వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (1:39 నిముషాలు)
ఇతరములు:
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (1:39 నిముషాలు)
ఇతరములు:
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 30
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం – 30
1) ఒక ప్రత్యేక దైవదూత ద్వారా పంపబడిన ప్రఖ్యాత ఖుర్ఆన్ వాక్యాలు ఏవి?
A) సూరాహ్ అలఖ్ లో తొలి 5 వాక్యాలు
B) సూరాహ్ ఫాతిహా మరియు సూరాహ్ బఖరహ్ లో చివరి 2 వాక్యాలు
C) సూరాహ్ కహఫ్ మొదటి మరియు చివరి 10 వాక్యాలు
2) అప్పగింతలో ద్రోహం – అబద్ధం – వాగ్ధాన భంగం – మరియు దుర్భాషలాడటం ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటాయి?
A) ముస్లిం
B) మొమిన్
C) మునాఫిక్
3) అల్లాహ్ వద్ద పుణ్యం పరంగా అతి గొప్ప గుటక ఏది?
A) కోపం దిగమింగే గుటక
B) ఉపవాసం లో త్రాగే నీటిగుటక
C) జమ్ జమ్ నీటి గుటక
క్విజ్ 30: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [16 నిమిషాలు]
1) ఒక ప్రత్యేక దైవదూత ద్వారా పంపబడిన ప్రఖ్యాత ఖుర్ఆన్ ఆయతులు ఏవి?
B] సూర ఫాతిహా మరియు సూర బఖరహ్ లో చివరి 2 ఆయతులు
సహీ ముస్లిం 806లో ఉంది, ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు,
عَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: بَيْنَمَا جِبْرِيلُ قَاعِدٌ عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، سَمِعَ نَقِيضًا مِنْ فَوْقِهِ، فَرَفَعَ رَأْسَهُ، فَقَالَ: ” هَذَا بَابٌ مِنَ السَّمَاءِ فُتِحَ الْيَوْمَ لَمْ يُفْتَحْ قَطُّ إِلَّا الْيَوْمَ، فَنَزَلَ مِنْهُ مَلَكٌ، فَقَالَ: هَذَا مَلَكٌ نَزَلَ إِلَى الْأَرْضِ لَمْ يَنْزِلْ قَطُّ إِلَّا الْيَوْمَ، فَسَلَّمَ، وَقَالَ: أَبْشِرْ بِنُورَيْنِ أُوتِيتَهُمَا لَمْ يُؤْتَهُمَا نَبِيٌّ قَبْلَكَ: فَاتِحَةُ الْكِتَابِ، وَخَوَاتِيمُ سُورَةِ الْبَقَرَةِ، لَنْ تَقْرَأَ بِحَرْفٍ مِنْهُمَا إِلَّا أُعْطِيتَهُ “
ఒకరోజు జిబ్రీల్ అలైహిస్సలాం మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని ఉండగా పై నుండి ఒక ద్వారం తెరువబడే శబ్దం వినిపించింది. జిబ్రీల్ అలైహిస్సలాం తల పైకెత్తి, ‘ఆకాశంలోని ఒక ద్వారం తెరువబడింది, ఇది దాని శబ్దమే. ఇంతకు ముందు ఎన్నడూ ఆ ద్వారం తెరువబడలేదు’. అని అంటుండగా ఆ ద్వారం గుండా ఒక దైవదూత దిగాడు, ఆ దైవదూత గురించి చెబుతూ, ‘భూమిపైకి దిగిన ఈ దైవ దూత, ఇంతకుముందు ఎన్నడూ దిగలేదు,’ అని అన్నారు. వెంటనే ఆ దైవదూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సలామ్ చేసి, ‘మీకు రెండు కాంతులు ఇవ్వబడినందుకు సంతోషించండి, అవి ఇతర ప్రవక్త లెవ్వరికీ ఇవ్వబడ లేదు. అవి (1) సూరహ్ ఫాతిహా, (2) సూరహ్ బఖరహ్ లోని చివరి ఆయతులు. మీరు వీటిలోని ఏ అక్షరాన్ని పఠించినా, దాని పుణ్యం మీకు లభిస్తుంది లేక ఏ దు’ఆ చేసినా అది అంగీకరించబడుతుంది” అని చెప్పాడు.
ملخص الجواب : أن خواتيم سورة البقرة آيات مدنية ، وأن إعطاء الله تعالى هذه الآيات لنبيه صلى الله عليه وسلم ليلة المعراج ، يحتمل أنه أوحى بهما إليه بلا واسطة ، ثم نزلتا مرة أخرى في المدينة ، أو أن الله بشره بنزول هذه الآيات عليه ، ثم نزلتا حقيقة في المدينة ، وأما حديث ابن عباس فيحتمل أنه نزول بالآيات ، أو نزول بالفضل ومالثواب .
[ఈ హదీసు వివరణ:-] రెండు వెలుగులంటే సూరహ్ ఫాతిహా (1), సూరహ్ బఖరహ్(2) చివరి వాక్యాలు. తీర్పుదినం నాడు ఈ రెండు వెలుగుగా మారుతాయి. వీటి వెలుగులో ఖుర్ఆన్ పఠించేవారు నడుస్తూ ఉంటారు. ”నూరుహుమ్ యస్ఆ బైన అయ్దీహిమ్” (సూర తహ్రీమ్ 66:8). మరియు సూరహ్ బఖరహ్ చివరి భాగం అంటే ”ఆమనర్రసూలు’ నుండి చివరి వరకు.
సూరహ్ ఫాతిహా చాలాప్రాధాన్యత ఉంది. దీని పేరు ఉమ్ముల్ ఖుర్ఆన్, సబ్’ఉమసా’నీ, సూరహ్ షిఫా’ సూరతుల్ క’న్జ్, సూరతు ‘స్సలాహ్, దీన్ని పఠించనిదే నమా’జ్ నెరవేరదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,
”అల్లాహ్ ఆదేశం, ”నేను నమా’జ్ అంటే సూరహ్ ఫాతిహాను నాకూ నా దాసునికి మధ్య చెరిసగం పంచివేసాను. ఎవరు నన్ను ఏది కోరితే దాన్నే అతనికి ప్రసాదిస్తాను. ఒకవేళ దాసుడు, ‘అల్’హమ్దులిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్’ అని అంటే అల్లాహ్ ‘హమిదనీ అబ్దీ’ నా దాసుడు నన్ను స్తుతించాడు అని అంటాడు. దాసుడు ‘అర్ర’హ్మానిర్ర’హీమ్’ అని అంటే అల్లాహ్ ‘అస్నా’అలయ్య అబ్దీ’, నా దాసుడు నన్ను కీర్తించాడు అని అంటాడు. దాసుడు, ‘మాలికి యౌమిద్దీన్’ అంటే అల్లాహ్, ‘మజ్జదనీ అబ్దీ’, నా దాసుడు నా గొప్పతనాన్ని కొనియాడాడు, అని అంటాడు. దాసుడు, ‘ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్,’ అని అంటే అల్లాహ్, ‘ఇది నాకు నా దాసునికి మధ్య ఉంది. దాసుడు ఏది కోరితే అది నేను ప్రసాదిస్తాను.’ ఆ తరువాత దాసుడు చివరి వరకు పఠిస్తే, అల్లాహ్, ‘ఇదంతా నా దాసునికోసమే ఉంది, అతడు ఏమి కోరితే అదే అతని కోసం ఉంది,’ అని అంటాడు.” (నిసాయి’)
ఈ సూరహ్ మొత్తం స్తోత్రం, కీర్తనం, ప్రార్థనలతో నిండి ఉంది. అందువల్లే దీన్ని వెలుగు అనడం జరిగింది. అదేవిధంగా సూరహ్ బఖరహ్ చివరి ఆయతులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ప్రార్థన, ప్రార్థనా ఫలితం రెండూ ఉన్నాయి. అది, ‘ఆమనర్రసూలు నుండి చివరి వరకు.
తఫ్సీర్ ఇబ్నె కసీ’ర్లో ‘స’హీ’హ్ బు’ఖారీ ఉల్లేఖనంలో ఈ రెండిటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ విధంగా ఉంది, ”ఎవరు ఈ రెండు ఆయతులను రాత్రి పఠిస్తే అతని కొరకు అవి సరిపోతాయి.”
ముస్నద్ అ’హ్మద్లో ఇలా ఉంది. “సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు దైవసింహాసనం క్రింద ఉన్న నిధిలో నుండి నాకు ఇవ్వ బడ్డాయి. నా కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవి ఇవ్వబడ లేదు.”
‘స’హీ’హ్ ముస్లిమ్లో ఇలా ఉంది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ చేసినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ”సిద్రతుల్ మున్తహా” వరకు వెళ్ళారు. అది ఏడవ ఆకాశంపై ఉంది. భూమి నుండి పైకి వెళ్ళే ప్రతి వస్తువు సిద్రతుల్ మున్తహా వద్దకు చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోవటం జరుగు తుంది. ఆకాశం నుండి వచ్చేది కూడా ఇక్కడి వరకే చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోబడుతుంది. దీన్ని బంగారు పిచ్చుకలు కప్పి ఉంటాయి. ఇక్కడ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు 3 వస్తువులు ఇవ్వ బడ్డాయి. (1) 5 పూటల నమా’జులు, (2) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, (3) ఏకదైవారాధకులందరి క్షమాపణ.
ముస్నద్లో ఇలా ఉంది, ” ‘ఉఖ్బహ్ బిన్ ‘ఆమిర్తో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, ”సూరహ్ బఖరహ్ లో ఈ చివరి ఆయతులు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండు. నాకు అవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి.”
ఇబ్నె మర్ద్వైలో ఇలా ఉంది, “మాకు ఇతరులపై మూడు విధాలా ఆధిక్యత లభించింది. సూరహ్ బఖరహ్ చివరిఆయతులు, ఇవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి. నా కంటే ముందు ఎవ్వరికీ ఇవ్వబడ లేదు. నా తరువాత కూడా ఎవ్వరికీ ఇవ్వబడవు.”
ఇబ్నె మర్ద్వైలో ఇలా ఉంది. ‘అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ముస్లిముల్లోని ఎవరైనా ఆయతుల్ కుర్సీ మరియు సూరహ్ బఖరహ్ చివరి వాక్యాలు చదవకుండా పడుకుంటారని నేననుకోను. ఇవి మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు దైవసింహాసనం క్రింద ఉన్న నిధి నుండి లభించాయి.“
మరో తిర్మిజి 2882′ ‘హదీసు’లో ఇలా ఉంది, “అల్లాహ్ భూమ్యా కాశాలను సృష్టించడానికి రెండువేల సంవత్సరాల ముందు ఒక గ్రంథం వ్రాయబడింది. ఇందులో రెండు ఆయతులు లిఖించి సూరహ్ బఖరహ్ పూర్తి చేయబడింది. ఎవరి ఇంటిలో మూడు రోజుల వరకు పఠించబడుతుందో, ఆ ఇంటి సమీపానికి కూడా షై’తాన్ రాలేడు.” (షేక్ అల్బానీ సహీ అన్నారు.)
ఇబ్నె మర్ద్వైహ్లో ఇలా ఉంది, ”ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, ఆయతుల్ కుర్సీ పఠిస్తే నవ్వుతారు, ఇంకా ఈ రెండు దైవసింహాసనం క్రింద నిధి నుండి లభించాయి,” అని అంటారు.
కొన్ని ‘హదీసు’ల్లో ఇలా ఉంది,
“దాసుడు, ‘గుఫ్రానక రబ్బనా,’ అని ప్రార్థిస్తే అల్లాహ్ , ‘నఅమ్, నేను నీ పాపాలను క్షమించాను,’ అని అంటాడు, ఒకవేళ దాసుడు ”రబ్బనా, లాతుఆ’ఖిజ్’నా,” – ‘ఓ అల్లాహ్ మా పాపాల పట్ల మమ్మల్ని విచారించకు,’ అని అంటే అల్లాహ్ సమాధానంగా, ‘నేనలాగే చేస్తాను,’ అని అంటాడు. ఒకవేళ, ”లాత’హ్మిల్ ‘అలైనా,” – ‘నాకు శక్తిలేని భారం వేయకు,’ అని అంటే అల్లాహ్, ‘నేనలాగే చేస్తాను, అంటే శక్తికి మించిన బరువు వేయనని’ అంటాడు, ఒకవేళ దాసుడు, ”వ ‘అఫు అన్నా” – ‘ఓ అల్లాహ్ నన్ను క్షమించు,’ అని అంటే అల్లాహ్, ‘నేను క్షమించివేస్తాను,’ అని అంటాడు. ఒక వేళ, ”వ’గ్ఫిర్లనావర్’హమ్నా,” – ‘మమ్మల్నిక్షమించు కరుణించు,’ అని అంటే అల్లాహ్ , ”మేము క్షమిం చాము, కరుణించాము,” అని అంటాడు. ఒకవేళ, ”ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్,” – ‘మాకు అవిశ్వా సులపై సహాయం చేయి,’ అని అంటే అల్లాహ్ , ”మేము మీకు సహాయం చేసాము అని అంటాడు.”
2) అప్పగింతలో ద్రోహం – అబద్ధం – వాగ్ధాన భంగం – మరియు దుర్భాషలాడటం ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటాయి?
C] మునాఫిక్
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِصًا، وَمَنْ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا: إِذَا اؤْتُمِنَ خَانَ، وَإِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا عَاهَدَ غَدَرَ، وَإِذَا خَاصَمَ فَجَرَ
”ఏ వ్యక్తిలో ఈ 4 గుణాలుంటాయో అతడు ఖచ్చితంగా కపటాచారియే. ఎవరిలోనైనా వీటిలోని ఒక్క గుణం ఉంటే అతడు దానిని వదలనంత వరకు అతనిలో ఒక కాపట్య చిహ్నం ఉన్నట్టే. ఆ 4 గుణాలు ఇవి: 1. అమానతు ఉంచబడితే ద్రోహం తలపెడతాడు; 2. మాట్లాడితే అసత్యం పలుకుతాడు; 3. వాగ్దానం చేస్తే వాగ్దానభంగం చేస్తాడు; 4. వివాదం తలెత్తితే తిట్లకు దిగుతాడు”. (బు’ఖారీ, ముస్లిమ్)
3) అల్లాహ్ వద్ద పుణ్య పరంగా అతి గొప్ప గుటక ఏది?
A) కోపం దిగమింగే గుటక
అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللهِ، مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللهِ
“అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్ఠానికై దాసుడు మింగే కోపాగ్ని గుటక”. (ఇబ్ను మాజ 4189, అహ్మద్ 2/ 128, అదబుల్ ముఫ్రద్ 1318, సహీహుత్తర్గీబ్: అల్బానీ 2752).
ఇలాంటి ఎన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయో, అప్పుడు మనం ఈ హదీసును, ఈ గొప్ప పుణ్యఫలితాన్ని గుర్తుకు తెచ్చుకుంటామా? అల్లాహ్ కొరకు మన కొపాన్ని మింగి పుణ్యాన్ని పొందుతామా?
కోపం వచ్చినప్పుడు కోపం ప్రకారం ఆచరించడానికి శక్తి ఉండికూడా కోపాన్ని దిగమ్రింగేవారిని అల్లాహ్ సుబ్ హానహు వతఆలా ప్రశంసించి, వారికి మన్నింపు, క్షమాపణ, స్వర్గప్రవేశ శుభవార్త ఇచ్చాడు.
الَّذِينَ يُنْفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالكَاظِمِينَ الغَيْظَ وَالعَافِينَ عَنِ النَّاسِ وَاللهُ يُحِبُّ المُحْسِنِينَ * وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَنْ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللهُ وَلَمْ يُصِرُّوا عَلَى مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ * أُولَئِكَ جَزَاؤُهُمْ مَغْفِرَةٌ مِنْ رَبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَنِعْمَ أَجْرُ العَامِلِينَ {آل عمران: 134-136}
“ఎవరు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు కోపాన్ని దిగమ్రింగుతారో ఇంకా ప్రజలను మన్నిస్తారో, (ఇలాంటి) సజ్జనులను అల్లాహ్ ప్రేమిస్తాడు. మరెవరైతే (వారి ద్వారా) ఏదైనా అశ్లీల పని జరిగితే లేదా వారు తమపై అన్యాయం చేసుకుంటే, వెంటనే అల్లాహ్ ను స్మరించి తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. –నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు?- వారి ద్వారా జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు (మంకుపట్టు పట్టరు). ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది”. (ఆలె ఇమ్రాన్ 3:134-136).
ఈ ఘనమైన ఫలం పైన మరో ప్రతిఫలం ఏమిటంటే; అతనికిష్టమైన హూరె ఐన్ (అందమైన పెద్ద కళ్ళుగల స్వర్గపు సుందర కన్య)ను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. సహల్ బిన్ ముఆజ్ తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ، دَعَاهُ اللهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
“ఎవరు తన కోపాన్ని దిగమింగుతాడో, అతను దానిని అమలు పరచడానికి శక్తి ఉండి కూడా (దిగమింగుతాడో), అల్లాహ్ ప్రళయదినాన అతనిని ప్రజల ఎదుట పిలుస్తాడు, అతనికిష్టమైన హూరె ఐన్ ను ఎన్నుకునే అధికారం ఇస్తాడు”. (అబూదావూద్ 4777, తిర్మిజి 2493, ఇబ్నుమాజ 4186, అల్బానీ సహీహుత్తర్గీబ్ 2753లో హసన్ అని చెప్పారు).
ఏదైనా ప్రాపంచిక వృధాకార్యం కోసం నీవు ఇంతటి గొప్ప పుణ్యాన్ని వదులుకుంటావా? ప్రజల్ని ఓటమికి గురి చేసేవాడు శక్తిశాలి కాదు, తన కోపాన్ని దిగమ్రింగేవాడు అసలైన శక్తిశాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الغَضَب
“ఎదుటి వానిని చిత్తుచేసినవాడు శూరుడు కాదు, తాను ఆగ్రహానికి గురైనప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన శూరుడు”. (బుఖారి 6114, ముస్లిం 2609, అహ్మద్ 2/ 236.).
وكان عند ميمون بن مهران ضيف، فاستعجل على جاريته بالعشاء، فجاءت مسرعة ومعها قصعة مملوءة، فعثرت وأراقتها على رأس سيدها ميمون، فقال: يا جارية أحرقتني، قالت: يا معلم الخير، ومؤدب الناس، ارجع إلى ما قال الله تعالى، قال: وما قال الله تعالى؟ قالت: قال: ﴿ وَالْكَاظِمِينَ الْغَيْظَ ﴾ [آل عمران: 134]، قال: قد كظمت غيظي، قالت: ﴿ وَالْعَافِينَ عَنِ النَّاسِ ﴾ [آل عمران: 134]، قال: قد عفوت عنك، قالت: زِد؛ فإن الله تعالى يقول: ﴿ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ ﴾ [آل عمران: 134]، قال: أنت حرة لوجه الله تعالى [إحياء علوم الدين].
رابط الموضوع:
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 22
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ప్రశ్నల పత్రం – 22
1) నిశ్చయంగా ఏ వేళ చదివే ఖుర్ఆన్ పారాయణం అల్లాహ్ వద్ద సాక్ష్యం ఇస్తుంది?
A) జుహార్ వేళ
B) ఫజర్ వేళ
C) మిట్ట మద్యాహ్నం వేళ
2) ‘రజబ్’ నెలలో ఏదైనా ప్రత్యేక ఇబాదత్ (ఆరాధన) దైవప్రవక్త (ﷺ) వారు ఆజ్ఞాపించారా?
A) అవును – రజబ్ కుండే
B) అవును – షబేమేరాజ్
C) ఖాజా బంధ నవాజ్ ఉర్సు
D) పై వాటిలో ఏదీ లేదు
3) అషర ముబష్షర (శుభవార్తపొందిన 10 మంది సహాబాల ) యొక్క ప్రత్యేకత ఏమిటి?
A) బ్రతికి ఉండగానే స్వర్గం యొక్క శుభవార్త పొందారు
B) వీరే యుద్ధ వీరులన్న ప్రత్యేకత
C) అరబ్ అందరిలో ఉత్తములన్న ప్రత్యేకత
క్విజ్ 22: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [13:07 నిమిషాలు]
ఇతరములు :
తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz
నమాజు నిధులు (Treasures of Salah)
రజబ్ నెల మరియు దాని గురించిన మూఢనమ్మకాలు
క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
08. ఖురాన్ మహాత్యాల పుస్తకం (కితాబ్ ఫధాయిల్ అల్ -ఖురాన్)
[హదీసులు] [PDF] [47 పేజీలు]
1. ఖుర్‌ఆన్ పారాయణ నియమాలు
2. ఖుర్‌ఆన్ పారాయణ రకాలు, దాని సంకలనం
మూలం: మిష్కాతుల్ మసాబీహ్ నుండి
సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
హదీసుల పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా
సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం (تفسير سُورةُ الفاتحة)
సూరహ్ అల్ ఫాతిహా (ప్రారంభం)
మూలం: అహసనుల్ బయాన్, First Edition February 2009, శాంతి మార్గం పబ్లికేషన్స్ ట్రస్ట్, హైదరాబాద్:
పరిచయం:
సంకలనం రీత్యా దివ్యఖుర్ఆన్ లో ఇది మొట్టమొదటి సూరా. ఈ సూరాలో తౌహీద్ (అంటే ఏకదైవారాధన) ప్రధానంగా కనబడుతుంది. దేవుని పట్ల విశ్వాసం, దైవారాధన, దేవుణ్ణి సహాయం కోసం వేడుకోవడం, దేవుని ప్రార్థించడం గురించి ఇందులో ముఖ్యంగా నొక్కి చెప్పడం జరిగింది. ఈ సూరాలో ఏడు ఆయతులున్నాయి. అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు, స్తోత్రాలకు, అభ్యర్థనలకు యోగ్యుడనీ, అల్లాహ్ మాత్రమే పరిపూర్ణుడనీ, ఇహలోకానికి, పరలోకానికి అల్లాహ్ మాత్రమే ప్రభువనీ, ఆయనే సృష్టికర్త అనీ ఈ ఏడు ఆయతులలో నిర్దిష్టంగా చెప్పడం జరిగింది.
ఈ సూరాకు ‘అల్ ఫాతిహా’ (ప్రారంభం) అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే, ఇది దివ్యఖుర్ఆన్ కు ప్రారంభ అధ్యాయం. ఈ సూరా దివ్య ఖుర్ఆన్ కు తల్లివంటిదనీ, దివ్య ఖుర్ఆన్ సారం ఇందులో ఉందని కూడా చెప్పడం జరిగింది.
ముస్లిములు చేసే నమాజుల్లో తప్పనిసరిగా చదువవలసిన సూరా ఇది. రోజూ చేసే అయిదు పూటల నమాజు కాని, లేక స్వచ్ఛందంగా చేసే ఐచ్ఛికమైన నమాజుల్లో కాని ప్రతి నమాజులో ఈ సూరాను పఠించటం తప్పనిసరి. ప్రారంభ సూరా చదువకపోతే ముస్లిములు చేసే ఏ నమాజూ స్వీకరించ బడదని ముస్లిం ధర్మవేత్తలు ఖచ్చితంగా చెప్పారు.
ధర్మవేత్తల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రారంభ సూరా (అల్ ఫాతిహా), పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం వంటిది. ఈ సూరా పూర్తి ఖుర్ఆన్ కు సారాంశం అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇస్లాంకు సంబంధించిన ప్రధానమైన భావనలను, నియమాలను అన్నింటినీ ఈ సూరా క్లుప్తంగా తెలియజేస్తుంది. మౌలికమైన ఇస్లామీయ భావనలు, ప్రధానమైన ఇస్లామీయ విశ్వాసాలు, అంటే దేవుని ఏకత్వం (దేవుడు ఒక్కడే అని విశ్వసించడం, దేవునికి భాగస్వాములు ఎవరూ లేరని విశ్వసించడం, దేవునికి సాటి ఎవరూ లేరని విశ్వసించడం), దేవుని గుణగణాలను గురించి ఈ సూరా సరళంగా, సూటిగా, సంక్షిప్తంగా మనిషికి తెలియజేస్తుంది. ముస్లిములు అల్లాహ్ ను, అంటే ఒకే ఒక్క ఆరాధ్యుడిని తప్ప మరెవ్వరినీ అర్థించరాదనీ, ఎవరి ముందూ చేతులు చాపరాదనీ, మనిషి సాటి మనిషికి దాస్యం చేయరాదనీ, కేవలం దేవునికి మాత్రమే తన ఆరాధనను అంకితం చేసుకొని, ఆయన ముందు మాత్రమే తలవంచాలని బోధిస్తుంది. దేవునికి మానవ గుణగణాలు ఆపాదించడాన్ని ఖండిస్తుంది. అల్లాహ్ కు ఎవరూ సమానులు కారు. అల్లాహ్ వంటి వారు మరెవ్వరూ లేరు. మనిషి ఆయన్ను విశ్వసించాలి. విశ్వాసంతో ఆయన్నే ఆరాధించాలి.
ఈ సూరా రెండు సమాన భాగాలుగా ఉన్నట్లు కనబడుతుంది. మొదటి భాగంలో అల్లాహ్, ఆయన గుణగణాల గురించి ఉంది. రెండవ భాగంలో మనిషి గురించి, మనిషికి దేవునితో ఉన్న అవసరం గురించి ఉంది.
అల్ ఫాతిహా సూరా వ్యాఖ్యానం:
అల్ ఫాతిహా సూరా దివ్య ఖుర్ఆన్ లోని మొట్ట మొదటి సూరా. హదీసుల ద్వారా కూడా దీని మహత్తు తెలుపబడింది. ఫాతిహ అంటే ఆరంభించటం, మొదలు పెట్టడం అని అర్థం. అందుకే దీనిని “ఫాతిహతుల్ కితాబ్” అంటే పుస్తకారంభం అని పిలవటం జరిగింది. ఈ సూరాకు మరిన్ని పేర్లు కూడా ఉన్నట్లు హదీసుల ద్వారా రూఢీ అవుతోంది. ఉదాహరణకు:
ఇంకా అనేక పేర్లు ఈ సూరాకు ఉన్నాయి.
ఈ సూరాకు గల ఇంకొక పేరు ‘అస్సలాత్’. హదీసె ఖుద్ సీ లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు: “ఖసమ్ తు స్సలాత బైనీ వ బైన అబ్దీ” (సహీహ్ ముస్లిం : కితాబుస్సలాత్) – అంటే “నేను సలాత్ (నమాజు)ను నాకు – నా దాసునికి మధ్య విభజించాను” అని భావం. అంటే ఫాతిహా సూరా నన్నమాట! ఈ సూరాలోని సగభాగంలో దైవ స్తోత్రం చేయబడింది. ఆయన దయాదాక్షిణ్యాలు, పోషణ, న్యాయశీలం, విశ్వ సామ్రాజ్యాధికారం అభివర్ణించబడ్డాయి. మిగిలిన సగభాగంలో దైవసన్నిధిలో దాసుడు చేసుకునే విన్నపాలు, అభ్యర్థనలు వివరించబడ్డాయి.
ఈ హదీసులో ఫాతిహా సూరాను ‘నమాజు’ గా అభివర్ణించడం జరిగింది. దీన్ని బట్టి నమాజులో ఈ సూరాను పఠించటం చాలా అవసరమని స్పష్టమవుతోంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాల ద్వారా ఈ విషయం పదే పదే స్పష్టపరచటం జరిగింది: ఉదాహరణకు: – “లా సలాత లిమన్ ల్లమ్ యఖ్ రఅ బి ఫాతిహతిల్ కితాబ్” (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం). అర్థం: ఫాతిహా సూరా పఠించని వ్యక్తి నమాజు నెరవేరదు. ఈ హదీసులోని అరబీ మూలంలో వచ్చిన ‘మన్’ అనే పదం సర్వసాధారణమైనది. నమాజు చేసే ప్రతి వ్యక్తికీ ఇది వర్తిస్తుంది. వ్యక్తిగత స్థాయిలో నమాజు చేసినా, సామూహికంగా నమాజు చేసినా, నమాజు చేయించే ఇమాము అయినా, ఇమామును అనుసరించే వారయినా – అందరూ ఈ సూరాను చదవవలసిందే. నెమ్మదిగా చేసే (సిర్రీ) నమాజులోనయినా, బిగ్గరగా చేసే (జహ్రీ) నమాజులోనయినా, విధిగా చేయవలసిన (ఫర్జ్) నమాజులోనయినా, స్వచ్ఛందంగా చేసుకునే (నఫిల్) నమాజులోనయినా – నమాజు చేసే ప్రతి ఒక్కరూ ఈ సూరాను చదవటం తప్పనిసరి. క్రింద పేర్కొనబడిన హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తోంది:
ఒకసారి ఫజ్ర్ (ఉదయం) నమాజులో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు ఆయన సహచరులు (రదియల్లాహు అన్హుమ్) కూడా ఖుర్ఆన్ పారాయణం చేయసాగారు. తత్కారణంగా నమాజులో ఖుర్ఆన్ పఠించడానికి ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. నమాజును ముగించిన తరువాత ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) తన సహచరుల నుద్దేశ్యించి, “ఏమిటీ? మీరు కూడా (నా వెనకాల) ఖుర్ఆన్ పఠించారా?” అని అడిగారు. దానికి సహచరులు “అవున”ని చెప్పారు. అప్పుడు ఆయన (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “మీరిలా చేయకండి – నాతో పాటు పఠించకండి – అయితే ఫాతిహా సూరా ను మాత్రం తప్పక పఠించాలి. ఎందుకంటే దాన్ని పఠించనిదే నమాజు నెరవేరదు” (అబూ దాఊద్, తిర్మిథీ, నసాయి).
అలాగే మరో హదీసు – హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు: “మన్ సల్లా సలాతన్ లమ్ యఖ్రఅ ఫీహా బి ఉమ్మిల్ ఖుర్ఆని ఫహియ ఖిదాజున్” సలాతున్ ఘైరు తమామ్: (ఎవరయితే ఫాతిహా సూరా లేకుండానే నమాజు చేశాడో అతని నమాజు లోపభూయిష్టమైనదవుతుంది – అది పరిపూర్ణమైన నమాజు కాబోదు). దైవప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) మూడుసార్లు ఈ మాటన్నారు. “మేము ఇమాము వెనుక కూడా నమాజు చేస్తాము కదా! మరప్పుడేం చేయాలి?” అని కొంతమంది హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ను ప్రశ్నించగా, “ఇమాము వెనుక ఉన్నప్పుడు (అంటే సామూహిక నమాజు చేస్తున్నప్పుడు) మీరు మనసులోనే – లోలోపలే – ఫాతిహా సూరా పఠించండి” అని ఆయన (రదియల్లాహు అన్హు) సమాధానమిచ్చారు. (సహీహ్ ముస్లిం)
పై రెండు హదీసుల ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే, దివ్య ఖుర్ఆన్ లో సెలవీయబడినట్లు, “దివ్య ఖుర్ఆన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినండి, మౌనంగా ఉండండి” (అల్ అరాఫ్ – 204). అలాగే హదీథులో చెప్పబడినట్లు – “సామూహిక నమాజుకు సారధ్యం వహించే వ్యక్తి (ఇమాము), గ్రంథ పారాయణం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి.” దీని భావం ఏమిటంటే బిగ్గరగా చేయించే నమాజులలో వెనుక నిలబడివున్న నమాజీలు (ముక్తదీలు) ఫాతిహా సూరా తరువాత మిగిలిన పారాయణమంతటినీ మౌనంగా వినాలి. ఇమాముతో పాటే ఖుర్ఆన్ పారాయణం చేయకూడదు. లేదంటే, ఇమాము, తన వెనుకనున్న అనుయాయులు కూడా సహీహ్ హదీథుల కనుగుణంగా ఫాతిహా సూరాను పఠించడానికి వీలుగా ఫాతిహా సూరా ఆయతులను బాగా ఆగి ఆగి పారాయణం చేయాలి. లేదా ఫాతిహా సూరా ముగించిన తరువాత తన అనుయాయుల (ముక్తదీల) సౌకర్యార్థం ఇమాము చాలినంత వ్యవధిని ఇవ్వాలి. అలా చేస్తే ముఖ్తదీలు ఫాతిహా సూరా వాక్యాలను లోలోపలే చదవుకుంటారు. ఇలా చేయటం ఖుర్ఆన్ హదీథుల దృష్ట్యా ఆక్షేపణీయం కూడా కాదు. పైగా ఖుర్ఆన్, హదీథు – రెండింటి ఆదేశాలను పాటించినట్లవుతుంది. దీనికి భిన్నంగా ఫాతిహా సూరా పఠనాన్ని వారించటం వల్ల అనవసరంగా కొన్ని లేనిపోని సంశయాలకు తావిచ్చినట్లవుతుంది. ఉదా:- దివ్యఖుర్ఆన్ మరియు ప్రామాణిక హదీథులు పరస్పరం సమన్వయం చెందటం లేదనీ, వాటి మధ్య వైరుద్ధ్యం ఉందనీ, ఆ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే ఆచరణయోగ్యమైనదనీ, ఏక కాలంలో రెండింటినీ అనుసరించటం దుస్సాధ్యమనీ (దైవం మన్నించుగాక) కుంటిసాకులు వెతికే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించినట్లవుతుంది. మరిన్ని వివరాలకై అల్ అరాఫ్ 204వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను కూడా చూడండి. (ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే మౌలానా అబ్దుర్రహ్మాన్ ముబారక్ పూరి గారి ‘తహ్ కీకుల్ కలామ్’ పుస్తకం, ఇంకా మౌలానా ఇర్షాదుల్ హఖ్ అథ్రీ గారి పుస్తకాలు చదవండి). ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. ముక్తదీ గనక ఇమామ్ చేసే ఖుర్ఆన్ పారాయణం వింటున్నట్లయితే ఫాతిహా సూరా పఠించరాదనీ, ఒకవేళ వినని సందర్భంలో మాత్రం తప్పకుండా ఫాతిహా సూరా పఠించాల్సిందేనని ‘సలఫ్’లో (ఈ పదం వివరణ కోసం దయచేసి గ్రంథం చివరిలో ఇవ్వబడిన పద విశ్లేషణ చదవండి) అత్యధికమంది తెలిపినట్లు ఇమామ్ ఇబ్నె తైమియా అభిప్రాయపడ్డారు. (మజ్మూయె ఫతావా ఇబ్నె తైమియా 23/265).
ఇది మక్కీ సూరా. అంటే ఈ సూరా మక్కాలో అవతరించిందన్నమాట! మక్కా లేక మదీనాలో అవతరించిందంటే భావం: మహాప్రవక్త (సల్లల్లాహ్ అలైహి వసల్లం) హిజ్రత్ చేయక మునుపు (మదీనాకు వలస పోక పూర్వం) అవతరించిన సూరాలన్నీ మక్కీ సూరాలనబడతాయి. మరి ఆ సూరాలన్నీ పవిత్ర మక్కా నగరంలోనే అవతరించి ఉండనవసరం లేదు. సమయం సందర్భాలను బట్టి మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాలలో అవతరించి ఉన్నప్పటికీ అవి మక్కీ సూరాలుగానే పరిగణించబడతాయి. అలాగే హిజ్రత్ (దైవదౌత్య అందిన 13 ఏండ్ల తరువాత జరిగిన మదీనా వలస ప్రయాణం) అనంతరం అవతరించిన సూరాలు – అవి మదీనాలో అవతరించినా లేక మదీనా పొలిమేరల్లో అవతరించినా లేక మదీనా నగరానికి బహుదూరాన అవతరించినా – అవన్నీ మదనీ సూరాలుగానే వ్యవహరించబడతాయి. ఆఖరికి అవి మక్కాలో లేక మక్కా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అవతరించి ఉన్నాసరే!
“బిస్మిల్లాహ్” విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రతి సూరాకు మొదట్లో వచ్చే ప్రత్యేకమైన వచనమా? లేక ప్రతి సూరాలో అంతర్భాగమా? లేక ఫాతిహా సూరాలోని ఒక ఆయతా? లేక ఏ సూరాలోనూ అంతర్భాగం కాని అదనపు వచనమా? అంటే కేవలం ఒక సూరాను మరొక సూరా నుంచి విడదీయడానికి సూచనగా ప్రయోగించబడిన వాక్యమా? – అన్న విషయంపై మీమాంస ఉంది. దీన్ని ఫాతిహా సూరా సమేతంగా అన్ని సూరాలలో అంతర్భాగంగా మక్కా మరియు కూఫా ఖుర్ఆన్ పఠితలు (ఖుర్రాలు) ఖరారు చేశారు. కాగా; ఇది ఒక ఆయతుగా ఏ సూరాలోనూ అంతర్భాగం కాదని మదీనా, బస్రా, సిరియా పారాయణకర్తలు అన్నారు. కాకపోతే నమల్ సూరాలోని 30వ వచనంలో వచ్చిన ‘బిస్మిల్లాహ్’ ను మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో ఆయతుగా శిరసావహించారు. అలాగే బిగ్గరగా పఠించే నమాజులలో ‘బిస్మిల్లాహ్’ ను బిగ్గరగా చదివే అంశంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. బిగ్గరగా చదవాలని కొందరు భావిస్తుండగా, నెమ్మదిగా పఠించాలని మరికొంతమంది తలపోస్తున్నారు (ఫతహుల్ ఖదీర్). అధిక సంఖ్యాక విద్వాంసులు మాత్రం నెమ్మదిగా పఠించాలన్న విషయానికే ప్రాధాన్యతనిచ్చారు. అంతమాత్రం చేత బిగ్గరగా పఠించటం విపరీతం కాదు – బిగ్గరగా పఠించటం కూడా ధర్మసమ్మతమే.
‘బిస్మిల్లాహ్’ అంటే ‘అల్లాహ్ పేరుతో’ అని మాత్రమే అర్థం వస్తుంది. కనుక దానికి ముందు అఖ్రవు (నేను చదువుతున్నాను), అబ్ దవు (నేను ప్రారంభిస్తున్నాను), అత్ లూ (నేను పారాయణం చేస్తున్నాను) – లాంటిది ఏదో ఒక పదం ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. అంటే అల్లాహ్ పేరుతో మొదలెడుతున్నాను, అల్లాహ్ పేరుతో అధ్యయనానికి ఉపక్రమిస్తున్నాను అని భావం. ప్రతి పనికి ముందు “బిస్మిల్లాహ్” పలకమని గట్టిగా తాకీదు చేయబడింది. భోజనం చేసేటప్పుడు, జంతువును జిబహ్ చేసేటప్పుడు, ఉదూ చేయ సంకల్పించినప్పుడు, ఆఖరికి సంభోగానికి ముందు కూడా ‘బిస్మిల్లాహ్’ పఠించాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ పారాయణం మొదలెడుతున్నప్పుడు బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ ను పఠించటం అనివార్యమైనప్పటికీ, దానికి ముందు అవూదు బిల్లాహి మినష్షయితానిర్రజీమ్ ను పఠించడం కూడా ఎంతో అవసరమే. ఎందుకంటే “ఫయిదా ఖరతుల్ ఖుర్ఆన ఫస్తయిజ్ బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్” (మీరు ఖుర్ఆన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకోండి – సూరా అన్నహ్ల్:98) అన్న ఆదేశం విస్మరించరానిది.
అల్ ఫాతిహా సూరా
అవతరణ: మక్కా – ఆయతులు : 7
[1]. అల్ హమ్దు: ఇందులో ‘అల్’ అనే పదం ప్రత్యేకతను, సమీకృతాన్ని సూచిస్తోంది. సమస్త స్తోత్రములు అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయనీ, అవి ఆయనకే ప్రత్యేకమనీ భావం. ఎందుకంటే ప్రశంసలకు అసలు అర్హుడు అల్లాహ్ యే. ఎవరిలోనయినా ఏదైనా ప్రత్యేకత, సద్గుణం, నేర్పు ఉంటే అది కూడా అల్లాహ్ సృజించినదే. అందుచేత స్తోత్రానికి అర్హుడు కూడా ఆయనే. అల్లాహ్: ఇది అల్లాహ్ నామం. వేరొకరి కోసం ఈ నామాన్ని ఉపయోగించటం సమ్మతం కాదు. అల్ హమ్దులిల్లాహ్ : ఇది కృతజ్ఞతా పూర్వకమయిన పలుకు. హదీథుల ద్వారా ఈ వచనం అత్యంత మహత్ పూర్వకమైనదని వెల్లడవుతోంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ : శ్రేష్ఠమయిన వేడుకోలు అని ఒక హదీథులో ఉంది (సుననె తిర్మిథీ). “అల్ హమ్దులిల్లాహ్ తమ్ లవుల్ మీజాన్” – ‘అల్ హమ్దులిల్లాహ్ త్రాసును నింపేస్తుంది’ అని మరొక హదీథులో అనబడింది. (సహీహ్ ముస్లిం). అందుకే దాసుడు తినే, త్రాగే ప్రతిసారీ అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవటాన్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడని వేరొక హదీథులో చెప్పబడింది (సహీహ్ ముస్లిం).
[2]. రబ్బ్ : అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలలో ఇదొకటి. రబ్బ్ అంటే ప్రతి వస్తువును సృష్టించటంతో పాటు దాని అవసరాలు, అక్కరలను తీర్చి, దానికి పరిపూర్తి నొసగేవాడు అని అర్థం. ఈ పదాన్ని ఈ భావంలో వేరొకరికై ఉపయోగించటం సమ్మతం కాదు. ఒకవేళ ఇతరులను ఈ పేరుతో సంబోధించదలిస్తే దానికి ముందుగాని వెనుకగాని మరో పదం వాడాలి. ఉదా: అబ్దుర్రబ్ (ప్రభువు యొక్క దాసుడు). అంతేగాని కేవలం ‘రబ్’ అని ఇతరులెవరినీ పిలువకూడదు. ఆలమీన్ అనే పదం ఆలమ్ అనే పదానికి బహువచనం. ఆ మాటకొస్తే సమస్త సృష్టిరాసుల సముదాయాన్ని ఆలమ్ గా వ్యవహరిస్తారు. అందుకే సాధారణంగా ఈ పదాన్ని బహువచనంలోకి తీసుకోరు. అయితే దేవుని పరిపూర్ణ పోషకత్వాన్ని, సమగ్ర ప్రభుతను వెల్లడించే ఉద్దేశ్యంతో ఆలమీన్ అనే బహువచనాన్ని తీసుకురావటం విశేషం. సృష్టిరాసుల్లోని వేర్వేరు రకాలను, కోవలను గురించి ఇక్కడ తెలియజెప్పటం ముఖ్యోద్ధేశ్యం అన్నమాట! ఉదాహరణకు: జిన్నుల జగతి, మానవ జగతి, దైవదూతల లోకం, పశుపక్షాదుల ప్రపంచం ఇత్యాదివి. ఈ సృష్టితాలన్నింటి అవసరాలు వేరు. తీరుతెన్నులు వేరు. అయితే రబ్బిల్ ఆలమీన్ (సమస్త లోకాలను పోషించేవాడు) మాత్రం వాటి స్వరూప స్వభావాలను, అవసరాలను, స్థితిగతులను దృష్టియందుంచుకుని వాటికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు.
[3]. రహ్మాన్: రహ్మాన్, రహీమ్ – ఇవి రెండూ అధిక అర్థాలనిచ్చే పదాలే. ఈ రెండింటిలోనూ అధికమైన, అనంతమైన, అపారమైన అనే భావం తొణకిసలాడుతోంది. అంటే అల్లాహ్ అపారంగా కనికరించేవాడు. ఆయనలోని ఈ గుణం ఇతర గుణగణాల మాదిరిగా శాశ్వతమైనది, స్థిరమైనది. కొంతమంది పండితులు ఈ సందర్భంగా ఏమంటారంటే; రహీమ్ కన్నా రహ్మాన్ అనే పదంలో విస్తృత భావం ఉంది. అందుకే రహ్మానద్దునియా వల్ ఆఖిరతి అని అనబడుతుంది. అంటే ఇహపర లోకాల్లోనూ కరుణించేవాడని అర్థం. ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలు సర్వ సాధారణం. విశ్వాసులు – అవిశ్వాసులన్న విచక్షణ లేకుండా అందరూ ఈ ప్రపంచంలో ఆయన దయాదాక్షిణ్యాలకు నోచుకుంటున్నారు. కాని పరలోకంలో ఆయన కేవలం రహీమ్ గా మాత్రమే ఉంటాడు. అంటే అక్కడ ఆయన దయానుగ్రహాలు కేవలం విశ్వాసులకు మాత్రే పరిమితం అయి ఉంటాయి. “నేను ఆ కారుణ్యాన్ని నాకు భయపడేవారి కొరకూ, జకాత్ ఇచ్చే వారి కొరకూ, మా ఆయతులను విశ్వసించే వారి కొరకు తప్పకుండా వ్రాస్తాను” (అల్ అరాఫ్ – 156). అల్లాహుమ్మజ్ అల్నా మిన్ హుమ్. (అల్లాహ్! మమ్మల్ని కూడా ఆ భాగ్యవంతులలో చేర్చుగాక).
[4]. మనిషి ప్రపంచంలోనూ తాను చేసిన కర్మలకు ప్రతిఫలం కొంతవరకు అనుభవించినప్పటికీ పరలోకంలోనే అసలు సిసలు ఫలితం బయటపడుతుంది. సంపూర్ణమైన ప్రతిఫలం అక్కడే ఉనికిలోనికి వస్తుంది. ప్రతి వ్యక్తికీ అతను చేసిన మంచి లేక చెడు పనులను బట్టి అల్లాహ్ అతనికి బహుమానం ఇవ్వటమో, శిక్ష విధించటమో జరిగి తీరుతుంది. ఇదే విధంగా ప్రపంచంలో కూడా తాత్కాలికంగా అనేకమందికి కొన్ని అధికారాలుంటాయి. కాని పరలోకంలో మాత్రం అధికారాలన్నీ అల్లాహ్ హస్తగతం అవుతాయి. తీర్పుదినాన ఆయన తిరుగులేని సార్వభౌమాధికారిగా ఉంటాడు. “ఈ రోజు విశ్వసామ్రాజ్యాధికారం ఎవరిదో చెప్పండి?” అంటూ ఆనాడాయన ప్రశ్నిస్తాడు. “తిరుగులేని వాడు, ఏకైకుడైన అల్లాహ్ దే” అంటూ ఆయనే సమాధానం కూడా ఇస్తాడు (అల్ మోమిన్ – 16) “ఆనాడు, ఏ మనిషీ ఎవరికొరకైనా ఏదన్నా చెయ్యగలగటమన్నది అసంభవం, ఆ రోజు అధికారమంతా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.” (ఇన్ ఫితార్ – 19) – అదీ తీర్పుదినమంటే!
[5]. ఇబాదత్ అంటే ఒకరి ప్రసన్నతను చూరగొనెందుకు అత్యంత అణుకువను, అశక్తతను, వినయ వినమ్రతలను అభివ్యక్తం చేయటం అని భావం. ఇబ్నె కథీర్ మాటల్లోనే చెప్పాలంటే, “షరిఅత్ లో సంపూర్ణమైన ప్రేమ, అభిమానం, భయము, భక్తీ – వీటన్నింటి సమ్మేళనమే ఇబాదత్.” అంటే ఎవరిపట్లనయితే ప్రేమాభిమానాలు కలిగి ఉంటామో, ఆయన శక్తియుక్తుల ముందు తమ నిస్సహాయ స్థితినీ, దైన్యస్థితినీ వ్యక్త పరచాలి. ఆ శక్తిమంతుడు తమను నిలదీసి అడుగుతాడన్న భీతి కూడా ఆ దాస్యంలో తొణకిసలాడుతూ ఉండాలి. విషయాన్ని సాదాసీదా చెప్పవలసి ఉంటే “నా బుదుక, వ నస్తయీనుక” (మేము నిన్ను ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్ను అర్థిస్తాము) అని అనబడేది. కాని, అల్లాహ్ ఇక్కడ “ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్” అని నొక్కి వక్కాణించి ఈ వాక్యానికి ప్రత్యేకతను, వైశిష్ఠ్యాన్ని కల్పించాడు – అంటే దీని అర్థం: “ఓ అల్లాహ్! మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము” అని.
దీని ప్రకారం అల్లాహ్ ను గాక వేరొకరిని పూజించటం గానీ, సహాయం కొరకు వేరేతరులను మొరపెట్టుకోవటం గానీ ధర్మసమ్మతం కాదు. ఈ పదాల ద్వారా షిర్క్ (అల్లాహ్ కు భాగస్వాముల్ని నిర్ణయించటం) నిర్ద్వంద్వంగా ఖండించబడింది. కాని హృదయాలలో షిర్క్ రోగం తిష్ఠవేసి ఉన్నవారు ఈ మూలాంశాన్ని విస్మరించి, అపోహలో పడిపోయి, భ్రమలకు లోనై పిడివాదానికి దిగుతారు. మనం జబ్బుపడినప్పుడు డాక్టరు సహాయం పొందటం లేదా? ఇల్లాలి సేవల్ని పొందటం లేదా? ఇరుగు పొరుగువారి తోడ్పాటును, డ్రైవరు సాయాన్ని పొందటం లేదా? అని దబాయిస్తారు. ఈ విధంగా వాళ్లు, అల్లాహ్ గాక వేరితరుల సహాయాన్ని అర్థించటం కూడా సమ్మతమేనని మీరు ఒప్పుకునేలా చేయటానికి ప్రయత్నిస్తారు. నిజానికి కారకాలకు లోబడి ఒండొకరి సహాయాన్ని కోరటం, సహాయపడటం షిర్క్ కానే కాదు. ఇదైతే దేవుడు సమ్మతించి ఆమోదించిన వ్యవస్థ. ఆ వ్యవస్థలోని పనులన్నీ బాహ్యకారకాలకు అనుగుణంగానే జరుగుతాయి. కడకు దైవప్రవక్తలు సయితం మనుషుల సహాయసహకారాలను పొందుతూ ఉంటారు. దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం తన జాతి జనులనుద్దేశించి, ‘అల్లాహ్ (ధర్మం) కొరకు నాకు సహాయపడేవారు మీలో ఎవరున్నారు?’ అని అడిగారు (అస్సఫ్ – 14). అల్లాహ్ స్వయంగా విశ్వాసుల నుద్దేశించి, “సత్కార్యం, దైవభక్కికి సంబంధించిన విషయాలలో ఒకరికొరకు సహకరించండి” అని సెలవిచ్చాడు. (అల్ మాయిదా: 2)
మరి ఇటువంటి సహాయసహకారాలు నిషేధించబడటంగానీ, షిర్క్ గా అభివర్ణించబడటం గానీ జరగలేదు. పైగా ఇలాంటి పనులు జరగాలని ప్రోత్సహించటమైంది. ఇలాంటి సత్కార్యాలు ప్రశంసనీయంగా పేర్కొనబడ్డాయి. వాస్తవమైన షిర్క్ తో దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. బాహ్యపరమైన కారకాల రీత్యా సహాయం చేయటం ఏమాత్రం చేతకాని వానిని, సహాయం చేయజాలని వానిని “సహాయం చెయ్యి” అని అర్థించటమే అసలు షిర్క్. ఉదాహరణకు: చనిపోయిన ఒకానొక వ్యక్తిని సహాయం కోసం మొరపెట్టుకోవటం, అతడు కష్టాల నుండి గట్టెక్కిస్తాడనీ, అక్కరలు తీరుస్తాడని తలపోయటం, లాభనష్టాలు అతని అధీనంలో ఉన్నాయని ఊహించటం, దగ్గరున్నవారు పిలిచినా, దూరమున్నవారు మొరపెట్టుకున్నా, ప్రతి ఒక్కరి మొరలను ఆలకించే ‘శక్తి’ అతనిలో ఉందని నమ్మటం – ఇదంతా దైవానికి వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టడంగా, భాగస్వామ్యం కల్పించటంగా, దేవుని లక్షణాలను వేరొకరికి ఆపాదించటంగా పరిగణించబడుతుంది. ఇదే షిర్క్! దురదృష్టవశాత్తూ ముస్లిం దేశాలలో సయితం ఇటువంటి షిర్క్ వర్థిల్లుతోంది. మహనీయుల (ఔలియాల) పట్ల ప్రేమ కలిగి ఉండటం అవసరం మరి! అంటూ ముస్లింలు ఈ ప్రేమాభిమానంలో అతిశయిల్లి రాగానపడి షిర్కుకు ఒడిగడుతున్నారు. ఇటువంటి పోకడలబారి నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక!
తౌహీద్ (ఏకదైవోపాసన) మూడు రకాలు. ఈ సందర్భంగా ఏకదైవోపాసనకు సంబంధించిన ఈ మూడు రకాలను, క్లుప్తంగా నయినా సరే వివరించటం సమంజసం అనిపిస్తోంది. అవేమంటే – 1. తౌహీదె రుబూబియత్ 2. తౌహీదె ఉలూహియత్ 3. తౌహీదె అస్మా వ సిఫ్పాత్.
1.తౌహీదె రుబూబియత్ అంటే భావం: ఈ మొత్తం విశ్వానికి సృష్టికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకుని ఉన్నవాడు, వ్యూహ రచయిత కేవలం అల్లాహ్ మాత్రమే. నాస్తికులు మినహా మిగిలిన వారంతా ఈ తౌహీద్ ను అంగీకరిస్తారు. ఆఖరికి బహుదైవోపాసకులు సయితం ఈ దృక్పథాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటున్నారు. మక్కాకు చెందిన బహుదైవారాధకుల (ముష్రిక్కుల) ఒప్పుకోలును గురించి ఖుర్ఆన్ ఇలా అభివర్ణించింది:
“ఓ ప్రవక్తా! వారిని అడగండి: ఆకాశం నుంచీ, భూమి నుంచీ మీకు ఉపాధినొసగే వాడు ఎవడు? (మీ) వినేశక్తీ, చూసే శక్తీ ఎవరి అధీనంలో ఉన్నాయి? నిర్జీవమైన దాన్నుంచి జీవమున్న దాన్ని, జీవమున్న దాన్నుంచి జీవము లేని దాన్ని తీసే వాడెవడు? అసలీ విశ్వవ్యవస్థను నడుపుతున్న వాడెవడు? ‘అల్లాహ్’ అని వారు ఠకీమని అంటారు” (యూసుఫ్ – 31)
మరొకచోట ఇలా అనబడింది:
“భూమ్యాకాశాలను సృష్టించిన వాడెవడు? అని వారినడిగితే, ‘అల్లాహ్’ అని వాళ్లు చెబుతారు”(అజ్జుమర్-38)
వేరొకచోట సెలవీయబడింది:
“ఈ భూమి, భూమిలో ఉన్నదంతా ఎవరిదో మీకు తెలిస్తే చెప్పండి?” అని వారిని అడుగు. ‘అల్లాహ్ దే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు మీరు ఎందుకు గ్రహించటం లేదు? అని వారితో అను. ఇంకా సప్తాకాశాలకూ, మహోన్నతమైన సింహాసనానికి అధిపతి ఎవరని కూడా వారిని ప్రశ్నించు. ‘అల్లాహ్’ అని వారు తడబడకుండా సమాధానమిస్తారు. మరి అటువంటప్పుడు మీరు ఆయనకు ఎందుకు భయపడటం లేదు? అని వారిని నిలదియ్యి” (అల్ మోమినూన్ : 84 – 89)
2.తౌహీదె ఉలూహియత్: అంటే భావం అన్ని రకాల ఆరాధన (ఇబాదల్) లకు, దాస్యాలకు, వేడుకోళ్ళకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పుకోసం లేక అతని అప్రసన్నతకు గురవుతామేమెనన్న భయం కొద్దీ చేసే ప్రతి పనీ ఆరాధన (ఇబాదత్) గానే భావించబడుతుంది. అందుచేతనే నమాజ్, ఉపవాసం, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు – ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవటం, అతని పేర మొక్కకోవటం, మొక్కుబడులు తీర్చుకోవటం, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకుని నిలబడటం, అతని చుట్టూ ప్రదక్షిణ చేయటం, అతని సమక్షంలో భయభక్తులను ప్రదర్శించటం, అతను తమకేదైనా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించటం – ఇత్యాదులన్నీ ఆరాధన (ఇబాదత్) గానే పరిగణించబడతాయి. మరి ఇటువంటి పనులన్నీ ఒక్కడైన అల్లాహ్ కోసమే చేయాలి. ఇదే తౌహీదె ఉలూహియత్ (అయితే బాహ్య కారకాల కనుగుణంగా బ్రతికి ఉన్న మనుషుల వద్దకు వెళ్ళి, వారి నుండి ఏదైనా ఆశించటం, వారి యెడల వినయ వినమ్రతలను కలిగి ఉండటం మాత్రం ‘తౌహీద్’ కు విరుద్ధం కాదు). సమాధి పూజ వ్యాధికి లోనయిన సామాన్యులు, ప్రముఖులు ఈ ‘తౌహీదె ఉలూహియత్’ లో షిర్క్ కు ఒడిగడు తుంటారు. ఇటువంటి ఆరాధనలను వారు సమాధులలో ఖననం చేయబడినవారి నుద్దేశించి చేస్తుంటారు. ఇది ముమ్మాటికీ షిర్కే!
3.తౌహీదె అస్మా వ సిఫ్పాత్ : అంటే భావం ఖుర్ఆన్ మరియు హదీథులలో అల్లాహ్ గురించి చెప్పబడిన గుణగణాలను, లక్షణాలను ఏమాత్రం వక్రీకరించకుండా, వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా – యథాతథంగా అంగీకరించటం. అంటే ఆ గుణగణాలు వేరొకరిలో కూడా ఉన్నాయన్న భావనకు సుతరామూ తావీయకూడదు.
ఉదాహరణకు: అగోచర జ్ఞానం అల్లాహ్ గుణం, లేదా దూరాన ఉన్నవారు మొరపెట్టుకున్నా, చేరువలో ఉన్నవారు ఫిర్యాదు చేసినా – అందరి గోడునూ ఆయన వింటాడు అనేది ఇంకొక గుణం. విశ్వమండలంలో ఏదైనా సరే చేయగల అధికారం ఆయనకు ఉంది అనేది ఇంకొకటి. ఇలాంటివే అనేకానేక గుణగణాలు ఆయన సొంతం. మరి అటువంటి గుణగణాలలో ప్రవక్తనో, వలీనో, సజ్జనులనో చేర్చరాదు. ఒకవేళ వారిని కూడా సహవర్తులుగా చేర్చి, ఆ మహనీయులకు కూడా అటువంటి గుణాలే ఉన్నాయని భావిస్తే అది ముమ్మాటికీ ‘షిర్కే’ అవుతుంది.
[6]. హిదాయత్: అంటే మార్గదర్శకత్వం వహించటం, తిన్నని త్రోవలో నడపటం, గమ్యస్థానానికి చేర్చటం అని భావం. ఇదే అరబీలో సద్భుద్ధి, సత్ప్రేరణ, నిదర్శనంగా కూడా అభివర్ణించబడింది. అంటే మాకు ఋజుమార్గం వైపు దర్శకత్వం వహించు! ఆ మార్గంపై నడిచే సద్భుద్ధి నొసగు!! ఆ మార్గంపై కు సహన స్థయిర్యాలను ప్రసాదించు !! తద్వారానే మేము నీ ప్రసన్నతను చూరగొనగలము అన్నది దీని మతలబు. మరి ఈ ఋజుమార్గం కేవలం మనిషి బుద్ధీజ్ఞానాల వల్ల, అతని తెలివితేటల వల్ల ప్రాప్తించదు. దానికి దైవకటాక్షం ఎంతో అవసరం. ఈ ఋజుమార్గమే ఇస్లాం. ఆ మార్గాన్నే అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లోకానికి విడమర్చి చెప్పారు. ఆ మార్గాన్ని పొందటమెలాగో ఖుర్ఆన్ మరియు హదీథులు పూసగుచ్చినట్లుగా మనకు వివరిస్తున్నాయి.
[7]. దైవకటాక్షం పొందినవారు: ఈ కోవకు చెందిన వారెవరో ఖుర్ఆన్ ఖుద్దుగా వివరించింది. అన్నిసా సూరాలో పేర్కొనబడినట్లుగా – “ఎవరయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో వారు (ప్రళయదినాన) దైవకటాక్షం పొందిన వారితో ఉంటారు. అంటే దైవప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులు. అటువంటి వారి సహచర్యం ఎంతో మంచిది కదా!” (అన్నిసా : 69)
దైవానుగ్రహానికి పాత్రులైన వారి ఈ మార్గం దైవవిధేయత మరియు ప్రవక్త విధేయతల మార్గమే తప్ప వేరొక మార్గం కాదన్న సంగతి కూడా ఈ ఆయతులో స్పష్టంగా చెప్పబడింది.
[8]. ఆగ్రహానికి గురైన వారు, అపమార్గానికి లోనైనవారు: ఆగ్రహానికి గురైనవారంటే యూదులు, అపమార్గానికి లోనైన వారంటే క్రైస్తవులని భావం. ఈ విషయంలో ఖుర్ఆన్ వ్యాఖ్యాతల మధ్య ఎలాంటి అభిప్రాయభేదం లేదని ఇబ్నె అబీ హాతిమ్ అంటున్నారు. (ఫతహుల్ ఖదీర్). అందుకే ఋజుమార్గాన నడవాలని కోరుకునేవారు యూదులు, క్రైస్తవుల మార్గవిహీనతకు దూరంగా మసలు కోవటం ఎంతో అవసరం. యూదుల మార్గభ్రష్టతకు తార్కాణం ఏమిటంటే, వాళ్ల తెలిసి కూడా – ఉద్దేశ్యపూర్వకంగా – సన్మార్గాన నడిచేవారు కారు. దైవవాక్కులలో ప్రక్షిప్తాలు చేసేవారు. ప్రతి దానికీ వంకలు పెట్టేవారు. ఉజైర్ ను వారు దేవుని కుమారునిగా నిలబెట్టారు. ఏదేని విషయాన్ని ధర్మం (హలాల్) గానో, అధర్మం (హరాం) గానో ఖరారు చేసే అధికారాన్ని వారు తమ ఆచార్యులకు, మతాధికార్లకు కట్టబెట్టారు. ఇక క్రైస్తవులు చేసిన ఘోరమైన తప్పిదం ఏమిటంటే, వాళ్ళు దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం ప్రేమలో అతిశయిల్లారు. ఆయన్ని దేవుని కుమారునిగా ఖరారు చేశారు. ‘త్రిత్వం’ (మూడు దైవాల భావన) ను సృష్టించి గందరగోళ స్థితికి కారకులయ్యారు. అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంలో సయితం ఇటువంటి అయోమయావస్థ నెలకొంటున్నది. ప్రవక్త పట్ల ప్రేమాతిశయంతో కొందరు మహానుభావులు తమదైన శైలిలో తొక్కే పుంతలు మార్గభ్రష్టతకు దారి తీసేలా పరిణమిస్తున్నాయి. ఈ కారణంగానే వారు ఇహలోకంలోనే పరాభవానికి గురవుతున్నారు. అల్లాహ్ వారిని ఈ మార్గభ్రష్టతల లోయల్లోనుంటి బయట పడవేయుగాక!
ఫాతిహా సూరా చివర్లో ‘ఆమీన్’ పలకటం అత్యంత మహత్పూర్వకమని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పదే పదే తాకీదు చేయటం గమనార్హం. అందుకే (నమాజులో) ఇమామ్, ముఖ్తదీలు ప్రతి ఒక్కరూ ‘ఆమీన్’ పలకాలి. “బిగ్గరగా చేసే నమాజులలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చు స్వరంతో ‘ఆమీన్’ పలికేవారు. ప్రియ సహచరులు కూడా బిగ్గరగా ఆమీన్ పలికే సరికి మస్జిద్ ఆమీన్ శబ్ధంతో ప్రతిధ్వనించేది”. (ఇబ్నె మాజా, ఇబ్నె కథీర్). ఆమీన్ బిగ్గరగా పలకటం సున్నత్ (దైవప్రవక్త సంప్రదాయం). ఇది ప్రవక్త ప్రియసహచరుల ఆచరణ కూడా. ఆమీన్ కు పలు అర్ధాలు ఇవ్వబడ్డాయి. ‘ఆమీన్’ అంటే తథాస్తు అనీ, ‘ఓ అల్లాహ్! మా ప్రార్థనను స్వీకరించు’ అనీ, ‘మా ఆశను అడియాశ చేయకు’ అనీ భావం.
కొత్తపదాలు – వాటి అర్థాలు
| ఔలియా | ‘వలీ’ అన్న పదానికి బహువచనం; సన్నిహితులు, ప్రియతములు అని అర్థం; ఔలియాను దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా నిర్వచించాడు: “వారు విశ్వాసులై ఉంటారు. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటారు” (యూసుఫ్ : 63); సాధారణంగా జనం వలీలంటే “బాబాలు” అని అనుకుంటారు. కాని నిజానికి వలీలంటే బాబాలనబడేవారు కాదు. మంచివారైన విశ్వాసులందరూ, ప్రవక్తల అనుచరులందరూ అల్లాహ్ వలీలుగానే భావించబడతారు. ఈ పదానికి వేరితర అర్థాలు కూడా ఉన్నాయి. ఉదా: సంరక్షకుడు, సహాయకుడు. |
| ఖుర్రా | ‘ఖారి’ అనే పదానికి బహువచనం; ఖుర్ఆన్ పారాయణ విద్యలో పండితులు అని అర్థం. |
| జహ్రీ నమాజులు | ఖుర్ఆన్ పారాయణం బిగ్గరగా జరిగే నమాజులు(ఫజ్ర్, మగ్రిబ్, ఇషా) |
| జిన్నులు/జిన్నాతులు | అగ్నితో సృష్టించబడిన, మనుషుల కంటికి కనిపించని మరో జాతి ప్రాణులు. |
| ముక్తదీలు | ఇమాము వెనుక, అతనిని అనుసరిస్తూ నమాజు చేసేవారిని “ముక్తదీలు” అంటారు. నమాజుకు సారధ్యం వహించే వ్యక్తి ‘ఇమాము’ అని పిలువబడతాడు; |
| లాఇలాహ ఇల్లల్లాహ్ | “అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు.” |
| షిర్క్ | అల్లాహ్ ఆరాధన (ఉలూహియత్)లో గాని, ఆయన సార్వభౌమత్వం (రుబూబియత్) లో గాని, ఆయన దివ్య నామ, గుణగణాల (అస్మా వసిఫ్ఫాత్)లో గాని వేరొకరికి భాగస్వామ్యం కల్పించటం. ఇది ఘోరమైన పాపం. ఈ పాపానికి పాల్పడేవారిని ‘ముష్రికులు’ అంటారు అంటే అల్లాహ్ తో పాటు వేరొకరికి భాగస్వామ్యం కల్పించే వారన్నమాట. |
| సలఫ్ | పూర్వీకులు; ఇస్లాంలో తొలి మూడు తరాలకు చెందిన నికార్సయిన ముస్లింలు. |
| సిర్రీ నమాజులు | ఖుర్ఆన్ పారాయణం నిశ్శబ్దంగా జరిగే నమాజులు (జుహర్, అస్ర్) |
| బిద్అతీలు | ఖుర్ఆన్ మరియు హదీథులకు, వాటి స్ఫూర్తికి విరుద్ధమైన కొత్త అర్ధాలు చెప్పేవారు; ధర్మంలో కొత్తపుంతలు తొక్కేవారు; ఈ తరహా పోకడలు ఘోరపాపాలుగా భావింపబడతాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీటిని తీవ్రంగా ఖండించారు. |
| హదీథె ఖుద్ సీ | అల్లాహ్ మాటలను ప్రవక్త తన నోటితో అల్లాహ్ ఇలా ఆదేశించాడని చెప్పటం; మామూలు హదీథుకు – హదీథె ఖుద్సీకు మధ్య భేదాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అల్లాహ్ ప్రేరణతో దైవప్రక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవన్నీ మామూలు హదీథులు అవుతాయి. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదయినా హదీథులో నేరుగా అల్లాహ్ ఇలా అంటున్నాడని గాని, ఇలా ఆదేశించాడని గాని చెప్పినట్లయితే అటువంటి హదీథులు ‘హదీథె ఖుద్స్’ గా భావించబడతాయి. |
| ప్రక్షిప్తాలు | లేనివి కల్పించబడటం. |
ఇతరములు:
సూరహ్ పరిచయం
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో ౩ ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ‘కౌసర్‘ (సమృద్ధి) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)కు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ, అల్లాహ్‌ను కొనియాడాలని, ఆయనకు కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది. అవిశ్వాసుల వైరం, వారి గర్వం ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది.
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (38 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇది మక్కాలో అవతరించినది. దీనిలో మూడు ఆయతులున్నాయి. [1]
| అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … | బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీమ్ | بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ |
| 1. (ప్రవక్తా) మేము నీకు కౌసర్ (సరస్సు) [2] ను ప్రసాదించాము. | ఇన్నా అఅతైనా కల్ కౌసర్ | إِنَّا أَعْطَيْنَاكَ الكَوْثَرَ |
| 2. కనుక నీవు నీ ప్రభువు కొరకు నమాజు చెయ్యి మరియు ఖుర్బానీ చెయ్యి.[3] | ఫశల్లి లి రబ్బిక వన్ హర్ | فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ |
| 3. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా నశించిపోతాడు.[4] | ఇన్న షానిఅక హువల్ అబ్తర్ | إِنَّ شَانِئَكَ هُوَ الأَبْتَرُ |
క్రింద నోట్స్ అహ్సనుల్ బయాన్ నుండి :
[1] ఈ సూరాను సూరత్ అన్ నహ్ర్ గా కూడా వ్యవహరిస్తారు.
[2] కౌసర్ అనే పదం బహుళార్ధకాలకు సంకేతం. దీని అర్ధాలు కూడా అనేకం. ఇబ్నె కసీర్ గారు “అత్యధిక శుభాలు” అన్న అర్దానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే ఇతరత్రా అర్దాలు కూడా ఈ పదంలో ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు ప్రామాణిక హదీసులలో వచ్చిన వివరాల ప్రకారం కౌసర్ అనేది స్వర్గంలో మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం)కు వొసగబడే ఒక కాలువ. మరికొన్ని హదీసులలో కౌసర్ అనేది ఒక సరస్సు అని, విశ్వాసులు స్వర్గంలో ప్రవేశించేముందు మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చేతుల మీదుగా ఆ సరస్సు నీరును త్రాగుతారని, ఆ సరస్సులోకి వచ్చే నీరు కూడా స్వర్గంలోని ఆ కాలువకే చెందింది అయి ఉంటుందని తెలుపబడింది. అలాగే ఇహలోకంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారికి లభించిన విజయాలు, కీర్తి ప్రతిష్టలు, పరలోకంలోని పుణ్యఫలాలు – ఇవన్నీ ఈ “అత్యధిక శుభాలు” లోకి వచ్చేస్తాయి. (ఇబ్నె కసీర్).
[3] అంటే నమాజు కూడా కేవలం ఒక్కడైన అల్లాహ్ కొరకే చేయాలి. ఖుర్బానీ కూడా ఒక్కడైన ఆ అల్లాహ్ పేరిటే ఇవ్వాలి. బహుదైవారాధకుల మాదిరిగా ఈ ఖుర్బానీలో ఇతరులను భాగస్వాములుగా చేర్చరాదు. ‘నహ్ర్‘ అంటే ఒంటె గొంతుపై ఈటెతోగానీ, కత్తితోగానీ కొట్టి, ఆ తరువాత దానిని ‘జిబహ్‘ చేయటం అని అసలు అర్థం. అయితే ఇతర పశువులను మాత్రం నేలపై పరుండబెట్టి గొంతు కోయటాన్ని ‘జిబహ్’గా వ్యవహరిస్తారు. కాని ఈ ఆయతులో ‘నహ్ర్’ అంటే అసలు సిసలు అర్థం ఖుర్బానీ. ఇక ఇతరత్రా దానధర్మాలుగా పశువును ఖుర్బానీ చేయటం, హజ్ సందర్భంగా “మినా” పర్వత లోయలో పశువును ఖుర్బానీ చేయటం, బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వటం – ఇవన్నీ ఇందులో అంతర్భాగాలే.
[4] “అబ్‌తర్‘ అంటే తోక తెగటం అని అసలు అర్ధం. ఒకరి వంశపరంపర ముందుకు సాగకుండా ఆగిపోయిన వారిని, పేరు కూడా ప్రస్తావించకుండా వదిలివేసిన అనామకులను ‘అబ్‌తర్’గా వ్యవహరిస్తారు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) వారి మగపిల్లలు చనిపోవటం గమనించిన కొంతమంది అవిశ్వాసులు ఆయన్ని ‘అబ్‌తర్’గా అవహేళన చేయసాగారు. అప్పుడు అల్లాహ్ ఆయన్ని (సల్లలాహు అలైహి వ సల్లం) ఓదారుస్తూ ఈ వాక్యాలను అవతరింపజేశాడు –
“ఓ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) నీవు అనామకుడవు కావు. నీ విరోధులే అనామకులవుతారు” అని ధైర్యం చెప్పాడు. మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆడపిల్లల ద్వారానే అల్లాహ్ ఆయన సంతతికి ప్రపంచంలో గొప్ప కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదించాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచర సమాజమంతా ఆయన బిడ్డల్లాంటివారే. వారి సంఖ్యాబలంపై ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రళయదినాన గర్వపడతారు. అదీగాక ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గౌరవమర్యాదలను అల్లాహ్ ఎంతగానో పెంచాడు. లోకమంతా నేడు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పేరును ఎంతో భక్తితో, వినయంతో ప్రస్తావిస్తుంది. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)పై శాంతీశుభాలు కురవాలని లోకవాసులంతా ప్రార్థిస్తారు. అదే సమయంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శత్రువులు చరిత్రపుటలకే పరిమితం అయిపోయారు. ఒకవేళ ఎవరయినా వారి ఊసు ఎత్తినా వారిని దుష్టులుగానే చూస్తారుగాని మంచివారుగా చూడరు.
[35 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ సూరాను సూరయె దీన్‌గా, సూరయె అరఐత్‌గా, సూరయె యతీమ్‌గా కూడా వ్యవహరిస్తారు. (ఫత్‌హుల్ ఖదీర్).
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.
1 తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు
2. కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచిపనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.
| అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో … | బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ | بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ |
| 1. పరలోకతీర్పును ధిక్కరించేవాడిని నీవు చూశావా? | అరఅయ్ తల్లదీ యుకద్దిబు బిద్దీన్ | أَرَأَيْتَ الَّذِي يُكَذِّبُ بِالدِّينِ |
| 2.వారే అనాథులను కసరి కొట్టేవారు. | ఫదాలికల్లదీ యదువ్వుల్ యతీం | فَذَلِكَ الَّذِي يَدُعُّ اليَتِيمَ |
| 3. నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించని వారు | వలా యహుద్దు అలా తఆమిల్ మిస్కీన్ | وَلَا يَحُضُّ عَلَى طَعَامِ المِسْكِينِ |
| 4. ఐతే నమాజు చేసే (అలాంటి) వారూ నాశనమౌతారు. | ఫవైలుల్ లిల్ ముసల్లీన్ | فَوَيْلٌ لِلْمُصَلِّينَ |
| 5. ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ చూపేవారో | అల్లదీన హుమ్ అన్ సలాహితిహిం సాహూన్ | الَّذِينَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُونَ |
| 6. ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారో, | అల్లదీన హుమ్ యురాఊన్ | الَّذِينَ هُمْ يُرَاءُونَ |
| 7. ఎవరైతే చిన్న పాటి సహాయం అర్థించిన వారిని కూడా తిరస్కరించే వారో. | వయంన ఊనల్ మాఊన్ | وَيَمْنَعُونَ المَاعُونَ |
దివ్య ఖురాన్ సందేశం ఆడియో
Divya Qur’an Sandesham
ప్రతి ఆయత్ అరబీలో చదివిన తర్వాత, తెలుగు అనువాదం చదవబడుతుంది.
పారా నెంబర్ మీద క్లిక్ చేసి ఆ పారా వినవచ్చు. పారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు
[అన్నీ పారాలు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ]
Published by the King Fahd Complex for Printing of the holy Quran KFCPHQ, Madina
Translated by Dr Abdul Raheem Mohammed Moulana
అరబీ ఆయత్ చదవకుండా, తెలుగు అనువాదం మాత్రమే చదవబడుతుంది.
పారా నెంబర్ మీద క్లిక్ చేసి ఆ పారా వినవచ్చు. పారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు
[అన్నీ పారాలు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ]
Published by the King Fahd Complex for Printing of the holy Quran KFCPHQ, Madina
Translated by Dr Abdul Raheem Mohammed Moulana
ఇతరములు:
దివ్య ఖురాన్ సందేశం – చదవండి
దివ్య ఖుర్ఆన్ సర్వ మానవాళి మార్గదర్శకత్వానికి అల్లాహ్ వైపు నుండి అవతరించిన సత్య గ్రంథం. ఈ సత్యతను ఖుర్ఆన్ నుండి కాకుండా శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి.
(إعجاز القرآن الكريم)
[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/1z1r]
[6 నిమిషాల వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
ఇతరములు:
అల్లాహ్ త ఆలా ఇలా తెలియజేశాడు:
“నమాజు నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పటి నుండి రాత్రి చీకటి అలుముకునే వరకు. తెల్లవారు జామున ఖుర్‌ఆన్ పారాయణం చెయ్యి. నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది. రాత్రిపూట కొంత భాగం తహజ్ఞుద్ (నమాజులో ఖుర్‌ఆన్ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను మఖామె మహ్‌మూద్‌కు (ప్రశంసనీయమైన స్థానానికి) చేరుస్తాడు.” (సూరతు ఇస్రా /బనీ ఇస్రాయీల్: 78-79).
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా తెల్లవారు జామున చేసే ఖుర్‌ఆన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది” అంటే ఫజ్ర్ వేళ అల్లాహ్ దూతలు దివి నుండి భువికి దిగివస్తారు. (సహీహ్ తిర్మిజీ: 3135, సహీహ్ ఇబ్నుమాజా:670)
మరో హదీసులో ఇలా ఉంది: ‘రాత్రి వేళ విధుల్ని నిర్వహించిన దూతలు అల్లాహ్ సన్నిధికి చేరుకున్నపుడు – తనకంతా తెలిసినప్పటికీ – మీరు నా దాసుల్ని ఏ స్థితిలో వదలి వచ్చారు? అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. దానికి వారు: “మేము వారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా వారు నమాజులో లీనమై ఉన్నారు. మేము వారివద్ద నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వారు నమాజులోనే నిమగ్నులై ఉన్నారు” అని సమాధానమిస్తారు.’ (బుఖారీ:522,ముస్లిం:1001).
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: “ప్రజలలో కొంత మంది అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉన్నారు .” అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు.
యా రసూలుల్లాహ్ ! వారెవరూ? అని కొందరు అడిగారు.
దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం): “వారు అహ్‌లుల్ ఖుర్‌ఆన్ (ఖుర్‌ఆన్ (గంథాన్ని పారాయణం చేసేవారు, దానిని నేర్పేవారు, నేర్చుకునేవారు) మరియు వారే అల్లాహ్‌కు అతి దగ్గరవారై ఉంటారు, వారు ఆయనకు ప్రత్యేకులు” అని అన్నారు.
[నసాయి, ఇబ్ను మాజా, హాకిమ్: సహీహ్ అత్తర్గీబ్ వత్తర్హీబ్: 1432]
హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “మీలో ఖుర్‌ఆన్ నేర్చుకొని ఇతరులకు నేర్పించినవారే అందరికంటే ఎక్కువగా మేళ్లు కలిగి ఉన్నవారు.” (బుఖారీ:4639)
హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “నిశ్చయంగా అల్లాహ్ ఈ గ్రంథం కారణంగా కొన్ని జాతుల్ని ఉన్నతమైన స్థితికి పెంచుతాడు. మరికొన్ని జాతుల్నిదీని కారణంగానే అధోగతికి దిగజార్చుతాడు.” (ముస్లిం1353)
ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:
“సుమధుర స్వరంతో గొంతెత్తి ఖుర్‌ఆన్ పారాయణం చేసే దైవప్రవక్త కంఠ శ్వరాన్ని శ్రద్ధగా ఆలకించినట్లుగా అల్లాహ్ మరే స్వరాన్నీ ఆలకించడు.” (బుఖారీ:4636, ముస్లిం:1319).
సమధుర స్వరంతో ఖుర్‌ఆన్ పారాయణం చేసేవాని పట్ల అల్లాహ్ ప్రసన్నుడయి అతని ఆచరణను అంగికరిస్తాడు అని అర్ధం.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అను) కథనం: అన్సార్ జాతికి చెందిన ఒక సహాబీ (అనుచరుడు) మస్జిద్ ఖుబాలో ఇమామత్ చేసేవారు. ఆయన ప్రతి రకాతు ఆరంభంలో ‘ఖుల్‌హువల్లాహు అహద్” సూరా పఠించిన తరువాత మరొక సూరా చదివేవారు. ఇలాగే ఆయన ప్రతి రకాతులో చేసేవారు.
కొందరు ఆయనను ఇలా అడిగారు? “నీవు ఆ సూరాను నమాజులో చదవకుంటే నమాజు కానట్టుగా ప్రతి రకాతులో నిత్యం చదువుతుంటావు, నీవు చదివేటుగా ఉంటే ఆ సూరను మాత్రమే చదువు లేకుంటే ఇతర సూరాలను చదువు అని అన్నారు.”
తరువాత ఆయన ఇలా సమాధానమిచ్చారు: “‘చూడండి! నేను ఇలాగే నమాజు చదువుతాను .మీకిష్టమైతే నేను మీ కొరకు ఇమామత్ చేస్తాను, మీకు ఇష్టం లేదంటే చెప్పండి ఇమామత్ మానుకుంటాను” అని అన్నారు. వారిలో అందరికంటే గొప్ప వ్యక్తిగా ఆయనను వారు భావించేవారు. కనుక ఇతరులు ఇమామత్ చేయడం వారికి ఇష్టముండేది కాదు.
చివరికి కొంత మంది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు పోయి ఈ సమస్య గురించి తెలియజేశారు.
తరువాత ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ వ్యక్తితో: “వారి కోరిక ప్రకారం (ఇమామత్) చేయుటకై నీకు ఏ విషయం అడ్డు? ఆ సూరానే నీవు ఎందుకు ప్రతి రకాతులో చదవాలనుకుంటున్నావు?” అని అడిగారు.
దానికి ఆ వ్యక్తి: “యా రసూలల్లాహ్! “నేను ఆ సూరా (ఖులహువల్లాహు అహద్) ను ఇష్టపడుతున్నాను అని అన్నారు.
అది విని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో: “ఆ సూరాను నీవు ఇష్టపడుతున్నావంటే అది నీన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది? అని చెప్పారు.
[సహీహ్ తిర్మిజీ:2901]
హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ఖుర్‌ఆన్‌లో ముప్పై వాక్యాలు గల, ఒక సూరా ఉంది. అది (అల్లాహ్ సన్నిధిలో) ఒక వ్యక్తి గురించి సిఫారసు చేసి ఆఖరికి అతనికి క్షమాభిక్ష లభించేలా చేసింది.” అదే, “తబారకల్లిజీ బియదిహిల్ ముల్కు.” (తిర్మిజీ: 2891, ఇబ్నుమాజా: 3786, అబూదావూద్).
మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “దివ్య ఖుర్‌ఆన్‌లో ఒక సూరా ఉంది. అది తనను పఠించేవాని తరఫున వాదిస్తుంది. కడకు అతన్ని స్వర్గంలో చేర్పిస్తుంది.” (మజ్‌మవుజ్ జవాయిద్).
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రదియల్లాహు అన్జ్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు; “తబారకల్లజీ బియదిహిల్ ముల్క్ ప్రతి రాత్రి చదివిన కారణంగా అల్లాహ్ వారిని సమాధి శిక్షనుండి కాపాడుతాడు.” [హాకిమ్, సహీహ్ తర్గీబ్ వత్ తర్హీబ్ : 1589]
హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం): “అలిఫ్ లామ్ మీమ్ తంజీల్ అస్ సజ్దా’ మరియు ‘తబారకల్లజీ’ సూరాలు పారాయణం చేసేవరకు నిద్రపోయేవారు కాదు.” అని తెలిపారు. [సహీహ్ తిర్మిజీ: 2892]
హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం): “సూరతుల్ జుమర్ మరియు “బనీ ఇస్రాయిల్” సూరాలు పారాయణం చేసేవరకు నిదపోయేవారు కాదు.” అని తెలిపారు.” [సహీహ్ తిర్మిజీ: 2892]
హజ్రత్ అబ్దుల్లాహ్ ఇబ్ను మస్‌వూద్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరైనా ఖుర్‌ఆన్ గ్రంథంలోని ఒక అక్షరాన్ని చదివితే అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒక్క పుణ్యం పది పుణ్యాలకు సమానంగా ఉంటుంది.” నా అభిప్రాయం ప్రకారం: ‘అలిఫ్ లామ్ మీమ్” అనేది ఒకే అక్షరం కాదు. పైగా ‘అలిఫ్’ ఒక అక్షరం, లామ్’ ఒక అక్షరం,మీమ్ ఒక అక్షరం అని అన్నారు.“ (సహీహ్ తిర్మిజీ: 2910, సహీహ్ నసాయి: 2391, హాకిమ్).
[ఇది జఫరుల్లాహ్ ఖాన్ హఫిజ హుల్లాహ్ గారు రాసిన అల్లాహ్ ను ప్రేమించండి – స్వర్గాన్ని చేరుకోండి అను పుస్తకం నుండి తీసుకోబడింది]
You must be logged in to post a comment.