ధర్మపరమైన నిషేధాలు – 5 : అల్లాహ్ తప్ప మరెవ్వరితో దుఆ చెయ్యకు (అర్థించకు) [వీడియో]

బిస్మిల్లాహ్

[11:54 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 5

5- అల్లాహ్ తప్ప మరెవ్వరితో దుఆ చెయ్యకు (అర్థించకు) [1]:

చనిపోయినవారితో, దైవ దూతలతో, ప్రవక్తలతో, జిన్నాతులతో మరియు దూరంలో ఉన్నవారితో దుఆ చేయకు. వారిని అర్థించకు.

 [وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ ،وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ]. {الأحقاف:5،6}

అల్లాహ్ ను కాదని, ప్రళయదినం వరకు అతనికి సమాధాన మైనా ఇవ్వలేని వారిని, తమను వేడుకుంటున్నారనే విషయం కూడా ఎరుగనివారిని వేడుకునేవాడికంటే పరమ భ్రష్టుడైన వాడు ఎవడు ఉంటాడు. (అంతేకాదు) మానవులందరినీ సమావేశపరచి- నప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధన (వేడుకోలు)ను తిరస్కరిస్తారు[. (సూరె అహ్ ఖాఫ్ 46: 5,6).


([1]) అల్లాహ్ తన కొరకు ప్రత్యేకించుకున్న దుఆః

1-  ఆరాధన, ప్రశంస పరమైన దుఆః ‘యా జవ్వాద్, యా కరీమ్ (ఓ దాతృతుడా, అనుగ్రహించువాడా)’, ‘సుబ్ హానల్లాహిల్ అజీమ్ (పవిత్రుడైన గొప్పవాడు అల్లాహ్)’, ‘సుబ్ హానక లా ఇలాహ ఇల్లా అంత (నీవు పవిత్రునివి, నీ తప్ప సత్య ఆరాధ్యుడెవ్వడూ లేడు’.

2-  ప్రశ్నార్థమైన దుఆః ‘యా రహీమ్ నన్ను కరుణించు’. ఓ అల్లాహ్ నన్ను మన్నించు


పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు – 3 : అల్లాహ్ ను ప్రేమించు విధంగా లేదా అంతకు మించి మరెవరినీ ప్రేమించకు [వీడియో]

బిస్మిల్లాహ్

[4:25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 3

3అల్లాహ్ ను ఏ గౌరవభావంతో ప్రేమించాలో అదే విధంగా లేదా అంతకు మించి మరెవరినీ ప్రేమించకు:

ప్రేమ అనేది అల్లాహ్ తప్ప మరెవరితో ఉండకూడదు. ఎవరితోనైనా ఉంటే అది అల్లాహ్ కొరకే ఉండాలి. మరియు అల్లాహ్ ప్రేమించువాటినే ప్రేమించాలి. ప్రపంచంలో ఉన్న ప్రేమ అల్లాహ్ పట్ల మరియు అల్లాహ్ కొరకు ఉంటే అది అల్లాహ్ ప్రేమలో ఓ భాగమే([1]).

[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ الله أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ الله وَالَّذِينَ آَمَنُوا أَشَدُّ حُبًّا لله] {البقرة:165}

కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు ప్రత్యర్థులుగా నిలబెట్టి, అల్లాహ్ పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అన్నిటికంటే అధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు. (సూరె బఖర 2: 165).


([1])  అల్లాహ్ పట్ల ప్రేమ రకాలుః

1-  దయ, జాలితో కూడిన ప్రేమ. ఇది సంతానం, చిన్న పిల్లవాళ్ళు మరియు వారి లాంటివారితో ఉంటుంది.

2-  గౌరవ మర్యాద, సేవసత్కార్యాలతో కూడిన ప్రేమ. ఈ రకమైన ప్రేమ తండ్రి, శిక్షకుడు మరియు వారి స్థానంలో ఉన్నవారితో ఉంటుంది.

3-  కామం, వాత్సల్యంతో కూడిన ప్రేమ. ఇది భార్యతో ఉంటుంది.

4-  ఆరాధన, విధేయత భావంతో కూడిన ప్రేమ. అల్లాహ్ పట్ల విధేయత భావంతో కూడిన ప్రేమలో విశ్వాసుల్లో గల పుణ్యపురుషుల ప్రేమ కూడా వస్తుంది. (అంటే వారిని ప్రేమించుట అల్లాహ్ ఆరాధన పాటించినట్లు. ఎందుకనగా వారిని ప్రేమించాలని స్వయంగా అల్లాహ్ యే ఆదేశించాడు).


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు – 2 : ఆరాధనలో ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ యేతరుల కొరకు చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[2:10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 2

ఆరాధనలో ఏ ఒక్క భాగం కూడా అల్లాహ్ యేతరుల కొరకు చేయకు:

ఆయన ఆరాధనలో ఆయనతో పాటు మరెవ్వరినీ భాగస్వామి చేయకు.

మౌలికంగా ఇబాదత్ (ఆరాధన) అంటే తనకు తాను అల్లాహ్ యదుట అధమునిగా, ధీనుడిగా భావించి, ఆయన ముందు అణగిపోవుట. అల్లాహ్ యేతరుల ఆరాధన హృదయము, నాలుక మరియు అవయవాలతో జరుగుతుంది. అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

[وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا] {النساء:36}

మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, ఆయనకు ఎవ్వరినీ భాగస్వామిగా చేయకండి. (సూరె నిసా 4: 36).


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ఇతర ముఖ్యమైన పోస్టులు :

ధర్మపరమైన నిషేధాలు – 1 : దేని కొరకు నీవు పుట్టించబడ్డావో దాని నుండి నిర్లక్ష్యంగా ఉండకు [వీడియో]

బిస్మిల్లాహ్

[3:39 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు 1

1- దేని కొరకు నీవు పుట్టించబడ్డావో దాని నుండి నిర్లక్ష్యంగా ఉండకు:

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] {الذاريات:56}

అల్లాహ్ ఆదేశం: ]నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను[. (జారియాత్ 52: 56).

అంటే ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ నే పూజించాలి. ఆయన ఏ ఆదేశమిచ్చినా పాలించాలి. దేనిని నిషేధించినా దానికి దూరంగా ఉండాలి.


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

క్విజ్: 76: ప్రశ్న 02: సమాధుల పూజ [ఆడియో]

బిస్మిల్లాహ్

[7:36 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

రెండవ ప్రశ్న సిలబస్ : సమాధుల పూజ

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు (Muharramat) పుస్తకం నుండి:

సమాధులను పూజించడం, మరణించి సమాధుల్లో ఉన్న వలీలు (పుణ్యపురుషులు) అవసరాలను తీరుస్తారని, కష్టాలను తొలిగిస్తారని నమ్మడం మరియు అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నదాని సహాయం వారితో కోరడం, వారితో మొరపెట్టుకోవడం లాంటివి పెద్ద షిర్క్ లో లెక్కించ బడతాయి.

అల్లాహ్ ఆదేశం చదవండి:

وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ
మీ ప్రభువు తనను తప్ప ఇతరులను మీరు ఆరాధింపకూడదని ఆదేశించాడు
[. (బనీఇస్రాఈల్ 17: 23).

అదే విధంగా చనిపోయిన ప్రవక్తలతో, పుణ్యాత్ములతో ఇంకెవరితోనైనా వారి సిఫారసు పొందుటకు, తమ కష్టాలు దూరమగుటకు వారితో దుఆ చేయడం కూడా షిర్క్. చదవండి అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

أَمَّنْ يُجِيبُ المُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الأَرْضِ أَإلَهٌ مَعَ اللهِ
బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరలను ఆలకించి అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా
చేసినవాడు ఎవడు? అల్లాహ్ తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడ ఎవడైనా ఉన్నాడా?
(నమ్ల్ 27: 62).

కొందరు కూర్చున్నా, నిలబడినా, జారిపడినా తమ పీర్, ముర్షిదుల నామములను స్మరించుటయే తమ అలవాటుగా చేసుకుంటారు. ఎప్పుడు ఏదైనా క్లిష్టస్థితిలో, కష్టంలో, ఆపదలో చిక్కుకున్నప్పుడు ఒకడు యా ముహమ్మద్ అని, మరొకడు యా అలీ అని, ఇంకొకడు యా హుసైన్ అని, మరి కొందరు యా బదవీ, యా జీలానీ, యా షాజులీ, యా రిఫాఈ, యా ఈద్ రూస్, యా సయ్యద జైనబ్, యా ఇబ్ను ఉల్వాన్ అని, యా గౌస్ అల్ మదద్ అని, యా ముఈనుద్దీన్ చిష్తీ అని, యా గరీబ్ నవాజ్ అని, నానా రకాలుగా పలుకుతారు. కాని అల్లాహ్ ఆదేశం ఏమిటని గమనించరు:

إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللهِ عِبَادٌ أَمْثَالُكُمْ فَادْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا لَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ
అల్లాహ్ ను వదలి మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి (అఅ’రాఫ్ 7: 194).

కొందరు సమాధి పూజారులు సమాధుల ప్రదక్షిణం చేస్తారు. వాటి మూలమూలలను చుంబిస్తారు. చేతులు వాటికి తాకించి తమ శరీరంపై పూసుకుంటారు. వాటి గడపను చుంబిస్తారు. దాని మట్టిని తీసుకొని తమ ముఖాలకు రుద్దుకుంటారు. వాటిని చూసినప్పుడు సాష్టాంగ పడతారు (సజ్దా చేస్తారు). తమ అవసరాలను కోరతూ రోగాల నుండి స్వస్థత పొందుటకు, సంతానం కావాలని, అవసరం తీరాలని వాటి ఎదుట భయభీతితో, వినయవినమ్రతలతో నిలబడతారు. ఒక్కోసారి సమాధిలో ఉన్నవారిని ఉద్దేశించి ఇలా పిలుస్తారు కూడా: యా సయ్యిదీ! ఓ మేరే బాబా! నేను చాలా దూరం నుండి మీ సమక్షంలో హాజరయ్యాను, నాకు ఏమీ ప్రసాదించక వెనక్కు త్రిప్పి పంపుతూ అవమాన పరచకు.

కాని అల్లాహ్ ఆదేశం ఏముందో గమనించారా?

وَمَنْ أَضَلُّ مِمَّنْ يَدْعُو مِنْ دُونِ اللهِ مَنْ لَا يَسْتَجِيبُ لَهُ إِلَى يَوْمِ القِيَامَةِ وَهُمْ عَنْ دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయం వరకు తమ ప్రార్థనలను విని సమాధాన మివ్వలేనటువంటి వారిని ప్రార్థించే వారికంటే, ఎక్కువ మార్గభ్రష్టులెవరు? మరియు వారు వీరి (ప్రార్థించేవారి) ప్రార్థనలను ఎరుగకుండా ఉన్నారు
(అహ్ఖాఫ్ 46: 5).

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు:

مَنْ مَاتَ وَهْوَ يَدْعُو مِنْ دُونِ الله نِدًّا دَخَلَ النَّارَ
“ఎవరు అల్లాహ్ ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ/దుఆ చేస్తూ చనిపోతాడో అతను నరకంలో ప్రవేశిస్తాడు”.
(బుఖారి 4497).

కొందరు సమాధుల వద్ద తమ తల గొరిగించుకుంటారు. ‘సమాధుల హజ్ చేసే విధానం’ అన్న పేరుగల పుస్తకాలు కొందరి వద్ద లభిస్తాయి. విశ్వవ్యవస్థ నిర్వహణ శక్తి మరియు లాభనష్టాలు చేకూర్చే శక్తి వలీలకు ఉన్నదని కొందరు నమ్ముతారు. కాని అల్లాహ్ యొక్క ఈ ఆదేశం పట్ల వారు ఎలా అంధులైపోయారో గమనించండి:

وَإِنْ يَمْسَسْكَ اللهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ وَإِنْ يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ
ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రాహన్ని మల్లించే వాడు కూడా ఎవడూ లేడు (యూనుస్ 10: 107).

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (7:33 నిముషాలు)

ఆడియో విన్న తర్వాత క్రింది ప్రశ్న ట్రై చెయ్యండి

(2) సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం , అక్కడ బలి ఇవ్వడం ఎలాంటి కార్యం?

A) ధర్మ సమ్మతం
B) చిన్న పాపం
C) ఘోర పాపం (షిర్క్)

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

తెలుగు ఇస్లామిక్ క్విజ్ (ఆడియో సిరీస్) మెయిన్ పేజీ :
https://teluguislam.net/others/telugu-islamic-quiz

ఇంకా క్రింది పోస్టులు చదవండి:

లాక్ డౌన్ తర్వాత తొలి జుమా ఖుత్బ: 5 ముఖ్యమైన ఆరాధనలు [వీడియో]

బిస్మిల్లాహ్

[14:48 నిమిషాలు]

సౌదీలో లాక్‌డౌన్‌ తర్వాత మసీదులు తెరవబడ్డాయి
13-10-1441 (హిజ్రి) రోజున మొదటి జుమ్మా ఖుత్బ
జామి హుస్సేన్ బిన్ అలీ రజియల్లాహు అన్హు
షేఖ్ సాలిహ్ బిన్ ఫురైహ్ అల్ బహ్ లాల్
అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లొడ్ చేసుకోండి [14:48 నిమిషాలు]

[ముస్లింల ధార్మిక విశ్వాసం] అల్లాహ్‌ మనల్ని ఎందుకు పుట్టించాడు?

బిస్మిల్లాహ్

1. ప్రశ్న : అల్లాహ్‌ మనల్ని ఎందుకు పుట్టించాడు?

జవాబు:

ఆయన మనల్ని కేవలం తన ఆరాధన కొరకు సృష్టించాడు.

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

నేను జిన్నాతులనూ, మానవులనూ కేవలం నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను.[1]
(సూరా అజ్‌ జారియాత్‌ 51:56)

హదీస్‌ : అల్లాహ్‌కు ఆయన దాసులపై ఉన్న హక్కు ఏమిటంటే, వారు ఆయన్నే ఆరాధించాలి. ఈ ఆరాధనలో మరెవ్వరినీ భాగస్వాములుగా చెయ్యకూడదు. (బుఖారీ, ముస్లిం)


ఈ పోస్ట్ ముస్లింల ధార్మిక విశ్వాసం – జమీల్ జైనూ అను పుస్తకం నుండి తీసుకోబడింది

[1] నోట్స్: ఆహ్సనుల్ బయాన్ నుండి:

మానవులను, జిన్నులను పుట్టించటంలోని తన ఉద్దేశ్యమేమిటో అల్లాహ్ ఈ వాక్యంలో తెలియపరచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులనుగానీ, జిన్నాతులనుగానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్రాలను హరించ లేదు. ఒకవేళ అదేగనక అయివుంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా  అల్లాహ్ ఆరాధనకు కట్టుబడి ఉండేవారు. కాని అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుకలోని పరమార్ధాన్ని వారికిక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్థాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.

“నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు”. (సూరా అజ్‌ జారియాత్‌ 51:57)

ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా నా పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో! అదేమీ కాదు. ప్రపంచంలో మీరు కల్పించే చిల్లర దేవుళ్ల లాంటి వాణ్ని కాదు నేను. ఆ మాటకొస్తే భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు నా అధీనంలోనే ఉన్నాయి. నా ఆరాధన వల్ల నా భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగాని నాకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.


మరింత సమాచారం కోసం క్రింది లింక్ సందర్శించండి:

మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? (The Purpose of Creation)