
[14:16 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు
హజ్ మరియు ఉమ్రా ఆదేశాలు (Haj Umrah) [పుస్తకం]
అన్సాకుల్ హజ్ మూడు రకాలు:
1- హజ్జె తమత్తుఅ: ముందు ఉమ్రా యొక్క ఇహ్రామ్ మాత్రమే చేయాలి. ఉమ్రా చేసిన తరువాత హలాల్ అయిపోయి, మళ్లీ హజ్ రోజున మక్కాలో తానున్న ప్రాంతము నుండే హజ్ కొరకు ఇహ్రామ్ చెయ్యాలి. మీఖాతులో ఇలా అనాలి. లబ్బైక్ ఉమ్రతన్ ముతమత్తిఅన్ బిహా ఇలల్ హజ్. హజ్జె తమత్తుఅ మిగిత రెండు రకాల కంటే చాలా శ్రేష్ఠమైనది. అది ముఖ్యంగా హాజి హజ్ సమయానికి ముందుగా మక్కాలో వచ్చి ఉంటే. ఇందులో హాజీ ఒక బలిదానము తప్పక ఇవ్వాలి. ఒక వ్యక్తి తరఫున ఒక మేక మరియు ఏడుగురి తరఫున ఒక ఒంటె లేక ఒక ఆవు సరిపోతుంది.
2- ‘హజ్జె ఖిరాన్’: ఒకే సమయంలో ఉమ్రా మరి హజ్ ఇహ్రామ్ చేయాలి. లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జన్ అనాలి. ముందు ఉమ్రా చేసి (అంటే తావాఫ్, సఈ చేసి, తల వెంట్రుకలు తీయకుండా) అదే ఇహ్రామ్ లో ‘యౌమున్నహర్’ (10వ తేది) వరకు ఉండాలి. ఇలా ఉమ్రా తరువాత హలాల్ గాకుండా హజ్ లో చేరడం అవుతుంది. ఈ రకమైన హజ్ సామాన్యంగా హజ్ ఆరంభానికి అతి సమీపంలో వచ్చినవారు చేస్తారు. ఉమ్రా చేసి హలాల్ అయి మళ్ళీ హజ్ కొరకు ఇహ్రామ్ చేసే సమయం ఉండదు గనక. లేదా బలి జంతువు తమ వెంట తీసుకొచ్చిన వారు చేస్తారు. ఈ హజ్ లో కూడా బలిదానం తప్పనిసరి.
3- ‘హజ్జె ఇఫ్రాద్’: కేవలం హజ్ సంకల్పం మాత్రమే చేయాలి. మీఖాత్ లో లబ్బైక్ హజ్జన్ అనాలి. ఇందులో బలిదానం అవసరం లేదు. విమానంలో ప్రయాణించువారు మీఖాత్ కు సమాన ప్రాంతం వద్దనే ఇహ్రామ్ చేయాలి. మీఖాత్ ఏర్పాటు కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు కూడా చేయవచ్చును. ఇక మీఖాత్ వద్ద చేసే పనులు; గోళ్ళు తీయడం, స్నానం చేసి, శరీరానికి సువాసన పూసుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులు ధరించడం లాంటివన్నీ విమానంలో లేదా అందులో పయనమయ్యే ముందు పూర్తి చేసుకోవాలి. మీఖాత్ వద్ద లేదా దానికి కొంచెం ముందు చేరుకున్నప్పుడు ఇహ్రాం సంకంల్పం చేయాలి.
ఇహ్రామ్ విధానం:
ఇహ్రామ్ ఈ విధంగా చెప్పాలి:
- 1- హజ్జె తమత్తుఅ చేయువారు లబ్బైక్ ఉమ్రతన్ ముతమత్తిఅన్ బిహా ఇలల్ హజ్జ్ అనాలి.
- 2- హజ్జె ఖిరాన్ చేయువారు లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జన్ అనాలి.
- 3- హజ్జె ఇఫ్రాద్ చేయువారు లబ్బైక్ హజ్జన్ అనాలి.
ఇహ్రమ్ నుండి మొదలుకొని కాబా ప్రదక్షిణం ప్రారంభించే వరకు “తల్ బియ” చదువుతూ ఉండాలి: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హంద వన్నిఅమత లక వల్ ముల్క, లా షరీక లక.
لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ لَبَّيْكَ لَا شَرِيكَ لَكَ لَبَّيْكَ
إِنَّ الحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالمُلْكَ لَا شَرِيكَ لَكَ
ఇహ్రామ్ నిషిద్ధతలు:
ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధం అగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధనలో ప్రవేశించాడు. అతనిపై క్రింది విషయాలు నిషిద్ధం:
- 1- తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం నిషిద్ధం. కాని అవసరమున్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు.
- 2- గోళ్ళు తీయుట నిషిద్ధం. కాని గోరు విరిగినా, నొప్పి ఉన్నా దానిని తీయుట పాపం కాదు.
- 3- సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం నిషిద్ధం.
- 4- సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు నిషిద్ధం. ఉదా: పెళ్ళి చేసుకొనుట, చేయించుట, భార్యభర్తల సరసాలడడం వగైరా.
- 5- చేతులలో గ్లౌసులు వేసుకొనుట నిషిద్ధం.
- 6- వేటాడుట నిషిద్ధం.
పై ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఇక ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధం ఉన్న విషయాలు దిగువ తెలుపబడుతున్నవి.
- 1- కుట్టిన బట్టలు ధరించడం నిషిద్ధం. కాని అవసరముంటే బెల్ట్, గడియారం మరియు కళ్ళ జోళ్ళు ఉపయోగించవచ్చును.
- 2- తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉపయోగించడం నిషిద్ధం. కాని అంటుకొని ఉండని గొడుగు, వాహణము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించడం యోగ్యం.
- 3- మేజోళ్ళు తొడుగుట నిషిద్ధం. కాని సైండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడే బూట్లు ఉపయోగించ వచ్చును.
పై నిషిద్ధ కార్యాలు చేసినవాని 3 స్థితులు:
- 1- అకారణంగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును. ఇంకా అతనిపై ‘ఫిద్య’ (ప్రాయశ్చితం) కూడా విధియగును.
- 2- ఏదైనా అవసరం ఉండి చేసిన వ్యక్తి పాపాత్ముడు కాడు. కాని ప్రాయశ్చితం చెల్లించాలి.
- 3- ఏదో కారణంగా – ఉదా: తెలియక, మరచి- పోయి, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై చేసిన వ్యక్తి పాపాత్ముడూ కాడు, అతనిపై ప్రాయశ్చితమూ లేదు.
హజ్, ఉమ్రా మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/
You must be logged in to post a comment.