దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నిజ సృష్టికర్తను ఎలా గుర్తించాలి? ఆయన గుణగణాలేమిటి? https://youtu.be/YXvC41kqzPw(8:34 నిముషాలు ) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ ప్రసంగంలో “అల్లాహ్ అంటే ఎవరు?” మరియు “అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి?” అనే రెండు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. పొగను చూసి నిప్పును, వస్తువును చూసి దాని తయారీదారుని గుర్తించినట్లే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని చూసి దాని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని తార్కికంగా అర్థం చేసుకోవచ్చని వక్త వివరిస్తారు. ఆ సృష్టికర్త ఒక్కడేనని, ఆయనకు ఎవరూ సాటిలేరని స్పష్టం చేస్తారు. ఆయన ఏకత్వాన్ని, గొప్పతనాన్ని మరియు లక్షణాలను వివరించడానికి, వక్త దివ్య ఖురాన్‌లోని ‘సూరహ్ అల్-ఇఖ్లాస్’ మరియు ‘ఆయతుల్ కుర్సీ’లను వాటి తెలుగు అనువాదంతో సహా ఉదహరించారు. ఈ వచనాల ద్వారా అల్లాహ్ నిరపేక్షాపరుడని, సజీవుడని, సర్వజ్ఞుడని, మరియు ఆయనకు తల్లిదండ్రులు, సంతానం లేరని, ఆయనకు ఎవరూ సమానులు కారని నొక్కిచెప్పారు. సత్యాన్ని గ్రహించి, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్‌ను ఆరాధించాలని ఈ ప్రసంగం పిలుపునిస్తుంది.
అల్హందులిల్లాహ్. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ రెండు ప్రశ్నలకు సంక్షిప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.
అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు మనం లాజికల్‌గా కూడా సమాధానం పొందవచ్చు. అంటే, పొగను చూసి దూరంగా, పొగను చూసి అక్కడ అగ్ని మండుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాము. ఒక టేబుల్‌ను, కట్టెతో చేయబడిన అల్మారీని చూసి, దీనిని తయారు చేసేవాడు ఒక కార్పెంటర్ అని, ఎక్కడైనా ఏదైనా మంచి డిజైన్‌ను చూసి ఒక మంచి ఆర్టిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉదాహరణలు మన ముందుకు వస్తాయి కదా.
అయితే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని మన కళ్లారా మనం చూస్తూనే ఉన్నాము కదా. అయితే, వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని అట్లే మనకు తప్పకుండా తెలుస్తుంది. ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు.
ఈ లోకంలో ఆ నిజమైన సృష్టికర్తను వదలి ఎంతోమంది ప్రజలు వేరే ఎవరెవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఒక్కసారి ప్రశాంతమైన మనసుతో మీరు ఆలోచించండి. ఆ ఆరాధ్యులలో, ఎవరినైతే ఆ నిజ సృష్టికర్తను వదిలి ఎవరినైతే ప్రజలు పూజిస్తున్నారో, ఆ పూజ్యులలో ఏ ఒక్కరైనా గానీ “మేము ఆకాశం సృష్టించామని, భూమిని మేము సృష్టించామని, వర్షాన్ని మేము కురిపిస్తున్నామని,” ఈ విధంగా ఏమైనా దావా చేసిన వారు ఉన్నారా? లేరు. ఉండరు కూడా.
అయితే, ఇంకా ఇలాంటి ఉదాహరణలతోనే మీకు సమాధానాలు ఇస్తూ ముందుకు పోవడం మంచిది కాదు. స్వయంగా ఆ సృష్టికర్త, మనందరి నిజ ఆరాధ్య దైవం, ఆయన యొక్క అంతిమ గ్రంథంలో సర్వ మానవాళిని ఉద్దేశించి, స్వయంగా ఆయన తన గురించి ఏ పరిచయం అయితే మనకి ఇచ్చాడో, ఒక్కసారి శ్రద్ధగా ఆలకిద్దాము.
“వారికీ ఇలా చెప్పు, అల్లాహ్ ఆయన ఒక్కడు, ఏకైకుడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఏ అవసరం లేని వాడు, సృష్టిలో ప్రతీ ఒక్కరి అవసరాన్ని తీర్చువాడు. ఆయన ఎవరిని కనలేదు అంటే, ఆయనకు భార్య, పిల్లలు ఎవరూ లేరు. ఇంకా, ఆయన కూడా ఎవరికీ పుట్టిన వాడు కాడు, అంటే ఆయనకు తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేడు.“
ఇది దివ్య గ్రంథం, సర్వ మానవాళి కొరకు మార్గదర్శిగా పంపబడినటువంటి దివ్య గ్రంథం ఖురాన్‌లోని 112వ అధ్యాయం.
ఇక ఆ సృష్టికర్త అయిన అల్లాహ్, సూరతుల్ బఖరా, సూరహ్ నెంబర్ రెండు, ఆయత్ నెంబర్ 255లో తన గురించి ఎలా పరిచయం చేశాడో, చాలా శ్రద్ధగా ఆలకించండి.
ఆ నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సుమారుపది గుణాలు ఈ ఆయతులో తెలుపబడ్డాయి. శ్రద్ధగా వినండి మరియు ఆయన తప్ప ఈ సృష్టిలో ఏ ఒక్కరిలోనైనా ఈ గుణాలు ఉన్నాయా గమనించండి. తద్వారా ఆయన ఏకైకుడు, ఆయనే ఒకే ఒక్కడు మన ఆరాధనలకు అర్హుడు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని కూడా గ్రహించండి. ఇప్పుడు నేను మీ ముందు పఠించినటువంటి ఆయతి యొక్క తెలుగు అనువాదం:
అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గానీ నిద్ర గానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్సీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, చాలా గొప్పవాడు.
అల్లాహు అక్బర్. అధ్యాయం 112లో మీరు సుమారు నాలుగు Unique , సాటి లేని అటువంటి గుణాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చదివిన ఈ రెండవ అధ్యాయంలోని 255వ ఆయతులో సుమారు పది గుణాలు తెలుసుకున్నారు. నిశ్చింతగా, ఏకాంతంలో పరిశీలించండి. మరియు మన ఈ శరీరంలో నుండి ప్రాణం వీడకముందే సత్యాన్ని గ్రహించండి. ఆ నిజమైన సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమాకు సంబంధించిన రెండు ముఖ్యమైన హదీసులను ఈ ప్రసంగం వివరిస్తుంది. మొదటి హదీసు, జుమా ప్రసంగం జరుగుతున్నప్పుడు ఆలస్యంగా వచ్చి, ముందు వరుసలకు చేరుకోవడానికి ప్రజలను దాటుకుంటూ, వారి భుజాలను తోసుకుంటూ వెళ్ళడం నిషిద్ధమని స్పష్టం చేస్తుంది. అలా చేయడం ఇతరులకు ఇబ్బంది మరియు బాధ కలిగించడమేనని ప్రవక్త హెచ్చరించారు. రెండవ హదీసు, జుమా ప్రసంగం వింటున్నప్పుడు నిద్రమత్తు (కునుకు) వస్తే, ఆ స్థలం నుండి లేచి వేరే చోట కూర్చోవాలని సూచిస్తుంది. ఇలా చేయడం వల్ల నిద్రమత్తు దూరమవుతుందని ప్రవక్త తెలిపారు. ఈ రెండు హదీసులు జుమా రోజున ముస్లింలు పాటించవలసిన మర్యాదలు మరియు నియమాలను తెలియజేస్తాయి.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
జుమాకు సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు.
ఈరోజు, జుమా సందర్భంలో ప్రజల మధ్యలో నుండి దాటి ముందుకు వెళ్ళడం.
సునన్ అబీ దావూద్ (1118) మరియు సునన్ నిసాయి (1398)లో అబ్దుల్లా బిన్ బుస్ర రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు:
جَاءَ رَجُلٌ يَتَخَطَّى رِقَابَ النَّاسِ يَوْمَ الْجُمُعَةِ (జా అ రజులున్ యతఖత్తా రిఖాబన్-నాసి యౌమల్ జుముఆ). జుమా రోజు ఒక వ్యక్తి ప్రజల యొక్క మెడలను చీల్చుతూ ముందుకు రాసాగాడు.
وَالنَّبِيُّ صلى الله عليه وسلم يَخْطُبُ (వన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం యఖ్తుబు). ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇస్తున్నారు, అంటే జుమా ప్రసంగం ప్రసంగిస్తున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని చూసి,
اجْلِسْ فَقَدْ آذَيْتَ (ఇజ్లిస్ ఫఖద్ ఆదైత) “అక్కడే కూర్చో, నీవు ప్రజలకు ఇబ్బంది కలిగించావు, బాధ కలిగించావు” అని చెప్పారు.
ఇది సహీహ్ హదీస్. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే, ఎవరైతే జుమా నమాజులో ముందు వస్తారో, ముందు పంక్తులను వారు పూర్తి చేయాలి. స్థలము ఖాళీగా వదిలి వెనుక కూర్చుండే ప్రయత్నం చేయకూడదు. మరియు వెనుక వచ్చేవారు ఇద్దరి మధ్యలో నుండి, వారి మెడలను, వారి యొక్క భుజాలను ఈ విధంగా చీలుస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం ఇది మంచి విషయం కాదు. ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించకుండా, ఎక్కడ స్థలం దొరుకుతుందో వెనుక వచ్చేవారు అక్కడే కూర్చునే ప్రయత్నం చేయాలి.
జుమా సందర్భంలో కునుకు వస్తే ఏమి చేయాలి?
దీనికి సంబంధించిన హదీస్ అబూ దావూద్ (1119) మరియు తిర్మిది (526)లో అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను:
إِذَا نَعَسَ أَحَدُكُمْ وَهُوَ فِي الْمَسْجِدِ فَلْيَتَحَوَّلْ مِنْ مَجْلِسِهِ ذَلِكَ إِلَى غَيْرِهِ (ఇదా నఅస అహదుకుమ్ వహువ ఫిల్ మస్జిద్ ఫల్-యతహవ్వల్ మిన్ మజ్లిసిహి దాలిక ఇలా గైరిహి) “మీలో ఎవరైనా మస్జిద్ లో ఉండగా అతనికి కునుకు వస్తే, అతడు తన కూర్చున్న ఆ స్థలాన్ని వదిలి వేరే స్థలంలో వెళ్ళాలి, స్థలం మార్చుకోవాలి.”
దీని ద్వారా ఏం తెలిసింది? ఈ విధంగా మనకు కునుకు అనేది దూరమైపోతుంది, స్థలం మార్చడం మూలంగా.
అల్లాహ్ యొక్క దయవల్ల ఈ రోజు రెండు హదీసులు మనం తెలుసుకున్నాము. అల్లాహు తఆలా మరింత ఎక్కువ ధర్మజ్ఞానం ఖురాన్ హదీసుల ఆధారంగా మనకు ప్రసాదించు గాక. వాటి ప్రకారం ఆచరించి ఇతరులకు ధర్మ ప్రచారం చేసే అటువంటి సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని కూడా ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
హదీసుల పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా

విషయ సూచిక
1. రమ’దాన్ నెలవంక చూడటం – హదీస్ 1969 | పేజీ 620 2. ఉపవాసం గురించి వివిధ విషయాలు – హదీస్ 1982 | పేజీ 625 3. ఉపవాసాన్ని శుద్ధిపరచటం – హదీస్ 1999 | పేజీ 629 4. ప్రయాణికుని ఉపవాసం – హదీస్ 2019 | పేజీ 633 5. తప్పిన ఉపవాసాలు పూర్తి చేసుకోవటం – హదీస్ 2030 | పేజీ 636 6. అదనపు ఉపవాసాలు – హదీస్ 2036 | పేజీ 638 7. అదనపు (నఫిల్) ఉపవాసాల విరమణ – హదీస్ 2076|పేజీ 647 8. ఘనతగల రాత్రి (లైలతుల్ ఖద్‌ర్) – హదీస్ 2083 | పేజీ 649 9. ఏ’తెకాఫ్ – హదీస్ 2097|పేజీ 653
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌దహూ, లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.“
అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వ స్తోత్రములు ఆయనకే చెల్లును, ఆయనే అన్నింటి పై అధికారం కలవాడు.
(బుఖారీ, ముస్లిం).
ఎవరైతే దీనిని రోజు వందసార్లు పఠిస్తారో అతడు పదిమంది బానిసలను విముక్తి చేసినట్లు అతడికి వ్రాయబడతాయి. వంద పుణ్యాలు లభిస్తాయి. అతని వంద తప్పులు తుడిచి వేయబడతాయి. అతడికి అది ఆరోజంతా ప్రొద్దుగూకే వరకు షైతాను బారినుండి రక్షణవుతుంది. మరియు అతడు ఖయామత్ రోజున తీసుకుని వచ్చే ఈ ఆచరణ కంటే శ్రేష్టమైనది మరెవ్వరూ తీసుకుని రాలేరు కాని దీనికంటే ఎక్కువ ఆచరించిన వారుతప్ప.
[అల్‌బుఖారీ 4/95 మరియు ముస్లిం 4/2071]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ విధేయతా విధానం మరియు మీలాదున్నబీ, దర్గాల వద్ద జరిగే ఆరాధనలు మరియు మ్రొక్కుబడులు, ముహర్రం నెలలో జరిగే బిదఆతులు, నెల్లూరు రొట్టెల పండుగ, సఫర్ నెలలో జరిగే బిదఆతులు, ఆఖరి చహర్షుబా, శకునాలు, రజబ్ నెల బిదఆతులు, రజబ్ కె కుండే, మేరాజ్ నబీ పండుగ, షాబాన్ నెల బిదఆతులు, వసీలాలోని బిదఆతులు, ఉరుసుల ఆచారాలు, తావీజులు, చేతబడులు, జాదూ, ఇంద్రజాలం, జ్యోతిష్యం, వాలెంటైన్స్ డే పండుగ మొదలైన ఇస్లాం ధర్మంలో లేని బిదఆతులు అంటే నూతన కల్పితాల గురించి ఈ పుస్తకంలో రచయిత సవివరంగా ప్రామాణిక ఆధారాలతో చర్చించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తీవ్ర ఎండకాలంలో ఉపవాసం పాటించడం మన సహాబాల సదాచారం:
హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజియల్లాహు అన్హు) తీవ్ర ఎండకాలంలో నఫిల్ ఉపవాసాలు ఉండేవారు.
ముఆజ్ (రజియల్లాహు అన్హు) తన మరణ సమయంలో అన్నారు: “చావు వల్ల బాధ లేదు, ప్రతి ఒక్కరికీ రానుందే, కాని ఆ ఎండ తాపాన్ని భరిస్తూ ఉండే ఉపవాసాలు ఇక ఉండలేను కదా అని బాధ.”
ఉమర్ (రజియల్లాహు అన్హు) మరణించే ముందు తన సుకుమారుడైన అబ్దుల్లాహ్ కు చేసిన వసియ్యత్: “నీవు విశ్వాస ఉత్తమ గుణాల్ని అవలంభించు: వాటిలో మొదటిది తీవ్ర ఎండకాలంలో ఉపవాసాలు పాటించు” అని చెప్పారు.
ప్రియపాఠకుల్లారా! పైన సహాబాల కొన్ని ఉదారహణలు ఏవైతే తెలిపానో అవి వారి నఫిల్ ఉపవాసాల విషయం. రమజాను యొక్క ఫర్జ్ ఉపవాసాలైతే ఎలాగైనా ఉండేవారు. ఈ రోజుల్లో మనలో అనేక మంది రమజాను ఉపవాసాలకు ఎండలు బాగున్నాయి కదా అని, ఉండకూడని సాకులు వెతుకుతారు. కాని సహాబాలు ప్రయాణాలు చేసుకుంటూ, అంతే కాదు తీవ్ర ఎండకాలంలో యుద్ధాలు చేసుకుంటూ కూడా ఉపవాసాలు పాటించారు. తబూక్ యుద్ధం ఏ కాలంలో ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసా? మండుతున్న ఎండలు, పండుతున్న ఖర్జూరాలు, కోతకు వచ్చిన ఖర్జూరాలు గనక చేతులో చిల్లి గవ్వ లేని పరిస్థితి ఎందరిదో! అప్పుడు కొంతమంది కపటవిశ్వాసులు తప్పించుకునే ఉద్దేశంతో ఈ తీవ్ర ఎండల్లో ఎలా బయలుదేరాలి అని సాకులు చెబుతూ,[لَا تَنفِرُوا فِي الْحَرِّ] (ఇంత తీవ్రమైన ఎండ వేడిలో బయలుదేరకండి) అని ఇతరులను ఆపే ప్రయత్నం చేశారు, అప్పుడు అల్లాహ్ తెలిపాడు:
“నరకాగ్ని ఇంతకన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది” అని వారికి చెప్పు. ఆ సంగతిని వారు గ్రహిస్తే ఎంత బావుండు!” (తౌబా 9:81).
హజ్జాజ్ ఒక ప్రయాణంలో మక్కా మదీనాల మధ్య నీళ్ళున్న చోట మజలీ చేశాడు, పగటి భోజనం తీసుకరమ్మని చెప్పాడు, సమీపంలో ఓ ఎడారివాసి (బద్దూ) కనబడగా అతడ్ని పగటి భోజనానికి ఆహ్వానించాడు, అతడన్నాడు: నీకంటే మేలైనవాడు నన్ను ఆహ్వానిస్తే నేను అతని ఆహ్వానాన్ని స్వీకరించాను. అతడెవుడు అని హజ్జాజ్ అడిగాడు, బద్దూ చెప్పాడు: అల్లాహ్! ఉపవాసముండమని చెప్పాడు, నేను ఉపవాసమున్నాను. ఈ మండుతున్న ఎండలోనా ఉపవాసం అని హజ్జాజ్ ఆశ్చర్యంగా అడిగాడు, అతడన్నాడు: “అవును, దీనికంటే మరీ విపరీతమైన ప్రళయం నాటి ఆ వేడి నుండి రక్షణ కొరకు ఉపవాసమున్నాను” అని చెప్పాడు. ఈ సమాధానం విని హజ్జాజ్ చెప్పాడు: “నఫిల్ ఉపవాసమే గనక ఈనాటి ఉపవాసం వదులుకో, నాతో కలసి భోజనం చేయి, రేపటి రోజు ఉపవాసం ఉండు”. అప్పుడు ఆ ఎడారివాసి “రేపటి రోజు వరకు నేను బ్రతికుంటానని జమానతు (గ్యారంటీ) ఇవ్వగలవా” అని అడిగాడు. ఆ జమానతు నేనివ్వలేనని హజ్జాజ్ చెప్పాడు.
గమనించారా పాఠకుల్లారా! మనిషి విశ్వాసపరంగా ఎంత బలంగా ఉండునో, మనస్థైర్యం ఎంత దృఢంగా ఉండునో అంతే ఎండల్ని ఓర్చుకోనైనా ఉపవాసాలు ఉండగలుగుతాడు.
మండుటెండల్లో ఉపవాసం యొక్క మాటే వేరు. దాని రుచి, దాని అనూన్యమైన ఆహ్లాదం సౌభాగ్యులకు, అదృష్టవంతులకే లభిస్తుంది. చెప్పుకుంటు పోతే సలఫె సాలిహీన్ లో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
కాని చివరిలో ఒకే ఒక విషయం గుర్తు చేస్తాను, శ్రద్ధగా బుద్ధిపూర్వకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి: అదేమిటంటే: ప్రళయం నాడు సూర్యుడు అతి సమీపంలో ఉంటాడో, 50 వేల సంవత్సరాలకంటే దీర్ఘకాలం అది, ప్రతి ఒక్కడు తన పాదాన్ని కదిలించలేని స్థితిలో ఉంటాడు, ప్రతి ఒక్కడు తన పాపాల పరిమాణంలో తన చెమటలో మునిగి ఉంటాడు, ఛాయ ఎక్కడా ఉండదు, కేవలం అల్లాహ్ అర్ష్ ఛాయ తప్ప. ఇన్నీ ఘోరమైన పరిస్థితులను ఎదురుకునే శక్తి నీలో ఏమైనా ఉందా? లేదు, ముమ్మాటికీ లేదు!!!
ఇక దేనికి ఆలస్యం ఉపవాసం ఉండడంలో.
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ ZFGO జుల్ఫీ దావా సెంటర్ – సౌది అరేబియా
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
నమాజ్ యొక్క వాజిబులు:
1- మొదటి తక్బీరె తహ్రీమ తప్ప మిగిత అన్ని తక్బీర్లు.
2- రుకూలో కనీసం ఒక్కసారైనా సూబ్హాన రబ్బియల్ అజీం అనడం.
3- రుకూ నుండి లేస్తూ ఇమాం మరియు ఒంటరి నమాజి సమిఅల్లాహు లిమన్ హమిదహ్ అనడం.
4- రుకూ నుండి నిలబడి రబ్బనా వలకల్ హంద్ అనడం.
5- సజ్దాలో కనీసం ఒక్కసారైనా సుబ్హాన రబ్బియల్ అఅలా అనడం.
6- రెండు సజ్దాల మధ్యలో రబ్బిగ్ ఫిర్లీ అనడం.
7- మొదటి తషహ్హుద్ చదవడం.
8- మొదటి తషహ్హుద్ చదవడానికి కూర్చోవడం.
నమాజ్ యొక్క రుకున్ లు:
1- ఫర్జ్ నమాజులో శక్తి ఉన్నప్పుడు నిలబడటం. నఫిల్ నమాజులో నిలబడటం తప్పనిసరి కాదు. కాని కూర్చుండి నమాజు చేసేవారికి, నిలబడి చేసేవారికంటే సగం పుణ్యం లభిస్తుంది.
2- తక్బీరె తహ్రీమ.
3- ప్రతి రకాతులో సూరె ఫాతిహ పఠించడం.
4- ప్రతీ రకాతులో రుకూ చేయడం.
5- రుకూ నుండి లేచి నిటారుగా నిలబడటం.
6- ప్రతీ రకాతులో రెండు సార్లు ఏడు అంగములపై సజ్దా చేయడం.
7- రెండు సజ్దాల మధ్య కూర్చోవడం.
8- నమాజులోని రుకూ, సజ్దా మొదలైన అంశాలన్నిటినీ నింపాదిగా, శాంతిగా నెరవేర్చడం.
9- చివరి తషహ్హుద్.
10- తషహ్హుద్ కొరకు కోర్చోవడం.
11- దరరూదె షరీఫ్ (అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది…..)
12- సలాం తింపడం.
13- ప్రతి రుకున్ నెరవేర్చడంలో క్రమ పద్దతిని పాటించడం
నమాజులో మరచిపోవుట:
ఎవరైనా నమాజులో మరచిపోతే, అంటే; నమాజులో ఏదైనా అదనపు కార్యం లేదా ఏదైనా కొరత జరుగుతే, లేదా అలాంటి అనుమానం ఏదైనా కలుగుతే నమాజు చివరిలో రెండు సజ్దాలు చేయాలి. వీటిని సహ్ వ్ సజ్దా అంటారు.
మరచిపోయి నమాజులో ఏదైనా హెచ్చింపు జరిగినప్పుడు, అంటే; ఖియాం, లేదా రుకూ, లేదా సజ్దా లాంటిదేదైనా ఎక్కువ చేసినప్పుడు సలాం త్రిప్పిన తరువాత రెండు సహ్ వ్ సజ్దాలు చేయాలి.
ఒకవేళ మరచిపోయి నమాజులో ఏదైనా కొరత జరిగినప్పుడు అంటే; నమాజులో చేయవలసిన ఏదైనా కార్యం చేయక, చదవ వలసినది ఏదైనా చదవక కొరత జరుగుట. ఒకవేళ అది ‘రుకున్’ అయితే, దాని రెండు స్థితులు: ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తర్వాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు వస్తే, వెంటనే ఆ ‘రుకున్’ నెరవేరుస్తూ, ఆ రకాతులో దాని తరువాత ఉన్నవాటిని పూర్తి చేయాలి([1]). సలాం తింపేకి ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఆ ‘రుకున్’ ఏ రకాతులో మరచిపోయాడో దాని తరువాత రకాతు ఆరంభానికి ముందు ఆ విషయం గుర్తుకు రాకుంటే ఆ రకాత్ కానట్లే లెక్క. ఇప్పుడు చేస్తున్న రకాతే దాని స్థానం తీసుకుంటుంది([2]).
మరచిపోయిన రుకున్ సలాం తరువాత కొద్ది క్షణాలకే గుర్తుకు వస్తే, పూర్తి ఒక రకాత్ చేసి, సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. తొందరగా గుర్తుకు రాక, ఆలస్యంగా గుర్తుకు వస్తే, లేదా వుజూ భంగమయితే తిరిగి పూర్తి నమాజు చేయాలి.
ఏదైనా వాజిబ్ ఉదాహరణకు మొదటి తషహ్హుద్, మరచిపోతే సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేస్తే సరిపోతుంది.
ఇక అనుమాన స్థితికి గురైనప్పుడు; ఈ అనుమానం రకాతుల సంఖ్యలో ఉంటే, ఉదా: రెండు రకాతులు చదివానా లేదా మూడా? అని సందేహం కల్గితే, తక్కువ సంఖ్యపై నమ్మకం ఉంచుకొని, మిగిత రకాతులు పూర్తి చేసుకోవాలి. సలాంకు ముందు సజ్దా సహ్ వ్ చేయాలి. ఒకవేళ రుకున్ విషయంలో సందేహం కలుగుతే, దాన్ని చేయలేని కింద లెక్క కట్టి, దాన్ని నెరవేర్చాలి. దాని తరువాత రకాతులు చేసుకోవాలి. సజ్దా సహ్ వ్ చేయాలి.
వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
[1] దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడ్డాడు కాని ఖిరాత్ ఆరంభానికి ముందే అతనికి మరచిపోయిన రుకూ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అతను రుకూ చేయాలి, రెండు సజ్దాలు చేయాలి. మళ్ళీ రెండవ రకాతు కొరకు నిలబడి యథా ప్రకారంగా నమాజు పూర్తి చేయాలి.
[2] దీని ఉదాహరణః ఒక వ్యక్తి మొదటి రకాతులో ఖిరాత్ తర్వతా రుకూ మరచిపోయి రెండు సజ్దాలు కూడా చేశాడనుకుందాము. రుకూ నమాజు ‘రుకున్’లలో ఒకటి. ఇక అతడు రెండవ రకాతు కొరకు నిలబడి, ఖిరాత్ ఆరంభించిన తర్వాత గుర్తుకు వస్తే అతని ఆ రకాతు, ఎందులో అతను రుకూ మరచిపోయాడో అది కానట్లే. అందుకు ఈ రెండవ రకాతు మొదటి రకాతు స్థానంలో ఉంటుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.