దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ శుభ నామమైన: “అల్ -ఫత్తాహ్” యొక్క వివరణ – Al Fattah (الْفَتَّاحُ) [వీడియో] https://youtu.be/yjDaHleVXGU [14 నిముషాలు] 🎤: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
34:26 قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ “మన ప్రభువు మనందరినీ సమావేశపరచి ఆ తరువాత మన మధ్య సత్యబద్ధంగా తీర్పుచేస్తాడు. ఆయన తీర్పులు చేసేవాడు, సర్వం తెలిసినవాడు” అని చెప్పు.
35:2 مَّا يَفْتَحِ اللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِن بَعْدِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ అల్లాహ్ తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసే వాడెవడూ లేడు. మరి ఆయన దేన్నయినా నిలిపివేస్తే, ఆ తరువాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు. (సూరా ఫాతిర్ 35:2)
6:44 فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُم بَغْتَةً فَإِذَا هُم مُّبْلِسُونَ తరువాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు, మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలూ తెరిచాము. తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మిడిసిపడుతుండగా, అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు, వారు పూర్తిగా నిరాశ చెందారు.
26:117 قَالَ رَبِّ إِنَّ قَوْمِي كَذَّبُونِ అప్పుడు అతనిలా ప్రార్థించాడు: “నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. 26:118 فَافْتَحْ بَيْنِي وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِي وَمَن مَّعِيَ مِنَ الْمُؤْمِنِينَ “కాబట్టి నీవు నాకూ – వారికీ మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులనూ కాపాడు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) సహాబాల ఆచరణల వెలుగులో ఖుర్ఆన్ మరియు హదీసుల అవగాహన.
2) ధార్మిక పరంగా మిలాదున్నబీ (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదినం ఉత్సవానికున్న విలువ.
3) మూడు ముఖ్య నియమాలు
4) ధర్మంలో ‘బిద్దతే హసన’ (మంచి క్రొత్త పోకడ) యొక్క అస్తిత్వం వుందా?
5) మిలాదున్నబీని జరుపుకొనే వారి ఆధారాలు మరియు వాటి జవాబులు.
ఇస్లామీయ సహెూదరులారా!
ఒక ముస్లిం యొక్క సాఫల్యత అనేది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు విధేయత చూపడంలోనే వుంది. దివ్య ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించిన విషయాలను అనుసరిస్తూ, వాటి తిరస్కరణ, అవిధేయతలకు ఎల్లప్పుడూ దూరంగా వుండాలి.
అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల విధేయత చూపే వారికి అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గం) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం వుంటారు. గొప్ప విజయం అంటే ఇదే. ఎవడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల అవిధేయుడై, ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడిని ఆయన నరకాగ్నిలో పడవేస్తాడు. వాడందులో ఎల్లకాలం పడి వుంటాడు. అవమానకరమైన శిక్ష అలాంటి వారి కోసమే వుంది.” (నిసా:13- 14)
పై ఆయతులపై ఒక్కసారి దృష్టి సారించండి. వీటిలో అల్లాహ్ – విధేయత చూపుతూ తనను అనుసరించే వారికి స్వర్గపు శుభవార్తనూ, దీనికి వ్యతిరేకంగా అవిధేయత చూపి తనను తిరస్కరించే వారికి నరక శిక్షను గూర్చి తెలియజేశాడు. అందుకే ప్రతి ముస్లిం తన హృదయంలో తొంగి చూసి, తనే మార్గంలో పయనిస్తున్నాడో విశ్లేషించుకోవాలి. స్వర్గానికి తీసుకెళ్ళే మార్గంలోనా లేక (అల్లాహ్ శరణు) నరకంలోకి తీసుకెళ్ళే మార్గంలోనా అని. అల్లాహ్ కు విధేయత ఎలా సాధ్యమవుతుంది? అతనికి విధేయత అనేది – దివ్య ఖుర్ఆన్ ను చదవడం, నేర్పించడం ద్వారా మరియు దాని (ఆజ్ఞల)పై దృష్టి సారించి, దానినే మన జీవితపు కొలమానంగా నిర్ధారించడం ద్వారా సాధ్యమవుతుంది.
ఇక, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు విధేయత ఎలా సాధ్యమవుతుంది?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ శుభ నామము: “అస్-సమీఅ్” యొక్క వివరణ [వీడియో] https://youtu.be/xCWLjjGHElI [36 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క శుభ నామమైన “అస్-సమీ” (సర్వం వినేవాడు) గురించి వివరిస్తారు. సమయాభావం వలన అల్-బసీర్ (సర్వం చూసేవాడు) మరియు అల్-అలీమ్ (సర్వజ్ఞాని) అనే ఇతర రెండు నామాలను వదిలి, కేవలం అస్-సమీ పై దృష్టి సారిస్తారు. అల్లాహ్ వినికిడి శక్తి ఎంత గొప్పదో, విశాలమైనదో ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేస్తారు. ఒకే సమయంలో సృష్టిలోని జీవరాశులన్నిటి ప్రార్థనలను, విభిన్న భాషలలో, ఎలాంటి గందరగోళం లేకుండా వినగలడని ఉదాహరణలతో వివరిస్తారు. ఈ నమ్మకం ఒక విశ్వాసి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాలి, వారి మాటలు, చేతలు ఎలా ఉండాలి, మరియు ప్రార్థనలలో అల్లాహ్ వైపు ఎలా ఏకాగ్రతతో మళ్ళాలో వివరిస్తారు. షిర్క్‌ను ఖండిస్తూ, వినలేని వారిని ఆరాధించడం నిరర్థకమని, సర్వం వినే అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని నొక్కి చెబుతారు.
పరిచయం
అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మాబాద్.
أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ [అవూజు బిల్లాహిస్ సమీఇల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్] (శపించబడిన షైతాన్ నుండి సర్వం వినేవాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుతున్నాను)
لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ [లైస కమిస్లిహి షైఉన్ వహువస్ సమీఉల్ బసీర్] (ఆయనను పోలినది ఏదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.)
సోదర మహాశయులారా, ప్రియ మిత్రులారా, ఈరోజు అల్లాహ్ శుభ నామములైన మూడు నామాల గురించి, అస్-సమీ, అల్-బసీర్, అల్-అలీమ్. ఈ మూడిటి గురించి చెప్పేది ఉండే. కానీ ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది. మూడిటి గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే, మరీ ఇంకా చాలా దీర్ఘం, ఎక్కువ సమయం అవుతుంది గనక, ఈరోజు కేవలం సమీ గురించి చెబుతున్నాను. ఎలాగైతే మీరు ఇప్పుడు ఇక్కడ టైటిల్ లో కూడా చూస్తున్నారు. అయితే రండి.
అస్-సమీ: సర్వం వినేవాడు
అస్-సమీ అల్లాహ్ యొక్క పేరు అని, అందులో ఉన్నటువంటి గుణం ‘సమ్’ (వినికిడి), వినడం అల్లాహ్ యొక్క గుణం అని మనం నమ్మాలి. ఖురాన్‌లో 50 కంటే ఎక్కువ చోట్ల అల్లాహ్ యొక్క ఈ పేరు ప్రస్తావన వచ్చింది. అల్లాహ్ యొక్క ఈ పేరు, అస్-సమీ అంటే వినేవాడు. ఈ ఒక్క పదం వాస్తవానికి మన తెలుగులోనిది, అస్-సమీలో ఉన్నటువంటి విశాలమైన భావానికి సరిపోదు. అందుకొరకే వివరణ చాలా అవసరం.
కేవలం మానవులదే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతీ దాని గురించి అల్లాహు తఆలా చాలా స్పష్టముగా మంచి రీతిలో వింటాడు. అల్లాహు తఆలా యొక్క వినే శక్తి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎలా వింటాడు అన్న దాని గురించి కైఫియత్ (ఎలాగో), అది మనకు తెలియదు. కానీ ఖురాన్‌లో అల్లాహు తఆలా ఏ ఆయతులు అయితే తెలిపాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఏ హదీసులు అయితే వచ్చాయో, వాటన్నిటిని కలుపుకుంటే, పూర్తి విశ్వంలో నుండి ఎలా వింటాడు అనేది కాకుండా, కేవలం ఒక మానవుల విషయం మనం చిన్నగా ఆలోచిస్తే, పూర్తి ప్రపంచంలో ఉన్న మానవులు ఒకే సమయంలో, ఒకే సందర్భంలో, ఒకే పెద్ద మైదానంలో ఉండి, ప్రతీ ఒక్కరూ తమ తమ భాషల్లో, ప్రతీ ఒక్కరూ తమ వేరువేరు కోరికలు ఏదైతే వెళ్లబుచ్చుతారో, అల్లాహు తఆలా ఆ ఒకే సమయంలో అందరి మాటలు వింటాడు, అందరి భాషలు వింటాడు అర్థం చేసుకుంటాడు, అందరి కోరికలు వేరువేరుగా ఉన్నప్పటికీ వాటిని వింటాడు.
జన సమూహంలో ఉండి అందరి శబ్దాలు, భాషలు, వారు చెప్పే మాటలు ఎంత వేరువేరు ఐనా, వారికి పరస్పరం ఒకరికి ఒకరు ఎంత డిస్టర్బెన్స్ ఐనా, అల్లాహ్ అజ్జవజల్లా యొక్క వినే శక్తి ఎంత గొప్పది అంటే, అతనికి ఎలాంటి డిస్టర్బెన్స్ కాదు. అల్లాహు తఆలా ప్రతీ ఒక్కరి మాట, ప్రతీ ఒక్కరి కోరిక, ప్రతీ ఒక్కరి భాష వింటాడు. అంతేకాదు, ఎవరైనా ఇప్పుడు నేను చెబుతున్నట్లుగా బిగ్గరగా, శబ్దంతో చెప్పినా, (మెల్లగా) “ఓ అల్లాహ్ మేము ఉపవాసం ఉంటున్నాము, మా ఉపవాసాలను స్వీకరించు ఓ అల్లాహ్”. నేను ఎంత మెల్లగా చెబుతున్నాను అంటే బహుశా నా పక్కన ఉన్నవానికి కూడా వినబడదు కావచ్చు, కానీ అల్లాహ్ బిగ్గరగా చెప్పేవారి మాట వింటాడు, నిశ్శబ్దంగా చెప్పే వాని మాట వింటాడు. అంతే కాదు, కొన్ని సందర్భాలలో మనలో మనమే నాలుకను కదిలించి మాట్లాడుతూ ఉంటాము, ఏ శబ్దమూ రాదు. అలాంటి మాటలు సైతం అల్లాహ్ వింటాడు.
ఒక సామెతగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. అందులో అస్-సమీ, అల్-బసీర్, అల్-అలీమ్ మూడు అల్లాహ్ యొక్క నామాల ప్రస్తావన వచ్చేస్తుంది. అదేమిటంటే, అమావాస్య రాత్రి, చిమ్మని చీకటి రాత్రి, నల్ల రాయి కింద పాతాళంలో ఉన్నటువంటి చీమను అల్లాహ్ చూస్తాడు (బసీర్), నడిచే నడక యొక్క శబ్దాన్ని అల్లాహ్ వింటాడు (అస్-సమీ), ఆ చీమ తన చీమల గ్రూప్‌తో ఏం మాట్లాడుతుందో అది కూడా అల్లాహ్‌కు తెలుసు (అల్-అలీమ్).
ఖురాన్ మరియు హదీసుల ఆధారాలు
ఈ మూడు పేర్లు అనేక సందర్భాలలో కూడా ఖురాన్‌లో వచ్చి ఉన్నాయి. ఒక ఉదాహరణ మీకు మన సోదరులు తెలిపారు కూడా. అందుకొరకే మూడిటిని కలిపి ఒకే సమయంలో మనం తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఆశ ఉండింది కానీ సమయం సరిపోదు. అందుకొరకే ఇప్పుడు సమీ గురించి చెప్పడం జరుగుతుంది. ముస్నద్ అహ్మద్‌లో వచ్చిన ఒక హదీస్, ఇబ్ను మాజా, నసాయిలో కూడా ఉంది. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారి మాటను గమనించండి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక స్త్రీ వచ్చి ఒక విషయం అడిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు ఇంకా వహీ రాలేదని, దీని గురించి ఇప్పుడే ఏమీ సమాధానం చెప్పలేనని అంటారు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అంటున్నారు:
الْحَمْدُ لِلَّهِ الَّذِي وَسِعَ سَمْعُهُ الْأَصْوَاتَ [అల్హందులిల్లాహిల్లజీ వసిఅ సమ్ఉహుల్ అస్వాత్] (ఆ అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు, ఏ అల్లాహ్ యొక్క వినికిడి అన్ని రకాల శబ్దాలను ఆవరించి ఉందో.)
لَقَدْ جَاءَتِ الْمُجَادِلَةُ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تُكَلِّمُهُ లకద్ జాఅతిల్ ముజాదిలతు ఇలన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం తుకల్లిముహు (ఆ వాదించే స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి మాట్లాడుతుండగా)
ఆ ఒక సమస్య గురించి అడుగుతూ వచ్చినటువంటి స్త్రీ యొక్క మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఆమె మాట్లాడుతుంది,
وَأَنَا فِي نَاحِيَةٍ مِنَ الْبَيْتِ مَا أَسْمَعُ مَا تَقُولُ వఅనా ఫీ నాహియతిన్ మినల్ బైతి మా అస్మఉ మా తఖూల్ (నేను ఇంటిలోనే ఒక పక్కన, ఒక మూలన ఉండి వింటూ ఉన్నాను),
قَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّتِي تُجَادِلُكَ فِي زَوْجِهَا وَتَشْتَكِي إِلَى اللَّهِ وَاللَّهُ يَسْمَعُ تَحَاوُرَكُمَا ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ بَصِيرٌ (నిశ్చయంగా అల్లాహ్ తన భర్త విషయంలో మీతో వాదిస్తూ ఉండిన, మరియు అల్లాహ్‌కు మొరపెట్టుకుంటున్న ఆ స్త్రీ యొక్క మాటను విన్నాడు. మరియు అల్లాహ్ మీ ఇద్దరి మాటలను వింటూ ఉన్నాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.)
సోదర మహాశయులారా, ఇంతకుముందు నేను చెప్పినట్లు, ఆ హదీస్ కూడా సహీహ్ ముస్లింలో వచ్చి ఉంది, 2577. అల్లాహ్ అంటున్నాడు, హదీస్ ఖుద్సీ ఇది.
[యా ఇబాదీ, లవ్ అన్న అవ్వలకుమ్ వ ఆఖిరకుమ్ వ ఇన్సకుమ్ వ జిన్నకుమ్ ఖామూ ఫీ సయీదిన్ వాహిదిన్ ఫసఅలూనీ, ఫఅఅతైతు కుల్ల వాహిదిన్ మస్అలతహు, మా నఖస జాలిక మిన్ ముల్కీ షైఆ, ఇల్లా కమా యన్ఖుసుల్ మిఖ్యతు ఇజా గుమిస ఫిల్ బహర్]
(ఓ నా దాసులారా, మీలోని మొదటివాడి నుండి మొదలుకొని చివరి వాడి వరకు, మానవులే కాదు జిన్నాతులు సైతం ఒకే ఒక మైదానంలో మీరందరూ నిలబడి, మీరందరూ నాతో అర్ధించారంటే, అడిగారంటే, ప్రతి ఒక్కరికి అతను అడిగినది నేను ఇచ్చేశానంటే, నా యొక్క రాజ్యంలో ఏ కొంచెం కూడా తరగదు, సముద్రంలో ఒక సూది ఇలా ముంచి తీస్తే సముద్రంలో ఎంత తరుగుతుంది?అంత కూడా, నేను ప్రతీ ఒక్కరికి మీరు అడుగుతున్నది విని, వారు అడిగినది వారికి ఇచ్చేస్తే ఇంత కూడా తరగదు.
బుఖారీ ముస్లింలో అబూ మూసా అష్అరీ రదియల్లాహు తఆలా అన్హు వారి హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో వారు సహాబాలు ప్రయాణంలో ఉన్నారు. అబూ మూసా అంటున్నారు: فَكُنَّا إِذَا عَلَوْنَا كَبَّرْنَا ఫకున్నా ఇజా అలౌనా కబ్బర్నా (మేము నడుస్తూ నడుస్తూ అంటే ప్రయాణంలో దారిలో ఎత్తు ప్రదేశంలో ఉండగా ‘అల్లాహు అక్బర్’ అని గొంతు ఎత్తి కొంచెం పెద్ద శబ్దంతో అంటూ ఉంటిమి). ఫఖాల్ (అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు):
أَيُّهَا النَّاسُ ارْبَعُوا عَلَى أَنْفُسِكُمْ، فَإِنَّكُمْ لَا تَدْعُونَ أَصَمَّ وَلَا غَائِبًا، وَلَكِنْ تَدْعُونَ سَمِيعًا بَصِيرًا قَرِيبًا [అయ్యుహన్నాస్, ఇర్బవూ అలా అన్ఫుసికుమ్. ఫఇన్నకుమ్ లా తద్ఊన అసమ్మ వలా గాఇబా. వలాకిన్ తద్ఊన సమీఅన్ బసీరన్ ఖరీబా] (ఓ ప్రజలారా, మీరు స్వయం మీపై కొంచెం తగ్గించుకోండి, నిదానం అనేది పాటించండి. మీరు ఎవరిని అర్ధిస్తున్నారు? ఏదైనా చెవిటి వాడిని కాదు, ఏదో దూరం ఉండి ఏమీ తెలియని వానికి కాదు. మీరు వినే వాడితో, చూసే వాడితో, మీకు దగ్గరగా ఉన్న వాడితో దుఆ చేస్తున్నారు, మీరు పిలుస్తున్నారు, అర్ధిస్తున్నారు.)
అందుకే సోదర మహాశయులారా, అల్లాహు తఆలా ఇంత గొప్పగా వినేవాడు అన్నటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనం నోటితో చెబుతాము, అవును అల్లాహ్ అన్నీ వింటాడు, అల్లాహ్‌కు ప్రతీ భాష తెలుసు. అంటాము నోటితో. కానీ వాస్తవంగా మనకు ఆ సంపూర్ణ విశ్వాసం ఉందా? దానిపై ప్రగాఢమైన, బలమైన నమ్మకం ఉన్నదా? ఉండేది ఉంటే, వాస్తవానికి మన జీవితాల్లో మార్పు వచ్చేది. ఈ విశ్వాసం ప్రకారంగా మన యొక్క జీవితాలపై దాని ప్రభావం ఉండేది. ఒక హదీస్, ఖురాన్ ఆయత్ ఆధారంగా వినండి ఒక సంఘటన. చూడండి.
అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, సహీహ్ బుఖారీ, హదీస్ నెంబర్ 6384, సహీహ్ ముస్లిం 2704 లో వచ్చిన హదీస్. ఏమంటున్నారు? اجْتَمَعَ عِنْدَ الْبَيْتِ قُرَشِيَّانِ وَثَقَفِيٌّ، أَوْ ثَقَفِيَّانِ وَقُرَشِيٌّ ఇజ్తమఅ ఇందల్ బైతి ఖురషియాన్ వ సఖఫియ్యాని వ ఖురషి (కాబా వద్ద ఇద్దరు ఖురైషీలు ఒక సఖీఫ్‌కు చెందిన లేదా ఇద్దరు సఖీఫ్‌కు చెందిన ఒక ఖురైష్‌కు చెందిన ముగ్గురు మనుషులు కలిసి ఉన్నారు). శరీర వైభవం కలిగినవారు కానీ అర్థం చేసుకునేటువంటి మనసు చాలా తక్కువగా వారికి ఉండింది. బుర్ర చిన్నగా, శరీరం పెద్దగా. అర్థం చేసుకునే గుణం లేదు కానీ మాటలు చాలా. వారిలో ఒకడు ఏమన్నాడు? أَتَرَوْنَ أَنَّ اللَّهَ يَسْمَعُ مَا نَقُولُ؟ అతరౌన అన్నల్లాహ యస్మఉ మా నఖూల్? (మనం చెప్పే మాటలు అల్లాహ్ వింటాడా?). అయితే రెండోవాడు అన్నాడు, మనము బిగ్గరగా మాట్లాడితే వింటాడు, నవూజుబిల్లాహ్, మనం మెల్లిగా, నిశ్శబ్దంగా, గుప్తంగా మాట్లాడితే వినడు. మూడోవాడు అన్నాడు, ఒకవేళ అల్లాహు తఆలా బిగ్గరగా మనం మాట్లాడినప్పుడు వినేవాడైతే, మనం మెల్లిగా మాట్లాడినా గానీ వింటూ ఉంటాడు. అప్పుడు అల్లాహు తఆలా సూరత్ ఫుస్సిలత్ అవతరింపజేశాడు. సూరా నెంబర్ 41, ఆయత్ నెంబర్ 22 నుండి శ్రద్ధగా చూడండి, చదవండి.
(మీరు రహస్యంగా చెడు పనులకు పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్ళు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.)
చూశారా, అవిశ్వాసులు, బుద్ధి తక్కువ ఉన్నవారు, అల్లాహ్ యొక్క వినే, అల్లాహ్‌కు తెలిసే, అల్లాహ్ చూసే, సమీ, బసీర్, అలీమ్ విషయంలో ఎలాంటి దురాలోచనలకు పాల్పడ్డారు? మరియు ఇలాంటి దురాలోచన ఎప్పుడైతే ఉంటుందో, మనిషి యొక్క వ్యవహారంలో, అతని యొక్క చేష్టల్లో, అతని పనుల్లో, ఇతరులతో అతను ఏదైతే బిహేవియర్, అతడు మసులుకుంటాడో అందులో కూడా చాలా మార్పు ఉంటుంది.
అందుకొరకే, అల్లాహ్ సంపూర్ణంగా వినేవాడు, ఎంతటి గొప్పగా వినేవాడో, స్టార్టింగ్‌లో మనం కొన్ని విషయాలు ఏదైతే తెలుసుకున్నామో, దాని ప్రకారంగా బలమైన నమ్మకం ఉండాలి. బలమైన నమ్మకం లేకుంటే, మనిషి ఆచరణలలో చాలా చెడు ప్రభావం చూపుతుంది, దాని కారణంగా మనిషి చెడుకు పాల్పడి నరకం పాలవుతాడు. ఒకసారి మీరు మళ్ళీ చూడండి, వెంటనే దాని తర్వాత ఆయతులు.
మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురి అయ్యారు. ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా వహించకపోయినా నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్ధించినా క్షమించబడరు.
…ఈ క్షమాభిక్ష కోసం అర్ధించినా క్షమించబడరు ఎక్కడ ఇది? ఇది నరకంలో ఉండి. అందుకొరకే ఇప్పటికైనా గానీ అవకాశం ఉంది. నిన్ననే తవ్వాబ్, అఫూ, గఫూర్, గఫార్ గురించి విన్నారు. అల్లాహ్ పట్ల, అల్లాహ్ యొక్క పేరు సమీ, గుణం సమ్అ, పేరు బసీర్, గుణం బసర్ చూడడం, మరియు అలాగే అలీమ్, ఇల్మ్, వీటి గురించి ఎలాంటి తప్పుడు ఆలోచన ఉన్నా, మన ఆచరణలో ఎలాంటి చెడు ఉన్నా, దానిని తొందరగా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఎలా చేయగలుగుతాము మనం సరిదిద్దుకునే ప్రయత్నం? రండి, ఇప్పుడు చెప్పబోయే మాటలు మీరు శ్రద్ధగా విన్నారంటే, మనం చేంజ్ కావచ్చు, మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. ఎలా అంటారా?
అల్లాహ్ వింటాడు అని ఎప్పుడైతే మనం అంటామో, అందు రెండు భావాలు వస్తాయి. ఒకటి, ఏ ఎవరి విషయాలు, ఎవరి మాటలు వింటూ ఉన్నాడో, వారికి సంబంధించి. రెండవ భావం, స్వయం వినేవాడు అల్లాహ్‌కు సంబంధించి. అర్థమైందా?
ఇప్పుడు, అల్లా క్షమించుగాక నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను, అల్లాహ్ కొరకు ఎలాంటి ఉపమానాలు, ఉదాహరణ కాదు, మనకు అర్థం కావడానికి ఇట్లాంటి కొన్ని చిన్న ఉదాహరణలు. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటూ ఉన్నారు. కదా? అయితే ఇప్పుడు, వినడం అన్న ఈ ప్రస్తావన ఇక్కడ ఏదైతే ఉందో, ఇందులో రెండు భావాలు. ఒకటి, ఎవరి మాటలు వింటున్నారో వారికి సంబంధించి. మరొకటి, వినేవాడు అల్లాహ్, అతనికి సంబంధించి. అల్లాహ్‌కు సంబంధించి ఏంటి? కొన్ని సందర్భాలలో, కొన్ని ఆయతులలో, అల్లాహ్ విన్నాడు, అల్లాహ్ వింటాడు, అల్లాహ్ వినేవాడు, ఇలాంటి పదాలు ఎక్కడైతే వస్తాయో, అక్కడ భావం, అల్లాహ్ మీ మాటను వినేశాడు, స్వీకరిస్తాడు, మీరు కోరినది నొసంగుతాడు, ఇస్తజాబ (అంగీకరించాడు), ఈ భావంలో. ఇది చాలా సంతోషకరం మన కొరకు.
ఉదాహరణకు, సమిఅల్లాహు లిమన్ హమిదహ్. ఎప్పుడంటారు? రుకూ నుండి నిలబడి కదా? అల్లాహు తఆలా విన్నాడు, సమిఅల్లాహు, అల్లాహ్ విన్నాడు, లిమన్ హమిదహు, ఎవరైతే అతనిని అంటే అల్లాహ్‌ని ప్రశంసించారో. ఇక్కడ ధర్మవేత్తలు అంటారు, అజాబ, وَلَيْسَ الْمُرَادُ سَمْعَهُ مُجَرَّدَ سِمَاعٍ فَقَطْ వలైసల్ మురాదు సమ్ఉహు ముజర్రద్ సిమాఅ ఫఖత్ (కేవలం వినడం మాత్రమే ఉద్దేశం కాదు, అంగీకరించాడు). అంటే, అల్లాహ్ మీ యొక్క ఈ స్తోత్రాలను విన్నాడు అంటే, అంగీకరించాడు, స్వీకరించాడు, దీనికి ప్రతిఫలం అల్లాహ్ మీకు ప్రసాదిస్తాడు.
అలాగే, సూరత్ ఇబ్రాహీం ఆయత్ నెంబర్ 39 లో మీరు చూస్తే, إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ [ఇన్న రబ్బీ లసమీఉద్ దుఆ] (నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు) అని వస్తుంది. అంటే, నిశ్చయంగా నా ప్రభువు దుఆలను వినేవాడు, అంటే కేవలం విని ఊరుకోడు, అంగీకరిస్తాడు, మీరు అడిగేది మీకు ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త ఉంది. అర్థమైంది కదా?
ఇక వినే వాడు అన్న దానిలో రెండవ భావం ఏదైతే చెప్పామో, మరొక భావం, వినే వారి, అంటే ఎవరి మాటలు వింటున్నాడో, ఎవరి మాటలు వినబడతాయో, వారి గురించి. ఇక్కడ మానవులు అని మనం ఒకవేళ తీసుకుంటే, అందులో మూడు భావాలు వస్తాయి. ఏంటి?
మొదటి భావం, అల్లాహు తఆలా విన్నాడు అని అంటే ఇక్కడ, నీకు అల్లాహు తఆలా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. అర్థమైందా? కాలేదా? ఉదాహరణకు, మీరు ఒకచోట పని చేస్తున్నారు అనుకోండి. మీ యజమాని , “ఒరేయ్, ఏమంటున్నావు రా, వింటున్నా నేను” అని అన్నాడు. అంటే అక్కడ ఏంటి? ఏదైనా శుభవార్తనా? మీరు ఏదో పొరపాటు మాట అన్నారు, దాని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కదా?
ఉదాహరణకు ఖురాన్‌లో చూడండి, సూరత్ అజ్-జుఖ్రుఫ్, ఆయత్ నెంబర్ 80:
أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم [అమ్ యహసబూన అన్నా లా నస్మఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్] (వారి రహస్యాలను, వారి గుప్త విషయాలను మేము వినము అని వారు భావిస్తున్నారా?) ఇక్కడ వినే మాట వచ్చింది, అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటి? హెచ్చరిస్తున్నాడు అల్లాహు తఆలా.
అలాగే సూరత్ ఆల్-ఇమ్రాన్, ఆయత్ నెంబర్ 181లో చూడండి: لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ [లఖద్ సమిఅల్లాహు ఖౌలల్లజీన ఖాలూ ఇన్నల్లాహ ఫఖీరున్ వ నహ్ను అగ్నియాఉ] (యూదులలో కొందరు దుష్టులు ‘నిశ్చయంగా అల్లాహ్ పేదవాడు మేము సిరి సంపదలు గలవారిమి’ అని అన్నవారి మాటను నిశ్చయంగా అల్లాహ్ విన్నాడు.)
అల్లాహ్ ఏమంటున్నాడు? మేము విన్నాము. అంటే ఏంటి? అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. ఏంటి? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదేనా మీ మాట? అల్లాహ్ పట్ల ఇలాంటి భావాలు కలిగి ఇలాంటి మాటలు పలుకుతారా మీరు? తహదీద్, హెచ్చరిక, చేతావని.
రెండవ భావం, అల్లాహు తఆలా తన ప్రియమైన దాసులకు, ప్రవక్తలకు, పుణ్యాత్ములకు సపోర్ట్ చేస్తున్నాడు, వారికి మద్దతు ఇస్తున్నాడు అన్నట్లుగా భావం ఉంటుంది. ఇది చూడాలనుకుంటే సూరత్ తాహా ఆయత్ నెంబర్ 46 మీరు చూడవచ్చు. ఏముంది?
إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ [ఇన్ననీ మఅకుమా అస్మఉ వ అరా] (నిశ్చయంగా నేను మీ ఇద్దరితో ఉన్నాను, నేను వింటూ ఉన్నాను మరియు చూస్తూ ఉన్నాను.)
ఓ మూసా, హారూన్ అలైహిముస్సలాం, మీరిద్దరూ వెళ్ళండి, ఫిరౌన్‌కు దావత్ ఇవ్వండి, తౌహీద్ గురించి చెప్పండి, బనీ ఇస్రాయీల్‌పై అతడు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నాడో, దాని గురించి హెచ్చరించండి. మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం వారిని అల్లాహు తఆలా ఫిరౌన్ వద్దకు పంపుతూ ఏమన్నాడు? “ఇన్ననీ మఅకుమా, నేను మీకు తోడుగా ఉన్నాను.” అల్లాహు అక్బర్. దావత్ పని చేసే వారులారా, అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని ప్రజల వరకు చేరవేసే వారులారా, భయపడకండి. ఎన్ని గద్దింపులు మీకు వచ్చినా, అయ్యో, ఫలానా అంత పెద్ద ఇంటర్నేషనల్ దాయికే ఫలానా ఫలానా ప్రభుత్వం ఇలాంటి హెచ్చరికలు ఇచ్చేసింది, ఇక మనం దావత్ పని వదులుకుందామా? హెచ్చరికలు ఇవ్వడం వారి యొక్క పని, వారికి ఈ సత్యం అర్థం కాక. కానీ నీకు తోడుగా ఎవరున్నాడు? “ఇన్ననీ మఅకుమా, నేను నీకు తోడుగా ఉన్నాను” అని అల్లాహు తఆలా మూసా మరియు హారూన్ అలైహిముస్సలాంకి ఓర్పునిస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, స్థైర్యాన్ని ఇస్తున్నాడు, ఇంకా ఏమంటున్నాడు? “అస్మఉ వ అరా, నేను ప్రతీ విషయాన్ని వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను.” మీ యొక్క కదలికలు, మీరు ఎక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు, ఫిరౌన్ ముందు మీరు ఎలా దావత్ ఇస్తారు, అవన్నీ నేను చూస్తూ ఉంటాను, మీకు తోడుగా ఉంటాను, మీ మాటలు వింటూ ఉంటాను, మీరు ఎలాంటి భయం పడకండి.” అల్లాహ్ యొక్క ధైర్యం, అల్లాహ్ వైపు నుండి ఒక తోడ్పాటు లభిస్తుంది. ఇక్కడ ‘సమఅ’ ఈ భావంలో ఉంది.
ఇక మూడవ భావం, అల్లాహు తఆలా ఈ పూర్తి విశ్వంలో ఎక్కడా, ఏదీ కూడా అతని వినికిడికి బయట లేదు. మనిషి ఏ గుహలో, అంటారు కదా, బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఏ ఏ ప్రూఫ్‌లలో మనిషి బంధించబడి తనకు తాను లోపల వేసుకున్నా, అల్లాహ్ వినకుండా ఎక్కడా ఏ మనిషి ఉండలేడు. ఈ లోకంలో ఏ ప్రాంతం కూడా, ఈ లోకంలో ఏ స్థితి కూడా, ఈ లోకంలో ఎక్కడ ఏది కూడా అల్లాహ్ వినికిడికి బయట లేదు.
అయితే సోదర మహాశయులారా, ఇక ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత చాలా ముఖ్యమైన ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇంతటి గొప్ప వినే వాడైన ఆ అల్లాహ్‌ను మనం విశ్వసిస్తున్నాము గనక, మన మొరలను అతను వినడా, అంగీకరించడా? ఓ అల్లాహ్, నేను ఈ కష్టంలో ఉన్నాను, నా కష్టాన్ని దూరం చెయ్యి ఓ అల్లాహ్, అని నిజంగా మనసుతో మన మాట వెళ్లి, కళ్ళతో కన్నీరు కారుతూ, రాత్రి వేళ ఎవరు చూడని సమయంలో అతని ముందు మనం నిలబడ్డామంటే, అతను మన మాట వినడా? అతడు మనకు ప్రసాదించడా? ప్రసాదిస్తే, మరి ఎవరైతే వినేవారు కారో, ఎన్నో టన్నుల మట్టి కింద శవం అయి ఉన్నారో, లేక చనిపోయి కాలాలు గడిచి మొత్తం కుళ్ళిపోయారో, అలాంటి వారు ఎవరిలోనైతే వినే శక్తి లేదో, ఎందుకు వారిని ఆరాధించాలి? ఎందుకు వారిని పూజించాలి?
అల్లాహు తఆలా షిర్క్‌ను ఖండిస్తూ, తన వినే శక్తిని స్పష్టంగా తెలియజేసినప్పుడు, ఎవరినైతే మీరు అల్లాహ్‌ను కాదని పూజిస్తున్నారో, వారిలో వినే శక్తి లేదు అని కూడా స్పష్టంగా తెలియజేశాడు. మీరు ఒకవేళ దీనికి సంబంధించిన ఆయతులు చదివితే విషయం చాలా మంచి రీతిలో అర్థమవుతుంది. రండి, ఒక్కసారి చూడండి ఇక్కడ సూరతుల్ అఅరాఫ్ ఆయత్ నెంబర్ 195. 194 నుండి చదువుదాము, విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి:
(మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, వారంతా మీ లాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి, ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులే అయితే, వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.)
ఈ ఆయత్‌ను నోట్ చేసుకోండి. మన వద్ద కొందరు ఏం చేస్తారు, మన మిత్రులు, మనలాంటి కల్మా చదివే ముస్లింలు, నమాజ్ చేసే వారు, “అయ్యా, ఈ వలీలను మేము పూజిస్తుంటే మీరు తప్పు అని ఎందుకు అంటున్నారు? ఆనాటి కాలంలో రాళ్లను, రప్పలను, చెట్లను పూజించేవారు, వాటిని ఖండించడం జరిగింది. పుణ్యాత్ములను, పుణ్య పురుషులను వద్దకు వెళ్లి, వారి సమాధుల వద్దకు వెళ్లి ఈ కొన్ని పనులు చేసినందుకు రద్దు చేయబడలేదు” అని అంటారు. ఈ ఆయత్‌ను వారికి దలీల్‌గా చూపండి. మీరు అల్లాహ్‌ను వదలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరితో దుఆ చేస్తున్నారో, ఎవరి సమాధి వద్ద ఆరాధనకు సంబంధించిన ఏదైనా ఒక పని చేస్తున్నారో, వారంతా మీ లాంటి దాసులే, ఇబాదున్ అమ్సాలుకుమ్, మీ లాంటి దాసులే. అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి.
فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ [ఫద్ఊహుమ్ ఫల్యస్తజీబూ లకుమ్ ఇన్ కున్తుమ్ సాదిఖీన్] (మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి, ఈ బహుదైవోపాసనలో మీరు గనక సత్యవంతులే అయితే, వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానం ఇవ్వాలి.)
ఏమిటి, వారు నడవగలగటానికి వారికేమయినా కాళ్లున్నాయా? వారు దేనినయినా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్లున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచుకోండి. మరి మీరంతా కలసి నాకు కీడు కలిగించే వ్యూహాన్నీ రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి.”
ఇదే సూరత్‌లో మరొక ఆయత్, ముందు కొంచెం ఆయత్ నెంబర్ 198 లో కూడా ఈ మాట చాలా స్పష్టంగా వచ్చింది:
وَإِن تَدْعُوهُمْ إِلَى الْهُدَىٰ لَا يَسْمَعُوا (ఒకవేళ మీరు వారికి ఏదైనా చెప్పటానికి పిలిచినా, వారు మీ మాటను వినలేరు) లా యస్మవూ, వినలేరు
షిర్క్‌ను ఖండించడానికి అల్లాహు తఆలా ఈ విధంగా ఇంత స్పష్టంగా తెలియజేశాడు. ఈ భావంలో ఆయతులు సూరత్ మర్యమ్ 41-42 లో కూడా ఉన్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రి అయిన ఆజర్‌ను షిర్క్ నుండి ఆపుతూ ఏమన్నారు?
يَا أَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ (ఓ నా తండ్రీ, ఏమి వినలేని మరియు ఏమి చూడలేని వాటిని మీరు ఎందుకు పూజిస్తున్నారు?)
సోదర మహాశయులారా, చివరి మాట ఇక ఈ రోజు ఈ ప్రసంగంలో అదేమిటంటే, అల్లాహ్ వినేవాడు, ఎంత గొప్పగా, విశాలంగా, ఎంత సున్నితంగా. మన తెలుగులో ఒక సామెత ఉంది గుర్తుందా మీకు? ఎంత నిశ్శబ్దం అంటే సూది పడినా వినగలిగే అంతటి నిశ్శబ్దం ఏర్పడింది అని అంటారు. సూది పడితే మనకు వినబడుతుందా? కానీ అల్లాహ్ వింటాడు. అల్లాహ్ వింటాడు అన్నటువంటి విశ్వాసం ఇలాంటి సామెతల ద్వారా మరింత అల్లాహ్‌పై మన విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరిగిందంటే, మన ఆచరణలో, మన జీవితంలో ప్రభావం చూపాలి. ఎలాంటి ప్రభావం? అల్లాహ్ వింటాడు అయితే మనం మాట్లాడే ప్రతీ మాట అల్లాహ్‌కు ఇష్టమైనదే ఉండాలి. మనం మాట్లాడే మాట ద్వారా ఎవరికీ బాధ కలిగించకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? అఫ్దలుల్ ముస్లిమీన (ముస్లింలలో అత్యుత్తముడు ఎవడయ్యా అంటే), ఏ ముస్లిం ద్వారానైతే ఇతరులందరికీ అతని నాలుక ద్వారా గానీ, చేతుల, కాళ్ల ద్వారా గానీ ఏ హాని కలగకుండా ఉంటుందో, నష్టం కలగకుండా ఉంటుందో.
మరియు మనం అల్లాహ్ యొక్క ఈ పేరును మంచి రీతిలో అర్థం చేసుకున్నామంటే, మనం అల్లాహ్‌తో ఏ దుఆ చేసినా గానీ, అల్లాహ్ యొక్క ఈ పేరు మాధ్యమంతో, వసీలాతో దుఆ చేయాలి. ఎలాగైతే ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే యూసుఫ్ అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే జకరియా అలైహిస్సలాం దుఆ చేశారు, ఎలాగైతే ఇమ్రఅతు ఇమ్రాన్ (మర్యమ్ అలైహస్సలాం యొక్క తల్లి) దుఆ చేశారు.
إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ [ఇన్న రబ్బీ లసమీఉద్ దుఆ] (నిశ్చయంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు) అని ఇంతకుముందే మనం విన్నాము.
رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ [రబ్బనా తఖబ్బల్ మిన్నా, ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్] (ఓ అల్లాహ్, నీవు స్వీకరించు మా నుండి. నిశ్చయంగా నీవు వినేవాడివి, అన్నీ తెలిసిన వానివి.)
సూరత్ ఆల్ ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 35 లో కూడా ఈ భావం ఉంది.
చివరి మాట, మరీ చివరి, ఎక్దం చివరి, ఇంత అల్లాహ్ యొక్క పేరుతో మనం దుఆ చేశామంటే, తప్పకుండా అల్లాహ్ స్వీకరిస్తాడన్నటువంటి నమ్మకం కూడా మళ్ళీ కలిగి ఉండాలి. అల్లాహ్ చాలా వినేవాడు అని నేను ఎంతో వసీలతో దుఆ చేశానండి, ఇంకా ఖుబూలే కావట్లేదు నా దుఆ, అని అల్లాహ్ పట్ల నిరాశ, అల్లాహ్ పట్ల తప్పుడు ఆలోచన కలగకూడదు. మనం దుఆ చేసే విషయంలో ఏదైనా లోపం ఉండవచ్చు అని ఇంకా దుఆ చేయాలి. అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు అన్నటువంటి నమ్మకం కూడా కలిగి ఉండాలి. దీని గురించి చదవండి సూరత్ యూసుఫ్ ఆయత్ నెంబర్ 34.
అల్లాహు తఆలా ఈ యొక్క పేరు ‘సమీ’ గురించి ఏదైతే మనం తెలుసుకున్నామో, దీని ప్రకారంగా మన జీవితంలో మార్పు తెచ్చుకునేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఇంతటితో ఈనాటి ప్రసంగం ముగుస్తుంది. కొంచెం ఆలస్యం అయినందుకు క్షమించండి. వాస్తవానికి అల్లాహ్ యొక్క పేర్ల విషయం చెబుతున్నాము, ఎన్ని చెప్పినా మాటలు పూర్తి కావు. అల్లాహ్ యొక్క గొప్పతనం అంత విశాలమైనది, గొప్పది. కానీ మీతో క్షమాపణ కోరుతున్నాను ఆలస్యం అయినందుకు.
అల్లాహ్ తఆలా మీ అందరికీ కూడా ఇహపరలోకాల్లో అన్ని రకాల మేళ్లు ప్రసాదించుగాక. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
(1) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాల గురించి ఖురాన్ మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం.
(2) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి అనేక మంది సహాబాల సాక్ష్యం.
(3) అత్యుత్తమ గుణగణాల నమూనాలు.
ఇస్లామీయ సహోదరులారా! నేటి జుమా ఖుత్బా యొక్క అంశం – “దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలు”.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల్ని చర్చించే ముందు మనమందరం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అల్లాహ్ యొక్క ప్రవక్త అవడంతో పాటు దైవప్రవక్త లందరికీ నాయకులు (ఇమామ్). ప్రవక్త పాలనా పోషణలు స్వయంగా అల్లాహ్ చూస్తాడు. ఇలా అతణ్ణి, నిత్యం పరిశుద్ధం చేస్తూ గుణగణాల్లో, నైతికతలో అందరికన్నా ఉత్తముడిగా, ఆదర్శవంతునిగా తీర్చిదిద్దుతాడు. ప్రవక్త సంరక్షకుడు స్వయానా అల్లాహ్ కనుక దివ్య ఖురాన్లో రెండు విషయాలపై ఒట్టేసి మరీ ఆయన ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గుణగణాలను గూర్చి సాక్ష్యమిచ్చాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“నూన్- కలము సాక్షిగా! వారు (దైవదూతలు) వ్రాసే సాక్షిగా! (ఓ ముహమ్మద్)! నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కాదు. నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో వున్నావు”. (ఖలమ్ : 1-4)
ప్రవక్త ఎల్లప్పుడూ దైవ వాణి (వహీ)ని అనుసరిస్తాడు. కనుక ఆ దైవవాణే వాస్తవానికి అతని నైతికత, గుణగణాలు అయివుంటాయి. అందుకే ఓ సారి ఆయెషా (రజి అల్లాహు అన్హతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల గురించి అడగ్గా ఆమె జవాబిస్తూ – ఆయన గుణగణాలు స్వయానా దివ్య ఖురానే అని అన్నారు. (ముస్నద్ అహ్మద్ – సహీఉల్ అర్నావూత్)
అంటే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) దివ్య ఖురానుకు ఆచరణా ప్రతిబింబము అన్నమాట.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాల సాక్ష్యం కేవలం ఖురానులోనే కాదు, మునపటి ఆకాశ గ్రంథాలలో కూడా లభ్యమై వుంది.
అతా బిన్ యసార్ (రహిమహుల్లాహ్) కథనం: “నేనొక సారి అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రదియల్లాహు అన్హు) ను కలిసి ఆయనతో – తౌరాత్ లో వివరించబడ్డ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గుణగణాలను గూర్చి వివరించండి- అని అడిగాను. ఆయన జవాబిస్తూ – సరే, అల్లాహ్ సాక్షి! దివ్య ఖురానులో వివరించబడ్డ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొన్ని గుణగణాలే తౌరాత్ లోనూ వివరించబడ్డాయి.
దివ్య ఖురాన్లో ఇలా వుంది: ‘ఓ ప్రవక్తా! మేము నిన్ను సాక్షిగా, శుభవార్తాహరుడిగా, భయపెట్టేవాడిగా చేసి పంపాము.’ తౌరాత్ లో కూడా ఈ గుణగణాలు వివరించబడ్డాయి. వీటితో పాటు తౌరాత్ లో ఇంకా ఆయన అరబ్బుల కోసం కోటగా వుంటారని, ఆయన నా(అల్లాహ్) దాసులు మరియు ప్రవక్త అని, ఆయన పేరు ‘ముతవక్కల్’ (అల్లాహ్ పై నమ్మకం వుంచేవాడు) అని నేను పెట్టాను – అని వుంది. ఇంకా ఆయన గుణగణాల్లో ఇవి కూడా వివరించబడ్డాయి – ఆయన దుర్గుణులు, కఠినులు కారు మరియు బజార్లలో గొంతెత్తి సంభాషించరు. చెడును చెడుతో సమాధానం ఇవ్వకుండా, దానిని ఉపేక్షించి క్షమిస్తారు అని వివరించారు. (బుఖారీ : 4838)
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యుత్తమ గుణగణాలను గూర్చి దివ్య ఖురాను మరియు తౌరాత్ గ్రంథాల సాక్ష్యం తర్వాత మరి కొందరి సాక్ష్యం కూడా వినండి!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు:
1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం.
2) తగిన విధంగా గౌరవించడం,
3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం.
4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం.
5) విధేయత చూపడం.
6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం.
7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం,
8) అత్యధికంగా దరూద్ పఠించడం.
గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ శుభ నామములు: అర్ – రజ్జాఖ్, అర్ – రాజిఖ్ యొక్క వివరణ [వీడియో] https://youtu.be/QDdFQMgriM8 [33 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క నామములైన అర్-రజ్జాక్ (గొప్ప ఉపాధి ప్రదాత) మరియు అర్-రాజిక్ (ఉపాధినిచ్చేవాడు) గురించి వివరిస్తారు. ఈ నామాలకు రెండు ప్రధాన భావాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు: మొదటిది, సామాన్య ఉపాధి (రిజ్క్ ఆమ్), ఇది అల్లాహ్ విశ్వాసులు, అవిశ్వాసులు అనే తేడా లేకుండా సకల జీవులకు ఇచ్చే భౌతిక అవసరాలు. రెండవది, ప్రత్యేకమైన ఉపాధి (రిజ్క్ ఖాస్), ఇది హృదయానికి సంబంధించినది, అనగా విశ్వాసం, ధర్మ జ్ఞానం, మరియు మార్గదర్శకత్వం, ఇది ఇహపరలోకాల సాఫల్యానికి దారితీస్తుంది. ఉపాధి ప్రదాత ఏకైక అల్లాహ్ మాత్రమేనని గుర్తించి, ఆయనకే ఆరాధనలు జరపాలని, ఆయన ఇచ్చిన దానిలో నుండి ఖర్చు చేయాలని, మరియు పేదరికం భయంతో సంతానాన్ని నిరోధించడం వంటి ఘోరమైన పాపాలకు దూరంగా ఉండాలని ఖురాన్ ఆయతుల ఆధారంగా వక్త ఉద్బోధించారు.
పరిచయం
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు వర్షించుగాక.
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్. సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన సహచరులపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆ తర్వాత…
అల్లాహ్ యొక్క శుభ నామముల గురించి మనం, మనకు ఇవ్వబడిన సమయంలో ఎంతో కొంత వివరణ తెలుసుకోవడం, మన విశ్వాసపరంగా, మన యొక్క క్యారెక్టర్ పరంగా, మన యొక్క సామాజిక పరంగా, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో లాభం చేకూరుస్తుందని ఆశిస్తున్నాను.
అల్లాహ్ నామముల ఘనత
వాస్తవానికి మనం ఖురాన్ గ్రంథాన్ని శ్రద్ధగా అర్థం చేసుకున్నామంటే ఒక విషయం మనకు బోధపడుతుంది. అదేమిటి?
قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا కుల్ లవ్ కానల్ బహ్రు మిదాదల్ లి కలిమాతి రబ్బీ లనఫిదల్ బహ్రు కబ్ల అన్ తన్ఫద కలిమాతు రబ్బీ వలవ్ జిఇనా బి మిస్లిహీ మదదా. (ఓ ప్రవక్తా!) ఇలా అను: ‘నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రమంతా సిరాగా మారినా, నా ప్రభువు మాటలు పూర్తికాకముందే ఆ సముద్రం ఇంకిపోతుంది. సహాయంగా మేము మరొక అంతటి సముద్రాన్ని తెచ్చినాసరే.’
అల్లాహ్ యొక్క పవిత్ర వచనాల గురించి, అల్లాహ్ యొక్క శుభ నామముల గురించి, ఆయన యొక్క ఉత్తమ గుణాల గురించి మనం ఎంత చెప్పుకుంటూ పోయినా, ఎంత రాసినా, సిరాలన్నీ కూడా సమసిపోతాయి, సముద్రాలన్నీ కూడా ఎండిపోతాయి. అల్లాహ్ యొక్క పవిత్ర నామములు, వాటి యొక్క వివరణలు అంతం కావు.
మీకు గుర్తుందా ఇంతకుముందు నేను అర్-రహ్మాన్, అర్-రహీం ఈ రెండు పేర్ల యొక్క వివరణ చెప్పాను. దాని గురించి చదువుతున్న సందర్భంలో, రియాదున్ నయీమ్ ఫీ జిల్లిర్ రహ్మానిర్ రహీం అన్న ఒక పుస్తకం గురించి తెలిసింది. దాని యొక్క పి.డి.ఎఫ్ కూడా పొందాను. రెండు వాల్యూంలలో ఉంది. మొత్తం టోటల్ సుమారు 800 పేజీల వరకు, కేవలం అల్లాహ్ యొక్క రహ్మాన్, రహీం ఈ రెండు పేర్ల యొక్క వివరాలు అందులో ఉన్నాయి. గమనించండి.
గమనించండి, మనం అల్లాహ్ యొక్క పేర్ల గురించి ఎంత చెప్పుకున్నా గానీ, ఎంత వివరణతో కూడిన మాటలు తెలుసుకున్నా గానీ, తెలుసుకున్న కొన్ని విషయాలను మంచిగా అర్థం చేసుకొని, వాటి ప్రకారంగా మన విశ్వాసాన్ని సరిదిద్దుకోవడం మరియు మన యొక్క ఆచరణలో ఒక మంచి మార్పు తీసుకొని రావడం ఇది చాలా అవసరం. లేదంటే ఈ రోజుల్లో సమాచారం, ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. కానీ కావలసిన అసలైన జ్ఞానం అదే కొరత. మరి జ్ఞానం అంటారు దేన్ని? తెలుసుకున్న విషయం ప్రకారంగా, తెలుసుకున్న నేర్చుకున్న జ్ఞానం ప్రకారంగా విశ్వాసం మరియు ఆచరణ ఉండడం.
అర్-రజ్జాక్, అర్-రాజిక్ – రెండు భావాలు
ఈ రోజు, అల్లాహ్ యొక్క శుభ నామములలోని అర్-రజ్జాక్ మరియు అర్-రాజిక్. ఈ రెండు పేర్ల గురించి ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుంటున్నాం. సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఈ రెండు పేర్ల ప్రస్తావన ఖురాన్లో ఎన్నో సందర్భాలలో వచ్చి ఉంది. అయితే, సంక్షిప్తంగా నేను దీని యొక్క భావంలో ఉన్న రెండు ముఖ్య విషయాలను తెలియజేస్తున్నాను, ఇది ముందు అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత, దీనికి సంబంధించిన ఆధారాలు మరియు ఈ రెండు పేర్ల యొక్క ప్రభావం మన జీవితంలో ఎలా ఉండాలి, ఆ విషయాలు ఇన్షా అల్లాహ్ తర్వాత తెలుసుకుందాం.
మొదటి భావం: సామాన్య ఉపాధి (రిజ్క్ ఆమ్)
మొదటి భావం, అల్లాహ్ యొక్క పేరు రాజిక్ మరియు అర్-రజ్జాక్. ఉపాధి అని సర్వసామాన్యంగా మనం తెలుగులో అనువదిస్తాము. ఉపాధి ప్రధాత. ఉపాధిని ఇచ్చేవాడు. లేదా రాజిక్, పోషించేవాడు అన్నటువంటి భావంలో కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ నేను ఎంతవరకైతే చదివానో, ఈ రెండు పేర్ల గురించి, దానిని ఉపాధి లేదా పోషణ అన్నటువంటి భావం చాలా లిమిటెడ్ గా ఉంది. రిజ్క్, అల్లాహ్ యొక్క పేరు రజ్జాక్ అన్నటువంటి ఈ పేరులో ఎంత విశాలమైన భావం ఉందో దానికి సమానమైన తగ్గట్టు తెలుగు పదం మన వద్ద లేదు. ఎందుకు? వినండి వివరం, మీకే తెలుస్తుంది.
రిజ్క్, రజ్జాక్ యొక్క ఒక భావం, అల్లాహు తఆలా విశ్వాసులకు గానీ అవిశ్వాసులకు గానీ, పుణ్యాత్ములకు గానీ పాపాత్ములకు గానీ, మునుపటి వారికి, వెనుకటి వారికి, అల్లాహు తఆలా ఈ సృష్టిని సృష్టించినప్పటి నుండి మొదలుకొని, ఇది అంతం అయ్యేవరకు ఆ తర్వాత కూడా అందరికీ వారికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ ప్రసాదించేవాడు. కేవలం ఒక వారి తిండి త్రావుడుకు సంబంధించిన, వారు బ్రతకాలంటే ఏ ఆహారం అవసరమో అంత మాత్రమే కాదు. ప్రతిదీ వారి జీవితంలో వారికి అవసరమున్నది ప్రతిదీ ప్రసాదించేవాడు.
ఈ భావంలో గనక మనం చూస్తే ఖురాన్లో అనేక సందర్భాలలో ఆయతులు ఉన్నాయి. మరియు ఎవరైతే ఈ ఉపాధి అన్నటువంటి భావంలో తీసుకొని, దీనినే చాలా ముఖ్యమైనదిగా భావిస్తారో, జీవితం గడపడానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయో అవి లభిస్తే ఇక మాకు స్వర్గం లభించినట్లు అని భావిస్తారో, అలాంటి వారికి హెచ్చరికలు కూడా ఉన్నాయి. అల్లాహ్ అందరికీ ఇది ప్రసాదిస్తాడు. కానీ అల్లాహ్ తన ఇష్ట ప్రకారంగా ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే.
ఒకసారి మీరు సూరత్ సబా, ఆయత్ నంబర్ 35 నుండి 37 వరకు గనక చూశారంటే, సంతానం, డబ్బు, ధనం ఇలాంటి విషయాలన్నీ కూడా పొంది ఎవరైతే గర్వపడతారో, మాకు అన్ని అనుగ్రహాలు లభించాయి అన్నటువంటి ఒక మోసంలో ఉంటారో వారికి అల్లాహు తఆలా ఎలా హెచ్చరిస్తున్నాడో ఒక్కసారి మీరు సూర సబా, సూరా నంబర్ 34, ఆయత్ నంబర్ 35 నుండి 38 వరకు అనువాదం చూడండి మరియు దీనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడే నేను మీకు చూపిస్తున్నాను మరియు దీనిని చదువుదాము కూడా.
అవిశ్వాసులు అంటున్నారు, మేము శ్రీ సంపదలలో, సంతాన భాగ్యంలో ఎంతో అధికులము. మేము శిక్షించబడటం అనేది జరగని పని అని వారు అన్నారు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. చూశారా? ఈ రోజుల్లో, మా గ్యాంగ్ చాలా పెద్దది, నా ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, నా వెంట ఫలానా ఫలానా పెద్ద హోదా అంతస్తులు గలవారు ఉన్నారు, నా వద్ద ఇంత డబ్బు, ధనం ఉంది, మాకు ఇక ఎవరి భయము లేదు. ఇట్లాంటి ఎన్నో పదాలు మాటలు మనం వింటూ ఉంటాము.
ఇహలోక పరంగా వారికి లభించిన కొంత సమృద్ధి, దానిని పొంది ఎలా గర్విస్తున్నారో, ఆ తర్వాత వెంటనే అల్లాహ్ వారికి ఎలాంటి ఉపదేశం చేస్తున్నాడో గమనించండి. ఓ ప్రవక్త వారికి చెప్పు: నా ప్రభువు తాను కోరిన వారి ఉపాధిని విస్తృతం చేస్తాడు, తాను కోరిన వారికి కుంచింపజేస్తాడు. కానీ చాలామంది ఈ యధార్థాన్ని గ్రహించరు. ఆ తర్వాత 37 లో, మీ సిరి సంపదలు గానీ, మీ సంతానం గానీ మా సన్నిధిలో అంతస్తుల రీత్యా మిమ్మల్ని ఏమాత్రం దగ్గరకు చేర్చలేవు. అయితే, ఎవరైనా విశ్వసించి సదాచరణ చేస్తే అటువంటి వారికి వారి ఆచరణకు బదులుగా రెండింతల प्रतिఫలం ఉంటుంది, వారు ఎత్తైన మేడలలో సురక్షితంగా ఉంటారు.
గమనించారా సోదర మహాశయులారా? అల్లాహు తఆలా ఎవరికి ఎలాంటి ఉపాధిని, ఇహలోకపు వారి జీవితంలో అవసరం ఉన్నటువంటి అవసరాలు ఇస్తాడో, వాస్తవానికి ఉన్నవాడు కూడా పరీక్షలో ఉన్నాడు, లేని వాడు కూడా పరీక్షలో ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు. ఇలాంటి భావంలో ఇంకా అనేక ఆయతులు ఉన్నాయి. సూరత్ అల్ ముఅమినూన్ ఆయత్ నంబర్ 55, 56. అలాగే సూరతుల్ ఇస్రా, ఆయత్ నంబర్ 20, 21.
రెండవ భావం: ప్రత్యేకమైన ఉపాధి (రిజ్క్ ఖాస్)
కానీ ఇక రండి, అర్-రజ్జాక్, అర్-రాజిక్ లోని రెండో భావం. ఇది అందరితో పాటు, అందరికీ లభించే విధంగా సామాన్య రిజ్క్ తో పాటు, ప్రత్యేకమైన రిజ్క్. ముందు దానిని రిజ్క్ ఆమ్ అని అంటారు, రెండవ దానిని రిజ్క్ ఖాస్ అని అంటారు. రిజ్క్ అంటే అర్థం అయ్యింది కదా ఇప్పుడు మీకు, అర్థం అవుతుంది కదా. రజ్జాక్ ఈ రిజ్క్ నుండే వచ్చింది.
రిజ్క్ ఖాస్ ప్రత్యేకమైన ఆ ఉపాధి అనండి. ఎందుకంటే ఈ పదం చాలా ప్రబలి ఉంది, అందరికీ పరిచయం అందుకొరకు దీన్ని మనం ఉపయోగిస్తున్నాము, అల్హందులిల్లాహ్. ఆ ప్రత్యేకమైన రిజ్క్ ఏంటి? హృదయాలకు సంబంధించినది. అది ధర్మ జ్ఞానం రూపంలో, సత్యమైన, బలమైన, దృఢమైన విశ్వాస రూపంలో, దేని ద్వారానైతే ఇహలోకంలో అల్లాహ్ ను గుర్తించి, ప్రవక్త విధానంపై జీవితం గడపగలుగుతామో, దేని ద్వారానైతే పరలోకంలో నరకం నుండి రక్షణ, మోక్షం పొంది స్వర్గంలో ప్రవేశించగలుగుతామో, అలాంటి రిజ్క్.
అలాంటి రిజ్క్. ఇది అసలైన రిజ్క్. ఇది చాలా ఉత్తమమైన రిజ్క్. ఎవరైతే ఈ రిజ్క్ ను పొందుతారో, వాస్తవానికి అలాంటి వారే ఇహ పరలోకాల మేళ్లను పొందేవాళ్ళు. ఈ రిజ్క్ ను ఎవరైతే తప్పిపోయారో, ఇది ఎవరికైతే మిస్ అయిపోయిందో, ఇక వారికి వేరే ఏ ఉపాధి లభించినా, ఏ ధనం సంతానం లభించినా వాస్తవానికి అది వారి నష్టాలను, కష్టాలను, శిక్షలను పెంచుతుంది కానీ నరకం నుండి మోక్షాన్ని కలుగజేయదు.
సూరతు అత్-తలాఖ్. సూరా నంబర్ 65, ఆయత్ నంబర్ 11 లోని రెండవ సగ భాగం గమనించండి, ఇక్కడి నుండి,
وَمَن يُؤْمِن بِاللَّهِ وَيَعْمَلْ صَالِحًا వమన్ యుఅమిన్ బిల్లాహి వయఅమల్ సాలిహా మరి ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచరణ చేస్తారో,
يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا أَبَدًا ۖ యుద్ఖిల్ హు జన్నతిన్ తజ్రీ మిన్ తహతిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా అబదా వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు, వాటిలో వారు కలకాలం ఉంటారు.
قَدْ أَحْسَنَ اللَّهُ لَهُ رِزْقًا ఖద్ అహ్సనల్లాహు లహు రిజ్కా నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమమైన ఉపాధిని ఒసగాడు.
ఇది ప్రత్యేకమైన ఉపాధి. ఇది ప్రత్యేకమైన రిజ్క్. అల్లాహ్ మనల్ని ఇలాంటి ప్రత్యేకమైన రిజ్క్ ఉపాధిని పొందిన వారిలో చేర్చాలని మనం అల్లాహ్ యొక్క అర్-రజ్జాక్, అర్-రాజిక్ పేర్ల యొక్క వసీలాతో దుఆ చేయాలి.
ముఖ్యమైన పాఠాలు
ఇక, అల్లాహ్ యొక్క పేర్ల గురించి ఈ ముఖ్యమైన కొన్ని విషయాలు విన్న తర్వాత, మరికొన్ని ఈ పేర్ల గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవలసిన అవసరం చాలా చాలా ఉంది. మొట్టమొదటి విషయం ఇందులో, ఈ లోకంలో అల్లాహు తఆలా అనేకమంది ప్రవక్తలను పంపి, అల్లాహ్ ను ప్రజలు ఏదైతే మరిచిపోయి ఇతరులను ఆరాధిస్తున్నారో, వారిని అల్లాహ్ వైపునకు పిలవడానికి, ఏ ఏ అల్లాహ్ యొక్క అనుగ్రహాల ఉపమానాలు వారికి చూపించి అల్లాహ్ యొక్క అనుగ్రహాల నిదర్శనాలు వారికి చూపించి వారిని అల్లాహ్ వైపునకు ఆహ్వానించారో వాటిలో ఒకటి ఏమిటి? అల్లాహ్ మీకు ఏ రిజ్క్ అయితే ప్రసాదిస్తున్నాడో అది కేవలం అల్లాహ్ వైపు నుండే లభిస్తుంది గనక మీరు ఆ అల్లాహ్ ను వదలి ఇంకా వేరే ఎవరినీ కూడా ఆరాధించకూడదు.
సోదర మహాశయులారా, నా మాట అర్థం అవుతుంది కదా మీకు? ఎందుకంటే ఇక్కడ ఈ విషయాన్ని ఆలోచించడం చాలా అవసరం, చాలా అవసరం. ఎవరైనా ఒక మినిస్టర్, ఎవరైనా ఒక లీడర్, ఎవరైనా ఒక ధనికుడు మనకు ఏదైనా మనకు అవసరమైన వస్తువు ఇచ్చాడు, అతనికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తాము మనం? అతనికి మనం ఎంత రుణపడి ఉంటాము? ఒక్కసారి, రెండుసార్లు ఎవరైనా మనుషుల్లో మనకు ఏదైనా సహాయం చేస్తే, ఇలా ఉండే మనం, రిజ్క్ ఆమ్, రిజ్క్ ఖాస్, సామాన్య ఉపాధి, ప్రత్యేకమైన ఉపాధి, బాహ్యమైన కళ్లకు కనబడే ఉపాధి రిజ్క్, కళ్లకు కనబడని ఉపాధి అంతా కూడా ప్రసాదించేవాడు ఏకైక అల్లాహ్ మాత్రమే ఉన్నాడు. ఆయన తప్ప వేరే ఎవరూ లేరు అన్న విషయం మనం ఎప్పుడు గ్రహిద్దాము? ఒకవేళ ఈ విషయాన్ని మనం గ్రహించకుంటే అల్లాహ్ యొక్క ఆరాధన సరియైన రీతిలో మనం చేయలేము.
చదవండి ఒకసారి మీరు, సూరత్ యూనుస్. సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 31. ఒకవేళ మీ వద్ద ఖురాన్ కూడా ఉంది కదా ఇప్పటివరకు, గురువుగారితో ఉండి ఖురాన్ చూస్తూ ఉన్నారు మీరు. అందుకొరకే నేను ఆయత్ నంబర్లు చాలా స్పష్టంగా చెబుతున్నాను. సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 31 గనక మీరు శ్రద్ధ వహించారంటే, అల్లాహు తఆలా ఇలా గుర్తు చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఇదిగోండి, మీరు నా తో పాటు మొబైల్ లో కూడా ల్యాండ్స్కేప్ లో పెట్టి శ్రద్ధగా చూడండి.
ఆనాటి కాలంలోని బహుదైవారాధకులు, ముష్రికులు కూడా అల్లాహ్యే రోజీ, రిజ్క్ ప్రసాదించేవాడు, ఉపాధిని ఇచ్చేవాడు అని నమ్మేవారు. ఆకాశం నుండి, భూమి నుండి మీకు ఉపాధిని సమకూర్చేవాడు ఎవడు? చెవులపై, కళ్ళపై పూర్తి అధికారం కలవాడు ఎవడు? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలికితీసేవాడు ఎవడు? సమస్త కార్యాల నిర్వాహకర్త ఎవరు? అని ఓ ప్రవక్త వారిని అడుగు. అల్లాహ్ యే అని వారు తప్పకుండా చెబుతారు. మరలాంటప్పుడు మీరు అల్లాహ్ యొక్క శిక్షకు ఎందుకు భయపడరు? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత స్పష్టంగా ఉంది చూడండి.
మనకు అన్ని రకాల రిజ్క్ ప్రసాదించేవారు అల్లాహ్ మాత్రమే అని ఆనాటి కాలంలో ఉన్న బహుదైవారాధకులు కూడా నమ్మేవారు. కానీ ఎంత విచిత్రం, బాధాకరమైన విషయం ఈ రోజుల్లో, ఈ రోజుల్లో ముస్లిమేతరుల సంగతి ఏమిటి? ఎందరో ముస్లింలు, ఎన్నో రకాల రిజ్క్ గురించి, అల్లాహ్ యొక్క మస్జిదులకు వచ్చి, అల్లాహ్ ను ఎలాంటి భాగస్వామి లేకుండా ఆరాధించడం మానేసి, లేకుంటే కొందరు ఇలా చేస్తూ ఎన్నో రకాల రిజ్క్ ల గురించి వేరే ఎన్నో దర్గాల వద్దకు, బాబాల వద్దకు, ఎందరో పుణ్యాత్ములను లేక చనిపోయిన వారిని ఆశించి అక్కడికి వెళ్లి వారితో మొరపెట్టుకుంటారు. ఎంత ఘోరమైన పాపం ఇది గమనించండి.
మనకు అసలైన రిజ్క్ ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. అందుకొరకే అల్లాహు తఆలా ఈ అనుగ్రహాన్ని గుర్తించి షిర్క్ ను ఖండిస్తున్నాడు. అంతే కాదు, అల్లాహ్ మనకు ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేయాలి అని కూడా మనకు ఆదేశిస్తున్నాడు. ఇక ఈ విషయం సర్వసామాన్యంగా మనందరికీ తెలిసినదే, దీని గురించి ఎక్కువగా వివరం చెప్పను. వేరే సందర్భాలలో ధర్మవేత్తల ప్రసంగాలు కూడా మీరు వింటారు, ఇన్ఫాక్ ఫీ సబీలిల్లాహ్.
అలాగే, మనకు ఉన్నదానిలోనే తృప్తిపడి, దాని గురించి ఎక్కువగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించాలి అని కూడా అల్లాహ్ మనకు మాటిమాటికి ఆదేశిస్తూ ఉంటాడు. సూరతుల్ బఖరా ఆయత్ నంబర్ 172 చూస్తే,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ యా అయ్యుహల్లజీన ఆమనూ కులూ మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్ ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను తినండి.
وَاشْكُرُوا لِلَّهِ వష్కురూ లిల్లాహ్ మరియు అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలపండి.
إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ఇన్ కున్తుమ్ ఇయ్యాహు తఅబుదూన్ ఒకవేళ మీరు ఆయన్నే ఆరాధిస్తున్నవారైతే.
ఇక చాలా ముఖ్యమైన విషయం. అందరూ శ్రద్ధగా వింటున్నారో కదా? చాలా ముఖ్యమైన విషయం. రిజ్క్ ప్రసాదించేవాడు ఎవడు? కేవలం అల్లాహ్. ఆనాటి కాలంలోని ముస్లింలు కూడా నమ్మేవారు అని మనం ఇప్పుడే తెలుసుకున్నాము.
وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ వల్లాహు ఖైరుర్ రాజికీన్ మరియు అల్లాహ్ ఉత్తమ ఉపాధి ప్రదాత.
وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ వల్లాహు యర్జుకు మన్ యషాఉ బిగైరి హిసాబ్ మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంతగా ప్రసాదిస్తాడు.
ఎన్నో ఆయతులు ఉన్నాయి.
ముఖ్యమైన విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్పబోతున్నది? మనకు ఎక్కువ సంతానం అయితే ఎలా వారికి మనం తినిపిస్తాము? ఎలా వారికి త్రాపిస్తాము? ఎలా వారి ఖర్చులను చూడగలుగుతాము? మన ఉపాధి చాలా తక్కువగా ఉంది, నా యొక్క జీతం చాలా తక్కువగా ఉంది, మన యొక్క రాబడి దుకాణంలో చాలా తక్కువగా ఉంది, మన వద్ద పంటలు అంత ఎక్కువగా లేవు, భూములు ఎక్కువగా లేవు, ఆస్తిపాస్తులు లేవు, సంతానం ఎక్కువ అయ్యేది ఉంటే ఎలా వారి పెళ్ళిళ్ళు చేసేది? ఎలా వారికి డిగ్రీలు చదివించేది? అన్నటువంటి ఆలోచనల్లో పడి ఎవరైతే సంతానం పుట్టకుండా ఆపరేషన్లు చేయించుకుంటున్నారో, కడుపులో గర్భం నిలిచిన తర్వాత బిడ్డ పుడుతుందేమో అన్నటువంటి వార్త వచ్చి అబార్షన్లు చేయిస్తున్నారో, లేదా పుట్టిన తర్వాత తీసుకువెళ్లి అలాగే సజీవంగా పాతిపెడుతున్నారో లేక కాల్చేస్తున్నారో లేదా చెత్తకుండీల వద్ద పారేస్తున్నారో, ఇలాంటి వారందరూ కూడా ఎంత ఘోరాతి ఘోరమైన, నీచాతి నీచమైన పాపానికి ఒడిగడుతున్నారో, అల్లాహు అక్బర్. అల్లాహు తఆలా సూరతుల్ ఇస్రా, బనీ ఇస్రాయిల్ లోని ఆయత్ నంబర్ 31 లో
وَلَا تَقْتُلُوا أَوْلَادَكُمْ خَشْيَةَ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُهُمْ وَإِيَّاكُمْ వలా తక్తులు అవ్లాదకుమ్ ఖష్యత ఇమ్లాఖిన్ నహ్ను నర్జుకుహుమ్ వ ఇయ్యాకుమ్. “పేదరికపు భయంతో మీ సంతానాన్ని చంపకండి. వారికి, మీకు కూడా మేమే ఉపాధిని ప్రసాదిస్తాము.”
సోదర మహాశయులారా, ఖురాన్లో రెండు సందర్భాల్లో, ఖురాన్లో రెండు సందర్భాల్లో ఈ ఆయత్ ప్రస్తావించబడింది. కానీ ఖురాన్ అల్లాహ్ యొక్క సత్య గ్రంథం అన్న విషయంలో, అల్లాహు అక్బర్. ఇప్పటికీ ఎంత గొప్ప నిదర్శనం ఉన్నదో దీనిని మీరు గమనించండి. ఒకచోట
نَحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ నహ్ను నర్జుకుకుమ్ వ ఇయ్యాహుమ్. “మేమే మీకు మరియు వారికి ఉపాధినిస్తాము.”
ఇది సూరతుల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 151 లో. అంటే ఏమిటి? మీరు మీ సంతానాన్ని పేదరికంతో ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్నటువంటి భయంతో చంపకండి. ఆ తర్వాత సూరతుల్ అన్ఆమ్ లో ఏముంది?
حْنُ نَرْزُقُكُمْ నహ్ను నర్జుకుకుమ్ “మేమే మీకు ఉపాధినిస్తాము.”
وَإِيَّاهُمْ వ ఇయ్యాహుమ్ “మరియు వారికి.”
ఎప్పుడైతే తల్లిదండ్రులు స్వయం తమ గురించి, అయ్యో నాకు ఇంతే స్తోమత ఉంది, నాకు ఇంతే ఉంది అని తమ గురించి ఆలోచించి భయపడ్డారో, అక్కడ అల్లాహు తఆలా కుమ్ [కుమ్], మీకు అని ముందు చెప్పాడు. మరియు అదే సూరతుల్ ఇస్రా, దాని యొక్క రెండో పేరు బనీ ఇస్రాయిల్, ఆయత్ నంబర్ 31 లో,
حْنُ نَرْزُقُكُمْ నహ్ను నర్జుకుహుమ్ “మేమే వారికి ఉపాధినిస్తాము.”
وَإِيَّاكُمْ వ ఇయ్యాకుమ్ “మరియు మీకు.”
సంతాన ప్రస్తావన, ఇంకా ఇహలోకంలో రాని సంతానం, వారి గురించి ముందు ప్రస్తావించాడు అల్లాహు తఆలా. తర్వాత మీకు అని చెప్పాడు. ఎందుకు? ఎక్కడైతే సంతానం ఎక్కువ అయితే మనకు తినిపించడం, త్రాపించడం, వారిని పోషించడం కష్టమవుతుంది అని భావించారో, అల్లాహు తఆలా వారి ప్రస్తావన ముందు చేశాడు.
ఇది గమనించండి. అల్లాహు తఆలా ఇంతటి గొప్ప ఉపాధి ప్రధాత అయితే ఇక మనం ఎందుకని భయపడవలసింది? అయితే గమనించాలి ఇక్కడ అదేమిటి? రిజ్క్ విషయంలో, మన కొరకు ఏ విషయాలు హరామ్, ఏ విషయాలు హలాల్ ఈ నిర్ణయం చేసే హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉన్నది. సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నంబర్ 32, అలాగే సూరత్ యూనుస్ ఆయత్ నంబర్ 59 లో అల్లాహ్ దీనిని స్పష్టం చేశాడు. ఈ మాట ఎందుకు తీసుకురావడం జరిగింది? ఈ రోజుల్లో కొందరు కొన్ని ఆహార విషయాల్లో, కొన్ని ఉపాధి విషయాల్లో, వారి జీవితంలో ఉపయోగపడే విషయాల్లో తమ ఇష్టానుసారం, తమ అందా కరుణ, మా ఇమాములు, మా బుజుర్గులు, మా యొక్క పీర్లు, మా యొక్క ముర్షదులు అని కొందరు కొన్ని రకాల అందా అనుకరణలో ఏదైతే పడి ఉన్నారో, గుడ్డి విశ్వాసంలో పడి ఉన్నారో, దాని కారణంగా అల్లాహ్ హరామ్ చేసిన విషయాలను కొందరు హలాల్ చేసుకోవడం, అల్లాహ్ హలాల్ చేసిన విషయాలను మరికొందరు హరామ్ చేసుకోవడం ఇలాంటి పాపాలకు పాల్పడుతున్నారు. అందుకొరకు ఈ విషయంలో కూడా అల్లాహ్ తో భయపడాలి.
ఇక, మనకు అల్లాహు తఆలా ఇహలోకపు ఉపాధితో పాటు పరలోక ఉపాధి వృద్ధిగా, సమృద్ధిగా ప్రసాదించాలి అని అంటే, మనం అల్లాహ్ హలాల్ చేసిన విషయాలను మాత్రమే అవలంబించాలి. వాటన్నిటిలో అతి గొప్ప విషయం విశ్వాసం. అల్లాహ్ పై, అల్లాహ్ ఎవరెవరిని విశ్వసించాలని చెప్పాడో, మరియు అల్లాహ్ యొక్క ఆరాధన సరియైన రీతిలో చేస్తూ ఉండాలి.
ఈ లోకంలో అవిశ్వాసులకు ఇంకా అల్లాహ్ ను తిరస్కరించే వారికి, నాస్తికులకు అల్లాహ్ ఆహారం ప్రసాదిస్తున్నాడు కానీ అది అసలైన ఆహారం కాదు. అది అసలైన ఉపాధి కాదు. ఎందుకంటే మన జీవిత ఉద్దేశం తినడానికి మనం పుట్టలేదు. ఈ తినడం, త్రాగడం, ఉపాధి ఇవన్నీ కూడా అసలైన ఉద్దేశానికి ఒక సబబు. అయితే సబబునే అసల్ టార్గెట్ గా మనం నిర్ణయించుకుంటే చాలా పొరపాటలో పడిపోతాము. అయితే విశ్వాసం ఇది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో కూడా ఒకవేళ మనం ఖురాన్లో గనక చూస్తే సూరతున్ నహ్ల్ లోనే చూడండి. ఇంకా వేరే సూరాలలో కూడా, ఈ బస్తీవాసులు గనక విశ్వాస మార్గాన్ని అవలంబిస్తే మేము వారికి సమృద్ధిగా ఉపాధి ప్రసాదించే వారిమి. అలా ప్రసాదించబడినప్పుడు అల్లాహ్ యొక్క హక్కులను గమనించడం, నెరవేర్చడం చాలా తప్పనిసరి విషయం.
ముగింపు
సోదర మహాశయులారా, మనం ఇహలోకపు మరియు పరలోకపు అతి ఉత్తమమైన, అల్లాహ్ కు ఇష్టమైన రిజ్క్ ను మనం అడిగినప్పుడు, అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్లు రాజిక్ మరియు రజ్జాక్ వసీలాతో అడగాలి. దీని ద్వారా మనకు బోధపడుతున్న మరొక విషయం, అల్లాహ్ రజ్జాక్ మనకు ఏదైనా ప్రసాదించాడు అంటే దానిలో మనం ఖర్చు పెట్టే బీదవాళ్ళకు, పేదవాళ్ళకు, అవసరం ఉన్నవారికి ఇచ్చేటువంటి ఆదేశం కూడా ఇచ్చాడు, ఆ విషయాన్ని గమనించాలి. మరియు ఇహలోకంలో ఉన్నటువంటి మన శరీరానికి సంబంధించిన ఉపాధి ఒకటి ఉంటే మన ఆత్మకు సంబంధించిన ఉపాధి మరొకటి ఉన్నది.
మన శరీరానికి సంబంధించిన ఉపాధి భూమి నుండి, వర్షం రూపంలో ఆకాశం నుండి, భూమి నుండి ఆహారం రూపంలో మనం పొందుతాము. కానీ ఆత్మకు అవసరమైన ఆహారం, ఉపాధి అల్లాహ్ వహీ రూపంలో, ఖురాన్ హదీస్ రూపంలో ఆకాశం నుండి ఏదైతే పంపాడో దాన్ని కూడా మనం తీసుకోవాలి. ఎక్కువ సంఖ్యలో తీసుకోవాలి. అప్పుడే దానిని తీసుకొని మనం ఆచరించినప్పుడే మనకు పరలోకంలో ఎన్నటికీ అంతం కాని ఆహారం లభిస్తుంది. ఉదాహరణకు సూరత్ సాద్, ఆయత్ నంబర్ 54 మీరు చూశారంటే,
إِنَّ هَٰذَا لَرِزْقُنَا مَا لَهُ مِن نَّفَادٍ ఇన్న హాదా లరిజ్కునా మా లహు మిన్ నఫాద్. “నిశ్చయంగా ఇది మా ఉపాధి, దీనికి అంతమంటూ లేదు.”
అల్లాహు అక్బర్. ఆయత్ నంబర్ 49 లో ఏముంది?
هَٰذَا ذِكْرٌ హాదా జిక్ర్ “ఇది ఒక హితబోధ.”
అయితే,
وَإِنَّ لِلْمُتَّقِينَ لَحُسْنَ مَآبٍ వ ఇన్న లిల్ ముత్తకీన లహుస్న మఆబ్ “నిశ్చయంగా దైవభీతిపరులకు అత్యుత్తమ గమ్యస్థానం ఉంది.”
ఆ తర్వాత, స్వర్గంలోని కొన్ని విషయాల గురించి అల్లాహు తఆలా ప్రస్తావించాడు. చివరలో ఏమంటున్నాడు?
إِنَّ هَٰذَا لَرِزْقُنَا ఇన్న హాదా లరిజ్కునా “నిశ్చయంగా ఇది మా ఉపాధి.”
అయితే స్వర్గంలో ఆ ఎల్లకాలం శాశ్వతంగా అంతం కాని ఆ రిజ్క్ మనకు ప్రసాదించబడటానికి తప్పకుండా మనం అల్లాహ్ యొక్క రాజిక్, రజ్జాక్ పేర్ల సహాయంతో దుఆ చేసుకుంటూ, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో మనం జీవితం గడపాలి. చివరిలో నేను రెండు ఆయతులు, వాటి యొక్క అర్థాలు తెలిపి నా యొక్క ఈ ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. మొదటి ఆయత్ సూరతుల్ హజ్, ఆయత్ నంబర్ 50.
وَرِزْقٌ كَرِيمٌ వ రిజ్కున్ కరీమ్ “…మరియు గౌరవప్రదమైన ఉపాధి ఉంది.”
అలాగే ఈ భావంలోనే అల్లాహు తఆలా సూరతుల్ అన్ఫాల్ ఆరంభంలో కూడా తెలిపాడు. సూరతుల్ అన్ఫాల్ ఆరంభంలో కూడా అల్లాహు తఆలా విశ్వాసం, నమాజ్ మరియు ఇంకా ఖురాన్ యొక్క తిలావత్, ఎందుకంటే ఇప్పుడు రమజాన్ కూడా వస్తుంది, ఎల్లవేళలో ఖురాన్ తిలావత్ చేయాలి, కానీ ప్రత్యేకంగా, ప్రత్యేకంగా మనం రమజాన్ లోనైతే ఇంకా ఎక్కువగా అధికంగా ఖురాన్ పారాయణం చేయాలి. అయితే సూరె అన్ఫాల్ యొక్క ఆయతులను గమనించండి. నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే, అల్లాహ్ ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి. అల్లాహ్ ఆయతులు వారి ముందు పఠించబడినప్పుడు అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి. వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు. వారు నమాజు నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు.
వీరి కొరకు వీరి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. మన్నింపు ఉంది, గౌరవప్రదమైన ఆహారం ఉంది. అల్లాహు అక్బర్.
అల్లాహు తఆలా ఇలాంటి గౌరవప్రదమైన ఆహారం, మన్నింపు, ఉన్నత స్థానాలు మనందరికీ ప్రసాదించుగాక. వాటిని పొందే విశ్వాస సత్కార్య మార్గాలను కూడా అవలంబించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్తలలో శ్రేష్టులయిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వంశంలో జన్మించారు. ఆయన అల్లాహ్ దాసులు మరియు అంతిమ దైవప్రవక్త. ప్రళయం వరకు రాబోయే మానవులందరి కోసం ఆయనను ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఆయన రాకతో దైవప్రవక్తల పరంపర సమాప్తమయ్యింది. ఆయన ఇతర ప్రవక్తలపై విశిష్టత మరియు ఆధిక్యతను పొందివున్నారు. ఇలాగే ఆయన ఉమ్మత్ స్థాయి కూడా ఇతర ఉమ్మత్ (అనుచర సమాజం)ల కన్నా ఎక్కువగా వుంది. ఆయన విధేయతను అల్లాహ్ తప్పనిసరి చేశాడు. ఆయనకు గల ప్రత్యేకతలు ఇతర ప్రవక్తలకు లేవు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రండి! మన ప్రియ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మహత్యం, ఆయన అద్భుతాలు మరియు
కొన్ని ప్రత్యేకతలను గూర్చి తెలుసుకొందాం.
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్థాయి మరియు ఆయన విశిష్టత
1) శ్రేష్ట వంశము
తన వంశము (కుటుంబం) రీత్యా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ఉన్నత స్థానం కలిగి వున్నారు.
ఈ విషయాన్నే వాయిలా బిన్ అసఖా (రదియల్లాహు అన్హు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు:
“నిస్సందేహంగా అల్లాహ్, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానంలో ‘కనాన’ ను ఎన్నుకున్నాడు. తదుపరి ‘కనాన’ నుండి ఖురైష్ ను, వారి నుండి బనూ హాషిమ్ ను ఎన్నుకున్నాడు. బనూ హాషిమ్ నుండి నన్ను ఎన్నుకున్నాడు.” (సహీ ముస్లిం : 2276)
ఇలాగే, రోము చక్రవర్తి (హెరిక్లెస్), అబూసుఫ్యాన్ (అప్పటి వరకు ఆయన ఇంకా ముస్లిం కాలేదు)ను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశావళిని గూర్చి అడగ్గా – ఆయన జవాబిస్తూ, “అతను మాలో ఎంతో ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి” అని అన్నారు. దీని పై హెరిక్లెస్ స్పందిస్తూ – దైవప్రవక్తలు (సాధారణంగా) తమ జాతుల్లోని ఉన్నత వంశానికి చెందినవారై వుంటారు అని అన్నాడు. (సహీ బుఖారీ : 7, సహీ ముస్లిం : 1773)
2) మానవాళి కొరకు గొప్ప కటాక్షం
వాస్తవానికి మానవాళి పై అల్లాహ్ ఉపకారాలు లెక్కలేనంతగా వున్నాయి. కానీ వాటిలో అన్నింటి కన్నా ప్రత్యేక ఉపకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆగమనం. ఈ విషయాన్ని అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:
“అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే – ఆయన, వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్దుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందు వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై వున్నారు.” (ఆలి ఇమ్రాన్ : 164)
ఈ ఆయత్ లో అల్లాహ్ సెలవిచ్చినట్లు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవదౌత్య బాధ్యతలు అప్పగించబడ్డ సమయంలో మానవ జాతి స్పష్టమైన అపమార్గానికి లోనై అజ్ఞానపు అంధకార లోయలలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో అల్లాహ్ వారి వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పంపి, వారిని అంధకారం నుండి బయటకు తీసి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా వారిని రుజుమార్గం వైపునకు దారి చూపాడు. ఇలా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కొరకు ఒక కారుణ్యంగా వున్నారు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
“మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.” (అంబియా : 107)
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు.
“ప్రజలారా! నేను ప్రజల కొరకు (అల్లాహ్ తరఫు నుండి) బహుమానంగా పంపబడిన కారుణ్యాన్ని”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
కాలాన్ని దూషించకు. ఇది అల్లాహ్ ను బాధ కలిగించినట్లగును [వీడియో] https://youtu.be/4Asy-MTKEcU [6 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
90- కాలాన్ని దూషించకు.(*) ఇది అల్లాహ్ ను బాధ కలిగించినట్లగును( **). కాలాన్ని సృష్టించి, దానిని నియమ బద్ధంగా చేసింది అల్లాహ్ యే. కాలంలోనే విధివ్రాత అమలు జరిగే విధంగా చేశాడు.
అల్లాహ్ చెప్పాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు అబూ హురైరా ఉల్లేఖించారుః “మానవూడు నన్ను బాధిస్తున్నాడు. అతడు కాలాన్ని దూషిస్తున్నాడు. వాస్తవానికి నేనే కాలం. అధికారమంతయూ నా చేతిలోనే ఉంది. రేయింబవళ్ళను మార్చేవాడిని నేనే”. (బుఖారి/వమా యుహ్ లికునా ఇల్లద్దహ్ ర్ 4826).
(*) కాలాన్ని దూషించడం మూడు రకాలుగా ఉంటుందిః
1- తౌహీద్ కు వ్యెతిరేకమైన ఘోరమైన షిర్క్. కొందరు ఇలా అంటారుః ‘కాలం పాడుగాను’, ‘ఈ రాత్రి విపరీతమైన వేడి గలది’, ‘మహా చల్లని రాత్రి’, ఇలాంటి మాటలు అన్నప్పుడు వేడి, చలిను పుట్టించేది కాలం, రాత్రి అని నమ్మితే ఇదే ఘోరమైన షిర్క్.
2-కాలం సృష్టికర్త అల్లాహ్ అని నమ్మినప్పటికీ విపరీతమైన వేడి, లేదా చలి ఉన్నప్పుడు యమకోపంతో, ఓపిక లేకుండా, దానిని భరించడం లో పుణ్యం అన్న విషయం మరచి, అల్లాహ్ వ్రాసిన విధివ్రాత మీద ఆగ్రహంతో ప్రవర్తించుట లేదా దాని వార్త ఇతరులకు ఇచ్చుట. ఈ ప్రవర్తన సరియైనది కాదు. ఇందువల్ల మనిషి పాపానికి గురవుతాడు.
3-మంచి విశ్వాసం మరియు సదుద్దేశంతో ఎలా ఉంది వాతవరణం అంటే సమాధానంగా చలి ఉంది అని వేడి ఉంది అని ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంది అని తెలుపుతే ఈ పద్ధతి సరైనది. ఇందులో ఏలాంటి పాపము లేదు.
(**) కాలాన్ని, భూమిని, జడపదార్థాల్ని మరియు ఇతర సృష్టిని దూషించుట అల్లాహ్ ను దూషించినట్లు. ఎందునగా అది వాస్తవానికి వాటిని ఉనికిలోకి తెచ్చినవారిని దూషించినట్లు. ఉదాహరణకుః నీవు ఒక ఇల్లును దాని బలహీన నిర్మాణం వల్ల లేదా ఏదైనా వాహనాన్ని అది మంచిగా లేనందుకు దూషించావంటే వాస్తవానికి దానిని చేసినవానిని దూషించినట్లు. అందుకే ఈ చేష్టకు దూరంగా ఉండి భయపడాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.