దేవదూతలపై విశ్వాసం [వీడియో]

బిస్మిల్లాహ్

[4:21 నిముషాలు]

ఈమాన్ (విశ్వాసం), దాని మూలస్థంబాలు
https://teluguislam.net/2019/08/21/belief-eman-pillars/

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్‌ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్‌ పుట్టించాడు. వారి స్వభావం లోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకానేక రకాలు గలవు. ‘అర్ష్‌ (అల్లాహ్‌ సింహాసనము)ను మోసేవారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్‌, మీకాఈల్‌, నరక పాలకుడు మాలిక్‌, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్‌. అల్లాహ్‌ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త (సల్లల్హాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని, ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖించారు:

pillars of iman angels

“అల్లాహ్‌ దూతలు నూర్‌ (కాంతి)తో వుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్నిజ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) వుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).

మానవుడు చేసే ప్రతీ పనిని వ్రాసిపెట్టే దైవ దూతలు: కిరామన్ కాతిబీన్ [ఆడియో]

బిస్మిల్లాహ్

[7:15 నిముషాలు]
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 23
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

82:10-12 وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ * كِرَامًا كَاتِبِينَ * يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా!

ఈ భావం గల ఆయతులు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చూడండి సూర రఅద్ 13:10-11 అలాగే సూర ఖాఫ్ 50:16-18.

వీటి ద్వార మనం నేర్చుకోవలసిన గుణపాఠం: ఎల్లవేళల్లో మన ప్రతి మాట, చేష్ట, వాచకర్మ మన ప్రతీ కదలిక మరియు మౌనం అంతా నమోదవుతున్నప్పుడు మనం క్షణం పాటు కొరకైనా మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు అవిధేయత పాటించవచ్చా గమనించండి!

మనం ఖుర్ఆన్ శ్రద్ధతో చదువుతున్నామా?

ఒక్కసారి నాతో సూర జాసియా 45:29లోనీ ఈ ఆయతుపై లోతుగా పరిశీలించే అవగాహన చేసే ప్రయత్నం చేయండి

45:29 هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ
“ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం”

ఎలా అనిపిస్తుంది? తప్పించుకునే మార్గం ఉందా ఏమైనా? ప్రళయదినాన ఆ కర్మలపత్రాన్ని చూసి స్వయం ఎలా నమ్మకుంటాడో, ఒప్పుకుంటాడో సూర కహఫ్ 18:49లోని ఈ ఆయతును గమనించండి:

 وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا ۚ وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا

కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు. 

%d bloggers like this: