జుమా (శుక్ర వారం) నమాజ్ కు ముందు తరువాత ఎన్ని సున్నతులు? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [5:51 నిముషాలు]

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [3 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


1126. ఇంతకు ముందు ఇబ్నె ఉమర్‌ (రది అల్లాహు అన్హు) వివరించిన “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట నేను జుమా తర్వాత రెండు రకాతుల నమాజ్‌ చేశానన్న” (బుఖారీ- ముస్లిం) హదీసు ఈ అధ్యాయానికి కూడా వర్తిస్తుంది.

ముఖ్యాంశాలు

గ్రంథకర్త ఇమామ్‌ నవవీ (రహిమహుల్లాహ్) ఈ అధ్యాయంలో జుమా తర్వాత ఎన్ని రకాతుల నమాజ్‌ చేయాలనే విషయం గురించి వివరిస్తున్నారు. రాబోవు రెండు హదీసుల్లో దానిగురించి ఇంకా వివరంగా విశదీకరిస్తారు. ఇకపోతే జుమాకు ముందు ఎన్ని రకాతులు చేయాలి? అనే విషయమై హదీసుల ద్వారా బోధపడేదేమిటంటే, జుమా నమాజ్‌ కోసం మస్జిద్ కు వచ్చే వ్యక్తి రెండు రకాతులు చేసిన తర్వాతగాని కూర్చోకూడదు. ఆఖరికి ఖుత్బా (ప్రసంగం) సమయంలో వచ్చినాసరే, సంక్షిప్తంగానయినా రెండు రకాతులు చేసుకోవాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు. అయితే ప్రసంగానికి ముందు రెండు రకాతుల తహియ్యతుల్‌ మస్జిద్ నమాజ్‌ తర్వాత రెండేసి రకాతుల చొప్పున నఫిల్‌ నమాజు ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు.

1127. హజ్రత్‌ అబూహురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“మీలో ఎవరయినా జుమా తర్వాత నాలుగు రకాతుల నమాజ్‌ చేసుకోవాలి”. (ముస్లిం)

(సహీహ్‌ ముస్లింలోని జుమా ప్రకరణం)

1128. హజ్రత్‌ ఇబ్నె ఉమర్‌ (రది అల్లాహు అన్హు) కథనం: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  జుమా తరువాత (మస్జిద్ లో) ఎలాంటి నమాజ్ చేసేవారు కాదు. మస్జిద్ నుండి తిరిగి  వెళ్ళిన తర్వాతే ఇంట్లో రెండు రకాతులు చేసేవారు.” (ముస్లిం)

(సహీహ్ ముస్లింలోని జుమా వ్రకరణం)

ముఖ్యాంశాలు:

ఒక హదీసులో జుమా తర్వాత నాలుగు రకాతులు చేయాలనీ, మరో హదీసులో రెండు రకాతులు చేయాలని చెప్పబడింది. దీనిద్వారా రెండు పద్ధతులూ సరైనవేనని బోధపడుతోంది. కొంతమంది పండితులు ఈ రెండు హదీనుల్ని సమన్వయ పరచటానికి ప్రయత్నించారు. జుమా తర్వాత మస్జిద్ లోనే నమాజ్‌ చేయదలచుకునేవారు నాలుగు రకాతులు చేయాలనీ, ఇంట్లో చేసేవారు రెండు రకాతులు చేసుకుంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.

ఇకపోతే నాలుగు రకాతుల నమాజును ఏ విధంగా చేయాలి? ఈ విషయంలో కూడా రెండు అభిప్రాయాలున్నాయి. ఒక విధానం నాలుగు రకాతులు ఒకే సలాంతో చేయాలనీ, మరొక విధానం రెండేసి రకాతుల చొప్పున చేయాలని. రెండు పద్ధతులూ సమ్మతమైనవే. అయితే రెండేసి రకాతుల చొప్పున చేసుకోవటమే ఉత్తమం. ఎందుకంటే ఒక ప్రామాణిక హదీసులో రాత్రి మరియు పగటిపూట నఫిల్‌ నమాజులు రెండేసి రకాతులు చేయాలని చెప్పబడింది. ఇమామ్‌ బుఖారీ (రహిమహుల్లాహ్) కూడా తన గ్రంథంలో “రాత్రి మరియు పగటి పూట (నఫిల్‌) నమాజులు రెండేసి రకాతులే” అనే శీర్షికతో ఒక అధ్యాయాన్ని ఏర్పరచారు.

జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు – హదీసులు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ )


364. హజ్రత్‌ జాబిర్‌ (రది అల్లాహు అన్హు) ఇలా తెలిపారు: జుమా రోజున ఒక వ్యక్తి మస్జిద్ లో ప్రవేశించాడు. ఆ సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రసంగిస్తున్నారు. వచ్చిన వ్యక్తి నుద్దేశించి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “నమాజ్‌ చేశావా?” అని దర్యాప్తు చేశారు. “లేదు’ అని అన్నాడా వ్యక్తి. “మరయితే లే. రెండు రకతుల నమాజ్‌ చెయ్యి” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (బుఖారీ, ముస్లిం)

సారాంశం:

జుమా ప్రసంగం జరుగుతుండగా రెండు రకతుల నమాజ్‌ చేయవచ్చునని ఈ హదీసు ద్వారా అవగతమవుతున్నది. ప్రసంగ కర్త మటుకు అవసరం మేరకు మాట్లాడగలడనీ, మస్జిద్ కు వచ్చే నమాజీలకు రెండు రకాతులు నెరవేర్చమని చెప్పగలడని కూడా దీనిద్వారా స్పష్టమవుతున్నది.

367. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్‌ అబూ హురైర (రది అల్లాహు అన్హు) తెలిపారు : “మీలో ఎవరయినా జుమా నమాజ్‌ చేస్తే ఆ తరువాత నాలుగు రకాతులు చదవండి.”  (ముస్లిం)

[జుమా నమాజ్ – హదీసులు – హదీసు మకరందం (బులూఘ్-అల్–మరామ్) నుండి ]

ఇతరములు:

విశ్వాస మూల సూత్రాలు: నాల్గవ పాఠం – షిర్క్, దాని రకాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[16 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

షిర్క్ (బహుదైవారాధన), దాని రకాలు:

షిర్క్ అంటే: ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పుట. ఉదాహరణకు విగ్రహాన్ని, మృతులను, సూర్యచంద్రులను, ప్రవక్తలను, వలీలను, సమాధి తదితరాలను పూజించుట. లేదా అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకొనుట, వారికి మ్రొక్కుబడులు చెల్లించుట లేదా వారి కొరకు నమాజు, ఉపవాసాలు పాటించుట, వారి కొరకు బలిదానమిచ్చుట. ఇవన్నీ అల్లాహ్ తో పాటు షిర్క్ లో వస్తాయి.

అలాగే విగ్రహానికి, సూర్యచంద్రులకు, సమాధివారికి ఇంకా ఇలాంటి వాటికి సజ్దా చేయుట (సాష్టాంగపడుట). ఇది కూడా షిర్క్, ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది. అల్లాహ్ కాపాడుగాక!

అలాగే సృష్టించటంలో అల్లాహ్ తో పాటు ఎవరైనా భాగస్వామి గలడని, లేదా అల్లాహ్ మాత్రమే శక్తిగలవాటి శక్తి అతనిలో ఉందని నమ్మడం కూడా షిర్క్ అవుతుంది.

షిర్క్ రెండు రకాలు: చిన్న షిర్క్, పెద్ద షిర్క్.

మొదటిది: పెద్ద షిర్క్: ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైనా అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. ఇలాంటి షిర్క్ చేసిన వ్యక్తి తౌబా చేయకుండా (పశ్చత్తాప పడి, క్షమాభిక్ష కోరకుండా) చనిపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ఇంకా ఇది సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది.

పద్దెనిమిది ప్రవక్తల ప్రస్తావన తర్వాత సూర అన్ఆమ్ ఆయతు 88లో అల్లాహ్ ఇలా హెచ్చరించాడు:

[وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ] {الأنعام:88}

{ఒకవేళ వారు షిర్క్ చేసి ఉండినట్లయితే, వారు చేసిన సమస్తం నాశనం అయివుండేది}. (సూరె అన్ఆమ్ 6: 88).

వారితో షిర్క్ ముమ్మాటికీ జరగలేదు, వారిని ప్రస్తావించి మనల్ని హెచ్చరించడం జరిగింది.

పెద్ద షిర్క్ ను అల్లాహ్ స్వచ్ఛమైన తౌబా చేయనిది క్షమించడు. ఖుర్ఆన్ సాక్ష్యం చూడండి:

[إِنَّ اللهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ وَمَنْ يُشْرِكْ بِاللهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا] {النساء:48}

{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడన్నమాట}. (సూరె నిసా 4: 48).

పెద్ద షిర్క్ లోని కొన్ని రకాలు: అల్లాహ్ యేతరులతో దుఆ, అల్లాహ్ యేతరుల కొరకు మొక్కుబడి, జిబహ్ వగైరాలు చేయుట. అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కలిపి అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ వారి పట్ల ఉంచుట.

[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللهِ] {البقرة:165}

{కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు}. (సూరె బఖర 2: 165).

రెండవది: చిన్న షిర్క్: ఖుర్ఆను, హదీసుల్లో ఏ పనుల కొరకు షిర్క్ అనే పదం వచ్చిందో కాని అవి పెద్ద షిర్క్ వరకు చేరవో వాటిని చిన్న షిర్క్ అంటారు. ఈ రకం ధర్మభ్రష్టతకు కారణం కాదు. కాని దీని వల్ల తౌహీదు లో మాత్రం కళంకం, కొరత ఏర్పడుతుంది. ఉదా: ప్రదర్శనాబుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట. లేదా షిర్క్ అక్బర్ కు చేర్పించే ఏదైనా కార్యం. ఉదా: ఏదైనా సమాధి వద్ద అల్లాహ్ కొరకు నమాజు చేయుట. అల్లాహ్ యేతరులు లాభనష్టానికి అధికారులు కారు అన్న విశ్వాసంతో వారి మీద ప్రమాణం చేయుట. ఇంకా అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి తలచినట్లు అని అనడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمْ الشِّرْكُ الْأَصْغَرُ) قَالُوا: يَا رَسُولَ الله وَمَا الشِّرْكُ الْأَصْغَرُ؟ قَالَ: (الرِّيَاءُ).

“మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేదేమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారని”. చిన్న షిర్క్ అంటేమిటి? ప్రవక్తా అని అడిగారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “ప్రదర్శనాబుధ్ధి” అని. (ముస్నద్ అహ్మ్దద్ 23630. దీని సనద్ జయ్యిద్).

«مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ»

ఎవరు అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేశాడో అతడు షిర్క్ చేసినట్లే“. (అబూ దావూద్ 3251. సహీ హదీస్).

తాయత్తులు వేసుకొనుట: రోగాలు, ఆపదలు రాకుండా లేదా వచ్చినా తొలిగిపోవుటకు కడాలు, రింగులు సాధనం అని వేసుకొనుట లాంటి పనులు చిన్న షిర్క్ కు సంబంధించినవే. ఇక అవి సాధనమే కాదు, లాభనష్టాలు వాటిలో ఉన్నాయి, అంటే: అవి వేసుకున్నప్పుడు లాభం ఉంటుంది వేసుకోకుంటే నష్టం ఉంటుంది అని విశ్వసిస్తే అది పెద్ద షిర్కులో వస్తుంది. (అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి).

అలాగే జ్యోతిషుల వద్దకు వచ్చి ఏమైనా అడగడం కూడా షిర్క్ లో వస్తుంది, ఎలా అనగా అతడు మానవుల్లో కొందరు అగోచర జ్ఞానం గలవారని నమ్మినందుకు. ఇది అబద్ధం, భూటకం. అల్లాహ్ ఈ ఆదేశానుసారం:

[قُلْ لَا يَعْلَمُ مَنْ فِي السَّمَاوَاتِ وَالأَرْضِ الغَيْبَ إِلَّا اللهُ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ] {النمل:65}

“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతారో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా వారికి చెప్పు. (నమ్ల్ 27:65).

అందుకే ప్రతి ముస్లం తప్పనిసరిగా తెలుసకోవాల్సిన విషయం ఏమిటంటే: స్వచ్ఛమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) కొరకే అల్లాహ్ మనల్ని పుట్టించాడు, స్వర్గనరకాలను సృష్టించాడు, ప్రవక్తల్ని పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. కర్మలన్నీ అల్లాహ్ కొరకే ప్రత్యేకించి చిత్తశుద్ధితో చేసినప్పుడే స్వీకరించబడతాయి, లేదా అంటే అవి రద్దు చేయబడతాయి.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

ధర్మపథంలో కష్టాలు, పరీక్షలు, అవరోధాలు [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [36 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


أَحَسِبَ النَّاسُ أَن يُتْرَكُوا أَن يَقُولُوا آمَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ

“మేము విశ్వసించాము” అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదలి వేయబడతామనీ, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా? [1]

وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ

వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము.  వీరిలో సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్‌ తెలుసుకుంటాడు. [2]

[సూరహ్అంకబూత్ 29:2-3]

[1] “మేము విశ్వసించాము” అని నోటితో చెప్పినంతమాత్రాన, తమను పరిక్షించకుండానే వదలివేయబడటం జరుగుతుందని భావించటం సరైనది కాదు. వారు ధన ప్రాణాల ద్వారా పరీక్షించబడతారు. కష్టాల ద్వారా పరీక్షించబడతారు. ఆకలిబాధ ద్వారా పరీక్షించబడతారు. ఈ పరీక్షల ద్వారా కల్తీ సరుకు ఏదో – మేలిమి సరుకు ఏదో, నిజాయితీపరులెవరో – నయవంచకులెవరో నిగ్గుదేల్చటం జరుగుతుంది.

[2] ఇది తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న దైవ సంప్రదాయం. అందుకే ఆయన గతించిన సమాజాల వారిని పరీక్షించినట్లుగానే ఈ సమాజాన్ని (ముహమ్మద్‌ అనుచర సమాజాన్ని) కూడా పరీక్షిస్తాడు. మక్కాలోని అవిశ్వాసుల వేధింపులు నానాటికీ పెరిగిపోతుండటంతో ముస్లిములు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఫిర్యాదు చేసుకున్నారు. దైవసహాయం కోసం ప్రార్ధించమని ఆయన్ని (సల్లల్లాహు అలైహి వ సల్లం) విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన బాధిత సహచరులనుద్దేశించి ఇలా అన్నారు : ఈ దౌర్జన్యకాండ విశ్వాసుల చరిత్రలో ఆనవాయితీగా వస్తున్నదే. మీకు పూర్వం గతించిన విశ్వాసులు ఇంతకన్నా దారుణంగా వేధించబడ్డారు. గొయ్యి తవ్వి, వారిని ఆ గోతిలో నిలబెట్టి, తలపై రంపపు కోతకోస్తే, వారి శరీరాలు రెండు భాగాలుగా చీలిపోయేవి. అలాగే ఇనుప దువ్వెనలతో వారి శరీరాలను దువ్వగా, మాంసం ఊడివచ్చేది. అయినాసరే ఈ అమానుష కృత్యాలు వారిని వారి సత్యధర్మం నుంచి మరల్చటంలో సఫలీకృతం కాలేకపోయాయి.” (సహీహ్‌ బుఖారీ – కితాబ్‌ అహాదీసుల్‌ అంబియా). హజ్రత్‌ అమ్మార్‌, ఆయన తల్లిగారైన హజ్రత్‌ సుమయ్య, తండ్రి హజ్రత్‌ యాసిర్‌, హజ్రత్‌ సుహైబ్‌, హజ్రత్‌ బిలాల్‌ మిఖ్దాద్‌ తదితర సహచరులపై తొలి కాలంలో జరిగిన వేధింపులకు చరిత్ర పుటలే సాక్షి. ఈ సంఘటనల నేపథ్యంలోనే ఈ ఆయతులు అవతరించాయి. అయితే ప్రళయదినం వరకూ సాధారణ ముస్లింలందరికీ ఇవి వర్తిస్తాయి.

[అహ్సనుల్ బయాన్, సూరహ్అంకబూత్ నుండి]


وَمِنَ النَّاسِ مَن يَعْبُدُ اللَّهَ عَلَىٰ حَرْفٍ ۖ فَإِنْ أَصَابَهُ خَيْرٌ اطْمَأَنَّ بِهِ ۖ وَإِنْ أَصَابَتْهُ فِتْنَةٌ انقَلَبَ عَلَىٰ وَجْهِهِ خَسِرَ الدُّنْيَا وَالْآخِرَةَ ۚ ذَٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ

ప్రజలలో మరికొంతమంది (కూడా ఉన్నారు. వారు) ఎలాంటివారంటే, వారు ఒక అంచున (నిలబడి) అల్లాహ్‌ను ఆరాధి స్తుంటారు. తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. ఏదన్నా ఆపద వచ్చిపడితే మాత్రం అప్పటి కప్పుడే ముఖం తిప్పుకునిపోతారు.[1] అలాంటి వారు ప్రాపంచికంగానూ, పార లౌకికం గానూ నష్టపోయారు. స్పష్టంగా నష్ట పోవటం అంటే ఇదే.

[సూరహ్ అల్-హజ్ 22:11]

[1] “హర్ ఫున్ ” (حَرْفٍ) అంటే అంచు, ఒడ్డు అని అర్థం. ఈ అంచులపై నిలబడి ఉండేవాడు నిలకడలేని వాడై ఉంటాడు. మతధర్మం విషయంలో సంశయానికి, సందిగ్దానికి  లోనై ఉన్న వ్యక్తి కూడా ఇంతే. ధర్మావలంబనలో అతనికి నిలకడ ప్రాప్తించదు. ఎందుకంటే పొద్దస్తమానం ప్రాపంచిక ప్రయోజనాలు పొందటం అతని ముఖ్యోద్దేశం అయి వుంటుంది. ప్రయోజనాలు చేకూరినంతసేపూ ధర్మాన్ని అంటి పెట్టుకుని ఉంటాడు. లేని యెడల తన పూర్వీకుల మతం వైపుకు మరలిపోతాడు. తద్భిన్నంగా నిజమైన, నికార్సయిన ముస్లింలు దృఢవిశ్వాసం కలిగి ఉంటారు. వారు కలిమి లేములను, ఎత్తుపల్లాలను చూడకుండానే ధర్మంలోకి వస్తారు. సర్వకాల, సర్వావస్థల్లో ధర్మంపై స్థయిర్యాన్ని కనబరుస్తారు. దైవానుగ్రహాలు ప్రాప్తించినప్పుడు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కష్టాలెదురైనపుడు ఓర్పు వహిస్తారు. ఈ ఆయతు అవతరణా నేపథ్యంలో ఒక వ్యక్తి వృత్తాంతం ఉంది. అతను మదీనా నగరానికి వస్తాడు. తనకు సంతానం కలిగితే, పశువులలో సమృద్ధి జరిగితే ఈ ధర్మం (ఇస్లాం) చాలా మంచి ధర్మం అని అంటాడు. తాననుకున్నట్లుగా జరగకపోతే ఈ ధర్మం ముదనష్టపు ధర్మం అంటాడు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆనాడు కొత్తగా ఇస్లాం స్వీకరించిన అరబ్బు పల్లెవాసుల్లో ఈ అవలక్షణం ఉండేది. (ఫత్‌హుల్‌ బారీ)

[అహ్సనుల్ బయాన్, సూరహ్ అల్-హజ్ నుండి]


وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ

155. మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయ ప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన, ప్రాణ, ఫల (ఆదాయాల) నష్టానికీ గురిచేసి పరీక్షి స్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యం ఉండేవారికి శుభవార్త నివ్వు.

الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ

156. ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు: “నిశ్చయంగా మేము అల్లాహ్‌కే చెందినవారము! మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము!” అని అంటారో;

أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ

157. అలాంటి వారికి వారి ప్రభువునుండి అనుగ్రహాలు మరియు కరుణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు. 

(సూరహ్ బఖర 2:155-157)


ఇతరములు:

సూరహ్ అల్ మా’ఊన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [ఆడియో & టెక్స్ట్]

సూరహ్ అల్ మా’ఊన్ (సూరహ్ నం.107) అనువాదం, వ్యాఖ్యానం

[35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరాను సూరయె దీన్‌గా, సూరయె అరఐత్‌గా, సూరయె యతీమ్‌గా కూడా వ్యవహరిస్తారు. (ఫత్‌హుల్‌ ఖదీర్‌).

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్‌’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.

1 తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు

2. కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచిపనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.

[అహ్సనుల్ బయాన్ నుండి]

సూరతుల్ మాఊన్ – 107

అనంత  కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో …బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ
1. పరలోకతీర్పును ధిక్కరించేవాడిని నీవు చూశావా?అరఅయ్ తల్లదీ యుకద్దిబు బిద్దీన్أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ
2.వారే అనాథులను కసరి కొట్టేవారు.ఫదాలికల్లదీ యదువ్వుల్ యతీంفَذَلِكَ الَّذِي يَدُعُّ اليَتِيمَ
3. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించని వారువలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్وَلَا يَحُضُّ عَلَى طَعَامِ المِسْكِينِ
4. ఐతే నమాజు చేసే (అలాంటి) వారూ నాశనమౌతారు.ఫవైలుల్ లిల్ ముసల్లీన్فَوَيْلٌ لِلْمُصَلِّينَ
5. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ చూపేవారోఅల్లదీన హుమ్ అన్ సలాహితిహిం సాహూన్الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ  سَاهُونَ
6. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారో,అల్లదీన హుమ్ యురాఊన్الَّذِينَ هُمْ  يُرَاءُونَ
7. ఎవరైతే చిన్న పాటి సహాయం అర్థించిన వారిని కూడా తిరస్కరించే వారో.వయంన ఊనల్ మాఊన్وَيَمْنَعُونَ المَاعُونَ

ఈ ప్రసంగంలో సూరహ్ అల్ మా ఊన్ (107) యొక్క వివరణాత్మక వ్యాఖ్యానం అందించబడింది. పరలోక దినాన్ని తిరస్కరించే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, ముఖ్యంగా అనాథలను గెంటేయడం మరియు పేదలకు ఆహారం ఇవ్వకపోవడం వంటి అంశాలను ఇది వివరిస్తుంది. అలాగే, నమాజు పట్ల అశ్రద్ధ వహించే వారు, ప్రదర్శన బుద్ధితో (రియా) చేసే ప్రార్థనలు మరియు ఇరుగుపొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేయడానికి నిరాకరించే వారి పట్ల హెచ్చరికలు చేయబడ్డాయి. పరలోక విశ్వాసం గట్టిగా ఉన్న వ్యక్తిలో ఉండే సద్గుణాలను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా వివరించడం జరిగింది.

ఇది సూరహ్ మా ఊన్ అని మనము ముందు నుండే తెలిసి ఉన్నాము. ఈ సూరత్ పేరు మా ఊన్ అనేది ఇందులోని చివరి వాక్యంలో అల్ మా ఊన్ అన్న పదం ఏదైతే వచ్చిందో దానిని బట్టి. అయితే ముందు అలవాటు ప్రకారంగా దీని అనువాదం విందాము, ఆ తర్వాత దీని యొక్క వ్యాఖ్యానం తెలుసుకుందాము.

పరలోకాన్ని తిరస్కరించేవారి లక్షణాలు

అరైతల్లజీ యుకజ్జిబు బిద్దీన్. నీవు చూశావా ఆ వ్యక్తిని? వాడు పరలోక పుణ్యఫలాన్ని, శిక్షను తిరస్కరిస్తున్నాడు. నీవు ఆ వ్యక్తిని చూశావా? అతను పరలోక పుణ్యఫలాన్ని, శిక్షను తిరస్కరిస్తున్నాడు.

أرأيت الذي يكذب بالدين
(అర ఐతల్లజీ యుకజ్జిబు బిద్దీన్)
నీవు చూశావా ఆ వ్యక్తిని, వాడు పరలోక పుణ్యఫలాన్ని, శిక్షను తిరస్కరిస్తున్నాడు. (107:1)

ఫజాలికల్లజీ యదుఉల్ యతీమ్. అతడే అనాథను కసరికొట్టి గంటేసేవాడు.

فذلك الذي يدع اليتيم
(ఫజాలికల్లజీ యదుఉల్ యతీమ్)
అతడే అనాథను కసరి కొట్టి గెంటేసే వాడు. (107:2)

వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్. నిరుపేదకు చెందిన అన్నం పెట్టేందుకు పురికొల్పనివాడు. ఫజాలికల్లజీ యదుఉల్ యతీమ్. అతడే అనాథను కసరి గంటేసేవాడు. వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్. నిరుపేదకు చెందిన అన్నం పెట్టమని ఎవరికీ ప్రోత్సహించేవాడు కాదు.

ولا يحض على طعام المسكين
(వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్)
నిరుపేదకు చెందిన అన్నం పెట్టేందుకు పురికొల్పని వాడు. (107:3)

సోదర మహాశయులారా! ఈ సూరత్ సూరహ్ మా ఊన్ లో మొదటి వాక్యం మొదటి ఆయత్ ‘అరైతల్లజీ యుకజ్జిబు బిద్దీన్’. నీకు అతని గురించి తెలుసా? నీవు అతన్ని చూశావా? ఎవరు? అల్లజీ యుకజ్జిబు బిద్దీన్. ఎవరైతే దీన్ ను తిరస్కరిస్తున్నాడు, ధిక్కరిస్తున్నాడు. దీన్ అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో దీనికి రెండు భావాలు. ఒకటి ఇస్లాం ధర్మం అని. ఖురాన్ లో అల్లాహ్ ఏమి చెప్పాడు? ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం. అల్లాహ్ కు ఇష్టమైన ధర్మం, అల్లాహ్ వద్ద అంగీకార యోగ్యం పొందే ధర్మం ఇస్లాం మాత్రమే. వరదీతులకుముల్ ఇస్లామ దీనా. మీకు ధర్మంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్లాంనే మెచ్చుకున్నాడు, ఇస్లాం తోనే ఇష్టపడ్డాడు. దీన్ అన్న దానికి ఒక భావం ఏమిటి? ఇస్లాం ధర్మం అని.

దీన్ కు మరొక భావం కూడా ఉంది. అది ఏమిటి? ప్రతిఫల దినం. మంచివారికి విశ్వాసం మరియు సత్కార్యాలతో జీవితం గడిపిన వారికి సత్ఫలితం, అవిశ్వాస మార్గాన్ని లేదా విశ్వాస మార్గం అవలంబించి దుష్కార్యాలకు పాల్పడిన వారికి వారి దుష్కార్యాలకు బదులుగా శిక్ష లభించే ఆ పరలోక దినాన్ని దీన్ అని అంటారు. ఖురాన్ లో దీన్ అన్న పదం దీని గురించి కూడా వచ్చింది. ఆ పరలోక దినం, ఏ దినమైతే ప్రతిఫలం అనేది మంచివారికి సత్ఫలితం మరి చెడ్డవారికి దుష్ఫలితం ఇవ్వబడే రోజు. చదవండి సూరహ్ ఫాతిహా – అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీమ్, ఆ తర్వాత మాలికి యౌమిద్దీన్. దీన్ అన్న పదం వచ్చింది కదా ఇక్కడ కూడా. ఇక్కడ ఏదైతే దీన్ అన్న పదం వచ్చిందో, ఇస్లాం ధర్మం అన్న భావంలో కాదు. ఆ పరలోక దినాన, ఏ రోజునైతే ప్రతి ఒక్కరికి తాను చేసిన దానికి ప్రతిఫలం లభించనున్నదో, ఆ రోజు యొక్క నాయకుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఆ రోజు యొక్క సర్వాధికారి కేవలం అల్లాహ్ మాత్రమే.

అల్లాహ్ యే మార్గదర్శి

ఈ విధంగా ఈ ఆయత్ లో దీన్ అన్న పదానికి రెండు భావాలు ఉన్నాయి. కానీ అధిక శాతం వ్యాఖ్యానకర్తలు ఇక్కడ రెండో భావం కుదురుతుంది, అదే ఉద్దేశించబడినది అని అంటున్నారు. దీనివల్ల తెలిసే మరొక విషయం ఏంటంటే, ఎవరైతే పరలోక దినాన్ని విశ్వసించరో, వారిలో చాలా రకాల చెడు కార్యాలు, చెడు విశ్వాసాలు ఎన్నో రకాల తప్పిదాలకు వారికి ఆ పరలోకాన్ని విశ్వసించకపోవడం అనేది ఎన్నో రకాల చెడుల వైపునకు తీసుకెళ్తుంది. అందులో నుంచి ముఖ్యమైనవి రెండు చెడు గుణాలను ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రస్తావించాడు. ఏమి చెప్పాడు? అరైతల్లజీ యుకజ్జిబు బిద్దీన్. ఆ ధర్మాన్ని, ఇస్లాం ధర్మం అనండి కానీ ఇక్కడ మనం ఉద్దేశించింది ఏంటిది పరలోక దినాన్ని. ఆ ప్రతిఫల దినాన్ని తిరస్కరించే వ్యక్తి అతనిలో ఎలాంటి గుణం ఉంది? ఫజాలికల్లజీ యదుఉల్ యతీమ్. అతడే అనాథలను కసరి కొడుతున్నాడు, నెట్టేస్తున్నాడు, గంటేస్తున్నాడు. వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్ మరియు మిస్కీన్ నిరుపేదలకు వారికి చెందిన అన్నం ఏదైతే ఉందో అది కూడా పెట్టండి అని ప్రోత్సహించడం లేదు.

సోదర మహాశయులారా! ఖురాన్ లో మరి ఎన్నో చోట్ల అల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ పరలోక విశ్వాసం అనేది మనిషిలో ఎలాంటి మంచి గుణాలు తీసుకొస్తుందో ప్రస్తావించి ఉన్నాడు. ఉదాహరణకు సూరత్ దహర్, దాని యొక్క రెండో పేరు సూరహ్ ఇన్సాన్. అందులో అల్లాహ్ తఆలా చెప్తున్నాడు:

విన్నమా వయుత్తయిమూనత్తఆమ అలా హుబ్బిహి మిస్కీనన్ వయతీమన్ వ అసీరా. పుణ్యాత్ములు కొందరు మంచి మనుషులు వారు ఏం చేస్తున్నారు? యుత్తయిమూనత్తఆమ అలా హుబ్బిహి. స్వయంగా వారికి ఇష్టమైన ప్రియమైన తిండి, భోజనం, అన్నం, తిను పదార్థాలు, త్రాగు పదార్థాలు యుత్తయిమూన తినిపిస్తున్నారు. ఎవరికి? మిస్కీనన్ నిరుపేదలకు, యతీమన్ అనాథలకు, అసీరన్ ఖైదీలకు. ఎందుకు తినిపిస్తున్నారు? ఏంటి ఉద్దేశం? ఇన్నమా నుత్తయిముకుమ్ లివజ్ హిల్లాహ్. మేము మీకు ఏదైతే తినిపిస్తున్నామో అది కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు. కేవలం పరలోక దినాన అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం మాకు లభించాలి అన్నటువంటి ఉద్దేశంతో, కేవలం ఆయన యొక్క సంతృప్తి కొరకు. లా నురీదు మింకుమ్ జజాఅన్ వలా శుకూరా. మేము మీకు తినిపించడం ద్వారా మీతో ఎలాంటి ప్రతిఫలాన్ని మీరు దానికి బదులుగా మాకు ఏదైనా ఇవ్వాలని మేము కోరము. వలా శుకూరా కనీసం మీరు మాకు థాంక్స్ చెప్పాలని మా కృతజ్ఞత చెల్లించాలని కూడా మేము కోరము, ఉద్దేశించము. ఇన్నా నఖఫు మిర్ రబ్బినా యౌమన్ అబూసన్ ఖమ్ తరీరా. మేము ఆ సుదీర్ఘమైన మహా కఠినాలతో కూడుకున్న మహా కష్టతరంతో ఉన్నటువంటి ఆ భయంకరమైన రోజు నుండి భయపడుతున్నాము.

ఏ రోజు అది? ఖయామత్, ప్రళయ దినం. ఆ పరలోక దినం, ఆ పరలోక విశ్వాసం, అక్కడ ఒక్కొక్క చిన్న చిన్న కార్యానికి మనం జవాబు చెప్పుకోవలసి ఉన్నది అన్నటువంటి ఆ భయం మాలో ఉంది. ఆ రోజు ఇహలోకంలో అల్లాహ్ మాకు ఏదైతే కొంతపాటి ధనం ఇచ్చాడో, మాకు ఏదైతే సౌకర్యాలు ఇచ్చాడో దాని మూలంగా అది మేము అవసరం ఉన్న వారికి, అనాథలకు, నిరుపేదలకు, బీద వాళ్లకు, ఖైదీలకు తినిపించకుంటే రేపటి రోజు అల్లాహ్ మమ్మల్ని అడుగుతాడు, ప్రశ్నిస్తాడు అన్నటువంటి భయం మాలో ఉంది. అందుగురించి ఆనాటి ఆ భయం మాలో ఉండి మేము తినిపిస్తున్నాము. అయితే ఆనాడు ఆ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని ఆ భయం నుండి దూరం చేసి తొలగించి ఆయన మాకు ప్రతిఫలం ఇవ్వాలి, దాని యొక్క సత్ఫలితం ఆయన ఇవ్వాలని మేము ఆయన యొక్క ప్రేమలో వీరికి తినిపిస్తున్నాము. వీరి ద్వారా మాకు ఎలాంటి బదలా ప్రతిఫలం అవసరం లేదు. మేము కనీసం వారు మాకు కృతజ్ఞత చెల్లించాలని థాంక్స్ చెప్పాలని కూడా కోరము.

ఇది ఒక విశ్వాసిలో పరలోక విశ్వాసం గట్టిగా ఉండేదుంటే నిజమైన రీతిలో ఉంటే, పక్కవాడు ఉపవాసం ఉంటే తిండి లేకుండా ఉంటే ఆయన కడుపు నిండా తిని బేవుల్ తీసుకుంటూ పడుకోడు. పరలోక విశ్వాసం ఉన్నవాడు పక్కింటి వారి వర్షం వల్ల ఇల్లు కూలిపోతుంది, వారు నీళ్లలో వర్షంలో తడుచుకుంటూ నిద్రిస్తున్నారు పక్కన బిల్డింగ్ లో హాయిగా నిద్రిస్తున్నాడు, విశ్వాసం ఉన్న వ్యక్తి ఇలా తనలాంటి మనుషుల్ని ఇలాంటి ఇబ్బందిలో చూసుకుంటూ జీవితం గడపడు. భావం ఏమిటి? ఎవరిలో ఎంత పరలోక విశ్వాసం లోపిస్తుందో అంతే అతను ప్రజల పట్ల మృదు భావంతో వారి పట్ల ప్రయోజనకరంగా వారికి లాభాన్ని చేకూర్చే విధంగా జీవితం గడపడు. అదే ఒకవేళ పరలోక విశ్వాసం గట్టిగా ఉండి అనాటి ఆ సుదీర్ఘ కష్టతరమైన రోజు నుండి భయపడి అల్లాహ్ ఆనాడు సత్ఫలితాలు ప్రసాదించాలి అన్నటువంటి ఆశ ఉన్న వ్యక్తి స్వయంగా అతడు కేవలం తన లాభాన్నే కాదు ప్రజల యొక్క అవసరాలు ఏమిటో అవి కూడా దృష్టిలో ఉంచుకుంటారు.

అయితే ఇక్కడ ఈ ఆయత్ లలో పరలోక విశ్వాసాన్ని పరలోక ప్రతిఫల దినాన్ని తిరస్కరిస్తున్నాడు గనుక ఇతనిలో ఈ రెండు రకాల గుణాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఏంటి? యదుఉల్ యతీమ్. అనాథను నెట్టేస్తున్నాడు, కసరి కొడుతున్నాడు. వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్ మరియు నిరుపేదలకు వారికి చెందిన అన్నం వారికి ఇవ్వండి అని కూడా కనీసం ప్రోత్సహించడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. పరలోక విశ్వాసం లేనందుకు లేదా పరలోక విశ్వాసంలో కొరత ఉన్నందుకు కేవలం ఇవి రెండు గుణాలు ఈ చెడు గుణాలు మాత్రమే పుడతాయని భావం కాదు. వేరే చెడు గుణాలు ఉండవని భావం కాదు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే సమాజంలో మనిషి ఎన్నో రకాల చెడు కార్యాలకు పాల్పడతాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? ఉదాహరణకు మనిషి ఏదైనా దొంగతనం చేయాలనుకుంటాడు, వ్యభిచారం చేయాలనుకుంటాడు కానీ దొంగతనం చేయబోతే వ్యభిచారం చేయబోతే పట్టుకోబడతాను అన్నటువంటి భయం కూడా ఉంటుంది. ఉంటుందా లేదా?

లేదా ఏదైనా భయం ఉండి మనిషి ఆ పని చెడు చేయలేకపోతాడు. లేదా మనిషి ఏదైనా మంచి పని చేస్తున్నాడు అంటే కనీసం అరే ఈయన మా దగ్గరికి గెస్ట్ గా వచ్చాడు కనీసం ఒక ఛాయ్ అన్నా తాగిద్దాం రేపటి రోజు మనం పోతే కూడా మరి మనల్ని చూడకుండా ఉంటాడు కదా అంటే ఒకరి పట్ల ఏదైనా మంచితనం చేస్తున్నాడు అంటే వారి నుండి ఏదైనా ఆశిస్తున్నాడు. వారి నుండి ఏదైనా బదలా ప్రతిఫలం దొరుకుతుంది అన్నటువంటి ఆశ అతనికి ఉంటుంది. అంటే ఈ ఆశా భయం ఇవి రెండు ఉండి మనిషి ఏదైనా మంచి చేస్తాడు చెడు నుండి దూరం ఉంటాడు అవునా కాదా?

కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈ రెండు రకాల మనుషులు, నిరుపేదలు నిరుపేదలు మరియు అనాథలు. నిరుపేదకు ఏదైనా ఇచ్చేదుంటే తిరిగి అక్కడ నుండి మాకు ఏదైనా దొరుకుతుందని ఆశ ఉంటుందా? ఉండదు. ఈ రోజుల్లో ఏం జరుగుద్ది? మంచిగా హై ఫై లో ఉన్న వారికి మంచి మంచి హై ఫై గిఫ్ట్ తీసుకొని వెళ్తాము. ఎందుకు? కనీసం ఇంత కూడా ఇవ్వకుంటే నన్ను చిన్న చూపుతో చూస్తాడు అతడు, రేపటి రోజు అతని వద్దకు వెళ్లకుంటే అరే నువ్వు అక్కడ నుండి వచ్చావు నా గురించి ఏం తెచ్చావురా అని కూడా అడుగుతాడు. ఇటువంటి భయం అతనికి ఉంటది అవునా కాదా?

కానీ నిరుపేదకి ఇస్తే? బీదవాళ్ళకి ఇస్తే? అక్కడ నుండి ఏం దొరుకుతుంది? వారి నుండి మనకు ఏం వస్తుంది? ఏమీ ఆశ ఉండదు. ఇకపోతే అనాథలు. మన సమాజంలో ప్రత్యేకంగా అనాథలు మహా ఎక్కువ ఉంటే వారి తల్లి వారికి దిక్కుగా ఉంటుంది. అది కూడా ఒక స్త్రీ. సామాన్యంగా ఒక బాధ్యులు అని అతని వారి వెంట ఎవరూ ఉండరు. వారిపై ఏదైనా దౌర్జన్యం చేస్తున్నప్పుడు మనిషికి ఏ భయం కూడా కలగదు.

అయితే పరలోక విశ్వాసం గట్టిగా ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? ఇతనికి ఎవడు దిక్కు లేకున్నా నేను ఇతన్ని కసరి కొట్టవద్దు, ఇతన్ని దూరం చేయవద్దు, ఇతన్ని గెంటేయవద్దు, ఇతని దగ్గర ఇతని దగ్గర ఏమీ లేకున్నా నేను అతనికి ఇవ్వాలి దాని యొక్క ప్రతిఫలం నాకు ఎక్కడ దొరుకుద్ది అల్లాహ్ వద్ద దొరుకుతుంది అన్నటువంటి నమ్మకం ఉండి అతను ముందడుగు వేస్తాడు. మరి వాస్తవానికి ఇస్లాం ధర్మం ఈ రోజుల్లో ఎన్నో టీవీ ఛానల్లు, న్యూస్ పేపర్లు ఇంకా ఎన్నో వర్గాలు ఎన్నో ఫిర్కాలు ఎన్నెవరు ఎవరెవరు ఇస్లాం గురించి ఏమన్నా గానీ ఒక బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు ఖురాన్ గ్రంథం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్ర చదివాడంటే అనాథలకు, నిరుపేదలకు ఎంత గొప్ప స్థానం ఇవ్వబడిందో వారికి వారి అవసరాలు తీర్చే విధంగా ఎలా ప్రోత్సహించబడిందో చాలా దీనికి సంబంధించిన ఆయత్ లు హదీసులు ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఒక రెండు విషయాలను మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు: ‘అనా వ కాఫిలుల్ యతీమి కహాజైని ఫిల్ జన్నా’. ప్రవక్త స్వయంగా తమ గురించి అంటున్నారు: నేను మరియు ఎవరైతే ఒక అనాథకు, అనాథ బాలుడు గానీ అనాథ బాలిక గానీ అనాథకు బాధ్యుడిగా ఉండి వారి యొక్క మంచి చెడ్డలు చూసుకుంటూ వారి యొక్క శిక్షణ, వారి యొక్క చదువు, వారి యొక్క పెళ్లి అన్ని రకాల బాధ్యతలు వహిస్తాడో మేమిద్దరము స్వర్గంలో ఇలా దగ్గరగా కలిసి ఉంటాము అని శుభవార్త ఇచ్చారు. ప్రవక్తకు తోడుగా ఉంటాడు అలాంటి వ్యక్తి. ఎంత గొప్ప స్థానమో గమనించండి. ఇది ఎవరి గురించి అనాథల గురించి ఎన్నో ఉన్నాయి లాభాలు ఫజీలత్ లు హదీసులు కానీ ఈ ఒక్క హదీసును గమనిస్తే కూడా మనం ఇస్లాం లో అనాథలకు ఎంత గొప్ప స్థానం ఇవ్వబడింది వారి యొక్క మంచి చెడ్డలు చూడడం, వారి యొక్క కష్టాల్లో వారికి తాత్ ఇవ్వడం, మద్దతు చేయడం, వారి యొక్క శిక్షణ, వారి యొక్క చదువు అన్ని రకాల వారి యొక్క బాధ్యతలను వహించడం ఎంత గొప్ప విషయం.

ిక మిస్కీన్ నిరుపేదలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: ‘అస్సాయీ అలల్ అర్మలతి వల్ మిస్కీన్ కల్ ముజాహిది ఫీ సబీలిల్లాహ్’. ఎవరైతే విధవలకు అంటే భర్త లేకుండా జీవితం గడుపుతున్నారు దిక్కు లేకుండా భర్త చనిపోయాడా లేదా విడాకులు ఇచ్చాడా ఇక ఎవరూ కూడా తనను పెళ్లి చేసుకోవడం లేదు వారి యొక్క జీవితం చాలా దుర్భరంగా గడుస్తుంది. వల్ మిస్కీన్ నిరుపేదలు మరీ బీదవాళ్లు. ఇలాంటి విధవలకు మరియు బీద వాళ్లకు నిరుపేదల కొరకు కృషి చేసేవాడు, స్వయంగా నా దగ్గర ఏం లేకున్నా వారిని కలిసి వారిని కలిసి ఫలానా ఒక బేవా స్త్రీ ఉన్నది ఫలానా ఒక మిస్కీన్ వ్యక్తి ఉన్నాడు మీరు ఒక నెలకు ఐదువందలు ఇవ్వండి మీరు ఒక రెండొందలు ఇవ్వండి వారి యొక్క ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు స్కూల్ లో అడ్మిట్ చేయండి దాని గురించి ఫీజు ఇవ్వండి ఈ విధంగా వారి యొక్క బాగుగోలు కొరకు స్వయంగా డబ్బు రూపకంగా ఏమీ చేయలేకపోయినా ఆర్థికంగా సహకరించలేకపోయినా డబ్బు ఉన్న వారి దగ్గరికి వెళ్లి పరపతి ఉన్న దగ్గరికి వారు వెళ్లి ఎవరు ఏ రకమైన సహాయం చేయగలుగుతారో వారిని కలిసి వారి గురించి మంచి చేయడానికి ప్రయత్నం చేసేవారు కల్ ముజాహిది ఫీ సబీలిల్లాహ్ అల్లాహ్ మార్గంలో యుద్ధం చేసే వారి లాంటి పుణ్యం వారికి లభిస్తుంది. అల్లాహ్ తఆలా ఇలాంటి సత్కార్యాలు పుణ్యకార్యాల్లో పాల్గొనే ఒక సద్భాగ్యం మనందరికీ ప్రసాదించు గాక.

నమాజు పట్ల ఏమరుపాటు మరియు ప్రదర్శన బుద్ధి

ఇక ఆ తర్వాత ఏం చెప్పాడు అల్లాహ్ తఆలా? ఫవైలుల్ లిల్ ముసల్లీన్. నమాజు చదివే వారి కొరకు వినాశం ఉంది అల్లాహు అక్బర్ ఎంత విచిత్ర విషయం ఆలోచించండి. ఎవరైతే నమాజు చేయటం లేదో వారు ఇప్పుడే తొందరగా సంతోష పడకండి నమాజు చేస్తే ఇక్కడ పాపం దొరుకుతుంది నమాజు చేస్తే శిక్ష దొరుకుతుంది అని. నమాజు చేయని వారి గురించి ఇంకా మహా భయంకరమైన శిక్షలు ఉన్నాయి. మసలకకుమ్ ఫీ సఖర్. ఖాలు లమ్ నకు మినల్ ముసల్లీన్. ఇహలోకంలో నెక్స్ట్ పార్ట్నర్ ఉండవచ్చు క్లాస్మేట్ ఉండవచ్చు జాబ్ మేట్ ఉండవచ్చు ఒక కాడ పని చేసుకునే వాళ్ళు ఒక కాడ కలిసి మెలిసి తినేవాళ్ళు కానీ ఎవరైతే నమాజు చేసేవాళ్లో ఎవరైతే మంచి కార్యాలు చేసేవాళ్లో విశ్వాసం పై గట్టిగా స్థిరంగా ఉన్నవారు వారు స్వర్గంలో పోతారు పోయిన తర్వాత అక్కడ చూస్తారు ఫలానా ఫలానా ఫలానా మన ఫ్రెండ్స్ మనకు కనబడతలేరు కదా మన బంధువులు మనకు కనబడతలేరు కదా ఎక్కడున్నారు? అల్లాహ్ తఆలా అడుగుతాడు వారిని చూడాలనుకుంటున్నారా? అవును అల్లాహ్ తఆలా. ఇక చూడండి వారు నరకంలో ఉన్నారు అని అల్లాహ్ తఆలా చూపిస్తాడు. అప్పుడు ఈ స్వర్గవాసులు ఆ నరకవాసిని అడుగుతారు ఇహలోకంలో మాతో కలిసి మెలిసి ఉండేవారు మీరైతే కానీ ఈరోజు ఎందుకు మీరు నరకంలో వచ్చి పడ్డారు? మసలకకుమ్ ఫీ సఖర్ మిమ్మల్ని ఏ విషయం నరకంలో తీసుకొచ్చేసింది? ఖాలు లమ్ నకు మినల్ ముసల్లీన్ మేము నమాజు చేసే వారిలో లేకుంటిమి. తిండిలో పనిలో ఫిలింలో అన్నిట్లో మీతోని పాల్గొన్నాము కానీ మీరు నమాజ్ కు వెళ్ళినప్పుడు నమాజ్ కు రండి అనంటే అరె పోరా ఇప్పుడే మీరు ముతవా అయిపోయింది ఇక మేము మీతోని కలవలేము నమాజ్ కు మీతో మేము వచ్చేవాళ్లము కాదు అందుగురించి అల్లాహ్ మమ్మల్ని నరకంలో పడేశాడు. ఈ నమాజ్ చేయని విషయం అనేది మమ్మల్ని ఈ స్థానానికి దిగజారి చేసింది అని వారు అప్పుడు అంటారు. నమాజ్ చేయని వారి స్థితి మరీ భయంకరంగా ఉంది కానీ ఇక్కడ ఏ నమాజ్ చేసే వారి గురించి చెప్పడం జరుగుతుంది ముందు ఆ విషయం ఉంది. నమాజ్ చేసే వారి గురించి ఈ వినాశం ఉంది ఎవరు వారు? అల్లజీన హుమ్ అన్ సలాతిహిమ్ సాహూన్. వారు తమ నమాజుల పట్ల ఏమరుపాటుకు గురి అయ్యి ఉన్నారు.

సోదరులారా! నమాజ్ అన్న విషయం మన మరియు మన యొక్క ప్రభువు మన యొక్క అల్లాహ్ మధ్యలోని ఒక స్పష్టమైన సంబంధం. ఈ సంబంధాన్ని సంపూర్ణ ప్రేమతో ఇష్టపూర్వకముగా మనస్ఫూర్తిగా చేయాలి. ఏదో బలిమిటికి ఫలానా చెప్తున్నాడు ఫలానా చెప్తున్నాడు అన్నటువంటి బలిమితో ఎప్పుడైతే మనం చేస్తామో ఆ బలిమి చేసేవాళ్ళు లేదా ఆ బోధ చేసేవాళ్ళు మనకు దగ్గరగా లేకుంటే మనం ఏమరుపాటుకు గురి అయి ఉంటాము. అలా ఏమరుపాటుకు గురైన వారు నమాజుల విషయంలో వారికి వినాశం ఉంది. ఈ ఏమరుపాటు అనేది ఏ రకంగా నమాజ్ టైంకు చేయకపోవడం ఇది కూడా ఏమరుపాటులో వస్తుంది లేదా టైంకు నమాజ్ లో వచ్చాము కానీ మనసు పెట్టి నమాజ్ చేయడం లేదు. ఎప్పుడు అయిపోతే తొందరగా పరిగెత్తి పోవాలి అని ఎందుకైతే వచ్చానో ఇక్కడికి నమాజ్ చేయడానికి అని ఇలాంటి ఇష్టం లేకుండా ఎంతో బద్ధకంతో మూడవ విషయం నమాజ్ చేస్తున్నప్పుడు నమాజ్ యొక్క విధులు నమాజ్ యొక్క సున్నతులు ఏ విషయం ఏ పద్ధతి ఎలా అవలంబించాలి ఎలా చేయాలి సమయం గడుస్తున్న కొద్దీ వయసు మీద పడుతున్న కొద్దీ వారాలు నెలలు సంవత్సరాలు దాటుతున్నాయి మన జీతం పెరగడానికి ప్రయత్నం చేస్తాము సంతానం పెరగడానికి ప్రయత్నం చేస్తాము వ్యాపారం పెరగడానికి ప్రయత్నం చేస్తాము ప్రపంచ రంగంలో అన్నిట్లో ఇంకా ముందుముందుకు ఉండాలి అని చూస్తాము కానీ మన యొక్క నమాజ్ అల్లాహ్ తో మన యొక్క సంబంధం అది కూడా గట్టిగా పడాలి ఈరోజు ఒక సూర యాద్ చేసుకున్నాము రేపటి రోజు రెండు యాద్ చేసుకుందాం ఈరోజు నేను తెలియక ఏదో తొందరగా చేశాను రేపటి రోజు తెలుసుకొని మరింత మంచిగా చేస్తాను ఇలాంటి తపన లేకుంటే అలాంటి నమాజుల వల్ల ఏం లాభం కలుగుతుంది?

దీని గురించి ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు: ద్వంద్వ స్వభావులు మునాఫికులు పై పైగా ఇస్లాం అని చెప్పుకుంటూ లోపట ఇస్లాం పట్ల అల్లాహ్ పట్ల ధర్మం పట్ల ప్రేమ లేకుండా జీవితం గడిపే వారు. ఇలాంటి వారి గురించి ఏం చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు: ‘తిల్క సలాతుల్ మునాఫిఖ్, తిల్క సలాతుల్ మునాఫిఖ్, తిల్క సలాతుల్ మునాఫిఖ్’. ఈ మునాఫికులు ద్వంద్వ స్వభావులు కపట విశ్వాసులు వీరి యొక్క నమాజ్ ఇలా ఉంటుంది వీరి యొక్క నమాజ్ ఇలా ఉంటుంది వీరి యొక్క నమాజ్ ఇలా ఉంటుంది ఎలా? టైం దాటుతూ ఉంటుంది దాటుతూ ఉంటుంది దాటుతూ ఉంటుంది ఇక చివరి గడియ ఉన్నప్పుడు అరె నమాజ్ టైం సంపూర్ణంగా కంప్లీట్ అయిపోతుంది కదా ఇక మూడు నాలుగు నిమిషాలే ఉంది తొందరగా వచ్చేస్తాడు టకా టక్ టకా టక్ ప్రవక్త గారు చెప్పారు ఎలాగైతే కోడి గింజలు తినడానికి చుంచు ఎలా కొడుతుంది ఆ విధంగా తన నమాజ్ చేసి వెళ్లిపోతాడు. అతనికి అతని ఆ నమాజ్ ద్వారా ఏదైనా ప్రయోజనం కలుగుతుందా? లాభం కలుగుతుందా? పుణ్యం దొరుకుతుందా? దొరకదు. అందుగురించి సోదరులారా! ఇలాంటి అలసట ఇలాంటి అలక్ష్యం ఏమరుపాటు నమాజ్ విషయంలో ఉండకూడదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని యొక్క ప్రేమలో మనస్ఫూర్తిగా ప్రవక్త యొక్క సరైన విధానంలో ఈ ఐదు పూటల నమాజులు చేస్తూ ఉండే భాగ్యం మనందరికీ ప్రసాదించు గాక. ఐదు పూటల నమాజులతో పాటు తహజ్జుద్ ఇంకా ఇతర నఫిల్ నమాజులు కూడా చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

ఇలాంటి నమాజీలకు వినాశం ఉంది అని ఏదైతే చెప్పబడుతుందో అందులో ఒక రెండో రకం ‘అల్లజీన హుమ్ యురా ఊన్’. ఎవరైతే ప్రదర్శన బుద్ధితో నమాజ్ చేస్తారో. నమాజ్ చేస్తున్నారు కానీ ఎందుకు? అల్లాహ్ చూసి నన్ను మెచ్చుకోవాలి, అల్లాహ్ తన యొక్క పుణ్య దాసుల్లో నన్ను చేర్చాలి అలాంటి ఉద్దేశం కాదు ఆ ఫలానా వ్యక్తి చూస్తున్నాడు నన్ను నమాజీ అని అనుకోవాలి. ఫలానా వ్యక్తి నన్ను మెచ్చుకోవాలి, మా ముతవల్లి గారు నన్ను మెచ్చుకోవాలి, మా తండ్రి నన్ను మెచ్చుకోవాలి, ఫలానా నా ఫ్రెండ్ నన్ను మెచ్చుకోవాలి, మా వాడ యొక్క మౌల్వీ సాబ్ నన్ను మెచ్చుకోవాలి ఈ విధంగా ప్రదర్శన బుద్ధి ప్రజలకు చూపించాలని రియా దిఖవా సుమ్ ఆ ఎవరైతే ఇలాంటి ఉద్దేశాలతో నమాజ్ చేస్తారో వారికి కూడా దాని యొక్క పుణ్యం లభించదు వారికి వినాశం ఉంది అని ఇక్కడ హెచ్చరించబడుతుంది.

చిన్న చిన్న సహాయాలు మరియు ముగింపు

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏమిటో తెలుసా? అరైతల్లజీ – ఆ వ్యక్తిని నీవు చూశావా ఎవరైతే పరలోక దినాన్ని తిరస్కరిస్తున్నాడు అందువల్ల అతనిలో ఒక చెడ్డ గుణం అనాథను కసరి కొట్టడం నిరుపేదలకు అన్నం పెట్టండి అని చెప్పకపోవడం లాంటి చెడు గుణాలు జన్మించాయి. అలాగే ఈ నమాజ్ చేసే వారికి ఏ వినాశం అయితే ఉందో వారి సంగతి కూడా చూడు కొంచెం. ఎవరు వారు? నమాజ్ లో ఏమరుపాటుతో పాల్గొంటారు, ప్రదర్శన బుద్ధితో నమాజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? పరలోక విశ్వాసం గట్టిగా లేదు గనుక నమాజ్ లో కూడా లోపం జరుగుతుంది. ఒకవేళ పరలోక విశ్వాసం బలంగా ఉండేదుంటే నమాజ్ లో కూడా ఇలాంటి ఏమరుపాటు అనేది జరగదు. ఇలా పరలోక విశ్వాసం బలహీనంగా ఉన్నందుకు మరొక మూడో రకమైన చెడు వారిలో ఏమొస్తుంది? వయమ్నఊనల్ మా ఊన్. వారు సాధారణంగా పరస్పరం ఒకరికి ఒకరు చేయూతగా తోడ్పాటుగా వాడుకునే అవసరాలు వస్తువులు కూడా ఇవ్వకుండా ఆపుకుంటారు.

అల్ మా ఊన్ అన్న పదం ఏదైతే ఉందో ఇక్కడ హజ్రత్ ఇబ్నె మసూద్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్, హజ్రత్ అలీ, అబ్దుల్లా బిన్ ఉమర్, ఉమ్మె అతియ్య ఇంకా ఎందరో సహాబాల వ్యాఖ్యానాలు ఏదైతే వచ్చి ఉన్నాయో హదీసు గ్రంథాల్లో, ఇంట్లో గొడ్డలి, నీళ్ల బొక్కెన బకెట్ మరియు ఇటువంటి చిన్న చిన్న ఏదైనా బౌల్స్ ఏదైనా చిన్నపాటి సామాన్ ఏదైతే అవసరం ఉంటుందో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది ఇంటి పక్కవాళ్ళు పరస్పరం ఒకరి నుండి ఒకరు అడుగుకుంటూ ఉంటారు. కనీసం ఇలాంటి చిన్న విషయాలు కూడా ఇవ్వకపోవడం వారికి చేయూతగా తోడ్పాటుగా ఉండకపోవడం కూడా దీనివల్ల మనకు వినాశం కలుగుతుంది అన్నటువంటి హెచ్చరిక ఇందులో ఇవ్వబడింది. ఇక ఈ సూరాను మీరు గమనిస్తే ఇందులో మనకు కొన్ని విషయాలు బోధపడుతున్నాయి. అవేంటి? ముఖ్యంగా మనిషిలో పరలోక విశ్వాసం చాలా బలంగా ఉండాలి. అల్లాహ్ నన్ను ఏదైతే సృష్టించాడో పుట్టించాడో అతను చనిపోయిన తర్వాత ఒకరోజు నన్ను మరోసారి తిరిగి బ్రతికిస్తాడు లేపుతాడు అక్కడ ఇహలోకంలో నేను చేసిన ప్రతి చిన్న పెద్ద మంచి చెడు అన్ని విషయాల గురించి సమాధానం చెప్పుకునేది ఉంది. ఆ పరలోక దినాన్ని బలంగా గట్టిగా విశ్వసించాలి. ఆ విశ్వాసం వల్ల అతని మధ్య అతని సృష్టికర్త మధ్య సంబంధం బాగుపడుతుంది. అతి ముఖ్యమైన ఆరాధన నమాజ్ అనేది సంపూర్ణ ప్రేమతో మనస్ఫూర్తిగా చేయగలుగుతాడు. అంతేకాకుండా అతని మధ్య అతని లాంటి సోదరుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. పరస్పరం ఒకరికి ఒకరు చేయూతగా తోడ్పాటుగా ఉండి వారికి అవసరం ఉన్న విషయాల్లో వారికి సహాయపడే అన్నటువంటి గుణం వారిలో వస్తుంది. అంతేకాకుండా సమాజంలో ఎవరైతే దిక్కు లేని వాళ్ళు సామాన్యంగా బలహీనులుగా ఉంటారో అనాథలు గానీ నిరుపేదలు గానీ విధవలు గానీ ఇలాంటి వారి పట్ల కూడా ఒకరితో ఏమీ ఆశించకుండా నేను ఒక అనాథల గురించి భవనం తయారుచేసి మంచిగా చేస్తే ప్రభుత్వం నాకు చాలా రకాల సహాయాలు చేస్తుంది అన్న ఆశతో కూడా ఎందరో ముందడుగు వేసి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ నాకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఉన్నాడు ఆయన నాకు తన యొక్క సంతృప్తిని ప్రసాదించి ఆయన యొక్క దర్శన భాగ్యం నాకు కలుగనుంది పరలోకంలో స్వర్గంలో అన్నటువంటి ఆశతో వారి పట్ల మంచితనం చేస్తూ ఉండాలి. అందుగురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ప్రవక్త పదవి లభించక ముందే ఇలాంటి సద్గుణాలు వారిలో ఉండినవి. హజ్రత్ ఖదీజా రజిఅల్లాహు అన్హు గారు ఏం చెప్పారు? ఇన్నక లతసిలుర్రహిమ్. నీవు సంబంధాల్ని బంధుత్వాల్ని పెంచుతూ ఉంటారు. వతఖ్రిద్దైఫ్. ఎవరైతే అతిథులు వస్తారో మీరు అతిథి మర్యాద చాలా మంచి విధంగా చేస్తారు. తక్సిబుల్ మాదూమ్. ఏమీ పని చేయలేకుండా ఎవరైతే సంపాదించకుండా బలహీనంగా ఉన్నాడో అలాంటి వారికి మీరు సంపాదించి పెడతారు. వతుఈను అలా నవాయిబిల్ హఖ్. మరి ఎవరైతే ధర్మపరంగా ఏదైనా కష్టానికి ఆపదకు ఏదైనా ఇబ్బందికి గురి అయి ఉన్నారో వారికి మీరు సహాయపడతారు. ఇలాంటి సద్గుణాలు ఉన్న వారిని అల్లాహ్ ఎప్పుడూ కూడా అవమాన పరచడు అలాంటి వారిని అల్లాహ్ వృథా చేయడు మీరు బాధపడకండి అని ఓదార్పుని ఇచ్చింది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసేవారు ఓ అల్లాహ్! నన్ను మిస్కీన్ లలో చేర్చుకో, మిస్కీన్ ల పట్ల నాకు ప్రేమ నిరుపేదల యొక్క ప్రేమ నాలో కలిగించు మరియు ప్రళయ దినాన ఈ నిరుపేదల యొక్క జమాత్ లో వారి వెంట నన్ను కూడా ప్రళయ దినాన హాజరు చేయి. నిరుపేదలతో కూర్చోవడం వారికి అవసరాలు తీర్చడం ఇందులో ఎలాంటి చిన్నతనం అనేది మన ప్రవక్త గారు భావించేవారు కాదు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సూరా ఏదైతే మనం ఈరోజు విన్నామో దీని యొక్క వ్యాఖ్యానం తెలుసుకున్నామో దీని ప్రకారం మన యొక్క జీవితం గడుపుకునే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించు గాక. జజాకుముల్లాహు ఖైర్ వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.


Tags: Islamic Sermon, Surah Al-Maun, Quran Telugu, Day of Judgment, Orphan, Prayer, Charity, Namaz, Riya, Telugu Islam, ఇస్లామిక్ ప్రసంగం, సూరహ్ అల్ మా ఊన్, ఖురాన్ తెలుగు, పరలోక దినం, అనాథలు, నమాజు, దానం, రియా, తెలుగు ఇస్లాం.

అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత [ఆడియో & టెక్స్ట్]

అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత
https://youtu.be/F_XuR9WXUr8 [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సహచరుడు, ఇస్లాం మొదటి ఖలీఫా అయిన హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలు వివరించబడ్డాయి. ఇస్లాంకు ముందు ఆయన స్వచ్ఛమైన, నిజాయితీ గల జీవితం, ప్రవక్త గారి పిలుపును అందుకుని క్షణం కూడా సంకోచించకుండా ఇస్లాం స్వీకరించిన తీరు, ప్రవక్త గారి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, విశ్వాసం గురించి చర్చించబడింది. మేరాజ్ సంఘటన తర్వాత ప్రవక్తను సత్యవంతునిగా ధృవీకరించడం ద్వారా “సిద్దీఖ్” అనే బిరుదును ఎలా పొందారో వివరించబడింది. ఇస్లాం కోసం బానిసలను విడిపించడం, హిజ్రత్ (వలస) ప్రయాణంలో ప్రవక్త గారికి తోడుగా నిలవడం, థౌర్ గుహలో ఆయన చేసిన త్యాగం, ప్రవక్త గారి మరణానంతరం ముస్లిం సమాజాన్ని ఎలా ధైర్యంగా నిలబెట్టారో వంటి అనేక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఇందులో ప్రస్తావించబడ్డాయి.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అద అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహచరుల గురించి తెలుసుకొని ఉన్నాము.

ఈరోజు మనం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము.

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించాక రెండున్నర సంవత్సరాలకు ఇహలోకంలోకి వచ్చారు. ఆయన తన చిన్నతనం నుండే ఎంతో నిజాయితీగా, సత్యవంతునిగా మరియు ఎంతో అందరికీ ఇష్టమయ్యే మృదువైన, ఉత్తమమైన నడవడికను అవలంబించుకొని జీవితం గడుపుకుంటూ వచ్చారు. ఆయన జీవిత చరిత్రను మనం చూస్తే, ఇస్లాం కంటే ముందు అజ్ఞాన కాలంలో ఆయన తన యవ్వనంలో గానీ, ఇస్లాం స్వీకరించక ముందు గానీ ఏ ఒక్క రోజు కూడా మత్తుపానీయాలకు సమీపించలేదు, దగ్గరికి వెళ్ళలేదు. ఏ చెడు అలవాట్లకు, సామాన్యంగా ఏదైతే కొన్ని సమాజాల్లో యువకులు కొన్ని చెడు గుణాల్లో పడిపోతారో, అలాంటి ఏ చెడు గుణానికి దగ్గర కాలేదు.

ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం గురించి ప్రచారం ప్రారంభం చేయక ముందు నుండే అతను ప్రవక్త గారికి ఒక దగ్గరి స్నేహితునిగా, ఒక మంచి స్నేహితునిగా ఉన్నారు. ఆయనకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే నేను ప్రవక్తను, అల్లాహ్ నన్ను సర్వ మానవాళి వైపునకు సందేశహరునిగా, ప్రవక్తగా చేసి పంపాడో, నా పిలుపు ఏమిటంటే, అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు మరియు నేను ఆయన ప్రవక్తను, నీవు ఈ విషయాన్ని స్వీకరిస్తావా అని అంటే, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు క్షణం పాటు గురించి కూడా సంకోచించక, ఎలాంటి సందేహంలో పడక, ఏ ప్రశ్న ప్రవక్త ముందు చేయక వెంటనే స్వీకరించారు. కొందరు తడబడాయిస్తారు, కొందరు ఆలోచిస్తారు, మరికొందరు ఎదురు ప్రశ్నలు వేస్తారు కానీ హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు అలాంటి ఏ సంకోచంలో పడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే నమ్ముకున్నారు.

ఇంకా మనం ఆయన జీవితం గురించి తెలుసుకున్నప్పుడు ఎన్నో విషయాలు ముందుకు రానున్నాయి, కానీ ఒక సందర్భంలో ఎప్పుడైతే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హుతో, ఏమిటి నీవు నీ స్నేహితుడు అంటే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, నీ స్నేహితుడు చెప్పిన ప్రతి మాటను ఒప్పుకుంటున్నావు అని హేళనగా కొందరు అవిశ్వాసులు అడిగినప్పుడు, అవును, ఆయన అమీన్ మరియు సాదిఖ్ అని మీరు కూడా నమ్మేవారు కదా! ఆయన ప్రపంచంలో ఎవరితోనీ కూడా తన స్వయ అవసరానికి అయినా ఏ ఒక్క రోజు గానీ ఏ ఒక్కసారి గానీ అబద్ధం పలకలేదు. అలాంటి వ్యక్తి సృష్టికర్త అయిన అల్లాహ్ పై ఎలా అబద్ధాన్ని, ఎలా అబద్ధాన్ని మోపుతారు? ఒక అభాండను అల్లాహ్ వైపునకు ఎలా అంకితం చేస్తారు? చేయలేరు. అందుగురించి ఆయన చెప్పిన ప్రతి మాటను నేను నమ్ముతాను. అల్లాహ్ ఈ విషయం నాకు తెలిపాడు అని ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారో అందులో నేను ఏ మాత్రం సంకోచించను. సోదర మహాశయులారా, సోదరీమణులారా, విశ్వాసం అంటే ఇలా దృఢంగా ఉండాలి. మనం కూడా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క జీవితం ద్వారా మంచి ఉత్తమమైన గుణపాఠాలు నేర్చుకోవాలి.

హజ్రత్ అబూబకర్, ఈ బిరుదుతోనే ఆయన చాలా ప్రఖ్యాతి గాంచారు. అబ్దుల్ అతీఖ్ అని ఇంకా అబ్దుల్ కాబా అని వేరే ఎన్నో రకాల పేర్ల గురించి మనకు చరిత్రలో తెలుస్తుంది. కానీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి అబ్దుల్లాహ్ అన్న పేరును పెట్టారు, అల్లాహ్ యొక్క దాసుడు అని, కానీ అబ్దుల్లాహ్ అన్న పేరుతో ఆయన ఫేమస్ కాలేదు. అబూబకర్ అన్న పేరుతో మరియు మరొక బిరుదు “సిద్దీఖ్”.

దీని గురించి కూడా ఎన్నో ఉల్లేఖనాలు ఉన్నాయి. ఖురాన్ ఒక ఆయతు ద్వారా కూడా ఎందరో ఖురాన్ వ్యాఖ్యానకర్తలు ఈ విషయం తెలిపారు.

وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ ۙ أُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ
(వల్లజీ జా అబిస్సిద్ఖి వసద్దఖ బిహీ ఉలాఇక హుముల్ ముత్తఖూన్)
సత్యాన్ని తీసుకువచ్చినవాడూ, దాన్ని సత్యమని ధృవీకరించిన వాడూ – అలాంటి వారే దైవభీతి గలవారు. (39:33)

ఇందులో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యపరిచిన వారు, వారే భయభక్తులు కలిగి ఉన్నవారు, వారే ముత్తఖీన్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏదైతే తెలుపుతున్నాడో, సద్దఖ నుండి సిద్దీఖ్ వస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సత్యపరిచిన వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ గనుక ఆయనకు సిద్దీఖ్ అన్న బిరుదు పడింది. అంతేకాదు దీని గురించి ఒక ప్రఖ్యాతిగాంచిన సంఘటన ఏమిటంటే ఎప్పుడైతే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గగన ప్రయాణం మేరాజ్ కు వెళ్లి వచ్చారో ఆ తర్వాత మేరాజ్ యొక్క సంఘటన ప్రజలకు తెలియపరిచారు. అప్పుడు విశ్వాసులు ఆ విషయాన్ని నమ్మారు. కానీ అవిశ్వాసులు హేళన చేశారు. మేము ఇక్కడి నుండి మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వెళ్ళాలంటే నెల పడుతుంది కనీసం, నీవు ఒకే రాత్రి రాత్రిలోని కొంత భాగములో బైతుల్ మఖ్దిస్ వెళ్లి మళ్ళీ అక్కడ నుండి ఏడు ఆకాశాల వరకు వెళ్ళావు, ఏమిటి మమ్మల్ని పిచ్చి వాళ్ళుగా అనుకుంటున్నావా అని ఎగతాళి చేశారు. కానీ ఆ సమయంలో అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలుపుతున్న సందర్భంలో అబూబకర్ లేరు. ఒక అవిశ్వాసి అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు వెళ్లి, ఏమిటి ఎవరైనా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు ఒక రాత్రిలో వెళ్లి వచ్చాను అని అంటే నమ్ముతావా? అంటే అబూబకర్ సిద్దీఖ్ చెప్పారు, లేదు. సామాన్యంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఎన్ని రోజుల ప్రయాణం పడుతుంది మనకు తెలుసు కదా. ఎవరైనా ఇలా చెప్పేది ఉంటే ఎలా నమ్మాలి? అతడు సంతోషపడి వెంటనే చెప్పాడు, అయితే మరి నీ స్నేహితుడు నీ మిత్రుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెబుతున్నాడు కదా, రాత్రి కొంత భాగంలోనే బైతుల్ మఖ్దిస్ కి వెళ్ళాడంట, అక్కడి నుండి ఏడు ఆకాశాలకు వెళ్లి స్వర్గ నరకాలను కూడా దర్శనం చేసి వచ్చారంట. వెంటనే అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తెలిపారు, ఒకవేళ ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే అది నూటికి నూరు పాళ్ళు నిజం, అందులో అబద్ధానికి అసత్యానికి ఏ ఆస్కారం లేదు. అల్లాహు అక్బర్! గమనించండి. అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు సరే నేను ముహమ్మద్ ను తెలుసుకుంటాను సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తర్వాత నిజమో లేదో చెబుతాను ఇవన్నీ ఇలా చెప్పలేదు విషయాలు, ఏమన్నారు? అతని ముంగట అప్పుడే అప్పటికప్పుడే చెప్పారు, ఒకవేళ ఈ మాట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గనుక చెప్పేది ఉంటే ఆ మాట నిజము, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుగురించి ఆయనకు సిద్దీఖ్ అన్నటువంటి బిరుదు పడింది అని కూడా చెప్పడం జరిగింది.

అంతేకాకుండా సహీ బుఖారీలో కూడా ఒక హదీస్ వచ్చి ఉంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్, ఉమర్, ఉస్మాన్ నలుగురు ఉహద్ పర్వతంపై ఉన్నారు. అప్పుడు ఉహద్ పర్వతం అందులో ప్రకంపన వచ్చింది, ఊగ సాగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ కాలుతో ఒకసారి ఇలా కొట్టి, ఉస్బుత్ ఉహుద్ (ఓ ఉహుద్, స్థిరంగా ఉండు), ఉహుద్ కదలకు, నిలకడగా ఉండు, ఇప్పుడు నీపై ఒక నబీ, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీదులు ఉన్నారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అంటే ప్రవక్త అంటే స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సిద్దీఖ్ అంటే హజ్రత్ అబూబకర్ మరియు ఇద్దరు షహీదులు అంటే హజ్రత్ ఉమర్ మరియు ఉస్మాన్.

సోదర సోదరీమణులారా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం కంటే ముందు తమ జీవితంలో ఏ ఒక్కసారి కూడా షిర్క్ కార్యకలాపాలకు పాల్పడలేదు. ఆయనకు యవ్వనంలో చేరుకున్నప్పటి నుండే వ్యవసాయం ఇంకా పెద్దలతో ఉండడం మరియు హుందాతనంగా జీవించడం ఆరంభించారు. ఆయన యవ్వనంలో చేరిన తర్వాత ప్రజలలో ఒక చాలా మంచి వ్యక్తిగా, ఏదైనా ముఖ్య విషయాల్లో అతనితో సలహా తీసుకోవాలి అని ప్రజలు కోరేవారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు మౌనం వహించలేదు. నాకు ఇస్లాం లాంటి ఒక అనుగ్రహం లభించింది కదా ఇక దీనిపై నేను స్థిరంగా ఉంటాను అని తనకు తాను ఆలోచించుకొని కేవలం జీవితం గడపలేదు. ఇస్లాం స్వీకరించిన వెంటనే ఇస్లాం యొక్క ప్రచారం కూడా మొదలు పెట్టారు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఏ పది మంది గురించి ఇహలోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వీరు తప్పకుండా స్వర్గంలో చేరుతారు అని అందులో మొట్టమొదటి వ్యక్తి అబూబకర్, ఆ తర్వాత మిగతా తొమ్మిది మందిలో అధిక శాతం హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క బోధనతో, హజ్రత్ అబూబకర్ యొక్క ప్రోత్సాహంతో ఇస్లాం స్వీకరించారు. ఉదాహరణకు హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ తల్హా, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఇంకా వేరే కొంతమంది. అంతేకాదు, హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు వ్యాపారం చేస్తూ ఉండేవారు. అల్లాహు త’ఆలా ఆ వ్యాపారం ద్వారా అతనికి చాలా శుభం కలుగజేశాడు. ఆయన ఎంతో మంచి విధంగా ధనం సంపాదించారు, హలాల్, ధర్మసమ్మత మార్గం నుండి. కానీ ధనం అంటే ఇష్టపడి దాని ప్రేమలో, వ్యామోహంలో చిక్కుకునే వారు కాదు. సాధ్యమైనంత వరకు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతూ ఉండేవారు.

ఇక ఈ ఉత్తమ గుణం అయితే ఇస్లాం తర్వాత ఎలా మారింది? సమాజంలో ఎవరైతే కొందరు బానిసలు, బానిసరాండ్లు, మరికొందరు బలహీనులు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, వారు ఇస్లాం స్వీకరించిన కారణంగా వారి యొక్క యజమానులు వారిని బాధిస్తూ ఉండేవారు. అయితే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని వారి యొక్క యజమానుల నుండి కొని తన స్వయ డబ్బుతో వారిని అల్లాహ్ మార్గంలో విడుదల చేసేవారు. ఇస్లాంపై ఇక మీరు స్వేచ్ఛగా జీవితం గడపండి అని. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు స్వయంగా తాను తన డబ్బుతో ఏ ఏ బానిసలను కొని బానిస నుండి విముక్తి కలిగించారో వారిలో ఆమిర్ ఇబ్ను ఫుహైరా, ఉమ్ము ఉబైస్, జున్నైరా, నహదియా మరియు ఆమె కూతురు, హజ్రత్ బిలాల్ రదియల్లాహు త’ఆలా అన్హు చాలా ప్రఖ్యాతిగాంచిన వారు తెలిసిన విషయమే మరియు బనీ మొఅమ్మల్ కు సంబంధించిన ఒక బానిసరాలు.

అంతేకాకుండా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రజలకు ఇస్లాం బోధించడంలో స్వయంగా ఒక్కొక్కసారి ఆయనపై ఎన్నో ఆపదలు వచ్చేవి. ఎందుకంటే ప్రవక్త జీవిత చరిత్ర చదివిన వారికి విషయం తెలుసు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వయంగా మరియు వారిని విశ్వసించిన వారిపై అవిశ్వాసులు హత్యా, దౌర్జన్యాలు చేసేవారు మరియు ఎన్నో రకాలుగా వారిని బాధించేవారు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక దుర్మార్గుడు వచ్చి తన యొక్క దుప్పటిని తీసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెడలో వేసి ఇంత గట్టిగా లాగాడంటే దాని మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవూదుబిల్లా ఇక ఆయనకు ప్రాణం పోయినట్లు ఏర్పడింది. అప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వచ్చి ఆ దుష్టుల నుండి, దుర్మార్గుల నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విడిపించి, “అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బి యల్లాహ్” (నా ప్రభువు కేవలం అల్లాహ్ అని అన్నందుకు ఒక వ్యక్తిని చంపుతారా?) అని, ఏమిటి నా ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని అన్నంత మాత్రాన మీరు ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి పుణ్యాత్ముని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇంత దుర్మార్గానికి మీరు ఒడిగడుతున్నారు అని వారిని హెచ్చరించారు. అప్పుడు ఆ దుర్మార్గులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వదిలి అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు వారిని కొట్టడం మొదలు పెట్టారు. చివరికి ఆయన స్పృహ తప్పిపోయారు. అతని యొక్క తల్లి ఉమ్ము ఖుహాఫా వచ్చి తన కొడుకును వెంట తీసుకొని వెళ్ళింది. ఇంట్లోకి తీసుకెళ్లాక కొంత క్షణం, కొంత సమయం గడిచింది. స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన వెంటనే తల్లి తీసుకొచ్చి నీళ్లు ఇస్తుంది, నాన్న ఈ నీళ్లు త్రాగి కొంచెం ఓదార్పు వహించి నీవు విశ్రాంతి తీసుకో. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు చెబుతారు, లేదు లేదు, ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితి ఏముందో ఒకసారి నాకు తెలపండి. తల్లి అంటుంది, నాన్న నువ్వు కొంచెం మేలుకున్నాక, విశ్రాంతి తీసుకొని నీ శరీరంలోని ఈ అవస్థలు కొంచెం దూరమయ్యాక వెళ్లి నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాచారాన్ని తెలుసుకుంటూ. కానీ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒప్పుకోలేదు. ఉమ్మె జమీల్ ను పిలవండి అని తల్లికి చెప్పారు. ఎవరు? హజ్రత్ ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క సోదరి. అప్పటికి ఆమె ఇస్లాం స్వీకరించింది కానీ స్వయంగా ఉమర్ కు తెలియదు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వారి వద్దకు ఉమ్మె జమీల్ వచ్చింది. అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమ్మె జమీల్ చెవిలో ఒక మాట మాట్లాడారు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్షేమ విషయాలు తెలుసుకున్నారు. ఆయన బాగున్నారు, స్వస్థతగా ఉన్నారు అని తెలిసినప్పుడు అప్పుడు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారికి నెమ్మది, ఎంతో ఆనందం ఏర్పడింది. అయినా శరీరంలో స్వయంగా నడిచి వెళ్లే అటువంటి శక్తి లేదు, కానీ అమ్మ యొక్క సహాయంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. ప్రవక్తను చూసుకున్న తర్వాత ఆయన శరీరంలోని అవస్థలన్నీ దూరమైనట్లు ఆయనకు ఏర్పడ్డాయి. అల్లాహు అక్బర్. ఇలాంటి ప్రేమ వెలిబుచ్చేవారు. ఇలాంటి విశ్వాసం వారిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల. అల్లాహ్ ను విశ్వసించిన తర్వాత అల్లాహ్ ఆరాధనపై నిలకడగా ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను విశ్వసించి, ప్రవక్త బాటను తూచా తప్పకుండా అనుసరిస్తూ ఈ విధంగా వారు జీవితం గడిపారు. ఈ రోజుల్లో మన పరిస్థితి ఏముందో ఒకసారి గమనించండి. అబూబకర్ ఎవరు అబూబకర్? అల్లాహు అక్బర్! అబూబకర్, ఆయనను ప్రశంసిస్తూ ఖురాన్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పేరు చెప్పకుండా ఆయన ఉత్తమ గుణగణాలను ప్రస్తావిస్తూ ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు.

ఏ ఒక్క క్షణం పాటు కూడా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విడని వారు. అల్లాహ్ ధర్మం కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సైగను చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ధర్మం కొరకు ఏం అవసరం ఉంది అని చెప్పక ముందే గ్రహించి తన ఆస్తిని, తన సంతానాన్ని, తనకు తానును అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త గురించి త్యాగం చేసేవారు.

ఎప్పుడైతే మక్కా నుండి మదీనా వలస పోవడానికి అనుమతి వచ్చిందో, ఎందరో ముస్లింలు మదీనా వైపునకు వలస పో సాగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎన్నో సార్లు నాకు కూడా అనుమతి ఇస్తున్నారా మదీనా వెళ్ళడానికి అని అంటే, ప్రవక్త చెప్పేవారు, లేదు, ఓపిక వహించు, అల్లాహు త’ఆలా నీకు ఏదైనా మంచి స్నేహితం ప్రసాదించవచ్చు. అంటే నీ ఈ వలస ప్రయాణంలో నీకు ఎవరైనా మంచి తోడు లభించవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ వైపు నుండి వారికి అనుమతి లభించిన తర్వాత అబూబకర్ కు తెలిపారు, మన ఇద్దరము కలిసి వలస ప్రయాణానికి వెళ్తాము. మంచి రెండు వాహనాలను, ఒంటెలను సిద్ధపరిచి ఉంచు. అప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు రెండు ఒంటెలను మంచిగా సిద్ధపరిచి ఉంచారు. అబూబకర్ ఉద్దేశం ఈ రెండు ఒంటెలు స్వయంగా తమ ఖర్చుతో ఆయన తయారు చేసి ఉంచారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఒప్పుకోలేదు. ప్రవక్త ఉపయోగించడానికి ఏ ఒంటెను తీసుకోవాలనుకున్నారో దాని యొక్క ఖరీదు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హుకు చెల్లించారు. అంతే కాదు, ఈ వలస ప్రయాణంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, అల్లాహు అక్బర్! ఎన్నో మహిమలు జరుగుతాయి. ప్రతిసారి హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క ఘనత మరియు ఆయన యొక్క విశిష్టత ఇంకా స్పష్టమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంటి నుండి కదిలి వెళ్లారో, అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు వచ్చారు. ఒంటెలపై ప్రయాణం చేస్తూ ఘారె థౌర్ లోకి వెళ్లి అక్కడ శరణు తీసుకున్నారు. ఆ సందర్భంలో ముందు స్వయంగా అబూబకర్ ఆ ఘార్ లోపలికి వెళ్లారు, ఆ గుహ లోపలికి వెళ్లారు. ఘార్ అంటే గుహ, థౌర్ అక్కడ దాని యొక్క పర్వతం పేరు అందులోని ఒక గుహ. ఆ గుహలో ముందు అబూబకర్ వెళ్లారు ఎందుకు? అక్కడ ఏదైనా పురుగు పూసి, ఏదైనా విషకాటు వేసే అటువంటి విషపురుగులు ఉండకూడదు, ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా అవస్థ కలగకూడదు అని. అక్కడంతా పరిశుభ్ర చేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి పిలిచారు. మరియు ఆ సందర్భంలో ఒకచోట రంధ్రాన్ని చూస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రపోతున్నారు. ఆయనకు ఎలాంటి బాధ కలగకూడదు అని, ఏదైనా ఆ రంధ్రంలో నుండి విషపురుగు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని స్వయంగా ఆయనను గానీ కాటు వేయకూడదు అన్న భయంతో తన ఒక కాలును, తన యొక్క పాదాన్ని ఆ రంధ్రానికి ఆనించి ఉంచారు. కొంతసేపటికి ఏదో విషపురుగు కాటేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చాలా బాధ కలుగుతుంది, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల అబూబకర్ తోడపై ఉంది. నేను కదిలానంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిద్ర చెడిపోతుంది, ఆయన మేలుకుంటారేమో అన్న భయంతో కదలకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి గొప్ప త్యాగం ఒకసారి గ్రహించండి మీరు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క లుఆబ్ ముబారక్ అంటే లాలాజలాన్ని ఆ విషకాటు, విషపురుగు కాటేసిన చోట పెడతారు, అప్పటికప్పుడే నయమైపోతుంది. ప్రయాణంలో వెళుతున్నప్పుడు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఒకసారి ప్రవక్తకు ముందు, ఒకసారి ప్రవక్త వెనక, ఒకసారి ప్రవక్త కుడి వైపున, మరొకసారి ప్రవక్త ఎడమ వైపున ఈ విధంగా ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో అడిగారు, అబూబకర్ ఇలా వెనక, ముందు, కుడి, ఎడమ ఈ విధంగా ఎందుకు మీరు మారుస్తున్నారు స్థలం వెళుతూ వెళుతూ? అప్పుడు అబూబకర్ చెప్పారు, నాకు ఎప్పుడైతే భయం ఏర్పడుతుందో, శంకిస్తానో, ఇటు నుంచి ముందు నుండి ఎవరైనా శత్రువులు ఎదురవుతారా ఆ సందర్భంలో మీకు ఏ హాని కలగకుండా, మీపై ఎలాంటి బాణం రాకుండా నేను ముందుకు వెళ్తాను. నాకు ఎప్పుడైతే ఏదైనా వెళుతూ వెళుతూ ప్రాంతంలో ఇటువైపున ఏదైనా రాళ్ల వెనక ఎవరైనా దాగి ఉండవచ్చును, ఎవరైనా ఏదైనా అక్కడ నుండి బాణం విసురుతారా, ఏదైనా శత్రువు అక్కడ నుండి ఏదైనా దాడి చేస్తాడా అని భయం కలిగినప్పుడు నేను కుడి వైపున వస్తాను, ఎడమ వైపున భయం కలిగినప్పుడు ఎడమ వైపు వెళ్తాను, వెనక వైపు భయం కలిగినప్పుడు వెనక వెళ్తాను. ఈ విధంగా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కాపాడడానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏ హాని కలగకుండా ఉండడానికి ఇంతగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట ఈ వలస ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ అవసరం పడుతుందో అని తన వద్ద ఉన్న డబ్బు ధనం మొత్తం వెంట తీసుకొని వెళ్లారు. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ వారి ఇంటి వారి గురించి వదిలి వెళ్లారు. అల్లాహు అక్బర్! సోదర సోదరీమణులారా, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు మొట్టమొదటిసారిగా పురుషులలో ఇస్లాం స్వీకరించిన వ్యక్తి యొక్క ఈ అమూల్యమైన గాధను మనం వింటూ ఉన్నాము. అల్లాహ్ యొక్క దయతో ఈయన యొక్క జీవితంలోని మరెన్నో మంచి విషయాలు మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క వివిధ సందర్భాలలో వివిధ రకాల ధైర్య సాహసాలు, ఇస్లాం ప్రాప్తి కొరకు, వ్యాపించడానికి ఆయన చేసినటువంటి కృషి ఇంత అంత కాదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వలస వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి సమయంలో సులభతరమైన స్థితి గానీ, కష్టతరమైన పరిస్థితి గానీ అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థితుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అండదండగా ఉన్నారు. బద్ర్ యుద్ధం సంఘటన, దాని యొక్క వివరాలు ఎవరికీ తెలియవు? తెలియని వారు చదవండి, తెలుసుకోండి. కేవలం 313 వరకు ఇటువైపు నుండి ముస్లింలు మరియు అటువైపు నుండి అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని ఈ భూమి మీద నుండి నశింపజేయాలి అన్నటువంటి ఒక తప్పుడు ఉద్దేశ్యాన్ని తీసుకుని వెయ్యి కంటే ఎక్కువ మంది వస్తారు. ధర్మాధర్మాల మధ్య, సత్యాసత్యాల మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో రెండు చేతులు ఎత్తి అల్లాహ్ తో దుఆ చేస్తున్నారు, దుఆ చేస్తున్నారు. ఓ అల్లాహ్ నీ ధర్మాన్ని కాపాడడానికి, నీ ధర్మంపై స్థిరంగా ఉండడానికి, నీ ధర్మం నలువైపులా వ్యాపించడానికి ఈ కొంతమంది తమ ప్రాణాలు తమ చేతిలో తీసుకుని ఏదైతే వచ్చారో, నీవు వారిని స్వీకరించు, నీ ధర్మాన్ని కాపాడు, నీ ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఎవరైతే వచ్చారో వారి నుండి మమ్మల్ని, నీ ధర్మాన్ని అన్నిటిని కాపాడేవారు నువ్వే. దుఆ చేస్తూ ఉన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. చేతులు ఎత్తి దుఆ ఎక్కువ సేపు చేయడం మూలంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భుజాల మీద ఉన్నటువంటి ఆ దుప్పటి కింద జారిపడిపోతుంది. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆ విషయం చూసి, ఆ సంఘటన చూసి వచ్చి ఆ దుప్పటి కింది నుండి తీసి ప్రవక్త భుజాల మీద వేస్తూ, ప్రవక్తా ఇక సరిపుచ్చుకోండి, ఆపేయండి, అల్లాహు త’ఆలా తప్పకుండా మీ విన్నపాన్ని ఆమోదిస్తాడు, మీరు చేస్తున్న ఇంతటి ఈ దుఆలను తప్పకుండా స్వీకరిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తృప్తి ఇవ్వను సాగారు. ఆ తర్వాత ఉహద్ యుద్ధం గానీ, ఆ తర్వాత కందక యుద్ధం గానీ, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే వరకు ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి యుద్ధంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా వెంట వెంటనే ఉన్నారు.

చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయాక సహాబాల పరిస్థితి ఏమైంది? అలాంటి సందర్భంలో కూడా హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెక్కుచెదరకుండా, కదలకుండా ఎంతో ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో, నిలకడగా ఉన్నారు. ఆ సంఘటన మీరు బహుశా విని ఉండవచ్చును.

ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకాన్ని వీడిపోయారో, మలకుల్ మౌత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారి ఆత్మను తీసుకున్నారో, కేవలం ఈ భౌతిక కాయం హజ్రత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా గారి యొక్క ఇంట్లో మంచముపై ఉన్నది. ఈ విషయం వెంటనే మదీనాలో ఉన్నటువంటి ముస్లింలందరికీ తెలిసిపోయింది. అందరూ చాలా బాధతో రోధిస్తూ మస్జిద్-ఎ-నబవీలో సమూహం అవుతారు. కానీ ఎంతో ధైర్యవంతుడు, ఎంతో శూరుడు, యుద్ధ మైదానాలలో ఎందరినో చిత్తు చేసినటువంటి ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన కూడా ప్రవక్త మరణించారు అన్న విషయాన్ని భరించలేకపోతున్నారు. ఏమన్నారు? ప్రవక్త మరణించలేదు. మూసా అలైహిస్సలాం ఎలాగైతే కొద్ది రోజుల గురించి వేటికి వెళ్లారో అల్లాహ్ తోనే కలుసుకోవడానికి, మళ్లీ తిరిగి వచ్చారో అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్లారు, చనిపోలేదు. ఎవరైనా ముహమ్మద్ చనిపోయారు అని అనేది ఉంటే నేను అతనిని నా ఈ తల్వారితో నరికేస్తాను అన్నటువంటి నినాదం కూడా మొదలు పెట్టారు. ఆ సమయంలో అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు కొంత దూరంలో ఉన్నారు. ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వార్త తెలిసిన వెంటనే వచ్చేస్తారు. ముందు తమ కూతురు ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి యొక్క శుభ భౌతిక కాయం ఉన్న ఆ గదిలో వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దుప్పటి కప్పి ఉంటుంది. ముఖము పై నుండి దుప్పటి తీస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నొసటి మీద చుంబిస్తారు, ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు అంటారు, కేవలం అల్లాహ్ మాత్రమే ఎలాంటి మరణం లేనివాడు, ఎల్లకాలం శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు రెండు మరణాలు లేవు, ఒకే ఒక మరణం ఏదైతే ఉండెనో అది వచ్చేసింది, మీరు చనిపోయారు. అప్పటికీ ముస్లింల యొక్క ఈ పరిస్థితి, వారి యొక్క బాధ, మరోవైపున హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క నినాదం, హజ్రత్ అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇవన్నీ చూస్తారు. వెళ్లి ఉమర్ ను కూర్చోమని చెప్తారు, కానీ ఆ బాధలో అతను అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి మాటను పట్టించుకోలేకపోతారు. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారు అలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాబాలను ఎలా ఓదార్చాలి, ఉమర్ ఏదైతే తప్పుడు ఆలోచనలో ఉన్నాడో ప్రవక్త మరణ బాధ కలిగి అతడు ఏ ఆవేశంలో ఉన్నాడో, అతనిని ఎలా ఓదార్చాలి, అతడి యొక్క తప్పు ఆలోచనను ఎలా సరిచేయాలి? అల్లాహు అక్బర్! అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ అబూబకర్ మీద కలిగింది. అబూబకర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఎవరితోనూ గొడవపడలేదు, ఉమర్ ఏంటి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని ఆ సందర్భంలో ఏమీ చెప్పలేదు. వెంటనే మస్జిద్-ఎ-నబవీలో మెంబర్ పై ఎక్కారు. అల్లాహ్ యొక్క హమ్ద్-ఒ-సనా, ప్రశంసలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ తర్వాత అంటే ఖుత్బ-ఎ-మస్నూనా అని ఏదైతే అంటామో మనం సామాన్యంగా, ఆ తర్వాత

مَنْ كَانَ يَعْبُدُ مُحَمَّدًا فَإِنَّ مُحَمَّدًا قَدْ مَاتَ، وَمَنْ كَانَ يَعْبُدُ اللَّهَ فَإِنَّ اللَّهَ حَىٌّ لاَ يَمُوتُ
ఎవరైతే ముహమ్మద్ ను పూజించేవారో, ముహమ్మద్ చనిపోయారు అన్న విషయం వారు తెలుసుకోవాలి. మరి ఎవరైతే అల్లాహ్ ను పూజిస్తున్నారో, అల్లాహ్ ను ఆరాధిస్తున్నారో అల్లాహ్ శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు, ఎన్నటికీ అతనికి మరణం రాదు.

ఆ తర్వాత ఖురాన్ యొక్క ఆయత్ చదివి వినిపిస్తారు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు.

وَمَا مُحَمَّدٌ اِلَّا رَسُوْلٌۚ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ۗ اَفَا۟ىِٕنْ مَّاتَ اَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلٰٓى اَعْقَابِكُمْ ۗ وَمَنْ يَّنْقَلِبْ عَلٰى عَقِبَيْهِ فَلَنْ يَّضُرَّ اللّٰهَ شَيْـًٔا ۗوَسَيَجْزِى اللّٰهُ الشّٰكِرِيْنَ

(వమా ముహమ్మదున్ ఇల్లా రసూలున్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహిర్ రుసుల్, అఫఇమ్మాత అవ్ ఖుతిలన్ ఖలబ్తుమ్ అలా అ’అఖాబికుమ్, వమన్ యన్ఖలిబ్ అలా అఖిబైహి ఫలన్ యదుర్రల్లాహ షైఆ, వసయజ్ జిల్లహుష్ షాకిరీన్)
ముహమ్మద్ కేవలం ఒక ప్రవక్త మాత్రమే. ఆయనకు పూర్వం కూడా ఎందరో ప్రవక్తలు గడిచిపోయారు. ఒకవేళ ఆయన మరణించినా, లేదా చంపబడినా మీరు మీ మడమల మీద వెనుతిరిగి పోతారా ఏమిటి? అలా వెనుతిరిగి పోయినవాడు అల్లాహ్ కు ఎలాంటి నష్టాన్నీ కలిగించలేడు. కృతజ్ఞత చూపే వారికి అల్లాహ్ త్వరలోనే ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (3:144)

ఈ ఆయత్ వినగానే హజ్రత్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు అంటారు, నా కాళ్లు నా వశంలో లేవు, నేను కింద పడిపోయాను. అవును, నేను ఈ ఆయత్ ఖురాన్ లో చదివి ఉన్నాను కానీ బహుశా అప్పుడు నేను దీని యొక్క అర్ధాన్ని, దీని యొక్క భావాన్ని ఇంత గంభీరంగా తీసుకోలేదు అని అతను ఒప్పుకున్నారు. సహాబాలందరూ ఈ ఆయత్ అప్పుడే విన్నట్లుగా వారందరూ రోధిస్తూ ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు అన్న విషయం వారు ధృవీకరించుకున్నారు. హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క ఈ సమయస్ఫూర్తి, ఈ ధైర్యం, ఈ సాహసం, అల్లాహ్ యొక్క సహాయం ఆయనతో ఉండడం మూలంగా ముస్లిం ఉమ్మత్ అంతా ఐకమత్యంతో నిలబడగలిగింది.

ఆ తర్వాత ప్రవక్త తర్వాత మొదటి ఖలీఫాగా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు నియమితులయ్యారు. నియమితులైన తర్వాత ఆయన ముందు ఎన్నో ఫిత్నాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. మక్కా, మదీనా మరియు తాయిఫ్ ఈ మూడు ప్రాంతాలు తప్ప దాదాపు అరేబియా ద్వీపకల్పంలో ఉన్నటువంటి అనేక తెగల వారు ఇస్లాం నుండి మళ్ళీ తిరిగి తమ పాత ధర్మం వైపునకు వెళ్ళిపోయారు. కొందరు జకాత్ ఇవ్వడానికి తిరస్కరించారు. మరికొందరు తమను తాము ప్రవక్తగా ప్రకటించుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ముస్లింల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి సమయంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోక ముందు ఉసామా బిన్ జైద్ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఒక సైన్యాన్ని సిద్ధపరిచారో, ఆ సైన్యాన్ని పంపడానికే తీర్మానం తీసుకుంటారు. ఎందరో సహాబాలు అన్నారు, అబూబకర్, మదీనాలో మన సంఖ్య తక్కువగా ఉంది, ముస్లిం సైన్యాన్ని బయటికి పంపకండి, మనపై ఎవరైనా దాడి చేస్తారేమో. కానీ అబూబకర్ అన్నారు, లేదు, ప్రవక్త ఏదైతే తీర్మానం తీసుకున్నారో, దాన్ని నేను పూర్తి చేసి తీరుతాను. ఆ సైన్యాన్ని పంపారు. ఆ తర్వాత జకాత్ ఇవ్వని వారితో కూడా నేను యుద్ధం చేస్తాను అన్నారు. ప్రవక్తకు జకాత్ రూపంలో ఏది ఇచ్చేవారో, దానిలో ఒక చిన్న మేకపిల్లను కూడా ఎవరైనా ఇవ్వడానికి తిరస్కరిస్తే నేను అతనితో యుద్ధం చేస్తాను అన్నారు. అల్లాహు అక్బర్! ఎంతటి ధైర్యం. రెండు సంవత్సరాలు, కొన్ని నెలల కాలంలోనే హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు అల్లాహ్ యొక్క దయతో, అల్లాహ్ యొక్క సహాయంతో ఇస్లాంను మళ్ళీ తిరిగి అరేబియా ద్వీపకల్పంలో స్థాపించారు. ఎవరైతే ఇస్లాంను వీడి వెళ్లారో వారిని మళ్ళీ ఇస్లాం వైపునకు తీసుకువచ్చారు.

ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి పక్కనే ఆయనకు కూడా చోటు లభించింది. సోదర సోదరీమణులారా, అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ఆయన జీవితం నుండి మనం గుణపాఠం నేర్చుకోవాలి. ప్రవక్తపై విశ్వాసం, అల్లాహ్ పై విశ్వాసం ఎలా ఉండాలి, ఇస్లాం ధర్మం కోసం ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలాంటి కష్ట నష్టాలకు ఓర్చుకోవాలి, ఎలాంటి సాహసంతో ఇస్లాం కొరకు మనం సేవ చేయాలి అన్నటువంటి విషయాలు ఆయన జీవితం నుండి నేర్చుకోవాలి. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల యొక్క జీవిత చరిత్రలను చదివి, విని, వారి యొక్క మార్గాన్ని అవలంబించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహుమ్మ సల్లీ వసల్లిమ్ అలా నబియ్యినా ముహమ్మద్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

తౌబా (పశ్చాత్తాపం), ఇస్తిగ్ ఫార్ అంటే ఏమిటి? వాటి లాభాలు ఏమిటి? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి: (40 నిమిషాలు)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్
ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

“ఓ విశ్వాసులారా! మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్‌ వైపుకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు.” (నూర్‌ – ౩7)

మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపుకే మరలండి (పాపాల పశ్చాత్తాపపడండి).” (హూద్‌ – ౩)

“విశ్వసించిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్‌ వైపుకు మరలండి.” (తహ్రీమ్‌ – 8)


దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:

“అల్లాహ్ సాక్షి! నేను రోజుకు డెబ్భైకన్నా ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడుకుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉంటాను.” (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రార్ధనల ప్రకరణం.)


ఇతరములు:

నమాజు కొరకు మస్జిదుకు వెళ్ళే వారి ఉఫాది మరియు చావు, బ్రతుకుల బాధ్యత⁉️ [ఆడియో]

బిస్మిల్లాహ్

ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి: (9 నిముషాలు)

వక్త : ముహమ్మద్ నసీరుద్దీన్ జామియీ (హఫిజహుల్లాహ్)

నమాజు; ప్రతిరోజు ఐదు పూటల నమాజు చదవటం ప్రతి ముస్లింలకి తప్పనిసరి విధి చేయబడినది. అలాగే ముస్లింలకు నమాజు స్వర్గానికి తాళం చెవి లాంటిది. అలాగే అల్లాహ్ దగ్గర ప్రళయదినాన ముందుగా ప్రశ్నింపబడేది నమాజు గురించే. అందుకే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు నమాజు నా కంటి చలువ అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి క్లిష్టపరిస్ధితులు ఎదురైన ముందుగా నమాజు చదివి అల్లాహ్ తో వేడుకునేవారు.

మస్జిద్ కు వెళ్ళడం; ఎవరైతే నమాజు కొరకు మస్జిద్కు వెళ్తారో వారి ఉఫాది మరియు చావు బ్రతుకుల బాధ్యత (పూచి) కూడా అల్లాహ్ నే స్వయంగా తీసుకున్నాడు.

మిత్రులారా! ధైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసు నందు ఇలా ఉపదేశించారు;

హదీసు – పరిశీలన;

عَنْ أَبِي أُمَامَةَ ، أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ ، قَالَ : ” ثَلاثَةٌ كُلُّهُمْ ضَامِنٌ عَلَى اللَّهِ ، إِنْ عَاشَ رُزِقَ وَكُفِيَ ، وَإِنْ مَاتَ أَدْخَلَهُ اللَّهُ الْجَنَّةَ : مَنْ دَخَلَ بَيْتَهُ فَسَلَّمَ ، فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ ، وَمَنْ خَرَجَ إِلَى الْمَسْجِدِ ، فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ ، وَمَنْ خَرَجَ فِي سَبِيلِ اللَّهِ فَهُوَ ضَامِنٌ عَلَى اللَّهِ “

رواه ابن حبان في صحيحه
وأخرجه ابوداود والحاكم والبيهقي وغيرهم

హజ్రత్ అబూ ఉమామా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

ముగ్గురు; వారిలో ప్రతి ఒక్కరి గురించి అల్లాహ్ పూచి (జమానత్) తీసుకున్నాడు, వారు బ్రతికి ఉంటే అల్లాహ్ ఉపాధి ప్రసాదిస్తాడు, అల్లాహ్ వారికి సరిపోతాడు. ఒకవేళ చనిపోతే అల్లాహ్ వారిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఆ ముగ్గురిలో ఒకరు: తన ఇంట్లో ప్రవేశిస్తూ సలాం చేసే వ్యక్తి గురించి. రెండవ వ్యక్తి మస్జిద్ వైపునకు వెళ్లేవాడు.మూడవ వ్యక్తి అల్లాహ్ మార్గంలో వెళ్ళినవాడు.

[సహీ ఇబ్ను హిబ్బాన్ 499, సహీహుత్ తర్గీబ్ 321]

పై హదీసు జాగ్రత్తగా గమనించండి! ఎవరైతే నమాజు చదువటకు మస్జిద్ కు బయలుదేరాడో అతడు పూర్తిగా అల్లాహ్ సంరక్షణలో ఉంటాడు.

15/ 3/ 2019 జుమా రోజున, న్యూజిలాండ్ – క్రిస్ట్ చర్చ్ అనే నగరంలో రెండు మస్జిద్ లలో జరిగిన సంఘటన. అది కొందరు ముస్లింలు జుమా నమాజు చదువుటకు మస్జిద్ కి వెళ్ళారు. ముస్లింలు భయభక్తులతో మస్జిద్ లో నమాజు చదువుతుండగా, కొందరు ఉన్మాదులు అనగా కొందరు క్త్రైస్తవ ఉగ్రవాదులు వచ్చి వారి పై పైశాచికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన లో 50మంది ముస్లింలు అక్కడే వీరమరణం పొందారు. అల్లాహ్ వీరందరికి – ఇన్ షా అల్లాహ్ – స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులో చెప్పారు. ఎవరైతే నమాజు సలుపుటకు మస్జిద్ కు బయలుదేరి మార్గ మధ్యంలో చావు వస్తే అల్లాహ్ అతడికి స్వర్గం ప్రసాదిస్తాడని. అల్ హందులిల్లాహ్. చాలా బాధగా ఉన్నప్పటికి, ఈ హదీసు గుర్తు రావటంతో నా మనసు కూడా కొంచెం నెమ్మదించింది సహోదరులారా!.

చావు అనేది అది ఎప్పుడైన రావచ్చు ఎక్కడైన రావచ్చు. దానిని ఎవరూ కూడా ఆపలేరు. ఈ లోకంలో చావు అనేది లేకపోతే జంతువులు, మనషుల తప్ప ఎక్కడ ఖాళిగా కనిపించేది కాదు. చావు ఉంది కాని, అది అల్లాహ్ ఏదైతే తన జమానత్ ఇచ్చాడో ఆ దారిలో చనిపోవటం కూడా ఒక మంచి విషయమే.

ఈ హదీసులో మరోక విషయం కూడా చెప్పబడింది. అది ఏమంటే ఏవరైతే నమాజు కొరకు మస్జిద్ వెళ్తారో అతని ఉఫాది పంపిణి అల్లాహ్ పూచి తీసుకున్నాడని. కాని, నేడు మనకి చాలా దగ్గరలో మస్జీద్ లు ఉన్నాయి. వేళకి నమాజు ఆచరించడం లేదు. కొందరు నమాజు సమయంలో అంగడి, దుకాణాల దగ్గర కూర్చోండిపోతారు. ఇవి కొద్దిసేపు విడిచి నమాజు కు వెళ్ళడానికి ప్రయత్నించడం లేదు. ఏదైతే మీరు ఉఫాది కోసం మీ దుకాణాలను తెరచి ఉంచారో అలాంటి మేలైన ఉఫాదిని నేను ప్రసాదిస్తానని అల్లాహ్ అంటున్నాడు. కాని మనం నమాజును వదిలివేస్తున్నాము. ఇది చాలా పెద్ద పొరపాటు కదా!

విశ్వాస సహోదరులారా! నమాజును వదలకండి! వేళకు నమాజు చదవండి! అల్లాహ్ నమాజులో బరకత్ శుభాలను ఉంచాడు. అలాగే నమాజులో ఉఫాది పంపిణి బాధ్యత కూడా ఉంచాడు. నా ప్రియమిత్రులారా!. అల్లాహ్ మనందరికి ఐదు పూటల నమాజు చదివే బాగ్యాన్ని ప్రసాదించుగాక! అల్లాహ్ మార్గంలో చనిపోయిన వారికి స్వర్గాన్ని ప్రసాదించుగాక! ఆమీన్ యా రబ్!!

భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్ ]

ఈ ప్రసంగంలో, భార్యతో మల మార్గం ద్వారా సంభోగించడం ఇస్లాంలో ఘోరమైన పాపమని, దీనికి పాల్పడే వారిపై అల్లాహ్ శాపం ఉంటుందని హదీసుల ఆధారంగా వివరించబడింది. కొందరు భర్తలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఖుర్ఆన్ ఆయతులను తప్పుగా అన్వయించి, భార్యలను మోసం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తున్నారని ప్రస్తావించబడింది. ఈ దుశ్చర్యలకు కారణం అజ్ఞానం, వివాహానికి ముందున్న చెడు అలవాట్లు, మరియు పాశ్చాత్య సంస్కృతి, నీలి చిత్రాల ప్రభావం అని పేర్కొనబడింది. ఇస్లాం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మలమూత్ర విసర్జన తర్వాత ఎడమ చేతితో శుభ్రపరుచుకోవాలని చెప్పిన ధర్మంలో, నోటితో మర్మాంగాలను తాకడం వంటివి ఎంతమాత్రం అనుమతించబడవని స్పష్టం చేయబడింది. వైవాహిక జీవితంలో ఇస్లామీయ హద్దులను పాటించి, పవిత్రంగా జీవించాలని, చెడు అలవాట్లను విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందాలని ఉపదేశించబడింది.

కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మల మార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్తుందా? అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ వినండి:

مَلْعُونٌ مَنْ أَتَى امْرَأَتَهُ فِي دُبُرِهَا
(మల్’ఊనున్ మన్ అతా ఇమ్రఅతహూ ఫీ దుబురిహా)
తన భార్యతో మల మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురియు గాక. (అబూ దావూద్ 2162 సహీహుల్ జామి 5865).

అల్లాహ్ అన్ని రకాల శాపనాల నుండి, శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచు గాక.

అయితే సోదర మహాశయులారా, ఇంతకుముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము, రుతుస్రావంలో కలిసే వారి గురించి. ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే అందులో కూడా వచ్చింది,

مَنْ أَتَى حَائِضًا أَوْ امْرَأَةً فِي دُبُرِهَا أَوْ كَاهِنًا فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును“. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).

సోదర మహాశయులారా, స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు. కానీ కొందరు భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. మల మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారు గమనించాలి, వారు రెండు రకాల పాపాలు, రెండు రకాల ఘోరమైన స్థితులకు గురవుతున్నారు. ఒకటి, శాపం వారిపై పడుతుంది. రెండవది, కుఫ్ర్ లో పడిపోతున్నారు వారు.

ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఖుర్ఆన్ ఆయత్ యొక్క భావం తప్పుగా చెప్తారు. అరే భర్త అయితే ఖుర్ఆన్ ఆయత్ చెప్తున్నాడు, తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి, మరి ఎవరైనా ఆలిమ్ ను అడుగుదామా, ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ సిగ్గుపడి అడగలేరు. వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మల మార్గం ద్వారా వారి కోరికను పూర్తి చేసుకునే విధానం యోగ్యమని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ చూపుతారు. ఏంటి ఆ ఆయత్?

[نِسَاؤُكُمْ حَرْثٌ لَكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ]
(నిసాఉకుమ్ హర్సుల్లకుమ్ ఫ’తూ హర్సకుమ్ అన్నా షి’తుమ్)
మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).

మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి, తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయత్ ను దలీల్ గా తీసుకుంటారు. కానీ వారికి తెలిసి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, ఆమె వెనుక నుండి ఎలా వచ్చినా సరే, కానీ సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి.

అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా? పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం. నిషిద్ధమైన, భిన్నమైన, అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం. లేదా నీలి చిత్రాల్లోని, కొందరికి బ్లూ ఫిలిమ్స్ చూసేటటువంటి అలవాటు, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులుకోలేకపోతారు.

అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి, చెడ్డ అలవాటులను వదులుకోవాలి. అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయాలి. వారు చేయరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు.

మరొక ముఖ్య విషయం గమనించండి, భార్య భర్తలిద్దరూ ఏకమై, ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే అవుతుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాజాలదు.

సోదర మహాశయులారా, ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి. కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది. దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను.

చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా, కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి ఖుర్ఆన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తారు. విన్నారు కదా? అలాగే మరికొందరు భర్తలు ఖుర్ఆన్ లోని మరొక ఆయత్:

هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ
(హున్న లిబాసుల్లకుమ్ వ అన్తుమ్ లిబాసుల్లహున్న)
వారు (భార్యలు) మీ కొరకు వస్త్రధారణ, మీరు వారి కొరకు వస్త్రధారణ. (2:187)

భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రధారణ, అని ఏదైతే ఆయత్ ఉందో, దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు. దుష్కార్యాలకు పాల్పడతారు. అదేంటి? కొందరు భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని.

ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని, ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి.

భార్య భర్తలిద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం, ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా గానీ, ఇవన్నీ కూడా తప్పుడు అలవాటులు. వాస్తవానికి ఈ కల్చర్ చాలా చెండాలమైనది. ఇస్లామీయ సంస్కృతి, కల్చర్ ఎంతమాత్రం కాదు. వెస్ట్రన్ కల్చర్ ఇది. వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి 20 సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు. అప్పుడే నేను ఆనాటి, అంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు ఉలమాలను అడిగితే, వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా? వాస్తవానికి ఇది వెస్ట్రన్ నుండి వచ్చినదే. ఈ బ్లూ ఫిలిమ్ లు, ఇంకా వెస్ట్రన్ యొక్క నగ్న చిత్రాలు, ఫిలిమ్ లు అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి.

ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలపడం లేదు. మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో, సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. ఏ పవిత్రమైన, పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం, ఎడమ చేతితోనే ఇస్తింజా చేయాలి, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చేయాలి, కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో, అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి, నాకడానికి, ఆ ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా? గమనించండి.

భార్య భర్తలు ఇద్దరు, వారి మధ్యలో ఏ పరదా లేదు అంటే ఇక వేరే ఏ హద్దులూ లేవు, ఎలా ఇష్టం ఉంటే అలా, ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు. అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి కానీ, ఎక్కడో ఒక ఆయత్, ఎక్కడో ఒక హదీస్ తీసుకొని, విని, తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు, ఘోరమైన తప్పు.

ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల, నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో, వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను. ధర్మవేత్తలు కొందరు, డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, వీటన్నిటికీ దూరంగా ఉండండి, ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇస్లాం ధర్మం, ఇది ఎవరో కొందరు థింక్ ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ప్రయత్నాలు కావు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, మనందరి కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి సత్య ధర్మం. ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది. చివరికి వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో, భార్య భర్తల జీవితంలో కూడా, ఇందులో ఏ నిషిద్ధతలు ఉన్నాయో, ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అన్ని రకాల చెడుల నుండి దూరం ఉంచు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’వాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=7377

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ప్రళయ కాల చిహ్నాలు : సంగీతం అధికమై పోతుంది

సంగీతం అధికమై పోతుంది

ప్రళయ కాల చిహ్నాలు : సంగీతం అధికమై పోతుంది

హజ్రత్ ఇమ్రాన్‌ ఇబ్న్ హుసైన్‌ కథనం: ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ప్రళయం సమీపించినప్పుడు ఈ ఉమ్మత్‌ ప్రజలు భూమిలోనికి దిగద్రొక్కబడతారు, ఢీ కొట్టుకొని చనిపోతారు, రూపాలు మారిపోతాయి” అప్పుడు ఒక వ్యక్తి: “ఓ దైవ ప్రవక్తా! అది ఎప్పుడు సంభవిస్తుందని”  ప్రశ్నించాడు. “సంగీతాలు, భజంత్రీలు, నాట్యాలు ఎక్కువైనప్పుడు. మరియు మద్యం (అధికంగా) హెచ్చరిల్లినప్పుడు” అని సమాధానమిచ్చారు”

(తిర్మిజీ, ఇబ్ను మాజ, సహీహ్‌ అల్‌ జామీ సగీర్‌: 3559).

అనేక మంది ప్రజలు పోటిలు పడి గెలవాలనే భావనతో తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. అది అలా ఉండగా మరో వైపు చిన్న చిన్న పిల్లలతో సహా వృద్దులను కూడా నాట్యాలు చేయిస్తున్నారు. పోటీల పేరున ఇండ్లల్లో దాగిఉన్న స్త్రీలు సహితం బహిరంగంగా నిర్వహించే పోటిలలో పాల్గొంటున్నారు. అనేక భాషలలో, అనేక రాష్ట్రాలలో, నాట్య పోటీలు అధికమై పోయాయి. అలాగే స్టేజ్‌ పోటీలు, సంగీతాల పోటీలు, పాటల కచేరీలు ప్రతి ఛానలుకు అధికంగా డబ్బును సమకూర్చుకొనే సాధనాలుగా మారిపోయాయి.


ఇది ప్రళయ దిన చిహ్నాలు అనే పుస్తకం నుండి తీసుకోబడింది.
కూర్పు: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ (హఫిజహుల్లాహ్)

ఇస్లాంలో సమాధి శిక్ష లేదా? [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి: [ 10 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

సమాధిలో అనుగ్రహాలు అనుభవించడం, లేదా శిక్షలు చవిచూడడం తిరస్కరించడానికి ఏ తావు లేని సత్యం అయినా కొందరు ఈ రోజుల్లో తిరస్కరించడానికి ఎలా సాహసిస్తున్నారో ఆశ్చర్యం కలుగుతుంది. సమాధి శిక్షల గురించి ఖుర్ఆన్, హదీసుల సంక్షిప్త సమాచారం తెలుగులో ఈ ఆడియోలో వినండి.


ఒక సందర్భంలో షేఖ్ బిన్ బాజ్ (సఊదీ Ex గ్రాండ్ ముఫ్తీ) రహిమహుల్లాహ్ గారితో ప్రశ్నించడం జరిగింది ‘కొందరు సమాధి శిక్షలను నమ్మట్లేదు, ఎందుకనగా దాని ప్రస్తావన ఖుర్ఆనులో లేదట? వారికి ఏదైనా ఉపదేశం చేయండి!‘

అందుకు షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ ఇలా జవాబిచ్చారు:

సమాధి శిక్ష సత్యం, “తవాతుర్” (అంటే అసత్యం అన్న సందేహం లేని) సంఖ్యలో హదీసులున్నాయి, దీనిపై ముస్లిములందరీ ఏకాభిప్రాయం ఉంది. ఖుర్ఆనులో దీని గురించి ఆధారాలున్నాయి. ఉదాహరణకు చూడండి:

النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ

(ఇదిగో) అగ్ని – దాని ఎదుట వారు ప్రతి ఉదయం, సాయంత్రం రప్పించబడుతుంటారు. (ఇది సమాధి శిక్ష) మరి ప్రళయం సంభవించిననాడు, “ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి” (అని సెలవీయబడుతుంది). (దివ్య ఖురాన్ 40:46)

అల్లాహ్ సమాధి మరియు నరక శిక్షల నుండి రక్షించుగాక.

చెప్పే విషయం ఏమిటంటే: సమాధి శిక్షలను తిరస్కరించే వ్యక్తికి తౌబా చేయమని చెప్పాలి.అతను తౌబా చేయడానికి ఒప్పుకోక పోతే (ఇస్లామీయ ప్రభుత్వంలో) అతడ్ని కాఫిర్ గా డిక్లేర్ చేసి చంపేసెయ్యాలి. (అతని దుర్మార్గం ప్రబలకుండా). అల్లాహ్ ఇలాంటి దుర్గతి నుండి కాపాడుగాక.

https://binbaz.org.sa/fatwas/9795/حكم-من-ينكر-عذاب-القبر-لانه-لم-يذكر-في-القران