74: అల్లాహ్ నియమించిన హద్దులను (శిక్షలను) రద్దు చేయమని వాదించుట ~ ఒక ముస్లిం లో లేని లోపము కల్పించుట ~బిదాత్ స్థాపించుటకు పోరాడుట(అబూ దావూద్ : 3597)
75: బిదాత్ ని ప్రారంభించుట, అపమార్గం వైపు సందేశం ఇచ్చుట (సహీ ముస్లిం: 1017,2674)
76: బంధుత్వాన్ని త్రెంచుట- 4:1(సహీహ్ ముస్లిం 2556)
77: తోటి ముస్లింతో కొట్లాడుట – (బుఖారీ :48)
—
4:31 – పెద్ద పాపాలకు దూరంగా ఉంటే చిన్న పాపాలు క్షమిస్తాను
53:32 – పెద్ద పాపాలకు దూరంగా ఉండాలి
42:37 – భాగ్యవంతులు పెద్ద పాపాలకు దూరంగా ఉంటారు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్‌గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ [అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్] సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ [అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.
పేరు & కున్నియత్
ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.
జననం మరియు బాల్యం
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.
మదీనా వలస మరియు ఖైబర్ యుద్ధం
మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్‌కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.
మదీనాలో జీవనం మరియు పేదరికం
మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.
ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.
ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.
ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.
అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.
తల్లి ఇస్లాం స్వీకరణ
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.
ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:
أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ [అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్] అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.
అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.
ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్‌కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్‌కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.
కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్‌కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్‌కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్‌ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్‌లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనంతర జీవితం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్‌లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్‌లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.
ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!
ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.
చివరి రోజులు మరియు మరణం
సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.
సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.
అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.
సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
జ్ఞాపకశక్తి మరియు హదీసుల ఉల్లేఖన
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.
ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَجَزَاكُمُ اللهُ خَيْرًا [వ జజాకుముల్లాహు ఖైరన్] మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ [అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఏ సత్కార్యాన్నీ అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి | బులూగుల్ మరాం | హదీసు 1261 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://www.youtube.com/watch?v=aP57ahtc42U [4 mins]
1261.హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు:
“ఏ సత్కార్యాన్నీ అల్పంగా, అతి సామాన్యంగా తలపోయకండి – ఆఖరికి తమ సోదరుణ్ణి నగుమోముతో పలకరించటాన్నయినా సరే.“
సారాంశం:
ఏమీ చేయలేకపోయినా కనీసం ఒక మంచి మాట మాట్లాడటం, ఎదుటివారిని ఆకట్టుకునే రీతిలో నవ్వుతూ పలకరించటం కూడా సత్కార్యం క్రిందికే వస్తుందని ఈ హదీసు చెబుతోంది. ఏ విషయాలనయితే మనం అతి స్వల్పమైనవిగా ఊహించుకుని ఉపేక్షిస్తామో అవే ఒక్కోసారి మనల్ని ప్రజల నుండి దూరం చేస్తాయి. పిసినారిగా, గర్విష్టిగా మనల్ని నిలబెడ తాయి. అందుకే మనం తోటి సోదరుల్ని పలకరించినా, తోటివారు మనల్ని పలకరించినా పరధ్యానంతో మాట్లాడరాదు. మాట్లాడేటప్పుడు ముఖంపై అసహనం, ఆగ్రహం వ్యక్తమవకూడదు. భృకుటి ముడిపడకూడదు. నుదురు చిట్టించరాదు. కసురుకోవటం, చీకాకు పడటం వంటివి చేయకూడదు. విముఖత అసలే పనికిరాదు. మన ముఖ కవళికల ద్వారా, హావ భావాల ద్వారా వీలయినంత వరకు సంతోషాన్ని, తృప్తినీ అభివ్యక్తం చేయాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క శుభ నామాల (అస్మా-ఉల్-హుస్నా) జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మరియు దాని వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించబడింది. అల్లాహ్‌ను తెలుసుకోవడానికి ఆయన నామాలను తెలుసుకోవడమే ప్రధాన మార్గమని, ఇది విశ్వాసాన్ని, ప్రేమను, భయభక్తులను పెంచుతుందని మరియు సరైన ఆరాధనకు పునాది అని నొక్కి చెప్పబడింది. అల్లాహ్ నామాలను తెలుసుకోవడం స్వర్గ ప్రవేశానికి, పాపాల నుండి దూరం కావడానికి, ఆత్మ శుద్ధికి మరియు ప్రార్థనల స్వీకరణకు దారితీస్తుందని వివిధ ఉదాహరణలు, ఖురాన్ ఆయతులు మరియు హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. ప్రజలపై ఆధారపడటాన్ని తగ్గించి, కేవలం అల్లాహ్‌పైనే నమ్మకం ఉంచేలా ఈ జ్ఞానం ఎలా సహాయపడుతుందో కూడా వివరించబడింది.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్) శపించబడిన షైతాన్ నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మా ఉల్ హుస్నా ఫద్ ఊహు బిహా) మరియు అల్లాహ్ కొరకు శుభ నామాలు ఉన్నాయి, వాటి ద్వారానే మీరు ఆయనను ప్రార్థించండి.
సోదర మహాశయులారా, రండి ఈ రోజు మనం అల్లాహ్ యొక్క శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత, శుభ నామాల జ్ఞానాన్ని మనం పొందితే మనకు ఏంటి లాభాలు, అల్లాహ్ యొక్క శుభ నామాల జ్ఞానం మనం నేర్చుకోవడం, దీనికి ఎంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నదో కొన్ని పాయింట్స్ లలో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
పరిచయం మరియు ఒక ఉపమానం
చూడండి, వలిల్లాహిల్ మసలుల్ ఆలా, నేను అల్లాహ్ కొరకు ఏ ఉపమానం ఇవ్వడం లేదు. ఫలా తజ్రిబూ లిల్లాహిల్ అమ్సాల్. మన తక్కువ జ్ఞానం, మన యొక్క బుర్రలో విషయం త్వరగా దిగడానికి అర్థం అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ. మీ ఊరిలో ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. ఎవడబ్బా ఇతను అని మీరు అనుకుంటారు. కానీ అతని వేషధారణను బట్టి ఏదో ఒక చిన్న అంచనా వేసుకుంటారు. కదా? దానివల్ల మరికొంత పరిచయం ఎంతైతే పెరుగుతుందో అంతే అతని పట్ల మీరు కొంచెం ఆకర్షితులవుతారు. ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, అతని యొక్క పరిచయంలో ఇంకా ఎక్కువ విషయాలు తెలిసి వచ్చేసరికి ఇంకా అతనికి ఆకర్షితులై, దగ్గరగా అయి మరింత ప్రేమ ఎక్కువ అవుతుంది. అవును కదా? అంతేకాదు, ఇక ఎవరికీ ఎలాంటి రిలేషన్ షిప్ లతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుందో, అలాంటివి కొందరికి అత్తగారి సంబంధాలు అంటే కొంచెం ఎక్కువ లైక్ కదా? ఈ విధంగా, ఓ మా అత్తగారి ఊరి వారంట ఇతను అని అంటే, అరే ఇంటికి పిలిపించుకొని చాయన్నా తాగించాలి అని ఆలోచన వస్తుంది. ఇంకా నేను డీప్ లో వెళ్ళను. చిన్నగా మీకు అర్థం కావడానికి ఉదాహరణ ఇచ్చాను.
ఏ వ్యక్తి పట్ల అతని యొక్క పరిచయం మనకు ఎంత ఎక్కువగా తెలుస్తుందో, అతని పట్ల మన ప్రేమ, గౌరవ అభిమానం, అతని సేవ, అతని యొక్క ఆదేశాన్ని, అతను ఏదైనా మాటను శ్రద్ధగా వినడం, దాని తర్వాత దానిని ఆచరించే విషయం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కదా?
సోదర మహాశయులారా, అల్లాహ్ మనందరి సృష్టికర్త, మన అందరి ఉపాధికర్త, పోషణకర్త, ఈ మొత్తం విశ్వాన్ని నిర్వహిస్తున్నవాడు, నడుపుతున్నవాడు. అతని గురించి మనం తెలుసుకోవడం, ఇది మనపై ఉన్నటువంటి విధులలో, బాధ్యతలో అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే మొట్టమొదటిది, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను కన్న తండ్రిని కొంచెం కూడా నువ్వు ఖాతరు చెయ్యవా? అని మనం అంటాము కదా? కన్న తండ్రి ద్వారా మనల్ని పుట్టించిన ఆ అసలైన సృష్టికర్తను తెలుసుకోకుంటే, అతని పరిచయం మనకు లేకుంటే ఎలా మరి?
అయితే అల్లాహ్ శుభ నామాల జ్ఞాన ప్రాముఖ్యత తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు? అల్లాహ్ గురించి మనకు ఎక్కువగా తెలవాలంటే, అల్లాహ్ యొక్క పరిచయం మనకు కావాలంటే తప్పకుండా అల్లాహ్ యొక్క శుభ నామముల, ఉత్తమ గుణాల వివరణ మనకు ఎంత తెలుస్తుందో అంతే ఎక్కువ అల్లాహ్ యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అందుకొరకే ఒకచోట ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఎంత మంచి మాట చెప్పారు:
مَعْرِفَةُ أَسْمَاءِ اللَّهِ الْحُسْنَى وَصِفَاتِهِ الْعُلَا هِيَ الطَّرِيقُ الرَّئِيسِيُّ إِلَى مَعْرِفَةِ اللَّهِ (మారిఫతు అస్మాఇల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉలా హియత్ తరీఖుర్ రఈసీ ఇలా మారిఫతిల్లాహ్) అల్లాహ్ యొక్క శుభ నామాలు మరియు ఆయన ఉన్నత గుణగణాల యొక్క జ్ఞానం, అల్లాహ్ ను తెలుసుకోవడానికి ప్రధానమైన మార్గం.
అల్లాహ్ గురించి తెలుసుకోవడానికి అతి ప్రధానమైన మార్గం అల్లాహ్ యొక్క శుభ నామాలు మరియు ఉత్తమ గుణాలు. అందుకొరకే ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తరీఖుల్ హిజ్రతైన్‌లో చెబుతున్నారు:
وَلَيْسَتْ حَاجَةُ الْأَرْوَاحِ قَطُّ إِلَى شَيْءٍ أَعْظَمَ مِنْهَا إِلَى مَعْرِفَةِ بَارِئِهَا وَفَاطِرِهَا (వలైసత్ హాజతుల్ అర్వాహి ఖత్తు ఇలా షైఇన్ ఆ’జమ మిన్హా ఇలా మారిఫతి బారిఇహా వ ఫాతిరిహా) మనిషి యొక్క శరీరానికి తిండి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ అతని ఆత్మకు అల్లాహ్ యొక్క పరిచయం, అతన్ని పుట్టించినటువంటి సృష్టికర్త యొక్క పరిచయం చాలా అవసరం.
وَلَا سَبِيلَ إِلَى هَذَا إِلَّا بِمَعْرِفَةِ أَوْصَافِهِ وَأَسْمَائِهِ (వలా సబీల ఇలా హాదా ఇల్లా బి మారిఫతి అవ్సాఫిహి వ అస్మాఇహి) ఆయన గుణగణాలు మరియు నామాలను తెలుసుకోవడం ద్వారా తప్ప దీనికి మార్గం లేదు.
మరి ఇది ఎలా సాధ్యం? అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్లు, అల్లాహ్ యొక్క ఉత్తమ గుణాలు తెలుసుకోవడం ద్వారానే సాధ్యము. ఇది ఒక పాయింట్.
ఆరాధన మరియు విశ్వాసంలో ప్రాముఖ్యత
రెండవ పాయింట్, అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? అల్లాహ్‌ను ఆరాధించడానికి. ఎప్పటివరకైతే మనం అల్లాహ్ యొక్క పరిచయం అతని శుభ నామాల ద్వారా మంచి రీతిలో తెలుసుకోమో, అతని యొక్క ఆరాధన కూడా సరియైన రీతిలో చేయలేము. అల్లాహ్ యొక్క ఆరాధన మంచి రీతిలో చేయడానికి, అల్లాహ్ యొక్క శుభ నామాలను తెలుసుకోవడం చాలా చాలా అవసరం.
మూడో విషయం, అల్లాహ్‌ను విశ్వసించడం తప్పనిసరి కదా? అయితే, అల్లాహ్‌ను మనం ఎంత ఎక్కువగా అతని శుభ నామాల ద్వారా తెలుసుకుంటామో, అంతే మన విశ్వాసం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. షేఖ్ అబ్దుర్రహ్మాన్ అస్-సాదీ రహిమహుల్లాహ్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచారు.
స్వర్గ ప్రవేశానికి మార్గం
ఇంకా, సోదర మహాశయులారా, సహీ బుఖారీలో వచ్చిన హదీస్ మీకు తెలుసు. నాలుగో పాయింట్ లో ఈ విషయం నోట్ చేసుకోండి. ఏంటి? ఎవరు ఎంత ఎక్కువగా అల్లాహ్ యొక్క నామాలను, ఉత్తమ పేర్లను తెలుసుకుంటారో, అంతే వారు స్వర్గంలో ప్రవేశించడానికి ఎక్కువ అర్హత కలిగి ఉంటారు.
إِنَّ لِلَّهِ تِسْعَةً وَتِسْعِينَ اسْمًا، مَنْ أَحْصَاهَا دَخَلَ الْجَنَّةَ (ఇన్న లిల్లాహి తిస్’అతన్ వ తిస్’ఈన ఇస్మన్, మన్ అహ్సాహా దఖలల్ జన్నహ్) నిశ్చయంగా అల్లాహ్ కొరకు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, ఎవరైతే వాటిని లెక్కిస్తారో (పూర్తిగా గ్రహిస్తారో) వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.
అల్లాహ్ కొరకు ఒకటి కంటే ఒకటి తక్కువ వంద, అంటే తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి. మన్ అహ్సాహా దఖలల్ జన్నహ్. ఎవరైతే దానిని లెక్కించారో స్వర్గంలో ప్రవేశిస్తారు. ‘అహ్సా‘, ఇక్కడ ఏదైతే అరబీ పదం వచ్చిందో ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ తెలుపుతున్నారు, దీని యొక్క భావం ఏమిటంటే ఇందులో మూడు విషయాలు రావడం తప్పనిసరి, అప్పుడే ‘అహ్సా’ ఈ యొక్క సరియైన అర్థాన్ని, భావాన్ని అతను ఆచరించిన వాడు అవుతాడు. అప్పుడే అతడు స్వర్గంలో ప్రవేశించడానికి అర్హుడు అవుతాడు.
మొదటిది, అల్లాహ్ యొక్క శుభ నామాలను తెలుసుకోవాలి, ఆ పదాలను, వాటి భావాలను తెలుసుకోవాలి.
రెండవది, ఆ భావాలు ఏదైతే తెలుసుకుంటున్నాడో, ప్రతి ఒక్క అల్లాహ్ పేరుకు ఒక అర్థం ఉంటుంది కదా, ఉదాహరణకు అర్-రహ్మాన్, అనంత కరుణామయుడు. ఇప్పుడు పదం తెలిసింది, అల్లాహ్ యొక్క పేరు రహ్మాన్ అని తెలిసింది, దాని యొక్క భావం తెలిసింది. ఆ భావం ద్వారా మనపై వచ్చి పడే బాధ్యతలు ఏమిటి? అది కూడా తెలుసుకోవాలి. అంటే, అల్లాహ్ కంటే ఇంకా ఎవరైనా వేరే వారు కరుణించే విషయంలో గొప్పగా ఉన్నారు అని నమ్మవద్దు, అలాంటి ఆశతో వేరే ఎవరి వైపునకు మరలవద్దు.
ఇంకా, మూడో విషయం, అల్లాహ్ యొక్క ఈ నామాలు తెలుసుకొని, భావాలు తెలుసుకొని, వాటి యొక్క బాధ్యత ఏమిటో తెలుసుకొని, అల్లాహ్‌ను ఆ శుభ నామాల ద్వారా అర్ధించాలి, దుఆ చేయాలి, వేడుకోవాలి. ఇదే విషయం అల్లాహ్ చెప్పాడు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ 180 లో:
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మా ఉల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు చాలా మంచి పేర్లు ఉన్నాయి, మీరు ఆ పేర్ల ఆధారంగానే అల్లాహ్‌తో దుఆ చేయండి.
ఇప్పుడు ఈ ఆయత్, సూరా ఆరాఫ్ ఆయత్ నెంబర్ 180 మరియు సహీ బుఖారీ లో వచ్చిన హదీస్, ఈ రెండిటిని కలిపి ఒక ముఖ్యమైన మాట చెబుతున్నాను శ్రద్ధ వహించండి. సర్వసామాన్యంగా అల్లాహ్ యొక్క పేర్లు ఎన్ని అని మనం ఎవరినైనా అడిగితే వెంటనే 99 అని చెప్పేస్తాం. అయితే గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క పేర్లు లెక్కలేనన్నివి. అయితే సహీ బుఖారీలో వచ్చిన హదీస్ భావం ఏంటంటే, 99 పేర్లు కనీసం తెలుసుకుంటే, వాటి యొక్క హక్కును నెరవేరుస్తే స్వర్గ ప్రవేశ భాగ్యం లభిస్తుంది. పేర్లు ఎన్ని అంటే 99 అనకూడదు. లెక్కలేనన్ని పేర్లు. ఎందుకంటే ముస్నద్ అహ్మద్‌లో మరొక హదీస్ కూడా ఉంది. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దుఆ నేర్పారు:
اللَّهُمَّ إِنِّي عَبْدُكَ وَابْنُ عَبْدِكَ وَابْنُ أَمَتِكَ (అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక వబ్ను అబ్దిక వబ్ను అమతిక…) ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను నీ దాసుడను, నీ దాసుని కుమారుడను మరియు నీ దాసురాలి కుమారుడను… తో ప్రారంభమవుతుంది. ఇన్షాఅల్లాహ్ దాని యొక్క వివరణ ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో మేము చెప్పి ఉన్నాము.
అల్లాహ్ పట్ల ప్రేమ పెరుగుట
ఐదో పాయింట్ ఏంటంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఉత్తమ నామాలు మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అతని పట్ల ప్రేమ అంతే ఎక్కువగా పెరుగుతుంది. అవును, ఇది వాస్తవం. దీనికి సంబంధించి ఖురాన్‌లో నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల నుండి ఎన్నో ఆధారాలు మనం తీసుకోవచ్చు. కానీ స్టార్టింగ్‌లో నేను ఏదైతే ఒక ఉదాహరణ ఇచ్చానో, దాని ద్వారా కూడా మీకు విషయం అర్థమవుతుంది కదా? ఒక వ్యక్తి యొక్క గుణగణాలు ఎన్ని ఎక్కువ తెలిసి వస్తాయో, అతని సంబంధం మనకు ఎంత దగ్గరగా ఉంది అని తెలిసి వస్తుందో, అంతే అతని పట్ల ప్రేమ పెరుగుతుంది కదా? ఆ విధంగా, అల్లాహ్ యొక్క నామములు, అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్లు మనం తెలుసుకోవాలి. రహ్మాన్, రహీమ్, అల్-మలిక్, అల్-ఖుద్దూస్…
ఆరవ పాయింట్ – అల్లాహ్ ఉత్తమ నామాలు ప్రాముఖ్యత, ఘనత, లాభం ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క నామాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, వాటి హక్కును నెరవేరుస్తామో, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు! మనము అల్లాహ్‌ను ప్రేమిస్తున్నాము అని అనుకుంటాము. అది ఎంతవరకు అందులో సత్యమో, అల్లాహ్ యే సత్యవంతులుగా మనల్ని తేల్చుగాక, సత్యంగా ఉంచుగాక. కానీ, అల్లాహ్ నామములు ఎంత ఎక్కువగా తెలుసుకొని వాటి హక్కులు నెరవేరుస్తామో అంతే ఎక్కువగా అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు. సహీ బుఖారీలో దీని గురించి దలీల్ ఉంది. తెలుసు కదా ఆ సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హదీస్ యొక్క సారాంశం చెబుతున్నాను, సహీ బుఖారీ లోని హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో ఒక సహాబీ నమాజ్‌లో సూరే ఫాతిహా తర్వాత ఏదైనా సూరా చదివిన తర్వాత, సూరతుల్ ఇఖ్లాస్ కూడా చదువుతూ ఉండేవాడు. అయితే వెనుక ముఖ్తదీలకు కొంచెం విచిత్రంగా ఏర్పడి ప్రవక్తతో తెలియజేశారు. ప్రవక్త చెప్పారు, “అడగండి అతను అలా ఎందుకు చేస్తున్నాడు?” అని.
فَسَأَلُوهُ، فَقَالَ: لِأَنَّهَا صِفَةُ الرَّحْمَٰنِ، وَأَنَا أُحِبُّ أَنْ أَقْرَأَ بِهَا (ఫసఅలూహు, ఫఖాల: లి అన్నహా సిఫతుర్ రహ్మాన్, వ అన ఉహిబ్బు అన్ అఖ్రఅ బిహా) వారు అతనిని అడిగారు, అప్పుడు అతను ఇలా అన్నాడు: “ఎందుకంటే అది దయామయుని (అల్లాహ్) గుణగణం, మరియు నేను దానిని పఠించడానికి ఇష్టపడతాను.”
అందులో అల్లాహ్ యొక్క గుణగణాలు ఉన్నాయి. అల్లాహ్ యొక్క ఉత్తమ పేర్ల ప్రస్తావన ఉంది. అందుకొరకే అది నాకు చాలా ప్రియమైనది.
فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أَخْبِرُوهُ أَنَّ اللَّهَ يُحِبُّهُ (ఫఖాలన్ నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం: అఖ్బిరూహు అన్నల్లాహ యుహిబ్బుహు) అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతనికి తెలియజేయండి, నిశ్చయంగా అల్లాహ్ అతనిని ప్రేమిస్తున్నాడు.”
ఆ వ్యక్తికి మీరు వెళ్లి శుభవార్త ఇవ్వండి, అల్లాహ్ ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అల్లాహ్ యొక్క నామాలను, శుభ నామాలను, ఉత్తమ పేర్లను ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క ప్రేమ అనేది మనకు లభిస్తుంది.
ఇక రండి, ధర్మవేత్తలు ఈ సబ్జెక్టు మీద ఎంత పనిచేసారు! అల్లాహు అక్బర్! పాతకాలపు ఇమాములు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మవేత్తల్లో షేఖ్ అబ్దుర్రహ్మాన్ అస్-సాదీ గానీ, షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ గానీ, హిస్నుల్ ముస్లిం పుస్తకం ఉంది కదా, దాని యొక్క రచయిత షేఖ్ సయీద్ అల్-కహ్తానీ, వీరందరూ కూడా వీటిపై పుస్తకాలు రాసి ఉన్నారు.
సృష్టిపై ఆధారపడటం తగ్గడం
ఏడవ పాయింట్: అల్లాహ్ యొక్క శుభ నామాలు, ఉత్తమ పేర్ల జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, లాభం, ఘనతలో ఏమిటంటే మనం అల్లాహ్ యొక్క నామాల గురించి ఎంత మంచిగా, వివరంగా, ఎంత లోతుగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా అల్లాహ్‌కు దగ్గరగా అయి ప్రపంచ వాసులతో సంబంధం తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? అల్లాహ్‌ను సరియైన రీతిలో మనం తెలుసుకొని, అతని యొక్క హక్కు సరియైన రీతిలో మనం నెరవేరుస్తూ, ప్రజల అవసరాలు లేకుండా వారి ముందు చెయ్యి చాపకుండా, వారి ముందు అర్ధించకుండా, భిక్షాటన చేయకుండా ఉండగలుగుతాము. అవును, దీనికి సంబంధించి చాలా వివరాలు ధర్మవేత్తలు రాసి ఉన్నారు. సంక్షిప్తంగా ఒక రెండు విషయాలు నేను చెప్తాను. ఇన్షాఅల్లాహ్ మీకు ఈ మాట అర్థమవుతుంది.
ఎప్పుడైతే అల్లాహ్ మాత్రమే ‘ఘనీ‘, ఆయనే నిరపేక్షాపరుడు మరియు నన్ను కూడా ప్రజల అవసరం లేకుండా చేయగలడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకం ఉండి, సూరె ఫాతిర్ ఆయత్ నెంబర్ 15:
يَا أَيُّهَا النَّاسُ أَنتُمُ الْفُقَرَاءُ إِلَى اللَّهِ (యా అయ్యుహన్ నాస్ అన్తుముల్ ఫుఖరాఉ ఇలల్లాహ్) ఓ ప్రజలారా, అల్లాహ్ ముందు మీరందరూ కూడా అడిగేవారు, భిక్షాటన చేసేవారు. అల్లాహ్ యొక్క అవసరం మీరు కలిగి ఉన్నారు.
وَاللَّهُ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ (వల్లాహు హువల్ ఘనియ్యుల్ హమీద్) మరియు అల్లాహ్, ఆయనే ఎవరి అవసరం కలిగిలేడు, ప్రశంసనీయుడు.
ఆయన అల్-ఘనీ, ఎవరి అవసరం కలిగిలేడు. అల్-హమీద్, ఎవరు ప్రశంసించినా ప్రశంసించకపోయినా, అతడు అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. ఈ ఆయత్, ఇలాంటి భావంలో ఉన్నటువంటి అల్-ఘనీ, అల్లాహ్ యొక్క పేర్లలో గొప్ప పేరు, దాని యొక్క భావం, అర్థం, మరి దాని యొక్క బాధ్యత మనపై, మనిషి మంచి రీతిలో ఖురాన్ హదీసుల ఆధారంగా తెలుసుకున్నాడంటే, అల్లాహ్ తో అర్ధిస్తాడు, అల్లాహ్ యే నిరపేక్షాపరుడు కనుక నన్ను ప్రజల అవసరం లేకుండా చేస్తాడు అన్నటువంటి నమ్మకం ఎక్కువగా కలిగి ఉంటాడు. ఇక దీనికి ఉదాహరణలు ఇవ్వాలంటే స్వయం ప్రవక్త జీవితంలో నుండి, సహాబాల నుండి చాలా ఉన్నాయి. ఒక్క చిన్న ఉదాహరణ అర్థం కావడానికి ఇవ్వడం జరిగింది.
అలాగే సోదర మహాశయులారా, అల్లాహ్ అల్-మలిక్, అల్-మాలిక్. ఆయనే రాజు. ఆయనే సర్వాధికుడు. ఈ ఆయత్, దీని యొక్క లోతైన జ్ఞానం, దీనికి సంబంధించిన ఆయతులు వాటిని మనం అర్థం చేసుకున్నామంటే:
وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا (వలిల్లాహి ముల్కుస్ సమావాతి వల్ అర్జి వమా బైనహుమా) ఆకాశాల మరియు భూమి యొక్క మరియు వాటి మధ్య ఉన్న సమస్తం యొక్క ఆధిపత్యం అల్లాహ్ కే చెందింది.
ఆకాశాలు, భూమి, వమా బైనహుమా, వీటి మధ్యలో ఉన్న సమస్తానికి ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఇక ఈ లోకంలో ఎవరికి ఏదైనా చిన్న అధికారం ఉంటే వారితో భయపడడం, ఏదైనా అవసరం ఉంటే ఆ అధికారుల వద్దకు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, ఇట్లాంటి పనులు చేయడు.
భయభక్తులు పెరగడం మరియు పాపాలకు దూరం కావడం
8వ పాయింట్ : సోదర మహాశయులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు వస్తాయి. కానీ రండి, మరొక విషయం ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క నామాలను ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, వాటి హక్కును నెరవేరుస్తామో, అల్లాహ్ పట్ల భయం, అల్లాహ్ యొక్క గౌరవం ఎక్కువగా పెరుగుతుంది. అవును.
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ విషయాన్ని మిఫ్తాహు దారిస్ సాదాలో ప్రస్తావించారు. ఏమిటంటే:
كَفَى بِخَشْيَةِ اللَّهِ عِلْمًا وَكَفَى بِالِاغْتِرَارِ بِاللَّهِ جَهْلًا (కఫా బి ఖష్యతిల్లాహి ఇల్మన్ వ కఫా బిల్ ఇగ్తిరారి బిల్లాహి జహలా) మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ గురించి తెలుసుకుంటాడో అంతే ఎక్కువగా అల్లాహ్‌కు భయపడతాడు మరియు మనిషి ఎంత ఎక్కువగా అల్లాహ్ పట్ల అజ్ఞానంగా ఉంటాడో, అంతే అల్లాహ్ విషయంలో మోసపోయి పాపాలకు గురి అయి ఉంటాడు
ఒకవేళ ఈ భావం మరింత మంచిగా మీకు అర్థం కావాలంటే సూరె ఫాతిర్, ఆయత్ నెంబర్ 28 చదవండి:
إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ (ఇన్నమా యఖ్శల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా) నిశ్చయంగా, ఆయన దాసులలో జ్ఞానులు మాత్రమే అల్లాహ్‌కు భయపడతారు.
అల్లాహ్‌తో భయపడేది, అల్లాహ్ గురించి ఎక్కువగా తెలిసిన వారు. ధర్మ జ్ఞానం కలిగి ఉన్నవారు, అల్లాహ్‌కు సంబంధించిన జ్ఞానం కలిగి ఉన్నవారే అల్లాహ్‌తో ఎక్కువగా భయపడతారు. మరియు సహీ హదీసులో వచ్చిన విధంగా బుఖారీ మరియు ముస్లింలో, ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారు?
أَنَا أَعْلَمُكُمْ بِاللَّهِ وَأَشَدُّكُمْ لَهُ خَشْيَةً (అన ఆ’లముకుం బిల్లాహి వ అషద్దుకుం లహు ఖశ్యహ్) నేను మీ అందరిలో అల్లాహ్ గురించి బాగా తెలిసిన వాడను మరియు ఆయనకు అత్యధికంగా భయపడే వాడను.
అల్లాహ్ గురించి నేను మీ అందరిలో ఎక్కువగా తెలిసినవాన్ని, మీ అందరిలో అల్లాహ్ పట్ల ఎక్కువగా భయం కలిగి ఉన్నవాన్ని. అర్థమైందా? అల్లాహ్ యొక్క నామ ప్రాముఖ్యత తెలుస్తుందా?
సోదర మహాశయులారా, తొమ్మిదవ పాయింట్, మనం అల్లాహ్ యొక్క ఉత్తమ నామాల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా పాపాలకు దూరం ఉండగలుగుతాము. తద్వారా నరకం నుండి మోక్షం పొందగలుగుతాము. అవును, ఎంత ఎక్కువగా అల్లాహ్ గురించి తెలుసుకోగలుగుతామో, అంతే పాపాలకు దూరంగా ఉండగలుగుతాము. అవునా లేదా? దీనికి సంబంధించి కూడా ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు ఉన్నాయి. కానీ ఒక చిన్న ఉదాహరణ, ఉపమానం ద్వారా మీకు చెబుతాను.
ఏదైనా బంగారం దుకాణంలో దొంగలించాలని, ఆ… ఎక్కడ ఎవరు లేరు, ఏ పోలీస్ వారు కూడా లేరు అని దుకాణానికి ఏదైనా బొక్క వేయాలని దొంగ దగ్గరికి వస్తున్నాడు, అంతలోనే అటు నుంచి పోలీస్ బండి వస్తుంది. ఏమవుతుంది? అలాగే అదే ఉద్దేశంతో, అదే ధైర్యంతో దొంగతనం చేయడానికి వెళ్తాడా? లేదా కెమెరాలు నలువైపుల నుండి ఉన్నాయి, అలాంటి చోట ఏదైనా పాపం, దోషం, నేరం, తప్పు… అంతెందుకండి, సిగ్నల్ వద్దకు వచ్చాము, రెడ్ లైట్ ఉంది, అక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి సిగ్నల్ పై, మళ్లీ పోతే పోలీస్ కెమెరా కూడా పట్టుకొని ఉన్నాడు. మీరు దాటారంటే క్లిక్ కొడతాడు. దాటుతారా? దాటరు కదా? వలిల్లాహిల్ మసలుల్ ఆలా. అల్లాహ్ కొరకు కాదు ఈ ఉపమానాలు, మనకు అర్థం కావాలి అని.
ఇన్న బత్ష రబ్బిక లషదీద్. నీ ప్రభువు పట్టుకోవడానికి, శిక్షించడానికి వచ్చినప్పుడు ఎవరు కూడా అతని పట్టు నుండి వదులుకోలేరు అన్న విషయంపై మనకు కచ్చితమైన నమ్మకం ఉండేది ఉంటే. అల్లాహు తాలా చీకట్లలో కూడా అలాగే చూస్తాడు, ఎలాగైతే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం చూస్తాడో అన్నటువంటి నమ్మకం మనకు ఉండేది ఉంటే, పాపంలో ముందడుగు వేయగలుగుతామా, ధైర్యం చేయగలుగుతామా?
అల్లాహ్ యొక్క శుభ నామములు, ఉత్తమ పేర్లు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే ఎక్కువగా పాపాల నుండి దూరం ఉండి నరకం నుండి మోక్షం పొందగలుగుతాము.
ఆత్మ శుద్ధి మరియు దుఆ స్వీకరణ
10వ పాయింట్, అల్లాహ్ యొక్క నామములు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంతే మన ఆత్మ శుద్ధి కలుగుతుంది. పాపాల పట్ల ఆలోచన, పాపాల పట్ల ఒక రకమైన ఆకర్షణ అనేది తగ్గుతుంది. దానికి బదులుగా పుణ్యాల వైపు ఆలోచనలు ఎక్కువగా కలిగి మనం పుణ్యాలు చేయడానికి పూనుకుంటాం. సూరతుష్ షమ్స్, అలాగే సూరతుల్ ఆలా యొక్క ఆయతుల ద్వారా ఈ విషయం మనకు బోధపడుతుంది. అలాగే, సూరత్ ఆల ఇమ్రాన్ మరియు సూరతుల్ జుమాలో వచ్చిన ఆయతుల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉద్దేశం పంపడానికి ఇదే అన్నట్లుగా అల్లాహు తాలా చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు.
సోదర మహాశయులారా, సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏమిటి? అల్లాహ్‌ను ఎంత ఎక్కువగా మనం అతని శుభ నామాల ద్వారా తెలుసుకుంటామో, అంతే విశ్వాసం పెరుగుతుంది, అతని పట్ల ప్రేమ పెరుగుతుంది, స్వర్గానికి దగ్గరవుతాము, పాపాలకు దూరంగా ఉండి నరక మోక్షం పొందుతాము, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు.
లాస్ట్, ఫైనల్, ఇంపార్టెంట్ విషయం. – మనం అల్లాహ్ యొక్క నామాలతో దుఆ చేస్తే… అల్లాహ్ యొక్క నామాలు మనం మంచిగా తెలుసుకొని వాటి ఆధారంగా, ఏ దుఆ మనకు చేయవలసిన అవసరం ఉందో దానికి అనుగుణంగా ఏ అల్లాహ్ యొక్క పేరు ఉందో దాని ఆధారంగా దుఆ చేస్తే, వెంటనే, త్వరగా దుఆ స్వీకరించబడే అవకాశాలు పెరుగుతాయి. దీనికి సంబంధించి కూడా సహీ బుఖారీ, ముస్లింలోని హదీసులు ఉన్నాయి. సూరతుల్ ఇఖ్లాస్ యొక్క వ్యాఖ్యానం మీరు చదివారంటే అందులో కూడా ఆ హదీసులు వస్తాయి. ఒక సందర్భంలో ఒక సహాబీ వచ్చి:
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ بِأَنَّكَ أَنْتَ اللَّهُ الْأَحَدُ الصَّمَدُ الَّذِي لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బి అన్నక అంతల్లాహుల్ అహదుస్ సమద్, అల్లజీ లమ్ యలిద్ వలమ్ యూలద్ వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్) ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను నిన్నే వేడుకుంటున్నాను, ఎందుకంటే నీవే అల్లాహ్, ఏకైకుడవు, నిరపేక్షాపరుడవు. ఆయన ఎవరినీ కనలేదు, ఎవరి చేతా కనబడలేదు. మరియు ఆయనకు సరిసమానులెవరూ లేరు.
అని అన్నాడు, ప్రవక్త వెంటనే ఏమి చెప్పారు? ఇతను అల్లాహ్ యొక్క ఎంతటి గొప్ప పేర్లతో అర్ధిస్తున్నాడు అంటే ఇక అతడు ఏ ఏమీ అడిగినా అల్లాహ్ ప్రసాదిస్తాడు, ఏ దుఆ చేసినా అల్లాహ్ స్వీకరిస్తాడు.
అల్లాహ్ శుభనామాల జ్ఞాన ప్రాముఖ్యత -2 || షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ https://youtu.be/o2Az39e4Gvs [34 నిముషాలు]
ఈ ప్రసంగంలో, వక్త ఏ విద్య అత్యంత శ్రేష్ఠమైనది మరియు ఘనత గలది అనే ప్రశ్నతో ప్రారంభించి, దాని సమాధానం అల్లాహ్ గురించిన జ్ఞానమేనని స్పష్టం చేశారు. అల్లాహ్ యొక్క నామాలు, గుణాలు మరియు పనుల గురించి తెలుసుకోవడమే అన్ని జ్ఞానాలలోకి గొప్పదని, దీనిని ‘అల్-ఫిఖ్ హుల్-అక్బర్’ (అత్యున్నత అవగాహన) అని అంటారని వివరించారు. ఒక ఎత్తైన భవనానికి బలమైన పునాది ఎంత అవసరమో, మన ఆరాధనలు మరియు విశ్వాసానికి అల్లాహ్ గురించిన సరైన జ్ఞానం అంత అవసరమని ఒక ఉదాహరణతో పోల్చారు. ఖురాన్‌లోని సూరత్ అత-తౌబా, సూరత్ అత-తలాఖ్ మరియు సూరత్ అల్-మునాఫిఖూన్ వంటి అధ్యాయాల నుండి ఆయత్‌లను ఉటంకిస్తూ, అల్లాహ్ తన సృష్టిని మనకు పరిచయం చేసింది మనం ఆయనను తెలుసుకోవడానికేనని నొక్కి చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా వంటి పండితుల మాటలను ప్రస్తావిస్తూ, ఖురాన్‌లో స్వర్గంలోని సుఖాల కంటే అల్లాహ్ గుణగణాల ప్రస్తావనే ఎక్కువగా ఉందని తెలిపారు. చివరగా, మన సిరిసంపదలు మరియు సంతానం అల్లాహ్ ధ్యానం నుండి మనల్ని మరల్చరాదని, అల్లాహ్ గురించిన జ్ఞానంతో మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలని హితవు పలికారు.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ. [అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.] సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్, ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత.
ప్రియ మిత్రులారా, కొన్ని రకాల విద్యలో ఏ విద్య ఎక్కువ ఘనత గలది? ఏ విద్యను నేర్చుకోవడంలో సమయం కేటాయించడం ఎక్కువ ఘనత గల విషయం? ఏ విద్యను మనం నేర్చుకుంటే మనకు ఎక్కువ లాభం కలుగుతుంది? ఈ మూడు ప్రశ్నలకు కూడా సమాధానం ఒకటే. ఏమిటి? ఆ విద్య దేనికి సంబంధించిందో దానిని బట్టి ఆ ఘనత, ఆ లాభం ఉంటుంది.
ఏ జ్ఞానం అతి శ్రేష్ఠమైనది?
ఈ విధంగా, ఇప్పుడు మన ముందు ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి. ధర్మ విద్యకు సంబంధించి కూడా అందులో మరీ ఎన్నో అంశాలు, ఎన్నో వివరాలు ఉన్నాయి. వాటన్నిటిలోకెల్లా అతి గొప్ప ఘనత గల విషయం, అల్లాహ్ త’ఆలా యొక్క పేర్ల గురించి, ఉత్తమ నామాల గురించి, సుందరమైన గుణాల గురించి తెలుసుకోవడం. దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం ఇతర జ్ఞానాల కంటే ఎక్కువ ఘనత గల విషయం. ఇందులో మన సమయాన్ని వెచ్చించడం మన కొరకు ఎక్కువ లాభదాయకమైన విషయం. దీనినే కొందరు ధర్మవేత్తలు
أَلْفِقْهُ الْأَكْبَرُ [అల్ ఫిఖ్ హుల్ అక్బర్] అత్యున్నత అవగాహన
అని చెప్పారు. అంటే అతి పెద్ద, అతి గొప్ప ధర్మ అవగాహన.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో, ధర్మ అవగాహన ఎవరికైతే ప్రసాదించబడినదో వారి యొక్క ఘనత తెలుపుతూ ఏమన్నారు? సహీ బుఖారీలోని హదీస్, హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు.
مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ [మన్ యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫఖ్ఖిహ్ హు ఫిద్దీన్] అల్లాహ్ ఎవరికైతే మేలు చేయాలని తలుస్తాడో, అతనికి ధర్మంలో అవగాహనను ప్రసాదిస్తాడు.
అల్లాహు త’ఆలా ఎవరి పట్లనైతే మేలు చేయగోరుతాడో, అతనికి ధర్మ అవగాహన ప్రసాదిస్తాడు. ధర్మం మన జీవిత విధానం. ఎక్కడి నుండి వచ్చింది? అల్లాహ్ నుండి వచ్చింది. ఆ అల్లాహ్ నుండి వచ్చిన ఈ ధర్మ జ్ఞానంలో అతి ఉత్తమమైన, ఉన్నతమైన, ప్రప్రథమమైన నేర్చుకోవలసిన విషయం అల్లాహ్ గురించి. ఎందుకంటే ధర్మం యొక్క అసలు మూలం ఏంటి? నేను దాసుణ్ణి, అతడు నా యజమాని. నా జీవితమే అతని దాస్యంలో ఉండాలి. ఎలా చేయాలి ఆ దాస్యం? ఆయన నేర్పుతాడు, మనం నేర్చుకొని అలాగే ఆచరిస్తాము. అందుకొరకే అల్లాహ్ గురించి తెలుసుకోవడమే సర్వ విద్యల్లో, అన్ని రకాల జ్ఞానాల్లో అతి గొప్ప ఘనత గల విషయం.
అల్లాహ్ గురించి తెలుసుకోవడం – ఒక బలమైన పునాది
ఇక రండి, ఈ విషయాన్ని మరో రకంగా తెలుసుకుందాము. మీరు ఎంత మంచి, ఎంత ఎత్తైన భవనం కట్టాలనుకుంటారో, అంతే పునాదిని గట్టిగా, బలంగా, దృఢంగా చేస్తారు. అవునా కాదా? కేవలం, కేవలం గడ్డి వేసి పైన ఏదో చిన్న వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ కవర్ ఏదైనా వేసుకోవడానికి చిన్నపాటి గుంజల మీద మనం ఒక కప్పు లాంటిది వేసేస్తాము. అదే ఒకవేళ స్లాబ్ వేయాలంటే, పునాదులు మంచిగా లోతుగా త్రవ్వి, రాళ్లతో, సిమెంట్ తో, ఐరన్ (ఇనుము)తో కలిసిన అన్ని విషయాల ద్వారా, మళ్లీ దానిలో పిల్లర్లను లేపి దానిపై స్లాబ్ వేస్తాము. ఇది ఒక్క స్లాబ్ విషయం అయితే. అదే ఒకవేళ ఎత్తైన భవనాలు 10 అంతస్తులు, 20 అంతస్తులు, 30, 40, 70 కట్టాలనుకుంటే, అంతే ఎక్కువగా పునాది బలంగా, దృఢంగా తయారు చేయడం జరుగుతుంది. కదా?
ఇది లాజిక్ పరంగా, సామాన్య మనిషికి కూడా బుద్ధి జ్ఞానాల్లో వచ్చే విషయమే కదా? అయితే మనం ఈ లోకంలో ఎన్ని పుణ్యాలు చేసుకున్నా, మన వద్ద ఎంత ఎక్కువ ధర్మ అవగాహన కలిగి ఉన్నా, ఇదంతా కూడా పై భవనాల మాదిరిగా. ఒకవేళ పునాది బాగు లేకుంటే, దృఢంగా లేకుంటే ఈ భవనం పైన ఏదైతే మేడలు కడుతున్నామో అవి గట్టిగా ఉండవు, చిన్నపాటి కదలికకు కూడా, వేగంగా వీచే గాలికి కూడా పడిపోవచ్చు. అలాగే అల్లాహ్ గురించి తెలుసుకోవడం, అల్లాహ్ యొక్క నామాల గురించి, అతని ఉత్తమ గుణాల గురించి తెలుసుకోవడం, వాటి ప్రకారంగా మన విశ్వాసాన్ని దృఢంగా ఉంచడం, ఈ విశ్వాసం అల్లాహ్ గురించి కావలసిన నమ్మకం ఇది బలమైన పునాది లాంటిది. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో, అంతే బలంగా పై భవనాలు ఉంటాయి, మేడలు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి.
అల్లాహ్ యొక్క పేర్లలో అల్-అలీమ్, అల్-బసీర్, అస్-సమీ‘ ఇవన్నీ మనం విన్నాము. చిన్నపాటి వివరణ, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆయతులు, కొన్ని వివరాలు చెప్పగలిగాను. కానీ వాటిని మనం అర్థం చేసుకున్నామా? కేవలం ఇప్పుడు ఒక మూడు పేర్ల విషయమే తీసుకోండి మీరు. వాస్తవంగా ప్రతిక్షణం అల్లాహ్ నన్ను చూస్తూ ఉన్నాడు, నా నుండి వింటూ ఉన్నాడు, నా గురించి అన్నీ తెలిసి ఉన్నాడు అన్నటువంటి బలమైన, ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటే, అతని యొక్క అవిధేయత మనం చేయగలమా?
తండ్రి ముంగట ఉండి బీడీ, సిగరెట్ బయటికి తీసే వాడినే మనం ఎంత దుష్టుడివిరా, ఎంత దుర్మార్గుడివి నువ్వు, ఇంత కూడా నీకు తండ్రి యొక్క విలువ తెలియదా అన్నట్లుగా మనం అతన్ని నిందిస్తాము. కదా? మరి ఏ ఒక్క క్షణమైనా మనం అల్లాహ్ దృష్టి నుండి దూరం ఉన్నామా? అల్లాహ్ చూడకుండా మనం ఎక్కడైనా దాచుకోగలుగుతామా? అర్థమవుతుందా? అల్లాహ్ యొక్క పేర్లు, అల్లాహ్ యొక్క నామాలు, అల్లాహ్ యొక్క ఉత్తమ గుణాల గురించి తెలుసుకోవడం ఎంత అవసరం ఉన్నది.
సోదర మహాశయులారా, ఈ భవనాల యొక్క సామెత ఏదైతే ఇప్పుడు ఇచ్చానో, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ వారు దీని గురించి చాలా స్పష్టంగా, చాలా వివరంగా దీని గురించి చెప్పి ఉన్నారు. అయితే, ఖురాన్‌లోని ఒక్క ఆయత్, సూరత్ అత-తౌబా, ఆయత్ నంబర్ 109 తీసి చూడండి.. దీని ద్వారా మనకు బోధ పడుతున్న విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి.
أَفَمَنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ تَقْوَىٰ مِنَ اللَّهِ وَرِضْوَانٍ خَيْرٌ أَم مَّنْ أَسَّسَ بُنْيَانَهُ عَلَىٰ شَفَا جُرُفٍ هَارٍ فَانْهَارَ بِهِ فِي نَارِ جَهَنَّمَ తన కట్టడాన్ని దైవభీతి, దైవ ప్రసన్నతల పునాదిపై కట్టినవాడు ఉత్తముడా? లేక కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున తన కట్టడాన్ని కట్టినవాడు ఉత్తముడా? (9:109)
ఖురాన్‌లో లాజిక్ పరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది లాజిక్ పరమైన ఆధారం కాదా? గమనించండి. ఒక కట్టడం ఎలా ఉన్నది? దైవభీతి, దైవ ప్రసన్నతల పునాదిపై. మరొకతని కట్టడం ఎలా ఉంది? కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న, అది కూడా ఏదైనా లోయ యొక్క డొల్ల అంచున. ఏది త్వరగా పడిపోవడానికి భయం ఉన్నది? ఇది. కదా? అటు పిమ్మట అది అతనితో పాటే నరకాగ్నిలో పడిపోయింది. ఈ కట్టడాల విషయం తీసుకొచ్చి అల్లాహ్ మళ్ళీ నరకం విషయం ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ ఉద్దేశం అదే. ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు. విశ్వాసం, అల్లాహ్ గురించి సరియైన జ్ఞానం కావలసిన రీతిలో ఎంత అవసరమో అంత లేనందువల్ల, అల్లాహ్ పట్ల ఆ బలమైన విశ్వాసం కలిగి లేము. దాని కారణంగా ఎన్నో పాపాలు జరుగుతున్నాయి. దాని కారణంగా మనిషి నరకంలో పడిపోతాడు.
అల్లాహ్‌ను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
సోదర మహాశయులారా, అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు? అందరి సమాధానం ఒకటే ఉంటుంది కదా? అల్లాహ్ ను ఆరాధించడానికి. అల్లాహ్ ఆరాధన మనం, అల్లాహ్ ను గుర్తుపట్టకుండా, అల్లాహ్ అనేవాడు ఎవడు అనేది సరియైన రీతిలో తెలుసుకోకుండా ఎలా చేయగలుగుతాము?
అందుకొరకే అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని కూడా ఎంత స్పష్టంగా ఖురాన్‌లో మన కొరకు తెలియజేశాడో గమనించండి. ముందు అల్లాహ్ మనకు అతని గురించి జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత నన్ను ఆరాధించు, నా ఆరాధన కొరకే నిన్ను పుట్టించాను అన్న మాట, ఆదేశం తెలియపరిచాడు. ఈ విషయాన్ని మీరు ఒకవేళ గ్రహించగలిగారనుకుంటే ఖురాన్‌లో అనేక సందర్భాలలో ఆయతులు ఉన్నాయి. కానీ రండి, ఒకసారి సూరతు అత-తలాఖ్ సూర నంబర్ 65 ఇది. ఇందులో ఈ ఆయత్ పై ఒకసారి మనం శ్రద్ధ వహిద్దాము, ఆయత్ నంబర్ 12. ఇది చివరి ఆయత్ సూరత్ తలాఖ్‌లో. ఏముంది గమనించండి?
اللَّهُ الَّذِي خَلَقَ سَبْعَ سَمَاوَاتٍ وَمِنَ الْأَرْضِ مِثْلَهُنَّ يَتَنَزَّلُ الْأَمْرُ بَيْنَهُنَّ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا అల్లాహ్, ఆయనే సప్తాకాశాలను, అలాంటివే భూములను సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ వాటి మధ్య అవతరిస్తుంది. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి. (65:12)
అరబీ గ్రామర్ ప్రకారంగా ఇక్కడ వచ్చింది లిత’లమూ, కానీ మన తెలుగు సాహిత్య ప్రకారంగా ఆ మాట చివరలో వచ్చింది, తెలుసుకోవటానికి. ఏమని తెలుసుకోవటానికి? అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడని. ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి. మనం తెలుసుకోవాలి అల్లాహ్ గురించి. అల్లాహ్ యే సృష్టించినవాడు, అల్లాహ్ యే ఆదేశించువాడు, అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారమే ఈ మొత్తం సృష్టి యొక్క ప్రక్రియ నడుస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది. ఈ ఆయతులో అల్లాహ్ సృష్టించిన తన సృష్టి గురించి తెలియజేస్తూ, మీరు అల్లాహ్ గురించి తెలుసుకోవాలి, ఆ అల్లాహే సృష్టించాడని, ఆయనే సర్వశక్తిమంతుడు అని, ఆయన యొక్క జ్ఞానం ఈ సర్వ సృష్టిని ఆవరించి ఉంది. అర్థం కాలేదా? ఖురాన్ యొక్క ఈ మాట అర్థమవుతుందా, అవతలేదా?
అల్లాహ్ క్షమించు గాక నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా. అల్లాహ్ గురించి కాదు, సామెత, మన మదిలో విషయం నాటుకుపోవడానికి, మింగుడు పడని మనం జీర్ణించలేని మాటను మంచిగా జీర్ణించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, డైజిన్ టాబ్లెట్ మాదిరిగా, ఒక ఉదాహరణ. ఏంటి? కాలేజీలో ఒక వ్యక్తి ప్రవేశించాడు. సూట్ బూట్‌లో ఉన్నాడు. అతను ఎవరో అన్నది తెలియని వరకు కాలేజ్ స్టూడెంట్స్ కూడా అతని పక్క నుండే దాటుతూ ఎవరో వస్తూ పోతా ఉంటారు కాలేజీలో ఎంతో మంది అన్నట్లుగా ఉంటారు. అవునా లేదా? అదే ఒకవేళ తెలిసింది, ఈ కాలేజ్ యొక్క ఓనర్, ఈ కాలేజ్ యొక్క అసలు బాధ్యుడు, క్షణంలో అతను తలచుకుంటే మీకు ఫీజులన్నీ మాఫ్ చేసి, మీ పరీక్షల్లో అన్ని రకాల సులభతరాలు కలుగజేసి, అంతటి ఎదిగిన మినిస్ట్రీలో కూడా చాలా పెద్ద చేయి ఉన్నటువంటి వ్యక్తి అని మీకు తెలిస్తే, పరిచయమైతే? అరె, నా పక్క నుండే దాటాడు కాదా, మంచిగా సలాం చేసి, సలాం చేసేవాడిని, అరే ముందు తెలియదు రా నాకు. ఈ విధంగా అనుకుంటారా లేదా?
అవునా కాదా? మరొక సామెత కూడా ఉంది, అరబీలో, ఉర్దూలో, తెలుగులో కూడా చెప్పుకుంటారు. ఒక దేశం రాజు పక్క దేశంలో పోయారంటే, తెలియని వారి కొరకు అతడు అజ్ఞానుడు, పామరుడు లాంటివాడే. కానీ ఎప్పుడైతే ఆ దేశ ప్రజలకు తెలుస్తుందో, ఫలానా అగ్రరాజ్యం యొక్క రాజు అట ఇతను అని, ఎలా అతనిపై గౌరవం ఉంటుంది అప్పుడు? ఎలా ఉంటుంది అతని యొక్క మర్యాద? ఇవన్నీ లాజిక్ పరంగా మనకు అర్థమయ్యే విషయాలే కదా? ఏ అల్లాహ్‌ను మనం ఆరాధించాలో, ఆ ఆరాధన కొరకే మనము పుట్టామో, అతని గురించి, అతని నామాల గురించి, అతని ఉత్తమ గుణాల గురించి మనకు తెలియకుంటే, ఈ రోజుల్లో మనలో అనేక మందికి తెలియదు గనుక, మనం ఆ అల్లాహ్‌ను ఉత్తమ రీతిలో, ఆరాధించవలసిన రీతిలో, అతనితో భయపడవలసిన రీతిలో భయపడటం లేదు.
అల్లాహ్ త’ఆలా ఒక్క ఆయత్ కాదు, రెండు ఆయతులలో కాదు, అనేక సందర్భాలలో ‘వఅలమూ, వఅలమూ, వఅలమూ’ అల్లాహ్ గురించి తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి అని మాటిమాటికి అల్లాహ్ యొక్క గుణాలు ప్రస్తావించడం జరిగింది.
فَاعْلَمُوا أَنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ [ఫఅ’లమూ అన్నల్లాహ అజీజున్ హకీమ్] మీరు తెలుసుకోండి, అల్లాహ్ యే తిరుగులేని శక్తిమంతుడు, వివేచనాపరుడు. (బఖరా 2: 209)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ [వఅ’లమూ అన్నల్లాహ బికుల్లి షైఇన్ అలీమ్] మీరు తెలుసుకోండి, అల్లాహ్ సర్వజ్ఞాని, సర్వం గురించి ఉత్తమ రీతిలో తెలిసినవాడు.(బఖరా 2: 231)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ [వఅ’లమూ అన్నల్లాహ బిమా త’అమలూన బసీర్] మీరు చేస్తున్నదంతా అల్లాహ్ సూక్ష్మంగా చూస్తూ ఉన్నాడు. (బఖరా 2: 233)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ [వఅ’లమూ అన్నల్లాహ గఫూరున్ హలీమ్] తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఎంతో క్షమాశీలి మరియు సహనశీలి. (బఖరా 2: 235)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ [వఅ’లమూ అన్నల్లాహ సమీఉన్ అలీమ్] తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహు త’ఆలా వినువాడు మరియు అన్నీ తెలిసినవాడు. (బఖరా 2: 244)
وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ [వఅ’లమూ అన్నల్లాహ గనియ్యున్ హమీద్] తెలుసుకోండి, నిశ్చయంగా అల్లాహ్ నిరపేక్షాపరుడు, స్వతహాగా అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. (బఖరా 2: 267)
కేవలం సూర బఖరాలోనే ‘వఅలమూ, వఅలమూ’ (జ్ఞానం నేర్చుకోండి, మీరు తెలుసుకోండి) అల్లాహ్ గురించి అని అల్లాహ్ యొక్క ఎన్ని పేర్లు, ఆ పేర్లలో ఉన్నటువంటి ఎన్ని గుణాల గురించి మనకు చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే సూరతుల్ మాయిదా 98, సూరతుల్ బఖరా 194, సూరతుల్ అన్ఫాల్ 40, ఇంకా సూరత్ ముహమ్మద్ 19, అనేక ఆయతులు ఉన్నాయి.
అందుకొరకే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహ్మతుల్లా అలైహి వారి యొక్క ఈ మాటను కొంచెం శ్రద్ధ వహించండి. చెప్పారు:
وَالْقُرْآنُ فِيهِ مِنْ ذِكْرِ أَسْمَاءِ اللَّهِ وَصِفَاتِهِ وَأَفْعَالِهِ أَكْثَرُ مِمَّا فِيهِ مِنْ ذِكْرِ الْأَكْلِ وَالشُّرْبِ وَالنِّكَاحِ فِي الْجَنَّةِ ఖురాన్‌లో, స్వర్గంలో తినడం, త్రాగడం మరియు వివాహం గురించి ఉన్న ప్రస్తావన కంటే అల్లాహ్ యొక్క పేర్లు, గుణాలు మరియు పనుల గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంది.
అరబీ యొక్క సెంటెన్స్ షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ చెప్పింది వినిపించాను. దీని అనువాదం తర్వాత చెప్తాను. అంతకంటే ముందు, ఈ రోజుల్లో ఎంతో మంది అజ్ఞానులు, అవును, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎన్ని ప్రపంచ చదువులు ఉన్నా గానీ, వారు పలికే ఈ పనికిమాలిన మాటల ద్వారా వారి డిగ్రీలన్నీ కూడా వ్యర్థమే. సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా అని ఒక గేయం కూడా మీరు విని ఉండవచ్చు నా నోట. ఏంటి విషయం? ఎందరో అజ్ఞానులు, ఏండయ్యా మీ ఖురాన్‌లో, మాటిమాటికి మొగోళ్ళకు నలుగురు భార్యల గురించి ప్రస్తావన ఉంటుంది, స్వర్గంలో ఇంత మంది కన్యలు అని ఉంటుంది, లేదా అంటే స్త్రీల యొక్క ప్రత్యేక విషయాల గురించి, వారి యొక్క బహిష్టుల గురించి ఉంటుంది, ఏంటి ఈ ఖురాన్? నఊజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇలాంటి యొక్క ఎగతాళి ఖురాన్ పట్ల చేసిన అజ్ఞానులు, వారిలో మరీ దుర్మార్గులు, కొందరు అజ్ఞాన ముస్లింలు కూడా. నఊజుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. కానీ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్, ఎవరి జీవితాలైతే ఖురాన్ చదవడం, చదివించడం, వ్యాఖ్యానం, ఇలాంటి విషయాల్లో గడిసిపోయినవో, ఏమంటున్నారు? ఖురాన్‌లో, స్వర్గంలో తినడం, త్రాగడం మరియు వివాహం గురించి ఉన్న ప్రస్తావన కంటే అల్లాహ్ యొక్క పేర్లు, గుణాలు మరియు పనుల గురించిన ప్రస్తావనే ఎక్కువగా ఉంది.
وَالْآيَاتُ الْمُتَضَمِّنَةُ لِذِكْرِ أَسْمَاءِ اللَّهِ وَصِفَاتِهِ أَعْظَمُ قَدْرًا مِنْ آيَاتِ الْمَعَادِ [వల్ ఆయాతుల్ ముతదమ్మినతు లిజిక్రి అస్మాఇల్లాహి వ సిఫాతిహి అ’జము ఖదరన్ మిన్ ఆయాతిల్ మ’ఆద్] మరియు అల్లాహ్ యొక్క పేర్లు మరియు గుణాలను కలిగి ఉన్న ఆయతులు, పరలోకం గురించిన ఆయతుల కంటే ఎక్కువ ఘనత గలవి.
పరలోకం గురించి ఉన్న ఆయతుల యొక్క సంఖ్య, విలువ, వాటికంటే గొప్ప సంఖ్యలో అల్లాహ్ యొక్క పేర్ల, అల్లాహ్ యొక్క గుణాల ప్రస్తావనకు సంబంధించిన ఆయతులు ఉన్నాయి.ఉదాహరణకు, పూర్తి ఖురాన్‌లో ఉన్నటువంటి 6000 కంటే ఎక్కువ ఆయతులలో అతి గొప్ప ఆయత్ అని దేనిని చెప్పడం జరిగింది? ఆయతుల్ కుర్సీని. కదా? అందులో, అందులో ఏముంది ప్రస్తావన? అల్లాహ్ గురించే ఉన్నది మొత్తం టోటల్‌గా. పరలోక ప్రస్తావన, స్వర్గం ప్రస్తావన, తిను త్రాగు ప్రస్తావన, వేరే విషయాలు లేవు, కేవలం అల్లాహ్ గురించి. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబై బిన్ కా’బ్ ని ప్రశ్నించారు,
أَتَدْرِي أَيُّ آيَةٍ فِي كِتَابِ اللَّهِ أَعْظَمُ؟ [అతద్రి అయ్యు ఆయతిన్ ఫీ కితాబిల్లాహి ఆ’జం?] అల్లాహ్ యొక్క గ్రంథంలో ఏ ఆయత్ చాలా గొప్పది అని నీకు తెలుసా?
అప్పుడు ఉబై బిన్ కా’బ్ “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్” అని చెప్పారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషంతో, వాహ్, ఏం చెప్పినావు అన్నట్లుగా తన యొక్క ఛాతిలో ఈ విధంగా తట్టి,
لِيَهْنِكَ الْعِلْمُ يَا أَبَا الْمُنْذِرِ [లియహ్నికల్ ఇల్ము యా అబల్ ముందిర్] ఓ అబల్ ముందిర్, ఈ జ్ఞానం నీకు శుభకరంగా అగుగాక. అని ప్రశంసించారు.
ఖురాన్‌లోని అతి గొప్ప ఆయత్, ఏ దీనిని చెప్పడం జరిగింది, అందులో ఎవరి ప్రస్తావన ఉంది, ఆ ఆయత్ గురించి తెలిసిన సహాబీకి ఎంత గొప్ప షాబాష్ ఇవ్వడం జరిగింది. ఇక సూరతులలో చూసుకుంటే, ఆయతులలో గొప్ప ఆయత్ ఇది.
సూరతులలో చూసుకుంటే ఏ సూరతుని أَعْظَمُ سُورَةٍ [అ’జము సూర] అతి గొప్ప సూరాఉమ్ముల్ ఖురాన్, ఖురాన్ యొక్క మూలం అని చెప్పడం జరిగింది? సూరతుల్ ఫాతిహా. చూడండి, బిస్మిల్లా నుండి మొదలుకొని సుమారు సగం సూరా కంటే ఎక్కువ అల్లాహ్ యొక్క పేర్లు, అల్లాహ్ గురించి, అతని యొక్క ఉత్తమ గుణాలు, అతని యొక్క ఉత్తమ పనులు, అతనికి, మనిషికి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి దాని ప్రస్తావన ఉంది, చివర్లో ఒక రెండు ఆయతులలో దుఆ ఉంది, అది కూడా అల్లాహ్‌తోనే అడగడం జరుగుతుంది.
అంతేకాదు, ఈ సూరా గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు ఇంతకుముందే మీరు విన్నారు, తౌరాత్‌లో గానీ, ఇంజీల్‌లో గానీ, జబూర్‌లో గానీ, స్వయం ఖురాన్‌లో గానీ ఇలాంటి గొప్ప సూరా వేరేదేదీ కూడా అవతరించబడలేదు.
చూస్తున్నారా? అల్లాహ్ యొక్క ప్రస్తావన ఎంత గొప్పగా ఖురాన్‌లో ఉంది? మనం ఆ ఉద్దేశంతో, ఆ భావంతో ఖురాన్ చదువుతున్నామా? అల్లాహ్‌ను తెలుసుకోవడానికి.
మరొక చిన్న ఉదాహరణ ఇచ్చి ఇక నేను సమాప్తం చేస్తాను. ఖురాన్‌లో ఏ సూరత్ కి ఆ ఒక్క చిన్న సూరా, ఖురాన్‌లోని మూడో వంతు భాగానికి సమానమైనది అన్నట్లుగా చెప్పడం జరిగింది?
إِنَّهَا تَعْدِلُ ثُلُثَ الْقُرْآنِ [ఇన్నహా త’దిలు సులుసల్ ఖుర్ఆన్] నిశ్చయంగా ఇది (సూరతుల్ ఇఖ్లాస్) ఖురాన్‌లో మూడో వంతుకు సమానం.
సహీ బుఖారీలోని హదీస్ ఇది. ఖురాన్‌ను మూడు భాగాలు చేస్తే ఒక్క భాగానికి సరి సమానమైనటువంటి అంత గొప్ప సూరా ఏది? ఖుల్ హువల్లాహు అహద్. సూరతుల్ ఇఖ్లాస్. నాలుగే నాలుగు ఆయతుల చిన్న సూరా. ఏముంది అందులో? అల్లాహ్ ఏకత్వం గురించి. అల్లాహ్ నిరపేక్షాపరుడు అన్న విషయం గురించి. ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరికీ సంతానం కాడు, మరియు ఆయనకు సరి సమానుడు, సాటి గలవాడు ఎవరూ లేరు అన్నటువంటి ప్రస్తావన.
అందుకొరకే, అల్లాహ్ గురించిన జ్ఞానం నేర్చుకోవడం, అల్లాహ్ శక్తి సామ్రాజ్యాల గురించి తెలిసి అతని యొక్క భయం మనలో, అతని పట్ల ప్రేమ మనలో, అతని పట్ల ఆశ మనలో పెరిగే విధంగా అల్లాహ్ గురించి ఖురాన్ ద్వారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ద్వారా తెలుసుకోవడం చాలా, చాలా అవసరం.
ఎప్పుడైతే అల్లాహ్‌ను మనం తెలుసుకోవలసిన రీతిలో తెలుసుకొని విశ్వాసం చాలా బలంగా, ప్రగాఢంగా, దృఢంగా చేసుకుంటామో, ఆ తర్వాత ఏ సత్కార్యాలు చేసినా వాటి పుణ్యాలు, వాటి యొక్క లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి, మరియు ఎల్లవేళల్లో మనం ప్రపంచంలోని ఏ పనిలో ఉన్నా గానీ, మన ఏ డ్యూటీలో ఉన్నా గానీ, మన ఏ జాబ్‌లో ఉన్నా గానీ, ఫ్రెండ్స్‌లతో ఆనంద ఉత్సవాల్లో ఉన్నా గానీ, భార్యా పిల్లలతో మనం ఎంతో సంతోషంగా గడుపుతున్నా గానీ, ఇంట్లో ఎవరైనా చనిపోయి బాధగా ఉన్నప్పుడు గానీ, ఏదైనా వ్యవసాయంలో పంట మునిగిపోయినా గానీ, మన వ్యాపారం ఏదైనా చాలా అది లాస్‌లో జరిగినా గానీ, అన్ని స్థితిల్లో, అన్ని వేళల్లో మనం అల్లాహ్‌ను మరిచిపోయి ఉండలేము. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకొని, అల్లాహ్, అరే ఉండనీరా భయ్, ఏంటి మాటిమాటికి నువ్వు ధర్మం, ధర్మం, అల్లాహ్, అల్లాహ్ అని అనుకుంటూ ఉంటావు. ఈ విధంగా అనేవాళ్ళు ఉన్నారు కొందరు, అస్తగ్ఫిరుల్లాహ్.
కానీ ఎవరైతే ఆనంద, సంతోషాల్లో గానీ, లేదా బాధలో ఉన్నప్పుడు గానీ, సుఖంలో గానీ, దుఃఖంలో గానీ, పేదరికంలో గానీ, సిరి సంపదలో గానీ, అన్ని స్థితిల్లో అల్లాహ్‌ను ముందుగా ఉంచి, అల్లాహ్ యొక్క ప్రస్తావన, అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క జిక్ర్ ఎక్కువగా చేస్తూ ఉంటారో వారే సాఫల్యూలు, మరీ ఎవరు దీనికి భిన్నంగా ఉంటారో వారే చాలా నష్టం పోతారు.
చదవండి సూరతుల్ మునాఫిఖూన్, ఆయత్ నంబర్ తొమ్మిది.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَن ذِكْرِ اللَّهِ [యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుల్హికుమ్ అమ్వాలుకుమ్ వలా అవ్లాదుకుమ్ అన్ జిక్రిల్లాహ్] ఓ విశ్వాసులారా! మీ సిరిసంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు.
చూశారా? ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు. అల్లాహ్ ధ్యానం నుండి, అల్లాహ్ యొక్క జిక్ర్ నుండి.
నిన్ననే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మాట మీద మాట వచ్చేసి, ఇప్పుడే నీ కళ్ళ ముంగట నీకు చాలా ప్రియమైనవాడు, నీ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, నీ సంతానంలో ఎవరైనా కావచ్చు, చనిపోయారు, యాక్సిడెంట్ అయింది. అంటే నువ్వు ఇక్కడ హాయిగా తినుకుంటూ ఏదైనా మంచిగా ఉన్నావు, సంతోషంగా, యకాయకిగా నీకు వార్త వచ్చేసింది అతను చనిపోయాడు అని. నీవు ఏం చేస్తావు, ఏం చెబుతావు?
ఇద్దరు ముగ్గురిది సమాధానాలు వేరు వేరుగా ఉండినవి. కానీ వారిలో ఎవరికైతే ధర్మ జ్ఞానం కొంచెం ఎక్కువగా ఉండిందో వెంటనే చెప్పారు,
إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ [ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్] నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము మరియు నిశ్చయంగా మేము ఆయన వైపునకే మరలి పోవలసి ఉంది.
చదివి
الْحَمْدُ لِلَّهِ [అల్హమ్దులిల్లాహ్] అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
అని అంటాను. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, ధర్మ జ్ఞానం యొక్క బరకత్. అందుకొరకే అల్లాహ్ యొక్క జిక్ర్ కంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌ను తెలుసుకోవడం కంటే, అల్లాహ్ గురించి ఎక్కువ జ్ఞానం పొంది, ఆయన భయం, ఆయన పట్ల ప్రేమ, ఆయన పట్ల ఆశ, ఇవి మనలో ఎక్కువగా కుదిరి ప్రతి సమయంలో, సందర్భంలో, స్థితిలో అల్లాహ్‌కు ఇష్టమైనదే చేయాలి అన్నటువంటి తపన కలిగి ఉంటామో, అప్పుడు మనకు ఈ నష్టం ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, సిరిసంపదలు, సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి దూరం చేయకూడదు, చేసిందంటే మరి మీరు నష్టపోతారు.
అల్లాహ్ ఈ అస్మాయె హుస్నా, సిఫాతె ఉలియా, అల్లాహ్ యొక్క మంచి పేర్లు, ఉత్తమ గుణాల గురించి అయిన జ్ఞానం, ఖురాన్ హదీస్ ఆధారంగా, సలఫ్ మనహజ్ ప్రకారంగా తెలుసుకుంటూ మన విశ్వాసాన్ని పెంపొందించుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఉద్బోధిస్తుండగా తాను విన్నానని అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తెలియజేసారు: “అల్లాహ్ జ్ఞానాన్ని ప్రజల హృదయాల నుండి లాక్కోని పైకి లేపుకోడు. కాని ఉలమాల (పండితుల) మరణం ద్వారా జ్ఞానాన్ని లేపుకుంటాడు ఆ విధంగా ఒక్క జ్ఞాని కూడా మిగలకుండా చేస్తాడు. ఆ తర్వాత ప్రజలు ఆజ్ఞానులను తమ నాయకులుగా (గురువులుగా) చేసుకుంటారు. వారిని ఏదైయిన ప్రశ్న అడిగితే వారు తమ అజ్ఞానంతోనే తీర్పులు ఇస్తారు. ఫలితంగా స్వయంగా తాము మార్గభ్రష్ఠులు అవుతారు. ఇతరులను కూడా మార్గభ్రష్టత్వానికి గురిచేస్తారు.” (బుఖారీ, ముస్లిం)
పై హదీసు ద్వారా మనం చాలా విషయాలను అర్ధం చేసుకోవలసి ఉంది:
1.జ్ఞానం అనేది పుస్తకాలలో, సి.డి. లలో, ఇంటర్నెట్ లో ఉందా? లేదా ఉలమాల హృదయాలలోన?
2.ఒకవేళ పుస్తకాలలో మరియు సి.డి.లలో అయితే అల్లాహ్ వాటిని లేపుకొనే అ జ్ఞానాన్ని అంతం చేసేవాడు, ఉలమాలకు మృత్యువు ప్రసాదించి కాదు
3.మనం ఎవరిని మార్గదర్శకులుగా చేసుకోవాలి? జ్ఞానమున్న పండితులనా? లేక మిడి మిడి జ్ఞానం కలవారినా?
సోదర సోదరీమణులారా! ఈనాడు మన చుట్టూ ఎంతో మంది ఇస్లాం జ్ఞానాన్ని బోధించే ఉలమాలు ఉన్నప్పటికిని మనం మన గురువులు, మార్గదర్శకులు నాయకులుగా అజ్ఞానులను చేస్తుకుంటున్నాము. కేవలం పై పై తళుకులు చూసి జ్ఞానికి అజ్ఞానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేక పోతున్నాము. తద్వారా మన పరలోక జీవితం సంకటంలో పడిపోతుంది. మనం ఉలమాలకు (పండితులకు) ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇవ్వడం లేదు. దానికి బదులుగా మన తలలపై అజ్ఞానులు స్వారీ చేస్తున్నారు. ధార్మిక పండితులు ధర్మ జ్ఞానం కోసం ఇల్లు, వాకిలి వదిలిపెట్టి ఎన్నో త్యాగాలు చేసి పరదేశాలకు సైతం ప్రయాణాలు చేసి ధర్మ జ్ఞానార్జన చేశారు. అటువంటి వారిని వదలి ఇతరత్రులను మన మార్గదర్శకులుగా చేసుకోవడం ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి. ప్రపంచంలో ఎప్పుడెప్పుడైతే అజ్ఞానులు నాయకులుగా, మార్గదర్శకులుగా అయ్యారో ఆ సమాజంలో మన ఊహకందని కొత్త కొత్త సమస్యలు, ఉపద్రవాలు బయలుదేరుతాయి. ఇంకా అలాగే ఆ జాతి సమూలంగా నాశనం అవుతుంది.
ఈనాడు చాలామంది నెట్లో పుస్తకాలు డౌన్లోడ్ చేసి చదివేసి, యూ ట్యూబ్ లో ప్రసంగాలు విని తమవద్ద గొప్ప జ్ఞానం ఉందని తామే గొప్ప విద్వాంసులుగా భావిస్తున్నారు. సాధారణంగా పుస్తకాలు, టి.వి., సి.డి., నెట్ల ద్వారా విద్యాభ్యాసం చేసినవారు గర్వానికి గురి అవుతూ ఉంటారు. అదే గురువు వద్ద విద్యాభ్యాసం చేసిన వ్యక్తికి అణుకువ, సామాజిక మర్యాదలు వంటి సద్గుణాలు అలవడుతాయి
బహుదూరపు బాటసారులమైన మనకు ఈ ఉలమాలు ఆకాశంలో మిరిమిట్లు గొల్పుతూ దారి తప్పిన ప్రయాణికులకు మార్గం చూపే నక్షత్రాల లాంటి వారు. ఎడారిలో దప్పికగొన్న బాటసారులకు దాహాన్ని తీర్చు ఒయాసిస్ లాంటి వారు. వీరి చెలిమి, సాంగత్యము ఎన్నడూ నష్టం చేకూర్చదు.
మనము ఆరోగ్యము క్షీణిస్తే వైద్య సలహాల కొరకు వైద్యవృత్తిలో ఆరితేరిన వైద్యుణ్ణి సంప్రదిస్తాము. అలాగే ఇల్లు కట్టాలన్నా మంచి ఇంజనీరును వెతుకుతాము ఇలా ఐహిక జీవితానికి సంబంధించిన ప్రతి పనికి ప్రావీణ్యులను సంప్రదిస్తాము.
కానీ ఒక్క ధర్మ విషయములో సలహాలు మరియు సూచనలకు ఏ దారినపోయే దానయ్యనో అడుగుతాము. తెలిసీతెలియక అతనిచ్చే సలహాలను పాటించి మన ఇహ పరాలను నాశనం చేసుకుంటున్నాము. తెలియకపోతే కనీసం ధర్మపండితుల (ఉలమాలు) ను అడిగి తెలుసుకోవాలి అన్న ఇంకిత జ్ఞానం లేక స్వయంగా మార్గభ్రష్టులవుతూ ఇతరులను మార్గభ్రష్టత్వానికి గురిచేస్తున్నారు. అఖీదా, ఆరాధనలు, జకాత్, వ్యాపారలావాదేవీలు ఆస్తిపాస్తుల పంపకాలు ఇంకా ప్రతి విషయంలోను స్వయంగా మిడి మిడి జ్ఞానంతో వారికి వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఉలమాలను ప్రక్కన పెట్టి పై పై తళుకులు బెళుకులను చూసి అల్ప జ్ఞానులను ప్రశ్నించి మోసపోతున్నారు.
ఉర్దూలో ఒక కవి ఇలా అంటున్నాడు. దాని భావం
తెలిసీ తెలియని వైద్యునితో ఆయుష్షుకు ముప్పు తెలిసీ తెలియని పండితునితో విశ్వాసానికే ముప్పు
అల్లాహ్ మనందరికి ప్రావీణ్యులైన పండితులను మన మార్గదర్శకులుగా చేసుకునే భాగ్యాన్ని కల్పించుగాక. అమీన్
ఈ పుస్తకం“ఇల్మేదీన్ కిన్ సే సీఖే”ను తెలుగు భాషలోనికి అనువాదం చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు ముందుగా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పుస్తక రచయిత ఫజీలతు షేఖ్ సయ్యద్ హుసైన్ ఉమరీ మదనీ (హఫిజహుల్లాహ్) “ధర్మ జ్ఞానము మనం ఎవరి వద్ద నేర్చుకోవాలి?” అన్న విషయంపై ఖుర్ఆన్ సహీహ్ హదీసులు మరియు సలఫెసాలెహీనుల సూక్తుల ద్వారా ఎంతో చక్కగా వివరించారు. అల్లాహ్ వారికి ఇహ పరలోకాలలో తగిన ప్రతిఫలం ప్రసాదించుగాక. పుస్తకం చదివిన వెంటనే నేను షేఖ్ గారికి ఫోన్ చేసి ఈ పుస్తకాన్ని నేను తెలుగులో అనువదిస్తాను అని అన్నాను. అందుకు షేఖ్ మదనీ హఫిజహుల్లాహ్ ఎంతో సంతోషంతో నాకు ఆ భాధ్యతను అప్పగించారు. తప్పులు లేకుండా అనువాదం చేసే భాగ్యాన్ని ప్రసాదించమని అల్లాహ్ నుప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను. ఈ పుస్తకం పున:పరిశీలన విషయంలో నాకు తోడ్పడిన డా॥ సయీద్ అహ్మద్ మదని (హఫిజహుల్లాహ్) గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، وعلى آله وصحبه أجمعين، أما بعد :
ధర్మజ్ఞానం ఎవరి వద్ద అభ్యసించాలి?
ఈ రోజులలో సహృదయంతో ఇస్లాం ధర్మాన్ని అవలంబిస్తూ ధర్మజ్ఞానాన్ని కూడా అభ్యసించాలి అని దృఢమైన సంకల్పం గల వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అందులోను చాలామంది జ్ఞానార్జన కొరకు మాధ్యమమును ఎన్నుకొనుటలో తప్పులు చేస్తుంటారు. కొందరు ఫిలాసఫర్ ల వద్ద విద్యను అభ్యసిస్తుంటారు. ఒక పద్ధతి ప్రకారం సరైన జ్ఞానాన్ని వీరు అభ్యసించి ఉండరు. పోగా వీరి ఆలోచనా విధానాలు మరియు బోధనలు ఇస్లాంకు విరుద్ధంగా ఉంటాయి. మరికొందరైతే తమ భాషా ప్రావీణ్యత, మంచి పదజాలంతో కథలు వళ్లించి ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసే ప్రసంగీకుల వద్ద విద్యాభ్యాసన చేస్తూ ఉంటారు. వీరి వద్ద తమ పదజాలంతో ఎదుటి వారిని సంతృష్ట పరచుట తప్ప ఏమీ ఉండదు. ఈ ఆధునిక యుగంలో కొందరైతే తెలియకుండానే కొత్త కొత్త వ్యక్తుల, మార్గభ్రష్టత్వానికి గురిచేసే వెబ్ సైట్ల ద్వారా విద్యను అభ్యసిస్తారు. విద్యాభ్యాసన యదార్థానికి ఇది ధర్మభ్యాసన కనుక ఇందులో ఎంతో జాగ్రత్త వహించాలి.
ముహద్దిస్, ముఫస్సిర్, ఫఖీ మరియు ముజ్తహిద్, కలల గూడార్థములను వివరించగల గొప్ప తాబయీ ముహమ్మద్ బిన్ సీరీన్ బసరీ (రహమతుల్లాహి అలైహి) ఈ విధంగా అంటున్నారు.
(1) إِنَّ هَذَا الْعِلْمَ دِينَ فَانْظُرُوا عَمَّنْ تَأْخُذُونَ دِينَكُمْ “ఇన్న హాజల్ ఇల్మ దీనున్, ఫన్జురూ అమ్మన్ తాఖుజూన దీనకుమ్” “ నిశ్చయముగా ఈ జ్ఞానము అనేది నీ దీన్ (ధర్మం), నీవు నీ ధర్మాన్ని (ఇస్లాం) ఎవరి వద్ద అభ్యసిస్తున్నావో పరీక్షించుకో?”
కాబట్టి కేవలం జ్ఞానవంతుడిని అనే తోలు కప్పుకుని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లేక సోషల్ మీడియా మరియు సోషల్ నెట్వర్క్ ల ద్వారా, బ్రదర్, సిస్టర్ లుగా పరిచయం చేసినంత మాత్రాన, ఒక వ్యాసం లేక ఒక పుస్తకం వ్రాసినంతనో లేక అఖీదా మరియు మన్ హజ్ ను ప్రక్కన పెట్టి చరిత్ర పై గొప్ప ప్రసంగం చేసినంతనో లేక ఒక వ్యాసం వ్రాసినంత మాత్రానో లేక ఏదైనా అంశంపై ఒక పండితుని ప్రసంగం వినిన లేక ఏదో ఒక పుస్తకం చదివినంతనే లేక రకా రకా ఆంగ్ల భాషలో మాట్లాడినంతనో ఇంకా అవసరం లేకుండానే తన ప్రశంశ కొరకు ఫోటోలు ప్రింట్ చేపించుకున్నంత మాత్రాన అతను ఇస్లాం ధర్మపు ప్రతి అంశాన్ని వివరించగల పండితుడు లేక ప్రతి విషయంలో మనం అతని ద్వారా జ్ఞానాన్ని ఆర్జించగల యోగ్యత గల పండితుడు కాజాలడు.
ఈమామ్ ఇబ్నేరుష్ద్ ఈవిధంగా అంటున్నారు:
(2) كَانَ الْعِلْمُ فِي الصُّدُورِ فَصَارَ الْآنَ فِي الثِّيَابِ కాన అల్-ఇల్ము ఫీ అస్-సుదూరి, ఫసార అల్-ఆన ఫీ అత్-థియాబి “జ్ఞానం హృదయాలలో ఉండేది. ప్రస్తుతానికి దుస్తులలో ఉంది.” (ఒకప్పుడు జ్ఞానం హృదయాలలో పదిలంగా ఉండేది. కాని ప్రస్తుతం ప్రజలు స్క్రీన్ మీద కనిపించే మేకప్, దుస్తులకే ప్రాముఖ్యత ఇస్తున్నారు.)
ప్రస్తుతం ఇస్లామిక్ మదరసాల నుండి ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకొస్తున్న కొంతమంది ఇంకా క్రొత్తగా పుట్టుకొస్తున్న దాయీలు, అఖీదా మరియు విశ్వాసాల గురించి అజ్ఞానంతో కూడిన ఎటువంటి ఆలోచనలు, కోణాలు ప్రజల ముందు ఉంచుతున్నారంటే ధర్మం సంపూర్ణం గావింపక ముందు వాటి గురించి ప్రవక్త వారు ప్రవచించ లేదు, సహబా (రజియల్లాహు అన్హుమ్) వారు మాట్లాడే ధైర్యం చెయ్యలేదు.
“ప్రతి విషయంలోను మీలో ఎవరో ఒకరు తప్పకుండా ఫత్వా ఇచ్చేస్తారు. ఒకవేళ ఇదే విషయం ఉమర్ (రజియల్లాహు అన్హు) వారి ముందు ప్రవేశపెడితే వారు దానిని పరిష్కరించుటకు బదర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాలను సమావేశపరచేవారు.”
ముఫ్తియె హిజాజ్, ఈమామె దారుల్ హిజ్రా ఈమామ్ మాలిక్ (రహమతుల్లాహి అలైహి)వారు అంటున్నారు “నేను ఒక విషయంలో సుమారు పది సంవత్సరాలకు పైగా యోచిస్తున్నాను. కాని ఆ విషయమై నాకు ఇప్పటికిని ఒక సదాభిప్రాయం ఏర్పడలేదు“.(8) “ఒక వేళ తప్పని సరిగా సమాధానం ఇవ్వవలసి వచ్చినపుడు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఖచ్చితంగా చెప్పలేను” అనేవారు” (9)
తఫ్సీర్, హదీస్, ఫిఖా, ఉసూలే ఫిఖా, లుగా (భాషాతత్వము) అదబ్ (సాహిత్యము) లకు ఈమాము అయిన ఈమాము షాఫయీ (రహమతుల్లాహి అలైహి) వారు ఇలా అంటున్నారు. “ ధర్మజ్ఞానాన్ని గూర్చి ఎటువంటి వారు చర్చించారంటే, కొన్ని విషయాలను వారు చర్చించకుండా మౌనం పాటించి ఉంటే వారి కొరకు అది బహు శ్రేయస్కరంగా ఉండేది. ఇన్నాల్లా వారు (తప్పుల నుండి) సురక్షితంగా ఉండేవారు (10)
“ఈమామ్ ఇబ్నే హజం (రహమతుల్లాహి అలైహి) వారు ఏమంటున్నారంటే “ విద్యకు, విద్యావంతులకు అత్యంత నష్టం కలిగించే దుస్థితి ఏమిటంటే అనర్హులు* జ్ఞానానికి మరియు పండితులకు (ఉలమాలు) సంబంధించిన విషయాలలో అనవసరంగా తలదూర్చడం. ఎందుకంటే వారు అజ్ఞానాన్ని జ్ఞానంగా మరియు అరాచకాన్ని సంస్కరణగా భావిస్తారు. (11)
షైఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహమతుల్లాహి అలైహి) వారు “ఇస్లాం ధర్మం విషయంలో అజ్ఞానంతో మాట్లాడడం, ఆ విధంగా మాట్లాడే వారికి సహాయం చెయ్యడం ఇంకా ఇస్లాం ధర్మానికి సంబంధం లేని విషయాలను ఇస్లాంలో చేర్చడం” ఎవ్వరికిని ధర్మసమ్మతం (హలాల్) కాదు అని అన్నారు. (12)
ఇంకా ఎవడైనా అజ్ఞానంతో ఉలమాలను విభేదిస్తూ మాట్లాడితే అతడ్ని ఆపాలి అప్పటికిని అతను మితిమీరి ప్రవర్తిస్తే అజ్ఞానులకు బుద్ధి చెప్పే రీతిలోనే అతనికి బుద్ధి చెప్పాల్సివస్తుంది. పండితునిగా చెలామణి అవుతున్నప్పటికిని ధర్మానికి విరుద్ధంగా మాట్లాడినందుకుగాను అతని మాటను నమ్మడం జరుగదు. (13) ఒకడు కావాలని ఉద్దేశ్య పూర్వకంగా అబద్ధం చెప్పకపోయినా అజ్ఞానంతో ధర్మం విషయంలో మాట్లాడితే అతడు అబద్దీకుడే (14)
కొందరైతే పేరు ప్రఖ్యాతుల కోసం ఉలమాల అసాధారణ ఫత్వాలు మరియు అరుదైన సూక్తులను ప్రజల ముందు ఒక క్రొత్త రీసెర్చ్ లాగా ప్రవేశపెడుతారు. కాని ఈమామ్ ఔజాయీ (రహమతుల్లాహి అలైహి) ఈ విధంగా అంటున్నారు.
(15) مَنْ أَخَذَ بِنَوَادِرِ الْعُلَمَاءِ خَرَجَ مِنَ الْإِسْلَامِ “ ఎవడైతే ఉలమాల అరుదైన సూక్తులను ఎన్నుకొనునో అతను ఇస్లాం నుండి వైదొలగిపోయాడు” (16)
సలఫెస్సాలేహీన్ బలంగా ఖండించిన ఈ విషయాలను గురించి న్యాయపరమైన యదార్థ విచారణ చేస్తే అజ్ఞానులు లేక అల్ప జ్ఞానులు నిజానికి తమను తాము మోసం చేసుకుంటూ, పూర్తి ముస్లిం సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలిసిపోతుంది.
గమనిక: ఇస్లాంలో ధర్మజ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రతి ఒక్కరు అర్హులే, కాని ఇక్కడ అనర్హులు అంటే ధర్మజ్ఞానాన్ని ఆర్జించవలసిన రీతిలో ఆర్జించకుండా మిడి మిడి జ్ఞానంతో ఉలమాలు చెయ్యవలసిన పనులు చెయ్యడం (ఫత్వాలు వగైరాలు ఇవ్వడం) అంటే డాక్టరు కాకుండానే కంపౌండర్లు ఆపరేషన్ చేసినట్లు (ప్రతి ఒక్కరూ తమ జ్ఞాన పరిధిని తెలుసుకొని ప్రవర్తించాలి. (అనువాదకుడు)
ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో (17) “سَيَأْتِي عَلَى النَّاسِ سَنَوَاتٌ خَدَّاعَاتٌ … وَيَنْطِقُ فِيهَا الرُّوَيْبِضَةُ ” قِيلَ: وَمَا الرُّوَيْبِضَةُ؟ قَالَ: “الرَّجُلُ التَّافِهُ فِي أَمْرِ الْعَامَّةِ”
“ అతి త్వరలో ప్రజలపై ఎటువంటి సంవత్సరాలు వస్తాయంటే అందులో కపటం మరియు మోసం చాలా ఎక్కువగా ఉంటుంది… ఆ రోజులలో రువైబిజా (అజ్ఞానులు, అయోగ్యులు)(18, 19) మాట్లాడెదరు (ప్రవక్త వారితో) రువైబిజా ఏమిటి? అని ప్రశ్నించడం జరిగింది. అందుకు ప్రవక్త వారు” అల్పుడు, అజ్ఞాని అయిన వ్యక్తి ప్రజల విషయాలలో మాట్లాడతాడు. కొన్ని కథనాలలో అల్పుడు, అజ్ఞాని అని కాకుండా పరమ కపటి మరియు తెలివితక్కువ వాడు అన్న పదాలు ఉన్నాయి. కనుక ధర్మ జ్ఞానాన్ని ఎటువంటి పండితుడి వద్ద అభ్యసించాలంటే అతను ధర్మాన్ని అభ్యసించుటలో ఇతరులకు నేర్పే విషయంలో అల్లాహ్ కు భయపడేతత్వం కలిగిఉండాలి. (20) తెలియని విషయాలలో మౌనం వహించేవాడై ఉండాలి (21) ఇంకా అతని జ్ఞానం కేవలం పుస్తకం లేక ఇంటర్నెట్ ద్వారా ఆర్జించినది కాకుండా విశ్వసనీయమైన గురువు ద్వారా ఆర్జించినదై ఉండాలి.
గ్రంథం యొక్క వెలుగులో మరియు గురువుగారి పర్యవేక్షణలో జ్ఞానాన్ని ఆర్జించుటకు గల ప్రధానమైన కారణము ఏమిటంటే, గ్రంథాలన్నింటిలో కెల్లా వివరణాత్మకమైన గ్రంథము ఖుర్ఆన్ గ్రంథము(22) అయినప్పటికిని దానిని బోధించుటకు అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం వారిని పంపించెను (23) తద్వారా బోధన మరియు తబ్లీగ్ (ప్రచారము, విద్యావ్యాప్తి) చేసేటప్పుడు ఎలాంటి మార్గభ్రష్టత్వము, క్రమరాహిత్యము మరియు అసమానతలు చోటుచేసుకోరాదని, ఆవిధంగా చూసిన ఖుర్ఆన్ యొక్క ఉపమానాలను ప్రజలకన్నా మిన్నగా ధర్మజ్ఞానమున్న పండితులే బాగుగా ఎరుగుదురు. (24) ఇంకా విషయాన్ని తెలుసుకొనుటకు పదాల యొక్క మూలాల వరకు వెళ్తారు (25) అటువంటప్పుడు సత్యాన్ని ప్రేమించే వారుగా నిజమైన పండితుల వద్దనే జ్ఞానాన్ని ఆర్జించాలి. (26) లేకపోతే సత్ జ్ఞానము అంతరించిపోతుంది. దీనిని గురించే ఈమామ్ షాఫయీ (రహమతుల్లాహి అలైహి) ఇలా అంటున్నారు.
“ ఎవడైతే కేవలం పుస్తకపు పేజీలతో ధర్మజ్ఞానాన్ని ఆర్జించునో అతను ఆజ్ఞలను కాలరాసినట్లే” (27)
మిసర్ (ఈజిప్ట్) దేశస్థుడు 9వ హిజ్రీకి చెందిన ముహద్దిస్, ఫఖీ, తత్వవేత్త మరియు సాహిత్యకర్త అహ్మద్ అష్ – షుమాన్నీ (రహమతుల్లాహి అలైహి) వారు ఇలా అంటున్నారు.
“ ఎవరైతే నేరుగా గురువు ద్వారా జ్ఞానాన్ని ఆర్జించునో అతను తన జ్ఞానంలో కల్తీలు మరియు తప్పుల నుండి సురక్షితంగా ఉంటాడు. మరి ఎవడైతే గురువు లేకుండా కేవలం పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించునో అటువంటి జ్ఞానం ఉలమాల వద్ద లేని దానితో సమానం.
గమనించవలసిన విషయం ఏమిటంటే జ్ఞానాన్ని నిజమైన జ్ఞానవంతులు అందులోను నిష్ఠార్థులు మరియు గొప్ప పండితుల వద్ద ఆర్జించే విషయమై విశ్వసనీయ అఖీదా పుస్తకాలలో పేర్కొనడం జరిగింది. మరి దాని వైపే ఖులఫాయె రాషిదీన్ లలో అమీరుల్ ముమినీన్ ఉమర్ రజియల్లాహు అన్ హు వారు ప్రోత్సహించారు.
“ తస్మాత్ ! ప్రజలు తమ పెద్దల వద్ద జ్ఞానం ఆర్జించినంతకాలం ఇంకా జ్ఞానార్జన కొరకు చిన్నవారు పెద్ద వారి ముందు నించున్నంతసేపు సురక్షితంగా ఉంటారు. అలాకాక ఎప్పుడైతే చిన్నవాళ్ళు పెద్దవారికి బదులుగా నిలబడతారో నిశ్చయంగా వాళ్ళు నాశనం అవుతారు”
గమనించవలసిన విషయం ఏమిటంటే, పెద్ద పెద్ద ఉలమాల వద్ద జ్ఞానాన్ని ఆర్జించమని ప్రోత్సహిస్తూ ప్రధాన అఖీదా పుస్తకాలలో ప్రస్తావించుటకు గల కారణం ఏమిటంటే ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతి అంటూ లేకుండా మిడి మిడి జ్ఞానమున్న వారివద్ద, అవిశ్వసనీయ మరియు అవాస్తవ వ్యక్తుల వద్ద జ్ఞానాన్ని ఆర్జిస్తామో అక్కడ అఖీదా మరియు మన్ హాజ్ లలో లోపం ఏర్పడుతుందనే భీతి అంటిపెట్టుకొని ఉంటుంది. షైఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహమతుల్లాహి అలైహి) ఇలా అంటున్నారు : “ కొందరు ఏమన్నారంటే, ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేసేవాళ్ళు మిడి మిడి జ్ఞానమున్న ప్రసంగీకుడు, తెలిసీ తెలియని ఫఖీ, అర్థవైద్యుడు ఇంకా సగం తెలిసిన వ్యాకరణవేత్త, (అది ఎలాగంటే) మిడిమిడి జ్ఞానమున్న ప్రసంగీకుడు ధర్మాన్ని నాశనం చేస్తే, తెలిసీ తెలియని ఫఖీ పట్టణాలలో ఉపద్రవాలు సృష్టిస్తాడు, అర్థవైద్యుడు ప్రాణానికి ముప్పుగా మారుతాడు అలాగే సగం తెలిసిన వ్యాకరణవేత్త భాషను సర్వనాశనం చేస్తాడు (30)
జ్ఞానాన్ని ఆర్జించేందుకు కేవలం పుస్తకాల పైనే ఆధారపడకుండా ప్రావీణ్యుడైన గురువును ఎంపిక చేసుకొని అతని యెడల అణుకువతో మెలగవలెను. అదేవిధంగా అతని విశిష్టత, శ్రద్ధ మరియు ప్రావీణ్యతను దృష్టిలో ఉంచుకొని గురువును ఎన్నుకోవాలి. ఇదే విషయాన్ని ఈమామ్ షౌకాని (రహమతుల్లాహి అలైహి) వారు అంటున్నారు : “ నిపుణత గల వ్యక్తి వద్ద సాధన చెయ్యనంత వరకూ మానవుడు ఆ వృత్తికి న్యాయం చేయలేడు. ఉదాహరణకు హదీసు జ్ఞానార్జకుడైన ఒక వ్యక్తి ముహద్దసీనుల (హదీసు శాస్త్రంలో ప్రావీణ్యులు) వద్ద హదీసు జ్ఞానాన్నైతే నేర్చుకున్నాడు కాని హదీసు పదాలను అర్థం చేసుకునేందుకు వారి వద్దనే భాషా పరిజ్ఞానాన్ని అభ్యసించదలిస్తే భాషాభ్యాసన విషయంలో అతను తప్పుచేస్తున్నట్లే.. ఒకవేళ అతను అనర్హుల వద్ద జ్ఞానార్జన చేసి అనర్హుడై ఉండి ఉలమాల సూక్తులకు విలువనిచ్చిన గ్రుడ్డి పశువు మాదిరిగా మార్గభ్రష్టుడు అవుతాడు. జ్ఞానాన్ని భ్రష్టుపట్టిస్తాడు. ఇంకా అతిశయోక్తి కలిగించే మాటలు, అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతాడు (31)
ఆలా కాక ఒక విషయంలో నిలకడగా ముందుకు వెళ్తూ ఫత్వాలు గుప్పించకుండా ఒక పద్ధతి ప్రకారం ఉలమాల పర్యవేక్షణలో, జ్ఞానం వెలుగులో నిజాయితీగా దావత్, ఇస్లాహ్ (సంస్కరణ) చేస్తూ స్వయంగా ఆచరిస్తున్నట్లైతే ఎటువంటి అభ్యంతరం లేదు ఇంకా అది ప్రశంసింపదగిన విషయము (32)
ఉలేమాలను గౌరవించుట
“ప్రతి ముస్లిం యొక్క శ్రేష్ఠత కాబతుల్లా:ను మించినది“.(33) అతని ధన, ప్రాణ మరియు గౌరవ మర్యాదల సంరక్షణ విధిగానున్నది. అందులోను ముఖ్యముగా ఉలేమాలను గౌరవించడం అనేది తూచ తప్పక పాటించవలసిన విషయం. ఏ విద్యార్థియైన లేక జ్ఞానమున్న పండితుడైనా ఒకవేళ అతను ఉలమాలను గౌరవించకపోతే అతని ప్రస్తావన పండితులలో కాదుకదా సామాన్య ముస్లిం ప్రజానీకంలో కూడా ఉండదు. ఎందుకంటే రసూలుల్లు సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అంటున్నారు.
“మా పెద్దలను గౌరవించని, మా చిన్నారులను కరుణించని మరియు మా ఆలిమ్ యొక్క హక్కును ఎరుగని వ్యక్తికి నా ఉమ్మత్ (అనుచర సమాజం) తో ఎటువంటి సంబంధం లేదు” (35)
ఆలిమ్ యొక్క హక్కును (తెలుసుకోవడం, నెరవేర్చడం) అంటే (అతని వ్యక్తిత్వపు హక్కుకాదు) అతని జ్ఞానపు హక్కును తెలుసుకోవడం. కాబట్టి మానవుడు, అల్లాహ్ తఆలా ఆలిమ్ కు ప్రసాదించిన ఉన్నత స్థానాన్ని గుర్తించాలి (ఇంకా) ఆ ఉన్నత స్థానం అనేది జ్ఞానం కారణంగా ప్రసాదించడం జరిగింది. (36)
ఎందుకంటే ఉలమాలను గౌరవించుట ఇంకా వారి హక్కులను పర్యవేక్షించుటలో మానవునికి మార్గదర్శకత్వము లభిస్తుంది. లేకపోతే అతను అవమానానికి, నష్టానికి గురికావలసి వస్తుంది. ఇంకా అతను పాపాత్ముడు అవుతాడు (37)
ఉలమాలు, యదార్థానికి వారు ప్రవక్తల వారసులు. (38) మరి ఏవిధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో బిగ్గరగా మాట్లాడడం నిషిద్ధమే. (39) అదేవిధంగా ఉలమాలతో కూడా బిగ్గరగా మాట్లాడరాదు. ఎందుకంటే ఏవిధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హేళన చేసే వారి కొరకు అల్లాహ్ తఆలా చాలునో (40) ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పరిహసించిన ఉత్ బా, షైబా, వలీద్, ఉమయ్య ఇంకా ఉక్ బాబిన్ అబీముయిత ను బద్ర్ యుద్ధంలో నాశనం చేసెను. (41) ఎవరైతే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని పరిహసించిన అబ్దుల్లా బిన్ ఖమిఅ లాంటి వాణ్ణి ఒక అడవి గొర్రెతో ముక్కలు ముక్కలుగా చేయించాడో (42) ఎవరైతే ఉత్ బా బిన్ అబిలహబ్ లాంటి ప్రవక్త పరిహాసకుడ్ని పులితో చంపించెనో (43) అదే అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వారసులు అయిన ఉలమాలను పరిహసించే వారి కొరకునూ చాలును.
బుఖారా రాజ్యాధికారి అయిన ఖాలిద్ బిన్ అహ్మద్ అజ్-జుబలీ అనే వ్యక్తి ఈమామ్ బుఖారీ రహమతుల్లాహి అలైహి వారి విషయంలో మితిమీరి ప్రవర్తించి వారిని నానా విధాలుగా బాధించినప్పుడు ఈమామ్ బుఖారీ రహమతుల్లాహి అలైహి వారు అతనిని గూర్చి బద్-దుఆ చేసెను. దాని పర్యవసానంగా అల్లాహ్ తఆలా అతని రాజ్యాధికారాన్ని లాగేశాడు, అతనిని నీచ స్థితికి దిగజార్చెను, తుదిశ్వాస విడిచేవరకూ కూడా అతను జైలు గోడల మధ్య ఖైదీగా మగ్గుతూనే ఉన్నాడు. (44)
حوالہ جات (References)
صحيح مسلم المقدمة باب في أن الإسناد من الدين …
سورة نمل / ٦٤
خلاصة الأثر في أعيان القرن الحادي عشر لمحمد أمين المحبي، حرف الهمزة والألف /ج 1/ ص 275
سورة يونس / ٥٩
سورة ال عمران / ٩٤
سورة نساء / ٥٠
تاريخ دمشق لابن عساكر، ذكر من اسمه عثمان بن عاصم … بعض كبار ہیں اور یمین کے بارے میں حسین ہے جو غلط ہے اور صحیح ابو الحصين ہے۔
شرح اصول اعتقاد اهل السنة و الجماعة للالكائي، باب سياق ذكر من رسم … جماع ابواب ذكر ما روي عن النبي …
جامع بيان العلم و فضله لابن عبد البر، باب كراهية القول في دين الله بغير علم
الرسالة للامام الشافعي، باب تجنب اهل الكلام
الأخلاق و السير في مداواة النفوس لابن حزم، ذم الجهل …
مجموع الفتاوى لابن تيمية، كتاب الصلاة، باب شروط الصلاة / ج 22 / ص 230
الرد على البكري لابن تيمية، علم السلوك، من تكلم في الدين … / ج 1 / ص 444
السنن الكبرى للبيهقي، كتاب الشهادات، باب ما يجوز شهادة اهل الأهواء …
اوزاعي كے روایت ہے اس کے لیے دیکھئے: تذکرة الحفاظ
سنن ابن ماجه، كتاب الفتن، باب العزلة، على بن ابی بکر کی الزوائد میں اسنادہ صحیح …
وريک روایت میں ہے کہ اس کے شر سے بچ کر رہو۔ دیکھئے: شعب الإيمان للبيهقي، باب نشر العلم، فصل قال وينبغي …
إكمال المعلم بفوائد صحيح مسلم للقاضي عياض، كتاب الفتن، باب ذهاب الإيمان آخر الزمان …
كفاية الحاجة في شرح سنن ابن ماجه للسندي، على سنن ابن ماجه…
سورة فاطر/٢٨
سورة بني إسرائيل/ ٣٦
سورة يوسف/١
سورة البقرة/١٢٩، سورة آل عمران/ ١٦٤، وسورة الجمعة/ ٢
سورة عنكبوت/ ٤٣
سورة النساء/ ٨٣
سورة النحل/ ٤٣، سورة الأنبياء/ ٧
تذكرة السامع و المتكلم في أدب العالم و المتعلم لابن جماعة، الباب الثاني في أدب المتعلم…
الضوء اللامع لأهل القرن التاسع للسخاوي، ثلث ذكر من اسمه محمد… حرف الميم، / ج 9 / ص 118
شرح أصول اعتقاد أهل السنة و الجماعة للالكائي، باب سياق ذكر من رسم … سياق ما روي عن النبي … في الحث … اور اس کے آخری قول الصغير الكبير للطبراني، باب العين، عطاء بن مسعود … قیل … میں ابن مسعودؓ سے بھی مروی ہے۔
مجموع الفتاوى لابن تيمية، علم السلوك، فصل في الأمراض والشفاء … /ج 10 / ص 118
أدب الطلب و منتهى الأرب للشوكاني، ص 118
صحيح مسلم، كتاب الإيمان، باب الدليل على دخول …، ” انزل حيث ينزلك” …
جامع الترمذي، أبواب البر والصلة، باب ما جاء في شفقة المسلم … اور فصل من أهان قریشا، ابو دانی صامت سے بھی…
المسند للشاشي، مسند عبادة بن الصامت، / ج 3 / ص 273، ليكن اس میں لیس منا ہے اور مسند احمد میں اس کی جگہ لیس من امتی ہے اور طبرانی کبیر (حدیث: ۷۲۳۵) میں بھی ہے۔
البحر الزخار بمسند البزار، / ج 7 / ص 179، حدیث: 2740، مسند احمد: 26523
فيض القدير شرح الجامع الصغير للمناوي، حرف اللام / ج 5 / ص 386 / ح 7659
السير، سرش الجامع الصغير للمناوي، حرف اللام / ج 3 / ص 331
سنن أبي داود، أول كتاب العلم، باب الحث على طلب العلم… بروایت ابوالدرداء جامع ترمذی …
سورة الحجرات / 2
سورة الحجر / 95
صحيح البخاري، كتاب الوضوء، باب إذا ألقي على ظهر المصلي … بروایت ابن مسعود
مسند الشاميين للطبراني، ما انتهى إلينا من مسند ثور بن يزيد، عن مكحول…
موسوعة الدفاع عن رسول الله، لعلى بن نايف الشحود، المجلد الباب التاسع المستهزئون وردود أفعالهم، عاقبة عتبة بن أبي لهب والأسود …
البداية والنهاية لابن كثير، ذكر سنة ست وخمسين ومائتين، من توفي فيها من الأعيان/ ج 11/ ص 535
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
జిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ ఘనత & రోజు వారి జీవితంలో చదివే ప్రత్యేక దుఆలు మరియు వాటి ఘనతలు https://youtu.be/Oldiv3H1dE0 [60+ నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం) మరియు ధిక్ర్ (అల్లాను స్మరించడం) యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ఇస్తిగ్ఫార్ అనేది పాపాల నుండి హృదయాన్ని శుభ్రపరచడమే కాకుండా, వర్షాలు, సంపద, సంతానం వంటి ప్రాపంచిక మరియు పారలౌకిక శుభాలను తెస్తుందని నొక్కి చెప్పబడింది. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ వంటి ప్రత్యేక దువాల ఘనత కూడా చర్చించబడింది. అదేవిధంగా, ధిక్ర్ అనేది ఒక ముస్లిం జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆరాధనగా మారుస్తుందని, నిలబడి, కూర్చుని, పడుకుని – అన్ని స్థితులలో అల్లాహ్ స్మరణలో ఉండటం వల్ల అపారమైన పుణ్యం మరియు అల్లాహ్ శిక్ష నుండి రక్షణ లభిస్తుందని స్పష్టం చేయబడింది. లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు సుబ్హానల్లాహి వబిహమ్దిహి వంటి ధిక్ర్ ల యొక్క గొప్పతనం మరియు ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత చేసే తస్బీహ్‌ల వల్ల కలిగే లాభాలు కూడా వివరించబడ్డాయి. అంతిమంగా, ప్రతి ముస్లిం తన జీవితాన్ని ఇస్తిగ్ఫార్ మరియు ధిక్ర్ లతో అలంకరించుకోవాలని ప్రబోధించబడింది.
ప్రియ వీక్షకులారా! ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం రెండు అంశాలపై మాట్లాడుకుందాము. అయితే ఈ రెండు అంశాలకు సంబంధించిన సందేశం మీకు ముందే చేరి ఉన్నది గ్రూపులలో. ఒకటి ధిక్ర్ గురించి మరొకటి ఇస్తిగ్ఫార్ గురించి. అయితే ధిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్ లో మన రోజువారీ జీవితంలో మనం చదివే దువాలలో ఏ గొప్ప విషయాలు ఉన్నాయి, వాటి గురించి ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఇన్షా అల్లాహ్ నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను.
అయితే ఇందులో ప్రతి ఒక్క అంశం, ధిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్, సపరేట్గా మనకు స్పష్టంగా అర్థం కావడానికి నేను రెండు టాపిక్కులుగా, రెండు అంశాలుగా వేరువేరు చెప్తాను. సుమారు ఒక 25 నుండి 30 నిమిషాలు ముందు ఇస్తిగ్ఫార్ గురించి మాట్లాడుకుందాము. ఆ తర్వాత ధిక్ర్ గురించి.
అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం)
أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా, యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా, వయుమ్‌దిద్‌కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా. నేను ఇలా అన్నాను, ‘క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్యయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని ఒసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.’
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! సూరత్ నూహ్ 29వ పారాలో ఒక ముఖ్యమైన ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి దావత్, వారు తమ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశంలో ఇస్తిగ్ఫార్ గురించి ఉన్నటువంటి కొన్ని ఆయతులు, అందులోని కొన్ని గొప్ప భావం గలటువంటి, ఘనత గలటువంటి విషయాలు తెలియజేయడానికి నేను మీ ముందు తిలావత్ చేశాను.
అయితే ఇస్తిగ్ఫార్ అంటే ఏంటి? ఇస్తిగ్ఫార్ అంటే మనం మన పాపాల మన్నింపుకై అల్లాహ్ తో అర్ధించడం. అస్తగ్ఫిరుల్లాహ్ అని మనం అంటాము సర్వసామాన్యంగా. నమాజ్ నుండి సలాం తిప్పిన తర్వాత అంటే ఏంటి? ఓ అల్లాహ్, నేను నా పాపాల నుండి నీ క్షమాభిక్షను, మన్నింపును కోరుతున్నాను.
సోదర మహాశయులారా, నేను ఈ ఇస్తిగ్ఫార్ గురించి మరికొన్ని విషయాలు చెప్పేకి ముందు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనలో ఎంతో మంది ఒకరి చేతి కింద పని చేస్తారు. అలాంటప్పుడు సర్వసామాన్యంగా ఏదైనా మన పనిలో మిస్టేక్ జరిగినప్పుడు మనం మన పై వారితో సారీ అని అంటూ ఉంటాము. కదా? కొన్ని సందర్భాల్లో ఒకే రోజులో ఎన్నోసార్లు ఇలాంటి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మనం అక్కడ ఆ సమయంలో ఆ పెద్దవారి ముందు సారీ అని, క్షమించండి అని ఈ భావం గల ఇంకా వేరే ఏ పదాలైనా గానీ ఉపయోగిస్తాము.
ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి పని చేస్తున్నాడు. తనకు పైగా ఉన్నటువంటి అధికారికి ఆ పని గురించి ఉత్తమ రీతిలో చేయాలని, అందులో ఏదైనా లోపం జరిగితే క్షమాపణ కోరాలని మన యొక్క స్వభావంలో ఈ విషయం ఉన్నది. అయితే మనమందరము కూడా మన సృష్టికర్త నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ యొక్క దాసులం. అల్లాహు తాలా ఆరాధన కొరకే మనం పుట్టించబడ్డాము. ఇక తప్పు జరగకుండా నూటికి నూరు శాతం, హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం జీవితం గడపలేము. పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే మనం అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఎల్లవేళల్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యందు మన యొక్క లోపం, మన యొక్క కొరత, మనతో జరిగేటువంటి తప్పులు, అపరాధాలు, పాపాలు అన్నిటి గురించి ఓ అల్లాహ్, నీవు నన్ను క్షమించు, మన్నించు అని మనం ఇలా అనుకుంటూ ఉంటే ఇది మన యొక్క ఆత్మశుద్ధి, ఆ పాపం నుండి ఇక ముందుకు దూరం ఉండడానికి, జరిగిన పాపం దాని యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి, అల్లాహ్ యొక్క క్షమాభిక్ష, మన్నింపు పొంది అతని కరుణ ఛాయల్లో రావడానికి, అతనికి ఇంకా దగ్గర అవ్వడానికి ఇస్తిగ్ఫార్ ఎంతో ముఖ్యమైన విషయం.
అయితే రండి, ఇస్తిగ్ఫార్ గురించి రెండు, మూడు గంటలు చెప్పుకుంటూ పోయినా గానీ ఈ అంశం పూర్తి కాదు. అన్ని ఆయతులు, అన్ని హదీసులు ఎన్నో కోణాల నుండి దీనిని మనం చెప్పుకోవచ్చు. కానీ మన రోజువారీ జీవితంలో మనకు చాలా ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు నేను తెలియజేస్తున్నాను, మీరు శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.
అన్నిటికంటే ముందు నేను ఇబ్ను మాజాలో వచ్చినటువంటి ఒక హదీస్ వినిపిస్తున్నాను. చాలా ముఖ్యమైన హదీస్ ఇది. దీని ద్వారా మనకు ఇస్తిగ్ఫార్ యొక్క లాభం అన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే రండి ఇదిగోండి, ఈ హదీస్ అరబీ పదాలు మీరు కూడా చూస్తూ దీని యొక్క అర్థాన్ని, దీని యొక్క భావాన్ని తెలుసుకోండి.
ఇప్పుడే మీకు చూపిస్తూ ఉన్నాను.
అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నిశ్చయంగా దాసుడు ఒక తప్పు, అపరాధం, పాపం చేసినప్పుడు అతని యొక్క హృదయంలో ఒక నల్ల మచ్చ ఏర్పడుతుంది. అతడు ఆ పాపాన్ని వదులుకుంటే, అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, పాపం చేయడం ద్వారా అల్లాహ్ కు ఏదైతే దూరమయ్యాడు కదా, తాబా (అల్లాహ్ వైపునకు మరలితే) అతని ఆ హృదయంలో నుండి ఆ మచ్చ అనేది దూరమైపోతుంది. పాపాలు పెరిగిపోతే ఆ నల్ల మచ్చలు పెరుగుతూ పోతాయి, చివరికి పూర్తి హృదయంపై ఆ మచ్చలు మచ్చలు మచ్చలు మచ్చలు ఎక్కువైపోయి హృదయమే నల్లగా అయిపోతుంది. ఇదే అల్లాహు అజ్జవజల్ల తన కితాబులో చెప్పాడు.” ఇదే,
كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్సిబూన్. అది కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది.
ఇక్కడ అల్లాహు తాలా తుప్పు పట్టింది అని ఏదైతే అంటున్నాడో, ఈ తుప్పు అనేది హృదయానికి దేనివల్ల పట్టింది? వారి యొక్క దురాగతాలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క చెడు పనులు ఏవైతే వారు చేస్తున్నారో.
ఇన్షా అల్లాహ్ మీకు విషయం అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ హదీస్ ద్వారా మనకు బోధపడిన విషయం ఏంటి? ఎప్పుడెప్పుడైతే దాసుడు ఓ తప్పుకు, ఓ పాపానికి ఒడిగడతాడో అప్పుడప్పుడు అతని యొక్క హృదయం నల్లగా అవుతుంది. పాపాలు పెరిగిపోతూ పోయాయి, కానీ వాటిని ఆ నల్ల మచ్చను దూరం చేయడానికి పాపాన్ని వదులుకోవడం, అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవడం, అల్లాహ్ వైపునకు మరలడం ఇలాంటిదేమీ చేయకుంటే అది ఇంకా నల్లగా అయిపోయి తర్వాత చాలా ప్రమాదానికి మనిషి గురి అయిపోతాడు.
అయితే రండి ఇక్కడ మనం ముందు తెలుసుకుందాము, పాపం అంటే ఏమిటి? సోదర మహాశయులారా, అల్లాహ్ ఏ ఆదేశం ఇచ్చాడో దానిని పాటించకపోవడం పాపం. అల్లాహ్ ఏ విషయాన్ని చేయకూడదు అని చెప్పాడో అంటే అల్లాహ్ యొక్క వారింపులు, వాటికి పాల్పడడం ఇది పాపంలో లెక్కించబడుతుంది. ఈ విధంగా ఇది మన మధ్య అల్లాహ్ కు మధ్యలో కావచ్చు, మన మధ్య మనలాంటి మానవుల మధ్యలో కావచ్చు, మనము మరియు మానవులే కాకుండా ఇతర, ఉదాహరణకు ఎక్కడైనా ఒక చెట్టు ఉన్నది. నీడ ఆ చెట్టు ద్వారా ప్రజలు పొందుతూ ఉన్నారు. అనవసరంగా ఆ చెట్టును కోసేసాము. ప్రజలకు కలిగేటువంటి లాభాన్ని మనం దూరం చేశాము. ఇది కూడా ఒక పాపమే. మనం డైరెక్ట్ గా ఒక మనిషికి బాధ కలిగించలేదు, ఇన్డైరెక్ట్ గా కలిగించాము. జంతువులు ఉన్నాయి, కాలక్షేపంగా నా యొక్క గురి బాగా ఉందా లేదా అని కేవలం పరీక్షించుకోవడానికి పక్షులను, జంతువులను ఈటెతో గానీ లేదా ఇంకా ఈ రోజుల్లో గన్ అలాంటి వేరే పరికరాలతో వాటిని చంపడం ఇది ఇస్లాం ధర్మంలో పాపంగా చెప్పడం జరిగింది. కొందరు కొన్ని రకాల పక్షుల పిల్లల్ని పట్టుకుంటారు దాని మూలంగా ఆ పక్షి యొక్క తల్లి ఏదైతే ఉంటుందో దానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఇది కూడా ఒక పాపంలో వస్తుంది. అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నాను. మనం వెళ్తూ వెళ్తూ ఆ ఏందీ తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసేది అని బనానా అరటిపండు యొక్క ఆ తొక్క ఏదైతే ఉందో అలాగే దారిలో పడేస్తాము. హదీస్ లో ఏముంది? దారిలో నుండి బాధ కలిగించే విషయాన్ని దూరం చేయడం పుణ్యకార్యం. ఇక్కడ మనం బాధ కలిగించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా మనం అల్లాహ్ పట్ల గానీ, ప్రజల పట్ల గానీ, ఇంకా వేరే ఎవరి పట్ల గానీ ఏదైనా వారికి హాని కలిగించడం ఇవన్నీ కూడా పాపాల్లో లెక్కించబడతాయి. పాపాలు చేయడం వల్ల అది స్వయం మన ఆత్మకు, మన శరీరానికి, మన ఆరోగ్యానికి, పాపం వల్ల మన ఇంట్లో మనకు, మన పిల్లలకు, మన యొక్క సంపదలో, మన యొక్క ధనంలో, మన రోజువారీ జీవితంలో, మన సమాజానికి ఎంతో చెడు ఉంటుంది. పాపాల ప్రభావం వ్యక్తిగత మరియు సామాజిక జీవితంపై, ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇన్షా అల్లాహ్ ఏ రోజైనా దాని గురించి వివరంగా తెలుసుకుందాము. కానీ ఇప్పుడు నేను ఇక్కడ దాన్ని సంక్షిప్తంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఇలాంటి ఏ తప్పు ఏ పాపం జరిగినా గానీ మనం స్వచ్ఛమైన మనసుతో అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవాలి. అల్లాహ్ తో క్షమాభిక్ష కోరాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటామో అక్కడ నాలుగు కండిషన్లను గుర్తుంచుకోవాలి. అప్పుడే అల్లాహ్ తో మనం కోరుకున్న ఆ క్షమాపణ స్వీకరించబడుతుంది. మన యొక్క తప్పు, మన యొక్క పొరపాటు, మన యొక్క పాపం అది మన్నించబడుతుంది. దాని యొక్క శిక్ష నుండి మనం తప్పించుకోగలుగుతాము. ఈ కండిషన్లు పూర్తి చేయడంలో ఎంత వెనక ఉంటామో, ఎంత లేజీతనం మనం చేస్తామో అంతే మన తౌబా ఇస్తిగ్ఫార్ యొక్క ఆమోదం కూడా, అది స్వీకరించబడడం కూడా చాలా వెనక ఉండిపోతాము. ఏంటి అవి? మొదటిది, చేసిన తప్పును ఛీ అని భావించడం. దానిని అది గుర్తు వచ్చినప్పుడు నాతో ఎలా జరిగిపోయింది కదా అని ఒక పశ్చాత్తాప భావం అనేది మనిషిలో ఉండాలి. కొన్ని పాపాల గురించి ఎలా ఉంటుంది? అయ్యో వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు అని వదులుకుంటాము. కానీ మనసులో ఇంత మంచి అవకాశం పాయే కదా అని అనుకుంటాము. చూడడానికి పాపం చేయట్లేదు కావచ్చు, కానీ ఇది తౌబాలో రాదు. ఎందుకు? పాపం పట్ల కాంక్ష ఉంది. ఇక్కడ ఏం జరగాలి? మొట్టమొదటి షరతు, మొట్టమొదటి నిబంధన, పాపాన్ని తప్పుగా భావించాలి, పాపంగా భావించాలి, ఛీ నాతో ఎలా ఇది జరిగింది కదా అని ఒక బాధగా ఉండాలి. రెండవది, ఏ పాపం నుండి మనం క్షమాపణ కోరుకుంటున్నామో, తౌబా చేస్తున్నామో దానిని వదులుకోవాలి. దానిని వదులుకోవాలి. వడ్డీ తినే వ్యక్తి గానీ, జూదం ఆడే వ్యక్తి గానీ, మత్తు సేవించే వ్యక్తి గానీ, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని అంటున్నాడు, కానీ ఆ పాపాన్ని వదులుకోవడం లేదు. ఒక వ్యక్తి నమాజ్ చేయట్లేదు. మహా ఘోరమైన పాపం ఇది. ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని అంటున్నాడు. మళ్ళీ నమాజ్ సమయం వచ్చింది. నమాజ్ చేయడం, అతడు నమాజ్ చేయకపోవడం ఒక చెడు అలవాటు ఏదైతే చేసుకున్నాడో దానిని వదులుకోవాలి. మూడో కండిషన్, ఇకముందు నేను ఆ పాపానికి ఒడిగట్టను, నేను ఆ పాపం చేయను అని బలంగా సంకల్పించుకోవాలి. దృఢంగా నిశ్చయించుకోవాలి, సంకల్పించుకోవాలి. ఈ మూడు పాపాలు, సారీ, ఈ మూడు కండిషన్లు పాపం యొక్క సంబంధం మనిషి మరియు అల్లాహ్ కు మధ్యలో ఉన్నప్పుడు. కానీ ఒకవేళ ఒకవేళ పాపం ఎవరితో, మనిషి పట్ల జరిగి ఉంటే, ఎవరినైనా కొట్టి ఉన్నాము, ఎవరినైనా మనం అవమానపరిచి ఉన్నాము, ఎవరిదైనా ఏదైనా సొమ్ము అన్యాయంగా తీసుకుని ఉన్నాము, అలాంటప్పుడు ఈ మూడు షరతులతో పాటు కండిషన్లతో పాటు ఆ వ్యక్తితో క్షమాపణ కోరుకోవాలి, ఆ వ్యక్తి మన్నిచేసేయాలి, లేదా అతని యొక్క హక్కు అతనికి చేరవేసేయాలి. ఈ నాలుగు కండిషన్లు ఉంటాయి. ఈ నాలుగు కండిషన్లు మనం పూర్తి చేయాలి. అప్పుడే మన తౌబా, మన ఇస్తిగ్ఫార్ అన్నది స్వీకరించబడుతుంది.
సోదర మహాశయులారా, ఈ సందర్భంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఏంటి అవి? ఒకటి, పాపాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉన్నా మనం ప్రతిసారి, ప్రతిసారి, ప్రతిసారి అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. రెండవది, పాపాలు ఎంత ఘోరమైనవి అయినా ఆ ఇంత పెద్ద పాపం చేశాను నేను, అల్లాహ్ క్షమిస్తాడా నన్ను అని అనుకోవద్దు. నిన్ను క్షమించడం అల్లాహ్ కు కష్టం ఏమీ కాదు. కానీ స్వచ్ఛమైన మనసుతో అల్లాహ్ తో క్షమాపణ కోరుకొని పాపాన్ని విడనాడాలి. రెండోది ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఎంత ఘోరమైన పాపాలు అయినా గానీ. మూడవది, అజ్ఞానం వల్ల, షైతాన్, మానవుల్లోని, జిన్నాతుల్లోని షైతానుల దుష్ప్రేరేపణ వల్ల అయ్యో ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా కదా నేను పాపాలు, అని అనుకోవద్దు. అర్థమవుతుంది కదా? పాపాలు ఎంత ఎక్కువగా ఉన్నా, ఎలాంటి ఘోరమైన పాపమైనప్పటికీ, మూడవది ఎంత దీర్ఘకాలం నుండి ఉన్నా గానీ, నేను ఇందులో ప్రతి ఒక్కదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు అని నేను ఆ ఆధారాలు మీకు చూపడం లేదు.
ఇక సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలో మనం ప్రతిసారి, ప్రతిసారి, ప్రతిసారి అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. ఒక్కసారి మీరు గమనించండి, సహీహ్ ముస్లిం షరీఫ్ ఇంకా తిర్మిజీ, ఇబ్ను మాజా వేరే హదీస్ గ్రంథాల్లో వచ్చిన విషయం, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఏమని విశ్వసిస్తాము? మాసూమ్ అనిల్ ఖతా, పాప రహితులు ప్రవక్తలు. అయినా గానీ సహాబాలు ఏమంటున్నారు? ఒక్కొక్క సమావేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వందేసి సార్లు రబ్బిగ్ఫిర్లీ, అస్తగ్ఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు అని అనేవారు. ప్రవక్త అయి ఇంత ఎక్కువగా అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండేవారంటే మనం ప్రతిరోజు ఎన్నిసార్లు క్షమాపణ కోరుకుంటూ ఉండాలి? అయితే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటూ ఉండాలి. ఈ క్షమాపణ కోరుకుంటూ ఉండడం వల్ల మనకు చాలా చాలా లాభాలు కలుగుతాయి. లాభాల దాని యొక్క ఘనతలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, చాలా ఎక్కువ ఘనతలు ఉన్నాయి. కానీ సంక్షిప్తంగా కొన్ని చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చదివిన ఆయత్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో సూరత్ నూహ్ లోని ఆయత్లు ఒక్కసారి ఆ ఆయతుల యొక్క కేవలం భావాన్ని మీరు స్పీడ్ గా చూసి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి మీకు చూపించడం జరుగుతుంది. అల్హమ్దులిల్లాహి కసీరా.
ఆయత్ నెంబర్ 10 నుండి మొదలవుతుంది చూడండి. మన సూర నెంబర్ 71. నేను ఇలా అన్నాను, నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, “క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.” లాభాలు ఏంటి? “ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.” వర్షాలు లేకుంటే అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే అల్లాహ్ వర్షాలు కురిపిస్తాడు. రెండో లాభం, “మీ సిరిసంపదల్లోనూ,” చూస్తున్నారా? రెండో లాభం సిరిసంపదల్లో. మూడో లాభం, “పుత్ర సంతతిలోనూ.” సంతానం కలిగే విషయంలో “పురోభివృద్ధిని ఒసగుతాడు.” నాలుగో లాభం, “మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు.” మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఐదో లాభం, “ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.” తోటలు ఉంటే నీళ్లు వాటికి అవసరం. అయితే అల్లాహు తాలా కాలువలను కూడా ప్రవహింపజేస్తాడు. చూస్తున్నారా? ఇక్కడ ఎంత స్పష్టంగా మనకు కనబడిందో, ఇస్తిగ్ఫార్ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా అల్లాహ్ యొక్క దయతో మనకు లాభాలు కలుగుతూ ఉంటాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఇది సహీహ్ హదీస్, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ వారు సహీహాలో ప్రస్తావించారు 2299. ఏంటి హదీస్? జుబైర్ బిన్ అవ్వామ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ప్రళయ దినాన స్వయం తన కర్మల పత్రాన్ని చూసి సంతోషపడాలి అని ఎవరైతే కోరుతున్నారో, కోరుకుంటున్నారో, ఎంత ఎక్కువ ఇస్తిగ్ఫార్ అందులో ఉంటే అంతే ఎక్కువగా అతనికి ప్రళయ దినాన సంతోషం కలుగుతుంది.” అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూడండి, గమనిస్తున్నారా? ఈ ప్రపంచపు ఉదాహరణ ద్వారా కూడా మీకు చెప్పగలను. ఒక వ్యక్తి ఇద్దరు మనుషులు పనిచేస్తున్నారు అనుకోండి ఒక వర్క్ షాప్ లో, ఒక ఫ్యాక్టరీలో, ఒక కంపెనీలో. ఇద్దరితో కూడా తప్పు జరిగింది. కానీ ఒక వ్యక్తి వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్లి, “సార్, ఆ పనిలో నాతో ఈ మిస్టేక్ జరిగింది, క్షమించండి సార్, ఇక నుండి నేను శ్రద్ధ వహిస్తాను.” జీతం తీసుకునే సమయం వచ్చేసరికి మరొక వ్యక్తి క్షమాపణ కోరుకోలేదు. ఆ ఏంటి మొన్న నువ్వు ఆ తప్పు చేశావు కదా, అయ్యో జరగదా అంత మాత్రంలో దాన్ని గురించి మందలిస్తావా? ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఇంకా వేరే ఏదైనా అడ్డ రీతిలో మాట్లాడాడు. మీరే ఆలోచించండి ఇద్దరిలో ఎవరు ఆ మేనేజర్ కి ఇష్టం? ఆ మేనేజర్ ఎవరి పట్ల ఇష్టపడతాడు? మరియు మనం మన జీతం తీసుకునే సందర్భంలో మనతో జరిగే మిస్టేక్ వల్ల ఏ మన జీతం అయితే కట్ అవుతుందో దాని కారణంగా జీతం పొందిన రోజు సంతోషం ఎవరు ఉంటారు, బాధగా ఎవరు ఉంటారు? కేవలం అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ మీరు గమనించండి. ప్రళయ దినాన మనం అల్లాహ్ ముందు హాజరైన తర్వాత అక్కడ మన కర్మ పత్రాలు తూకం చేయబడతాయి, మన కర్మ పత్రాలు మన కుడి చేతిలో లేదా ఎడమ చేతిలో ఇవ్వబడతాయి. ఆ సందర్భంలో మన కర్మ పత్రంలో మనకు సంతోషకరమైన విషయం చూడాలనుకుంటే అధికంగా, అధికంగా, అధికంగా ఇస్తిగ్ఫార్ అందులో ఉండడం తప్పనిసరి.
మరొక హదీస్ ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామిలో ప్రస్తావించారు 3930, అబ్దుల్లా బిన్ బుస్ర్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, “తూబా.” తూబా అంటే ఏంటి? తూబా అంటే మీకు సంతోషం, మీకు శుభవార్త కలుగు గాక అని కూడా భావం వస్తుంది. తూబా అంటే స్వర్గంలో ఒక చెట్టు ఉంది, దాని ద్వారా స్వర్గవాసుల వస్త్రాలు తయారు చేయబడతాయి. ఈ విధంగా అల్లాహు తాలా దాని నీడలో ఉండేటువంటి గొప్ప శుభవార్త మనకు ఇస్తున్నాడని భావం. అయితే ఎవరైతే తన కర్మ పత్రాల్లో ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చూస్తారో అలాంటి వారికి గొప్ప శుభవార్త ఉన్నది.
ఈ విధంగా సోదర మహాశయులారా, మనం ఇస్తిగ్ఫార్ పట్ల ఎప్పుడూ కూడా అశ్రద్ధగా ఏమాత్రం ఉండకూడదు. ఇక రండి, మన రోజువారీ జీవితంలో, మన రోజువారీ జీవితంలో ఏ ఏ సందర్భాలలో మనం ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి? సోదర మహాశయులారా, అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ప్రతి నమాజ్ వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్. రుకూలో, సజ్దాలో సుబ్హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ఫిర్లీ. అల్లాహుమ్మగ్ఫిర్లీ. గుర్తుంది కదా, అల్లాహుమ్మగ్ఫిర్లీ అంటే ఓ అల్లాహ్ నన్ను క్షమించు. రుకూలో, సజ్దాలో. అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తషహ్హుద్ లో మనం చదవవలసిన దువాలలో అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు అడిగినప్పుడు చెప్పిన దువా ఏమిటి? اللَّهُمَّ إِنِّي ظَلَمْتُ نَفْسِي ظُلْمًا كَثِيرًا، وَلَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ، فَاغْفِرْ لِي مَغْفِرَةً مِنْ عِنْدِكَ، وَارْحَمْنِي إِنَّكَ أَنْتَ الْغَفُورُ الرَّحِيمُ అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరన్ వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతమ్ మిన్ ఇన్దిక వర్హమ్నీ ఇన్నక అంతల్ గఫూరుర్రహీమ్. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో, اللَّهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ، وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిక్కహూ వజిల్లహూ వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ. అంటే ఏంటి? గమనించండి ఇక్కడ భావాన్ని. ఇది ముస్లిం షరీఫ్ లోని హదీస్. అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ. ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు. కుల్లహూ అన్ని పాపాలను. దిక్కహూ వ జిల్లహూ, చిన్న పాపాలు, పెద్ద పాపాలు. వ అవ్వలహూ వ ఆఖిరహూ, ముందు చేసినవి, తర్వాత చేసినవి. వ అలానియతహూ వ సిర్రహూ, నేను ఎక్కడైనా దాగి ఉండి గుప్తంగా చేసిన పాపాలైనా లేదా బహిరంగంగా చేసిన పాపాలైనా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అన్ని రకాల పాపాల నుండి క్షమాపణకై ఎంత మంచి దువాలు నేర్పబడ్డాయో మీరు గమనిస్తున్నారు కదా? ఇలాంటి దువాలు మనం నేర్చుకోవాలి. రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు అని మాది ఒక పీడీఎఫ్ ఉంది, చదవండి. అందులో ఇలాంటి దువాలన్నీ కూడా జమా చేయడం, అందులో పూర్తి రిఫరెన్స్ తో తెలియజేయడం జరిగినది.
సోదర మహాశయులారా, అతి ముఖ్యంగా, అతి ముఖ్యంగా మనం ఎన్ని రకాల పదాలు, ఏ ఏ సందర్భాలు అల్లాహ్ తో క్షమాపణ కోరుకోవడానికి ఉపయోగిస్తామో వాటన్నిటిలోకెల్లా సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ చాలా చాలా చాలా చాలా చాలా ముఖ్యమైనది. సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్.
اللَّهُمَّ أَنْتَ رَبِّي لَا إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్తనీ వ అన అబ్దుక, వ అన అలా అహ్‌దిక వ వఅ్‌దిక మస్తతఅతు, అఊజు బిక మిన్ షర్రి మా సనఅతు, అబూఉ లక బి నిఅమతిక అలయ్య, వ అబూఉ లక బి జంబీ ఫగ్ఫిర్లీ, ఫఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత.
మీరందరూ కూడా దీనిని కంఠస్థం చేసుకునే అవసరం లేదు. లేదు, నిజంగా చెప్తున్నాను. కేవలం చూసి చదవండి సరిపోతుంది. మీకు ఈ ఘనత ప్రాప్తిస్తుంది. ఈ దువా గురించి ముస్నద్ అహ్మద్ లో ఒక పదం ఏముందో తెలుసా? ఇన్న అవ్ఫకద్ దుఆ. దువాలలో ఎక్కువ భాగ్యాన్ని ప్రసాదించేటువంటి దుఆ, అల్లాహుమ్మ అంత రబ్బీ వ అన అబ్దుక, జలమ్తు నఫ్సీ వఅతరఫ్తు బిజంబీ, యా రబ్బి ఫగ్ఫిర్లీ జంబీ ఇన్నక అంత రబ్బీ ఇన్నహూ లా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అంత. మరియు నేను సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ లో ఏదైతే చదివాను కదా, దాని గురించి సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ఏమిటి? ఎవరైతే పగలు, ఉదయం పూట దీనిని సంపూర్ణ నమ్మకం మరియు విశ్వాసంతో చదువుతారో సాయంకాలం కాకముందే అతను చనిపోతాడో అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. ఎవరైతే రాత్రి చదువుతారో పూర్తి నమ్మకంతో అతను ఉదయం కాకముందు చనిపోతే అతడు స్వర్గవాసుల్లో ఒకడైపోతాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా ఎంత గొప్ప అదృష్ట విషయం ఇందులో తెలియజేయడం జరిగింది? అందుకొరకే సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకుంటూనే ఉండాలి. కానీ ఉదయం అజ్కార్లలో, సాయంకాలం అజ్కార్లలో కనీసం ఒక్కసారైనా గానీ, ఒక్కసారైనా గానీ ఈ దువా చదవాలి.
సోదర మహాశయులారా ఇక్కడ మీకు ఒక శుభవార్త వినిపిస్తున్నాను, శ్రద్ధ వహించండి. కొందరు మీ యొక్క ఫ్రెండ్స్ లలో, మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ముస్లిమేతరులు అయి ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సందర్భంలో లేదా అట్లే ఏదైనా సందర్భంలో, “అరే మీ ముస్లింలు మంచిగా దువా చేస్తారురా భాయ్, మీ ముస్లింలు ఆ ఏదో చదివి ఊదుతారు చాలా నయం అవుతుంది” ఈ విధంగా కొంచెం ఒక ముస్లింల వైపు ఆకర్షణ కలిగి, ముస్లింల యొక్క దువాతో వారు ప్రభావితులై ఉంటారు. అలాంటి వారిలో, అలాంటి వారికి ఈ దువా మీరు నేర్పే ప్రయత్నం చేయండి. దీని యొక్క భావం వారిని చదవమని చెప్పండి, అరబీలో ఈ పదాలు రాకపోయినా గానీ.
ఒక సందర్భంలో ఏం జరిగింది? హుసైన్ అనే వ్యక్తి, స్వాద్ తో వస్తుంది ఇక్కడ పేరు, ఇమ్రాన్ ఇబ్ను హుసైన్ గారి యొక్క తండ్రి, ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది, దాని యొక్క రిసెర్చ్ చేసేవారు షేఖ్ షుఐబ్ అల్ అర్నావూత్ దీని యొక్క సనదును సహీహ్ అని చెప్పారు. ఒక వ్యక్తి హుసైన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అతను వచ్చి ప్రవక్తతో అడిగాడు, “నాకు మీరు ఏదైనా నేర్పండి, నేను చెప్పుకోవడానికి, చదువుకోవడానికి.” ప్రవక్త చెప్పారు,
اللَّهُمَّ قِنِي شَرَّ نَفْسِي، وَاعْزِمْ لِي عَلَى أَرْشَدِ أَمْرِي అల్లాహుమ్మ కినీ షర్ర నఫ్సీ, వ అజిమ్లీ అలా అర్షది అమ్రీ. ఓ అల్లాహ్ నా యొక్క నఫ్స్, స్వయం నాలో ఉన్నటువంటి చెడు నుండి నన్ను కాపాడు. మరియు అతి ఉత్తమ విషయం వైపునకు నాకు మార్గదర్శకత్వం చేసి నేను దానిపై దృఢంగా ఉండే విధంగా నాకు భాగ్యం కలుగజేయి.
ఒక నాన్ ముస్లిం, ముస్లిమేతరుడు అడిగినప్పుడు ప్రవక్త అతనికి ఈ దువా నేర్పారు. ఆ వ్యక్తి ఈ దువా చదవడం మొదలు పెట్టాడు, కొద్ది రోజులకు అల్లాహు తాలా అతనికి భాగ్యం కలుగజేశాడు, అతడు ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించిన కొద్ది రోజులకు మళ్ళీ వచ్చాడు. వచ్చి చెప్పాడు, “నేను ఒక సందర్భంలో మీ వద్దకు వచ్చాను, మీరు అల్లాహుమ్మ కినీ షర్ర నఫ్సీ వ అజిమ్లీ అలా అర్షది అమ్రీ అని నాకు నేర్పారు. అయితే నేను దానిని చదువుతూ చదువుతూ ఉన్నాను, నాకు ఇస్లాం భాగ్యం కలిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పాలో మీరు నాకు తెలియజేయండి.” అప్పుడు ప్రవక్త నేర్పారు,
اللَّهُمَّ اغْفِرْ لِي مَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ، وَمَا أَخْطَأْتُ وَمَا عَمَدْتُ، وَمَا عَلِمْتُ وَمَا جَهِلْتُ అల్లాహుమ్మగ్ఫిర్లీ మా అస్రర్తు వమా ఆలన్తు వమా అఖ్తఅతు వమా అమద్తు వమా అలిమ్తు వమా జహిల్తు. ఓ అల్లాహ్ నన్ను క్షమించు. నేను గోప్యంగా చేసిన పాపాలు, బహిరంగంగా చేసిన పాపాలు. ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో అవి వాటిని కూడా మన్నించు, ఏ పాపాలైతే తెలియకుండా చేశానో వాటిని కూడా మన్నించు. మరియు ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో మరియు ఏ పాపాలైతే నేను తెలియకుండా అజ్ఞానంగా చేశానో అన్నిటినీ కూడా నీవు మన్నించు.
చూస్తున్నారా గమనిస్తున్నారా? ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువాలు నేర్పేవారు. అయితే సోదర మహాశయులారా, చివరిలో నేను ఇస్తిగ్ఫార్ కు సంబంధించిన మరొకటి మీకు వినిపించదల్చుకుంటున్నాను, దాన్ని కూడా గుర్తుంచుకోండి. కానీ నేను చెప్తున్నాను కదా, ఇలాంటి దువాలన్నీ కూడా మీరు కంఠస్థం చేసే అవసరం లేదు, కేవలం చూసి చదువుతున్నా గానీ మీకు లాభం కలుగుతుంది.
أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ الْحَيَّ الْقَيُّومَ وَأَتُوبُ إِلَيْهِ అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై. అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలై. ఇది ఎప్పుడూ కూడా చదవడం మర్చిపోకండి. ఇది మర్చిపోకండి ఎందుకంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే ఇది చదువుతూ ఉంటారో వారి యొక్క పాపాలు ఒకవేళ వారి యొక్క పాపాలు ఒకవేళ ఎంత ఎక్కువ ఉన్నా గానీ మన్నించబడతాయి. చివరికి అతను ధర్మ యుద్ధం నుండి వెనుదిరిగినా అలాంటి పాపం కూడా ఈ దువా కారణంగా మన్నించబడుతుంది. చూశారా? చూస్తున్నారా గమనిస్తున్నారా ఎంత గొప్ప లాభం అనేది ఇందులో తెలపడం జరిగింది? అందుకొరకు సోదర మహాశయులారా, ఇస్తిగ్ఫార్ అనేది మాటిమాటికి చేస్తూ ఉండండి. నేను ఇంతకు ముందే చెప్పాను చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి. కానీ ఈ కొన్ని విషయాలు ఈరోజు మనకు సరిపోతాయి. ప్రత్యేకంగా ఇందులో మన రోజువారీ జీవితంలో మనం చదవవలసిన కొన్ని ముఖ్యమైన దువాలు, సందర్భాల గురించి కూడా తెలపడం జరిగింది. ఆ సందర్భాల్లో వాటిని మీరు పాటిస్తూ ఉండండి. ఇన్షా అల్లాహ్ ఇక్కడి వరకు దీన్ని ఆపేసి ఈ అంశాన్ని వేరే అంశం వైపునకు ముందుకు సాగుదాము. విన్న విషయాలను అర్థం చేసి ఆచరించే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ధిక్ర్ (అల్లాను స్మరించడం)
సరే మిత్రులారా, ఇప్పుడు నేను రెండవ అంశం చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. నేను కొంచెం ఫాస్ట్ గానే చెప్పే ప్రయత్నం చేస్తాను మరియు అందరూ కూడా దీనిని విని, ఆచరించి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వాలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا వజ్కురుల్లాహ జిక్రన్ కసీరా. సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! మనమందరము దాసులము. దాసుడు తన యజమాని యొక్క స్తుతి, అతని యొక్క పొగడ్త, అతని యొక్క గొప్పతనాన్ని చాటడమే దాసుని యొక్క అసలైన పని. ఇందులో అతను ఎంత వెనక ఉంటే అంతే అతనికి నష్టం జరుగుతుంది, యజమానికి ఏ నష్టం జరగదు. అందుకొరకే ఒక మన తెలుగు కవి ఏం చెప్తున్నాడు?
ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలము ఉండబోదురా, ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలము ఉండబోదురా, సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా, నీ డిగ్రీలన్నీ వ్యర్థమురా.
సృష్టికర్తను గ్రహించాలి. ఆ సృష్టికర్తనే మనం స్తుతిస్తూ ఉండాలి, అతన్నే పొగడుతూ ఉండాలి.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ఆరాధన కొరకే పుట్టించబడ్డాము. అయితే ఇక మనకు వేరే పనులు వద్దా? ఈ లోకంలో జీవిస్తున్నామంటే వేరే ఎన్నో పనులు కూడా ఉంటాయి. మాటిమాటికి అల్లాహ్ నే ఆరాధించుకుంటూ ఎలా ఉండగలుగుతాము అని కొందరు చికాకుగా అడ్డ ప్రశ్న వేస్తారు. కానీ ఇస్లాం ధర్మాన్ని కొంచెం లోతు జ్ఞానంతో, మంచి విధంగా అర్థం చేసుకుంటూ చదివారంటే మన జీవితంలోని ప్రతి క్షణం మనం ఆరాధనలో ఉన్నట్లు, మన జీవితంలోని ప్రతి క్షణం అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ ను గుర్తిస్తూ ఉన్నట్లు చేసుకోగలము. కానీ ఈ భాగ్యం ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? ఎవరు ఎంత ఎక్కువ ఇస్లాం జ్ఞానం నేర్చుకుంటారో అంతే ఎక్కువగా వారు తమ ప్రతి విషయాన్ని అల్లాహ్ యొక్క ఆరాధన, ప్రతి ఘడియను అల్లాహ్ యొక్క స్మరణలో గడపగలుగుతారు. వారు ఏ పని చేస్తూ ఉన్నా గానీ, ఏదైనా కంపెనీలో పని చేస్తూ ఉన్నా, ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఏదైనా వ్యవసాయంలో ఉన్నా, బజార్లో ఉండి ఏమైనా సామానులు అమ్ముతూ ఉన్నా, చివరికి నిద్రపోతూ ఉన్నా గానీ. అవునా? అవును. ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు తాలా అన్హు ఏమంటున్నారు? ఇన్నీ అహ్‌తసిబు నౌమతీ కమా అహ్‌తసిబు కౌమతీ. నేను రాత్రి మేల్కొని అల్లాహ్ ఎదుట నిలబడి తహజ్జుద్ చేస్తూ ఉండి, అహ్‌తసిబు (పుణ్యం ప్రాప్తించాలని కోరుతూ ఉంటానో), అహ్‌తసిబు నౌమతీ (నేను పడకపై పడుకొని నిద్రిస్తూ కూడా దీనికి బదులుగా అల్లాహ్ నాకు పుణ్యం ప్రసాదించాలి, ప్రసాదిస్తాడు అన్నటువంటి ఆశ కలిగి, నమ్మకం కలిగి ఉంటాను).
అవును మరి. ఎవరైతే టైం మేనేజ్మెంట్ ఏ కాదు ఈనాటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులలో వినేది, స్వయం తన క్షణ క్షణాన్ని అల్లాహ్ యొక్క స్మరణలో, అల్లాహ్ యొక్క ధిక్ర్ లో, అల్లాహ్ యొక్క ఆరాధనలో ఎలా గడపగలను అన్నది నేర్చుకోవాలి. తాను చేస్తున్న ప్రతిదీ కూడా అల్లాహ్ స్మరణ, అల్లాహ్ యొక్క ఆరాధన అయిపోవాలి. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి.
ఎందుకంటే ముస్లిం అని ఏదైతే మనం అంటామో దాని భావమే ఏంటి? విధేయుడు. అయితే విధేయత ఏదో ఒక్క సందర్భంలో కాదు, ఎల్లవేళల్లో ఉండాలి. నీవు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పనిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు అది నీ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క విధేయతలో ఉంటే నీవు అతని ఆరాధనలో ఉన్నట్లే, అతని స్మరణలో ఉన్నట్లే.
ఈ విధంగా ఎవరైతే అల్లాహ్ యొక్క స్మరణలో ఉంటారో వారికి ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వారిపై వచ్చిపడినా అల్లాహ్ యొక్క స్మరణ నుండి వారు దూరం కాలేరు. ఒక విషయం ఆలోచించండి, సుఖంగా హాయిగా జీవిస్తున్నారు అని మనం కొందరి గురించి అనుకుంటాము. ఏ విషయం చూసి? అతని వద్ద ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని చూసి, అతని వద్ద ఉన్న బిల్డింగ్లను చూసి, అతని వద్ద ఉన్న కార్లను చూసి, అతని వద్ద ఉన్నటువంటి ధన సంపద, ఈ లోకపు కొన్ని సౌకర్యాలు. అరే వానికేం బాధరా భాయ్, ఎంత ధరలు పెరిగినా గానీ బోలెడంత డబ్బు ఉన్నది వానికి, వాడు హాయిగా బతుకుతాడు. ఈ విధంగా మనం అనుకుంటాము. కానీ ఒకవేళ అతను అల్లాహ్ స్మరణలో లేకుంటే, తన జీవితాన్ని అల్లాహ్ యొక్క విధేయతలో గడపకుంటే అతడు ఈ సౌకర్యం సౌకర్యం కాదు, ఈ సుఖం సుఖం కాదు, ఇది వాస్తవానికి చాలా చాలా బాధాకరమైన జీవితం.
ఇక సోదర మహాశయులారా, ఈ ధిక్ర్ యొక్క అంశం కూడా, అల్లాహు అక్బర్, చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే ప్రతీది కూడా ధిక్ర్ లో రావచ్చు. లా ఇలాహ ఇల్లల్లాహ్ ధిక్ర్. నమాజ్ కూడా ధిక్ర్. ప్రతి ఆరాధన అల్లాహ్ యొక్క ధిక్ర్. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ధిక్ర్ ను రెండు రకాలుగా అర్థం చేసుకోవడానికి సులభ రీతిలో విభజించి నేను చెబుతున్నాను. ఒకటి ఏమిటి? ధిక్ర్ అంటే స్మరించడం, గుర్తు చేయడం, మరిచిపోకుండా ఉండడం. ఈ భావాలు వస్తాయి ధిక్ర్ అన్న అరబీ పదానికి. అయితే అల్లాహ్ యొక్క ధిక్ర్ చేస్తూ ఉండాలి అని అంటే ఏంటి? మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో, ఏ స్థితిలో ఉంటామో అక్కడ ఆ సమయంలో, ఆ స్థితిలో, ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క ఏ ఆదేశం ఉన్నది, ప్రవక్త వారి ఏ విధానం ఉన్నది తెలుసుకొని ఆ రకంగా చేయడం, పాటించడం ఇది అల్లాహ్ యొక్క ధిక్ర్. ఇది ఒక సామాన్య భావంలో, ఓకేనా? ఇక రెండవది, మనం అల్లాహ్ ను గుర్తు చేస్తూ కూర్చుంటూ, లేస్తూ అన్ని సందర్భాల్లో అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్ అని అనడం. ఉదాహరణకు, ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు బిస్మిల్లాహ్. ఏదైనా తిన్న తర్వాత, తాగిన వెంటనే అల్హమ్దులిల్లాహ్. ఏదైనా శుభవార్త మనకు దొరికింది, మాషా అల్లాహ్. ఏదైనా పని పూర్తయింది, అల్హమ్దులిల్లాహ్. ఏదైనా బాధాకరమైన వార్త మనకు వచ్చింది, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆశ్చర్యకరమైన ఏదైనా విషయం మనకు తెలిసింది, సుబ్హానల్లాహ్. ఎవరి గురించైనా, ఎక్కడైనా ఏదైనా గొప్ప విషయాలు చెప్పుకుంటూ విన్నాము, అల్లాహు అక్బర్. మనం ఏదైనా సహాయం కోరాలనుకున్నాము, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. మనం అల్లాహ్ ను స్తుతించి పుణ్యాలు సంపాదించుకోవాలనుకుంటున్నాము, సుబ్హానల్లాహి వబిహమ్దిహ్. మన యొక్క పుణ్యాల త్రాసు బరువుగా కావాలని కోరుతున్నాము, సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. పాపాలు ఎక్కువగా ఉన్నాయి, బాధ కలుగుతుంది, అవన్నీ కూడా తొలగిపోవాలని కాంక్ష ఉంది, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఏదైనా బాధగా ఏర్పడుతుంది, కష్టాల్లో ఉన్నారు అవి తొలగిపోవాలి, దూరం అయిపోవాలి, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్జాలిమీన్. ఈ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. కూర్చుంటూ, లేస్తూ అన్ని సందర్భాల్లో.
ఒక్కసారి మీరు సూరత్ ఆలె ఇమ్రాన్. సూర ఆలె ఇమ్రాన్ చివరి కంటే కొంచెం ముందు, కొన్ని ఆయతుల ముందు ఈ రెండు ఆయతులను గనుక మీరు శ్రద్ధ వహించారంటే ఎంత గొప్ప శుభవార్త ఇందులో ఉందో ఒక్కసారి మీరు చూడండి. అల్లాహు తాలా ఇలాంటి శుభవార్త ఇస్తున్నాడు.
الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ అల్లజీన యజ్కురూనల్లాహ కియామవ్ వ కుఊదవ్ వ అలా జునూబిహిమ్ వ యతఫక్కరూన ఫీ ఖల్కిస్ సమావాతి వల్ అర్ద్, రబ్బనా మా ఖలఖ్త హాజా బాతిలా, సుబ్హానక ఫకినా అజాబన్నార్. వారు నిలుచుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. వీరే నిజమైన విజ్ఞులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ఇలాంటి వారే అల్లాహ్ ను అన్ని స్థితుల్లో స్మరిస్తూ, గుర్తు చేస్తూ, అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉంటూ తమ జీవితం గడుపుతారు కదా, భూమి ఆకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారు ఇలా అంటారు, “మా ప్రభువా, నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. సుబ్హానక్, నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.”
ఇక్కడ మీరు గమనించారు కదా? వారు నిలుచుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ ను స్మరిస్తూ ఉంటారు. అల్లాహ్ ను ఎప్పుడెప్పుడు స్మరించాలి? అన్ని స్థితుల్లో స్మరిస్తూ ఉండాలి అన్నటువంటి గొప్ప విషయం ఇందులో మనకు తెలిసినది. అర్థమైంది కదా?
ఇక ఈ ధిక్ర్ మనం ఎల్లవేళల్లో చేస్తూ ఉంటే మనకు ఏంటి లాభం కలుగుతుంది? అల్లాహు అక్బర్. నేను కొన్ని లాభాలు ఇంతకు ముందే మీకు చెప్పాను కొన్ని పదాలు చెప్తూ చెప్తూ. ఇందులో అతి గొప్ప విషయం మీరు గమనించాల్సింది, అదేమిటి? ముస్నద్ అహ్మద్ లో వచ్చిన హదీస్, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు 134 హదీస్ నెంబర్. నూహ్ అలైహిస్సలాం వారి యొక్క వసియత్, వాంగ్మూలం తన కుమారుడికి ఏముండినది? ఆయన చెప్పారు, నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి నిన్ను ఆదేశిస్తున్నాను, నీవు లా ఇలాహ ఇల్లల్లాహ్ అధికంగా చదువుతూ ఉండు. ఎందుకు? దీని ఘనత, దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉన్నదంటే, ఏడు ఆకాశాలు, ఏడు భూమిలు త్రాసులోని ఒక పల్లెంలో పెట్టబడి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ను మరో పల్లెంలో ఇది త్రాసు యొక్క రెండు పల్ల్యాలు ఉంటాయి కదా, ఒక వైపున ఏడు ఆకాశాలు, ఏడు భూములు, మరోవైపున కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ పెట్టబడితే లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నది చాలా బరువుగా అయిపోతుంది. అంతేకాదు, లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఘనత, ప్రాముఖ్యత గురించి ఇంకా ఏం చెప్పారు? ఏడు ఆకాశాలు, ఏడు భూములు ఒక రింగ్ మాదిరిగా, ఎలాంటి రింగ్? చాలా బలమైన, గట్టి. లా ఇలాహ ఇల్లల్లాహ్ దానిని విరగ్గొట్టగలిగేంతటి శక్తి కలదు. అల్లాహు అక్బర్ చూస్తున్నారా? ఆ తర్వాత సుబ్హానల్లాహి వబిహమ్దిహి గురించి ఏం చెప్పారో చూడండి. సుబ్హానల్లాహి వబిహమ్దిహి ఇది కూడా అధికంగా నీవు చదువుతూ ఉండు, దీని గురించి నేను నిన్ను ఆదేశిస్తున్నాను. ఇది ఈ సృష్టిలోని ప్రతి వస్తువు యొక్క ఇబాదత్, ప్రతి వస్తువు యొక్క ఆరాధన. ఈ విషయం మీకు ఖురాన్ లో తెలుస్తుందా?
وَإِن مِّن شَيْءٍ إِلَّا يُسَبِّحُ بِحَمْدِهِ وَلَٰكِن لَّا تَفْقَهُونَ تَسْبِيحَهُمْ వఇమ్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిల్ లా తఫ్కహూన తస్బీహహుమ్. ఆకాశాలు, భూములు అన్నీ కూడా అల్లాహ్ యొక్క స్తుతి, అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతున్నాయి. వాటిలో ఉన్న ప్రతీది కూడా సుబ్హానల్లాహి వబిహమ్దిహి అని అంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ హదీస్ లో ఇదే విషయం వచ్చింది. నూహ్ అలైహిస్సలాం తన కొడుక్కు చెప్పారు, “సుబ్హానల్లాహి వబిహమ్దిహి ప్రతి సృష్టిలోని ప్రతీ దాని యొక్క సలాహ్. దీని ద్వారా ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరికి సుబ్హానల్లాహి వబిహమ్దిహి అనడం ద్వారానే వారికి వారి యొక్క ఉపాధి, వారి యొక్క ఆహారం లభిస్తున్నది.” అందుకొరకే అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేస్తూ ఉండాలి. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాము? నాకు మంచి ఉద్యోగం ఉంటేనే నా ఉపాధి, నాకు నా మంచి ఆ వ్యవసాయం ఉంటేనే ఉపాధి. ఇవన్నీ బాహ్యమైన సాధనాలు. వీటిలో హలాల్ ఏవో వాటిని మనం పాటించాలి. కానీ ఉత్తమమైన ఉపాధి లభించడానికి బాహ్యంగా కనబడని ఎన్నో, ఎన్నో సాధనాలు ఉంటాయి. వాటిలో అతి గొప్పది, అతి ముఖ్యమైనది అల్లాహ్ యొక్క స్మరణ, అల్లాహ్ యొక్క ధిక్ర్.
సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలోని ధిక్ర్ లలో కొన్ని ఘనతలు మీరు చూడండి. ఈ విషయాలను మనం ఒకవేళ గ్రహించామంటే ప్రతిరోజు మనం అల్లాహ్ యొక్క ధిక్ర్ ఇంకా అధికంగా చేస్తూ ఉండగలము. అధికంగా చేస్తూ ఉండగలము. ఉదాహరణకు, ఉదయం సాయంకాలం చదివే దువాలలో ఒక దువా ఉంది,
اللَّهُمَّ إِنِّي أَصْبَحْتُ أُشْهِدُكَ وَأُشْهِدُ حَمَلَةَ عَرْشِكَ وَمَلَائِكَتَكَ وَجَمِيعَ خَلْقِكَ أَنَّكَ أَنْتَ اللَّهُ لَا إِلَهَ إِلَّا أَنْتَ وَأَنَّ مُحَمَّدًا عَبْدُكَ وَرَسُولُكَ అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు ఉష్హిదుక వ ఉష్హిదు హమలత అర్షిక వ మలాయికతక వ జమీఅ ఖల్కిక అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంత వ అన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక. ఉదయం చదివినప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అస్బహ్తు” అని అంటారు. సాయంకాలం చదివినప్పుడు “అల్లాహుమ్మ ఇన్నీ అమ్సైతు” అని అంటారు. ఈ దువా చదవడం ద్వారా లాభం ఏంటి? ఈ దువా ఉదయం చదివినట్లయితే వారి యొక్క పగలంతా జరిగిన పాపాలు మన్నించబడతాయి. సాయంకాలం చదివిన ఈ దువా ఎవరైతే నాలుగు సార్లు చదివేది ఉంటే వారిని నరకాగ్ని నుండి రక్షణ కల్పించడం జరుగుతుంది.
సోదర మహాశయులారా, మన రోజువారీ జీవితంలో అల్లాహ్ యొక్క ధిక్ర్ లో ఉదయం, సాయంకాలం కొన్ని అజ్కార్లు వేరువేరుగా ఉన్నాయి మరియు ఎక్కువ శాతం ఉదయం, సాయంకాలం రెండు సందర్భాల్లో చదివేటివి ఉన్నాయి. ఒక దువా వస్తుంది,
أَعُوذُ بِكَلِمَاتِ اللَّهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ అఊజు బికలిమాతిల్లాహిత్ తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. మూడు సార్లు ఎవరైతే దీనిని చదువుతారో వారికి రాత్రి ఏ విష పురుగు హాని కలిగించదు అని ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్. గమనించండి ఎంత గొప్ప పుణ్యం ఇందులో, ఎంత గొప్ప లాభం ఉంది ఇందులో. అలాగే ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు
بِسْمِ اللَّهِ الَّذِي لَا يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ బిస్మిల్లాహిల్లజీ లా యదుర్రు మఅస్మిహి షైఉన్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాఇ వహువస్ సమీఉల్ అలీమ్. చదివేది ఉంటే వారికి ఏదీ కూడా నష్టం పరచదు అని మనకు హదీస్ ద్వారా తెలుస్తుంది.
సోదర మహాశయులారా,
لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. ఇది ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత చదివేది ఉంది. ఉదయం, సాయంకాలం చదివేది ఉంది. ఇన్షా అల్లాహ్ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్సు కూడా మనం పెట్టే ప్రయత్నం చేద్దాము. కొన్ని సందర్భాల్లో చదివే దాంట్లో కొన్ని పదాలు ఎక్కువగా కూడా ఉన్నాయి, దాని ప్రకారంగా వాటి యొక్క ఘనతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో మీరు అల్లాహ్ యొక్క ధిక్ర్ లలో ఫర్జ్ నమాజ్ తర్వాత మనం పది పది సార్లు సుబ్హానల్లాహ్, పది సార్లు అల్హమ్దులిల్లాహ్, పది సార్లు అల్లాహు అక్బర్ లేదా 33 సార్లు సుబ్హానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ కదీర్. ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్ ఏమిటి? ఎవరైతే 33, 33, 33 తర్వాత లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక్కసారి చదివి వంద పూర్తి చేస్తారో వారి యొక్క పాపాలు సముద్రపు నురుగంత ఉన్నా గానీ అవి మన్నించబడతాయి. ఎంత గొప్ప అదృష్టం గమనిస్తున్నారా మీరు? అలాగే సోదర మహాశయులారా, పది సార్లు, పది సార్లు, పది సార్లు చదవడం ఫర్జ్ నమాజ్ ల తర్వాత. దీని ఘనత నమాజ్ నిధులు అనేటువంటి మా వీడియోలో చెప్పడం జరిగినవి. మీరు జీడీకే ఎన్ఎస్సిఆర్ఈ యూట్యూబ్ ఛానల్ లో వెళ్లి నమాజ్ నిధులు అన్నది చూడండి. సుమారు దాంట్లో 10వ వీడియో, 10వ ఎపిసోడ్. మీకు అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసినంత, ఉమ్రా చేసినంత, హజ్ చేసినంత, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత పది పది సార్లు మీరు సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అంటూ ఉంటే, ఎంత గొప్ప ఘనతనో గమనించండి.
ఇంకా సోదర మహాశయులారా, ఈ పది పది సార్లు చదవడం ద్వారా దీని గురించి సహీహ్ హదీస్ ఒకటి అబూ దావూద్ లో కూడా వచ్చి ఉంది. మనం పది పది సార్లు చదివితే 30 అవుతాయి, ఐదు నమాజ్ లలో కలిపితే 150 అవుతాయి, కానీ త్రాసులో ప్రళయ దినాన 1500 పుణ్యాలు లభిస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు.
సోదర మహాశయులారా, మనం ఎప్పుడైతే నమాజ్ లో వచ్చి నిలబడతామో సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అని చదువుతామో ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి అని సహీహ్ ముస్లిం లో వచ్చి ఉంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, ప్రవక్తతో నేను ఈ హదీస్ విన్నప్పటి నుండి నా నమాజ్ ఆరంభంలో నేను ఇదే చదువుతాను అని. గమనిస్తున్నారా? ఈ విధంగా అల్లాహ్ యొక్క స్మరణలో చాలా చాలా లాభాలు ఉన్నాయి. అందుకొరకే అల్లాహు తాలా మీరు అధికంగా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయండి అని చెప్పాడు. మరియు ఏ నమాజ్ లో ఎక్కువగా అల్లాహ్ యొక్క ధిక్ర్ ఉంటుందో ఆ నమాజ్ యొక్క సవాబ్, ఆ నమాజ్ యొక్క పుణ్యం పెరిగిపోతుంది. ఏ ఉపవాసంలో అల్లాహ్ యొక్క ధిక్ర్ ఎక్కువ ఉంటుందో ఆ ఉపవాస పుణ్యం అనేది అందరికంటే ఎక్కువగా ఉంటుంది. ఏ హజ్ లో అల్లాహ్ యొక్క ధిక్ర్ ఎక్కువగా ఉంటుందో ఆ హజ్ లో, ఆ హజ్ యొక్క పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది.
చివరిలో ఒక రెండు విషయాలు తెలుసుకొని సమాప్తం చేద్దాము. అదేమిటంటే అధికంగా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయడం ఇది విశ్వాసుల ఉత్తమ గుణం. ధిక్ర్ లో వెనక అయి ఉండడం, ధిక్ర్ లో బద్ధకం వహించడం ఇది మునాఫికుల గుణం. మునాఫికులు అల్లాహ్ యొక్క ధిక్ర్ చేయడంలో చాలా బద్ధకం వహిస్తారు అని అల్లాహు తాలా స్పష్టంగా ఖురాన్ లో తెలిపాడు. అల్లాహు తాలా ఖురాన్ లో తెలిపాడు. అయితే అలాంటి ఆ బద్ధకం వహించే మునాఫికులలో మనం ఏ మాత్రం చేరకూడదు. మనం ఏ మాత్రం చేరకూడదు. సూరత్ నిసా ఆయత్ నెంబర్ 142. మీకు కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను, శ్రద్ధగా చూసి ఆ మునాఫికుల లిస్టులో నుండి తమను తాము బయటికి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا ఇన్నల్ మునాఫికీన యుఖాదిఊనల్లాహ వహువ ఖాదిఉహుమ్, వఇజా కామూ ఇలస్సలాతి కామూ కుసాలా యురాఊనన్నాస వలా యజ్కురూనల్లాహ ఇల్లా కలీలా. నిశ్చయంగా కపటులు అల్లాహ్ ను మోసం చేయజూస్తున్నారు. అయితే అల్లాహ్ వారి మోసానికి శిక్ష విధించనున్నాడు. వారు నమాజ్ కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు, ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు. వారు చాలా తక్కువగా అల్లాహ్ యొక్క స్మరణ చేస్తారు. నామమాత్రంగా అల్లాహ్ ని స్మరిస్తారు.
ఇలాంటి వారిలో మనం కలవకూడదు. ఇలాంటి ఈ భావం ఒకటి అక్కడ సూరత్ తౌబాలో కూడా చెప్పడం జరిగింది. సూరత్ తౌబాలో కూడా ఇలాంటి ఒక భావం వచ్చి ఉంది. అయితే సోదర మహాశయులారా, అల్లాహ్ యొక్క ధిక్ర్ అన్నది మనం ఉదయం మేల్కొని అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వఇలైహిన్నుషూర్ నుండి మొదలుకొని పొద్దంతలో అనేక సందర్భాల్లో చివరికి మళ్ళీ పడకపై వెళ్లే వరకు ప్రతి సమయం, ప్రతి సందర్భం, ప్రతి స్థితిలో ఉంది. యుద్ధ మైదానంలో శత్రువులు ఒకరిపై ఒకరు అక్కడ తూటలు వదులుకుంటూ, బాణాలు విసురుకుంటూ, రక్త సిక్తం అయ్యే సందర్భంలో కూడా అల్లాహ్ ఏమన్నాడు? మీరు ఒక వర్గాన్ని కలిసి యుద్ధంలో వారితో పోరాటంలో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా స్థిరంగా ఉండండి, వెనుదిరగకండి మరియు అల్లాహ్ ను అధికంగా స్మరించండి. గమనించండి, అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా అల్లాహు తాలా స్మరణ చేయడం నుండి మనకు మినహాయింపు ఇవ్వలేదంటే వేరే ఏ సందర్భంలో ఉంటుంది? అజాన్ తర్వాత కూడా ధిక్ర్ ఉంది, ఇంకా అనేక వజూ తర్వాత ఉంది, మస్జిద్ లో ప్రవేశించే సందర్భంలో ఉంది, రాత్రి వేళ ఉంది, రుకూలో, సజ్దాలో, కునూతులో, సలాం తింపిన తర్వాత, మయ్యిత్ కొరకు అలాగే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మనం చిన్నపాటి జేబులో ఉండేటువంటి పుస్తకాలు గానీ లేదా మన మొబైల్ లో చిన్నపాటి రెయిన్బో వల్ల ముఖ్యమైన దువాలు ఇలాంటి పీడీఎఫ్ గానీ పెట్టుకొని మనం అల్లాహ్ యొక్క స్మరణ అధికంగా చేస్తూ ఉన్నామంటే మనకు ఇహపరలోకాల్లో మేల్లే మేలు కలుగుతాయి.
చివరిలో ఒక హదీస్ యొక్క భావం, ఇక నేను అది చూపించి మళ్ళీ ఇంకా ఆలస్యం చేయను, హదీస్ భావం చెప్పి సమాప్తం చేస్తాను. అదేమంటే ఎవరైతే ఈ లోకంలో ఎక్కడైనా కూర్చుంటారో లేదా ఏదైనా ఎక్కడైనా నడుస్తారో లేదా ఎక్కడైనా ఇలా వెల్లకిలా పడుకుంటారో, అక్కడ అల్లాహ్ ను స్మరించలేదు, అల్లాహ్ ను స్తుతించలేదు, అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తపై దరూద్ చేయలేదు, చదవలేదు అంటే ఆ సమయం, ఆ ఘడియ, ఆ పడుకోవడం, ఆ నడవడం, ఆ కూర్చోవడం ఇదంతా కూడా వారి కొరకు ప్రళయ దినాన పశ్చాత్తాప భావంగా చాలా నష్టకరంగా ఉంటుంది. అక్కడ ఈ నష్టాన్ని తీర్చుకోవడానికి వేరే ఏ సాధనం ఉండదు. ఇలాంటి సమయం రాకముందే ఇక్కడే బుద్ధి జ్ఞానాలు నేర్చుకొని అల్లాహ్ ను అధికంగా స్మరించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
(ఆడియోలో కనిపించే హదీస్ యొక్క అనువాదం)
ఈ హదీస్ చూస్తున్నారు. దీనిని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. కేవలం అనువాదం నేను చెబుతున్నాను శ్రద్ధ వహించండి. అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సహాబాలతో అడిగారు, “నేను మీకు తెలియజేయనా, మీ కర్మల్లో అతి ఉత్తమమైనవి, అల్లాహ్ కు ఎక్కువగా ఇష్టమైనది, మీ యొక్క చక్రవర్తి అయిన అల్లాహ్ కు ఎక్కువగా ఇష్టమైనది, అంటే అల్లాహ్ కు ఎక్కువ ఇష్టమైన మరియు అల్లాహ్ వద్ద మీ కర్మల్లో అత్యంత ఉత్తమమైనది, మీ యొక్క స్థానాలను చాలా పైకి చేసే ఎత్తు చేసే రెట్టింపు చేసేటువంటిది, మరియు మీరు వెండి బంగారాలను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది. అంతేకాదు ఇంకా, ఇంకా ఉంది. మీరు మీ శత్రువులను కలిసి, మీరు వారి మెడలను నరకడం, వారు మీ మెడలను నరకడం కంటే కూడా ఉత్తమం.” అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క విషయం గురించి చెప్పాలనుకుంటున్నారు, కానీ ఎన్ని విషయాల కంటే ఉత్తమమైనదో గమనించండి. సర్వ కర్మల్లో ఉత్తమమైనది, అల్లాహ్ కు చాలా ప్రసన్నతమైనది, స్థానాలను రెట్టింపు చేయునది, మరియు వెండి బంగారం ఖర్చు చేయడం కంటే కూడా ఉత్తమమైనది, శత్రువులను కలిసి వారు మెడలు నరకడం మనం వారి మెడలను మెడలను నరకడం కంటే కూడా ఉత్తమమైనది. ఏంటి? అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క ధిక్ర్. చూశారా? ఇంత గొప్ప ఘనత. ఈ ఘనతను మనం మరియు ఇది చాలా సులభమైనది కూడా. ధిక్ర్ చేయడానికి మనకు వజూ అవసరం ఉండదు. ధిక్ర్ చేయడానికి మనకు నిలబడాలి, ఖిబ్లా దిశలో ఉండాలి ఇట్లాంటి ఏ కండిషన్లు లేవు. అందుకొరకే ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సబకల్ ముఫర్రిదూన్ అని చెప్పారు. అంటే అల్లాహ్ యొక్క ధిక్ర్ అధికంగా చేసేవారు చాలా చాలా చాలా అందరికంటే ముందుగా దూసుకెళ్లారు అని. అందుకొరకే మరొక హదీస్ లో ఉంది, మనిషిని అల్లాహ్ యొక్క శిక్ష నుండి కాపాడేది అల్లాహ్ యొక్క ధిక్ర్ కంటే గొప్ప విషయం మరొకటి వేరేదేమీ లేదు అని.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.