తెలుగు ఇస్లామిక్ క్విజ్: పార్ట్ 30 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 30
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 30

1) ఒక ప్రత్యేక దైవదూత ద్వారా పంపబడిన ప్రఖ్యాత ఖుర్ఆన్ వాక్యాలు ఏవి?

A) సూరాహ్ అలఖ్ లో తొలి 5 వాక్యాలు
B) సూరాహ్ ఫాతిహా మరియు సూరాహ్ బఖరహ్ లో చివరి 2 వాక్యాలు
C) సూరాహ్ కహఫ్ మొదటి మరియు చివరి 10 వాక్యాలు

2) అప్పగింతలో ద్రోహం – అబద్ధం – వాగ్ధాన భంగం – మరియు దుర్భాషలాడటం ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటాయి?

A) ముస్లిం
B) మొమిన్
C) మునాఫిక్

3) అల్లాహ్ వద్ద పుణ్యం పరంగా అతి గొప్ప గుటక ఏది?

A) కోపం దిగమింగే గుటక
B) ఉపవాసం లో త్రాగే నీటిగుటక
C) జమ్ జమ్ నీటి గుటక

క్విజ్ 30: సమాధానాలు & వివరణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [16 నిమిషాలు]


1) ఒక ప్రత్యేక దైవదూత ద్వారా పంపబడిన ప్రఖ్యాత ఖుర్ఆన్ ఆయతులు ఏవి?

B] సూర ఫాతిహా మరియు సూర బఖరహ్ లో చివరి 2 ఆయతులు

సహీ ముస్లిం 806లో ఉంది, ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు,

عَنِ ابْنِ عَبَّاسٍ، قَالَ: بَيْنَمَا جِبْرِيلُ قَاعِدٌ عِنْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، سَمِعَ نَقِيضًا مِنْ فَوْقِهِ، فَرَفَعَ رَأْسَهُ، فَقَالَ: ” هَذَا بَابٌ مِنَ السَّمَاءِ فُتِحَ الْيَوْمَ لَمْ يُفْتَحْ قَطُّ إِلَّا الْيَوْمَ، فَنَزَلَ مِنْهُ مَلَكٌ، فَقَالَ: هَذَا مَلَكٌ نَزَلَ إِلَى الْأَرْضِ لَمْ يَنْزِلْ قَطُّ إِلَّا الْيَوْمَ، فَسَلَّمَ، وَقَالَ: أَبْشِرْ بِنُورَيْنِ أُوتِيتَهُمَا لَمْ يُؤْتَهُمَا نَبِيٌّ قَبْلَكَ: فَاتِحَةُ الْكِتَابِ، وَخَوَاتِيمُ سُورَةِ الْبَقَرَةِ، لَنْ تَقْرَأَ بِحَرْفٍ مِنْهُمَا إِلَّا أُعْطِيتَهُ “

ఒకరోజు జిబ్రీల్ అలైహిస్సలాం మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని ఉండగా పై నుండి ఒక ద్వారం తెరువబడే శబ్దం వినిపించింది. జిబ్రీల్ అలైహిస్సలాం తల పైకెత్తి, ‘ఆకాశంలోని ఒక ద్వారం తెరువబడింది, ఇది దాని శబ్దమే. ఇంతకు ముందు ఎన్నడూ ఆ ద్వారం తెరువబడలేదు’. అని అంటుండగా ఆ ద్వారం గుండా ఒక దైవదూత దిగాడు, ఆ దైవదూత గురించి చెబుతూ, ‘భూమిపైకి దిగిన ఈ దైవ దూత, ఇంతకుముందు ఎన్నడూ దిగలేదు,’ అని అన్నారు. వెంటనే ఆ దైవదూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సలామ్ చేసి, ‘మీకు రెండు కాంతులు ఇవ్వబడినందుకు సంతోషించండి, అవి ఇతర ప్రవక్త లెవ్వరికీ ఇవ్వబడ లేదు. అవి (1) సూరహ్ ఫాతిహా, (2) సూరహ్ బఖరహ్ లోని చివరి ఆయతులు. మీరు వీటిలోని ఏ అక్షరాన్ని పఠించినా, దాని పుణ్యం మీకు లభిస్తుంది లేక ఏ దు’ఆ చేసినా అది అంగీకరించబడుతుంది” అని చెప్పాడు.

ملخص الجواب : أن خواتيم سورة البقرة آيات مدنية ، وأن إعطاء الله تعالى هذه الآيات لنبيه صلى الله عليه وسلم ليلة المعراج ، يحتمل أنه أوحى بهما إليه بلا واسطة ، ثم نزلتا مرة أخرى في المدينة ، أو أن الله بشره بنزول هذه الآيات عليه ، ثم نزلتا حقيقة في المدينة ، وأما حديث ابن عباس فيحتمل أنه نزول بالآيات ، أو نزول بالفضل ومالثواب .

[ఈ హదీసు వివరణ:-] రెండు వెలుగులంటే సూరహ్ ఫాతిహా (1), సూరహ్ బఖరహ్(2) చివరి వాక్యాలు. తీర్పుదినం నాడు ఈ రెండు వెలుగుగా మారుతాయి. వీటి వెలుగులో ఖుర్ఆన్ పఠించేవారు నడుస్తూ ఉంటారు. ”నూరుహుమ్ యస్ఆ బైన అయ్దీహిమ్” (సూర తహ్రీమ్ 66:8). మరియు సూరహ్ బఖరహ్ చివరి భాగం అంటే ”ఆమనర్రసూలు’ నుండి చివరి వరకు.

సూరహ్ ఫాతిహా చాలాప్రాధాన్యత ఉంది. దీని పేరు ఉమ్ముల్ ఖుర్ఆన్, సబ్’ఉమసా’నీ, సూరహ్ షిఫా’ సూరతుల్ క’న్జ్, సూరతు ‘స్సలాహ్, దీన్ని పఠించనిదే నమా’జ్ నెరవేరదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

”అల్లాహ్ ఆదేశం, ”నేను నమా’జ్ అంటే సూరహ్ ఫాతిహాను నాకూ నా దాసునికి మధ్య చెరిసగం పంచివేసాను. ఎవరు నన్ను ఏది కోరితే దాన్నే అతనికి ప్రసాదిస్తాను. ఒకవేళ దాసుడు, ‘అల్’హమ్దులిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్’ అని అంటే అల్లాహ్ ‘హమిదనీ అబ్దీ’ నా దాసుడు నన్ను స్తుతించాడు అని అంటాడు. దాసుడు ‘అర్ర’హ్మానిర్ర’హీమ్’ అని అంటే అల్లాహ్ ‘అస్నా’అలయ్య అబ్దీ’, నా దాసుడు నన్ను కీర్తించాడు అని అంటాడు. దాసుడు, ‘మాలికి యౌమిద్దీన్’ అంటే అల్లాహ్, ‘మజ్జదనీ అబ్దీ’, నా దాసుడు నా గొప్పతనాన్ని కొనియాడాడు, అని అంటాడు. దాసుడు, ‘ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్,’ అని అంటే అల్లాహ్, ‘ఇది నాకు నా దాసునికి మధ్య ఉంది. దాసుడు ఏది కోరితే అది నేను ప్రసాదిస్తాను.’ ఆ తరువాత దాసుడు చివరి వరకు పఠిస్తే, అల్లాహ్, ‘ఇదంతా నా దాసునికోసమే ఉంది, అతడు ఏమి కోరితే అదే అతని కోసం ఉంది,’ అని అంటాడు.” (నిసాయి’)

ఈ సూరహ్ మొత్తం స్తోత్రం, కీర్తనం, ప్రార్థనలతో నిండి ఉంది. అందువల్లే దీన్ని వెలుగు అనడం జరిగింది. అదేవిధంగా సూరహ్ బఖరహ్ చివరి ఆయతులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ప్రార్థన, ప్రార్థనా ఫలితం రెండూ ఉన్నాయి. అది, ‘ఆమనర్రసూలు నుండి చివరి వరకు.

తఫ్సీర్ ఇబ్నె కసీ’ర్లో ‘స’హీ’హ్ బు’ఖారీ ఉల్లేఖనంలో ఈ రెండిటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ విధంగా ఉంది, ”ఎవరు ఈ రెండు ఆయతులను రాత్రి పఠిస్తే అతని కొరకు అవి సరిపోతాయి.” 

ముస్నద్ అ’హ్మద్లో ఇలా ఉంది. “సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు దైవసింహాసనం క్రింద ఉన్న నిధిలో నుండి నాకు ఇవ్వ బడ్డాయి. నా కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవి ఇవ్వబడ లేదు.”

‘స’హీ’హ్ ముస్లిమ్లో ఇలా ఉంది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ చేసినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ”సిద్రతుల్ మున్తహా” వరకు వెళ్ళారు. అది ఏడవ ఆకాశంపై ఉంది. భూమి నుండి పైకి వెళ్ళే ప్రతి వస్తువు సిద్రతుల్ మున్తహా వద్దకు చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోవటం జరుగు తుంది. ఆకాశం నుండి వచ్చేది కూడా ఇక్కడి వరకే చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోబడుతుంది. దీన్ని బంగారు పిచ్చుకలు కప్పి ఉంటాయి. ఇక్కడ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు 3 వస్తువులు ఇవ్వ బడ్డాయి. (1) 5 పూటల నమా’జులు, (2) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, (3) ఏకదైవారాధకులందరి క్షమాపణ.

ముస్నద్లో ఇలా ఉంది, ” ‘ఉఖ్బహ్ బిన్ ‘ఆమిర్తో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, ”సూరహ్ బఖరహ్ లో  ఈ చివరి ఆయతులు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండు. నాకు అవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి.”

ఇబ్నె మర్ద్వైలో ఇలా ఉంది, “మాకు ఇతరులపై మూడు విధాలా ఆధిక్యత లభించింది. సూరహ్ బఖరహ్ చివరిఆయతులు, ఇవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి. నా కంటే ముందు ఎవ్వరికీ ఇవ్వబడ లేదు. నా తరువాత కూడా ఎవ్వరికీ ఇవ్వబడవు.” 

ఇబ్నె మర్ద్వైలో ఇలా ఉంది. ‘అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ముస్లిముల్లోని ఎవరైనా ఆయతుల్ కుర్సీ మరియు సూరహ్ బఖరహ్ చివరి వాక్యాలు చదవకుండా పడుకుంటారని నేననుకోను. ఇవి మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు దైవసింహాసనం క్రింద ఉన్న నిధి నుండి లభించాయి.

మరో తిర్మిజి 2882′ ‘హదీసు’లో ఇలా ఉంది, “అల్లాహ్ భూమ్యా కాశాలను సృష్టించడానికి రెండువేల సంవత్సరాల ముందు ఒక గ్రంథం వ్రాయబడింది. ఇందులో రెండు ఆయతులు లిఖించి సూరహ్ బఖరహ్ పూర్తి చేయబడింది. ఎవరి ఇంటిలో మూడు రోజుల వరకు పఠించబడుతుందో, ఆ ఇంటి సమీపానికి కూడా షై’తాన్ రాలేడు.” (షేక్ అల్బానీ సహీ అన్నారు.)

ఇబ్నె మర్ద్వైహ్లో ఇలా ఉంది, ”ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, ఆయతుల్ కుర్సీ పఠిస్తే నవ్వుతారు, ఇంకా ఈ రెండు దైవసింహాసనం క్రింద నిధి నుండి లభించాయి,” అని అంటారు.

కొన్ని ‘హదీసు’ల్లో ఇలా ఉంది,

“దాసుడు, ‘గుఫ్రానక రబ్బనా,’ అని ప్రార్థిస్తే అల్లాహ్ , ‘నఅమ్, నేను నీ పాపాలను క్షమించాను,’ అని అంటాడు, ఒకవేళ దాసుడు ”రబ్బనా, లాతుఆ’ఖిజ్’నా,” – ‘ఓ అల్లాహ్ మా పాపాల పట్ల మమ్మల్ని విచారించకు,’ అని అంటే అల్లాహ్ సమాధానంగా, ‘నేనలాగే చేస్తాను,’ అని అంటాడు. ఒకవేళ, ”లాత’హ్మిల్ ‘అలైనా,” – ‘నాకు శక్తిలేని భారం వేయకు,’ అని అంటే అల్లాహ్, ‘నేనలాగే చేస్తాను, అంటే శక్తికి మించిన బరువు వేయనని’ అంటాడు, ఒకవేళ దాసుడు, ”వ ‘అఫు అన్నా” – ‘ఓ అల్లాహ్ నన్ను క్షమించు,’ అని అంటే అల్లాహ్, ‘నేను క్షమించివేస్తాను,’ అని అంటాడు. ఒక వేళ, ”వ’గ్ఫిర్లనావర్’హమ్నా,” – ‘మమ్మల్నిక్షమించు కరుణించు,’ అని అంటే అల్లాహ్ , ”మేము క్షమిం చాము, కరుణించాము,” అని అంటాడు. ఒకవేళ, ”ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్,” – ‘మాకు అవిశ్వా సులపై సహాయం చేయి,’ అని అంటే అల్లాహ్ , ”మేము మీకు సహాయం చేసాము అని అంటాడు.”

2) అప్పగింతలో ద్రోహం – అబద్ధం – వాగ్ధాన భంగం – మరియు దుర్భాషలాడటం ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటాయి?

C] మునాఫిక్

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرٍو أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: أَرْبَعٌ مَنْ كُنَّ فِيهِ كَانَ مُنَافِقًا خَالِصًا، وَمَنْ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنْهُنَّ كَانَتْ فِيهِ خَصْلَةٌ مِنَ النِّفَاقِ حَتَّى يَدَعَهَا: إِذَا اؤْتُمِنَ خَانَ، وَإِذَا حَدَّثَ كَذَبَ، وَإِذَا عَاهَدَ غَدَرَ، وَإِذَا خَاصَمَ فَجَرَ

”ఏ వ్యక్తిలో ఈ 4 గుణాలుంటాయో అతడు ఖచ్చితంగా కపటాచారియే. ఎవరిలోనైనా వీటిలోని ఒక్క గుణం ఉంటే అతడు దానిని వదలనంత వరకు అతనిలో ఒక కాపట్య చిహ్నం ఉన్నట్టే. ఆ 4 గుణాలు ఇవి: 1. అమానతు ఉంచబడితే ద్రోహం తలపెడతాడు; 2. మాట్లాడితే అసత్యం పలుకుతాడు; 3. వాగ్దానం చేస్తే వాగ్దానభంగం చేస్తాడు; 4. వివాదం తలెత్తితే తిట్లకు దిగుతాడు”. (బు’ఖారీ, ముస్లిమ్)

3) అల్లాహ్ వద్ద పుణ్య పరంగా అతి గొప్ప గుటక ఏది?

A) కోపం దిగమింగే గుటక

అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట

ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللهِ، مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللهِ

“అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్ఠానికై దాసుడు మింగే కోపాగ్ని గుటక”. (ఇబ్ను మాజ 4189, అహ్మద్ 2/ 128, అదబుల్ ముఫ్రద్ 1318, సహీహుత్తర్గీబ్: అల్బానీ 2752).

ఇలాంటి ఎన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయో, అప్పుడు మనం ఈ హదీసును, ఈ గొప్ప పుణ్యఫలితాన్ని గుర్తుకు తెచ్చుకుంటామా? అల్లాహ్ కొరకు మన కొపాన్ని మింగి పుణ్యాన్ని పొందుతామా?

కోపం వచ్చినప్పుడు కోపం ప్రకారం ఆచరించడానికి శక్తి ఉండికూడా కోపాన్ని దిగమ్రింగేవారిని అల్లాహ్ సుబ్ హానహు వతఆలా ప్రశంసించి, వారికి మన్నింపు, క్షమాపణ, స్వర్గప్రవేశ శుభవార్త ఇచ్చాడు.

الَّذِينَ يُنْفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالكَاظِمِينَ الغَيْظَ وَالعَافِينَ عَنِ النَّاسِ وَاللهُ يُحِبُّ المُحْسِنِينَ * وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَنْ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللهُ وَلَمْ يُصِرُّوا عَلَى مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ * أُولَئِكَ جَزَاؤُهُمْ مَغْفِرَةٌ مِنْ رَبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِنْ تَحْتِهَا الأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَنِعْمَ أَجْرُ العَامِلِينَ {آل عمران: 134-136}

“ఎవరు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు కోపాన్ని దిగమ్రింగుతారో ఇంకా ప్రజలను మన్నిస్తారో, (ఇలాంటి) సజ్జనులను అల్లాహ్ ప్రేమిస్తాడు. మరెవరైతే (వారి ద్వారా) ఏదైనా అశ్లీల పని జరిగితే లేదా వారు తమపై అన్యాయం చేసుకుంటే, వెంటనే అల్లాహ్ ను స్మరించి తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. –నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు?- వారి ద్వారా జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు (మంకుపట్టు పట్టరు). ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది”. (ఆలె ఇమ్రాన్ 3:134-136).

ఈ ఘనమైన ఫలం పైన మరో ప్రతిఫలం ఏమిటంటే; అతనికిష్టమైన హూరె ఐన్ (అందమైన పెద్ద కళ్ళుగల స్వర్గపు సుందర కన్య)ను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. సహల్ బిన్ ముఆజ్ తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ، دَعَاهُ اللهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ

“ఎవరు తన కోపాన్ని దిగమింగుతాడో, అతను దానిని అమలు పరచడానికి శక్తి ఉండి కూడా (దిగమింగుతాడో), అల్లాహ్ ప్రళయదినాన అతనిని ప్రజల ఎదుట పిలుస్తాడు, అతనికిష్టమైన హూరె ఐన్ ను ఎన్నుకునే అధికారం ఇస్తాడు”. (అబూదావూద్ 4777, తిర్మిజి 2493, ఇబ్నుమాజ 4186, అల్బానీ సహీహుత్తర్గీబ్ 2753లో హసన్ అని చెప్పారు).

ఏదైనా ప్రాపంచిక వృధాకార్యం కోసం నీవు ఇంతటి గొప్ప పుణ్యాన్ని వదులుకుంటావా? ప్రజల్ని ఓటమికి గురి చేసేవాడు శక్తిశాలి కాదు, తన కోపాన్ని దిగమ్రింగేవాడు అసలైన శక్తిశాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الغَضَب

“ఎదుటి వానిని చిత్తుచేసినవాడు శూరుడు కాదు, తాను ఆగ్రహానికి గురైనప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన శూరుడు”. (బుఖారి 6114, ముస్లిం 2609, అహ్మద్ 2/ 236.).

وكان عند ميمون بن مهران ضيف، فاستعجل على جاريته بالعشاء، فجاءت مسرعة ومعها قصعة مملوءة، فعثرت وأراقتها على رأس سيدها ميمون، فقال: يا جارية أحرقتني، قالت: يا معلم الخير، ومؤدب الناس، ارجع إلى ما قال الله تعالى، قال: وما قال الله تعالى؟ قالت: قال: ﴿ وَالْكَاظِمِينَ الْغَيْظَ ﴾ [آل عمران: 134]، قال: قد كظمت غيظي، قالت: ﴿ وَالْعَافِينَ عَنِ النَّاسِ ﴾ [آل عمران: 134]، قال: قد عفوت عنك، قالت: زِد؛ فإن الله تعالى يقول: ﴿ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ ﴾ [آل عمران: 134]، قال: أنت حرة لوجه الله تعالى [إحياء علوم الدين].
رابط الموضوع:

ఇతరములు :

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

%d bloggers like this: