ఖురాన్: 77. అల్ ముర్సలాత్ [వీడియో]

బిస్మిల్లాహ్

077 Al-Mursalaat – Telugu Quran – Youtube Video

అహ్సనుల్ బయాన్ :

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 50 ఆయతులు ఉన్నాయి.ఈ సూరాలో ముఖ్యంగా ప్రళయం,మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, తీర్పుదినాల గురుంచి ప్రస్తావించడం జరిగింది. ఈ సూరాకు పెట్టబడిన పేరు మొదటి ఆయతులో వచ్చింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది తప్పనిసరిగా జరిగే సంఘటన అని ఈ సూరా నొక్కి చెప్పింది.ఆ రోజున నక్షత్రాలు మసకబారి పోతాయి.ఆకాశం తునా తునకలవుతుంది.పర్వతాలు దుమ్ము మాదిరిగా  ఎగురుతాయి.ఆ రోజున ప్రవక్తలందరినీ పిలిచి వారు అల్లాహ్ సందేశాన్ని మానవాళికి అందించటం జరిగిందా లేదా  అన్న విషయమై వాంగ్మూలం ఇవ్వమని కోరడం జరుగుతుంది.

ఈ సూరాలో అల్లాహ్ శక్తి సామర్ధ్యాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా మరణించిన తరువాత మళ్ళీ లేపడం ఆయనకు చాలా తేలికని నిరూపించడం జరిగింది. సత్యతిరస్కారుల వాదన అసత్యంగా  రుజువవుతుందని చెప్పడం జరిగింది. తీర్పు దినాన్ని చాలా కఠినమైన రోజుగా, దుస్థితి దాపురించే రోజుగా అభివర్ణించటం జరిగింది. ఆ రోజున భారీ నిప్పురవ్వలు ఎగురుతుంటాయి. ఆ రోజున సత్యతిరస్కారులు మాట్లాడే స్థితిలో ఉండరు. వారికి ఎలాంటి సాకులు చెప్పే అనుమతి కూడా ఉండదు. దైవభీతి కలిగిన వారు చల్లని నీడలో,సెలయేర్లతో,వివిధ రకాల ఫలాలతో సంతోషాన్ని పొందుతారు.

%d bloggers like this: