సుననె రాతిబహ్ (సున్నతే ముఅక్కద) – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో]

సుననె రాతిబహ్ (సున్నతే ముఅక్కద) – హబీబుర్రహ్మాన్ జామి’ఈ [వీడియో]
https://youtu.be/I1YhvW1cte4 [14 నిముషాలు]

నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.

عَنْ أُمِّ حَبِيبَةَ رضي الله عنها زَوْجِ النَّبِيِّ ﷺ أَنَّهَا قَالَتْ سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْـجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْـجَنَّةِ(.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది“. (ముస్లిం 728).

సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు:

ఫజ్ర్ కు ముందు 2. (2)
జుహ్ర్ కు ముందు 2 + 2 = 4. (6)
జుహ్ర్ తర్వాత 2. (8)
మగ్రిబ్ తర్వాత 2. (10)
ఇషా తర్వాత 2. (12)
(పై 12 రకాతుల సంఖ్యను సామాన్యంగా ‘సున్నతె ముఅక్కద’ అంటారు)

సున్నతు మరియు నఫిల్ నమాజులు

%d bloggers like this: