ఈద్ (పండుగ) నమాజు విధానం [వీడియో]

బిస్మిల్లాహ్

[3:15 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈద్

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

[వుజూ తర్వాత దుఆ] స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ

స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ: عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః "మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, "అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ" చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు". (ముస్లిం 234).

స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ:

عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ
مِنْ أَيِّهَا شَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ” చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

నమాజు నిధులు (Treasures of Salah)
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

ఇస్లాంలో క్రొత్త రోజు మగ్రిబ్ నుండి మొదలవుతుంది [వీడియో]

బిస్మిల్లాహ్

[2:24 నిముషాలు]

లైలతుల్ ఖద్ర్ కోసం మేలుకోవడం ఎప్పటి నుండి మొదలుపెట్టాలి? ఏ తారీఖు నుండి మొదలు పెట్టాలి?
ఈ రోజు మేము 21 వ ఉపవాసం పూర్తి చేసుకున్నాము, ఇక వచ్చే రాత్రి నుండి మొదలుపెట్టాలా?

సమాధానం ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [2:24 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

సుబ్ హానల్లాహ్, అల్ హమ్దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు అల్లాహు అక్బర్ యొక్క ఘనత – హిస్న్ అల్ ముస్లిం నుండి

బిస్మిల్లాహ్

130. సుబ్ హానల్లాహ్, అల్ హమ్దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు అల్లాహు అక్బర్ యొక్క ఘనత

ఈ పదాల అర్ధములు:

సుబ్ హానల్లాహ్ (అల్లాహ్ పరమ పవిత్రుడు, నిష్కళంకుడు)
అల్ హమ్దు లిల్లాహ్ (సర్వ స్తోత్రములు మరియు కృతఙ్ఞతలు అల్లాహ్ కే చెందును)
లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వేరెవరూ ఆరాధనకు అర్హులు కారు)
అల్లాహు అక్బర్ (అల్లాహ్ చాలా గొప్పవాడు)
లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ (అల్లాహ్ ఆజ్ఞ తప్ప ఏ శక్తీ ఏ బలమూ లేదు)


254.“‘సుబ్ హానల్లాహి వబిహమ్దిహి’ అని రోజుకు వందసార్లు స్మరించినట్లయితే సముద్రంలోని నురుగుకు సమానమైన పాపాలైనా సరే క్షమించబడతాయి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.” (బుఖారీ)

سُبْحَانَ اللهِ وَبِحَمْدِهِ
సుబ్ హానల్లాహి వబిహమ్దిహి

[అల్ బుఖారీ 7/168, ముస్లిం 4/2071 మరియు చూడుము : ఈ పుస్తకంలోని దుఆ నెం. 91 ఎవరైతే దీనిని ప్రొద్దున మరియు రాత్రి వంద సార్లు పఠిస్తారో.]


255. “ఎవరైనా రోజుకు పదిసార్లు “లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” పఠించినట్లయితే ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానం నుండి నలుగురు బానిసలను విముక్తి గావించినంత పుణ్యము లభిస్తుంది” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.” (బుఖారీ).

لَا إِلهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ وهُوَ عَلى كُلِّ شَيءٍ قَديرٌ
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్

[అల్ బుఖారీ 7/67, ముస్లిం 4/2071 మరియు చూడుము ఈ పుస్తకము దుఆ నెం. 92 ఎవరైతే దీనిని రోజుకి దినానికి వందసార్లు పఠిస్తారో దాని ప్రాముఖ్యత]


256. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “రెండు వచనాలు నాలుకపై చాలా తేలికైనవి, త్రాసులో చాలా బరువైనవి మరియు కరుణామయునికి చాలా ప్రియమైనవి, అవి “సుబహానల్లాహి వబిహమ్దిహీ” “సుబ్ హానల్లాహిల్ అదీమ్” (బుఖారీ, ముస్లిం).

سُبْحانَ اللهِ وَبِحَمْدِهِ وسُبْحَانَ اللهِ العَظِيمِ
సుబ్ హానల్లాహి వబిహమ్దిహీ, సుబ్ హానల్లాహిల్ అదీమ్

[అల్ బుఖారీ 7/168 మరియు ముస్లిం 4/2072. 4. ముస్లిం 4/2072]


257. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “సుబ్ హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్” ఇవి నాకు వేటి పైనైతే సూర్యుడు ఉదయిస్తాడో వాటన్నింటికన్నా ఉత్తమమైనవి (ముస్లిం 4/2072).

سُبْحَانَ اللهِ، والحَمْدُ للهِ، لَا إِلَهَ إلَّا اللهُ واللهُ أَكْبَرُ
సుబ్ హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్


258. హజ్రత్ సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం: మేము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద కూర్చోని ఉండగా ఆయన “మీలో ఎవరయినా రోజుకు వెయ్యి పుణ్యాలను సంపాదించు కోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అక్కడ కూర్చున్న వారిలో ఒకరు లేచి అది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. బదులుగా ప్రవక్త గారు “వందసార్లు “తస్బీహ్” (సుబహానల్లాహ్) స్మరించినట్లయితే వెయ్యి పుణ్యాలు లభిస్తాయి, లేక అతని వెయ్యి పాపాలు క్షమించ బడతాయి” అని సెలవిచ్చారు. (ముస్లిం 4/2073).

سُبْحَانَ اللهِ
సుబ్ హానల్లాహ్


259. ఎవరైతే “సుబ్ హానల్లాహిల్ అదీమి వబిహమ్దిహీ” పలుకుతారో వారి కొరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది.

سُبْحَانَ اللهِ العَظِيمِ وبِحَمْدِهِ
సుబ్ హానల్లాహిల్ అదీమి వబిహమ్దిహీ

[దీనిని అత్తిర్మిదీ ఉల్లేఖించారు 5/511, అల్ హాకిం 1/501 ఆయన దీనిని సహీహ్ అన్నారు. అజ్ జహబీ ఏకీభవించారు. చూడుము సహీహ్ అల్ జామిఅ 5/ 531 మరియు ఆయనను దీనిని అత్తిర్మిదీ సహీహ్ అన్నారు 3/160]


260. ఓ అబ్దుల్లా బిన్ ఖైస్ “నేను నీకు స్వర్గ నిధులలో నుండి ఒకదాని గురించి నీకు చెప్పనా! అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నన్ను ప్రశ్నించారు. ఓ ప్రవక్తా తప్పకుండా సెలవివ్వండని నేను అన్నాను. అయితే నీవు “లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహి” పలకమని చెప్పినట్లు హజ్రత్ అబ్దుల్లా బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. (బుఖారీ, ముస్లిం).

لَا حَوٍلَ وَلَا قُوَّةَ إِلَّا باللهِ
లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్

[అల్ బుఖారీ అల్ ఫతహ్ 11/213, మరియు ముస్లిం 4/2076]


261. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు “అల్లాహ్ వద్ద నాలుగు వచనాలు అన్నింటికంటే ప్రియమైనవి. అవి “సుబ్ హానల్లాహి వల్ హమ్దులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్” (ముస్లిం 3/1685).

سُبْحَانَ اللهِ، والحَمْدُ للهِ، ولَا إِلَهَ إِلاَّ اللهُ واللهُ أَكْبَرُ
సుబ్ హానల్లాహి వల్ హమ్దులిల్లాహ్ వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్


262. ఒక పల్లెటూరివాడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి నాకు కొన్ని వచనాలు నేర్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ, అల్లాహు అక్బర్ కబీరన్, వల్ హందు  లిల్లాహి కసీరన్, సుబ్ హానల్లాహి రబ్బిల్ ఆలమీన, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా హిల్ అజీజిల్ హకీమి” అని చెప్పమన్నారు. అప్పుడు అతను ఇది నా ప్రభువు కోసం మరి నా కోసం ఏమిటి? అని అడిగాడు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి ఇలా అడగమని చెప్పారు: “అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హంనీ, వహ్ దినీ, వర్ జుఖ్నీ” (అబూ దావూద్)

لَا إِلهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، اللهُ أَكْبَرُ كَبيراَ والْحَمْدُ للهِ كَثيراً، سُبْحَانَ اللهِ رَبِّ العَالَمينَ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلّا باللهِ العَزيزِ الْحَكِيمِ.اللَّهُمَّ اغْفِرْ لِي، وارْحَمْنِي، واهْدِنِي، وارْزُقْنِي

లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లాషరీక లహూ, అల్లాహు అక్బర్ కబీరన్, వల్ హందు  లిల్లాహి కసీరన్, సుబ్ హానల్లాహి రబ్బిల్ ఆలమీన, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా హిల్ అజీజిల్ హకీమి,అల్లాహుమ్మగ్ ఫిర్లీ వర్ హంనీ, వహ్ దినీ, వర్ జుఖ్నీ

[ముస్లిం 4/2072 మరియు అబుదావూద్ : “పల్లెటూరి వ్యక్తి మరలిపోగా నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు : (నిస్సందేహంగా ఈ వ్యక్తి తన రెండు చేతులూ శుభంతో నింపుకున్నాడు)” అను పదాలు ఉల్లేఖించారు 1/220]


263. ఎవరైనా వ్యక్తి ఇస్లాం స్వీకరించినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అతనికి నమాజు నేర్పి, ఈ క్రింది పదాలతో దుఆ చెయ్యమని నేర్పేవారు : “అల్లాహుమ్మగ్ ఫిర్లీ, వర్ హంనీ, వహ్ దినీ, వ ఆఫినీ,వర్ జుఖ్నీ“- (ముస్లిం).

اللَّهُمَّ اغْفِرِ لِي، وارْحَمْنِي، واهْدِنِي، وعَافِنِي وارْزُقْنِي
అల్లాహుమ్మగ్ ఫిర్లీ, వర్ హంనీ, వహ్ దినీ, వ ఆఫినీ,వర్ జుఖ్నీ

[ముస్లిం 4/2073 మరియు ముస్లిం యొక్క మరొక ఉల్లేఖనలో (నిస్సందేహంగా ఈ పదాలు నీ కొరకు ప్రపంచము మరియు పరలోకమును జతచేయును)]


264. నిశ్చయముగా ఉత్తమమైన దుఆ “అల్ హమ్దు లిల్లాహ్” మరియు ఉత్తమమైన అల్లాహ్ స్మరణ “లా ఇలాహ ఇల్లల్లాహ్

الْحَمْدُ للهِ.لَا إِلَه إِلَّا اللهُ
అల్ హమ్దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్

[అత్తిర్మిదీ 5/462, ఇబ్ను మాజహ్ 2/1249, అల్ హాకిం 1/503 సహీహ్ అన్నారు మరియు అజ్జహబీ ఏకీభవించారు. చూడుము సహీహ్ అల్ జామిఆ 1/362]


265. చిరస్థాయిగా నిలిచిపోయే పుణ్యములు “సుబ్ హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” (నిసాయి, అహ్మద్).

سُبْحَانَ اللهِ، والْحَمْدُ للهِ، لَا إِلَهَ إَلَّا اللهُ واللهُ أَكْبَرُ وَلَا حَوْلَ وَلَا قُوَّةَ إلَّا باللهِ
సుబ్ హానల్లాహి, వల్ హమ్దు లిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్

[అహ్మద్ సంఖ్య 513 అహ్మద్ షాకిర్ దీని పరంపరలు సహీహ్ చూడుము మజ్ముఅ అజ్ఞవాఇద్ 1/297, దీనిని ఇబ్బుహజర్ బులూగల్ మరామ్ లో అబిసఈద్ ఉల్లేఖనతో అన్నిసాఈ ద్వారా ఉల్లేఖించారు మరియు ఇబ్ను హిబ్బాన్ మరియు అల్ హాకింలు సహీహ్ అన్నారని తెలిపారు]


ఇది హిస్న్ అల్ ముస్లిం (తెలుగు)  అనే పుస్తకం నుండి తీసుకోబడింది ( కొన్ని చిన్న మార్పులతో)
అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని.
అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ.
https://teluguislam.net/2010/11/23/hisn-al-muslim-vedukolu-telugu-islam/

ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు – హిస్న్ అల్ ముస్లిం నుండి

బిస్మిల్లాహ్

129. ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు

248. “అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతి దినము డెబ్బైసార్లకంటే ఎక్కువ అల్లాహ్ ను మన్నింపుకై వేడుకుంటాను, మరియు పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతుంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు. (బుఖారీ). [అల్ బుఖారీ, అల్ అస్ఖలాని ఫత్-హుల్ బారీ 11/101]


249. “ప్రజలారా! పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి నేనయితే రోజుకు వందేసి సార్లు క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు? (ముస్లిం 4/2076).


250. ఎవరయితే “అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి” అని పలుకుతారో అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు. ఒకవేళ అతను యుద్ధభూమి నుండి పారిపోయిన వాడైనా సరే అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (అబూదావూద్, అహ్మద్, తిర్మిదీ 3-182).

أَسْتَغْفِرُ اللهَ الْعَظِيمَ الَّذِي لَا إِلَهَ إلَّا هُوَ الحَيُّ القَيُّومُ وأَتُوبُ إِلَيْهِ

అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి

నేను  మహోన్నతుడు అయిన అల్లాహ్ మన్నింపు కోరుతున్నాను. ఆయన తప్ప (నిజ) ఆరాధ్యుడు ఎవరూ లేరు. అయన నిత్యుడు. శాశ్వతుడు. నేను అయన సమక్షంలోనే తౌబా చేస్తున్నాను.

[దీనిని అబుదావూద్ ఉల్లేఖించారు. 2/85, అత్తిర్మిదీ 5/569, అల్ హాకిం 1/115 సహీహ్ మరియు అజ్జహబీ ఏకీభవించారు. అల్బానీ గారు దీనిని సహీహ్ అన్నారు. చూడుము సహీహ్ అత్తిర్మిదీ 3/182 జామిఆ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం 4/389–390 అల్ అర్నావూత్ శోధన.]


251. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకటించారు: “రాత్రి చివరి గడియలలో ప్రభువు దాసునికి అతి చేరువలో ఉంటాడు. ఆ వేళ అల్లాహ్ ను  స్మరించే వారిలో మీరు కూడా చేరాలనుకుంటే చేరండి.”

[దీనిని అత్తిర్మిదీ, అన్నిసాఈ 1/279, మరియు అల్ హాకిం ఉల్లేఖించారు. చూడుము అల్ అల్బానీ సహీహ్ అత్తిర్మిదీ 3/183 మరియు జామిఅ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్ అర్నావూత్ శోధన 4/144. ]


252. “సజ్దా స్థితిలో దాసుడు అల్లాహ్ కు అతి చేరువలో ఉంటాడు. కనుక ఆ స్థితిలో మీరు (అల్లాహ్ ను) ఎక్కువగా వేడుకోండి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం 1/350, అబుషేబా).


253. “అప్పుడప్పుడు నా మనసుకు ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను రోజుకు నూరుసార్లు అల్లాహ్ క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం).

[దీనిని ముస్లిం ఉల్లేఖించారు 4/2075, ఇబ్నుల్ అధీర్ అలా అన్నారు: “లయుఘాను అలా ఖల్ బీ” నాహృదంపై మీద పొర వచ్చినప్పుడు అంటే, దీని అర్థం : తప్పిదం పొరపాటు (మరచిపోవుట) : ఎందుకంటే రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎల్లప్పుడు అధికంగా స్మరణలో నిమగ్నులై ఉండేవారు, అయితే ఎప్పుడైనా కొన్ని సమయాలలో వారు మరచిపోతే దానిని వారు తన తప్పిదముగా లెక్క కట్టేవారు మరియు క్షమాభిక్ష వేడుకునేవారు. చూడుము జామిఅ అల్ ఉసూల్ 4/386.]


ఇది హిస్న్ అల్ ముస్లిం (తెలుగు)  అనే పుస్తకం నుండి తీసుకోబడింది ( కొన్ని చిన్న మార్పులతో)
అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని.
అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ.
https://teluguislam.net/2010/11/23/hisn-al-muslim-vedukolu-telugu-islam/

రమజాన్ చివరి దశకం [వీడియో]

బిస్మిల్లాహ్

రమజాన్ చివరి దశకం (10 రోజులు)
( లైలతుల్ ఖద్ర్, తరావీహ్, తహజ్జుద్, నమాజ్ , ఎతికాఫ్, ఖురాన్ పారాయణం, దుఆ, ఇస్తిగ్ఫార్)

అబూ బక్ర్ బేగ్ ఉమ్రీ (హఫిజహుల్లాహ్) (అధ్యాపకులు మర్కజ్ ఇబాదుర్రహ్మాన్, ఏలూరు)

[34:34 నిముషాలు]

 ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

 

షిర్క్ నిర్వచనం, దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్
అల్లాహ్ ఏకత్వం (అఖీదా ఏ తౌహీద్) పుస్తకం
Kitab-at-Tawheed- By Dr-Saleh bin Fawzaan al-fawzaan
డా. సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్
రెండవ ప్రకరణం: షిర్క్ నిర్వచనం, దాని రకాలు

(అ) షిర్క్ నిర్వచనం:

అల్లాహ్ యొక్క పోషకత్వంలోనూ, ఆయన దైవత్వంలోనూ వేరొకరికి సాటి (సహవర్తులను) కల్పించటాన్ని ‘షిర్క్‘ అంటారు.

ప్రజాబాహుళ్యంలో సాధారణంగా అల్లాహ్  దైవత్వం (ఆరాధన, దాస్యం ) విషయంలో షిర్క్ ప్రబలి ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే అల్లాహ్ తో పాటు వారు ఇతరులను కూడా మొర పెట్టుకుంటారు. లేదా అల్లాహ్ యేతరుల కొరకు కొన్ని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదాహరణకు : ఖుర్బానీ, మొక్కుబడులు, అల్లాహ్ యేతరులకు భయపడటం, వారిపై ఆశలు పెట్టుకోవటం ఇత్యాదివి.


కొన్ని కారణాల దృష్ట్యా షిర్క్ మహాపరాధం. అవేమంటే:

(1) షిర్క్ చేయటమంటే సృష్టికర్త ప్రత్యేకతలలో, గుణాలలో సృష్టితాలకు సామ్యం కల్పించటమే. కాబట్టి అల్లాహ్ తో పాటు వేరేతరులకు భాగస్వామ్యం కల్పించినవాడు వాస్తవానికి ఆ భాగస్వాములను అల్లాహ్ ను పోలిన వారుగా ఖరారు చేశాడన్నమాట! ఇది అతి పెద్ద జులుం. మహాపాతకం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

 إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

నిశ్చయంగా అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం.” (లుఖ్మాన్ 31 : 13)

(2) షిర్క్ చేష్టకు ఒడిగట్టిన మీదట పశ్చాత్తాపం చెందనివానిని అల్లాహ్ క్షమించడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్క్ ను) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.” (అన్ నిసా 4 : 48)

(3) షిర్క్ కి పాల్పడేవాని కొరకు స్వర్గాన్ని నిషేధించానని, అలాంటి వ్యక్తి శాశ్వతంగా నరకాగ్నిలో కాలుతూ ఉంటాడని అల్లాహ్ తెలియపరిచాడు. ఉదాహరణకు :

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ

ఎవడు అల్లాహ్ కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. ఇక అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.” (అల్ మాయిద 5 : 72)

(4) మనిషి చేసే షిర్క్, అతను గతంలో చేసిన సత్కార్యాలన్నింటినీ సర్వ నాశనం చేసివేస్తుంది. (18 మంది ప్రవక్తల ప్రస్తావన తీసుకువచ్చిన మీదట) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ

ఇదీ అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సయితం దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసిన కర్మలన్నీ వృధా అయిపోయేవి.” (అల్ అన్ ఆమ్ 6 : 88)

వేరొకచోట అల్లాహ్  తన అంతిమ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  నుద్దేశించి ఇలా ఉపదేశించాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ

నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నీవు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. నిశ్చయంగా నీవు నష్టపోయిన వారిలో చేరతావు.” (అజ్ జుమర్ 39 : 65)

(5) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు :

shirk-types

జనులు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ను అంగీకరించనంత వరకూ వారితో పోరాడాలని నాకు ఆదేశించబడింది. వారు గనక ఈ కలిమాను అంగీకరిస్తే, వారు తమ ధన ప్రాణాలను కాపాడుకున్న వారవుతారు. అయితే ఈ కలిమా హక్కు మాత్రం మిగిలి ఉంటుంది.” (బుఖారీ, ముస్లిం)

(6) షిర్క్ పెద్ద పాపాలలోకెల్లా పెద్దది. దీని గురించి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

shirk-types-2

ఏమిటి, అన్నిటికన్నా పెద్ద పాపాలేవో నేను మీకు తెలుపనా?” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రశ్నించగా, ‘తప్పకుండా తెలుపండి దైవ ప్రవక్తా!’ అని మేమన్నాము. అప్పుడాయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “అల్లాహ్ కు భాగస్వామిగా వేరెవరినయినా నిలబెట్టడం, తల్లిదండ్రులను ఎదిరించటం.” (బుఖారీ, ముస్లిం)

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ తన పుస్తకం (అల్ జవాబుల్ కాఫీ : పే జి 109) లో ఇలా అభిప్రాయపడ్డారు:

అల్లాహ్ ఈ విషయం మనకు ఎరుకపరిచాడు. ఆయన సృష్టికర్త, పాలకుడు (ఆజ్ఞాపించేవాడు) అవటంలోని ముఖ్యోద్దేశం ఏమిటంటే; అల్లాహ్ ఆయన పేర్లు, గుణగణాల ఆధారంగా తెలుసుకోవాలి. కేవలం ఆయన్నే ఆరాధించాలి. ఆయనకు సాటి కల్పించరాదు. జనులు న్యాయానికి, సమత్వం, సమతూకాలకు కట్టుబడి ఉండాలి. సమత్వం, సమతూకాల మూలంగానే భూమ్యాకాశాల వ్యవస్థ నిలబడి ఉంది.”

అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :

لَقَدْ أَرْسَلْنَا رُسُلَنَا بِالْبَيِّنَاتِ وَأَنزَلْنَا مَعَهُمُ الْكِتَابَ وَالْمِيزَانَ لِيَقُومَ النَّاسُ بِالْقِسْطِ

నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమయిన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటా (త్రాసు)ను కూడా అవతరింపజేశాము – ప్రజలు న్యాయం (సమతూకం)పై నిలిచి ఉండటానికి!” (అల్ హదీద్ : 25)

పై ఆయతులో అల్లాహ్ తన ప్రవక్తలను పంపినట్లు, తన గ్రంథాలను అవతరింపజేసినట్లు తెలియజేశాడు. ప్రజలు నీతికి, న్యాయానికి కట్టుబడి ఉండాలన్నదే దీని ఉద్దేశం. అన్నిటికన్నా పెద్ద న్యాయం (సమత్వం, సమతూకం) తౌహీద్. తౌహీదే (దేవుని ఏకత్వమే) న్యాయానికి, ధర్మానికి ప్రాతిపదిక. షిర్క్ (బహుదైవోపాసన) అతి పెద్ద దుర్మార్గం, దుర్వర్తనం, దారుణం.

అల్లాహ్ సెలవిచ్చినట్లు –

 إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

నిశ్చయంగా షిర్క్ (బహుదైవోపాసన) చాలా పెద్ద జులుం.” (లుఖ్మాన్ 31 : 13)

మొత్తానికి తెలిసిందేమంటే షిర్క్ (బహుదైవారాధన) అతి పెద్ద దారుణం (అన్యాయం). తౌహీద్ (ఏక దైవారాధన) అన్నిటికన్నా గొప్ప న్యాయం (ధర్మం). కనుక ఏ వస్తువు మహదాశయమైన తౌహీద్ కు వ్యతిరేకంగా నిలుస్తుందో అది మహాపరాధంగా పరిగణించబడుతుంది.

ఈ నేపథ్యంలోనే అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇంకా ఇలా అంటున్నారు:

షిర్క్ (బహుదైవారాధన) ఈ సిసలయిన ఆశయానికి (తౌహీద్ కు) వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మహాపరాధమే. అల్లాహ్ ప్రతి  ముష్రిక్ పై స్వర్గాన్ని నిషిద్ధం (హరామ్) గావించాడు. అతని ధన ప్రాణాలను కూడా ఏక దైవారాధకుల కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. ఎందుకంటే వారు అల్లాహ్ దాస్యం యొక్క హక్కును నిర్వర్తించలేదు. కాబట్టి వారిని బానిసలుగా చేసుకునేందుకు ఏక దైవారాధకులకు అనుమతి ఇవ్వబడింది. అదలా ఉంచితే అల్లాహ్ ముష్రిక్కు చేసిన ఏ సత్కర్మనూ స్వీకరించడు. వారి కొరకు చేయబడిన సిఫారసు ఆమోదించటంగానీ, పరలోకంలో వారి మొరను ఆలకించటంగానీ, వారి కోర్కెను తీర్చటం గానీ చేయడు. ఎందుకంటే ముష్రిక్  వ్యక్తి అల్లాహ్ వ్యవహారంలో అతి పెద్ద మూర్ఖుడు. ఎందుకంటే అతను సృష్టితాలను ఆయనకు సహవర్తులుగా నిలబెట్టాడు. ఇది పరమ ప్రభువు అయిన అల్లాహ్ విషయంలో అజ్ఞానానికి పరాకాష్ఠ. ఆయన విషయంలో ఇది చాలా పెద్ద అన్యాయం. వాస్తవానికి అతను షిర్క్ చేసి అల్లాహ్ కు కాదు, తన ఆత్మకే అన్యాయం చేసుకున్నాడు.”

(7) వాస్తవానికి షిర్క్ ఒక లోపం. దోషం. దాని నుండి అల్లాహ్ తన అస్తిత్వాన్ని పవిత్రంగా, పునీతంగా ఖరారు చేసుకున్నాడు. కాబట్టి అల్లాహ్ కు సహవర్తుల్ని కల్పించే వాడు. ఆయనకు లేనిపోని దోషాన్ని, లోపాన్ని ఆపాదిస్తున్నడన్నమాట! ఆ విధంగా అతను అల్లాహ్ పై తిరుగుబాటు చేశాడు. ఆయన ఆజ్ఞను ఎదిరించి ఆయనతో శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు.


(అ) షిర్క్ రకాలు:

షిర్క్ రెండు రకాలు

మొదటి రకం: షిర్కె అక్బర్ (పెద్ద షిర్క్)

ఇది మనిషిని ముస్లిం సముదాయం నుండి బహిష్కృతం చేసేస్తుంది. అతను గనక పశ్చాత్తాపం చెందకుండానే మరణిస్తే కలకాలం నరకాగ్నిలో ఉంటాడు.

ఏ రకమయిన ఆరాధన అయినా సరే అల్లాహ్ యేతరుల కొరకు చేస్తే అది షిర్కె అక్బర్ (పెద్ద తరహా షిర్క్) అవుతుంది : ఉదాహరణకు అల్లాహ్ యేతరులను మొర పెట్టుకోవటం, వారి పేర మొక్కుకోవటం, మొక్కుబడులు చెల్లించటం, బలిదానాలు చేసి సమాధులలో ఉన్న వారి మెప్పు పొందగోరటం, జిన్నాతుల, షైతానుల ప్రసన్నత బడయటం, అలాగే మృతులు షైతానులు, జిన్నాతులు తమకేదైనా హానికలిగిస్తాయేమోనని భయపడటం. అలాగే – దేవుని ఏకత్వం కేవలం అల్లాహ్ మాత్రమే తీర్చగల అవసరాల కోసం అల్లాహ్ యేతరులను ఆశించటం, ఆపదలను తొలగించమని అల్లాహ్ యేతరులను అర్థించటం మొదలగునవి.

నేటి ఆధునిక యుగంలో ఇలాంటి షిర్క్ మరీ ఎక్కువైపోయింది. పుణ్య పురుషుల సమాధులపై నిర్మించబడిన కట్టడాల వద్ద సకల ఆర్భాటాలతో ఈ షిర్క్ పోకడలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి –

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ

వారు అల్లాహ్ ను వదలి తమకు లాభాన్నిగానీ, నష్టాన్నిగానీ చేకూర్చ లేని వాటిని పూజిస్తున్నారు. (అదేమంటే) ‘అల్లాహ్ సమక్షంలో అవి మాకు సిఫారసు చేస్తాయి’ అని అంటున్నారు.” (యూనుస్ 10: 18)

రెండవ రకం: షిర్కె అస్గర్: (చిన్నతరహా షిర్క్)

ఇది మనిషిని ముస్లిం సముదాయం నుండైతే వేరుపరచదు గాని దానివల్ల ‘ఏకదైవారాధన’ (తౌహీద్)లో దోషం ఏర్పడుతుంది. అంతేకాదు, అది అతన్ని క్రమక్రమంగా ‘షిర్కె అక్బర్’ వైపు తీసుకెళుతుంది. షిర్కె అస్గర్  కూడా రెండు రకాలు : (1) కనిపించే షిర్క్ (2) కనిపించని షిర్క్,

(1) కనిపించే షిర్క్:

అంటే మనిషి మాటల ద్వారా, చేతల ద్వారా వ్యక్తమయ్యే షిర్క్ అన్నమాట. ఉదాహరణకు : దైవేతరులపై ఒట్టేసి చెప్పటం. దీని గురించి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు:

shirk-types-3

ఎవరయితే అల్లాహ్ యేతరునిపై ప్రమాణం చేశాడో అతను తిరస్కారాని (కుఫ్ర్) కి పాల్పడ్డాడు” లేదా ఆయనిలా అన్నారు : “అతను షిర్క్ కి ఒడిగట్టాడు.” (ఈ హదీసును తిర్మిజీ – 1535 సహీగా పేర్కొన్నారు. హాకిమ్ దీనిని సహీహ్ గా పేర్కొన్నారు).

అల్లాహ్ కోరినట్లుగా మరియు తమరు కోరుకున్నట్లుగా” అని చెప్పటం కూడా ఈ కోవకు చెందినదే. ఒకసారి ఒక సహచరుడు ఇలాగే అంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అతనిని ఈ విధంగా మందలించారు : –

shirk-types-4

ఏమిటి, నీవు నన్నూ అల్లాహ్ కు పోటీగా పరిగణిస్తున్నావా?” (ఇది తప్పు. దీనికి బదులు) నీవు ఈ విధంగా అను : ఒక్కడైన అల్లాహ్ కోరినట్లుగా.” (అస్సహీహ – 139) అలాగే  “ఒకవేళ అల్లాహ్ లేకుంటే, ఫలానా వ్యక్తి లేకుంటే” అని చెప్పటం కూడా ఇలాంటిదే.

అల్లాహ్ తలచినట్లుగానే జరిగింది. దానిమీదట ఫలానా వ్యక్తి అభిలషించినట్లుగా జరిగింది” అని అంటే అది సరైనదే. ‘దానిమీదట’ లేదా ‘ఆపైన’ అనే పదం చేరిస్తే అది ఒప్పే. ఎందుకంటే ఈ విధంగా అన్నప్పుడు దాసుని కోరిక దేవుని కోరికకు లోబడినట్లవుతుంది. ఉదాహరణకు : అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَمَا تَشَاءُونَ إِلَّا أَن يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేరు.” (అత్ తక్వీర్ 81 : 29)

నా కొరకు అల్లాహ్ మరియు మీరు తప్ప ఎవరూ లేరు” అని చెప్పటం కూడా ఒక విధంగా షిర్కుతో కూడిన పలుకే.  “ఇది అల్లాహ్ శుభాల వల్ల మరియు మీ శుభాల వల్లనే ప్రాప్తించింది” అని అటం కూడా ఇలాంటిదే.

షిర్కు తో కూడిన పనుల ఉదాహరణ:

ఏదైనా ఆపద నుండి బయటపడేందుకు లేదా ఏదైనా గండాన్ని తొలగించేందుకు కడియం ధరించటం, దారం కట్టడం, దిష్టి తగులుతుందనే భయంతో తాయెత్తు కట్టడం, వెంట్రుకల హారాలు తొడగటం మొదలగునవి.

ఇలాంటివన్నీ గండాల నుండి గట్టెక్కటంలో, కష్టాలను దూరం చేయటంలో తోడ్పడతాయని గనక మనిషి నమ్మితే ఇది షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) క్రిందికి వస్తుంది. ఎందుకంటే అల్లాహ్ ఈ వస్తువులను ఇలాంటి ఉద్దేశాల ప్రాప్తి కొరకు సాధనంగా చేయలేదు. ఒకవేళ ఈ వస్తువులు తమంతట తాముగా ఆపదలను దూరం చేస్తాయని నమ్మితే మాత్రం అది ‘షిర్కె అక్బర్’ గానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది  అల్లాహ్ యేతరులపై ఆశ పెట్టుకోవటం వంటిదే.

(2) కనిపించని షిర్క్:

అంటే దాగి ఉన్న షిర్క్ అన్నమాట. ఇది మనిషి సంకల్పంలో మనోభావంలో ఉంటుంది. ఉదాహరణకు: ప్రదర్శనాబుద్ధి. అంటే ఒక వ్యక్తి  అల్లాహ్ ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో ఒక సత్కార్యం చేసే బదులు జనుల మెప్పును కాంక్షించి చేస్తాడు. ఉదాహరణకు: ఎంతో ఏకాగ్రతతో నమాజ్ చేస్తాడు లేదా దానధర్మాలు చేస్తాడు. కాని అతని మనసులో లోకులు తనను ప్రశంసించాలన్న కోరిక ఉంటుంది.

ఏదైనా ఒక కార్యంలో ప్రదర్శనా మనస్తత్వం వచ్చిందంటే, అది అతని పనిని పాడు చేసేస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

 فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగ స్వామ్యం కల్పించకూడదు.” (అల్ కహఫ్ 18 : 110)

షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) గురించి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు :

“మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా ‘షిర్కె అస్గర్ ‘ గురించిన భయముంది. ‘దైవప్రవక్తా! షిర్కె అస్గర్ అంటే ఏమిటి?’ అని ప్రియ సహచరులు విన్నవించుకోగా, “ప్రదర్శనా బుద్ది” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)  చెప్పారు. (అహ్మద్-22528, తిబ్రానీ)

అలాగే ఎవరయినా ప్రాపంచిక స్వలాభాలను ఆశించి ఏదైనా సత్కార్యం చేస్తే, అది కూడా ‘కనిపించని షిర్క్’లోకి వస్తుంది. ఉదాహరణకు : ఎవరయినా కేవలం సిరిసంపదల కోసం హజ్ చేయటం, లేదా అజాన్ ఇవ్వటం, లేదా సామూహిక నమాజ్ కు సారధ్యం వహించటం, లేదా కేవలం సిరిసంపదలను ఆశించి ధర్మజ్ఞానాన్ని ఆర్జించటం, జిహాద్ చేయటం.

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా ప్రవచించారు :

shirk-types-5

దీనారు దాసోహం అన్నవాడు నాశనమయ్యాడు. దిర్హమ్ కు దాసోహం అన్నవాడు నాశనమయ్యాడు. చారలు గల దుప్పటిని కలిగి ఉన్న దాసుడు నాశనమయ్యాడు. పనితనము (చిత్రీకరణ) గల దుప్పటి ఉన్న దాసుడు నాశనమయ్యాడు. అతనికేదైనా ఇవ్వబడితే సంతోషిస్తాడు. ఇవ్వకపోతే కినుక వహిస్తాడు.” (బుఖారీ)

ఈ విషయమై ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు:

సంకల్పాలలో, ఉద్దేశాలలో షిర్క్ అనేది తీరంలేని సముద్రం వంటిది. అతి కొద్ది మంది మాత్రమే దాని నుండి బయటపడగలుగుతారు. కనుక ఎవరయినా తన ఆచరణ ద్వారా అల్లాహ్ ప్రసన్నతతో పాటు వేరొక సంకల్పం చేసుకుంటే, అల్లాహ్ సామీప్యం పొందటంతో పాటు ఇతరత్రా ఉద్దేశ్యాలకు కూడా చోటిస్తే అతను తన సంకల్పంతో షిర్క్ చేసినట్లే.”

ఈ సందర్భంగా ‘సంకల్ప శుద్ది’ అంటే భావం దాసుడు తన మాటలను, చేతలను, సంకల్పాన్ని కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించాలి. (అంటే కేవలం అల్లాహ్ ప్రసన్నతను చూరగొనటమే అతని ధ్యేయమై ఉండాలి). ఇదే అసలుసిసలు ఏకోన్ముఖత. అంటే సిసలయిన ఇబ్రాహీమ్ విధానం. దీనిని అవలంబించమని అల్లాహ్ తన దాసులందరికీ ఆజ్ఞాపించాడు. ఇది మినహా ఆయన ఎవరి నుండీ, ఎలాంటి దానిని అంగీకరించడు. ఈ ఏకోన్ముఖతే ఇస్లాం వాస్తవికత.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ

ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయిన వారిలో  చేరుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3 : 85)

ఇదే సిసలయిన ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) విధానం. దీని నుండి ముఖం త్రిప్పుకున్నవాడు, విసుగును ప్రదర్శించినవాడు అతి పెద్ద మూర్ఖుడు.” (అల్ జవాబుల్ కాఫీ – పేజీ : 115)

షిర్కె అస్గర్ – షిర్కె అక్బర్ కి మధ్యగల వ్యత్యాసాలు

వెనుకటి చర్చ ప్రకారం ఈ రెండు రకాల షిర్క్ మధ్య గల తేడాలు ఇవి :

1. షిర్కె అక్బర్ (పెద్ద తరహా షిర్క్) మనిషిని ముస్లిం సముదాయం నుండి బహిష్కరిస్తుంది. షిర్కె అస్గర్  (చిన్న తరహా షిర్క్) ముస్లిం సముదాయం నుండి మనిషిని బహిష్కరించదు గాని అతని ఏకదైవారాధనా విశ్వాసంలో లోపం ఏర్పరుస్తుంది.

2. షిర్కె అక్బర్ కు పాల్పడినవాడు శాశ్వతంగా నరకయాతనను అనుభవిస్తాడు. షిర్కె అస్గర్ కు ఒడిగట్టినవాడు నరకానికి ఆహుతి అయినా శాశ్వతంగా నరకంలోనే ఉండడు.

3.షిర్కె అక్బర్ మనిషి ఆచరణలన్నింటినీ నాశనం చేసేస్తుంది. కాగా, షిర్కె అస్గర్ ఆచరణలన్నింటినీ వృధా చేయదు. ఏ ఆచరణలో అది (ప్రదర్శనాబుద్ధి, ప్రాపంచిక స్వలాభాపేక్ష) జొరబడుతుందో దానిని మాత్రమే నాశనం చేస్తుంది.

4.షిర్కె అక్బర్ ముష్రిక్కుల ధన ప్రాణాలను ధర్మసమ్మతం చేసేస్తుంది. కాని షిర్కె అస్గర్ వల్ల అతని ధన ప్రాణాలు ధర్మసమ్మతం అవవు.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (93-100 పేజీలు). https://teluguislam.net/2019/09/20/aqeedah-tawheed-shaykh-fawzan/

లైలతుల్ ఖద్ర్ దుఆ

బిస్మిల్లాహ్
1196. ఆయేషా (రదియల్లాహు అన్హా) కధనం : నేను ప్రవక్తతో “దైవ ప్రవక్తా! నేనొక వేళ లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి) ఏదో కనుగొంటే ఆ రాత్రి నేను ఏమని ప్రార్ధించాలో కాస్త చెబుతారా?” అని అడిగాను.    ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్ధించమని చెప్పారు : اللَّهمَّ إنَّكَ عفوٌّ تحبُّ العفوَ فاعفُ عنِّي అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్‌ అఫ్‌వ  ఫా'ఫు అన్నీ అల్లాహ్‌! నీవు అమితంగా మన్నించేవాడవు. మన్నింపును ఇష్టపడతావు. కనుక నన్ను మన్నించు (తిర్మిజీ- హసన్‌, సహీహ్‌) హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి

1196. ఆయేషా (రదియల్లాహు అన్హా) కధనం : నేను ప్రవక్తతో “దైవ ప్రవక్తా! నేనొక వేళ లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి) ఏదో కనుగొంటే ఆ రాత్రి నేను ఏమని ప్రార్ధించాలో కాస్త చెబుతారా?” అని అడిగాను.    ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్ధించమని చెప్పారు :

اللَّهمَّ إنَّكَ عفوٌّ تحبُّ العفوَ فاعفُ عنِّي

అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్‌ అఫ్‌వ  ఫా’ఫు అన్నీ

అల్లాహ్‌! నీవు అమితంగా మన్నించేవాడవు. మన్నింపును ఇష్టపడతావు. కనుక నన్ను మన్నించు

(తిర్మిజీ- హసన్‌, సహీహ్‌)

తెలుగు మూలంలైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు  – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

ఎవరయితే విశ్వాసంతో, పుణ్యం లభించాలన్న ఉద్దేశ్యంతో ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్) లో నమాజు చేస్తూ నిలబడ్డారో

బిస్మిల్లాహ్

1190. హజ్రత్‌ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:

“ఎవరయితే విశ్వాసంతో, పుణ్యం లభించాలన్న ఉద్దేశ్యంతో ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్) లో నమాజు చేస్తూ నిలబడ్డారో (అంటే అల్లాహ్ ఆరాధన చేశారో) వారి వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి.” (బుఖారీ-ముస్లిం).

(సహీహ్ బుఖారీలోని తరావీహ్  నమాజు ప్రకరణం & సహీహ్‌ ముస్లిం లోని ప్రయాణీకుల నమాజ్‌ ప్రకరణం)

తెలుగు మూలం: లైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు  – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి

గడ్డం తప్పనిసరి అని ఏదైనా హాదీసులో చెప్పబడినదా? [వీడియో & టెక్స్ట్]

గడ్డం తప్పనిసరి అని ఏదైనా హాదీసులో చెప్పబడినదా?
https://youtu.be/nbYQWiZ3Q0k [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)


అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా చెప్పారని  అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

మీసాలను దగ్గరగా కత్తిరించండి (ట్రిమ్ చెయ్యండి) మరియు గడ్డాలు పెంచుకోండి మరియు మాజియన్లను (పర్షియన్ అగ్ని ఆరాధకులు) వ్యతిరేకించండి.” [సహీహ్ ముస్లిం # 501]

ఒక సందర్భంలో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  కిస్రా (పర్షియన్ రాజు) యొక్క రెండు [1] దూతలను స్వీకరించినప్పుడు, వారు గడ్డం తీయించుకున్నారని (షేవ్ చేసుకున్నారని) మరియు పెరిగిన మీసాలతో ఉన్నారని చూసినప్పుడు వాటిని చూడటం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇష్టపడలేదు.

ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా అన్నారు:

నీకు దీన్ని చేయమని మిమ్మల్ని ఎవరు ఆదేశించారు?” వారు ఇలా అన్నారు: “మా ప్రభువు” (వారి రాజు కిస్రా అని అర్థం)”.

అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఇలా అన్నారు:

అయితే నా గడ్డం పెరగనివ్వమని మరియు మీసాలను కత్తిరించమని నా రబ్ (అల్లాహ్) నన్ను ఆదేశించాడు.” [2]

[1] కిస్రా: ఖోస్రు, పెర్షియన్ రాజు. కిస్రా అనేది సాధారణంగా పెర్షియన్ రాజుల హోదా.
[2] హదీత్ హసన్ అని రచయిత చెప్పారు:

మూలం: https://abdurrahman.org/2015/02/22/the-beard-why-sheikh-dr-muhamad-ismaaeel-dr-saleh-as-saleh/

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో గడ్డం పెంచడం యొక్క ఆవశ్యకత గురించి ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. వక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అంతిమ ఆదర్శంగా అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, సాధారణ వ్యక్తులను కాదు, మత పెద్దలను కూడా. గడ్డం పెంచడాన్ని ఆజ్ఞాపించే హదీసులను ఉటంకిస్తూ, యూదులు మరియు ముష్రికుల నుండి తమను తాము వేరు చేసుకోవడానికి గడ్డాన్ని పూర్తిగా పెరగనివ్వాలని మరియు మీసాలను కత్తిరించాలని ప్రవక్త ముస్లింలను ఆదేశించారని ఆయన వివరించారు. గడ్డం ఉన్న కొందరి చెడు ప్రవర్తన, అసంపూర్ణ పెరుగుదల లేదా రూపురేఖల గురించిన ఆందోళనల వంటి సాధారణ అభ్యంతరాలను వక్త తిరస్కరించారు, గడ్డం పురుషుని సహజ సృష్టిలో ఒక భాగమని మరియు పురుషత్వానికి చిహ్నమని స్పష్టం చేశారు.

చూడండి, ఇస్లాం ధర్మం అల్లాహ్ పంపినటువంటి ధర్మం. సర్వసామాన్యంగా స్టూడెంట్స్ ఎప్పుడైతే టీచర్ చదువు చెబుతాడో, ఏదైనా పుస్తకం ఇచ్చి దాని గురించి బోధ చేస్తాడో, మా టీచర్ ఎంత ఆదర్శవంతంగా ఉన్నాడు అనేది కూడా టీచర్ వైపునకు చూడడం పిల్లల యొక్క అలవాటుగా ఉంటుంది. వారి యొక్క స్వభావంలో ఉంది. అందుకొరకే అల్లాహు త’ఆలా ఎప్పుడైతే ఖురాన్ హదీసుల ద్వారా మనకు ధర్మ జ్ఞానం ప్రసాదించాడో, మనకు ఆదర్శంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిలిపాడు. మరియు ఆ ప్రవక్త గురించి స్వయంగా అల్లాహ్‌యే సర్టిఫికేట్ ఇచ్చేశాడు.

إِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
(ఇన్నక ల’అలా ఖులుఖిన్ అజీమ్)
నిశ్చయంగా మీరు అత్యున్నత గొప్ప నడవడిక మరియు మంచి సద్వర్తనలో ఉన్నారు

అంతేకాకుండా,

وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا
(వమా ఆతాకుముర్రసూలు ఫఖుదూహు వమా నహాకుమ్ అన్హు ఫన్తహూ)
ప్రవక్త ఇచ్చినది మీరు తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన వాటికి దూరంగా ఉండండి

అంతేకాకుండా సూరతుల్ అహ్‌జాబ్‌లో,

لَّقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ
(లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనహ్)
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీకు ఉత్తమమైన ఆదర్శం ఉంది

అందుకొరకే, ఎప్పుడైనా షైతాన్ గాని, ఇంకా వేరే ఎవరైనా గాని, అరేయ్ నీ మౌల్వీ సాబును చూడురా, అరే నీ గురువుగారిని చూడురా ఏం చేస్తుండో, అరే వాణ్ని చూడురా ఎట్లున్నాడో అని ప్రజల వైపునకు లేదా ప్రస్తుతం మన కళ్ళల్లో మన దృష్టిలో మన యొక్క కని విని వినికిడిలో ఏ మంచి వ్యక్తి ఉన్నాడో అతడిలో ఏదైనా లోపం చూపించి, అరే వాళ్లారా నువ్వు ఇంతవరకు ఫాలో అవుతున్నది చూడు ఏం చేస్తున్నాడో, ఇలా చూపించి ఇస్లాం పట్ల విరక్తి, ఇస్లాం పట్ల ఒక అయిష్టత ఏర్పడే అటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అందుకొరకు ఆ సందర్భంలో అల్లాహ్‌ను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని బలంగా పట్టుకొని వారి గురించి అధికంగా చదివి వారి యొక్క ఉత్తమ అల్లాహ్ ఆదేశాలను మరియు ప్రవక్త యొక్క ఉత్తమ ఆదర్శాన్ని ముందు పెట్టుకోండి.

మీ ప్రశ్నలోని రెండవ భాగం దానికి నేను ఇంత విడమరిచి చెప్పవలసి వచ్చింది. అల్లాహ్ స్వీకరించుగాక చెప్పడానికి, ఆచరించేటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అయితే మనం గడ్డం విషయానికి వస్తే కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఎలా ఉండింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు వేరు వేరు పదాల్లో, అరబీలో వేరు వేరు పదాల్లో గడ్డాన్ని దాని స్థితిలో పూర్తిగా పెంచుతూ మీసాలు కత్తిరిస్తూ ఉండండి అని చెప్పారు.

وَفِّرُوا اللِّحَى
(వఫ్ఫిరుల్-లుహా)
గడ్డాన్ని ఘనంగా, సంపూర్ణంగా ఉంచండి.

أَوْفُوا اللِّحَى
(అవ్‌ఫుల్-లుహా)
పూర్తిగా.

ఇంకా వేరే ఎన్నో,

أَرْخُوا
(అర్ఖూ)
దాని స్థితిలో అలాగే పొడుగ్గా వదిలేయండి.

ఇలాంటి ఏడు రకాల పదాలు అరబీలో వచ్చి ఉన్నాయి. రెండవది, ఆ ఏడు రకాల పదాలు చేస్తే మంచిది అన్నటువంటి ఫార్మెట్లో లేవు, ఆర్డర్ ఫార్మెట్. వఫ్ఫిరూ, అవ్‌ఫిరూ, అర్ఖూ, ఆర్డర్, అంటే హుకుమ్. గమనిస్తున్నారా? ఇది ఒక వైపు ఇలా ఉండగా, మరోవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా యూదులకు మీరు వ్యతిరేకత పాటిస్తూ గడ్డాన్ని వదలండి, ముష్రికులకు భిన్నంగా, మజూస్‌కు భిన్నంగా. ఇక ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యూదులను, ముష్రికులను, మజూసులను ప్రస్తావించి మనల్ని సంపూర్ణంగా గడ్డం ఉంచండి అని చెప్పాడంటే వారిలో షేవ్ చేసేవారు ఉన్నారు, వారిలో ట్రిమ్ చేసేవారు ఉన్నారు, వారిలో రకరకాల డిజైన్లు చేసేవారు ఉన్నారు, అలాంటి వారి ఏ పోలిక మీరు పాటించకుండా ప్రవక్త యొక్క ఆదర్శాన్ని పాటించి వారి విధంగా పూర్తిగా గడ్డం వదలండి.

అంతేకాదు, మరో రకంగా మనం గమనించామంటే ఇందులో మరో గొప్ప విషయం, అదేమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితంలో ఒక్కసారైనా, నవూజుబిల్లాహ్ అస్తగ్‌ఫిరుల్లాహ్, అర్థం కావడానికి కేవలం చెబుతున్నాను, ప్రవక్త విషయంలో ఈ మాట చెప్పినందుకు తప్పు ఉంటే అల్లాహ్ నన్ను క్షమించుగాక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జీవితంలో ఒక్కసారి కూడా షేవ్ చేయలేదు, ట్రిమ్ చేయలేదు, కత్తెర పెట్టలేదు, డిజైన్ చేయలేదు, ఏలాంటి ఏ అలంకరణలు చేయడానికి గడ్డానికి చేయి పెట్టలేదు. చేయి పెట్టలేదు అంటే కత్తిరించే విషయంలో. ఈ ఒక్క సహీ హదీస్ లేదు ఇప్పటివరకు.

అందుకొరకే గడ్డం, ఇది మన ప్రకృతి విషయాల్లో ఒకటి. ప్రకృతిపరంగా మనం తీయవలసిన వెంట్రుకలు తీస్తాము, గోళ్లు పెరుగుతూ ఉంటే తీస్తాము. దీనికి వ్యతిరేకంగా చేసేవారు ఏందిరా పశువా, జంతువా, ఇంక ఇట్లా పెంచుకున్నావ్ ఏంటి అని అంటారు కదా, అలాగే గడ్డాన్ని పెంచాలి. గడ్డం ఇది ప్రకృతికి, మన అందానికి అడ్డం కాదు, ఇది అనుకూలమైన విషయం. అందుగురించి పశువుల్లో కూడా, జంతువుల్లో కూడా మగవాళ్లకు గడ్డం లేదా గడ్డం లాంటి ఒక గుర్తు ఉంది.

ఇంతటితో మీకు తృప్తి కాకుంటే మరో విషయం కూడా మీరు తెలుసుకోండి. అదేమిటంటే, గడ్డం గురించి ఎవరైతే అభ్యంతరం వ్యక్తం చేస్తారో వారిలో ఒక విషయం ఏంటో తెలుసా, అరే ఎందరో గడ్డం ఉన్నవారిని చూసామయ్యా, గడ్డం అడ్డుగా ఏదో ఎన్నో రకాల చెడు పనులు చేస్తారు. అందుకొరకు ఆ గడ్డం పెట్టుకొని ఆ పనులు చేయకపోవడమే మంచిది. అస్తగ్‌ఫిరుల్లాహ్, అస్తగ్‌ఫిరుల్లాహ్. ఇది గడ్డంకు అడ్డం ఇంత మాత్రం కాదు. ఎందుకంటే గమనించండి, గడ్డం పెట్టి ఎవరైనా ఏదైనా పొరపాట్లు చేస్తున్నారు అంటే గడ్డం వల్ల చేయడం లేదు అది. అలా అనుకుంటే మరి గడ్డం లేకుండా అన్నీ మంచి పనులు చేసేవారు ఉన్నారా? అందుకొరకు ఈ టాపిక్‌నే తీసుకురాకూడదు. ఈ ఆబ్జెక్షనే తప్పు, రాంగ్.

మరి కొందరు ఏమంటారు, అరే గడ్డం పెట్టాలి కరెక్టే కానీ ఒకసారి ఇక్కడ కొన్ని వెంట్రుకలు ఉంటాయి, ఇటువైపున ఉండవు. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఉండేది ఉంటే మొత్తం ఉండాలి, మంచిగా అనిపిస్తది. గడ్డం ఇది అల్లాహు త’ఆలా ఇస్తున్నది, దాని స్థితిలో మనం పెంచాలి. ఈ ఆటంకాలు చెప్పుకుంటూ మనం అల్లాహ్ ఆదేశానికి వ్యతిరేకంగా, ప్రవక్త ఆదర్శానికి వ్యతిరేకంగా పాటించకూడదు, పాపంలో పడిపోతాము.

మరి కొందరు ఉన్నారు, ఏమంటారు, గడ్డం ఉన్న వారిని ఎంతమంది చూస్తాము, అంతా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పాడుగా కనబడుతుంది, మంచిగా అందంగా కనబడరు. గడ్డాన్ని వాళ్లు కొంచెం, ఇది వారి తప్పు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో వచ్చి ఉంది,

أَكْرِمُوا شَعَرَكُمْ
(అక్రిమూ షా’రకుమ్)
మీ యొక్క వెంట్రుకల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాటిని అలంకరిస్తూ ఉండండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నూనె కూడా పెట్టుకునేవారు. మనం అడపాదడపా దువ్వుకుంటూ, అటు ఇటు పోకుండా, చిందరవందరంగా లేకుండా మనం దీన్ని కాపాడుకోవాలి. ఎవడైనా కాపాడుకోకుంటే అతడు మనకు దలీల్ ఆధారం కాదు మరియు వాని యొక్క పని అనేది మనం దానివల్ల గడ్డం ఉంచకూడదు అని చెప్పలేము. బహుశా గడ్డనికి సంబంధించి ఈ విషయాలు గడ్డం ఉంచడానికి మనకు ప్రోత్సాహం కలిగిస్తాయి అని ఆశిస్తున్నాను.

అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం, మరింత అధిక జ్ఞానం, దాని ప్రకారం ఆచరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=10797

ఇతరములు: