ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన మూడు విషయాలు [ఆడియో]

బిస్మిల్లాహ్
ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన మూడు విషయాలు :
(1) ప్రయోజనకరమైన జ్ఞానం (2) పవిత్ర ఆహారం మరియు (3) అంగీకరింపబడే ఆచరణ

ఈ క్రింది దుఆ నేర్చుకొని ఫజర్ ప్రార్ధన తరువాత అల్లాహ్ ను వేడుకోండి :

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ عِلْمًا نَافِعًا وَرِزْقًا طَيِّبًا وَعَمَلًا مُتَقَبَّلًا
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిఅ, వరిజ్ఖన్ తయ్యిబ, వ అమలమ్ ముతఖబ్బల.
(ఓ అల్లాహ్! నేను నీతో ప్రయోజనకరమైన జ్ఞానం, పవిత్ర ఆహారం మరియు అంగీకరింపబడే ఆచరణ కోరుతున్నాను).
(ఇబ్ను మాజ 925).

ఈ దుఆ రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (పగలు రాత్రి దుఆలు) అనే పుస్తకం నుండి తీసుకోబడింది. సంకలనం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్). లింక్ మీద క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి. అందరు తప్పకుండ నేర్చుకొని రేయింబళ్ళలో అల్లాహ్ కు దుఆ చేసుకోండి, ఇహపర లాభాలు పొందండి.

ఈ దుఆ గురుంచిన వివరణకు ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [10:16 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

సజ్దాలో చేసుకొనే ప్రవక్త దుఆలు

1.సుబ్ హాన రబ్బియల్ అఅలా. (ముస్లిం 772).

سُبْحَانَ رَبِّيَ الأعلَى

(ఉన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).

ఒక్కసారి చదవడం విధిగా ఉంది. ఎక్కువ సార్లు చదవడం చాలా మంచిది.

2- సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వ బిహందిక అల్లాహుమ్ మగ్ఫిర్లీ. (బుఖారి 794, ముస్లిం 484).

سُبْحَانَكَ اللَّهُمَّ رَبَّنَا وَبِحَمْدِكَ اللَّهُمَّ اغْفِرْلِي

(మా ప్రభువైన ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధునివి, నీకే స్తోత్రములు, ఓ అల్లాహ్ నన్ను మన్నించు).

3- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలా ఇకతి వర్రూహ్. (ముస్లిం 487).

سُبُّوحٌ قُدُّوسٌ رَبُّ الْـمَلَائِكَةِ وَالرُّوحُ

(దైవదూతలు మరియు జిబ్రీల్ యొక్క ప్రభువు పరిశుద్ధుడు, పరమపవిత్రుడు).

4- సుబ్ హాన జిల్ జబరూతి వల్ మలకూతి వల్ కిబ్రియాఇ వల్ అజమహ్. (అబూదావూద్ 873, నిసాయి 1049. అల్బానీ సహీ అని అన్నారు).

سُبْحَانَ ذِي الجَبَرُوتِ وَالمَلَكُوتِ وَالْكِبرِيَاءِ وَالْعَظْمَةِ

(సార్వభౌమాధికారి, సర్వాధిపతి, గొప్పవాడు మరియు ఘనుడు అయిన అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు).

5- అల్లాహుమ్మగ్ఫిర్లీ జంబీ కుల్లహూ దిఖ్ఖహూ వ జిల్లహు వ అవ్వలహూ వ ఆఖిరహూ వ అలానియతహూ వ సిర్రహూ. (ముస్లిం 483).

اللَّهُمَّ اغْفِرْلِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ وَجِلَّهُ وَأوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ

(ఓ అల్లాహ్! నా చిన్నా పెద్ద, ముందు వెనక, బహిర్గతమైన, రహస్యమైన పాపాలన్నిటినీ క్షమించు).

6- అల్లాహుమ్మ లక సజత్తు వ బిక ఆమంతు వ లక అస్లమ్ తు సజద వజ్ హియ లిల్లజీ ఖలకహు వ సవ్వరహు వ షక్క సమ్అహు వ బసరహు తబారకల్లాహు అహ్ సనుల్ ఖాలికీన్. (ముస్లిం 771).

اللَّهُمَّ لَكَ سَجَدْتُ وَبِكَ آمَنْتُ وَلَكَ أَسْلَمْتُ سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَصَوَّرَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ تَبَارَكَ اللهُ أَحْسَنُ الخَالِقِينَ

(ఓ అల్లాహ్ నేను నీ కొరకు సజ్దా చేశాను, నిన్ను విశ్వసించాను, నీకే శిరసవహించాను, నా ముఖం దానిని సృష్టించిన, ఆకారం ఇచ్చిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

7- అల్లాహుమ్మ అఊజు బిరిజాక మిన్ సఖతిక వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక వ అఊజు బిక మిన్క లా ఉహ్ సీ సనాఅన్ అలైక అంత కమా అస్నైత అలా నఫ్సిక. (ముస్లిం 486).

اللَّهُمَّ أَعُوذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ وَبِمُعَافَاتِكَ مِنْ عُقُوبَتِكَ وَأَعُوذُ بِكَ مِنْكَ لَا أُحْصِي ثَنَاءً عَلَيْكَ أَنْتَ كَمَا أَثْنَيْتَ عَلَى نَفْسِكَ

(ఓ అల్లాహ్! నీ అప్రసన్నత నుండి నీ ప్రసన్నత శరణు, నీ శిక్ష నుండి నీ మన్నింపు శరణు కోరుతున్నాను. నిన్ను నీవు ఎలా స్తుతించుకున్నావో అలా నేను నీ స్తోత్రాలను లెక్కించలేను).

సజ్దాలో ఉన్నప్పుడు ఎక్కువగా దుఆ చేయడం మంచిది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వస్లలం) ఈ హదీసు ఆధారంగా:

దాసుడు తన ప్రభువుకు అత్యంత సమీపంగా ఉండేది సజ్దా స్థితిలో. అందుకు మీరు అందులో దుఆ ఎక్కు వగా చేయండి“. (ముస్లిం 482).

పుస్తకం నుండి: రేయింబవళ్ళ ముఖ్యమైన దుఆలు (పగలు రాత్రి దుఆలు)
కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ, ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

[వుజూ తర్వాత దుఆ] స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ

స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ: عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ مِنْ أَيِّهَا شَاءَ). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః "మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, "అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ" చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు". (ముస్లిం 234).

స్వర్గపు ఎనిమిది ద్వారాల్లో ఇష్టమున్న ద్వారము నుండి ప్రవేశించే స్వేచ్ఛ:

عَنْ عُمَرَ بنِ الخَطَّابِ ÷ عَنْ رَسُولِ الله ﷺ قَالَ: (مَا مِنْكُمْ مِنْ أَحَدٍ يَتَوَضَّأُ فَيُسْبِغُ الْوَضُوءَ ثُمَّ يَقُولُ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ إِلَّا فُتِحَتْ لَهُ أَبْوَابُ الْـجَنَّةِ الثَّمَانِيَةُ يَدْخُلُ
مِنْ أَيِّهَا شَاءَ).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “మీలో ఎవరైనా సంపూర్ణంగా వుజూ చేసి, “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ” చదివితే వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. తాను కోరిన ద్వారము నుండి అతను అందులో ప్రవేశించవచ్చు”. (ముస్లిం 234).

నమాజు నిధులు (Treasures of Salah)
https://teluguislam.net/2011/02/24/treasures-of-salah-namaz-telugu-islam/

ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు – హిస్న్ అల్ ముస్లిం నుండి

బిస్మిల్లాహ్

129. ఇస్తిగ్ ఫార్ మరియు తౌబా వచనాలు

248. “అల్లాహ్ సాక్షిగా! నేను ప్రతి దినము డెబ్బైసార్లకంటే ఎక్కువ అల్లాహ్ ను మన్నింపుకై వేడుకుంటాను, మరియు పశ్చాత్తాపంతో ఆయన వైపునకు మరలుతుంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సెలవిచ్చారు. (బుఖారీ). [అల్ బుఖారీ, అల్ అస్ఖలాని ఫత్-హుల్ బారీ 11/101]


249. “ప్రజలారా! పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి నేనయితే రోజుకు వందేసి సార్లు క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు? (ముస్లిం 4/2076).


250. ఎవరయితే “అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి” అని పలుకుతారో అల్లాహ్ అతన్ని క్షమిస్తాడు. ఒకవేళ అతను యుద్ధభూమి నుండి పారిపోయిన వాడైనా సరే అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (అబూదావూద్, అహ్మద్, తిర్మిదీ 3-182).

أَسْتَغْفِرُ اللهَ الْعَظِيمَ الَّذِي لَا إِلَهَ إلَّا هُوَ الحَيُّ القَيُّومُ وأَتُوبُ إِلَيْهِ

అస్తగ్ ఫిరుల్లాహల్ అదీమల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూము వ అతూబు ఇలైహి

నేను  మహోన్నతుడు అయిన అల్లాహ్ మన్నింపు కోరుతున్నాను. ఆయన తప్ప (నిజ) ఆరాధ్యుడు ఎవరూ లేరు. అయన నిత్యుడు. శాశ్వతుడు. నేను అయన సమక్షంలోనే తౌబా చేస్తున్నాను.

[దీనిని అబుదావూద్ ఉల్లేఖించారు. 2/85, అత్తిర్మిదీ 5/569, అల్ హాకిం 1/115 సహీహ్ మరియు అజ్జహబీ ఏకీభవించారు. అల్బానీ గారు దీనిని సహీహ్ అన్నారు. చూడుము సహీహ్ అత్తిర్మిదీ 3/182 జామిఆ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం 4/389–390 అల్ అర్నావూత్ శోధన.]


251. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రకటించారు: “రాత్రి చివరి గడియలలో ప్రభువు దాసునికి అతి చేరువలో ఉంటాడు. ఆ వేళ అల్లాహ్ ను  స్మరించే వారిలో మీరు కూడా చేరాలనుకుంటే చేరండి.”

[దీనిని అత్తిర్మిదీ, అన్నిసాఈ 1/279, మరియు అల్ హాకిం ఉల్లేఖించారు. చూడుము అల్ అల్బానీ సహీహ్ అత్తిర్మిదీ 3/183 మరియు జామిఅ అల్ ఉసూల్ లి అహాదీథుర్రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్ అర్నావూత్ శోధన 4/144. ]


252. “సజ్దా స్థితిలో దాసుడు అల్లాహ్ కు అతి చేరువలో ఉంటాడు. కనుక ఆ స్థితిలో మీరు (అల్లాహ్ ను) ఎక్కువగా వేడుకోండి” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం 1/350, అబుషేబా).


253. “అప్పుడప్పుడు నా మనసుకు ఏదో ఆవహించినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను రోజుకు నూరుసార్లు అల్లాహ్ క్షమాపణకై అర్థిస్తూ ఉంటాను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు. (ముస్లిం).

[దీనిని ముస్లిం ఉల్లేఖించారు 4/2075, ఇబ్నుల్ అధీర్ అలా అన్నారు: “లయుఘాను అలా ఖల్ బీ” నాహృదంపై మీద పొర వచ్చినప్పుడు అంటే, దీని అర్థం : తప్పిదం పొరపాటు (మరచిపోవుట) : ఎందుకంటే రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎల్లప్పుడు అధికంగా స్మరణలో నిమగ్నులై ఉండేవారు, అయితే ఎప్పుడైనా కొన్ని సమయాలలో వారు మరచిపోతే దానిని వారు తన తప్పిదముగా లెక్క కట్టేవారు మరియు క్షమాభిక్ష వేడుకునేవారు. చూడుము జామిఅ అల్ ఉసూల్ 4/386.]


ఇది హిస్న్ అల్ ముస్లిం (తెలుగు)  అనే పుస్తకం నుండి తీసుకోబడింది ( కొన్ని చిన్న మార్పులతో)
అరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని.
అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ.
https://teluguislam.net/2010/11/23/hisn-al-muslim-vedukolu-telugu-islam/

లైలతుల్ ఖద్ర్ దుఆ

బిస్మిల్లాహ్
1196. ఆయేషా (రదియల్లాహు అన్హా) కధనం : నేను ప్రవక్తతో “దైవ ప్రవక్తా! నేనొక వేళ లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి) ఏదో కనుగొంటే ఆ రాత్రి నేను ఏమని ప్రార్ధించాలో కాస్త చెబుతారా?” అని అడిగాను.    ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్ధించమని చెప్పారు : اللَّهمَّ إنَّكَ عفوٌّ تحبُّ العفوَ فاعفُ عنِّي అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్‌ అఫ్‌వ  ఫా'ఫు అన్నీ అల్లాహ్‌! నీవు అమితంగా మన్నించేవాడవు. మన్నింపును ఇష్టపడతావు. కనుక నన్ను మన్నించు (తిర్మిజీ- హసన్‌, సహీహ్‌) హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి

1196. ఆయేషా (రదియల్లాహు అన్హా) కధనం : నేను ప్రవక్తతో “దైవ ప్రవక్తా! నేనొక వేళ లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి) ఏదో కనుగొంటే ఆ రాత్రి నేను ఏమని ప్రార్ధించాలో కాస్త చెబుతారా?” అని అడిగాను.    ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రార్ధించమని చెప్పారు :

اللَّهمَّ إنَّكَ عفوٌّ تحبُّ العفوَ فاعفُ عنِّي

అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్‌ అఫ్‌వ  ఫా’ఫు అన్నీ

అల్లాహ్‌! నీవు అమితంగా మన్నించేవాడవు. మన్నింపును ఇష్టపడతావు. కనుక నన్ను మన్నించు

(తిర్మిజీ- హసన్‌, సహీహ్‌)

తెలుగు మూలంలైలతుల్ ఖద్ర్ లో చేయబడే నమాజు  – హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి

రమదాన్ మెయిన్ పేజీ :
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

నబీ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దరూద్ పఠించు ఘనత – హిస్న్ అల్ ముస్లిం

బిస్మిల్లాహ్

107. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించు ఘనత

219. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రకటించారు.

“ఎవరైతే నాకై ఒకసారి “దరూద్ దుఆ” చదువుతారో అతనికి అల్లాహ్ తన కారుణ్యం పది సార్లు పంపుతాడు.” 

[ముస్లిం 1/288.]


220. మరియు ప్రవక్త (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రకటించారు :

“నా సమాధిని మీరు ఉత్సవ క్షేత్రంగా చేసుకోకండి, మీరు ఎక్కడ నుండియైనా నాకై “దరూద్ దుఆ” పంపండి అది నాకు తప్పక చేరుతుంది.”

[బుఖారీ ముస్లిం] [అబుదావూద్ 2/218, అహ్మద్ 2/367 మరియు అల్బానీ గారు సహీహ్ అబిదావూద్ 2/283లో దీనిని సహీహ్ అన్నారు]


221. ఇంకా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలిపారు :

“ఎవరి ముందైనా నా పేరు ప్రస్తావించబడినపుడు వారు నాకై “దరూద్ దుఆ” చేయక పోతే అతను పిసినారి.”

[అత్తిర్మిదీ 5/551, ఇతరులు ఉల్లేఖించారు. చూడుము సహీహ్ అల్ జామిఅ 3/ 25, సహీహ్ అత్తిర్మిదీ 3/177.]


222. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలిపారు.

“నిశ్చయంగా అల్లాహ్ యొక్క దూతలు కొందరు భూమిపై సంచరిస్తూ ఉంటారు. వారు నా అనుచర సమాజము పంపించు సలాం నాకు అందజేస్తారు.”

[అన్నిసాఈ 3/43, అల్ హాకిం 2/421 మరియు సహీహ్ అన్నిసాఈ 1/274లో అల్బానీ గారు దీనిని సహీహ్ అన్నారు.]


223. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలిపారు.

“ఎవరైనా నాకు సలాం పంపినచో, అల్లాహ్ నా ఆత్మను నా వైపుకు పంపిస్తాడు, నేను తిరిగి అతనికి సలాం పంపిస్తాను.”

[అబుదావూద్, సంఖ్య 2041 అల్బానీ గారు సహీహ్ అబిదావూద్ 1/383లో దీనిని హసన్ అన్నారు.]


ఇది హిస్న్ అల్ ముస్లిం (తెలుగు)  అనే పుస్తకం నుండి తీసుకోబడిందిఅరబ్బీ మూలం: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తాని. అనువాదం: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ.
https://teluguislam.net/2010/11/23/hisn-al-muslim-vedukolu-telugu-islam/

పూర్తి దరూద్ షరీఫ్:

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”

చిన్న దరూద్ షరీఫ్ : 

అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ వ బారిక్ అలా ముహమ్మద్

ఇతర లింకులు:

[దుఆ] అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుక హుబ్బక, వ హుబ్బ మయ్-యుహిబ్బుక ..

1491. హజ్రత్‌ అబూ దర్దా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు: దావూద్‌ ప్రవక్త (అలైహిస్సలాం) ప్రార్థనల్లో ఇది కూడా ఒకటి:

اللهم إني أسألك حبك، وحب من يحبك، والعمل الذي يبلغني حبك، اللهم اجعل حبك أحب إلى من نفسي، وأهلي، ومن الماء البارد

 

అల్లాహుమ్మ ఇన్నీ అస్-అలుక హుబ్బక, వ హుబ్బ మయ్-యుహిబ్బుక, వల్-అమల్ అల్లజీ యుబల్లిఘునీ హుబ్బక. అల్లాహుమ్మ అజ్-అల్ హుబ్బక అహబ్బ ఇలయ్య మిన్ నఫ్ సీ, వ అహ్ లీ, వ మినల్ మాయిల్ బారిద్  

ఓ అల్లాహ్! నేను నీ ప్రేమను, నిన్ను ప్రేమించేవారి ప్రేమను, నన్ను నీ ప్రేమ దాకా చేర్చే కర్మలను ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్‌! నీ ప్రేమను నా కొరకు నా ప్రాణం కన్నా, నా ఆలుబిడ్డల కన్నా, చల్లని నీటికన్నా ప్రియమైనదిగా చెయ్యి.” (తిర్మిజీ-హసన్)

(సుననె తిర్మిజీలోని దావాత్‌ అధ్యాయాలు)

ముఖ్యాంశాలు;

ఈ ప్రార్ధనలో అల్లాహ్  ప్రేమతోపాటు అల్లాహ్ ప్రియదాసుల ప్రేమను, సత్కార్యాల ప్రేమను కూడా అర్ధించటం జరిగింది. ఎందుకంటే మనిషికి వీటి మూలంగా కూడా అల్లాహ్ ప్రేమ, ఆయన సాన్నిహిత్యం లభిస్తాయి.


ఈ హదీసు హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen) నుండి తీసుకోబడింది . Book 17, Hadith 1491

ఐదు విషయాలను కోరుతూ అల్లాహ్ ను అడిగే ఒక మంచి దుఆ [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [ 5 నిముషాలు]

తప్పక విని నేర్చుకోండి, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉండండి

اللهمَّ إِني أسأَلُك الصِّحَةَ والعِفَّةَ، والأمَانَةَ وحُسنَ الخُلُقِ، والرِّضَا بالقَدَر

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకస్ సిహ్హత్, వల్ ఇఫ్ఫత, వల్ అమానత, వ హుస్నల్ ఖులుఖ్, వర్రిధా బిల్ ఖద్ర్

ఓ అల్లాహ్ నాకు ప్రసాదించు: (1) ఆరోగ్యం, (2) అన్ని రకాల చెడులు దూరంగా ఉండి ఒకరి ముందు నీచంగా ఉండకుండా ఉండుట, (3) అమానత్, (4) సద్వర్తన, (5) విధి వ్రాత తో సంతోషపడటం 

(అదాబ్ అల్ ముఫ్రద్, ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

అల్లాహ్ యేతరులతో “దుఆ” చేయుట, లేక సహాయం కొరకు “మొర” పెట్టుకొనుట షిర్క్ – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

14వ అధ్యాయం
అల్లాహ్ యేతరులతో “దుఆ” చేయుట, లేక సహాయం కొరకు “మొర” పెట్టుకొనుట షిర్క్

అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ

అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్నిగాని లాభాన్నిగాని కలిగించ లేని ఏ శక్తిని వేడుకోకు. ఒక వేళ అలా చేస్తే నీవూ దుర్మార్గుడవై పోతావు. అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవ్వరూ లేరు“. (యూనుస్ 10 : 106,107).

 إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ

అల్లాహ్ ను కాదని మీరు ఆరాధిస్తున్నవి మీకు ఏ ఉపాధినీ ఇచ్చే అధికారం కలిగి లేవు, ఉపాధి కొరకు అల్లాహ్ ను అడగండి!” (అన్ కబూత్ 29 : 17).

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమ మార్గభ్రష్టుడైన వాడు ఎవడు? మానవులందరిని సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అహ్ ఖాఫ్ 46: 5,6).

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ

బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు?.” (నమ్ల్  27: 62).

తబ్రానీలో ఉంది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కాలంలో ఒక కపటవిశ్వాసి విశ్వాసులకు చాలా బాధకలిగించేవాడు. ఒకసారి సహచరులు “పదండి! మనం ప్రవక్తతో ఈ కపటవిశ్వాసి గురించి మొరపెట్టుకుందాము” అని అన్నారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  చెప్పారు: “నాతో కాదు మొర పెట్టుకోవలసింది. అల్లాహ్ తో మొరపెట్టుకోవాలి“.

ముఖ్యాంశములు:

1. “దుఆ” (ప్రార్థన) సర్వ సామాన్యమైనది. కాని “ఇస్తిగాస” (మొర) ప్రత్యేకించబడినది.

2. సూరె యూనుస్ లోని ఆయత్ (అల్లాహ్ ను వదలి నీకు నష్టాన్ని గాని లాభాన్ని గాని కలిగించలేని ……….) యొక్క భావం తెలిసింది.

3. అదే షిర్క్ అక్బర్ .

4. పుణ్యపురుషుడు, మహాభక్తుడు అల్లాహ్ యేతరులతో వారి సంతృప్తి కొరకు మొరపెట్టుకుంటే అతడు కూడా దుర్మార్గులలో కలసిపోతాడు.

5. సూరె యూనుస్ లోని రెండవ ఆయతు (అల్లాహ్ గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే …..) యొక్క భావం తెలిసింది.

6. అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకుంటే వారు ఏ లాభమూ చేకూర్చలేరు. అది అవిశ్వాసం కూడాను.

7. అన్ కబూత్ లోని ఆయతు (అల్లాహ్ ను కాదని మీరు పూజిస్తున్నవి…….) యొక్క భావం కూడా తెలిసింది.

8. స్వర్గం అల్లాహ్ తో కోరినట్లు, ఉపాధి కూడా అల్లాహ్ తో మాత్రమే కోరాలి.

9. అహ్ ఖాఫ్ లోని ఆయతు (అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి……..) యొక్క భావం తెలిసింది.

10. అల్లాహ్ ను వదలి ఇతరులతో దుఆ చేసిన వానికంటే ఎక్కువ దుర్మార్గుడు, భ్రష్టుడు మరొకడు లేడు.

11. ఎవరితోనైతే మొరపెట్టుకొనడం జరుగుతుందో వారు మొరపెట్టుకునే వారిని ఎరుగరు.

12. ఇహలోకంలో మొరపెట్టుకోవటం, పరలోకంలో వారి పరస్పర ద్వేషానికి, శతృత్వానికి కారణమగును.

13. అల్లాహ్ ను వదలి ఇతరులను మొరపెట్టుకొనుట వారి ఆరాధన చేసినట్లు అగును.

14. మొరపెట్టుకోబడినవాడు ఈ మొరను తిరస్కరిస్తాడు.

15. ఇదే పరమ మార్గభ్రష్టత్వానికి కారణం.

16. అహ్  ఖాఫ్ వాక్యం (బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు……….) యొక్క భావం తెలిసింది.

17. చాలా ఆశ్చర్యకరమైన విషయం: కష్ట కాలాలలో అల్లాహ్ తప్ప ఎవరూ వినరని విగ్రహరాధకులు సయితం ఒప్పుకుంటారు. అందుకే ఆ సమయాల్లో అల్లాహ్ తోనే చిత్త శుద్ధితో మొరపెట్టుకుంటారు. (కాని ఈనాటి సమాధి పూజారులైన ముస్లింల విషయం బాధకరమైనది. అల్లాహ్ వారికి తౌహీద్ మార్గం చూపుగాక!).

18. పై హదీసు ద్వారా తెలిసిందేమిటంటే; ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తౌహీద్ ను అన్ని రకాల షిర్క్ నుండి దూరముంచడానికి చాలా ప్రయత్నం చేశారు. అల్లాహ్ తో ఏలాంటి మర్యాద పాటించాలో నేర్పారు.

తాత్పర్యం: (అల్లామా అస్-సాదీ) :

పదవ అధ్యాయం లోని తాత్పర్యంలో తెలుపబడిన షిర్క్ అక్బర్ యొక్క పరిచయాన్ని నీవు అర్థం చేసుకొనియుంటే 12, 13, 14వ అధ్యాయాలు కూడా అర్థం చేసుకోగలవు.

మొక్కుబడి ఒక ఆరాధన. దాన్ని పూర్తి చేసిన వారిని అల్లాహ్ ప్రశంసించాడు. అల్లాహ్ విధేయత కొరకు మొక్కుకున్న మొక్కు బడి పూర్తి చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశించారు.

ఏ పని గురించి ధర్మం ఆదేశించిందో, లేక అది చేసినవారిని ప్రశంసించిందో అది ఇబాదత్. మరొకసారి ఇబాదత్ (ఆరాధన) పరిచయాన్ని (భావాన్ని) గుర్తుంచుకొండి: “అల్లాహ్, ఇష్టపడే, తృప్తి చెందే ప్రతీ బాహ్య, ఆంతర్య మాటలు, చేష్టలు“.

అన్ని రకాల కీడు నుండి అల్లాహ్ శరణు మాత్రం కోరాలని అల్లాహ్ ఆదేశించాడు. ఇది ఇబాదత్. అల్లాహ్ తో శరణు కోరితే దాన్ని తౌహీద్ , విశ్వాసం అంటారు. ఇతరులతో కోరితే షిర్క్ అంటారు.

దుఆ మరియు మొరపెట్టుకొనుటలో వ్యత్యాసం ఏమనగా: దుఆ అన్ని పరిస్థితులకు ఉపయోగపడుతుంది. కష్టకాలాల్లో మొరపెట్టుకోవడం జరుగుతుంది. ఇవన్నియు పూర్తి చిత్తశుద్ధితో అల్లాహ్ తోనే చేయాలి. ఆయనే దుఆలు వినేవాడు. అంగీకరించేవాడు. కష్టాలను తొలగించువాడు. శక్తి లేని దాని గురించి దైవదూత, వలీలతో మొరపెట్టుకునేవాడు ముష్రిక్, కాఫిర్ అవుతాడు. ధర్మభ్రష్టుడవుతాడు. సృష్టిలో ఎవరి వద్ద కూడా స్వయంగా తనకు, లేక ఇతరులకు లాభనష్టాలు చేకూర్చే ఏ శక్తి లేదు. అందరూ అన్ని విషయాల్లో అల్లాహ్ ఎదుట బీదవాళ్ళే.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఫజ్ర్ నమాజు మరియు దాని తర్వాత ఓ దుఆ ఘనత [ఆడియో]

బిస్మిల్లాహ్

ఇక్కడ వినండి /డౌన్లోడ్ చేసుకోండి [5 నిమిషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా