సమాజ సంస్కరణ – ధార్మిక బహిరంగ సభ వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/Htvm7QPyjI4 [47 నిముషాలు]
ఈ ప్రసంగం ఖురాన్ మరియు హదీసుల జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా స్వర్గ మార్గాన్ని సులభతరం చేసుకోవడం గురించి వివరిస్తుంది. సమాజ సంస్కరణ అనేది వ్యక్తిగత సంస్కరణ మరియు అల్లాహ్ పట్ల బలమైన విశ్వాసం (అఖీదా)తో మొదలవుతుందని వక్త ఉద్ఘాటించారు. షాబాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా ఉపవాసాలు ఉండేవారని, ఇది ప్రజలు నిర్లక్ష్యం చేసే నెల అని పేర్కొన్నారు. షబే బరాత్ (షాబాన్ 15వ రాత్రి) పేరుతో సమాజంలో ఉన్న బిద్అత్ (కొత్త ఆచారాల)ను, ప్రత్యేక నమాజులు, సమాధుల సందర్శన వంటి వాటిని ఆధారాలతో ఖండించారు. చివరగా, ప్రామాణికమైన ఇస్లాం ధర్మాన్ని నేర్చుకోవడానికి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రండి❗షబె బరాత్ ఇలా జరుపుకుందాం వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/yJX3ZOTXNJw [11 నిముషాలు]
ఈ ప్రసంగంలో, షబే బరాత్ యొక్క వాస్తవికత, దాని గురించిన మూడు రకాల అభిప్రాయాలు మరియు హదీసుల వెలుగులో సరైన ఆచరణ పద్ధతులు వివరించబడ్డాయి. మొదటి అభిప్రాయం ప్రకారం, దీనికి సంబంధించిన హదీసులు ప్రామాణికం కానందున ఇది ఒక సాధారణ రాత్రి. రెండవ అభిప్రాయం, అతిగా వెళ్ళి, ప్రత్యేక ప్రార్థనలు, అలంకరణలు, కొత్త బట్టలు మరియు కొన్ని మూఢనమ్మకాలతో దీనిని జరుపుకుంటారు. మూడవ మరియు సరైన అభిప్రాయం ప్రకారం, షాబాన్ 15వ రాత్రి అల్లాహ్ తన సృష్టిని చూసి, బహుదైవారాధన (షిర్క్) చేసేవారు, ద్వేషం పెంచుకున్నవారు, మరియు ఇతర పెద్ద పాపాలు చేసేవారు తప్ప అందరినీ క్షమిస్తాడు. కాబట్టి, ఈ రాత్రి చేయవలసిన అసలైన పని ప్రత్యేక ఉత్సవాలు కాదు, బదులుగా మన విశ్వాసాన్ని (తౌహీద్) శుద్ధి చేసుకోవడం, ఇతరులపై ఉన్న ద్వేషాన్ని, కక్షను తొలగించుకోవడం, మనం చేసిన అన్యాయాలను సరిదిద్దుకోవడం, మరియు పాపాల నుండి దూరంగా ఉండటం. ఈ విధంగా మన హృదయాలను శుభ్రపరుచుకుని పడుకుంటే అల్లాహ్ యొక్క క్షమాపణను పొందుతామని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ. (అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బఅద్) సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహచరులపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత…
రండి, షబే బరాత్ ఇలా జరుపుకుందాము.
ఈ అంశంపై ఈ రోజు సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.
ఇస్లామీయ క్యాలెండర్ షాబాన్, ఎనిమిదవ నెల, 13వ తారీఖు ఈరోజు పూర్తయిపోయింది. రేపు మగ్రిబ్ తర్వాత 14వ రోజు పూర్తి అయ్యి 15వ రోజు మొదలవుతుంది. అయితే ఎన్నో ప్రాంతాల్లో, ఎంతో మంది షబే బరాత్, బడోంకీ ఈద్, ముర్దోంకీ ఈద్ అన్న పేరుతో, పెద్దల పండుగ అని కూడా కొందరు అంటారు కొన్ని ప్రాంతాల్లో, ఇలా రేపటి రాత్రిని జరుపుకుంటారు. దీని గురించి వాస్తవం ఏమిటి?
అయితే ఆ వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి, రండి షబే బరాత్ ఇలా జరుపుకుందాము అన్నటువంటి ఒక టాపిక్, ఒక అంశం, హెడ్లైన్ పెట్టాను. మీకు స్పష్టంగా, సులభంగా అర్థం కావడానికి మూడు విషయాలు గుర్తుంచుకోండి. షబే బరాత్ విషయంలో మూడు అభిప్రాయాలు, మూడు రకాల మనుషులు ఉన్నారు.
కొందరు ఏమంటారు, షబే బరాత్ కు సంబంధించి ఎన్ని హదీసులైతే వచ్చాయో, ఏ ఒక్కటీ సహీ లేదు గనక, వేరే సామాన్య రోజులు ఎలాగైతే ఉన్నాయో, అలాంటిదే ఆ 15వ రాత్రి షబే బరాత్.
రెండో వర్గం వారు, షబే బరాత్ గురించి చాలా హదీసులు వచ్చాయి అని, ఆ రోజు రాత్రి జాగారం చేయడం, మస్జిదులను అలంకరించుకోవడం, కొత్త బట్టలు ధరించడం, సమాధులను సందర్శించడం, ప్రత్యేకమైన కొన్ని వంటకాలు వండుకోవడం, అంతేకాదు, గత షబే బరాత్ నుండి ఇప్పటివరకు మన బంధువుల్లో ఎవరెవరైతే చనిపోయారో వారి ఆత్మలు వచ్చి శాంతి పొందుతాయి, మనం వండినటువంటి వంటలను తింటారు కూడా అన్నటువంటి మూఢనమ్మకాలు కూడా కొందరిలో ఉన్నాయి.
అయితే ఈ రెండు అభిప్రాయాలు కూడా సత్యానికి, ధర్మానికి, ఖురాన్, హదీస్ ఏదైతే చెబుతుందో దానికి దూరంగా ఉన్నారు. ఈ రెండు వర్గాల వారు కూడా సత్యానికి, ధర్మానికి దూరంగా ఉన్నారు.
సరైన అభిప్రాయం
మూడవ, సత్యమైన అభిప్రాయం, మూడవ మాట ఏదైతే ఖురాన్, హదీసులకు ఆధారంగా మనకు కనబడుతుందో అది ఏమిటంటే, షాబాన్ 15వ రాత్రి, ‘లయలతున్ నిస్ఫి మిన్ షాబాన్’ అని పదాలు వస్తాయి అరబీలో హదీసులో. దానినే సర్వసామాన్యంగా షబే బరాత్ అంటారు. షబే బరాత్ అన్న పేరు ఇది సరైనది కాదు. ఎందుకు? దాని రీజన్ టైం ఉంటే తర్వాత చెబుతాను. కానీ హదీసులో వచ్చిన పదాలు ఏంటి? మీరు కనీసం అల్-మక్తబతుష్ షామిలా లేదా ఇంగ్లీష్ తెలిసిన వారు మన ఎంతో మంది యువకులు ఉన్నారు, స్టూడెంట్స్, sunnah.com అని చూస్తే సుమారు తొమ్మిది, పది హదీసు గ్రంథాలు అరబీలో, ఇంగ్లీష్లో ఉన్నాయి. దాంట్లో గనక మీరు ‘లయలతన్ నిస్ఫి మిన్ షాబాన్’ అని రాస్తే మీకు దానికి సంబంధించిన ఎన్నో హదీసులు కనబడతాయి.
షబే బరాత్ సరైన పదం కాదు, దాని రీజన్ టైం ఉంటే వివరంగా తర్వాత చెబుదాము. కానీ మన అసలైన మాట, షబే బరాత్ అని ఏ రాత్రిని అనుకుంటున్నారో దాని గురించి హదీసులో వచ్చిన పదాలు, ‘లయలతన్ నిస్ఫి మిన్ షాబాన్’. తెలుగు అనువాదం ఏమవుతుంది? షాబాన్ యొక్క సగం. ‘నిస్ఫ్’ అంటే సగం. షాబాన్, షాబాన్. ‘లయలా’ రాత్రి. అంటే ఏమిటి? సర్వసామాన్యంగా మనం సులభంగా అర్థం కావడానికి 15వ షాబాన్ రాత్రి అని అంటాము.
15వ షాబాన్ రాత్రి గురించి కొన్ని హదీసులు వచ్చాయి. ఆ హదీసుల్లో ఉన్న మాట ఏంటి? దాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకోకుండా కొందరు లేదు అని, ఇదొక మితవాదం, మరికొందరు హదీసులు ఉన్నాయి అని, ఉన్న భావాన్ని, అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా ఆ ప్రకారంగా ఆచరించకుండా దానికి వ్యతిరేకంగా, భిన్నంగా మరికొన్ని రకాల బిద్అత్ లకు పాల్పడుతున్నారు.
అయితే హదీసుల్లో వచ్చిన విషయం, ఆ హదీసులు మీకు వినిపిస్తాను. శ్రద్ధగా మీరు వింటారని ఆశిస్తున్నాను. ఇందులో ఒక హదీస్ షేఖ్ అల్బానీ రహీమహుల్లాహ్ వారు ‘సహీహుత్ తర్ఘీబ్’లో ప్రస్తావించారు. హదీస్ నెంబర్ 54. నిశ్చయంగా అల్లాహ్ త’ఆలా, బిద్అత్ చేసే వ్యక్తి తన బిద్అత్ ను వదులుకొనంత వరకు అతని నుండి తౌబాను ఆపుకొని ఉంటాడు.
ఈ హదీస్ నేను ముందు వినిపించాను. అసలు టాపిక్ కు కొంచెం భిన్నంగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, లేనిపోని విషయాలు, ఇస్లాం తెలుపని విషయాలు మనం చెప్పుకుంటే, చేస్తే దాని ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకొరకు చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే హదీసులో వచ్చిన విషయం ఏంటి?
‘ఇదా కానత్ లయలతున్ నిస్ఫి మిన్ షాబాన్’, ఎప్పుడైతే షాబాన్ యొక్క 15వ రాత్రి ఉంటుందో, ‘ఇత్తలఅల్లాహ్’ (అల్లాహ్ చూస్తాడు). అల్లాహ్ త’ఆలా తన సృష్టి రాశులను చూస్తాడు. ఫయఘ్ఫిర్ (క్షమిస్తాడు). అల్లాహ్ త’ఆలా అందరినీ క్షమించేస్తాడు. ఒకవేళ క్షమించకుంటే ఎవరెవరిని క్షమించడు? ఎవరైతే షిర్క్ చేస్తారో, ద్వేషాలు పెంచుకుంటారో, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఇలాంటి కొన్ని విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు, నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో, వేరువేరు హదీసుల్లో వచ్చిన విషయం.
వాటి సారాంశం ఏమిటంటే, మనిషి సామాన్య రాత్రుల మాదిరిగా, ఈ 15వ షాబాన్ రాత్రి ప్రత్యేకించుకొని ఏదైనా ఉత్సవం మాదిరిగా, పండుగ మాదిరిగా, కొత్త బట్టలు ధరించడం, మస్జిదులను అలంకరించుకోవడం, ఇండ్లను అలంకరించుకోవడం, ఇవన్నీ ఏమీ చేయకుండా తన యొక్క విశ్వాసాన్ని శుద్ధిపరుచుకొని, అన్ని రకాల షిర్క్, బహుదైవారాధనలకు దూరంగా ఉండే విధంగా చూసుకొని, తాను పడుకునేకి ముందు అందరి పట్ల అతనికి మనసులో ఏదైతే ద్వేషం, కపటం ఉందో వాటన్నిటి నుండి క్షమాపణ కోరుకొని, అందరినీ మాఫీ చేసేసి, ఎవరిపైన ఏదైనా దౌర్జన్యం చేసి ఉంటే, అతని వైపు నుండి ఒకరిపై ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, ఆ అన్యాయం వేరే వారి యొక్క ధనంలో గానీ, పరువు, మానంలో గానీ, వారి యొక్క ఆర్థికంగా గానీ, ఇంకా ఏ రకంగానైనా, దాని విషయం లో ఆ హక్కు వారికి చెల్లించి, అల్లాహ్ తో క్షమాపణ కోరుకొని, ఇంకా మన కళ్ళను, మన చెవులను, మన చేతులను, మన కాళ్ళను, మన శరీర అవయవాలను అన్ని రకాల వ్యభిచారాలకు దూరంగా ఉంచుకొని, శుభ్రమైన మనస్సుతో, తౌహీద్ పై, సున్నత్ పై ఆ రాత్రి పడుకున్నామంటే మనం అల్లాహ్ యొక్క క్షమాపణ, అల్లాహ్ యొక్క మన్నింపు పొందగలం.
ఇది అసలు పని మనం చేయవలసింది. ఇక్కడ షబే ఖదర్ అని ఏదైతే రమదాన్ చివరి రాత్రుల్లో ఉంటుందో, జాగారం చేసి, ఎక్కువ ఖురాన్ చదవడం, లేదా నఫిల్ నమాజులు చేయడం, అలాంటి ఏ పనీ ఈ 15వ షాబాన్ రాత్రి, దేనినైతే షబే బరాత్ అని అనుకుంటున్నారో, ఆ రాత్రి చేయడానికి ఏ ఒక్క సహీ హదీసు లేదు. చేయవలసిన పని, దేని గురించి అయితే హదీసులు సపోర్ట్ చేస్తున్నాయో నేను చెప్పేశాను. మన తౌహీద్, సున్నత్, మరియు మన యొక్క మనస్సు కల్మషం లేకుండా, మనం ఎవరిపై ఎలాంటి, ఎవరికీ హాని కలిగించకుండా, మనం శుభ్రంగా ఉన్నామంటే అల్లాహ్ యొక్క మన్నింపు, క్షమాపణ పొందగలుగుతాము.
షబే బరాత్ పేరు వెనుక ఉన్న వాస్తవం
ఇక చివరిలో ఒక క్షణం, ఒక నిమిషం, రెండు నిమిషాల్లో, షబే బరాత్ ఇది సరైనది కాదు అని ఏదైతే చెప్పానో, కొంచెం ఆలోచించండి. ఇస్లాం ధర్మం అరబీ భాషలో ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ‘షబ్’ ఇది ఫార్సీ భాష. రాత్రి అన్న భావంలో వస్తుంది. ‘బరాఅత్’ అరబీ పదం. ‘షబ్’ ఫార్సీ పదం, ‘బరాఅత్’ సూరతుల్ బరాఅ, తౌబా అని ఏదైతే ఉందో, క్రమంలో తొమ్మిదో సూరా, సూరతుత్ తౌబా, దానిని సూరతుల్ బరాఅ అని కూడా అంటారు. ఎందుకంటే దాని ప్రారంభం:
بَرَاءَةٌ مِّنَ اللَّهِ وَرَسُولِهِ إِلَى الَّذِينَ عَاهَدتُّم مِّنَ الْمُشْرِكِينَ (బరాఅతుమ్ మినల్లాహి వ రసూలిహి…) (మీరు ఒప్పందాలు కుదుర్చుకున్న ముష్రిక్కులతో ఇక మీదట ఎలాంటి సంబంధాలుండబోవని అల్లాహ్ తరఫున, ఆయన ప్రవక్త తరఫున ప్రకటించబడుతోంది) (9:1)
అని మొదలవుతుంది. ‘బరాఅత్’ అరబీ పదం, ‘షబ్’ ఫార్సీ పదం. ఈ రెండు కలిసి మొదలయ్యాయి. దీని వెనక ఎవరైతే బిద్అత్ పనులు చేస్తారో వారి యొక్క కొన్ని రకాల మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. అదంతా ఏమీ ఇస్లాం ప్రకారంగా కాదు. అందుకొరకు మనం సహీ హదీసుల ఆధారంగా ఏ విషయం అయితే వచ్చిందో దానిని నేను చెప్పేశాను. అది మనం చేసుకొని ఉన్నాము అంటే అల్లాహ్ వద్ద మన యొక్క క్షమాపణ, మన్నింపు, భాగ్యం మనకు లభిస్తుంది. అల్లాహ్ అన్ని రకాల బిద్అత్, దురాచారాల నుండి మనల్ని కాపాడుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. (వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) (మా ఆఖరి మాట, సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[42 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షాబాన్ నెల యెుక్క వాస్తవికత – ఖుర్ఆన్ హదీసు–వెలుగులో! సంకలనం,కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామీఈ (హఫిజహుల్లాహ్)
నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు
ఖుర్ఆన్ లో వచ్చిన ‘శుభప్రదమైన రాత్రి’ అంటే షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రినా? లేక రమజాన్ నెలలో వచ్చే లైలతుల్ ఖద్ర్ నా? ఖుర్ఆన్ వెలుగులో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్.
సూరహ్ అద్ దుఖాన్ ఆయాతును చూపించి షాబాన్ నెల 15 తేది రాత్రి షబెే బరాత్ శుభప్రదమైన రాత్రని చాలా మంది అపోహను కలిగివున్నారు. ఆ ఆయతు మరియు తఫ్సీర్ లను చదివి సత్యాన్ని తెలుసుకుందాము
మా వద్ద నుండి ఆజ్ఞ రూపంలో! (ప్రవక్తలను) పంపేది కూడా మేమే.
رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
నీ ప్రభువు దయానుగ్రహం వల్ల. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ
మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు.
لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తు న్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు, పూర్వీకు లైన మీ తాతముత్తాతలకు కూడా (ఆయనే) ప్రభువు. (Quran – 44 :1 – 8)
పై ఆయతులో వచ్చిన శుభప్రదమైన రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని భావం. ఈ లైలతుల్ ఖద్ర్ రమజాన్ నెల చివరి దశకంలోని బేసిరాత్రుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది.
“దివ్య ఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల” – అల్ బఖర – 185.అని చెప్పబడటం గమనార్హం.
అలాగే “మేము ఈ ఖుర్ఆన్ ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము” అని అల్ ఖద్ర్ సూరాలో సెలవీయబడటం కూడా గమనార్హమే.
ఆ ఘనమైన రేయినే ఈ సూరాలో శుభప్రదమైన రేయిగా పేర్కోనటం జరిగింది. అది శుభప్రదమైన రేయి అనటంలో సందేహానికి తావేలేదు. ఎందుకంటే
ِ إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ
నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును రమజాను నెలలో) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.
وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ
ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు?
لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ
ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది.
تَنَزَّلُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ
ఆ రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భూమికి) దిగివస్తారు.
سَلَٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ
ఆ రాత్రి అసాంతం శాంతియుతమైనది – తెల్లవారే వరకూ (అది ఉంటుంది).Quran 97 :(1 – 5)
దివ్యఖుర్ఆన్ ఘనమైన రాత్రిన లేక శుభకరమైన రాత్రిన అవతరించిందంటే దాని భావం ఇదే. ఆ రాత్రి నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దాని అవతరణా క్రమం ఆరంభమయింది. అంటే తొట్టతొలిసారి ఈ రాత్రియందే ఈ గ్రంధం అంతిమ దైవప్రవక్త (స) పై అవతరించింది. లేక దీని భావం ఇది:
ఈ రాత్రియందే దివ్యఖుర్ఆన్ “లౌహె మహ్ పూజ్” నుంచి క్రింది ఆకాశంలో ఉన్న ‘బైతుల్ ఇజ్జత్’ లోకి దించబడింది. మరి అక్కణ్ణుంచి అవసరాల కనుగుణంగా కొద్దికొద్దిగా 23 ఏండ్ల వ్యవధిలో మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై అవతరించింది.
కొంత మంది ‘శుభప్రదమైన రాత్రి’ ని షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిగా తలపోశారు. కాని ఇది సరైనది కాదు.
ఈ గ్రంధం రమజాన్ మాసంలోని ‘లైలతుల్ ఖద్ర్’ లో అవతరించినట్లు ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా రూఢీ అవుతున్నప్పుడు ఇతరత్రా రాత్రుల గురించి ఆలోచించటం ఎంతమాత్రం సరైంది కాదు.
నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –
మెదటి బాగంలో ఖుర్ఆన్ లో వచ్చిన ‘శుభప్రదమైన రాత్రి’ అంటే రంజాన్ నెలలో చివరిదశలో వచ్చే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని తెలుసుకున్నాము. హదీసుల వెలుగులో షబే బరాత్ కు సంభందించిన హదీసులు ప్రామాణికమైనవేనా? తెలుసుకుందాం ఇన్ షా అల్లాహ్
షాబాన్ 15వ రాత్రి (షబే బరాత్) కి సంబందించిన హదీసుల్లో ఒకటి మాత్రమే సహీహ్ (హసన్) గా మరియు మిగితా హదీసులు ప్రామాణికమైనవి కావు.!
ఆ హదీసుల్లో కొన్నిటిని గురించి శ్రద్ధగా చదవి సత్యాన్ని తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!
1) మెుదటి హదీసు
హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ఒకసారి షాబాన్ 15 వ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా పడకపై లేకపోవడం వలన వెదుకుతూ ఉండగా బఖీ స్మశానంలో అగుపించగా నేను అక్కడికెళ్లి కారణం అడుగగా – “ఈ రాత్రి అల్లాహ్ ప్రపంచం వైపు దృష్టిసారిస్తాడు, బని కల్బ్ వారి గొర్రెల వెంట్రుకల కంటే అధిక రెట్లో మానవుల పాపాలను క్షమిస్తాడు” అని చెప్పారు. (ఈ హదీసు ముస్నద్ అహ్మద్, తిర్మిది, ఇబ్నెమాజాలో ఉంది.)
పై మూడు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా ద్వార ఉర్వా, ఉర్వా ద్వారా యహ్ యా, యహ్ యా ద్వారా హజ్జాజ్ విన్నట్లు ఉంది. అయితే ఇమాం తిర్మిజి ఈ హదీసు చివరిలో ఎంతో స్పష్టంగా చెప్పారు: నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ ద్వారా విన్నాను ఆయన దీనిని బలహీనమైనదని, ప్రామాణికమైనది కాదని చెప్పారు, ఎందుకంటే ఉర్వా ద్వారా యహ్’యా మరియు యహ్’యా ద్వారా హజ్జాజ్ వినలేదు. (తిర్మిజి, అబ్వాబుస్ సియాం, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్. 739)
2) రెండవ హదీసు
హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“షాబాన్ 15 వ రాత్రి అల్లాహ్ యెుక్క ఆరాధనలో నిలబడు. మరునాడు నీవు ఉపవాసం పాటించు. అల్లాహ్ షాబాన్ 14 నాటి సూర్యాస్తమయం వెంటనే ప్రపంచపు ఆకాశంపై వచ్చి, ఫజ్ర్ వరకు తన పాపాల మన్నింపు కోరేవాడున్నాడా నేను అతడ్ని మన్నిస్తాను, ఉపాధి కోరేవాడున్నాడా నేను అతనికి ఉపాధిని ప్రసాదిస్తాను, ఆపదలో ఉన్నవాడెవడూ అతనికి స్వస్థత ప్రసాదిస్తాను అంటూ ఇలాంటి నినాదాలు ప్రకటిస్తాడు.”
(ఇబ్నుమాజా, కితాబు ఇఖామతిస్ సలాతి వస్సున్నతు ఫీహా, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్ 1388)
ఈ హదీసు గురించి షేఖ్ అల్బాని (రహిమహుల్లాహ్) తెలిపారు ఇది దయీఫ్ మరియు మౌదూ అని (అంటే ప్రామాణికమైనది కాదు, కల్పించబడినది).
ఈ హదీసులో ఇబ్ను అబి సబ్రా అనే వ్యక్తి గురించి ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ ఇబ్నె ముయీన్ ఇలా చెప్పారు: అబూ సబ్రా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పని హదీసులు తానె చెప్పి ప్రవక్త వైపు ఆపాదించాడు. అందువలన అతనిని కల్పిత హదీసుల బోధకుడిగా పేర్కోన్నారు.
3) మూడవ హదీసు హసన్ మరియు సహీగా కొందరు ఉలమాలు పేర్కొన్నారు.
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉల్లేఖించారు:
“షాబాన్ 15వరాత్రి అల్లాహ్ తఆలా తన దాసుల పట్ల దృష్టి సారిస్తాడు. అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు. కాని ఇద్దరి వ్యక్తుల పాపాలను క్షమించడు. వారిలో ఒకడు : అల్లాహ్ కు బాగాస్వామిని నిలబెట్టేవాడు (షిర్క్ చేసేవాడు) రెండో వాడు: మనసులో కపటం, కీడు గలవాడు.“
(ఈ హదీసు ఇబ్నెమాజా, ఇబ్ను హిబ్బాన్ లలో ఉంది.)
ఈ హదీసు కొందరి దగ్గర దయీఫ్ గా వుంటే ఎక్కువ ఉలమాలు దీనిని ఇతర హదీసుల ఆదారంగా సహీగా ప్రకటించారు.
పై హదీసులు మరికొన్ని వేరే బలహీన, లేదా కల్పిత హదీసుల ద్వారా ఈ క్రింది విషయాలను సత్కార్యాలుగా భావించి, వాటిని ప్రత్యేకంగా 15వ షాబాన్ సందర్భంగా చేయటం పుణ్యకార్యం అని అంటారు:
1- 15వ షాబాన్ రాత్రి జాగారం
2- ప్రత్యేక నమాజులు
3- పగలు ఉపవాసం పాటించడం.
4- సమాధులను దర్శించడం
5- గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని, అంతే కాదు ప్రత్యేక వంటకాలు చేసి, వాటిని ఆ ఆత్మలు తినిపోతాయని భ్రమపడడం జరుగుతుంది.
అయితే సోదర సోదరిమణులారా! పై ఐదు విషయాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గానీ, సహాబాలు, తాబియిన్లు గానీ పాటించలేదు. అలాంటి మూఢనమ్మకాలు అసలు వారికి లేనే లేవు.
కొందరి అభిప్రాయమేమిటంటే ఆ రాత్రి ఇద్దరిని తప్ప అందరిని అల్లాహ్ క్షమిస్తాడు అని వచ్చిన హదీసు సహీ అయినప్పుడు నమాజు, రోజాలు పాటించడంలో తప్పు ఏమిటి అని అంటారు?
కాని వాస్తవంగా ఆలోచిస్తే, ఆ హదీసులో అలాంటి భావమేమీ లేదు. అలా అనుకుంటే సహీ బుఖారీ హదీసు నంబర్ 758లో ఉంది:
“అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగం మిగిలి ఉండగా ప్రపంచపు ఆకాశం వైపునకు వచ్చి ఎవరైనా అడుగుతారా వారికి ఇస్తాను, ఎవరైనా దుఆ చేస్తారా అంగీకరిస్తాను, ఎవరైనా పాప మన్నింపు కోరుతారా మన్నిస్తాను” అని ఫజ్ర్ వరకు ప్రకటిస్తూ ఉంటాడు.
గమనించండి ఇది బుఖారీలోని హదీసు, ఏ ఒక్కరు దీనిని బలహీనమైనది అని అనలేదు, అనలేరు కూడా.
ఇక పై హదీసు కొందరు పండితులు బలహీనమైనదంటే మరి కొందరు సహీ అన్నారు.అయితే బుఖారీ హదీసు ప్రకారం ప్రతి రోజు మేల్కొని అల్లాహ్ ను వేడుకుంటూ మన్నింపు కూరుతూ అన్ని మేల్లు అడుగుతూ ఉంటే ఎంత బావుంటుంది. అలా కాకుండా నిరాధరమైన హదీసుల ఆధారంగా కేవలం ఒక రాత్రి, పగలు పాటించడం అసలు ఇది ప్రవక్త పద్ధతే కాదు. ప్రవక్త పద్ధతి కానప్పుడు పుణ్యానికి బదులుగా పాపం మూట గట్టుకున్నట్లవుతుంది. జాగ్రత్తా!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ ఇమామ్ హాఫిజ్ ఇబ్నే హజ్ర్ (రహ్మతుల్లాహి అలైహి) రజబ్ నెల గురించి ఇలా తెలియజేశారు: “రజబ్ నెల పవిత్రమైన నెల కనుక అరేబియ ప్రజలు ఈ నెల గడిచిన పిమ్మట నీటి కొరకై అనేక ప్రాంతాల వైపుకు, కొండల వైపుకు బయలుదేరేవారు. కనుక ఈ నెలను షాబాన్ నెల అంటారు.” (ఫత్ హుల్ బారీ :4/251).
షాబాన్ నెలలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సాంప్రదాయం :
1-హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు షాబాన్ నెలలో ప్రతి రోజు ఉపవాసం ఉండేవారు చివరకు మేమంతా ఇకవారు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాసాలు మానరేమో! అని అనుకునేవారము. మరియు చాలా రోజుల వరకు (ఉపవాసాలు) పాటించేవారు కాదు. చివరకు మేమంత ఇకవారు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాసాలు పాటించరేమో! అని అనుకునేవారము, మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) రమజాన్ మాసంలో తప్ప, ఇతర మాసాలలో మొత్తం నెల ఉపవాసాలు పాటించినట్లు నేను ఎప్పుడు చూడలేదు. మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) షాబాన్ నెలకంటే ఎక్కువగా ఉపవాసాలు ఇతర నెలల్లో పాటించినట్లు ఆయన్ని నేను చూడలేదు. (బుఖారీ:1833, ముస్లిం:1956)
అంటే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇతర నెలలకంటే షాబాన్ నెలలో అధికంగా ఉపవాసాలు పాటించేవారన్నమాట. కనుక మనం కూడా షాబాన్ నెలలో అధికమైన సంఖ్యలో ఉపవాసాలు పాటించడం సున్నత్ సాంప్రదాయం:
హజ్రత్ ఉసామా బిన్ జైద్(రజియల్లాహు అన్హు) కధనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని నేను ఇలా అడిగాను: “ఓ అల్లాహ్ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం) మీరు షాబాన్ మాసంలో (అధికంగా) ఉపవాసాలు పాటించినట్లు, ఏ ఇతర మాసాలలో అన్ని ఉపవాసాలను పాటించినట్లు నేను మిమ్మల్ని చూడలేదు. దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా బదులిచ్చారు: “రజబ్ మరియు రమజాన్ నెలకి మధ్య ఉన్న షాబాన్ నెల యొక్క వాస్తవం ప్రజలకు తెలియదు. ఈ నెలలో ప్రజలు చేసిన కార్యాలు అల్లాహ్ ముందు సమర్పించబడతాయి. కనుక నా పుణ్యకార్యాలు అల్లాహ్ యందు నేను ఉపవాస స్థితిలో ఉండగా సమర్పించబడాలని ఇష్టపడుతున్నాను.” – (నసాయి:2317, అబూ దావూద్, సహీహ్ ఇబ్ను ఖుజైమ)
హజ్రత్ అబూ మూసా అల్ అరి (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు: “షాబాన్ నెల మధ్య (15వ) రాత్రిన అల్లాహ్ బహిర్గతమవుతాడు, బహుదైవారాధకుడిని మరియు సంబంధాన్ని తెంచుకున్నవాడిని తప్ప ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు.” (ఇబ్నుమాజా:1/422, సిల సిలతుస్ సహీహ:1562)
షాబాన్ 15 వ రోజు తరువాత ఉపవాసం పాటించడం నిషిద్ధం:
హజ్రత్ అబూ హురైరా (రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “షాబాన్ 15 రోజులు గడిచిన పిమ్మట రమజాన్ వచ్చేవరకు ఉపవాసాలు పాటించకండి.” (తిర్మిజి: 739, అబూదావూద్:2337)
హజ్రత్ అబూ హురైరా(రజియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “రమజాన్ నెల ప్రారంభం కావడానికి ఒకటి, రెండు రోజుల ముందుగా ఎవరూ ఉపవాసం పాటించకూడదు. ఒక వేళ ఎవరైనా ఆ తేదీల్లో (ఇతర నెలల్లో కూడా) ఎడతెగకుండా ఉపవాసాలు పాటిస్తూ ఉంటే అలాంటి వ్యక్తి ఈ (షాబాన్ చివరి) తేదిల్లో ఉపవాసం పాటించవచ్చు.” (సహీహ్ బుఖారీ)
షాబాన్ నెల మొదటి 15 రోజులలో ఉపవాసం పాటించకుండా, షాబన్ నెల చివరి 15రోజులలో ఉపవాసాలు పాటించడం నిషిద్ధం. షాబాన్ నెల పూర్తిగా శుభకరమైనది. మరియు ఆ నెలంతా ఉపవాసాలు పాటించకుండా నెల చివరిన ఒకటి లేక రెండు ఉపవాసాలు పాటించకూడదని తెలియజేయడం జరిగింది.
షాబాన్ 15వ రోజు కొన్ని బిద్అత్ (కల్పితాచారాల) కార్యాల వాస్తవికత:
ఇమామ్ మఖ్దసి (రహ్మతుల్లాహి అలైహి) ఇలా ప్రకటించారు: “448వ హిజ్రి శకంలో ఒక వ్యక్తి నాబ్లీస్ పట్టణము నుండి ‘భైతుల్ ముఖద్దస్‘కు వచ్చాడు. అతని పేరు ఇబ్నే ఉబై హుమైరా అతడు చాలా చక్కగా ఖుర్ఆన్ పారాయణం చేసేవాడు. అతను షాబాన్ 15వ రోజు రాత్రి ‘భైతుల్ ముఖద్దస్’లో నఫిల్ నమాజు చదవడం ఆరంభించాడు. అతనిని చూచి ఒకరు ఇద్దరు ముగ్గురు అంటూ ఒక పెద్ద జమాతుగా నిలబడి నమాజు నెరవేర్చారు. ఇలా ఆ రోజు నుండే ఈ బిద్ అత్ ఆరాధన మొదలయ్యింది. (అల్ బాయిస్ అలా ఇన్కారిల్ బద్యి వల్ హవాదిస్: 124-125)
1) షబేబరాత్ నమాజ్: ప్రతి ఏట షాబాన్ నెల 15వ తేది రాత్రి 100 రకాతుల నమాజు ప్రత్యేకంగా చేస్తారు.
2) ఆరు రకాతుల నమాజు: దీనిని కష్టాలు తొలిగిపోవాలని, వయస్సు పెరగాలని మరియు ప్రజలతో నిరుపేక్షంగా ఉండాలని సంకల్పం చేసుకొని నమాజు నెరవేర్చుతారు.
3) ఈ రాత్రిలో యాసీన్ సూరాను ప్రత్యేకంగా చదువుతారు. మరియు “అల్లాహుమ్మ యా జల్ మన్ని వలా యమున్ను అలైహి యాజల్ జలాలి వల్ ఇక్రామ్” అనే పదాలను చదువుతుంటారు.
4, కొంతమంది ‘శుభప్రదమైన రాత్రి’ని షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిగా తలపోసారు. కాని ఇది సరైనది కాదు. ఈ గ్రంథం రమజాన్ మాసంలోని ‘లైలతుల్ ఖద్ర్’లో అవతరించినట్లు ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా రూఢీ అవుతున్నప్పుడు ఇతరాత్రా రాత్రుల గురించి ఆలోచించటం ఎంతమాత్రం సరైంది కాదు.
ఇమామ్ షిఖైరి (రహ్మతుల్లాహి అలైహి) ఆ రాత్రి గురించి ఇలా తెలియజేశారు: “మహాపండితులు మరియు ముహద్దీసీన్లు(హదీసు వేత్తలు) ఆ రాత్రి (షబేబరాత్)ని లైలతుల్ ఖద్ర్ గా భావించటానికి ఎటువంటి యదార్థము లేదు” అని తెలియజేశారు. (అస్సునన్ వల్ ముబ్దిది ఆత్:146).
ఇమామ్ నజ్ముద్దీన్ అల్ గైతీ (రహ్మతుల్లాహి అలైహి) గారు ఇలా ప్రకటించారు: “హిజాజ్ పండితులు షాబాన్ 15వ రాత్రిన చేసే ప్రత్యేకమైన పుణ్యాల గురించి మరియు వాటి ఘనతను గురించి తిరస్కరించారు. వారిలో హజ్రత్ ఇబ్నే అబీ మలీకా, మరియు మదీనా జ్ఞానవంతులు ఆ రోజున చేసే ప్రత్యేకమైన కార్యాలన్నీ ‘బిద్ అత్’ అని ఏకీభవించారు. (అస్సునన్ వల్ బిద్ అత్ అష్ షిఖైరీ: 145).
షాబాన్ 15వ రోజు గురించి కొన్ని నిరాధారమైన హదీసులు:
బిద్ అత్ ఆచారాల్లో మునిగి తేలుతున్నవారు తాము చేస్తున్నది ధర్మమేనంటూ ఈ క్రింది ఇవ్వబడే బలహీనమైన ఆధారాలను చూపుతారు. కనుక మేము మీ ముందు ఆ హదీసులను ఉంచుతున్నాము.
1-హజ్రత్ అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “షాబాన్ 15వ రోజు రాత్రి నమాజు చదవండి, పగలు ఉపవాసం ఉండండి. ఆ రోజు సూర్యస్తమయం తరువాత ప్రపంచపు ఆకాశమునకు అల్లాహ్ దిగి వస్తాడు, తరువాత ఇలా అంటాడు: ఎవరైతే నా పాపాలు మన్నించమని వేడుకుంటారో, నేను వారి పాపాలు మన్నిస్తాను. మరియు ఎవరైతే ఉపాధిని ప్రసాదించమని వేడుకుంటారో, వారికి ఉపాధిని ప్రసాదిస్తాను. ఎవరైన అస్వస్థతకు గురికాబడితే వారికి స్వస్థతను ప్రసాదిస్తాను. ఇంకా ఇలా, అలా…. సూర్యోదయం వరకు ఇలా (ప్రసాదించే కార్యం) జరుగుతొంది” (ఇబ్నేమాజా, సిల్ సిలతుజ్ జయీఫా: 2132, సిల్ సిలతుజ్ జయీఫా వల్ మౌజూఅ: 5/154)
2-హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హ) ఉల్లేఖనం ప్రకారం; “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక రాత్రి నాకు కనపడలేదు, అంతలో నేను (బయటకు వెళ్ళి చూస్తే) ఆయన బఖీ శ్మశానంలో కనపడ్డారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం): “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నీకు అన్యాయం చేస్తారని అనుకున్నావా? అని హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హ) గారిని అడిగారు. దానికి హజ్రత్ ఆయిషా (రజియల్లాహు అన్హ) గారు: “మీరు ఇతర భార్యల వద్దకు పోయారేమోననీ అనుకున్నాను” అని అన్నారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “షాబాన్ 15వ రోజు రాత్రి అల్లాహ్ ప్రపంచపు ఆకాశమునకు దిగి వస్తాడు, బనీ కలబ్ (సంతానం పేరు) గొర్రెల వెంట్రుకలకంటే ఎక్కువ మనషులను క్షమిస్తాడు……..” (ఇబ్ను మాజా, జయీఫ్: 1389, తిర్మిజీ, జయీఫ్:3684, జయీఫుల్ జామె:1761 ).
హజ్రత్ హాఫిజ్ ఇబ్ను దహ్యా (రహ్మతుల్లాహి అలైహి) ఇలా తెలియజేసారు: “షాబాన్ 15వ రాత్రి ఆరాధనల గురించి ఏ ఒక్క హదీసు ఆధారపూర్వక మైనది లేదు. కనుక మనం ఇలాంటి ఉల్లేఖనలను విశ్వసించకూడదు.”
అలాగే హజ్రత్ ఇమామ్ అబూ హనీఫా (రహ్మతుల్లాహి అలైహి) ద్వారా ఆ రాత్రి లేక పగలు చేసే ఆరాధనల గురించి ఎలాంటి ఆదేశాలు లేవు. మరియు నాలుగు ఇమాముల కాలంలో ఆ కార్యాల గురించి ఎవరికి తెలియదు. ఎందుకంటే? నాలుగు ఇమాముల జనన మరణాలు 80 హిజ్రి శకం నుండి 214 హిజ్రి శకం మధ్యలో జరిగినవి. మరియు షాబాన్ 15వ నాటి బిద్అత్ 448వ హిజ్రి శకంలో ప్రారంభమయినది. కనుక ఇది నాలుగు ఇమాముల దగ్గర బిద్అత్ కార్యాలుగానే భావించబడతాయి.
నా ప్రియమైన ముస్లింములారా! మీరు ఇలాంటి బిద్అత్ కార్యాలను ఆరాధనలుగా భావిస్తున్నవారితో సహవాసం చెయ్యకండి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఒక కార్యానికి నిజమైన ఆధారం దొరకనంతవరకు వాటిని అనుసరించకండి. ఎందుకంటే? అది ధర్మం కాని ఒక విషయం, ధర్మం కాని విషయాలను ధర్మంగా ఆచరించినా లేక పరిచయం చేసినా వారు షైతాన్ సేవకులు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షబే బరాత్ – షాబాన్ నెల యొక్క బిద్ఆత్’లు (దురాచారాలు) https://youtu.be/lg3lujt6PN8 [30 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
షాబాన్ నెల యెుక్క వాస్తవికత – ఖుర్ఆన్ హదీసు–వెలుగులో! సంకలనం,కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామీఈ (హఫిజహుల్లాహ్)
నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు
ఖుర్ఆన్ లో వచ్చిన ‘శుభప్రదమైన రాత్రి’ అంటే షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రినా? లేక రమజాన్ నెలలో వచ్చే లైలతుల్ ఖద్ర్ నా? ఖుర్ఆన్ వెలుగులో తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్.
సూరహ్ అద్ దుఖాన్ ఆయాతును చూపించి షాబాన్ నెల 15 తేది రాత్రి షబెే బరాత్ శుభప్రదమైన రాత్రని చాలా మంది అపోహను కలిగివున్నారు. ఆ ఆయతు మరియు తఫ్సీర్ లను చదివి సత్యాన్ని తెలుసుకుందాము
حمٓ وَٱلْكِتَٰبِ ٱلْمُبِينِ హా మీమ్. స్పష్టమైన ఈ గ్రంథం తోడు!
إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةٍۢ مُّبَٰرَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ నిశ్చయంగా మేము దీనిని శుభప్రద మైన రాత్రియందు అవత రింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసేవాళ్ళము.
فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيم ఆ రాత్రియందే కీలకమైన ప్రతి ఉత్తర్వూ జారీ చేయబడు తుంది.
أَمْرًۭا مِّنْ عِندِنَآ ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ మా వద్ద నుండి ఆజ్ఞ రూపంలో! (ప్రవక్తలను) పంపేది కూడా మేమే.
رَحْمَةًۭ مِّن رَّبِّكَ ۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ నీ ప్రభువు దయానుగ్రహం వల్ల. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
رَبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَآ ۖ إِن كُنتُم مُّوقِنِينَ మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు.
لَآ إِلَٰهَ إِلَّا هُوَ يُحْىِۦ وَيُمِيتُ ۖ رَبُّكُمْ وَرَبُّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తు న్నాడు, ఆయనే చంపుతున్నాడు. ఆయనే మీ ప్రభువు, పూర్వీకు లైన మీ తాతముత్తాతలకు కూడా (ఆయనే) ప్రభువు. (Quran – 44 :1 – 8)
పై ఆయతులో వచ్చిన శుభప్రదమైన రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని భావం. ఈ లైలతుల్ ఖద్ర్ రమజాన్ నెల చివరి దశకంలోని బేసిరాత్రుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది.
“దివ్య ఖుర్ఆన్ అవతరించిన నెల రమజాన్ నెల” – అల్ బఖర – 185.అని చెప్పబడటం గమనార్హం.
అలాగే “మేము ఈ ఖుర్ఆన్ ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము” అని అల్ ఖద్ర్ సూరాలో సెలవీయబడటం కూడా గమనార్హమే.
ఆ ఘనమైన రేయినే ఈ సూరాలో శుభప్రదమైన రేయిగా పేర్కోనటం జరిగింది. అది శుభప్రదమైన రేయి అనటంలో సందేహానికి తావేలేదు. ఎందుకంటే
ِ إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆనును రమజాను నెలలో) ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము.
وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు?
لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది.
تَنَزَّلُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ ఆ రాత్రి యందు దైవదూతలు, ఆత్మ (జిబ్రయీల్) తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల (నిర్వహణ) నిమిత్తం (దివి నుంచి భూమికి) దిగివస్తారు.
سَلَٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ ఆ రాత్రి అసాంతం శాంతియుతమైనది – తెల్లవారే వరకూ (అది ఉంటుంది).Quran 97 :(1 – 5)
దివ్యఖుర్ఆన్ ఘనమైన రాత్రిన లేక శుభకరమైన రాత్రిన అవతరించిందంటే దాని భావం ఇదే. ఆ రాత్రి నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దాని అవతరణా క్రమం ఆరంభమయింది. అంటే తొట్టతొలిసారి ఈ రాత్రియందే ఈ గ్రంధం అంతిమ దైవప్రవక్త (స) పై అవతరించింది. లేక దీని భావం ఇది:
ఈ రాత్రియందే దివ్యఖుర్ఆన్ “లౌహె మహ్ పూజ్” నుంచి క్రింది ఆకాశంలో ఉన్న ‘బైతుల్ ఇజ్జత్’ లోకి దించబడింది. మరి అక్కణ్ణుంచి అవసరాల కనుగుణంగా కొద్దికొద్దిగా 23 ఏండ్ల వ్యవధిలో మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై అవతరించింది.
కొంత మంది ‘శుభప్రదమైన రాత్రి’ ని షాబాన్ నెలలో వచ్చే 15వ రాత్రిగా తలపోశారు. కాని ఇది సరైనది కాదు. ఈ గ్రంధం రమజాన్ మాసంలోని ‘లైలతుల్ ఖద్ర్’ లో అవతరించినట్లు ఖుర్ఆన్ ద్వారా స్పష్టంగా రూఢీ అవుతున్నప్పుడు ఇతరత్రా రాత్రుల గురించి ఆలోచించటం ఎంతమాత్రం సరైంది కాదు.
నా ధార్మిక సహోదర సహోదరిమణులారా! అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతహు –
మెదటి బాగంలో ఖుర్ఆన్ లో వచ్చిన ‘శుభప్రదమైన రాత్రి’ అంటే రంజాన్ నెలలో చివరిదశలో వచ్చే లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రాత్రి) అని తెలుసుకున్నాము. హదీసుల వెలుగులో షబే బరాత్ కు సంభందించిన హదీసులు ప్రామాణికమైనవేనా? తెలుసుకుందాం ఇన్ షా అల్లాహ్
షాబాన్ 15వ రాత్రి (షబే బరాత్) కి సంబందించిన హదీసుల్లో ఒకటి మాత్రమే సహీహ్ (హసన్) గా మరియు మిగితా హదీసులు ప్రామాణికమైనవి కావు.!
ఆ హదీసుల్లో కొన్నిటిని గురించి శ్రద్ధగా చదవి సత్యాన్ని తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!
1) మెుదటి హదీసు
హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు, ఒకసారి షాబాన్ 15 వ రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా పడకపై లేకపోవడం వలన వెదుకుతూ ఉండగా బఖీ స్మశానంలో అగుపించగా నేను అక్కడికెళ్లి కారణం అడుగగా – “ఈ రాత్రి అల్లాహ్ ప్రపంచం వైపు దృష్టిసారిస్తాడు, బని కల్బ్ వారి గొర్రెల వెంట్రుకల కంటే అధిక రెట్లో మానవుల పాపాలను క్షమిస్తాడు” అని చెప్పారు. (ఈ హదీసు ముస్నద్ అహ్మద్, తిర్మిది, ఇబ్నెమాజాలో ఉంది.)
పై మూడు గ్రంథాల్లో కూడా ఈ హదీసు ఆయిషా రజియల్లాహు అన్హా ద్వార ఉర్వా, ఉర్వా ద్వారా యహ్ యా, యహ్ యా ద్వారా హజ్జాజ్ విన్నట్లు ఉంది. అయితే ఇమాం తిర్మిజి ఈ హదీసు చివరిలో ఎంతో స్పష్టంగా చెప్పారు: నేను ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ ద్వారా విన్నాను ఆయన దీనిని బలహీనమైనదని, ప్రామాణికమైనది కాదని చెప్పారు, ఎందుకంటే ఉర్వా ద్వారా యహ్’యా మరియు యహ్’యా ద్వారా హజ్జాజ్ వినలేదు. (తిర్మిజి, అబ్వాబుస్ సియాం, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్. 739)
2) రెండవ హదీసు
హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“షాబాన్ 15 వ రాత్రి అల్లాహ్ యెుక్క ఆరాధనలో నిలబడు. మరునాడు నీవు ఉపవాసం పాటించు. అల్లాహ్ షాబాన్ 14 నాటి సూర్యాస్తమయం వెంటనే ప్రపంచపు ఆకాశంపై వచ్చి, ఫజ్ర్ వరకు తన పాపాల మన్నింపు కోరేవాడున్నాడా నేను అతడ్ని మన్నిస్తాను, ఉపాధి కోరేవాడున్నాడా నేను అతనికి ఉపాధిని ప్రసాదిస్తాను, ఆపదలో ఉన్నవాడెవడూ అతనికి స్వస్థత ప్రసాదిస్తాను అంటూ ఇలాంటి నినాదాలు ప్రకటిస్తాడు.”
(ఇబ్నుమాజా, కితాబు ఇఖామతిస్ సలాతి వస్సున్నతు ఫీహా, బాబు మా జాఅ ఫీ లైలతిన్ నిస్ఫి మిన్ షాబాన్ 1388)
ఈ హదీసు గురించి షేఖ్ అల్బాని (రహిమహుల్లాహ్) తెలిపారు ఇది దయీఫ్ మరియు మౌదూ అని (అంటే ప్రామాణికమైనది కాదు, కల్పించబడినది).
ఈ హదీసులో ఇబ్ను అబి సబ్రా అనే వ్యక్తి గురించి ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ మరియు ఇమామ్ ఇబ్నె ముయీన్ ఇలా చెప్పారు: అబూ సబ్రా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పని హదీసులు తానె చెప్పి ప్రవక్త వైపు ఆపాదించాడు. అందువలన అతనిని కల్పిత హదీసుల బోధకుడిగా పేర్కోన్నారు.
3) మూడవ హదీసు హసన్ మరియు సహీగా కొందరు ఉలమాలు పేర్కొన్నారు.
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉల్లేఖించారు:
“షాబాన్ 15వరాత్రి అల్లాహ్ తఆలా తన దాసుల పట్ల దృష్టి సారిస్తాడు. అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు. కాని ఇద్దరి వ్యక్తుల పాపాలను క్షమించడు. వారిలో ఒకడు : అల్లాహ్ కు బాగాస్వామిని నిలబెట్టేవాడు (షిర్క్ చేసేవాడు) రెండో వాడు: మనసులో కపటం, కీడు గలవాడు.“
(ఈ హదీసు ఇబ్నెమాజా, ఇబ్ను హిబ్బాన్ లలో ఉంది.)
ఈ హదీసు కొందరి దగ్గర దయీఫ్ గా వుంటే ఎక్కువ ఉలమాలు దీనిని ఇతర హదీసుల ఆదారంగా సహీగా ప్రకటించారు.
పై హదీసులు మరికొన్ని వేరే బలహీన, లేదా కల్పిత హదీసుల ద్వారా ఈ క్రింది విషయాలను సత్కార్యాలుగా భావించి, వాటిని ప్రత్యేకంగా 15వ షాబాన్ సందర్భంగా చేయటం పుణ్యకార్యం అని అంటారు:
1- 15వ షాబాన్ రాత్రి జాగారం 2- ప్రత్యేక నమాజులు 3- పగలు ఉపవాసం పాటించడం. 4- సమాధులను దర్శించడం 5- గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వస్తాయని, అంతే కాదు ప్రత్యేక వంటకాలు చేసి, వాటిని ఆ ఆత్మలు తినిపోతాయని భ్రమపడడం జరుగుతుంది.
అయితే సోదర సోదరిమణులారా! పై ఐదు విషయాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గానీ, సహాబాలు, తాబియిన్లు గానీ పాటించలేదు. అలాంటి మూఢనమ్మకాలు అసలు వారికి లేనే లేవు.
కొందరి అభిప్రాయమేమిటంటే ఆ రాత్రి ఇద్దరిని తప్ప అందరిని అల్లాహ్ క్షమిస్తాడు అని వచ్చిన హదీసు సహీ అయినప్పుడు నమాజు, రోజాలు పాటించడంలో తప్పు ఏమిటి అని అంటారు?
కాని వాస్తవంగా ఆలోచిస్తే, ఆ హదీసులో అలాంటి భావమేమీ లేదు. అలా అనుకుంటే సహీ బుఖారీ హదీసు నంబర్ 758లో ఉంది:
“అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగం మిగిలి ఉండగా ప్రపంచపు ఆకాశం వైపునకు వచ్చి ఎవరైనా అడుగుతారా వారికి ఇస్తాను, ఎవరైనా దుఆ చేస్తారా అంగీకరిస్తాను, ఎవరైనా పాప మన్నింపు కోరుతారా మన్నిస్తాను” అని ఫజ్ర్ వరకు ప్రకటిస్తూ ఉంటాడు.
గమనించండి ఇది బుఖారీలోని హదీసు, ఏ ఒక్కరు దీనిని బలహీనమైనది అని అనలేదు, అనలేరు కూడా.
ఇక పై హదీసు కొందరు పండితులు బలహీనమైనదంటే మరి కొందరు సహీ అన్నారు.అయితే బుఖారీ హదీసు ప్రకారం ప్రతి రోజు మేల్కొని అల్లాహ్ ను వేడుకుంటూ మన్నింపు కూరుతూ అన్ని మేల్లు అడుగుతూ ఉంటే ఎంత బావుంటుంది. అలా కాకుండా నిరాధరమైన హదీసుల ఆధారంగా కేవలం ఒక రాత్రి, పగలు పాటించడం అసలు ఇది ప్రవక్త పద్ధతే కాదు. ప్రవక్త పద్ధతి కానప్పుడు పుణ్యానికి బదులుగా పాపం మూట గట్టుకున్నట్లవుతుంది. జాగ్రత్తా!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.