కొన్నిస్థలాల, చిహ్నాల, మృతుల నుండి శుభం (బరకత్) పొందటం :
కొత్తగా కనిపెట్టిన బిద్అతు(కల్పితాచారం)లలో ‘సృష్టితాల‘ నుండి “శుభం” పొందగోరటం కూడా ఒకటి. ఇది కూడా విగ్రహారాధనలో ఒక భాగమే. ఈ వల పన్నటం ద్వారా ఎంతోమంది బ్రతకనేర్చిన స్వార్ధపరులు అమాయక వ్యక్తుల జేబులు ఖాళీ చేస్తుంటారు.
‘బరకత్” అంటే ఏదైనా వస్తువులో శుభం, సమృద్ధి స్థిరంగా ఉండటం అని భావం.
ఇలాంటి శుభం లేక సమృద్ధి కొరకు ప్రార్థించాల్సింది అల్లాహ్ నే . ఎందుకంటే ఆ వస్తువును ప్రసాదించిన వానికే బరకత్ పొందుపరిచే శక్తి ఉంటుంది. ఆ పని అల్లాహ్ మాత్రమే చేయగలడు. ఎందుకంటే శుభాన్ని అవతరింపజేసేవాడు, దానిని స్థిరపరిచేవాడు అల్లాహ్ మాత్రమే. మనుషులకు, వేరే ఇతర సృష్టితాలకు బరకత్‌ని ప్రసాదించే శక్తిగానీ, బరకత్ అనే దానికి ఉనికినిచ్చే శక్తిగానీ, దానిని నిలిపి ఉంచే శక్తిగానీ ఉండదు.
కాబట్టి స్థలాల నుండి, చిహ్నాల నుండి, చనిపోయిన వ్యక్తుల నుండి “శుభం” (తబర్రుక్) పొందటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే ఆ వస్తువుకు శుభం చేకూర్చే శక్తి స్వత సిద్ధంగా ఉందని మనిషి గనక నమ్మాడంటే అది ‘షిర్క్‘ అవుతుంది. ఒకవేళ అతను ఫలానా వస్తువును సందర్శించటం, దానిని తాకటం, దానిని తన శరీరంపై స్పర్శించటం అల్లాహ్ తరపున బరకత్ ప్రాప్తికి సాధనమని నమ్మితే అది షిర్క్ కాదుగానీ, షిర్క్‌కు దోహదపడే ఒక సాధనమవుతుంది.
ఇక ప్రవక్త ప్రియ సహచరుల విషయానికి వస్తే వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కేశముల ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) గారి లాలాజలం ద్వారా, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) వుజూ చేసిన నీళ్ల ద్వారా బరకత్ (శుభం) పొందేందుకు పోటీపడేవారు. అయితే ఇదంతా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) జీవించి ఉన్నంతవరకే జరిగింది. దీనికి ఆధారం ఏమిటంటే, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) పరమపదించిన తరువాత, సహచరులు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) సమాధి ఉన్న గదిలోకి వెళ్ళి శుభం పొందలేదు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్ చేసిన వివిధ స్థలాలకు వెళ్ళి, లేదా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) విశ్రాంతి పొందిన స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి “శుభం” పొందలేదు. కాబట్టి ఔలియాల (అల్లాహ్ ప్రియతములైన వ్యక్తుల) స్థలాలకు వెళ్ళి అక్కడి నుండి శుభం పొందగోరటం ధర్మసమ్మతం కాదు.
అలాగే ప్రవక్త సహచరులు తమలోని గొప్ప వ్యక్తుల నుండి కూడా శుభం పొందేవారు కారు. ఉదాహరణకు : హజ్రత్ అబూబకర్, హజ్రత్ ఉమర్ (రది అల్లాహు అన్హుమా), ఇంకా ఆ కోవకు చెందిన మరెందరో సహాబీల జీవిత కాలంలోగానీ, వారు మరణించిన తరువాత గానీ వారి నుండి శుభం పొందేందుకు యత్నించలేదు. వారు హిరా గుహ వద్దకు వెళ్ళి నమాజ్ చేయటంగానీ, దుఆ చేయటంగానీ చేయలేదు.అల్లాహ్ మూసా (అలైహిస్సలాం)తో సంభాషించిన తూర్ పర్వత సందర్శన నిమిత్తం వెళ్ళటంగానీ, అక్కడ నమాజ్ చేయటం గానీ చేయలేదు. దైవప్రవక్తల సమాధులున్నాయని అనుమానించ బడుతున్న పర్వతాల వద్దకు, స్థలాల వద్దకు కూడా వారు వెళ్ళలేదు.
అలాగే మదీనా నగరంలో మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నిత్యం నమాజ్ చేసే స్థలంలోనే నిలబడటంగానీ, మక్కాలో ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) నమాజ్ చేసీన స్థలాలలో తొలికాలపు మహనీయులు నిలబడటం గానీ, ఆ స్థలాలను తాకటంగానీ, ముద్దాడటం గానీ చేసేవారు కారు.
కాస్త ఆలోచించండి! మహాప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) గారి శుభప్రదమైన అడుగులు పడిన స్థలాలను, ఆయన నమాజ్ చేసిన స్థలాలనే తాకటం, ముద్దుపెట్టుకోవటం ఆయన అనుయాయులకు ధర్మసమ్మతం కానపుడు వేరేతరులు సంచరించిన, ఆరాధనలు చేసిన స్థలాలను, ప్రదేశాలను ముద్దాడటం ఎంత వరకు సమ్మతం? ఎంతవరకు సహేతుకం?
ఆ స్థలాలలో దేనినయినా తాకటం లేదా ముద్దుపెట్టుకోవటం మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) షరీయత్ ప్రకారం ధర్మసమ్మతం కాదన్న విషయం ఇస్తామీయ విద్వాంసులకు బాగా తెలుసు. (ఇఖ్తెజ అస్సిరాతల్ ముస్తఖీమ్ – 2/795-802. డా. నాసిరుల్ అఖల్ పరిశోధన).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“వారు అల్లాహ్‌కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్‌ను స్థాపించాలని, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే ఆదేశించడం జరిగింది. ఇదే ఎంతో సరియైన ధర్మం.”(అల్ బయ్యినహ్ : 5)
మరోచోట అల్లాహ్ సెలవిచ్చాడు :
“వాటి మాంసమూ అల్లాహ్‌ను చేరదు, వాటి రక్తమూ చేరదు. కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి.”(అల్ హజ్జ్ : ౩7)
ఇంకొకచోట ఆయన ఇలా ఆదేశించాడు :
“ప్రవక్తా ప్రజలను ఇలా హెచ్చరించు : “మీరు దాచినా లేక బహిర్గతం చేసినా – మీ మనసుల్లో ఉన్నదంతా అల్లాహ్‌కు తెలుసు.”(ఆలి ఇమ్రాన్ : 29)
1. విశ్వాసుల నాయకులు హజ్రత్ అబూ హఫ్స్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
“ఆచరణలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్కరికీ అతని మనసులోని ఉద్దేశానికి అనుగుణంగా ప్రతిఫలం దొరుకుతుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం వలస పోయిన వ్యక్తి ప్రస్థానం – నిజంగానే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం చేసిన ప్రస్థానంగా పరిగణించబడుతుంది. ఎవడైతే ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో లేక ఏ స్త్రీనయినా వివాహమాడాలనే సంకల్పంతో వలస పోతాడో అతడు – తాను కోరుకున్న వాటికోసం వలసపోయినట్టుగా భావించటం జరుగుతుంది.”
ఈ హదీసు ప్రామాణికతపై ఏకాభిప్రాయం ఉంది. హదీసు వేత్తల్లో అగ్రగణ్యులైన ఉభయులూ – అనగా అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బుఖారీ మరియు అబుల్ హుసైన్ ముస్లిం బిన్ హజ్జాజ్‌లు – హదీసు సంకలన గ్రంథాలన్నిటిలోకెల్లా ప్రామాణికమైన తమ తమ గ్రంథాల్లో ఈ హదీసును పొందుపరచారు.
2. విశ్వాసుల మాతృమూర్తి ఉమ్మె అబ్దుల్లాహ్ హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:
“సైనిక పటాలం ఒకటి కాబాపైకి దండెత్తే ఉద్దేశ్యంతో బయలుదేరుతుంది. ఆ సైనిక పటాలం భూమండలంలోని ఒక ప్రదేశానికి చేరుకోగానే అక్కడి వారంతా భూమిలోనికి కూరుకుపోతారు.”
హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) అంటున్నారు – ఆ మాట విని నేను “ఓ దైవప్రవక్తా! వారంతా భూమిలో ఎందుకు కూర్చి వేయబడతారు? వారిలో బజారున పోయేవారు, వేరే ఇతరులు కూడా ఉంటారు కదా!” అని అడిగాను. (అంటే సైనికాధికారులతో పాటు సామాన్య సిపాయిలు లేదా బజారులో తిరిగే మామూలు మనుషులు కూడా ఉంటారని అర్ధం.) దానికి ఆయన “మొదటి నుంచి చివరిదాకా వారందరూ నేలలోకి కూర్చి వేయబడతారు. అయితే ఆ తరువాత వారంతా కూడా తమ తమ ఉద్దేశాల ఆధారంగా లేపబడతారు. (అంటే ప్రళయం సంభవించాక వారితో వారి సంకల్పాలనుబట్టి వ్యవహరించడం జరుగుతుంది)” అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీవి).
3. హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్‌హా) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :
“మక్కా విజయం తరువాత హిజ్రత్ (వలస వెళ్ళవలసిన అవసరం) లేదు. అయితే దైవమార్గంలో పోరాటం మరియు సంకల్పం మాత్రం కొనసాగుతూ ఉంటాయి. దైవమార్గంలో పోరాడటం కోసం మిమ్మల్ని పిలవడం జరిగితే, మీరు (తక్షణమే) బయలు దేరండి.”(బుఖారీ,ముస్లిం)
దీని భావం ఏమిటంటే, (హిజ్రీ శకం 8వ యేట) మక్కా నగరం దారుల్ ఇస్లాం (ఇస్లామీయ రాజ్యం) అయిపోయింది. కనుక మక్కా విజయం తరువాత ఇక మక్కా నుండి వలస వెళ్ళాల్సిన అవసరం మిగిలి ఉండలేదు.
మేము ఒకానొక యుద్ధంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట ఉన్నాము. అప్పుడు ఆయన ఈ విధంగా ప్రవచించారు : “మదీనాలో కొంతమంది (యుద్దానికి) రాలేకపోయారు. అయితే మీరు ప్రయాణించిన ప్రతిచోటా, మీరు నడిచిన ప్రతి లోయలోనూ వారు మీతోపాటే ఉన్నారు. అనారోగ్యం వారిని ఆపి ఉంచింది.”
వేరొక ఉల్లేఖనంలో “పుణ్యంలో మీతో పాటు వారు కూడా భాగస్వాములయ్యారని ఉంది” (ముస్లిం)
బుఖారీ ఉల్లేఖనంలో హజ్రత్ అనస్ (రది అల్లాహు అన్హు) ఇలా ఉటంకిస్తున్నారు :
“మేము తబూక్ యుద్దానంతరం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట తిరిగి వచ్చాము. అప్పుడు ఆయన ఇలా అన్నారు : “కొందరు మన వెనక మదీనాలోనే ఆగిపోయి ఉన్నారు. అయితే మనం నడిచిన ప్రతి కనుమ, ప్రతి లోయలోనూ వారు మనతోపాటే ఉన్నారు. తగిన కారణం వల్ల వారు రాలేకపోయారు.”
“మా నాన్న యజీద్ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను అంతిమ హజ్ యాత్ర చేసిన యేట వ్యాధిగ్రస్తుణ్ణయి ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు. అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. నేను ఆయన్ని “దైవప్రవక్తా! నా నొప్పి ఎంత తీవ్రంగా తయారయిందో తమరు చూస్తూనే ఉన్నారు. నేనా డబ్బు కలవాణ్లి. నాకు ఒక్కగానొక్క కూతురు తప్ప ఇతర వారసులెవరూ లేరు. నేను నా ధనంలోని మూడింట రొండొంతులను ఎవరికైనా దానం చేయవచ్చా?” అని అడిగాను. దానికి ఆయన “కూడదు” అన్నారు. తిరిగి నేను “సగం ధనం దానం చేయనా” అని అడిగాను. దానికి కూడా ఆయన “కూడదు” అనే అన్నారు. మళ్ళీ నేను “మూడింట ఒక వంతైనా దానం చేయలేనా దైవ ప్రవక్తా!” అని విన్నవించుకోగా అందుకు ఆయన “మూడింట ఒక వంతు అయితే చేయగలవు. కాని అది కూడా ఎక్కువే (లేక) పెద్దదే అవుతుంది” (అని అన్నారు). “ఎందుకంటే నువ్వు నీ వారసులను పరుల ముందు చేయి చాపుతూ తిరిగిదరిద్రులుగా వదలి వెళ్ళడంకన్నా స్టితిమంతులుగా వదలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం. (గుర్తుంచుకో!) నువ్వు దైవప్రసన్నత కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో పెట్టే ముద్దకు కూడా ప్రతిఫలం పొందుతావు” అని ఉపదేశించారు. అప్పుడు నేను “ఓ దైవప్రవక్తా! నేను నా సహచరుల వెనుక ఉండిపోతానా? (అంటే నా సహచరులు ముందుగానే చనిపోయి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉండిపోతానా?)” అని సందేహపడగా దానికి ఆయన “(అయితేనేమి? మంచిదేగా) ఎందుకంటే నీ సహచరుల అనంతరం నువ్వు బ్రతికివుంటే దైవప్రసన్నత కోసం నువ్వు చేసుకునే ప్రతి ఆచరణతో నీ స్థాయి, అంతస్థులు పెరుగుతాయి. బహుశా నీకు ఇంకా జీవితం గడిపే అవకాశం లభిస్తుందేమో! అప్పుడు కొంత మంది (విశ్వాసులకు) నీవల్ల మేలు కలగవచ్చు, ఇంకొంతమంది (దైవ తిరస్కారులకు) నీ వల్ల కీడు కలగవచ్చు. ఓ అల్లాహ్! నా సహచరుల హిజ్రత్‌ని (ప్రస్థానాన్ని) పరిపూర్ణం గావించు. వారిని పరాజయం పాలుచేయకు’ అని వేడుకున్నారు. కాని “సాద్ బిన్ ఖౌలా” దయార్హులు. ఎందుకంటే ఆయన మక్కాలో ఉండగానే కన్నుమూశారు. అందుకని ఆయన కనికరించబడాలని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దుఆ చేసేవారు. (బుఖారీ – ముస్లిం)
7. హజ్రత్ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
“అల్లాహ్ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు.”(ముస్లిం)
ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను “ఒకడు తన శూరత్వాన్ని ప్రకటించుకోవడానికి, మరొకడు తన వంశప్రతిష్టను చాటుకోవడానికి, ఇంకొకడు పరుల మెప్పు పొందడానికి పోరాడుతున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు దైవ మార్గంలో పోరాడుతున్నట్లు?” అని ప్రశ్నించడం జరిగింది. అందుకాయన “దైవవాక్కు (దైవధర్మం) ఉన్నతి కోసం పోరాడిన వాడు అల్లాహ్ మార్గంలో పోరాడినట్లు పరిగణించడం జరుగుతుంది” అని సమాధానమిచ్చారు. “(బుఖారి – ముస్లిం)
9. హజ్రత్ అబూబక్రహ్ నుఫైబిన్ హారిస్ సఖఫీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :
“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు.(బుఖారీ -ముస్లిం)
“మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్కు తీసుకువస్తే – అలాంటి వ్యక్తి మస్జిద్ చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతస్తు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంతసేపూ అతను నమాజు చేస్తున్నట్టుగానే పరిగణించ బడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు ‘ అని విన్నవించుకుంటూ ఉంటారు”
(బుఖారీ – ముస్లిం). హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్‌హజుహూ” అంటే అతన్ని బయటికి తీసుకువస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.
11. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్ అబుల్ అబ్బాస్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రది అల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :
“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు”(బుఖ్లూరీ -ముస్లిం)
“మీ పూర్వీకుల్లోని ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణానికి బయలుదేరారు. దారిలో రాత్రయింది. ఆ ముగ్గురూ ఒక గుహలో శరణు తీసుకుందామని అందులోకి వెళ్ళారు. అంతలోనే పర్వతం పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లిపడింది. దాంతో గుహ ముఖద్వారం మూసుకు పోయింది. దాంతో వారు ఆ ఆపద నుంచి బయటపడే మార్గం గురించి మాట్లాడుకున్నారు. ఆఖరికి తాము అంతకు మునుపు చేసుకున్న సత్కార్యాల ఆధారంగా అల్లాహ్‌ను వేడుకోవడం తప్ప ఆ విపత్తు నుండి బయట పడేందుకు వేరేమార్గం లేదన్న నిర్ణయానికి వచ్చారు.
వారిలోని ఒకడు ఇలా వేడుకున్నాడు : “దేవా! నాకు మరీ ముసలివారైన తల్లిదండ్రులుండేవారు. సాయంత్రం పూట అందరికంటే ముందు నేను నా తల్లిదండ్రులకే పాలు త్రాగించేవాడిని. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు గానీ, నా నౌకర్లకు గానీ త్రాపించేవాణ్డి కాను. ఒకరోజు నేను (పశువులకు) చెట్లమేత కోసం చాలా దూరం వెళ్ళిపోయాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులిద్దరూ నిద్రపోయారు. నేను ఆ పూట పాలు పితికి తీసుకు వచ్చాను. అప్పటికే వారు గాఢ నిద్రలో ఉండడం గమనించాను. వారిని మేల్కొలపడానికి నాకు మనసొప్పలేదు. వారికంటే ముందు నా భార్యాబిడ్డలకు, నౌకర్లకు పాలు త్రాగించడం కూడా నాకిష్టం లేదు. అందుకని నా పిల్లలు నా కాళ్ళ మీద పడి విలవిల్లాడినా కూడా (నేను వారికి త్రాపకుండా) పాలపాత్ర చేతిలో పట్టుకొని తెల్లవారే దాకా వాళ్ళ దగ్గరే నిలబడి, ఏ సమయం లోనైనా వారు మేల్కొంటారేమోనని ఎదురు చూడసాగాను. తెల్లవారిన తరువాత గాని వారు లేవలేదు. నిద మేల్కొని రాత్రి వారికోసం ఉంచబడిన పాలు తాగారు. ఓ అల్లాహ్! కేవలం నీ ప్రసన్నత కోసమే నేనీ పని చేసివుంటే మేము చిక్కుకున్న ఈ గుహ ముఖ ద్వారం నుండి బండ రాయిని తొలగించి మమ్మల్ని రక్షించు.”
అతని వేడుకోలు ఫలితంగా ఆ బండ రాయి కొద్దిగా జరిగింది. అయితే (అప్పటికీ, ఆ సందుగుండా వారు బయటికి రాలేకపోయారు.
తరువాత రెండో వ్యక్తి అభ్యర్థించుకో సాగాడు: “ఓ దేవా! నా బాబాయి కూతురు ఒకామె ఉండేది. నేనామెను అమితంగా ఇష్టపడేవాణ్ణి. (వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది): మగవారు ఆడ వారిని అమితంగా ప్రేమించినంతగా నేను ఆమెను ప్రేమించేవాడిని. ఒకసారి నేను ఆమె పొందుకోసం పరితపించాను. కాని అందుకామె ఒప్పుకోలేదు. ఆఖరికి దుర్భిక్షం ఆమెను గత్యంతరం లేక నా వద్దకు వచ్చేలా చేసింది. అప్పుడు ఆమె నాతో ఏకాంతంలో గడిపే షరతుపై నేనామెకు నూట ఇరవై దీనార్లు ఇచ్చాను (గత్యంతరం లేక ఆమె అవి తీసుకుంది). నా కోరిక తీర్చేందుకు సిద్ధమయ్యింది. నేనామెను ఆక్రమించుకున్నప్పుడు, (వేరొక ఉల్లేఖనం ప్రకారం) నేను ఆమె రెండు తొడల మధ్య కూర్చు న్నప్పుడు ఆమె నాతో; “అల్లాహ్‌కు భయపడు! అక్రమంగా కన్నెపొరను చీల్చకు అని అంది. ఆ మాటలు విన్న తడవుగా నేను ఆమె దగ్గర నుండి లేచి పోయాను. నిజానికి ఆమె నాకు ప్రజల్లో అత్యంత ప్రియతమమైనది. నేను ఆమె కిచ్చిన బంగారు దీనార్లను కూడా వదులుకున్నాను. ఓ దేవా! నేను కేవలం నీ ప్రసన్నత కోసమే ఇలా చేసి ఉన్నట్లయితే మాపై వచ్చిపడిన ఈ విపత్తు నుండి మమ్మల్ని రక్షించు.
రెండో వ్యక్తి వేడుకోలు తరువాత ఆ బండరాయి ఇంకొంచెం తొలగింది. అయినా గాని వారు బయటపడేందుకు మార్గం సుగమం కాలేదు.
ఆ తరువాత మూడో వ్యక్తి వేడుకోవడం ప్రారంభించాడు: “ప్రభూ! నేను కొంత మంది పని మనుషులను జీతానికి ఉంచుకున్నాను. నేను వారందరికీ జీతాలిచ్చేశాను. కాని వారిలో ఒకడు మాత్రం తన జీతం పుచ్చుకోకుండానే వెళ్ళిపోయాడు. నేను అతని జీతాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. దాంతో చాలా ధనం పోగయ్యింది. కొంత కాలానికి ఆ వ్యక్తి వచ్చి, “ఓ దైవ దాసుడా! నాకు నా జీతం ఇవ్వు” అనడిగాడు. దానికి నేను, “నువ్వు చూస్తున్నటువంటి ఈ ఒంటెలు, ఆవులు, మేకలు, బానిసలు – అన్నీ నీ జీతం ఫలాలే (వాటిని నువ్వు తీసేసుకో)” అన్నాను. అందుకతను “ఓ దైవదాసుడా! నాతో పరాచికాలు వద్దు’ అంటూ చిన్నబోయాడు. నేను “ఇది పరాచికం కాదు (నిజం చెబుతున్నాను)” అన్నాను. అప్పుడు అతను (నా కోసం) ఏమీ వదలకుండా ఆ సంపదనంతా తరలించుకొని వెళ్ళిపోయాడు. ఓ అల్లాహ్! నేను ఈ పని కేవలం నీ ప్రసన్నతను దృష్టిలో పెట్టుకొనే చేసినట్టయితే మేము చిక్కుకున్నటువంటి ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడు.” దాంతో ఆ బండరాయి పూర్తిగా తొలగి పోయి గుహద్వారం తెరుచుకోవటంతో వారు ముగ్గురూ బయటపడ్డారు. (బుఖారీ -ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.
أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ (అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.
మరణ దూత గురించి ఒకే ఒక వాస్తవం
చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.
మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.
విశ్వాసి మరణ ఘట్టం
విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.
وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ (వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్) “మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)
ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.
అవిశ్వాసి మరణ ఘట్టం
ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:
لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ (లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’) వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)
మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:
وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ (వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్) అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)
అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,
فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ (ఫక అన్నమా ఖర్ర మినస్ సమా) ఆకాశం నుండి పడిపోయిన వాని వలె. ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.
సమాధి జీవితం (బర్ జఖ్)
ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.
కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.
وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ (వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్) వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)
దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.
సమాధిలో ప్రశ్నోత్తరాలు
ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.
ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.
ముగింపు
ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.
చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.
أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తలాక్ ముందు ఇస్లాం మనకు కొన్ని ఆదేశాలు పాటించాలని చెప్పింది, వాటిని ఆచరించడం తప్పనిసరి. వాటిని ఆచరించక ముందే విడాకులు చెెప్పడం మహా పాపం.
[వీడియో: 20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
దాంపత్య జీవితం ఒక బలమైన ఒప్పందం. అల్లాహ్ స్వయంగా వారి మధ్యలో ప్రేమ నూరిపోశాడు. ఒకరి ద్వారా మరొకరికి సుఖశాంతులు కలగజేశాడు. (సూరా రూం 30:21). ఘోర పాపాల్లో ఒకటైన అబద్ధాన్ని అన్ని వేళల్లో నిషిద్ధపరచిన అల్లాహ్, దాంపత్య జీవితంలో రగులుతున్న జ్వాలల్ని ఆర్పడానికి దానిని యోగ్యపరచాడు. ఈ విధంగా రాస్తూ పోతే చాలా ఉంది, ఇలాంటి ప్రగాఢ ఒడంబడికను తెంచటం, తెంచుకోవటం, ఒకరికి మరొకరు శరీరంతో దుస్తులు అంటుకొనియున్నట్లుగా ఉన్నవారు వేరైపోవడం ఎంత బాధకర విషయం. దీని వల్ల స్వయం వారిద్దరికీ, సంతానం ఉంటే వారికీ, ఇరువైపుల కుటుంబాలకు మొత్తం సమాజానికే ఒక్క నష్టం ఏమిటి? ఎన్నో నష్టాలు వాటిల్లుతాయి. అందుకే వారిరువురిలో ఏదైనా బేధభావం ఏర్పడి, భర్త తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నప్పుడు ‘తలాక్’ అనడంలో త్వర పడకుండా ముందు ఈ క్రింది పద్ధతులు పాటించాలి.
1- అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో దాంపత్య జీవితం ఎలా గడపాలో స్వయంగా భర్త ముందు నేర్చుకోవాలి, భార్యకు నేర్పే ప్రయత్నం చేయాలి.
2- భర్త తన భార్యలో లేదా భార్య తన భర్తలో తనకు నచ్చని ఏదైనా అలవాటు, లోటు చూసినప్పుడు వెడబాటుకు త్వరపడకుండా అల్లాహ్ మరియు ప్రవక్త ఈ ఆదేశాలను అర్థం చేసుకొని ఆచరించాలి:
“… వారితో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే, ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో!” (నిసా 4:19).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:
“ఏ విశ్వాసి కూడా తన విశ్వాసురాలైన భార్యను అసహ్యించుకోకూడదు/వదులు కోకూడదు. అతను ఆమెలోని ఏదైనా ఒక గుణం నచ్చకపోతే, అతనికి నచ్చిన మరో గుణం ఆమెలో ఉండవచ్చు”. (ముస్లిం 1469).
మరొక హదీసులో ఉంది:
“నిస్సందేహంగా స్త్రీ ప్రక్కటెముకతో సృజించబడింది, అది ఏ విధంగానూ తిన్నగా కాదు, కనుక నీవు ఆమె నుండి ప్రయోజనం పొందాలనుకుంటే వంకరగా ఉన్నప్పుడు కూడా పొందగలవు. నీవు ఆమెను తిన్నగా చేయటానికి ప్రయత్నిస్తే ఆమెను విరగ్గొడతావు, ఆమెను విరగ్గొట్టటం అంటే ఆమెకు విడాకులివ్వటమే”. (ముస్లిం 1468, బుఖారి 3331).
3- ఓపిక సహనాలు ఎన్ని వహించినా, అవి పనికి రావు అనుకొని, విడాకులకే పరుగిడ కూడదు. అల్లాహ్ సూర నిసా (4:34) లో ఇచ్చిన ఈ మూడు ఆదేశాలను పాటించాలి:
ఎప్పుడైతే మీ భార్యలు అవిధేయతకు పాల్పడతారని భయం చెందుతారో అప్పుడు మీరు వారికి నచ్చజెప్పండి, పడకలో వేరుగా ఉంచండి. వారిని (మెల్లగా) కొట్టండి. [సూర నిసా (4:34)]
అయితే ఈ మూడు పద్ధతులు ఒకేసారి కాకుండా క్రమంగా ఒకటి తరువాత ఒకటి ఉపయోగించాలి. ముందు ఖుర్ఆన్ ఆయతులు, ప్రవక్త హదీసుల, సహాబాల, పుణ్యాత్ముల చరిత్ర ద్వారా నచ్చజెప్పుతూ ఉండాలి. ఇలా ప్రయోజనం కానరాకుంటే పడకలో వేరు చేయాలి. అంటే ఆమెను ఆమె అమ్మగారింటికి పంపడం కాదు, తన వద్ద, తన ఇంట్లోనే ఉండనివ్వాలి, కాని ఒకే పడకపై ఆమెతో కలసి పడుకోకూడదు. ఇక కొట్టడం అంటే; దొరికింది అవకాశం అని ఎడాపెడా కొట్టడం కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: ‘గైర ముబర్రహ్’ కొట్టడం అని. అయితే ఈ గైర ముబర్రహ్ అంటే ఏమిటి అన్న దానికి హజ్రత్ ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హు) చెప్పారు: ఎముక విరిగినట్లు కాదు, మిస్వాక్ (పళ్ళపుల్ల)తో కొట్టడం అని. హసన్ బస్రీ చెప్పారు: ఆ దెబ్బ వల్ల ఏలాంటి గుర్తు, వాపు, వాతలు రాకుండా ఉండాలి అని. (తఫ్సీర్ ఇబ్ను కసీర్).
4- భర్తలో ఏమైనా లోపాలుంటే భార్య నచ్చజెప్పాలి, స్వయం చెప్పలేకపోతే పెద్దలతో చెప్పించాలి. ఈ ఆయతు భావాన్ని శ్రద్ధగా చదవండి:
“భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రం దోషం లేదు. సర్దుబాటు అనేది అన్నింటికన్నా మేలైనది. ‘పేరాశ’ అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ ఈ వ్వవహారశైలి అల్లాహ్ కు బాగ తెలుసు అన్న నమ్మకం కలిగి ఉండండి”. (నిసా 4:128).
పై ఆయతు ప్రకారం ఆచరించే ప్రయత్నం చేసినా, దాంపత్య జీవితంలోని ప్రేమానురాగాలు పెరగనప్పుడు, దినదినానికి వారి మధ్య విభేదాలే ఎక్కువైనప్పుడు; ఇరువురి వైపున ఒక్కొక్క మధ్యవర్తినీ నియమించాలి, వారు న్యాయవంతులు, ధర్మావగాహన కలిగి ఉన్నవారు, అల్లాహ్ ప్రీతి కొరకు వీరిని కలిపే ప్రయత్నం చేసేవారై ఉండాలి. చదవండి అల్లాహ్ అదేశం:
“ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరఫు నుంచి ఒక మధ్యవర్తినీ, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తినీ నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు“. (నిసా 4:35).
ఇలా ఆ ఇద్దరి మధ్యవర్తుల ప్రయత్నం వారిని కలపండలో ఫలిస్తే అల్ హందులిల్లాహ్! అదే కావలసింది, అదే వారు చెయ్యాల్సింది కూడా. కాని ఏదైనా కారణంగా వారి ప్రయత్నాలు ఫలించక, వారిరువురిలో ద్వేష జ్వాలలే రగులుతూ ఉంటే, వారు ఆ దంపతుల మధ్య ఎడబాటుయే మేలు అని భావించి విడాకుల (తలాక్)కు సలహా ఇచ్చినా పాపంలో పడరు. కాని అనవసరంగా, లేదా దంపతుల్లో ఎటైనా ఒకరి వైపు మ్రొగ్గు చూపి విడాకులకు సలహా ఇస్తే వారు షైతాన్ ను ప్రసన్నం చేసినవారవుతారు, వారితో షైతాన్ చాలా సంతోషిస్తాడు. (ముస్లిం 2813. ఈ పూర్తి హదీస్ చదవండి). ఇలాంటి వారి గురించి ప్రవక్త ఒక సందర్భంలో ఇలా తెలిపారు: “ఎవరైతే ఒక మనిషిని అతని భార్యకు వ్యతిరేకంగా పురికోల్పుతాడో అతడు మాలోని వాడు కాదు”. (అబూ దావూద్ 5170). మరియు వారి మాయమాటలలో పడి, తెలిసి కూడా అన్యాయంగా, అనవసరంగా విడాకులిచ్చే భర్త, లేదా విడాకులు కోరే భార్య ఎంత ఘోరమైన పాపానికి ఒడిగడతారో ప్రవక్తగారి ఈ హదీసుల ద్వారా తెలుసుకోండి!
“అల్లాహ్ వద్ద ఘోర పాపాల్లో ఒకటి: మనిషి ఒక స్త్రీతో వివాహమాడి, ఆమెతో కాపురం చేసి, ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి ఆమె మహర్ కూడా కాజేయడం”. (హాకిం 2743, సహీహా 999).
“ఏ భార్య తన భర్తతో అనవసరంగా విడాకులు కోరుతుందో ఆమె స్వర్గ సువాసనను కూడా నోచుకోదు”. (అబూదావూద్ 2226, తిర్మిజి 1187).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షేఖ్ ముహమ్మద్ ఇబ్న్ అల్-ఉతైమీన్- రహిమహుల్లాహ్ – చెప్పారు :
‘ప్రజలు షరియా నుండి రెగ్యులర్ దుఆ మరియు జిక్ర్ లను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించినప్పుడు, అప్పుడు జిన్నాతులు వారిలో చాలాపెరిగాయి, మరియు అవి వారిని ఎగతాళి చేసి వారితో ఆడుకున్నాయి’
[లికా అల్-బాబ్ అల్-మఫ్ తూహ్ 197]
من أقوال ابن العثيمين رحمه الله
ولمَّا غفل النَّاس عن الأوراد الشَّرعية كثرت فيهم الجنُّ الآن، وتلاعبت بهم .
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకలు, బర్త్ డే పార్టీలు, మీలాదున్నబీ ఉత్సవాలు జరుపుకొనుట ఇస్లామీయ కార్యమేనా? మనకంటే ఎంతో అధికంగా ప్రవక్తను ప్రేమించే సహాబాలు (ప్రవక్త సహచరులు) ఈ మీలాద్ చేశారా? ఇది చేయడం పుణ్యమైతే వారు ఎందుకు చేయలేదు? అది పుణ్యం కాకపోతే మరి మనం ఎందుకు చేయాలి? ఇంకా మరిన్ని వివరాలు, వాస్తవాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
[40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
ఈ ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టినరోజు (మీలాద్-ఉన్-నబీ) వేడుకల యొక్క వాస్తవికతను చర్చిస్తుంది. ఇస్లాం ఒక సంపూర్ణమైన మతమని, దానిలో కొత్త ఆచారాలకు, ప్రత్యేకంగా ఆరాధనల విషయంలో, స్థానం లేదని వక్త స్పష్టం చేస్తున్నారు. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో కేవలం రెండు పండుగలు (ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా) మాత్రమే ఉన్నాయని, మీలాద్ వేడుకలను పండుగగా జరుపుకోవడం ప్రవక్త మరియు ఆయన సహచరుల పద్ధతికి విరుద్ధమని వివరిస్తున్నారు. ఈ వేడుకను సమర్థించడానికి ఉపయోగించే వాదనలను విశ్లేషించి, వాటిలోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ, ఇది ఇస్లాంలోకి తరువాత చేర్చబడిన ఒక నూతన ఆచారం (బిద్అత్) అని, దీనిని పాటించడం పుణ్యకార్యం కాదని, పాపమని తేల్చిచెప్పారు. ఇస్లాం యొక్క మూల సూత్రాలను అనుసరించాలని, ఇతర మతాల వారిని అనుకరించరాదని ఆయన ముస్లింలకు హితవు పలికారు.
(الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ) అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబీయ్యినా ముహమ్మద్ వ ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్. (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)పై, ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక).
ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు, దీని యొక్క వాస్తవికత ఏమిటి? ఇస్లాంకు సంబంధించిన విషయమేనా ఇది, కాదా?
మహాశయులారా, మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవలసినది, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది. “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా” ( الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا) అని అల్లాహుతాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఏమిటి? “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” ( الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ) – ఈనాడు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను. “వ అత్మమ్తు అలైకుమ్ నిఅమతీ” (وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي) – మరియు నా అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను. “వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా” (وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا) – మరియు మీ కొరకు ధర్మంగా ఇస్లాంను ఇష్టపడ్డాను.
ఈనాడు మీ ధర్మాన్ని నేను సంపూర్ణం చేశాను అంటే ఏ నాడు అది? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికి ఇంచుమించు ఒక 80-83 రోజుల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ అవతరింపజేయబడినది. అయితే, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది అని ఏదైతే మనం అంటున్నామో, ఈ ఆయత్ దానికి ఒక ఆధారంగా, నిదర్శనంగా తెలుసుకున్నామో, దీని భావం ఏమిటి? ధర్మం పేరుతో ఇక ఏ విషయం కూడా మనం ఇందులో చేర్చలేము. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి చెప్పినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి ముందు ఏ విషయం అయితే దీన్లో లేనిదో, అది ఇప్పుడు దీన్లో లెక్కించబడదు. ధర్మంలో లెక్కించబడదు. మరియు ధర్మంలో ఉన్న ఏ విషయాన్ని కూడా తీసివేయడానికి కూడా మనకు ఎలాంటి అర్హత లేదు.
రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ధర్మం సంపూర్ణమైనది అని అన్నదానికి భావం రెండు రకాలుగా. ఒకటి, ఇందులో అదనంగా మనం ఏదీ చేర్చలేము. అరే ఇది కూడా చాలా మంచిగా ఉంది కదా, దీన్ని కూడా ధర్మంగా భావిద్దాము, ఇది కూడా మనం ఆచరిద్దాము, ఇలా కూడా చేద్దాము, ఇది కూడా ధర్మంగా పుణ్యంగా ఉంటుంది మనకు, ఇలా చెప్పలేము మన ఇష్టానుసారం. అలాగే అల్లాహుతాలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాన్ని ధర్మంలో తెలిపారో, అందులో నుండి ఏ విషయాన్ని కూడా మనం మినహాయించలేము, తీసివేయలేము. ఆ అర్హత కూడా మనకు లేదు.
ఇంకా మహాశయులారా, ఇందులో మనం తెలుసుకోవాల్సిన రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం, ఇందులో అల్లాహ్ మనకు ఏది తెలిపాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది తెలిపారో, అదే ధర్మం. దానినే మనం అనుసరించాలి. ఇది కాకుండా మన ఇష్టానుసారం ఏదైనా విషయాన్ని చేర్చుకోవడాన్ని, అనుసరించడాన్ని అల్లాహ్ ఖండించాడు. దీనికి సంబంధించిన ఎన్నో ఆయతులు ఉన్నాయి, కానీ ఉదాహరణకు సూరె జాథియాలోని ఆయత్ నంబర్ 18: “సుమ్మ జఅల్నాక అలా షరీఅతిమ్ మినల్ అమ్రి ఫత్తబిఅహా వలా తత్తబిఅ అహ్వా అల్లజీన లా యఅలమూన్” (ثُمَّ جَعَلْنَاكَ عَلَىٰ شَرِيعَةٍ مِّنَ الْأَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ لَا يَعْلَمُونَ). (మేము నిన్ను ధర్మానికి సంబంధించిన ఒక రాజబాటపై నిలబెట్టాము. అయితే నీవు దీనిని అనుసరించు. జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు). అల్లాహ్ పంపిన షరీఅత్, అల్లాహ్ పంపిన ధర్మం దానినే మనం అనుసరించాలి అని అల్లాహ్ మనకు ఆదేశిస్తున్నాడు.
అలాగే మహాశయులారా, మూడవ విషయం, ఇస్లాంలో పండుగలు, ఈద్ అని ఏదైతే మనం అంటామో, ఎన్ని ఉన్నాయి సంవత్సరానికి? రెండు మాత్రమే. ఒకటి ఈదుల్ అద్హా, ఇంకొకటి ఈదుల్ ఫితర్. ఈదుల్ ఫితర్, ఈదుల్ అద్హా ఈ రెండు మాత్రమే. సునన్ అబీ దావూద్ లోని సహీహ్ హదీస్, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు పండుగగా, ఈద్‌గా కొన్ని రెండు రోజులు జరుపుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోకూడదు అని, వారిని ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోవడాన్ని నిషేధించి, రద్దు చేసి, “ఖద్ అబ్దలకుముల్లాహు బిహిమా ఖైరమ్ మిన్హుమా” (قَدْ أَبْدَلَكُمُ اللَّهُ بِهِمَا خَيْرًا مِنْهُمَا). (అల్లాహుతాలా మీ కొరకు ఆ రెండు రోజుల కంటే మరీ ఉత్తమమైన వేరే రెండు రోజులు మీకు ప్రసాదించాడు, వాటిని మీరు పండుగగా జరుపుకోండి, ఈద్‌గా జరుపుకోండి అని తెలిపారు). ఆ రెండు ఏమిటి? ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా. ఈ విధంగా సంవత్సరంలో ఇక మూడవ ఈద్, మూడవ పండుగ ముస్లింలకు ఏదీ లేదు. మూడవ పండుగ, మూడవ ఈద్ ఏదైనా ఉండేది ఉంటే, అది వారంలో ఒకసారి జుమా రోజు. జుమా కూడా ఈదుల్ మూమినీన్ అని చెప్పడం జరిగింది.
ఇక మీలాదున్నబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు, దానిని ఈద్ అని ఏదైతే ఈ రోజుల్లో అనడం జరుగుతుందో, ఈద్ మీలాదున్నబీ అని, ధర్మపరంగా దానిని ఈద్ అని అనడం కూడా తప్పు, అలాగే దానిని ఈద్‌గా జరుపుకోవడం కూడా తప్పు. ఒకవేళ ఎవరైనా, సరే మంచిది, దానికి ఈద్ అన్న పదం మేము తీసేస్తాము, మీలాదున్నబీ అని జరుపుకుంటాము అని అంటే, అది కూడా కుదరని పని.
కానీ ఇంతవరకే విషయం సరిపోదు. మరికొందరు ఒక రాంగ్ క్వశ్చన్, ఒక అడ్డ ప్రశ్న వేస్తారు. అదేమిటంటే, సరే మంచిది, ఈద్ అని దానికి పేరు పెట్టుకోము. మీలాదున్నబీ అన్న పేరుతో ఆ రోజును మేము గడుపుకోవడం, ఒక సంతోషంగా, సంతోషక దినంగా భావించి జరుపుకోవడం, ప్రజల్ని ఆ రోజు ఒకచోట జమా చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర తెలపడం, ఇందులో ఏమిటి తప్పు? పాపం ఏమున్నది ఇందులో? ఇలా అడ్డంగా ప్రశ్నిస్తారు. అయితే, ఇందులో పాపం ఏమున్నదో, అది ఇప్పుడే తెలియజేస్తాను, కానీ దానికంటే ముందు ఒక విషయం మనం ఆలోచించాలి. అదేమిటి?
ఇది ఒకవేళ మంచి విషయం అని మనం భావించి చేస్తూ ఉండేది ఉంటే, నవూజుబిల్లాహ్, అస్తగఫిరుల్లాహ్, ఈ యొక్క మంచి విషయం మనకు తెలపడం అల్లాహ్ మర్చిపోయాడా? నవూజుబిల్లాహ్, అస్తగఫిరుల్లాహ్. అల్లాహ్ ప్రవక్తకు తెలియజేశారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలపడం మర్చిపోయారా? అలా ఏమైనా ఉందా? గమనించండి. ఈ రోజు ఇందులో తప్పేమున్నది? మనం మంచి పనులే చేస్తాము కదా ఈ రోజుల్లో. అయితే, మనం మన ఇష్టానుసారం ఏ పనినైనా మంచిదిగా భావించి చేయడం, ఇది ధర్మం కాదు. ఇది అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో స్వీకరించబడదు. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త తెలిపిన విషయాన్నే మనం ఆచరించాలి.
ఇక నష్టం ఏమిటి? అందులో వేరే ఏ చెడు పని చేయకున్నా, మహా నష్టం ఇప్పుడే నేను మీకు తెలియజేసినట్లు, ఒకవేళ అది మంచి పని అని మనం చేస్తూ ఉంటే, ఆ మంచి పని విషయంలో అల్లాహ్ లేదా అల్లాహ్ యొక్క ప్రవక్త మర్చిపోయారా? ఇటువంటి ఒక పెద్ద అభాండం ఏర్పడుతుంది. రెండవ విషయం, ఒకవేళ ఇది చెడైతే ఏమీ కాదు, మంచి అని అని మనం చేసుకుంటూ ఉంటే, మనకంటే ఎక్కువగా ధర్మం పట్ల ప్రేమ కలిగిన సహాబాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకంటే ఎక్కువగా ప్రేమించేవారు సహాబాలు. సహాబా కంటే ఎక్కువ మనం ప్రేమిస్తామా ప్రవక్తను? చెప్పండి. మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నామా ప్రవక్తను లేక సహాబాలు ఎక్కువ ప్రేమించేవారా? సహాబాలు కదా. అయితే వారు మరి ఈ విషయం పాటించలేదు కదా?
ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాలు. అందుగురించి ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఒక సందర్భంలో ఏమి చెప్పారు? ఎవరైతే ఒక పని ఇస్లాంలో కొత్తగా ఏర్పాటు చేసి దానిని ఆచరిస్తాడో, అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఒక మహా అపనింద, ఒక పెద్ద అబద్ధాన్ని మోపుతున్నాడు. ఎందుకు? “ఇది మంచి కార్యం, ఇది సత్కార్యం, ఇది చాలా అల్లాహ్‌కు ఇష్టమైన పని” అని మనం అంటుంటే, అల్లాహుతాలా మర్చిపోయాడు లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలియజేయడం మర్చిపోయాడు అని ఈ విధంగా, “ఫఖద్ ఖాన రిసాలా” (فقد خان الرسالة) (సందేశాన్ని అందజేయడంలో మోసం చేశాడు). ప్రవక్త రిసాలత్, సందేశం అందజేయడంలో, నవూజుబిల్లాహ్, అమానత్ పాటించలేదు అన్నటువంటి ఒక పెద్ద అపనింద ప్రవక్తపై వస్తుంది. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇక, ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి. అర్థమయ్యాయి కదా? అయితే, ఇదే విషయాన్ని మరో రకంగా కూడా కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో ఎందరో ముస్లిం సోదరులని మనం మీలాదున్నబీ జరుపుకుంటున్నది చూస్తూ ఉన్నాము. చూస్తున్నాము కదా? అచ్చా, మీలాదున్నబీ అంటే ఏంటో తెలుసా? మీలాదున్నబీ అన్న ఈ అరబీ పదానికి భావం ఏంటి? ప్రవక్త బర్త్‌డే. నబీ అంటే ప్రవక్త, మీలాద్ అంటే “ఉష్ మీలాద్ అంతా?” (وش ميلادك أنت؟) (నీ పుట్టినరోజు ఏది?). నీ జన్మదినం ఏది? నీ బర్త్‌డే ఏది? అని మనం సామాన్యంగా అరబీలో అడుగుతాము కదా.
అయితే మహాశయులారా, ఇస్లాంలో మనం మన బర్త్‌డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ప్రవక్తల బర్త్‌డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ఇంకా ఏ పుణ్యపురుషులు, మహాభక్తులు, ఔలియా అల్లాహ్, బుజుర్గ్ బాబా, అచ్చే అచ్చే లోగా, ఈ విధంగా ఎవరి ఏ బర్త్‌డేలు, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉందా? లేదు. “అరే ఏం చేయమండి మేము? కేవలం ఆ రోజు మేము పుట్టిన దినం అని చాక్లెట్లు పంచుకుంటాము. ఆ రోజు మేము పుట్టిన దినము అని అందరం ఒకచోట జమా అయ్యి కేక్ తీసుకొచ్చి దాన్ని కోసి మేము అందరం కలిసి తింటాము. ఇందులో మేమేం హరామ్ కార్యం చేస్తున్నాము?” అని అంటారు. కానీ ఇది ఇస్లాంకు సంబంధించిన విషయం ఎంత మాత్రం కాదు.
ఇంకా మహాశయులారా, ఎందరో సోదరులు ఈద్-ఎ-మీలాదున్నబీ పాటిస్తున్నారు. కానీ వారి యొక్క ఈ మీలాదున్నబీ ఉత్సవాల విషయం మరియు వారు చెప్పే మాటలలో ఎన్నో రకాల వైరుధ్యం కనబడుతుంది. కాంట్రడిక్షన్. ఏ విధంగా? ఒక మౌల్వీ సాబ్ ప్రసంగం చేస్తూ ఏమన్నాడు? మనం తప్పకుండా మీలాదున్నబీ ఉత్సవాలు పాటిస్తూ ఉండాలి. దీనికి మనకు ఆధారాలు కూడా ఉన్నాయి, అని చెప్పుకొచ్చాడు. ఇక దానికి దలీల్ ఉంది, ఆధారం ఉంది అని అంటే, ప్రజలు చాలా సంతోషపడిపోతారు కదా. ఏంటి ఆధారం అండి? సహీహ్ ముస్లిం షరీఫ్‌లో హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు. అయితే, ప్రవక్తా మీరు ఎందుకు ఉపవాసం ఉంటారు అని ప్రవక్తను ప్రశ్నించినప్పుడు, “జాక యౌమున్ వులిద్తు ఫీహి” (ذَاكَ يَوْمٌ وُلِدْتُ فِيهِ) (అది నేను జన్మించిన రోజు). నేను ఆ సోమవారం రోజున జన్మించాను గనుక నేను ఉపవాసం ఉంటున్నాను. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ జన్మదిన వేడుకలు పాటిస్తూ ఉన్నారు. మనం కూడా పాటించడం చాలా మంచిది.
కానీ అస్తగఫిరుల్లాహ్! వాస్తవంగా ఈ హదీస్ ముస్లిం షరీఫ్‌లో ఉన్నది వాస్తవమే. కానీ దీని ద్వారా మీలాదున్నబీ మనం చేసుకోవచ్చు అన్నదానికి ఏదైతే ఆధారం తీసుకుంటున్నారో, ఆ ఆధారం కుదరదు. ఎందుకు కుదరదు? గమనించండి. మొదటి విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు హదీస్ ప్రకారంగా? ఉపవాసం పాటించేవారు, రోజా రఖ్తే థే. ఉపవాసం పాటించేవారు. మరి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నారు? మీలాదున్నబీ అని ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నారో, ఉపవాసమే పాటిస్తున్నారా కేవలం? విరుద్ధమా లేదా?
రెండో రకంగా చూసుకోండి. ఈద్-ఎ-మీలాదున్నబీ అని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి ఈద్ రోజున ఉపవాసం ఉండవచ్చా? వేరొక హదీస్‌లో ఉంది, అది కూడా సహీహ్ హదీస్. ఎవరైతే సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చి ఉంది. ఎవరైతే పండుగ రోజు ఉపవాసం ఉంటారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవిధేయులు. నాఫర్మానీ చేసేవాళ్ళు. అయితే ఇక చెప్పండి. ఈద్ అని అంటున్నారు, ప్రవక్త ఉపవాసం ఉండే ఆ హదీస్ ద్వారా దలీల్ తీసుకుంటున్నారు. మరి ఈద్ రోజున, పండుగ రోజున ఉపవాసం ఉండరాదు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవూజుబిల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, అస్తగఫిరుల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, ప్రవక్త స్వయంగా పండుగ రోజు ఉపవాసం ఉండరాదు అని, పండుగ రోజు ఉపవాసం ఉన్నారా? ఇది మీలాదున్నబీ అని అంటున్నారు కదా.
ఇంకా మూడో రకంగా దీన్ని ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం, అంటే సోమవారం సంవత్సరంలో ఒకసారి వస్తుందా? వారంలో ఒకసారి. అయితే వారంలో ఒకసారి వచ్చేదాన్ని, ఉపవాసం పాటించేదాన్ని వదిలేశారు, సంవత్సరంలో ఒకసారి ఈద్-ఎ-మీలాదున్నబీ అని జరుపుకుంటున్నారు. ఇది ఎక్కడ కుదురుతుంది? గమనించండి.
ఈ రకంగా చూసుకుంటూ పోతే, నాలుగో విషయం గమనించండి. అదేమిటి? సామాన్యంగా ఎవరైతే మీలాదున్నబీ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారో, సామాన్యంగా మీలాదున్నబీ ఉత్సవాలు ఎవరు జరుపుతారు? తమకు తాము మేము ముఖల్లిద్‌లం. ఏదైనా ఒక ఇమామ్‌ను పట్టుకోవాలి, ఏదైనా ఒక ఇమామ్ యొక్క తఖ్లీద్ తప్పకుండా చేయాలి, అని అంటూ ఉంటారు కదా. అలాంటివారే మరొక విషయం ఏమంటారు? వారిలోని పండితులు కూడా, అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక, వారిలోని పండితులు కూడా ఏమంటారు? మేము ఇజ్తిహాద్ చేయడానికి, ఖురాన్ హదీస్ ద్వారా విషయాలు గ్రహించడానికి, మన ముందు ఉన్న సమస్యలకు ఖురాన్ హదీస్ ద్వారా పరిష్కారం వెతకడానికి మాకు అనుమతి లేదు. మేము ఏ ఇమామ్ యొక్క తఖ్లీద్ పాటిస్తున్నామో, ఆ ఇమామ్ ఏం చెబితే అదే మేము చేయాలి. అయితే, అటువైపున తప్పకుండా తఖ్లీద్‌ను పాటించాలి అని అంటారు. ఇటు ఈద్-ఎ-మీలాదున్నబీ వచ్చినప్పుడు స్వయంగా వారే దలీల్‌లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. మరి ఇమామ్‌ల విషయం చూస్తే, ఏ ఒక్క ఇమామ్ కూడా మీలాదున్నబీ చేయాలని చెప్పలేదు. విషయం అర్థమవుతుందా? నమాజ్ విషయానికి వస్తే ఉదాహరణకు, ఎందుకు మీరు ఇలా నమాజ్ చేస్తున్నారు? ప్రవక్త యొక్క విధానం ఇది కదా అంటే, లేదు లేదు మేము ఫలానా ఇమామ్‌ను అనుసరిస్తాము. హమ్ ఫలా ఇమామ్ కే ముఖల్లిద్ హై. ఈ విధంగా అంటారు. ఇక మీలాదున్నబీ వచ్చే విషయం వచ్చేసరికి, స్వయంగా ఎన్నో దలీల్ ఆధారాలు వెతుకుతూ వెతుకుతూ వేటికి తీసుకొస్తారు. ఈ రకంగా కూడా…
ఇంకా మహాశయులారా, మరికొందరు ఏమంటారో తెలుసా? మీరు ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అంటారు కదా. ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి. అర్థమవుతుందా? ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి అని అంటారు. మరి వారితోనే ఈ ప్రశ్న అడిగితే, ఏమని? ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి. ఈద్-ఎ-మీలాదున్నబీ అన్న పదాలతో. ఎక్కడా లేదు హదీసులలో. సోమవారం రోజు ఉపవాసం ఉండేవారు ప్రవక్త. హదీస్ ఏదైతే వచ్చి ఉందో, దాని ద్వారా దలీల్ తీసుకుంటున్నారు. ఇంకా వేరే ఎలాంటి దలీల్‌లు నేను చూపిస్తాను ఇన్షా అల్లాహ్, అందులో కూడా భావం వారు తప్పుగా ఎలా తీసుకుంటున్నారో. అయితే, ఈద్-ఎ-మీలాదున్నబీ చేయకూడదు అని దలీల్ మాతోనే అడుగుతున్నారు. అప్పుడు మేమే అడిగినప్పుడు, ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి అంటే, వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడా దలీల్ లేదు.
ఇక మాట వచ్చింది గనుక ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అదేమిటంటే, ఆరాధనలు, ఇబాదాత్, వీటిలో దలీల్, ఆధారం చేయడానికి ఉండాలి. ప్రవక్త ఇలా చేశారు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు అని చేయడానికి ఆధారం ఉండాలి. చేయకూడదు అన్నదానికి కాదు. మరియు ఏ విషయం చేయమని ఉందో, అది మాత్రమే మనం చేయాలి. ఏ విషయం ప్రస్తావన లేదో, దానిని చేయకూడదు. ఎందులో ఇది? ఇబాదాత్‌లో, ఆరాధనలలో. ఉదాహరణకు, ఉపవాసం, రోజా, మంచి విషయమేనా కాదా? అల్లాహ్‌కు చాలా ఇష్టమైన సత్కార్యం కదా. రమదాన్‌లో ఇది ఫర్జ్, విధి. ఎవరైనా ఒక మనిషి వచ్చి, ఎవరైనా ఒకరు వచ్చి, ఇస్లామీయ ప్రకారం నాలుగో నెల రబీఉల్ ఆఖర్. ఇందులో కూడా మనం ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే మనకు ఇలాంటి లాభాలు అని చెప్తే, దానిని మనం ఒప్పుకోవచ్చా? ఎక్కడుంది ఆధారం చూపించు.
ఇప్పుడు ఆ మనిషి మళ్లీ, రబీఉల్ అవ్వల్‌లోని ఈ మాసంలో ఉపవాసాలు ఉండకండి అని ప్రవక్త ఎక్కడైనా చెప్పారా అని మనకు అడ్డ ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నయే తప్పు అక్కడ. అర్థమైందా? ఉదాహరణకు నమాజ్ విషయం తీసుకోండి. నమాజ్ విషయం. ఐదు పూటల నమాజ్‌లు విధి అని మనకు తెలుసు కదా. ఇవి కాకుండా ఫర్జ్ నమాజ్‌ల కంటే ముందు సున్నతులు, ఫర్జ్ నమాజ్‌ల కంటే తర్వాత సున్నతులు, నఫిల్ నమాజ్‌లు, ఇంకా వేరే చాష్త్, సలాతుల్ ఇస్తిస్కా వర్షం గురించి నమాజ్, సలాతుల్ కుసూఫ్ సూర్య గ్రహణ, చంద్ర గ్రహణ నమాజ్‌లు, జుమ్మా నమాజ్, ఈ విధంగా ఎన్నో రకాల నమాజ్‌లు ఉన్నాయి కదా. వాటన్ని వివరాలు వచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి 15వ తారీఖు షాబాను రాత్రి ఎవరైనా 100 రకాతుల నమాజ్‌లు చేసి, ప్రతి ఒక్క రకాతులో 10, 10 సార్లు ఖుల్ హువల్లాహ్ చదవాలి సూరె ఫాతిహా తర్వాత అని ఈ విధంగా ఒక పద్ధతి మనకు నేర్పుతే, మనం ఏమడుగుతాము? నమాజ్ మంచి విషయమే. కానీ ఈ విధంగా ఒక తారీఖు ముకర్రర్ చేసి, ఒక పద్ధతి నిర్ణయించి నువ్వు ఏదైతే చెబుతున్నావో, దానికి ఏమిటి ఆధారం? ఆ, 15వ తారీఖు షాబానున ఈ రకంగా నమాజ్ చేయవద్దు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించు అని అంటే? అతని ఆ ప్రశ్నయే అడ్డ ప్రశ్న, అలా అడగడమే తప్పు. ఇప్పుడు మాట అర్థమైంది కదా? ఇంతకంటే మరొక చిన్న ఉదాహరణ ఇచ్చేసి నేను ఇక ముందుకు వెళ్తాను. అదేమిటి?
ప్రతి రోజు మనం అజాన్ వింటున్నాము కదా? అజాన్ యొక్క చివరి పదాలు ఏంటి చెప్పండి? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. సామాన్యంగా మనం వుజూ చేసుకున్న తర్వాత గాని, తషహుద్‌లో గాని, వేరే సందర్భాల్లో అవ్వల్ కలిమా తయ్యిబ్ ఏమంటాము తర్వాత? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం కదా, చదివేవాళ్ళం కదా. ఆరు కల్మాల యొక్క వాస్తవికత మరి ఎప్పుడైనా తెలియజేస్తాను ఏంటి అనేది. దానిలో ఉన్న బిద్అతులు ఏంటి అది మరి ఎప్పుడైనా తెలుసుకోండి. కానీ ఇక్కడ అవ్వల్ కలిమా తయ్యిబ్ అని మనలో చాలా ఫేమస్ ఉంది, చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటూ వస్తాము. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. కదా? ఇప్పుడు ఎవరైనా అజాన్ తర్వాత చివరిలో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, మంచిదేనా? ఎందుకు? మంచిది కాదు అని అంటున్నాము కదా మనం, ధర్మం కాదు అని అంటున్నాము కదా. అయితే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ఈ పదం తప్పా? కాదు. ఇక్కడ ఏమంటాము మనం? ప్రవక్త ఇంతే మనకు నేర్పారు ఇక్కడ అజాన్‌లో. లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వేరే సందర్భాల్లో చదువుతాం మనం. వుజూ చేసిన తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్ అని చదువుతాము. తషహుద్‌లో ఉన్నప్పుడు కూడా మనము అవన్నీ ఎక్కడ చదువుతాము. ఎక్కడ ఏ విధంగా నేర్పారో అక్కడ అలా చదువుతాము. కానీ అజాన్ తర్వాత ఇక్కడ మనకు ఏం నేర్పబడింది? కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ మీద చదివి అజాన్ ఆపేసేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడ్డ ప్రశ్న అడిగితే, అరే నేను ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కూడా అంటానయ్యా. ఎక్కడైనా ఉందా హదీస్‌లో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చెప్పొద్దు అజాన్ చివరలో అని? అంటే ఏమంటాము? నీ ప్రశ్నయే తప్పు ఇక్కడ. అర్థమైంది కదా? ఆరాధనలలో ప్రవక్త ఎలా చేశారు, ఎలా చేయాలని చెప్పారు, ఎలా చేయాలని అనుమతించారు, లేదా అల్లాహ్ ఎలా మనకు ఆదేశించాడు, అలాగే చేయాలి. కానీ వివిధ జీవితంలోని విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఆమలాత్ అని దేనినైతే అనబడడం జరుగుతుందో, పెళ్లిళ్లు గాని, ఇంకా వ్యాపారాలు గాని, లావాదేవీలు గాని, ఇవన్నిటిలో, భోజనాలు తినే, త్రాగే విషయాల్లో, దుస్తులు ధరించే విషయాల్లో, ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో నహీ, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. పురుషులు చీలమండలానికి కిందిగా డ్రెస్ తొడుగకూడదు. భోజనం చేసేటప్పుడు ఆనుకొని, టేకా తీసుకొని తినకూడదు. ఈ విధంగా ఏ విషయాల నుండి మనల్ని నివారించడం జరిగిందో, వాటికి మనం దూరంగా ఉండాలి. అవి తప్ప మిగతావన్నీ కూడా హలాల్‌గా పరిగణించడం జరుగుతుంది. ఇంకా వేరే ఎన్నో ఆయతులు ఉన్నాయి, హదీసులు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే రండి ఇక.
చాలా దూరం వెళ్ళిపోలేదు. ఈద్-ఎ-మీలాదున్నబీ విషయం ఏదైతే ఉందో, దాని విషయంలో కూడా ఈద్-ఎ-మీలాదున్నబీ చేయకూడదు అని దలీల్ ఎక్కడుంది చూపించండి అని అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నయే తప్పు. ప్రవక్త ఎక్కడ చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించినది. ఆ తర్వాత 23 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆ తర్వాత సహాబాలు ఇంచుమించు 100 సంవత్సరాల వరకు ఉన్నారు. చివరి సహాబీ 110 లో చనిపోయారు. ఆ తర్వాత తాబయీన్ కాలం, ఆ తర్వాత తబఎ తాబయీన్ కాలం. సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ప్రకారంగా, “ఖైరుల్ ఖురూని ఖర్నీ సుమ్మల్లజీన యలూనహుమ్ సుమ్మల్లజీన యలూనహుమ్” ( خَيْرُ الْقُرُونِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ). (అనువాదం: నా కాలం, నా తర్వాత వచ్చే కాలం, ఆ తర్వాత వచ్చే కాలం, సర్వ కాలాల్లో అతి ఉత్తమమైన కాలాలు ఇవి మూడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు). అలాంటి ఉత్తమమైన కాలంలో ఈ బిద్అత్ లేనే లేదు.
అందుగురించి మహాశయులారా, ఇది మంచి కార్యమే కదా, ఎందుకు చేయకూడదు? ఇలాంటి ప్రశ్నల్లో మనం పడే అవసరం లేదు. ప్రవక్త గారు చేశారా? సహాబాలు చేశారా? సహాబాలను అనుసరించినవారైనటువంటి తాబయీన్‌లు చేశారా? ఈ విషయం మనం చూడాలి. మరొక విచిత్రమైన విషయం, అదేమిటంటే కాంట్రడిక్షన్. ఎవరైతే సామాన్యంగా మీలాదున్నబీ జరుపుకుంటూ ఉంటారో, ఏ తారీఖున జరుపుకుంటారు? తారీఖు తెలియదా? 12 రబీఉల్ అవ్వల్. కదా? అయితే ఈ తారీఖు అని మనం ఏదైతే అంటామో, డేట్, ఇవి ఎప్పటి నుండి ఉన్నాయి? ఎప్పటి నుండి? భూమి, ఆకాశాలు, సూర్య, చంద్రులు అప్పటి నుండి, అవును కదా? “ఇన్న ఇద్దతష్షుహూరి ఇందల్లాహి ఇస్నా అషర షహ్రన్ ఫీ కితాబిల్లాహ్” సూరె తౌబా లోని ఆయత్. అయితే, మీలాదున్నబీ జరుపుకునే వాళ్లలో అధికులు, ఇంచుమించు అందరూ ప్రవక్త గారి గురించి ఒక మాట వారి వద్ద ఏమున్నదంటే, నవూజుబిల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, ఒక హదీస్ అని వారు అంటారు కానీ హదీస్ కాదు అది. “అవ్వలు మా ఖలఖల్లాహు నూరీ” (أَوَّلُ مَا خَلَقَ اللَّهُ نُورِي) (అనువాదం: అల్లాహ్ సృష్టించిన వాటిలో మొదటిది నా జ్యోతి). ప్రప్రథమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నూర్‌ను అల్లాహుతాలా పుట్టించాడు, ఆ తర్వాతనే ఈ లోకమంతా పుట్టించబడింది అని. మొట్టమొదటిసారిగా, తొలిసారిగా, ప్రప్రథమంగా ఎవరిని పుట్టించడం జరిగింది అంటారు వాళ్ళు? సహీహ్ హదీస్ లేదు దానికి కానీ వారు చెప్పే ప్రకారంగా ఎవరిని పుట్టించడం జరిగింది? ప్రవక్త గారి నూర్‌ను. అంటే వారి ప్రకారంగా ప్రవక్త అందరికంటే మొదటిసారిగా పుట్టించబడ్డారు. అయితే మీ విశ్వాస ప్రకారం ప్రవక్త పుట్టినప్పుడు సూర్య చంద్రులు లేవు, భూమి ఆకాశాలు లేవు, పగలు రాత్రి అనేదే లేదు, డేట్ అన్నదే లేదు. మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఎందుకు మళ్ళీ బర్త్‌డేలు జరుపుకుంటున్నారు? అర్థమైందా? అర్థమైందా లేదా విషయం? మీ విశ్వాస ప్రకారం అందరికంటే ముందు ఎవరు పుట్టారు? ప్రవక్త, ప్రవక్త యొక్క నూర్. అప్పుడు సూర్య చంద్రులు, ఈ నక్షత్రాలు, ఈ లోకమే లేదు. మరి ఈ తారీఖు అన్న విషయం, డేట్ అన్న విషయం భూమి ఆకాశాలు పుట్టి, సూర్య చంద్రులు తర్వాత కదా? రాత్రి, పగలు ద్వారా మనకు డేట్స్ అనేది ఏర్పడతాయి. ఈ విధంగా వారి మాటయే వారికి విరుద్ధంగా ఉంది.
మరొక విచిత్రమైన విషయం. ఒక మౌల్వీ సాబ్ చాలా పుస్తకం రాశారు, మీలాదున్నబీ చేయవచ్చు అని రుజువు చేయడానికి. స్వయంగా ఆయన ఒకచోట ఏం రాశాడో తెలుసా? ఒక్కచోట రాయలేదు, ఒక హెడ్డింగ్, ఒక సైడ్ హెడ్డింగ్ అని ఏదైతే అంటారో. ఖులఫాయే రాషిదీన్ మరియు సహాబాల కాలంలో మీలాదున్నబీ జరుపుకోకపోవడానికి కారణాలు. అంటే, సహాబాల కాలంలో మీలాదున్నబీ జరగలేదు అని ఒప్పుకుంటున్నారు. కానీ ఇక తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు? కొన్ని కారణాలు తెలుపుతున్నారు. అయితే ఎప్పుడైతే వారు ఒప్పుకుంటున్నారో సహాబాలు కూడా దీనిని చేయలేదు అని, అంటే ఇక ఖురాన్ హదీస్‌లో లేనట్లే కదా. మళ్ళీ మీలాదున్నబీ జరుపుకోవడానికి ఆ ఆయత్ కూడా ఉన్నది, ఫలానా ఆయత్ ఉన్నది, ఫలానా హదీస్ ఉన్నది, ఫలానా హదీస్ ఉన్నది అని అంటే, ఈ రోజు ఈ హదీసులు, ఈ ఆయతులతోనైతే మీరు దలీల్ చూపుతున్నారో, ఆ ఆయతులు, ఆ హదీసులు సహాబాలకు తెలియలేదా? మరి తెలిస్తే వారెందుకు జరుపుకోలేదు? గమనించండి.
మరియు మన ఏ సోదరులైతే మీలాదున్నబీ జరుపుకుంటున్నారో, వారు ఈ విషయాలపై గ్రహించాలి, ఆలోచించాలి. సూరె యూనుస్ ఆయత్ నంబర్ 57, 58 ద్వారా మీలాదున్నబీ చేయవచ్చు అన్నటువంటి ఒక ఆధారం, సాకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. గమనించండి కొంచెం. “కుల్ బి ఫద్లిల్లాహి వ బిరహ్మతిహి, ఫబిజాలిక ఫల్ యఫ్రహూ” (قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا). బి ఫద్లిల్లాహి, అల్లాహ్ యొక్క దయ, వ రహ్మతిహి, అల్లాహ్ యొక్క కారుణ్యం. అల్లాహ్ యొక్క దయ మరియు కారుణ్యం మీకు లభించినది అంటే, మీరు సంతోషించండి. ఖురాన్ యొక్క ఆయత్ యొక్క భావం, తర్జుమా. కానీ ఉర్దూలో అల్లాహ్ కా ఫజ్ల్ ఔర్ ఉస్కి రహ్మత్ జబ్ యే పాయే తో వో ఖుష్ హో జాయే. సంబరపడాలి, సంతోషించాలి. దాంట్లో కొంచెం పదం ఏలుపు… పెంచుతారు. ఖుషీ మనాయో. ఖుష్ హో జావో, ఖుషీ మనాయో. సంతోషించండి, సంబరపడండి. సంతోషాలను, మీ సంబరాలను ఒక ఉత్సవంగా జరుపుకోండి. ఈ రెండిటిలో తేడా ఉందా లేదా? ఒక నిమిషం.
అయితే ఇది 58వ ఆయత్. కానీ ఈ అల్లాహ్ యొక్క దయ, ఈ అల్లాహ్ యొక్క కారుణ్యం, అల్లాహ్ దేని గురించి చెప్తున్నాడు? ఏంటిది అది? అయితే 57వ ఆయత్‌లో ఉంది. “యా అయ్యుహన్నాసు కద్ జాఅత్కుమ్ మౌఇజతుమ్ మిర్రబ్బికుమ్” (يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ). ఖురాన్ గురించి. అంటే ఈ ఖురాన్ గ్రంథం అల్లాహ్ యొక్క గొప్ప దయ, అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యం. ఇది రావడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి రోగాలు దూరమైపోయినాయి, మీలో ఉన్నటువంటి పరస్పరం కోపాలు, ద్వేషాలు ఇవన్నీ దూరమయ్యాయి, షిర్క్, బిద్అతులు ఇవన్నీ దూరమైపోయాయి, విశ్వాస మార్గం మీకు లభించినది, మీ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో దుర్మార్గాలు కూడా దూరమైపోయి మీరు సన్మార్గం వైపునకు వచ్చారు. ఖురాన్ అల్లాహ్ యొక్క గొప్ప దయ, గొప్ప కారుణ్యం. ఇది వచ్చినప్పుడు మీరు దీనిని సంతోషించాలి. అయితే ఏమంటారో తెలుసా? ఖురాన్ అవతరించినప్పుడు అల్లాహ్ దీనిని ఒక గొప్ప కారుణ్యం, గొప్ప దయ అని తెలిపి సంతోషపడాలి, సంతోషించాలి, ఉత్సవాలు జరుపుకోవాలి అని ఏదైతే మనకు అల్లాహ్ తెలుపుతున్నాడో, ఈ ఖురాన్ ఎవరి ద్వారా వచ్చింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రవక్త పుట్టిన రోజును మనం ఎంత గొప్పగా జరుపుకోవాలి, మీరే ఆలోచించండి. ఓ నిజంగానే చాలా గొప్ప విషయం అని ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ మళ్ళీ ప్రశ్న, అదేంటి? ఈ ఆయత్ ఎవరిపై అవతరించింది? ఈ రోజు మనపై అవతరించిందా? మీలాదున్నబీ జరుపుకునే వాళ్ళ మీద అవతరించిందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. మరి ప్రవక్త ఇలాంటి మీలాదున్నబీ జరుపుకోవాలి అని ఈ ఆయత్ ద్వారా ఎక్కడైనా చెప్పారా? మరి ఈ విషయం సహాబాలకు బోధపడలేదా? ఈ రోజు ఈ భావం తీసుకోవడానికి ఎక్కడ మనకు హక్కు ఉన్నది?
మరియు ఖురాన్ హదీసులను మనం పరిశీలిస్తే, అక్కడ మనకు తెలిసే విషయం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టుకను కేవలం గొప్ప కారుణ్యంగా చెప్పలేదు అల్లాహుతాలా. ఏ రోజు ప్రవక్తకు ప్రవక్త పదవి లభించినదో, ఏ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ లభించినదో, దానిని అల్లాహుతాలా ఒక గొప్ప కారుణ్యంగా చెబుతున్నాడు. సూరె ఆలి ఇమ్రాన్‌లో “లఖద్ మన్నల్లాహు అలల్ ముఅమినీన ఇజ్ బఅస ఫీహిమ్” ( لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ). అల్లాహుతాలా విశ్వాసులపై ఎంతో అనుగ్రహించాడు. “ఇజ్ బఅస ఫీహిమ్” ( إِذْ بَعَثَ فِيهِمْ) (వారిలో ఒక ప్రవక్తను పంపినప్పుడు). ఎలా? వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి మధ్య ఒక సందేశ దూతగా అల్లాహుతాలా పంపాడు. ఆ సందేశ దూత ఖురాన్ ఆయతులను పఠిస్తారు వారి మధ్యలో. మరియు వారిని శుభ్రపరుస్తారు. చక్కదిద్దుతారు. వారికి ఖురాన్, హదీసులను నేర్పుతారు. గమనించండి. ఖురాన్, హదీసులను నేర్పడం, అల్లాహ్ ఆయతులను పఠించడం, ప్రజలను షిర్క్, దుర్మార్గం, బిద్అత్, అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు తీసుకురావడం, దీనిని ఒక గొప్ప అనుగ్రహంగా ప్రస్తావిస్తున్నారు. మరి ఇంతకుముందు మనం ముస్లిం షరీఫ్ హదీస్ ఏదైతే విన్నామో, అందులో మరొక విషయం కూడా ఉన్నది. అదేమిటి?
ప్రవక్తా, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఈ సోమవారం రోజున అని అడిగినప్పుడు, ఇదే రోజు నేను పుట్టాను, జన్మించాను. “వ బుఇస్తు” ( وَبُعِثْتُ). మరియు అదే రోజు నాకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవి లభించినది. అయితే ఈ ప్రవక్త పదవి లభించడం, ప్రవక్తకు ప్రవక్త పదవి లభించి మనకు ఏ సన్మార్గం అయితే లభించినదో, ఇది చాలా గొప్ప విషయం.
అందుగురించి సోదరులారా, ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే, గ్రహిస్తూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. చివరికి ఒక సంక్షిప్తంగా, ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం మీలాదున్నబీకి సంబంధించిన ఒక తెలుగులో ఒక టాపిక్, ఒక ప్రసంగం చేశాను. అందులో ఈ బిద్అత్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది కూడా వివరంగా తెలిపాను, తెలియజేశాను. కానీ మన అఖండ భారత్‌లో అంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇదంతా విడిపోక ముందు, సంగతి గురించి అప్పుడు తొలిసారిగా మన ఏరియాలో, భారతదేశంలో ఈ మీలాదున్నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, ఆ జులూస్ 5 జులై 1933లో స్టార్ట్ అయింది అని, ఈ మీలాదున్నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, అది 5 జులై 1933లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన అక్కడ జరుగుతుంది. వారి నుండి దీని గురించి ప్రత్యేకమైన లైసెన్స్ తీసుకొని వారు కొందరు దీనిని చేశారు. దీనిని ఇలా జరుపుకోవడానికి కారణం ముఖ్యంగా ఏంటో తెలుసా? పండితులు కాదు దీనిని స్టార్ట్ చేసిన వారు.
క్రైస్తవులు, ఇంకా వేరే మతస్తులు వారి మత పెద్దల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. జరుపుకుంటూ ఉంటారు కదా? క్రిస్మస్ అని కానీ, గాంధీ జయంతి అని కానీ, ఇంకా అంబేద్కర్ గారు జన్మించిన జన్మదినం గాని, ఇంకా వేరే ఎన్నో రకాలుగా ఎందరో పెద్దలు, మహానుభావుల జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళందరూ వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నప్పుడు, మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పవారు ఎవరు? వారి యొక్క జన్మదిన వేడుకలు మనం ఎందుకు జరుపుకోకూడదు? మనం ఆ రోజున ఎందుకు జులూస్ తీయకూడదు? ఇలాంటి ఆలోచన వారిలో వచ్చి, ఇలాంటి ఒక బిద్అత్‌కు వారు ఒక పునాది నాటారు. అప్పటి నుండి ఇది మొదలైంది ఈ ఏరియాలో. మరి ఇక్కడ మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గ్రహించాలి. “మన్ తషబ్బహ బి కౌమిన్ ఫహువ మిన్హుమ్” (مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ). (ఎవరైతే ఇతర జాతుల, ఇతర మతస్తుల, ఇతర ధర్మాలను అనుసరించే వారి యొక్క పోలికను అవలంబిస్తాడో, వారి గతి వారితోనే అయిపోతుంది). అల్లాహు అక్బర్ అస్తగఫిరుల్లాహ్. ఇది ఇష్టమేనా మనలో ఎవరికైనా?
అల్లాహ్ ఏమంటున్నాడు మనకు? “వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్” (وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ). (మీకు చావు వచ్చినా కానీ ఇస్లాంపై, కల్మా చదువుతూ, ఇస్లాం ప్రకారంగా మీ చావు రావాలి). అంటే, చచ్చేవరకు మీరు ఇస్లాంపై జీవించాలి. అందుగురించి, బర్త్‌డేలు జరుపుకోవడం, అది ప్రవక్త బర్త్‌డే గాని, స్వయంగా మన బర్త్‌డేలు గాని, ఇంకా వేరే ఏ విషయాలు కానీ, ఇస్లాంకు వీటికి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఇందులో మనకు పుణ్యం లభించదు, పాపం అవుతుంది. అల్లాహ్ ఇలాంటి బిద్అతుల నుండి, దురాచారాల నుండి మనందరినీ కూడా కాపాడుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం:
“జాగ్రత్తగా వినండి! ఈ ఐహిక జీవితం శాపభూయిష్టమైనది. అంటే అల్లాహ్ కారుణ్యానికి దూరం చేస్తుంది. ఈ ఐహిక జీవితంలో నిమగ్నమై, పరలోకాన్ని మరచి పోయినవాడు అల్లాహ్ (త’ఆలా) కారుణ్యానికి దూరమై పోతాడు. ఇంకా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువూ శపించదగినదే. ఎందుకంటే అల్లాహ్ కారుణ్యానికి దూరం చేస్తుంది. అయితే అల్లాహ్ ధ్యానం, మరియు అల్లాహ్ సాన్నిహిత్యం పొందినవారు తప్ప. ఈ రెంటిలో అన్ని రకాల మేళ్ళూ ఉన్నాయి. ఇంకా ధార్మిక పండితుడైనా, ధార్మిక విద్యను అభ్యసించే వాడయినా వీరంతా అల్లాహ్ కారుణ్యం హక్కుగలవారు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించడానికి “లహ్‌వల్ హదీస్” కొనేవాడూ…. ” (31: లుఖ్మాన్: 6)
పై ఆయతులోని “లహ్ వల్ హదీస్” అన్న పదానికి అర్థం పాటలు, మ్యూజిక్లుఅని ఇబ్ను మస్ఊద్ (రది అల్లాహు అన్హు) ప్రమాణం చేసి చెప్పేవారు. (తఫ్సీర్ ఇబ్నె కసీర్).
అబూ ఆమిర్, అబూ మూలిక్ అష్‌అరీ & ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
“తప్పక నా అనుచరుల్లో ఒక సంఘం వ్యభిచారం, పట్టు దుస్తులు, మత్తు పానీయాలు మరియు సంగీత సామాగ్రి, వీటన్నింటినీ ధర్మసమ్మతం చేసుకుంటుంది… (వాస్తవానికి అవి నిషిద్ధం)”.(బుఖారి, కితాబుల్ అష్రబ, బాబు మా జాఅ ఫీ మన్ యస్తహిల్లుల్ ఖమ్ర…)
అనస్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తతో ఉల్లేఖించారు:
“ఈ అనుచర సంఘంలో ఇలాంటి విపత్తులు వచ్చి ఉంటాయి. అవేమనగా: భూమిలో అణగద్రొక్కబడుట. రాళ్ళ వర్షం కురియుట. ముఖాలను మార్చుట. ఎప్పుడైతే ఈ అనుచర సంఘంలో కొందరు మత్తు పానీయాలు సేవించడం, ఆటపాటకత్తెలను ఉంచుకొనడం, వాద్యం వాయించడం లాంటి అలవాట్లకు లోనవుతారో అప్పుడు వారిపై ఈ విపత్తులు కురుస్తాయి.” (సహీహ: 2203. ఈ భావం తిర్మిజిలో కూడా ఉంది 2212).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఢోలు (డప్పు) వాయించడాన్ని నివారించారు. సంగీత సామాగ్రి దుర్మార్గుల, బుద్ధిహీనుల ధ్వని అని తెలిపారు. ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ లాంటి పూర్వ పండితులు సితారు, వీణ, తంబురా లాంటి ఆటపాటలు, మ్యూజిక్ పరికరాలు నిషిద్ధం అని స్పష్టంగా చెప్పారు. నిస్సందేహంగా ఇవన్నియు మ్యూజిక్ పరికరాల్ని నివారించిన ప్రవక్త హదీసులోనే వస్తాయి. ఇంకా పియానో (piano), గిటారు (guitar) వగైరా కూడా ఈ కోవలోకే వస్తాయి. ఏ పాత మ్యూజిక్ సాధనాల గురించి నిషిధ్ధత హదీసులో వచ్చిందో, వాటికంటే ఆధునిక సాధనాల ద్వారా వినువారిని మత్తులో పడవేసే ప్రభావం ఎక్కువ ఉంది.
ఇబ్ను అల్-ఖయ్యిం (రహిమహుల్లాహ్) లాంటి పండితుల కథనం:
“మ్యూజిక్ (సంగీతం) యొక్క నిషా, మత్తు సారాయి మత్తుకంటే భయంకరమైనది.“
మ్యూజిక్ తో పాట, పాటకత్తెల (గాయకురాలి) స్వరం కూడా కలసిందంటే నిషిద్ధత మరీ పెరిగిపోతుంది. పాపం మరీ ఎక్కువవుతుంది. ఒకవేళ ప్రేమ, మోహం మరియు అందకత్తెల అందాలను వర్ణించే పాటలు ఉంటే, నిషిధ్ధత సమస్య మరింత తీవ్రమౌతుంది. అందుకే పాట వ్యభిచారానికి ఒక సాధనం లాంటిదన్నారు పండితులు. ఇంకా అది హృదయంలో నిఫాఖ్ (కపటత్వం) మొలకల్ని మొలకిస్తుంది.
ఇక ఈ కాలంలో పాటలు, మ్యూజిక్ లు మహా అల్లకల్లోలాన్ని సృష్టించేవిగా తయారయినాయి. దానిపై మరో సమస్య ఏమనగా గడియారం, బెల్లు, అలారం, పిల్లవాళ్ళ ఆట వస్తువులు, కంప్యూటర్లు, మరియు సెల్ ఫోన్, టెలిఫోన్లలో కూడా మ్యూజిక్ రాగాలు ఉన్నాయి. ఇక దాని నుండి జాగ్రత్త పడుట ధైర్యవంతుల పనే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.