ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం:అబ్దుల్ మాబూద్ జామయీ
‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి
అంశము: ఇస్లాం నుంచి బహిష్కరించే ఎనిమిదవ విషయము: విశ్వాసులకు వ్యతిరేకంగా కాఫిర్లకు సహాయం చేయటము
ప్రధమ ఖుత్బా:
إنَّ الْحَمْدَ لِلَّهِ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وسَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، وَأَشْهَدُ أَنْ لَا إلـٰه إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.
స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :
అల్లాహ్ ను విశ్వసించడంలో విశ్వాసులను స్నేహితులుగా చేసుకోవటము కూడా తప్పనిసరి (లాజిం) (ఖచ్చితమవుతుంది).
అల్లాహ్ దాసులారా! అల్లాహ్ భీతి కలిగి ఉండండి, ఎల్లప్పుడూ ఆయనకు భయపడుతూ ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయతకు పాల్పడమాకండి, ఇంకా గుర్తుంచుకోండి అల్లాహ్ ను విశ్వసించడం లో “విశ్వాసులను స్నేహితులుగా చేసుకోవడం” ఓ ఖచ్చితమైన భాగం, అంటే వాళ్ళను ప్రేమించడం, వాళ్ళను సహకరించడం. అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు:
وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి. (9:71)
అల్లాహ్ ను విశ్వసించడంతో కుఫ్ర్ (అవిశ్వాసం) మరియు కాఫిరులను ద్వేషించడం (లాజిమవుతుంది) కచ్చితం అవుతుంది. మరియు కాఫిర్లతో సంబంధాలు, మరియు స్నేహం యొక్క అర్థము, వివరణ.