరీల వైపు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అబూ మర్సద్ గనవీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

(لَا تُصَلُّوا إِلَى الْقُبُورِ وَلَا تَجْلِسُوا عَلَيْهَا).

“గొరీలు ఎదురుగా ఉండగా నమాజ్ చేయడం గానీ, వాటిపై కూర్చోవటం గానీ చేయకండి”. (ముస్లిం 972).

3- ఒంటెశాల అంటే ఒంటెలు కట్టే చోటు. అలాగే అశుద్ధ స్థలాల్లో నమాజ్ చేయరాదు.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ : 6వ భాగం : ఆయతులు 9 – 15 [వీడియో]

బిస్మిల్లాహ్

[45:30 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

18. సూరా అల్ కహఫ్ (ఆయతులు 9 – 15)

18:9  أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا

ఏమిటీ, గుహవారిని, శిలాఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా?

18:10  إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا

ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినపుడు ఇలా ప్రార్థించారు: “మా ప్రభూ! నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.”

18:11  فَضَرَبْنَا عَلَىٰ آذَانِهِمْ فِي الْكَهْفِ سِنِينَ عَدَدًا

అంతే! మేము ఆ గుహలో ఎన్నదగ్గ కొన్నేండ్లవరకూ వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాము.

18:12  ثُمَّ بَعَثْنَاهُمْ لِنَعْلَمَ أَيُّ الْحِزْبَيْنِ أَحْصَىٰ لِمَا لَبِثُوا أَمَدًا

ఆ తరువాత, ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ఠకాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము.

18:13  نَّحْنُ نَقُصُّ عَلَيْكَ نَبَأَهُم بِالْحَقِّ ۚ إِنَّهُمْ فِتْيَةٌ آمَنُوا بِرَبِّهِمْ وَزِدْنَاهُمْ هُدًى

వారి యదార్ధ గాథను మేము నీకు వివరిస్తున్నాము – తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు. మేము వారి సన్మార్గంలో వృద్ధినొసగాము.

18:14  وَرَبَطْنَا عَلَىٰ قُلُوبِهِمْ إِذْ قَامُوا فَقَالُوا رَبُّنَا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ لَن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا

వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము; “భూమ్యాకాశాలకు ప్రభువైనవాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.”

18:15  هَٰؤُلَاءِ قَوْمُنَا اتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً ۖ لَّوْلَا يَأْتُونَ عَلَيْهِم بِسُلْطَانٍ بَيِّنٍ ۖ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا

“ఆయన్ని వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహ్‌కు అబద్ధాన్ని అంట గట్టేవాడికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు?


సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

కొందరు సోదరులు డ్యూటీలు రాత్రి 12 , 2 వరకు చేస్తారు. ఫజ్ర్ నమాజుకు లేవలేరు. ఉదయం 7 లేదా 8 కి లేసి ఫజ్ర్ చేసుకుంటారు.ఇది ఎంతవరకు సమంజసం? [వీడియో]

బిస్మిల్లాహ్

[4:26 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తన పెళ్లి జరగడం ఆలస్యమవుతుందని తల్లిదండ్రులను నిందించడం, కోపగించుకోవడం తగదు [వీడియో]

బిస్మిల్లాహ్

[10:50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : నమాజు చేయరాని వేళలు [వీడియో]

బిస్మిల్లాహ్

[13:31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

నమాజ్ చేయరాని వేళలు:

కొన్ని సమయాల్లో నమాజ్ చేయుట యోగ్యం లేదు. అవిః

  • 1- ఫజ్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం తర్వాత సూర్యుడు బారెడంత పైకి వచ్చే వరకు.
  • 2- మిట్ట మధ్యానం, సూర్యుడు నడి ఆకాశంలో, తలకు సమానంగా ఉన్నప్పుడు. అది పశ్చిమాన వాలే వరకు.
  • 3- అస్ర్ నమాజ్ తర్వాత నుండి సూర్యాస్తమయం వరకు.

కాని ఈ సందర్భాల్లో కొన్ని నమాజులు చేయవచ్చును. ఉదాః తహియ్యతుల్ మస్జిద్ (మస్జిదులో ప్రవేశించిన వెంటనే చేయు నమాజ్). జనాజా నమాజ్. సూర్య గ్రహ నమాజ్. తవాఫ్ సున్నతులు. తహియ్యతుల్ వుజూ లాంటివి.

అలాగే తప్పిపోయిన నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు ఆధారంగాః

 (مَنْ نَسِيَ صَلَاةً أَوْ نَامَ عَنْهَا فَكَفَّارَتُهَا أَنْ يُصَلِّيَهَا إِذَا ذَكَرَهَا)

“ఎవరైనా ఏదైనా నమాజ్ మరచిపోతే, లేదా దాని సమయంలో నిద్రపోతే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని నెరవేర్చడమే దాని ప్రాయశ్చితం”. (ముస్లిం 684, బుఖారి 597).

ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు

ధర్మపరమైన నిషేధాలు – 4 : అల్లాహ్ తప్ప మరెవ్వరితో భయపడకు [వీడియో]

బిస్మిల్లాహ్

[3:23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 4

4అల్లాహ్ తప్ప మరెవ్వరితో భయపడకు: అల్లాహ్ ఆరాధన సంబంధమైన భయంలో, లేదా మృత్యువునిచ్చుట, ఏదైనా పాపం పై పట్టి శిక్షించుట లాంటివి కేవలం అల్లాహ్ శక్తిలోనే ఉన్న వాటి గురించి అల్లాహ్ తప్ప ఇతరులతో భయపడకూడదు.

[فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي وَلِأُتِمَّ نِعْمَتِي عَلَيْكُمْ وَلَعَلَّكُمْ تَهْتَدُونَ] {البقرة:150}

అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేస్తాను. మీరు నా ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్యం పొందే అవకాశం ఉంది. (సూరె బఖర 2: 150).


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

స్త్రీల మీద అఘాయిత్యాలు పెరిగిపోవడానికి గల కారణాలు, నివారణకు కొన్ని సలహాలు ఇస్లాం వెలుగులో [వీడియో]

బిస్మిల్లాహ్

[19:52 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫిఖ్’ హ్ జనాజా నమాజ్ & ప్రశ్నోత్తరాలు [వీడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఫిఖ్’ హ్ జనాజా నమాజ్ & ప్రశ్నోత్తరాలు
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/rkz1UCIFbyo [39:41 నిముషాలు]

(مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ قِيلَ وَمَا الْقِيرَاطَانِ قَالَ مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారుః “ఎవరైతే జనాజలో హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 1325, ముస్లిం 945).

  • నియ్యత్ (సంకల్పం).
  • ఖిబ్లా దిశలో నిలబడుట.
  • సత్ర్ (అచ్ఛాదన).
  • వుజూ.

ఇమాం (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు ఎదురుగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమాం వెనక నిలబడాలి. అల్లాహు అక్బర్ అని అఊజు బిల్లా…. బిస్మిల్లా….. మరియు సూరె ఫాతిహ చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూదె ఇబ్రాహీం (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్…) చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలిః అల్లా హుమ్మగ్ ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాయిబినా వసగీరినా వకబీరినా వ జకరినా వ ఉన్ సానా, అల్లాహుమ్మ మన్ అహ్ యయ్ తహూ మిన్నా ఫ అహ్ యిహీ అలల్ ఇస్లామ్ వమన్ తవఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్ రిమ్ నా అజ్రహూ వలా తుజిల్లనా బఅదహూ. మళ్ళీ అల్లాహు అక్బర్ అని కొన్ని సెకండ్లు నిలిచి సలాం తింపాలి.

اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ

భావం : ఓ అల్లాహ్ మాలో బ్రతికున్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్నవారిని, దూరముగా ఉన్నవారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమింపుము. ఓ అల్లాహ్ మాలో ఎవరిని సజీవంగా ఉంచదలుచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలిచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము. ఓ అల్లాహ్ అతని చావుపై మేము వహించిన ఓపిక పుణ్యాలు మాకు లేకుండా చేయకుము. అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.

ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తరువాత గర్భము పడిపోయి, చనిపోయినచో దాని యొక్క జనాజ నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాక ముందు గర్భము పడిపోయి, చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.

[శుద్ధి & నమాజు (Tahara and Salah) అను పుస్తకం నుండి తీసుకోబడింది]

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో జనాజా నమాజ్ (అంత్యక్రియల ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత, పద్ధతి మరియు ధర్మశాస్త్రపరమైన ఆదేశాలను వివరిస్తారు. ఇస్లాం ఒక వ్యక్తిని మరణించిన తర్వాత కూడా ఎలా గౌరవిస్తుందో, వారిపై జీవించి ఉన్నవారికి ఉన్న హక్కులను గుర్తుచేస్తూ ప్రసంగం ప్రారంభమవుతుంది. అంత్యక్రియలలో పాల్గొనడం, మృతదేహానికి స్నానం చేయించడం (ఘుస్ల్), మరియు కఫన్ (శవ వస్త్రం) తొడిగించడం వంటి చర్యలకు లభించే గొప్ప పుణ్యఫలాల గురించి హదీసుల ఆధారంగా చర్చిస్తారు. జనాజా నమాజ్ చెల్లుబాటు కావడానికి అవసరమైన నియమాలు (నియ్యత్, ఖిబ్లా, సత్ర్, వుదూ) మరియు నమాజ్ చేసే విధానం (నాలుగు తక్బీర్‌లు, సూరహ్ ఫాతిహా పారాయణం, దరూద్ ఇబ్రాహీం, మృతుని కోసం ప్రత్యేక దుఆ) వివరంగా చెప్పబడింది. నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భస్రావం జరిగితే, ఆ పిండానికి కూడా జనాజా నమాజ్ చేయాలనే ముఖ్యమైన ఆదేశాన్ని నొక్కి చెబుతారు. ప్రసంగం చివరలో, జనాజా నమాజ్‌కు సంబంధించిన సఫ్ (వరుసలు) ఏర్పాటు, గాయబానా నమాజ్ (పరోక్ష ప్రార్థన), స్త్రీ-పురుషుల కోసం దుఆలో తేడాలు మరియు చిన్న పిల్లల జనాజా వంటి అంశాలపై శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సోదర మహాశయులారా! అల్హందులిల్లాహ్ అల్లాహ్ యొక్క దయవల్ల మనం కొన్ని రోజుల నుండి శుద్ధి మరియు నమాజ్ అనే అంశంపై ఏ మంచి పాఠాలు అయితే మొదలు పెట్టామో, అల్హందులిల్లాహ్ దాని యొక్క చివరిలో ఈ రోజు చేరుకున్నాము. ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల జనాజా నమాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము.

ఇందులో మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే, జనాజా నమాజ్ దీని యొక్క వివరణ, దీని యొక్క పద్ధతి తెలుసుకునే ముందు, ఇస్లాం యొక్క మంచితనాన్ని, మేలును, గొప్పతనాన్ని, స్వయంగా మీరు విని అర్థం చేసుకొని ప్రత్యేకంగా అవిశ్వాసులకు ఇస్లాం యొక్క ఈ మంచి విషయాన్ని బోధించండి.

అదేమిటంటే, ఇస్లాం యొక్క సంబంధం ఎవరితో ఏర్పడుతుందో వారి యొక్క హక్కు మనపై వారు బ్రతికి ఉన్నంతవరకే కాదు, చనిపోయిన తర్వాత కూడా మనపై ఉంటుంది. మన ఒక ముస్లిం సోదరుడు బ్రతికి ఉన్నంతవరకే అతని హక్కు మనపై కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికి ఉన్నాము, మన యొక్క ముస్లిం సోదరుడు లేదా సోదరీమణి చనిపోయింది, అప్పుడు కూడా అతని యొక్క హక్కు మనపై ఉంటుంది.

ఒక ముస్లిం వ్యక్తి చనిపోయాడు అంటే స్నానం చేపించడం, కఫన్ దుస్తులు ధరింపజేయడం, సమాధిలో దించడం, అంతకుముందు నమాజ్ చేయడం, అతని గురించి, ఆమె గురించి అల్లాహ్ తో క్షమాభిక్ష, పాపాల మన్నింపు, అల్లాహ్ యొక్క కరుణ వారిపై కురుస్తూ ఉండాలి అని అల్లాహ్ ను వేడుకోవడం, ఆ తర్వాత ఇంకా వారి కొరకు దుఆ చేస్తూ ఉండటం, ఇవన్నీ ఎలాంటి సత్కార్యాలు? అల్లాహు అక్బర్.

సహీహ్ హదీసులో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ అహ్కాముల్ జనాయిజ్ లో ప్రస్తావించారు, ఒక బ్రతికి ఉన్న ముస్లిం, చనిపోయిన ఒక ముస్లింకి స్నానం చేపించాడు, స్నానం చేపిస్తున్న సందర్భంలో ఏమైనా లోపాలు, దోషాలు, ఏమైనా విషయాలు చూశాడు, , కప్పి ఉంచాడు, ఎవరికీ చెప్పలేదు,

غَفَرَ اللَّهُ لَهُ أَرْبَعِينَ مَرَّةً
(గఫరల్లాహు లహు అర్బయీన మర్ర)
అల్లాహ్ అతన్ని నలభై సార్లు క్షమిస్తాడు.

ఎవరైతే ఒక ముస్లింకి కఫన్ దుస్తులు ధరింపజేస్తారో, అల్లాహు త’ఆలా స్వర్గంలో మంచి అక్కడి స్వర్గపు పట్టు వస్త్రాలు ఇలాంటి వ్యక్తికి ధరింపజేస్తాడు.

ఇక అతని కొరకు నమాజ్ చేశాడంటే, సహీహ్ బుఖారీలోని హదీస్. ఇప్పుడు కూడా ఇన్ షా అల్లాహ్ ఆ హదీస్ వస్తుంది, రెండు పెద్ద కొండలు. ఇక రెండు పెద్ద పర్వతాలు అంటే మీ ఇష్టం. మీలో ఎంత ఇఖ్లాస్, మీలో ఎంత ముతాబా’అ. ఈ పదాలు ఇంతకు ముందు ఎన్నో సార్లు వచ్చి ఉన్నాయి. గుర్తుంది కదా? ఇఖ్లాస్ అంటే చిత్తశుద్ధి. కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం. ముతాబా’అ అంటే exactly, perfectly ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని అనుసరించడం. ఎంత ఇఖ్లాస్, ఎంత ముతాబా’అ ఉంటుందో అంతే పెద్ద పర్వతాలు. ఈ హిమాలయా కూడా చిన్నదే. అలా మీరు ఊహించారంటే, నమాజ్ చేయడం మరియు అతన్ని సమాధిలో పెట్టేవరకు ఖబరిస్తాన్ లో, స్మశాన వాటికలో ఉండటం ఎంత గొప్ప పుణ్యాలో ఒకసారి గ్రహించండి.

ఇక్కడ మీకు రెండు విషయాలు అర్థమవుతున్నాయి కదా? ఒకటి, ఒక ముస్లిం చనిపోయాడు అంటే, చనిపోయిన తర్వాత కూడా అతని యొక్క బాధ్యత మనపై ఎంత గొప్పగా ఉందో. ఒక విషయం ఇది. ఈ బాధ్యతను గనక మనం కరెక్ట్ ఇఖ్లాస్ మరియు ముతాబా’అ ప్రకారంగా నెరవేర్చామంటే, అల్లాహ్ వైపు నుండి మనకు ఎన్ని అనుగ్రహాలు, వరాలు, పుణ్యాలు, సత్ఫలితాలు, మంచి ప్రసాదాలు ఉన్నాయో గమనించండి.

రండి. జనాజా యొక్క చాలా వివరాలతో కూడిన పాఠం. అది కూడా బహుశా ఎంత లేకున్నా గానీ ఒక 10 పాఠాలు కావచ్చు. ఇన్ షా అల్లాహ్, త్వరలో ఎప్పుడైనా మనం వివరాలతో తెలుసుకుందాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు సంక్షిప్తంగా నమాజ్ విషయం మీకు తెలియజేస్తున్నాము.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరైతే జనాజాలకు హాజరై నమాజ్ చేసే వరకు ఉంటాడో, అతనికి ఒక ఖీరాత్ పుణ్యం లభించును. మరెవరైతే ఖననం చేయబడే వరకు ఉంటాడో, అతనికి రెండు ఖీరాతుల పుణ్యం లభించును.”

“రెండు ఖీరాతులు అంటే ఏమిటి?” అన్న ప్రశ్నకు సమాధానంగా “రెండు పెద్ద కొండలు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నారు, రెండు ఖీరాతులు అంటే ఏంటి, ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ఏం సమాధానం ఇచ్చారు సల్లల్లాహు అలైహి వసల్లం? రెండు పెద్ద పర్వతాలు, పెద్ద కొండలు అని. జబలైనీ అజీమైనీ, అజీం అజీం. ఇది చాలా గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది.

అయితే వేరే కొన్ని మరి సహీహ్ హదీసులో ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతం అని కూడా ప్రస్తావన వచ్చి ఉంది. ఏంటి? మదీనా నగరంలో ఉన్నటువంటి ఉహుద్ పర్వతం. అయితే ఇక్కడ విరుద్ధం, విభేదం కాదు. కొన్ని సందర్భాల్లో ఒకే సత్కార్యానికి వేరువేరు రకాలుగా మనం పుణ్యాలు లేదా పుణ్యాల ప్రస్తావన చూస్తూ ఉంటే ఇది విరుద్ధం అనరు. దీని యొక్క భావం ఏమిటంటే, ఎవరు ఎంత స్వచ్ఛంగా, ఇఖ్లాస్ మరియు ముతాబా’అ. ఆ రెండు పదాలు మీరు మరిచిపోకండి. మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అవి. చిత్తశుద్ధి మరియు ప్రవక్త విధానాన్ని అనుసరించడం. ఇఖ్లాస్, ముతాబా’అ ఎవరిలో ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా వారు ఆ పుణ్యాన్ని పొందుతారు అనే భావం.

జనాజా నమాజ్ లో నాలుగు విషయాలు తప్పనిసరి. ఏమిటి అవి?

నియ్యత్ (సంకల్పం), ఖిబ్లా దిశలో నిలబడుట, సతర్ (అచ్ఛాదన), వుజూ.

ఈ నాలుగు విషయాలు మీకు అర్థమయ్యాయి. నియ్యత్ అంటే మనసులో మనం సంకల్పించుకుంటాము. నోటితో నియ్యత్ చేయడం ఇది ప్రవక్త పద్ధతి కాదు. రెండవది, ఖిబ్లా దిశలో నిలబడటం. ఖిబ్లా వైపునకు. ఇది కూడా విషయం అర్థమైనదే. సత్ర్, అచ్ఛాదన అంటే నమాజ్ చేసే సందర్భంలో మన శరీరంపై ఎంత దుస్తులు ఉండాలో అంత దుస్తులు ఉండడం. ఇది కూడా తప్పనిసరి. జనాజా నమాజ్ కొరకు వుజూ చేసుకొని ఉండటం కూడా తప్పనిసరి. ఇవి నాలుగు షరతులు. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా గానీ అతను నమాజ్ చేసినప్పటికీ అతని నమాజ్, నమాజ్ కాదు. అంగీకరింపబడదు.

ఇమామ్ (నమాజ్ చేయించు వ్యక్తి) పురుషుని శవము యొక్క తలకు దగ్గరగా నిలబడాలి. స్త్రీ శవము యొక్క మధ్యలో నిలబడాలి. ఇతర నమాజీలు ఇమామ్ వెనక నిలబడాలి.

అల్లాహు అక్బర్ అని

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

మరియు సూరె ఫాతిహా చదవాలి.

మళ్ళీ అల్లాహు అక్బర్ అని తషహ్హుద్ లో చదివే దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ పూర్తిగా చదవాలి. మళ్ళీ అల్లాహు అక్బర్ అని శవము కొరకు దుఆ చేయాలి.

ఇక్కడ గమనించారు కదా? నమాజ్ యొక్క విధానం, జనాజా నమాజ్ ఎలా చేయాలి అనే విధానం ఇక్కడ చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అయితే గమనించండి, ఇమామ్ ఎవరైతే నమాజ్ చేయిస్తారో, వారు ఎలా ఎక్కడ నిలబడాలి అనే విషయం ఇక్కడ ముందు చెప్పడం జరిగింది.

మయ్యిత్, శవం పురుషునిది అయ్యేదుంటే, అతని యొక్క తలకు సమానంగా ఇలా నిలబడాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఒకవేళ స్త్రీ అయ్యేది ఉంటే, ఆమె యొక్క మధ్యలో, నడుము కాడ. ఈ విషయం అర్థమైపోయింది కదా? ఇక ముక్తదీలు అందరూ కూడా ఇమామ్ వెనక నిలబడతారు. అయితే ఇమామ్ అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. ఎందుకంటే, జనాజా నమాజ్ కు సంబంధించి హదీసులు ఏవైతే వచ్చాయో, జనాజా నమాజ్ కు సంబంధించిన హదీసుల్లో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సనా చదివారా, చదవలేదా, ఏ ప్రస్తావన లేదు. చదివారు అని లేదు, చదవలేదు అని లేదు. అందుకొరకే ఇక్కడ ధర్మవేత్తలు ఎంతో మంది ఏమని అభిప్రాయపడ్డారు? ఒకవేళ ప్రవక్త చదివి ఉండేది ఉంటే, ప్రస్తావన ఉండేది. కానీ వేరే ఎంతో మంది సర్వసామాన్యంగా ధర్మవేత్తలు అంటారు, నమాజు ఆరంభంలో సనా చదవడం సర్వసామాన్య విషయం. అందుకొరకు ఇక్కడ దాని ప్రస్తావన ప్రత్యేకంగా లేకపోయినప్పటికీ చదవడమే మంచిది. అయితే మీ ఇష్టం. చదివినా అల్హందులిల్లాహ్, చదవకపోతే ఎలాంటి పాపం లేదు. కానీ ఏం చదవాలి? అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకున్న వెంటనే,

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

చదివి సూరె ఫాతిహా పూర్తిగా చదవాలి. సూరె ఫాతిహా తర్వాత ఏదైనా సూరా చదివినా అల్హందులిల్లాహ్. చదవకపోయినా అల్హందులిల్లాహ్. ఆ తర్వాత రెండవసారి అల్లాహు అక్బర్ అని మళ్ళీ చేతులు కట్టుకొని దరూద్ ఇబ్రాహీం, అల్లాహుమ్మ సల్లీ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం… మనం తషహ్హుద్ లో చదువుతాము కదా? అది పూర్తిగా చదవాలి. మళ్ళీ మూడోసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని మయ్యిత్ కొరకు దుఆ చేయాలి.

ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో సహీహ్ హదీసుల్లో నాలుగు రకాల దుఆలు వచ్చి ఉన్నాయి. ఆ నాలుగింటిలో కూడా చాలా మంచి లాభదాయకమైన, శవానికి, మయ్యిత్ కు ఎంతో ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. ఎలాంటి విషయాలు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించగలుగుతారా?

ఒక సందర్భంలో ఒక సహాబీ బ్రతికి ఉన్నారు. ప్రవక్త వెనక ఉండి ఒక మయ్యిత్, ఒక శవం యొక్క, ఒక ముస్లిం జనాజా నమాజ్ చేస్తున్నారు. ప్రవక్త ఈ దుఆ, ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తున్నానో మీకు, ఈ దుఆ ఏదైతే చదివారో వెనక ఉన్న ఆ సహాబీ ఏమంటున్నారు? ఆ దుఆ విని నాకు అనిపించింది, అయ్యో! ఆ శవం కాడ నా శవం ఉండేది ఉంటే ఎంత బాగుండేది. ప్రవక్త వారి దుఆలు అన్నీ కూడా నాకు ప్రాప్తమయ్యేవి అని. అల్లాహు అక్బర్. గమనించండి సోదర మహాశయులారా, ఇలాంటి దుఆలు మనం నేర్చుకోవాలి. మన గ్రామాల్లోనే కాదు, పెద్ద పెద్ద నగరాల్లో చాలా, చాలా బాధాకరమైన విషయం నా కొరకు. ఏంటో తెలుసా? చాలా మంది ఈ జనాజా నమాజ్ లో చదివే దుఆ వారికి తెలిసే ఉండదు. అడిగారు నేను ఎన్నో సందర్భాలలో. సంవత్సరం క్రితం కూడా నేను ఏదైతే ఇండియాకు వెళ్లానో ఒక నెల గురించి, అక్కడ సుమారు రెండు, మూడు జనాజాలలో చదవడం, చదివించే అవసరం పడింది. ఇక మన వద్ద చిన్నపాటి ఇఖ్తిలాఫ్ కూడా. ఈ జనాజా నమాజ్ చదివించే వారు శబ్దంగా చదవాలా? మనసులో చదువుకోవాలా? మెల్లగా నిశ్శబ్దంగా? లేదా శబ్దంగా చదవాలా? సర్వసామాన్యంగా మన వద్ద హనఫీ సోదరులు మెల్లగా చదువుతారు. హనాబిలా వద్ద కూడా మెల్లగానే చదవాలి అని ఉంది. అహ్లుల్ హదీస్ వారు శబ్దంగా చదువుతారు. అయితే ప్రతి ఒక్క దాని గురించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లను నేను. కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పిన విషయం సహీహ్ బుఖారీలో, నేను శబ్దంగా ఇప్పుడు ఇక్కడ మీకు చదివింది ఎందుకంటే, ఈ సూరె ఫాతిహా కూడా జనాజాలో చదవడం ప్రవక్త వారి సున్నత్ అని మీకు తెలియాలి.

ఈ విధంగా సోదర మహాశయులారా, కనీసం జనాజా సందర్భాలలో మనం ప్రజలకు చెప్పాలి. అయ్యలారా, అవ్వలారా, కొంచెం నేర్చుకోండి దుఆలు. ఓ కొడుకా, ఓ నా బిడ్డా, నీవు ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఏమి లాభం నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు కనీసం “అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా” చదవలేకపోతే. నీవు బంగళాలు కట్టించి, మీ నాన్న సమాధి మీద ఎంత పెద్ద గోపురం కట్టినా గానీ ఏమి లాభం, నీవు నీ తండ్రి గురించి క్షమాభిక్ష ఎలా కోరాలో నీకు తెలియకుంటే.

సోదర మహాశయులారా, వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. సౌదీ అరబ్ లో కొన్ని సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఒకేషన్ లో వెళ్ళాడు, సెలువులో. కానీ కరోనా కారణంగా చిక్కిపోయాడు అక్కడే. రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న నాలుగు రోజుల క్రితం అతనితో మాట్లాడినప్పుడు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. “షేఖ్, ఎందుకో నాకు ఇక్కడ ఇండియాలో భార్యా పిల్లలు అందరిలో కలిసి ఉన్నాను కానీ ఉండబుద్ధి అయితే లేదు. అటే రావాలి అనిపిస్తుంది.” నేనన్నాను, ఇది కూడా నువ్వు అదృష్టంగా భావించు. అల్లాహ్ ఏదైనా పరీక్షలో మనల్ని పడవేసాడు అంటే అందులో కూడా ఏదైనా మేలు ఉంటుంది. ఆ విషయాన్ని మనం నమ్మాలి, గ్రహించాలి. ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అని అడిగాను. “షేఖ్, ఇప్పటికి సుమారు నేను ఇక్కడికి వచ్చేసి ఏడు నెలలు అయిపోయినాయి, కేవలం ఎవరితోనైనా కలిసినప్పుడు అస్సలాము అలైకుమ్ అంటే వ అలైకుమ్ అస్సలాం. ఇంతే కానీ, అక్కడ అరబులో ఉండి పరస్పరం దుఆలు ఇచ్చుకోవడం, జజాకల్లాహు ఖైర్, బారకల్లాహు ఫీక్, అహ్సనల్లాహు ఇలైక్, కైఫల్ హాల్, ష్లోనక్, అల్లా యహ్ఫజక్, అల్లా యర్హమక్, ఇలాంటి దుఆలు ఏదైతే ఇచ్చుకుంటారో పరస్పరం అది గుర్తొచ్చినప్పుడల్లా నా మనసుకు చాలా బాధ కలుగుతుంది” అని అన్నాడు.

ఇంతకుముందు కూడా నేను ఒక విషయం మీకు తెలియజేశాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందు వచ్చే ఎన్నో సూచనలు తెలుపుతూ, ధర్మం ఎంత బలహీనంగా అయిపోతుందో తెలియజేస్తూ, వారిలో కొందరిని ప్రశంసించారు. ఎవరు? అల్ హమ్మాదూన్, అధికంగా అల్లాహ్ ను ప్రశంసించే వారు, అల్లాహ్ తో వేడుకునే వారు.

క్షమించండి, జనాజా నమాజ్ కు సంబంధించిన పద్ధతులు, దుఆల గురించి మనం తెలుసుకుంటున్నాము. కానీ మనం ఈ రోజుల్లో ధర్మం నేర్చుకోకుండా, దుఆలు నేర్చుకోకుండా ప్రపంచ విషయాలు రోజు ఎంత తిరిగేస్తా ఉంటామో మనం, కానీ మన జీవితంలో అతి ముఖ్యమైన ఒక విషయం మనం నేర్చుకోము. రండి, ముందు నేను మీకు దీని యొక్క అనువాదం వినిపిస్తాను, ఆ తర్వాత ఈ దుఆ చదువుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను దుఆ ముందు చదివేశాను, అరబీలో ఉంది. భావం తెలిస్తే కదా మీకు దాని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. చూడండి భావం.

ఓ అల్లాహ్! మాలో బ్రతికి ఉన్న వారిని, మరణించిన వారిని, హాజరుగా ఉన్న వారిని, దూరముగా ఉన్న వారిని, చిన్నలను, పెద్దలను, పురుషులను, స్త్రీలను క్షమించుము. ఓ అల్లాహ్! మాలో ఎవరిని సజీవంగా ఉంచదలచుకున్నావో వారిని ఇస్లాంపై స్థిరముగా ఉంచుము. మాలో ఎవరిని మరణింపజేయదలచావో వారిని విశ్వాసముపై మరణింపజేయుము.ఓ అల్లాహ్! అతని చావుపై మేము వహించిన ఓపిక, పుణ్యాలు మాకు లేకుండా చేయకుము.

గమనిస్తున్నారా, ఎంత మంచి భావాలు ఉన్నాయి? ఏం తెలుస్తుంది? మనకు ఎంత దగ్గరి బంధువు అయినా గానీ, భార్య కొరకు ఒక భర్త చనిపోయినా, భార్య విధవ అయిపోయినా, తండ్రి చనిపోయి పిల్లలు అనాథలు అయిపోయినా, భార్య చనిపోయి భర్త ఒంటరిగా అయిపోయాడు అన్నటువంటి వ్యధకు, బాధకు గురి అయినా అల్లాహ్ కొరకు ఓపిక సహనాలు వహించాలి. ఓపిక సహనాలు వహిస్తూ, అల్లాహ్ దానికి సరియైన ఫలితం కూడా ప్రసాదించాలి అని ఆశిస్తూ ఉండాలి. “ఫల్ తస్బిర్ వల్ తహ్తసిబ్” అదే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సొంత కూతురు జైనబ్ రదియల్లాహు అన్హా వారికి నసీహత్ చేసింది? ఇంకా ఆ దుఆలోని మరో పదం గుర్తుంచుకోండి: “అతని చావు పిదప మమ్మల్ని ఉపద్రవం, సంక్షోభంలో పడవేయకుము.” ఎంత మంచి భావం ఉందో ఇక్కడ గమనిస్తున్నారా మీరు? సోదర మహాశయులారా,

اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا وَشَاهِدِنَا وَغَائِبِنَا وَصَغِيرِنَا وَكَبِيرِنَا وَذَكَرِنَا وَأُنْثَانَا اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الْإِسْلَامِ وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الْإِيمَانِ اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ وَلَا تُضِلَّنَا بَعْدَهُ
(అల్లాహుమ్మగ్ఫిర్ లిహయ్యినా వ మయ్యితినా వ షాహిదినా వ గాఇబినా వ సగీరినా వ కబీరినా వ దకరినా వ ఉన్సానా అల్లాహుమ్మ మన్ అహ్యైతహు మిన్నా ఫ అహ్యిహి అలల్ ఇస్లాం వ మన్ తవఫ్ఫైతహు మిన్నా ఫ తవఫ్ఫహు అలల్ ఈమాన్ అల్లాహుమ్మ లా తహ్రిమ్నా అజ్రహు వ లా తుదిల్లనా బ’అదహు)

ఈ దుఆ యొక్క అనువాదం మీరు విన్నారు. మరొక దుఆ ఉంది, అది కూడా అందులో ఎంత గొప్ప భావం ఉంది?

اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ وَعَافِهِ وَاعْفُ عَنْهُ
(అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్ హమ్హు వ ఆఫిహి వ’అఫు అన్హు)
ఓ అల్లాహ్, అతన్ని క్షమించు, అతన్ని కరుణించు. ఓ అల్లాహ్, అతన్ని సుఖంగా, శాంతిగా ఉంచు. అతనిని నీవు అన్ని రకాలుగా అతని పాపాలను తుడిచివేసి నీవు మన్నించేసెయ్.

وَأَكْرِمْ نُزُلَهُ
(వ అక్రిమ్ నుజులహు)
అతడు ఇప్పుడు నీకు అతిథిగా అయ్యాడు. నీవు అతన్ని మంచిగా చూసుకో.

وَوَسِّعْ مُدْخَلَهُ
(వ వస్సి’అ ముద్ఖలహు)
అతడు సమాధిలో ప్రవేశించాడు, సమాధిని నీవు విశాలపరచు.

وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثَّلْجِ وَالْبَرَدِ
(వగ్సిల్హు బిల్ మాయి వస్సల్జి వల్ బరద్)
నీవు అతని యొక్క పాపాలను నీటితో, బర్ఫ్ (ఐస్)తో, కడగండ్లతో పూర్తిగా కడిగి వేసెయ్. ఏమి పాపాలు లేకుండా చేయి అతన్ని.

وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ
(వ అబ్ దిల్హు దారన్ ఖైరమ్ మిన్ దారిహి)
ఈ ఇక్కడి గృహం కంటే, నీవు ఉత్తమమైన గృహం అక్కడ అతనికి ప్రసాదించుము.

وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ
(వ జౌజన్ ఖైరమ్ మిన్ జౌజిహి)
ఇక్కడ ఉన్న అతని జంట కంటే, మంచి ఓ జంట నీవు అతనికి ప్రసాదించు.

وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ
(వ అహْلన్ ఖైరమ్ మిన్ అహ్లిహి)
ఇక్కడ ఇతని యొక్క కుటుంబం ఏదైతే ఉందో, ఇంతకంటే మంచి కుటుంబం నీవు అతనికి ప్రసాదించుము.

وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ
(వ అ’ఇద్హు మిన్ అదాబిల్ ఖబ్ర్)
ఇతన్ని నీవు సమాధి శిక్ష నుండి కాపాడు, శరణు ప్రసాదించు.

وَعَذَابِ النَّارِ
(వ అదాబిన్నార్)
నరక శిక్ష నుండి కూడా ఇతనికి శరణు ప్రసాదించు.

وَأَدْخِلْهُ الْجَنَّةَ
(వ అద్ఖిల్హుల్ జన్నహ్)
మరియు ఇతన్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము.

గమనిస్తున్నారా ఎంత గొప్ప భావాలు ఉన్నాయో?

అయితే సోదర మహాశయులారా, ఈ దుఆ ఏదైతే ఇక్కడ తెలుగులో కూడా రాసి ఉందో, మళ్లీ అంటే ఈ మూడు తక్బీర్, మూడోసారి అల్లాహు అక్బర్ అని చేయి కట్టుకున్న తర్వాత ఈ దుఆ చదివాము కదా, గుర్తుంది కదా మీకు? మరోసారి కొత్తగా చెప్తున్నాను, శ్రద్ధ వహించండి. మధ్యలో చాలా విషయాలు, మాటలు వచ్చాయి కదా?

మొదటిసారి అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకొని, సనా చదివితే చదవచ్చు లేకపోతే పర్వాలేదు. అ’ఊదుబిల్లాహ్, బిస్మిల్లాహ్, సూరె ఫాతిహా మొత్తం చదివి, ఆ తర్వాత ఏదైనా సూరా చదివితే చదవచ్చు లేకపోయినా పర్వాలేదు.

మళ్ళీ అల్లాహు అక్బర్ అని దరూద్ ఇబ్రాహీం పూర్తిగా చదవాలి, ఏదైతే మనం తషహ్హుద్ లో చదువుతామో.

మూడోసారి అల్లాహు అక్బర్ అని ఈ దుఆలు చదవాలి, ఇప్పటివరకు మనం తెలుసుకున్న దుఆలు.

నాలుగోసారి అల్లాహు అక్బర్ అని అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్, ఒకవైపున సలాం తింపినా సరిపోతుంది, సహీహ్ హదీస్ తో రుజువు అయి ఉంది. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని రెండో వైపున కూడా ఒకవేళ సలాం తెంపితే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ రెండు సలాముల విషయం కూడా ఒక సలాం అయినా, రెండు సలాములైనా, ఈ రెండు విషయాలు సహీహ్ హదీసులతో రుజువు అయి ఉన్నాయి.

ఎవరైనా గర్భిణీలకు పూర్తి నాలుగు నెలలు నిండిన తర్వాత గర్భము పడిపోయినచో, దాని యొక్క జనాజా నమాజ్ చదవాలి. నాలుగు నెలలు పూర్తి కాకముందు గర్భము పడిపోయి చనిపోయినచో నమాజ్ చేయకుండా దానము చేయాలి.

ఈ విషయం కూడా చాలా అవసరం. అనేక మంది ఈ ఆదేశం పట్ల కూడా చాలా అశ్రద్ధగా ఉన్నారు. కొందరి గురించి అయితే తెలుస్తుంది, తొమ్మిది నెలలు పూర్తి నిండి పుట్టిన వెంటనే లేదా పుట్టినప్పుడే చనిపోయాడు అని తెలిస్తే కూడా జనాజా నమాజ్ చదవకుండానే తీసుకెళ్లి దఫన్ చేసి వచ్చేస్తారు. కానీ అబూ దావూద్ లో వచ్చిన హదీస్ ఆధారంగా అనేక ధర్మవేత్తలు, ప్రస్తుత కాలంలోని ఎందరో మషాయిఖ్ ఇదే ఫత్వా ఇచ్చారు. ఏంటి? నాలుగు నెలలు గర్భం పూర్తి అయింది, 120 రోజులు పూర్తిగా నిండిపోయాయి, ఆ తర్వాత తల్లి గర్భంలో పిండం చనిపోతే అతని యొక్క జనాజా నమాజ్ తప్పకుండా చదవాలి. ఎందుకు? ఇంతకు ముందు నేను మీకు చూపించాను ‘Z Daroos’ అని మా YouTube ఛానల్ ఏదైతే ఉందో ఆఫీస్ వైపు నుండి, అందులో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఆదేశాలు కొంచెం వివరంగా ఉన్నాయి, తప్పకుండా వినండి అక్కడ. సంక్షిప్తం ఏమిటి? సుమారు 80 నుండి 90 రోజుల తర్వాత తల్లి గర్భంలో పిండం సంపూర్ణ మానవ ఆకారం పొందుతాడు. కళ్ళు, చేతులు, మొత్తం శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో, పూర్తి ఒక మానవ రూపంలో వచ్చేస్తాడు. అంతకుముందు 40 రోజులు నుత్ఫా, 40 రోజులు అలకా, తర్వాత 40 రోజులు ముద్గా, ఈ విధంగా 120 రోజులు పూర్తి అయిపోయేసరికి ఇక అతడు సంపూర్ణ ఒక మనిషి, మనిషి రూపం దాల్చేశాడు. 120 రోజుల తర్వాత అతనిలో రూహ్, ఆత్మ కూడా వేయడం జరిగింది. ఇక అతడు ఒక సంపూర్ణ ఒక మనిషిగా ఉన్నాడు, చిన్న సైజులో, తల్లి గర్భంలో. ఆ తర్వాత మరణిస్తే తప్పకుండా అతని యొక్క జనాజా నమాజ్ చేయాలి. “అస్సిక్తు యుసల్లా అలైహ్” హదీసులో వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

ఇక నాలుగు నెలల కంటే ముందు, నాలుగు నెలలు పూర్తి కాకముందే చనిపోతే, జనాజా నమాజ్ చేయకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇక్కడ వరకు సోదర మహాశయులారా, అల్హందులిల్లాహ్ జనాజా నమాజ్ కు సంబంధించిన ఆదేశాలు పూర్తి అయ్యాయి.

ప్రశ్న-జవాబులు

సర్వసామాన్యంగా నమాజుల కొరకు ఎలాగైతే సఫ్ ఉంటుందో అలాగే ఉండాలి. ఇక్కడ కొందరు అంటారు మూడు, ఐదు, ఏడు లైన్లు, ఇలా తప్పనిసరి ఏమీ లేదు కానీ ఉంటే మంచిది. కానీ సఫ్ కంప్లీట్ కూడా ఉండాలి. ఇది మంచి విషయం. సఫ్ కంప్లీట్ కాకుండా ఎక్కువ సఫ్ లు చేయడం మరియు బేసి సంఖ్యలో చేయడం ఇది అంత తప్పనిసరి కాదు. సఫ్ కంప్లీట్ గా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం.

జనాజా ముందట కూడా చదివించడం జరిగింది. జనాజా ముంగట పెట్టుకొని అక్కడ కూడా చదివించడం జరిగింది. కానీ దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఆధారంగా ముస్లిం ప్రభుత్వంలోని నాయకుడు ఎవరి జనాజా నమాజ్ గాయబానా వేరేచోట చదివించడానికి ఆదేశం ఇస్తాడో, అక్కడ చదవచ్చు. ఇక్కడ సౌదీ అరబ్ లో కూడా ఇక్కడి రాజు ఆదేశం ఇచ్చారు. అందుకని కువైత్ రాజు యొక్క జనాజా నమాజ్ గాయబానా ఇక్కడ మక్కా, మదీనాలో, హరమైన్ లో కూడా చేయడం జరిగింది.

పర్వాలేదు, ఒకే దుఆ చదివితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక రెండో దుఆ ఏదైతే నేను చదివానో, అందులో
“అల్లాహుమ్మగ్ఫిర్ లహు వర్హమ్హు వఆఫిహి వఅఫు అన్హు”
ఈ ఏదైతే పదాలు ఉన్నాయో చివరిలో హూ, హీ అని, అక్కడ,
“అల్లాహుమ్మగ్ఫిర్ లహా వర్హమ్హా వఆఫిహా వఅఫు అన్హా వఅక్రిమ్ నుజులహా”
ఈ విధంగా చదవడం మంచిది. కానీ ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం మయ్యిత్, మయ్యిత్ పదం ముజక్కర్. ఇది ఆహ్, మేల్ వర్డ్. అందుకొరకు “అల్లాహుమ్మగ్ఫిర్ లహు” చదివినా ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇక్కడ ఎవరు ఫత్వా ఇచ్చారో ప్రస్తుతం నాకు గుర్తు రావట్లేదు కానీ నేను ఎవరో ఎవరిదో ఫత్వా చదివాను. జనాజా నమాజ్ లో ఒకవేళ ఎవరికైనా దుఆ కంఠస్థం లేకపోతే వారు రాసుకొని ఏదైనా మొబైల్ లో గానీ లేదా కాగితంలో గానీ చూసి చదవడంలో ఇబ్బంది లేదు ఇన్ షా అల్లాహ్. కానీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి, కనీసం ఒక్క దుఆనైనా. అల్లాహు ఆ’లమ్.

నేను చెప్పాను కదా ఇంతకుముందు, రాసి ఉండాలి అరబీలో. దాన్ని చూసి చదివితే ఇన్ షా అల్లాహ్ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది “హాదా అహ్వను అలైక మిన్ గైరిల్ అరబియ్యా”. అరబీ భాషలో కాకుండా వేరే భాషలో చదవడం కన్నా చూసి నమాజ్ లో అరబీలో ఆ దుఆ చదవడం ఉత్తమం. అల్లాహు ఆ’లమ్.

చెప్తాను, వినండి. మన వద్ద సర్వసామాన్యంగా మన హనఫీ సోదరులు అల్లాహ్ మాకు, వారికి అందరికీ హిదాయత్ ఇవ్వుగాక, హనఫీ సోదరులు సూరతుల్ ఫాతిహా చదవరు. సనా చదువుతారు. ఇదే చాలా విచిత్ర విషయం అనిపిస్తుంది. అందుకొరకే అంధానుసరణ ఉండకూడదు. అంటే ఈ అంధానుసరణ, తక్లీద్ ఏదైతే ఉందో, దీని కారణంగా ఏం జరుగుతుంది? వారు సనా ప్రస్తావన లేదు, అది చదువుతున్నారు. సూరె ఫాతిహా ప్రస్తావన ఉంది, దాన్ని వదులుతున్నారు. అందుకొరకు కూడా వారి యొక్క నమాజ్ సంక్షిప్తంగా అయిపోతుంది. ఇంకా వేరే ఏదైనా ఎవరైనా వేరే కారణాలతో సంక్షిప్తంగా చేస్తే నాకు తెలియదు. నాకు తెలిసిన విషయం చెప్పాను. అల్లాహు ఆ’లమ్. ఇక్కడ ముఖ్యంగా నేను గుర్తు చేస్తున్నది ఏమిటంటే, సూరె ఫాతిహా కూడా జనాజా నమాజ్ లో చేయాలి.

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతిలో మనకు నేర్పిన విషయంలో జనాజా నమాజ్ లో రుకూ, సజ్దాలు లేవు. కారణం ఏంటి? మీరు చెప్పినట్లు, ముందు ఒక శవం ఉంటుంది గనక చూసే వారికి మనం అతని కొరకు రుకూ చేస్తున్నట్లు, అతని కొరకు సజ్దా చేస్తున్నట్లు ఏర్పడకూడదు కావచ్చు. అల్లాహు ఆ’లమ్. ఇదే అల్లాహ్ యొక్క ఇష్టం. అందుకొరకే విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి? తూచా తప్పకుండా ఎందుకు, ఎలా, ఇలా ఎందుకు, అలా ఎందుకు లేదు అన్నటువంటి ప్రశ్నలు లేకుండా అల్లాహ్ చెప్పిన మాటను, ప్రవక్త చూపిన పద్ధతిని మనం అనుసరించాలి. బారకల్లాహు ఫీకుమ్.

కరెక్ట్. ఈ విషయం ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ నాలుగు నెలల గర్భం నిండిన తర్వాత ఒకవేళ చనిపోతే నమాజ్ చేయాలి అని అన్నప్పుడు, ఇక చిన్నపిల్లలు ఎవరైతే పుట్టి కొద్ది రోజులు బ్రతికి చనిపోయారో, వారి జనాజా నమాజ్ చదవకపోవడానికి ఏంటి దలీల్? ఏంటి కారణం? ఏంటి రీజన్? అర్థమైంది కదా?

నమాజు మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

పిల్లల శిక్షణలో తల్లిదండ్రుల పాత్ర & ప్రశ్నోత్తరాలు – షేక్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్ [వీడియో]

బిస్మిల్లాహ్

చాల మంచి వీడియో, ప్రతి ఒక్కరూ వినవలసిన వీడియో, ఎన్నో విషయాలు షేఖ్ గారు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చాలా చాలా చక్కగా వివరించారు, అల్హందులిల్లాహ్. తప్పక విని ప్రయోజనం పొందండి మరియు మీ బంధు మిత్రులకు షేర్ చెయ్యండి, ఇన్షా అల్లాహ్.

[1:27: 39 నిముషాలు]
ఫజీలతుష్ షేఖ్ సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఇతర ముఖ్యమైన పోస్ట్  

సంతాన శిక్షణకై తల్లిదండ్రులకు మార్గదర్శి [పుస్తకం]
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్