ఉసూలె సలాస (త్రి సూత్రాలు): పార్ట్ 1 – షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ [వీడియో]

బిస్మిల్లాహ్

[43:50 నిముషాలు]
ఉసూలె సలాసహ్ : త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – పార్ట్ 1
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ హఫిజహుల్లాహ్

ఈ వీడియో పాఠాలు క్రింది పుస్తకం ఆధారంగా వివరించబడ్డాయి:
ఉసూలె సలాస (త్రి సూత్రాలు) [పుస్తకం] [మర్కజ్ దారుల్ బిర్ర్]

[ఈ వీడియోలో చెప్పబడిన బుక్ విషయాలు మీ సౌలభ్యం కోసం క్రింద ఇస్తున్నాము. వీడియో వింటూ క్రింది టెక్స్ట్ ఫాలో కండి]

త్రిసూత్రాలు

  1. నీ ప్రభువు ఎవరు? 2. నీ ధర్మం ఏది? 3. నీ ప్రవక్త ఎవరు?

కూర్పు : ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ (రహిమహుల్లాహ్)
అనువాదం : హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమరి M.A.

మనవి

పరలోక సాఫల్యం పొందాలంటే ఇహలోకంలో విశ్వాసాల పునాదులు పటిష్టంగా ఉండాలి. మన కర్మలు ఆ పునాదులపై ఆధారపడి వుంటాయి. అందువలన విశ్వాసాల పటిష్టతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా దీని పై శ్రద్ధ వహించని వారి శాతమే ఎక్కువ. అనువదించబడిన ఈ పుస్తకం విశ్వాసాల పటిష్టతకు ఒక మైలురాయి.

పాఠకులారా…

12వ శతాబ్దము నాటికి ముస్లింల ధార్మిక జీవనశైలి చెదిరిపోయింది. ఏధర్మం మూలంగా వారికి సన్మార్గము లభించిందో ఆదే ధర్మంలో షైతాన్ తన సమూహంతో విశ్వాసాల రూపురేఖలను మార్చి ముస్లింల హృదయాలను అనాచారాల (ఇస్లాం అనుసరణాచారాలకు వ్యతిరేకంగా) కు లోబరుచుకున్నాడు. పుణ్యాత్ములను ఆరాధించటం, సమాధులను దర్శించటం (ప్రార్ధించడం), వేడు కోవటం, బలిదానాలు చేయటం, మొక్కు తీర్చటం, లేని పక్షంలో వారి ప్రతాపానికి గురి అయ్యేభయం, తాయత్తుల మహిమలు, దైవ సందేశహరుల విలువలను అగౌరవ పర్చటం, ఇష్టానుసారంగా దిద్దుకున్న ఆచారాలను ఇస్లాం ధర్మంలో కల్పితంచేసి ప్రజలను వక్రమార్గానికి మళ్ళించటం జరిగింది.

ఈ తరుణంలో ఇస్లాం ధార్మిక వాస్తవ రూపురేఖలను వెలికి తీసి ప్రజలకు సన్మార్గం చూపించటానికి అహోరాత్రులు శ్రమించిన వ్యక్తి… “ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్”.

‘ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ హిజ్ర శకం 1115 సంవత్సరంలో “నజ్ద్ ” దేశంలోని “ఉయ్యైనా” పట్టణంలో జన్మించారు. నాడు విద్యా, జ్ఞానాలకు నెలవుగా గుర్తింపు పొందిన ‘బసర’ నగరానికి పయనించి విద్యా విజ్ఞాలలో ప్రావీణ్యం పొందారు. ధర్మప్రచారానికి నడుం బిగించిన సందర్భములో ” ముహమ్మద్ బిన్ సఊద్ ” వెన్నుతట్టి తన వంతు సహాయాన్ని అందించారు. అనతి కాలంలోనే ఈ ప్రచారం విసృతమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

మీ ముందు వున్న ఈ చిరు పుస్తకం “అల్ ఉసూలు స్సలాసతి వ అదిల్లతిహా” అనే పేరుతో అరేబియా (అరబ్బి) భాషలో లిఖించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లో అనువాదం చేసి ప్రచురించడం జరిగింది. దీని వలన ఎంతో మంది ప్రజలు ‘షిర్క్’ (బహుదైవరాధన), ‘బిద్అత్’లను విడనాడి అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపపడి సన్మార్గము వైపుకు మళ్ళారు. ఇదే సంకల్పముతో దీనిని తెలుగుభాషలో అనువదించటం జరిగింది. దీని లోని ముఖ్యాంశం ఏమిటంటే మరణాంతరం సమాధిలో ప్రతి మానవునికి (విశ్వాసి, అవిశ్వాసి తేడా లేకుండా) ఈ 3 ప్రశ్నలు ప్రశ్నించబడతాయి.

  1. నీ ఆరాధ్య దేవుడు ఎవరు?
  2. నీ ధర్మం ఏది?
  3. నీ ప్రవక్త ఎవరు?

పై ప్రశ్నలకు ఏ అల్ప విశ్వాసము కలిగియున్న వ్యక్తి కూడా జవాబు ఇవ్వగలడు. ఇందుకు సంబంధించి మనలో చోటుచేసుకున్న కలుషితమైన విశ్వాసాలను దైవగ్రంధము పవిత్ర ఖుర్ఆన్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుల ఆధారంగా అసత్య, అవాస్తవ విశ్వాసాలను బహిర్గతం చేయడం జరిగింది.

అంతే కాకుండా ధర్మానికి సంబంధించి ఏ అంశమైనా సాక్ష్యాధారాలతోనే అంగీకరించాలనే గీటురాయి కల్పించబడింది. ఈ మహోన్నత పుస్తకాన్ని తెలుగుభాషలో అనువదించే భాగ్యాన్ని కల్పించిన అల్లాహ్ కు సర్వత్రా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అందరికి దీని ప్రయోజనం చేకూరాలని కోరుకుంటున్నాను. తద్వార ఖుర్ఆన్, హదీసు ప్రకారంగా మన జీవితం మెరుగు పడాలని, మరణాంతరం సమాధిలో సరైన జవాబులు ఇచ్చే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

ఈ పుస్తక అనువాదానికి, ప్రచురణకు పాలు పంచుకున్న అనేకులకు అల్లాహ్ వారి పుణ్యకర్మలను అంగీకరించి ఇహపరలోకాల్లో మంచి ఫలితం ప్రసాదించాలని ప్రార్ధించుచున్నాను…ఆమీన్.

ధార్మిక సేవలో……….
హాఫిజ్ అబ్దుల్ గఫ్ఫార్ ఉమ్రి, M.A.
తెలుగు అనువాదకులు మర్కజుల్ హిదాయ, బహ్రన్.


అనంతకరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో…

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు

పాఠకులారా…

అల్లాహ్ మీ పై కరుణించుగాక..! ఇది బాగా గుర్తు పెట్టుకో వలసిన విషయం. నాల్గు విషయాల గురించి జ్ఞానము పొందుట, అవగాహన చేసుకొనుట మనపై విధించబడి ఉన్న విధి.

మొదటి విషయం :విద్యా భ్యాసన

అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఇస్లాం ధర్మం గురించి ఆధారాలతో అవగాహన చేసుకొనుట.

రెండవ విషయం : ఆచరణ

విద్యాభ్యాసనతో అవగాహన చేసుకొన్న దానిని ఆచరించుట.

మూడవ విషయం : ఆహ్వానం, ప్రచారం

ఇస్లాం ధర్మం వైపునకు ఇతరులను ఆహ్వానించుట. నాలుగో విషయం : ఓర్పు, సహనం
ధర్మ ప్రచారంలో ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలపై ఓర్పు, సహనంతో స్థిరంగా ఉండుట.

పై నాలుగు అంశాలకు ఆధారం పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా పేర్కొంటున్నాడు:

وَالْعَصْرِ  إِنَّ الْإِنسَانَ لَفِي خُسْرٍ إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَتَوَاصَوْا بِالْحَقِّ وَتَوَاصَوْا بِالصَّبْرِ

కాలం సాక్షిగా..! నిస్సందేహంగా మానవుడు నష్టములోపడివున్నాడు. కాని ఎవరైతే విశ్వసించి, సత్కార్యములు చేస్తూ వుంటారో, మరియు పరస్పరం సత్యోపదేశం, సహనబోధన చేసుకుంటారో వారు తప్ప“. (అల్ అఫ్ 103: 1-3)

ఇమాం ‘షాఫయి’ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పవిత్ర సూర గురించి ఇలా పేర్కొన్నారు:

అల్లాహ్ మానవ సృష్టి పై తన వాగ్దాన ప్రకారం, ఈ ఒక్క సూరానే అవతరింపజేసి ఉంటే, అది వారి సన్మార్గమునకు సరిపోయేది.”

ఇమాం ‘బుఖారి’ (రహ్మతుల్లాహి అలైహి) తన ‘సహిహ్ బుఖారి’ గ్రంధములో ఒక అధ్యాయాన్ని ఈ విధంగా ఆరంభం చేశారు.

“మాట, బాటకు ముందు జ్ఞానం’ (సంబంధిత జ్ఞానాన్ని సేకరించుట, పొందుట)

దీనికి ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనమే :

فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ

తెలుసుకోండి..! అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యదేవుడు లేదు. మరియు మీరు మీ పాపాలకు క్షమాపణ కోరుతూవుండండి”. (ముహమ్మద్ 47:19) |

فبدأ بالعلم.

కనుక ఇందులో అల్లాహ్ మాట, బాటకు ముందు జ్ఞాన ప్రస్తావన చేశాడు.

పాఠకులారా..

అల్లాహ్ మీ పై కరుణించుగాక.. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయమే. క్రింద పేర్కొనబడే మూడు సమస్యల జ్ఞానం పొందుట, దానిని ఆచరించుట, ప్రతి ముస్లిం (స్త్రీ, పురుషుని) పై విధించబడిన విధి.

మొదటి సమస్య:

అల్లాహ్ యే మనల్ని సృష్టించి, ఉపాధి కల్పించాడు. మరి మాకు అనవసరంగా ఇలాగే వదిలి పెట్టలేదు. తన ప్రవక్తను (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మా మార్గదర్శనం కోసం మావైపు పంపిచాడు. ఆయనకు విధేయత చూపిన వారు స్వర్గ వాసులవుతారు. ఆయన ఆజ్ఞను తిరస్కరించిన వారు నరక వాసులవుతారు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّا أَرْسَلْنَا إِلَيْكُمْ رَسُولًا شَاهِدًا عَلَيْكُمْ كَمَا أَرْسَلْنَا إِلَىٰ فِرْعَوْنَ رَسُولًا فَعَصَىٰ فِرْعَوْنُ الرَّسُولَ فَأَخَذْنَاهُ أَخْذًا وَبِيلًا

మీ వద్దకు అలాగే ఒక ప్రవక్తను సాక్ష్యంగా చేసి పంపాము, ఎలాగైతే మేము ‘ఫిరౌన్’ వద్దకు ప్రవక్తను పంపాము, కాని ఫిరౌన్ ఆ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతనిని కఠినంగా శిక్షించాము”. (అల్ ముజ్జమ్మిల్ 73:15-16)

రెండవ సమస్య:

అల్లాహ్ కు తన ఆరాధనలో మరెవరినీ సాటి కల్పించడాన్ని ముమ్మాటికి సహించడు. (ప్రఖ్యాత దైవ దూతలు, ప్రవక్తలైనా సరే) అల్లాహ్ ఇలా ప్రవచిస్తున్నాడు:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ కొరకే (ప్రత్యేకించబడ్డాయి). కనుక అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి”. (జిన్‌ 72:18)

మూడవ సమస్య:

ఎవరైతే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరించి విధేయత చూపుతూ, అల్లాహ్ ఏకత్వాన్ని కూడ అంగీకరిస్తారో వారికి అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పట్ల శతృత్వం వహించే వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొనుట ఏ మాత్రం తగని విషయం. ఒకవేళ వారు ఇహలోకపరంగా అతి సమీప బంధువులైన సరె. ఇందుకు ఆధారం అల్లాహ్ పేర్కొన్న ఈ వచనం:

لَّا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُم بِرُوحٍ مِّنْهُ

అల్లాహ్ ను పరలోకాన్ని విశ్వసించే వారు, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించే వారు, వారి తల్లితండ్రులైనా,వారి కుమారులైనా,వారి సోదరులైనా సరె. లేదా వారి కుటుంబీకులైన సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు.తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి, వారికి బలాన్నిచ్చాడు. ఆయన వారిని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు.ఆ వనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు, వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్తా! అల్లాహ్ షక్షం వారే సఫలీకృతులయ్యే వారు”.(అల్ ముజాదలహ్ 58:22)

పాఠకులారా..

అల్లాహ్ మీకు సన్మార్గాన్ని అనుసరింపచేయు గాక. ఈ విషయాన్ని కూడ బాగా అర్ధం చేసుకోండి. అదేమిటంటే “హనఫీయ్యత్, మిల్లతె ఇబ్రాహీమి” అంటే, మీరు చిత్తశుద్ధితో సంపూర్ణముగా కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. ఈ కార్యాన్ని గురించే అల్లాహ్ అందరిని ఆజ్ఞాపించాడు. దీని కోసమే మానవుడిని సృష్టించాడు. అల్లాహ్ తన గ్రంధంలో పేర్కొన్నాడు.

నేను సృష్టించలేదు జిన్నాతులను, మానవులను, కాని నా ఆరాధనకు (తప్ప)”. (అజ్జారియాత్ 51:56)

య’బుదూన్” అనే పదానికి అర్ధం: నా ఏకత్వాన్ని మనసార అంగీకరించండి.

అల్లాహ్ ప్రస్తావించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధానమైన, ఉన్నతమైన ఆజ్ఞ “తౌహీద్” అన్ని విధాల ఆరాధనలు ఏకైక అల్లాహ్ కొరకే అర్పించుటకు మారు పేరు. మరి అల్లాహ్ నిర్మూలించిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ప్రధాన మైనది “షిర్క్” అల్లాహ్ యేతరులను మన ఆశలను, కోరికలను నెరవేర్చటానికి పిల్చేందుకు అతని భాగస్వామిగా కల్పేందుకు మారు పేరు.

అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నడు:

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

మరియు మీరందరూ అల్లాహ్ ని ఆరాధించండి, మరి అతనితో ఎవరినీ సాటి కల్పించకండి”. (అన్నిసా 04:36)


బిస్మిల్లా హిర్రహ్మాన్ నిర్రహీం

ధర్మ అవగాహనకు అవశ్యకమైన త్రిసూత్రాలు

ప్రతి మానవుడికి ఏ 3 సూత్రాల అవగాహన అవసరం అని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా చెప్పండి:

  1. ప్రతి వ్యక్తి తన ప్రభువు గురించి అవగాహన పొందడం.
  2. తన ధర్మం (దీన్) గురించి అవగాహన పొందడం.
  3. తన ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లం) గురించి అవగాహన పొందడం.

ప్రధమ సూత్రం:

విశ్వప్రభువైన అల్లాహ్ గురించి అవగాహన

మీ ప్రభువు ఎవరని వివరంగా అడిగినప్పుడు చెప్పండి”నా ప్రభువు అల్లాహ్! ఆయనే తన దయ, కృషితో నన్నూ మరియు ఈ సర్వలోకాన్ని పోషిస్తున్నాడు. ఆయనే నాఆరాధ్యదేవుడు. ఆయన తప్ప మరోక ఆరాధ్యదేవుడు లేడు. ఆయనే విశ్వపోషకుడు. ఆయనే ఆరాధ్య దైవం ఇలా చెప్పటానికి దైవ గ్రంధంలో ఆధారం చూడండి :

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
సర్వపొగడ్తలు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కొరకే”. (అల్ ఫాతిహ 01 :02)

అల్లాహ్ తప్ప లోకంలోని సర్వమూ (ప్రతి వస్తువు) సృష్టియే. నేను ఆ సృష్టిలో ఒకణ్ణి.

మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు? దేనిద్వార కనుగొన్నారు? అని అడిగినప్పుడు “ఆయన నిదర్శపూరితమైన చిహ్నాలతో, అనేక రకమైన సృష్టితాలతో కనుగొన్నాము” అని చెప్పండి.

ఆయన నిదర్శనాల్లో: రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి.
ఆయన సృష్టితాల్లో : సప్తభూములు, సప్త ఆకాశాలు, ఆరెండింటి మధ్యలో ఉన్న సర్వమూ (ప్రతీది) కూడ.

అల్లాహ్ చిహ్నాల గురించి ఆధారాలు :

అల్లాహ్ తన పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో ఇలా తెలుపుతున్నాడు:

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు,అయన (అల్లాహ్) చిహ్నాల్లోనివే, మీరు సూర్యునికి, చంద్రునికి ఆరాధించకండి (సాష్టాంగం చేయకండి). మీరు ఆరాధించేవారైతే వాటిని సృష్టించిన అల్లాహ్ ను అరాధించండి (సాష్టాంగం చేయండి).” (ఫుస్సిలత్ 41:37)

అల్లాహ్ తన సృష్టి గురించి పవిత్ర ఖుర్ఆన్లో ఇలా సెలవిస్తున్నాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

వాస్తవానికి మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయనే భూమ్యాకాశాలను ఆరు రోజులలో సృష్టించాడు తదనంతరం తన సింహాసనం (అర్ప్)ను అధిష్టించాడు. ఆయనే రాత్రిని పగలుపై కప్పుతున్నాడు, మళ్ళీ పగలుని రాత్రి వెంట పరుగులు తీయిస్తున్నాడు.ఆయనే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మరియు నక్షత్రాలను సృష్టించాడు. అన్ని ఆయన ఆజ్ఞకే లోబడి ఉన్నాయి. గుర్తుంచుకొండి. సృష్టించడం, ఆజ్ఞాపించడం ఆయనకే చెల్లుతుంది. శుభాలుకలవాడు అల్లాహ్ యే, ఆయనే సర్వలోకాలకు ప్రభువు”. (అల్ ఆరాఫ్ 7: 54)

సర్వలోకానికి పోషకుడైన ఆయనే (అల్లాహ్) ఆరాధనకు అర్హుడని దైవ గ్రంధం ఖుర్ఆన్లో ఇలా చెప్పబడింది:

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ

ఓ మానవులారా..! మీరు ఆ (సత్య) ప్రభువునే ఆరాధించండి ఎవరైతే మీకంటే ముందు మీ పూర్వికుల్ని సృష్టించాడో, దాని ఫలితంగా బహుశ మీరు నరకాగ్ని నుండి విముక్తి పొందగలరు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. మరియు పైనుండి వర్షాన్ని కురిపించాడు. దాని ద్వారా రకరకాల పండ్లను సృష్టించాడు. వాటిని మీ కొరకు ఆహారంగా ప్రసాదించాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూ కూడ మీరు (ఇతరులను) అల్లాహ్ కు సహవర్తిత్వం కల్పించకండి”. (అల్ బఖర 2:21-22)

ఇమామ్ ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఈ వచనానికి తాత్పర్యం ఇలా తెలిపారు:

పైన పేర్కొన్న వాటిని సృష్టించినవాడే అన్ని రకాల పూజలకు అసలైన అర్హుడు” (తఫ్సీర్ ఇబ్నె కసీర్)

గమనిక : అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం చేయవలసిన ఆరాధనల పేర్లను ముందుగా అరబి వ్యాఖ్యాలతోనే పేర్కొని తరువాత క్లుప్తంగా దాని వివరణ ఇవ్వటం జరిగంది. క్రింది వాటిని గమనిచండి.

అరబి నామాలు (ఆరాధనల పేర్లు)

ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్, దుఆ, ఖాఫ్, తవక్కుల్, ఖుషూ, ఇస్తిఆనత్, రఘ్-బత్ , ఖషియత్, ఇస్తి ఆజహ్, ఖుర్బాని, ఉమ్మీద్ వ రజా, రహ్బత్, రుజూ, జబహ్ఇ, ఇస్తిఘాసహ్, నజర్ వ మిన్నత్ మొదలైనవి.

పై ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కే పరిమితం. వీటి గురించి దైవ గ్రంధం ఖుర్ఆన్ లోని ఈ ఆయత్ లో ప్రస్తావన జరిగింది:

وَأَنَّ الْمَسَاجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا مَعَ اللَّهِ أَحَدًا

నిస్సందేహంగా మసీదులు అల్లాహ్ (ప్రార్ధన) కొరకే ఉన్నాయి. అందులో అల్లాహ్ తో పాటు మరెవరినీ పిలవకండి“. (అల్ జిన్న్ 72 :18)

పైన పేర్కొన్న ఆరాధనలను ఎవరైన అల్లాహ్ కొరకు కాకుండా మరెవరి కొరకైన చేస్తే అతను ముష్రిక్, మరియు అవిశ్వాసి అవుతాడు. దీనికై పవిత్ర గ్రంధం ఖుర్ఆన్లో ఈ ఆయత్ ని గమనించండి:

وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ

ఎవరైనా అల్లాహ్ తో పాటు వేరే దైవాన్ని పిలిస్తే (అప్పటికి) అతని వద్ద అలా పిలవటానికి ఎటువంటి ప్రమాణికం (సూచిక) లేదు. అలాంటి వ్యక్తి లెక్క అల్లాహ్ పై ఉన్నది. నిస్సందేహంగా అవిశ్వాసులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు”. (అల్ మొమినూన్ 23:117)

గమనిక :

పైన పేర్కొనబడిన అరబి నామాలను వివరిస్తూ, అవన్నీ ఆరాధనలకు చెందుతాయని చెప్పటానికి తగు ఆధారములు ఖుర్ఆన్ గ్రంధము, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సున్నత్ల నుండి పేర్కొనడం జరిగింది గమనించండి

ఫిఖ్ హ్ (శుద్ధి,నమాజు) – పార్ట్ 02: మల మూత్ర విసర్జన పద్ధతులు [వీడియో]

బిస్మిల్లాహ్

[48:57 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: మల మూత్ర విసర్జన పద్ధతులు

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

మలమూత్ర విసర్జన:

మలమూత్ర విసర్జన పద్దతులు ఇలా ఉన్నాయి:

1- మరుగుదొడ్డిలో ఎడమ కాలుతో ప్రవేశిస్తూ, ప్రవేశముకు ముందే చదవాలి:

బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి

بسم الله اَللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْـخُبُثِ وَالْـخَبَائِثِ

(అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నేను దుష్ట జిన్నాతు స్త్రీ పురుషుల నుండి నీ శరణు జొచ్చుచున్నాను).
(బుఖారి 142, ముస్లిం 375).

మరుగుదొడ్డి నుండి కుడి కాలు ముందు వేస్తూ బయటకు వచ్చి చదవాలి:

గుఫ్రానక
غُفْرَانَكَ  
నీ మన్నింపుకై అర్థిస్తున్నాను. (తిర్మిజి 7).

2- అల్లాహ్ పేరుగల ఏ వస్తువూ మరుగుదొడ్డిలోకి తీసుకెళ్ళకూడదు. కాని దాన్ని తీసి పెట్టడంలో ఏదైనా నష్టం ఉంటే వెంట తీసుకెళ్ళవచ్చును.

3- ఎడారి ప్రదేశంలో కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఖిబ్లా వైపున ముఖము, వీపు గానీ పెట్టి కూర్చోకూడదు. నాలుగు గోడల మధ్య కూడా మంచిది కాదు కాని అభ్యంతరము లేదు. 

4- సతర్ పరిధిలోకి వచ్చే శరీర భాగాన్ని ప్రజల

చూపులకు మరుగు పరచాలి. ఇందులో ఏ కొంచ మైనా అశ్రద్ధ వహించకూడదు. పురుషుల సతర్ నాభి నుండి మోకాళ్ళ వరకు. స్త్రీ యొక్క పూర్తి శరీరం, నమాజులో కేవలం ముఖము తప్ప. స్త్రీ నమాజులో ఉన్నప్పుడు పరపురుషులు ఎదురౌతే ముఖముపై ముసుగు వేసుకోవాలి.

5- శరీరం లేక దుస్తులపై మలమూత్ర తుంపరులు పడకుండా జాగ్రత్త వహించాలి.

6- మలమూత్ర విసర్జన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు నజాసత్ మర్కలను దూరము చేయుటకు రాళ్ళు, కాగితము లాంటివి ఉపయోగించవచ్చును. పరిశుభ్రత కొరకు ఎడమ చెయ్యి మాత్రమే ఉపయోగించాలి.

ప్రశ్నలు & సమాధానాలు (Q&A) – మల మూత్ర విసర్జన పద్ధతులు

[29:11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన వీడియో పాఠాలు

అపానవాయువు (గ్యాస్, గాలి వెళ్లడం,పిత్తు) వెళ్లిందో లేదో అన్న డౌట్ (సందేహం) ఉంటే ఏమి చేయాలి? [వీడియో]

బిస్మిల్లాహ్

[3:06 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఫిఖ్ హ్ (తహారా,శుద్ధి – నమాజు) – పార్ట్ 01 [వీడియో]

బిస్మిల్లాహ్

[51:22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అంశాలు: పరిశుభ్రత, అపరిశుభ్రత, నజాసత్‌ (అశుద్దత) రకాలు, నజాసత్‌ (అశుద్దత) ఆదేశాలు

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

శుచి శుభ్రత ఆదేశాలు

పరిశుభ్రత మరియు అపరిశుభ్రత

‘నజాసత్’ అంటేమిటి? దేనితోనయితే ఒక ముస్లిం దూరంగా ఉండి, అది ఏ చోటనైనా అంటినచో కడుగుట విధిగా ఉందో దానినే ‘నజాసత్’ (అశుధ్ధత) అంటారు. రక్తం లాంటి కనబడే మలినమేదైనా శరీరానికి లేదా బట్టలకు అంటినచో దానిని కడుగుట తప్పనిసరి. కడిగిన తర్వాత దాని మర్క కనబడితే, అది తొలగడం కూడా కష్టంగా ఉంటే పాపం లేదు. ఒక వేళ మలినం కానరానిదై ఉంటే దాన్ని ఒక్కసారి కడిగినా సరిపోతుంది.

ఇక నేలపై ఏదైనా మలినం పడిపోతే అక్కడ నీళ్ళు పారబోస్తే అది శుభ్రమవుతుంది. మలినం పలుచగా పారునటువంటిదైతే అది ఎండిపోయిన- చో నేల పరిశుభ్రమవుతుంది. ఒక వేళ పారనిదిగా ఉంటే దాన్ని తీసిపడేసిన తరువాతనే అది శుభ్రమవుతుంది.

పరిశుభ్రత కొరకు మరియు అశుద్ధతను దూరము చేయుటకు నీళ్ళు ఉపయోగించబడ- తాయి. అవి వర్షపు మరియు సముద్రపు నీళ్ళు లాంటివి వగైరా. అలాగే ఎవరైనా ఉపయోగించిన తరువాత మిగిలిన నీళ్ళు ఉపయోగించవచ్చును. ఇంకా శుభ్రమైన ఏదైనా వస్తువు నీళ్ళలో కలిసి అందులో ఏలాంటి మార్పు రాకుండా దాని అసలు రూపములో ఉండిపోతే అవి కూడా ఉపయోగించవచ్చును. కాని ఏదైనా అపరిశుభ్ర- మైన వస్తువు అందులో కలుషితమై దాని అసలు రూపములో లేనిచో అవి ఉపయోగించకూడదు. అపరిశుభ్రమైన వస్తువు ఏదైనా కలుషితమై నీళ్ళ రంగు, రుచి, వాసనలో మార్పు వస్తే అవి ఉపయోగించరాదు. మార్పు రాని యెడల అవి ఉపయోగించవచ్చును.

అలాగే మనుషులు త్రాగిన తర్వాత మిగిలిన నీళ్ళు శుభ్రత పొందుటకు, వజూ చేయుటకు ఉపయోగించవచ్చును. కాని కుక్క లేక పంది ఎంగిలి చేసిన నీళ్ళు వాడరాదు. అవి అశుద్ధం.

‘నజాసత్’ రకాలు:

(1,2) మలమూత్రం.

(3) ‘వదీ’: అది తెల్లటి చిక్కని ద్రవ పదార్థం. అది మూత్రము తరువాత వెలువడుతుంది.

(4) ‘మజి’: అది తెల్లటి జిగటగల పదార్థం. అది భార్యభర్తల సరసాలాడడముతో, లేదా మనిషి కామాలోచనలో పడినప్పుడు వెల్తుంది.

*’మనీ’ (ఇంద్రియం, వీర్యం) శుభ్రమైనదే. అయినా అది పచ్చిగా ఉన్నప్పుడు కడుగుట, ఎండిపోయినప్పుడు నలుచుట అభిలషణీయం.

(5) తినుట యోగ్యం కాని జంతువుల మలమూత్రం అపరిశుభ్రం. తినుట యోగ్యమైన జంతువుల మలమూత్రం అపరిశుభ్రం కాదు.

పైన చెప్పబడిన మలినాలు శరీరానికి, లేదా దుస్తులకు అంటినచో వాటిని తీసేసి కడగాలి. అయితే కేవలం ‘మజి’ విషయంలో ఓ రాయితీ ఏమిటంటే: అది అంటిన చోట కడగకుండా నీళ్ళు చల్లినా సరిపోవును. *’మనీ’ కామంతో వెళ్ళినచో స్నానం చేయుట విధియగును.

(6) బహిష్టు మరియు బాలింత రక్తస్రావం.

‘నజాసత్’ ఆదేశాలు:

1- మనిషికి ఏదో ఒక పదార్థం అంటింది, కాని అది నజాసతేనా కాదా అనే నిర్థారణ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, దాని గురించి పరిశోధన చేసే అక్కర లేదు. అలాగే దాన్ని కడిగే అవసరం కూడా లేదు.

2- ఒక మనిషి నమాజ్ చేసిన తరువాత శరీరం లేదా తన దుస్తుల్లో నజాసత్ చూశాడు. దాని గురించి నమాజ్ కు ముందు తెలియదు, లేదా తెలిసు కాని మరచిపోయాడు. అలాంటప్పుడు అతని నమాజ్ అయినట్లే.

3- దుస్తుల్లో నజాసత్ పడిన స్థలం తెలియ కుంటే, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏ స్థలం అన్న అధిక అనుమానం కలుగునో దాన్నే కడగాలి. ఎందుకనగా మలినాన్ని దాని రంగు, రుచి లేదా వాసనతో పసిగట్టవచ్చును.

అల్లాహ్ ఎవరికైతే మేలు చేయాలని కోరుతాడో అతనికి ధర్మ అవగాహన, ధర్మాన్ని అర్ధం చేసుకొనే భాగ్యం ప్రసాదిస్తాడు [వీడియో]

బిస్మిల్లాహ్

[3:34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
విజ్ఞానం : https://teluguislam.net/others/ilm-knowledge/

దీనికి సంబంధించిన ఇతర లింకులు:

జకాత్ హక్కుదారులు – జకాత్ ఎవరికి ఇవ్వవచ్చు? [వీడియో]

బిస్మిల్లాహ్

[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది
జకాత్ ఆదేశాలు – 2: భూసంపద, పశువుల జకాత్, జకాత్ హక్కుదారులు [వీడియో] [28:03 నిముషాలు]

జకాత్ హక్కుదారులు

జకాత్ హక్కుదారులెవరనేది స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడు:

إِنَّمَا الصَّدَقَاتُ لِلْفُقَرَاءِ وَالْمَسَاكِينِ وَالْعَامِلِينَ عَلَيْهَا وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ ۖ فَرِيضَةً مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ – 9:60

ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, ఋణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలో నూ, బాటసారులకూ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూ”. (తౌబా 9: 60).

పై ఆయతులో అల్లాహ్ ఎనిమిది రకాలు తెలిపాడు. వారిలో ప్రతి ఒక్కడు జకాత్ తీసుకునే అర్హత గలవాడు. ఇస్లాం ధర్మంలో జకాత్ సమాజములోని అర్హులకే ఇవ్వబడుతుంది. ఇతర ధర్మం లో ఉన్నట్లు కేవలం పండితులకివ్వబడదు. జకాత్ హక్కుదారులు వీరుః

1- నిరుపేద (ఫఖీర్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగము కన్నా తక్కువ పొందేవాడు.

2- అక్కరతీరనివాడు (మిస్కీన్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగముకన్న ఎక్కువ పొందుతాడు, కాని అది అతనికి సరిపడదు. అందుకు అతనికి సరిపడునంత కొన్ని నెలలు, ఒక సంవత్సరం వరకు జకాత్ సొమ్ము ఇవ్వవచ్చును.

3- జకాత్ వసూలు చేసే ఉద్యోగి అంటే జకాత్ వసూలు చేయడానికి ముస్లిం అధికారి తరఫున నియమింపబడిన ఉద్యోగులు. వారు ధనికులైనప్పటికీ, వారి పనికి తగ్గట్టు జీతంగా వారికి జకాత్ నుండి ఇవ్వవచ్చును.

4- హృదయాలు గెలుచుకొనుటకు అంటే అవిశ్వాసుల్లో తమ వంశం, గోత్రంలో నాయకులుగా ఉన్నవారు ఇస్లాంలో ప్రవేశించే ఆశ ఉన్నచో వారికి, లేదా వారి కీడు ముస్లింలకు కలగకుండా జకాత్ సొమ్ము ఖర్చు చేయవచ్చును. అలాగే కొత్తగా ఇస్లాం స్వీకరించినవారిలో వారి అవసరార్థం, వారు స్థిరంగా ఇస్లాంపై ఉండుటకు జకాత్ ధనం ఖర్చు చేయవచ్చును.

5- బానిసలను స్వతంత్రులుగా చెయ్యటానికి మరియు శత్రవుల నుంచి ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చును.

6- ఋణగ్రస్తులు అంటే అప్పులపాలైనవారు. ఇలాంటి వారికి జకాత్ నుండి ఖర్చు చేయవచ్చును. కాని క్రింది షరతులు వారిలో ఉండాలి:

  • A: ముస్లిం అయి యుండాలి.
  • B: స్వయంగా చెల్లించగల ధనికుడు కాకూడదు.
  • C: ఆ అప్పు ఏ పాప కార్యానికో చేసి ఉండ కూడదు.
  • D: అది ఆ సమయంలోనే చెల్లించుట తప్పనిసరి అయి యుండాలి.

7- అల్లాహ్ మార్గంలో అంటే జీతం తీసుకోకుండా పుణ్యాపేక్షతో ధర్మయుద్ధం చేయు వీరులు, వారి స్వంత ఖర్చుల కొరకు, లేదా ఆయుధాలకు జకాత్ డబ్బు ఇవ్వచ్చును. జిహాదులో ధర్మవిద్య అభ్యసించడం కూడా వస్తుంది. ఎవరైనా విద్యభ్యాసనలో నిమగ్నులైనట్లయితే, అతని విద్యకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

8- బాటసారి అంటే ప్రయాణికుడు. గృహజీవనంలో ఎంత ఆనందంగా ఉన్నా సరే ప్రయాణంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులకు గురయితే అతను తన గ్రామం చేరుకొనుటకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

మస్జిదుల నిర్మణాలకు, దారులు సరి చేయడానికి జకాత్ సొమ్ము ఉపయోగించరాదు.

జకాతు & సదఖా ( మెయిన్ పేజీ)
https://teluguislam.net/five-pillars/zakah

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ – 1వ భాగం : సూరతుల్ కహఫ్ పరిచయం, ఘనత [వీడియో]

బిస్మిల్లాహ్

[28:48 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

సూరతుల్ కహఫ్ పారాయణం: సాద్ అల్-ఘమిడి | తెలుగు సబ్ టైటిల్స్: అహ్సనుల్ బయాన్ |వీడియో
https://teluguislam.net/2020/06/25/18-al-kahf

జకాత్ ఆదేశాలు – 2: భూసంపద, పశువుల జకాత్, జకాత్ హక్కుదారులు [వీడియో]

బిస్మిల్లాహ్

[28:03 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

భూ సంబంధ ఉత్పత్తులపై జకాత్

నిల్వ మరియు తూకము చేయుగల ఖర్జూరం, ఎండిన ద్రాక్ష, గోధుమ, జొన్న, బియ్యం లాంటి ఆహారధాన్యాల, ఫలాలపై జకాత్ విధిగా ఉంది. కాని పండ్లు, కూరగాయలపై జకాత్ విధిగా లేదు. పై వాటిలో జకాత్ విధి కావడానికి అవి నిసాబ్ కు చేరి ఉండాలి. వాటి నిసాబ్ 612 కిలోలు. వాటిపై ఒక సంవత్సరం గడవాలన్న నిబంధన లేదు. కోతకు వచ్చినప్పుడు వాటిలో నుండి ఈ క్రింది పద్ధతిలో జకాత్ చెల్లించాలిః

ప్రకృతి పరమైన వర్షాలు, నదుల మూలంగా పండిన పంటల్లో పదవ వంతు జకాత్ చెల్లించాలి. కృత్రిమ కాలువలు, బావుల మూలంగా పండిన పంటల్లో ఇరవయ్యో వంతు జకాత్ చెల్లించాలి.

ఉదాః ఒక వ్యక్తి తన భూమిలో గోధుమ విత్తనం వేశాడు. అతనికి 800 కిలోల పంట పండింది. ఇప్పుడు అతనిపై జకాత్ విధిగా ఉంది. ఎందుకనగా దీని నిసాబ్ 612 కిలోలు, అయితే దీనికంటే ఎక్కువగా పండింది. ఇక ఆ పంట వర్షంతో పండితే అందులో పదో వంతు అంటే 80 కిలోల జకాత్ చెల్లించాలి. ఒకవేళ కృత్రిమ కాలువల, బావుల ఆధారంగా పండితే అందులో ఇరవయ్యో వంతు అంటే 40 కిలోలు జకాత్ చెల్లించాలి.

పశువుల జకాత్

ఇక్కడ పశువులు అంటేః ఆవు, మేక, గొర్రె మరియు ఒంటె లని భావం. వీటి జకాతు కొరకు ఈ క్రింది నిబంధనలు వర్తిస్తాయిః

1- నిసాబ్ కు చేరి ఉండాలి. ఒంటెల నిసాబ్ 5. మేకలు, గొర్రెల నిసాబ్ 40. ఆవుల నిసాబ్ 30. వీటికి తక్కువ ఉన్నవాటిలో జకాత్ లేదు.

2- వాటి యజమాని వద్ద అవి సంవత్సరమెల్లా ఉండాలి.

3- అవి ‘సాయిమా’ అయి ఉండాలి. అంటే సంవత్సరంలో అధిక శాతం పచ్చిక మైదానాల్లో మేసేవి అయి ఉండాలి. శాలలో ఒక చోట ఉండి తమ ఆహారం తినునవి, లేదా వాటి యజమాని వాటి కొరకు మేత ఖరీదు చేసి, లేదా స్టోర్ చేసి ఉంచేవాడైతే వాటిలో జకాత్ లేదు.

4- పరివహణ సాధనంగా, లేదా వ్యవసాయ పరంగా పని చేయునవై ఉండకూడదు.

ఒంటెల జకాత్

ఒంటెల జకాత్ యొక్క నిసాబ్ 5 ఒంటెలు. ఏ ముస్లం వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అవి అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తయిందో అతను ఈ విధంగా జకాత్ చెల్లించాలి.

  •  5 నుండి 9 వరకుంటే 1 మేక.
  • 10 నుండి 14 వరకుంటే రెండు మేకలు.
  • 15 నుండి 19 వరకుంటే మూడు మేకలు.
  • 20 నుండి 24 వరకుంటే నాలుగు మేకలు.
  • 25 నుండి 35 వరకుంటే ఏడాది వయసున్న ఒక ఆడ ఒంటె. అది గనక లేకుంటే రెండేళ్ళ మగ ఒంటె.
  • 36 నుండి 45 వరకుంటే రెండేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 46 నుండి 60 వరకుంటే మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.
  • 61 నుండి 75 వరకుంటే నాలుగేళ్ళ ఒక ఒంటె.
  • 76 నుండి 90 వరకుంటే రెండేళ్ళ రెండు ఒంటెలు.
  • 91 నుండి 120 వరకుంటే మూడెళ్ళ రెండు ఆడ ఒంటెలు.
  • 120 ఒంటెలకు మించిపోతే ప్రతి నలభై ఒంటెలపై రెండేళ్ళ ఒక ఆడ ఒంటె. ప్రతి 50 ఒంటెలపై మూడేళ్ళ ఒక ఆడ ఒంటె.

వీటికంటే ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి 40లో రెండేళ్ళ ఒక ఆడ ఒంటె, ప్రతి 50లో మూడేళ్ళ ఒక ఆడ ఒంటె జకాత్ గా ఇవ్వాలి.

ఆవుల జకాత్

 ఆవులు, ఎద్దులు అన్నిటి లెక్క ఒకటే. 1 నుండి 29 వరకుంటే జకాత్ లేదు

  • ఏ వ్యక్తి ఆధీనంలో 30 నుండి 39 వరకున్నాయో (వాటిపై సంవత్సరం గడిసిందో) అందులో ఏడాది వయస్సుగల ఒక ఆడ లేదా మగ దూడ జకాత్ గా ఇవ్వాలి.
  • 40 నుండి 59 వరకుంటే రెండేళ్ళ దూడ.
  • 60 నుండి 69 వరకుంటే ఏడాది వయస్సు గల రెండు దూడలు.
  • 70 నుండి 79 వరకుంటే ఏడాది వయసుగల 1 దూడ, రెండేళ్ళ వయస్సుగల మరొక దూడ.

ఆ తరువాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 30లో ఏడాది వయస్సుగల ఒక దూడ, ప్రతి 40లో రెండేళ్ళ వయస్సుగల ఒక దూడ జకాత్ గా ఇవ్వాలి.

మేకల జకాత్

(మేకలు, గొర్రెలు, పొట్టేలు అన్నిటి నిసాబ్ ఒకటే. అవి 1 నుండి 39  వరకుంటే జకాత్ విధిగా లేదు). ఏ వ్యక్తి  ఆధీనంలో 40 నుండి 120 వరకు మేకలున్నాయో అతను అందులో నుండి ఒక మేక జకాత్ గా ఇవ్వాలి.

  • 121 నుండి 200 వరకుంటే రెండు మేకలు.
  • 201 నుండి 399 వరకుంటే మూడు మేకలు.
  • 400 నుండి 499 వరకుంటే నాలుగు మేకలు.
  • 500 నుండి 599 వరకుంటే ఐదు మేకలు.
  • ఆ తర్వాత వాటి సంఖ్య ఎంత పెరిగినా ప్రతి 100లో ఒక మేక జకాత్ గా ఇవ్వాలి.

జకాత్ హక్కుదారులు

జకాత్ హక్కుదారులెవరనేది స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడు:

ఈ జకాత్ నిధులు అసలు కేవలం నిరుపేదలకు, అక్కరలు తీరని వారికి, జకాత్ వ్యవహారాలకై నియుక్తులైన వారికీ, ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవటం అవసరమో వారికీ, ఇంకా బానిసల విముక్తికీ, ఋణగ్రస్తుల సహాయానికీ, అల్లాహ్ మార్గంలో నూ, బాటసారులకూ వినియోగించటం కొరకు, ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన ఒక విధి. అల్లాహ్ అన్నీ ఎరిగినవాడూ వివేకవంతుడూ. (తౌబా 9: 60).

పై ఆయతులో అల్లాహ్ ఎనిమిది రకాలు తెలిపాడు. వారిలో ప్రతి ఒక్కడు జకాత్ తీసుకునే అర్హత గలవాడు. ఇస్లాం ధర్మంలో జకాత్ సమాజములోని అర్హులకే ఇవ్వబడుతుంది. ఇతర ధర్మం లో ఉన్నట్లు కేవలం పండితులకివ్వబడదు. జకాత్ హక్కుదారులు వీరుః

1- నిరుపేద (ఫఖీర్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగము- కన్నా తక్కువ పొందేవాడు.

2- అక్కరతీరనివాడు (మిస్కీన్) అంటే తనకు సరిపడు ఖర్చులో సగముకన్న ఎక్కువ పొందు- తాడు, కాని అది అతనికి సరిపడదు. అందుకు అతనికి సరిపడునంత కొన్ని నెలలు, ఒక సంవత్సరం వరకు జకాత్ సొమ్ము ఇవ్వవచ్చును.

3- జకాత్ వసూలు చేసే ఉద్యోగి అంటే జకాత్ వసూలు చేయ డానికి ముస్లిం అధికారి తరఫున నియమింపబడిన ఉద్యోగులు. వారు ధనికులై- నప్పటికీ, వారి పనికి తగ్గట్టు జీతంగా వారికి జకాత్ నుండి ఇవ్వవచ్చును.

4- హృదయాలు గెలుచుకొనుటకు అంటే అవిశ్వాసుల్లో తమ వంశం, గోత్రంలో నాయకులుగా ఉన్నవారు ఇస్లాంలో ప్రవేశించే ఆశ ఉన్నచో వారికి, లేదా వారి కీడు ముస్లింలకు కలగకుండా జకాత్ సొమ్ము ఖర్చు చేయవచ్చును. అలాగే కొత్తగా ఇస్లాం స్వీకరించినవారిలో వారి అవసరార్థం, వారు స్థిరంగా ఇస్లాంపై ఉండుటకు జకాత్ ధనం ఖర్చు చేయవచ్చును.

5- బానిసలను స్వతంత్రులుగా చెయ్యటానికి మరియు శత్రవుల నుంచి ముస్లిం ఖైదీలను విడిపించుటకు జకాత్ సొమ్ము ఖర్చు పెట్టవచ్చును.

6- ఋణగ్రస్తులు అంటే అప్పులపాలైనవారు. ఇలాంటి వారికి జకాత్ నుండి ఖర్చు చేయవచ్చును. కాని క్రింది షరతులు వారిలో ఉండాలిః

  • A: ముస్లిం అయి యుండాలి.
  • B: స్వయంగా చెల్లించగల ధనికుడు కాకూడదు.
  • C: ఆ అప్పు ఏ పాప కార్యానికో చేసి ఉండ కూడదు.
  • D: అది ఆ సమయంలోనే చెల్లించుట తప్పనిసరి అయి యుండాలి.

7- అల్లాహ్ మార్గంలో అంటే జీతం తీసుకోకుండా పుణ్యాపేక్షతో ధర్మయుద్ధం చేయు వీరులు, వారి స్వంత ఖర్చుల కొరకు, లేదా ఆయుధాలకు జకాత్ డబ్బు ఇవ్వచ్చును. జిహాదులో ధర్మవిద్య అభ్యసించడం కూడా వస్తుంది. ఎవరైనా విద్యభ్యాసనలో నిమగ్నులైనట్లయితే, అతని విద్యకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

8- బాటసారి అంటే ప్రయాణికుడు. గృహజీవనంలో ఎంత ఆనందంగా ఉన్నా సరే ప్రయాణంలో ఏదైనా ఆర్థిక ఇబ్బందులకు గురయితే అతను తన గ్రామం చేరుకొనుటకు సరిపడు ఖర్చులు జకాత్ నుండి ఇవ్వవచ్చును.

మస్జిదుల నిర్మణాలకు, దారులు సరి చేయడానికి జకాత్ సొమ్ము ఉపయోగించరాదు.

నోట్స్:

1-  సముద్రం నుండి లభించే ముత్యాలు, పగడాలు మరియు చేపల్లో జకాత్ లేదు. వాణిజ్యసరుకుగా ఉన్నప్పుడు పైన తెలిపిన ప్రకారంగా జకాత్ చెల్లించాల్సి ఉంటుంది.

2- అద్దెకివ్వబడిన బిల్డింగులు, ఫ్యాక్టరీల పై జకాత్ లేదు. కాని వాటి నుండి పొందుతున్న పైకం నిసాబ్ కు చేరుకొని, సంవత్సరం గడిస్తే అందులో జకాత్ విధిగా ఉంది.


జకాత్ ఆదేశాలు – 1: వెండి, బంగారం, డబ్బు, వ్యాపార సామాగ్రి మరియు షేర్స్ యొక్క జకాతు [వీడియో]

బిస్మిల్లాహ్

[19:09 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
జకాత్ ఆదేశాలు [పుస్తకం] ఆధారంగా ఈ వీడియో చెప్పబడింది

జకాత్ ఆదేశాలు (أحكام الزكاة)

ఇస్లామీయ పరిభాషలో జకాత్ అంటే: అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశ్యంతో నిర్ణీత ధన, ధాన్యాలు ధర్మవిధిగా నిర్ణీత ప్రజలకు చెల్లించవలసిన హక్కు.

జకాత్ ఇస్లాం మూల స్తంభాల్లో మూడవది. ఏ ముస్లిం ‘నిసాబ్‘ (అంటే జకాత్ విధింపుకు అవసరమై నిర్ణీత పరిమాణాని)కు అధికారి అయ్యాడో అతనిపై జకాత్ విధి అవుతుంది. అల్లాహ్ ఆదేశం చదవండిః

నమాజు స్థాపించండి. జకాత్ ఇవ్వండి“. (బఖర 2: 43).

జకాత్ ను ధర్మపరంగా విధిగావించడంలో అనేక లాభాలు, మేల్లున్నాయి. వాటిలో కొన్ని ఇవి:

1- ఆత్మశుద్ధి కలుగుతుంది. మనస్సులో నుండి దురాశ, పిసినారి తత్వాలు దూరమవుతాయి.

2- ముస్లిం భక్తుడు దాతృత్వం లాంటి సద్గుణ సంపన్నుడవుతాడు.

3- ధనవంతుని మరియు పేదవాని మధ్య ప్రేమ సంబంధాలు బల పడతాయి. ఎలా అనగా ఉపకారుని పట్ల ఆత్మ ఆకర్షితమవుతుంది మరియు ప్రేమిస్తుంది.

4- బీద ముస్లిముల అవసరాలు తీరుతాయి. వారు ఒకరి ముందు తమ చెయ్యి చాపకుండా ఉంటారు.

5- జకాత్ చెల్లించే మానవుడు పాపాల నుండి పరిశుద్ధుడు అవుతాడు. అంటే జకాత్ వల్ల అతని స్థానం ఉన్నతమై, అతని పాపాలు మన్నించ- బడతాయి.

ఏ వస్తువుల్లో జకాత్ విధిగా ఉంది

బంగారం, వెండి, వ్యాపార సామాగ్రి, పెంపుడు జంతువులు మరియు పంటలు, ఫలాలు మరియు లోహాలు, ధాతువులు.

బంగారం, వెండి జకాత్

బంగారం, వెండి ఏ రూపంలో ఉన్నా వాటిపై జకాత్ విధిగా ఉంది. అది ‘నిసాబ్’ కు అధికారి అయిన వ్యక్తిపై మాత్రమే.

బంగారం నిసాబ్: 20 దీనారులు. ఈ నాటి లెక్క ప్రకారం 85 గ్రాములు.

వెండి నిసాబ్: 200 దిర్హములు. ఈ నాటి లెక్క ప్రకారం 595 గ్రాములు.

పై లెక్క ప్రకారం ఏ వ్యక్తి నిసాబ్ కు అధికారి అయ్యాడో, అది అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయిందో, అతను అందులో నుండి (2.5%) రెండున్నర శాతం జకాతుగా చెల్లించాలి.

వాటి జకాత్, డబ్బు రూపంలో ఇవ్వదలుచు- కున్న వ్యక్తి, అతను వాటికి అధికారి అయినప్పటి నుండి ఒక సంవత్సరం పూర్తయినప్పుడు మార్కెట్లో ఒక గ్రాము బంగారం లేదా వెండి యొక్క ధర ఎంత ఉందో తెలుసుకొని, తన వద్ద ఉన్న మొత్తం బంగారం లేదా వెండి మూల్యం ఎంతవుతుందో లెక్కేసి అందులో నుండి రెండున్నర శాతం డబ్బు జకాతుగా ఇవ్వాలి. (మేము డబ్బు అని వ్రాసాము అయితే ఎవరు ఏ దేశంలో ఉన్నారో అక్కడ వారి కరెన్సీ పేరేముందో దాన్ని బట్టి వారు లెక్కించుకోవాలి).

దీని ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద 100 గ్రాముల బంగారం ఉంది అనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయింది కూడాను. అందుకు అతనిపై జకాత్ విధి అయింది. ఇక అతను రెండున్నర గ్రాముల బంగారం జకాతుగా ఇవ్వాలి. ఒకవేళ అతను దాని జకాత్ డబ్బు రూపంలో ఇవ్వదలుచుకుంటే, 100 గ్రాముల బంగారం ధర తెలుసుకోవాలి. (దాని ధర ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఒక లక్ష అని తెలిసిందనుకుందాం) అతను అందులో రెండున్నర శాతం జకాత్ ఇవ్వాలి. (అంటే (2,500) రెండు వేల అయిదు వందల రూపాలు). ఇదే విధంగా వెండి జకాతు ఇవ్వాలి.

ఇలాగే కరెన్సీలో కూడా జకాతు విధి అవుతుంది, నిసాబ్ కు అధికారి అయి, దానిపై సంవత్సరం గడచిన వెంటనే. ఎవరి వద్ద 595 గ్రాముల వెండి ధరకు సమానమైన లేదా అంతకంటే ఎక్కువ కరెన్సీ ఉందో అతనిపై జకాత్ విధిగా ఉంది. అతను తన వద్ద ఉన్న మొత్తం డబ్బులో నుండి రెండున్నర శాతం జకాత్ గా ఇవ్వాలి.

ఏ ముస్లిం వద్ద కరెన్సీ (డబ్బు) ఉండి, సంవత్సరం దాటిందో అతను 595 గ్రాముల వెండి ధర తెలుసుకోవాలి, అతని వద్ద ఉన్న డబ్బు 595 గ్రాములవెండి ధరకు చేరుకుంటే జకాత్ ఇవ్వాలి, ఒకవేళ అతని వద్ద ఉన్న డబ్బు దాని ధరకు తక్కువ ఉంటే అతనిపై జకాత్ విధిగా లేదు.

ఉదాహరణ: ఒక వ్యక్తి వద్ద భారత కరెన్సీ ప్రకారం రూ. 80 వేలున్నాయనుకుందాం. అతని వద్ద ఉండి సంవత్సరం పూర్తి అయ్యింది కూడా. ప్రస్తుతం మార్కెట్లో 595 గ్రాముల వెండికి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. దాని ధర ఎనభై ఐదు వేలు అని తెలిస్తే అతనిపై జకాత్ విధిగా లేదు. ఎందుకనగా అతను నిసాబ్ కు అధికారి కాలేదు. నిసాబ్ కు అధికారి కావడానికి అతని వద్ద ఎనభై ఐదు వేల రూపాలుండాలి. ఏ దేశంలోనైనా వారి కరెన్సీ వెల వెండితో పోల్చబడితే వారు తమ కరెన్సీ జకాత్ వెండి లెక్కతో ఇవ్వాలి. అంటే 595 గ్రాముల వెండికి విలువగల డబ్బు ఉన్నప్పుడే అతనిపై జకాత్ విధి అగును.

వ్యాపార సామాగ్రి యొక్క జకాత్

సంపద కలిగి, దానిని వ్యాపారంలో ఉపయోగించే ముస్లిం వర్తకునిపై ప్రతి సంవత్సరం జకాత్ విధిగా ఉంది. ఇది అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహానికి కృతజ్ఞత మరియు అతనిపై ఉన్న తన పేదసోదరుల హక్కు అని తను భావించాలి. లాభోద్దేశంతో క్రయవిక్రయించే ప్రతీ వస్తువు వ్యాపార సామాగ్రి అనబడుతుంది; భూములు, ఇండ్లు, స్థిరాస్థులు (real estate), పశువులు, తినుత్రాగు పదార్థాలు మరియు వాహనాలు వగైరా. అవి నిసాబ్ కు చేరి ఉండాలి. అంటే పైన తెలిపిన 85 గ్రాముల బంగారం ధరకు లేదా 595 గ్రాముల వెండి ధరకు సమానంగా ఉండాలి. అందులో రెండున్నర శాతం జకాతుగా ఇవ్వాలి.

ఉదాహరణః ఒక వ్యక్తి వద్ద ఒక లక్ష రూపాయల విలువ గల వ్యాపార సామాగ్రి ఉంటే, అందులో నుండి రూ. 2500/- జకాత్ చెల్లించాలి. వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం ఆరంభంలో తమ వద్ద ఉన్న మొత్తం సరుకును లెక్కించుకొని జకాత్ చెల్లించాలి. ఎవరైనా వ్యాపారి సంవత్సరం పూర్తి అయ్యేకి పది రోజుల ముందు ఏదైనా సరుకు కొనుగోళు జేస్తే దాని జకాత్ కూడా ముందు నుండే ఉన్న సరుకుతో కలపివ్వాలి. వ్యాపారం ప్రారంభించిన మొదటి రోజు సంవత్సరం యొక్క ఆరంభమగును. ఇలా ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి.

కంచెలోకి పంపకుండా పశువుశాలలో, ఇంటి వద్ద ఉంచి మేత ఇవ్వబడే పశువులు వ్యాపారం కోసం పెంచితే వాటి మీద జకాత్ విధి అవుతుంది. అవి నిసాబ్ కు చేరుకున్నా, చేరుకోకపోయినా వాణిజ్య సరుకులాగా దాని వెల నిసాబ్ కు చేరుకుంటే అందులో నుండి జకాత్ చెల్లించాలి.

షేర్స్ యొక్క జకాత్

రియల్ ఎస్టేట్ (Real estate) తదితర విషయాల్లో షేర్స్ ఈ రోజుల్లో ఓ పరిపాటి విషయం అయింది. (ధర్మసమ్మతమైన షేర్స్ కొనుట, అమ్ముట యోగ్యమే. కాని ధర్మసమ్మతం కాని వాటిలో ముస్లిం పాల్గొనుట ఎంత మాత్రం యోగ్యం కాదు). అందులో డిపాజిట్ చేసి ఉన్న డబ్బు కొద్ది సంవత్సరాల్లో పెరగవచ్చు, తరగనూవచ్చు. షేర్స్ లో ఉన్న డబ్బుపై జకాత్ ఉంది. ఎందుకనగా అది కూడా వాణిజ్య సరుకు లాంటిదే. షేర్స్ లో పాల్గొన్న ప్రతి ముస్లిం ప్రతి సంవత్సరం తన షేర్స్ ధర చూస్తూ ఉండాలి. జకాత్ చెల్లిస్తూ ఉండాలి.


ముహర్రం మాసం & సహాబాల ఔన్నత్యం [వీడియో]

బిస్మిల్లాహ్

[55 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ముహర్రం & ఆషూరా (ముహర్రం 10 వ తేదీ) మెయిన్ పేజీ
https://teluguislam.net/2020/08/20/muharram/

సహాబా