86. తఫ్సీర్ సూర అత్తారిఖ్ (Tafsir Surah at-Tariq) [వీడియో]

అత్ తారిఖ్ (ప్రభాత నక్షత్రం) సూరా పరిచయం

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 17 ఆయతులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించిన విషయాలు ప్రళయం, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, దైవవాణి అవతరించడం. మొదటి ఆయతులో వచ్చిన ‘తారిఖ్’ ( ప్రభాత నక్షత్రం) అన్న ప్రస్తావననే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. మనిషిని ఏ విధంగా వీర్య ద్రవం నుంచి సృష్టించింది తెలుపుతూ అల్లాహ్ మరణించిన ప్రతి ఒక్కరిని తీర్పుదినం రోజున మళ్ళీ లేపి నిలబెట్టగలడని, ఆ రోజున యావత్తు మానవాళి తుది తీర్పు కోసం అల్లాహ్ ముందు హాజరవుతుందని చెప్పడం జరిగింది. ఆ రోజున ప్రతిఒక్కరి మంచి లేదా చెడు పనులు బట్టబయలవుతాయి. దివ్యఖుర్ఆన్ అల్లాహ్ పంపిన సత్యమనీ, ఇది మంచిని చెడు నుంచి వేరు చేస్తుందనీ, ఇవి వ్యర్ధమైన ప్రసంగాలు కావని నొక్కి చెప్పింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూరత్ అత్తారిఖ్ ) :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV09wO7Wzqes1UNDUaDRX8Nw

84. తఫ్సీర్ సూరతుల్ ఇన్ షిఖాఖ్ – Tafsir Surah Inshiqaq [వీడియోలు]

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 25 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా తీర్పుదినం గురించి బోధించింది. మొదటి ఆయతులోనే దీనికి పేరుగా పెట్టబడిన పదాలు వచ్చాయి. తీర్పుదినం నాటి భయానక పరిస్థితులను క్లుప్తంగా అభివర్ణిస్తూ ఈ సూరా ప్రారంభమవుతుంది. రోదసి(అంతరిక్షం)లో చోటుచేసుకునే ప్రళయభీకర పరిస్థితుల గురించి ఈ సూరా వివరించింది. ఆ రోజున ఆకాశం తెరువబడుతుంది. భూమి చదునుగా చేయబడుతుంది. పర్వతాలు చెల్లాచెదరవుతాయి. అందరిని అల్లాహ్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ సూరాలో అవిశ్వాసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ పరలోకంలో ఎదురయ్యే తీవ్రమైన శిక్ష గురించి హెచ్చరించడం జరిగింది. సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారికి శాశ్వత స్వర్గవనాలు లభిస్తాయని ఈ సూరా పునరుద్ఘాటించింది.

తఫ్సీర్ సూర అత్ తహ్రీమ్ [వీడియో]

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూర తహ్రీమ్):
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3rcWu2KG3dbap82eYuTHIS

అహ్సనుల్ బయాన్ (తెలుగు అనువాదం & వ్యాఖ్యానం) నుండి :

1.9 ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం| మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

398 – حديث عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ قَالَتْ: فَرَضَ اللهُ الصَّلاَةَ حِينَ فَرَضَهَا رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ فِي الْحَضَرِ وَالسَّفَرِ، فَأُقِرَّتْ صَلاَةُ السَّفَرِ، وَزِيدَ فِي صَلاَةِ الْحَضَرِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 1 كيف فرضت الصلوات في الإسراء

398. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-

అల్లాహ్ (ప్రారంభంలో) నమాజు విధిగా చేయాలని నిర్ణయించినప్పుడు ప్రయాణావస్థలో ఉన్నా, లేకపోయినా రెండేసి రకాతులు విధిగా చేయాలని ఆదేశించాడు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళకు ప్రయాణావస్థలో రకాతుల సంఖ్యను ఇదివరకటిలాగే యథాతథంగా ఉంచి, ప్రయాణావస్థలో లేనప్పుడు నిర్వర్తించవలసిన రకాతుల సంఖ్యను పెంచడం జరిగింది.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 1వ అధ్యాయం – కైఫఫర్జియ తిస్సలాతు ఫిల్ ఇస్రా)

399 – حديث ابْنِ عُمَرَ عَنْ حَفْصِ بْنِ عَاصِمٍ قَالَ: حَدَّثَنَا ابْنُ عُمَرَ، فَقَالَ: صَحِبْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمْ أَرَهُ يُسَبِّحُ فِي السَّفَرِ وَقَالَ اللهُ جَلَّ ذِكْرُهُ (لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ)
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 11 باب من لم يتطوع في السفر دبر الصلاة وقبلها

399. హజ్రత్ హఫ్స్ బిన్ ఆసిమ్ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:-

నేను (ఓసారి ప్రయాణంలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాను. ఆయన (ఈ) ప్రయాణంలో సున్నత్ నమాజులు చేస్తూ ఉండగా నేను చూడలేదు. కాగా; అల్లాహ్ ( ఖుర్ఆన్లో) “దైవప్రవక్త (జీవనసరళి)లో మీకొక చక్కని ఆదర్శం ఉంది” అని అన్నాడు. (33:21)

[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 11వ అధ్యాయం – మల్లమ్ యతతవ్వు ఫిస్సఫరి దుబుర సలవాత్)

400 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: صَلَّيْتُ الظُّهْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمَدِينَةِ أَرْبَعًا، وَبِذِي الْحُلَيْفَةِ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 5 باب يقصر إذا خرج من موضعه

400. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నాలుగు రకాతులు జుహర్ నమాజు చేశాను; ‘జుల్ హులైఫా’లో రెండు రకాతులు అసర్ నమాజు చేశాను.

[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 5వ అధ్యాయం – యఖ్ సురు ఇజా ఖరజ మిమ్మవుజూ…..]

401 – حديث أَنَسٍ، قَالَ خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَة
سَأَلَهُ يَحْيَى بْنُ أَبِي إِسْحقَ قَالَ: أَقَمْتُمْ بِمَكَّةَ شَيْئًا قَالَ أَقَمْنَا بِهَا عَشْرًا
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 1 باب ما جاء في التقصير وكم يقيم حتى يقصر

401. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)కథనం:-

మేమొకసారి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట మదీనా నుండి మక్కాకు బయలుదేరాము. ఈ ప్రయాణంలో మేము (మక్కా నుండి) తిరిగి మదీనా చేరుకునే వరకు రెండేసి రకాతులు (మాత్రమే ఫర్జ్) నమాజ్ చేశాము. హజ్రత్ యహ్యా బిన్ అబూ ఇసఖ్ (రహిమహుల్లాహ్) ఈ హదీసు విని “మరి మీరు మక్కాలో ఎన్ని రోజులు విడిది చేశారు?” అని అడిగారు. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) “మక్కాలో మేము పది రోజులు ఉన్నాము” అని సమాధానమిచ్చారు.

(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 1వ అధ్యాయం – మాజా అఫిత్తఖ్సీరి వకమ్ యుఖీము హత్తాయుఖస్సిర్)

81. తఫ్సీర్ సూర తక్వీర్ (Tafsir Surah Takweer) [వీడియోలు]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 29 ఆయతులు ఉన్నాయి. దైవవాణి అవతరణ, ప్రవక్తల పరంపర, తీర్పుదినం నాటి భయానక పరిస్థితుల గురించి ఈ సూరా ముఖ్యంగా వివరించింది. మొదటి ఆయతులో ‘తక్వీర్’ (చుట్టబడినది) అన్న ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. తీర్పుదినం నాడు చోటు చేసుకునే తీవ్రమైన రోదసీ మార్పుల గురించి ఇందులో చెప్పడం జరిగింది. ఆ రోజు సూర్యుడు చుట్టబడతాడు. నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి. పర్వతాలు స్థానభ్రంశం చెందుతాయి. ఆ నాటి బీభత్సం కారణంగా ప్రజలు తమ విలువైన సంపదను కూడా పట్టించు కోకుండా వదిలేస్తారు. అడవి జంతువులు ఒకచోట సమీకరించబడతాయి. సముద్రాలు మరుగుతాయి. ఆత్మలను వాటి శరీరాలతో తిరిగి కలుపడం జరుగుతుంది. ఆ రోజు సజీవంగా సమాధి కావించబడిన ఆడపిల్ల నేనే పాపం చేసాను? నన్నెందుకు హత్య చేసారని ప్రశ్నిస్తుంది. ఆకాశానికి ఉన్న తెరలు తొలగించబడతాయి. స్వర్గవనాలు దగ్గరకు తీసుకురాబడతాయి. మానవుల కర్మల చిట్టాలు తెరువబడతాయి. ఆరోజున ప్రతి ఒక్కరికి తాను చేసిన మంచి లేదా చెడు తెలిసి వస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ (సఅసం) అత్యంత గౌరవనీయుడైన దైవ సందేశహరుడనీ, ఆయన పిచ్చివాడు కాదని, ఆయన దేవుని సందేశాన్ని మానవాళికి చేరవేస్తారని, అల్లాహ్ ఆయనకు తెలియజేసినది తప్ప ఆయనకు మరేవిధమైన అగోచరాల జ్ఞానం లేదని ఈ సూరా విశదీకరించింది. దివ్యఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అని, ఇది యావత్తు మానవాళికి హెచ్చరిక అని ఈ సూరా స్పష్టంగా చెప్పింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూర తక్వీర్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1eUZmfRFb8Sghnt6K-nwlM

సూరా అల్ కౌసర్ (అత్యధిక శుభాలు) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

సూరా అల్ కౌసర్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/q1WOtndCOOY [31 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 3 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ‘కౌసర్’ (సమృద్ధి) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ప్రసాదించబడిన అసంఖ్యాక అనుగ్రహాలను ప్రస్తావిస్తూ, అల్లాహ్ ను కొనియాడాలని, ఆయనకు కృతజ్ఞత చూపాలని బోధించడం జరిగింది. అవిశ్వాసుల వైరం, వారి గర్వం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఏమాత్రం నష్టపరచలేవని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సూరాను సూరతు’న్నహ్ర్’గా కూడా వ్యవహరిస్తారు.

77. తఫ్సీర్ సూరా ముర్సలాత్ (Tafsir Surah Mursalat) [వీడియో]

77. తఫ్సీర్ సూరా ముర్సలాత్ (Tafsir Surah Mursalat) [4 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్లే లిస్ట్: https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2R3mGtZwe7XSQ2iNzLDPT5

92. సూరా అల్ లైల్ (రాత్రి) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

92. సూరా అల్ లైల్ (రాత్రి) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/n1d3UzeEsAQ (పార్ట్ 1) [50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 21 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా అల్లాహ్ మార్గంలో కృషిచేయడం గురించి, ఇహ లోకంలో మన సంఘర్షణ గురించి తెలియజేసింది. మొదటి ఆయతులో వచ్చిన ‘లైల్’ (రాత్రి) అన్న ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఇహలోక జీవితం ఒక సంఘర్షణ అని, ఇహపరలోకాల్లో సాఫల్యం లేదా వైఫల్యం అన్నది ఈ సంఘర్షణపై ఆధారపడి ఉందని, మనం అల్లాహ్ ను విశ్వసించి మంచి పనులు చేస్తే, అల్లాహ్ పట్ల భయభీతులు కలిగి ఉండి, దానధర్మాలు చేస్తే, సత్యాన్ని విశ్వసిస్తే సాఫల్యం పొందగలమనీ, అల్లాహ్ మనకు శాశ్వత స్వర్గవనాలు ప్రసాదిస్తాడని తెలిపింది. కాని మనిషి దుర్మార్గానికి కట్టుబడి, అల్లాహు దూరమైతే, స్వార్ధంతో, దురాశతో వ్యవహరిస్తే, సత్యాన్ని తిరస్కరిస్తే దారుణంగా విఫలమవుతాడు. అల్లాహ్ఆ దేశాలను తిరస్కరించిన వారికి భగభగమండే అగ్నిశిక్ష సిద్ధంగా ఉందని హెచ్చరించడం జరిగింది.

94. సూరా అష్ షరహ్ (హృదయాన్ని తెరవడం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

94. సూరా అలమ్ నష్రహ్ (అష్ షరహ్) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/JntXw28d4MQ [51 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

పరిచయం: ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అల్లాహ్ అనుగ్రహాలను ఈ సూరాలో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హృదయాన్ని అల్లాహ్ కారుణ్యంతో నింపాడు. ప్రజలందరినీ ఆహ్వానించే హృదయవైశాల్యం ప్రసాదించాడు. కష్టనష్టాలను తొలగించి, ఆయన హోదా గౌరవాలను ఇనుమడింపచేసాడు. కాబట్టి, అధైర్యపడకుండా, క్రుంగిపోకుండా, అల్లాహ్ ప్రసన్నత పొందడానికి తీరిక లభించినపుడు ఆరాధనలో నిమగ్నమై పోవాలని ఆయనకు బోధించడం జరిగింది.

100. సూరా అల్ ఆదియాత్ (పరుగెత్తే గుర్రాలు) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

100. సూరా అల్ ఆదియాత్ (పరుగెత్తే గుర్రాలు) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/unv_Y4Sl2BE [38 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

సూరా పరిచయం :

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. అల్లాహ్ పట్ల మనిషి కృతఘ్నతను, ప్రాపంచిక జీవితం పట్ల వ్యామోహాన్ని ఈ సూరా ప్రస్తావించింది. ఈ సూరాకు పెట్టిన పేరు మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. ఈ సూరా యుద్ధ రంగంలో విశ్వాసులు ఉపయోగించే గుర్రాలకు సంబంధించిన వర్ణనతో ప్రారంభమయ్యింది. ప్రజలు తమ సంపద పట్ల, ప్రాపంచిక భోగభాగ్యాల పట్ల ఎలా వ్యామోహం పెంచుకుంటారో వివరించింది. అల్లాహ్ పట్ల ఎలా కృతఘ్నులు అవుతారో తెలిపింది. తీర్పుదినాన ప్రతి ఒక్కరి కర్మల చిట్టా అతని ముందు ఉంటుందని, ప్రతి ఒక్కరి రహస్యాలు బట్టబయలవుతాయని తెలియజేసింది.

100:1 وَالْعَادِيَاتِ ضَبْحًا
రొప్పుతూ, రివ్వున దూసుకుపోయే గుర్రాల సాక్షిగా! [1]

100:2 فَالْمُورِيَاتِ قَدْحًا
మరి డెక్కల రాపిడితో నిప్పు రవ్వలను చెరిగేవాటి సాక్షిగా! [2]

100:3 فَالْمُغِيرَاتِ صُبْحًا
మరి ప్రభాత సమయాన (ప్రత్యర్ధులపై) మెరుపుదాడి చేసేవాటి సాక్షిగా! [3]

100:4 فَأَثَرْنَ بِهِ نَقْعًا
– మరి ఆ సమయంలో అవి దుమ్ము ధూళిని రేపుతాయి. [4]

100:5 فَوَسَطْنَ بِهِ جَمْعًا
మరి దాంతో పాటు (శత్రు) సైనిక పంక్తుల మధ్యలోకి చొచ్చుకు పోతాయి. [5]

100:6 إِنَّ الْإِنسَانَ لِرَبِّهِ لَكَنُودٌ
అసలు విషయం ఏమిటంటే మానవుడు తన ప్రభువు (విషయంలో) చేసిన మేలును మరచినవాడుగా తయారయ్యాడు. [6]

100:7 وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ
నిజానికి ఈ విషయానికి స్వయంగా అతనే సాక్షి! [7]

100:8 وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ
యదార్ధానికి అతను ధన ప్రేమలో మహా ఘటికుడు. [8]

100:9 أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ
ఏమిటి, సమాధుల్లోని వాటిని బయటికి కక్కించబడే సమయం గురించి అతనికి తెలియదా? [9]

100:10 وَحُصِّلَ مَا فِي الصُّدُورِ
గుండెల్లోని గుట్టంతా రట్టు చేయబడే సమయం గురించి (అతనికి తెలీదా?) [10]

100:11 إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌ
నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువుకు వారి గురించి బాగా తెలిసి ఉంటుంది. [11]

[1] ‘ఆదియాత్‘ అంటే చాలా వేగంగా పరుగెత్తే గుఱ్ఱాలని అర్థం. ‘దబ్ హున్‘ అంటే వగర్చటం, రొప్పటం అని ఒక అర్థం. సకిలించటం అని మరో అర్థం. అంటే రొప్పుతూ లేక ఆవేశంతో సకిలిస్తూ రణరంగంలో శత్రు సేనల వైపు దూసుకుపోయే గుర్రాలని భావం.

[2] ఆ విధంగా అవి పరుగెత్తుతూ పోతున్నప్పుడు వాటి డెక్కల రాపిడికి నిప్పు కూడా పుడుతుంది. ముఖ్యంగా అవి పర్వత కనుమల మీదుగా పోతున్నప్పుడు, రాతి ప్రదేశాలలో తమ ఖురములను నేలకు కొడుతూ పోతున్నప్పుడు ఈ దృశ్యం కనిపిస్తుంది. అటువంటి అశ్వాల మీద ప్రమాణం చేసి రానున్న వాక్యాలలో ఒక ముఖ్య విషయం చెప్పబడుతోంది.

[3] ‘ముగీరాత్‘ అంటే ఆకస్మిక దాడి జరిపేవి అని అర్థం. పూర్వం అరేబియాలో సాధారణంగా ఉదయం పూటే యుద్ధం మొదలయ్యేది. రాత్రిపూట అందరూ ఆదమరిచి నిద్రపోతుండగా శత్రు శిబిరాలపై విరుచుకుపడటం పిరికితనానికి నిదర్శనమని, శూరులైన వారెవరూ అలాంటి వెన్నుపోటుకు పాల్పడరని వారు భావించేవారు.

[4] అంటే – ఆ గుర్రాలు వేగంగా దూసుకు పోతున్నప్పుడు, శత్రుశిబిరంపై ఆకస్మిక దాడులు జరిపినప్పుడు ఆ ప్రాంతమంతా దుమ్ముధూళితో నిండిపోతుంది.

[5] ‘వసత్న‘ అంటే మధ్యలోకి అని అర్థం. తాము రేపిన దుమ్ముతో ఆ ప్రదేశమంతా కలుషితమై, ఏమీ కానరాని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ గుర్రాలు అకస్మాత్తుగా శత్రువుల శ్రేణులలోకి చొచ్చుకుపోయి కలకలాన్ని సృష్టిస్తాయి.

[6] మొదటి ఐదు ఆయతులలో చేయబడిన ప్రమాణాలకు సమాధానం ఈ (6వ) ఆయతులో ఇవ్వబడింది. ఇక్కడ ‘మానవుడు’ అంటే సత్య తిరస్కారి, దైవధిక్కారి అయినవాడు అన్నమాట! మేలును మరచిన వారే ఇలా తయారవుతారు.

[7] అంటే – మనిషి తన ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా తాను దేవుని కృతఘ్నుణ్ణి అని ఖుద్దుగా నిరూపించుకుంటున్నాడు.

[8] ఇక్కడ “ఖైర్” అనే అరబీ పదం ధనం, డబ్బు, సిరిసంపదలు అన్న అర్థంలో ప్రయోగించ బడింది. ఉదాహరణకు: అల్ బఖరా సూరాలోని 180వ వచనంలో “ఇన్ తరకల్ ఖైరా….” ను చూడండి. అక్కడ ఆ పదం ఆస్తిపాస్తులు, సిరిసంపదలు అన్న అర్థంలోనే ఉంది. “షదీద్‘ అంటే ‘చాలా గట్టివాడు’ అని అసలు అర్థం. అయితే ధనాశ కలవాడు, పిసినారి అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా సంపద వ్యామోహంలో చిక్కుకుపోయినవాడే పిసినిగొట్టుగా, పేరాశాపరునిగా తయారవుతాడు.

[9] అంటే – సమాధులలో ఉన్న మృతులంతా బ్రతికించబడి, లేపబడే సమయం….

[10] అంటే – హృదయాలలో దాగివున్న రహస్య విషయాలన్నీ బయటపెట్టబడిన వేళ.

[11] మృతులను సమాధుల నుంచి సజీవంగా లేపిన పరమప్రభువు, వారి ఆంతర్యాల్లోని రహస్య విషయాలను వెళ్ళగ్రక్కించే అల్లాహ్ ఎంతటి సూక్ష్మద్రష్టయో ఊహించవచ్చు. ఆయన నుండి ఏ వస్తువూ దాగిలేదు. మరి ఆయన ప్రతి ఒక్కరికీ వారి కర్మలనుబట్టి పుణ్యఫలమో, పాపఫలమో ఇస్తాడు. దైవానుగ్రహాలను అనుక్షణం ఆస్వాదిస్తూ అల్లాహ్ మేళ్లను మరచి విర్రవీగే వారికి ఇదొక హెచ్చరిక! అలాగే ధనవ్యామోహంలో పడిపోయి తమ సంపదలో నుంచి హక్కుదారుల హక్కు చెల్లించ కుండా ఉండే పిసినారులకు కూడా ఇది హెచ్చరికే!

30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr