అల్లాహ్ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు https://youtu.be/5AZinozb7W8 [18 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
హజ్రత్ అబూ హురైరా అబ్దుర్రహ్మాన్ బిన్ సఖర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ మీ శరీరాలను, మీ ముఖాలను చూడడు. ఆయన మీ అంతరంగాలను, ఆచరణలను మాత్రమే చూస్తాడు.” (ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు https://youtu.be/hVPv5X3woKA [10 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
9. హజ్రత్ అబూబక్రహ్ నుఫైబిన్ హారిస్ సఖఫీ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) :
“ఇద్దరు ముస్లింలు తమ తమ ఖడ్గాలతో పరస్పరం దాడికి దిగితే, హంతకుడు, హతుడు – ఇద్దరూ నరకానికి వెళతారు” అని చెప్పారు. నేను “దైవప్రవక్తా! హంతకుని మాట సరేగాని హతుడేం పాపం చేశాడని నరకానికి వెళతాడు? అని సందేహపడ్డాను. అందుకాయన “అతనూ తన ప్రత్యర్థిని చంపాలన్న కసితోనే ఉన్నాడు కదా!” అని బదులిచ్చారు. (బుఖారీ -ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు – రియాదుస్ సాలిహీన్ https://youtu.be/LEj9zcBqzMI [16 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
[11] దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ప్రభువు ద్వారా ఉల్లేఖించిన విషయాన్ని హజ్రత్ అబుల్ అబ్బాస్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉటంకించారు :
“అల్లాహ్ సత్కార్యాలను, దుష్కార్యాలను రాసి, పిదప వాటిని గురించి వివరించాడు; ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలని సంకల్పించుకొని, (ఏదయినా కారణంచేత) దానిని అమలుపరచలేక పోయినప్పటికీ అల్లాహ్ తన వద్ద అతను ఒక సత్కార్యం పూర్తి చేసినట్టు రాసుకుంటాడు. మరి ఆవ్యక్తి ఆ మంచి పని చేయాలని ఉద్దేశించుకొన్న పిదప దాన్ని నెరవేరిస్తే దానికి అల్లాహ్ పది నుండి ఏడు వందల రెట్లు – ఇంకా దానికంటే ఎన్నో రెట్లు అధికంగానే సత్కర్మలు చేసినట్లు అతని ఖాతాలో రాస్తాడు. (దీనికి భిన్నంగా) ఎవడైనా ఒక చెడుపని చేయాలనుకుని ఏదయినా కారణంచేత చేయకుండా ఉంటే అప్పటికీ అల్లాహ్ తన వద్ద, ఆ వ్యక్తి పూర్తిగా ఒక మంచి పని చేసినట్టు రాసుకుంటాడు. అయితే అతను ఆ చెడ్డపని చేయాలని సంకల్పించుకున్న పిదప దాన్ని చేసేస్తే మాత్రం ఒక్క చెడ్డపని చేశాడని పొందుపరుస్తాడు” (బుఖ్లూరీ -ముస్లిం)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
‘హదీసు’వేత్తల సంక్షిప్త జీవిత గాథలను బస్తవీ గారు ”రియా‘దుల్ ము‘హద్దిసీ‘న్”లో పేర్కొన్నారు. ఇక్కడ కేవలం రచయిత తన ముందుమాటలో పేర్కొన్న ‘హదీసు’వేత్తలను గురించి పేర్కొనబడింది.
బు’ఖారీ పేరు, ముహమ్మద్ –అబూఅబ్దుల్లాహ్. బిరుదు ఇమాముల్ ము’హద్దిసీ’న్, అమీరుల్ ము’హద్దిసీ’న్. ఇతని వంశ పరంపర ము‘హమ్మద్ బిన్ ఇస్మా‘యీల్ బిన్ ఇబ్రాహీమ్ బిన్ అల్ ము‘గీరహ్.
జన్మం, ఖరసాన్ సమర్ఖంద్, ఇప్పటి ఉజ్బెకిస్తాన్, 13-10-194 హిజ్రీ (19-7-810 క్రీ.శ.). మరణం, 1-10-256 హి (1-9-870 క్రీ.శ.), 60 సం. వయస్సులో సమర్ఖందులో. ఇతను అబ్బాసీయ పరిపాలనా కాలంలో ఉన్నారు. ఇతని శిక్షకులు, అహ్మద్ బిన్ హంబల్, అలీ బిన్ మదీనీ, ఇస్హాఖ్ బిన్ రహ్వే. ఇతని శిశ్యులు ముస్లిం బిన్ హజ్జాజ్, ఇబ్నె అబీ ఆసిం. సహీహ్ బుఖారీ ఇతని ముఖ్య పుస్తకం.
బు’ఖారీ తండ్రి పేరు ఇస్మా’యీల్, బిరుదు అబుల్ ‘హసన్. ఇతను మలిక్ బిన్ అనస్ శిశ్యులు. ఇతను చాలా పెద్ద ‘హదీసు’వేత్త. ఇస్మా’యీల్ చాలా పరిశుద్ధులు మరియు ధర్మ సంపాదకులు. ఒకసారి మాట్లాడుతూ ‘నా సంపాదనలో ఒక్క దిర్‌హమ్ అయినా అధర్మ సంపాదన లేదు,’ అని అన్నారు. (అస్’ఖలానీ)
బు’ఖారీలో ఎన్నో గొప్ప గుణాలు ఉండేవి. ఇవే కాక మరో గొప్పతనం ఏమిటంటే, తండ్రి కొడుకులు ఇద్దరూ ‘హదీసు’వేత్తలే. బు’ఖారీ తల్లి చాలా భక్తురాలు, మహత్మ్యాలు కలిగి ఉండేది. ఎల్లప్పుడూ దైవాన్ని ప్రార్థించడం, దైవ భీతితో కన్నీళ్ళు కార్చటం, దీనంగా మొర పెట్టుకోవటం చేసేది. బు’ఖారీ కళ్ళు చిన్నతనంలోనే అస్వస్థతకు గురయ్యాయి. దృష్టి క్రమంగా పోసాగింది. వైద్యులు ఇక నయం కాదని చేతులెత్తేశారు. బు’ఖారీ తల్లి ఇబ్రాహీమ్ (అ)ను కలలో చూశారు. ‘నీ ప్రార్థన మరియు ఏడ్వటం వల్ల అల్లాహ్ నీ కొడుకు కళ్ళకు స్వస్థత ప్రసాదించాడు,’ అని అతను అంటున్నారు. ఉదయం లేచి చూసే సరికి బు’ఖారీ కళ్ళు నయం అయి ఉన్నాయి. కంటి చూపు తిరిగి వచ్చి ఉంది. అయితే అంతకు ముందు కంటి చూపు ఎందుకు పోయిందో కారణం తెలియలేదు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత వెన్నెల రాత్రుల్లో కూర్చొని ”తారీఖ్ కబీర్” అనే పుస్తకం వ్రాశారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హదీసు పరిచయం – (బస్తవి) (12 పేజీలు) [PDF] హదీసు అంటే ఏమిటి? ఖురాన్ లో హదీసు ప్రస్తావన? ఖురాన్ వివరణలో హదీసు ప్రాముఖ్యత. హదీసు వివేక పూరితమైనది. ఇస్లాం ను అర్ధం చేసుకోవడానికి హదీసు అవసరం. హదీసులు కూడా అల్లాహ్ దగ్గర నుండి వచ్చినవే. హదీసు ప్రత్యేకతలు…
పరిచయము
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ప్రవక్త (స) ‘హదీసు’ల సేవకుడు అబ్దుస్సలామ్ బ‘స్తవీ ముస్లిమ్ సోదరులకు విన్నవించుకునేది ఏమనగా ప్రస్తుత కాలంలో అవిశ్వాసం, దైవ ధిక్కారం, నాస్తికత్వం, మార్గభ్రష్టత్వం రోజురోజుకూ వ్యాపిస్తూ వృద్ధి చెందుతూ ఉన్నాయి. పరాయి వారే కాదు, ముస్లిములు కూడా వీటికి గురై తమ్ముతాము నాశనం చేసుకుంటున్నారు. ఖుర్‌ఆన్‌ను తమ కల్పిత మూఢ నమ్మకాలకు అనుగుణంగా మలచుకుంటున్నారు. అంతే కాదు ప్రవక్త (స) ‘హదీసు’ల పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వాటి ప్రామాణికతను, ప్రాముఖ్యతను నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ వీరు ఈ ‘హదీసు’ల ప్రాధాన్యత, ప్రాముఖ్యతలను తెలుసు కుంటే ఏనాడూ ఇటువంటి మహా పాపాలకు పాల్పడరు. ఇందులో చాలా సులభమైన పద్ధతిలో ‘హదీసు’లను అనువదించడం వివరించడం జరిగింది. అల్లాహుత’ఆలా మనందరికీ ‘హదీసు’లను అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హదీసు సంకలనం (Compilation of Hadith) – అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్) [వీడియో] https://youtu.be/jnGNFr_0cog [33 నిముషాలు]
ఎపిసోడ్-1 లో చెప్పబడిన విషయాలు
-హదీస్ అంటే అర్ధం? వివరణ -హదీస్ ప్రాముఖ్యత -హదీస్ ప్రస్తావన ఖుర్ఆన్ లో -హదీస్ అవసరం లేదు అన్నవారికి సమాధానం -హదీసులు కంఠస్తం చేసేవారికి శుభవార్త -వహీ ఎన్ని రకాలు?అవి ఏవి? -హదీసుల పట్ల ఉత్సాహం -ఖుర్ఆన్ తో పాటు ఇంకోటి ఇవ్వబడింది అదే హదీస్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 21 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా అల్లాహ్ మార్గంలో కృషిచేయడం గురించి, ఇహ లోకంలో మన సంఘర్షణ గురించి తెలియజేసింది. మొదటి ఆయతులో వచ్చిన ‘లైల్’ (రాత్రి) అన్న ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఇహలోక జీవితం ఒక సంఘర్షణ అని, ఇహపరలోకాల్లో సాఫల్యం లేదా వైఫల్యం అన్నది ఈ సంఘర్షణపై ఆధారపడి ఉందని, మనం అల్లాహ్ ను విశ్వసించి మంచి పనులు చేస్తే, అల్లాహ్ పట్ల భయభీతులు కలిగి ఉండి, దానధర్మాలు చేస్తే, సత్యాన్ని విశ్వసిస్తే సాఫల్యం పొందగలమనీ, అల్లాహ్ మనకు శాశ్వత స్వర్గవనాలు ప్రసాదిస్తాడని తెలిపింది. కాని మనిషి దుర్మార్గానికి కట్టుబడి, అల్లాహు దూరమైతే, స్వార్ధంతో, దురాశతో వ్యవహరిస్తే, సత్యాన్ని తిరస్కరిస్తే దారుణంగా విఫలమవుతాడు. అల్లాహ్ఆ దేశాలను తిరస్కరించిన వారికి భగభగమండే అగ్నిశిక్ష సిద్ధంగా ఉందని హెచ్చరించడం జరిగింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పరిచయం: ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అల్లాహ్ అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హృదయాన్ని అల్లాహ్ కారుణ్యంతో నింపాడు. ప్రజలందరినీ ఆహ్వానించే హృదయవైశాల్యం ప్రసాదించాడు. కష్టనష్టాలను తొలగించి, ఆయన హోదా గౌరవాలను ఇనుమడింపచేసాడు. కాబట్టి, అధైర్యపడకుండా, క్రుంగిపోకుండా, అల్లాహ్ ప్రసన్నత పొందడానికి తీరిక లభించినపుడు ఆరాధనలో నిమగ్నమై పోవాలని ఆయనకు బోధించడం జరిగింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. అల్లాహ్ పట్ల మనిషి కృతఘ్నతను, ప్రాపంచిక జీవితం పట్ల వ్యామోహాన్ని ఈ సూరా ప్రస్తావించింది. ఈ సూరాకు పెట్టిన పేరు మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. ఈ సూరా యుద్ధ రంగంలో విశ్వాసులు ఉపయోగించే గుర్రాలకు సంబంధించిన వర్ణనతో ప్రారంభమయ్యింది. ప్రజలు తమ సంపద పట్ల, ప్రాపంచిక భోగభాగ్యాల పట్ల ఎలా వ్యామోహం పెంచుకుంటారో వివరించింది. అల్లాహ్ పట్ల ఎలా కృతఘ్నులు అవుతారో తెలిపింది. తీర్పుదినాన ప్రతి ఒక్కరి కర్మల చిట్టా అతని ముందు ఉంటుందని, ప్రతి ఒక్కరి రహస్యాలు బట్టబయలవుతాయని తెలియజేసింది.
100:2 فَالْمُورِيَاتِ قَدْحًا మరి డెక్కల రాపిడితో నిప్పు రవ్వలను చెరిగేవాటి సాక్షిగా![2]
100:3 فَالْمُغِيرَاتِ صُبْحًا మరి ప్రభాత సమయాన (ప్రత్యర్ధులపై) మెరుపుదాడి చేసేవాటి సాక్షిగా![3]
100:4 فَأَثَرْنَ بِهِ نَقْعًا – మరి ఆ సమయంలో అవి దుమ్ము ధూళిని రేపుతాయి.[4]
100:5 فَوَسَطْنَ بِهِ جَمْعًا మరి దాంతో పాటు (శత్రు) సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకు పోతాయి.[5]
100:6 إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు (విషయంలో) చేసిన మేలును మరచినవాడుగా తయారయ్యాడు.[6]
100:7 وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి![7]
100:8 وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ యదార్ధానికి అతను ధన ప్రేమలో మహా ఘటికుడు.[8]
100:9 أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ ఏమిటి, సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా?[9]
100:10 وَحُصِّلَ مَا فِي الصُّدُورِ గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి (అతనికి తెలీదా?)[10]
100:11 إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది.[11]
Footnotes:
[1] ‘ఆదియాత్‘ అంటే చాలా వేగంగా పరుగెత్తే గుఱ్ఱాలని అర్థం. ‘దబ్ హున్‘ అంటే వగర్చటం, రొప్పటం అని ఒక అర్థం. సకిలించటం అని మరో అర్థం. అంటే రొప్పుతూ లేక ఆవేశంతో సకిలిస్తూ రణరంగంలో శత్రు సేనల వైపు దూసుకుపోయే గుర్రాలని భావం.
[2] ఆ విధంగా అవి పరుగెత్తుతూ పోతున్నప్పుడు వాటి డెక్కల రాపిడికి నిప్పు కూడా పుడుతుంది. ముఖ్యంగా అవి పర్వత కనుమల మీదుగా పోతున్నప్పుడు, రాతి ప్రదేశాలలో తమ ఖురములను నేలకు కొడుతూ పోతున్నప్పుడు ఈ దృశ్యం కనిపిస్తుంది. అటువంటి అశ్వాల మీద ప్రమాణం చేసి రానున్న వాక్యాలలో ఒక ముఖ్య విషయం చెప్పబడుతోంది.
[3] ‘ముగీరాత్‘ అంటే ఆకస్మిక దాడి జరిపేవి అని అర్థం. పూర్వం అరేబియాలో సాధారణంగా ఉదయం పూటే యుద్ధం మొదలయ్యేది. రాత్రిపూట అందరూ ఆదమరిచి నిద్రపోతుండగా శత్రు శిబిరాలపై విరుచుకుపడటం పిరికితనానికి నిదర్శనమని, శూరులైన వారెవరూ అలాంటి వెన్నుపోటుకు పాల్పడరని వారు భావించేవారు.
[4] అంటే – ఆ గుర్రాలు వేగంగా దూసుకు పోతున్నప్పుడు, శత్రుశిబిరంపై ఆకస్మిక దాడులు జరిపినప్పుడు ఆ ప్రాంతమంతా దుమ్ముధూళితో నిండిపోతుంది.
[5] ‘వసత్న‘ అంటే మధ్యలోకి అని అర్థం. తాము రేపిన దుమ్ముతో ఆ ప్రదేశమంతా కలుషితమై, ఏమీ కానరాని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ గుర్రాలు అకస్మాత్తుగా శత్రువుల శ్రేణులలోకి చొచ్చుకుపోయి కలకలాన్ని సృష్టిస్తాయి.
[6] మొదటి ఐదు ఆయతులలో చేయబడిన ప్రమాణాలకు సమాధానం ఈ (6వ) ఆయతులో ఇవ్వబడింది. ఇక్కడ ‘మానవుడు’ అంటే సత్య తిరస్కారి, దైవధిక్కారి అయినవాడు అన్నమాట! మేలును మరచిన వారే ఇలా తయారవుతారు.
[7] అంటే – మనిషి తన ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా తాను దేవుని కృతఘ్నుణ్ణి అని ఖుద్దుగా నిరూపించుకుంటున్నాడు.
[8] ఇక్కడ “ఖైర్” అనే అరబీ పదం ధనం, డబ్బు, సిరిసంపదలు అన్న అర్థంలో ప్రయోగించ బడింది. ఉదాహరణకు: అల్ బఖరా సూరాలోని 180వ వచనంలో “ఇన్ తరకల్ ఖైరా….” ను చూడండి. అక్కడ ఆ పదం ఆస్తిపాస్తులు, సిరిసంపదలు అన్న అర్థంలోనే ఉంది. “షదీద్‘ అంటే ‘చాలా గట్టివాడు’ అని అసలు అర్థం. అయితే ధనాశ కలవాడు, పిసినారి అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా సంపద వ్యామోహంలో చిక్కుకుపోయినవాడే పిసినిగొట్టుగా, పేరాశాపరునిగా తయారవుతాడు.
[9] అంటే – సమాధులలో ఉన్న మృతులంతా బ్రతికించబడి, లేపబడే సమయం….
[10] అంటే – హృదయాలలో దాగివున్న రహస్య విషయాలన్నీ బయటపెట్టబడిన వేళ.
[11] మృతులను సమాధుల నుంచి సజీవంగా లేపిన పరమప్రభువు, వారి ఆంతర్యాల్లోని రహస్య విషయాలను వెళ్ళగ్రక్కించే అల్లాహ్ ఎంతటి సూక్ష్మద్రష్టయో ఊహించవచ్చు. ఆయన నుండి ఏ వస్తువూ దాగిలేదు. మరి ఆయన ప్రతి ఒక్కరికీ వారి కర్మలనుబట్టి పుణ్యఫలమో, పాపఫలమో ఇస్తాడు. దైవానుగ్రహాలను అనుక్షణం ఆస్వాదిస్తూ అల్లాహ్ మేళ్లను మరచి విర్రవీగే వారికి ఇదొక హెచ్చరిక! అలాగే ధనవ్యామోహంలో పడిపోయి తమ సంపదలో నుంచి హక్కుదారుల హక్కు చెల్లించ కుండా ఉండే పిసినారులకు కూడా ఇది హెచ్చరికే!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.