నమాజు నిధులు – పార్ట్ 01 : వుజూ యొక్క ఘనతలు, లాభాలు , గొప్ప పుణ్యాలు [వీడియో]

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[26:10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పుస్తకం ఇక్కడ చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

నమాజు నిధులు

నమాజులో చాలా గొప్ప నిధులు, కోశాగారాలున్నాయి. బహుశా అవి అనేక మందికి తెలియకపోవచ్చు. ఇవి సత్కర్మ, పుణ్యం మరియు హోదా అంతస్తులతో నిండి ఉన్నాయి. షైతాన్ కూడా మనల్ని వాటి నుండి దూరముంచడానికి సిద్ధమై యున్నాడు. మనం మన నిద్ర (అలక్ష్యం) నుండి  మేల్కొనే సరికి తెలుపబోయే అనేక పుణ్యాల నుండి దూరముంచడానికి కొన్నిటిపై మాత్రమే తృప్తి పడేలా చేశాడు. అందువల్ల మనం ఒక్క నమాజు చేసుకొని వెళ్తాము కాని ఒక్క పుణ్యం కూడా మనకు దక్కదు. – ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్ మనల్ని కాపాడాలి-. అందుకే ‘అల్లాహ్ పై విశ్వాసం’ మరియు ‘వాచా కర్మ’లో చిత్తశుద్ధి ఆయుధంతో సన్నద్ధమై, (అల్లాహ్) ‘సహనం’, ‘స్మరణం’ కోటలో భద్రంగా ఉండి, ‘వినయ’, ‘విమ్రత’ కవచం ధరించి యుధ్ధపతాకం ఎగిరేసి గత కాలంలో కోల్పోయిన మన నమాజులను మరియు దానికి సంబంధించిన అమూల్య నిక్షేపాలను, నిధులను కాపాడుకొనుటకు మనోవాంఛలకు మరియు షైతాన్ కు వ్యతిరేకంగా పోరాడుదాం.

ఇకనైనా సమయం రాలేదా? నిద్ర నుండి మేల్కొనే సమయం, ఏమరుపాటును వదులుకునే సమయం, పుణ్యాత్ముల బృందంలో కలిసే సమయం, సత్కార్యాల అకౌంట్ పెంచుకునే సమయం, కరుణామయుని కరుణ, మన్నింపుకై నిరీక్షించి సజ్జనులతో స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నం చేసే సమయం రాలేదా?

నిశ్చయంగా నమాజు నిధులు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని నమాజుకు ముందు పొందవచ్చు. మరి కొన్ని నమాజు మధ్యలో. మిగితావి నమాజు తర్వాత.

ఇక రండి! పయనమవుదాము……..’చిత్తశుద్ధి’ మరియు ‘ధైర్య’ నౌకలో నమాజులోని మూడు గుప్తమైన నిధుల అన్వేషణకై ప్రయాణం మొదలెడదాం.

1- మొదటి నిధిః (నమాజుకు ముందు) నమాజు కొరకు సంసిద్ధత.

2- రెండవ నిధిః (నమాజు సందర్భంలో) నమాజు చేయుట.

3- మూడవ నిధిః (నమాజు తర్వాత) జిక్ర్ మరియు కొన్ని ఆచరణలు.

మొదటి నిధి (నిక్షేపం)

నమాజు కొరకు సంసిద్ధత

ఈ విలువగల నిధిని మనం నమాజులో ప్రవేశించక ముందు నమాజుకు సంబంధించిన ప్రథమ ఏర్పాట్లు మరియు మానసిక, ఆత్మీయ సంసిద్ధతల ద్వారా పొందగలము. దానికి అర్హులమయ్యే మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి, శ్రద్ధ వహించండి.

1 – వుజూ:

వుజూ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. పుణ్యాల సంపాదన, వాటి రెట్టింపులకై ఇది మొదటి మెట్టు. వుజూ ద్వారా ఈ క్రింద తెలుపబడే పుణ్యాలు పొందగలము.

(అ) అల్లాహ్ యొక్క ప్రేమ:  అల్లాహ్ ఆదేశం:

{నిశ్చయంగా తౌబా చేసేవారిని మరియు పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు}. (బఖర 2: 222).

అల్లాహ్ మనల్ని ప్రేమించటం కంటే గొప్ప పుణ్యమేమిటి?

షేఖ్ సఅదీ తన తఫ్సీర్ -తైసీరుల్ కరీమిర్రహ్మాన్ ఫీ తఫ్సీరి కలామిల్ మన్నాన్-లో చెప్పారు: ఈ ఆయతులో ‘పరిశుద్ధతను పాటించేవారు’ అంటే పాపాల నుండి దూరముండడం, అయితే ఇందులో మలినము నుండి శుద్ధి పొందుట కూడా వస్తుంది. పరిశుభ్రత మరియు వుజూ ఒక ధార్మిక విషయం అని దీని ద్వారా తెలుస్తుంది. ఎలా అంటే దాన్ని పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తున్నాడు అని వచ్చింది. అందుకే పరిశుభ్రత, వుజూ నమాజ్, తవాఫ్ మరియు ఖుర్ఆన్ పారాయణానికి ఒక షరతుగా ఉంది.

(ఆ) వుజూ నీళ్ళతో పాపాల తొలగింపు:

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (إِذَا تَوَضَّأَ الْعَبْدُ الْمُسْلِمُ أَوْ الْمُؤْمِنُ فَغَسَلَ وَجْهَهُ خَرَجَ مِنْ وَجْهِهِ كُلُّ خَطِيئَةٍ نَظَرَ إِلَيْهَا بِعَيْنَيْهِ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ فَإِذَا غَسَلَ يَدَيْهِ خَرَجَ مِنْ يَدَيْهِ كُلُّ خَطِيئَةٍ كَانَ بَطَشَتْهَا يَدَاهُ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ فَإِذَا غَسَلَ رِجْلَيْهِ خَرَجَتْ كُلُّ خَطِيئَةٍ مَشَتْهَا رِجْلَاهُ مَعَ الْمَاءِ أَوْ مَعَ آخِرِ قَطْرِ الْمَاءِ حَتَّى يَخْرُجَ نَقِيًّا مِنَ الذُّنُوبِ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ముస్లిం లేక మోమిన్ దాసుడు వుజూ చేస్తూ, తన ముఖం కడిగినపుడు ప్రవహించే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కళ్ళతో చూసి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది (మన్నించబడుతుంది). రెండు చేతులు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో చేయితో పట్టి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. రెండు కాళ్ళు కడిగినపుడు వెళ్ళే నీళ్ళతో లేక చివరి నీటి చుక్కతో కాళ్ళు నడచి చేసిన ప్రతి పాపం రాలిపోతుంది. చివరికి అతను పాపాల నుండి పూర్తిగా పరిశుద్ధుడై వెళ్తాడు“. (ముస్లిం 244).

عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ ÷ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ خَرَجَتْ خَطَايَاهُ مِنْ جَسَدِهِ حَتَّى تَخْرُجَ مِنْ تَحْتِ أَظْفَارِهِ).

ఎవరు సక్రమంగా వుజూ చేస్తారో అతని శరీరం నుండి అతని పాపాలు దూరమయిపోతాయి. చివరికి అతని గోళ్ళ నుండి వెళ్ళిపోతాయి“. (ముస్లిం 245).

మరో గొప్ప ఘనత క్రింద పాదసూచికలో లో చూడండిః([1]).

(ఇ) ప్రళయదినాన వుజూ అంగములు (కాంతిగా) ప్రకాశిస్తాయి:

عن أَبِي هُرَيْرَةَ ÷ قَالَ إِنِّي سَمِعْتُ النَّبِيَّ ﷺ يَقُولُ: (إِنَّ أُمَّتِي يُدْعَوْنَ يَوْمَ الْقِيَامَةِ غُرًّا مُحَجَّلِينَ مِنْ آثَارِ الْوُضُوءِ فَمَنْ اسْتَطَاعَ مِنْكُمْ أَنْ يُطِيلَ غُرَّتَهُ فَلْيَفْعَلْ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ప్రళయదినాన నా అనుచర సమాజాన్ని (కర్మ విచారణ కోసం) పిలవడం జరుగుతుంది. అప్పుడు వారి ముఖాలు, చేతులు వుజూ ప్రభావంతో తెల్లగా, మహోజ్వలంగా ఉంటాయి. అందువల్ల మీలో ఎవరైనా తమ తెలుపు, తేజస్సులను వృద్ధి చేసుకో దలిస్తే వారు అలా వృద్ధి చేసుకోవచ్చు“. (బుఖారి 136, ముస్లిం 246).

(ఈ) పాపాల తుడిచివేత మరియు ఉన్నత స్థానం:

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (أَلَا أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا وَيَرْفَعُ بِهِ الدَّرَجَاتِ) قَالُوا: بَلَى يَا رَسُولَ اللهِ قَالَ: (إِسْبَاغُ الْوُضُوءِ عَلَى الْـمَكَارِهِ وَكَثْرَةُ الْـخُطَا إِلَى الْـمَسَاجِدِ وَانْتِظَارُ الصَّلَاةِ بَعْدَ الصَّلَاةِ فَذَلِكُمْ الرِّبَاطُ فَذَلِكُمْ الرِّبَاطُ).

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “పరమ ప్రభువైన అల్లాహ్ ఏ విషయాల ఆధారంగా అపరాధాలను మన్నిస్తాడో, స్థాయిని ఉన్నతం చేస్తాడో నేను మీకు తెలుపనా?” దానికి సహచరులు ‘దైవప్రవక్తా తప్పక సెలవీయండి’ అని బదులిచ్చారు. అప్పుడాయన ఇలా బోధించారు: “(1) వాతావరణం, పరిస్థితులూ అననుకూలంగా ఉన్నప్పటికీ వుజూ పూర్తిగా చెయ్యటం. (2) మస్జిద్ వైపునకు అధికంగా అడుగులు వెయ్యడం. (3) ఒక నమాజ్ తరువాత మరో నమాజ్ కొరకు నిరీక్షించడం. ఇది రిబాత్ తో సమానం, ఇది రిబాత్ తో సమానం“. (ముస్లిం 251).

పరిస్థితులూ అననుకూలంగా ఉండుటః అంటే చలి కాలంలో చల్ల దనం, లేక అనారోగ్యం వల్ల చలనం, కదలిక కష్టంగా తోచినపుడు వుజూ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో పాపాల మన్నింపు, పుణ్యాల రెట్టింపు, స్వర్గంలో ప్రవేశముద్దేశంతో పై మూడు కార్యాలు నెరవేర్చువాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాపాల మన్నింపు మరియు షహాదత్ అపేక్షతో శత్రువు మధ్యలో పహరా కాయడం (రిబాత్)తో పోల్చారు.

మరికొందరి అభిప్రాయ ప్రకారం, వీటిని ‘రిబాత్’ అనటానికి కారణ మేమంటే అవి మనిషిని పాపాల నుండి దూరముంచుతాయి. నిజము దేవుడెరుగును. (అల్ మత్జరుర్రాబిహ్ ఫీ సవాబిల్ అమలిస్సాలిహ్ లిల్ హాఫిజ్ అబూ ముహమ్మద్ షర్ఫొద్దీన్ అబ్దుల్ మోమిన్ అద్దిమ్యాతి).

(ఉ) పాపాల క్షమాపణ మరియు స్వర్గ ప్రవేశం:

عَنْ عُثْمَانَ ÷ أنَّهُ تَوَضَّأَ ثُمَّ قَالَ: قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا ثُمَّ صَلَّى رَكْعَتَيْنِ لَا يُحَدِّثُ فِيهِمَا نَفْسَهُ غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ).

ఉస్మాన్ రజియల్లాహు అన్హు వుజూ చేసి ఇలా చెప్పారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలాగే వుజూ చేస్తూ ఉండగా చూశాను. పిదప ఆయన ఇలా ప్రవచించారు: “ఎవరు నా ఈ పద్ధతి ప్రకారం వుజూ చేసి, మనసులో ఎలాంటి (ప్రాపంచిక) ఆలోచనలు రానివ్వకుండా పూర్తి ఏకాగ్రతతో రెండు రకాతుల నమాజు చేస్తారో అతని గత పాపాలు క్షమించబడతాయి“. (బుఖారీ 1934, ముస్లిం 226).

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيِّ ÷ أَنَّ رَسُولَ اللهِ ﷺ قَالَ: (مَا مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُحْسِنُ الْوُضُوءَ وَيُصَلِّي رَكْعَتَيْنِ يُقْبِلُ بِقَلْبِهِ وَوَجْهِهِ عَلَيْهِمَا إِلَّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఎవరైనా ఒకరు ఉత్తమ రీతిలో వుజూ చేసుకొని, పూర్తి శ్రద్ధాభక్తులతో రెండు రకాతుల నమాజు చేసినచో అతనికి తప్పక స్వర్గం లభిస్తుంది“. (అబూ దావూద్ 906, ముస్లిం 234).

2 – వుజూ తర్వాత దుఆ:

వుజూ తర్వాత దుఆ యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. మొదటి నిధిలోని మరికొన్ని పుణ్యాల అన్వేషణలో మనం ఉన్నాము. వుజూ తర్వాత గల ప్రత్యేక దుఆల ద్వారా క్రింది పుణ్యాలు సంపాదించవచ్చు.

(అ) స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ:

عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ” చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు“. (ముస్లిం 234).

(ఆ) తోలుకాగితంలో పేరు వ్రాయబడి దానిపై ముద్ర వేయబడుతుంది. అది ప్రళయదినం వరకు తీయబడదు:

عَنْ أَبِي سَعِيدِ الخُدرِي ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَوَضَّأَ فَقَالَ: سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ أَشْهَدُ أَن لاَ إِلَهَ إِلاَّ أَنتَ أَسْتَغْفِرُكُ وَأَتُوبَ إِلَيكَ، كُتِبَ فِي رِِقٍّ ثُمَّ جُعِلَ فِي طَابِعٍ فَلَمْ يُكسَرْ إِلى يَومِ الْقِيامة).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ సఈద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఎవరైనా వుజూ చేసి, “సుబ్ హానకల్లాహుమ్మ వ బిహందిక అష్ హదు అల్లాఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక” చదువుతారో అతని పేరు తోలు కాగితంలో వ్రాయబడుతుంది. ముద్ర వేయబడుతుంది. ప్రళయదినం వరకు తీయబడదు“([2]).

3 – మిస్వాక్ :

ఒక పుణ్యం తర్వాత మరో పుణ్యం సంపాదించడంలోనే ఉన్నాము, ఇప్పుడు మనం (మిస్వాక్) స్టేషన్ లో ఉన్నాము. ఈ గొప్ప పుణ్యం గురించి చదవండిః మిస్వాక్ నోటిని శుభ్రం చేయునది, అల్లాహ్ ను సంతృష్టి పరచునది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లఖించారుః

السِّوَاكُ مَطْهَرَةٌ لِلْفَمِ مَرْضَاةٌ لِلرَّبِّ

మిస్వాక్ నోటికి శుభ్రత కలుగజేస్తుంది మరియు అల్లాహ్ ను సంతృష్టి పరుస్తుంది“([3]).


[1] వుజూ యొక్క మరో ఘనత ముస్నద్ అహ్మదులో ఇలా ఉందిః

عَن أَبِي أُمَامَةَ ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: أَيُّمَا رَجُلٍ قَامَ إِلَى وَضُوئِهِ يُرِيدُ الصَّلَاةَ ثُمَّ غَسَلَ كَفَّيْهِ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ كَفَّيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا مَضْمَضَ وَاسْتَنْشَقَ وَاسْتَنْثَرَ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ لِسَانِهِ وَشَفَتَيْهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ وَجْهَهُ نَزَلَتْ خَطِيئَتُهُ مِنْ سَمْعِهِ وَبَصَرِهِ مَعَ أَوَّلِ قَطْرَةٍ فَإِذَا غَسَلَ يَدَيْهِ إِلَى الْمِرْفَقَيْنِ وَرِجْلَيْهِ إِلَى الْكَعْبَيْنِ سَلِمَ مِنْ كُلِّ ذَنْبٍ هُوَ لَهُ وَمِنْ كُلِّ خَطِيئَةٍ كَهَيْئَتِهِ يَوْمَ وَلَدَتْهُ أُمُّهُ. { أحمد }

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ ఉమామ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఏ వ్యక్తి నమాజు ఉద్దేశ్యంతో వుజూ చేస్తూ రెండు అరచేతులు కడుగుతాడో నీటి తొలి చుక్క ద్వారా అతని రెండు చేతులతో చేసిన పాపాలు తొలిగిపోవును. నోట్లు నీళ్ళు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్ళు ఎక్కించి చీది శుభ్రపరచుకుంటాడో నీటి మొదటి చుక్క ద్వారా అతని నాలుక మరియు పెదవుల ద్వారా చేసిన పాపాలు తొలిగిపోతాయి. ముఖము కడిగినప్పుడు కళ్ళు మరియు చెవి ద్వారా చేసిన పాపాలు నీటి మొదటి చుక్క ద్వారా తొలిగి పోతాయి. మోచేతుల వరకు చేతులు, మోకాళ్ళ వరకు కాళ్ళు కడినగినప్పుడు సర్వ పాపాల నుండి విముక్తి పొంది తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితి మాదిరిగా అయిపోతాడు”. (అహ్మద్ 36/601). [ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ]

[2]. (సునన్ నిసాయీ అల్ కుబ్రా/ బాబు మా యఖూలు ఇజా ఫరగ మిన్ వుజూఇహీ. 9909. 6/25. సహీహుత్తర్గీబు వత్తర్ హీబ్ 225. సహీహుల్ జామిఅ 6170).

[3]. నిసాయి 5, ఇబ్ను మాజ 289, బుఖారీ ముఅల్లఖన్ హ. నం. 1933 తర్వాత. ముస్నద్ అహ్మద్ 1/3).

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్) – “అర్రహీఖుల్‌ మఖ్ తూమ్” పుస్తకం నుండి

బిస్మిల్లాహ్
మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – అంతిమ హజ్ – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/IrogXl0z-uY [42నిముషాలు]

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్)

దైవసందేశం అందించే కార్యం పరిపూర్తి అయింది. అల్లాహ్ ఏకత్వం, ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడన్న సత్యాన్ని ధృవీకరించడం మరియు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి దైవదౌత్యం పునాదులపై ఓ క్రొత్త సమాజ నిర్మాణ, రూపకల్పన అమల్లోనికి వచ్చేసింది. అంటే, ఇప్పుడు ఆ మహత్కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి ఓ అదృశ్యవాణి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనోఫలకంపై ఆయన ఈ ప్రపంచంలో జీవించి ఉండే కాలం దగ్గరపడుతుందనే సూచనలు ప్రస్ఫుటం చేయనారంభించింది. అందుకేనేమో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను హిజ్రీ శకం 10లో యమన్ కు గవర్నరుగా చేసి పంపిస్తూ ఆ పదవికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు తోడు హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)తో, “ఓ ముఆజ్! బహుశా నీవు నన్ను ఈ సంవత్సరం తరువాత మళ్ళీ కలుసుకోలేవు అని అనిపిస్తోంది! నా ఈ మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు నా సమాధిని మాత్రమే చూడగలవేమో!” అని చెప్పారు, హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ పలుకులు విన్నంతనే దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా రోదించడం కూడా జరిగింది.

అసలు యదార్థం ఏమిటంటే, అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ అదృశ్య వాణి ద్వారా ఇస్లామ్ ధర్మసందేశం వలన ఒనగూడిన సత్ఫలితాలేమిటో చూయించదలిచాడు. ఏ దైవసందేశ ప్రచారం కోసమైతే ఆయన అహర్నిశలు ఇరవై సంవత్సరాలకు పైన్నే కష్టాలను, కడగండ్లను అనుభవిస్తూ వచ్చారో దాని ఫలితం ఎంత మహోజ్వలంగా ఉందో కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించాడన్నమాట. ఇందుకు అల్లాహ్ ఓ సుముహూర్తాన్ని కూడా నిర్ణయించి, తద్వారా హజ్ సందర్భంలో మక్కా పరిసరాల్లో నివసించే అరబ్బు తెగల ప్రతినిధి వర్గాలను ఓ చోట సమావేశపరిచి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించిన ధార్మిక విషయాల జ్ఞానాన్ని వారు సముపార్జించడానికి, ఏ అమానతు భారమైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భుజస్కంధాలపై వేయబడిందో దాన్ని ఇప్పుడు వీరు మోయవలసి ఉంటుందని చెప్పడానికి, దైవసందేశాన్ని అందించడం, ముస్లిం సమాజానికి మేలు చేకూర్చే హక్కును సజావుగా నిర్వర్తించడంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి లోటు రానివ్వకుండా ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారని వారి నోటే సాక్ష్యం ఇప్పించవలసి ఉంది. ఈ దైవ నిర్ణయం ప్రకారమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ చారిత్రాత్మకమైన ‘హజ్జె మబ్రూర్’ (దైవం మెచ్చిన హజ్) చేయవలసి ఉందని ప్రకటించగానే అరేబియా ద్వీపానికి చెందిన ముస్లిం జనసందోహం తండోపతండాలుగా వచ్చి ఆయన చుట్టూ చేరనారంభించింది. ప్రతి వ్యక్తీ, తాను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వెళ్ళి ఆయన నాయకత్వంలో హజ్ చేయాలని పరితపించిపోతున్నాడు.[1] జిల్-ఖాదా నెల ఇంకా నాల్గు రోజులకు ముగుస్తుందనగా శనివారం రోజున దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ కోసం బయలుదేరారు.[2]

[1]. ఇది సహీహ్ ముస్లిం గ్రంథంలో ఉన్న హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం. చూడండి, ప్రవక్త హజ్ అధ్యాయం – 1/394.

[2]. హాఫిజ్ ఇబ్నె హజర్ పరిశోధించి చెప్పిన విషయం ఇది. కొన్ని ఉల్లేఖనాల్లో జిల్ ఖాదా నెల ఇంకా అయిదు రోజులకు ముగుస్తుందనగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బయలుదేరారనే అని వచ్చిన వివరాలను ఆయన సరిదిద్దారు. చూడండి, ఫత్ హుల్ బారి – 8/104.

తలపై నూనె వేసి మర్ధించుకొని దువ్వుకున్నారు. ‘తహ్బంద్’ (లుంగీ) కట్టుకొని మేనిపై దుప్పటి కట్టుకున్నారు. ఖుర్బానీ పశువుల మెడలలో పట్టెడలు వేసి జొహ్ర్ నమాజు చేసి హజ్ కోసం బయలుదేరారు. అస్ర్ నమాజుకు ముందే ‘జుల్ హులైఫా’ వాదీ (లోయ)లోనికి చేరుకుని అక్కడాగి రెండు రకాతుల ‘అస్ర్’ నమాజు చేశారు. గుడారాలు వేసుకొని రాత్రంతా అక్కడనే గడిపారు. తెల్లవారిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబా (రదియల్లాహు అన్హుమ్) (అనుచరగణం) ను సంబోధిస్తూ, “రాత్రి నా ప్రభువు వద్ద నుండి వచ్చేవాడు ఒకడొచ్చి నాతో, ఈ శుభమైన లోయలో నమాజు చేయమని, హజ్ లో ‘ఉమ్రా’ కూడా ఉందని ప్రకటించు అని చెప్పి వెళ్ళాడు” అని తెలిపారు.[3]

[3] ఇది హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఉల్లేఖించినట్లు బుఖారీ గ్రంథంలో ఉంది. 1/207.

జొహ్ర్ నమాజుకు ముందే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఇహ్రామ్’ కోసం ‘గుస్ల్’ చేశారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శరీరం మీదా, తలపైనా తన చేతులతో ‘జరీరా’తో కలిపిన కస్తూరి సువాసన గల పదార్థాన్ని, దాని తళుకు, గుబాళింపు ఆయన తల పాపిటలో, గెడ్డంలో కానవచ్చేటట్లు పులిమారు. అయితే ఆ సువాసనా పదార్థాన్ని ఆయన కడిగివేయకుండా అలాగే ఉంచేసుకున్నారు. ఆ తరువాత తహ్బంద్ కట్టుకొని, శరీరం పై ఓ దుప్పటిని కట్టుకొని “లబ్బైక్’ వాక్యాలను బిగ్గరగా పలికారు. బయటకు వచ్చి తన ‘కస్వా’ అనే ఆడ ఒంటె పై ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కూడా మరోసారి లబ్బైక్ పదాలను బిగ్గరగా పలికారు. అలా ఒంటెనెక్కి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మైదానం వైపునకు వెళ్ళి అక్కడ కూడా లబ్బైక్ వాక్యాల్ని అందరికీ వినబడేటట్లు పలికారు.

ఆ తరువాత పయనమై ఓ వారం తరువాత ప్రొద్దుగ్రుంకే సమయానికి మక్కా దాపుకు చేరుకున్నారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘జీతువా’లో మకాం వేశారు. రాత్రి అక్కడనే గడిపి ఫజ్ర్ నమాజు తరువాత ‘గుస్ల్’ (స్నానం) చేసి ఉదయాన్నే మక్కాలో ప్రవేశించారు. అది హిజ్రి శక సంవత్సరం 10, జిల్ హిజ్జా మాసం 4వ తేది, ఆదివారం రోజు. ప్రయాణ కాలంలో మొత్తం ఎనిమిది రాత్రిళ్ళు గడిచాయి- సరాసరి ప్రయాణానికి పట్టేకాలం అదే- నేరుగా మస్జిదె హరామ్ (కాబా మస్జిద్)కు చేరి ఆయన మొదట దైవగృహం కాబా తవాఫ్ చేశారు. ఆ తరువాత సఫా మర్వా కొండల నడుమ ‘సయీ’ చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ మరియు ఉమ్రాలు రెంటికి సంబంధించిన ఇహ్రామ్ ఒకేసారి కట్టుకోవడం ‘హదీ’ (ఖుర్బానీ) పశువులను వెంట తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇహ్రామ్ వస్త్రాలను మాత్రం తీసివేయక అలానే ఉంచేసుకున్నారు. తవాఫ్ మరియు సయీ రెంటిని ముగించుకొని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎగువ మక్కాలో హజూన్ అనే ప్రదేశంలో విడిది చేశారు. అయితే, హజ్ తవాఫ్ తప్ప మరే తవాఫ్ ఆయన చేయలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వచ్చిన ఏ సహాబాలైతే తమ వెంట ‘హదీ’ తీసుకురాలేకపోయారో, వారికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ ఇహ్రామ్ ను ఉమ్రా ఇహ్రామ్ గా మార్చుకొమ్మని, కాబా గృహం తవాఫ్ మరియు సఫా మర్వాల నడుమ ‘సయీ’ చేసిన తరువాత వాటిని తీసేసి పూర్తిగా ‘హలాల్ కమ్మని ఆదేశం ఇచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా ఇహ్రామ్ దుస్తులను తీసివేసి హలాల్ కానందున సహాబాలు కొంత ఇరుకునబడ్డారు. అది చూసిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో, “నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేనసలు హదీ తెచ్చేవాడినే కాదు. మీతోపాటే హలాల్ అయి ఉండేవాణ్ణి” అని అనగా సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఆయన ఆదేశాలను శిరసావహించారు. అంటే ఎవరి వద్ద హదీ పశువు లేదో వారు హలాల్ అయిపోయారు. (హలాల్ కావడం అంటే, ఇహ్రామ్ కట్టుకున్న తరువాత కొన్ని ధర్మసమ్మతమైన విషయాలు ఇహ్రామ్ వదలనంతవరకు హరామ్ అవుతాయి. ఇహ్రామ్ వదిలిన తరువాత తిరిగి అవి ధర్మసమ్మతం అయిపోతాయి అని అర్థం.)

ఎనిమిది జిల్ హిజ్జా తేదీన – తర్వియా రోజున – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మినా’కు వెళ్ళారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిల్ హిజ్జా తొమ్మిదవ తేదీ ఉదయం వరకు విడిది చేశారు. జొహ్ర్,అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు (అయిదు పూటలు) అక్కడనే చేశారు. సూర్యోదయం అయిన వరకు ఆగి ‘అరఫా’కు బయలుదేరారు. అక్కడికి చేరేటప్పటికే ఆయన కోసం ‘వాదియె నిమ్రా’లో గుడారం సిద్ధపరచబడి ఉంది. పగలంతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గుడారం లోనే ఉండిపోయారు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలిన తరువాత ఆయన ఆదేశం మేరకు కస్వా పై కజావా కట్టబడింది. దాని పైనెక్కి ‘బత్న్’ లోయలోనికి అరుదెంచారు. అప్పుడు ఆయన చుట్టూ ఒక లక్షా ఇరవై నాల్గు వేలు లేదా లక్షా నలభై నాల్గు వేల మంది చేరారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి నడుమన నిలుచొని ఓ సమగ్రమైన ప్రసంగం చేస్తూ ఇలా సెలవిచ్చారు:

“ప్రజలారా! నా మాటలను ఆలకించండి! ఎందుకంటే ఈ సంవత్సరం తరువాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెన్నడూ కలుసుకోలేరు.[4]

ఈ గడుస్తున్న నెల మరియు ఈ నగరం యొక్క పవిత్రతలా, మీ ప్రాణం, మీ సంపద కూడా పరస్పరం ఒకరిపై ఒకరికి అంతే పవిత్రమైనది, నిషిద్ధమైనది. బాగా వినండి! అజ్ఞాన కాలంనాటి ప్రతిదీ నా కాళ్ళ క్రింద నలిపివేయబడింది. అజ్ఞానకాలంలో జరిగిన హత్యల రక్తపరిహారం కూడా అంతం చేయబడింది. మనలో మొట్టమొదటి వ్యక్తి రక్తపరిహారం దేన్నయితే నేను అంతమొందిస్తున్నానో అది రబీయా బిన్ హారిస్ కుమారునిది – ఈ పిల్లవాణ్ణి బనూ సఅద్ పాలు త్రాగడానికి వదలినప్పుడు హుజైల్ వంశానికి చెందినవారు అతణ్ణి హతమార్చారు – అజ్ఞాన కాలం నాటి వడ్డీని కూడా అంతం చేసేస్తున్నాను. మన వడ్డీలో మొదటి ఏ వడ్డీనైతే నేను అంతం చేస్తున్నానో అది అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారి వడ్డీ. ఇప్పుడు ఈ వడ్డీ అంతా లేనట్లే.

అయితే, స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి. ఎందుకంటే వారిని మీరు అల్లాహ్ అమానతుగా పొందినవారు. అల్లాహ్ వచనం ద్వారా మీ కోసం వారు ధర్మసమ్మతం అయినవారు. మీకు ఇష్టం కాని వారినెవరినీ వారు మీ పడకల పైకి రాకుండా ఉంచాలి. అది మీ హక్కు. వారే గనక అలా చేస్తే మీరు వారిని దండించవచ్చు. అయితే వారిని తీవ్రమైన దండనకు గురి చేయకూడదు. ప్రసిద్ధ రీతిలో వారికి తిండీ బట్టా అందించడం అనేది మీపై వారికి ఉన్న హక్కు.

ఇంకా, మీ కోసం దేన్నయితే వదిలి వెళుతున్నానో దాన్ని మీరు గనక దృఢంగా పట్టుకొని ఉంటే ఇక మీదట మీరు ఏమాత్రం మార్గాన్ని తప్పలేరు. అది అల్లాహ్ గ్రంథం.

ప్రజలారా! గుర్తుంచుకోండి! నా తరువాత మరే ప్రవక్త ఉండడు. అలాగే నా తరువాత మరే సమాజమూ లేదు. కాబట్టి మీరు మీ ప్రభువును ఆరాధించండి. అయిదు పూటలా నమాజు చేయండి. రమజాన్ మాసంలో రోజా వ్రతాన్ని పాటించండి. మనస్పూర్తిగా జకాత్ చెల్లించండి. మీ ప్రభువు గృహ (కాబా) హజ్ చేయండి మరియు మీ పాలకులను విధేయించండి. అలా చేస్తే మీ ప్రభువు యొక్క స్వర్గంలో ప్రవేశిస్తారు. [6]

ఇంకా, నా గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏమంటారు? దానికి సహాబా (రదియల్లాహు అన్హుమ్), “మీరు ధర్మాన్ని మాకు అందించారు, సందేశ ప్రచారం చేశారు. ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి దాని హక్కును నిర్వర్తించారు” అన్నారు. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తన చూపుడు వ్రేలిని ఆకాశం వైపునకు ఎత్తి దాన్ని ప్రజల వైపునకు వంచుతూ ‘ఓ అల్లాహ్ దీనికి నీవే సాక్షివి’ అని మూడు మార్లు పలికారు.[7]

[4] ఇబ్నె హిషామ్ -2/603
[5] సహీహ్ ముస్లిమ్ – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి హజ్ అధ్యాయం – 1/397.
[6] ఇబ్ను మాజా; ఇబ్ను అసాకర్; రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/263.

[7] సహీహ్ ముస్లిమ్ – 1/397

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పలుకుల్ని రబీయా బిన్ ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ఉచ్ఛస్వరంతో ప్రజలకు వినిపించనారంభించారు.[8] ప్రసంగం పూర్తి చేసిన తరువాత అల్లాహ్ ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అల్ యౌమ అక్-మల్తు లకుం దీనుకుమ్. వ అత్-మంతు అలైకుం నిఇమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా.”(5 : 3)

(ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. నాపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లామ్ ను మీ ధర్మంగా అంగీకరించాను.)

[8] ఇబ్నె హిషామ్ -2/605

[9]. బుఖారి, ఇబ్నె ఉమర్ గారి ఉల్లేఖనం. చూడండి, రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/265

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ ఆయత్ ను విన్నంతనే దుఃఖించనారంభించారు. మీరెందుకు రోదిస్తున్నారని అడుగగా, “పరిపూర్ణత తరువాత మిగిలేది లోపమే కదా!” అని బదులిచ్చారు ఆయన.[9]

ప్రసంగం తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ పలికి నమాజు కోసం ఇఖామత్ కూడా పలికారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జుహ్ర్ నమాజు చేయించారు. ఆ తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) మరోసారి ఇఖామత్ పలుకగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అస్ర్ నమాజు కూడా చేయించారు. ఈ రెండు నమాజుల మధ్యకాలంలో మరే నమాజు చేయలేదు. ఆ తరువాత వాహనమెక్కి తాము విడిది చేసిన చోటికి వెళ్ళిపోయారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). తన ఒంటె కస్వా పొట్టను బండరాళ్ళ వైపునకు మళ్ళించి కూర్చోబెట్టారు. ‘జబ్లే ముషాత్’ (కాలినడకన వెళ్ళేవారి మార్గంలో ఉన్న మట్టి తిన్నె) ను ముందు ఉండేటట్లు చూసి తన ముఖాన్ని కాబాకు అభిముఖంగా చేసి అక్కడనే ఉండిపోయారు. ప్రొద్దుగ్రుంకుతూ, బాగా ఎరుపెక్కి అస్తమించే వరకు వేచి చూశారు.

సూర్యబింబం పూర్తిగా మటుమాయమైపోగానే హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు)ను తన ఒంటె పై వెనుక కూర్చోబెట్టుకొని బయలుదేరి ‘ముజ్ దల్ఫా’కు వచ్చేశారు. ముజ్ దల్ఫాలో మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ఒకే అజాన్ మరియు రెండు ఇఖామత్ లతో చేశారు. ఆ రెండు నమాజుల మధ్యలో ఎలాంటి నఫిల్ నమాజు చేయలేదు. ఉషోదయం వరకు అలా మేనువాల్చారు. తెల్లవారుతూ ఉండగా అజాన్ కాగానే ఇఖామత్ చెప్పి ఫజ్ర్ నమాజ్ చేశారు. పిదప కస్వాపై ఎక్కి ‘మష్ అరిల్ హరామ్’కు వెళ్ళిపోయారు. అక్కడ ఖిబ్లా దిశగా (కాబాభి ముఖంగా) నిలబడి దుఆ చేశారు. ఆయన ఏకత్వం, ఔన్నత్యం గురించి ప్రస్తుతించారు. అలా ఇక్కడా బాగా తెల్లవారిపోయిన వరకు అలా నిలబడి అల్లాహ్ ను ప్రస్తుతిస్తూనే ఉండిపోయారు. సూర్యోదయం అయ్యే ముందు ‘మినా’కు బయలుదేరారు. ఈసారి హజ్రత్ ఫజ్ల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను తన వెనుకగా ఎక్కించుకోవడం జరిగింది. ‘బత్నే ముహస్సిర్’కు చేరగా తన వాహన వేగాన్ని కొంత పెంచి పరుగెత్తించారు.

జమ్రయె కుబ్రాకు వెళ్ళే మార్గాన్ని అనుసరించి అక్కడికి చేరుకున్నారు – ఆ కాలంలో అక్కడ ఓ చెట్టు ఉండేది. ‘జమ్రయె కుబ్రా’ ఆ చెట్టు పేరుతోనే గుర్తించబడేది. ఇదే కాకుండా జమ్రయె కుబ్రాను జమ్రయె అక్బా మరియు జమ్రయె ఊలాగా కూడా పిలుస్తారు – అక్కడికి చేరిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జమ్రయె కుబ్రా పై ఏడు గులకరాళ్ళను విసిరారు. ఒక్కో గులకరాయి విసురుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్) అని పలికారు. అవి రెండు వ్రేళ్ళతో పట్టి విసరేటంత చిన్నవి. ఈ గులకరాళ్ళను ఆయన బత్నె వాదీలో నిలబడి విసిరారు.

ఆ తరువాత బలి స్థానానికి వెళ్ళి తన చేత్తో 63 ఒంటెల్ని జిబహ్ చేశారు. తక్కిన ఒంటెలను జిబహ్ చేయమని హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)కి అప్పగించారు. ఆయన మిగిలిపోయిన 37 ఒంటెల్ని జిబహ్ చేయడం జరిగింది. ఇలా ఖుర్బానీ ఇచ్చిన ఒంటెల సంఖ్య మొత్తం నూరు అయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)ను కూడా తన హదీ (ఖుర్బానీ)లో చేర్చుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం మేరకు ఆ ఖుర్బానీ ఒంటెల మాంసం నుండి ఒక్కో ముక్కను కోసి వండడం జరిగింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు) ఆ వండిన మాంసాన్ని కొంత భుజించి దాని పులుసును కూడా త్రాగారు.

ఖుర్బానీ అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటెనెక్కి మక్కాకు బయలుదేరారు. బైతుల్లాహ్ (కాబా గృహం) తవాఫ్ (ప్రదక్షిణ) చేశారు – దీన్ని తవాఫె ఇఫదః అంటారు – మక్కాలోనే జొహ్ర్ నమాజు చేశారు. పిదప (జమ్ జమ్ చెలమ) దగ్గర ఉన్న బనూ అబ్దుల్ ముత్తలిబ్ వారి దగ్గరకు వెళ్ళారు. వారు హాజీలకు జమ్ జమ్ నీరు త్రాగిస్తున్నారప్పుడు. వారిని చూసి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “బనూ అబ్దుల్ ముత్తలిబ్! మీరు నీళ్ళు తోడుతూనే ఉండండి. నీరు త్రాగించే ఈ కార్యంలో ప్రజలు మిమ్మల్ని మించిపోతారనే భయమే లేకపోతే నేను కూడా మీతోపాటే వచ్చి నీళ్ళు తోడేవాణ్ణి” అని సెలవిచ్చారు – అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అనుచరగణం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నీళ్ళు తోడుతూ చూసి ప్రతివాడు ముందుకెళ్ళి నీటిని తోడడానికి ప్రయత్నం చేసేవాడు. ఇలా హాజీలకు నీరు త్రాగించే హోదా, గౌరవం ఏదైతే బనూ అబ్దుల్ ముత్తలిబ్ కు దక్కిందో, ఆ వ్యవస్థ కాస్తా ఛిన్నాభిన్నమైపోయేది అని అర్థం – బనూ అబ్దుల్ ముత్తలిబ్ జమ్ జమ్ బావి నుండి ఓ బొక్కెన నీటిని తోడి ఇవ్వగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందులో నుండి తనవితీరా నీరు త్రాగారు.” [10]

ఆ రోజు యౌమున్నహ్ర్. అంటే జిల్ హిజ్జా పదవ తేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ రోజు ప్రొద్దెక్కిన తరువాత (చాష్త్ సమయం) ఓ ఖుత్బా (ప్రసంగం) ఇచ్చారు. ప్రసంగించేటప్పుడు ఆయన కంచర గాడిద (ఖచ్చర్) నెక్కి ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలను హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు), సహాబా (రదియల్లాహు అన్హుమ్) లకు వినబడేటట్లు బిగ్గరగా చెబుతున్నారు. సహాబా( (రదియల్లాహు అన్హుమ్)లు ఆ సమయాన కొందరు నిలబడి, మరికొందరు కూర్చుని వింటూ ఉన్నారు.” [11] ప్రవక్త శ్రీ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రోజు ప్రసంగం లోనూ, నిన్నటి ఎన్నో మాటలను వల్లించారు. సహీహ్ బుఖారి మరియు సహీహ్ ముస్లిమ్ గ్రంథాల్లో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ఉంది. ఆయన (రదియల్లాహు అన్హు), యౌమున్నహ్ర్ (పదవ జిల్ హిజ్జా) నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రసంగించారని చెప్పారు:

“కాలం పరిభ్రమిస్తూ, మళ్ళీ అల్లాహ్ భూమ్యాకాశాలు సృజించిన ఈ రోజుకు తిరిగివచ్చింది. సంవత్సరానికి పన్నెండు నెలలు. ఈ పన్నెండు నెలల్లో నాల్గు నెలలు హరామ్ నెలలు. మూడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చేవి. అంటే జిల్ ఖాదా, జిల్ హిజ్జా మరియు ముహర్రం. ఇంకొకటి రజబె ముజర్. అది జమాదిల్ ఉఖ్రా మరియు షాబాన్ నెలలకు నడుమన ఉన్న నెల.”

ఇంకా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఇది ఏ మాసం?” అని అడిగారు. మేము జవాబుగా, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే బాగా తెలుసు” అన్నాం. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొంచెం సేపు మౌనం పాటించారు. మేము, ఈ నెలకు ఆయన మరేదైనా పేరు పెట్టనున్నారేమో అని అనుకున్నాం. కాని ఆ తరువాత ఆయన తిరిగి, “ఇది జిల్ హిజ్జా మాసం కాదా?” అని అడిగారు. “అవును. ఎందుకు కాదు” అన్నాం మేము. ఆయన మళ్ళీ, “ఇది ఏ నగరం?” అని ప్రశ్నించారు. మేము, “అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు బాగా తెలుసు.” అని సమాధానమివ్వగా, ఆయన మళ్ళీ మౌనం వహించారు. మేము, ఆ మౌనాన్ని చూసి ఈ నగరానికి. మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగా, తమ మౌనాన్ని వీడి, “ఇది బల్దహ్ (మక్కా) కాదా?” అని ప్రశ్నిం చారు. “ఔను. తప్పకుండా” అని సమాధానమిచ్చాం మేము.

“సరే, ఈ రోజు ఏ రోజు?” అని అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం).

“అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే బాగా తెలుసు” అన్నాం మేము.

మా సమాధానం విన్న ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తిరిగి మౌనం వహించారు. మౌనాన్ని చూసి, ఈ రోజుకు మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగానే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఈ రోజు యౌమున్నహ్ర్ (ఖుర్బానీ రోజు అంటే జిల్ హిజ్జా పదవ తారీకు) కాదా?” అని అడిగారు.

“ఔను. ఎందుకు కాదు” అని అన్నాం మేము. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు:

“సరే వినండి, మీ ఈ నగరం, మీ ఈ నెల మరియు మీ ఈ రోజు ఎలా నిషిద్ధం (హరాం) గావించబడిందో, అలానే మీ రక్తం, మీ సంపద, మీ మానం పరస్పరం ఒకరిపై ఒకరికి నిషిద్ధం గావించబడ్డాయి.

మీరు అతి త్వరలోనే మీ ప్రభువును చేరుకుంటారు. ఆయన మిమ్మల్ని మీ కర్మలను గురించి అడుగుతాడు. కాబట్టి చూడండి! నా తరువాత ఒకరి మెడలను మరొకరు నరుక్కునేలా ధర్మభ్రష్టులు కాకండి. నేను దైవసందేశాన్ని మీకు అందించి నా విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకున్నానా? చెప్పండి” అని అడిగారు.

సహాబాలందరూ ముక్తకంఠంతో ‘అవును’ అని పలికారు.

అప్పుడు ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఓ అల్లాహ్! నీవే సాక్షి! అంటూ, ఎవరైతే ఇక్కడ హాజరుగా ఉన్నారో (ఈ మాటలను) హాజరుగా లేనివారికి అందించాలి. ఎందుకంటే, ఎవరికైతే (ఈ మాటలు) అందించడం జరుగుతుందో ప్రస్తుతం కొందరు (హాజరుగా) వినేవారికంటే నా ఈ మాటల పరమార్థాన్ని తెలుసుకోగలరు.” [12]

మరో ఉల్లేఖనంలో ఈ ఖుత్బాలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చి నట్లుంది:

“ఏ నేరం చేసినవాడైనా తనకు తాను తప్ప మరొకరికి నేరంచేయడనే విషయాన్ని గుర్తించండి (అంటే ఆ నేరం చేసినందుకు మరొకరు కాకుండా స్వయంగా తానే ఆ నేరం క్రింద పట్టుబడతాడని అర్థం). గుర్తుంచుకోండి! ఏ నేరగాడు అయినా తన కుమారుని పైగాని లేదా ఏ కుమారుడైనా తన తండ్రి పైగాని నేరం చేయడు (అంటే, తండ్రి చేసిన నేరానికి కుమారుణ్ణిగాని, కుమారుడు చేసిన నేరానికి తండ్రినిగాని పట్టుకోవడం జరగదు అని). జ్ఞాపకముంచుకోండి! షైతాన్ ఇప్పుడు, మీ ఈ నగరంలో ఎవ్వరూ అతణ్ణి పూజించేవారు లేరు గనుక నిరాశకు లోనైపోయాడు. ఏ కర్మలనైతే మీరు తుచ్ఛమైనవిగా నీచమైనవిగా తలుస్తున్నారో ఆ కర్మలలోనే అతణ్ణి మీరు విధేయించడం జరుగుతుంది. వాటి ద్వారానే అతడు సంతుష్టుడవుతూ ఉంటాడు.” [13] (అంటే ఎలాంటి ప్రాధాన్యత లేని విషయాల్లో వారు అతణ్ణి అనుసరిస్తారు అని అర్థం.)

[10] ముస్లిమ్- అధ్యాయం , ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి హజ్ – 1/397 – 400.
[11] అబూ దావూద్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఖుత్బాల అధ్యాయం – 1/270.

[12] సహీహ్ బుఖారి- మినాలో చేసిన ఖుత్బా అధ్యాయం-1/234.
[13] తిర్మిజీ-2/38, 135; ఇబ్ను మాజా, కితాబుల్ హజ్ మిష్కాత్-1/234.

ఆ ప్రసంగం అయిన తరువాత ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) అయ్యామె తష్రీక్ (11, 12, 13 జిల్ హిజ్జా తేదీలు) లో మినాలోనే ఉండిపోయారు. ఈ మూడు రోజుల్లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హజ్ మనాసిక్’ను (హజ్ లో నిర్వర్తించవలసిన పనులను) కూడా ఆచరించారు. అదేకాకుండా ప్రజలకు ఇస్లాం ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలను గురించి బోధిస్తూ దైవాన్ని ప్రస్తుతించారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) నిర్వహించిన ఖుర్బానీ ఆచారాన్ని నెలకొల్పుతూ షిర్క్ కు సంబంధించిన గురుతులన్నింటినీ నామరూపాల్లేకుండా చెరిపివేశారు. ‘అయ్యామె తష్రీక్’లో ఓ రోజు ప్రసంగించారు కూడా. ‘సునన్ అబూ దావూద్’ గ్రంథంలో ఉటంకించిన ఓ ఉల్లేఖనంలో, హజ్రత్ సరాఅ బిన్తె నిభాన్ (రదియల్లాహు అన్హా) గారి కథనం ఇలా ఉంది:

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘రఊస్’[14] రోజున ఖుత్బానిస్తూ మాకు ఇలా బోధించారు: “ఈ దినం అయ్యామె తష్రీక్ లోని మధ్య రోజు” [15] అని అన్నారు.

నేటి ఖుత్బా కూడా నిన్నటి (యౌమున్నహ్ర్ ) ఖుత్బాలాంటిదే. ఇది నస్ర్ అధ్యాయం అవతరణ తరువాత ఇచ్చిన ఖుత్బా.

అయ్యామె తష్రీక్ అయిపోయిన తరువాత మరునాడు ‘యౌమున్నఫ్ర్’ అంటే 13 జిల్ హిజ్జా రోజున ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) మినా నుండి బయలు దేరారు. వాదియె అబ్తహాలో నివసించే ‘ఖైఫ్ బనీ కనానా’ వారి దగ్గర ఆగి సేద తీర్చుకున్నారు. మిగిలిన ఆ పగలు, రాత్రి కూడా అక్కడనే గడిపేశారు. అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్ , ఇషా నమాజులు చేశారు. అయితే ఇషా నమాజు తరువాత కొంచెం సేపు నిద్రించి లేచి మళ్ళీ బైతుల్లాహ్ కు బయలు దేరారు. అక్కడికి చేరి ‘తవాఫె విదా’ (కాబా గృహపు చివరి తవాఫ్) చేశారు.

ఇప్పుడిక హజ్ మనాసిక్ (హలో ఆచరించవలసిన ఆచారాలు) పూర్తి చేసుకొని తమ వాహనాన్ని మదీనా వైపునకు మరల్చి బయలుదేరారు. మదీనాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునే ఉద్దేశ్యంతో కాకుండా, ఇప్పుడు అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో తిరిగి ఓ క్రొత్త కృషికి నాంది పలకడానికే ఆ ప్రస్థానం. ” [16]

[16] హజ్జతుల్ విదా వివరాల కోసం ఈ గ్రంథాలను చూడండి: సహీ బుఖారి- కితాబుల్ మనాసిక్, సంపుటి 1, సంపుటి-2/631; సహీహ్ ముస్లిమ్ – బాబుల్ హజ్జతున్నబీ (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఫత్ హుల్ బారి – సంపుటం 3, షరహ్ కితాబుల్ మనాసిక్ మరియు సంపుటం-8/103 – 110; ఇబ్నె హిషామ్ 2/601 – 605; జాదుల్ ముఆద్ 1/196, 218 – 240

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం) – షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి [పుస్తకం]

మరణాంతర జీవితం – పార్ట్ 03 : సమాధి శిక్షకు గురి చేసే విషయాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 03 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 03. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 24:18 నిముషాలు]

అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలహందులిల్లాహ్ వస్సలాతు వస్సలామ్ అలా రసూలిల్లాహ్. అమ్మాబాద్, ఋజుమార్గం టీవి  ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశం లో స్వాగతం.

ఈనాటి మన శీర్షిక సమాధి శిక్షలు, సమాధి అనుగ్రహాలు. మహాశయులారా సమాధి శిక్షల గురించి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం వల్ల మనకు అతి ముఖ్యమైన లాభం ఏమిటంటే మన చావు రాక ముందే, సమాధి జీవితంలోకి ప్రవేశించక ముందే మనకు మనం సరిదిద్దుకొని సత్కార్యాల మార్గంలో ఉంచుకోవచ్చు. ఎలాగైతే మనం తెలివైన విద్యార్థిని చూస్తామో వారు మోడల్ పేపర్స్ ని చూసుకొని ఇలాంటి ఇలాంటి ప్రశ్నలు రావచ్చు, ఇలాంటి కష్టమైన ప్రశ్నలు కూడా రావచ్చు, మనకు పేపర్ ఈ  రకంగా కష్టంగా  ఉండవచ్చు అని ఏదైతే చూసుకొని ఊహించుకొని, వాటిని తెలుసుకొని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారో, అలాగే సమాధిలో ఏమేమి జరగనుంది? ఆ వివరాలు ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటే అంతే మనలో మంచి మార్పు రావచ్చు.

సమాధిలో ఏయే శిక్షలు అయితే జరుగుతాయో, వాటికి మనం ఇహ లోకంలో చేసే దుష్కార్యాలే మూల కారణం అవుతాయి. ఉదాహరణకు విశ్వాస మార్గాన్ని అవలంబించక పోవుట, అల్లాహ్  ఏకత్వాన్ని స్వీకరించకపోవడం, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసి అల్లాహ్  పంపిన సత్య ధర్మాన్ని స్వీకరించకపోవుట  ఇది సమాధి శిక్షలకు మూల కారణం.

సూరయే గాఫిర్  ఆయత్ నంబర్ 46 లో అల్లాహ్ (తఆలా), ఫిరౌను మరియు అతన్ని అనుసరించిన వారి గురించి, వారికి సమాధిలో ఎలాంటి శిక్షలు జరుగుతున్నాయో ఈ విధంగా తెలిపాడు.   

النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا
ఉదయం సాయంకాలం నరకాగ్ని వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది.
(40:46)

అంటే నరకాగ్ని యొక్క జ్వాలలు, దాని యొక్క వేడి ఇదంతా వారికి ప్రతిరోజు ఉదయం, సాయంకాలం రెండు సార్లు దాని శిక్ష ఇవ్వడం జరుగుతుంది మరియు ఇంతకు ముందు మనం సూరయే అన్ ఆమ్ లోని ఆయత్ నెంబర్ 93 విని ఉన్నాము.

وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمُ ۖ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ

ఈ దుర్మార్గులు మరణయాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్‌ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు! (6:93)

ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించడం జరుగుతుంది. ఎందుకు? మీరు అల్లాహ్ పట్ల అసత్య మాటలు పలికారు. అల్లాహ్ కు ఇతరులను భాగస్వామిగా కలిపారు. అందుగురించి మహాశయులారా షిర్క్ ను విడనాడాలి. అల్లాహ్ కు చేసే ఏ ఆరాధన అయితే ఉందో దానిని మనం ఇతరులకు ఎంత  మాత్రం చేయకూడదు.

అలాగే రెండవ విషయం సమాధి శిక్షకు ఏదైతే కారణం అవుతుందో కపట విశ్వాసం, బాహ్యంగా ఇస్లాం స్వీకరించినట్లు నటించడం, చూసేవారికి ముస్లిములుగా కనపరచడం, కానీ మనసులో ఇస్లాం, ఈమాన్, విశ్వాసం పట్ల ప్రేమ ఉండకుండా మనస్పూర్వకంగా  ఇస్లాం పై ఆచరించకుండా ఉండడం. “నిశ్చయంగా కపట విశ్వాసులు నరకం లోని అతి దిగువ స్థానములో ఉంటారు.”

ఇంకా ఎవరైతే అల్లాహ్ ధర్మంలో మార్పులు చేర్పులు చేస్తారో అల్లాహ్  హరామ్ చేసిన వాటిని హలాల్ గా, హలాల్  చేసిన వాటిని హరామ్ గా చేస్తారో, అల్లాహ్ ఏ విషయాల్ని ధర్మంగా, ధర్మ సమ్మతంగా తెలుపలేదో  వాటిని యొక్క ధర్మంగా ప్రజల ముందుకు తీసుకొస్తారో  అలాంటి వారికి కూడా చాలా భయంకరమైన శిక్ష సమాధిలో జరుగుతూ ఉంటుంది.

అమర్ బిన్ లుహయ్  అని ఒక నాయకుడు. అతన్ని చాలా గౌరవించేవారు  ఖురైషులు. అతడు చాలా రోజుల వరకు చాలా మంచి విధంగా వారికి నాయకత్వం వహించాడు. కానీ సీరియా, వేరే దేశాల పర్యాటనకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కాబాలో తొలిసారిగా షిర్క్  మొదలు పెట్టాడు. విగ్రహాలను తీసుకొచ్చి పూజించడం, ప్రజల్ని వాటి యొక్క పూజకు పురికొల్పడం  మొదలుపెట్టాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. – “నేను అమర్ బిన్ లుహయ్  చూశాను, అతడు నరకంలో తన యొక్క ప్రేగులను తానే బయటికి లాక్కుంటూ ఉన్నాడు.” (సహీ బుఖారిలో  ఉన్నహదీస్ ఇది. 4623 హదీత్ నెంబర్). ప్రళయం వరకు ఇలాంటి శిక్ష అతనికి ఎందుకు జరుగుతుంది? ఇలాంటి దుష్కార్యాలు మరియు ఇలాంటి దురాచారాలను ధర్మం పేరిట ప్రజల్లో వ్యాపింప చేశాడు. మరి ఈ రోజుల్లో కూడా కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకురావడం ముస్లింలలో కూడా ఎంతో మంది ఎన్నో విషయాలని ఆరాధనగా, ధర్మంగా, పుణ్యకార్యాలు గా చేస్తూ వాటిని వ్యాపింప చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మనల్ని సమాధి శిక్షకు గురి చేస్తాయి.

సమాధి శిక్షకు గురి చేసే విషయాల్లో ఒకటి ఖురాన్  చదవకపోవడం, నేర్చుకొని దానిని మర్చిపోవడం. ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాంటి వారి గురించి మరియు ఎవరైతే నమాజ్ లు విడనాడుతారో ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ ఎవరైతే చేయరో  సామూహికంగా దాని యొక్క సమయంలో, అలాంటి వారి గురించి కూడా సమాధి శిక్షల గురించి హెచ్చరించారు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూశారు:  ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. మరో వ్యక్తి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి అతని తల మీద పడేస్తున్నాడు. తల ముక్కలు ముక్కలై రాయి దూరంగా  పడిపోతుంది. ఆ వ్యక్తి రాయిని తీసుకుని వచ్చేసరికి మళ్ళీ ఈ తల పూర్తి తలగా  అయిపోతుంది. సరి అయిపోతుంది, మళ్ళీ కొడతాడు. మళ్ళీ ముక్కలు ముక్కలు అవుతుంది. ఇలాగే అతనికి శిక్ష జరుగుతూ ఉన్నది. ఈ శిక్ష ఎలాంటి వారికి జరుగుతుంది అంటే జిబ్రీల్ దూత తెలిపారు: “ఎవరైతే ఖురాన్ నేర్చుకొని మరిచిపోయారో , ఖురాన్ చదవడం మానేశారో  మరియు ఫజర్ నమాజ్ చదవకుండా పడుకుని ఉంటారో అలాంటి వారికి శిక్ష జరుగుతుంది“. ఎవరైతే ఈ రోజుల్లో ఫజర్ నమాజ్ లు వదిలేస్తున్నారో, ఎనిమిది తొమ్మిది పది పదకొండు వారి యొక్క డ్యూటీ  సమయం వరకు, ఒకవేళ ఉదయం పూట డ్యూటీ లేకుంటే ఫజర్ నమాజ్ చదవకుండా అలాగే పడుకొని ఉంటారో, వారు ఇలాంటి శిక్షల నుండి భయపడి తమను తాము ఇలాంటి శిక్షల  నుండి కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏమిటి? ఫజర్ నమాజ్ చదవడం మొదలు పెట్టాలి. ఖురాన్  చదువుతూ ఉండాలి. ఖురాన్ పారాయణం ని వదలకూడదు.

అలాగే సమాధి శిక్షలకు గురిచేసే దుష్కార్యాల్లో ఒకటి మూత్ర విసర్జన సందర్భంలో దాని యొక్క తుంపరలు పైన పడకుండా జాగ్రత్త పడకపోవడం, మూత్ర విసర్జన తరువాత పరిశుభ్రత చేసుకోకపోవడం, అలాగే చాడీలు చెప్పడం, పరోక్ష నింద చెప్పడం ఇవన్నీ కూడా సమాధి శిక్షకు మనల్ని గురి చేస్తాయి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి ఒక దారిలో వెళ్తున్నారు. అటు పక్కన రెండు సమాధులు కనబడ్డాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “వీరిద్దరూ చేసే పాపాన్ని మహా ఘోరమైన పెద్ద పాపంగా భావించలేదు వీళ్ళు. అయినా వీరికి శిక్ష చాలా ఘోరంగా జరుగుతుంది. వారిలో ఒకతను మూత్ర విసర్జన నుండి, మూత్ర తుంపరలు నుండి జాగ్రత్తపడేవాడు కాదు. మరొక వ్యక్తి చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు.” మరో ఉల్లేఖనంలో ఉంది. “పరోక్ష నిందలు చెప్పుకుంటూ ఉండేవాడు.”

సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి అబద్ధం. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యలో జరిగే మాటల్లో అబద్దం పలకడం కానీ మరియు ప్రత్యేకంగా ఎవరైతే న్యూస్ ఛానెల్ లో పని చేస్తున్నారో, ఎవరైతే అల్లాహ్ (త’ఆల) వారికీ వాక్చాతుర్యం ప్రసాదించాడో  మాట్లాడేటువంటి విధానం ఇచ్చాడో  వారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో మంది శాటిలైట్ ఛానెల్ లో గానీ లేక ఇంకా వేరే సోషల్ మీడియాల  ద్వారా వారి యొక్క మాట వ్యాప్తి చెందుతూ ఉందో అలాంటి వారు మాట్లాడే సందర్భంలో చాలా జాగ్రత్త పడాలి. అబద్ధం ఏదైతే వారు తెలుపుతారో అబద్దం మాట ఏదైతే పలుకుతారో దానికి ఎంత ఘోరమైన శిక్ష ఉందంటే మనం దాన్ని ఊహించలేము, భరించలేము. అబద్ధం పలికే వారు ప్రత్యేకంగా ఎవరైతే ఏదైనా మాట మాట్లాడిన తర్వాత వారి యొక్క మాట ప్రపంచంలో వ్యాపించి పోతుందో అలాంటి వారు మరీ జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే సహీ బుఖారి హదీస్ నెంబర్ 7074 లో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నరకంలో ఒక వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి యొక్క నోట్లో కత్తి వేసి ఇటు మెడ వరకు కోయడం జరుగుతుంది. ఇటు నుండి ఇక్కడి వరకు వెనకకు వస్తాడు దైవదూత కోసుకుంటూ, మళ్ళీ తర్వాత అదే కత్తి తీసి ఇటు వైపు నుండి ఇటు మెడ వరకు కోస్తాడు. ఈ విధంగా ఇటు నోట్లో పెట్టి, ఇటు ముక్కులో పెట్టి, ఇటు కన్నులో పెట్టి ఈ విధంగా కోస్తూ ఉంటాడు. ఇటు కోసిన తర్వాత ఇటు వస్తాడు, ఇటు నుండి మళ్ళీ ఇటు వచ్చేసరికి సరి అయిపోతుంది. మళ్ళీ కోస్తాడు. ఈ విధంగా అతని నుండి రక్తం కూడా వెళ్తూ ఉంటుంది. ఈ శిక్ష జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఎవరికీ జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రశ్నించినప్పుడు,  ఇతను ఎవరు అంటే, ఇతను పొద్దున్న లేసిన తరువాత అబద్దం పలికే వాడు. ఆ  అబద్ధాన్ని ప్రపంచంలో వ్యాపింప చేసే ప్రయత్నం చేస్తూ దాన్ని వ్యాపించే వారు. అందుకు అతనికి ఇలాంటి శిక్ష జరుగుతుంది అని. అయితే అబద్ధాల్లో కూడా కొన్ని స్టేజ్ లు ఉన్నాయి. ఒక వ్యక్తి తన వ్యక్తిగత లాభం కొరకు ఒక మనిషితో ఏదైనా మాట్లాడుతూ అబద్ధం పలుకుతాడు. ఇందులో ఇద్దరి మధ్యలోనే ఏదైనా ఎవరికైనా నష్టం జరగవచ్చు. మరొక అబద్ధం ఒక సమాజానికి కావచ్చు. కొన్ని సందర్భాల్లో అబద్ధం మనిషి అల్లాహ్ యొక్క ప్రవక్త మీద, మరి కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ అల్లాహ్ కు వ్యతిరేకంగానే అల్లాహ్ మీద అబద్ధం, అసత్యం పలుకుతాడు. ఈ రకంగా అబద్దం ఎవరి పట్ల ఎంత కఠినంగా ఉంటుందో అదే ప్రకారంగా అతని యొక్క శిక్ష  కూడా కఠినంగా ఉండవచ్చు.

సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో మరొకటి వడ్డీ తినడం, వడ్డీ తీసుకోవడం, వడ్డీ వ్యాపారాలు, వడ్డీ లావాదేవీలలో పాల్గొనడం. అదే సహీ బుఖారీ హదీసులో  ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నరకంలో ఒక వ్యక్తిని చూశారు. అతన్ని ఒక రక్తపు నదిలో వేయడం జరిగింది. ఈదుతూ ఈదుతూ దాని చివరి వరకు వచ్చి పైకి ఎక్కుదాము అని అనుకుంటాడు. ఈ నదిలో నుండి బయటికి వచ్ఛేద్దాము ఈ శిక్షను నేను భరించలేను అని అనుకుంటాడు. అంతలోనే ఆ ఒడ్డుమీద ఒక దైవదూత ఉంటాడు. అతని వద్ద కొన్ని రాళ్ళు ఉంటాయి. ఎప్పుడైతే ఒడ్డుకు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాడో ఆ రాళ్లతోనే అతన్ని కొడతాడు. అతను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. మళ్లీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే దగ్గరికి వస్తాడో ఈ దైవదూత అతన్ని రాళ్లతో కొడతాడు. ఈ విధంగా అతనికి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు జిబ్రీల్ అమీన్ తెలిపారు “ఇతడు ప్రజల నుండి ప్రజలకు అప్పు ఇచ్చి, అసలైన అప్పు తో పాటు వడ్డీ కూడా తీసుకుంటూ ఉండేవాడు” అని చెప్పారు. అందుకు మహాశయులారా ఈ రోజుల్లో వడ్డీ తీసుకోవడంలో మనకు కొంత లాభం కనబడుతుంది కావచ్చు. కానీ వాస్తవానికి ఇది లాభం కాదు. మన ఇహ పర లోకాలను నష్టాలలో చేకూర్చి అతి భయంకరమైన పాపం.

సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో మరొకటి వ్యభిచారం. ఈ రోజుల్లో ఇంత అభివృద్ధి చెందిన కాలం, టెక్నాలజీ డెవలప్ అయిన కాలం, అన్ని రకాల వనరులు, అన్ని రకాల సౌకర్యాలు పెరిగిన ఈ కాలంలో అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎక్కువగా తెలుపుకొని ఆయనకు విధేయత చూపే దానికి బదులుగా అనేక మంది యువకులు, యువతులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అన్నటువంటి తేడా లేకుండా వ్యభిచారం యొక్క పాపములో కూరుకుపోతున్నారు. వ్యభిచారం ఎంత ఘోరమైన చెడ్డ కార్యం అంటే దానికి ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్, ఒక కార్యక్రమం అవసరం ఉంటుంది. కానీ సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఇది కూడా ఒకటి. అదే సహీ బుఖారీ హదీస్ లో ఉంది – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చూశారు: ఒక చాలా పెద్ద కుండ ఉంది. లోపల పురుషులు, స్త్రీలు నగ్నంగా ఉన్నారు. దాని కింద మంట ఉంది. ఎప్పుడైతే మంట భగభగ మండుతూ పైకి వస్తుందో వారందరూ ఘనమైన శబ్దంతో అరుస్తూ బయటికి రావాలి అనుకుంటారు. కానీ కుండ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మూత చిన్నగా ఉంటుంది. దాని లోపలి భాగం చాలా పెద్దగా ఉంటుంది. ఈ విధంగా వారు బయటికి రాలేక పోతారు. మళ్ళీ ఆ మంటలు చల్లారినట్లు అవుతూ ఉంటే వెంటనే కిందికి పడిపోతారు. ఈ రకంగా వారికి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఏవరికి జరుగుతుంది అంటే వీళ్ళందరూ వ్యభిచారం చేసేవాళ్ళు అని చెప్పడం జరిగింది. ఈవిధంగా మహాశయులారా ఇలాంటి కార్యాలకు, ఇలాంటి పాపాలకు దూరంగా ఉండాలి. మన సంతానంలో ఎవరైనా ఇలాంటి చెడు కార్యాలకు పాల్పడటం అయితే లేదు కదా అని మనం జాగ్రత్తపడాలి. వారి యొక్క ఉత్తమ శిక్షణకై చాలా కృషి చేస్తూ ఉండాలి.

సమాధి శిక్షకు గురి అయ్యే పాపాలలో ఒకటి ప్రజలకు మంచిని గురించి ఆదేశించి స్వయంగా ఆ మంచిని ఆచరించకపోవడం. అల్లాహ్ ప్రత్యేకంగా మాలాంటి వాళ్లందరినీ కూడా కాపాడుగాక, వారందరికీ కూడా సన్మార్గం చూపు కాక. వాస్తవానికి మహాశయులారా ఇది మహా భయంకరమైన విషయం. ఏ ధర్మబోధనలను అయితే మనం ఇతరులకు బోధిస్తామో, వాటిని ఆచరించే ప్రయత్నం కూడా చేయాలి. ఎవరైతే చెప్పే మాట ఒకటి కానీ వారి ఆచరణ దానికి భిన్నంగా ఉంటుందో, ప్రళయదినాన వారిని ఎలా శిక్షించడం జరుగుతుంది? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  గగన ప్రయాణానికి వెళ్ళిన రాత్రి కొందరిని చూశారు. వారి యొక్క పెదవులు, నరక కత్తెరలతో కత్తిరించ బడుతున్నాయి. మళ్లీ కొంతసేపట్లో అవి సరి అయిపోతాయి. మళ్లీ కత్తిరించడం జరుగుతుంది. మళ్ళీ సరి అయిపోతాయి. ఇలాంటి శిక్ష జరుగుతూనే ఉంటుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అంటే నీ అనుచర సంఘంలోని ప్రసంగీకులకు. ఎవరైతే ప్రసంగాలు చాలా బ్రహ్మాండంగా చేస్తారో, కానీ వాటి ప్రకారంగా ఆచరించే ప్రయత్నం చెయ్యరు.

సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి రమదాన్  లో పాటించే ఉపవాసాలు, అందులో ఉపవాసాలు పాటిస్తున్నట్లు గా ప్రజల అందరితో కలిసి ఉండడం, ఉపవాసాలు ఉండటం. కానీ ఇఫ్తార్ సమయం కాకముందే ఇఫ్తార్ చేసేయడం, ఉపవాసాన్ని భంగ పరచడం, ఏమైనా తినేయడం. దీని మూలంగా కూడా సమాధిలో కఠినమైన శిక్ష జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హెచ్చరించారు. సహీ ఇబ్నె హిబ్బాన్ మరియు ముస్తద్రక్ లోని హదీత్ షేక్ అల్బానీ రహిమహుల్లా దానిని సహీ గాపేర్కొన్నారు. ఇలాంటి వారిని తల క్రిందులుగా చేసి, కాళ్ళు పైకి చేసి వ్రేలాడ తీయడం జరుగుతుంది మరియు వారి యొక్క నోటిని కత్తెరలతో కోసుకుంటూ వెనుక వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. రక్తం చిందుతూ కిందికి కారుతూ ఉంది. ఇలా ఈ శిక్ష జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంది. ఇలాంటి శిక్ష ఎవరికీ జరుగుతుంది అని ప్రశ్నించినప్పుడు ఎవరైతే ఇఫ్తార్ సమయం కాకముందే రమదాన్ లో తమ ఉపవాసాలను భంగపరిచేవారో, ఇఫ్తార్ చేసేవారో అలాంటి వారికి ఈశిక్ష జరుగుతుంది అని తెలపడం జరిగింది.

ఇంకా మహాశయులారా సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో, ఈ రోజుల్లో అనేక మంది దీనికి పాల్పడి ఉన్నారు. ఏమిటంటే, తమ యొక్క ప్యాంటు గాని, పైజామా గాని, లుంగీ గాని,సౌబ్ కానీ, ఏ దుస్తులు అయినా చీలమండలానికి (ankles) కిందిగా తొడగడం. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హదీత్ ఉంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. “మీకంటే ముందు ఒక వ్యక్తి గర్వంతో తన వస్త్రాన్ని వ్రేలాడ తీసుకుంటూ భూమిపై వెళ్తూ ఉన్నాడు. అల్లాహ్ తఆలా అతన్ని భూమిలోనే ధ్వసం చేసాడు (భూమిలోకి కృంగిపోయాడు). అతడు ప్రళయదినం  వరకు భూమిలో ధ్వసం అవుతూనే ఉన్నాడు.” అల్లాహుఅక్బర్ అల్లాహుఅక్బర్ . ఎవరికైనా ఏదైనా గర్వ ఉద్దేశం లేకున్నా గాని ఇలా చీలమండలానికి కిందిగా తొడగడం ఇది యోగ్యం లేదు, ధర్మ సమ్మతం కాదు. పరలోకం లోనే కాకుండా, అంతకంటే ముందు సమాధి శిక్షకు కూడా ఒక కారణం అవుతుంది. అందుగురించి మనం దీని నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఇంకా మహాశయులారా సమాధి శిక్షకు గురి చేసే పాపాల్లో ఒకటి జంతువులను కష్టపెట్టడం, వాటిని శిక్షించడం, వాటికి బాధ కలిగించడం కూడా. ఏ స్త్రీ ఒక పిల్లిని కట్టేసి, బంధించి అన్నం నీళ్లు ఇవ్వకుండా దానిని శిక్ష పెట్టిందో, అదే స్థితిలో అది చనిపోయిందో ఆమెకు నరక శిక్ష ఉంది అని ఏదైతే ఒక ప్రఖ్యాతిగాంచిన హదీత్ ఉందో అదే స్త్రీ గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు. ఆమెను సమాధిలో కూడా శిక్షించ బడుతూ ఉన్నట్లుగా నేను చూశాను అని. అందుకు ఏ జంతువులను కూడా శిక్షించకూడదు.

అలాగే సమాధి శిక్షలకు గురిచేసే పాపాల్లో మరొకటి అప్పు తీసుకొని అప్పు ఇచ్చిన వారికి చెల్లించకపోవడం, అదే స్థితిలో చనిపోవడం. ఈ రోజుల్లో ఎంతో మంది ఇలాంటి పాపానికి గురి అవుతున్నారు. తమ అవసరానికి అప్పులు తీసుకుంటారు గడువు దాటిపోతుంది. దాటి పోయిన తర్వాత కూడా అప్పు ఇచ్చినవాడు నాలుగు సార్లు ఇంటికి వచ్చి అప్పు అడిగాడు అంటే వెళ్లి కోర్టు నుండి స్టే తీసుకురావడం, అప్పు ఇవ్వకుండా ఏదైనా సాకులు చూపి తప్పించుకునే ప్రయత్నం చేయడం మరియు ప్రత్యేకంగా ప్రభుత్వం వైపు నుండి ఏ అప్పులు అయితే ఇవ్వబడతాయో వాటిని బూటకపు సాకులు ద్వారా తప్పించుకునే ప్రయత్నాలు కూడా ఎంతో మంది చేస్తూ ఉంటారు. అయితే గమనించాలి. అప్పు ఎవరి నుండి తీసుకున్నామో వారికి చెల్లించకపోవడం కూడా ఇది ఒక పాపం, ఇది కూడా మన సమాధి శిక్షకు కారణం అవుతుంది.

ఈ విధంగా మహాశయులారా ఇప్పటివరకు మనం ఈ కార్యక్రమంలో సమాధి శిక్షకు గురి చేసే పాపాల గురించి మనం తెలుసుకున్నాం. అయితే దీని తర్వాత కార్యక్రమం తర్వాత ఎపిసోడ్ లో నరక శిక్ష నుండి రక్షింపబడే పుణ్యకార్యాలు ఏమిటో అవి కూడా మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము. తరువాయి భాగం కూడా వినడం మర్చిపోకండి. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బారకాతుహు.

పూర్తి భాగాలు క్రింద వినండి 

కరోనా వల్ల భయం చెంది మస్జిద్ కు నమాజు కొరకు వెళ్లకుంటే ఏమైనా పాపమా? [వీడియో]

బిస్మిల్లాహ్
[1:33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
https://teluguislam.net/corona/

“అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” అని చెబితే ఎన్ని పుణ్యాలు లభిస్తాయి? [ఆడియో]

బిస్మిల్లాహ్
[5:35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

“అస్సలాముఅలైకుం వ రహ్మాతుల్లాహి వ బరకాతుహ్ అని చెబితే ఎన్ని పుణ్యాలు లభిస్తాయి?

30 పుణ్యాలు

అబూ దావూద్ 5195లో ఉంది, షేఖ్ అల్బానీ సహీ అన్నారు: ఇమ్రాన్ బిన్ హుసైన్ ఉల్లేఖించారు:

عَنْ عِمْرَانَ بْنِ حُصَيْنٍ، قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ، فَرَدَّ عَلَيْهِ السَّلَامَ، ثُمَّ جَلَسَ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «عَشْرٌ» ثُمَّ جَاءَ آخَرُ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ، فَرَدَّ عَلَيْهِ، فَجَلَسَ، فَقَالَ: «عِشْرُونَ» ثُمَّ جَاءَ آخَرُ فَقَالَ: السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، فَرَدَّ عَلَيْهِ، فَجَلَسَ، فَقَالَ: «ثَلَاثُونَ»

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు ఒక వ్యక్తి వచ్చి అస్సలాముఅలైకుమ్ అని అన్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 10 పుణ్యాలు అన్నారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చాడు, అతడు అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అన్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి కూర్చున్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 20 పుణ్యాలు అన్నారు. మరో వ్యక్తి వచ్చి అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అని అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చారు. అతడు కూర్చున్నాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) 30 పుణ్యాలు అన్నారు.

قَالَ الْقَفَّالُ [أبو بكر محمد بن علي بن إسماعيل الشاشي المعروف بـ “القفال الكبير 291هـ – 365هـ (904 – 976 م)] فِي فَتَاوِيهِ تَرْكُ الصَّلَاةِ يَضُرُّ بِجَمِيعِ الْمُسْلِمِينَ لِأَنَّ الْمُصَلِّيَ … لَا بُدَّ أَنْ يَقُولَ فِي التَّشَهُّدِ السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ فَيَكُونُ مُقَصِّرًا بِخِدْمَةِ اللَّهِ وَفِي حَقِّ رَسُولِهِ وَفِي حَقِّ نَفْسِهِ وَفِي حَقِّ كَافَّةِ الْمُسْلِمِينَ وَلِذَلِكَ عُظِّمَتِ الْمَعْصِيَةُ بِتَرْكِهَا

وَاسْتَنْبَطَ مِنْهُ السُّبْكِيُّ أَنَّ فِي الصَّلَاةِ حَقًّا لِلْعِبَادِ مَعَ حَقِّ اللَّهِ وَأَنَّ مَنْ تَرَكَهَا أَخَلَّ بِحَقِّ جَمِيعِ الْمُؤْمِنِينَ مَنْ مَضَى وَمَنْ يَجِيءُ إِلَى يَوْمِ الْقِيَامَةِ لِوُجُوبِ قَوْلِهِ فِيهَا السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ [فتح الباري 2/317]

సహీ బుఖారీ యొక్క ప్రక్యాతి గాంచిన వ్యాఖ్యానకర్త ఇమాం ఇబ్ను హజర్ అస్కలానీ ఫత్హుల్ బారీ 2/317లో తెలిపారు: ఇమాం ఖఫ్ఫాల్ రహిమహుల్లాహ్ తన ఒక ఫత్వాలో చెప్పారు:

ఒక్క వ్యక్తి నమాజు వదలడం వల్ల ముస్లిములందరికీ నష్టం జరుగుతుంది, ఎందుకనగా నమాజీ … తషహ్హుద్ లో అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అనడం తప్పనిసరి, నమాజు చేయని వ్యక్తి ఇది అనలేదు గనక అతడు, అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల, స్వయం తన పట్ల మరియు ముస్లిములందరి పట్ల కొరత చేసినవాడయ్యాడు. అందుకే నమాజు వదలడం మహా ఘోరమైన పాపంగా పరిగణించడం జరిగింది.

ఇమాం సుబ్కీ రహిమహుల్లాహ్ చెప్పారు:

నమాజులో అల్లాహ్ హక్కుతో పాటు దాసుల హక్కు కూడా ఉంది. ఎవరు దానిని వదిలారో అతడు గతంలో చనిపోయిన మరియు ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరి హక్కును కాజేసినవాడవుతాడు. ఎందుకనగా తషహ్హుద్ లో అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్సాలిహీన్ అనడం విధిగా ఉంది.

సీరత్ పాఠాలు 7: ఉహుద్ యుద్ధం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం వరకు [వీడియో]

బిస్మిల్లాహ్

[19:44 నిముషాలు]

ఉహుద్ యుద్ధంనుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణం వరకు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

 ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [19:44 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ఉహద్ యుద్ధం

బద్ర్ యుద్ధం తర్వాత ఒక సంవత్సరానికి, మస్లిముల మరియు అవిశ్వాసుల మధ్య ఈ యుద్ధం జరిగింది. బద్ర్ యుద్ధంలో ఓటమికి పాలైన అవిశ్వాసులు, ముస్లిములతో ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఈ సారి 3000 సైనికులతో బయలుదేరారు. వారితో పోరాడడానికి ముస్లిముల వైపు నుండి 700 మంది పాల్గొన్నారు. ప్రారంభ దశలో ముస్లిములే గెలుపొందారు. అవిశ్వాసులు మక్కా దారి పట్టారు. కాని వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. కొండ వెనుక వైపు నుండి వచ్చి, ముస్లిములపై విరుచుకు పడ్డారు. ఇలా ఎందుకు జరిగిందంటే: అదే కొండపై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొందరు విలుకాండ్రులను నియమించారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ స్థానాన్ని వదలకూడదని వారికి నొక్కి చెప్పారు. కాని వారు ముస్లిములు గెలుపొందినది, ముష్రికులు పారిపోవునది చూసి (యుద్ధం ముగిసిందన్న భ్రమలో పడి) విజయప్రాప్తి కోసం పరుగెత్తుకొచ్చారు. అందువల్ల ఆ స్థలం ఖాలీ అయిపోయింది. ఖురైషులకు మంచి అవకాశం లభించింది. కొండ వెనక నుండి తిరిగి దాని శిఖరంపై వచ్చి అక్కడి నుండి ముస్లిములపై దాడి చేశారు. అందుకే ఈ సారి ముష్రికులు గెలుపొందారు. ఈ యుద్ధంలో 70 మంది ముస్లిములు అమరవీరులయ్యారు. వారిలో ఒకరు: హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు). ముష్రికుల వైపు నుండి 22 మంది చంపబడ్డారు.

ఖందక యుద్ధం

ఉహద్ యుద్ధం తర్వాత కొద్ది రోజులకు మదీన యూదులు మక్కా వెళ్ళి ఖురైషుల్ని కలుసుకొని మీరు గనక మదీనా పై దాడి చేసి, ముస్లిములతో యుద్ధం చేస్తే ఈ సారి మేము (లోపల నుండి) మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్దానం చేశారు. ఖురైషులు సంతోషంతో దీన్ని ఒప్పుకున్నారు. ఖురైషులు ఒప్పుకున్నాక ఇతర తెగవాళ్ళను కూడా పురికొలిపారు. వారు కూడా ఒప్పుకున్నారు. అరబ్బు దేశమంతటి నుండి యూదులు, ముష్రికులందరూ ఏకమై భారీ ఎత్తున మదీనా పై దండ యాత్రకు బయలుదేరారు. సుమారు పది వేల మంది సైనికులు మదీనా చుట్టు ప్రక్కన పోగు అయ్యారు.

శత్రువుల కదలిక గురించి ప్రవక్తకు వార్తలు అందుతున్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలతో సలహా కోరారు. అప్పుడు ఈరాన్ దేశస్తుడైన సల్మాన్ ఫార్సీ (రదియల్లాహు అన్హు) ఖందకం త్రవ్వాలని సలహా ఇచ్చారు. మన రెండు వైపులా ఖర్జూరపు తోటలు, ఒక వైపు కొండ ఉండగా మరో వైపు ఏమీ అడ్డుగా లేనందు వల్ల అదే వైపు ఖందకం త్రవ్వడం ప్రారంభించారు. ముస్లిములందరూ ఇందులో పాల్గొని అతి తొందరగా దాన్ని పూర్తి చేశారు. ముష్రికులు ఖందకానికి ఆవల ఒక నెల వరకు ఉండిపోయారు. మదీనలో చొరబడటానికి ఏ సందు దొరకలేదు. ఆ కందకాన్ని దాటలేక పోయారు. అల్లాహ్ అవిశ్వాసులపై ఒకసారి తీవ్రమైన గాలి దుమారాన్ని పంపాడు. దాని వల్ల వారి గుడారాలు ఎగిరిపోయాయి. వారిలో అల్లకల్లోలం చెలరేగి భయం జనించింది. క్షణం పాటు ఆగకుండా పారిపోవడంలోనే క్షేమం ఉంది అనుకొని పరిగెత్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒక్కడే దాడి చేయుటకు వచ్చిన సైన్యాలను పరాజయానికి గురి చేసి, ముస్లిములకు సహాయ పడ్డాడు.

ముష్రికుల సైన్యాలు దారి పట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఈ సంవత్సరం తర్వాత ఖురైష్ మీపై దాడి చేయరు. కాని మీరు వారి మీద దాడి చేస్తారు“. వాస్తవంగా ప్రవక్త చెప్పినట్లు ఖురైషు వైపు నుండి ఇదే చివరి దాడి అయ్యింది. (ఆ తర్వాత వారు ఎప్పుడు ముస్లింపై దాడి చేయుటకు సాహసించలేదు).

కందకం త్రవ్వే సందర్భంలో ముస్లిములు ఘోరమైన ఆకలికి గురి అయ్యారు. ఆకలి భరించలేక కడుపుపై రాళ్ళు కట్టుకోవలసి వచ్చింది. అప్పుడు జాబిన్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కనీసం ప్రాణం కాపాడేంత పరిమాణంలోనైనా ప్రవక్తకు ఏదైనా తినిపించాలని కోరుకొని తన వద్ద ఉన్న ఓ చిన్న మేక పిల్లను కోశాడు. మాంసం తయారు చేసి భార్యకు ఇస్తూ దీని కూర వండి, అతితక్కవగా ఉన్న బార్లీ గింజల పిండితో రొట్టెలు చేసి పెట్టమని చెప్పాడు. వంట తయ్యారు అయ్యాక ప్రవక్త వద్దకు వెళ్ళి ‘మీకు మరో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడేంత భోజనం ఉంది’ అని తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త “ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది” అని కందకంలో పాల్గొన్న వారందరినీ పిలిచారు. మరియు స్వయంగా మాంసం ముక్కలు మరియు రొట్టెలు వడ్డించారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అయినా ఆ భోజనం ఎవరి చేయి పెట్టినట్లుగా మిగిలింది. అప్పుడు వారు సుమారు వెయ్యి మంది ఉండిరి. ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహిమల్లో ఒకటి.

హుదైబియా ఒప్పందం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ముస్లిములు మదీనకు వలస వచ్చినప్పటి నుండి, వారిని ఎన్నటికీ తిరిగి మక్కా రానివ్వకూడదని, మస్జిదె హరాం దర్శనం చేయనివ్వద్దని దృఢంగా ముష్రికులు నిశ్చయించుకున్నారు. కాని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరులు మక్కాకు పయనం కావాలని హిజ్రి శకం ఆరవ ఏట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిశ్చయించారు. వెళ్ళడానికి జిల్ ఖాద నెల నిర్ణయమయింది. అది గౌరవపదమైన నెల అని, అందరూ దాన్ని గౌరవిస్తారనీ, ఉమ్రా ఉద్దేశ్యంతో బయలుదేరారు. యుద్ధ ఆదేశం ఏ మాత్రం లేకుండినది. 1400 మంది సహాబాలు ఇహ్రామ్ దుస్తులు ధరించి, బలివ్వడానికి ఒంటెలు తమ వెంట తీసుకెళ్ళారు. వాస్తవానికి వీరు కాబా దర్శనానికి, దానిని గౌరవార్ధమే బయలుదేరారన్న నమ్మకం చూసేవారికి కలగలాని, ఖురైషువారు వీరిని మక్కాలో ప్రవేశం నుండి నిరోధించుటకు ఊహించనూ వద్దని ఆయుధాలు కూడా ధరించలేదు. కేవలం ప్రయాణికులు తమ ఖడ్గ ఒరలో ఉంచుకునే ఆయుధం తప్ప.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖస్వా పేరుగల తమ ఒంటపై పయనమయ్యారు. సహచరులు ఆయన వెనక ఉన్నారు. మదీనవాసుల మీఖాత్ జుల్ హులైఫా చేరుకున్నాక, అందరూ బిగ్గరగా తల్బియా చదువుతూ ఉమ్రా యొక్క ఇహ్రామ్ సంకల్పం చేశారు. వాస్తవానికి కాబా దర్శన హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది. దాని దర్శనం మరియు ప్రదక్షిణం నుండి నిరోధించే హక్కు అప్పటి ఆచారం (దస్తూర్, ఖానూన్) ప్రకారం కూడా ఖురైషుకు ఏ మాత్రం లేదు. వారి శత్రువైనా సరే, అతడు కాబా గౌరవ ఉద్దేశ్యంతో వస్తే అతడ్ని ఆపవద్దు.

కాని ముస్లిములు మక్కా ఉద్దేశ్యంతో బయలుదేరారని విన్న వెంటనే ముష్రికులు యుద్ధానికి సిద్ధమయ్యారు. వారికి ఎంత కష్టతరమైన సరే ప్రవక్తను మక్కాలో రానివ్వకూడదని దృఢంగా నిర్ణయించుకున్నారు. వారి ఈ చేష్ట, వారు ముస్లిముల పట్ల శత్రుత్వంగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా రనడానికి మరియు వారికి లభించవలసిన హక్కుల నుండి వారిని దూరం చేస్తున్నారు అనడానికి గొప్ప నిదర్శనం.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బిడారం నడుస్తూ నడుస్తూ మక్కాకు సమీపములో చేరుకుంది. కాని ఖురైషువారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరుల్ని మక్కాలో ప్రవేశించకుండా, కాబా ప్రదక్షిణం చేయకుండా నిరోధిస్తునే ఉన్నారు.

ప్రవక్తతో సంధి చేసుకొని ఏదో ఓ కొలికికి రావాలని రాయబార వ్యవహారాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల్లో (అంటే ముస్లిముల మరియు మక్కాలోని ముష్రికుల మధ్య) అనేక రాయబార బృందాలు వస్తూ పోయాయి. ఈ మధ్యలో ఖురైష్ యువకుల్లో నలబై మంది హఠాత్తుగా ముస్లిములపై విరుచుకుపడి వారిలో కొందరిని చంపుదాము అని అనుకున్నారు. కాని ముస్లిములు వారిని పట్టుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం వద్దకు తీసుకువచ్చారు. అయితే ప్రవక్త వారితో ఏ ప్రతికార చర్యకు పాల్పడకుండా వారిని వారి దారిన వదిలేసి వారిని మన్నించారు.

ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు)ని రాయబారిగా ఖురైష్ నాయకుల వద్దకు పంపి, మేము యుద్దానికి కాదు వచ్చింది. కేవలం అల్లాహ్ గృహ దర్శనం, దాని గౌరవార్థం వచ్చాము అని తెలియజేశారు. ఉస్మాన్ మరియు ఖురైషుల మధ్య సంధి కుదరలేదు. అంతే గాకుండా వారు ఉస్మాన్ ని పోనివ్వకుండా తమ వద్దే నిర్బంధించారు. అందువల్ల ఉస్మాన్ హత్యకు గురయ్యాడు అన్న పుకారు పుట్టింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఈ విషయం తెలిసిన వెంటనే “ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుండి కదిలేది లేదు” అని స్పష్టం చేసి, దీనికై ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరితో శపథం తీసుకున్నారు. అప్పుడు తమ ఒక చేతిని ఉస్మాన్ చేతిగా పరిగణించి తమ రెండవ చేయిని దానిపై కొట్టి శపథం చేశారు. ఈ శపథం ” బైఅతుర్ రిజ్వాన్” అన్న పేరు పొందింది. ఓ చెట్టు క్రింద జరిగింది. ప్రవక్తగారు సహచరులతో చేసిన శపథం ఇలా ఉండింది: ఉస్మాన్ కు వాస్తవంగా ఏదైనా కీడు జరిగింది అని తెలిస్తే గనక మీలో ఏ ఒక్కరూ పారిపోకుండా ముష్రికులతో పోరాడనిదే ఈ స్థలాన్ని వదలేది లేదు. తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలిసిన వార్త ఏమిటంటే ఉస్మాన్ క్షేమంగానే ఉన్నారు. హత్య చేయబడలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములతో యుద్ధానికి సిద్ధమన్నట్లు శపథం చేశారని తెలిసిన వెంటనే సుహైల్ బిన్ అమ్ర్ ను దౌత్యవేత్తగా పంపారు. అతను ప్రవక్తతో కూర్చుండి; ముస్లిములు ఈ సారి తిరిగి వెళ్ళిపోవాలని మరియు వచ్చే సంవత్సరం ఎప్పుడైనా రావచ్చనే విషయంపై సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. సంధి కుదిరింది. ప్రవక్త కూడా సంధి ఒప్పంద నిబంధనలను అంగీకరించారు. ఈ నిబంధనలు బాహ్యంగా ముష్రికుల పక్షంలో వారికి మాత్రమే అనుకూలమైనవిగా ఉండెను. అందుకే ముస్లిములు మండిపడ్డారు. వారి దృష్టిలో అవి అన్యాయం, దౌర్జన్యంతో కూడి ఉన్న నిబంధనలని. ముష్రికులకు అనుకూలమైనవిగా ఉన్నాయని అనిపించింది. కాని ప్రవక్త సంధి కుదరాలనే కోరేవారు. ఎందకుంటే ఇస్లాం ప్రశాంత వాతవరణంలో వ్యాపిస్తూ ఉంటే అనేక మంది ఇస్లాంలో ప్రవేశించవచ్చు అన్న విషయం ప్రవక్తకు తెలుసు. వాస్తవానికి జరిగింది కూడా ఇదే. ఈ యుద్ధవిరమణ కాలంలో ఇస్లాం విస్తృతంగా వ్యాపించింది.

అంతే కాదు, వాస్తవానికి ముస్లిముల మరియు ఖురైష్ ల మధ్య జరిగిన ఈ యుద్ధవిరమణ సంధి ఇస్లాం మరియు ముస్లిముల పాలిట గొప్ప సహాయంగా నిలిచింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవజ్యోతితో చూస్తూ ఉన్నారని కుడా ఈ సంఘటన గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఎలా అనగ నిబంధనలన్నిటీ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంగీకరిస్తూ పోయారు. అదే సందర్భంలో కొందరి సహచరులకు అవి బాహ్యంగా ముష్రికులకు అనుకూలంగా కనబడినవి.

మక్కా విజయం

హిజ్రి శకం ఎనిమిదవ ఏట (ముష్రిక్కులు తాము చేసిన వాగ్దానానికి వ్యెతిరేకం వహించినందుకు) మక్కాపై దాడి చేసి, జయించాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిర్ణయించారు. రమజాన్ 10వ తారీకున 10 వేల వీరులతో బయలుదేరారు. ఏలాంటి పోరాటం, రక్తపాతం లేకుండా మక్కాలో ప్రవేశించారు. ఈ ప్రవేశం చారిత్రకమైనది. చెప్పుకోదగ్గది. ఖురైషులు తమ ఇష్టానుసారం లొంగిపోయారు. అల్లాహ్ ముస్లిములకు సహాయపడ్డాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిదె హరాం వెళ్ళి కాబా యొక్క తవాఫ్ చేసి, కాబా లోపల, వెలుపల, పైన ఉన్న విగ్రహాలన్నిటిని తొలగించి దాని లోపల రెండు రకాతుల నమాజు చేశారు. తర్వాత కాబా గడపపై వచ్చి నిలుచున్నారు. ఖురైషులు గడప ముందు నిలబడి, ప్రవక్త వారి గురించి ఏ తీర్పు ఇస్తారు అని వేచిస్తున్నారు. ప్రవక్త గంభీర స్వరంతో “ఓ ఖురైషులారా! నేను మీ పట్ల ఎలా ప్రవర్తిస్తానని భావిస్తున్నారు” అని అడిగారు. వారందరూ ఏక శబ్దమై “మేలు చేస్తారనే భావిస్తున్నాము. ఎందుకంటే మీరు మంచి సోదరులు, మంచి సోదరుని సుపుత్రులు” అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “పోండి, మీరందరికి స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది” అని ప్రకటించారు. ఈ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన్ను, తన సహచరుల్ని బాధించి, నానా రకాలుగా హింసించి, స్వదేశం నుండి తరిమిన శత్రువుల్ని ఈ రోజు క్షమిస్తూ, మన్నిస్తూ ఒక గొప్ప ఉదాహరణ / ఆదర్శం నిలిపారు.

బృందాల రాక, రాజులకు ఇస్లాం సందేశం

మక్కా విజయం తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రస్తావన మరియు ఇస్లాం ధర్మ ప్రచారం నలువైపులా వ్యాపించింది. ఇక సుదూర
ప్రాంతాల నుండి బృందాలు వచ్చి ఇస్లాం స్వీకరించ సాగాయి.

అలాగే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టుప్రక్క దేశాల రాజులకు ఇస్లాం పిలుపునిస్తూ, ఉత్తరాలు వ్రాయించి పంపారు. వారిలో కొందరు ఇస్లాం స్వీకరించారు. మరి కొందరు ఇస్లాం స్వీకరించలేదు కాని ఉత్తమరీతి లో ఉత్తరాన్ని తీసుకొని మంచి విధంగా సమాధానమిచ్చారు. కాని ఈరాన్ రాజైన ఖుస్రో (Khosrau) ప్రవక్త పత్రాన్ని చూసి కోపానికి గురై దాన్ని చింపేశాడు. ప్రవక్తకు ఈ విషయం తెలిసింది. పిమ్మట ఆయన ఇలా శపించారు: “అల్లాహ్! అతని రాజ్యాన్ని కూడా నీవు చించేసెయి“. ఈ శాపనానికి ఏమంత ఎక్కువ సమయం గడువక ముందే అతని కొడుకు స్వయంగా తండ్రిని చంపేసి, రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు.

మిస్ర్ (Egypt) రాజు ముఖోఖిస్ ఇస్లాం స్వీకరించలేదు. కాని ప్రవక్త రాయబారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించి, అతనితో ప్రవక్త కొరకు కానుకలు పంపాడు. అలాగే రోమన్ రాజు కూడా ప్రవక్త రాయబారికి మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి విధంగా ప్రవర్తించాడు.

బహైన్ రాజు ముంజిర్ బిన్ సావీ ప్రవక్త పత్రాన్ని ప్రజలందరికీ వినిపించాడు. వారిలో కొందరు విశ్వసించారు మరి కొందరు తిరస్కరించారు.

హిజ్రి శకం 10వ ఏట ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేశారు. ఆయన చేసిన ఏకైక హజ్ ఇదే. ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్ చేశారు. ఆయన హజ్ పూర్తి చేసుకొని మదీన తిరిగి వచ్చారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం

హజ్ నుండి వచ్చాక సుమారు రెండున్నర మాసాలకు ప్రవక్తకు అస్వస్థత అలుముకొన్నది. దిన దినానికి అది పెరగ సాగింది. నమాజు కూడ చేయించడం కష్టమయిపోయింది. అప్పుడు అబూబక్ర్ ను నమాజు చేయించాలని ఆదేశించారు.

హిజ్రి పదకొండవ శకం, నెల రబీఉల్ అవ్వల్, 12వ తారీకు సోమవారం రోజున ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమోన్నతుడైన అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మొత్తం 63 సంవత్సరాలు జీవించారు. ప్రవక్త మరణ వార్త సహచరులకు అందగా వారికి సృహ తప్పినట్లయింది. నమ్మశక్యం కాక పోయింది. అప్పుడు అబూ బక్ర సిద్దీఖ్ రజియల్లాహు అను నిలబడి ప్రసం గించారు: వారిని శాంతపరుస్తూ, ప్రశాంత స్థితి నెలకొల్పుతూ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అందరి లాంటి ఒక మానవుడే, అందిరికి వచ్చి నటువంటి చావు ఆయనకు వచ్చింది అని స్పష్టపరిచారు. అప్పుడు సహచరులు తేరుకొని, శాంత పడ్డారు. ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు స్నానం చేయించి, కఫన్ దుస్తులు ధరియింపజేసి, ఆయిషా (రజియల్లాహు అన్హా) గదిలో ఖననం చేశారు.

ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్త పదవికి ముందు 40 సం. ఆ తర్వాత 13 సం. మక్కాలో, 10 సం. మదీనలో గడిపారు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్

మరణాంతరం జీవితం – పార్ట్ 02: మరణ యాతన, సమాధిలో ప్రశ్నోత్తరాలు, సమాధి శిక్షలు అనుగ్రహాలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతరం జీవితం – పార్ట్ 02 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 02. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 23:21 నిముషాలు]

ఋజుమార్గం టీవి  ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. “ఎవరికి చావు ఎలా వస్తుంది? “అనే శీర్షిక మనం వింటూ ఉన్నాము.

అందులో మరొక ముఖ్య విషయం ఏమిటంటే చావు ఎప్పుడైతే వస్తుందో, మరణదూతను మన కళ్లారా మనం చూస్తామో అప్పుడు చావు యొక్క వాస్తవికత తెలుస్తుంది. చావుకు సంబంధించిన విషయాలు మన ముందు స్పష్టం అవుతాయి. అల్లాహ్ యొక్క ఎంత  గొప్ప కరుణ మనపై ఉందో గమనించండి. చనిపోయే ఏ మనిషి కూడా “నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఈ కష్టాల్లో ఉన్నాను. ఇకనైనా మీరు నాతో గుణపాఠం నేర్చుకోండి. విశ్వాస మార్గాన్ని అవలంబించండి. సత్కార్యాలు చేస్తూ పోండి మీరు” అని ఎవరూ కూడా చెప్పలేరు. తాను ఏ కష్టాలను భరిస్తున్నాడో వాటి నుండి తనను తాను రక్షించు కోవటానికి ఏదైనా మార్గం ఉందా అని అరుస్తూ ఉంటాడు. అతని చుట్టుపక్కల ఉన్న అతని బంధువులకు, మిత్రులకు ఏది చెప్పలేక పోతాడు. కానీ అల్లాహ్ యొక్క ఎంత  గొప్ప కరుణ మనపై ఉందో గమనించండి, ఆ వివరాలు మనకు అల్లాహ్ ముందే మనకు ఎందుకు తెలియజేశాడు? ఎందుకంటే ఆ పరిస్థితి మనకు రాకముందే మనకు మనం చక్క దిద్దుకోవాలి.

ఒకసారి సూరతుల్ మూమినూన్ లోని ఆయతును గమనించండి

حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُونِ لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّا ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَائِلُهَا ۖ وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

వారిలోని ఒకరికి చావు సమీపించినప్పుడు, ఓ నా ప్రభువా తిరిగి నన్ను ఇహలోకానికి మరోసారి పంపు.ఏ సత్కార్యాలు అయితే నేను ఇంతవరకు చేసుకోలేకపోయానో ఏ సత్కార్యాల్ని నేను విలువ లేకుండా వదిలేశానో ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ మరణ సందర్భంలో వాటి యొక్క విలువ ఎంత అనేది నేను ఆ తిరిగి సత్కార్యాలు చేసుకుంటాను. తిరిగి నన్ను ఇహలోకంలోకి పంపు. అప్పుడు ఏమి సమాధానం వస్తుంది? కల్లా ముమ్మాటికి అలా జరగదు.ఒక మాట అతను నోటితో పలుకుతున్నాడు. కానీ అతని కోరిక ఎన్నటికీ పూర్తి కాదు. పునరుత్థాన దినం మరోసారి వారిని సజీవులుగా లేపబడేది. ఆరోజు వరకు వారి వెనక ఒక అడ్డు ఉంది. ఆ అడ్డు తెరలో వారు అక్కడే ఉంటారు. (సూరతుల్ మూమినూన్ 23:99-100)

చావు వచ్చినప్పుడే దాని యొక్క వాస్తవికత అనేది మన ముందు స్పష్టమవుతుంది. ఆ విషయాలని అల్లాహ్ తెలిపాడు. మనం వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.

సూరత్ అష్షూరా ఆయత్ నెంబర్ 44 లో కూడా అల్లాహ్ తఆలా విషయాన్ని ఎంత స్పష్టంగా తెలిపాడో గమనించండి.

 وَتَرَى الظَّالِمِينَ لَمَّا رَأَوُا الْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَىٰ مَرَدٍّ مِّن سَبِيلٍ

“దుర్మార్గులు, అవిశ్వాసులు, షిర్క్ చేసేవాళ్ళు, పాపాలు లో మునిగి ఉన్న వాళ్ళు శిక్షను చూసినప్పుడు వారు ఏమంటారో అప్పుడు మీరు చూసెదరు. ఏమి ఇహలోకానికి తిరిగి పోవడానికి ఏదైనా అవకాశం ఉందా? అనివారు అప్పుడు అడుగుతారు” (సూరత్ అష్షూరా 42:44)

కానీ ఎలాంటి అవకాశం ఏమి ఇవ్వడం జరగదు. ఈ సందర్భంలో చావు సమీపించిన సందర్భములో అల్లాహ్ కరుణలో మనపై ఉన్నటువంటి గొప్ప కరుణ ఒకటి ఏమిటంటే ఎవరైతే ఆ చివరి సమయంలో కూడా తన సృష్టికర్తను మరచిపోకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్  చదువుతారో అలాంటి వారికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు తెలియపరిచారు. సునన్ అబీ దావూద్ లోని హదీద్ లో ఇలా ఉంది: ఇహలోకంలో ఎవరి చివరి మాట “లా ఇలాహ ఇల్లల్లాహ్”అల్లాహ్ తప్ప వేరే సత్యఆరాధ్యుడు మరి ఎవ్వడు లేడు. ఈ సద్వచనం తన చివరి మాటలు అవుతాయో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ క్లిష్ట పరిస్థితులు, బాధకరమైన సమయంలో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎవరికి గుర్తొస్తుందో అల్లాహ్ కే బాగా తెలుసు. కానీ ఇహ లోకంలో దాని గురించి కాంక్ష ఉంచిన వారు, దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండేవారు, అలాంటి వారికి అల్లాహ్ తఆలా ఆ సత్భాగ్యం ప్రసాదించగలడు.

ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి చనిపోతాడో  సామాన్యంగా తీసుకెళ్ళి అంత క్రియలు అన్నీ చేసి సమాధిలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు సమాధిలో ఎవరికి, ఎలా జరుగుతుంది అనే విషయం కూడా మనందరి గురించి చాలా ముఖ్యమైన విషయం.

సమాధిలో పెట్టడం జరిగిన తరువాత ఒకవేళ అతను విశ్వాసుడు అయితే, పుణ్యాత్ముడు అయితే, సత్కార్యాలు చేసే వాడు అయితే, అతనికి అతని యొక్క ఆత్మ తిరిగి అతని శరీరంలో వేయడం జరుగుతుంది. అతను లేచి కూర్చుంటాడు. అదే సమయంలో ఎప్పుడైతే అతను కళ్ళు తెరుస్తాడో సూర్యాస్తమయం కావడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది అన్నట్లుగా కనబడుతుంది. అప్పుడే ఇద్దరు దైవ దూతలు అతని వద్దకు వస్తారు. అతను అంటాడు పక్కకు జరగండి. నా అసర్ నమాజ్ నాకు ఆలస్యం అయిపోయింది నేను అసర్ నమాజ్ చేసుకుంటాను. వారు అంటారు, ఇది నమాజ్ చేసే సమయం కాదు. నమాజ్లు చేసే సమయం ఇహలోకంలో సమాప్తం అయిపోయింది. ఇప్పుడు మా ప్రశ్నలకు మీరు సిద్దం కావాలి. నీ ప్రభువు ఎవరు? నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవాడివి? అని అంటే అతను విశ్వాసి కనుక రబ్బీ అల్లాహ్  నా ప్రభువు అల్లాహ్, నేను ఆయన్నే ఆరాధిస్తూ ఉంటిని అని అంటాడు. రెండవ ప్రశ్న అడుగుతాడు. నీ ధర్మం ఏది? ఏ ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉంటివి? అతడు అంటాడు, నా ధర్మం ఇస్లాం ధర్మం అని. తర్వాత మూడో ప్రశ్న జరుగుతుంది. మీ మధ్య ప్రవక్తగా పంపబడిన ఆ ప్రవక్త ఎవరు అని? అప్పుడు అతను అంటాడు: ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని. అప్పుడు వారు నాలుగో ప్రశ్న అడుగుతారు. సామాన్యంగా ఎక్కువ మంది మన ముస్లిం సోదరులకి బహుశా ఈ మూడు ప్రశ్నలు తెలిసి ఉన్నాయి. కానీ నాలుగో ప్రశ్న కూడా ప్రశ్నించడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. ముస్నద్అ హ్మద్ ఇంకా వేరే హాదీస్ గ్రంధాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా సహీ హదీద్ లతో రుజువైన విషయం. ఏంటి నాలుగో ప్రశ్న? నీవు ఈ నిజమైన మూడు సమాధానాలు ఏదైతే ఇచ్చావో దీని జ్ఞానం నీకు ఎలా ప్రాప్తం అయింది? ఈ సరైన సమాధానం నువ్వు ఎలా తెలుసుకున్నావు? అప్పుడు అతడు అంటాడు, నేను అల్లాహ్ గ్రంధాన్ని చదివాను. దానిని విశ్వసించాను. అందులో ఉన్న విషయాల్ని సత్యంగా భావించి సత్యరూపంలో నేను ఆచరించడం కూడా మొదలుపెట్టాను. అందుగురించి నాకు జ్ఞానం ప్రాప్తం అయ్యింది అని అంటాడు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ రోజు మనకు మనం ముస్లింలమని ఎంత సంతోషించినా ఖురాన్ జ్ఞానం పొందక ఉంటే, ఖురాన్ యొక్క విద్యనేర్చుకోకుండా ఉంటే, ఇస్లాం ధర్మజ్ఞానాన్ని అభ్యసించి దాని ప్రకారంగా ఆచరించకుండా ఉంటే బహుశా మనకు కూడా సమాధానాలు సరైన రీతిలో ఇవ్వడం కష్టతరంగా ఉండవచ్చు. అల్లాహ్ అలాంటి క్లిష్ట పరిస్థితి నుండి మనల్ని కాపాడుగాక.

ప్రస్తుతం ఇప్పుడు నేను మీముందు విశ్వాసులు అయితే సత్కార్యం చేసే వారు అయితే ఏ మంచి సమాధానం ఇస్తారు అని వివరించాను. ఒకవేళ దీనికి భిన్నంగా అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు, దుష్కార్యాలు చేసేవారు ఎలాంటి సమాధానాలు ఇస్తారో అది తెలియ పరుస్తున్నాను. ఆ తరువాత సమాధిలో ఎవరికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి. ఎవరు ఎలాంటి అనుగ్రహాలకు అర్హులవుతారు. అది తర్వాత మనం తెలుసుకుందాం ఇన్షాఅల్లాహ్. 

విశ్వాసికి ఏ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందో, అతను ఎలా సమాధానం ఇస్తాడో మనం తెలుసుకున్నాము కదా? ఇక రండి అవిశ్వాసిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దుర్మార్గులను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ప్రతి మానవుడ్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడైతే వారిని ప్రశ్నించడం జరుగుతుందో వారు ఎలాంటి సమాధానం ఇస్తారు? అనే విషయం తెలుసుకుందాం.

అవిశ్వాసి, కపట విశ్వాసులు, దుర్మార్గులను సమాధిలో పెట్టబడిన తర్వాత ఆత్మ వారి శరీరంలో వేయబడుతుంది. అతను ఆ సందర్భంలో లేచి కూర్చుంటాడు. ఇద్దరు దేవదూతలు వస్తారు. “నీ ప్రభువు ఎవరు?” అని అతని అడుగుతారు. అయ్యో, అయ్యో, నాకు తెలియదు అని అంటాడు. “మీ ధర్మం ఏది?” అని అడుగుతారు. అయ్యో! అయ్యో! నాకు తెలియదు అని అంటాడు. “మీలో పంపబడిన ప్రవక్త ఎవరు” అని అడుగుతారు. అయ్యో! అయ్యో! నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు ఆ తర్వాత విషయం సహీహ్ బుఖారీ లో కూడా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? “నీవు ఎందుకు తెలుసుకోలేదు? నువ్వు ఎందుకు తెలిసిన వారిని అనుసరించలేదు? ఖురాన్ గ్రంధాన్ని పారాయణం ఎందుకు చేయలేదు? విశ్వాస మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు?” అని ఇనుప గదముతో తల మీద, మరొక హదీస్ లో స్పష్టంగా ఉంది, రెండు చెవుల మధ్యలో వెనుక భాగములో చాలా బలంగా కొట్టడం జరుగుతుంది. ఆ యొక్క దెబ్బతో ఎంత పెద్ద శబ్దంతో అతను అరుస్తాడు అంటే ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “మానవులు మరియు జిన్నాతులు తప్ప సృష్టిలో ఉన్న ప్రతీ సృష్టి అతని అరుపును వింటారు.” ఇక తర్వాత అతనికి శిక్షలు మొదలవుతాయి.

సోదరులారా సోదరీమణులారా వింటున్న ఈ విషయాలు, వింటున్న మీరు, “అరే వాళ్ళు వాళ్ళ విషయాలు అలా చెప్పుకుంటున్నారు” అని ఎగతాళి చేసి విలువ నివ్వకుండా వినడం కూడా మానుకుంటే ఇప్పుడు నాకు నష్టం కలిగేది ఏమీ లేదు. కానీ మన అందరం కూడా ఒక రోజు చనిపోయేది ఉంది. మరియు సమాధి యొక్క ఈ శిక్షల గురించి ఏదైతే తెలుపడం జరుగుతుందో, సమాధిలో జరిగే ఈ ప్రశ్నోత్తరాల గురించి ఏదైతే తెలపడం జరుగుతుందో వాటన్నిటిని మనం కూడా ఎదుర్కొనేది ఉంది.

ఇక్కడ ఒక విషయం గమనించండి, సామాన్యంగా సర్వమానవులు కూడా చనిపోయే వారిని సమాధిలో తీసుకొచ్చి పెట్టడమే సరైన పద్ధతి. అందు గురుంచే మాటి మాటికి సమాధి యొక్క అనుగ్రహాలు, సమాధి శిక్షలు, సమాధిలో ఎలాంటి ప్రశ్నోత్తరాల జరుగుతాయి. సమాధి, సమాధి అని మాటిమాటికీ మనం అంటూ ఉంటాము. కానీ ఎవరైనా సమాధి చేయబడకుండా అగ్నికి ఆహుతి అయితే, క్రూర జంతువు వారిని తినేస్తే, లేదా సముద్రంలో వారు కొట్టుకుపోయినా లేదా విమానం గాలిలోనే పేలిపోయి ఏ ముక్కలు ముక్కలు మిగలకుండా వారు అలాగే హతమైనా, నాశనమైనా, ఏ విధంగా చనిపోయినా, ఆ చావు ఎలా జరిగినా కానీ శరీరం నుండి ఆత్మ వేరు అవుతుంది. ఆ తర్వాత శరీరం మిగిలి ఉండి ఉంటే, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఖననం చేయడం జరిగితే అందులో ఆ ఆత్మను వేయబడి ప్రశ్నించడం జరుగుతుంది. లేదా అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ తన ఇష్టప్రకారం వేరే ఏదైనా ఒక శరీరం ఏర్పాటు చేసి ఆత్మను అందులో వేయవచ్చు, లేదా డైరెక్టుగానే ఆత్మతోనే ఈ ప్రశ్నోత్తరాలు కూడా జరపవచ్చు. ఈ ప్రశ్నోత్తరాలు జరగడం సత్యం. ఇందులో అనుమానానికి ఏ తావులేదు.

ఇక తరువాత సరైన సమాధానం ఇచ్చిన విశ్వాసి మరియు సత్కార్యాలు చేసేవారు, అలాంటి వాళ్లలో అల్లాహ్ మనల్ని కూడా చేర్చుగాక, వారికీ సమాధిలో ఎలాంటి అనుగ్రహాలు మొదలవుతాయి అంటే ముందు వారికి నరకం వైపు నుండి ఒక చిన్న కిటికీ తెరవటం జరుగుతుంది. ఇదిగో నరకంలో మీ స్థానం చూడండి. కానీ అల్లాహ్ దయ మీపై కలిగింది. అల్లాహ్ మిమ్మల్ని ఈ నరకం నుండి కాపాడాడు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. తర్వాత స్వర్గం యొక్క కిటికీ తెరవడం జరుగుతుంది. అందులో వారి యొక్క స్థానం చూపడం జరుగుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ప్రతి ఒక్కరు స్వర్గంలో నరకంలో ఉన్నటువంటి వారి స్థానాలను చూస్తారు సమాధిలో ఉండి.”

ఆ తరువాత అల్లాహ్ ఆకాశం నుండి ఒక శుభవార్త ఇస్తాడు: “నా ఈ దాసుని  కొరకు స్వర్గపు ద్వారాలు, స్వర్గపు కిటికీలు తెరవండి”. అక్కడి నుండి సువాసన వస్తూ ఉంటుంది. మరియు మంచి గాలి వస్తూ ఉంటుంది మరియు “ఈ దాసుని కొరకు స్వర్గం యొక్క పడక అతని గురించి వేయండి.” అంతేకాదు అతనికి ఆ పడకలు వేయడం జరుగుతాయి. స్వర్గం నుండి సువాసన గాలులు వస్తూ ఉంటాయి. అంతలోనే అతను చూస్తాడు, ఒక అందమైన వ్యక్తి అతని వైపునకు వస్తూ ఉన్నాడు. అయ్యా! నీవు ఎవరివి? చాలా అందమైన ముఖముతో దగ్గరికి అవుతున్నావు మరియు ఏదో శుభవార్త తీసుకొని వస్తున్నట్లుగా కనబడుతున్నావు. అసలు నువ్వు ఎవరివి? అని అంటే ఆ వ్యక్తి అంటాడు, “నేను నీ యొక్క సత్కార్యాల్ని. ఇహలోకంలో నీవు ఏ సత్కార్యాలు అయితే చేశావో నన్ను అల్లాహ్ ఈ రూపంలో నీ వద్దకు తీసుకొచ్చాడు. హాజరు పరిచాడు. నీవు ఎలాంటి ఒంటరితనం నీకు ఏర్పడకుండా నీవు ఎలాంటి భయం చెందకుండా ప్రళయం సంభవించే వరకు ఆ తర్వాత మరోసారి అల్లాహ్ తఆలా ఈ సమాధుల నుండి లేపేవరకు నేను నీకు తోడుగా ఉండాలి”. ఇంతే కాకుండా ఇంకా ఎన్నో వరాలు కూడా ఉంటాయి. ఇన్షా అల్లాహ్ వాటి ప్రస్తావన మరి కొంత సేపటి తరువాత మనం మీ ముందు తెలుపుతామని,

అయితే ఎవరైతే సమాధానం సరియైన విధంగా ఇవ్వరో, అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు గా ఉంటారో వారికి ఏం జరుగుతుంది? స్వర్గం వైపు నుండి ఒక కిటికీ తెరవటం జరుగుతుంది. ఇదిగోండి స్వర్గం లో మీ స్థానం ఉండేది, కానీ మీరు సరైన సమాధానం ఇవ్వలేదు కనుక ఈ స్థానం మీకు లేదు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. నరకం నుండి ఒక కిటికీ తెరవడం జరుగుతుంది. అక్కడి నుండి అగ్ని జ్వాలలు, దుర్వాసన, మంట, వేడి వస్తూ ఉంటుంది. మరియు ఆకాశం నుండి ఒక దుర్వార్త ఇచ్చే వారు ఇలా దుర్వార్త ఇస్తాడు, నా దాసునికి నరకం యొక్క పడక వేయండి. నరకం యొక్క కిటికీలు తెరవండి. అంతలోనే అతను చూస్తాడు, భయంకరమైన నల్లటి ముఖముతో ఒక వ్యక్తి అతని వైపు వస్తున్నాడు. ఓ దుర్మార్గుడా, ఓ చెడ్డ ముఖము కలవాడా, దుర్వాసనతో కూడుకొని ఉన్నవాడా, దూరమైపో ఏదో దుర్వార్త నీవు నాకు తీసుకొని వస్తున్నట్టు ఉన్నది. అతను అంటాడు, అవును నేను నీ దుష్కర్మల్ని. నేను నీకు ప్రళయదినం వరకు తోడుగా ఉండి నీ యొక్క బాధలు ఇంకా పెంచడానికి అల్లాహ్ నన్ను నీతో పాటు ఉండడానికి పంపాడు.

మహాశయులారా ఈ విధంగా సమాధిలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైతే విశ్వాస మార్గాన్ని అవలంబించరో, దుష్కార్యాలు చేస్తూ ఉంటారో, ఇంకా వేరే ఎన్నో పాపాలకు ఒడికడతారో వారికి కూడా ఎన్నో రకాలుగా శిక్షలు జరుగుతూ ఉంటాయి. వారికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి మరియు సమాధి శిక్షల నుండి కూడా మనం సురక్షితంగా ఉండడానికి ఇహలోకంలో ఎలాంటి సత్కార్యాలు మనం చేసుకోవాలి. ఈ విషయాలుఇన్షా అల్లాహ్ ముందు మనం తెలుసుకుందాం.

సమాధి శిక్షలు సమాధి యొక్క అనుగ్రహాలు ఏమిటో తెలుసుకునేకి ముందు ఒక విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అదేమిటంటే ఈ సమాధి పరలోకం యొక్క మజిలీలలో మొదటి మజిలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దీని గురించి తెలిపారు: సమాధి, పరలోక మజిలీల లో మొట్టమొదటి మజిలీ. ఒకవేళ ఇక్కడ అతడు పాస్ అయ్యాడు అంటే, ఇక్కడ అతనికి మోక్షం లభించింది అంటే, దీని తర్వాత ఉన్న మజిలీల లో అతనికి ఇంకా సులభతరమే అవుతుంది. మరి ఎవరైతే ఈ తొలి మజిలీలో గెలువరో, తొలి మజిలీలో పాస్ అవ్వరో ఇక్కడ వారికి మోక్షం ప్రాప్తం కాదో ఆ తరువాత మజిలీలలో ఇంతకంటే మరీ ఘోరమైన, కష్టతరమైన సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది.”

అందుగురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నో సందర్భాల్లో సమాధి శిక్షల నుండి మీరు అల్లాహ్ యొక్క శరణుకోరండి అని మాటిమాటికీ చెబుతూ ఉండేవారు. సమాధి యొక్క శిక్షల నుండి ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజుల్లో కూడా శరణు కోరుతూ ఉండేవారు. వేరే సందర్భాలలో కూడా శరణుకోరుతూ ఉండేవారు. ఎప్పుడైనా సమాధిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ హాజరైన ప్రజలకు బోధ చేస్తూ కూడా ఈ విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పేవారు.

అందుగురించి సోదరులారా సమాధి శిక్షలకు మనం గురి కాకుండా ఉండడానికి ముందే వాటి గురించి తెలుసుకొని ఇహ లోకంలోనే మనం అక్కడి శిక్షల నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి. వాటి గురించి ఏ సత్కార్యాలు అవలంబిస్తే మనం అక్కడ శిక్షలనుండి రక్షణ పొందగలుగుతామో వాటిని చేసుకొనే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తఆలా మనందరికీ సత్భాగ్యం  ప్రసాదించుగాక.

ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో, సమాధిలో ఎవరికి ఎలాంటి అనుగ్రహాలు లభిస్తాయి? మరియు ఎవరికి ఎలాంటి శిక్షలు కలుగుతాయి? అనే విషయాలు తెలుసుకుందాము.

వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ  బరకాతుహు

పూర్తి భాగాలు క్రింద వినండి 

మానవుడు చేసే ప్రతీ పనిని వ్రాసిపెట్టే దైవ దూతలు: కిరామన్ కాతిబీన్ [ఆడియో]

బిస్మిల్లాహ్

[7:15 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 23
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

82:10-12 وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ * كِرَامًا كَاتِبِينَ * يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా!

ఈ భావం గల ఆయతులు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చూడండి సూర రఅద్ 13:10-11 అలాగే సూర ఖాఫ్ 50:16-18.

వీటి ద్వార మనం నేర్చుకోవలసిన గుణపాఠం: ఎల్లవేళల్లో మన ప్రతి మాట, చేష్ట, వాచకర్మ మన ప్రతీ కదలిక మరియు మౌనం అంతా నమోదవుతున్నప్పుడు మనం క్షణం పాటు కొరకైనా మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు అవిధేయత పాటించవచ్చా గమనించండి!

మనం ఖుర్ఆన్ శ్రద్ధతో చదువుతున్నామా?

ఒక్కసారి నాతో సూర జాసియా 45:29లోనీ ఈ ఆయతుపై లోతుగా పరిశీలించే అవగాహన చేసే ప్రయత్నం చేయండి

45:29 هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ
“ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం”

ఎలా అనిపిస్తుంది? తప్పించుకునే మార్గం ఉందా ఏమైనా? ప్రళయదినాన ఆ కర్మలపత్రాన్ని చూసి స్వయం ఎలా నమ్మకుంటాడో, ఒప్పుకుంటాడో సూర కహఫ్ 18:49లోని ఈ ఆయతును గమనించండి:

 وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا ۚ وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا

కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు. 

సత్-సంకల్పం (హుస్నే-నియ్యత్): హజ్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[12:41 నిముషాలు]
ఈ వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది:
హజ్ / ఉమ్రా పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

‘దరూదే ఇబ్రహీం’ యొక్క అర్థము ద్వారా మనకు ఏమి తెలుస్తుంది?[ఆడియో]

బిస్మిల్లాహ్

[6 నిముషాలు]
తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 23[ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

సహీ బుఖారీ 3370, సహీ ముస్లిం 406లో ఉంది:

عَبْدُ الرَّحْمَنِ بْنَ أَبِي لَيْلَى قَالَ: لَقِيَنِي كَعْبُ بْنُ عُجْرَةَ، فَقَالَ: أَلاَ أُهْدِي لَكَ هَدِيَّةً سَمِعْتُهَا مِنَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟ فَقُلْتُ: بَلَى، فَأَهْدِهَا لِي، فَقَالَ: سَأَلْنَا رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقُلْنَا: يَا رَسُولَ اللَّهِ، كَيْفَ الصَّلاَةُ عَلَيْكُمْ أَهْلَ البَيْتِ، فَإِنَّ اللَّهَ قَدْ عَلَّمَنَا كَيْفَ نُسَلِّمُ عَلَيْكُمْ؟ قَالَ: ” قُولُوا: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ، وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ “

’అబ్దుర్రహ్మాన్ బిన్ అబీ లైలా ఉల్లేఖించారు: క’అబ్ బిన్ ’ఉజ్ర (రజియల్లాహు అన్హు) నన్ను కలిశారు. ‘ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విషయం మీకు తెలియపరచనా!’ అని అన్నారు. దానికి నేను తప్ప కుండా వినిపించండి,’ అని అన్నాను. అప్పుడతను, ‘మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ఓ ప్రవక్తా! తమరిపై, తమ ఇంటి వారిపై ఎలా దరూద్ పంపాలి. ఎందుకంటే అల్లాహ్ సలామ్ పంపించే పద్ధతి మాకు నేర్పాడు,’ అని విన్నవించుకున్నాం. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పంపాలి అని అన్నారు:

అల్లాహుమ్మ ‘సల్లి ‘అలా ము’హమ్మదిన్ వ ‘అలా ‘ఆలి ము’హమ్మదిన్ కమా ‘సల్లైత ‘అలా ఇబ్రాహీమ వ’అలా ‘ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ ‘అలా ము’హమ్మదిన్ వ’అలా ‘ఆలి ముహమ్మదిన్ కమా బారక్త ‘అలా ఇబ్రాహీమ వ’అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక ‘హమీదుమ్మజీద్.”

‘ఓ మా ప్రభూ! ము’హమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ము’హమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబంపై కారుణ్యాన్ని అవతరింప జేయి. ఇబ్రాహీమ్ అలైహిస్సలాం పై మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబంపై కారుణ్యాన్ని అవతరింపజేసినట్టు. నిస్సందేహంగా నీవే ప్రశంసించదగ్గ గొప్పవాడవు. ఓ మా ప్రభూ! ము’హమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ము’హమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబంపై శుభాన్ని అవతరింప జేయి. ఇబ్రాహీమ్ అలైహిస్సలాం పై మరియు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కుటుంబంపై శుభాన్ని అవతరింప జేసినట్టు. నిస్సందేహంగా నీవే ప్రశం సించదగ్గ గొప్ప వాడవు.’

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)
https://teluguislam.net/muhammad/