అల్ కహఫ్ (గుహ) సూరా పరిచయం : ఆహ్సనుల్ బయాన్ తఫ్సీర్ నుండి:
ఈ సూరా మక్కా కాలానికి చెందినా సూరా. ఈ సూరా ముఖ్యంగా ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ప్రధాన సూత్రాలను చర్చించింది. అల్లాహ్ పట్ల, పరలోకం పట్ల, మరణానంతర జీవితం పట్ల విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి ఈ చర్చ ఉద్దేశించింది. ప్రారంభ వచనాలు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడుతూ ఆయన మహొన్నత వ్యక్తిత్వాన్ని చాటిచెప్పాయి.
ఈ సూరాలోని 9 వ ఆయతులో ఒక గుహలో నిద్రపోయిన కొందరు విశ్వాసుల ప్రస్తావన ఉంది. ఈ కదా ఒక అద్భుతమైన సంఘటనను తెలిపింది. వారి సుదీర్ఘమైన నిద్ర దేవుని మహాత్యాలలో ఒకటి. ఈ కధ ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. వారు కొందరు యువకులు. బహుధైవారాధనను తిరస్కరించిన యువకులు. విగ్రహాలను లేక ఇతర దేవుళ్ళను ఆరాధించడాన్ని ఇష్టపడని యువకులు. అందువల్ల దౌర్జన్యాలకు గురయిన ఆ యువకులు తమ ప్రాంతాన్ని వదిలి పారిపోయి వచ్చారు. వారు ఒక గుహలోకి వచ్చి నిద్రపోయారు. అలాగే నిద్రలో దాదాపు 309 సంవత్సరాలు గడిపారు. కాని వారు నిద్రలేచి తాము మహా అయితే కొన్ని గంటలు నిద్రపోయి ఉంటామని భావించారు. గుహలో నిద్రపోయిన ఆ యువకులు అల్లాహ్ ను విశ్వసించిన యువకులు. అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ అర్ధించనివారు. వారి కధ త్యాగాన్ని, స్థిరచిత్తాన్ని, అల్లాహ్ పట్ల ధృడమైన విశ్వాసాన్ని, సత్యం కోసం పోరాడటాన్ని ప్రతిబింబిస్తుంది. గుహలో వారి సుదీర్ఘ నిద్ర మరణాన్ని, మరణానంతరం మళ్ళీ లేపడాన్ని సూచిస్తుంది. మరణం, మరణానంతర జీవితం రెండూ అనివార్యమైనవిగా తెలుపుతుంది.
ఈ సూరాలో మూసా (అలైహిస్సలాం) గురించిన కధ కూడా ప్రస్తావించబడింది. ధైవప్రవక్తగా, దేవుని సందేశాన్ని తీసుకువచ్చిన మహానీయునిగా అత్యున్నత స్థానం కలిగినప్పటికీ మూసా ప్రవక్త (అలైహిస్సలాం) జ్ఞానాన్ని ఇంకా సంపాదించాలన్న కుతూహలం మెండుగా కలిగినవారు, ఆయన మరో వ్యక్తి నుంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్నడూ వెనుకాడలేదు. మూసా ప్రవక్త(అలైహిస్సలాం) ఖిజర్ అనే మహనీయుని నుంచి జ్ఞానబోధ స్వీకరించడానికి ఆయనతో పాటు ఉన్నారు. ఆయన చెప్పినట్లు సహనం వహించడానికి ప్రయత్నించారు.
ఈ సూరాలో ప్రస్తావనకు వచ్చిన మూడో కధ జుల్ ఖర్ నైన్ కు సంబంధించినది. ఆయన న్యాయశీలుడైన గొప్ప పాలకుడు. ఒక పొరుగు దేశం ప్రజలు ఆయనకు మొరపెట్టుకొని, తమపై దాడులు చేస్తున్న అరాచక, అనాగరిక జాతులు యాజూజ్, మాజూజ్ ల నుంచి రక్షణ కల్పించవలసిందిగా కోరారు. బలహీనమైన పొరుగువారిని కాపాడటానికి ఆ న్యాయశీలుడైన రాజు సంకల్పించాడు. యాజూజ్,మాజూజ్ ల నుంచి వారిని రక్షించటానికి ఒక ధృడమైన గోడను నిర్మించాడు. ఈ సూరా తౌహీద్ (ఏక దైవారాధన)గురించి బలంగా చెబుతూ ముగుస్తుంది.
ప్రతి ఆయత్ యొక్క అర్ధం క్రింద చదవ వచ్చు .
(ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు)
18:1 الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ وَلَمْ يَجْعَل لَّهُ عِوَجًا ۜ
ప్రశంసలన్నీ అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. ఆయన తన దాసునిపై ఈ (ఖుర్‌ఆన్) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇందులో ఎలాంటి వక్రతనూ ఉంచలేదు.
18:2 قَيِّمًا لِّيُنذِرَ بَأْسًا شَدِيدًا مِّن لَّدُنْهُ وَيُبَشِّرَ الْمُؤْمِنِينَ الَّذِينَ يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا حَسَنًا
పైగా అన్నివిధాలా సరైనదిగా ఉంచాడు – తన వద్దనుంచి విధించబడే కఠినమైన శిక్ష గురించి హెచ్చరించటానికి, మంచి పనులు చేసే విశ్వాసులకు ఉత్తమ ప్రతిఫలం ఉందని శుభవార్తలు ఇవ్వటానికి,
18:3 مَّاكِثِينَ فِيهِ أَبَدًا
అందులో వారు శాశ్వతంగా ఉంటారని (తెలుపటానికి),
18:4 وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا
అల్లాహ్ సంతానం కలిగి ఉన్నాడని పలికేవారిని హెచ్చరించటానికి (ఈ గ్రంథం అవతరింపజెయ్యబడింది).
18:5 مَّا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ ۚ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ ۚ إِن يَقُولُونَ إِلَّا كَذِبًا
యదార్థానికి వారికిగానీ, వారి తాత ముత్తాతలకుగానీ ఈ విషయం ఏమీ తెలియదు. వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే.
18:6 فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلَىٰ آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَٰذَا الْحَدِيثِ أَسَفًا
(ఓ ముహమ్మద్!) ఒకవేళ ఈ జనులు ఈ మాటను విశ్వసించకపోతే నువ్వు వారి వెనుక దుఃఖంతో కుమిలిపోతూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏమి?
18:7 إِنَّا جَعَلْنَا مَا عَلَى الْأَرْضِ زِينَةً لَّهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًا
జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము.
18:8 وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا
దాని (భూమి)పై ఉన్న దానినంతటినీ మేము (నేలమట్టం చేసి) చదునైన మైదానంగా చేయనున్నాము.
18:9 أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا
ఏమిటీ, గుహవారిని, శిలాఫలకం వారిని నువ్వు మా శక్తి సూచనలలో మహా విచిత్రమైన సూచనగా తలపోస్తున్నావా?
18:10 إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا
ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినపుడు ఇలా ప్రార్థించారు: “మా ప్రభూ! నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి.”
18:11 فَضَرَبْنَا عَلَىٰ آذَانِهِمْ فِي الْكَهْفِ سِنِينَ عَدَدًا
అంతే! మేము ఆ గుహలో ఎన్నదగ్గ కొన్నేండ్లవరకూ వారి చెవులపై జోకొట్టి పడుకోబెట్టాము.
18:12 ثُمَّ بَعَثْنَاهُمْ لِنَعْلَمَ أَيُّ الْحِزْبَيْنِ أَحْصَىٰ لِمَا لَبِثُوا أَمَدًا
ఆ తరువాత, ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ఠకాలాన్ని ఖచ్చితంగా లెక్కగడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము.
18:13 نَّحْنُ نَقُصُّ عَلَيْكَ نَبَأَهُم بِالْحَقِّ ۚ إِنَّهُمْ فِتْيَةٌ آمَنُوا بِرَبِّهِمْ وَزِدْنَاهُمْ هُدًى
వారి యదార్ధ గాథను మేము నీకు వివరిస్తున్నాము – తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు. మేము వారి సన్మార్గంలో వృద్ధినొసగాము.
18:14 وَرَبَطْنَا عَلَىٰ قُلُوبِهِمْ إِذْ قَامُوا فَقَالُوا رَبُّنَا رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ لَن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము; “భూమ్యాకాశాలకు ప్రభువైనవాడే మా ప్రభువు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.”
18:15 هَٰؤُلَاءِ قَوْمُنَا اتَّخَذُوا مِن دُونِهِ آلِهَةً ۖ لَّوْلَا يَأْتُونَ عَلَيْهِم بِسُلْطَانٍ بَيِّنٍ ۖ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا
“ఆయన్ని వదలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? అల్లాహ్‌కు అబద్ధాన్ని అంట గట్టేవాడికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు?
18:16 وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُم مِّن رَّحْمَتِهِ وَيُهَيِّئْ لَكُم مِّنْ أَمْرِكُم مِّرْفَقًا
“ఇప్పుడు మీరు వాళ్ళతోనూ, అల్లాహ్‌ను గాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగత్రెంపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి. మీ ప్రభువు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు. మీ కార్యసిద్ధికై సౌలభ్యాన్ని సమకూరుస్తాడు.”
18:17 وَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَت تَّزَاوَرُ عَن كَهْفِهِمْ ذَاتَ الْيَمِينِ وَإِذَا غَرَبَت تَّقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِي فَجْوَةٍ مِّنْهُ ۚ ذَٰلِكَ مِنْ آيَاتِ اللَّهِ ۗ مَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ ۖ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُ وَلِيًّا مُّرْشِدًا
సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడిప్రక్కకు ఒరిగిపోవటాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనల్లోనిది. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వానిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించే వాడెవడినీ నీవు పొందలేవు.
18:18 وَتَحْسَبُهُمْ أَيْقَاظًا وَهُمْ رُقُودٌ ۚ وَنُقَلِّبُهُمْ ذَاتَ الْيَمِينِ وَذَاتَ الشِّمَالِ ۖ وَكَلْبُهُم بَاسِطٌ ذِرَاعَيْهِ بِالْوَصِيدِ ۚ لَوِ اطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًا وَلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا
వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు. కాని వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకూ, ఎడమ ప్రక్కకూ ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉన్నాము. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి (కూర్చుని) ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే, వెనుతిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుణ్ణి చేస్తుంది.
18:19 وَكَذَٰلِكَ بَعَثْنَاهُمْ لِيَتَسَاءَلُوا بَيْنَهُمْ ۚ قَالَ قَائِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ ۖ قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۚ قَالُوا رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَابْعَثُوا أَحَدَكُم بِوَرِقِكُمْ هَٰذِهِ إِلَى الْمَدِينَةِ فَلْيَنظُرْ أَيُّهَا أَزْكَىٰ طَعَامًا فَلْيَأْتِكُم بِرِزْقٍ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا
ఇదే విధంగా – వారు పరస్పరం ప్రశ్నించుకోవటానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకతను “మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు?” అని అడగ్గా, “ఒక రోజో లేక ఒక రోజుకన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాం” అని వారు సమాధాన మిచ్చారు. మళ్లీ ఇలా చెప్పారు : “మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి (నాణెము)ని ఇచ్చి, మీలో ఒకరిని పట్టణానికి పంపండి – అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కుని, అందులో నుంచి మీ కోసం తినటానికి తీసుకు వస్తాడు. అయితే అతను మృదువుగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు.
18:21 وَكَذَٰلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوا أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَأَنَّ السَّاعَةَ لَا رَيْبَ فِيهَا إِذْ يَتَنَازَعُونَ بَيْنَهُمْ أَمْرَهُمْ ۖ فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖ رَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا
ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమనీ, ప్రళయం (సంభవించటం)లో సందేహానికి తావులేదని ప్రజలు తెలుసుకోవటానికి మేము వారి పరిస్థితిని గురించి ప్రజలకు తెలియజేశాము. మరి వారేమో అప్పుడు ఈ వ్యవహారంలో పరస్పరం తర్జనభర్జన చేసుకోసాగారు – “వీరి గుహపై ఒక కట్టడం కట్టండి” అని కొందరన్నారు. వీరి సంగతి వీరి ప్రభువుకే బాగా తెలుసు. వీళ్ల వ్యవహారంలో పైచేయిగా ఉన్నవారు మాత్రం ఇలా అన్నారు: “మేము వీళ్లు ఉన్నచోట ఒక ఆరాధనాలయం కడతాము.”
18:22 سَيَقُولُونَ ثَلَاثَةٌ رَّابِعُهُمْ كَلْبُهُمْ وَيَقُولُونَ خَمْسَةٌ سَادِسُهُمْ كَلْبُهُمْ رَجْمًا بِالْغَيْبِ ۖ وَيَقُولُونَ سَبْعَةٌ وَثَامِنُهُمْ كَلْبُهُمْ ۚ قُل رَّبِّي أَعْلَمُ بِعِدَّتِهِم مَّا يَعْلَمُهُمْ إِلَّا قَلِيلٌ ۗ فَلَا تُمَارِ فِيهِمْ إِلَّا مِرَاءً ظَاهِرًا وَلَا تَسْتَفْتِ فِيهِم مِّنْهُمْ أَحَدًا
“వాళ్లు ముగ్గురు, నాల్గోది వారి కుక్క” అని కొందరంటారు. “వారు అయిదుగురు. ఆరోది వారి కుక్క” అని మరి కొంద రంటారు. వారు తమకు తెలియని విషయంలో ఊహాగానాలు చేస్తున్నారు. “వారు ఏడుగురు, ఎనిమిదోది వారి కుక్క” అని ఇంకా కొంతమంది అంటారు. “వారి సంఖ్య గురించి నా ప్రభువు బాగా ఎరుగు. వారి సంఖ్య గురించి బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు” అని వారికి చెప్పు. కాబట్టి నువ్వు వారి విషయంలో స్థూలంగా మాత్రమే వాదించు. ఇంకా (గుహ) వారిని గురించి వీళ్ళలో ఎవరినీ అడగకు.
18:23 وَلَا تَقُولَنَّ لِشَيْءٍ إِنِّي فَاعِلٌ ذَٰلِكَ غَدًا
ఏ విషయంలోనయినాసరే “రేపు నేను ఈ పని చేస్తాను” అని ఎట్టిపరిస్థితిలోనూ చెప్పకు.
18:24 إِلَّا أَن يَشَاءَ اللَّهُ ۚ وَاذْكُر رَّبَّكَ إِذَا نَسِيتَ وَقُلْ عَسَىٰ أَن يَهْدِيَنِ رَبِّي لِأَقْرَبَ مِنْ هَٰذَا رَشَدًا
అయితే “అల్లాహ్ తలిస్తే చేస్తాను (ఇన్‌షాఅల్లాహ్)” అని అనాలి. మరచిపోయినప్పుడల్లా నీ ప్రభువును స్మరించు. “నా ప్రభువు దీనికన్నా సన్మార్గానికి దగ్గరగా ఉండే విషయం వైపుకు నాకు దారి చూపిస్తాడన్న ఆశ వుంది” అని చెబుతూ ఉండు.
18:25 وَلَبِثُوا فِي كَهْفِهِمْ ثَلَاثَ مِائَةٍ سِنِينَ وَازْدَادُوا تِسْعًا
వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరో తొమ్మిదేండ్లు అదనం.
18:26 قُلِ اللَّهُ أَعْلَمُ بِمَا لَبِثُوا ۖ لَهُ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَبْصِرْ بِهِ وَأَسْمِعْ ۚ مَا لَهُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا يُشْرِكُ فِي حُكْمِهِ أَحَدًا
వారికి చెప్పు : “వారు అక్కడ ఖచ్చితంగా ఎంతకాలం ఉన్నారో అల్లాహ్‌కే తెలుసు. భూమ్యాకాశాల రహస్యం ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనెంత చక్కగా చూసేవాడు! మరెంత చక్కగా వినేవాడు! అల్లాహ్ తప్ప వారిని ఆదుకునే వాడెవడూ లేడు. అల్లాహ్ తన పరిపాలనాధికారంలో (నిర్ణయాలలో) ఎవరినీ భాగస్వామిగా చేర్చుకోడు.”
18:27 وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِن كِتَابِ رَبِّكَ ۖ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَن تَجِدَ مِن دُونِهِ مُلْتَحَدًا
నీ వద్దకు వహీ ద్వారా పంపబడిన నీ ప్రభువు గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. ఆయన వచనాలను మార్చగలవాడెవడూ లేడు. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఆశ్రయం తప్ప వేరే ఆశ్రయాన్ని పొందజాలవు.
18:28 وَاصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ وَلَا تَعْدُ عَيْنَاكَ عَنْهُمْ تُرِيدُ زِينَةَ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَلَا تُطِعْ مَنْ أَغْفَلْنَا قَلْبَهُ عَن ذِكْرِنَا وَاتَّبَعَ هَوَاهُ وَكَانَ أَمْرُهُ فُرُطًا
తమ ప్రభువును ఉదయం, సాయంత్రం వేడుకుంటూ, ఆయన ప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో ఉన్నవారి సహచర్యం పట్ల నీ మనసును సంతృప్త పరచుకో. జాగ్రత్త! వారి నుంచి నీ దృష్టిని మరల్చుకోకు. ప్రాపంచిక జీవితపు అందాలను నీవు కోరుకుంటావేమో! చూడు! ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోనుచేశామో, ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో, ఎవడి పనితీరు మితిమీరిపోయిందో అతనికి విధేయత చూపకు.
18:29 وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ ۚ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ۚ وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا
ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!
18:30 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ إِنَّا لَا نُضِيعُ أَجْرَ مَنْ أَحْسَنَ عَمَلًا
ఇక విశ్వసించి, సత్కార్యాలు చేసినవారి విషయం – నిశ్చయంగా మేము ఉత్తమ ఆచరణ చేసిన వారి ప్రతిఫలాన్ని వృధా కానివ్వము.
18:31 أُولَٰئِكَ لَهُمْ جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهِمُ الْأَنْهَارُ يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَيَلْبَسُونَ ثِيَابًا خُضْرًا مِّن سُندُسٍ وَإِسْتَبْرَقٍ مُّتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ ۚ نِعْمَ الثَّوَابُ وَحَسُنَتْ مُرْتَفَقًا
వారి కోసం శాశ్వితమైన స్వర్గవనాలున్నాయి. వారి క్రింది నుంచి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. సన్నగానూ, దళసరిగానూ ఉండే సుతిమెత్తని ఆకుపచ్చ రంగుగల పట్టు వస్త్రాలు ధరిస్తారు. వారక్కడ ఆసనాలపై (దిండ్లకు) ఆనుకుని ఆసీనులై ఉంటారు. ఎంత చక్కటి పుణ్యఫలం అది! ఎంత అమోఘమైన విశ్రాంతి నిలయం అది!!
18:32 وَاضْرِبْ لَهُم مَّثَلًا رَّجُلَيْنِ جَعَلْنَا لِأَحَدِهِمَا جَنَّتَيْنِ مِنْ أَعْنَابٍ وَحَفَفْنَاهُمَا بِنَخْلٍ وَجَعَلْنَا بَيْنَهُمَا زَرْعًا
(ఓ ప్రవక్తా!) వారికి ఆ ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా వినిపించు – వారిలో ఒకతనికి మేము రెండు ద్రాక్ష తోటలను ఇచ్చాము. వాటి చుట్టూ ఖర్జూరపు చెట్ల కంచెను నిర్మించాము. ఆ రెంటికీ మధ్య పచ్చని పంట పొలాలను కూడా వొసగాము.
18:33 كِلْتَا الْجَنَّتَيْنِ آتَتْ أُكُلَهَا وَلَمْ تَظْلِم مِّنْهُ شَيْئًا ۚ وَفَجَّرْنَا خِلَالَهُمَا نَهَرًا
ఆ రెండు తోటలూ దిట్టంగా పండాయి. అందులో ఏ లోటూ చేయలేదు. ఇంకా, ఆ రెండు తోటల మధ్య మేము ఒక కాలువను కూడా ప్రవహింపజేశాము.
18:34 وَكَانَ لَهُ ثَمَرٌ فَقَالَ لِصَاحِبِهِ وَهُوَ يُحَاوِرُهُ أَنَا أَكْثَرُ مِنكَ مَالًا وَأَعَزُّ نَفَرًا
మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, “నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి. మందీమార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణే” అని అన్నాడు.
18:35 وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَن تَبِيدَ هَٰذِهِ أَبَدًا
ఇలా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు: “ఏనాటికైనా ఈ తోట నాశనమై పోతుందని నేననుకోను.”
18:36 وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِّنْهَا مُنقَلَبًا
“ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ (అలాంటిదేదైనా జరిగి) నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను (ఆ మళ్ళింపు స్థానంలో) ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను.”
18:37 قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلًا
అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు : “ఏమిటీ, నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్యపు బిందువుతో సృష్టించి, ఆపైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆ ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా?
18:38 لَّٰكِنَّا هُوَ اللَّهُ رَبِّي وَلَا أُشْرِكُ بِرَبِّي أَحَدًا
“నా మట్టుకు నేను ఆ అల్లాహ్‌యే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను.
18:39 وَلَوْلَا إِذْ دَخَلْتَ جَنَّتَكَ قُلْتَ مَا شَاءَ اللَّهُ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ ۚ إِن تَرَنِ أَنَا أَقَلَّ مِنكَ مَالًا وَوَلَدًا
“(మిత్రమా!) నువ్వు నీ తోటలోకి పోతున్నప్పుడు ‘అల్లాహ్ తలచినదే అవుతుంది. అల్లాహ్ ద్వారా లభించే శక్తి తప్ప వేరే శక్తి ఏదీ లేదు’ అని ఎందుకు పలకలేదు? ఒకవేళ నువ్వు నన్ను సంపదలో, సంతానంలో నీకన్నా అల్పునిగా చూస్తున్నట్లయితే,
18:40 فَعَسَىٰ رَبِّي أَن يُؤْتِيَنِ خَيْرًا مِّن جَنَّتِكَ وَيُرْسِلَ عَلَيْهَا حُسْبَانًا مِّنَ السَّمَاءِ فَتُصْبِحَ صَعِيدًا زَلَقًا
“(తెలుసుకో!) నా ప్రభువు నాకు నీ తోట కన్నా మేలైనదాన్ని ప్రసాదించి, నీ తోటపై ఆకాశం నుంచి ఏదన్నా శిక్షను పంపినా పంపవచ్చు (ఆశ్చర్యపోనవసరం లేదు). అప్పుడది తెల్లవారేసరికి చదునైన – నున్నని – మైదానంలా అయిపోవచ్చు!
18:41 أَوْ يُصْبِحَ مَاؤُهَا غَوْرًا فَلَن تَسْتَطِيعَ لَهُ طَلَبًا
“లేదా దీని నీరు భూమిలో ఇంకిపోనూవచ్చు. దాన్ని వెతికి తీసుకురావటం నీ తరం కాకపోవచ్చు.”
18:42 وَأُحِيطَ بِثَمَرِهِ فَأَصْبَحَ يُقَلِّبُ كَفَّيْهِ عَلَىٰ مَا أَنفَقَ فِيهَا وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا وَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُشْرِكْ بِرَبِّي أَحَدًا
అతని పండ్లన్నీ ముట్టడించబడ్డాయి. దాని కోసం పెట్టిన పెట్టుబడిపై అతను చేతులు నలుపుకుంటూ ఉండి పోయాడు. ఆ తోట తలక్రిందులై (తడికెలపై) పడి ఉంది. “అయ్యో! నేను నా ప్రభువుకు సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉంటే ఎంత బావుండేది!” అని (ఆ వ్యక్తి) అన్నాడు.
18:43 وَلَمْ تَكُن لَّهُ فِئَةٌ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مُنتَصِرًا
అల్లాహ్ పట్టు నుంచి అతన్ని రక్షించి, సహాయపడటానికి అతని జన సమూహమేదీ రాలేదు. స్వయంగా అతను కూడా ప్రతిఘటించలేకపోయాడు.
18:45 وَاضْرِبْ لَهُم مَّثَلَ الْحَيَاةِ الدُّنْيَا كَمَاءٍ أَنزَلْنَاهُ مِنَ السَّمَاءِ فَاخْتَلَطَ بِهِ نَبَاتُ الْأَرْضِ فَأَصْبَحَ هَشِيمًا تَذْرُوهُ الرِّيَاحُ ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ مُّقْتَدِرًا
(ఓ ప్రవక్తా!) ప్రాపంచిక జీవితపు ఉదాహరణను కూడా వారికి తెలుపు. అది మేము ఆకాశం నుంచి కురిపించే వర్షపు నీరు వంటిది. దానివల్ల నేలలో దట్టమైన పచ్చిక మొలిచింది. ఆఖరికి అది పొట్టు పొట్టుగా మారిపోగా, గాలులు దాన్ని లేపుకుపోతాయి. అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు.
18:46 الْمَالُ وَالْبَنُونَ زِينَةُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَالْبَاقِيَاتُ الصَّالِحَاتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ أَمَلًا
సిరిసంపదలైనా, సంతానమైనా ప్రాపంచిక జీవితానికి అలంకారం మాత్రమే. అయితే మిగిలివుండే సత్కార్యాలు నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా మేలైనవి. అత్యుత్తమం కాగలవని ఆశించబడేవి అవే.
18:47 وَيَوْمَ نُسَيِّرُ الْجِبَالَ وَتَرَى الْأَرْضَ بَارِزَةً وَحَشَرْنَاهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ أَحَدًا
మేము పర్వతాలను నడిపిస్తాము, నువ్వు ఆ రోజున భూమిని చదును చేయబడి ఉన్నట్లుగా చూస్తావు. జనులందరినీ మేము (ఒకచోట) సమీకరిస్తాము. వారిలో ఏ ఒక్కరినీ వదలి పెట్టము.
18:48 وَعُرِضُوا عَلَىٰ رَبِّكَ صَفًّا لَّقَدْ جِئْتُمُونَا كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ بَلْ زَعَمْتُمْ أَلَّن نَّجْعَلَ لَكُم مَّوْعِدًا
వారంతా నీ ప్రభువు సమక్షంలో వరుసగా నిలబెట్టబడతారు. “నిశ్చయంగా – మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా వద్దకు వచ్చేశారు. కాని మీరు మాత్రం, మేమెన్నటికీ మీ కోసం వాగ్దాన సమయం నిర్ధారించము అనే తలపోసేవారు.”
18:49 وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا ۚ وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు.
18:50 وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ ۗ أَفَتَتَّخِذُونَهُ وَذُرِّيَّتَهُ أَوْلِيَاءَ مِن دُونِي وَهُمْ لَكُمْ عَدُوٌّ ۚ بِئْسَ لِلظَّالِمِينَ بَدَلًا
ఆదమ్ ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు, ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభువు ఆజ్ఞను జవదాటాడు. అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి, మీ అందరికీ శత్రువు అయినవాణ్ణీ, వాడి సంతానాన్నీ మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది!
18:51 مَّا أَشْهَدتُّهُمْ خَلْقَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَا خَلْقَ أَنفُسِهِمْ وَمَا كُنتُ مُتَّخِذَ الْمُضِلِّينَ عَضُدًا
నేను భూమ్యాకాశాలను సృష్టించినప్పుడుగానీ, స్వయంగా వీళ్ళను పుట్టించినపుడుగానీ వారిని అక్కడ ఉంచలేదు. అపమార్గం పట్టించే వారిని నేను నా సహాయకులుగా చేసుకోను.
18:52 وَيَوْمَ يَقُولُ نَادُوا شُرَكَائِيَ الَّذِينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُم مَّوْبِقًا
“నాకు భాగస్వాములని మీరు భావించిన (వారెక్కడ?) వారిని పిలవండి” అని ఆయన చెప్పిన రోజున వారు (తమ మిధ్యా దైవాలను) పిలుస్తారు. కాని వారిలో ఏ ఒక్కరూ సమాధానం ఇవ్వరు. మేము వారి మధ్యన వినాశాన్ని ఏర్పరుస్తాము.
18:53 وَرَأَى الْمُجْرِمُونَ النَّارَ فَظَنُّوا أَنَّهُم مُّوَاقِعُوهَا وَلَمْ يَجِدُوا عَنْهَا مَصْرِفًا
అపరాధులు నరకాన్ని చూడగానే, తాము పడవలసి ఉన్నది అందులోనేనని అర్థం చేసుకుంటారు. దాన్నుంచి తప్పించుకునే మార్గం ఏదీ వారికి కనిపించదు.
18:54 وَلَقَدْ صَرَّفْنَا فِي هَٰذَا الْقُرْآنِ لِلنَّاسِ مِن كُلِّ مَثَلٍ ۚ وَكَانَ الْإِنسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلًا
మేము ఈ ఖుర్‌ఆనులో ప్రజల కోసం పలు పలు విధాలుగా ఉపమానాలన్నింటినీ వివరించాము. కాని మానవుడు అందరి కన్నా ఎక్కువ తగవులమారి.
18:55 وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ وَيَسْتَغْفِرُوا رَبَّهُمْ إِلَّا أَن تَأْتِيَهُمْ سُنَّةُ الْأَوَّلِينَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ قُبُلًا
ప్రజల వద్దకు మార్గదర్శకత్వం వచ్చేసిన తరువాత కూడా వారు విశ్వసించకుండా, క్షమాభిక్షకై తమ ప్రభువును వేడుకోకుండా వారిని ఆపిన విషయం ఒక్కటే – అదేమిటంటే, గత కాలంలోని ప్రజలకు ఎదురైన వ్యవహారమే తమకూ ఎదురవ్వాలనీ లేదా ప్రత్యక్షంగా తమ ముందుకు శిక్ష రావాలని వారు నిరీక్షించటం.
18:56 وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۚ وَيُجَادِلُ الَّذِينَ كَفَرُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ ۖ وَاتَّخَذُوا آيَاتِي وَمَا أُنذِرُوا هُزُوًا
మేము ప్రవక్తలను శుభవార్తలను అందజేయటానికి, హెచ్చరికలు చేయటానికి మాత్రమే పంపిస్తాము. అవిశ్వాసులు అసత్యం ఆధారంగా వాదులాడతారు. దాని ద్వారా సత్యాన్ని ఖండించటానికి (ప్రయత్నిస్తారు.) వారు నా ఆయతులను, వారికి చేస్తున్న హెచ్చరికలను ఆషామాషీగా తీసుకున్నారు.
18:57 وَمَنْ أَظْلَمُ مِمَّن ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْهَا وَنَسِيَ مَا قَدَّمَتْ يَدَاهُ ۚ إِنَّا جَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۖ وَإِن تَدْعُهُمْ إِلَى الْهُدَىٰ فَلَن يَهْتَدُوا إِذًا أَبَدًا
తన ప్రభువు వచనాల ద్వారా హితబోధ చేసినప్పటికీ, విముఖత చూపి, తన చేతులతో ముందుగా చేసి పంపుకున్న దానినే మరచిపోయిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? వారు దానిని (ఖుర్‌ఆనును) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసేశాము. వారి చెవులకు చెవుడు కలిగించాము. నువ్వు సన్మార్గం వైపుకు వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, వారు ఎన్నటికీ సన్మార్గం పొందేవారు కారు.
18:58 وَرَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ ۖ لَوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ ۚ بَل لَّهُم مَّوْعِدٌ لَّن يَجِدُوا مِن دُونِهِ مَوْئِلًا
నీ ప్రభువు క్షమాగుణం కలవాడు, దయాశీలి. వారి చేష్టలకు శిక్షగా ఆయన గనక వారిని పట్టుకున్నట్లయితే, వారిని తొందరగానే శిక్షించి ఉండేవాడు. అసలు విషయం ఏమిటంటే వారి కోసం ఒక వాగ్దాన సమయం నిర్ధారితమై ఉంది. దాన్నుంచి తప్పించుకునిపోయే చోటేదీ వారికి దొరకదు.
18:59 وَتِلْكَ الْقُرَىٰ أَهْلَكْنَاهُمْ لَمَّا ظَلَمُوا وَجَعَلْنَا لِمَهْلِكِهِم مَّوْعِدًا
తమ దురాగతాల మూలంగా మేము సర్వనాశనం చేసిన వారి పట్టణాలు ఇవే. వీరి వినాశానికి కూడా మేము ఒక గడువును నిర్ధారించి పెట్టాము.
18:60 وَإِذْ قَالَ مُوسَىٰ لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّىٰ أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا
“ఏళ్ళ తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంతవరకూ నేను నడుస్తూనే ఉంటాను” అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు (జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి).
18:61 فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا
తీరా వారిద్దరు సాగర సంగమానికి చేరుకున్నాక, అక్కడ తమ చేపను మరచి పోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది.
18:62 فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبًا
వారుభయులూ ముందుకు సాగిపోయిన తరువాత మూసా తన (వెంటనున్న) యువకుణ్ణి ఉద్దేశించి, “మా ఉదయ భోజనం తీసుకురా. నిజంగానే ఈ ప్రయాణంలో చాలా ప్రయాస పడాల్సి వచ్చింది” అన్నాడు.
18:63 قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ ۚ وَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ عَجَبًا
దానికతను, “చూశారా (ఎంత పనయిందో)! మనం రాతి బండకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నేను చేప సంగతి మరచేపోయాను. అసలేం జరిగిందో మీకు చెప్పకుండా షైతానే నన్ను మరుపుకు లోను చేశాడు. ఆ చేప చాలా విచిత్రంగా సముద్రంలోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది” అని వివరించాడు.
18:64 قَالَ ذَٰلِكَ مَا كُنَّا نَبْغِ ۚ فَارْتَدَّا عَلَىٰ آثَارِهِمَا قَصَصًا
“(అరె!) మనం వెతుక్కుంటూ వచ్చింది ఆ స్థలం కోసమే కదా!” అని మూసా అన్నాడు. ఆ తరువాత వారిద్దరూ తమ పాదచిహ్నాల ఆధారంగా వెనక్కి తిరిగి వచ్చారు.
18:65 فَوَجَدَا عَبْدًا مِّنْ عِبَادِنَا آتَيْنَاهُ رَحْمَةً مِّنْ عِندِنَا وَعَلَّمْنَاهُ مِن لَّدُنَّا عِلْمًا
అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము.
18:66 قَالَ لَهُ مُوسَىٰ هَلْ أَتَّبِعُكَ عَلَىٰ أَن تُعَلِّمَنِ مِمَّا عُلِّمْتَ رُشْدًا
మూసా అతనితో, “మీకు నేర్పబడిన మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి, నేను మీ వెంట ఉండవచ్చా?” అని అభ్యర్థించాడు.
18:67 قَالَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
దానికతను, “మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేరు.
18:68 وَكَيْفَ تَصْبِرُ عَلَىٰ مَا لَمْ تُحِطْ بِهِ خُبْرًا
“అయినా మీరు మీ జ్ఞానపరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది?” అన్నాడు.
18:69 قَالَ سَتَجِدُنِي إِن شَاءَ اللَّهُ صَابِرًا وَلَا أَعْصِي لَكَ أَمْرًا
“అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను” అని (మూసా) సమాధానమిచ్చాడు.
18:70 قَالَ فَإِنِ اتَّبَعْتَنِي فَلَا تَسْأَلْنِي عَن شَيْءٍ حَتَّىٰ أُحْدِثَ لَكَ مِنْهُ ذِكْرًا
“సరే! నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే (బాగా గుర్తుంచుకోండి!) ఏ విషయం గురించైనాసరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంతవరకూ నన్నేమీ అడగకూడదు” అన్నాడతను.
18:71 فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا
వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరినీ ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు.
18:72 قَالَ أَلَمْ أَقُلْ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
“మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా!?” అని (ఖిజరు) అన్నాడు.
18:73 قَالَ لَا تُؤَاخِذْنِي بِمَا نَسِيتُ وَلَا تُرْهِقْنِي مِنْ أَمْرِي عُسْرًا
“నా మరుపుపై నన్ను పట్టుకోకండి. నా విషయంలో కఠినంగా వ్యవహరించకండి” అని మూసా విన్నవించుకున్నాడు.
18:74 فَانطَلَقَا حَتَّىٰ إِذَا لَقِيَا غُلَامًا فَقَتَلَهُ قَالَ أَقَتَلْتَ نَفْسًا زَكِيَّةً بِغَيْرِ نَفْسٍ لَّقَدْ جِئْتَ شَيْئًا نُّكْرًا
ఆ తరువాత వారుభయులూ ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతనా అబ్బాయిని చంపేశాడు. “మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు. అతను ఏ ప్రాణినీ హతమార్చి ఉండలేదుకదా! నిశ్చయంగా మీరు అత్యంత ఘోరకృత్యానికి పాల్పడ్డారు” అని మూసా చెప్పాడు.
18:75 قَالَ أَلَمْ أَقُل لَّكَ إِنَّكَ لَن تَسْتَطِيعَ مَعِيَ صَبْرًا
“నా వెంట ఉంటూ మీరు ఏ మాత్రం సహనం పాటించలేరని ముందే చెప్పానా లేదా?” అని ఆయన అన్నాడు.
18:76 قَالَ إِن سَأَلْتُكَ عَن شَيْءٍ بَعْدَهَا فَلَا تُصَاحِبْنِي ۖ قَدْ بَلَغْتَ مِن لَّدُنِّي عُذْرًا
“ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనయినా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది” అని మూసా ప్రాధేయపడ్డాడు.
18:77 فَانطَلَقَا حَتَّىٰ إِذَا أَتَيَا أَهْلَ قَرْيَةٍ اسْتَطْعَمَا أَهْلَهَا فَأَبَوْا أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارًا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُ ۖ قَالَ لَوْ شِئْتَ لَاتَّخَذْتَ عَلَيْهِ أَجْرًا
వారిద్దరూ అక్కణ్ణుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను (యధాతథంగా) నిలబెట్టాడు. “మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా!” అని మూసా అన్నాడు.
18:78 قَالَ هَٰذَا فِرَاقُ بَيْنِي وَبَيْنِكَ ۚ سَأُنَبِّئُكَ بِتَأْوِيلِ مَا لَمْ تَسْتَطِع عَّلَيْهِ صَبْرًا
దానికతను ఈ విధంగా సమాధానమిచ్చాడు: “ఇక మీకూ- నాకూ మధ్య చీలిక ఏర్పడినట్లే (మన సావాసం చెల్లిపోయింది). మీరు సహించలేకపోయిన ఆ మూడు విషయాల పరమార్థాన్ని కూడా మీకు వివరిస్తాను (వినండి)….”
18:79 أَمَّا السَّفِينَةُ فَكَانَتْ لِمَسَاكِينَ يَعْمَلُونَ فِي الْبَحْرِ فَأَرَدتُّ أَنْ أَعِيبَهَا وَكَانَ وَرَاءَهُم مَّلِكٌ يَأْخُذُ كُلَّ سَفِينَةٍ غَصْبًا
“ఆ పడవ సంగతి – అది సముద్రంలో పనిచేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పర చాలనుకున్నాను. ఎందుకంటే, ఇంకాస్త ముందుకుపోతే కనిపించిన ప్రతి (మంచి) పడవనూ బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు.
18:80 وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا
“ఇకపోతే ఆ అబ్బాయి సంగతి; అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కారవైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది.
18:81 فَأَرَدْنَا أَن يُبْدِلَهُمَا رَبُّهُمَا خَيْرًا مِّنْهُ زَكَاةً وَأَقْرَبَ رُحْمًا
“అందుకే వారికి వారి ప్రభువు – అతనికి బదులుగా – అతనికన్నా సౌశీల్యవంతుడైన, దయార్ద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము.
18:82 وَأَمَّا الْجِدَارُ فَكَانَ لِغُلَامَيْنِ يَتِيمَيْنِ فِي الْمَدِينَةِ وَكَانَ تَحْتَهُ كَنزٌ لَّهُمَا وَكَانَ أَبُوهُمَا صَالِحًا فَأَرَادَ رَبُّكَ أَن يَبْلُغَا أَشُدَّهُمَا وَيَسْتَخْرِجَا كَنزَهُمَا رَحْمَةً مِّن رَّبِّكَ ۚ وَمَا فَعَلْتُهُ عَنْ أَمْرِي ۚ ذَٰلِكَ تَأْوِيلُ مَا لَمْ تَسْطِع عَّلَيْهِ صَبْرًا
“ఇక గోడ సంగతంటారా, ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాధ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాధలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతట నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనుక దాగివున్న వాస్తవికత ఇదే!”
18:83 وَيَسْأَلُونَكَ عَن ذِي الْقَرْنَيْنِ ۖ قُلْ سَأَتْلُو عَلَيْكُم مِّنْهُ ذِكْرًا
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్‌ఖర్‌నైన్ గురించి అడుగుతున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు.
18:84 إِنَّا مَكَّنَّا لَهُ فِي الْأَرْضِ وَآتَيْنَاهُ مِن كُلِّ شَيْءٍ سَبَبًا
మేము అతనికి భువిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్నికూడా అతనికి సమకూర్చాము.
18:85 فَأَتْبَعَ سَبَبًا
అతను ఒక దిశలో పోసాగాడు.
18:86 حَتَّىٰ إِذَا بَلَغَ مَغْرِبَ الشَّمْسِ وَجَدَهَا تَغْرُبُ فِي عَيْنٍ حَمِئَةٍ وَوَجَدَ عِندَهَا قَوْمًا ۗ قُلْنَا يَا ذَا الْقَرْنَيْنِ إِمَّا أَن تُعَذِّبَ وَإِمَّا أَن تَتَّخِذَ فِيهِمْ حُسْنًا
చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని, సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. “ఓ జుల్‌ఖర్‌నైన్! నువ్వు వీళ్లను శిక్షించవచ్చు. లేదా వీరి విషయంలో మరేదయినా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు” అని మేమతనికి సెలవిచ్చాము.
18:87 قَالَ أَمَّا مَن ظَلَمَ فَسَوْفَ نُعَذِّبُهُ ثُمَّ يُرَدُّ إِلَىٰ رَبِّهِ فَيُعَذِّبُهُ عَذَابًا نُّكْرًا
దానికతను, “దుర్మార్గానికి ఒడిగట్టిన వాణ్ణి మేము శిక్షిస్తాము. తరువాత అతను తన ప్రభువు వద్దకు మరలించబడతాడు. ఆయన అతనికి మరింత తీవ్రమైన శిక్ష విధిస్తాడు” అని అన్నాడు.
18:88 وَأَمَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهُ جَزَاءً الْحُسْنَىٰ ۖ وَسَنَقُولُ لَهُ مِنْ أَمْرِنَا يُسْرًا
“అయితే విశ్వసించి, మంచిపనులు చేసినవారికి ప్రతి ఫలంగా మేలు కలుగుతుంది. అలాంటి వారికి మేము సయితం మా పనిలో తేలికపాటి ఆదేశాలే ఇస్తాము” (అని అన్నాడు).
18:89 ثُمَّ أَتْبَعَ سَبَبًا
ఆ తరువాత అతను మరో దారి పట్టాడు –
18:90 حَتَّىٰ إِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَىٰ قَوْمٍ لَّمْ نَجْعَل لَّهُم مِّن دُونِهَا سِتْرًا
అతను సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చేరుకున్నప్పుడు, అక్కడ సూర్యుడు ఒక జాతి వారిపై ఉదయించటం చూశాడు. మేము వారికీ – సూర్యునికీ మధ్య ఎలాంటి అడ్డునూ ఉంచలేదు.
18:91 كَذَٰلِكَ وَقَدْ أَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًا
ఇదీ పరిస్థితి! అతనికి సంబంధించిన విషయాలన్నీ మా జ్ఞానపరిధిలో ఉన్నాయి.
18:92 ثُمَّ أَتْبَعَ سَبَبًا
ఆ తరువాత అతను ఇంకొక మార్గాన్ని అనుసరించాడు.
18:93 حَتَّىٰ إِذَا بَلَغَ بَيْنَ السَّدَّيْنِ وَجَدَ مِن دُونِهِمَا قَوْمًا لَّا يَكَادُونَ يَفْقَهُونَ قَوْلًا
అతను రెండు కొండల మధ్య ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ఆ రెంటికీ నడుమ ఒక జాతివారిని చూశాడు. వారు అతని (ఒక్క) మాటనైనా అర్థం చేసుకునే స్థితిలో లేరు.
18:94 قَالُوا يَا ذَا الْقَرْنَيْنِ إِنَّ يَأْجُوجَ وَمَأْجُوجَ مُفْسِدُونَ فِي الْأَرْضِ فَهَلْ نَجْعَلُ لَكَ خَرْجًا عَلَىٰ أَن تَجْعَلَ بَيْنَنَا وَبَيْنَهُمْ سَدًّا
“ఓ జుల్ ఖర్‌నైన్! యాజూజ్ మాజూజ్‌లు ఈ దేశంలో కల్లోలాన్ని సృష్టిస్తున్నారు. నువ్వు మాకూ – వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మిస్తావా? దానికయ్యే ఖర్చులు నీకు చెల్లించమంటావా?” అని వాళ్లు విన్నవించుకున్నారు.
18:95 قَالَ مَا مَكَّنِّي فِيهِ رَبِّي خَيْرٌ فَأَعِينُونِي بِقُوَّةٍ أَجْعَلْ بَيْنَكُمْ وَبَيْنَهُمْ رَدْمًا
అతనిలా సమాధానమిచ్చాడు: “నాకు నా ప్రభువు అనుగ్రహించిన అధికారమే ఎంతో శ్రేష్ఠమైనది. మీరు మీ (శ్రమ) శక్తి ద్వారా నాకు సహాయపడండి చాలు. నేను మీకూ – వారికీ మధ్య ఒక పటిష్టమైన గోడను నిర్మిస్తాను.
18:96 آتُونِي زُبَرَ الْحَدِيدِ ۖ حَتَّىٰ إِذَا سَاوَىٰ بَيْنَ الصَّدَفَيْنِ قَالَ انفُخُوا ۖ حَتَّىٰ إِذَا جَعَلَهُ نَارًا قَالَ آتُونِي أُفْرِغْ عَلَيْهِ قِطْرًا
“….నాకు ఇనుపరేకులను తెచ్చి ఇవ్వండి.” ఆ విధంగా అతను ఆ రెండు పర్వతాల మధ్య గోడను – సమానంగా – లేపిన తరువాత, “అగ్నిని రాజేయండి” అని ఆజ్ఞాపించాడు. ఆ ఇనుప రేకులు బాగా కాలి అగ్నిగా మారిన తరువాత “కరిగిన రాగిని తెండి, దానిపై పోస్తాను” అని అన్నాడు.
18:97 فَمَا اسْطَاعُوا أَن يَظْهَرُوهُ وَمَا اسْتَطَاعُوا لَهُ نَقْبًا
ఇక వారిలో (యాజూజు మాజూజుల్లో) ఆ గోడను ఎక్కే శక్తి లేకపోయింది. దానికి రంధ్రం వేయటం కూడా వారి తరం కాదు.
18:98 قَالَ هَٰذَا رَحْمَةٌ مِّن رَّبِّي ۖ فَإِذَا جَاءَ وَعْدُ رَبِّي جَعَلَهُ دَكَّاءَ ۖ وَكَانَ وَعْدُ رَبِّي حَقًّا
“ఇది కేవలం నా ప్రభువు కటాక్షం. అయితే నా ప్రభువు వాగ్దాన సమయం వచ్చినపుడు ఆయన దాన్ని నేలమట్టం చేసేస్తాడు. నిశ్చయంగా నా ప్రభువు వాగ్దానం నెరవేరటం తథ్యం” అని జుల్‌ఖర్‌నైన్ చెప్పాడు.
18:99 وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍ يَمُوجُ فِي بَعْضٍ ۖ وَنُفِخَ فِي الصُّورِ فَجَمَعْنَاهُمْ جَمْعًا
ఆ రోజు మేము వారిని (సముద్రపు అలల మాదిరిగా) ఒండొకరిలో చొచ్చుకుపోయేలా వదలిపెడతాము. శంఖం ఊద బడుతుంది. అంతే! మేము జనులందరినీ ఒకేసారి సమీకరిస్తాము.
18:100 وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكَافِرِينَ عَرْضًا
ఆ రోజు మేము నరకాన్ని అవిశ్వాసుల ముందు ప్రత్యక్షపరుస్తాము.
18:101 الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَن ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا
నా స్మరణ పట్ల వారి కళ్లు పొరలు క్రమ్ముకుని ఉండేవి. అప్పుడు వారు (సత్య వాక్కును) వినే స్థితిలో కూడా లేరు.
18:102 أَفَحَسِبَ الَّذِينَ كَفَرُوا أَن يَتَّخِذُوا عِبَادِي مِن دُونِي أَوْلِيَاءَ ۚ إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا
ఇప్పుడీ అవిశ్వాసులు, నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? (వినండి!) మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధంచేసి ఉంచాము.
18:103 قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْأَخْسَرِينَ أَعْمَالًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చేసుకున్న కర్మల రీత్యా మీలో అందరికన్నా ఎక్కువగా నష్టపోయే వారెవరో నేను మీకు చెప్పనా?
18:105 أُولَٰئِكَ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ وَلِقَائِهِ فَحَبِطَتْ أَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا
తమ ప్రభువు ఆయతులను, ఆయన్ని కలుసుకోవలసి ఉందన్న విషయాన్ని త్రోసి పుచ్చినవారు వీరే. అందువల్ల వారి కర్మలన్నీ వృధా అయిపోయాయి. కాబట్టి ప్రళయదినాన మేము వారి కర్మల బరువును తూయము.
18:106 ذَٰلِكَ جَزَاؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا وَاتَّخَذُوا آيَاتِي وَرُسُلِي هُزُوًا
వారికి లభించే ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు (సత్యాన్ని) తిరస్కరించారు. నా ఆయతులను, నా ప్రవక్తలను పరిహసించారు.
18:107 إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ كَانَتْ لَهُمْ جَنَّاتُ الْفِرْدَوْسِ نُزُلًا
అయితే విశ్వసించి, సత్కార్యాలు కూడా చేసిన వారికి ఆతిథ్యంగా ఫిరదౌసు వనాలు ఉన్నాయి.
18:108 خَالِدِينَ فِيهَا لَا يَبْغُونَ عَنْهَا حِوَلًا
వారక్కడ కలకాలం ఉంటారు. ఆ స్థలాన్ని వదలి మరెక్కడి కైనా పోవాలని వారు ఎన్నటికీ కోరుకోరు.
18:109 قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا
(ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు : “ఒకవేళ నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రం సిరాగా మారిపోయినా సరే, నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే, అది అయి పోతుంది.” – మేము మళ్లీ దాని వంటిదే (మరో సముద్రం) దాని సహాయార్థం తెచ్చినాసరే.”
18:110 قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا
(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నేనూ మీలాంటి మానవ మాత్రుణ్ణే.(కాకపోతే) ‘మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్య దైవం’ అన్న సందేశం (వహీ) నా వద్దకు పంపబడుతుంది. కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నవాడు సత్కార్యాలు చేయాలి. తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగస్వామ్యం కల్పించకూడదు.”
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్-మూ’మినూన్(విశ్వాసులు) సూరా పరిచయం: ఆహ్సనుల్ బయాన్ నుండి
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 118 ఆయతులు ఉన్నాయి. ధార్మిక విశ్వాసానికి సంబంధించిన ముఖ్య సూత్రాలను ఈ సూరాలో నొక్కి చెప్పడం జరిగింది. తౌహీద్ (ఏకధైవారాధన), ప్రవక్తల పరంపర, మరణానంతరం మళ్ళీ లేపబడటం వంటి విశ్వాసాలను ఇందులో ప్రభావవంతంగా ప్రస్తావించటం జరిగింది. ఈ సూరా ప్రారంభంలో విశ్వాసుల గురించి, వారి గుణగణాల గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టటం జరిగింది.
ఈ సూరాలో ప్రస్తావించబడిన విశ్వాసుల గుణగణాలు:
– వారు తమ నమాజుల్లో అణకువగా ఉంటారు.
– వ్యర్ధ ప్రసంగాలకు దూరంగా ఉంటారు.
– జకాత్ చెల్లిస్తారు.
– అక్రమ సంబంధాలకు పాల్పడరు.
– తమకు అప్పగించబడిన వాటి విషయంలో నిజాయితీగా ఉంటారు.
– తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు.
– తమ నమాజులను ఖచ్చితంగా పాటిస్తారు.
ఈ సూరా అవిశ్వాసుల గుణగుణాలను వర్ణించింది. వారు పరిధులు అతిక్రమించేవారు, జ్ఞానం లేనివారు, అహంభావులు,అయోమయానికి గురయిన వారు,వారు అల్లాహ్ ను విశ్వసించడానికి నిరాకరించినవారు, దేవుని చిహ్నాలపై ఆలోచించడానికి సిద్ధపడని వారు, సత్యాన్ని అసహ్యించుకుంటారు, రుజుమార్గం నుంచి తప్పుకుంటారు, వారు దేవుడు పంపిన ప్రవక్తలను తిరస్కరిస్తారు, ప్రవక్తలు పిచ్సివారని, మంత్రగాళ్ళని ఆరోపిస్తారు.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 50 ఆయతులు ఉన్నాయి.ఈ సూరాలో ముఖ్యంగా ప్రళయం,మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, తీర్పుదినాల గురుంచి ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాకు పెట్టబడిన పేరు మొదటి ఆయతులో వచ్చింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది తప్పనిసరిగా జరిగే సంఘటన అని ఈ సూరా నొక్కి చెప్పింది.ఆ రోజున నక్షత్రాలు మసకబారి పోతాయి.ఆకాశం తునా తునకలవుతుంది.పర్వతాలు దుమ్ము మాదిరిగా ఎగురుతాయి.ఆ రోజున ప్రవక్తలందరినీ పిలిచి వారు అల్లాహ్ సందేశాన్ని మానవాళికి అందించటం జరిగిందా లేదా అన్న విషయమై వాంగ్మూలం ఇవ్వమని కోరడం జరుగుతుంది.
ఈ సూరాలో అల్లాహ్ శక్తి సామర్ధ్యాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా మరణించిన తరువాత మళ్ళీ లేపడం ఆయనకు చాలా తేలికని నిరూపించడం జరిగింది. సత్యతిరస్కారుల వాదన అసత్యంగా రుజువవుతుందని చెప్పడం జరిగింది. తీర్పు దినాన్ని చాలా కఠినమైన రోజుగా, దుస్థితి దాపురించే రోజుగా అభివర్ణించటం జరిగింది. ఆ రోజున భారీ నిప్పురవ్వలు ఎగురుతుంటాయి. ఆ రోజున సత్యతిరస్కారులు మాట్లాడే స్థితిలో ఉండరు. వారికి ఎలాంటి సాకులు చెప్పే అనుమతి కూడా ఉండదు. దైవభీతి కలిగిన వారు చల్లని నీడలో,సెలయేర్లతో,వివిధ రకాల ఫలాలతో సంతోషాన్ని పొందుతారు.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యతలు (Virtues of Reciting Qur’an) [ఆడియో] ప్రసంగించిన వారు:ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ https://www.youtube.com/watch?v=2CXKS5iGnI8 క్లుప్త వివరణ: ఈ ప్రసంగంలో ఖుర్ఆన్ పఠనా ప్రాముఖ్యత గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు
“ఖుర్ఆన్ కంఠపాఠి గౌరవనీయులైన దైవదూత లాంటివాడు. అతను (ప్రళయదినాన) వారితోనే ఉంటాడు. ఖుర్ఆన్ పఠించడం తనకు ఎంతో ప్రయాసతో కూడిన పని అయినప్పటికీ, దాన్ని పఠించి కంఠస్తం చేసే వ్యక్తి రెట్టింపు పుణ్య ఫలానికి అర్హుడవుతాడు”. (బుఖారీ 4937. ముస్లిం 798).
“ఖుర్ఆన్ పారాయణం చేయండి. అది తన్ను చదివినవారి పట్ల ప్రళయదినాన సిఫారసు చేస్తుంది”. (ముస్లిం 804).
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇదియే ఇస్లాం (This is Islam) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
మనిషి తను జీవిస్తున్న ఈ ధర్తి, సుందర విశాలమైన ఈ జగం, ఆశ్చర్యంలో పడవేసే నక్షత్రాలతో నిండియున్న ఆకాశం, అంతయూ పటిష్ఠమైన వ్యవస్థతో నడుస్తున్నదని ఆలోచిస్తాడు. భూమి, అందులో ఉన్న పర్వతాలు, లోయలు, సెలయేర్లు, చెట్లు, గాలి, నీరు, సముద్రం, ఎడారి మరియు రాత్రి పగలన్నిటిని చూసి వీటన్నిటిని సృష్టించినవాడెవడూ? అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది.
ఈ నీరు లేనిది జీవిత భావమే శూన్యం, దీనిని ఆకాశం నుండి కుర్పించేదెవరు? దాని ద్వారా పంటలు, చెట్లు, పుష్పాలు, ఫలాలు వెలికి తీసేవాడెవడు? మనుషులకు, పశువులకు దానిని ఉపయోగకరమైనదిగా చేసినవాడెవడు? నీరును తన గర్భంలో భద్రపరిచే శక్తి భూమికిచ్చిందెవరు?
ప్రతి వస్తువును అవసరమున్నంత ప్రమాణంలో మాత్రమే ఆకర్షించుకునే శక్తి భూమికి ఇచ్చిందెవరు? అవసరానికి మించి ఆకర్షించదు, చలనమే కష్టం అవుతుంది గనక. అవసరానికంటే తక్కువ ఆకర్షిస్తే ప్రతి వస్తువు ఈదుతూ ఉంటుంది.
మనిషిని అందమైన ఆకారంలో సృష్టించినవాడెవడు?
అంతెందుకూ! మనిషి స్వయం తన ఆకృతి గురించి గమనిస్తే ఆశ్చర్యపడతాడు. నీ శరీరములో ఉన్న అవయవాలపై ఒకసారి దృష్టి సారించు, ఒక నిర్ధిష్టమైన పద్దతిలో అవి పని చేస్తున్నాయి. వాటి పని విధానం గురించి నీకు తెలియునది అతితక్కువ. అలాంటప్పుడు దాని గురించి ఖచ్చితమైన నిర్ణయం ఎలా చేయగలవు?
నీవు పీల్చుతున్న ఈ గాలిని గమనించు! అది ఒక క్షణమైనా ఆగితే నీ జీవితమే అంతమవుతుంది. అయితే దాన్ని ఉనికిలోకి తెచ్చిందెవరు?
నీవు త్రాగుతున్న నీరు, నీవు తింటున్న ఆహారం, నీవు నడుస్తున్న ఈ నేల, నీకు వెలుతురునిస్తున్న సూర్యుడు, ఇంకా నీవు తిలకిస్తున్న ఆకాశ చంద్రతారలన్నింటిని సృష్టించినవాడెవడు?
అల్లాహ్. నిశ్చయంగా అల్లాహ్ యే.
అవును, అల్లాహ్ యే ఈ జగమంతటినీ సృష్టించాడు. ఆయన ఒక్కడే దాన్ని నడుపుతున్నాడు. అందులో మార్పులు చేస్తున్నాడు. ఆయనే నీ ప్రభువు, నిన్ను సృజించాడు, ప్రాణం పోశాడు, ఆహారం ఇస్తున్నాడు, చివరికి మరణానికి గురిచేస్తాడు. ఆయనే నిన్ను, ఈలోకాన్ని సైతం శూన్యం నుండి ఉనికిలోకి తెచ్చినవాడు.
ఇదంతా తెలిసాక, ఎవరైనా బుద్ధిమంతుడు, ‘ఈ లోకమంతా వృధాగా పుట్టించబడిందని, మనుషులు జన్మిస్తున్నారు, కొంత కాలం జీవించి చనిపోతున్నారు, ఇలా అంతా సమాప్తమవుతుంది’ అని అనగలడా?
అయితే వాస్తవం ఏమిటంటే: మనం మానవులం ఎందుకు పుట్టించబడ్డాము? అనే ముఖ్య విషయాన్ని మనం తెలుసుకోవాలి.
అల్లాహ్ మనల్ని పుట్టించింది కేవలం ఆయనను ఆరాధించడానికే. ఆ ఆరాధన విధానం తెలియజేయడానికి ప్రవక్తల్ని పంపాడు. గ్రంథాల్ని అవతరింపజేశాడు. ఎవరయితే ఆయన్నే పూజించి, ఆయనకు విధేయులుగా ఉండి, ఆయన నివారించిన వాటి నుండి దూరంగా ఉంటాడో అతడే ఆయన సంతృష్టిని పొందినవాడు. మరెవరయితే ఆయన ఆరాధన నుండి విముఖుడై, ఆయన విధేయతను నిరాకరిస్తాడో అతడే ఆయన ఆగ్రహానికి, శిక్షకు గురైనవాడు.
అల్లాహ్ ఈ లోకాన్ని ఆచరణ మరియు పరీక్ష కొరకు పుట్టించాడు. మానవులు చనిపోతూ ఉంటారు. ఓ రోజు ప్రళయం సంభవిస్తుంది. అల్లాహ్ తీర్పు చేసి ఫలితాలు ఇవ్వడానికి మానవులను వెలికి తీస్తాడు. అల్లాహ్ అక్కడ వివిధ వరాలతో ఓ స్వర్గం సిద్ధపరిచాడు. దానిని ఏ కన్నూ చూడలేదు. ఏ చెవీ వినలేదు. అది ఊహలకూ అతీతమైనది. విశ్వసించి, ఆయన ఆజ్ఞా పాలన చేసినవారి కొరకు అల్లాహ్ దానిని సిద్ధపరిచాడు.
అలాగే మానవులు ఊహించని రకరకాల శిక్షలతో కూడిన నరకాన్ని తయారు చేశాడు. అల్లాహ్ ను తిరస్కరించి, ఇతరుల్ని పూజించి, ఇస్లామేతర మతాలను అవలంభించిన వారి కొరకు అది సిద్ధంగా ఉంది.
ఇస్లాం, అల్లాహ్ ఇష్టపడిన ధర్మం. అనగా అద్వితీయుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతను పాటించుట. ఏ వ్యక్తి అయినా సరే ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంభిస్తే దాన్ని అల్లాహ్ ఎన్నటికీ స్వీకరించడు. ఇది మానవ సమాజంలో ఏదో కొందరిది కాదు, సర్వ మానవులకు చెందినది.
అల్లాహ్ మానవులకు కొన్ని ఆదేశాలిచ్చాడు, మరికొన్ని విషయాలను నిషేధించాడు. ఎవడైతే ఇందులో అల్లాహ్ కు విధేయత చూపుతాడో అతడు సాఫల్యం మరియు (నరకం నుండి) రక్షణ పొందుతాడు. ఎవడైతే అవిధేయత చూపుతాడో అతడు విఫలుడౌతాడు మరియు నష్టపోతాడు.
ఇస్లాం కొత్త ధర్మం కాదు. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండీ అల్లాహ్ వారి కొరకు ఇష్టపడిన ధర్మం
ఈ గాథ ‘ఆదం’ (అలైహిస్సలాం) ను అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ప్రారంభం అవుతుంది. అల్లాహ్ అతడ్ని మట్టితో పుట్టించి, అతనిలో ఆత్మను ఊదాడు. సర్వ వస్తువుల పేర్లు అతినికి నేర్పాడు. అతని గౌరవ, ప్రతిష్ఠల ఉన్నతి కొరకు అతని ముందు సాష్టాంగ పడాలని దైవదూతలను ఆదేశించాడు. అందరూ సజ్దా చేశారు, కాని ఇబ్లీసు ఆదంతో తనకున్న ఈర్ష్య వలన సజ్దా చేయుటకు నిరాకరించి, అహంభావానికి గురి అయ్యాడు. అందుకు అల్లాహ్ అతడ్ని ఆకాశాల్లో ఉన్నటువంటి సౌకర్యాల నుండి తరిమి, అవమానం పాలు జేసి, తన కారుణ్యానికి దూరం చేశాడు. అతనిపై శాపం, దౌర్భాగ్యం మరియు నరకం విధించాడు. అప్పుడు అతడు అల్లాహ్ తో ప్రళయం వరకు వ్యవధి కోరాడు. అల్లాహ్ అతనికి వ్యవధి ఇచ్చాడు. అక్కడే అతడు ఆదం సంతానాన్ని సన్మార్గం నుండి తప్పిస్తానని ప్రమాణం చేశాడు.
ఆదం చెలిమి, చనువు మరియు సుఖ, శాంతులు పొందుటకు అల్లాహ్ అతని నుండి అతని సహవాసి ‘హవ్వా’ను సృజించాడు. ఏ మానవుని ఊహలకు అందనటువంటి భోగభాగ్యాలతో నిండివున్న స్వర్గంలో ఉండాలని ఆదేశించాడు. వారిద్దరి శత్రువైన ‘ఇబ్లీసు’ గురించి తెలియజేశాడు. వారిద్దరిని పరీక్షించడానికి స్వర్గంలో ఉన్న వృక్షాల్లో ఒక వృక్షం నుండి తినుటను నివారించాడు. అప్పుడు ‘షైతాన్’ వారిని ప్రేరేపించి ఆ వృక్షం నుండి తినుట మనోహరమైనదిగా చేసి, ‘నేను మీ నిజమైన శ్రేయోభిలాషిని’ అని ప్రమాణం చేసి ఇలా అన్నాడుః మీరు ఈ వృక్షం నుండి తింటే మీకు శాశ్వతమైన జీవితం లభిస్తుంద’ని చెప్తూ వారిని అపమార్గం పట్టించే వరకు అతడు పట్టు విడవ లేదు. చివరికి వారు ఆ వృక్షం నుండి తినేశారు. తమ ప్రభువు యొక్క అవిధేయతకు పాల్పడ్డారు. పిదప తాము చేసినదానిపై పశ్చాత్తాప పడి, తమ ప్రభువుతో క్షమాపణ కోరారు, ఆయన వారిని క్షమించాడు. కాని వారిని స్వర్గము నుండి భూమిపైకి దించాడు. ఆదం (అలైహిస్సలాం) తన భార్యతో భూమిపై నివసించారు. అల్లాహ్ వారికి సంతానం ప్రసాదించాడు. సంతానం యొక్క సంతానం ఇలా ఇప్పటికీ పెరుగుతునే ఉన్నారు.
ఆదం సంతానాన్ని మార్గదర్శకత్వం నుండి తప్పించడానికి, సర్వ మంచితనాల నుండి అభాగ్యుల్ని చేయడానికి, చెడును మనోహరమైనది (ఆకర్షణీయమైనది)గా చేయడానికి, అల్లాహ్ కు ప్రియమైన వాటి నుండి దూరంగా ఉంచడానికి మరియు ప్రళయదినాన నరకం పాలు చేయడానికి ఇబ్లీసు మరియు అతని సంతానం ఎల్లవేళల్లో పోరాటానికి సిద్ధమైయున్నారు.
అయితే అల్లాహ్ మానవుల్ని నిర్లక్ష్యంగా వదలలేదు. ధర్మం, సత్యం అంటేమిటో స్పష్టపరచడానికి, వారి మోక్షం ఎందులో ఉందో తెలుపడానికి వారి వద్దకు ప్రవక్తల్ని పంపాడు.
ఆదం అలైహిస్సలాం చనిపోయిన తరువాత పది శతాబ్దాల వరకు వారి సంతానం ఏకత్వపు’ (తౌహీద్) సిధ్ధాంతం, అల్లాహ్ విధేయతపైనే ఉండిరి. ఆ తరువాత అల్లాహ్ తో పాటు అల్లాహ్ యేతరులను ఆరాధించడం మొదలై ‘షిర్క్’([1]) సంభవించింది. ప్రజలు విగ్రహాలను సయితం ఆరాధించడం మొదలెట్టారు. అప్పుడు ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలవడానికి, విగ్రహారాధన నుండి నిరోధించడానికీ తొలి ప్రవక్త ‘నూహ్’ uని అల్లాహ్ పంపాడు. ఆ తరువాత ప్రవక్తల పరంపర ఆరంభమయింది. వారు ప్రజల్ని (ఇస్లాం) వైపునకు అంటే ‘అల్లాహ్ అద్వితీయుని ఆరాధన చేయుట, ఇతరుల ఆరాధనను త్యజించుటకు’ ఆహ్వానిస్తుండేవారు.
అదే పరంపరలో హజ్రత్ ‘ఇబ్రహీం’ (అలైహిస్సలాం) ఒకరు. ఆయన కూడా తమ జాతి వారిని ‘విగ్రహారాధన వదలండనీ, అల్లాహ్ అద్వితీయున్నే ఆరాధించండని’ బోధించారు. ఆయన తరువాత ప్రవక్త పదవి ఆయన ఇద్దరు సుకుమారులైన ‘ఇస్మాఈల్’ (అలైహిస్సలాం) మరియు ‘ఇస్ హాఖ్’ uకు, వారి తరువాత మళ్ళీ ‘ఇస్ హాఖ్’ సంతానానికి లభించింది. ‘ఇస్ హాఖ్’ సంతానంలో గొప్ప స్థానం గలవారు: ‘యాఖూబ్’, ‘యూసుఫ్’, ‘మూసా’, ‘దావూద్’, ‘సులైమాన్’ మరియు ‘ఈసా’ అలైహిముస్సలాం. ‘ఈసా’ (అలైహిస్సలాం) తరువాత ‘ఇస్ హాఖ్’ (అలైహిస్సలాం) సంతానంలో ఏ ప్రవక్తా రాలేదు.
అక్కడి నుండి ప్రవక్త పదవి ‘ఇస్మాఈల్’ (అలైహిస్సలాం) సంతతికి మరలింది. అందులో ఏకైక ప్రవక్త ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లం ను చిట్టచివరి ప్రవక్తగా, ప్రవక్తల అంతిమునకు ముద్రగా మరియు ఆయన తీసుకువచ్చిన ధర్మమే చివరి వరకు ఉండాలని అల్లాహ్ ఎన్నుకున్నాడు. ఆయనపై అవతరించిన దివ్యగ్రంథం ఖుర్ఆనే మానవులకు అల్లాహ్ యొక్క అంతిమ సందేశం. అందుకే అది అరబ్బులకు, అరబ్బేతరులకు అంతే కాదు సర్వ మానవులకు మరియు జిన్నాతుల కొరకు కూడా చెందినది. ప్రతి కాలానికి మరియు యుగానికి అనుకూలమైనది. ప్రతి మేలును గురించి ఆదేశించినది. ప్రతి చెడును నివారించినది.
ప్రవక్త ముహమ్మద్ ﷺ తీసుకువచ్చిన ఈ ధర్మం తప్ప, ఏ వ్యక్తి నుండీ మరే ధర్మాన్ని అల్లాహ్ స్వీకరించడు.
అల్లాహ్ అద్వితీయుని ఆరాధన గురించి ప్రజలకు మార్గదర్శకత్వం చేయడానికి, దీనికి విరుధ్ధంగా వారు పాటిస్తున్న విగ్రహాల ఆరాధనను ఖండించడానికి అల్లాహ్ ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లంని అంతిమ ప్రవక్తగా పంపాడు. ఆయనతో అంతిమ సందేశాన్ని పంపాడు.
మక్కా నగరములో, నలబై సంవత్సరాల వయస్సులో ఉండగా ‘ముహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవికి ముందు నుంచే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ జాతివారిలోనే కాదు, సర్వ మానవుల్లోకెల్లా ఉత్తమ నడవడిక, సద్వర్తన కలిగి యున్నారు. సత్యాన్ని పాటించడం, అమానతులను కాపాడటంలో ఆయనకు ఆయనే సాటి. సభ్యతా, సంస్కారంలో కూడా ఉన్నత శిఖరాన్ని అందుకున్నవారు ఆయనే. అందుకే తమ జాతివారే ఆయనకు “అమీన్” (విశ్వసనీయుడు) అన్న బిరుదునిచ్చారు. ఆయన “ఉమ్మీ”. అంటే చదవడం, వ్రాయడం రానివారు. అటువంటి వారిపై అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ అవతరింపజేసి, సర్వ మానవులు ఏకమై కూడా దీని వంటిది తీసుకురాలేరని ఛాలెంజ్ చేశాడు.
ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ‘ఇస్మాఈల్’ బిన్ ‘ఇబ్రాహీం’ సంతతి. ప్రవక్త ﷺ తల్లి పరంపర ఇదిః ఆమిన బిన్తె వహబ్ బిన్ అబ్ది మునాఫ్ బిన్ జుహ్ రా. జుహ్ రా ప్రవక్త గారి తాత యొక్క సోదరుడు.
అబ్దుల్లాహ్ వివాహం ఆమినతో జరిగింది. మూడు మాసాలు దాంపత్య జీవితం గడిపారు. కొద్ది రోజులకే ఆమె గర్భం దాల్చింది. (తొమ్మిది మాసాలు ప్రవక్తను మోసింది, కాని) ఏ మాత్రం కష్టంగా భావించలేదు. చివరికి క్రీ.శ. 571 సంవత్సరం సొమవారం రోజున ఆమె సంపూర్ణ శరీరాకారముగల, అందమైన బాలుణ్ణి (ప్రవక్తను) జన్మనిచ్చింది. ఆయన ﷺ తమ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన తండ్రి పరమపదించారు. అందుకు ఆయన తాతగారు ఆయన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయన తల్లి మూడు రోజులు ఆయనకు పాలు త్రాగించింది. తరువాత పాలు త్రాగించడానికి ఒక గ్రామీణురాలైన హలీమ సఅదియకు ఆయన్ని అప్పగించడం జరిగింది. ఆ కాలంలో తమ చంటి పాపలను గ్రామాల్లో ఉంచి పాలు త్రాగించడం అరబ్బుల ఆనవాయితిగా ఉండేది. ఎందుకనగా అచ్చట శరీర ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు తగినన్ని వసతులు లభించేవి గనక. హలీమ సఅదియ ఆ శిశువులో ఎన్నో వింత విషయాలు చూసింది. అందులో కొన్ని: హలీమ తన భర్తతో ఒక బక్కచిక్కిన, వేగం లేని గాడిదపై వచ్చింది. కాని మక్కా నుండి తిరిగిపోయే సందర్భంలో ప్రవక్త ఆమె ఒడిలో పాలు త్రాగుతున్నారు, అదే గాడిద వేగాన్నందుకొని ఇతర స్వారీలను వెనక వదలి ముందుకు సాగిపోయింది. దానికి హలీమ యొక్క తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.
స్వయంగా హలీమ కథనం ప్రకారం ఆమె రొమ్ముల్లో పాలు అతి తక్కువగా ఉండేవి, అవి ఆమె వద్ద ముందు నుండే ఉన్న ఓ పాలు త్రాగే శిశువుకు సరిపోక, అతడు ఆకలితో ఏడుస్తూ ఉండేవాడు. అవే రొమ్ములు ప్రవక్త తన నోట్లోకి తీసుకున్నాక పాలతో ఉట్టిపడ్డాయి. ఇద్దరు శిశువులూ కడుపు నిండా త్రాగేవారు.
బనూ సఅద్ ప్రాంత భూములు అనావృష్టి కారణంగా ఎండిపోయేవి. ఈ అదృష్టవంతుణ్ణి (ప్రవక్తను) పొందే భాగ్యం కలిగిన తరువాత అక్కడి భూములు పండుట మరియు పశు సంపదలో పెరుగుదల మొదలైంది. దౌర్భాగ్యం, పేదరికం అనేవి దూరమై సిరి సంపదలు, భోగభాగ్యాలు ఆవరించాయి.
రెండు సంవత్సరాల తరువాత హలీమ ప్రవక్తను ఆయన తల్లి, తాతల వద్ద మక్కాకు తీసుకు వచ్చింది. అయితే ఈ రెండు సంవత్సరాల్లో కలిగిన శుభాలను చూసి మరోసారి ప్రవక్తను తీసుకు పోవుటకు పట్టుదలతో ప్రాధేయపడింది. అందుకు ఆమిన ఒప్పుకుంది. అప్పుడు హృదయ- పూర్వకంగా సంతోషంతో అదృష్టవంతుడైన అబ్బాయిని తిరిగి తెచ్చుకుంది. ఆ రెండు సంవత్సరాలు కూడా గడిసాక హలీమ ప్రవక్తను ఆయన తల్లికి అప్పగించింది. అప్పుడు ప్రవక్త వయస్సు నాలుగు సంవత్సరాలు. ఇక తల్లి తను చనిపోయే వరకు పోషించింది. తల్లి చనిపోయేటప్పుడు ఆయన వయస్సు ఆరు సంవత్సరాలు. ఇక తాత తన వద్ద ఉంచుకొని రెండు సంవత్సరాల తరువాత ఈ లోకం వీడారు. అప్పుడు పినతండ్రి అబూ తాలిబ్ తన రక్షణలో తీసుకొని తన సంతానం కంటే ఎక్కువ ప్రేమ చూపారు. అతడు సిరిమంతుడు కాదు గనక ప్రవక్త ﷺ ఐహిక భోగభాగ్యాలను, సుఖాలను అనుభవించలేదు. ఆయన ﷺ బనూ సఅద్ గ్రామంలో ఉన్నప్పుడు తన పాల సంబంధ సోదరులతో మేకలు మేపిన అనుభవం పోందారు, కనుక ఇక్కడ మక్కావాసుల మేకలు మేపసాగారు. దాని నుండి పొందే వేతనం తన పినతండ్రి అబూ తాలిబ్ కు ఇస్తూ ఉండేవారు. పన్నెండు సంవత్సరాల వయస్సులో వ్యాపారనిమిత్తం అబూతాలిబ్ తో సీరియా దేశానికి వెళ్ళారు. మరొక సందర్భంలో ఖదీజ బిన్తె ఖువైలిద్ (ఆమె మక్కాలో పేరుగాంచిన ధనవంతురాలు) యొక్క సామాగ్రి వ్యాపారం కొరకు సీరియా తీసుకెళ్ళారు. అధిక రెట్ల లాభం (ఏలాంటి మోసం లేకుండా) ఆర్జించుకొని వచ్చారు. అందుకు ఆమె ఆయన ﷺకు ఇతరులకంటే ఎక్కువ వాటా ఇచ్చింది. ఈ సీరియా ప్రయాణంలో ఆమె యొక్క బానిస మైసర ఆయన ﷺతో ఉండి చూసిన ఆయన యొక్క ఉన్నత ప్రవర్తన, ఉత్తమ నడవడికను ఖదీజ విన్నాక ఆయన ﷺ ను తన సహవాసిగా చేసుకోవాలన్న కాంక్ష ఆమెకు మరింత అధికమైంది. -ఇంతకు ముందు ఆమె భర్త చనిపోయాడు-. పిదప పెద్దల సమక్షంలో శుభసంతోషాలతో ధర్మంగా వారి పెళ్ళి జరిగి- పోయింది. అప్పుడు ఆయన ﷺవయస్సు 25, ఖదీజ వయస్సు 40 సం.
ఎప్పుడైతే ప్రవక్త ﷺ తన జీవితపు నాలుగో దశాబ్దానికి చేరువయ్యారో ఏకాంతంలో ఉండడానికి ఇష్టపడేవారు. మక్కాకు బయట కొంత దూరంలో ఉన్న ‘హిరా’ గుహలో రోజుల తరబడి ఒంటరిగా ఉండి అల్లాహ్ ను ఆరాధిస్తూ ఉండేవారు. అన్నపానీయాలు ముగిసినప్పుడు అవి తీసుకొనుటకే ఇంటికి వెళ్ళేవారు. ఒక రాత్రి అదే గుహలో జిబ్రీల్ దూత ఆకాశం నుండి వచ్చి ((చదువు)) అన్నాడు. “నేను చదువరుణ్ణి కాను” అని సమాధానం పలికారు. అతడు మళ్ళీ ((చదువు)) అన్నాడు. “నేను చదువరుణ్ణి కాను” అని ప్రవక్త చెప్పారు. మళ్ళీ అతడు ((చదువు)) అని చెప్పాడు. “నేను చదువరుణ్ణి కాను” అని ప్రవక్త జవాబిచ్చారు. ప్రవక్త యొక్క ప్రతి జవాబు తరువాత జిబ్రీల్ ఆయన ﷺ ని తన ఛాతితో అదిమి వదిలేశేవాడు. అప్పుడు ప్రవక్తకు శ్వాస ఆగిపోయెంత బాధ అయ్యేది. మూడోసారి అదిమి విడిచాక మొదటిసారిగా దివ్యఖుర్ఆన్ యొక్క ఈ ఐదు (5) ఆయతులు అవతరించాయి. ((ఇఖ్ రఅ బిస్మి రబ్బికల్లజీ ఖలఖ్. ఖలఖల్ ఇన్ సాన మిన్ అలఖ్. ఇఖ్ రఅ వరబ్బుకల్ అక్ రమ్. అల్లజీ అల్లమ బిల్ ఖలమ్. అల్లమల్ ఇన్ సాన మాలమ్ యఅలమ్)). చదువు సర్వ సృష్టికర్త అయిన నీ ప్రభువు పేరుతో. ఆయన మానవుణ్ణి నెత్తుటి ముద్దతో సృష్టించాడు. చదువు నీ ప్రభువు ఎంతో అనుగ్రహశాలి. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి నేర్పాడు. (ఇవి సూర అలఖ్ (96)లోని మొదటి ఐదు ఆయతులు).
విద్యాజ్ఞానాల గురించి ఆదేశిస్తూ, మానవ పుట్టుక ఆరంభాన్ని తెలియజేస్తూ అవతరించిన గొప్ప ఆయతులు ఇవి. ఈ ఆయతుల ద్వారానే ప్రవక్తపై అల్లాహ్ యొక్క వహీ (దివ్యజ్ఞాన) అవతరణ ఆరంభమయ్యింది. ప్రవక్త భయకంపితులై ఖదీజ వద్దకు వచ్చారు. వచ్చీరాగానే (పడక మీద పడి) “దుప్పటి కప్పండి దుప్పటి కప్పండి” అన్నారు. ఇల్లాలు దుప్పటి తెచ్చి కప్పింది. కొంత సేపటికి భయం తొలిగిపోయాక, జరిగినదంతా తన ఇల్లాలి ఖదీజకు వర్ణిస్తూ, ‘తన ప్రాణానికేదో ముప్పు వాటిల్లనున్నట్లు అనిపిస్తుందని’ అన్నారు. అప్పుడు ఖదీజ ఓదార్చుతూ, “అల్లాహ్ సాక్షిగా! అలా జరగదు. అల్లాహ్ మిమ్మల్ని ఎన్నటికీ అవమానపరచడు. ఎందుకనగా మీరు బంధువుల్ని ఆదరిస్తారు. ఇతరుల బరువు బాధ్యతల్ని మోస్తారు. సంపాదించలేనివారికి సంపాదించి పెడ్తారు. అతిథుల్ని సత్కరిస్తారు. సత్యమార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలలో సహకరిస్తారు” అని చెప్పింది.
మరో సారి జిబ్రీల్ ప్రవక్త ﷺ వద్దకు వచ్చిన విషయం గురించి స్వయంగా ప్రవక్త ﷺ ఇలా తెలిపారు: నేను నడుస్తూ ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం విన్నాను. కన్నెత్తి చూసే సరికి హిరా గుహలో వచ్చిన దూతయే అక్కడ ఉన్నాడు. ప్రవక్త ﷺ భయపడ్డారు. కాని మొదటి సారి భయం కన్నా తక్కువ. ఇంటికి చేరుకొని దుప్పటి కప్పండి, దుప్పటి కప్పండి అని చెప్పారు. ఆ తరువాత ఈ ఆయతులు అవతరించాయిః ((యా అయ్యుహల్ ముద్దస్సిర్. ఖుమ్ ఫ అన్ జిర్. వ రబ్బక ఫ కబ్బిర్. వ సియాబక ఫ తహ్హిర్. వర్రుజ్ జ ఫహ్ జుర్)). అనగా: వస్త్రం కప్పుకొని పడుకున్న మనిషీ లేచి నిలబడు. ఖుర్ఆన్ ద్వారా ప్రజల్ని హెచ్చరించు. అల్లాహ్ సందేశం వారికి అందజేయి. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. విగ్రహాలకు దూరంగా ఉండు. (ఇవి సూర ముద్దస్సిర్ (74)లోని మొదటి ఆయతులు). ఆ తరువాత ఎడతెగ కుండా వహీ రావడం మొదలైనది. అల్లాహ్ ముహమ్మద్ ﷺ కు ఆదేశించాడు: నీవు ప్రజల్ని అల్లాహ్ అద్వితీయుని ఆరాధన వైపునకు మరియు అల్లాహ్ ప్రజల కొరకు ఇష్టపడిన ఇస్లాం ధర్మం వైపునకు పిలువమని. ఈ ఆదేశానుసారం ప్రవక్త ﷺ వివేకం మరియు చక్కని హితబోధతో ప్రచార కార్యక్రమంలో నిమగ్నులయ్యారు.
మొట్టమొదటిసారిగా ఆయన ﷺ సందేశాన్ని అంగీకరించిన స్త్రీలలో ఆయన ﷺ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా, పురుషుల్లో ఆయన ﷺ ప్రాణమిత్రుడు అబూ బక్ర్ సిద్దీఖ్(రదియల్లాహు అన్హు), యువకుల్లో ఆయన ﷺ పినతండ్రి కుమారుడు అలీ బిన్ అబీ తాలిబ్(రదియల్లాహు అన్హు). తర్వాత ప్రజలు ఒకరి వెనుక మరొకరు ‘ఇస్లాం’ ధర్మాన్ని స్వీకరించగలిగారు. ఇస్లాం స్వీవకరించినవారు బహుదైవారాధకుల, అవిశ్వాసుల తరఫున కఠిన యాతనలకు గురయ్యారు. (అయినా ఇస్లాంను వీడలేదు). ఆ కష్టాలను సహిస్తూ ప్రవక్త ﷺ పదమూడు సంవత్సరాలు మక్కాలో ఇస్లాం ప్రచారం చేస్తూ పోయారు. దినదినానికి అవిశ్వాసుల హింసాదౌర్జన్యాలు స్వయం ప్రవక్త ﷺ మరియు ఆయన సహచరుల (ఇస్లాం స్వీకరించినవారి) పట్ల అధికమయ్యాయి. అప్పుడు ఆయన ﷺ మరియు ఆయన సహచరులు ‘మదీన’కు వలసపోయారు. అక్కడ సయితం ప్రచారంలోనే అహర్నిశలు శ్రమించారు. కొద్ది సంవత్సరాల్లో మక్కాలో విజయ పతాకం ఎగరవేస్తూ ప్రవేశించారు. అప్పుడు అక్కడి ప్రజలందరూ ఇస్లాంలో ప్రవేశించారు.
ఆయన ﷺ ప్రవక్త పదవికి ముందు నలబై, ఆ తరువాత ఇరవై మూడు ఇలా మొత్తం అరవై మూడు సంవత్సరాలు జీవించారు. తరువాత ఈ లోకాన్ని వీడి శాశ్వతమైన పరలోకానికి వెళ్ళారు.
ముహమ్మద్ ﷺ కు ఇచ్చిన సందేశాలతోటే ఆకాశ సందేశాల రాకను సమాప్తి చేశాడు అల్లాహ్. ఆయన ﷺ విధేయత సర్వమానవాళిపై విధిగా చేశాడు. ఆయన ﷺ విధేయత పాటించినవారు ఇహములో అదృష్టవంతులై పరలోకంలో స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆయన ﷺ కు అవిధేయత చూపినవారు ఇహములో దురదృష్టవంతులై పరలోకంలో నరకంలో ప్రవేశిస్తారు.
ఆయన ﷺ మరణించాక ఆయన సహచరులు ఆయన అడుగుజాడలో నడచి, ఆయన సందేశాన్ని ఇతరులకు అందజేశారు. ఇస్లాంను నలుమూలలో వ్యాపింప జేశారు.
సర్వ మానవాళిలో అత్యుత్తమ నడవడిక గలవారు ప్రవక్త ముహమ్మద్ ﷺ. ఇది వారిలో ప్రవక్త పదవి లభించక ముందు నుంచే ఉండినది. అది లభించాక మరింత అధికమయింది. స్వయంగా అల్లాహ్ ఇలా తెలిపాడుః నీవు నిస్సందేహంగా మహోన్నతమైన శీలం కలవాడవు. (68: ఖలం: 4). ఆయన ﷺ ఇస్లాం ప్రచారం చేస్తూనే ఉత్తమ శీలం, మంచి నడవడికను గురించి బోధించి, ప్రోత్సహించేవారు. మరియు స్వయంగా తమ సహచరులకు బోధించే ప్రవర్తనకు గొప్ప నిదర్శనగా ఉండేవారు. సద్వర్తనను తమ సహచరుల మదిలో ఉపదేశాలతో నాటే ముందు తమ నడవడిక, ఆచరణలతో ఉన్నతమైన సద్ర్పవర్తన అంటేమిటో వారి మదిలో నాటేవారు. అనస్ (రదియల్లాహు అన్హు) కథనం: నేను పది సంవత్సరాలు ప్రవక్త ﷺ సేవలో ఉన్నాను. అల్లాహ్ సాక్షి! ఒక్కసారి కూడా నన్ను హూఁ అని అన లేదు. ఇలా ఎందుకు చేశావు? అలా ఎందుకు చేయలేదు? అని ఏనాడూ నిలదీయలేదు. (ముస్లిం).
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: నేనొక రోజు దైవప్రవక్త ﷺతో కలసి నడుస్తున్నాను. ఆ సమయంలో ఆయన నజ్రాన్ కండువ కప్పుకొని ఉన్నారు. దాని అంచులు లావుగా ఉండేవి. దారిలో ఓ పల్లెవాసి కలసి ప్రవక్త (కండువ)ను పట్టి గట్టిగా లాగాడు. అలా గట్టిగా లాగడం వల్ల ప్రవక్త ﷺ భుజం మీద కండువా అంచులు గీరుకుపోయి ఆ ప్రదేశం కందిపోయింది. (పల్లెవాసి అంతటితో ఊరుకోక కటువుగా మాట్లాడుతూ) ‘మీకు అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి నాకు కొంచెం ఇప్పించండి’ అని అన్నాడు. దైవప్రవక్త ﷺ అతని వైపు తిరిగి చూసి చిరునవ్వు నవ్వుతూ అతనికి కొంత ధనం ఇవ్వమని (సహచరుల్ని) ఆజ్ఞాపించారు. (బుఖారి 3149, ముస్లిం 1057).
ప్రవక్త ﷺ తమ ఇంట్లో ఉన్నప్పుడు ఏమి చేసేవారని ఆయన పవిత్ర భార్య ఆయిషా రజియల్లాహు అన్హాని ప్రశ్నించినప్పుడు ‘ఆయన తమ ఇల్లాలికి సహకరిస్తూ ఉండేవారు. నమాజు సమయమయిన వెంటనే వుజూ చేసుకొని నమాజు కొరకు బయలుదేరేవారు’ అని సమాధానమిచ్చారు. (బుఖారి 676).
ప్రవక్త ﷺ కంటే ఎక్కువ చిరునవ్వు నవ్వేవారిని నేను చూడలేదని అబ్దుల్లాహ్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) తెలియజేస్తున్నారు. అందరికీ తెలిసిన ఆయన ఉత్తమ గుణాల్లో కొన్ని ఇవి: ఆయన దాత, ఎన్నడూ ఏ కొంచమైనా పిసినారితనం చూపలేదు. శూరుడు, సత్యం, ధర్మం నుండి ఎన్నడూ వెనక్కి తిరగలేదు. న్యాయశీలి, ఎన్నడూ తీర్పు చేయడంలో అన్యాయం చేయలేదు. పూర్తి జీవతంలో సంత్యవంతుడు, విశ్వసనీయుడు అనే ప్రఖ్యాతి చెందారు. (తిర్మిజి 3641).
జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం: ఎవరైనా, ఏదైనా అడిగితే ‘లేదు’ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ అనలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహాసములాడేవారు. (ధనిక, పేద బేధ లేకుండా) అందరితో కలసి ఉండేవారు. పిలవాళ్ళను తమ వడిలో కూర్చోబెట్టుకొని ఆడించేవారు. ఆహ్వానాన్ని అంగీకరించేవారు. వ్యాధిగ్రస్తుల్ని పరామర్శించేవారు. (అపరాధుల సాకును) ఒప్పుకునేవారు. తమ సహచరులను వారికి నచ్చిన మంచి పేర్లతో సంబోధించేవారు. మాట్లాడుతున్నవారి మధ్య ఆటంకం కలిగించేవారుకారు. అబూ ఖతాద (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం: ఒకసారి నజ్జాషి రాయబార బృందం ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవ చేయుటకు సిద్ధమయ్యారు. అప్పుడు సహచరులిలా అన్నారుః ప్రవక్తా! మేము ఉన్నాము కదా చాలు. “వీరు మా సహచరులకు తగిన విధంగా ఆదరించారు. ప్రతీకగా నేను కూడా మంచి ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నాను” అని ప్రవక్త బదులిచ్చారు.
మరో సందర్భంలో ఇలా సంబోధించారుః “నేనొక దాసుణ్ణి, దాసుడు తినే విధంగా నేనూ తింటాను. దాసుడు కూర్చునే విధంగా నేనూ కూర్చుంటాను”. ఆయన గాడిదపై స్వారీ చేసేవారు. నిరుపేద, బీదవాళ్ళతో సమానంగా కూర్చునేవారు.
స్కాట్డలాండ్ కు చెందిన థామస్ కార్లిల్ అనే తత్వవేత్త (Scottish philosopher, Thomas Carlyle) నోబెల్ ప్రైజ్ పొందిన తన రచన “On Heroes, Heroworship, and the Heroic in History”లో తన క్రైస్తవ జాతిని సంబోధించి ప్రవక్త ﷺ గురించి చాలా విషయాలు వ్రాశాడు, అందులోని ఒక విషయం ఇది: ‘ఇస్లాం ధర్మం అసత్యం, ముహమ్మద్ మోసగాడు, అసత్యవాది అని వినబడే మాటలను చెవి యొగ్గి వినుట అతినీచ కార్యం అని ఈ కాలంలో చాలా స్పష్టం అయింది’.
ప్రవక్తకు లభించిన మహత్యాల్లో అతి గొప్పది ఖుర్ఆన్. అది భాషాప్రవీణులను
లొంగదీసింది. అందరూ కలసి అందులో ఉన్నటువంటి ఒక్క సూరానైనా తేగలరా అని అల్లాహ్ సవాలు చేశాడు. ఈ శక్తి తమకు లేదని ఆవిశ్వాసులు ఒప్పుకున్నారు. ఈ సవాలు ఇప్పటికీ ఉంది.
చంద్రుణ్ణి రెండు ముక్కలు చేసి చూపించండని మక్కా అవిశ్వాసులు ప్రవక్తతో ఛాలెంజ్ చేసినప్పుడు ప్రవక్త ﷺ అల్లాహ్ తో ప్రార్థించారు. ఆ తర్వాత చంద్రుడు రెండు ముక్కలైనది స్పష్టంగా కనిపించింది.
ఎన్నో సార్లు వ్రేళ్ళ మధ్య నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి. ఆయన చేతిలో కంకర రాళ్ళు తస్బీహ్ (అల్లాహ్ పవిత్రత) పఠించాయి.
ప్రవక్తను హతమార్చడానికి ఒక యూదురాలు విషం కలిపి బహుకరించిన మాంసపు ముక్క ఆయన ﷺ తో మాట్లాడింది.
ఒక పల్లెవాసి ఒక మహత్యం చూపమని కోరాడు. ఆయన ﷺ ఒక చెట్టును ఆదేశించగా అది ఆయన వద్దకు వచ్చింది. మరలా ఆదేశించగా అది దాని చోటుకి వెళ్ళి పోయింది.
పాలు లేని ఒక మేక పొదుగును తమ శుభహస్తాలతో ముట్టుకోగా అందులో పాలు సమకూరాయి, దాని పాలు పితికి స్వయంగా తాగారు. తమ మిత్రుడు అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) కు కూడా త్రాగించారు.
అలీ బిన్ ఆబీతాలిబ్ (రదియల్లాహు అన్హు) కళ్ళల్లో అవస్త ఉండగా ఆయన ﷺ ఆ కళ్ళల్లో తమ ఉమ్మి వేశారు. అవి అప్పటికప్పుడే బాగుపడ్డాయి.
ఒక సహచరుని కాలుకు అవస్త ఉండగా తమ చేతితో తుడువగానే అక్కడికక్కడే నయం అయింది.
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)కు దీర్ఘ ఆయుష్షు, అనేక ధన, సంతానం కలుగజేయు అని అల్లాహ్ ను ప్రార్థిస్తే ఆయన 120 సంవత్సరాలు జీవించారు. ఆయనకు కలిగిన సంతానం 120 మంది. ఆయన ఖర్జూరపు తోట సంవత్సరంలో రెండు సార్లు ఫలించేది. అయితే అది సంవత్సరానికి ఒక సారి మాత్రమే ఫలిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.
మస్జిద్ లో మెంబర్ పై నిలబడి ప్రసంగిస్తున్నప్పడు ‘అనావృష్టి సంభవించి చాలా నష్టం కలుగుతున్నది’ అని ఒక వ్యక్తి చెప్పగా ఆయన ﷺ అల్లాహ్ ను ప్రార్థించారు. ఆకాశంలో ఎక్కడా లేని మేఘాలు, కొద్ది క్షణాల్లో పర్వతాల మాదిరిగా గుమిగూడి వారం రోజులు ఎడతెగకుండా వర్షం కురిసింది. మరోసారి వర్షాలు చాలా ఎక్కువయ్యాయి అని చెప్పగా, వర్షాలు ఆగిపోవాలని దుఆ చేసారు అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలు ఎండలో నడిచి వెళ్ళారు.
ఒక యుద్ధం (జంగె ఖందఖ్)లో రెండున్నర కిలోల జొన్న పిండితో చేసిన రొట్టెలు మరియు ఒక మేక మాంసం వెయ్యి మంది సహచరులతో కలిసి ఆయన ﷺ భుజించారు. ఆ రొట్టెలు, వండిన కూర మొత్తం అలాగే మిగిలింది.
వంద మంది అవిశ్వాసులు ఆయన ﷺ ను హతమార్చడానికి ఆయన గృహాన్ని చుట్టుముట్టారు. ఆయన ﷺ వారి ముఖాలపై మట్టి విసిరి వెళ్ళిపోయారు. వారు చూడలేకపోయారు.
సురాఖ బిన్ మాలిక్ ఆయన ﷺ ను చంపడానికి వెంటపడి దగ్గరికి రాగానే, ఆయన ﷺఅతనిపై శపించారు. అతని గుఱ్ఱపు మొదటి రెండు కాళ్ళు మొకాళ్ళ వరకు భూమిలోకి దిగిపోయాయి.
ఇవేగాక ఇంకా అనేక మహత్యాలున్నాయి. అన్నియు అల్లాహ్ తరఫు నుండి లభించినవే. ఎందుకనగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని రుజువు పరచడానికి.
1- అల్లాహ్ పై విశ్వాసం: ఇది ఇస్లాం ధర్మం యొక్క అసలైన పునాది. అల్లాహ్ పై విశ్వాసం అంటేః అల్లాహ్ ఉన్నాడని, అతడే ప్రతిదానికి పోషకుడు, అధికారి, ఏకైక సృష్టికర్త మరియు సర్వ జగత్తును నడిపేవాడని గాఢంగా విశ్వసించుట. ఇంకా అతడొక్కడే సర్వ ఆరాధనలకు అర్హుడు, అతనికెవ్వడూ భాగస్వామి లేడు. సర్వ ఉత్తమ గుణాలు గలవాడు. ప్రతి లోపాలకు, దోషాలకు అతీతుడు. తన సృష్టిలో దేనికీ పోలినవాడు కాడు అని దృఢంగా విశ్వసించాలి.
ఈ లోకాన్ని, ఇందులో ఉన్న సృష్టిని గమనించేవాడు ఇవి తమంతట తామే ఉనికిలోకి రావడం అసాధ్యం అని నమ్ముతాడు. వీటన్నిటికి ఒక సృష్టకర్త లేనిదే ఉనికిలోకి రావడం కూడా అసాధ్యం అని నమ్ముతాడు. అయితే ఆ సృష్టికర్త ఎవరు?. అతడే అల్లాహ్.
2- దైవదూతలపై విశ్వాసం: వారు మన కళ్ళకు కనబడని ఒక సృష్టి. అల్లాహ్ యే వారిని పుట్టించాడు. వారికి పోషణ, అధికారం, లోక నిర్వహణ లాంటి ఏ ప్రత్యేకతలు లేవు. లేక వారు ఆరాధనలకు ఏ మాత్రం అర్హులు కారు. (ఇవి అల్లాహ్ ప్రత్యేకతలు మాత్రమే). అల్లాహ్ ఆదేశాల సంపుర్ణ పాలన గుణం మరియు బాధ్యతలను పూర్తిగా నెరవేర్చే గుణం అల్లాహ్ వారికి ప్రసాదించాడు.
ఒక ముస్లిం వారి ఉనికినీ మరియు వారి సరియైన సంఖ్య అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదని విశ్వసించాలి.
ఎవరి పేర్లు మనకు తెలియునో వారిని వారి పేర్లతోనే విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్, మీకాఈల్ మరియు మాలిక్ తదితరులు.
ఎవరిది ఏ గుణం, ఏ పని ఉందో వారిని అలాగే విశ్వసించాలి.
3- గ్రంధాలపై విశ్వాసం: సత్యాన్ని స్పష్ట పరచుటకు మరియు ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలుచుటకు పూర్వ ప్రవక్తల్లో కొందరిపై అల్లాహ్ గ్రంథాలను అవతరింపజేశాడని ముస్లిం విశ్వసించాలి. ఉదాః తౌరాత్, ఇంజీల్, జబూర్. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ పై అల్లాహ్ ఖుర్ఆన్ అవతరింపజేశాడని విశ్వసించాలి.
ఖుర్ఆన్: సర్వమానవాళికి ఇది అల్లాహ్ యొక్క అంతిమ సందేశం.
ఖుర్ఆను తెచ్చిన దాని ప్రకారంగా ఉన్న ఆచరణలనే అల్లాహ్ అంగీకరిస్తాడు. ఇది పూర్వ గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ధ్రువీకరిస్తుంది మరియు పరిరక్షిస్తుంది. దీని ప్రత్యేకమైన ఒక విషయం: ‘దీనిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు’; అందుకే ఇందులో మార్పులు చేర్పులు జరగలేవు. పూర్వ గ్రంథాలు మార్పు చేర్పులకు గురి అయ్యాయి; ఎందుకనగా అల్లాహ్ వాటి రక్షణా బాధ్యత తీసుకోలేదు.
ఖుర్ఆన్ అతి ఉత్తమ సాహిత్య శైలికి దర్పణం లాంటిది. దీనిలోని ధార్మిక శాసనాలు అతి ఉన్నతమైనవి. ఇందులో ఏ మానవునికీ తెలియని అల్లాహ్ కు సంబంధించిన విషయాలు, అగోచర విషయాలు తెలుపబడినవి. ఏ మనిషీ తన మేధను ఉపయోగించి కూడా వాటిని తెలుసుకోలేడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో, ఆ తరువాత కాలములో లేక ఆ తరువాత కాలాల్లో ఎవరికీ తెలియని నెచురల్ సైన్స్ (Natural scince)కు సంబంధించిన నియమాలను మరియు దృగ్గోచర విషయాలను (Phenomenon) సూచించింది. ఇంకా అందులో సూచించబడిన ఎన్నో విషయాలు ప్రవక్త ముహమ్మద్ ﷺ తరువాత పదమూడు వందల సంవత్సరాలకు కనిపెట్టబడినవి, స్పష్టమయినవి. ఇంకెన్నో ఇప్పటికీ స్పష్టం కాలేదు.
సర్వ మానవులు ఈ ఖుర్ఆన్ వంటిది, లేదా కనీసం దీనిలోని ఒక్క సూరా వంటిది తీసుకురాగలలేరని అల్లాహ్ సవాల్ చేశాడు. వారు లొంగిపోయారు. ఆ సవాల్ ఇప్పటికీ ఉంది. ప్రజల్లో బలహీనత కూడా ఉంది అంటే వారు ఇప్పడు కూడా దానిలాంటిది తేలేరు.
భాషాప్రవీణులను లొంగదీసే తత్వం కేవలం దాని పదాల్లోనే కాదు, లేక కేవలం అగోచర విషయాల గురించి చెప్పడంలోనే కాదు, లేక ధార్మిక శాసనాల్లోనే కాదు, అన్నింటిలోనూ కలిసి ఉంది.
4- ప్రవక్తలపై విశ్వాసం: ప్రజల్ని అల్లాహ్ వైపు ఆహ్వానించడానికి దానికి వ్యెతిరేకంగా ఉన్న దానిని ఖండించడానికి అల్లాహ్ ప్రవక్తలను పంపాడని ముస్లిం విశ్వసించాలి. వారు మానవులు. అల్లాహ్ వారిని సృష్టించాడు. వారికి పోషణ, అధికారం, లోక నిర్వహణ లాంటి ఏ ప్రత్యేకతలు లేవు. వారు ఆరాధనలకు ఏ మాత్రం అర్హులు కారు. (ఇవి అల్లాహ్ ప్రత్యేకతలు మాత్రమే). అన్నపానీయాలు, చావు బ్రతుకుల్లాంటి మానవ ఆవసరాలే వారికీ ఉన్నాయి. ప్రవక్తలు సర్వమానవుల్లో శ్రేష్ఠులు. అల్లాహ్ వారిని సందేశహరులుగా, ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వారిని విశ్వసించుట అంటే వారికి ఇవ్వబడిన సందేశం సత్యం అని భావం. ఎవరి పేర్లు మనకు తెలియునో వారిని ఆ పేర్లతోనే విశ్వసించాలి. వారు ఇచ్చిన వార్తలను సత్యంగా నమ్మాలి. చివరి ప్రవక్త ముహమ్మద్ ﷺ తెచ్చిన ధర్మాన్ని ఆచరించాలి. ఆయన ﷺ తర్వాత ఇంకెవ్వరి ధర్మం కూడా చెల్లదు. అంగీకరించబడదు.
5-పరలోక విశ్వాసం: అది అంతిమదినం. ఆ రోజున పాపపుణ్యాల లెక్క తీసుకొని ప్రతి ఒక్కరికి తగిన ఫలితమిచ్చుటకు అల్లాహ్ అందరినీ సమాధుల నుండి లేపుతాడు. దానిని అంతిమ దినం అనడానికి హేతువు ఏమనగా ఆ తరువాత ఏ దినమూ ఉండదు. స్వర్గవాసులు తమ స్థానంలో మరియు నరకవాసులు తమ స్థానంలో ఉండిపోతారు.
పరలోక (అంతిమదిన) విశ్వాసం అంటే ఆ దినం ఖచ్చితంగా రానుందని దృఢంగా విశ్వసించాలి. దాని ప్రకారం ఆచరించాలి.
పరలోక విశ్వాసంలో మూడు విషయాలు వస్తాయిః
అ: మృతులను బ్రతికించడంపై విశ్వాసం. ఆ రోజు అల్లాహ్ చనిపోయినవారందరినీ సమాధుల నుండి నగ్న శరీరము, నగ్న పాదములతో మరియు శిశ్నాగ్రచర్మంతో (సున్నతీలేకుండా) నిలబెడతాడు.
ఆ: లెక్క, ప్రతిఫలం జరుగుననే విశ్వాసం. ఆ రోజు అల్లాహ్, ఇహలోకంలో ఏమి చేశావు అని ప్రతి మానవుడ్ని అడుగుతాడు. దాని ప్రకారం ఫలితమిస్తాడు. ఎవరైతే విశ్వసించి, విధేయత చూపి, సత్కార్యాలు చేయుదురో వారికి స్వర్గం లభించును. ఎవరైతే అవిశ్వాసానికి పాల్పడి అవిధేయతకు గురియగుదురో వారికి నరకం ప్రాప్తమగును. లెక్క, ప్రతిఫలం జరుగుట వివేకంతో కూడిన విషయం. ఎందుకనగా అల్లాహ్ గ్రంథాలను అవతరింపజేశాడు. ప్రవక్తల్ని పంపాడు. ప్రజలకు మంచి చెడులన్నియు స్పష్టపరచాడు. ఆ తరువాత ఆయన్ని ఆరాధించాలి, ఆయన ఆజ్ఞాపాలన చేయాలని ఆదేశించాడు. అయితే కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు తిరస్కారులయ్యారు. ఇక వీరిద్దరినీ సమానంగా చూచుట అల్లాహ్ వివేకానికీ, న్యాయానికి తగినది కాదు. దివ్యగ్రంథంలో అల్లాహ్ ఇలా తెలిపాడు: ((మేము విధేయుల స్థితిని అపరాధుల స్థితి మాదిరిగా చేస్తామా? ఏమయింది మీకు, ఎలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?)). (68:35,36).
ఇ: స్వర్గం, నరకం పట్ల విశ్వాసం. అది మానవుల శాశ్వత స్థానం. స్వర్గం భోగభాగ్యాలతో కూడుకున్న స్థానం. అది అల్లాహ్ విధించిన వాటిని విశ్వసించిన భక్తిపరులు, నిర్మలమైన భక్తితో అల్లాహ్ ఆయన ప్రవక్తకు విధేయులై, ప్రవక్త అడుగుజాడల్లో నడిచినవారి కొరకు సిధ్ధపరచబడింది. స్వర్గంలో చేరినవారు తమ సత్కర్మల ప్రకారం వివిధ అంతస్తుల్లో ఉంటారు.
నరకం శిక్షల స్థానం. అల్లాహ్ ను విశ్వసించని, ప్రవక్తకు విధేయత చూపని దుర్మార్గుల కొరకు సిద్ధపరచబడింది. నరకంలో వివిధ స్థానాలు, అంతస్తులున్నాయి. ఎవరి పాపాల తీరు వారు అందులో ఉంటారు.
6- విధివ్రాతపై విశ్వాసం: భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల జ్ఞానమంతయు అల్లాహ్ కు గలదు. అల్లాహ్ కోరినదే జరుగును, ఆయన కోరనిది జరగదు. ఏది సంభవించినా ఆయన జ్ఞానం, కోరిక లేనిదే సంభవించదు అని విశ్వసించుట.
ఇస్లాం ప్రకారం ‘ఆరాధన’ చిత్తశుద్ధితో అల్లాహ్ కు ప్రత్యేకించి చేస్తేనే తప్ప అంగీకరించబడదు. ప్రవక్త ﷺ పద్దతికి అనుగుణంగా ఉండడం కూడా తప్పనిసరి. ఉదాః నమాజ్ ఒక ఆరాధన. అది కేవలం అల్లాహ్ కొరకే చేయాలి. ప్రవక్త ﷺ చేసి చూపిన పద్దతిలోనే చేయాలి.
అది ఈ కారణంగాః
1- ఆరాధన చిత్తశుధ్ధితో ఏకైక అద్వీతీయుని కొరకే చేయాలని స్వయంగా అల్లాహ్ ఆదేశించాడు. ఆయనతో పాటు ఇతరుల ఆరాధన, ఆయనకు సాటి కల్పించినట్లగును. అల్లాహ్ ఆదేశం: ((అల్లాహ్ నే ఆరాధించండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయకండి)). (4:36).
2- ధర్మం, షరియత్ కు సంబంధించిన ఆదేశాలిచ్చే హక్కు (Legislative power) కేవలం అల్లాహ్ కే ఉంది. ఇతరుల ఆరాధనను అల్లాహ్ ధర్మసమ్మతం చేయలేదు. అల్లాహ్ ధర్మ సమ్మతం చేయని ఆరాధన ఏ మనిషైతే చేస్తాడో అతడు Legislative power([2]) ను తన చేతిలోకి తీసుకున్నవాడవుతాడు.
3- మన కొరకు ధర్మాన్ని అల్లాహ్ సంపూర్ణం చేశాడు. అల్లాహ్ సంపూర్ణం చేసిన ధర్మంలో లేని ఆరాధన కనిపెట్టినవారు, ఆచరించినవారు సంపూర్ణ ధర్మంలో లోపం చూపినవారవుతారు.
4- మనిషి తనకు నచ్చిన ఆరాధన, తాను కోరిన విధంగా చేయుటయే సరిఅయినదై ఉంటే, విభిన్న అభిరుచుల కారణంగా ప్రతి మనిషికీ తనదైన ప్రత్యేక ఆరాధన ఉండేది.
1- (లాఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్) సాక్ష్యం యొక్క భావం ఏమనగా నోటితో పలికిన పదాలకు అనుగుణంగా ‘అల్లాహ్ యే సత్యమైన ఆరాధ్యుడు, అద్వితీయుడు, భాగస్వామి లేనివాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం , అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త, సందేశం అందజేయువారు అని దృఢంగా విశ్వసించాలి.
ఏ మనిషి అయినా, అతని ఇస్లాం మరియు కర్మల అంగీకారం అల్లాహ్ పట్ల ఉన్న అతని చిత్తశుద్ధి (ఇఖ్లాస్)పైనా మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ అనుసరణ, విధేయతపైనా ఆధారపడి ఉంది.
(లాఇలాహ ఇల్లల్లాహ్) యొక్క భావం: అల్లాహ్ యే సత్య ఆరాధ్య దైవం, ఆయన అద్వితీయుడు అన్న విశ్వాసంతో ఈ వచనం నోటితో పలకాలి. నోటితో పలకడం సరిపోదు, దాని ప్రకారం ఆచరించాలి. అల్లాహ్ ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపాలి. (ముహమ్మదుర్రసూలుల్లాహ్) యొక్క భావం: ప్రవక్త చెప్పిన మాటను సత్యపరచాలి. ఆయన ఆదేశాలను అనుసరించాలి. ఏ పనుల నుండి హెచ్చరించారో, నివారించారో వాటికి దూరంగా ఉండాలి. అల్లాహ్ యొక్క ఆరాధన ఆయన ﷺ చూపిన విధంగా చేయాలి.
3- జకాత్ చెల్లించుటః ధనంలోని ఒక నిర్ణీత ప్రమాణం అల్లాహ్ సూర తౌబా (9:60)లో తెలిపిన ప్రకారం పేదవారికి, అవసరార్థులకు, తదితరులకు ఇచ్చుట.
జకాత్ లాభాలుః ఆత్మశుద్ధి కలుగును. దురాశ మరియు పిసినారితనం దూరమగును. పేద ముస్లింల అవసరాలు తీరును. పేద, ధనవంతుని మధ్య ప్రేమ సంబంధాలు స్థిరపడును. స్వార్థం, ఈర్ష్య లాంటి దుర్గుణాలు దూరమగును. ఆప్యాయత, వినమ్రత మరియు ఇతరుల అవసరాల పట్ల అవగాహన కలుగును.
4- రమజాన్ ఉపవాసాలుః రమజాను మాసములో పగలంతా అల్లాహ్ యొక్క ఆరాధన ఉద్దేశంతో ఉపవాసం భంగము చేయు విషయాలకు దూరంగా ఉండుట. ప్రతి ముస్లిం రమజాను మాసమెల్ల ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు అల్లాహ్ యొక్క ఆరాధనోద్దేశంతో
అన్నపానీయాలు మరియు లైంగిక వాంఛలకు దూరంగా ఉండాలి.
ఉపవాసం యొక్క లాభాలుః ఆత్మశుద్ధి. అల్లాహ్ సంతృప్తి పొందే ఉద్దేశంతో ఇష్టమున్న వాటిని విడనాడే అలవాటు మనస్సుకు కల్గించుట. ఇంకా కష్టాలు భరించే, సహనం వహించే అలవాటు కల్గించుట. చేసే సత్కార్యాలు చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట. బాధ్యతలను నెరవేర్చుట. ఇతరుల ఆకలిదప్పులను గ్రహించుట. ఆరోగ్యవంతంగా ఉండుట మొదలగునవి.
5- హజ్: కాబా వరకు చేరుకునే శక్తిగలవారు జీవితంలో ఒక్కసారి అక్కడికి వెళ్ళి హజ్ కు సంబంధించిన కార్యాలు నెరవేర్చుట.
సర్వ మానవాళి కొరకు అల్లాహ్ ఇష్టపడిన ధర్మం ఇస్లాం. అది ప్రతి యుగానికి, ప్రతి సమాజానికి అనుకూలమైనది. ప్రతి మంచిని గురించి బోధించునది. ప్రతి చెడును గురించి నివారించునది. మానవులకు ఇహలోక సుఖం, పరలోక ముక్తి లభించాలంటే ఇస్లాం ధర్మాన్నే స్వీకరించాలి. దాన్ని మన జీవిత వివధ వ్యవహారాల్లో పాటించాలి. ఇస్లాం ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పుటకు ఇతర ధర్మాల్లో లేని, దాని ప్రత్యేకతలే సరిపోవును.
1- ఇది అల్లాహ్ తరఫున వచ్చిన ధర్మం. మానవుల అవసరాలను అల్లాహ్ యే బాగా ఎరుగును. అల్లాహ్ ఆదేశం: ((పుట్టించినవాడికే తెలియదా? వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రాహి మరియు సమస్తమూ తెలిసినవాడు)). (67:14).
2- ఇది మానవ మొదటి స్థితిని, అంతిమ గతిని మరియు సృష్టి ఉద్దేశాన్ని స్పష్టంగా తెలుపుతుంది. ఇంకా మానవుడు ఇహలోకంలో విధిగా నడవవలసిన దారి ఏదో విశదపరుస్తుంది. విధిగా విడనాడవలసిన వాటిని సయితం వివరిస్తుంది. చదవండి ఈ క్రింది దివ్యగ్రంథ ఆయతులుః ((మానవులరా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు)). (4:1). ((ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టించాము. దానిలోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము. దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము)). (20:55). ((నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు తప్ప మరిదేని కొరకూ సృష్టించలేదు)). (51:56). ((ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను)). (5:3).
3- ఇది స్వభావిక ధర్మం. ప్రకృతి, స్వభావానికి విరుద్ధం కాదు. ((అల్లాహ్ మానవులను ఏ స్వభావం ఆధారంగా సృష్టించాడో దానిపై స్థిరంగా ఉండండి)). (30:30).
4- ఇది మేధ ప్రాముఖ్యతను కాదనదు. సవ్యమైన రీతిలో యోచించాలని ఆదేశిస్తుంది. మూర్ఖత్వం, అంధానుకరణకు అనుమతి ఇవ్వదు. అలాగే సవ్యమైన యోచన నుండి అశ్రద్ధను అసహ్యించుకుంటుంది. అల్లాహ్ ఆదేశం ఇలా వుందిః ((వీరిని అడగండి, తెలిసినవారూ, తెలియనివారూ ఇద్దరూ సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు)). (39:9). ((భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావడంలో, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అన్ని వేళలా అల్లాహ్ ను స్మరించే, భూమి, ఆకాశాల నిర్మాణం గురించి చింతనచేసే వివేకవంతులకు ఎన్నో సూచనలున్నాయి. (వారు ఇలా అంటారుః) ప్రభూ! ఇదంతా నీవు వ్యర్థంగా, లక్ష్యరహితంగా సృష్టించలేదు. నీవు పరిశుద్ధుడవు కనుక ప్రభూ! మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు)). (3:191,192).
5- ఇందులో విశ్వాసం మరియు ధర్మశాస్త్రం (జీవన విధానం) రెండూ సంపూర్ణంగా ఉన్నాయి. ఇది కేవలం ఊహగానాల వరకు పరిమితమైనది కాదు. నిజమైన విశ్వాసాలు, వివేకంతో కూడిన వ్యవహారాలు, సుందర ప్రవర్తన అన్నియూ ఇందులో ఉన్నాయి. ఇది వ్యక్తికీ మరియు సంఘానికీ, ఇహలోకానికీ మరియు పరలోకానికీ సంబంధించిన ధర్మం.
6- ఇది మనిషి భావాలకు (sentiments) ప్రాముఖ్యతనిస్తుంది. మంచికి, నిర్మాణ కార్యక్రమాలకు యంత్రంగా మలచుటకు ఇస్లాం మార్గదర్శకత్వం చేస్తుంది.
7- ఇది స్నేహితులు, శత్రువులు, తనవాళ్ళు, పరాయివాళ్ళు అందరితో న్యాయం చేయమని బోధిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ((న్యాయం చేయండని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు)). (16:90). ((పలికితే న్యాయమే పలకండి)). (6:152). ((ఏదైనా వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి. ఇది దైవభక్తికి అత్యంత సమీపమైనది)). (5:8).
8- సత్యమైన సోదరభావంగల ధర్మం ఇస్లాం. ముస్లిములందరూ ధార్మిక సోదరులు. దేశాలు, జాతులు మరియు రంగులు వారిని విడదీయవు. ఇస్లాంలో కుల, వర్ణ ప్రాధాన్యతలు లేవు. ప్రాధాన్యతలకు గీటురాయి దైవభీతి. అల్లాహ్ ఆదేశం: ((వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు)). (49:13).
9- ఇది విద్య, విజ్ఞతలను పెంపొదిస్తుంది. ఇస్లాం తన అనుచరులను విద్యనభ్యసించాలని ఆదేశిస్తుంది. దానిపై గొప్ప ప్రతిఫల వాగ్దానం చేస్తుంది. చదవండి అల్లాహ్ ఆదేశం: ((మీలో విశ్వసించిన వారికి, జ్ఞానం ప్రసాదింపబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు)). (58:11). ((వీరిని అడగండి, తెలిసినవారూ, తెలియనివారూ ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా?)). (39:9). ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా ప్రవచించారుః “విద్యనభ్యసించుట ప్రతి ముస్లింపై విధిగా ఉంది”.
10- ఎవరు ఇస్లాం స్వీకరించి, మంచిరీతిలో దాన్ని అనుసరించాడో -వ్యక్తి అయినా లేక సంఘం అయినా- అతనికి సౌభాగ్యం, గౌరవం ప్రసాదించే బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. అల్లాహ్ ఆదేశం: ((మీలో విశ్వసించి మంచి పనులు చేసేవారికి అల్లాహ్ చేసిన వాగ్దానమేమిటంటే, ఆయన వారిని, వారికి పూర్వం గతించిన ప్రజలను చేసిన విధంగా, భూమిపై ఖలీఫాలు (ప్రతినిధులు)గా చేస్తాడు, అల్లాహ్ వారికై అంగీకరించిన వారి ధర్మాన్ని వారికొరకు పటిష్ఠమైన పునాదులపై స్థాపిస్తాడు. వారి యొక్క (ప్రస్తుత) భయస్థితిని శాంతిభద్రతలతో కూడిన స్థితిగా మారుస్తాడు. కనుక వారు నాకు దాస్యం చేయాలి, ఎవ్వరినీ నాకు భాగస్వాములుగా చేయకూడదు)). (24:55). ((పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే, విశ్వాసి అయిన పక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము. (పరలోకంలో) అటువంటి వారికి వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలను ప్రసాదిస్తాము)). (16:97).
11- ఇది పరస్పరం ప్రేమ, అప్యాయత, వాత్సల్యం మరియు దయ చూపవలసినదిగా బోధించే ధర్మం. మహానీయ ముహమ్మద్ ﷺ ఇలా ఉపదేశించారుః “ముస్లిముల ఉదాహరణ వారి పరస్పర దయాశీలత, ప్రేమ, మరియు అన్యోన్య అనురాగంలో ఒక దేహం లాంటిది. దేహంలో ఒక అవయవానికి ఏదయినా జబ్బు చేస్తే దేహంలోని ఇతర అవయవాలు కూడా విశ్రమాన్ని వదలి జ్వరంలో పాలు పంచుకుని దానికి తోడవుతాయి”. మరో సందర్భంలో ఇలా సెలవిచ్చారుః “కరుణించువారిపై కరుణామయుడైన అల్లాహ్ కరుణించును. అందుకు భువిలో ఉన్నవారిని మీరు కరుణించండి. దివిలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణించును”. మరో సందర్భంలో ఇలా హెచ్చరించారుః “తన కొరకు ఇష్టపడిన దాన్ని తన సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు మీలో ఏ వ్యక్తి కూడా నిజమయిన విశ్వాసి కాజాలడు”.
12- ఇస్లాం పని చేయాలని, కష్టపడాలని, ప్రోత్సహిస్తుంది. ప్రవక్త ﷺ ఇలా ప్రవచించారుః “బలహీనుడయిన విశ్వాసికన్నా బలశాలి అయిన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ప్రియుడు, ఉత్తముడు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఏదో మంచి అన్నది ఉంటుంది. ఏ విషయమైతే నీకు లాభదాయకమైనదో దాని గురించి ఎక్కువ ఆశపడి (దాన్ని పొందే ప్రయత్నం చేయి). ధైర్యాన్ని కోల్పోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం వాటిల్లితే, లేక కష్టం కలిగితే ‘నేను ఆ విధంగా చేసివుంటే మరో విధంగా జరిగి ఉండేది’ అని అనకుము. దానికి బదులుగా ‘అల్లాహ్ యే నిర్ణయం చేశాడు. తనకు కోరినట్లు జరిగింది’ అను”.
13- విరుద్ధ విషయాలు ఇందులో లేవు. అల్లాహ్ ఆదేశం: ((ఇది అల్లాహ్ తరఫునుండి కాక వేరొకరి తరఫునుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలు ఉండేవి)). (4:82).
14- ఇది స్పష్టంగా, సులభంగా ఉంది. ప్రతి ఒక్కరికీ తేలికగా అర్థమయ్యేటట్లు ఉన్నది. ((నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటానికి గాను సులభతరం చేశాము. మరి (దీనిద్వారా) హితబోధను గ్రహించేవాడెవడైనా ఉన్నాడా?)). (54:17).
15- దాని ద్వారాలు ప్రతి ఒక్కరి కొరకు తెరచి ఉన్నాయి. దాన్ని నేర్చుకోవాలన్న, దాన్ని స్వీకరించాలన్న వ్యక్తిని వద్దని వారించదు.
16- ఇది ఉత్తమ ప్రవర్తన, సత్కర్మల వైపునకు ఆహ్వానిస్తుంది. అల్లాహ్ ఆదేశం: ((మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంభించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు)). (7:199). ((నీవు చెడును శ్రేష్ఠమైన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణస్నేహితుడై పోవటాన్ని నీవు గమనిస్తావు)). (41:34). ప్రవక్త ముహమ్మద్ ﷺ ఉపదేశించారుః “అనేక మందిని స్వర్గంలో ప్రవేశింపజేయునవిః అల్లాహ్ భయభీతి మరియు సద్వర్తన”. మరో సందర్భంలో ఇలా సెలవిచ్చారుః “ప్రజల్లో అల్లాహ్ కు అతిప్రియుడు వారికి లాభం చేకూర్చేవాడు. సత్కార్యాల్లో అల్లాహ్ కు చాలా ప్రియమైనవిః నీవు నీ తోటి ముస్లిములను సంతోషపరుచుట. లేక అతని ఒక ఆపదను దూరం చేయుట. లేక అతనిపై ఉన్న ఋణాన్ని తీర్చుట. లేక అతన్ని ఆకలి బాధ నుండి తప్పించుట. ఒక ముస్లిం వెంట ఉండి అతని అవసరాన్ని తీర్చడం, ఒక నెల మస్జిద్ లో ‘ఏతికాఫ్’ (ప్రార్థన చేస్తూ మస్జిద్ లో ఉండుట) కంటే నాకు ఎంతో ప్రియమైనది”.
17- ఇది బుద్ధీ జ్ఞానాలను కాపాడుతుంది. అందుకే మత్తుపదార్థాలను, డ్రగ్స్ మరియు బుద్ధిని చెడగొట్టే ప్రతిదానిని నిషేధించింది. అల్లాహ్ ఆదేశం ఇదిః ((మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహ్ కు మీరంటే ఎంతో దయ అని నమ్మండి)). (4:29).
18- ఇస్లాం ధనసంపదలను రక్షిస్తుంది. అందుకే అమానతులను హక్కుదారులకు అప్పగించాలని ప్రోత్సహించింది. అలాంటి వారికి ఉత్తమ జీవనోపాధి మరియు స్వర్గ ప్రవేశం వాగ్దానాలు చేయబడ్డాయి. దొంగతనం నిషేధించబడింది. ప్రజల సొమ్ము దొంగలించే మరియు వారిని భయాంధోళనకు గురి చేసే ధైర్యం చేయకుండా ఉండుటకు, వారికి ఇహపరాల్లో శిక్ష గురించి హెచ్చరిక చేయబడింది.
19- ఇస్లాం ప్రాణాన్ని కూడా కాపాడుతుంది. అందుకే హత్యను నిషేధించింది. హంతకునికి ఇహంలో హతం మరియు పరంలో శాశ్వత నరకం శిక్ష తెలిపింది. ఏ ఇస్లామీయ దేశాల్లో ఈ చట్టం ఉందో అచ్చట హత్య సంఘటనలు కానరావడం చాలా అరుదు. ఒకర్ని హత్య చేస్తే తనూ చంపబడుతాడని తెలిసిన వ్యక్తి హత్యకు దూరంగానే ఉంటాడు. ఇలా నేరస్తుల నేరాల నుండి ప్రజలు నిర్భయంగా, శాంతిగా ఉంటారు.
20- ఇస్లాం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తుంది. అల్లాహ్ ఆదేశం: “తినండీ, త్రాగండీ, మితిమీరకండి”. (7:31). ఈ వాక్యంలో వైద్య శాస్త్ర మూలం తెలుపబడింది. అది ఎలా అనగా తినత్రాగడంలో మితిమీరకుండా జాగ్రత్తపడుటయే ఆరోగ్య రక్షణకు మూల కారణం. ఆరోగ్యాన్ని కాపాడుటకే మత్తు, డ్రగ్స్ లను ఇస్లాం నిషేధించింది. మరియు అవి ఆరోగ్యానికి ఎంత హానికరమైనవో తెలియనిది కాదు. అదేవిధంగా వ్యభిచారం, స్వలింగసంపర్కం (Sodomy)ను నిషేధించింది. వాటి వల్ల వ్యాపిస్తున్న సుఖవ్యాధులు, లైంగికవ్యాధులు (syphillis, gonorhoea) ఇప్పుడు గుప్తంగా ఏమాత్రం లేవు. ఉదాహరణకుః హెచ్.ఐ.వి./ఏయిడ్స్, herpes, venereal తదితర వ్యాధులు.
21- ఇస్లాం మనిషికి స్వాతంత్రం ప్రసాదిస్తుంది. కాని ఒక హద్దులో. మనిషి స్వేచ్ఛగా క్రయవిక్రయాలు, వ్యాపారము మరియు ప్రయాణాలు వగైరా చేయవచ్చు. కాని ఒకరికి మోసం, ద్రోహం, నష్టం చేయరాదు. అలాగే ఇస్లాంలో తినుట, త్రాగుట, ఆఘ్రాణించుట, పీల్చుట, ధరించుటలో పూర్తి స్వాతంత్రం ఉంది. అయితే స్వయంగా తనకు, లేదా ఇతరులకు నష్టం చేకూర్చే నిషిద్ధానికి పాల్పడకూడదు.
మనిషికి ఇహలోకములో అవసరమున్న మరియు ఇహపరాల సాఫల్యానికి తోడ్పడే ప్రతి ఒక్కటి నేర్పుటకు ఇస్లాం వచ్చింది. ఇస్లామీయ ఆదేశాలు మరియు నిషిద్ధతలపై దృష్టిసారిస్తే అందులోగల ఉత్తమ విషయాలు స్పష్టమవుతాయి.
1- మానవుడు పశువుల వలే కాకుండా, తన వాంఛలకు బానిస కాకుండా గౌరవస్థాయిలో ఉండుటకు, ఇంకా ఇతర సృష్టిరాసులను గొప్పగా భావించి, తన దైవాన్ని వదలి వారి ముందు నమ్రత చూపకుండా ఉచ్చస్థాయికి చేర్చునటువంటి ఆదేశాలిస్తుంది ఇస్లాం.
2- బుద్ధిజ్ఞానాలను, శరీర అవయవాలను, అవి ఇహపరాల ఏ సత్కార్యాలు చేయుటకు సృష్టించబడ్డాయో వాటినే చేయాలని ఇస్లాం ఆదేశిస్తుంది.
3- అద్వీతీయుడైన అల్లాహ్ యొక్క ఆరాధన చిత్తశుద్ధితో చేయాలని, అసత్య దైవాల ఆరాధన విడనాడాలని ఆదేశిస్తుంది.
4- ప్రజల అవసరాలు తీర్చాలని, వారికి సహాయసహకారాలు అందిస్తూ ఉండాలని ప్రోత్సహిస్తుంది.
5- రోగులను పరామర్శించాలని, శవాల వెంట శ్మశానం వరకు నడవాలని, (పరలోక జ్ఞప్తి కొరకు) శ్మశాన దర్శనకు వెళ్ళాలని మరియు వారి కొరకు దుఆ చేయాలని ఆదేశిస్తుంది.
6- ప్రజలకు న్యాయం చేయాలని, అన్యాయం చేయరాదని మరియు తనకు ఇష్టమైనదే, ఇతరులకై ఇష్టపడాలని ఆదేశిస్తుంది.
7- తన జీవనోపాధి సమకూర్చుటకు శ్రమించాలని, తన గౌరవాన్ని కాపాడుకుంటూ, యాచనకు, అగౌరవ చేష్టలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తుంది.
8- మానవుల పట్ల ప్రేమ, వాత్సల్యం చూపాలని, వారితో మంచి విధంగా వ్యవహరిస్తూ, వారి శ్రేయస్సుకు పాటుపడుతూ నష్టం కలిగించకుండా ఉండాలని ఆదేశిస్తుంది.
9- తల్లిదండ్రులకు విధేయులై, బంధుత్వం పెంచి, ఇరుగుపొరుగువారితో మంచిగా మెలగాలని మరియు పశువుల పట్ల సైతం మార్దవం / దయ చూపాలని ఆదేశిస్తుంది.
10- మిత్రుల పట్ల విశ్వాసం, నమ్మకం ఉంచాలి. భార్యాపిల్లలతో ప్రేమపూర్వకంగా ఉండాలని ఆదేశిస్తుంది.
11- అమానతులను అప్పగించాలని, వాగ్దానం పూర్తి చేయాలని, ఇతరుల గురించి మంచి అభిప్రాయం ఉంచాలని, సర్వ పనుల్లో మృదుత్వాన్ని పాటించాలని మరియు సత్కార్యాల్లో తొందరపడాలని ఆదేశిస్తుంది. ఇవే కాక ఇంకెన్నో ఉత్తమమైన ఆదేశాలిస్తుంది.
ఇస్లాం ధర్మంలోని ఉత్తమ విషయాల్లో మరీ గొప్పవి; నిషిద్ధతలు. అవి విశ్వాసిని చెడు కార్యాలకు పాల్పడకుండా నివారిస్తాయి, వాటి దుష్ఫలితాల నుండి కూడా హెచ్చరిస్తాయి, అందరూ సుఖంగా తమ జీవితం గడుపుకొనుటకు. దిగువ ఇవ్వబడిన ఇస్లాం నిషిద్ధపరిచిన విషయాలు చదవండి:
1- అవిశ్వాసానికి, సత్య తిరస్కారానికి పాల్పడుట మరియు అల్లాహ్ కు ఇతరుల్ని భాగస్వాములు చేయుట నిషిద్ధ పరుస్తుంది ఇస్లాం.
2- గర్వం, కపటం, ఆత్మ స్తుతి, ఈర్ష్య మరియు ఆపదలో ఉన్న వారిని చూసి నవ్వుట నివారిస్తుంది ఇస్లాం.
3- చెడు అభిప్రాయం, అపశకునం, నిరాశ నిస్పృహ, పిసినారితనం మరియు వృధా ఖర్చుల నుండి నివారిస్తుంది.
4- సోమరితనం, పిరికితనం, బలహీనత, మాంద్యం, తొందరపాటు, కఠినత్వం, నిర్లజ్జ, అసహనం, దౌర్బల్యం, కోపం, ఉద్రేకం మరియు పోగొట్టుకున్నదానిపై వ్యాకులతకు గురి కావడం నుండి నివారిస్తుంది.
5- బాధితుల, అగత్యపరుల సహాయానికి దూరముంచే రెండు దుర్గుణాల నుండి నివారిస్తుంది. (అ): పాశాన హృదయుడు కావడం. (ఆ): పెడసరితనం/ అహంకారం, అహంభావం.
6- పరోక్షంగా నిందించడం (అంటే ఒక వ్యక్తి ప్రస్తావన అతనికి నచ్చని విధంగా ఇతరుల ముందు చేయడం), చాడీలు చెప్పడం నుండి నివారిస్తుంది.
7- వృధాగా మాట్లాడ్డం, రహస్యాలను బహిరంగ చేయడం, ప్రజలతో హేళన, ఎగతాలి చేయుట నుండి నివారిస్తుంది.
8- దూషించడం, శపించడం, కించపరచడం మరియు చెడుబిరుదులతో పిలవడం నుండి నివారిస్తుంది ఇస్లాం.
9- గొడవ, వాదన, తగాదాలకు దిగుట, చెడు వైపునకు తీసుకెళ్లే హాస్యమాడుట (జోక్ చేయుట) నుండి నివారిస్తుంది.
10- అవసరమున్న చోట సాక్ష్యం ఇవ్వకపోవుట, అబద్ధపు సాక్ష్య-మిచ్చుట, అమాయక స్త్రీలపై అపనిందమోపుట, చనిపోయినవారిని దూషించుట, విద్యను బోధించకపోవుట నుండి నివారిస్తుంది ఇస్లాం.
11- అవివేకం, అశ్లీలం, ఉపకారం చేసి చెప్పుకోవడం, మేలు చేసినవారికి కనీసం ‘ధన్యవాదాలు’ తెలుపక పోవడం నుండి నివారిస్తుంది ఇస్లాం.
12- అపహరణం, మోసం, వాగ్దాన భంగాల నుండి నివారిస్తుంది.
13- తల్లిదండ్రుల అవిధేయత, బంధుత్వాన్ని త్రెంచుట మరియు సంతానానికి ఉత్తమ శిక్షణ ఇవ్వకపోవుట నుండి నివారిస్తుంది.
14- ఇతరుల రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం, లోపాలు వెతకడం నుండి నివారిస్తుంది.
15- పురుషులు స్త్రీల లాంటి, స్త్రీలు పురుషుల్లాంటి (వేషా, భాష, వస్త్రణ, ప్రవర్తన) అవలంభించుట నివారిస్తుంది.
17- అసత్య ప్రమాణాలతో సరుకు అమ్ముట, తూకము మరియు కొలతలలో తక్కువ చేసి ఇచ్చుట, నిషిద్ధ కార్యాల్లో ధనం వెచ్చించుట మరియు ఇరుగుపొరుగు వారిని బాధించుటను నివారిస్తుంది.
18- దొంగతనం, కోపం, భాగస్వామ్యంలో ఉన్న ఇద్దరిలో పరస్పరం మోసం, నష్టం చేయుట, పనివానికి/ సేవకునికి అతని మూల్యం ఇవ్వటంలో ఆలస్యం చేయుట లేక అతనితో పని చేయించుకొని బత్తెము ఇవ్వకపోవుట మొదలగున వాటిని నివారిస్తుంది.
19- ఆరోగ్యానికి హాని కలిగే విధంగా తినుటను నివారిస్తుంది.
20- పెడమొఖంగా ఉండుట, పరస్పరం ద్వేషాలు పెంచుకొనుట, పరస్పరం దూరమగుట నివారిస్తుంది. మూడు రోజుల కంటే ఎక్కువ పరస్పరం మాటలు విడనాడుట నుండి హెచ్చరిస్తుంది.
21- కారణం లేకుండా ఒకరిని కొట్టడం మరియు ఆయుధాలతో బెదిరించడాన్ని నివారిస్తుంది.
22- వ్యభిచారం, స్వలింగ సంపర్కం మరియు ఆత్మహత్యలను నిషేధిస్తుంది.
పరలోకం మరియు దానికి సంబంధించిన విషయాలను విశ్వసించనంత వరకు ఏ మనిషీ విశ్వాసి కాజాలడు. ఆ దినం ఎంత భయంకరమైనదో దివ్య ఖుర్ఆన్ ఇలా తెలిపిందిః “అది పిల్లలను వృద్ధులుగా చేసే దినం”. (72:17). ఆ నాడు సంభవించే వాటిలో కొన్ని దిగువ తెలుపుచున్నాము.
మృత్యువుః ఇది ఇహలోకంలో ప్రతి జీవికి అంతిమ విషయం. అల్లాహ్ ఆదేశాలు గమనించండి. “ప్రతి జీవి మరణాన్ని చవి చూస్తుంది”. (3: 185). “ఈ పుడమిపై ఉన్న ప్రతి వస్తువూ నాశనమైపోతుంది”. (55:26). “నీవూ మరణిస్తావు, వారూ మరణిస్తారు”. (39: 30). ఏ మానవునికీ ఇహలోకంలో శాశ్వత జీవితం లభించదు. “శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడా ఏ మానవునికీ ప్రసాదించలేదు”. (21:34).
1- మరణం ఖచ్చితమైన విషయం. ఇందులో ఇసుమంత సందేహానికి తావు లేదు. మృతుడు తన వెంట ఏమీ తీసుకెళ్ళలేడు. అతని వెంట మిగిలేవి అతను చేసిన కర్మలే.
2- మనిషి చావు గురించి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎవడు ఎక్కడ, ఎప్పుడు ఎలా చనిపోతాడో ఎవ్వరికీ తెలియదు. ఎందుకనగా ఇది ఒక అగోచరజ్ఞానం. ఇది అల్లాహ్ అద్వితీయునికే తెలుసు.
3- చావు వచ్చాక ఆలస్యమో, లేక దాన్ని నెట్టేయడమో, లేక దాని నుండి పారిపోవడమో కాని పని. అల్లాహ్ ఆదేశం “ప్రతి జాతి వారికొక గడువు నియమించబడియున్నది. మరియు వారి గడువు వచ్చి-నప్పుడు ఒక గడియ వెనుకగాని ముందుగాని వారు కానేరరు”. (734).
4- విశ్వాసునికి మరణం సమీపించినప్పుడు యమదూత అందమైన ఆకారంలో అతని వద్దకు వస్తాడు. కరుణదూతలు కూడా స్వర్గ శుభ- వార్తలతో హజరవుతారు. చదవండి అల్లాహ్ ఆదేశం: “ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ అని పలికిరో, మళ్ళీ అందు స్థిరముగా ఉండిరో వారి యొద్దకు దైవదూతలు దిగివచ్చి మీరు భయపడకండి, చింతపడకండి, మీతో వాగ్దానము చేయబడుతున్న స్వర్గముతో సంతోషపడండి అని పలుకుతారు”. (41:30).
అవిశ్వాసి వద్దకు భయంకరమైన మసిబూసిన ఆకారంలో యమదూత వస్తాడు. అతనితో శిక్షదూతలు శిక్ష దుర్వార్త ఇస్తూ హాజరవుతారు. చదవండి అల్లాహ్ ఆదేశం: “ఈ దుర్మార్గులు మరణవేదనలో మునిగి తేలుతూ ఉండగా, దైవదూతలు తమ హస్తాలను చాచి ఇటు తెండి, బయటకు తీయండీ మీ ప్రాణాలను, అల్లాహ్ పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతలకూ, ఆయన ఆయతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకూ ఫలితంగా ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది”. (6:93).
చావు వచ్చినప్పుడు వాస్తవము స్పష్టమయి అసలు విషయము ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది. అల్లాహ్ ఇలా తెలిపాడుః “తుదకు వారిలో ఒకనికి చావు వచ్చినప్పుడు ‘ఓ నా ప్రభువా! నన్ను తిరిగి పంపివేయుము. నేను వదలి వచ్చిన దానిలో సత్కార్యము చేయుదును’ అని పలుకును. అట్లు కానేరదు. అది ఒక మాట, దానిని అతడు పలుకుచున్నాడు. వారు మరల సజీవులై లేచు దినము వరకు వారి ముందర అడ్డు ఉన్నది”. (23:99,100).
చావును చూసి అవిశ్వాసి మరియు పాపాత్ముడు ఇహలోకానికి తిరిగి వచ్చి సత్కార్యాలు చేయాలని కోరుదురు కాని అప్పుడు ఆ పశ్చాత్తాపము ఏమీ పనికి రాదు. అల్లాహ్ ఇలా తెలిపాడుః “నీవు పాపాత్ములను చూచెదవు. వారు బాధను చూచునప్పుడు తాము తిరిగి పోవుటకు మార్గము గలదా? అని పలుకుదురు”. (42:44).
సమాధిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రకారం: శవాన్ని సమాధిలో పెట్టి అతని బంధువులు తిరిగి పొయిన తరువాత ఇద్దరు దూతలు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ‘నీ ప్రభువు ఎవరు?, నీ ధర్మం ఏది?, నీ ప్రవక్త ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. ‘నా ప్రభువు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం, నా ప్రవక్త ముహమ్మద్ ﷺ’ అని విశ్వాసి సమాధానమిస్తాడు. అప్పుడు వారిద్దరంటారుః ఇదిగో చూడు నరకంలో నీ స్థానం, అల్లాహ్ దానికి బదులుగా స్వర్గంలో నీకు ఈ స్థానం ప్రసాదించాడు. విశ్వాసి రెండు స్థనాలు చూస్తాడు. కాని అవిశ్వాసి లేక మునాఫిఖ్ (వంచకుడు) వారిద్దరు ప్రశ్నించబడినప్పుడు ‘అయ్యో! నాకు తెలియదు’ అని వాపోతాడు. అప్పుడు ఇద్దరు దూతలు ‘నీవు తెలుసుకోలేదు, దానికి ప్రయత్నమూ చేయలేదు’ అని అంటూ, ఇనుప సమ్మెటలతో కొడుతారు. అందుకు అతడు కేకలు వేసి అరుస్తాడు. అతని అరుపులు మానవులు, జిన్నాతులు తప్ప అందరూ వింటారు. సమాధి అతని కొరకు ఇరుకుగా ఉంటుంది. ఇద్దరు దూతలు అతనికి నరకంలో అతని స్థానం చూపిస్తారు. అక్కడి నుండి దాని తాపం, శిక్ష వస్తూ ఉంటుంది.
సమాధిలో ఉన్న శరీరములో ఆత్మను తిరిగి పంపడం పరలోక విషయాల్లో ఒకటి. దాన్ని మానవ మేధ ఇహలోకంలో ఉండి గ్రహించలేదు. మనిషి విశ్వాసి అయితే, అనుగ్రహాలకు అర్హుడయినచో సమాధిలో అనుగ్రహించబడుతాడు. శిక్షకు అర్హుడయినచో శిక్షింపబడుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు కోరండి”. (అబూదావూద్). మంచి మనుస్సు దీన్ని తిరస్కరించదు. ఎందుకనగా దీనికి ఇంచుమించు పోలిన విషయం ఒకటి ఇహలోకంలో మనిషి చూస్తుంటాడు. పడుకున్న వ్యక్తి స్వప్నలో శిక్షకు గురి అయినట్లు చూస్తాడు. సహాయం కోరుతూ అరుస్తాడు. కాని అతని ప్రక్కనే మేలుకొని ఉన్న వ్యక్తి దాన్ని గ్రహించలేకపోతాడు. ఇక జీవన్మరణాల్లోని తేడా ఇంతకంటే గొప్పది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారుః “సమాధి పరలోక స్థానాల్లో మొదటి స్థానం. దాన్ని క్షేమంగా దాటినవారికి ఆ తరువాత స్థానాలు తేలికగా ఉంటాయి. దాన్ని క్షేమంగా దాటనివారికి దాని తరువాతవి కఠినంగా ఉంటాయి”. (తిర్మిజి).
సమాధి శిక్ష అని పేరు రావడానికి కారణం అనేక మందిని సమాధిలో పెట్టడం వల్లనే. కాలిపోయినవారు, మునిగిపోయినవారు మరియు కౄరజంతువులకు ఆహారమైనవారు ఇంకా ఎవరు ఎలా మరణించినా తమ కర్మల ప్రకారం శిక్షించబడుతారు లేక అనుగ్రహించబడుతారు. సమాధి శిక్షలు వివిధ రకాలుగా ఉంటాయిః ఇనుప సమ్మెటలతో కొట్టబడును. సమాధి చీకటితో నిండిపోవును. నరకంలోని పరుపు అతనికి వేయబడును. దాని తలుపు అతని వైపునకు తెరువబడును. అందులో నుండి వేడి గాలి వస్తూ ఉండును. అతని దుష్కార్యాలు, దుర్వాసన గల దుస్తులు ధరించిన అందవికారంగల వ్యక్తి రూపంలో అతనికి తోడుగా ఉండును. అవిశ్వాసి మరియు మునాఫిఖులకు ఎడతెగకుండా శిక్ష ఉండును. పాపాత్ముడైన విశ్వాసికి తన పాపాలకు తగినరీతిలో శిక్ష ఉండును. తర్వాత శిక్ష నుండి రక్షింపబడవచ్చును.
సమాధిలో వరాలుః విశ్వాసి కొరకు అతని సమాధి వెడల్పు చేయబడును. నూర్ (కాంతుల)తో నింపబడును. స్వర్గం యొక్క ద్వారము అతని వైపునకు తెరువబడును. అందులో నుండి పరిమళం మరియు గాలులు వీస్తూ ఉండును. స్వర్గపు పరుపులు పరచబడును. అతని సత్కార్యాలు అందమైన మనిషి రూపములో అతనికి తోడుగా ఉండును.
1- అల్లాహ్ ఈ సృష్టిని శాశ్వతంగా ఉండుటకు సృష్టించలేదు. తప్పక ఒక దినం రానుంది ఇది అంతము కానుంది. అదే ప్రళయం సంభవించే రోజు. సందేహం లేనటువంటి రోజు. “పునరుత్థాన దినం రానున్నది. అందెట్టి సందేహం లేదు”. (22:7). “మాకు ప్రళయకాలము రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు? నా ప్రభువు సాక్షిగా! అది తప్పక మీకు వచ్చును”. (34:3). ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. దాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికీ తెలుపలేదు. “ప్రళయ కాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయము నీకేమి తెలుసు. ప్రళయ కాలము సమీపములోనే కావచ్చు”. (33:63).
2- ఈ ధరిణిపై దుష్టులు మాత్రమే మిగిలి యుండగా ప్రళయం సంభవించును. అది ఎలా అనగాః అది సంభవించేకి ముందు అల్లాహ్ ఒక మందమారుతమైన గాలిని పంపును. దానివలన విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టినంతటిని నాశనము చేయాలనుకున్నప్పుడు, శంకు ఊదే దూతకు ఆదేశమిస్తాడు, అతడు శంకు ఊదగా ప్రజలందరు సొమ్మసిల్లిపోతారు. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః “శంకు ఊదబడును, కావున ఆకాశములలోనూ భూమిలోనూ ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోవుదురు. అల్లాహ్ కోరినవారు తప్ప”. (39:68). అది జుమా (శుక్రవారం) రోజగును. పిదప దైవదూతలు సయితం చనిపోవుదురు. అల్లాహ్ తప్ప మరెవ్వరూ మిగిలి ఉండరు.
3- సమాధుల్లో ఉన్న మానవ దేహాలను మట్టి తినేస్తుంది. కేవలం వెన్నెముకలో ఉండే బీజము తప్ప. కాని ప్రవక్తల దేహాలను మట్టి తినదు. తరువాత అల్లాహ్ వర్షం కుర్పిస్తాడు, దానితో దేహాలు తయారవుతాయి. వారిని లేపాలని అల్లాహ్ ఉద్దేశించినప్పుడు శంకు ఊదే దూత ఇస్రాఫీల్ ను జీవింపజేస్తాడు. అతడు రెండవసారి శంకు ఊదగా అల్లాహ్ అందరినీ జీవింపజేస్తాడు. వారందరూ మొదటిసారి అల్లాహ్ పుట్టించినట్లు నగ్నముగా, సున్నతి చేయబడకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా సమాధుల నుండి లేచి వస్తారు. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః “శంకు ఊదబడినప్పుడు వారంతా గోరీల నుండి లేచి తమ ప్రభువు వైపునకు పరుగెత్తుకుంటూ వస్తారు”. (36:51). అందరికంటె ముందు ప్రవక్త ముహమ్మద్ ﷺ భూమి నుండి వెలికి వస్తారు. తరువాత ప్రజలందరూ ‘మహ్ షర్’ మైదానము వైపునకు వెళ్తారు. అది చాలా విశాలమైన భూమి. అప్పుడు సూర్యుడు ప్రజలకు అతి సమీపంలో ఉంటాడు.
ఆ మైదానంలో ప్రజలు తమ లెక్క, తీర్పు కొరకు చాలా కాలం వేచి ఉంటారు. పిదప అల్లాహ్ వారి మధ్య తీర్పు కొరకు వస్తాడు. నరకంపై వంతెన వేయబడుతుంది. అది వెంట్రుక కన్నా సన్నగా, ఖడ్గం కన్నా పదునైనదిగా ఉంటుంది. దానిపై ప్రజలు తమ కర్మల ప్రకారంగా దాటుదురు. కొందరు కనురెప్ప పాటులో, మరికొందరు గాలి తీరుగా, ఇంకొందరు గుఱ్ఱపు రౌతుగా దాటుతే, అక్కడే కొందరు ప్రాకుచూ దాటుదురు. వంతెనకు కొండ్లుండును. అవి ప్రజలను పట్టి నరకంలో పడవేయును. అయితే అందులో పడువారు అవిశ్వాసులు మరియు పాపాలకు గురి అయిన విశ్వాసుల్లో అల్లాహ్ కోరినవారు. అవిశ్వాసులైతే శాశ్వతంగా అందులోనే పడి ఉంటారు. కాని పాపాలు చేసిన విశ్వాసులు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్షింపబడుతారు. తరువాత అందులో నుండి తీయబడి స్వర్గంలో ప్రవేశించబడుదురు.
స్వర్గవాసులు నరకంపై ఉన్న వంతెన క్షేమంగా దాటిన తరువాత స్వర్గం మరియు నరకం మధ్యలో ఉన్న వంతెనపైకి వచ్చి నిలుస్తారు. వారి పరస్పరం ఒకరిపై ఉండిన మరొకరి హక్కులు చెల్లించబడును. ఎవరైనా ఒకరిపై అన్యాయం చేసి ఉంటే, అతని నుండి పరిహారం బాధితునికి ఇవ్వబడి, వారి హృదయాల కల్ముషాలు దూరము కాక ముందు ఎవరూ స్వర్గంలో ప్రవేశించలేరు. స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో చేరిన పిదప మృత్యువును పొట్టేలు రూపంలో తీసుకు వచ్చి స్వర్గం మరియు నరకం మధ్యలో వారు చూస్తూ ఉండగా ‘జిబ్హ్’ చేయ(కోయ)బడును. స్వర్గవాసులారా! శాశ్వతంగా ఉండండి, ఇక మీకు మరణం లేదు. నరకవాసులారా! మీకూ శాశ్వతం ఇక మరణం లేదు అని అనబడుతుంది. ఒకవేళ మరణం అనేది ఉంటే సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు చనిపోతారు. చింత, బాధతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.
సృష్టికర్త అయిన అల్లాహ్ ఆదేశం: “ప్రజలు, రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి భయపడండి. అది అవిశ్వాసుల కొరకు సిద్ధమైయున్నది“. (2:24).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి తమ సహచరులతో “నరకాగ్ని మీరు రాజేస్తున్న (ఇహలోక) అగ్నికి డెబ్బై రెట్ల ఎక్కువ తీవ్రంగా ఉంటుంది” అని చెప్పారు. అనుచరులు ఈ మాట విని ‘ప్రవక్తా! అల్లాహ్ సాక్షిగా! (కాల్చడానికి) ఈ అగ్నియే సరిపోతుంది కదా’ అని అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నరకాగ్నికి మీ (ప్రాపంచిక) అగ్నిపై అరవై తొమ్మిది రెట్ల ఆధిక్యత ఉంది. దాని డెబ్బై భాగాలలోని ప్రతి భాగం తీవ్రతలో మీ అగ్ని మాదిరిగా ఉంటుంది” అని సమాధానమిచ్చారు. (బుఖారి, ముస్లిం).
నరకంలో ఏడు అంతస్తులుంటాయి. ప్రతి అంతుస్తులో మరోదానికంటే ఎక్కువ శిక్ష ఉంటుంది. ఎవరి కర్మల ప్రకారం వారు అందులో ఉంటారు. మునాఫిఖులు (వంచకులు) నరకంలోని అతిక్రింది స్థానంలో, కఠిన శిక్షలో ఉంటారు. అవిశ్వాసులకు శిక్ష కలకాలం ఉంటుంది. అందులో కాలిపోయినపుడల్లా మరింత శిక్ష కలుగుటకు తిరిగి చర్మం మార్చబడును. అదే విషయం అల్లాహ్ ఇలా తెలిపాడుః
“వారి చర్మం కాలిపోయినపుడల్లా దానికి బదులుగా వేరే చర్మమును, వారు బాధ రుచి చూచుటకై, కల్పించుచుందుము”. (4:56).
“అవిశ్వాసానికి పాల్పడినవారికి నరకాగ్ని ఉన్నది. వారు చనిపోవాలనే తీర్పు ఇవ్వబడదు. వారి నరక యాతనను ఏ మాత్రం తగ్గించడమూ జరగదు. ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్వక్తికీ ప్రతిఫలం ఇస్తాము”. (35:36).
నరకవాసులను సంకెళ్ళతో కట్టి, మెడలలో పట్టీలు వేయబడును. “ఆ రోజు నీవు దోషులను చూస్తావు. వారి చేతులూ, తాళ్ళూ బేడీలతో బంధించబడి ఉంటాయి. వారు తారు వస్త్రాలను ధరించి ఉంటారు. అగ్ని జ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకుంటాయి”. (14: 49,50).
వారి తిండి విషయము ఇలా తెలుపబడిందిః
“నిశ్చయంగా జఖ్కూమ్ వృక్షం పాపాత్ములకు ఆహారం అవుతుంది. అది నూనె మడ్డిలా ఉంటుంది. సలసల కాగే నీరు మాదిరిగా అది కడుపులో మసలుతూ ఉంటుంది”. (4:43,46).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“జఖ్కూమ్ వృక్షం యొక్క ఒక చుక్క భూమిపై పడినచో భూనివాసుల జీవనోపాధి పాడయిపోతుంది. ఇక దాన్ని తినేవారి గతి ఏమవుతుందో?.
నరక శిక్ష యొక్క కఠినత్వాన్ని, స్వర్గం యొక్క భోగభాగ్యాల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీసు విశదీకరిస్తుందిః
“ఇహలోకంలో అత్యధిక సుఖాలను అనుభవించిన అవిశ్వాసిని ఒకసారి నరకంలో ముంచి తీసి, నీవు ఎప్పుడైనా సుఖాన్ని అనుభవించావా? అని ప్రశ్నిస్తే ‘లేదు, ఎప్పుడూ లేదు’ అని బదులిస్తాడు. ఒక్కసారి అందులో మునిగి లేచినందుకు సర్వ సుఖాలను మరచిపోయాడు. అదే విధంగా ప్రపంచంలో బీదరికాన్ని, కష్ట బాధలను అనుభవించిన విశ్వాసిని ఒకసారి స్వర్గంలో ప్రవేశింపజేసి, ఎప్పుడైనా నీవు బీదరికాన్ని కష్టాలను చూశావా? అని ప్రశ్నిస్తే, నేను ఎప్పుడూ చూడలేదని బదులిస్తాడు. ఒకసారి స్వర్గంలో మునిగి లేచినందుకు ఇహలోక బాధలు, కష్టాలు మరచిపోయాడు.”
స్వర్గం పుణ్యపురుషులకు సదా ఉండే గౌరవనీయమైన స్థానం. అందులో ఉన్న అనుగ్రహాలను ఏ కన్నూ చూడలేదు. ఏ చెవి వినలేదు. ఎవరి ఊహలకు అందలేదు. చదవండి దివ్యఖుర్ఆన్ సాక్ష్యం:
“వారి కర్మలకు ప్రతిఫలంగా, కళ్ళకు చలువ కలిగించే ఎటువంటి సామాగ్రి వారి కొరకు దాచి పెట్టబడి ఉందో ఆ సామాగ్రిని గురించి ఏ ప్రాణికి తెలియదు“. (32:17).
అందులో వేరు వేరు స్థానాలు గలవు. విశ్వాసులు తమ కర్మల ప్రకారం అందులో ఉందురు.
“అల్లాహ్ మీలో విశ్వాసులైన వారికి మరియు విద్యగల వారికి పదవులు ఉన్నతములుగా చేయును“. (58:11).
స్వర్గవాసులు తమ ఇష్టానుసారం తింటూ, త్రాగుతూ ఉందురు. అందులో నిర్మలమైన నీటి వాగులు, ఏ మాత్రం మారని రుచిగల పాల కాలువలు, పరిశుద్ధ తేనే కాలువలు, సేవించేవారికి మధురంగా ఉండే మద్య పానాలుండును. వారికివ్వబడే మద్యం ప్రపంచం లాంటింది కాదు. చదవండి దివ్య ఖుర్ఆన్:
“మద్యపు చెలమల నుండి పాత్రలు మాటిమాటికీ నింపబడి వారి మధ్య త్రిప్పబడుతాయి. మెరిసిపోతున్న మధువు, త్రాగేవారికి అది ఎంతో మధురం. దానివల్ల వారి శరీరానికి నష్టం ఉండదు. వారి బుద్ధీ చెడిపోదు“. (37:45-47).
అందులో వారి వివాహం అందమైన కళ్ళుగల సుందర స్త్రీలతో జరుగును. వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః
“స్వర్గంలో ఉన్నటువంటి స్త్రీ భూనివాసుల వైపునకు ఒకసారి తొంగి చూసినచో భూమ్యాకాశాల మధ్య కాంతులీనుతాయి. సువాసనతో నిండిపోతాయి“. (బుఖారి).
స్వర్గవాసులకు లభించే వరాల్లో అతి పెద్ద వరం అల్లాహ్ దర్శనం
వారికి అక్కడ మలమూత్రములు కలగవు. ఉమ్మి, చీమిడీలు ఉండవు. వారికి బంగారపు దువ్వెనలుండును. వారి చెమటలో కస్తూరి లాంటి సువాసన ఉండును. ఈ అనుగ్రహాలు కలకాలముంటాయి. ఇవి తరగవు, నశించవు. ప్రవక్త ﷺ ఉపదేశించారుః “స్వర్గంలో ప్రవేశించినవారికి అనుగ్రహాలు కలకాలముండును. ఏ కష్టమూ ఉండదు. దుస్తులు పాతబడవు. అందులో అతి తక్కువ అదృష్టవంతునికి లభించే వరం ఇహలోకం కంటే పది రెట్లు ఉత్తమమైనది”.
ఇస్లాం ధర్మంలో స్త్రీల స్థానం వారికున్న హక్కులను గురించి చదివే ముందు ఇస్లామేతర మతాల్లో వారికున్న స్థానం, స్త్రీల పట్ల ఉన్న ఆ మతాలవారి వ్యవహారం గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
గ్రీకుల వద్ద స్త్రీ అమ్మబడేది మరియు కొనబడేది. ఆమెకు ఏ హక్కూ లేకుండా ఉండేది. సర్వ హక్కులు పురుషునికే ఉండేవి. ఆస్తిలో వారసత్వము లేకుండా తన స్వంత సొమ్ములో ఖర్చు పెట్టే హక్కు కూడా ఉండేది కాదు. ప్రఖ్యాతిగాంచిన అచ్చటి తత్వవేత్త సుఖరాత్ (Socrates the philosopher) ఇలా అన్నాడుః ‘స్త్రీ జాతి ఉనికి ప్రపంచం యొక్క అధోగతి మరియు క్షీణత్వానికి ఒక మూలకారణం. స్త్రీ ఒక విషమాలిన చెట్టు లాంటిది, చూపుకు ఎంతో అందంగా ఉంటుంది కాని పక్షులు దాన్ని తిన్న వెంటనే చనిపోతాయి’.
రోమన్స్ వారు స్త్రీకి ఆత్మయే లేదనేవారు. వారి వద్ద స్త్రీకి ఏలాంటి విలువ, హక్కు లేకుండింది. ‘స్త్రీకి ఆత్మ లేదు’ అనడం వారి నినాదంగా ఉండేది. అందుకే వారిని స్తంభాలకు బంధించి కాగిన నూనె వారి దేహములపై పోసి వారిని బాధపెట్టేవారు. ఇంతకంటే ఘోరంగా నిర్దోషులైన స్త్రీలను గుఱ్ఱపు తోకతో కట్టి వారు చనిపోయేంత వరకు గుఱ్ఱాన్ని పరిగెత్తించేవారు.
మన భారత దేశంలో కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. అంతేకాదు, దీనికి మరో అడుగు ముందు వేసి భర్త చనిపోతే భార్యను కూడా సతీసహగమనము చేయించేవారు. (స్త్రీలను దేవదాసీలుగా కూడా ఉపయోగించేవారు).
చైనీయులు స్త్రీలను ధనసంపదను మరియు సంతోషాన్ని నశింపజేసే నీటితో పోల్చేవారు. భార్యను అమ్మడము హక్కుగా భావించేవారు. అదే విధంగా ఆమెను సజీవంగా దహనం చేయుట కూడా ఒక హక్కుగా భావించేవారు.
ఇక యూదులు, హవ్వా, ఆదమును కవ్వించి చెట్టు నుంచి పండు తినిపించిందన్న అసత్య ఆరోపణతో స్త్రీ జాతినే శపించబడినదిగా భావించేవారు. స్త్రీ బహిష్టురాలయినప్పుడు తనుండే గృహము, తను ముట్టుకునే ప్రతి వస్తువు అపరిశుభ్రమవుతుందనేవారు. ఆమెకు సోదరులుంటే తన తండ్రి ఆస్తిలో వచ్చే భాగం తనకు ఇచ్చేవారు కారు.
క్రైస్తవులు స్త్రీని షైతాన్ (దయ్యం, పిశాచము) యొక్క ద్వారముగా భావించేవారు. ఒక క్రైస్తవ పండితుడు స్త్రీ విషయములో ఇలా ప్రస్తావించాడుః ‘స్త్రీ మానవ పోలిక గలది కాదు’. బోనావెన్తూర్ (Saint bona ventura: 1217- 1274) ఇలా చెప్పాడుః ‘మీరు స్త్రీని చూసి మానవురాలే కాదు, కౄరజంతువని కూడా అనుకోకండి. మీరు చూసేది షైతాన్ మరియు వినేది కేవలం పాము ఈలలు/బుసబుసలు’.
ఇంగ్లీషువారి చట్టం (Common Law) ప్రకారమయితే గత అర్థ శతాబ్దంలో ‘స్త్రీ’ పౌరుల తరగతులోని ఏ తరగతిలో కూడా లెక్కించబడేది కాదు, మరియు ఆమెకు స్వతహాగా ఏ హక్కు ఉండేది కాదు. చివరికి తను ధరించే దుస్తులు కూడా తన అధికారములో ఉండేవి కావు. క్రీ. శ. 1567న స్కాట్ ల్యాండ్ పార్లమెంటు (Scottish parliament)లో ఏ చిన్న అధికారము కూడా స్త్రీకి ఇవ్వకూడదన్న ఆదేశం జారిచేశారు. హెన్రి8th (Henry VIII) పరిపాలనలో బ్రిటిష్ పార్లమెంటు స్త్రీ అపరిశుభ్రత గలది గనుక బైబిల్ చదవకూడదని చట్టం జారి చేసింది. 1586వ సంవత్సరము ఫ్రాన్సులో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి స్త్రీ మనిషా కాదా అని చర్చించి చివరికి మనిషే కాని పురుషుని సేవ కొరకు పుట్టించబడిందన్న నిర్ణయానికి వచ్చారు. క్రీ. శ. 1805వ సంవత్సరము వరకు బ్రిటిషు చట్టం ‘భర్త తన భార్యను అమ్ముట యోగ్యమే’ అని ఉండింది. మరియు వారు భార్య యొక్క ధర ఆరు పెన్సులు (Six pence ie Half Schilling) నిర్ణయించారు.
అరబ్బులు కూడా ఇస్లాంకు ముందు స్త్రీని చాలా నీచంగా చూసేవారు. ఏ స్థాయి లేకుండా, ఆస్తిలో హక్కు లేకుండా ఉండేది. అనేక అరబ్బులు స్త్రీలను సజీవంగా దహనం చేసేవారు.
స్త్రీ జాతి భరించే ఈ అన్యాయాన్ని తొలగించుటకు, స్త్రీ పురుషులు ఒకటే మరియు పురుషులకున్న విధంగా వారికీ హక్కులున్నవి అని చాటి చెప్పుటకు ఇస్లాం ధర్మం వచ్చింది. ఇదే విషయాన్ని దివ్యగ్రంథం ఖుర్ఆన్ లో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా తెలిపాడుః {మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు}. (49:13). మరో చోట ఇలా సెలవియ్యబడిందిః {మంచి పనులు చేసేవారు పురుషులైనా, స్త్రీలైనా వారు గనుక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు}. (4:124). మరొక చోట ఇలా ఆదేశమివ్వబడిందిః {తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగమని మేము మానవునికి ఉపదేశించాము}. (29:8). ప్రవక్త మహానీయ ముహమ్మద్ ﷺ ఇలా ఉపదేశించారుః “విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవారు సద్ప్రవర్తన గలవారు. మీలో మంచివారు తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారు”. (తిర్మిజి). ‘నా సేవాసద్వర్తనలకు అందరికంటే ఎక్కువ అర్హులు ఎవరు?’ అని ఒక వ్యక్తి ప్రవక్తతో అడిగాడు, “నీ తల్లి” అని చెప్పారు మహాప్రవక్త ﷺ. ‘మళ్ళీ ఎవరు?’ అని అడిగాడు ఆ వ్యక్తి. “నీ తల్లి” అని చెప్పారు ప్రవక్త. ‘మళ్లీ ఎవరు’ అని అడిగాడు ఆ మనిషి. “నీ తల్లి” అని సమాధానమిచ్చారు. మరో సారి అడిగాడు ‘మళ్లీ ఎవరు’ అని, “నీ తండ్రి” అని బదులిచ్చారు మహానీయ ﷺ . (ముస్లిం).
ఇస్లాం దృష్టిలో స్త్రీ స్థానం ఎలా ఉందో సంక్షిప్తంగా పైన తెలుపబడినది.
1- స్వామ్యం (Ownership): బిల్డింగ్, పంటలు, పొలాలు, ఫ్యాక్టరీలు, తోటలు, బంగారం, వెండి మరియు అన్ని రకాల పశువులు. వీటన్నిట్లో స్త్రీ తను కోరినవి తన యజమాన్యంలో ఉంచుకోవచ్చును. స్త్రీ భార్య, తల్లి, కూతురు మరియు చెల్లి, ఏ రూపములో ఉన్నా, పై విషయాలు తన అధికారములో ఉంచ వచ్చును.
2- వివాహ హక్కు, భర్తను ఎన్నుకునే హక్కు, భర్తతో జీవితం గడపడంలో నష్టము ఏర్పడినప్పుడు వివాహ బంధమును తెంచుకొని విడాకులు కోరే హక్కు. ఇవి స్త్రీ యొక్క ప్రత్యేక హక్కులని రుజువైనది.
3- విద్యః తనపై విధిగా ఉన్న విషయాలను నేర్చుకునే హక్కు. ఉదాః అల్లాహ్ గురించి, తన ప్రార్థనలు మరియు వాటిని చేసే విధానం గురించి తెలుసుకొనుట తనపై విధియైఉన్న హక్కులు. తను ఎలాంటి ప్రవర్తనలు నేర్చుకోవాలి, ఏలాంటి సంస్కారము సభ్యత, పాటించాలి అనే విషయాలు తెలుసుకొనుట ప్రతి స్త్రీ యొక్క హక్కు. ఇవన్ని అల్లాహ్ యొక్క ఈ ఆదేశానుసారంగాః {అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైనవాడు ఎవడు లేడని బాగా తెలుసుకో}. (47:19). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారుః “విద్యనభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా యున్నది”.
4- తన స్వంత ధనము నుంచి తను కోరినట్లు తనపైగాని, ఇతరులపైగాని -వారు తన భర్త, సంతానము, తండ్రి లేక తల్లి ఎవరయినా సరే- ఖర్చు చేసే హక్కుంది. కాని హద్దులు మీరి, వ్యర్థమైన ఖర్చులు చేయకూడదు. (అలా చేసినచో, నిరోధించడం భర్త విధి). ఖర్చు చేయడంలో పురుషునికెంత అధికారముందో స్త్రీకి కూడా అంతే ఉంది.
5- తన స్వంత ధనము నుంచి తన జీవితములోనే మూడవ వంతు ధనము గురించి తను కోరినవారికి వసియ్యత్ (వీలునామా) చేయవచ్చును. తను చనిపోయిన తరువాత ఆమె ఆ వసియ్యత్ ను ఏలాంటి అభ్యంతరం లేకుండా జారి చేయించవచ్చును. ఎందుకనగా వసియ్యత్ ప్రతి ఒక్కరి స్వంత విషయము. పురుషులకున్న విధంగా స్త్రీలకు కూడా ఈ హక్కు ఉంది. కాని పురుషులైనా, స్త్రీలైనా తమ ఆస్తిలోని మూడవ వంతు కంటే ఎక్కువ వసియ్యత్ చేయకూడదు మరియు అల్లాహ్ నిర్ణయించిన వారసుని కొరకు వసియ్యత్ చేయకూడదు.
6- ధరించడంలో తాను కోరిన విధంగా పట్టు, బంగారం ఇంకేవైనా ధరించవచ్చును. -అయితే పట్టు, బంగారం పురుషుల కొరకు నిషిద్ధం.- కాని ధరించి కూడా నగ్నత్వాన్ని మరియు అర్థనగ్నత్వాన్ని కనబరచే దుస్తులు భర్త తప్ప ఇతరుల ఎదుట ధరించరాదు.
7- కంట్లో కాటిక, బుగ్గల మీద స్నో, పౌడరు పూసుకొని (ఇతరుల కొరకు కాదు) తన భర్త కొరకు సింగారించుకొనుట. ఇంకా సువాసనగల సుందర దుస్తులు ధరించుట స్త్రీ యొక్క హక్కు.
8- తనకిష్టమైన వస్తవులు తినే, త్రాగే హక్కు ఆమెకుంది. తినేత్రాగే విషయాల్లో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసము లేదు. పురుషులకు యోగ్యమున్నవే స్త్రీలకూ యోగ్యం. ఇక నిషిద్ధమున్నవి ఇద్దరికీ నిషిద్ధం. మానవులదంరిని ఉద్దేశించి ఇచ్చిన అల్లాహ్ ఆదేశం చదవండిః {తినండి, త్రాగండి. మితిమీరకండి. అల్లాహ్ మితిమీరేవారిని ప్రేమించడు}. (7:31).
9- తన తండ్రి, భర్త, కొడుకు వగైరాల ఆస్తిలో ఆమెకు హక్కు గలదు. అలాగే ఆమె ఆస్తిలో వారి దగ్గరివారికి హక్కు గలదు.
స్త్రీ యొక్క ప్రత్యేక హక్కుల్లో భర్తపై ఉన్న తన భార్య హక్కులు.
అల్లాహ్ ఆదేశానుసారంగా ఇవి భర్తపై ఉన్న భార్య యొక్క హక్కులు. అల్లాహ్ ఆదేశం ఇదిః {మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి}. (2:228). భార్య యొక్క హక్కులను సంపూర్ణంగా నెరవేర్చుట భర్తపై విధిగా ఉంది. హాఁ ఆమె తనకుతానుగా, తనిష్టముతో కొన్ని హక్కులకు మినహాయింపు ఇస్తే అది ఆమె ఇష్టం.
1- భర్త తన శక్తికొలది కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా భార్య యొక్క పోషణ, వస్త్ర, చికిత్స మరియు గృహ మొ!నవి వసతుల ఏర్పాటు చేయాలి.
2- తన భార్య యొక్క ధన, ప్రాణము, ధర్మం, మానమును కాపాడాలి.
3- ధర్మానికి సంబంధించిన అనివార్యమైన విషయాలు భార్యకు నేర్పాలి. ఆతను నేర్పలేకపోతే స్త్రీల విద్యాబోధన ప్రత్యేక సమావేశాల్లో, కేంద్రాల్లో, మసీదుకు వెళ్ళి అచ్చట నేర్చుకొనుటకు అనుమతివ్వాలి. అక్కడికి వెళ్ళడంలో ఏలాంటి కీడు జరగకుండా శాంతి ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఏలాంటి నష్టము కలిగే భయం ఉండకూడదు.
4- {తమ భార్యలతో మంచివిధంగా మెలగండి}(4:19) అన్న అల్లాహ్ ఆదేశం ప్రకారం వారితో మంచి విధంగా మెలగాలి. అంటేః ఆమె యొక్క సంభోగ హక్కులో కొరత రానివ్వరాదు. తిట్టి, దూషించి, హీనపరచి బాధ కలిగించరాదు. ఏలాంటి నష్టము లేనప్పుడు తన బంధువులను దర్శించడం నుండి వారించరాదు. శక్తికి మించిన భారం ఆమెపై వేయరాదు. మనసా వాచా కర్మాన ఆమెకు మేలే చేయాలి. ప్రవక్త ﷺ ఇలా సెలవిచ్చారుః “మీలో మంచివారు ఎవరయ్యా అంటేః తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారు. నేను నా భార్యల పట్ల మంచిగా మెలిగేవాణ్ణి”.
కుటుంబ జీవితం విఛ్చిన్నం కాకుండా, అధోగతి వైపునకు పోకుండా సురక్షితంగా ఉండాలని ఇస్లాం చాలా ప్రోత్సహించింది. మనిషి సుఖంగా ఉండి, సమాజం పరిశుద్ధంగా ఉండుటకు, దాన్ని మంచి సభ్యత, మంచి గుణాల బలమైన అడ్డుతో రక్షణ కల్పించి కాపాడింది. ఈ గుణాలను పాటిస్తే భావోద్రేకాలు ఉద్భవించవు. మనోవాంఛలకు తావు ఉండదు. ఉపద్రవాలకు తావు ఇచ్చే కోరికలను కూడా ఆపుటకు అడ్డు ఖాయం చేసి స్త్రీ పురుషులు తమ కంటి చూపులను క్రిందికి జేసుకోవాలని ఆదేశమిచ్చింది. దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో సూర నూర్ (24:30-31) చదవండి.
స్త్రీ యొక్క గౌరవానికి, తాను అవమానము పాలు కాకుండా బంధ్రంగా ఉండుటకు, నీచ మనస్సుగలవారు మరియు అల్లకల్లోలం సృష్టించేవారు అమె నుంచి దూరముండుటకు, గౌరవమర్యాదల విలువ తెలియని మూర్ఖుల నుంచి భధ్రంగా ఉండుటకు, విషపూరితమైన చూపులకు కారణమగు ఉపద్రవాలను అడ్డుకొనుటకు, స్వయంగా స్త్రీ గౌరవము, తన మానము యొక్క బధ్రతకు అల్లాహ్ పర్ద యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
ఇస్లాం పర్దాను విధిగా చేసి స్త్రీలకు శాంతియుతమైన, గౌరవజీవితం ప్రసాదించింది. ఎందుకంటే స్త్రీ వయసుమల్లిన తరువాత కొంతవరకు అందాన్ని కోల్పోతుంది. ఇక పురుషుడు దారిన వెళ్ళినప్పుడు యౌవనంలో ఉన్న అందకత్తెలను చూసి, తన ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన ఇల్లాలిని వారితో పోలుస్తాడు. అక్కడి నుండే మొదలవుతాయి సంసార సాగరంలో తూఫానులు.
సుమారు మానవ చరిత్ర ఉన్నప్పటి నుండే బహుభార్యత్వం ఉంది. అందుకే యూద, క్రైస్తవ లాంటి పూర్వ ధర్మాల్లో, ప్రాచీన చైనా మరియు భారత సంస్కృతుల్లో కూడా ఉండినది. అయితే హద్దు లేకుండా భార్యలను ఉంచుకునేవారు. అందుకు స్త్రీ అన్యాయానికి గురి అవుతూ ఉండేది. ఇస్లాం వచ్చాక స్త్రీ జాతి భరిస్తున్న అన్యాయాన్ని తొలగించి నాలుగు భార్యల వరకు ఒకే సమయంలో ఉంచుకోవచ్చన్న హద్దు నిర్ణయించింది. ఇస్లాం దీని గురించి విచ్చలవిడిగా అనుమతించలేదు. ఒక షరతు విధించింది. అది వారి మధ్య న్యాయం పాటించటం. ఈ షరతును పాటించకుండా దీనికి పాల్పడేవాడికి కరకుగా హెచ్చరించింది. ఘోరశిక్ష ఉందని తెలిపింది.
ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల పురుషుడు బహుభార్యత్వం వైపుకు మొగ్గు చూపుతాడు. ఉదాహరణకు భార్య గొడ్డురాలు కావచ్చు, లేదా ఏదైనా రోగానికి గురి కావచ్చు. లేక మరేదైనా కారణం కావచ్చు. ఇలాంటి స్త్రీ కొరకు ఆమె భర్త ఆమెకు విడాకులివ్వడం మంచిదా? లేక ఆమెను తన వివాహబంధంలో ఉంచుకొని మరొకామెను వివాహమాడడం మంచిదా?
బహుభార్యత్వం వలన మన సమాజానికి మేలే చేకూరుతుంది. ఎలా అనగా యుద్ధాలు తదితర కారణాల వల్ల స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది. ఉదాహరణకు: ప్రపంచ యుద్ధంలో కేవలం యూరప్ లో 25మిలియన్ల స్త్రీలు విధవలు అయ్యారు. ఈ స్త్రీలు భర్తలు లేకుండా ఉండిపోవడం మంచిదా? లేక రెండవ భార్యగా ఒక భర్త ఛాయలో ఉండడం మేలా? రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1945లో స్వయంగా స్త్రీలు జర్మన్ లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి ‘స్త్రీల మేలు కొరకు బహుభార్యత్వ చట్టాన్ని తీసుకురావాలని, లేనిచో తమ అతివిలువైన సొమ్మును (పరువు, మానమును) ఒక వృత్తిగా చేసుకోనున్నారు’ అని డిమాండ్ చేశారు.
ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని గమనించాక, అల్లాహ్ వద్ద ముక్తి పొందే మార్గం ఇదేనని గ్రహించిన ప్రతి ఒక్కరు అందులో ప్రవేశించుట తప్పనిసరి. దాన్ని అనుసరించకుండా ఏ మనిషికీ స్వర్గం ప్రాప్తికాదు. నరకం నుండి ముక్తి లభించదు. ఇందులో ప్రవేశ విధానం ఏమిటని నీవు అడగదలుచుకుంటే? ఇదిగో జవాబుః నీవు ఇస్లాంను స్వీకరించాలనుకుంటే నీవుః “లాఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్”ను (అంటే అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడు. ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని) సంపూర్ణ విశ్వాసంతో నోటితో పఠించు. పిదప ఇస్లాంకు సంబంధించిన విషయాలను నేర్చుకుంటూ ఉండు, ఒక్కో విషయాన్ని ఆచరించు. ఉదాహరణకుః నమాజ్ ఆచరించాలి, దాని విధానం నేర్చుకోవాలి. అలాగే ఇతర ఆదేశాలు. ఇస్లామీయ బోధనలను వివరించు లెట్రిచర్ / సాహిత్యం చాలా ఉన్నాయి. వాటిని చదవడం మరువకండి. మమ్మల్ని సంప్రదించండి.
[2] మానవుడు చేసే శాసన నిర్మాణాలు అల్లాహ్ శాసనాలకు విరుద్ధంగా లేనిచో వాటిని అమలు పరచుట తప్పేమి కాదు.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ధర్మ శాస్త్ర శాసనాలు (Fiqh Islami) (జకాత్ ఆదేశాలు, అన్నపానియాల ఆదేశాలు, వస్త్రాధరణ ఆదేశాలు, వైవాహిక ధర్మాలు) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్జ్, ఉమ్రా ఆదేశాలు – Rulings of Hajj and Umrah అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
ఇస్లాం మూల స్తంభాలు ఐదున్నవి: అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడు లేడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట. నమాజు స్థాపించుట. విధి దానము (జకాత్) చెల్లించుట. హజ్ చేయుట. రమజాను నెల ఉపవాసం ఉండుట. (బుఖారి 8, ముస్లిం 16).
దాని ఘనతః అల్లాహ్ సాన్నిధ్యంలో చేర్పించు సత్కార్యాలలో హజ్ అతిగొప్పది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
ఎవరైతే ఏలాంటి వాంఛలకు లోనవకుండా, దైవ ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా హజ్ చేసి తిరిగి వెళ్తారో, వారు తమ తల్లి గర్భము నుంచి పుట్టినప్పటి స్థతిలో తిరిగి వెళ్తారు. (బుఖారి 1819, ముస్లిం 1350).
హజ్ నిబంధనలు
తెలివిగల, యుక్తవయస్సుకు చేరిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా ఉంది. అతను దానికి అర్హుడైనప్పుడు. అంటే తన బాధ్యతలో ఉన్నవారి ఖర్చులు చెల్లించాక, అతని వద్ద మక్కా రాను, పోను పూర్తి ప్రయాణ ఖర్చులు ఉండాలి. ప్రయాణ దారి నిర్భయంగా ఉండాలి. శారీరకంగా ఆరోగ్యవంతుడై యుండాలి. హజ్ చేయుటకు ఆటంకం కలిగించే అంగవైకల్యం మరే శారీరక రోగం ఉండ కూడదు. ఇక స్త్రీ విషయంలో గత నిబంధనలతో పాటు తనతో తన ‘మహ్రమ్’ (వివాహ నిషిద్ధమైన బంధువు) ఉండాలి. అంటే భర్త, లేక ఆమె దగ్గరి మహ్రమ్ లో ఏవరైనా ఒకరు ఉండాలి. ఆమె (తన భర్త చనిపోయినందుకు లేదా విడాకులు పొంది- నందుకు) గడువులో కూడా ఉండ కూడదు. ఎందుకనగా గడువులో ఉన్నవారు ఇంటి బైటికి వెళ్ళుట అల్లాహ్ నిషేధించాడు. ఎవరికి ఇలాంటి ఆటంకాలు ఎదురగునో వారిపై హజ్ విధిగా లేదు.
హజ్ సిద్ధాంతములు
1- హాజి హజ్ కొరకు పయణమయ్యే ముందు హజ్, ఉమ్రా పద్ధతులను తెలుసుకొని ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాలు చదివి లేదా పండితులతో ప్రశ్నించి ఇంకే విధంగానైనా సరే తెలుసుకోవాలి.
2- మేలు విషయాల్లో సహాయపడే మంచి మిత్రుని వెంట వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒక వేళ ధర్మజ్ఞాని, లేదా ధర్మజ్ఞాన విద్యార్థి తనకు తోడుగా ఉంటే మరీ మంచిది.
3- హజ్ ఉద్దేశం అల్లాహ్ అభీష్టాన్ని, ఆయన సన్నిధానమును పొందుటయే ఉండాలి.
4- వృధా మాటల నుండి నాలుకను కాపాడాలి.
5- ఎవరికీ బాధ కలిగించకుండా ఉండాలి.
6- స్త్రీ పర్ద చేయు విషయంలో, జన సమ్మూహం నుండి దూరముండుటకు అన్ని రకాల ప్రయత్నం చేయాలి.
7- హాజి తనకు తాను అల్లాహ్ ఆరాధనలో ఉన్నట్లు, లోక సంచారములో కాదని భావించాలి. కొందరు హజ్ యాత్రికులు అల్లాహ్ వారికి సన్మార్గము చూపుగాకా! వారు హజ్ యాత్రను వినోద విహారమునకు, ఫోటోలు, వీడియోలు తీయుటకు సదావకాశముగా భావిస్తారు. (ఇది తప్పు).
ఇహ్రామ్
‘ఇహ్రామ్’ హజ్ ఆరాధనలోకి ప్రవేశము. హజ్ లేక ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ‘ఇహ్రామ్’ విధిగా ఉంది. హజ్ లేక ఉమ్రా చేయు వ్యక్తి మక్కా బయటి నుండి వచ్చే వారయితే ప్రవక్త నియమించిన మీఖాతుల్లో ఏ ఒక మీఖాతు నుండైనా ఇహ్రామ్ చేయాలి. ఆ మీఖాతులు ఇవిః
1- ‘జుల్ హులైఫ’: ఇది మదీనకు సమీపంలో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు ‘అబ్ యారె అలీ’. ఇది మదీనవాసుల మీఖాత్. 2- ‘అల్ జుహ్ ఫ’: అది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచే ఇహ్రామ్ చేస్తున్నారు. ఇది సిరీయా వారి మీఖాతు. 3- ‘ఖర్నుల్ మనాజిల్’ (‘అస్సైలుల్ కబీర్’): ఇది తాయిఫ్ కు సమీపాన ఒక ప్రాంతం. ఇది నజ్ద్ వారి మీఖాత్. 4- ‘యలమ్ లమ్’: ఇది యమన్ వారి మీఖాత్. 5- ‘జాతు ఇర్ఖ్’: ఇది ఇరాఖ్ వారి మీఖాత్.
పై మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించారు. అవి మేము తెలిపిన వారి ప్రాంత నివాసుల మరియు వారి తప్ప ఎవరైతే హజ్ లేక ఉమ్రా చేయుటకు వాటి నుండి దాటుతారో వారికి కూడాను. ఇక మక్కా నివాసులు మరియు ‘అహ్లుల్ హిల్ల్’ (మక్కా నగరానికి బయట మరియు మీఖాతు లోపల నివసించువారు) తమ ఇంటి నుండే ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్ ధర్మములు
ఇహ్రామ్ కు ముందు చేయవలసిన ధర్మములు:
1- గోర్లు, చంకల మరియు నాభి క్రింది వెంట్రుకలు తీయాలి. మీసాలు కత్తిరించాలి. స్నానం చేసి, సువాసన శరీరానికి పూసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులకు పూసుకోవద్దు.
2- కుట్టిన బట్టలు తీసి, ఒక పంచి కట్టుకొని, ఒక దుప్పటి వేసుకోవాలి. స్త్రీ తనకిష్టమైన బట్టలు ధరించవచ్చును. అయితే పూర్తి పర్ద చేయాలి. అలంకరణ ప్రదర్శించకుండా ఉండాలి. పరపురు- షులు ఎదురయ్యే సమయాన ముఖము, అరచేతుల పర్ద కూడా చేయుటకు ప్రయత్నిం- చాలి. చేతుల్లో గ్లౌసులు, ముఖముపై నఖాబ్ వేయ కూడదు.
3- మస్జిద్ కు వెళ్ళి నమాజ్ సమయమయితే జమాఅతుతో నమాజు చేసుకోవాలి. లేనిచో రెండు రకాతులు ‘తహియ్యతుల్ వుజూ’ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇహ్రామ్ చేయాలి.
అన్సాకుల్ హజ్ మూడు రకాలు
1- హజ్జె తమత్తుఅ: ముందు ఉమ్రా యొక్క ఇహ్రామ్ మాత్రమే చేయాలి. ఉమ్రా చేసిన తరువాత హలాల్ అయిపోయి, మళ్లీ హజ్ రోజున మక్కాలో తానున్న ప్రాంతము నుండే హజ్ కొరకు ఇహ్రామ్ చెయ్యాలి. మీఖాతులో ఇలా అనాలి. లబ్బైక్ ఉమ్రతన్ ముతమత్తిఅన్ బిహా ఇలల్ హజ్. హజ్జె తమత్తుఅ మిగిత రెండు రకాల కంటే చాలా శ్రేష్ఠమైనది. అది ముఖ్యంగా హాజి హజ్ సమయానికి ముందుగా మక్కాలో వచ్చి ఉంటే. ఇందులో హాజీ ఒక బలిదానము తప్పక ఇవ్వాలి. ఒక వ్యక్తి తరఫున ఒక మేక మరియు ఏడుగురి తరఫున ఒక ఒంటె లేక ఒక ఆవు సరిపోతుంది.
2- ‘హజ్జె ఖిరాన్’: ఒకే సమయంలో ఉమ్రా మరి
హజ్ ఇహ్రామ్ చేయాలి. లబ్బైక్ ఉమ్రతన్ వ హజ్జన్ అనాలి. ముందు ఉమ్రా చేసి (అంటే తావాఫ్, సఈ చేసి, తల వెంట్రుకలు తీయకుండా) అదే ఇహ్రామ్ లో ‘యౌమున్నహర్’ (10వ తేది) వరకు ఉండాలి. ఇలా ఉమ్రా తరువాత హలాల్ గాకుండా హజ్ లో చేరడం అవుతుంది. ఈ రకమైన హజ్ సామాన్యంగా హజ్ ఆరంభానికి అతి సమీపంలో వచ్చినవారు చేస్తారు. ఉమ్రా చేసి హలాల్ అయి మళ్ళీ హజ్ కొరకు ఇహ్రామ్ చేసే సమయం ఉండదు గనక. లేదా బలి జంతువు తమ వెంట తీసుకొచ్చిన వారు చేస్తారు. ఈ హజ్ లో కూడా బలిదానం తప్పనిసరి.
3- ‘హజ్జె ఇఫ్రాద్’: కేవలం హజ్ సంకల్పం మాత్రమే చేయాలి. మీఖాత్ లో లబ్బైక్ హజ్జన్ అనాలి. ఇందులో బలిదానం అవసరం లేదు.
విమానంలో ప్రయాణించువారు మీఖాత్ కు సమాన ప్రాంతం వద్దనే ఇహ్రామ్ చేయాలి. మీఖాత్ ఏర్పాటు కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు కూడా చేయవచ్చును. ఇక మీఖాత్ వద్ద చేసే పనులు; గోళ్ళు తీయడం, స్నానం చేసి, శరీరానికి సువాసన పూసుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులు ధరించడం లాంటివన్నీ విమానంలో లేదా అందులో పయనమయ్యే ముందు పూర్తి చేసుకోవాలి. మీఖాత్ వద్ద లేదా దానికి కొంచెం ముందు చేరుకున్నప్పుడు ఇహ్రాం సంకంల్పం చేయాలి.
ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధం అగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధనలో ప్రవేశించాడు. అతనిపై క్రింది విషయాలు నిషిద్ధం:
1- తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం నిషిద్ధం. కాని అవసరమున్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు.
2- గోళ్ళు తీయుట నిషిద్ధం. కాని గోరు విరిగినా, నొప్పి ఉన్నా దానిని తీయుట పాపం కాదు.
3- సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం నిషిద్ధం.
4- సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు నిషిద్ధం. ఉదా: పెళ్ళి చేసుకొనుట, చేయించుట, భార్యభర్తల సరసాలడడం వగైరా.
5- చేతులలో గ్లౌసులు వేసుకొనుట నిషిద్ధం.
6- వేటాడుట నిషిద్ధం.
పై ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఇక ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధం ఉన్న విషయాలు దిగువ తెలుపబడుతున్నవి.
1- కుట్టిన బట్టలు ధరించడం నిషిద్ధం. కాని అవసరముంటే బెల్ట్, గడియారం మరియు కళ్ళ జోళ్ళు ఉపయోగించవచ్చును.
2- తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉపయోగించడం నిషిద్ధం. కాని అంటుకొని ఉండని గొడుగు, వాహణము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించడం యోగ్యం.
3- మేజోళ్ళు తొడుగుట నిషిద్ధం. కాని సైండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడే బూట్లు ఉపయోగించ వచ్చును.
పై నిషిద్ధ కార్యాలు చేసినవాని 3 స్థితులు:
1- అకారణంగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును. ఇంకా అతనిపై ‘ఫిద్య’ (ప్రాయశ్చితం) కూడా విధియగును.
2- ఏదైనా అవసరం ఉండి చేసిన వ్యక్తి పాపా- త్ముడు కాడు. కాని ప్రాయశ్చితం చెల్లించాలి.
3- ఏదో కారణంగా -ఉదా: తెలియక, మరచి- పోయి, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై- చేసిన వ్యక్తి పాపాత్ముడూ కాడు, అతనిపై ప్రాయశ్చితమూ లేదు.
తవాఫ్
ఇతర మస్జిదుల మాదిరిగా మస్జిదె హరాంలో కూడా కుడి కాలుతో ప్రవేశిస్తూ ఈ దుఆ చదవడం ధర్మం. బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
بِسْمِ الله وَالصَّلاَةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله اللَّهُمَّ اغْفِرْ لِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
కాబా తవాఫ్ చేయుటకు దానివైపున వెళ్ళాలి.
తవాఫ్: అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశ్యంతో కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చేయుట. అది హజ్రె అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. మొదటి మూడిట్లో దగ్గర దగ్గర అడుగులు వేసి పరుగెత్తుట ధర్మం. కాని ఎవరికీ ఇబ్బంది కలగించకూడదు. దీనినే ‘రమ్ల్’ అంటారు. పైన కప్పుకున్న దుప్పటిని కుడి భుజము క్రింది నుండి తీసుకొని ఎడమ భుజముపై వేసుకోవాలి. అంటే కుడి భుజము పైన బట్ట ఉండకూడదు. దీనిని ‘ఇజ్తిబాఅ’ అంటారు. ఇవి రెండు (రమ్ల్, ఇజ్తిబాఅ) ఉమ్రా లేక హజ్ ఉద్దేశ్యంతో మక్కా వచ్చి చేసే తొలి తవాఫ్ లో మాత్రమే చేయాలి. కాబా ఎడమ వైపు ఉండాలి. తవాఫ్ వుజూ స్థితిలో చేయుట తప్పనిసరి. ఇక తవాఫ్ ఈ విధంగా చేయాలి:
1- హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేయితో దానిని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలవుతే దాన్ని చుంబించాలి. చుంబిం- చడం వీలు కాకుంటే దాన్ని చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. ఇక తవాఫ్ ప్రారంభించాలి. ఇష్టానుసారం, తన భాషలో తన కొరకు, తను కోరినవారి కొరకు దుఆ చేస్తూ లేదా ఖుర్ఆన్ పారయణం చేస్తూ ఉండాలి. ఇచ్చట ప్రత్యేకంగా ఏ దుఆ లేదు.
2- రుక్నె యమాని వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే (తవాఫ్ చేస్తూ ఉండాలి). చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. ఈ రుక్నె యమాని మరియు హజ్రె అస్వద్ మధ్య ఈ దుఆ చదవాలి: రబ్బనా ఆతినా ఫిద్దున్ యా హసనతౌఁ వఫిల్ ఆఖిరతి హసనతౌఁ వఖినా అజాబన్నార్. (చూడండి సూర బఖర 2:201).
3- హజ్రె అస్వద్ వద్ద చేరుకొని దాన్ని చెయ్యితో ముట్టుకుంటూ, వీలు కాకుంటే దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి.
ఈ విధంగా 7 ప్రదక్షిణాల్లో ఒకటి పూర్తయింది.
4- మిగితవి మొదటి దాని లాగే చేస్తూ, హజ్రె అస్వద్ చేరుకున్నప్పుడల్లా మరియు ఏడవది పూర్త- యిన తరువాత కూడా అల్లాహు అక్బర్ అనాలి.
తవాఫ్ తరువాత:
తవాఫ్ తరువాత మఖామె ఇబ్రాహీం వెనక – అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా- నిలబడి రెండు రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజు చేస్తున్నప్పుడు దుప్పటి రెండు భుజాలపై ఉండుట తప్పనిసరి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకుడదు. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ రెండవ రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ హువల్లాహు అహద్ చదవాలి. జనసమ్మర్థంలో దాని వెనక నమాజ్ చేయుట సాధ్యపడకుంటే మస్జిదె హరాంలో ఏక్కడైనా చేయవచ్చును.
సఈ
ఇక ‘మస్అ’ (సఫా, మర్వాల మధ్యలో ‘సఈ’ చేసే స్థలం) వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుం- టూ “ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్” చదివాలి. సఫా కొండపై ఎక్కి కాబా దిశలో నిలబడి చేతులు ఎత్తి అల్లాహ్ స్తోత్రము పఠించి, ఈ దుఆ మూడు సార్లు చదవాలి. దాని మధ్యలో రెండు సార్లు తనిష్టానుసారం దుఆ చేసుకోవాలిః లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాఇలాహ ఇల్ల- ల్లాహు వహ్ దహూ అంజజ వఅదహూ వనసర అబ్ దహూ వహజమల్ అహ్ జాబ వహ్ దహూ.
ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు గుర్తులు ఉన్న స్థలంలో శక్తి ప్రకారం పరుగుతీయడం ధర్మం. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరవవద్దు. ఈ పరుగు పురుషులకే ప్రత్యేకం. స్త్రీలకు దీని అనుమతి లేదు. మర్వా చేరుకొని దానిపై ఎక్కి ఖిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దుఆ చెయ్యాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దుఆ కూడా చేసు కోవాలి. ఇక్కడికి ఏడిట్లో ఒకటి పూర్తయింది. మిగిత ఆరు ఇలాగే పూర్తి చేయాలి. ప్రతీ సారి సఫా మరియు మర్వాల వద్ద దుఆ చేయాలి. పచ్చ రంగు స్తంభాల మధ్య పరుగుతీయాలి. సఈ మధ్యలో దుఆ ఎక్కువగా చేయాలి. ఏడిట్లో ప్రతీ ఒక దానికొక వేరు దుఆ అంటూ ప్రవక్తతో రుజువు లేదు.
హాజి తమత్తుఅ చేయువాడైతే సఈ తర్వాత తల వెంట్రుకలు తీయించుకొని ఉమ్రా ముగించాలి. సాధారణ దుస్తులు ధరించి ఇహ్రామ్ నుండి హలాల్ అవ్వాలి. జిల్ హిజ్జ ఎనిమిదవ రోజున జొహ్ర్ నమాజుకు కొంచెం ముందు తనున్న ప్రాంతం నుండే హజ్ కొరకు ఇహ్రాం చేస్తూ, ఉమ్రా కొరకు ఇహ్రామ్ చేయు సందర్భంలో చేసిన పనులు ఇప్పుడు చేసి హజ్ సంకంల్పం మనుసులో చేసుకొని లబ్బైక్ హజ్జన్ అనాలి. ఆ తరువాత తల్ బియ చదవాలి. కాని ఖిరాన్, ఇఫ్రాద్ చేయువారు సఫా మర్వాల మధ్య సఈ పూర్తి చేసి, వెంట్రుకలు తీయకుండా, ఇహ్రాం స్థితిలోనే ఉండాలి.
జిల్ హిజ్జ ఎనిమిదవ రోజు
ఈ రోజు హాజి మినా వెళ్ళి జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు చేయాలి. ప్రతి నమాజు దాని సమయంలో మరియు నాలుగు రకాతుల నమాజు ఖస్ర్ చేసి రెండు రకాతులు చేయాలి.
తొమ్మిదవ రోజు (అరఫ రోజు)
ఈ రోజు చేయు ధర్మములు ఇవి:
1- సూర్యోదయము తరువాత హాజి అరఫాత్ వెళ్ళి అచ్చట సూర్యాస్తమయం వరకు ఉండాలి. పొద్దు వాలిన తరువాత జొహ్ర్, అస్ర్ కలిపి ఖస్ర్ చేయాలి. నమాజ్ తరువాత అల్లాహ్ స్మరణము, దుఆ మరియు తల్ బియలో నిమగ్నులై, వినయ వినమ్రతతో అల్లాహ్ ను వేడుకుంటూ తన కొరకు మరియు ముస్లిముల కొరకు అల్లాహ్ తో అడుగుతూ తనిష్ట ప్రకారం దుఆ చేసుకోవాలి. చేతులు ఎత్తి దుఆ చేయడం చాలా మంచిది. అరఫాత్ లో నిలవడం హజ్ రుకున్ లలో ఒకటి. ఇచ్చట నిలవనివారి హజ్ కానేకాదు. ఇచ్చట నిలుచు సమయం 9వ జిల్ హిజ్జ సూర్యోదయం నుండి 10వ జిల్ హిజ్జ ఉషోదయం వరకు. ఎవరైతే ఈ పగలు మరియు రాత్రిలో ఏ కొంత సమయం నిలిచినా వారి హజ్ సరియగును. హాజి అరఫాత్ హద్దు లోపల ఉండుట తప్పనిసరి. ఆ రోజున హద్దు లోపల ఉండకుండా బైట ఉన్నవారి హజ్ నెరవేరదు.
2- అరఫ రోజు కచ్చితంగా సూర్యాస్తమయం అయిన పిదప అరఫాత్ నుండి ముజ్ దలిఫా వైపునకు పూర్తి శాంతి, మర్యాదతో ఘనమైన శబ్దముతో తల్ బియ చదువుతూ వెళ్ళాలి.
ముజ్ దలిఫా
ముజ్ దలిఫా చేరుకొని మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి ఖస్ర్ చేయాలి. నమాజు తరువాత తన స్వంత పనులు చేసుకోవచ్చును. అది భోజనం తయారీ, తదితర పనులు. చురుకుదనంతో ఫజ్ర్ నమాజుకు మేల్కొనుటకు తొందరగా పడు కోవడం చాలా మంచిది.
పదవ రోజు (పండుగ రోజు)
1- ఫజ్ర్ నమాజు సమయమయిన వెంటనే నమాజు చేసుకొని అక్కడే కూర్చోని ప్రకాశమాన వరకు అధికంగా జిక్ర్, దుఆలు చేస్తూ ఉండాలి.
2- ఏడు చిన్న రాళ్ళు తీసుకొని సూర్యోదయాని- కి ముందే తల్ బియ చదువుతూ మినా వెళ్ళాలి.
3- జమ్ర అఖబ (జమ్ర కుబ్రా, సామాన్యాంగా ప్రజలు దాన్ని పెద్ద షైతాన్ అంటారు) చేరుకునే వరకు తల్ బియ చదువుతూ ఉండాలి. ఏడు రాళ్ళు, ప్రతి రాయి అల్లాహు అక్బర్ అంటూ ఒక్కొక్కటేసి జమ్ర అఖబపై విసరాలి.
4- రాళ్ళు విసిరిన తరువాత తమత్తుఅ, మరి ఖిరాన్ చేసేవారు ఖుర్బానీ చెయ్యాలి. మరియు అందులో నుంచి వారు స్వయంగా తినడం, ఇతరు లకు దానం చేయడం, బహుకరించడం మంచిది.
5- ఖుర్బానీ తరువాత తల కొరిగించాలి. లేదా కటింగ్ చేయించుకోవాలి. తల కొరిగించడం ఎక్కువ పుణ్యం. స్త్రీలు కూడా తమ తల వెంట్రుకలను వ్రేలు మందము అనగా మూడు సెంటిమీటర్లు కత్తిరించుకోవాలి.
ఇప్పుడు హాజి స్నానం చేసి, సువాసన పూసుకొనుట, దుస్తులు ధరించుట మంచిది. ఎందుకనగా ఇప్పుడు హాజిపై ఇహ్రామ్ వలన నిషిద్ధమున్న; కుట్టిన బట్టలు ధరించడం, సువాసన పూసుకోవడం, గోళ్ళు, వెంట్రుకలు తీయడం లాంటి విషయాలు యోగ్యమగును. కాని భార్యభర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫ్ ముగిసే వరకు ఉండును.
6- కాబా వద్దకు వెళ్ళి తవాఫె హజ్ (తవాఫె ఇఫాజ) చెయ్యాలి. అది ఈ విధంగా: ముందు కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. మఖామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజు చెయ్యాలి. హజ్జె తమత్తుఅ చేయువారు సఫా మర్వాల మధ్య సఈ చెయ్యాలి. కాని ఖిరాన్ హజ్ లేదా ఇఫ్రాద్ హజ్ చేయువారు తొలి తవాఫ్ తో సఈ చేసియుంటే ఇప్పుడు సఈ చేయవలసిన అవసరం లేదు. అదే హజ్ యొక్క సఈ అగును. అప్పుడు సఈ చేయకున్నట్లయితే ఇప్పుడు తప్పక చేయాలి.
సఈ తరువాత ఇహ్రాం నిషిద్ధతలన్నీ ముగి- స్తాయి. భార్యాభర్తల మధ్య నిషిద్ధత కూడా.
7- హాజీ 11వ, 12వ రాత్రి మినాలో గడపటం తప్పనిసరి. (ఇష్టమున్నవారు 13వ రాత్రి కూడా ఉండవచ్చును). రాత్రి గడపటం అంటే రాత్రి యొక్క అధిక భాగం మినాలో ఉండాలి.
రాళ్ళు విసరడం, ఖుర్బానీ చేయడం, క్షౌరం, తర్వాత తవాఫ్. ఈ నాలుగు పనులు ఇదే క్రమంగా చేయడం సున్నత్. ఒక వేళ ఇందులో వెనకా ముందు జరిగినా ఏమీ అభ్యంతరం లేదు.
పదకుండవ రోజు
ఈ రోజు హాజి రమె జిమార్ (రాళ్లు విసురుట) ఆవశ్యకం. దాని సమయం పొద్దు వాలిన వెంటనే మొదలవుతుంది. అంతకు ముందు విసురుట యోగ్యం లేదు. మరుసటి రోజు ఉషోదయం వరకు దీని సమయం ఉంటుంది. ముందు చిన్న జమరపై, తర్వాత మధ్య దానిపై, ఆ తరువాత అఖబ అంటే పెద్ద దానిపై విసరాలి. క్రింద తెలుపబడే రీతిలో రమె జిమార్ చెయ్యాలి.
1- తన వెంట చిన్న 21 రాళ్ళు (పెద్ద శనగ గింజంత) తీసుకొని ముందు చిన్న జమరపై ఒక్కొక్కటేసి ఏడు రాళ్ళు విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ప్రతి రాయి చిన్న జమర చుట్టున్న హౌజులో పడునట్లు విసిరే ప్రయత్నం చేయాలి. పిదప ఆ జమరకు కొంచం కుడి వైపున జరిగి నిలబడి దీర్ఘంగా దుఆ చేయుట సున్నత్.
2- మధ్యలో నున్న జమర వద్దకు వెళ్ళి ఒక్కొ క్కటేసి ఏడు రాళ్ళు దానిపై విసరాలి. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అనాలి. దానికి కొంచెం ఎడమ వైపుకు జరిగి దీర్ఘంగా దుఆ చేయాలి.
3- ఆ తరువాత పెద్ద జమర వద్దకు వెళ్ళి ఏడు రాళ్ళు ఒక్కొక్కటేసి విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ఇక అక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి.
పన్నెండవ రోజు
1- ఈ రోజు పదకుండవ రోజు చేసిన తీరు చేయాలి. హాజి 13వ రోజు ఉండాలనుకుంటే చాలా మంచిది. ఆ రోజు 11 మరియు 12వ రోజు చేసినట్లే చేయాలి.
2- 12వ రోజు (మరియు 13వ రోజు ఉన్న వారు ఆ రోజు) రాళ్ళు విసిరిన తరువాత కాబా వద్దకు వెళ్ళి తవాఫె విదాఅ చెయ్యాలి. తర్వాత మఖామె ఇబ్రాహీం వెనక, అక్కడ సాధ్యపడకుంటే ఎక్కడైనా రెండు రకాతులు చెయ్యాలి. బహిష్టు మరియు బాలంత స్త్రీలు ఈ తవాఫ్ చేయకుండా తిరిగి తమ దేశానికి వెళ్ళినా పాపమేమి లేదు.
ఎవరైనా పదవ తారీకున చేయవలసిన తవాఫె ఇఫాజ అప్పుడు చేయకుండా ఇప్పుడు చేసినా ఫరవా లేదు, యోగ్యమే. అదే ఈ తవాఫె విదాఅ కు బదులుగా సరిపోతుంది. అంటే తమ దేశానికి తిరిగి వెళ్ళే ముందు చేసే తవాఫె విదాఅ కు బదులుగా ఈ తవాఫె ఇఫాజ సరిపోతుంది. అయితే ఇలా చేసేవారు తవాఫె విదాఅ సంకల్పం తో కాకుండా, తవాఫె ఇఫాజ సంకల్పం చేసుకోవాలి.
3- ఆ తరువాత హాజి ఆలస్యం చేయకుండా తన సమయాన్ని జిక్ర్, దుఆ మరియు తనకు లాభం చేకూర్చే విషయాల్లో గడుపుతూ మక్కా నుండి వెళ్ళిపోవాలి. అయితే ఎవరైనా ఏదైనా అవసరంగా, ఉదాః తన మిత్రుని కొరకు వేచిస్తూ, లేదా తనకు దారిలో అవసరముండే సామానుల కొనుగోళు వగైరాలకై కొంత సమయం మాత్రమే ఆగుతే పాపం లేదు. కాని దూర దేశాల నుండి వచ్చినవారు హజ్ తరువాత మక్కాలో కొద్ది రోజుల నివాసం చేస్తే వారు మక్కాను వదలి వెళ్ళిపోయే రోజున తవాఫె విదాఅ చేయాలి.
హజ్ యొక్క రుకున్ లు
1- ఇహ్రామ్.
2- అరఫాత్ లో నిలవడం.
3- తవాఫె హజ్.
4- సఫా మర్వా మధ్యలో సఈ.
పై నాలిగిట్లో ఏ ఒక్క రుకున్ వదలినా, తిరిగి దానిని చేయని వరకు హజ్ నెరవేరదు.
హజ్ యొక్క వాజిబులు
1- మీఖాత్ నుండి ఇహ్రాం చేయడం.
2- పగలు వచ్చినవారు సూర్యాస్తమయం వరకు అరఫాత్ లో నిలవడం.
3- ముజ్ దలిఫాలో ఫజ్ర్ తరువాత ప్రకాశ మాన వరకు రాత్రి గడపడం. అయితే వృద్ధు లు, స్త్రీలు అర్థ రాత్రి వరకు ఉండి తరలిపోతే పాపం లేదు.
4- 11, 12, (13) రాత్రులు మినాలో గడపడం.
5- పై మూడు రోజుల్లో రాళ్ళు విసరడం.
6- క్షౌరం చేయించుకోవడం.
7- తవాఫె విదాఅ.
పై ఏడిట్లో ఏ ఒక్క వాజిబ్ వదలినా అతనిపై ‘దమ్’ విధిగా అవుతుంది. అంటే ఒక మేక లేదా ఆవు మరియు ఒంటెలో ఏడవ వంతు బలి ఇచ్చి హరంలోని బీదవారికి దానం చేయాలి.
మస్జిదె నబవి దర్శనం
నమాజ్ చేసే ఉద్దేశ్యంతో మస్జిదె నబవి దర్శనం పుణ్యకార్యం. సహీ హదీసు ప్రకారం అందులో చేసే ఒక నమాజ్ పుణ్యం ఇతర మస్జిదులలో చేసే వెయ్యి నమాజుల కన్నా అతిఉత్తమం. మస్జిదె హరాం మక్కా తప్ప. (అందులో ఒక నమాజు పుణ్యం మస్జిదె నబవిలోని వంద నమాజులకు, ఇతర మస్జిదుల్లోని లక్ష నమాజుల కంటే ఉత్తమం). మస్జిదె నబవి దర్శనం సంవత్నరమెల్లా ఎప్పుడు చేసినా పుణ్యమే. దానికొక ప్రత్యేక సమయమేమి లేదు. అది హజ్ లో ఒక భాగం కూడా ఎంత మాత్రం కాదు. మస్జిదె నబవీలో ఉన్నంత సేపట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి ఉత్తమ సహచరులైన అబూ బక్ర్, ఉమర్ రజియల్లాహు అన్హుమాల సమాధుల దర్శనం చేయడం పుణ్యకార్యం. సమాధుల దర్శనం ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే, స్త్రీలకు లేదు. మస్జిదె నబవి యొక్క ఏ వస్తువును కూడా ముట్టుకొని శరీరానికి తుడుచుకొనుట, బర్కత్ (శుభం)గా భావించుట, సమాధి యొక్క తవాఫ్ చేయుట, దుఆ సమయాన దాని వైపు ముఖము చేయుట లాంటి పనులు ధర్మానికి విరుద్ధమైనవి గనక యోగ్యం లేవు.
అల్లాహ్ మీ హజ్ మరియు సర్వ సత్కార్యాలు స్వీకరించి, రెట్టింపు పుణ్యాలు ప్రసాదించుగాక!
—
ఉమ్రా విధానం
ప్రతీ ముస్లిం స్త్రీ పురుషునిపై జీవితంలో ఒకసారి ఉమ్రా చేయుట విధిగా ఉంది. అల్లాహ్ ఆదేశం సూర బఖర (2:196)లో ఇలా ఉంది:
అల్లాహ్ కొరకు హజ్, ఉమ్రా పూర్తి చేయండి.
అది సర్వ సత్కార్యాల్లో అతి ఉత్తమమైనది గనక శక్తిగల ముస్లిం మరే మరీ చేస్తూ ఉండుట పుణ్య కార్యం. ‘ముఅతమిర్’ (ఉమ్రా చేయు వ్యక్తి) ఉమ్రా విధుల్లో అన్నిటికి ముందు ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్:
అంటే ఉమ్రా ఆరాధనలోకి ప్రవేశం. ముహ్రిమ్ (ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తి)పై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధమగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధన లో ప్రవేశించాడు. ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ‘ఇహ్రామ్’ విధిగా ఉంది. ముఅతమిర్ మక్కా వెలుపలి నుండి వచ్చే వారయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించిన మీఖాతుల్లో ఏ ఒక మీఖాతు నుండైనా ఇహ్రామ్ చెయ్యాలి. ఆ మీఖాతులు ఇవి:
1- ‘జుల్ హులైఫ’: అది మదీనకు సమీపం లో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు ‘అబ్ యారె అలీ’. అది మదీనవాసుల మీఖాతు.
2- ‘అల్ జుహ్ ఫ’: అది రాబిగ్ సమీపంలో ఒక పల్లెటూరు. ఈ రోజుల్లో రాబిగ్ నుంచే ఇహ్రామ్ చేస్తున్నారు. అది సిరీయా వారి మీఖాతు.
3- ‘అస్సైలుల్ కబీర్’: తాయిఫ్ కు సమీపం లో ఒక ప్రాంతం. అది నజ్ద్ వారి మీఖాతు.
4- ‘యలమ్ లమ్’: ఇది యమన్ వారి మీఖాతు.
5- ‘జాతు ఇర్ఖ్’: ఇది ఇరాఖ్ వారి మీఖాత్.
పై మీఖాతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించారు. అవి మేము తెలిపిన వారి ప్రాంత నివాసుల మరియు వారి తప్ప ఎవరైతే హజ్ లేక ఉమ్రా చేయుటకు వాటి నుండి దాటుతారో వారికి కూడాను. ఇక మక్కా నివాసులు మరియు ‘అహ్లుల్ హిల్ల్’ (మక్కా నగరానికి వెలుపల మరియు మీఖాతు లోపల నివసించువారు) తమ ఇంటి నుండి ఇహ్రామ్ చేయాలి.
ఇహ్రామ్ ధర్మములు
ఇహ్రామ్ కు ముందు చేయవలసిన ధర్మములు:
1- గోర్లు, చంకల మరియు నాభి క్రింది వెంట్రుకలు తీయాలి. మీసాలు కత్తిరించాలి. స్నానం చేసి, సువాసన శరీరానికి పూసుకోవాలి. ఇహ్రామ్ దుస్తులకు పూసుకోవద్దు.
2- కుట్టిన బట్టలు తీసి, ఒక పంచి కట్టుకొని, ఒక దుప్పటి వేసుకోవాలి. స్త్రీ తనకిష్టమైన బట్టలు ధరించవచ్చును. అయితే పూర్తి పర్ద చేయాలి. అలంకరణ ప్రదర్శించకుండా ఉండాలి. పరపురు- షులు ఎదురయ్యే సమయాన ముఖము, అరచేతుల పర్ద కూడా చేయుటకు ప్రయత్నిం- చాలి. చేతుల్లో గ్లౌసులు, ముఖముపై నఖాబ్ వేసుకోకూడదు.
3- మస్జిద్ కు వెళ్ళి నమాజ్ సమయమయితే జమాఅతుతో నమాజు చేసుకోవాలి. లేనిచో రెండు రకాతులు ‘తహియ్యతుల్ వుజూ’ చేసుకోవచ్చు. ఆ తరువాత ఇహ్రామ్ చేయాలి.
విమానంలో ప్రయాణించువారు మీఖాత్ కు సమాన ప్రాంతం వద్దనే ఇహ్రామ్ చేయాలి. మీఖాత్ ఏర్పాటు కష్టంగా ఉంటే దానికి కొంచెం ముందు కూడా చేయవచ్చును. ఇక మీఖాత్ వద్ద చేసే పనులు; గోళ్ళు తీయడం, స్నానం చేసి, శరీరానికి సువాసన పూసుకోవడం మరియు ఇహ్రామ్ దుస్తులు ధరించడం లాంటివన్నీ విమానంలో లేదా అందులో పయనమయ్యే ముందు పూర్తి చేసుకోవాలి. మీఖాత్ వద్ద లేదా దానికి కొంచెం ముందు చేరుకున్నప్పుడు ఇహ్రాం సంకంల్పం చేయాలి.
ఇహ్రమ్ నుండి మొదలుకొని కాబా ప్రదక్షిణం ప్రారంభించే వరకు “తల్ బియ” చదువుతూ ఉండాలి: లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హంద వన్నిఅమత లక వల్ ముల్క, లా షరీక లక.
ఇహ్రామ్ స్థితిలో ఉన్న వ్యక్తిపై ఇహ్రామ్ కు ముందు యోగ్యమున్న కొన్ని విషయాలు నిషిద్ధం అగును. ఎందుకనగా అతడు ఒక ఆరాధనలో ప్రవేశించాడు. అతనిపై క్రింది విషయాలు నిషిద్ధం:
1- తల వెంట్రుకలు మరియు శరీర వెంట్రుకలు తీయడం నిషిద్ధం. కాని అవసరమున్నప్పుడు మెల్లగా తల గోకుట నేరం కాదు.
2- గోళ్ళు తీయుట నిషిద్ధం. కాని గోరు విరిగినా, నొప్పి ఉన్నా దానిని తీయుట పాపం కాదు.
3- సుగంధం మరియు సువాసన సబ్బుల ఉపయోగం నిషిద్ధం.
4- సంభోగం మరియు దానికి సంబంధించిన విషయాలు నిషిద్ధం. ఉదా: పెళ్ళి చేసుకొనుట, చేయించుట, భార్యభర్తల సరసాలడడం వగైరా.
5- చేతులలో గ్లౌసులు వేసుకొనుట నిషిద్ధం.
6- వేటాడుట నిషిద్ధం.
పై ఆరు విషయాలు స్త్రీ పురుషులందరిపై నిషిద్ధం. ఇక ప్రత్యేకంగా పురుషులపై నిషిద్ధం ఉన్న విషయాలు దిగువ తెలుపబడుతున్నవి.
1- కుట్టిన బట్టలు ధరించడం నిషిద్ధం. కాని అవసరముంటే బెల్ట్, గడియారం మరియు కళ్ళ జోళ్ళు ఉపయోగించవచ్చును.
2- తలకు అంటుకొని ఉండే ఏదైనా వస్తువు ఉప- యోగించడం నిషిద్ధం. కాని అంటుకొని ఉండని గొడుగు, వాహణము మరియు గుడారాలు లాంటివి ఉపయోగించడం యోగ్యం.
3- మేజోళ్ళు తొడుగుట నిషిద్ధం. కాని సైండిల్ మరియు చెప్పులు లేనప్పుడు మడమలు కనబడే బూట్లు ఉపయోగించ వచ్చును.
పై నిషిద్ధ కార్యాలు చేసినవాని 3 స్థితులు:
1- అకారణంగా చేసిన వ్యక్తి పాపాత్ముడగును. ఇంకా అతనిపై ‘ఫిద్య’ (ప్రాయశ్చితం) కూడా విధియగును.
2- ఏదైనా అవసరం ఉండి చేసిన వ్యక్తి పాపాత్ముడు కాడు. కాని ప్రాయశ్చితం చెల్లించాలి.
3- ఏదో కారణంగా -ఉదా: తెలియక, మరచి- పోయి, లేదా ఒకరి ఒత్తిడితో నిస్సహాయుడై- చేసిన వ్యక్తి పాపాత్ముడూ కాడు, అతనిపై ప్రాయశ్చితమూ లేదు.
తవాఫ్
ఇతర మస్జిదుల మాదిరిగా మస్జిదె హరాంలో కూడా కుడి కాలుతో ప్రవేశిస్తూ ఈ దుఆ చదవడం ధర్మం. బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అల్లాహుమ్మగ్ ఫిర్లీ జునూబి వఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.
بِسْمِ الله وَالصَّلاَةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ الله اللَّهُمَّ اغْفِرْلِي ذُنُوبِي وَافْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ
కాబా తవాఫ్ చేయుటకు దానివైపున వెళ్ళాలి.
తవాఫ్: అంటే అల్లాహ్ యొక్క ఇబాదత్ ఉద్దేశ్యంతో కాబా చుట్టున ఏడు సార్లు ప్రదక్షిణం చేయుట. అది హజ్రె అస్వద్ నుండి ప్రారంభించి అక్కడే ముగించాలి. మొదటి మూడిట్లో దగ్గర దగ్గర అడుగులు వేసి పరుగెత్తుట ధర్మం. కాని ఎవరికీ ఇబ్బంది కలగించకూడదు. దీనినే ‘రమ్ల్’ అంటారు. పైన కప్పుకున్న దుప్పటిని కుడి భుజము క్రింది నుండి తీసుకొని ఎడమ భుజముపై వేసుకోవాలి. అంటే కుడి భుజము పైన బట్ట ఉండకూడదు. దీనిని ‘ఇజ్తిబాఅ’ అంటారు. ఇవి రెండు (రమ్ల్, ఇజ్తిబాఅ) ఉమ్రా లేక హజ్ ఉద్దేశ్యంతో మక్కా వచ్చి చేసే తొలి తవాఫ్ లో మాత్రమే చేయాలి. కాబా ఎడమ వైపు ఉండాలి. తవాఫ్ వుజూ స్థితిలో చేయుట తప్పనిసరి. ఇక తవాఫ్ ఈ విధంగా చేయాలి:
1- హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి కుడి చేయితో దానిని ముట్టుకొని బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. వీలవుతే దాన్ని చుంబించాలి. చుంబించడం వీలు కాకుంటే దాన్ని చెయ్యితో ముట్టుకొని చెయ్యిని చుంబించాలి. చెయ్యితో ముట్టుకొనుట కూడా సాధ్యపడకుంటే దాని సూటిగా నిలబడి దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించ- కూడదు. ఇక తవాఫ్ ప్రారంభించాలి. ఇష్టానుసా రం, తన భాషలో తన కొరకు, తను కోరినవారి కొరకు దుఆ చేస్తూ లేదా ఖుర్ఆన్ పారయణం చేస్తూ ఉండాలి. ఇచ్చట ప్రత్యేకంగా ఏ దుఆ లేదు.
2- రుక్నె యమాని వద్ద చేరుకున్నాక వీలవుతే దాన్ని ముట్టుకుంటూ అల్లాహు అక్బర్ అనాలి. కాని చెయ్యిని చుంబించకూడదు. వీలు కాకుంటే (తవాఫ్ చేస్తూ ఉండాలి). చెయ్యితో సైగ చేయకూడదు. అల్లాహు అక్బర్ అనకూడదు. ఈ రుక్నె యమాని మరియు హజ్రె అస్వద్ మధ్య ఈ దుఆ చదవాలి: రబ్బనా ఆతినా ఫిద్దున్ యా హసనతౌఁ వఫిల్ ఆఖిరతి హసనతౌఁ వఖినా అజాబన్నార్.
3- హజ్రె అస్వద్ వద్ద చేరుకొని దాన్ని చెయ్యితో ముట్టుకుంటూ, వీలు కాకుంటే దాని వైపు చెయ్యితో సైగ చేస్తూ అల్లాహు అక్బర్ అనాలి.
ఈ విధంగా ఏడు ప్రదక్షిణాల్లో ఒకటి పూర్తయింది.
4- మిగితవి మొదటి దాని లాగే చేస్తూ, హజ్రె అస్వద్ చేరుకున్నప్పుడల్లా మరియు ఏడవది పూర్త-యిన తరువాత కూడా అల్లాహు అక్బర్ అనాలి.
తవాఫ్ తరువాత
తవాఫ్ తరువాత మఖామె ఇబ్రాహీం వెనక – అనగా అది తనకు మరియు కాబాకు మధ్యలో ఉన్నట్లుగా- నిలబడి రెండు రకాతుల నమాజు చేయుట ధర్మం. నమాజు చేస్తున్నప్పుడు దుప్పటి రెండు భుజాలపై ఉండుట తప్పనిసరి. ఏ ఒక్క భుజము నగ్నంగా ఉండకుడదు. మొదటి రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ రెండవ రకాతులో సూరె ఫాతిహా తరువాత ఖుల్ హువల్లాహు అహద్ చదవాలి. జనసమ్మర్థంలో దాని వెనక నమాజ్ చేయుట సాధ్యపడకుంటే మస్జిదె హరాంలో ఏక్కడైనా చేయవచ్చును.
సఈ
ఇక ‘మస్అ’ (సఫా, మర్వాల మధ్యలో ‘సఈ’ చేసే స్థలం) వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుంటూ “ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్” చదివాలి. సఫా కొండపై ఎక్కి కాబా దిశలో నిలబడి చేతులు ఎత్తి అల్లాహ్ స్తోత్రము పఠించి, ఈ దుఆ మూడు సార్లు చదవాలి. దాని మధ్యలో రెండు సార్లు తనిష్టానుసారం దుఆ చేసుకోవాలిః లాఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లాషరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్ యీ వ యుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లాఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ అంజజ వఅదహూ వనసర అబ్దహూ వహజమల్ అహ్ జాబ వహ్దహూ.
ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు స్తంభం వద్దకు చేరినప్పుడు శక్తి ప్రకారం పరుగుతీయడం ధర్మం. ఇలా రెండవ పచ్చరంగు స్తంభం వరకు. ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరవవద్దు. ఈ పరుగు పురుషులకే ప్రత్యేకం. స్త్రీలకు దీని అనుమతి లేదు. మర్వా చేరుకొని దానిపై ఎక్కి ఖిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దుఆ చెయ్యాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దుఆ కూడా చేసు కోవాలి. ఇక్కడికి ఏడిట్లో ఒకటి పూర్తయింది. మిగిత ఆరు ఇలాగే పూర్తి చేయాలి. ప్రతీ సారి సఫా మరియు మర్వాల వద్ద దుఆ చేయాలి. పచ్చ రంగు స్తంభాల మధ్య పరుగుతీయాలి. సఈ మధ్యలో దుఆ ఎక్కువగా చేయాలి. ఏడిట్లో ప్రతీ ఒక దానికొక వేరు దుఆ అంటూ ప్రవక్తతో రుజువు లేదు. (సఫా నుండి మర్వా వరకు ఒకటి. మర్వా నుండి సఫా వరకు రెండు పరుగులగును. ఇలా మొదటి పరుగు సఫా నుండి మొదలై ఏడవ పరుగు మర్వాపై ముగియును).
సఈ తురవాత శిరోముండనం చేయించు- కోవాలి. ఇందులో ఎక్కువ పుణ్యం ఉంది. కటింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇక ఇహ్రామ్ దుస్తులు తీసి ఉమ్రా ముగించాలి. ఇహ్రామ్ కు సంబంధిం- చిన నిషిద్ధతలు ఇక ముగించాయి.
అర్కానె ఉమ్రా
1- ఇహ్రామ్.
2- తవాఫ్.
3- సఈ.
ఇందులో ఏ ఒక్క రుకున్ వదలినా తిరిగి అది చేయనంత వరకు ఉమ్రా నెరవేరదు.
వాజిబాతె ఉమ్రా
1- మీఖాత్ నుండి ఇహ్రామ్ చేయుట.
2- శిరోముండనం.
వీటిలో ఏ ఒక్కటి వదలినా అతనిపై దమ్ విధి అవుతుంది. అంటే ఒక మేక జిబహ్ చేసి లేదా ఒంటె మరియు ఆవులోని ఏడిట్లో ఒక భాగం హరమ్ లో ఉండే బీదవాళ్ళకు దానం చేయాలి.
అల్లాహ్ మనందరికి ప్రవక్త చూపిన పద్ధతిలో ప్రతి ఆరాధన చేసే భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
అరబ్బుల్లో బహుదైవారాధనే ఒక ప్రసిద్ధిచెందిన ధర్మంగా ఉండింది. సత్య ధర్మానికి వ్యెతిరేకంగా ఉన్న ఈ బహుదైవారాధన (షిర్క్)ను వారు పాటించినందువలన వారి ఆ కాలమును “అజ్ఞానకాలం” అనబడింది. అల్లాహ్ ను గాక, వారు పూజించే దేవతల్లో ప్రసిద్ధి చెందినవిః ‘లాత్’, ‘ఉజ్జా’, ‘మనాత్’, మరియు ‘హుబుల్’. అరబ్బుల మధ్య యూదమతాన్ని, క్రైస్తవ మతాన్ని అవలంబించినవారు మరియు పార్శీలు కూడా ఉండిరి. వారందరి మధ్య కొందరు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ‘దీనె హనీఫ్’ (బహుదైవారాధనకు అతీతంగా సవ్యమైన ధర్మం)పై స్థిరంగా ఉన్నవారు కూడా ఉండిరి.
ఇక వారి ఆర్థిక జీవతం అంటేః ఎడారివాసుల (అనాగరికుల) పూర్తి ఆధారం పశు సంపద, వాటిని మేపుటయే ఉండింది. నాగరికతలో ఉన్నవారి ఆధారం వ్యవసాయం, వ్యాపారంపై ఉండింది. ఇస్లాం ధర్మ జ్యోతి ప్రకాశించేకి కొంచం ముందు ‘మక్కా’ అరబ్ ద్వీపంలో ఒక పెద్ద వ్యాపార కేద్రంగా పేరుగాంచింది. మదీనా, తాయిఫ్ మరియు ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా నాగరికత ఉండినది.
సామాజిక వ్యవస్థః అన్యాయం విపరీతంగా వ్యాపించి యుండింది. బలహీనులకు ఎలాంటి హక్కు లేకపోవడం, ఆడ బిడ్డలను సజీవ సమాధి చేయడం, మానభంగాలకు పాల్పడడం, బలహీనుల హక్కు బలవంతుడు కాజేయడం, హద్దు లేకుండా భార్యలనుంచుకోవడం, వ్యభిచారం సర్వ సామాన్యమైయుండినది. తుచ్ఛమైన కారణాలపై సంవత్సరాల తరబడి తెగల్లో అంతర్ యుద్ధం జరిగేది. ఒకప్పుడు ఒక తెగకు సంబంధించిన సంతానంలో కూడా ఈ యుద్ధాలు జరిగేవి.
ఇది ఇస్లాంకు ముందు అరబ్ ద్వీపం యొక్క సంక్షిప్త స్వరూపం.
అబ్దుల్ ముత్తలిబ్ -ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత- అధిక ధన, సంతానం గలవారని ఖురైష్ అతన్ని చాలా గౌరవించేవారు. ‘అల్లాహ్ పది మగ సంతానం ప్రసాదిస్తే అందులో ఒకరిని దేవతలకు బలిస్తాన’ని అతను మ్రొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. పది మంది మగ సంతానం కలిగారు. అందులో ఒకరు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తండ్రి అబ్దుల్లాహ్. అబ్దుల్ ముత్తలిబ్ తన మ్రొక్కుబడిని పూర్తి చేయదలుచుకున్నపుడు, ఖురైష్ అతని ముందుకు వచ్చి ఇది ప్రజలలో ఒక ఆచారముగా అయిపోతుందన్న భయంతో అతనికి అడ్డుపడి, పది ఒంటెల మరియు అబ్దుల్లాహ్ మధ్య చీటి (పాచిక) వేసి పది ఒంటెలను అబ్దుల్లాహ్ కు బదులుగా బలిదానమివ్వాలి, ఒక వేళ చీటి అబ్దుల్లాహ్ పేరున వస్తే, మళ్ళీ పది ఒంటెలను పెంచాలని ఏకీభవించారు. ఈ విధంగా చీటి వేశారు. కాని ప్రతి సారి అబ్దుల్లాహ పేరే వచ్చేది. పదవసారి అనగ వంద ఒంటెలు ఒకవైపు అబ్దుల్లాహ్ ఒక వైపు ఉండగా ఒంటెల పేరున చీటి వెళ్ళింది. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ ఒంటెలను బలి ఇచ్చాడు. అబ్దుల్ ముత్తలిబ్ కు మొదటి నుండి ఇతర సంతానముకన్నా అబ్దుల్లాహ్ యే హృదయానికి అతి చేరువుగా ఉండే. అతన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. ప్రత్యేకంగా ఈ బలిదానము యొక్క సంఘటన తర్వాత. అతను పెరిగి, పెండ్లీడుకు చేరిన తర్వాత అతని తండ్రి జుహ్రా కుటుంబానికి చెందిన ఆమిన బిన్తె వహబ్ తో అతని వివాహం చేశాడు. అబ్దుల్లాహ్ వైవాహిక జీవితం గడుపుతూ ఆమిన మూడు నెలల గర్భములో ముహమ్మదును మోస్తుండగా ఒకసారి వ్యాపార బృందముతో సీరియా దేశం వైపు వెళ్ళాడు. తిరిగి వస్తుండగా దారిలోనే ఒక వ్యాదికి గురై మదీనలో నజ్జార్ వంశానికి చెందిన తన మేన మామల వద్ద ఆగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడే మరణించాడు. అంతిమ క్రియలు అక్కడే జరిగాయి.
ఇటు ఆమిన నెలలు నిండినవి, సోమవారం రోజున ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించారు. కాని నిర్ణీత తారీకు మరియు నెల ప్రస్తావన రాలేదు. రబీఉల్ అవ్వల్ మాసం తొమ్మిదవ తారీకు అని చెప్పబడింది. అదే నెల 12 అనీ ఉంది. అలాగే రమజాను నెల అని కూడా అనబడింది. తదితర అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాని అది క్రీ.శ. ప్రకారం 571 సంవత్సరం అన్నది నిజం. అదే సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ (ఏనుగుల సంవత్సరం) అని అంటారు.
[1]అనగా ఇస్మాఈల్ అలైహిస్సలాంను వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞతో జిబహ్ చేయబోయాడు. అబ్దుల్ ముత్తలిబ్ తన మ్రొక్కుబడిని పూర్తి చేయుటకు అబ్దుల్లాహ్ ను జిబహ్ చేయబోయాడు. అబ్దుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి అయితే ఇస్మాఈల్ అలైహిస్సలాం తాత ముత్తాతల్లో వస్తారు. ఈ విధంగా ఆయన బలికెక్కిన ఇద్దరి వ్యక్తుల కుమారుడు అని భావం.
సంక్షిప్తంగా ఏనుగుల సంఘటన ఏమిటంటేః యమన్ లో నజ్జాషి అను రాజు యొక్క ప్రతినిధి అబ్రహా హబ్షీ ఉండేవాడు. అరబ్బులందరూ మక్కా నగరంలో ఉన్న పవిత్ర కాబా గృహాన్ని గౌరవిస్తూ, దూర ప్రాంతాల నుండి దాని దర్శనానికి వస్తూ, హజ్ చేస్తున్నది చూసిన అబ్రహా, యమన్ దేశపు రాజధాని ‘సనఆ’ లో ఒక పెద్ద చర్చి నిర్మించాడు. హజ్ కొరకు వచ్చే అరబ్బులందరూ కాబాకు బదులుగా దీని దర్శనానికి రావాలని కోరాడు. అది విన్న బనీ కినాన (అరబ్ వంశాల్లోని ఒక వంశం)లోని ఒక వ్యక్తి రాత్రి సమయంలో అందులో ప్రవేశించి ఆ చర్చి గోడలకు మలినము పూసాడు. ఈ విషయం తెలిసిన అబ్రహా ఆగ్రహముతో మక్కా నగరములోని కాబా గృహాన్ని ధ్వసం చేయాలని పూనుకొని అరవై వేల సైన్యంతో వెళ్ళాడు. సైన్యంలో తన వెంట తొమ్మిది ఏనుగులను తీసుకొని, తాను అన్నిట్లో పెద్ద ఏనుగుపై పయనమయి మక్కా సమీపానికి చేరుకున్నాడు. అక్కడ సైన్యాన్ని సరిచేసుకొని మక్కాలో ప్రవేశించాలన్న ఉద్దేశంతో సిద్ధమయ్యాడు. కాని తను అధిరోహించిన ఏనుగు కాబా వైపునకు ఒక్క అడుగు వేయడానికి సిద్ధం లేనట్లు కూర్చుండి పోయింది. కాబా దిశకు గాకుండా వేరే దిశలో లేపినప్పడు లేచి పరుగెత్తేది. కాని కాబా దిశకు మార్చితే కూర్చుండి పోయేది. వారు ఈ ప్రయత్నాల్లో ఉండగా అల్లాహ్ వారిపై పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి వారిపై గులకరాళ్ళను విసిరాయి. అల్లాహ్ చివరికి వారిని పశువులు తినవేసిన పొట్టు మాదిరిగా చేశాడు. అది ఎలా అంటేః ప్రతి పక్షి వద్ద చణక గింజంత మూడు రాళ్ళుండేవి. ఒకటి వారి చుంచువులో, రెండు వారి కాళ్ళల్లో. అవి ఎవరిపై పడిన వారి అవయవాలు ముక్కలు ముక్కలయి దారి గుండా పడుతూ చివరికి సర్వనాశనమయ్యే- వారు. అల్లాహ్ అబ్రహాపై ఒక వ్యాదిని పంపాడు. దాని కారణంగా అతని వ్రేళ్ళు ఊడిపోయాయి. అతడు సనఆలో చేరుకునే సరికి ఆ రోగం ముదిరిపోయి, తన తడాక చూపింది. అక్కడే వాడు చనిపోయాడు.
ఇటు ఖురైషుల విషయం: అబ్రహ వస్తున్న విషయం విని, వారు భయపడి కొండల్లో, కొనల్లో పరుగెత్తుకు పోయారు. ఆ సైన్యంపై విరుచుకు పడ్డ ఆపదను చూసి అందరూ తృప్తి, శాంతితో తమ తమ ఇండ్లల్లోకి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మకు 50 రోజుల ముందు జరిగినది. (అందుకే ఈ సంవత్సరానికి ఆముల్ ఫీల్ అన్న పేరు వచ్చింది).
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించిన తరువాత, ఆయన పిన తండ్రి అయిన అబూ లహబ్ యొక్క బానిస సువైబ అను ఆమె ఆయనకు పాలు పట్టింది. ఆమె అంతకు ముందు హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కు కూడా పాలు పట్టింది. (ఇతను ప్రవక్త పెత్తండ్రి). ఈ విధంగా హంజా ప్రవక్త పాల సంబంధ సోదరుడయ్యాడు.
అరబ్బుల అలవాటేమనగా వారు తమ పసిపిల్లలకు గ్రామీణ వాతవర ణములో ఉంచి అక్కడ పాలు పట్టించేవారు. ఎందుకనగా శారీరకంగా, ఆరోగ్యంగా ఉండుటకు అచ్చట పూర్తి సహాయం లభించేది. ఇలా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మరో దాయి వద్దకు చేరుకున్నారు. దాని వివరణ ఇలా ఉందిః ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించిన రోజుల్లో మక్కాలో ఉన్న శిశువులను పాలు త్రాగించడానికి తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో బనీ సఅద్ వారి ఒక బృందం వచ్చింది. ప్రతి స్త్రీ పసిపిల్లలున్న గృహాలను గాలించి, అట్లే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వచ్చి అతను అనాధ, పేదవాడు అని తెలుసుకొని వెను దిరిగింది. అందరి వలే హలీమ సఅదియా కూడా ఆయన్ని స్వీకరించక తిరిగి పోయింది. కాని అనేక గృహాలను గాలించినప్పటికీ, తన వెంట తీసుకెళ్ళడానికి శ్రీమంతుల బాలున్ని పొందలేక పోయింది. ఆమె ఉద్దేశ ప్రకారం, శ్రీమంతుల బాలున్ని పొందుతే, ఆ బాలుని ఇంటివారు పాలు పట్టినందుకు ఇచ్చే పైకం ద్వారా వారి పస్తుల్లో గడుస్తున్న రోజులకు సమాప్తం ఉండవచ్చు, ప్రత్యేకంగా అనావృష్టి వల్ల దారిద్ర్య రేఖకు దిగజారిన వారి జీవితం బాగు పడవచ్చన్న ఆశ ఆమెది. వేరే ఏ మార్గం దొరక్క అదే అనాథ బాలున్ని, వారు ఇచ్చే చిన్న పాటి పారితోషికాన్ని స్వీకరించటానికి తిరిగి ఆమిన (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తల్లి) ఇంటికి వచ్చింది. హలీమ తన భర్తతో మరీ నిదానంగా నడిచే (పరుగెత్తలేని), బక్కని గాడిద పై మక్కా వచ్చింది. కాని తిరుగు ప్రయాణంలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన ఒడిలో తీసుకున్నాక, అదే గాడిద వేగంగా పరుగెత్తుతూ తోటి సవారీలను వెనుకేసి, తోటి ప్రయాణికులను కూడా ఆశ్చర్యంలో పడవేసింది. హలీమ ఉల్లేఖనం ప్రకారం, ఆమె వద్ద చాలా తక్కువ పాలుండేవి. ముందు నుండే ఆమె వద్ద ఉన్న స్వంత కొడుకు పాలు సరిపడక ఆకలితో ఎప్పుడూ ఏడ్చేవాడు. కాని ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె పాలు త్రాగడం మొదలు పెట్టిన వెంటనే ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. బనూ సఅద్ అనే తన ప్రాంతంలో ఉన్న భూములు వర్షము లేక మాడిపోతున్న వేళ, శుభ బాలునికి పాలు పట్టే భాగ్యం పొందాక, అక్కడి భూములు పండాయి. పశువులు అధికమయ్యాయి. వారి స్థితిగతులు కలిమి నుండి లేమి, కష్టము నుండి సుఖములుగా మారాయి.
చూస్తూ చూస్తూ హలీమ రక్షణలో రెండు సంవత్సరాలు గడిచాయి. ఇతరులలో కానరాని అసాధారణ అలవాట్లు ఈ సుపుత్రునిలో చూస్తున్నందు వలన మరియు దూరదృష్టి అతనిలో ఏదో ఒక గొప్ప విషయాన్ని సూచిస్తున్నందు వలన, హలీమాకు మరి కొన్ని రోజులు ఈ బాలున్ని పోషించాలన్న తపన కలిగింది. (రెండు సంవత్సరాల్లో తిరిగి ఆమినకు అప్పజెప్పాలన్న మాటపై) హలీమ ఈ బాలుడ్ని తీసుకొని, అతని తల్లి, తాత దగ్గరికి మక్కా వచ్చింది. కాని అతని మూలంగా ఆమె స్థితిగతుల్లో ఏ మార్పు వచ్చిందో, ఏ శుభం చూసిందో అందుకని మరో రెండేళ్ళు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను తన వద్దే ఉంచుకుంటానని ప్రాధేయపడితే, దానికి ఆమిన ఒప్పుకుంది. అదే అనాథశిశువుడు అయిన ముహమ్మదును మహా సంతోషం, మాహా భాగ్యంతో తీసుకొని హలీమా తమ బనీ సఅద్ ప్రాంతానికి తిరిగి వచ్చింది.
ముహమ్మద్ (ﷺ)కు సుమారు 4 సంవత్సరాల వయస్సు. ఒక రోజు గుడారానికి కొంత దూరాన తమ పాల సంబంధ తమ్ముడు అగు హలీమ సఅదియా కొడుకుతో ఆడుకుంటున్నాడు. హలీమ కొడుకు పరుగెత్తుకుంటూ తల్లి వద్దకు వచ్చాడు. అతని ముఖముపై భయాందోళన చిహ్నాలు స్ఫష్టంగా ఉన్నాయి. “అమ్మా! తొందర వచ్చేసెయి, అదిగో ఖురైషి తమ్మున్ని చూడు, అని అనసాగాడు. హలీమ ముహమ్మద్ (ﷺ) వైపు పరుగులు తీస్తూ అతని గురించి ప్రశ్నించింది. దానికి తన కొడుకు “నేను తెల్లని బట్టల్లో ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వారు ముహమ్మద్ ని మా మధ్య నుండి పక్కకు తీసుకెళ్ళి, పడుకోబెట్టి, అతని ఎద చీల్చి…. అని అంటుండగా హలీమ సంఘటన స్థలానికి చేరుకుంది. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కదల కుండా నిలబడి ఉన్నాడు. రంగు పేలిపోయి ఉంది. ముఖ కవళికల్లో మార్పు వచ్చింది. హలీమా వ్యాకులతతో జరిగిందేమిటని అడిగింది. “నేను క్షేమంగనే ఉన్నాను” అని ముహమ్మద్ ఇలా చెప్పాడుః “తెల్లని దుస్తుల్లో ఇద్దరు మనుషులు వచ్చి నన్ను తీసుకెళ్ళి నా ఎదను చీల్చి, అందులో నుండి గుండెను తీసి, దానిలో ఉన్న ఒక నల్లటి రక్తపు ముద్దను తీసి పారేసి, చల్లని జమ్ జమ్ నీటితో గుండెను కడిగి యధా విధిగా దాని స్థానంలో పెట్టేసి కుట్లువేసి సరిచేసి వెళ్ళిపోయారు. వారు ఇక కనబడలేదు. హలీమా ముహమ్మద్ (ﷺ)ను తీసుకొని తన గుడారంలో వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున -ముహమ్మద్ (ﷺ)ను వెంటబెట్టుకొని మక్కా వచ్చేసింది. సమయం కాని సమయంలో వచ్చిన హలీమాను చూసి ఆమిన ఆశ్చర్యానికి గురైంది. ఆమెనే స్వయంగా ఎంతో బతిమిలాడి తీసుకెళ్ళింది కదా. అయితే ఇలా హఠాత్తుగా రావడానికి కారణం ఏమిటని ఆమిన అడిగింది. హలీమా హృదయ పరిచ్ఛేద విషయాన్ని వివరంగా చెప్పింది.
ఒకరోజు ఆమిన తన అనాథ సుపుత్రుడిని తీసుకొని, బనూ నజ్జార్లోని ఆయన మేనమామలను సందర్శించడానికి మదీనకు పయనమయ్యింది. కొద్ది రోజులు అక్కడ ఉండి, తిరిగి వస్తుండగా ‘అబ్వా’ అనే ప్రాంతంలో అసువులు బాసింది. అక్కడే అంతిమ క్రియలు జరిగాయి. ఇలా ఆరు సంవత్సరాల వయసులో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కన్నతల్లికీ వీడ్కోలు పలికారు.
ఆయన పోషణ, సంరక్షణ భారం తాత అబ్దుల్ ముత్తలిబ్ పై పడింది. ప్రేమతో ఆయన్ని చూసుకున్నారు. కంటి పాపలా ఆయన్ని కాసారు. ముహమ్మద్ ఎనిమిదవ ఏటలో తాత కూడా పరమపదించారు. అయితే పోతూ పోతూ తన తనయుడైన అబూతాలిబ్ కు ముహమ్మద్ సంరక్షణ భారం అప్పజెప్పి పోయాడు. అబూ తాలిబ్ అధిక సంతానం, తక్కువ సంపాదన గలవారైనప్పటికీ ముహమ్మద్ పోషణ బాధ్యత స్వీకరించారు. అతను, అతని భార్యలిద్దరూ తమ స్వంత సంతానంలాగా ఆయన్ని చూసుకునేవారు. ముహమ్మద్ కు కూడా పినతండ్రి అంటే ఎనలేని ప్రేమ. ఈ వాతవరణంలో ఆయన పెరుగుదల యొక్క తొలి దశ/ మెట్టు మొదలయింది. నిజాయితీగా జీవించ గలిగారు. అందుకే సత్యత, విశ్వసనీయత ఆయనకు మారుపేరుగా నిలిచాయి. “అమీన్” (విశ్వసినీయుడు) వస్తున్నాడు లేదా “సాదిఖ్” (సత్యసంధుడు) వస్తున్నాడు అని అంటే అతను ముహమ్మదే అని అనుకునేవారు ప్రజలు.
యౌవనంలో అడుగుపెడుతూ, జీవిత వ్యవహారాల్లో, ఆర్థిక సంపాదనలో తన కాళ్ళపై నిలబడటానికి ప్రయత్నం మొదలు పెట్టారు. అందుకని కష్టపడడం, సంపాదించడం ఆరంభించారు. చిన్నపాటి పారితోషికానికి బదులుగా ఖురైషుల మేకలు మేపుటకై కాపరిగా పనిచేశారు.
(బాబాయి అబూ తాలిబ్ వర్తకులవడం చేత, అతని వెంట కొన్ని వర్తక పర్యటనలు చేసినందు వల్ల ఆయనకు వాణిజ్యంలో మంచి అనుభవం కలిగింది). అయితే మక్కాలో ఖదీజ బిన్తె ఖువైలిద్ అను ఓ శ్రీమంతురా- లుండేది. ఆమె విధవ కూడాను. ఒకసారి ఆమె తన వర్తక సామాగ్రి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అప్పజెప్పుతూ సీరియా దేశానికి వెళ్ళి వ్యాపారం చేయవలసిందిగా కోరింది. ఈ ప్రయాణంలో మైసర అను బానిస ఆమె వర్తక సామాగ్రికి బాధ్యుడుగా ఆయనతో ఉన్నాడు. ఆయనగారి శుభం, అయన విశ్వసనీయత వల్ల ఇంతకు ముందు ఎన్నడూ లేని అధిక లాభం వచ్చింది. ఖదీజా మైసరను ఈ ఎనలేని లాభాల గురించి అడిగింది. దానికి మైసర “ముహమ్మద్ సామా గ్రిని చూపించే, విక్రయించే బాధ్యత వహించారు. (ఆయన మాటా విధానాన్ని, నిజాయితీ, సచ్చీలతను చూసి) ప్రజలు మీ సామాగ్రిపై విరుచుకు పడేవారు. అందుకే ఏ అన్యాయం లేని ఇంతటి మహాలాభంతో తిరిగి వచ్చాము” అని సమాధానం చెబుతూ ఉంటే ఖదీజ పూర్తి శ్రద్ధగా అతని మాటలు వింటూ ఉండే. ఆమె ముందే కొన్ని విషయాలు ముహమ్మద్ గురించి విని యుండే. అందుకే ఈ మాటలు విని ఆమెకు మరింత అద్భుతమైన ఉత్సాహం కలిగింది. ఇంతటి సుగుణ సంపన్నునితో దాంపత్య జీవితం గడపాలన్న కోరిక ఆమెలో పుట్టింది. ఈ విషయం తెలిపి, ఆయన ఉద్దేశ్యమేంటో తెలుసు కోడానికి తన బంధువులైన ఒకామెను పంపింది. ఆయనకు ఖదీజ సందేశం అందింది, దానికాయన ఒప్పుకున్నారు. అప్పటికీ ఆయనకు పాతికేళ్ళు. పెద్దల సమక్షంలో పెళ్ళయింది. దాంపత్య జీవితంలో ఒకరికొకరు చాలా ఆనందం పొందారు. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖదీజ ధనానికి బాధ్యుడుగా ఉండి వ్యాపారం చేస్తూ, తమ సామర్థ్యాన్ని, దక్షతని నిరూపించుకున్నారు. కొద్ది సంవత్సరాల్లో ఖదీజా –రజియల్లాహు అన్హా-కు సంతానం కూడా కలిగింది. వారిలో జైనబ్, రుఖయ్య, ఉమ్ము కల్సూమ్ మరియు ఫాతిమా అను నలుగురు కూతుళ్ళు. ఖాసిమ్ మరియు అబ్దుల్లాహ్ అను ఇద్దరు కొడుకులు. అయితే కొడుకులిద్దరూ పసితనం లోనే చనిపోయారు. (ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మదీన జీవితంలో మారియా రజియల్లాహు అన్హాతో ఒక కుమారు డయ్యాడు. పేరు ఇబ్రాహీం. ఈ కొడుకు కూడా బాల్యంలోనే మరణించాడు).
జుబైదా వంశానికి చెందిన యమన్ దేశస్తుడు ఒకతను తన సామాగ్రితో మక్కా వచ్చాడు. మక్కాలోని పేరు ప్రఖ్యాతి గల ఆస్ బిన్ వాయిల్ అతని ఆ సామాగ్రిని కొన్నాడు. కాని అతనికి పైకం చెల్లించ లేదు. అతని నుండి తన హక్కు తీసుకొనుటకు జుబైదాకు చెందిన వ్యక్తి ఏ న్యాయశీలుడిని పొందలేక పోయాడు. అందుకు అతను ఓ కొండపై ఎక్కి తన బాధను వెలకక్కాడు. అప్పుడు మక్కాలోని కొన్ని తెగలు లేచి బాధితులకు వారి హక్కు లభించాలని ఏకీభవించారు. దానికి వారు ఓ ఒప్పందం చేసుకున్నారు. అదేమిటంటేః మక్కావాసి అయినా లేదా మక్కాలో వచ్చే ఏ వ్యక్తి అయినా అతనికి ఏదైనా అన్యాయం జరిగిందంటే మనమందరం బాధితునికి తోడుగా నిలబడి అతనికి తన హక్కు లభించే వరకు దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా పోరాడాలి. ఖురైషువారు ఈ ఒప్పందాన్ని ‘హిల్ఫుల్ ఫుజూల్’ అని నామకరించారు. అయితే ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అందులో పాల్గొన్నారు. అప్పుడు ఆయన వయస్సు 20 సంవత్సరాలు.
ముహమ్మద్ –సల్లల్లాహు అలైహి వసల్లం- వయస్సు 35 సంవత్సరాలు ఉండగా ఖురైషువారు కాబా కట్టడాన్ని కొత్తగా నిర్మించాలని ఉద్దేశించారు. ఎందుకనగా అది పాత కాలపు కట్టడం కావడం చేత శిథిలావస్తకు చేరి, దాని గోడలు పగులుబారినవి. అంతకు మునుపే ఎప్పుడో ఓ తూఫాను మక్కాలో వచ్చి వరద తాకిడి మస్జిదె హరాం వరకు చేరి కాబా పునాదులను సయితం పెకిలించింది. అందుకే వారు కాబా యొక్క గౌరవార్థం దాని పునర్నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే దీని నిర్మాణంలో ధర్మసమ్మతమయిన సంపాదనే ఖర్చు పెట్టాలి అని ఏకీభవించారు. దాని నిర్మాణం మొదలు పెట్టి, హజ్రె అస్వద్ (నల్లరాయి) వద్దకు చేరుకున్నాక, హజ్రె అస్వద్ ను దాని స్థానంలో అమర్చే కీర్తి ఎవరికి దక్కాలన్న విషయంలో విభేదించి సుమారు నాలుగైదు రోజులు గడిసినా వివాదం చల్లారకుండా మరింత వేడెక్కి భయంకర యుద్ధానికే దారి తీసే సందర్భంలో ఓ విషయంపై ఏకీభవించారు. అదేమిటంటే; మస్జిదె హరాంలో రేపటి రోజు అందరికి ముందుగా ప్రవేశించే వ్యక్తిని న్యాయ- నిర్ణేతగా ఎన్నుకుందాము అని. ఆ వ్యక్తి ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అయి ఉండాలని అల్లాహ్ కోరాడు. వారు ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం-ను చూడగానే “ఇతను విశ్వసనీయుడు ముహమ్మద్, ఇతడిని మేము ఇష్టపడ్డాము” అన్న నినాదాలు చేశారు. ఆయన వారి దగ్గరకు వెళ్ళాక వారు విషయాన్ని తెలిపారు. అప్పుడు ఆయన ఓ దుప్పటి తెప్పించారు, అందులో హజ్రె అస్వద్ పెట్టారు. గొడవ చేసిన ప్రతి తెగ నాయకుడిని పిలిచి దుప్పటి ఓ అంచును పట్టుకోవాలని చెప్పారు. అందరూ పట్టుకున్నాక దాన్ని లేపి హజ్రె అస్వద్ పెట్టే చోటకి తీసుకెళ్ళమన్నారు. అందరూ కలసి దాన్ని అక్కడికి చేర్పించాక ఆయనే స్వయంగా హజ్రె అస్వద్ ను దుపట్టిలో నుండి తీసి దాని స్థానంలో అమర్చారు. ఈ వివేకవంతమైన పరిష్కారంతో అందరూ తృప్తి చెందారు.
ఖురైషువారికి ధర్మసంపద కొరత ఏర్పడింది. అందువల్ల ఉత్తరం వైపునుండి ఆరు మూరలు తగ్గించి లోపలికి అని గొడ లేపారు. ఆ వదలిన ప్రాంతాన్నే హిజ్ర్ లేదా హతీమ్ అని అంటారు. కాబా నిర్మాణం పూర్తి అయిన తర్వాత అది సుమారు చతురాస్కారంలో అయింది. వారికి ఇష్టమైన వారే అందులో ప్రవేశించటానికి దాని తలుపును పైకి ఎత్తారు. 15 మూరల ఎత్తు లేసిన తర్వాత ఆరు స్తంభాలపై దాని కప్పు వేశారు.
ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నలబై సంవత్సరాల వయస్సుకు సమీపిస్తున్న కొద్దీ ఆయనలో ఏకాంత ప్రియత్వం పెరగ సాగింది. మక్కాకు తూర్పు దిశలో ఉన్న ఓ కొండ, అందులోని హిరా గుహలో ఉండి ఆయన అల్లాహ్ ఆరాధనలో రేయింబవళ్ళు గడిపేవారు. ఒక రాత్రి, అది రమజాను నెల 21వ రాత్రి, ఆయన అదే గుహలో ఉన్నారు. అప్పటికీ ఆయనకు నలబై సంవత్సరాలు పూర్తి అయినవి. జిబ్రీల్ దైవ దూత ఆయన వద్దకు వచ్చి “చదువు” అని అన్నాడు. నాకు చదవటం రాదన్నారాయన. ఆ దూత ఆయన్ను గట్టిగా కౌగలించుకొని వదిలి చదువు అన్నాడు. అప్పటికీ ఆయన నాకు చదువు రాదు అనే సమాధానమిచ్చారు. అందుకు జిబ్రీల్ రెండు, మూడు సార్లు గట్టిగా అదిమి వదిలారు, ఆ తర్వాత ఇలా చదివాడుః
{(ఓ ప్రవక్తా!) పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు, నీప్రభువు పరమ దయాళువు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు}. (అలఖ్ 96: 1-5).
(ఇలా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ప్రవక్త పదవి నొసంగబడినది). కాని ఈ సంఘటన తర్వాత ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హిరా గుహలో ఉండలేక పోయారు, కంపించిన హృద యంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. నాకు దుప్పటి కప్పండి, నాకు దుప్పటి కప్పండి అని ఖదీజాతో అన్నారు. కాసేపటికి భయం దూరమయింది. అప్పుడు జరిగిన సంఘటన సతీమణి ఖదీజకు వినిపిస్తూ నాకు నా ప్రాణ భయముంది అన్నారు. అది విని ఖదీజ ధైర్యం చెబుతూ, “ముమ్మాటికి అలా జరగదు. అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ మిమ్మల్ని ఎన్నాటికీ అవమాన పరచడు. మీరు బాంధవ్యం పెంపొందిస్తారు, ఇతరుల భారాన్ని భరిస్తారు, ఏమి లేనివారికి (సంపాదించి) ఇస్తారు. అతిథులను గౌరవిస్తారు, ఆపదల్లో ఉన్నవారికి న్యాయం లభించుటకు సహాయపడతారు”. అని చెప్పింది.
అల్లాహ్ ఆరాధన కొనసాగించడానికి, కొద్ది రోజుల తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి హిరా గుహకి వచ్చారు. ఆరాధన పూర్తి చేసుకొని తిరిగి మక్కా రావడానికి గుహ నుండి దిగి వస్తూ, పల్లపు ప్రాంతంలో ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వినిపించింది. తెలెత్తి చూసే సరికి జిబ్రీల్ భూమ్యాకాశాల మధ్యలో కుర్చీపై కుర్చున్నాడు. అతన్ని చూసి ప్రవక్త భయకంపితులై ఇంటికి వచ్చి నాకు దుప్పటి కప్పండి అని అన్నారు. అప్పుడే కొంత సేపటికీ ఈ వహీ అవతరించింది.
{వస్త్రం కప్పుకొని పడుకున్న ఓ మనిషి! లే, లేచి హెచ్చరించు. నీ పుభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. మాలిన్యానికి దూరంగా ఉండు}. (ముద్దస్సిర్ 74: 1-5).
ఆ తరువాత వహీ ఎడతెగకుండా రావడం మొదలయింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ ప్రచారం ఆరంభించిన తొలి సందర్భంలోనే ఆయన గౌరవనీయులైన సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా విశ్వాస ప్రకటనను స్వీకరించింది. అల్లాహ్ మాత్రమే ఏకైక ఆరాధ్యుడని, ఆమె భర్త అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చింది. స్త్రీ పురుషుల్లో మొట్టమొదటిసారిగా ఇస్లాం స్వీకరించినవారు ఈ స్త్రీ మూర్తియే. ఆమె తర్వాత తమ ప్రాణ మిత్రుడైన అబూ బక్ర్ తో ప్రవక్త ఈ విషయం చెప్పినప్పుడు అతను కూడా నిస్సంకోచంగా విశ్వసించి, ఆయన్ను సత్యపరిచాడు. తల్లి మరియు తాత మరణానంతరం ఆయన్ను పోషించి, మంచి విధంగా చూసుకున్న పినతండ్రి అబూ తాలిబ్, అతను చేసిన మేలుకు బదులుగా ప్రవక్త అతని సంతానంలో ఒకడైన అలీని తన వద్ద ఉంచి పోషించసాగారు. అలీ చిన్న వయస్సులో ఉన్నప్పటికీ అతని హృదయం వికసించి తను కూడా విశ్వసించాడు. ఆ తర్వాత ఖదీజ రజి యల్లాహు అన్హా బానిస జైద్ బిన్ హారిస కూడా విశ్వాసుల్లో కలిశాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మ ప్రచార కార్యాన్ని గుప్తంగా నిర్వహించసాగారు. అప్పట్లో ఇస్లాం స్వీకరించేవారు తమ ఇస్లాంను రహస్యంగా ఉంచేవారు. ఏ ఒక్కరి విషయం వెల్లడైనా ఖురైషుల నానారకాల శిక్షలకు గురి కావలసి వచ్చేది. విశ్వాసులు ఇస్లాం నుండి తిరిగి అవిశ్వాసులవ్వాలని ఖురైషులు ఇలా చేసేవారు.
ఆ సందర్భంలో ప్రవక్త సహచరులు నమాజు గాని వేరే అల్లాహ్ ఆరాధన గాని ముష్రికులకు తెలియకూడదని మక్కా కనుమల్లో చేసేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిగత, రహస్య ప్రచారంలో మూడు సంవత్సరాలు గడిపాక, ఒక రోజు అల్లాహ్ ఈ వహీ పంపాడుః
{కనుక ప్రవక్తా! నీకు ఆజ్ఞాపించబడుతూ ఉండిన విషయాన్ని బహిరంగంగా ఎలుగెత్తి చాటు. షిర్క్ చేసేవారిని ఏ మాత్రం లెక్క చేయకు}. (హిజ్ర్ 15: 94).
ఈ ఆదేశానుసారం ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఫా కొండపై ఎక్కి మక్కా వాసులను పిలిచారు. చాలా మంది పోగైనారు. వారి లో ఆయన పినతండ్రి అబూ లహబ్ కూడా ఉన్నాడు. అల్లాహ్, ఆయన ప్రవక్తకు అందరికన్నా ఎక్కువ కఠిన శత్రువుడు ఇతడే. ప్రజలందరు పోగైన తర్వాత “కొండ ఆవల మీ శత్రువులు, మీపై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారని నేనంటే మీరు నమ్ముతారా?”. అని ప్రవక్త అడిగారు. వారందరు “మేము మిమ్మల్ని సత్యసంధులుగా, విశ్వసనీయులుగానే చూశాము కనుక మీరు చెప్పేది ఖచ్చితంగా నమ్ముతాం” అని ఏకంగా అన్నారు. అప్పుడు ప్రవక్త “నేను మిమ్మల్ని మీ ముందు రానున్న భయకరమైన శిక్షల నుండి హెచ్చరిస్తున్నాను” అని చెబుతూ అల్లాహ్ అద్వితీయుని ఆరాధన వైపుకు పిలుస్తూ, విగ్రహారాధనను వదులుకోవాలని బోధించారు. ప్రజల మధ్య నుండి అబూ లహబ్ ఆగ్రహంతో ముందుకు వచ్చి “నీ చేతులు విరుగుగాకా, ఇందుకేనా మమ్మల్ని రప్పించింది అని దూషించ సాగాడు. అటు అల్లాహ్ ఈ సూరా అవతరింపజేశాడు.
{అబూ లహబ్ చేతులు విరిగి పోయాయి! అతడు సర్వ నాశనం అయి పోయాడు. అతడి ఆస్తిపాస్తులు, అతడి సంపాదన అంతా అతనికి పనికి రాకుండా పోయింది. చివరికి అతడు తప్పకుండా భగభగమండే అగ్నిలో పడవేయబడతాడు. అంతే కాదు (అతడితో పాటు) అతడి భార్య కూడా అందులో పడవేయబడుతుంది. ఆమె చాడీలు చెబుతూ కలహాలు రేపే స్త్రీ. ఆమె మెడలో బాగా పేనిన ఒక త్రాడు ఉంటుంది}. (లహబ్ 111: 1-5).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మప్రచారం కొనసాగిస్తునే ఉన్నారు. అయితే ఇప్పుడు వారి సమావేశాల్లో నిలబడి బహిరంగంగా వారిని ఇస్లాం వైపుకు పిలవడం, కాబా వద్ద నమాజు చేయడం ఆరంభించారు. ప్రజలు కలుసుకునే ప్రాంతాల్లో, బాజారుల్లోకి వచ్చి ప్రవక్త ఇస్లాం గురించి బోధించే వారు. అందువల్ల ఆయన ఎన్నో సార్లు నా నా రకాల బాధలకు గురయ్యారు. ఆయన్ని విశ్వసించినవారు కూడా అవిశ్వాసుల యాతనలకు బలిఅయ్యే వారు. వారిలో యాసిర్, సుమయ్యా మరియు వారిద్దరి కొడుకు అమ్మార్ (రజియల్లాహు అన్హుమ్)లు ప్రసిద్ధి చెందారు. చివరికి అమ్మార్ తల్లిదండ్రులు ఆ యాతనలను భరించలేక షహీద్ (అమరగతి) అయ్యారు. సుమయ్యా ఇస్లాంలో తొలి షహీద్ గా పేరునొందారు. అలాగే బిలాల్ బిన్ అబీ రిబాహ్ హబషీ రజియల్లాహు అన్హు కూడా ఉమయ్య బిన్ ఖలఫ్ మరియు అబూ జహల్ చేత ఘోరంగా శిక్షించబడ్డారు. వాస్తవానికి బిలాల్, అబూ బక్ర్ పిలుపు, ప్రోత్సహంతో ఇస్లాంలో ప్రవేశించారు. ఈ విషయం బిలాల్ యజమాని ఉమయ్యా బిన్ ఖలఫ్ కు తెలిసింది. అతడు ఆయనపై ఘోరమైన హింసా దౌర్జన్యాలు చేశాడు. ఇవన్నీ ఆయన ఇస్లాం వదలుకోవాలని. కాని ఆయన అతని మాటను ధిక్కరించి, ఇస్లాం ధర్మంపై స్థిరంగా ఉండిపోయారు. ఉమయ్యా బిలాల్ ను సంకెళ్ళలో బంధించి, మండే ఎడారి ఇసుకపై పడవేసి, బరువైన బండ ఆయన ఎదపై పెట్టేవాడు. (అయినప్పటికీ బిలాల్ నిరాకరించేవారు) అందుకు ఆయన మెడలో తాడు కట్టి అగ్ని కుర్పిస్తున్న ఎండలో, మాడు ఇసుకలో ఆయన్ని లాగేవాడు. (ఆ దౌర్జన్యుడు ఇంతటితో తృప్తి పడక) తన మిత్రులతో కలసి ఒకరెనుకొకరు అలసిపోయే వరకు బిలాల్ పై కొరడా దెబ్బల వర్షం కురిపించేవారు. అంతులేని బాధలకు గురయినప్పటికీ నోటితో మాత్రం “అహద్, అహద్” (అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే) అనే పదాలే వినవచ్చేవి. ఒకసారి అబూ బక్ర్ తన దారిన వెళుతూ బిలాల్ అనుభవిస్తున్న బాధను చూశారు. అప్పుడే ఉమయ్యాతో సంప్రదించి ఆయన్ని ఖరీదు చేసి అల్లాహ్ కొరకు ఆయనకు స్వేచ్ఛతనిచ్చారు.
ఈ దౌర్జన్యఖాండలు హెచ్చు పెరుగుతన్నందు వల్ల, వారు ఇప్పుడే తమ ఇస్లాంను మరియు వారు రహస్యంగా ఒక చోట కలిసి శిక్షణ పొందుతున్న విషయాల్ని బహిర్గతం చేయవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలకు ఆదేశించారు. ఇది ఎంతో గొప్ప వివేకం. ఎందుకంటే ఇప్పుడే వారు తమ ఇస్లామును బహిర్గతం చేశారంటే ప్రవక్త వారికి ఇచ్చే శిక్షణ మరియు విద్యకు అవిశ్వాసులు అడ్డు పడుట నిస్సందేహం. అందు వల్ల రెండు వర్గాల మధ్య ఒక పెద్ద ఘర్షణ సంభవించవచ్చు. ముస్లింలు ఇంకా అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు గనక ఎక్కువ నష్టం వారికే వాటిల్లవచ్చు. అంతేమిటి బొత్తిగే అంతం కావచ్చు. అందుకే ముస్లిములు తమ ఇస్లాం బహిర్గతం చేయవద్దని ఆదేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మంచి ఉపాయం చేశారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రం ధర్మ ప్రచారం, అల్లాహ్ ఆరాధన విరోధుల సమక్షంలో బహిరంగంగా చేసేవారు. వారు ఎన్ని విధాలుగా బాధించినా సహించేవారు.
ఇస్లాం మరియు ముస్లిముల బద్ధశత్రువు, ముష్రికుల నాయకుడు అబూ జహల్ ఓ రోజు కాబా వద్ద ఉన్న ప్రవక్తను దూషించాడు, చాలా బాధ కలిగించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురు జవాబూ చెప్పలేదు, ఏ ఒక్కటీ మాట్లాడ లేదు. అప్పుడు ఒక స్త్రీ కూడా ఈ సంఘటనను చూసింది. కొంత సేపటికే షికారు కొరకు మక్కా బైటికి వెళ్ళిన హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ వచ్చాడు. ఆ స్త్రీ తాను చూసిన అబూ జహల్ చేష్టలు, ప్రవక్తను దూషించడమంతా అతనికి తెలియజేసింది. అది విన్న హంజా రజియల్లాహు అన్హు ఆగ్రహోదోగ్రుడై అబూ జహల్ ను వెతుకుతూ వెళ్ళాడు. ఓ చోట కొందరి మధ్య కూర్చుండి ఉండటాన్ని చూశాడు. హఠాత్తుగా అబూ జహల్ పై విరుచుకుపడి ధనుస్సుతో గట్టిగా కొట్టి అతని తలను గాయ పరిచి, ‘నేను ముహమ్మద్ ధర్మంపై ఉండగా నీవు ఆయన్ని దూషిస్తావా?’. హంజా రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరణకు ఇది ఓ సబబుగా అయింది. ఆయన ఇస్లాం స్వీకరణ వల్ల ముస్లిములకు ఓ రకమైన బలం, గౌరవం ప్రాప్తమయింది. ఎలా అనగా ఆయన మక్కావాసుల్లో ఓ ఉన్నత స్థానం, గొప్ప కీర్తి పేరు ప్రతిష్ఠ కలవారు.
ఉమర్ రజియల్లాహు అన్హు గారి ఇస్లాం స్వీకరణ వల్ల కూడా ముస్లిములకు గట్టి బలం, పటిష్టము లభించింది. హంజా రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరణకు మూడు రోజుల తర్వాత ఇతను ఇస్లాం స్వీకరించారు. అది ఎలా అనగాః ఉమర్ రజియల్లాహు అన్హు ఓ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని హతమార్చే ఉద్దేశ్యంతో వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కలసి ‘ఎటు వెళ్ళుచున్నావు ఉమర్!’ అని అడిగాడు. దానికి అతడు ‘ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వస్లలం-ను హతమార్చుటకు వెళ్ళుచున్నాను’ అని సమాధానమిచ్చాడు. దానిపై అతడన్నాడుః ‘నీవు ముహమ్మద్ –సల్లల్లాహు అలైహి వసల్లం-ను హతమారుస్తే బనూ హాషిం మరియు బనూ జుహ్రా నిన్ను క్షేమంగా వదులుతారా?’ ఉమర్ అన్నాడుః ‘నీవు నీ తాతముత్తాతల మతాన్ని వదలి కొత్త మతాన్ని స్వీకరించినట్లున్నావు’? అతడన్నాడుః దీనికంటే మరీ విచిత్రమైన విషయం చెప్పాలా ఉమర్! నీ చెల్లి మరియు బావ ఇద్దరూ ఇస్లాం స్వీకరించారు. తాతముత్తాతల మతాన్ని వదిలేశారు’. ఉమర్ అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళి చెల్లిలి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఖబ్బాబ్ బిన్ అరత్త్ రజియల్లాహు అన్హు వారింట్లో ఉన్నాడు. ఖుర్ఆన్ లోని సూర తాహా వ్రాసిఉన్న పత్రం అతని వద్ద ఉంది. అతను వారికి ఆ సురా నేర్పుతున్నాడు. ఉమర్ వస్తున్నది గమనించిన ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు ఇంట్లో ఓ మూలకు దాగిపోయాడు. ఉమర్ చెల్లి ఫాతిమా ఆ పత్రాన్ని దాచిపెట్టింది. ఉమర్ ఇంటికి సమీపంలో చేరినప్పుడే ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు ఖుర్ఆన్ పారాయణాన్ని విన్నాడు. లోనికి ప్రవేశించిన వెంటనే ‘నేను మీ ఇంట్లో విన్నదేమిటి?’ అని అడిగాడు. ‘ఏమి లేదు, అట్లే మాట్లాడుకుంటూ ఉంటిమి’ అని వారిద్దరు అన్నారు. ఉమర్ అన్నాడుః బహుశా మీరిద్దరు పాత మతాన్ని విడనాడి కొత్త ధర్మం స్వీకరించారు కదూ? బావ చెప్పాడుః ‘ఉమర్! ఒకవేళ సత్వం అన్నది నీ మతంలో కాకుండా వేరే ధర్మంలో ఉంటే ఏమిటి మీ ఆలోచనా?’ దానిపై ఉమర్ అతడ్ని చాలా చితకబాదాడు. అంతలోనే చెల్లి వచ్చి ఉమర్ ను భర్త మీది నుండి పక్కకు జరపబోయింది. ఉమర్ ఆమెను సయితం కొట్టి రక్తసిక్తం చేసేశాడు. ఆమె ముఖం ద్వారా రక్తం కారడం మొదలయింది. అదే కోపంలో ఆమె ఇలా అందిః “అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్”. అంటే సత్య ఆరాధ్యుడు అల్లాహ్ తప్ప ఎవడు కాడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యమిచ్చుచున్నాను.
ఉమర్ రక్తసిక్తమైన చెల్లిని చూసి చాలా సిగ్గు పడ్డాడు. ‘మీ వద్ద ఉన్న పుస్తకం ఏది? ఇవ్వండి’ అని అడిగాడు. చెల్లి చెప్పిందిః ‘నీ అపరిశుద్ధునివి, దీని పరిశుద్ధులు ముట్టుకుంటారు’ లేచి స్నానం చేసుకో’. ఉమర్ లేచి, స్నానం చేసి, పుస్తకం తీసుకొని బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం చదివి ‘చాలా మంచి పేర్లున్నాయి అని చెప్పాడు. మళ్ళి సూర తాహా మొదటి నుండి 14వ ఆయతు (నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజును స్థాపించు) వరకు చదివి, ఈ మాట ఎంత బావుంది మరెంత గౌరవపదంగా ఉంది, ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- ఎక్కుడున్నాడో దారి చూపండి’ అని అన్నాడు.
ఉమర్ యొక్క ఈ మాటను విన్న ఖబ్బాబ్ రజియల్లాహు అన్హు లోపలి నుండి బైటికి వచ్చి “సంతోషించు ఉమర్! “అల్లాహ్ ఉమర్ బిన్ ఖత్తాబ్ లేదా అబూ జహల్ బిన్ హిషామ్ ద్వారా ఇస్లాంను బలపరుచు” అని ప్రవక్త చేసిన దుఆ అంగీకరించబడిందని ఆశిస్తున్నాను’ అని అన్నాడు.
ఆ తర్వాత ఉమర్ -రజియల్లాహు అన్హు- తన కరవాలాన్ని తీసుకొని ప్రవక్త వైపునకు బయలుదేరాడు. తలుపును తట్టాడు. ఒక వ్యక్తి తలుపు సందుల్లో నుండి చూశాడు. ఉమర్ కరవాలం ధరించి ఉండడాన్ని గమనించి, లోపలున్న ప్రజలకు తెలిపాడు. వారు దిగ్భాంతి చెందారు. అప్పుడు ప్రవక్త లోపలి గదిలో ఉన్నారు. అక్కడే దగ్గర ఉన్న హంజా రజియల్లాహు అన్హు ప్రజల గమనించి ఏమిటి సంగతి? అని అడిగాడు. ఉమర్ అని వారన్నారు. అప్పుడు హంజా రజియల్లాహు అన్హు అన్నారుః ‘అతని కొరకు ద్వారం తెరవండి. అతను సదుద్దేశ్యంతో వచ్చాడా అది అతనికి లభించుటకు సహాయపడదాము. ఒకవేళ ఏదైనా దురుద్దేశ్యంతో వచ్చాడా అతని కరవాలంతో అతడ్ని హతమార్చుదాము’. ఉమర్ లోనికి ప్రవేశించి ఇస్లాం స్వీకరించానని చాటి చెప్పాడు. వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఏకంగా మరియు పెద్ద శబ్దముతో అల్లాహు అక్బర్ అని అన్నారు. ఆ శబ్దాన్ని మస్జిదె హరాంలో ఉన్నవారు విన్నారు.
సుహైబ్ రూమి రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః ‘ఉమర్ రజియ- ల్లాహు ఇస్లాంలో ప్రవేశించినప్పటి నుండి ఇస్లాం బలంగా, గౌరవంగా ఉంది. దాని వైవు బహిరంగంగా పిలవడం జరిగింది. మేము కాబా వద్ద కూర్చో గలిగాము మరియు దాని ప్రదక్షిణం (తవాఫ్) చేయ గలిగాము’.
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః ‘ఉమర్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించినప్పటి నుండి మేము గౌరవంగా జీవించగలిగాము’.
దినదినానికి ఇస్లాంలో ప్రవేశించే వారి సంఖ్యం పెరగడం మరియు ప్రజల్ని ఇస్లాం నుండి నిరోధించడానికి చేసే ప్రయత్నాలు ఫలించక పోవడాన్ని చూసి ముష్రికులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఇస్లాం ప్రచారం నుండి అడ్డుకోడానికి వేరే పన్నాగాలు పన్నడం మొదలు పెట్టారు. ఇదే పనిగా, మక్కా నాయకుల్లో ఒకడైన అబుల్ వలీద్ ఉత్బా బిన్ రబీఆ, మస్జిదె హరాంలో ఒంటరిగా కూర్చొని ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ఇలా మాటను ఆరంభించాడుః సోదర పుత్రుడా! నీవు నీ జాతి వారి వద్దకు ఓ పెద్ద ఆపద తెచ్చి పెట్టావు. దాని కారణంగా ఐక్యంగా ఉన్నవారిలో చీలికలు సృష్టించావు. వారి దేవతలను, వారి ధర్మాన్ని విమర్శించావు. వారి తాతముత్తాతలను అవిశ్వాసులని అన్నావు. అయితే నేను కొన్ని విషయాలు నీ ముందు ఉంచదలిచాను. వాటిలో ఏ కొన్నైనా నీవు స్వీకరిస్తావని ఆశిస్తున్నాను. అందుకు ప్రవక్త “చెప్పండి అబుల్ వలీద్! వింటాను” అని సమాధానం ఇచ్చారు.
నాయనా! నీవు తీసుకొచ్చిన ఈ కొత్త పద్ధతుల ద్వారా ఏదైనా ధనం కూడబెట్టాలని అనుకుంటే మేము నీ కొరకు ధనబండారాలు సమకూరుస్తాము. చివరికి నీవు మాలో అందరికన్నా ఎక్కువ ధనవంతునివి అయిపోతావు. లేదా ఈ పని ద్వారా నీవు గౌరవ, ప్రతిష్ఠలు సంపాదించాలనుకుంటే మేము నిన్ను మా నాయకునిగా ఎన్నుకుంటాము. ఇక ఏ పని కుడా నీ సలహా లేనిది చేయనే చేయము. ఒకవేళ నీవు గొప్ప అధికారాన్ని కోరుకుంటే మేము నిన్ను మాకు రాజుగా ఎన్నుకొని నీకు కిరీటం కడతాం. ఇవేమీ కాకుండా నీవు ఏవైనా దుష్కళలు కంటూ ఉంటే పేరుగాంచిన వైద్యులను రప్పించి నీకు వైద్యం చేస్తాము. నీ బాగుగోలు కొరకు ఎంత ధనమైనా వెచ్చిస్తాము. ఈ విషయాలన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శ్రద్ధగా, నిశబ్దంగా వింటున్నారు. ఉత్బా తన ప్రసంగం ముగించాడు. అప్పుడు ప్రవక్త అడిగారుః నీవు ముగించావా అబుల్ వలీద్? అవును నేను ముగించాను అని అతడన్నాడు. సరే, ఇక నా మాట వింటావా? అని ప్రవక్త అడిగారు. అవును అని అతడన్నాడు.
అప్పుడు ప్రవక్త ﷺ సూర ఫుస్సిలత్ లోని ఈ ఆయతులు పఠించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పారాయణం చేస్తూ పోతున్నారు. ఉత్బా రెండు అరచేతులు వెనక భూమికి ఆనించి తల భుజము పై పెట్టుకొని గమ్మున వింటు ఉన్నాడు. ప్రవక్తగారు 38వ ఆయతు వరకు పారాయణం చేసి అందులో సజ్దా ఆదేశం ఉండగా పారాయణం నిలిపి వేసి సజ్దా చేశారు. సజ్దా నుండి లేచి, “అబుల్ వలీద్! నీవు ఏదైతే విన్నావో విన్నావు. అదే నా సమాధానం, ఇక నీ ఇష్టం” అని అన్నారు.
ఉత్బా టక్కున లేచి తన మిత్రుల వద్దకు వెళ్ళాడు. ఇతని రాకను చూసినవారు ‘అల్లాహ్ సాక్షిగా! పోయేటప్పుడు ఉన్న అబుల్ వలీద్ ముఖం ఇప్పుడు తిరిగి వస్తున్నప్పుడు లేదు’ అని పరస్పరం అనుకుంటున్నారు. వారి వద్ద కూర్చున్న వెంటనే ఒకడు అడిగాడు, నీ వెనక ఏమి జరిగింది అబుల్ వలీద్! అతడు ఇలా సమాధానమిచ్చాడుః వెనక జరిగినది ఏమిటంటే; అల్లాహ్ సాక్షిగా! నేను విన్నటువంటి మాట ఎన్నడూ వినలేదు. అది చేతబడి కాదు. మంత్రజాలం కాదు. కవిత్వము అసలే కాదు. ఖురైషులారా మీరు నా మాట వినండి. అతడ్ని అతని మానాన వదలండి. అల్లాహ్ సాక్షిగా! అతడు చెప్పిన ఏ మాట నేను విన్నానో అది ఒక సంచలనం సృష్టిస్తుంది. అరబ్బులో ఎవరైనా అతడ్ని హతమారుస్తే మీ పని వేరే వారితో పూర్తి అయిందన్న మాట. ఒక వేళ అతను అరబ్బులను జయించాడంటే అతని రాజ్యం మీ రాజ్యం, అతని గౌరవం మీ గౌరవం, అతని ఉనికి మీ కొరకే ఎక్కువగా అదృష్టవంతగా ఉంటుంది’. అప్పుడు వారన్నారుః అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ తన నోట నీపై కూడా మంత్రం చేసేశాడు. అతడన్నాడుః ‘ఇది నా అభిప్రాయం, ఇక మీకు ఇష్టమైనది మీరు చేయండి’.
ఎవరి ఇస్లాం విషయం తెలిసేదో వారి పట్ల సామాన్యంగా, బలహీనులయిన ముస్లింల పట్ల ప్రత్యేకంగా పెరుగుతున్న అవిశ్వాసుల హింసా దౌర్జన్యాల కారణంగా, తమ ధర్మాన్ని కాపాడుతూ హబషా వైపు -అక్కడ శాంతిస్థానం లభిస్తుందన్న నమ్మకంతో- (ఆ దేశ రాజు) నజ్జాషీ వద్ద వలసపోవుటకు అనుమతించవలసినదిగా ప్రవక్తతో సహాబాలు (ప్రవక్త అనుయాయులు, సహచరులు) కోరారు. ముఖ్యంగా అనేక మంది ముస్లిములు తమ పట్ల మరియు తమ సంతానం పట్ల ముష్రికులతో భయంగా ఉన్నందు వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వలసపోవుటకు వారిని అనుమతించారు. ఇది ప్రవక్త పదవి లభించిన తర్వాత ఐదవ యేట జరిగిన సంఘటన. అప్పుడు సుమారు 70 మంది ముస్లింలు తమ భార్యా పిల్లలతో సహా వలసపోయారు. వారిలో ఉస్మాన్ రజియల్లాహు అన్హు తమ ఇల్లాలు అనగా ప్రవక్త ప్రియ కూతురు రుఖయ్యా రజియల్లాహు అన్హా కూడా ఉన్నారు. అయితే మక్కా అవిశ్వాస ఖురైషులు, ముస్లిములు అక్కడ కూడా ప్రశాంతంగా ఉండకూడదన్న దురుద్దేశంతో నజ్జాషి వద్దకు కొందరిని రాయబారులుగా, కానుకలతో పంపారు. తమ దేశం నుండి పారిపోయి వచ్చిన వారిని తమకు అప్పగించ వలసిందిగా వారు రాజును కోరారు. అంతేకాదు, ముస్లిములపై రాజు మరింత ఆగ్రహించుకోవాలని, ముస్లింలు ఈసా -అలైహిస్సలాం- (యేసు క్రీస్తు) మరియు ఆయన తల్లిని దూషిస్తారని వారిపై అపనింద వేశారు. నజ్జాషీ ఈ విషయంలో ముస్లింలను మందలించాడు. అందుకు వారు ఈసా అలైహిస్సలాం (యేసు క్రీస్తు) గురించి ఖుర్ఆన్ ఏమంటుందనేది స్పష్టపరచి, ఆయన గురించి ఉన్న సత్యాన్ని వెల్లడించారు. తద్వారా ఖుర్ఆనులోని సూరె మర్యం (19వ అధ్యాయం) పారాయణం చేశారు. ఈ వివరాలన్నీ విన్నాక ముస్లింలను గౌరవించి, సత్కరించి వారు తన దేశంలో ప్రశాంతంగా ఉండండని తృప్తినిచ్చి, ఖురైషు రాయబారులను తరిమేశాడు. ముస్లింలను వారికి అప్పగించడం కాని పని అని స్పష్ట పరిచాడు.
ఇదే సంవత్సరంలోని రమజాను మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్దకు వెళ్ళి, అక్కడ సమూహమైన ఖురైషుల యదుట సూరె నజ్మ్ (53వ అధ్యాయం) పారాయణం మొదలెట్టారు. వారు ఎల్లప్పుడూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాటను వినకూడదని ఇతరులకు బోధ చేసేవారు గనక, స్వయంగా ఎప్పుడూ అల్లాహ్ వచనాలు (ఖుర్ఆన్ ఆయతులను) వినడానికి నోచుకోలేదు, గనక ఎప్పుడైతే ఈ సూరా పారాయణం వారికి హఠాస్తంభవించిందో, ఆకర్శించే శక్తి గల అల్లాహ్ వచనం వారి చెవులకు తట్టిందో, ప్రతీ ఒక్కడూ పూర్తి శ్రద్ధతో వినసాగాడు. దాన్ని వినడం తప్ప మరే ఆలోచనే లేకుండింది. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం {ఫస్జుదూ లిల్లాహి వఅబుదూహ్} ఆయతు చదివారో స్వయంగా సజ్దా చేశారు. వారిలో ఏ ఒక్కడు కూడా తనకు తాను అదుపులో ఉంచుకోలేక సజ్దాలో పడిపోయాడు.
ఇస్లామీయ ప్రచారానికి విరుద్ధంగా ఖురైషులు అనేక పన్నాగాలు పన్నారు. తీవ్రమైన శారీరక బాధ కలిగించుట, హింసించుట, పీడించుట. బెదిరించుట, జడిపించుట. ప్రేరేపించుట. ఆశలు చూపుట, పురిగొల్పుట. ఇలా నానా రకాల అఘాయిత్యాలు జరిపారు. అయినా ఇవన్నీ విశ్వాసులకు ఇస్లాం ధర్మంపై మరింత స్థిరత్వాన్ని కలిగిస్తూ, విశ్వాసుల సంఖ్యలో హెచ్చింపే అవసాగింది.
ఖురైషులు ఇస్లాంను అణచడానికి సరికొత్త ఉపయాలు ఆలోచించేవారు. ఇప్పుడు మరో రకమైన ఎత్తుగడకై తమ మెదడుకు పదను పెట్టి ఓ నిర్ణయానికి వచ్చారుః ముస్లిములు మరియు బనీ హాషింలతో సంపూర్ణ సంఘ బహిష్కరణకై ఒక ఒప్పందం వ్రాసి, అందరూ దానిపై సంతకాలు చేసి, దాన్ని కాబాలో వేలాడగట్టారు. అంటే వారితో వ్యాపార లావాదేవీలు చేయరాదు, వివాహ సంబంధాలు, పెళ్ళి పేరంటాలు పెట్టుకోరాదు. అన్నపానియాల సరఫరా చేయరాదు. ఏలాంటి సహాయ సహకారాలు అందించరాదు. అప్పుడు ముస్లింలు గత్యంతరం లేక మక్కా నగరాన్ని విడిచి పెట్టి సమీపములో ఉన్న ఒక కనుమలో శరణు తీసుకున్నారు. దానినే షిఅబె అబీ తాలిబ్ (అబూ తాలిబ్ కనుమ) అంటారు. అక్కడ ముస్లిములు ఎంతో కష్టభూయిష్టమైన జీవితం గడిపారు. నానారకాలుగా ఆకలి బాధలకు గురయ్యారు. ధనవంతులు చాలా ధనం ఖర్చు పెట్టారు. ఖదీజ రజియల్లహు అన్హా తన పూర్తి ఆస్తిని ఖర్చు చేసింది. ఆ సందర్భంలో వ్యాదులు ప్రభలిపోయాయి. అందువల్ల చాలా మంది చస్తూ చస్తూ బ్రతికారు. అయినా ముస్లింలు మరియు బనీ హాషిం ఎంతో సహనం, స్థయిర్యంతో మూడు సంవత్సరాలు గడిపారు. ఏ ఒక్కరూ సత్య ధర్మం నుండి వెనుదిరగ లేదు. చివరికి ఖురైషులోని కొందరు పెద్దలు -బనీ హాషింలోని కొందరితో వారికి దగ్గరి సంబంధం ఉండింది- వారు ముందుకు వచ్చి, ఇక ఈ ఒప్పందం చెల్లబోదు, దాన్ని చింపేయ్యాల్సిందే అని ఖురైష్ నాయకుల ముందు తేల్చి చెప్పారు. అందువల్ల ఆ ఒప్పంద పత్రాన్ని తెప్పించి చూసె సరికి దాన్ని చెదలు తినియుంది. బిస్మికల్లా హుమ్మ అని అల్లాహ్ పేరు తప్ప ఏమీ మిగల లేదు. ఈ విధంగా ముస్లింములు, బనీ హాషిం క్లిష్ట సమయం గడిపి, మక్కా తిరిగి వచ్చారు.
కాని ఖురైషులు దౌర్జన్య వైఖరిలో ఏ మార్పు రాలేదు; ముస్లిముల మరియు ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడడం, ప్రజల్ని ప్రవక్త వద్దకు రాకుండా చేయడం, ఖుర్ఆన్ వినడం నుండి ఆపడం లాంటివి. అంతే కాదు అరబ్ నలువైపుల నుండి ఎవరు వచ్చినా, ఎక్కడా వారు ప్రవక్తతో కలసి ఇస్లాం స్వీకరిస్తారో అని భయపడేవారు. ఇలాంటి ఓ సంఘటన స్వయంగా తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః అతను తన జాతిలో పేరుగల నమ్మదగిన నాయకుడు. ఒకసారి మక్కా వచ్చాడు. కొందరు ఖురైషు పెద్దలు అతని వద్దకు వచ్చి ముహమ్మద్ – ﷺ – గురించి అతడ్ని బెదిరిస్తూ అతని మాటలు వినబోకండి, అతని దగ్గరికే వెళ్ళకండి, చేతబడి లాంటి మాటలు అతనివి. వాటి వల్ల తండ్రి కొడుకుల మధ్య, సోదరుల మధ్య, భార్యభర్తల మధ్య చీలికలు ఏర్పడుతాయి అని ఆరోపించారు. తుఫైల్ అంటాడుః అల్లాహ్ సాక్షిగా! మాటిమాటికి వారు చెప్పడం వల్ల, నేను అతనితో మాట్లాడనని మరియు అతని ఏ మాటను విన అని నిశ్చయించుకున్నాను. అయినా పోతూ పోతూ ఏదైనా మాట చెవులో పడుతుందేమో అని ముందే చెవులలో దూది పెట్టుకున్నాను.
ఆ తర్వాత మస్జిదె హరాంకు వెళ్ళాను. ప్రవక్త కాబా వద్ద నమాజులో ఖుర్ఆన్ పారాయణం చేస్తున్నారు. నేను దాని కొంత భాగం వినాలని అల్లాహ్ కూడా నిశ్చయించినట్లుంది. అయితే కొంత మేరకు విన్నాను. అప్పుడు నా మనుసులో నేను అనుకున్నాను; నేను ఓ కవిని, తెలివిగలవాడిని, మంచిని చెడు నుండి వేరుగా గుర్తించగలను. ఈ మనిషి మాట వినకుండా నన్ను అడ్డుకునేది ఏమిటని? అతడు ఏదైనా మంచి విషయం చెప్పాడా అంగీకరిస్తాను. చెడు చెప్పినట్లయితే వదిలేస్తాను. ఆయన అక్కడ ఉన్నంత సేపు నేను అక్కడే ఉండి, ఆయన తమ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఆయన వెనక వెనకే వెళ్ళాను. ఆయన ఇంట్లో ప్రవేశించాక తర్వాత నేనూ ప్రవేశించాను. అక్కడ ఆయనతో ఇలా విన్నవించుకున్నానుః ముహమ్మద్! -సల్లల్లాహు అలైహి వసల్లం- మీ జాతివారు మీ గురించి నన్ను చాలా భయపెట్టించారు. చివరికి నేను మీ మాట వినకూడదని చెవులలో దూది పెట్టుకున్నాను. అయితే అల్లాహ్ మాత్రం నేను వినాలని నిర్ణయించాడు. అందుకు చాలా మంచి మాటలు విన్నాను. మీ విషయం ఏమిటో మీరే స్వయంగా చెబుతే బావుంటుంది. అప్పుడు ఆయన ఇస్లాం గురించి నాకు తెలిపాడు. ఖుర్ఆన్ పారాయణం చేసి వినిపించారు. అల్లాహ్ సాక్షిగా! దాని కంటే ఉత్తమమైన మాట గాని మరియు న్యాయమైన విషయం గాని నేను ఎప్పుడూ వినలేదు. అప్పుడే నేను ఇస్లాం స్వీకరించాను. సత్యం యొక్క సాక్ష్యం పలికాను.
ఆ తర్వాత తుఫైల్ తమ జాతివారి వద్దకు వెళ్ళి వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించి, దాని గురించి వివరాలు ఇవ్వగలిగారు. దాని ఫలితంగా వారి కుటుంబికులు ఇస్లాం స్వీకరించారు. తర్వాత వారి జాతివారిలో కూడా ఇస్లాం ప్రచారం చాలా మంచి విధంగా జరిగింది.
ప్రవక్త బాబాయి అబూ తాలిబ్ పూర్తి శరీరంలో తీవ్రమైన వ్యాది సోకింది. అతడు మంచం పట్టాడు. కొద్ది రోజుల్లో సక్రాత్ (మరణవేధన)కు గురయ్యాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని తలకడన కూర్చున్నారు. చివరి గడియలో మరణానికి ముందు అతను “లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికితే బావుండునని ఆశిస్తున్నారు. కాని అతని చుట్టూ ఉన్న అతని దుష్ట స్నేహితులు, ప్రత్యేకంగా వారి నాయకుడు అబూ జహల్, వారందరూ లాఇలాహ ఇల్లల్లాహ్ చదవనిస్తలేరు. నిరాకరించడమే కాకుండా, “ఏమీ నీవు నీ తాత ముత్తాతల ధర్మాన్ని విడనాడుతావా? అబ్దుల్ ముత్తలిబ్ మతాన్ని త్యజిస్తావా? అని నిందిస్తున్నారు. చివరికి అబూ తాలిబ్ షిర్క్ పై చని పోయాడు. అవిశ్వాసుడై మరణించినందుకు ప్రవక్త దుఃఖం అధికమైంది. ప్రవక్త ఈ బాధ నుండి కోలుకోక ముందే సుమారు రెండు నెలలకే ఆయన ప్రియమైన పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హా పరమపదించారు. అందువల్ల ప్రవక్త అమితంగా దుఃఖించారు. పరోక్షంగా సహాయం అందిస్తూ వచ్చిన అబూ తాలిబ్ మరియు జీవితాంతం తన కష్టాల్లో పాలుపంచుకొని, ప్రోత్సహించే సతీమణి ఖదీజాల మరణానంతరం అవిశ్వాసుల అఘాయిత్యాలు ప్రవక్తపై మరింత ఎక్కువయ్యాయి. (అయినా ప్రవక్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ధర్మ ప్రచారంలో నిమగ్నులయ్యారు).
ప్రవక్త పిలుపును అంగీకరించిన వారిలో అనేకులు బడుగువర్గానికి సంబంధించినవారు మరియ బానిసలు ఉండిరి. సామాన్యంగా ప్రతి కాలంలో ప్రవక్తల పిలుపును అంగీకరించేవారు వీరే ఉండేవారు. ఎందకనగా ఎవరినైనా అనుసరించడం వారికి కష్టతరమేమీ కాదు. కాని పెద్దలుగా చెలామణి అయినవారిని మరియు హోదా అంతస్తులు గలవారిని గర్వం, ఈర్ష్య, హోదాఅంతస్తుల ప్రేమ వైగారాలు సత్యం, ధర్మం పట్ల విధేయతకు అడ్డుగా ఉంటాయి మరియు ఇతరులకు అనుసరులుగా ఉండేందుకు ఆటంకం కలిగిస్తాయి.
ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకొనుటకు ముష్రికులు వివిధ పద్ధతులు అనుసరించారు. ఇస్లాం వ్యాప్తిని ఓ హద్దులో ఉంచుటకు విభిన్న మార్గాలు అవలంబించారు. ప్రజల్ని సత్యధర్మం నుండి ఆపడానికి శతవిధాల ప్రయత్నించారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవిః
1. బెదిరింపులుః ఖురైషు నాయకులు కొందరు ప్రవక్తగారి పెదనాన్న అబూ తాలిబ్ వద్దకు వచ్చి ‘ముహమ్మద్ మాకు చాలా బాధ కలిగిస్తున్నాడు, మా దైవాలను విమర్శిస్తున్నాడు. మీరు అతడ్ని ఈ చేష్టల నుండి ఆపండి’ అని అన్నారు. అతను ప్రవక్తను రప్పించి, “నాయనా! నీవు వారికి బాధ కలిగిస్తున్నావని, వారి దైవాలను విమర్శిస్తున్నావని నీ చిన్నాన్న కొడుకులు అంటున్నారు. దీనిని మాకనుకోరాదు నాన్న”. దీనికి సమాధానంగా ప్రవక్త సూర్యుని వైపు సైగ చేసి దీని ఏదైనా ఒక జ్వాలను నా చేతిలో పెట్టినా నేను వీరి కొరకు నా ప్రచార కార్యక్రమాన్ని విడనాడ లేను. అప్పుడు అబూ తాలిబ్ చెప్పాడః నా కొడుకు అబద్ధం పలుకలేదు. అతడ్ని అతని మానన వదలండి.
2. అపనిందలుః ప్రవక్త పిచ్చివాడని, చేతబడి చేయువాడని, అబద్ధం పలికేవాడని మరియు పాతకాలపునాటి కట్టుకథలు తెచ్చువాడని అపనిందలు మోపారు. (వీటి సాక్ష్యాధారాలు ఖుర్ఆన్ లోనే ఉన్నాయి).
3. ఎగతాళి చేయడం, పరిహసించడం మరియు నవ్వడం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహచరులతో ఎగతాళి చేసేవారు, మరియు వారి దగ్గరి నుండి దాటినప్పుడు పరిహసించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల కించపరిచే మాటలు మాట్లాడేవారు. బలహీన వర్గానికి సంబంధించిన వారితో ఎప్పుడైనా ప్రవక్తను చూసినట్లైతే వీరేనా ఇతని అనుచరులు అని హేళన చేసేవారు.
4. ప్రవక్త బోధనలను వికృతంరూపమివ్వడం, సందేహాలు లేపడం, అసత్య వదంతుల వ్యాపింపజేయడం: ఖుర్ఆన్ కేవలం కొన్ని కట్టుకథల పుస్తకం మాత్రమే అని ఆరోపించేవారు. ఒక మనిషి ఇతనికి నేర్పుతున్నాడని ఆరోపించేవారు.
5. చితకబాదడం: ప్రవక్తను మరియు సహచరులను సత్యధర్మం నుండి ఆపడానికి పై ప్రయత్నాలు ఫలించనందు వల్ల శారీరక ఇబ్బందులు కలిగించే వారు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్ర్ లో నమాజ్ చేస్తుండగా ఉఖ్బా బిన్ అబీ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖబా భూజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారుః {ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?}.
ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్, వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూః ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటె ను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగోల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.
ఒక రోజు అబూ జహల్ అన్నాడుః ముహమ్మద్ ను నేను నమాజు చేస్తూ చూశానా (అతను సజ్దాలో పోయినప్పుడు) అతని మెడ మీద కాలు పెట్టి తొక్కుతాను అతని మూతి మీద మట్టి విసురుతాను. వాడనుకున్నట్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేయుటకు వచ్చారు. వచ్చిరాగానే నమాజు మొదలుపెట్టారు. మెడను కాలుతో తొక్కాలని నిశ్చయించుకున్నవాడు, తన మీద చేయబడుతున్న దాడి నుండి తన్నుతాను కాపాడుకొంటున్నట్లు రెండు చేతులు మీదికి ఎత్తి టక్కున వెనక్కి తిరగాడు. నీకెమయింది అబుల్ హకం అని వారు అడుగుతే నాకు మరియు ముహమ్మదుకు మధ్య ఒక అగ్ని కందకము ఉండినది. (నేను ఏ కొంచం ముందుకు వెళ్ళినా దానికి ఆహుతి అయి పోయేవాణ్ణి అని చెప్పాడు).
6. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులను బాధించడం: ప్రవక్త సల్లల్లాహ అలైహి వసల్లం సహచరులను బాధ కలిగించే, వారిని కఠినంగా శిక్షించేవారు. కొందరు బలహీన బానిసలను త్రాళ్ళతో కట్టి మండే ఎండలో వదిలేసేవారు. ఇంకెన్నో విధాలుగా పీడించేవారు.
అమ్మార్ రజియల్లాహు అన్హు మరియు అతని తల్లదండ్రిని నానారకాలుగా శిక్షించారు. చివరికి అతని తల్లిని ఘోరమైన విధంగా హత్య చేశారు. అతని తండ్రి కూడా అనేక రకాల శిక్షలను భరించలేక ప్రాణం కోల్పోయాడు. వారు ఖబ్బాబ్ బిన్ అరత్త్ రజియల్లాహు అన్హు యొక్క వెంట్రుకలు పట్టి లాగేవారు. అతని మెడను వడిబెట్టేవారు. మండుటెండలో దగదగ మండే పెద్ద బండపై పరుండబెట్టి దాని వెడిని భరించక కదలకుండా ఛాతిపై మరో పెద్ద బండ పెట్టేవారు. అలాగే ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించినప్పుడు అతనిపై కూడా దౌర్జన్యం చేసి అతని హత్యాయత్నం చేశారు.
ముస్లిముల పట్ల ఖురైషుల తలబిరుసుతనం, హింసా దౌర్జన్యాలు, వారిని అణచివేసే ప్రయత్నాలు మితిమీరుతున్నందు వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ ప్రయాణం చేస్తే బావుంటుందని ఆలోచించారు. అల్లాహ్ వారికి ఇస్లాం భాగ్యం ప్రసాదించవచ్చు. అయితే తాయిఫ్ ప్రయాణం సులభమేమీ కాదు. తాయిఫ్ చుట్టూ ఎత్తయినా పర్వతాలు, వాటి మధ్యలో చిక్కు దారిన ప్రయాణించడం చాలా కష్టం. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాహసించి అక్కడికి చేరుకున్నారు. తాయిఫ్ వాసుల ఎదురుకోలు, వారి సమాధానం మంచి విధంగా లేకుండింది. వారు ఆయన మాటను ఆలకించకనే తరిమివేశారు. అంతే కాదు, తుంటరి కుర్రగాళ్ళను ప్రేరేపించారు, ప్రవక్త తిరిగి వెళ్తున్నప్పుడు వారు ఆయనపై రాళ్ళు రువ్వారు. దాని వల్ల ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమయి, అది పాదరక్షల్లో నిలిచిపోయి చెప్పులు తీయడం కష్టమైంది. ప్రవక్తగారు కుంగిపోయి, దుఃఖిస్తూ(1) తిరిగి మక్కా వెళ్తుండగా జిబ్రీల్ అలైహిస్సలాం, పర్వతాల దూతతో ఎదురయి, ” మీ ఇష్ట ప్రకారం అతనికి ఆదేశించుటకు అల్లాహ్ మీ వైపు పర్వతాల దూతను పంపాడు” అని చెప్పాడు.
అప్పుడు పర్వతాల దూత మాట్లాడుతూః “ఓ ముహమ్మద్! నీవు ఇష్టపడితే (మక్కాను ఆవరించుకొని ఉన్న) ఈ రెండు కొండల్ని వారిపై పడవేస్తాను” అని చెప్పాడు. కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “వద్దు, వీరుగాకున్నా వీరి సంతానంలో కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి ఆయనతో ఎవరినీ సాటి కల్పించని వారిని అల్లాహ్ పుట్టిస్తాడని నాకు ఆశవుంది”.
[1] వారి దుష్పవర్తన వల్ల కాదు, ఇస్లాం స్వీకరించనందుకు
ముష్రికుల వ్యెతిరేకత, పోరాటాల్లో ఒక రకం; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లొంగదీయాలన్న ఉద్దేశ్యంతో మహిమలు కోరడం. అనేకసార్లు వారు మహిమలు చూపమని కోరారు. అయితే ఒకసారి చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చేసి చూపించాలని కోరారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తో వేడుకున్నారు. అల్లాహ్ వారికి ఈ మహిమ చూపించాడు. ఖురైషులు చంద్రుని రెండు ముక్కల్ని వేరు వేరుగా చూశారు. చాలా సేపటి వరకు చూశారు. అయినా ఇస్లాం స్వీకరించలేదు. ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- మాపై మంత్రం చేశాడని వదంతి లేపారు. వారిలోని ఒక మనిషి వారికి ఇలా చెప్పాడుః ముహమ్మద్ మంత్రం చేసియుంటే అందరిపై చేయలేడు కదా, అయితే వేచించండి, ఏదైనా బిడారము వస్తే వారిని అడగవచ్చు, అంతలోనే ఒక బిడారము వచ్చింది. వారిని ప్రశ్నించారు. అవును మేము చూశామని వారు చెప్పారు. అయినా ఖురైషులు మొండివైఖరి అవలంభించి తమ అవిశ్వాసంపైనే ఉండిపోయారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెదనాన్న అబూ తాలిబ్ మరియు పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాల మరణం, తాయిఫ్ నుండి తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటన, ఆ తరువాత ఖురైషుల హింసాదౌర్జన్యాల హెచ్చింపు ఇవన్నీ ఒకటెనుకొకటి సంభవించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక రకాల బాధలు అనుభవిస్తున్న సందర్భంలో అల్లాహ్ వైపు నుండి ఆయన మనసుకు నెమ్మది, తృప్తి, శాంతి ప్రసాదించబడే రోజు ఆసన్నమయింది. ఆ రోజు రాత్రి ప్రవక్త ﷺ నిద్రిస్తున్న
[1] మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు ప్రయాణాన్ని “ఇస్రా” అని, అక్కడి నుండి గగన ప్రయాణాన్ని “మేరాజ్” అని అంటారు.
వేళ జిబ్రీల్ అలైహిస్సలాం “బురాఖ్” తీసుకొని వచ్చారు. దాని పోలిక గుఱ్ఱం లాంటిది. దానికి రెండు రెక్కలు. మెరుపు లాంటి దాని వేగం. దానిపై ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను సవారి చేయించుకొని ఫాలస్తీనా దేశంలో బైతుల్ మఖ్దిస్ వెళ్ళారు. అక్కడి నుండి గగన ప్రయాణము చేసి పోషకుడైన అల్లాహ్ యొక్క చాలా నిదర్శనాలు చూశారు. అక్కడే ఐదు పూటల నమాజు విధి అయ్యింది. అదే రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశాంత హృదయంతో, దృఢ విశ్వాసంతో తిరిగి వచ్చారు. ఈ విషయాన్నే అల్లాహ్ ఇలా తెలిపాడుః
{కొన్ని నిదర్శనాలు చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదె హరాం నుండి మస్జిదె అఖ్సా వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. నిజానికి ఆయనే అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడునూ}. (బనీ ఇస్రాయీల్ 17: 1).
ఉదయం కాబా వద్దకు వచ్చి, రాత్రి జరిగిన సంఘటన ప్రజల ముందు చెప్పగా అవిశ్వాసులు పరిహసించి, ఘోరంగా తిరస్కరించారు. కొందరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లొంగదీయాలనే ఉద్దేశంతో బైతుల్ మఖ్దిస్ గురించి వర్ణించవలసినదిగా కోరారు. ప్రవక్త దానిలోని ఒక్కొక్క వస్తువును గురించి వివరించారు. ఇంతటి సూక్ష్మమైన వర్ణనతో ముష్రికులు తృప్తి చెందక మరో నిదర్శన అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నేను దారిలో ఒక బిడారాన్ని చూశాను. అది మక్కా వైపు వస్తుంద”ని చెప్పి, వారి ఒంటెల సంఖ్య, వారు ఇక్కడికి చేరుకునే సమయంతో సహా అన్ని వివరాలిచ్చారు. ప్రవక్త మాట / సూచన నూటికి నూరు పాల్లు నిజం అయింది. కాని అవిశ్వాసులు సత్యపరిచేకి బదులుగా, సత్యతిరస్కారం, తలబిరుసుతనంలోనే ఉండిపొయ్యారు.
ఇస్రా మరియు మేరాజ్ తరువాత రోజు జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త వద్దకు వచ్చి, ఐదు నమాజుల విధానం, వాటి సమయాలు తెలియజేశారు. అంతకు ముందు ఉదయం రెండు రకాతులు, సాయంకాలం రెండు రకాతుల నమాజు మాత్రమే ఉండినది.
ఖురైషుల పోరు రోజురోజుకు పెర్గుతూ పోతుంది. వారు సత్యం నుండి దూరమే అవుతున్నారు. ఆ సమయాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర ప్రాంతాల నుండి మక్కా వచ్చేవారికి ఇస్లాం ధర్మాన్ని తెలుపడంపై ఎక్కువ దృష్టి సారించారు. వారి నివాసాల్లో, వారు మజిలి చేసే చోట వారితో కలసి క్లుప్తంగా ఇస్లాం గురించి వివరించేవారు. ప్రవక్త పిన తండ్రి అబూ లహబ్ ఆయన -ﷺ- వెంట తిరుగుతూ ఆయన గురించి, ఆయన ప్రచారం గురించి ప్రజల్ని బెదిరించేవాడు.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీన నుండి వచ్చి మజిలి చేసిన కొందరితో కలిసి వారిని అల్లాహ్ వైపు పిలిచారు. వారు ఆయన మాటలను శ్రద్ధగా విని, ఆయన్ను విశ్వసించి, అనుసరిస్తామని వారు ఏకీభవించారు. అయితే ఒక ప్రవక్త రానున్నాడు, అతని ఆగమన కాలం సమీపించిందని వారు ఇంతకు ముందే యూదులతో వినేవారు. ఎప్పుడైతే ప్రవక్త వారికి ఇస్లాం బోధ చేశారో, యూదులు చెప్పే మాట గుర్తొచ్చి, ఆ ప్రవక్త ఈయనే అని తెలుసుకొని, ఈయన్ని విశ్వసించడంలో యూదులు మనకంటే ముందంజం వేయకూడదని వారు పరస్పరం అనుకొని తొందరగా విశ్వసించారు. వారు ఆరుగురు. ఆ తరువాత సంవత్సరం పన్నెండు మంది ప్రవక్తతో కలసి ఇస్లాం ధర్మ జ్ఞానం నేర్చుకున్నారు. వారు తిరిగి మదీన వెళ్ళేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హును వారితో పంపారు. అతను వారికి ఖుర్ఆన్ నేర్పాలని మరియు ఇస్లాం ధర్మాదేశాలు బోధించాలని. అతను అక్కడి సమాజంపై మంచి ప్రభావం వేయగలిగారు. అంటే మదీనవాసులు అతని ప్రచారం పట్ల ఆకర్శితులయ్యే విధంగా అతను అక్కడ ఉండి ఇస్లాం బోధించగలిగారు. ఒక సంవంత్సరం తర్వాత అతను మక్కా వచ్చేటప్పుడు తన వెంట 72 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిశారు. అల్లాహ్ ధర్మ సహాయానికి ఎల్లవేళల్లో సిద్ధమేనని వారు శపథం చేసి తిరిగి మదీన వెళ్ళిపోయారు.
మదీన పట్టణం ఇస్లాం మరియు ముస్లింలకు మంచి ఆశ్రయం, శాంతి స్థానంగా అయ్యింది. అక్కడికి మక్కా పీడిత ముస్లిముల హిజ్రత్(1) మొద లయ్యింది. ముస్లిములను హిజ్రత్ చేయనివ్వకూడదని ఖురైషు గట్టి పట్టు పట్టారు. హిజ్రత్ చేయబూనిన కొందరు ముస్లిములు నానా రకాల హింసా దౌర్జన్యాలకు గురయ్యారు. అందుకు ముస్లిములు రహస్యంగా హిజ్రత్ చేసేవారు. అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో అనుమతి కోరినప్పుడల్లా “తొందరపడకు, బహుశా అల్లాహ్ నీకొక ప్రయాణమిత్రుడు నొసంగవచ్చును” అని చెప్పేవారు. చివరికి చాలా మంది ముస్లిములు హిజ్రత్ చేశారు.
ముస్లిములు ఈ విధంగా హిజ్రత్ చేసి, మదీనలో వెళ్ళి స్థానం ఏర్పరుచుకుంటున్న విషయాన్ని చూసి ఖురైషులకు పిచ్చెక్కి పోయింది. అంతే కాదు, ముహమ్మద్ -ﷺ- ప్రతిష్ఠ, ఆయన ప్రచారం దినదినానికి వృద్ధి చెందుతున్నది చూసి వారు భయం చెందారు. అందుకని వారందరూ
1 హిజ్రత్ అంటే వలసపోవుట. అంటే తన స్వగ్రామంలో ఇస్లాం ధర్మ ప్రకారం జీవితం గడపడం కష్టతరమైతే, దాన్ని వదిలి వేరే ప్రాంతానికి ప్రయాణమగుట.
కలసి సమాలోచన చేసి ప్రవక్తను హతమార్చాలని ఏకీభవించారు. అబూ జహల్ ఇలా చెప్పాడుః మనం ప్రతి తెగ నుండి శక్తివంతుడైన ఒక యువకునికి కరవాలం ఇవ్వాలి. వారందరూ ముహమ్మదును ముట్టడించి, అందరు ఒకేసారి దాడి చేసి సంహరించాలి. అప్పుడు అతని హత్యానేరం అన్ని తెగలపై పడుతుంది. బనీ హాషిం అందరితో పగతీర్చుకొనుటకు సాహసించలేరు అని పథకం వేశారు. వారి ఈ పథకం, దురాలోచన గురించి అల్లాహ్ ప్రవక్తకు తెలియ జేశాడు. అల్లాహ్ అనుమతిని అనుసరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ బక్ర్ రజియల్లాహు అన్హుతో హిజ్రత్ కొరకు సిద్ధమయ్యారు. అలీ రజియల్లాహు అన్హును పిలిచి, ఈ రాత్రి నీవు నా పడకపై నిద్రించు, (నీకు ఏ నష్టమూ కలగదు). చూసే వారికి నేనే నిద్రిస్తున్నానన్న భ్రమ కలుగుతుంది అని చెప్పారు.
అవిశ్వాసులు తమ పథకం ప్రకారం, ప్రవక్త ఇంటిని చుట్టుముట్టారు. అలీ రజియల్లాహు అన్హును నిద్రిస్తున్నది చూసి ముహమ్మద్ -సల్లల్లాహు అలైహి వసల్లం- అని భ్రమపడ్డారు. ఆయన బైటికి వచ్చిన వెంటనే ఒకే దాడిలో హత్య చేయాలని ఆయన రాక కొరకు ఎదిరి చూస్తున్నారు. వారు ముట్టడించి కాపుకాస్తున్న వేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్య నుండి వెళ్ళారు. వారి తలలపై మన్ను విసురుతూ అక్కడి నుండి వెళ్ళారు. అల్లాహ్ వారి చూపులను పట్టుకున్నాడు. ప్రవక్త వారి ముందు నుండి దాటింది వారు గ్రహించలేక పోయారు. అక్కడి నుండి ప్రవక్త అబూ బక్ర్ రజియల్లాహు అన్హు వద్దకెళ్ళి, ఇద్దరూ కలసి సుమారు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న సౌర్ గుహలో దాగి పోయారు. అటు ఖురైషు శక్తిశాలి యువకులు తెల్లారే వరకు నిరీక్షిస్తునే ఉండిపోయారు. తెల్లారిన తర్వాత ప్రవక్త పడక నుండి అలీ రజియల్లాహు అన్హు లేచి, వీరి చేతిలో చిక్కాడు. ప్రవక్త గురించి అడిగారు. అలీ రజియల్లాహు అన్హు ఏమీ చెప్ప లేదు. అతన్ని పట్టి లాగారు, కొట్టారు, కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఖురైషులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెతకడానికి అన్ని దిక్కులా అన్వేషీలను పంపారు. ఆయన్ని జీవనిర్జీవ ఏ స్థితిలో పట్టు కొచ్చినా, అతనికి 100 ఒంటెల బహుమాణం అని ప్రకటించారు. కొందరు అన్వేషీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన మిత్రుడు ఉన్న గుహ వద్దకు చేరుకున్నారు. వారిలో ఏ ఒక్కడైనా వంగి తన పాదాల్ని చూసుకున్నా, వారిద్దర్ని చూసేవాడు. అందుకు అబూ బక్ర్ రజియల్లాహు అన్హు (ప్రవక్త పట్ల) కంగారు పడ్డారు. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా ధైర్యం చెప్పారుః “అబూ బక్ర్! ఏ ఇద్దరికి తోడుగా మూడోవాడు అల్లాహ్ ఉన్నాడో వారి గురించి నీకు రందేమిటి. దిగులు పడకు అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు”. వాస్తవంగా వారు ఆ ఇద్దరిని చూడలేదు కూడా. మూడు రోజుల వరకు అదే గుహలో ఉండి, మదీనాకు బయలుదేరారు. దూర ప్రయాణం, మండే ఎండలో ప్రయాణం సాగుతూ రెండవ రోజు సాయంకాలం ఒక గుడారం నుండి వెళ్ళుచుండగా అక్కడ ఉమ్మె మఅబద్ పేరుగల స్త్రీ ఉండెను. నీ వద్ద తిను త్రాగటకు ఏమై నా ఉందా అని ఆమెతో అడిగారు. నా వద్ద ఏమీ లేదు. ఆ మూలన బలహీన మేక ఉంది. మందతో పాటు నడవలేకపోతుంది. దానిలో పేరుకు మాత్రం పాలు కూడా లేవు అని చెప్పింది. పిదప ఆమె అనుమతి మేరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మేక వద్దకు వెళ్ళి దాని పొదుగును చెయితో తాకగానే అందులో పాలు వచ్చేశాయి. పెద్ద పాత్ర నిండ పాలు పితికారు. ఉమ్మె మఅబద్ మరీ ఆశ్చర్యంగా ఒక వైపు నిలుచుండి బిత్తర పోయింది. ఆ పాలు అందరూ కడుపు నిండా త్రాగారు. మరో సారి పాత్ర నిండా పితికి, ఉమ్మె మఅబద్ వద్ద వదిలి, ప్రయణమయ్యారు.
మదీనవాసులు ప్రతీ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎదిరి చూస్తూ మదీన బైటికి వచ్చేవారు. ప్రవక్త మదీన చేరుకునే రోజు సంతోషం తో, స్వాగతం పలుకుతూ వచ్చారు. మదీన ప్రవేశంలో ఉన్న ఖుబాలో మజిలి చేశారు. అక్కడ నాలుగు రోజులున్నారు. మస్జిదె ఖుబా పునాది పెట్టారు. ఇది ఇస్లాంలో మొట్టిమొదటి మస్జిద్. ఐదవ రోజు మదీన వైపు బయలుదేరారు. అన్సారులో అనేక మంది ప్రవక్త ఆతిథ్య భాగ్యం తనకే దక్కాలని చాలా ప్రయత్నం చేసేవారు. అందుకని ప్రవక్త ఒంటె కళ్ళాన్ని పట్టుకునేవారు. అయితే ప్రవక్త వారికి ధన్యావాదాలు తెలుపుతూ, వద లండి! దానికి అల్లాహ్ ఆజ్ఞ అయిన చోటనే కూర్చుంటుంది అని చెప్పే వారు. అది అల్లాహ్ ఆజ్ఞ అయిన చోట కూర్చుంది. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దిగలేదు. మళ్ళీ లేచీ కొంత దూరం నడిచింది. తిరిగి వచ్చి మొదటి ప్రాంతంలోనే కూర్చుంది. అప్పుడు ప్రవక్త దిగారు. అదే ప్రస్తుతం మస్జిదె నబవి ఉన్న చోటు. ప్రవక్త అబూ అయ్యూబ్ అన్సారీ రజియల్లా హు అన్హు వద్ద ఆతిథ్యం స్వీకరించారు. అటు అలీ రజియల్లాహు అన్హు ప్రవక్త వెళ్ళాక మూడు రోజులు మక్కాలో ఉండి, ఆ మధ్యలో ప్రవక్త వద్ద ఉన్న అమానతులు హక్కుదారులకు చెల్లించి మదీనకూ బయలు దేరాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుబాలో ఉండగా అక్కడికి వచ్చి కలుసుకున్నాడు.
ఒంటె కూర్చున్న స్థలాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని యజమానుల నుండి ఖరీదు చేసి అక్కడ మస్జిద్ నిర్మించారు. ముహాజి రీన్ మరియు అన్సారుల(1) మధ్య సోదర బాంధవ్యం ఏర్పరిచారు. ఒక్కో ముహాజిరును ఒక్కో అన్సారుతో కలిపి ఇతడు నీ సోదరుడు తన సొమ్ము లో కూడా నీ భాగమని తెలిపారు. ముహాజిరులు అన్సారులు కలసి పని చేసుకోవడం మొదలెట్టారు. వారి మధ్య సోదర బాంధవ్యం మరీ గట్టిపడింది.
[1] మదీనకు వలస వచ్చిన వారిని ముహాజిరీన్ అంటారు. వారి సహాయం చేసిన మదీన వాసులను అన్సార్ అంటారు.
మదీనాలో ఇస్లాం విస్తృతం కావడం మొదలయింది. కొందరు యూదులు ఇస్లాం స్వీకరించారు. వారిలో ఒకరు అబ్దుల్లాహ్ బిన్ సలాం రజియల్లాహు అన్హు. ఇతను వారిలో ఒక పెద్ద పండితుడు. మరియు వారి పెద్ద నాయకుల్లో ఒకరు.
ముస్లిములు మక్కా నగరాన్ని వదలి వెళ్ళినప్పటికీ వారికి వ్యతిరేకంగా ముష్రికుల విరోధం, పోరాటం సమాప్తం కాలేదు. ఖురైషులకు మదీన యూదులతో ముందు నుండే సంబంధం ఉండెను. అయితే వారు దాన్ని ఉపయోగించి ముస్లిముల
మధ్యగల ఐక్యతను భంగం కలిగించాలని, తృప్తిగా ఉండనివ్వకుండా మనోవ్యదకు గురి చేయాలని యూదులను ప్రేరేపించేవారు. అంతే కాదు, వారు స్వయంగా ముస్లిములను బెదిరిస్తూ, అంతమొందిస్తామని హెచ్చరించేవారు. ఈ విధంగా ముస్లిములకు ముప్పు ఇరువైపులా చుట్టుముట్టింది. అంటే మదీన లోపల ఉన్నవారితో మరియు బైటి నుండి
ఖురైషులతో. సమస్య ఎంత గంభీరమైనదంటే సహాబాలు ఆయుధాలు తమ వెంట ఉంచుకొని రాత్రిళ్ళు గడిపేవారు. ఈ భయాందోళన సందర్భంలోనే అల్లాహ్ యుద్ధానికి అనుమ తించాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గస్తీ దళాల్ని తయారు చేసి పంప సాగారు. వారు చుట్టు ప్రక్కల్లో శత్రువులపై దృష్టి ఉంచేవారు. ఒక్కోసారి వారి వ్యాపార బృంధాలను అడ్డుకునేవారు. వీటి ఉద్దేశం: ముస్లిములు అశక్తులు కారు అని తెలియజేయుటకు, వారిపై ఒత్తిడి చేయుటకు, ఇలా వారు సంధికి దిగి వచ్చి, ముస్లిములు స్వేచ్ఛగా ఇస్లాంపై ఆచరిస్తూ, దాని ప్రచారం చేసుకోవడంలో వారు అడ్డు పడకూడదని. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్కలో ఉన్న తెగలవారితో ఒప్పందం, ఒడంబడికలు కుదుర్చుకున్నారు.
ముస్లిములు మక్కాలో ఉన్నప్పుడు ముష్రికులు వారిని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి చివరికి తమ స్వస్థలాన్ని వదలి వలస వెళ్ళే స్థితికి తీసుకొచ్చారు (అన్న విషయం తెలిసినదే). అందువల్ల వారు తమ జన్మస్థలాన్ని, తమ ధనాన్ని మరియు తమవారిని వదలి మదీనా వచ్చారు. అప్పుడు ముష్రికులు వారి ధనాన్ని ఆక్రమించుకున్నారు. అంతేకాదు ఇటు మదీనా వాసులపై దొంగ దాడులు చేస్తూ తృప్తిగా ఉండకుడాం చేయసాగారు.
అందుకే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరియా నుండి వస్తున్న ఖురైషు వాణిజ్య బృందాన్ని అడ్డుకొని, వారిని అదుపులో మరియు భయంలో ఉంచాలని నిశ్చయించి, 313 మంది సహాబాలతో కలసి వెళ్ళారు. అప్పుడు వారి వద్ద రెండు గుఱ్ఱాలు, 70 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఖురైషు బృందంలో 1000 ఒంటెలున్నాయి. 40 మంది ఉన్నారు. అబూ సుఫ్యాన్ వారికి నాయకత్వం వహిస్తున్నాడు. కాని మస్లిములు అడ్డుకునే విషయాన్ని అబూ సుఫ్యాన్ గ్రహించి, ఈ వార్త మక్కా పంపుతూ, వారితో సహాయం కోరాడు. అంతే కాదు, అతడు తన బృందంతో ప్రధాన రహదారిని వదిలేసి వేరే దొడ్డిదారి గుండా వెళ్ళిపోయాడు. ముస్లిములు వారిని పట్టుకోలేక పోయారు. అటు వార్త తెలిసిన మక్కా ఖురైషులు, 1000 యుద్ధవీరులతో పెద్ద సైన్యం తయారు చేసుకొని బయలుదేరారు. వీరు దారిలో ఉండగానే అబూ సుఫ్యాన్ రాయబారి వచ్చి, వాణిజ్య బృందం ముస్లిముల నుండి తప్పించుకొని, క్షేమంగా చేరుకోనుంది. మీరు తిరిగి మక్కా వచ్చేసెయ్యండి అని చెప్పాడు. కాని అబూ జహల్ నిరాకరించాడు. తిరిగి మక్కా పోవడానికి ఒప్పుకోలేదు. ప్రయాణం ముందుకు సాగిస్తూ బద్ర్ వైపు వెళ్ళాడు.
ఖురైషు సైన్యం బయలుదేరిన విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసిన తర్వాత తమ సహచరులతో సమాలోచన చేశారు. అందరూ అవిశ్వాసులతో పోరాడుటకు సిద్ధమేనని ఏకీభవించారు. రెండవ హిజ్రి శకం, రమజాను మాసములోని ఒక రోజు రెండు సైన్యాలు పోరాటానికి దిగాయి. ఇరువురి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ముస్లింలు విజయం పొందారు. వీరిలో 14 మంది సహాబాలు షహీదు (అమరవీరు) లయ్యారు. ముష్రికుల్లో 70 మంది వధించబడగా, మరో 70 మంది ఖైదీలయ్యారు.
ఈ యుద్ధ సందర్భంలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూతురు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సతీమణి రుఖయ్యా రజియల్లాహు అన్హా మరణించారు. అందుకే ఉస్మాన్ రజియల్లాహు ఈ యుద్ధం లో పాల్గొన లేకపో యాడు. ప్రవక్త ఆదేశమేరకు అతను తన అనారోగ్యంగా ఉన్న భార్య సేవలో మదీనలోనే ఉండిపోయాడు. ఈ యుద్ధం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ రెండవ కూతురు ఉమ్మె కుల్సూమ్ రజియల్లాహు అన్హా వివాహం ఉస్మాన్ రజియ ల్లాహు అన్హుతో చేశారు. అందుకే అతను జిన్నూరైన్ అన్న బిరుదు పొందాడు. అంటే రెండు కాంతులు గలవాడు అని.
బద్ర్ యుద్ధంలో ముస్లిములు అల్లాహ్ సహాయంతో విజయం సాధించి, ముష్రికుఖైదీలతో మరియు విజయధనంతో సంతోషంగా తిరిగి మదీన వచ్చారు. ఖైదీల్లో కొందరు పరిహారం చెల్లించి విడుదలయ్యారు. మరి కొందరు ఏ పరిహారం లేకుండానే విడుదలయ్యారు. ఇంకొందరి పరిహారం; ముస్లిం పిలవాళ్ళకు చదువు నేర్పడం నిర్ణయమయింది. వారు ఇలా విడుదలయ్యారు.
ఈ యుద్ధంలో ముష్రికుల పేరుగాంచిన నాయకులు, ఇస్లాం బద్ధశత్రువులు హతమయ్యారు. వారిలో అబూ జహల్, ఉమయ్య బిన్ ఖల్ఫ్, ఉత్బా బిన్ రబీఆ మరియు షైబా బిన్ రబీఆ వైగారాలు.
బద్ర్ యుద్ధంలో ముష్రికులు ఓడిపోయిన తర్వాత, ఒకరోజు ఉమైర్ బిన్ వహబ్, సఫ్వాన్ బిన్ ఉమయ్యతో ఓ సమావేశం జరిపాడు. ఉమైర్ బిన్ వహబ్ ఖురైష్ లోని షైతానుల్లో ఒకడు. ప్రవక్తను, ఆయన సహచరుల్ని చాలా బాధ కలిగించేవాడు. అతని కొడుకు వహబ్ బద్ర్ యుద్ధంలో ముస్లిముల చేతిలో బంధిగా అయిపోయాడు.
మాట సందర్భంలో సఫ్వాన్ ముష్రికుల హతుల గురించి ప్రస్తావిస్తూ ‘అల్లాహ్ సాక్షిగా! వారి తర్వాత జీవితంలో ఏ సుఖం లేదు’ అని అన్నాడు. అప్పుడు ఉమైర్ అన్నాడుః ‘నిజం! అల్లాహ్ సాక్షిగా! నా మీద అప్పు ఉంది. దాన్ని తేర్చడానికి నా వద్ద ఏమీ లేదు. ఇంకా పిల్లలున్నారు, వారిని చూసేవాడు ఉండడు అని భయం ఉంది. ఈ ఆటంకాలు గనక లేకుంటే ముహమ్మద్ వరకు చేరుకొని అతని హత్య చేసేవాడ్ని నేను’.
సఫ్వాన్ ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి, ‘నీ అప్పు బాధ్యత నేను తీసుకుంటాను. నీ సంతానాన్ని వారున్నంత వరకు నా సంతానంగా చూసుకుంటాను’ అని అన్నాడు. ఉమైర్ అన్నాడుః అట్లైతే ఈ విషయం నీవు, నేను తప్ప మరే వ్యక్తికీ తెలియకూడదు. అతడన్నాడుః సరే.
ఇక ఉమైర్ అక్కడి నుండి వెళ్ళి తన కరవాలానికి విషముతో సానం పట్టి మదీనకు పయనమయ్యాడు. అక్కడికి చేరుకొని, మస్జిదె నబవి బయట తన ఒంటెను కూర్చోబెడుతున్న, కరవాలం ధరించి ఉన్న ఉమైర్ ను, పరస్పరం సంభాషించుకుంటున్న ముస్లిముల ఓ గుంపు మధ్యలో ఉన్న ఉమర్ రజియల్లాహు అన్హు పసిగట్టి, ‘ఇదిగో అల్లాహ్ యొక్క కరడుగట్టిన శత్రువు ఉమైర్ బిన్ వహబ్ ఏదో కీడు పూనుకొనే వస్తున్నాడు’ అని అన్నాడు.ఉమర్ వెంటనే ప్రవక్త వద్దకు వెళ్ళి ‘దైవప్రవక్తా! ఇదిగో అల్లాహ్ యొక్క శత్రువు ఉమైర్ బిన్ వహబ్ కరవాలం ధరించి వచ్చాడు’ అని తెలియజేశాడు. ప్రవక్త చెప్పారుః “అతడ్ని రానివ్వు”.
ఉమర్ అతడ్ని ప్రవక్త వద్దకు ప్రవేశింపజేశాడు. ఉమర్ అతడ్ని గట్టిగా పట్టుకున్నది చూసిన ప్రవక్త “ఉమర్ అతడ్ని వదలు” అని ఆదేశించి, “నా దగ్గరికి రా ఉమైర్” అని పిలిచారు. అతడు దగ్గరికయ్యాక, “ఏ ఉద్దేశ్యంతో వచ్చావు ఉమైర్?” అని అడిగారు. ‘మీ చేతికి చిక్కిన మా ఖైదీల గురించి వచ్చాను. వారి పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించండి’ అని చెప్పాడు. “నీవు ఎందు గురించి వచ్చావో నిజం చెప్పు” అని ప్రవక్త కోరారు. అయినా అతడు ‘ఏమీ లేదు, వారి గురించే వచ్చాను’ అని చెప్పాడు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం చెప్పారుః “కాదు, (అంటే నీవు చెప్పేది నిజం కాదు). నీవు మరియు సఫ్వాన్ బిన్ ఉమయ్య ఓ చోట కూర్చొని బద్ర్ హతులను గుర్తు చేశారు. అప్పుడు నీవు అన్నావుః నాకు గనక అప్పు మరియు నా సంతాన భయం లేకుంటే నేను ముహమ్మద్ ను హతమార్చేవాడిని, అప్పుడు సఫ్వాన్ బిన్ ఉమయ్య నీ అప్పు మరియు నీ సంతాన బాధ్యత తీసుకున్నాడు. దీనికి బదులుగా నీవు నన్ను హతమార్చాలని అని. కాని నీకు మరియు నీ ఈ ఉద్దేశ్యానికి మధ్య అల్లాహ్ అడ్డు పడ్డాడు”.
ప్రవక్త నోట ఈ మాట విన్న వెంటనే ఉమైర్ “అష్ హదు అన్నక రసూలుల్లాహ్” (నిస్సందేహంగా మీరు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను) అని పలికి, ప్రవక్తా! మీకు ఆకాశం నుండి వచ్చే విషయాలను మరియు మీపై అవతరింపజేయబడే వహీ (దివ్యావిష్కృతి)ని మేము తిరస్కరించేవారము. అయితే ఈ (మీ హత్యాయత్న) విషయం మాట్లాడుకునేటప్పుడు నేను మరియు సఫ్వాన్ తప్ప మరెవ్వరూ లేరు. అల్లాహ్ సాక్షిగా! ఈ విషయం మీకు అల్లాహ్ తప్ప మరెవ్వరూ తెలుపలేదు. అల్లాహ్ కే సర్వ స్తోత్రములు, అతడు నాకు సన్మార్గం చూపాడు. అందుకని ఇక్కడికి తీసుకొచ్చాడు’ అని సత్య సాక్ష్యం పలికాడు.
అప్పుడు ప్రవక్త చెప్పారుః “మీ సోదరునికి ధర్మ విషయాలు నేర్పండి, ఖుర్ఆన్ నేర్పించండి. అతని ఖైదీని విడుదల చెయ్యండి”. సహచరులు అలాగే చేశారు. ఆ తర్వాత ఉమైర్ అన్నాడుః ‘ప్రవక్తా! ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడడంలో తీవ్ర ప్రయత్నం చేశాను. అల్లాహ్ ధర్మంపై ఉన్నవారికి చాలా బాధ కలిగించాను. మీరు గనక అనుమతిస్తే మక్కా వెళ్ళి వారిని అల్లాహ్ మరియు అల్లాహ్ సత్య ప్రవక్త మరియు ఇస్లాం వైపునకు పిలుస్తానని కోరుతున్నాను. అల్లాహ్ వారికి కూడా సన్మార్గం చూపవచ్చు’.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అనుమతి ఇచ్చాడు.
ఉమైర్ మదీన వెళ్ళిన తర్వాత సఫ్వాన్ ప్రజలకు ఇలా చెప్పేవాడుః ‘సంతోషించండి, బద్ర్ సంఘటనను మరిపించే ఓ శుభవార్త రానుంది’. అటునుండి వచ్చే బాటసారులను ఉమైర్ గురించి ఏదైనా వార్త ఉందా? అని అడిగేవాడు. అయితే ఒకసారి ఓ బాటసారి వచ్చి అతను ఇస్లాం స్వీకరించిన వార్త వినిపించాడు. ఈ వార్త విని అతనితో మాట్లడనని మరియు అతనికి ఎప్పుడూ ఏ లాభమూ చేకూర్చనని ప్రమాణం చేశాడు. అటు ఉమైర్ మక్కా చేరుకున్న తర్వాత అక్కడే ఉండి ప్రజల్ని ఇస్లాం వైపునకు పిలవడం మొదలెట్టాడు. అల్ హందులిల్లాహ్ అతని ద్వారా చాలా మంది ఇస్లాం స్వీకరించారు.
మరో సంఘటనః మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో ఓ ప్రయాణం నుండి తిరిగి వస్తుండగా ఒక ప్రాంతంలో బస చేశారు. ప్రతి ఒక్కడు ఏదైనా చెట్టు నీడ గురించి వెతికి అక్కడ నిద్రించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఓ చెట్టు క్రింద మకాం వేశారు. దాని ఒక కొమ్మకు తమ కరవాలాన్ని వ్రేలాడదీసి, నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రవక్త నిద్ర ఉన్న సందర్భంలో ముందు నుండే గోప్యంగా వెంటాడుతున్న ఓ అవిశ్వాసుడు గుట్టచప్పుడు కాకుండా వచ్చాడు. నిద్రలో ఉన్న ప్రవక్త తలాపిన నిలబడ్డాడు. ప్రవక్త కరవాలాన్ని తీశాడు. దానిని ఒరలో నుండి బైటికి తీసి, ప్రవక్త తలపై దాన్ని లేపాడు. ‘ముహమ్మద్, ఇక నా నుండి నిన్ను అడ్డుకునేవాడెవడు?’ అని అన్నాడు. అప్పుడే ప్రవక్త కళ్ళు తెరచి చూసే సరికి నగ్న ఖడ్గం పైకి ఎత్తి ఉన్న వ్యక్తిపై దృష్టి పడింది. అయినా ఎంతో నెమ్మదిగా అతని ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “అల్లాహ్” అని అన్నారు. అంతలోనే అతనిలో వనుకుడు మొదలయింది. ఖడ్గం అతని చేతి నుండి క్రింద పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖడ్గం తమ చేతులో తీసుకొని, నా నుండి నిన్ను ఎవరు అడ్డుకోగలడు? అని అడిగారు. అతడు తికమక చూస్తూ ఏమనలేక ‘ఎవడు లేడు’ అని అన్నాడు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడ్ని మన్నించారు. ఆ తర్వాత అతడు ఇస్లాం స్వీకరించాడు. మళ్ళీ తన జాతిలోకి వెళ్ళి ఇస్లాం ప్రచారం చేశాడు.
బద్ర్ యుద్ధం తర్వాత ఒక సంవత్సరానికి, మస్లిముల మరియు అవి- శ్వాసుల మధ్య ఈ యుద్ధం జరిగింది. బద్ర్ యుద్ధంలో ఓటమికి పాలైన అవిశ్వాసులు, ముస్లిములతో ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించు- కున్నారు. అందుకే ఈ సారి 3000 సైనికులతో బయలుదేరారు. వారితో పోరాడడానికి ముస్లిముల వైపు నుండి 700 మంది పాల్గొన్నారు. ప్రారంభ దశలో ముస్లిములే గెలుపొందారు. అవిశ్వాసులు మక్కా దారి పట్టారు. కాని వెంటనే మళ్ళీ తిరిగి వచ్చారు. కొండ వెనుక వైపు నుండి వచ్చి, ముస్లిములపై విరుచుకు పడ్డారు. ఇలా ఎందుకు జరిగిందంటేః అదే కొండపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొందరు విలుకాండ్రులను నియమించారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆ స్థానాన్ని వదలకూడదని వారికి నొక్కి చెప్పారు. కాని వారు ముస్లిములు గెలుపొందినది, ముష్రికులు పారిపోవునది చూసి (యుద్ధం ముగిసిందన్న భ్రమలో పడి) విజయప్రాప్తి కోసం పరుగెత్తుకొచ్చారు. అందువల్ల ఆ స్థలం ఖాలీ అయిపోయింది. ఖురైషులకు మంచి అవకాశం లభించింది. కొండ వెనక నుండి తిరిగి దాని శిఖరంపై వచ్చి అక్కడి నుండి ముస్లిములపై దాడి చేశారు. అందుకే ఈ సారి ముష్రికులు గెలుపొందారు. ఈ యుద్ధంలో 70 మంది ముస్లిములు అమరవీరులయ్యారు. వారిలో ఒకరుః హంజా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రజియల్లాహు అన్హు. ముష్రికుల వైపు నుండి 22 మంది చంపబడ్డారు.
ఉహద్ యుద్ధం తర్వాత కొద్ది రోజులకు మదీన యూదులు మక్కా వెళ్ళి ఖురైషుల్ని కలుసుకొని మీరు గనక మదీనా పై దాడి చేసి, ముస్లిములతో యుద్ధం చేస్తే ఈ సారి మేము (లోపల నుండి) మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వాగ్ధానం చేశారు. ఖురైషులు సంతోషంతో దీన్ని ఒప్పుకున్నారు. ఖురైషులు ఒప్పుకున్నాక ఇతర తెగవాళ్ళను కూడా పురికొలిపారు. వారు కూడా ఒప్పుకున్నారు. అరబ్బు దేశమంతటి నుండి యూదులు, ముష్రికులందరూ ఏకమై భారీ ఎత్తున మదీనా పై దండ యాత్రకు బయలుదేరారు. సుమారు పది వేల మంది సైనికులు మదీనా చుట్టు ప్రక్కన పోగు అయ్యారు.
శత్రువుల కదలిక గురించి ప్రవక్తకు వార్తలు అందుతున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో సలహా కోరారు. అప్పుడు ఈరాన్ దేశస్తుడైన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖందకం త్రవ్వాలని సలహా ఇచ్చారు. మదీన రెండు వైపులా ఖర్జూరపు తోటలు, ఒక వైపు కొండ ఉండగా మరో వైపు ఏమీ అడ్డుగా లేనందు వల్ల అదే వైపు ఖందకం త్రవ్వడం ప్రారంభించారు. ముస్లిములందరూ ఇందులో పాల్గొని అతి తొందరగా దాన్ని పూర్తి చేశారు. ముష్రికులు ఖందకానికి ఆవల ఒక నెల వరకు ఉండిపోయారు. మదీనలో చొరబడటానికి ఏ సంధు దొరకలేదు. ఆ కందకాన్ని దాటలేక పోయారు. అల్లాహ్ అవిశ్వాసులపై ఒకసారి తీవ్రమైన గాలిదుమారాన్ని పంపాడు. దాని వల్ల వారి గుడారాలు ఎగిరిపోయాయి. వారిలో అల్లకల్లోలం చెలరేగి భయం జనించింది. క్షణం పాటు ఆగకుండా పారిపోవడంలోనే క్షేమం ఉంది అనుకొని పరిగెత్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒక్కడే దాడి చేయుటకు వచ్చిన సైన్యాలను పరాజయానికి గురి చేసి, ముస్లిములకు సహాయ పడ్డాడు.
ముష్రికుల సైన్యాలు దారి పట్టిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ఈ సంవత్సరం తర్వాత ఖురైష్ మీపై దాడి చేయరు. కాని మీరు వారి మీద దాడి చేస్తారు”. వాస్తవంగా ప్రవక్త చెప్పినట్లు ఖురైషు వైపు నుండి ఇదే చివరి దాడి అయ్యింది. (ఆ తర్వాత వారు ఎప్పుడు ముస్లింపై దాడి చేయుటకు సాహసించలేదు).
కందకం త్రవ్వే సందర్భంలో ముస్లిములు ఘోరమైన ఆకలికి గురి అయ్యారు. ఆకలి భరించలేక కడుపుపై రాళ్ళు కట్టుకోవలసి వచ్చింది. అప్పుడు జాబిన్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు కనీసం ప్రాణం కాపాడేంత పరిమాణంలోనైనా ప్రవక్తకు ఏదైనా తినిపించాలని కోరుకొని తన వద్ద ఉన్న ఓ చిన్న మేక పిల్లను కోశాడు. మాంసం తయారు చేసి భార్యకు ఇస్తూ దీని కూర వండి, అతితక్కవగా ఉన్న బార్లీ గింజల పిండితో రొట్టెలు చేసి పెట్టమని చెప్పాడు. వంట తయ్యారు అయ్యాక ప్రవక్త వద్దకు వెళ్ళి ‘మీకు మరో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే సరిపడేంత భోజనం ఉంది’ అని తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త “ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది” అని కందకంలో పాల్గొన్న వారందరినీ పిలిచారు. మరియు స్వయంగా మాంసం ముక్కలు మరియు రొట్టెలు వడ్డించారు. అందరూ కడుపు నిండా తిన్నారు. అయినా ఆ భోజనం ఎవరి చేయి పెట్టనట్లుగా మిగిలింది. అప్పుడు వారు సుమారు వెయ్యి మంది ఉండిరి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహిమల్లో ఒకటి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ముస్లిములు మదీనకు వలస వచ్చినప్పటి నుండి, వారిని ఎన్నటికీ తిరిగి మక్కా రానివ్వకూడదని, మస్జిదె హరాం దర్శనం చేయనివ్వద్దని దృఢంగా ముష్రికులు నిశ్చయించుకున్నారు.
కాని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు మక్కాకు పయనం కావాలని హిజ్రి శకం ఆరవ ఏట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిశ్చయించారు. వెళ్ళడానికి జిల్ ఖాద నెల నిర్ణయమయింది. అది గౌరవపదమైన నెల అని, అందరూ దాన్ని గౌరవిస్తారనీ. ఉమ్రా ఉద్దేశ్యంతో బయలుదేరారు. యుద్ధ ఆదేశం ఏ మాత్రం లేకుండినది. 1400 మంది సహాబాలు ఇహ్రామ్ దుస్తులు ధరించి, బలివ్వడానికి ఒంటెలు తమ వెంట తీసుకెళ్ళారు. వాస్తవానికి వీరు కాబా దర్శనానికి, దానిని గౌరవార్థమే బయలుదేరారన్న నమ్మకం చూసేవారికి కలగలాని, ఖురైషువారు వీరిని మక్కాలో ప్రవేశం నుండి నిరోధించుటకు ఊహించనూ వద్దని ఆయుధాలు కూడా ధరించలేదు. కేవలం ప్రయానికులు తమ ఖడ్గఒరలో ఉంచుకునే ఆయుధం తప్ప.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖస్వా పేరుగల తమ ఒంటెపై పయనమయ్యారు. సహచరులు ఆయన వెనక ఉన్నారు. మదీనవాసుల మీఖాత్ జుల్ హులైఫా చేరుకున్నాక, అందరూ బిగ్గరగా తల్బియా చదువుతూ ఉమ్రా యొక్క ఇహ్రామ్ సంకల్పం చేశారు. వాస్తవానికి కాబా దర్శన హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది. దాని దర్శనం మరియు ప్రదక్షిణం నుండి నిరోధించే హక్కు అప్పటి ఆచారం (దస్తూర్, ఖానూన్) ప్రకారం కూడా ఖురైషుకు ఏ మాత్రం లేదు. వారి శత్రువైనా సరే, అతడు కాబా గౌరవ ఉద్దేశ్యంతో వస్తే అతడ్ని ఆపవద్దు.
కాని ముస్లిములు మక్కా ఉద్దేశ్యంతో బయలుదేరారని విన్న వెంటనే ముష్రికులు యుద్ధానికై సిద్ధమయ్యారు. వారికి ఎంత కష్టతరమైన సరే ప్రవక్తను మక్కాలో రానివ్వకూడదని దృఢంగా నిర్ణయించుకున్నారు. వారి ఈ చేష్ట, వారు ముస్లిముల పట్ల శత్రుత్వంగా, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నా- రనడానికి మరియు వారికి లభించవలసిన హక్కుల నుండి వారిని దూరం చేస్తున్నారు అనడానిక గొప్ప నిదర్శనం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిడారం నడుస్తూ నడుస్తూ మక్కాకు సమీపములో చేరుకుంది. కాని ఖురైషువారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల్ని మక్కాలో ప్రవేశించకుండా, కాబా ప్రదక్షిణం చేయకుండా నిరోధిస్తునే ఉన్నారు.
ప్రవక్తతో సంధి చేసుకొని ఏదో ఓ కొలికికి రావాలని రాయబార వ్యవహారాలు మొదలయ్యాయి. ఇరు పక్షాల్లో (అంటే ముస్లిముల మరియు మక్కాలోని ముష్రికుల మధ్య) అనేక రాయబార బృందాలు వస్తూ పోయాయి. ఈ మధ్యలో ఖురైష్ యువకుల్లో నలబై మంది హఠాత్తుగా ముస్లిములపై విరుచుకుపడి వారిలో కొందరిని చంపుదాము అని అనుకున్నారు. కాని ముస్లిములు వారిని పట్టుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం వద్దకు తీసుకువచ్చారు. అయితే ప్రవక్త వారితో ఏ ప్రతికార చర్యకు పాల్పడకుండా వారిని వారి దారిన వదిలేసి వారిని మన్నించారు.
ఆ తర్వాత ప్రవక్త -ﷺ- ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హుని రాయబారిగా ఖురైష్ నాయకుల వద్దకు పంపి, మేము యుద్ధానికి కాదు వచ్చింది. కేవలం అల్లాహ్ గృహ దర్శనం, దాని గౌరవార్థం వచ్చాము అని తెలియజేశారు. ఉస్మాన్ మరియు ఖురైషుల మధ్య సంధి కుదరలేదు. అంతే గాకుండా వారు ఉస్మాన్ ని పోనివ్వకుండా తమ వద్దే నిర్బంధించారు. అందువల్ల ఉస్మాన్ హత్యకు గురయ్యాడు అన్న పుకారు పుట్టింది. ప్రవక్త -ﷺ-కు ఈ విషయం తెలిసిన వెంటనే “ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా ఇక్కడి నుండి కదిలేది లేదు” అని స్పష్టం చేసి, దీనికై ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరితో శపథం తీసుకున్నారు. అప్పుడు తమ ఒక చేతిని ఉస్మాన్ చేతిగా పరిగణించి తమ రెండవ చేయిని దానిపై కొట్టి శపథం చేశారు. ఈ శపథం “బైఅతుర్ రిజ్వాన్” అన్న పేరు పొందింది. ఓ చెట్టు క్రింద జరిగింది. ప్రవక్తగారు సహచరులతో చేసిన శపథం ఇలా ఉండిందిః ఉస్మాన్ కు వాస్తవంగా ఏదైనా కీడు జరిగింది అని తెలిస్తే గనక మీలో ఏ ఒక్కరూ పారిపోకుండా ముష్రికులతో పోరాడనిదే ఈ స్థలాన్ని వదలేది లేదు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసిన వార్త ఏమిటంటే ఉస్మాన్ క్షేమంగానే ఉన్నారు. హత్య చేయబడలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిములతో యుద్ధానికి సిద్ధమన్నట్లు శపథం చేశారని తెలిసిన వెంటనే సుహైల్ బిన్ అమ్ర్ ను దౌత్యవేత్తగా పంపారు. అతను ప్రవక్తతో కూర్చుండి; ముస్లిములు ఈ సారి తిరిగి వెళ్ళిపోవాలని మరియు వచ్చే సంవత్సరం ఎప్పుడైనా రావచ్చనే విషయంపై సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. సంధి కుదిరింది. ప్రవక్త కూడా సంధి ఒప్పంద నిబంధనలను అంగీకరించారు. ఈ నిబంధనలు బాహ్యంగా ముష్రికుల పక్షంలో వారికి మాత్రమే అనుకూలమైనవిగా ఉండెను. అందుకే ముస్లిములు మండిపడ్డారు. వారి దృష్టిలో అవి అన్యాయం, దౌర్జన్యంతో కూడి ఉన్న నిబంధనలని. ముష్రికులకు అనుకూలమైనవిగా ఉన్నాయని అనిపించింది. కాని ప్రవక్త సంధి కుదరాలనే కోరేవారు. ఎందకుంటే ఇస్లాం ప్రశాంత వాతవరణంలో వ్యాపిస్తూ ఉంటే అనేక మంది ఇస్లాంలో ప్రవేశించవచ్చు అన్న విషయం ప్రవక్తకు తెలుసు. వాస్తవానికి జరిగింది కూడా ఇదే. ఈ యుద్ధవిరమణ కాలంలో ఇస్లాం విస్తృతంగా వ్యాపించింది.
అంతే కాదు, వాస్తవానికి ముస్లిముల మరియు ఖురైష్ ల మధ్య జరిగిన ఈ యుద్ధవిరమణ సంధి ఇస్లాం మరియు ముస్లిముల పాలిట గొప్ప సహాయంగా నిలిచింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవజ్యోతితో చూస్తూ ఉన్నారని కుడా ఈ సంఘటన గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఎలా అనగ నిబంధనలన్నిటీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంగీకరిస్తూ పోయారు. అదే సందర్భంలో కొందరి సహచరులకు అవి బాహ్యంగా ముష్రికులకు అనుకూలంగా కనబడినవి.
హిజ్రి శకం ఎనిమిదవ ఏట (ముష్రిక్కులు తాము చేసిన వాగ్దానానికి వ్యెతిరేకం వహించినందుకు) మక్కాపై దాడి చేసి, జయించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయించారు. రమజాన్ 10వ తారీకున 10 వేల వీరులతో బయలుదేరారు. ఏలాంటి పోరాటం, రక్తపాతం లేకుండా మక్కాలో ప్రవేశించారు. ఈ ప్రవేశం చారిత్రకమైనది. చెప్పుకోదగ్గది. ఖురైషులు తమ ఇష్టానుసారం లొంగిపోయారు. అల్లాహ్ ముస్లిములకు సహాయపడ్డాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదె హరాం వెళ్ళి కాబా యొక్క తవాఫ్ చేసి, కాబా లోపల, వెలుపల, పైన ఉన్న విగ్రహాల న్నిటిని తొలగించి దాని లోపల రెండు రకాతుల నమాజు చేశారు. తర్వాత కాబా గడపపై వచ్చి నిలుచున్నారు. ఖురైషులు గడప ముందు నిలబడి, ప్రవక్త వారి గురించి ఏ తీర్పు ఇస్తారు అని వేచిస్తున్నారు. ప్రవక్త గంభీర స్వరంతో “ఓ ఖురైషులారా! నేను మీ పట్ల ఎలా ప్రవర్తిస్తానని భావిస్తున్నారు” అని అడిగారు. వారందరూ ఏక శబ్ధమై “మేలు చేస్తారనే భావిస్తున్నాము. ఎందుకంటే మీరు మంచి సోదరులు, మంచి సోదరుని సుపుత్రులు” అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “పోండి, మీరందరికి స్వేచ్ఛ ప్రసాదించబడుతుంది” అని ప్రకటించారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన్ను, తన సహచరుల్ని బాధించి, నానా రకాలుగా హింసించి, స్వదేశం నుండి తరిమిన శత్రువుల్ని ఈ రోజు క్షమిస్తూ, మన్నిస్తూ ఒక గొప్ప ఉదాహరణ / ఆదర్శం నిలిపారు.
మక్కా విజయం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన మరియు ఇస్లాం ధర్మ ప్రచారం నలువైపులా వ్యాపించింది. ఇక సుదూర ప్రాంతాల నుండి బృందాలు వచ్చి ఇస్లాం స్వీకరించ సాగాయి.
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్క దేశాల రాజులకు ఇస్లాం పిలుపునిస్తూ, ఉత్తరాలు వ్రాయించి పంపారు. వారిలో కొందరు ఇస్లాం స్వీకరించారు. మరి కొందరు ఇస్లాం స్వీకరించలేదు కాని ఉత్తమరీతి లో ఉత్తరాన్ని తీసుకొని మంచి విధంగా సమాధానమిచ్చారు. కాని ఈరాన్ రాజైన ఖుస్రౌ (Khosrau) ప్రవక్త పత్రాన్ని చూసి కోపానికి గురై దాన్ని చింపేశాడు. ప్రవక్తకు ఈ విషయం తెలిసింది. పిమ్మట ఆయన ఇలా శపించారుః “అల్లాహ్! అతని రాజ్యాన్ని కూడా నీవు చించేసెయి”. ఈ శాపనానికి ఏమంత ఎక్కువ సమయం గడువక ముందే అతని కొడుకు స్వయంగా తండ్రిని చంపేసి, రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు.
మిస్ర్ (Egypt) రాజు ముఖౌఖిస్ ఇస్లాం స్వీకరించలేదు. కాని ప్రవక్త రాయబారితో ఉత్తమ రీతిలో ప్రవర్తించి, అతనితో ప్రవక్త కొరకు కానుకలు పంపాడు. అలాగే రోమన్ రాజు కూడా ప్రవక్త రాయబారికి మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి విధంగా ప్రవర్తించాడు.
బహ్రైన్ రాజు ముంజిర్ బిన్ సావీ ప్రవక్త పత్రాన్ని ప్రజలందరికీ విని పించాడు. వారిలో కొందరు విశ్వసించారు మరి కొందరు తిరస్కరించారు.
హిజ్రి శకం 10వ ఏట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ చేశారు.
ఆయన చేసిన ఏకైక హజ్ ఇదే. ఆయనతో పాటు లక్షకు పైగా సహచరులు హజ్ చేశారు. ఆయన హజ్ పూర్తి చేసుకొని మదీన తిరిగి వచ్చారు.
హజ్ నుండి వచ్చాక సుమారు రెండున్నర మాసాలకు ప్రవక్తకు అస్వస్థత అలుముకొన్నది. దిన దినానికి అది పెరగ సాగింది. నమాజు కూడ చేయించడం కష్టమయిపోయింది. అప్పుడు అబూ బక్ర్ ను నమాజు చేయించాలని ఆదేశించారు.
హిజ్రి పదకొండవ శకం, నెల రబీఉల్ అవ్వల్, 12వ తారీకు సోమవారం రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమోన్నతుడైన అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. మొత్తం 63 సంవత్సరాలు జీవించారు. ప్రవక్త మరణ వార్త సహచరులకు అందగా వారికి సృహ తప్పినట్లయింది. నమ్మశక్యం కాక పోయింది. అప్పుడు అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు నిలబడి ప్రసం గించారుః వారిని శాంతపరుస్తూ, ప్రశాంత స్థితి నెలకొల్పుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరి లాంటి ఒక మానవుడే, అందిరికి వచ్చి నటువంటి చావు ఆయనకు వచ్చింది అని స్పష్టపరిచారు. అప్పుడు సహచరులు తేరుకొని, శాంత పడ్డారు. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు స్నానం చేయించి, కఫన్ దుస్తులు ధరియింపజేసి, ఆయిషా రజియల్లాహు అన్హా గదిలో ఖననం చేశారు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవికి ముందు 40 సం. ఆ తర్వాత 13 సం. మక్కాలో, 10 సం. మదీనలో గడిపారు.
సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అధికంగా ప్రేమించేవారు. వారు తమ ఆత్మలకంటే, సంతానం కంటే మరియు తమ ఆధీనంలో ఉన్నవాటికంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమించేవారు. ఆయన ఆధారంగానే అల్లాహ్ వారిని అవిశ్వాస చీకట్ల నుండి ఇస్లాం కాంతిలో తీసుకొచ్చాడు. ప్రవక్త పట్ల సహచరుల ప్రేమను తెలిపే అనేక సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ముష్రికుల చేతిలో బందీ అయిన ఖుబైబ్ బిన్ అదీ రజియల్లాహు అన్హు అను గొప్ప సహచరుని వద్ద ఖురైష్ గుమిగూడారు. వారిలో అగ్ర నాయకుడైన అబూ సుఫ్యాన్ (అప్పటికి ఇస్లాం స్వీకరించలేదు) ‘నీకు బదులుగా నీ ఈ స్థానంలో ముహమ్మద్ ఉండి అతడ్ని మేము హతమార్చుదుము. నీవు నీ ఇంట్లో ఉంటే బావుండునని భావిస్తున్నావా’ అని అడిగాడు. ఖుబైబ్ అన్నాడుః ‘లేదు, అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ప్రవక్త ఇక్కడ కాదు, తాను ఉన్న స్థానంలో ఉండగా ఆయనకు ముళ్ళు కుచ్చి అవస్త కలుగుతుండగా నేను నా ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు’.
ఉహద్ యుద్ధంలో ప్రవక్త చనిపోయారన్న వదంతి వ్యాపించింది. అప్పుడే ఒక స్త్రీ వచ్చింది. ఆమె తండ్రి చనిపోయాడని, తర్వాత కొడుకు, ఆ తర్వాత భర్త ఇంకా ఆ పిదప సోదరుడు కూడా చంపబడ్డారు అని తెలుపబడింది. అయినా ఆమె అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? “ప్రవక్త పరిస్తితి ఎలా ఉంది? అని. ఆయన క్షేమంగనే ఉన్నారని ఆమెకు సమాధానం దొరికినా ‘ప్రవక్తను నాకు చూపించండి’ అని కోరింది. ప్రవక్త వద్దకు వచ్చాక ఆయన దుస్తుల ఓ అంచును పట్టి ‘అల్లాహ్ ప్రవక్తా! నా తల్లిదండ్రులను మీకు అర్పింతును గాక! మీరు క్షేమంగా ఉన్న తర్వాత నాకు ఏ రందీ లేదు’. అని అంది.
ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, ‘ప్రవక్తా! నేను నా కంటే ఎక్కువ, నా భార్యపిల్లల కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే మీ వద్దకు వచ్చి మిమ్మల్ని చూడనిదే తృప్తి కలగదు. అయితే నేను నా చావును మరియు మీ చావును గుర్తు చేసుకున్నప్పుడు మీరు ప్రవక్తలతో స్వర్గంలోని ఉన్నత స్థానంలో ఉంటారని నేను ఒక వేళ స్వర్గంలో ప్రవేశించినా మిమ్మల్ని చూడలేననే ఆవేధనే నన్ను కుమిలివేస్తుంది’ అని వాపోయాడు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “నీవు ప్రేమించేవారితో నీవు ఉంటావు”.
మీరు ప్రవక్తను ఎలా ప్రేమించేవారని అలీ రజియల్లాహు అన్హును ప్రశ్నించినప్పుడు, ‘అల్లాహ్ సాక్షిగా! ఆయన మాకు మా ధనసంతానం కంటే, మా తల్లదండ్రుల కంటే అంతే కాదు దాహంగా ఉన్నప్పుడే లభించే చల్లని నీటి కంటే ఎక్కువ ప్రేమ గలవారు’ అని సమాధానమిచ్చారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివిధ సంస్కృతుల, విభిన్న విశ్వాసాల మరియు భిన్న జాతులవారితో హృదయపూర్వకంగా సంతోషంతో మరియు వారి సంస్కృతులలో ఏ జోక్యం చేసుకోకుండా వారితో సహజీవనం చేశారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాని కొన్నిటిని క్రింద ప్రస్తావిస్తున్నాము.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనకు వచ్చినప్పటి నుండీ అక్కడున్న యూదులతో ఎంతో శాంతివంతమైన జీవితం గడిపారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామీయ నైతిక విధానాన్ని వారి పట్ల అవలంభించేవారు. అందుకే ఆయన వారి రోగులను పరామర్శించేవారు, ఆయన పొరుగులో ఉన్న యూదుడు పెట్టే అనేక ఇబ్బందులను సహించేవారు. యూదుని శవాన్ని తీసుకువెళ్ళుచుండగా చూసి నిలబడేవారు. ఒకసారి ఓ యూదుని శవం వెళ్ళుచుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడ్డారు. ఇది యూదుని శవం కదా? అని సహచరులు అన్నారు. (అంటే యూదుని శవానికై మీరు ఎందుకు నిలబడ్డారు?) ప్రవక్త చెప్పారుః “అతను మనిషి కాడా?”.
ఆయన -ﷺ- మదీన వచ్చినప్పటి నుండి యూదులతో ఏ శత్రుత్వం లేకుండా ఉండే ప్రయత్నం చేసేవారు. అంతే కాదు ఆయన ఓ ఒప్పందంపై సంతకం చేశారు. దాని ద్వారా ఆయన ఇతరులతో ఎంత సామరస్యంగా జీవితం గడపడానికి కోరుకునేవారో తెలుస్తుంది.
ఇస్లామీయ రాజ్యం విస్తృతం అయినప్పుడు క్రిస్టియన్ అరబ్బు వంశాల కూటములు కొన్ని ఉండేవి. ప్రత్యేకంగా నజ్రాన్ లో. ప్రవక్త వారితో అతి ఉత్తమ రీతిలో ప్రవర్తించేవారు. ఇస్లామీయ ప్రభుత్వ ఛాయలో వారికి సంపూర్ణ శాంతియుతమైన జీవనం లభించాలని, వారి ధార్మిక విషయాల్లో వారికి స్వేచ్ఛ లభించాలని మరియు ఇతర రంగాల్లో కూడా వారికి స్వేచ్ఛా స్వతంత్రం లభించాలని వారితో ఒప్పందాలు చేశారు.
నజ్రాన్ వాసులతో జరిగిన ఒప్పందంలో ఇలా ఉంది. నజ్రాన్ మరియు దాని చుట్టుప్రక్కలో ఉన్నవారికి; వారు అక్కడ ఉన్నా, బైట ఉన్న వారి ధన, ప్రాణ, ధరిత్రి, ధర్మంలో అల్లాహ్ రక్షణ మరియు అల్లాహ్ యొక్క సందేశకర్త అయిన ప్రవక్త ముహమ్మద్ పూచి ఉంది. ఇంతే గాకుండా ఈ ఒప్పందంలో నజ్రాన్ క్రైస్తవుల సర్వ హక్కుల బాధ్యత, మరియు వారి శాంతిసౌఖ్యాలకు హాని కలిగే ఏ కార్యానికి పాల్పడేది లేదని కూడా ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేత వెలువడిన మదీన దస్తావీజులోని ఒప్పందాల ఓ భాగంలో: మదీనాలోని ముస్లిమేతరులు ముస్లింలవంటి నాగరికులే (సిటిజన్), ముస్లిములకు ఉన్నటువంటి హక్కులే వారికి ఉన్నాయి, ముస్లిములపై ఉన్నటువంటి విధులే వారిపై ఉన్నాయని ఉంది.
ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత వ్యవహారం మునాఫిఖుల(కపటుల)తో; ఆయనకు పేర్లతో సహా వారి గుర్తింపు ఉన్నప్పటికీ మరియు వారు ముస్లిముల మధ్య న్యూనతభావాన్ని సృష్టిస్తున్నారని, ముస్లిములను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పటికీ, ప్రవక్తగారు వారితో సహజీవితం గడపడాన్ని నిరాకరిస్తున్నట్లు చూడలేము. ఆయన వారితో కలసి ఉండేవారు. వారితో వ్యవహారాలు చేసేవారు. వారితో వినేవారు. శక్తి ఉన్నప్పటికీ వారికి వ్యతిరేకంగా బలప్రయోగం చేయలేదు. పౌరులకు సంబంధించిన ఏ ఒక హక్కు వారికి లేకుండా ఎన్నడూ ప్రవర్తించలేదు. ముస్లిముల మాదిరిగా వారు సర్వ నివాస హక్కులు పొందుతున్నారు. సామాజిక సమస్యల్లో ప్రవక్త వారికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అనుమతి ఇచ్చేవారు. బైతుల్ మాల్ నుండి వారికి లభించవలసిన వాట నొసంగేవారు.
ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇతర మతస్థులతో ఏలాంటి కల్మషం, అసహ్యత లేకుండా ప్రేమశాంతియుతమైన జీవితం గడిపేవారు. అంతే కాదు, తమ వాచకర్మ, నోట ప్రవర్తన ద్వారా కూడా ఇతరులతో స్వేచ్ఛ, శాంతియతమైన జీవితం గడపాలని ప్రోత్సహించేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాల్లో ముస్లిముల మధ్య సోదరబాంధవ్యం, వారి మధ్య గట్టి సంబంధం ఉండుట విధిగా ఉంది అని తాకీదు చేశారు. పరస్పర కపటం, ద్వేషం, భిన్నత్వం, చీలికలు అనైక్యతలు ఉంచుకొనుట నుండి వారించారు. మరియు వారి మధ్య చీలికలకు, ద్వేష మరియు దూరాలకు దారి తీసే ప్రతీ దాని నుండి హెచ్చరించారు. ముస్లిం అవసరాన్ని తీర్చడానికి, అతని సహాయానికి, అతని మేలు, మద్దతుకు ఎల్లవేళల్లో సిద్ధంగా ఉండాలని ప్రోత్సహించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను, ప్రవచనాలను అంతేకాదు, ఆయన ఆచరణలపై శ్రద్ధ వహిస్తే వాటిలో ముస్లిముల మధ్య ప్రేమరాగాల్ని వ్యాపించే బహిరంగ పిలుపు ద్యోతకమవుతుంది. ఇదిగో ఆయన విశ్వాసపరమైన ప్రేమను ఎలా స్వర్గానికి దారి అని తెలుపారో చూడండిః
“మీరు విశ్వాసులు కానంత వరకు స్వర్గంలో చేరరు, మరి పరస్పరం ప్రేమించుకోనంత వరకు విశ్వాసులు కాజాలరు. నేను మీకో విషయం తెలుపనా? అది గనక మీరు చేస్తే మీలో పరస్పరం ప్రేమానురాగాలు కుదురుతాయి; మీరు సలాంను విస్తృతం చేయండి”.
ఆయన -ﷺ- ముస్లిముల మధ్యలో ఎల్లప్పుడూ ప్రేమ విత్తనాలు నాటే మరియు కరుణ, వాత్సల్యం పెంచే ప్రయత్నం చేసేవారు. ప్రజల హృదయాల్లో ప్రేమ పునాదులను గట్టిగా నాటే అధిక కాంక్ష గలవారు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః
“ఇద్దరు వ్యక్తులు కేవలం అల్లాహ్ కొరకు పరస్పరం ప్రేమించుకున్నట్లయితే వారిలో ఎవరు ఇతరుని పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడో అతడిని అల్లాహ్ అధికంగా ప్రేమిస్తాడు.
ఇంతే కాదు, ఇతరులను ప్రేమించడం, వారి కొరకు మంచిని ప్రేమించడంలోనే విశ్వాస గ్యారంటీ ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచారుః
“తన కొరకు ఇష్టపడినదే తన సోదరుని కొరకు ఇష్టపడనంత వరకు మీలో ఎవరు విశ్వాసులు కాజాలరు”.
ప్రవక్త -ﷺ- ఇలా చెప్పారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “పరస్పరం కానుకలు పంపించుకుంటూ ఉండండి, అందువల్ల ప్రేమలు పెరుగుతూ ఉంటాయి”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి కావలసిన మార్గాలు, సాధనాలు కూడా నేర్పారు; మెతక హృదయులు అయి ఉండుట. ఇతరుల ప్రేమ భావాల్ని గ్రహించేగుణం దానిలో కలగవేయుట.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పొట్టిగా గాని లేదా పొడుగ్గా గాని కాకుండా మధ్యరకమైన ఎత్తులో ఉండిరి. విస్తరించిన భుజాలు. సరితూగిన అవయవాలు. విశాలవక్షస్తుడు. చంద్రబింబం లాంటి అందమైన ముఖం. సుర్మా పెట్టుకున్నటువంటి కళ్ళు. సన్నటి ముక్కు. అందమైన మూతి. సాంద్రమైన గడ్డం.
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం, అంబర్ గ్రిస్ (ambergris) మరియు కస్తూరి లేదా ఇంకేదైనా సువాసనగల పదార్థం, ద్రవ్యాల సువాసన ప్రవక్త సువాసన కంటే ఎక్కవ ఉన్నది నేను ఎన్నడూ చూడలేదు/ ఆఘ్రాణించేలదు. ప్రవక్త చెయ్యి కంటే ఎక్కువ సున్నితమైన వస్తవును ఎప్పుడూ నేను ముట్టుకోలేదు.
ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా, మందహాసంగా ఉండేవారు. తక్కువ సంభాషించేవారు. మధుర స్వరం గలవారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఆయన గురించి ఇలా చెప్పాడుః ఆయన అందరిలో అందమైన వారు. అందరికన్నా ఎక్కువ దాతృత్వ గుణం గలవారు, మరియు అందరి కన్నా గొప్ప శూరుడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా శూరులు, బలశాలి. అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః యుద్ధం చెలరేగి ఒకరిపై ఒకరు విరుచుకుపడేటప్పుడు మేము ప్రవక్త వెనక ఉండేవారము.
ఆయన అందరికన్నా ఎక్కువ ఉదారులు, ఔదార్యము ఉన్నవారు. ఆయన్ను ఏదైనా అడుగుతే ఎప్పుడూ లేదు, కాదు అనలేదు.
అందరికన్నా ఎక్కువ ఓర్పు, సహనం గలవారు. ఎప్పుడూ తమ స్వంత విషయంలో ఎవరితో ప్రతీకారం కోరలేదు. ఎవరినీ కోపగించలేదు. కాని అల్లాహ్ నిషిద్ధతాల పట్ల జోక్యం చేసుకున్నవాడిని అల్లాహ్ కొరకు శిక్షించేవారు.
ఆయన దృష్టిలో దూరపు – దగ్గరివారు, బలహీనులు – బలలవంతులు అనే తారతమ్యము లేదు. హక్కులో అందరూ సమానం. మరింత తాకీదు చేస్తూ ఇలా చెప్పారుః “ఏ ఒకరికి మరొకరిపై ఆధిక్యత, ఘనత లేదు. కేవలం తఖ్వా (అల్లాహ్ భయభీతి) తప్ప. మానవులందరూ సమానులే. గత కాలల్లో గతించిన జాతుల్లో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయు డవుతే శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అందుకే వారు నాశనం అయ్యారు. వినండి! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేసేవాన్ని”.
ఎప్పుడూ ఏ భోజనానికి వంక పెట్ట లేదు. ఇష్టముంటే తినేవారు. లేదా వదిలేవారు. ఒక్కోసారి నెల రెండు నెలల వరకు ఇంటి పొయ్యిలో మంటే ఉండకపోయేది. ఆ రోజుల్లో ఖర్జూరం మరియు నీళ్ళే వారి ఆహారంగా ఉండేది. ఒక్కోసారి ఆకలితో కడుపుపై రాళ్ళు కట్టుకునేవారు.
చెప్పుల మరమ్మతు చేసుకునేవారు. దుస్తులు చినిగిన చోట కుట్లు వేసుకునేవారు. ఇంటి పనుల్లో ఇల్లాలికి సహకరించేవారు. వ్యాదిగ్రస్తుల్ని పరామర్శించేవారు.
పేదరికం వల్ల పేదలను చిన్న చూపుచూసేవారు కారు. రాజ్యాధికారం వల్ల రాజులతో భయపడేవారు కారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుఱ్ఱం, ఒంటె, గాడిద మరియు కంచర గాడిదలపై ప్రయాణం చేసేవారు.
ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా అందరికన్నా ఎక్కువ మందహాసంతో ఉండేవారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేవారు. సువాసనను ప్రేమించే వారు. దుర్వాసనను అసహ్యించుకునేవారు. సర్వ సద్గుణాలను, ఉత్తమ చేష్టలను అల్లాహ్ ఆయనలో సమకూర్చాడు.
అల్లాహ్ ఆయనకు నొసంగిన విద్యా జ్ఞానం ముందువారిలో, వెనుక వారిలో ఎవ్వరికీ నొసంగ లేదు. ఆయన నిరక్షరాస్యులు. చదవలేరు, వ్రాయ లేరు. మానవుల్లో ఎవరూ ఆయనకు గురువు కారు. దివ్యగ్రంథం ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వచ్చినది. దాని గురించి అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
{ఇలా అను ఓ ప్రవక్తా! ఒకవేళ మానవులూ జిన్నాతులూ అందరూ కలసి ఈ ఖుర్ఆను వంటిదానిని దేనినయినా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు. వారందరూ ఒకరికొకరు సహాయులు అయినప్పటికినీ}. (బనీ ఇస్రాఈల్ 7: 88).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నపటి నుండి చదవడం, వ్రాయడం నేర్చుకోకుండా నిరక్షరాస్యులవడం తిరస్కారుల అపోహాలకు ఒక అడ్డు కట్టుగా నిలిచింది. ఈ గ్రంథాన్ని ముహమ్మద్ – సల్లల్లాహు అలైహి వసల్లం- స్వయంగా వ్రాసారు, లేదా ఇతరులతో నేర్చుకున్నారు, లేదా పూర్వ గ్రంథాల నుండి చదివి వినిపిస్తున్నాడన్న అపోహాలు వారు లేపుతూ ఉంటారు. నిరక్షరాస్య మనిషి ఎలా ఇలా చేయగలడు? అందుకని వాస్తవంగా ఇది అల్లాహ్ వైపు నుండి అవతరించినదే.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించిన మహిమల్లో అతి గొప్పది దివ్య గ్రంథం ఖుర్ఆన్. ఇది ప్రళయం వరకూ మహిమగా నిలిచి ఉంది. అది భాషాప్రావీణులను, వాక్పుతులను అశక్తతకు గురి చేసింది. ఖుర్ఆన్ లో ఉన్నటువంటి పది సూరాలు, లేదా ఒక సూరా, లేదా కనీసం ఒక్క ఆయతైనా తేగలరా అని అల్లాహ్ అందరితో ఛాలెంజ్ చేశాడు. ముష్రికులు స్వయంగా తమ అసమర్థత, అశక్తతను ఒప్పుకున్నారు.
ఆయన మహిమల్లోః ఒకసారి ముష్రికులు మహత్యము చూపించమని కోరారు. ప్రవక్త అల్లాహ్ తో దుఆ చేశారు. చంద్రుణ్ణి రెండు వేరు వేరు ముక్కల్లో వారికి చూపించబడింది. (దీని వివరం పైన చదివారు).
కంకర రాళ్ళు ఆయన చేతులో సుబ్ హానల్లాహ్ పఠించాయి. అవే రాళ్ళు అబూ బక్ర్ చేతులో, తర్వాత ఉమర్ చేతులో, ఆ తర్వాత ఉస్మాన్ చేతులో పెట్టారు. అప్పుడు కూడా అవి తస్బీహ్ పఠించాయి.
ఎన్నో సార్లు ఆయన వ్రేళ్ళ నుండి నీళ్ళ ఊటలు ప్రవహించాయి.
ప్రవక్త భోజనం చేసేటప్పుడు ఆ భోజనం కూడా తస్బీహ్ పఠిస్తున్నది సహచరులు వినేవారు.
రాళ్ళు, చెట్లు ఆయనకు సలాం చేసేవి.
ఒక యూదురాళు ప్రవక్తను చంపే ఉద్దేశ్యంతో మేక మాంసంలోని దండచెయి భాగంలో విషం కలిపి బహుమానంగా పంపింది. ఆ మాంసపు దండచెయి మాట్లాడింది.
ఒక గ్రామీణుడు ఏదైనా మహిమ చూపించండి అని కోరినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టును ఆదేశించగా అది దగ్గరికి వచ్చింది. మరోసారి ఆదేశించగా తన మొదటి స్థానానికి తిరిగి వెళ్ళింది.
ఏ మాత్రం పాలు లేని మేక పొదుగును చెయితో తాకగానే పాలు వచ్చేశాయి. దాని పాలు పితికి స్వయంగా త్రాగి, అబూ బక్ర్ కు త్రాపించారు.
అలీ బిన్ అబూ తాలిబ్ రజియల్లాహు అన్హు కళ్ళల్లో అవస్త ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని అతని కళ్ళల్లో పెట్టగా అప్పడికప్పుడే సంపూర్ణ స్వస్థత కలిగింది.
ఒక సహచరుని కాలు గాయపడంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కాలును చెయితో తుడిసారు. వెంటనే అది నయం అయ్యింది.
ప్రవక్త -ﷺ- అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కొరకు దీర్ఘాయుష్మంతుడుగను, అధిక ధన సంతానం గలవాడవాడిగను మరియు అల్లాహ్ వారికి శుభం (బర్కత్) ప్రసాదించాలని దుఆ చేశారు. అలాగే ఆయనకు 120 మంది సంతానం కలిగారు. ఖర్జూరపు తోటలన్నీ ఏడాదికి ఒక్కసారే ఫలిస్తాయి. కాని ఆయన ఖర్జూరపు తోట ఏడాదికి రెండు సార్లు పండేది. ఇంకా ఆయన 120 సంవత్సరాలు జీవించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు మెంబర్ పై ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యక్తి వచ్చి, అనావృష్టి దాపురించింది మీరు వర్షం కొరకు దుఆ చేయండని కోరగా, రెండు చేతులెత్తి దుఆ చేశారు. ఎక్కడా లేని మేఘాలన్నీ పర్వతాల మాదిరిగా ఒక చోట చేరి, వారం రోజుల పాటు కుండ పోత వర్షం కురిసింది. మరో జుమా రోజు ఖుత్బా సందర్భంలో వర్షం వల్ల నష్టం చేకూరుతుందని విన్నవించుకోగా రెండు చేతులెత్తి దుఆ చేశారు. అప్పటికప్పుడే వర్షం నిలిచింది. ప్రజలందరూ ఎండలో నడచి వెళ్ళారు.
ఖందక యుద్ధంలో పాల్గొన్న వెయ్యి మంది వీరులందరికీ సుమారు మూడు కిలోల యవధాన్యాల రొట్టెలు మరియు ఒక చిన్న మేక మాంసం తో ప్రవక్త వడ్డించారు. అందరూ కడుపు నిండా తృప్తికరంగా తిని వెళ్ళారు. అయినా రొట్టెలు మరియు మాంసంలో ఏ కొదవ ఏర్పడలేదు.
అదే యద్ధంలో బషీర్ బిన్ సఅద్ కూతురు తన తండ్రి మరియు మామ కొరకు తీసుకొచ్చిన కొన్ని ఖర్జూరపు పండ్లు వీరులందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తినిపించారు.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వద్ద ఉన్న ఒకరి భోజనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి సైన్యానికి తినిపించారు.
హిజ్రత్ కు వెళ్ళే రాత్రి ఆయన్ను (సల్లల్లాహు అలైహి వసల్లం) హత్య చేయుటకు వేచిస్తున్న వంద మంది ఖురైషుల పై దుమ్ము విసురుతూ వారి ముందు నుండి వెళ్ళి పోయారు. వారు ఆయన్ని చూడలేకపోయారు.
హిజ్రత్ ప్రయాణంలో సురాఖా బిన్ మాలిక్ ఆయన్ను చంపడానికి వెంటాడుతూ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని శపించారు. అందుకు అతని గుఱ్ఱం కాళ్ళు మోకాళ్ళ వరకు భూమిలో దిగిపోయాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ సహచరులతో పరిహసించే వారు, తమ ఇల్లాలితో వినోదంగా, ఉల్లాసంగా గడిపేవారు. చిన్నారులతో ఆనందంగా ఉండేవారు. వారి కొరకు సమయం కెటాయించేవారు. వారి వయసు, బుద్ధిజ్ఞానాలకు తగిన రీతిలో వారితో ప్రవర్తించేవారు. తమ సేవకుడైన అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హుతో కూడా ఒకప్పుడు పరిహసిస్తూ “ఓ రెండు చెవులవాడా” అని అనేవారు.
ఒక వ్యక్తి వచ్చి ప్రవక్తా! నాకొక సవారి ఇవ్వండని అడిగాడు. ప్రవక్త పరిహాసంగా “మేము నీకు ఒంటె పిల్లనిస్తాము” అని అన్నారు. నేను ఒంటె పిల్లను తీసుకొని ఏమి చేయాలి? అని ఆశ్చర్యంగా అడిగాడతను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రతి ఒంటె, పిల్లనే కంటుంది కదా” అని నగుమోహంతో అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల ముందు ఎల్లప్పుడూ మంద హాసంతో, నగుమోహంతో ఉండేవారు. వారి నుండి మంచి మాటే వినేవారు. జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నేను ఇస్లాం స్వీకరించినప్పటి నుండీ, ప్రవక్త వద్దకు ఎప్పుడు వచ్చినా ఆయన రావద్దని చెప్పలేదు. నేను ఎప్పుడు చూసినా చిరునవ్వే ఉండేది. ఒకసారి “ప్రవక్తా! నేను గుఱ్ఱంపై స్థిరంగా కూర్చోలేకపోతాను అని” విన్నవించు కున్నాను. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా రొమ్ము మీద కొట్టాడు. మళ్ళీ ఇలా దుఆ చేశారుః “అల్లాహ్ ఇతన్ని స్థిరంగా కూర్చోబెట్టు. ఇతడ్ని మార్గదర్శిగా, సన్మార్గగామిగా చెయ్యి”. ఆ తర్వాత నేను ఎప్పుడూ గుఱ్ఱం మీది నుంచి పడలేదు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ బంధువులతో కూడా పరిహసించే వారు. ఒకసారి ప్రవక్త తమ కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా ఇంటికి వెళ్ళారు. అక్కడ హజ్రత్ అలీ రజియ్లలాహు అన్హు కన్పించక పోవడంతో. ఆయన ఎక్కడి వెళ్ళాడమ్మా! అని కూతుర్ని అడిగారు. దానికి ఫాతిమ రజియల్లాహు అన్హా సమాధానమిస్తూ “మా ఇద్దరి మధ్య చిన్న తగాద ఏర్పడింది. అందుకు ఆయన నాపై కోపగించుకొని, అలిగి వెళ్ళిపోయారు” అని అంది. ప్రవక్త అక్కడి నుండి మస్జిదుకు వచ్చారు. అతను అందులో పడుకొని ఉన్నారు. ఆయన మీది నుండి దుప్పటి తొలిగి పోయింది. ఆయన శరీరానికి మట్టి అంటుకొని ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన శరీరానికి అంటుకొని ఉన్న మట్టిని తూడుస్తూ “అబూ తురాబ్ (మట్టివాడా)! లే అబూ తురాబ్! లే” అని అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులకు, కూతుళ్ళకు ప్రవక్త ఉత్తమ సద్గుణాల్లో ఓ గొప్ప వంతు ఉండింది. ఒక్కోసారి ప్రవక్త తమ సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హాతో పరుగు పందెం పెట్టేవారు. ఆమె తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటే వద్దనేవారు కాదు. స్వయంగా ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారుః “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట నా స్నేహితురాళ్ళతో కలసి ఆడుకునేదాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి రాగానే ఆ బాలికలు భయపడి దాక్కునేవారు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నా దగ్గరకు పంపేవారు. నేను వారితో మళ్ళీ ఆడుకునేదాన్ని”.
బాలలతో అనురాగంగా కలిగి యుండి, వారిని ప్రేమగా చూసుకుంటూ ఒక్కోసారి వారితో ఆటలాడేవారు. షద్దాద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజులో తమ వెంట హసన్ లేదా హుసైన్ ను తీసుకొచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వెళ్ళి అబ్బాయిని కూర్చోబెట్టారు. అల్లాహు అక్బ్రర్ అని నమాజునారంభించారు. సజ్దాలో వెళ్ళి, చాలా ఆలస్యం అయినప్పటికీ లేవలేదు. నాకు అనుమానం కలిగి కొంచం తల లేపి చూశాను. ఆ అబ్బాయి ఆయన వీపుపై ఉన్నాడు. నేను మళ్ళీ సజ్దాలో ఉండిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు ముగించిన తర్వాత సహచరులుః ‘ప్రవక్తా! మీరు దీర్ఘంగా సజ్దా చేసినందుకు ఏదైనా సంఘటన జరిగిందా లేదా మీపై దివ్యవాణి (వహీ) అవతరణ జరుగుతుందా అని భావించాము’ అని అడిగారు. అందుకు ప్రవక్త చెప్పారుః “ఇవన్నీ ఏమి కాదు, విషయం ఏమిటంటేః అబ్బాయి నా వీపుపై ఎక్కాడు. అతను కోరిక తీరక ముందే తొందరగా లేవడం నాకు బావ్యమనిపించలేదు. అనసు రజియల్లాహు అన్హు ఉల్లేఖనంలో ఉందిః ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఉత్తమ గుణం గలవారు. నాకో చిన్న తమ్ముడు ఉండేవాడు. అతని పేరు ఉమైర్. ప్రవక్త ప్రేమతో, అతని తృప్తి కొరకు ఇలా అనేవారుః “ఉమైర్ నీ నుఘైర్ ఎలా ఉంది”. నుఘైర్ అంటే బుర్ర పిట్ట. అతను దానితో ఆడుకునేవాడు.
ఇంటివారితో ప్రవక్త వ్యవహారంలో సర్వ సద్గుణాలు ఏకమయ్యాయి. ఆయన చాలా వినయనమ్రతతో మెదిలేవారు. తమ చెప్పులు స్వయంగా కుట్టుకునేవారు. అవసరమున్న చోట బట్టలకు మాసికలేసుకునేవారు. ఎప్పుడూ భోజనానికి వంకలు పెట్టేవారు కారు. ఇష్టముంటే తినే, లేదా వదిలేసేవారు. స్త్రీ జాతిని ఒక మనిషిగా గౌరవించేవారు. అంతే కాదు, తల్లి, భార్య, కూతురు, చెల్లి రూపాల్లో వివిధ గౌరవాలు ప్రసాదించేవారు. ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడుః నా సేవా సద్వర్తనలకు అందరికన్నా ఎక్కువ అర్హులేవరు అని. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అన్న ప్రశ్నకు “నీ తల్లి” అనే జవాబిచ్చారు. నాల్గవ సారి అడిగినప్పుడు “నీ తండ్రి” అని చెప్పారు. మరొసారి ఇలా చెప్పారుః “ఏ వ్యక్తి తన తల్లిదండ్రిలో ఒకరిని లేదా ఇద్దరిని పొంది, వారి సేవా చేసుకోకుండా నరకంలో ప్రవేశిస్తాడో అల్లాహ్ అతన్ని తన కరుణకు దూరమే ఉంచుగాకా!”.
ఆయన సతీమణి ఏదైనా పాత్ర నుండి త్రాగినప్పుడు, ఆయన ఆ పాత్ర తీసుకొని ఆమె ఎక్కడ తన మూతి పెట్టిందో అక్కడే తమ మూతి పెట్టి త్రాగేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారుః “మీలో మంచివారు తమ ఇల్లాలి పట్ల మంచి విధంగా మెలిగేవారు. నేను నా ఇల్లాలి పట్ల మీ అందరికన్నా మంచి విధంగా వ్యవహిరించేవాణ్ణి”.
(ఈనాడు మనం మన భార్యలతో ఉత్తమ రీతిలో వ్యవహరించి ఉంటే మరియు మన ఇల్లాలులు ప్రవక్త సతీమణుల లాంటి సద్గుణాలు అవలంబించి ఉంటే మన జీవితాలు సుఖశాంతులతో నిండి ఉండేవి. మనందరికి అల్లాహ్ ఈ భాగ్యం ప్రసాదించుగాక! ఆమీన్).
ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి కరుణ గుణం: ఆయన ఇలా ప్రవచించారుః “కరుణించేవారిని కరుణామయుడైన అల్లాహ్ కరుణిస్తాడు. మీరు భువిలో ఉన్నవారిపై కరుణ చూపండి. దివిలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు”. ప్రవక్తలో ఈ గొప్ప గుణం అధిక భాగంలో ఉండింది. చిన్నలు, పెద్దలు, దగ్గరివారు, దూరపువారు అందరితో గల ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వ్యవహారాల్లో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన కరుణ, వాత్సల్యపు నిదర్శనం ఒకటిః ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న పిలవాళ్ళ ఏడుపు విని సామూహిక నమాజు దీర్ఘంగా కాకుండా, సంక్షిప్తముగా చేయించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారని అబూ ఖతాదా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను నమాజు కొరకు నిలబడినప్పుడు దీర్ఘంగా చేయించాలని అనుకుంటాను, కాని పసి పిల్లవాని ఏడుపు విని నేను సంక్షిప్తంగా చేయిస్తాను. తన తల్లికి అతని వల్ల ఇబ్బంది కలగ కూడదని”.
తమ అనుచర సంఘం పట్ల ఆయన కరుణ, మరియు వారు అల్లాహ్ ధర్మంలో చేరాలన్న కాంక్ష యొక్క నిదర్శనం: ఒక యూద పిలవాడు వ్యాదిగ్రస్తుడయ్యాడు. అతడు ప్రవక్త సేవ చేసేవాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని పరామర్శ కొరకు బయలుదేరి, అతని తలకడన కూర్చున్నారు. కొంత సేపటికి, “అబ్బాయీ! ఇస్లాం స్వీకరించు” అని చెప్పారుః అతడు తన తలాపునే నిలుచున్న తండ్రి వైపు చూశాడు. అబుల్ ఖాసిం (ప్రవక్త విశేషనామం, కునియత్) మాట విను అని అతని తండ్రి చెప్పాడు. ఆ అబ్బాయి అప్పుడే ఇస్లాం స్వీకరించాడు. మరి కొంత సేపటికే చనిపోయాడు. ప్రవక్త అతని వద్ద నుండి వెళ్తూ ఇలా అన్నారుః “ఇతన్ని అగ్ని నుండి కాపాడిన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు ఆయన ఓపిక, సహనాలతోనే జీవితం గడిపారు. ఈ (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా రజియల్లాహు అన్హా ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడుః నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారుః “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడుః అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు. అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉందిః ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడుః ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్ర్(6)లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ రజియల్లాహు అన్హు పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖబా భూజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారుః
{ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?}. (ఘాఫిర్ 28)
ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్, వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూః ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటె ను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగోల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా రజియల్లాహు అన్హా వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.
వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడుః “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది. బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణిఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సంద ర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్టరోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది. ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి
1 అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.
పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త -ﷺ- ఇలా చెప్పారుః “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విష యంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రజియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం”.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మానవ గౌరవాల్లో కూడా శత్రు- వులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విజయధనం పంపిణి చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మస్ఊద్ రజియల్లాహు అన్హు ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ రజియల్లాహు అన్హా మిగిలారు. అయినా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారుః “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లవేళల్లో అల్లాహ్ ఆరాధన, ధ్యానం మరియు ఆలోచనలో ఉండేవారు. ఆయనకు ఏదైనా చింత, రంది కలిగినప్పుడు లేదా ఏదైనా ఆపద ఎదురైనప్పుడు బిలాల్ ను పిలిచి “నమాజుకు పిలుపునిచ్చి మాకు విలాసం, ఉల్లాసం కలుగజేయు బిలాల్” అని అనేవారు.
ఆయన రాత్రి తహజ్జుద్ చేస్తూ చాలా దీర్ఘంగా ఖియాం చేసేవారు. చివరికి పాదాలు వాపు ఎక్కేవి. ఖుర్ఆన్ చదువుతూ కొన్ని ఆయతులు మరీమరీ చదివేవారు. నమాజు స్థితిలో ఎక్కువగా ఎడ్వడం వల్ల గడ్డం తడి అయ్యేది. ఆయన సతీమణి ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః ప్రవక్తా! మీపై మీరు ఎందుకు ఇంతగా కష్టం తెచ్చుకుంటున్నారు. అల్లాహ్ మీ పూర్వపు మరియు వెనకటి పాపాలన్నియూ మన్నించాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పేవారుః “నేను ఆయనకు కృతజ్ఞుడైన దాసుడ్ని కాకూడదా?” రాత్రి అధిక శాతం అల్లాహ్ తో వేడుకోలులో, ఖుర్ఆన్ పారాయణంలో, దుఃఖిస్తూ గడిపేవారు.
అలాగే ఉపవాస విషయానికి వస్తే ప్రయాణంలోనైనా, నివాసంలోనైనా, చలికాలంలోనైనా, ఎండకాలంలోనైనా ఎక్కువగా ఉపవాసాలుండేవారు. మేము ఒకసారి విపరీతమైన ఎండలో ఉన్నాము. ఆరాధనలకు అర్హుడైన అల్లాహ్ సాక్షిగా! ఎండతాపాన్ని భరించలేక మా తలపై చేతులను పెట్టు- కుంటూ ఉంటిమి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇబ్ను రవాహ రజియల్లాహు అన్హు, వీరిద్దరు తప్ప ఎవరు ఉపవాసముండలేదు.
దానదర్మాలు విషయం హద్దు లేకుండా దాతృత గుణం గలవారు. ఆయన వద్ద ఉన్న ప్రతీది దానం చేసేవారు. పేదరికానికి భయపడకుండా ఖర్చు చేసేవారు. ఎప్పుడు ఏ ఒక్క యాచకున్ని లేదనలేదు. ఎప్పుడు ఎవరు ఏది అడిగినా ఏమీ ఇవ్వకుండా వట్టి చేతుల్తో పంపేవారు కాదు. అతనికి సహాపడేవారు. ఆయన సహచరులు అనేవారుః ప్రవక్తను ఎప్పుడు ఏ విషయం అడిగినా ఆయన దానిని కాదనలేదు.
జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది అఇష్టంగా వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదించేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకునేవారు. శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.
ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖన ప్రస్తావించారుః “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూ కోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః “ఇవన్ని యూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి”. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).
ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే దీనార్ తప్ప ఆ బంగారంలో ఒక దీనార్ కూడా నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారుః “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు”.
తిండి విషయం, నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయం కాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.
ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.
అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న కంబళి మరియు మందమైన లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారుః నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడిచేవాణ్ణి ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండేది.
ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు దానం చేసియున్న ఒక భూమి తప్ప. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారుః “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవ ధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.
న్యాయ విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తార తమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారుః బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబూ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే వినిపించు కునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారుః “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని అనుకునేవాణ్ణి”.
ఒకసారి ఉసైది బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు. వెంటనే ఉసైద్ అన్నాడుః ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచు కున్నాను. ప్రవక్త చెప్పారుః సరే తీర్చుకో. ఉసైద్ అన్నాడుః ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది. మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది. అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు. ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య ముద్దించు కోసాగాడు. మళ్ళీ చెప్పాడుః నేను కోరింది ఇదే ప్రవక్తా!
అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హును సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారుః “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడవుతే అతన్ని శిక్షించ కుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని”.
కొందరు తత్వవేత్తలు, ఇస్లాం స్టడీ చేసిన పాశ్చాత్య నిపుణులు (orientalists) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్స్ క్రింద తెలుపుతున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గొప్పతనాన్ని, ఆయన ప్రవక్తపదవిని, ఆయన ఉత్తమ గుణాలను వారు ఒప్పుకున్న విషయాల్ని స్పష్టం చేస్తున్నాము. కొందరు ఇస్లామీయ విరోధులు, శత్రువులు చేస్తున్న దుష్ప్రచారానికి, పక్షపాతానికి ఈ ఇస్లాం ధర్మం దూరంగా ఉంది అని వారు తెలిపిన ఇస్లాం ధర్మ వాస్తవికతలను మీ ముందుంచుతున్నాము. (అయితే ఇస్లాంగానీ, ప్రవక్తగానీ వారి ప్రశంసలకు, సాక్ష్యాలకు ఆధారపడిలేరు. మరి ఇవి తెలిపే కారణం ఏమిటంటే; ఇస్లాంను అర్థం చేసుకోకుండా, దానిని చెడుగా భావించేవారు, వారి వంశం, లేదా వారి లాంటి మతాలపై ఉన్నవారిలో కొందరు ఇస్లాంను చదివి ఎలా అర్థం చేసుకున్నారో అదే విధంగా ఇస్లాం అధ్యాయనం చేసి, న్యాయంపై ఉండాలన్నదే మా ఉద్దేశం).
జోర్జ్ బర్నార్డ్ షా(*) తన రచన “ముహమ్మద్”లో (బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాల్చేసింది) ఇలా వ్రాశాడుః “ఈ నాటి సమాజానికి ముహ మ్మద్ లాంటి మేధావి అవసరం చాలా ఉంది. ఈ ప్రవక్త ఎల్లప్పుడూ తన ధర్మాన్ని గౌరవ స్థానంలో ఉంచాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం ఇతర నాగరికతలను అంతమొందించే అంతటి శక్తి గలది. శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండునది. నా జాతి వాళ్ళల్లో చాలా మంది స్పష్టమైన నిదర్శనంతో ఈ ధర్మంలో ప్రవేశిస్తున్నది నేను చూస్తున్నాను. సమీపం లోనే ఈ ధర్మం యూరపు ఖండంలో విశాలమైన చోటు చేసుకుంటుంది”.
ఇంకా ఇలా వ్రాశాడుః “అజ్ఞానం, దానిపై పక్షపాతం వల్ల మధ్య శతాబ్థి (Middle Ages) లోని క్రైస్తవ మత పెద్దలు ముహమ్మద్ తీసుకొచ్చిన ధర్మాన్ని అంధవికారంగా చిత్రీకరించి, అది క్రైస్తవ మతానికి శత్రువు అని ప్రచారం చేశారు. కాని నేను ఈ వ్యక్తి (ముహమ్మద్) గురించిచదివాను. అతను వర్ణాతీతమైన, అపరూపమైన వ్యక్తి. ఆయన క్రైస్తవమతానికి శత్రువు ఎంత మాత్రం కారు. ఆయన్ను మానవ జాతి సంరక్షకుడని పిలవడం తప్పనిసరి. నా దృష్టిలో ఆయన గనక నేటి ప్రపంచ పగ్గాలు తన చేతిలో తీసుకుంటే మన సమస్యల పరిష్కార భాగ్యం ఆయనకు లభిస్తుంది. నిజమైన శాంతి, సుఖాలు ప్రాప్తమవుతాయి. అవి పొందడానికే మానవులు పరితపిస్తున్నారు.
(*) నోట్: George Bernard Shaw. జననం 26/7/1856. మరణం 2/11/1950. జన్మ స్థలం Ireland.
థోమస్ కార్లైల్(**) తన ప్రఖ్యాతిగంచిన రచన “On Heroes, HeroWorship, and the Heroic in History”లో ఇలా వ్రాశాడుః “ముహమ్మద్ కుయుక్తుడు, మోసగాడు, అసత్యరూపి మరియు అతని ధర్మం కేవలం బూటకపు, బుద్ధి హీన విషయాల పుట్ట అన్న ప్రస్తుత మన వ్యూహం, మరియు ఇలాంటి వ్యూహాలను వినడం నేటి విద్యాజ్ఞాన యుగంలో మన కొరకే సిగ్గు చేటు. ఇలాంటి మూఢ, సిగ్గుచేటు విషయాలు ప్రభలకుండా పోరాడడం మన విధి. ఈ ప్రవక్త అందజేసిన సందేశం 12 వందల సంవత్సరాల నుండి రెండు వందల మిలియన్లకంటే ఎక్కువ మంది కొరకు ప్రకాశ వంతంగా ఉంది. ఈ సందేశాన్ని విశ్వసించి, దాని ప్రకారం తమ జీవితా లను మలచుకొని దానిపై చనిపోయిన ప్రజలు అసంఖ్యాకులు. ఇంతటి గొప్ప వాస్తవం అబద్ధం, బూటకం అని భావించగలమా?”.
(**) నోట్: Thomas Carlyle జననం 4/12/1795 స్కాట్ ల్యాండ్ లోని Ecclefechan గ్రామంలో. మరణం 5/2/1881 లండన్ లో ప్రఖ్యాతి గాంచిన చరిత్ర కారుడు, సాహిత్యపరుడు.
మన ఇండియా తత్వవేత్త రామ క్రిష్ణా రావు ఇలా చెప్పారుః “అరబ్ ద్వీపంలో ముహమ్మద్ ప్రకాశమయినప్పుడు అది ఓ ఎడారి ప్రాంతం. అప్పటి ప్రపంచ దేశాల్లో నామమాత్రం గుర్తింపు లేని ప్రాంతం అది. కాని కొత్త సంస్కృతి, సభ్యతను ఏర్పరిచారు. మరియు కొత్త రాజ్యాన్ని నిర్మించారు. అది మొరాకో నుండి ఇండియా ద్వీపకల్పం వరకు విస్తరించింది. అంతే కాదు ఆయన ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాల్లోని జీవనశైలి, విచారణా విధానాల్లో గొప్ప మార్పు తేగలిగాడు.
కెనడాకు చెందిన ఓరియంటలిస్ట్ జ్వీమర్ (S.M. Zweimer) ఇలా వ్రాశాడుః “నిశ్చయంగా ముహమ్మద్ ధార్మిక నాయకుల్లో అతి గొప్పవారు.
ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఆయన శక్తివంతుడైన సంస్కరణకర్త, అనర్గళ వాగ్ధాటి, ధైర్యంగల అతిసాహసి, సువిచారం చేయు గొప్ప మేధావి అని అనడమే సమంజసం. ఈ సద్గుణాలకు విరుద్ధమైన విషయాలు ఆయనకు అంకితం చేయుట ఎంత మాత్రం తగదు, యోగ్యం కాదు. ఆయన తీసుకొచ్చిన ఈ ఖుర్ఆను మరియు ఆయన చరిత్ర ఇవి రెండూ ఆయన సద్గుణాలకు సాక్ష్యం చెబుతున్నాయి.
సర్ విలియమ్ యోయిర్ (Sir William Muir) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ -ముస్లిముల ప్రవక్త- చిన్నప్పటి నుండే అమీన్ అన్న బిరుదు పొందారు. ఆయన ఉత్తమ నడవడిక, మంచి ప్రవర్తనను బట్టి ఆయన నగరవాసులందరూ ఏకంగా ఇచ్చిన బిరుదు ఇది. ఏదీ ఎట్లయినా, ముహమ్మదు వర్ణాతీతమైన శిఖరానికి ఎదిగి యున్నారు. ఏ వ్యక్తి ఆయన గురించి వర్ణించగలడు. ఆయన్ను ఎరగనివాడే ఆయన గౌరవస్థానాన్ని ఎరగడు. ఆయన గురించి ఎక్కువగా తెలిసినవాడు ఆయన గొప్ప చరిత్రను నిశితంగా పరిశీలించినవాడు. ఈ చరిత్రనే ముహమ్మదును ప్రవక్తల్లో మొదటి స్థానంలో మరియు విశ్వమేధావుల్లో ఉన్నతునిగా చేసింది.
ఇంకా ఇలా అన్నాడుః “ముహమ్మద్ తన స్పష్టమైన మాట, సులభ మైన ధర్మం ద్వారా సుప్రసిద్ధులయ్యారు. మేధావుల మేధను దిగ్ర్భమలో పడవేసిన పనులు ఆయన పూర్తి చేశారు. అతి తక్కువ వ్యవధిలో అందరినీ జాగరూక పరచిన, అప్రమత్తం చేసిన, నశించిపోయిన సద్గుణాల్లో జీవం పోసిన, గౌరవ మర్యాదల ప్రతిష్ఠను చాటి చెప్పిన ఇస్లాం యొక్క ప్రవక్త ముహమ్మద్ లాంటి సంస్కరణకర్త చరిత్రలో ఎవ్వరూ మనకు కనబడరు.
గొప్ప నవలారచయిత, తత్వవేత్త రష్యాకు చెందిన లియో టోల్స్ టాయ్(#) ఇలా చెప్పాడుః “ముహమ్మద్ విఖ్యాతి, కీర్తి గౌరవానికి ఇది ఒక్క విషయం సరిపోతుందిః ఆయన అతి నీచమైన, రక్తపాతాలు సృష్టించే జాతిని, సమాజాన్ని దుర్గుణాల రాక్షసి పంజాల నుండి విడిపించారు. వారి ముందు అభివృద్ధి, పురోగతి మార్గాలు తెరిచారు. ముహమ్మద్ ధర్మశాస్త్రం కొంత కాలంలో విశ్వమంతటిపై రాజ్యమేలుతుంది. ఎందుకనగా ఆ ధర్మానికి బుద్ధిజ్ఞానాలతో మరియు మేధ వివేకాలతో పొందిక, సామరస్యం ఉంది.
(#) నోట్: Leo Tolstoy Nikolayevich. జననం 9/9/1828 మరణం 20/11/1910 జన్మ స్థలం Tula Oblast, Russia. ప్రపంచపు గొప్ప నవలా రచయితల్లో ఒకడితను. తత్వవేత్త కూడా.
ఆస్ట్రియా దేశస్తుడైన షుబ్రుక్ చెప్పాడుః ముహమ్మద్ లాంటి వ్యక్తి వైపు తనకు తాను అంకితం చేసుకోవడంలో మానవజాతి గర్వపడుతుంది. ఎందుకనగా ఆయన చదువరులు కానప్పటికీ కొద్ది శతాబ్ధాల క్రితం ఒక చట్టం తేగలిగారు. మనం ఐరోపాకు చెందిన వాళ్ళం గనక దాని శిఖరానికి చేరుకున్నామంటే మహా అదృష్టవంతులమవుతాము.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వసల్లం యొక్క సంపూర్ణ జీవిత చరిత్ర పరిశీలన దృష్టితో చదివి ఆయన అనుకరణ భాగ్యం అల్లాహ్ సర్వమానవాలికి ప్రసాదించుగాక! ఆమీన్!!!
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లిం వనిత (Muslim Woman) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
ఇస్లాం ధర్మంలో స్త్రీలకున్న హక్కులను గురించి చర్చించే ముందు ఇతర మతాల్లో స్త్రీలకున్న హక్కులు, వాటి వ్యవహారం స్త్రీల పట్ల ఎలా ఉంది అనేది వివరించడం చాలా ముఖ్యం.
గ్రీకుల వద్ద స్త్రీ అమ్మబడేది మరియు కొనబడేది. ఆమెకు ఏ హక్కూ లేకుండింది. సర్వ హక్కులు పురుషునికే ఉండినవి. ఆస్తిలో వారసత్వం లేకుండా తన స్వంత సొమ్ములో ఖర్చు పెట్టే హక్కు కూడా లేకుండింది. ప్రఖ్యాతి గాంచిన అచ్చటి తత్వవేత్త సుఖరాత్ (Socrates the philosopher 469-399BC) ఇలా అన్నాడు. “స్త్రీ జాతి ఉనికి ప్రపంచం యొక్క అధోగతి మరియు క్షీణత్వానికి ఒక మూల కారణం. స్త్రీ ఒక విషమాలిన చెట్టు తీరు, చూపుకు ఎంతో అందంగా ఉంటుంది కాని పక్షులు దాన్ని తిన్న వెంటనే చనిపోతాయి”.
రోమన్లు స్త్రీకి ఆత్మయే లేదనేవారు. వారి వద్ద స్త్రీకి ఏలాంటి విలువ, హక్కు లేకుండింది. “స్త్రీకి ఆత్మ లేదు” అనడం వారి నినాదంగా ఉండింది. అందుకే వారిని స్థంబాలకు బంధించి కాగిన నూనె వారి దేహాలపై పోసి వారిని బాధించేవారు. ఇంతకంటే ఘోరంగా నిర్దోషులైన స్త్రీలను గుఱ్ఱపు తోకతో కట్టి వారు చనిపోయెంత వరకు గుఱ్ఱాన్ని పరిగెత్తించేవారు.
మన భారత దేశంలో మరో అడుగు ముందుకు వేసి భర్త చనిపోతే భార్యను కూడా సతీసహగమనం చేయించేవారు.
చైనీయులు స్త్రీ యొక్క ఉదాహరణ ధన సంపాదనను మరియు మంచితనాన్ని నశింపజేసే నీటితో ఇచ్చేవారు. భార్యని అమ్మడం ఒక హక్కుగా భావించేవారు. అదే విధంగా సజీవంగా దహనం చేయుట ఒక హక్కుగా భావించేవారు.
హవ్వా, ఆదమును కవ్వించి చెట్టు నుంచి పండు తినిపించిందని యూదులు స్త్రీ జాతినే శపించబడినదిగా భావించేవారు. స్త్రీ బహిష్టు రాలయినపుడు తనుండే గృహము, తను ముట్టుకునే ప్రతి వస్తువు కూడా అపరిశుభ్రమవుతుందని భావించేవారు. తనకు సోదరులుంటే తన తండ్రి ఆస్తిలో వచ్చే భాగం తనకు ఇచ్చేవారు కారు.
క్రైస్తవులు స్త్రీని షైతాన్ (దయ్యం, పిశాచం) యొక్క ద్వారముగా భావించేవారు. ఒక క్రైస్తవ పండితుడు స్త్రీ విషయంలో ఇలా ప్రస్తావించాడు: “స్త్రీ మానవ పోలిక గలది కాదు”. బోనావెన్తూర్ (Saint Bonaventure 1217 – 1274) ఇలా చెప్పాడు: “మీరు స్త్రీని చూసి మానవుడే కాదు. కౄర జంతువని కూడా అనుకోకండి. మీరు చూసేది షైతాన్ మరియు వినేది కేవలం పాము ఈలలు”.
ఇంగ్లీషు వారి చట్టం “Common law” ప్రకారమయితే గత అర్ద శతాబ్దంలో స్త్రీ పౌరుల తరగతులోని ఏ తరగతిలో కూడా లెక్కించబడక పోయేది. మరియు స్త్రీకి స్వంతగా ఏ హక్కు లేకుండింది. చివరికి తను ధరించే దుస్తులు కూడా తన అధికారంలో లేకుండినవి. క్రీ.శ. 1567న స్కాట్ల్యాండ్ పార్లమెంటులో ఏ చిన్న అధికారం కూడా స్త్రీకి ఇవ్వకూడదన్న ఆదేశం జారి చేశారు. హెన్రి8th (Henry VIII) పరిపాలనలో బ్రిటిష్ పార్లమెంటు స్త్రీ అపరిశుభ్రత గలది గనుక బైబిల్ చదవకూడదని చట్టం జారి చేసింది. 1586వ సంవత్సరం ఫ్రాన్సులో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి స్త్రీ మనిషేనా, లేదా అని చర్చించి చివరికి మనిషే కాని పురుషుని సేవ కొరకు పుట్టించబడిందన్న నిర్ణయానికి వచ్చారు. క్రీ.శ. 1805 వరకు బ్రిటిషు చట్టం “భర్త తన భార్యను అమ్ముట యోగ్యమే” అని యుండింది. మరియు వారు భార్య యొక్క ధర ఆరు పెన్సులు (6pence ie Half Schillng) నిర్ణయించారు.
అరబ్బులు ఇస్లాంకు ముందు స్త్రీని చాలా నీచంగా చూసేవారు. ఏ స్థాయి లేకుండా, ఆస్తిలో హక్కు లేకుండా ఉండింది. అనేక అరబ్బులు తమ బిడ్డలను సజీవంగా దహనం చేసేవారు.
స్త్రీ జాతి భరించే ఈ అన్యాయాన్ని తొలగించుటకు, స్త్రీ పురుషులు ఒకటే మరియు పురుషులకున్న విధంగా వారికి హక్కులున్నవి అని చాటి చెప్పుటకు ఇస్లాం ధర్మం వచ్చింది. ఇదే విషయాన్ని దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇలా తెలిపాడు:
{మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృష్టించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసు కునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు}. (హుజురాత్ 49: 13).
{మంచి పనులు చేసేవారు పురుషులైనా, స్త్రీలైనా వారు గనక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు}. (నిసా 4: 124). మరో చోట దివ్య ఖుర్ఆన్ ఇలా తెలుపుతుందిః
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఇలా ప్రశ్నించాడు, ‘నా సద్వ ర్తనలకు, సేవలకు అందరికంటే ఎక్కువ హక్కు గలవారెవరు?’ అని, “నీ తల్లి” అని చెప్పారు ప్రవక్త. అతను ‘మళ్ళీ ఎవరు’ అని అడిగాడు. దానికి ప్రవక్త “నీ తల్లి” అని చెప్పారు. ‘మళ్ళీ ఎవరు’ అని అడగ్గా “నీ తల్లి” అని చెప్పారు. మళ్ళీ ఎవరు అని అడిగినప్పుడు “నీ తండ్రి” అని ప్రవక్త బదులిచ్చారు. (బుఖారి 5971, ముస్లిం 2548).
ఇస్లాం స్త్రీ గురించి ఏమంటుందనే దానికి ఇది ఒక సంక్షిప్త విషయం. మరీ వివరానికి తరువాతి పేజీలు చదవండి.
స్త్రీ యొక్క సామాన్య హక్కులు
స్త్రీకు కొన్ని సామాన్య హక్కులున్నవి. వాటిని స్వయంగా స్త్రీలు తెలుసుకొనుట మరియు పురుషులు వాటిని వారి కొరకు అంగీకరించుట ఎంతయినా అవసరం. స్త్రీలు తమ ఈ హక్కలను తమిష్టానుసారం వినియొగించుకోవచ్చును.
సంక్షిప్తంగా ఆ హక్కులు ఇవి
1- స్వామ్యం (Ownership): బిల్డింగ్, పంటలు, పొలాలు, ఫ్యాక్టరీలు, తోటలు, బంగారం, వెండి మరియు అన్ని రకాల పశువులు. వీటన్నిట్లో స్త్రీ తను కోరినవి తన యాజమాన్యంలో ఉంచుకో వచ్చును. స్త్రీ భార్య, తల్లి, బిడ్డ మరియు చెల్లి, ఇలా ఏ రూపములో ఉన్నా, పై విషయాలు తన అధికారంలో ఉండ వచ్చును.
2- వివాహ హక్కు, భర్తను ఎన్నుకునే హక్కు. భర్తతో జీవితం గడపడంలో నష్టం ఏర్పడినపుడు వివాహ బంధాన్ని తెంచుకొని, విడాకులు కోరే హక్కు. ఇది స్త్రీ యొక్క ప్రత్యేక హక్కు అనడంలో ఏ సందేహం లేదు.
3- విద్యః తనపై విధిగా ఉన్న విషయాలను నేర్చుకునే హక్కు. ఉదాః అల్లాహ్ గురించి, తన ప్రార్థనలు మరియు వాటిని చేసే విధానం తెలుసుకొనుట తనపై విధిగా ఉన్న హక్కులు. తను ఎలాంటి ప్రవర్తన అవలంభించాలి, ఏలాంటి సంస్కారం, సభ్యత పాటించాలి అనే విషయాలు తెలుసుకొనుట ప్రతి స్త్రీ హక్కు. అల్లాహ్ ఆదేశం:
“విద్యనభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా యుంది”. (ఇబ్ను మాజ 224).
4- దానధర్మం: తన స్వంత ధనము నుంచి తను కోరుకున్నట్లు తనపైగాని, ఇతరులపై గానిః వారు తన భర్త అయినా, సంతానమ యినా, తండ్రి లేక తల్లి అయినా ఖర్చు చేయవచ్చును. హద్దుకు మించి, వ్యర్థమైన ఖర్చు చేయ కూడదు. (చేసినచో, దాన్ని నిరోధించడం ఆమె బాధ్యుని విధి). ఖర్చు చేయడంలో పురుషుని కున్నంత అధికారం స్త్రీలకూ ఉంది.
5- ప్రేమించే, అసహ్యించే హక్కుః సద్గుణముగల స్త్రీలను ప్రేమించి, వారి ఇంటికి వెళ్ళడం, వారికి బహుమానంగా ఏదైనా పంపడం, వారితో కలం స్నేహం చేయడం, వారి క్షేమసమాచారాలు తెలుసు కోవడం, వారి బాధల సమయాన వారిని పరామర్శించడం. (భార్య తన భర్త, ఇతర స్త్రీలు తమ బాధ్యుల అనుమతితో చెయ్యాలి). మరియు దుర్గుణం గలవారిని అసహ్యించి, అల్లాహ్ సంతృష్టి కొరకు వారితో దూరముండటం.
6- వాంగ్మూలం: తన స్వంత ధనం నుంచి తన జీవితములోనే మూడవ వంతు ధనము గురించి తను కోరినవారికి వసియ్యత్ (వాజ్మూలం) చేయ వచ్చును. తను చనిపోయిన తరువాత ఆమె ఆ వసియ్యత్ ను ఏలాంటి అభ్యంతరం లేకుండా జారి చేయించ వచ్చును. ఎందుకనగా వసియ్యత్ ప్రతి ఒక్కరి స్వంత విషయం. పురుషులకున్న విధంగానే స్త్రీలకు కూడా ఆ హక్కుంది. ప్రతి ఒక్కరు అల్లాహ్ నుంచి సత్ఫలితం కోరుట చాలా ముఖ్యం. కాని ఈ వసియ్యత్ మొత్తం ఆస్తిలో మూడిట్లో ఒక వంతుకన్న ఎక్కువ ఉండకూడదు.
7- దుస్తులు ధరించడంలో తినిష్టానుసారం పట్టు బట్టలు, బంగారము ధరించవచ్చును. ఇవి రెండూ పురుషులపై నిషిద్ధము. కాని ధరించి కూడా నగ్నంగా ఉన్నట్లనిపించే దుస్తులు ధరించ కూడదు. అంటే శరీర సగభాగం లేక నాల్గవ భాగం మాత్రమే దరించుట, లేక తలను, మెడను మరియు వదను కొంగుతో, పైటతో కప్పియుంచక పోవుట. ఈ స్థితిలో కేవలం తన భర్త ఎదుట మాత్రం ఉండవచ్చును.
8- భర్త కొరకు సింగారం చేయుట, సుర్మా, కాటిక పెట్టుకొనుట, ఇతర
యోగ్యమైన వస్తువులతో సింగారించుకొనుట, భర్త ఇష్టపడే మంచి దుస్తులు ధరించుట యోగ్యమే. కాని అవిశ్వాస స్త్రీలు మరియు వేశ్యలు ధరించే డ్రెస్సులు ధరించక, సందేహాత్మక వస్త్రాల నుండి దూరముండుటయే మంచిది.
9- తినే త్రాగే విషయాల్లో తమకు నచ్చినది తినత్రాగ వచ్చును. పురుషులకు వేరు స్త్రీలకు వేరు అని ఏమీ లేదు. పురుషులకు యోగ్య- మున్నదే స్త్రీలకు ఉంది. పురుషులకు నిషిద్ధమున్నదే స్త్రీలకు నిషిద్ధమున్నది. అల్లాహ్ (సూరె ఆరాఫ్ 7: 31)లో ఈ విధంగా బోధించాడుః
స్త్రీ యొక్క ప్రత్యేక హక్కుల్లో ఆమె పట్ల ఆమె భర్తపై ఉన్న హక్కులు. ఇవి తన భర్త హక్కులు ఆమెపై ఉన్న విధంగనే ఉన్నవి. ఉదాః అల్లాహ్ మరియు ప్రవక్త అవిధేయతకు గురి చేయని భర్త ఆజ్ఞలు పాటించడం. అతనికి భోజనాలు వండి పెట్టడం. పడకను బాగుంచడం. సంతానాన్ని పోషించి, మంచి శిక్షణ ఇవ్వడం. అతని ధన, మానమును కాపాడడం. తన మానాన్ని కాపాడుతూ, యోగ్యమైన అలంకరణ వస్తువులను ఉపయోగించి అతని కొరకు సింగారించుకొనడం. ఇవి స్త్రీపై ఉన్న తన భర్త హక్కులు.
ఒక స్త్రీ పట్ల తన భర్తపై ఉన్న హక్కుల్లో అల్లాహ్ ఆదేశాను సారం సంక్షిప్తంగా కొన్ని హక్కులు క్రింద తెలుసుకుందాము.
{మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి}. (బఖర 2: 228).
ప్రతి విశ్వాసిని తన ఈ హక్కులను గుర్తెరిగి ఏలాంటి సిగ్గు పడక మరియు భయపడకుండా తన హక్కులను పొందాలని మేము ఇచ్చట పేర్కొన్నాము. భర్త ఆమెకి ఈ హక్కులను పూర్తిగా ఇవ్వడం అతనిపై విధిగా ఉంది. ఒక వేళ ఆమె స్వయంగా తన ఈ హక్కులను వదులుకుంటే పర్వాలేదు.
భర్తపై ఉన్న భార్య హక్కులు ఇవి
1- కలిమిలోనైనా, లేమిలోనైనా భార్య యొక్క పోషణ, వస్త్ర, చికిత్స మరియు గృహ వసతులు మొదలగునవి తను ఏర్పాటు చేయాలి.
2- ఆమె ధన, ప్రాణ, మానములను మరియు ఆమె ధర్మాన్ని కాపాడాలి. పురుషునికి స్త్రీపై అధికారమివ్వబడింది గనుకు అధికారి విధి ఏమనగా తనకు దేనిపై అధికారమివ్వబడిందో దాన్ని రక్షించటం, కనిపెట్టి ఉండటం.
3- ధర్మానికి సంబంధించిన విషయాలను ఆమెకు నేర్పే బాధ్యత భర్తది. అతనిలో నేర్పే శక్తి లేకుంటే, స్త్రీల విద్య బోధన ప్రత్యేక సమావేశాల్లోః మస్జిదులో లేక బడిలో వెళ్ళి నేర్చుకొనుటకు అను మతివ్వాలి. అచ్చట ఉపద్రవం లేకుండా శాంతి ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా ఏలాంటి నష్టం కలిగే భయం ఉండకూడదు.
4- భార్యతో సద్వర్తనతో మెలగాలి. అల్లాహ్ ఆదేశం ఇలా ఉందిః {వారితో సద్భావంతో జీవితం గడపండి}. (నిసా 4: 19). సద్వర్తనతో మెలిగి మంచి విధంగా సంసారం చేయుట అనగా భార్యతో కాపురం చేయుట ఒక హక్కు. దాన్ని పూర్తి చెయ్యాలి. ఆమెను దూషించి, తిట్టి బాధ కలిగించరాదు. ఏలాంటి భయం లేని భారాన్ని ఆమెకు అప్పగించరాదు. మాట మరియు తన ప్రవర్తన ద్వారా మంచిగా వ్యవహరించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహహి వసల్లం ఇలా చెప్పారుః “మీలో మంచివారు ఎవరయ్యా అంటే తమ భార్యల పట్ల మంచితనముతో మెలిగేవారే. నేను నా భార్యల పట్ల మంచిగా మెలిగేవాణ్ణి. (తిర్మిజి 3895).
పర్ద
కుటుంబ జీవితం విఛ్ఛిన్నం కాకుండా, అధోగతి వైపునకు పోకుండా సురక్షితంగా ఉండాలని ఇస్లాం చాలా ప్రోత్సహించింది. మనిషి సుఖంగా ఉండి, సమాజం పరిశుద్ధంగా ఉండుటకు, దాన్ని మంచి సభ్యత, మంచి గుణాల యొక్క బలమైన అడ్డుతో రక్షణ కల్పించి కాపాడింది. ఈ గుణాలను పాటిస్తే భావోద్రేకాలు ఉద్భ వించవు. మనోవాంఛలకు తావు ఉండదు. ఉపద్రవాలకు తావు ఇచ్చే కోరికల్ని కూడా ఆపుటకు అడ్డు ఖాయం చేసి స్త్రీ పురుషులు తమ కంటి చూపులను క్రిందికి జేసుకోవాలని ఆదేశించింది.
స్త్రీ యొక్క గౌరవానికి, తన మానము యొక్క అవమానము కాకుండా బధ్రంగా ఉండుటకు, నీచ మనస్సు గలవారు మరియు అల్లకల్లోలం సృష్టించేవారు ఆమె నుంచి దూరముండటకు, గౌరవ మర్యాదల విలువ తెలియని మూర్ఖుల నుంచి బధ్రంగా ఉండుటకు, విషపూరితమైన చూపులకు కారణమగు ఉపద్రవాలను అడ్డుకొనుటకు, స్వయంగా స్త్రీ గౌరవము, తన మానము యొక్క భద్రతకు అల్లాహ్ “పర్ద” యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
ముఖము, రెండు అర చేతులు తప్ప పూర్తి శరీరము కానరాకుండా “పర్ద” చేయుట విధి అనీ, పరపురుషుల ఎదుట తన అలంకరణను, వంపుసొంపులను బహిరంగ పర్చకూడదనీ ధర్మ వేత్తలు ఏకీభవించారు. రెండు అర చేతులు మరియు ముఖం విషయంలో ధర్మవేత్తలు బేధాబిప్రాయంలో పడి రెండు గ్రూపులయ్యారు. ప్రతి ఒక్కరి వద్ద తమ అభిప్రాయం ప్రకారం ఆధారాలున్నవి. “పర్ద” ధరించుట విధి అని, దాని హద్దును గూర్చి అనేక ఆధారాలు గలవు. ప్రతి ఒక్కరూ వాటి నుంచే ఆధారము తీసుకున్నారు. తమ అభిప్రాయానికి వ్యెతిరేకమున్న ఆధారాలకు ఎన్నో హేతువులు (కారణాలు) చెప్పారు. అల్లాహ్ ఆదేశాలు ఇలా ఉన్నవిః
{ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల మరియు వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్దతి}. (33: అహ్ జాబ్: 53).
{ఓ ప్రవక్తా! నీ భార్యలకు, నీ కూతుళ్ళకు, విశ్వాసుల స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడ తీసుకోమని చెప్పు. వారు గుర్తింప బడటానికీ, వేధింపబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైన పద్దతి, అల్లాహ్ క్షమించేవాడు కరుణించు వాడునూ}. (33: అహ్ జాబ్: 59).
{ఓ ప్రవక్తా! విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పుః తమ చూపులను కాపాడుకోండి అని, తమ మర్మాంగాలను రక్షించుకోండి అని, తమ అలంకరణను ప్రదర్శించవద్దని – దానంతట అదే కనిపించేది తప్ప – తమ వక్షః స్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలని, వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరెవరి ముందు ప్రదర్శించ కూడదనిః భర్త ….}. (24: నూర్ :31).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర భార్య ఆయిషా సిద్దీఖా రజియల్లాహు అన్హా ఇలా చెబుతున్నారుః “స్త్రీలు దుప్పట్లు కప్పుకొని వచ్చి ప్రవక్త వెనక ఫజ్ర్ నమాజు చేసేవారు. నమాజైన తర్వాత వారు తిరిగి ఇండ్లకు పోతుండగా చీకటి కారణంగా గుర్తింప బడేవారు కారు”. (సునన్ నసాయి). ఫాతిమ బిన్తె మున్జిర్ రహిమహుల్లాహ్ చెప్పారుః “మేము ఇహ్రాం (హజ్ లేక ఉమ్రా) స్థితిలో ఉండగా మా కొంగులను ముఖముపై వ్రేలాడ తీసుకునే వారిమి. అప్పుడు అస్మా బిన్తె అబీ బక్ర్ రజియల్లాహు అన్హా మాతో ఉన్నారు. (ముఅత్త ఇమాం మాలిక్. హజ్/ తఖ్మీరుల్ ముహ్రిమి వజ్ హహు). ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః “వలసవచ్చిన (ముహాజిర్) మహిళలను అల్లాహ్ కరుణించుగాకా! మొదటి సారి {తమ వక్షః స్థలాలను ఓణి అంచులతో కప్పుకోవాలని} దివ్య ఖుర్ఆన్ ఆయతు అవతరించినపుడు తమ దుప్పట్లను చింపుకొని కప్పుకున్నారు”. (బుఖారిః 4758).
ఇవే గాకా ఇంకా అనేక ఆధారాలున్నవి. పైన తెలిపిన ప్రకారం ఏ బేధాబిప్రాయాలు ఉన్నా, అందరు కూడా అనారోగ్య స్థితిలో డాక్టరు వద్దకు వెళ్ళుట లాంటి అగత్య పరిస్థితిలో స్త్రీ తమ ముఖ ముపై ఉండే ముసుగును తెరువ వచ్చనీ, ఉపద్రవాలు జనించే ఆస్కారమున్నపుడు తెరవ కూడదని ఏకీభవించారు. ఎవరయితే ముఖానికి “పర్ద” వర్తించదని అన్నారో వారు సయితం ఉపద్రవాలు జనించే భయమున్నపుడు “పర్ద” చేయాలని ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో భక్తులు, పుణ్యాత్ములు అరుదై ఎటు చూసినా సంక్షోభం వ్యాపించియుంది. నీచులు, దుర్మార్గులు అనేకమైపోయారు. ఈ సమయాల్లో “పర్ద” ప్రాముఖ్యత చాలా ఉంది.
అదే విధంగా కుటుంబమూ, దాని గౌరవ మర్యాదలూ, నీతినడవడికలూ బధ్రంగా ఉండుట కొరకు కూడా స్త్రీ పరుషుల విశృంఖలత (కలయిక)ను ఇస్లాం నిషేధిస్తుంది. ఉపద్రవముల, సంక్షోభముల ద్వారాలను మూసి వేయాలని ప్రోత్సహిస్తుంది. స్త్రీ బయటకు వెళ్ళుట, పురుషుల్లో కలసి విచ్చలవిడిగా తిరుగుట, ముఖముపై “పర్ద” లేకుండా ఉండుట వలన భావోద్రేకాలు ఉద్భవించును. పాపాల కారణాలు అతి సులువై, పాపము చేయుట మరీ సులభమగును. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః
{ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల మరియు వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్దతి}. (33: అహ్ జాబ్: 53).
ప్రవక్త స్త్రీ పురుషుల కలయికను చాలా కఠినంగా వారించారు. అంతేకాదు ఈ కలయికనూ ప్రార్థన సమయాల్లో, ఆ ప్రాంతాల్లో కూడా ఉండకూడదని తాకీదు చేశారు.
స్త్రీకి పురుషులున్న చోట పోవుట చాలా అవసరముండీ, తన ఈ అవసరానికి సహాయపడువారెవరూ లేనియడల లేక స్వయంగా తనకు లేదా తనబిడ్డలకు వారి పోషణ ఖర్చులు తెచ్చువారు లేనియడల, ఈ విధమైన మరేతర అవసరమునకై పోదలుచు కుంటే పోవచ్చు, కాని ధర్మశాస్త్ర హద్దుబాట్లను గుర్తుంచుకొని ఇస్లామీయ “యూనీఫాం”లో అనగా పూర్తి “పర్ద”తో తన అలంకరణ ప్రదేశాలను బహిర్గతం చేయకుండా పురుషుల కలయిక (ఇఖ్తిలాత్) నుంచి దూరముండి తన అవసరాలను తీర్చుకోవాలి.
నీతి గుణాల, కుటుంబముల సంరక్షణ కొరకు ఇస్లాం ఇచ్చిన మరో ఆదేశమేమనగా ఏ స్త్రీ కూడా పరపురుషులతో ఒంటరిగా ఉండకూడదు. అతని భర్త లేక అతని “మహ్రమ్” (వివాహ నిషిద్ధ బంధువు) లేకుండానే పరపరుషునితో ఒంటరిగా ఉండుటను ప్రవక్త చాలా గట్టిగా వారించారు. ఎందుకనగా షైతాన్ ఈ ఒంటరితనములో మనసులను చెడగొట్టి, అశ్లీల కార్యాలు చేయించే ప్రయత్నంలో ఉంటాడు.
“హైజ్”, “నిఫాసు”ల ధర్మములు
“హైజ్” (బహిష్టు) కాలము, దాని గడువుః
స్త్రీలకు ప్రతి నెలా జరిగే రక్తస్రావాన్ని హైజ్ అంటారు.
1- వయస్సు: ఎక్కువ శాతం 12 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సులో హైజ్ వస్తుంది. ఈ పరిస్థితి ఆరోగ్యము, వాతవరణము మరియు ప్రాంతాన్ని బట్టి ముందుగాని తరువాత గాని కావచ్చు.
2- కాలపరిమితి: కనీసం ఒక రోజు. గరిష్ఠ కాలపరిమితి 15 రోజులు.
గర్భిణి యొక్క బహిష్టుః సామాన్యంగా గర్భం నిలిచిన తరువాత రక్త స్రావముండదు. గర్భిణీ ప్రసవవేదనతో ప్రసవించడానికి రెండు మూడు రోజుల ముందు రక్తము చూసినచో అది “నిఫాస్” అగును. ఒకవేళ ప్రసవ వేదన లేనిచో అది “నిఫాస్” కాదు, బహిష్టు కాదు. ఇస్తిహాజా అగును. దీని ఆదేశాలు క్రింది పంక్తుల్లో వస్తున్నాయి.
అసాధారణ బహిష్టు
అసాధారణ బహిష్టు రకాలు
1- ఎక్కువ లేక తక్కువ. ఉదాః ఒక స్త్రీ యొక్క (బహిష్టు కాలం) సాధారణంగా ఆరు రోజులు. కాని ఒక సారి ఏడు రోజులు కావచ్చును. ఏడు రోజుల అలవాటుండి ఆరు రోజులకే పరిశుద్ధం కావచ్చు.
2- వెనక లేక ముందు. ఉదాః నెలారంభంలో అలవాటుండి నెలాఖరులో కావచ్చు. నెలాఖరులో అలవాటుండి నెలారంభంలోనే కావచ్చు. వెనక లేక ముందు అయినా, ఎక్కువ లేక తక్కువ రోజులు అయినా, ఎప్పుడు రక్తస్రావం అవుతూ చూసిందో అప్పుడే బహిష్టు, ఎప్పుడు ఆగి పోతుందో అప్పుడే పరిశుభ్రమయినట్లు.
3- బహిష్టు రోజుల మధ్యలో లేదా చివరిలో పరిశుభ్రతకు కొంచం ముందు పసుపు రంగు తీరు లేదా ఎరుపు రంగు కలసిన చీము తీరు రక్తము చూచినచో అది బహిష్టు రక్తస్రావమే అగును. బహిష్టు స్త్రీలకు వర్తించే ఆదేశము ఆ స్త్రీకి వర్తించును. ఒకవేళ పరిశుభ్రత పొందిన తరువాత అలా వస్తే అది బహిష్టు రక్తస్రావము కాదు.
4- ఒక రోజు రక్తస్రావముండడము మరో రోజు ఉండక పోవడం. ఇది రెండు రకాలుగా కావచ్చు.
అ- ఇది ఎల్లపుడూ ఉన్నచో “ముస్తహాజ” కావచ్చును. “ముస్తహాజా”లకు వర్తించే ఆదేశాలే ఆమెకు వర్తించును.
ఆ- ఎల్లపుడూ కాకుండా, ఎప్పుడయినా ఒకసారి జరిగి, ఆ తరువాత పరిశుభ్రం కావచ్చు. ఎవరికయినా రక్తస్రావం జరుగుతూ ఒక రోజుకన్నా తక్కువ సమయంలో ఆగిపోతే అది పరిశుద్ధత కాదు. పరిశుద్ధత ఒక రోజుకన్నా తక్కువ సమయంలో ఆగినందుకు కాదు. కాని ఇంతక ముందు జరిగిన దాన్ని బట్టి చివరి రోజుల్లో ఏ విధంగా ఆగిపోయిందో అది గుర్తుంచుకున్నా లేదా తెల్లటి ద్రవం వచ్చినా (తెల్ల బట్ట అయినా) ఆగిపోతుందన్న సూచనలు.
5- రక్తస్రావం మాత్రం కనబడడము లేదు కాని బహిష్టు రోజుల మధ్య లేక పరిశుద్ధమగుటకు కొంచెం ముందు తడిగా ఉన్నట్లు గ్రహించినచో అది బహిష్టు. ఒకవేళ పరిశుద్ధ అయిన తరువాత ఉంటే అది బహిష్టు కాదు.
బహిష్టు యొక్క ధర్మములు
1- నమాజ్: బహిష్టు స్త్రీ పై ఫర్జ్, సున్నత్, నఫిల్ అన్ని విధాల నమాజులు నిషిద్ధం. చేసినా అది నెవరవేరదు. కాని కనీసం ఒక రకాత్ చేయునంత సమయం దాని మొదట్లో లేక చివరిలో లభించినచో ఆ నమాజు తప్పక చేయవలెను. మొదటి దానికి ఉదాహరణః సూర్యాస్తమయం అయ్యాక మగ్రిబ్ యొక్క ఒక రకాత్ చేయునంత సమయం దాటాక బహిష్టు అయినచో, ఆమె పరిశుద్ధ అయిన తర్వాత ఆ మగ్రిబ్ నమాజు ‘ఖజా’ చేయ వలెను. ఎందు కనగా ఆ నమాజు యొక్క ఒక్క రకాతు చేయునంత సమయం పొందిన పిదపనే బహిష్టు అయింది. ఇక చివరి దానికి ఉదాహరణః సూర్యోదయానికి ముందు ఒక రకాత్ మాత్రమే చేయునంత సమయం ఉన్నపుడు పరిశుద్ధమయితే, (స్నానం చేశాక) ఆ ఫజ్ర్ నమాజ్ ‘ఖజా’ చేయాలి. ఎందుకనగా రక్తస్రావం ఆగిన తరువాత ఆమె ఒక్క రకాత్ చేయునంత సమయం పొందినది.
ఇక జిక్ర్, తక్బీర్, తస్బీహ్, అల్ హందులిల్లాహ్, తినుత్రాగినప్పుడు బిస్మిల్లాహ్ అనడం హదీసు మరియు ధర్మ విషయాలు చదవడం, దుఆ మరియు దుఆపై ఆమీన్ అనడం, ఖుర్ఆన్ పారాయణం వినడం, చూస్తూ నోటితో కాకుండా గ్రహించి చదవడం, తెరిచియున్న ఖుర్ఆనులో లేదా బ్లాక్ బోర్డ్ పై వ్రాసియున్న దాన్ని చూస్తూ మనస్సులో చదవడం నేరం కాదు. యోగ్యమే. ఏదైనా ముఖ్య అవసరం: టీచర్గా ఉన్నపుడు లేదా పరీక్ష సమయాల్లో చదవడం, చదివించడం తప్ప ఇతర సమయాల్లో నోటితో చదవకపోవడం మంచిది.
2- రోజా (ఉపవాసము): ఫర్జ్, నఫిల్ అన్ని విధాల రోజాలు నిషేధం. కాని ఫర్జ్ రోజాలు తరువాత ఖజా (పూర్తి) చేయాలి. రోజా స్థితిలో బహిష్టు అవుతే ఆ రోజా కాదు. అది సూర్యాస్తమయముకు కొన్ని నిమిషాల ముందైనా సరే. అది ఫర్జ్ రోజా అయి ఉంటే ఇతర రోజుల్లో పూర్తి చేయాలి. సూర్యాస్తమయమునకు కొద్ది క్షణాల ముందు రక్తస్రావం అయినట్లు అనిపించి, అలాకాకుండా సూర్యాస్తమయము తరువాతనే అయితే ఆ రోజా పూర్తయినట్లే. ఉషోదయం అయిన కొద్ది క్షణాల తరువాత పరిశుద్ధమయితే ఆ దినము యొక్క రోజా ఉండరాదు. అదే ఉషోదయానికి కొద్ది క్షణాలు ముందు అయితే రోజా ఉండాలి. స్నానం ఉషోదయం తరువాత చేసినా అభ్యంతరం లేదు.
3- కాబా యొక్క తవాఫ్ (ప్రదక్షిణం): అది నఫిలైనా, ఫర్జ్ అయినా అన్నీ నిషిద్ధం. హజ్ సమయంలో తవాఫ్ తప్ప ఇతర కార్యక్ర మాలుః సఫా మర్వా సఈ, అరఫాత్ మైదానంలో నిలవడం, ముజ్దలిఫా, మినాలో రాత్రులు గడపడం, జమ్రాతులపై రాళ్ళు రువ్వడం మొదలగునవన్నీ పూర్తి చేయాలి. ఇవి నిషిద్ధం కావు. పరిశుద్ధ స్థితిలో తవాఫ్ చేసిన వెంటనే లేక సఫా మర్వా సఈ మధ్యలో బహిష్టు ప్రారంభమయితే ఆ హజ్ లో ఏలాంటి లోపముండదు.
4- బహిష్టు స్త్రీ మస్జిదులో నిలువ కూడదు. అది నిషిద్ధం.
5- సంభోగం: భార్య రజస్సుగా ఉన్నపుడు భర్త ఆమెతో సంభోగించడం నిషిద్ధం. భర్త సంభోగాన్ని కోరుతూ వచ్చినా భార్య అంగీకరించడం కూడా నిషిద్ధం. పురుషుని కొరకు అతని భార్య ఈ స్థితిలో ఉన్నపుడు ఆమెతో సంభోగం తప్ప ముద్దులాట మరియు కౌగలించుకొనుట లాంటి విషయాలన్నీ అల్లాహ్ అనుమతించాడు.
6- విడాకులుః భార్య రజస్సుగా ఉన్నపుడు విడాకులివ్వడం నిషిద్ధం. ఆమె ఆ స్థితిలో ఉన్నపుడు విడాకులిచ్చినా అతడు అల్లాహ్, ఆయన ప్రవక్త యొక్క అవిధేయుడయి ఒక నిషిద్ధ కార్యాన్ని చేసినవాడవుతాడు. కనుక అతడు విడాకులను ఉపసంహరించుకొని ఆమె పరిశుద్ధురాలయిన తరువాత విడాకు లివ్వాలి. అప్పుడు కూడా ఇవ్వకుండా మరోసారి బహిష్టు తరువాత పరిశుద్ధురాలయ్యాక ఇష్టముంటే ఉంచుకొనడం లేకుంటే విడాకులివ్వడం మంచిది.
7- స్నానం చేయడం విధిగా ఉందిః పరిశుద్ధురాలయిన తరువాత సంపూ- ర్ణంగా తలంటు స్నానం చేయుట విధి. తల వెంట్రుకలు కట్టి (జెడ వేసి) ఉన్నచో వాటిలో నీళ్ళు చేరని భయమున్నచో అవి విప్పి అందులో నీళ్ళు చేర్పించవలెను. నమాజు సమయం దాటక ముందు పరిశుద్ధమయినచో ఆ సమయంలో ఆ నమాజును పొందుటకు స్నానం చేయడంలో తొందర పడుట కూడా విధిగా ఉంది. ప్రయాణంలో ఉండి నీళ్ళు లేనిచో, లేదా దాని ఉపయోగములో ఏ విధమైనా హాని కలిగే భయమున్నచో, లేక అనారోగ్యం వల్ల హాని కలిగే భయమున్నచో స్నానానికి బదులుగా “తయమ్ముం”([1]) చేయవలెను. తరువాత నీళ్ళు లభించిన లేక ఏ కారణమయితే అడ్డగించిందో అది తొలిగిపోయిన తరువాత స్నానం చేయవలెను.
“ఇస్తిహాజ”, దాని ఆదేశాలు
ఎప్పుడూ ఆగకుండా, ఆగినా నెలలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఆగి ప్రతి రోజు అవుతూ ఉండే రక్తస్రావమును “ఇస్తిహాజ” అంటారు. కొందరు 15 రోజులకంటే అధికంగా వస్తే అది “ఇస్తిహాజ” అని అన్నారు.
ముస్తహాజ యొక్క మూడు స్థితులుః
(ఇస్తిహాజలో ఉన్న స్త్రీని ముస్తహాజ అంటారు).
1- ఇస్తిహాజకు ముందు బహిష్టు యొక్క కాలపరిమితి ఎన్ని రోజు లనేది గుర్తుండవచ్చు. ఆ మొదటి కాలపరిమితి ప్రకారం అన్ని రోజులు బహిష్టు రోజులని లెక్కించాలి. అప్పుడు బహిష్టు ఆదేశాలే ఆమెకు వర్తించును. మిగితా రోజులు ఇస్తిహాజ రోజులుగా లెక్కించాలి. అప్పుడు ఆమె ముస్తహాజ స్త్రీలకు సంబంధించిన ఆదేశాలను పాటించాలి. దీని యొక్క ఉదాహరణః ఒక స్త్రీకి ప్రతి నెలారంభంలో ఆరు రోజులు బహిష్టు వచ్చేది. కాని ఒకసారి ఆ కాలం దాటినప్పటికీ ఆగలేదు. అలాంటపుడు ఆ నెల మొదటి ఆరు రోజులు బహిష్టు రోజులుగానూ ఆ తరువాతవి ఇస్తిహాజ రోజులుగానూ లెక్కించ వలెను. ఆరు రోజుల తరువాత స్నానం చేసి నమాజు కూడా చేయాలి. అప్పుడు రక్తస్రావం జరుగుతూ ఉన్నా పరవాలేదు.
2- మొదటిసారి బహిష్టు అయి, ఆగకుండా ఇస్తిహాజ జరుగుతూ ఉంటే బహిష్టు రోజుల గడువు తెలిసే వీలు లేకుంటే అలాంటప్పుడు బహిష్టు రక్తము మరియు ఇస్తిహాజ రక్తములో భేదమును తెలుసుకోవాలి. బహిష్టు రక్తము ఎక్కువ ఎర్రగా ఉంటుంది కాబట్టి నలుపుగా లేక దుర్వాసనగా లేక చిక్కగా ఏర్పడును. ఈ మూడిట్లో ఏ ఒక్క విధంగానున్నా అప్పుడు బహిష్టు ఆదేశాల్ని పాటించాలి. ఎప్పుడయితే ఇవి మారునో అప్పటి నుండి ఇస్తిహాజ ఆదేశాలు పాటించాలి. దాని ఉదాహరణః ఒక స్త్రీకి రక్త స్రావం ప్రారంభమయి ఆగడము లేదు. అలాంటపుడు తేడా/వ్యత్యాసం ఉందా లేదా గమనించవలెను. ఉదాహరణః పది రోజులు నలుపుగా తరువాత ఎరుపుగా లేక పది రోజులు చిక్కగా తరువాత పలుచగా లేక పది రోజులు బహిష్టు వాసన తరువాత ఎలాంటి వాసన లేదు. అలాంటపుడు మొదటి (అండర్ లైన్లోని) మూడు గుణాలుంటే ఆమె బహిష్టురాళు. ఆ మూడు గుణాలు లేకుంటే ఆమె ముస్తహాజ.
3- రక్త స్రావం ప్రారంభమైనప్పటి నుంచే ఆగకుండా ఉంది. బహిష్టు గడువు తెలియదు. అంతే గాకుండా ఒకే విధంగా ఉండి భేదము కూడా ఏర్పడడము లేదు, లేక అది బహిష్టు అన్న ఖచ్చితమైన నిర్ణయానికి రాకుండా సందిగ్ధంలో పడవేసే విషయాలున్నప్పుడు తన దగ్గరి బంధుత్వంలో ఉన్న స్త్రీల అలవాటు ప్రకారం మొదటి నుంచే ఆరు లేక ఏడు రోజులు బహిష్టు రోజులుగా లెక్కించి, మిగిలనవి ఇస్తిహాజగా లెక్కించవలెను.
ఇస్తిహాజ ధర్మములు
ముస్తహాజ మరియు పరిశుద్ధ స్త్రీలో ఈ చిన్న భేదము తప్ప మరేమి లేదు.
1- ముస్తహాజా ప్రతి నమాజుకు వుజూ చేయాలి.
2- వుజూ చేసే ముందు రక్త మరకలను కడిగి రహస్యాంగాన్ని దూదితో గట్టిగా బంధించాలి.
నిఫాసు, దాని ధర్మములు
ప్రసవ కారణంగా గర్భ కోశము నుంచి స్రవించు రక్తాన్ని నిఫాసు అంటారు. అది ప్రసవముతోనైనా, లేక తరువాత ప్రారంభమైనా, లేక ప్రసవావస్థతో ప్రసవానికి రెండు మూడు రోజుల ముందైనా సరే. అలాంటి స్త్రీ రక్తస్రావం ఆగిపోయినప్పుడే పరిశుద్ధమగును. (కొందరు స్త్రీలు నలబై రోజులకు ముందే రక్తస్రావం నిలిచినప్పటికీ స్నానం చేసి పరిశుద్ధులు కారు. నమాజు ఇతర ప్రార్థనలు చేయరు. నలబై రోజుల వరకు వేచిస్తారు. ఇది తప్పు. ఎప్పుడు పరిశుద్ధురాలయినదో అప్పటి నుండే నమాజులు…… మొదలెట్టాలి). రక్తస్రావం నిలువకుండా నలబై రోజులకు పైగా ఉంటే, నలబై రోజుల తరువాత స్నానం చేయవలెను. “నిఫాసు” కాల పరిమితి నలబై రోజులకంటే ఎక్కువ ఉండదు. నలబై రోజులకు ఎక్కువ అయితే అది బహిష్టు కావచ్చును. (లేదా ఇస్తిహాజా కావచ్చు). ఒకవేళ బహిష్టు అయితే, ఆ నిర్ణిత రోజులు ముగిసి పరిశుద్ధమయిన తరువాత స్నానం చేయవలెను.
పిండము మానవ రూపము దాల్చిన తరువాత జన్మిస్తెనే “నిఫాసు” అనబడును. మానవ రూపం దాల్చక ముందే గర్భము పడిపోయి రక్తస్రావం జరిగితే అది నిఫాసు కాదు. అది ఒక నరము నుంచి స్రవించు రక్తము మాత్రమే. అప్పుడు ముస్తహాజకు వర్తించే ఆదేశమే ఆమెకు వర్తించును. మానవ రూపము ఏర్పడుటకు కనీస కాలం గర్భము నిలిచినప్పటి నుండి ఎనభై (80) రోజులు. గరిష్ఠ కాలం తొంబై (90) రోజులు అవుతుంది.
నిఫాసు ధర్మములు కూడా బహిష్టు గురించి తెలిపిన ధర్మములే.
బహిష్టు మరియు కాన్పులను ఆపడం
స్త్రీ బహిష్టు కాకుండా ఏదయినా ఉపయోగించదలుచుకుంటే ఈ రెండు షరతులతో ఉపయోగించవచ్చును.
1- ఏలాంటి నష్ట భయముండకూడదు. నష్ట భయమున్నచో అది ధర్మసమ్మతం కాదు.
2- భార్య తన భర్త అనుమతితో ఉపయోగించాలి.
బహిష్టు కావడానికి ఏదయినా ఉపయోగించ దలుచుకంటే ఈ రెండు షరతులతో ఉపయోగించవచ్చును.
1- భర్త అనుమతితో ఉపయోగించాలి.
2- నమాజు, రోజా లాంటి విధిగా ఉన్న ఆరాధనలు పాటించని ఉద్దేశంగా ఉపయోగించకూడదు.
గర్భం నిలువకుండా (కుటుంబ నియంత్రణ కొరకు) ఏదైనా ఉపయోగించదలుచుకుంటే ఈ రెండు షరతులను పాటించాలి.
1- కుటుంబ నియంత్రణ ఉద్దేశంగా చేయుట యోగ్యం లేదు.
2- ఒక నిర్ణీత కాలపరిమితి వరకు అనగా గర్భము వెంటనే గర్భము నిలిచి స్త్రీ ఆరోగ్యానికి హాని కలిగే భయముంటె మాత్రమే. అది కూడా భర్త అనుమతితో. ఇంకా దీని వల్ల ఆమె ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే భయం ఉంటే కూడా చేయించకూడదు.
[1]1) దాని విధానం ఇదిః ఒక సారి రెండు చేతులు భూమిపై కొట్టి ముఖముపై ఒకసారి మరియు మణికట్ల వరకు చేతులపై ఒకసారి తుడుచుకోవాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఇస్లామీయ సంస్కారాలు – ఆదేశాలు (Adaab in Islam) అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia) అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
విషయ సూచిక: – ఇఖ్లాస్ – షిర్క్ భయంకరం మరియు తౌహీద్ ఘనత – రియా (ప్రదర్శనా బుద్ధి) చిన్న షిర్క్ – దుఆ – విద్య – మంచిని భోధించడం – చెడును ఖండించడం – మంచిని ఆజ్ఞాపించే, చెడును ఖండించే పద్ధతులు – తల్లిదండ్రుల సేవ – సద్వర్తన – సౌమ్యం, మృదు వైఖరి – కరుణ
– జుల్మ్ (అన్యాయం,దౌర్జన్యం) నిషిద్దం – ముస్లింను వధించడం నిషిద్దం – ముస్లిం పై మరొక ముస్లిం హక్కులు – ఇరుగు పొరుగు వారి హక్కులు – నాలుక భయంకరాలు – పరోక్షనింద నిషిద్దం – సత్యం ఘనత, అసత్యం నుండి హెచ్చరిక – తౌబా (పశ్చాత్తాపం) – తౌబా నియమాలు – సలాం – భోజనం చేయు పద్ధతులు – మలమూత్ర విసర్జన పద్ధతులు – తుమ్ము, ఆవలింపు – కుక్కను పెంచడం – అల్లాహ్ యెక్క జిక్ర్ (స్మరణ)
కొన్ని దుఆలు : – పడుకొనే ముందు – నిద్ర నుండి మేల్కొని – వాహనం ఎక్కినపుడు – గమ్యస్థానం చేరుకున్నప్పుడు – ఉజూకు ముందు – ఉజూ తర్వాత – ఇంటి నుండి వెళ్ళినప్పుడు – ఇంట్లో ప్రవేశించినప్పుడు – ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) పై దరూద్ – ఉదయం – సాయంకాలం – స్నేహం – ఓపిక, సహనం
[పూర్తి పుస్తకం క్రింద చదవండి]
1. ఇఖ్లాస్
అల్లాహ్ ఆదేశాలుః
{వారు అల్లాహ్ కు దాస్యం చెయ్యాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని మాత్రమే ఆదేశించటం జరిగింది}. (బయ్యినహ్ 98: 5).
{నేను మాత్రం నా ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకించి, ఆయనకు మాత్రమే దాస్యం చేస్తాను అని చెప్పండి}. (జుమర్ 39: 14).
{ప్రవక్తా! ప్రజలను ఇలా హెచ్చరించుః మీ మనస్సులలో ఉన్నదంతా మీరు దాచినా లేక బహిర్గతం చేసినా అల్లాహ్ కు తెలుసు}. (ఆలె ఇమ్రాన్ 3: 29).
{భూమ్యాకాశాలలో ఏ వస్తువూ అల్లాహ్ కు గోప్యంగా లేదు}. (ఆలె ఇమ్రాన్ 3: 5).
“కర్మలు మనో సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. ఎవరు ఏ సంకల్పం చేస్తారో వారికి అదే ప్రాప్తమవుతుంది”. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. (బుఖారి 1, ముస్లిం 1907).
“ఎక్కడ ఉన్నా అల్లాహ్ తో భయపడు. పాపము జరిగిన వెంటనే పుణ్యము చెయ్యి. అందువలన పాపము తుడ్చుక పోవును. ప్రజల ఎడల సద్వర్తనతో మెలుగు”. అబూ జర్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. (తిర్మిజి 1987).
విశేషాలుః
1- సత్కార్యాల అంగీకరణకు చిత్తశుద్ధి వైఖరి, సంకల్పశుద్ధి చాలా ముఖ్యము. పుణ్యఫలితాల రెట్టింపు కూడా దానిపై ఆధారపడి ఉంది.
2- అల్లాహ్ షిర్క్ కు చాలా అతీతుడు. ఆయన ప్రసన్నత పొందడానికి మాత్రం చేయబడిన సత్కార్యాన్ని తప్ప దేనినీ అంగీకరించడు. ఒక హదీసులో అల్లాహ్ ఇలా చెప్పినట్లు ప్రవక్త e తెలిపారుః
“ఇతర సహవర్తులకంటే అధికంగా నేనే షిర్క్ కు అతీతుణ్ణి, ఎవరైనా ఒక పని చేసి, అందులో నాతో ఇతరుల్ని సాటి కల్పుతాడో నేను అతడ్ని, అతని షిర్క్ ను స్వీకరించను”. అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం. (ముస్లిం 2985).
3- భూమ్యాకాశాల్లో ఏ వస్తువూ అల్లాహ్ కు మరుగు లేదు గనక ఎల్లప్పుడూ ఆయనతో భయపడాలి. ప్రతీ క్షణం ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు.
2. షిర్క్ భయంకరము మరియు తౌహీద్ ఘనత
అల్లాహ్ ఆదేశాలుః
{ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం పరమదుర్మార్గం}. (లుఖ్మాన్ 31: 13).
{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారికొరకు క్షమిస్తాడు}. (నిసా 4: 48).
{నీ వద్దకూ, నీకు పూర్వం గతించిన ప్రవక్తల వద్దకూ ఇలా వహీ పంపబడింది. “ఒకవేళ మీరు షిర్కు (బహుదైవారాధన) చేస్తే, మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి; మీరు నష్టానికి గురి అవుతారు.”}. (జుమర్ 39: 65).
{నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను}. (జారియాత్ 51: 56).
{మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాముః “అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యాదైవాల ఆరాధనకు దూరంగా ఉండండి”}. (నహ్ల్ 16: 36).
“ఏ వ్యక్తి అల్లాహ్ కు సహవర్తులు కల్పించకుండా అల్లాహ్ ను కలుసు కుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఏ వ్యక్తి అల్లాహ్ కు సహవర్తులు కల్పించి కలుసుకుంటాడో అతడు అగ్నిలో ప్రవేశిస్తాడు”. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ ఉల్లేఖనం. (ముస్లిం 93).
“వినాశనానికి గురి చేసే ఏడు విషయాల నుండి దూరముండండి” అని ప్రవక్త బోధించగా, అవేమిటి? ప్రవక్తా అని సహచరులు అడగగా, “అల్లాహ్ తో సాటి కల్పించడం” అని ప్రవక్త బదులిచ్చారు. అబూ హురైర ఉల్లేఖనం. (బుఖారి 2767, ముస్లిం 89).
ముఆజ్ బిన్ జబల్ ఉల్లేఖనం ప్రకారం, నేను ప్రవక్త వెనక గాడిదపై కూర్చోని ఉన్నాను. దాన్ని ఉఫైర్ అని అనేవారు. ఒకసారి ఆయన “ఓ మఆజ్! అల్లాహ్ కు దాసులపై ఉన్న హక్కు ఏమిటో మరియు అల్లాహ్ ను ఆరాధించే దాసులకు అల్లాహ్ పై ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా? అని అడిగారు. ‘అల్లాహ్ కు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అని నేను బదులిచ్చాను. దానికి ప్రవక్త మహానీయులు ఇలా సెలవిచ్చారుః “అల్లాహ్ కు దాసులపై ఉన్న హక్కు ఏమిటంటే; వారు ఆయన్నే ఆరాధించాలి. ఈ ఆరాధనలో ఆయనకు మరెవ్వరినీ భాగస్వామిగా నిలబెట్టవద్దు. మరియు దాసులకు అల్లాహ్ పై ఉన్న హక్కు ఏమిటంటే ఆయన వారిని శిక్షించకుండా ఉండాలి. (ముస్లిం 30, బుఖారి 2856).
విశేషాలుః
1- షిర్క్ చాలా ఘోరమైన పాపం. తౌబా చేయనిదే ఇతర పాపాల తీరు అల్లాహ్ తనిష్టముతో క్షమించడు. తప్పనిసరిగా తౌబా చేయాలి.
2- షిర్క్ పై చనిపోయినవాని సత్కార్యాలు వ్యర్థమగును. మరియు అతడు శాశ్వతంగా నరకములో ఉండుటకు అది కారణమగును.
3- తౌహీద్ ఘనత ఎలా ఉంది చూడండి, అల్లాహ్ జిన్నాతులను, మానవులను దాని కొరకే పుట్టించాడు. మరియు నరకము నుండి రక్షింపబడి స్వర్గములో ప్రవేశించడానికి అది గొప్ప కారణము.
3. రియా (ప్రదర్శనాబుద్ధి) చిన్న షిర్క్
అల్లాహ్ ఆదేశం:
{తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహించేవారు, ప్రదర్శనా బుద్ధితో వ్యవహరించేవారు, వాడుకునే మామూలు వస్తువులను (ప్రజలకు) ఇవ్వటానికి వెనుకాడేవారు సర్వనాశనమవుతారు}. (మాఊన్ 107: 4-7).
“ఏలాంటి సందేహము లేనట్టి తీర్పు దినాన అల్లాహ్ పూర్వీకులను, వెనకటి వారిని సమూహ పరిచినప్పుడు, ఒక చాటింపు చేయువాడు ఇలా చాటింపు చేస్తాడుః ఎవడు తను చేసిన సత్కార్యములలో అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించాడో, అతడు పుణ్యఫలితాన్ని వారితోనే పొందాలి. అల్లాహ్ ఇతర సహవర్తులకంటే అధికంగా షిర్క్ కు అతీతుడు”. అబూ సఅద్ బిన్ ఫజాల అన్సారి ఉల్లేఖనం. (తిర్మిజి 3154, ఇబ్ను మాజ 4203).
“మేము మసీహుద్దజ్జాల్ విషయము చర్చించుకోగా ప్రవక్త ﷺ వచ్చి, మసీహుద్దజ్జాల్ కంటే భయంకరమైన విషయము తెలుపనా?” అని ప్రశ్నిస్తే, తప్పక తెలుపండని మేము విన్నవించుకోగా, “గుప్తమైన షిర్క్” అదేమనగాః ఒక వ్యక్తి నమాజు చేయుటకు నిలబడతాడు, అయితే చూసేవారు మెచ్చుకోవాలని అలంకరిస్తూ నమాజు చేస్తాడు. (అలా స్తుతించబడటానికి, చూచినవారు మెచ్చుకోవాలనే ఉద్దేశముతో నమాజు చేయడం గుప్తమైన షిర్క్) అని ప్రవక్త ﷺ విశదపరిచారు. అబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖనం. (ఇబ్ను మాజ 4204).
విశేషాలుః
1- ప్రదర్శనాబుద్ధి చాలా భయంకరమైనది, దాని గురించి చాలా కఠినంగా హెచ్చరించబడింది. ఈ దుర్గుణముగలవారికి కఠిన శిక్ష ఉంది.
2- ఒక వ్యక్తి ప్రదర్శనాబుధ్ధికి గురి అవుతాడు కాని అది అతనికి తెలియకపోవచ్చు.
3- ప్రదర్శనాబుధ్ధితో కూడిన పనులు అంగీకరింపబడవు, రద్దు చేయబడతాయి.
4. దుఆ
అల్లాహ్ ఆదేశాలుః
{నీ ప్రభువు ఇలా అంటున్నాడుః “నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను”}. (మోమిన్ 40: 60).
{నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అనీ ఓ ప్రవక్తా నీవు వారికి తెలుపు}. (బఖర 2: 186).
“ఎవరైనా ముస్లిం ఏదైనా దుఆ చేసినప్పుడు అల్లాహ్ అతనికి దానికి బదులుగా మూడిట్లో ఏదైనా ఒకటి ప్రసాదిస్తాడు. – కాని పాపం మరియు బంధుత్వ తెగతెంపులు కోరవద్దు -. 1. దుఆలో కోరుకున్నది వెంటనే లభించవచ్చు. లేదా 2. ప్రళయం వరకు దాన్ని అతని కొరకు భద్రపరుస్తాడు. లేదా 3. దానికి తగిన పరిమాణంలో అతనిపై ఉన్న ఏదైనా ఆపదను దూరం చేస్తాడు”. అప్పుడు సహచరులన్నారుః అలాంటప్పుడు మేము దుఆ అధికంగా చేస్తాము అని, దానికి బదులుగా ప్రవక్త ﷺ చెప్పారుః “అల్లాహ్ కూడా అధికంగా ప్రసాదించేవాడున్నాడు” అని. (అహ్మద్ 3/18).
“ముస్లిం వ్యక్తి యొక్క దుఆ తన దూరమున్న సోదరుని పట్ల అంగీకరింప బడును. అప్పుడు అతని తలకడన ఒక దైవదూత ఉంటాడు, ఆ వ్యక్తి తన సోదరుని కొరకు దుఆ చేసినపుడల్లా ఆ దూత ఆమీన్ అంటూ నీకు కూడా ఈ మేలు కలుగుగాకా అని దీవిస్తాడు”. అబుద్దర్దా ఉల్లేఖనం. (ముస్లిం 2733).
విశేషాలుః
1- దుఆ ఆరాధన. కాబట్టి అల్లాహ్ దప్ప ఇతరులతో దుఆ చేయరాదు. అల్లాహ్ తో వేడుకునేవాటిని ఇతరులతో వేడుకునేవాడు షిర్క్ చేసినవాడవుతాడు. దుఆ స్థానం చాలా గొప్పదన్న విషయం తెలుసుకో! ఎలా అనగా ప్రవక్త దాన్ని ఆరాధన అని అన్నారు. అనగా ఆరాధన యొక్క గొప్ప అంశము.
2- దుఆ శబ్దముతో గాకుండా మెల్లగా చేయడం మంచిది. తక్కువ పదములో ఎక్కువ భావం గల దుఆ చేయుట చాలా మంచిది.
3- ఏ మనిషి కూడా తనకు తాను, తన సంపద మరియు సంతానాన్ని శపించవద్దు.
4- ముస్లిం సోదరుల గురించి వారి వెనక దుఆ చెయ్యడం పుణ్యకార్యం.
5- కోరినది లభించడమే దుఆ అంగీకరించబడినట్లు కాదు. అతనికి ఎదురయ్యే కీడు ఆ దుఆ ద్వారా దూరము కావచ్చు. లేదా పరలోక దినము వరకు భద్రపరచి ఆ దుఆకన్నా ఎక్కువ ప్రయోజనకరమైన ఫలితము లభించవచ్చును.
6- నిషిద్ధ సంపాదన యొక్క తిండి మరియు వస్త్రములు ధరించడము దుఆ అంగీకారాణికి ఆటంకముగా ఉండును.
5. విద్య
అల్లాహ్ ఆదేశాలుః
{వీరిని అడుగు, తెలిసిన వారూ, తెలియని వారూ ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా?}. (జుమర్ 39: 9).
{మీలో విశ్వసించినవారికి, జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు}. (ముజాదల 58: 11).
{ఇలా ప్రార్థించు, “ఓ ప్రభువా! నాకు మరింత జ్ఞానం ప్రసాదించు”}. (తాహా 20: 11).
{అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు}. (ఫాతిర్ 35: 28).
“విద్య నేర్పించువారికి, దానిపై ఆచరించేవారంత పుణ్యం లభించును. అయితే ఆచరించేవారి పుణ్యాల్లో ఏ మాత్రం కొరత జరగదు”. ముఆజ్ బిన్ అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (ఇబ్నుమాజ 240).
“మనిషి చనిపోయినప్పుడు అతని ఆచరణ అంతమయిపోతుంది. అయితే మూడు రకాల ఆచరణలు మటుకు అంతం కావు. వాటి పుణ్యఫలం మనిషి చనిపోయిన తరువాత కూడా అతనికి లభిస్తునే ఉంటుంది. ఒకటిః సదఖయే జారియా. రెండుః ప్రజలకు ఉపయోగపడుతున్న జ్ఞానం. మూడుః అతని కోసం దుఆ చేసే ఉత్తమ సంతానం”. అబూ హురైర ఉల్లేఖనం. (ముస్లిం 1631).
“అల్లాహ్ సాక్షిగా! నీ మార్గదర్శముతో ఒక వ్యక్తైనా రుజుమార్గాన్ని పొందినచో అది నీకు ఎర్ర ఒంటెలకన్నా చాలా ఉత్తమమం”. సహల్ బిన్ సఅద్ ఉల్లేఖనం. (బుఖారి 3701, ముస్లిం 2406).
“నా ఏ ఒక విషయం మీకు తెలిసినా అది ఇతరులకు బోధించండి”. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ ఉల్లేఖనం. (బుఖారి 3461).
విశేషాలుః
పై ఆయతుల మరియు హదీసుల్లో ఈ క్రింది విషయాలు తెలుస్తున్నవి.
1- విద్య మరియు విద్వాంసుల ఘనత. ధర్మజ్ఞానం లభించడం అల్లాహ్ మేలు కోరాడని భావం. ధర్మ జ్ఞానము నేర్చుకొనుట స్వర్గ ప్రవేశానికొక మార్గం.
2- విద్య నేర్పడం, మంచిని బోధించడం మరియు విద్యను వ్యాపింపజేయడం అది కొంచమైనా, అందులో చాలా పుణ్యముంది. మరియు చనిపోయిన తరువాత కూడా పుణ్యం లభిస్తూ ఉంటుంది.
3- ధర్మ విద్య నేర్చుకొనుట నఫిల్ (అధిక) ప్రార్థనలకన్నా గొప్పది.
4- సంతానము నైతికంగా మంచివారగుటకు ధార్మిక శిక్షణ ఇవ్వాలి.
6. మంచిని బోధించడం – చెడును ఖండించడం
అల్లాహ్ ఆదేశాలుః
{మీరు సర్వమతస్థులకన్న శ్రేష్ఠులు. మీరు ప్రజల మేలు కొరకు ఏర్పడితిరి. మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు. అల్లాహ్ ను విశ్వసిస్తారు}. (ఆలె ఇమ్రాన్ 3 : 110).
{మీలో మంచి వైపునకు పిలిచేవారూ, మేలు చెయ్యండి అని ఆజ్ఞాపించేవారూ, చెడు నుండి వారించేవారూ కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు}. (ఆలె ఇమ్రాన్ 3: 104).
“మీలోనెవరైనా చెడు చూసినచో చేతి శక్తితో దాని రూపు మార్పాలి. ఆ శక్తి లేనిచో హితబోధ చేసి ఆపాలి. ఆ శక్తి కూడా లేనిచో మనుసులో చెడు భావించి దూరముండాలి. ఇది విశ్వాసము యొక్క చివరి మెట్టు”. అబూ సఈద్ ఖుద్రీ ఉల్లేఖనం. (ముస్లిం 49).
“ఎవరి ఆధీనములో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. మీరు తప్పనిసరిగా మంచిని ఆజ్ఞాపిస్తూ, చెడును ఖండిస్తూ ఉండాలి. అలా చేయక పోయినట్లయితే త్వరలో అల్లాహ్ మీపైకి భయంకరమైన శిక్షను పంపిస్తాడు. అప్పుడు మీరు అతన్ని వేడుకుంటే మీ వేడుకోలు అంగీకరింపబడవు”. హూజైఫా ఉల్లేఖనం. (తిర్మిజి 2169).
“ఎవరు అత్యచారున్ని చూస్తూ ఉండి, అతని చేతుల్ని స్వాధీనం చేయకున్నట్లయితే (అతన్ని అత్యాచారం నుండి ఆపకున్నట్లయితే) సమీపంలోనే అల్లాహ్ వారందరిపై తన వైపు నుండి విపత్తును కురియ జేస్తాడు”. అబూ బక్ర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (తిర్మిజి 2168).
2- చెడును చూచినవారు, తమ శక్తి ప్రకారం దాని రూపు మాపడం తప్పనిసరి.
3- చేయి ద్వారా చెడును నిర్మూలించుట దాని శక్తి గలవారికే సాధ్యం. ఉదాః తండ్రి లేదా (నగర, రాష్ట్ర, దేశ, విద్యాలయ తదితర) అధికారులు లాంటి వారు.
4- చెడును మనసులో అసహ్యించుకొనడమనగా దాని నుండి దూరముండుట.
5- మంచిని ఆజ్ఞాపించటం, చెడును నివారించటం మానుకొనుట, దుఆల అనంగీకారానికి మరియు అల్లాహ్ వైపున విపత్తుకు కారణమవుతుంది.
7. మంచిని బోధించే, చెడును ఖండించే పద్ధతులు
అల్లాహ్ ఆదేశాలుః
{నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో చక్కని హితబోధతో. ప్రజలతో ఉత్తమోత్తమైన రీతిలో వాదించు}. (నహ్ల్ 16: 125).
{(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవయ్యావు. నీవే గనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు}. (ఆలె ఇమ్రాన్ 3: 159).
“మృదు వైఖరి గుణం లేనివాడు సర్వ మేళ్ళను, శుభాలను కోల్పోయినట్లే”. ఉల్లేఖనం: జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 2592).
విశేషాలుః
1- ఇస్లాం ప్రచారం, మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడును నివారించడంలో మృదువైఖరి, వివేకమును పాటించాలని ప్రోత్సహించబడింది.
2- సర్వ కార్యాల్లో మృదువైఖరి అవలంబించాలని ప్రోత్సహించడబడింది, ఎందుకంటే అది నోచుకోనివాడు సర్వ మేళ్ళను కోల్పోయినట్లే.
8. తల్లిదండ్రుల సేవ
అల్లాహ్ ఆదేశాలుః
{తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగమని మేము మానవునికి ఉపదేశించాము}. (అన్ కబూత్ 29: 8).
{నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు. మీరు కేవలం ఆయన్నుతప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి. ఒకవేళ మీవద్ద వారిలో ఒకరు గాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారిముందు విసుగ్గా ‘ఛీ’ అని కూడా అనకండి. వారిని కసరుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి}. (17: 23).
{మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచి పెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (అందుకే మేము అతనికి ఇలా బోధించాము) “నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు}. (లుఖ్మాన్, 31:14).
అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా ప్రశ్నించానుః ‘అల్లాహ్ కు అన్నిటికంటే ఎక్కువ ప్రియమైన ఆచరణ ఏది?’ అని. “నమాజు దాని సమయంలో చేయడం” అని ఆయన సమాధానమిచ్చారు. ‘ఆ తరువాత ఆచరణ ఏది’ అని అడిగాను. “తల్లిదండ్రుల పట్ల సద్వర్తనతో మెలగడం” అని చెప్పారు. ‘ఆ తరువాత ఏది’ అని నేను మళ్ళీ ప్రశ్నించాను. “అల్లాహ్ మార్గంలో పోరాడడం” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. (బుఖారి 527, ముస్లిం 85).
అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, ‘ప్రవక్తా! నా సేవ, సద్వర్తనలకు అందరికంటే ఎక్కువ హక్కుగలవారెవరు?’ అని అడిగాడు. “నీ తల్లి” అని చెప్పారు ప్రవక్త ﷺ. ‘ఆ తరువాత ఎవరూ?’ అంటే “నీ తల్లి” అనే చెప్పారు ప్రవక్త ﷺ. తిరిగి అతను ‘ఆ తరువాత ఎవరూ?’ అని అడిగాడు. “నీ తల్లి” అనే జవాబిచ్చారు ప్రవక్త ﷺ. ‘ఆ తరువాత ఎవరూ’ అని మళ్ళీ అడిగాడతను. దానికి ప్రవక్త ﷺ చెప్పారుః “నీ తండ్రి” అని. (బుఖారి 5971, ముస్లిం 2548).
విశేషాలుః
1- తల్లిదండ్రుల పట్ల గౌరవ మర్యాదలు చూపాలని, వారికి విధేయులయి ఉండాలని మరియు వారితో ఎల్లప్పుడూ సద్వర్తనతో మెలుగుతూ, ఉపకారం చేస్తూ ఉండే కాంక్ష ఉంచాలని ఇస్లాం ఆదేశిస్తుంది.
2- నియమిత కాలములో నమాజు తరువాత, తల్లిదండ్రుల సేవయే అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ఆచరణ.
3- వారి అవిధేయత, వారితో కఠోరంగా, కర్కశంగా మాట్లాడుట మరియు వారిని ఊఁ లేక ఛీ అని అనుట నుండి కఠినంగా హెచ్చరించబడింది.
4- తల్లి పట్ల ఉపకారం, విధేయత హక్కు తండ్రి కన్నా ఎక్కువ ఉందని తెలుపబడింది.
ప్రజల స్వర్గ ప్రవేశానికి ఏ ఆచరణలు అధికంగా కారణమవుతాయి? అని వచ్చిన ప్రశ్నకు ప్రవక్త ﷺ ఇలా సమాధానమిచ్చారుః “అల్లాహ్ భయబీతి (తఖ్వా) మరియు సద్వర్తన”. ఉల్లేఖనం: అబూ హురైర ÷. (తిర్మిజిః 2004).
“సద్వర్తనగల విశ్వాసులే వారిలో సంపూర్ణ విశ్వాసం గలవారు. తమ ఇల్లాలి పట్ల సద్వర్తనతో మెలిగేవారే మీలో చాలా మంచివారు”. ఉల్లేఖనం: అబూ హురైర÷ . (తిర్మిజి 1162).
“నైతిక గుణాల వల్ల ఒక విశ్వాసునికి ఉపవాసమున్న వాని మరియు రాత్రి వేళ తహజ్జుద్ నమాజ్ సలుపు వారంత స్థానం లభిస్తుంది”. ఉల్లేఖనం: ఆయిష రజియల్లాహు అన్హా. (అబూ దావూద్ 4798).
విశేషాలుః
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతి ఉత్తమ గుణముగలవారని తెలిసింది.
2- సద్వర్తన ఘనత, దాని స్థానం తెలిసింది. స్వర్గ ప్రవేశానికి, ఉన్నత స్థానానికి ఏ సత్కార్యాలు అధికంగా కారణమవుతాయో అందులో ఒకటి సద్వర్తన. ప్రళయదినాన కర్మలు తూకం చేయబడతాయి. ఒక ముస్లిం త్రాసులో అతి భారముగల క్రియ అల్లాహ్ భీతి, మరియు సద్వర్తన ఉంటాయి.
3- మంచి మాట మాట్లాడాలని, మంచి పనులే చేయాలని ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
4- సద్భావంతో జీవితం గడుపుకునే భార్యభర్తల ప్రాముఖ్యత.
5- సత్కార్యాలతో విశ్వాసం పెరుగుతుంది. దుష్కార్యాలతో విశ్వాసం తరుగుతుంది.
10. సౌమ్యం, మృదువైఖరి
అల్లాహ్ ఆదేశం:
{(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు}. (ఆలె ఇమ్రాన్, 3:159).
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్ ఖైస్ తెగ ప్రతినిధి వర్గనాయకుడైన అషజ్జ్ ను సంబోధించి ఇలా అన్నారుః “నీలో రెండు సద్గుణాలున్నాయి. అవి అల్లాహ్ కు ఎంతో ఇష్టమయినవి. అవిః సహనం, సౌమ్యం”. ఉల్లేఖనం: ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 17).
అల్లాహ్ ఈ విధంగా బోధించినట్లు మాహానీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారుః “నా దాసులారా! నేను దౌర్జన్యాన్ని నిషేధిస్తున్నాను. మీరు కూడా ఒకరిపై నొకరు దౌర్జన్యం చేయడం నిషిద్ధం అని భావించండి, అలాగే ఆచరించండి”. ఉల్లేఖనం: అబూ జర్ర్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 2577).
“ఎవనిపై తన సోదరుడ్ని అవమానపరచిన లేదా మరే విధమైన అన్యాయము ఉన్నచో, దిర్హమ్ వ దీనార్ (డబ్బు, ధనం) చెల్లని ఆ (ప్రళయ) దినం రాకా ముందే క్షమాపణ కోరి లేదా వారి హక్కు ఇచ్చేసి) తొలిగిపోవాలి. లేదా ఆ రోజున బాధితుని వద్ద పుణ్యాలున్నచో తను ఎంత అన్యాయము చేశాడో అన్ని పుణ్యాలు తీసుకొనబడును. అతని వద్ద పుణ్యాలు లేనిచో పీడితుని పాపాలు తీసుకొని అతనిపై వేయబడును”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 2449).
విశేషావలుః
1- దౌర్జన్యం నిషిద్ధం కనుక భయపడి ఉండాలి.
2- అత్యచారికి ఇహపర లోకాల్లో కఠిన శిక్ష గలుగును.
3- పీడితుని అర్తనాదన అత్యాచారి పట్ల స్వీకరించబడుతుంది.
13. ముస్లిమును వధించడం నిషిద్ధం
అల్లాహ్ ఆదేశాలుః
{ఉద్దేశ్యపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం, శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు}. (నిసా 4: 93).
ప్రవక్త ﷺ ప్రవచనాలుః
عَنْ عَبْدِ الله ÷ قَالَ: قَالَ رَسُولُ الله ﷺ: (أَوَّلُ مَا يُقْضَى بَيْنَ النَّاسِ يَوْمَ الْقِيَامَةِ فِي الدِّمَاءِ).
“ప్రళయదినాన రక్తాలు చిందించిన వారిపట్ల మొదటి తీర్పు జరుగును”. అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (ముస్లిం 1678, బుఖారి 6533).
“అల్లాహ్ యందు ఒక విశ్వాసున్ని సంహరించటం కన్నా ప్రపంచనాశనము చాలా సులభం”. ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా. (నసాయి 3922, తిర్మిజి 1395).
విశేషాలుః
1- ముస్లింను వధించటం చాలా ఘోర పాపం. అల్లాహ్ వద్ద ముస్లిం విలువ చాలా గొప్పది.
2- రక్తాలు చిందించటం ఘోర పాపం. కాబట్టి మొదటి తీర్పు దాని గూర్చే అగును.
3- వధించిన వానిని ఇహలోకములో వధింపబడును. మరియు పరలోకము నందు అతడు శాశ్వతంగా నరకములో ఉండును.
“విశ్వాసి మరొక విశ్వాసితో కలసి ఒక కట్టడంలా రూపొందుతాడు. దాని ఒక భాగం మరొక భాగానికి బలం చేకూర్చుతుంది”. ఉల్లేఖనం: అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు. (బుఖారి 2446, ముస్లిం 2585).
“ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు. అతనికి ద్రోహం చేయకూడదు. అతనితో అసత్య వ్యవహారం చేయకూడదు. అసహాయంగా ఉండకూడదు. ఒక ముస్లిం మరొక ముస్లింని అవమాన పరుచుట, వధించుట మరియు అతని సొమ్మును కాజేయుట నిషిద్ధం. ‘తఖ్వా’ (అల్లాహ్ భయభీతి) ఇక్కడ ఉంది (అని ప్రవక్త ఛాతి వైపు సైగ చేశారు). ఒక ముస్లింని హీనపరచడం దుష్ ప్రవర్తన గల వ్యక్తి చిహ్నం”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (తిర్మిజి 1927. దీని భావం ముస్లిం 2564లో ఉంది).
“ఎవరయితే ఒక ముస్లింపై ఆసన్నమయిన కష్టాన్ని దూరం చేస్తారో, అతనికి ప్రళయదినాన ఎదురయ్యే కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరయితే ఋణగ్రస్తునికి వీలైనంత వ్యవదిస్తాడో అల్లాహ్ ఇహపరలోకాల్లో అతనికి సౌలభ్యం కలుగ జేస్తాడు. ఎవరయితే ముస్లిం యొక్క లోటుపాట్లను మరుగు పరుస్తాడో అల్లాహ్ ప్రళయదినాన అతని తప్పిదాలను కప్పిపుచ్చుతాడు. తన సోదరుని సహాయములో ఉన్నవారికి అల్లాహ్ సహాయపడతాడు”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (ముస్లిం 2699).
విశేషాలుః
1- విశ్వాసులు పరస్పర సహోదరులు. రాజు, బంటు, చిన్న, పెద్ద ఎవరైనా సరే.
2- ముస్లిములు పరస్పరం చేదోడువాదోడుగా ఉండాలని, అక్కరగల వారికి ధర్మప్రకారంగా సహాయపడాలని చాలా ప్రోత్సహించబడింది.
3- నిస్సహాయంగా ఉన్నవారికి సహాయపడుట ఘనతగల విషయం, చాలా పుణ్యం.
15. ఇరుగు పొరుగు వారి హక్కులు
అల్లాహ్ ఆదేశం:
{మీరంతా అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయకండి. తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు వీరందరి పట్ల మంచిగా వ్యవహరించండి}. (నిసా 4: 36).
ఒక సారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః “అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాడు, అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాడు, అల్లాహ్ సాక్షిగా అతను విశ్వాసి కాడు”. ఎవరు ప్రవక్తా అని అడగ్గా, “ఎవరి పొరుగు వారికయితే వారు పెట్టే కష్టాల వల్ల అశాంతి కలుగుతుందో వారు” అని ప్రవచించారు ప్రవక్త. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 6016).
“అల్లాహ్ మరియు ప్రళయదినంపై విశ్వాసమున్నవారు పొరుగు వారికి కష్ట పెట్టకూడదు. ఎవరయితే అల్లాహ్ ను పరలోక దినాన్ని విశ్వసిస్తారో, వారు తమ అతిథిని ఆదరించి సత్కరించాలి. అల్లాహ్ మరియు పరలోక దినాన్ని విశ్వసించువారు మంచి మాట మాట్లాడాలి లేదా మౌనం వహించాలి”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 6018, ముస్లిం 47).
విశేషాలుః
1- పొరుగువారికి ఉపకారం చేస్తూ ఉండాలి. కష్టపెట్ట కూడదని ప్రోత్సహిస్తూ చాలా తాకీదు చేయబడింది.
2- ఉత్తమ విశ్వాసముగల మానవుడు, పొరుగువారితో సద్వర్తనతో మెలిగి, కష్టపెట్టకుండా ఉన్నవాడు. (ఆ పొరుగు వారు ముస్లిమేతరులైనప్పటికీ).
16. నాలుక భయంకరాలు
అల్లాహ్ ఆదేశాలుః
{అతని నోటి నుండి వెడలే ప్రతి మాటనూ వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు}. (ఖాఫ్ 50: 18).
{మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ, మనస్సూ అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది}. (బనీ ఇస్రాయీల్ 17: 36).
‘ప్రవక్తా! ఉత్తమ విశ్వాసులెవరు?’ అని నేనడగ్గా, “ఎవరి నాలుక మరియు చెయ్యి ద్వారా ఇతర ముస్లిములు శాంతి పొందుతారో అతడే” అని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిచ్చారు. ఉల్లేఖనం: అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు. (ముస్లిం 42, బుఖారి 11).
“ఎవరైతే తమ పెదాల మధ్య ఉన్న దాన్ని, ఊరువుల మధ్య ఉన్న దాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటారో వారికి స్వర్గం లభింపజేసే పూచీ నాది”. ఉల్లేఖనం: సహల్ బిన్ సఅద్ రజియల్లాహు అన్హు. (బుఖారి 6474).
“దాసుడు ఆలోచించక, గ్రహించక పలికే మాటకు బదులుగా నరకు కూపములో పడతాడు. తూర్పు పడమర మధ్య ఉన్నంత దూరం దాని లోతు ఉంటుంది”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 6477, ముస్లిం 2988).
విశేషాలుః
1- నాలుక భయంకరాల నుండి జాగ్రత్త ఉండాలి. అనాలోచనతో ఉచ్చరించిన మాటల ద్వారా మానవుడు నరకములో చేరుకుంటాడు. మరియు ఇదే నాలుక ఉపయోగము అధర్మంగా ఉంటే నరక ప్రవేశానికి కారణము. మరియు ధర్మంగా ఉంటే స్వర్గప్రవేశానికి కారణమగును. అనేక మంది పాపానికి గురి అయ్యే కారణము అనవసరంగా నిర్లక్ష్యంగా మాట్లాడడమే.
2- మాట్లాడే ప్రతి మాట మరియు ప్రతి చిన్న పని గురించి కూడా విచారణ జరగనున్నది. (మనిషి అవయవాలలో) నాలుక మరియు మర్మాంగము చాలా భయంకరమైనవి.
17. పరోక్షనింద నిషిద్ధం
అల్లాహ్ ఆదేశం:
{మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృతసోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహ్యించుకుంటారు}. (హుజురాత్ 49: 12).
ఒక సారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు, “పరోక్షనింద అంటేమిటో మీకు తెలుసా?” అని. ‘అల్లాహ్, ఆయన ప్రవక్తకే బాగా తెలుసు’ అన్నారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారుః “పరోక్ష నింద అంటే మీరు మీ సోదరుని ప్రస్తావన అతనికి నచ్చని విధంగా చేయడం అన్న మాట. దానికి వారు, ‘అయితే నేను చెప్పే విషయం నా సోదరునిలో వాస్తవంగా ఉన్నప్పటికీ అది పరోక్షనిందే అవుతుందా?’ అని ఆశ్చర్యంగా అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు చెప్పే విషయం అతనిలో ఉన్నదయితెనే అది పరోక్షనింద అవుతుంది. అతనిలో లేని విషయాన్ని నీవు చెప్పినట్లయితే అది అపనింద అవుతుంది” అని విశదీకరించారు. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (ముస్లిం 2589).
నేనొకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ‘సఫియలో ఉన్న ఈ లోపాలే చాలు, ఆమె పొట్టిది’ అని అన్నాను. దానికి ప్రవక్త ﷺ “ఆయిషా! నీవు పలికిన మాట ఎంత మలినమైనదంటే, దాన్ని సముద్రములో రంగరిస్తే సముద్రమంతా కలుషితమైపోతుంది” అని బాధతో అన్నారు. ఉల్లేఖనం: ఆయిషా రజియల్లాహు అన్హా. (అబూదావూద్ 4875, తిర్మిజి 2502).
“ఒక ముస్లిం మరొక ముస్లింని అవమాన పరుచుట, వధించుట మరియు అతని సొమ్ము కాజేయుట నిషిద్ధం”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (తిర్మిజి 1927. దీని భావం ముస్లింలో ఉంది).
“తన సోదరుని పరువు కాపాడుటకు ప్రయత్నించే వానిని ప్రళయదినాన అల్లాహ్ నరకం నుండి కాపాడతాడు”. అబూ దర్దా ఉల్లేఖనం. (తిర్మిజి 1931).
విశేషాలుః
1- పరోక్షనింద నిషిద్ధం. అది ఘోర పాపము. మరియు పరోక్షనిందుతునికి కఠినమైన శిక్ష గలదు.
2- ఒకరి ప్రస్తావన అతని వెనక అతను నచ్చని విధంగా చేయుటయే పరోక్షనింద. అది నిషిద్ధం. వాస్తవంగా అది అతనిలో ఉన్నప్పటికైనా.
3- పరోక్షనింద చేయువానిని అలా చేయకుండా ఆపుట విధి. పరోక్షనింద విషయాలు వినుట కూడా నిషిద్ధం. ముస్లిం సోదరుని పరువు కాపాడుటకు పోరాడించువాని ఘనత చాలా ఉంది. అల్లాహ్ అతన్ని నరకము నుండి కాపాడతాడు.
4- పరోక్షనింద మాటల ద్వారా మరియు సైగల ద్వార కూడా అవుతుంది.
18. సత్యం ఘనత, అసత్యం నుండి హెచ్చరిక
అల్లాహ్ ఆదేశాలుః
{అల్లాహ్ ఆయతులను విశ్వసించనివారే అబద్ధాలను కల్పిస్తున్నారు. అసలు వారే అసత్యవాదులు}. (నహ్ల్ 16: 105).
{విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులకు తోడ్పండి}. (తౌబా 9: 119).
{వారు తాము అల్లాహ్ కు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటంలో తమ నిజాయితీని నిరూపించుకొని ఉంటే, అది వారికే శ్రేయస్కరమైనదిగా ఉండేది}. (ముహమ్మద్ 47: 21).
నేను ప్రవక్తతో (నేర్చుకొని) జ్ఞాపకముంచుకున్న విషయం: “సందేహమున్న దాన్ని వదిలేసి, లేని దానిని తీసుకో. సత్యంలో శాంతి ఉంది. అసత్యంలో సందేహం” అని హసన్ బిన్ అలీ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. (తిర్మిజి 2518).
“నిశ్చయంగా సత్యం పుణ్యానికి మరియు పుణ్యం స్వర్గానికి దారి చూపుతుంది. ఒక వ్యక్తి సత్యాన్ని పాటిస్తూ, సత్యంగా జీవిస్తూ సత్యవంతుల్లో కలుస్తాడు. నిశ్చయంగా అబద్ధం పాపానికి, పాపం నరకానికి దారి చూపుతుంది. ఒక వ్యక్తి అబద్ధమాడుతూ, అసత్యజీవితం గడుపుతూ అసత్యవంతుల్లో లిఖించబడతాడు”. ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు. (బుఖారి 6094, ముస్లిం 2607).
“ఏ వ్యక్తిలో ఈ నాలుగు గుణాలుంటాయో అతను అసలైన మునాఫిఖ్. ఒక వేళ అతనిలో వీటిలోని ఒక్క గుణం ఉన్నా అతను దాన్ని వదలనంత వరకు అతనిలో నిఫాఖ్ కు సంబంధించిన ఒక గుణం ఉన్నట్లే. ఆ నాలుగు గుణాలు ఇవిః అతన్ని నమ్మి ఏదయినా అమానతు అప్పగించినప్పుడు అతను దాన్ని కాజేస్తాడు. నోరు విప్పితే అబద్ధము పలుకుతాడు. మాటిస్తే దాన్ని నిలబెట్టుకోడు. ఎవరితోనయినా వాదులాట జరిగితే అన్యాయానికి దిగుతాడు”. ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా. (బుఖారి 34, ముస్లిం 58).
విశేషాలుః
1- అసత్యం నుండి హెచ్చరించబడింది. అసత్యం వంచకుల గుణం. ప్రజల మధ్య అసత్యాన్ని ప్రభలింపజేసేవారికి కఠిన శిక్ష గలదు.
2- అసత్యం పాపానికి గురి చేస్తుంది. అది నరక ప్రవేశానికి కారణమవుతుంది.
3- సత్యం ఘనత చాలా ఉంది. ప్రతి విషయంలో దాన్ని పాటించాలని ప్రోత్సహించబడింది.
4- అబద్ధం ‘నిఫాఖ్’ (వైరం) గుణాల్లో ఒకటి.
19 ‘తౌబా’ (పశ్చాత్తాపం)
అల్లాహ్ ఆదేశాలుః
{విశ్వసించిన ప్రజలారా! మీరంతా కలసి అల్లాహ్ వైపునకు మరలి క్షమాభిక్షను వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు}. (నూర్ 24: 31).
{విశ్వాసులారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి}. (తహ్రీమ్ 66: 8).
“ప్రజలారా! (మీ పాపాల మన్నింపుకై) మీరు అల్లాహ్ పట్ల తౌబా చేయండి. నేను ఒక రోజులో 100 సార్లు తౌబా చేస్తూ ఉంటాను”. ఉల్లేఖనం: అగర్ బిన్ యసార్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 2702).
“నీళ్ళు పచ్చిక లభించని ఎడారిలో ఒంటె తప్పిపోయిన వ్యక్తి (దాన్ని పొందిన తర్వాత ఎంత సంతొషిస్తాడో) అంతకంటే ఎక్కువ తౌబా చేయు వ్యక్తితో అల్లాహ్ సంతొషిస్తాడు”. ఉల్లేఖనం: అనస్ రజియల్లాహు అన్హు. (బుఖారి 6309, ముస్లిం 2747).
“ప్రతి ఆదము కుమారుడు అపరాధుడే, అయితే అత్యధికంగా అల్లాహ్ వైపుకు మరలి క్షమాపణకై అర్థించేవారే మేలైన అపరాధులు”. ఉల్లేఖనం: అనస్ రజియల్లాహు అన్హు. (తిర్మిజి 2499).
“పగలు పాపము చేసిన వ్యక్తి రాత్రి వేళ అతని వైపుకు మరలతాడని అల్లాహ్ రాత్రి వేళ తన చెయ్యి చాపుతాడు. రాత్రి పాపము చేసిన వ్యక్తి పగలు తన వైపుకు మరలతాడని అల్లాహ్ పగలు తన చెయ్యి చాపుతాడు. ఇలా సూర్యుడు పశ్చిమాన ఉదయించే వరకు జరుగుతూ ఉంటుంది”. ఉల్లేఖనం: అబూ మూసా అష్అరి రజియల్లాహు అన్హు. (ముస్లిం 2759).
విశేషాలుః
1- సర్వ పాపాల నుండి అవి ఎంత ఘోరమయినా, నిరాశ చెందకుండా ఎల్లప్పుడూ తౌబా చేస్తూ ఉండాలి. అది మానవుని శ్రేయస్సుకూ, మోక్షానికీ ముఖ్య కారణం.
2- అల్లాహ్ కారుణ్యం చాలా అధికమైనది. అందుకు తౌబా ఘనత చాలా ఉంది. మరియు తౌబా చేయువానితో అల్లాహ్ చాలా సంతోషిస్తాడు.
3- అపరాధాలు ఆదము కుమారునితో జరుగుతూ ఉంటాయి. అందుకే పశ్చాత్తాపముతో క్షమాపణ వేడుకుంటూ ఉండాలి.
తౌబా నియమాలుః
1- తౌబా షరతుల్లో ఒకటిః శ్వాస చెదరక ముందు, ప్రాణం గొంతులో రాక ముందే చెయ్యాలి.
2- పడమర దిశ నుండి సూర్యోదయము కాకముందే తౌబా చెయ్యాలి. ఆ తరువాత ఏమీ లాభముండదు.
3- స్వచ్ఛంగా తౌబా చేసి కూడా మళ్ళీ అదే పని చేయువాని మొదటి తౌబా అంగీకరించబడుతుంది. కాని మళ్ళీ తౌబా చెయ్యాలి.
4- చేసిన తప్పు విడనాడి పశ్చాత్తాప పడి తౌబా చేసిన తరువాత తిరిగి అదే పాపం చేయకుండా స్థిరంగా ఉంటానని దృఢ సంకల్పం చేసుకోవాలి.
20. సలాం
అల్లాహ్ ఆదేశం:
{విశ్వసించిన ప్రజలారా! మీ ఇళ్ళల్లోకి తప్ప ఇతరుల ఇళ్ళల్లోకి ప్రవేశించకండి. ఇంటి వారి అంగీకారం పొందనంత వరకు, ఇంటి వారికి సలామ్ చేయనంత వరకు}. (నూర్ 24: 27).
“మీరేదయినా సమావేశంలో ప్రవేశించినప్పుడు సలాం చేయండి. కూర్చోవాలను కుంటే కూర్చోండి. మళ్ళీ అక్కడి నుండి తిరిగి వస్తున్నప్పుడు కూడా సలాం చేయండి. (గుర్తుంచుకోండి!) మొదటి సారి చేసే సలాం, వెళ్ళేటప్పుడు చేసే సలాం కన్నా అధిక పుణ్యఫలానికి పాత్రమయింది కాదు”. (అనగా తిరిగి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సలాం చేయాలి). ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (అబూ దావూద్ 5208, తిర్మిజి 2849).
విశేషాలుః
1- సలాం యొక్క ఘనత. అది ప్రేమాభిమానాలు పెంచుకొని స్వర్గ ప్రవేశానికి మంచి కారణం.
2- పరిచయం ఉన్నవారు లేనివారు, అందరికీ సలాం చేయాలి. కేవలం పరిచయం ఉన్నవారికే కాదు.
3- సలాం కొరకు ధర్మమైన పదాలుః “అస్సలాము అలైకుం” మరియు “వరహ్మతుల్లాహి” అనడం పుణ్యం. మరియు “వబరకాతుహు” కూడా అధిక పుణ్యం గలది. జవాబులో ఇవే పదాలు మరియు దీనికంటే (ధర్మమైన) మంచి పదాలు పలకాలి.
4- అవిశ్వాసులకు ముందు సలాం చేయకూడదు. వారు సలాం చేస్తే “వఅలైకుం” మాత్రమే అనాలి.
5- విశ్వాసులు అవిశ్వాసులు ఒకే చోట సమావేశమై ఉంటే సలాం చేయవచ్చును.
6- కొద్ది క్షణాలు కలిసి వీడిపోయిన గాని సలాం చేసి కలుసుకోవాలి. సలాం చేసి విడిపోవాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఇలా ఉపదేశించారుః “బిస్మిల్లాహ్ అంటూ కుడి చెయితో (పళ్ళములో) నీ దగ్గర ఉన్నదే తిను”. ఉల్లేఖనం: ఉమర్ బిన్ అబీ సలమహ్. (బుఖారి 5376, ముస్లిం 2022).
“మీలోనెవరు కూడా ఎడమ చెయితో తినత్రాగ కూడదు. ఎడమ చెయితో తినుట త్రాగుట షైతాన్ అలవాటు”. ఉల్లేఖనం: అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా. (ముస్లిం 2020).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగు దొడ్డికి వెళ్ళేటప్పుడు ఈ దుఆ పఠించేవారుః అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇసి. (భావం: అల్లాహ్ షైతాన్ స్త్రీ పురుష దుష్ట శక్తుల బారి నుండి రక్షణ కొరకు నీ శరణు వేడుకుంటున్నాను). ఉల్లేఖనం: అనస్ రజియల్లాహు అన్హు. (బుఖారి 142, ముస్లిం 375).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలిచిన నీళ్ళల్లో మూత్రం చేయుట నివారించారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 281).
విశేషాలుః
1- ముస్లిం మలమూత్ర విసర్జనకు వెళ్ళునపుడు మరియు తిరిగి వచ్చునపుడు పైన తెలిపిన దుఆలు పఠించుట ప్రవక్త సాంప్రదాయం.
2- కాలకృత్యాలు తీర్చుకొనుటకు యడారిలో వెళ్ళినప్పుడు ప్రజల చూపులకు దూరంగా పోవాలి. ఖిబ్లా దిశలో వీపు గాని ముఖం గాని పెట్టి కూర్చోరాదు. నాలుగు గోడల మధ్యలో కూర్చున్నప్పుడు ఖిబ్లా దిశలో ఉంటే ఏమీ పాపం లేదు.
3- మలమూత్రపు తుంపరలు శరీరం, దుస్తులపై పడకుండా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే పరిశుభ్రత తప్పనిసరిగా చేసుకోవాలి.
4- ఇస్లాం ఎంత సంపూర్ణమైన ధర్మం చూడండి. మలమూత్ర విసర్జన పద్ధతుల గురించి కూడా మంచి శిక్షణ ఇచ్చింది. మానవ అవసరాలకు తగిన ఏ విషయాన్ని కూడా వివరించక ఉండలేదు.
“అల్లాహ్ తుమ్ముతో ఇష్టపడతాడు. ఆవలింపును అసహ్యించు కుంటాడు. గనక మీలో ఎవరైనా తుమ్మినచో అల్ హందులిల్లాహ్ అనాలి. ఇది విన్న ప్రతి ముస్లింపై యర్ హముకల్లాహ్ అని బదులివ్వడం తప్పనిసరి హక్కు. ఇక ఆవలింపు, ఇది షైతాన్ తరఫున వస్తుంది. గనక ఆవలింతువారు పూర్తి శక్తితో దాన్ని ఆపుకోవాలి. ఎందుకనగా మీలో ఎవరైనా ఆవలించినప్పుడు షైతాన్ చూసి సంబర పడతాడు”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 6223).
“మీలో ఎవరైనా తుమ్నినప్పుడు అల్ హందులిల్లాహ్, ఇది విన్నవారు యర్ హముకల్లాహ్, మళ్ళీ తుమ్మినవారు యహ్ దీకుముల్లాహ్ వ యుస్లిహు బాలకుం అనాలి”. అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (బుఖారి 6224).
“తమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడే మీరు యర్ హముకల్లాహ్ అనండి. అతడు అల్ హందులిల్లాహ్ అనకున్నట్లయితే మీరు జవాబివ్వకండి” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అబూ మూసా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (ముస్లిం 2992).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్మినప్పుడు చెయిని లేక చేతి రూమాలును మూతి మీద పెట్టుకొని, చాలా తక్కువ స్వరంతో తుమ్మేవారు అని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి 2745, అబూ దావూద్ 5029).
విశేషాలుః
1- తుమ్మిన వ్యక్తి అల్ హందులిల్లాహ్ అన్నది విన్నవారు యర్ హముకల్లాహ్ అనుట పుణ్యం.
2- అల్ హందులిల్లాహ్ అనకున్నట్లయితే జవాబివ్వనవసరం లేదు.
3- ఆవలింపునాపడం చాలా మంచిది.
4- ఆవలింపును ఆపలేని స్థితిలో చెయి అడ్డం పెట్టుకొనుట మంచిది.
5- తుమ్మెటప్పుడు చెయి, దస్తీ లేక రూమాలు ఏదైనా అడ్డం పెట్టుకోవాలి.
6- తుమ్మినప్పుడు, ఆవలంచినప్పుడు తక్కువ శబ్దం రానివ్వాలి. ఘనంగా తుమ్ముట అసహ్యమేర్పడును.
“మేకల మంద, తోట భద్రత మరియు వేటకు తప్ప వేరే ఉద్దేశ్యంతో కుక్కను పెంచేవారి పుణ్యాలలో రోజుకొక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి”. మరో ఉల్లేఖనంలో “రెండు ఖీరాతులు” అని ఉంది. (ఒక్క ఖీరాత్ ఒక ఉహద్ పర్వతానికి సమానం). అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం. (ముస్లిం 1575, బుఖారి 2322).
“కుక్క మీలోనెవరి పళ్ళములోనైన మూతి పెడితే దాన్ని ఏడు సార్లు కడిగి ఎనిమిదవ సారి మట్టితో కడగండి”. ఉల్లేఖనం: అబ్గుల్లాహ్ బిన్ ముఘఫ్ఫల్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 280).
విశేషాలుః
1- కుక్కను పెంచడం నిషేధం. కాని తోట, మేకల భద్రత మరియు వేట కుక్క తప్ప.
2- కుక్కల నుండి దూరంగానే ఉండాలి.
3- కుక్క ఎందులోనైతే మూతి పెట్టినదో, అది అపరిశుభ్రం. గనక దాన్ని ఏడు సార్లు నీళ్ళతో మరియు ఒక్క సారి మట్టితో కడగాలి.
25. అల్లాహ్ యొక్క జిక్ర్ (స్మరణ)
అల్లాహ్ ఆదేశాలుః
{మీరు జయము పొందుటకు అల్లాహ్ ను చాల స్మరింపుము}. (సూరె జుముఅ: 62: 10).
{ఓ విశ్వాసులారా! మీరు చాల ఎక్కువగా అల్లాహ్ ను స్మరించండి. మరియు మీరు ఉదయం సాయంకాలం అతని పవిత్రతను కొనియాడండి}. (సూరె అహ్ జాబ్ 33: 41,42).
“అల్లాహ్ స్మరణల్లో చాలా ఘనత గలది లాఇలాహ ఇల్లల్లాహ్”. అని ప్రవక్త చెప్పగా నేను విన్నాను అని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. (తిర్మిజి 3383, ఇబ్ను మాజ 3800).
కొన్ని దుఆలు:
A. పడుకునే ముందు
بِاسْمِكَ اللَّهُمَّ أَمُوتُ وَأَحْيَا
బిస్మికల్లాహుమ్మ అమూతు వ అహ్ యా. (బుఖారి 6324). [భావం: అల్లాహ్ నేను నీ నామ స్మరణంతోనే మృత్యువు ఒడిలో ఒదిగి పోతాను. నీ పేరు పలుకుతూ బ్రతికి లేస్తాను].
అల్ హందులిల్లాహిల్లజీ అహ్ యానా బఅద మా అమాతనా వఇలైహిన్ నుషూర్. (బుఖారి 6324). [భావం: సర్వ స్తోత్రములకు అర్హుడైన ఆ అల్లాహ్ యే మమ్మల్ని నిర్జీవావస్తకు గురి జేసి తిరిగి జీవం పోసినవాడు. ఆయన సమక్షంలోనే మేము తిరిగి లేచి నిలబడవలసిన వారము].
బిస్మిల్లాహ్, అల్ హందులిల్లాహ్, సుబ్ హానల్లజీ సఖ్ఖరలనా హాజా వమా కున్నా లహూ ముఖ్రినీన్, వఇన్నా ఇలా రబ్బినా లమున్ ఖలిబూన్. (అహ్మద్ 1/97. ముస్లిం 1342.). [భావం: అల్లాహ్ పేరుతో, సర్వస్తోత్రములు అల్లాహ్ కే, ఆయన అతి పవిత్రుడు. ఆయనే ఈ వాహనమును మా ఆధీనంలో చేశాడు. లేకపోతే మేము దీన్ని ఆధీన పరుచుకోలేక పోయేవారము. నిశ్చయంగా మేము మా ప్రభువు వైపునకు మరలవలసిన వారలము].
అఊజు బికలిమాతిల్లాహిత్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. (ముస్లిం 2708). [భావం: సృష్టిలో ఉన్న సర్వ కీడుల నుండి నేను అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాల శరణు వేడుతున్నాను].
అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లాషరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహు. (ముస్లిం 234). [భావం: అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరు ఆరాధనకు అర్హులు కానేకారని, ఆయన అద్వితీయుడు, ఆయనకు ఎవరు సాటి లేరని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను].
బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. (అబూ దావూద్ 5095, తిర్మిజి 3426). [భావం: అల్లాహ్ పేరుతో మరియు ఆయనపై నమ్మకంతోనే నేను (బైటికి వచ్చాను). పాపానికి దూరంగా ఉండే శక్తిని, సదాచరణకు సద్బుద్ధినీ ప్రసాదించేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే].
బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వఅలల్లాహి రబ్బినా తవక్కల్నా. (అబూ దావూద్ 5096). [భావం: అల్లాహ్ నామముతోనే ప్రవేశించాము. అల్లాహ్ నామముతోనే బైటికి వచ్చాము. మా పోషకుడైన అల్లాహ్ పైనే మా నమ్మకం].
అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. (బుఖారి 3370). [భావం: అల్లాహ్ నీవు ఇబ్రాహీంను, వారి కుటుంబీకులను కరుణించినట్లు ముహమ్మద్ మరియు వారి కుటుంబీకులను కరుణించు. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి. ఓ అల్లాహ్ నీవు ఇబ్రాహీం, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేసినట్లు ముహమ్మద్, వారి కుటుంబీకులకు శుభాలు దయ చేయుము. నిశ్చయంగా నీవు స్తోత్రాలకు అర్హునివి. ఘనుడివి].
అల్లాహుమ్మ బిక అమ్ సైనా వబిక అస్బహ్నా వబిక నహ్ యా వబిక నమూతు వఇలైకన్నుషూర్. (అబూ దావూద్ 5068). [భావం: అల్లాహ్! నీ సహకారంతోనే సాయంత్రానికి చేరాము. నీ సహాయముతోనే ప్రాతఃకాలానికి చేరాము. నీ దయతోనే జీవిస్తున్నాము. నీ ఆజ్ఞ అయితేనే మరణిస్తాము. చివరికి నీ వద్దకే హాజరవుతాము].
26. స్నేహం
అల్లాహ్ ఆదేశాలుః
{ఆ దినం వచ్చినప్పుడు స్నేహితులందరూ ఒకరికొకరు శత్రువులైపోతారు. -భయభక్తులు కలవారు తప్ప – }. (సూరె జుఖ్రుఫ్ 43: 67).
{దుర్మార్గపు మానవుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, “అయ్యో నేను దైవప్రవక్తకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది! అయ్యో నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది! అతడి మాయలో పడి నేను నా వద్దకు వచ్చిన హితబోధను స్వీకరించలేదు. షైతాను మానవుని విషయంలో నమ్మకద్రోహి అని తేలిపోయింది”}. (సూరె ఫుర్ ఖాన్ 25: 27-29).
{తరువాత వారు ఒకరి వైపున కొకరు తిరిగి పరిస్థితులను గురించి పరస్పరం అడిగి తెలుసుకుంటారు. వారిలో ఒకడు ఇలా అంటాడుః ప్రపంచంలో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతను నాతో ఇలా అంటూండేవాడు, నీవు కూడా ధ్రువీకరించే వారిలో చేరిపోయావా? మనం చనిపోయి, మట్టిగా మారి, అస్థిపంజరంగా మిగిలిపోయినపుడు నిజంగానే మనకు ప్రతిఫలమూ, శిక్షా అనేవి ఉంటాయా? ఇప్పుడతను ఎక్కడున్నాడో, మీరు చూడదలచుకున్నారా? ఇలా చెప్పి అతను తొంగి చూడగానే, అతనికి నరకంలోని ఒక అగాధంలో అతను కనిపిస్తాడు. అప్పుడు అతన్ని సంబోధిస్తూ ఇలా అంటాడుః అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను సర్వ నాశనం చేసి ఉండేవాడివి. నా ప్రభువు అనుగ్రహం లేకపోయి ఉంటే, ఈ రోజు నేను కూడా పట్టుబడి వచ్చిన వారిలో ఒకడినై ఉండేవాణ్ణి}. (సూరె సాఫ్ఫాత్ 37: 50-57).
“మనిషి తన స్నేహితుని ధర్మాన్ని అనుసరిస్తాడు. అందుకని తాను స్నేహం చేస్తున్న వారిని గురించి ఆలోచించుకొని మరీ స్నేహం చేయాలి”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహుఅన్హు. (అబూ దావూద్ 4833, తిర్మిజి 2378).
“ఏ రోజు అల్లాహ్ నీడ తప్ప వేరే నీడ లభ్యం కాదో ఆ రోజు అల్లాహ్ ఏడు రకాల మనుషులకు తన నీడలో ఆశ్రయమిస్తాడు. ఆందులో వీరు కూడాః అల్లాహ్ మరియు ఆయన ధర్మం కొరకు మాత్రమే మైత్రి ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు; వారు అల్లాహ్ కొరకే కలుసుకుంటారు. మరియు అల్లాహ్ కొరకే వేరౌతారు”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (బుఖారి 660, ముస్లిం 1031).
విశేషాలు
1- ప్రతి మనిషికి మితృడు అవసరం. అలాంటప్పుడు సద్వర్తనగల మరియు మంచిని బోధించి ధర్మమునకు సహాయపడు వానితో స్నేహం చేయాలి. చెడు వైపునకు, పాపానికి మరియు అల్లాహ్ తిరస్కారానికి గురి చేసే దారి చూపు అధర్మ మితృడు, మితృడు కాడు శతృడు.
2- ధర్మము నుండి దూరము చేయు అల్లాహ్ ఆజ్ఞను పాటించనివ్వని అవిశ్వాస స్నేహం నుండి దూరముండాలి.
{మేము మిమ్మల్ని భయప్రమాదాలకు, ఆకలి బాధకు, ధనప్రాణాల నష్టాలకు మరియు ఆదాయాల కొరతలకు గురి చేసి తప్పక పరీక్షిస్తాము. ఈ పరిస్థి- తులలో సహనం వహించేవారికి శుభవార్తనందజేయి}. (బఖర 2: 155).
“విశ్వాసుని వ్యవహారం కూడా వింతయినది. అతను ఏ స్థితిలో ఉన్నా తద్వార శుభాన్నే సేకరిస్తాడు. అతను సుఖ సంపన్నతలు వరించినప్పుడు కృతజ్ఞతతో మెలుగుతాడు. అది అతనికి మేలును చేకూరుస్తుంది. వ్యాది వ్యధలకు గురై నప్పుడు వాటిని సహనంతో ఎదుర్కొంటాడు. అది అతనికి శుభప్రద మవుతుంది”. ఉల్లేఖనం: సుహైబ్ రజియల్లాహు అన్హు. (ముస్లిం 2999).
అల్లాహ్ చెప్పాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “నేను నా దాసున్ని అతనికి ప్రియమైన వాటితో పరీక్షించినప్పుడు అతడు సహనం వహిస్తే నేను అతనికి దానికి బదులుగా స్వర్గం ప్రసాదిస్తాను”. (బుఖారి 5653).
“ఒక ముస్లిం మానసిక వ్యధకూ లేదా అనారోగ్యానికి లేదా ఏదయినా కష్టానికి, దుఖానికి గురయి దాన్ని ఓరిమితో సహించినట్లయితే దానికి ప్రతిఫలంగా అల్లాహ్ అతని తప్పులను మన్నిస్తాడు. కడకు అతనికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అది అతని పాప విమోచనానికి కారణ భూతమవుతుంది”. (బుఖారి 5642, ముస్లిం 2573).
“విశ్వాసులయిన స్త్రీ పురుషులపై అప్పుడప్పుడు పరీక్ష సమయాలు ఆసన్నమవుతూ ఉంటాయి. ఒక్కోసారి స్వయంగా అతనికి, మరోసారి అతని సంతానానికి, ఇంకొకసారి అతని సంపదకి ఈ ఆపదలు వాటిల్లుతాయి. చివరకు అతను అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అతని (కర్మపత్రంలో) ఏలాంటి పాపముండదు”. ఉల్లేఖనం: అబూ హురైర రజియల్లాహు అన్హు. (తిర్మిజి 2399).
విశేషాలుః
1- ప్రతి విషయంలో ఓపిక వహించాలని మరియు సహనానికి వ్యతిరేకం చేసి (అల్లాహ్ కోపానికి గురి కాకూడదని) ప్రోత్సహించబడింది. మరియు అసహనానికి గురి కాకూడదని హెచ్చరించబడింది. ఎందుకనగా పరీక్ష (బాధ) కాలములో లభించే పుణ్యాలు కూడా వ్యర్థమయి పోతాయి.
2- ముస్లింపై ఏ కష్టము వచ్చినా, దానితో అతని పాపాలు తగ్గుతాయి.
3- ఓపిక విషయాలలో సత్కార్యములు ఓపికతో చేయుట మరియు పాపాలు చేయకుండా సహనం వహించుట అతి గొప్ప విషయం.
4- అల్లాహ్ సర్వం తెలియువాడు, వివేచనాపరుడు. తన దాసుల మేలు కొరకు ఏది బాగుంటుందనేది అతనికి బాగా తెలుసు. కాబట్టి ఏ పరిస్థితిలో నున్నా సంతోషముతో ఉండాలి.
ﷺ :- ఈ గుర్తు ఉన్న చోట సల్లల్లాహు అలైహి వసల్లం చదవండి.
25.34980855.394526
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.