హజ్ పాఠాలు – 1: హజ్ ఆదేశాలు, హజ్ నిబంధనలు, సిద్ధాంతములు & ఇహ్రాం ధర్మములు [వీడియో]

బిస్మిల్లాహ్

[13:50 నిముషాలు]
హజ్ మరియు ఉమ్రా ఆదేశాలు (Haj Umrah) [పుస్తకం]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

హజ్, ఉమ్రా మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/

హజ్ ఆదేశం, దాని విశిష్టత:

ప్రతి ముస్లిం స్త్రీ పురుషునిపై జీవితంలో ఒక్కసారి హజ్ చేయుట విధిగా ఉంది. ఇది ఇస్లాం మూల స్తంభాలలో ఐదవది. అల్లాహ్ ఆదేశం:

[وَللهِ عَلَى النَّاسِ حِجُّ البَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا].

అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. (ఆలి ఇమ్రాన్ 3: 97).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ الله وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ وَالْحَجِّ وَصَوْمِ رَمَضَانَ

ఇస్లాం మూల స్తంభాలు ఐదున్నవి: (1) అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. (2) నమాజు స్థాపించుట. (3) విధి దానము (జకాత్) చెల్లించుట. (4) హజ్ చేయుట. (5) రమజాను నెల ఉపవాసం ఉండుట. (బుఖారి 8, ముస్లిం 16).

దాని ఘనత: అల్లాహ్ సాన్నిధ్యంలో చేర్పించు సత్కార్యాలలో హజ్ అతిగొప్పది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారుః

(مَنْ حَجَّ هَذَا الْبَيْتَ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ).

ఎవరైతే ఏలాంటి వాంఛలకు లోనవకుండా, దైవ ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా హజ్ చేసి తిరిగి వెళ్తారో, వారు తమ తల్లి గర్భము నుంచి పుట్టినప్పటి స్థితిలో తిరిగి వెళ్తారు. (బుఖారి 1819, ముస్లిం 1350).

హజ్ నిబంధనలు:

[1]. తెలివిగల, [2] యుక్తవయస్సుకు చేరిన ప్రతి [3] ముస్లింపై హజ్ విధిగా ఉంది. అతను దానికి [4] అర్హుడైనప్పుడు. అంటే తన బాధ్యతలో ఉన్నవారి ఖర్చులు చెల్లించాక, అతని వద్ద మక్కా రాను, పోను పూర్తి ప్రయాణ ఖర్చులు ఉండాలి. [5] ప్రయాణ దారి నిర్భయంగా ఉండాలి. [6] శారీరకంగా ఆరోగ్యవంతుడై యుండాలి. హజ్ చేయుటకు ఆటంకం కలిగించే అంగవైకల్యం మరే శారీరక రోగం ఉండ కూడదు. ఇక స్త్రీ విషయంలో గత నిబంధనలతో పాటు తనతో తన [7]‘మహ్రమ్’ (వివాహ నిషిద్ధమైన బంధువు) ఉండాలి. అంటే భర్త, లేక ఆమె దగ్గరి మహ్రమ్ లో ఏవరైనా ఒకరు ఉండాలి. ఆమె (తన భర్త చనిపోయినందుకు లేదా విడాకులు పొందినందుకు) [8] గడువులో కూడా ఉండ కూడదు. ఎందుకనగా గడువులో ఉన్నవారు ఇంటి బైటికి వెళ్ళుట అల్లాహ్ నిషేధించాడు. ఎవరికి ఇలాంటి ఆటంకాలు ఎదురగునో వారిపై హజ్ విధిగా లేదు.

హజ్ సిద్ధాంతములు:

  • 1- హాజి హజ్ కొరకు పయణమయ్యే ముందు హజ్, ఉమ్రా పద్ధతులను తెలుసుకొని ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదివి లేదా పండితులతో ప్రశ్నించి ఇంకే విధంగానైనా సరే తెలుసుకోవాలి.
  • 2- మేలు విషయాల్లో సహాయపడే మంచి మిత్రుని వెంట వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒక వేళ ధర్మజ్ఞాని, లేదా ధర్మజ్ఞాన విద్యార్థి తనకుతోడుగా ఉంటే మరీ మంచిది.
  • 3- హజ్ ఉద్దేశం అల్లాహ్ అభీష్టాన్ని, ఆయన సన్నిధానమును పొందుటయే ఉండాలి.
  • 4- వృధా మాటల నుండి నాలుకను కాపాడాలి.
  • 5- ఎవరికీ బాధ కలిగించకుండా ఉండాలి.
  • 6- స్త్రీ పర్ద చేయు విషయంలో, జన సమ్మూహం నుండి దూరముండుటకు అన్ని రకాల ప్రయత్నం చేయాలి.
  • 7- హాజి తనకు తాను అల్లాహ్ ఆరాధనలో ఉన్నట్లు, లోక సంచారములో కాదని భావించాలి. కొందరు హజ్ యాత్రికులు అల్లాహ్ వారికి సన్మార్గము చూపుగాకా! వారు హజ్ యాత్రను వినోద విహారమునకు, ఫోటోలు, వీడియోలు తీయుటకు సదావకాశముగా భావిస్తారు. (ఇది తప్పు).

ఇహ్రామ్:

‘ఇహ్రామ్’ హజ్ ఆరాధనలోకి ప్రవేశము. హజ్ లేక ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ‘ఇహ్రామ్’ విధిగా ఉంది. హజ్ లేక ఉమ్రా చేయు వ్యక్తి మక్కా బయటి నుండి వచ్చే వారయితే ప్రవక్త నియమించిన మీఖాతుల్లో ఏ ఒక మీఖాతు నుండైనా ఇహ్రామ్ చేయాలి. ఆ మీఖాతులు ఇవిః

  • 1- ‘జుల్ హులైఫ‘: ఇది మదీనకు సమీపంలో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు ‘అబ్ యారె అలీ‘. ఇది మదీనవాసుల మీఖాత్.
  • 2- ‘అల్ జుహ్ ఫ‘: అది రాబిగ్  సమీపంలో  ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచే ఇహ్రామ్ చేస్తున్నారు. ఇది సిరీయా వారి మీఖాతు.
  • 3- ‘ఖర్నుల్ మనాజిల్‘ (‘అస్సైలుల్ కబీర్‘): ఇది తాయిఫ్ కు సమీపాన ఒక ప్రాంతం. ఇది నజ్ద్ వారి మీఖాత్.
  • 4- ‘యలమ్ లమ్‘: ఇది యమన్ వారి మీఖాత్.
  • 5- ‘జాతు ఇర్ఖ్‘: ఇది ఇరాఖ్ వారి మీఖాత్.

పై మీఖాతులు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నియమించారు. అవి మేము తెలిపిన వారి ప్రాంత నివాసుల మరియు వారి తప్ప ఎవరైతే హజ్ లేక ఉమ్రా చేయుటకు వాటి నుండి దాటుతారో వారికి కూడాను. ఇక మక్కా నివాసులు మరియు ‘అహ్లుల్ హిల్ల్’ (మక్కా నగరానికి బయట మరియు మీఖాతు లోపల నివసించువారు) తమ ఇంటి నుండే ఇహ్రామ్ చేయాలి.

ఇహ్రామ్ ధర్మములు:

ఇహ్రామ్ కు ముందు చేయవలసిన ధర్మములు:

1- గోర్లు, చంకల మరియు నాభి క్రింది వెంట్రుకలు తీయాలి. మీసాలు కత్తిరించాలి. స్నానం చేసి, సువాసన శరీరానికి పూసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులకు పూసుకోవద్దు.

2- కుట్టిన బట్టలు తీసి, ఒక పంచి కట్టుకొని, ఒక దుప్పటి వేసుకోవాలి. స్త్రీ తనకిష్టమైన బట్టలు ధరించవచ్చును. అయితే పూర్తి పర్ద చేయాలి. అలంకరణ ప్రదర్శించకుండా ఉండాలి. పరపురుషులు ఎదురయ్యే సమయాన ముఖము, అరచేతుల పర్ద కూడా చేయుటకు ప్రయత్నించాలి. చేతుల్లో గ్లౌసులు, ముఖముపై నఖాబ్ వేయ కూడదు.

3- మస్జిద్ కు వెళ్ళి నమాజ్ సమయమయితే జమాఅతుతో నమాజు చేసుకోవాలి. లేనిచో రెండు రకాతులు ‘తహియ్యతుల్ వుజూ’ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇహ్రామ్ చేయాలి.

%d bloggers like this: