స్త్రీల సహజ రక్త సంభంధిత ఆదేశాలు – ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]

రచన: ఫజీలతుష్షేక్ అల్లామ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్
(అల్లాహ్ ఆయనను,ఆయన తల్లిదండ్రులను మరియు సమస్తముస్లింలను మన్నించుగాక!)

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.

సమస్త స్తుతులు అల్లాహ్’కు మాత్రమే అంకితం, మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనతో సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతో మన్నింపులు వేడుకుంటున్నాము మరియు ఆయన వైపుకు మాత్రమే మరలుతున్నాము!అలాగే మా హృదయాల కీడు నుండి, దుష్కర్మల నుండి అల్లాహ్’తో శరణు వేడుకొంటున్నాము.ఎవరికైతే అల్లాహ్ సన్మార్గం చూపుతాడో అతన్ని ఎవరు మార్గభ్రష్టుడిగా మార్చలేరు, ఎవరినైతే ఆయన మార్గబ్రష్టుడిగా చేస్తాడో అతనికెవరూ సన్మార్గం చూపరు.ఇంకా అల్లాహ్ తప్ప మరో నిజఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను.మరియు ముహమ్మద్ ఆయన యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను.ఆయనపై,ఆయన కుటుంబీకులపై,ఆయన సహచరులపై మరియు ప్రళయదినం వరకు ఆయనను అత్యుత్తమంగా అనుసరించే అనుచరసమాజం పై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక!

అమ్మాబాద్! నిస్సందేహంగా స్త్రీలు క్రమంగా సహజ రుతుస్రావం, ఇస్తిహాజా మరియు (నిఫాస్) పురిటిరక్తానికి లోనవుతూ ఉంటారు, ఇది ప్రధాన అంశాలలో ఒకటి కనుక దీనికి సంబంధించిన ఆదేశాలను వివరించడం, అవగాహన కల్పించడం మరియు విజ్ఞులు చెప్పిన విషయాలలో తప్పుడు వివరణల నుండి సరైన జ్ఞానం వైపుకు మార్గదర్శనం చేయడం చాలా అవసరం.కాబట్టి ప్రముఖులు చెప్పిన మాటల్లో సమంజసమైనవి లేక బలహీనమైనవి ఏమిటి అని ఖరారు చేయడంలో మేము ఖుర్ఆను మరియు సున్నతు మార్గాన్ని అవలంభిస్తాము.

  • 1-ఎందుకంటే ఈ రెండు ప్రధాన మూలాలు, వీటి ఆధారంగానే షరీఅతుకు సంబంధించిన ఆదేశాలు, ఆరాధనలు మరియు విధులు దాసులకు నిర్దేశించ బడతాయి.
  • 2-ఈ విధంగా ఖుర్ఆను మరియు సున్నతులను ఆధారం చేసుకోవడం వలన మనసుకు శాంతి చేకూరుతుంది,హృదయాలు తెరుచుకుంటాయి ఆత్మకు తృప్తికలుగుతుంది మరియు బాధ్యతలు తీరుతాయి.
  • 3- కావున ఈ రెండు కాకుండా ఇతర మూలాల కోసం సాక్ష్యం తీసుకోబడింది కానీ వాటినే సాక్ష్యంగా పరిగణించబడదు.

ఎందుకంటే,ప్రామాణిక అభిప్రాయం ప్రకారం, హుజ్జతు (రుజువు) కేవలం అల్లాహ్ వాక్కుయగు ఖుర్ఆను మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలలో మాత్రమే ఉంది, అలాగే పండితులగు సహాబాల తీర్పులలో ఉంది, ఆయితే ఆ తీర్పులు ఖుర్ఆను మరియు సున్నత్ లకు విరుద్ధంగా ఉండకూడదు.అలాగే మరొక సహాబీ అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉండకూడదు ఒకవేళ అది ఖుర్ఆను మరియు సున్నతులకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అప్పుడు ఖుర్ఆను సున్నతులోని ఆదేశాన్ని పాటించడం తప్పనిసరి అవుతుంది.ఒకవేళ ఈ సహాబీ అభిప్రాయానికి మరొక సహాబీ అభిప్రాయం విరుద్ధంగా ఉంటే, అప్పుడు ఈ రెండు అభిప్రాయాల మధ్య తర్జీహ్ అవసరం పడుతుంది ఆ రెండింటిలో ప్రాధాన్యత పర్చబడ్డ రాజిహ్ అభిప్రాయం తీసుకోబడుతుంది

.لقوله تعالى: {فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللّهِ وَالْيَوْمِ الآخِرِ ذَلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلا } [النساء:59].
అల్లాహ్ సెలవిచ్చాడు:{“ఒకవేళ ఏ విషయంలోనయినా మీ మధ్య వివాదం తలెత్తితే దానిని అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరల్చండి -మీకు నిజంగానే అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అనివార్యం).ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది”.}(అల్ నిసా:59)

ఇది స్త్రీల సహజ రక్తసంబంధిత విషయాలు మరియు ఆదేశాలను వివరించే చిరుపుస్తకం, వీటిని వివరించే పుస్తకం చాలా అవసరం.

ఈ పుస్తకం క్రింది అధ్యాయాలను కలిగి ఉంది:

మొదటి అధ్యాయం: ‘హైజ్’ రుతుస్రావం అంటే ఏమిటి? అందులోని మర్మమేమిటి?

నిఘంటువు పరంగా’అల్ హైజ్’ అంటే పదార్ధం స్రవించడం మరియు కారుతున్న పదార్ధం.

షరీఆ అర్థం:ప్రకృతి పరంగా ఎటువంటి కారణం లేకుండా నిర్దారీత సమయంలో స్త్రీకు వెలువడే రక్తం. మరియు ఇది సహజంగా వెలువడు రక్తం, వ్యాధి, గాయం, గర్భస్రావం మరియు ప్రసవానికి కారణం కాదు, ఇది సహజ రక్తం. అయితే, ఇది స్త్రీ పరిస్థితి, పర్యావరణం మరియు వాతావరణాన్ని బట్టి మారుతుంది మరియు అందుకే స్త్రీలకు సుస్పష్టంగా ఈ రక్తం విభిన్నంగా ఉంటుంది.

ఋతుస్రావం యొక్క మర్మం: శిశువు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు, గర్భం వెలుపల ఉన్నందున ఆహారం తినడం అసాధ్యం, మరియు అత్యంత దయశీలియగు తల్లికి కూడా తన బిడ్డకు సాధ్యం కాదు, కాగా అల్లాహ్ తఆల స్త్రీ కడుపులో చిన్న రక్తపు ముద్దలను సృష్టిస్తాడు, దాని ద్వారా బిడ్డ తల్లి కడుపులో ఆహారం పొందుతుంది, ఈ రక్తం కణాలు శిశువు శరీరంలోకి చేరుతాయి. బొడ్డు తాడు ద్వారా, శిశువు యొక్క సిరలలో ఈ రక్తం చేరుతుంది, శిశువు ఈ రక్తం నుండి ఆహార పోషకాలను పొందుతుంది.(فتبارك الله أحسن الخالقين)

ఇదియే అల్ హైజ్’లో గల వివేకం,అందుకే గర్భధారణ పొందినప్పుడు అరుదైన సందర్భాల్లో తప్పితే స్త్రీకు రుతుక్రమం ఆగిపోతుంది మరియు అదే విధంగా, చాలా మంది స్త్రీలకు ప్రసవానంతరం పాలు పట్టే సమయంలో ముఖ్యంగా ప్రారంభ రోజులలో రుతుక్రమం ఆగిపోతుంది.

రెండవ అధ్యాయం:రుతుస్రావం సమయం మరియు దాని వ్యవధి

ఈ అధ్యాయం రెండు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది:

మొదటి అంశం: స్త్రీకు ఏ వయసులో రుతుస్రావం ప్రారంభమవుతుంది?
రెండవ అంశం: ఆ ఋతుక్రమం వ్యవధి ఎంత ఉంటుంది?

మొదటి అంశం విషయానికొస్తే, సాధారణ ఋతుస్రావం 12 నుండి 50 సంవత్సరాల మధ్య సాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు శారీరక స్థితి, ప్రదేశం మరియు వాతావరణం అనుసారం దీనికి ముందుగా లేక దీనికి తర్వాత కూడా వెలువడుతుంది.

విద్వాంసుల,ఉలమాలు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ విషయంగా అనగా: స్త్రీకి ఋతుస్రావం కావడానికి నిర్దిష్ట వయోపరిమితి ఉందా? ఈ వయస్సుకి ముందు లేదా తర్వాత స్త్రీకి రుతుక్రమం జరగదు అని గుర్తించడానికి? అదే విధంగా, నిర్ణీత పరిమితికి ముందు లేదా తర్వాత స్త్రీకి వచ్చే రక్తం అనారోగ్యం వల్ల వస్తుంది మరియు రుతుస్రావం నుండి కాదు?అని చెప్పవచ్చా?

దీని గురించి పండితులు విభేదించారు. ఇమామ్ దార్మీ భేదాన్ని ప్రస్తావించిన తరువాత ఇలా అన్నారు:”ఇదంతా నా అభిప్రాయం ప్రకారం తప్పు, ఎందుకంటే అన్ని దశలలో నమ్మదగినది రుతుస్రావం పొందటమే’కాబట్టి రక్తం ఎంత మొత్తంలో ఏ పరిస్థితిలో మరియు ఏ వయస్సులో కనిపించిన దానిని రుతుస్రావంగా లెక్కించడం తప్పనిసరి. వల్లాహు ఆలము

మరియు ఇమామ్ దార్మీ(రహిమహుల్లాహ్) చెప్పినది సరైనదిగా ఉంది ఇమామ్ ఇబ్నే తైమియా(రహిమహుల్లాహ్)కూడా దీనినే ఎన్నుకున్నారు, కాబట్టి స్త్రీ రుతుస్రావ రక్తాన్ని చూసినప్పుడు ఆమె ఋతుస్రావగ్రస్తురాలవుతుంది అది ఆమెకు తొమ్మిది సంవత్సరాలైన లేదా యాభై (50) కంటే ఎక్కువ వయసైనా సరే!అల్లాహ్ తఆల మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రుతుస్రావం ప్రారంభమైనప్పుడు రుతుస్రావ ఆదేశాలను నిర్ణయించారు కానీ దానికి వయస్సును నిర్ణయించలేదు, అందువల్ల ఇది జరిగినప్పుడు దానికి చెందిన ఆదేశాలవైపుకు తప్పనిసరిగా మరలడం జరుగుతుంది మరియు రుతుస్రావం కోసం నిర్దిష్ట వయస్సును పరిమితం చేయడానికి ఖుర్ఆను మరియు హదీసు నుండి రుజువు అవసరం అయితే దాని గురించి ఎటువంటి రుజువు లేదు.

రెండవ స్థానం ఋతుస్రావం యొక్క వ్యవధి గురించి, అనగా ఋతుస్రావం ఎన్ని రోజులు జరుగుతుంది.

దీని గురించి పండితులు ఎక్కువగా విభేదించారు అందులో ఆరు లేదా ఏడు అభిప్రాయాలు ఉన్నాయి. ఇమామ్ ఇబ్నేముంజిర్ రహిమహుల్లాహ్ ప్రకారం: “ఋతుస్రావపు రోజుల సంఖ్యకు అతి,అల్పానికి చెందిన ఒక నిర్దిష్ట పరిమితి లేదని ఒక సమూహం చెప్పిందని వ్యక్తం చేశారు”

నేను దార్మీ రహిమహుల్లాహ్ యొక్క మునుపటి ప్రకటన వలె ఇది సరైనదని చెప్తున్నాను మరియు షేక్ అల్-ఇస్లాం ఇబ్నే తైమియా కూడా దీనినే ఇష్టపడ్డారు ఎందుకంటే ఖుర్ఆను,సున్నత్ మరియు సహీహ్ ఖియాస్ దాని ఆధారంగా ఉంది.

మొదటి ఋజువు:

قوله تعالى: {وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ قُلْ هُوَ أَذًى فَاعْتَزِلُوا النِّسَاءَ فِي الْمَحِيضِ وَلَا تَقْرَبُوهُنَّ حَتَّى يَطْهُرْنَ} [البقرة:222]،

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:(మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: ”అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి)

కాబట్టి ఈ ఆయతులో హైజ్ ఆగడానికి అల్లాహ్ “తహ్ర్” (శుద్దీకరణ)ను ముగింపుగా పేర్కొన్నాడు అంతేకాని ఒక రాత్రి మరియు పగలు లేదా మూడు రోజులు లేదా పదిహేను రోజులు గడిచిపోవడాన్ని ముగింపుగా చెప్పలేదు.కనుక ఆదేశానికి కారణం రుతుక్రమం ఉండటం మరియు లేకపోవడం అని ఇది సూచిస్తుంది.ఋతుస్రావం కనుగొనబడినప్పుడల్లా ఆదేశం ధృవీకరించబడుతుంది మరియు స్త్రీ ఋతుస్రావం నుండి విముక్తి పొందినప్పుడు రుతుక్రమం యొక్క నియమాలు కూడా తొలిగిపోతాయి.

రెండవ ఋజువు: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఆయిషాతో (ఆమె ఉమ్రా కోసం ఇహ్రామ్ స్థితిలో రుతుక్రమంలో ఉన్నప్పుడు) ఇలా అన్నట్లు సహీహ్ ముస్లిం నుండి రుజువైంది: “ఒక సాధారణ హజ్జ్’ యాత్రికుడు చేసేపనులన్నీఇక్కడ చేయండి,తవాఫ్ స్వచ్ఛత పొందనంత వరకు చేయకూడదు’అని చెప్పారు. ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు:నేను నహర్ రోజున శుద్ధి అయ్యాను. అల్ హదీసు

సహీహ్ బుఖారీ,సహీ ముస్లింలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషాతో ఇలా అన్నారు: “రుతుస్రావం నుండి శుద్ది పొందే వరకు వేచి ఉండు,శుద్ది పొందిన తదుపరి ‘తన్’ఈమ్’కు బయల్దేరు(ఇహ్రామ్ ఉమ్రా కోసం).” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం “తహ్ర్”ను ఋతుస్రావ ముగింపుగా పేర్కున్నారు నిర్దిష్ట వ్యవధిని ముగింపుగా ప్రస్తావించలేదు, కాబట్టి ఈ హదీసు ఆదేశం అనేది రుతుస్రావం వెలువడటం,ఆగిపోవడం తో ముడిపడి ఉందని సూచిస్తుంది.

మూడవ ఋజువు: వాస్తవానికి, ఈ సంచికలో ఫుఖహాలు ఫిఖానిపుణులు పేర్కొన్న రుతుక్రమం యొక్క అంచనాలు మరియు వివరాలు ఖుర్ఆను మరియు సున్నతులో లేవు, వాటిని వివరించాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నప్పటికీ.కాగా ఒకవేళ దాసుని పై వీటిని అర్ధంచేసుకోవడం తప్పనిసరి అయి ఉన్నా మరియు అల్లాహ్ ఆరాధనకి చెందినవై ఉన్నా అల్లాహ్ తఆల మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఈ ఆదేశాల యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ వివరించేవారు. ఉదాహరణకు నమాజు,ఉపవాసం, వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన ఆదేశాల మాదిరిగా.అల్లాహ్ తఆల మరియు ప్రవక్త (ﷺ) సల్లల్లాహు అలైహివ సల్లం నమాజుల సంఖ్య, వాటి సమయాలు, రుకూ సజ్దాలు ఇంకా వివరించినట్లుగా.జకాత్ విధిగా ఉన్న సంపద, అదే విధంగా జకాత్ పైకం దాని ఖర్చులను నిర్దేశించారు. అలాగే ఉపవాసం: దాని వ్యవధి,సమయం గురించి. మరియు హజ్ యొక్క నియమాలు మొదలైనవి వివరించారు.తినడం,త్రాగడం, నిద్రపోవడం, సంభోగం మరియు కూర్చోవడం, ఇంట్లోకి ప్రవేశించడం,బయలుదేరడం మరియు మలవిసర్జన యొక్క మర్యాదలు కూడా వివరించారు.చివరికి ఎన్నిమట్టిపెడ్డలు వాడాలో కూడా తెలిపారు, ఇది కాకుండా, అల్లాహ్ ధర్మాన్ని పరిపూర్ణం చేసినటువంటి మరియు తన విశ్వాసులైన దాసులపై పరిపూర్ణం చేసిన చిన్న మరియు పెద్ద విషయాలు కూడా వివరించారు.كما قال تعالى

{وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ } [النحل:89]،
(మరియు మేము ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంధాన్ని అవతరింపజేశాము)[అన్నహ్ల్:89]

وقال تعالى: {مَا كَانَ حَدِيثًا يُفْتَرَى وَلَـكِن تَصْدِيقَ الَّذِي بَيْنَ يَدَيْهِ وَتَفْصِيلَ كُلَّ شَيْءٍ } [يوسف:111].
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:(ఇది (ఈ ఖుర్ఆన్) కల్పితగాధ కాదు. కాని ఇది ఇంతవరకు వచ్చిన గ్రంధాలలో మిగిలివున్న సత్యాన్ని ధృవీక రిస్తుంది మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది)[యూసుఫ్:111]

ఋతుస్రావం యొక్క ఈ అంచనాలు పవిత్ర ఖుర్ఆన్ లేదా ప్రవక్త యొక్క సున్నత్లో లేనప్పుడు, ఈ అంచనాలు మరియు వివరాలు నమ్మశక్యం కాదని స్పష్టమవుతుంది. విశ్వాసం అనేది కేవలం హైజ్ రుతుక్రమం పేరుతో మాత్రమే ముడిపడి ఉంది, దానిపై షరీఆ ఆదేశాలు లేమిని,ఉనికిని బట్టి జారీ అవుతాయి.మరియు ఈ ఋజువు: అంటే ఖుర్ఆను మరియు సున్నతులో ఆదేశ ప్రస్తావన లేకపోవడం నమ్మలేమనడానికి ఋజువు’అని చెప్పడం అనునది మీకు ఈ సమస్యలో అలాగే ఇతర విద్యాపరమైన సమస్యలలో ప్రయోజనం చేకూరుస్తుంది, ఎందుకంటే షరీఅతు యొక్క తీర్పులు కేవలం అల్లాహ్ యొక్క గ్రంధమైన ఖుర్ఆను మరియు ప్రవక్త ﷺ యొక్క సున్నత్ సుప్రసిద్ధ ఇజ్మా మరియు ప్రామాణిక ఖియాస్ ద్వారా నిరూపించబడతాయి.షేఖుల్-ఇస్లాం ఇబ్నే తైమియా తన “ఖాయిదా”లో ఇలా పేర్కొన్నారు:“వాటిలో ఒకటి ఋతుస్రావం పేరుకూడా ఉంది. అల్లాహ్ తఆలా ఖుర్ఆను మరియు సున్నత్లోని అనేక తీర్పులను దీనితో ముడిపెట్టాడు అల్లాహ్ తఆలా రుతుక్రమానికి అతి,అల్ప సమయాలను నిర్దారించలేదు అలాగే రెండు రుతుక్రమాల మధ్య తుహ్ర్ స్వచ్ఛతను అవసరం ఉన్నప్పటికీని నిర్ణయించలేదు మరియు నిఘంటువు ద్వారా కూడా నిర్ణయించబడలేదు, కాబట్టి ఈ విషయంలో ఎవరు పరిమితిని విధించినా, అతను ఖుర్ఆను మరియు సున్నతులను వ్యతిరేకించాడు”మాట ముగిసింది.

నాల్గవ ఋజువు: విశ్వసనీయత, అంటే ఖియాస్ సహీ అల్ ముత్తరిద్’అని అర్థం, అల్లాహ్ ఋతుస్రావం యొక్క కారణం “అజా” (మలినం) అని పేర్కొన్నాడు, ఋతుస్రావం వెలువడినప్పుడు అజా ఉంటుంది రెండవ మరియు మొదటి రోజున, మూడవ మరియు నాల్గవ రోజుల మధ్య తేడా ఏమి లేదు,అదేవిధంగా పదహారవ మరియు పదిహేనవ రోజుల మధ్య మరియు పద్దెనిమిదవ మరియు పదిహేడవ రోజుల మధ్య కూడా ఎటువంటి తేడా లేదు.”ఋతుస్రావం” అనేది రుతుస్రావమే “అజా” అనేది “అజా”నే, కారణం ఈ రెండు రోజులలో సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది, కాబట్టి హేతుబద్ధంగా రెండూ సమానంగా ఉన్నప్పుడు రెండు రోజుల మధ్య ఆదేశంలో తేడా ఎలా సరైనది?ఇది ఖియాస్ సహీ’కు (ప్రామాణిక పరికల్పనకు) విరుద్ధం కాదా? రెండు రోజులలో సమానమైన కారణం ఉన్నందువల్ల రెండింటి ఆదేశంలో ఖియాస్ సహీ సరిసమానంగా భావించాల్సిన అవసరం లేదా?

ఐదవ ఋజువు: పరిమితిని నిర్ణయించిన వారి సూక్తులలో విభేదాలు. పరిమితులను నిర్దేశించిన వారి సూక్తులలోని వ్యత్యాసం ఈ సమస్యలో విధిగా దానిని అనుసరించాలి అనడానికి ఎటువంటి ప్రామాణిక ఋజువు లేదని సూచిస్తుంది, ఇవి ఇజ్తిహాదీ తీర్పులు మాత్రమే (ఇందులో తప్పు ఒప్పులకు అవకాశం ఉంది) ఇందులో ఏ తీర్పు కూడా మరొక తీర్పుకు బదులు అనుసరించడానికి అనుకూలంగా లేదు. కనుక విభేధానికి గురైనప్పుడు ఖుర్ఆను మరియు సున్నతుల వైపుకు మరలాలి.

తక్కువ లేదా ఎక్కువ ఋతుస్రావం కోసం నిర్ణీత పరిమితి లేదని బలంగా స్పష్టమైంది మరియు ఇది ప్రబలమైన(రాజిహ్)అభిప్రాయం. కనుక తెలుసుకోండి! స్త్రీ ఎటువంటి కారణం అనగా గాయం మొదలైనవి లేకుండా చూసే ఏదైనా శారీరక రక్తం, సమయం మరియు వయస్సుతో సంబంధం లేకుండా ఋతుస్రావ రక్తంగా పరిగణించ బడుతుంది. ఒకవేళ ఆ రక్తం స్త్రీకి ఆవిరామంగా కొనసాగుతూ, ఎప్పటికీ ఆగకపోతే లేదా నెలలో ఒకటి లేదా రెండు రోజులు ఆగిపోయినట్లయితే, అది ఇస్తిహాజా రక్తం అవుతుంది.ఇస్తిహాజా,దాని ఆదేశాలు త్వరలో వివరించబడతాయి. (ఇన్ షా అల్లాహ్)షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లా పేర్కొన్నారు: గర్భాశయం నుండి వెలువడే రక్తం నిజానికి హైజ్ ఋతుస్రావ రక్తమే అవుతుంది, ఇస్తిహాజ రక్తమని నిర్దారించే ఋజువు లభ్యమైతే తప్ప!ఇంకా ఇలా తెలిపారు: గర్భాశయం నుండి వెలువడే రక్తం రోగం లేక గాయం కారణంగా అని తెలియనంత వరకు హైజ్ ఋతుస్రావ రక్తంగానే పరిగణించబడుతుంది.ఈ వాక్కు ఏ రకంగానైతే ఋజువు పరంగా ప్రబలంగా ఉందో అలాగే అర్ధమవ్వడానికి అవగాహనకు అతిసమీపంగా మరియు ఆచరణకు సులభంగా ఉంది,పరిమితులు ఖరారు చేసేవారు వీటికి అనుగుణంగా ప్రస్తావించినట్లై ఆ సూక్తులు ఇలా ఉంటే స్వీకరించడానికి ఎక్కువ యోగ్యమైనది ఎందుకంటే అవి ఇస్లాం ధర్మపు ఆత్మ మరియు జాబితాలకు అనుగుణంగా ఉన్నాయి మరియు ఇస్లాం ధర్మపు జాబితా సౌలభ్యం మరియు సౌకర్యంగా ఉంది

.قال الله تعالى: {وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ } [الحج:78]،
అల్లాహ్ తఆల ఇలా సెలవిచ్చాడు :(ఆయన ధర్మ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు)[హజ్జ్:78]

మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవచించారు:

[నిశ్చయంగా ధర్మం బహు సులభమైనది ఎవడైతే ఇందులో (ధర్మంలో) కఠినంగా వ్యవహరించాడో అతను పతనమయ్యాడు కనుక సరళంగా ఉండండి మితంగా వ్యవహరించండి మరియు శుభవార్తలు వినిపించండి].ఇమాం బుఖారీ ఉల్లేఖించారు.

మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నైతికతలో ఈ విషయం కూడా ఉంది: [దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు రెండు విషయాలలో ఒకటి ఎన్నుకోమని కోరితే చాలా సులభమైనది ఎన్నుకుంటారు అందులో పాపం లేనట్లయితే.]

గర్భవతి ఋతుస్రావం:

తరుచుగా స్త్రీలు గర్భం దాల్చిన వెంటనే రుతుస్రావం ఆగిపోతుంది ఇమాం అహ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా తెలిపారు:స్త్రీలు రక్తస్రావం ఆగిపోవడం పై గర్భాన్నిగుర్తిస్తారు’- కనుక గర్భిణీ రక్తం చూసినప్పుడు అది ఒకవేళ ప్రసవానికి కొంత సమయం ముందుగా అనగా రెండు లేక మూడు రోజులు రక్తంతో పాటు ప్రసవవేదన కూడా ఉంటే అది పురిటిరక్తస్రావంగా పరిగణించబడుతుంది.ఒకవేళ ఆ రక్తం ప్రసవానికి చాలా కాలం ముందు లేదా ప్రసవానికి కొంత సమయం ముందు అయి దానితో ప్రసవ నొప్పి రాకపోతే, అది నిఫాస్(పురిటి)రక్తం కాదు, కాగా ఇది రుతుస్రావం యొక్క రక్తమయి ఆ ప్రకారం ఆదేశాలు జారీ అవుతాయా? లేక చెడురక్తం అయి రుతుస్రావ ఆదేశాలు నిలిపివేయబడతాయా. ?

ఈ విషయంలో ఇస్లామీయ విజ్ఞులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, సరైన విషయం ఏమిటంటే, స్త్రీకి తెలిసిన అలవాటు ప్రకారం రుతుక్రమం వచ్చినప్పుడు అది రుతుక్రమ రక్తమే అవుతుంది, ఎందుకంటే వాస్తవానికి, స్త్రీ అనుభవించే రక్తం ఋతుస్రావమే అవుతుంది అది కాదని సూచించే కారణం ఉన్నప్పుడు వర్తించదు అలాగే గర్భిణీ స్త్రీకి రుతుక్రమం జరుగదు అనడానికి ఖుర్ఆను మరియు సున్నతులో ఎటువంటి ఆధారాలు లేవు.

ఇమాం మాలిక్, ఇమాం షాఫయీ రహిమహుమల్లాహ్ అభిప్రాయం కూడా ఇదే! షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ కూడా దీనినే ఎన్నుకున్నారు,ఆయన ‘అల్ ఇఖ్తీయారాత్’ (పేజీ:30)లో పేర్కున్నారు: ఇమాం బైహఖీ, ఇమాం అహ్మద్ రహిమహుమల్లాహ్ ద్వారా దీని గురించి ఒక కథనం ఉల్లేఖించారు ఇంకా ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ ఈ అభిప్రాయం వైపుకు మరలారని’కూడా పేర్కున్నారు”

ఈ ఆధారంగా సాధారణ మహిళల మాదిరిగానే గర్భిణీ స్త్రీలకు కూడా అవే ఋతుస్రావ ఆదేశాలు వర్తిస్తాయి’కానీ ఆదేశం రెండు సందర్భాలలో దీని నుండి మినహాయించబడుతుంది.

మొదటి సమస్య: తలాఖ్’(విడాకులు) ఇద్దతు వ్యవధి గడిపే ఋతుస్రావ మహిళలకు విడాకులు ఇవ్వడం నిషేధించబడింది, అయితే గర్భిణీ స్త్రీకి ఇది నిషేధించబడలేదు.ఎందుకంటే ఋతుక్రమంలో గర్భిణి కాని స్త్రీకి విడాకులు ఇవ్వడం అల్లాహ్ తఆల యొక్క ఆయతుకి విరుద్ధం:{فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ } [الطلاق:1]، (ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (‘తలాఖ్) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (‘ఇద్దత్) తో విడాకులివ్వండి)[తలాఖ్:1]కానీ గర్భిణీ స్త్రీకి రుతుక్రమంలో ఉన్నప్పుడు విడాకులు ఇవ్వడం దీనికి వ్యతిరేకం కాదు, ఎందుకంటే గర్భిణీ స్త్రీకి విడాకులు ఇచ్చే వ్యక్తి ఆమెకు సరైన ఇద్దతు పద్ధతి ప్రకారం తలాఖ్ విడాకులు ఇస్తున్నాడు, ఆమె రుతుక్రమంలో ఉన్నా లేదా శుద్దావస్థలో ఉన్నా సరే! ఎందుకంటే ప్రసవం ఆమె ఇద్దతు అవుతుంది.అందుచేత లైంగిక సంపర్కం తర్వాత గర్భిణీ స్త్రీకి విడాకులు ఇవ్వడం కూడా నిషేధం కాదు, అయితే గర్భిణి కాని సాధారణ స్త్రీ యొక్క ఆదేశం దీనికి విరుద్ధంగా ఉంది.

రెండవ సమస్య: గర్భిణీ స్త్రీ యొక్క రుతుస్రావం: గర్భిణీ స్త్రీ యొక్క ఇద్దతు వ్యవధి హైజ్’తో ముగియదు కానీ గర్భవతి కాని సాధారణ స్త్రీ దీనికి విరుద్ధం.ఎందుకంటే గర్భిణీ స్త్రీకి రుతుక్రమం వెలువడిన లేకపోయిన ప్రసవంతో ఇద్దతు ముగుస్తుంది.ఆమెకు ఋతుస్రావం కలిగిన లేకపోయినా సరే.

لقوله تعالى: {وَأُوْلاَتُ الأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ } [الطلاق:4].
(మరియు గర్భవతు లైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు.)[తలాఖ్:4]

మూడవ అధ్యాయం: రుతుస్రావం పై హఠాత్తుగా జారీ అగు ఆదేశాలు

రుతుక్రమ ప్రభావితపు రకాలు:

మొదటి రకం : అల్పం లేదా అధికం, ఉదాహరణకు, స్త్రీకి రుతుక్రమం (ఋతుస్రావం)ఆరు రోజులు ఉంటుంది, కానీ ఆమెకు ఏడు రోజుల పాటు రక్తస్రావం కొనసాగుతుంది, లేదా ఆమెకు ఏడు రోజులు ఋతుక్రమం ఉంటుంది కానీ ఆరవ రోజున శుద్ది పొందుతుంది.

రెండవ రకం: తొందర లేదా ఆలస్యం ఉదాహరణకు: స్త్రీకి నెలాఖరులో రుతుక్రమం వస్తుంది, కానీ ఆమె నెల ప్రారంభంలో చూస్తుంది లేదా ఆమె రుతుక్రమం అలవాటు నెల ప్రారంభంలో ఉంటుంది, కానీ నెల చివరిలో రుతుక్రమం అవుతుంది.

ఇస్లామీయ విద్వాంసులు ఈ రెండు రకాల రుతుక్రమ ఆదేశాల గురించి విభేదించారు, సరైన విషయం ఏమిటంటే, స్త్రీ రక్తాన్ని చూసినప్పుడల్లా రుతుక్రమం ఉంటుంది మరియు రుతుస్రావం నిలిచినప్పుడు, అది ఆమెకు సాధారణం కంటే ఎక్కువ లేదా తక్కువ వెలువడిన, ముందుగా లేక ఆలస్యంగా వెలువడిన సరే ఆమె పరిశుద్దిపొందినట్లుగా పరిగణించబడుతుంది.దీనికి చెందిన రుజువు గత అధ్యాయంలో ప్రస్తావించబడింది.అక్కడ షరీఆ వ్యాఖ్యాన కర్త (షారిఏ ఇస్లాం) ఋతుక్రమ ఆదేశాలను ఋతుక్రమంతో ముడిపెట్టారు.ఇమాం షాఫయీ రహిమహుల్లాహ్ యొక్క అభిప్రాయం ఇదే , దీనినే షేఖుల్-ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ కూడా ఎన్నుకున్నారు,ఈ అభిప్రాయం “సాహిబ్ అల్-ముఘ్నీ’రహిమహుల్లాహ్ అల్-ముఘ్నీలో బలమైనదిగా పేర్కున్నారు దీనికే ఆయన మద్దతు తెలిపారు. అతను ఇలా అన్నారు: “పైన పేర్కొన్న కారణంపై అలవాటు ఆధారపడి ఉంటే తప్పనిసరిగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దానిని తన ఉమ్మతుకు వివరించేవారు, దాని వివరణను ఆలస్యం చేసేవారు కాదు.ఎందుకంటే అవసరమైన సమయంలో ఏదైని విషయం వివరించకుండా ఉండటం అనుమతించబడదు.చూడబోతే దైవప్రవక్త సతీమణులకు,ఇతర మహిళలకు ఎల్లప్పుడూ ఈ విషయాల వివరణ అవసరం ఉండేది దైవప్రవక్త వాటిని వివరించడంలో నిర్లక్ష్యం చేసేవారు కాదు.ముస్తహాజా మినహా ఇతర మహిళల గురించి దైవప్రవక్త నుండి అలవాటు ప్రస్తావన మరియు వివరణ నిరూపించబడలేదు.

మూడవ రకం: పసుపు రంగు లేదా గోదుమ రంగు, ఒక స్త్రీ గాయాల నుండి స్రవించే నీరు లేదా బురద రంగు వంటి పసుపు రంగు స్రావాన్ని చూసినట్లయి, అది రుతుక్రమం మధ్యలో లేదా దానికి సంబంధించిన “తుహర్”కు ముందు ఉంటే, అది రుతుస్రావంగా పరిగణించబడుతుంది, ఋతుస్రావం యొక్క నియమాలు ఆమెపై జారీ అవుతాయి, కానీ అది తుహర్ తర్వాత అయితే, ఋతుస్రావం కాదుఎందుకంటే సయ్యిదా ఉమ్ముఅతియ్య రజియల్లాహు అన్హా ఇలా అన్నారు: మేము తుహర్ తర్వాత పసుపు గోదుమ రంగును లెక్కించేవారం కాదు’ఈ హదీసును ఇమాం అబూదావూద్ ప్రామాణిక సనదుతో వివరించారు.ఇమాం బుఖారీ కూడా ఈ హదీసును వివరించారు, కానీ సహీహ్ బుఖారీలో,”బఅద తుహరు”అనే పదం(తుహర్ తర్వాత)లేదు, కానీ ఇమాం బుఖారీ “తర్జుమతుల్-బాబ్”ను ఈ విధంగా ప్రస్తావించారు: “ఋతుస్రావం రోజులలో కాకుండా సఫ్రా(పసుపు) మరియు కద్రాల(బూడిద)వర్ణన”.హాఫిజ్ ఇబ్నే హజర్ (రహిమహుల్లాహ్) ఆయిషా (రజియల్లాహు అన్హా) యొక్క హదీసును సూచిస్తూ సయ్యిదా ఆయిషా యొక్క మునుపటి హదీసు ప్రకారం ఆమె చెప్పారు: మీరు తెల్లటి నీరు చూసేంత వరకు’ఉమ్మే అతియ్య (తర్జుమతుల్-బాబ్’లో ప్రస్తావించబడింది) యొక్క హదీసు మధ్యలో తత్బీక్’వైపుకు సూచిస్తుంది, ఏ విధంగా అంటే సయ్యిదా ఆయిషా సిద్ధీఖా రజియల్లాహు అన్హా హదీసు స్త్రీ బహిష్టు ఉన్నప్పుడు పసుపు లేదా మట్టి రంగులో రక్తాన్ని చూసినప్పుడు జారీ చేయబడుతుంది మరియు సయ్యిదా ఉమ్మే అతియ్యా యొక్క హదీసు ఆదేశం ఋతుస్రావం రోజులలో కాకుండా ఇతర రోజులలో జారీ చేయబడుతుంది.స్త్రీలు సయ్యిదా ఆయిషా (రజియల్లాహు అన్హా) వైపుకు (దిరజ) అంటే “మర్మాంగం పై పెట్టుకునే వస్తువు”పంపేవారు అందులో పసుపు రంగు రక్తం ఉన్న దూది ఉండేది’ అప్పుడు సయ్యిదా ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా చెప్పేవారు: “తెల్లని బట్ట కనిపించే వరకు తొందరపడకండి”.”తెల్లబట్ట” అనేది ఋతుస్రావం ముగిసిన తర్వాత “గర్భం” బయటకు పంపే తెల్లటి నీటిని సూచిస్తుంది.

నాల్గవ రకం : బహిష్టులో అవరోధం,స్త్రీ కు రక్తం ఆగుతూ వచ్చినప్పుడు ఆమె ఒకరోజు రక్తం చూసి ఇంకో రోజు శుద్దత చూస్తే దీనికి రెండు స్థితులు ఉన్నాయి:

మొదటి స్థితి: పరిస్థితి ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగితే అది ఇస్తిహాజ’రక్తం అవుతుంది. ఒకవేళ స్త్రీ ఒకరోజు రక్తం మరొక రోజు ‘తుహ్ర్’చూసినట్లైతే ఆమె పై ఇస్తిహాజ ఆదేశాలు జారీ అవుతాయి’

రెండవ స్థితి: స్త్రీకు సమాంతరంగా రక్తం స్రవించ కుండా కొంత సమయం రక్తం సరవిస్తుంది అలాంటప్పుడు ‘సరైన తుహ్ర్’ సమయం తెలిసి నట్లైతే ఆ ‘తుహ్ర్’గురించి ధార్మిక విద్వాంసులు అది తుహ్ర్’గా పరిగణించబడుతుందా?లేక బహిష్టుగా’భావించబడుతుందా’?అనే విషయంగా విరివిరిగా అభిప్రాయాలు వెల్లడించారు.

ఇమాం షాఫయీ రహిమహుల్లాహ్ రెండు అభిప్రాయాలల్లో ప్రామాణిక అభిప్రాయం మేరకు ‘ఆమె పై బహిష్టు ఆదేశాలు జారీ అవుతాయి, ఈ విరామం బహిష్టుదవుతుంది షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియ రహిమహుల్లాహ్ మరియు అల్ ఫాయిఖ్’ దీనినే ఎన్నుకున్నారు, ఇమాం ఇబ్నుహనీఫా రహిమహుల్లాహ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు,ఎందుకంటే, స్త్రీ తనలో స్వచ్ఛమైన తెల్లని రంగును అందులో చూడలేదు, అలాగే ఒకవేళ దానిని”తుహర్”గా అనుకుంటే, దానికి ముందు మరియు తర్వాత కూడా రుతుస్రావం ఉంది, అయితే దీనిని ఎవరు చెప్పలేదు, లేకపోతే ఐదు రోజుల్లో రుతుస్రావ సమయం ముగుస్తుంది.ఒకవేళ దానిని తుహర్’గా భావిస్తే ప్రతీ రెండు రోజుల్లో గుసుల్ చేయడం వల్ల ఇబ్బంది మరియు కష్టం కలుగుతుంది షరీఅతులో ఇబ్బందికి,కష్టానికి ఆస్కారం లేదు. అల్హందులిల్లాహ్.

హనాబిలా’ల ప్రముఖ అభిప్రాయం రక్తం బహిష్టుగా పరిగణించబడుతుంది స్వచ్ఛత ’తుహ్ర్’గా భావించబడుతుంది. ఒకవేళ ఈ రెండింటి కలయిక తరుచూ బహిష్టును మించి ఉంటే బహిష్టుని మించిన రక్తం ఇస్తిహాజా రక్తం అవుతుంది.

అల్లామా ఇబ్ను ఖుదామా అల్-ముఘ్నీలో ఇలా అన్నారు: “రక్తం ఒకరోజు కంటే తక్కువగా ఆగినప్పుడు అది తుహ్ర్’కాదు ఈ కథనం ఆధారంగా “నిఫాస్”లో మేము ఒక రోజు కంటే తక్కువ సమయం చూడబడదు అని పేర్కోన్నఈ అభిప్రాయం సరైనది (ఇన్షా అల్లాహ్) ఎందుకంటే రక్తస్రావం కొన్నిసార్లు కొనసాగుతుంది మరియు కొన్నిసార్లు ఆగిపోతుంది, అలాంటి స్త్రీకి స్నానం చేయడం (విరామంతో శుద్దిపొందుతుంది) వాజిబుగా తప్పనిసరి చేయడం కష్టంతో ఇబ్బందితో కూడినది. ఇది అల్లాహ్ తఆల సెలవిచ్చిన ఈ ఆయతుకు విరుద్దం:

لقوله تعالى: {وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ } [الحج:78]،
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:(మరియు ఆయన ధర్మ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు)[అల్ హజ్జ్:78]

అల్లామ ఇబ్ను ఖుదామ రహిమహుల్లాహ్ ఇంకా ఇలా అన్నారు: “ఈ కారణంగా, రక్తం ఒక రోజులోపు ముగిసినట్లైతే అది తుహ్ర్’గా భావించబడదు కానీ స్త్రీ ఆగిపోయిన సూచన చూస్తే తప్ప!, ఉదాహరణకు, స్త్రీ యొక్క చివరి అలవాటులో రక్తం నిలిచిపోవడం లేదా మళ్ళీ తెల్లని నీటిని చూడటం.

కాబట్టి సాహిబుల్ ముఘ్నీ తెలిపిన ఈ అభిప్రాయం రెండు అభిప్రాయాల్లో మితంగా ఉంది. వల్లాహు ఆలము

ఐదవరకం:రక్తం పొడిబారడం, ఇటువంటి స్త్రీ తడిని మాత్రమే చూస్తుంది. మరియు ఈ తడి తుహ్ర్’కు ముందు బహిష్టు సమయంలో ఉంటే లేక బహిష్టుతో పాటుఉంటే, అది ఋతుస్రావం అవుతుంది ఒకవేళ ఈ తడి తుహ్ర్’ తర్వాత ఉంటే బహిష్టు కాదుఎందుకంటే తుహ్ర్’ పసుపు లేదా మట్టి రంగుతో కలిసి ఉండాలి మరియు ఇదియే (పసుపు మరియు మట్టిరంగు) యొక్క ఆదేశం.

నాల్గవ అధ్యాయం : ఋతుక్రమ ఆదేశాల వివరణ.

రుతుక్రమ ఆదేశాలు ఎక్కువగా ఉన్నాయి అవి 20 కంటే అధికంగా ఉన్నాయి అందులో అనివార్యమైనవి అవసరమైనవి ఇక్కడ మేము ప్రస్తావిస్తున్నాము. కనుక అందులోని కొన్ని ఆదేశాలు ఇవి:

మొదటి ఆదేశం:నమాజు: బహిష్టు స్త్రీ పై ఫర్జు మరియు నఫిల్ నమాజులు నిషేధం,ఆమె నమాజు చదువలేదు అది ఆమె పై విధి కూడా కాదు, కానీ ఒక రకాతు సమయాన్నిమొదట్లో లేక చివర్లో తుహ్ర్’లో పొందినట్లైతే చదవ వలసి ఉంటుంది.

మొదటి సమయం ఉదాహరణ: ఒక స్త్రీకు సూర్యాస్తమయం అనంతరం ఒక రకాతు సమయం పొందిన తర్వాత బహిష్టు కలిగితే ఆమె బహిష్టు నుండి పరిశుద్ధి పొందిన తర్వాత మగ్రిబ్ నమాజు ఖజా చేయడం విధిగా ఉంటుంది. ఎందుకంటే బహిష్టు వచ్చిన తర్వాత ఆమె నమాజు సమయంలో ఒక రకాతు చదివే సమయాన్ని పొందినది.

చివరి సమయ ఉదాహరణ: ఒకవేళ స్త్రీ సూర్యోదయానికి ముందు ఒకరకాతు సమయానికి ముందు బహిష్టు నుండి పరిశుద్దిపొందితే ఆమె తహరతు పొందిన తర్వాత ఫజర్ నమాజు ఖజా చేయడం ఆమెపై విధిగా ఉంటుంది ఎందుకంటే ఆమె నమాజు సమయంలో ఒకరకాతు చదవగలిగే సమయాన్నిపొంది ఉన్నది.

బహిష్టు స్త్రీ ఒక రకాతు పూర్తిగా చదవలేనంత సమయం పొందినట్లైతే ఉదాహరణకు సూర్యాస్తమయం తర్వాత ఒకక్షణంలో స్త్రీకి రుతుస్రావం కలిగింది లేక రెండవ ఉదాహరణ సూర్యోదయానికి ఒక క్షణం ముందు స్త్రీ పరిశుద్దిపొందితే.ఆమె పై నమాజు వాజిబు కాదు, ఎందుకంటే దైవప్రవక్త ప్రవచనం ఇలా ఉంది:’ఎవరైతే నమాజు యొక్క ఒక్క రకాతు పొందుతాడో నిశ్చయంగా అతను పూర్తినమాజును పొందాడు’(ముత్తఫఖున్ అలైహి)’ఈ హదీసు అర్ధం ఒకరకాతు కంటే కనిష్ట సమయం పొందితే అతను నమాజు పొందలేదు’-

మరియు ఒక స్త్రీ అసరు నమాజు సమయంలో ఒక రకాతు సమయాన్ని పొందినా ఆమెపై అసరు నమాజుతో పాటు జొహార్’నమాజు విధి అవుతుందా?లేక ఇషా సమయంలో ఒక రకాతు పొందినట్లయితే ఆమెపై ఇషా నమాజుతో పాటు మగ్రిబ్ నమాజు కూడా వాజిబు అవుతుందా?

ఈ విషయంగా ధార్మిక విద్వాంసులు విభేధించారు, వాస్తవానికి ఆమెపై నమాజు విధి కాదు కానీ ఆమె పొందిన నమాజు అసర్ మరియు ఇషా నమాజు చదవ వలసి ఉంటుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఇలా ఉంది: ఎవరైతే సూర్యాస్తమయంకు ముందు అసర్ యొక్క ఒక్క రకాతు పొందినా నిస్సందేహంగా అతను అసర్ నమాజును పొందాడు’ ముత్తఫఖున్ అలైహి’ఈ హదీసులో దైవప్రవక్త (فقـد أدرك الظّهـر والعصر) (అతను జుహర్ మరియు అసర్ నమాజు పొందాడు) అనే మాట చెప్పలేదు.అంటే దైవప్రవక్త జుహార్ అతనిపై విధి అవుతుంది అని చెప్పలేదు చూడబోతే బరాఅత్ ఉంది,ఇదియే ఇమాం అబూ హనీఫా,ఇమాం మాలిక్ రహిమహుముల్లాహ్ అభిప్రాయం అల్లామా నవవి రహిమహుల్లాహ్ ఈ ఇద్దరితో ‘షర్హు అల్ మూహజ్జబ్’లో లిఖించారు.ఇక దైవస్మరణ విషయానికొస్తే అల్లాహు అక్బర్,సుబ్ హానల్లాహ్’ అల్హందులిల్లాహ్’స్మరించడం,అన్నపానియాలు తినే బిస్మిల్లాహ్ దుఆ చదవడం, హదీసు మరియు ఫిఖా పుస్తకాలు చదవడం దుఆ చేయడం,ఆమీన్ పలకడం, ఖుర్ఆన్ వినడం వంటి విషయాలలో ఏది ఆమెపై నిషేధం కాదు-బుఖారి ముస్లింలో ప్రామాణికంగా రూఢీ అయినది ఏమనగా’ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సయ్యిదా ఆయిషా రజియల్లాహు అన్హా ఒడిలో పడుకునేవారు ఆమె రుతుక్రమావస్థలో ఉండేది’అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఖుర్ఆను మజీదు చదివేవారు’)అలాగే బుఖారి ముస్లింలో సయ్యిదా ఉమ్ము అతియ్య రజియల్లాహుఅన్హా ఉల్లేఖనం ఆమె దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభోదించగా విన్నది:’యువతులు,పరదాధరించినవారు,ఋతుక్రమ స్త్రీలు ఈదు నమాజులకు వెళ్ళండి,ముస్లింల దావతులో, మేలులో హాజరవ్వండి. ఋతుక్రమ స్త్రీలు నమాజుకు మాత్రం దూరంగా ఉండండి.ఇక ఋతుస్రావ మహిళలు ఖుర్ఆను చదవడం విషయానికొస్తే ఒకవేళ వారు చూస్తూ లేక మనసులో పరిశీలిస్తూ నోటిని కదుపకుండా చదివితే అందులో ఎలాంటి సమస్య లేదు,ఉదాహరణకు: ఋతుస్రావ మహిళ ఎదుట పెట్టబడిన ఖుర్అను ఆయతులు చూస్తూ మనసులో చదువుకోవాలి.ఇమాం నవవి రహిమహుల్లాహ్ ‘షర్హు అల్ ముహద్దబ్’లో ఇలా చెప్పారు: దీనికి ఎలాంటి అభిప్రాయ బేధం లేకుండా అనుమతించబడింది’ ఒకవేళ మహిళ నోటితో ఉచ్చరిస్తూ చదవడం గురించి జమ్హూర్ (అత్యధిక) విద్వాంసులు నిషేధం, అసమంజసం అని పేర్కున్నారు.ఇమాం బుఖారి, ఇమాం ఇబ్ను జరీర్ తబరీ మరియు ఇమాం ఇబ్ను ముంజిర్ రహిమహుముల్లాహ్ ‘దీనికి అనుమతి ఉంది’అని చెప్పారు.ఇమాం మాలిక్ ఇమాం షాఫయీ చెప్పిన పూర్వపు మాటలతో ఇదే ప్రస్తావించబడింది. హాఫిజ్ ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ ఈ మాటను ఈ రెండింటితో ‘ఫత్హుల్ బారి’లో పేర్కున్నారు,ఇమాం బుఖారి ఇమాం ఇబ్రాహీం నఖయీ ‘ముఅల్లఖ్’లో ఉల్లేఖిస్తూ’ ఒకవేళ ఆమె ఆయతు చదివిన కూడా అందులో ఎలాంటి సమస్య లేదు అని చెప్పారు.షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్’ ఫతావ మజ్మూఅతు ఇబ్ను ఖాసిం’లో పేర్కున్నారు:ఋతుస్రావ స్త్రీ ఖుర్ఆను చదవకూడదు అనే విషయంలో మూలంగా నిలిచే ఏ హదీసు లేదు’ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవచించిన హదీసు ‘ఋతుస్రావ మహిళ మరియు అశుద్ధావస్థలోని వ్యక్తి ఖుర్ఆను గ్రంధం నుండి ఏమి చదవకూడదు’ ముహద్దిసీనుల దృష్టిలో ఇది ఏకగ్రీవంతో బలహీనంగా ఉంది,దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కాలంలో మహిళలు రుతుక్రమం వెలువడేది ఒకవేళ వారికి ఖుర్ఆను పారాయణం నిషేధమై ఉంటే ఖచ్చితంగా దానిని దైవప్రవక్త తన ఉమ్మతుకు తెలిపేవారు విశ్వాసుల మాతలకు ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉండేది, ఇది (అటువంటి అంశాలకు) సంబంధించినది, సహచరులు ప్రజలలో ఉల్లేఖించేవారువారిలో ఒక్కరు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిషేధించడాన్ని ఉల్లేఖించనప్పుడు ఖుర్ఆను పారాయణంను హరాం చేయడం సమంజసం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాలంలో రుతుస్రావ స్త్రీలు విస్తారంగా ఉన్నప్పటికీ, రుతుక్రమంలో ఉన్న స్త్రీలను ఖుర్ఆన్ పఠించకుండా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరోధించనప్పుడు, రుతుక్రమం సమయంలో ఖుర్ఆన్ చదవడం నిషేధించబడలేదని అవగతమవుతుంది.

ధార్మిక విజ్ఞుల అభిప్రాయాలు తెలుసుకున్నతర్వాత, రుతుక్రమంలో స్త్రీలు అవసరం ఉంటే తప్ప ఖుర్ఆను పారాయణం చేయకూడదని చెప్పడం సముచితమే, ఉదాహరణకు, బహిష్టు స్త్రీ ఉపాధ్యాయురాలై, తన విద్యార్థులకు బోధించేటప్పుడు లేదా ఉపాధ్యాయురాలు పరీక్షను చదివి తీసుకోవలిసినప్పుడు లేదా ఇలాంటి సారూప్య సమస్యలు ఎదురైనప్పుడు.

రెండవ ఆదేశం:ఉపవాసం: ఋతుస్రావ స్త్రీ పై ఫర్జు మరియు నఫిల్ ఉపవాసాలు నిషేధించబడ్డాయి,ఆమె పాటించే ఉపవాసాలు చెల్లవు,కానీ ఫర్జు ఉపవాసాలు ఖజా ఆమెపై వాజిబు అవుతుంది.ఉదాహరణకు సయ్యిదా ఆయేషా రజియల్లాహు అన్హ యొక్క హదీసు ప్రకారం:’మాకు రుతుస్రావం కలిగినప్పుడు ఉపవాసాలు ఖజా చేయమని ఆదేశించబడేది కానీ నమాజు ఖజా చేయమని ఆదేశబడేది కాదు’ (ముత్తఫఖున్ అలైహి)

కాగా స్త్రీ ఉపవాస వ్రతంలో ఉన్నప్పుడు బహిష్టుకు గురైతే ఆమె ఉపవాసం భంగం అవుతుంది. అది సూర్యాస్తమయానికి కాస్త ముందు అయినా సరే, ఆ ఉపవాసం ఫర్జు అయి ఉంటే ఆమెపై తిరిగి ఖజా పాటించడం విధిగా ఉంటుంది.

కాగా ఒక స్త్రీకి సూర్యాస్తమయానికి ముందు రుతుక్రమం కదులుతున్నట్లు అనిపించినా, సూర్యాస్తమయం తర్వాత ఆమె రుతుక్రమం వెలువడుతుంది, అప్పుడు ఆమె ఉపవాసం పూర్తయింది సరైన అభిప్రాయం ప్రకారం రక్తం లోపలే ఉన్నందున ఆ ఉపవాసం భంగం అవ్వదు.ఎందుకంటే ఒక పురుషుడు తన కలలో చూసినట్లుగా స్త్రీ కూడా తన కలలో చూస్తే ఆమెపై గుసుల్ వాజిబు అవుతుందా?అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో అడిగినప్పుడు,ఆయన ఇలా చెప్పారు:”అవును, ఆమె తడిని చూసినప్పుడు.” కాబట్టి, ఈ హదీసులో, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని ‘వీర్యం’ను చూడటంతో ముడిపెట్టారు, కానీ వీర్యం బదిలీతో ఆదేశంను ముడిపెట్టలేదు.ఇదేవిధంగా బహిష్టు కూడా దీని సంబంధిత ఆదేశాలు కూడా బయటికి వెలువడినప్పుడు మాత్రమే వర్తిస్తాయి కదులుతున్నందు వల్ల వర్తించవు.

స్త్రీ ఫజ్రోదయం సమయాన ఋతుస్రవిస్తే,ఆ రోజు ఉపవాసం చెల్లదు అది ఆమె ఫజ్ర్’జామున కొద్దిసేపటికే పరిశుద్ది పొందినా సరే!

ఒకవేళ ఆమె రుతుక్రమం నుండి ఫజ్ర్ కంటే కొంచెం ముందు పరిశుద్దిపొంది ఆపై ఉపవాసం ఉన్నట్లయితే అది చెల్లుతుంది ఆమె ఫజ్ర్ తర్వాత గుసులు స్నానం చేసిన పక్షంలో కూడా సరే చెల్లుతుంది,దీనికి ఉదాహరణ ఒక అశుద్ధ స్థితిలోని వ్యక్తి వంటిది అతను అశుద్దావస్థలోనే ఉపవాస సంకల్పం చేసుకుంటాడు ఫజ్రోదయం తర్వాత గుసులు స్నానం చేస్తాడు అతని ఆ ఉపవాసం చెల్లుతుంది.హజ్రత్ ఆయిషా మరియు ఉమ్మె సల్మా రజియల్లాహు అన్హుమా లు చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి తెల్లవారు (నిద్ర) లేచేటప్పుడు లైంగిక అశుద్ధావస్థలో ఉండేవారు. అయితే అది స్వప్నావస్థలో జరిగిన వీర్యస్ఖలనం కాదు. ఆ తర్వాత ఆయన అదే స్థితిలో ఉపవాసం ప్రారంభించేవారు. (బుఖారీ, ముస్లిం).

మూడవ ఆదేశం: బైతుల్లాహ్ యొక్క తవాఫు: ఒక బహిష్టు స్త్రీపై ఫర్జు లేక నఫిల్ బైతుల్లాహ్ తవాఫ్ నిషేధించబడింది, ఆమె పక్షాన చెల్లదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం మేరకు సయ్యిదా ఆయిషా రజియల్లాహు అన్హా రుతుక్రమంలో ఉన్నప్పుడు:”ఒక సాధారణ హజ్జ్ యాత్రికుడు చేసే విధంగానే చేయండి, కానీ మీరు శుద్ధిపొందనంత వరకు బైతుల్లాహ్ తవాఫ్ ప్రదక్షిణ చేయవద్దు”.ఇక మిగిలిన సఫా మరియు మర్వా యొక్క సయి, ముజ్దలిఫా మరియు మినాలో ఆగడం,రాత్రి బస చేయడం, జమ్రాత్పై గులకరాళ్లు విసరడం, హజ్ మరియు ఉమ్రా యొక్క ఇతర ఆచరణలు రుతుస్రావ మహిళపై నిషేధం కాదు,కాగా స్త్రీ తుహ్ర్ (పరిశుద్ధ) స్థితిలో తవాఫ్ చేసిన వెంటనే లేదా సయీ సమయంలో రుతు వెలువడితే ఎటువంటి దోషం ఉండదు.

నాలుగవ ఆదేశం:తవాఫే విదా మినహాయింపు: ఒక మహిళ హజ్ మరియు ఉమ్రా యొక్క ఆచరణలను పూర్తి చేసి, తన ప్రాంతానికి బయలుదేరే ముందు రుతు ప్రారంభమై ఆమె మక్కా నుండి బయలుదేరే వరకు కొనసాగినట్లయితే, తవాఫ్ విదా చేయకుండా వెళుతుంది.అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమ ఉల్లేఖనం: తెలియపరుస్తున్నారు”ప్రజలకు చివరగా వెళ్ళేటప్పుడు (బైతుల్లాహ్) అల్లాహ్ గృహాన్ని సందర్శించి తవాఫ్ చేసి వెళ్ళమని ఆదేశించబడింది కానీ బహిష్టు స్త్రీలకు మాత్రం మినహాయించబడింది.(ముత్తఫఖున్ అలైహి)వీడ్కోలు విదా సమయంలో, రుతుక్రమంలో ఉన్న స్త్రీ మస్జిదు హరమ్ తలుపు వద్దకు వచ్చి దుఆ చేయడం ముస్తహబ్ కాదు,ఎందుకంటే ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుండి ఉల్లేఖించబడలేదు, అయితే ఆరాధనలు ఉల్లేఖనాలపై ఆధారపడి ఉంటాయి.చూడబోతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఉల్లేఖించబడినది దీనికి వ్యతిరేకంగా ఉంది.సయ్యిదా సఫియా రజియల్లాహు అన్హా కథనంలో ఆమె తవాఫే ఇఫాజా తర్వాత రుతుక్రమం మొదలైంది అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: “అప్పుడు ఆమె ప్రయాణానికి బయల్దేరాలి”.(ముత్తఫఖున్ అలైహి).కాబట్టి, ఈ హదీసులో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెను మస్జిద్-ఎ-హరమ్ ద్వారం వద్ద హాజరుకావాలని ఆదేశించలేదు ఒకవేళ ఇది మస్నూన్ అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దాని గురించి ఖచ్చితంగా వివరించేవారు.హజ్ మరియు ఉమ్రా కోసం తవాఫ్ ఋతుస్రావ స్త్రీకి మినహాయింపు లేదు, ఆమె ఋతుస్రావం నుండి పరిశుద్ధి పొందినప్పుడు తవాఫ్ చేయాలి.

ఐదవ ఆదేశం: మస్జిదులో ఆగడం: రుతుస్రావ స్త్రీ మస్జిదులో ఆగడం నిషేధించబడింది, ఈద్గాహ్’లో కూడా ఆగడం నిషేధించబడింది.ఎందుకంటే హజ్రత్ ఉమ్ముఅతియ్య రజియల్లాహు అన్హా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విన్నది:“యువతులు,పరదాస్త్రీలు, ఋతుస్రావ మహిళలు ఈద్గా’కు వెళ్ళాలి” ఇంకా “కానీ ఋతుస్రావ స్త్రీలు ఈద్గాహ్’కు దూరంగా ఉండాలి”అని ప్రస్తావన ఉంది.(ముత్తఫఖున్ అలైహి).

ఆరవ ఆదేశం:సంభోగం: భర్త తన భార్యతో సంభోగం చేయడం నిషేధించబడింది మరియు స్త్రీ తన భర్తకు అలా చేయడానికి అవకాశం ఇవ్వడం కూడా నిషేధించబడింది, ఎందుకంటే అల్లాహ్ తఆల ఇలా సెలవిచ్చాడు:

لقوله تعالى: {وَيَسْأَلُونَكَ عَنِ الْمَحِيضِ قُلْ هُوَ أَذًى فَاعْتَزِلُواْ النِّسَاء فِي الْمَحِيضِ وَلاَ تَقْرَبُوهُنَّ حَتَّىَ يَطْهُرْنَ} [البقرة:222]،
(మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: ”అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి.)[అల్ బఖర:222]

ఆయతులో పేర్కొన్న “మహీజ్”అనే పదం ఋతుస్రావ సమయం మరియు రుతుస్రావ ప్రదేశాన్ని అనగా మర్మాయవాన్నిసూచిస్తుంది.అదే విధంగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అనగా, మీరు లైంగిక కలయిక తప్ప స్త్రీతో ప్రతిదీ చేయవచ్చు.అనగా సంభోగం”ముస్లిం ఉల్లేఖించారు.అలాగే, ముస్లిము సమాజపు యొక్క ఏకాభిప్రాయం ఏమిటంటే, రుతుక్రమావస్థలో భార్యతో సంభోగించడం నిషేధించబడింది.అల్లాహ్ తఆలాని,పరలోక దినాన్ని విశ్వసించే వ్యక్తి అల్లాహ్ గ్రంధం, ఆయన ప్రవక్త సున్నత్ మరియు ముస్లింల ఇజ్మా ఏకాభిప్రాయం ద్వారా నిషేధించబడిన ఆ హేయపనిలో పాల్గొనడం హలాల్ కాదు. ఈ చర్యకు పాల్పడినవాడు అల్లాహ్ దైవప్రవక్త మరియు విశ్వాసుల ఇజ్మా ఏకాభిప్రాయాన్ని వ్యతిరేకించినవారిలో లెక్కించబడతారు.ఇమామ్ నవవీ “షర్హు అల్-మహద్దబ్” సంపుటం. 2, పేజి. 374లో పేర్కోన్నారు అది “ఇమామ్ షాఫయీ ఇలా తెలిపారు”ఎవడైతే భార్య రుతుక్రమంలో ఉన్నప్పుడు ఆమెతో రమించాడో అతను పెద్ద పాపానికి పాల్పడ్డాడు”. మా సహచరులు ఇలా అన్నారు: “ఎవరైతే రుతుస్రావ సమయంలో సంభోగం చేయడాన్ని హలాలుగాభావిస్తాడో అతను ‘కాఫిరు’గా ఆదేశించబడతాడు”.లైంగిక సంపర్కం కాకుండా,భర్త తన భార్యతో కోరికను తీర్చుకోవడానికి ఇతర విషయాలు అనుమతించబడ్డాయి, ఉదాహరణకు ముద్దులు, కౌగిలించుకోవడం మరియు మర్మాయవాన్నితాకకుండా అలుముకోవడం, కానీ సంబోగ సమయంలో నాభి నుండి మోకాలి వరకు వస్త్రాన్ని కట్టుకోవడం ఉత్తమం.ఎందుకంటే ఇది ఆయిషా(రజియల్లాహు అన్హా)యొక్క హదీసు:”దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నాకు ఆజ్ఞాపించినప్పుడు, నేను లోవస్త్రాన్ని బిగించుకుంటాను,అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో దేహాన్ని కలిపేవారు, అప్పుడు నేను రుతుక్రమ స్థితిలో ఉన్నాను”. ముత్తఫఖున్ అలైహి.

ఏడవ ఆదేశం: తలాఖ్’విడాకులు: రుతుస్రావంతో ఉన్న భార్యకి భర్త విడాకులు ఇవ్వడం నిషేధంلقوله تعالى: {يَاأَيُّهَا النَّبِيُّ إِذَا طَلَّقْتُمُ النِّسَاء فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ } [الطلاق:1] ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :అంటే, ఆమె తలాఖ్ ఇద్దతు గడువును ప్రారంభించే స్థితిలో ఉన్నప్పుడు తలాఖ్ విడాకులు ఇవ్వండి,ఇది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు లేదా తుహ్ర్ శుద్ధి పొందిన పిదప రమించకుండ తలాఖ్ ఇస్తేనే జరుగుతుంది,ఎందుకంటే ఆమెకు ఋతుక్రమ స్థితిలో విడాకులు ఇచ్చినప్పుడు ఆమె ఇద్దతును ప్రారంభించదు, దీనికి విరుద్ధంగా, ఆమె విడాకులు తీసుకున్న కాలం ఇద్దతుగా పరిగణించబడదు, సంభోగం తర్వాత తుహ్ర్ స్థితిలో విడాకులు ఇచ్చినట్లయితే, ఆమె ప్రారంభించే ఇద్దతు కాల సమయం తెలియదు ఎందుకంటే ఆమె ఈ లైంగిక సంపర్కం ద్వారా గర్భవతి అయి ప్రసవం వరకు వేచి ఉండాలా లేక గర్భం దాల్చని స్థితిలో రుతుక్రమ సమయాన్ని పూర్తిచేయాలా తెలియదు.ఇద్దతు యొక్క స్వభావం గురించి ఖచ్చితంగా తెలియనప్పుడు ఆ విషయం స్పష్టమయ్యే వరకు భర్తపై భార్యకు విడాకులు ఇవ్వడం నిషేధం.ఋతుస్రావ స్థితిలో భార్యకు తలాఖ్ ఇవ్వడం మునుపటి ఆయతు మరియు ఈ హదీసు వెలుగులో నిషేధమని తెలుస్తుంది.బుఖారి ముస్లింలో అబ్దుల్లా బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హుమ)తో రూఢీ అయినది ఆయన తన భార్యకు బహిష్టు స్థితిలో విడాకులు ఇచ్చాడు అప్పుడు ఉమర్ ఫారూఖ్ రజియల్లాహు అన్హుమ దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంకు తెలియజేసారు,దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)చాలా అగ్రహించారు ఇలా చెప్పారు: “అతనితో ఆమె వద్దకు వెల్లి వెనక్కి తీసుకోమని ఆజ్ఞాపించండి, ఆపై ఆమె పరిశుద్ది పొంది తిరిగి మళ్ళీ రుతుక్రమం వచ్చి దాని నుండి తిరిగి పరిశుద్ధిపొందిన తర్వాత వరకు ఉంచండి, ఆపై కోరుకుంటే, ఆమెను తనతో ఉంచుకోవాలి లేదా లైంగిక కలయికకి ముందు ఆమెకు విడాకులు ఇవ్వాలి.”ఈ ఇద్దతు అనుసరిస్తూ భర్తలు భార్యలకు తలాఖ్ ఇవ్వాలని అల్లాహ్ తఆల సూచించాడు.ఒక వ్యక్తి తన భార్యకు రుతుక్రమంలో ఉన్నప్పుడు విడాకులు తలాఖ్ ఇచ్చినట్లైతే అతను పాపానికి పాల్పడ్డాడు,అతనిపై తౌబా పశ్చాత్తాపం తప్పనిసరి అలాగే తన భార్యకు తిరిగి పవిత్రత ఇవ్వడం (హరమ్) అతనిపై విధిగా ఉంటుంది, తద్వారా తిరిగి అతను షరీఅత్ పద్ధతితో పాటు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆజ్ఞకు అనుగుణంగా ఆమెకు సక్రమంగా విడాకులు ఇవ్వగలడు, దాంపత్యంలోకి తిరిగి వచ్చిన తర్వాత, ఆమెను ఆ బహిష్టు స్థితి నుండి పరిశుద్ధి పొందే వరకు విడిచిపెట్టాలి ఆపై రెండవ సారి మళ్ళీ ఋతుస్రావం వెలువడి తిరిగి పరిశుద్ధి అయ్యే వరకు ఆమెను విడిచిపెట్టాలి పిమ్మట భర్త ఆమెని తనతో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు,లేదా లైంగిక సంపర్కానికి ముందు విడాకులు తలాఖ్ ఇవ్వచ్చు.ఋతుస్రావం స్థితిలో తలాఖ్ విడాకుల నిషేధం నుండి మూడు సందర్భాలు మినహాయించబడ్డాయి.మొదటి సందర్భం: ఏకాంతం లేదా లైంగిక కలయికకి ముందు తలాఖ్ విడాకులు: స్త్రీతో ఏకాంతానికి లేదా లైంగిక సంపర్కానికి ముందు విడాకులు తలాఖ్ ఇస్తే అలాంటప్పుడు స్త్రీకి రుతుస్రావావస్థలో తలాఖ్ ఇవ్వడంలో ఏ సమస్య లేదు.ఎందుకంటే ఈ స్త్రీ పై ఎలాంటి`ఇద్దతు’ లేదు. ఆ సమయంలో, ఆమెకు విడాకులు ఇవ్వడం వ్యతిరేకం కాదు.لقوله تعالى: {فَطَلِّقُوهُنَّ لِعِدَّتِهِنَّ } [الطلاق:1]. అల్లాహ్ సెలవిచ్చాడు:(ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (‘తలాఖ్) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (‘ఇద్దత్) తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి.)[తలాఖ్:1]

రెండవ సందర్భం: గర్భస్థితిలో స్త్రీ ఋతుస్రావానికి లోనైతే అప్పుడు ఆమెకు తలాఖ్ ఇవ్వడంలో ఎలాంటి సమస్య లేదు,దీనిగురించి ఇంతకు ముందు వివరించబడినది.

మూడవ సందర్భం: పరిహారంకు బదులు విడాకులు: తలాఖ్ విడాకులు పరిహారంకు బదులుగా ఉండినట్లైతే అప్పుడు కూడా రుతుస్థితిలో విడాకులు ఇవ్వడంలో ఎలాంటి సమస్య లేదు.

ఉదాహరణకు, భార్యాభర్తల మధ్య ఏదైనా అనైతికత, కుటిలత్వం లేదా చెడు సంబంధం ఉంటే, అప్పుడు భార్య నుండి పరిహారం తీసుకుని భర్త ఆమెకు విడాకులు ఇస్తాడు అప్పటికీ భార్య ఋతుస్థితిలో ఉన్నా సరే అనుమతి ఉంది.ఇబ్నుఅబ్బాస్ రజియల్లాహు అన్హుమ కథనం:- సాబిత్ బిన్ ఖైస్ భార్య దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వద్దకి వచ్చి ఓ దైవప్రవక్త ‘నాకు సాబిత్ బిన్ ఖైస్ నడవడిక మరియు అతని ధర్మంపట్ల ఎలాంటి ఫిర్యాదు లేదు కానీ నేను ఇస్లాం స్థితిలో కుఫ్ర్ ను ఇష్టపడటం లేదు,మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఆమెతో ‘{మరి నీవు అతని తోటను తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నావా?అని అడిగారు,దానికి ఆమె ‘అవును (సిద్ధంగా ఉన్నాను) దైవప్రవక్త ఇలా చెప్పారు {నువ్వు ఆ తోటను స్వీకరించు, ఒక తలాఖ్ ఆమెకు ఇవ్వు}కాబట్టి, ఈ హదీసులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను రుతుక్రమంలో ఉన్నావా లేదా స్వచ్ఛంగా ఉన్నావా అని అడగలేదు. మరియు రెండవది, ఈ తలాఖ్ స్త్రీ తరపు నుంచి ఫిద్యా ఇవ్వడం వల్ల జరిగింది, అవసరమైనప్పుడు ఏ పరిస్థితిలోనైనా ఇది అనుమతించబడుతుంది.అల్లామా ఇబ్నుఖుదామా, అల్-ముఘ్నీ, పేజీ 52, 7 సంపుటంలో, రుతుక్రమంలో ఖులా అనుమతి యొక్క కారణాన్ని వివరిస్తూ ఇలా అన్నారు:బహిష్టులో తలాఖ్’ను ఆపడం ఈ “జరర్’హాని”(బాధ) కారణంగా ఉంది.అది దీర్ఘకాల ఇద్దతు కారణంగా స్త్రీకి కలుగుతుంది, మరియు ఈ “ఖులా”తను ఇష్టపడని, ప్రేమలేని వ్యక్తితో సహవాసం చేస్తూ ఉండటం వల్ల కలిగే కలత,బాధ “హాని”ని తొలగించడం కోసం ఇది జరుగుతుంది, ఇది దీర్ఘకాల ఇద్దతు కంటే మరింత ఎక్కువ హానికరం, కాబట్టి అందులోని పెద్దదానిని అల్పమైనదానితో తొలగించడం అనుమతించబడింది, అందుకే దైవప్రవక్త ﷺ `ఖులా’చేసుకునే మహిళ స్థితిని గురించి కనుగొనలేదు.(ఇబ్నుఖుదామా గారి మాట ముగిసింది).

ఇక స్త్రీకి ఋతు వెలువడినప్పుడు నికాహ్ చేసుకోవడం వల్ల తప్పేమీ లేదు, ఎందుకంటే ఇది అసలైన స్థితి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నికాహ్ చేసుకోకూడదు అనడానికి ఎటువంటి ప్రామాణికరుజువు లేదు, కానీ భర్త ఋతుక్రమావస్థలోని భార్యతో రమించే విషయం పరిగణలోకి తీసుకోబడుతుంది, ఒకవేళ భర్త భార్యతో రమించకుండా దూరంగా ఉంటే ఎటువంటి సమస్య లేదు, లేకుంటే ఋతుస్రావం నుండి విముక్తి పొందే వరకు ఆమె వద్దకు వెళ్లకూడదు, ఎందుకంటే ఆమె షరీఆతు విరుద్ధమైన చర్యకు గురవుతుందనే భయం ఉంది.

ఎనిమిదవ ఆదేశం: తలాఖ్ యొక్క ఇద్దతు చెల్లుబాటు: లైంగిక సంభోగం మరియు ఖిల్వత్ సహీహా తర్వాత భర్త తన భార్యకు తలాఖ్ ఇచ్చినట్లయితే ఆమె రుతుక్రమంలో ఉండి, గర్భం లేకుంటే మూడు పూర్తి ఇద్దతులు గడపడం వాజిబు అని చెప్పబడిందిلقوله تعالى

: {وَالْمُطَلَّقَاتُ يَتَرَبَّصْنَ بِأَنفُسِهِنَّ ثَلاَثَةَ قُرُوَءٍ} [البقرة:228]،
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:(మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు వేచి ఉండాలి)[అల్ బఖర:228]

అనగా మూడు ఋతుక్రమాలు అని అర్ధంఒకవేళ ఆమె గర్భవతి అయితే, ప్రసవమే ఇద్దతు అవుతుంది ఆ సమయం ఎక్కువ లేదా తక్కువ అయినా సరే,لقوله تعالى: {وَأُوْلاَتُ الأَحْمَالِ أَجَلُهُنَّ أَن يَضَعْنَ حَمْلَهُنَّ } [الطلاق:4]، అల్లాహ్ సర్వశక్తిమంతుడు ఇలా సెలవిచ్చాడు:

(మరియు గర్భవతు లైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు)[తలాఖ్:4 ]

ఒకవేళ మహిళకు ఋతుక్రమం లేనట్లయితే అనగా రజస్వల అవ్వని బాలిక,వృద్ధాప్యం కారణంగా లేక ఆపరేషన్ కారణంగా గర్భాశయాన్ని తొలగించబడి రుతుక్రమం ఆగిపోయిన స్త్రీ లేదా రుతుక్రమం వెలువడటం పట్ల ఎటువంటి ఆశ లేనట్లయితే, వారి ఇద్దతు మూడు నెలలుగా పరిగణించబడుతుంది:

لقوله تعالى: {وَاللاَّئِي يَئِسْنَ مِنَ الْمَحِيضِ مِن نِّسَائِكُمْ إِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلاَثَةُ أَشْهُرٍ وَاللاَّئِي لَمْ يَحِضْنَ} [الطلاق:4]،
అల్లాహ్ సెలవిచ్చాడు:(మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచిపోయిన వారైతే లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే; లేక వారి ఋతు స్రావం ఇంకా ప్రారంభంకాని వారైతే, అలాంటి వారి గడువు మూడు మాసాలు.)[తలాఖ్:4]

ఒకవేళ స్త్రీ రుతుక్రమ మహిళగా ఉన్నట్లయి, తెలిసిన కొన్నికారణాల వల్ల అంటే వ్యాధి లేక శిశువుకు పాలు పట్టడం వల్ల రుతుస్రావం ఆగిపోయింది.అలాంటి మహిళ ఇద్దతులో ఉంటుంది, ఆ సమయం ఎక్కువ ఉన్నప్పటికీ, రుతుక్రమం తిరిగి వచ్చిన పిదప ఇద్దతు గడుపుతుందిఒకవేళ కారణం ముగిసి, రుతుక్రమం జరగకపోతే, ఆ స్త్రీ వ్యాధి నుండి కోలుకుని లేదా రజాఅతు (పాలుపట్టడం) చివరి దశకు చేరుకుని అప్పటికీ ఋతుస్రావం లేకుంటే మహిళ ఆ కారణం ముగింపు కారణంగా ఒక సంవత్సరం ఇద్దతు పూర్తి చేస్తుంది,ఇదియే సరైన అభిప్రాయం, ఇది షరీఆ నిబంధనలకు అనుగుణంగా ఉన్న మాట.ఎందుకంటే కారణం మాయమైనప్పుడు మరియు రుతుక్రమం తిరిగి రానప్పుడు,ఎటువంటి కారణం లేకుండా స్త్రీ రుతుస్రావం ఆగిపోయి ఉంటుంది, అలాంటప్పుడు ఆమె గర్భం కోసం ముందుజాగ్రత్తగా తొమ్మిది నెలల పూర్తి కాలాన్ని గడుపుతుంది, ఎందుకంటే సుమారుగా గర్భం తొమ్మిది నెలలు ఉంటుంది దాంతో పాటు ఇద్దతు కోసం మూడు నెలలు గడుపుతుంది.ఇక తలాఖ్ నికాహ్ తర్వాత లైంగిక కలయికకు ముందు జరిగితే అందులో ఎలాంటి ఇద్దతు లేదు, ఋతుస్రావ రోజులది ఇతర దినాలదీ,-ఎందుకంటే

لقوله تعالى: {يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نَكَحْتُمُ الْمُؤْمِنَاتِ ثُمَّ طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ فَمَا لَكُمْ عَلَيْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّونَهَا} [الأحزاب:49].
అల్లాహ్ తఆల సెలవిచ్చాడు:{ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత – మీరు వారిని తాకక పూర్వమే – వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచి వుండే వ్యవధి (ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికం ఇచ్చి మంచితనంతో వారిని సాగనంపండి.}(అల్ అహ్జాబ్:49)

తొమ్మిదవ ఆదేశం: ఇస్తిబ్రా ఏ రహమ్ –గర్భందాల్చ లేదని నిర్దారణ చేసుకోవడం –దీని అవసరం ఇస్తిబ్రా ఏ రహమ్ యొక్క ఆదేశ అవసరం కలిగినప్పుడు పడుతుంది.దీనికి చెందిన కొన్ని సమస్యలు ఉన్నాయి:

వాటిలో ఒకటి ఇది: భార్యని వదిలి భర్త మరణించినప్పుడు, స్త్రీ గర్భస్తుడు అతని వారసుడు అయి ఉంటాడు, స్త్రీకి భర్త ఉండి ఉంటే, ఆమె బహిష్టు అయ్యే వరకు లేదా ఆమె గర్భం స్పష్టంగా కనిపించనంత వరకు భర్త ఆమెతో రమించకూడదు ఒకవేళ గర్భం దాల్చినట్లు తేలితే, మేము అతని వారసుడిగా నిర్దారిస్తాం, మేము అతని వారసుడిగా ఉండకూడదని నిర్ణయించుకుంటాము. మేము అతని మరణ సమయంలో గర్భం పొందటం వలన ఈ తీర్పు వెల్లడించాము ఒకవేళ ఆమెకు బహిష్టు వెలువడితే మేము అతని వారసుడు లేడని తీర్పుచేస్తాం ఈ తీర్పు ఆమెకు బహిష్టు వెలువడటం వలన ‘గర్భాశయం ఖాళీ’ఉండటం వలన తీర్మానించాము.

పదవ ఆదేశం: గుసులు స్నానం వాజిబు: బహిష్టు స్త్రీ పరిశుద్ధిపొందిన తర్వాత దేహశుద్ది కోసం గుసుల్ స్నానం ఆచరించాలి.దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా బింతు అబీ జైష్ రజియల్లాహు అన్హాకు బోధించారు: ఋతుస్రవించినప్పుడు నమాజు వదిలేయి,ఋతు క్రమం ముగిసిన తర్వాత గుసుల్ చేసి నమాజు ఆచరించండి’ ఇమాం బుఖారి దీనిని ఉల్లేఖించారు.గుసుల్’లో కనీస విధిగా ఉన్న విషయం ఏమిటంటే, స్త్రీ తన జుట్టు మూలాలతో సహా మొత్తం శరీరాన్ని కడగాలి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులో నిరూపించబడినట్లుగా చేయడమే గుసుల్ యొక్క ఉత్తమ విధానం.అస్మా బింతు షకల్ రజియల్లాహు అన్హా బహిష్టు పరిశుద్ధి కొరకు గుసుల్ విధానం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అడిగినప్పుడు, ఆయన ఇలా బోధించారు: మీరు నీరు మరియు రేగు ఆకులను తీసుకొని బాగా పరిశుద్ధి పొందాలి, ఆపై తలపై నీరు పోయాలి. నీరు మీ తల యొక్క మూలాలకు చేరే వరకు మీ తలను బాగా రుద్దండి, ఆపై మీ తలపై నీరు పోయాలి, ఆపై కస్తూరి సువాసనలో ముంచిన దూదిని తీసుకొని దాని నుండి స్వచ్ఛతను పొందండి. హజ్రత్ అస్మా రజియల్లాహు అన్హా ఇలా అన్నారు: నేను ఈ దూది నుండి స్వచ్ఛతను ఎలా పొందగలను? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సుబ్’హానల్లాహ్’” అప్పుడు సయ్యిదా ఆయిషా రజియల్లాహు అన్హా ఆమెతో ఇలా అన్నారు! “రక్తప్రభావ స్థానంలో ఈ దూదిని ఉపయోగించండి.”[ఇమాం ముస్లించే ఉల్లేఖించబడింది].తలవెంట్రుకలను గట్టిగా ముడివేసినప్పుడు జుట్టు యొక్క మూలాల్లోకి నీరు చేరదనే భయం ఉంటుందీ కనుక తలజుట్టును తెరవడం తప్పనిసరి కాదు.సహీహ్ ముస్లింలో, సయ్యిదా ఉమ్ము సల్మా రజియల్లాహు అన్హా హదీసు ప్రకారం ఆమె దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు అప్పుడు ఆయన ఇలా అన్నారు:”నేను నా జుట్టును గట్టిగా ముడి కట్టుకున్నాను, గుసుల్ కారణంగా దానిని నేను విప్పాలా? మరొక ఉల్లేఖనంలో ఇలాఉంది, రుతుస్రావం మరియు జనాబత్ కారణంగా? అప్పుడు ప్రవక్త ఇలా తెలిపారు: “లేదు, నీ తలపై మూడు దోసెడుల నీరు పోసుకుంటే చాలు,పిదప శరీరం మీద నీళ్ళు పోసుకుని స్వచ్ఛతను పొందండి”.

నమాజు సమయంలో రుతుక్రమంలో ఉన్న స్త్రీ పరిశుద్ధి పొందినప్పుడు, ఆమె త్వరగా గుసుల్ స్నానం చేయడం వాజిబు, తద్వారా ఆమె సమయానికి నమాజు చేయగలదు, ఆమె ప్రయాణిస్తున్నప్పుడు లేదా నీరు వాడటం వల్ల హనీ కలిగే భయం ఉంటే లేదా అనారోగ్యానికి గురై నీరు బాధ పెడుతుంది అంటే అప్పుడు గుసుల్ కాకుండా తయమ్ముమ్ చేస్తుంది, ఆటంకాలు తీరిన తర్వాత గుస్ల్ చేయాలి.

కొంతమంది స్త్రీలు నమాజు సమయంలో రుతుక్రమం నుండి శుద్ధి పొందుతారు కానీ గుసుల్’ను మరొక సమయానికి వాయిదా వేస్తారు ఆ సమయంలో ఆమెకు పరిపూర్ణ శుద్ధి పొందటం అసాధ్యం అని అంటారు, అయితే ఇది ఆమెకు ఆధారం గానీ, సాకు గానీ కాదుఎందుకంటే ఇది ఆమెకు సాధ్యమే. గుసుల్’లో కనీస వాజిబు విషయాలను ఆచరించి సకాలంలో నమాజు ఆచరించాలి పిమ్మట ఆమెకు తగినంత సమయం దొరికినప్పుడు పరిపూర్ణ స్వచ్ఛతను పొందాలి.

ఐదవ అధ్యాయం: ఇస్తిహాజా మరియు దాని సంబంధిత ఆదేశాలు

ఇస్తిహాజ: స్త్రీకు ముగియకుండా కొనసాగే రక్తాన్ని లేదా కొన్నిసార్లు నెలలో ఒకటి లేక రెండు రోజులు రక్తం ఆగిపోతుంది.

మొదటి స్థితికి ఋజువు: (స్త్రీకి రక్తం కొన్నిసార్లు ఆగదు) ఆయిషా రజియల్లాహు అన్హా కథనం సహీ బుఖారీలో ప్రస్తావించబడింది. ఫాతిమా బింతు అబీ జైష్ రజియల్లాహు అన్హా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగింది:ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను పరిశుద్ధిపొందడం లేదు’ఇంకో ఉల్లేఖనంలో ఇలా ఉంది: నాకు ఇస్తిహాజ రక్తం స్రవిస్తుంది నేను పరిశుద్ధిపొండటం లేదు’రెండవ స్థితి ఋజువు: (ఇందులో కొంచం సమయం కోసం రక్తం ఆగిపోతుంది) హంనా బింతు జహెష్ రజియల్లాహు అన్హా యొక్క హదీసు ఇలా ఉంది ఆమె దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో అడిగారు.ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇస్తిహాజ రక్తం ఎక్కువగా స్రవిస్తూ ఉంటుంది’-(హదీసు: ఈ హదీసును ఇమాం అహ్మద్ బిన్ హంబల్,ఇమాం అబూ దావూద్,ఇమాం తిర్మీజీ రహిమహుముల్లాహ్ ఉల్లేఖించారు మరియు ఇమాం తిర్మీజీ దీనిని సహీహ్ గా పేర్కున్నారు మరియు ఇమాం రహిమహుల్లాహ్ తో దీని తస్ హీహ్ మరియు ఇమాం బుఖారి తో దీని తహసీన్ నకలు చేయబడింది).

ముస్తహాజ స్థితి వివరాలు:

ముస్తహాజాలో మూడు స్థితులు ఉన్నాయి:

మొదటి స్థితి: స్త్రీ యొక్క రుతుక్రమం ఇస్తిహాజాకు ముందు తెలిసినట్లయితే, ఆ స్త్రీ తన చివరిగా తెలిసిన ఋతుస్రావ రోజుల ప్రకారంగా గడుపుతుంది ఆమెపై రుతుక్రమ నియమాలు జారీ అవుతాయి ఆపై మిగిలిన రోజులు ఇస్తిహాజా రక్తంగా లెక్కించబడుతుంది ఆమెపై ఇస్తిహాజా ఆదేశాలు జారి అవుతాయి.

ఉదాహరణ: ఒక స్త్రీకు ప్రతీ నెల ప్రారంభంలో ఆరు రోజులు ఋతు వెలువడుతుంది,ఆపై ఇస్తిహాజ రక్తం వస్తుంది అది అవిరామంగా కొనసాగుతుంది, కనుక ప్రతీ నెల ప్రారంభ ఆరు రోజులు ఋతుస్రావంగా లెక్కించబడుతుంది మిగిలిన రోజులు ఇస్తిహాజాగా పరిగణించబడతాయి.ఫాతిమా బింతే అబీ హుబైష్ మహనీయ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ను ప్రశ్నిస్తూ“ఓ ప్రవక్త నాకు ఋతుస్రావం అవుతూ శుద్ధి పొందలేకపోతున్నాను,మరి నేను నమాజులను వదిలిపెట్టవచ్చునా?అని అడిగింది. దానికి ప్రవక్త”లేదు,అది ఒక నరం (వలన జరుగుతుంది) కాబట్టి ఋతుస్రావం జరిగే సాధారణ రోజులలో నమాజును విడిచి ఆ తరువాత గుసుల్(స్నానం) ఆచరించి నమాజు పాటించు అని తెలిపారు.సహీహ్ ముస్లింలో ఇలా ఉంది ఉమ్ము హబీబా బింతు జహష్‘తో చెప్పారు: “మీ ఋతుస్రావం మిమ్మల్ని నిరోధించినన్ని రోజులు ఆగిపోండి, ఆపై గుసుల్ స్నానం చేసి నమాజు చేయండి.”ఈ హదీసు ఆధారంగా, తన ఋతుస్రావం గురించి తెలిసిన ముస్తహాజా స్త్రీ, ఆమె రుతుక్రమం జరిగినన్ని రోజులు ఉండి పిదప గుస్ల్ చేసి నమాజు చేస్తుంది అప్పుడు ఆమె ఆ రక్తం (ఇస్తిహాజా) గురించి పట్టించుకోదు.ఈ హదీసు ఆధారంగా, తన ఋతుస్రావం గురించి తెలిసిన ముస్తహాజా స్త్రీ, ఆమె రుతుక్రమం జరిగినన్ని రోజులు ఉండి పిదప గుస్ల్ చేసి నమాజు చేస్తుంది అప్పుడు ఆమె ఆ రక్తం (ఇస్తిహాజా) గురించి పట్టించుకోదు.

రెండవస్థితి: ఇస్తిహాజాకు ముందు స్త్రీ రుతుక్రమం తెలియదు, ఆమె రక్తాన్నిచూసినప్పుడు ఆ సమయం నుండి రక్తస్రావం అయినట్లైతే ఆమె విలక్షణంగా వ్యవహరిస్తుంది. కనుక నలుపు రంగులో ఉన్న రక్తం లేదా చిక్కని లేదా దుర్వాసన వంటి లక్షణాలను కలిగి ఉన్నప్పుడు అది రుతుక్రమం అవుతుంది ఆమెపై రుతుక్రమ నియమాలు జారీ అవుతాయి ఇది కాకుండా స్రవించే రక్తం ఇస్తిహాజా అవుతుంది అప్పుడు ఇస్తీహాజా యొక్క నియమాలు చెల్లుబాటు అవుతాయి.

ఉదాహరణ: ఒక మహిళ మొదటిసారి చూసిన రక్తం కొనసాగుతూ ఉంది, కానీ స్త్రీ పది రోజులు నల్ల రక్తాన్ని చూస్తుంది, మిగిలిన నెల ఎర్ర రక్తాన్ని చూస్తుంది, లేదా ఆమె పది రోజుల పాటు మందపాటి చిక్కని రక్తాన్ని చూస్తుంది మిగిలిన నెల పలుచని రక్తం చూస్తుంది, లేదా పది రోజులు రక్తంతో రుతురక్త దుర్వాసనను గమనిస్తుంది మిగిలిన నెల దుర్వాసన గమనించదు. మొదటి ఉదాహరణలో ఆమె ఋతుక్రమం నల్లరక్తం అవుతుంది, రెండవ ఉదాహరణలో చిక్కని రక్తం ఋతుస్రావం అవుతుంది, మూడవ ఉదాహరణలో దుర్వాసనతో కూడిన రక్తం రుతుక్రమంగా పరిగణించబడుతుంది అది కాకుండా స్రవించే రక్తం ఇస్తిహాజా రక్తం అవుతుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా బిన్తే అబీ హబైష్తో ఈ విధంగా చెప్పారు: “ఋతురక్తము అయితే అది నల్లగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో నమాజు చేయడం మానుకో, ఒకవేళ దీనికి వ్యతిరేఖమైన(రక్తం)ఉంటే వుజూ చేసుకుని నమాజు పాటించు ఎందుకంటే అది ఒక నరం మాత్రమే! అబూదావూద్, నసాయి దీనిని ఉల్లేఖించారు ఇమాం ఇబ్ను హిబ్బాన్ , ఇమాం హాకిం దీనిని ప్రామాణికమైనదిగా ప్రకటించారు)ఈ హదీసు సనదు మరియు మతను గురించి సందేహం ఉన్నప్పటికీ పండితులు దీనిని అనుసరించారు మరియు ఈ హదీస్ చాలా మంది మహిళల అలవాటు వైపుకు మరల్చడం ఉత్తమం.మూడవస్థితి: స్త్రీ యొక్క ఋతుస్రావం తెలియదు మరియు సరిగ్గా గుర్తించబడదు, అది ఇస్తిహాజా యొక్క రక్తం కొనసాగుతుంది ఆమె రక్తాన్నిచూసినప్పటి నుండి మరియు రక్తం ఒక లక్షణం లేదా విభిన్న లక్షణాలను కలిగి ఉంటుంది ఇది ఋతుస్రావం అని గుర్తించడం సాధ్యం కాదు.అప్పుడు ఈ స్త్రీ ఎక్కువ మంది మహిళల అలవాటు ప్రకారం ప్రవర్తిస్తుంది, కాబట్టి ప్రతి నెల ఆరు లేదా ఏడు రోజులు ఋతుస్రావంగా పరిగణించబడుతుంది అయితే ఆమె రక్తం చూసిన ప్రారంభ రోజులను నిర్దారించబడుతుంది అది కాకుండా(మిగిలిన రోజులు) ఇస్తిహాజాగా చూడబడుతుంది.ఉదాహరణకు ఒక మహిళ నెల యొక్క ఐదవ రోజున రక్తం చూస్తుంది ఆ రక్తం ఋతుస్రావంగా రంగుతో గానీ మరేవిషయం ద్వారా నిర్దారణ లేకుండా కొనసాగుతూ ఉంది, అయితే ఆమె ఋతుస్రావం ప్రతీనెల ఆరు లేక ఏడు రోజులు ఉంటుంది,ఆమె ప్రతీ నెల యొక్క ఐదవ రోజు నుండి పరిగణిస్తుంది.హమ్నా బింతు జహెష్ రజియల్లాహు అన్హా హదీసులో ఆమె చెప్తుంది:ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు అతి ఎక్కువగా ఋతురక్తం స్రవిస్తూ ఉంటుంది దీని గురించి మీరు నాకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటి?నిశ్చయంగా ఇస్తిహాజ నన్ను నమాజు మరియు ఉపవాసాల నుండి ఆపుతుంది, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం బోధించారు: నేను నీకు ‘వస్త్రాన్ని’పెట్టుకునే విధానం సూచిస్తాను, నీవు దానిని నీ మర్మాయవానికి కట్టుకో దానివలన రక్తంపోతుంది’ దానికి ఆమె ‘ఇది దానికంటే చాలా ఎక్కువ’అదే ఉల్లేఖనంలో ఉంది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవచించారు: ఇది షైతాను మోసాల్లో ఒక మోసం కనుక ఆరు లేక ఏడు రోజులు ఋతుస్రావరోజులు గడపండి పిదప మీరు శుద్ధిపొందరని తెలిసిన తర్వాత గుసుల్ స్నానం చేయండి ఇరవై నాలుగు లేదా ఇరవై మూడు రోజున రాత్రిన నమాజు చదవండి పిదప ఉపవాసం పాటించండి’(ఈ హదీసు ఇమాం అహ్మద్,అబూదావూద్,తిర్మీజీ రహిమహుముల్లాహ్ దీనిని ప్రామాణీకమైనదిగా పెర్కున్నారు,మరియు వారు ఇమాం అహ్మద్ రహిమహుల్లాహ్ తో దీని ప్రామాణికత మరియు ఇమాం బుఖారి రహిమహుల్లాహ్ ద్వారా దీని తహసీన్’ను నకలు చేశారు)దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు: ఆరురోజులు లేక ఏడు రోజులు’ ఇది తఖ్‘యీర్ కోసం కాదు, ఇజ్తిహాద్ కోసం మాత్రమే కనుక ఆ స్త్రీ సృష్టిని పోలిక పరంగా, వయస్సు మరియు సంబంధ పరంగా తన స్థితికి దగ్గరగా ఉన్న ఇతర స్త్రీలను చూస్తుంది. అంతేకాకుండా ఆమె ఋతురక్తానికి దగ్గరగా ఉండేలా చూస్తుంది ఇతర సారూప్య”విషయాలను”పరిగణనలోకి తీసుకుంటుంది.కాబట్టి ఆరు రోజులు సముచితమైతే ఆమె ఆరు రోజుల పాటు ఋతుక్రమం పాటిస్తుంది.ఏడు రోజులు సముచితంగా ఉంటే ఏడు రోజులు ఋతుక్రమం పాటిస్తుంది.

ముస్తహాజ సారూప్య స్త్రీ స్థితి:

మహిళకు కొన్ని కారణాల వల్ల మర్మాయవం నుండి కొన్నిసార్లు రక్తస్రావం జరుగుతుంది, ఉదాహరణకు గర్భాశయం లేదా ఇంకేదైన శస్త్రచికిత్స జరగడం అయితే ఇది రెండు రకాలు:

మొదటి రకం: శస్త్ర చికిత్స అనంతరం స్త్రీకు రక్తం స్రవించడం అసాధ్యమని స్పష్టమైనప్పుడు. ఉదాహరణకు శస్త్రచికిత్స ద్వారా గర్భాశయం పూర్తిగా తీసివేయబడినప్పుడు లేదా రక్తం స్రవించకుండా మూసివేసినప్పుడు ఇలాంటి మహిళకు ఇస్తిహాజ ఆదేశం వర్తించదు, ఈమెకు‘తుహ్ర్’తర్వాత పసుపురంగు లేదా మట్టిరంగు లేదా తడి చూసిన మహిళ వలె ఆదేశం వర్తిస్తుంది,ఇలాంటి మహిళ నమాజు,ఉపవాసం వదలదు,ఆమెతో సంభోగించడం కూడా నిషేధం కాదు, ఆ రక్తాన్ని కడగడం విధి కాదు, కానీ నమాజు సమయంలో ఆ రక్తాన్ని కడిగి,వస్త్రాన్ని కట్టుకోవడం విధిగా ఉంటుంది తద్వారా అది రక్తాన్ని నిరోదిస్తుంది పిదప ఆమె నమాజు కోసం వుజూ చేస్తుంది,నమాజు సమయం విధి అయిన తర్వాత వుజూ చేస్తుంది ఉదాహరణకు ఐదు విధి నమాజులు ఇక ఎప్పుడు నమాజు చదవాలని కోరుకున్నఅదే సమయంలో వుజూ చేస్తుంది ఉదాహరణకు నఫిలు నమాజులు చదవడం.

రెండవ రకం: శస్త్రచికిత్స అనంతరం మహిళ యొక్క ఋతుఆగడం బదులుగా ఆమెకు ఋతు స్రవించవచ్చు, అలాంటప్పుడు ఈమెకు కూడా ముస్తహాజా స్త్రీ ఆదేశం వర్తిస్తుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రస్తావించిన ఈ వాక్కు హజ్రత్ ఫాతిమా బింతు అబూ హుబైష్’కు బోధించబడినది:(ఇది ఒక నరం మాత్రమే ఋతురక్తం కాదు, నీకు ఋతుస్రవించినప్పుడు నమాజు మానుకో)కనుక దైవప్రవక్త బోధన ‘ఋతుస్రవించినప్పుడు’ అనే విషయం ద్వారా అవగతమవుతుందేమనగా ముస్తహాజ ఆదేశం ఋతుక్రమం జరిగే మహిళలకు వర్తిస్తుంది మరియు ఋతు అసాధ్యం గల మహిళకు స్రవించే రక్తం నరం ద్వారా వెలువడే రక్తం అవుతుంది.

ఇస్తిహాజా ఆదేశాలు

ఇస్తిహాజ ఆదేశాలు:గడిచిన అంశం ద్వారా రక్తం ఎప్పుడు ఋతుక్రమం అవుతుంది,ఎప్పుడు ఇస్తిహాజ అవుతుందో తెలుసుకున్నాం ఋతురక్తం అయితే ఋతుక్రమ ఆదేశాలు జారీ అవుతాయి ఇస్తిహాజ రక్తం అయినప్పుడు ఆమెపై ఇస్తిహాజ ఆజ్ఞలు జారీ అవుతాయి.

ఋతుక్రమపు ముఖ్యమైన ఆదేశాల ప్రస్తావన ఇంతకుముందు గడిచింది.

ఇక మిగిలిన ఇస్తిహాజ ఆదేశాల విషయానికొస్తే దీని ఆదేశాలు ‘తుహ్ర్’మాదిరిగా ఉంటాయి,ముస్తహాజ మరియు పరిశుద్ధ స్త్రీ మధ్య దిగువ విషయాలు మినహా ఎటువంటి వ్యత్యాసం లేదు.

మొదటి ఆదేశం: ముస్తహాజ కోసం ప్రతీ నమాజు కోసం వుజూ విధిగా చేయాలి.దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రతు ఫాతిమా బింతు అబీ హుబైష్ రజియల్లాహు అన్హాకు బోధించారు: (పిదప ప్రతీ నమాజు కొరకు వుజూ చేసుకో’) దీనిని ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ ‘బాబు గసులుద్దమ్’ లో ఉల్లేఖించారుదీని అర్ధమేమనగా స్త్రీ సమయం నిర్దారీత నమాజు యొక్క సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే వుజూ చేస్తుంది.నిర్దారీత సమయం లేని నమాజు కోసం చదవాలని కోరినప్పుడు ఆ నమాజు కోసం వుజూ చేస్తుంది.రెండవ ఆదేశం: (రక్తపు మరకలు కడగడం) స్త్రీ వుజూ చేయాలనుకున్నప్పుడు రక్తపు మరకలు కడగాలి మర్మాయవం పై రక్తం నిలిచే విధంగా దూది పట్టీని కట్టాలిదైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ హమ్నా బింతు జహష్ కు బోధించారు ‘నేను నీకు దూదివాడే విధానాన్ని సూచిస్తాను దానివలన రక్తం ఆగిపోతుంది’ ఆమె అడిగినది:అది దానికంటే కూడా ఎక్కువ అవుతుంది,దైవప్రవక్త బోధించారు: ‘లోవస్త్రాన్ని బిగించు’ (హదీసు)లోవస్త్రం కట్టిన తర్వాత ఆమె మర్మాయవం నుండి వెలువడే రక్తం అది హనీ చేకూర్చదు ఫాతిమా బింతు హుబైష్’కు ఇలాగే సూచిస్తూ బోధించారు:రుతుక్రమంలో నమాజుకు దూరంగా ఉండు పిదప గుసుల్ చేసి ప్రతీ నమాజు కోసం వుజూ చేసుకో తర్వాత నమాజు చదువు ఆ రక్తపు బిందువులు చాప మీద పడినా సరే! (ఇమాం అహ్మద్ మరియు ఇబ్నుమాజా దీనిని ఉల్లేఖించారు)మూడవ ఆదేశం: సంభోగం,మనిషి సంభోగానికి దూరంగా ఉండటం వల్ల వ్యభిచార భయం లేనట్లైతే అలాంటి లైంగిక కలయిక గురించి ఉలమాలు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు,అందులో సరైనది ఏమనగా సంభోగించడానికి అనుమతి ఉంది. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాలంలో చాలామంది స్త్రీలు ‘తకరీబ్ అదస్’ లేక దానికంటే ఎక్కువగా ఇస్తిహాజ రోగానికి గురయ్యారు కానీ అల్లాహ్ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారితో రమించకూడదని వారించలేదు.అల్లాహ్ తఆల సెలవిచ్చాడు:(అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి) ఋతుక్రమం సమయం మినహా భార్యలకు దూరంగా ఉండటం విధి కాదని ఈ ఆయతు ద్వారా అవగతమవుతుంది. రెండవ విషయం ఇస్తిహాజ స్థితిలో నమాజు స్థాపించడం అనుమతి ఉంది సంభోగం దానికంటే తెలికైనది ముస్తహాజ తో సంభోగం యొక్క ఖియాసు ఋతుస్రావ స్త్రీతో చేయడం సరికాదు ఎందుకంటే (ముస్తహాజ మరియు ఋతుస్రావ మహిళ)ఇద్దరు సమానం కాదు ఎవరైతే నిషేధం అని చెప్పారో వారి వద్ద కూడా సమానం కాదు ఇది ఖియాస్ మఅల్ ఫారిఖ్ అవుతుంది సరికాదు.

ఆరవ అధ్యాయం: పురిటి రక్తస్రావం (నిఫాసు) మరియు దాని ఆదేశాలు

నిఫాస్ :నిఫాస్ అంటే గర్భాశయం నుండి ప్రసవం వల్ల లేదా ప్రసవ సమయాన లేదా ప్రసవం తర్వాత రెండు లేక మూడు రోజుల ముందు ప్రసవ వేదనతో సరవిస్తుంది.

షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:

మహిళ ప్రసవ వేదనతో రక్తం చూసినట్లయితే అది నిఫాస్ అవుతుంది. షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియ రహిమహుల్లాహ్ రెండు లేక మూడు రోజులు పరిమితి పెట్టలేదు మరియు ప్రసవ వేదన’ అంటే ప్రసవం తర్వాత నొప్పి పెడుతుంది లేనట్లైతే అది ప్రసవవేదన కాదని షేఖుల్ ఇస్లాం’రహిమహుల్లా పేర్కున్నారు. ఉలమాలు నిఫాస్ కనిష్ట గరిష్ట పరిమితిలో అభిప్రాయాలు ప్రస్తావించారు.

షేక్ తఖియుద్దీన్ రహిమహుల్లాహ్ తన రిసాల ‘అల్ అస్మా అల్లతీ అల్లఖ షారిఉల్ అహ్కామ్ బిహా’(పేజీ:37)లో తెలిపారు: నిఫాస్ యొక్క గరిష్ట,కనిష్ట పరిమితి యొక్క ఖరారు లేదు, ఒకవేళ ఒక మహిళ నలభై లేదా అరవై లేదా డెబ్బై రోజులకు పైగా రక్తాన్ని చూసిన తర్వాత ముగిసినట్లైతే అది నిఫాస్ అని అంచనా వేసినట్లయి, ఆ రక్తం ఆమెకు అలాగే కొనసాగితే చెడు రక్తమని భావించినట్లైతే ఆ సమయంలో నిఫాస్ యొక్క పరిమితి నలభై రోజులు ఎందుకంటే నలభై గరిష్టంగా చివరి పరిమితి, దీని గురించి ఆసార్ కథనాలు కూడా వచ్చాయి’

నేను చెప్పేదేమనగా: దీని ఆధారంగా, 40 రోజులకు మించి రక్తస్రావం ఆగిపోవడం ఈ స్త్రీకి అలవాటు అయినప్పటికీ, ఆమెకి 40 రోజుల కంటే ఎక్కువ రక్తస్రావం జరిగినప్పుడు,లేదా రక్తం ఆగిపోయే సంకేతాలు కనిపించినట్లయితే ఆమె రక్తస్రావం ముగిసేవరకు వేచి ఉండాలి, లేకుంటే నలభై రోజులు పూర్తయినప్పుడు ఆమె గుస్ల్ చేయాలి, ఎందుకంటే ఇది తరచుగా జరుగుతుంది- అవును,ఒకవేళ ఆమె ఋతుక్రమ సమయం వచ్చినట్లయితే, ఆ స్త్రీ తన రక్తస్రావ రోజులు ముగిసే వరకు వేచి ఉంటుంది రక్తం అలవాటు ప్రకారం ఆగిపోయిన తర్వాత ఆమె భవిష్యత్తులో దీని ప్రకారం వ్యవహరిస్తుంది. ఒకవేళ రక్తం జారీ అయినట్లైతే ముస్తహాజ ఆదేశం వర్తిస్తుంది ఇస్తిహాజా యొక్క మునుపటి ఆదేశాలు ఆమెపై జారీ అవుతాయి.

ఒకవేళ నలభై రోజులకు ముందు రక్తం ఆగిపోయినట్లైతే ఆమె గుసుల్ చేయాలి నమాజు చేయాలి,భర్తతో లైంగికంగా రమించవచ్చు, కానీ రక్తం ఆగిపోవడం ఒకరోజు కంటే కనిష్టంగా ఉంటే దానిపై ఎటువంటి ఆదేశం లేదు, అల్లామ ఇబ్ను ఖుదామ ‘అల్ ముఘన్ని’లో ప్రస్తావించారు.

గర్భం ప్రసవం తర్వాత నిఫాస్ అనునది నిరూపితమవుతుంది, ఇందులో మానవ సృష్టి కూడా స్పష్టంగా ఉండాలి, ఒక మహిళ లోపభూయిష్ట పిండాన్ని ప్రసవిస్తే అంటే అందులో మానవ సృష్టి స్పష్టంగా లేనట్లయితే అప్పుడు ఆమె రక్తం నిఫాస్ రక్తం కాదు, అది నరం స్రవించే రక్తం అవుతుంది. ఆ స్త్రీ పై ముస్తహాజా యొక్క తీర్పు జారీ అవుతుంది, మానవసృష్టి స్పష్టంగా గుర్తించదగిన అతి కనిష్ట కాలం గర్భం ప్రారంభమైనప్పటి నుండి ఎనభై (80) రోజులు మరియు గరిష్టంగా తొంభై (90) రోజుల కాలం పడుతుంది.

షేక్ మజద్ ఇబ్నే తైమియా ఇలా అన్నారు:ఒక స్త్రీ గర్భం దాల్చడానికి ముందు ప్రసవ నొప్పులతో రక్తాన్నిచూసినట్లయితే, ఆమె దాని గురించి పట్టించుకోకూడదు మరియు ప్రసవం తర్వాత నమాజు, ఉపవాసం మానేస్తుంది. ఒకవేళ ప్రసవం తర్వాత విషయం బహిర్గత స్థితికి విరుద్ధంగా కనిపిస్తే ఆమె మరలుతుంది దానిని భర్తీ చేస్తుంది, ఒకవేళ విషయం బహిర్గత స్థితికి విరుద్ధంగా కనిపించకపోతే బహిర్గత ఆదేశమే జారీఅవుతుంది భర్తీ చేయవలసిన అవసరం ఉండదు-ఈ మాటలు మజద్ ఇబ్ను తైమియ నుండి ‘షర్హుల్ ఇఖ్నావు’లో నకలు చేయబడింది.

నిఫాస్ ఆదేశాలు:

నిఫాస్’కు కూడా ఋతుక్రమానికి సంభంధించిన ఆదేశాలే వర్తిస్తాయి కానీ దిగువ ప్రస్తావించిన ఆదేశాలు మినహాయించబడ్డాయి:

మొదటి ఆదేశం: ఇద్దతు: ఇద్దతును తలాఖ్’తో లెక్కించబడుతుంది నిఫాస్తో కాదు, ఎందుకంటే తలాఖ్ విడాకులు ప్రసవానికి ముందు జరిగితే, ఇద్దతు ప్రసవంతోనే ముగుస్తుంది, నిఫాస్తో ముగియదు. ఒకవేళ తలాఖ్ ప్రసవం తర్వాత జరిగితే ఆమె ఋతుస్రావం కోసం వేచిచూస్తుంది ఇది ఇంతకు ముందు గడిచింది.

రెండవ ఆదేశం: ‘ఈలా’ గడువు ఋతుక్రమంలో పరిగణించబడుతుంది కానీ నిఫాసుక్రమంలో లెక్కించబడదు.

ఈలా: ఈలా అంటే భర్త తన భార్యతో ఎప్పటికీ సంభోగించనని ప్రమాణం చేస్తాడు లేక నాలుగు నెలల కంటే గరిష్ట సమయం వరకు రమించనని ఒట్టుపెట్టుకుంటాడు. ఎప్పుడైతే భర్త ఈ విధంగా ప్రమాణం చేస్తాడో పిమ్మట భార్య అతనితో లైంగిక కలయిక గురించి అడిగితే అతని ప్రమాణ సమయాన్ని నాలుగు నెలలకు నిర్దారించబడుతుంది ఆ నాలుగు నెలలు గడిచిన తర్వాత భార్య అభ్యర్ధన మేరకు భర్త సంభోగం లేక తలాఖ్ కొరకు బలవంతం చేయబడుతుంది ఈ సమయంలో భార్యకు నిఫాస్ రక్తం వెలువడితే ఈ సమయం లెక్కించబడదు మరో నాలుగు నెలలు నిఫాసు సమయానికి ప్రత్యామ్నాయంగా జోడించబడుతుంది కానీ ఋతుస్రావం మాత్రం లెక్కించబడుతుంది ఎందుకంటే దీని సమయం భర్త మీద పరిగణించబడుతుంది.

మూడవ ఆదేశం: బులూగతు(ప్రాజ్ఞ వయసుకి చేరడం): ఇది ఋతుస్రవించడం వల్ల తెలుస్తుంది నిఫాస్ ద్వారా తెలియదు. ఎందుకంటే స్త్రీకి స్కలనం లేకుండా గర్భం ధరించడం అసాధ్యం. గర్భధారణకు బులూగతు అనేది మునుపటి స్ఖలనం ద్వారా లభిస్తుంది.

నాల్గవ ఆదేశం: ఋతుస్రావం మరియు నిఫాసులో వ్యత్యాసం : ఋతస్రావం ముగిసి పిదప అలవాటు ప్రకారం మళ్ళి స్రవించినట్లయితే అది నిశ్చయంగా ఋతుస్రావం అవుతుంది. ఉదాహరణకు ఒకమహిళ యొక్క ఋతుక్రమం అలవాటు ఎనిమిది రోజులు ఆమె నాలుగు రోజులు ఋతుస్రావం చూస్తుంది పిదప రెండు రోజులు ముగుస్తుంది మళ్ళీ ఏడవ ఎనిమిదవ రోజు మళ్ళీ ఋతుస్రవిస్తుంది అయితే మళ్ళీ వచ్చే ఈ రక్తం నిశ్చయంగా ఋతుస్రావం అవుతుంది. ఆమెపై ఋతుక్రమ నియమాలు జారీ అవుతాయి.ఇక నిఫాసు రక్తం విషయానికొస్తే నిఫాసు రక్తం నలభై రోజులకు ముందు ఆగిపోయి తిరిగి మళ్ళీ నలభై రోజులలో రక్తం స్రవించినట్లైతే అది అనుమానాస్పదమవుతుంది, కనుక స్త్రీ తప్పనిసరిగా నమాజు చదువుతుంది, నిర్దారీత సమయం గల ఉపవాసాలు పాటిస్తుంది, ఫరాయిజులు కాకుండా ఆమెపై కూడా ఋతుస్రావ స్త్రీపై నిషేధమగు విషయాలు హరాము అవుతాయి మరియు ఆ రక్తస్రావ రోజులలో చేసినవి ఋతుస్రావ మహిళ పై ఖజా వాజిబు మాదిరిగానే తుహ్ర్ పొందిన తర్వాత తిరిగి ఖజా చేస్తుంది. ఇదియే ఫిఖా హనాబిలా వద్ద ప్రసిద్ది చెందింది.

మరి సరైన దృక్పథం ఏంటంటే స్త్రీకి నిఫాస్ అయ్యే అవకాశం ఉన్న సమయంలో రక్తం తిరిగి వచ్చినప్పుడు అది నిఫాస్ అవుతుంది, లేకుంటే అది రుతుక్రమం అవుతుంది, కానీ ఆ రక్తం స్త్రీకి కొనసాగితే అది ఇస్తిహాజా రక్తం అవుతుంది.

ఇది అల్’ముఘ్నీలో ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) ద్వారా ఉల్లేఖించిన మాటకు దగ్గరగా ఉంది. ఇమాం మాలిక్ రహిమహుల్లాహ్ తెలిపారు:ఒకవేళ స్త్రీ రక్తం ముగిసిన తర్వాత లేదా మూడవ రోజు తర్వాత మళ్ళీ రక్తం చూసినట్లయితే అది నిఫాస్ రక్తం అవుతుంది లేకుంటే ఋతుక్రమం అవుతుంది.ఇదే విషయాన్ని షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ తీర్మానించారు:వాస్తవాల ప్రకారం రక్తంలో ఎటువంటి సందేహం లేదు, కానీ సందేహం సాపేక్షమైనది, దీనిలో వ్యక్తులు వారి జ్ఞానం మరియు అవగాహన ప్రకారం విభిన్నంగా ఉన్నారు, ఖుర్ఆను మరియు హదీసు వాటిలో ప్రతిదాన్ని స్పష్టం చేస్తుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఎవరికీ రెండుసార్లు ఉపవాసం లేదా రెండుసార్లు ప్రదక్షిణలు చేయడాన్ని విధిగా చేయలేదు, కానీ ఉపవాసంలో లోపం ఉన్నట్లయి ఖజాతో సరిదిద్ద లేకుంటే వేరే విషయం, ఇక మనిషి చేసే పని దానిని శక్తిమేరకు చేస్తాడు అప్పుడు అతని బాధ్యత తీరుతుంది.كما قال تعالى: {لاَ يُكَلِّفُ اللّهُ نَفْسًا إِلاَّ وُسْعَهَا} [البقرة:286]، అల్లాహ్ తఆల సెలవిచ్చాడు:(‘అల్లాహ్, ఏ ప్రాణి పైననూ దాని శక్తికి మించిన భారం వేయడు.)(సూరతుల్ బఖర:286)وقال: {فَاتَّقُوا اللَّهَ مَا اسْتَطَعْتُمْ } [التغابن:16]. అల్లాహ్ సెలవిచ్చాడు:(కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్ యందు భయ-భక్తులు కలిగి ఉండి)ఐదవ వ్యత్యాసం(సంభోగం): రుతుక్రమం మరియు నిఫాస్ సమయంలో: రుతుక్రమ సమయంలో, అలవాటు కంటే ముందు స్త్రీ పరిశుద్దిపొందితే, ఆమె భర్తకు ఎటువంటి అభ్యంతరం లేకుండా సంభోగం చేయడానికి అనుమతించబడుతుంది మరియు నిఫాస్ సమయంలో, స్త్రీ నలభై రోజులలోపు పరిశుద్దిపొందితే ప్రసిద్ధ అభిప్రాయం ప్రకారం, ఆమె భర్త సంభోగం చేయడం మక్రూహ్, కానీ సరైన అభిప్రాయం మేరకు భర్త ఆమెతో సంభోగం చేయవచ్చుఇదియే జమ్హూర్ ఉలమాల అభిప్రాయం.ఎందుకంటే మక్రూ అనేది షరీఆ ఆదేశాలలో ఒకటి, దీనికి షరీఆ ఋజువు అవసరంఈ విషయంలో షరీఅతు ఆధారం ఏది లేదు కానీ ఇమామ్ అహ్మద్ బిన్ హన్బల్ రహిమహుల్లాహ్ ఉస్మాన్ బిన్ అబీ అల్-ఆస్ భార్య గురించి ఉల్లేఖించినది తప్ప, ఆమె నలభై రోజుల ముందు ఉస్మాన్ వద్దకు వచ్చింది అప్పుడు అతను ఇలా అన్నాడు: “నా దగ్గరికి రావద్దు”.ఈ మాట (మకృహ్)అసహ్యవాదనను తప్పనిసరి చేయదు, ఎందుకంటే కొన్నిసార్లు ఇది భర్త తరపు నుండి ముందుజాగ్రత్తగా జరగవచ్చు, భార్య ఇంకా”తుహ్ర్” పొందలేదని లేదా లైంగిక సంపర్కం వల్ల రక్తం కదులుతుందనే భయంతో లేదా అది కాకుండా ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అల్లాహు ఆలము.

ఏడవ అధ్యాయం: ఔషధాల ద్వారా ఋతుస్రావం ఆపడం లేదా జరపడం లేదా ఔషధాల ద్వారా గర్భనిరోధం లేదా గర్భవిచ్చిత్తికి చెందిన ఆదేశాలు.

ఏదైన వస్తువు ఉపయోగిస్తూ స్త్రీ తన ఋతుస్రావం నిరోధించడానికి రెండు షరతులతో అనుమతించబడుతుంది:

మొదటి షరతు: మందులు స్త్రీ ఆరోగ్యానికి హాని కలిగించకూడదు, హాని లేదా అసౌకర్యం గురించి భయం ఉండకూడదు. ఒకవేళ అవి వాడటం వలన హనీ కలుగుతుందంటే మాత్రం అనుమతి లేదు.لقوله تعالى: {وَلاَ تُلْقُواْ بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ } [البقرة:195]، అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:(మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి;)(సూరే బఖర:195){وَلاَ تَقْتُلُواْ أَنفُسَكُمْ إِنَّ اللّهَ كَانَ بِكُمْ رَحِيمًا } [النساء:29]. {మరియు మిమ్మల్ని మీరు హతమార్చుకోకండి’నిశ్చయంగా అల్లాహ్ మీ పై అమితమైన దయగలవాడు }(నిసా:29)

రెండవ షరతు: ఋతుస్రావ నిరోధం భర్తకు సంబంధించినది అయితే భర్త అనుమతి ఉండాలి, ఉదాహరణకు, స్త్రీ తన భర్తతో గడువు కాలంలో ఉంది అప్పుడు తిండి ఖర్చులు భర్తపై విధిగా ఉంటుంది, అప్పుడు స్త్రీ అటువంటి ఔషధం ఉపయోగిస్తుంది, తద్వారా ఆమె గడువు పెరుగుతుంది భర్తపై స్త్రీ నిర్వహణ పెరుగుతుంది అప్పుడు భర్త యొక్క అనుమతి లేకుండా ఋతుక్రమం నిరోధించే ఇలాంటి మందు వాడటానికి అనుమతి లేదు.అదేవిధంగా ఒకవేళ ఋతుక్రమం ఆగడం వల్ల గర్భం అగుతుందని రుజువైతే అలాంటప్పుడు భర్త అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి నిరూపణ జరిగినప్పటికి ఉత్తమం ఏమనగా అవసరానికి మించి మందులు వాడకూడదు ఎందుకంటే అలవాటును యధాతథంగా ఉంచడం వల్ల ఇది ఆరోగ్యాన్నిమితంగా భద్రంగా ఉండటానికి సహకరిస్తుంది.

ఇక ఋతుస్రవించేలా చేసే మందుల వాడకం విషయానికొస్తే ఇది కూడా రెండు షరతులతో అనుమతించబడుతుంది:

మొదటి షరతు ఏమిటంటే: ఒక స్త్రీ వాజిబును నిరోధానికి కారణమయ్యే విధంగా మందులను ఉపయోగించకూడదు. ఉదాహరణకు, ఒక స్త్రీ రంజానులో ఉపవాసం ఉండకూడదనే కారణంతో ఔషధం వాడటం లేదా ఔషధ ఉపయోగం వల్ల నమాజు లేకుండా చేయడం మరియు ఇలాంటి ఇతర సారూప్య విషయాలు.

రెండవ విషయం: భర్త అనుమతితో ఋతుక్రమం వెలువడేలా చేయడం ఎందుకంటే ఋతుస్రావం భర్తను పూర్తిగా ప్రయోజనం పొందకుండా నిరోదిస్తుంది అందుచేత భర్త ఇష్టం లేకుండా అతని హక్కును ఆపే ఇలాంటి వస్తువులు వాడటానికి అనుమతి లేదు,ఒకవేళ ఆమె విడాకులు పొందినదైతే ఋతుక్రమం వెలువడేలా చేయడంలో భర్త రుజూ చేసుకునే హక్కు కలిగి ఉన్నప్పుడు దాన్ని ముగించే విధంగా చేస్తుంది.

గర్భాన్ని నిరోధించే మందులు వాడటంకు సంబంధించి కూడా రెండు రకాలు ఉన్నాయి:

మొదటిది: గర్భాన్ని పూర్తిగా నిరోదించడానికి అనుమతి లేదు, ఎందుకంటే దీనివలన గర్భం పూర్తిగా ముగిసిపోతుంది వంశనిరోధకానికి కారణమవుతుంది,ఇది దైవప్రవక్త ఉద్దేశించిన ఇస్లామీయ సమాజం యొక్క ఆధిక్యతకు విరుద్దమైనది అలాగే ప్రస్తుతం ఉన్న సంతానం కూడా భద్రంగా ఉంటుందనేది కూడా తెలియదు ఒకవేళ ప్రస్తుత సంతానం మరణిస్తే ఆ మహిళ సంతానం లేని విధవగా మిగిలిపోతుంది.

రెండవ రకం: గర్భాన్ని ఒక నిర్ధారిత సమయం వరకు ఆపడం ఉదాహరణకు స్త్రీ అధికంగా పిల్లలు కనేదై ఉంటుంది ఆమెకు గర్భం హానీ కలిగిస్తుంది అలాంటప్పుడు ఆమె రెండు సంవత్సరాలకు ఒకసారి గర్భం వచ్చేలా క్రమబద్దీకరించేలా కోరుకుంటుంది అలాంటప్పుడు ఈ షరతులతో అంటే మొదట భర్త అనుమతి ఇవ్వాలి,రెండు దాని వలన ఆమెకు హానీ జరగకూడదు అనుమతి ఉంటుంది.దీనికి ఆధారం ఏమిటంటే సహాబాలు దైవప్రవక్త కాలంలో తమ భార్యలు గర్భం దాల్చకూడదని అజల్’చేసేవారు ఇలా చేస్తున్నప్పటికి వీరిని ఆపలేదు. అజల్ అంటే భర్త తన భార్యతో రమించేటప్పుడు వీర్యస్కలనానికి ముందు అంగాన్ని స్త్రీ మర్మాంగం నుండి బయటికి తీసి స్కలించడం.

ఇక గర్భస్రావం (అబార్షన్) కోసం మందులు వాడటంకు సంబంధించి కూడా రెండు రకాలు ఉన్నాయి:

మొదటి రకం: గర్భం నిర్వీర్యం చేయు ఉద్దేశం శిశువును తొలగించేదై ఉంటే అదికూడా ఆత్మఊదబడిన తర్వాత అయితే ఎటువంటి సంశయం లేకుండా నిషేధమే ఎందుకంటే ఒక ప్రాణాన్ని అకారణంగా హతమార్చడమవుతుంది ఖుర్ఆను మరియు సున్నతు మరియు ఇజ్మా వెలుగులో ఒక ప్రాణాన్ని హతమార్చడం పూర్తిగా నేషేధం.ఒకవేళ ఇది ఆత్మ ఊదబడటానికి ముందు జరిగితే అనుమతించడంలో ఉలమాలు విభిన్న అభిప్రాయాలు తెలిపారు: కొంతమంది ఉలమాలు దీనికి అనుమతించారు మరికొంతమంది నిరోదించారు మరికొందరు తెలిపారు: ఒకవేళ అలఖ’కాకపోతే అనుమతి ఉంది,ఇంకొందరు మనిషి రూపురేఖలు దాల్చనట్లైతే అనుమతి ఉందని చెప్పారు.

ముందుజాగ్రత్తగా విషయం ఏమిటంటే, అనవసరంగా అబార్షన్ చేసుకోవడం హరాము నిషిద్ధం, ఒక స్త్రీ చాలా అనారోగ్యంతో ఉన్నట్లయి, గర్భం భరించలేకపోతే అబార్షన్ ఆ సమయంలో అనుమతించబడుతుంది. అయితే ఈ గర్భంలో మానవుని రూపురేఖలు దిద్దుకున్న సమయం దాటినట్లైతే గర్భస్రావం ఈ సందర్భంలో నిషేధించబడింది. అల్లాహు ఆలము.

రెండవరకం: అబార్షన్ ద్వారా గర్భంను తొలగించడం ఉద్దేశం కాకూడదు అంటే గర్భం నిండిన తర్వాత మరియు ప్రసవానికి దగ్గరగా చేరిన తర్వాత గర్భం తీయడం. అయితే తల్లీబిడ్డలు క్షేమంగా ఉండి,ఆపరేషన్ అవసరం లేకుండా ఉన్న షరతుతో ఇది అనుమతించబడుతుంది. ఒకవేళ ఆపరేషన్ అవసరం పడితే అది నాలుగు రకాల స్థితి ఉంటుంది:

మొదటి స్థితి: తల్లీబిడ్డలు ఇద్దరు ప్రాణాలతో ఉంటే అనవసరంగా ఆపరేషనుకు అనుమతి లేదు అంటే ప్రసవం డెలివరీ కష్టంగా మారి ఆపరేషన్ అవసరం పడుతుంది ఇలా ఎందుకంటే దేహం ఆమె వద్ద ఒక అమానతు కనుక మనిషి ఒక పెద్ద కారణం లేకుండా దానిలో మార్పులు చేయకూడదు,(ఆపరేషన్ అనుమతించబడకపోవడానికి ఇంకో కారణం) కొన్ని సార్లు మనిషి ఆపరేషన్ వలన నష్టం కాదని అనుకుంటాడు కానీ నష్టం జరుగుతుంది.

రెండవ స్థితి: తల్లి బిడ్డ ఇద్దరు చనిపోతారు అలాంటప్పుడు ఆపరేషన్ చేసి బిడ్డను తీయడానికి అనుమతి ఉంది.ఎందుకంటే దానివలన ఎలాంటి ప్రయోజనం లేదు.

మూడవ స్థితిలో తల్లి ప్రాణాలతో ఉండి బిడ్డ ప్రాణాలు కోల్పోతుంది అలాంటప్పుడు తల్లికి హానీ జరుగుతుందనే భయం ఉన్నట్లయితే ఆపరేషన్ చేసి బిడ్డను తీయవచ్చు, ఎందుకంటే బిడ్డ చనిపోయాక ఆపరేషన్ లేకుండా బయటికి తీయలేమని స్పష్టంగా అర్ధమవుతుంది ఈ గర్భం తల్లి కడుపులో ఉండటం వలన భవిష్యత్తులో గర్భం దాల్చకుండా ఆపుతుంది దానివలన ఆమెకు హానీ జరుగుతుంది కొన్నిసార్లు మునుపటి భర్త యొక్క ఇద్దతులో ఉండటం వలన తర్వాత భర్త లేకుండా ఉండిపోవలసివస్తుంది. అల్లాహు ఆలము

నాల్గవ స్థితి: తల్లి చనిపోయి బిడ్డ ప్రాణాలతో ఉంటుంది ఒకవేళ బిడ్డ ప్రాణాలతో బయటికి తీయలేమనే నమ్మకం కలిగితే ఆపరేషన్ చేయడానికి అనుమతి లేదు.

ఒకవేళ బిడ్డను ప్రాణాలతో రక్షించగలం అనే నమ్మకం ఉంది, బిడ్డ సగం బయటికి వచ్చి మిగతా సగంను బయటికి తీయడానికి తల్లి కడుపును చీరవచ్చు ఒకవేళ బిడ్డ కొంచం కూడా బయటికి రానట్లైతే మా సహచరులు చెప్పిన ప్రకారం ‘గర్భాన్ని తీయడానికి తల్లి కడుపును చీరబడదు ఎందుకంటే ఇది ‘ముస్లా’అవుతుంది. చూడబోతే ప్రామాణిక అభిప్రాయం ఏమనగా ఆపరేషన్ లేకుండా బిడ్డను తీయడం అసాధ్యమైన పక్షంలో తల్లి కడుపు ఆపరేషన్ చేయబడుతుంది.దీనినే ఇబ్ను హుబైర ఎంచుకున్నారు, అల్ ఇన్సాఫ్’లో తెలిపారు:ఇదియే ఉత్తమం.నేను చెప్పేది ఏమిటంటే మరీ ముఖ్యంగా మన ఈ కాలంలో ఇది ఇంకా ఉత్తమం ఎందుకంటే ఆపరేషన్ అనునది ముస్లా’కాదు. ఎందుకంటే కడుపు ఆపరేషన్ చేసి తిరిగి దానిని కుట్టడం జరుగుతుంది అంతేకాదు ఒక సజీవి పవిత్రత నిర్జీవి పవిత్రత కంటే చాలా ఎక్కువ. మరియు అమాయకుడిని వినాశనం నుండి కాపాడటం విధి గర్భం కూడా ఒక అమాయక మనిషే కనుక దానిని కాపాడటం వాజిబు విధి అవుతుంది.అల్లాహ్ సర్వం తెలిసినవాడు.

గమనిక: పైన అనుమతిస్తూ ప్రస్తావించిన అబార్షను స్థితులలో తప్పనిసరిగా ఆమె భర్త యొక్క అనుమతి తీసుకోవాలి.

ఇక్కడికి ఈ అంశంలో నేను వ్రాయాలని కోరుకున్న ముఖ్యమైన విషయాలు ముగిసాయి. ఇందులో మేము సమస్యలను వాటి జాబితాలు, సూత్రాలతో పరిమితం చేశాము, లేకపోతే ఈ సమస్యల యొక్క శాఖలు, వివరాలు మరియు ఈ విషయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు తీరంలేని సముద్రం వంటివి.కానీ వివేకి, తెలివైన వ్యక్తి శాఖలను మూలాల వైపుకు, జుజ్’యీ విషయాలను కుల్లీ విషయాల వైపుకు చేర్చగల శక్తి కలిగి ఉంటాడు, మరియు విషయాలను వాస్తవాల ఆధారంగా ఖియాసు చేయగల సమర్ధత కలిగి ఉంటాడు.ఒక ముఫ్తీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు సృష్టిజీవుల మధ్య ప్రవక్తల సత్యసందేశాన్నివివరించడానికి, తెలియజేయడానికి ఒక దూత మరియు మార్గం అని తెలుసుకోవాలి. ఖుర్ఆను మరియు సున్నతులో ప్రస్తావించబడిన విషయాలకు అతను ఒక భాద్యుడు,జవాబుదారీ అని తెలుసుకోవాలి, ఎందుకంటే ఖుర్ఆను మరియు సున్నతు షరీఆ యొక్క మూలాలు వీటిని అర్థంచేసుకోవాలని మరియు అనుసరిస్తూ కట్టుబడి ఉండాలని దాసుడిని కోరబడినది.ఖుర్ఆను మరియు సున్నతుకు విరుద్ధమైన ప్రతిదీ తప్పు, దానిని చెప్పేవ్యక్తికి జవాబు ఇవ్వడం తప్పనిసరి,దానిని అనుసరించడానికి అనుమతించబడదు. ఒకవేళ అతను అసహాయకుడు ముజ్తహిద్ అయితే అతనికి తన పరిశ్రమ ఫలితం దక్కుతుంది, కానీ అతని తప్పు గుర్తించిన రెండవ వ్యక్తి మాత్రం అతని ఫత్వాను స్వీకరించడానికి అనుమతించబడదు.

ఒక ముఫ్తీ ఖచ్చితంగా అల్లాహ్ ప్రీతి ప్రసన్నతలు పొందటం కోసం తన నియ్యతును శుద్ధిచేసుకోవాలి మరియు అన్ని రకాల ఆపదలు, ఘటనలలో అల్లాహ్’తో మాత్రమే సహాయం కోరాలి, సంస్కరణ నిమిత్తం అల్లాహ్ తో దృఢత్వం,సౌభాగ్యం వేడుకోవడం అతనిపై విధిగా ఉంది.

మరియు అతను ఖుర్ఆను మరియు సున్నతులో వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోవాలి,వాటిలో ఆద్యాయనం చేసి పరిశోదించాలి లేదా ఆ విషయంగా వాటిని అర్థం చేసుకోవడానికి పండితుల మాటలను వారి అవగాహన ప్రకారంగా గ్రహించడం అతనిపై తప్పనిసరి.

తరుచుగా జరిగే విషయం ఏమిటంటే ఏదో ఒకసమస్య ఏర్పడుతుంది మనిషి ధార్మిక విజ్ఞులు చెప్పిన మాటల వెలుగులో శక్తిమేరకు ఉత్తమంగా సమస్యల పరిష్కారం శోదిస్తాడు, అప్పుడు అతనికి సంతృప్తి కలిగించే పరిష్కారం గురించి ఎటువంటి రుజువు కనిపించదు,కొన్నిసార్లు ఈ సమస్యల గురించి అతనికి ఎటువంటి ప్రస్తావన దొరకదు.ఎప్పుడైతే అతను ఖుర్ఆను మరియు సున్నతు వైపుకు తిరిగుతాడో వెంటనే ఆ సమస్య యొక్క ఆదేశం దాదాపుగా అర్థమవుతుంది. ఇది చిత్తశుద్ధి, జ్ఞానం మరియు అవగాహన ప్రకారంగా ఉంటుంది.

మరియు ముఫ్తీ సందేహంలో ఉన్నప్పుడు తీర్పు కోసం వేచి ఉండాలి ఒక ముఫ్తీ సమస్యలు తలెత్తినప్పుడు ఆదేశాలు జారీచేయడంలో విధిగా ఆలస్యం చేయాలి త్వరపడకుండా ఉండాలి ఎన్నో సమస్యల్లో ఆదేశాలు జారీచేయడంలో ముఫ్తీలు తొందరపడతారు పిదప ఆలోచన తర్వాత తను ఆ సమస్య ఆదేశంలో తప్పుచేశామని గుర్తిస్తారు, పిమ్మట వారు సిగ్గుతో పశ్చాత్తాప పడతారు మరికొన్ని సందర్భాలలో తాము ఇచ్చిన ఆ తప్పుడు ఫత్వాను సరిదిద్దుకునే శక్తి మరియు అవకాశం కూడా ఉండదు.

ముఫ్తీలో సత్యాన్వేషణ,సహనం, సౌమ్యత మరియు గంభీరత వంటి లక్షణాలను ప్రజలు గుర్తించినప్పుడు, వారు అతని మాటలను నమ్ముతారు, అతని మాటలను విశ్వసిస్తారు. మరియు ప్రజలు ముఫ్తీలో త్వరపడటం, తప్పుచేయడం వంటి లక్షణాలను చూసినప్పుడు అతను ప్రశ్నలకు ఇచ్చే ఫత్వాని నమ్మరు,కాబట్టి ముఫ్తీ తన తొందరపాటు మరియు తప్పుల కారణంగా తనను మరియు ప్రజలను తన వద్దనున్న జ్ఞానంను కోల్పోయేలా చేస్తాడు.

అల్లాహ్ మమ్మల్ని,మా ముస్లిం సోదరులను సరళమైన ఋజుమార్గంలో నడిపించమని తన ప్రత్యేక కృప ద్వారా మమ్మల్ని అతని బాధ్యతలోకి తీసుకోవాలని దుఆ చేస్తున్నాము ఇంకా తన కృపానుగ్రహాలతో పాపం చేయకుండా మమ్మల్ని రక్షించమని అల్లాహ్ తఆలాను వేడుకుంటున్నాము.నిశ్చయంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, గౌరవప్రదుడు, మరియు అల్లాహ్ యొక్క శాంతి శుభాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంపై ఆయన కుటుంబీకులపై, సహచరులందరిపై కురియుగాక!సర్వప్రశంసలు పొగడ్తలు కేవలం అల్లాహ్’కు మాత్రమే చెందుతాయి ఆయన అనుగ్రహభాగ్యం వలన ఈ పుణ్యకార్యం ముగింపుకు చేరుకుంది.

సంకలనం: ముహమ్మద్ అస్సాలిహ్ అల్ ఉసైమీన్
జుమా రోజున జుహా సమయం: 14 వ షాబాన్,1392 హిజ్రీ సంవత్సరం