అశుద్ధ (అపరిశుభ్రత) విషయాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

అశుద్ధ విషయాలు వాటి వివరాలు, వాటిని పరిశుద్ధ పరచు విధానాల గురించి ఖుర్ఆన్ హదీసుల ఆధారంగా తప్పక వినండి, విన్పించండి

ఇక్కడ ఆడియో వినండి / డౌన్లోడ్ చేసుకోండి (28 నిమిషాల ఆడియో)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇతరములు:

ఇస్లాం లో దినాలు, తద్దినాలు, చాలీస్మాలు, బర్సీలు జరుపుకోవచ్చా? [ఆడియో]

బిస్మిల్లాహ్

dinalu taddinalu.jpg

ఇక్కడ ఆడియో వినండి / డౌన్లోడ్ చేసుకోండి (7 నిమిషాల ఆడియో)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత – హిస్నుల్ ముస్లిం

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో వినండి / డౌన్లోడ్ చేసుకోండి (7 నిమిషాల ఆడియో)

వక్త: అబూ హయ్యాన్ హమ్మాద్ ఉమరీ (హఫిజహుల్లాహ్)

[నుండి: హిస్నుల్ ముస్లిం, సంకలనం: షేఖ్‌ సయీద్‌  అల్‌ ఖహ్తాని , అనువాదం: జఫరుల్లాహ్‌ ఖాన్‌ నద్వీ]

అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత
అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత
అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత
అల్లాహ్ నామస్మరణ (జిక్ర్) యొక్క ఘనత

చెడు కలలు వస్తే ఏమి చెయ్యాలి? [ఆడియో]

బిస్మిల్లాహ్

[6:08 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


చెడు కల వచ్చినప్పుడు ఏం చెయ్యాలి?

  • అప్పడి దాక పడుకున్న దానికి భిన్నంగా అంటే కుడి వైపు ఉంటే ఎడమ వైపు, ఎడమ వైపు ఉంటే కుడి వైపుకు మరలి నిద్రపోవాలి.
  • ఎడమవైపు మూడు సార్లు ఉమ్మాలి.
  • షైతాన్ మరియు చెడు కలల నుండి అల్లాహ్ శరణు కోరుకోవాలి.
  • ఈ చెడు కల గురుంచి ఇతరులకు చెప్పకూడదు.

దుఆలు 

bad-dreams-1 చెడు కలలు

[హిస్నుల్ ముస్లిం, సంకలనం: షేఖ్‌ సయీద్‌  అల్‌ ఖహ్తాని , అనువాదం: జఫరుల్లాహ్‌ ఖాన్‌ నద్వీ]


bad-dreams-2 చెడు కలలు

ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు

బిస్మిల్లాహ్

“(ఓ ప్రవక్తా!) నీ వైపునకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్చు. నిశ్చయంగా నమాజ్‌ సిగ్గమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్నసంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.” (29, సూరతుల్‌ అన్‌కబూత్‌:45)

హజ్రత్ అబ్దుల్లాహ్‌ బిన్‌ జాబిర్‌ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఐదు పూటల నమాజు చేయటం మీలో ఒకరి ఇంటి ముందు నిండుగా ప్రవహిస్తున్న సెలయేటిలో (పతి రోజు ఐదుపూటల స్నానం చేయటం లాంటిది” (ముస్లిం).

ఒక వ్యక్తి జీవితమంతా ముస్లింగా ఉండాలంటే అతను ప్రతి రోజు ఐదు సమయాల నమాజు విధిగా ఆచరించాలి. నమాజును ఆచరించేవారి కొరకు ప్రళయ దినాన అది జ్యోతిగాను ధృవ పత్రముగాను ఉంటుంది. తద్వారా వారు ప్రళయ దినాన నరకం నుండి విముక్తి పొందుతారు. కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “వారి తరువాత కొందరు అయోగ్యులు వారి స్థానంలో వచ్చారు. వారు నమాజును త్యజించారు. మనో వాంఛలను అనుసరించారు. కనుక వారు త్వరలోనే (ప్రళయ దినాన) గయ్ (అనే నరకం)లో పడవేయబడుతారు” (19, సూరతుల్‌ మర్యం:59).

నమాజు ఆచరించేవారి కొరకు స్వర్గం ప్రాప్తమవుతుందని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: “తమ నమాజులను కాపాడుకునేవారు. ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు” (70, మఆరిజ్‌:34-35).

ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేసారు: “ప్రళయ దినాన దాసునితో మొట్టమొదట ప్రశ్నించబడే ఆరాధన నమాజు. ఆ నమాజును సరిగ్గా పాటించినట్లయితే సాఫల్యం పొందుతాడు. అదే గనుక సరిగ్గాలేదంటే అతను నష్టపోతాడు, విఫలుడవుతాడు” (తిర్మిజీ, సహీహ్‌ అల్‌ జామీ :2020).

నరకవాసుల పాపాల గురించి స్వర్గవాసులు ప్రశ్నించే విషయాన్ని అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు: మీరు ఎందువల్ల నరకంలో పడ్డారు? (అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు). “మేము నమాజును స్థాపించలేదు. మేము పేదలకు అన్నదానం చేసేవారము కాము. మరియు మేము సత్యాన్ని తిరస్కరించే వారితో కలిసి సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండేవారము. ప్రళయ దినాన్ని అబద్దంగా భావించాము, చివరికి మాకు మృత్యువు వచ్చేసింది” (74, సూరతుల్‌ ముద్దసిర్‌:42-47).

నమాజును ఉద్దేశ్యపూర్వకంగా వదిలినవారు ముస్లిములు కానేకారని ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: “విశ్వాసిగల దాసునికి కుఫ్ర్ కు (తిరస్కారికి) మధ్య వ్యత్యాసం నమాజును పాటించకపోవడమే”” (ముస్లిం). ప్రవక్త ముహమ్మద్‌ మరొకచోట ఇలా ప్రవచించారు: “మన (విశ్వాసుల) మధ్య మరియు వారి (అవిశ్వాసుల) మధ్య ఉన్న ఒడంబడిక నమాజును పాటించడము. ఎవరైయితే దాన్ని (నమాజును) పాటించరో, వారు అవిశ్వాసానికి గురికాబడ్డారు” (అహ్మద్‌, తిర్మిజీ, ఇబ్నుమాజా). మరొక చోట ఇలా తెలియజేసారు: “ఇస్లామే అసలైన ధర్మం. నమాజు దీని స్తంభం, దీని అత్యుత్తమ విలువైన స్థానం “అల్‌ జిహాద్‌ ఫీ సబీలిల్లాహ్‌”’ (ముస్లిం).

ప్రియమైన సోదరులారా! నమాజును జీవితంలో ఒక భాగంగా భావించి తప్పక నెరవేర్చండి. అప్పుడే ఇహపరాల సాఫల్యం పొందగలరు. ఎవరయితే ఆత్మ పరిశీలన చేసుకుంటారో, మరణానంతర జీవితం కొరకు సదాచరణా చేసుకుంటారో వారే వివేకవంతులు. మరెవరయితే తన మనసును దాని కోరికల అనుసరణకై వదిలేస్తారో, తరువాత అల్లాహ్‌ అనుగ్రహంపట్ల ఆశలు పెంచుకుంటారో వారే అవివేకులు.


ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)


ఈద్ (పండుగల) నమాజు

బిస్మిల్లాహ్

ఈద్ పండుగల నమాజు :

రమజాన్‌ మరియు బక్రీద్‌ పండుగల నమాజు విధిగా నిర్ణయించబడింది. నిశ్చయంగా ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి పండుగ రోజున నమాజు చేసేవారు. స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరికీ  పండుగ నమాజు వాజిబు.

పండుగ రోజు స్నానం చేయడం మన శక్తిని బట్టి మంచి దుస్తులు ధరించడం సున్నతుగా భావించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెల్ల దుస్తులు ధరించేవారు. తెల్ల దుస్తులంటే చాలా ఇష్టపడేవారు. మరియు సువాసనలో అన్నిటికంటే మంచి సువాసన పూసుకునేవారు. అలాగే యమని అబాయా తొడిగేవారు” (తబ్రాని).

రమజాన్‌ పండుగ నమాజుకు బయలుదేరక ముందు అల్పాహారం చేయడం సున్నతు. బక్రీద్‌ పండుగ నమాజు తరువాత అల్పాహారం చేయడం సున్నతు. (సహీహుల్‌ జామీ :4845, ఇబ్నుమాజా)

బక్రీద్‌ పండుగ నమాజుకు, రమజాన్‌ పండుగ నమాజుకు బయలు దేరేటప్పుడు బిగ్గరగా తక్బీర్ చెబుతూ ఈద్‌గాహ్‌ చేరుకోవాలి.

అరఫా రోజు ఫజర్‌ నమాజు నుండి అయ్యాముత్‌ తష్‌రీఖ్‌ (బక్రీద్‌ నెల 9,10,11,12,13) రోజుల్లో తక్బీర్ పదాలు పఠిస్తూ ఉండాలి.

అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, అల్లాహు అక్బర్‌, లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహ్‌ అక్బర్‌, అల్లాహు అక్బర్‌ వ లిల్లాహిల్‌హమ్ద్”. అలాగే బక్రీద్‌ నాలుగు (10,11,12,139) రోజులలో ఖుర్చాని ఇవ్వవచ్చును.

(సహీహుల్‌ జామీ  :5004, ఇర్వావుల్‌ గలీల్‌:654).

బక్రీద్‌ పండుగ రోజు తరువాత మూడు రోజులు ఖుర్బానీ చెయ్యవచ్చును. కాని పండుగ (జుల్‌హజ్‌10వ) రోజు ఖుర్బానీ చెయ్యడం ఉత్తమమైనది.

అయ్యాముత్‌ తష్‌రిఖ్‌ అంటే జిల్‌హజ్‌ నెల 11,12,13, రోజులు ఖుర్బానీ రోజులే. జిల్‌హజ్‌ 13వ రోజు సూర్యాసమయం వరకూ ఖుర్బానీ చెయ్యవచ్చును.

ఖుర్చానీ ఇవ్వదలుచుకున్నవారు తమ చేతులతోనే ఖుర్బానీ జంతువును జబహ్‌ చెయ్యడం మంచిది. అలాగే స్త్రీలు కూడా తమ ఖుర్బానీ జంతువును జబహ్‌ చెయ్యవచ్చును. లేక ఇతరుల ద్వారా జబహ్‌ చెయ్యించడం కూడా ధర్మమే.

పండుగ నమాజు తరువాత ఒక మంచి ధారుగల కత్తిని తీసుకొని “ఖుర్బానీ దుఆ” పఠించి జంతువును జబహ్‌ చేయాలి. తరువాత ఆ మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని బీదవారికి, మరొక భాగాన్ని బంధువులకు పంచాలి. మూడవ భాగాన్ని తమ సొంతానికై ఉంచుకోవాలి.

ఖుర్బానీ దుఆ:

ఇన్నీ వజ్జహతు వజ్‌హియ లిల్లజీ ఫతరస్‌ సమావాతి వల్‌ అర్జ, హనీఫఃవ్‌ వమా అనా మినల్‌ ముష్‌రికీన్‌, ఇన్న సలాతి వ నుసుకీ వ మహ్‌యా వమమాతీ లిల్లాహి రబ్బిల్‌ ఆలమీన్‌, లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్‌తు వ అన అవ్వలుల్‌ ముస్లీమీన్‌. అల్లాహుమ్మ మిన్‌క వ లక అన్‌ ……” ఖుర్బానీ ఎవరిపేరుతో ఇవ్వబడుతుందో వారి పేరు పేర్కొని “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్‌” అని జబహ్‌ చెయ్యాలి.

రమజాన్‌ పండుగ నమాజుకు బయలదేరక ముందు ‘ఫిత్రా దానం చెల్లించాలి. బక్రీద్‌ పండుగ నమాజుకు తరువాత ఖుర్బానీ ఇవ్వాలి. (బుఖారి, ముస్లిం)

ఫిత్రా దానం చెల్లించే స్తోమత కలిగిన ప్రతి ముస్లిం విధిగా ఫిత్రా దానం చెల్లించాలి. ఇంట్లో ఉన్నవారి ప్రతి వ్యక్తికి బదులు ఒక ‘సా’ (2.500 కి.) హిజాజి ధాన్యాలు (బియ్యం లేక గోదుమలు లేదా మనం నిరంతరాయంగా వాడుకునే ధాన్యం) దానంగా ఇవ్వాలి. (అహ్మద్‌)

ముస్లిం సమాజానికి చెందిన బీదవారికి మాత్రమే ఫిత్రా దానం ఇవ్వాలి. అది ధాన్యం రూపంలో దానం చెయ్యడం ఉత్తమమైన ఆచారం.

హజ్రత్‌ అబూ సయీద్‌ ఖుద్రి;ఈ కథనం; ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు: “ప్రతి పండుగ నమాజు ఆచరించుటకై ఈద్‌గాహ్‌ వెళ్ళేవారు” (బుఖారి, ముస్లిం).

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు కాలి నడన వెళ్ళేవారు” (సహీహుల్‌ జామీ :4710).

ప్రవక్త ముహమ్మద్‌: ఈద్‌గాహ్‌కు చిన్నారి పాపలను, యువతులను, వయసు మీరిన స్త్రీలను మరియు ఎవరి దగ్గరనైతే దౌని (స్కార్ఫ్) లేదో, వారు తమ సహోదరి వద్దనుండి దౌని తీసుకొని ఈద్‌గాహ్‌ పోవాలని ఆజ్ఞాపించారు. దీని ఉద్దేశ్యం ఏమంటే, స్త్రీలుకూడా ముస్లిం సమూహంలో వారి దుఆ పొందగలరని. దీనికి ఆధారంగా ఒక హదిసులో ఉమ్మే అతియ్యా ఈ ఉల్లేఖించారు: “పురిటి స్త్రీలు, బహిష్టు స్త్రీలు, పరదాలో ఉన్న మహిళలు నమాజ్‌ నెరవేర్చుటకై ఈద్‌గాహ్‌ పోవాలని, ముస్లిం పురుషులతో పాటు దుఆలో పాల్గొనాలనీ మాకు ఆజ్ఞాపించారు. కాని బహిష్టు స్త్రీలు మాత్రం నమాజు నుండి తప్పుకోవాలనీ ఆదేశించారు” (బుఖారి, ముస్లిం).

పండుగ నమాజుకు ముందు ఎలాంటి నఫిల్‌ నమాజు నెరవేర్చకూడదు.హజ్రత్ అబూ సయీద్‌ ఖుద్రి (రధి అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పండుగ నమాజుకు ముందు (నఫిల్‌) నమాజు నెరవేర్చలేదు. కాని పండుగ నమాజు తరువాత ఇంటికి వచ్చి రెండు రకాతులు (నఫిల్‌) చదివేవారు. (బుఖారి, ముస్లిం)

పండుగ నమాజాకై అజాన్‌ లేక ఇఖామత్‌ చెప్పకూడదు. హజత్‌ జాబిర్‌ బిన్‌ సముర (రధి అల్లాహు అన్హు) కథనం: “నేను ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారితో పండుగ నమాజు ఒకసారి రెండుసార్లు కాదు ఎన్నోసార్లు అజాన్‌ మరియు ఇఖామత్‌ లేకుండానే చదివాను.” (ముస్లిం)

పండుగల నమాజు సమయం: హజ్రత్‌ జున్దుబ్‌-ఈ కథనం ప్రకారం: “ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు రెండింతలు అయిన తరువాత రమజాన్‌ నమాజు చదివేవారు. మరియు సూర్యుడు ఉదయించిన తరువాత ఈటె నీడ దాని ఎత్తుకు సమానంగా అయిన తరువాత బక్రీద్‌ నమాజు చదివేవారు”

ఇమామ్‌ షౌకానీ (రహిమహుల్లాహ్ అలైహి) గారు ఇలా తెలియజేసారు. “ఈ హదీసు పండుగ నమాజు సమయాల హదిసులలో చాలా ప్రామాణికమైన హదీస్‌గా భావించారు” (ఫిఖ్‌హుస్‌ సున్నా:1/279).

[అరబ్‌ దేశాలలో ఈద్‌ నమాజ్‌ సున్నత్‌ సమయం ప్రకారం నెరవేర్చుచున్నారు. కాని మన దేశాలలో ఈద్‌ నమాజ్‌ చాలా ఆలస్యంగా నెరవేర్చే అలవాటుకు గురికాబడ్డారు. ఇది ఎంత మాత్రం సున్నత్‌ పద్దతి కాదు.]

పండుగ రోజు పిల్లలు దఫ్‌ వాయించి ధర్మ పద్దతిలో మంచి గీతాలు మరియు ఇతర ఆటలతో ఖుషీ చేయవచ్చును. (బుఖారీ)

పండుగల రోజు ఇతరులతో కలసినప్పుడు “తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్కా” అని చెప్పవలెను. (మా పుణ్యాలు మీ పుణ్య కార్యాలను అల్లాహ్‌ స్వీకరించుగాక) (తమాముల్‌ మిన్నా లిల్‌ అల్బాని:1/ 356)

పండుగల నమాజ్‌ ఆచరించే విధానము:

1) కాబతుల్లాహ్‌ దిశకు తిరిగి నిలబడాలి.

2) నమాజు కొరకై నియ్యత్‌ మనసులో అనుకోవాలి.

3)తరువాత పంక్తుల్ని తిన్నగా ఉంచుకోవాలి. పోత పోసిన సీసపు గోడ మాదిరిగా కలిసి నిలబడాలి. (బుఖారి, ముస్లిం)

4) తక్సీర్‌ (అల్లాహు అక్బర్‌) చెప్పినప్పుడు చెవుల వరకు చేతులను ఎత్తాలి. (ముస్లిం) చెవులను తాకవలసిన అక్కర లేదు. ఆ తరువాత కుడి చేతితో ఎడమ చెయ్యి మణికట్టుని పట్టుకొని రెండు చేతులను రొమ్ముపై (ఛాతిఫై) ఉంచాలి. (నసాయి, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, అల్‌ అల్పానీ రహిమహుల్లాహ్ | పేజీ: 88)

5) చూపులను సజ్డా స్థలంసై ఉంచాలి. (బైహఖి, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, లిల్‌ అల్బానీ రహిమహుల్లాహ్ | పేజీ నెంబరు: 88)

6) తరువాత నమాజు ఆరంభానికై (సున్నతుగా) ఒక దుఆ చదవాలి.

సుబ్‌హాన కల్లాహుమ్మ వబిహమ్‌దిక వతబార కస్‌ముక, వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక”” (అబూదావూద్‌, సహీహ్‌ సిఫతుస్‌ సలాతున్‌ నబి, లిల్‌ అల్బానీ రహిమహుల్లాహ్ పేజీ నెంబరు: 93)

7) తరువాత 7 సార్లు తక్బీర్లు  (అల్లాహు అక్బర్‌ )నిదానంగా చెప్పాలి. (తిర్మిజి, అబూదావూద్‌)

ప్రతి తక్బీర్ కు చేతులను భూజాల వరకు లేక చెవుల వరకు ఎత్తాలి.

8) తరువాత ఇమామ్‌ బిగ్గరగా సూరతుల్‌ ఫాతిహా చదవాలి. ఇమామ్‌ వెనుక ఉన్నవారు (ముఖ్తదీలు) మెల్లగా చదవాలి. ఆ తరువాత ఇమామ్‌ వేరొక సూరా చదవాలి. ఇమామ్‌ వెనుక ఉన్నవారు నిశబ్దంగా వినాలి. సూరతుల్‌ ఫాతిహా మినహా ఇతర సూరాలు ముఖ్తదీలు చదవకూడదు.

9) తరువాత రుకూ సజ్దాలు చేసి రెండవ రకాతుకై అల్లాహు అక్బర్‌ అని నిలబడి సూరాలు పఠించక ముందు ఐదు సార్లు తక్బీర్లు  నిదానంగా చెప్పి ప్రతి తక్బీర్ కు చేతులను భుజాల వరకు లేక చెవుల వరకు ఎత్తి ఛాతిపై కట్టుకోవాలి. ( అబూదావూద్‌)

10) పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఖాఫ్‌ వల్‌ ఖుర్‌ఆనిల్‌ మజీద్‌) సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “ఇఖ్బరబతిస్‌ సాఅతు వన్‌ షఖ్బల్‌ ఖమర్‌” సూరా చదవాలి. (ముస్లిం)

లేక పండుగ నమాజు మొదటి రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “సబ్బిహిస్మ రబ్బికల్‌ ఆలా” సూరా మరియు రెండవ రకాతులో ఫాతిహా సూరా చదివిన తరువాత “హల్‌ అతాక హదిసుల్‌ గాషియా” సూరా చదవాలి. (ఇర్వావుల్‌ గలీల్‌: 644)

11) ఆ తరువాత ప్రసంగించడం సున్నతు. ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్‌ అబూబకర్‌, మరియు హజ్రత్‌ ఉమర్‌ పండుగ నమాజు చేసిన తరువాత ప్రసంగించేవారు. (బుఖారీ, ముస్లిం)

12) పండుగ ప్రసంగం మింబర్ (వేదిక)పై  ఎక్కి ప్రసంగించకూడదు. (బుఖారి, ముస్లిం)

అంటే ఈద్‌గాహ్‌లో మింబర్ తీసుకొపోవడం లేక అక్కడ మింబర్ లా కట్టించి దానిపై ఎక్కి ప్రసంగం చేయకూడదు. మామూలుగా నిలబడి ప్రసంగించాలి.


ఇది “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానము” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజ హుల్లాహ్)


జుమా నమాజుకు త్వరగా వెళ్లడంలో ఘనత, దాన్ని కోల్పొవటం గురించి హెచ్చరిక [వీడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఈ ఆడియో శుక్రవారం (జుమా) నమాజుకు త్వరగా హాజరు కావడం యొక్క ప్రాముఖ్యతను మరియు దానిని విడిచిపెట్టడం గురించిన తీవ్రమైన హెచ్చరికను వివరిస్తుంది. ఖురాన్ ఆయత్ (సూరా అల్-జుమా) మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసుల ఆధారంగా ఈ విషయం స్పష్టం చేయబడింది. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం, జుమా నమాజుకు వేర్వేరు సమయాలలో (గడియలలో) ముందుగా వచ్చిన వారికి గొప్ప పుణ్యాలు లభిస్తాయి. మొదటి గడియలో వచ్చినవారికి ఒంటెను, రెండవ గడియలో వచ్చినవారికి ఆవును, ఆ తర్వాత గొర్రె, కోడి, మరియు కోడిగుడ్డును బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుందని వివరించబడింది. ఇమామ్ ఖుత్బా (ప్రసంగం) ఇవ్వడానికి మింబర్ పైకి వచ్చిన తర్వాత, హాజరైన వారి పేర్లను నమోదు చేసే దేవదూతలు తమ గ్రంథాలను మూసివేసి ప్రసంగాన్ని వింటారని, కాబట్టి ఆలస్యంగా వచ్చేవారు ఈ ప్రత్యేక పుణ్యాన్ని కోల్పోతారని నొక్కి చెప్పబడింది. మరో హదీసులో, జుమా నమాజును నిరంతరంగా వదిలివేసే వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేస్తాడని, దానివల్ల వారు అశ్రద్ధపరులలో చేరిపోతారని తీవ్రంగా హెచ్చరించబడింది. ముగింపులో, జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, అజాన్‌కు ముందే మస్జిద్‌కు చేరుకోవాలని, ఈ తప్పనిసరి ప్రార్థనను విడిచిపెట్టే ఘోర పాపానికి దూరంగా ఉండాలని వక్త ఉద్బోధించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్.సోదర మహాశయులారా, జుమా నమాజ్ కు త్వరగా హాజరవటంలోని ఘనత, దాన్ని కోల్పోవటం గురించి హెచ్చరిక, ఈ అంశానికి సంబంధించి ఒక ఆయత్ మరియు రెండు హదీసులు విందాము.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ.
ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకు గాను పిలవబడినప్పుడు మీరు అల్లాహ్ ధికర్ వైపునకు పరుగెత్తి రండి మరియు వ్యాపారం వదిలిపెట్టండి. మీరు తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా మేలైనది.

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్

مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ غُسْلَ الْجَنَابَةِ ثُمَّ رَاحَ فَكَأَنَّمَا قَرَّبَ بَدَنَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّانِيَةِ فَكَأَنَّمَا قَرَّبَ بَقَرَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الثَّالِثَةِ فَكَأَنَّمَا قَرَّبَ كَبْشًا أَقْرَنَ وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الرَّابِعَةِ فَكَأَنَّمَا قَرَّبَ دَجَاجَةً وَمَنْ رَاحَ فِي السَّاعَةِ الْخَامِسَةِ فَكَأَنَّمَا قَرَّبَ بَيْضَةً فَإِذَا خَرَجَ الإِمَامُ حَضَرَتِ الْمَلاَئِكَةُ يَسْتَمِعُونَ الذِّكْرَ ‏”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు: “ఎవరైతే జుమా రోజు జనాబత్ కు చేసే గుసుల్ లాంటి గుసుల్ స్నానం, అంటే సంపూర్ణ విధంగా స్నానం చేసి మస్జిద్ కు అందరికంటే ముందు వెళ్తాడో అతనికి ఒక ఒంటె బలిదానం ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. రెండవ వేళలో వెళ్ళిన వ్యక్తికి ఆవును బలిదానం ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వచ్చిన వారికి కొమ్ములు గల గొర్రెను బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది మరియు నాలుగవ గడియలో వెళ్ళే వారికి ఒక కోడి అల్లాహ్ మార్గంలో బలిదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఐదవ వేళలో వెళ్ళే వారికి అల్లాహ్ మార్గంలో ఒక కోడి గ్రుడ్డును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇమాం ఖుత్బా ఇవ్వడానికి మింబర్ పైకి వస్తాడో, దేవదూతలు కూడా ప్రసంగం ఖుత్బా వినడానికి హాజరవుతారు.”

అంటే ఏం తెలిసింది? ఈ ఐదు వేళలు ఏవైతే తెలుపబడ్డాయో, అవి కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఫజర్ తర్వాత లేదా సూర్యోదయం తర్వాత నుండి ఇమాం మెంబర్ పైకి ఎక్కే వరకు. ఇక ఎవరైతే ఇమాం మెంబర్ పై ఎక్కిన తర్వాత మస్జిద్ లోకి ప్రవేశిస్తారో, ఈ దైవదూతలు ప్రత్యేకంగా జుమా కొరకు వచ్చే వారి గురించి తమ యొక్క దఫ్తర్ లలో, తమ యొక్క నోట్ బుక్స్ లలో ఏదైతే వారి పేర్లు రాసుకుంటూ ఉండడానికి వస్తారో వారి యొక్క జాబితాలోకి చేరకోరు. అంటే ఎంతో గొప్ప పుణ్యాన్ని, జుమాకు సంబంధించిన ప్రత్యేక ఘనతను వారు కోల్పోతున్నారు అని భావం.

మూడవ హదీస్, అన్ ఇబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్నహు సమిఅ రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూల్

لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ
“జుమా నమాజు చేయని వారు, జుమా నమాజును వదిలేవారు, వారు తమ ఈ అలవాటును మానుకోకుంటే త్యజించుకుంటే అల్లాహ్ వారి హృదయాలను మూసివేస్తాడు. వారి హృదయాలపై ముద్ర వేస్తాడు. ఏం జరుగుతుంది? ఆ తర్వాత వారు అశ్రద్ధ వహుల్లోకి చేరిపోతారు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా తాను విన్నట్లు అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు ఉల్లేఖించారు.

అయితే సోదర మహాశయులారా, పై ఆయత్ మరియు హదీసుల నుండి మనకు తెలిసిన విషయాలు ఏమిటి? జుమా నమాజ్ అజాన్ కంటే ముందే మస్జిద్ లోకి వచ్చి హాజరయ్యే, ఖుత్బా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి. జుమా నమాజుకు త్వరగా పోవుటలో చాలా ఘనత ఉంది, ఐదు రకాలుగా దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. జుమా నమాజ్ వదిలే వారికి భయంకరమైన హెచ్చరిక ఇవ్వబడింది. అలా చేయుట వల్ల వారి హృదయాలపై ముద్ర వేయడం జరుగుతుంది. మంచి విషయాలు, ధర్మ విషయాలు, అల్లాహ్ యొక్క బోధనలు అర్థం చేసుకోకుండా మూసివేయబడతాయి. అల్లాహు అక్బర్. ఇది ఎంత భయంకరమైన శిక్షనో గమనించండి. అల్లాహ్ తలా మనందరికీ జుమా యొక్క ఘనతను అర్థం చేసుకుని, దానిని పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.

ఇతరములు:

అపశకునాల నమ్మకాలు ఇస్లాంలో నిషిద్ధం

బిస్మిల్లాహ్

అపశకునాల నమ్మకాలు కలిగిన ప్రజలు పూర్వపు కాలం నుండి ఈ రోజు వరకు ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి ఒక్కొ విధమైన నమ్మకం. కనుక కొంత మంది రాహు కాలాన్ని నమ్ముతారు. ఆ కాలానికి అనుగుణంగా తమ జీవితాలను గడుపుతారు. ఇంకా కొంత మంది గర్బవతి చనిపోతే అపశకునంగా భావించి, ఆమె అంతక్రయలు జరపకుండా కాకులు, గద్దలు పెక్కు తినుట కొరకు ఊరు బయట ఆమె దేహాన్ని పడేసిన సంఘటనలు ఉన్నాయి. మరియు కొంత మంది ప్రజలు ఉదయాన్నే వితంతువు ఎదురుపడితే అపశకునంగా భావిస్తారు. ఒకవేళ తమ అమ్మ లేక చెల్లి లేక కూతురు విధవరాలు ఉంటే, వారిని కూడా ఎదురుగా రాకూడదని నివారిస్తారు. మరియు కొందరు వారి నివాసాలను ఇంటి వరండాలకే  పరిమితం చేస్తారు.

మరియు కొందరు ఇంటి నుండి బయలదేరేటప్పుడు పిల్లి గనుక ఎదురు వస్తే, లేక ఎవరైనా వారి ముందు తుమ్మినట్లయితే అపశకునంగా భావిస్తారు. తిరిగి ఇంట్లోకి పోయి కొన్ని నిమిషాలు కూర్చొన్న తరువాత తమ పనిపై బయలదేరుతారు. మరియు వీధికి ఎదురుగా ఇల్లు ఉంటే “వీధి పోటు” అని అపశకునంగా భావించేవారు కూడా ఉన్నారు. మరి కొంత మంది తమ ఇంటి వాస్తు సరిలేక పోతే, దానిని అపశకునంగా భావించి కట్టిన ఇల్లును కూలదీసిన సంఘటనలు లేకపోలేదు.

సూర్య గ్రహణాన్ని, చంద గ్రహణాన్ని కూడా అపశకునంగా నమ్ముతారు. గర్భిణీలపై వాటి ఛాయ పడితే పుట్టబోయే పిల్లలు గుడ్డివారిగానో, కుంటివారిగానో పుట్టుతారని భావిస్తారు. మరియు ఫలానా తేదిలలో లేక సమయాలలో పిల్లలు జన్మిస్తే భాగ్యవంతులు కారని, కాన్పు కాక మునుపే సిజేరియన్ చేసి కడుపులో నుండి పిల్లలను బయటకు తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరియు గ్రహణాల ప్రభావం దేవాలయాలపై ఉంటుందని పూజారులు నమ్ముతారు. కనుక వారు దేవాలయాలను సైతం మూసివేస్తారు.

మరియు కొంత మంది ప్రజలు పక్షులను ఎగురవేసి అవి కుడి దిశకు లేక ఎడమ దిశకు పోవటాన్నిబట్టి వారు శకునాలుగా నమ్ముతారు. తాము అనుకున్న దిశలో గాకుండా పక్షులు మరొక వైపు ఎగిరిపోతే దాన్ని అపశకునంగా భావిస్తారు. లేక అనుకున్న దిశలో ఎగిరిపోతే మంచి శకునంగా భావిస్తారు. ఇలా రక రకాల శకునాల నమ్మకాలు దేశ విదేశాల సమాజ ప్రజలలో విస్తరించి ఉన్నాయి.

ఇస్లామీయ ధర్మం ప్రకారం అపశకునం అనేది లేనే లేదు. మరియు లాభ నష్టాల అధికారం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ  లేదు. కనుక అల్లాహ్‌ ఇలా తెలియజేసాడు:

وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఓ ప్రవకా! ఇలా అను: “మరియు అల్లాహ్‌ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే! ఆయనే ప్రతిది చేయగల సమర్థుడు.”(సూరతుల్‌ అన్ఆమ్‌:17)

మరొకచోట ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది:

وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ

“ఒక వేళ అల్లాహ్‌ నీకు ఏదైన ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అను(గహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు” (సూరత్  యూనుస్‌:107)

మరొకచోట ఇలా ఉంది:

إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ

“అల్లాహ్‌ నాకు కీడు చేయదలుచుకుంటే – ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక ఆయన (అల్లాహ్)  నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?” వారితో ఇంకా ఇలా అను: “నాకు కేవలం అల్లాహ్‌ చాలు! ఆయన (అల్లాహ్)ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మకముంచుకుంటారు.” (సూరతు జుమర్‌:38)

హజ్రత్‌ అబ్దుల్లాహ్  బిన్‌ అబ్బాస్‌ (రధియల్లాహు అన్హు) కథనం: నేను ఒక రోజు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వాహనంపై ఆయన వెనుక కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు:

“ఓ అబ్బాయి! నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పుతాను. నీవు అల్లాహ్‌ను గుర్తుంచుకో (అల్లాహ్‌ ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి ఉండు) అల్లాహ్‌ నిన్ను గుర్తుంచుకుంటాడు. నీవు అల్లాహ్‌ను గుర్తుంచుకో, ఆయన నీ ముందున్నట్లే గ్రహిస్తావు (అల్లాహ్‌ సహాయం నీ కొరకు నిత్యం ఉంటుంది). నీవు అర్ధించ దలుచుకున్నప్పుడు అల్లాహ్‌నే అర్థించు. నీవు సహాయం కోరాలనుకుంటే, అల్లాహ్‌నే సహాయం కోసం అర్ధించు. జా(గత్త! లోకమంతా ఏకమై నీకు మేలు చేకూర్చాలనుకున్నా అల్లాహ్‌ నీ కోసం వ్రాసి పెట్టిన దానికంటే ఎక్కువేమీ అది నీకు మేలు చేకూర్చజాలదు. ఒక వేళ నీకు కీడు తలపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఏకమైనా కూడా అల్లాహ్‌ నీ కోసం వ్రాసి ఉంచిన దానికంటే ఎక్కువ నష్టమేమి అది కలిగించజాలదు. ఎందుకంటే కలములు పైకి లేపుకోబడ్డాయి. (విధివ్రాత (వాయటం అయిపోయింది.) పత్రాల సిరా ఆరిపోయింది.”

(తిర్మిజీ: 2516, సహీహుల్‌ జామీ : 7957)

హజత్‌ బురైదా (రధియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) : “దుశ్శకునాలు చూసేవారు కాదు” (అబూదావూద్‌:3920).

కునమైనా  అపశకునమైనా, దౌర్చాగ్యమైనా, కలిమి అయినా- లేమి అయినా అంతా అల్లాహ్‌ చేతుల్లోనే ఉన్నాయనీ, అమాయుకులను, అన్యం పుణ్యం తెలియని జంతువులను, నెలలను, దినాలను లేక సమయాలను దోషులుగా నిలబెట్టడం అర్ధం పర్ధం లేని విషయమేననీ మనం తెలుసుకోవాలి.


ఇది “ఇస్లాంలో అధర్మ కార్యాలు మరియు వాటి ప్రక్షాళణ” అను పుస్తకం నుంచి తీసుకోబడింది. (పేజీలు : 75 -78). కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ


మరణానంతర జీవితం [పుస్తకం]

పుస్తకం పేరు: మరణానంతర జీవితం (Life After Death)
(ఖుర్‌ఆన్‌ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో)
కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్) 

ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో మరణానంతర జీవితం గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.

ఇక్కడ పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
[మొబైల్ ఫ్రెండ్లీ] [PDF] [300 పేజీలు] [6.3 MB]

క్లుప్త విషయసూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

తొలి పలుకు:

అల్లాహ్‌కు మాత్రమే సర్వ స్తోత్రములు చెందును. ఆయనే సర్వలోకాలకు ప్రభువు, ప్రతిఫల దినానికి అధిపతి, ఆయన ఎంతో పరిశుద్దుడు సంరక్షకుడు. అల్లాహ్‌ శాంతి మరియు కరుణ కటాక్షాలు ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన అనుచరులపై, పుణ్యాత్ములైన సత్య మూర్తులసై కురియుగాక!.

మరణానంతర జీవితం మానవునికి అసలైన జీవితం. ఇహలోక జీవితంలో చేసుకున్న మంచిచెడులు మాత్రమే అతని వెంట వస్తాయి. మిగతా విషయాలన్ని ఇహలోక జీవితానికే పరిమితం. మానవుడు అసలైన విజయ లక్ష్యం సాధించాలంటే పరలోక విశ్వాసం, జ్ఞానం మరియు భయం, భక్తిని సాధించాలి. ఇహలోకంలో కూడా మనిషి శాంతి సుఖాలతో ఉండాలంటే మరియు సమాజం మానవ మర్యాదలతో ముందుకు నడవాలంటే పరలోక విశ్వాసమే పునాది. మరణానంతర జీవితం లేదంటే! మంచి, చెడులకు, సద్గుణాలకు, దుర్గుణాలకు, పాపాలకు, పుణ్యాలకు అర్జాలే ఉండవు. చావు బ్రతుకులకు, జంతువులకు, మానవులకు, స్వర్గానికి, నరకానికి కూడా అర్థమే లేదు.

మనిషి మరణించిన తరువాత తన విశ్వాసం ప్రకారం ప్రశ్నించబడుతాడు. ఒకవేళ అవిశ్వాసిగా ఉంటే, సర్వసృష్టికర్తను విశ్వసించకుండా నాస్తికుడిగా మారిపోయి. తన ఇష్టానుసారంగా జీవించడమే మానవుని లక్ష్యం అనుకుంటే అతను అవిశ్వాసి. ఇంకా కొంత మంది ప్రజలు దేవుడు ఉన్నాడనీ పరలోకం వాస్తవమేననీ, స్వర్గం, నరకం నిజమేననీ విశ్వసించినా వాటి వాస్తవాలను గ్రహించకుండా తమ ఇష్టానుసారంగా మూఢ విశ్వాసాలకు అనుగుణంగా ఆరాధించేవారు కూడా అవిశ్వాసులే.

అల్లాహ్ పై విశ్వాసం లేకపోతే, మరణానంతర జీవిత వాస్తవాలను విశ్వసించకపోతే, మరియు వాటిపై ధృఢమైన నమ్మకం లేకపోతే, ఇంకా తమ జీవితాలను పుణ్య జీవితాలుగా మార్చుకోకపోతే, అలాంటివారి ఇహపరాల జీవిత ఫలితాలు శూన్యమే. వారు ఎన్ని మానవతా కార్యసాధనలు చేసినా, చక్రవర్తులుగా ఉండి రాజ్యం మొత్తం దానం చేసినా, పరలోక లక్ష్యాన్ని సాధించలేరు. నరకాగ్ని నుండి రక్షించబడలేరు.

మానవునికి ప్రసాదించబడిన ఒక్కొక్క క్షణం మరియు ఒక్కొక్క అనుగ్రహం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. వాటికి సమాధానం ఇవ్వనిదే మనిషి ఒక్క అడుగు ముందుకు వేయలేడు. అతను తాను చేసిన ప్రతి పనిని, ప్రతి మాటను, ప్రతి కుట్రను గురించి ప్రశ్నించబడుతాడు.

మరణానంతర జీవిత విశ్వాసం వలన మానవుడు పరలోక బాధల నుండి రక్షింపబడాలని, పరలోక జ్ఞానాన్ని అధ్యయనం చేసి దాన్ని విశ్వసిస్తాడు. ఇహలోక జీవితాన్ని ఉత్తమ రీతిలో గడుపుటకై సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అలాగే మరణానంతర జీవిత విశ్వాసం వలన మానవుడు మృత్యువు పాందే వరకూ ఒక లక్ష్యాన్ని సాధించాలనీ శ్రమిస్తాడు. ఆ మహా లక్ష్యమే స్వర్గం.

మరణానంతర జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అగోచర విషయాలను, అంటే మనిషి మరణించిన తరువాత నుండి స్వర్గంలోనికి లేక నరకంలొనికి చేరుకునే వరకు ఎదురయ్యే విషయాలను ఖుర్‌ఆన్‌ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో అల్లాహ్‌ ప్రసాదించిన జ్ఞానం మేరకు మీ ముందు పొందుపరిచే ప్రయత్నం చేసాము.

అహ్‌వాలుల్‌ ఖియామహ్‌”’అనే పేరున అబ్దుల్ మలిక్‌ అల్‌ కులైబ్‌ గారు, మరియు “అల్‌ జన్నత్‌ వన్‌నార్‌‘” పేరున ఉమర్‌ అల్‌ అష్‌ఖర్‌ గారు ఖుర్‌ఆన్‌ ఆయతులను మరియు ప్రామాణికమైన హదిసులను సేకరించి అరబీ భాషలో గ్రంథస్థం చేసారు. ఈ రెండు పుస్తకాలను అధ్యయనం చేసిన తరువాత మేము మీ కొరకు “మరణానంతర జీవితము” పేరుతో ఈ పుస్తకాన్ని సంక్షిప్తంగా తెలుగు భాషలో కూర్చు చేసాము. మరి కొన్ని వివరాలను కూడా అనేక ప్రామాణికమైన హదీసు గ్రంథాల నుండి సేకరించి చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో కూర్చు చేసాము.


సమగ్ర విషయ సూచిక

  • [1] మరణానంతర జీవిత విశ్వాసము
    1. మనిషికి జ్ఞానం ఎలా ప్రసాదించబడింది?
    2. మరణానంతర జీవితాన్ని ఎందుకు తిరస్కరించారు?
    3. జన్మించిన వారు మరణించక తప్పదు. మరణించిన వారు ప్రళయ దినాన జన్మించక తప్పదు.
  • [2] మనుషులకు మరణం ప్రాప్తమయ్యే లక్షణాలు.
    1. విశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే మంచి లక్షణాలు.
      1. కలిమయే షహాదత్‌.
      2. నుదుటిపై చెమటలు.
      3. శుక్రవారం మరణం.
      4. షహీద్‌ కాబడిన ముస్లిం (అమరుడు).
      5. అల్లాహ్‌ మార్గంలో (ఫీ సబిలిల్లాహ్‌) మృత్యువు పాందినవారు షహీద్‌.
      6. పుణ్యకార్యాలు చేస్తుండగా మరణం సంభవిస్తే స్వర్గం ప్రాప్తమవుతుంది.
    2. అవిశ్వాసికి మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే చెడ్డ లక్షణాలు.
      • ధర్మాన్ని తప్పుగా విశ్వసించిన ప్రజలు.
    3. మరణం సమీపించినప్పుడు దైవదూతలు   ప్రత్యక్షమవుతారు.
    4. మరణ వేదనలు (సకరాతుల్‌ మౌత్‌).
    5. ఆకాశాలఫైకి ఆత్మ ప్రయాణం.
      • విశ్వాసిగా ఉన్న పుణ్యాత్ముడైన ముస్లిం ఆత్మకు లభించే గౌరవం.
      • అవిశ్వాసికి మరియు పాపాత్ముడైన ముస్లిం ఆత్మకు ధిక్కరణ లభిస్తుంది.
  • [3] సమాధిలో ఏం జరుగుతుంది?
    1. సమాధిలో ప్రశ్నోత్తరాల తరువాత జరిగే సుఖదుఃఖాలు.
    2. సమాధి తీవ్రత.
    3. సమాధి భయాందోళన
      • సమాధి చీకటి.
      • నమ్మక ద్రోహం (గులూల్‌).
      • అబద్దాలు పలికేవారు, వ్యభిచారులు, వడ్డీ తీసుకునే వారు, ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని నేర్చుకున్న అవిధేయులు.
      • సమాధిలో నలిగిపోయే యాతన.
    4. సమాధి యాతనలను మానవులు, జిన్నాతులు తప్ప ప్రతి ఒక్కరూ వినగలరు.
      • మానవులు, జిన్నాతులు సమాధి సుఖదుఃఖాలు ఎందుకు వినలేరు?
    5. సమాధి యాతనలను ప్రవక్త ముహమ్మద్‌ (సల్లలాహు అలైహి వ సల్లం) విన్నారు.
    6. సమాధిలో శిక్షలకు గురికాబడే కొన్ని కారణాలు.
      • మూత్రం అశుద్ధత వలన, చెప్పుడు సంభాషణ వలన శిక్షలు అనుభవిస్తారు.
      • అప్పు తీసుకొని తిరిగి చెల్లించని వారికి సమాధి శిక్ష.
      • ఇతరులు రోధించడం వలన మృతుడు శిక్షింపబడుతాడు.
    7. సమాధి శిక్షనుండి కాపాడే పుణ్యాలు.
      • షహీద్‌గా మరణించిన వ్యక్తి.
      • అల్లాహ్‌ మార్గంలో పోరాడేందుకై సిద్ధంగా ఉండి చనిపోయిన వ్యక్తి
      • శుక్రవారం చనిపోయిన వ్యక్తి.
      • కడుపు బాధతో మరణించిన వ్యక్తి.
      • ప్రతి రాత్రి సూరతుల్‌ ముల్క్‌ పారాయణం చేసిన వ్యక్తి.
    8. సమాధి శిక్షనుండి రక్షణకై చేసే ప్రార్థనలు
  • [4] ప్రళయం రోజు సర్వమానవుల సమీకరణ.
    • సూర్‌ (శంఖం) పూరించబడుతుంది.
    • కొమ్ము రూపంలో శంఖం.
    • శంఖాన్ని పూరించేవాడు.
    • శంఖం పూరించబడే రోజు.
    • రెండు సార్లు శంఖాన్ని పూరిస్తారు.
    • మట్టినుండి పునర్జీివితం ప్రాప్తమవుతుంది.
    • ప్రతి వ్యక్తికి వెన్నపూస ఆధారంగా పునర్జన్మ ప్రాప్తమవుతుంది.
    • ప్రవక్తల శరీరాలను భూమి తినదు.
    • సమాధి నుండి మొట్టమొదట వెలికివచ్చేవారు.
    • ప్రళయం రోజు సర్వ మానవాళి సమీకరణ జరుగుతుంది.
    • కర్మలకు అణుగుణంగా తీర్చు చేయబడును.
    • ప్రళయ దినాన భూమి నుండి సర్వ మానవులు సమావేశమయ్యే స్థితి.
    • ప్రళయం రోజు మొట్ట మొదట దుస్తులు ధరించేవారు.
    • సర్వ మానవులు సమీకరించబడే భూమి.
    • భూమ్యాకాశాలు మార్చబడేటప్పుడు మానవులంతా సిరాత్‌ (పుల్సిరాత్‌)పై ఉంటారు.
    • ప్రళయ బీభత్సం.
    • ప్రళయం రోజున ప్రతి ఒక్కరు స్వార్థపరులుగా ఉంటారు.
    • ప్రళయం ఒక్కరోజు 50 వేల సంవత్సరాలకు సమానమైనది.
    • అల్లాహ్‌ యావత్తు భూమ్యాకాశాలను చుట్టి తన పిడికిలిలో ఇముడ్చుకుంటాడు.
    • సముద్రాలు పొంగిపోతాయి. ఆకాశాలు బద్దలైపోతాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి.
    • భూమండలమంతా దుమ్ముగా గాలిలో కలిసిపోతుంది.
    • పర్వతాలు తునకలుగా చేయబడుతాయి.
  • [5] ప్రజల విశ్వాసం మరియు కర్మల ప్రకారం తీర్పు ఇవ్వబడుతుంది.
    1. అవిశ్వాసులు (కాఫిర్లు మరియు బహుదైవారాధకులు).
      • ప్రళయం రోజు అవిశ్వాసులు మార్గభసష్టత్వానికి గురికాబడినందుకు పశ్చాత్తాపం చెందుతారు.
      • ప్రళయ దినాన అవిశ్వాసుల పుణ్యాలన్నీ వ్యర్థమైపోతాయి.
      • అవిశ్వాసులు నరకంలో పశ్చాత్తాపం చెందుతూ పరస్పరం మాట్లాడుకుంటారు.
      • ప్రవక్త ఈసా (అలైహిస్సలాం)ను ఆరాధించేవారి గతి.
      • డబ్బు మరియు ధనం పిచ్చిలో ఉండి, అహంకారానికి గురి కాబడినవారు నరకంలో పరస్పరం మాట్లాడుకుంటారు.
    2. పుణ్యకార్యాలకు దూరంగా ఉంటున్న విశ్వాసుల గతి.
      • నమాజును స్థాపించనివారి గతి.
      • జకాతు చెల్లించని వారి గతి.
      • ఉపవాసాలను పాటించనివారి గతి.
      • ప్రళయ దినాన కొందరి దుర్గుణాల కారణంగా అల్లాహ్‌ వారివైపు చూడడు, పలుకరించడు.
    3. ప్రళయ దినాన కొన్ని దుర్గుణాల కారణంగా ప్రత్యేకమైన శిక్షలు అనుభవిస్తారు.
      • అహంకారుల గతి.
      • సిరిసంపదలకై పోటిపడేవారి స్థితి.
      • మోసం చేసేవారి గతి.
      • నమ్మక [ద్రోహం (గులూల్‌).
      • భూమిని కాజేసేవారి గతి.
      • భికారీల మరియు ఫకీర్ల గతి.
      • అబద్ధపు స్వప్నాలు చెప్పుకొనే వారి గతి.
      • ఖిబ్లా (కాబతుల్లాహ్‌) దిక్కున ఉమ్మివేయువారి గతి.
      • ద్విముఖులుగా ప్రవర్తించే వారి గతి.
    4. పుణ్యాత్ములైన విశ్వాసులు (మూమిన్‌లు).
      • కొన్ని ప్రత్యేకమైన పుణ్యాలు చేసినందుకు ప్రళయ దినాన అల్లాహ్‌ తన అర్ష్ నీడను ప్రసాదిస్తాడు.
      • తోటి సహోదరులకు సహాయం చేసే ఘనత.
      • బుణగ్రస్తులకు గడువునిస్తే పుణ్యం.
      • న్యాయమూర్తులు.
      • షహీదులు (అమరులు).
      • కోపాన్ని దిగమింగేవారికి బహుమతి.
      • అజాన్‌ చెప్పేవారు.
      • వుజూ చేసేవారు.
      • ఇస్లాం ధర్మంలోనే ఉంటూ వృద్ధాప్యం పొందినవారు.
  • [6] మహా సిఫారసు (షఫాఅత్‌)
    1. ప్రళయ దినాన సిఫారసు ఎనిమిది విధాలుగా ఉంటుంది.
    2. న్యాయాన్ని స్థాపించబడును.
      • సమానమైన న్యాయం జరుగును.
      • తమ తమ కర్మలన్నిటినీ ప్రతి ఒక్కరు చూసుకుంటారు.
      • ఒకరి పాపాలు మరొకరు మొయ్యరు.
      • ఇతరులు చేసే పుణ్యాలకు లేక పాపాలకు భాగస్తులు కాగలరు.
      • పుణ్యాలు రెట్టింపు చేయబడుతాయి, కాని పాపాలు ఎంత చేస్తే అంతే ఉంటాయి.
      • పాపాలను పుణ్యాలుగా మార్చబడును.
      • అవిశ్వాసులకు మరియు వంచకులకు విరుద్ధంగా సాక్షులను నిలబెట్టడము జరుగును.
    3. మానవులు తమ జీవితాలకు విలువనివ్వకుండా గడిపినందుకు ప్రశ్నించబడుతారు.
      • తిరస్కారులు మరియు బహుదైవారాధకులు ప్రశ్నించబడుతారు.
      • ప్రళయ దినాన మానవులందరూ నాలుగు ప్రశ్నలకు తప్పక సమాధానమివ్వాలి.
      • అనుభవించిన అనుగ్రహాల పట్ల ప్రశ్నించబడుతారు.
      • చేసిన వాగ్దానాల గురించి ప్రశ్నించబడుతారు.
      • కళ్లు, చెవులు, మనస్సు పట్ల విచారణ జరుగును.
  • [7]  ప్రళయ దినాన లెక్క తీసుకునే అనేక విధానాలు
    1. అవిశ్వాసుల నుండి లెక్క తీసుకునే విధానం.
    2. ప్రతి ఒక్కరికి లెక్కల పత్రాలు ఇవ్వబడుతాయి.
    3. విశ్వాసుల నుండి లెక్క తీసుకునే కొన్ని విధానాలు.
      • మొట్టమొదట విధిగావించబడిన నమాజు విచారణ.
      • పేరు ప్రఖ్యాతులకై చేసే పుణ్యాలు.
      • మానవులు చేసిన పాపాలు చూపించబడుతాయి.
      • ప్రజలను అల్లాహ్‌ నిందిస్తాడు.
    4. ప్రళయ దినాన కర్మలు బరువు వేసే త్రాసుస్థాపించబడుతుంది.
    5. ఎలాంటి కర్మలను త్రాసులో తూకం వేస్తారు?
  • [8] ప్రళయ దినాన చివరి గడియలు
    1. ప్రజలు ఎవరినైతే పూజించారో లేక విధేయులుగా ఉన్నారో వారి వెంట పోతారు.
    2. అవిశ్వాసులు నరకానికి పోతారు.
    3. విశ్వాసులకు జ్యోతి లభిస్తుంది.
    4. ప్రళయ దినాన ప్రతి ఒక్కరు తను చేసిన దౌర్జన్యాలకు పరిహారం చెల్లించాలి.
      • ప్రళయ దినాన పరిహారం ఎలా చెల్లిస్తారు.
      • రక్తపాతం ఘోరమైన పాపం.
      • ప్రళయ దినాన జంతువులు ప్రతికారం తీర్చుకుంటాయి
      • విశ్వాసులు ఒకరికొకరు పరిహారము చెల్లించుకుంటారు.
  • [9] స్వర్గం మరియు నరకం
    1. స్వర్గం మరియు నరకం శాశ్వతమైనవి.
    2. నరకం.
    3. నరక యాతనలు.
      • నరక నిర్వాహకులు.
      • నరకం దాని తీవ్రత మరియు దాని లోతు.
      • అల్లాహ్‌ నరకాన్ని పూర్తిగా నింపేస్తాడు.
      • నరకం యొక్క భాగాలు.
      • నరకం యొక్క ఇంధనం.
      • నరకాగ్ని తీవ్రత.
      • అగ్ని మాట్లాడుతుంది మరియు చూడగలుగుతుంది.
      • భూలోకంలో నరకం యొక్క ప్రభావం.
    4. శాశ్వతంగా నరకంలోనే ఉండేవారు.
    5. నరకములో శాశ్వతంగా ఉండేవారి పాపాలు.
      • తిరస్కారము మరియు బహుదైవారాధన.
      • ధర్మాన్ని సక్రమంగా విశ్వసించనివారు.
      • మార్గభ్రష్టులను అనుసరించడం.
      • కపట విశ్వాసులు.
      • అహంకారం.
    6. ఘోరమైన పాపాల కారణంగా నరకానికి పోతారు.
      • హిజ్రత్‌ చేయనివారు.
      • అన్యాయంగా తీర్చు ఇచ్చినందుకు నరకానికి పోతారు.
      • ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై అబద్ధాలను కల్పించినవారు.
      • అహంకారులు.
      • అన్యాయంగా హత్యలు చేసినవారు.
      • వడ్డీ తీసుకునేవారు.
      • అన్యాయంగా ధనాన్ని కాజేసేవారు.
      • చిత్రీకరించేవారు.
      • దుర్మార్గుల వైపు మొగ్గేవారు.
      • శరీరం కనపడే విధంగా దుస్తులు ధరించేవారు.
      • జంతువులను పీడించేవారు.
      • చిత్తశుద్ది లేకుండ ధర్మజ్ఞానాన్ని గ్రహించేవారు.
      • బంగారం, వెండి పాత్రలలో తినేవారు.
      • నీడనిచ్చే రేగి చెట్టును నరికేవారు.
      • ఆత్మహత్య చేసుకొనేవారు.
    7. కొందరు నరకానికి పోతారనే విషయాన్ని బ్రతికుండగానే పొందారు.
    8. నరకం అంతా మనుషులతో నింపబడుతుంది.
    9. అతి ఎక్కువగా నరకానికి స్త్రీలు పోతారు.
    10. నరకం యొక్క తిండి, నీరు మరియు దుస్తులు.
      • అగ్నిని తినేవారు.
      • నరక వాసుల దుస్తులు.
      • ప్రపంచ అనుగ్రహాలను ఒక్క క్షణంలో మరిచిపోతారు.
    11. నరకంలో అనుభవించే అనేక యాతనలు.
      • అవిశ్వాసులు నరకాగ్నిలో పొందే అతి తక్కువ బాధ.
      • మనిషి నరకంలో కరిగిపోయే శిక్షలు పొందుతాడు.
      • ముఖాలను మాడ్చేసే శిక్షలు.
      • బొర్లగించి నరకానికి ఈడ్పుకొనిపోయి పడేస్తారు.
      • ముఖాలు నల్లబడిపోతాయి.
      • నలువైపుల నుండి అగ్ని చుట్టుకుంటుంది.
      • గుండెలను మాడ్చేసే అగ్ని.
      • కడుపులోని పేగులు వెలికివచ్చి అగ్నిలో పడుతాయి.
      • నరకంలో సంకెళ్ళు మరియు గుదిబండలు వేసి శిక్షించబడుతారు.
      • పశ్చాత్తాపంతో, అవమానంతో మొరలు పెట్టుకుంటారు.
      • మనిషి నరకాగ్ని నుండి కాపాడుకునే విధానాలు.
  • [10] స్వర్గం ఒక అద్బుతమైన జీవితం
    1. స్వర్గాన్ని పాందేవారి గుణాలు
      • స్వర్గం పాందుటకై మనం చేసే ఆరాధనలన్నీ వెలకట్టలేవు.
    2. స్వర్గానికి పోవుటకై సిఫారసు.
      • స్వర్గానికి పోవుటకై అల్లాహ్‌ యందు సిఫారసు.
    3. స్వర్గానికి పోయేవారు.
      • విశ్వాసులు స్వర్గానికి పోతారు.
      • స్వర్గంలో విశ్వాసులైన స్త్రీలు.
      • అందరికంటే ముందు స్వర్గానికి పోయేవారు.
      • విచారణ లేకుండానే కొందరు స్వర్గానికి ప్రవేశిస్తారు.
      • విశ్వాసులుగా ఉన్న పాపాత్ములు నరకం నుండి వెలికితీసి స్వర్గానికి చేర్చబడుతారు.
      • అందరికంటే చివరిన స్వర్గానికి పోయే విశ్వాసులు.
    4. స్వర్గం శాశ్వతమైనది.
    5. కొందరు స్వర్గానికి పోతారనే సువార్తను బ్రతికుండగానే పొందారు.
      • వృక్షం క్రింద ప్రమాణం చేసినవారు.
      • బదర్‌ యుద్ధ వీరులు
      • షహీద్‌ కాబడిన కుటుంబం
      • స్వర్గం నాయకులు
      • మహా అదృష్టవంతులు
      • సౌభాగ్యవంతులైన మహిళలు
    6. స్వర్గం యొక్క సౌందర్యం.
      • స్వర్గం తలుపులు.
      • స్వర్గం అంతస్తులు.
      • చివరి స్వర్గవాసికి ప్రపంచంకంటే విశాలమైన స్వర్గం ప్రసాదించబడును.
      • స్వర్గంలో ఉన్న మన్ను.
      • స్వర్గం నదులు.
      • స్వర్గం చెలమలు.
      • స్వర్గంలో అందమైన మేడలు మరియు గుడారాలు.
      • స్వర్గంలో ఉదయం సాయంత్రం.
      • స్వర్గం సువాసన.
      • స్వర్గం వృక్షాలు పండ్లు ఫలహారాలు.
      • సిద్‌రతుల్‌ మున్తహ వద్ద ఉన్న రేగి చెట్టు.
      • తూబా వృక్షం.
      • స్వర్గంలో అతి మృదువైన సువాసన.
      • స్వర్గంలో బంగారం వృక్షాలు.
    7. స్వర్గంలో అనుభవించే అనుగ్రహాలు
      • స్వర్గం అనుగ్రహాలు ఇహలోక అనుగ్రహాల కంటే గొప్పవి.
      • స్వర్గవాసుల ఆహారం, పానీయం.
      • స్వర్గవాసులు తినే, త్రాగే పాత్రలు.
      • స్వర్గవాసులకు పుణ్యవతులైన భార్యలు.
      • స్వర్గ స్త్రీలకు పుణ్యభర్త మరియు గొప్ప సౌందర్యాన్ని అనుగ్రహించబడును.
      • పెద్ద కళ్ళుగల హూర్లు.
      • స్వర్గవాసులకు ప్రాప్తమయ్యే శక్తి .
      • స్వర్గవాసుల కొరకు సేవకులు.
      • స్వర్గవాసులకు అతి ఘనమైన అనుగ్రహం
      • తస్‌బీహ్‌, తక్బీర్ స్వర్గం అనుగ్రహాలు.

గమనిక: ఈ పుస్తకం చదువుతూ క్రింద ఇచ్చిన ఆడియో ప్రసంగాలు వినండి:

ఖుర్’ఆన్ ఘనత – Greatness of Al-Qur’an [ఆడియో]

Greatness of Al-Qur’an (ఖురాన్  ఘనత) – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

Greatness of Al-Qur’an (ఖురాన్  ఘనత)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఖుర్ఆన్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1MMOwL9fds2bCGoEbYxk1J

శ్రమకోర్చి ఖుర్ఆన్ పఠించే వ్యక్తి ఘనత

461. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్యఫలానికి అర్హుడవుతాడు.”

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్ ఖుర్ఆన్, 80 వ అధ్యాయం – ‘అబస’ సూరా]

మధురమైన, సువాసన కలిగిన నారింజపండులా ఉండండి

460. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:-

ఖుర్ఆన్ పఠించే వ్యక్తి (విశ్వాసి) రుచిలోనూ, సువాసనలోనూ మేలు జాతికి చెందిన నారింజపండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని విశ్వాసి (మోమిన్) రుచి ఉన్నా సువాసన లేని ఖర్జూర పండు లాంటివాడు. ఖుర్ఆన్ పఠించే కపట విశ్వాసి పరిమళం ఉన్న చేదుఫలం లాంటివాడు. ఖుర్ఆన్ పఠించని కపట విశ్వాసి సువాసన లేని చేదుగా ఉండే అడవి దోసకాయ లాంటివాడు.

[సహీహ్ బుఖారీ : 70 వ ప్రకరణం – అల్ అత్ అము – 30 వ అధ్యాయం – జిక్రిత్తామ్]

ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం – 37 వ అధ్యాయం – ఖుర్ఆన్ క్రమం తప్పకుండా పఠించే వ్యక్తి ఘనత. 
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1

ఇతరములు: