తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 06 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 6
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం -6

1) దుఆ చేస్తూ ఎవరి “వసీలా” (సిఫారసు) తీసుకోవాలి?

A) ప్రవక్తల, దైవదూతల “వసీలా”
B) అల్లాహ్ నామముల, సత్కర్మల “వసీలా”
C) ఔలియాల, బాబాల “వసీలా”

2) పడుకునే ముందు ‘ఆయతుల్ కుర్సీ’ చదివితే ఏమి లాభం ?

A) స్వర్గం
B) నరకం నుండి రక్షణ
C) షైతాన్ దగ్గరికి రాడు, అల్లాహ్ వైపునుండి ఓ రక్షకుడు నియమించ బడుతాడు

3) నమాజు చదవకుంటే ఏమి నష్టం?

A) ఏ నష్టమూ లేదు
B) ముష్రిక్, మునాఫిఖ్ అయిపోయే ప్రమాదముంది
C) చాలా తీరిక దొరుకుతుంది.

క్విజ్ 06. సమాధానాలు,విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 12:01]

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 05 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 5
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం – 5

1) “ఇబ్లీస్” అంటే ఎవరు?

A) మానవుడు
B) జిన్
C) దైవదూత

2) దైవప్రవక్త ఈసా(అలైహిస్సలాం) గారి సహచరులను ఖుర్ఆన్ లో ఏమని ప్రస్తావించటం జరిగింది?

A) ముహాజిర్
B) అన్సారీ
C) హవారియ్యూన్

3) అల్లాహ్ యేతరుల కొరకు మ్రొక్కుబడి చేస్తే అది ఎలాంటి చర్య అవుతుంది?

A) షిర్క్ (భాగస్వామ్యం)
B) బిద్అత్ (నూతన ఆచారం)
C) సవాబ్ (పుణ్యకార్యం)

క్విజ్ 05. సమాధానాలు,విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 10:56]

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 04 [ఆడియో]

బిస్మిల్లాహ్

Telugu Islamic Quiz (తెలుగు ఇస్లామిక్ క్విజ్) – పార్ట్ 4
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం -4

1) మానవ జీవిత ప్రధాన లక్ష్యం ఏమిటి ?

A] పుట్టుట – జీవించుట – చనిపోవడం
B] సుఖ సౌఖ్యాలను అనుభవించడం
C] కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట.

2) పవిత్ర కాబా గృహం చుట్టూ దాసులు ప్రదక్షిణ చేయడాన్ని ఏమంటారు ?

A] సయీ
B] తవాఫ్
C] సలాహ్

3) దైవప్రవక్త (ﷺ) వారికి ముహమ్మద్ (ﷺ) తో పాటుగా ఖుర్ఆన్ మరో పేరుంది అది ఏమిటి?

A] రహ్మాన్
B] ఖలీల్
C) అహ్మద్

క్విజ్ 04. సమాధానాలు, విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 10:27]

తెలుగు ఇస్లామిక్ క్విజ్ : పార్ట్ 03 [ఆడియో]

బిస్మిల్లాహ్

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రశ్నల పత్రం -3

1) పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం లో ” బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్” తో ప్రారంభం కాని సురాహ్ ఏది?

A) 80 వ సురాహ్ అబస
B) 9వ సురాహ్ తౌబా
C) 19 వ సురాహ్ మర్యం

2) నరకంలో అగ్నిశిక్ష తో పాటుగా ఈ శిక్షా స్థలం కూడా ఉంటుంది అది ఏది ?

A) అతి చెడ్డ వాసన గల ప్రత్యేక చోటు
B) ఒంటరిని చేసి శిక్షించే చోటు
C) అతి చలితో బాధించే శిక్షా స్థలం

3) అల్లాహ్ ఎక్కడ  ఉన్నాడు?

A) ఏడూ ఆకాశాలపై గల అర్ష్ అనే సింహాసనం పై ఉన్నాడు
B) మక్కా లోనే  ఉన్నాడు
C) అన్ని చోట్లా ఉన్నాడు

4) దైవప్రవక్త (ﷺ) వారికి ప్రవక్త పదవి లభించే నాటికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వయస్సు ఎన్ని సంవత్సరాలు?

A) 55
B) 63
C) 40

5) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం ) ఎక్కడ పుట్టారు ?

A] మదీనా
B] మక్కా
C] సిరియా

క్విజ్ 03. సమాధానాలు & విశ్లేషణ ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [వ్యవధి 6:50]

నమాజ్ పాఠాలు 5: సున్నతె ముఅక్కద, విత్ర్ నమాజ్, ఫజ్ర్ సున్నతులు, చాష్త్ నమాజ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[20:28 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


సున్నతె ముఅక్కద:

స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్త  ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారుః

 (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).

ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజు చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును“. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజు లన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

 (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజు నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ల లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు. (ముస్లిం 778).

జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

 (فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).

మనిషి తనింట్లో చేసే నమాజు అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజు తప్ప“. (బుఖారి 6113).


విత్ర్ నమాజ్:

అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద.

దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది.

అయితే రాత్రి చివరి ఘడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం.

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయమంటే; ప్రవక్త మహా నీయులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా తప్పకుండా చేసేవారు.

కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో పదకుండు రకాతులు చేసేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ఉందిః

أَنَّ رَسُولَ اللهكَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).

రాత్రి నమాజు రెండేసి రకాతులు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

 (صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).

“రాత్రి వేళ నఫిల్ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయి. దీనివల్ల మొత్తం నమాజు విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”.  (బుఖారి 991, ముస్లిం 749).

విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విత్ర్ నమాజు విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.

రాత్రి నమాజు చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజు తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.


ఫజ్ర్ సున్నతులు:

ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్నా, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:

أَنَّ النَّبِيَّ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنْ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى رَكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ.

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్నతులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు”. (బుఖారి 1163, ముస్లిం 724). వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారు:

لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.

“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).

మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.

ప్రవక్తను అనుసరిస్తూ వాటిని సంక్షిప్తంగా చేయాలి.

ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజు తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.


చాష్త్ నమాజ్:

దీనినే సలాతుల్ అవ్వాబీన్ అంటారు. ఇది సున్నతె ముఅక్కద. అనేక హదీసుల్లో దీని గురించి ప్రోత్సహించబడింది. అబూ జర్ర్  ఉల్లేఖించిన హదీస్ ముస్లిం 820లో ఉంది ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః

عَنْ أَبِي ذَرٍّ عَنْ النَّبِيِّ ﷺ أَنَّهُ قَالَ: (يُصْبِحُ عَلَى كُلِّ سُلَامَى مِنْ أَحَدِكُمْ صَدَقَةٌ فَكُلُّ تَسْبِيحَةٍ صَدَقَةٌ وَكُلُّ تَحْمِيدَةٍ صَدَقَةٌ وَكُلُّ تَهْلِيلَةٍ صَدَقَةٌ وَكُلُّ تَكْبِيرَةٍ صَدَقَةٌ وَأَمْرٌ بِالْمَعْرُوفِ صَدَقَةٌ وَنَهْيٌ عَنْ الْمُنْكَرِ صَدَقَةٌ وَيُجْزِئُ مِنْ ذَلِكَ رَكْعَتَانِ يَرْكَعُهُمَا مِنْ الضُّحَى).

“మానవ శరీరంలో ఎన్ని కీళ్ళు ఉన్నాయో వాటిలో ప్రతి దానికీ బదులుగా ఒక దానం (సదఖా) విధి అయి ఉంది. అయితే ప్రతి సుబ్ హానల్లాహ్ ఒక సదఖా, ప్రతి అల్ హందులిల్లాహ్ ఒక సదఖా, లాఇలాహ ఇల్లల్లాహ్ ఒక సదఖా, అల్లాహు అక్బర్ ఒక సదఖా, ఒక మంచిని బోధించడం ఒక సదఖా, ఒక చెడును నివారించడం ఒక సదఖా, వీటన్నిటికీ బదులుగా చాష్త్ సమయంలో రెండు రకాతులు సరిపోతాయి”.

عَنْ أَبِي هُرَيْرَةَ t قَالَ أَوْصَانِي خَلِيلِي بِثَلَاثٍ لَا أَدَعُهُنَّ حَتَّى أَمُوتَ: صَوْمِ ثَلَاثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ وَصَلَاةِ الضُّحَى وَنَوْمٍ عَلَى وِتْرٍ.

హజ్రత్ అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నా ప్రాణ స్నేహితులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు మూడు విషయాలను గురించి హితబోధ చేశారు. నేను వాటిని చని పోయేంత వరకు వదలిపెట్టను. అవిః 1. ప్రతి (ఇస్లామీయ) నెలలో మూడు రోజుల ఉపవాసం పాటించటం. 2. చాష్త్ నమాజ్ చేయడం. 3. విత్ర్ నమాజ్ చేసి నిద్ర పోవడం. (బుఖారి 1178, ముస్లిం 721).

దీని ఉత్తమ సమయం పొద్దెక్కి, ఎండ తాపం పెరిగిన తర్వాత. పొద్దు వాలిన వెంటనే దీని సమయం సమాప్తమవుతుంది. కనిష్ట సంఖ్య రెండు రకాతులు. గరిష్ట సంఖ్యకు హద్దు లేదు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

జుమా (శుక్ర వారం) – మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]

బిస్మిల్లాహ్

క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు హదీసులు చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి

జుమా (శుక్ర వారం) – మిష్కాతుల్ మసాబీహ్ [హదీసులు]
[PDF] [19 పేజీలు]
మూలం: మిష్కాతుల్ మసాబీహ్ నుండి

సంకలనం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అల్ ఖతీబ్ అత్ తబ్రీజీ
హదీసుల పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ అల్ – అల్బానీ
తెలుగు అనువాదం: డా. అబ్దుర్రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా

ఇతరములు :

ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్
https://www.youtube.com/watch?v=PuE-YFf5rKM
ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు – ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[13:33 నిముషాలు ]
https://archive.org/download/telugu-islamic-audio/bidah-regarding-prophets-grave.mp3

ఇంకా కొన్ని ప్రశ్నలైతే ఏదైతే వచ్చాయో ఆ ప్రశ్నల్లో మూఢనమ్మకాలు. ఈ పదం మూఢనమ్మకాలు, ఈ పదమే ఏ మనిషికి అవసరం లేని విషయం అని అర్థమవుతుంది.ఇస్లాం ధర్మం ఏ విషయంలో మనకు ఎలాంటి నమ్మకం ఉండాలి? దేని విషయంలో మనం ఎలా విశ్వసించాలి? అన్ని విషయాలు చాలా క్లియర్ గా, క్లుప్తంగా తెలియజేసింది. సహీహ్ బుఖారీలోని ఒక హదీస్ లో ఏముంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

إِنَّ الْحَلَالَ بَيِّنٌ، وَإِنَّ الْحَرَامَ بَيِّنٌ، وَبَيْنَهُمَا أُمُورٌ مُشْتَبِهَاتٌ لَا يَعْلَمُهُنَّ كَثِيرٌ مِنَ النَّاسِ

ఇన్నల్ హలాల బయ్యినున్, వ ఇన్నల్ హరామ బయ్యినున్, వ బైనహుమా ఉమూరున్ ముశ్తబిహాతున్ లా యఅలముహున్న కసీరున్ మినన్-నాస్.

నిశ్చయంగా, ధర్మసమ్మతమైనవి (హలాల్) స్పష్టంగా ఉన్నాయి మరియు నిషిద్ధమైనవి (హరామ్) కూడా స్పష్టంగా ఉన్నాయి. ఆ రెండింటి మధ్యలో సందేహాస్పదమైన కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి గురించి చాలా మందికి తెలియదు.

ధర్మసమ్మతమైన విషయాలు కూడా స్పష్టంగా ఉన్నాయి మరియు నిషిద్ధ విషయాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. వాటి మధ్యలో చాలా కొన్ని విషయాలు మాత్రమే, కొన్ని విషయాలు మాత్రమే ఎంతో మందికి తెలియకుండా అనుమానాస్పదంలో ఉన్నాయి. అంటే అవి వారు నిజ జ్ఞానంతో, సరైన బుద్ధి ఆలోచనలతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలిసిపోతాయి. కానీ చాలామంది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు.

ఇస్లాం ధర్మం, దీని యొక్క గొప్పతనం గురించి ఒక హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? “నేను మీకు చాలా స్పష్టమైన విషయం మీ ముందు తీసుకొచ్చాను. దీని పగలు ఎంతో కాంతివంతమైనది, వెలుతురుతో కూడి ఉన్నది, ఇందులోని రాత్రులు కూడా ఎంతో తేజోవంతమైనవి” అని చెప్పారు. అంటే రాత్రి ఏముంటుంది? చీకటి ఉంటుంది కదా. కానీ ఇస్లాం ధర్మం ఇలాంటి చీకటిలోని ధర్మం కాదు. దీని పగలు కాదు, దీని రాత్రులు కూడా ఎంతో కాంతివంతమైనవి అన్నట్లుగా. అంటే ఇందులోని విషయాలు వాస్తవానికి అర్థం చేసుకోగలిగితే చాలా స్పష్టమైనవి. మనిషి యొక్క స్వభావానికి, ప్రకృతికి అర్థమయ్యేటివి. కానీ మనిషి యొక్క స్వభావం వక్రమార్గంలో వెళ్లి ఉండకూడదు ముందు నుండి. ఎందుకంటే ఒక విషయం కొన్ని సందర్భాల్లో చూడండి, ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు మీకు, చౌరస్తా మీద నిలబడి, “అయ్యా నేను ఇటు పోవాలి, ఏ దారి పోతుంది?” అని. నీవు ఆ ఊరి వానివి, ఆ గ్రామం వానివి, నీకు కచ్చితంగా తెలుసు ఇటు పోతుందని. అయినా గానీ కొందరు ఎట్లా ఉంటాడు? “అబ్బో లేదు, ఏదో నువ్వు అబద్ధం చెప్తున్నట్టు ఏర్పడుతుంది, ఇటు పోదా?” “ఇంతకుముందు నేనెప్పుడో వచ్చినప్పుడు ఇటు పోయినట్టు నాకు గుర్తు ఉన్నది.” అంటే అతని ఆలోచనల్లో, అతని ఊహలో ముందే ఏదైనా తప్పు, వక్రం ఉండేది ఉంటే, అతనికి స్పష్టమైన మార్గం కూడా అతనికి స్పష్టంగా కనబడదు.

కానీ ఇస్లాంలో మూఢనమ్మకాలకు ఎలాంటి ఛాన్స్ అనేది లేదు. అన్ని విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.

సోదరులారా, ఇంతకుముందు మనం, మనలోని కొంతమంది సోదరులు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి నగరం, అంటే ఆయన పుట్టింది మక్కాలో, మరణించింది మదీనాలో. ఆ మదీనా నగరాన్ని మనం దర్శించి వచ్చాము. అయితే అక్కడ మనం కొన్ని విషయాలు చూసి వచ్చాము. దాని గురించి చెప్తే బాగుంటుంది అని కూడా ఒక ప్రశ్న వచ్చింది. అయితే అన్ని విషయాలు చెప్పడానికి టైం సరిపడదు, కానీ అందులోని కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి విషయంలో చాలా మంది ప్రజలు మూఢనమ్మకాలకు, మోసాలకు గురై ఉన్నారు. ఎందుకు? ఎప్పుడైతే కరెక్ట్, సరైన, నిజమైన ఇస్లాం ధర్మాన్ని ప్రజలు వదులుకున్నారో—వదులుకున్నారు అంటే దీని నుండి విముఖత చూపి తిరిగి వెళ్లిపోయినా లేదా ముస్లిం అని తమకు తాము అనుకున్నా ఇస్లాంను చదవడం లేదు, ఇస్లాం ధర్మాన్ని నేర్చుకోవడం లేదు, ఆచరించడం లేదు. “అరే నేను నా ముస్లిం ఖాన్దాన్లో పుట్టాను,” ఐదు పూటల నమాజు చేయడం, గడ్డం వదలడం, ముస్లింగా జీవించడం, “అంతా ఏం అవసరం లేదులే, అల్లాహ్ మనల్ని అట్లనే క్షమిస్తాడు,” ఇలాంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు చాలామంది.

దీనివల్ల కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి విషయంలో ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ మూఢనమ్మకాల కారణంగా కొందరు అక్రమంగా, అన్యాయంగా డబ్బు సంపాదించే వాళ్ళు కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారు? కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు. “ఇది ప్రవక్త గారి యొక్క సమాధి, ఇది ప్రవక్త గారి యొక్క దర్గా, ఈ ప్రవక్త గారి యొక్క సమాధి మీద ఉన్నటువంటి గోపురం” అని చెప్పడమే కాదు, ఆ చిత్రపటాలను అమ్ముతున్నారు. కొన్ని దేశాల్లోనైతే ఒక్కొక్క చిత్రపటం 40 డాలర్లలో అమ్ముతున్నారంట. అంటే ఇంచుమించు ఇక్కడి 120, 110-120 రియాల్లు అవుతాయి. ఒక్కొక్క చిత్రపటం. ప్రజలు, వారి యొక్క హృదయాల్లో ప్రవక్త గారి పట్ల ప్రేమ ఉంది కదా. కానీ ప్రేమ కేవలం ఉండడం సరిపోదు. ప్రవక్త గారి గురించి సరైన విధంగా, హదీసుల్లో ఏ వివరణ వచ్చి ఉందో తెలుసుకోవడం అవసరం. అలా తెలుసుకుంటలేరు గనుక, కేవలం ఎవరైనా వచ్చి ఇలా మోసం చేసి, “ఇది ప్రవక్త గారి సమాధి, ఇది ప్రవక్త గారి యొక్క సమాధి చిత్రం” అని అమ్ముతూ ఉంటే కొనేసి తమ ఇళ్లల్లో పెట్టుకొని, “ఇలా కూడా మనకు శుభాలు కలుగుతాయి” అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు.

మరి కొందరు ఏం చేస్తారంట తెలుసా? వేరే బయట దేశాల్లో వెళ్లి, “ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి నుండి తీసుకురాబడినటువంటి మట్టి. ఇందులో మీకు ఈ రోగాలు దూరమవుతాయి, మీకు ఇలా ఇలా లాభం కలుగుతుంది” అని ఆ మట్టి కూడా అమ్ముతూ ఉంటారట. కొంచెం చిన్నపాటి బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి కూడా, ఈ విధంగా అక్కడి మట్టి తీసి అమ్ముతూ ఉంటే ఇప్పటివరకు ఆ సమాధుల నుండి ఎంత మట్టి పోయి ఉండవచ్చు 1400 సంవత్సరాల నుండి? కానీ ఈ అమ్మేవాళ్ళు కూడా అబ్బో తక్కువేం ఉండరు. “లేదు లేదు, అక్కడ బరకత్ కలుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది” అని కూడా అంటారు. మాటలు కలపడానికి కూడా ఏమీ తక్కువ లేదు.

కానీ సోదరులారా, ఇస్లాం ధర్మం మనకు సమాధుల మట్టి ద్వారా ఈ లాభం కలుగుతుంది, సమాధి వద్ద ఏదైనా గట్టి కట్టడం కట్టడం ద్వారా మనకి లాభం కలుగుతుంది అని ఎక్కడా ఖురాన్లో, ఏ హదీస్లో ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు.

వాస్తవానికి ఏమిటంటే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితకాలంలోనే మనకు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు, వాటిని మనలోని చాలామంది మర్చిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి కొన్ని గంటల ముందు—రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కాదు—కొన్ని గంటల ముందు ఒక మాట ఏం చెప్పారు? “అల్లాహ్ యూదులపై తన శాపం కురిపించుగాక! అల్లాహ్ క్రైస్తవులపై తన శాపం కురిపించుగాక!” ఏ క్రైస్తవులు, ఏ యూదులు? ఎవరైతే తమ ప్రవక్తల మరియు పుణ్యపురుషుల సమాధులను ఆరాధనాలయంగా చేసుకున్నారో. అంటే ఏంటి? ప్రవక్త తన మరణానికి కొన్ని గంటల ముందు ఇలా చెబుతున్నారు అంటే భావం ఏంటి? రేపటి రోజు నా యొక్క సమాధిని ఇలా మీరు చేయకూడదు. అందుగురించి ఆయిషా (రజియల్లాహు అన్హా) ఏం చెప్తున్నారు? అందరిలాగే ప్రవక్త వారిని కూడా ‘బఖీ’ ఖబరిస్తాన్ ఏదైతే ఉందో అక్కడ లేదా వేరే ఏదైనా బయటి ప్రదేశంలో సమాధి చేయకపోవడానికి ఒక కారణం ఏంటి? ఆయన సమాధి భద్రంగా ఉండాలి, రేపటి రోజు ప్రజలు దాన్ని ఒక ప్రార్థన స్థలంగా చేసుకోకూడదు అన్న ఉద్దేశం.

అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సమాధి గురించి రెండు దుఆలు చేశారు. ఒకటి, “నా సమాధిని మీరు ఒక పండుగగా, ఉరుసు, జాతర మాదిరిగా చేసుకోకండి.” నెలకు ఒకసారి గానీ, సంవత్సరానికి ఒకసారి గానీ, వారానికి ఒకసారి గానీ, ఈ రోజుల్లో సమాధుల వద్దకు జాతరల పేరు మీద వస్తూ పోతూ ఉంటారు కదా, ఉరుసులు గిట్ల చేస్తూ ఉంటారు.

لَا تَجْعَلُوا قَبْرِي عِيدًا
లా తజ్అలూ ఖబ్రీ ఈదన్.
నా సమాధిని ఒక పండుగ (ఉత్సవ స్థలం)గా చేయకండి.

మరియు అల్లాహ్‌తో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకో దుఆ ఏం చేశారు?

اللَّهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا يُعْبَدُ
అల్లాహుమ్మ లా తజ్అల్ ఖబ్రీ వసనన్ యుఅబద్.
ఓ అల్లాహ్, నా సమాధిని ఆరాధించబడే ఒక విగ్రహంగా చేయకు.

ఓ అల్లాహ్, నా సమాధిని ఒక విగ్రహంగా, ఆరాధించబడే ఒక విగ్రహంగా చేయకు ఓ అల్లాహ్, అని కూడా దుఆ చేశారు. ప్రవక్త గారి ఆ దుఆలను అల్లాహ్ స్వీకరించాడు. అయితే ఏం జరిగింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధి… ఉదాహరణకు కేవలం అర్థం కావడానికి, అల్లాహ్ క్షమించుగాక, చూడని వాళ్లకు, అక్కడికి వెళ్లి ఈ వివరాలు వినని వారికి కొంచెం అర్థం కావడానికి ఒక పోలికగా నేను ఇస్తున్నాను. ఉదాహరణకు ప్రవక్త గారి సమాధి ఇది అనుకోండి. ఈ విధంగా దఫన్ చేయడం జరిగింది, ఇలా ఇటువైపున ఖిబ్లా ఉంది, ఇది ప్రవక్త గారి యొక్క శుభ శిరస్సు, తల వైపున తల భాగం అనుకోండి. దీనికి వెనుక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భుజాల వరకు అబూబక్ర్ (రజియల్లాహు త’ఆలా అన్హు) గారి యొక్క సమాధి ఉంది. దానికి వెనుక, హజ్రత్ అబూబక్ర్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క భుజాల వరకు హజ్రత్ ఉమర్ వారి యొక్క తల, ఈ విధంగా హజ్రత్ ఉమర్ (రజియల్లాహు అన్హు) వారి యొక్క సమాధి ఉంది.

మరియు ఆ సమాధి, అందులో వారిని పెట్టబడిన తర్వాత, అదే మట్టి వారిపై ఏదైతే పూడ్చడం జరిగిందో, దాని మీద ఎలాంటి ఏ కట్టడం లేదు. కానీ ఒక కాలంలో కొందరు దుష్టులు ఏదైనా దుష్టకార్యం గురించి పాలుపడినప్పుడు, అప్పటి రాజు ఆ మూడు సమాధులను ఒక గోడతో బంధించాడు. ఆ గోడకు అవతల మరొక, ఇంచుమించు మూడున్నర మీటర్ల గోడ, మూడున్నర ఎత్తు మీటర్ల మరొక గోడ ఎలా ఉంది? ఫైవ్ కార్నర్స్ (five corners). అర్థమవుతుందా? పంచ… ఏమంటారు దాన్ని… చతురస్రం కాదు. మురబ్బా (స్క్వేర్) అంటే చతురస్రం కదా, నాలుగు మూలలు ఉంటాయి. ఇది ఐదు మూలలది. అర్థమవుతుందా లేదా? ఇలా ఒక గోడ, ఈ రెండు మూలలు. ఇలా, ఇటు ఒక గోడ, ఇటు ఒక గోడ, ఈ నాలుగు మూలలు. ఇంకొకటి ఇట్లా గోడ, ఇక్కడ ఐదు మూలలు. ఎందుకు? రేపటి రోజు ఎవరైనా అజ్ఞాని ప్రవక్త ప్రేమ పేరుతో ‘ఘులువ్’ (అతివాదానికి) దిగి ప్రవక్తకు డైరెక్టుగా ఖిబ్లా చేసుకోకుండా.

ఇది బయటి గోడ. మళ్లీ దాని తర్వాత జాలీ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏముంది? సామాన్య ప్రజలు ఆ జాలీ ఏదైతే ఉందో, దాని వైపు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాధిని దర్శిస్తారు. “అస్సలాము అలైక, అస్సలాతు వస్సలాము అలైక యా రసూలల్లాహ్” అని అంటారు. “అస్సలాము అలైక యా అబూబకర్ వ రజియల్లాహు అన్హు”, “అస్సలాము అలైక యా ఉమర్ వ రజియల్లాహు అన్హు” ఈ విధంగా అంటారు. ఎవరైనా పెద్ద నాయకులు గిట్ల, దేశ రాజులు ముస్లింలు వస్తే, జాలీ లోపటి నుండి. కానీ ఆ జాలీ లోపట ఏదైతే ఎత్తైన గోడ ఉందో, ఆ గోడకు గానీ, దాని లోపట ఉన్న మరో గోడ, దానికి ఎక్కడా ఏ తలుపు లేదు. ఏ ద్వారం లేదు, ఏ సందు లేదు. ఎవరూ కూడా లోపటికి పోవడానికి ఛాన్స్ ఉండదు.

ఈ వీడియో క్లిప్ మూలం:
రజబ్ నెల కల్పితాచారాలు, వడ్డీ తినుట, వ్యభిచారం, ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో]

విత్ర్ నమాజు ఘనత, రకాతుల సంఖ్య [వీడియో]

బిస్మిల్లాహ్

విత్ర్ నమాజు ఘనత, రకాతుల సంఖ్య Witr Namazu Ghanata, Rakatul sankhya أهمية صلاة الوتر

[వ్యవధి: 6:04 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


విత్ర్ నమాజ్:

అలాగే ముస్లిం విత్ర్ నమాజును పాటించుట ధర్మం. ఇది కూడా సున్నతె ముఅక్కద. దీని సమయం ఇషా తరువాత నుండి ఉషోదయం వరకు ఉంటుంది. అయితే రాత్రి చివరి ఘడియలో మేల్కొనగల వారికి ఆ సమయమే ఉత్తమం.

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాల్లో ఎలాంటి సాంప్రదాయమంటే; ప్రవక్త మహా నీయులు ఎప్పుడూ విడనాడ లేదు. ప్రయాణంలో ఉన్నా, లేదా స్థానికంగా ఉన్నా తప్పకుండా చేసేవారు.

కనిష్ట సంఖ్య ఒక్క రకాతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రుల్లో పదకుండు రకాతులు చేసేవారు. ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనంలో ఉంది:

أَنَّ رَسُولَ الله ﷺ كَانَ يُصَلِّي بِاللَّيْلِ إِحْدَى عَشْرَةَ رَكْعَةً يُوتِرُ مِنْهَا بِوَاحِدَةٍ…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట 11 రకాతులు చేసేవారు, అందులో ఒక రకాతు విత్ర్ చేసేవారు. (ముస్లిం 736).

రాత్రి నమాజు రెండేసి రకాతులు.

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రాత్రి నమాజ గురించి ప్రశ్నించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

 (صَلَاةُ اللَّيْلِ مَثْنَى مَثْنَى فَإِذَا خَشِيَ أَحَدُكُمْ الصُّبْحَ صَلَّى رَكْعَةً وَاحِدَةً تُوتِرُ لَهُ مَا قَدْ صَلَّى).

“రాత్రి వేళ నఫిల్ నమాజు రెండేసి రకాతుల చొప్పున చేయాలి. ఇక ఉషోదయం కావస్తోందని భావించినప్పుడు ఒక రకాతు చేయి. దీనివల్ల మొత్తం నమాజు విత్ర్ (బేసి సంఖ్య నమాజ్) అయిపోతుంది”. 
(బుఖారి 991, ముస్లిం 749).

విత్ర్ లో దుఆయె ఖునూత్ చేయడం మంచిది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హసన్ బిన్ అలీ (రజియల్లాహు అన్హు) గారికి విత్ర్ లో చదివే దుఆ నేర్పారు. కాని ఎల్లప్పుడు చేయకూడదు. ఎందుకనగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విత్ర్ నమాజు విధానం గురించి ఉల్లేఖించిన సహచరులు ఖునూత్ గురించి చెప్పలేదు.

రాత్రి నమాజు చేయలేకపోయినవారు మరుసటి రోజు రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది, పన్నెండు ఇష్టమున్నన్ని రకాతులు చేయుట మంచిది. ఎప్పుడైనా రాత్రి నమాజు తప్పి పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాగే చేసేవారు.


సున్నతు మరియు నఫిల్ నమాజులు

ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత Fajr ku mundu Sunnatul Ghanata فضل ركعتي الفحر (تلغو Telugu)

[వ్యవధి: 3:22 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


ఫజ్ర్ సున్నతులు:

ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్నతుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్నా, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేవారు. ఆయిషా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖనం ప్రకారం:

أَنَّ النَّبِيَّ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنْ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى رَكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్నతులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు“. (బుఖారి 1163, ముస్లిం 724).

వాటి ఘనత, ప్రాముఖ్యతలో ప్రవక్త ﷺ ఇలా చెప్పేవారు:

لَـهُمَا أَحَبُّ إِلَيَّ مِنْ الدُّنْيَا جَمِيعًا.

“ఆ రెండు రకాతులు నాకు ప్రపంచం మరియు, అందులో ఉన్న వాటికన్నా చాలా ప్రియమైనవి”. (ముస్లిం 725).

మొదటి రకాతులో (సూర ఫాతిహా తర్వాత) సూర కాఫిరూన్ మరియు రెండవ రకాతులో (సూర ఫాతిహ తర్వాత) సూర ఇఖ్లాస్ చదువుట ధర్మం. ఒక్కోసారి మొదటి రకాతులో “ఖూలూ ఆమన్నా బిల్లాహి వమా ఉంజిల ఇలైనా….” (అల్ బఖర 2: 136) ఆయతులు మరియు రెండవ రకాతులో “ఖుల్ యా అహ్లల్ కితాబి తఆలౌ ఇలా కలిమతిన్ సవాఇమ్ బైననా వ బైనకుమ్….” (ఆలె ఇమ్రాన్ 3: 64) ఆయతులు పఠించుట మంచిది.

ప్రవక్తను అనుసరిస్తూ వాటిని సంక్షిప్తంగా చేయాలి.

ఫర్జ్ నమాజుకు ముందు వాటిని చేయలేకపోయిన వ్యక్తి నమాజు తర్వాత కూడా చేయవచ్చును. అయితే సూర్యోదయం తర్వాత సూర్యుడు బల్లెమంత పైకి వచ్చాక చేయడం మరీ ఉత్తమం. దీని సమయం పగటిలి పొద్దు వాలేకి ముందు వరకు ఉంటుంది.


సున్నతు మరియు నఫిల్ నమాజులు

సున్నతు నమాజుల ఘనత, సంఖ్య [వీడియో]

బిస్మిల్లాహ్

సున్నతు నమాజుల ఘనత, సంఖ్య Sunnat Namazula Ghanata فضل السنن الرواتب (Telugu)

[వ్యవధి: 6 నిముషాలు ]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


సున్నతె ముఅక్కద:

స్థానికులైన ప్రతి ముస్లిం స్త్రీ పురుషులు పన్నెండు రకాతులు పాటించడం ఎంతో పుణ్యకార్యం. అవి జొహ్ర్ కు ముందు 4, దాని తరువాత 2, మగ్రిబ్ తరువాత 2, ఇషా తరువాత 2, ఫజ్ర్ కు ముందు 2 రకాతులు. స్వయంగా ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లం  ఈ సున్నతులు పాటించేవారు. ఇంకా ఆయన ఇలా శుభవార్త ఇచ్చారని ఉమ్మె హబీబ రజియల్లాహు అన్హా తెలిపారుః

 (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْجَنَّةِ).

ఏ ముస్లిం భక్తుడు రాత్రి పగల్లో ఫర్జ్ కాకుండా పన్నెండు రకాతుల అదనపు (నఫిల్) నమాజు చేస్తూ ఉంటాడో అతనికి వాటికి బదులుగా అల్లాహ్ ఒక గృహము స్వర్గంలో నిర్మిస్తాడు, లేదా ఒక గృహం స్వర్గంలో నిర్మించచబడును“. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కద మరియు సాధరణంగా నఫిల్ నమాజులన్నియూ ఇంట్లో చేయడం చాలా ఉత్తమం. ప్రవక్త ﷺ ప్రబోధించారని, జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

 (إِذَا قَضَى أَحَدُكُمْ الصَّلَاةَ فِي مَسْجِدِهِ فَلْيَجْعَلْ لِبَيْتِهِ نَصِيبًا مِنْ صَلَاتِهِ فَإِنَّ اللهَ جَاعِلٌ فِي بَيْتِهِ مِنْ صَلَاتِهِ خَيْرًا).

“మీలోనెవరైనా మస్జిదులో (ఫర్జ్) నమాజు నెరవేర్చుకున్నాక, తన ఇంటి కొరకు కూడా (సున్నతులు, నఫిల్ల లాంటి) నమాజుల యొక్క కొంత భాగాన్ని మిగిలించుకోవాలి. అల్లాహ్ అతని నమాజుకు బదులుగా అతని ఇంట్లో మేలే చేకూర్చుతాడు”. (ముస్లిం 778).

జైద్ బిన్ సాబిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

 (فَإِنَّ خَيْرَ صَلَاةِ الْـمَرْءِ فِي بَيْتِهِ إِلَّا الصَّلَاةَ الْـمَكْتُوبَةَ).

“మనిషి తనింట్లో చేసే నమాజు అతి ఉత్తమమైనది. కేవలం ఫర్జ్ నమాజు తప్ప”. (బుఖారి 6113).


ఇతరములు:

సున్నతు మరియు నఫిల్ నమాజులు