[2:53 నిముషాలు] షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు. [అల్ బఖర – 2 : 275 ]
అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.[అల్ బఖర – 2 : 276 – 280 ]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పై హదీసు భావం: హజ్రత్ కఅబ్ బిన్ ఉజర్ (రజి అల్లాహు అన్హు) తెలిపారు : ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) మింబర్ తీసుకుని రమ్మని పురామాయించారు , దాన్ని తెచ్చాక మొదటి మెట్టుపై కాలు పెట్టగానే “ఆమీన్” అన్నారు . తరవాత రెండవ మెట్టుపై కాలు పెట్టి “ఆమీన్ ” అన్నారు , మూడవ మెట్టుపై కాలు పెట్టగానే మళ్లీ “ఆమీన్” అన్నారు .! ప్రసంగం ముగిసిన తర్వాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) క్రిందికి దిగి వచ్చారు. అప్పుడు సహాబా (రజియల్లాహు అన్హుమ్) అడిగారు : మేము ఈ రోజు విన్నటువంటి మాట ఇంతకు ముందు ఎన్నడూ వినలేదు అని విన్నవించారు, దానికి దైవప్రవక్త (ﷺ) అన్నారు ::
జిబ్రాయిల్ (అలైహిస్సలాం) వచ్చి రమజాన్ మాసం పొంది ఎవరు తన పాపాలను ప్రక్షాళన చేసుకోలేదో.. అతడు నాశనం అయ్యాడు .అన్నారు అది విని నేను “ఆమీన్” అన్నాను.
నేను రెండవ మెట్టుపై అడుగుపెట్టిన ప్పుడు జిబ్రాయిల్ (అలైహిస్సలాం) అన్నారు : ఎవరి ముందు దైవప్రవక్త (ﷺ) పేరు తీసుకోబడుతుందో అది వినికుడా దరూద్ పఠించక పోతే అతడు నాశనం అయ్యాడు అని శపించారు.అది విని నేను ‘ఆమీన్’ అన్నాను,
మూడవ మెట్టుపై కాలు పెట్టగానే తల్లి తండ్రి ని లేదా ఇద్దరిలో ఒకరిని వృద్ధాప్యంలో ఉండగా వారికి సేవ చేసి స్వర్గం పొందలేని వానిపై అభిశాపం పడుగాక అన్నారు అది విని నేను ‘ఆమీన్’ అన్నాను.
[హాకిమ్ – సహీహ్]
2] ఏ ఆచరణ గూర్చి వారిస్తూ అల్లాహ్ మరియు ఆయన సందేశహరునితో యుద్ధానికి సిద్ధం అవ్వండి అని తెలుపబడింది?
“ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్‌కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలి వున్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరూ ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరుగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు యిబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడేవరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు శ్రేయోదాయకం.” (సూర బఖరా 2:278-280)
3) సృష్టి తొలి కాలంలో ఒక కాకి ద్వారా సమాధి చేసే పద్దతి నేర్చుకున్నది ఎవరు?
తర్వాత అతని మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు. ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి,) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు.
మిష్కాత్ 211:- ”ప్రపంచంలో అన్యాయంగా చంపబడిన ప్రతి వ్యక్తికి బదులు, ఆదమ్ (అలైహిస్సలాం) కుమారుడైన ఖాబిల్కు ఒక పాపం చుట్టు కుంటుంది. ఎందుకంటే హత్యను మొట్ట మొదట ప్రారంభించిన వాడు అతడే!”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అప్పుల బాధల్లో చిక్కుకొని, వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయినవారికి ఇస్లామీయ సూచనలు వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/U861e5h6_AE [10 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ఇస్లామీయ దృక్పథంలో అప్పుల భారం, వ్యాపార నష్టాలు మరియు ఇతర ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఆచరణాత్మక పరిష్కారాలు వివరించబడ్డాయి. పాపాల పట్ల పశ్చాత్తాపపడి అల్లాహ్‌ను క్షమాపణ వేడుకోవడం (ఇస్తిగ్ఫార్) యొక్క ప్రాముఖ్యత, హరామ్ సంపాదనకు, ముఖ్యంగా వడ్డీకి దూరంగా ఉండటం యొక్క ఆవశ్యకత నొక్కి చెప్పబడింది. అంతేకాకుండా, అప్పుల నుండి విముక్తి పొందటానికి మరియు సమృద్ధిని పొందటానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన నిర్దిష్ట దుఆలు (ప్రార్థనలు) మరియు వాటిని పఠించవలసిన ప్రాముఖ్యత గురించి చర్చించబడింది.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.
అప్పుల బదల్లో చిక్కుకొని ఉన్నారు, దినదినానికి వ్యాపారంలో చాలా లాస్ జరుగుతుంది, ఇంకా అనేక రకాల ఇబ్బందులకు గురి అయి ఉన్నారని ఏదైతే తెలిపారో, దీని గురించి కొన్ని ఇస్లామీయ సూచనలు ఇవ్వండని అడిగారో, ఖురాన్ హదీస్ ఆధారంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతున్నది.
ఇస్తిగ్ఫార్ (క్షమాపణ) యొక్క ప్రాముఖ్యత
అన్నిటికంటే ముందు మనమందరమూ కూడా అధికంగా, అధికంగా అల్లాహ్‌తో మన పాపాల గురించి క్షమాభిక్ష కోరుతూ ఉండాలి. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఒక్కొక్క సమావేశంలో, ఒక్కొక్కసారి ఎక్కడైనా కూర్చుంటామో, ఎక్కడైనా నడుస్తామో 100 సార్లు అంతకంటే ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఎందుకంటే సూరత్ నూహ్, ఆయత్ 10 నుండి 12 వరకు ఒకసారి గమనించండి.
يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا [యుర్సిలిస్ సమా’అ అలైకుమ్ మిద్రారా] “ఆయన మీపై ఆకాశం నుండి కుండపోతగా వర్షం కురిపిస్తాడు.” (71:11)
وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا [వ యుమ్దిద్కుమ్ బి అమ్ వాలివ్ వ బనీన వ యజ్ అల్లకుమ్ జన్నతివ్ వ యజ్ అల్లకుమ్ అన్ హారా] “ధనంతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఏర్పాటు చేస్తాడు, కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:12)
నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, నేను నా జాతితో చెప్పాను, మీరు అల్లాహ్‌తో అధికంగా ఇస్తిగ్ఫార్ చేయండి, అల్లాహ్‌తో అధికంగా మీ పాపాల గురించి క్షమాభిక్ష కోరండి. నిశ్చయంగా ఆయన పాపాలను క్షమించేవాడు. మీరు ఇలా ఇస్తిగ్ఫార్ అధికంగా చేస్తూ ఉంటే, ఆయన ఆకాశం నుండి మీపై కుండపోత వర్షం కురిపిస్తాడు, మీకు ధనము ప్రసాదిస్తాడు, సంతానము అధికం చేస్తాడు, మీకు మంచి తోటలు, ఉద్యానవనాలు ప్రసాదిస్తాడు, మీకు మంచి సెలయేళ్లు, మీ చుట్టుపక్కన ఉన్న వాగుల్లో, నదుల్లో నీళ్లు ప్రవహింపజేస్తాడు. మీ తోటల్లో, మీ చేనుల్లో శుభాలు, బర్కత్ ప్రసాదిస్తాడు. మీకు సంతానం ప్రసాదిస్తాడు, మీ ధనం అధికం చేస్తాడు. ఈ విధంగా ఎన్నో లాభాలు ఇస్తిగ్ఫార్ ద్వారా మనకు ప్రాప్తి అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు కూడా అనేకం ఉన్నాయి.
హరామ్ మరియు వడ్డీ నుండి దూరం ఉండటం
అంతేకాకుండా, సాధ్యమైనంత వరకు పూర్తి ప్రయత్నం చేయాలి, హరామ్ నుండి దూరం ఉండి అన్ని రకాల నిషిద్ధ వస్తువులకు, పనులకు, ప్రత్యేకంగా హరామ్ సంపాదనకు దూరంగా ఉండాలి. ఇంకా ప్రత్యేకంగా వడ్డీ నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి. మాటిమాటికి అల్లాహ్‌తో దుఆ చేయాలి. ఒకవేళ అజ్ఞానంగా ఏదైనా వడ్డీ వ్యాపారాల్లో, వడ్డీ అప్పుల్లో చిక్కుకున్నా గానీ, అతి త్వరలో బయటపడే మార్గాలు వెతకాలి మరియు అల్లాహ్‌తో అధికంగా దుఆ చేయాలి.
దుఆ యొక్క శక్తి మరియు సరైన సమయాలు
దుఆ కేవలం ఇస్తిగ్ఫార్ వరకే కాదు, కొన్ని దుఆలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా మనకు నేర్పారు. అంతేకాకుండా మన భాషలో మనం, “ఓ అల్లాహ్, వడ్డీ ఇంత చెడ్డ పాపమని తెలిసింది, ఇక నుండి నేను దాని నుండి నేను తప్పించుకొని, దాని నుండి నేను ఎంత దూరం ఉండే ప్రయత్నం చేస్తానో, ఓ అల్లాహ్ నాకు ఈ భాగ్యం నీవు ప్రసాదించు” ఈ విధంగా మన భాషలో మనం ఏడుచుకుంటూ దుఆ అంగీకరింపబడే సమయాలు ఏవైతే ఉంటాయో, ఆ సమయాలను అదృష్టంగా భావించి, ఉదాహరణకు అజాన్ మరియు ఇకామత్ మధ్యలో, రాత్రి ఫజ్ర్ కంటే ముందు సమయంలో, ఇంకా నిద్ర నుండి ఎప్పుడు మేల్కొన్నా గానీ వెంటనే,
لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، الْحَمْدُ لِلَّهِ، وَسُبْحَانَ اللهِ، وَلَا إِلَهَ إِلَّا اللهُ، وَاللهُ أَكْبَرُ، وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ [లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు, లహుల్ ముల్కు వ లహుల్ హందు, వ హువ అలా కుల్లి షై’ఇన్ కదీర్. అల్హమ్దులిల్లాహ్, వ సుబ్ హా నల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, వ లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్]
అని చదివి, ఆ తర్వాత అల్లాహుమ్మగ్ఫిర్లీ అని దుఆ చేసుకోవాలి, దుఆ అంగీకరింపబడుతుంది.
అప్పుల నుండి విముక్తి కోసం ప్రత్యేక దుఆలు
అయితే ఇక రండి, ప్రత్యేకంగా వ్యాపార నష్టాల నుండి దూరం ఉండి, అప్పుల బాధ నుండి త్వరగా బయటికి రావడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ఈ దుఆలు తప్పకుండా చదవండి. సునన్ తిర్మిజీలో వచ్చి ఉంది ఈ దుఆ, హదీస్ నంబర్ 3563, షేక్ అల్బానీ రహమహుల్లాహ్ దీనిని హసన్ (అంగీకరింపబడే అటువంటి మంచి ప్రమాణం తో కూడిన హదీస్) అని చెప్పారు.
ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, అతడు బానిసత్వం నుండి విముక్తి పొందడానికి ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో, దాని మూలంగా అతనిపై ఏదైతే ఒక అప్పు రూపంలో భారం పడిందో, దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో సహాయం అడిగినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “నేను నీకు ఒక విషయం నేర్పుతాను, నీపై ‘సిర్’ పర్వతం లాంటి అప్పు ఉన్నా గానీ, నువ్వు ఈ దుఆ చదువుతూ ఉంటే అల్లాహ్ తప్పకుండా నీ అప్పును నువ్వు అదా చేసే విధంగా సహాయపడతాడు.” దుఆ నాతోపాటు చదువుతూ నేర్చుకోండి:
اللَّهُمَّ اكْفِنِي بِحَلَالِكَ عَنْ حَرَامِكَ، وَأَغْنِنِي بِفَضْلِكَ عَمَّنْ سِوَاكَ [అల్లాహుమ్మక్ఫినీ బిహలాలిక అన్ హరామిక్, వ అగ్నినీ బిఫద్లిక అమ్మన్ సివాక్] “ఓ అల్లాహ్, నీవు హరామ్ నుండి నన్ను కాపాడి, హలాల్ నాకు సరిపోయే విధంగా చూసుకో. మరియు నీ యొక్క అనుగ్రహం, నీ యొక్క దయ తప్ప ప్రతీ ఒక్కరి నుండి నన్ను ఏ అవసరం లేకుండా చేసేయి.”
ఈ దుఆను పొద్దు, మాపు, పడుకునే ముందు, నిద్ర నుండి లేచినప్పుడు, దీనికి ఒక సమయం అని ఏమీ లేదు, ఇన్నిసార్లు ఇక్కడ కూర్చుని ఇట్లా ఏ పద్ధతి లేదు. కొందరు ఏదైతే తెలుపుతారో, దేనికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సంఖ్య అనేది తెలిపారో, మనం ఆ సున్నతును పాటించాలి సంఖ్య విషయంలో కూడా. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంఖ్య అనేది ఏమీ తెలుపలేదో ఇన్నిసార్లు, అన్నిసార్లు చదవాలని, దాన్ని మనం ఎన్నిసార్లు చదివినా గానీ అభ్యంతరం లేదు. మరోసారి చదవండి:
ఈ దుఆ కాకుండా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరో సందర్భంలో మరొక దుఆ కూడా నేర్పారు. సహీహుత్ తర్గిబ్, హదీస్ నంబర్ 1821లో వచ్చి ఉంది. అనస్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రదియల్లాహు త’ఆలా అన్హు వారికి ఇలా చెప్పారు: “నీకు ఒక దుఆ నేర్పుతాను, ఈ దుఆ నువ్వు చేస్తూ ఉండు, ఒకవేళ నీపై ఉహుద్ పర్వతానికి సమానమైన అప్పు ఉన్నా, అల్లాహ్ నీ వైపు నుండి దానిని తీర్చేస్తాడు.” ఏంటి ఆ దుఆ?
“ఓ అల్లాహ్! సర్వసామ్రాజ్యాలకు అధిపతి! నువ్వు కోరిన వారికి సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తావు. నువ్వు కోరిన వారి నుండి సామ్రాజ్యాన్ని లాగేసుకుంటావు. నువ్వు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు. నువ్వు కోరిన వారిని అవమానపరుస్తావు. మేలంతా నీ చేతిలోనే ఉంది. నిశ్చయంగా నువ్వు ప్రతి దానిపై శక్తిమంతుడవు.” (3:26). ఓ ఇహపరలోకాల కరుణామయుడా మరియు దయామయుడా, నువ్వు కోరినవారికి వాటిని ప్రసాదిస్తావు, నువ్వు కోరిన వారికి వాటిని నిరోధిస్తావు. నన్ను నీ నుండి లభించే కారుణ్యంతో కరుణించు, అది నీవు తప్ప ఇతరుల కరుణ అవసరం లేకుండా చేస్తుంది.
కొంచెం పొడుగ్గా ఏర్పడుతుంది, కానీ భయపడకండి. చూసి, రాసుకొని, మాటిమాటికి విని కంఠస్థం చేసుకొని దుఆ చేసే అవసరం లేదు. వింటూ వింటూ మీరు స్వయంగా పలుకుతూ ఉండండి లేదా ఒక కాగితంలో రాసుకొని చూసి చదువుతూ ఉండండి. మరోసారి విని దీన్ని మీరు గుర్తుంచుకోండి:
ఇప్పుడు ఈ దుఆ ఏదైతే నేను రెండుసార్లు చదివానో, వాస్తవానికి సూరత్ ఆలి ఇమ్రాన్, సూర నంబర్ 3, ఆయత్ నంబర్ 26 ఏదైతే ఉందో, ఆ 26వ ఆయత్ యొక్క భాగం ఉంది మరియు చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దుఆ కూడా ఉంది. అయితే తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ మీరు విప్పి చూశారంటే, అల్లాహ్ దయతో అక్కడ ఈ దుఆ, దీని యొక్క వివరణ కూడా, దీని యొక్క అనువాదం కూడా చూడవచ్చు. అల్లాహ్ మనందరి ఇబ్బందులను, ఆపదలను దూరం చేయుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“విశ్వసించిన ప్రజల్లారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే, అల్లాహ్‌కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీపై అల్లాహ్ తరపున ఆయన ప్రవక్త తరపున యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి.” (సూరహ్ బఖర 2: 278, 279).
ఇది అల్లాహ్ వద్ద ఎంత చెడ్డ పాపమో తెలియుటకు పై ఆయతులే చాలు.
ప్రజలు, ప్రభుత్వాలు వడ్డీ కారణంగా వినాశపు చివరి హద్దులోకి చేరుకున్నాయన్న నిజాన్ని వాటిపై దృష్టిసారించిన వ్యక్తి గమనించగలడు. వడ్డీ వ్యవహారాల వలన దారిద్య్రం, మార్కెట్లో సరుకు రాకపోవుట, ఆర్ధిక దివాలా , అప్పులు చెల్లించే స్థోమత లేకవోవుట, జీవనాభివృద్ధిలో ఆటంకాలు, నిరుద్యోగ సమస్యలు పెరుగుట, అనేక కంపెనీలు, ఆర్ధిక సంస్థలు మూతబడుట, ఇంకా రోజువారి కష్టార్జితము, చెమట ధారాపోసి సంపాదించే సంపాదన కూడా వడ్డీ తీర్చడానికి సరిపడకపోవుట చూస్తునే ఉన్నాము. లెక్కలేనంత ధనం కొందరి చేతుల్లో తిరగటం వలన సమాజంలో వర్గాల తారతమ్యం ఉత్పన్నమవుతుంది. వడ్డీ వ్యవహారంలో పాల్గొన్న వారికి అల్లాహ్ హెచ్చరించిన యుధ్ధ రూపాలు బహుశా ఇవేకావచ్చు.
ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఏవిధంగానైనా వడ్డీ వ్యవహారం చేసే వారినీ, అందుకు సహాయం చేసే వారినీ (దలాలి, ఏజెంట్) అందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు:
“వడ్డీ తినేవారిని, తినిపించే వారినీ, ఆ వ్యవహారాలు వ్రాసేవారినీ, అందులో సాక్ష్యం పలికేవారందరినీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) శపించారు. ఆ పాపంలో వీరందరూ సమానమే” అని చెప్పారు. (ముస్లిం 1598).
ఈ హదీసు ఆధారంగా వడ్డీ ఇచ్చిపుచ్చుకొనుట, వడ్డీ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయుట, వడ్డీ వ్యవహారాల్లో క్లర్కుగా, దాని లావాదేవీలు రిజిస్టర్ చేయుటకు, మరియు అందులో వాచ్ మేన్‌గా ఉద్యోగం చేయుట యోగ్యం కాదు. వాస్తవం ఏమిటంటే వడ్డీకి సంబంధించిన ఏ వ్యవహారంలో కూడా, ఏ విధంగానైనా పాల్గొనుట నిషిద్ధం.
ఘోరపాపంతో కూడిన ఈ చెడును ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఎంత స్పష్టంగా చెప్పారో, అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“వడ్డీలో 73 స్థాయిలున్నాయి. వాటిలో అత్యంత హీనమైన స్థాయి (దశ) యొక్క పాపం; ఒక వ్యక్తి తన కన్న తల్లిని పెళ్ళాడటం వంటిది. వడ్డీ యొక్క అత్యంత తీవ్రస్థాయి పాపం ఒక ముస్లిం పరువు ప్రతిష్టలను మంటగలపటం”. (ముస్తద్రక్ హాకిం: 2/37, సహీహుల్ జామి: 3533. ).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పినట్లు అబ్దుల్లాహ్ బిన్ హంజలా (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“బుద్ధిపూర్వకంగా ఒక దిర్హం వడ్డీ తినడం 36 సార్లకంటే ఎక్కువ వ్యభిచారం చేసినదానితో సమానం”. (అహ్మద్: 5/225, సహీహుల్ జామి:3375).
వడ్డీ అందరిపై నిషిద్ధం. బీదవాళ్ళ, ధనికుల మధ్య ఏలాంటి తేడా లేదు. తేడా ఉంది అని కొందరనుకుంటారు. కాని అది తప్పు. అందరిపై, అన్ని పరిస్థితుల్లోనూ నిషిద్ధం. పెద్ద పెద్ద వ్యాపారులు, ధనికులు దీని వల్లే దీవాలా తీస్తున్నారు. ఎన్నో సంఘటనలు దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి.
వడ్డీ ద్వారా వచ్చే ధనం చూడడానికి ఎక్కువ కనబడినా ఆ ధనంలో బర్కత్ (శుభం) అనేది నశించిపోతుంది. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు:
“వడ్డీ ద్వారా ఎంత ధనం వచ్చినా దాని అంతం అల్పంతోనే అవుతుంది”. (అహ్మద్: 2/37, సహీహుల్ జామి: 3542.)
వడ్డీశాతం పెరిగినా లేక తరిగినా, ఎక్కువ ఉన్నా లేక తక్కువ ఉన్నా తీసుకోవడం, తినడం ఎట్టిపరిస్థితుల్లోనూ యోగ్యం కాదు. అన్ని విధాలుగా నిషిద్ధం. వడ్డీ తినే వ్యక్తి ఉన్మాది వలే ప్రళయదినాన నిలబడతాడు. ఇది ఎంత చెడు అయినప్పటికి అల్లాహ్ తౌబా చేయమని ఆజ్ఞాపించి, దాని విధానం కూడా స్పష్టం చేశాడు. వడ్డీ తినేవారిని ఉద్దేశించి ఇలా ఆదేశించాడు:
ఇప్పుడైనా మీరు పశ్చాత్తాప పడి (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. (సూరహ్ బఖర 2: 279).
ఇదే వాస్తవ న్యాయం.
విశ్వాసుని మనుస్సు ఈ ఘోరపాపాన్ని అసహ్యించుకొనుట, దాని చెడును గ్రహించుట తప్పనిసరి. దొంగలించబడే లేక నష్టమయ్యే భయం లాంటి గత్యంతరంతో వడ్డీఇచ్చే బ్యాంకుల్లో తమ సొమ్మును డిపాజిట్ చేసే వాళ్ళు, వారి గత్యంతరం ఎంతమటుకు ఉంది, గత్యంతరంలేక మరణించిన జంతువును తినువారి లాంటి లేదా అంతకంటే కఠిన స్ధితిలో ఉన్నారా? అనేది గ్రహించాలి. అందుకు అల్లాహ్ క్షమాపణ కోరుతూ ఉండాలి. ఎంత సంభవమైతే అంత వరకు (దాని నుండి దూరమై) దాని స్థానంలో వేరే (ధర్మ సమ్మతమైన) ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం తమ సొమ్ము ఉన్న బ్యాంకుల నుండి తమ సొమ్ముపై రావలసిన వడ్డీని వారితో అడగకూడదు. వారు స్వయంగా తన అకౌంటులో జమ చేస్తే దాన్ని దానం ఉద్దేశంతో కాకుండా ఆ పాపపు సొమ్ముతో తన ప్రాణం వదులుకొనుటకు (కడు బీదవారికి) ఇచ్చేయాలి. నిశ్చయంగా అల్లాహ్ పవిత్రుడు. పవిత్రమైన వాటినే స్వీకరి స్తాడు. దాని నుండి స్వలాభం పొందడం ఎంత మాత్రం యోగ్యం కాదు. తినుత్రాగు, ధరించు ప్రయాణ ఖర్చు రూపంలో గాని లేక గృహనిర్మాణం లేక అతనిపై విధిగా ఉన్న భార్యబిడ్డల, తల్లిదండ్రుల ఖర్చు రూపంలోగాని లేక అందులో నుంచి జకాత్, ట్యాక్స్ వగైరా చెల్లించడానికిగాని లేక కనీసం తనపై జరిగిన అన్యాయాన్ని దూరం చేయడానిక్కూడా దాన్ని ఉపయోగించరాదు. కేవలం అల్లాహ్ యొక్క బహుగట్టి పట్టు నుండి తప్పించుకోడానికి ఎవరికైనా ఇచ్చివేయాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు. [అల్ బఖర – 2 : 275 ]
అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.
ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.[అల్ బఖర – 2 : 276 – 280 ]
అధ్యాయం : 37 – వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష
పసిడిపూలు – అంశాల వారీగా ఖుర్ఆన్ వ్యాఖ్యాల సంకలనం
సంకలనం : రచన అనువాద విభాగం, శాంతి మార్గం పబ్లికేషన్స్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.