ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పతనానికి గల పది కారణాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లింలారా! సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు భయపడండి. మరియు తెలుసుకోండి ఈ ఉమ్మత్ కు అల్లాహ్ తఆలా గొప్ప ప్రాధాన్యతను ప్రసాదించాడు. మరియు తన సృష్టిలో ఉత్తమమైనటువంటి వ్యక్తిని ప్రవక్తగా మరియు దైవ సందేశహరునిగా ఎన్నుకున్నాడు. ఆయనే మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ఆయన వాస్తవంగా సమస్త మానవులలో నైతికతపరంగా, జ్ఞానపరంగా, ఆచరణ పరంగా, ఉత్తములు. దీని కారణంగానే ఈనాడు పూర్తి ప్రపంచంపై ఆయన యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది.

మానవులైనా లేక జిన్నులైనా లేక వేరే ఇతర జీవరాసులైనా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రభావం వారిపై ఉంటుంది. కాబట్టి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వాస్తవంగా ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన లాంటి వ్యక్తి ఈ భూప్రపంచంపై పుట్టలేదు మరియు పుట్టడు కూడా. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గొప్పదనం కేవలం కొన్ని కోణాలకే పరిమితం కాదు. ప్రతి అంశంలోనూ ప్రతి కోణాన్ని కలిగి ఉంటుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనం గురించి ఎన్నో ఆధారాలు దాదాపు వంద కంటే పైపెచ్చు మనకు లభిస్తాయి. ప్రతి ఆధారం మరో ఆధారానికి భిన్నంగా ఉంటుంది అందులో ఇవి కొన్ని.

1. అల్లాహ్ తఆలా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ని దైవ సందేశహారునిగా బాధ్యతలు నెరవేర్చడానికి సమస్త మానవులలో నుండి ఎన్నుకున్నాడు. అల్లాహ్ తన ప్రవక్తతో ఇలా అన్నాడు.

﴿وأرسلناك للناس رسولا﴾
(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త జనులకు సందేశం అందజేసేవానిగా చేసి పంపాము

2. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మరొక గొప్పదనం ఏమిటంటే, అల్లాహ్ తఆలా ఆయనను (నబి) ప్రవక్తగా మరియు (రసూల్) దైవ సందేశహరునిగా ఎన్నుకున్నాడు.

3. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పతనంలో భాగంగా మరొక ఆధారం ఏమిటంటే ఆయన “ఉలుల్ అజ్మ్” ప్రవక్తలలోని వారు. “ఉలుల్ అజ్మ్” ప్రవక్తలు ఐదుగురు. వారు నూహ్, ఇబ్రహీం, మూసా, ఈసా (అలైహిముస్సలాం) మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). దీని గురించి ఖుర్ఆన్ రెండు చోట్ల ప్రస్థావన ఉంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

﴿‏وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ مِيثَاقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى ابْنِ مَرْيَمَ﴾
(ఆసందర్భాన్ని జ్ఞాపకంచేసుకో) మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము (ముఖ్యంగా) నీ నుండి, నూహ్‌ నుండి, ఇబ్రాహీం నుండి, మూసా నుండి, మర్యమ్‌ కుమారుడైన ఈసా నుండి.

మరో చోట ఇలా అంటున్నాడు:

﴿‏شَرَعَ لَكُم من الدِّينِ مَا وَصَّى بِهِ نُوحًا وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِ إِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى أَنْ أَقِيمُوا الدِّينَ وَلا تَتَفَرَّقُوا فِيه﴾
ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్‌ నూహ్‌కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకూ నిర్ధారించాడు. దానినే (ఓ ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం!) మేము నీ వైపుకు (వహీ ద్వారా) పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, ఈసా (అలైహిముస్సలాం)కు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలనీ, అందులో చీలిక తీసుకురావద్దనీ (వారికి) ఉపదేశించాము.

4. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మరొక గొప్పదనం ఏమిటంటే అల్లాహ్ తఆలా ఆయన ప్రవక్త తత్వాన్ని సూచించే ఎన్నో సంకేతాలను ఉన్నతీకరించాడు. ఇబ్నే ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) తన గ్రంథమైనటువంటి “ఇగాసతు అల్ లహ్ఫాన్” యొక్క చివరి భాగంలో వెయ్యి కంటే ఎక్కువ సూచనలను తెలియజేశారు. ఇది దాసులపై అల్లాహ్ యొక్క కారుణ్యం ఎందుకంటే ప్రవక్తపై ప్రజలు విశ్వాసం తీసుకురావడంలో ఈ సూచనలు ఎంతో తోడ్పడతాయి, మరియు శత్రువుల యొక్క వాదనలను తిప్పికొడతాయి.

5. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి మరో గొప్పదనం ఏమిటంటే అల్లాహ్ తఆలా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ప్రసాదించిన అద్భుతాలలో ప్రళయం వరకు ఉండేటువంటి ఒక గొప్ప అద్భుతం “దివ్య ఖుర్ఆన్ “.

ఎందుకంటే ప్రవక్తలు చేసినటువంటి అద్భుతాలు వారి మరణంతోనే ముగిసిపోయాయి. కానీ ఖుర్ఆన్ ఎంతటి మహా అద్భుతం అంటే ఈ భూమ్యాకాశాలు అంతమయ్యేంతవరకు ఉంటుంది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు: దైవ ప్రవక్తలలో అద్భుతాలు ప్రసాదించబడని ప్రవక్త అంటూ లేరు, మరియు ప్రజలు వీటి ప్రకారమే వారిని విశ్వసించారు మరియు నాకు ప్రసాదించబడినటువంటి అతిపెద్ద అద్భుతం “ఖుర్ఆన్”. అల్లాహ్ దీనిని నాపై అవతరింపజేశాడు. మరియు నాకు నమ్మకముంది, రేపు ప్రళయ దినం రోజున ప్రవక్తల అందరిలో కెల్లా నాఅనుచర సమాజమే ఎక్కువగా ఉంటుంది.(బుఖారి, ముస్లిం)

6. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క గొప్పదనానికి గల మరొక రుజువు ఏమిటంటే, అల్లాహ్ అయనపై అత్యుత్తమ (షరియత్‌ను) ధర్మాన్ని అవతరింపజేసాడు, మరియు అన్ని ఆకాశ గ్రంథాలలో ఉన్న అన్ని ప్రధాన ఆజ్ఞలను మరియు బోధనలను అందులో ఉండేలా చేసాడు, మరియు వాటికి మరిన్ని ఆజ్ఞలను కూడా జోడించాడు.

7. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనం యొక్క మరొక రుజువు ఏమిటంటే అల్లాహ్ ఆయనపై వహీ ద్వారా షరీయత్ యొక్క వివరణ తెలియజేసే హదీసులను కూడా అవతరింపజేశాడు.

8. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనం యొక్క మరొక రుజువు ఏమిటంటే అల్లాహ్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను సమస్త మానవులు మరియు జిన్నాతుల కొరకు దైవ సందేశారునిగా చేసి పంపించాడు, కానీ ఇతర ప్రవక్తలను మాత్రం ఒక ప్రత్యేక జాతి కొరకు పంపించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿وما أرسلناك إلا كافة للناس بشيرا ونذيرا﴾
(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము.

అల్లాహ్ తఆలా మరో చోట ఇలా తెలియ చేస్తున్నాడు:

﴿وما أرسلناك إلا رحمة للعالمين﴾
(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.

మరియు అల్లాహ్ ఈ విషయాన్ని కూడా తెలియజేశాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశాన్ని జిన్నులు కూడా స్వీకరించాయి.

﴿ وإذ صرفنا إليك نفرا من الجن يستمعون القرآن فلما حضروه قالوا أنصتوا فلما قُضِي ولوا إلى قومهم منذرين ﴾
(ఓ ప్రవక్తా!) జిన్నుల సమూహం ఒకదానిని మేము ఖుర్‌ఆన్‌ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు, “నిశ్శబ్దంగా వినండి” అని (పరస్పరం) చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియ గానే, తమ వర్గం వారిని హెచ్చరించటానికి వాళ్ల వద్దకు తిరిగి వచ్చారు.

మరో చోట ఇలా సెలవిచ్చాడు:

﴿ يا قومنا أجيبوا داعي الله وآمنوا به يغفر لكم من ذنوبكم ويجركم من عذاب أليم ﴾
ఓ మా జాతివారలారా! అల్లాహ్‌ వైపునకు పిలిచేవాని మాట వినండి. అతన్ని విశ్వసించండి. అల్లాహ్‌ మీ పాపాలను మన్నిస్తాడు. బాధాకరమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు.

ఈ వాక్యంలో అల్లాహ్ వైపు పిలిచే “దాయి” అనగా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అని అర్థం. ఆయన ద్వారానే జిన్నాతులు ఖుర్ఆన్ పారాయణాన్ని విన్నాయి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రతి ప్రవక్త తన ప్రజల కోసం ప్రత్యేకంగా పంపబడ్డాడు.మరియు నేను ఎరుపు మరియు నలుపు అందరి కొరకు పంపబడ్డాను” (ముస్లిం) ఈ హదీస్ లో ఎరుపు మరియు నలుపు అనగా పూర్తి ప్రపంచం అని అర్థం.

9. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనం గురించి మరొక రుజువు ఏమిటంటే అల్లాహ్ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం గారి ద్వారా ప్రవక్తల యొక్క పరంపరను ముగించాడు. ఆయనను చిట్ట చివరి ప్రవక్తగా చేసి పంపాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

﴿ ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين ﴾
(ప్రజలారా!) ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్‌ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నాకు మరియు నా ముందున్న ప్రవక్తలందరి ఉదాహరణ ఎలాంటిదంటే ఒక వ్యక్తి ఒక ఇల్లు నిర్మించాడు మరియు అందులో అన్ని రకాల అలంకరణ చేశాడు, కానీ ఒక మూలలో ఒక ఇటుకను అమర్చలేదు ఇప్పుడు ప్రజలందరూ వచ్చి ఇంటి చుట్టూ నలువైపులా చూస్తున్నారు మరియు ఆశ్చర్యానికి లోనవుతారు మరియు ఇలా అంటారు – ఇక్కడ ఒక ఇటుక ఎందుకు అమర్చలేదు! అయితే ఆ ఇటుకను నేనే మరియు నేనే చిట్టచివరి ప్రవక్తను.(బుఖారి, ముస్లిం)

10. మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్పతనంలో భాగంగా మరొక రుజువు ఏమిటంటే అల్లాహ్ తఆలా ఆయన ఘనతను ఉన్నతం చేశాడు. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:

﴿ورفعنا لك ذكرك﴾
ఇంకా – మేము నీ కీర్తిని ఉన్నతం చేశాము.

అల్లాహ్ తఆలా తన ప్రవక్త పేరును తౌహీద్ యొక్క సాక్ష్యంలో ఒక విడదీయరాని భాగంగా చేసాడు: “అల్లాహ్ తప్ప మరే ఆరాధనకు అర్హుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను”, ఎన్నో ఆరాధనాలలో అల్లాహ్ పేరుతో ప్రవక్త పేరు కూడా ప్రస్తావించ బడుతుంది. అజాన్, ఇఖామత్, ఖుత్బా, నమాజ్, అత్తహియ్యాత్, మరియు ఎన్నో దుఆలలో ఈ విధంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరు ప్రపంచ నలుమూలలా మారుమ్రోగుతూ ఉంటుంది. మరియు ఈ విధంగా మరే వ్యక్తి గురించి లేదు.

హస్సాన్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) గారు ఇలా అన్నారు:

إذا قال في الخمس المؤذن أشهد ألم تر أن الله أخلد ذِكره

إذا قال في الخمسِ المؤذنُ أشهدُ وَضَمَّ الإلـٰهُ اسمَ النبيِّ إلى اسمه

فذو العرش محمودٌ وهذا محمدُ وشقَّ له من اسمه لِـــيُــجِلَّــــهُ

అల్లాహ్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పేరును తన పేరుతో జత చేసేశాడు. ఇక ముఅజ్జిన్ (అజాన్ పలికే వ్యక్తి) (ప్రతిరోజూ) ఐదు సార్లు అజాన్ పలుకుతూ “అష్ హదు” అని అంటాడు. మరియు అల్లాహ్ తన పేరుతోపాటు ఆయన పేరును కలిపాడు, తద్వారా ఆయన్ను గౌరవించాలని. అందుకే అర్ష్ వాసుడు (అల్లాహ్) ‘మహమూద్’ అయితే, ఈయన ‘ముహమ్మద్’ (సల్లల్లాహు అలైహి వ సల్లం).

ఓ ముస్లిం లారా! ఇవి మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గొప్పదనానికి సంబంధించిన పది ఆధారాలు. ఇలాంటి ఆధారాలు వంద కంటే ఎక్కువ గా ఉన్నాయి. దీని గురించి మీకు ముందు తెలియజేయడం జరిగింది.

అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక! ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాత్తాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత

నిశ్చయంగా అత్యంత అసభ్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ముస్తఫా (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అవమానించడం మరియు ఆయనను దూషించడం, కించపరచడం. ఇలాంటి వారు ఇస్లాం మరియు ముస్లింల పట్ల విద్వేషాన్ని కలిగి ఉంటారు. వీరిని ఉద్దేశించి అల్లాహ్ ఇలా అంటున్నాడు:

(إن شانئك هو الأبتر)
ముమ్మాటికీ నీ శత్రువే నామరూపాల్లేకుండా పోయేవాడు.

అనగా నిన్ను మరియు నీకు ప్రసాదించ బడినటువంటి ధర్మాన్ని మరియు సన్మార్గాన్ని ద్వేషించేవారు నామరూపాలు లేకుండా పోతారు. వారి ప్రస్తావన చేసే వారెవరు ఉండరు మరియు వారు అన్ని రకాల మేళ్ళ నుండి దూరమైపోతారు.

ఎవరైతే ఇస్లాంకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారో, వారికి వ్యతిరేకంగా అల్లాహ్ ఎలాంటి కుట్ర పన్నుతాడు అంటే వారు ఇస్లాంపై దాడి చేసినప్పుడల్లా వారి దేశాల దృష్టి ఇస్లాం వైపు పెరుగుతుంది, దాని ద్వారా వారు ఇస్లాం యొక్క బోధనలను మరియు ఇస్లాం యొక్క వాస్తవికతను తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇస్లాం యొక్క ప్రచారాన్ని వ్యాపింప చేయడానికి ముస్లింలు తమ దేశాలలో దావా కార్యక్రమాలను వేగవంతం చేస్తారు అల్లాహ్ ఇలా అంటున్నాడు:

(ومكروا مكرا ومكرنا مكرا وهم لا يشعرون)
ఈ విధంగా వారు (రహస్యంగా) కుట్ర పన్నారు. మరి మేము కూడా మా వ్యూహాన్ని రచించాము. కాని దాని గురించి వారికి తెలీదు.

అదే సమయంలో, అవిశ్వాసులు ముస్లింలను రెచ్చగొట్టాలని కోరుకుంటారు. తద్వారా వారు హింస, కోపం, అజ్ఞానం, మూర్ఖత్వంతో విధ్వంసాలను సృష్టించాలని చూస్తారు. అలా జరిగినప్పుడు వారు తమ జాతి వారితో ఇలా అంటారు – ఇస్లాం మరియు ముస్లింలు ఏం చేస్తున్నారో చూశారా!. ఈ విధంగా ఇస్లాంపై బురద చల్లుతారు ఈ విధంగా ప్రజలను ఇస్లాం నుండి ఆపడానికి మీడియా ద్వారా ఎన్నో విధ్వంసకర దృశ్యాలను ప్రసారం చేస్తారు.

కాబట్టి ఇలాంటి ఉపద్రవాల నుంచి అప్రమత్తంగా ఉండాలి. మరియు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహనాన్ని ఆయుధంగా చేసుకోవాలి. ఆ సందర్భంలో జ్ఞానవంతులు,పండితులు చూపిన మార్గదర్శకత్వాలను పాటించాలి. ఇలాంటి సంఘటనలను ఇస్లాం ప్రచారం కొరకు మరియు ఇస్లాం పై లేవనెత్తుతున్న సందేహాలను దూరం చేయడం కొరకు వినియోగించుకోవాలి. తద్వారా శత్రువుల మోసానికి లోను కాకుండా ఉంటాము. ఆ సందర్భంలో అల్లాహ్ యొక్క పరీక్ష మనపై అనుగ్రహంగా మారవచ్చు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

(ولا يستخفنك الذين لا يوقنون)
నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానం సత్యమైంది. నమ్మకం లేనివారు నిన్ను తడబాటుకు లోనుచేసే స్థితి రాకూడదు సుమా!

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద సత్కార్యానికై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుముఆ రోజు వారిపై ఎక్కువగా దరూద్ మరియు సలాం పంపమని చెబుతూ ఇలా సెలవిచ్చారు:

“ఉత్తమమైన రోజుల్లో జుమా రోజు. ఆ రోజునే ఆదమ్ అలైహిస్సలాం పుట్టించబడ్డారు.ఆయన అదే రోజున మరణించారు, అదే రోజున శంఖం పూరించబడుతుంది. అదే రోజు గావు “కేక” కూడా వినబడుతుంది. కాబట్టి ఆరోజు నాపై అతి ఎక్కువగా దరూద్ మరియు సలాం పంపండి. అవి నా ముందు ప్రదర్శించబడతాయి”.

ఓ అల్లాహ్! నీవు, నీ దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు శుభాలను పంపు. ఆయన ఖలీఫాలు, తాబయీన్లు మరియు ప్రళయం వరకు ఎవరైతే చిత్తశుద్ధితో అనుసరిస్తారో వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవం మరియు కీర్తిని ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయు మరియు ఏకేశ్వరోపాశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! ద్రవ్యోల్బణం, వడ్డీ, వ్యభిచారం, భూకంపాలు మరియు పరీక్షలను మా నుండి తొలగించు, మరియు బాహ్య, అంతర్గత ప్రలోభాల యొక్క చెడులను ప్రత్యేకించి మా దేశం నుండి మరియు సాధారణ అన్ని ముస్లిం దేశాల నుండి తొలగించు.

ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. మరియు వారిని వారి దేశం కొరకు కారుణ్యంగా చేయు.

ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపడంవలన  లాభాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖుత్బా అంశము : ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పంపడం  వలన  లాభాలు                

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.     

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి, అవిధేత నుండి జాగ్రత్త వహించండి.

తెలుసుకోండి! ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)వారిపై దరూద్ పంపడం ద్వారా పది ప్రయోజనాలు ఉన్నాయి.

1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపమన్న అల్లాహ్ యొక్క ఆజ్ఞ నెరవేరుతూ ఉంటుంది.

అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33:56)

2. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం ఒక దుఆ లాంటిది. ఇది ఆరాధనలో భాగమే ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ కాబట్టి దీని కొరకు పుణ్యఫలం కూడా ఉంది.

3. మహాప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై ఒకసారి దరూద్ పంపడం వలన అల్లాహ్ తఆలా యొక్క పది కారుణ్యాలు లభిస్తాయి. ప్రవక్త వారు ఇలా తెలియజేశారు: ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తారో అల్లాహ్ వారి పై పదిసార్లు కరుణిస్తాడు. (ముస్లిం)

ప్రతిఫలం అనేది చర్య యొక్క స్వభావం ద్వారా లభిస్తుంది. కనుక ఎవరైతే ప్రవక్త వారిని ప్రశంసిస్తారో అల్లాహ్ దానికి బదులుగా అతడిని ప్రశంసిస్తాడు మరియు అతని స్థానాలను ఉన్నతం చేస్తాడు.

4. దరూద్ పఠించే వ్యక్తి యొక్క పది అంతస్తులు పెరుగుతాయి. అతనికి పది పుణ్యాలు లభిస్తాయి మరియు పది పాపాలు క్షమించబడతాయి.

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “ఎవరయినా నాపై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు“. (నసాయి)

5. దరూద్ పాపాల మన్నింపుకు, దుఃఖవిచారాలను దూరం చేసుకోవటానికి, కష్టాలు కడగండ్ల నుండి గట్టెక్కటానికి దోహదపడుతుంది.

హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) కధనం: నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా నేను మీపై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను. వాస్తవానికి నేను నా ప్రార్ధన (దుఆ) లో ఎంత సేపు మీపై దరూద్ పఠించాలి?.” అని అడిగాను. అందుకాయన “నికిష్టమయినంత సేపు” అని అన్నారు. “నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?” అని అడిగాను. “సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచింది” అని అన్నారాయన. నేను “సగం ప్రార్ధన దరూద్ కోసం కేటాయిస్తాను” అన్నాను. దానికాయన “సరే, నీ యిష్టం.కానీ అంతకన్నా ఎక్కువ సేవు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నారు.నేను మళ్లీ “అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?” అని అడిగాను. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది” అని అన్నాడు. చివరికి నేను “మరయితే నా ప్రార్ధన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను” అని అన్నాను. అప్పుడాయన “ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది” అని చెప్పారు. (తిర్మీజీ)

ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) తెలియచేసారు: ఇతను హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ఈయన అల్లాహ్ తో ఒక ప్రత్యేక దుఆ వేడుకునేవారు. కానీ ఎప్పుడైతే ఆయన తన ప్రత్యేక దుఆ దగ్గర దరూద్ పటించడం ప్రారంభించాడో అతని ఇహపరాల ఇబ్బందుల కొరకు అల్లాహ్ సరిపోయాడు. ఆయన దరూద్ పంపినప్పుడల్లా అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలను కురిపించాడు. ఒకవేళ అతను తన సోదరుని కోసం దుఆ చేస్తే దైవదూతలు ఆమీన్ చెప్పడంతో పాటు నీకు కూడా అది లభించుగాక అనేవారు కాబట్టి మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొరకు దుఆ  చేయడం ఎంతో ఉత్తమమైనది.

6. మహా ప్రవక్త మొహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం వలన కలిగేటువంటి మరో ప్రయోజనం ఏమిటంటే ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠిస్తే, స్వర్గంలో ఆయనకు ‘ఉన్నత స్థానం’ లభించాలని కోరుకుంటే ప్రళయ దినాన వారికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు లభిస్తుంది.

హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్తుండగా విన్నాను, ఆయన ఈ విధంగా తెలియ చేసారు: “మీరు ఆజాన్ పిలుపు వినగానే దానికి తిరిగి అదే విధంగా సమాధానం చెప్పండి. ఆ తరువాత నాపై దరూద్ పటించండి. ఎవరు అయితే నాపై ఒకసారి దరూద్ పంపుతాడో అల్లాహ్ అతన్ని పది సార్లు కరుణిస్తాడు. నా కొరకు వసీలా’ (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని అల్లాహ్ ను కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను”. (ముస్లిం)

7. దుఆ చేసే వ్యక్తి తన దుఆ కి ముందు దరూద్ పఠించినప్పుడు అతనిలో దుఆ స్వీకరించబడుతుంది అనే ఆశ ఉంటుంది. ఎందుకంటే దరూద్ అతని దుఆ ని అల్లాహ్ అంగీకరించేందుకు తోడ్పడుతుంది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలియజేశారు: “ఆకాశం మరియు భూమి మధ్య దుఆ నిలిపివేయబడుతుంది. మీరు దానిపై ప్రార్థించే వరకు అనగా ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపనంతవరకు దానిలో ఏదీ పైకి వెళ్లదు“. (తిర్మీజీ)

8. మనం పఠించేటువంటి దరూద్ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి చేరవేయబడుతుంది, ప్రవక్త గారు ఇలా తెలియజేశారు: “మీ దరూద్ నాకు అందించబడుతుంది“. (అహ్మద్)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై తన ‘దరూద్’ పంపడం కంటే ఒక వ్యక్తికి గొప్ప గౌరవం ఏముంటుంది?

9. ఏదేని సభలో దూరూద్ పటించడం ఆ సభ యొక్క స్వచ్ఛతకు కారణం. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే దూరూద్ పఠించరో అది వారి కొరకు ప్రళయ దినాన దుఃఖ దాయకంగా పరిణమిస్తుంది.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “కొంతమంది ఒకచోట సమావేశమై ఆ సమావేశంలో అల్లాహ్ ను జ్ఞాపకం చేసుకోకపోతే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై దరూద్ పంపకపోతే ప్రళయదినాన ఆ సమావేశం వారి పాలిట దుఃఖదాయకంగా (తలవంపుగా) పరిణమిస్తుంది. వారు సత్కార్యాల ఆధారంగా స్వర్గంలో ప్రవేశించేవారయినా సరే.” (అహ్మద్)

10. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమ పెరుగుదలకు దరూద్ షరీఫ్ కారణం. ఇది విశ్వాసం యొక్క ఒడంబడికలలో ఒకటి, ఇది ఒక్క ప్రేమ ద్వారా మాత్రమే నెరవేరుతుంది. ఒక వ్యక్తి తన ప్రియమైన వ్యక్తిని ఎంత ఎక్కువగా గుర్తుంచుకుంటాడో, అతని సద్గుణాలు మరియు అతని ప్రేమకు దారితీసే లక్షణాలను పునరుద్ధరించుకుంటాడు. దీనివలన అతని ప్రేమ మరింత పెరుగుతుంది మరియు అతను ప్రేమించే ప్రియమైన వ్యక్తిని కలవాలనే కోరిక పూర్తిగా పెరుగుతుంది.

కానీ ఒక వ్యక్తి తాను ప్రేమించే వ్యక్తిని మర్చిపోయినప్పుడు అతని హృదయంలో నుండి అతని సద్గుణాలన్నీ తొలగిపోతాయి, మరియు అతనిపై ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుంది. ఒక ప్రేమికుడికి తాను ప్రేమించే తన స్నేహితుడిని చూడడం కంటే తన కళ్ళను మరి ఏమి చల్లపరచలేదు.

ఇవి ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై దరూద్ పంపడం వలన కలిగేటువంటి పది ప్రయోజనాలు – వీటిని ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) వారు (జలా అల్ ఆఫ్ హామ్) అనే పుస్తకంలో పొందుపరిచారు.

అల్లాహ్ ఖుర్ఆన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకం తో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక, అల్లాహ్ మనందరిని క్షమించుగాక, మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి, నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.   

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ ముస్లిం లారా! మహా ప్రవక్త  ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కొరకు దరూద్ పంపడంతోపాటు, వసీల మరియు ఫజీల (ఔన్నత్యం) కొరకు దుఆ  కూడా చేయాలి. అనగా ఓ అల్లాహ్! మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ మఖామే మహమూద్ వరకు చేర్చు.  దీని ఆధారం జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే అజాన్ పిలుపు వింటారో వారు ఈ దుఆ  చదవాలి:

(ఈ సంపూర్ణ పిలుపుకు స్థిరముగా స్థాపించబడు నమాజుకు ప్రభువైన అల్లాహ్! హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారికి వసీల అనే ఆశ్రయం ప్రసాదించు. మహిమ కలిగిన ఔన్నత్యమును ప్రసాదించు. మరియు నీవు వారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చు) (బుఖారి)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రబోధిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) తెలియజేశారు: ముఅజ్జన్ (అజాన్ ఇచ్చేవాని) ప్రకటన విన్నప్పుడు, అతను అనే పలుకులే మీరూ పలకండి. ఆ తర్వాత నాపై దరూద్ పఠించండి. నాపై ఒకసారి దరూద్ పఠించేవారిని అల్లాహ్ పదిసార్లు కరుణిస్తాడు. ఆ తర్వాత నాకు ‘వసీలా’ లభించాలని అల్లాహ్ ను ప్రార్థించండి. వసీలా అనేది స్వర్గంలో ఒక (ఉన్నత స్థానం). స్వర్గవాసులందరిలో అది కేవలం ఒకే ఒక్కరికి లభిస్తుంది. ఆ ఒక్కణ్ణి నేనేనని నా అభిప్రాయం. కనుక నాకు వసీలా లభించాలని ప్రార్థించే వ్యక్తికి నా సిఫారసు తప్పకుండా లభిస్తుంది. (ముస్లిం)

వసీల” అనగా స్వర్గంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానము. “ఫజీల” అనగా మహిమ కలిగినటువంటి ఔన్నత్యము. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలియచేసినటువంటి దాంట్లో మఖామే మహమూద్ లో “మహమూద్” అనగా ఒక ప్రదేశము అక్కడ నిల్చున్న వ్యక్తి ప్రశంసించబడతాడు. “అల్ మఖాం” అనగా లెక్క తీసుకునేటువంటి సందర్భంలో సిఫారసు కొరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిల్చోనేటువంటి ప్రదేశము. దీని ఆధారం అబూరైన కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: “మఖామే మహమూద్ అనగా సిఫారసు

మరియు హదీస్ యొక్క చివరిలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అన్నారు: “అనగా ఆచరణ ద్వారానే ప్రతిఫలం లభిస్తుంది కనుక ఏ వ్యక్తి అయితే మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొరకు మఖామే మహమూద్ గురించి అల్లాహ్ ను ప్రార్ధిస్తాడో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సిఫారసు కు అతను అర్హుడు అవుతాడు. మరియు ఆ వ్యక్తి పాపాలు క్షమించబడి, స్థానాలు ఉన్నతం చేయబడే వారిలో చేర్చబడతాడు”.

అల్లాహ్ మనందరికీ మహా ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సిఫారసు పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక! (ఆమీన్)

మరియు ఇది కూడా తెలుసుకోండి, అల్లాహ్ ఆయనపై తన కారుణ్యాన్ని కురిపించు గాక. అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి తెలియచేశాడు. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

(إن اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تسليما)
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.

ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్ ,ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు. మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారీగా చేయి. ఓ అల్లాహ్! మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు.   

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు. ఓ అల్లాహ్ మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు, మాకు మోక్షాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు.  

ఓ అల్లాహ్! మేము నీతో స్వర్గం గురించి ప్రాధేయపడుతున్నాము మరియు ఆ స్వర్గంలోకి ప్రవేశించేటువంటి ఆచరణని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము మరియు ఆ నరకం నుండి నీ శరణు వేడుకుంటున్నాము మరియు నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి పని నుండి  నీ శరణు కోరుకుంటున్నాము.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల ప్రేమ | కలామే హిక్మత్ (వివేక వచనం)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మనిషికి తన భార్యాబిడ్డల కంటే, తన సొంత సొమ్ముకంటే, తన వారికంటే ఎక్కువగా నేను ప్రియమైనవాడ్ని కానంతవరకూ అతను విశ్వాసి (మోమిన్) కాలేడు.” (ముస్లిం)

ఈ హదీసులో ”విశ్వాసం” యొక్క ఉన్నతమయిన స్థితి వివరించబడింది. పరలోక సాఫల్యం పొందాలంటే అటువంటి ఉన్నతస్థితికి విశ్వాసం చేరుకోవాలి. అంటే మనం మన స్వయంపై దైవప్రవక్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు మన ప్రాణం కన్నా దైవప్రవక్త ప్రాణమే ప్రీతికరం కాగలగాలి. ఒకసారి హజ్రత్ ఉమర్ మహాప్రవక్తను ఉద్దేశించి, “ఓ దైవప్రవక్తా! నా ప్రాణం తప్ప మిగతా అన్ని విషయాలకన్నా మీరే నాకు ప్రియమైన వారు” అని అన్నారు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”లేదు, ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో అతని సాక్షిగా చెబుతున్నాను – నేను మీకు మీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రియతమం కానంత వరకూ మీరు విశ్వాసి కాలేరు” అని పలికారు. ఉమర్ (రజిఅన్ అన్నారు. “ఇప్పుడు నాకు మీరు నిశ్చయంగా నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రీతికరమైన వారు.” దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “అయితే ఉమర్! ఇప్పుడు మీరు విశ్వాసులు” అన్నారు. (బుఖారి)

సహచరులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల అమితమయిన ప్రేమాభిమానం కలిగి ఉండేవారు. చారిత్రక గ్రంథాలు, హదీసు గ్రంథాలే దీనికి నిదర్శనం. హిజ్రత్ సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్తకు చేసిన సేవలను గురించి ప్రఖ్యాత చరిత్రకారులు, హదీసువేత్త అయిన ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఇలా వ్రాశారు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూబకర్ ఇద్దరూ రాత్రిపూట సూర్ గుహలో చేరారు. అయితే అబూబకర్ గుహలోకి మొదట ప్రవేశించారు. దైవప్రవక్తకు కీడు కలిగించే మృగం గాని, పాముగాని గుహలో ఉండవచ్చునేమోనన్న భయంతో అబూబకర్ తొలుత తానే గుహలో ప్రవేశించారు.”

మరో ఉల్లేఖనం ఏమని ఉందంటే; ఆ గుహకు ఎన్నో కన్నాలు ఉన్నాయి. అబూబకర్ ఆ కన్నాలను మూసివేశారు. ఒక కన్నాన్ని మూసివేయటానికి వీలుపడకపోతే తన కాలిని దానికి అడ్డుగా పెట్టారు. కన్నం లోపలినుంచి విషపు పురుగులు కాటేయసాగాయి. బాధతో ఆయన కళ్ళనుంచి అశ్రువులు రాలాయి. అయినా ఆయన కాలు తీయలేదు.

ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాన్ని అనుసరించాలి. ఎవరయినా, తనకు ప్రవక్త యెడల అమితమయిన ప్రేమ ఉందని చాటుకుంటూ ప్రవక్త సంప్రదాయాన్ని (సున్నత్ను) అవలంబించకపోతే, అతను అసత్యవాది, బూటకపు అనుయాయి అనిపించుకుంటాడు. అల్లాహ్ సెలవిచ్చాడు:

“మేము అల్లాహ్ ను మరియు ప్రవక్తను విశ్వసించామని, విధేయతను స్వీకరించామని వారంటారు. ఆ తరువాత వారిలో ఒక వర్గం విధేయత పట్ల విముఖత చూపుతుంది. ఇటువంటి వారు విశ్వాసులు కారు.” (అన్నూర్ : 47)

విధేయతా మార్గం నుండి వైముఖ్యం ప్రదర్శించిన వారిని విశ్వాస పరిధుల నుండి వేరుచేస్తూ పై ఆయత్ అవతరించింది. మనసులో ఎంత అధికంగా విశ్వాసం ఉంటే అంతే అధికంగా విధేయతా భావం ఉంటుంది.

చెప్పుకోవటానికయితే చాలామంది తమకు ప్రవక్తయెడల అపార గౌరవం, ప్రేమ ఉన్నాయని చెప్పుకుంటారు. అయితే వారి మాటలు ‘విధేయత’ అనే గీటురాయిపై పరికించబడతాయి. ఒకవేళ వారి ఆచరణ ప్రవక్త ఆచరణకు భిన్నంగా ఉంటే వారు చెప్పేదంతా బూటకం అవుతుంది. మనసులో ప్రేమ ఉంటే, నిష్కల్మషమైన విధేయతా భావం ఉంటే అది ఆచరణ ద్వారా తప్పకుండా వ్యక్తమవుతుంది.

”(ఓ ప్రవక్తా!) వారితో అనండి, ‘ఒకవేళ మీరు అల్లాహ్ యెడల ప్రేమ కలిగి ఉంటే నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ అపరాధాలను మన్నిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, ఎంతగానో కరుణించేవాడు కూడాను.” (ఆలి ఇమ్రాన్ : 31)

హాపిజ్ ఇబ్నె హజర్ ఇలా అన్నారు :

ప్రవక్తలందరిపట్ల ప్రేమ కలిగి ఉండటం విశ్వాసానికి ప్రతీక. అయితే మనం అందరికన్నా ఎక్కువ ప్రేమ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల కలిగి ఉండాలి :

ఇమామ్ ఖతాబి ఇలా అంటున్నారు:

ఇక్కడ ప్రేమ అంటే భావం లాంఛన ప్రాయమయిన ప్రేమ కాదు హృదయ పూర్వకమయిన ప్రేమ. మహాప్రవక్త ఏమని ఉపదేశించారంటే, మీరు నా అనుసరణలో మీ మనోకాంక్షల్ని జయించనంతవరకు, నా సంతోషానికి మీ సుఖసంతోషాలపై ప్రాధాన్యత ఇవ్వనంతవరకూ – ఒకవేళ మీకు నష్టం కలిగినాసరే, చివరకు మీరు అమరగతి నొందవలసి వచ్చినా సరే – మీరు నా సంతోషం కొరకు పాటుపడనంతవరకూ మీకు నాపై గల ప్రేమ ధృవీకరించబడదు.

ఖాజీ అయాజ్ మరియు ఇబ్నె బతాల్ తదితరులు ఇలా అభిప్రాయపడ్డారు : ప్రేమ మూడు రకాలు :

(1) గౌరవనీయమయిన ప్రేమ. ఇది తండ్రిపట్ల ఉంటుంది.
(2) అవ్యాజానురాగాలతో కూడిన ప్రేమ. ఇది సంతానంపై ఉంటుంది.
(3) స్వాభావికమయిన ప్రేమ. ఇది ఒక మనిషికి మరో మనిషిపై సాధారణంగా ఉంటుంది.

ఈ హదీసులో మహాప్రవక్త అన్ని రకాల ప్రేమలను ప్రస్తుతించారు.

ఈ హదీసు ఆలోచన, యోచనల వైపు దృష్టిని మరలిస్తుంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా ప్రాప్తమయ్యే మహత్పూర్వకమయిన ప్రయోజనాలకు మూలం ఆలోచన మరియు యోచనలే. ప్రవక్త సహచరులు ఏ విషయంపైనయినా ఎంతో సావధానంగా ఆలోచించేవారు. ప్రతి విషయాన్ని తరచి చూసేవారు. అందుచేత వారి విశ్వాసం ఎంతో దృఢమయ్యింది. ఈ హదీసు ద్వారా ముస్లిమైన ప్రతి ఒక్కరికీ లభించే సందేశం ఏమంటే సకల ప్రేమలకన్నా ప్రవక్త యెడల ప్రేమకు అతను ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో తాను ఏ స్థాయిలో నున్నది అతను సతతం ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత చరిత్ర (సీరత్ ) తెలుసుకోవడం ఎందుకు అవసరం? [వీడియో ]

ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత చరిత్ర (సీరత్ ) తెలుసుకోవడం ఎందుకు అవసరం? [వీడియో ]
https://youtu.be/cXBur4cYoZE [37:50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ﷺ ఆదర్శవంతమైన జీవితంలోని 30 అంశాలు – ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం గారి జాదుల్ మఆద్ లో నుండి [వీడియోలు]

ప్రవక్త ఆదర్శవంతమైన జీవితంలోని 30 అంశాలు – ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం గారి జాదుల్ మఆద్ లో నుండి [వీడియోలు]
యూట్యూబ్ ప్లే లిస్ట్ – https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1vAdSpzam50Xb4BbeTxUTh
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

A ప్రవక్త విధానం: మలమూత్ర విసర్జనలో

1- ఆయన మరుగుదొడ్డిలో ప్రవేశించాలని అనుకున్నప్పుడు ఈ విధంగా పలికేవారు: అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్. (ఓ అల్లాహ్! అపరిశుభ్ర స్త్రీ పురుష జిన్నాతుల నుండి నీ శరణు కోరుతున్నాను). (బుఖారీ). బయటకు వచ్చిన తర్వాత అనేవారు: గుఫ్రానక. (ఓ అల్లాహ్ నన్ను క్షమించు). (అబూ దావూద్ 30)

2- ఆయన ఎక్కువగా కూర్చొని ఉన్న స్థితిలోనే మలమూత్ర విసర్జన చేసేవారు.

3- ఆయన ఒక్కోసారి “ఇస్తింజా” (నీటితో శుభ్రం) చేసుకునేవారు, మరికొన్ని సార్లు “ఇస్తిజ్మార్” (రాళ్ళతో శుద్ధి) చేసుకునేవారు, ఇంకొన్ని సార్లు ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ రెండూ చేసేవారు.

4- ఆయన ఇస్తిన్జా మరియు ఇస్తిజ్మార్ లో ఎడమ చేతినే ఉపయోగించేవారు.

5- ఆయన ఇస్తింజా చేసిన తర్వాత తమ చేతిని మట్టితో శుభ్రపరుచుకునేవారు. (ఈ రోజుల్లో సబ్బుతో, హ్యాండ్ వాష్ లిక్విడ్ తో శుభ్రపరుచుకున్నా సరిపోతుంది).

6- ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు మలమూత్ర విసర్జన కొరకు సహాబాల (సహచరుల) దృష్టికి కనబడనంత దూరంగా వెళ్ళిపోయేవారు.

7- ఆయన కొన్నిసార్లు ఏదైనా మట్టి దిబ్బ (మిట్ట) వెనక, కొన్నిసార్లు ఖర్జూరపు చెట్ల చాటుకు, మరికొన్ని సార్లు లోయలో, పల్లపు భూమిలో చెట్ల వెనక మలమూత్ర విసర్జన చేసేవారు.

8- ఆయన మూత్ర విసర్జన కొరకు మెత్తటి నేలను అన్వేషించేవారు.

9-ఆయన మలమూత్ర విసర్జన కొరకు కూర్చునేటప్పడు నేలకు అత్యంత దగ్గరగా అవనంతవరకూ తమ దుస్తులను ఎత్తేవారు కాదు.

10- ఆయన మూత్రవిసర్జ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సలామ్ చేస్తే దానికి సమాధానం ఇచ్చేవారు కాదు.

B ప్రవక్త విధానం: వుజూ చేయడంలో

1-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాల్లో ప్రతీ నమాజు కొరకు వుజూ చేసేవారు, కొన్ని సందర్భాల్లో ఒకే వుజూ తో ఎన్నో నమాజులు చేసేవారు.

2- ఆయన ఒక్కోసారి కేవలం ఒక ముద్ నీళ్ళతో, ఒకప్పుడు మూడిట్లో రెండు భాగాల ముద్ నీళ్ళతో, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ నీళ్ళతో వుజూ చేసేవారు. (నాలుగు ముద్ లు కలసి ఒక సాఅ అవుతుంది. ఇది ఒక కొలమానం. ఒక సాఅ లో సుమారు మూడు కిలోల బియ్యం వస్తాయి).

3- ఆయన వుజూలో తక్కువ నీటిని ఉపయోగించేవారు. తమ అనుచరసమాజాన్ని కూడా నీరు వృధా చేయడం నుంచి వారించేవారు.

4- ఆయన కొన్నిసార్లు ఒక్కోసారి, కొన్నిసార్లు రెండేసి సార్లు, కొన్ని సార్లు మూడేసి సార్లు తమ వుజూ అవయవాలను కడిగేవారు. మరికొన్ని సార్లు కొన్ని అవయవాలను రెండేసి సార్లు కడిగితే, మరికొన్ని అవయవాలను మూడేసి సార్లు కడిగేవారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా మూడు కంటే ఎక్కువ సార్లు కడగలేదు.

5- ఆయన కొన్నిసార్లు ఒకే దోసెడు నీటితో పుక్కిలించి, ముక్కులోకి నీళ్ళు ఎక్కించేవారు, మరికొన్ని సార్లు రెండు దోసెళ్ళతో, మరికొన్ని సార్లు మూడు దోసెళ్ళతో. అయితే ఒకే దోసెడు నీళ్ళలో నుండి సగంతో పుక్కిలించి, సగం ముక్కులో ఎక్కించేవారు.

6- ఆయన కుడిచేతితో ముక్కులోకి నీళ్ళు ఎక్కించి, ఎడమ చేతితో శుభ్రపరిచేవారు.

7- ఆయన పుక్కిలించకుండా, ముక్కులోకి నీటిని ఎక్కించకుండా వుజూ చేసేవారు కాదు.

8- ఆయన పూర్తి తలపై మస్ హ్ చేసేవారు, మరికొన్ని సార్లు రెండు చేతులతో తలపై మస్ హ్ చేస్తూ ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి తీసుకొచ్చేవారు.

9- ఎప్పుడైతే ఆయన తమ నుదుటిపై మసహ్ చేసేవారో అప్పుడు మిగిలిన మసహ్ ని తమ తలపాగా‌పై పూర్తిచేసే వారు.

10- ఆయన తలపై మస్ హ్ తో పాటే చెవుల పైభాగం మరియు లోపలి భాగం కూడా మస్ హ్ చేసేవారు.

11- ఆయన మేజోళ్ళు తొడగనప్పుడు రెండు కాళ్ళు కడిగేవారు.

12- ఆయన క్రమపద్దతిలో మరియు ఒక అవయవం తర్వాత వెంటనే మరో అవయవం కడుగుతూ వుజూ చేసేవారు, ఆయన ఈ (క్రమం, వెంటవెంట) విషయంలో ఎన్నడూ అంతరాయం (లోటు) కలిగించేవారు కాదు.

13- ఆయన బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరు)తో వుజూ ప్రారంభించేవారు, మరియు వుజూ పూర్తి చేశాక, చివరిలో ఈ దుఆ చదివేవారు: అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్ అల్నీ మినల్ ముతతహ్హిరీన్.  (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని ఆయన ఒక్కడేనని ఆయనకు భాగస్వామి ఎవరూ లేరని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను, ఓ అల్లాహ్! నన్ను పశ్చాత్తాప పడేవారిలోను, పరిశుభ్రత పాటించే వారిలోనూ చేర్చు (తిర్మిజీ).

            ఇంకా ఈ దుఆ కూడా చదివేవారు: సుబ్ హానకల్లాహుమ్మ వబిహమ్ దిక అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక. (ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు మరియు సకల స్తోత్రాలు నీ కొరకే. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు అని సాక్ష్యమిస్తున్నాను. పశ్చాత్తాప పడి నీతో క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపునకే మరలుచున్నాను. (ఇర్వావుల్ గలీల్ 1-135).

14- ఆయన‌‌ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా సహాబాలు ప్రారంభంలో: “నవైతు నఫ్అల్ హదస్” (నేను అశుధ్ధత దూరం అవ్వాలని “నియ్యత్” (సంకల్పం) చేసుకుంటున్నాను) అని లేదా నమాజు ధర్మసమ్మతం చేయడానికి “నియ్యత్” (సంకల్పిం) చేసుకుంటున్నాను అని అనేవారు కారు.

15- ఆయన వుజూలో తమ మోచేతులు మరియు చీలమండలాని కంటే పైగా కడిగేవారు కాదు.

16- ఆయనకు (వుజూ తర్వాత) తమ అవయవాలను ఆరబెట్టే అలవాటు లేకుండినది.

17- ఆయన తమ గెడ్డంలో ఖిలాల్  చేసేవారు, కానీ ఎల్లప్పుడూ చేసేవారు కారు.

18- ఆయన తమ వేళ్ళ మధ్యలో కూడా ఖిలాల్ చే‌సేవారు, కానీ ఎల్లప్పుడూ కాదు.

19- ఆయనకు ఎవరితోనైనా నీరు పోయించుకుంటూ వుజూ చేసే అలవాటు లేకుండినది, అనేకసార్లు స్వయంగా తామే నీళ్ళు తీసుకొని వుజూ చేసేవారు. మరికొన్ని సార్లు అవసరమైతే మరో వ్యక్తి సహాయం తీసుకునేవారు.

C ప్రవక్త విధానం: మేజోళ్ళపై మసహ్ చేయడంలో([2])

1- సహీహ్ హదీసు ద్వారా రూఢీ అయినది ఏమనగా ఆయన ప్రయాణంలోనూ, మరియు నగరంలో ఉన్నప్పుడూ మస్ హ్ చేసేవారు. ఆయన స్థానికుల కొరకు ఒక రాత్రి, ఒక పగలు మరియు ప్రయానికుని కొరకు మూడు రాత్రులు, మూడు పగళ్ళు మస్ హ్ చేసే గడువుని నిర్ధారించారు.

2- ఆయన మేజోళ్ళ పైభాగాన మస్ హ్ చేసేవారు. ఆయన అన్ని రకాల మేజోళ్ళపై మస్ హ్ చేశారు. ఒకప్పుడు కేవలం తలపాగా పై, మరొకప్పుడు నొసటి మరియు తలపాగాను కలిపి మస్ హ్ చేశారు.

3- ఆయన వుజూ చేస్తున్నప్పుడు కాళ్ళు కడిగే విషయంలో ఇబ్బంది పడేవారు కాదు. ఒకవేళ మేజోళ్ళు ఉంటే వాటిపైనే మస్ హ్ చేసేవారు, లేకపోతే కాళ్ళు కడిగేవారు.

D ప్రవక్త విధానం: తయమ్ముమ్ చేయడంలో([3])

1- ఆయన ఏ నేలపై నమాజు ఆచరించేవారో అదే నేలపై తయమ్ముమ్ చేసేవారు అది మన్ను అయినా, లేదా ఇసుక అయినా, లేదా చిత్తడి నేల అయినా సరే. ఆయన ఇలా అనేవారు: నా అనుచర సమాజంలోని ఏ వ్యక్తి అయినా ఎక్కడ ఉండగా నమాజు సమయం అవుతుందో అక్కడి శుభ్రమైన భూమి అతని కొరకు నమాజు చేసే స్థలం అవుతుంది మరియు (నీళ్ళు లేనిచో) తయమ్ముమ్ కొరకు అదే నేల మట్టి సరిపోతుంది.

2- ఆయన దూర ప్రయాణంలో వెళ్ళినప్పుడు తయమ్ముమ్ కొరకు తమ వెంట మట్టిని తీసుకువెళ్ళేవారు కారు. మరియు ఇలా చేయమని ఎన్నడూ ఆదేశించలేదు.

3- ఆయన నుండి ప్రతీ నమాజు కొరకూ విడిగా తయమ్ముమ్ చేయడం రుజువు లేదు,  ఆయన ఇలా ఆజ్ఞాపించనూ లేదు. ఆయన తయమ్ముమ్ ఆదేశం సామాన్యంగా ఇచ్చేశారు, మరియు అది వుజూకి ప్రత్యామ్నాయం అని తెలిపారు.

4- ఆయన ముఖం మరియు చేతుల పై ఒకే తట్టు తో తయమ్ముమ్ చేసేవారు.  

1- ఆయన నమాజు కొరకు నిలబడినప్పుడు “అల్లాహు అక్బర్” అనేవారు. దానికంటే ముందు ఆయన ఏమీ పలికేవారు కాదు. అదేవిధంగా ఎన్నడూ నోటితో సంకల్పం చేయలేదు.

2- ఆయన తక్బీరే తహ్రీమా (అల్లాహు అక్బర్)తో పాటే తమ రెండు చేతుల వేళ్ళను విడిగా, ఖిబ్లా దిశలో పెట్టి తమ రెండు చెవుల అంచుల లేదా భుజాల వరకు  ఎత్తేవారు. ఆ తరువాత కుడి చెయ్యిని ఎడమ చెయ్యి పైభాగంపై పెట్టేవారు

3- ఆయన కొన్నిసార్లు ఈ దుఆ (ఇస్తిఫ్తాహ్)తో (నమాజ్) ప్రారంభించేవారు: అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనస్, అల్లాహుమ్మగ్ సిల్నీ మిన్ ఖతాయాయా బిల్ మాఇ వస్సల్ జి వల్ బరద్.

اللهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ، اللهُمَّ نَقِّنِي مِنْ خَطَايَايَ كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنَ الدَّنَسِ، اللهُمَّ اغْسِلْنِي مِنْ خَطَايَايَ بِالثَّلْجِ وَالْمَاءِ وَالْبَرَدِ

(ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్నూ, నా పాపాలకు అంతే దూరంగా ఉంచు, ఓ అల్లాహ్! మాసిన బట్టని తెల్లగా శుభ్రం చేయబడినట్లు నన్ను నా పాపాల నుండి ప్రక్షాళణం చెయ్యి. ఓ అల్లాహ్! నా పాపాలను మంచు, నీరు, వడగండ్లతో కడిగివెయ్యి).

మరికొన్నిసార్లు ఆయన ఈ దుఆ తో  (నమాజు) ప్రారంభించేవారు: వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ జ హనీఫా, వమా అన మినల్ ముష్రికీన్, ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్.

وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا، وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ، إِنَّ صَلَاتِي، وَنُسُكِي، وَمَحْيَايَ، وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، لَا شَرِيكَ لَهُ، وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ

(నేను నా ముఖాన్ని ఏకాగ్ర చిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన వాని వైపునకు త్రిప్పుకున్నాను. నేను బహుదైవారాధకులలోని వాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయన సహవర్తులెవరూ లేనివాడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాడిని.

4- ఆయన దుఆయే ఇస్తిఫ్తాహ్ తర్వాత: అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం చదివేవారు. (నేను శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను). ఆ తర్వాత సూరతుల్ ఫాతిహా పఠించేవారు.

5- ఆయన రెండు చోట్ల మౌనంగా ఉండేవారు. మొదటిది: తక్బీరే తహ్రీమా మరియు ఖిరాత్ మధ్య. రెండవది: ఇందులో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం సూరయే ఫాతిహా తరువాత, మరికొందరి అభిప్రాయం ప్రకారం రుకూకి ముందు.

6- ఆయన సూరయే ఫాతిహా ముగించిన తరువాత మరొక‌ సూరా పారాయణం చేసేవారు. కొన్నిసార్లు పెద్ద సూరాలు పఠిస్తే మరికొన్ని సార్లు ప్రయాణం లేదా ఇతర కారణాల వల్ల చిన్న సూరాలు పఠించేవారు. కానీ ఆయన ఎక్కువ శాతం మధ్య రకమైన సూరాలు పఠించేవారు.

7- ఆయన ఫజర్ నమాజులో 60 నుండి 100 ఆయతుల వరకూ పారాయణం చేసేవారు. అదేవిధంగా ఆయన ఫజ్ర్ నమాజులో సూరయే ఖాఫ్, సూరయే రూమ్, సూరయే తక్వీర్ పారాయణం చేసేవారు.

            అదేవిధంగా “సూరయే జిల్ జాల్” ను రెండు రకాత్ లలో కూడా  పారాయణం చేసారు.

            ప్రయాణంలో ఉన్నప్పుడు ఫజ్ర్ నమాజులో ముఅవ్వజతైన్ (సూరయే ఫలఖ్ మరియు సూరయే నాస్) పారాయణం చేసారు.

            ఒకసారి ఆయన సూరయే ముఅ్ మినూన్ పారాయణం చేయడం ప్రారంభించారు మొదటి రకాతులో ఉండగా మూసా మరియు హారూన్ అలైహిమస్సలాం గారి సంఘటనకు చేరుకోగానే ఆయనకు విపరీతమైన దగ్గు రావడంతో ఆయన రుకూ చేసారు.

8- ఆయన జుమా రోజు ఫజ్ర్ నమాజులో అలిఫ్ లామ్ మీమ్ సూరయే సజ్దహ్ మరియు హల్ అతా అలల్ ఇన్సాన్ సూరయే దహర్ ను పారాయణం చేసేవారు.

9- ఆయన జొహ్ర్ నమాజులో కొన్నిసార్లు సుదీర్ఘ పారాయణం చేసేవారు. ఒకవేళ జొహ్ర్ నమాజులో సుదీర్ఘ పారాయణం చేస్తే అస్ర్ నమాజులో దానికి సగం వంతు పారాయణం చేసేవారు. ఒకవేళ జొహ్ర్ నమాజులో ఖిరాత్ సంక్షిప్తంగా చేసి ఉంటే అస్ర్ నమాజులో కూడా దానికి సమానంగా ఖిరాత్ (పారాయణం) చేసేవారు.

10- ఆయన మగ్రిబ్ నమాజులో ఒకసారి సూరయే తూర్, మరొకసారి సూరయే ముర్సలాత్ పారాయణం చేసారు.

11- ఆయన ఇషా నమాజులో సూరయే తీన్ పారాయణం చేసారు. మరియు హజ్రత్ ముఆజ్ రజియల్లాహు అన్హు గారి కొరకు {వష్షమ్ సి వదుహాహా} సూరయే షమ్స్ మరియు {సబ్బిహిస్మ రబ్బికల్ అఅలా} సూరయే అఅలా మరియు {వల్లైలి ఇజా యగ్ షా} సూరయే లైల్ పారాయణం చేయవలసినదిగా నిర్ణయించారు. సూరే బఖరా పారాయణం నుండి వారించారు.

12- ఆయన విధానం ఏ సూరా పారాయణం చేసినా దానిని పూర్తిగా పారాయణం చేయడం. ఒక్కోసారి ఒక సూరాను రెండు రకాత్ లలో పూర్తిచేసే వారు, ఒక్కోసారి ఆయన సూరాను ప్రారంభం నుంచి పారాయణం చేసేవారు. కానీ సూర మధ్యలో నుండి లేదా చివరి భాగం నుండి పారాయణం చేయడం గురించి ఆయన నుండి ఏ విషయమూ ప్రస్తావించబడలేదు.

            ఒకే రకాత్‌లో రెండు సూరాలను పఠించే విషయానికి వస్తే ఆయన ఇలా కేవలం సఫిల్ నమాజులలో చేసేవారు. ఇక ఒకే సూరాను రెండు రకాత్ లలో పూర్తి చేసే విషయానికి వస్తే ఆయన ఇలా తక్కువగా చేసేవారు. అదేవిధంగా ఆయన జుమా మరియు ఈదైన్ (పండుగల) నమాజులను వదిలి వేరితర నమాజులలో ఫలానా సూరాలనే  పఠించాలని ప్రత్యేకించలేదు.

13- ఆయన ఫజ్ర్ నమాజులో రుకూ తరువాత ఒక నెల వరకూ ఖునూతే నాజిలా పఠించారు, పిదప దానిని వదిలేశారు. ఇలా తాత్కాలిక అవసరం ఏర్పడినప్పుడు చేసారు, ఎప్పుడైతే ఆ అవసరం పూర్తి అయిపోయిందో అప్పుడు మానేశారు. ఆయన ఖునూత్ ను కష్ట, ఆపద సమయాల్లో పఠించేవారు, కానీ ఇది ఫజ్ర్ నమాజుతోనే ముడిపడిలేదు.

1- ప్రతీ నమాజులో ఆయన మొదటి రకాతు రెండవ రకాత్ కంటే సుదీర్ఘంగా ఉండేది.

2- ఆయన ఖిరాత్ పూర్తి చేయగానే శ్వాస తిరిగి తీసుకునేంత సమయం మౌనం పాటించేవారు. మరియు రెండు చేతులు ఎత్తుతూ (రఫ్ఉల్ యదైన్ చేస్తూ), అల్లాహు అక్బర్ పలుకుతూ రుకూలోకి వెళ్ళేవారు. తమ రెండు అరచేతులతో తమ మోకాళ్ళను గట్టిగా పట్టుకునేవారు, అలాగే తమ మోచేతులను ప్రక్కలకు దూరంగా ఉంచేవారు, ఆయన వీపు నిటారుగా ఉండేది. తలను పైకి ఉంచేవారు కాదు, అదేవిధంగా కిందికి కూడా వంచేవారు కాదు, వీపుకి సమానంగా ఉంచేవారు.

3- ఆయన రుకూలో సుబ్ హాన రబ్బియల్ అజీమ్ చదివేవారు. (ముస్లిం). ఒక్కోసారి: సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ చదివేవారు. (ముత్తఫఖున్ అలైహి). ఆయన రుకూలో ఈ దుఆ కూడా చదివేవారు: సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్ (ముత్తఫఖున్ అలైహి).

4- సాధారణంగా ఆయన రుకూ పది సార్లు సుబ్ హాన రబ్బియల్ అజీమ్ చదివేంత సమానంగా ఉండేది. ఆయన సజ్దహ్ కూడా అలానే ఉండేది. ఒక్కోసారి రుకూ మరియు సజ్దహ్ ఖియామ్ కు సమానంగా ఉండేవి. కానీ ఇలా అప్పుడప్పుడూ ఒంటరిగా రాత్రి నమాజులలో చేసేవారు. ఆయన నమాజులు ఎక్కువ శాతం  మధ్యస్థంగా మరియు సరైన విధంగా ఉండేవి.

5- ఆయన సమిఅల్లాహులిమన్ హమిదహ్ అంటూ రుకూ నుండి పైకి లేస్తూ, రఫ్ఉల్ యదైన్ చేసేవారు, అలాగే వీపును నిటారుగా ఉంచేవారు. ఆయన సజ్దహ్ నుండి లేచిన తర్వాత (రెండు సజ్దాల మధ్య కూర్చున్నప్పుడు) కూడా నిటారుగా కూర్చునేవారు. ఇంకా ఇలా చెప్పేవారు: ఆ వ్యక్తి నమాజు చెల్లదు, ఎవడైతే రుకూ మరియు సజ్దహ్ లో తన వీపును నిటారుగా ఉంచడో. (తిర్మిజీ 265)

ఆయన నిటారుగా నిలబడిన తర్వాత రబ్బనా వలకల్ హమ్ద్ అనేవారు, మరొకప్పుడు రబ్బనా లకల్ హమ్ద్ అనేవారు, మరికొన్ని సార్లు అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్ అనేవారు.

6- ఆయన రుకూ తర్వాత ఈ రుకున్ (అంటే ఖౌమా) కూడా రుకూ కు సమానమైన దీర్ఘంగా చేసేవారు. ఈ ఖౌమా స్థితిలో: అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హమ్దు మిల్అస్సమావాతి వ మిల్అల్ అర్జి వ మిల్అ మా బైనహుమా వమిల్అ మా షిఅ్ త మిన్ షైఇన్ బఅ్ దు అహ్లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు, వకుల్లునా లక అబ్దున్, లా మానిఅ లిమా అఅ్ తైత వలా ముఅ్ తియ లిమా మనఅ్ త వలా యన్ఫఉ ౙల్ జద్ది వమిన్కల్ జద్దు. (ముస్లిం)

7- ఆ తర్వాత ఆయన రఫఉల్ యదైన్ చేయకుండా సజ్దహ్ చేసేవారు. సజ్దహ్ చేసేటప్పుడు ఆయన ముందు తమ మోకాళ్ళను నేలపై పెట్టేవారు ఆ తర్వాత చేతులను పెట్టేవారు, ఆ తర్వాత నొసటి మరియు ముక్కుని ఆనించేవారు. ఆయన తలపాగా గుడ్డ పై కాకుండా నొసటి మరియు ముక్కుపై సజ్దహ్ చేసేవారు. ఆయన ఎక్కువగా నేలపైనే సజ్దహ్ చేసేవారు.. మరియు నీరు,తడిచిన మట్టిపై, మరియు ఖర్జూరపు చాపపై మరియు శుభ్రపరిచి, రంగించబడిన తోలు పై కూడా సజ్దహ్ చేసారని ఆధారాలు ఉన్నాయి.

8- సజ్దహ్ స్థితిలో ఉన్నప్పుడు ఆయన నుదుటు మరియు ముక్కును ఆనించి ఉంచేవారు, మరియు తమ రెండు చేతులను తమ రెండు చంకలకు ఎంతలా దూరంగా ఉంచేవారంటే ఆయన చంకల తెల్లదనం కనబడేది.

9- మరియు తమ రెండు చేతులను తమ భుజాలు మరియు చెవులకు సమానంగా ఉంచేవారు మరియు మధ్యస్థంగా సజ్దహ్ చేసేవారు. కాలి వేళ్ళ పై భాగం (గోటి భాగం) ఖిబ్లా వైపు ఉండేవి, అరచేతులు మరియు వేళ్ళను చాచేవారు..వేళ్ళను కలిపి ఉంచేవారు కాదు అదేవిధంగా ఎక్కువ దూరం దూరంగా కూడా ఉంచేవారు కాదు.

10) ఆయన సజ్దహ్ లో ఈ దుఆ చదివేవారు:-

సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్ లీ ..(ముత్తఫఖున్ అలైహి) మరియు ఇలా కూడా పలికేవారు:- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్

11- ఆ తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రఫఉల్ యదైన్ చేయకుండా తమ తలను పైకెత్తేవారు,మరియు ఎడమ కాలిని పరిచి దానిపై కూర్చునేవారు ، కుడి కాలును లేపి ఉంచేవారు,మరియు తమ రెండు చేతులను తమ తొడలపై పెట్టేవారు ఆ స్థితిలో ఆయన మోచేతులు తొడలపై ఉండేవి.. మరియు చేతులను (పంజా) తమ‌ మోకాళ్లపై పెట్టేవారు, అలాగే రెండు వేళ్ళను  మధ్యలో గుండ్రని ఆకారం వచ్చేలా కలిపేవారు,ఆ తర్వాత ఆయన తమ చూపుడువేలుడు పైకి లేపి దుఆ చేసేవారు అదేవిధంగా.. దానిని కదుపుతూ ఉండేవారు మరియు ఈ దుఆ చదివేవారు:- అల్లాహుమ్మగ్ ఫిర్ లీ, వర్ హమ్నీ,వజ్ బుర్నీ,వహ్దినీ,వర్జుఖ్నీ…(అబూ దావూద్, తిర్మీజి, ఇబ్నే మాజహ్)-

[మిస్సింగ్ పాయింట్స్]

1) ఆయన నమాజులో ఉన్నప్పుడు అటూ ఇటూ దిక్కులు చూసేవారు కాదు.

2) ఆయన నమాజులో కళ్ళను మూసుకుని ఉంచేవారు కాదు.

3) ఆయన నమాజ్ కొరకు నిల్చున్నప్పుడు తలను కొంచెం వంచి ఉంచేవారు. ఆయన ఎప్పుడైనా నమాజును సుదీర్ఘంగా చేయాలని అనుకున్నప్పుడు ఒకవేళ వెనుక నుండి పిల్లవాని ఏడుపు వినిపిస్తే నమాజును త్వరగా ముగించేవారు, ఆ పిల్లవాని తల్లికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి.

4- ఆయన తమ మనవరాలు ఉమామాను తమ భుజాలపై ఎత్తుకొని ఫర్జ్ నమాజు చేసేవారు. ఖియామ్ (నిలబడిన) స్థితిలో ఎత్తుకునేవారు, రుకూ లేదా సజ్దహ్ స్థితిలో క్రిందికి దించేవారు.

5- ఆయన నమాజు చేస్తున్న స్థితిలో హసన్ మరియు హుసైన్ (రదియల్లాహు అన్హుమా) వచ్చి ఆయన వీపుపై ఎక్కేవారు, అప్పుడు ప్రవక్త వారిని దించకుండా తమ సజ్దహ్ ని సుదీర్ఘంగా చేసేవారు.

6- ఆయన నమాజులో ఉన్న స్థితిలో ఒకవేళ హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు వస్తే ఆయన నడుచుకుంటూ పోయి  ఆమె కొరకు తలుపు తీసేవారు పిదప తమ నమాజు చేసే చోటుకి తిరిగి వచ్చి, నమాజును కొనసాగించేవారు.

7- ఆయన నమాజు స్థితిలో ఉన్నప్పుడు సలాం కు సమాధానం సైగతో ఇచ్చేవారు.

8- ఆయన నమాజులో అవసరమున్నప్పుడు ఊదేవారు, ఏడ్చేవారు మరియు గొంతుని సవరించుకునే ఉండేవారు.

9- ఆయన కొన్నిసార్లు చెప్పులు, బూట్లు తీసేసి నమాజు చేసేవారు, కొన్నిసార్లు అవి తొడిగి నమాజు చేసేవారు. ఆయన యూదులను వ్యతిరేకిస్తూ చెప్పులతో నమాజు చేయండని ఆదేశించారు.

10- ఆయన ఒక్కోసారి ఒకే వస్త్రం లో నమాజు చేసేవారు. కానీ ఎక్కువగా రెండు వస్త్రాలలో నమాజు చేసేవారు.

1- ఆయన సలామ్ తిప్పిన తర్వాత మూడుసార్లు “అస్తగ్ఫిరుల్లాహ్” అని, ఈ జిక్ర్ చేసేవారు: అల్లాహుమ్మ అంతస్సలాము వమిన్కస్సలాము తబారక్ త యా ౙల్ జలాలి వల్ ఇక్రామ్. (ముస్లిం). اللَّهُمَّ أَنْتَ السَّلامُ وَمِنْكَ السَّلَامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ والإِكْرَامِ

            ఆయన ఇస్తిగ్ఫార్ మరియు పైన తెలుపబడిన జిక్ర్ చేసే వరకు మాత్రమే ఖిబ్లా వైపు తిరిగి ఉండేవారు, ఆ పిదప వెంటనే ముఖ్తదీలు(నమాజీల) వైపుకు తిరిగేవారు. ఒక్కోసారి కుడి వైపు నుండి, మరోసారి ఎడమ వైపు నుండి.

2- ఆయన ఫజ్ర్ నమాజు చేసిన తర్వాత సూర్యుడు ఉదయించే వరకు అదే చోట కూర్చుని ఉండేవారు.

3- ఆయన ప్రతీ ఫర్జ్ నమాజు తర్వాత ఈ దుఆ చదివేవారు: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ .. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅ్ తైత వలా ముఅ్ తియ లిమా మనఅ్ త వలా యన్ఫఉ ౙల్ జద్ది వమిన్కల్ జద్ది..(ముత్తఫఖున్ అలైహి)లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్,వలా నఅ్ బుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅ్ మతు వలహుల్ ఫద్ లు ,వలహుస్స నాఉల్ హసను,లా ఇలాహ ఇల్లల్లాహ్,ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్. (ముస్లిం).

لَا إلهَ إلَّا اللهُ، وَحدَهُ لَا شَرِيْكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شيءٍ قَدِيرٌ، اللَّهُمَّ لَا مانعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ ولا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الجَدِّ، ولَا حَوْلَ ولَا قُوَّةَ إلَّا باللهِ، لَا إِلَهَ إِلَّا اللهُ، وَلَا نَعْبُدُ إِلَّا إياهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ، لَا إلهَ إلَّا اللهُ، مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

4- ఆయన తమ అనుచర సమాజానికి అభిలషణీయంగా నిర్ణంయించారు: సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు చెప్పి, చివరిలో లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఒకసారి పలికి 100 సంఖ్య పూర్తిచేయడం.

E- ప్రవక్త విధానం: నఫిల్ మరియు రాత్రి నమాజులో

1- ఆయన సాధారణ సున్నత్ అంటే కారణంతో కూడి లేని సున్నత్ మరియు నఫిల్ నమాజులు ఇంట్లోనే చేసేవారు. ప్రత్యేకంగా మగ్రిబ్ సున్నతులు.

2- ఆయన స్థానికంగా ఉన్నప్పుడు పదిరకాతులు నిబద్ధంగా చేసేవారు:

జొహ్ర్ కు ముందు రెండు రకాతులు, జొహ్ర్ తర్వాత రెండు రకాతులు,

మగ్రిబ్ తర్వాత రెండు రకాతులు,

ఇషా తర్వాత ఇంట్లో రెండు రకాతులు,

ఫజ్ర్ కి ముందు రెండు రకాతులు.

3) ఆయన నఫిల్ నమాజులలో అత్యంత నిబద్ధంగా ఫజ్ర్ సున్నతులను పాటించేవారు. ఆయన వాటిని మరియు విత్ర్ ను స్థానికంగా ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా వదిలేవారు కాదు. ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ రెండు (ఫజ్ర్ సున్నతులు, విత్ర్) తప్ప వేరే ఏ సున్నతులు, నఫిల్లు చేయడం రుజువు లేదు .

4- ఆయన ఫజ్ర్ సున్నత్ చేసుకున్నాక కుడి ప్రక్కన నడుం వాల్చేవారు.

5- ఆయన ఒక్కోసారి జొహర్ నమాజు కు ముందు నాలుగు రకాతులు చేసేవారు. ఎప్పుడైనా జొహ్ర్ తర్వాత చేసే రెండు సున్నతులు తప్పిపోతే అస్ర్ నమాజు తర్వాత చేసేవారు.

6- ఆయన రాత్రి నమాజ్ అధికంగా నిలబడి చేసేవారు. ఒక్కోసారి కూర్చుని చేసేవారు. మరికొన్ని సార్లు ఆయన కూర్చుని ఖిరాత్ చేసి, మిగిలిన కొంత ఖిరాత్ భాగాన్ని నిలబడి పూర్తి చేసి, రుకూలోకి వెళ్ళేవారు.

7- ఆయన రాత్రి నమాజు 8 రకాతులు చేసేవారు, ప్రతి  రెండు రకాతుల తర్వాత సలాం తిప్పేవారు. ఆ తర్వాత నిరంతరంగా 5 రకాతుల విత్ర్ నమాజు చేసేవారు, చివరి రకాతులో తప్ప కూర్చునేవారు కాదు. ఒక్కోసారి 9 రకాతుల విత్ర్ నమాజు చేసేవారు, 8 రకాతులు నిరంతరంగా చేసి, ఆ తర్వాత కూర్చొని, సలాం తిప్పకుండా, లేచి, 9వ రకాతు చేసి కూర్చొని, తషహ్హుద్ చదివి సలాం తిప్పేవారు. సలాం తిప్పిన తరువాత మరో రెండు రకాత్ లు చేసేవారు, లేదా ఈ పద్ధతిలోనే ఒక్కోసారి 7 రకాతులు చేసి, ఆ తర్వాత రెండు రకాతులు కూర్చొని చేసేవారు.

8- ఆయన రాత్రి తొలి భాగం, మధ్య భాగం మరియు చివరి భాగంలో విత్ర్ నమాజు చేసేవారు. ఇలా చెప్పేవారు: మీరు విత్ర్ ను రాత్రి ఆఖరి నమాజుగా చేసుకోండి. (ముత్తఫఖున్ అలైహి)

9- ఆయన ఒక్కోసారి విత్ర్ తర్వాత రెండు రకాత్ లను కూర్చొని చేసేవారు, ఒక్కోసారి కూర్చొని ఖిరాత్ చేసి, రుకూ చేయడానికి సంకల్పించినప్పుడు లేచి నిలబడేవారు మరియు రుకూలోకి వెళ్ళేవారు.

10- ఎప్పుడైనా నిద్ర ఆవరించి లేదా ఏదైనా అవస్త ఉండి (రాత్రి తహజ్జుద్ చేయలేకపోతే) పగలు పన్నెండు రకాతులు చేసేవారు.

11- ఆయన ఒక్కోసారి తహజ్జుద్ నమాజులో ఒకే ఆయతుని తెల్లవారే వరకూ మాటిమాటికి తిలావత్ చేస్తూ గడిపేవారు.

12- ఆయన రాత్రి నమాజు ఒక్కోసారి నిశబ్దంగా, మరొకసారి బిగ్గరగా చేసేవారు. ఒక్కోసారి సుదీర్ఘంగా చేస్తే, మరొకసారి తేలికగా ఖియామ్ (నిలబడటం) చేసేవారు.

13- ఆయన విత్ర్ నమాజులో (సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా) మరియు (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) మరియు (ఖుల్ హువల్లాహు అహద్) పారాయణం చేసేవారు. మరియు విత్ర్ నమాజు సలామ్ తిప్పిన తరువాత మూడు సార్లు (సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్) చదివేవారు, మూడోసారి చదివేటప్పుడు స్వరాన్ని బిగ్గరగా చేస్తూ దీర్ఘం చేస్తూ చదివేవారు. (అబూ దావూద్,నసాయీ, ఇబ్నే మాజహ్)

1- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజును గొప్పగా భావించేవారు. మరియు  గౌరవం ఇచ్చేవారు అలాగే ఆ రోజు విశిష్టతలను ప్రత్యేకంగా తెలిపారు. వాటిలో కొన్ని:

* జుమా రోజు గుసుల్ చేయడం.

* ఆ రోజు మంచి దుస్తులు ధరించడం

* మరియు ఖుత్బా నిశ్శబ్దంగా వినడం వాజిబ్

* ప్రవక్త ముహమ్మద్ పై అత్యధికంగా దరూద్ పంపడం.

2- ప్రజలు మస్జిదులో జమా అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్         వచ్చి, సలామ్ చేసేవారు. మళ్ళీ మింబర్ పైకి ఎక్కి, ప్రజల వైపు ముఖం చేసి, వారికి సలాం చేసి, కూర్చునేవారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు అజాన్ ఇచ్చేవారు. ఆజాన్ అయిన వెంటనే ప్రవక్త నిలబడి ఖుత్బా ఇచ్చేవారు. అజాన్ మరియు ఖుత్బాకు మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండేది కాదు. మింబర్ తయారు కాక ముందు ప్రవక్త విల్లు లేదా లాఠీ కు ఆనుకొని ఖుత్బా ఇచ్చేవారు.

3- ఆయన నిలబడి (మొదటి) ఖుత్బా (జుమా ప్రసంగం) ఇచ్చేవారు, పిదప కూర్చునేవారు, మళ్లీ లేచి నిలబడి రెండవ ఖుత్బా ఇచ్చేవారు.

4- ఆయన ప్రజలను తమకు సమీపంగా కూర్చోమని మరియు నిశ్శబ్దంగా ఉండమని ఆజ్ఞాపించేవారు. మనిషి తన సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అన్నా అతను వ్యర్ధమైన పనికి పాల్పడినవాడవుతాడు, మరెవరైతే వ్యర్థమైన పనికి పాల్పడతాడో అతని కొరకు జుమా పుణ్యం లేదు.

5- ఆయన ఖుత్బా ఇస్తున్నప్పుడు కళ్ళు ఎర్రగా అయి, స్వరం గంభీరంగా (బిగ్గరగా) అయిపోయేది మరియు ఆయనలో ఆగ్రహం పెరిగిపోయేది ఎలా అంటే ఒక సైన్యాన్ని బెదిరిస్తున్నట్లుగా ఉండేది.

6- ఆయన “అమ్మా బఅద్” అని చెప్పిన తర్వాత ఖుత్బా మొదలు పెట్టేవారు. మరియు సంక్షిప్తమైన ఖుత్బా ఇచ్చి, నమాజును సుదీర్ఘంగా చేసేవారు.

7- ఆయన జుమా ఖుత్బా లో సహాబాలకు (తమ అనుచరులకు) ఇస్లాం యొక్క మూల విషయాలు,‌ ధర్మ పద్దతులను నేర్పేవారు. ఏదైనా ఆజ్ఞాపించే మరియు వారించే అవసరం ఉన్నప్పుడు ఆజ్ఞాపించేవారు, వారించేవారు.

8- ఆయన ఏదైనా అవసరం కలిగినప్పుడు లేదా ప్రశ్నించే వారికి సమాధానం ఇవ్వడం కొరకు ఖుత్బా ను ఆపేసేవారు, మళ్లీ ఖుత్బాను కొనసాగించి పూర్తి చేసేవారు. ఒక్కోసారి ఏదైనా అవసరానికి మింబర్ పై నుండి దిగి, మళ్లీ మింబర్ పైకి వచ్చేవారు. ఆయన సమయసందర్భానుచితాన్ని గమనిస్తూ ఖుత్బా ఇచ్చేవారు. ఆకలితో ఉన్నవారిని లేదా అవసరం కలిగి ఉన్నవారిని చూస్తే వారికి దానం చేమమని ఆజ్ఞాపించేవారు మరియు ప్రోత్సహించేవారు.

9- ఆయన అల్లాహ్ స్మరణ వచ్చిన సందర్భంలో  తమ చూపుడు వేలుతో సైగ చేసేవారు. ఎప్పుడైనా కరువు కాటకాల స్థితి ఏర్పడినప్పుడు ఖుత్బా లోనే వర్షం కోసం దుఆ చేసేవారు.

10- ఆయన జుమా నమాజు చేసిన తర్వాత ఇంటికి వెళ్లి రెండు రకాత్ ల సున్నత్ నమాజు చేసేవారు. జూమాలో హాజరైనవారితో  జుమా నమాజు తర్వాత నాలుగు రకాతుల సున్నతులు చేయమని ఆజ్ఞాపించేవారు. (ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ చెప్పారు: జుమా చేసుకున్న తర్వాత మస్జిదులో చేసేవారు 4 సున్నతులు చేయాలి, ఇంటికి వచ్చి చేసేవారు 2 చేయాలి).

1- ఆయన పండుగ నమాజులు ఈద్గాలో చేసేవారు. అందమైన దుస్తులను ధరించేవారు

2- ఈదుల్ ఫిత్ర్ రోజున పండుగ స్థలానికి (ఈద్గాహ్)కు బయలుదేరే ముందు కొన్ని ఖర్జూరాలు బేసి సంఖ్యలో తినేవారు. అయితే ఈదుల్ అజ్హా పండుగ నాడు  తిరిగి వచ్చేవరకూ ఏమీ తినేవారు కాదు. ఖుర్బానీ ఇచ్చి, ఖుర్బానీ మాంసాన్నే తినేవారు. ఈదుల్ ఫిత్ర్ నమాజు కొంత ఆలస్యంగా, ఈదుల్ అజ్హా నమాజు కొంత తొందరగా చేసేవారు.

3- ఆయన ఈద్గాహ్ కు కాలినడకన వెళ్లేవారు. వెంట బల్లాన్ని తీసుకువెళ్ళడం జరిగేది, ఆయన అక్కడకు చేరుకున్నాక ఆయన ముందు బల్లెమును (సుత్రా కొరకు) పాతిపెట్టబడం జరిగేది.

4- ఆయన ఈద్గాహ్ కు (పండుగ నమాజు స్థలానికి) చేరుకున్నాక, అజాన్ మరియు ఇఖామత్ లేకుండానే నమాజు ప్రారంభించేసేవారు. ఇంకా అస్సలాతు జామిఅహ్ లాంటి పదాలు కూడా అనేవారు కాదు. ఆయన మరియు సహాబా (సహచరులు) పండుగ నమాజుకు ముందు లేదా తర్వాత ఏ నమాజు చేసేవారు కాదు.

5- ముందు ఆయన నమాజు చేసేవారు, తర్వాత ఖుత్బా ఇచ్చేవారు. అయితే ఆ నమాజు రెండు రకాతులగా చేయించేవారు. మొదటి రకాతులో తక్బీరే తహ్రీమాతో పాటు ఏడు సార్లు క్రమంగా (నిరంతరంగా) తక్బీర్ చేసేవారు, ప్రతి రెండు తక్బీర్ల మధ్య క్షణంపాటు మౌనంగా ఉండేవారు, ఆ తక్బీర్ల మధ్య ఎటువంటి ప్రత్యేక జిక్ర్ (దుఆ) నిరూపించబడలేదు. ఏడు తక్బీర్లు అయిన తర్వాత ఖిరాత్ ప్రారంభించేవారు, ఖిరాత్ పూర్తయిన తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రుకూలోకి వెళ్ళేవారు. ఆ తర్వాత రెండో రకాతులో నిరంతరంగా ఐదు సార్లు తక్బీర్ పలికేవారు. పిదప ఖిరాత్ మొదలు పెట్టేవారు. నమాజు పూర్తయిన తర్వాత లేచి జనుల ముందు నిలబడేవారు, ఆ స్థితిలో ప్రజలు కూర్చొనే ఉండేవారు, ఆయన వారందరికీ హితోపదేశం చేసేవారు మరియు మంచిని ఆదేశిస్తూ చెడు నుండి వారించేవారు..

మొదటి రకాతులో సూరయే ఫాతిహా తరువాత సూరయే ఖాఫ్ మరియు రెండవ రకాతులో “ఇఖ్తరబ” అనగా సూరయే ఖమర్ పూర్తిగా పారాయణం చేసేవారు. కొన్ని సార్లు రెండు రకాతులలో సూరయే అఅలా మరియు సూరయే గాషియా పారాయణం చేసేవారు.

1- ఆయన సూర్యగ్రహణం సందర్భంగా తమ దుప్పటిని ఈడ్చుకుంటూ హడావిడిగా, భయాందోళనతో మస్జిదుకు వచ్చారు. వెంటనే రెండు రకాతుల నమాజ్ చేయించారు. మొదటి రకాతులో సూరయె ఫాతిహా మరియు ఒక పెద్ద సూరా బిగ్గరగా పారాయణం చేశారు. ఆ తర్వాత సుదీర్ఘమైన రుకూ చేసారు, పిదప రుకూ నుండి నిలబడుతూ సమిఅల్లాహు లిమన్ హమిదహ్, రబ్బనా వలకల్ హంద్ అన్నారు. ఆ తర్వాత ఖిరాత్ ప్రారంభించారు, అయితే ఈ ఖియామ్, ఖిరాత్ మొదటి ఖియామ్, ఖిరాత్ కంటే తక్కువగా ఉండినది. ఆ తర్వాత సుదీర్ఘమైన రుకూ చేసారు ఇది ముందు రుకూ కంటే కొద్దిగ తక్కువ ఉండినది. తర్వాత తమ తలను రుకూ నుండి పైకెత్తారు పిదప సుదీర్ఘమైన రెండు సజ్దాలు (సాష్టాంగం) చేసారు. ఆ తర్వాత మళ్ళీ నిలబడి మొదటి రకాతులో చేసిన విధంగా ఈ రెండవ రకాతులో చేశారు. ఈ విధంగా ప్రతీ రకాతులో రెండు రుకూలు మరియు రెండు సజ్దాలు అయ్యాయి.‌ నమాజు  పూర్తయిన తర్వాత ఆయన‌ స్వచ్ఛమైన‌, అనర్గళమైన (మంచి సంభాషణ కలిగిన) ఖుత్బా ప్రసంగం ఇచ్చారు.

2- మరియు ఆయన గ్రహణ సందర్భంలో అల్లాహ్ స్మరణ, నమాజ్, దుఆ, ఇస్తిగ్ఫార్, సదఖా (దానదర్మాలు) చేయమని మరియు బానిసలకు విముక్తినివ్వమని ఆజ్ఞాపించారు.

1- ఆయన మింబర్ పై జుమా ఖుత్బా సందర్భం వర్షం కొరకు దుఆ చేసేవారు. ఇంకా వేరితర సందర్భాల్లో కూడా వర్షం కొరకు దుఆ చేసేవారు. అదే విధంగా ఆయన మస్జిద్ లో కూర్చుని ఉండగా తమ చేతులను పైకెత్తారు, మరియు అల్లాహ్ తో వర్షం కొరకు దా చేశారు.

2- ఆయన వర్షం కొరకు చేసిన దుఆలలో ఓ రెండు ఇవి: (అల్లాహుమ్మస్ ఖి ఇబాదక, వబహాఇమక, వన్ షుర్ రహ్మతక వఅహ్ యి బలదకల్ మయ్యిత్) ఓ అల్లాహ్! వర్షం కురిపించు! నీ దాసుల కొరకు, జంతువుల కొరకు, ఇంకా నీ కారుణ్యాన్ని కురిపించు మరియు మరణించిన ఈ సీమను బతికించు!

మరొక దుఆ: (అల్లాహుమ్మస్ ఖినా గైసమ్ ముగీసా, మరీఅమ్ మరీఆ, నాఫిఅన్ గైర జార్ర్, ఆజిలన్ గైర ఆజిల్). ఓ అల్లాహ్! ఆలస్యం లేకుండా తక్షణమే, నష్టం కాకుండా లాభాన్నిచ్చే, మాకు సహాయపడే, పచ్చటి పైర్లను పండించే మరియు ఆనంద వసంతాలుగా ఉండే వర్షాన్ని కురిపించు!

3- ఆయన ఎప్పుడైనా మేఘం లేదా తుఫాను గాలిని చూస్తే ముఖం కవలికల్లో ఆందోళన కనపడేది, అప్పుడు ఆయన (అటూ ఇటూ) వెనకా ముందూ చూస్తూ ఉండేవారు. ఎప్పుడైతే వర్షం కురిసేదో ఆయన దానిపట్ల సంతోషించేవారు. (ఆయన ఇది అల్లాహ్ శిక్షయితే కాదు కదా అని భయపడేవారు).

4- ఆయన వర్షాన్ని చూసినప్పుడు ఈ విధంగా అనేవారు: అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఆ. (ఓ అల్లాహ్ లాభదాయకమైన వర్షం కుర్పించు). మరియు తమ శరీరంలోని కొంత భాగం నుండి బట్టను తొలగించేవారు, అది వర్షంలో తడవాలని. ఆయనను దీని గురించి ప్రశ్నించినప్పుడు ఈ విధంగానే అనేవారు: నిశ్చయంగా ఇది అల్లాహ్ తరపునుండి అవతరించబడిన తాజా అనుగ్రహం.

5- వర్షం అధికమైనప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో వర్షం ఆగడానికి దుఆ చేయండని కోరినప్పుడు ఆయన ఈ విధంగా దుఆ చేసేవారు: అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా, అల్లాహుమ్మ అలల్ ఆకామి వద్ ద్జిరాబి వల్ ఆకామి వల్ జిబాలి, వ బుతూనిల్ అవ్ దియతి, వ మనాబతిష్ షజర్. అల్లాహ్! మాపై కాకుండా మా చుట్టు ప్రక్కల వర్షాన్ని కురిపించు. కొండలు, గుట్టలు, లోయలు మరియు చెట్లు మొలిచే చోట్లలో వర్షాన్ని కురిపించు. (బుఖారీ, ముస్లిం).

1- శత్రువులు ఆయనకు మరియు ఖిబ్లాకు మధ్యలో ఉన్నప్పుడు, వీరులందంరూ ఆయన వెనక రెండు సఫ్ (పంక్తు)లలో ఉండేవారు, ఆయన తక్బీరే తహ్రీమా పలికినప్పుడు వారందరూ తక్బీర్ పలికేవారు. ఆయన రుకూ చేస్తే వారందరూ రుకూ చేసేవారు, ఆయన రుకూ నుండి లేస్తే అందరూ లేచేవారు, ఆయన సజ్దాలోకి వెళ్ళినప్పు మొదటి  సఫ్ (పంక్తి) లో ఉన్నవారు సజ్దా చేసేవారు మరియు రెండో పంక్తివారు శత్రువులకు ఎదురుగా నిలబడేవారు, పిదప ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం రెండో రకాతు కొరకు నిలబడినప్పుడు రెండో పంక్తివారు తమ రెండు సజ్దాలు చేసుకొని, లేచి మొదటి పంక్తిలోనికి వెళ్ళిపోయేవారు, మొదటి పంక్తివారు వెనక్కి వచ్చి రెండో పంక్తివారి స్థానం తీసుకునేవారు, ఈ విధంగా మొదటి పంక్తి యొక్క విశిష్టత రెండు పంక్తులవారూ పొందేవారు. మరియు రెండవ పంక్తి వాళ్లు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు రెండు సజ్దాలు పొందగలిగేవారు. అదే విధంగా ఆయన రెండో రకాతులో రుకూ లోకి వెళ్ళాక రెండు పంక్తుల వారూ మొదటి రకాతులానే అమలు చేసేవారు. మరియు ఆయన తషహ్హుద్ లో కూర్చున్నప్పుడు రెండో పంక్తి వాళ్లు తమ రెండు సజ్దాలను చేసుకునేవారు. పిదప ఆయన తో పాటు తషహ్హుద్ లో పాల్గొనేవారు. ఈ విధంగా అందరితో పాటే సలాం తిప్పేవారు.

2- ఒకవేళ శత్రువులు ఖిబ్లా వైపున కాకుండా వేరే దిశలో ఉంటే ఆయన తమ వెంట ఉన్నవారందరినీ ఒక్కోసారి రెండు గ్రూపులుగా చేసేవారు. ఒక గ్రూపు శత్రువులను ఎదురించడానికి నిలబడితే, మరొక గ్రూప్ ఆయనతో పాటు నమాజు చేసుకునేవారు. ఒక గ్రూపువారు ప్రవక్తతో ఒక రకాతు నమాజ్ చేసి వెళ్ళిపోయేవారు, మరియు రెండొవ గ్రూపువారు వచ్చి ఆయన రెండో రకాతులో కలిసేవారు, ఆయన సలాం తిప్పిన తర్వాత రెండు గ్రుపులూ మిగిలిన తమ ఒక్కొక్క రకాత్ పూర్తి చేసుకునేవారు.

3- ఒక్కోసారి ఆయన రెండు గ్రూపులలో నుండి ఒక గ్రూపుకి ఒక రకాత్ చేయించి నిలబడేవారు. వారప్పుడు రెండొవ రకాతు స్వయంగా పూర్తి చేసుకుని ఆయన రుకూ చేయకముందే వాపసు వెళ్ళిపోయేవారు. తర్వాత రెండో గ్రూపు వచ్చి ఆయనతో పాటు రెండో రకాతులో కలసేవారు, ఆయన తషహ్హుద్ కొరకు కూర్చున్నప్పుడు వీరు లేచి నిలబడి రెండవ రకాతు పూర్తిచేసుకునేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు తషహ్హుద్ చదివిన తరువాత వారి కోసం వేచి ఉండేవారు, వారు కూడా తషహ్హుద్ చదివిన తరువాత వారందరితో కలిపి సలామ్ త్రిప్పేవారు.

4- ఆయన ఒక్కోసారి ఒక గ్రూపువారికి రెండు రకాతులు చేయించి, సలాం తింపేవారు. మళ్ళీ రెండో గ్రూపు వస్తే వారికి రెండు రకాతులు చేయించి, సలాం తింపేవారు

5- ఒక్కోసారి ఆయనతో పాటు ఒక రకాత్ చదివి ఒక గ్రూపు వెళ్ళిపోయేది మరియు ఒక రకాత్ ఖజా చేసేది కాదు. పిదప రెండో జమాత్ వచ్చాక వారికి కూడా ఆయన ఒక రకాతు చేయించేవారు మరియు ఆ జమాత్ కూడా రెండవ రకాతు ఖజా చేసేది కాదు. ఈ విధంగా ఆయనవి రెండు రకాతులు పూర్తయ్యేవి మరియు మిగతా వారివి కేవలం ఒక్కో రకాతు పూర్తయ్యేది.

1- జనాజాలో ఆయన పద్దతి ఎంతో పరిపూర్ణంగా మరియు అన్ని జాతులకు భిన్నంగా ఉండేది. ఇందులో మృతుడు, మరియు అతని కుటుంబం మరియు ఆత్మీయుల పట్ల సద్వర్తన, ఉత్తమంగా మసలుకునే వ్యవహారం ఉండేది. అందుకని ప్రవక్తవారు ప్రథమంగా వ్యాధి గ్రస్తునిని‌ సందర్శించేవారు, అతనికి పరలోకాన్ని జ్ఞప్తికి చేసేవారు, అతనికి తౌబా, ఇస్తిగ్ఫార్ గురించి ఉపదేశించేవారు, రోగి సమీపంలో ఉన్నవారితో, అతనికి లాఇలాహ ఇల్లల్లాహ్ చదవడం గురించి గుర్తు చేస్తూ ఉండమని ఆజ్ఞాపించేవార, ఇది అతని చివరి పలుకుగా మారాలని ఇలా ఆదేశించేవారు.

2- ఆయన సృష్టిలో అందరికన్నా ఎక్కువ అల్లాహ్ విధివ్రాత పట్ల సంతృప్తిగా ఉండేవారు. అందరికంటే ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండేవారు. ఆయన తమ‌ కుమారుడైన‌ ఇబ్రాహీం మరణించినప్పుడు ఏడ్చారు, ఆయన పట్ల ఉన్న దయ, కరుణ మరియు అప్యాయత వల్ల. కానీ ఆయన హృదయం అల్లాహ్ పట్ల ప్రసన్నత, కృతజ్ఞత తో‌ నిండి ఉండినది. మరియు నాలుక అల్లాహ్ స్మరణ మరియు స్తోత్రంలో నిమగ్నమై ఉండినది. మరియు ఆయన ఇలా అన్నారు: నిశ్చయంగా కళ్ళు కన్నీటి పర్యంతం అయ్యాయి, హృదయం బాధగా ఉంది, కానీ నేను అవే పలుకులు పలుకుతాను దేనిపట్లయితే నా ప్రభువు ప్రసన్నుడవుతాడో.

3- ఆయన ముఖాన్ని గిల్లడం, అరవడం, పెడబొబ్బలు పెట్టడం, విలపిస్తూ సంతాపం తో స్వరాన్ని బిగ్గరగా చేయడాన్నుంచి వారించారు.

4- ఆయన విధానం: మృతుని అంత్యక్రియలు తొందరగా పూర్తి చేయడం. అతన్ని శుభ్రపరచడం, స్నానం చేయించడం మరియు తెల్లని కఫన్ దుస్తులు తొడగించడం.

5- ఆయన విధానం: మృతుని ముఖం కప్పి ఉంచడం, అతని కళ్ళు మూయడం.

6- ఆయన కొన్ని సందర్భాల్లో మృతునిని స్వయంగా చుంబించేవారు.

7- ఆయన మృతదేహాన్ని మూడు లేదా ఐదు లేదా గుసుల్ (స్నానం) చేయించేవారి సూచన మేరకు అంతకంటే ఎక్కువ సార్లు అవసరం ఉంటే అన్నేసార్లు గుసుల్ చేయించమని ఆజ్ఞాపించేవారు. అయితే చివరిలో కాఫూర్ (కర్పూరం) ను వాడమని ఆజ్ఞాపించేవారు.

8- ఆయన యుద్ధభూమిలో వీరమరణం పొందిన (షహీద్) లకు గుసుల్ ఇచ్చేవారు కాదు. అతనిపై ఉన్న ఆయుధాలు, కవచాన్ని‌ తీసేసి, అతని శరీరంపై ఉన్న వస్త్రాల్లోనే ఖననం చేసేవారు. మరియు నమాజే జనాజా చేయించేవారు కాదు.

9- ఆయన ఇహ్రామ్ స్థితిలో మరణించిన వారికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించమని ఆజ్ఞాపించేవారు, వారిని వారి ఇహ్రామ్ బట్టల్లోనే ఖననం చేయమని ఆజ్ఞాపించేవారు. మరియు సుగంధ ద్రవ్యాలు పూయడం మరియు తలను కప్పడం నుండి వారించేవారు.

10- మృతుడి సంరక్షకునితో తెల్లని మంచి వస్త్రాలలో కఫన్ ఇవ్వమని ఆజ్ఞాపించేవారు, మరియు ఎక్కువ ఖరీదైన కఫన్ నుండి వారించేవారు.

11- ఒకవేళ కఫన్ చిన్నగా ఉండి, పూర్తి శరీరానికి సరిపోకపోతే, తలను దాచేవారు మరియు కాళ్లపై గడ్డిని పరిచేవారు.

1- ఆయన మృతుని జనాజా నమాజే మస్జిద్ బయట చేయించేవారు. కొన్ని సార్లు మస్జిద్ లో కూడా చేయించారు కానీ ఇలా ఎల్లప్పుడూ చేయలేదు.

2- నమాజ్ చేయించాలని ఎవరిదైనా జనాజా వస్తే, ఇతనిపై అప్పు (రుణం)ఉందా? అని అడిగేవారు. ఒకవేళ అతనిపై ఎలాంటి అప్పు లేకపోతే నమాజ్ చేయించేవారు. ఒకవేళ అతనిపై అప్పు ఉంటే ఆయన జనాజా నమాజ్ చేయకుండా మీరు చేసుకోండని సహాబాలకు ఆజ్ఞాపించేవారు. కానీ ఎప్పుడైతే యుద్ధఫలం రావడం మొదలయినదో ఆయన జనాజా నమాజు చేయించి, అతని అప్పు తీర్చేవారు మరియు అతని ఆస్తిని అతని వారసుల కొరకు వదిలేసేవారు.

3- ఆయన నమాజే జనాజా ప్రారంభిస్తూ అల్లాహు అక్బర్ అని అల్లాహ్ ను స్తుతించి, ఆయన్ని ప్రశంసించేవారు (అంటే సూర ఫాతిహా చదివేవారు), మృతుని కొరకు దుఆ చేసేవారు. నమాజే జనాజాలో నాలుగు తక్బీర్లు పలికేవారు. ఎప్పుడైనా ఐదు తక్బీర్లు కూడా పలికారు.

4- ఆయన మృతుని కొరకు ఇఖ్లాస్ (చిత్తశుద్ధి)తో దుఆ చేయండని ఆదేశించేవారు. ఆయన చేసే దుఆలలో ఇవి కూడా: అల్లాహుమ్మగ్ ఫిర్ లిహయ్యినా, వ మయ్యితినా, వ షాహిదినా, వ గాఇబినా, వ సగీరినా, వ కబీరినా, వ జకరినా, వ ఉన్సానా. అల్లాహుమ్మ మన్ అహ్ యైతహూ మిన్నా ఫఅహ్యిహీ అలల్ ఇస్లామ్, వమన్ తవ ఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్రిమ్ నా అజ్రహూ వలా తఫ్తిన్నా బఅ్ దహ్. (ఓ అల్లాహ్! మాలో బ్రతికి ఉన్నవారిని, మరణించినవారిని, హాజరుగా ఉన్నవారిని, లేని వారిని, చిన్నవారిని, పెద్దవారిని, మా పురుషులను, మా స్త్రీలను మన్నింపుము. ఓ అల్లాహ్! మాలో ఎవరినయితే సజీవంగా ఉంచావో వారిని నీ ఇస్లాంపై సజీవంగా ఉంచు. మాలో ఎవరికయితే మరణాన్ని ప్రసాదిస్తావో వారికి ఈమాన్ (విశ్వాసం)పై మరణాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మమ్మల్ని అతని ప్రతిఫలం నుండి దూరం చేయకు, అతని తరువాత మమ్మల్ని కష్టాలకు గురిచేయకు.

ఆయన చేసే దుఆలలో ఈ దుఆ కూడా ఉంది:

అల్లాహుమ్మగ్ ఫిర్ లహూ వర్ హమ్ హూ, వ ఆఫిహీ, వఅ్ ఫు అన్హూ, వ అక్రిమ్ నుజులహూ వ వస్సిఅ్  ముద్ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బరది, వనఖ్ఖిహీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్యజు మినద్ దనసి, వ అబ్దిల్హు దారన్ ఖైరన్ మిన్ దారిహి, వ అహ్లన్ ఖైరన్ మిన్ అహ్లిహి, వ జౌజన్ ఖైరన్ మిన్ జౌజిహీ, వ అద్ఖిల్ హుల్ జన్నత, వ అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి వ అదాబిన్నార్. (ఓ అల్లాహ్! అతన్ని క్షమించు, అతనిని కరుణించు, అతనికి సుఖాన్ని ప్రసాదించు, అతన్ని మన్నించు, అతన్ని అతిథిగా ఆదరించు, అతడు చేరుకునే స్థలాన్ని వెడల్పు చేయి, నీటితోని, మంచుతోను, మరియు వడగళ్ళతోనూ అతని పాపములను కడిగివేయి, మురికి లేని తెల్లని వస్త్రం నుండి మురికిని శుభ్రం చేసినట్లుగా అతని పాపములను కడిగివేయుము. అతని ఇంటికి బదులుగా మరింత మంచి ఇల్లు, ఈ కుటుంబం కంటే మంచి కుటుంబం, అతని జీవిత భాగస్వామి కంటే మంచి భాగస్వామిని అతనికి ప్రసాదించు. అతనికి స్వర్గంలో ప్రవేశం కల్పించు, సమాధి శిక్ష నుండి (నరకశిక్ష నుండి) కాపాడు. (ముస్లిం).

5- ఆయన జనాజా నమాజు కొరకు పురుషుని తలకు సమానంగా, మరియు స్త్రీ మధ్య భాగానికి సమానంగా నిలబడేవారు.

6- ఆయన పిల్లల నమాజే జనాజా కూడా చేయించేవారు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, యుధ్ధప్రాప్తి సంపదనలో ద్రోహం (దొంగతనం) చేసేవారి నమాజే జనాజా చేయించేవారు కాదు.

7- ఆయన రజ్మ్ (వ్యభిచారం శిక్షలో రాళ్లు రువ్వండంతో మరణించిన) జుహైనా తెగకు చెందిన ఒక స్త్రీ యొక్క నమాజే జనాజా చేయించారు.

8- ఆయన నజాషీ చక్రవర్తి జనాజా నమాజ్ పరోక్షంగా చేయించినట్లు రుజువు ఉంది. అయితే ఆయన ప్రతి ఒక్కరి నమాజే జనాజా పరోక్షంగా చేసేవారు కాదు.

9- ఆయన ఎవరిదైనా జనాజా నమాజు చేయలేకపోతే, అతని సమాధి వద్దకు వెళ్లి చేసేవారు

1- ఆయన నమాజే జనాజా పూర్తి చేశాక జనాజా ముందు నడుచుకుంటూ ఖబ్రిస్తాన్ (శ్మశానవాటిక)కు వెళ్లేవారు. వాహనంపై ఉన్నవారిని వెనక ఉండమని, కాలి నడకన ఉన్నవారిని ముందు, వెనక, కుడి, ఎడమ ఎక్కడున్నా పర్లేదు, కాని జనాజాకు దగ్గర ఉండమని ఆజ్ఞాపించేవారు. ఆయన జనాజాని వేగంగా తీసుకూవెళ్ళాలని ఆదేశించేవారు.

2- జనాజాను క్రిందికి దించేవరకూ ఆయన కూర్చునే వారు కాదు.

3- ఆయన ముందు నుండి జనాజా వెళితే ఆయన నిలబడ్డారు, నిలబడమని ఆదేశించారు. అదేవిధంగా ఆయన కూర్చొని ఉండడం కూడా రుజువయినది.

4- ఆయన విధానం: శవాన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం మరియు మిట్ట మధ్యాహ్నం పూట ఖననం చేయకూడదు.

5- సమాధి బగ్లీ (ఖిబ్లా దిశలో కొంచెం లోతుగా త్రవ్వి) ఉండాలి, మరియు మృతుని తల వద్ద, అలాగే కాళ్ల వద్ద విశాలంగా త్రవ్వాలని ఆదేశించేవారు.

6- ఆయన మృతుడ్ని ఖననం చేసిన తర్వాత అతని తల వైపు నుండి మూడు దోసెట్ల మట్టి వేశారు.

7- ఖననం చేసిన తరువాత అక్కడే నిలబడి మృతుని స్థిరత్వం కొరకు ప్రార్ధించేవారు. మరియు తమ అనుచరులను కూడా ఇలా చేయమని ఆజ్ఞాపించేవారు.

8- సమాధి వద్ద (ఫాతిహా ఇంకా ఏమైనా) చదవడం లేదా మృతునుకి (కలిమహ్ చదువు అని) ఉపదేశించడం అనేవి ఆయన నుండి నిరూపితం కాలేదు.

9- చావు వార్త వినిపంచడంలో ఆయన విధానం: ఎవరిదైనా చావు వార్త అతని గొప్పతనాలు చెప్పుకుంటూ చేసేవారు కాదు, ఇలా చేయడం నుండి వారించేవారు.

1- సమాధులను (అదనపు మట్టి పోసి) ఎత్తుగా లేపడం, ఇటుకలతో గట్టిగా తయారు చేయడం, వాటికి పూత పూయడం మరియు వాటిపై గోపురాలు కట్టడం లాంటివన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు కావు.

2- ఒకసారి ఆయన హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు గారిని యమన్ వైపునకు పంపుతూ ఈ విధంగా ఆదేశించారు: ఏ చిత్రపటాన్ని మరియు విగ్రహాన్ని చూసినా నీవు దానిని తుడిచివేయి (ధ్వంసం చేసెయ్యి). ఎత్తైన సమాధిని చూస్తే సమానం చెయ్యి. ఈ విధంగా ఎత్తయిన సమాధులను సమానంగా చేయడం ఆయన విధానం.

3- ఆయన సమాధి పై సున్నం వేయడం, దానిపై నిర్మాణాలు నిర్మించడం, మరియు వాటిపై రాయడం నుండి వారించారు.

4- తమవారి సమాధి అని గుర్తుండడానికి ఒక రాయి పెట్టారు.

5- ఆయన సమాధులపై మస్జిదులు నిర్మించడం, వాటి వద్ద దీపాలు వెలిగించడం నుండి వారించారు మరియు ఇలా చేసేవారిని శపించారు.

6- ఆయన వాటి వైపు ముఖం చేసి నమాజు చేయడం నుండి వారించారు. ఆయన తమ‌ సమాధిని పండగ (మేళా, ఉర్సు, జాతర) లా చేయడం నుండి వారించారు.

7 – సమాధులను అవమానించడం, తొక్కడం, వాటిపై కూర్చోవడం, వాటిని ఆనుకోవడం, వాటిని విపరీతంగా గౌరవించడం, సందర్శించడం ఆయన పద్దతి కాదు.

8- ఆయన సహాబాల సమాధులను సందర్శించేవారు, అల్లాహ్ వారిని క్షమించాలని దుఆ చేయడానికి. ఖబ్రిస్తాన్ వెళ్ళేవారు ఈ దుఆ చదవాలని ఆదేశించారు: అస్సలాము అలైకుం అహ్లద్ దియారి, మినల్ మూమినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్, నస్ అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియహ్. (ఓ ఈ గృహవాసులైన విశ్వాసులారా! ముస్లిములారా! మీపై శాంతులు కురియుగాక, మేము ఇన్ షా అల్లాహ్ మీతో కలువనున్నాము.  మేము మా కొరకు మరియు మీ కొరకై అల్లాహ్ తో సంక్షేమాన్ని కోరుతున్నాము. (ముస్లిం)

9- ఆయన విధానం ఏమిటంటే ఆయన మృతుల కుటుంబీకులను సందర్శించడానికి వెళ్లేవారు. కానీ సందర్శించడానికి ఏదైనా సమయాన్ని ప్రత్యేకించడం, లేదా సమాధుల మరియు వేరే చోటు జమ అయి ఖుర్ఆన్ చదవడం ఎప్పుడు చేయలేదు. (అంటే ఖుర్ఆన్ ఖ్వానీలు, ఫాతిహాలు చేసేవారు కాదు).

10- ఆయన విధానంలో నుండి మరొకటి ఏమిటంటే ప్రజల కొరకు మృతుల కుటుంబీకులు భోజనాలను నిర్వహించకూడదు, పైగా ప్రజలే మృతుల కుటుంబీకుల కొరకు భోజనాలను సిద్ధం చేసి వారికి తినిపించాలి. (దీని ద్వారా మూడొద్దులు, దస్వా, బీస్వా, తీస్వా, చాలీస్వా లాంటి వన్నీ యోగ్యం లేవని స్పష్టంగా తెలుస్తున్నది).

1- ఆయన విధానం జకాత్ కు సంబంధించి అత్యంత పరిపూర్ణమైనది. అంటే: దాని విధి అయ్యే సమయం, దాని పరిమాణం, దాని నిసాబ్ (జకాత్ విధింపు పరిమితి), అది ఎవరిపై విధి అవుతుంది, దాని హక్కుదారులు ఎవరు అన్న విషయాలన్నీ క్షుణ్ణంగా తెలియచేసారు. ధనవంతులు ఔచిత్యాలను మరియు పేదవాళ్ళ  అవసరాలను దృష్టిలో పెట్టడం జరిగినది. మరియు పేదల అవసరాలు తీరే రీతిలో ధనవంతుల సంపదలో ఏ దౌర్జన్యం లేకుండా జకాత్ విధిగా చేయబడింది.

2- ఎవరు జకాత్ తీసుకోడానికి అర్హులని గ్రహించేవారో, అతనికి జకాత్ ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా జకాత్ సొమ్ములో నుంచి అడిగితే, ఆ వ్యక్తి గురించి ఆయనకు తెలియకపోతే, అతనితో ఈ విధంగా చెప్పి, ఇచ్చేవారు: ఈ జకాతులో ధనవంతులకు, మరియు సంపాదించే స్థోమత కలిగిన వ్యక్తులకు ఎలాంటి భాగం లేదు.

3- ఆయన విధానం: ఏ ప్రాంతపు ధనికులతో జకాత్ తీసుకోబడినదో అదే ప్రాంతపు హక్కుదారుల్లో దానిని పంచేవారు, ఆ తర్వాత మిగిలినది తెప్పించి వేరే చోటున పంచేవారు.

4- ఆయన జకాత్ వసూళ్ళ కొరకై నియమితులైన వారిని జంతువులు, పండ్లు, మరియు పంటపొలాలు లాంటి బాహ్యమైన ఆస్తులు కలవారి వద్దకే పంపేవారు.

5- ఆయన ఖర్జూరం మరియు ద్రాక్ష తోటల యాజమానుల వద్దకు అంచనా వేసే (నిపుణుల)ను పంపేవారు, వారు పండ్లను మంచిగా చూసి ఎన్ని కిలోలు అవుతాయో అంచనా వేసేవారు, దీని ఆధారంగానే ప్రవక్త వారిపై ఎంత జకాత్ ఉంటుందో నిర్ణయించేవారు.

6- ఆయన విధానం: గుర్రాలు, బానిసలు, కంచర గాడిదలు మరియు గాడిదలపై జకాత్ తీసుకునేది కాదు. అదే విధంగా తూకం చేయలేని మరియు నిల్వ ఉంచలేని కూరగాయలు మరియు పండ్లపై కూడా జకాత్ తీసుకునేవారు కాదు. కానీ ద్రాక్ష మరియు ఖర్జూరాల నుండి జకాత్ తీసుకునేవారు. అయితే అన్ని రకాల ఖర్జూరాలలో నుండి జకాత్ తీసుకునేవారు, అందులో వాటి క్వాలిటీ మరియు రకాలను బట్టి వ్యత్యాసం పాటించేవారు కారు.

7- జకాతులో మంచి సంపదనే వెతికి తీసే విధానం కాదు ఆయనది. బదులుగా మధ్యస్థంగా ఉండే సంపదను తీసుకునేవారు.

8- సదఖా చేసినవారు, తాము సదఖ చేసిన వస్తువుని కొనుగోలు చేయడం నుండి వారించేవారు. ఎవరైనా పేదవాడు సదఖాగా పొందిన సొమ్ము ధనవంతునికి బహుమతిగా ఇస్తే దానిని తీసుకనే, తినే అనుమతి ఇచ్చేవారు.

9- ఆయన ఒక్కోసారి జకాత్ మరియు సదఖా యొక్క సంపద నుండి ముస్లిముల యొక్క లాభం లేదా సంక్షేమ పనుల కొరకు అప్పుగా తీసుకునేవారు. మరియు అవసరం ఉన్న సమయంలో సమయానికి ముందే జకాత్ తీసుకునేవారు. (ఉదాహరణకు అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి నుండి రెండు సంవత్సరాల జకాత్ ముందుగానే తీసుకున్నారు.)

10- ఆయన వద్దకు ఎవరైనా జకాత్ తీసుకొని వస్తే “అల్లాహుమ్మ బారిక్ ఫీహి వఫీ ఇబిలిహ్” (ఓ అల్లాహ్! ఇందులో మరియు అతని ఒంటెలలో శుభాన్ని ప్రసాదించు) అని లేదా “అల్లాహుమ్మ సల్లి అలైహ్” అని దుఆ చేసేవారు. (ముత్తఫఖున్ అలైహి).

1- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సదఖయే ఫిత్ర్ లో ఒక సాఅ్ ఖర్జూరం, లేదా బార్లీ, లేదా పన్నీర్, లేదా కిష్మ్మిష్ ను విధిగా చేసారు.

2- ఆయన విధానం: పిత్రాదానం పండుగ నమాజ్ కి ముందే తీయాలి. ఆయన ఇలా తెలిపారు: ఎవరైతే దానిని నమాజ్ కు ముందు తీస్తారో, అది స్వీకరింపబడుతుంది, మరెవరైతే నమాజు తర్వాత తీస్తారో అతను ఒక సాధారణ సదఖా (దానం) చేసినట్లు. (అబూ దావూద్).

3-  ఆయన విధానం: ఫిత్రదానం బీద వాళ్లకు మరియు చెయ్యి చాచి అడగని పేదవాళ్ల కొరకు ప్రత్యేకించేవారు. మరియు జకాత్ యొక్క ఎనిమిది రకాల హక్కుదారులలో ఏ ఒక్కరికీ ఇచ్చేవారు కాదు.

1- ఆయన అందరి కంటే ఎక్కువగా దానాలు చేసేవారు. తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా అంతా దానం చేసేసేవారు.

2- ఆయనతో ఎవరూ ఏమీ అడిగినా ఆయన ఇచ్చేసేవారు. ఒకవేళ అది తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా .

3- తీసుకునే వాడికి తీసుకోవడంలో ఎంత సంతోషం, ఆనందం ఉంటుందో అంతకంటే ఎక్కువ  ఆనందం ఆయనకి ఇవ్వడంలో ఉండేది.

4- ఎప్పుడన్నా ఎవరన్నా అవసరం కలవాడు ఆయన ముందు వస్తే అప్పుడు ఆయన తమ కంటే ఎక్కువ అతనికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఒక్కోసారి తమ ఆహారం విషయంలో ఒక్కోసారి తమ బట్టల విషయంలో.

5- ఆయనతో కలిసిన వారు స్వీయ ఉదార భావాన్ని తమ నుండి నేర్చుకునేవారు

6- ఆయన ఇచ్చే బహుమతులు మరియు దానాలు వివిధ రకాలుగా ఉండేవి: ఒక్కోసారి ప్రత్యేక బహుమాన రూపంలో, ఒక్కోసారి సదఖాగా, ఒక్కోసారి సాదారణ గిఫ్ట్ రూపంలో, ఒక్కోసారి ఎవరితో ఏదైనా వస్తువు కొని, ఆ వస్తువు మరియు దాని పైకం (ధర) రెండూ అమ్మేవానికే ఇచ్చేసేవారు, ఒక్కోసారి అప్పు తీసుకొని దానికంటే ఎక్కువ, ఉత్తమ రీతిలో తిరిగి ఇచ్చేవారు, ఒక్కోసారి ఎవరి వద్దనైనా బహుమతి పుచ్చుకుంటే అతనికి ఏదో ఒక విధంగా దాని ప్రతిఫలం అంతకంటే ఎక్కువ లేదా మంచిది ఇచ్చేవారు.

1- ఆయన విధానం: (29వ షాబాన్ సూర్యాస్తమయం తర్వాత) రమజాన్ నెల వంక ప్రత్యక్షంగా చూడనంత వరకు, లేదా చూసినట్లు కనీసం ఎవరైనా ఒక్కరు సాక్ష్యం ఇవ్వనంత వరకు ఉపవాసం ప్రారంభించేవారు కాదు. నెలవంక కనబడనిచచో, ఎవరు సాక్ష్యం ఇవ్వనిచో, షాబాన్ నెల ముప్పై రోజులు పూర్తి చేసుకొనేవారు.

2- ఒకవేళ 29వ షాబాన్ సూర్యాస్తమయం తర్వాత మేఘాలు క్రమ్ముకొని ఉంటే ఆయన షాబాన్ ముప్పై రోజులను పూర్తి చేసేవారు. మరియు మేఘావృతమైన రోజున ఉపవాసం ఉండేవారు కాదు, ఉండాలని ఆజ్ఞపించనూ లేదు.

3- ఆయన విధానం: రమజాన్ ముగింపుకై ఇద్దరు వ్యక్తుల సాక్షం స్వీకరించేవారు. (అంటే రమజాన్ ప్రారంభానికై ఒక్కరి సాక్ష్యం, పండుగకై ఇద్దరి సాక్ష్యం అవసరం).

4- ఒకవేళ పండుగ నమాజు చేసే సమయం ముగిసిన‌ తర్వాత ఇద్దరు వ్యక్తులు నెలవంక చూసామని సాక్ష్యం ఇస్తే, ఆయన ఉపవాసాన్ని విరమించేవారు, అందరికీ ఇదే ఆదేశమిచ్చేవారు. మరుసటి రోజు పండగ నమాజు దాని సమయంలో చేసేవారు.

5- ఆయన ఇఫ్తార్ చేయడంలో తొందర చేసేవారు, అంటే సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ చేసేవారు మరియు దాని తాకీదు చేసేవారు. అదేవిధంగా సహరీ చేసేవారు మరియు దాని గురించి ప్రోత్సహించేవారు, ఆయన సహరిలో ఆలస్యం చేసేవారు అంటే సహరీ చివరి సమయంలో సహరీ చేసేవారు మరియు అందరికీ ఇలాగే చేయాలని తాకీదు చేసేవారు.

6- ఆయన నమాజ్ కి ముందు ఇఫ్తార్ చేసేవారు. మరియు కొన్ని తాజా ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ అవి లేకపోతే ఎండు ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ అవి కూడా లేకపోతే కొన్ని నీళ్ల గుటకలతో ఉపవాసాన్ని విరమించేవారు.

7- ఆయన ఇఫ్తార్ సమయంలో ఈ దుఆ పఠించేవారు: జహబజ్జమఉ వబ్ తల్లతిల్ ఉరూఖు వసబతల్ అజ్రు ఇన్ షా అల్లాహ్. (దాహం తీరింది, నరాలు తడి అయ్యాయి, అల్లాహ్ తలుచుకుంటే ప్రతిఫలం కూడా లభిస్తుంది.)

8- ఆయన విధానం: రమజా మాసంలో అనేక రకాల ఆరాధనలు ఎక్కువగా చేసేవారు. రమజాన్ లోని ప్రతి రాత్రి ప్రవక్త మరియు జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖుర్ఆన్ ఒకరికొకరు వినిపించుకునేవారు.

9- ఆయన ఈ మాసంలో అధికంగా దానధర్మాలు, ఉపకారాలు (ప్రజల ఎడల మేలు), ఖుర్ఆన్ పారాయణం, నమాజ్, జిక్ర్ (అల్లాహ్ స్మరణ) చేస్తూ ఉండేవారు మరియు ఏతెకాఫ్ కూడా పాటించేవారు.

10- ఆయన వేరే రోజుల్లో చేయనటువంటి ఆరాధనలు ప్రత్యేకంగా రమజాన్ లో చేసేవారు. ఒక్కోసారి ఆయన సౌమె విసాల్ పాటించేవారు, కాని దాని నుండి సహాబాలను వారించేవారు. కాని తర్వాత సహాబాలకు కూడా సహరీ వరకు విసాల్ చేసే అనుమతి ఇచ్చారు. (సౌమె విసాల్ అంటే: ఇఫ్తార్ చేయకుంటే సహరీ వరకు ఏమీ తినకుండా ఉండుట. అయితే ఇప్పుడు ఇది మన కొరకు యోగ్యం లేదు).

1- ఆయన ఉపవాసిని సంభోగం నుండి, అరుపులు గోలల నుండి, తిట్లు, వివాదాల నుండి వారించేవారు. ఒకవేళ ఎవరైనా అతని పట్ల వివాదానికి దిగితూ (కయ్యానికి కాలు రువ్వితూ) తిట్లకు దిగితే “నేను ఉపవాసంతో ఉన్నాను” అని చెప్పమన్నారు.

2- ఆయన రమజాను మాసంలో ప్రయాణం చేస్తే ఒక్కోసారి ప్రయాణస్థితిలో ఉపవాసం ఉండేవారు, ఒక్కోసారి ఉపవాసం ఉండేవారు కారు. ఆయన సహాబాలకు రెండు విషయాలలో ఒకటిని ఎంపిక చేసుకునే అనుమతిని ఇచ్చారు.

3- ఒకవేళ ముస్లిముల సైన్యం శత్రువుల వద్దకు సమీపంగా ఉంటే ఉపవాసం ఉండవద్దని ఆజ్ఞాపించేవారు.

4- ప్రయాణం కారణంగా ఉపవాసం ఉండకపోవడానికి ఆయన ఎటువంటి దూర పరిమితిని (హద్దును) నియమించలేదు.

5- సహాబాలు ప్రయాణం మొదలుపెట్టగానే ఉపవాసాన్ని విడిచిపెట్టేసేవారు. ఊరి పొలిమరలకు దూరం అయ్యాకే ఉపవాసం విరమించాలని భావించేవారు కాదు. పైగా ఇలా అనేవారు: ఇదే ప్రవక్తవారి సున్నత్ (విధానం).

6- కొన్ని సందర్భాల్లో ప్రవక్త మేల్కొనే సరికి, ఫజ్ర్ సమయం సమీపించి ఉంటే, సంభోగం వలన అశుద్ధావస్తలో ఉంటే, ఫజ్ర్ సమయం ప్రవేశించాక స్నానం చేసేవారు. ఉపవాసాన్ని పూర్తి చేసేవారు.

7- ఆయన రమజాన్ లో ఉపవాస స్థితిలో కొందరు భార్యలకు ముద్దు పెట్టుకునేవారు. (కాని ప్రవక్త తమను తాము అదుపులో ఉంచుకునే రీతిలో మనం లేము గనక మన ఉపవాసం భంగం కాకుండా ఉండడానికి దీనికి దూరముండడమే ఉత్తమం).

8- ఆయన నుండి ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయడం, తలపై నీళ్లు పోసుకోవడం, (జాగ్రత్త పాటిస్తూ) ముక్కులో నీళ్ళు ఎక్కించడం, పుక్కిలించడం కూడా నిరూపితమై ఉంది.

9- ఆయన ఒకవేళ ఎవరైనా మరిచిపోయి తింటే అతనికి ఖజా చేయమని ఆజ్ఞాపించేవారు కాదు.

10- ఆయన వ్యాధిగ్రస్తునికి మరియు ప్రయాణికుడికి ఉపవాసం ఉండవద్దని, తర్వాత ఆ ఉపవాసాన్ని పూర్తి (ఖజా) చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఒకవేళ గర్భిణీ మరియు పాలు త్రాగించే స్త్రీలకు తమ గురించి అనారోగ్య భయం ఉంటే వారికి కూడా ఉపవాసం వదులుకునే అనుమతి ఇచ్చారు, కానీ వారు తర్వాత ఆ ఉపవాసాలను పూర్తి (ఖజా) చేసుకోవాలి.

1- ఉపవాసంలో ఆయన విధానం అందరికంటే పరిపూర్ణమైనది. కోరిన  లక్ష్యాన్ని పొందే మార్గం మరియు అది మనస్సుకు ఏ భారం కాకుండా సులభతరంగా ఉండేది.

ఆయన నఫిల్ ఉండడం మొదలు పెడితే, ఇక ఆయన ఉపవాసాలు వదలరేమో అనిపించేది. వదిలితే ఇక ఉండరేమో అనిపించేది.

ఆయన రమజాన్ తప్ప వేరే ఏ నెలలో పూర్తిగా ఉపవాసాలుండలేదు. మరియు షాబాన్ నెలలో ఉన్నంత ఎక్కువ ఏ వేరే నెలలో ఉపవాసాలుండలేదు. మరియు ఆయన ఉపవాసముండ కుండా ఏ నెలా గడిచేది కాదు. (అనగా ఆయన ప్రతీ నెలలో కొన్ని నఫిల్ ఉపవాసాలు పాటించేవారు).

2- ఆయన ప్రత్యేకించి శుక్రవారం రోజున ఉపవాసం ఉండటాన్ని ఇష్టపడలేదు. మరియు సోమవారం, గురువారం ప్రత్యేకించి ఆయన ఉపవాసాలు పాటించేవారు.

3- ప్రయాణంలో ఉన్నా లేదా స్థానికంగా ఉన్నా, అయ్యామే బీజ్ (చంద్ర మాసం ప్రకారం 13,14,15 తేదీలలో) ఉపవాసాలు ఎప్పుడూ వదిలేవారు కాదు.

4- ఆయన ప్రతినెల ప్రారంభ మూడు రోజులు ఉపవాసం ఉండేవారు.

5- ఆయన షవ్వాల్ నెల ఉపవాసాల గురించి ఇలా తెలిపారు: రమజాన్ వెంటనే ఈ ఉపవాసాలు ఉంటే పూర్తి కాలం ఉపవాసాలు ఉన్నట్లే. (ముస్లిం)

ఆయన ఆషూరా (మొహర్రం 10 వ తారీఖున) ఉపవాసాన్ని మిగతా ఉపవాసాల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉండేవారు.

6- ఆయన అరఫా (జిల్ హిజ్జా 9 వ తేదీ) ఉపవాసం గురించి ఇలా అన్నారు: అరఫా రోజున ఉపవాసం ఉండటం వల్ల గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం; మొత్త రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి. (ముస్లిం).

ఆయన విధానం: అరఫా మైదానంలో (హజ్ లో) ఉన్నప్పుడు అరఫా రోజున ఉపవాసం ఉండేవారు కాదు.

7- ఆయన ఎప్పుడూ నిరంతరంగా ఉపవాసాలు పాటించలేదు. బదులుగా ఆయన ఇలా అన్నారు: ఎవడైతే నిరంతరంగా ఉపవాసాలు పాటిస్తాడో అతను ఉపవాసమూ లేనట్టే, మరియు ఇఫ్తార్ కూడా చేయనట్లే. (నసాయీ)

8- ఒక్కోసారి ఆయన నఫిల్ ఉపవాసానికి సంకల్పించుకునేవారు మరియు ఉపవాసాన్ని విరమించేసేవారు. తరచుగా ఏమయ్యేదంటే; ఆయన ఇంట్లోకి ప్రవేశించి ‘ఈరోజు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా?’ అని అడిగేవారు, ఒకవేళ  లేదు అని సమాధానం దొరికితే, ఆయన అప్పుడు నేను ఉపవాసం ఉంటాను అనేవారు.

9- ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరైనా ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతనిని ఎవరైనా భోజనానికి పిలిస్తే అతను వారితో ఈరోజు నేను ఉపవాసంతో ఉన్నాను అని అనాలి. (ముస్లిం)

1- ఆయన రమజాన్ చివరి పది రోజులలో ఏతికాఫ్ పాటించేవారు, మరియు ఈ పద్ధతి ఆయన మరణం వరకు పాటించారు. ఒకసారి రమజాన్ లో ఏతికాఫ్ పాటించనందుకు షవ్వాల్ నెలలో దాని ఖజా పాటించారు.

2- ఆయన లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి)ని అన్వేషించటానికి ప్రారంభ రమజాన్ లోని మొదటి దశలో, ఆ తర్వాత రెండో దశలో, ఆ తర్వాత మూడో దశలో ఎతికాఫ్ చేసారు. అది చివరి దశలో ఉందని ఆయనకు తెలిశాక, ఆయన అల్లాహ్ సన్నిధికి చేరుకునేంతవరకు ప్రతి రమజానులో చివరి దశలోనే ఏతికాఫ్ పాటించారు.

3- ఆయన ఉపవాసం ఉన్న స్థితిలోనే ఏతెకాఫ్ పాటించేవారు.

4- ఆయన గుడారం(డేరా) వేయమని ఆజ్ఞాపించేవారు. అప్పుడు ఆయన కొరకు మస్జిద్ లో గుడారం ఏర్పాటు చేయడం జరిగేది. ఆయన అందులోనే ఉండి అల్లాహ్ ఆరాధన చేసేవారు.

5- ఆయన ఏతికాఫ్ పాటించాలని సంకల్పించుకుంటే ఫజ్ర్ నమాజు తర్వాత ఆ గుడారంలోనికి ప్రవేశించేవారు.

6- ఏతికాఫ్ లో ఉన్నప్పుడు ఆయన పడక గుడారంలో పెట్టబడేది, ఆయన తమ డేరా లో ఒంటరిగా ఉండేవారు.

7- ఆయన ఏతికాఫ్ స్థితిలో ఉన్నప్పుడు తమ ఇంటికి కేవలం తమ ముఖ్యమైన (మలమూత్ర విసర్జన, స్నానం లాంటి) అవసరాలకు మాత్రమే వెళ్లేవారు.

8- ఆయన ఏతికాఫ్ స్థితిలో తమ‌ తలను ఆయెషా రజియల్లాహు అన్హా గారి వైపు తీసేవారు అప్పుడు ఆమె బహిష్టు స్థితిలో ఉండి కూడా ఆయన తలను కడిగి, దువ్వేది. (మస్జిదె నబవీ ప్రక్కనే ఆయిషా రజియల్లాహు అన్హా గది ఉండినది).

9- ఎవరైనా భార్య గుడారాంలో ప్రవక్తను కలవడానికి వస్తే, ఆయన వారితో మాట్లాడడం తప్ప ఇతరత్రా ఏదీ చేసేవారు కాదు. వారు వెళ్ళడానికి లేచి నిలబడితే, అది రాత్రి పూట గనక వారి వెనక తోడుగా మస్జిద్ బైట (ప్రాంగణంలో) వచ్చేవారు.

10- ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏతికాఫ్ స్థితిలో భార్యలతో లైంగిక సంబంధం (సంభోగం) లేదా ముద్దు పెట్టుకోవడం లాంటివేమీ చేసేవారు కాదు.

11- ఆయన ప్రతి సంవత్సరం పది రోజులు ఏతికాఫ్ పాటించేవారు. కానీ తమ మరణానికి ముందు సంవత్సరం ఆయన 20 రోజుల ఏతికాఫ్ పాటించారు.

1- ఆయన నాలుగు సార్లు ఉమ్రా చేశారు.

* మొదటి సారి: ఉమ్రయె హుదైబియా. ఆ సందర్భంలో మక్కా ముష్రికులు (అవిశ్వాసులు) ఆయన్ను (మరియు సహాబాలను) మస్జిదె హరామ్ లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అప్పుడు ఆయన అడ్డుకోబడిన చోటనే జంతువు ఖుర్బానీ చేసి, తలవెంట్రుకలు తీయించుకొని, హలాల్ అయ్యారు (అంటే ఇహ్రాం స్త్థితిలో నుండి బైటికి వచ్చారు), ఆ తర్వాత తిరిగి మక్కా వెళ్ళిపోయారు.

* రెండొవ సారి: ఉమ్రయె ఖజా. దీనిని ఆయన హుదైబియా తర్వాతి సంవత్సరంలో చేశారు.

* మూడొవ సారి: హజ్జె ఖిరాన్ తో కలిపి చేసినది.

* నాలుగోవ సారి: జిఇర్రానా ప్రదేశము నుండి చేసిన ఉమ్రా.

2- ఆయన చేసిన నాలుగు ఉమ్రాలలో ఏ ఒక్కటి కూడా మక్కాలో ఉండి, మళ్ళీ బయటకు వెళ్ళి చేయలేదు, అన్నీ కూడా బయటి నుండి మక్కాలో ప్రవేశిస్తూ చేసినవే.

3- ఆయన సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉమ్రా చేసినట్లు రుజువైనది. ఆయన సంవత్సరంలో రెండు ఉమ్రాలు చేయలేదు.

4-ఆయన ఉమ్రాలన్నీ హజ్ నెలల్లోనే చేసారు.

5- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశం: రమదాన్ లో చేయబడిన ఉమ్రా హజ్ తో సమానం (ముత్తఫఖున్ అలైహి)

1- హజ్జ్ చేయడం విధి అని ఆదేశం అవతరించిన వెంటనే ప్రవక్త హజ్ కొరకు సిద్ధం అయిపోయారు. ఆయన (మదీనా జీవితంలో) కేవలం ఒకే హజ్ చేసారు, అది కూడా హజ్జె ఖిరాన్.

2- ఆయన జొహ్ర్ నమాజ్ తర్వాత ఇహ్రామ్ ధరించారు. మరియు ఈ పదాలతో తల్బియా చదివారు: లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్. ఇన్నల్ హమ్ద, వన్నిఅమత లక వల్ ముల్క లా షరీక లక్.  (నేను హాజరైయ్యాను ఓ అల్లాహ్! నేను హాజరైయ్యాను, నీకు భాగస్వాములు ఎవరూ లేరు. నేను హాజరయ్యాను, నిస్సందేహంగా సకల ప్రశంసలు నీ కోసమే! సమస్త వరాలు నీ వైపు నుండే, సామ్రాజ్యాధికారం అంతా కూడా నీదే, వీటిలో కూడా నీకు ఎవరూ భాగస్వామి లేరు. (బుఖారీ, ముస్లిం).

ఆయన తమ స్వరాన్నిపెంచి బిగ్గరగా తల్బియా చదివారు, అది సహాబాలందరూ విన్నారు. అల్లాహ్ ఆదేశమేరకు ఆయన వారందరికీ బిగ్గరగా తల్బియా పఠించమని ఆజ్ఞాపించారు. పైన తెలిపిన తల్బియా ప్రవక్త పలుకుతూ ఉంటే సహాబాలు కూడా తగ్గిస్తూ , పెంచుతూ తల్బియా పలికేవారు. ఆయన ఎవరినీ నిరాకరించలేదు.

3- ఆయన సహాబాలకు హజ్ యొక్క మూడు రకాలు (ఖిరాన్, తమత్తుఅ్, ఇఫ్రాద్) లో ఏది తలిస్తే దాని ఇహ్రామ్ చేసే అనుమతి ఇచ్చారు. పిదప మక్కాకు సమీపంగా చేరుకున్నప్పుడు ఖుర్బానీ జంతువు తమ వెంట తీసుకురాని వారికి ఇలా ఆదేశించారు: మీరు ఉమ్రా చేసి, ఇహ్రామ్ స్థితి నుండి బైటికి వచ్చి, హజ్జె ఖిరాన్ సంకల్పాన్ని విరమించుకోండి.

4- ప్రవక్త ఈ హజ్జ్ ప్రయాణం తమ స్వారీ మీద చేసారు. దానిపై ఎటువంటి పల్లకి (కజావా), లేదా అంబారీ (హౌదజ్) ఉండేది కాదు మరియు ఆయన ప్రయాణ సామాగ్రి మరియు దారిలో తినత్రాగే వస్తువులు ఆయన స్వారీపైనే ఉండినవి.

పిదప ఆయన మక్కాకు చేరుకున్నాక ఎవరి వద్దనైతే ఖుర్బానీ జంతువు లేదో వారిని తప్పనిసరిగా ఉమ్రా కి మారమని ఆదేశించారు. ఉమ్రా పూర్తయ్యాక హలాల్ అయిపోవాలని ఆదేశించారు. ఎవరి వద్దనైతే ఖుర్బానీ జంతువు ఉందో వారిని మాత్రమే ఇహ్రామ్ స్థితిలో ఉండమని ఆదేశించారు. పిదప ఆయన జీతువా (ZeeTuwa) ప్రాంతానికి చేరుకున్నారు, అక్కడ జిల్ హిజ్జా 4 వ తేదీ రాత్రి గడిపారు. ఫజ్ర్ నమాజ్ చేసి గుస్ల్ (స్నానం) చేసి, మక్కా వైపునకు బయలుదేరారు. ఆయన మక్కాలో, దాని ఎగువ ప్రాంతం అయిన హుజూన్ కి సమీపంగా సనియతుల్ ఉల్యా వైపు నుండి పగటి పూట ప్రవేశించారు.

ఆయన మస్జిదే హరామ్ లో ప్రవేశించాక తహియ్యతుల్ మస్జిద్ చేయలేదు. (ఎందుకంటే ఇక్కడ తవాఫ్ (ప్రదక్షిణం) చేయడమే తహియ్యతుల్ మస్జిద్). ఆ పిదప కాబా వరకు, హజ్రె అస్వద్ వద్దకు వచ్చి, దానిని చుంబించారు, దాని వద్ద ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. పిదప ఆయన కుడి వైపుకు తిరిగి, కాబాను ఎడమ వైపున ఉంచారు. ఆయన కాబా ద్వారం వద్ద, జలదారి (దోనీ, పర్ నాలా) క్రింద, కాబా పైన లేదా దాని మూల మూలన దుఆ చేయలేదు. హజ్రె అస్వద్ మరియు రుక్నే యమానీ మధ్య ఈ దుఆ చదవడం రుజువై ఉంది: రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వఫిల్ ఆఖిరతి హసనతవ్ వఖినా అజాబన్నార్. (ఓ మా ప్రభూ! ప్రపంచం లోను మాకు మేలుని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మాకు మేలును ప్రసాదించు మరియు మమ్మల్ని అగ్ని శిక్ష నుండి కాపాడు).

ఆయన తవాఫ్ చేస్తున్నప్పుడు ఈ దుఆ తప్ప వేరేదీ ప్రత్యేకించి చదివాలని నిర్ణయించలేదు.

ఆయన తవాఫ్ లో మొదటి మూడు రౌండ్లు ‘రమ్ల్’ చేసేవారు, అంటే: అడుగులు దగ్గరదగ్గరగా వేస్తూ కొంచెం వేగంగా నడిచేవారు. అలాగే ‘ఇజ్తిబాఅ’ చేసేవారు, అంటే: కుడి భుజం ఖాళీగా ఉంచి ఎడమ భుజంపై వస్త్రాన్ని కప్పేవారు. ఈ విధంగా కుడి భుజం నగ్నంగా మరియు ఎడమ భుజం కప్పబడి ఉండేది.

ఆయన హజ్రె అస్వద్ ముందు వచ్చినప్పుడల్లా దాని వైపున సైగ చేశారు, లేదా వంకర కర్రతో తాకి, దానిని చుంబించారు మరియు అల్లాహు అక్బర్ అన్నారు.

ఇదే విధంగా ఆయన రుక్నే యమానీని తాకారు కానీ‌ దానిని చుంబించలేదు. అలాగే దానిని ముట్టుకున్న తర్వాత తమ చేతిని చుంబించలేదు.

కాబా యొక్క తవాఫ్ పూర్తి చేశాక, మఖామె ఇబ్రాహీం వెనక వచ్చి, చదివారు: వత్తఖిజూ మిమ్ మఖామి ఇబ్రాహీమ ముసల్లా  [وَاتَّخِذُواْ مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ] (మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి). (బఖర:2-125).

పిదప రెండు రకాతుల నమాజ్ చేశారు. అప్పుడు మఖామె ఇబ్రాహీం ఆయన మరియు కాబా మధ్యలో ఉంది. మొదటి రకాతులో సూరయె ఫాతిహా తర్వాత (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) సూరయె కాఫిరూన్ మరియు రెండవ రకాతులో సూరయె ఫాతిహా తర్వాత (ఖుల్ హువల్లాహు అహద్) సూరయె ఇఖ్లాస్ పారాయణం చేశారు. నమాజు పూర్తి చేశాక హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి దానిని చుంబించారు. పిదప సఫా వైపుకు బయలుదేరి దాని సమీపంలో చేరగానే  [إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَآئِرِ اللّهِ) ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్ చదివారు. (నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్‌ చిహ్నాలలోనివి). (బఖర: 2-158).

“అల్లాహ్ సఫాను ముందు ప్రస్తావించాడు కనుక నేను కూడు సఈ సఫా నుండే ప్రారంభిస్తాను” అని చెప్పి సఫా కొండపై ఎక్కి, కాబా దిశలో ముఖం చేసి, లాఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని  పలికి ఈ జిక్ర్ చేశారు: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు అన్జజ వఅదహు వ నసర అబ్దహు వ హజమల్ అహ్జాబ వహ్ దహు.

«لا إله إلا اللهُ وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شيءٍ قدير، لاَ إلهَ إلاَّ اللهُ وَحْدَهُ أَنْجَزَ وَعْدَهُ وَنَصَرَ عَبْدَه وَهَزَمَ الأحْزَابَ وحْدَه»

అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయనకు సరి సమానులు లేరు. రాజ్యాధికారం ఆయనదే, సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే, ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, తన దాసునికి సహాయం చేసాడు, ఆయన ఒక్కడే శత్రు వర్గాలను చిత్తుగా ఓడించాడు. (ముస్లిం, నిసాయి).

ఆయన ఈ జిక్ర్ మధ్యలో ప్రార్థించారు. ఆయన ఈ జిక్ర్ 3సార్లు పఠించారు.

పిదప ఆయన సఈ చేస్తూ మర్వహ్ వైపునకు వెళ్ళారు, లోయలో పరిగెత్తడం మొదలుపెట్టారు, అది దాటిన తర్వాత సామాన్య రీతిలో నడుచుకుంటూ వెళ్ళారు, ఆయన కాలినడకన సఈ చేయడం ప్రారంభించారు, పిదప జనసమూహం కారణంగా స్వారీ చేస్తూ సఈ పూర్తిచేసారు. మర్వహ్ చేరుకున్నప్పుడల్లా ఆయన దాని పైకి ఎక్కేవారు మరియు కాబాను తమ ఎదురుగా ఉండేలా చేసి అల్లాహ్ గొప్పతనం, ఏకత్వం ప్రకటించేవారు అనగా అల్లాహు అక్బర్ మరియు లాఇలాహ ఇల్లల్లాహ్ అనేవారు. మరియు సఫా పై ఏ దుఆలు చేశారో మర్వహ్ పై కూడా అవే దుఆలు చేసేవారు, (కానీ ఇన్నస్సఫా వల్ మర్ వత ఆయత్ చదివేవారు కాదు).

ఆయన మర్వహ్ వద్ద సఈ పూర్తి చేసి, తమ వెంట ఖుర్బానీ జంతువు తీసుకురాని వారితో ఇహ్రామ్ విప్పి పూర్తిగా హలాల్ అయిపోవాలని అదేశమిచ్చారు, ఒకవేళ హజ్జే ఇఫ్రాద్ అయినా లేదా ఖిరాన్ మరియు తమత్తుఅ్ అయినా పర్లేదన్నారు.

 ఆయన వద్ద ఖుర్బానీ జంతువు ఉంది గనక ఆయన ఇహ్రామ్ విప్పలేదు మరియు ఈ విధంగా అన్నారు: ఒకవేళ నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేను ఖుర్బానీ జంతువును వెంట తీసుకువచ్చేవాడిని కాదు, కేవలం ఉమ్రా కొరకే ఇహ్రామ్ ధరించేవాడిని. (ముత్తఫఖున్ అలైహి)

అదే ప్రదేశంలో ఆయన గుండు చేయించుకునేవారి కొరకు 3సార్లు మరియు కటింగ్ చేయించుకునేవారి కొరకు ఒక్కసారి క్షమాభిక్ష కొరకు దుఆ చేశారు.

ఆయన తర్వియహ్ (జిల్ హిజ్జా 8వ) రోజు వరకు మక్కాలోని ‘జాహిర్’ అనే ప్రాంతంలో ముస్లింలతో పాటు బస చేసినప్పుడు నమాజులు ఖస్ర్ చేస్తూ ఉండేవారు.

తర్వియహ్ (జిల్ హిజ్జా 8వ) రోజునన చాష్త్ (సూర్యోదయం అయ్యాక కొంత) సమయానికి తమతో పాటు ఉన్న వారితో మినా కి బయలుదేరారు. ఎవరైతే ఇహ్రామ్ ను విప్పేసారో వారు తమ ఇండ్ల నుండి (హజ్జ్ కొరకు) ఇహ్రామ్ ధరించి బయలుదేరారు.

ఆయన మినా చేరుకున్నాక అక్కడే జొహ్ర్ మరియు అస్ర్ (మరియు మిగితా) నమాజులు వాటి సమయాల్లో చేసుకొని, రాత్రి గడిపారు. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత అరఫా వైపుకు రవానా అయ్యారు. సహాబాలలో కొందరు తల్బియా చదువుతుండగా మరి కొందరు తక్బీర్ పలుక సాగారు. ఆయన రెండింటినీ వింటూ ఉన్నారు కానీ ఎవరినీ వద్దనేవారు కాదు.

ఆయన ఆజ్ఞమేరకు ఆయన కొరకు నమిరహ్ లో  గుడారం (డేరా) వేయడం జరిగింది, (నమిరహ్ అరఫాలోని భాగం కాదు, ఇది అరఫా తూర్పు భాగంలో ఉన్న ఒక గ్రామం) ఆయన అందులో బస చేసారు. పొద్దు వాలిన తర్వాత (జొహ్ర్ సమయానికి) ఖస్వా ఒంటెపై స్వారీ చేస్తూ ఉరనహ్ లోయలోని దిగువ భాగానికి చేరుకున్నారు. అదే ప్రదేశంలో తమ స్వారీ పై కూర్చునే అద్భుతమైన ఖుత్బా (ప్రసంగాన్ని) ఇచ్చారు. అందులో ఆయన‌

– ఇస్లాం మూలంశాలు, నియమాలను వివరించారు.

– బహుదైవారాధన మరియు అజ్ఞానపు దురాచారాలను ఖండించారు.

– ఒకరి ధన, మాన, ప్రాణాలు నిషిధ్ధమని ప్రకటించారు. వీటిని ఇతర మతాలవారు కూడా అంగీకరిస్తారు.

– అజ్ఞానపు వ్యవహారాలు మరియు వడ్డీ ని అంతమొందించారు.

– స్త్రీలతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలని తాకీదు చేశారు.

– ఈ ప్రసంగంలోనే తమ అనుచర సమాజాన్ని ఖుర్ఆన్ (హదీసుల)ను గట్టిగా పట్టుకోవాలని ఆదేశించారు.

– తాను అల్లాహ్ ఆజ్ఞలను ఉత్తమ రీతిలో అందరికీ చేరవేశానని మరియు దైవ దౌత్య పదవి బాధ్యతలను నెరవేర్చానని, అలాగే సమాజం కొరకు శ్రేయస్సు కోరానని తమ సహాబాల (సహచరుల)తో అంగీకారం మరియు సాక్ష్యం తీసుకున్నారు, ఇంకా ఈ మాట పైన అల్లాహ్ ను కూడా సాక్షిగా ఉంచారు.

ఆయన ఖుత్బా ముగించిన తరువాత బిలాల్ రదియల్లాహు అన్హు గారిని అజాన్ ఇవ్వమని ఆదేశించారు. అజాన్ మరియు ఇఖామత్ అయిన తర్వాత ఆయన సిర్రీ (మొనంగా) ఖిరాత్ చేసి, జొహ్ర్ నమాజ్ రెండు రకాతులు చేయించారు, మళ్ళీ ఇఖామత్ ఇవ్వడం జరిగినది వెంటనే అస్ర్ నమాజ్ రెండు రకాతులు చేయించారు. మరియు ఆ రోజు జుమా రోజు. ఆయనతో పాటు మక్కా వారు కూడా ఈ ప్రయాణం లో ఉన్నారు. వారు కూడా ఖస్ర్ మరియు జమా చేసారు.

ఆయన నమాజు పూర్తి చేసిన తర్వాత మౌఖిఫ్ (అరఫాత్)కి చేరుకున్నారు. ప్రజలకు ప్రవక్త అరఫా (అంటే 9వ జిల్ హిజ్జ) రోజు ఉపవాసమున్నారేమో అనే సందేహం వచ్చినప్పుడు ఆయన గారి భార్య హజ్రత్ మైమూనా రజియల్లాహు అన్హా గారు ఒక పాత్రలో పాలు పంపారు, ఆయన మౌఖిఫ్ లోనే నిలబడి ఉన్నప్పుడు ప్రజలందరి ముందు దానిని త్రాగారు. మరియు అరఫా మైదానం పర్వతం దిగువ ప్రాంతంలో రాళ్ల దగ్గర ఖిబ్లాకు ఎదురుగా తమ స్వారీ పైనే ‘నడిచి వెళ్ళేవారి దారి’ ఎదురుగా ఉండేలా నిలబడ్డారు. సూర్యాస్తమయం వరకూ దుఆ చేస్తూ, విలపిస్తూనే ఉన్నారు. మరియు ప్రజలను ఉరనా లోయను వదలి, అరఫా లోపలికి రావాలని ఆజ్ఞాపించారు. ఇంకా ఇలా ఆదేశించారు: నేను ఇక్కడ నిలిచాను మరియు పూర్తి అరఫా నిలుచు ప్రదేశం. (ముస్లిం)

ఆయన దుఆలో తమ చేతులను ఛాతీ వరకూ పైకెత్తారు ఎలాగైతే ఒక నిరుపేద ఆహారాన్ని అర్జిస్తాడో. ఆ సందర్భంలో ఇలా తెలిపారు:

«خَيْرُ الدُّعَاءِ دُعَاءِ يَوْمِ عَرَفَةَ، وَخَيْرُ مَا قُلْتُ أَنَا والنبيونَ قَبْلِي: لَا إلهَ إلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الملكُ وَلَهُ الحَمْدُ وهو عَلَى كُلِّ شيءٍ قَدِيرٌ»

దుఆలలో కెల్లా ఉత్తమమైన దుఆ అరఫా రోజు చేయబడే దుఆ మరియు నేను, నాకు పూర్వం ప్రవక్తలందరూ చేసిన అత్యుత్తమమైన (దుఆ): లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (తిర్మీజి).

ఏ అనుమానం లేకుండా, సంపూర్ణంగా సూర్యాస్తమయం అయి, దాని పసుపుతనం కూడా కనుమరుగయ్యాక, ఆయన అరఫాత్ మైదానం నుండి బయలుదేరారు. ఉసామా బిన్ జైద్ ను తమ‌ వెనక కూర్చోబెట్టుకున్నారు. మరియు ప్రశాంతంగా,  నిశ్శబ్దంగా నడుస్తూ ఉన్నారు మరియు ఒంటె పగ్గాన్ని పల్లకి పక్క భాగాన్ని తగిలే విధంగా తన వైపుకి లాగుతూ ఉన్నారు‌. ఆ సమయంలో ఆయన ఇలా ఆదేశించారు: ఓ ప్రజలారా! ప్రశాంతంగా నడవండి. ఎందుకంటే త్వరగా, వేగంగా నడవడం పుణ్యం కాదు. (బుఖారీ)

ఆయన మఅ్ జిమైన్ దారి నుండి వాపసు అయ్యారు మరియు జబ్బ్ దారి నుండి అరఫా లో ప్రవేశించారు.

పిదప ఆయన సైరుల్ అనఖ్ నడక శైలిని అలవర్చుకున్నారు, అనగా అత్యంత నిదానంగానూ కాదు, అత్యంత వేగంగానూ కాదు, మధ్యస్థ నడక శైలి. ఒకవేళ ఆయనకు విశాలమైన దారి కనపడితే కొద్దిగా వేగం పెంచేవారు.

ఆయన దారిలో నిరంతరంగా తల్బియా పలికుతూనే ఉన్నారు. దారిలో ఒక చోట మూత్ర విసర్జన కొరకు వెళ్ళి, తేలికగా వుజూ చేసుకున్నారు. పిదప మళ్ళీ నడక ప్రారంభించి ముజ్దలిఫా చేరుకొని నమాజు కొరకు వుజూ చేసారు. అజాన్, ఇఖామత్ ఇవ్వమని ఆజ్ఞాపించారు. పిదప ఆయన ఒంటెలను కూర్చోబెట్టే కి మరియు ప్రజలు తమ సామానులను దించక ముందే మగ్రిబ్ నమాజు చేయించారు. వారు తమ సామానులను దించిన తర్వాత మళ్ళీ ఇఖామత్ ఇవ్వమని, ఇషా నమాజు చేయించారు. ఇషా కొరకు అజాన్ ఇవ్వబడలేదు. మగ్రిబ్ మరియు ఇషా మధ్యలో ఏ నమాజూ చేయలేదు.

ఆ తర్వాత ఆయన ఫజ్ర్ వరకు పడుకున్నారు, ఆ రాత్రి ఆయన ఏ నమాజు చేయలేదు.

ఆ రాత్రి చంద్రుడు ఆస్తమించాక తమ బలహీన కుటుంబీకులను ఫజర్ కి ముందే మినా కు బయలుదేరాలని ఆదేశించారు. సూర్యోదయానికి ముందే జమరాత్ కు రాళ్లు కొట్టవద్దని తాకీదు చేశారు.

ఫజ్ర్ సమయం ప్రవేశించచిన తొలి వేళలోనే ఫజ్ర్ నమాజు చేయించారు, దాని కొరకు అజాన్ మరియు ఇఖామత్ ఇవ్వబడినది. పిదప స్వారీ చేస్తూ మష్అరే హరామ్ కు చేరుకున్నారు. ‘ముజ్దలిఫా ప్రాంతమంతయూ నిలుచు స్థలమే’ అని ప్రకటన చేశారు. పిదప ఖిబ్లా వైపు తిరిగి వెళుతురు అయ్యే వరకు దుఆ చేస్తూ, విలపిస్తూ, తక్బీర్ మరియు తహ్లీల్ మరియు అల్లాహ్ స్మరణ లో నిమగ్నమైపోయారు.

 ఆ తర్వాత ఆయన ముజ్దలిఫహ్ నుండి ఫజల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుని తమ వెనక కూర్చోబెట్టుకొని బయలుదేరారు. ఈ దారిలోనే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమాని జమ్రాత్ పై విసరడానికి ఏడు కంకర రాళ్ళు ఏరుకొని తీసుకు రమ్మని చెప్పారు. ప్రవక్త వాటిని తమ చేతుల్లో ఎగరవేస్తూ, “ఇలాంటి కంకర్రాళ్ళే జమరాత్ పై విసరండి, ధర్మ విషయంలో మితిమీరకండి! ఎందుకంటే గత జాతులు ధర్మ విషయంలో మితిమీరడం వల్లనే నశించిపోయాయి”. (నిసీఈ, ఇబ్నె మాజా).

ఆయన ముందుకు సాగుతూ వాదియె ముహస్సర్ నుండి దాటుతూ తమ ఒంటె వేగాన్ని పెంచారు. ఆ తర్వాత జమర అఖబా లేదా కుబ్రాకు దారితీసే మధ్య మార్గాన్ని ఎంచుకొని, దాని ద్వారా మినా చేరుకున్నారు. ఆయన రాళ్ళు రువ్వడం ప్రారంభించే వరకూ తల్బియా పలికుతూ ఉన్నారు‌. సూర్యోదయం తర్వాత వాది (లోయ)లోని క్రింది భాగంలో కాబాను ఎడమ వైపున, మినాను కుడి వైపున ఉంచి, జమరకి ముందు సవారిపైనే ఉండి, ఒకదాని తర్వాత ఒకటి ఏడు రాళ్ళు విసిరారు‌, ప్రతీ రాయి విసిరేటప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు.

పిదప ఆయన మినా కి వాపసు అయ్యారు.

అక్కడ అనర్గళంగా, స్పష్టమైనరీతిలో అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అందులో

– ఖుర్బానీ రోజు యొక్క విశిష్ఠత, ప్రాముఖ్యత, గొప్పతనం,

– పవిత్ర మక్కా నగరం యొక్క విశిష్ఠత వివరించారు.

– అల్లాహ్ గ్రంథానికి అనుగుణంగా పరిపాలించే వారికి విధేయత చూపమన్నారు.

– హజ్జ్ యొక్క విధివిధానాలను బోధించారు.

పిదప ఆయన మినా లో ఖుర్బానీ చేసే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ అరవై మూడు ఒంటెలను తమ స్వహస్తాలతో జిబహ్ చేసారు. ఒంటెను నిలబెట్టి, దాని ముందు ఎడమ కాలును మడిచి నహర్ చేసారు. ఆ తర్వాత ఆయన జిబహ్ చేయడం ఆపేసి, వంద లోని మిగిలిన ఒంటెలను అలీ రజియల్లాహు అన్హు జబహ్ చేయాలని, వాటి మాంసం నిరుపేదలలో పంచిపెట్టాలని మరియు కసాయికి అతని కష్టార్జితంగా జంతువులో నుండి ఏమీ ఇవ్వద్దని ఆదేశించారు. (అంటే వేరే డబ్బులు ఇవ్వచ్చు, కాని ఖుర్బానీ మాంసం, దాని తోలు లాంటివేమీ ఇవ్వకూడదు).

 మినా మొత్తం ఖుర్బానీ చేసే ప్రదేశం అని అలాగే మక్కా వీధులు నడటానికి దారులు మరియు ఖుర్బానీ చేసే ప్రదేశం అని తెలియజేశారు.

ఆయన ఖుర్బానీ పూర్తి కాగానే క్షైరం చేసేవారిని పిలిచి, శిరోముండనం (గుండు) చేయించుకున్నారు. అతను కుడివైపు నుండి మొదలుపెట్టాడు‌. పిదప ఆయన అతనికి ఎడమ వైపున చెయ్యమని ఆజ్ఞాపించారు‌. ఆ తర్వాత తమ వెంట్రుకలను అబూ తల్హా రజియల్లాహు అన్హు గారికి ఇచ్చి, ప్రజలలో పంచి వేయమని ఆదేశించారు‌. (ముత్తఫఖున్ అలైహి).

అక్కడే గుండు చేయించుకునేవారి కొరకు మూడు సార్లు మరియు కటింగ్ చేయించుకునేవారి కొరకు ఒక సారి క్షమాభిక్ష కొరకు దుఆ చేశారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం హలాల్ అవ్వక ముందు ఆయిషా రజియల్లాహు అన్హా ఆయనకు సుగంధ ద్రవ్యాలను పూసారు. (ఇది మొదటి తహల్లుల్).

            ఆ తర్వాత ఆయన జొహ్ర్ కి ముందు స్వారీ చేస్తూ మక్కా చేరుకున్నారు. తవాఫె ఇఫాజా చేశారు. (దీనినే తవాఫె హజ్ అని కూడా అంటారు, ఇది రుకున్, ఇది చేయకుంటే హజ్ చేయనట్లే లెక్క). ఆయన దానికి మినహా వేరే తవాఫ్ చేయలేదు. (అంటే అక్కడ ఉండి, నఫిల్ తవాఫులు చేయలేదు). ఈ సందర్భంలో సఈ కూడా చేయలేదు. మరియు ఈ తవాఫ్ లో రమ్ల్ చేయలేదు, అలాగే వీడ్కోలు తవాఫ్ (తవాఫె విదాఅ)లో కూడా రమ్ల్ చేయలేదు. ఆయన రమ్ల్ కేవలం ప్రారంభ తవాఫ్ (తవాఫె ఖుదూమ్)లోనే చేసారు.

            తవాఫ్ పూర్తయిన పిదప ఆయన జమ్ జమ్ వైపుకు వెళ్ళారు. అక్కడ ప్రజలు త్రాగుతున్నారు. వారు జమ్ జమ్ నీళ్ళ పాత్ర ఆయనకు ఇచ్చారు, ఆయన నిలబడి త్రాగారు. (అక్కడ అలాంటి అవసరం ఉండే). పిదప ఆయన మినా తిరిగి వచ్చి, అక్కడే రాత్రి గడిపారు.

            ఆయన ఆ రోజు జొహ్ర్ నమాజు ఎక్కడ చేశారన్న విషయంలో బేధాభిప్రాయం ఉంది. ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా కథనం: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మినాలో జొహ్ర్ నమాజు చేశారు మరియు జాబిర్, ఆయిషా రజియల్లాహు అన్హుమా కథనం: మక్కాలో చేసారు.

            మరుసటి రోజు (11వ జిల్ హిజ్జ) పొద్దువాలే వరకు (జొహ్ర్ సమయ ప్రవేశానికి) వేచించి సమయం కాగానే తమ నివాసం నుండి జమరాత్ వైపుకు కాలినడకన వెళ్ళారు, స్వారి మీద కాదు. మస్జిదె ఖైఫ్ కి సమీపంగా ఉన్న జమరయె ఊలా నుండి మొదలు పెట్టారు. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అంటూ ఏడు రాళ్ళు కొట్టారు.

            ఆ తర్వాత జమర నుండి కొద్దిగ ముందుకు సాగి, కొంచెం కుడి వైపునకు వచ్చి, రెండు చేతులను పైకెత్తి, ఖిబ్లా వైపు ముఖం చేసి సుదీర్ఘమైన దుఆ చేసారు, అంటే సూర బఖర పఠించే అంత సేపు.

            పిదప జమరయె వుస్తా వైపుకి వచ్చారు. అల్లాహు అక్బర్ అని పలుకుతూ ఏడు రాళ్ళు కొట్టారు, పిదప లోయకు కలిసి ఉండే ఎడమ భాగం వైపుకి జరిగి ఖిబ్లా వైపు తిరిగి మొదటి సారి కంటే కొంత తక్కువ సుదీర్ఘమైన దుఆ చేసారు.

            పిదప ఆయన జమరయె అఖబా వద్దకు వచ్చి, లోయ లోనికి ప్రవేశించారు. జమరాను ముందు ఉంచి బైతుల్లాహ్ ను ఎడమ వైపున మరియు మినా ను కుడి వైపున ఉండేలా చేసుకొని అల్లాహు అక్బర్ అని పలికి ఏడు రాళ్ళు కొట్టారు. రాళ్ళు కొట్టిన తర్వాత అక్కడ ఎటువంటి దుఆ చేయలేదు తిరిగి వాపసు వచ్చేసారు.

            ప్రాధాన్యత పొందిన అభిప్రాయం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జొహ్ర్ నమాజ్ కి ముందే జమరాత్ పై రాళ్ళు విసిరారు. ఆ తర్వాత నమాజు చేసుకున్నారు. అబ్బాస్ రజియల్లాహు అన్హు గారికి హాజీలకు నీళ్ళు త్రాపించే బాధ్యత ఉన్న కారణంగా మినా రాత్రులు  (మినాలో కాకుండా) మక్కాలో గడపడానికి అనుమతిని ఇచ్చారు.

            ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రోజులే రాళ్ళు విసిరి వెళ్ళాలని తొందరపడలేదు, తష్రీఖ్ యొక్క మూడు రోజులు (జిల్ హిజ్జా 11,12,13) పూర్తిగా ఉండి, రాళ్ళు విసిరారు.

            జొహ్ర్ తర్వాత ముహస్సబ్ వైపు బయలుదేరారు, పిదప అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు చేసారు మరియు నిద్రపోయారు. అదే రాత్రి మక్కా బయలుదేరి, సహరీ సమయంలో తవాఫె విదాఅ (వీడ్కోలు) చేసారు. ఈ తవాఫ్ లో రమ్ల్ చేయలేదు (భుజాలను కదుపుతూ, చిన్న అడుగులు వేస్తూ వేగంగా నడవడం).

            సఫియా రదియల్లాహు అన్హా గారికి బహిష్టు (నెలసరి) రావడంతో ఆమెకు వీడ్కోలు తవాఫ్ వదిలేయమని అనుమతి ఇచ్చారు.

            ఆయిషా రజియల్లాహు అన్హా గారికి ఆమె మనస్సు తృప్తి కోసం తమ‌ సోదరునితో పాటు తన్ఈమ్[4] నుండి ఉమ్రా చేసే అనుమతి ఇచ్చారు. ఆమె రాత్రి ఉమ్రా ముగించిన తర్వాత ప్రవక్త సహాబాలకు బయలుదేరమని ఆదేశించారు. మరియు ప్రజలు మదీనా వైపునకు బయలుదేరారు.

(హజ్ లేదా ఉమ్రా చేసేవారు ఇచ్చే ‘జంతుబలి’ని, అలాగే తమ స్థానంలో ఉండి, మక్కాలో జిబహ్ చేయుబడుటకు పంపే జంతువుని ‘హద్ య్’ అంటారు).

1- ఆయన తమ వైపు నుండి ఒంటె మరియు ఆవుని ‘హద్ య్’ లో ఇచ్చారు. తమ సతీమణుల తరపున ఆవుని ఇచ్చారు. అలాగే ఆయన స్థానికంగా ఉన్న స్థితిలో, మరియు తమ ఉమ్రా, హజ్జ్ లలో ‘హద్ య్’ సమర్పించారు۔

2- ఆయన మేకను ‘హద్ య్’గా సమర్పించడానికి పంపుతున్నప్పుడు దాని మెడలో పట్టా వేసేవారు. కాటు వేసి చిహ్నం పెట్టేవారు కాదు. ఆయన స్థానికంగా ఉండి, ‘హద్ య్’ పంపుతున్న స్థితిలో ముహ్రిమ్ పై కొన్ని హలాల్ వస్తువులు నిషిద్ధమున్న్లు ఆయన పై నిషిద్ధమ్మయ్యేవి కావు.

3- ఆయన ఒంటె ‘హద్ య్’గా పంపుతున్నప్పుడు దాని మెడలో పట్టా మరియు చిహ్నం కూడా వేసేవారు, చిహ్నం అంటే ఆయన దాని మూపురం యొక్క కుడి వైపున రక్తం వచ్చేలా ఒక చిన్న కాటు వేసేవారు.

4- ఆయన ‘హద్ య్’ పంపిస్తూ తీసుకువెళ్ళే వ్యక్తికి చెప్పేవారు: జంతువు చనిపోయే స్థితికి చేరుకుంటే దానిని జిబహ్ చేయమని మరియు ఒక చెప్పుని దాని రక్తంతో రంగించి దాని ప్రక్కలో పెట్టండి, దాని మాంసం ఆ వ్యక్తి మరియు అతని ప్రయాణ మిత్రులు తినకండి, కాని వేరే ప్రజల్లో పంచి పెట్టండి.

5- ఆయన ఒక ఒంటెలో ఏడుగురు మరియు ఒక ఆవులో ఏడుగురు పాల్గొనడానికి (భాగం పంచుకోవడానికి) సహాబాలకు అనుమతి ఇచ్చారు.

6- ‘హద్ య్’ తీసుకువెళ్ళే వ్యక్తి వద్ద ప్రయాణం కొరకు వేరే స్వారీ లేకుంటే ఈ ‘హద్ య్’ ఒంటెపై కూర్చొని ప్రయాణంచవచ్చు. ఇలా అతనికి ప్రయాణానికి ఓ వాహనం దొరికే వరకు.

7- ఆయన విధానం: ఒంటెను నిలబెట్టి ఎడమ కాలును కట్టివేసి నహర్ చేయడం. నహర్ చేసేటప్పుడు “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” అని‌ పలికేవారు.

8-ఆయన ఖుర్బానీ జంతువులను తమ స్వహస్తాలతో జిబహ్ చేసేవారు. కొన్నిసార్లు ఈ పని ఇతరులకు అప్పగించేసేవారు.

9- ఆయన మేకను ౙబహ్ చేస్తున్నప్పుడు తమ కాలుని దాని ప్రక్కపై పెట్టేవారు మరియు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పలికుతూ ౙబహ్ చేసేవారు.

10- ఆయన తమ అనుచర సమాజం కొరకు ‘హద్ య్’ మరియు ఖుర్బానీ జంతువు యొక్క మాంసం తినడానికి మరియు బహుమతిగా ఇచ్చిపుచ్చుకోడానికి మరియు (పేదల్లో పంచిన తర్వాత కొంత భాగం మక్కా నుండి తమ ప్రాంతాలకు తీసుకుపోయే) అనుమతి ఇచ్చారు.

11- కొన్నిసార్లు ఆయన ‘హద్ య్’ మాంసాన్ని పంచిపెట్టేవారు, మరికొన్నిసార్లు ‘ఇష్టమున్నవారు జిబహ్ చేయబడిన జంతువు నుండి కోసుకొని వెళ్ళిండి’ అని చెప్పేవారు.

12- ఆయన విధానం: ‘హద్ య్’ జంతువును ఉమ్రా చేసినప్పుడు మర్వహ్ వద్ద, మరియు హజ్జే ఖిరాన్ చేసినప్పుడు మినాలో జిబహ్ చేసేవారు. ఆయన‌ హలాల్ అయిన తర్వాతనే నహర్ చేశారు. ఆయన ఎల్లప్పుడూ సూర్యోదయం తర్వాత, జమరాత్ పై రాళ్ళు విసిరిన తర్వాతే నహర్ చేసేవారు. సూర్యోదయానికి ముందే నహర్ లేదా జిబహ్ చేసే అనుమతి ఎవరికీ ఇవ్వలేదు.

1- ఆయన‌ ఎప్పుడూ ఖుర్బానీ వదలలేదు. ఆయన పండుగ నమాజు తరువాత రెండు గొర్రెపోతులను ఖుర్బానీ ఇచ్చేవారు మరియు ఇలా అనేవారు: తష్రీఖ్ రోజులన్నీ (అంటే 11,12,13వ జిల్ హిజ్జ) జిబహ్ చేసే రోజులే. (ముస్నద్ అహ్మద్)

2- ఇంకా ఇలా తెలిపారు: ఎవరైతే‌ పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ ఇస్తారో అతని‌ ఖుర్బానీ స్వీకరించబడదు. అది తన‌ ఇంటి వారి కొరకు ఇచ్చిన మాంసం కింద లెక్క. (ముత్తఫఖున్ అలైహి)

3- ఆయన గొర్రేపోతులో జజ్అ జిబహ్ చసే అనుమతి ఇచ్చారు. జజ్అ అనగా ఆరు నెలలు నిండ గొర్రేపోతు పిల్ల. మిగతా జంతువులలో రెండు పళ్ళు ఉన్న జంతువులను. ఒంటెలలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న దానిని. ఆవులో రెండు పూర్తి చేసి మూడులో ప్రవేశించినది.

4- ఆయన విధానం: ఖుర్బానీ కొరకు ఎటువంటి లోపాలు లేని ఉత్తమమైన, ఆరోగ్యవంతమైన జంతువులనే ఎంచుకునేవారు. చెవులు కోసి వున్న, కొమ్ములు విరిగి ఉన్న, గుడ్డివి, కుంటివి, అంగ వైకల్యం మరియు (మాంసం లేకుండా) బలహీనమైన వాటిని ఖుర్బానీ ఇవ్వడం నుండి వారించారు.

            ఇంకా ఇలా ఆదేశించారు: కళ్ళను, చెవులను శ్రద్ధగా పరిశీలించండి, అనగా అవి‌ పూర్తిగా మంచి స్థితిలో ఉన్నాయన్న నమ్మకానికి రావాలి.

5- ఎవరైతే ఖుర్బానీ ఇవ్వడానికి సంకల్పించుకుంటాడో అతను జుల్ హిజ్జా ప్రారంభం అవ్వగానే తమ గోళ్ళను, తల వెంట్రుకలను కత్తిరించకూడదని ఆజ్ఞాపించారు.

6- ఈద్గాహ్ లో నే‌ ఖుర్బానీ చేయటం ప్రవక్త విధానం.

7- ఆయన విధానం: ఒక మేక ఒక కుటుంబం తరపున ఖుర్బానీకి సరిపోతుంది, ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నా సరే.

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఆదేశించారు: ప్రతి శిశువు తన అఖీఖా కి బదులు తాకట్టు ఉంటుంది. కాబట్టి ఏడో రోజున అఖీఖా చేయాలి, మరియు ఆ బిడ్డ తల వెంట్రుకలను తీయించాలి (గుండు చేయాలి). మరియు పేరు పెట్టాలి. (అబూ దావూద్, తిర్మీజి, నిసాయీ)

2- మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం: మగ బిడ్డ తరపున రెండు మేకలు మరియు ఆడ బిడ్డ తరపున ఒక మేక జిబహ్ చేయాలి. (అబూ దావూద్, నసాయీ)

1- ఆయన కొనడం, అమ్మడం చేసేవారు కానీ దైవదౌత్యం తర్వాత కొనుగోలు చేయడం అమ్మడం కంటే అధికంగా ఉండినది. ఆయన‌ వేతనం కొరకు పని చేసారు మరియు వేతనాలు ఇచ్చి పని తీసుకున్నారు. ఆయన (క్రయవిక్రయాల్లో ఇతర వ్యవహారాల్లో) స్వయం ఇతరులకు బాధ్యత వహించారు (వకీల్ గా ఉన్నారు) మరియు ఇతరులను బాధ్యులుగా (వకీల్ గా) నియమించారు. కాని ఇతరులను బాధ్యులుగా చేయడమే స్వయం బాధ్యత వహించేకంటే అధికంగా ఉండినది.

2-ఆయన నగదు మరియు అప్పు రెండు రకాలుగా కొనుగోళ్లు చేశారు. ఆయన ఇతరుల కొరకు సిఫారసు చేసారు మరియు ఆయన ముందు ఇతరుల సిఫారసు కూడా చేయబడినది. ఆయన తాకట్టు ద్వారా‌ అప్పు తీసుకున్నారు, అలానే తాకట్టు లేకుండా కూడా అప్పు తీసుకున్నారు. మరియు ఆయన వస్తువులను కూడా అరువుగా తీసుకున్నారు.

3- ఆయన‌ సాధారణ బహుమతి ఇచ్చారు మరియు తీసుకున్నారు. ఆయన‌ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు మరియు ఇతరుల నుండి బహుమతులు స్వీకరించచారు, మళ్ళీ అంతకంటే మేలైనది తిరిగి కూడా ఇచ్చారు, ఒకవేళ (బహుమతి స్వీకరించాలన్న) ఇష్టం లేకపోతే ఆ బహుమతి ఇచ్చే వారికి మంచి సాకు చెప్పేవారు. రాజులు బహుమతులు పంపేవారు, ఆయన వాటిని స్వీకరించేవారు, మరియు సహాబాలలో వాటిని పంచిపెట్టేసేవారు.

4- ప్రజల్లో అత్యుత్తమ వ్యవహారం ఆయనదే ఉండేది. ఆయన ఎవరి వద్దనైనా ఎప్పుడన్నా అప్పు తీసుకుంటే, తిరిగి చెల్లించడంలో ఉత్తమ విధానాన్ని మరియు ఎక్కువ ఇచ్చేవారు, ఇంకా అప్పు ఇచ్చినవారి సంపద, కుటుంబంలో శుభం కొరకు దుఆ చేసేవారు. ఒకసారి ఆయన ఒక ఒంటెను అప్పుగా తీసుకున్నారు, అప్పుడు దాని యజమాని ప్రవక్త వద్దకు వచ్చి అప్పును వాపసు చేయమని అడుగుతూ, కఠినంగా వ్యవహరించసాగాడు, అక్కడున్న సహాబాలు కూడా అతని పట్ల కఠినంగా ప్రవర్తించాలనుకున్నారు, కాని ప్రవక్త ఇలా తెలిపారు: అతనిని వదిలివేయండి! హక్కుదారునికి (ఎంతైనా) మాట్లాడే హక్కు ఉంది. (ముత్తఫఖున్ అలైహి)

5- ఆయనతో అజ్ఞానంగా వ్యవహరించే వారి పట్ల ఆయనలో ఓపిక సహనలే అధికమయ్యేవి. ఎవరిలో కొపాగ్రహం మిచ్చిపోతుందో అతడు తన కోపాన్ని వుజూ తో లేదా నిలబడి ఉంటే కూర్చొని లేదా షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతూ చల్లబరుచుకోవాలని (శాంతపరచాలని) ఆదేశించారు.

6- ఆయన ఎవరి పట్ల కూడా గర్వహాంకారాలతో వ్యవహరించేవారు కాదు. బదులుగా ఆయన తమ సహచరుల పట్ల వినయంగా, మృదు స్వభావం తో మెలిగేవారు. ప్రతీ చిన్న, పెద్ద అందరికీ‌ సలామ్ చేసేవారు.

7- ఆయన వేళాకోళం (జోక్) చేసినా సత్యం ద్వారానే చేసేవారు. ఆయన ఏదైనా కప్పిపుచ్చే రీతిలో మాట్లాడినా (అంటే తౌరియా చేసినా) సత్యాన్నే అవలంబించేవారు.

8- ఆయన పరుగు పందెంలో పోటీ చేశారు. ఆయన తమ చెప్పుల్ని స్వయంగా కుట్టుకునేవారు. తమ దుస్తులకు స్వయంగా తామే అతుకులు వేసుకునేవారు. తొట్టె (బకెట్) విరిగితే స్వయంగా సరిచేసుకునేవారు. మేక పాలు స్వయంగా పితికేవారు. పడకలో, బట్టల్లో పేను, మరేదైనా ఇలాంటివి పడితే శుభ్రపరుచుకునేవారు. తమ ఇంటి వారికి సేవ చేసేవారు, తమ వ్యక్తిగత అవసరాలు తామే పూర్తి చేసుకునేవారు. ఆయన మస్జిదే నబవీ నిర్మాణం సమయంలో సహాబాలతో కలిసి ఇటుకలు కూడా మోసేవారు.

9- ఆయన సృష్టిలోనే అత్యంత విశాలమైన హృదయం, పవిత్రమైన మనస్సు గలవారు.

10- రెండు విషయాలలో ఏదైనా ఒకటి ఎంచుకునే అనుమతి లభిస్తే ఆయన సులువైనదే ఎంచుకునేవారు, ఒకవేళ అది పాపంతో కూడినది కాకపోతే.

11- ఆయన ఏ దౌర్జన్యపరుడి యొక్క దౌర్జన్యం పట్ల పగ తీర్చుకునేవారు కాదు. కానీ అతను అల్లాహ్ నిషిద్ధతలను ఉల్లంఘించనప్పుడు తప్ప, ఎవడైనా అల్లాహ్ నిషిద్ధతలను ఉల్లంఘిస్తే ఆయన కంటే ఎక్కువ ఆగ్రహించుకునేవాడు మరెవరూ ఉండరు.

12- ఆయన సలహా ఇచ్చేవారు మరియు తీసుకునేవారు కూడా. వ్యాధిగ్రస్తులను పరామర్శించేవారు. జనాజాలో పాల్గొనేవారు. దావత్ (ఆహ్వానాన్ని) స్వీకరించేవారు. బలహీనుల, నిరుపేదల మరియు విధవల అవసరాలను పూర్తి చేయడం కొరకు వారితో పాటు వెళ్లేవారు.

13- తనకు ప్రియమైన వస్తువు ఎవరైనా ఆయనకు ఇస్తే, ఆయన అతని కొరకు దుఆ చేసేవారు మరియు ఇలా అనేవారు: ఎవరి కొరకైనా ఎవరన్నా మేలు చేస్తే, అతను జజాకల్లాహు ఖైరా (అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక) అని అంటే అతను అతనిని మంచి రీతిలో ప్రశంసించినట్టు. (తిర్మీజి).

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: “మీ ఈ ప్రపంచంలోని వాటిలో మహిళలు, సువాసన పట్ల నాలో ప్రేమ ప్రోదిచెయ్యబడింది. కాగా, నమాజ్ నా కంటికి చలువ.

            ఇంకా ఇలా తెలిపారు: “యువకుల్లారా! మీలో స్థోమత ఉన్నవారు పెళ్ళి చేసుకోండి”. మరో సందర్భంలో ఇలా చెప్పారు: “అధికంగా ప్రేమించే మరియు పిల్లలను కనే స్త్రీని వివాహమాడండి”.

2- ఆయన తమ భార్యలతో ఉత్తమరీతిలో, సత్ప్రవర్తనతో మెలిగేవారు, సద్భావంతో ఉండేవారు మరియు ఇలా అనేవారు: “తన ఇంటివారి (ఆలుబిడ్డల) యెడల ఉత్తముడైన వాడే మీ అందరిలో ఉత్తముడు. నేను నా ఆలుబిడ్డల విషయంలో మీ అందరికన్నా ఉత్తముడిని.

3- ఆయన భార్యలలో ఎవరైనా ఏదైనా విషయంపై ఇష్టం (మక్కువ) చూపితే ఆయన వారి కోరికలను నెరవేర్చేవారు ఎప్పటివరకైతే అందులో ఎలాంటి నిషేధం ఉండదో. ఆయన అన్సార్ బాలికలను ఆయెషా రజియల్లాహు అన్హా వద్దకు ఆమెతో ఆడుకోడానికి పంపేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఏ పాత్రలో ఎక్కడ తమ పెదవులు పెట్టి త్రాగారో అదే చోట ప్రవక్త తమ పెదవులు పెట్టి త్రాగేవారు. ఆయన ఆయిషా రజియల్లాహు అన్హా ఒడిలో తలను ఆనించేవారు. ఆమె ఒడిలో తమ శిరస్సు ఉంచి ఖుర్ఆన్ పారాయణం చేసేవారు, అలాంటి కొన్ని సందర్భాల్లో ఆమె బహిష్టురాలై ఉండేది. ఆమె బహిష్టులో ఉన్నప్పుడు ఆయన‌ ఆమెతో లంగోటా లాంటి లో ఉడుపును కట్టుకోమని ఆదేశించేవారు ఆ తర్వాత ఆమె దేహానికి తమ దేహం ఆనించేవారు.

4- ఆయన అస్ర్ నమాజ్ తర్వాత తమ భార్యల వద్దకు వెళ్లి, వారి దగ్గర కూర్చొని వారి స్థితిగతులు, సంక్షేమాలు తెలుసుకునేవారు. రాత్రి వంతు ఏ భార్య గద్దర ఉండేదో ఆమె వద్దే రాత్రి గడిపేవారు.

5- ఆయన రాత్రి, నివాసం మరియు రోజువారి ఖర్చులు భార్యల మధ్యలో న్యాయంగా పంచేశారు. కొన్నిసార్లు మిగిలిన సతీమణుల సమక్షంలో ఎవరైనా ఒక్కరి వైపు తమ చెయ్యి చాపేవారు.

6- ఆయన తమ భార్యలతో రాత్రి మొదటి భాగంలో మరియు చివరి భాగంలో సంభోగం చేసేవారు. మొదటి భాగంలో సంభోగం చేస్తే గుసుల్ స్నానం చేసి నిద్రపోయేవారు. కొన్ని సందర్భాల్లో వుజూ చేసి పడుకునే వారు‌.

            ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరయితే తన ఇల్లాలితో మల విసర్జన మార్గం గుండా సమాగమం జరుపుతాడో వాడు శాపగ్రస్తుడు.” (అహ్మద్, సహీహ్)

            ఇంకా ఇలా తెలియజేశారు: “మీలో ఎవరయినా తన భార్యతో సమాగమం జరపాలనుకుంటే ఈ దుఆ చదవాలి: ‘బిస్మిల్లాహ్ అల్లాహుమ్మ జన్నిబ్ నష్షైతాన వ జన్నిబిష్షైతాన మా రజఖ్తనా’ (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్! మమ్ము షైతాన్ నుంచి దూరంగా ఉంచు. నీవు మాకు ప్రసాదించే దాని నుంచి కూడా షైతాన్ ను దూరంగా ఉంచు).

بِسْمِ اللَّهِ اللَّهُمَّ جَنِّبْنَا الشَّيْطَانَ وَجَنِّبِ الشَّيْطَانَ مَا رَزَقْتَنَا

 ఈ సమాగమం ద్వారా వారికి అల్లాహ్ సంతానం రాసిపెట్టి ఉంటే ఆ సంతానానికి షైతాన్ ఎన్నటికీ కీడు కలిగించలేడు. (బుఖారీ, ముస్లిం).

7- ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మీలో ఎవరయినా స్త్రీని వివాహమాడినా లేదా బానిసను లేదా వాహనం కొనుగోలు చేసినా అల్లాహ్ తో దానిలో శుభం కొరకు ఈ విధంగా వేడుకోవాలి: “అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఖైరహా వ ఖైర మా జుబిలత్ అలైహి వ అఊజుబిక మిన్ షర్రిహా వ షర్రి మా జుబిలత్ అలైహ్.” (ఓ అల్లాహ్! నేను నీ నుండి దీనిలోని మేలును అర్థిస్తున్నాను. ఏ నైజంపై దీనిని పుట్టించటం జరిగిందో దాని మేలును అర్థిస్తున్నాను. మరియు ఇందులోని కీడు నుంచి నీ శరణు వేడుతున్నాను. ఏ స్వభావంపై దీనిని సృజించటం జరిగిందో దాని కీడు నుంచి నీ శరణు కోరుతున్నాను.)” (అబూదావూద్-2160 హసన్)

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَهَا وَخَيْرَ مَا جُبِلَتْ عَلَيْهِ أَعُوْذُبِكَ مِنْ شَرِّهَا وَشَرِّ مَا جُبِلَتْ عَلَيْهِ

8- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నికాహ్ చేసుకున్న వారిని ఈ విధంగా ఆశీర్వదించేవారు: “బారకల్లాహు లక వ బారక అలైక వ జమఅ బైనకుమా ఫీ ఖైర్” “అల్లాహ్ నీకు మరియు మీపై శుభాన్ని కురిపించుగాక! మీ ఇద్దరి మధ్య శుభాన్ని, ఏకీభావాన్ని సృజించుగాక!)” (అబూదావూద్-2130 సహీహ్)’

بَارَكَ اللَّهُ لَكَ وَبَارَكَ عَلَيْكَ، وَجَمَعَ بَيْنَكُمَا فِي خَيْرٍ

9- ఆయన ప్రయాణానికి బయలుదేరాలనుకున్నప్పుడు తమ భార్యల మధ్య చీటీ (డ్రా) వేసేవారు, అందులో ఎవరి పేరు వస్తే ఆమెతో ప్రయాణం చేసేవారు. మిగతా భార్యలకు దీని బదులు ఇచ్చేవారు కాదు.

10- ఆయన ఇళ్లను ఎంతో ఎత్తుగా, మహా విశాలంగా మరియు అధిక అలంకరణలతో నిర్మించడం పట్ల ఏ శ్రద్ధ చూపేవారు కాదు. (జీవితపు అవసరాలు తీరే విధంగా ఉంటే సరిపుచ్చుకునేవారు).

11- ఆయన తలాఖ్ (విడాకులు) ఇచ్చారు,  రుజూ కూడా చేసుకున్నారు (మొదటి మరియు రెండవ విడాకుల తర్వాత గడువు లోపల తిరిగి భార్యగా ఉంచుకునే అనుమతి ఖుర్ఆన్ లో ఉంది, అదే ప్రకారంగా రుజూ చేసుకున్నారు).

            మరియు ఒక నెల కొరకు తాత్కాలికంగా తమ భార్యల నుండి ఈలా (వేరవ్వడం) చేసారు.

            కానీ ఆయన జిహార్ ఎన్నడూ చేయలేదు. (అంటే భార్యతో నీ వీపు నా తల్లి లాంటిది లేదా నీవు నా తల్లి లాంటి దానివి అనడం. అజ్ఞాన కాలంలో మాటిమాటికి ఇలా అని భార్యలను వేధించేవారు, ఇస్లాం దీనిని నిషిద్ధ పరిచింది, అలా చెప్పేవారిపై పరిహారం విధిగావించింది. చూడండి సూర ముజాదల ప్రారంభ ఆయతులు) .

1- ఆయన పగలూ, రాత్రీ, రహస్యంగా మరియు బహిరంగంగా ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించేవారు. ఆయన మక్కాలో మూడు సంవత్సరాల వరకూ రహస్యంగా ధర్మప్రచారం చేసారు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఈ ఆజ్ఞ అవతరించిందో: فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِيْنَ కాబట్టి (ఓ ప్రవక్తా!) నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరచి చెప్పు. బహుదైవారాధకులను (ముష్రిక్కులను) పట్టించుకోకు. (హిజ్ర్ 15:94).

            అప్పుడు అల్లాహ్ ఆజ్ఞ పై అమలు చేస్తూ బహిరంగంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరియు నిందించేవాడి నిందతో భయపడకుండా ప్రతీ చిన్న, పెద్ద, స్వతంత్రుడు, బానిస, మగ, ఆడ, జిన్నులు మరియు మానవులందరినీ అల్లాహ్ వైపునకు ఆహ్వానించేవారు.

2- మక్కా లో ఆయన సహచరుల పై దౌర్జన్యం పెరిగిపోయినప్పుడు ఆయన వారిని హబ్షా (అబీసీనియా) వైపు హిజ్రత్ (వలస) చేయవలసిందిగా ఆదేశించారు.

3- ఆయన తాయిఫ్ నగరానికి బయలుదేరారు, వారికి ఇస్లాం సందేశం ఇవ్వడానికి మరియు వారు సత్యధర్మానికి మద్దతు, సహాయం అందించి, ఆయనకు తోడ్పాటుగా ఉండాలని, కానీ వారిలో ఎవరూ కూడా స్వీకరించ లేదు మరియు సహాయకులుగా నిలబడలేదు, పైగా తీవ్రమైన బాధ కలిగించారు. మక్కావాసుల కంటే ఘోరమైన రీతిలో ప్రవర్తించారు. తిరిగి మక్కా వెళ్ళిపోయేలా బలవంతం చేసారు‌. అందువల్ల ఆయన ముతఇమ్ బిన్ అదీ రక్షణలో మక్కాలో ప్రవేశించారు.

4- పదేళ్ళ వరకూ ఆయన  బహిరంగంగా ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతీ సంవత్సరం హజ్జ్ లో బైటి నుండి వచ్చే ప్రజలతో కలిసేవారు, హాజీల డేరాల వద్దకు వెళ్ళేవారు. హజ్జ్ కాలంలోనే ఉకాజ్, మిజిన్న, జుల్ మజాజ్ లాంటి పెద్ద బజార్లలో వచ్చే ప్రతీ తెగవారితో, వారి నివాస స్థలానికి వెళ్ళి, వారిని కలసి ఇస్లాం సందేశం అందజేసేవారు.

5- ఆ సందర్భంలోనే ఒకసారి ఆయన అఖబాకు దగ్గర్లో మదీనావాసులైన ఖజ్రజ్ తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులతో కలిసారు, వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. వారు వెంటనే ఇస్లాం స్వీకరించి, మదీనాకు తిరిగి వెళ్లి, ఇతరులను ఇస్లాం వైపునకు ఆహ్వానించడం మొదలు పెట్టారు. ఈ విధంగా మదీనాలో ఇస్లాం వ్యాప్తి చెందింది. మరియు ఇస్లాం ప్రవేశించని ఇల్లు అంటూ లేకుండినది.

6- మరుసటి సంవత్సరం వారిలో నుండే 12 మంది వచ్చారు. అప్పుడు ఆయన వారితో అఖబా వద్ద ఈ ప్రకారంగా ప్రమాణం తీసుకున్నారు: మేము ప్రవక్త మాటను విని, విధేయత పాటిస్తాము, అవసరం ఏర్పడినప్పుడు డబ్బు ఖర్చు చేస్తాము, మంచిని ఆదేశిస్తాము మరియు చెడును ఖండిస్తాము, అల్లాహ్ మార్గంలో నిందించేవాడి ఏ నిందనూ లెక్క చేయకుండా మీకు సహాయం చేస్తూ ఉంటాము మరియు మేము స్వయం మమ్మల్ని మరియు మా భార్యపిల్లల్ని కాపాడే రీతిలో మిమ్మల్ని (అంటే ప్రవక్తను) కాపాడతాము. వీటన్నిటికి బదులుగా మీకు స్వర్గం ఉంటుందని ప్రవక్త వారికి శుభవార్తనిచ్చారు.

            ఆ తర్వాత వారు మదీనా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారితో పాటు ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు మరియు అబ్దుల్లాహ్ బిన్ మక్తూమ్ రజియల్లాహు అన్హు గారిని పంపారు. వీరు మదీనా వాసులకు ఖుర్ఆన్ బోధిస్తూ మరియు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ ఉండేవారు. అలా వారి ఆధారంగా ఎంతోమంది ఇస్లాం స్వీకరించారు. వారిలోనే ఉసైద్ బిన్ హుజైర్ మరియు సఅద్ బిన్ ముఆజ్ రజియల్లాహు అన్హుమా వారు కూడా ఉన్నారు.

7- పిదప ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం, ముస్లిములు మదీనా వైపు హిజ్రత్ చేయాలని ఆదేశించారు. అప్పుడు ప్రజలందరూ అందులో ముందుకు సాగిపోయారు. పిదప ఆయన మరియు ఆయన ప్రియ గుహ వాసి అయిన అబూ బకర్ రదియల్లాహు అన్హు గారులిద్దరూ కలసి హిజ్రత్ చేసి, మదీనాకు వలస వచ్చినవారితో కలిసిపోయారు.

8- ప్రవక్త మదీనా చేరుకున్న తర్వాత అన్నిటికంటే ముందు ముహాజిరీన్ మరియు అన్సార్ మధ్య సోదరభావం ఏర్పరిచారు. అప్పుడు వారి సంఖ్య 90 ఉండెను.

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ముస్లింలందరి ఆశ్రయం ఒక్కటే, వారిలోని అత్యంత అల్పుడైన సరే ఎవరికైనా ఆశ్రయం ఇవ్వగలడు (దానిని మిగితా ముస్లిములందరూ ఒప్పుకోక తప్పదు) (బుఖారీ). ప్రవక్త ఇంకా ఇలా తెలిపారు: విశ్వాసుల మరియు అవిశ్వాసుల మధ్య ఏదైనా ఒప్పందం ఉన్నప్పుడు, దానిని భంగం చేయరాదు, అది అలా ఉండగా, దాని గడువు పూర్తి కాక ముందు మరో ఒప్పందం కుదుర్చకూడదు, లేదా (వారి వైపు నుండి ఏదైనా ద్రోహం జరగవచ్చన్న భయం ఉంటే) ఒప్పందాన్ని భంగం చేస్తున్నామని వారికి స్పష్టంగా తెలియజేయాలి. (అబూ దావూద్ 2759).

2- ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా తెలిపారు: ఎవరైనా ఒక వ్యక్తి ఆశ్రయం ఇచ్చి, పిదప‌ అతనిని హత్య చేస్తే  అలాంటి హంతకునితో నాకు ఏలాంటి సంబంధం లేదు. (ఇబ్నే మాజహ్).

3- ముసైలమ కజ్జాబ్ రాయబారులు ఆయన వద్దకు వచ్చినప్పుడు అన్నారు: మేము ముసైలమను అల్లాహ్ యొక్క ప్రవక్తగా నమ్ముతున్నాము, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: ఒకవేళ రాయబారులను హతమార్చడం అనేది ఉంటే నేను మిమ్మల్ని హతమార్చే వాడిని. ప్రవక్తవారి ఈ పలుకులే రాయబారులను హత్య చేయకూడదు అన్న చట్టంగా నిలిచాయి.

4- ఎవరైనా రాయబారి ఇస్లాం స్వీకరిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని తమ వద్ద ఆపుకునేవారు కాదు, అతన్ని తిరిగి పంపేసేవారు.

5- శత్రువులు సహాబాలలో ఏ ఒకరితోనైనా ప్రవక్తకు తెలియకుండా, ఇష్టం లేకుండా ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే ఆయన దానిని కొనసాగించేవారు, ఒకవేళ ఆ ఒప్పందం వల్ల ముస్లిములకు ఏ నష్టం లేకుంటే.

6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ఖురైష్ లతో చేసిన ఒప్పందంలోని కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి:

• పదేళ్ళ వరకు వారి మధ్య మరియు ముస్లింల మధ్య యుద్ధం జరగదు,

• అవిశ్వాసుల్లో నుండి ఎవరైనా ఇస్లాం స్వీకరించి ముస్లింల వద్దకు వెళ్తే వారు అతనిని తిరిగి వాపసు పంపించేయాలి.

• ముస్లింలలో నుండి ఎవరైనా అవిశ్వాసుల వద్దకు పోతే, వారు అతన్ని తిరిగి వాపసు పంపరు.

            కానీ అల్లాహు తఆలా దీనిని స్త్రీల విషయంలో రద్దు చేశాడు. వారిని పరీక్షించాలని, వారితో విచారణ జరపాలని ఆదేశించాడు. దీని ప్రకారం ఏ స్త్రీ విశ్వాసీ అని తెలుస్తుందో ప్రవక్త ఆమెను తిరిగి అవిశ్వాసుల వద్దకు పంపేవారు కాదు.

7- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలుకు ఆదేశించారు: ఏ స్త్రీలు అవిశ్వాసాన్ని విడనాడి ఇస్లాం వైపునకు హిజ్రత్ చేసి వస్తారో వారి మహర్ లను అవిశ్వాసులకు వాపసు చేసేయండి. అందువల్ల ముస్లిములు వారి మహర్లను అవిశ్వాసులకు తిరిగి ఇచ్చేసేవారు.

8- అవిశ్వాస పురుషుల్లో నుండి ఎవరైనా ముస్లిం గా ప్రవక్త వద్దకు వస్తే, ఆ అవిశ్వాసులు అతడ్ని తీసుకువెళ్లడానికి వస్తే ఆయన అతనిని తీసుకెళ్ళడం నుండి నిరాకరించేవారు కాదు. అదేవిధంగా అతనిని తిరిగి వెళ్ళిపోమని బలవంతం చేసేవారు కూడా కాదు మరియు పో అని ఆజ్ఞాపించేవారు కూడా కాదు. ఎప్పుడైనా ఆ వ్యక్తి ఆ అవిశ్వాసుల్లో ఎవరినైనా హతమార్చితే లేదా ఎవరి సొమ్మునైనా దోచుకుంటే, అతడు వీరి చేతుల నుండి చేజారి పోయాడు గనక మరియు వారి వద్ద కూడా చేరుకోలేదు గనక అతని ఈ పనిని నిరాకరించేవారు కాదు మరియు అతను చేసిన హత్యకు ఎటువంటి జమానత్ (పరిహార బాధ్యత) తీసుకునేవారు కాదు.

9- ఖైబర్ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆయన వారితో ఈ షరతుపై ఒప్పందం చేసుకున్నారు: వారిని అక్కడి నుంచి బహిష్కరించడబడును, మరియు వారి స్వారీలు మోయోగలిగే సామానులే వారు తీసుకువెళ్లాలి మరియు వారి బంగారం, వెండి,  ఆయుధాలకు ప్రవక్తయే అధికారులవుతారు.

10- ఇంకా వారితో జరిగిన ఒప్పందంలో: వారి భూమిలో పండే పంటలో సగం ముస్లింలకు మరియు సగం వారికి. ముస్లింలు కోరుకున్నన్ని రోజులే వారు వారు అక్కడ ఉంటారు. ప్రవక్త ప్రతీ ఏటా వారి వద్దకు సరైన అంచనా వేసే నిపుణుడిని పంపేవారు అతను పండ్లు పండాక ఎన్ని పండ్లను త్రెంచాలో అంచనా వేసేవాడు. మరియు ముస్లిముల వాటాకు వారినే హామీదారులుగా ఉంచేవారు మరియు మిగిలిన వారి వాటాలో వారు తమ ఇష్ట ప్రకారం చేసుకునేవారు

1- ఆయన హుదైబియా నుండి తిరిగి వాపసు రాగానే రాజుల వైపునకు ఉత్తరాలు, లేఖలు రాయడం, రాయబారులను (దూతలను) పంపడం మొదలు పెట్టారు.

– ఆయన రోమా రాజుకు ఓ లేఖ వ్రాసి, దూత ద్వారా పంపారు. మరియు అతను ఇస్లాం స్వీకరించాలనుకున్నాడు, స్వీకరించేవాడే కాని (తన కొందరి దగ్గరి వారి కారణంగా) స్వీకరించలేదు.

2- అబీ సీనియా దేశం నజాషీ చక్రవర్తి వైపునకు కూడా సందేశం పంపారు, అతను ఇస్లాం స్వీకరించాడు.

3- ముఆజ్ బిన్ జబల్ మరియు అబూ మూసా అష్ అరీ రదియల్లాహు అన్హుమా వారిని యమన్ వాసుల వద్దకు పంపారు, వారందరూ ఏ గొడవ లేకుండా ఇస్లాం స్వీకరించారు.

1- ఆయన కపట విశ్వాసుల బాహ్య ఆచరణలను స్వీకరించేవారు మరియు అంతర్గత విషయాలను అల్లాహ్ పై వదిలేసేవారు. రుజువు మరియు ఆధారాలతో వారితో చర్చ జరిపేవారు. ఆయన కొన్నిసార్లు వారి పట్ల దృష్టిని మరల్చుకుంటే  మరి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించేవారు. ప్రభావవంతమైన మాటలతో వారికి నచ్చజెప్పేవారు.

2- ఆయన వారి హృదయాలు గెలుచుకోడానికి వారితో పోరాడలేదు. ఆయన ఇలా అనేవారు: “ముహమ్మద్ తన సహచరులనే హతమార్చేస్తున్నాడు” అని ప్రజలు అనుకుంటూ తిరగడం నాకిష్టం లేదు. (ముత్తఫఖున్ అలైహి).

1- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేసేవారు. ఆయన మాటలన్నీ అల్లాహ్‌ స్మరణ మరియు దానికి సంబంధించిన విషయంలోనే ఉండేవి. ఆయన ఆజ్ఞ, వారింపు మరియు అనుచర సమాజానికిచ్చే ధార్మికాదేశాలు నాలుక ద్వారా అల్లాహ్ స్మరణ అయితే, ఆయన మౌనం హృదయ స్మరణ. ఆయన నిలబడుతూ, కూర్చుంటూ, పడుకుంటూ, నడుస్తూ, తిరుగుతూ, స్థానికంగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో, సందర్భాల్లో, స్థితుల్లో అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారు. ఒక్కటేమిటి ఆయన ప్రతి శ్వాసలో అల్లాహ్ స్మరణ ఉండేది.

ఆయన విధానం: ఉదయసాయంకాలపు జిక్ర్ లో

Text Box: అజ్కార్ & దుఅల గురించి
ఇక్కడ క్లిక్ చేయండి
1- ఆయన ఉదయం ఈ జిక్ర్ చేసేవారు:

                                                                                      أَصْبَحْنَا عَلَى فِطْرَةِ الْإِسْلَامِ وَعَلَى كَلِمَةِ الْإِخْلَاصِ وَعَلَى دِينِ نَبِيِّنَا مُحَمَّدٍ ﷺ وَعَلَى مِلَّةِ أَبِينَا إِبْرَاهِيمَ حَنِيفًا مُسْلِمًا وَمَا كَانَ مِنْ الْمُشْرِكِين

అస్ బహ్ నా అలా ఫిత్రతిల్ ఇస్లామి వ అలా కలిమతిల్ ఇఖ్లాసి వఅలా దీని నబియ్యినా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ వ అలా మిల్లతి అబీనా ఇబ్రాహీమ హనీఫమ్ ముస్లిమవ్ వమాకాన మినల్ ముష్రికీన్. (ముస్నద్ అహ్మద్ 3/406, సహీహుల్ జామి ).

(మేము ఉదయానికి చేరాము స్వభావిక ధర్మం అయిన ఇస్లాంపై, చిత్తశుద్ధితో కూడి ఉన్న వచనంపై, మా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మంపై, మా పితామూర్తులైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మతముపై, ఆయన ఏకాగ్రచిత్తులు, విధేయులు, ముష్రికులలోని వారు కారు).

            మరియు ఈ విధంగా అనేవారు:

اللَّهُمَّ بِكَ أّصْبَحْنَا وَبِكَ أَمْسَينَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيكَ النُّشُور

అల్లాహుమ్మ బిక అస్ బహ్ నా వ బిక అమ్ సైనా వబిక నహ్ యా వ బిక నమూతు వ ఇలైకన్నుషూర్. (అదబుల్ ముఫ్రద్ 1199).

(ఓ అల్లాహ్! నీ రక్షణలోనే మేము ఉదయానికి చేరాము, నీ రక్షణలోనే మేము సాయంకాలానికి చేరాము, నీ పేరుతోనే మేము జీవించి ఉన్నాము, నీ పేరుతోనే మేము మరణిస్తాము, మళ్ళీ నీ వైపే లేపబడనున్నాము).

            ఇంకా ఇలా అన్నారు: మీలో ఎవరైనా ఉదయానికి చేరుకున్నారంటే ఈ జిక్ర్ చదవాలి:

أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ للهِ رَبِّ الْعَالَمِينَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ هَذَا الْيَوْمِ: فَتْحَهُ، وَنَصْرَهُ وَنُورَهُ، وَبَرَكَتَهُ، وَهُدَاهُ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِيهِ وَشَرِّ مَا بَعْدَهُ.

అస్ బహ్ నా వ అస్ బహల్ ముల్కు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఖైర హాజల్ యౌమి, ఫత్ హహు, వ నస్రహు, వ నూరహు, వ బరకతహు, వహుదాహు వఅఊజు బిక మిన్ షర్రి మా ఫీహి వ షర్రి మా బఅ్ దహ్

మేము మరియు రాజ్యమంతా సకలలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకు ఉదయానికి చేరాము. ఓ అల్లాహ్ నేను ఈ రోజులో ఉన్న మేలును, జయాన్ని, సహాయాన్ని, కాంతిని, శుభాలను, సన్మార్గము ప్రసాదించమని వేడుకుంటున్నాను. మరియు దీనిలో ఉన్న కీడు నుండి, తర్వాత వచ్చే కీడు నుండి నీ శరణే కోరుచున్నాను. (అబూదావూద్, జాదుల్ మఆద్ 2-373).

(ఇదే జిక్ర్ సాయంకాలం కూడా చదవాలి, కాని ముందు వాక్యము “అమ్సైనా వ అమ్సల్” అని మార్చి చదవాలి)

మరియు ఇలా అన్నారు: ఎవరైతే సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివుతాడో ఒకవేళ అతను సాయంకాలానికి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదివి ఉదయించేకి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. ((బుఖారి 6306)

اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلهَ إلاَّ أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَااسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلاَّ أَنْتَ

అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్ తనీ వ అన అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅ్ దిక మస్తతఅ్ తు అఊజు బిక మిన్ షర్రి మా సనఅ్ తు అబూఉ లక బినిఅ్ మతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

(ఓ అల్లాహ్! నీవు నా ప్రభువు, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులో వచ్చుచున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు).

3- మరియు ఇలా అన్నారు: ఎవరు ప్రతి రోజు ఉదయం వంద సార్లు ఈ జిక్ర్ చేస్తాడో:

  • అతనికి 10 బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం ఉంటుంది,
  • 100 పుణ్యాలు అతని కొరకు వ్రాయబడతాయి,
  • అతని 100 పాపాలు మన్నింపబడతాయి,
  • అతను సాయంకాలం వరకు షైతాన్ నుండి కాపాడబడతాడు,
  • అతనికంటే ఎక్కువ చదివినవాడు తప్ప మరెవ్వడూ అతనికంటే ఉత్తముడు కాడు.

لاَ إِلهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِير

లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (బుఖారీ 6403, ముస్లిం 2691).

4- మరియు ఆయన ఉదయం, సాయంత్రం ఈ దుఆ చదివేవారు:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَافِيَةَ فِي الدُّنْيَا وَالآخِرَةِ اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي دِيْنِي وَ دُنْيَايَ وَأَهْلِيْ وَمَالِيْ اللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِيْ وَآمِنْ رَوْعَاتِي اللَّهُمَّ احْفَظْنِيْ مِنْ بَيْنِ يَدَيَّ وَمِنْ خَلْفِيْ وَعَنْ يَمِيْنِي وَعَنْ شِمَالِي وَمِنْ فَوْقِي وَأَعُوذُ بِعَظْمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِي

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరహ్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ, అల్లాహుమ్మస్ తుర్ ఔరాతీ వ ఆమిన్ రౌఆతీ అల్లాహుమ్మహ్ ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌకీ వ అఊజు బిఅజ్మతిక అన్ ఉగ్ తాల మిన్ తహ్ తీ.

(ఓ అల్లాహ్! నేను నీతో ఇహపరాల క్షేమాన్ని కోరుతున్నాను, ఓ అల్లాహ్! నేను నీతో నా ధర్మం, ప్రపంచం, ఇల్లాలు, ఆస్తుల్లో మన్నింపు మరియు క్షేమాన్ని కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా లోటుపోట్లను కప్పిఉంచు, నా భయాన్ని దూరం చేయి, ఓ అల్లాహ్! నన్ను నా ముందు నుండి, నా వెనక నుండి, నా కుడి, ఎడమ నుండి మరియు పై నుండి కాపాడు. నేను క్రింది నుండి కూడా ఏ కీడుకు గురి కాకుండా నీ ఔన్నత్యాల ఆధారంగా నీ శరణులోకి వచ్చాను).

5- ఇంకా ఇలా తెలిపారు: ఎవరైతే ఈ దుఆ ప్రతి ఉదయం మరియు సాయంత్రం చదువుతాడో అతనికి ఏదీ నష్టపరచదు. (అబూదావూద్ 5088).

بِسْمِ اللهِ الَّذِي لاَ يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الأَرْضِ وَلاَ فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ العَلِيم

బిస్మిల్లాహిల్లజీ లా యజుర్రు మఅస్మిహీ షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాఇ వహువస్సమీఉల్ అలీం.

(అల్లాహ్ పేరుతో, ఆయన పేరుతో ఏ వస్తువు నష్టపరచదు, ఆకాశంలోగాని, భూమిలోగాని, ఆయన వినువాడు, సర్వజ్ఞాని).

6- అబూ బకర్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఇలా అన్నారు: నాకు ఏదైనా దుఆ నేర్పండి, నేను దానిని ఉదయం, సాయంత్రం చదువుతాను, అప్పుడు ప్రవక్త చెప్పారు: నీవు ఉదయం, సాయంకాలం మరియు పడుకునే ముందు ఈ దుఆ చదువు:  

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالأرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ رَبَّ كُلِّ شَيْءٍ وَ مَلِيْكَهُ أَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوْءً أَوْ أَجُرَّهُ إِلَى مُسْلِمٍ

అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇఁ వ మలీకహ్, అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్ షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రహూ ఇలా ముస్లిమ్.

(ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతీ వస్తువు యొక్క ప్రభువా! మరియు యజమానీ! నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్ ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్ల గాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి).

ఆయన విధానం: ఇంటి నుండి బయలుదేరే లేదా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దుఆలలో

1- ఆయన ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ విధంగా పలికేవారు:

بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللَّهِ، اللَّهُمَّ إِنِّي أعُوذُ بِكَ أنْ أضِلَّ أَوْ أُضَلَّ، أَوْ أَزِلَّ أَوْ أُزَلَّ، أَوْ أظْلِمَ أَوْ أُظْلَمَ، أَوْ أجْهَلَ أَوْ يُجْهَلَ عَلَيَّ

బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్, అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక అన్ అజ్దిల్ల ఔ ఉజ్దల్ల ఔ అజిల్ల ఔ ఉజల్ల ఔ అజ్లిమ ఔ ఉజ్లమ ఔ అజ్ హల ఔ యుజ్ హల అలయ్య.

అల్లాహ్ పేరుతో వెళ్తున్నాను, నేను స్వయంగా మార్గం తప్పడం నుండి, లేదా తప్పించబడటం నుండి, జారటం నుండి లేదా జారింపబడుట నుండి, నేను ఎవరినైనా బాధించడం నుండి లేదా ఎవరిచేతనైనా బాధింపబడటం నుండి, నేను ఎవరితోనైనా అసభ్యంగా, మూర్ఖంగా ప్రవర్తించుట నుండి లేదా ఎవరైనా నాతో అలా ప్రవర్తించుట నుండి నేను నీ శరణు కోరుతున్నాను ఓ అల్లాహ్!).

2- ఇంకా ఇలా తెలిపారు: ఎవరు ఇంటి నుండి బైటికి వెళ్తూ ఈ దుఆ చదువుతారో అతనితో ఇలా అనబడుతుంది: నీకు సన్మార్గం ప్రాప్తించినది, అల్లాహ్ నీ కొరకు సరిపోయాడు, కీడు, బాధల నుండి  నీకు రక్షణ లభించినది మరియు షైతాన్ అతని నుండి దూరమయ్యాడు. (అబూదావూద్ 5095).

بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللَّهِ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله

బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లాహౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్.

(అల్లాహ్ పేరుతో వెళ్తున్నాను, అల్లాహ్ పై మాత్రమే నా నమ్మకం. పుణ్యం చేసే మరియు పాపం నుండి దూరంగా ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు.)

3- ఆయన ఫజ్ర్ నమాజ్ కొరకు బయలుదేరేటప్పుడు ఇలా చదివేవారు:

اللَّهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا وَفِي لِسَانِي نُورًا وَاجْعَلْ فِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي بَصَرِي نُورًا وَاجْعَلْ مِنْ خَلْفِي نُورًا وَمِنْ أَمَامِي نُورًا وَاجْعَلْ مِنْ فَوْقِي نُورًا وَمِنْ تَحْتِي نُورًا اللَّهُمَّ أَعْطِنِي نُورًا

అల్లాహుమ్మజ్అల్ ఫీ ఖల్ బీ నూరా, వ ఫీ లిసానీ నూరా, వజ్అల్ ఫీ సమ్ఈ నూరా, వజ్అల్ ఫీ బసరీ నూరా, వజ్అల్ మిన్ ఖల్ ఫీ నూరా, వ మిన్ అమామీ నూరా, వజ్అల్ మిన్ ఫౌఖీ నూరా, మవిన్ తహ్ తీ నూరా, అల్లాహుమ్మ అఅతినీ నూరా. (ముస్లిం 763, బుఖారి 6316).

(ఓ అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసాదించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. ఓ అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).

4- ఇంకా ఇలా అన్నారు: మనిషి తన ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఈ దుఆ చదవాలి:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ الْمَوْلَجِ وَخَيْرَ الْمَخْرَجِ بِسْمِ الله وَلَجْنَا وَبِسْمِ الله خَرَجْنَا وَعَلَى الله رَبِّنَا تَوَكَّلْنَا

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరల్ మౌలజి వ ఖైరల్ మఖ్రజి బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వఅలల్లాహి రబ్బినా తవక్కల్నా.

(ఓ అల్లాహ్! నేను ఇంట్లో ప్రవేశిస్తూ, బయటికి వెళ్తూ శుభం కలగాలని నిన్నే వేడుకుంటున్నాను. అల్లాహ్ పేరుతో ప్రవేశించాము, అల్లాహ్ పేరుతోనే బైటికి వెళ్ళాము, మా ప్రభువైన అల్లాహ్ పై నమ్మకం ఉంచాము). (అబూదావూద్ 5096).

1- ఆయన మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు ఈ దుఆ చదివేవారు: అఊజు బిల్లాహిల్ అజీం వ బివజ్ హిహిల్ కరీం వ సుల్తానిహిల్ ఖదీం మినష్షైతానిర్రజీం.

أَعُوذُ بِاللهِ الْعَظِيمِ وَبِوَجْهِهِ الْكَرِيمِ وَسُلْطَانِهِ الْقَدِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

(ధూత్కరింపబడిన షైతాన్ బారి నుండి రక్షణకై నేను గొప్పవాడైన అల్లాహ్, ఆయన గౌరవనీయమైన ముఖం మరియు ఆది నుండి గల ఆయన అధికార శరణులోకి వస్తున్నాను).

అయన దీని ఘనత ఇలా తెలిపారు: ఎప్పుడైతే దాసుడు ఈ దుఆ చదువుతాడో అప్పుడు షైతాన్ అంటాడు: ఈ రోజంతా ఇతను నా నుండి రక్షింపబడ్డాడు.(అబూ దావూద్)

2- ఇంకా ఇలా అన్నారు: మీలో ఎవరైనా మస్జిదులోకి ప్రవేశించాలనుకున్నప్పుడు  ప్రవక్త పై దరూద్ పంపిన తరువాత ఈ దుఆ చదవాలి:

అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.                    اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు). (ముస్లిం 713).

మస్జిద్ నుండి బైటికి వచ్చేటప్పుడు ఈ దుఆ చదవాలి:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక.        اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ

(ఓ అల్లాహ్ నీతో నీ దయ కోరుతున్నాను). (ముస్లిం 713).

ఆయన విధానం: నెలవంకను చూసినప్పుడు చేసే దుఆలో

ఆయన నెలవంకను చూసినప్పుడు ఈ దుఆ చేసేవారు:

اللَّهُمَّ أَهِلَّهُ عَلَيْنَا بِالْأَمْنِ وَالإِيمَانِ، وَالسَّلَامَةِ وَالإِسْلَامِ، وَالتَّوْفِيقِ لِمَا تُحِبُّ رَبَّنَا وَتَرْضَى رَبُّنَا وَرَبُّكَ اللهُ

అల్లాహుమ్మ అహిల్లాహూ అలైనా బిల్ అమ్ని, వల్ ఈమాని వస్సలామతి, వల్ ఇస్లామి వత్తౌఫీఖి లిమా తుహిబ్బు రబ్బునా వతర్జా, రబ్బునా వ రబ్బు కల్లాహ్

ఓ అల్లాహ్! ఈ చంద్రునికి మాపై శాంతి, విశ్వాసము, రక్షణ, ఇస్లాంతో సహా,  ఉదయింపజేయి. నీవు ప్రేమించే, ఇష్టపడే వాటి భాగ్యం ప్రసాదించు ఓ మా ప్రభువా! (ఓ చంద్రుడా!) నాకు మరియు నీకు అల్లాయే ప్రభువు (దార్మీ, తిర్మిజి 3-157).

1-: ఆయన ఇలా సెలవిచ్చారు: నిశ్చయంగా అల్లాహు తఆలా తుమ్ముని ఇష్టపడతాడు మరియు ఆవలింతని ఇష్టపడడు. కనుక మీలో ఎవరికన్నా తుమ్ము వస్తే అల్  హందులిల్లాహ్ అని పలకాలి. వినే ప్రతి ముస్లిం పై ‘యర్హముకల్లాహ్ (నీపై అల్లాహ్ కారుణ్యం చూపు గాక)’ అనడం విధిగా ఉంది. ఆవలింత అనేది షైతాన్ తరపు నుండి. కనుక మీలో ఎవరికన్నా ఆవలింత వస్తే శక్తానుసారం దానిని ఆపడానికి ప్రయత్నం చేయాలి, మీలో ఎవరైనా ఆవలిస్తే షైతాన్ నవ్వుతాడు. (బుఖారీ)

2- ఆయన తుమ్మేటప్పుడు తమ చేయి లేదా వస్త్రాన్ని (రుమాలుని) అడ్డు పెట్టుకునేవారు. స్వరాన్ని తగ్గించేవారు.(అబూ దావూద్, తిర్మీజి)

3- ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా తుమ్మి (అల్ హందు లిల్లాహ్ అంటే, దగ్గరున్నావారిలో ఎవరైనా) యర్హముకల్లాహ్ అని అంటే, ఆయన దానికి జవాబుగా: యర్ హమునల్లాహు వ ఇయ్యాకుమ్, వయగ్ఫిర్ లనా వలకుమ్. (అల్లాహ్ మాపై మరియు మీపై కరుణించుగాక మరియు మిమ్మల్ని మరియు మమ్మల్ని క్షమించుగాక).

4- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: మీలో‌ ఎవరైనా తుమ్మినప్పుడు అల్ హందులిల్లాహ్ అనండి, ఇతనికి‌ జవాబుగా ఇతని సోదరుడు లేదా సహచరుడు యర్ హముకల్లాహ్ అనాలి. మళ్ళీ ఇతను యర్ హముకల్లాహ్ కి‌ జవాబుగా యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం అనాలి (అల్లాహ్ మీకు సన్మార్గం చూపుగాక మరియు మిమ్మల్ని సరిదిద్దుగాక). (బుఖారీ).

5- మీలో ఎవరైనా తుమ్మి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడే అతనికి యర్ హముకల్లాహ్ అని జవాబు ఇవ్వండి. ఒకవేళ అతను హందులిల్లాహ్ అనకపోతే అతనికి‌ జవాబు ఇవ్వకండి‌. (ముస్లిం).

            ఆయన మూడు సార్లు కంటే ఎక్కువ తుమ్మేవాడికి బదులు ఇచ్చేవారు కాదు. ఇతనికి జలుబు అయింది అనేవారు. (ముస్లిం).

6- సహీ హదీసులో వచ్చింది: యూదులు ఆయన వద్దకు వచ్చి కావాలని తుమ్మేవారు, తద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యర్ హముకల్లాహ్ అంటే, వారికి ఆ కరుణ దుఆ లభిస్తుందని ఆశించేవారు, కానీ ప్రవక్త యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం (అల్లాహ్ మీకు సన్మార్గం చూపుగాక మరియు మిమ్మల్ని సరిదిద్దుగాక) అని అనేవారు. (తిర్మిజీ)

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: మీలో‌ ఎవరైనా వ్యాధిగ్రస్తునిని పరామర్శించి, ఈ దుఆ చేస్తే, ఆ రోగం, ఆపద ఇతనికి తగలదు:

الْحَمْدُ للهِ الَّذِي عَافَانِي مِمَّا ابْتَلَاكَ بِهِ وَفَضَّلَنِي عَلى كَثِيرٍ مِمَّنْ خَلَقَ تَفْضِيلاً

అల్ హందులిల్లాహిల్లజీ ఆఫానీ మిమ్మబ్ తలాక బిహి వఫజ్జలనీ అలా కసీరిమ్ మిమ్మన్ ఖలఖ తఫ్జీలా.

సకల స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందుతాయి, అల్లాహ్ నిన్ను పరీక్షిస్తున్న దాని నుండి నన్ను క్షేమంగా ఉంచాడు మరియు ఆయన తన సృష్టిలో అనేకులపై నాకు ప్రాధాన్యతను వొసగాడు. (అబూ దావూద్)

1- ఆయన తమ అనుచర సమాజానికి గాడిద గాండ్రింపు వింటే పై’తాన్ నుండి శరణు కోరమని మరియు కోడి పుంజు కూత వింటే అల్లాహ్ తో ఆయన అనుగ్రహాన్ని అర్థించండి అని తెలిపారు. (బుఖారీ, ముస్లిం).

1- ఆయన ప్రజలకు కోపం వచ్చినప్పుడు వుజూ చేయమని, నిలబడి ఉంటే కూర్చోమని, కూర్చొని ఉంటే పడుకోవాలని మరియు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుంచి శరణు వేడుకోమని ఆదేశించారు.

1- తర్జీఅ (ترجيع = అజాన్ లో షహాదత్ పదాలు 4 సార్లు పలకడం) మరియు తర్జీఅ లేకుండా అంటే రెండు విధాలుగా అజాన్ ఇవ్వడం రుజువైనది. మరియు ఇఖామత్ ఒకసారి లేదా రెండు సార్లు ఇవ్వడం కూడా అనుమతి ఇవ్వబడింది. అయితే అన్ని స్థితుల్లో “ఖద్ ఖామతిస్సలాహ్” రెండు సార్లు అనడమే ఆయన నుండి రుజువైనది. ఒకేసారి అనడం ఖచ్చితంగా నిరూపించబడలేదు.

2- ఆయన తమ‌ అనుచర సమాజానికి ముఅజ్జిన్ ఎలా పులకుతే అలాగే జవాబు ఇవ్వాలని, కానీ హయ్య అలస్సలాహ్ మరియు హయ్య అలల్ ఫలాహ్ అన్నప్పుడు లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అని జవాబు ఇవ్వమని ఆదేశించారు.

3- ప్రవక్త ప్రవచనం: ఎవరైతే అజాన్ విని ఈ దుఆ చదువుతాడో, అతని పాపాలు మన్నించబడతాయి: అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా.

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ నా ప్రభువు అని, ముహమ్మద్ (అల్లాహ్ యొక్క) ప్రవక్త అని మరియు ఇస్లాం నా ధర్మం అని ఇష్టపడ్డాను). (ముస్లిం 386).

4- అజాన్ వినేవారు ముఅజ్జిన్ కి బదులు ఇచ్చాక ఆయనపై దరూద్ చదివి, ఆ తర్వాత ఈ దుఆ చదవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, ఇంకా అందువల్ల అతనికి ప్రళయదినాన ప్రవక్త సిఫారసు లభిస్తుందని శుభవార్తి ఇచ్చారు: అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅ్ వతిత్ తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(ఈ పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ‘మఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠంపజేయి). (బుఖారీ)

5- ఆయన ఇలా తెలిపారు: అజాన్ మరియు ఇఖామత్ ల మధ్య చేయబడే దుఆ రద్దుచేయబడదు.

1- ఆయన జిల్ హిజ్జా తొలిదశలో అత్యధికంగా అల్లాహ్ స్మరణ చేసేవారు. మరియు ప్రజలకు కూడా అత్యధికంగా తహ్మీద్ (అల్ హందులిల్లాహ), తక్బీర్ (అల్లాహు అక్బర్), తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్) చేస్తూ ఉండాలని ఆదేశించారు.

1- ఆయన ప్రతి రోజు ఒక హిజ్బ్ పారాయణం చేసేవారు, దానిని వదిలేవారు కాదు. (హిజ్బ్ అంటే తిలావత్ కొరకు ఫిక్స్ చేసుకున్న ఖుర్ఆన్ లోని ఒక భాగం).

2- ఆయన ఖుర్ఆన్ ను ఆగి ఆగి నింపాదిగా ఒక్కో అక్షరాన్ని స్పష్టంగా పారాయణం చేసేవారు, వేగంగా చదివేవారు కాదు, అలానే త్వరగా కూడా చదివేవారు కాదు. బదులుగా మధ్యస్థ వైఖరిని అవలంభిస్తూ ఖిరాఅ తఫ్సీరియ్యహ్ (వినేవారికి భావం తెలిసేరీతిలో తిలావత్) చేసేవారు.

3- ఆయన ఖుర్ఆన్ యొక్క ప్రతి ఆయతును వేర్వేరుగా చదివేవారు. ఒక్కో ఆయత్ పై ఆగేవారు. సూరాలను ఆగి ఆగి నింపాదిగా తిలావత్ చేసేవారు, వినేవారికి చాలా సుదీర్ఘమైన సూరాగా ఏర్పడేది.

4- ఆయన మద్ (దీర్ఘం) ఉన్న పదాలను ఉదా : అర్రహ్మాన్, అర్హహీంని గుంజీ, లాగీ చదివేవారు. (వీడియోలో తప్పక చూడండి ఈ విధానం).

5- ఆయన పారాయణం ప్రారంభించే ముందు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ తో శరణు వేడుకునేవారు. అనగా అఊజుబిల్లాహి మినష్ షైతానిర్రజీం పఠించేవారు. మరికొన్ని సార్లు ఈ విధంగా చదివేవారు: అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినష్షైతానిర్రజీమి మిన్‌ హమ్జిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహ్. (ఓ అల్లాహ్ నేను శాపగ్రస్తుడైన షైతాన్ ప్రేరణల నుండి,అతని ఊదడం నుండి, మంత్రం నుండి నీ శరణు వేడుతున్నాను). (ఇబ్నే మాజహ్).

6- ఆయన నిలబడి, కూర్చొని, పడుకొని, వుజూ స్థితిలో, వుజూ లేని స్థితిలో ప్రతీ స్థితిలో ఖుర్ ఆన్ పారాయణం చేసేవారు కానీ అశుద్ధావస్థలో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు కాదు.

7- ఆయన ఉత్తమమైన స్వరంతో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. మరియు ఇలా అనేవారు: ఎవరైతే ఖుర్ ఆన్ సుందరమైన స్వరంతో చదవడో వాడు మన విధానం లోనివాడు కాదు. (బుఖారీ).

            ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ఖుర్ఆన్ ను మీ కంఠస్వరాల ద్వారా అలంకరించండి.

8- ఆయన ఇతరుల స్వరంతో కూడా పారాయణం వినడం ఇష్టపడేవారు.

9- ఆయన సజ్దహ్ ఆయతు చదివినప్పుడు అల్లాహు అక్బర్ అని సజ్దహ్ లోకి వెళ్ళేవారు. ఆయన ఒక్కోసారి సజ్దహ్ లో ఈ దుఆ చదివేవారు: సజద వజ్ హియ లిల్లజీ ఖలకహూ వ షక్క సమ్అహూ వ బసరహూ బిహౌలిహీ వ కువ్వతిహీ [ఫతబారకల్లాహు అహ్ సనుల్ ఖాలిఖీన్]. (తిర్మిజి 580 [హాకిం 802]).

سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ بِحَوْلِهِ وَقُوَّتِهِ {فَتبَارَك اللهُ أَحسَنَ الخَالِقِين}

(నా ముఖం, తన శక్తి సామర్థ్యాలతో దానిని సృష్టించిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

            మరికొన్ని సందర్భాల్లో ఈ దుఆ చదివేవారు: అల్లాహుమ్మక్ తుబ్ లీ బిహా ఇందక అజ్రా, వ జఅ అన్నీ బిహా విజ్రా, వజ్అల్ హా లీ ఇందక జుఖ్రా, వ తఖబ్బల్ హా మిన్నీ కమా తఖబ్బల్ తహా మిన్ అబ్దిక దావూద్. (తిర్మిజి 579, 3424).

اللَّهُمَّ اكْتُبْ لِي بِهَا عِنْدَكَ أَجْرًا وَضَعْ عَنِّي بِهَا وِزْرًا وَاجْعَلْهَا لِي عِنْدَكَ ذُخْرًا وَتَقَبَّلْهَا مِنِّي كَمَا تَقَبَّلْتَهَا مِنْ عَبْدِكَ دَاوُدَ

(ఈ సజ్దాకు బదులుగా నీ వద్ద నా కొరకు పుణ్యం వ్రాసి పెట్టు, నాపై ఉన్న పాపాల భారం దించిపెట్టు, పుణ్యఫలం భద్రంగా స్టోర్ చేసిపెట్టు మరియు నీ (ప్రియ)దాసుడైన దావూద్ అలైహిస్సలాం నుండి అంగీకరించినట్లు నాతో అంగీకరించు).

ఆయన సజ్దయే తిలావత్ నుండి లెసినప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు కాదు. అలాగే తషహ్హుద్ లేదా సలామ్ కూడా త్రిప్పేవారు కాదు. (కాని నమాజు చేయించే ఇమాం నమాజులో ఉండగా సజ్దయే తిలావత్ గల ఆయత్ చదివితే, అల్లాహు అక్బర్ అంటూ సజ్దాలోకి వెళ్ళాలి, అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి లేవాలి).

1- ఆయన ఖుత్బా ఇచ్చేటప్పుడు కళ్ళు ఎర్రగా, కంఠస్వరం పెద్దగా (బిగ్గరగా) అయ్యేవి. ఆగ్రహం పెరిగిపోయేదే; ఎలాగైతే ఒక సైన్యం నుండి బెదిరించేవాడు అంటాడో: ప్రజలారా శత్రువు మీపై పొద్దున్న లేదా రాత్రి దాడి చేయబోతున్నాడు.

            ఆయన ఇలా అన్నారు: “నన్ను పంపబడిన కాలం మరియు ప్రళయదినం మధ్య ఈ విధంగా న్ని ఈ విధంగా ప్రక్కప్రక్కన కలిపి పంపడం జరిగింది” అని ప్రవక్త ముహమ్మద్ ﷺ తమ చూపుడు వ్రేలును మధ్య వ్రేలుతో కలిపి చూపిస్తూ అన్నారు (బుఖారీ, ముస్లిం)

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనేవారు: అమ్మా బఅద్, ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, వషర్రల్ ఉమూరి ముహ్ దాసాతుహా, వ కుల్ల బిద్అతిన్ ద్జలాలహ్. (అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథంలోనిది, అన్నిటికంటే ఉత్తమమైన విధానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం, అన్ని విషయాల్లో కెల్ల అతి చెడ్డ విషయం బిద్అతులు (ధర్మం పేరు మీద కల్పితాచాచరాలు),  ప్రతి కొత్త కల్పిత దురాచారం మార్గభ్రష్టత్వానికి దారితీస్తుంది. (ముస్లిం).

ఆయన అల్లాహ్ స్తోత్రం తో ప్రారంభించకుండా ఎటువంటి ప్రసంగాన్ని ప్రసంగించేవారు కాదు.

ఆయన తమ సహాబాలకు ఉపన్యాసం కొరకు ఈ విధంగా బోధించేవారు:-

ఇన్నల్ హమ్ద లిల్లాహి నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్ మాలినా మయ్ యహ్ దిహిల్లాహు ఫలాముజిల్ల లహు వమయ్ యుజ్లిల్ ఫలా హాదియలహు వ నష్రదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు…

సకల స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందుతాయి మేము ఆయన్నే స్తుతిస్తాము. సహాయం కోసం ఆయన్నే అర్ధిస్తున్నాము. మోక్షం(క్షమాభిక్ష )కొరకు ఆయన్నే వేడుకుంటున్నాము. కామ చేష్టల నుండి దురాచరణల నుండి మేము ఆయన శరణు కోరుకుంటున్నాము ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శనం వహిస్తాడు వారిని ఎవరూ దారి తప్పించలేరు. మరి ఎవరినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వానికి గురి చేయదలుచుకుంటాడో వారికి ఎవ్వరూ దారి చూపించలేరు‌ అల్లాహ్ తప్ప ఎవరూ నిజ ఆరాధ్యుడు లేడని మేము సాక్ష్యం ఇస్తున్నాము.మరియు మహాప్రవక్త ముహమ్మద్ ﷺ గారు ఆయన సందేశహరులని దాసులని కూడా మేము సాక్ష్యం ఇస్తున్నాము.

పిదప ఆయన ఈ మూడు వాక్యాలను పారాయణం చేసేవారు:-

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ حَقَّ تُقٰتِهٖ وَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.

Aal-e-Imran 3:102

يٰۤاَيُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمُ الَّذِيْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيْرًا وَّنِسَآءً ۚ وَاتَّقُوا اللّٰهَ الَّذِيْ تَسَآءَلُوْنَ بِهٖ وَالْاَرْحَامَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلَيْكُمْ رَقِيْبًا

మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.

An-Nisa’ 4:1

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَقُوْلُوْا قَوْلًا سَدِيْدًا ۙ

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).

Al-Ahzab 33:70

మరియు ఆయన వారికి (సహాబాలకు) ప్రతీ పనిలో ఇస్తెఖారహ్ చేయమని నేర్పేవారు ఎలాగైతే ఖుర్ఆన్ లోని సూరా నేర్పేవారో.

ఆయన ఇలా అన్నారు:-

మీరు ఏ పనినైనా చేయాలనుకుంటే ‘ఫర్జ్’ నమాజులో తప్ప ఇతర నఫిల్ నమాజు రెండు రకాతులు చదివి ఇలా పఠించాలి.

అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వఅస్తఖ్దిరుక బిఖుద్రతిక వస్అలుక మిన్ ఫజ్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅ్ లము వలా అఅ్ లము వ అన్త‌ అల్లాముల్ గుయూబ్. అల్లాహుమ్మ ఇన్ కున్త తఅ్ లము అన్న హాజల్ అమ్ర —(తమ అవసరం గురించి విన్నవించాలి)— ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ లేదా ఇలా అన్నారు (ఆ(ع)జిలిహీ వ ఆ(آ)జిలిహీ)–ఫఖ్దుర్ హు లీ వయస్సిర్ హు లీ , సుమ్మ బారిక్ లీ ఫీహి , వ ఇన్ కున్త తఅ్ లము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ.. లేదా ఇలా అన్నారు (ఆ(ع)జిలిహీ వ ఆ(آ)జిలిహీ)..ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ రజ్జినీ బిహీ.(బుఖారీ)

(ఓ అల్లాహ్ ! నేను నీ జ్ఞానం ద్వారా, నీ నుండి మేలు కోరుతున్నాను. నీ శక్తి ద్వారా నాకు శక్తిని ప్రసాదించు. నీ మహా అనుగ్రహాన్ని కోరుతున్నాను. నిశ్చయంగా నీకే శక్తి ఉంది. నాకు ఎలాంటి శక్తి లేదు. నీకు అంతా తెలుసు నాకు ఏమీ తెలియదు. ఆగోచర జ్ఞానం కలవాడవు నీవే. ఓ అల్లాహ్! ఈ పని (దేనిని గురించి ఇస్తేఖారా చేస్తున్నారో దానిని ప్రస్తావించాలి) ధార్మికంగా సామాజికంగా, సంపాదనంగా, మోక్షపరంగా,(దాని త్వరగా మరియు ఆలస్యం లో) నా కొరకు మేలైనదైతే నాకై నిశ్చయించు. దానిని నా కొరకు ప్రసాదించు. ఓ అల్లాహ్! ఈ పని ధార్మికంగా, సంపాదనపరంగా, మోక్షపరంగా(దాని త్వరగా మరియు ఆలస్యం లో) కీడైనదైతే దాన్నుండి నాకు నా నుండి దాన్ని దూరంగా ఉంచు. ఎక్కడున్నా సరే నాకు మేలును ప్రసాదించు. దాని ద్వారా నాకు సంతృప్తిని ప్రసాదించు). (బుఖారీ)

1- ఆయన ఒక్కోసారి పరుపు మీద‌ మరియు ఒక్కోసారి చర్మంతో చేయబడిన పరుపు మీద, ఒక్కోసారి చాప పై , ఒక్కోసారి నేలపై , మరియు ఒక్కోసారి మంచంపై పడుకునేవారు‌.ఆయన పరుపు మరియు దిండి శుభ్రంగా రంగించబడిన చర్మం తో చేసినదై ఉండేది దాని లోపల ఖర్జూరం బెరడు నిండి ఉండేది.

2- ఆయన అవసరానికంటే ఎక్కువగా నిద్రపోయేవారు కాదు.మరియు అవసరానికంటే తక్కువగా నిద్రపోయే వారు కూడా కాదు.

3- ఆయన రాత్రి మొదటి భాగంలో నిద్రపోయేవారు మరియు చివరి భాగంలో మేలుకునేవారు. కొన్నిసార్లు ముస్లిములందరి సంక్షేమం కోసం మొదటి రాత్రిలో మేల్కొని ఉండేవారు.

4- (ప్రయాణ స్థితిలో) ఆయన రాత్రి చివరి భాగంలో పడుకున్నప్పుడు కుడి వైపున  పడుకునేవారు.మరియు ఫజర్ ముందు పడుకున్నప్పుడు కుడి చేయి నిల్చోబెట్టి దాని అరచేతిలో తల పెట్టి పడుకునే వారు.

5- ఆయన పడుకున్నప్పుడు ఎవరూ ఆయనని నిద్ర నుండి మేల్కొనిపేవారు కాదు ఎప్పటి వరకు అయితే ఆయన స్వయంగా మేలుకోరో. ఆయన కళ్ళు నిదురపోయేవి కానీ హృదయం మేల్కొని ఉండేది.

6-ఆయన పరుపుపై పడుకొనేందుకు వెళ్లినప్పుడు ఈ దుఆ చదివేవారు:-  బిస్మికల్లాహుమ్మ అమూతు వ అహ్యా (అల్లాహ్ పేరుతో మరణిస్తున్నాను (నిదురపోతున్నాను) మరియు జీవిస్తున్నాను (మేల్కొంటున్నాను) (బుఖారీ)

ఆయన ఖుల్ హువల్లాహు అహద్ (సూరయే ఇఖ్లాస్),ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(సూరయే ఫలఖ్), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్ (సూరయే నాస్) పఠించేవారు మరియు తమ రెండు అరచేతులను దగ్గర చేసి వాటి మీద ఊదేవారు.పిదప రెండు అరచేతులతో తల,ముఖం, మరియు కుదరభాగంపై స్పర్శించేవారు (తుడిచేవారు). మరియు ఎంతవరకు కుదిరితే అంత భాగంపై తుడిచేవారు. ఈ విధంగా ఆయన మూడుసార్లు చేసేవారు.(బుఖారీ)

7- ఆయన కుడి వైపున పడుకునేవారు.మరియు ఆయన తన చేతిని కుడి చెంప క్రింద ఉంచి ఈ దుఆ చదివేవారు:- అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక ( ఓ అల్లాహ్ నీవు నన్ను సమాధి శిక్ష నుండి కాపాడు ఏ నాడు అయితే నీవు నీ దాసులను తిరిగి లేపుతావో)అబూ దావూద్, తిర్మీజి

ఆయన కొందరు సహాబాలతో ఇలా అన్నారు:- నీవు నీ పరుపు మీదకు పోయినప్పుడు నమాజు కొరకు చేసే మాదిరిగా వుజూ చేసుకో పిదప కుడి వైపు తిరిగి పడుకొని ఈ దుఆ చదువు:-

«اللَّهُمَّ أَسْلَمْتُ نَفْسِي إِلَيْكَ، وَفَوَّضْتُ أَمْرِي إِلَيْكَ، وَوَجَّهْتُ وَجْهِي إِلَيْكَ، وَأَلْجَأْتُ ظَهْرِي إِلَيْكَ، رَغْبَةً وَرَهْبَةً إِلَيْكَ ، لَا مَلْجَأَ وَلَا مَنْجَا مِنْكَ إِلَّا إِلَيْكَ ، آمَنْتُ بِكِتَابِكَ الَّذِي أَنْزَلْتَ وَبِنَبِيِّكَ الَّذِي أَرْسَلْتَ».

“అల్లాహుమ్మ అస్లమ్తు నఫ్సీ ఇలైక, వఫవ్వజ్తు అమ్రీ ఇలైక, వ వజ్జహ్తు వజ్హీ ఇలైక, వ అల్ జఅ్ తు జహ్రీ ఇలైక, రగ్బతవ్ వ రహ్బతన్ ఇలైక, లా మల్జఅ వలా మన్జఅ మిన్క ఇల్లా ఇలైక, ఆమన్తు బికితాబికల్లదీ అన్జల్త వ బినబియ్యికల్లదీ అర్సల్త””

ఓ అల్లాహ్! నా ఆత్మను నీ ఆధీనం చేసాను, నా వ్యవహారాలన్నీ నీకు నా ముఖాన్ని నీ వైపుకు మరల్చాను, నా వీపును నీ వైపుకు వంచాను, (ఇవన్నీ నేను) భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో చేసాను. నీ పట్టు నుండి తప్పించుకోలేను. నీవు తప్ప నాకు రక్షకుడు లేడు. నీవు అవతరింప జేసిన గ్రంథాన్నీ మరియు నీవు పంపిన ప్రవక్తనూ విశ్వసించాను. (ఈ దుఆ నిద్ర పోయిన తరువాత చనిపోతే ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మరణం జరిగినట్లు) (బుఖారీ, ముస్లిం).

«اللَّهُمَّ رَبَّ جِبْرِيلَ، وَمِيكَائِيلَ، وَإِسْرَافِيلَ فَاطِرَ السَّمَوَاتِ وَالْأَرْضِ، عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ، أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِكَ إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ».

 అల్లాహుమ్మ రబ్బ జిబ్రీల, వ మీకాయీల, వ ఇస్రాఫీల ఫాతిరస్ సమావాతి వల్ అర్ది. ఆలిమల్ గైబి వష్ షహాదతి, అన్త తహ్కుము బైన ఇబాదిక, ఫీమా కానూ ఫీహి యఖ్తలిఫూన్. ఇహ్దినీ లిమఖ్ తులిఫ ఫీహి మినల్ హఖ్ఖి బిఇద్నిక ఇన్నక తహ్దీ మన్ తషాఉ ఇలా సిరాతిమ్ ముస్తఖీమ్.

ఓ అల్లాహ్! జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీలుల ప్రభువువి నీవే! ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలలో తీర్పునిచ్చే వాడివి నీవే. విభేదము ఏర్పడిన విషయాలలో నీ అనుజ్ఞతో నాకు సత్యము వైపునకు మార్గదర్శకము గావించు. నిశ్చయంగా నీవు కోరిన వారికి రుజు మార్గదర్శకము గావిస్తావు. (ముస్లిం).

9- ఆయన నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఈ విధంగా పఠించేవారు:-

«الْحَمْدُ للهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُورُ»

“అల్హామ్దు లిల్లాహిల్లదీ అహ్యానా బఅ్ దమా అమాతనా వఇలైహిన్ నుషూర్”

చనిపోయిన తర్వాత మమ్మల్ని తరిగి బ్రతికించిన అల్లాహ్క సమస్త స్తోత్రములు, మరియు ఆయన వైపునకే మనమంతా మరలిపోవలసి ఉన్నది. (బుఖారీ, ముస్లిం) మరియు మిస్వాక్ చేసేవారు మరియు కొన్నిసార్లు సూరయే ఆలిమ్రాన్ చివరి పది వాక్యాలు పారాయణం చేసేవారు (ముత్తఫఖున్ అలైహి)

10- ఆయన కోడికూతను విన్నప్పుడు నిద్ర లేచేవారు మరియు అల్లాహ్ యొక్క స్తోత్రం, తక్బీర్ (గొప్పతనం), తహ్లీల్ (లాఇలాహ ఇల్లల్లాహ్) మరియు దుఆ చేసేవారు.

11- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు:- మంచి కలలు అల్లాహ్ తరుపునుండి వస్తాయి. మరియు చెడు కలలు షైతాన్ తరపు నుండి వస్తాయి‌. అందువలన ఏ వ్యక్తి అయినా అయిష్టకరమైన కలను చూస్తే ఎడమవైపున సాధారణంగా(తూ తూ అని కొన్ని తుంపర్లు పడేలా) ఉమ్మాలి.మరియు అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం అని పఠిస్తే అతనికి ఎటువంటి హాని కలుగదు. మరియు దానిని ఎవరికీ తెలుపకూడదు. మరియు ఒకవేళ మంచి కలను చూస్తే దానిని శుభవార్త అనుకొని కేవలం తాను ఇష్టపడిన వారికి మాత్రమే తెలుపాలి.(ముత్తఫఖున్ అలైహి)

అలాగే చెడు కలలు చూసేవారితో ప్రక్క మార్చి మరియు నమాజు చేయమని ఆజ్ఞాపించారు.

1-ఆయన సుగంధాన్ని అత్యధికంగా వాడేవారు, మరియు దానిని‌ ఇష్టపడేవారు.ఎప్పడూ సువాసనను పీల్చుకోకుండా వదిలేవారు కాదు.ఆయన దృష్టిలో అన్నిటికంటే ఉత్తమమైన సువాసన మిష్క్ ది(అనగా కస్తూరిది ).

2- ఆయన‌ మిస్వాక్ ను అధికంగా ఇష్టపడేవారు.ఇఫ్తార్ మరియు ఉపవాస స్థితిలో కూడా మిస్వాక్ చేసేవారు.నిద్ర నుండి మేల్కొనేటప్పుడు, మరియు ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు మరియు నమాజు కొరకు మిస్వాక్ చేసేవారు.

3- ఆయన సుర్మా ను ఉపయోగించేవారు మరియు ఇలా అన్నారు:-మీ సుర్మా లలో అత్యంత ఉత్తమమైన సుర్మా అస్మద్ .ఇది కళ్ళను శుభ్రపరుస్తుంది మరియు కను రెప్పల వెంట్రుకలను పెంచుతుంది.

4- ఆయన ఒక్కోసారి స్వయంగా తల దువ్వుకునేవారు ఒక్కోసారి ఆయన భార్య ఆయిషా రదియల్లాహు అన్హా  దువ్వేది. ఆయన తల వెంట్రుకలన్నీ గొరిగించుకునేవారు లేకపోతే అలానే వదిలేసేవారు

5- ఆయన‌ హజ్ మరియు ఉమ్రాలలోనే గుండు చేయించుకోవడం రుజువైంది.ఆయన తల వెంట్రుకలు జుమ్మ కంటే ఎక్కువ మరియు వఫ్రా కంటే తక్కువ ఉండేవి.మరియు జుమ్మ వెంట్రుకలు ఆయన చెవుల‌ అంచు వరకు చేరి ఉండేవి.

జుమ్మ :- భుజాల వరకు పెరిగిపోయిన తల వెంట్రుకలు

వఫ్రహ్:- చివరి వరకు ఉండే పొడువాటి వెంట్రుకలను (జుట్టు) అంటారు

లమ్మహ్:- చెవుల అంచుల కంటే కొద్దిగ‌ పొడవుగా ఉండే జుట్టు

6- ఖజఅ్(కొంత తలభాగాన్ని గొరికించుకొని కొంత భాగాన్ని వదిలివేయడం,అరగుండు) నుండి ఆయన వారించేవారు

7-ఆయన ఇలా తెలిపారు:- అవిశ్వాసులకు వ్యతిరేకత చూపండి! గెడ్డాన్ని పెంచండి మరియు మీసాలను తగ్గించండి.(ముత్తఫఖున్ అలైహి)

8- ఆయన దుస్తులలో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకునేవారు.ఒక్కోసారి ఉన్ని ,ఒక్కోసారి దూది లేదా పత్తి,లేదా కొన్నిసార్లు కాటన్ (అవిసె మొక్క నుండి తయారు చేయబడిన వస్త్రం).ఆయనకు  అన్నిటికంటే ఇష్టమైన వస్త్రం చొక్కా.

9-ఆయన యమన్ కి చెందిన చారల దుప్పటి, మరియు ఆకుపచ్చ దుప్పటిని కూడా వేసుకునేవారు.మరియు జుబ్బా,మరియు చేతుల దగ్గర టైట్ గా ఉండేది,పైజామా,లుంగీ,దుప్పటి,సాక్సులు, చెప్పులు మరియు తలపాగా కూడా ధరించేవారు.

10- తలపాగాను అడుగున కట్టేవారు మరియు దాని అంచుని ఒక్కోసారి వెనుక వదిలేసేవారు. ఒక్కోసారి వదిలేవారు కాదు.  (హన్క్ అనగా అంగిలి,దిగువ దవడ గడ్డం క్రింద భాగాన్ని అంటారు )

11- మరియు ఆయన నలుపు రంగు దుస్తులు ధరించేవారు, మరియు ఎరుపు లుంగీ లేదా దుప్పటిని కూడా వాడారు

12- ఆయన వెండి ఉంగరాన్ని ధరించేవారు, మరియు దానిలో ఉన్న రాయి ని అరచేతి లోపలి వైపుకు తిప్పుకునేవారు.

13- ఆయన కొత్త దుస్తులు ధరించేటప్పుడు వాటి పేరు తీసుకునేవారు మరియు ఈ విధంగా ప్రార్థించేవారు:-

اللَّهُمَّ  أَنْتَ كَسَوْتَنِيهِ ھذا القمیص اوالرداء او العمامۃ أَسْأَلُكَ خَيْرِهِ وَخَيْرِ مَا صُنِعَ لَهُ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّهِ وَشَرِّ مَا صُنِعَ لَهُ

అల్లాహుమ్మ అంత కసౌతనీహి హాజల్ ఖమీసి అవిర్రిదాఇ అవిల్ అమామహ్,అస్అలుక  ఖైరిహీ వ ఖైర మా సునిఅ లహూ వ అఊజుబిక మిన్ షర్రిహీ వషర్రి మాసునిఅ లహ్. (అబూదావూద్ 4020).

 (ఓ అల్లాహ్!నీవే నాకు ఈ చొక్కా, లేదా దుప్పటి లేదా తలపాగా తొడిగించావు, ఇందులో ఉన్న మేలు మరియు దేని కొరకు ఇది తయారు చేయబడిందో ఆ మేలును నీతో కోరుతున్నాను, ఇందులోని కీడు మరియు దేని కొరకు తయారు చేయబడిందో ఆ కీడు నుండి నీ శరణులో వస్తున్నాను).

14- ఆయన చొక్కాను కుడివైపు నుండి ధరించేవారు.

15- ఆయన దువ్వుకునేటప్పుడు, చెప్పులు వేసుకునేటప్పుడు, వుజూ లేదా తహారత్ (శుభ్రత) పొందేటప్పుడు, మరియు ఏదైనా వస్తువుని ఇవ్వడం మరియు తీసుకోవడంలో కుడి వైపు నుండి ప్రారంభించడాన్ని ఇష్టపడేవారు.

16- తుమ్ము వచ్చినప్పుడు ఆయన చేయి లేదా వస్త్రాన్ని ముఖంపై అడ్డుగా పెట్టుకునే వారు మరియు తమ స్వరాన్ని తగ్గించేసేవారు.

17- ఆయన ముసుగు వేసుకున్న యువ కన్యల కంటే ఎక్కువ సిగ్గుపడేవారు.

18- ఆయన పరిహసించే మాటలపై నవ్వే వారు కూడా!..అయితే ఆయన నవ్వడం అధికంగా చిరునవ్వు తో ఉండేది. ఆయన అధికంగా నవ్వినప్పుడు ఆయన చిగుళ్ళు  కనపడేవి. ఆయన ఏడవడం కూడా నవ్వడం మాదిరిగానే ఉండేది ఎలాగైతే ఆయన పగలబడి నవ్వే వారు కాదు అలానే వారు వెక్కి వెక్కి ఏడ్చేవారు కాదు. అయితే ఆయన కళ్ళ నుండి కన్నీరు కారేది. మరియు ఆయన హృదయం నుండి (ఏడ్చే) శబ్దం వినబడేది.న

1- ఆయన ఏదైనా తెగ‌ వద్దకు పోతే వారికి సలాం చేసేవారు.మరియు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సలాం చేసి వెళ్ళేవారు.మరియు ప్రజలకు సలాం ను వ్యాప్తి చేయమని ఆజ్ఞాపించేవారు.

2- ఆయన ఇలా అన్నారు:- చిన్నవాడు పెద్దవానికి సలాం చేయాలి, మరియు బాటసారి కూర్చొని ఉన్న వ్యక్తి కి, మరియు స్వారీ పై ప్రయాణం లో ఉన్నవాడు కాలినడక నడిచే వానికి, మరియు తక్కువ మంది ఎక్కువ మందికి సలాం చేయాలి.

3- ఆయన ఎవరినన్నా కలిసినప్పుడు ముందుగా సలాం చేసేవారు మరియు ఆయనకి ఎవరైనా సలాం చేస్తే అదేవిధంగా.. లేకపోతే అంతకంటే ఉత్తమంగా వెంటనే బదులు ఇచ్చేవారు. కానీ ఏదన్నా కారణం ఉదా :- నమాజ్,మల మూత్ర విసర్జన సమయంలో వెంటనే ఇచ్చేవారు కాదు.

4- ఆయన ప్రారంభంలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనేవారు మరియు ఆయన మొదలుపెట్టే అతను అలైకస్సలాం అని మొదలుపెట్టడాన్ని అయిష్జపడేవారు.ఆయన సలాం కి జవాబుగా వఅలైకస్సలాం అని వావ్(మరియు ) తో  ఇచ్చేవారు.

5- ఆయన విధానం ఏమనగా ప్రజలు అధికంగా ఉన్నప్పుడు ఒక్కసారి సలాం చేయడం వలన అందరికీ చేరదు అనుకున్నప్పుడు ఆయన మూడు సార్లు సలాం చేసేవారు.

6- ఆయన విధానం ఏమనగా మస్జిద్ లోనికి ప్రవేశించే వారు  ముందుగా తహియ్యతుల్ మస్జిద్ నమాజు చేయాలి ఆ తర్వాత ప్రజల వద్దకు వచ్చి సలాం చేయాలి.

7- ఆయన చేయి, తల, వేళ్ళ సైగలతో ఎవరికీ సలాం జవాబు ఇచ్చేవారు కాదు.కానీ నమాజులో ఉన్నప్పుడు తప్ప.. అప్పుడు ఆయన సైగలతో జవాబు ఇచ్చేవారు.

8- పిల్లల ఉన్న దారి గుండా వెళితే వారికి సలాం చేసేవారు. అదేవిధంగా స్త్రీలు ఉన్న దారిలో ప్రవేశించినా సలాం చేసేవారు.మరియు సహాబాలు కూడా జుమా నమాజు తరువాత వాపసు వస్తుండగా దారిలో ఉన్న ముసలామెకు సలాం చేసేవారు.

9- ఆయన ఇతరులకు సలాం పంపేవారు. మరియు ఇతరులు పంపిన సలాం ను కూడా స్వీకరించేవారు. ఆయన ముందు ఎవరన్నా వేరొకరి సలాంను ప్రస్తావిస్తే ఆయన ముందు సలాం తెచ్చిన అతని పై మరియు పంపిన వాని పై సలాం చేసేవారు.

10- ఆయనను ఇలా ప్రశ్నించడం జరిగింది:- ఒక వ్యక్తి అతని సహోదరుడుని కలుసుకున్నప్పుడు అతని కొరకు వంగవచ్చునా? దానికి ఆయన లేదని సమాధానమిచ్చారు. మరి ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది అతనిని వాటేసుకుని చుంబించవచ్చునా? దానికి కూడా ఆయన లేదని సమాధానం ఇచ్చారు. పిదప ఇలా అడగడం జరిగింది అతనితో కరచాలం చేయవచ్చునా? దానికి ఆయన అవును అని సమాధానం ఇచ్చారు (తిర్మీజి)

11- ఆయన తన ఇంటి వారి వద్దకు వారు ఉచ్చులో పడే విధంగా(ఇబ్బంది కరంగా)అకస్మాత్తుగా వచ్చేవారు కాదు. ఆయన ప్రవేశించగానే సలాం చేసేవారు మరియు వారి స్థితిగతులను తెలుసుకునేవారు

12-ఆయన రాత్రి వేళలో తమ ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఏ విధంగా సలాం చేసేవారు అంటే మేలుకొని ఉన్నవాడు వినేలా మరియు నిద్రపోయి ఉన్నవాడు తొందరపడి మేలుకోకుండా ఉండేలా చేసేవారు.

13- ఆయన విధానం ఏమనగా ఎప్పుడైతే అనుమతి అందించే వానితో నీవు ఎవరు ? అని అడగబడుతుందో అప్పుడు ఆయన ఫలానా గారి అబ్బాయి ఫలానా ని,లేదా తమ బిరుదు ని తెలిపేవారు అంతేకానీ “నేను నేను” అనేవారు కాదు.

14- ఆయన ఇతరుల వద్దకు వెళ్ళినప్పుడు మూడుసార్లు అనుమతిని అర్జించేవారు ఒకవేళ మూడుసార్లు తర్వాత కూడా అనుమతి లభించకపోతే తిరిగి వచ్చేసేవారు.

15-ఆయన సహాబాలకు అనుమతిని అర్జించేముందు సలాం చేయమని బోధించేవారు.

16-ఆయన ఎవరి ద్వారం వద్దనైనా వెళితే దానికి తిన్నగా నిలబడే వారు కాదు బదులుగా కుడి లేదా ఎడమ వైపు నిలబడేవారు‌. మరియు ఇలా అనేవారు:- అనుమతిని అర్థించడం కనుచూపు పడడం నుండి కాపాడుకోవడం కొరకే (ముత్తఫఖున్ అలైహి)

1-ఆయన చాలా అనర్గళంగా మరియు మధురమైన మాట గలవారు.ఉఛ్ఛారణ లో అందరికంటే వేగంగా మరియు సంభాషణలో మధురమైనవారు.

2- ఆయన సుదీర్ఘంగా మౌనం వహించే వారు. కేవలం అవసరం కలిగినప్పుడే మాట్లాడేవారు.మరియు వ్యర్థమైన,అనవసర మాటల నుండి దూరం పాటించేవారు.ఆయన కేవలం పుణ్యం ఆశించే విషయాలలోనే మాట్లాడేవారు.

3- ఆయన సమగ్రంగా మాట్లాడేవారు. ఆయన మాటలు లెక్కించగలవాడు లెక్కించగలిగేంతగా చాలా స్పష్టంగా ఉండేవి.ఆయన మాటలు గుర్తుపెట్టుకోకపోయేంత వేగంగా ఉండేవి కావు.అలాగే ఎక్కువగా ఆగి ఆగి మాట్లాడేవారు కూడా కాదు.

4- ఆయన తమ ప్రసంగం లో , మరియు అనుచర సమాజిని‌ అత్యున్నత జ్ఞానం బోధించడంలో ఉత్తమమైన మరియు సరైన పదాలు పదాలను ఎంచుకునేవారు..ఏవైతే కాఠిన్యానికి , అసభ్యకరమైన మాటల నుండి దూరంగా ఉంటాయో.

5- ఆయన‌ ఏదైనా మంచి పదాన్ని దాని అర్హతలేని వాడి కొరుకు, మరియు చెడు పదాన్ని మంచి వ్యక్తి కోసం ఎంచుకునేవారు కాదు.కావున,  కపటులను సయ్యద్(సర్దారు )అని మరియు అబూ జహల్ ను అబుల్ హకమ్ (తెలివైనవాడు)అని అనడం నుండి వారించారు.మరియు సుల్తాన్ కొరకు మాలికుల్ ముల్క్ మరియు ఖలీఫతుల్లాహ్ అనడం నుండి వారించారు.

6- ఆయన ఇలా అన్నారు:- ఎవరిపై అన్నా షైతాన్ ప్రభావం ఉంటే అతను బిస్మిల్లాహి అని చదవాలి.మరియు షైతానును శపించకూడదు.మరియు షైతాన్ నాశనం అవ్వాలి అని ఇలాంటి పదాలతో శపించకూడదు.

7- ఆయన ఉత్తమమైన పేర్లను ఇష్టపడేవారు. మరియు ఇలా అన్నారు :-మీ వద్దకు ఎప్పుడైనా రాయబారి ని పంపించడం జరిగితే అతని రూపం మరియు పేరు చక్కగా ఉండాలి. ఆయన పేర్ల నుండి అర్థాలను గ్రహించి పేర్లు మరియు ఆ వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వారు .

8- ఆయన ప్రవచనం:- అల్లాహ్ దృష్టిలో అన్నిటికంటే ఇష్టమైన పేరు అబ్దుల్లాహ్ మరియు అబ్దుర్రహ్మాన్ . మరియు అందరికంటే సత్యసంధులు హారిస్ మరియు హమ్మామ్. మరియు అన్నిటికంటే చెడ్డ పేర్లు హరబ్ మరియు ముర్రహ్

9- ఆయన ఆసియా అనే పేరును మార్చి జమీలహ్ అని పెట్టారు.మరియు అస్రమ్ ను జరిఅ గా మార్చారు. మరియు ఆయన మదీనా లో ప్రవేశించిన తర్వాత దాని పాత పేరు యస్రిబ్ ను తీసివేసి తయ్యిబహ్ పెట్టారు.

11- ఆయన సహాబాలకు మరియు చిన్న పిల్లలకు కున్నియత్ ను ఎంచేవారు (ఇచ్చేవారు).ఆయన తమ భార్యల్లో కొందరికి కూడా కున్నియత్ (స్వంత పేరు)ఇచ్చారు.

12- ఆయన విధానం ఏమనగా ఆయన పిల్లలు కలవారికి మరియు పిల్లలు లేని వారికి ఇద్దరికీ కూడా కున్నియత్ ఇచ్చేవారు. మరియు ఇలా తెలిపేవారు నా పేరు ద్వారా మీరు కూడా పేరు పెట్టుకోండి కానీ నా కున్నియత్ ను ఎంచుకోకండి.

ఆయన అషా అనే పేరుని వదిలి ఉత్మా అని పిలవడాన్నుండి వారించారు.మరియు ద్రాక్ష ను కర్మ్ అనడం నుండి కూడా వారించారు.మరియు ఇలా తెలిపారు:- కర్మ్ అనేది విశ్వాసి హృదయం

13-ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు..దాసుడు ఈ నక్షత్రం మూలంగానే వర్షం కురిసింది అని అనడం నుండి వారించారు ‌ మరియు అల్లాహ్ ఏదైతే తలిచాడో అదే విధంగా మీరు‌ ఏదైతే తలిచారో అని అనడం నుండి, మరియు అల్లాహ్ యేతరల పై వాగ్దానం చేయడం నుండి, మరియు అత్యధికంగా ప్రమాణాలు చేయడం నుండి కూడా వారించారు. మరియు “ఇతను ఇలా చేశాడు కాబట్టి ఇతను యూదుడు” అని అనడం నుండి మరియు సర్దార్ తన రాజ్యంలోని వారందరినీ “మీరు నా దాసులు మరియు దాసీలు” అనడం నుండి మరియు “నా అంతరాత్మ (మనసు) మలీనమైపోయింది” అని మరియు “షైతాన్ పాడుగాను” అని అదే విధంగా “ఓ అల్లాహ్ నీవు తలుచుకుంటే నన్ను క్షమించు” అని ఇలాంటి పదాలు వాడడం నుండి వారించారు.

14- ఆయన కాలం, గాలి, జ్వరం మరియు కోడిని తిట్టడం నుండి అలాగే అజ్ఞానపు కూతలు కూయడం నుండి వారించారు. అనగా తెగలను పిలవడం మరియు వారి పట్ల పక్షపాతం చూపడం వంటివి మొదలగు.మ


([1]) జాదుల్ మఆద్ 1/163

([2]) జాదుల్ మఆద్ 1/192

([3]) జాదుల్ మఆద్ 1/163

[4] తన్ఈమ్ అంటే మక్కా నుండి మదీనా దారిలో హరం యొచ్చ చివరి హద్దు

93. సూరా అద్ దుహా – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

93. సూరా అద్ – దుహా – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/-brxXfYs6GU [ 50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలు ఇందులో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఊరటనిస్తూ, అల్లాహ్ ఆయన్ను వదలిపెట్టలేదని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనాధబాలునిగా ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేసింది అల్లాహ్ యేనని, మార్గం తెలియని స్థితిలో ఉన్నప్పుడు మార్గం చూపింది అల్లాహ్ యేనని, బీదరికంలో ఉన్నప్పుడు సంపద ప్రసాదించింది అల్లాహ్ యేనని గుర్తుచేయడం జరిగింది. రాబోయే కాలం గతకాలం కన్నా నిశ్చయంగా మేలైనదిగా ఉంటుందని చెప్పడం జరిగింది. అనాధల పట్ల దయతో వ్యవహరించాలని, యాచకులను కసురుకోరాదని, అల్లాహ్ ప్రసాదించిన వరాలను గురించి అందరికీ తెలియజేయాలని చెప్పడం జరిగింది.

సజ్జహ్ (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే మరియు ప్రవక్త ﷺ ను గౌరవించండి | తఖ్వియతుల్ ఈమాన్

ఆయిషహ్ (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముహాజిర్ల, అన్సార్ల సమూహంతో పాటు ఉన్నారు. ఒక ఒంటె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి సజ్జహ్ చేసింది. (సాష్టాంగపడింది). అప్పుడు సహాబాలు, ‘ఓ ప్రవక్తా! మీకు పశువులు, వృక్షాలు కూడా సజ్జహ్ చేస్తున్నాయి. మీకు సజ్జహ్ చేయడంలో వాటికంటే మాకే ఎక్కువ హక్కు ఉంది’ అని విన్నవించుకున్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: ‘మీ ప్రభువును ఆరాధించండి. మీ సోదరుణ్ణి గౌరవించండి’ (హదీసు గ్రంథం ముస్నద్ అహ్మద్ 76/86)

మానవులందరూ పరస్పరం సోదరుల్లాంటి వారు. అందరి కంటే పెద్దవారు పెద్ద సోదరుల్లాంటి వారు. వారిని గౌరవించండి. అందరి యజమాని, ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయన్నే ఆరాధించాలి. దీని ద్వారా తెలిస్తున్న విషయం ఏమిటంటే, అల్లాహ్ సన్నిహితులు ప్రవక్తలు, ఔలియాలు అందరూ నిస్సహాయులే. అల్లాహ్ వారికి ఔన్నత్యం ప్రసాదించాడు. కనుక మనకు సోదరుల్లాంటి వారయ్యారు. వారికి విధేయులై ఉండమని మనల్ని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే మన స్థాయి వారి కంటే చిన్నది. కనుక వారిని మానవుల మాదిరిగానే గౌరవించాలి. వారిని దేవుళ్ళను చేయకూడదు. కొందరు పుణ్యాత్ములను చెట్లు, జంతువులు కూడా గౌరవిస్తాయి. కనుక కొన్ని దర్గాల వద్దకు పులులు, ఏనుగులు, తోడేళ్ళు వస్తుంటాయి. మానవులు వాటితో పోటీ పడకూడదు. అల్లాహ్ తెలిపిన విధంగానే వారిని గౌరవించాలి. హద్దులు మీరి ప్రవర్తించకూడదు. ఉదాహరణకు : ముజావర్లుగా మారి సమాధుల వద్ద ఉండటం షరీఅత్లో ఎక్కడా లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ముజావర్ల(దర్గా యజమానులు) అవతారం ఎత్తకూడదు. మనుషులు జంతువులను చూసి అనుకరించడం సమంజసం కాదు.

ఖైస్ బిన్ సఅద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు : నేను హీరా నగరానికి వెళ్లాను. అక్కడి ప్రజలు తమ రాజుకు సాష్టాంగపడటం నేను చూశాను. నిశ్చయంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సజ్జహ్ చేయబడటానికి ఎక్కువ అర్హులు అని మనసులో అనుకున్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు వెళ్ళి ‘నేను హీరాల్లో ప్రజలను రాజుకు సజ్జహ్ చేస్తుండగా చూశాను. వాస్తవానికి మా సబ్దాలకు మీరే ఎక్కువ హక్కు దారులు’ అని అన్నాను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఒకవేళ నువ్వు నా సమాధి దగ్గర నుండి వెళితే దానిపై సజ్జహ్ చేస్తావా? అని ప్రశ్నించారు. ‘లేదు’ అని సమాధాన మిచ్చాను. అయితే ‘అలా చేయకు’ అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హితబోధ చేశారు.(హదీసు గ్రంథం అబూ దావూద్, హదీస్: 2140)

దీని ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలకు చెప్పదలసిన విషయం ఏమిటంటే – ఏదో ఒకరోజు నేను మరణించి సమాధి ఒడిలో నిద్రపోతాను. అలాంటప్పుడు నేను సజ్జహ్ చేయబడటానికి ఎలా అర్హుణ్ణి కాగలను. నిత్యుడు అయిన అల్లాహ్ యే సజ్జహ్ కు అర్హుడు. కనుక బతికున్న వాడికిగానీ, చనిపోయిన వానికి గానీ సజ్జహ్ చేయకూడదు. సమాధికిగానీ, ఆస్థానంలో కూడా సజ్జహ్ చేయకూడదు. ఎందుకంటే బతికున్న వారు ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయినవారు కూడా ఒకప్పుడు బ్రతికున్నవారే. మనిషి చనిపోయి దేవుడు కాలేడు. దాసునిగానే ఉంటాడు.

ఈ పోస్ట్ క్రింది పుస్తకం లోని 7 వ అధ్యాయం నుండి తీసుకోబడింది:
విశ్వాస ప్రదాయిని(తఖ్వియతుల్‌ ఈమాన్‌)
ఉర్దూ మూలం: హదీసు వేత్త షాహ్‌ ఇస్మాయీల్‌ (రహిమహుల్లాహ్)

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]
మూలం : మర్దిజా ఆల్డ్ రిచ్ టారింటినో
అనువాదం: బా మేరాజ్
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్

[డౌన్లోడ్ పుస్తకం]
[116 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

దైవప్రవక్త సహచరులు జాబిర్ బిన్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:

ఒక వెన్నెల రాత్రి – నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను చూశాను. ఆయన ఎరుపు రంగు దుస్తుల్లో వున్నారు.నేను ఆకాశంలోని చంద్రుణ్ణి ఒకసారి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖారవిందాన్ని మరోసారి ఇలా మార్చి మార్చి చూస్తూ ఉన్నాను.అప్పుడు నాకు ఆకాశంలోని చంద్రుడి కన్నా దైవ ప్రవక్త ముఖారవిందమే నిండు చంద్రునిలా ఎంతో అందంగా కనిపించింది.

1. శుభోదయం
2. నల్ల మచ్చ
3. జమ్ జమ్ బావి
4. వంద ఒంటెల విందు
5. వర్తక బృందం
6. క్రైస్తవ పండితుడు -బహీరా
7. యవ్వనం
8. అల్లాహ్ పిలుపు
9. ఖురైష్ తెగ
10. ప్రతి పక్షం
11. జిన్నాత్
12. రాత్రి ప్రయాణం
13. కొండ గుహ
14. మదీనా
15. మదీనా-2
16. బద్ర్ యుద్ధం
17. ఉహుద్ యద్ధం
18. కందక యుద్ధం
19. తిరిగి రాక

మన పై ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) హక్కులు – సలీం జామి’ఈ [వీడియో]

మనపై ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) హక్కులు – సలీం జామి’ఈ [వీడియో]
https://youtu.be/Eh9min90YQ8 [30 నిముషాలు]

1- ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ను విశ్వసించకపోతే జరిగే నష్టం ఏమిటి ?
2- సహాబాలు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను ఎలా గౌరవించేవారో అలనాటి ఒక అవిశ్వాసి ఇచ్చిన సాక్ష్యం ఏమిటి ?
3- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అభిమానిస్తే ఎంత గొప్ప ప్రయోజనమో తెలుసా ?
4- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను ఎవరెవరు ఆదర్శంగా తీసుకోవాలి ?
5- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ను అనుసరించటం ఎలాగో సహాబాలు చూపిన విధానం ఏమిటి ?
6- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కు ఈ రోజుల్లో మనం అండగా నిలబడటం అంటే ఏమిటి ?
7- ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అనుచరులుగా మనమీద ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి హక్కులు ఏమున్నాయో తెలుసుకొని నెరవేర్చాలి కదా?

కావున ఈ వీడియో చూసి తెలుసుకోండి మరియు బంధు మిత్రులకు షేర్ చేసి తెలియజేయండి

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

రబీ ఉల్ అవ్వల్ నెలలోని కల్పితాచరణలు – ముహమ్మద్ జాకిర్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

రబీ ఉల్ అవ్వల్ నెలలోని కల్పితాచరణలు – ముహమ్మద్ జాకిర్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/hnKnm_DP4eo [34 నిముషాలు]