రచన: ఫజీలతుష్షేక్ అల్లామ ముహమ్మద్ బిన్ సాలిహ్ అల్ ఉసైమీన్
(అల్లాహ్ ఆయనను,ఆయన తల్లిదండ్రులను మరియు సమస్తముస్లింలను మన్నించుగాక!)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం.
సమస్త స్తుతులు అల్లాహ్’కు మాత్రమే అంకితం, మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనతో సహాయం అర్ధిస్తున్నాము, ఆయనతో మన్నింపులు వేడుకుంటున్నాము మరియు ఆయన వైపుకు మాత్రమే మరలుతున్నాము!అలాగే మా హృదయాల కీడు నుండి, దుష్కర్మల నుండి అల్లాహ్’తో శరణు వేడుకొంటున్నాము.ఎవరికైతే అల్లాహ్ సన్మార్గం చూపుతాడో అతన్ని ఎవరు మార్గభ్రష్టుడిగా మార్చలేరు, ఎవరినైతే ఆయన మార్గబ్రష్టుడిగా చేస్తాడో అతనికెవరూ సన్మార్గం చూపరు.ఇంకా అల్లాహ్ తప్ప మరో నిజఆరాధ్యుడు లేడని, ఆయన ఏకైకుడని, ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను.మరియు ముహమ్మద్ ఆయన యొక్క దాసుడు, ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను.ఆయనపై,ఆయన కుటుంబీకులపై,ఆయన సహచరులపై మరియు ప్రళయదినం వరకు ఆయనను అత్యుత్తమంగా అనుసరించే అనుచరసమాజం పై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక!
అమ్మాబాద్! నిస్సందేహంగా స్త్రీలు క్రమంగా సహజ రుతుస్రావం, ఇస్తిహాజా మరియు (నిఫాస్) పురిటిరక్తానికి లోనవుతూ ఉంటారు, ఇది ప్రధాన అంశాలలో ఒకటి కనుక దీనికి సంబంధించిన ఆదేశాలను వివరించడం, అవగాహన కల్పించడం మరియు విజ్ఞులు చెప్పిన విషయాలలో తప్పుడు వివరణల నుండి సరైన జ్ఞానం వైపుకు మార్గదర్శనం చేయడం చాలా అవసరం.కాబట్టి ప్రముఖులు చెప్పిన మాటల్లో సమంజసమైనవి లేక బలహీనమైనవి ఏమిటి అని ఖరారు చేయడంలో మేము ఖుర్ఆను మరియు సున్నతు మార్గాన్ని అవలంభిస్తాము.
- 1-ఎందుకంటే ఈ రెండు ప్రధాన మూలాలు, వీటి ఆధారంగానే షరీఅతుకు సంబంధించిన ఆదేశాలు, ఆరాధనలు మరియు విధులు దాసులకు నిర్దేశించ బడతాయి.
- 2-ఈ విధంగా ఖుర్ఆను మరియు సున్నతులను ఆధారం చేసుకోవడం వలన మనసుకు శాంతి చేకూరుతుంది,హృదయాలు తెరుచుకుంటాయి ఆత్మకు తృప్తికలుగుతుంది మరియు బాధ్యతలు తీరుతాయి.
- 3- కావున ఈ రెండు కాకుండా ఇతర మూలాల కోసం సాక్ష్యం తీసుకోబడింది కానీ వాటినే సాక్ష్యంగా పరిగణించబడదు.
ఎందుకంటే,ప్రామాణిక అభిప్రాయం ప్రకారం, హుజ్జతు (రుజువు) కేవలం అల్లాహ్ వాక్కుయగు ఖుర్ఆను మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాటలలో మాత్రమే ఉంది, అలాగే పండితులగు సహాబాల తీర్పులలో ఉంది, ఆయితే ఆ తీర్పులు ఖుర్ఆను మరియు సున్నత్ లకు విరుద్ధంగా ఉండకూడదు.అలాగే మరొక సహాబీ అభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉండకూడదు ఒకవేళ అది ఖుర్ఆను మరియు సున్నతులకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అప్పుడు ఖుర్ఆను సున్నతులోని ఆదేశాన్ని పాటించడం తప్పనిసరి అవుతుంది.ఒకవేళ ఈ సహాబీ అభిప్రాయానికి మరొక సహాబీ అభిప్రాయం విరుద్ధంగా ఉంటే, అప్పుడు ఈ రెండు అభిప్రాయాల మధ్య తర్జీహ్ అవసరం పడుతుంది ఆ రెండింటిలో ప్రాధాన్యత పర్చబడ్డ రాజిహ్ అభిప్రాయం తీసుకోబడుతుంది
.لقوله تعالى: {فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللّهِ وَالرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِاللّهِ وَالْيَوْمِ الآخِرِ ذَلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلا } [النساء:59].
అల్లాహ్ సెలవిచ్చాడు:{“ఒకవేళ ఏ విషయంలోనయినా మీ మధ్య వివాదం తలెత్తితే దానిని అల్లాహ్ మరియు ప్రవక్త వైపునకు మరల్చండి -మీకు నిజంగానే అల్లాహ్ పై, అంతిమ దినంపై నమ్మకం ఉన్నట్లయితే (మీరిలా చేయటం అనివార్యం).ఇదే మేలైన పద్ధతి. పరిణామం రీత్యా కూడా ఇదే అన్నింటికంటే ఉత్తమమైనది”.}(అల్ నిసా:59)
ఇది స్త్రీల సహజ రక్తసంబంధిత విషయాలు మరియు ఆదేశాలను వివరించే చిరుపుస్తకం, వీటిని వివరించే పుస్తకం చాలా అవసరం.
ఈ పుస్తకం క్రింది అధ్యాయాలను కలిగి ఉంది:
- మొదటి అధ్యాయం: ‘హైజ్’ రుతుస్రావం అంటే ఏమిటి? అందులోని మర్మమేమిటి?
- రెండవ అధ్యాయం:రుతుస్రావం సమయం మరియు దాని వ్యవధి
- మూడవ అధ్యాయం: రుతుస్రావం పై హఠాత్తుగా జారీ అగు ఆదేశాలు
- నాల్గవ అధ్యాయం : ఋతుక్రమ ఆదేశాల వివరణ
- ఐదవ అధ్యాయం: ఇస్తిహాజా మరియు దాని సంబంధిత ఆదేశాలు
- ఆరవ అధ్యాయం: పురిటి రక్తస్రావం (నిఫాసు) మరియు దాని ఆదేశాలు
- ఏడవ అధ్యాయం: ఔషధాల ద్వారా ఋతుస్రావం ఆపడం లేదా జరపడం లేదా ఔషధాల ద్వారా గర్భనిరోధం లేదా గర్భవిచ్చిత్తికి చెందిన ఆదేశాలు
Read More “స్త్రీల సహజ రక్త సంభంధిత ఆదేశాలు – ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉసైమీన్ [పుస్తకం]”

You must be logged in to post a comment.