మరణాంతర జీవితం – పార్ట్ 05: పునరుత్థాన దినంపై విశ్వాసం [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 05 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 05. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:07 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలిహందులిల్లాహి వహద వస్సలాతు వస్సలామ్ అలా నబియ్యునా బ’ద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

సోదర సోదరీమణులారా! పరలోకం సత్యం. మరోసారి లేపబడటం అనుమానం, సందేహం లేని విషయం. దీని గురించి ఖురాన్ లో అల్లాహ్ (తఆలా) ఎన్నో రకాలుగా మనకు ఉదాహరణలు ఇచ్చి ఉపమానాల ద్వారా దీని యొక్క వాస్తవికతను తెలియపరిచాడు. ఒక రకమైన నిదర్శన దీని గురించి ఏమిటంటే, సామాన్యంగా మనం మన జీవితంలో చూస్తూ ఉంటాము: ఒక్కసారి ఏదైనా వస్తువు తయారు చేయడం లేదా అనండి, మొదటిసారి ఏదైనా వస్తువు తయారు చేయడంలో మనకి ఏదైనా కష్టం కావచ్చు. కానీ దానినే మరోసారి తయారు చేయడంలో అంత కష్టం ఉండదు. ఇది మన విషయం, నవూదుబిల్లాహ్, మనకు మరియు అల్లాహ్ కు ఎలాంటి పొంతన లేదు. కానీ మన తక్కువ జ్ఞానానికి, మన అల్పబుద్ధులకు కూడా విషయం అర్థం కావడానికి మన యొక్క ఈ ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ బ్రహ్మాండమైన సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ ఆకాశాల ముందు, ఇంత పెద్ద భూమి ముందు, ఇంత గొప్ప పర్వతాల ముందు ఐదు అడుగుల మనం మానవులం ఇంత పెద్ద విషయం. అయితే తొలిసారిగా ఒక ఇంద్రియపు బిందువుతో అందమైన ఇంతటి గొప్ప మనిషిని సృష్టించగల ఆ సృష్టికర్త చనిపోయిన తర్వాత మరోసారి సృష్టించడం కష్టమా? ఎంత మాత్రం కష్టం కాదు. ఎంత మాత్రం కష్టం కాదు.

సూర రూమ్ ఆయత్ నెంబర్ 27 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు.

وَهُوَ الَّذِي يَبْدَأُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ وَهُوَ أَهْوَنُ عَلَيْهِ – 30:27
“ఆయనే సృష్టి (ప్రక్రియ)ని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక”

ఆయనే సృష్టిని తొలిసారిగా పుట్టించిన వాడు, ఆయన తప్పకుండా తిరిగి పుట్టించ గలడు. తిరిగి పుట్టించడం అనేది అతనికి ఎంతో సులభతరమైన విషయం.

సూరతుల్ అంబియా ఆయత్ నెంబర్ 104 లో ఇలా తెలియపరిచాడు.

كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُ ۚ وَعْدًا عَلَيْنَا ۚ إِنَّا كُنَّا فَاعِلِينَ – 21:104
“ఏ విధంగా మేము మొదటిసారి సృష్టించామో అదేవిధంగా మలిసారి కూడా చేస్తాము. ఈ వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాపైన ఉంది. దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము.”

గమనించారా? తొలిసారిగా పుట్టించడం దానికంటే మలిసారి సృష్టించడంలో ఎలాంటి కష్టతరమైన పని కాదు.

ఒక వ్యక్తి ప్రస్తావన సూరయే యాసీన్ లో వచ్చి ఉంది. అతను ఎంతో విర్రవీగుతూ “మా శరీరమంతా మట్టిలో కలిసిపోయిన తరువాత మా ఎముకలు సైతం బూడిద అయిపోయిన తర్వాత ఎలా పుట్టించ గలుగుతాడు, ఎలా తిరిగి లేప గలుగుతాడు?” అన్నటువంటి అడ్డ ప్రశ్నలు వేశాడు. అల్లాహ్ (తఆలా) అతనికి సమాధానం ఇస్తూ “మాకు ఉపమానాలు చూపించి ఎలా లేపుతాడు? అని ప్రశ్నిస్తున్నాడా? తాను తన స్వయంగా సృష్టిని మరిచిపోయాడా?” ఆ తరువాత ఆయత్ నెంబర్ 79 లో అల్లాహ్ ఇలా తెలిపాడు.

قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ – 36:79
(వారికి) సమాధానం ఇవ్వు : “వాటిని తొలిసారి సృష్టించిన వాడే (మలిసారి కూడా) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.”

తొలిసారిగా ఎలా మిమ్మల్ని పుట్టించాడో అలా మలిసారిగా పుట్టించడం తప్పనిసరి. ఇందులో అతనికి ఏ మాత్రం ఇబ్బందికరం ఉండదు. అందుకు సోదరులారా ఇందులో అనుమానపడే విషయం లేదు.

ఇక బుద్ధి పూర్వకమైన మరికొన్ని నిదర్శనాలు మరోరకంగా చూపించాడు. ఒకసారి గమనించండి. ఎండకాలం వచ్చిందంటే బీడు వారిన భూములను మనం చూస్తాం. ఏ మాత్రం అందులో జీవం లేని విషయాన్ని మనం గమనిస్తాము. కానీ అదే నిర్జీవ భూమిలో ఒక్కసారి ఒక వర్షం యొక్క జల్లు పడిందంటే అందులో మళ్ళీ జీవం పోసేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఆ భూమి నుండి పంటలు పండించేది ఎవరు? ఆ సృష్టికర్తయే. ఎలాగైతే నిర్జీవ భూమిలో జీవం పోసి, అక్కడి నుండి పంటలు పండించే శక్తి ఆ సృష్టికర్త కు ఉందో, అలాగే చనిపోయిన మనిషిని, మట్టిలో కలిసిపోయిన శరీరాన్ని, బూడిదగా మారినా ఎముకల్ని సైతం కలిపి మరోసారి జీవింప చేయడం ఏమాత్రం కష్టతరమైన విషయం కాదు.

సూరయే ఫుస్సిలత్ లోని ఆయత్ నెంబర్ 39 గమనించండి.

وَمِنْ آيَاتِهِ أَنَّكَ تَرَى الْأَرْضَ خَاشِعَةً فَإِذَا أَنزَلْنَا عَلَيْهَا الْمَاءَ اهْتَزَّتْ وَرَبَتْ ۚ إِنَّ الَّذِي أَحْيَاهَا لَمُحْيِي الْمَوْتَىٰ ۚ– 41:39

ఆయన యొక్క సూచనలలో ఒక సూచన ఏమిటంటే, నీవు భూమిని ఎండిపోయినదిగా, బీడుబారినదిగా చూస్తావు. ఎప్పుడైతే మేము ఆ భూమిపై వర్షాన్ని కురిపిస్తామో, ఆ తర్వాత పచ్చని పైర్లతో అది ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది. ఆ నిర్జీవ భూమిని ఎవరైతే బ్రతికించాడో ఆ భూమిలో జీవం పోసాడో అతడే మృతులను కూడా మరోసారి లేపుతాడు. వారికి కూడా జీవం ప్రసాదిస్తాడు.

ఇలాంటి ఆయత్ లు ఖురాన్ లో మరి ఎన్నో ఉన్నాయి. మరొక గమనించగల విషయం ఏమిటంటే, ఎండిపోయిన భూమి, చూడడానికి చనిపోయిన భూమి, అందులో నీటి వర్షం, వర్షం యొక్క నీరు పడిన తరువాత ఎలా పచ్చగా అవుతుందో, మొలకలు ఎత్తుతాయో ఇలాంటి ఉదాహరణలే మృతులను లేపబడే విషయంలో కూడా అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు.

సహీ ముస్లింలోని హదీత్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియపరిచారు. “మొదటిసారి ఇస్రాఫీల్ శంఖు ఊదినప్పుడు ఒక వైపునకు మెడలు వాలి పోతాయి. ప్రజలు సొమ్మసిల్లి పోతారు. ఆ తర్వాత ప్రళయం సంభవించి ఈ ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ అల్లాహ్ (తఆలా) ఒక వర్షం కురిపిస్తాడు. వెన్నుముక లోని చివరి భాగం ఏది అయితే మిగిలి ఉంటుందో, దాని ద్వారా మరోసారి ఎలాగైతే వర్షం ద్వారా మొలకలు ఎత్తుతాయో అలాగే మనుషులు కూడా పుట్టుకొస్తారు. రెండవ శంఖు ఊదిన తర్వాత అందరూ కూడా అల్లాహ్ ఎదుట హాజరవుతారు”. ఈ ప్రళయ దినాన్ని విశ్వసించడం, ప్రళయ దినాన్ని నమ్మడం మన విశ్వాసంలోని అతి ముఖ్యమైన భాగం. ఇందులో మనం ఏ మాత్రం ఆలస్యం కానీ, ఏ మాత్రం సందేహం గాని, అనుమానం గాని ఉంచుకోకూడదు. దీని వల్ల మనకే నష్టం కలుగుతుంది. ఒకవేళ మనం పరలోక దినాన్ని విశ్వసించామో ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ మరోసారి లేపుతాడు, బ్రతికిస్తాడు అని ఎప్పుడైతే నమ్ముతామో మనకే ఇందువల్ల మేలు కలుగుతుంది.

మరొక విషయం గమనించండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. ఎందరో ఎన్నో రకాల అన్యాయాలు చేస్తున్నారు. ఎన్నో రకాల దౌర్జన్యాలు చేస్తున్నారు. వారికీ వారి దౌర్జన్యం వారు చేసే అంతటి పాపాల శిక్ష ఇహ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? లేదు. వారు ఎవరిపైన అయితే దౌర్జన్యం చేస్తున్నారో ఆ బాధితులకు వారి యొక్క న్యాయం లభిస్తుందా? లేదు. అందుగురించి కూడా పరలోక దినం తప్పనిసరి. అక్కడ సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వ మానవుల మధ్య న్యాయం చేకూరుస్తారు. బాధితునికి అతని హక్కు దౌర్జన్యపరుడు నుండి తప్పకుండా ఇప్పిస్తాడు. అంతే కాదు సహీ హదీత్ లో వచ్చి ఉంది ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తెలిపారు: “ఒకవేళ కొమ్ము ఉన్న మేక కొమ్ము లేని మేకను అన్యాయంగా కొట్టిందంటే రెండు మేకల్ని కూడా అల్లాహ్ (తఆలా) ప్రళయ దినాన హాజరు పరుస్తాడు. దౌర్జన్యం చేసిన మేక నుండి దౌర్జన్యానికి గురి అయిన మేకకు న్యాయం ఇప్పించి ఆ తర్వాత వారిని మట్టిగా మార్చేస్తాడు”. చెప్పే విషయం ఏంటంటే జంతువుల మధ్య లో కూడా న్యాయం చేకూర్చ గలిగే ఆ సృష్టికర్త, మానవుల మధ్య తప్పకుండా న్యాయం చేకూర్చ గలుగుతాడు. ఆ న్యాయం, ప్రతిఫల దినం తప్పని సరిగా రావలసి ఉంది. మనం దానిని ఎంత తిరస్కరించినా అది తప్పక వస్తుంది. నిశ్చయంగా ప్రళయ దినం వచ్చి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ దీని విషయంలో మనందరి విశ్వాసంలో మరింత బలం చేకూర్చు గాక.

ప్రళయ దినం రావడం ఆ రోజు మనందరి లెక్క తీసుకోవడం ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ (తఆలా) ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు వచ్చే మానవులందరినీ కూడా ఒక చోట జమ చేసి, వారిలో ఎవరికీ ఎన్ని సంవత్సరాల జీవితం ప్రసాదించాడో వాటి గురించి తప్పకుండా లెక్క తీసుకుంటాడు.

సూరతుల్ ఘాషియా ఆయత్ నెంబర్ 25, 26 లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:

إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ – 88:25
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم – 88:26
“వారందరూ మా వైపునకు తిరిగి రావలసి ఉన్నది. మరి ఆ తర్వాత మేము వారందరి యొక్క లెక్క తప్పకుండా తీసుకొని ఉంటాము.”

లెక్క తీసుకోవడం అనేది అల్లాహ్ (తఆలా) మనకు ఇచ్చిన జీవితంలోని ఒక్కొక్క క్షణానికి ఆరోజు లెక్క తీసుకోవడం అనేది సత్యం. కొన్ని సందర్భాల్లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “అల్లాహుమ్మ హాసిబ్నీ హిసాబయ్ యసీరా” అని దుఆ చేసేవారు. అంటే “ఓ అల్లాహ్! నా యొక్క లెక్క చాలా తేలికగా నీవు తీసుకో. ఎలాంటి ఇబ్బందికి నన్ను గురిచేయకుండా నా లెక్క తీసుకో.” అయితే ఒక సందర్భంలో ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రశ్నించారు: “ప్రవక్తా! చాలా సులభతరమైన లెక్క ఏమిటి” అని? అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సమాధానం పలికారు: “తేలికమైన, చాలా సులభతరమైన లెక్క అంటే ఆయేషా అల్లాహ్ దాసుని యొక్క కర్మ పత్రాలను కేవలం అలా చూసి అతన్ని మన్నించి వేయడం“. ఈ హదీత్ ముస్నద్ అహ్మద్ లోనిది సహీ హదీత్.

అయితే సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో మరొక హదీత్ ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు” “ఎవరి లెక్క తీసుకోబడుతుందో అతడు అయితే శిక్షలో పడినట్లే”. అప్పుడు ఆయేషా (రదియల్లాహు అన్హా) మరోసారి ప్రశ్నించారు: “ప్రవక్తా! అల్లాహ్ (తఆలా) ఖురాన్ లో తెలిపాడు కదా! అతనితో చాలా సులభతరమైన లెక్క తీసుకోవడం జరుగుతుంది అని”. దీనికి సమాధానంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఆయిషా! ఇది కేవలం అతని కర్మ పత్రాల్లో చూడడం, దానిని లెక్క తీసుకోవడం అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా లెక్క తీసుకోవడం అంటే ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క కార్యాన్ని పట్టి అడగడం, దాని గురించి మందలించడం. ఇలా ఎవరైతే ఒక్కొక్క విషయాన్ని గురించి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో, అతడు అయితే నాశనం అయినట్లే కదా!” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు చెప్పారు.

అంటే ఈ హదీతుల ద్వారా ఏం బోధపడుతుంది మనకు? లెక్క తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది అని, దానికి మనం ఇక్కడే సిద్దపడాలి అని మరియు అల్లాహ్ తో దుఆ కూడా చేస్తూ ఉండాలి – “ఓ అల్లాహ్ సత్కార్యాలు చేస్తూ జీవితం గడిపే సత్ భాగ్యం నాకు ప్రసాదించు మరియు ప్రళయ దినాన మా యొక్క లెక్క, తీర్పులు అన్నీ కూడా చాలా సులభతరంగా జరగాలి. నీ యొక్క మన్నింపు కు మీ యొక్క క్షమాపణకు, నీ యొక్క కరుణ కటాక్షాలను మేము నోచుకోవాలి” అని దుఆ చేస్తూ ఉండాలి.

ఇప్పటికీ సమాజంలో కొందరు ప్రళయదినం ఎందుకు? ఆ రోజు ఎందుకు లెక్క తీసుకోవడం? ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే అల్లాహ్ (తఆలా) ఏ ఉద్దేశంతో మనల్ని ఇహలోకంలోకి పంపాడో అది ఆయన్ను ఆరాధించడం మాత్రమే. ఆయన ఆరాధన పద్ధతులను తెలియపరచడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంధాలను కూడా అవతరింపజేశాడు. ఇక అల్లాహ్ తన బాధ్యత పూర్తి చేసి మానవునికి సన్మార్గం ఎందులో ఉందో తెలియజేసి అతను దానిని అవలంబించాలి, దాని ప్రకారం జీవితం గడపాలి అని ఆదేశించాడు. ఇక ఆ పరలోకం,, ఇహలోకంలో ఎవరు ఎలా జీవించారు? ఆ లెక్క తీసుకోవడానికి, ఎవరు న్యాయం చేశారో, వారి యొక్క న్యాయానికి ప్రతిఫలం ఇవ్వడానికి, ఎవరైతే అన్యాయం చేశారో, దౌర్జన్యం చేశారో వారి యొక్క శిక్ష వారికి ఆ రోజు ఇవ్వడానికి. ఎవరు ప్రవక్తల యొక్క బాటను అనుసరించారు? అల్లాహ్ పంపిన గ్రంధాలని స్వీకరించి వాటి ప్రకారం తమ జీవితం మలుచుకున్నారు? ఇవన్నీ కూడా ఆ రోజు తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది.

సూరతుల్ ఆరాఫ్ లో అల్లాహ్ ఇలా తెలియపరిచాడు:

మేము ప్రవక్తల్ని కూడా ప్రశ్నిస్తాము మరియు ప్రవక్తల్ని ఎవరి వైపునకు పంపామో ఆ జాతి వారిని కూడా ప్రశ్నిస్తాము.”

ఈ లెక్క విషయంలో ప్రజలందరూ కూడా సమానంగా ఉండరు. వారి వారి కర్మల ప్రకారం, వారి వారి విశ్వాసాల ప్రకారం, వారు ఇహలోకంలో అల్లాహ్ ఆజ్ఞలను, అల్లాహ్ ఆదేశాలను పాటించి, వాటి ప్రకారం ఏదైతే జీవితం గడిపారో, వాటి ప్రకారం కొందరి యొక్క లెక్క చాలా కష్టతరంగా ఉంటుంది. మరికొందరికి సులభతరంగా ఉంటుంది. కొందరిపట్ల మన్నింపు వైఖరి అల్లాహ్ వహిస్తాడు. మరి కొందరిని అల్లాహ్ (తఆలా) వారితో ఒక్కొక్క లెక్క తీసుకుంటాడు.

ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో తెలిపారు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీత్ ఆ పొడుగైన హదీతులో చివరి మాట ఏంటంటే – “గత జాతులు నాకు చూపబడటం జరిగింది, నా అనుచర సంఘాన్ని కూడా నేను చూశాను. వారిలో డెబ్బై వేల మంది వారు ఎంత అదృష్టవంతులు అంటే, వారు ఎలాంటి లెక్కలేకుండా, ఎలాంటి శిక్ష లేకుండా స్వర్గంలోనికి వెళ్తారు.” అల్లాహు అక్బర్. అల్లాహ్ (తఆలా) మనందరినీ కూడా ఆ డెబ్బై వేలలో కలపాలి, ఆ డెబ్బై వేలలో జోడించాలి అని మనం దుఆ చేస్తూ ఉండాలి. ఆ ప్రకారంగా మనం ఆచరిస్తూ కూడా ఉండాలి.

ఇన్షా అల్లాహ్, పరలోకానికి సంబంధించిన ఎన్నో మజిలీలు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుంటూ పోతూఉన్నాము . మా ఈ కార్యక్రమాలను ఎడతెగకుండా చూస్తూ ఉండండి. అల్లాహ్ (తఆలా) పరలోకం పట్ల మన విశ్వాసాన్ని మరింత బలం చేయుగాక, సత్కార్యాలు చేస్తూ ఉండి, కలిమా “లా ఇలాహ ఇల్లల్లాహ్” చదువుతూ, అదే పుణ్య స్థితిలో అల్లాహ్ మన ప్రాణాలు వీడే అటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక!

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బారకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

నమాజు నిధులు – పార్ట్ 03: నమాజ్ కొరకు నడచి వెళ్ళడం లోని ఘనత, మస్జిద్ లో ప్రవేశిస్తూ చేసే దుఆల ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[19:28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పుస్తకం ఇక్కడ చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

7 – నమాజ్ కొరకు నడచి వెళ్ళడం: 

నమాజు కొరకు నడచి వెళ్ళడంలో అమూల్యమైన పుణ్యాలున్నాయి. అవి విశ్వాసి యొక్క సత్కర్మల అకౌంట్ ను పెంచుతాయి. దీనిని సంక్షిప్తంగా క్రింద తెలియజేస్తున్నాముః

(7.1)      స్వర్గంలో ఆతిథ్యం:

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ عَنِ النَّبِيِّ ﷺ قَالَ: (مَنْ غَدَا إِلَى الْـمَسْجِدِ أَوْ رَاحَ أَعَدَّ اللهُ لَهُ فِي الْـجَنَّةِ نُزُلًا كُلَّمَا غَدَا أَوْ رَاحَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు“. (ముస్లిం 669, బుఖారి 662).

(7.2)      పాపాల మన్నింపు మరియు స్థానాల ఉన్నతం:

عَنْ أَبِي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (مَنْ تَطَهَّرَ فِي بَيْتِهِ ثُمَّ مَشَى إِلَى بَيْتٍ مِنْ بُيُوتِ الله لِيَقْضِيَ فَرِيضَةً مِنْ فَرَائِضِ الله كَانَتْ خَطْوَتَاهُ إِحْدَاهُمَا تَحُطُّ خَطِيئَةً وَالْأُخْرَى تَرْفَعُ دَرَجَةً).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు: “ఎవరైనా తనింట్లో వుజూ చేసుకొని అల్లాహ్ గృహాల్లోని ఒక గృహానికి అల్లాహ్ విధుల్లోని ఒక విధి నెరవేర్చడానికి బయలుదేరుతే అతని ఒక అడుగుకు బదులుగా పాప మన్నింపు జరిగితే రెండవ అడుగుకు బదులు అతని స్థానం పెరుగుతుంది“. (ముస్లిం 666).

(7.3)      అతి గొప్ప ప్రతిఫలం:

عَنْ أَبِي مُوسَى ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (إِنَّ أَعْظَمَ النَّاسِ أَجْرًا فِي الصَّلَاةِ أَبْعَدُهُمْ إِلَيْهَا مَمْشًى فَأَبْعَدُهُمْ وَالَّذِي يَنْتَظِرُ الصَّلَاةَ حَتَّى يُصَلِّيَهَا مَعَ الْإِمَامِ أَعْظَمُ أَجْرًا مِنَ الَّذِي يُصَلِّيهَا ثُمَّ يَنَامُ).

అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా శుభవార్తిచ్చారు: “నమాజు విషయంలో అందరికంటే గొప్ప ఫలానికి అర్హుడు అందరికంటే ఎక్కువ దూరం నండి నమాజు కోసం నడిచి వచ్చేవాడు. నమాజు తొందరగా చేసి పడుకునే వ్యక్తి కంటే సామూహిక నమాజు కోసం ఎదురు చూస్తూ ఇమాంతో నమాజు చేసుకునే వ్యక్తి ఎక్కువ పుణ్యానికి అర్హుడవుతాడు“. (ముస్లిం 662, బుఖారీ 651).

(7.4)      ప్రళయదినాన సంపూర్ణ కాంతి

عَنْ بُرَيْدَةَ ÷ عَنَ النَّبِيِّ ﷺ قَالَ: (بَشِّرْ الْـمَشَّائِينَ فِي الظُّلَمِ إِلَى الْـمَسَاجِدِ بِالنُّورِ التَّامِّ يَوْمَ الْقِيَامَةِ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని బురైద రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “చీకట్లో నడుచుకుంటూ మస్జిద్ కు వెళ్ళే వారికి ప్రళయదినాన సంపూర్ణ కాంతి శుభవార్త ఇవ్వండి“. (తిర్మిజి 223. అబూ దావూద్ 561).

(7.5)       సదఖా

عَن أَبي هُرَيْرَةَ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ :…. (وَالْكَلِمَةُ الطَّيِّبَةُ صَدَقَةٌ وَكُلُّ خُطْوَةٍ تَمْشِيهَا إِلَى الصَّلَاةِ صَدَقَةٌ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మంచి మాట ఒక సదకా (దానం) మరియు నమాజు కొరకు మస్జిదుకు వెళ్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు దానమే“. (బుఖారీ 2891, ముస్లిం 1009).

(7.6) మస్జిద్ లో ప్రవేశిస్తూ చేసే దుఆ

మస్జిద్ లో ప్రవేశిస్తూ ఎవరైనా “అఊజు బిల్లాహిల్ అజీం వబివజ్ హిహిల్ కరీం వసుల్తానిహిల్ కదీం మినష్షైతానిర్రజీం” చదివితే, ‘ఈ రోజంతా ఇతడు నా నుండి కాపాడబడ్డాడు’ అని షైతాన్ అంటాడు. (అబూదావూద్ 466, సహీహుల్ జామి 4715).

జుల్ హిజ్జ తొలి దశకం విశిష్టత [వీడియో]

బిస్మిల్లాహ్

https://youtu.be/VWBeqRwgrjg
[1:05:47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/

దిల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు

బిస్మిల్లాహ్

ఈ పది దినాలలో ఆచరించవలసిన ఆరాధనా పద్ధతులు: అల్లాహ్ తరఫు నుండి ఈ పది దినాలు తన దాసుల వైపునకు ఒక గొప్ప దీవెనగా గ్రహించవలెను. మంచి  పనులలో, శుభకార్యాలలో, దానధర్మాలలో చైతన్యవంతంగా, క్రియాత్మకంగా పాల్గొనటం ద్వారా వీటికి విలువనిచ్చినట్లగును. ఈ దీవెనకు తగిన ప్రాధాన్యతనివ్వటం ముస్లింల కనీస బాధ్యత. పూర్తి ఏకాగ్రతతో, వివిధ దైవారాధనలలో ఎక్కువ సమయం గడపటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఈ పది దినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి స్వయంగా తనను తాను అంకితం చేసుకోవలెను. మంచి పనులు చేయటానికి మరియు వివిధ ఆరాధనలు చేయటానికి ప్రసాదించబడిన రకరకాల అవకాశాలు కూడా అల్లాహ్ తన దాసులపై అవతరింపజేసిన ప్రత్యేక దీవెనలలోనికే వస్తాయి.  ఈ శుభకార్యాల ద్వారా ముస్లింలు ఎల్లప్పుడూ చైత్యవంతంగా, క్రియాత్మకంగా మరియు నిరంతరాయంగా తమ అల్లాహ్ ను ఆరాధించటానికి అవకాశం ఉన్నది.

దిల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు:

ఉపవాసం.

దిల్ హజ్జ్ 9వ తేదీన ఉపవాసం ఉండటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ శుభసమయంలో మంచి పనులు చేయవలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి ఉన్నారు. మరి, ఉపవాసమనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథపు ఒక హదీథ్ ఖుద్సీలో ఉపవాసాన్ని తను ఎన్నుకున్న ఆరాధనగా అల్లాహ్ ప్రకటించెను: “అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఒక్క ఉపవాసం తప్ప, ఆదం సంతానపు పుణ్యకార్యాలన్నీ వారి కోసమే. అది మాత్రం నా కోసం. మరియు దాని ప్రతిఫలాన్ని నేను స్వయంగా అతనికి ప్రసాదిస్తాను.’”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దిల్ హజ్జ్ మాసపు 9వ రోజున ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను: ”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ దిల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు.” (అన్నిసాయి హదీథ్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీథ్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీథ్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.)

తక్బీర్

దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో తక్బీర్ (“అల్లాహు అక్బర్”), తహ్మీద్ (“అల్హమ్దులిల్లాహ్”), తహ్లీల్ (“లా ఇలాహ ఇల్లల్లాహ్”) మరియు తస్బీహ్ (“సుబ్హానల్లాహ్”) అని బిగ్గరగా  ఉచ్ఛరించవలెను. ఇది మస్జిద్ లలో, ఇంటిలో, దారిలో, ఇంకా ఆరాధనలో భాగంగా మరియు అల్లాహ్ యొక్క మహోన్నత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని ప్రకటించటంలో భాగంగా అల్లాహ్ పేరు స్మరించటానికి మరియు బిగ్గరగా ఉచ్ఛరించటానికి అనుమతింపబడిన ప్రతి చోట ఉచ్ఛరించలెను. పురుషులు దీనిని బిగ్గరగా మరియు మహిళలు నిదానంగా ఉచ్ఛరించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:

వారు తమ కొరకు అక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లాహ్ వారికి ప్రసాదించబడిన పశువులపై కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి (అల్లాహ్ పేరుతో బలిదానం చేయాలని) స్వయంగా తినాలి, లేమికి గురి అయిన ఆగత్యపరులకు పెట్టాలి…” [సూరహ్ అల్ హజ్జ్ 22:28]

నిర్ణీత దినాలంటే దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలని మెజారిటీ పండితులు అంగీకరించినారు. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీథ్ లోని పదాలలో “(దిల్ హజ్జ్ మాసపు) మొదటి పది దినాలు నిర్ణీత దినాలని” ఉన్నది.

తక్బీర్ లో “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్;వల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్(అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు; అల్లాహ్ యే మహోన్నతుడు మరియు సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును)” మరియు ఇలాంటి ఇతర పదాలు కూడా పలక వచ్చును.

తక్బీర్ పలకటమనేది ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఆచరణా విధానం. కాని నేటి కాలంలో దీనిని ప్రజలు పూర్తిగా మరచిపోయినారు. ఈ రోజులలో చాలా అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే తక్బీర్ పదాలు పలుకు తున్నారు. ఈ తక్బీర్ ను బిగ్గరగా ఉచ్ఛరించ వలెను. దీని ద్వారా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక సున్నహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారాన్ని)ను తిరిగి పునరుద్ధరింపవలసిన అవసరాన్ని గుర్తు చేసినట్లవుతుంది. ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) మరియు అబు హురైరా (రదియల్లాహు అన్హు) లు దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో మార్కెట్ ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ బిగ్గరగా తక్బీర్ ఉచ్ఛరించేవారని మరియు వారి తక్బీర్ పలుకులు వినగానే ప్రజలు కూడా బిగ్గరగా తక్బీర్ పలుకులు ఉచ్ఛరించే వారని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నమోదు చేయబడినది. ప్రజలను తక్బీర్ పలుకలు ఉచ్ఛరించమని గుర్తు చేయటం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ప్రతి ఒక్కరూ స్వయంగా తక్బీర్ ఉచ్ఛరించమనేగాని అందరూ కలిసి సమశ్రుతిలో ఒకేసారి తక్బీర్ ఉచ్ఛరించమని కాదు. ఇలా ఒకేసారి అందరూ కలిసి ఒకే గొంతులో ఉచ్ఛరించే విధానానికి షరిఅహ్ లో ఎటువంటి ఆధారం లభించదు.

పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన సున్నహ్ ను అంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆచారాన్ని మరల పునరుద్ధరించటమనే చర్యకు అనేకమైన పుణ్యాలు లభించును. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించి ఈ హదీథ్: “ఎవరైతే నా మరణం తర్వాత ప్రజలు మరచిపోయిన నా సున్నహ్ ను (ఆచారాన్ని) తిరిగి పునరుద్ధిరంచారో, వారు ఆ సున్నహ్ ను ఆచరిస్తున్న ప్రజల పుణ్యాలలో ఎటువంటి తగ్గింపూ లేకుండా, వారూ (పునరుద్ధరించినవారూ) అన్ని పుణ్యాలు పొందుతారు.” (అత్తిర్మిథీ హదీథ్ గ్రంథం, 7/443; ఉల్లేఖకుల పరంపర ఆధారంగా ఇది హసన్ హదీథ్ గా వర్గీకరింపబడినది.)

హజ్జ్ మరియు ఉమ్రా యాత్ర చేయటం.

ఈ పవిత్ర పది దినాలలో ఎవరైనా చేయగలిగే ఉత్తమ శుభకార్యాలలో అల్లాహ్ యొక్క గృహాన్ని హజ్జ్ యాత్ర కోసం సందర్శించటం. ఎవరికైతే అల్లాహ్ తన పవిత్ర గృహాన్ని సందర్శించే మరియు సరైన పద్ధతిలో అన్ని ఆరాధనలు పూర్తి చేయటానికి సహాయ పడుతున్నాడో వారి ఔన్నత్యాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీథ్ ఇలా ప్రకటించినారు: “స్వీకరింపబడిన హజ్జ్ యాత్ర తెచ్చే పుణ్యఫలం స్వర్గం కంటే తక్కువ ఉండదు.”మంచి పనులు అధికంగా చేయటం. ఎందుకంటే అల్లాహ్ కు మంచి పనులంటే ఇష్టం మరియు అవి అల్లాహ్ నుండి అమితమైన పుణ్యాలను సంపాదించి పెట్టును.

ఎవరైతే హజ్జ్ యాత్రకు వెళ్ళలేక పోయారో, వారు ఈ పవిత్ర సమయంలో అల్లాహ్ ధ్యానంలో, ప్రార్థనలలో, నమాజలలో, ఖుర్ఆన్ పఠనంలో, అల్లాహ్ ను స్మరించటంలో, దానధర్మాలలో, తల్లిదండ్రులను గౌరవించటంలో, బంధువులతో సంబంధాలు మెరుగు పరచటంలో, సమాజంలో మంచిని ప్రోత్సహించటంలో మరియు చెడును నిరోధించటంలో, ఇంకా ఇతర వివిధ రకాల మంచి పనులు, పుణ్యకార్యాలలో, ఆరాధనలలో మునిగి పోవలెను.

ఖుర్బానీ – బలిదానం సమర్పించటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరినైనా అల్లాహ్ కు దగ్గర చేర్చే శుభకార్యాలలో పశుబలి సమర్పించటం, దాని కోసం ఒక ఉత్తమమైన పశువును ఎన్నుకోవటం, దానిని బాగా మేపటం, అల్లాహ్ కోసం ఖర్చు పెట్టటం అనేలి కూడా ఉన్నాయి.

చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం మరియు క్షమాపణ వేడుకోవటం. ఈ పది పవిత్ర దినాలలో ఎవరైనా చేయగలిగే మంచి శుభకార్యాలలో ఒకటి – తాము చేసిన తప్పులకు, పాపములకు పశ్చాత్తాప పడుతూ, అల్లాహ్ ను చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకోవటం. తమలోని అని అవిధేయతా పనులను, పాపపు పనులను, చెడు అలవాట్లను వదిలివేయటానికి గట్టిగా నిర్ణయించుకోవటం. పశ్చాత్తాపపడటమంటే అల్లాహ్ వైపునకు తిరిగి మరలటం మరియు అల్లాహ్ ఇష్టపడని అన్ని తప్పుడు పనులను అవి రహస్యమైనవైనా లేక బహిరంగమైనవైనా సరే వదిలివేయటం. ఏ పాపాలైతే జరిగి పోయినవో, వెంటనే వాటిని  పూర్తిగా వదిలి వేసి, మరల వాటి వైపు మరలమని గట్టిగా నిశ్చయించుకుని, అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యాలనే మనస్పూర్తిగా చేయటానికి ప్రయత్నించ వలెను.

ఒకవేళ ఎవరైనా ముస్లిం పాపం చేసినట్లయితే, ఆలస్యం చేయకుండా వెనువెంటనే పశ్చాత్తాప పడవలెను. దీనికి మొదటి కారణం చావు ఏ క్షణాన వస్తుందో ఎవరికీ తెలియక పోవటం. రెండోది ఒక పాపపు కార్యం ఇంకో పాపపు కార్యానికి దారి చూపుతుందనే వాస్తవ అనుభవం.

ప్రత్యేక సమయాలలో పశ్చాత్తాపపడటం, అల్లాహ్ ను క్షమాపణ వేడుకోవటంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆయా శుభసమయాలలో ప్రజల ఆలోచనలు ఆరాధనల వైపునకు మరలి, మంచి పనులు చేయాలనే ఆసక్తి కలిగి, తమలోని తప్పులను, పాపాలను గుర్తించటానికి దారి చూపును. తద్వారా వారిలో గతం గురించిన పశ్చాత్తాప భావనలు కలుగును. పశ్చాత్తాప పడటమనేది అన్ని సమయాలలోనూ తప్పని సరియే. కాని, ఒక ముస్లిం అత్యంత శుభప్రదమైన దినాలలో మంచి పనులతో పాటు, ఆరాధనలతో పాటు పశ్చాత్తాపాన్ని జత పరచటమనేది అల్లాహ్ ఆమోదిస్తే (ఇన్షాఅల్లాహ్) సాఫల్యానికి చిహ్నమగును. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాని, ఎవరు ఇక్కడ పశ్చాత్తాప పడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తేడో, అతడు అక్కడ సాఫల్యం పొందే వారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు.” [సూరహ్ అల్ ఖశశ్ 28:67]

సమయం త్వరత్వరగా గడిపోతుండటం వలన, ఈ ముఖ్యసమయాలలోని శుభాలను ముస్లింలు కోల్పోకుండా చూసుకోవలెను. తనకు అవసరమైనప్పుడు పనికి వచ్చేవి మంచి పనుల ద్వారా సంపాదించుకున్న పుణ్యాలే. ఎన్ని పుణ్యాలున్నా సరే, అక్కడి అవసరాలకు చాలవు. కాబట్టి ఇలాంటి శుభసమాయలలో అధిక పుణ్యాలు సంపాదించుకుంటూ, రాబోయే సుదీర్ఘ ప్రయాణానికి స్వయంగా తయారు కావలెను. ఏ క్షణంలో బయలుదేరటానికైనా సరే సిద్ధంగా ఉండవలెను. గమ్యస్థానం చాలా దూరంగా ఉన్నది. ఏ ఒక్కరూ తప్పించుకోలేని సుదీర్ఘ ప్రయాణము భయభ్రాంతుల్ని కలిగిస్తున్నాయి. మోసం, దగా, వంచన నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. కాని, అల్లాహ్ ప్రతి క్షణాన్ని గమనిస్తున్నాడు. ఆయన వైపునకే మనము మరల వలసి ఉన్నది మరియు ఆయనకే మన కర్మలు సమర్పించవలసి ఉన్నది. దీని గురించి దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాబట్టి ఎవరైతే అణువంత మంచిని చేసారో, వారు దానిని చూస్తారు. మరియు ఎవరైతే అణువంత చెడును చేసారో, వారు దానిని చూస్తారు.” [సూరహ్ అజ్జల్ జలాహ్99:7-8]

కూడగట్ట వలసిన పుణ్యఫలాలు చాలా ఉన్నాయి. కాబట్టి విలువ కట్టలేని మరియు ప్రత్యామ్నాయం లేని ఈ పది శుభదినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవలెను. చావు సమీపించక ముందే, సరైన సమయంలో ప్రతిస్పందించక, మంచి అవకాశాన్ని చేజార్చుకోక ముందే, ఏ ప్రార్థనలూ స్వీకరించబడని చోటుకు చేరుకోమని ఆదేశింపబడక ముందే, ఆశించుతున్న వానికి మరియు అతను ఆశించిన వాటికి మధ్య చావు అడ్డుపడక ముందే, నీ కర్మలతో సమాధిలో చిక్కుకోక ముందే మంచి పనులు, శుభకార్యాలు చేయటానికి త్వరపడవలెను.

గాఢాంధకారంతో నిండిన హృదయం గలవాడా, నీ హృదయాన్ని వెలుగుకిరణాలతో నింపి, మెత్తపరచే సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఈ పది శుభదినాలలో మీ ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి వీస్తున్న చల్లటి దీవెనల ఆహ్లాదాన్ని కోల్పోవద్దు. అల్లాహ్ తను ఇష్టపడిన వారికి ఈ చల్లటి పవనాలు తప్పక స్పర్శించేటట్లు చేస్తాడు. అటువంటి పుణ్యాత్ములు తీర్పుదినాన ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మరియు వారి కుటుంబాన్ని మరియు వారి సహచరులను అల్లాహ్ మరింతగా దీవించు గాక.


అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్, రివ్యూ: షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాంహౌస్ వారి సౌజన్యంతో

ఉద్-హియహ్ (బలిదానం – ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి దిల్-హజ్జ్ మాసపు పది దినాలలో వేటినుండి దూరంగా ఉండవలెను?

బిస్మిల్లాహ్

ప్రశ్న: ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి ఈ పది దినాలలో వేటినుండి దూరంగా ఉండవలెను?

సున్నహ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉపదేశాల ప్రకారం) బలిదానం (ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి తన వెంట్రుకలను, గోళ్ళను కత్తిరించడం మరియు తన చర్మం నుండి దేన్నైనా సరే తొలగించడం మొదలైనవి ఈ దిల్ హజ్జ్ పది దినాల ఆరంభం నుండి బలిదానం సమర్పించే వరకు (ఖుర్బానీ చేసే వరకు) మానివేయవలెను.  ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించి ఉన్నారు: “దిల్ హజ్జ్ యొక్క క్రొత్త నెలవంక చూడగానే, మీలో ఎవరైనా ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) సమర్పించాలనుకుంటే, అది పూర్తి చేసే వరకు (పశుబలి పూర్తి చేసే వరకు) తన వెంట్రుకలను మరియు గోళ్ళను కత్తిరించడం మానివేయవలెను.” ఇంకో ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినట్లు నమోదు చేయబడినది: “అతను తన వెంట్రుకలు లేక చర్మం నుండి (దానిని అంటిపెట్టుకుని ఉన్న వాటిని) దేనినీ తొలగించకూడదు.” (నలుగురు ఉల్లేఖకులతో సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథంలో నమోదు చేయబడినది, 13/146)

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ ఆదేశాలు ఒక దానిని తప్పని సరిగా చేయమంటున్నాయి (ఖుర్బానీని). ఇంకా వారి యొక్క నిషేధాజ్ఞలు ఇంకో దానిని (వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించటాన్ని) హరామ్ (ఎట్టి పరిస్థితులలోను చేయకూడదు) అని ప్రకటిస్తున్నాయి. సరైన అభిప్రాయం ప్రకారం ఈ ఆదేశాలు మరియు నిషేధాజ్ఞలు బేషరతుగా మరియు తప్పించుకోలేనివిగా ఉన్నాయి. అయితే, ఎవరైనా వ్యక్తి ఈ నిషేధించిన వాటిని కావాలని చేసినట్లయితే, అతను వెంటనే అల్లాహ్ యొక్క క్షమాభిక్ష అర్థించవలెను. అతని బలిదానం (ఖుర్బానీ) స్వీకరించబడును. అంతే కాని దానికి ప్రాయశ్చితంగా అదనపు బలిదానం (ఖుర్బానీ) సమర్పించుకోవలసిన అవసరంలేదు; హాని కలిగిస్తున్న కారణంగా ఉదాహరణకు చీలిపోయిన గోరు బాధపెట్టటం, వెంట్రుకలున్నచోట గాయం కావటం మొదలైన అత్యవసర పరిస్థితుల వలన కొన్ని వెంట్రుకలు లేక గోరు తొలగించవలసి వస్తే, అటువంటి వారు వాటిని తొలగించవచ్చును. అలా చేయటంలో ఎటువంటి తప్పూ, పాపమూ లేదు. ఇహ్రాం స్థితి ఎంతో ముఖ్యమైనదప్పటికీ, వెంట్రుకలు లేక గోళ్ళు వదిలివేయటం వలన హాని కలుగుతున్నట్లయితే, వాటిని కత్తిరించటానికి అనుమతి ఇవ్వబడినది. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో స్త్రీలు గాని, పురుషులు గాని తమ తల వెంట్రుకలను కడగటంలో ఎటువంటి తప్పూ లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాాహు అలైహి వసల్లం వాటిని కత్తిరించటాన్నే నిరోధించినారు గాని వాటిని కడగటాన్ని నిరోధించలేదు.

వెంట్రుకలు లేక గోళ్ళు తీయటం పై ఉన్న నిషేధం వెనుక ఉన్న వివేచన ఏమిటంటే బలిదానం సమర్పిస్తున్నతని అల్లాహ్ కు దగ్గర కావాలనుకుని చేస్తున్న ఈ పశుబలి వంటి కొన్ని ధర్మాచరణలు, హజ్జ్ లేక ఉమ్రా యాత్రలో ఇహ్రాం స్థితిలో ఉన్నవారితో సమానం. కాబట్టి వెంట్రుకలు, గోళ్ళు తీయటం వంటి కొన్ని ఇహ్రాం స్థితిలోని నిబంధనలు పశుబలి ఇస్తున్న వారికి కూడా వర్తిస్తాయి. దీనిని పాటించటం వలన అల్లాహ్ అతనిని నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడని ఒక ఆశ.  అల్లాహ్ యే అత్యుత్తమమైన జ్ఞానం కలిగినవాడు.

ఒకవేళ ఎవరైనా దుల్ హజ్జ్ నెలలోని మొదటి పది దినాలలో ఉదియహ్ (బలిదానం) ఇవ్వాలనే సంకల్పం లేకపోవటం వలన తన వెంట్రుకలు లేక గోళ్ళు తీసి, ఆ తర్వాత ఉదియహ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే, ఆ క్షణం నుండి అతను వెంట్రుకలు లేక గోళ్ళు తీయకుండా ఉండవలెను.

కొందరు స్త్రీలు దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలలో తమ వెంట్రుకలను కత్తిరించుకునేందుకు వీలుగా, తమ బలిదానాన్నిచ్చే బాధ్యతను తమ సోదరులకు లేక కొడుకులకు అప్పగిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, బలిదానం సమర్పిస్తున్న వారికే ఈ నిబంధన వర్తిస్తుంది – అసలు పశుబలిని పూర్తి చేసే బాధ్యత ఇతరులకు అప్పగించినా, అప్పగించకపోయినా. ఎవరికైతే ఆ బాధ్యత ఇవ్వబడినదో వారికి ఈ నిబంధన వర్తించదు. స్వయంగా ఇష్టపడి ఇతరుల పశుబలి చేస్తున్నా లేక ఇతరులు తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తున్నా, అటువంటి వారి పై  ఈ నిషేధము వర్తించదు.

ఇంకా, ఈ నిబంధన బలిదానం (ఖుర్బానీ) చేస్తున్నతని పైనే ఉంటుంది గాని అతని భార్యాబిడ్డలకు వారు కూడా వేరుగా బలిదానం(ఖుర్బానీ) చేస్తున్నట్లయితేనే తప్ప వర్తించదు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ కుటుంబం తరఫున బలిదానం సమర్పించేవారు కాని వారిని తమ వెంట్రుకలు, గోళ్ళు తీయకుండా ఈ నిబంధనలు పాటించమని ఆదేశించినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.

ఎవరైనా బలిదానం(ఖుర్బానీ) సమర్పించాలని నిశ్చయించుకుని, ఆ తర్వాత హజ్జ్ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నట్లయితే, వారు ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు వెంట్రుకలు గాని గోళ్ళు గాని తీయకూడదు. ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు అవసరమైనప్పుడు వెంట్రుకలు లేక గోళ్ళు తీయటమనేది సాధారణ సమయాలలో మాత్రమే పాటించే ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారం. కాని ఒకవేళ “తమత్తు” పద్ధతి ప్రకారం హజ్జ్ చేస్తున్నట్లయితే, [ఉమ్రా పూర్తి చేసి, ఇహ్రాం స్థితి నుండి బయటకు వచ్చి, మరల హజ్జ్ కోసం క్రొత్తగా ఇహ్రాం స్థితిలో ప్రవేశించేవారు], ఉమ్రా పూర్తి చేసిన తర్వాత తన వెంట్రుకలను చిన్నగా కత్తిరించకోవలెను. ఎందుకంటే వెంట్రుకలు తీయటమనేది ఉమ్రాలోని ఒక ఆచరణ.

పైన తెలిపిన హదీథ్ లో బలిదానం(ఖుర్బానీ) ఇచ్చేవారికి వర్తించే నిబంధనలన్నీ తెలియజేయబడినవి. సుగంధద్రవ్యాల వాడకంలో లేక భార్యతో సంభోగం చేయటంలో లేక కుట్టబడిన దుస్తులు ధరించటంలో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. అల్లాహ్ కే ప్రతిదీ తెలియును.


అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్, రివ్యూ: షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాంహౌస్ వారి సౌజన్యంతో

ఖుర్బానీ (జిబహ్, బలిదానం, ఉద్-హియ)

సామాజిక రుగ్మతలు మరియు వాటి నివారణోపాయాలు [వీడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

 (తప్పక చూడవలసిన వీడియో)!
[1:01:35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అందరు తప్పక చూడవలసిన వీడియో!

టైటిల్ చూసి బోరింగ్ టాపిక్ అనుకోవద్దు.వీడియో మొదట భాగంలో కొంచెం ఓర్పు పట్టి వినండి. కొంత సమయం తర్వాత, మీకు తప్పక ఇంటరెస్ట్ కలుగుతుంది. దీంట్లో చెప్పిన విషయాలు శ్రద్దగా వినండి, ఇన్షా అల్లాహ్ మనలో తప్పక మార్పు కలుగుతుంది.

మీరు వినటమే కాదు, తప్పక మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి మరియు వినమని ప్రోత్సహించండి.

అల్లాహ్ మనందరికీ సత్ భాగ్యం కలుగ జేయుగాక.అమీన్

నమాజు నిధులు – పార్ట్ 02: నమాజు కొరకు తొలిసమయంలో వెళ్ళటం, అజాన్ కు బదులు పలకటం,అజాన్ తర్వాత దుఆ [వీడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ ఆడియో (mp3) వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

[22:22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

నమాజు నిధులు (Treasures of Salah) – పుస్తకం ఇక్కడ చదవండి
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

4 – నమాజు కొరకు తొలిసమయంలో వెళ్ళటం :

నమాజు కొరకు తొలి సమయంలో (త్వరగా, శీఘ్రముగా) బయలుదేరుట చాలా ఘనతగల విషయం. ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైర (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

عَنْ أَبِي هُرَيْرَةَ  ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ:

(لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ).

అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ అవకాశాలు చీటీలు వేసుకునే పద్ధతి ద్వారా మాత్రమే లభిస్తాయని తెలిస్తే, వారు తప్పకుండా పరస్పరం చీటీలు వేసుకుంటారు. అలాగే నమాజ్ వేళ కాగానే తొలి సమయంలో (మస్జిద్) చేరడంలో ఎంత పుణ్యం ఉందో తెలిస్తే, అందులో కూడా ప్రజలు ఒకర్నొకరు మించిపోవడానికి పోటీపడతారు“. (బుఖారీ 615, ముస్లిం 437).

జుమా నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటంలో ప్రత్యేక శ్రేష్ఠత మరియు చెప్పరాని విశిష్ఠత ఉంది. ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

عَنْ أَوسِ بنِ أَوسٍ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ:

(مَنْ غَسَّلَ وَ اغْتَسَلَ يَومَ الْـجُمُعَةِ وَ بَكَّرَ وَ ابْتَكَرَ وَدَنَا مِنَ الإِمَامِ فَأَنصَتَ، كَانَ لَهُ بِكُلِّ خُطوَةٍ يَخطُوهَا صِيامُ سَنَةٍ وَ قِيامُها وَ ذَلِكَ عَلَى اللهِ يَسير).

ఎవరు జుమా రోజు తలంటు స్నానం చేసి, తొలి సమయంలో అందరికంటే ముందుగా (మస్జిద్ చేరుకుని), ఇమాంకు సమీపంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడో, అతను నడిచే ప్రతి అడుగుకు బదులుగా ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు ఒక సంవత్సరపు తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇది అల్లాహ్ కు ఎంతో కష్టం కాదు“([1]).

జుమా కొరకు ఒక్కో అడుగుపై ఒక సంవత్సరపు ఉపవాసాల మరియు తహజ్జుద్ చేసినంత పుణ్యం!! ఇంతకంటే గొప్ప శ్రేష్ఠత, ఘనతగల ఫలితం ఇంకేముంది?

నిరంతరం నమాజు కొరకు తొలి సమయంలో వెళ్ళటం మనసంతా మస్జిద్ లోనే ఉందన్నదానికి సంకేతం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఉపదేశించారు:

అల్లాహ్ ఛాయ తప్ప మరెలాంటి ఛాయ లభించని (ప్రళయ)దినాన అల్లాహ్ ఏడుగురు వ్యక్తులను తన నీడ పట్టున ఆశ్రయమిస్తాడు. అందులో ఒకడు: మస్జిద్ నుండి వెళ్ళినప్పటి నుండీ అక్కడికి తిరిగి వచ్చే వరకు మనసంతా మస్జిదులోనే ఉండేటటువంటి వ్యక్తి“. (తిర్మిజి 2391, బుఖారి 660, ముస్లిం 1031).

5 – అజాన్ కు బదులు పలకటం: 

ఇప్పటికీ మనం నమాజుకు సంబంధించిన నిధుల మధ్య ఉత్తమ మైన సుకృతాలు, అమూల్యమైన పుణ్యాల అన్వేషణలో ఉన్నాము. అజాన్ యొక్క జవాబు ద్వారా స్వర్గం పొందవచ్చన్న శుభవార్త ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చియున్నారు. ఈ రెండు హదీసులపై శ్రద్ధ వహించండి:

عَنْ عُمَرَ بْنِ الْخَطَّابِ ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ:

(إِذَا قَالَ الْـمُؤَذِّنُ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ فَقَالَ أَحَدُكُمْ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ ثُمَّ قَالَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ قَالَ أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ ثُمَّ قَالَ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ قَالَ أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ ثُمَّ قَالَ حَيَّ عَلَى الصَّلَاةِ قَالَ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله ثُمَّ قَالَ حَيَّ عَلَى الْفَلَاحِ قَالَ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله ثُمَّ قَالَ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ قَالَ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ ثُمَّ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ مِنْ قَلْبِهِ دَخَلَ الجَنَّةَ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

ముఅజ్జిన్ ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్’ అన్నపుడు దానికి జవాబుగా మీలో ఒకడు తన హృదయాంతరంతో ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్’ అంటే, అతను (ముఅజ్జిన్) ‘అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్’ అన్నపుడు ఇతను (మీలో ఒకడు) ‘అష్ హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్’ అంటే, అతను ‘అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్’ అన్నపుడు ఇతను ‘అష్ హదు అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్’ అంటే, అతను ‘హయ్య అలస్సలాహ్’ అన్నపుడు ఇతను ‘లాహౌల వలా ఖవ్వత ఇల్లా బిల్లాహ్’ అంటే, అతను ‘హయ్య అలల్ ఫలాహ్’ అన్నపుడు ఇతను ‘లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్’ అంటే అతను అల్లాహు అక్బర్ అన్నపుడు ఇతను అల్లాహు అక్బర్ అంటే మళ్ళీ అతను లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్నపుడు ఇతను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అంటే ఇతను స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 385).

عًن  أَبِي هُرَيْرَةَ ÷ يَقُولُ كُنَّا مَعَ رَسُولِ الله ﷺ بِتَلَعَاتِ الْيَمَنِ فَقَامَ بِلَالٌ يُنَادِي فَلَمَّا سَكَتَ قَالَ رَسُولُ اللهِ ﷺ: (مَنْ قَالَ مِثْلَ مَا قَالَ هَذَا يَقِينًا دَخَلَ الجَنَّةَ).

అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యమన్ వైపున హిజాజులో ఒక ఎత్తైన ప్రదేశంలో ఉండగా, బిలాల్ నిలబడి అజాన్ ఇచ్చాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారుః “ఇతను (బిలాల్) చెప్పినట్లు పూర్తి నమ్మకంతో ఎవరు జవాబిస్తారో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (అహ్మద్ 2/352. నిసాయీ 668).

6 – అజాన్ తర్వాత దుఆః 

అజాన్ తర్వాత దుఆ యొక్క ఘనత కూడా గొప్పగా ఉంది. కాని అనేకులు దీని పట్ల అశ్రద్ధ వహిస్తున్నరు. దాని సారాంశం క్రింది విధంగా ఉందిః

(అ)      పాపాల మన్నింపుః

عَنْ سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ÷ عَنْ رَسُولِ الله ﷺ أَنَّهُ قَالَ: (مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْـمُؤَذِّنَ وَأَنَا أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ رَضِيتُ بِالله رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا وَبِالْإِسْلَامِ دِينًا غُفِرَ لَهُ ذَنْبُهُ).

సఅద్ బిన్ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “ముఅజ్జిన్ అజాన్ విన్నాక ‘వ అన అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా’ చదివిన వారి పాపాలు మన్నించబడతాయి”. (ముస్లిం 386, అబూ దావూద్ 525, తిర్మిజీ 210, నిసాయీ 672, ఇబ్ను మాజ 721).

(ఆ)    ప్రళయదినాన ప్రవక్త యొక్క సిఫారసుకు అర్హుడవుతాడుః

عَنْ جَابِرِ بْنِ عَبْدِ الله ÷ أَنَّ رَسُولَ الله ﷺ قَالَ: (مَنْ قَالَ حِينَ يَسْمَعُ النِّدَاءَ اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ حَلَّتْ لَهُ شَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ).

“‘అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్దావతిత్తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ’. ఈ న్న దుఆ ఎవరు అజాన్ విన్న తర్వాత చదువుతారో వారు ప్రళయదినాన నా సిఫారసుకు అర్హులవు తార”ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చినట్లు జాబిర్ బిన్ అబ్దుల్లాహ్  (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ 614).


[1]. అల్ ముఅజముల్ కబీర్ లిత్తబ్రానీ 1/214. అహ్మద్ 4/9. దీని భావం అబూ దావూద్ 345. తిర్మిజి 496. నిసాయీ 1381. ఇబ్ను మాజ 1087లో ఉంది.

మరణాంతర జీవితం – పార్ట్ 04 : సమాధుల నుండి లేపబడటం, పునరుత్థాన దినంపై విశ్వాసం (పార్ట్ 01) [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 04 [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

పార్ట్ 04. ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 20:55 నిముషాలు]

అస్సలామ్ అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలిహందులిల్లాహి వహద వస్సలాతు వస్సలామ్ అలా నబియ్యునా బ’ద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశం లో స్వాగతం.

ఈనాటి శీర్షిక సమాధుల నుండి లేపబడటం

మహాశయులారా! చావు ఎంత నిజమో, సత్యమో, తిరస్కరించలేని విషయమో అంతే అంత కంటే ఎక్కువ నగ్నసత్యం ఏమిటంటే, మనం చనిపోయి సంవత్సరాలు గడిచినా మరోసారి అల్లాహ్ (తఆలా) తప్పకుండా మనల్ని బ్రతికిస్తాడు మరియు తప్పకుండా మనం రెండవసారి జన్మను ఎత్తి అల్లాహ్ ముందు నిలబడేది ఉన్నది ఇహలోకంలో కాదు. ఇప్పుడు చావు వస్తుంది. మనం చనిపోతున్నాము. మన చావుతోనే మన ప్రళయం మనపై సంభవిస్తుంది.

కానీ ఒక రోజు రానుంది. అప్పుడు అల్లాహ్ తఆలా శంఖు ఊదడానికి నియమింపబడిన దూత ఇస్రాఫీల్ (అలైహిస్సలాం)ను ఆదేశిస్తాడు. ఆయన శంఖును పూరిస్తాడు, శంఖును ఊదుతాడు. అందువల్ల ఈ విశ్వమంతా నశించిపోతుంది. వాటి యొక్క ప్రస్తావన సూరతుల్ తక్వీర్, సూరతుల్ ఇన్ఫితార్, సూరతుల్ ఖారిఅహ్, సూరతుల్ జిల్ జాల్ ఇంకా వేరే సూరాలలో కూడా చాలా స్పష్టంగా ఉంది. అయితే ఆ తరువాత అందరికంటే ముందు హజ్రత్ ఇస్రాఫీల్ (అలైహిస్సలాం)ని అల్లాహ్ (తఆలా) బ్రతికిస్తాడు. ఆయన కూడా చనిపోతారు. ఆ తర్వాత అల్లాహ్ మళ్ళీ ఆయనలో జీవం పోసి ఆయన్ని బ్రతికిస్తాడు. ఆయనకు ఆదేశం ఇస్తాడు – మరోసారి శంఖు ఉదాలని. ఆయన మరోసారి శంఖు ఊదుతాడు. అప్పుడు ఆదిమానవుడు నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు ఈ విశ్వమంతా నాశనం అయ్యే వరకు ఎందరు మానవులు ఈ లోకంలో వచ్చారో, వారందరూ కూడా అల్లాహ్ ఎదుట హాజరు కావడానికి లేచి వస్తారు. అది ఎలా జరుగుతుంది? దాని కొన్ని వివరాలు మనం ఈ రోజు ఇన్షా అల్లాహ్ తెలుసుకోవడంతో పాటు పునరుత్థాన దినం, పరలోకం, మరోసారి లేపబడటం, ఇవన్నీ ఎలా సత్యమో, ఖురాన్, హదీసుల ఆధారాలతో పాటు బుద్ధిపూర్వకమైన కొన్ని నిదర్శనాలు కూడా ఇన్షా అల్లాహ్ మీకు తెలుపబడతాయి. నమ్మడానికి ఇంతవరకు ఏదైనా సందేహం, అనుమానం ఉన్నా ఇన్షా అల్లాహ్, ఆ అల్లాహ్ దయతో తప్పకుండా వీరు నమ్మి తీరుతారు. మీరు ఈవిషయాలు చాలా శ్రద్దగా వింటారు అని ఆశిస్తున్నాను.

సహీ బుఖారీలో వచ్చిన హదీసు ప్రకారం, మొదటిసారి శంఖు ఊదబడిన తరువాత విశ్వమంతా నాశనం అయిపోతుంది. ఎలాగైతే విత్తనం ద్వారా మళ్ళీ ఒక వర్షం కురిసింది అంటే విత్తనంలో, విత్తనం ఏదైతే మనం భూమిలో నాటుతామో ఒక చిన్న వర్షం కురిసిన తరువాత ఎలా అది మొలక ఎత్తుతుందో, ఆతరువాత ఏ విత్తనం ఉంటుందో, దాని యొక్క చెట్టు బయటికి వస్తుందో, ఆ విధంగా మనిషి ఏ స్థితిలో చనిపోయినా, ఎక్కడ చనిపోయినా వెన్నెముకలోని కింది చివరి భాగంలో ఒక చిన్న ఎముక ముక్కను అల్లాహ్ (తఆలా) అలాగే నశించి పోకుండా కాపాడి ఉంచుతాడు. ఆ రోజు అల్లాహ్ (తఆలా) ఒక వర్షం కురిపిస్తాడు. ఇస్రాఫీల్ (అలైహిస్సలాం) కు రెండోసారి శంఖు ఊదడానికి ఆదేశిస్తాడు. ఈవిధంగా ఆ వెన్నెముక ద్వారా వర్షం కురిసిన తరువాత మొక్కలు ఎలా మొలకెత్తుతాయో ఆ విధంగా ఇస్రాఫీల్ (అలైహిస్సలాం) శంఖు ఊదిన తర్వాత మరోసారి అందరు మానవులు లేచి నిలబడి అల్లాహ్ ఎదుటకు హాజరవుతారు.

దీనికి సంబంధించిన కొన్ని ఆయతులు మనం ఇప్పుడు విందాం శ్రద్ద వహించండి. సూరయే జుమర్ ఆయత్ నెంబర్ 68 లో అల్లాహ్ (తఆలా) ఇలా తెలియజేసాడు.

وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ ۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخْرَىٰ فَإِذَا هُمْ قِيَامٌ يَنظُرُونَ – 39:68

శంఖు ఊదడం జరుగుతుంది. ఆకాశాల్లో ఉన్నవారు, భూమిలో ఉన్న వారు అందరూ సొమ్మసిల్లి పోతారు. కేవలం అల్లాహ్ తలుచుకున్న వారు తప్ప. మరోసారి శంఖు ఉందడం జరుగుతుంది. అప్పుడు వారందరూ చూసుకుంటూ నిలబడి హాజరవుతారు.

ఈ విధంగా మహాశయులారా! రెండో సారి అల్లాహ్ (తఆలా) నిర్జీవులందరినీ కూడా జీవులుగా చేసి లేపడం అనేది సత్యం. సూరతుల్ మూ’మినూన్ లోని చివరిలో అల్లాహ్ తఆలా ఇలా తెలిపాడు.

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ – 23:115

ఏమీ! మేము మిమ్మల్ని వృదాగా పుట్టించామని మీరు అనుకుంటున్నారా? మరియు తిరిగి మా వైపునకు వచ్చేది లేదు అని మీరు భావిస్తున్నారా?

ఇదే సూరతుల్ మూ’మినూన్ లోని ప్రారంభ ఆయతుల్లో:

ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ – 23:15
మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు

ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ – 23:16
మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు.

దశల వారుగా మీరు ఏదైతే పుట్టించ బడ్డారో ఆతరువాత ఇహలోకంలో వచ్చాక బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం కొందరు యవ్వనంలో మరికొందరు బాల్యంలో మరికొందరు వృద్ధాప్యంలో ఈధంగా ఒక రోజు కాకున్నా ఒకరోజు మీరు చనిపోవాల్సిన వున్నది. ఆ తరువాత ప్రళయ దినాన మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

అయితే సోదర సోదరీమణులారా! చనిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాము. సమాధిలో పెట్టబడిన కాలాలు గడిచిన కొద్దీ ఆ శవం మట్టిలో కలిసిపోతుంది. మరికొందరు కాల్చేస్తారు. అయితే ఎలా మరోసారి వారిని పుట్టించడం జరుగుతుంది?, లేపడం జరుగుతుంది? అన్నటువంటి అనుమానం కొందరికి వస్తుంది కదా.! అయితే ఈ కొన్ని ఉదాహరణలు, ఈ కొన్ని సత్యాలు శ్రద్ధగా వినండి. ఇక మీకు ఎలాంటి అనుమానం ఇన్షా అల్లాహ్ ఉండదు. మొట్ట మొదటి విషయం ఎవరైతే మరోసారి లేపబడటం విషయంలో సందేహపడుతున్నారో అల్లాహ్ (తఆలా) దివ్య ఖురాన్ లో మూడు నాలుగు రకాల తాకీదు పదాలతో, లేపబడటం సత్యం. ఇందులో అనుమానం లేదు అని స్వయంగా అల్లాహ్ తన ప్రమాణం చేసి చెప్తున్నాడు.

అవిశ్వాసులు భ్రమపడి ఉన్నారు. వారు మరోసారి లేపబడరు అని. మీరు చెప్పండి. ఎందుకు లేదు? ఒక రకంగా ఇది కూడా తాకీదు పదం. ఇలా కాదు, ఎందుకు కాదు, తప్పకుండా అవుతుంది. నా ప్రభువు సాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది. ఇది కూడా ఒక రకమైన తాకీదు. మళ్ళీ ఇది కూడా తాకీదు పదం. చివరిలో ఏదైతే ఒత్తు “న్న” ఉన్నదో అది కూడా అరబీ గ్రామర్ ప్రకారంగా తాకీదు పదం. అల్లాహ్ (తఆలా) ఒకే ఆయత్, ఆయత్ లోని చిన్నపాటి భాగంలోనే నాలుగు రకాల తాకీదు పదాలతో “చెప్పండి ఎందుకు లేదు నా ప్రభువు సాక్షిగా మీరు తప్పకుండా మరోసారి లేపబడతారు“. ఈ తాకీదు లతో కూడిన ఈ ఆయత్ కాకుండా ఇంకా వేరే ఎన్నోరకాలుగా అల్లాహ్ (తఆలా) ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా స్పష్టపరిచాడు.

గత కాలాల్లో కూడా మన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కంటే ముందు గడిచిన ప్రవక్తల కాలాల్లో కూడా ఎందరో అవిశ్వాసులు పునరుత్థాన దినాన్ని, పరలోక దినాన్ని తిరస్కరించే వారు. అయితే అల్లాహ్ వారికి నమ్మకం కలగడానికి ఇలాంటి కొన్ని వాస్తవికతలను వారి కళ్ళముందు వారికి చూపించాడు. అవి ఏమిటి?

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) కాలంలో కొందరు “ఓ మూసా! మేము అల్లాహ్ ను మా కళ్లారా చూసినంత వరకు నిన్నువిశ్వసించము, నమ్మము” అని చెప్పారు. అయితే అల్లాహ్ తన యొక్క నూర్ (కాంతి)లోని చిన్న భాగాన్ని పర్వతంపై ప్రదర్శించాడు. అల్లాహ్ చెప్పాడు – “అది గనక ఒకవేళ భరించగలిగి ఉంటే ఆ తర్వాత విషయం మీరు నన్ను చూసేది“. ఎప్పుడైతే ఆ కాంతి ఆ పర్వతం మీద పడినదో వీరందరూ ఆ విషయాన్ని చూసి అక్కడికక్కడే చనిపోయారు. ఆ విషయాన్ని అల్లాహ్ తఆలా ఇలా తెలిపాడు? ఏ కొంతమందిని మూసా (అలైహిస్సలాం) ఎన్నుకొని తూర్ పర్వతానికి తీసుకెళ్లారో వారికే ఇలాంటి విషయం జరిగింది. పర్వతంపై పడినటువంటి కాంతిని వారు చూడలేకపోయారు. ఆ ప్రకాశవంతమైన కాంతిని భరించలేక పోయారు. అందరు కూడా చనిపోయారు. మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో దుఆ చేశారు. “ఓ అల్లాహ్! వెనుక నా జాతివారు ఏదైతే ఇంతటి గొప్పమాట అన్నారో వీరు నాతో వెంట వచ్చారు. వీరిని గనుక నీవు మరోసారి బ్రతికించి, వారి వరకు పంపకుంటే వారు నన్ను ఎలా నమ్ముతారు?” అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వీరిని ఎవరైతే చనిపోయారో మరోసారి బ్రతికించాడు. అయితే అల్లాహ్ చనిపోయిన వారిని బ్రతికించ గలుగుతాడు అన్నటువంటి వాస్తవికతలను ఇహలోకంలో కూడా చూపించాడు.

ఇలాంటి మరో సంఘటన స్వయంగా ఖురాన్ లో కూడా ఉంది. ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడినటువంటి ఒక గ్రామం నుండి వెళ్తున్నాడు. వెళుతూ వెళుతూ ఈ బస్తీ వాళ్ళు, కొంతకాలం ముందు వారు ఈ బస్తీలో జీవిస్తున్నారు. ఇప్పుడు వీరందరూ చనిపోయారు కదా? ప్రళయదినాన అల్లాహ్ వీరిని ఎలా బ్రతికిస్తాడు? ఈ బస్తీ వాసులను అల్లాహు (తఆలా) మరోసారి ఎలా బతికిస్తాడు? ఎలా వారికి జీవం పోసి లేపుతాడు? అని అతని నోట ఈ మాట వెళ్ళింది. ఆ వ్యక్తి ఏ గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడో, తనవెంట తన యొక్క తినడానికి కావలసిన సామాగ్రి కూడా ఉంది. అయితే ఆ వ్యక్తిని అల్లాహ్ (తఆలా) అక్కడే చంపేశాడు. వంద సంవత్సరాల వరకు ఆ మనిషి చనిపోయి ఉన్నాడు. ఆ తరువాత అల్లాహ్ (తఆలా) అతన్ని బ్రతికించాడు, లేపాడు. అల్లాహ్ అతన్ని అడిగాడు. “నీవు చనిపోయిన తర్వాత ఈ స్థితిలో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నావు?” “ఒక రోజు లేదా ఒక రోజు కంటే కొంచెం తక్కువగా నేను చనిపోయిన స్థితిలో ఉంటిని” అని చెప్పాడు. అల్లాహ్ చెప్పాడు – “కాదు, నీవు పూర్తిగా వంద సంవత్సరాల వరకు ఈ నిర్జీవ అవస్థలో ఉంటివి. చూడు! కావాలంటే నీ గాడిద ఏది? ఏ దానిమీద ఐతే నువ్వు ప్రయాణం చేసుకుంటూ వచ్చావో దాని పరిస్థితి ఏమైంది? ఒక రోజు అయ్యేది ఉంటే, ఒక రోజులో దాని శరీరమంతా మట్టిలో కలసిపోయి కేవలం ఎముకలు మిగిలి ఉంటాయా? ఇప్పుడు చూడు నీ కళ్ళ ముంగట నీ గాడిద యొక్క ఎముకలు కనపడుతున్నాయి కదా! కానీ అల్లాహ్ తన శక్తిని ఇలా చూపిస్తున్నాడో గమనించు. అదే గాడిద యొక్క ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ దాని మీద నీ తినుసామాగ్రి ఏదైతే ఉందో అది కొంచెం కూడా పాడవ్వకుండా, అందులో ఎలాంటి మార్పు రాకుండా అదే నీ యొక్క తిను పదార్థాలను, త్రాగు పదార్థాలను చూడు, అందులో ఎలాంటి మార్పు రాలేదు. నీ గాడిదను, మరి నిన్ను ప్రజల కొరకు కూడా మేము ఒక గుర్తుగా, ఒక సూచనగా, ఒక మహిమగా ఏదైతే చేయదలిచామో ఈ విషయాన్ని నీ కళ్లారా చూడు. కొంతసేపటిలో అల్లాహ్ (తఆలా) అతని గాడిదను కూడా అతని కళ్ళ ముంగటే బ్రతికించాడు. అందులో మాంసం, తోలు అన్ని ఏర్పడి ఒక సంపూర్ణమైన ఒక గాడిద అతని ముందు నిలబడి ఉన్నది. అల్లాహ్ (తఆలా) అన్ని రకాల శక్తి గలవాడు. ఎప్పుడు ఏది చేయదలచిన చేయగలవాడు. స్వయంగా మనం మానవులం. ఒకసారి మనం పుట్టించబడ్డామంటే రెండవ సారి పుట్టించడం ఆయనకు ఏదైనా కష్టమా? ఎంత మాత్రం కాదు.

మూడవ సంఘటన కూడా సూరయే బకరాలోనే ఉంది. అది కూడా మూసా (అలైహిస్సలాం) కాలంలోనే జరిగింది. మూసా (అలైహిస్సలాం) కాలంలో ఒక వ్యక్తి తన పినతండ్రిని, అతని యొక్క ఆస్తికి హక్కుదారుడు కావాలన్న దురాశతో చంపేశాడు. కానీ గుప్తంగా చంపాడు. ఎవరికీ తెలియకుండా హతుని యొక్క బంధువులు మూసా (అలైహిస్సలాం) వద్దకు వచ్చి, “మూసా! నీవు అల్లాహ్ తో దుఆ చెయ్యి. మా మనిషిని చంపింది ఎవరో మాకు తెలిసి రావాలి”. అయితే అల్లాహ్ (తఆలా) మూసా (అలైహిస్సలాం)కు ఒక పరిష్కారం తెలియపరిచాడు. ఆ పరిష్కారాన్ని వారు సునాయాసంగా ఆచరించి ఉండేది ఉంటే చాల బాగుండు. కానీ వారు ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి మరింత ఇబ్బందికి పాలయ్యారు. చివరికి అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ప్రకారం “మాంసపు ముక్కను ఆ హతునికి తాకించండి. అతడు బ్రతికి అతన్ని చంపింది ఎవరో తెలియపరుస్తాడు, ఆ తర్వాత మళ్ళీ చనిపోతాడు” అని చెప్పడం జరిగింది. మరియు వాస్తవానికి అలా జరిగింది. సూరయే బకరా లోనే ఈ విషయం అల్లాహ్ (తఆలా) తెలియపరిచాడు.

అయితే మహాశయులారా! చెప్పే విషయం ఏమిటంటే అల్లాహ్ (తఆలా) చనిపోయిన వారిని బ్రతికించగలుగుతాడు అన్న వాస్తవికతలను ఇహలోకంలోనే కొందరి ప్రజలకు చూపించాడు. మరియు వాటిని దివ్య ఖురాన్ గ్రంధంలో సురక్షితంగా ఆ సంఘటనలు పేర్కొనడం జరిగింది. ఇలాంటి మరో సంఘటన కూడా సూరయే బకరాలో ఉంది. కానీ సంఘటనలు ఎన్ని విన్నా, దివ్య ఖురాన్ లాంటి సందేహం లేని సత్యగ్రంథం ద్వారా విన్నా, మన లోపల ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు దూరం చేసుకోనంతవరకు మనకు నమ్మకం కలగదు. అయితే సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వశక్తిమంతుడు గనుక అన్నీ చేయగల శక్తి గలవాడు కనుక వీటిని మనం నమ్మాలి.

అల్లాహ్ చనిపోయిన వారిని బ్రతికించ గలుగుతాడు అన్న విషయానికి మరికొన్ని బుద్ధిపూర్వకమైన ఆధారాలు, నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ వాటిని మనం తరువాయి భాగంలో తెలుసుకోబోతున్నాము.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బారకాతుహు.


పూర్తి భాగాలు క్రింద వినండి 

అరఫా రోజున చేసుకొనే ముఖ్యమైన జిక్ర్ మరియు దుఆలు – ఇమాం ఇబ్నె బాజ్

బిస్మిల్లాహ్

[గమనిక: ఈ చాప్టర్ ఇమాం ఇబ్నె బాజ్ (రహిమహుల్లాహ్) గారు వ్రాసిన “హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో” అనే పుస్తకం నుండి తీసుకోబడింది. ఇది హజ్ చేసే వాళ్ళ కోసం రాయబడిన పుస్తకం. కానీ క్రింది చాప్టర్ లో పేర్కొనబడిన జిక్ర్ మరియు దుఆలు హజ్ చేయని వారు కూడా అరఫా రోజు చేసుకొని లాభం పొందవచ్చు. ఈ జిక్ర్ మరియు దుఆలు అరఫా రోజే కాకుండా మిగతా రోజుల్లో సందర్భాలలో కూడాచేసుకోవచ్చు. అల్లాహ్ మనందరికీ సత్బాఘ్యం ప్రసాదించు గాక, అమీన్]

అరఫహ్ మైదానంలో నిలబడుట మరియు అక్కడి ఇతర ఆరాధనలు:

ఆ తరువాత ప్రజలు అరఫహ్ మైదానంలో నిలబడవలెను. బత్నె ఉర్నా అనే స్థలం తప్ప, మొత్తం అరఫహ్ మైదానంలో ఎక్కడైనా నిలబడవచ్చు. ఒకవేళ వీలయితే ఖిబ్లహ్ మరియు జబలె రహ్మహ్ ల వైపు తిరిగి నిలబడవలెను. అంటే ఖిబ్లహ్ దిశల తమ ముందు జబలె రహ్మహ్ ఉండేటట్లు నిలబడ వలెను. ఒకవేళ రెండింటికి అభిముఖంగా నిలబడ లేకపోతే, కేవలం ఖిబ్లహ్ వైపు మాత్రమే తిరిగి నిలబడవలెను. అలా నిలబడినపుడు, హజ్ యాత్రికుడు అల్లాహ్ ను ధ్యానించడంలో, అల్లాహ్ ను వేడుకోవడంలో, ప్రార్థించడంలో మనస్పూర్తిగా నిమగ్నమై పోవలెను.

దుఆ చేసేటపుడు, రెండు చేతులు పైకెత్తి దుఆ చేయవలెను. లబ్బైక్ అనే తల్బియహ్ పలుకులు మరియు ఖుర్ఆన్ పఠనం కొనసాగించవలెను.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను అనుసరించి ఈ క్రింది దుఆ చేయడం ఉత్తమం:

خَيْرُ الدُّعَاءِ دُعَآءُ يَوْمَ عَرَفَةَ، وَأَفْضَلُ مَا قُلْتُ أَنَا وَالنَّبِيُّونَ مِنْ قَبْليِ

ఖైరుద్దు ఆయి దుఆఉ యౌమ అరఫహ్ వఅఫ్దలు మాఖుల్తు అనా వ నబియ్యూన మిన్ ఖబ్లి 

అరఫహ్ దినం నాటి దుఆ అన్నింటి కంటే ఉత్తమమైన దుఆ మరియు ఉత్తమమైన దుఆ – నేనూ మరియు నా కంటే పూర్వం వచ్చిన ప్రవక్తలు చేసిన ఈ దుఆ –

لاَ  إِلهَ  إِلاَّ  اللهُ  وَحْدَهُ  لَا  شَرِيْكَ  لَهُ ،  لَهُ  المْـُلْكُ  وَلَهُ  الْـحَمْدُ ، يـُحْيِي  وَ  يُمِيْتُ  ، وَ هُوَ  عَلَى   كُلِّ   شَيْءٍ   قَدِيْرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్దహు, లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, యుహ్ఈ వ యుమీతు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.

ఆరాధింపబడే అర్హత కలిగిన ఆరాధ్యుడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ యే మహోన్నతుడు. ఆరాధింపబడే అర్హత కలిగిన వాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. విశ్వమంతా ఆయనకే చెందింది మరియు సకల ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావు బ్రతుకులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రతి దానిపై ఆయనకు ఆధిపత్యం ఉన్నది.

ఈ క్రింది నాలుగు ధ్యానాలను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడతాడని కొన్ని ప్రామాణిక ఉల్లేఖనలు తెలుపుతున్నాయి – 

سُبْحَانَ  الله
సుబ్-హానల్లాహ్
అన్ని రకాల లోపాలకు అతీతుడు, పరమ పవిత్రుడు

وَ الْـحَـمْدُ  لله
వల్ హమ్దులిల్లాహ్
సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే

وَ  لاَ  إِلَـهَ  إِلاَّ  الله
వలా ఇలాహ ఇల్లల్లాహ్
ఆరాధింపబడే అర్హతలు గల ఆరాధ్యుడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప.

وَ  اللهُ  أَكْبـَرْ
వల్లాహు అక్బర్
అల్లాహ్ అందరి కంటే (అన్నింటి కంటే) మహోన్నతుడు.

ఈ పలుకులను మనస్సు లోపలి పొరలలో నుండి దృఢంగా విశ్వసిస్తూ, తరచుగా పలుకుతూ ఉండవలెను. అలాగే షరిఅహ్ ఆమోదించిన ఇతర పలుకులు కూడా పలుకవలెను. ప్రత్యేకంగా వీటిని అరఫహ్ మైదానంలో ఈ అత్యుత్తమమైన దినం నాడు మనస్పూర్తిగా తరచుగా పలుకుతూ వలెను. ప్రత్యేకంగా హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క ఘనతను ప్రశంసించే కొన్ని సమగ్రమైన, విశేషమైన దుఆలను ఎంచుకొని, ఈ దినం నాడు వాటిని హృదయ పూర్వకంగా వేడుకోవలెను. వాటిలో కొన్ని క్రింద ఇవ్వబడినాయి:

سُبْحَانَ  اللهِ  وِبِحَمْدِهِ،  سُبْحَانَ  اللهِ  الْعَظِيمَ
సుబహానల్లాహి వ బిహమ్దిహి – సుబహానల్లాహిల్ అజీమ్.
ఆయన అన్ని లోపాలకూ అతీతుడు, పరమ పవిత్రుడు మరియు సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు ఆయనకే చెందును – ఆయన అన్ని లోపాలకూ అతీతుడు, పరమ పవిత్రుడు, అత్యంత ఘనమైన వాడు.

لاَ  إِلَهَ  إِلاَ  أَنْتَ  سُبْحَانَكَ  إِنِّي  كُنْتُ  مِنَ  الظَّالِـمِـيْنَ
లా ఇలాహ ఇల్లా అంత, సుబహానక, ఇన్నీ కుంతు మినజ్జాలిమీన్
ఆరాధింపబడే అర్హతలు గల ఆరాధ్యుడెవ్వడూ లేడు – నీవు తప్ప. అన్ని లోపాలకూ అతీతుడివీ, పరమ పవిత్రుడివి. నిశ్చయంగా నేను హద్దుమీరిన వారిలోని వాడినే (కేవలం నీ దయ కారణంగానే నేను హద్దుమీరక నీ దాసుడిగా మారగలిగాను).

لاَ  إِلَهَ  إِلاَّ  الله  وَلاَ  نَعْبُدُ  إِلاَّ  إِيَّاهُ،  لَهُ  النَّعْمَةُ  وَلَهُ  الْفَضْلُ  وَلَهُ  الثَّنَاءُ  الـْحُسْنُ، لاَ  إِلَهَ  إِلاَّ  الله  مـُخْلِصِيْنَ  لَهُ  الدِّيْنَ  وَلَوْ  كَرِهِ  الْكَافِرُونَ

లా ఇలాహ ఇల్లల్లాహ్, వ లా నఆబుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నఅమతు, వ లహుల్ ఫద్లు, వ లహుథ్థానాఉల్ హుస్ను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన లహుద్దీన, వలవ్ కరిహల్ కాఫిరూన్

ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. మేమందరమూ కేవలం నిన్నే ఆరాధిస్తాము. అన్ని రకాల శుభాలు మరియు అనుగ్రహాలు ఆయనవే. అత్యంత ఘనమైన ప్రశంసలు కేవలం ఆయన కొరకే. ఆరాధింపబడే అర్హత గలవాడెవ్వడూ లేడు – ఒక్క అల్లాహ్ తప్ప. మా యొక్క చిత్తశుద్ధితో కూడిన విశ్వాసం ఆయన కొరకే – సత్యతిరస్కారులకిది అయిష్టమైనా సరే.

لاَ  حَوْلَ  وَلاَ  قُوَّةَ  إِلاَّ  بِالله
లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్
ఆయన వద్ద నున్న శక్తీ, సామర్థ్యం  తప్ప మరింకేదీ లేదు.

رَبَّنَا  آتِنَا  فِي  الدُّنْيَا  حَسَنَةً  وَفِي  الْآخِرَةِ  حَسَنَةً  وَقِنَا  عَذَابَ  النَّارِ

రబ్బనా ఆతినా పిద్దున్యా, హసనతవౌ, వ ఫిల్ ఆఖిరతి హసనతవౌ, వ ఖినా అదాబన్నార్

ఓ మా ప్రభూ! ఈ ప్రపంచంలో మాకు శుభాలను ప్రసాదించు మరియు పరలోకంలో కూడా శుభాలను ప్రసాదించు మరియు నరకాగ్ని శిక్ష నుండి మమ్ముల్ని కాపాడు.

أَللَّهُمَّ  أَصْلِحْ  لِي  دِيْنِي الَّذِي  هُوَ  عِصْمَةُ  أَمْرِي،  وَأَصْلِحْ  لِي  دُنْيَاي  الَّتِي  فِيْهَا مَعَاشِي،  وَأَصْلِحْ  لِي  آخِرَتِي  الَّتِي  فِيْهَا  مَعَادِي،  وَاجْعَلِ  الـْحَيَاةِ  زِيَادَةً  لِي  فِي كُلِّ  خَيْرٍ، وَالـْمَوْتَ  رَاحَةً  لِي  مِنْ  كُلِّ  شَرٍ

అల్లాహుమ్మ అస్లిహ్ లి దీనీ – అల్లదీ హువ ఇస్మతు అమ్రీ, వ అస్లిహ్ లీ దున్యాయ – అల్లతీ ఫీహా మఆషీ, వ అస్లిహ్ లీ ఆఖిరతీ – అల్లతీ ఫీహా మఆదీ, వజ్అలిల్ హయాత జియాదతన్ లీ ఫీ కుల్లి ఖైరిన్, వల్ మౌత రాహతన్ లీ మిన్ కుల్లి షర్రిన్.

ఓ అల్లాహ్!  నా ఆచరణలను (చెడు నుండి) కాపాడే విధంగా నా ధర్మాన్ని సరిదిద్దు. నా జీవనోపాధి ఉన్న నా ఈ ప్రపంచాన్ని సరిదిద్దు. నేను మరల వలసి ఉన్న నా పరలోకాన్ని సరిదిద్దు. నా కొరకు ప్రతి ఒక్క శుభంలోనూ నా ఈ జీవితాన్ని పొడిగించు. మరియు ప్రతి దుష్టత్వం నుండి నా మరణాన్ని కాపాడు.

أَعُوذُ بِالله مِنْ جَهْدِ الْبَلَاءِ،  وَدَرَكِ الشِّقَاءِ،  وَسُوْءِ الْقَضَاءِ،  وَشَمَاتَةِ الأَعْدَاءِ

అఊదు బిల్లాహి మిన్ జహ్దిల్ బలాఇ, వ దరకిష్షఖాఇ, వ సూఇల్ ఖదాఇ, వ షమాతతిల్ ఆదాఇ.

కఠిన పరీక్షల నుండి, దురదృష్టాల నుండి, నాకు వ్యతిరేకమైన తీర్పుల నుండి మరియు విరోధుల అపహాస్యాల నుండి నేను అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الـْهَمِّ وَالـْحَزَنِ، وَمِنَ الْعَجْزِ وَالْكَسَلِ، وَمِنَ الـْجُبْنِ وَالْبُخْلِ، وَمِنَ الـْمَأْثَمِ وَالـْمَغْرَمِ، وَمِنْ غَلَبَةِ الدِّيْنِ وَقَهْرِ الرِّجَالِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ హమ్మ వల్ హజని, వ మినల్ అజ్ జి వల్ కసలి,  వ మినల్ జుబ్ని వల్ బుఖ్లి, వ మినల్ మఅథమి వల్ మగ్రమి, వ మిన్ గలబతిద్దీని వ ఖహ్రిర్రిజాలి.

ఓ అల్లాహ్! బాధలకు, కష్టాలకు, కలతలకు, విచారానికి, దు:ఖానికి, పీడనలకు, నిస్సహాయానికి, బద్దకానికి, సోమరితనానికి, పిరికితనానికి, పాపాలకు మరియు అప్పులకు, అప్పుల భారముకు మరియు ఇతరులు నాపై ఆధిక్యం చలాయింటానికి వ్యతిరేకంగా నేను నీ శరణు వేడుకుంటున్నాను.

أَعُوذُ بِكَ اللَّهُمَّ مِنَ الْبَرْصِ وَالـْجُنـُوْنِ وَالـْجُذَامِ وَمِنْ سَـيِّءِ الْأَسْقَامِ

అఊదు బిక అల్లాహుమ్మ మినల్ బర్సి, వల్ జునూని, వల్ జుదామి, వ మిన్ సయ్యిఇల్ అస్ఖామి

ఓ అల్లాహ్! కుష్టురోగం నుండి, నల్ల కుష్టురోగం నుండి, పిచ్చితనం నుండి మరియు ఇతర అసహ్యమైన వ్యాధుల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنـِّي أَسْأَلُكَ الْعَفْـوَ وَالْعَافِيَـةَ فـِي الدُّنِيَـا وَالْآخِرَةِ،

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరహ్

ఓ అల్లాహ్! ఇహపరలోకాలలో నీ మన్నింపు మరియు రక్షణ కొరకు నేను నిన్ను వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنـِّي أَسْأَلُكَ الْعَفْـوَ وَالْعَافِيـَةَ فـِي دِيـْنِي وَدُنْيَايَ وَأَهْـلِي وَمَالِي

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ

ఓ అల్లాహ్! నా ధర్మం, నా ప్రపంచం, నా కుటుంబం మరియు నా సంపద యొక్క క్షేమం గురించి మరియు  నా మన్నింపు గురించి నేను నిన్ను వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِي وَآمِنْ رَوْعَاتِي، وَاحْفَظْنِي مِنْ بَيْنَ يَدَيَّ وَمِنْ خَلْفِي وَعَنْ يَمِيْنِي وَعَنْ شِمَالِي، وَمِنْ فَوْقِي وَأَعُوْذُ بِعَظَمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تـَحْتِي

అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, వ ఆమిన్ రౌఆతీ, వహ్ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ, వఅన్ యమీనీ వఅన్ షిమాలీ, వమిన్ ఫౌఖీ, వఅఊదు బి అజమతిక అన్ ఉగ్తాల మిన్ తహ్తీ

ఓ అల్లాహ్! నా తప్పులను దాచివేయి మరియు భయం నుండి నన్ను కాపాడు, నా కుడివైపు నుండి మరియు నా ఎడమ వైపు నుండి మరియు నా పై వైపు నుండి, నా ముందు నుండి మరియు నా వెనుక నుండి నన్ను రక్షించు. నా క్రింద నుండి నేను హత్య చేయబడతానేమో అనే భయంతో నేను నీ ఘనత ఆధారంగా నీ శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ اغْـفِرْ لـِي خَطِيْـئَتـِي وَجَهْلـِي وَإِسْرَافِي فِي أَمْرِي وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنـِّي

అల్లాహుమ్మ గ్ఫర్లీ ఖతీఅతీ వ జహ్లీ వ ఇస్రాఫీ, ఫీ అమ్రీ వ మా అంత ఆలము బిహీ మిన్నీ

ఓ అల్లాహ్! నాకంటే అధికంగా నీకు తెలిసిన నా లోపాలను, అజ్ఞానాన్ని మరియు హద్దుమీరటాన్ని క్షమించు.

أَللَّهُمَّ اغْـفِرْ لـِي جَدِّي وَهَزْلـِي وَخَطَـئِي وَعَـمْدِي وَكُلِّ ذَلِكَ عِنْدِي

అల్లాహుమ్మ గ్ఫర్లీ జిద్దీ వ హజ్లీ, వ ఖతాఇయీ, వ అమ్దీ వ కుల్లు దాలిక ఇందీ

ఓ అల్లాహ్! గంభీరంగా మరియు పరిహాసంగా నేను చేసిన పాపాలను మరియు నా చెడు ఆలోచనలను, నాలోని కొరతలను మరియు నాలోని లోపాలన్నింటినీ  క్షమించు.

أَللَّهُمَّ اغْـفِرْ لِـي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْـتُ وَمَا أَنْـتَ أَعْلَمُ بِهِ مِنِّي، أَنْتَ الـْمُقَدَّمُ وَأَنْتَ الـْمُؤَخِّرُ وَأَنْتَ عَلَى كُلِّ شَـيْءٍ قَدِيْـرٌ

అల్లాహుమ్మగ్ఫర్లీ మా ఖద్దమ్తు, వ మా అఖ్ఖర్తు, వ మా అస్రర్తు, వ మా ఆలంతు, వ మా అంత ఆలము బిహీ మిన్నీ, అంతల్ ముఖద్దిము వ అంతల్ ముఅఖ్ఖిరు వ అంత అలా కుల్లి షైఇన్ ఖదీర్.

ఓ అల్లాహ్! నా ద్వారా పూర్వం జరిగిపోయిన వాటినీ మరియు జరుగబోయే వాటినీ క్షమించు, మరియు రహస్యంగానూ, బహిరంగంగానూ నా ద్వారా జరిగిపోయిన వాటినీ క్షమించు – అవి నా కంటే ఎక్కువగా నీకే తెలుసు. కేవలం నీవు మాత్రమే ఎవరినైనా ముందుకు పంపగలవు లేదా వెనక్కి తీసుకురాగలవు. కేవలం నీవు మాత్రమే అన్నింటిపై ఆధిపత్యం కలిగి ఉన్నావు.

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الثَّبَاتَ فِي الْأَمْرِ وَالْعَزِيْمَةَ عَلَى الرُّشْدِ، وَأَسْأَلُكَ شُكْرَ نِعْمَتِكَ وَحُسْنَ عِبَادَتِكَ، وَأَسْأَلُكَ قَلْباً سَلِيْمـًا وِلِسَاناً صَادِقاً، وَأَسْأَلُكَ مِنْ خَيْرِ مَا تَعْلَمُ، وَأَعُوْذُ بِكَ مِنْ شَرِّ مَا تَعْلَمُ، وَأَسْتَغْـفِرُكَ لـِمَا تَعْلَمُ إِنَّكَ عَلاَّمُ الْغُـيُوْبِ

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక థ్థబాత ఫిల్ అమ్రి, వల్ అజీమత అలర్రుష్ది, వ అస్అలుక షుక్ర నేమతిక వ హుస్న ఇబాదతిక, వ అస్అలుక ఖల్బన్ సలీమా, వ లిసానన్ సాదిఖా, వ అస్అలుక మిన్ ఖైరి మా తాలము, వ అఊదుబిక మిన్ షర్రి మా తాలము, వ అస్తగ్ఫిరుక లిమా తాలము, ఇన్నక అల్లాముల్ గుయూబ్.

ఓ అల్లాహ్! నేను నీ నుండి అన్ని విషయాలలో స్థిరత్వాన్ని మరియు సన్మార్గాన్ని అనుసరించటంలో నిలకడను వేడుకుంటున్నాను. నీ అనుగ్రహాలకు బదులుగా నీకు కృతజ్ఞతలు తెలిపుకునే శక్తినీ మరియు నిన్ను సరిగ్గా ఆరాధించే శక్తినీ ప్రసాదించు. సన్మార్గం పై నడిపించే హృదయాన్ని మరియు సత్యాన్ని పలికే నాలుకను నేను నీ నుండి వేడుకుంటున్నాను. నీకు తెలిసిన మంచిని నేను నీ నుండి కోరుకుంటున్నాను. నీకు తెలిసిన ప్రతి చెడు నుండి నేను నీ వద్ద శరణు కోరుకుంటున్నాను. నీకు తెలిసిన పాపాల నుండి నేను నీ మన్నింపును కోరుకుంటున్నాను. నిశ్చయంగా అన్ని గుప్త విషయాలు నీకే తెలుసు.

أَللَّهُمَّ رَبَّ النَّبِيِّ مـُحَمَّدٍ عَلَيْهِ الصَّلاَةُ وَالسَّلاَمُ اغْـفِرْ لـِي ذَنْبِي، وَأَذْهِبْ غَيْظَ قَلْبِي، وَأَعِذْنِي مِنْ مُّضِلاَّتَ الْفِـتْـنِ مَا أَبْـقَيْتَـنـِي

అల్లాహుమ్మ రబ్బన్నబియ్యి ముహమ్మదిన్ అలైహిస్సలాతు వస్సలామ్ – ఇగ్ఫర్లీ దంబీ వ అద్హిబ్ గైజ ఖల్బీ, వ అయిద్నీ మిమ్ ముదిల్లాతల్ ఫిత్ని మా అబ్ ఖైతనీ.

ఓ అల్లాహ్!  ముహమ్మద్ యొక్క ప్రభువా! నా తప్పులను మన్నింపుము. క్రోధం నుండి నా హదయాన్ని శుభ్రం చేయుము. నేను సజీవంగా ఉండాలని నీవు తలిచినంత కాలం వరకు, నన్ను దారి తప్పించే ఫిత్నాల (దుష్టత్వం) నుండి కాపాడుము.

أَللَّهُمَّ رَبَّ السَّماَوَاتِ وَرَبَّ الْأَرْضِ وَرَبَّ الْعَرْشِ الْعَظِيْمِ، رَبُّناَ وَرَبُّ كُلِّ شـَيْءٍ، فَالِقُ الـْحَبِّ وَالنَّوَى، مُنْزِلُ التَّوْرَاةِ وَالْإِنْجِيْلِ وَالْقُرْآنِ، أَعُوْذُ بِكَ مِنْ شَرِّ كُلِّ شـَيْءٍ أَنْتَ آخِذٌ بِنَاصِيِتـِهِ، أَنْتَ الْأَوَّلُ فَلَيْسَ قَبْلَكَ شَـيْءٌ، وَأَنْتَ الْآخِرُ فَلَيْسَ بَعْدُكَ شَـيْءٌ، وَأَنْتَ الْظَاهِرُ فَلَيْسَ فَوْقُكَ شَـيْءٌ، وَأَنْتَ الْبَاطِنُ فَلَيْسَ دُوْنَكَ شَـيْءٌ، إِقْضِ عَنِّي الدَّيْنَ وَأَغْنِـنِي مِنْ الْفَقْرِ

అల్లాహుమ్మ రబ్బస్సమావాతి వ రబ్బల్ అర్ది వ రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బునా వ రబ్బు కుల్లి షైఇన్, ఫాలిఖుల్ హబ్బి వన్నవా, ముంజిలుత్తౌరాతి వల్ ఇంజీలి వల్ ఖుర్ఆన్, అఊదు బిక మింషర్రి కుల్లి షైఇన్ అంత ఆఖిదుంబి నాశియతిహి, అంతల్ అవ్వలు ఫలైస ఖబ్లక షైఉన్, వ అంతల్ ఆఖిరు ఫలైస బఆదక షైఉన్, వ అంతజ్జాహిరు ఫలైస ఫౌఖక షైఉన్, వ అంతల్ బాతిను ఫలైస దూనక షైఉన్, ఇఖ్ది అన్నీ అద్దీన వ అగ్నినీ మినల్ ఫఖ్రి.

ఓ అల్లాహ్! భూమ్యాకాశాల ప్రభువా మరియు మహోన్నతమైన అర్ష్ సింహాసనం యొక్క ప్రభువా! ఓ మా అందరి యొక్క మరియు అన్నింటి యొక్క ప్రభువా! మొలకెత్తుట కొరకు విత్తనాల్ని మరియు గింజలన్ని చీల్చేవాడా మరియు మొక్కలు మొలకెత్తించేవాడా! నీవే తౌరాతును, గోస్పెలును మరియు ఖుర్ఆన్ ను అవతరింపజేసావు. నీ చేతిలో తన నుదురు చిక్కించుకుని ఉన్న ప్రతిదాని దుష్టత్వం నుండి నేను నీ శరణు కోరుతున్నాను. నీవే ప్రథముడివి – నీకు పూర్వం ఉనికిలో ఏదీ లేదు. నీవే కడపటి వాడివి – నీ తర్వాత ఉనికిలో ఏదీ ఉండదు. నీవే మహోన్నతుడివి – నీ పై ఏదీ లేదు. రహస్యాలన్నీ తెలిసిన వాడివి నీవే. గుప్తంగా దాచబడిన వాటిని నీ కంటే బాగా ఎరిగినవారు ఎవ్వరూ లేరు. నా తరుఫున నా ఋణాలు తీర్చు మరియు లేమీ, పేదరికం, దారిద్ర్యం, శూన్యత్వం మొదలైనవి నా దరిదాపులకు కూడా చేరనంత పటిష్టంగా, అభేద్యంగా నన్ను చేయి.

أَللَّهُمَّ أَعْطِ نَفْسـِي تَقْوَاهَا وَزَكِّـهَا أَنْتَ خَيْرُ مَنْ زَكَّاهَا، أَنْتَ وَلِـيُّهَا وَمَوْلاَهاَ

అల్లాహుమ్మ ఆతీ నఫ్సీ తఖ్వాహా వ జక్కిహా, అంత ఖైరు మిన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా

ఓ అల్లాహ్!  నాకు తఖ్వా (ధర్మనిష్ఠ) ను  ప్రసాదించు మరియు నా ఆత్మను పవిత్రం చేయి. ఉత్తమంగా పవిత్రత చేకూర్చేవాడివి నీవే. ఉత్తముడివి నీవే, నా రక్షకుడివి నీవే మరియు నా పాలకుడివి నీవే.

أَللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنَ الْعَـجَزِ وَالْكَسَلِ، وَأَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْـقَبْرِ

అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్అజజి, వల్ కసలీ, వఅఊదు బిక మిన్ అదాబిల్ ఖబర్

ఓ అల్లాహ్!  నిస్సహాయ స్థితి నుండి మరియు సోమరితనం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు సమాధి శిక్షల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ لَكَ أَسْلَمْتُ وَبِكَ آمَنْتُ وَعَلَيْكَ تَوَكَّلْتُ وَإِلَيْكَ أَنَبـْتُ وَبِكَ خَاصَمْتُ، أَعُوْذُ بِعِزَّتِكَ أَنْ تُضِلَّنِـي لاَ إِلَهَ إِلاَّ أَنْتَ، أَنْتَ الـْحَيُّ الَّذِي لاَ يَمُوْتُ وَالـْجِنُّ وَالْإِنْسُ يَمُوْتُوْنَ

అల్లాహుమ్మ లక అస్లమ్ తు, వ బిక ఆమన్ తు, వ అలైక తవక్కల్ తు, వ ఇలైక అనబ్ తు, వ బిక ఖాసమ్ తు, అఊదు బి ఇజ్జతిక అన్ తుదిల్లనీ, లా ఇలాహ ఇల్లా అంత, అంతల్ హయ్యుల్లదీ  లా యమూతు వల్ జిన్ను, వల్ ఇన్సు యమూతూన్.

ఓ అల్లాహ్! నేను నీకు విధేయుడైనాను మరియు నిన్నే విశ్వసించాను, నిన్నే నమ్ముకున్నాను, నీవైపుకే మరలాను, నీ కొరకు పోరాడాను. మార్గభ్రష్టత్వం నుండి నన్ను కాపాడమని నీ ఘనత ద్వారా నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క నీవు తప్ప. నీవే శాశ్వతమైనవాడివి. నీకు చావు లేదు – కానీ, జిన్నాతులు మరియు మానవులకు చావు ఉంది.

أَللَّهُمَّ إِنِّي أَعُوْذُ بِكَ مِنْ عِلْمٍ لاَ يَـنْـفَعُ وَمِنْ قَلْبٍ لاَ يـَخْشَعُ وَمِنْ نَـفْسٍ لاَ تَشْبَعُ، وَمِنْ دَعْوُةٍ لاَ يُـسْتَجَابُ لَـهَا

అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ ఇల్మిన్ లా యంఫవు, వ మిన్ ఖల్బిన్ లా యఖ్షవు, వ మిన్ నఫ్సిన్ లా తష్బవు, వ మిన్ దావతిన్ లా యుస్తజాబు లహా

ఓ అల్లాహ్! ప్రయోజనం కలిగించని జ్ఞానం నుండి, భయపడని హృదయం నుండి, ఎన్నడూ తనివి తీరని / తృప్తి పొందని ఆత్మ నుండి మరియు స్వీకరించబడని ప్రార్థనల నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.

أَللَّهُمَّ جَنـِّبْـنِي مُنْكَرَاتِ الْأَخْلاَقِ وَالْأَعْمَالِ وَالْأَهْوَاءِ وَالْأَدْوَاءِ

అల్లాహుమ్మ జన్నిబ్ నీ ముంకరాతిల్ అఖ్లాఖి, వల్ ఆమాలి, వల్ అహ్వాయి, వల్ అద్వాయి.

ఓ అల్లాహ్! ప్రతి చెడు ప్రవర్తన నుండి, చెడు పనుల నుండి, చెడు ఆలోచనల నుండి మరియు రోగాల నుండి నేను నీ రక్షణ వేడుకుంటున్నాను.

أّللَّهُمَّ أَلـْهِمْنِي رُشْدِيْ وَأَعِذْنِي مِنْ شَرِّ نَـفْسِي

అల్లాహుమ్మ అల్ హిమ్ నీ రుష్దీ, వ అయిద్ నీ మిన్ షర్రి నఫ్సీ

ఓ అల్లాహ్! నేను మార్గదర్శకత్వం ప్రసాదించు మరియు నాలోని చెడు నుండి నన్ను రక్షించు.

أَللَّهُمَّ اَكْفِنِـي بِحَلاَلِكِ عَنْ حَرَامِكَ وَأَغْنِـنِـي بِـفَضْلِكَ عَمَّنْ سِوَاكَ

అల్లాహుమ్మఅక్ఫీనీ బి హలాలిక అన్ హరామిక, వ అగ్ నినీ బి ఫద్ లిక అమ్మన్ సివాక

ఓ అల్లాహ్! నా ఆవసరాలకు చాలినంతగా నాకు ధర్మసమ్మతమైన జీవనోపాధినే ప్రసాదించు గానీ, అధర్మమైంది కాదు. ఇతరుల నుండి అడుక్కునే గత్యంతరం రానీయకుండా, నీ ఆనుగ్రహాల ద్వారా నన్ను సంతృప్తి పరుచు,

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـهُدَى وَالتُّـقَـى وَالْعَفَافَ وَالْغِـنَـى

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వ త్తుఖా, వల్ అఫాఫ  వల్ గినా

ఓ అల్లాహ్!  నేను నీ నుండి మార్గదర్శకత్వాన్ని, తఖ్వాను (ధర్మనిష్ఠను), సచ్ఛీలతను మరియు సమృద్ధిని కోరుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـهُدَى وَالسَّدَادَ

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ హుదా వస్సదాద

ఓ అల్లాహ్! నేను నీ నుండి మార్గదర్శకత్వాన్ని మరియు క్షేమాన్ని కోరుకుంటున్నాను.

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْـجَنَّةَ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَعُوْذُ بِكَ مِنْ النَّارِ وَمَا قَرَّبَ إِلَيْهَا مِنْ قَوْلٍ أَوْ عَمَلٍ، وَأَسْأَلُكَ أَنْ تَـجْعَلَ كُلَّ قَضَاءٍ قَضَيْتَهُ لِـي خَيْراً

అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ జన్నత, వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔవ్ అమలిన్, వ అఊదుబిక మినన్నారి వ మా ఖర్రబ ఇలైహా మిన్ ఖౌలిన్ ఔవ్ అమలిన్, వ అస్అలుక అన్ తజ్అల కుల్ల ఖదాయిన్ ఖదైతహు లీ ఖైరా

ఓ అల్లాహ్! నేను నీ నుండి స్వర్గాన్ని మరియు స్వర్గం సమీపానికి చేర్చే పలుకు మరియు పని కోరుకుంటున్నాను. నేను నరకాగ్ని నుండి మరియు నరకం సమీపానికి చేర్చే పలుకు మరియు పని నుండి నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నా కోసం వ్రాసిపెట్టిన ప్రతిదానినీ శుభంగా మార్చమని నేను నిన్ను వేడుకుంటున్నాను.

لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيْكَ لَهُ، لَهُ الْـمُلْكُ وَلَهُ الْـحَمْدُ يُـحْيِي وَيُـمِيْتُ بِـيـَدِهِ الْـخَيْـرُ وَهُوَ عَلَى كُلِّ شـَيْءٍ قَـدِيْـرٌ

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హమ్ దు, యుహ్యీ వ యుమీతు, బి యదిహిల్ ఖైరు, వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్

అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గల వారెవ్వరూ లేరు. ఆయన ఏకైకుడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. సకల లోకాలు మరియు సమస్త ప్రశంసలు ఆయనకే చెందుతాయి. చావుబ్రతుకులు ఆయన ఆదేశంతోనే సంభవిస్తాయి. శుభమంతా ఆయన చేతుల్లోనే ఉంది. మరియు ప్రతి దానినీ శాసించే శక్తిసామర్ధ్యాలు గలవాడు ఆయనే.

سُبْحَانَ اللهِ وَالْـحَمْدُ للهِ وَلاَ إِلَهَ إِلاَّ الله وَاللهُ أَكْبَرُ، وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِاللهِ الْعَـلِيِّ الْعَظِـيْمِ

సుబహానల్లాహి, వల్ హమ్ దులిల్లాహి, వ లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్, వ లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీమ్

అల్లాహ్ యే పరమ పవిత్రుడు, సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హతలు గలవారెవ్వరూ లేరు, అల్లాహ్ యే మహోన్నతుడు. అల్లాహ్ తప్ప – అంతటి శక్తిసామర్ధ్యాలు గలవారెవ్వరూ లేరు. ఆయనే మహోన్నతుడు, ఘనత గల వాడూను.

أَللَّهُمَّ صَلِّ عَلَى مُـحَمَّدٍ وَعَلَى آلِ مُـحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيْمَ وَعَلَى آلِ إِبْرَاهِيْمَ إِنَّكَ حَـمِيْدٌ مَـجِيْدٌ، وَبَارِكْ عَلَى مُـحَمَّدٍ وَعَلَى آلِ مُـحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْـرَاهِـيْمَ وَعَلَى آلِ إِبْـرَاهِـيْمَ إِنَّكَ حَـمِيْدٌ مَـجِـيْدٌ

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.

ఓ అల్లాహ్! ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పై మరియు ఆయన కుటుంబంపై నీవు కారుణ్యం కురిపించినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన కుటుంబం పై కారుణ్యం కురిపించు. నిశ్చయంగా కేవలం నీవు మాత్రమే స్తుతింపదగిన వాడవు మరియు గొప్ప ఘనత గల వాడవూను. ఓ అల్లాహ్!  ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) పై మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురిపించు. నిశ్చయంగా కేవలం నీవు మాత్రమే స్తుతింపదగిన వాడవు మరియు గొప్ప ఘనత గలవాడవూను.

رَبَّـنَا آتِنـَا فِي الدُّنْيَا حَسَنَـةً وَفِي الْآخِرَةِ حَسَنَـةً وَقِـنَـا عَذَابَ النَّارِ

రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనవ్ వ ఖినా అదాబన్నార్

ఓ నా ప్రభూ! ఈ లోకంలో మాకు శుభాన్ని ప్రసాదించు మరియు పరలోకంలో మాకు శుభాన్ని ప్రసాదించు మరియు మమ్ముల్ని నరకాగ్ని నుండి కాపాడు.

పై వాటితో పాటు హజ్ యాత్రికులు ఈ పవిత్ర స్థలంలో పూర్తిగా అల్లాహ్ యొక్క స్మరణలతో నిండిన ఇతర దుఆలు కూడా చేస్తూ, వీలయినంత ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపాలి. ఈ దుఆలు చేసేటప్పుడు హృదయ పూర్వకంగా ఏడుస్తూ, ఇహపరలోకాలలో శుభాలు ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవాలి. దుఆ చేసేటపుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా దానిని మూడు సార్లు రిపీట్ చేసేవారు. కాబట్టి మనం కూడా ఆయన సంప్రదాయాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. అరఫహ్ మైదానంలో ముస్లింలు వినయం, నమ్రత, నిగర్వం, అణుకువలను ప్రదర్శిస్తూ, ఆయన దయాదాక్షిణ్యాలను మరియు మన్నింపును ఆశిస్తూ పూర్తిగా అల్లాహ్ వైపు మరలాలి, ఆయన సహాయాన్ని అర్థించాలి, ఆయనకు పూర్తిగా సమర్పించుకోవాలి, ఆయన వైపుకు వంగాలి. ఆయన యొక్క శిక్షలకు మరియు ఆగ్రహానికి వారు భయపడాలి. వారు తాము చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుని, చిత్తశుద్ధితో తౌబా చేసుకుంటూ, వాటిని క్షమించమని పెద్ద ఎత్తున ప్రజలు ఒకే చోట చేరిన ఆ మహోన్నతమైన పర్వదినాన అల్లాహ్ ను వేడుకోవాలి. ప్రత్యేకంగా ఈ రోజున అల్లాహ్ తన దాసులపై ఎక్కువ అనుగ్రహం చూపుతాడు మరియు సగర్వంగా తన దైవదూతల ముందు వారి గురించి కొనియాడతాడు. అల్లాహ్ ప్రత్యేకంగా ఈ రోజున అనేక మందిని నరకంలో నుండి తప్పిస్తాడు. అరఫహ్ రోజున షైతాను ఎన్నడూ లేనంతగా చిన్నబుచ్చుకున్నట్లు మరియు ఘోరమైన పరాభవానికి గురైనట్లు కనబడతాడు – బదర్ యుద్ధం రోజును గాకుండా. తన దాసులపై అల్లాహ్ చూపే అపరిమితమైన అనుగ్రహాలను, అనేక మంది ప్రజలు విడుదల చేయబడటాన్ని మరియు క్షమింపబడటాన్ని  షైతాను ఈరోజున చూస్తాడు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీథు ఆయెషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన ఆధారంగా సహీహ్ బుఖారీలో ఇలా నమోదు చేయబడింది:

مَا مِنْ يَوْمٍ أَكْـثَـرُ مِنْ أَنْ يُـعْـتِـقَ اللهُ فِيْـهِ عَبْداً مِنَ النَّـارِ مِنْ يَوْمِ عَرَفَةَ، وَإِنَّـهُ لَـيَدْنُوْ ثُمَّ يُـبَاهِي بِـهِمُ الْـمَلاَئِكَـةَ فَـيَـقُولُ مَا أَرَادَ هَؤُلاَءِ

మామిన్ యౌమిన్ అక్థరు మిన్ అన్ యుతిఖల్లాహు ఫీహి అబ్దన్ మినన్నారి మిన్ యౌమి అరఫహ్ వ ఇన్నహు లయద్నూ థుమ్మ యుబాహీ బిహిముల్ మలాయికత ఫయఖూలు మా అరాద హఉలాయి

అల్లాహ్  అంత ఎక్కువగా తన దాసులను నరకాగ్ని నుండి విడుదల చేయడు – అరఫాత్ రోజున తప్ప. ఆయన మానవుడికి సమీపంగా వస్తాడు మరియు తన దైవదూతలతో వారి గురించి సగర్వంగా కొనియాడతాడు. ఆయనిలా అంటాడు: “ఈ నా దాసులు ఏమి కావాలని వేడుకుంటున్నారు?”

కాబట్టి ముస్లింలు మంచి నడవడికను ప్రదర్శిస్తూ, తమ బద్ధశత్రువైన షైతానును అవమానం పాలు చేయవలెను. ఎంత ఎక్కువగా వారు మనస్ఫూర్తిగా అల్లాహ్ స్మరిస్తూ, వేడుకుంటూ, తాము చేసిన పాపాలన్నింటికీ పశ్చాత్తాప పడుతూ మరియు అల్లాహ్ యొక్క మన్నింపును అర్థిస్తూ ఉంటే, షైతాను అంత ఎక్కువగా నిరాశా, నిస్పృహలకు గురవుతూ, బాధ పడతాడు. సూర్యాస్తమయం వరకు యాత్రికుడు అల్లాహ్ యొక్క స్మరణలో మరియు దుఆలలో మనస్పూర్తిగా ఏడుస్తూ గడప వలెను.

సూర్యాస్తమయం తర్వాత, ప్రజలు ప్రశాంతంగా ముజ్దలిఫహ్ వైపుకు మరలాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంప్రదాయాన్ని అనుసరిస్తూ, వారు తరుచుగా తల్బియహ్పలుకుతూ ఉండాలి మరియు ముజ్దలిఫహ్ ప్రాంతంలో వ్యాపించాలి. సూర్యాస్తమయం కంటే ముందే అరఫాత్ మైదానం వదిలిపెట్టడం అనుమతించబడలేదు.

సూర్యాస్తమయం పూర్తయ్యే వరకు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అరఫహ్ మైదానంలో గడిపారు. అంతిమ హజ్ లో ఆయన ఇలా బోధించారు:

خُـذُوْا عَنِّي مَـنَاسِكَـكُمْ

ఖుదూ అన్నీ మనాసికకుమ్

“నా నుండి మీరు మీ హజ్ ఆచరణలు నేర్చుకోండి”


ఈ వ్యాసం క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో
అరబీ పుస్తక రచయిత : షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్).
తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, పునర్విమర్శ : షేక్ నజీర్ అహ్మద్


హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత

అరఫా రోజు ఉపవాసం సౌదీ అరేబియా అరఫా రోజు ఉండాలా? లేక తను ఉన్న ప్రాంతంలోని కేలండర్ ప్రకారం ఉండాలా ? [వీడియో]

బిస్మిల్లాహ్

[14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత