ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:32 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇతరములు:
తెలుగుఇస్లాం.నెట్ * తెలుగులో ఇస్లాం జ్ఞాన సంపద *
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:32 నిముషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇతరములు:
వక్త/రచయిత : షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ (రహిమహుల్లాహ్)
తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ సందర్భంగా ఏప్రిల్ ఫూల్ పేరిట కొందరు మూర్ఖులు చేస్తున్న చేష్టల నుండి నేను ముస్లిములందరినీ హెచ్చరిస్తున్నాను: హెచ్చరిక ఏమిటంటే ఇది యూదుల, క్రైస్తవుల, మజూస్ (అగ్నిపూజారుల) మరియు అవిశ్వాసుల నుండి పొందిన ఓ అబద్ధం, అసత్యం. ఇందులో ధర్మపరమైన నిషేధమైన అసత్యమే కాకుండా ముస్లిమేతరుల పోలిక ఉంది, ముస్లిమేతరుల పోలిక నిషిద్ధం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “మన్ తషబ్బహ బిఖౌమిన్ ఫహువ మిన్ హుమ్” అంటే “ఎవరు ఏ జాతి పోలికను అవలంబిస్తాడో అతడు ఆ జాతి వారికి చెందినవాడు అవుతాడు”. (అబూదావూద్ 4031). (షేఖుల్ ఇస్లామ్ ఇబ్ను తైమియా దీని సనద్ ను ‘జయ్యిద్’ అంటే ప్రమాణికమైనదని అన్నారు.)
పోలిక అన్నది కనీసం నిషిద్ధంలో వస్తుంది, హదీసు యొక్క బాహ్య పదాలు చూస్తే పోలిక వహించేవాడు అవిశ్వాసానికి పాల్పడినట్లని కనబడతున్నాయి.
ఏప్రిల్ ఫూల్ అని చెప్పడంలో ఈ రెండు నిషిద్ధ కార్యాలే (1-అబద్ధం, 2- ఇతరుల పోలిక) గాకుండా ఇస్లాం మరియు ముస్లిం శత్రువుల పట్ల ముస్లిం అవమానత్వం కూడా ఉంది. ఎలా అనగా కామన్ సెన్స్ గా అందరూ ఎరిగిన విషయమే: ఎవని పోలిక అవలంబించడం జరుగుతుందో వాడు ఈ పోలిక అవలంబించేవాడికన్నా మేలైనవాడన్న గర్వంలో పడతాడు, వీనికన్నా బెటర్ గనకనే నన్ను ఫాలో అవతున్నాడన్న ఫీలింగ్ కి గురవుతాడు. తుదకు ఈ పోలిక అవలంబించేవాడు తనకు తాను తక్కువగా భావించి అంటే న్యూనతభావానికి గురై వాని పోలిక అవలంబిస్తాడు, ఈ విధంగా విశ్వాసి అవిశ్వాసికి తోకగా, వానికి ఫాలోవర్ గా అయి అవమానం పాలవుతాడు.
ఇంతే కాకుండా ఈ ఛండాలమైన, నీచమైన అసత్యపు ఎప్రిల్ ఫూల్ లో మరో నాలుగో నిషిద్ధం ఏముందంటే: అధర్మంగా ఇతరుల సొమ్ము కాజేయడం, ముస్లిములను భయభ్రాంతులకు గురి చేయడం. ఫూల్ జేస్తున్నా అని ఇంటివారికి మనింటికి చుట్టాలొస్తున్నారు మంచి వంటకాలు చేసి పెట్టండని కాల్ చేస్తాడు, లేదా ఇంకా ఇలాంటి జోక్స్ పేరు మీద జరిగే చేష్టలు. లేదా భయభ్రాంతులకు గురి అయ్యే సమాచారం అందజేస్తాడు, ఉదాహరణకు మీ యజమానికి ఆక్సిడెంట్ జరిగింది, బండి క్రింద పడ్డాడు అన్నటువంటి జోకులు. ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇవి యోగ్యం కాజాలవు.
وبهذه المناسبة أحذر إخواني المسلمين مما يصنعه بعض السفهاء من كذبة أبريل، وأظن أنه قريبٌ من هذه الكذبة التي تلقوها عن اليهود والنصارى والمجوس وأصحاب الكفر، ثم إنها مع كونها كذباً والكذب محرم شرعاً، وكونها تشبهاً بغير المسلمين والتشبه بغير المسلمين محرم، وقد قال النبي صلى الله عليه وسلم: «من تشبه بقومٍ فهو منهم». قال شيخ الإسلام ابن تيمية رحمه الله: إسناده جيد. وأقل أحواله التحريم، وإن كان ظاهره يقتضي كفر المتشبه بهم. هي مع تضمنها لهذين المحظورين هي أيضاً إذلالٌ للمسلم أمام عدوه؛ لأن من المعلوم بطبيعة البشر أن المقلد يفخر على من قلده، ويرى أنه أقدم منه؛ ولذلك ضعف مقلده حتى قلده، ففيها إذلالٌ للمؤمن بكونه ذيلاً وتبعاً للكفار. المحظور الرابع أن غالبها -أي غالب هذه الكذبة الخبيثة- تتضمن أكلاً للمال بالباطل أو ترويعاً للمسلم، فإنه ربما يكذب فيكلم أهل البيت ويقول: إن فلاناً يقول ترى عندنا جماعة هذا اليوم يطبخون غداءً كثيراً ولحماً. وما أشبه ذلك. أو ربما يخبرهم بأمرٍ يروعهم؛ كأن يقول: قيمكم دُعس، دعسته سيارة. وما أشبه ذلك من الأمور التي لا تجوز بدون أن تكون بهذه الحال
[అరబిక్ మూలం : binothaimeen.net/content/6820]
ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:00 నిమిషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
వడ్డీ (Interest, Riba)
[7:33 నిముషాలు ]
[ఇక్కడ ఆడియో డౌన్లోడ్ చేసుకోండి]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
ఈ వీడియో క్లిప్ మూలం:
రజబ్ నెల కల్పితాచారాలు, వడ్డీ తినుట, వ్యభిచారం, ప్రవక్త సమాధికి సంభందించిన దురాచారాలు [వీడియో]
ఇతరములు
పరస్త్రీతో కరచాలనం (ముసాఫహా) చేయుట
[2:08 నిముషాలు మాత్రమే]
[ఇక్కడ mp3 ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
అగోచరం అంటే .. :
భూత భవిష్యత్ కాలాలకు చెందిన ఏ విషయాలైతే జనుల దృష్టికి రావో – కంటికి కానరావో – వాటిని అగోచరాలని అంటారు.
అగోచర జ్ఞానాన్ని అల్లాహ్ తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇలా సెలవిచ్చాడు :
“అల్లాహ్ తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు.” (అన్ నమ్ల్ 27: 65)
అల్లాహ్ కొన్ని సందర్భాలలో దైవప్రవక్తలలో కొందరికి, కొన్ని పరమార్థాల దృష్ట్యా తన అగోచర జ్ఞానంలోని కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించటం జరిగింది.
“ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు – తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప!” (అల్ జిన్న్ : 26, 27)
అంటే, అల్లాహ్ తనకు స్వంతమైన అగోచర జ్ఞానంలోని కొంత భాగాన్ని తన ప్రవక్తలలో తాను కోరిన వారికి, కొన్ని పరమార్థాల దృష్ట్వా తెలియపరచటం సంభవమే. ఎందుకంటే అతను (ఆ ప్రవక్త) ఆ అద్భుతాలను తన దైవదౌత్యానికి నిదర్శనంగా చూపుతాడు. ఇలాంటి అద్భుతాలలో, అగోచర విషయాలను (భవిష్యవాణి) తెలుపటం కూడా ఒకటి. ఈ అగోచర జ్ఞానంలో మానవ సందేశహరునికి, దైవదూతల సందేశవాహకునికి మాత్రమే ప్రమేయం ఉంటుంది. మూడో వ్యక్తికి ఇందులో ఎలాంటి దఖలు ఉండదు. ఎందుకంటే అల్లాహ్ అగోచర జ్ఞానాన్ని వారిరువురికే పరిమితం చేశాడు. కాబట్టి అల్లాహ్ దృష్టిలో మినహాయింపుకు నోచుకున్న ఆ సందేశహరులు తప్ప వేరెవరయినా తనకు అగోచర జ్ఞానం ఉందని అంటే అతను అసత్యవాది, అవిశ్వాసానికి ఒడిగట్టిన వాడవుతాడు. అతను హస్త సాముద్రికం ఆధారంగా చెప్పినా, తారాబలం చూసి చెప్పినా, క్షుద్రవిద్యలను ఆశ్రయించినా, జ్యోతిష్కం ద్వారా చెప్పినా, మరే వనరుల ఆధారంగా చెప్పినా అతను అబద్ధీకుడే. ఈ యుగంలో కూడా ఇలాంటి నయవంచకులు, మోసగాళ్లకు కొదువలేదు. వారు తమ వాక్చాతుర్యంతో, మాయమాటలతో అమాయక జనులను బుట్టలో వేసుకుని పోగొట్టుకున్న వస్తువుల ఆచూకీ తెలుపుతామని, రోగ కారణాలను తెలుపుతామని అంటుంటారు. ఫలానా వ్యక్తి నీకేదో చేసేశాడని, అందుకే నీవు ఈ విధంగా మంచాన పడ్డావని చెబుతుంటారు. ఈ విషయాలను వారు జిన్నాతుల నుండి, షైతానుల నుండి సేకరిస్తారు. అందుకోసం వారు ఆ పైశాచిక శక్తులను ప్రసన్నుల్ని చేస్తుంటారు. ఎవరయినా మీ వద్దకు క్షుద్రవిద్యను పొందిన మాటలంటే ఖచ్చితంగా వారు మాయలమారులని, మోసగాళ్లని గ్రహించాలి.
షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు : “భవిష్యవాణి (సోదె) చెప్పేవారి పరిస్థితి ఎటువంటిదంటే, వారి వద్ద షైతాన్ సహచరుడు ఉంటాడు. ఆకాశాలలో దొంగచాటుగా. విన్న విషయాలను వాడు వారికి తెలియజేస్తుంటాడు. వాటిలో వారు మరికొన్ని అబద్ధాలను (మిర్చిమసాలాను) జోడించి వివరిస్తారు.”
ఆయన ఇంకా ఇలా అంటున్నారు : “ఈ సోదె చెప్పటంలో కొందరు ఆరితేరిన వారుండేవారు. వారి దగ్గరకు షైతానులు తినే త్రాగే పదార్థాలను కూడా తెచ్చేవారు. ఆ ప్రదేశాలలో లభ్యంకాని పండ్లను, మిఠాయిలను కూడా తెచ్చేవారు. వాటిలో కొన్నింటిని జిన్ను మక్కా లేదా బైతుల్ మఖ్దిస్ లేదా వేరే ఇతర స్థలాలకు తరలించేవాడు.” (మజ్మూ అత్ తౌహీద్ – పేజీ : 797, 801)
అగోచరాలకు సంబంధించి వారు జ్యోతిష్యశాస్త్రం ద్వారా కొన్ని విషయాలు అందజేస్తుంటారు. నక్షత్రాలను, రాసులను చూసి వారు భూమండలంపై సంభవించబోయే దానిని సూచిస్తుంటారు. గాలులు ఎంతవేగంగా వీస్తాయి, వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తుంది తదితర విషయాలను అంచనా వేస్తారు. నక్షత్రాలు తమ తమ కక్ష్యల్లో చేసే పరిభ్రమణం, వాటి కలయిక, విడిపోవటాలను బట్టి జరిగే సంఘటనలను నిర్ధారిస్తారు. వారిలా అంటారు: ఇతను గనక ఫలానా నక్షత్రం సంచరించే సమయంలో వివాహమాడితే అతనికి ఈ ఈ సమస్యలు ఎదురవుతాయి. అతను గనక ఫలానా నక్షత్రం పొడసూపినపుడు ప్రయాణం చేస్తే ఫలానా ఫలానా గండాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను ఫలానా నక్షత్రం సమయంలో పుట్టాడు కనుక ఫలానా భాగ్యం వరిస్తుంది లేదా ఫలానా దరిద్రం చుట్టుకుంటుంది. ప్రస్తుతం కొన్ని చవుకబారు పత్రికలు సయితం ఇలాంటి రాశి ఫలాలను ముద్రించి మనుషుల జీవితాలలో సంభవించబోయే వాటిని గురించి విచ్చలవిడి రాతలు రాస్తున్నాయి.
కొంతమంది అజ్ఞానులు, బలహీన విశ్వాసులు జ్యోతిష్కుల వద్దకు వెళుతుంటారు. వారు తమ జీవితాలలో యెదురు కానున్న సంఘటనలను గురించి, ముఖ్యంగా వివాహాది శుభకార్యాల గురించి దర్యాప్తు చేస్తుంటారు.
ఎవడయితే తనకు అగోచర జ్ఞానముందని అంటాడో, మరెవరయితే అలాంటి వారిని సత్యవంతులని ధృవీకరిస్తాడో అతను ముష్రిక్కు, కాఫిర్ అవుతాడు. ఎందుకంటే వాడు అల్లాహ్ యొక్క ప్రత్యేక గుణాలలో తనకు భాగస్వామ్యం ఉందని దావా చేస్తున్నాడు. నిజానికి నక్షత్రాలు అల్లాహ్ కు సంపూర్ణ విధేయతను ప్రకటించే సృష్టితాలు. వాటి అధీనంలో ఏ శక్తీ లేదు. ఒకరి భాగ్యాన్నిగానీ, దరిద్రాన్ని గానీ శాసించే అధికారం వాటికి లేదు. జీవన్మరణాలతో కూడా వాటికి ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ పైశాచిక చేష్టలు. ఆకాశాలలో దొంగచాటుగా విన్న విషయాలను అవి చేరవేస్తుంటాయి.
ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 120 – 121)
(HomoSexuality and its Evil effects)
[41 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమో సెక్సువల్స్) అంటారు. అనగాఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో సంభోగించటం.
దైవ ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు ప్రపంచంలోనే అందరికన్న ముందుగా స్వలింగ సంపర్కమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడ్డారు. ఆ ముదనపు జాతి పేరు మీదగానే స్వలింగ సంపర్కాన్ని ‘లవాతత్‘ అని పేర్కొనటం జరుగుతుంది.
[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:
మేము లూతు (అలైహిస్సలామ్)ను పంపాము. అతను తన జాతివారిని ఉద్దేశించి, ”మీరు ఇంత సిగ్గుమాలిన చేష్టకు పాల్పడుతున్నారేమిటి? మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పాడు పని చెయ్యలేదే!”అయ్యో! మీరు స్త్రీలను వదలి [96], పురుషులతో కామవాంఛ తీర్చుకుంటున్నారా?! [97] అసలు మీరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారు” [98] అని అన్నారు. దానికి అతని జాతి వారు ఇచ్చిన జవాబు ఇదే: ”వీళ్లను మీ బస్తీ నుంచి వెళ్లగొట్టండి. మహా పవిత్రులట వీళ్ళు. [99]” (Quran – 7 : 80-82)
[96] అంటే మీరు స్త్రీలను వదిలి లైంగిక కోర్కేల్ని తీర్చుకోవటానికి ప్రకృతి ధర్మానికి విరుద్దంగా సిగ్గులేకుండా మగవాళ్ళు దగ్గరికి పోతారా?! మీరు ఒడిగడుతున్న ఈ చేష్ట అత్యంత హేయమైనది, విరుద్దమైనది. జంతువుల్లో సయితం లేని ఈ పాడు బుద్ది మీకెలా పుట్టిందీ?
[97] మగవారి లైంగిక వాంఛల పరిపూర్తికై, వారి తృప్తికై, సౌఖ్యానికై దేవుడు ఆడవారిని పట్టించాడు. కాని ఈ దుర్మార్గుల స్వభావమే చెడిపోయింది. మీరు స్త్రీలను వదిలి పురుషుల మల విసర్జనా మార్గాన్ని వాడుకోసాగారు.
[98] ప్రకృతి విరుద్ధమైన ఈ పని బరితెగించిన చేష్టగా, దైవాదేశాల అతిక్రమణగా పేర్కొనబడింది. అయితే నాగరికతా ధ్వజవాహకులమని చెప్పుకునే పాశ్చత్య దేశాల వారు నేడు ఈ సిగ్గుమాలిన పనిని చట్టబద్దంగా చేసుకుంటున్నారు. పైగా ఈ లతుకోరు పనిని ‘ప్రాధమిక హక్కు’ (fundamental right) గా ఖరారు చేసుకుంటున్నారు. అంటే పాశ్చాత్య దేశాల వారి దృష్టిలో ఇప్పుడది నేరమూ కాదు. చెడు పని కూడా కాదు. ఎందుకంటే వారి నాగరికత బాగా ‘ముదిరి’పోయింది.
[99] నీతిబాహ్యత, దుర్మార్గం, సామాజిక రుగ్మతలు వ్రేళ్లూనుకుపోయిన సమాజంలో సజ్జనుల హితబోధలు ఒక్కోసారి వింతగా తోస్తాయి. దైవప్రవక్త హజ్రత్ లూత్ అలైహిస్సలాం మరియు ఆయన వెంటనున్న కొద్దిమంది సౌశీల్యవంతులు ఆ దుర్మార్గుల కంటికి వింత మనుషుల్లా కనిపించారు. తమ సొసైటిలో ఈ పవిత్రులకు చోటు లేదు అని తెగేసి చెప్పే దుస్సాహసానికి పాల్పడ్డారు. కామంతో కళ్ళు మూసుకుపోయిన వానికి సిగ్గూ ఉండదు, భయమూ ఉండదు అన్న దానికి ఇదొక నిదర్శనం.మంచి వైపుకు, సౌశీల్యం పారిశుద్ద్యాల వైపుకు ఆహ్వానించే వారు వారి దృష్టికి అధములుగా కనిపిస్తారు. మంచివారినే వారు చులకన చేస్తారు.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:
మేము పంపిన దూతలు లూత్ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకు పోతూ, ”ఇది చాలా గడ్డురోజు” [125] అని అన్నాడు. (మరో వైపునుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటినుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు.[126] ”నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు [127] ఉన్నారు. మీ కొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను నవ్వులపాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కడైనా మంచివాడు లేడా?’‘ [128] అని లూతు నచ్చజెప్పాడు. ”నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!” [129] అని వారు సమాధానమిచ్చారు.”(అయ్యో!)మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బావుండేది! లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బావుండేది!” [130] అని లూత్ అన్నాడు. అప్పుడు దైవదూతలు “ఓ లూత్! మేము నీ ప్రభువు తరఫున పంపబడిన వారము. వారు నీ దాకా రాలేరు. కాబట్టి నువ్వు నీ ఇంటివారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు. మీలో ఎవరూ వెనుతిరిగి చూడకూడదు. అయితే నీ భార్య; వారందరికీ పట్టే గతే ఆవిడకూ పట్టనున్నది. వారికోసం ఉదయ సమయం నిశ్చయించబడింది. ఏమిటీ, ఉదయ సమయం దగ్గరలో లేదా?” [131] అని పలికారు. మరి మా ఉత్తర్వు(ను అమలుపరచే సమయం) రాగానే ఆ బస్తీని తల క్రిందు లుగా చేసేసి, వారిపై నిరాఘాటంగా గులకరాళ్ళను కురిపించాము. అవి నీ ప్రభువు తరపున గుర్తు వేయ బడినవి. అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు. [132](సూరా హూద్ 11 :77 – 83)
[125] హజ్రత్ లూత్ (అలైహిస్సలాం) అంతగా మనస్తాపం చెందడానికి కారణం ఏమిటంటే దైవదూతలు మీసాలు కూడా మొలవని నవయువకుల రూపంలో వచ్చారు. తన జాతి పురుషుల సిగ్గుమాలిన చేష్టల గురించి ఆయనకు తెలుసు కాబట్టి పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టి ఆయన వ్యాకులతకు లోనయ్యారు. వచ్చిన ఆ అందమైన నవయువకులు అతిథులు కానేకారనీ, వారు దైవశాసనాన్ని అమలు పరచడానికి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు.
[126] లూత్ ఇంటికి అందమైన కొందరు యువకులు వచ్చి ఉన్నారని తెలియగానే ఆ స్వలింగ సంపర్క రోగగ్రస్తులు ఉండబట్టలేక పరుగెత్తుకుని వచ్చారు. ఆ యువకులను తమ తమ ఇళ్లకు తీసుకుపోయి వాళ్ళను ఆ పాడుపని కోసం ఉపయోగించు కోవాలనుకున్నారు.
[127] అంటే – లైంగిక కోర్కెల్ని తీర్చుకోవాలన్నదే మీ ఉద్దేశ్యమైతే అందుకోసం ‘నా కూతుళ్లు ఉన్నారు. వారిని వివాహమాడండి. మీ కోర్కెల్ని ధర్మబద్ధంగానూ, సహజపద్ధతిలోనూ తీర్చుకోండి. ఇదే మీ కొరకు అన్ని విధాలా శ్రేయస్కరం అని లూత్ చెప్పదలిచారు. ఇక్కడ ‘కూతుళ్లు’ అంటే ఎవరు? తన జాతికి చెందిన మహిళలను ఆయన కూతుళ్లుగా చెప్పుకున్నారని చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దైవప్రవక్త తన జాతివారి కొరకు పితామహుడు వంటివాడు. అలా చెప్పటంలోని ఆయన ఆంతర్యం ఏమిటంటే సమాజంలో ఇంతమంది ఆడపిల్లలు ఉండగా మీకేం పోయే రోగం వచ్చింది? మీరు ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకుని మీ సహజ కోరికల్ని తీర్చుకోవచ్చుకదా! (ఇబ్నె కసీర్).
[128] ఏమిటీ? నా ఇంటికి వచ్చిన అతిథులతో దుర్వవహారం చేసి నన్ను అవమానాలపాలు చేస్తారా? మీలో ఆ మాత్రం అర్ధం చేసుకునే వారు లేరా? అతిథి మర్యాదకు కళంకం తెస్తారా? మీ దుష్ట బుద్ధిని అడ్డుకునే సజ్జనుడు మీలో ఒక్కడూ లేడా? దైవప్రవక్త లూత్ ఇంతగా కలత చెందడానికి కారణం అప్పటివరకూ ఆయన ఆ అతిథులను మానవ మాత్రులుగా తలపోయటమే. ఆ వచ్చిన వారు మనుషులు కారనీ, దుర్మార్గుల భరతం పట్టడానికి దివి నుంచి భువికి దిగివచ్చిన దైవదూతలని ఆయనకు తెలీదు. వారు దైవదూతలన్న సంగతి ఆయనకు ముందు నుంచే తెలిసి ఉంటే కలవరం చెందేవారు కారు. దైవప్రవక్తలకు రహస్య విషయాల జ్ఞానం ఉండదని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రబల తార్మాణమే.
[129] అంటే ఆ దుర్మార్గులు సహజమైన, ధర్మసమ్మతమైన ఒక వద్ధతిని ్రోసివుచ్చి అసహజమైన, అహేతుకమైన, అధర్మమైన చేష్టను అవలంబించారు. పరమ జుగుప్సాకరమైన ఈ పనిలో లూత్ జాతివారు ఎంత ముందుకు వెళ్ళిపోయారో, వారి కళ్లు ఎలా మూసుకుపోయాయో దీన్నిబట్టి బోధపడుతోంది.
[130] “బలం” అంటే బాహుబలం, ఒనరులు, సంతానబలం అని భావం. “దృథఢమైన ఆధారం” అంటే తనను సమర్థించే తెగగానీ, వంశంగానీ ఉంటే వారిని ఆశ్రయించే వాడినే! అన్నది ఆయన ఆవేదన. ఎంతటి నిస్సహాయస్థితిలో ఆయన ఈ మాటలన్నారో అర్థమవుతోంది. నన్ను ఆదుకునేవారు, నా తరఫున మాట్లాడేవారు ఈ రోజు ఉండి ఉంటే అతిథుల విషయంలో నేను అవమానం పాలు కాకుండా ఉండేవాడినే! అని ఆందోళన చెందారు. దైవప్రవక్త హజత్ లూత్ (అలైహిస్సలాం) గారి ఈ ఆకాంక్ష దైవంపై భారం మోపే విషయానికి విరుద్ధం కాజాలదు. ప్రాపంచికంగా మనిషి తన రక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ పైన దైవంపై భారం వేయాలి. ఇదే సరైనది. అంతేగాని చేతులు ముడుచుకు కూర్చుని, అన్నింటికీ దేవుడే ఉన్నాడు అంటే అసలుకే నష్టం వాటిల్లుతుంది. కాబట్టి హజ్రత్ లూత్ (అలైహిస్సలాం) పలుకుల్లో విపరీతమైన అంశం ఏమీ లేదు. ఈ సంఘటన ద్వారా విదితమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు. అలాగే వారు సర్వాధికారాలు కలిగి ఉండరు. దైవప్రవక్తలకు సర్వాధికారాలు ఉండి ఉంటే ఈ సందర్భంగా హజ్రత్ లూత్ అత్యంత దీనంగా ఇలా చెప్పుకుని ఉండేవారు కారు. ఈ రోజుల్లో కొందరు దైవప్రవక్త (స)కు సర్వాధికారాలుండేవని నమ్ముతున్నారు. ఈ నమ్మకం సరైనది కాదు. పై ఆయతు వారి ఈ నమ్మకాన్ని ఖండిస్తున్నది.
[131] ఒకవైపు లూత్ గారి దీనావస్థను, మరోవైపు ఆ జాతిజనుల విశ్చంఖలత్వాన్ని గమ నించిన దైవదూతలు జోక్యం చేసుకోవలసిన తరుణం వచ్చేసింది. “ఓ లూత్! మీరు ఆందోళన చెందనవసరం లేదు. వాళ్లు మా దాకా కాదుకదా, కనీసం మీ దాకా కూడా రాలేరు. రాత్రి పొద్దుపోయాక మీ మనుషులను వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తెల్లవారగానే ఈ పట్టణవాసులు నాశనం చేయబడతారు” అని వారు ధైర్యం చెప్పారు.
[132]“అవి” అంటే ఏవి? ఆయా ఊళ్లను ధ్వంసం చేయటానికి వాటిపై విసరబడిన “రాళ్ళు’ అని కొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడగా, ఈ ఆయతులో “అవి” అనే సర్వనామం నాశనమైన ఆ ‘ఊళ్ళ’నే సూచిస్తున్నదని మరికొంతమంది అభిప్రాయ పడ్డారు. ఆ ఊళ్లు సిరియా-మదీనాల మధ్య ఉండేవి. “దుర్మార్గులు” అంటే మక్కాకు చెందిన సత్యతిరస్కారులు. వెనుకటి జాతులకు పట్టిన దుర్గతే మీకూ పడుతుంది జాగ్రత్త! అని హెచ్చరించటం ఈ వాక్యాల ప్రధాన ఉద్దేశం.
ప్రవక్త లూత్ అలైహిస్సలాం జాతివారు స్వలింగ సంపర్కంమనే అత్యంత నీచమైన చేష్టకు పాల్పడటంతో వారిపై దేవుడి శిక్షలు దాపురించాయి!.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:
మరి మా దూతలు లూత్ (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు [49]. అప్పుడు వారిలా అన్నారు: “నువ్వు భయపడకు. కలత చెందకు. మేము నీ భార్యను తప్ప [50] – నిన్నూ, నీ పరివారాన్నీ కాపాడుతాము. ఎందుకంటే ఆమె (శిక్షను అనుభవించటానికి) వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది.” “మేము ఈ పట్టణవాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము.[51] (ఆ విధంగా) మేము ఆ పట్టణాన్ని బుద్ధి జీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా [53] చేసాము” (సూరా అంకబూత్ 29 : 33 – 35)
[50] హజ్రత్ లూత్ అలైహిస్సలాం పరిస్దితిని అర్ధం చేసుకున్న దైవదూతలు భీతి చెందరాదని, దుఃఖించరాదని ఆయన్ని ఓదార్చారు. తాము దుష్టులను శిక్షించటానికి పంపబడిన దైవదూతలం అని తెలిపారు. అయితే దగాకోరుగా వ్యవహరించిన ఆయన భార్యకు సయితం శిక్షపడటం ఖాయమని ఆ సందర్భంగా దైవదూతలు స్పష్టం చేశారు.
[51] ఆకాశం నుంచి అవతరించిన ఆ శిక్ష ఎటువంటిదంటే దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం వారి నివాస స్ధలాలను భూమినుంచి పెళ్ళగించి, ఆకాశం దాకా ఎత్తుకెళ్ళి అమాంతం క్రింద పడేశారు. ఆ తరువాత వారిపై కంకర రాళ్ళ వర్షం కురిపించబడింది. ఆ స్ధలాన్ని దుర్వాసన వచ్చే జలసంధి (మృత సముద్రం)గా మార్చివేయటం జరిగింది. (ఇబ్నె కసీర్)
[53] ఒకవైపు నుంచి రాళ్ళ వర్షం, మరో వైపు నుంచి ఇళ్ళు తలక్రిందులవటం, ఆ తరువాత ఆ ప్రదేశం అంతా దుర్వాసనతో కంపుకొట్టడం ఇదంతా ఒక గుణపాఠ సూచనే. ఆ ప్రదేశం మృత సముద్రంగా వ్యవహరించబడుతోంది. కాని విజ్ఞులు మాత్రమే ఇలాంటి ఘటనల నుండి గుణపాఠం గ్రహిస్తారు.
సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది [46].చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసివేశాము [47]. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము [48]. నిస్సందేహంగా యోచన చేసేవారి కొరకు [49] ఇందులో ఎన్నో సూచనలున్నాయి. ఈ పట్టణం (జనులు) వచ్చిపోయే రహదారిపైనే ఉంది [50] (సూరా అల్ హిజ్ర్ – 15 :73 – 75)
[46] సూర్యుని లేలేత కిరణాలు పడుతున్న సమయంలో ఒకే ఒక్క శబ్దం వచ్చింది. అత్యంత భయంకరమైన ఈ కేక హజ్రత్ జిబ్రీల్ (అలైహిస్సలాం)దని కొంతమంది అభిప్రాయపడ్డారు.
[47] వారి నివాస స్థలాలు భూమి నుంచి ఆకాశానికి ఎత్తి, వాటిని తలక్రిందులుగా చేసి విసిరివేయటం జరిగిందని అనబడుతోంది. ఆ విధంగా వారు తమ ఇల్లూ వాకిలి సమేతంగా తలక్రిందులుగా చేసివేయబడ్డారు. అయితే కేవలం పై కప్పులతో సహా ఇళ్లు కూలిపోవటం మాత్రమే దీని భావమని మరికొందరంటారు.
[48] ఆ తర్వాత వారిపై ఒక ప్రత్యేక రకమైన కంకర రాళ్లు కూడా కురిపించబడ్డాయి. ఈ విధంగా వారు మూడు రకాల శిక్షలకు గురిచేయబడ్డారు. భావితరాల కొరకు ఇదొక గుణపాఠం అయ్యేలా చేయబడింది.
[49] ఆయతులో ‘ముతవస్సిమీన్” అని వుంది. నిశిత దృష్టితో విషయాన్ని పరికించే వారిని, యోచన చేసేవారిని ‘ముతవస్సిమీన్’ అంటారు. అలాంటి వారి కోసం ఇందులో గుణపాఠం ఉంది.
[50] అంటే ప్రధాన రహదారి అని భావం. మదీనా నుంచి సిరియాకు వెళ్ళే మార్గంలో శిథిలావస్థలో ఉన్న లూత్ (అలైహిస్సలాం) జాతి ప్రజల పట్టణాలు కానవస్తాయి. అటువైపు వచ్చేపోయే వారంతా ఆ దారి గుండా సాగవలసిందే. అవి మొత్తం అయిదు పేటలు. 1. సద్దూమ్ (ముఖ్యపట్టణం) 2. సాబ 3. సావహ్ 4. అస్‌ర 5. దూమా. వీటిని నాశనం చేసిన తీరు గురించి ఒక కథనం ఈ విధంగా ఉంది : హజత్ జిబ్రీల్ (అలైహిస్సలాం) తన రెక్కలపై ఈ పేటలను ఎత్తుకుని నింగికేసి సాగిపోయారు. ఆకాశాన ఉన్నవారు కూడా వారి కుక్కలు మొరగటాన్ని, కోళ్లు కూతవేయటాన్ని విన్నారు. ఆ తరువాత వారిని నేలకేసి గిరాటు కొట్టారని అనబడుతోంది (ఇబ్నె కసీర్). అయితే ఈ కథనానికి ప్రామాణికమైన అధారాలు లేవు.
తౌబా, ఇస్తిగ్ ఫార్ ప్రాముఖ్యత
తౌబా, ఇస్తిగ్ ఫార్ చేయడంలో తప్పులు, పొరపాట్లు
తౌబా, ఇస్తిగ్ ఫార్ చేయడంలో జాప్యం చేయడం
తౌబా, ఇస్తిగ్ ఫార్ గురించిన సందేహాలు
ఇక్కడ వినండి లేదా ఆడియో డౌన్లోడ్ చేసుకోండి [35 నిముషాలు]
ఆడియో మొదటి భాగం క్రింద వినవచ్చు:
తౌబా (పశ్చాత్తాపం), ఇస్తిగ్ ఫార్ అంటే ఏమిటి? వాటి లాభాలు ఏమిటి? [ఆడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఇతరములు:
అస్మా బిన్తె అబూబకర్ ఉల్లేఖనం ప్రకారం: ఒక స్త్రీ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సన్నిధికి వచ్చి “ప్రవక్తా! నా కూతురికి చర్మవ్యాది సోకింది. దాని మూలంగా ఆమె తలవెంట్రుకలు రాలిపోయాయి. నేనామెకు పెళ్ళి చేశాను. మరి నేను ఆమెకు సవరం పెట్టవచ్చా?” అని అడిగింది. దానికి ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) “సవరం పెట్టుకునే స్త్రీని మరియు పెట్టుకోవటానికి తాపత్రయపడే స్త్రీని అల్లాహ్ శపించాడు” అని అన్నారు. (ముస్లిం 2123, బుఖారి 5941).
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖించారు: “స్త్రీ తన శిరోజాల్లో సవరం పెట్టుకొనుటను ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) గట్టిగా వారించారు”. (ముస్లిం 2126).
ఈ రోజుల్లో “విగ్” రూపంలో ఇది చెలామణిలో ఉంది. ఈ నిషిద్ధ కార్యం జరిగే బ్యూటిపార్లర్‌లలో ఇంకా చెప్పరాని దుష్కా ర్యాలు జరుగుతాయి.
దీనికి సంబంధించిన మరో నిషిద్ధత ఎరువిచ్చుకునే వెంట్రుకలు. డ్రామాల్లో, ఫిల్ములో పనిచేసేవాళ్ళు, (వాళ్ళను అనుకరించేవాళ్ళు) వీటిని ఉపయోగీస్తారు. ఇలాంటి వారికి పరలోక సాఫల్యంలో ఓ భాగమైనా లభించదు.
[ఇది ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) గారు రాసిన “ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు”అను పుస్తకం నుంచి తీసుకుబడింది. ]
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి: https://teluguislam.net/whatsapp/
ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి: (40 నిమిషాలు)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“ఓ విశ్వాసులారా! మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్ వైపుకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు.” (నూర్ – ౩7)
“మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపుకే మరలండి (పాపాల పశ్చాత్తాపపడండి).” (హూద్ – ౩)
“విశ్వసించిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపుకు మరలండి.” (తహ్రీమ్ – 8)
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:
“అల్లాహ్ సాక్షి! నేను రోజుకు డెబ్భైకన్నా ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడుకుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉంటాను.” (బుఖారీ)
(సహీహ్ బుఖారీలోని ప్రార్ధనల ప్రకరణం.)
ఇతరములు:
You must be logged in to post a comment.