ప్రశ్న-2 : నెలసరిలో ఉన్న స్త్రీ (ఫజర్ కంటే ముందు) పరిశుద్దురాలైంది. ఫజర్ తరువాత స్నానము చేసి నమాజ్ కూడా చేసింది. ఆ రోజు ఉపవాసాన్ని కూడా పూర్తి చేసింది. అయితే ఆమె ఆ రోజు పాటించిన ఉపవాసానికి బదులుగా మరలా ఉపవాసం పాటించాలనే విధి వుందా?’. ఒక సోదరి.
జవాబు: ‘ఫజర్’ కంటే ఒక్క నిమిషం ముందు నెలసరిలో ఉన్న స్త్రీ పరిశుద్ధురాలైనా తన పరిశుద్ధత గురించి పూర్తిగా నమ్మకం కలిగివుంటే మరింకా అది రమజాన్ మాసమే అయితే ఆమె పై ఆరోజు ఉపవాసాన్ని పాటించడం విధిగా పరిగణించబడుతుంది. కనుక అమె ఆరోజు పాటించే ఉపవాసం శ్రేయస్కరంగానే భావించబడుతుంది. దానికి బదులు (ఖజా) ఉపవాసం పాటించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె పరిశుభ్రతలోనే ఉపవాసం (‘సహరి’ చేసింది) పాటించింది. ఆమె ఒకవేళ ‘ఫజర్’ తరువాత స్నానం చేసినా సరే. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. దీనికి ఉదాహరణ ఏమిటంటే పురుషుడు కామక్రియల వల్ల లేదా వీర్యస్ఖలనానికి గురై (‘సహ్రి’ చేసుకుని) ఫజర్ తరువాత స్నానము చేసినా అతని ఉపవాసం శ్రేయస్కరంగానే పరిగణించ బడుతుంది.
దీనికి సంబంధించిన మరొక విషయయాన్ని ప్రస్తావించ దలచుచున్నాను : అదేమిటంటే, ‘ఆమె ఉపవాసం పూర్తి చేసుకుని ఇఫ్తార్ చేసిన తరువాత, ఇషా కంటే ముందు ఋతుస్రావానికి గురైతే ఆమె ఆ రోజు ఉపవాసం వృధా అయిపోతుందని’ కొందరు స్త్రీలు భావిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సరి కాదు. అంతే కాకుండా ఒక వేళ సూర్యాస్తమయం తరువాత ఒక క్షణం తరువాత ఋతస్రావం ప్రారంభమైనా కూడ ఆమె ఉపవాసం పరిపూర్ణమవుతుంది.
—
ఈ ఫత్వా క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
ఋతుకాలం – సందేహాలు & సమాధానాలు
మూల రచయిత (అరబీ): షేఖ్ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి హఫిజహుల్లాహ్
మర్కజ్ దారుల్ బిర్ర్ పబ్లికేషన్స్