జిల్ హిజ్జా (హజ్ నెల) తొలి దశ ఘనత [వీడియో]

వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

Video Courtesy: Dawah and Foreigners guidance office, zulfi, Saudi Arabia.

జిల్ హిజ్జలోని తొలిదశ

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం

ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 12వ మాసమైన జిల్ హిజ్జలోని తొలిదశ (అంటే మొదటి పది రోజుల)కు చాలా ఘనతలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇవి:

1- అల్లాహ్ సూర ఫజ్ర్ (89)లో దీని ప్రమాణం చేశాడు

2- ఈ దశలోనే అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం గావించాడు. (బుఖారి 4407).

3- ఈ దశలోనే ఇస్లాం యొక్క మూల స్థంబాలు ఏకమవుతాయి, ఇలా వేరే రోజుల్లో కావు.

4- ఈ దశలో చేయబడే సత్కార్యాలు అల్లాహ్ కు ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే అధికంగా ఇష్టం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: జిల్ హిజ్జ తొలి దశకంలో చేసే సత్కార్యాలు ఇతర దినాల్లో చేసే సత్కార్యాల కన్నా అల్లాహ్ కు ఎక్కువగా ప్రియమైనవి, శ్రేష్ఠమైనవి, (అబూ దావూద్ 2438, బుఖారి 969). ఔన్నత్యాల రీత్యా అవి చాలా గొప్ప దినాలు, వాటిలో అధికంగా లాఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్ హందులిల్లాహ్ అంటూ ఉండండి. (అహ్మద్ 10/296). వాటిలో చేసే సత్కార్యాలకు పుణ్య ఫలం ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల ఫలం కన్నా ఎక్కువగా లభిస్తుంది. (దార్మీ 1815).

5- వాటిలో ఒక రోజు; అరఫా రోజు (9 వ రోజు) ఘనత:

  • (1) సూర బురూజ్ (85)లోని  3వ ఆయతులో ‘వమష్ హూద్’ అని ఆ రోజు ప్రమాణం చేయడం జరిగింది.
  • (2) హాజీల గురించి అది చాలా ముఖ్య- మైన రోజు, అది లేనిది హజ్ నెరవేరదు. (తిర్మిజి 889).
  • (3) ఆ రోజు అల్లాహ్ ప్రజల్ని నరకం నుండి విడుదల చేసినంత మరే రోజూ చేయడు, (ముస్లిం 1348).
  • (4) ఆ రోజు అరఫాత్  మైదానంలో వచ్చిన హాజీల పాపాలు ఇసుక  కణాలు, వర్షపు చుక్కలు, లేదా సముద్రపు నురుగంత ఉన్నా అల్లాహ్ క్షమిస్తాడు, ఇంతే కాదు, వారు ఎవరి గురించి దుఆ చేస్తారో వారి పాపాలు కూడా మన్నించేస్తాడు. (బజ్జార్ 6177, సహీహ్ తర్గీబ్ 1113).
  • (5) ఉత్తమమైన దుఆ అరఫా రోజు చేసే దుఆ. (తిర్మిజి 3585).
  • (6) హజ్ చేయనివారు అరఫా రోజు ఉపవాసముండాలి, అందుకు వారి గత రెండు సంవత్సరాల పాపాలు మన్నించ- బడతాయి. (ముస్లిం 1162).

5- ఈ తొలిదశకంలోని చివరి రోజును ‘యౌం నహ్ర్’ (జంతు బలిదాన ‘ఖుర్బానీ’ దినం) అంటారు, అల్లాహ్ దృష్టిలో యౌం నహ్ర్ మరియు దాని తర్వాత రోజు కన్నా ఉత్తమమైన రోజులు మరేమీ లేవు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (అబూ దావూద్ 1765).

అందుకే ఈ దశను అదృష్టంగా భావించి పుణ్యాల్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా ఈ సత్కార్యాలు: విశ్వాస పునరుద్ధరణ, నమాజుల స్థాపితం, దానదర్మాలు, నఫిల్ (అరఫా) ఉపవాసాలు, హజ్, ఉమ్రాలు, ఖుర్బానీ చేయడం, స్త్రీ పురుషులందరూ ఈద్ గాహ్ కు వెళ్ళడం, అధికంగా జిక్ర్ (అల్లాహ్ స్మరణ) చేయడం, చెడుకు దూరంగా ఉండడం, ప్రత్యేకంగా షిర్క్, బిద్అత్, బంధు,మిత్ర సంబధాలను తెంచడం లాంటి నుండి. ఎక్కువగా తౌబా, ఇస్తిగ్ఫార్ మరియు ఖుర్ఆన్ పారాయణం చేస్తూ ఉండడం.

హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత కోసం క్రింద క్లిక్ చెయ్యండి
https://teluguislam.net/2010/10/07/ten-days-of-dhul-hijjah/

జిల్ హజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత
https://teluguislam.net/2019/07/16/dhul-hijjah-1o-days/

అరఫా రోజు (హజ్జ్ నెల 9 రోజు) ఘనత [ఆడియో]
https://teluguislam.net/2019/07/26/day-of-arafah-virtues/

హజ్ ప్రాముఖ్యత & దాని పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [ఆడియో – 70 నిమిషాలు]
https://teluguislam.net/2019/07/27/hajj-rewards-equal-good-deeds/

ఖుర్బానీ ఆదేశాలు
https://teluguislam.net/2019/07/16/qurbani-animal-sacrifice-udhiyah/

ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ స్నేహితులు మరియు బంధువులు మా teluguislam వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

%d bloggers like this: