తలాఖ్ (విడాకుల) ప్రకరణం – మహా ప్రవక్త మహితోక్తులు 1.20

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

تحريم طلاق الحائض بغير رضاها وأنه لو خالف وقع الطلاق ويؤمر برجعتها

936 – حديث ابْنِ عُمَرَ، أَنَّهُ طَلَّقَ امْرَأَتَهُ وَهِيَ حَائِضٌ عَلَى عَهْدِ رَسُولِ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَسَأَلَ عُمَرُ بْنُ الْخَطَّابِ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ ذلِكَ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: مُرْه فَلْيُرَاجِعْهَا ثُمَّ لِيُمْسِكْهَا حَتَّى تَطْهُرَ، ثُمَّ تَحِيضَ، ثُمَّ تَطْهُرَ، ثُمَّ إِنْ شَاءَ أَمْسَكَ بَعْدُ، وَإِنْ شَاءَ طَلَّقَ قَبْلَ أَنْ يَمَسَّ؛ فَتِلْكَ الْعِدَّةُ الَّتِي أَمَرَ اللهُ أَنْ تُطَلَّقَ لَهَا النِّسَاءُ
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 1 باب قول الله تعالى (يأيها النبي إذا طلقتم النساء فطلقوهن لعدتهن وأحصوا العدة)

936. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కథనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో నేను నా భార్యకు బహిష్టు స్థితిలో విడాకులిచ్చాను. ఆ విషయంలో (నా తండ్రి) హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విచారిస్తే ఆయన ఇలా అన్నారు: అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)కు ఆ విడాకుల్ని ఉపసంహరించుకోమని చెప్పేయి. అతని భార్య బహిష్టు ఆగిపోయి పరిశుద్ధం అయ్యేవరకు ఆమెను తన దగ్గర ఆపి ఉంచాలి. తిరిగి ఆమె బహిష్టు అయి, తిరిగి పరిశుద్ధమయిన తర్వాత అతను కావాలనుకుంటే ఆమెను (తన దాంపత్యంలో) ఆపి ఉంచవచ్చు లేదా విడాకులివ్వవచ్చు. అయితే అప్పటిదాకా అతను ఆమెను తాకరాదు. ఇదే విడాకుల గడువు. దీని ప్రకారమే అల్లాహ్ స్త్రీలకు విడాకులివ్వాలని ఆజ్ఞాపించాడు.

[సహీహ్ బుఖారీ: 68వ ప్రకరణం – తలాఖ్, 1వ అధ్యాయం – ఖౌలిల్లాహి యా అయ్యుహన్నబియ్యు ఇజాతల్లఖ్ తుమ్)

937 – حديث ابْنِ عُمَرَ عَنْ يُونُسَ بْنِ جُبَيْرٍ، قَالَ: سَأَلْتُ ابْنَ عُمَرَ؛ فَقَالَ طَلَّقَ ابْنُ عُمَرَ امْرَأَتَهُ وَهِيَ حَائِضٌ، فَسَأَلَ عُمَرُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَأَمَرَهُ أَنْ يُرَاجِعَهَا، ثُمَّ يُطَلِّقَ مِنْ قُبُلِ عِدَّتِهَا؛ قُلْتُ: فَتَعْتَدُّ بِتِلْكَ التَّطْلِيقَةِ قَالَ: أَرَأَيْتَ إِنْ عَجَزَ وَاسْتَحْمَقَ
__________
أخرجه البخاري في: 68 كتاب الطلاق: 45 باب مراجعة الحائض

937. హజ్రత్ యూనుస్ బిన్ జుబైర్ (రహిమహుల్లాహ్) కథనం:- నేను హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని బహిష్టు స్థితిలో విడాకులిచ్చేయడం గురించి అడిగితే ఆయన ఇలా అన్నారు – ఉమర్ కొడుకు కూడా తన భార్యకు బహిష్టు స్థితిలో విడాకులిచ్చాడు. దాని గురించి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విచారిస్తే “అబ్దుల్లా బిన్ ఉమర్ కు విడాకుల్ని ఉపసంహరించుకోమని ఆజ్ఞాపించు” అని చెప్పారు. అంతేకాకుండా ఇద్దత్ (గడువు) ప్రారంభమైనపుడు ఆమెకు తిరిగి విడాకులివ్వాలని ఆయన తెలియజేశారు.

అప్పుడు నేను హజ్రత్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు)ని “మరి ఆ (బహిష్టు లో ఇచ్చిన) విడాకులు విడాకుల క్రిందికి వస్తాయా?” అని అడిగాను. దానికి ఆయన “ఎందుకు రావు? ఒకవేళ ఎవరైనా గత్యంతరం లేని స్థితిలో లేదా బుద్ధి గడ్డి తినడం వల్ల విడాకులిస్తే అవి విడాకులుగా పరిగణించబడవా?” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 68వ ప్రకరణం – తలాఖ్, 45వ అధ్యాయం – మురాజాతిల్ హాయిజ్]

وجوب الكفارة على من حرّم امرأته ولم ينو الطلاق

65. తఫ్సీర్ సూర అత్ తలాఖ్ (విడాకులు) – Tafsir Surah at-Talaq [వీడియో]  

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీరె సూర అత్ తలాఖ్ ):
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV19HRZXclr7zrnTQ2HYWqfn

ఈ సూరా మదీనా కాలానికి చెందినది. ఇందులో 12 ఆయతులు ఉన్నాయి. ఇది ముఖ్యంగా విడాకుల గురించి ప్రస్తావించిన అధ్యాయం. మొదటి ఆయత్లో వచ్చిన పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఈ సూరా కుటుంబ బంధాల ప్రాముఖ్యాన్ని చాటి చెప్పింది. వివాహ మర్యాదను కాపాడాలని, తొందరపడి విడాకుల నిర్ణయానికి రాకూడదని బోధిస్తూ, ఆ విధంగా హక్కులకు భంగం కలిగే పరిస్థితిని నివారించింది. ఇస్లామ్ అనుమతించిన వాటన్నింటిలోను అల్లాహ్ కు అత్యంత అయిష్టమైన చర్య విడాకులు. కాని అందుకు అనుమతి ఇవ్వబడింది. గృహ సంబంధమైన ఇలాంటి వ్యవహారాల్లో అల్లాహ్ పట్ల భక్తితో, అల్లాహ్ పట్ల భయంతో వ్యవహరించాలని, తమ నిర్ణయాన్ని ఒకటికి రెండుసార్లు పునరాలోచించు కోవాలని విశ్వాసులను ఈ విషయమై హెచ్చరించడం జరిగింది. భార్యకు విడాకులిచ్చే హక్కు భర్తకు ఉంది. కాని విడాకులన్నవి సరియైన పద్ధతిలో, సరియైన సమయంలో ఇస్లామీయ చట్టం ప్రకారం జరగాలి. ఎలా అంటే :

  • భార్య రుతుకాలంలో ఉన్నప్పుడు విడాకులు ఇవ్వరాదు.
  • నిర్దిష్ట సమయం గడిచేవరకు ఆమెను ఇంటినుంచి బలవంతంగా బయటకు పంపరాదు.
  • నిర్ధిష్ట సమయం (ఇద్దత్) మూడువిధాలుగా ఉంటుంది.
  • ఈ నిర్దిష్ట కాలంలోనూ, గర్భంతో ఉన్న కాలంలోను భర్త తన భార్యపోషణకు ఖర్చు చేయాలి.
  • శిశువు జన్మించిన తర్వాత భర్త తాను విడాకులిచ్చిన భార్య కొరకు వేరుగా నివాస వసతి ఏర్పాటు చేయాలి.
  • విడాకులిచ్చిన భార్య శిశువుకు పాలుపట్టడానికి అంగీకరిస్తే, అందుకు భర్త తగిన పారితోషికం చెల్లించాలి.
  • పాలుపట్టే విషయంలో వారిద్దరి మధ్య ఎలాంటి అంగీకారం కుదరనట్లయితే, వేరే మహిళతో పాలుపట్టించే ఏర్పాటు చేయాలి.

తలాఖ్ ఆదేశాలు – ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

తలాఖ్ ఆదేశాలు - ముహమ్మద్‌ ఇక్బాల్ కైలానీ [పుస్తకం]

ఉర్దూ మూలం : మౌలానా ముహమ్మద్ ఇక్బాల్ కీలానీ
తెలుగు అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
ప్రకాశకులు : హదీస్ పబ్లికేషన్స్

[మొబైల్ ఫ్రెండ్లీ బుక్]
[PDF] [80 పేజీలు] [3 MB]

[డెస్క్ టాప్ బుక్ పుస్తకం]
[PDF] [80 పేజీలు] [67.4 MB]

విషయసూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

  • మహిళాభ్యుదయ సంఘాలకు మనవి [1p]
  • 1. ముందు మాట [28p]
    • కఠినమైన మార్గం
    • విడాకుల సాంప్రదాయిక పద్ధతి
    • ముఖ్య నియమ నిభందనలు
    • ఒక విడాకుతో వేరుపడటం
    • రెండు విడాకులతో వేరు పడటం
    • మూడు విడాకులతో విడిపోయే ధర్మ సమ్మతమైన పద్ధతి
    • ఖులా
    • ఏక కాలంలో మూడు విడాకులు
    • హలాలా
    • ఇస్లాం – సమత్వం, సమతూకంతో కూడిన ధర్మం
    • వివాహ చట్టాలు
    • విడాకులు
    • నియోగ చట్టం
    • ఇస్లాం మరియు మనిషి గౌరవ మర్యాదలు
    • ముగింపు

హదీసుల పరంగా చాఫ్టర్లు

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

హదీసు పబ్లికేషన్స్ వారు ప్రచురించిన పుస్తకాలు క్రింది లింక్ దర్శించి డౌన్లోడ్ చేసుకోగలరు.
https://teluguislam.net/hadith-publications-books/

తలాఖ్(విడాకులు)కు ముందు ఇది తప్పనిసరి ( قبل أن تطلق) [వీడియో]

బిస్మిల్లాహ్

తలాక్ ముందు ఇస్లాం మనకు కొన్ని ఆదేశాలు పాటించాలని చెప్పింది, వాటిని ఆచరించడం తప్పనిసరి. వాటిని ఆచరించక ముందే విడాకులు చెెప్పడం మహా పాపం.

[వీడియో: 20 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

దాంపత్య జీవితం ఒక బలమైన ఒప్పందం. అల్లాహ్ స్వయంగా వారి మధ్యలో ప్రేమ నూరిపోశాడు. ఒకరి ద్వారా మరొకరికి సుఖశాంతులు కలగజేశాడు. (సూరా రూం 30:21). ఘోర పాపాల్లో ఒకటైన అబద్ధాన్ని అన్ని వేళల్లో నిషిద్ధపరచిన అల్లాహ్, దాంపత్య జీవితంలో రగులుతున్న జ్వాలల్ని ఆర్పడానికి దానిని యోగ్యపరచాడు. ఈ విధంగా రాస్తూ పోతే చాలా ఉంది, ఇలాంటి ప్రగాఢ ఒడంబడికను తెంచటం, తెంచుకోవటం, ఒకరికి మరొకరు శరీరంతో దుస్తులు అంటుకొనియున్నట్లుగా ఉన్నవారు వేరైపోవడం ఎంత బాధకర విషయం. దీని వల్ల స్వయం వారిద్దరికీ, సంతానం ఉంటే వారికీ, ఇరువైపుల కుటుంబాలకు మొత్తం సమాజానికే ఒక్క నష్టం ఏమిటి? ఎన్నో నష్టాలు వాటిల్లుతాయి. అందుకే వారిరువురిలో ఏదైనా బేధభావం ఏర్పడి, భర్త తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నప్పుడు ‘తలాక్’ అనడంలో త్వర పడకుండా ముందు ఈ క్రింది పద్ధతులు పాటించాలి.

1- అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో దాంపత్య జీవితం ఎలా గడపాలో స్వయంగా భర్త ముందు నేర్చుకోవాలి, భార్యకు నేర్పే ప్రయత్నం చేయాలి.

2- భర్త తన భార్యలో లేదా భార్య తన భర్తలో తనకు నచ్చని ఏదైనా అలవాటు, లోటు చూసినప్పుడు వెడబాటుకు త్వరపడకుండా అల్లాహ్ మరియు ప్రవక్త ఈ ఆదేశాలను అర్థం చేసుకొని ఆచరించాలి:

وَعَاشِرُوهُنَّ بِالْمَعْرُوفِ ۚ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَيَجْعَلَ اللَّهُ فِيهِ خَيْرًا كَثِيرًا

“… వారితో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే, ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కాని మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరచాడేమో!” (నిసా 4:19).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:

“ఏ విశ్వాసి కూడా తన విశ్వాసురాలైన భార్యను అసహ్యించుకోకూడదు/వదులు కోకూడదు. అతను ఆమెలోని ఏదైనా ఒక గుణం నచ్చకపోతే, అతనికి నచ్చిన మరో గుణం ఆమెలో ఉండవచ్చు”. (ముస్లిం 1469).

మరొక హదీసులో ఉంది:

నిస్సందేహంగా స్త్రీ ప్రక్కటెముకతో సృజించబడింది, అది ఏ విధంగానూ తిన్నగా కాదు, కనుక నీవు ఆమె నుండి ప్రయోజనం పొందాలనుకుంటే వంకరగా ఉన్నప్పుడు కూడా పొందగలవు. నీవు ఆమెను తిన్నగా చేయటానికి ప్రయత్నిస్తే ఆమెను విరగ్గొడతావు, ఆమెను విరగ్గొట్టటం అంటే ఆమెకు విడాకులివ్వటమే”. (ముస్లిం 1468, బుఖారి 3331).

3- ఓపిక సహనాలు ఎన్ని వహించినా, అవి పనికి రావు అనుకొని, విడాకులకే పరుగిడ కూడదు. అల్లాహ్ సూర నిసా (4:34) లో ఇచ్చిన ఈ మూడు ఆదేశాలను పాటించాలి:

وَاللَّاتِي تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَاهْجُرُوهُنَّ فِي الْمَضَاجِعِ وَاضْرِبُوهُنَّ

ఎప్పుడైతే మీ భార్యలు అవిధేయతకు పాల్పడతారని భయం చెందుతారో అప్పుడు మీరు వారికి నచ్చజెప్పండి, పడకలో వేరుగా ఉంచండి. వారిని (మెల్లగా) కొట్టండి. [సూర నిసా (4:34)]

అయితే ఈ మూడు పద్ధతులు ఒకేసారి కాకుండా క్రమంగా ఒకటి తరువాత ఒకటి ఉపయోగించాలి. ముందు ఖుర్ఆన్ ఆయతులు, ప్రవక్త హదీసుల, సహాబాల, పుణ్యాత్ముల చరిత్ర ద్వారా నచ్చజెప్పుతూ ఉండాలి. ఇలా ప్రయోజనం కానరాకుంటే పడకలో వేరు చేయాలి. అంటే ఆమెను ఆమె అమ్మగారింటికి పంపడం కాదు, తన వద్ద, తన ఇంట్లోనే ఉండనివ్వాలి, కాని ఒకే పడకపై ఆమెతో కలసి పడుకోకూడదు. ఇక కొట్టడం అంటే; దొరికింది అవకాశం అని ఎడాపెడా కొట్టడం కాదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: ‘గైర ముబర్రహ్’ కొట్టడం అని. అయితే ఈ గైర ముబర్రహ్ అంటే ఏమిటి అన్న దానికి హజ్రత్ ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హు) చెప్పారు: ఎముక విరిగినట్లు కాదు, మిస్వాక్ (పళ్ళపుల్ల)తో కొట్టడం అని. హసన్ బస్రీ చెప్పారు: ఆ దెబ్బ వల్ల ఏలాంటి గుర్తు, వాపు, వాతలు రాకుండా ఉండాలి అని. (తఫ్సీర్ ఇబ్ను కసీర్).

4- భర్తలో ఏమైనా లోపాలుంటే భార్య నచ్చజెప్పాలి, స్వయం చెప్పలేకపోతే పెద్దలతో చెప్పించాలి. ఈ ఆయతు భావాన్ని శ్రద్ధగా చదవండి:

وَإِنِ امْرَأَةٌ خَافَتْ مِن بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَالصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ الْأَنفُسُ الشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا وَتَتَّقُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا

“భర్త తనను ఈసడించుకుంటాడనో లేక తనను పట్టించుకోడనో స్త్రీకి భయమున్నప్పుడు వారిద్దరూ పరస్పరం సర్దుబాటు చేసుకుంటే అందులో వారిరువురిపై ఏమాత్రం దోషం లేదు. సర్దుబాటు అనేది అన్నింటికన్నా మేలైనది. ‘పేరాశ’ అనేది ప్రతి ప్రాణిలోనూ పొందుపరచబడి ఉంది. ఒకవేళ మీరు ఔదార్యాన్ని చూపి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే మీ ఈ వ్వవహారశైలి అల్లాహ్ కు బాగ తెలుసు అన్న నమ్మకం కలిగి ఉండండి”. (నిసా 4:128).

పై ఆయతు ప్రకారం ఆచరించే ప్రయత్నం చేసినా, దాంపత్య జీవితంలోని ప్రేమానురాగాలు పెరగనప్పుడు, దినదినానికి వారి మధ్య విభేదాలే ఎక్కువైనప్పుడు; ఇరువురి వైపున ఒక్కొక్క మధ్యవర్తినీ నియమించాలి, వారు న్యాయవంతులు, ధర్మావగాహన కలిగి ఉన్నవారు, అల్లాహ్ ప్రీతి కొరకు వీరిని కలిపే ప్రయత్నం చేసేవారై ఉండాలి. చదవండి అల్లాహ్ అదేశం:

وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَابْعَثُوا حَكَمًا مِّنْ أَهْلِهِ وَحَكَمًا مِّنْ أَهْلِهَا إِن يُرِيدَا إِصْلَاحًا يُوَفِّقِ اللَّهُ بَيْنَهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا

ఒకవేళ ఆలుమగల మధ్య విముఖత విరోధంగా మారే భయం మీకుంటే భర్త తరఫు నుంచి ఒక మధ్యవర్తినీ, భార్య వైపు నుంచి ఒక మధ్యవర్తినీ నియమించుకోండి. వారిద్దరూ గనక సర్దుబాటుకు ప్రయత్నం చేయదలిస్తే అల్లాహ్ ఆ దంపతుల మధ్య రాజీ కుదుర్చుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, సర్వం ఎరిగినవాడు“. (నిసా 4:35).

ఇలా ఆ ఇద్దరి మధ్యవర్తుల ప్రయత్నం వారిని కలపండలో ఫలిస్తే అల్ హందులిల్లాహ్! అదే కావలసింది, అదే వారు చెయ్యాల్సింది కూడా. కాని ఏదైనా కారణంగా వారి ప్రయత్నాలు ఫలించక, వారిరువురిలో ద్వేష జ్వాలలే రగులుతూ ఉంటే, వారు ఆ దంపతుల మధ్య ఎడబాటుయే మేలు అని భావించి విడాకుల (తలాక్)కు సలహా ఇచ్చినా పాపంలో పడరు. కాని అనవసరంగా, లేదా దంపతుల్లో ఎటైనా ఒకరి వైపు మ్రొగ్గు చూపి విడాకులకు సలహా ఇస్తే వారు షైతాన్ ను ప్రసన్నం చేసినవారవుతారు, వారితో షైతాన్ చాలా సంతోషిస్తాడు. (ముస్లిం 2813. ఈ పూర్తి హదీస్ చదవండి). ఇలాంటి వారి గురించి ప్రవక్త ఒక సందర్భంలో ఇలా తెలిపారు: “ఎవరైతే ఒక మనిషిని అతని భార్యకు వ్యతిరేకంగా పురికోల్పుతాడో అతడు మాలోని వాడు కాదు”. (అబూ దావూద్ 5170). మరియు వారి మాయమాటలలో పడి, తెలిసి కూడా అన్యాయంగా, అనవసరంగా విడాకులిచ్చే భర్త, లేదా విడాకులు కోరే భార్య ఎంత ఘోరమైన పాపానికి ఒడిగడతారో ప్రవక్తగారి ఈ హదీసుల ద్వారా తెలుసుకోండి!

అల్లాహ్ వద్ద ఘోర పాపాల్లో ఒకటి: మనిషి ఒక స్త్రీతో వివాహమాడి, ఆమెతో కాపురం చేసి, ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి ఆమె మహర్ కూడా కాజేయడం”. (హాకిం 2743, సహీహా 999).

ఏ భార్య తన భర్తతో అనవసరంగా విడాకులు కోరుతుందో ఆమె స్వర్గ సువాసనను కూడా నోచుకోదు”. (అబూదావూద్ 2226, తిర్మిజి 1187).

కూర్పు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.

ఇతరములు:

మూడు విడాకులు (తలాఖ్ లు) ఒక్కటేనా (هل الطلاق الثلاث واحد؟)

బిస్మిల్లాహ్

ఒకే సమయం, సందర్భంలో ఇచ్చిన మూడు విడాకులు మూడు అవుతాయని చాలా మంది అనుకుంటారు, వాస్తవమేమిటంటే అవి ఒకటిగానే లెక్కించబడతాయి. దీని ఆధారాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

[6 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia