1190. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“ఎవరయితే విశ్వాసంతో, పుణ్యం లభించాలన్న ఉద్దేశ్యంతో ఘనమైన రేయి (లైలతుల్ ఖద్ర్) లో నమాజు చేస్తూ నిలబడ్డారో (అంటే అల్లాహ్ ఆరాధన చేశారో) వారి వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి.” (బుఖారీ-ముస్లిం).
(సహీహ్ బుఖారీలోని తరావీహ్ నమాజు ప్రకరణం & సహీహ్ ముస్లిం లోని ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం)
తెలుగు మూలం: లైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి
You must be logged in to post a comment.