ఋజుమార్గం టీవి ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. “ఎవరికి చావు ఎలా వస్తుంది? “అనే శీర్షిక మనం వింటూ ఉన్నాము.
అందులో మరొక ముఖ్య విషయం ఏమిటంటే చావు ఎప్పుడైతే వస్తుందో, మరణదూతను మన కళ్లారా మనం చూస్తామో అప్పుడు చావు యొక్క వాస్తవికత తెలుస్తుంది. చావుకు సంబంధించిన విషయాలు మన ముందు స్పష్టం అవుతాయి. అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కరుణ మనపై ఉందో గమనించండి. చనిపోయే ఏ మనిషి కూడా “నాకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఈ కష్టాల్లో ఉన్నాను. ఇకనైనా మీరు నాతో గుణపాఠం నేర్చుకోండి. విశ్వాస మార్గాన్ని అవలంబించండి. సత్కార్యాలు చేస్తూ పోండి మీరు” అని ఎవరూ కూడా చెప్పలేరు. తాను ఏ కష్టాలను భరిస్తున్నాడో వాటి నుండి తనను తాను రక్షించు కోవటానికి ఏదైనా మార్గం ఉందా అని అరుస్తూ ఉంటాడు. అతని చుట్టుపక్కల ఉన్న అతని బంధువులకు, మిత్రులకు ఏది చెప్పలేక పోతాడు. కానీ అల్లాహ్ యొక్క ఎంత గొప్ప కరుణ మనపై ఉందో గమనించండి, ఆ వివరాలు మనకు అల్లాహ్ ముందే మనకు ఎందుకు తెలియజేశాడు? ఎందుకంటే ఆ పరిస్థితి మనకు రాకముందే మనకు మనం చక్క దిద్దుకోవాలి.
వారిలోని ఒకరికి చావు సమీపించినప్పుడు, ఓ నా ప్రభువా తిరిగి నన్ను ఇహలోకానికి మరోసారి పంపు.ఏ సత్కార్యాలు అయితే నేను ఇంతవరకు చేసుకోలేకపోయానో ఏ సత్కార్యాల్ని నేను విలువ లేకుండా వదిలేశానో ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ మరణ సందర్భంలో వాటి యొక్క విలువ ఎంత అనేది నేను ఆ తిరిగి సత్కార్యాలు చేసుకుంటాను. తిరిగి నన్ను ఇహలోకంలోకి పంపు. అప్పుడు ఏమి సమాధానం వస్తుంది? కల్లా ముమ్మాటికి అలా జరగదు.ఒక మాట అతను నోటితో పలుకుతున్నాడు. కానీ అతని కోరిక ఎన్నటికీ పూర్తి కాదు. పునరుత్థాన దినం మరోసారి వారిని సజీవులుగా లేపబడేది. ఆరోజు వరకు వారి వెనక ఒక అడ్డు ఉంది. ఆ అడ్డు తెరలో వారు అక్కడే ఉంటారు. (సూరతుల్ మూమినూన్ 23:99-100)
చావు వచ్చినప్పుడే దాని యొక్క వాస్తవికత అనేది మన ముందు స్పష్టమవుతుంది. ఆ విషయాలని అల్లాహ్ తెలిపాడు. మనం వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.
సూరత్ అష్షూరా ఆయత్ నెంబర్ 44 లో కూడా అల్లాహ్ తఆలా విషయాన్ని ఎంత స్పష్టంగా తెలిపాడో గమనించండి.
“దుర్మార్గులు, అవిశ్వాసులు, షిర్క్ చేసేవాళ్ళు, పాపాలు లో మునిగి ఉన్న వాళ్ళు శిక్షను చూసినప్పుడు వారు ఏమంటారో అప్పుడు మీరు చూసెదరు. ఏమి ఇహలోకానికి తిరిగి పోవడానికి ఏదైనా అవకాశం ఉందా? అనివారు అప్పుడు అడుగుతారు” (సూరత్ అష్షూరా 42:44)
కానీ ఎలాంటి అవకాశం ఏమి ఇవ్వడం జరగదు. ఈ సందర్భంలో చావు సమీపించిన సందర్భములో అల్లాహ్ కరుణలో మనపై ఉన్నటువంటి గొప్ప కరుణ ఒకటి ఏమిటంటే ఎవరైతే ఆ చివరి సమయంలో కూడా తన సృష్టికర్తను మరచిపోకుండా లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతారో అలాంటి వారికి అల్లాహ్ స్వర్గం ప్రసాదిస్తాడు అన్నటువంటి శుభవార్త ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు తెలియపరిచారు. సునన్ అబీ దావూద్ లోని హదీద్ లో ఇలా ఉంది: ఇహలోకంలో ఎవరి చివరి మాట “లా ఇలాహ ఇల్లల్లాహ్” – అల్లాహ్ తప్ప వేరే సత్యఆరాధ్యుడు మరి ఎవ్వడు లేడు. ఈ సద్వచనం తన చివరి మాటలు అవుతాయో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ క్లిష్ట పరిస్థితులు, బాధకరమైన సమయంలో, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎవరికి గుర్తొస్తుందో అల్లాహ్ కే బాగా తెలుసు. కానీ ఇహ లోకంలో దాని గురించి కాంక్ష ఉంచిన వారు, దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండేవారు, అలాంటి వారికి అల్లాహ్ తఆలా ఆ సత్భాగ్యం ప్రసాదించగలడు.
ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మనిషి చనిపోతాడో సామాన్యంగా తీసుకెళ్ళి అంత క్రియలు అన్నీ చేసి సమాధిలో పెట్టడం జరుగుతుంది. అప్పుడు సమాధిలో ఎవరికి, ఎలా జరుగుతుంది అనే విషయం కూడా మనందరి గురించి చాలా ముఖ్యమైన విషయం.
సమాధిలో పెట్టడం జరిగిన తరువాత ఒకవేళ అతను విశ్వాసుడు అయితే, పుణ్యాత్ముడు అయితే, సత్కార్యాలు చేసే వాడు అయితే, అతనికి అతని యొక్క ఆత్మ తిరిగి అతని శరీరంలో వేయడం జరుగుతుంది. అతను లేచి కూర్చుంటాడు. అదే సమయంలో ఎప్పుడైతే అతను కళ్ళు తెరుస్తాడో సూర్యాస్తమయం కావడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది అన్నట్లుగా కనబడుతుంది. అప్పుడే ఇద్దరు దైవ దూతలు అతని వద్దకు వస్తారు. అతను అంటాడు పక్కకు జరగండి. నా అసర్ నమాజ్ నాకు ఆలస్యం అయిపోయింది నేను అసర్ నమాజ్ చేసుకుంటాను. వారు అంటారు, ఇది నమాజ్ చేసే సమయం కాదు. నమాజ్లు చేసే సమయం ఇహలోకంలో సమాప్తం అయిపోయింది. ఇప్పుడు మా ప్రశ్నలకు మీరు సిద్దం కావాలి. నీ ప్రభువు ఎవరు? నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవాడివి? అని అంటే అతను విశ్వాసి కనుక రబ్బీ అల్లాహ్ నా ప్రభువు అల్లాహ్, నేను ఆయన్నే ఆరాధిస్తూ ఉంటిని అని అంటాడు. రెండవ ప్రశ్న అడుగుతాడు. నీ ధర్మం ఏది? ఏ ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉంటివి? అతడు అంటాడు, నా ధర్మం ఇస్లాం ధర్మం అని. తర్వాత మూడో ప్రశ్న జరుగుతుంది. మీ మధ్య ప్రవక్తగా పంపబడిన ఆ ప్రవక్త ఎవరు అని? అప్పుడు అతను అంటాడు: ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని. అప్పుడు వారు నాలుగో ప్రశ్న అడుగుతారు. సామాన్యంగా ఎక్కువ మంది మన ముస్లిం సోదరులకి బహుశా ఈ మూడు ప్రశ్నలు తెలిసి ఉన్నాయి. కానీ నాలుగో ప్రశ్న కూడా ప్రశ్నించడం జరుగుతుంది. శ్రద్ధగా వినండి. ముస్నద్అ హ్మద్ ఇంకా వేరే హాదీస్ గ్రంధాల్లో ఈ విషయం చాలా స్పష్టంగా సహీ హదీద్ లతో రుజువైన విషయం. ఏంటి నాలుగో ప్రశ్న? నీవు ఈ నిజమైన మూడు సమాధానాలు ఏదైతే ఇచ్చావో దీని జ్ఞానంనీకు ఎలా ప్రాప్తం అయింది? ఈ సరైన సమాధానం నువ్వు ఎలా తెలుసుకున్నావు? అప్పుడు అతడు అంటాడు, నేను అల్లాహ్ గ్రంధాన్ని చదివాను. దానిని విశ్వసించాను. అందులో ఉన్న విషయాల్ని సత్యంగా భావించి సత్యరూపంలో నేను ఆచరించడం కూడా మొదలుపెట్టాను. అందుగురించి నాకు జ్ఞానం ప్రాప్తం అయ్యింది అని అంటాడు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ రోజు మనకు మనం ముస్లింలమని ఎంత సంతోషించినా ఖురాన్ జ్ఞానం పొందక ఉంటే, ఖురాన్ యొక్క విద్యనేర్చుకోకుండా ఉంటే, ఇస్లాం ధర్మజ్ఞానాన్ని అభ్యసించి దాని ప్రకారంగా ఆచరించకుండా ఉంటే బహుశా మనకు కూడా సమాధానాలు సరైన రీతిలో ఇవ్వడం కష్టతరంగా ఉండవచ్చు. అల్లాహ్ అలాంటి క్లిష్ట పరిస్థితి నుండి మనల్ని కాపాడుగాక.
ప్రస్తుతం ఇప్పుడు నేను మీముందు విశ్వాసులు అయితే సత్కార్యం చేసే వారు అయితే ఏ మంచి సమాధానం ఇస్తారు అని వివరించాను. ఒకవేళ దీనికి భిన్నంగా అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు, దుష్కార్యాలు చేసేవారు ఎలాంటి సమాధానాలు ఇస్తారో అది తెలియ పరుస్తున్నాను. ఆ తరువాత సమాధిలో ఎవరికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి. ఎవరు ఎలాంటి అనుగ్రహాలకు అర్హులవుతారు. అది తర్వాత మనం తెలుసుకుందాం ఇన్షాఅల్లాహ్.
విశ్వాసికి ఏ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుందో, అతను ఎలా సమాధానం ఇస్తాడో మనం తెలుసుకున్నాము కదా? ఇక రండి అవిశ్వాసిని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దుర్మార్గులను కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ప్రతి మానవుడ్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎప్పుడైతే వారిని ప్రశ్నించడం జరుగుతుందో వారు ఎలాంటి సమాధానం ఇస్తారు? అనే విషయం తెలుసుకుందాం.
అవిశ్వాసి, కపట విశ్వాసులు, దుర్మార్గులను సమాధిలో పెట్టబడిన తర్వాత ఆత్మ వారి శరీరంలో వేయబడుతుంది. అతను ఆ సందర్భంలో లేచి కూర్చుంటాడు. ఇద్దరు దేవదూతలు వస్తారు. “నీ ప్రభువు ఎవరు?” అని అతని అడుగుతారు. అయ్యో, అయ్యో, నాకు తెలియదు అని అంటాడు. “మీ ధర్మం ఏది?” అని అడుగుతారు. అయ్యో! అయ్యో! నాకు తెలియదు అని అంటాడు. “మీలో పంపబడిన ప్రవక్త ఎవరు” అని అడుగుతారు. అయ్యో! అయ్యో! నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు ఆ తర్వాత విషయం సహీహ్ బుఖారీ లో కూడా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? “నీవు ఎందుకు తెలుసుకోలేదు? నువ్వు ఎందుకు తెలిసిన వారిని అనుసరించలేదు? ఖురాన్ గ్రంధాన్ని పారాయణం ఎందుకు చేయలేదు? విశ్వాస మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు?” అని ఇనుప గదముతో తల మీద, మరొక హదీస్ లో స్పష్టంగా ఉంది, రెండు చెవుల మధ్యలో వెనుక భాగములో చాలా బలంగా కొట్టడం జరుగుతుంది. ఆ యొక్క దెబ్బతో ఎంత పెద్ద శబ్దంతో అతను అరుస్తాడు అంటే ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు: “మానవులు మరియు జిన్నాతులు తప్ప సృష్టిలో ఉన్న ప్రతీ సృష్టి అతని అరుపును వింటారు.” ఇక తర్వాత అతనికి శిక్షలు మొదలవుతాయి.
సోదరులారా సోదరీమణులారా వింటున్న ఈ విషయాలు, వింటున్న మీరు, “అరే వాళ్ళు వాళ్ళ విషయాలు అలా చెప్పుకుంటున్నారు” అని ఎగతాళి చేసి విలువ నివ్వకుండా వినడం కూడా మానుకుంటే ఇప్పుడు నాకు నష్టం కలిగేది ఏమీ లేదు. కానీ మన అందరం కూడా ఒక రోజు చనిపోయేది ఉంది. మరియు సమాధి యొక్క ఈ శిక్షల గురించి ఏదైతే తెలుపడం జరుగుతుందో, సమాధిలో జరిగే ఈ ప్రశ్నోత్తరాల గురించి ఏదైతే తెలపడం జరుగుతుందో వాటన్నిటిని మనం కూడా ఎదుర్కొనేది ఉంది.
ఇక్కడ ఒక విషయం గమనించండి, సామాన్యంగా సర్వమానవులు కూడా చనిపోయే వారిని సమాధిలో తీసుకొచ్చి పెట్టడమే సరైన పద్ధతి. అందు గురుంచే మాటి మాటికి సమాధి యొక్క అనుగ్రహాలు, సమాధి శిక్షలు, సమాధిలో ఎలాంటి ప్రశ్నోత్తరాల జరుగుతాయి. సమాధి, సమాధి అని మాటిమాటికీ మనం అంటూ ఉంటాము. కానీ ఎవరైనా సమాధి చేయబడకుండా అగ్నికి ఆహుతి అయితే, క్రూర జంతువు వారిని తినేస్తే, లేదా సముద్రంలో వారు కొట్టుకుపోయినా లేదా విమానం గాలిలోనే పేలిపోయి ఏ ముక్కలు ముక్కలు మిగలకుండా వారు అలాగే హతమైనా, నాశనమైనా, ఏ విధంగా చనిపోయినా, ఆ చావు ఎలా జరిగినా కానీ శరీరం నుండి ఆత్మ వేరు అవుతుంది. ఆ తర్వాత శరీరం మిగిలి ఉండి ఉంటే, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఖననం చేయడం జరిగితే అందులో ఆ ఆత్మను వేయబడి ప్రశ్నించడం జరుగుతుంది. లేదా అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ తన ఇష్టప్రకారం వేరే ఏదైనా ఒక శరీరం ఏర్పాటు చేసి ఆత్మను అందులో వేయవచ్చు, లేదా డైరెక్టుగానే ఆత్మతోనే ఈ ప్రశ్నోత్తరాలు కూడా జరపవచ్చు. ఈ ప్రశ్నోత్తరాలు జరగడం సత్యం. ఇందులో అనుమానానికి ఏ తావులేదు.
ఇక తరువాత సరైన సమాధానం ఇచ్చిన విశ్వాసి మరియు సత్కార్యాలు చేసేవారు, అలాంటి వాళ్లలో అల్లాహ్ మనల్ని కూడా చేర్చుగాక, వారికీ సమాధిలో ఎలాంటి అనుగ్రహాలు మొదలవుతాయి అంటే ముందు వారికి నరకం వైపు నుండి ఒక చిన్న కిటికీ తెరవటం జరుగుతుంది. ఇదిగో నరకంలో మీ స్థానం చూడండి. కానీ అల్లాహ్ దయ మీపై కలిగింది. అల్లాహ్ మిమ్మల్ని ఈ నరకం నుండి కాపాడాడు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. తర్వాత స్వర్గం యొక్క కిటికీ తెరవడం జరుగుతుంది. అందులో వారి యొక్క స్థానం చూపడం జరుగుతుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “ప్రతి ఒక్కరు స్వర్గంలో నరకంలో ఉన్నటువంటి వారి స్థానాలను చూస్తారు సమాధిలో ఉండి.”
ఆ తరువాత అల్లాహ్ ఆకాశం నుండి ఒక శుభవార్త ఇస్తాడు: “నా ఈ దాసుని కొరకు స్వర్గపు ద్వారాలు, స్వర్గపు కిటికీలు తెరవండి”. అక్కడి నుండి సువాసన వస్తూ ఉంటుంది. మరియు మంచి గాలి వస్తూ ఉంటుంది మరియు “ఈ దాసుని కొరకు స్వర్గం యొక్క పడక అతని గురించి వేయండి.” అంతేకాదు అతనికి ఆ పడకలు వేయడం జరుగుతాయి. స్వర్గం నుండి సువాసన గాలులు వస్తూ ఉంటాయి. అంతలోనే అతను చూస్తాడు, ఒక అందమైన వ్యక్తి అతని వైపునకు వస్తూ ఉన్నాడు. అయ్యా! నీవు ఎవరివి? చాలా అందమైన ముఖముతో దగ్గరికి అవుతున్నావు మరియు ఏదో శుభవార్త తీసుకొని వస్తున్నట్లుగా కనబడుతున్నావు. అసలు నువ్వు ఎవరివి? అని అంటే ఆ వ్యక్తి అంటాడు, “నేను నీ యొక్క సత్కార్యాల్ని. ఇహలోకంలో నీవు ఏ సత్కార్యాలు అయితే చేశావో నన్ను అల్లాహ్ ఈ రూపంలో నీ వద్దకు తీసుకొచ్చాడు. హాజరు పరిచాడు. నీవు ఎలాంటి ఒంటరితనం నీకు ఏర్పడకుండా నీవు ఎలాంటి భయం చెందకుండా ప్రళయం సంభవించే వరకు ఆ తర్వాత మరోసారి అల్లాహ్ తఆలా ఈ సమాధుల నుండి లేపేవరకు నేను నీకు తోడుగా ఉండాలి”. ఇంతే కాకుండా ఇంకా ఎన్నో వరాలు కూడా ఉంటాయి. ఇన్షా అల్లాహ్ వాటి ప్రస్తావన మరి కొంత సేపటి తరువాత మనం మీ ముందు తెలుపుతామని,
అయితే ఎవరైతే సమాధానం సరియైన విధంగా ఇవ్వరో, అవిశ్వాసులు, కపట విశ్వాసులు, దుర్మార్గులు గా ఉంటారో వారికి ఏం జరుగుతుంది? స్వర్గం వైపు నుండి ఒక కిటికీ తెరవటం జరుగుతుంది. ఇదిగోండి స్వర్గం లో మీ స్థానం ఉండేది, కానీ మీరు సరైన సమాధానం ఇవ్వలేదు కనుక ఈ స్థానం మీకు లేదు అని ఆ కిటికీ మూయడం జరుగుతుంది. నరకం నుండి ఒక కిటికీ తెరవడం జరుగుతుంది. అక్కడి నుండి అగ్ని జ్వాలలు, దుర్వాసన, మంట, వేడి వస్తూ ఉంటుంది. మరియు ఆకాశం నుండి ఒక దుర్వార్త ఇచ్చే వారు ఇలా దుర్వార్త ఇస్తాడు, నా దాసునికి నరకం యొక్క పడక వేయండి. నరకం యొక్క కిటికీలు తెరవండి. అంతలోనే అతను చూస్తాడు, భయంకరమైన నల్లటి ముఖముతో ఒక వ్యక్తి అతని వైపు వస్తున్నాడు. ఓ దుర్మార్గుడా, ఓ చెడ్డ ముఖము కలవాడా, దుర్వాసనతో కూడుకొని ఉన్నవాడా, దూరమైపో ఏదో దుర్వార్త నీవు నాకు తీసుకొని వస్తున్నట్టు ఉన్నది. అతను అంటాడు, అవును నేను నీ దుష్కర్మల్ని. నేను నీకు ప్రళయదినం వరకు తోడుగా ఉండి నీ యొక్క బాధలు ఇంకా పెంచడానికి అల్లాహ్ నన్ను నీతో పాటు ఉండడానికి పంపాడు.
మహాశయులారా ఈ విధంగా సమాధిలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరైతే విశ్వాస మార్గాన్ని అవలంబించరో, దుష్కార్యాలు చేస్తూ ఉంటారో, ఇంకా వేరే ఎన్నో పాపాలకు ఒడికడతారో వారికి కూడా ఎన్నో రకాలుగా శిక్షలు జరుగుతూ ఉంటాయి. వారికి ఎలాంటి శిక్షలు జరుగుతాయి మరియు సమాధి శిక్షల నుండి కూడా మనం సురక్షితంగా ఉండడానికి ఇహలోకంలో ఎలాంటి సత్కార్యాలు మనం చేసుకోవాలి. ఈ విషయాలుఇన్షా అల్లాహ్ ముందు మనం తెలుసుకుందాం.
సమాధి శిక్షలు సమాధి యొక్క అనుగ్రహాలు ఏమిటో తెలుసుకునేకి ముందు ఒక విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అదేమిటంటే ఈ సమాధి పరలోకం యొక్క మజిలీలలో మొదటి మజిలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దీని గురించి తెలిపారు: “సమాధి, పరలోక మజిలీల లో మొట్టమొదటి మజిలీ. ఒకవేళ ఇక్కడ అతడు పాస్ అయ్యాడు అంటే, ఇక్కడ అతనికి మోక్షం లభించింది అంటే, దీని తర్వాత ఉన్న మజిలీల లో అతనికి ఇంకా సులభతరమే అవుతుంది. మరి ఎవరైతే ఈ తొలి మజిలీలో గెలువరో, తొలి మజిలీలో పాస్ అవ్వరో ఇక్కడ వారికి మోక్షం ప్రాప్తం కాదో ఆ తరువాత మజిలీలలో ఇంతకంటే మరీ ఘోరమైన, కష్టతరమైన సమస్యలు ఎదురుకోవాల్సి ఉంటుంది.”
అందుగురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నో సందర్భాల్లో సమాధి శిక్షల నుండి మీరు అల్లాహ్ యొక్క శరణుకోరండి అని మాటిమాటికీ చెబుతూ ఉండేవారు. సమాధి యొక్క శిక్షల నుండి ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజుల్లో కూడా శరణు కోరుతూ ఉండేవారు. వేరే సందర్భాలలో కూడా శరణుకోరుతూ ఉండేవారు. ఎప్పుడైనా సమాధిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఎవరినైనా ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ హాజరైన ప్రజలకు బోధ చేస్తూ కూడా ఈ విషయం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పేవారు.
అందుగురించి సోదరులారా సమాధి శిక్షలకు మనం గురి కాకుండా ఉండడానికి ముందే వాటి గురించి తెలుసుకొని ఇహ లోకంలోనే మనం అక్కడి శిక్షల నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి. వాటి గురించి ఏ సత్కార్యాలు అవలంబిస్తే మనం అక్కడ శిక్షలనుండి రక్షణ పొందగలుగుతామో వాటిని చేసుకొనే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తఆలా మనందరికీ సత్భాగ్యం ప్రసాదించుగాక.
ఇన్షా అల్లాహ్ తరువాయి భాగంలో, సమాధిలో ఎవరికి ఎలాంటి అనుగ్రహాలు లభిస్తాయి? మరియు ఎవరికి ఎలాంటి శిక్షలు కలుగుతాయి? అనే విషయాలు తెలుసుకుందాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్ హందు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మాబాద్!
ప్రియపాఠకులరా! మనం “మరణాంతరం జీవితం” అనే ఈ అంశం లో ముందు మరణం, మరియు అది ఎవరికి ఎలా వస్తుంది? మరణం తర్వాత ఎవరికి ఏమి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాము ఇన్ షా అల్లాహ్!
అయితే మహాశయులారా! ఇహలోకంలో ఎవరు ఎలా జీవించినా కష్టాల్లో, సుఖాల్లో, ఆనందంలో, బాధలో ఎలా జీవితం గడిపినా, వృద్ధులైనా, పిల్లలైనా, బీదవారైనా, శ్రీమంతులైనా ప్రతి ఒక్కరూ చావు ఒడిలోకి తప్పని సరిగా వెళ్ళ వలసి ఉంది. మానవులు వారి వారి విభిన్న విశ్వాసాలు, వారి యొక్క విభిన్న మతాలు, వారు జీవించే విధానాలు ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ ప్రతీ విషయంలో వారు విభేదించుకుంటున్నప్పటికీ విభేదించలేని ఏదైనా విషయం ఉందీ అంటే, అందరూ ఏకంగా నమ్మే విషయం ఏదైనా ఉందీ అంటే; అది చావు మాత్రమే. మనమందరం మరణించ వలసిన వాళ్ళం. మరణం దాని నుండి తప్పించుకుపోవడానికి ఎవరికీ సాధ్యపడదు. మరణానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు ముందు మనం తెలుసుకుందాం.
ఇందులో తొలి విషయం ఏమిటంటే; ప్రతీ జీవి చావు రుచి తప్పక చూడవలసి ఉంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విషయం స్పష్టంగా తెలిపాడు:
చావు నుండి తప్పించుకునే అవకాశం ఎవరికీ లేదు. ఈ సృష్టిలో అల్లాహ్ తర్వాత అందరికంటే ఉత్తములైన, సర్వ సృష్టిలో శ్రేష్ఠులైనవారు ప్రవక్త మహానీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి అల్లాహ్ సూరె జుమర్ 39:30లో ఇలా తెలియపరిచాడు:
“(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణీ శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే, వాళ్లు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటీ”?
ఇక ఎవ్వరికీ ఇలాంటి అవకాశం దొరకనప్పుడు చావు తప్పనిసరిగా దాని రుచి మనం చూడవలసినప్పుడు, దాని గురించి మనం సంసిద్ధత అనేది కూడా ఏర్పాటు చేసుకోవాలి. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పరుచుకోవాలి’ అని ఎలాగైతే అంటారో, అలాగే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే, మనం జీవులుగా ఉన్నంతవరకే మనకు పరలోకంలో కావలసిన సామాగ్రినంతా ఇక్కడే సరిపెట్టుకోవాలి. ఇక్కడే సిద్ధం చేసుకోవాలి. ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియపరిచారు:
ఐదు విషయాల్ని మరో ఐదు విషయాలు సంభవించక ముందే అదృష్టంగా భావించుకో: (1) చావు రాకముందు బ్రతికి ఉన్న ఈ రోజుల్ని అదృష్టంగా భావించు; సత్కార్యాలు చేసుకునే, విశ్వాస మార్గాన్ని అవలంభించే ప్రయత్నంచేయి.(2) ఆరోగ్యాన్ని అనారోగ్యానికి ముందు అదృష్టంగా భావించు. (3) తీరికను పనులు మోపయ్యేకి ముందు అదృష్టంగా భావించు. (4) యవ్వనాన్ని వృద్ధాప్యానికి ముందు అదృష్టంగా భావించు. (5) శ్రీమంతునిగా ఉన్నావు, డబ్బు ధనం చేతిలో ఉంది, దీన్ని అదృష్టంగా భావించు పేదరికానికి గురి అయ్యేకి ముందు. (ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబా 34319, ముస్తద్రక్ హాకిం 7846, సహీహ్ తర్గీబ్ 3355).
ఐదు విషయాలను మీరు గమనించండి! మరో ఐదు విషయాల కంటే ముందు వీటిని అదృష్టంగా భావించి, సద్వినియోగించుకోకుంటే ఎంత నష్టపోతామో!. గమనార్హమైన విషయం ఏమిటంటే; మనిషి చనిపోయిన తరువాత అతని వెంట ఏ డబ్బు, ధనము రాదు. ఏ ఆస్తి ఏ బిల్డింగ్లు, ఏ ప్రాపర్టీ రాదు. అతను తన వెంట కేవలం తాను చేసిన *సత్కార్యాలు మరి దుష్కార్యాలు* తీసుకెళ్తాడు.
ఇహలోకంలో విశ్వాస మార్గాన్ని అవలంభించి సత్కార్యాలు చేసి ఉంటే, చనిపోయిన తర్వాత జీవితంలో సుఖశాంతులు పొందుతాము. ఒకవేళ విశ్వాస మార్గాన్ని అవలంభించకుంటే మరణానంతర జీవితంలో కష్టాలను, దుఃఖాలను, శిక్షలను భరించలేము.
చావు విషయంలో తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే; చావు చాలా గుప్తమైన విషయం. ఎవరికీ చెప్పి రాదు. వచ్చేకి ముందు మెస్సేజ్ చేసి కానీ, కాలింగ్ బెల్ ఇచ్చి గాని, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చేసీ రాదు. అకస్మాత్తుగా చావు వచ్చేస్తుంది. ఈ విషయం మనం మన కళ్లారా చూస్తున్నాం. అయినా మనం గుణపాఠం నేర్చుకోవటం లేదు. ఎవరికీ ఎక్కడ ఏ సమయంలో చావు వచ్చునో అది కేవలం అల్లాహ్ తప్ప మరెవ్వరికీ తెలియదు. సూర లుఖ్మాన్ 31:34లో ఉంది:
చావు విషయంలో మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే; అది వచ్చినప్పుడు క్షణం పాటు ముందు కావాలన్నా కానిపని. ఆలస్యం కావాలన్నా అది ఆలస్యం కావడానికి ఎలాంటి అవకాశం లేదు.
“ప్రతి జాతికీ ఒక గడువు అంటూ ఉన్నది. వారి గడువు వచ్చిందంటే, వారి ఆ సమయం వచ్చిందంటే క్షణం పాటు ముందుగానీ వెనకగానీ అవ్వడానికి ఏ మాత్రం అవకాశం లేదు”. (ఆరాఫ్ 7:34)
ఇప్పటివరకు చావు గురించి విన్న విషయాలు వీటి ద్వారా మనకు ఎంతో బోధ కలగాలి. చావు రాకముందే మనం దానికి సిద్ధం అయ్యి ఉండాలి.
కానీ చావుకు సంబంధించిన ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కేవలం మీ చెవులతోనే కాకుండా మనస్సుతో వినండి. హృదయాంతర చెవులతో విని వాటిని మదిలో నాటుకోండి . దానికి సిద్ధమయ్యే ప్రయత్నం చేయండి. అదేమిటంటే చావు ఎవరికి ఎలా వస్తుంది?
విశ్వాసుడు, పుణ్యాత్ముడు ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ ను నమ్మి, ఆయన భయంతో, తన జీవితం ఆయన విధేయత లో గడిపిన వారికి చావు ఎలా వస్తుంది?
ముస్నద్ అహ్మద్ (18534) మరియు షేఖ్ అల్బానీ గారి సహీ తర్గీబ్ (3558)లో ఉంది: చాలా శ్రద్ధగా చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము, తద్వారా పరలోకానికై ఇహలోకములోనే సిద్ధమవుదాము.
ప్రవక్త మహనీయ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సందర్భంలో ఒక అనుచరుడ్ని ఖననం చేయడానికి స్మశానవాటిక (ఖబరిస్థాన్) వెళ్లిన సందర్భంలో సమాధి తయారవడంలో కొంత ఆలస్యం ఉండగా సహచరులకు పరలోక ప్రయాణం యొక్క వివరాలు ఎలా ఉంటాయో తెలియజేశారు. 2 లేదా 3 సార్లు ముందుగా చెప్పారు:
اسْتَعِيذُوا بِاللهِ مِنْ عَذَابِ الْقَبْرِ
సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు వేడుకోండి.
(ఇలాంటి మాట మనం చదివినప్పుడు, లేదా విన్నప్పుడు: ‘అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్ర్ ’అనాలి. అంటే ‘ఓ అల్లాహ్! సమాధి శిక్ష నుండి నీ శరణు వేడుకుంటున్నాను).
ఆ తర్వాత విశ్వాసుని సంఘటన తెలియబరుస్తూ ఇలా చెప్పారు:
ఎప్పుడైతే ఒక విశ్వాసికి ఈ లోకాన్ని వదిలేసి పరలోక ప్రయాణ సమయం వస్తుందో అప్పుడు ఆకాశం నుండి కొందరు దైవదూతలు దిగి వస్తారు. వారి ముఖాలు తెల్లగా ఉంటాయి, సూర్యునిలాగా మెరుస్తూ ఉంటాయి, స్వర్గపు కఫన్ దుస్తులు, సువాసనలు వారి వెంట ఉంటాయి. ఆ మనిషి ఎంత దూరం చూడగలుగుతాడో, అంతవరకు వారు కూర్చొని ఉంటారు. (వారందరూ విశ్వాసికి పరలోక ప్రయణానికి స్వాగతం పలుకుతూ ఉంటారు). అంతలోనే మలకుల్ మౌత్ (ప్రాణం తీయు దూత) కూడా హాజరవుతాడు. అతని తలాపున కూర్చుంటాడు (ఆ ప్రాణం తీయు దూత ఎంతో ప్రేమగా మృదువుగా అంటాడు):
అప్పుడు శరీరం నుండి ఆత్మ, కుండలో నుండి నీటి చుక్క పడినట్లు చాలా సులువుగా బయటకు వస్తుంది. ఆ తరువాత ప్రాణం తీయు దూత ఎంతో సునాయాసంగా, సులభతరంగా దానిని తీసుకుంటాడు. అతను తీసుకున్న వెంటనే అక్కడ ఉన్న దైవదూతలు అందరూ స్వర్గపు కఫన్ దుస్తులు, సువాసనల్లో దానిని చుట్టుకుంటారు. ఆ ఆత్మలో నుండి భూమండలంపై ఎక్కడా లేనటువంటి సువాసన వస్తూ ఉంటుంది.
ఆ దైవదూతలు దానిని తీసుకొని పైకి వెళ్తారు, ఎక్కడెక్కడ ఏ దైవదూతల సమూహం కలసినా ‘ఈ పవిత్రమైన ఆత్మ ఎవరిది’? అని అడుగుతారు, ఈ దైవదూతలు ఫలాన బిన్ ఫలాన అని ఇహలోకములో ఉన్న అతని మంచి పేరు చెబుతారు, ఈ విధంగా మొదటి ఆకాశం వరకు చేరుకుంటారు. ఆకాశపు ద్వారం తెరువండని కోరుతారు, అది వారి కొరకు తెరువబడుతుంది, ఇదే విధంగా ప్రతి ఆకాశంపై జరుగుతుంది, ప్రతి ఆకాశపు దూతల్లో ముఖ్యులైనవారు వారి వెంట పై ఆకాశం వరకు వెళ్తారు, చివరకు ఏడవ ఆకాశం పైకి చేరుకుంటారు.
“దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.”.
ఆ ఆత్మను తిరిగి అతని భౌతికాయంలోకి పంపడం జరుగుతుంది.
ఇలా విశ్వాసి అయి ఉంటే, సత్కార్యాలు చేసేవారు అయి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదాలతో, ఎంత గొప్ప స్వాగతం పలుకుతూ దైవదూతలు వచ్చి స్వర్గం యొక్క కఫన్ దుస్తులు తీసుకొచ్చి, స్వర్గం నుండి సువాసనలను తీసుకొచ్చి ఎంతో సునాయాసంగా సులభతరంగా అతని శరీరంలో నుండి అతని ఆత్మను బయటికి తీసి పైకి తీసుకెళ్తారు. అల్లాహు తఆలా మనందరికి విశ్వాస మార్గాన్ని అవలంబించి, సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక, మరియు మన శరీరంలో నుండి, ఆత్మ వేరు అయ్యే సందర్భంలో కూడా లా ఇలాహ్ ఇల్లల్లాహ్ అనే సద్వచనం (కలిమా తయ్యిబా) చదివే సద్భాగ్యం మనకు ప్రసాదించుగాక. ఆమీన్
కానీ ఎవరైతే అవిశ్వాసాన్ని అవలంభించి ఉంటారో, బహుదైవారాధనలో పడి ఉంటారో, పాపాల్లో కూరుకుపోయి ఉంటారో, నిజ సృష్టికర్త అయిన ఏకైక అల్లాహ్ ను విశ్వసించకుండా లేదా విశ్వసించినట్లుగా నటించి, అంతరాత్మలో ఇస్లాం పట్ల, విశ్వాసం పట్ల ప్రేమ ఉండవలసినదిగా కాకుండా తమ జీవితం అల్లాహ్ కు, అల్లాహ్ యొక్క ఇష్టానికి భిన్నంగా తమ కోరికల ప్రకారం గడుపుతూ ఉంటారో వారి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి అదే హదీసులో చదవండి:
ఇక ఎప్పుడైతే అవిశ్వాసికి లేదా వంచకుడికి, కపట విశ్వాసికి ఈప్రపంచాన్ని విడనాడి పరలోకానికి పయనమయ్యే సమయం వస్తుందో, అతని వద్దకు ఎవరొస్తారు? వారి ముఖాలు ఎలా ఉంటాయి? తెల్లగా నవ్వు ముఖంతో మెరుస్తూ ఉంటాయా? లేదు, లేదు! వారి ముఖాలు నల్లగా, భయంకరంగా ఉంటాయి, దుర్వాసన గల నరకపు దుస్తులు తీసుకు వస్తారు, అతని దృష్టి ఎంత దూరం పడుతుందో అంత దూరము వరకు పెద్ద సంఖ్యలో కూర్చొని ఉంటారు. అంతలోనే మరణదూత వస్తాడు, అతని తలాపున కూర్చొని అంటాడు:
ఓ దుష్టఆత్మ! అల్లాహ్ యొక్క ఆగ్రహానికి అల్లాహ్ యొక్క కోపానికి గురి కావడానికి బయటికి రా!
కానీ ఆత్మ మరణదూత చేతిలో రాకుండా శరీరంలో పరిగెత్తుతూ ఉంటుంది. చివరికి ఆ మరణదూత శరీరంలో నుండి లాగి తీస్తాడు. అది ఎంత కఠినంగా వస్తుందంటే ఎలాగైతే ఒక పచ్చి గుడ్డను, తడిగా ఉన్న బట్టను ముళ్ళ కంప నుండి తీసేటప్పుడు ఏ ఇబ్బందికరంగా వస్తుందో అంతకంటే మరీ ఇబ్బందికరంగా వస్తుంది.
ఆ తర్వాత దైవ దూతలు నరకం నుండి తీసుకొచ్చిన దుష్ట, దుర్వాసనగల కఫన్ దుస్తులలో చుట్టుకుంటారు. భూమండలంపై ఎక్కడా లేనటువంటి దర్వాసన వస్తూ ఉంటుంది. వెంటనే తీసుకొని ఆకాశం వైపునకు వెళతారు, ఏ దైవదూతల సమూహం నుండి దాటినా వారు ఈ దుష్టఆత్మ ఎవరిది? అని అడుగుతారు. వీరంటారు: ప్రపంచంలో పిలువబడే ఫలానా బిన్ ఫలాన చెడ్డ మనిషి అని. ఈ విధంగా మొదటి ఆకాశం వరకు చేరుకొని, ద్వారం తెరువండని అనుమతి కోరితే, ద్వారం తెరువబడదు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్, సూరె ఆరాఫ్ (7)లోని ఆయత్ 40 పారాయణం చేశారు:
“వారి కోసం ఆకాశ ద్వారాలు తెరువబడవు. ఒంటె సూది రంధ్రంలో నుంచి దూరిపోనంత వరకూ వారు స్వర్గంలో ప్రవేశించలేరు”.
అల్లాహ్ ఆదేశిస్తాడు: అత్యంత క్రింద ఉన్న భూమిలోని సిజ్జీన్ జాబితాలో ఇతనిని నమోదు చేయండి. మళ్ళీ ఆ ఆత్మను అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరయే హజ్ (22)లోని ఆయతు 31 పఠించారు:
అల్లాహ్‌కు సాటి కల్పించేవాడు ఆకాశం నుంచి క్రిందపడి పోయిన వానితో సమానం. ఇప్పుడతన్ని పక్షులైనా తన్నుకుపోతాయి లేదా పెనుగాలి అయినా ఎత్తి దూరప్రదేశంలో విసిరేస్తుంది.
ఇక ఆ ఆత్మ మళ్ళీ తిరిగి అతని శరీరంలోకి వస్తుంది. మళ్ళీ తరువాత ప్రశ్న ఉత్తరాలు జరుగుతాయి. వాటి వివరాలు మనం ఇన్షా అల్లాహ్ సమాధిలో ఎవరికీ ఏమి జరుగుతుంది అనే ఎపిసోడ్ లో చదువుదాము. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే; అవిశ్వాసుల ప్రాణం తీయబడే సందర్భంలో వారికి ఎలాంటి కష్టం, బాధ కలుగుతుందో అల్లాహ్ స్పష్టంగా ఖుర్ఆన్ లో తెలియపరిచాడు:
“ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు!”.
అలాంటి ఆ సమయం రాకముందే మనం గుణపాఠం నేర్చుకోవాలి. విశ్వాసమార్గాన్ని సత్కార్యాలు అవలంభించేమార్గాన్ని నడిచే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మహాశయులారా ఎవరికీ చావు ఎలా వస్తుంది అనే విషయం ఏదైతే చదవుతున్నామో, దీని తరువాయి అంశం చదవడం మర్చిపోకండి. అల్లాహ్ మనందరికీ చావు రాక ముందే దానికి సంబంధించిన సంసిద్ధతలు ఏర్పాటు చేసుకునే సద్భాగ్యం ప్రసాదించు గాక! ఆమీన్!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి, స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి, “నేను మీ ప్రభువును కానా?” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువువి). ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు. ‘దీని గురించి మాకేమీ తెలియదు’ అని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికీ * లేదా “మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు. మేము వారి తరువాతివారి సంతతిలో పుట్టినవారము. ఆ దుర్జనులు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురిచేస్తావా?!” అని మీరు అనకుండా ఉండటానికిగాను (మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము.) * వారు (బహుదైవారాధన నుండి ఏకదైవారాధన వైపుకు) మరలివస్తారేమోనని మేము ఈ విధంగా ఆయతులను విడమరచి చెబుతున్నాము.
సహీ ముస్లిం 2865లో ఉంది, ఇయాజ్ బిన్ హిమార్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: అల్లాహ్ ఇలా తెలిపాడని: “నేను నా దాసులను ముస్లిములుగా, సత్యాన్ని స్వీకరించి బహుదైవత్వాలకు దూరంగా ఉండేవారిగా పుట్టించాను, కాని షైతానులు వారి వద్దకు వచ్చి వారిని సత్యధర్మం నుండి దూరం చేశారు, నేను వారి కొరకు హరాం (నిషిద్ధం) చేసిన దానిని హరాం చేశారు”.
అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్ ప్రళయదినాన అతితక్కువ నరక శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని అల్లాహ్ అడుగుతాడు: భూమిలో ఉన్న సమస్తం నీదై ఉంటే దానిని పరిహారంగా చెల్లించి నరకం నుండి రక్షణ పొందాలనుకుంటున్నావా? అతడు అవును అని అంటాడు, అప్పుడు అల్లాహ్ అంటాడు: నీవు ఆదం వీపులో ఉండగానే నేను నీతో దీనికంటే ఎంతో తేలికైన విషయం ఒకటి కోరాను: నీవు నాతో పాటు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకు అని, కాని నీవు తిరస్కరించావు, నాకు భాగస్వాములకు నిలబెట్టావు”.
2) జ్యోతిష్యుని వద్దకు వెళ్లి సమాచారం అడిగేవాని ఎన్ని రోజుల నమాజ్ స్వీకరించబడదు?
C) 40 రోజుల
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారని సఫియ్య (రజియల్లాహు అన్హా) ప్రవక్తగారి ఒక భార్య ద్వారా ఉల్లేఖించారు:
“ఎవరైనా జ్యోతిష్యుని వద్దకు వచ్చి దేని గురించైనా అతన్ని ప్రశ్నిస్తే అతని నలబై రోజుల నమాజు స్వీకరించబడదు”. (ముస్లిం పదాలు 2230).
ఇది మనుషుల రూపంలో ఉన్నవారి వద్దకు వెళ్ళి అడగడం వరకే పరిమితం కాదు. ఈ రోజుల్లో కొందరు తమ జాతకలు తెలుసుకోడానికి టీవిలలో కొన్ని ప్రోగ్రామ్స్ ఫాలో అవుతుంటారు. మరి కొందరు స్మార్ట్ ఫోన్లో వచ్చిన ఆప్స్ లను ఫాలో అవుతారు
గుర్తుంచుకోండి:
వెబ్ సైట్లోకెల్లి జాతకం గురంచి వెతకడం కూడా ఈ హదీసులో వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి
మరో ముఖ్య విషయం: 40 రోజుల నమాజు అంగీకరింపబడదని అంటే వాటి పుణ్యం లభించదని భావం, కాని చేయకుండా ఉంటే అది మరింత ఘోరమైన పాపం అవుతుంది.
3) జనాజ నమాజ్ చేసి దానివెంట వెళ్లి ఖననం అయ్యేవరకు పాల్గొంటే ఎన్ని ఖిరాతుల పుణ్యం దొరుకుతుంది?
C) 02 ఖిరాతులు
జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం
గొప్ప పుణ్య కార్యాల్లో ఒకటి; జనాజ వెంట వెళ్ళడం, జనాజ నమాజు చేయడం, దానిపై లభించే పుణ్యం బరువు మానవుని త్రాసులో ఉహద్ పర్వతం కంటే అధికిమించి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఉబై బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః
“ఎవరు నమాజు మరియు (ఖననం) అయ్యే వరకు జానాజ వెంట ఉంటాడో అతనికి రెండు ఖీరాతులు, మరెవరయితే కేవలం నమాజు అయ్యే వరకు దాని వెంట ఉంటాడో అతనికి ఒక ఖీరాతు లభిస్తుంది. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన (అంటే అల్లాహ్) సాక్షి! ఒక్క ఖీరాత్ బరువు అల్లాహ్ వద్ద ఉన్న త్రాసులో ఉహద్ పర్వతంకంటే ఎక్కువ ఉండును”. (అహ్మద్ 5/ 131 ఇది సహీ హదీస్).
ప్రవక్త ﷺ తెలిపారని, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు;
“ఎవరు జనాజలో పాల్గొని నమాజు చేస్తాడో అతనికి ఒక ఖీరాత్, మరెవరయితే (నమాజు మరియు) ఖననం అయ్యే వరకు పాల్గొంటాడో అతనికి రెండు ఖీరాతులు లభించును”. రెండు ఖీరాతులంటే ఏమిటి? అని ప్రశ్న వచ్చినప్పుడు, ప్రవక్త చెప్పారు: “రెండు పెద్ద కొండల వంటివి”. (బుఖారి 1325, ముస్లిం 945, తిర్మిజి 1040, నిసాయి 1940, ఇబ్ను మాజ 1539, అహ్మద్ 2/ 401, ఇబ్ను హిబ్బాన్ 3080)
ముస్లింలో ఉంది; ఇబ్ను ఉమర్ (రజియల్లాహు అన్హు) జనాజ నమాజు చేసుకొని వెళ్ళేవారు, ఎప్పుడయితే వారికి అబూహురైరా (రజియల్లాహు అన్హు) గారి ఈ హదీసు చేరిందో ‘వాస్తవానికి మనం అనేక ఖీరాతులు పోగుట్టుకున్నాము’ అని బాధ పడ్డారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.
أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ (అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్) సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.
మరణ దూత గురించి ఒకే ఒక వాస్తవం
చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.
మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.
విశ్వాసి మరణ ఘట్టం
విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.
وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ (వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్) “మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)
ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.
అవిశ్వాసి మరణ ఘట్టం
ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:
لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ (లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’) వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)
మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:
وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ (వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్) అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)
అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,
فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ (ఫక అన్నమా ఖర్ర మినస్ సమా) ఆకాశం నుండి పడిపోయిన వాని వలె. ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.
సమాధి జీవితం (బర్ జఖ్)
ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.
కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.
وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ (వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్) వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)
దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.
సమాధిలో ప్రశ్నోత్తరాలు
ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.
ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.
ముగింపు
ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.
చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.
أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1822. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-
“మీలో ఎవరైనా చనిపోయినప్పుడు అతనికి (సమాధిలో) ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అతను ఉండవలసిన శాశ్వత స్థానం చూపబడుతుంది. అతను గనక స్వర్గవాసి అయి ఉంటే అతనికి స్వర్గవాసుల స్థానం చూపబడుతుంది; నరకవాసి అయి ఉంటే అతనికి నరకవాసుల స్థానం చూపబడుతుంది. అప్పుడు “ఇదే నీ అసలు స్థానం. నిన్ను ప్రళయదినాన లేపినప్పుడు ఈ స్థానానికే నీవు చేరుకోవలసి ఉంటుంది” అని అతనికి చెప్పబడుతుంది.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1811. హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు : (ప్రళయదినాన) మృత్యువు ఒక తెల్లని పొట్టేలు రూపంలో తీసుకురాబడుతుంది. ఒక ప్రకటనకర్త ఎలుగెత్తి “స్వర్గవాసులారా!” అని పిలుస్తాడు. స్వర్గవాసులు తలలు పైకెత్తి అతని వైపు చూస్తారు. ఆ ప్రకటనకర్త “దీన్ని మీరు గుర్తించారా?” అని అడుగుతాడు వారిని. స్వర్గవాసులు దాన్ని ఇంతకు పూర్వం కూడా చూసి ఉన్నందున “గుర్తించాము. అది మృత్యువు” అని అంటారు. తర్వాత ఆ ప్రకటనకర్త నరకవాసుల్ని కూడా ఎలుగెత్తి పిలుస్తాడు. వారు కూడా తలలు పైకెత్తి అటు వైపు చూస్తారు. “మీరు దీన్ని గుర్తించారా?” అని అడుగుతాడు ప్రకటనకర్త. నరకవాసులు కూడా దాన్ని ఇంతకు పూర్వం చూసి ఉన్నందున “గుర్తించాము అది మృత్యువు” అని అంటారు. ఆ తరువాత దాన్ని కోసివేయడం జరుగుతుంది. అప్పుడు ప్రకటనకర్త అందరినీ సంబోధిస్తూ “స్వర్గవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు. నరకవాసులారా! ఇప్పుడు జీవితం శాశ్వతమయిపోయింది. ఇక (మీకెవరికీ) మరణం రాదు” అని అంటాడు.
ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూక్తి పఠిస్తారు : “ప్రవక్తా! ఏమరుపాటుకు లోనయి సత్యాన్ని విశ్వసించని వారిని తీర్పు దినం గురించి భయపెట్టు. ఆ రోజు తీర్పు జరిగిన తరువాత దుఃఖం తప్ప మరేదీ మిగలదు.” (19:39)
(సహీహ్ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్ , 19వ సూరా – మర్యం, 1వ అధ్యాయం – ఖౌలిహీ (వ అన్జిర్ హుమ్ యౌ మల్‌హస్రా)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
మనిషి ఇహలోకంలో శాశ్వతంగా ఉండడు,శాశ్వత జీవితం పరలోక జీవితం. అయితే ఇక్కడ ఉండీ అక్కడి జీవితం గురించి ఎలా ఆలోచించగలం, ఊహించగలమో తెలుసుకొనుటకు ఈ వీడియో చూడండి.
ఈ ప్రసంగంలో, వక్త పరలోక జీవితం మరియు దాని కోసం సిద్ధం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఇహలోక జీవితం ఒక పరీక్ష అని, శాశ్వతం కాదని, మోసంతో కూడుకున్నదని ఖురాన్ ఆయతుల ద్వారా వివరించారు. మరణ సమయం ఎవరికీ తెలియదని, కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో, సత్కార్యాలు చేస్తూ ఉత్తమమైన స్థితిలో మరణాన్ని పొందాలని కోరుకోవాలని, కేవలం కోరుకుంటే సరిపోదని, దానికి తగ్గ ఆచరణ కూడా ఉండాలని ఉద్బోధించారు. కష్టాలు, సుఖాలు రెండూ అల్లాహ్ నుండే వచ్చే పరీక్షలని, వాటిని సహనంతో, నమాజ్ తో ఎదుర్కోవాలని సూచించారు. యువత, ఆరోగ్యం, సంపద, తీరిక సమయం మరియు జీవితం వంటి ఐదు అమూల్యమైన వరాలను అవి చేజారిపోకముందే సద్వినియోగం చేసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును ఉటంకించారు. సమయాన్ని వృధా చేయకుండా, అల్లాహ్ ధ్యానంలో మరియు సత్కార్యాలలో గడపడం ద్వారా పరలోక సాఫల్యం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
بِسْمِ ٱللَّٰهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.
أَعُوذُ بِٱللَّهِ ٱلسَّمِيعِ ٱلْعَلِيمِ مِنَ ٱلشَّيْطَانِ ٱلرَّجِيمِ శపించబడిన షైతాన్ నుండి నేను సర్వశ్రోత మరియు సర్వజ్ఞుడైన అల్లాహ్ శరణు వేడుతున్నాను.
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأَدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ ప్రతి ప్రాణీ మరణ రుచి చూడవలసిందే. మరి నిశ్చయంగా ప్రళయ దినాన మీరు మీ పూర్తి ప్రతిఫలాలు పొందగలరు. కనుక ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడో అతనే సాఫల్యం పొందినవాడు. ఈ ఐహిక జీవితం కేవలం మోసపు సామాగ్రి తప్ప మరేమీ కాదు.
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ జగత్తుకు ఏకైక యజమాని, మన ఆరాధనలకు నిజమైన ఆరాధనీయుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు స్తుతులు, పొగడ్తలు అన్నీయు చెల్లును. అంతిమ ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క అనేక అనేక కరుణలు, శాంతులు, శుభాలు కురియుగాక.
పరలోక జీవితం కొరకు మన తయారీ
సోదర మహాశయులారా! ఈరోజు మనం ‘పరలోక జీవితం, దాని గురించి మనం ఏం సిద్ధపరుస్తున్నాము’ అనే శీర్షికపై కొన్ని విషయాలు విందాము, గ్రహిద్దాము, ఆచరణకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాము ఇన్షా అల్లాహ్. అల్లాహ్ త’ఆలా అలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అయితే, నా ఈ చిన్న ప్రసంగంలో కొన్ని ప్రశ్నలు కూడా నేను అడుగుతాను. మీరు త్వరగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇన్షా అల్లాహ్.
మరణ సమయం ఎవరికీ తెలియదు
మొదటి ప్రశ్న ఏంటంటే, మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనకు తెలుసా? లేదు. మనం ఎప్పుడు చనిపోతాము అన్న విషయం మనలో ఎవరికీ తెలియదు. స్వయంగా అల్లాహ్ త’ఆలా సూరె లుఖ్మాన్ చివరిలో,
وَمَا تَدْرِي نَفْسٌ مَّاذَا تَكْسِبُ غَدًا ۖ وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు (31:34)
ఏ స్థితిలో మరణించాలని కోరుకోవాలి?
మనకు చావు ఎప్పుడు వస్తుందో అన్న విషయం తెలియనప్పుడు, చావు ఏ పరిస్థితిలో వస్తే బాగుంటుంది అన్న విషయం ఎప్పుడైనా ఒక్కసారైనా మనం ఆలోచించామా? ఉదాహరణకు, రెండో ప్రశ్న అనుకోండి.
ఒక వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుతూ చదువుతూ చనిపోతున్నాడు. మరో వ్యక్తి అవిశ్వాస మాటలు లేదా ఏదైనా పాటలు పాడుకుంటూ చనిపోతున్నాడు. ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ సజ్దా స్థితిలో ఉండి చనిపోతున్నాడు. మరో వ్యక్తి నమాజ్ సమయాన్ని వృధా చేసి పాటలు వినుకుంటూ, ఫిలింలు చూసుకుంటూ, ఇంకా వేరే ఏదైనా చెడు కార్యాలు చూస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా బీదవారికి దానం చేస్తూ లేక ఎవరికైనా సహాయం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. మరో వ్యక్తి ఎవరైనా బీదవాళ్ళను తన చేతి కింద పనిచేసే వాళ్ళను, వారిపై అన్యాయం చేస్తూ, ఏదైనా దౌర్జన్యం చేస్తూ ఆ స్థితిలో చనిపోతున్నాడు. ఒక వ్యక్తి ప్రయాణంలో వెళ్తున్నాడు, వాహనంలో ఉన్నాడు, నోటి మీద అల్లాహ్ యొక్క జిక్ర్ ఉంది, యాక్సిడెంట్ అయిపోయింది, ఆ సందర్భంలో కూడా అతనికి కలిమా నోటి మీద వచ్చేసింది. మరో వ్యక్తి తన ఫ్రెండ్లతో, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు, ఆ స్థితిలో అతనికి చావు వచ్చేసింది, యాక్సిడెంట్ అయింది, ఆ స్థితిలో చావు వచ్చింది.
ఇప్పుడు మీరే ఆలోచించండి, స్వయంగా మీరు, అంటే నేను, మీలో ప్రతి ఒక్కరు, స్వయంగా నేను కూడా, నేను ఏ స్థితిలో నాకు చావు వస్తే బాగుంటుంది అని ఆలోచించాలి. దేని గురించి నేను సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి? కుడి వైపున చెప్పిన విషయాలకా లేకుంటే ఎడమ వైపున చెప్పిన విషయాలకా? మీ అందరిలో ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారా? ఇన్షా అల్లాహ్. అల్లాహ్ త’ఆలా మన ఈ కోరిక ప్రకారం అలాంటి ఆచరణ ప్రసాదించుగాక, మరి మన కోరిక ప్రకారం మన యొక్క చావు అదే స్థితిలో అల్లాహ్ త’ఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
కోరికకు తగ్గ ఆచరణ
అయితే సోదరులారా! మాట్లాడుకున్నప్పుడు ఇది కోరుకుంటున్నాము. కుడివైపున సైగ చేసి ఏ విషయాలైతే చెప్పబడ్డాయో అవి కోరుకుంటున్నాము అని మాట్లాడేటప్పుడు, ఎవరైనా ప్రశ్న ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడం సులభం. కానీ దానిని ఆచరణ రూపంలో కూడా మనం ఉంచాలి. ఎందుకంటే కలిమా చదువుతూ, నమాజ్ చేసుకుంటూ, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు చేస్తూ మన చావు రావాలి అని కోరుకోవడం ఇది ఒక అంతు అయితే, ఎగ్జాక్ట్లీ దాని ప్రకారం లేదా కనీసం దానికి దగ్గరగా అలాంటి మంచి ఆచరణలు అవలంబించడం ఇది మరో అంతు.
కేవలం కోరికల మీద మేడలు కడతామా? ఇప్పుడు మనం ఇక్కడ విదేశ జీవితం గడుపుతున్నాము. ఇక్కడ సంపాదిస్తున్నాము. మనకన్ని కోరికలు ఉన్నాయా లేదా? ఉదాహరణకు ఇప్పుడు పెళ్లి కాని యువకులు, ఇలాంటి స్త్రీతో, ఇలాంటి అమ్మాయితో వివాహం చేయాలి, ఆ అమ్మాయిలో ఇలాంటి, ఇలాంటి గుణాలు ఉండాలి, నేను ఇక్కడ మంచిగా సంపాదించాలి, ఇంత మంచి ఒక ఇల్లు కట్టాలి, ఒక గృహం నిర్మించాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయా లేవా? మనం ప్రతిరోజు పడుకునే ముందు ఇలాంటి కోరికల్ని గుర్తు చేసుకుంటూ, వాటిని వల్లించుకుంటూ, మళ్ళించుకుంటూ, తిరిగి తిరిగి వాటిని గుర్తు చేసుకుంటూ మనం పడుకున్నప్పటికీ, ఓ పది సంవత్సరాల తర్వాత ఆ మేడ కట్టి అక్కడ తయారు ఉంటుందా? బిల్డింగ్ కట్టి అక్కడ రెడీ ఉంటుందా? ఏం చేయాల్సి ఉంటుంది? దాని గురించి ప్రయత్నం చేయాలి, సంపాదించాలి, ఇల్లు కట్టడానికి దానికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉంటారో వారితో కలవాలి, ఆ పనులు చేయాలి. అలాగే కలిమా చదువుతూ, నమాజ్ చేస్తూ, మంచి స్థితిలో, ఉత్తమ రీతిలో నాకు చావు రావాలి అని కోరుకున్నంత మాత్రాన కోరిక తీరుతుందా? లేదు.
‘మౌత్ కా బయాన్’ అని ఉర్దూలో ఒక పుస్తకం ఉంది. దాని యొక్క రచయిత ఒక సంఘటన గుర్తు చేశాడు. ఒక వ్యక్తి రోడ్డు మీద నిలబడి సామాను అమ్ముకుంటూ ఉంటాడు. ఇలాంటి మనుషులను మనం ఎంతో మంది చూస్తూ ఉంటాం కదా. పొద్దుటి నుండి సాయంకాలం వరకు, “పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఖంస రియాల్, ఖంస రియాల్, ఖంస రియాల్”. మార్కెట్లో ఎప్పుడైనా విన్నారా లేదా ఇట్లాంటిది? అదే పాట. నమాజ్ లేదు, అల్లాహ్ యొక్క జిక్ర్ లేదు, ఇంకా వేరే ఉత్తమ కార్యాలు ఏవీ లేవు. ముస్లిం. చనిపోయేటప్పుడు, చావు దగ్గరికి వచ్చినప్పుడు, అతని బంధువులు దగ్గరగా ఉండి, “నానా, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవండి” అని అంటున్నారు. “లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పక్కన అక్కడ మెల్లమెల్లగా పలుకుతున్నారు కనీసం విని అంటారని. కొంచెం మాట్లాడడానికి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, “ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, ఐదు రూపాయలు, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్, పాంచ్ రియాల్” అదే మాట వస్తుందట. ఎందుకు?
ఈ విధంగా మనిషి ఏదైనా ఉద్యోగపరంగా ఏదైనా ఒక మాటను మాటిమాటికీ చెప్పడం, అది తప్పు అని కాదు ఇక్కడ చెప్పే ఉద్దేశం. కానీ అల్లాహ్ యొక్క జిక్ర్, ఈమాన్, విశ్వాసం, నమాజ్, ఇతర సత్కార్యాలకు ఏ స్థానం అయితే ఇవ్వాలో, ఇతర సత్కార్యాలు ఎంతగా పాటించాలో, వాటిని పాటించడం కూడా తప్పనిసరి.
ఇహలోక జీవితం – ఒక మోసం
చావు ఎప్పుడు వస్తుంది మనకు తెలియదు. చావు మంచి స్థితిలో రావాలి మనందరి కోరిక. కానీ జీవితం గడుపుతున్నప్పుడు, “అరే! యవ్వనం ఉంది కదా, మనం యువకులం కదా, ఇప్పుడే కదా, ఒకేసారి కదా జీవితం, ఒకేసారి కదా ఛాన్స్” అనుకుంటూ మన కోరికలు మంచిగా ఉన్నప్పటికీ, ఆచరణను మంచిగా ఉంచకుంటే, చావు మంచిగా వస్తుంది అన్న ఆశ ఏదైనా ఉంటుందా? అందుగురించి సోదరులారా!
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ (కుల్లు నఫ్సిన్ జాఇఖతుల్ మౌత్) ప్రతి జీవికీ మరణ రుచి చూడక తప్పదు. (సూరె ఆలి ఇమ్రాన్ లో ఉంది ఆ ఆయత్)
وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ (వ ఇన్నమా తువఫ్ఫౌన ఉజూరకుమ్ యౌమల్ ఖియామహ్) ప్రళయ దినాన మీరు చేసుకున్న కర్మలకు సంపూర్ణ ఫలితం మీరు పొందుతారు.
అయితే వినండి,
فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأَدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ (ఫమన్ జుహ్జిహ అనిన్నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్) ఎవరైతే నరకం నుండి దూరం చేయబడ్డారో, స్వర్గంలో ప్రవేశింపబడ్డారో, విజయం అతనిది. సాఫల్యం అతనికి లభించింది.
ఇక్కడి వరకు విషయం అర్థమైంది కదా? ఏం చెప్పాడు అల్లాహ్ త’ఆలా? ప్రతి జీవి మరణించక తప్పదు, తప్పకుండా చనిపోతారు. ఆ తర్వాత చెప్పాడు అల్లాహ్ త’ఆలా, మీరు చేసుకున్న ప్రతి కర్మలకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత చెప్పాడు, నరకం నుండి దూరం చేయబడి, స్వర్గంలో ప్రవేశించిన వారు వారే సాఫల్యం పొందిన వారు. కానీ ఆ మరణం రాకముందు మనం ఎక్కడున్నాము? ఈ భూమి మీదే కదా, ఈ లోకంలో కదా. ఇక్కడ ఉండే కదా మనం ఆ స్వర్గం గురించి ఏదైనా ప్రయత్నం చేయాలి? ఇక్కడ ఉండే మనం సత్కార్యాలు చేయాలి, అప్పుడు నరకం నుండి దూరం చేయబడతాము, స్వర్గంలో ప్రవేశింపజేయబడతాము. అయితే అల్లాహ్ త’ఆలా ఎంత గొప్ప విషయం ఆ తర్వాత చెప్పాడో గమనించండి, ‘ఫఖద్ ఫాజ్’, సాఫల్యం పొందాడు అని మాట అయిపోయింది, కాలేదు. ఆ తర్వాత అల్లాహ్ చెప్పాడు,
ఇహలోక జీవితం, ఇందులో ఎన్నో రకాల మీకు మోసాలు జరుగుతాయి. ఒక వ్యక్తి వ్యాపారంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి తన వ్యవసాయంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఉద్యోగంలో మోసపోతాడు, ఇంకో వ్యక్తి ఏదైనా పని చేసుకుంటూ మోసపోతాడు. ఇవన్నీ మోసాలు చాలా తేలికగా, ఏ లెక్క లేనివి. అతి గొప్ప మోసం, ఎలాంటి మోసం? మనిషి స్వర్గం గురించి ఆలోచిస్తూ, స్వర్గం గురించి కోరికలు ఊహించుకుంటూ దాని గురించి ఏమీ చేయకుండా, ఏ సత్కార్యం పాటించకుండా, విశ్వాస మార్గం అవలంబించకుండా జీవితం గడపడం ఇది మహా మోసం.
ఇలాంటి మోసం అర్థమవుతుందా? ఉదాహరణకు, రోజూవారీగా కూలి తీసుకొని పనిచేసే వాళ్ళ విషయం గమనించండి, “ఈరోజు నా దగ్గర నువ్వు పని చేయాలి. ఎంత? ఈరోజు పనిచేస్తే 200 రియాల్ నీకు ఇస్తాను.” ఒప్పందం అయిపోయింది. సాయంకాలం వరకు మీకు డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమంటారు? మోసం చేశాడు వీడు అని నాలుగు తిడతారా లేదా? ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. కొందరు ఇలాంటి మోసాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ మనకు మనం ముస్లింలమనుకొని, విశ్వాసులమన్నటువంటి సంతృప్తిలో ఉండి, విశ్వాస మార్గం మీద స్థిరంగా ఉండకుండా, సత్కార్యాలు చేస్తూ మనం జీవితం గడపకుండా ఆ స్వర్గం మన తాతముత్తాతల ఏదైనా ఆస్తి ఉన్నట్లుగా మనం దొరుకుతుందిలే, ఎప్పుడో ఒకసారి స్వర్గంలో పోవాల్సిందే కదా అన్నటువంటి ఆలోచనల్లో పడి, సత్కార్యాలను వదులుకోవడం, ఇష్టం వచ్చినట్లు పాపాలు చేసుకుంటూ జీవితం గడపడం, ఇది మనకు మనం మోసంలో పడిపోతలేమా? స్వర్గం యొక్క కోరిక ఉంది, చేస్తున్న కార్యాలు ఏంటి? స్వర్గంలో తీసుకెళ్ళేటివా? కాదు.
ఇప్పుడు ఎండకాలం రాబోతుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. ఏం కనబడుతుంది? ముంగట రోడ్డు మీద నీళ్లు ఉన్నట్లు కనబడుతుంది. జరుగుతుంది కదా అలాంటిది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయా నీళ్లు? మీరు అనుకోండి, ఉదాహరణకు మీరు ఒక ఎడారిలో ఉన్నారు. ఎండలో తపించిపోయి మీకు చాలా దాహం కలుగుతుంది. నీళ్లు లేక మీరు తపిస్తున్నారు. మీకు ఎండమావులు కనబడతాయి. ఎండమావులే అంటారు కదా, సురాబ్. ఆహ్! ఇంకొంచెం నేను నడిచిపోతే ఇక నాకు నా ప్రాణంలో ప్రాణం వచ్చేస్తది, ఇక నీళ్లు దొరుకుతాయి, అన్నటువంటి ఆశతో అలసిపోయి, నడవలేని శక్తి, శక్తి ఏ మాత్రం లేదు నడవడానికి, కానీ అలాంటి ఎండమావులు, ఎండమావులు కాదు దాన్ని నీళ్లు అనుకుంటున్నాం మనం. ఇంకొంచెం కష్టపడి నాలుగు అడుగులు వెళ్దాము అని అనుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉండకుండా ఎండమావులు అని మీకు అనిపించినప్పుడు ఎంత బాధ కలుగుతుంది? ఇక ఎందుకు జీవితం, ఛా! ఇక్కడే చనిపోతే బాగుంటది. అనిపిస్తదా లేదా?
ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే దేవతలను ఆరాధిస్తారో, అలాంటి వారికి ప్రళయ దినాన ఇలాంటి మోసపు శిక్ష కూడా జరుగుతుంది. సహీ బుఖారీలో హదీస్ వచ్చి ఉంది. అందుగురించి సోదరులారా, ఇకనైనా మనం ఉన్న కొత్త జీవితాన్ని మనం అదృష్టంగా భావించి దాన్ని విశ్వాస మార్గంలో, సత్కార్యాలు చేసుకుంటూ గడిపే ప్రయత్నం చేద్దాం. ఇన్షా అల్లాహ్.
ఇహలోకం ఒక పరీక్ష
చూడండి, ఇహలోకంలో అల్లాహ్ ఎందుకు పంపాడు మనల్ని? హాయిగా స్వర్గం లాంటి జీవితం గడపడానికా లేకుంటే పరీక్ష గురించా? ఇది మూడో ప్రశ్న అనుకోండి మీరు. ఇహలోకంలో మనం ఎందుకు వచ్చాము? హాయిగా, లగ్జరీ లైఫ్ గడపడానికా లేకుంటే ఒక పరీక్ష పరమైన జీవితం గడపడానికా? పరీక్ష. ఎలాంటి అనుమానం లేదు కదా? అలాంటప్పుడు ఇక్కడ ఎదురయ్యే కష్టాలు, ఇక్కడ మనకు కలిగే బాధలు, వాటికి మనం చిన్నబోయి లేక మనస్తాపం చెంది, ఎంతో మనకు మనం కుళ్ళిపోయాము, ఇక ఎందుకురా నా జీవితం అన్నటువంటి భావనలో వెళ్లి, విశ్వాస మార్గం, స్వర్గంలో చేర్పించే సత్కార్యాలు, వాటిని ఎందుకు మరిచిపోతాము మనం?
మన విశ్వాస మార్గాన్ని వదలకుండా ఇలాంటి కష్టాల్ని, ఇలాంటి బాధల్ని ఎదుర్కొంటే ఇంకా మనకు స్వర్గాలలో స్థానాలు రెట్టింపు అవుతాయి, పెరుగుతూ పోతాయి. ఖురాన్ లో ఒక ఆయత్ ఉంది:
وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً (వ జ’అల్నా బ’అదకుమ్ లి బ’అదిన్ ఫిత్న) పరస్పరం ఒకరినొకరిని అల్లాహ్ మీకు పరీక్షగా చేశాడు.
మరో ఆయత్ ఉంది:
وَنَبْلُوكُم بِالشَّرِّ وَالْخَيْرِ فِتْنَةً (వ నబ్లూకుమ్ బిష్షర్రి వల్ ఖైరి ఫిత్న) ఇహలోకంలో మీకు సుఖము, శాంతి, అన్ని రకాల మంచితనాలు ఇచ్చి పరీక్షిస్తాను, బాధ, కఠోర జీవితం, ఎన్నో రకాల ఆపదల్లో మిమ్మల్ని ఇరికించి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాను.
బిష్షర్రి వల్ ఖైర్. షర్ర్, ఖైర్ ఇక్కడ పదాలు వింటూ ఉంటారు కదా. షర్ర్ అంటే కీడు, చెడు. ఖైర్ అంటే మంచితనం. ఈ రెండు రకాలుగా కూడా మిమ్మల్ని నేను పరీక్షిస్తాను అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు.
కొందరు కఫీల్ (employer) యొక్క ఇబ్బంది వల్ల గాని, జీతాలు సరిగ్గా దొరకవని వల్ల గాని, లేక జీతాలు బాగానే ఉన్నాయి, కఫీల్ తోని కిరికిరి ఏం లేదు, కానీ తోడుగా పనిచేసే వాళ్ళతోని కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, ఈర్ష్య, జిగత్సలు, ఇంకా వేరే రకాల ఏవే. సామాన్యంగా మనం ఇక్కడ చూసుకున్న కొన్ని కష్టాల గురించి నేను చెప్తున్నాను. ఇలాంటి కష్టాల్లో కొందరు ఎంతో పెద్ద కష్టంగా భావించి నమాజ్ వదులుతారు. ఇలాంటి కష్టాల్ని దూరం చేసుకోవడానికి సరైన మార్గం ఏంటో తెలుసుకోకుండా ఇంకెంత పాపాల్లో చిక్కుకుంటూ పోతారు.
సోదరులారా! ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గాని, ఆ కష్టం దూరం చేసేవారు ఎవరు? అల్లాహ్. అయితే, కష్టాలు దూరం చేయమని అల్లాహ్ ను మొరపెట్టకుండా, అల్లాహ్ కు ఇష్టమైన కార్యాలు చేయకుండా, ఇంకా పాపాల్లో మనం చిక్కుకుంటూ పోతే కష్టాలు పెరుగుతాయా, తరుగుతాయా? ఆలోచించండి, ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? “ఎందుకయ్యా నమాజ్ కు రావటం లేదయ్యా?” అంటే, “అరే! నాకు ఉన్నటువంటి బాధలు మీకు ఉంటే తెలుస్తది. మీరు ఎప్పుడు నమాజ్, నమాజ్ అనే అంటా ఉంటారు.” నమాజ్ అన్ని రకాల మేళ్లు, అన్ని రకాల మంచితనాలకు మూలం. ఎలాంటి కష్టం, ఎలాంటి బాధ ఉన్నా గాని, అది దూరం కావాలి అంటే అల్లాహ్ ఏమంటున్నాడు?
وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ (వస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్) సహనం ద్వారా మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి.
ఇంకా మీరు సూరహ్ బఖరాలో చూస్తే, రెండో పారాలో, “ఫద్కురూనీ అద్కుర్కుమ్ వష్కురూలీ వలా తక్ఫురూన్. యా అయ్యుహల్లజీన ఆమనూ…
اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ (ఇస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్, ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్) ఓ విశ్వాసులారా! మీరు సహాయాన్ని కోరండి, సహనం ద్వారా మరియు నమాజ్ ద్వారా. నిశ్చయంగా అల్లాహ్ సహనం పాటించే వారితో ఉన్నాడు.
ఆ తర్వాతనే వెంటనే చూడండి. సూరహ్ బఖరా, ఆయత్ నెంబర్ 153. “ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్” ఆ తర్వాత, “వలా తఖూలూ లిమయ్ యుఖ్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్, బల్ అహ్యావున్ వలాకిల్లా తష్’ఉరూన్”. అల్లాహ్ మార్గంలో ఎవరైతే హత్య చేయబడతారో వారి గురించి చెప్పబడింది, సామాన్య మృతి చెందిన వారి లాగా మీరు భావించకండి. ఆ తర్వాత అల్లాహ్ అంటున్నాడు, ఆయత్ నెంబర్ 155లో:
وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ (వ లనబ్లువన్నకుమ్ బిషైఇమ్ మినల్ ఖౌఫి వల్ జూఇ’) మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము కొంత భయంతో మరియు ఆకలి ద్వారా.
وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ (వ నఖ్సిమ్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్) మీ ధనాల్లో, మీ ప్రాణాల్లో, మీ ఉత్పత్తుల్లో కొరత చేసి, తక్కువ చేసి
మీరు ఎంత మీ ధనం పెరగాలి అని, మీ వ్యాపారం ఎంత డెవలప్ కావాలని మీరు ఆలోచిస్తారో అది అంత పెరగకుండా దాన్ని తరిగించి, మీ సంతానంలో గాని, మీ బంధువుల్లో గాని ఎవరికైనా చావు వచ్చి, వస్సమరాత్, ఇంకా మీ వ్యవసాయ పరంగా ఏదైనా ఫలాలు, ఫ్రూట్స్ అలాంటివి ఉంటే వాటిలో మీకు ఏదైనా నష్టం చేగూర్చి మిమ్మల్ని పరీక్షిస్తాము.
وَبَشِّرِ الصَّابِرِينَ (వ బష్షిరిస్సాబిరీన్) సబర్ విషయం గడిచింది కదా. సబర్ చేస్తే వాళ్లతోనే అల్లాహ్ ఉన్నాడు అని అన్నాడు కదా ఇంతకుముందే. ఇక్కడ ఏమన్నాడు? అలాంటి సబర్ చేసే వారి గురించి, ఇలాంటి కష్టాలు ఎవరిపై వస్తాయో, ఆ కష్టాల్లో ఎవరైతే సబర్ చేస్తారో, సహనం పాటిస్తారో, వారికి శుభవార్త ఇవ్వండి అని అల్లాహ్ అంటున్నాడు.
అర్హత లేనిదే క్షమాపణ లేదు
అయితే, చిన్నపాటి కష్టాలు వచ్చినందుకు మనం అల్లాహ్ కు ఇంకా దగ్గరగా కాకుండా, దూరమవుతూ ఉంటే, ఇది ఎలాంటి ఉదాహరణ? ఒక వ్యక్తికి కడుపు నొప్పి వేసింది, లేక బాగా తల తిరుగుతుంది, తల నొప్పి ఉంది, ఎలాంటి పరిస్థితిలోనైనా ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి. చూసే వారందరూ అంటున్నారు, “తొందరగా ఇప్పుడే ఆంబులెన్స్ ని పిలవండి.” అతను ఏమంటున్నాడు, “వద్దు, వద్దు. అటు వెళ్తే నాకు ఇంకా రోగం పెరుగుద్ది.” అలాంటి వారిని ఏమంటారు? ఎవరికైనా అపెండిక్స్ అయింది అనుకోండి, ఒక వైపున చాలా నొప్పులు వేస్తుంది కదా, విపరీతమైన నొప్పి. నిలబడలేడు, పడుకోలేడు, కూర్చోలేడు, ఎలాంటి స్థితిలో కూడా అతనికి విశ్రాంతి అనేది దొరకదు. అలాంటి వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లకుండా, డాక్టర్ ను కల్పించకుండా అలాగే వదిలేస్తారా?
సోదరులారా! అలాగే కష్టాలు ఎన్ని మనకు వచ్చినా గాని, ఎటు వైపునకు మనం మరలాలి? అల్లాహ్ వైపునకు మరలాలి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఏమంటున్నాడు?
وَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ (వ అఖద్నాహుమ్ బిల్ బ’సాఇ వద్దర్రాఇ ల’అల్లహుమ్ యతదర్ర’ఊన్) వారిని మేము కష్టాల్లో, ఆపదల్లో పట్టుకున్నాము, పరీక్షలకు గురిచేశాము. వారు అల్లాహ్ వైపునకు మరలి ఇంకా ఎక్కువగా మొరపెట్టుకోవాలని.
కానీ ఈ రోజుల్లో ఆ పని చేస్తున్నామా మనం? సోదరులారా! అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసును ఎల్లవేళల్లో మనం మన దృష్టిలో ఉంచుకోవాలి. మహనీయ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
ఐదు విషయాలను ఐదు విషయాలకు ముందు సద్వినియోగం చేసుకోండి
اغتنم خمسا قبل خمس (ఇగ్‌తనిమ్ ఖమ్సన్ ఖబ్ల ఖమ్సిన్) ఈ ఐదు స్థితులు రాకముందు ఈ ఐదు స్థితులను మీరు అదృష్టంగా భావించి దాన్ని మీరు వినియోగించుకోండి.
حَيَاتَكَ قَبْلَ مَوْتِكَ (హయాతక ఖబ్ల మౌతిక) మీ జీవితాన్ని చావు రాకముందు. చావు వచ్చిన తర్వాత ఏమైనా సత్కార్యాలు చేయగలుగుతామా? చేయలేము.
وَشَبَابَكَ قَبْلَ هَرَمِكَ (వ షబాబక ఖబ్ల హరమిక) రెండవది, మీ యవ్వనాన్ని వృద్ధాప్యం రాకముందు. “జవానీ మే క్యా జీ, తౌబా కర్తే సో బుడ్డే హోనే కే బాద్ కర్నా.” ఇది ఒక సామెతగా అయిపోయింది చాలా మంది ప్రజల్లో ఇది. హజ్ ఎప్పుడు చేయాలి అంటే మన సామాన్యంగా ఇండియా, పాకిస్తాన్ నుండి హజ్ గురించి వచ్చే వచ్చేవాళ్లు ఎక్కువ శాతం ఎవరు ఉంటారు? ముసలివాళ్లు. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచాయి, ఒక ఉమ్రా కూడా నసీబ్ లేదు. “ఉమ్రా చేయండి, హజ్ చేయండి” అంటే, “అరే! ఇంత తొందరగా ఎందుకు? మళ్ళీ ఏమైనా పాపాలు జరుగుతాయి కదా.” అస్తగ్‌ఫిరుల్లాహ్. అయితే ఇంకా జీవితం ముందుకు దొరుకుతుంది, ఆ తర్వాత హజ్ చేసిన తర్వాత ఇక మనం పుణ్యాల్లోనే జీవితం గడిపే అంతటి అవకాశం ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఉందా మనకు? మరి అలాంటప్పుడు ఆలస్యం దేని గురించి? తౌబా ప్రతి ఒక్కరు చేస్తూ ఉండాలి. షబాబక్, యవ్వనం, ఇగ్‌తనిమ్, దీన్ని అదృష్టంగా భావించు, ఖబ్ల హరమిక్, వృద్ధాప్యానికి చేరుకునే ముందు.
సోదరులారా! ఇంతకుముందు 55, 60, 60 దాటిన తర్వాత వాళ్లను ముసలివాళ్లు అని అనేవారు, వృద్ధులు అనేవారు. కానీ ఈ రోజుల్లో 40 వరకే డల్ అయిపోతున్నారు అందరూ. అవునా లేదా? అందుగురించి, యవ్వనంలో చేసే అటువంటి ఆరాధన, దాని పుణ్యం వృద్ధాప్యంలో చేసే ఆరాధన కంటే ఎక్కువ గొప్పగా ఉంటుంది. అందుగురించి ప్రవక్త ఏం చెప్పారు? నీ యవ్వనాన్ని నీవు అదృష్టంగా భావించు వృద్ధాప్యం రాకముందు.
وَصِحَّتَكَ قَبْلَ سَقَمِكَ (వ సిహ్హతక ఖబ్ల సఖమిక) ఆరోగ్యాన్ని అనారోగ్యానికి గురి కాకముందే నీవు అదృష్టంగా భావించు.
وَغِنَاكَ قَبْلَ فَقْرِكَ (వ గినాక ఖబ్ల ఫఖ్‌రిక) అల్లాహ్ ఏదైనా ధనం ఇచ్చి ఉన్నాడు, దాన్ని బీదరికానికి గురి కాకముందే అదృష్టంగా భావించు.
وَفَرَاغَكَ قَبْلَ شُغْلِكَ (వ ఫరాగక ఖబ్ల షుగులిక) ఏదైనా సమయం దొరికింది, దాన్ని అదృష్టంగా భావించి సత్కార్యాలలో గడుపు, నీవు ఏదైనా పనిలో బిజీ కాకముందు.
సమయాన్ని వృధా చేయవద్దు
ఇప్పుడు మనలో ఎంతో మంది యువకులు తమ యవ్వనాన్ని, తమ ఆరోగ్యాన్ని, తమ యొక్క ఫ్రీ టైమ్ ఏం చేస్తున్నారు అంటే, టైం పాస్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? టైం పాస్ చేస్తున్నారు. పాస్ అన్నదానికి ఒక అర్థం, గడుపుతున్నాము అని కూడా వస్తుంది, కొడుకు ఎగ్జామ్ లో పాస్ అయిండా ఫెయిల్ అయిండా? ఆ భావం కూడా వస్తుంది. కానీ ఒకసారి ఆలోచించాలి. సామాన్యంగా అనుకునేవారు, టైం గడుపుతున్నాము అనే భావం తీసుకుంటున్నారు. కానీ ఎందులో? ఫిలింలు చూస్తూ, పాటలు వింటూ, లేదా క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ, దాన్ని ఏమంటారు ఏదో, రాజా, రాణి, చోర్, ఏదో కాగితాలు ఉంటాయి కదా, పేకాట? పేకాట అంటారా? ఇట్లాంటి ఆటల్లో గడుపుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు అంటే, అతను టైం పాస్ చేస్తున్నాము. కానీ వాస్తవానికి, ఇక్కడ టైం పాస్ అయితలేదు, ఇందులో నీవు గడిపే టైం అంతా ఫెయిల్ అవుతుంది. రేపటి రోజు అల్లాహ్ ముందు చేరుతావు, ఈ సమయం ఏదైతే నీవు వృధాగా గడిపావో, అల్లాహ్ యొక్క స్వయంగా నీకు విద్యాపరంగా, నీ మేధాపరంగా, నీ ఇహలోక పరంగా, నీ పరలోక పరంగా లాభం చేగూర్చలేని దానిలో నువ్వు ఏదైతే గడిపావో, దాని గురించి నీవు సమాధానం చెప్పవలసి ఉంది. అందుగురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏం చెప్తారు?
మనిషి ఏ సమయాన్నైతే పడుకొని ఉండి గాని, కూర్చొని ఉండి గాని, నడుస్తూ ఉండి గాని అల్లాహ్ యొక్క ధ్యానంలో గడపకుంటే, అతని ఆ నడక, అతని ఆ కూర్చోవడం, అతని ఆ పడుకోవడం అదంతా పాపభరితంగా మరియు ఎంతో బాధకరమైన సమయంగా గడుస్తుంది. ప్రళయ దినాన దాని గురించి విచారణ, లెక్క అనేది జరుగుతుంది.
అందుగురించి సోదరులారా! ప్లీజ్, ఇక టైమ్ ను వృధా చేసుకోకండి. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లోని ఒక్కో అక్షరానికి పది పది పుణ్యాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు, రోజు మనం ఖురాన్ చదవడంలో ఎంత సమయం గడుపుతున్నాము? ఇవన్నీ పరలోకంలో పనికి వచ్చే వస్తువులా కాదా? లేక పేకాటలా, ఫిలింలు చూడడమా, పాటలు వినడమా? అవి పనికి వస్తాయా? అందుగురించి సోదరులారా! మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ధర్మపరంగా మన విద్య పెరగకుంటే, మనం చేస్తున్న ఆచరణలో, సత్కార్యాల్లో ఇంకా కొన్ని సత్కార్యాలు పెరగకుంటే, చెప్పండి మన జీవితం వృధా కాకుంటే ఇంకేమవుతుంది?
సౌదీలో పది సంవత్సరాలు ఉండి వచ్చిన తర్వాత, మీరు స్వదేశానికి తర్వాత మీ ఫ్రెండ్ గాని, లేక మీ బంధువులో ఎవరైనా గాని, “ఏం చేసినావురా పది సంవత్సరాలు ఉండి?” అంటే, “పని చేశాను.” “అవునురా పని చేశావు, ఇక్కడ కూడా ఎడ్లు, ఆవులు, గాడిదలు అన్నీ కూడా అవి కూడా పనిచేస్తున్నాయి. నువ్వు అక్కడికి పోయి పరదేశానికి పోయి ఏం సంపాదించావు అక్కడ, ఏం చేశావు? చెల్లె పెళ్లి చేశావా? బిడ్డ పెళ్లి చేశావా? ఇల్లు కట్టావా?” అడుగుతారా లేదా? అప్పుడు నువ్వు ఏమీ చేయలేదు అనుకో. ఇల్లు కట్టలేకపోయావు, చెల్లె పెళ్లి చేయలేకపోయావు, ఒక్క డబ్బు ఇక్కడ కూడబెట్టి ఒక పైసా అక్కడ నువ్వు ఏమీ చిన్న లాభం చేయలేకపోయావు. శబాష్ అని అంటారా లేకుంటే నాలుగు తిడతారా? కువైట్ పోయి వచ్చినా గాని, సౌదీయా పోయి వచ్చినా గాని, మలేషియా పోయి వచ్చినా గాని, అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయకుంటే, కనీసం నీ తల్లిదండ్రులకు ఉండడానికి ఒక చిన్న గూడైనా, చిన్నవాడి ఇల్లన్నా మంచిగా తయారు చేస్తే బాగుండకపోవునారా? అని నాలుగు తిడతారా లేదా?
ఎగ్జాక్ట్లీ ఇదే ఉదాహరణ మనది. ఇహలోక జీవితం మనకు టెంపరరీగా ఇచ్చాడు దేవుడు, పరీక్ష సమయంగా ఇచ్చాడు దేవుడు, అల్లాహ్ త’ఆలా. ఇక్కడ మనం సత్కార్యాలు సమకూర్చుకోవాలి ఎక్కడి గురించి? పరలోకం గురించి. ఇప్పుడు మనం ఆలోచించండి, ఇక్కడికి వచ్చి జాలియాత్ క్లాసులలో పాల్గొని సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు గడిచాయి, సూరహ్ ఫాతిహా కరెక్ట్ కాలేదు, రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీమ్ తప్ప ఇంకా వేరే కొత్త ఒక దుఆ నేర్చుకోలేదు, అత్తహియాత్ సరిగా రాదు, దాని తర్వాత దరూద్-ఎ-ఇబ్రాహీం గురించి ఇప్పుడు ఆలోచించలేదు. ఆలోచించండి, లాభంలో మన జీవితం గడుస్తున్నట్లా లేకుంటే నష్టంలో గడుస్తున్నట్లా? సంవత్సరాల తరబడి మనం క్లాసులలో వస్తాము లేక సంవత్సరాల తరబడి మనం జుమా ఖుత్బాలు వింటాము, కానీ పాటలు వినడం మానుకుంటలేము, ఫిలింలు చూడడం మానుకుంటలేము, గడ్డాలు వదలడం మనం మొదలుపెట్టలేము, ఇంకా అల్లాహ్ యొక్క మార్గంలో మనం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి, మలుచుకోవాలి అన్నటువంటి భావన మనకు కలుగుతలేదు అంటే, ఇహలోక ప్రేమ మనలో ఎక్కువ ఉన్నట్లా, పరలోక ప్రేమ ఎక్కువ ఉన్నట్లా? చెప్పండి. ఇయ్యాల ఏదో తిన్నచ్చాడు, తాగచ్చాడు, బాగానే వర్షానికి ముందు ఉరుములు ఉరిమినట్టుగా జరుగుతుంది అనుకోకండి. ఇది మన వాస్తవ జీవితం. చెప్పే విషయాలు మీ అందరికంటే ముందు స్వయంగా నా ఆత్మకు, నా ఇస్లాహ్, నాకు నేను సరిదిద్దుకోవడానికి చెప్తున్నాను. ఆ తర్వాత మీ గురించి చెప్తున్నాను. ఆలోచించాలి. ఈ విషయాల్ని మనం పరస్పరం ఆలోచించుకోకుంటే, పరస్పరం మనలో మనం చర్చించుకుంటూ మనకు మనం బాగు చేసుకునే ప్రయత్నం చేయకుంటే, మరి ఎప్పుడు మన యొక్క క్లారిఫికేషన్, మన ఇస్లాహ్, మనకు సంబంధించిన అన్ని రకాల చెడు నుండి దూరం అవ్వడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చనిపోయిన తర్వాతనా? అయ్యో, పాపం, ఇన్ని రోజులు వచ్చి వచ్చి ఇదే పాప స్థితిలో చనిపోయాడు అని నలుగురు ఎన్ని దుఆలు ఇచ్చినా గాని, దుఆకు ముందు అర్హుడు కాకుంటే మనిషి, వంద మంది కాదు, వెయ్యి మంది దుఆ చేసినా గాని లాభం ఉండదు.
అబ్దుల్లా బిన్ ఉబై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నటువంటి మునాఫిక్, వంచకుడు, ప్రవక్త వెనక నమాజ్ చేసేవాడు, ప్రవక్తతోని జిహాద్ లో కూడా పాల్గొనేవాడు. కానీ అతనికి యొక్క మగ్ఫిరత్, అతనికి క్షమాపణ అయితే లభించిందా? లేదు. అల్లాహ్ త’ఆలా చెప్పాడు:
إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الْأَسْفَلِ مِنَ النَّارِ (ఇన్నల్ మునాఫిఖీన ఫిద్దర్కిల్ అస్ఫలి మినన్నార్) మునాఫిక్ లు నరకంలోని అతి అధమ స్థానంలో ఉంటారు.
చివరికి అతని కొడుకు కోరాడు, ప్రవక్తా, మీరు వచ్చి మా నాన్నగారి యొక్క జనాజా చేయించండి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని జనాజా నమాజ్ చేయించడానికి కూడా వెళ్లారు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఆయత్ అవతరింపజేశాడు,
وَلَا تُصَلِّ عَلَىٰ أَحَدٍ مِّنْهُم مَّاتَ أَبَدًا (వలా తుసల్లి అలా అహదిమ్ మిన్హుమ్ మాత అబదా) అలాంటి వంచకులకు నమాజ్-ఎ-జనాజా కూడా మీరు చేయించకండి అని.
ప్రవక్త నమాజ్ చేయించారు కూడా, ప్రవక్త దుఆ అతని గురించి కబూల్ అయిందా? లేదు, కాలేదు. అందుగురించి మనలో కొందరు ఏమనుకుంటారు, ఏదో చిన్నపాటి పాపాలు జరుగుతూ ఉండి, తప్పులు జరుగుతూ ఉండి, ఆ, ఏదో ఇట్లా జీవితం గడుపితే ఏమైతంది, రేపటి రోజు కొద్ది రోజుల తర్వాతనైనా స్వర్గం పోతాం కదా, అయ్యో మా ఊర్లో ఇంత మంది మౌలీ సాబులు ఉన్నారు కదా, సౌదీలో ఒకవేళ చనిపోతే ఇంకా బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ మంది జనాజా నమాజ్ చదువుతారు కదా. ఇట్లాంటి ఆలోచనల్లో కూడా ఉంటారు. అయితే దాని గురించి నేను చెప్తున్నాను. స్వయంగా మనం అల్లాహ్ క్షమాపణకు అర్హులు కాకుంటే, వంద మంది కాదు, వెయ్యి మంది కాదు, లక్షల మంది నమాజ్ చేసినా గాని, మన ఊర్లే కాదు, ఇక్కడ సౌదీలో కాదు, హరమ్ షరీఫ్ లో జనాజా జరిగినా గాని, మదీనాలో జరిగినా గాని, అతని యొక్క క్షమాపణ అనేది అర్హత లేకుంటే ఎంత మంది దుఆలు కూడా పనికి రావు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆ కూడా అబ్దుల్లా బిన్ ఉబై గురించి పనికి వచ్చిందా? రాలేదు.
అందుగురించి సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే ఇహలోక జీవితం చాలా చిన్నగా ఉంది. నాలుగు రోజుల ఈ జీవితాన్ని మనం కేవలం తిండి, ఇంకా మన కోరికలు గడుపుకోవడంలోనే గడుపితే, పరలోకంలో చాలా నష్టం చూసుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా అలాంటి నష్టాల నుండి మనందరినీ కాపాడుగాక. అందుగురించి ఖురాన్ యొక్క ఈ ఆయత్ ద్వారా నేను ఈనాటి ఈ ప్రసంగాన్ని సమాప్తం చేస్తాను. అల్లాహ్ త’ఆలా ఎవరైతే పరలోకానికి ప్రాధాన్యత ఇస్తారో, అల్లాహ్ వారి గురించి ఏం చెప్పారు?
إِنَّ هَٰؤُلَاءِ يُحِبُّونَ الْعَاجِلَةَ وَيَذَرُونَ وَرَاءَهُمْ يَوْمًا ثَقِيلًا (ఇన్న హా ఉలాఇ యుహిబ్బూనల్ ఆజిలత వ యదరూన వరాఅహుమ్ యౌమన్ సఖీలా) వీరు ఇహలోకానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు, ఇహలోకాన్ని ప్రేమిస్తున్నారు, మరియు ఆ భారీ, బరువైన ఆ రోజు ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తున్నారు. (సూరహ్ ఇన్సాన్, ఆయత్ నెంబర్ 27)
ఆ రోజు చాలా శిక్ష కఠిన, ఎంతో భయంకరమైన ఆ రోజు. అది మన గురించి సులభతరంగా కావాలంటే, ఎంతో హాయిగా, మంచితనంగా గడవాలంటే, ఇహలోకంలో సత్కార్యాలు చేసుకోవాలి, సత్కార్యాల్లో జీవితం గడపాలి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సఊది అరేబియాలోని జుల్ఫీ జాలియాత్ వారు సమర్పిస్తున్న మరో నూతన వీడియో వీక్షించండి ప్రళయదినాన త్రాసును నెలకొల్పడం సత్యం, ఎవరి పుణ్యపళ్ళాలు బరువుగా ఉంటాయో వారే స్వర్గంలో చేరేవారు.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
ప్రళయ దినాన కర్మలు బరువు వేసే త్రాసు స్థాపించబడుతుంది.
త్రాసు గురించి అల్లాహ్ ఖుర్‌ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:
“ప్రళయ దినాన కచ్చితంగా తూచేటటువంటి త్రాసులను మేము ఏర్పాటు చేస్తాము. ఆ తర్వాత ఎవరిపై కూడా రవ్వంత అన్యాయం జరగదు. ఎవరైనా ఒక ఆవగింజకు సమానమైన ఆన్యాయం చేసి ఉన్నా దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాము. లెక్క తీసుకొనుటకు మేమే చాలు.”(21,సూరతుల్ అంబియా: 47)
హజ్రత్ ఇమామ్ ఖుర్‌తుబి (రహిమహుల్లాహ్) ఇలా ప్రవచించారు: “లెక్కలు తీసుకున్న తరువాత కర్మలను తూకం వేస్తారు. వారి పుణ్యాల బరువుకు తగ్గట్టుగా ప్రతిఫలం కూడా ఉంటుంది. అందుకనే లెక్కలు తీసుకున్న తరువాత కర్మలు తూయబడును. తరువాత వాటి ఆధారంగా మానవులకు (అంతస్తుల) ప్రతిఫలం ప్రసాదించడం జరుగుతుంది.” (తజ్‌కిరతుల్ ఖుర్‌తుబి: 309)
హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన త్రాసులో (కర్మలు) తూకం వేయబడును. ఆ త్రాసు భూమ్యాకాశాలను తూకం వేసేటంత విశాలంగా ఉంటుంది“. *
ఓ ప్రభూ! “దీనిలో ఎవరినీ తూకం వేస్తారు?” అని అల్లాహ్ దూతలు ప్రశ్నించారు. దానికి అల్లాహ్: “నా సృష్టిలో నేను తలచుకున్నవారందరినీ” అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ దూతలు: “సుబ్ హానక్! మేము నీకు ఎంతగా ఆరాధించాలో అంతగా ఆరాధించ లేదే!” అని అంటారు.(హాకిమ్, అస్ సహీహ: 941)
*గమనిక: కొందరు త్రాసు అనగా “అల్లాహ్ న్యాయాన్ని స్థాపిస్తాడే తప్ప త్రాసు రూపాంతరము ఉండదనీ భావించారు”. అలా భావించడం సరికాదు. నిజమైన విషయం ఏమంటే! అల్లాహ్ సాక్ష్యాత్తు త్రాసును నిలబెట్టుతాడు. ఇలా మనం విశ్వసించడం వల్ల ఖుర్‌ఆన్, హదీసులలో ప్రచురించబడిఉన్న నిజమైన వాక్యాలకు అనుగుణమైన విశ్వాసం అవుతుంది. కనుక విశ్వాసులందరూ ఆ త్రాసును తప్పక విశ్వసించాలి. మరియు ప్రళయ దినాన దానిలో కర్మలు తూయబడుతాయనీ, దానికి రెండు తూకం వేసే పళ్ళెములు ఒక సరిసమానం చేసే ముళ్లు కూడా ఉందనీ విశ్వసించాలి. ఇంకా దానిలో కర్మలు తూకం వేస్తే పైకీ క్రిందికి ఆ పళ్ళెములు వంగుతాయనీ కూడా విన్వసించాలి. ఇదే ‘“అహ్‌లుస్ సున్నత్ వల్ జమాఅత్” విశ్వాసం.
ఎలాంటి కర్మలను త్రాసులో తూకం వేస్తారు?
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“రెండు వాక్యాలు పలకటానికి చాలా తేలికైనవి, కాని అవి త్రాసులో చాలా బరువైనవి, కరుణామయునికి ఎంతో ప్రియమైనవి. అవి, “సుబ్‌హానల్లాహి వబిహమ్‌దిహి, సుబ్‌హానల్లాహిల్ అజీమ్.” (బుఖారీ,ముస్లిం)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయ దినాన ప్రజలందరి ముందు నా ఉమ్మత్‌కు చెందిన ఒక వ్యక్తిని కేకలు పెట్టి పిలువడం జరుగుతుంది. తరువాత అతని ముందు తొంభైతొమ్మిది (కర్మల) పత్రాలను తెరిచి పరుస్తారు. ప్రతి పత్రం అతను చూడగలిగినంత దూరం వరకూ (పెద్దదిగా) ఉంటుంది.”
తరువాత అల్లాహ్ అతనితో: “దీని (పాపాల పత్రాలు)లో నీవు చేయని (విషయాలు) ఏమైనా ఉన్నాయనీ చెప్పగలవా?” అని ప్రశ్నిస్తాడు.
అతను: “లేదు నా ప్రభూ!” అని అంటాడు.
మరలా అల్లాహ్ అతనితో: “వాటిని జాగ్రత్తగా రాసేవారు (మున్కర్ నకీర్) నీపై (నీ పత్రాలలో) అన్యాయంగా ఏమైనా రాసారా!”’ అని ప్రశ్నిస్తాడు. తరువాత అతనితో: “నీ వద్ద వాటికి (ఆ పాపాల పత్రాలకు) బదులు పుణ్యాలేమైనా ఉన్నాయా?” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు.
అప్పుడు అతను: లోలోన భయపడుతూ “నా వద్ద (పుణ్యాలు) లేవు” అని అంటాడు.
ఆ తరువాత అల్లాహ్ అతనితో: “ఎందుకు లేవు మా వద్ద నీ పుణ్యం ఒకటుంది. ఈ రోజు మేము ఎవరికీ అన్యాయం చెయ్యబోము” అని అల్లాహ్ (షహాదత్) “అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్‌హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”’ పత్రాన్ని అతనికి ప్రసాదిస్తాడు. అతను: (దాన్ని చూసి) “ఓ అల్లాహ్ ఈ ఒక్క పత్రం అన్ని (పాపాల) పత్రాలకు సరిసమానమవుతుందా?” అని ఆశ్చర్యపడుతూ అంటాడు.
తరువాత అల్లాహ్: “ఈ రోజు నీకు ఎలాంటి అన్యాయం జరగదు” అని అంటాడు.
తరువాత “(అతని పాపాల) పత్రాలన్ని ఒక పళ్లెంలో వేస్తారు. మరియు ‘షహాదత్ పత్రం’ మరొక పళ్లెంలో వేస్తారు. ఆ (పాపాల) పత్రాలన్ని తేలికైపోతాయి. షహాదత్ పత్రం (అన్ని పత్రాలపై) బరువైపోతుంది. (ఎందుకంటే) అల్లాహ్ పేరు కంటే (ఎక్కువ) ఏదీ బరువు ఉండదు.”’ (తిర్మిజీ హాకిమ్, సహీహ్ ఇబ్నుమాజ: 3469)
హజ్రత్ అబూ దర్దా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజున త్రాసులో తూకం చేసినప్పుడు ఉత్తమ గుణాలకంటే ఎక్కువ బరువు ఏ విషయము ఉండదు.” (ఇబ్నుమాజ, తిర్మిజీ, హాకిమ్)
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ప్రళయం రోజు ఒక లావుగా బలసిన వ్యక్తి వస్తాడు. అయినా అతను (త్రాసులో) దోమ రెక్కకు సమానం కూడా బరువు ఉండడు. తరువాత ఖుర్‌ఆన్ సూక్తిని ఇలా పఠించారు:
فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا
“ప్రళయం రోజున మేము వారిని ఏ మాత్రము బరువుగా నిలబెట్టము.””(18,సూరతుల్ కహఫ్:105) (బుఖారీ)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రది అల్లాహు అన్హు) కథనం; “ఒక రోజు నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మిస్వాక్ చెట్టు నుండి మిస్వాక్‌ను తెంపుకొనే టప్పుడు క్రిందకు (నేలపై) పడిపోయేటట్టు గాలి వీచింది. ఆ పరిస్టితిని చూసి ప్రజలు నవ్వినారు. మీరు ఎందుకు నవ్వుతున్నారనీ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. దానికి వారందరూ: ఓ అల్లాహ్ ప్రవక్తా! “ఆయన కాళ్ళు సన్నగా ఉన్నందువలన” అని సమాధానమిచ్చారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో, అతని సాక్షిగా! ప్రళయ దినాన త్రాసులో ఆయన కాళ్ళు ఉహద్ కొండకంటే ఎక్కువ బరువు ఉంటాయి.” (అహ్మద్, ఇర్వావుల్ గలీల్:65)
హజ్రత్ అబూ మాలిక్ అల్ అష్‌అరి (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“పరిశుభ్రత విశ్వాసానికి ఒక షరతు. ఆల్ హమ్‌దులిల్లాహ్ (అనే పదాలు) త్రాసులో నిండిపోతాయి. సుబ్‌హానల్లాహి, వల్ హమ్‌దు లిల్లాహి (అనే పదాలు) భూమ్యాకాశాల మధ్యలో ఉన్న (స్థలమంతా) నిండిపోతాయి.” (ముస్లిం)
హజ్రత్ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం; ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“ఎవరైనా అల్లాహ్‌ను విశ్వసిస్తూ, అతని వాగ్దానాన్ని ధృవీకరిస్తూ, తన గుర్రానికి (ధర్మ పోరాటానికై ఎల్లప్పుడు) సిద్ధంగా ఉంచినట్లయితే, ఆ గుర్రానికి అతను మేత పెట్టినందుకు, నీరు త్రాగించినందుకు, (ఆ గుర్రం) పేడ వేసినందుకు, మూత్ర విసర్జన చేసినందుకు బదులుగా, ప్రళయ దినాన ఆ వ్యక్తి కొరకు త్రాసులో పుణ్యాలు బరువు చేయ బడుతాయి.” (బుఖారి)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.