91. సూరా ఆష్ షమ్స్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

సూరా ఆష్ షమ్స్ – పార్ట్ 1- ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/nGfCiZJbC8Q [42 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 15 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా ఆధ్యాత్మికత గురించి, అనైతిక వ్యవహారశైలి గురించి, అనైతికత వల్ల వాటిల్లే వినాశాల గురించి వివరించింది. ఇందులోని మొదటి ఆయతులో ఈ సూరా పేరుకు సంబంధించిన పదం ప్రస్తావనకు వచ్చింది. ఈ సూరా మానవుల ఆధ్యాత్మిక విధులను గుర్తు చేసింది. అల్లాహ్ కు గల ప్రత్యేకమైన సృష్టి సామర్ధ్యాన్ని వర్ణిస్తూ, సూర్యచంద్రుల ప్రకాశం, భూమి, అద్భుతమైన రోదసీ (అంతరిక్ష) వ్యవస్థల సృష్టి గురించి తెలియజేసింది. మానవులందరికీ ఇష్టమొచ్చిన మార్గాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉందని, మంచిగా గాని, చెడుగా గాని వ్యవహరించే స్వేచ్ఛ ఉందని, ఏ మార్గాన నడవాలన్నది మనమే నిర్ణయించుకోవాలని తెలియజేస్తూ, అనైతికంగా వ్యవహరించి, అల్లాహ్ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితంగా దైవాగ్రహానికి గురి కావలసి వస్తుందని ఈ సూరా తెలియజేసింది.

విశ్వాసంలోని మాధుర్యం | కలామే హిక్మత్ 

మానవ మహోపకారి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారు :

“ఎవరిలోనయితే మూడు సుగుణాలు ఉన్నాయో అతను విశ్వాసం (ఈమాన్)లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. అవేమంటే;

  1. ఇతరులందరికంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతనికి ప్రియతమమైన వారై ఉండాలి.
  2. అతనెవరిని ప్రేమించినా అల్లాహ్ కొరకే ప్రేమించాలి.
  3. అగ్నిలో నెట్టివేయ బడటమంటే అతనికి ఎంత అయిష్టంగా ఉంటుందో ధిక్కారం(కుఫ్ర్) వైపునకు పోవాలన్నా అంతే అయిష్టత ఉండాలి.” (బుఖారి)

ఈ హదీసును అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. హజ్రత్ అనస్రుదైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సేవకులుగా ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీనాకు హిజ్రత్ చేసి వచ్చినప్పుడు ఈయన వయస్సు పది సంవత్సరాలు. ఈయన తల్లి ఈయన్ని దైవప్రవక్తకు సేవలు చేయమని చెప్పి అప్పగించింది. తన కుమారుని వయస్సులో, ఆస్తిపాస్తుల్లో, సంతానంలో వృద్ధి కోసం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రార్థించాలన్నది ఆమె ఆకాంక్ష. ఆమె మనోరధం ఈడేర్చడానికి మహాప్రవక్త అనస్ కోసం ప్రార్థించారు. ప్రవక్తగారు చేసిన ప్రార్థనా ఫలితంగా హజ్రత్ అనస్ కు ఇతర సహాబాల కన్నా ఎక్కువ మంది పిల్లలు పుట్టారు. ఈయన తోట ఏడాదిలో రెండుసార్లు పండేది. అయితే ఈ వృద్ధి వికాసాలతో ఝంజాటాలతో తాను విసిగెత్తి పోయానని, అల్లాహ్ మన్నింపు కొరకు నిరీక్షిస్తున్నానని అనస్ అంటూ ఉండేవారు. హిజ్రీ శకం 93లో ఆయన బస్రాలో కన్ను మూశారు. అప్పటికి ఆయనకు నూరేళ్ళు పైబడ్డాయి.

ఈ హదీసులో మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘విశ్వాసం’ లోని ఉన్నత శ్రేణిని గురించి వివరించారు. పైగా దీన్ని విశ్వాసంలోని మాధుర్యంగా, తీపిగా అభివర్ణించటం జరిగింది. ఎందుకంటే తియ్యదనాన్ని మానవ నైజం కూడా వాంఛిస్తుంది.

‘షేక్అబ్దుర్రహ్మాన్ బిన్ హసన్ “ఫతహ్ అల్ మజీద్”లో ఇలా అభిప్రాయపడ్డారు.“ఇక్కడ తీపి అది అభిరుచికి తార్కాణం. దైవధర్మాన్ని అవలంబించటం వల్ల ప్రాప్తమయ్యే తృప్తి, ఆనందం, ప్రశాంతతలకు ఇది ప్రతీక. వాస్తవానికి నిష్కల్మష విశ్వాసం ఉన్నవారే ఈ దివ్యానుభూతికి లోనవుతారు.

‘విశ్వాసంలోని తీపి’ని గురించి నవవి (రహిమహుల్లాహ్) ఏనుంటున్నారో చూడండి : దైవ విధేయతలో, భక్తీ పారవశ్యాలలో లీనమైపోయి తాదాత్మ్యం చెందటం, దైవప్రవక్త ప్రసన్నతను చూరగొనే మార్గంలో కష్టాలు కడగండ్లను ఆహ్వానించి ఓర్పుతో భరించటమే విశ్వాసంలోని తీపికి నిదర్శనం.

విశ్వాసం యొక్క ఈ ఉన్నత స్థానం ప్రాప్తమయ్యేదెలా? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విషయమై మూడు షరతులను పేర్కొన్నారు.

ఇమామ్ ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఏమన్నారంటే – తృప్తికి, ఆనందానికి ప్రతీక అయిన విశ్వాస మాధుర్యం, దాసుడు తన ప్రభువును అమితంగా ప్రేమించినపుడే ప్రాప్తిస్తుంది.ఈ అమితమయిన ప్రేమ మూడు విషయాలతో పెనవేసుకుని ఉంది. ఒకటి, ఆప్రేమ పరిపూర్ణతను సంతరించుకోవటం. రెండు, దాని ప్రభావం దాసునిపై పడటం.మూడు, దానికి హాని చేకూర్చగల వస్తువులకు, విషయ లాలసకు దూరంగా ఉండటం.

ప్రేమ పరిపూర్ణతను సంతరించు కోవటం అంటే మతలబు దాసుడు ఇతరులందరికన్నా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించాలి. ఆ ప్రేమ అతనిపై ఎంత గట్టి ప్రభావం వేయగలగాలంటే, అతను ఎవరిని అభిమానించినా, ఎవరిని సమర్ధించినా, ఎవరికి తోడ్పడినా అది అల్లాహ్ కోసమే అయి ఉండాలి. తనలోని ఈ సత్ప్రవర్తనను, సాధుశీలాన్ని అపహరించే సమస్త వస్తువులను, అలవాట్లను అతను మానుకోవటమే గాకుండా వాటికి బహుదూరంగా మసలుకోవాలి. అంతేకాదు, ఆయా చెడు సాధనాలను మనసులో అసహ్యించుకోవాలి. తనను ఎవరయినా అగ్ని గుండంలో పడవేయజూస్తే ఎంతగా భయాందోళన చెందుతాడో అంతే భయాందోళన ఆ హానికరమయిన సాధనాల పట్ల కూడా చెందాలి.

“ఇతరులందరికంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అతనికి ప్రియతమమైనవారై ఉండాలి” అనే హదీసులోని అంశం ప్రత్యేకంగా గమనించదగినది. ఈనేపథ్యంలో హాఫిజ్ ఇబ్నె హజర్ ఏమంటున్నారో చూడండి: తమ విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకోవాలని కాంక్షించేవారు, తమ తల్లిదండ్రుల, భార్యా భర్తల, సమస్త జనుల హక్కుల కన్నా తమపై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఎక్కువ హక్కులున్నాయని తెలుసుకుంటారు. ఎందుకంటే మార్గ విహీనతకు గురై ఉన్న తమకు సన్మార్గం లభించినా, నరకాగ్ని నుండి విముక్తి కలిగినా అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మాలంగానే కదా!”

దివ్య గ్రంథంలోనూ ఆ విషయమే నొక్కి వక్కాణించబడింది :


قُلْ إِن كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُم مِّنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ

“ఓ ప్రవక్తా! అనండి, ‘ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీభార్యలు, బంధువులు మరియు ఆత్మీయులు, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు,మందగిస్తాయని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీరు ఇష్టపడే మీ గృహాలు మీకుగనక అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు ఆయన మార్గంలో జిహాద్ చేయటం కంటేఎక్కువ ప్రియతమమైతే అల్లాహ్ తన తీర్పును మీ ముందుకు తీసుకువచ్చే వరకునిరీక్షించండి. అల్లాహ్ హద్దులు మీరే వారికి మార్గం చూపడు.” ( అత్ తౌబా 9:24)

మనిషికి అత్యంత ప్రీతికరమైన ఎనిమిది అంశాలను అల్లాహ్ పై ఆయత్లో ప్రస్తుతించాడు. వాటి ప్రేమలో పడిపోయిన కారణంగానే మనిషి దైవనామ స్మరణపట్ల అలసత్వం, అశ్రద్ధ చూపుతాడు. అందుకే, మనిషి హృదయంలో గనక ఆ ఎనిమిది అంశాలు లేదా వాటిలో ఏ ఒక్కదానిపైనయినా సరే అల్లాహ్ పట్ల కన్నా ఎక్కువ ప్రేమ ఉంటే వ్యధా భరితమయిన శిక్షకు గురవుతాడని హెచ్చరించటం జరిగింది.అటువంటి వారు దుర్మార్గుల్లో కలసిపోతారు (అల్లాహ్ మన్నించుగాక!)

అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల అపారమయిన ప్రేమ ఉందని ఊరకే చెప్పుకుంటూ తిరిగితే సరిపోదు, దాన్ని క్రియాత్మకంగా చాటి చెప్పాలి.అల్లాహ్ మరియు దైవప్రవక్త పట్ల ఎవరికెంత ప్రేమ ఉన్నదీ నిజానికి దైవాజ్ఞాపాలన ద్వారానే తెలుస్తుంది. దైవాజ్ఞల్నితు.చ. తప్పకుండా పాటిస్తూ, అడుగడుగునా భయభక్తులతో జీవించే వాడే యదార్థానికి దైవసామీప్యం పొందగలుగుతాడు. తన స్వామి దేన్ని ఇష్టపడతాడో, మరి దేన్ని ఇష్టపడడో ఆ సామీప్య భాగ్యంతోనే గ్రహిస్తాడు. తనను సృష్టించిన ప్రభువు ప్రసన్నత చూరగొనాలంటే, అంతిమ దైవప్రవక్తకు విధేయత చూపటం కూడా అవసరమన్న సత్యాన్ని గుర్తిస్తాడు.

అల్లాహ్ సెలవిచ్చాడు:

قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ

“ప్రవక్తా! మీరు ప్రజలకు చెప్పండి, ‘మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే, నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడు కూడాను.”(ఆలి ఇమ్రాన్ 3: 31)

అల్లాహ్ పట్ల తనకు ప్రగాఢమైన ప్రేమ ఉందని పలికే ప్రతి ఒక్కరికీ ఈ ఆయత్ నిర్ణయాత్మకమైనదని ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఇలా వ్రాశారు: ఎవరయితే అల్లాహ్ యెడల తనకు ప్రేమ ఉందని చాటుకుంటాడో, అలా చాటుకుంటూ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పద్ధతి ప్రకారం నడవడో అతను అసత్యవాది. మనోవాక్కాయ కర్మలచేత అతను ముహమ్మద్ చూపిన షరీఅత్ను అనుసరించనంత వరకూ అబద్ధాలకోరుగానే పరిగణించబడతాడు.

సహీహ్ హదీస్ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం ఒకటి ఇలా ఉంది – “నేను ఆచరించని పనిని ఎవరయినా చేస్తే అతను ధూత్కారి అవుతాడు”. ఏ వ్యక్తయినా తనకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల గల ప్రేమ పరిమాణాన్ని కొలచుకోదలుస్తే, ఖుర్ఆన్ మరియు హదీసుల గీటురాయిపై అతను తన జీవితాన్ని పరీక్షించి చూసుకోవాలి. ఒకవేళ తన దైనందిన జీవితం షరీఅత్కు అనుగుణంగా ఉందని తెలిస్తే అల్లాహ్ పట్ల, దైవప్రవక్త పట్ల ప్రేమ చెక్కు చెదరకుండా ఉన్నట్లే లెక్ట. అదే అతని ఆచరణ గనక దివ్య గ్రంథం మరియు ప్రవక్త సంప్రదాయం పరిధుల్లో లేదని తేలితే అల్లాహ్ పట్ల, దైవ ప్రవక్త పట్ల తనలో ప్రేమ భావం లేదని అనుకోవాలి. అప్పుడతని ప్రథమ కర్తవ్యం ఏమంటే, తన జీవితాన్ని దైవాదేశాల పరిధిలో, దైవప్రవక్త సంప్రదాయం వెలుగులో మలచుకోవటానికి ప్రయత్నించటం.

“ఎవరిని ప్రేమించినా అల్లాహ్ కొరకే ప్రేమించాలి” : దైవ ప్రవక్తలు, సద్వర్తనులైన ప్రజలు, విశ్వాసులను ప్రేమించటం దైవం యెడల ప్రేమకు ప్రతిరూపం. వారిని ప్రేమించటానికి కారణం అల్లాహ్ వారిని ప్రేమించటమే! అల్లాహ్ దీవెనలు,సహాయం వారికి ఉండటం మూలంగానే!!

అయితే విశ్వాసులయిన మంచివారి పట్ల ఒక వ్యక్తికి గల ఈ ప్రేమాభిమానం ‘షిర్క్’ (బహుదైవోపాసన) కానేరదు. మంచి వారిని ప్రేమించినంత మాత్రాన అల్లాహ్ యెడలగల ప్రేమను విస్మరించినట్లు కాదు. ప్రేమించేవాడు, తన ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడు గనకనే తనూ ప్రేమిస్తున్నాడు. ప్రభువు ఎవరిని ఇష్టపడటం లేదో వారిని తనూ ఇష్టపడటం లేదు. తన ప్రభువు స్నేహం చేసిన వారితోనే తనూ సావాసం చేస్తున్నాడు. తన ప్రభువు పట్ల శత్రు భావం కనబరుస్తున్న వారిని తనుకూడా తన శత్రువులుగా పరిగణిస్తున్నాడు. తన ప్రభువు తనతో ప్రసన్నుడయితే పరమానంద భరితుడవుతాడు. తన ప్రభువు ఆగ్రహిస్తే ఆందోళనతో కుమిలి పోతాడు. తన ప్రభువు దేన్ని ఆజ్ఞాపించాడో దాన్నే తనూ ఇతరులకు ఆజ్ఞాపిస్తాడు. తన ప్రభువు వేటి జోలికి పోరాదని చెప్పాడో వాటి విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రభువు విధేయతలోనే ఉంటాడు. భయభక్తులు గల దాసులను, పశ్చాత్తాపం చెందేవారిని, పరిశుద్ధతను అవలంబించేవారిని, సౌశీల్యవంతులను, ఏకాగ్రతతో ఆరాధనలు చేసేవారిని అల్లాహ్ ఇష్టపడతాడు. కాబట్టి మనం కూడా అటువంటి వారిని – అల్లాహ్ ఇష్టపడుతున్నందున -ఇష్టపడాలి.

స్వామి ద్రోహానికి పాల్పడే వారిని, తలబిరుసుతనం ప్రదర్శించే వారిని, కల్లోలాన్ని రేకెత్తించేవారిని అల్లాహ్ ఇష్టపడడు. కాబట్టి అటువంటి దుర్మార్గులను మనం కూడా అసహ్యించుకోవాలి – ఒకవేళ వారు మన సమీప బంధువులైనప్పటికీ వారికిదూరంగానే మసలుకోవాలి.

“అగ్నిలో నెట్టివేయబడటమంటే ఎంత అయిష్టమో కుఫ్ర్ (ధిక్కారం) వైపునకుపోవాలన్నా అంతే అయిష్టత ఉండాలి.”

మనిషిలో ఈమాన్ (విశ్వాసం) యెడల ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉండాలంటే, దానికి విరుద్ధాంశమయిన కుఫ్ర్ (అవిశ్వాసం)ను, కుఫ్ర్ వైపునకు లాక్కుపోయే వస్తువులను తలచుకోగానే అతనిలో అసహ్యం, ఏవగింపు కలగాలి. అవిశ్వాస వైఖరిని అతను ఎంతగా ద్వేషిస్తాడో అతనిలో ఈమాన్ అంతే దృఢంగా ఉన్నట్లు లెక్క. మహాప్రవక్త ప్రియ సహచరులను గురించి అల్లాహ్ అంతిమ గ్రంథంలో ఇలాపేర్కొన్నాడు:

وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِّنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَٰكِنَّ اللَّهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ

“మీ మధ్య దైవప్రవక్త ఉన్నారన్న సంగతిని బాగా తెలుసుకోండి. ఒకవేళ ఆయన అనేక వ్యవహారాలలో మీరు చెప్పినట్లుగా వింటే, మీరే స్వయంగా నష్టపోతారు.అయితే అల్లాహ్ విశ్వాసాన్ని మీకు ప్రీతికరం గావించాడు. ఇంకా దాన్ని మీ మనసుల్లో సమ్మతమైనదిగా చేశాడు. అవిశ్వాసం, అపచారం, అవిధేయతలను ద్వేషించే వారుగా చేశాడు. సన్మార్గం పొందేది ఇటువంటివారే.” (అల్ హుజురాత్ 49 : 7)

అవిశ్వాసం, అపరాధం, అవిధేయత అంటే ప్రవక్త సహచరులలో ద్వేషం రగుల్కొనేది. తమలోని ఈ సుగుణం మూలంగానే వారు సన్మార్గ భాగ్యం పొందారు.

ఈ హదీసు ద్వారా బోధపడిన మరో సత్యం ఏమంటే, విశ్వాసం (ఈమాన్)లో పలు అంతస్థులు ఉన్నాయి. ఒకరిలో విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే, మరొకరిలో అసంపూర్ణంగా ఉంటుంది. దైవారాధన, దైవ నామస్మరణ వల్ల విశ్వాసి హృదయం నెమ్మదిస్తుంది. మనసు ప్రశాంతతను, సంతృప్తిని పొందుతుంది. ఈ ఉన్నత స్థానం కేవలం కుఫ్ర్ కు దూరంగా ఉండటంతోనే ప్రాప్తించదు. కుఫ్ర్ ను ద్వేషించినపుడే ప్రాప్తిస్తుంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ [వీడియో]

భూకంపాలు, వరదలు మరియు ఇస్లాం సిద్ధాంతాలు – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NClr-TiBAc4 [25 నిముషాలు]

ఈ వీడియోలో తెలుసుకోవలసిన విషయాలు:

1- భూకంపాలు సంభవించేలా చేస్తున్నది ఎవరు ?
2- సునామీలు, భూకంపాలు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తాయి ?
3- అభం శుభం తెలియని పిల్లలు వీటి వల్ల మరణిస్తున్నారు వారు చేసిన పాపం ఏమిటి ?
4- దైవ వాక్యాలు బోధించే పండితులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు వారి నేరం ఏమిటి ?
5- ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక విశ్వాసి గా మన బాధ్యత ఏమిటి ?
6- పదే పదే ఎక్కువగా భూకంపాలు సంభవించటం దేనికి సంకేతం ?
7- పూర్తి భూమి కంపించే రోజు రానుందా ?

“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

నికాహ్ (వివాహం)లో ‘వలీ’ (సంరక్షకుని) అనుమతి అవసరం

నికాహ్ (వివాహం లేక శుభ లగ్నం) కొరకు వధువు తండ్రిగానీ లేక ఆమె తరపు పెద్ద మనిషిగానీ సంరక్షకుడు (వలీ)గా ఉండి తన సమ్మతిని తెలియజేస్తాడు. వధూవరుల తరఫు బంధుమిత్రులు. శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలిపి గౌరవప్రదమైన రీతిలో వధువును తీసుకుని వెళతారు. ఇప్పటి వరకూ ముస్లిం సమాజంలోనూ, ప్రాచ్య దేశాల ఇతర మతవర్గాల వారిలోనూ ఇదే పద్ధతి నడుస్తూ వస్తోంది. కాని లజ్జావిహీనమైన పాశ్చాత్య సంస్కృతి మూలంగా మన సంప్రదాయానికి విఘాతం ఏర్పడింది. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడిన అబ్బాయిలు- అమ్మాయిలు దొంగచాటుగా ప్రేమ వ్యవహారం నడిపి ఇద్దరూ కలిసి జీవిస్తామని, కలిసి మరణిస్తామని ఊసులాడుకుంటారు. పెద్దలకు చెప్పాపెట్టకుండా ఇంటి నుండి పారిపోయి నాలుగైదు రోజులు మాయమైపోతారు. ఆ తరువాత నేరుగా కోర్టుకు వచ్చి పెళ్లి చేసుకుంటారు. “వలీ లేకుండా కూడా నికాహ్ అయిపోతుంది” అన్న ఫత్వా ఆసరాగా కోర్టు నికాహ్ ధృవపత్రం జారీ చేస్తుంది. కన్నవారు అవమానభారంతో కృంగిపోతారు. ఈ రకమయిన నికాహ్ను ‘కోర్టు మ్యారేజ్’ గా వ్యవహరిస్తున్నారు. ఈ రకమయిన చేష్ట ఒక ఇస్లామీయ ప్రబోధనల పైనేకాదు, యావత్ ప్రాచ్య సంస్కృతి పైనే తిరుగుబాటుకు ప్రతీక. దీని ఉద్దేశం. వివాహాది శుభకార్యాలలో ఇస్లామీయ సంప్రదాయానికి తిలోదకాలిచ్చి దేశంలో పాశ్చాత్య తరహా సంస్కృతిని ప్రవేశ పెట్టడమే.

నికాహ్ సమయంలో ‘వలీ’ (సంరక్షకుడు) ఉండటం, అతని సమ్మతి లభించటం గురించి ఖుర్ఆన్ హదీసులలో స్పష్టమైన ఆదేశాలున్నాయి. స్త్రీల వివాహ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రత్యక్షంగా స్త్రీలను సంబోధించకుండా వారి ‘వలీ’లను సంబోధించటం జరిగింది. ఉదాహరణకు:

షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించి మోమిన్లు కానంతవరకూ మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి.“(అల్ బఖర: 221)

దీన్నిబట్టి స్పష్టంగా అవగతమయ్యేదేమిటంటే స్త్రీ తనంతట తానుగా నికాహ్ చేసుకోజాలదు. అందుకే ఆమె సంరక్షకులనుద్దేశించి ‘ఆదేశం’ ఇవ్వబడింది – ఆమెను ముష్రిక్కు పురుషునికిచ్చి వివాహం చెయ్యకూడదని. వలీ (సంరక్షకుని) అంగీకారం గురించి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కొన్ని ప్రవచనాలను కూడా గమనిద్దాం: ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

వలీ (అనుమతి) లేకుండా వివాహమే అవదు” (అబూదావూద్, తిర్మిజీ, ఇబ్నుమాజా).

మరొక హదీసులో ఇలా ఉంది:

“ఏ స్త్రీ అయితే వలీ అనుమతి లేకుండానే నికాహ్ చేసుకుందో ఆమె నికాహ్ మిథ్య. ఆమె నికాహ్ మిథ్య. ఆమె నికాహ్ మిథ్య.” (అహ్మద్, అబూ దావూద్, తిర్మిజీ, ఇబ్సుమాజా).

ఇమామ్ ఇబ్ను మాజా (రహిమహుల్లాహ్) పొందుపరచిన ఒక హదీసులోని పదజాలం మరింత తీవ్రంగా వుంది. అల్లాహ్ ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించే ఏ విశ్వాసురాలు కూడా ‘వలీ’ లేకుండా నికాహ్ చేసుకోవటం గురించి ఊహించనైనా లేదు. ఇంతకీ హదీసులో ఏమనబడిందంటే- “తన నికాహ్ ను స్వయంగా చేసుకునే స్త్రీ వ్యభిచారిణి మాత్రమే.”

ఇక్కడ గమనార్హమైన రెండు విషయాలు ఉన్నాయి. –

ఒకటి; ఒకవేళ ఏ స్త్రీ సంరక్షకుడైనా నిజంగానే దుర్మార్గుడు, స్వార్ధపరుడై ఉండి ఆ స్త్రీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పక్షంలో షరీయత్ ప్రకారం అటువంటి వ్యక్తి గార్డియన్‌గా అనర్హుడైపోతాడు. అతని స్థానంలో ఆమె సమీప బంధువుల్లోని వేరొక వ్యక్తి వలీ’గా ఖరారవుతాడు. ఒకవేళ ఆమె కుటుంబీకుల్లో ఏ ఒక్కరూ ఆమెకు శ్రేయోభిలాషులు కారని తేలినప్పుడు ఆ ఊరి పెద్దగానీ, రాజ్యాధికారిగానీ ఆమె తరపున ‘వలీ’గా ఉంటాడు. ఈ నేపథ్యంలో మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “వలీ అన్నవాడే లేని స్త్రీకి రాజ్యాధికారి వలీగా ఉంటాడు.”(తిర్మిజీ)

రెండు; సంరక్షకుని అనుమతి లేకుండా వివాహమాడరాదని తాకీదు చేసిన ఇస్లాం, స్త్రీ అంగీకారంతో నిమిత్తం లేకుండా ఆమె వివాహం తన ఇష్టానుసారం జరిపించరాదని సంరక్షకునికి కూడా ఆంక్ష విధించింది. “కన్య అయిన ఒక స్త్రీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి తన తండ్రి తనకు ఇష్టం లేని వ్యక్తితో తన వివాహం జరిపించాడని ఫిర్యాదు చేసింది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) – ఆమె కోరుకుంటే ఆ నికాహ్ కు కట్టుబడి ఉండవచ్చనీ, లేదంటే రద్దు పరచుకోవచ్చని ఆమెకు అధికారం ఇచ్చారు.” (అబూ దావూద్, నసాయి, ఇబ్నుమాజా),

అలాగే ఒక వ్యక్తి వితంతువు అయిన తన కుమార్తె వివాహం తన ఇష్టంతో జరిపించగా, ఆ వివాహాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రద్దుపరిచారు. (బుఖారి)

దీని భావమేమిటంటే నికాహ్ సందర్భంగా వలీ అనుమతితో పాటు వధువు అంగీకారం అనివార్యం. ఒకవేళ ఏ కారణంగానయినా వారిద్దరి మధ్య అభిప్రాయ భేదం పొడసూపితే జీవితంలోని మెట్టపల్లాల గురించి వలీ ఆమెకు నచ్చజెప్పి ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకునేలా యత్నించాలి. ఒకవేళ ఈ ప్రయత్నం ఫలించకపోతే అమ్మాయి. ఇష్టపడే మరో సంబంధం చూసి పెళ్ళి జరిపించాలి.

నికాహ్ లో అటు గార్డియన్, ఇటు వధువు- ఇరువురి అంగీకారాన్ని పరస్పరం అనివార్య అంశం ఖరారు చేసి ఇస్లామీయ షరియత్ ఒక మధ్యేమార్గాన్ని తెరచింది. తద్వారా వారిరువురి భావావేశాలను, ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుని ఏ ఒక్కరికీ తలవంపు జరగకుండా చూడటం జరిగింది.

ఖుర్ఆన్ హదీసులు ఇంత స్పష్టంగా ఆదేశాలిచ్చిన తరువాత కూడా అబ్బాయిలు అమ్మాయిలు తమ తల్లిదండ్రుల మాటను ఖాతరు చెయ్యకపోవలసిన ఖర్మ ఏం పట్టింది? చెప్పాపెట్టకుండా ఇంట్లోనుంచి పారిపోవటమెందుకు? వివాహానికి ముందే చాటుమాటు సరసాలెందుకు? వివాహం (నికాహ్) పేరుతో కోర్టులో నాటకమెందుకు? సంరక్షకుడు (వలీ) లేకుండా నికాహ్ చేసుకోవటం ధర్మసమ్మతమే అనుకుంటే పాశ్చాత్య తరహా పెళ్లిళ్లకు ఇస్లామీయ పెళ్లిళ్లకు మధ్య వ్యత్యాసం ఏం మిగిలిందీ? పాశ్చాత్య సమాజంలో స్త్రీకి ఇవ్వబడిన ఈ ‘స్వాతంత్రమే’ అక్కడి కొంపల్ని కూల్చేస్తున్నది. చిందరవందర అవుతున్న తమ బ్రతుకుల్ని చూసి పాశ్చాత్య వివేచనాపరులు సయితం ఆవేదనకు లోనవుతున్నారు. 1995లో అమెరికా ప్రధమ మహిళ అయిన హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్లో పర్యటించినప్పుడు ఆమె ఇస్లామాబాద్ లోని కాలేజ్ ఫర్ వుమెన్ విద్యార్ధినులతో మాట్లాడుతూ ఉద్వేగపూరితంగా ఇలా అన్నారు: “అమెరికాలో ప్రస్తుతం అతి పెద్ద సమస్య ఏమిటంటే అవివాహిత విద్యార్థినులు గర్భవతులై పోతున్నారు. ఈ సమస్యకు ఏకైక పరిష్కారం ఏమిటంటే యువతీయువకులు తమ మతపరమైన, సామాజికమైన విలువలపై తిరుగుబాటు చేయకూడదు. వారు ముస్లిములైనా సరే, క్రైస్తవులయినాసరే తమ ధార్మిక సామాజిక నియమ నిబంధనలకు కట్టుబడి వివాహాలు చేసుకోవాలి. వారు తమ తల్లిదండ్రుల గౌరవ మర్యాదలను మంటగలపకూడదు. వారి సుఖశాంతులను హరించకూడదు.”. (‘జంగ్’ దినపత్రిక: 28-3-1995)

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కే ఉంది

ఇస్లామీయ సోదరులారా! 

లాభనష్టాల అధికారం కేవలం అల్లాహ్ కే వుందని ప్రతి ముస్లిం మనస్ఫూర్తిగా విశ్వసించాలి. అతనికి తప్ప మరెవరికీ ఈ అధికారం లేదు. ఏ ‘వలీ‘ దగ్గరా లేదు, ఏ ‘బుజుర్గ్‘ దగ్గరా లేదు. ఏ ‘పీర్‘, ‘ముర్షద్‘ దగ్గరా లేదు. ఏ ప్రవక్త దగ్గరా లేదు. చివరికి ప్రవక్తలలో శ్రేష్ఠులు, ఆదమ్ సంతతికి నాయకులు మరియు ప్రవక్తల ఇమామ్ అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు కూడా. ఇతరులకు లాభనష్టాలు చేకూర్చడం అటుంచి, స్వయానా తమకు కలిగే లాభనష్టాలపై సయితం వారు అధికారం కలిగిలేరు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُل لَّآ أَمْلِكُ لِنَفْسِى نَفْعًۭا وَلَا ضَرًّا إِلَّا مَا شَآءَ ٱللَّهُ ۚ وَلَوْ كُنتُ أَعْلَمُ ٱلْغَيْبَ لَٱسْتَكْثَرْتُ مِنَ ٱلْخَيْرِ وَمَا مَسَّنِىَ ٱلسُّوٓءُ ۚ إِنْ أَنَا۠ إِلَّا نَذِيرٌۭ وَبَشِيرٌۭ لِّقَوْمٍۢ يُؤْمِنُونَ

“ప్రవక్తా! వారితో ఇలా అను: నాకు సంబంధించిన లాభనష్టాలపై నాకు ఏ అధికారమూ లేదు. అల్లాహ్ కోరింది మాత్రమే అవుతుంది. నాకే గనక అగోచర విషయ జ్ఞానం వున్నట్లయితే, నేను ఎన్నో ప్రయోజనాలను నా కొరకు పొంది ఉండేవాణ్ణి. నాకు ఎన్నటికీ ఏ నష్టమూ వాటిల్లేది కాదు. నేను నా మాటను నమ్మేవారి కొరకు కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే, శుభవార్త వినిపించేవాణ్ణి మాత్రమే.” (ఆరాఫ్ 7:188) 

ఈ ఆయతుపై దృష్టి సారిస్తే తెలిసేదేమిటంటే – 

స్వయానా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తనకు కలిగే లాభనష్టాలపై అధికారం కలిగి లేకపోతే – మరి ఆయన కన్నా తక్కువ స్థాయి గల వలీ గానీ, బుజుర్గ్ గానీ, పీర్ గానీ- ఎవరి సమాధులనయితే ప్రజలు గట్టిగా నమ్మి సందర్శిస్తుంటారో- ఈ అధికారాన్ని ఎలా కలిగి వుంటారు? తమకు ప్రయోజనం చేకూర్చే మరియు నష్టాన్ని కలిగించే వారుగా ప్రజలు తలపోసే వారి గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلْ أَفَرَءَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ إِنْ أَرَادَنِىَ ٱللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَـٰشِفَـٰتُ ضُرِّهِۦٓ أَوْ أَرَادَنِى بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَـٰتُ رَحْمَتِهِۦ ۚ قُلْ حَسْبِىَ ٱللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ ٱلْمُتَوَكِّلُونَ

“వారిని ఇలా అడుగు: ఒకవేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకొనే ఆరాధ్యులు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్ నాపై కనికరం చూపగోరితే, వారు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయం ఏమిటి? కనుక వారితో ఇలా అను, నాకు అల్లాహ్ ఒక్కడే చాలు, నమ్ముకునేవారు ఆయననే నమ్ముకుంటారు.” (జుమర్ 39 : 38) 

ఈ ఆయత్ లో అల్లాహ్ ఇలా ఛాలెంజ్ చేస్తున్నాడు: దైవేతరులెవరి దగ్గరైనా లాభనష్టాల అధికారం గనక వుంటే – అల్లాహ్ నష్టం కలిగించదలచిన వాడిని, తను, ఆ నష్టం కలగకుండా కాపాడ మనండి మరియు అల్లాహ్ ప్రయోజనం చేకూర్చదలచిన వాడికి ఆ ప్రయోజనం కలగకుండా ఆపమనండి. అంటే – వారలా చేయలేరు. మరి వారలా చేయలేరంటే – దాని అర్థం వారికి లాభనష్టాల అధికారం లేదు అని. 

అలాగే, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

مَّا يَفْتَحِ ٱللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍۢ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُۥ مِنۢ بَعْدِهِۦ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

“అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్య ద్వారాన్ని తెరచినా, దానిని అడ్డుకొనే  వాడెవ్వడూలేదు. ఆయన మూసివేసిన దానిని అల్లాహ్ తరువాత మళ్ళీ తెరిచేవాడూ ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు.” (ఫాతిర్ 35: 2) 

అందుకే, అల్లాహ్- తనను తప్ప ఇతరులను వేడుకోవడం నుండి వారించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَلَا تَدْعُ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًۭا مِّنَ ٱلظَّـٰلِمِينَ وَإِن يَمْسَسْكَ ٱللَّهُ بِضُرٍّۢ فَلَا كَاشِفَ لَهُۥٓ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍۢ فَلَا رَآدَّ لِفَضْلِهِۦ ۚ يُصِيبُ بِهِۦ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ ۚ وَهُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

“అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గానీ లాభాన్ని గానీ కలిగించలేని ఏ శక్తినీ వేడుకోకు. ఒకవేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురిచేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు. ఇంకా, ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే, ఆయన అనుగ్రహాన్ని మళ్ళించేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.” (యూనుస్ 10: 106 -107) 

ఈ ఆయతులలో అల్లాహ్ – దైవేతరులెవరికీ లాభనష్టాల అధికారం లేదు, వారిని వేడుకోవడాన్ని వారిస్తూ, ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! ఒకవేళ నీవు గనక ఇలా చేస్తే (అల్లాహ్ శరణు) నీవు కూడా దుర్మార్గులలో కలసి పోతావు – అని సెలవియ్యడంతోపాటు, తన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఆయన నష్టం కలిగించదలిస్తే దాన్ని ఆపగలిగే వాడెవడూ లేడు మరియు ఒకవేళ తన కృపతో ఆయన దేన్నయినా ప్రసాదిస్తే ఆయన అనుగ్రహాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేరు అని సెలవిచ్చాడు. దీనితో – రుజువయ్యిందేమిటంటే – ఈ అధికారాలు కేవలం అల్లాహ్ కే వున్నాయి. 

కాస్త ఆలోచించండి! 

మరి, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ తప్ప మరెవ్వరూ నష్టం కలిగించలేనప్పుడు, సాధారణ ముస్లిములకు అల్లాహ్ తప్ప మరెవరు నష్టం కలిగించగలరు? అందుకే, దైవేతరులెవరైనా సరే, వారితో లాభనష్టాలను ఆశించకూడదు. ఎందుకంటే – దైవేతరుల గురించి -తన సంకల్పంతో, అధికారంతో ఎవరికైనా తను కోరుకున్న నష్టం కలిగించగలడు – అని భావించడం పెద్ద షిర్క్ (షిర్కె అక్బర్). 

అందుకే ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఇలా సెలవిచ్చి వున్నారు: 

وَحَآجَّهُۥ قَوْمُهُۥ ۚ قَالَ أَتُحَـٰٓجُّوٓنِّى فِى ٱللَّهِ وَقَدْ هَدَىٰنِ ۚ وَلَآ أَخَافُ مَا تُشْرِكُونَ بِهِۦٓ إِلَّآ أَن يَشَآءَ رَبِّى شَيْـًۭٔا ۗ وَسِعَ رَبِّى كُلَّ شَىْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ وَكَيْفَ أَخَافُ مَآ أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِٱللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِۦ عَلَيْكُمْ سُلْطَـٰنًۭا ۚ فَأَىُّ ٱلْفَرِيقَيْنِ أَحَقُّ بِٱلْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ

“(అల్లాహ్ కు వ్యతిరేకంగా) మీరు నిలబెట్టిన భాగస్వాములకు నేను భయపడను. అయితే నా ప్రభువు ఏదైనా కోరితే అది తప్పకుండా జరుగుతుంది. నా ప్రభువు జ్ఞానం ప్రతి దానినీ ఆవరించి వున్నది. మీరు స్పృహలోకి రారా? నేను అసలు మీరు నిలబెట్టే భాగస్వాములకు ఎందుకు భయపడాలి?వాటి విషయంలో అల్లాహ్ మీపై ఏ ప్రమాణాన్ని అవతరింపజేయనప్పటికీ వాటిని మీరు ఆయన తోపాటు దైవత్వంలో భాగస్వాములుగా చేస్తూ భయపడనప్పుడు.” (అన్ఆమ్ 6: 80-81) 

ఈ ఆయతుల ద్వారా తెలిసిందేమిటంటే – 

పీర్లు, ఫకీర్లు, ‘బుజుర్గ్’ లో ఎవరిని గురించి కూడా (వారేదో చేసేస్తారని) భయాందోళనలకు గురి కాకూడదు. అల్లాహ్ అభీష్టానికి వ్యతిరేకంగా ఎవరు కూడా ఏ మాత్రం నష్టం కలిగించలేరు. ఇలాంటి భయాందోళనలు కేవలం అల్లాహ్ పట్ల కలిగి వుండాలి. కారణం – తన సంకల్పానికి అనుగుణంగా ఎవరికైనా నష్టం కలిగించే శక్తి సామర్థ్యాలు కేవలం ఆయనకే ఉన్నాయి కాబట్టి. ఒకవేళ అల్లాహ్ సంకల్పించకుంటే ప్రపంచంలోని ఏ వలీ, బుజుర్గ్, పీర్ లేదా సజ్జాదా నషీన్ అయినా ఏ మాత్రం నష్టం కలిగించలేడు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

قُل لَّن يُصِيبَنَآ إِلَّا مَا كَتَبَ ٱللَّهُ لَنَا هُوَ مَوْلَىٰنَا ۚ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ

“వారితో ఇలా అను: అల్లాహ్ మాకొరకు వ్రాసి వుంచింది తప్ప మాకు ఏదీ (చెడుగానీ, మంచిగానీ) ఏ మాత్రం కలుగదు. అల్లాహ్ యే మా సంరక్షకుడు. విశ్వసించేవారు ఆయననే నమ్ముకోవాలి.” (తౌబా 9: 51) 

అలాగే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: 

“యావత్ మానవజాతి ఏకమై నీకేదైనా ప్రయోజనం చేకూర్చాలన్నా ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసిపెట్టి వున్నంత వరకే ప్రయోజనం చేకూర్చ గలదు. అలాగే, యావత్తు మానవజాతి ఏకమై నీకేదైనా కీడు కలిగించాలనుకొన్నా – అది కూడా, ఇదివరకే నీ అదృష్టంలో అల్లాహ్ వ్రాసి పెట్టినంతవరకే కీడు తలపెట్టగలదు అని దృఢంగా విశ్వసించు.” (తిర్మిజి : 2516, సహీ ఉల్ జామె : 7957)  

ఈ పోస్ట్ క్రింది ఖుత్బా పుస్తకం నుండి తీసుకోబడింది.

సఫర్ నెల మరియు దుశ్శకునాలు (ఖుత్బా)
జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

షుక్ర్ (కృతజ్ఞతా భావం): దాని శుభాలు | ఖుత్ బాతే నబవీ ﷺ

وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِى لَشَدِيدٌۭ

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి! (అల్ ఇబ్రాహీమ్ 14: 7)

ప్రియ సోదరులారా..!

అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావం: దాని శుభాల గురించి ఈ రోజు ఖుత్బాలో తెలుసుకుందాం. మనం నోటితో, ఆచరణతో అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండటం తప్పనిసరి. నోటితో అల్ హమ్దులిల్లాహ్ పలకటం, ఆ అనుగ్రహాన్ని ఆచరణతో కాపాడుకోవటం, గుర్తించటం. దీనినే షుక్ర్ (కృతజ్ఞత) అంటారు. కృతజ్ఞతలు తెలుపుకునే వారికి అల్లాహ్ సమృద్ధిని, శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఖుత్బాలో పఠించిన వాక్యం అర్థం అదే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

“మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి! (అల్ ఇబ్రాహీమ్ 14 : 07)

ఈ ఆయత్ హజ్రత్ మూసా (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సంబంధించినది. మూసా (అలైహిస్సలాం) తమజాతి వారితో ఇలా అన్నారు:

“ఓ ప్రజలారా! అల్లాహ్ మీకు ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. ఇప్పుడు మీ ప్రభువు ఇలా ప్రకటించాడు: ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే అల్లాహ్ మరింత సమృద్ధిని, శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. కాని ఒకవేళ మీరు అనుగ్రహాల పట్ల ఏమరుపాటుగా ఉంటే, అశ్రద్ధ చేస్తే మరి అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉంది: “నా శిక్ష కూడా చాలా వ్యధాభరితంగా ఉంటుంది”。

ప్రవక్త ﷺ సున్నత్ అనుసరణ – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[మొబైల్ ఫ్రెండ్లీ బుక్ ][PDF] [120 పేజీలు] [5.13 MB]

విషయ సూచిక (డౌన్లోడ్)

  1. తొలి పలుకులు [13p]
  2. బిద్ అత్ (కొత్త పోకడలు) [22p]
  3. హదీసు వివరాల సంక్షిప్త బోధన [3p]
  4. సంకల్పం [1p]
  5. సున్నత్ నిర్వచనం [3p]
  6. సున్నత్ – ఖుర్ఆన్ వెలుగులో [6p]
  7. సున్నత్ మహత్తు [4p]
  8. సున్నత్ ప్రాముఖ్యం [9p]
  9. సున్నత్ యెడల భక్తి ప్రపత్తులు [3p]
  10. సున్నత్ వుండగా సొంత అభిప్రాయమా? [4p]
  11. ఖుర్ఆన్ అవగాహనకై సున్నత్ ఆవశ్యకత [8p]
  12. సున్నత్ను పాటించటం అవశ్యం [10p]
  13. ప్రవక్త సహచరుల దృష్టిలో సున్నత్ [8p]
  14. ఇమాముల దృష్టిలో సున్నత్ [4p]
  15. బిద్అత్ నిర్వచనం [2p]
  16. బిద్అత్ ఖండించదగినది [7p]
  17. బలహీనమైన, కాల్పనికమైన హదీసులు [2p]

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

అల్లాహ్ శుభ నామము: అస్-సమీఅ్ (సర్వమూ వినేవాడు) యొక్క వివరణ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభ నామము: “అస్-సమీఅ్” యొక్క వివరణ [వీడియో]
https://youtu.be/xCWLjjGHElI [36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క శుభ నామమైన “అస్-సమీ” (సర్వం వినేవాడు) గురించి వివరిస్తారు. సమయాభావం వలన అల్-బసీర్ (సర్వం చూసేవాడు) మరియు అల్-అలీమ్ (సర్వజ్ఞాని) అనే ఇతర రెండు నామాలను వదిలి, కేవలం అస్-సమీ పై దృష్టి సారిస్తారు. అల్లాహ్ వినికిడి శక్తి ఎంత గొప్పదో, విశాలమైనదో ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేస్తారు. ఒకే సమయంలో సృష్టిలోని జీవరాశులన్నిటి ప్రార్థనలను, విభిన్న భాషలలో, ఎలాంటి గందరగోళం లేకుండా వినగలడని ఉదాహరణలతో వివరిస్తారు. ఈ నమ్మకం ఒక విశ్వాసి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాలి, వారి మాటలు, చేతలు ఎలా ఉండాలి, మరియు ప్రార్థనలలో అల్లాహ్ వైపు ఎలా ఏకాగ్రతతో మళ్ళాలో వివరిస్తారు. షిర్క్‌ను ఖండిస్తూ, వినలేని వారిని ఆరాధించడం నిరర్థకమని, సర్వం వినే అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని నొక్కి చెబుతారు.

పరిచయం

అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మాబాద్.

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
[అవూజు బిల్లాహిస్ సమీఇల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్]
(శపించబడిన షైతాన్ నుండి సర్వం వినేవాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుతున్నాను)

لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ
[లైస కమిస్లిహి షైఉన్ వహువస్ సమీఉల్ బసీర్]
(ఆయనను పోలినది ఏదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.)

సోదర మహాశయులారా, ప్రియ మిత్రులారా, ఈరోజు అల్లాహ్ శుభ నామములైన మూడు నామాల గురించి, అస్-సమీ, అల్-బసీర్, అల్-అలీమ్. ఈ మూడిటి గురించి చెప్పేది ఉండే. కానీ ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది. మూడిటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే, మరీ ఇంకా చాలా దీర్ఘం, ఎక్కువ సమయం అవుతుంది గనక, ఈరోజు కేవలం సమీ గురించి చెబుతున్నాను. ఎలాగైతే మీరు ఇప్పుడు ఇక్కడ టైటిల్ లో కూడా చూస్తున్నారు. అయితే రండి.

అస్-సమీ అల్లాహ్ యొక్క పేరు అని, అందులో ఉన్నటువంటి గుణం ‘సమ్’ (వినికిడి), వినడం అల్లాహ్ యొక్క గుణం అని మనం నమ్మాలి. ఖురాన్‌లో 50 కంటే ఎక్కువ చోట్ల అల్లాహ్ యొక్క ఈ పేరు ప్రస్తావన వచ్చింది. అల్లాహ్ యొక్క ఈ పేరు, అస్-సమీ అంటే వినేవాడు. ఈ ఒక్క పదం వాస్తవానికి మన తెలుగులోనిది, అస్-సమీలో ఉన్నటువంటి విశాలమైన భావానికి సరిపోదు. అందుకొరకే వివరణ చాలా అవసరం.

కేవలం మానవులదే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతీ దాని గురించి అల్లాహు తఆలా చాలా స్పష్టముగా మంచి రీతిలో వింటాడు. అల్లాహు తఆలా యొక్క వినే శక్తి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎలా వింటాడు అన్న దాని గురించి కైఫియత్ (ఎలాగో), అది మనకు తెలియదు. కానీ ఖురాన్‌లో అల్లాహు తఆలా ఏ ఆయతులు అయితే తెలిపాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఏ హదీసులు అయితే వచ్చాయో, వాటన్నిటిని కలుపుకుంటే, పూర్తి విశ్వంలో నుండి ఎలా వింటాడు అనేది కాకుండా, కేవలం ఒక మానవుల విషయం మనం చిన్నగా ఆలోచిస్తే, పూర్తి ప్రపంచంలో ఉన్న మానవులు ఒకే సమయంలో, ఒకే సందర్భంలో, ఒకే పెద్ద మైదానంలో ఉండి, ప్రతీ ఒక్కరూ తమ తమ భాషల్లో, ప్రతీ ఒక్కరూ తమ వేరువేరు కోరికలు ఏదైతే వెళ్లబుచ్చుతారో, అల్లాహు తఆలా ఆ ఒకే సమయంలో అందరి మాటలు వింటాడు, అందరి భాషలు వింటాడు అర్థం చేసుకుంటాడు, అందరి కోరికలు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిని వింటాడు.

జన సమూహంలో ఉండి అందరి శబ్దాలు, భాషలు, వారు చెప్పే మాటలు ఎంత వేరువేరు ఐనా, వారికి పరస్పరం ఒకరికి ఒకరు ఎంత డిస్టర్బెన్స్ ఐనా, అల్లాహ్ అజ్జవజల్లా యొక్క వినే శక్తి ఎంత గొప్పది అంటే, అతనికి ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు. అల్లాహు తఆలా ప్రతీ ఒక్కరి మాట, ప్రతీ ఒక్కరి కోరిక, ప్రతీ ఒక్కరి భాష వింటాడు. అంతేకాదు, ఎవరైనా ఇప్పుడు నేను చెబుతున్నట్లుగా బిగ్గరగా, శబ్దంతో చెప్పినా, (మెల్లగా) “ఓ అల్లాహ్ మేము ఉపవాసం ఉంటున్నాము, మా ఉపవాసాలను స్వీకరించు ఓ అల్లాహ్”. నేను ఎంత మెల్లగా చెబుతున్నాను అంటే బహుశా నా పక్కన ఉన్నవానికి కూడా వినబడదు కావచ్చు, కానీ అల్లాహ్ బిగ్గరగా చెప్పేవారి మాట వింటాడు, నిశ్శబ్దంగా చెప్పే వాని మాట వింటాడు. అంతే కాదు, కొన్ని సందర్భాలలో మనలో మనమే నాలుకను కదిలించి మాట్లాడుతూ ఉంటాము, ఏ శబ్దమూ రాదు. అలాంటి మాటలు సైతం అల్లాహ్ వింటాడు.

ఒక సామెతగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. అందులో అస్-సమీ, అల్-బసీర్, అల్-అలీమ్ మూడు అల్లాహ్ యొక్క నామాల ప్రస్తావన వచ్చేస్తుంది. అదేమిటంటే, అమావాస్య రాత్రి, చిమ్మని చీకటి రాత్రి, నల్ల రాయి కింద పాతాళంలో ఉన్నటువంటి చీమను అల్లాహ్ చూస్తాడు (బసీర్), నడిచే నడక యొక్క శబ్దాన్ని అల్లాహ్ వింటాడు (అస్-సమీ), ఆ చీమ తన చీమల గ్రూప్‌తో ఏం మాట్లాడుతుందో అది కూడా అల్లాహ్‌కు తెలుసు (అల్-అలీమ్).

ఈ మూడు పేర్లు అనేక సందర్భాలలో కూడా ఖురాన్‌లో వచ్చి ఉన్నాయి. ఒక ఉదాహరణ మీకు మన సోదరులు తెలిపారు కూడా. అందుకొరకే మూడిటిని కలిపి ఒకే సమయంలో మనం తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆశ ఉండింది కానీ సమయం సరిపోదు. అందుకొరకే ఇప్పుడు సమీ గురించి చెప్పడం జరుగుతుంది. ముస్నద్ అహ్మద్‌లో వచ్చిన ఒక హదీస్, ఇబ్ను మాజా, నసాయిలో కూడా ఉంది. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారి మాటను గమనించండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక స్త్రీ వచ్చి ఒక విషయం అడిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు ఇంకా వహీ రాలేదని, దీని గురించి ఇప్పుడే ఏమీ సమాధానం చెప్పలేనని అంటారు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అంటున్నారు:

الْحَمْدُ لِلَّهِ الَّذِي وَسِعَ سَمْعُهُ الْأَصْوَاتَ
[అల్హందులిల్లాహిల్లజీ వసిఅ సమ్ఉహుల్ అస్వాత్]
(ఆ అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు, ఏ అల్లాహ్ యొక్క వినికిడి అన్ని రకాల శబ్దాలను ఆవరించి ఉందో.)

لَقَدْ جَاءَتِ الْمُجَادِلَةُ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تُكَلِّمُهُ
లకద్ జాఅతిల్ ముజాదిలతు ఇలన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం తుకల్లిముహు
(ఆ వాదించే స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి మాట్లాడుతుండగా)

ఆ ఒక సమస్య గురించి అడుగుతూ వచ్చినటువంటి స్త్రీ యొక్క మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఆమె మాట్లాడుతుంది,

وَأَنَا فِي نَاحِيَةٍ مِنَ الْبَيْتِ مَا أَسْمَعُ مَا تَقُولُ
వఅనా ఫీ నాహియతిన్ మినల్ బైతి మా అస్మఉ మా తఖూల్
(నేను ఇంటిలోనే ఒక పక్కన, ఒక మూలన ఉండి వింటూ ఉన్నాను),

فَأَنْزَلَ اللَّهُ عَزَّ وَجَلَّ
ఫఅన్జలల్లాహు అజ్జవజల్ల
(అప్పుడు అల్లాహు తఆలా ఆయత్ అవతరింపజేశాడు).

సూరతుల్ ముజాదలాలోని మొదటి ఆయత్:

قَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِي زَوْجِهَا وَتَشْتَكِي إِلَى اللَّهِ وَاللَّهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ
(నిశ్చయంగా అల్లాహ్ తన భర్త విషయంలో మీతో వాదిస్తూ ఉండిన, మరియు అల్లాహ్‌కు మొరపెట్టుకుంటున్న ఆ స్త్రీ యొక్క మాటను విన్నాడు. మరియు అల్లాహ్ మీ ఇద్దరి మాటలను వింటూ ఉన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.)

సోదర మహాశయులారా, ఇంతకుముందు నేను చెప్పినట్లు, ఆ హదీస్ కూడా సహీహ్ ముస్లింలో వచ్చి ఉంది, 2577. అల్లాహ్ అంటున్నాడు, హదీస్ ఖుద్సీ ఇది.

يَا عِبَادِي، لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ قَامُوا فِي صَعِيدٍ وَاحِدٍ فَسَأَلُونِي فَأَعْطَيْتُ كُلَّ وَاحِدٍ مَسْأَلَتَهُ مَا نَقَصَ ذَلِكَ مِنْ مُلْكِي شَيْئًا إِلَّا كَمَا يَنْقُصُ الْمِخْيَطُ إِذَا غُمِسَ فِي الْبَحْرِ

[యా ఇబాదీ, లవ్ అన్న అవ్వలకుమ్ వ ఆఖిరకుమ్ వ ఇన్సకుమ్ వ జిన్నకుమ్ ఖామూ ఫీ సయీదిన్ వాహిదిన్ ఫసఅలూనీ, ఫఅఅతైతు కుల్ల వాహిదిన్ మస్అలతహు, మా నఖస జాలిక మిన్ ముల్కీ షైఆ, ఇల్లా కమా యన్ఖుసుల్ మిఖ్యతు ఇజా గుమిస ఫిల్ బహర్]

(ఓ నా దాసులారా, మీలోని మొదటివాడి నుండి మొదలుకొని చివరి వాడి వరకు, మానవులే కాదు జిన్నాతులు సైతం ఒకే ఒక మైదానంలో మీరందరూ నిలబడి, మీరందరూ నాతో అర్ధించారంటే, అడిగారంటే, ప్రతి ఒక్కరికి అతను అడిగినది నేను ఇచ్చేశానంటే, నా యొక్క రాజ్యంలో ఏ కొంచెం కూడా తరగదు, సముద్రంలో ఒక సూది ఇలా ముంచి తీస్తే సముద్రంలో ఎంత తరుగుతుంది? అంత కూడా, నేను ప్రతీ ఒక్కరికి మీరు అడుగుతున్నది విని, వారు అడిగినది వారికి ఇచ్చేస్తే ఇంత కూడా తరగదు.

బుఖారీ ముస్లింలో అబూ మూసా అష్అరీ రదియల్లాహు తఆలా అన్హు వారి హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వారు సహాబాలు ప్రయాణంలో ఉన్నారు. అబూ మూసా అంటున్నారు: فَكُنَّا إِذَا عَلَوْنَا كَبَّرْنَا ఫకున్నా ఇజా అలౌనా కబ్బర్నా (మేము నడుస్తూ నడుస్తూ అంటే ప్రయాణంలో దారిలో ఎత్తు ప్రదేశంలో ఉండగా ‘అల్లాహు అక్బర్’ అని గొంతు ఎత్తి కొంచెం పెద్ద శబ్దంతో అంటూ ఉంటిమి). ఫఖాల్ (అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు):

أَيُّهَا النَّاسُ ارْبَعُوا عَلَى أَنْفُسِكُمْ، فَإِنَّكُمْ لَا تَدْعُونَ أَصَمَّ وَلَا غَائِبًا، وَلَكِنْ تَدْعُونَ سَمِيعًا بَصِيرًا قَرِيبًا
[అయ్యుహన్నాస్, ఇర్బవూ అలా అన్ఫుసికుమ్. ఫఇన్నకుమ్ లా తద్ఊన అసమ్మ వలా గాఇబా. వలాకిన్ తద్ఊన సమీఅన్ బసీరన్ ఖరీబా]
(ఓ ప్రజలారా, మీరు స్వయం మీపై కొంచెం తగ్గించుకోండి, నిదానం అనేది పాటించండి. మీరు ఎవరిని అర్ధిస్తున్నారు? ఏదైనా చెవిటి వాడిని కాదు, ఏదో దూరం ఉండి ఏమీ తెలియని వానికి కాదు. మీరు వినే వాడితో, చూసే వాడితో, మీకు దగ్గరగా ఉన్న వాడితో దుఆ చేస్తున్నారు, మీరు పిలుస్తున్నారు, అర్ధిస్తున్నారు.)

అందుకే సోదర మహాశయులారా, అల్లాహు తఆలా ఇంత గొప్పగా వినేవాడు అన్నటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం నోటితో చెబుతాము, అవును అల్లాహ్ అన్నీ వింటాడు, అల్లాహ్‌కు ప్రతీ భాష తెలుసు. అంటాము నోటితో. కానీ వాస్తవంగా మనకు ఆ సంపూర్ణ విశ్వాసం ఉందా? దానిపై ప్రగాఢమైన, బలమైన నమ్మకం ఉన్నదా? ఉండేది ఉంటే, వాస్తవానికి మన జీవితాల్లో మార్పు వచ్చేది. ఈ విశ్వాసం ప్రకారంగా మన యొక్క జీవితాలపై దాని ప్రభావం ఉండేది. ఒక హదీస్, ఖురాన్ ఆయత్ ఆధారంగా వినండి ఒక సంఘటన. చూడండి.

అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, సహీహ్ బుఖారీ, హదీస్ నెంబర్ 6384, సహీహ్ ముస్లిం 2704 లో వచ్చిన హదీస్. ఏమంటున్నారు? اجْتَمَعَ عِنْدَ الْبَيْتِ قُرَشِيَّانِ وَثَقَفِيٌّ، أَوْ ثَقَفِيَّانِ وَقُرَشِيٌّ ఇజ్తమఅ ఇందల్ బైతి ఖురషియాన్ వ సఖఫియ్యాని వ ఖురషి (కాబా వద్ద ఇద్దరు ఖురైషీలు ఒక సఖీఫ్‌కు చెందిన లేదా ఇద్దరు సఖీఫ్‌కు చెందిన ఒక ఖురైష్‌కు చెందిన ముగ్గురు మనుషులు కలిసి ఉన్నారు). శరీర వైభవం కలిగినవారు కానీ అర్థం చేసుకునేటువంటి మనసు చాలా తక్కువగా వారికి ఉండింది. బుర్ర చిన్నగా, శరీరం పెద్దగా. అర్థం చేసుకునే గుణం లేదు కానీ మాటలు చాలా. వారిలో ఒకడు ఏమన్నాడు? أَتَرَوْنَ أَنَّ اللَّهَ يَسْمَعُ مَا نَقُولُ؟ అతరౌన అన్నల్లాహ యస్మఉ మా నఖూల్? (మనం చెప్పే మాటలు అల్లాహ్ వింటాడా?). అయితే రెండోవాడు అన్నాడు, మనము బిగ్గరగా మాట్లాడితే వింటాడు, నవూజుబిల్లాహ్, మనం మెల్లిగా, నిశ్శబ్దంగా, గుప్తంగా మాట్లాడితే వినడు. మూడోవాడు అన్నాడు, ఒకవేళ అల్లాహు తఆలా బిగ్గరగా మనం మాట్లాడినప్పుడు వినేవాడైతే, మనం మెల్లిగా మాట్లాడినా గానీ వింటూ ఉంటాడు. అప్పుడు అల్లాహు తఆలా సూరత్ ఫుస్సిలత్ అవతరింపజేశాడు. సూరా నెంబర్ 41, ఆయత్ నెంబర్ 22 నుండి శ్రద్ధగా చూడండి, చదవండి.

وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ

(మీరు రహస్యంగా చెడు పనులకు పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్ళు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.)

చూశారా, అవిశ్వాసులు, బుద్ధి తక్కువ ఉన్నవారు, అల్లాహ్ యొక్క వినే, అల్లాహ్‌కు తెలిసే, అల్లాహ్ చూసే, సమీ, బసీర్, అలీమ్ విషయంలో ఎలాంటి దురాలోచనలకు పాల్పడ్డారు? మరియు ఇలాంటి దురాలోచన ఎప్పుడైతే ఉంటుందో, మనిషి యొక్క వ్యవహారంలో, అతని యొక్క చేష్టల్లో, అతని పనుల్లో, ఇతరులతో అతను ఏదైతే బిహేవియర్, అతడు మసులుకుంటాడో అందులో కూడా చాలా మార్పు ఉంటుంది.

అందుకొరకే, అల్లాహ్ సంపూర్ణంగా వినేవాడు, ఎంతటి గొప్పగా వినేవాడో, స్టార్టింగ్‌లో మనం కొన్ని విషయాలు ఏదైతే తెలుసుకున్నామో, దాని ప్రకారంగా బలమైన నమ్మకం ఉండాలి. బలమైన నమ్మకం లేకుంటే, మనిషి ఆచరణలలో చాలా చెడు ప్రభావం చూపుతుంది, దాని కారణంగా మనిషి చెడుకు పాల్పడి నరకం పాలవుతాడు. ఒకసారి మీరు మళ్ళీ చూడండి, వెంటనే దాని తర్వాత ఆయతులు.

وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ * فَإِن يَصْبِرُوا فَالنَّارُ مَثْوًى لَّهُمْ ۖ وَإِن يَسْتَعْتِبُوا فَمَا هُم مِّنَ الْمُعْتَبِينَ

మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురి అయ్యారు. ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా వహించకపోయినా నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్ధించినా క్షమించబడరు.

…ఈ క్షమాభిక్ష కోసం అర్ధించినా క్షమించబడరు ఎక్కడ ఇది? ఇది నరకంలో ఉండి. అందుకొరకే ఇప్పటికైనా గానీ అవకాశం ఉంది. నిన్ననే తవ్వాబ్, అఫూ, గఫూర్, గఫార్ గురించి విన్నారు. అల్లాహ్ పట్ల, అల్లాహ్ యొక్క పేరు సమీ, గుణం సమ్అ, పేరు బసీర్, గుణం బసర్ చూడడం, మరియు అలాగే అలీమ్, ఇల్మ్, వీటి గురించి ఎలాంటి తప్పుడు ఆలోచన ఉన్నా, మన ఆచరణలో ఎలాంటి చెడు ఉన్నా, దానిని తొందరగా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎలా చేయగలుగుతాము మనం సరిదిద్దుకునే ప్రయత్నం? రండి, ఇప్పుడు చెప్పబోయే మాటలు మీరు శ్రద్ధగా విన్నారంటే, మనం చేంజ్ కావచ్చు, మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. ఎలా అంటారా?

అల్లాహ్ వింటాడు అని ఎప్పుడైతే మనం అంటామో, అందు రెండు భావాలు వస్తాయి. ఒకటి, ఏ ఎవరి విషయాలు, ఎవరి మాటలు వింటూ ఉన్నాడో, వారికి సంబంధించి. రెండవ భావం, స్వయం వినేవాడు అల్లాహ్‌కు సంబంధించి. అర్థమైందా?

ఇప్పుడు, అల్లా క్షమించుగాక నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను, అల్లాహ్ కొరకు ఎలాంటి ఉపమానాలు, ఉదాహరణ కాదు, మనకు అర్థం కావడానికి ఇట్లాంటి కొన్ని చిన్న ఉదాహరణలు. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటూ ఉన్నారు. కదా? అయితే ఇప్పుడు, వినడం అన్న ఈ ప్రస్తావన ఇక్కడ ఏదైతే ఉందో, ఇందులో రెండు భావాలు. ఒకటి, ఎవరి మాటలు వింటున్నారో వారికి సంబంధించి. మరొకటి, వినేవాడు అల్లాహ్, అతనికి సంబంధించి. అల్లాహ్‌కు సంబంధించి ఏంటి? కొన్ని సందర్భాలలో, కొన్ని ఆయతులలో, అల్లాహ్ విన్నాడు, అల్లాహ్ వింటాడు, అల్లాహ్ వినేవాడు, ఇలాంటి పదాలు ఎక్కడైతే వస్తాయో, అక్కడ భావం, అల్లాహ్ మీ మాటను వినేశాడు, స్వీకరిస్తాడు, మీరు కోరినది నొసంగుతాడు, ఇస్తజాబ (అంగీకరించాడు), ఈ భావంలో. ఇది చాలా సంతోషకరం మన కొరకు.

ఉదాహరణకు, సమిఅల్లాహు లిమన్ హమిదహ్. ఎప్పుడంటారు? రుకూ నుండి నిలబడి కదా? అల్లాహు తఆలా విన్నాడు, సమిఅల్లాహు, అల్లాహ్ విన్నాడు, లిమన్ హమిదహు, ఎవరైతే అతనిని అంటే అల్లాహ్‌ని ప్రశంసించారో. ఇక్కడ ధర్మవేత్తలు అంటారు, అజాబ, وَلَيْسَ الْمُرَادُ سَمْعَهُ مُجَرَّدَ سِمَاعٍ فَقَطْ వలైసల్ మురాదు సమ్ఉహు ముజర్రద్ సిమాఅ ఫఖత్ (కేవలం వినడం మాత్రమే ఉద్దేశం కాదు, అంగీకరించాడు). అంటే, అల్లాహ్ మీ యొక్క ఈ స్తోత్రాలను విన్నాడు అంటే, అంగీకరించాడు, స్వీకరించాడు, దీనికి ప్రతిఫలం అల్లాహ్ మీకు ప్రసాదిస్తాడు.

అలాగే, సూరత్ ఇబ్రాహీం ఆయత్ నెంబర్ 39 లో మీరు చూస్తే, إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ [ఇన్న రబ్బీ లసమీఉద్ దుఆ] (నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు) అని వస్తుంది. అంటే, నిశ్చయంగా నా ప్రభువు దుఆలను వినేవాడు, అంటే కేవలం విని ఊరుకోడు, అంగీకరిస్తాడు, మీరు అడిగేది మీకు ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త ఉంది. అర్థమైంది కదా?

ఇక వినే వాడు అన్న దానిలో రెండవ భావం ఏదైతే చెప్పామో, మరొక భావం, వినే వారి, అంటే ఎవరి మాటలు వింటున్నాడో, ఎవరి మాటలు వినబడతాయో, వారి గురించి. ఇక్కడ మానవులు అని మనం ఒకవేళ తీసుకుంటే, అందులో మూడు భావాలు వస్తాయి. ఏంటి?

మొదటి భావం, అల్లాహు తఆలా విన్నాడు అని అంటే ఇక్కడ, నీకు అల్లాహు తఆలా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. అర్థమైందా? కాలేదా? ఉదాహరణకు, మీరు ఒకచోట పని చేస్తున్నారు అనుకోండి. మీ యజమాని , “ఒరేయ్, ఏమంటున్నావు రా, వింటున్నా నేను” అని అన్నాడు. అంటే అక్కడ ఏంటి? ఏదైనా శుభవార్తనా? మీరు ఏదో పొరపాటు మాట అన్నారు, దాని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కదా?

ఉదాహరణకు ఖురాన్‌లో చూడండి, సూరత్ అజ్-జుఖ్రుఫ్, ఆయత్ నెంబర్ 80:

أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم
[అమ్ యహసబూన అన్నా లా నస్మఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్]
(వారి రహస్యాలను, వారి గుప్త విషయాలను మేము వినము అని వారు భావిస్తున్నారా?)
ఇక్కడ వినే మాట వచ్చింది, అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటి? హెచ్చరిస్తున్నాడు అల్లాహు తఆలా.

అలాగే సూరత్ ఆల్-ఇమ్రాన్, ఆయత్ నెంబర్ 181లో చూడండి:
لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ
[లఖద్ సమిఅల్లాహు ఖౌలల్లజీన ఖాలూ ఇన్నల్లాహ ఫఖీరున్ వ నహ్ను అగ్నియాఉ]
(యూదులలో కొందరు దుష్టులు ‘నిశ్చయంగా అల్లాహ్ పేదవాడు మేము సిరి సంపదలు గలవారిమి’ అని అన్నవారి మాటను నిశ్చయంగా అల్లాహ్ విన్నాడు.)

అల్లాహ్ ఏమంటున్నాడు? మేము విన్నాము. అంటే ఏంటి? అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదేనా మీ మాట? అల్లాహ్ పట్ల ఇలాంటి భావాలు కలిగి ఇలాంటి మాటలు పలుకుతారా మీరు? తహదీద్, హెచ్చరిక, చేతావని.

రెండవ భావం, అల్లాహు తఆలా తన ప్రియమైన దాసులకు, ప్రవక్తలకు, పుణ్యాత్ములకు సపోర్ట్ చేస్తున్నాడు, వారికి మద్దతు ఇస్తున్నాడు అన్నట్లుగా భావం ఉంటుంది. ఇది చూడాలనుకుంటే సూరత్ తాహా ఆయత్ నెంబర్ 46 మీరు చూడవచ్చు. ఏముంది?

إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
[ఇన్ననీ మఅకుమా అస్మఉ వ అరా]
(నిశ్చయంగా నేను మీ ఇద్దరితో ఉన్నాను, నేను వింటూ ఉన్నాను మరియు చూస్తూ ఉన్నాను.)

ఓ మూసా, హారూన్ అలైహిముస్సలాం, మీరిద్దరూ వెళ్ళండి, ఫిరౌన్‌కు దావత్ ఇవ్వండి, తౌహీద్ గురించి చెప్పండి, బనీ ఇస్రాయీల్‌పై అతడు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నాడో, దాని గురించి హెచ్చరించండి. మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం వారిని అల్లాహు తఆలా ఫిరౌన్ వద్దకు పంపుతూ ఏమన్నాడు? “ఇన్ననీ మఅకుమా, నేను మీకు తోడుగా ఉన్నాను.” అల్లాహు అక్బర్. దావత్ పని చేసే వారులారా, అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని ప్రజల వరకు చేరవేసే వారులారా, భయపడకండి. ఎన్ని గద్దింపులు మీకు వచ్చినా, అయ్యో, ఫలానా అంత పెద్ద ఇంటర్నేషనల్ దాయికే ఫలానా ఫలానా ప్రభుత్వం ఇలాంటి హెచ్చరికలు ఇచ్చేసింది, ఇక మనం దావత్ పని వదులుకుందామా? హెచ్చరికలు ఇవ్వడం వారి యొక్క పని, వారికి ఈ సత్యం అర్థం కాక. కానీ నీకు తోడుగా ఎవరున్నాడు? “ఇన్ననీ మఅకుమా, నేను నీకు తోడుగా ఉన్నాను” అని అల్లాహు తఆలా మూసా మరియు హారూన్ అలైహిముస్సలాంకి ఓర్పునిస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, స్థైర్యాన్ని ఇస్తున్నాడు, ఇంకా ఏమంటున్నాడు? “అస్మఉ వ అరా, నేను ప్రతీ విషయాన్ని వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను.” మీ యొక్క కదలికలు, మీరు ఎక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు, ఫిరౌన్ ముందు మీరు ఎలా దావత్ ఇస్తారు, అవన్నీ నేను చూస్తూ ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మీ మాటలు వింటూ ఉంటాను, మీరు ఎలాంటి భయం పడకండి.” అల్లాహ్ యొక్క ధైర్యం, అల్లాహ్ వైపు నుండి ఒక తోడ్పాటు లభిస్తుంది. ఇక్కడ ‘సమఅ’ ఈ భావంలో ఉంది.

ఇక మూడవ భావం, అల్లాహు తఆలా ఈ పూర్తి విశ్వంలో ఎక్కడా, ఏదీ కూడా అతని వినికిడికి బయట లేదు. మనిషి ఏ గుహలో, అంటారు కదా, బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఏ ఏ ప్రూఫ్‌లలో మనిషి బంధించబడి తనకు తాను లోపల వేసుకున్నా, అల్లాహ్ వినకుండా ఎక్కడా ఏ మనిషి ఉండలేడు. ఈ లోకంలో ఏ ప్రాంతం కూడా, ఈ లోకంలో ఏ స్థితి కూడా, ఈ లోకంలో ఎక్కడ ఏది కూడా అల్లాహ్ వినికిడికి బయట లేదు.

అయితే సోదర మహాశయులారా, ఇక ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత చాలా ముఖ్యమైన ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇంతటి గొప్ప వినే వాడైన ఆ అల్లాహ్‌ను మనం విశ్వసిస్తున్నాము గనక, మన మొరలను అతను వినడా, అంగీకరించడా? ఓ అల్లాహ్, నేను ఈ కష్టంలో ఉన్నాను, నా కష్టాన్ని దూరం చెయ్యి ఓ అల్లాహ్, అని నిజంగా మనసుతో మన మాట వెళ్లి, కళ్ళతో కన్నీరు కారుతూ, రాత్రి వేళ ఎవరు చూడని సమయంలో అతని ముందు మనం నిలబడ్డామంటే, అతను మన మాట వినడా? అతడు మనకు ప్రసాదించడా? ప్రసాదిస్తే, మరి ఎవరైతే వినేవారు కారో, ఎన్నో టన్నుల మట్టి కింద శవం అయి ఉన్నారో, లేక చనిపోయి కాలాలు గడిచి మొత్తం కుళ్ళిపోయారో, అలాంటి వారు ఎవరిలోనైతే వినే శక్తి లేదో, ఎందుకు వారిని ఆరాధించాలి? ఎందుకు వారిని పూజించాలి?

అల్లాహు తఆలా షిర్క్‌ను ఖండిస్తూ, తన వినే శక్తిని స్పష్టంగా తెలియజేసినప్పుడు, ఎవరినైతే మీరు అల్లాహ్‌ను కాదని పూజిస్తున్నారో, వారిలో వినే శక్తి లేదు అని కూడా స్పష్టంగా తెలియజేశాడు. మీరు ఒకవేళ దీనికి సంబంధించిన ఆయతులు చదివితే విషయం చాలా మంచి రీతిలో అర్థమవుతుంది. రండి, ఒక్కసారి చూడండి ఇక్కడ సూరతుల్ అఅరాఫ్ ఆయత్ నెంబర్ 195. 194 నుండి చదువుదాము, విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి:

إِنَّ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ عِبَادٌ أَمْثَالُكُمْ ۖ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ * أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ

(మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, వారంతా మీ లాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి, ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులే అయితే, వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.)

ఈ ఆయత్‌ను నోట్ చేసుకోండి. మన వద్ద కొందరు ఏం చేస్తారు, మన మిత్రులు, మనలాంటి కల్మా చదివే ముస్లింలు, నమాజ్ చేసే వారు, “అయ్యా, ఈ వలీలను మేము పూజిస్తుంటే మీరు తప్పు అని ఎందుకు అంటున్నారు? ఆనాటి కాలంలో రాళ్లను, రప్పలను, చెట్లను పూజించేవారు, వాటిని ఖండించడం జరిగింది. పుణ్యాత్ములను, పుణ్య పురుషులను వద్దకు వెళ్లి, వారి సమాధుల వద్దకు వెళ్లి ఈ కొన్ని పనులు చేసినందుకు రద్దు చేయబడలేదు” అని అంటారు. ఈ ఆయత్‌ను వారికి దలీల్‌గా చూపండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరితో దుఆ చేస్తున్నారో, ఎవరి సమాధి వద్ద ఆరాధనకు సంబంధించిన ఏదైనా ఒక పని చేస్తున్నారో, వారంతా మీ లాంటి దాసులే, ఇబాదున్ అమ్సాలుకుమ్, మీ లాంటి దాసులే. అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి.

فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ
[ఫద్ఊహుమ్ ఫల్యస్తజీబూ లకుమ్ ఇన్ కున్తుమ్ సాదిఖీన్]
(మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి, ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులే అయితే, వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.)

ఆ తర్వాత ఆయత్ నెంబర్ 7:195,196:

أَلَهُمْ أَرْجُلٌ يَمْشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَيْدٍ يَبْطِشُونَ بِهَا ۖ أَمْ لَهُمْ أَعْيُنٌ يُبْصِرُونَ بِهَا ۖ أَمْ لَهُمْ آذَانٌ يَسْمَعُونَ بِهَا ۗ قُلِ ادْعُوا شُرَكَاءَكُمْ ثُمَّ كِيدُونِ فَلَا تُنظِرُونِ

ఏమిటి, వారు నడవగలగటానికి వారికేమయినా కాళ్లున్నాయా? వారు దేనినయినా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్లున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచుకోండి. మరి మీరంతా కలసి నాకు కీడు కలిగించే వ్యూహాన్నీ రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.”

إِنَّ وَلِيِّيَ اللَّهُ الَّذِي نَزَّلَ الْكِتَابَ ۖ وَهُوَ يَتَوَلَّى الصَّالِحِينَ

“ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాహ్‌యే ముమ్మాటికీ నా సహాయకుడు. సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే.”

ఇదే సూరత్‌లో మరొక ఆయత్, ముందు కొంచెం ఆయత్ నెంబర్ 198 లో కూడా ఈ మాట చాలా స్పష్టంగా వచ్చింది:

وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَسْمَعُوا
(ఒకవేళ మీరు వారికి ఏదైనా చెప్పటానికి పిలిచినా, వారు మీ మాటను వినలేరు) లా యస్మవూ, వినలేరు

షిర్క్‌ను ఖండించడానికి అల్లాహు తఆలా ఈ విధంగా ఇంత స్పష్టంగా తెలియజేశాడు. ఈ భావంలో ఆయతులు సూరత్ మర్యమ్ 41-42 లో కూడా ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి అయిన ఆజర్‌ను షిర్క్ నుండి ఆపుతూ ఏమన్నారు?

يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ
(ఓ నా తండ్రీ, ఏమి వినలేని మరియు ఏమి చూడలేని వాటిని మీరు ఎందుకు పూజిస్తున్నారు?)

సోదర మహాశయులారా, చివరి మాట ఇక ఈ రోజు ఈ ప్రసంగంలో అదేమిటంటే, అల్లాహ్ వినేవాడు, ఎంత గొప్పగా, విశాలంగా, ఎంత సున్నితంగా. మన తెలుగులో ఒక సామెత ఉంది గుర్తుందా మీకు? ఎంత నిశ్శబ్దం అంటే సూది పడినా వినగలిగే అంతటి నిశ్శబ్దం ఏర్పడింది అని అంటారు. సూది పడితే మనకు వినబడుతుందా? కానీ అల్లాహ్ వింటాడు. అల్లాహ్ వింటాడు అన్నటువంటి విశ్వాసం ఇలాంటి సామెతల ద్వారా మరింత అల్లాహ్‌పై మన విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగిందంటే, మన ఆచరణలో, మన జీవితంలో ప్రభావం చూపాలి. ఎలాంటి ప్రభావం? అల్లాహ్ వింటాడు అయితే మనం మాట్లాడే ప్రతీ మాట అల్లాహ్‌కు ఇష్టమైనదే ఉండాలి. మనం మాట్లాడే మాట ద్వారా ఎవరికీ బాధ కలిగించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అఫ్దలుల్ ముస్లిమీన (ముస్లింలలో అత్యుత్తముడు ఎవడయ్యా అంటే), ఏ ముస్లిం ద్వారానైతే ఇతరులందరికీ అతని నాలుక ద్వారా గానీ, చేతుల, కాళ్ల ద్వారా గానీ ఏ హాని కలగకుండా ఉంటుందో, నష్టం కలగకుండా ఉంటుందో.

మరియు మనం అల్లాహ్ యొక్క ఈ పేరును మంచి రీతిలో అర్థం చేసుకున్నామంటే, మనం అల్లాహ్‌తో ఏ దుఆ చేసినా గానీ, అల్లాహ్ యొక్క ఈ పేరు మాధ్యమంతో, వసీలాతో దుఆ చేయాలి. ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే యూసుఫ్ అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే జకరియా అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే ఇమ్రఅతు ఇమ్రాన్ (మర్యమ్ అలైహస్సలాం యొక్క తల్లి) దుఆ చేశారు.

إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ
[ఇన్న రబ్బీ లసమీఉద్ దుఆ]
(నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు) అని ఇంతకుముందే మనం విన్నాము.

సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 126, 7, 28 ఇట్లా చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాం ఏదైతే దుఆ చేశారో అందులో:

رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
[రబ్బనా తఖబ్బల్ మిన్నా, ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్]
(ఓ అల్లాహ్, నీవు స్వీకరించు మా నుండి. నిశ్చయంగా నీవు వినేవాడివి, అన్నీ తెలిసిన వానివి.)

సూరత్ ఆల్ ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 35 లో కూడా ఈ భావం ఉంది.

చివరి మాట, మరీ చివరి, ఎక్దం చివరి, ఇంత అల్లాహ్ యొక్క పేరుతో మనం దుఆ చేశామంటే, తప్పకుండా అల్లాహ్ స్వీకరిస్తాడన్నటువంటి నమ్మకం కూడా మళ్ళీ కలిగి ఉండాలి. అల్లాహ్ చాలా వినేవాడు అని నేను ఎంతో వసీలతో దుఆ చేశానండి, ఇంకా ఖుబూలే కావట్లేదు నా దుఆ, అని అల్లాహ్ పట్ల నిరాశ, అల్లాహ్ పట్ల తప్పుడు ఆలోచన కలగకూడదు. మనం దుఆ చేసే విషయంలో ఏదైనా లోపం ఉండవచ్చు అని ఇంకా దుఆ చేయాలి. అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు అన్నటువంటి నమ్మకం కూడా కలిగి ఉండాలి. దీని గురించి చదవండి సూరత్ యూసుఫ్ ఆయత్ నెంబర్ 34.

అల్లాహు తఆలా ఈ యొక్క పేరు ‘సమీ’ గురించి ఏదైతే మనం తెలుసుకున్నామో, దీని ప్రకారంగా మన జీవితంలో మార్పు తెచ్చుకునేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఇంతటితో ఈనాటి ప్రసంగం ముగుస్తుంది. కొంచెం ఆలస్యం అయినందుకు క్షమించండి. వాస్తవానికి అల్లాహ్ యొక్క పేర్ల విషయం చెబుతున్నాము, ఎన్ని చెప్పినా మాటలు పూర్తి కావు. అల్లాహ్ యొక్క గొప్పతనం అంత విశాలమైనది, గొప్పది. కానీ మీతో క్షమాపణ కోరుతున్నాను ఆలస్యం అయినందుకు.

అల్లాహ్ తఆలా మీ అందరికీ కూడా ఇహపరలోకాల్లో అన్ని రకాల మేళ్లు ప్రసాదించుగాక. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా): https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

పరస్పర సంబంధాలు తెంచుకుంటే నష్టం ఏమిటి? [ఆడియో]

బిస్మిల్లాహ్
పరస్పర సంబంధాలు తెంచుకుంటే నష్టం ఏమిటి? – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

సంవత్సర ముగింపు గుణపాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

మనం ఇప్పుడు ఇస్లామీయ 12 వ నెల జిల్ హిజ్జా మాసం లో ఉన్నాము, ఇంకా కొద్దీ రోజులలో క్రొత్త ఇస్లామీయ సంవత్సరం 1443 ముహర్రం మాసం లో అడుగుపెట్టబోతున్నాము. మరి గడచిన సంవత్సరంలో నుండి మనం ఏమి గుణ పాఠాలు నేర్చుకోగలము? మనల్ని మనం ఎలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి? మన తప్పుల్ని సరిదిద్దుకొని అల్లాహ్ యొక్క మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలి? ఈ వీడియో తప్పక చూడండి మరియు మీ బంధుమిత్రులకు తెలియజేయండి.

సంవత్సర ముగింపు గుణపాఠాలు – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)