ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.
అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.
ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.
మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయ పడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది“. (బఖర 2: 24).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “మీరు కాల్చే ఇహలోక అగ్ని నరకాగ్నిలో 70వ భాగం“. ఇదే చాలై పోయేది కాదు అని సహచరులు అనగా “ఈ అగ్ని కన్నా నరకాగ్ని 69 భాగములు ఎక్కువగా ఉండును. ప్రతి భాగములో ఇంతే వేడి ఉండును“ అని బదులిచ్చారు. నరకములో ఏడు అంతస్తులు గలవు. ప్రతి అంతస్తు మరో అంతస్తు కన్నా ఎక్కువ శిక్ష (వేడి) గలది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో చేరుదురు. కాని వంచకులకు ఎక్కువ శిక్ష, బాధ గల క్రింది స్థానం గలదు. నరకవాసుల్లో తిరస్కారులకు శాశ్వతంగా శిక్ష జరుగును. కాలిపోయినపుడల్లా చర్మము మారును. అల్లాహ్ ఆదేశం:
“తిరస్కరించిన వారికి నరకాగ్నియున్నది. వారు చనిపోవుటకు వారికి చావు విధింపబడదు. దాని బాధ వారి నుండి తగ్గింప బడదు. ఇటులే ప్రతి కృతఘ్నునకు శిక్ష విధించుచున్నాము“. (ఫాతిర్ 35: 36).
వారిని సంకెళ్ళతో కట్టి వారికి బేడీలు వేయబడునని తెలుపబడిందిః
“ఆ రోజు నీవు నేరస్థులను చూస్తావు. వారు సంకెళ్ళలో బంధించబడి ఉంటారు. గందకపు వస్త్రాలు ధరించబడి ఉంటారు. అగ్ని వారి ముఖాలను క్రమ్ముకొనును“. (ఇబ్రాహీం 14: 49,50).
“నిశ్చయంగా జెముడు వృక్షము పాపిష్టులకు ఆహరమగును. అది నూనె మడ్డి వలె ఉండును. అది కడుపులో సలసలకాగు నీళ్ళ వలె కాగును“. (దుఖాన్ 44: 43-46).
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం: “జఖ్ఖూం ఒక చుక్కైనా భూమిపై పడినచో భూమిపై ఉన్నవారి జీవనోపాయం చెడి పోతుంది. ఇక అది తినేవారికి ఎంత బాధ ఉండునో!“. నరక శిక్షల కఠినత్వం మరియు స్వర్గ శుభాల గొప్పతనాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరించారుః “ప్రపంచంలో అత్యధికంగా సుఖాలను అనుభవించిన అవిశ్వాసున్ని ఒక్కసారి నరకములో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభ వించావా? అని ప్రశ్నిస్తే, “లేదు ఎప్పుడూ లేదు” అని బదులిస్తాడు. అదే విధంగా ప్రపంచములో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభ వించిన విశ్వా సున్ని ఒకసారి స్వర్గములో ప్రవేశించి ఎప్పుడైనా నీవు బీద రికాన్ని, కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే “నేను ఎప్పుడూ చూడ లేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేస్తే ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయినట్లవుతుంది“. (ముస్లిం 2807).
స్వర్గం
అది సదాకాలమైన, గౌరవ నివాసం. దాన్ని మహాను భావుడైనా అల్లాహ్ తన పుణ్యదాసుల కొరకు సిద్ధ పరిచాడు. అందులోగల వరాలను ఏ కన్ను చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి మనుస్సు ఊహించనూ లేదు. దీని సాక్ష్యానికి ఈ ఆయత్ చదవండి:
వారు అందులో ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనె కాలువలు మరియు సేవించే వారికి మధురంగా ఉండే మద్యపానాలుండును. ఇది ప్రపంచము లాంటిది కాదు.
“పరిశుభ్రమైన ద్రాక్ష రసములతో నిండుగిన్నెలు వారి వద్దకు తేబడును. అది తెల్లది గాను త్రాగు వారికి రుచిగా ఉండును. అందు తల తిరగదు. మరియు దాని వలన మతి చెడదు“. (సాఫ్ఫాత్ 37: 45-47).
అక్కడి సుందరి స్త్రీల (హూరెఐన్ల)తో వివాహము జరుగును. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “స్వర్గములో ఉన్న స్త్రీ ఒక్కసారి ప్రపంచవాసులను త్రొంగి చూచినట్లయితే భూమ్యాకాశాల మధ్య కాంతితో, సువాసనతో నిండిపోతుంది“. (బుఖారి 2796).
విశ్వాసులకు అక్కడ లభించే అతిపెద్ద వరం అల్లాహ్ దర్శనం.
స్వర్గవాసులకు మలమూత్రం, ఉమ్మి లాంటివేవీ ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెముటలో కస్తూరి లాంటి సువాసన గలదు. ఈ శుభాలు, వరాలు శాశ్వతంగా ఉండును. ఇవి తరగవు, నశింపవు. ప్రవక్త సలల్ల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “స్వర్గములో చేరిన వారి సుఖాలకు అంత ముండదు. వారి దుస్తులు పాతబడవు. వారి యవ్వనం అంతం కాదు“. (ముస్లిం 2836). అందులో అతితక్కువ అద్రుష్టవంతుడు నరకం నుండి వెళ్ళి స్వర్గంలో ప్రవేశించిన చివరి విశ్వాసుడు. అది అతనికి పది ప్రపంచాలకంటే అతి ఉత్తమంగా ఉండును.
ఓ అల్లాహ్! స్వర్గంలో చేర్పించే కార్యాలు చేసే భాగ్యం మాకు ప్రసాదించి మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేయుము. ఆమీన్!!
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.