సామూహిక నమాజ్ విధి – వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం [ఖుత్బా]

ఖుత్బా అంశము : సామూహిక నమాజ్ విధి-వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం         

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారి పద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి. బిద్అత్ కార్యకలాపాలు మరియు ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతికార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి  తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుంచి దూరంగా ఉండండి మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి. అల్లాహ్ తఆల ముస్లింలకు జమాత్ తో అనగా (సామూహికంగా) మస్జిద్లో నమాజ్ ఆచరించమని ఆజ్ఞాపించాడు. మరియు అకారణంగా నమాజ్ నుండి దూరంగా ఉండడాన్ని వారించాడు.  మరియు మస్జిదులో జమాతుతో నమాజ్  చదవడం గురించి అనేక హదీసులలో ఆజ్ఞాపించబడింది.

1. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఈ విధంగా ప్రవచించారు:

మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా సామూహికంగా చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించటానికి కారణమేమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతేకాదు, అతని వల్ల జరిగిన పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంతవరకూ దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, “అల్లాహ్! ఇతనిపై శాంతి కురిపించు. అల్లాహ్! ఇతణ్ణి కనికరించు” అని అంటూ ఉంటారు. మస్జిద్లో ప్రవేశిం చిన తర్వాత సామూహిక నమాజ్ కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంత సేపూ అతను నమాజ్లో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (అంటే అతనికి అంత పుణ్యం లభిస్తుందన్నమాట).(బుఖారీ-ముస్లిం)

2. హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: రేపు (ప్రళయ దినాన) తానొక ముస్లింగా అల్లాహ్ ను కలవాలనుకునే వ్యక్తి ఈ నమాజుల కొరకు అజాన్ (ప్రకటన) ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షించుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా – నెరవేర్చాలి.) ఎందుకంటే అల్లాహ్ మీ ప్రవక్త కొరకు మార్గదర్శక పద్ధతుల్ని నిర్ణయించాడు. నమాజులు కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు కూడా ఈ వెనక ఉండేవాని మాదిరిగా ఇంట్లో నమాజ్ చేసుకుంటే మీరు మీ ప్రవక్త విధానాన్ని వదలి పెట్టినవారవుతారు. మీరు గనక మీ ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే తప్పకుండా భ్రష్ఠత్వానికి లోనవుతారు. ఎవరైతే ఉన్నతమైన రీతిలో వుజూ చేసి  మస్జిద్ వైపు బయలుదేరుతారో వారి ఒక అడుగు బదులుగా ఒక సత్కార్యం వారి పేరున రాయబడుతుంది మరియు వారి ఒక్క స్థానం ఉన్నతం చేయబడుతుంది మరియు ఒక పాపం మన్నించడం జరుగుతుంది. మా కాలంలో నేను గమనించేవాణ్ణి పేరెన్నికగన్న కపటులు మాత్రమే (సామూహిక నమాజ్లో పాల్గొనకుండా) వెనక ఉండిపోయేవారు. (వ్యాధి మొదలగు కారణాల చేత) నడవలేక పోతున్నవారిని ఇద్దరు మనుషుల సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో నిలబెట్టడం జరిగేది. (ముస్లిం)

3. ఓ అల్లాహ్ దాసులారా! ఎవరైతే మస్జిదులో జమాత్తో ఐదు పూటల నమాజ్ ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారి కొరకు అల్లాహ్ ప్రళయ దినం రోజున తన సింహాసనం నీడలో చోటు కల్పిస్తాడు ఆ సమయంలో సూర్యుడు ఒక మీల్ (మైల్ ) దూరంలో ఉంటాడు.

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా తెలియజేశారు: ఏడు రకాల (గుణము గల) వారికి అల్లాహ్ ఆనాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆనాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. (1) న్యాయశీలుడైన పాలకునికి. (2) యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో మరియు ఆయన విధేయతలో గడిపిన యువకునికి. (3) మస్జిద్ లోనే తన మనుస్సు లగ్నం చేసుకున్న వ్యక్తికి. (4) కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు వారు అల్లాహ్ కొరకే కలుసుకుంటారు. అల్లాహ్ కొరకే వేరు అవుతారు. (5) ఉన్నత వంశీయురాలైన, అందమైన స్త్రీ దుష్ట క్రియకు ఆహ్యానిస్తే కేవలం అల్లాహ్ భయముతో తిరస్కరించిన వ్యక్తికి. (6) కుడి చెయ్యి దానం చేసినదేమిటో ఎడమ చెయ్యికి తెలియనంత రహస్యంగా దానా దర్మాలు చేసే వ్యక్తికి.  (7) ఏకాంతములో అల్లాహ్ ధ్యానం చేస్తుండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి” (బుఖారి , మస్లిం).

4. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఈ విధంగా ప్రబోధించారని హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) తెలియజేశారు:

ఉదయం, సాయంత్రం మస్జిద్కు వెళ్ళే వ్యక్తి కోసం, అతను ఉదయం పూట గాని, సాయంత్రం వేళగాని ఎప్పుడు మస్జిద్కు వెళ్ళినా అల్లాహ్ స్వర్గంలో అతని ఆతిథ్యానికి ఏర్పాట్లు చేస్తాడు. అతను ఉదయం లేక సాయంత్రం ఎప్పుడు మస్జిద్ కు వెళ్ళినా సరే“.(బుఖారీ-ముస్లిం)

5. మస్జిద్లో జమాత్ తో పాటు నమాజ్ చదవాలి – దీని ఆధారం ఏమిటంటే యుద్ధ సమయంలో కూడా అల్లాహ్ విశ్వాసులకు జమాత్తో నమాజ్ స్థాపించడం తప్పనిసరి చేశాడు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది.

(وَإِذَا كُنْتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ الصَّلَاةَ فَلْتَقُمْ طَائِفَةٌ مِنْهُمْ مَعَكَ)

((ఓ ప్రవక్తా!) నీవు వారి మధ్య ఉన్నప్పుడు, వారి కోసం నమాజును మొదలుపెట్టినప్పుడు, వారిలోని ఒక సమూహం తమ ఆయుధాలను తీసుకొని నీ వెంట నిలబడాలి.)

6. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

(وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ)

(ఇస్రాయీలు సంతతి వారలారా!) మీరు నమాజులను నెలకొల్పండి, జకాతును ఇవ్వండి, (నా సన్నిధిలో) రుకూ చేసే వారితోపాటు మీరూ రుకూ చేయండి.)

7. ఓ విశ్వాసుల్లారా! మస్జిద్లో సామూహికంగా నమాజ్ చదవడంలో ఏమరపాటుకు లోనవ్వడం నుండి హెచ్చరించడం జరిగింది.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఈ విధంగా ప్రవచించారు:

“ఎవరి చేతిలో నయితే నా ప్రాణముందో ఆ ప్రభువు సాక్షి! కట్టెలు సమీకరించమని, నమాజు కోసం అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి, ప్రజలకు నమాజ్ చేయించటం కోసం (నా స్థానంలో) మరెవరినైనా నిలబెట్టి (సామూహిక నమాజులో పాల్గొనని) వారి దగ్గరకు నేను స్వయంగా వెళ్ళి వారిని వారి ఇండ్ల సమేతంగా తగల బెడదామని నేను ఎన్నోసార్లు అను కున్నాను”. (బుఖారీ-ముస్లిం)

8. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా తెలియజేశారు:

“ఎవరైతే అజాన్ విన్న తర్వాత కూడా మస్జిద్ కు రారో వారి నమాజ్ పరిపూర్ణం కాదు ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప. అంటే వారికి పూర్తి పుణ్యఫలం లభించదు” (ఇబ్నే మాజ)

9. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) గారే చేసిన కథనం:

ఒక అంధుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నన్ను మస్జిద్ దాకా తీసుకొని వచ్చేవారెవరూ లేరు” అని విన్నవించుకుంటూ తనకు ఇంట్లో నమాజ్ చేసుకునేందుకు రాయితీ కల్పించమని కోరాడు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) అతనికి ఆ మేరకు రాయితీనిచ్చారు. ఆ తర్వాత అతను తిరిగి వెళ్ళిపోతుండగా అతన్ని మళ్ళీ పిలిచి, ‘నీకు నమాజ్ కోసం చేయబడే ప్రకటన (అజాన్) వినపడుతుందా?’ అని అడిగారు. అతను ‘వినపడుతుంద’న్నాడు. అప్పుడాయన ‘అయితే దానికి హాజరు పలుకు (అంటే మస్జిద్కు వచ్చి నమాజ్ చెయ్యి)” అని ఆదేశించారు. (ముస్లిం)

10. జాబిర్ (రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ఆయన ఇలా తెలియజేశారు: ఒకసారి మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమ్అహ్ రోజు ప్రసంగిస్తున్నారు. ఆ సందర్భంలో మదీనా యొక్క వర్తక బీడారం వచ్చింది. అది తెలిసిన సహచరులు ప్రసంగాన్ని వినకుండా అక్కడికి వెళ్ళిపోయారు. కేవలం 12 మంది మాత్రమే మిగిలారు. అందులో అబూబకర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు)  ఉన్నారు ఆ సందర్భంలో ఈ వాక్యం అవతరించింది.

«وإذا رأوا تجارة أو لهوا انفضوا إليها»

(జనుల పరిస్థితి ఎలా ఉందంటే) ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరుగెడుతున్నారు.)

ఓ అల్లాహ్ దాసులారా! ఈ వాక్యంలో అల్లాహ్ వైపు నుంచి ప్రపంచం వైపు మొగ్గు చూపడం నుండి సహాబాలను వారించడం జరిగింది వారు ఆరాధనను వదిలి ప్రాపంచిక లావాదేవీలలో మునిగిపోయారు ఆ తర్వాత అల్లాహ్ వారికి పరలోక వర్తకం గురించి ప్రోత్సహించాడు. నిశ్చయంగా అల్లాహ్ తప్ప మరో ఉపాధి ప్రదాత లేడు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు.

(قُلْ مَا عِنْدَ اللَّهِ خَيْرٌ مِنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ)

(నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు : “అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు.”)

అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారితో నమాజ్ చదవడం ఆరాధన చేయడం ద్వారా లభించేటువంటి పుణ్యఫలం వ్యాపార లావాదేవీల కన్నా ఆటపాటల కన్నా ఎంతో ఉన్నతమైనది. కావున ఆయన సహచరులందరూ కూడా ఈ ఆజ్ఞను స్వీకరించి పట్టుదలతో వారు వ్యాపార లావాదేవీలలో నిమగ్నమైనప్పటికీ అల్లాహ్ యొక్క ఏదైనా ఆజ్ఞ వారి చెవిన పడితే వారు వెంటనే అల్లాహ్ వైపు మరలేవారు. మరియు సమయపాలన చేస్తూ నమాజ్ చదివేవారు. మరియు తమ ప్రవక్తకి విధేయత చూపేవారు. తమ ఇష్టాలను ప్రవక్త ఇష్టానికి అనుగుణంగా మార్చుకున్నారు. అందుకే అల్లాహ్ వారిలో ఉన్నటువంటి ఈ సుగుణాలను మెచ్చుకొని ఇలా అంటున్నాడు.

(رِجَالٌ لَا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَنْ ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ)

((కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు.)

ఓ ముస్లిం లారా! మస్జిద్ లో జమాత్తో పాటు నమాజ్ ఆచరించడం గురించి ఇవి పది ఆధారాలు తెలియపరచడం జరిగింది మనందరికీ కూడా ఈ విధంగా నమాజ్ స్థాపించేటువంటి బుద్ధిని భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక ,ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక ,అల్లాహ్ మనందరిని క్షమించు గాక.,మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా)  పశ్చాత్తాపం చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

రెండవ ఖుత్బా

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. మస్జిద్ లో సామూహికంగా నమాజ్ చదవడం ఈమాన్ లోని భాగము. కావున వ్యాపారస్తులు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండే వారందరూ కూడా నమాజ్ వేళ కాగానే మస్జిద్ కు వెళ్లడానికి త్వరపడాలి. అదేవిధంగా ఎవరైతే ఏదైనా సమావేశంలో ఉంటారో లేక ఏదైనా ప్రోగ్రామ్లో ఉంటారో వారిపై కూడా ఇది తప్పనిసరి అవుతుంది. అజాన్ వినపడగానే తమ పనులను ముగించుకుని ముందుగా నమాజ్ చదవాలి. నమాజ్ పూర్తి అయిన తరువాత మళ్లీ తమ పనులను ప్రారంభించుకోవాలి. మరియు నమాజ్ చదవడం అనేది మనిషి యొక్క మొదటి ఎంపికై ఉండాలి. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ మరియు అనవసరమైన కారణాల ద్వారా జమాతును విడిచిపెట్టడానికి అనుమతి లేదు. (ఏ కారణాల వల్ల జమాతును విడిచి పెట్టవచ్చు అవి ఇక్కడ తెలియపరచ బడింది) ప్రయాణ సందర్భంలో, అనారోగ్య స్థితిలో, లేక ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు, భయం వలన కాని, వర్షం వలన కానీ, లేక ఏదైనా భయంకర తుఫాను వలన కానీ.

ఓ అల్లాహ్ దాసులారా! జమాత్ అంటే (మొదటి జమాత్) అని అర్థం, దేనికోసమైతే అజాన్ మరియు ఇఖామత్ ఇవ్వబడుతుందో అది. చాలామంది (అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక) మొదటి జమాత్ నుంచి దూరంగా ఉంటారు. ఆ తర్వాత మసీదులోకి వచ్చి రెండో జమాతులోనూ లేక మూడో జమాత్ లోనో కలుస్తారు. దీని వలన ఒక జమాత్ కాకుండా అనేక జమాతులతో ప్రజలు నమాజ్ ఆచారిస్తున్నారు.

ఓ ముస్లింలారా! ఏ ముస్లిం అయితే విశ్వాసపరంగా దృఢంగా ఉంటాడో అతనిపై నమాజ్ యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఇది తప్పనిసరి చేయబడుతుంది. అతను నమాజ్ యొక్క విలువను తెలుసుకోవాలి. మరియు గ్రహించ వలసినటువంటి విషయం ఏమిటంటే అల్లాహ్ అతన్ని సిరిసంపదల ద్వారా వ్యాపార లావాదేవీల ద్వారా పరీక్షిస్తాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

(يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُلْهِكُمْ أَمْوَالُكُمْ وَلَا أَوْلَادُكُمْ عَنْ ذِكْرِ اللَّهِ وَمَنْ يَفْعَلْ ذَلِكَ فَأُولَئِكَ هُمُ الْخَاسِرُونَ)

(ఓ విశ్వాసులారా! మీ సిరిసంపదలు, మీ సంతానం మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరల్చరాదు. ఎవరైతే అలా చేస్తారో వారే నష్టపోయేవారు.)

మరోచోట ఇలా తెలియజేశాడు.

(فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَنْ تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ [36] رِجَالٌ لَا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَنْ ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ[37] لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُمْ مِنْ فَضْلِهِ وَاللَّهُ يَرْزُقُ مَنْ يَشَاءُ بِغَيْرِ حِسَابٍ[38])

(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (కొందరు) పురుషులు వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు. తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.)

ఈ వాక్యాలలో అల్లాహ్ తఆల వ్యాపార లావాదేవీల వలన నమాజ్ విషయంలో ఏమరపాటుకు లోనవ్వడం నుండి హెచ్చరించడం జరిగింది.  మరియు అదే విధంగా  ఉపాధి ప్రధాత కేవలం అల్లాహ్ మాత్రమే అని కూడా తెలియజేయబడింది ఆయన కోరుకున్న వారికి లెక్క లేనంత ప్రసాదిస్తాడు, కావున గ్రహించవలసిన మరో విషయం ఏమిటంటే నమాజ్ ఉపాధికి అడ్డంకి కాదు, లేక నమాజ్ వలన మనిషి యొక్క ఉపాధి ఆగిపోదు, ‘అల్లాహ్ నమాజ్ ద్వారా ఉపాధి మార్గాలను తెరుస్తాడు’ అందులో శుభాలు ప్రసాదిస్తాడు మరియు ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఆలోచిస్తారో వారు అల్లాహ్ విషయంలో అనుమానానికి లోనై ఉన్నారు.

ఓ విశ్వాసులారా! మనం అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్) వారి ఫత్వా ద్వారా ఈ ప్రసంగాన్ని ముగించుకుందాం! ఆయన ఇలా తెలియజేస్తున్నారు – ఎక్కడైతే అజాన్ పిలుపు నివ్వడం జరుగుతుందో అక్కడ పురుషులపై జమాత్తో నమాజ్ చదవడం తప్పనిసరి అవుతుంది. మరియు వ్యాపారులను మరియు దుకాణదారులు నమాజుల నుంచి వెనుక ఉండే అనుమతి కలుగజేయడం ప్రభుత్వానికి లేక పండితులకు ఎంత మాత్రమూ తగదు. అల్లాహ్ ధర్మం అనేది ఇలానే ఉంటుంది. కావున అల్లాహ్ విశ్వాసుల కొరకు జమాతుతో నమాజ్ చదవడాన్ని తప్పనిసరి చేశాడు కనుక ఈ విషయంలో వారు ఒకరికొకరు సహాయపడాలి. అల్లాహ్ ఇక్కడ విశ్వాసుల యొక్క ఒక గుణాన్ని తెలియజేస్తూ ఇలా అంటున్నాడు.

(وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ )

(విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు.) (మజ్మూ అల్ ఫతావా)

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

الأدلة العشرة على وجوب السعي لصلاة الجماعة، وتحريم التشاغل عنها بتجارة  موضوع الخطبة:
الخطيب: فضيلة الشيخ ماجد بن سليمان الرسي حفظه الله
 لغة الترجمة : التلغو
 المترجم: شيخ عبدالله بن قاسم جامعي
https://t.me/makkahkhutbalu القناة :   رابط