నిరంతరం సున్నతె ముఅక్కద చదివేవారు స్వర్గంలో ఒక గృహానికి అర్హులవుతారు.
عَنْ أُمِّ حَبِيبَةَ رضي الله عنها زَوْجِ النَّبِيِّ ﷺ أَنَّهَا قَالَتْ سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: (مَا مِنْ عَبْدٍ مُسْلِمٍ يُصَلِّي لله كُلَّ يَوْمٍ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً تَطَوُّعًا غَيْرَ فَرِيضَةٍ إِلَّا بَنَى اللهُ لَهُ بَيْتًا فِي الْـجَنَّةِ أَوْ إِلَّا بُنِيَ لَهُ بَيْتٌ فِي الْـجَنَّةِ(.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నానని ఆయన సతీమణి ఉమ్మె హబీబా (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: “ముస్లిం దాసుడు ప్రతి రోజూ ఫర్జ్ నమాజు కాకుండా పన్నెండు రకాతుల నఫిల్ నమాజు అల్లాహ్ కొరకు చేస్తూ ఉంటే అల్లాహ్ అతని కొరకు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు. లేక ఒక ఇల్లు అతని కొరకు నిర్మించబడుతుంది“. (ముస్లిం 728).
సున్నతె ముఅక్కదలో కొన్ని ఫర్జ్ నమాజుకు ముందున్నాయి, మరి కొన్ని తర్వాతున్నాయి. అవి మొత్తం 12 రకాతులు:
- ఫజ్ర్ కు ముందు 2. (2)
- జుహ్ర్ కు ముందు 2 + 2 = 4. (6)
జుహ్ర్ తర్వాత 2. (8) - మగ్రిబ్ తర్వాత 2. (10)
- ఇషా తర్వాత 2. (12)
(పై 12 రకాతుల సంఖ్యను సామాన్యంగా ‘సున్నతె ముఅక్కద’ అంటారు)
1. ఫజ్ర్ నమాజు కంటే ముందు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారు:
(رَكْعَتَا الْفَجْرِ خَيْرٌ مِنْ الدُّنْيَا وَمَا فِيهَا(.
“ఫజ్ర్ కు ముందు రెండు రకాతులు ప్రపంచము మరియు అందులో ఉన్నవాటి కంటే ఉత్తమమైనవి“.
ముస్లిం 725లోనే మరో ఉల్లేఖనంలో ఉంది:
لَهُمَا أَحَبُّ إِلَيَّ مِنَ الدُّنْيَا جَمِيعًا
“విశ్వం మొత్తానికంటే నాకు ఇవి రెండు నాకు అత్యంత ప్రియమైనవి”
ప్రవక్త ﷺ పాబందీగా పాటించే సున్న తుల్లో ఫజ్ర్ సున్నతులు కూడా, వాటిని ఆయన ప్రయాణంలో ఉన్నా, స్థానికంగా ఉన్నా విడనాడకపోయేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం:
أَنَّ النَّبِيَّ ﷺ لَمْ يَكُنْ عَلَى شَيْءٍ مِنْ النَّوَافِلِ أَشَدَّ مُعَاهَدَةً مِنْهُ عَلَى رَكْعَتَيْنِ قَبْلَ الصُّبْحِ.
“ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నఫిల్ నమాజుల్లో ఫజ్ర్ సున్నతులను చేసేటంత ఎక్కువ పాబందీగా మరో నఫిల్ చేసేవారు కారు“. (బుఖారి 1163, ముస్లిం 724).
2). జుహ్ర్ కు ముందు 4 (సున్నతె ముఅక్కద్). తర్వాత 2 (సున్నతె ముఅక్కద) + 2 నఫిల్
ఘనతలు, లాభాలు:
ఉమ్మె ‘హబీబహ్ (రజియల్లాహు అన్హా) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను:
“مَنْ حَافَظَ عَلَى أَرْبَعٍ رَكْعَاتٍ قَبْلَ الظُّهْرِ وَأَرْبَعٍ بَعْدَهَا حَرَّمَهُ اللهُ عَلَى النَّارِ”.
“జుహ్ర్ కు ముందు 4 రకా’తులను, జుహ్ర్ తరువాత 4 రకా’తులను పాబందీగా చేసే వారిపై అల్లాహ్ నరకాగ్నిని నిషేధిస్తాడు”. (తిర్మిజి’428, అబూ దావూ’ద్ 1269. సహీ హదీస్)
తిర్మిజి428, నిసాయి 1817లో ఉంది:
مَنْ صَلَّى أَرْبَعًا قَبْلَ الظُّهْرِ وَأَرْبَعًا بَعْدَهَا لَمْ تَمَسَّهُ النَّارُ
జుహ్ర్ కు ముందు 4, తర్వాత 4 రకాతులు చేసేవారిని నరకాగ్ని ముట్టుకోదు.
‘అబ్దుల్లాహ్ బిన్ సాయి’బ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూర్యుడు వాలిన తరువాత ”జుహ్ర్ కు ముందు 4 రకా’తులు సున్నతులు చదివేవారు. ఇంకా ”ఈ సమయంలో ఆకాశ ద్వారాలు తెరువబడతాయి. ఈ సమయంలో నా సత్కార్యాలు పైకి వెళ్ళాలని నేను అభిలషిస్తున్నాను’‘ అని అన్నారు. (తిర్మిజి’ 478. సహీ హదీస్)
ముసన్నఫ్ ఇబ్ను అబీ షైబా 5940లో ఉంది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
«أَرْبَعُ رَكَعَاتٍ قَبْلَ الظُّهْرِ، يَعْدِلْنَ بِصَلَاةِ السَّحَرِ»
“జుహ్ర్ కు ముందు 4 రకాతులు సహర్ లో చేసే (తహజ్జుద్) నమాజ్ కు సమానమైనది“. (సహీహా 1431).
అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చేయడం వల్ల అవి చేసేవారికి ప్రవక్త చేసిన రహ్మత్ యొక్క దుఆలో పాలుపంచుకునే భాగ్యం లభిస్తుంది. ఇబ్నె ఉమర్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు:
(رَحِمَ اللهُ امْرَأً صَلَّى قَبْلَ الْعَصْرِ أَرْبَعًا(.
“అస్ర్ కు ముందు నాలుగు రకాతులు చదివేవారి పై అల్లాహ్ కరుణ కురియుగాకా!“.
(అబూ దావూద్ 1271, తిర్మిజి 430. సహీ హదీస్).
పై సున్నతు, నఫిల్లు కాకుండా విత్ర్ నమాజు ఘనత చాలా గొప్పగా ఉంది: అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
وَإِنَّ اللهَ وِتْرٌ، يُحِبُّ الْوِتْرَ
“నిశ్చయంగా అల్లాహ్ ఏకైకుడు, మరియు విత్ర్ ను ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు”. (ముస్లిం 2677).
కూర్పు : ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
సున్నతు మరియు నఫిల్ నమాజులు
- సున్నతు నమాజుల ఘనత السنن الرواتب [వీడియో] [60 నిముషాలు]
- సున్నతు నమాజుల ఘనత, సంఖ్య [వీడియోక్లిప్ ] [6 నిముషాలు]
- ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత [వీడియో] [3:22 నిముషాలు ]
- ఫజ్ర్ కు ముందు సున్నతుల ఘనత [ఆడియో క్లిప్] [30 సెకండ్లు]
- విత్ర్ నమాజు ఘనత, రకాతుల సంఖ్య [వీడియో] [6 నిముషాలు]
- హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) నుండి
- ఫర్జ్ నమాజులతో పాటు సున్నతే ము అక్కదా ఘనత [PDF]
- ఫజ్ర్ వేళ సున్నత్ నమాజును సంక్షిప్తంగాచేయాలి , ఆ నమాజులో పటించవలసిన సూరాలు
- ఫజ్ర్ వేళ సున్నత్ తర్వాత కాసేపు కుడివైపు తిరిగి పడుకోవటం … తహజ్జుదు నమాజు [PDF]
- జుహర్ కు సంబంధిన సున్నత్ లు [PDF]
- అసర్ కు సంబంధిన సున్నత్ లు [PDF]
- మగ్ రిబ్ ముందు , దాని తర్వాత చేయబడే సున్నత్ లు [PDF]
- ఇషాకు ముందు , ఆ తర్వాత చేయబడే సున్నత్ లు [PDF]
- జుమా నమాజ్ వేళ చేయబడే సున్నత్ లు [PDF]
- ఇష్రాఖ్ నమాజ్ & చాష్త్ నమాజ్ ఒకటేనా లేక వేర్వేరా? [ఆడియో]
- చాష్త్ (ఇష్రాఖ్)నమాజు ఘనత [వీడియో]