
ప్రశ్న: ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి ఈ పది దినాలలో వేటినుండి దూరంగా ఉండవలెను?
సున్నహ్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉపదేశాల ప్రకారం) బలిదానం (ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి తన వెంట్రుకలను, గోళ్ళను కత్తిరించడం మరియు తన చర్మం నుండి దేన్నైనా సరే తొలగించడం మొదలైనవి ఈ దిల్ హజ్జ్ పది దినాల ఆరంభం నుండి బలిదానం సమర్పించే వరకు (ఖుర్బానీ చేసే వరకు) మానివేయవలెను. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించి ఉన్నారు: “దిల్ హజ్జ్ యొక్క క్రొత్త నెలవంక చూడగానే, మీలో ఎవరైనా ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) సమర్పించాలనుకుంటే, అది పూర్తి చేసే వరకు (పశుబలి పూర్తి చేసే వరకు) తన వెంట్రుకలను మరియు గోళ్ళను కత్తిరించడం మానివేయవలెను.” ఇంకో ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినట్లు నమోదు చేయబడినది: “అతను తన వెంట్రుకలు లేక చర్మం నుండి (దానిని అంటిపెట్టుకుని ఉన్న వాటిని) దేనినీ తొలగించకూడదు.” (నలుగురు ఉల్లేఖకులతో సహీహ్ ముస్లిం హదీథ్ గ్రంథంలో నమోదు చేయబడినది, 13/146)
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఈ ఆదేశాలు ఒక దానిని తప్పని సరిగా చేయమంటున్నాయి (ఖుర్బానీని). ఇంకా వారి యొక్క నిషేధాజ్ఞలు ఇంకో దానిని (వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించటాన్ని) హరామ్ (ఎట్టి పరిస్థితులలోను చేయకూడదు) అని ప్రకటిస్తున్నాయి. సరైన అభిప్రాయం ప్రకారం ఈ ఆదేశాలు మరియు నిషేధాజ్ఞలు బేషరతుగా మరియు తప్పించుకోలేనివిగా ఉన్నాయి. అయితే, ఎవరైనా వ్యక్తి ఈ నిషేధించిన వాటిని కావాలని చేసినట్లయితే, అతను వెంటనే అల్లాహ్ యొక్క క్షమాభిక్ష అర్థించవలెను. అతని బలిదానం (ఖుర్బానీ) స్వీకరించబడును. అంతే కాని దానికి ప్రాయశ్చితంగా అదనపు బలిదానం (ఖుర్బానీ) సమర్పించుకోవలసిన అవసరంలేదు; హాని కలిగిస్తున్న కారణంగా ఉదాహరణకు చీలిపోయిన గోరు బాధపెట్టటం, వెంట్రుకలున్నచోట గాయం కావటం మొదలైన అత్యవసర పరిస్థితుల వలన కొన్ని వెంట్రుకలు లేక గోరు తొలగించవలసి వస్తే, అటువంటి వారు వాటిని తొలగించవచ్చును. అలా చేయటంలో ఎటువంటి తప్పూ, పాపమూ లేదు. ఇహ్రాం స్థితి ఎంతో ముఖ్యమైనదప్పటికీ, వెంట్రుకలు లేక గోళ్ళు వదిలివేయటం వలన హాని కలుగుతున్నట్లయితే, వాటిని కత్తిరించటానికి అనుమతి ఇవ్వబడినది. దిల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో స్త్రీలు గాని, పురుషులు గాని తమ తల వెంట్రుకలను కడగటంలో ఎటువంటి తప్పూ లేదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాాహు అలైహి వసల్లం వాటిని కత్తిరించటాన్నే నిరోధించినారు గాని వాటిని కడగటాన్ని నిరోధించలేదు.
వెంట్రుకలు లేక గోళ్ళు తీయటం పై ఉన్న నిషేధం వెనుక ఉన్న వివేచన ఏమిటంటే బలిదానం సమర్పిస్తున్నతని అల్లాహ్ కు దగ్గర కావాలనుకుని చేస్తున్న ఈ పశుబలి వంటి కొన్ని ధర్మాచరణలు, హజ్జ్ లేక ఉమ్రా యాత్రలో ఇహ్రాం స్థితిలో ఉన్నవారితో సమానం. కాబట్టి వెంట్రుకలు, గోళ్ళు తీయటం వంటి కొన్ని ఇహ్రాం స్థితిలోని నిబంధనలు పశుబలి ఇస్తున్న వారికి కూడా వర్తిస్తాయి. దీనిని పాటించటం వలన అల్లాహ్ అతనిని నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడని ఒక ఆశ. అల్లాహ్ యే అత్యుత్తమమైన జ్ఞానం కలిగినవాడు.
ఒకవేళ ఎవరైనా దుల్ హజ్జ్ నెలలోని మొదటి పది దినాలలో ఉదియహ్ (బలిదానం) ఇవ్వాలనే సంకల్పం లేకపోవటం వలన తన వెంట్రుకలు లేక గోళ్ళు తీసి, ఆ తర్వాత ఉదియహ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే, ఆ క్షణం నుండి అతను వెంట్రుకలు లేక గోళ్ళు తీయకుండా ఉండవలెను.
కొందరు స్త్రీలు దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలలో తమ వెంట్రుకలను కత్తిరించుకునేందుకు వీలుగా, తమ బలిదానాన్నిచ్చే బాధ్యతను తమ సోదరులకు లేక కొడుకులకు అప్పగిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, బలిదానం సమర్పిస్తున్న వారికే ఈ నిబంధన వర్తిస్తుంది – అసలు పశుబలిని పూర్తి చేసే బాధ్యత ఇతరులకు అప్పగించినా, అప్పగించకపోయినా. ఎవరికైతే ఆ బాధ్యత ఇవ్వబడినదో వారికి ఈ నిబంధన వర్తించదు. స్వయంగా ఇష్టపడి ఇతరుల పశుబలి చేస్తున్నా లేక ఇతరులు తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తున్నా, అటువంటి వారి పై ఈ నిషేధము వర్తించదు.
ఇంకా, ఈ నిబంధన బలిదానం (ఖుర్బానీ) చేస్తున్నతని పైనే ఉంటుంది గాని అతని భార్యాబిడ్డలకు వారు కూడా వేరుగా బలిదానం(ఖుర్బానీ) చేస్తున్నట్లయితేనే తప్ప వర్తించదు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ కుటుంబం తరఫున బలిదానం సమర్పించేవారు కాని వారిని తమ వెంట్రుకలు, గోళ్ళు తీయకుండా ఈ నిబంధనలు పాటించమని ఆదేశించినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.
ఎవరైనా బలిదానం(ఖుర్బానీ) సమర్పించాలని నిశ్చయించుకుని, ఆ తర్వాత హజ్జ్ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నట్లయితే, వారు ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు వెంట్రుకలు గాని గోళ్ళు గాని తీయకూడదు. ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు అవసరమైనప్పుడు వెంట్రుకలు లేక గోళ్ళు తీయటమనేది సాధారణ సమయాలలో మాత్రమే పాటించే ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారం. కాని ఒకవేళ “తమత్తు” పద్ధతి ప్రకారం హజ్జ్ చేస్తున్నట్లయితే, [ఉమ్రా పూర్తి చేసి, ఇహ్రాం స్థితి నుండి బయటకు వచ్చి, మరల హజ్జ్ కోసం క్రొత్తగా ఇహ్రాం స్థితిలో ప్రవేశించేవారు], ఉమ్రా పూర్తి చేసిన తర్వాత తన వెంట్రుకలను చిన్నగా కత్తిరించకోవలెను. ఎందుకంటే వెంట్రుకలు తీయటమనేది ఉమ్రాలోని ఒక ఆచరణ.
పైన తెలిపిన హదీథ్ లో బలిదానం(ఖుర్బానీ) ఇచ్చేవారికి వర్తించే నిబంధనలన్నీ తెలియజేయబడినవి. సుగంధద్రవ్యాల వాడకంలో లేక భార్యతో సంభోగం చేయటంలో లేక కుట్టబడిన దుస్తులు ధరించటంలో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. అల్లాహ్ కే ప్రతిదీ తెలియును.
అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్, రివ్యూ: షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాంహౌస్ వారి సౌజన్యంతో
ఖుర్బానీ (జిబహ్, బలిదానం, ఉద్-హియ)
- ఖుర్బానీ దుఆ ( రెండు దుఆలు ఇవ్వబడ్డాయి)
- ఖుర్బానీ ఆదేశాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఖుర్బానీ అసలు ఉద్దేశ్యం,ఖుర్బానీ ప్రాముఖ్యత, ఖుర్బానీ ఘనత, ఖుర్బానీ ఎవరి కొరకు?, కొన్ని ముఖ్య విషయాలు, ఖుర్బానీ నిబంధనలు, ఖుర్బానీ జంతువు లోపాలు, జిబహ్ షరతులు, తప్పులు సరిదిద్దుకుందాం, మృతుల వైపున ఖుర్బానీ. - సమాధుల, దర్గాల వద్ద జంతుబలి ఇవ్వటం, కానుకలు సమర్పించుకోవటం, శ్రద్ధాంజలి ఘటించటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్
- అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ (జంతు బలిదానం) చేయుట షిర్క్ అక్బర్ – ఇమామ్ అస్-సాదీ
You must be logged in to post a comment.