షిర్క్ నాలుగు సూత్రాలు – షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ [పుస్తకం & వీడియో పాఠాలు]

al-qawaid-al-arbah.gif

ఇస్లాం ధర్మం యొక్క నాలుగు నియమాలు
(అల్ ఖవాఇద్ అల్ ఆర్బా)
షిర్క్ నాలుగు సూత్రాలు

మూలం:షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లాహ్ అలై)
అనువాదకులు:ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
పుస్తకం నుండి:ఇస్లాం మూల సూత్రాలు (హదీసు పబ్లికేషన్స్)

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [9 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ]


بسم الله الرحمن الرحيم

أسأل الله الكريمَ ، ربَّ العرش العظيم: أن يتولاّك في الدنيا والآخرة، وأن يجعلك مباركاً أينما كُنْتَ

మహోన్నత సింహాననానికి అధిపతి అయిన అల్లాహ్‌ దర్బారులో అభ్యర్ధించుకుంటున్నాను – ఆయన ఇహపరాలలో మిమ్మల్ని పర్యవేక్షిస్తూ ఉండుగాక! మీరెక్కడున్నా మిమ్మల్ని శుభవంతుల్ని చేయుగాక!

  وأن يجعلكَ مِمن إذا أعطي شَكَر، وإذا ابْتُلي صَبر، وإذا أذنب استغفر، فإن هذه الثلاث عنوانُ السعادة

కలిమిని ప్రసాదించినపుడు కృతజ్ఞతలు తెలుపుకునే, లేమికి గురి చేసినప్పుడు సహనం వహించే, తప్పులు జరిగిపోయినప్పుడు పశ్చాత్తాపం చెందే సజ్జనులకోవలో మిమ్మల్ని చేర్చుగాక!- ఈ మూడు విషయాలే మహాభాగ్యం అనబడతాయి.

اعلم أرشدك الله لطاعته أن الحنيفية – مِلةَ إبراهيمَ – : أنْ تَعبُدَ الله مُخلصاً له الدين، وبذلك أمرَ الله جميع الناس، وخَلَقهم لها ، كما قال

ఆరాధనలో ఏకాగ్ర చిత్తం కలిగి ఉండటం – ఇబ్రాహీం (అలైహిస్సలాం) అనుయాయునిగా మారటం – అంటే ఏమిటో తెలుసా?! ఒక్కడైన అల్లాహ్‌ను సేవించడంలో చిత్తశుద్ధినీ, వజ్ర సంకల్పాన్ని కనబరచటం! అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

“మేము మానవుల్ని, జిన్నుల్ని మా దాస్యం కోసమే పుట్టించాము.” (అజ్జారియాత్‌ 51:56)

فإذا عرفتَ أن الله خلقك لعبادته: فاعلم أنّ العبادةَ لا تُسمى عبادةً إلا مع التوحيد، (كما أنّ الصلاة لا تُسمى صلاة إلا مع الطهارة)

అల్లాహ్‌ తన దాస్యం కోసమే మిమ్మల్ని పుట్టించాడన్న సంగతి మీకు తెలిసినప్పుడు, ఆ దాస్యం స్వచ్చమైన – ఏకేశ్వరోపాసన (తౌహీద్‌) – తో కూడుకున్నదై ఉండాలన్న సత్యం కూడా మీరు తెలుసుకోవటం అవసరం. ఏ విధంగానయితే మీరు శుచీ శుభ్రతల (తహారత్‌)ను పాటించినపుడే నమాజ్‌ నెరవేరుతుందో అదే విధంగా అద్వితీయుడైన అల్లాహ్ కు భాగస్వామ్యం (షిర్క్‌)కల్పించకుండా ఉన్నప్పుడే దాస్యం స్వీకార యోగ్యం అవుతుంది.

فإذا دخل الشركُ في العبادة فسدتْ، (كالحَدَثِ إذا دخل في الصلاة) ، كما قال تعالى

ఆరాధన (దాస్యం)లోనే గనక “షిర్క్‌” వచ్చి చేరితే అది కలుషితం అయిపోతుంది.శుచీ శుభ్రతలను అశుద్ధ వస్తువులు పాడు చేసేసినట్లే షిర్క్‌తో కూడుకున్న పనులు స్వచ్చమైన తౌహీద్‌ను పాడు చేసేస్తాయి. దివ్యగ్రంథంలో అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు:

مَا كَانَ لِلْمُشْرِكِينَ أَن يَعْمُرُوا مَسَاجِدَ اللَّهِ شَاهِدِينَ عَلَىٰ أَنفُسِهِم بِالْكُفْرِ ۚ أُولَٰئِكَ حَبِطَتْ أَعْمَالُهُمْ وَفِي النَّارِ هُمْ خَالِدُونَ

“ముష్రిక్కులు అల్లాహ్‌ మసీదులలో సంరక్షకులుగా, సేవకులుగా ఉండటానికి పనికి రారు. ఎందుకంటే వారే స్వయంగా అవిశ్వాసులమని తమకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు. వారి కర్మలైతే అన్నీ వ్యర్థమై పోయాయి.నరకంలో వారు కలకాలం ఉండాలి.” (అత్‌ తౌబా 9:17)

فإذا عرفتَ أنّ الشرْكَ إذا خالط العبادة أفسدها وأحبط العمل وصار صاحبه من الخالدين في النار: عرفتَ أن أهمَّ ما عليك: معرفةُ ذلك؛ لعل الله أن يخلصك من هذه الشبكة، وهي الشرْكُ بالله

‘షిర్క్‌’ (భాగస్వామ్యం) వల్ల ఆరాధనలు, ఆచరణలన్నీ వ్యర్థమైపోతాయనీ, ముష్రిక్కుల పర్యవసానం నరకమని మీకు తెలిసిపోయిన మీదట, ఆ “షిర్క్‌” గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, దానిపట్ల జాగ్రత్త పడవలసిన బాధ్యత కూడా మీపై ఉంది; అప్పుడే మీరు ఆ వినాశకర చేష్ట నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోగలుగుతారు. దాని గురించి అల్లాహ్‌ ఇలా అంటున్నాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ

“అల్లాహ్‌ దృష్టిలో షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది.అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు.” (అన్‌ నిసా 4:116)

: وذلك بمعرفة أربع قواعد ذكرها الله في كتابه

అల్లాహ్‌ తన గ్రంథంలో ప్రస్తావించిన ఈ క్రింది నాలుగు ప్రధానాంశాలను తెలుసుకున్నప్పుడే దీని గురించిన పూర్తి అవగాహన ఏర్పడుతుంది.

మొదటి నియమం :

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వ్యతిరేకంగా వైర వైఖరిని అవలంబించి, కయ్యానికి కాలు దువ్విన అవిశ్వాసులు కూడా అల్లాహ్‌ను సృష్టికర్తగా, ఉపాధి ప్రదాతగా, విధాతగా అంగీకరించేవారు. కాని వారి ఈ అంగీకారం వారిని ఇస్లాంలో చేర్చలేకపోయింది. (అంటే ఒక్కడైన అల్లాహ్‌ను సేవించే వరకూ వారు ముస్లింలు కాలేకపోయారు.) దివ్యగ్రంథంలోని దైవోపదేశం ఇందుకు ప్రబల నిదర్శనం:

قُلْ مَن يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ أَمَّن يَمْلِكُ السَّمْعَ وَالْأَبْصَارَ وَمَن يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَيُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ وَمَن يُدَبِّرُ الْأَمْرَ ۚ فَسَيَقُولُونَ اللَّهُ ۚ فَقُلْ أَفَلَا تَتَّقُونَ

వారిని అడుగు : ఆకాశం నుండీ, భూమి నుండీ మీకు ఉపాధినిచ్చేవాడు ఎవడు? వినే శక్తీ, చూసే శక్తీ ఎవడి అధీనంలో ఉన్నాయి? ప్రాణములేని దాని నుండి ప్రాణమున్న దానినీ, ప్రాణమున్న దాని నుండి ప్రాణములేని దానినీ వెలికి తీసేవారు తప్పకుండా అంటారు. ఇలా అను: “అలాంటప్పుడు మీరు (షిర్క్‌కు వ్యతిరేకంగా నడవటం) మానుకోరేమిటి?” (యూనుస్‌ 10:31)

రెండవ నియమం :

తాము వాళ్ళను (తమ మిథ్యా దైవాలను, వలీలను) కేవలం సామీప్యం కోసం, సిఫారసు కోసమే పిలుస్తున్నామని ముష్రిక్కులు అనేవారు. ఈ సామీప్యానికి వారిచ్చే నిదర్శనం ఏమిటంటే ఈ వలీలు, పుణ్య పురుషులు తమను అల్లాహ్‌కు చేరువ చేస్తారని అనేవారు. కాని ఇది పచ్చి షిర్క్‌. ఈ సందర్భంగా అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు :

أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ ۚ وَالَّذِينَ اتَّخَذُوا مِن دُونِهِ أَوْلِيَاءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَا إِلَى اللَّهِ زُلْفَىٰ إِنَّ اللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِي مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ كَاذِبٌ كَفَّارٌ

ఇక ఆయనను వదిలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారు, (తమ ఈ చర్యకు సమర్థింపుగా) “వారు మమ్మల్ని అల్లాహ్‌ వద్దకు చేరుస్తారని మాత్రమే వారిని ఆరాధిస్తున్నాము” అని అంటారు.అల్లాహ్‌ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాదీ, సత్య ధిక్కారి అయిన ఏ వ్యక్తికీ అల్లాహ్‌ సన్మార్గం చూపడు.” (జుమర్‌-3)

సిఫారనుకు సంబంధించిన (అంటే వారు కల్పించుకున్న కాల్పనిక దేవుళ్ళు వారికి వారధిగా ఉంటారన్న వారి నమ్మకం షిర్క్‌ అని చాటి చెప్పే) ఆయతు:

وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَٰؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ ۚ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

“ఈ ప్రజలు అల్లాహ్‌ను కాదని తమకు నష్టాన్ని గానీ, లాభాన్ని గానీ కలిగించలేని వారిని పూజిస్తున్నారు.పైగా ఇలా అంటున్నారు : “వారు అల్లాహ్‌ వద్ద మా కొరకు సిఫారసు చేస్తారు.” (ప్రవక్తా!) వారితో ఇలా అను : ఆకాశాలలో గానీ, భూమిలో గానీ అల్లాహ్‌ ఎరుగని విషయాన్ని గురించి ఆయనకు మీరు తెలుపుతున్నారా?” ఆయన పరిశుద్దుడు.ఈ ప్రజలు చేసే షిర్కుకు అతీతుడు, ఉన్నతుడూను.” (యూనుస్‌ 10:18)

సిఫారసు రెండు రకాలు. ఒకటి: నకారాత్మక సిఫారను. రెండు : సకారాత్మక సిఫారసు.

1. నకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన వాటి కోసం దైవేతరుల ముందు అర్థించటం. దీనికి ఆధారం ఇది :

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ

“విశ్వసించిన ఓ ప్రజలారా! క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగ పడని, సిఫారసు కూడా చెల్లని, ఆ (చివరి) దినము రాక పూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరి సంపదలనుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మా ర్గులు”.’ (అల్‌ బఖర 2:254)


* ఈ సూక్తి గురించి వ్యాఖ్యానిస్తూ అల్లామా ఇబ్నె కసీర్‌ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు – అల్లాహ్‌ తన దాసులకు, తాను ప్రసాదించిన ఉపాధి నుండి, తన మార్గంలో ఖర్చుపెట్టమని ఆదేశిస్తున్నాడు.ఎందుకంటే వారు తవు ప్రభువు వద్ద తమ పుణ్య రాసులను సమకూర్చుకొవాలని! ప్రళయ దినం రాకముందే వారు ఈ పని చేసుకోవాలి.ఆ రోజు ఎంత కఠినమైనదంటే, ఆనాడక్కడ క్రయ విక్రయాలు గానీ, బేరసారాలు గానీ, స్నేహసంబంధాలు గానీ, రికమండేషన్లు గానీ ఏ మాత్రం పనికిరావు. పరిహారంగా సొమ్ము ఇవ్వటం కుదరదు. భూమండలం లోని బంగారాన్నంతటినీ ఇచ్చినా ఆనాడు మనిషి తనను విడిపించుకోలేడు. ఆవగింజంత ప్రయోజనం కూడా తన  ఆత్మకు చేకూర్చుకోజాలడు.

శంఖం ఊదబడిన రోజున వారు ఒక పట్టాన నిలదొక్కుకోవటం గానీ, ఒకరినొకరు పరామర్శించుకోవటం గానీ చేయలేరు. సిఫారసు చేసేవారి సిఫారసు కూడా ఏ విధంగానూ వారికి ఉపయోగ పడదు.


2. సకారాత్మక సిఫారసు : అంటే అల్లాహ్‌ను మాత్రమే వేడుకొనే సిఫారసు. సిఫారసు చేసేవాడు కూడా ఈ సిఫారసు మూలంగా ఆదరణీయుడవుతాడు. ఎవరి కోసమైతే సిఫారసు చేయబడుతుందో అతని వట్ల అల్లాహ్‌ కూడా ప్రసన్నుడవు తాడు. ఇటువంటి సిఫారసు కేవలం అల్లాహ్‌ నుండి మాత్రమే అర్థించబడుతుంది. ఎందుకంటే సిఫారసును ఆమోదించటం లేక ఆమోదించక పోవటమన్నది అల్లాహ్‌ అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది.కనుక దైవేతరుల నుండి అర్ధించేవాడు షిర్కుకు ఒడిగట్టినట్లే. ఎందుకంటే అతడు చేయరాని పనిని చేశాడు.’వేడుకోలు’కు విరుద్ధమైన వైఖరిని అవలంబించాడు.అల్లాహ్‌ కేవలం ఏకేశ్వరోపాసనను మాత్రమే ఇష్టపడతాడు. ఏకేశ్వరోపాసకులకై చేసే సిఫారసును మాత్రమే అంగీకరించి ఆమోదిస్తాడు. దివ్య ఖుర్‌ఆన్‌లో ఆయన సెలవిచ్చినట్లు:

مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ

“ఆయన సన్నిధిలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చెయ్యగల వాడెవ్వడు?” (అల్‌ బఖర 2:255)

يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ

“వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు, సిఫారసు వినటానికి అల్లాహ్‌ ఇష్టపడిన వాని విషయంలో తప్ప.” (అంబియా 21:28)

قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا

“ఇంకా ఇలా అను : సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్‌ చేతిలోనే ఉన్నది.” (అజ్‌ జుమర్‌ 29:44)

మూడవ నియమం:

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పెక్కు ఆరాధ్య దైవాలను పూజించే ప్రజల్లో ప్రభవింప జేయబడ్డారు.ఆ ప్రజల్లో కొందరు దైవదూతలను పూజించగా, మరి కొందరు దైవప్రవక్తలను ఆరాధించేవారు. కొందరు మహనీయులను కొలవగా, ఇంకొందరు చెట్టు పుట్టలను, రాళ్ళు రప్పలను కొలిచేవారు. మరికొందరు సూర్యచంద్రులను సేవించేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వీళ్ళందరి మిథ్యా విధానాన్ని అంతమొందించారు.ఈ విషయంలో వారి మధ్య ఎలాంటి వ్యత్యాసం కనబరచలేదు. దీనికి నిదర్శనం ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:

وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ

“పీడన ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు, అల్లాహ్‌నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడే వరకు ఈ అవిశ్వాసు లతో యుద్ధం చేయండి.” (అన్‌ఫాల్‌ 8:39)

సూర్యచంద్రుల దాస్యానికి సంబంధించిన నిదర్శనం ఇది:

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

“రేయింబవళ్ళు, సూర్యచంద్రులు అన్నీ ఆయన(అద్వితీయ శక్తికి) నిదర్శనాలలోనివి. కనుక మీరు సూర్యునికి గానీ, చంద్రునికి గానీ సాష్టాంగ పడకండి. మీకు దైవారాధన చేయాలనే ఉంటే ఈ నిదర్శనాలన్నింటినీ సృష్టించిన దైవానికి మాత్రమే సాష్టాంగపడండి.” (హామీమ్‌సజ్దా 41:37)

దైవదూతలను పూజించటం కూడా షిర్కేనన్న దానికి తార్కాణం:

وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا

“మీరు దైవదూతలను, దైవప్రవక్తలను మీ ప్రభువుగా చేసుకోమని ఆయన మిమ్మల్ని ఆదేశించటం లేదు.” ‘ (ఆలె ఇమ్రాన్‌ 3:80)

దైవప్రవక్తలను పూజించటం, అక్కరల కోసం వారిని అర్థించటం ‘షిర్క్‌’ అన్న దానికి ఈ సూక్తి నిదర్శనం:

وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ

(ఆ సన్నివేశాన్ని గురించి కాస్త ఆలోచించండి) “మర్యమ్‌ కుమారుడవైన ఓ ఈసా! నీవు మనుష్య జాతితో, అల్లాహ్‌ను కాదని నన్నూ, నాతల్లిని దేవుళ్ళుగా భావించండి అని బోధించావా? అని అల్లాహ్‌ అడిగినప్పుడు అతను ఇలా మనవి చేనుకుంటాడు: “నీవు అత్యంత పవిత్రుడవు! ఏ మాటను అనే హక్కు నాకు లేదో ఆ మాటను అనడం నాకు యుక్తమైన పని కాదు. ఒకవేళ నేను ఆ విధంగా అని ఉంటే, అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది. నామనస్సులో ఏముందో నీకు తెలుసు. నీమనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యదార్థాలన్నీ తెలిసిన మహా జ్ఞానివి.” (అల్‌ మాయిద 5:116)

ఇక ఔలియాలు, పుణ్యపురుషులకు సంబంధించిన నిదర్శనం (అంటే వాళ్ళను వేడుకుని, వాళ్ళ ఆధారంగా దేవుని సామీప్యం పొందవచ్చుననుకోవటం షిర్క్‌. ఇలాంటి వ్యవహారాలకు అల్లాహ్‌ అతీతుడు, ఉన్నతుడు). ఈ సూక్తిని గమనించండి:

أُولَٰئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا

“ఈ ప్రజలు ఎవరిని మొర పెట్టుకుంటున్నారో వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందడానికి మార్గాన్ని వెతుకుతున్నారు. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వారు, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు.” (బనీ ఇస్రాయీల్‌ 17:57)

ఇక చెట్టు పుట్టలు, రాళ్ళు రప్పలకు సంబంధించిన నిదర్శనం – అంటే వృక్షాలను, రాళ్ళను పూజించటం, మహనీయుల సమాధుల నుండి శుభం పొందాలని తాపత్రయ పడటం, తమ కష్టాలను, కడగండ్లను దూరం చేసుకోవటానికి వాళ్ళను మొక్కుకోవటం, వారి పేరున జంతువులను కోయటం, ఆ సమాధుల వద్ద కొంత కాలంపాటు గడపటం, అక్కడే ఆరాధనలు చేయటం, అక్కడి మట్టితో, వస్త్రాలతో ‘శుభం’ పొందగోరటం-ఇవన్నీ ‘షిర్క్‌’గా పరిగణించ బడతాయి. అల్లాహ్‌ ఈ విధంగా సెలవిచ్చాడు –

أَفَرَأَيْتُمُ اللَّاتَ وَالْعُزَّىٰ

ఇప్పుడు చెప్పండి : “ఈ లాత్‌, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్‌ల వాస్తవికత గురించి మీరు కాస్తయినా ఆలోచించారా?” (అన్‌ నజ్మ్‌ 53:19)


1 ఈ సూక్తికి వ్యాఖ్యానంగా హాఫిజ్‌ ఇబ్నె కసీర్‌ ఇలా అంటున్నారు: తనను తప్ప మరొకరిని పూజించమని అల్లాహ్ ఎన్నడూ ఆదేశించడు. తన దూతలను పూజించమని గానీ, తాను పంపిన ప్రవక్తలను ఆరాధించమని గానీ కోరడు. ఇస్లాం స్వీకరించిన తరువాత ధిక్కార వైఖరికి ఒడిగట్టమని కూడా అనడు. దైవేతరుల దాస్యం చేయమని పిలుపు ఇచ్చేవాడే ఇలాంటి ఆజ్ఞలు జారీ చేస్తాడు. దైవేతరుల దాస్యం కొరకు ఆహ్వానించిన వాడు నిశ్చయంగా  కుఫ్ర్కి (అవిశ్వాసానికి) ఒడిగట్టాడు. కాగా; దైవప్రవక్తలు సతతం ఈమాన్‌ గురించి మాత్రమే ఉపదేశిస్తారు. సాటిలేని సృష్టికర్తను నమ్మటం, దాస్యం చేయటమే ఈమాన్‌ బిల్లాహ్‌.

2. “ఊలాయి కల్లజీన……..” సూక్తి గురించి బుఖారీలో హజ్రత్‌ అబ్దుల్లాహ్ చే ఇలా ఉల్లేఖించబడింది – “ప్రజలు మొర పెట్టుకునే ఆ కొంతమంది ఎవరంటే వారు జిన్ను వర్గానికి చెందిన వారు. తరువాత వారు ఇస్లాం స్వీకరించారు.”

హజ్రత్‌ ఇబ్నె మస్‌వూద్‌ (రది అల్లాహు అన్హు) కథనం ఈ విధంగా వుంది: “ఈ ఆయతు జిన్నులను పూజించే అరబ్బులను ఉద్దేశించి అవతరించింది. ఆ జిన్నులు తరువాత ఇస్లాం స్వీకరించారు. ఆ సందర్భంగానే ఈ ఆయతు అవతరించింది. వాస్తవం అల్లాహ్‌ యెరుక” (షేఖ్‌ ముహమ్మద్‌ మునీర్‌ డెమాస్కసీ)


అల్లాహ్‌ ముష్రిక్కుల వైఖరిని ఖండిస్తూ ఈ ఆయతును అవతరింపజేశాడు. వాళ్లు విగ్రహాలను, దేవీదేవతలను పూజించేవారు. వాళ్ల పేరుతో కాబా గృహం మాదిరిగా కట్టడాలు నిర్మించేవారు.

లాత్‌ : తాయఫ్‌లో ఒక తెల్లని రాయి ఉండేది. దానిపై ఓ గృహం నిర్మించబడింది. అందులో అనేక తెరలు ఉండేవి. అనేక మంది సేవకులుండేవారు. దాని చుట్టూ మైదానాలుండేవి. తాయఫ్‌లో సఖీఫ్‌ తెగవారి దృష్టిలోఈ కట్టడం ఎంతో పవిత్రమైనదిగా, పూజనీయంగా ఉండేది.ఆ ప్రదేశంలో ఆ విగ్రహం ఉన్నందుకు ఖురైషులతోపాటు ఇతర అరబ్బు తెగలవారు కూడా గర్వపడేవారు.

ఉజ్జా: ఇదొక వృక్షం.ఇది ‘నఖ్లా’ అనే స్థలంలో ఉంది. ఈ “నఖ్లా’ మక్కా నగరానికి తాయఫ్‌ పట్టణానికి మధ్య ఉంది. ఈవృక్షంపై ఒక కట్టడం వెలిసింది. దానిపై కొన్ని పరదాలు వేలాడదీయబడ్డాయి. ఖురైష్‌ తెగవారు ఈ కట్టడాన్ని ఆరాధించేవారు. ఈ కారణంగానేనేమో ఉహుద్‌ యుద్ధ దినాన అబూ సుఫ్యాన్‌ ఈ కట్టడాన్ని తలచుకుంటూ”మాకు అండగా, ఉజ్జా దేవత ఉంది. మీకెవరున్నారు?!” అని ముస్లింలకు సవాలు విసిరాడు.దానికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రీయ సహచరుల చేత, “అల్లాహ్‌ మాకు అండగా ఉన్నాడు. మీకు అండగా ఎవరూ లేరు” అని చెప్పించారు.

మనాత్‌ : మక్కా-మదీనా నగరాల మధ్య ముసల్లల్‌ అనే స్ధలంలో ఈ విగ్రహం ఉండేది. అజ్ఞాన కాలంలో ఖుజాఅ, బెస్‌, ఖజ్రజ్‌ తెగల వారు ఈ విగ్రహానికి తమ శ్రద్ధాభక్తుల నివాళి ఘటించేవారు. హజ్‌ నెలలో కాబాకు వచ్చే యాత్రికులు ఈ స్థలం నుండే ఇహ్రామ్‌ దీక్ష బూనేవారు.ఈ కట్టడాలన్నింటినీ కూల్చడానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొంతమంది సహాబీలను పంపించారు. హజ్రత్‌ ఖాలిద్‌ బిన్‌ వలీద్‌ (రజి యల్లాహు అన్హు)ని మాత్రం “ఉజ్జా’ వైపునకు పంపారు.ఆయన ఆ కట్టడాన్ని నేలమట్టం చేస్తూ ఇలా పలికారు:-

ఓ ఉజ్జా! నేను నిన్ను ధిక్కరిస్తున్నాను. నీ పవిత్రతను కొనియాడబోను. అల్లాహ్‌ నీకు దుర్గతి పట్టించాడు.”

హజ్రత్‌ ముగీరా బిన్‌ షోబ (రజి యల్లాహు అన్హు), హజ్రత్‌ సుఫ్యాన్‌ (రజి యల్లాహు అన్హు)లను “లాత్‌’ విగ్రహం వైపునకు పంపించగా వారిద్దరూ కలసి ఆ విగ్రహాన్ని కూల్చివేశారు. ఆస్థలంలో ఒక మస్జిద్ను కూడా నిర్మించారు.ఈ విగ్రహం తాయఫ్‌ పట్టణంలో ఉండేది. మనాత్‌ విగ్రహం వైపునకు హజ్రత్‌ సుఫ్యాన్‌ పంపించబడ్డారు.ఆయన దాన్ని పడగొట్టారు. హజ్రత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ పడగొట్టారని కూడా ఒక ఉల్లేఖనం ఉంది.

మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సత్య ధర్మాన్ని తీసుకువచ్చారు. ఒక్కడైన సృష్టికర్తను సేవించమనీ, దైవారాధన స్వచ్భంగా ఉండాలనీ ఆయన ప్రజలకు బోధించారు. దురాచారాలను, షిర్కుతో కూడుకున్న కర్మలను ఆయన నిర్మూలించారు. ఆయన ప్రియ సహచరులు, వాళ్ల శిష్యులు కూడా ఈ సత్య ధర్మంపై స్థిరంగా ఉన్నారు. అయితే కాలక్రమేణా అనుయాయుల ధర్మావలంబనలో మార్చులు వచ్చాయి. ఆచరణలు కలగాపులగం అయి చాలా మంది ముస్లింలు షైతాన్‌ ఎత్తులకు చిత్తయిపోయారు. మిథ్యావాదులు ముస్లింలను లోబరుచు కున్నారు. వాళ్లు మళ్లీ విగ్రహారాధన వైపునకు మొగ్గసాగారు. తమకు తెలియ కుండానే వాళ్లు నెమ్మదిగా బహు దైవోపాసన వైపునకు తీసుకుపో బడుతున్నారు. కాని పండితులు ఈ విషయాన్ని పట్టించు కోవటం లేదు.ఇది ఎంతో శోచనీయం.

– షేక్‌ ముహమ్మద్‌ మునీర్‌ డెమాస్కసీ

హజ్రత్‌ అబూ వాఖిద్‌ లైసీ (రజి యల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలిసి హునైన్‌ వైపునకు బయలుదేరాము. ఆరోజుల్లోనే మేము దైవధిక్కార (కుఫ్ర్) ఊబిలో నుండి బయటపడి ఉన్నాము. దారిలో ఒక రేగి చెట్టు ఉండేది. బహు దైవారాధకులు ఆ వృక్షం వద్ద బైఠాయించేవారు. తమ ఆయుధాలను ఆ వృక్షానికి వ్రేలాడదీసేవారు. ఆ వృక్షం “జాతుల్‌ నవాద్‌”గా పిలువబడేది. ఆ వృక్షం వద్దకు సమీపించగానే, “దైవప్రవక్తా! ఏవిధంగానయితే ఈ వృక్షం వాళ్లకోసం ‘జాతుల్‌ నవాద్‌’గా ఉందో ఆ విధంగా మాక్కూడా ‘జాతుల్‌ నవాద్‌’ గా చేయండి”అని మేము ప్రాధేయపడ్డాము.దీనిపై మహాప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఆగ్రహం చెందారు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వ్యాఖ్యానించారు:

“అల్లాహు అక్బర్‌! ఇవైతే ప్రాచీన కాలవు ఆచారాలు. ఎవరి అధీనంలో నా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను. ఇస్రాయీల్‌ సంతతి వారు మూసా (అలైహిస్సలాం)తో అన్న మాటలే ఈనాడు మీరు అన్నారు.”వాళ్ళకున్న ఆరాధ్య దైవాల వంటివే మాకోసం కూడా కల్పించండి” అని ఇస్రాయీల్‌ వంశీయులు చెప్పి ఉన్నారు. మీరు ఒట్టి అజ్ఞానులు. మీరు మీ పూర్వీకులయిన యూదుల, కైస్తవుల పద్ధతులను అనుసరించేలా ఉన్నారు.” (తిర్మిజీ)

నాల్గవ నియమం :

ఈ కాలపు ముష్రిక్కులు పూర్వకాలపు ముష్రిక్కుల కన్నా కడు హీనంగా ఉన్నారు. ఎందుకంటే, పూర్వకాలపు ముష్రిక్కులు కలిమిలో షిర్క్‌ (బహు దైవోపాసన)కు పాల్చడే వారు. కష్టకాలం దాపురించగానే ఒక్కడైన దైవం వైపుకు చిత్తశుద్ధితో మరలేవారు. కాని ఈ కలికాలపు ముష్రిక్కులైతే కష్ట కాలంలోనే గాక,సుఖ సంతోషాల సమయాల్లో సైతం బహు దైవారాధనకు పాల్పడుతున్నారు. దైవ గ్రంథంలోని ఈ దైవోపదేశం ఇందుకు ప్రబల తార్కాణం :

فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ

“వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు.తరువాత ఆయన వారిని రక్షించి నేలపైకి తీసుకు రాగానే, అకస్మాత్తుగా వారు బహుదైవారాధన చేయటం ఆరంభిస్తారు.” (అన్‌కబూత్‌ 29:65)

మనలోని చాలా మంది తమ పూర్వీకుల, సజ్జనుల సమాధుల వద్దకు పోయి,వాటి ముందు చేయి చాచి అర్థించటం మనం చూస్తూ ఉన్నాము. కలిమిలోనూ లేమిలోనూ కూడా వీళ్లు ఈ పని చేస్తున్నారు. ప్రాచీన కాలపు ముష్రిక్కులే నయం. ఎందుకంటే వాళ్లు కష్టాల్లో మాత్రం నిజదైవం వైపునకు మరలి, కష్టాలు తీరిపోయిన తరువాత బూటకపు దైవాల వద్దకు పోయేవారు. కాని నవీన ముష్రిక్కులకు ఇలాంటి తేడా పాడా లేమీ లేవు. పైగా కష్టకాలంలో వీళ్ల బహు దైవోపాసనా చేష్టలు మరింత పెరిగిపోతున్నాయి. లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్‌ అలియ్యిల్‌ అజీమ్‌.

సర్వోన్నతుడైన అల్లాహ్‌ ఇలా సెలవిస్తున్నాడు:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلْ أَفَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ إِنْ أَرَادَنِيَ اللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَاشِفَاتُ ضُرِّهِ أَوْ أَرَادَنِي بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَاتُ رَحْمَتِهِ ۚ قُلْ حَسْبِيَ اللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ

“మీరు అల్లాహ్‌ను కాదని వేడుకునే మీ దేవీలు ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్‌ నాపై కనికరం చూపగోరికే, వారు ఆయన కారు ణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయ మేమిటీ? కనుక వారితో ఇలా అను : “నాకు అల్లాహ్‌ ఒక్కడే చాలు. నమ్ముకునే వారు ఆయననే నమ్ముకుంటారు.” (అజ్‌ జుమర్‌ 39:38)

ఇంకా ఈ విధంగా ఉపదేశించబడింది:

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

“కలత చెందినవాడు మొర పెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి, అతని బాధను తొలగించేవాడు ఎవడు? భూమిపై మిమ్మల్ని ప్రతినిధులుగా చేసినవాడు ఎవడు? అల్లాహ్‌తో పాటు (ఈ పనులు చేసే) మరొక దేవుడు కూడా ఎవడయినా ఉన్నాడా? కాని మీరు చాలా తక్కువగా ఆలో చిస్తారు?” (అన్‌ నమల్‌ 27:62)

ఇంకా ఈ విధంగా సెలవీయబడింది :

يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ

“ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా, వాటికి ఏ నమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయంనాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసినవాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజెయ్యలేడు.” (ఫాతిర్‌ 35: 13,14)

ఇంకా ఈ విధంగా కూడా ఉపదేశించబడింది:

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

“అల్లాహ్‌ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి నమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడా ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమభ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశ పరచినప్పుడు, వారు తమనువేడుకున్న వారికి విరోధులై పోతారు. వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ 46:5,6)


[వీడియో పాఠం]

షిర్క్ కి సంబంధించిన నాలుగు సూత్రాలు (The Four Principles of Shirk)
https://youtu.be/nAglSs0ggPE [~ 40 నిముషాలు]
వక్త: సయ్యద్ అబ్దుస్సలామ్ ఉమ్రి (హఫిజహుల్లాహ్)

 

ప్రవక్తలను, సందేశహరులను عليهم السلام అల్లాహ్ ఎందుకు పంపెను?

prophets-telugu-islamరచయితలు : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.

ఎప్పుడైతే ప్రజలు సర్వలోక సృష్టికర్త యొక్క ఏకదైవారాధనను వదిలి, షిర్క్ (ఏకైక దైవారాధనలో ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం) అనే అంధవిశ్వాసాల్ని, సహేతుకం కాని సిద్ధాంతాల్ని కనుగొన్నారో, అప్పటి నుండి తన భక్తులను కేవలం తనను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించటానికి, ఆరాధనలలో ఇతరులను తనతో జత పరచ వద్దని ఆజ్ఞాపించటానికి మరియు వారిని బహుదైవారాధనపు గాఢాంధకారంలో నుండి ఏకైక దైవారాధనపు వెలుగు లోనికి తీసుకు రావటానికి అల్లాహ్ తన ప్రవక్తలను మరియు సందేశహరులను పంపటం మొదలు పెట్టినాడు. ప్రవక్తలందరూ తౌహీద్ (ఏకైక దైవత్వం అంటే మహోన్నతమైన మరియు అత్యంత ప్రశంసనీయమైన అల్లాహ్ యొక్క ఏకైకత్వంలో విశ్వాసం)నే బోధించారు. ఖుర్ఆన్ లోని క్రింది వచనాలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి:

వాస్తవంగా మేము నూహ్ ను అతని జాతి వద్దకు పంపాము. అతను వారితో ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నానుఅని అన్నాడు(7:59)

మరియు మేము ఆద్ జాతి వద్దకు, వారి సోదరుడైన హూద్ ను పంపాము. అతను:ఓ నా జాతి సోదరులారా! మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమిటీ? మీకు దైవభీతి లేదా? (7:65) ఇది ఆద్ జాతి కు వచ్చిన ప్రవక్త సందేశం.

మరియు మేము మద్యన్ జాతి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము) అతను వారితో అన్నాడు: నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చియున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తి నిజాయితీతో ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై శాంతి స్థాపించబడిన తర్వాత మరల కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది (7:85). ఇది మద్యన్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన ప్రకటన.{మద్యన్ అనేది ఒక తెగ & నగరపు పేరు. వారి వద్దకు షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్త గా  పంపబడ్డారు. మద్యన్ యొక్క  మరొక పేరు అయ్ కహ్. మృత సముద్రానికి తూర్పున, అఖాభా అగాధం నుండి (Gulf of Aqaba) పడమటి వైపు ఉన్న సినాయి ద్వీపకల్పం మరియు మోఆబ్ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నది. అక్కడ నివసించే వారు ఆమోరైట్ తెగకు చెందిన అరబ్బులు. షుఐబ్ మరో పేరు ఎత్రో (Jethro)}

ఇక సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాము. అతను వారితో:“నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు(7:73) ఇది సమూద్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు రమ్మని ఆహ్వానించిన ప్రకటన.{సమూద్ ప్రజలు ఆద్ జాతికి చెందిన నబాతియన్ తెగకు చెందిన వారు. రెండవ ఆద్ జాతిగా ప్రసిద్ధి చెందినారు. వారు హిజాజ్ ఉత్తర భాగంలో ఉండేవారు. ఆ ప్రాంతం వాది అల్ ఖురా అనబడుతుంది. వారు ఆ పర్వత ప్రాంతంలో కొండలను తొలిచి గుహలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ సాలెహ్. నేటికీ అవి ఆ పేరుతోనే పిలవబడుతున్నాయి. ఇది మదీనా పట్టణం మరియు తబూక్ పట్టణాల మధ్య ఉన్నది. ఇప్పటికీ వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి.}

మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపాము.(అతడన్నాడు): మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి (16:36)

అల్లాహ్ ప్రతి ప్రవక్తను ఆయన స్వంత జాతి వద్దకు  వారి మార్గదర్శకత్వం కోసం పంపెను. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మొత్తం మానవజాతి మరియు జిన్నాతుల మార్గదర్శతక్వం కోసం పంపెను. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లోని (7:158) వచనం ధృవీకరుస్తున్నది-(ఓ ముహమ్మద్!) ఇలా ప్రకటించు:మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను

మరియు నేను జిన్నాతులు మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాదించటానికే! (51:56)

ఇంకా ఖుర్ఆన్ లోని అనేక వచనాల మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల వలన స్పష్టమవుతున్న దేమిటంటే, మానవాళికి మార్గదర్శకత్వపు అవసరం కలిగినప్పుడు,  అల్లాహ్ ప్రవక్తలను పంపినాడు.

English Source: Appendix II from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

జీసస్ మరియు ముహమ్మద్ (అల్లాహ్ వారిపై శాంతి కురిపించుగాక!) బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో

బిస్మిల్లాహ్

జీసస్ మరియు ముహమ్మద్ (అల్లాహ్ వారిపై శాంతి కురిపించుగాక!) బైబిల్ మరియు ఖుర్ఆన్ లలో

జీసస్ (యేసు) – ఏకైక సృష్టికర్త యొక్క దాసుడని మరియు ఆయనకు దైవత్వంలో ఎటువంటి భాగస్వామ్యం లేదనే కఠోర సత్యం గురించి బైబిల్ లోని దివ్యవచనాల ద్వారా ధృవీకరణ

నిర్మాణం : డా.ముహమ్మద్ తకి ఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
క్లుప్త వివరణ: ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.

Jesus and Muhammad (peace be upon them) in the Bible and Qur’an: Biblical evidence of Jesus being a servant of God and having no share in divinity –

By Dr.M.T.Al-Hilali,Ph.D in the appendix in the book “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan

[ఇక్కడ చదవండి / డౌన్ లోడ్ చేసుకోండి]

ఈ పుస్తకం లో క్రింది విషయాలు చర్చించ బడ్డాయి:

  • – బైబిల్ లో జీసస్ అలైహిస్సలాం మరియు సైతాను
  • – దేవుని బిడ్డ
  • – ప్రభువే తండ్రి
  • – జీసస్ అలైహిస్సలాం– ఏక దైవారాధకుడు, దైవభక్తుడు
  • – బైబిలులోని ఒక వృత్తాంతం.
  • – జీసస్: అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త
  • – జీసస్ : అల్లాహ్ యొక్క ఒక దాసుడు.
  • – బైబిల్ సంకలనం
  • – జీసస్: ఏకదైవత్వ(తౌహీద్) బోధకుడు
  • – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం గురించిన బైబిల్ లోని భవిష్యద్వాక్యాలు
  • – శిలువ గాథ పై కల్పించబడిన వాదనల పై చివరి మాట

జీసస్ (యేసు) – ఏకైక సృష్టికర్త యొక్క దాసుడని మరియు ఆయనకు దైవత్వంలో ఎటువంటి భాగస్వామ్యం లేదనే కఠోర సత్యం గురించి బైబిల్ లోని దివ్యవచనాల ద్వారా ధృవీకరణ 

ఉపోద్ఘాతం

అన్ని విధాల ఘనతలకు, గౌరవ మర్యాదలకు, సత్కారములకు, కీర్తిప్రతిష్టలకు యోగ్యుడైన ఆ ఏకైక సర్వలోక సర్వాధికారికే సకల ప్రశంసలు చెందుతాయి. ఆయన పరిపూర్ణమైన లక్షణాలన్నీ కలిగి ఉన్న ఏకైకుడు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరికీ సంతానం కాదు. ఆయనకు సరిసమానుడెవరూ లేరు. అయనే సర్వలోక శక్తిమంతుడైన, ఏకైక దివ్యశక్తి.

‘అన్ని రకాల ఆరాధనలకు అర్హత కలిగిన, ఏకైకుడైన ఆయననే కేవలం ఆరాధించమని బోధిస్తూ మరియు బహుదైవారాధన, ఏకైక ఆరాధ్యుడైన అల్లాహ్ కు భాగస్వాములను జతచేయడం, సృష్టితాలను ఆరాధించటం మొదలైన అత్యంత ఘోర పాపముల యొక్క శాశ్వతమైన, భయంకరమైన, భరించలేని దుష్పరిణామాల గురించి ప్రజలను హెచ్చరిస్తూ’ మానవాళికి ఏకైక దైవత్వపు మార్గదర్శకత్వాన్ని వహించటానికి, ఆయన తన సందేశహరులను, ప్రవక్తలను పంపాడు.

 అల్లాహ్ యొక్క అందరు ప్రవక్తల పై, సందేశహరుల పై ముఖ్యంగా అంతిమ సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ప్రళయ దినం వరకు ఆయనను ధార్మికంగా అనుసరించే వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు దీవెనలు కలుగు గాక . ఆమీన్!!

బైబిల్ లో జీసస్ అలైహిస్సలాం మరియు సైతాను

 బైబిల్ యొక్క క్రొత్త నిబంధనలలో అంటే మత్తాయి గోస్పెల్ లోని నాలుగవ అధ్యాయంలోని ఆరవ మరియు ఏడవ వచనంలో ‘జీసస్ – మరణాన్ని తప్పించుకోలేని ఒక విధేయుడైన దైవదాసుడని (an obedient mortal), ఇంకా దైవమే అతడి యజమాని మరియు ప్రభువని’ ఏడవ వచనంలోని జీసస్ బోధనలలో స్పష్టంగా ఉన్నది.

“ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి యున్నదని వానితో చెప్పెను”.

ఈ అధ్యాయంలో వాస్తవానికి సైతాను మెస్సయ్యా ను ఒకచోట నుండి మరొక చోటుకు మోసుకుంటూ పోయాడని మనం చదువుతాం. సైతాను దేవుడిని ఎలా మోసుకు పోగలడు? సకల ప్రశంసలకు అర్హుడైన అల్లాహ్ మహోన్నతుడు.  అటువంటి అపనిందలు blasphemy ఆయన దరిదాపులకి కూడా చేరలేవు!

అప్పుడు సైతాను ఆయనను తన ముందు సాష్టాంగ పడమని మరియు తనను ఆరాధించమని ఆజ్ఞాపించినది. ఇంకా ప్రాపంచిక భోగభాగ్యాలను ప్రసాదిస్తానని ఆశ చూపినది. ఎరగా చూపించినది. సైతాను దేవుడితో నిర్భయంగా అలా పలికే సాహసం ఎలా చేయగలదు? ఎప్పుడైతే సైతాను జీసస్ ను తన ఆజ్ఞలను అనుసరించమని ఆదేశించినాడో, ఇలా (పూర్వగ్రంథాలలో) వ్రాయబడి ఉన్నదని సైతానుకు జీసస్ జవాబిస్తారు:”ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను”. Matthew 4:10 

దేవుని బిడ్డ

Son of God దేవుని బిడ్డగా జీసస్ తనను తాను ఏనాడూ పిలుచుకోలేదు కాని మనిష్య కుమారునిగా (Mark 2:10) ఆయన తనకు తాను పిలుచుకుని ఉన్నాడు. బైబిల్ తో తెలిపినట్లుగా, ఎవరైనా అలా పిలిచినా ఆయన వారించ లేదు ఎందుకంటే అలాంటి పిలుపును కేవలం తన కోసమే ప్రత్యేకించుకోలేదు.

పాత, క్రొత్త నిబంధనలలోని బైబిల్ పదాల పరిభాష ప్రకారం దేవుడి భయభక్తులు గల ప్రతి ఒక్క పుణ్యపురుషుడు ‘Son of God’ దేవుని బిడ్డగా పిలవబడును.

Matthew 5:9 లో మనం ఇలా చదువుతాం: “సమాధాన పరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనుబడుదురు”

మత్తయి 5:44లో – “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు”

ప్రభువే తండ్రి

Matthew 5:48 లో–”మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు”

Matthew 6:1 లో– “లేనియెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు”.

Matthew 7:21 లో – “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును”.

గమనిక – ఇక్కడ వాడబడిన ‘Lord ప్రభువా’ అనే పదం అరబీ భాషలోని బైబిల్ లో ‘రబ్’ అని అనువదించబడినది. అలా చేయటం ద్వారా ప్రజలను ‘జీసస్ యే దేవుడు!’ వొప్పించవచ్చును.  కాని మిగిలిన ఆ వచనాన్ని పూర్తిగా చదివినట్లయితే, అసలైన దేవుడికి మెసయ్యా – జీసస్ విధేయతగా, అణుకువగా తన ఇచ్ఛను సమర్పించుకున్నాడనే విషయం పై  ఆ వచనం  సాక్ష్యమిస్తున్నదని గమనిస్తారు. కావున అక్కడ ఉండవలసిన సరైన అనువాదం :

“నాతో ‘ఓ యజమాని, ఓ యజమాని’ అని పలికిన ప్రతివారూ స్వర్గసామ్రాజ్యంలో ప్రవేశించరు. కాని స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్ఛానుసారం జీవించివారే స్వర్గంలో ప్రవేశిస్తారు.”

బైబిల్ లోని పై వచనాన్ని చదవటం ద్వారా ‘Father – తండ్రి’ అనే పదం అనేక చోట్ల అసలైన దేవుడి కోసం వాడబడినది.  ఆ పదం కేవలం జీసస్ కోసమే ప్రత్యేకంగా వాడబడలేదు.

Matthew 11:25 లో – “ఆ సమయమున యేసు చెప్పినదేమనగా – తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను” 

జీసస్ అలైహిస్సలాంఏక దైవారాధకుడు, దైవభక్తుడు

Matthew 14:23 లో – “ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ యెక్కి పోయి, …”.

ఒకవేళ జీసస్ యే గనుక దేవుడైతే లేక దైవుడిలోని భాగమైతే ఆయన ఎందుకు ప్రార్థిస్తాడు? వాస్తవానికి ప్రార్థన అనేది సమర్పించుకున్న వారి వైపు నుండి, అవసరాలున్న వారి వైపు నుండి మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన వారి వైపు నుండి ఉంటుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటిస్తున్నాడు:

“ఓ మానవులారా! అల్లాహ్ అక్కర గలవారు మీరే. వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు” (V. 35:15)

“ఎందుకంటే భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు” (V. 19:93)

బైబిలులోని ఒక వృత్తాంతం.

Matthew 15: 22 – 28 –  “ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి – ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యము పట్టి, బహు బాధపడుచున్నదని కేకలు వేసెను! అందుకాయన ఆమెతో ఒక్క మాట యైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి – ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని అనెను. ఆయనను వేడుకొనగా! ఆయన – ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడ లేదనెను! అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి – ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను! అందుకాయన – పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా! ఆమె – నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను! అందుకు యేసు – అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.”

కనాన్ కు చెందిన ఒక స్త్రీ కు చెందిన ఈ వృత్తాంతంలో గమనించ దగిన కొన్ని ముఖ్య సూచనలు ఉన్నాయి:

ఇక్కడ ప్రవక్త జీసస్ (ఈసా) అలైహిస్సలాం పై దయాదాక్షిణ్యాలు మరియు ప్రేమాభిమానాలు లేనివారుగా ఇక్కడ భాండం వేయబడినది, నింద మోపబడినది. (ఒకవేళ ఆ వృత్తాంతం కరక్టుగా వ్రాయబడి ఉన్నట్లయితే)

  1. ఆయన తన తెగనే ఉన్నతమైన మార్గం వైపు తీసుకుపోతూ, ఇతరులను చిన్నబుచ్చి కులవిచక్షణ చూపినట్లు తెలుపబడినది.
  2. ఆయన ఇతర తెగలను కుక్కలని పిలిచి దురభిమానం చూపిస్తూ, వారిపై తన తెగ వారికి దర్పాన్ని ఇచ్చినట్లు పేర్కొనబడినది.
  3. ఇక్కడ అజ్ఞానంలో మునిగి ఉన్న బహుదైవారధకురాలైన ఒక స్త్రీ ఆయనతో వాదులాడి, గెలిచినది అని తెలియజేయబడినది.

జీసస్: అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త

Matthew 19:16 – 17 “ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి – బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను! అందుకాయన – మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను”.  పై వచనంలో అల్లాహ్ వైపునకు ఆయన యొక్క విధేయతా పూర్వకమైన సమర్పణ కనబడుతున్నది.

Matthew 21:45 – 46 “ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి! ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి”.

జీసస్ ను ఆయన జీవితకాలంలో విశ్వసించిన సహచరులు, వారిని దేవుడని లేక దేవుడి కుమారుడని లేక ట్రినిటీలో తెలిపిన విధంగా ముగ్గురిలో ఒకరని నమ్మలేదని ఇక్కడు ఋజువు అవుతున్నది; కాని వారు ఆయనను కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే విశ్వసించారని తెలుస్తున్నది.. ఎవరైతే జీసస్ కు దైవత్వాన్ని ఆపాదిస్తున్నారో, వారికి వ్యతిరేకంగా నిరూపితమైన ఒక బలమైన ఆధారం.  కృతనిశ్చయంతో, చిత్తశుద్ధితో గమనిస్తేనే వారు దీనిని గ్రహించగలరు.

జీసస్ : అల్లాహ్ యొక్క ఒక దాసుడు.

Matthew 23:8 – ‘But be not ye called Rabbi: for one is your master, even Jesus, and all ye are brethren.’ “మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు”. (“Even Jesus” యొక్క  అనువాదం తెలుగు బైబిల్ లో లేదు)

జీసస్ ఇక్కడ అల్లాహ్ యొక్క దాసుడని. ఇంకా, అక్కడ ఒకే ఒక యజమాని ఉంటాడని ఆయనే అల్లాహ్ అని ఋజువు అవుతున్నది. అరబీ భాషలోని బైబిల్ లో జీసస్ ను యజమాని అనే అర్థం వచ్చేటట్లుగా అనువదించారు. కాని ఇంగ్లీషు అనువాదం లో అలా చేయక పోవటం వలన వాస్తవ భావానికి కొంచెం చేరువలో ఉన్నది.

Matthew 23:9 – “మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోక మందున్నాడు”.

పితృత్వం మరియు పుత్రత్వం అనేది దైవానికి మరియు ఆయన దాసులకు మధ్య ఉన్న సంబంధమని దీని ద్వారా మీరు గమనించగలరు: ఇది సాధారణ పదంగా వాడబడినదే గాని జీసస్ కోసం ప్రత్యేకించబడలేదు.

Matthew 24:36 – “అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.”

 అంతిమ ఘడియ గురించి కేవలం ఒక్క అల్లాహ్ కు మాత్రమే తెలుసుననటానికి ఇది ఒక ఖచ్చితమైన ఋజువు. కాబట్టి జీసస్ యొక్క జ్ఞానం ఇతర మానవుల వలె అసంపూర్ణమైనది.  కేవలం అల్లాహ్ మాత్రమే అన్నీ ఎరిగిన సర్వజ్ఞుడు.

Matthew 26:39 – “కొంత దూరము వెళ్ళి సాగిలపడి – నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయనను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను”.

ఇక్కడ అల్లాహ్ యొక్క ఇష్టాయిష్టాలకు సమర్పించుకోవటం గురించే కాక ఆయన అల్లాహ్ యొక్క దాసుడు అనే వాస్తవం గురించి కూడా ప్రస్తావించబడినది. కేవలం అల్లాహ్ మాత్రమే దేనినైనా మార్చగలడు.

బైబిల్ సంకలనం

Matthew 27:7 – 8 – “కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి! అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది”.

బైబిల్ (కొత్త నిబంధనలు) జీసస్ కాలంలో వ్రాయబడలేదని, ఆ సంఘటనలు జరిగిన చాలా కాలం తర్వాత ప్రజల జ్ఞాపకాలలో నుండి వెలికితీసి వీటిని వ్రాయటం జరిగినదని ఈ వచనాల ద్వారా స్పష్టమవుతున్నది.

Matthew 27:46 – “And about in the ninth hour Jesus cried with a loud voice, saying, ‘Eli, Eli, Iama sabachthani? (My God, My god, why hast Thou forsaken me?’)”

తనను శిలువ మీద పెట్ట చిల్లులు కొట్టినప్పుడు జీసస్ పై వాక్యాలు బిగ్గరగా పలుకుతూ ఏడ్చినాడని క్రైస్తవుల అభిప్రాయం. ఇది జీసస్ పై మోపబడిన ఒక ఘోరమైన అపవాదు. ఈ పదాలను గమనించినట్లయితే, అలాంటివి కేవలం అవిశ్వాసుల నుండి మాత్రమే వెలువడగలవని తెలుస్తుంది. ఇంకా, అలాంటి పదాలు అల్లాహ్ యొక్క ప్రవక్త నుండి వెలువడినాయనటం ఒక అమితాశ్చర్యకర మైనది. ఎందుకంటే అల్లాహ్ ఎప్పుడూ తన వాదనను భంగం చేయడు మరియు ఆయన ప్రవక్తలు ఆయన వాదనాభంగం గురించి ఆయనకు ఏనాడూ ఫిర్యాదు చేయరు.

జీసస్: ఏకదైవత్వ(తౌహీద్) బోధకుడు

John 17:3 లో– అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము“.

Mark 12:28 – 30 శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి – ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను! అందుకు యేసు – ప్రధానమైనది ఏదనగా – ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు! నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ“.

Mark 12:32 –  ఆ శాస్త్రి – బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.

Mark 12:34 – “… నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను“.

పై వచనాలలో, జీసస్ అలైహిస్సలాం స్వయంగా సాక్ష్యం ఇలా ఉన్నది – అల్లాహ్ ఒకే ఒక ఆరాధ్యుడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ ఆరాధ్యులు లేరు, అల్లాహ్ యొక్క ఏకైకత్వాన్ని విశ్వసించిన వారు ఆయన యొక్క సామ్రాజ్యానికి దగ్గరలో ఉంటారు. కావున, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిన వారు లేదా ట్రినిటీలో నమ్మకం ఉంచినవారు ఆయన యొక్క సామ్రాజ్యానికి బహుదూరంగా ఉంటారు, మరియు వారు అల్లాహ్ కు శత్రువులుగా పరిగణింపబడతారు.

Matthew 24:36 – అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు

అంతిమ ఘడియ ప్పుడు వస్తుందో ఒక్క అల్లాహ్ కు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు అనే ఖుర్ఆన్ లోని ప్రకటన లాంటిదే మత్తాయి బైబిల్ లో కూడా ఉన్నది. ఇంకా అల్లాహ్ కు జీసస్ విధేయతాపూర్వకంగా సమర్పించుకున్నాడని మరియు దైవత్వంలో ఆయనకు ఎలాంటి భాగస్వామ్యం లేదనే వాస్తవాన్ని ధృవీకరిస్తుంది: ఆయన దేవుడి అవతారమనే విషయం కేవలం కనాన్ ప్రజల కల్పితం మాత్రమే.

John 20:16 – 18 యేసు ఆమెను చూచి – మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము! యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి – నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పు మనెను! మగ్దలేనే మరియ వచ్చి – నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను“.

పై వచనాలలో జీసస్ చాలా స్పష్టంగా ‘అల్లాహ్ యే తన దైవమని మరియు మిగిలిన వారి దైవమని, అల్లాహ్ యొక్క ఆరాధనలో తనకు మరియు వారికి ఎటువంటి భేదం లేదని’ ధృవీకరించెను. జీసస్ కూడా దేవుడే అనేవారు తప్పక అల్లాహ్ పై ఘోర అపనింద మోపినవారవుతారు మరియు జీసస్ ను, అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ, అల్లాహ్ యొక్క  సందేశహరులందరినీ  మోసం చేసిన వారవుతారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆగమనం గురించిన బైబిల్ లోని భవిష్యద్వాక్యాలు

John 14:15 – 16“మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు! నేను తండ్రీని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకైన ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.”

ముస్లిం ధర్మవేత్తలు ఇలా తెలిపారు – “మరొక ఆదరణ కర్త” అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం; మరియు “ఎల్లప్పుడూ ఉండేది” అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క ధర్మాదేశాలు మరియు ఆయనపై అవతరింపజేసిన ఖుర్ఆన్.

John 15:26 – 27 – తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియైన అత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును! మీరు మొదటనుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు

John 16:5 – 8 – ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్ళుచున్నాను – నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దు:ఖముతో నిండియున్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళనియెడల ఆదరణకర్త మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును

John 16:12 – 14 – నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు! అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును! ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును.

John 16:16 – కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళ్ళుచున్నాను“.

ముస్లిం ధర్మవేత్తల ఇలా ధృవీకరిస్తునారు –  పైన తెలిపిన బైబిల్ వచనాలలో జీసస్ తర్వాత వచ్చే ప్రవక్త గురించిన వివరణలు కేవలం అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోనే ఏకీభవిస్తున్నాయి. తన తర్వాత వచ్చే అతని పేరును జీసస్ ‘Parqaleeta’ అని పిలిచెను. ఈ పదాన్ని తర్వాతి బైబిల్ వ్యాఖ్యానకర్తలు, అనువాదకర్తలు తొలగించివేసి, క్రమంగా దానిని ‘Spirit of Truth’ సత్యమైన ఆత్మ అని, మరికొన్ని చోట్ల, ‘Comforter’ ఆదరణకర్త అని మరియు మరికొన్ని చోట్ల ‘Holy Spirit’ దివ్యాత్మ అని మార్చివేసినారు. దీని అసలు పదం గ్రీకు భాషలో ఉన్నది. దాని అసలు అర్థం ‘one whom people praise exceedingly – ప్రజలచే అపరిమితంగా ప్రశంసించ బడేవాడు’. ఇదే పదం అరబీ భాషలోని ‘Muhammad అంటే ప్రశంసింపబడేవాడు’ అనే పదానికి సరిగ్గా సరిపోతున్నది.

శిలువ గాథ పై  కల్పించబడిన వాదనల పై చివరి మాట

1) జీసస్ యొక్క ముఖము యూదులకు తెలుసునని బైబిల్ సాక్ష్యమిస్తున్నది; జెరుసలెంలోని సోలొమాన్ ఆలయంలో ఆయన వారికి బోధించేవారు, ఉపదేశాలు చేసేవారు. కాబట్టి, మత్తాయి బైబిల్ తెలిపినట్లు, ముప్పై వెండినాణాలకు ఒక యూదుడిని బాడుగకు కుదుర్చుకోవటం అనవసరమైన విషయం కాదా?

2) 12 మంది సహచరులలో ఒకడైన జుదాస్ ఇస్కారియట్ Judas Iscariot అనే అతడిని జీసస్ ను చూపటానికి బాడుగకు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత జీసస్ ను శిక్షించటం చూసి, అతడు చాలా సిగ్గుపడి, వారి ఆ పని తనను తాను వేరు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా 24గంటల లోపు జరిగి పోయినది. ఇందులోని వ్యత్యాసములు చాలా స్పష్టంగా బహిర్గతమవుతున్నాయి.

3) యూదులు జీసస్ కు మరణశిక్ష విధించి, అనుమతి కోసం పిలాతు Pontius Pilate అనే గవర్నరు వద్ద అనుమతి పొందటానికి ప్రయత్నించిన స్పష్టమైన క్రింది సంఘటన ఒక్కటి చాలు, జీసస్ యొక్క శిలువ వృత్తాంతంలోని అసత్యాలను బయటికి లాగటానికి.

Matthew 27:11 – 14 – యేసు అధిపతి యెదుట నిలిచెను; అప్పుడు అధిపతి – యూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచి – నీవన్నట్టే అనెను! ప్రధాన యాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు! కాబట్టి పిలాతు – నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయనను అడిగెను! అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కలి ఆశ్చర్యపడెను“.

పై వృత్తాంతానికి క్రైస్తవులు ఇచ్చే వివరణ – సమస్త మానవాళి విముక్తి కోసం, విమోచన కోసం, మోక్షం కోసం మరియు మానవాళి యొక్క పాప ప్రక్షాళణ కోసం, ఇంకా వాటిని క్షమింపజేయటానికి జీసస్ శిలువ పై కెక్కి మరణించాలని కోరుకున్నాడు. ఒకవేళ అదే నిజమైతే, జీసస్ ఎందుకని మరణం నుండి తనను తప్పించమని అడిగినాడు? శిలువ మీద నుండి (వారి అభిప్రాయం ప్రకారం) ఆయన ఎందుకు ఇలా ఏడ్చినాడు: “ఓ దేవా, నన్నెందుకు విడిచి పెట్టినావు?” సత్యాన్ని ఆక్షేపిస్తున్నప్పుడు, సవాలు చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు మౌనం వహించాడు? ఆయన ఆత్మలను ప్రేరేపించే విధంగా యూదు పండితులను సవాలు చేస్తూ, ఉపన్యాసాలు ఇవ్వడంలో ప్రఖ్యాతి గాంచినాడు. ఊహలో ఉన్న ఏ వ్యక్తి అయినా దీనిని ఎలా నమ్మగలడు? ఒకవేళ శిలువ వృత్తాంతమే సత్యమైనదిగా ఋజువు కాకపోతే, దాని ఆధారం పైనా ఉన్న మొత్తం క్రైస్తవపు పునాదులే కదిలిపోతాయి.

యూదులచే జీసస్ శిలువపై చంపబడలేదు అనేది ముస్లింల విశ్వాసం. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ అవతరింపజేసిన పవిత్ర వచనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి: మరియు వారు: ‘నిశ్చయంగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యం కుమారుడైన ఈసా మసీహ్ (యేసు క్రీస్తు) ను చంపాము’ అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువ పై ఎక్కించనూ లేదు. కాని వారు భ్రమకు గురిచేయబడ్డారు (అతని లాంటి మరొక వ్యక్తిని శిలువ పైకి ఎక్కించారు). నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊపలనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. వాస్తవానికి అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. V. 4:157, 158

మొత్తం క్రైస్తవులతో పాటు యూదులు కూడా స్వయంగా జీసస్ శిలువ పై మరణించాడనే విశ్వసించారు. వారి అభిప్రాయాలకు విరుద్ధంగా, ఇస్లామీయ ప్రకటనలోని సత్యాన్ని బైబిల్ ద్వారా నిరూపించటానికి మత్తాయి కొత్త నిబంధనల (26 మరియు 27 వ అధ్యాయం) నుండి క్రింది ప్రశ్నలు తయారు చేయబడినాయి:

1) ఎవరైతే జీసస్ ను పట్టుకున్నారో (వారి అభిప్రాయం ప్రకారం), వారు జీసస్ ను వ్యక్తిగతంగా ఎరుగుదురా? లేదా వారు జీసస్ ను ఎరుగరా?

మత్తాయి బైబిలు: వారు జీసస్ ను ఎరుగరు.

2) జీసస్ ను పట్టుకున్నది పగటి వేళలోనా లేక రాత్రి వేళలోనా?

మత్తాయి బైబిలు: అది రాత్రి వేళ.

3) జీసస్ దగ్గరికి దారి చూపినది ఎవరు?

మత్తాయి బైబిలు: 12 మంది సహచరులలో ఒకడైన జుదాస్ ఇస్కారియట్ Judas Iscariot దారి చూపాడు.

4) అతడు వారిని ఉచితంగా దారి చూపాడా లేక వారు ఆశ చూపిన నిశ్చిత మూలధనం కోసం దారి చూపాడా?

మత్తాయి బైబిలు: 30 వెండి నాణాల బహుమతి కోసం అతడు దారి చూపాడు.

5) ఆ రాత్రి జీసస్ పరిస్థితి ఎలా ఉండినది?

మత్తాయి బైబిలు: జీసస్ భయపడుతూ ఉన్నాడు మరియు ఇలా ప్రార్థిస్తూ సాష్టాంగ పడి ఉన్నాడు: “ఓ దేవా, ఈ కప్పును నా నుండి దాటిపోనివ్వడం నీకు సాధ్యమే అయితే దీనిని దాటి పోనివ్వు.” ఇటువంటి మాటలు ఒక నిజమైన దైవవిశ్వాసి నుండి వెలువడటం అనేది నమ్మశక్యం కాని అత్యంత విడ్డూరమైన విషయం. దైవ ప్రవక్త విషయం ప్రక్కన పెట్టి, ఒక మామూలు దైవవిశ్వాసిలోని విశ్వాసమే గమనించి నట్లయితే, ఆ ఏకైక దైవానికి అన్నింటి మీదా శక్తి సామర్థ్యాలున్నాయని వారు ప్రగాఢంగా నమ్ముతారు, విశ్వసిస్తారు.

6) జీసస్ యొక్క మిగిలిన 11 మంది సహచరుల పరిస్థితి ఏమిటి?

మత్తాయి బైబిలు: భయం వలన (వారి అభిప్రాయం ప్రకారం) వారి బోధకుడితో పాటు వారి పైకీ నిద్ర ఆవరించినది.

7) వారి పరిస్థితితో జీసస్ పోరాడినాడా?

మత్తాయి బైబిలు (verses 40 – 46): ఆయన తృప్తి చెందలేదు. ఆయన వారి దగ్గరికి వచ్చి ఇలా పలుకుతూ, వారిని లేపినాడు: “చూడండి మరియు ప్రార్థించండి, మీరు ప్రలోభానికి గురికాకుండా ఉండటానికి; ఆత్మ నిశ్చయంగా సమ్మతిస్తున్నది కాని మాంసపు కండ బలహీనంగా ఉన్నది.” అప్పుడు ఆయన మరల వచ్చి చూడగా, వారు నిద్రలో ఉంటారు. మరియు వారిని ఆయన మరల నిద్రలేపి, పై వాక్యాలనే తిరిగి పలుకుతాడు. ఇలాంటి బలహీనత సరైన ఉత్తమమైన శిష్యులలోనే కాకుండా అతి మామూలు దైవభక్తి గల బోధకుడి మామూలు శిష్యులలో కూడా  కనబడదు, మరి ఆ బలహీనత కేవలం మర్యం కుమారుడైన జీసస్ శిష్యులలో ఎలా కనబడగలదు?

8) ఆ దుష్టులు జీసస్ ను బంధించినప్పుడు, వారు ఆయనకు సహాయపడినారా?

మత్తాయి బైబిలు: వారు ఆయనను విడిచిపెట్టి పారిపోయినారు.

9) ఆ రాత్రి జీసస్ కు తన సహచురులపై నమ్మకం ఉండినదా?

మత్తాయి బైబిలు:  వారందరూ తనను విడిచి పారిపోతారని జీసస్ వారికి తెలియజేసెను. ఆ తర్వాత జీసస్ వారితో ఇలా అనెను: నిశ్చయంగా ఈ రాత్రి కోడికూతకు ముందు, మీరు నన్ను వదిలి పారిపోతారు – ఇలా మూడు సార్లు అనగా, వారిలో నుండి పీటర్ అనే సహచరుడు – నేను చనిపోతాను గాని విడిచి పారిపోను అని పలికెను. అలాగే మిగిలిన సహచరులందరూ పలికిరి. మరియు అలా జరిగినది.

10) ఆ దుష్ట సైనికులు జీసస్ ను ఎలా పట్టుకున్నారు?

మత్తాయి బైబిలు: ఒక యూదుడు దారి చూపిస్తుండగా, వారు ఆయన దగ్గరకు కత్తులతో మరియు కర్రలతో వచ్చి, 57వ వచనంలో తెలిపినట్లుగా వారు ఆయనను పట్టుకున్నారు: “మరియు వారు ఆయనను గట్టిగా పట్టుకున్నారు, Caiaphas సియాఫస్ అనే వారి యొక్క మహాగురువు వద్దకు తీసుకుని పోయారు, అక్కడి వారి పెద్దలందరూ సమావేశమై ఉన్నారు.”

అక్కడ వారు ఆయనకు మరణశిక్ష విధించారు. ఆ దుష్టసైనికులు అక్కడి నుండి ఆయనను తీసుకుని పోయారు. ఆయన ముఖం పై ఉమ్మేశారు మరియు తమ చేతులతో ఆయనను మోదారు, ఆ తర్వాత ఆయన దుస్తులను చింపివేశారు. ఆ తర్వాత సిందూర వర్ణపు దుస్తులతో చుట్టివేశారు, ఆ పై ముళ్ళతో నిండి ఉన్న కిరీటాన్ని ఆయన తలపై ఉంచి, ఆయనను పీడిస్తూ, ఎగతాళి చేస్తూ పట్టుకుపోయారు. వారు ఆయనతో ఇలా పలికారు, ‘నీ దావా ప్రకారం నీవు ఇస్రాయీలుకు రాజువి.’ వారు ఆయనను తీవ్రంగా అవమానించారు.

11) చివరిగా ఆయనకు మరణశిక్ష విధించాలని ఎవరు నిర్ణయించారు?

మత్తాయి బైబిలు: ఆనాటి ఫలస్తీన్ దేశపు గవర్నరైన పిలాతు Pontius Pilate.

12) ఆ దుష్టసైనికులు ఆయనను, గవర్నరు ముందుకు తీసుకు వచ్చి, యూదుల గురువు వారి ధర్మశాస్త్రమైన తోరాహ్ ప్రకారం ఆయనకు శిలువ పైకి ఎక్కించి, చంపాలనే మరణశిక్షను విధించాడని తెలియజేయగా, ఆ గవర్నరు విచారించకుండానే, పరిశోధించకుండానే వారిని నమ్మినాడా?

మత్తాయి బైబిలు: ఆ గవర్నరు వారిని నమ్మలేదు, కాని ఆయనను ప్రశ్నించాడు: “వారు ఏదైతే చెప్పినారో, అది నిజమేనా?” ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయెను. ప్రశ్న మరల మరల అడుగ బడినది మరియు ఆయన అలాగే నిశ్శబ్దంగా ఉండెను. సత్యం కోసం ఆయన నిశ్శబ్దంగా ఉండెను.; ఒకవేళ ఆయన ప్రవక్త కాకపోయినా సరే, సత్యాన్ని స్పష్టం చేయటం మరియు యూదుల అపనిందలను నిరాకరించటం తప్పనిసరి. గవర్నరు భార్య,  గవర్నరు వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా పలికినది: “మీరు ఆ మంచి వ్యక్తిని ఏమీ చేయకుండా వదలలేరా? ఆయన కారణంగా నాకు ఈ రోజున కలలో అనేక సంఘటనలు జరిగినవి.”

యూదులను తిరస్కరిస్తూ మరియు హెచ్చరిస్తూ గంటల తరబడి జీసస్ అనేక ఉపన్యాసాలు ఇచ్చేవాడని, దీని వలన వారు జీసస్ ను నిందిచేవారని బైబిల్ ప్రకటిస్తున్నది. మరి ఆ రోజున ఆయన నిశ్శబ్దంగా ఎందుకు ఉండిపోయాడు? ఆయనను మాటిమాటికీ ప్రశ్నించటంలో ఆ గవర్నరు యొక్క ఉద్ధేశం సత్యం వైపు నిలబడాలని అయిఉండవచ్చును.

13) వారి ఊహల ప్రకారం జీసస్ ఎలా శిలువ పైకి ఎక్కించబడి, హత్య చేయబడినాడు?

మత్తాయి బైబిలు:  వారు జీసస్ ను ఇద్దరు దొంగల మధ్య శిలువ పైకి ఎక్కించారు, ఆ దొంగలు జీసస్ ను దూషిస్తూ ఇలా పలికినారు, “నీవే గనుక సత్యవంతుడివైతే, ఇప్పుడు నిన్ను నీవే రక్షించుకో.”

14) ఇది ఒక మహా ఉపద్రవం. జీసస్ (వారి అభిప్రాయం ప్రకారం) శిలువ పై ఉండగా ఏమని పలికెను?

మత్తాయి బైబిలు  (27:46): జీసస్ ఏడుస్తూ, బిగ్గరగా ఇలా పలికినాడు “Eli, Eli, Iama sabachthani? అర్థం – నా ప్రభూ, నా ప్రభూ, నన్ను ఎందుకు విడిచి పెట్టివేసినావు?”

అన్ని ధర్మాల ప్రామాణిక నియమాలను అనుసరించి ఇది ఒక పచ్చి అవిశ్వాసపు ప్రకటన. అవతరింపజేయబడిన ధర్మాలను అనుసరించి, ఎవరైనా ఇటువంటి వాక్యాలను ఒక ప్రవక్త పై చెప్పి నట్లయితే, వారు అవిశ్వాసులు అవుతారు.

సర్వలోక శక్తమంతుడైన అల్లాహ్ ఖుర్ఆన్ లో యూదులను మరియు క్రైస్తవులను – జీసస్ అల్లాహ్ యొక్క అవతారమనే, అల్లాహ్ యొక్క కుమారుడనే, పూర్తిగా జీసస్ నే తిరస్కరించేటటు వంటి  వారి అపనిందల గురించి హెచ్చరిస్తూ, వారు జీసస్ ను కేవలం అల్లాహ్ యొక్క సందేశహరుడిగానే విశ్వసించమని దివ్యఖుర్ఆన్ (V. 4:159) లో ఆజ్ఞాపిస్తున్నాడు: మరియు గ్రంథ ప్రజలలో ప్రతి ఒక్కరూ తమ మరణం సంభవించక ముందే ఆయనను (జీసస్ ను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని) తప్పక విశ్వసించవలెను. మరియు పునరుత్థాన దినాన ఆయన (ఈసా) వారి పై సాక్ష్యమిచ్చును


దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [పుస్తకం]

Daiva Pravaktha dharmam - Telugu Islam


రచయిత
:ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్
పునర్విచారకులు :హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రీ మదని, విజయవాడ
ప్రకాశకులు : అల్ అసర్ ఇస్లామిక్ సెంటర్, హైదరాబాద్

[ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి]
https://bit.ly/daiva-pravaktha-dharmam
[PDF] [250 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

ఆప్త వాక్కులు

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం

విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి” (దివ్వ ఖుర్ఆన్ 3:103)

వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది. అల్లాహ్ పై, అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్ ను స్మరించే వ్యక్తికి“.(దివ్య ఖుర్ఆన్ 33:21)

ప్రస్తుతం ముస్లిం సమాజంలోని అధిక శాతం ప్రజలలో కానవచ్చే విశ్వాసాలు ఆరాధనా పద్ధతులు మరియు ఆచరణా వ్యవహారాలు అన్నీ ధర్మం పేరుమీద ధర్మ వ్యతిరేకమైన కొత్త పద్ధతులు కొనసాతున్నాయి. ఇందుకు కారణం ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ విధానాల గురించి ప్రజలలో నిజమైన అవగాహన లేకపోవటమే.

ప్రస్తుతం ముస్లిములలో తౌహీద్ (దేవుని ఏకత్వ) భావన అధిక శాతం లోపించింది. ఇందుకు భిన్నంగా షిర్క్ (బహుదైవారాధన) భావాలు ప్రజలలో పెరిగి పోతున్నాయి. తత్కారణంగా నేటి ముస్లిం సమాజంలో అనేక మూఢ విశ్వాసాలు, అనేక మూఢ నమ్మకాలు మరియు ఒళ్ళు గగ్గురపరిచే అనేక అజ్ఞానపు చేష్ఠలు సర్వసామాన్యం అయిపోయాయి.

ప్రపంచానికి మార్గదర్శకం వహించాల్సిన ముస్లిం సమాజంలోని అధిక ప్రజలు ప్రస్తుతం పతనావస్థకు చేరుకున్నారు.

ఇంతకంటే అనేక రెట్లు అజ్ఞానపు మూఢత్వంలో ఉన్న అరబ్బు జాతిని ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు తౌహీద్, ఆఖిరత్ అనే నినాదాన్ని పునాదిగా చేసుకుని పతనావస్థలో ఉన్న ఆ సమాజాన్ని విశ్వాసపరంగా మరియు నైతికపరంగా ఉన్నత స్థాయికి చేర్చి ప్రపంచానికి ఆదర్శంగా మలిచారు. అందుకు కారణం ఖుర్ఆన్లోని వాక్యాలు ఎలా అవతరించాయో అలానే ప్రజలలో సర్వసామాన్యం చేయటమే.

ఈ రోజు ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ యధాస్థితిలో ఉన్నా ముస్లిం సమాజం స్థితి మారకపోవటానికి కారణం, (ఎ) ఆహారం తమ దగ్గర ఉన్నా పస్తులుండే వానివలె (బి) మందులు తమ దగ్గర ఉన్నా అనారోగ్యాన్ని దూరం చేసుకోలేని వాని పరిస్థితి వలె దైవ మార్గదర్శకత్వాన్ని పొంది కూడా దానిని పెడచెవిన పెట్టి అంధకారంలో తచ్చాడుతున్న వారిలా మారిపోయారు ముస్లింలు. అందువల్లనే అల్లాహ్ తన గ్రంథంలో ఇలా అంటున్నాడు.

“ఇక నా తరఫు నుండి మార్గదర్శకత్వం మీ దగ్గరకు వస్తే ఎవడు ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకే అవుతుంది. ప్రళయంనాడు మేము అతన్ని అంధుడుగా లేపుతాము” (దివ్యఖుర్ఆన్ 20:123 124)

అందుకే ఈ రోజు ముస్లింలు ప్రపంచంలో తమ స్థితిని చక్కబరచుకోవాలంటే ఒక్కటే మార్గం. అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ బోధనలు మరియు దానిని ఆచరించి చూపిన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవిత విధానాలు సర్వసామాన్యం చేయటం తప్ప వేరే మార్గం లేదు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకం రచయిత జనాబ్ మహమ్మద్ ఖలీలుర్రహ్మాన్ గారు తౌహీద్ అంశంపై తెలుగు భాషలో సవివరంగా చర్చించటం జరిగినది. తౌహీద్ వాస్తవికతను అర్థం చేసుకోవ టానికి ఈ పుస్తకం ఉపకారి కాగలదు. పుస్తక రచనలో రచయిత సౌదీ అరేబియాలోని ప్రామాణిక రచయితల గ్రంథాల నుండి సేకరించిన అంశాలను పొందుపర్చటం జరిగినవి. తౌహీద్ తోపాటు ప్రజలు చేసే షిర్క్ దేవుని వేడుకోలు, గుణాలు, నామాలు సోదాహరణగా చర్చించటం జరిగినవి. విశ్వాసాలు, ఆరాధనలలో తౌహీద్ యొక్క వాస్తవ దృక్పథాన్ని వివరించడం జరిగినది. ఈ పుస్తకం దైవదాసులైన మానవాళికి మార్గదర్శి కావాలని, సందేశ దాతలకు సందేశ సామగ్రిగా ఉపయోగ పడాలని, పుస్తక రచయితకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ…

హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రి మదని

విషయ సూచిక:

  1. తొలి పలుకులు [PDF]
  2. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [PDF]
  3. లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్షమివ్వడం [PDF]
  4. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం-నియమాలు [PDF]
  5. లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ [PDF]
  6. తౌహీద్ ఆల్ రుబూబియాత్ [PDF]
  7. తౌహీద్ ఆల్ ఉలూహియాత్ [PDF]
  8. హృదయారాధనలు [PDF]
  9. నోటి ఆరాధనలు [PDF]
  10. ఇతర శారీరక ఆరాధనలు [PDF]
  11. తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ [PDF]
  12. తౌహీద్ ప్రయోజనాలు [PDF]
  13. షిర్క్ యెక్క ఆరంభము [PDF]
  14. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలం నాటి ముష్రిక్కులు [PDF]
  15. ముహమ్మదుర్రసూలుల్లాహ్  సాక్ష్యం వాస్తవీకత [PDF]
  16. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )విధేయత లాభాలు [PDF]
  17. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అవిధేయత నష్టాలు [PDF]
  18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) సహచరుల విధేయత [PDF]
  19. నలుగురు ఇమాములు [PDF]
  20. సున్నత్-బిద్అత్ [PDF]
  21. సలఫ్ మరియు సున్నత్ [PDF]
  22. బిద్అత్ [PDF]
  23. యాసిడ్ టెస్ట్ [PDF]
  24. ఈమాన్ [PDF]
  25. ఇహ్ సాన్ [PDF]

ఏకత్వం వాస్తవికత (Hakeekath-Tawheed)

tawheed-telugu-islam
సంకలనం
: మౌలానా  అబ్దుస్ -సలాం  ఉమ్రి (Moulana Abdus-Salam Umri)
అనువాదం : మౌలానా  ముహమ్మద్  జాకీర్  ఉమ్రి (Moulana Muhammad Zakir Umri)
మస్జిద్ -ఎ -ఫరూఖియః ,హకీంపేట్ , టోలిచౌకి , హైదరాబాద్ (Masjid-e-Farooqiyah, Hakeempet, Tolichowki, Hyderabad)
ప్రకాశకులు: ఐదార ఫిక్రే ఆఖిరత్

ఏకదైవత్వం (తౌహీద్), ఆరాధనలు, బహుదైవారాధన – అల్లాహ్ కు సాటి కల్పించడం, ప్రార్థనలు, అగోచర జ్ఞానం, సిఫారసు, చికిత్స మొదలైన విషయాలు.

[PDF చదవండి /డౌన్ లోడ్ చేసుకోండి]

విషయ సూచిక :

  1. ముందు మాట
  2. తౌహీద్ (ఏకత్వం) అంటే ఏమిటి?
  3. ఇబాదత్ (ఆరాధన) అంటే ఏమిటి?
  4. షిర్క్ (సాటి కల్పించటం) అంటే ఏమిటి?
  5. మొక్కుబడులు, నైవేద్యాలు, ఆరాధనలు
  6. దుఆ  (ప్రార్ధన) ఆరాధనే
  7. తౌహీద్ మూడు రకాలు
  8. తౌహీదే జాత్
  9. తౌహీదే ఆస్మా  వసిఫాత్
  10. అల్లాహ్ దూరం దగ్గర అన్నీ చూస్తాడు
  11. అల్లాహ్ అర్ధిస్తే సంతోషిస్తాడు , అర్ధించని యెడలఆగ్రహం వ్యక్తం చేస్తాడు
  12. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) కూడా అల్లాహ్ నే ప్రార్ధించాడు
  13. తౌహీదే రుబూబియత్
  14. విగ్రహాల పట్ల విగ్రహారాధకుల వ్యర్ధ నమ్మకాలు
  15. మానవ అవసరాలు రెండు రకాలు
  16. తౌహీదే ఉలూహియత్
  17. ఓ ప్రజలారా!
  18. ఏకత్వమే ఆరాధనకు పునాది
  19. తౌహీద్ ప్రాధాన్యం
  20. తౌహీద్ ఇస్లాం ధర్మం పునాది రాయి
  21. తౌహీద్ అన్నిటి కంటే విలువైనది, బరువైనది
  22. తౌహీద్ పాపలన్నిటినీ తుడుచి వేస్తుంది
  23. ప్రతి వ్యక్తి ఎకదైవారాధకుడుగానే  జన్మిస్తాడు
  24. వాస్త ఏక దైవరాధకుడు విచారణ లేకుండా స్వర్గంలోనికి ప్రవేసిస్తాడు
  25. తౌహీద్ విధులు
  26. శక్తి యుక్తులు వినియోగించడం, నమ్మకం రెండూ తప్పనిసరి
  27. అల్లాహ్ నూహ్ జాతిని ముంచి వేశాడు
  28. తవక్కుల్ తౌహీద్ ఆత్మ మరియు జీవిత సామగ్రి
  29. షిర్క్ వాస్తవం
  30. షిర్క్ కి రెండు కారణాలున్నాయి
  31. బహు దైవరాధకులు నరకంలో శాశ్వతంగా ఉంటారు
  32. షిర్క్ నాలుగు రకాలు
  33. బహు దైవరాధకులు వారి చిల్లర దైవాలు ఇద్దరూ బలహీనులే
  34. విగ్రహారాధకుల సాక్ష్యాదారాలు
  35. విశ్వ సృష్టికర్త మాత్రమే సర్వ జ్ఞాని
  36. సృష్టికర్తేనే ఆరాధించాలి
  37. అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు పరిపూర్నుడూనూ
  38. సంతానం దైవత్వానికి వ్యతిరేకం
  39. లాభ నష్టాలు విశ్వసృష్టికర్త పాలకుడైన అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి
  40. అల్లాహ్ పరిపూర్ణ శక్తియుక్తులు గలవాడు
  41. అల్లాహ్ గోచర అగోచర జ్ఞాని
  42. మార్గదర్శకున్నే అనుసరించాలి
  43. వాసీఅహ్
  44. షరీఅత్తులో షిఫాఅత్ స్థానం
  45. షఫాఅత్  వాస్తవికత
  46. షఫాఅత్ కు విశ్వాసులే అర్హులు
  47. గులూ అంటే గౌరవాభిమనాల్లో హద్దు మీరి ప్రవర్తించటం
  48. అగోచర జ్ఞానం వాస్తవికత
  49. జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు
  50. దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు
  51. అగోచర జ్ఞానం లేని మూసా (అలైహిస్సలాం)
  52. ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) కూ అగోచర జ్ఞానం లేదు

కితాబుత్ తౌహీద్ (ఏక దైవారాధన పుస్తకం) | మర్కజ్ దారుల్ బిర్ర్

kitab-at-tawheed-AbdulWahhab-book-cover

Touheed (Eka Daivaradhana) (Telugu) – Kitabut Touheed
Compiled by : Allama Mohammad bin Abdul Wahhab
Translated by : Abdul Rab bin Shaik Silar
Edited by : Dr. Sayeed Ahmed Oomeri Madani, S.M. Rasool Sharfi
Publisher : Markaz Darul Bir, Ahmad Nagar, Pedana A.P. India

[మొబైల్ ఫ్రెండ్లీ బుక్]
[ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]
[PDF] [163 పేజీలు] [ఫైల్ సైజ్ : 4 MB]

విషయ సూచిక

అన్ని చాఫ్టర్లు PDF లింకులు గా క్రింద ఇవ్వబడ్డాయి. లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా చదవవచ్చు.

తొలిపలుకులు

  1. ఏక దైవారాధన యొక్క ఆవశ్యకత
  2. ఏక దైవారాధన యొక్క ప్రాముఖ్యత, సకల పాప సంహారిణి
  3. ఏక దైవారాధకుడు విచారణ  లేకుండానే స్వర్గమున ప్రవేశించును
  4. బహు దైవరాధన గురించి భయపడవలసిన ఆవశ్యకత
  5. “లా ఇలాహ ఇల్లల్లాహ్” నమ్మి సాక్ష్యమివ్వమని ప్రజలకు హితభోద చేయుట
  6. తౌహీద్ మరియు కలిమయే తౌహీద్ ధృవీకరణల సారాంశం
  7. కష్ట నష్టాల విముక్తికి తాయత్తులు , దారాలు, రక్ష రేకులు ధరించుట
  8. ఊదుట & తాయత్తులు ధరించుట నిషిద్దం
  9. రాళ్ళను, చెట్లను శుభం కల్గించేవిగా  భావించుట
  10. అల్లాహ్ యేతరులకు ‘బలి’ సమర్పించేవారు
  11. అల్లాహ్ యేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్ నామము పై అర్పణ కూడా నిషేధము
  12. అల్లాహ్ యేతరుల మొక్కుబడి షిర్కే
  13. అల్లాహ్ యేతరుల ‘శరణు’ షిర్కే
  14. అల్లాహ్ యేతరులను వేడుకొనుట షిర్కే
  15. నిరాధారమైన సృష్టిని వేడుకొనుట
  16. “వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు, ఈ విధముగా ప్రశ్నించు కుంటారు” –   (సబా  34 :23)
  17. సిఫారసు వాస్తవికత
  18. “(ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారందిరికీ మార్గదర్శకత్వము ప్రసాదించగలడు” (28 :56)
  19. ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించటమే
  20. పుణ్యాత్ముల, మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ ని ఆరాధించుట నిషిద్ధం
  21. పుణ్యాత్ముల సమాధుల  విషయంలో హద్దు మీరుట ధైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనాలయాలుగా మార్చుట
  22. ఏక ధైవోపాసనను భధ్రపరచటమే కాకుండా భంగపరచు మార్గములను కూడా ప్రవక్త అరికట్టెను
  23. ప్రవక్త ముహమ్మద్ ( సల్లల్లాహు అలైహి వసల్లం)  గారి ‘ఉమ్మత్’లో కొందరు విగ్రహారాధన లాంటి సంకటములో చిక్కుకొనుట
  24. చేతబడి
  25. జాదులోని కొన్ని విధానాలు
  26. జ్యోతిష్యుడు మరియు అతని కోవకు చెందిన వారి గురించి
  27. జాదు చేయబడిన వ్యక్తికి వైద్యము చేయుట
  28. దుశ్శకున (అపశకున) దర్శనము
  29. జ్యోతిష్యం గురించి
  30. నక్షత్రముల ప్రభావముతో వర్షం కురియునని నమ్ముట
  31. అల్లాహ్ ను ప్రేమించుట – ధర్మమునకు పునాది
  32. అల్లాహ్ పట్ల భయ భక్తులు కలిగి ఉండుట
  33. ఒక్క అల్లాహ్ నే నమ్ముకోవలెను
  34. అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉండరాదు – అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరాదు
  35. అల్లాహ్ నిర్ణయించిన విధి పై సహనం ఈమాన్ లోని అంతర్భాగమే
  36. ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యాలు షిర్కే
  37. ఇహలోక లబ్ధికి చేయు సత్కార్యములు కూడా ‘షిర్క్’లాంటివి
  38. అల్లాహ్ చే పవిత్రము అనబడిన వాటిని నిషేధించుట మత గురువులను ప్రభువుగా చేసుకొనుట
  39. ‘విశ్వసించితిమి ‘అను వారి వాస్తవము
  40. అల్లాహ్ నామములో, గుణ గణాలలో కొన్నింటిని తిరస్కరించటం
  41. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించుట
  42. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే కొన్ని గుప్తరూపములు
  43. అల్లాహ్ పై ప్రమాణం తో సంతృప్తి చెందని వాడు
  44. అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది అని పలుకుట షిర్కే
  45. కాలాన్ని దూషిస్తే అల్లాహ్ కు భాధ కలిగించినట్లే
  46. ఎవరినైనా రాజాధిరాజు అని పిలుచుట
  47. అల్లాహ్ నామాలను గౌరవించుట
  48. అల్లాహ్ ను , ఖుర్ఆనును, ప్రవక్త (సల్లాలహు అలైహి వసల్లం) ను హేళన చేసే వారి కోసం శాసనము
  49. అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత
  50. అల్లాహ్ సంతానం ప్రసాదిన్చినప్పుడు షిర్క్ కు పాల్పడుట
  51. అల్లాహ్ మహోన్నత నామములు
  52. అల్లాహ్ పై సలాం అని పలుకరాదు
  53. “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని పలుకరాదు
  54. “నా బానిస” అని పలుకరాదు
  55. అల్లాహ్ నామముతో యాచించు వానిని ఒట్టి చేతులతో పంపరాదు
  56. అల్లాహ్ నామమున స్వర్గమును మాత్రమె కోరవలెను
  57. కష్ట నష్టాలు సంభవించినప్పుడు “ఒక వేళ ఇలా జరిగి ఉంటే” అని పలుకుట
  58. గాలిని తిట్టుట నిషిద్దం
  59. అల్లాహ్ ను శంకించుట నిషిద్దం
  60. అల్లాహ్ నిర్ణయించిన విధిని తిరస్కరించేవారు
  61. చిత్రాలు,శిల్పాలను చిత్రించుట ఒక దుష్టమైన పని
  62. ఎక్కువగా ప్రమాణములు చేయుట
  63. అల్లాహ్ ప్రవక్త పేర పూచీ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండుట
  64. అల్లాహ్ నామమున ప్రమాణము చేయుట
  65. సృష్టిరాశులను సంతోష పెట్టడానికి అల్లాహ్ ను సిఫారసుదారుగా చేయరాదు
  66. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తౌహీదును పరిరక్షించారు, షిర్క్ మార్గాలకు కళ్ళెం వేశారు
  67. అల్లాహ్ ఘనత, గౌరవము (ఔన్నత్యము)

[పుస్తకం టెక్స్ట్]

తొలిపలుకులు

సర్వస్తోత్రాలు సకలలోక ప్రభువైన అల్లాహ్ కే. మహనీయులైన ఆయన ప్రవక్తపై, ఆయన కుటుంబీకులపై, సహచరులందరిపై శాంతీ కారుణ్యాలుకురియుగాక! 

ఇక అసలు విషయానికి వస్తే…., 

ఏకదైవారాధన (తౌహీద్) ఇస్లాం ధర్మానికి పునాది. ఆధారం. మానవ హృదయాలకు జీవం. పరలోక ముక్తికి మార్గం. జీవితంలో దాన్ని పుణికిపుచ్చుకున్న మనిషి తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. పరలోకంలో అతనికి విచారణ అనేది ఉండదు. పోతే, తౌహీద్ విధానాన్ని లెక్క చేయకుండా అల్లాహు కు ఇతరుల్ని భాగస్వాములుగా నిలబెట్టినవారు ఖచ్చితంగా నరకానికి పోతారు. అందులో సందేహం అక్కర్లేదు. మనిషికి తౌహీద్ అవసరం అన్నపానీయాలకన్నా, గాలి నీరులకన్నా ఎక్కువ. 

సులభంగా బోధపడేందుకుగాను పండితులు తౌహీద్ ను మూడు భాగాలుగా విభజించారు: 

1) అల్లాహ్ నామాలు, గుణవిశేషాల్లో (అస్మా వ సిఫాత్ లో) తౌహీద్,
2) ప్రభుత పరంగా (రుబూబియత్ లో ) తౌహీద్,
3) ఆరాధనలో (ఉలూహియత్ లో ) తౌహీద్ 

1) అల్లాహ్ నామాలు, గుణవిశేషాల్లో తౌహీద్, అంటే అల్లాహ్ గురించిన పరిజ్ఞానంలో, అల్లాహ్ ను  గుర్తించటంలో ఏకదైవ భావనను కలిగివుండటం. దివ్యఖుర్ఆన్ మరియు దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ప్రవచనాల్లో ప్రస్తావించబడిన విధంగా అల్లాహు కు అత్యుత్తమమైన పేర్లు, మహోన్నతమైన గుణవిశేషాలు ఉన్నాయని మనలో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వాటితోనే మనం ఆయన్ని వేడుకుంటాము. ఎలాంటి అనుచిత వివరణలు ఇవ్వకుండా, మార్పులు చేర్పులు లేకుండా, వాస్తవాలకు విఘాతం కలగకుండా, స్థితిగతులను వివరించకుండా, పోలికలు సారూప్యతల జోలికి పోకుండా అల్లాహ్ నామాలను, గుణవిశేషాలను మనం సంపూర్ణంగా విశ్వసిస్తాము, ధృవపరుస్తాము. 

2) ఇక రుబూబియత్ లో  (ప్రభుత ప్రకారం) తౌహీద్. అల్లాహ్ కార్యాల్లోనూ, అల్లాహ్ చేతల్లోనూ అల్లాహ్ ఒకే ఒక్కడని నమ్మటమే ఈ తౌహీద్ ఉద్దేశం. అల్లాహ్ మాత్రమే ప్రభువు, సృష్టికర్త, యజమాని, ప్రదాత, జీవన్మరణాలకు అధిపతి, క్షమించేవాడు, కరుణ గలవాడు, ఈ విషయాలన్నిటిలో ఆయనకు మరో భాగస్వామి గాని, సహవర్తుడు గాని లేదు అని తౌహీద్లోని ఈ విభాగం చెబుతుంది. సృష్టిలోని అణువణువూ ప్రస్ఫుటం చేసే తౌహీద్ ఇది. సృష్టిలోని ప్రతి ప్రాణిలోనూ ఈ తౌహీద్ నిశ్చలంగా ఉంటుంది. మనుషుల మతధర్మాలు వేరైనా, సంస్కృతీ నాగరికతలు విభిన్నమైనా అత్యంత సహజరూపంలో వారి ఉనికే ఈ తౌహీద్ ను చాటుతుంది. 

3) ఇక మిగిలింది ఆరాధన (ఉలూహియత్)లో తౌహీద్. ఇది దాసులు తమ కార్యాలను ఒకే దేవునికి అర్పించుకునే తౌహీద్. దీన్ని ఉద్దేశానికి, సంకల్పానికి సంబంధించిన తౌహీద్  గానూ చెప్పవచ్చు. ఆకాశం నుంచి గ్రంథాలు అవతరించటానికి గల లక్ష్యం ఇదే. లోకంలో ప్రవక్తలు ప్రభవించింది ఈ తౌహీద్ కోసమే. అసలు మనుషుల, జిన్నాతుల పుట్టుక పరమార్ధమే ఈ తౌహీద్. అల్లాహ్ ఇలా ప్రకటించాడు: 

మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!”  (సూరె జారియాత్ : 56) 

ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ “తౌహీద్ పుస్తకం” గౌరవ విద్వాంసులు ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్లాబ్ (రహిమహుల్లాహ్) రచించినది. ఆరాధనలోని తౌహీద్ గురించి సామాన్య ప్రజలకు తెలియజెప్పటానికి ఆయన ఈ పుస్తకం రాశారు. నాటి నుంచి నేటి దాకా ఎన్నో తరాలు ఈ పుస్తకం ద్వారా ప్రయోజనం పొందాయి. వివిధ భాషల్లో దీనికి అనువాదాలూ, తాత్పర్యాలూ రాయబడ్డాయి. 

నిన్న మొన్నటి దాకా మన తెలుగు జనావళికి ఇటువంటి పుస్తకం ఏదీ అందుబాటులో ఉండింది కాదు. ఎట్టకేలకు ఈ అవసరాన్ని గుర్తించిన గౌరవనీయులు అబ్దుర్రబ్ బిన్ షేఖ్ సిలార్ గారు అరబీ భాషలోని ఈ పుస్తకాన్ని సులభశైలిలో తెనుగీకరించటానికి పూనుకున్నారు. అల్లాహ్ దయవల్ల ఆయన ద్వారా ఈ కార్యం నెరవేరింది. అనంతరం ధార్మిక సోదరులు ఎస్. ఎమ్. రసూల్, షేఖ్ నసీరుర్రహ్మాన్, నేను ముగ్గురం ఈ పుస్తకాన్ని పునఃపరిశీలించి మూడవ ముద్రణకు పంపించాము. ఇప్పుడు ఈ పుస్తకం మునుపటి కన్నా శుద్ధంగా, సరికొత్తగా ప్రచురించబడుతోంది. 

రచయితకు, అనువాదకునికి, పరిశీలకులకు, ఇంకా ఈ సత్కార్యంలో పాలు పంచుకున్న వారందరికీ అల్లాహ్ ఇహపరలోకాల్లో ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించాలని కోరుకుంటూ…… 

డా|| సయీద్ అహ్మద్ ఉమరి, మదనీ. 
జనరల్ సెక్రటరీ, 
మర్కజ్ దారుల్ బిర్, పెడన, 

పాఠము- 1 : ఏక దైవారాధన యొక్క ఆవశ్యకత 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను: 

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْأِنْسَ إِلَّا لِيَعْبُدُونِ
నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించితిని.” (అజ్-జారియాత్-51:56) 

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اُعْبُدُوا اللهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేసితిమి. ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు తాగూత్ (తమంతట తాము సృష్టించుకున్న దేవతల)ఆరాధనకు తావివ్వకండని తెలుపుటకు.” (16:36) 

وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالوَالِدَيْنِ إِحْسَانًا
నీ ప్రభువు నిర్ణయం చేసెను. మీరు కేవలం ఆయననే (అల్లాహ్) ఆరాధించండి మరియు తల్లిదండ్రులతో దయ, మర్యాదలతో వ్యవహరిం చండి అని.” (17:23) 

وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا
మరియు మీరంతా కేవలం అల్లాహ్ కు దాస్యము చేయండి మరియు ఆయనకు భాగస్వాములను కల్పించవద్దు.” (4:36) 

قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు- అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా – వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య (న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్‌ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు.(అల్-అన్ ఆమ్-6:151) 

హజరత్ ముఆజ్ బిన్ జబల్ (రది యల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించెను: ఒకసారి నేను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇద్దరం ఒకే కంచర గాడిదపై ప్రయాణించుచుంటిమి. అప్పుడు దైవప్రవక్త నాతో ఈ విధముగా పలికెను: “ఓ ముఆజ్! అల్లాహ్ యొక్క హక్కు దాసులపై మరియు దాసులు హక్కు అల్లాహ్ పై ఏమిటో నీకు తెలుసునా?” జవాబుగా నేను “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే బాగా తెలుసును” అని పలికితిని. అప్పుడు ప్రవక్త ఈ విధంగా తెలిపెను: “అల్లాహ్ హక్కు దాసులపై ఏమిటంటే, వారు ఒక్క అల్లాహ్ ఆరాధించాలి మరియు ఆయనకు సాటినిగాని లేదా భాగస్వాము లను గాని సృష్టించకూడదు. మరియు దాసుల హక్కు అల్లాహ్ పై ఏమిటంటే, ఏ దాసులైతే అల్లాహ్ కు సాటిని, భాగస్వామిని సృష్టించరో వారిని ఆయన శిక్షించకూడదు.” “నేను ఈ శుభవార్తను ప్రజలకు అందజేయనా?” అని నేను అడిగాను. అందుకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అన్నారు, “వద్దు. వారు దీనినే నమ్ముకుని కూచుండి పోగలరు. (బుఖారీ, ముస్లిం) 

దీనిలో 24 అర్థ తాత్పర్యములు గలవు 

1. జిన్నాతుల, మానవుల సృష్టికి కారణము తెలుపబడింది. 

2. ఆరాధన అంటే అసలు ఏక దైవారాధన. ఎందుకంటే ప్రవక్తలందరు 

తమ జాతులకు ఏక దైవారాధన గురించే ఉపదేశించారు. 

3. ఎవరైతే ఏకదైవారాధనకు కట్టుబడి ఉండరో, వారు అల్లాహ్ యొక్క ఆరాధన చేయనట్లే. ‘కాఫిరూన్’ యొక్క ఆయత్ ప్రకారం, వేటినైతే మీరు ఆరాధిస్తున్నారో నేను వాటిని ఆరాధించువాణ్ణి కాదు (కాను).” (109-3) 

4. దీనితో ప్రవక్తలను ప్రభవింపజేయుటకు కారణము కూడా తెలియు చున్నది. 

5. అల్లాహ్ ప్రతి జాతిలోనూ ప్రవక్తలను ప్రభవింపజేసెను.

6. ప్రవక్తలందరి మతము ఒక్కటే. అది ఏక దైవారాధన. 

7. తాగూత్ (తమంతట తాము సృష్టించుకొన్న దేవతల)ను తిరస్కరించకుండా ఏక దైవారాధన సాధ్యము కాదు. 

8. “తాగూత్(తమంతట తాము సృష్టించుకున్న దేవతల)ని తిరస్కరించి అల్లాహ్ నే విశ్వసించినవాడు సుస్థిరమైన, ఎప్పటికీ విడిపోని ఆశ్రయము పొందినవాడయ్యెను.” 

9. అల్లాహ్ ని తప్ప ఆరాధించబడేవి అన్నీ తాగూత్ అనబడును. 

10. అల్లాహ్ ఉపదేశించిన అతిముఖ్యమైన 10 ఉపదేశములలో ఏక దైవారాధన మరియు బహుదైవారాధన నిషేధం ప్రధానమైనవి. అల్లాహ్ ఖుర్ఆన్ (17:22)లో 18 ఉపదేశాలు తెలిపెను. వాటిలో మొదటిది మరియు చివరిది రెండూ కూడా బహుదైవారాధన నిషేధం గురించి తెలియ జేస్తున్నాయి. “ఇవి వివేకముతో నిండివున్న విషయములు. వీటిని నీ ప్రభువు నీ వైపునకు అవతరింపజేసెను.” (బనీ ఇస్రాయీల్-17:39). 

11. అల్లాహ్ ఖుర్ఆన్ లో తెలిపిన 10 ఉపదేశాలలోని ప్రధాన ఉపదేశం: “మీరు కేవలం ఒక్క అల్లాహ్క దాస్యం చేయండి. ఆయనకు భాగస్వాములను కల్పించకండి.” (అన్ నిసా- 4:36) 

12. ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఉపదేశించిన బోధనలు కూడా తెలుప బడ్డాయి. 

13. మనపై అల్లాహ్ కు ఉన్న హక్కు తెలుపబడింది. 

14. దాసులు అల్లాహ్ యొక్క హక్కు నెరవేర్చినప్పుడు, అల్లాహ్ పై దాసులకు ఉన్న హక్కు తెలుపబడింది. 

15. హదీసుల్లో తెలుపబడిన విషయాలు చాలా మంది అనుచరులకు తెలియవు. 

16. ఏదైనా అవసరాన్నిబట్టి కొన్ని విషయాలు రహస్యంగా ఉంచవచ్చును. 

17. ఎవ్వరికైనా మంచి వార్త తెలుపటం సున్నత్. 

18. అల్లాహ్ యొక్క దయాకరుణలను దృష్టిలో ఉంచుకొని మంచి పనులను ఆచరించడంలో నిర్లక్ష్యము చేయరాదు. 

19. మనకు తెలియని విషయాల పట్ల “అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  కే బాగా తెలుసు” అనాలి. 

20. అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు కొంత మందికే తెలియజేయ వచ్చును. మరికొందరికి తెలుపకుండా ఉండవచ్చును. 

21. ఈ హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  యొక్క నిరాడంబరత మరియు సుహృ ద్భావము గోచరిస్తోంది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అతి పెద్ద హోదాగల వారై నప్పటికీ కంచర గాడిదపై ప్రయాణించెను. ఒక సాధారణ వ్యక్తిని కూడా తనతో పాటు కూర్చోబెట్టుకొనెను.

22. వాహనంపై వేరే వ్యక్తిని కూర్చోబెట్టుకోవచ్చును. 

23. ఈ హదీసు ద్వారా ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది. 

24. ఈ హదీసు ఏక దైవారాధన యొక్క విశిష్టతను తెలుపుతుంది. 

పాఠము-2 : ఏక దైవారాధన ప్రాముఖ్యత, సకల పాపసంహారిణి 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను. 

الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا اِيْمَانَهُمْ بِظُلْمٍ أُولَيكَ لَهُمُ الْاَمْنُ وَهُمْ مُهْتَدُونَ 

“వాస్తవంగా విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గంతో కలుషితం చేయని వారికే శాంతి. వారే ఋజుమార్గంపై ఉన్నారు.” (అల్ అన్ ఆమ్- 6:82) 

హజరత్ ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశించారు. “ఎవరైతే ఈ విషయాలను నమ్మి సాక్ష్యమిస్తారో: అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారు. ఆయన ఒక్కడే. ఆయనకు ఎవరూ సాటిగానీ భాగస్వాములు గానీ లేరు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఆయన యొక్క దాసుడు, ప్రవక్త. హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా ఆయన దాసుడు, ప్రవక్త. అల్లాహ్ యొక్క వాక్కు దానిని ఆయన మరియం అలైహస్సలాంకు అనుగ్రహించెను మరియు ఆయన అల్లాహ్ అనుగ్రహించిన ప్రాణం అని మరియు స్వర్గ నరకములు అక్షర సత్యాలని నమ్మి సాక్ష్య మిచ్చునో, వారిని అల్లాహ్ స్వర్గములో (ఎప్పటికైనా) ప్రవేశింపజేస్తాడు. అతని ఆచరణ ఎలాంటిదైనాసరే.” (బుఖారీ, ముస్లిం) 

హజరత్ ఉత్బాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: “ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని పొందుటకు “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు) అని విశ్వసించి సాక్ష్యమిస్తారో, అల్లాహ్ వారికొరకు నరకాన్ని నిషేధిస్తాడు. (బుఖారీ, ముస్లిం) 

హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధముగా ప్రబోధించారు: “ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో ఈ విధముగా విన్నవించెను. ఓ నా ప్రభూ! నాకు కొన్ని అతి ఉత్తమమైన వాక్యములు నేర్పుము. వాటితో నేను నిన్ను స్తుతిస్తూ స్మరిస్తూ ఉంటాను. దానికి అల్లాహ్ ఈ విధముగా ఉద్బోధించెను: “ఓ మూసా! లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించి, స్మరించుము.” మూసా అలైహిస్సలాం ఈ విధముగా పలికెను: ఓ అల్లాహ్! నీ దాసులందరూ ఈ స్తోత్రములు స్మరించు చున్నారు. అప్పుడు అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను. ఓ మూసా! సప్త భూమ్యాకాశాలు త్రాసులోని ఒక పళ్ళెంలో ఉంచి ఈ స్తోత్రాన్ని వేరే పళ్ళెంలో ఉంచిన ఎడల “లా ఇలాహ ఇల్లల్లాహ్” వాటన్నిటికంటే భారము కలది అగును. (ఇబ్నె హిబ్బాన్, హాకిం-సహీ సనద్) 

సునను తిర్మిజీలో హసన్ సనద్ హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశిస్తుండగా విన్నాను: అల్లాహ్ ఈ విధంగా ప్రబోధించెను “ఓ ఆదం కుమారుడా! నీవు నా వద్దకు భూమి నిండునంతటి పాపములతో వచ్చినా, నీవు ఆరాధనలో నాకు భాగస్వాములను కల్పించక వచ్చిన ఎడల నేను నిన్ను నా దయాదాక్షిణ్యాలతో క్షమించివేయగలను.” 

దీనిలో 20 అర్థ తాత్పర్యములు కలవు 

1. అల్లాహ్ అమిత కరుణామయుడు. 

2. అల్లాహ్ దృష్టిలో ఏకదైవారాధన ప్రధాన పుణ్యకార్యము. 

3. ఏకదైవారాధన పుణ్యకార్యమే కాకుండా పాపములను కూడా పరిహరించును. 

4. ఖుర్ఆన్లోని ఆయత్ (6:82) లో ‘జులుం’ అంటే అర్థం బహుదైవారాధన.

5. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు మరియు ఉత్బాన్ రదియల్లాహు అన్షు యొక్క రెండు హదీసులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎడల ఏక దైవారాధన యొక్క అర్థం స్పష్టంగా తెలియును. అంతే కాకుండా ఒట్టి నోటి మాటతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ చదివినంత మాత్రాన స్వర్గ ప్రవేశము లభించుననుకోవటం పొరపాటని తెలియగలదు. 

6. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు తెలిపిన హదీసులోని 5 ఉపదేశములను క్షుణ్ణంగా పరిశీలించి ఆచరించవలెను.

7. హజరత్ ఉత్బాన్ రదియల్లాహు అన్హు యొక్క హదీసులోని మాటలను క్షుణ్ణంగా పరిశీలించ వలయును.

8. ప్రవక్తలు కూడా స్తోత్రం తెలుసుకోవలసిన అవసరం కలిగివున్నారు. ఈ వాస్తవం కూడా గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

9. “లా ఇలాహ ఇల్లల్లాహ్” సప్త భూమ్యాకాశాల కంటే బరువైనప్పటికీ ఈ కలిమ చదివే వారి చాలా మంది పళ్ళెములు తేలికగా ఉండును.

10. దీని ద్వారా 7 ఆకాశాలే కాకుండా భూములు కూడా 7 ఉన్నట్లు తెలియు చున్నది. 

11. భూమ్యాకాశాలలో జీవరాశులు ఎన్నో జీవించుచున్నవి. 

12. అల్లాహు కు సాటిలేని ‘సిఫాత్'(గుణములు) ఉన్నట్లు తెలుస్తుంది. 

13. హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు క్షుణ్ణంగా పరిశీలించిన ఎడల హజరత్ ఉత్బాన్ రదియల్లాహు అన్షు ఉల్లేఖించిన హదీసులోని “లా ఇలాహ ఇల్లల్లాహ్” యొక్క అర్థం బహుదైవారాధన ను పూర్తిగా విడనాడాలని స్పష్టం అగుచున్నది. 

14. ఈ విషయం కూడా గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఈసా అలైహిస్సలాం ఇద్దరినీ దాసులుగానూ, ప్రవక్తలుగానూ సంబోధించ బడింది. 

15. ప్రతివస్తువు అల్లాహ్ చే అనుగ్రహించబడినది. అదే విధముగా హజరత్ ఈసా అలైహిస్సలాం కూడా అల్లాహ్ అనుగ్రహింపబడెను.

16. ప్రాణం కూడా అల్లాహ్ యే అనుగ్రహించును. కాబట్టి హజరత్ ఈసా అలైహిస్సలాం యొక్క ప్రాణం కూడా అల్లాహ్ యే అనుగ్రహించెను

17. స్వర్గ నరకములపై విశ్వసించవలసిన ఆవశ్యకత తెలుపబడెను. 

18. హజరత్ ఉబాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు ద్వారా, స్వర్గప్రవేశమునకు ఏకదైవారాధన నిబంధన అవసరమని తెలియ వస్తున్నది.

19. ప్రళయదినంనాడు మన అందరి పాప పుణ్యకార్యములు తూచబడును

20. ఈ హదీసులో అల్లాహ్ యొక్క ‘ముఖము’న్నదని తెలుపబడెను. కాని అది ఎట్లు ఉండును అనునది మనకు తెలుపబడలేదు అని నమ్మవలెను.

పాఠము-3 : ఏకదైవారాధకుడు విచారణ లేకుండానే స్వర్గమున ప్రవేశించును 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా పేర్కొనెను. 

ان ابراهيمَ كَانَ أَمَةً قَانِتَا لِلَّهِ حَنِيفًا، وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَة 

“నిశ్చయంగా ఇబ్రాహీం (అబ్రహం) అలైహిస్సలాం ప్రజలకు మార్గదర్శి. అల్లాహ్ యొక్క అమిత విధేయుడు. ఎప్పటికీ ఆయన పైనే మనస్సు నిలిపి యుండెను. ఆయన ఎన్నడూ బహుదైవారాధనకు పూనుకోలేదు.” (~5-35-16:120) 

والَّذِينَ هُمْ بَرَتِهِمْ لَا يُشْرِكُونَ : ) 

“నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ కు భాగస్వాములు కల్పించరో వారే విశ్వాసులు.”(అల్-మోమినూన్-23:59) 

హుసైన్ బిన్ అబ్దుర్రహ్మాన్ రహమతుల్లాహి అలైహ్ ఈ విధంగా తెలిపెను: నేను ఒకసారి సయీద్ బిన్ జుబైర్ రహమతుల్లాహి అలైహి దగ్గర హాజరై ఉంటిని. ఆయన “మీలో రాత్రి వ్రాలుతున్న నక్షత్రాన్ని ఎవరు తిలకించితిరి?” అని ప్రశ్నించెను. అప్పుడు “నేను తిలకించితినని” జవాబు పలికితిని. ఇంకా ఈ విధంగా విశదీకరించితిని. “నేను ఆ సమయంలో ప్రార్థనలో లేకుంటిని. ఆ సమయాన విషపురుగు యొక్క కాటుకు గురియై ఉంటిని.” అప్పుడు జుబైర్ “మరి, ఏమి చేసితివని” ప్రశ్నించెను. “నేను స్తోత్రము పఠించితిని” అని జవాబు ఇచ్చితిని. మరల ఆయన “అలా ఎందుకు చేశావు” అని ప్రశ్నించిరి. అప్పుడు నేను “షాబిరహమతులాహి అలైహి ఒక హదీసు తెలిపెను. అందుచే నేను స్తోత్రము పఠించితిని (దమ్ చేసితిని)” అని వివరించితిని. మరల సయీద్ బిన్ జుబైర్ “షాబి రహమతుల్లాహి అలైహి మీకు ఏమి తెలిపెను?” అని ప్రశ్నించెను. 

నేను జవాబుగా ఆయన మాకు బురైదా బిన్ హాసైబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన ఒక హదీసు తెలిపెను. “చెడు చూపు (దిష్టి) మరియు విషపురుగు కాటుకు తప్ప ఎట్టి పరిస్థితిలోను రుఖయ (స్తోత్ర పఠనము) చేయకూడదు.” అప్పుడు సయీద్ బిన్ జుబైర్ రహమతుల్లాహి అలైహి మీరు ఆలకించి అమలు పరచినది సరియైనదే కావచ్చు, కాని మాకు ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా జగత్ ప్రవక్త యొక్క ఈ హదీసును తెలిపిరి : 

నాకు చాలా మంది ప్రవక్తల అనుచరులను చూపబడెను. కొంతమంది ప్రవక్తలతో ఎక్కువ అనుచరులు ఉండిరి. మరి కొంతమంది ప్రవక్తలతో పాటు ఒకళ్ళిద్దరు అనుచరులు ఉన్నారు. నేను ఒక్క అనుచరుడు కూడా లేని ప్రవక్తను చూసితిని (తిలకించితిని). అంతలో నేను ఒక పెద్ద కూటమి (గుంపు) ని చూసి వీరు నా అనుచరులు అనుకొంటిని. కానీ వారు ప్రవక్త మూసా మరియు వారి అనుచరులని తెలుపబడెను. వారిలో 70 వేల మంది ఎలాంటి లెక్క, ఏ విధమైన శిక్షకు గురి కాకుండా స్వర్గమున ప్రవేశించుదురు అని పలికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం లేచి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు అనుచరులు 70 వేల మంది ఎవరై ఉంటారా అని ఆలోచనలో నిమగ్నులై ఉండిరి. మరల ప్రవక్త విచ్చేసినప్పుడు అనుచరులు ఆయనను ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సంబోధించెను: 

“ఎవరైతే మంత్రదండనలు చేయరో, వైద్యము కొరకు వాతలు పెట్టించు కొనరో, జ్యోతిష్యము, హస్తసాముద్రికము, వాస్తులను నమ్మక ఒక్క అల్లాహ్ నే విశ్వసించి శిరసావహిస్తారో వారే!” ఇది విని ఉక్కాషా బిన్ ముహ్సన్ రదియల్లాహు అన్హు లేచి నిలబడి ఈ విధంగా పలికెను. “ఓ ప్రవక్తా! అల్లాహ్ నన్ను వారిలో ఒకణ్ణి చేయమని ప్రార్థించండి.” అప్పుడు ప్రవక్త, “మీరూ వారిలో ఒక్కరు” అని పలికెను. అంతలో వేరే వ్యక్తిలేచి నిలబడి, “ఓ ప్రవక్తా! అల్లాహ్ నన్ను కూడా వారిలో చేర్చమని ప్రార్థించండి”అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త అన్నారు, “ఉక్కాషా నీకంటే ముందే ఈ ప్రార్ధనను సొంతం చేసుకున్నాడు.” (దీనిని బుఖారి, ముస్లిం, తిర్మిజీ, నసాయి పొందుపరిచెను.) 

దీనిలో 22 అర్థ తాత్పర్యములు కలవు 

1. ఏకదైవారాధన విషయంలో జనుల స్థితిలో మార్పు కలదు.

2. అల్లాహ్ ఏకత్వంపై ఎలా అమలు చేయవలెనో తెలిసినది. 

3. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎన్నడూ బహుదైవారాధనకు పూనుకోలేదని 

అల్లాహ్ యే స్పష్టముగా చెప్పెను. 

4. ఏ దైవప్రవక్త కూడా బహుదైవారాధనకు పూనుకోలేదని, ప్రవక్తలందరూ బహుదైవారాధనను నిరసించినట్లుగా అల్లాహ్, స్పష్టపరిచెను.

5. మంత్ర పఠనం, వాతలు పెట్టించుకోవటం వంటి పనులకు దూరంగా ఉండుట ఏకదైవారాధనలో అతి ప్రాముఖ్యము గలవి.

6. ఇటువంటి మూఢ నమ్మకములను నిరాకరించుటయే నిజంగా అల్లాహ్ పై నమ్మకము కలిగియున్నట్లు.

7. దీనిలో ప్రవక్త అనుచరులు యొక్క విద్యలో గల నైపుణ్యం కూడా అగుపడు తుంది. ఇటువంటి అతి ఉత్తమ స్థానము వారు వారి పుణ్యకార్యముల వలన పొందగలిగారు. 

8. దైవప్రవక్త అనుచరులు పుణ్యకార్యాలు చేయుటలో ఎలా ముందుండే వారో అర్థం అవుతుంది. 

9. చివరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క అనుచరులు అందరికంటే అధికులు మరియు ఉత్తములు. 

10. ప్రవక్త మూసా అలైహిస్సలాం యొక్క ఘనత కూడా తెలుస్తోంది. 

11. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లంకు ఇతర ప్రవక్తలందరి అనుచరులు చూపబడెను. 

12. ప్రతి సంతతినీ వారి వద్దకు పంపబడిన ప్రవక్తతో పాటు ప్రళయదినాన వేరువేరుగా హాజరుపరచబడును. 

13. ప్రవక్తల హితబోధనలను ప్రతి జాతిలోను చాలా తక్కువ మంది స్వీకరించిరి. 

14. కొంతమంది ప్రవక్తల హితబోధనలను ఎవ్వరూ స్వీకరించలేదు. 

15. ఎక్కువ అనుచరులున్నారని గర్వపడకూడదు. తక్కువ అనుచరులున్నారని బాధపడకూడదు. 

16. చెడు చూపు(దిష్టి) మరియు విష పురుగుల కాటుకు మాత్రం స్తోత్ర పఠనం చేయవచ్చును.

17. సయీద్ బిన్ జుబైర్ వాక్కుతో “సలఫె సాలిహీన్” యొక్క దైవజ్ఞానము కానవస్తుంది. మొదటి హదీసు, రెండవ హదీసుకు వ్యతిరేకం కాదు.

18. సలపె సాలిహీన్ ఒక మనిషిలో లేని సద్గుణం గురించి పొగడటానికి దూరంగా ఉండేవారు. 

19. దైవప్రవక్త, హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్హు ను “నీవు వారిలో ఒకడివి” అనుట దైవప్రవక్త సూచనలలో ఒకటి. 

20. దీని ద్వారా హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్షు యొక్క విశిష్ఠత బోధపడుతుంది.

21. ఏదైనా తెలియని విషయం గురించి మనం చర్చించుకోవచ్చును. 

22. హజరత్ ఉక్కాషా రదియల్లాహు అన్హు తర్వాత ప్రార్ధన కొరకు కోరిన వ్యక్తిని ఉత్తమ రీతిలో కూర్చోబెట్టుటలో ప్రవక్త యొక్క సుహృద్భావము కానవస్తుంది. 

పాఠము-4 : బహుదైవారాధన గురించి భయపడవలసిన ఆవశ్యకత 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధంగా ప్రబోధించెను: 

اِنَّ اللهَ لا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ ، وَمَن يُشْرِكْ بِاللهِ فَقَدِ افْتَرَ إِثْمًا عَظِيمات 

“తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని(షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరినవారి పాపాలను క్షమించగలడు. అల్లాహ్ కు భాగస్వామ్య కల్పన చేసినవాడు ఘోరమైన అబద్ధమును కల్పించాడు” (4:48) 

ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ విధంగా ప్రార్థించెను. 

وَاجْنُبْنِي وَبَنِى أَن نَّعْبُدَ الْأَصْنَامَة 

“(ఓ ప్రభువా) నన్ను మరియు నా సంతతిని విగ్రహారాధన నుండి రక్షించుము.” (14: 35) 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉపదేశించెను: 

“మీరు చిన్నషిర్క్క పాల్పడగలరని నాకు చాలా భయముగా ఉన్నది.” చిన్న షిర్క్క పాల్పడటం అంటే ఏమిటని ప్రశ్నించగా ఆయన “ఎదుటివాడు చూసి మెచ్చుకొనేందుకు చేయు పుణ్యకార్యములు” అని పలికెను. (ముస్నదె అహ్మద్-5:428-429) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను. 

“ఏ వ్యక్తి అయితే ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పిస్తూ మరణిస్తాడో అతడు నరకవాసి.” (బుఖారీ) 

హజరత్ జాబిర్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ఉపదేశించెను: 

“ఏ వ్యక్తి అయితే ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించ కుండా మరణిస్తాడో అతడు స్వర్గమున ప్రవేశించును. ఏ వ్యక్తి అయితే అల్లాహు ఆరాధనలో భాగస్వాములను కల్పిస్తూ మరణిస్తాడో అతడు నరకవాసి. (ముస్లిం)

దీనిలో 11 అర్థ తాత్పర్యములు కలవు. 

1. అల్లాహు సాటిగానీ, భాగస్వాములనుగానీ సృష్టించుటకు భయపడ వలెను. 

2. ఎదుటి వారు చూసేందుకు పుణ్యకార్యములు చేస్తే అల్లాహు భాగస్వాములను కల్పించినట్లే. 

3. ప్రదర్శనా బుద్ధితో మంచి పనులు చేసినట్లయితే స్వల్ప షిర్క్క పాల్పడినట్లే. 

4. పుణ్యాత్ముల విషయంలో అన్నింటికంటే ఎక్కువగా ప్రదర్శనాబుద్ధి లాంటి చిన్న తరగతి షిర్క్క సంబంధించి భయపడవలసి ఉంటుంది. 

5. స్వర్గము మరియు నరకము మానవునికి సమీపములో ఉన్నవి. 

ఒకే హదీసులో స్వర్గ నరకముల గురించి విశదీకరింపబడెను. 

6. ప్రపంచంలో మనుగడ సాగించినంత కాలం ఆరాధనలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించనివాడు స్వర్గమున ప్రవేశింపబడును.

7. ఎవరైతే అల్లాహ్ కు భాగస్వాములను కల్పిస్తాడో అతడు నరకమున ప్రవేశించును. అతడు ఎంతటివాడైనా సరే. 

8. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తనను, తన సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడమని అల్లాహ్ ని వేడుకొనుటలో ఒక పెద్ద ఉపదేశము కలదు. 

9. “ఓ అల్లాహ్! ఈ విగ్రహాల వలన చాలా మంది మార్గభ్రష్టులైనారు” అని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పలికెను. (ఖుర్ఆన్-14:36) అందువల్ల తనను, తన సంతతిని విగ్రహారాధన నుండి రక్షించమని అల్లాహ్ ని వేడుకొనెను. 

10. పైన తెలిపిన ఖుర్ఆన్ వాక్యాలు మరియు ప్రవక్త హదీసుల ద్వారా ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ కి అర్థం క్షుణ్ణంగా తెలుపబడెను. 

11. “షిర్క్” నుండి రక్షించబడిన వాని ఘనత. 

పాఠము- 5 : “లా ఇలాహ ఇల్లల్లాహ్”ను నమ్మి సాక్ష్యమివ్వమని ప్రజలకు హితబోధ చేయుట 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రస్తావించెను: 

قُلْ هَذِهِ سَبِيلِ اَدْعُوا إِلَى اللهِ عَلَى بَصِيرَةٍ أَنَا وَمَنِ اتَّبَعَنِي وسبحن الله وَمَا أَنَا مِنَ المُشْرِكِينَ . 

(ఓప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి: “నా మార్గమైతే ఇదే. నేనూ, నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము. అల్లాహ్ పరమ పవిత్రుడు. నేను, అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించే(షిర్క్ చేసే) వారిలోని వాణ్ణి కాను.”(యూసుఫ్-12:108) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హజరత్ ముఆజ్ రదియల్లాహు అన్హుని ‘యెమన్’ ప్రదేశానికి సాగనంపుతూ ఈ విధముగా ఉద్బోధన చేసెను: 

“నీవు గ్రంథ ప్రజల (క్రైస్తవుల) వైపుకు పయనించుచున్నావు. నీవు వారిని అన్నిటికంటే ముందు ఏకదైవారాధన చేయవలెనని ఆహ్వానించు. వారు నీ మాటను అంగీకరించిన పక్షములో వారికి అల్లాహ్ ఒక రోజులో 5 పూటల నమాజు (ప్రార్థన) ఆచరించుటకు ఆజ్ఞాపించెనని తెలుపు. వారు దీనికి కూడా అంగీకరిస్తే తర్వాత అల్లాహ్ ‘దానధర్మం’ (జకాత్) విధి కావించెనని వారికి తెలుపుము. అది వారిలోని ధనికుల దగ్గర నుండి సేకరించబడి, వారిలోని బీదవారికి పంచబడును. వారు వీటిని స్వీకరించిన పక్షములో వారి యొక్క మంచి వస్తువులను అర్థించకుము. దౌర్జన్యము చేసి వారి శాపమునకు గురికాకుము. ఎందుకంటే దౌర్జన్యము చేయబడిన వారి ప్రార్థనకు మరియు అల్లాహ్ కు మధ్య అడ్డు ఏదీ లేదు.” 

హజరత్ సహల్ బిన్ సాద్ (రదియల్లాహు అన్షు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

“ఖైబర్ రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా సంబోధించెను: “రేపు నేను మీలోని ఒక వ్యక్తి చేతికి జెండా ఇస్తాను. అతడు అల్లాహ్పట్ల ప్రవక్త పట్ల అమిత ప్రేమ కలవాడు. అల్లాహ్ మరియు ప్రవక్త కూడా అతనిని ప్రేమిస్తున్నారు. అతని చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని కల్పిస్తాడు.” అప్పుడు జెండా ఎవరి చేతికి ఇవ్వబడుతుందోనని అనుచరులు ఊహించసాగిరి. మరుసటి రోజు అలీ (రదియల్లాహు అన్హు) పిలువబడెను. అతని యొక్క కళ్ళు సరిగా లేకుండెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఉమ్మిరాసి దుఆ చేయగా ఆయన కళ్ళు సరయ్యెను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హజరత్ అలీ (రదియల్లాహు అన్షుకు ఈ విధముగా ఉద్బోధించెను: “శాంతముగా బయలుదేరి వెళ్ళుము. ఖైబర్ చేరి అన్నిటికంటే ముందు వారికి ఏకదైవారాధన గురించి తెలియజేయుము. అల్లాహ్ యొక్క ఆజ్ఞలను కూడా వారికి తెలుపుము. వారిలో ఒకళ్ళయినా నిజాన్ని స్వీకరించినచో అది మీకు ఎరుపు ఒంటే కంటే ఉత్తమమైనది.” 

దీనిలో 30 అర్థ తాత్పర్యములు కలవు 

1. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క అనుచరులు కూడా ప్రజలను అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవారు. 

2. ప్రదర్శనా బుద్ధితో చేయు పనుల వల్ల పుణ్యఫలం లభించదని అర్థమవుతుంది. 

3. ప్రజలను ఏకదైవారాధన వైపు పిలుచునప్పుడు మంచిగా ఉద్బోధించ వలెను. 

4. ఉత్తమ ఏకదైవారాధన ఏమనగా అల్లాహ్ కు ఎలాంటి లోపాలు లేవని అంగీకరించుట. 

5. బహుదైవారాధన చేయటమంటే, అల్లాహ్ ను కించపరచటమే. ఇంకా ఆయనకు భాగస్వాములున్నారని భావించుట.

6. బహు దైవారాధకులకు దూరంగా ఉండవలసిన ఆవశ్యకత. 

7. ఇస్లాంకు ప్రధాన మూలాధారం ఏక దైవారాధన. 

8. జనులకు ఉద్బోధన ఏకదైవారాధనతో ప్రారంభించవలెను. 

9. అల్లాహ్ ను తప్ప ఎవరినీ ఆరాధించకూడదన్నా, ఏకదైవారాధన అన్నా ఒకే అర్థము. 

10. కొంత మందికి దైవగ్రంథము ఇవ్వబడినప్పటికీ, వారు ఏకదైవారాధన కు ప్రాముఖ్యత ఇవ్వలేదు.ఏక దైవారాధనయే సరియైనదని గ్రహించి కూడా వారు ఆచరణశీలురు కాలేదు. 

11. ఏకదైవారాధన గురించి క్షుణ్ణంగా విశదీకరించి తెలుపవలెను.

12. అన్నిటికంటే ముందు ప్రధాన అంశములు తెలుపవలెను. 

13. దీనిలో ‘విధి దానం’ (జకాత్) యొక్క లక్ష్యము కూడా తెలుపబడెను.

14. తెలుసుకోగోరిన వారికి, వాళ్ళ అనుమానాలను పోగొట్టవలెను.

15. ‘విధిదానం (జకాత్)లో మంచి ఆభరణములు తీసుకోకూడదు. వేటినైతే ఇస్తారో వాటినే తీసుకోవలెను. 

16. దౌర్జన్యము చేసి బాధింపబడ్డ వ్యక్తి శాపమునకు గురికాకుము. 

17. దౌర్జన్యము చేయబడిన వ్యక్తి యొక్క శాపమును అల్లాహ్ వెంటనే స్వీకరించును. 

18. దైవప్రవక్తలు మరియు వారి అనుచరులు ఇహలోకంలో కష్టములకు గురిచేయబడుటకు కారణం వారు ప్రజలను ఏకదైవారాధన వైపుకు ఆహ్వానించుటయే. 

19. దైవప్రవక్త, “రేపు నేను జెండా అలాంటి వ్యక్తికి ఇస్తాను ఎవరైతే…” అనటం 

ఆయన దైవప్రవక్త అగుటకు ఒక చిహ్నం. 

20. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం, అలీ (రదియల్లాహు అన్హు) కళ్ళను నయపరచుట ఆయన దైవప్రవక్త అనుటకు ఒక నిదర్శనము. 

21. దీనిలో అలీ (రదియల్లాహు అన్హు) ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది. 22. అనుచరులు ఆలోచనలో నిమగ్నులయిరి. 

23. దీనితో మంచి చెడుల విధిరాతపై కూడా విశ్వాసము కలుగును. ఏదైనా మనం కోరుకున్నట్లు కాక అల్లాహ్ నిర్ణయం ప్రకారం జరుగును.

24. శాంతముగా పయనించుము అని అలీ (రదియల్లాహు అన్హు)కు బోధించుట. 

25. ప్రతి పనికి ముందు ఇస్లాం వైపు ఆహ్వానించ వలయును. 

26. ఎట్టి పరిస్థితులలోను ఇస్లాం గురించి క్షుణ్ణంగా విశదీకరించి తెలుపుతూ ఉండవలెను. 

27. ఇస్లాం గురించి మంచిగా సామరస్యంతో బోధించవలెను. 

28. ఇస్లాం స్వీకరించిన పిదప అల్లాహ్ ఆజ్ఞలను క్షుణ్ణంగా తెలుసుకోవలెను. 

29. ఏ వ్యక్తి ద్వారా అయినా కనీసం ఒక్క వ్యక్తి అయినా మార్గ భ్రష్టతను విడనాడి దైవమార్గము స్వీకరించిన ఎడల అది ఎంతో ఉత్తమము. 

30. ఫత్వా: ఏదైనా ప్రశ్నపై సరైన జవాబిచ్చినప్పుడు ప్రమాణము చేయ వచ్చును. 

పాఠము-6 : తౌహీద్ మరియు కలిమయె తౌహీద్ ధృవీకరణల సారాంశం 

అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ విధముగా పేర్కొనెను. 

أو ليك الذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إلى رَبِّهِمْ الوَسيلَةَ أَنهم اَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ 

عذابه اِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَعْدُورًا ) 

“వీరు ఎవరినైతే (అల్లాహ్ ను  కాకుండా) ఆరాధిస్తున్నారో వారే అల్లాహ్ యొక్క సాన్నిధ్యం పొందుటకు ప్రయత్నిస్తుంటారు. ఒకరితో ఒకరు పోటీపడి ఆయన కారుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షకు భయపడుచున్నారు. నిశ్చయముగా నీ ప్రభువు యొక్క శిక్ష భయపడ దగినటువంటిదే.” (బనీ ఇస్రాయీల్-17:57) 

وَإِذْ قَالَ ابْراهِيمُ لأَبِيهِ وَقَوْمِة انتي برام تما 

اِنَّنِي 

تَعْبُدُونَ الَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِيْنِ . 

وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ ) 

“ఇబ్రాహీం (అబ్రహం) అలైహిస్సలాం తన తండ్రిని, తన జాతిని ఉద్దేశించి ఈ విధముగా పలికెను: “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు ఏ విధమైన సంబంధములేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే కలిగియున్నది. ఆయనే నన్ను సన్మార్గమున నడుపును.” ఇబ్రాహీం ఈ వచనాన్నే తన వెనుక తన సంతానము కొరకు విడిచి వెళ్ళెను. వాళ్ళు అనుసరించగలరని. (అజ్-జుబ్రుఫ్-43:26-28) 

اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِّنْ دُونِ الله 

“వారు అల్లాహ్ ను విడిచి తమ పండితులను తమ సన్యాసులను తమ ప్రభువులుగా చేసికొనిరి.” (అత్-తౌబా-9:31) 

وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ 

انْدَادًا يُحِبُّونَهُمْ كَحُبّ الله 

“మరి కొందరు అల్లాహు భాగస్వాములను కల్పించి వారిని అల్లాహు అభివర్ణించే విధంగా అభివర్ణిస్తారు, ప్రేమించే విధంగా ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అల్లాహ్ నే అమితంగా ప్రేమిస్తారు.” (2:165) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ఉపదేశిం చారు: “ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ‘ను నమ్మి సాక్ష్యమిచ్చి, బహు దైవారాధనను నిరాకరించారో వాళ్ళ జీవితము ధన్యమైనది. అటువంటివారి ఆచరణ అల్లాహ్ చూచుకొనును.” 

దీనిలో 6 అర్థ తాత్పర్యములు కలవు 

1. అతి ముఖ్యమైన విషయం ఏకదైవారాధన. దాని అర్థం స్పష్టముగా తెలుపబడినది.

2. అల్లాహ్ ను విడిచి వేరే వారిని వేడుకొనుటయే బహుదైవారాధన, 

3. గ్రంథప్రజలు అల్లాహ్ ను వదిలి తమ మత గురువులను ఆరాధించే వారు కాదు. కేవలం వారు చూపిన వక్ర కార్యములను అనుసరించే వారు. అంటే అల్లాహ్ ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఎవరి ఆజ్ఞలను శిరసావహిస్తారో వారిని ఆరాధించినట్లు. 

4. ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలాం) తిరస్కారులను ఉద్దేశించి పలికిన వచనములు: “మీరు ఆరాధిస్తున్న వాటితో నాకు సంబంధము లేదు. నా సంబంధము నన్ను సృష్టించిన అల్లాహ్ తోనే” అని. స్పష్టంగా కల్పిత దేవుళ్ళను నిరాకరించి, తనను సృష్టించిన అల్లాహ్ నే ఆరాధించటం చిత్త శుద్ధితో కూడుకున్న పని అని విశదీకరించెను. ఈ విధమైన స్పష్టమైన 

 ఏకదైవారాధననే ఇబ్రాహీం (అలైహిస్సలాం) తన సంతతికి ఉద్బోధించి వెళ్ళెను. బహుశా వారు అనుసరించ గలరని. 

5. అల్లాహ్ ఖుర్ఆన్ తిరస్కారుల గురించి ప్రస్తావిస్తూ, వారు నరకము నుండి విముక్తి చెందలేరని తెలిపెను. వారు కల్పిత భాగస్వాములను అల్లాహ్ ను ప్రేమించినట్లు ప్రేమించుచున్నారు. దీనితో అర్థం అయ్యే దేమనగా బహుదైవారాధకులు కూడా సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ ను విశ్వసించి, ఆయనకు భాగస్వాములను కూడా కల్పించేవారు. అందుచే అల్లాహ్ ను విశ్వసించినప్పటికీ అల్లాహు భాగస్వాము లను కల్పించుట ద్వారా వారు నరక వాసుల య్యారు. అందుచే ఒక్క అల్లాహ్ నే ఆరాధించవలెను. ఆయనకు భాగస్వాములను కల్పించకుండా ఉన్నప్పుడే అల్లాహ్ విధేయులము కాగలము. లేనిచో నరకము నుండి విముక్తి అసంభవము. 

6. బహుదైవారాధనను ధిక్కరించకుండా కేవలం ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ చదివినంత మాత్రాన ఒక వ్యక్తి అల్లాహ్ విధేయుడు (ముస్లిం) కాలేడని హదీసులో స్పష్టముగా తెలుపబడింది. 

పాఠము-7 : కష్టనష్టాల విముక్తికి తాయత్తులు, దారాలు, రక్షరేకులు ధరించుట 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను. 

قُلْ أَفَرَعَيْتُمْ مَا تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ إِنْ أَرَادَ نِيَ اللهُ بصْرِهَل هُنَّ كَشِفْتُ صُرَةٍ اَوْ اَرَادَنِي بِرَحْمَةٍ هَل هُنَّ ملَتْ رَحْمَتِهِ قَلْ حَسْبِيَ اللهُ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكَّلُونَ . 

“ఓ ప్రవక్తా! వారిని ఉద్దేశించి పలుకుము. ఒకవేళ అల్లాహ్ నన్ను దండించదలచిన ఎడల అల్లాహ్ ని కాదని మీరెవరినైతే ఆరాధిస్తున్నారో వారు నన్ను రక్షించగలరా? లేదా అల్లాహ్ నన్ను కరుణించదలచినచో వీరు అల్లాహ్ కరుణను అడ్డుకొనగలరా? మీరే ఆలోచించండి. నాకు అల్లాహ్ ఒక్కడే చాలని చెప్పండి, నమ్ముకునే వారు ఆయన్నే నమ్ముకుంటారు.”(అజ్-జుమర్-39:38) 

హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఒక వ్యక్తి తన చేతిలో ఇత్తడి కడియాన్ని తొడిగి ఉండటం చూసి, ఇది ఏమిటని ప్రశ్నించెను. ఆ వ్యక్తి ఇది ‘వాహినా’ (బలహీనత) కారణముగా తొడిగితిని అని జవాబు పలికెను. అప్పుడు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  దీనిని తీసివేయి. అది(నీకు ఏమీ లాభము చేకూర్చదు) నిన్ను ఇంకా బలహీనపరుస్తుంది. అది తొడిగి ఉండగా నీకు మరణము సంభవిస్తే నీవు మోక్షము పొందలేవు” అని అన్నారు. (ముస్నద్ అహ్మద్-సహీసనద్) 

హజరత్ ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించారు: “తాయత్తులు ధరించే వారి కార్యములను అల్లాహ్ పూర్తి చేయకుండుగాక! గవ్వలు వ్రేలాడదీసే వారికి అల్లాహ్ శాంతినివ్వకుండుగాక! (ముస్నద్ అహ్మద్) 

“తాయత్తులు వ్రేలాడదీసే వారు అల్లాహ్ కు భాగస్వామ్యాన్ని కల్పించిన వారే.”  (ముస్నద్ అహ్మద్) 

ఇబ్నె అబీ హాతిం హజరత్ హుజైఫా రదియల్లాహు అన్హు గురించి ఈ విధముగా ఉల్లేఖించెను: ఆయన ఒక వ్యక్తి చేతికి అనారోగ్య కారణంగా తాడు కట్టబడి ఉండుట చూచెను. ఆయన దానిని త్రెంచి వేసి ఖుర్ఆన్లోని ఈ ఆయత్పఠించెను. 

وَمَا يُؤْمِنُ أَكْثَرُهُمْ بِاللهِ اِلَّا وَهُمْ مُّشْرِكُونَ . 

“అల్లాహ్ ని విశ్వసించిన వారిలోని అధికులు భాగస్వాములను కూడా కల్పిస్తూ ఉంటారు.” (యూసుఫ్-12:106) 

దీనిలో 11 అర్థ తాత్పర్యములు కలవు 

1.తాయత్తులు లేదా ఏవైనా వస్తువులు ధరించుట నిషిద్ధము.
2. ప్రవక్త సహచరుడైనా తాయత్తులు ధరించి మరణించిన ఎడల మోక్షము పొందలేరు. ” చిన్న తరగతి షిర్క్ ఘోరపాపాల కన్నా అతిఘోరమైనది” అన్న దైవప్రవక్త సహచరుల మాటకు ఈ హదీసు సాక్ష్యం (సమర్ధన) లభిస్తోంది.
3. తెలియక చేసినప్పటికీ మోక్షము లభించదు. 

4. ఈ వస్తువులు ఇహలోకములో కూడా లాభదాయకంకావు. పైగా నష్టం కలిగిస్తాయి. ఎందుకంటే దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) “అది నిన్ను ఇంకా బలహీన పరుస్తుంది” అన్నారు. 

5. ఇలాంటి వక్ర ఆచరణలు చేయువానిని గట్టిగా వారించవలెను. 

6. ఎవరైతే ఏ వస్తువు వ్రేలాడదీయునో దానికి అప్పజెప్పబడును. 

7. తాయత్తులు ధరించేవారు అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించినవారే. 

8. జ్వరం వచ్చినా తాళ్ళు కట్టుట నిషిద్ధం. 

9. హజరత్ హుజైఫా రదియల్లాహు అన్హు యొక్క వచనం ప్రకారం- ‘షిర్కె అక్బర్ ‘కు సంబంధించిన ఆయతు ‘షిర్కె అస్గర్ ‘కి కూడా వర్తించును.

10. దిష్టి నుండి కాపాడబడుటకు గవ్వలను తొడుగుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినట్లు. 

11. తాయత్తులు మరియు గవ్వలు తొడుగు వానిని శపించవచ్చును. 

తాయెత్తులు ధరించేవారి కార్యములను అల్లాహ్ పూర్తిచేయడు. గవ్వలు ధరించేవారిని అల్లాహ్ వారిమానాన వదిలేస్తాడు. (అంటే వారికి ఉపశమనం లభించదు). 

పాఠము-8 : ఊదుట మరియు తాయత్తులు ధరించుట నిషిద్ధం 

బుఖారీ, ముస్లింలలో హజరత్ అబూ బషీర్ అన్సారీ రదియల్లాహు అన్హు ఈ ఉల్లేఖనమును పొందుపరిచెను: “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వెంట ప్రయాణించుచుంటిని. ప్రవక్త, ఒక చాటింపు వేయువానిని పంపి ఈ విధముగా చాటింపు వేయించెను. “ఏ ఒంటె మెడలోనూ (దిష్టి నివారించుటకు) కట్టబడిన ఏ వస్తువూ ఉండకూడదు. ఉన్న వాటిని తీసివేయ వలెను” అని. 

అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖిం చెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధిం చెను: “మంత్రాలు, తాయత్తులు, తౌల అన్నీ అల్లాహ్ కు భాగస్వామ్యాన్ని కల్పించినట్లే (అని అర్థం)”. (ముస్నదె అహ్మద్, అబూ దావూద్) 

అత్తమాయిమ్ (తాయత్తులు): ఇతర వస్తువుల దిష్టి తగలకుండా ధరించే తాయత్తులు.

అర్రుఖా (మంత్ర పఠనం లేదా ఊదుట): షిర్క్ కు తావులేని స్తోత్రములు తప్ప వేరేవి పఠించకూడదు. 

తౌల: భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు ధరించునటు వంటివి. హజరత్ అబ్దుల్లా బిన్ హకీం రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: 

“ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధిం చెను. “ఏ వ్యక్తి అయినా ఏదైనా ధరించిన యెడల అతనిని దాని వశము చేసి వేయబడును.” (ముస్నద్ అహ్మద్ వ సునన్ తిర్మిజీ). 

ఇమాం అహ్మద్ హజరత్ రువైఫీ రదియల్లాహు అన్హు ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్, ఎవరైతే తాయత్తులు ధరించుదురో, శుద్ధి కొరకు ఎండిన పేడ లేక ఎముక ఉపయోగించెదరో వారితో ప్రవక్తకు, ఇస్లాంకు సంబంధము లేదు.’ 

“ఎవరైతే ఒకరి మెడ నుంచి అయినా తాయత్తు తీసివేసిన యెడల అతనికి ఒక బానిసను విముక్తి కలిగించినంత పుణ్యము లభించును. (వకీ రహ్మతుల్లా అలైహ్ దీనిని పొందుపరచెను)

వకీ రహమతుల్లాహ్ అలై, ఇబ్రాహీం నఖయీ రహమతుల్లాహ్ అలై ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: “ఇబ్నె మద్ రదియల్లాహు అన్హు తాయత్తులన్నింటినీ వారించెను. వాటిలో ఖుర్ఆన్ ఆయత్లు లిఖించి ఉన్నా, వేరేవి ఉన్నాసరే.” 

దీనిలో 8 అర్థ తాత్పర్యములు కలవు 

1. అత్తమాయిమ్, అర్రుఖా అర్థము తెలుపబడెను.

2. “అత్తాలా” అర్థము తెలుపబడెను.

3. అర్రుఖా, అత్తమాయిమ్, అత్తావిల అన్నియూ అల్లాహ్ కు భాగస్వాము లను కల్పించుటయే. 

4. దిష్టి మరియు విషపురుగు కాటు వైద్యమునకు అల్లాహ్ కు భాగస్వా ములు కల్పించనటువంటి స్తోత్రముల పఠనము వారించబడలేదు. 

5. ఖుర్ఆన్ ఆయత్లు లిఖించబడిన తాయత్తులు ధరించుట నిషిద్ధమా? కాదా అనే విషయంలో పండితుల మధ్య అభిప్రాయ భేదము కలదు. అందుచే ధరించకపోవుటయే ఎంతో ఉత్తమము. 

6. దిష్టి విముక్తి కొరకు జంతువుల మెడలో ఏవైనా వస్తువులు వ్రేలాడదీ యుట అల్లాహు భాగస్వాములుగా కల్పించినట్లే. 

7. జంతువుల మెడలో ఏమైనా వ్రేలాడ దీయుట గట్టిగా వారించ బడినది. 

8. ఎవరి మెడలోనైనా వ్రేలాడుతున్న తాయత్తును తీసివేయుట ద్వారా కలుగు పుణ్యము తెలుపబడెను.  

9. ఇబ్రాహీం నఖయీ రహమతుల్లాహ్ అలై, అబూ బిన్ మస్ ఊద్  రజి అల్లాహు అన్హుగారి శిష్యులు. ఆయన తాయత్తులను ధరించుట నిషేధిం చబడినట్లు స్పష్టపరిచెను అని తెలిపెను. 

పాఠము-9 : రాళ్ళను, చెట్లను శుభం కల్గించేవిగా భావించుట 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

اَفَرَيَتُمُ اللتَ وَالْعُزَّى وَمَنْوةَ الثَّالِثَةَ الْأُخْرى 

“లాత్, ఉజ్జా మరియు మూడో విగ్రహమైన మనాత్ వాస్తవికతను గురించి ఆలోచించారా?” (అన్-నజ్-53:19-20) 

హజరత్ అబూవాఖిద్ లైసీ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖిం చెను: “మేము ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తోపాటు హునైన్ పట్టణానికి ప్రయాణించుచుంటిమి. మేము అప్పుడే క్రొత్తగా ఇస్లాం స్వీకరించి ఉంటిమి. ఆ మార్గములో ఒక రేగి చెట్టు ఉంది. బహుదైవారాధకులు ఆ చెట్టును ప్రార్థించేవారు. వారి వస్తువులను కూడా ఆ చెట్టుకు వ్రేలాడదీసే వారు. దాని పేరు ‘జాత్ అన్వాత్.’ మా ప్రయాణంలో ఒక రేగి చెట్టు సమీపమునకు చేరినప్పుడు, ఓ ప్రవక్తా! ఏ విధముగానైతే బహుదైవారాధకుల కొరకు శుభము పొందుటకు “జాత్ అన్వాత్” ఉన్నదో, అటువంటిదే మా కొరకు కూడా ఒకటి నిశ్చయించండి అని చెప్పాము. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధంగా ఉద్బోధించారు: అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే ఉత్తముడు. ఇవి పూర్వీకుల విధానాలే! అయితే అల్లాహ్ పై ప్రమాణము చేసి చెబుతున్నాను. ఎవరి చేతిలోనయితే నాప్రాణముందో ఆయన సాక్షిగా చెబు తున్నాను. ప్రవక్త మూసా అలైహిస్సలామ్ ని, ఆయన అనుచరులు (బనీ ఇస్రాయీల్) ఏవైతే కోరారో మీరూ అవేకోరారు. “ఓ మూసా! ఏ విధముగా అయితే ఆరాధన కొరకు వారికి విగ్రహాలు కలవో అదే విధముగా మా కొరకు కూడా ఒక విగ్రహమును తయారుచేయి.” అప్పుడు ప్రవక్త మూసా (అలైహిస్సలాం), వారిని మీరు వట్టి తెలివిమాలిన వారు అని కోపగించారు. తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం, “మీరు కూడా పూర్వపు జాతులను అనుసరిస్తారు” అని చెప్పారు. (తిర్మిజీ) 

దీనిలో 22 అర్థ తాత్పర్యములు (పాఠములు) కలవు 

1. సూరయె నజ్ ఆయత్ (53:19-20) యొక్క అర్థం. 

2. అనుచరులు ‘జాత్ అన్వాత్’ గురించి అడుగుట ఏమిటంటే, అసలు వాస్తవికత ఏమిటని, ఎవరి చేతిలో నా ప్రాణం ఉన్నదో ఆ అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. 

3. అనుచరులు తమ అభిప్రాయము విన్నవించిరిగాని, అమలు పరచలేదు.. 4. అనుచరులు దానిని అల్లాహ్ స్వీకరించునని భావించిరి. 

5. అనుచరులకు ఇటువంటి పని చేయుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట అని తెలియనప్పుడు, వేరే వారికి కూడా తెలియ నట్లు.
6. పుణ్యము మరియు క్షమాపణ అనుచరులకు లభించునట్లు అందరికీ లభించవు. 

7. అనుచరులు ‘జాత్ అన్వాత్’ కోరినప్పుడు, ప్రవక్త, వారు తెలియక అడిగారని ఊరుకొనక, ఇదే మార్గభ్రష్టత్వము, మీరు కూడా మునుపటి సంతతుల అడుగుజాడల్లో నడవగలరని స్పష్టముగా వివరించి నిరోధించెను. 

8. అన్నిటికంటే ముఖ్య విషయం, ప్రవక్త తన అనుచరులతో ఈ విధముగా సంబోధించుట. “మీరు కూడా ఇస్రాయీల్ సంతతి కోరినట్లు కోరు చున్నారు. వారు, ఓ మూసా! మా కొరకు కూడా ఒక విగ్రహాన్ని నిర్ణయిం చుము” అని పలికిరి. మీరు కూడా అదే విధముగా ప్రశ్నించారు. 

9. అటువంటి వస్తువులు, ప్రదేశములు, ఏ విధమైన శుభము కలిగించ జాలవని గుర్తించడమే ఏకదైవారాధనకు నిదర్శనము. దీనిని ప్రారంభంలో అనుచరులు కూడా గ్రహించలేకపోయారు. ఇది అతి జాగ్రత్తగా గ్రహిం చవలసిన విషయం. 

10. ప్రవక్త ముఖ్య విషయం కాబట్టి చేశారు. 

11. అనుచరులు ఈ విధముగా కోరుటతో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించిరి. కానివారు అవిశ్వాసులు కాలేదు, దీనివలన షిర్క్ లో హెచ్చు తగ్గులు కలవని అర్థం అవుతుంది. 

12. అప్పుడే మేము ఇస్లాం స్వీకరించితిమి అంటే పాత వారికి ఇది తెలియక ఉండకూడదు.

13. ఆశ్చర్యము కలిగినప్పుడు “అల్లాహ్ అతి ఉత్తముడు” అని పలకవచ్చును. 

14. బహుదైవారాధన మరియు వక్ర కార్యములకు దారితీయునటువంటి వాటి నన్నిటినీ నిషేధించవలెను. 

15. దీనిలో పూర్వీకులను అనుసరించుటను నిషేధించబడెను

16. విద్యాభోధన చేయునప్పుడు కోపగించుకొనుట. (విద్యార్థులపై) 

17. ప్రవక్త దీనిలో మునుపటి సంతతుల విధానములను వివరించెను. 

18. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కూడా మునుపటి వారి వలె చేయగలరని తెలియపరచుట, ఆయన ప్రవక్త అనుటకు ఒక నిదర్శనము. 

19. అల్లాహ్! యూదులను, క్రైస్తవులను వేటి గురించి అయితే నిందించెనో, నిశ్చయముగా అవి మన కొరకు కూడా వర్తించును. అటువంటి కార్యముల నుండి మనం అన్ని విధాలా దూరంగా ఉండి జాగ్రత్తగా మసలుకోవాలి. 

20. అల్లాహ్ యొక్క ఆజ్ఞను శిరసావహించుటయే ఆరాధనకు నిదర్శనం. 

21. గ్రంధము అనుగ్రహించబడిన వారి విధానములు కూడా బహు దైవారాధకుల విధానముల వలె ఉండెను. 

22. ఎవరైతే చెడు నుంచి నిజం వైపుకు వస్తారో, వారిలో కొన్ని పాత పద్ధతులు ఇమిడి ఉంటాయి. వాటిని గ్రహించి జాగ్రత్తగా వాటి నుండి విముక్తి పొందుటకు ప్రయత్నించవలెను. 

పాఠము- 10 : అల్లాహ్ యేతరులకు ‘బలి’ సమర్పించేవారు 

అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ విధముగా పేర్కొనెను. 

قُلْ اِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَلَمِينَ لا شَرِيكَ لَهُ، وَبِنالِكَ أُمِرْتُ وَأنا أوّلُ الْمُسْلِمِينَ . 

“(ఓ ప్రవక్తా!) ఈ విధముగా ప్రకటించుము: నా ఆరాధన, నా అర్పణ, నా జీవితం, నా మరణం, సమస్తమూ సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయనకు సాటిగానీ, భాగస్వాములుగానీ లేరు. నాకు ఇదే ఆజ్ఞాపించబడినది మరియు నేను ప్రప్రథమంగా శిరసావహించిన విధేయుణ్ణి.” (6:162-163) 

فصل لربك وانحر: 

“కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు.” (108:2) 

హజరత్ అలీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు నాలుగు ఉద్బోధనలు చేసిరి. 

1) ఎవరైతే అల్లాహ్ కు తప్ప ఇతరులకు జంతువును అర్పిస్తారో వారు శాపగ్రస్తులవుతారు. 

2) ఎవరైతే తమ తల్లిదండ్రులను శపిస్తారో వారే స్వయంగా శాపగ్రస్తు లవుతారు.

3) బిర్అత్ లకు కు పాల్పడేవారికి ఎవరయితే ఆశ్రయం కల్పించుదురో, వారు కూడా శాపగ్రస్తులవుతారు. 

4) ఎవరైతే హద్దు రాళ్ళను మార్చివేస్తారో, వారు శాపగ్రస్తులవుతారు. 

(సహీముస్లింలో ఈ హదీసు పొందుపరచబడెను) 

హజరత్ తారిఖ్ బిన్ షిహాబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ఉపదేశించారు: 

“ఒక వ్యక్తి ఈగ కారణమున స్వర్గములో ప్రవేశించెను మరొక వ్యక్తి ఈగ కారణముననే నరకములో చేరెను.” అప్పుడు అనుచరులు అదెలా ప్రవక్తా? అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా విశదీకరించెను: “ఇద్దరు వ్యక్తులు ఒక ప్రదేశము నుండి ప్రయాణం సాగించారు. అచ్చటి ప్రజలు వాళ్ళ విగ్రహానికి అర్పణ చేయకుండా ఎవ్వరినీ ఆ మార్గము నుండి వెళ్ళనిచ్చేవారు కాదు. వారు ప్రయాణీకులలో ఒకరిని అర్పణ చేయమని పిలిచిరి. అతడు అర్పించుటకు నా దగ్గర ఏమీ లేదని పలికెను. వారు ఈగ అయినా సరే అర్పించవలసినదేనని చెప్పారు. అతను ఈగను ఆ విగ్రహానికి అర్పించెను. అప్పుడు వారు అతనిని విడిచిపెట్టిరి. అతడు ఆ ఈగను విగ్రహానికి అర్పించుట వలన నరకమున ప్రవేశింప జేయబడెను. మరల వారు వేరే వ్యక్తిని నీవు కూడా ఏమైనా అర్పించి వెళ్ళుము అని పలికిరి. కాని అతను నేను ఒక్క అల్లాహు తప్ప వేటికీ అర్పించను అని పలికెను. వారు అతనిని చంపివేసిరి. అతను స్వర్గమున ప్రవేశింప జేయబడెను.” (ముస్నద్ అహ్మద్) 

దీనిలో 13 పాఠములు కలవు 

1. వాక్యము (6:162-163) యొక్క తఫ్సీర్ (భావము). 

2. వాక్యము (108:2) యొక్క తఫ్సీర్ (భావము). 

3. అల్లాహ్ యేతరులకు అర్పించువారిని శపించుట మొట్టమొదటిది. 

4.నీవు వేరే వారి తల్లిదండ్రులను శపించిన యెడల అతడు నీ తల్లిదండ్రు లను శపించును. ఆ కారణముగా నీవే నీ తల్లిదండ్రులపై శాపమునకు కారకుడవగుదువు. 

5. ఎవరైనా వక్ర కార్యములకు పూనుకున్న వ్యక్తికి ఆశ్రయము ఇచ్చిన యెడల అతడు శాపమునకు అర్హుడగును (వక్ర కార్యము అంటే అల్లాహ్ ఆజ్ఞను ధిక్కరించుట లేదా అల్లాహు, ప్రవక్తకు అవిధేయత చూపుట). 

6. హద్దుల రాళ్ళను మార్చినవారిపై శాపము. 

7. ప్రత్యేక వ్యక్తిని శపించుటలో మరియు ఎవరినీ గుర్తించకుండా శపిం చుటలో వ్యత్యాసము కలదు. 

8. ఒక్క ఈగను అర్పించి నరకమున ప్రవేశింపబడుట గమనార్హము.

9. ఈగను అర్పించిన వ్యక్తి అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశముతో చేయలేదు. అతను తనప్రాణమును కాపాడుకొనుటకు చేసెను. దీనితో అల్లాహ్ కు కాకుండా ఇతరులకు అర్పించుట ఎంత ఘోరమైన పాపమో అర్థమవుతుంది. 

10. అల్లాహ్ యొక్క నిజమైన విధేయుడు మరణించుటకు సిద్ధపడెను. కాని అల్లాహక్కు తప్ప ఇతరులకు అర్పించుటకు పూనుకోలేదు. 

11. వారిలో ఈగను విగ్రహానికి అర్పించి నరకమున ప్రవేశించిన వ్యక్తి కూడా ముస్లింయే. విశ్వాసంలేని యెడల ఒక్క ఈగ కారణముగా నరకమున ప్రవేశించెను.

12. ఈ హదీసు వేరొక హదీసు ‘స్వర్గ నరకములు మీ బూట్ల లేజుల కంటే సమీపమున కలవు” (బుఖారీ)ను ధృవీకరించెను.

13. ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం అన్నిటికంటే ముఖ్యము.

పాఠము-11 : అల్లాహ్ యేతరులకు అర్పించబడే స్థలములో అల్లాహ్ నామముపై అర్పణ కూడా నిషేధము 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా సెలవిచ్చెను: 

لَا تَقُمْ فِيهِ اَبَدًا لَمَسْجِدُ أُتِسَ عَلَى التَّقْوى مِنْ أَوَّلِ يَوْمٍ اَحَقُّ أَن تَقُومَ فِيهِ فِيهِ رِجَالُ تُحِبُّونَ 

ان يتَطَهَّرُوا وَاللهُ يُحِبُّ الْمُطَهِّرِينَ . 

“మీరు ఎప్పటికీ దానిలో నమాజు చేయకండి. ప్రారంభము నుండే భయ భక్తుల ప్రాతిపదికపై నిర్మించిన మసీదే నీవు నమాజు చేయదగినది. అందులో పరిశుద్ధంగా ఉండుటకు ఇష్టపడేవారు ఉన్నారు. అల్లాహ్ నిశ్చయముగా పరిశుద్ధతను పాటించు వారిని ఇష్టపడును (ప్రేమించును).” (అత్-తౌబా 9:108) 

హజరత్ సాబిత్ బిన్ జహాక్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ఒక వ్యక్తి ‘బువాన’ అనే ప్రదేశములో ఒంటెను అర్పించుదునని వాగ్దానము చేసుకొనెను. అతను ఆ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రస్తావించగా ఆయన ఈ విధముగా అడిగెను. “అచ్చట మునుపటి విగ్రహాలలో ఏదైనా (పూజింపబడు) విగ్రహము ఉన్నదా?” అనుచరులు జవాబుగా లేదని పలికారు. మరల ప్రవక్త ఈ విధముగా ప్రశ్నించారు: “అక్కడ బహుదైవారాధకులు ఉత్సవాలు జరుపుకునేవారా?” అనుచరులు జవాబుగా లేదని పలికారు. అప్పుడు ప్రవక్త, “నీ అర్పణ పూర్తి చేయుము” అని పలికెను. “గుర్తుంచుకోండి. ఏ వాగ్దానమైనా సరే (మొక్కు బడి) అల్లాహ్ యొక్క అవిధేయతకు సంబంధించినదైతే దానిని పూర్తి చేయ కూడదు (ఆచరించకూడదు). తమ అందుబాటుకు మించివున్న మొక్కుబడిని కూడా పూర్తిచేయనవసరంలేదు.” (దీనిని సుననె అబూదావూద్, సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలలో నిబంధనల మేరకు పొందుపరచబడెను.) 

దీనిలో 11 పాఠములు కలవు 

1. వాక్యము (9:108) యొక్క భావము. 

2. అల్లాహ్ విధేయత భూమిపై కూడా ప్రభావితపరచును. 

3. ఏదైనా కష్టమైన సమస్యను తెలియజేయుటకు అనుమానము లేకుండా విశదీకరించి తెలుపవలెను.

4. అవసరాన్నిబట్టి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని జవాబు చెప్పవలెను. 

5. ఏదైనా ప్రదేశంలో అర్పణకు వాగ్దానము చేయునప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి చేయవలెను. 

6. మునుపటి రోజుల్లో అచ్చట విగ్రహారాధన జరిగిన ఎడల, ఇప్పుడు అచ్చట విగ్రహారాధన జరగనప్పటికీ అచ్చట మొక్కుబడి పూర్తి చేయుట నిషిద్ధము. 

7. పాత ఆచారములు గల ఏ ప్రదేశములో కూడా మొక్కుబడి పూర్తి చేయకూడదు. 

8. ఎవరైనా బహుదైవారాధన జరుగు ప్రదేశములో మొక్కుబడి వాగ్దానము చేసిన యెడల ఆ మొక్కుబడి పూర్తి చేయుట నిషిద్ధం. 

9. పండగలు చేయుటలో ముస్లిమేతరుల పద్ధతిని పాటించరాదు. 

10. అల్లాహ్ అవిధేయతకు పూనుకొను మొక్కుబడి నిషేధించబడినది. 

11. మనం చేయలేని వాగ్దానాలనుచేయుట నిషేధించబడినది. 

పాఠము-12 : అల్లాహ్ యేతరుల మొక్కుబడి షిర్కే 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సెలవిచ్చాడు: 

يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا

వారు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. ఏ రోజు కీడు నలువైపులా విస్తరిస్తుందో ఆ రోజు గురించి భయపడుతుంటారు. (అల్-ఆరాఫ్-76:7) 

وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهُ

మీరు ఏదైతే ఖర్చు చేశారో, మొక్కుబడి చేసుకున్నారో, నిశ్చయముగా అల్లాహ్ కు తెలుసును.” (అల్-బఖర-2:270) 

హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ప్రబోధించెను: 

“ఎవరైతే అల్లాహ్ విధేయతకు సంబంధించిన మొక్కుబడి చేశారో (వాగ్దానము చేశారో) వారు నిశ్చయముగా విధేయతను పూర్తి చేయవలెను. ఎవరైతే అల్లాహ్ అవిధేయతకు సంబందించిన మొక్కుబడి (వాగ్దానము) చేశారోవారు ఎట్టి పరిస్థితిలోనూ అవిధేయతకు పూనుకోకూడదు. 

దీనిలో 3 ప్రకరణములు కలవు 

1. వాగ్దానము (మొక్కుబడి) పూర్తి చేయవలెను. 

2. మొక్కుబడి ఆరాధన కాబట్టి వేరే వారికి మొక్కుకొనుట అల్లాహు భాగస్వాములను కల్పించుట అని అర్థం. 

3. అల్లాహ్ అవిధేయతకు పాల్పడే మొక్కుబడులు చేయకూడదు. తెలియక చేసినా వాటిని పూర్తి చేయుట నిషిద్ధం. 

పాఠము-13 : అల్లాహ్ యేతరుల ‘శరణు’ షిర్కే 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా బోధించెను:

 وَأَنَّهُ كَانَ رِجَالٌ مِّنَ الْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا

“మానవులలో కొందరు జిన్నాతులలోని కొందరిని శరణు వేడుకొను చుండెడివారు. ఈ విధముగా వారి గర్వము అధికమయ్యెను.” ( సూరా అల్ జిన్న్72:6) 

హజరత్ ఖౌలా బిన్తె హకీం (రదియల్లాహు అన్హా) గారి కథనం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ఉద్బోధిస్తుండగా నేను విన్నాను: ఎవరైతే ఏదైనా ప్రదేశములో దిగి, “నేను అల్లాహ్ సృష్టించిన ప్రతి దాని కీడు నుండి అల్లాహ్ సమస్త పదములతో శరణు కోరుచున్నాను” అని దుఆ చదివిన యెడల అతడు అక్కడ నుండి వెళ్ళనంత వరకు ఏ కీడు హాని కల్పించదు.” (ముస్లిం దీనిని పొందుపరచెను) 

దీనిలో 5 పాఠములు కలవు 

1. సూరె జిన్ (72 : 6) ఆయత్ అర్థం. 

2. అల్లాహ్ యేతరుల శరణు కోరటం అల్లాహు భాగస్వామ్యం కల్పించి నట్లు. 

3. అల్లాహ్ “పదములు” సృష్టి కావు. ఒకవేళ అల్లాహ్ పదములు సృష్టి అయినచో, సృష్టితో ప్రవక్త శరణు కోరే వారే కాదు. ఎందుకంటే సృష్టిలో దేనినైనా శరణు కోరుట అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినట్లు అగును 

4. దీనిద్వారా ఆ దుఆ (ప్రార్ధన) యొక్క విశిష్ఠత తెలుస్తోంది. 

5. ఏదైనా వక్ర పద్ధతి ద్వారా ఇహలోకంలో లాభము పొందుట లేదా చెడు నుంచి రక్షణ పొందుటకు ప్రయత్నించుట బహుదైవారాధన కాదని అనుకొనుట పొరపాటు. 

పాఠము- 14 : అల్లాహ్ యేతరులను వేడుకొనుట షిర్కే 

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُكَ وَلَا يَضُرُّكَ ۖ فَإِن فَعَلْتَ فَإِنَّكَ إِذًا مِّنَ الظَّالِمِينَ وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يُرِدْكَ بِخَيْرٍ فَلَا رَادَّ لِفَضْلِهِ ۚ يُصِيبُ بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ

“అల్లాహ్ ను వదలి నీకు లాభనష్టాలు కలిగించలేని వేటినీ వేడుకోకు. నీవు అలా చేసిన పక్షంలో దుర్మార్గుడవైపోతావు. ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా ఆపదకు గురి చేసినచో స్వయంగా అల్లాహ్ తప్ప ఆ ఆపద నుంచి నిన్ను తొలగించువారు ఎవ్వరూలేరు. నీకు ఆయన మేలు చేయాలనుకుంటే ఆయన అనుగ్రహాన్ని ఎవ్వరూ నివారించలేరు. ఆయన తన దాసులలో తను తలచిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నిశ్చయముగా ఆయన క్షమించేవాడూ, కరుణించేవాడూను.” (యూనుస్ 10:106-107) 

إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ ۖ إِلَيْهِ تُرْجَعُونَ

“యదార్థముగా అల్లాహ్ ను కాదని మీరు పూజిస్తున్నవి విగ్రహాలే. మీ అంతట మీరు అసత్యాలను అల్లుతున్నారు. అల్లాహ్ ను కాదని మీరు వేటినైతే పూజిస్తున్నారో అవి మీకు ఏ విధమైన ఉపాధి కల్పించలేవు. ఉపాధి కొరకు అల్లాహ్ అడగండి. ఆయనకే దాస్యం చేయండి. ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి. ఆయన వైపునకే మీరు మరలించబడతారు.” (అన్ కబూత్ 29:17) 

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ

“అల్లాహ్ ను  కాదని ప్రళయం వచ్చే వరకూ అతనికి సమాధానము ఇవ్వలేని వారిని మొరబెట్టుకునేవాడు, తమకు మొరబెట్టుకుంటు న్నాడనే విషయం కూడా తెలియని వారిని వేడుకుంటున్న వాడికంటే పరమ భ్రష్టుడు ఎవరు? ప్రజలందరినీ సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధనను తిరస్కరిస్తారు.” (అహ్ ఖాఫ్ 46:5-6) 

أَمَّن يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ وَيَجْعَلُكُمْ خُلَفَاءَ الْأَرْضِ ۗ أَإِلَٰهٌ مَّعَ اللَّهِ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ

“బాధితుడు మొరబెట్టుకున్నప్పుడు, అతని మొరను ఆలకించి అతని కష్టమును తొలగించు వాడెవడు? భూమిపై మిమ్ములను ప్రతినిధులుగా చేసినవాడెవడు? అల్లాహ్ తోపాటు మరొక దేవుడు కూడా ఉన్నాడా? మీరు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు.” (నమ్ల్  27:62) 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క కాలంలో ఒక కపటుడు ముస్లింలకు కష్టనష్టములు కలిగించెడివాడు. అప్పుడు అను చరులు ప్రవక్త వద్దకుపోయి మొరబెట్టు కొనుదుము అని ప్రవక్త వద్దకు వెళ్ళిరి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారినుద్దేశించి ఈ విధముగా ప్రబోధించెను: “చూడండి! నా వద్ద మొరబెట్టుకో కూడదు. ఒక్క అల్లాహ్ వద్ద మాత్రమే మొరబెట్టుకొనవలెను.” (తబ్రానీ) 

దీనిలో 18 పాఠములు కలవు 

1. వేడుకొనుట అందరూ చేస్తారు. కాని మొరబెట్టుకొనుట బాధితులు మాత్రమే చేస్తారు. 

2. వాక్యము (10:106) యొక్క భావము తెలుపబడినది. 

3. అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనుట, పెద్ద బహుదైవారాధన

4. ఎంతటి వ్యక్తి అయినా, అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనిన యెడల అతడు కూడా దుర్మార్గులలో చేరుతాడు. 

5. వాక్యము (10:107) యొక్క భావము తెలుపబడింది. 

6. అల్లాహ్ ని తప్ప వేరే వారిని వేడుకొనుట అల్లాహ్ ను ధిక్కరించినట్లు. 

7. వాక్యము (29:17) యొక్క అర్థము తెలుపబడినది.

8. అల్లాహ్ ని తప్ప వేరేవారిని ఉపాధి కొరకు వేడుకొనరాదు, ఎలాగైతే స్వర్గం కొరకు అల్లాహ్ ని తప్ప మరెవ్వరితో కోరరో, అలాగే ఉపాధిని కూడా అల్లాహ్ ని తప్ప మరెవ్వరితోనూ కోరకూడదు. 

9. వాక్యము (46:5) యొక్క భావము తెలుపబడినది. 

10. ఎవరైతే అల్లాహ్ ని కాదని వేరే వారిని వేడుకుంటాడో, మొరబెట్టు కుంటాడో, అతన్ని మించిన మార్గభ్రష్టుడు ఎవ్వడూ లేడు. 

11. అల్లాహ్ ని తప్ప ఎవరికైతే మొరబెట్టుకుంటున్నారో, వానికి మొరబెట్టు కుంటున్న విషయం కూడా తెలియదు. 

12. అల్లాహ్ ని కాదని ఎవరినైతే వేడుకొంటున్నారో, వారు ప్రళయదినం నాడు వారిని వేడుకున్న కారణంగా వారికి శత్రువులవుతారు. 

13. వేటినైతే వేడుకుంటున్నారో వారు ప్రళయ దినాన్ని నిరాకరిస్తారు. 

14. అల్లాహ్ ని కాకుండా వేరే వారిని వేడుకొనుట, నిశ్చయముగా వారిని ఆరాధించినట్లు. 

15. అల్లాహ్ ని కాదని ఇతరులను వేడుకొనుట కారణముగానే ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువ మార్గభ్రష్టుడైనాడు. 

16. వాక్యము (27:62) భావము తెలుపబడినది. 

17. నిశ్చయముగా ఆలోచించదగ్గ విషయం ఏమనగా, బహు దైవా రాధకులు కూడా కష్టములలో నుండి మొరబెట్టుకొనువాని మొర ఒక్క అల్లాహ్ యే వినగలడని, కష్టముల నుండి ఒక్క అల్లాహ్ యే రక్షించగలడని విశ్వ సించి, కష్ట పరిస్థితులలో వారు కూడా ఏకాగ్రతతో ఒక్క అల్లాహ్న వేడు కునేవారు. 

18. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకదైవారాధనను ఎటువంటి లోపాలు లేకుండా భద్రపరిచారు. అనుచరులకు ఏక దైవారాధన విషయంలో నీతి మర్యాదలను బోధించారు. అల్లాహ్ పట్ల అమితమైన మర్యాదలను, గౌరవాన్ని సమకూరుస్తూ వివరించారు. 

పాఠము- 15 :ఏ వస్తువునూ సృష్టించలేని వారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారా?

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రస్తావించెను: 

أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَا أَنفُسَهُمْ يَنصُرُونَ

“ఏమిటి వీరు, వేటినీ సృష్టించలేని వారిని, అల్లాహ్ సృష్టింపబడిన వారిని, ఎవ్వరికీ సహాయం చేయలేని వారిని, స్వయంగా తమకు కూడా సహాయం చేసుకోలేని వారిని అల్లాహు కు భాగస్వాములుగా చేస్తున్నారా?” (7:191-192) 

 وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍإِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ

“అల్లాహ్ ని విడిచి వేటినైతే మీరు వేడుకుంటున్నారో వారు కనీసం ఖర్జూరపు గింజపై ఉన్న పొరకు కూడా యజమానులు కారు. మీరు వారిని వేడుకున్నా, వారు మీ మొరలను ఆలకించలేరు. ఒకవేళ విన్నా ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు, వారు, మీరు అల్లాహ్ కు కల్పించిన భాగస్వామ్యమును తిరస్కరించుదురు. సత్యము ఎరిగిన అల్లాహ్ తప్ప ఎవ్వరూ మీకు ఈ సత్యసందేశమును అందజేయలేరు.” (35:13-14) 

హజరత్ అనస్ రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఉహుద్ యుద్ధంలో గాయపడ్డారు. ఆయన రెండు దంతాలు విరిగిపోయాయి. అప్పుడు ఆయన ఈ విధముగా చెప్పారు: “ఇటువంటి ప్రజలు ఏ విధముగా సాఫల్యము పొందు తారు?” అప్పుడు అల్లాహ్ ఈ వాక్యము అవతరింపజేసెను. (బుఖారి) 

ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఫజర్ నమాజు రెండవ రకాతు రుకూ నుంచి లేచి “సమి అల్లాహు లిమన్ హమిద, రబ్బనా వలకల్ హమ్ద్” చదివిన తరువాత “ఓ అల్లాహ్! ఫలానా వారిని శాపగ్రస్తులుగా చేయుము” అని పలికిరి. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యము “(ఓ ప్రవక్తా!) ఆ విషయంలో మీకు ఏ విధమైన అధికారమూ లేదు” అని తెలిపెను. 

మరోచోట ఈ విధముగా ఉల్లేఖించబడినది: 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సవ్వాన్ బిన్ ఉమయ్య, సుహైల్ బిన్ అమర్, హారిస్ బిన్ హిషామ్ శపిస్తుండగా ఈ వాక్యము అవతరింపబడెను: “(ఓ ప్రవక్తా!) ఆ విషయంలో మీకు ఏ విధమైన అధికారమూ లేదు.” వేరొకచోట, అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “ఓ ప్రవక్తా! మీ సమీప బంధువులకు ఉద్బోధించుము” అనే వాక్యము అవతరింపబడినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం లేచి నిలబడి ఈ విధముగా ప్రబోధించారు: “ఓ నా జాతి ప్రజలారా! మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అల్లాహ్ సమక్షములో మీకు నేను ఏ విధమైన సహాయమూ చేయలేను. ఓ నా మేనత్త సఫియా! అల్లాహ్ వద్ద నేను మీకు ఏ సహాయమూ చేయలేను. ఓ నా ప్రియమైన కూతురు ఫాతిమా! నా వద్ద ఉన్న సంపదలో ఏమికావాలో అడిగి తీసుకో. కాని అల్లాహ్ సమక్షంలో నేను నీకు ఏ విధమైన సహాయమూ అందించలేను.” 

దీనిలో 12 పాఠములు కలవు 

1. వాక్యములు (7:191-192) భావము తెలుపబడెను. 

2. ‘ఉహద్’లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  గాయపడుటను తెలుపబడెను. 

3. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నమాజులో చివరి రుకూ తర్వాత దుఆ యే ఖునూత్ చదివినట్లు స్పష్టమవుతుంది. సహచరులు ఆయన వెనుక ఆమీన్ అని పలుకుట కూడా తెలుస్తుంది. 

4. ధిక్కరించిన వారినే శాపగ్రస్తులుగా చేయమని కోరబడినది.

5. విశ్వాసులను, ప్రవక్తను, ధిక్కారులు అతిగా కష్టాలకు గురిచేశారు. అంతేకాకుండా విశ్వసించిన వారు, దౌర్జన్యపరులకు సమీప బంధువులై నప్పటికీ వారిని హతమార్చిరి. ప్రవక్తని “ఎవరైతే తమ ప్రవక్తను గాయ పరిచితిరో” ఆయనను గాయపరచటమే కాకుండా, హతమార్చుటకు పూనుకొనిరి. ఆయన వారి సమీప బంధువైనప్పటికీ

6.ధిక్కారులు ఈ నీచ కార్యముల కారణంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వారిని శాపగ్రస్తులుగా చేయమని కోరినప్పుడు అల్లాహ్, “ఆ విషయంలో మీకు ఏ అధికారమూ లేదు” అనే వాక్యమును అవతరింపజేసెను.

7. అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: “నిశ్చయముగా అల్లాహ్ వారిని క్షమించగలడు లేదా శిక్షించగలడు.” చివరికి అల్లాహ్ వారిని క్షమించెను. వారు విశ్వాసులయ్యారు.  

8. అవసరాన్ని బట్టి ఖునూత్ దుఆ చదవవచ్చునని అర్థం అవుతుంది

9. ఎవరినైతే శాపగ్రస్తులుగా చేయమని కోరబడుతుందో వారి పేరు తెలుపవచ్చును. 

10. “నీ సమీప బంధువులను ఉద్బోధించుము” అనే వాక్యము అవతరింప బడినప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన సమీప బంధువులను పిలిచి వారిని నరకము నుండి తమను తాము కాపాడుకోమని ఉద్బోధించుటను తెలుపబడినది. 

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఏకదైవారాధనకు పిలుపునిచ్చినప్పుడు ఆయనను ప్రజలు పిచ్చివాడని పలికారు. ఇప్పటికీ ఏకదైవారాధనకు పిలుపు ఇచ్చినచో అటువంటి మాటలే వినవలసి ఉంటుంది. 

12. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం తన బంధువులందరికీ, “నేను అల్లాహ్ సమక్షములో మీకు ఏ విధముగా కూడా సహాయ పడలేను అని పలికినప్పుడు, తన కన్న కూతురుతో కూడా ఇదే విధముగా పలికారు. ప్రవక్తయే నిస్సహాయులు అయినప్పుడు ఇతరులు ఏం సహాయం చేయగలరు. ఈ రోజుల్లో సహాయం కొరకు ఎవరినైతే వేడుకొంటున్నారో వారు ఏం సహాయం చేయగలరు చెప్పండి!! 

పాఠము – 16 : అల్లాహ్ ఏదైనా సందేశము అవతరింపజేసినప్పుడు దైవదూతలకు కలుగు భయాందోళనల గురించి

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا الْحَقَّ ۖ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ

“వారి హృదయముల నుండి భయం తొలగిపోయినప్పుడు, ఈ విధముగా ప్రశ్నించు కుంటారు. మీ ప్రభువు ఏమని పలికెను. అప్పుడు (దైవదూతలు) ఆయన సత్యమును పలికెను. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడును” అని చెబుతారు. (సబా-34:23) 

హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి హదీసును ఈ విధముగా ఉల్లేఖించెను. (బుఖారీ) 

“అల్లాహ్ ఆకాశములపై తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, దైవదూతలు ఆ ఆజ్ఞను శిరసావహిస్తూ తమ రెక్కలను, శుభ్రమైన రాయిపై మెత్తని గొలుసు తగిలినప్పుడు వచ్చు శబ్దము వచ్చునట్లు ఆడిస్తారు. ఆ నిర్ణయం ఆ దైవదూతలందరికీ చేరుతుంది. వారి హృదయముల నుండి భయభ్రాంతులు తొలిగిన తరువాత వారు ఒకరినొకరు “అల్లాహ్ ఏమని సంబోధించెను” అని ప్రశ్నించుకుంటారు. అప్పుడు వారు అల్లాహ్ సత్యమును పలికెను. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడూను” అని పలుకుతారు. షైతానులు ఆ మాటలను ఒక నిచ్చెనలాగా తయారై వింటారు. (షైతానులు మాటలను ఎలా చేరవేస్తారో హదీసు ఉల్లేఖకులు సుఫ్యాన్  సంజ్ఞలతో సహా వివరించారు. అందరికంటే పైన ఉన్న షైతాను తన క్రింద ఉన్న వారికి, ఆ షైతాను వాని క్రిందివానికి, ఆ విధముగా చివరి షైతాను జ్యోతిష్యులకు తెలియజేస్తాడు. కొన్ని సమయములలో ఆ మాట జ్యోతిష్యునికి చేరక ముందే షైతానులు పారద్రోలబడుతారు. కొన్ని సమయాల్లో షైతానులు జ్యోతిష్యునికి ఆ మాటను తెలియపరుస్తారు. జ్యోతిష్యుడు షైతాను తెలిపిన మాటలకు వంద అసత్యాలు జతపరుస్తాడు. ఏదైనా సంఘటన సంభవించినప్పుడు, ప్రజలు ఫలానా రోజు ఆ జ్యోతిష్యుడు తెలిపాడు గదా? అందురు. అందు మూలంగా ఆ ఒక్క వార్త సరిగా తెలిపినందుకు ఆ జ్యోతిష్యుడు సత్యవంతుడు అని ప్రజలు నమ్ముతారు. వాస్తవానికి ఆ వార్త షైతాన్ ద్వారా ఆకాశము నుండి వినబడినదై ఉంటుంది. 

హజరత్ నవ్వాస్ బిన్ సమ్ఆన్  (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను: 

“అల్లాహ్ ఏమైనా అవతరింపజేసినప్పుడు అల్లాహ్ భయముతో సకల ఆకాశములపై భయాందోళనలు కమ్ముకుంటాయి. అప్పుడు ఆకాశం మీద ఉన్నవారు ఆ శబ్దానికి మూర్ఛబోయి సాష్టాంగములో పడిపోతారు. ఆ తర్వాత జిబ్రయీల్ దూత అందరి కంటే ముందు తల పైకెత్తుతారు. అల్లాహ్ తను అవతరింప జేసిన విషయాన్ని ఆయనకు తెలియజేస్తాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాం వేరే దైవదూతల దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు వారు ఓ జిబ్రయీల్, మన ప్రభువు ఏమి అవతరింప జేసెను అని ప్రశ్నిస్తారు. అప్పుడు జిబ్రయీల్ (అలైహిస్సలాం) అల్లాహ్ సత్యమును అవతరింపజేసెనని పలుకుతారు. ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు అని తెలుపుతారు. అప్పుడు దైవ దూతలందరూ అదే సందేశాన్ని ఉచ్చరించుతారు. జిబ్రయీల్ అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞ మేరకు ఆ సందేశాన్ని అందజేస్తారు.”

దీనిలో 22 పాఠములు కలవు 

1. వాక్యము (34:23) యొక్క భావము (అల్లాహ్ ఏదైనా సందేశము అవతరింపజేసినప్పుడు దైవదూతలకు కలుగు భయాందోళనల గురించి తెలుపబడెను.) 

2. ఈ వాక్యములో మేము ఫలానా వారిచే సిఫారసు చేయించు కోగలము అన్న భావన ఖండించబడినది

3. దీనిలో “అల్లాహ్ నిశ్చయముగా సత్యమును పలికెను, ఆయన మహిమాన్వితుడు, మహోన్నతుడు” అని తెలుపబడింది. 

4. దైవదూతలు ఒకరినొకరు ప్రశ్నించుకొనుట తరువాత జవాబు తెలుపుకొనుట ఇచ్చట పొందుపరచబడెను. 

5. దైవదూతలు ప్రశ్నించినప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం, అల్లాహ్ అవతరింపజేసిన సందేశము వారికి తెలియపరుస్తారు. 

6. దైవదూతలందరూ మూర్ఛపోయినప్పుడు అందరికంటే ముందు, జిబ్రయీల్ (అలైహిస్సలాం) తేరుకొంటారు. 

7. ప్రశ్నించిన దైవదూతలందరికీ జిబ్రయీల్ (అలైహిస్సలాం) జవాబు ఇస్తారు. 

8. మూర్ఛబోవుట దైవదూతలందరిపై సంభవించును.

9. అల్లాహ్ సంబోధించునప్పుడు ఆకాశము కంపించును. 

10. అల్లాహ్ ఆజ్ఞ మేరకు జిబ్రయీల్ (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క సందేశమును తెలియపరుస్తారు. 

11. షైతానులు రహస్యంగా అల్లాహ్ యొక్క సందేశములు వినుటకు ప్రయత్నించెదరు. 

12. దీని కొరకు వారు ఒకరిపై ఒకరు నిచ్చెనలా అధిరోహిస్తారు. 

13. ఈ షైతానులను పారద్రోలుటకు ఉల్కలు పంపబడును. 

14. కొన్ని సందర్భాలలో అల్లాహ్ సందేశము షైతాన్ కు చేరకముందే పారద్రోలబడును. కొన్ని సందర్భాలలో సందేశాన్ని షైతాను తన స్నేహి తునికి తెలుపుతాడు. 

15. కొన్ని సందర్భాలలో జ్యోతిష్యుని మాట నిజమవుతుంది. 

16. జ్యోతిష్యుడు ఆ ఒక్కమాటకు వంద అసత్యములు కలుపుతాడు. 

17. ప్రజలు ఒక సరియైన మాటకు కారణముగా జ్యోతిష్కుడిని నమ్ము తారు. నిశ్చయముగా ఆ ఒక్క సత్యము కూడా షైతాన్ ద్వారా సేకరించ బడినదే.

18. జ్యోతిష్కుని ఒక్క సరియైన మాటను ఆదర్శముగా తీసుకుంటారు గానీ, అతడి నూరు అసత్యాలను గ్రహించరు. 

19. షైతానులు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని, అబద్దములు పలుకు వారిని సత్యవంతులుగా చిత్రీకరిస్తారు. 

20. దీనిద్వారా అల్లాహ్ స్వభావములు కూడా నిర్ధారణ అవుతాయి. 

21. ఆకాశములపై సంభవించు కంపనలు అల్లాహ్ యొక్క భయముతో జరుగును.

22. దైవదూతలందరూ అల్లాహ్ కు సాష్టాంగ ప్రణామం చేస్తారు. 

పాఠము- 17: సిఫారసు వాస్తవికత 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా పేర్కొనెను:

وَانْذِرُ بِهِ الَّذِينَ يَخَافُونَ أَنْ يُحْشَرُ وا إِلَى رَبِّهِمْ لَيْسَ لَهُمْ 

مِنْ دُونِهِ وَلِيُّ وَلَا شَفِيعُ لَعَلَّهُمْ يَتَّقُونَ . 

“(ఓ ప్రవక్తా!) తమ ప్రభువు ముందు ఆయన తప్ప తమకు సహాయము చేయువారుగానీ లేదా సిఫారసు చేయువారుగానీ ఎవ్వరూ లేని పరిస్థితిలో హాజరు కావలసి వస్తుందని భయపడేవారికి నీవు దీని ద్వారా ఉపదేశించుము. బహుశా వారు అల్లాహు కు భయపడగలరు.” (6:51)

قُل لِّلَّهِ الشَّفَاعَةُ جَمِيعًا
“సిఫారసు అధికారము అల్లాహ్ కలదు.” (39:44) 

مَن ذَا الَّذِي يَشْفَعُ عِندَهُ إِلَّا بِإِذْنِهِ
“ఆయన సమక్షములో ఆయన ఆజ్ఞ లేకుండా సిఫారసు చేయగల వారెవ్వరు?” (2:255) 

وَكَم مِّن مَّلَكٍ فِي السَّمَاوَاتِ لَا تُغْنِي شَفَاعَتُهُمْ شَيْئًا إِلَّا مِن بَعْدِ أَن يَأْذَنَ اللَّهُ لِمَن يَشَاءُ وَيَرْضَىٰ

“ఆకాశంలో ఎంతోమంది దైవదూతలున్నారు, కాని వారి సిఫారసు ఏ మాత్రం ఉపయోగపడదు, అల్లాహ్ ఎవరి గురించైనా ఏదైనా విన్నపం వినదలచుకుంటే, ఆ వ్యక్తి విషయంలో ఇష్టపడి సిఫారసుకు అనుమతిస్తేనే తప్ప.” (53:26) 

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ

“(ప్రవక్తా! ఆ బహుదైవారాధకులతో) ఈ విధముగా పలకండి. అల్లాహ్ ను కాదని మీరు ఆరాధ్యులుగా భావిస్తున్న వారిని పిలిచి చూడండి. వారు ఆకాశాలలోగానీ, భూమిలోగానీ రవ్వంత వస్తువుకు కూడా యజమానులు కారు. వారు భూమ్యాకాశాల ఆధిపత్యంలో భాగస్వాములు కారు. వారిలో ఎవ్వరూ అల్లాహ్ కు సహాయకులు కూడా లేరు. అల్లాహ్ ఏ వ్యక్తి విషయంలో సిఫారసుకు అనుమతించునో, ఆ వ్యక్తికి తప్ప మరెవరికీ ఏ సిఫారసూ అల్లాహ్ సమక్షములో లాభదాయకము కాదు.” (34:22-23) 

షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా విశదీకరించెను: 

“అల్లాహ్ తను సృష్టించిన దానిలో సకల సృష్టిరాశుల యొక్క భాగస్వామ్యము ఏదీ లేదని స్పష్టపరిచెను. వేటినైతే బహు దైవారాధకులు భాగస్వాములుగా కల్పిస్తుండేవారో వాటన్నిటినీ అల్లాహ్ ఖండించెను. ఉదాహ రణకు ఎవరికీ భూమ్యాకాశాలలో ఏ విధమైన అధికారము లేదని స్పష్టపరి చెను. అలాగే అల్లాహు కు ఎవ్వరూ సహాయం చేయలేదు. నిశ్చయముగా బహుదైవారాధకులు ఆశిస్తున్న సిఫారసు, అసలు సిఫారసుకు భిన్నమైనదని ఖుర్ఆన్ స్పష్టము చేసెను

وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ارْتَضَىٰ
“ఎవరినైతే అల్లాహ్ స్వయంగా ఇష్టపడతాడో వారికి తప్ప మరెవ్వరికీ సిఫారసు చేయలేరు.” (అల్-అంబియా-21:28) 

“ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), ప్రళయ దినం నాడు అల్లాహ్ సమక్షములో హాజరు అయి అల్లాహ్ ముందు సాష్టాంగ ప్రణామం చేయును. అల్లాహ్ ను స్మరించి వేడుకొనును. ఆ తరువాత ఆయన సాష్టాంగ ప్రణామం నుండి లేవగానే ఏమి కావలెనో కోరమని తెలుపబడును” అని ముహహ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వివరించెను. అప్పుడు హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు), “ఓ ప్రవక్తా! మీ సిఫారసు పొందే ఆ అదృష్టవంతులెవరు?” అని ప్రశ్నించెను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో, అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారని విశ్వసించి సాక్ష్యమిస్తారో వారు” అని పలికెను. 

దీనితో ఈ సిఫారసు అల్లాహ్ అనుమతితో, ఒక్క అల్లాహ్ యే ఆరాధనకు అర్హుడని నమ్మి సాక్షమిచ్చువానికే వర్తించును, బహు దైవారాధకులకు వర్తించదు. దీని ద్వారా స్పష్టమయ్యే విషయం ఏమనగా ఏకదైవారాధకులపై అల్లాహ్ ప్రత్యేక దయాదాక్షిణ్యములు చూపును, ఎవరికైతే సిఫారసు చేయుటకు అనుమతి ఇవ్వబడెనో, వారి ప్రార్థన ద్వారా ఏక దైవారాధకులు మాత్రమే కనికరించబడతారు. సిఫారసు చేయు వాని (ప్రవక్త) సిఫారసు విశ్వసించిన వారికి మరియు అల్లాహ్ కు భయపడు వారికి మాత్రమే. 

దీనిలో 8 భావములు (పాఠములు) కలవు 

1. సిఫారసు గురించి పేర్కొనబడిన ఆయతుల యొక్క భావము తెలుప బడెను. 

2. నిషిద్ధ సిఫారసులు స్పష్టముగా తెలుపబడెను. 

3. అల్లాహ్ ఆజ్ఞతో స్వీకరించబడు సిఫారసు తెలుపబడెను. 

4. అతి ఉత్తమ సిఫారసుగా పేర్కొనబడెను. 

5. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ సమక్షములో సాష్టాంగ ప్రణామం చేస్తారు. సిఫారసుకు అనుమతింపబడినప్పుడే సిఫారసు చేయగలరు. 

6. సిఫారసుకు అందరికంటే ఎక్కువ అర్హులైనవారు విశ్వాసులు. 

7. ఈ సిఫారసుకుబహుదైవారాధకులు (అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించువారు) అనర్హులు. 

8. సిఫారసు గురించి క్లుప్తంగా తెలుపబడినది. 

పాఠము- 18 : (ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

إِنَّكَ لَا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ

“(ఓ ప్రవక్తా!) నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వమును ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారందరికీ మార్గదర్శకత్వము ప్రసాదించ గలడు. ఆయనకు తన మార్గదర్శకత్వము స్వీకరించువారు ఎవరో తెలుసును.” (28:56) 

సయీద్ బిన్ ముసయ్యిబ్ (రహ్మతుల్లాహ్  అలై) తన తండ్రి ముసయ్యిబ్ (రదియల్లాహు అన్హు) ద్వారా ఈ విధముగా ఉల్లేఖించెను: 

“అబూ తాలిబ్ చావు సమీపించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) విచ్చేసిరి, అప్పుడు ఆయన వద్ద అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్య మరియు అబూ జహల్ కూర్చుని ఉండిరి. అప్పుడు ప్రవక్త ఈ విధముగా సంబోధించెను: “నా ప్రియమైన బాబాయి! అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమివ్వండి. నేను మీ సాక్ష్యమును అల్లాహ్ వద్ద సమర్పించుకుంటాను. అప్పుడు వాళ్ళిద్దరు అబూ తాలిబ్ తో, నీవు అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని చేజార్చుతావా? అని ప్రశ్నించిరి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో ఆ ఇద్దరూ తమ మాటలను మరీ మరీ తిప్పి ప్రశ్నించుచుండిరి. చివరికి అబూ తాలిబ్, తమ అబ్దుల్ ముత్తలిబ్ ధర్మము పైనే ఉండుటకు నిశ్చయించుకొనెను. అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమిచ్చుటకు నిరాకరించెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “నన్ను అల్లాహ్ వారించనంత వరకూ నేను మీ మోక్షము కొరకు అల్లాహ్ కు మనవి చేస్తాను” అని పలికెను. అప్పుడు అల్లాహ్ ఈ వాక్యాలు అవతరింపజేసెను. 

مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَن يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوا أُولِي قُرْبَىٰ 

“బహుదైవారాధకుల మోక్షము కొరకు ప్రార్థించుట ప్రవక్తకూ, విశ్వాసులకూ తగని పని, వారు వారికి బంధువులైనప్పటికీ.” (9:113) 

అల్లాహ్ అబూతాలిబ్ గురించి ఖుర్ఆన్ (28:56)లో ఆ వాక్యము అవతరింపజేసెను. 

దీనిలో 12 పాఠములు కలవు 

1. వాక్యముల (28:56) భావము తెలుపబడెను. 

2. వాక్యముల (9:113) భావము తెలుపబడెను

3. ప్రవక్త “అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్య మివ్వమని కోరుట.” 

4. ప్రవక్త అబూ తాలిబి ని అల్లాహ్ తప్ప ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారని సాక్ష్యమివ్వమని కోరినప్పుడు వారు ఇద్దరు ఆయనను అడ్డుకున్నారు. 

5. తన బాబాయి అల్లాహ్ ను విశ్వసించాలని ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) శాయశక్తులా ప్రయత్నిం చారు.

6. ఎవరైతే అబ్దుల్ ముత్తలిబ్ విశ్వాసి అని అనుకుంటారో, వారికి అతను విశ్వాసి కాదని స్పష్టమవుతుంది. 

7. అబూ తాలిబ్ మోక్షము కొరకు ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వేడుకొన్నప్పుడు, వారించబడెను.

8. చెడ్డవారితో స్నేహము చేయుట వలన అపార నష్టము వాటిల్లును

9. తమ తాతముత్తాతల సంప్రదాయములను, ఆధారములు లేకుండా పాటించుట నష్టదాయకము

10. అబూ జహల్ చేసినటువంటి వక్ర కార్యములు చేయువారందరికీ గుణపాఠము. 

11. జీవితపు చివరి ఘడియల్లోని ఆచరణలే మోక్ష భాగ్యము కలిగి ఉన్నవి. 

12. మార్గభ్రష్టులు చూపిన నిరాధార తాతముత్తాతల సంప్రదాయాలను (10:113) నమ్ముట వలననే అబూ తాలిబ్ విశ్వాసి కాలేకపోయారని గ్రహించవలెను. 

పాఠము- 19 : ఆదం సంతతి అవిశ్వాసులగుటకు కారణం మత గురువుల విషయంలో హద్దు మీరి ప్రవర్తించటమే 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ

“ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయాలలో హద్దుమీరి ప్రవర్తించకండి. అల్లాహు కు సత్యం తప్ప వేరే ఏ విషయాలనూ ఆపాదించకండి.” (అన్-నిసా- 4:171) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) వాక్యము (71:23) గురించి ఈ విధముగా వివరించెను: 

“వీరంతా (వద్, సువా, యగూస్, యవూఖ్, నసర్) నూహ్ (అలైహి స్సలాం) సంతతికి చెందిన మత పెద్దలు. వారు మరణించినప్పుడు అప్పటి ప్రజలు దుఃఖిస్తున్న సమయములో షైతాను ఆ ప్రజలకు ఆ పుణ్యవంతులు కూర్చునే చోట వారిని గుర్తించుకొనుట కొరకు వారి విగ్రహాలను ప్రతిష్ఠీకరించమని ఉసిగొల్పెను. వారు రాళ్ళను (విగ్రహాలను) ఆరాధించేవారు కాదు. అప్పటి ప్రజలు మరణించిన తర్వాత, వారి తర్వాత వచ్చిన ప్రజలు ధర్మ (మత) విద్యను కోల్పోయి, వాస్తవాలను మరచి ఆ విగ్రహాలను ఆరాధించుట ప్రారంభించారు.” (బుఖారి) 

ఇమాం ఇబ్నె ఖయ్యిం (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా తెలిపెను: 

“సలఫ్ సాలెహీన్ ఈ విధముగా విశదీకరించిరి. వారు మరణించిన తర్వాత వారి శిష్యులు. వారి సమాధుల వద్ద కూర్చొనుట ప్రారంభించారు. తరువాత వారి విగ్రహాలను తయారుచేశారు. ఆ విధముగా చాలా కాలము గడిచిన పిదప వారి ఆరాధన ప్రారంభమయ్యెను.”

హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ఉద్బోధిం చెను. మీరు నన్ను పొగడుటలో హద్దుమీరకండి! ఏ విధముగా అయితే ఈసా ఇబ్నె మరియం (అలైహిస్సలాం) విషయంలో క్రైస్తవులు హద్దుమీరిపోయారో!! నేను ఒక దాసుణ్ణి. మీరు నన్ను అల్లాహ్ దాసుడు, ప్రవక్త అని పలకండి.” (బుఖారి, ముస్లిం) 

హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈవిధముగా ప్రబోధిం చారు: “దైవదాసులు విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి. హద్దుమీరి ప్రవర్తించుట వలనే పూర్వ ప్రజలు మార్గభ్రష్టులయ్యారు.” (అహ్మద్, తిర్మిజీ, అబూదావూద్) 

హజరత్ అబ్దులా బిన్ మస్ ఊద్  (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హద్దుమీరి ప్రవర్తించువారు నాశనమగుదురు” అని మూడు సార్లు పలికెను. 

దీనిలో 20 పాడములు కలవు 

1. ఈ భాగము మరియు రాబోవు 2 భాగములు చదివిన ఎడల ఇస్లాం మరియు ఇతర మతాల మధ్యగల భేదము స్పష్టమగును. మనస్సులను మార్చగల అధికారము అల్లాహ్ కే కలదని స్పష్టమగును. 

2. దైవప్రవక్తల విషయంలో హద్దు మీరుట వలనే భూమిపై మొదటి సారిగా విగ్రహారాధన ప్రారంభమయ్యెను. 

3. అల్లాహ్ పంపిన ప్రవక్తలు బోధించిన ధర్మములో మార్పులు చేయుట వలనే ప్రజలు మార్గభ్రష్టులయ్యారు. 

4. ప్రజలు వక్ర కార్యములకు తొందరగా లోనవుతారు. కాని ఇస్లాం దీనిని వారించెను

5. బహుదైవారాధన ప్రారంభమగుటకు కారణం, మత గురువుల విషయంలో హద్దుమీరుట, తదుపరి వారు తమ గురువుల విద్యను అర్థం చేసుకొనలేకపోవుట. 

6. వాక్యము (71:23) భావమును విశదీకరించి తెలుపబడెను. 

7. వాస్తవంగా మనిషి మంచికి దూరమవుతూ చెడుకి సమీపిస్తూ ఉంటాడు. 

8. సత్యమును నిరాకరించుట వలనే కల్పిత వక్ర కార్యములకు పాల్పడు తారని స్పష్టమవుతుంది. 

9. కల్పిత కార్యము చేయువానికి దాని ప్రతిఫలము తెలియనప్పటికీ షైతానులకు బాగా తెలుసును. 

10. హద్దుమీరి ప్రవర్తించుట నిషిద్ధం. హద్దుమీరి ప్రవర్తించుటకు దారితీయు విషయాలు తెలుసుకోవలెను. 

11. శ్మశానములో మంచి పని కొరకు కూర్చొనుట కూడా చాలా నష్ట దాయకము. 

12. విగ్రహాల నిషిద్ధం మరియు వాటిని తుడిచిపెట్టవలసిన ఆవశ్యకత స్పష్టమవుతుంది. 

13. బహుదైవారాధన లేదా అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట అంటే అర్ధము స్పష్టముగా తెలుసుకోవలెను. కాని చాలా మంది ముస్లింలకు ఇది తెలియదు.

14. విచారకరమైన విషయం: వారు ఈ విషయాలను హదీసు పుస్తకాలలో చదువుతారు. వాటిని అర్థం చేసుకుంటారు. కాని వారు చేయు పనులు మత గురువులను గౌరవించుట కోసమే అనుకుంటారు. అల్లాహ్ మరియు ప్రవక్త వారించిన బహుదైవారాధన, అవిశ్వాసులు చేయు విగ్రహారాధననే బహుదైవారాధన అని భావించుచున్నారు.

15. వాటిని వేడుకొనువారు, అవి సిఫారసు చేయగలవని నమ్మేవారు.

16. తదుపరి బహుదైవారాధకులు, మత పెద్దలు, ఆ విగ్రహాలను ఆరాధించుటకు అధిష్టించినట్లు భావించిరి. 

17. మీరు నన్ను పొగడుటలో హద్దుమీరకండి! ఏ విధముగా అయితే క్రైస్తవులు ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) విషయంలో హద్దుమీరిపోయారో!!! “నేను ప్రజలకు సఫలీకృత మార్గము చూపువాడను కాను” అని ప్రవక్త స్పష్టముగా తన బాధ్యతను నిర్వర్తించెను

18. హద్దుమీరి ప్రవర్తించువారు ఎప్పుడూ నాశనమవుతారు. 

19. దీని ద్వారా మత విద్య నభ్యసించవలసిన ఆవశ్యకత తెలియును. విద్య నభ్యసించకపోవుట వలన కలుగు నష్టము తెలియును. నూహ్ (అలైహిస్సలాం) సంతతిలో దైవ విద్య అంతరించిన కారణంగానే బహుదైవారాధన ప్రారంభమయ్యెను. 

20) మత గురువులు మరణించిన తదుపరి వారు దైవ విద్యనభ్యసించక పోవుటయే దైవవిద్య అంతరించుటకు కారణము. 

పాఠము – 20 : పుణ్యాత్ముల, మత గురువుల సమాధుల వద్ద అల్లాహ్ ని ఆరాధించుట నిషిద్ధం 

హజరత్ ఆయిషా (రదియల్లాహు అస) ఈ విధముగా ఉల్లేఖించారు: 

“హజరత్ ఉమ్మె సల్మా (రదియల్లాహు అన్హా) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందు తను అబీసీనియాలో చూసిన ఒక చర్చి గురించి, అందులోని చిత్రాలు మరియు విగ్రహాల గురించి ప్రస్తావిం చెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ప్రబోధించెను: “వారిలోని మత గురువు మరణించినప్పుడు వారు అతని సమాధిపై మస్జిద్ కట్టెడివారు మరియు దానిలో ఇలాంటి చిత్రాలను చిత్రించెడివారు. వీరు అల్లాహ్ వద్ద అందరికంటే హీనులు.” వీరు రెండు చెడులను ఒక చోట జమచేసిరి. ఒకటి సమాధులను ఆరాధించుట, రెండవది చిత్రాలు చిత్రించుట. 

మరోచోట (బుఖారి, ముస్లిం) ఆయిషా రదియల్లాహు అన్హా ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ లోకము విడిచి పోవునప్పుడు తీవ్రమైన జ్వరంతో దుప్పటి కప్పుకున్నారు. గాభరాపడి దుప్పటి ముఖంపైనుంచి తీసి ఈ విధముగా ప్రబోధించెను. 

యూదులు, క్రైస్తవులు శాపగ్రస్తులు కాగలరు! వారు తమ ప్రవక్తల సమాధులను సాష్టాంగాల ఆలయాలుగా మార్చిరి”. దీని ద్వారా ప్రవక్త ఉద్దేశ్యం తన అనుచరులను అటువంటి కార్యముల నుండి నివారించుట, ప్రవక్త సమాధిని, మస్జిద్ చేయగలరని భావించకుంటే ప్రవక్త సమాధి బహిరంగ ప్రదేశములో ఉండేది. 

హజరత్ జుందుబ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం మరణానికి ఐదు రోజుల ముందు ఈ విధముగా ప్రబోధిస్తుండగా విన్నాను: 

నేను అలాహ్ సమక్షమున ప్రకటించుచున్నాను. నేను ఎవ్వరినీ నా ప్రియమైన స్నేహితునిగా ప్రకటించలేదు. నన్ను అల్లాహ్ తన ప్రియమైన స్నేహితునిగా చేసుకొనెను. ఏ విధముగా అయితే ఇబ్రాహీం అలైహిస్సలాంని తన (ఖలీల్) స్నేహితునిగా చేసుకొనెనో, నేను నా అనుచరులలో ఎవరినైనా ప్రియ స్నేహితునిగా చేయదలచుకుంటే అబూబకర్ రదియల్లాహు అన్హు ని చేయుదును. మునుపటి ప్రజలు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకొనిరి. ఎట్టి పరిస్థితి లోను మీరు సమాధులను మస్జిదులుగా చేయవద్దు (పూజించవద్దు). నేను మిమ్మలను ఈ చెడు కార్యముల నుండి నివారించుచున్నాను” (ముస్లిం). 

ప్రవక్త తన చివరి ఘడియల్లో కూడా ఇటువంటి కార్యాముల నుండి నివారిం చెను. సమాధులను పూజించువారిని శాపగ్రస్తులు అగుదురని వక్కాణించెను. సమాధులను పూజించుట, సమాధుల వద్ద నమాజు ఆచరించుట నిషేధించ బడినది. ఆయిషా రదియల్లాహు అన్హా తెలిపెను: “ప్రవక్త సమాధిని మస్జిద్ చేయగలరని భావించకుంటే” యొక్క అర్థము కూడా ఇదే! అనుచరులు ఎప్పటికీ ప్రవక్త యొక్క సమాధిపై మస్జిద్ కట్టువారు కాదు. ఎందుకంటే ఏ ప్రదేశములో అయితే నమాజు చేయబడునో ఆ ప్రదేశము మస్జిద్ అనబడును. 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈవిధముగా ప్రబోధించెను. (బుఖారీ, ముస్లిం) “సకల భూమిని నా కొరకు మస్జిద్ మరియు శుద్ది పొందు ప్రదేశముగా చేయబడెను.” 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: “ప్రళయ దినం ఎవరిపై సంభవించునో వారు పరమ నీచులు మరియు ఎవరైతే సమాధులను మస్జిద్లుగా భావించుకుంటారో వారు కూడా పరమ నీచులు.” ఇబ్నె మస్ ఊద్  రదియల్లాహు అన్హు ఉల్లేఖించెను (ప్రామాణిక సనద్ ద్వారా ముస్నద్ అహ్మద్ మరియు సహీ సనద్ అబూహాతిం పొందు పరచెను. ఇది మర్ ఫు  హదీసు). 

దీనిలో 16 పాఠములు (భావాలు) కలవు 

1. మతగురువుల సమాధిపై మస్జిద్ నిర్మించుటను ప్రవక్తగారు స్పష్టముగా నిషేధించెను. 

2. బొమ్మలను, విగ్రహాలను తయారు చేయుట నిషేధింపబడెను. 

3. ఈ వక్ర కార్యముల నిషేధము మొదటి నుంచి ఉన్నప్పటికీ, మరల చివరి ఘడియల్లో, వాటిని నివారించుటతో, దాని ప్రాముఖ్యత స్పష్టమగుటయేగాక అది అతి పెద్ద పాప కార్యమని అర్థమగును.

4. ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన సమాధిని కూడా ‘మస్జిద్’ చేయవద్దని స్పష్టపరచెను.

5. ప్రవక్తలు, మత గురువుల సమాధులపై మస్జిద్ లు కట్టి ఆరాధనలు చేయుట యూదుల, క్రైస్తవుల ఆచరణ

6. దాని కారణంగా (సమాధులపై మస్జిద్ లు నిర్మించిన యూదులు, క్రైస్తవులు శాపగ్రస్తులవుతారని పలికెను.

7. అందుమూలముగా వారు శాపగ్రస్తులగుదురని తెలుపుటకు కారణం, ముస్లింలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  సమాధిపై మస్జిద్ కట్టకూడదని స్పష్టీకరించుట. 

8. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  సమాధిని, బహిరంగ ప్రదేశములో లేకుండా చూడుటకు కారణము కూడా స్పష్టమగును. 

 9. సమాధులను మస్జిద్లు చేయుట అంటే అర్థం కూడా స్పష్ట మవుతుంది. 

10. ప్రవక్త సమాధులపై మస్జిద్ నిర్మించువారిని, ప్రళయదినం ఎవరిపై సంభవించునో వారిని ఒకేచోట విశదీకరించిరి, నిశ్చయముగా ఆయన, అవిశ్వాసము, బహుదైవారాధన అనుచరులలో ప్రబలుటకు ముందే అవి ఎట్లు ప్రబలునో, వాటి కష్టనష్టములు ఏమిటో క్షుణ్ణముగా విశదీకరించెను. 

11. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన మరణమునకు 5 రోజుల ముందు ప్రబోధించిన ఖుత్బాలు రాఫిజీ, జహమియ (అను) కూటములు నిరాధారములైనవని స్పష్టమగును. రాఫిజా మొట్టమొదట సమాధిపై మస్జిద్ నిర్మించిరి. వారి వలనే ముస్లింలలో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట, కల్పిత కార్యములు ప్రారంభమయ్యెను. 

12. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  మరణించినప్పుడు, జ్వరము, తలనొప్పి వంటి బాధలు కలిగెనని తెలియుచున్నది.

13. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ యొక్క ప్రియ స్నేహితుడు (ఖలీల్) అయ్యే అదృష్టం కలిగినది. 

14. ‘ఖలీల్’ అంటే ప్రియ స్నేహితుడు కంటే ఉత్తమమైన పదము.

15. దీనిలో అబూబకర్ సిద్దీక్ (రదియల్లాహు అన్హు) అందరికంటే ఉత్తమ అనుచరుడని స్పష్టమగును. 

16. ఈ ప్రబోధనలో అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా అర్హుడని స్పష్టమగును.

పాఠము-21 : పుణ్యాత్ముల సమాధుల విషయంలో హద్దుమీరుట దైవేతరుల ఆరాధన జరిగేందుకు అనువుగా వారి సమాధులను విగ్రహారాధనాలయాలుగా మార్చుట 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

“ఓ అల్లాహ్ ! నా సమాధిని విగ్రహమువలె చేయకుము. దేనినైతే ప్రజలు పూజించుదురో వారిపై అల్లాహ్ ఆపద వచ్చిపడునో ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలములుగా మార్చుకుందురో.”

ఇబ్నె జరీర్ రహమతుల్లాహ్ అలైహ్ “అఫరఐ తుముల్లాత వల్ ఉజ్జా” యొక్క తఫ్సీర్, సుఫ్యాన్, మన్ సూర్  విధానములో ముజాహిద్ గారి ఉల్లేఖనంలో ఈ విధముగా విశదీకరించెను: 

“లాత్” హజ్ చేయుటకు వచ్చువారికి విపరీతమైన సేవలు అందించువాడు. అతడు మరణించిన తరువాత ప్రజలు అతని సమాధిపై, సమాధి సేవకులై కూర్చుండిరి. 

అబూ అల్ జవ్జా  కూడా హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్షు) నుంచి ఈ విధముగా ఉల్లేఖించారు: లాత్ హాజీలకు విపరీతమైన సేవలు అందించేవాడు. 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), సమాధులను దర్శించు స్త్రీలను శాపగ్రస్తులవుతారని పలికెను. సమాధులపై మస్జిద్ లు నిర్మించేవారు, సమాధుల వద్ద దీపములు వెలిగించేవారు కూడా శాపగ్రస్తులవు తారని పలికెను. (దీనిని  ‘అహ్లుస్ సునన్’ పొందుపరిచెను). 

దీనిలో 10 పాఠములు కలవు 

1. విగ్రహముల గురించి విశదీకరించబడెను (కాబా గృహములో అధిష్టిం చిన విగ్రహముల గురించి). 

2. ఆరాధన విశదీకరించబడెను. 

3. ప్రవక్త ఆయనకు ఏ కీడు సంభవించునని అనుమానము కలిగెనో వాటి నుండి అల్లాహ్ ను శరణు వేడుకొనెను. 

4. ప్రవక్త “యా అల్లాహ్! నా సమాధిని ప్రజలు పూజించు విగ్రహముగా చేయకుము” అని ప్రార్థించినప్పుడు “మునుపటి ప్రజలు తమ ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలములుగా చేసుకొనిరి” అని కూడా స్పష్ట పరిచెను. 

5. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “ఇటువంటి పనులు చేసిన వారిపై విపరీతమైన ఆపదలు వచ్చిపడెను” అని ఉద్భోదించెను

6. ‘లాత్’ అరబ్బులలో అతి పెద్ద విగ్రహము. దాని ఆరాధన ఏ విధముగా ప్రారంభమయ్యేనో తెలుపబడెను. 

7. ‘లాత్’ ఒక మంచి సేవకుని సమాధిగా ఉండెనని తెలియుచున్నది. 

8. ‘లాత్’ సమాధిలో పూడ్చిపెట్టబడిన మనిషి పేరు. 

9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  “సమాధులను దర్శించు స్త్రీలు శాపగ్రస్తులగుదురని”  తెలిపెను. 

10. “సమాధులపై దీపములు వెలిగించువారు కూడా శాపగ్రస్తులగుదురని” ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  పలికెను. 

పాఠము – 22 : ఏకదైవోపాసనను భద్రపరచటమే కాకుండా భంగపరచు మార్గములను కూడా ప్రవక్త అరికట్టెను 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను; 

لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ

فَإِن تَوَلَّوْا فَقُلْ حَسْبِيَ اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ الْعَرْشِ الْعَظِيمِ

“(ప్రజలారా!) మీ నుంచే మీ వద్దకు ఒక ప్రవక్త విచ్చేసెను. మీరు హాని చెందుట ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్ని ఆయన తీవ్రంగా కాంక్షిస్తుండును. ఆయన విశ్వాసులపై వాత్సల్యం, కారుణ్యం కలవాడు.” ఒకవేళ వీరు విముఖత తెలిపినచో, మీరు వారితో ఈ విధముగా పలకండి, “నాకు అల్లాహ్ యే చాలును. ఆయన తప్ప ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయన మహత్తరమైన అర్థ(సింహాసనము) కు ప్రభువు.” (9:128-129) 

హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త చేసిన ప్రబోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “మీ ఇళ్ళను శ్మశానాలుగా చేయకండి, నా సమాధిని జాతర చేయు స్థలముగా మార్చకండి. మీరు ఎక్కడ ఉన్నా నాపై సలాము పంపండి. మీ సలాము నాకు చేర్చబడును”. (అబూ దావూద్ హసన్ సనద్ దీని రావి ‘సిఖహ్’) 

జైనుల్ ఆబిదీన్ అలీ బిన్ హుసైన్ (రహమతుల్లాహ్ అలైహ్) ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద ప్రార్థన చేయు చుండగా చూసి, అతనిని వారించి, నేను నీకు ఆ హదీసు తెలుపుదునా, అది నా తండ్రిగారు హజరత్ హుసైన్ (రదియల్లాహు అన్హు), నా తాతగారు హజరత్ అలీ (రదియల్లాహు అన్హు)తో, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి వినెను. ఆయన ఈ విధముగా సంబోధించెను: “నా సమాధిని జాతర ప్రదేశముగా మార్చకండి. మీరు (నమాజు చదకవ, ఖుర్ఆన్ చదవక, దుఆ చేయక) మీ ఇళ్ళను శ్మశానాలుగా మార్చుకోవద్దు. నాపై దరూద్ పంపు తుండండి, మీరు ఎక్కడ ఉన్నా మీ సలాము నాకు చేర్చబడును.” 

దీనిలో 9 ప్రకరణములు కలవు 

1. వాక్యము (9: 128-129) యొక్క భావము మరియు వివరణ తెలుపబడెను. 

2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తన అనుచరులను బహుదైవారాధన సరిహద్దుకు కూడా పోకుండా వారించెను. 

3. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాపై విశేష వాత్సల్యం, కరుణ కలిగియుండెను. మార్గదర్శకమును అతిగా కాంక్షించేవారు

4. ప్రవక్త తన సమాధిని దర్శించుటను ప్రత్యేకంగా వారించెను. ఆయన సమాధిని దర్శించుట మంచి కార్యము అయినప్పటికీ

5. సమాధులను ఎక్కువగా సందర్శించుటను ప్రవక్త వారించెను.

6. ప్రవక్త నఫిల్ నమాజులు ఇంటిలో ఆచరించమని ఉద్భోదించారు.

7. అనుచరులందరికీ శ్మశానములో నమాజు చేయరాదని తెలుసును.

8. సలాం ఎక్కడ ఉండి చెప్పినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు చేరును. దాని కొరకు ఆయన సమాధి దగ్గరకు వెళ్ళనవసరం లేదు.

9. దీనిలో ప్రవక్త(సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘బర్ జఖ్’ లో ఉన్నట్లు స్పష్టమగును. అనుచరులు పంపిన సలాములు ఆయనకు చేర్చబడును. 

పాఠము-23 : ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  గారి ‘ఉమ్మత్’లో కొందరు విగ్రహారాధన లాంటి సంకటములో చిక్కుకొనుట 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా బోధించెను: 

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ

గ్రంథంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారు విగ్రహాల (జిబ్త్)పై, మిథ్యా దైవాల (తాగూత్) పై విశ్వాసం కలిగి ఉన్నారు. అవిశ్వాసుల గురించి అభిప్రాయపడుతూ, “విశ్వాసుల కంటే వీరే చాలా వరకు సన్మార్గాన ఉన్నారు” అని అంటారు. (4:51) 

قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوت

“మీరు వారితో ఇలా చెప్పండి. నేను మీకు వారి గురించి తెలుపనా, ఎవరి పరిణామము పాపులకంటే హీనంగా ఉంటుందో? వారు అల్లాహ్ శాపగ్రస్తులైరి. ఆగ్రహించబడిరి. వారు కోతులు, పందులు చేయబడ్డారు. వారు తాగూతు దాస్యం చేశారు.” (5:60) 

قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا

వారిలో ఎవరైతే తమ వ్యవహారములలో జయించారో, ” మేము తప్పకుండా వారిపై ఆరాధనాలయము నిర్మించెదము” అని పలికిరి. (18:21) 

హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “మీరు మునుపటి సమాజములను అనుసరిస్తూ, వారితో సమానులై పోతారు. ఒకవేళ వారు పుట్టలో దూరినా, మీరు కూడా దూరిపోతారు.” అప్పుడు అనుచరులు, “మునుపటి సమాజములంటే యూదులు, క్రైస్తవులా?” అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘మరెవరు?’ అని జవాబు పలికారు. 

హజరత్ సౌబాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “అల్లాహ్ నా కొరకు భూమిని దగ్గరకు చేర్చెను. నేను దాని యొక్క తూర్పు, పడమరలను తిలకించితిని. నా అనుచరులు రాజ్యము ఉన్నంత వరకు నా తుదిచూపు ఉన్నది. ఎంత వరకు అయితే నాకు భూమిని దగ్గర చేసి చూపెట్టబడెనో, నాకు ఒక ఎర్రటి, రెండవది, తెల్లటి నిధులు ప్రసాదించబడెను. నేను నా ప్రభువుతో నా అనుచరుల కొరకు ఈ విధముగా ప్రార్థించితిని. “వారిని అనావృష్టితో నాశనము చేయకుము. వారిపై బద్ధ శత్రువును అధిష్టించకుము. వారిని నాశనము చేసి విడిచిపెట్టగలడు. నా ప్రభువు ఈ విధముగా సెలవిచ్చెను: ఓ! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం), నేను నిర్ణయించిన తర్వాత అది మార్చబడదు. నేను మీ అనుచరుల విషయంలో మీ ప్రార్థన స్వీకరించితిని. వారిని అనావృష్టితో నాశనము చేయను. వారిని నాశనము చేసే బద్ద శత్రువులను కూడా నియమించను, శత్రువులందరూ వారికి వ్యతిరేకంగా ఏకీభవించినాసరే, కాని వారే ఒకరినొకరు నాశనము చేసుకొందురు. ఖైదీలుగా చేయుదురు. 

హాఫిజ్ బర్ ఖాని కూడా తన పుస్తకము ‘సహీ లో దీనిని పొందుపరచెను. “నాకు నా అనుచరులలో మార్గభ్రష్టము చెందిన మార్గదర్శకుల విషయంలో అపాయము కానవస్తుంది. ఒకవేళ వారిలో ఒకసారి యుద్ధము ప్రారంభమైన యెడల, ప్రళయదినం వరకూ అది ఆగదు. నా అనుచరులలో ఒక సమూహము బహదైవారాధకులతో చేయి కలిపేంతవరకూ, నా అనుచరులలో కొన్ని సమూహములు విగ్రహాలను పూజించనారంభించనంత వరకూ ప్రళయదినము సంభవించదు. నా ఉమ్మత్ లో  30 మంది దజ్జాల్లు వచ్చెదరు. వాళ్ళందరూ మేము ప్రవక్తలమని వాదన చేయుదురు. నేను చివరి ప్రవక్తను, నా తర్వాత వేరే ప్రవక్త ఎవ్వరూ రారు. నా అనుచరులలో ఒక సమూహము ఎల్లప్పుడూ సత్యమార్గములో ఉంటారు. అల్లాహ్ వారికి సహాయము చేస్తాడు. వారిని వదలి వెళ్ళువారు వారికి ఏమీ కీడు చేయలేరు. చివరికి ప్రళయ దినం సంభవించును. 

దీనిలో 14 ప్రకరణములు కలవు 

1. వాక్యము (4:51) భావము తెలుపబడెను (దానిలో విగ్రహాలు, షైతాన్ను ఆరాధించిన విషయం కలదు). 

2. వాక్యము (5:60) భావము కలదు. పాపులకంటే నీచమైన వారి గురించి తెలుపబడెను. 

3. వాక్యము (18:21) భావము కలదు. ‘కహఫ్’ వారి గుహపై మస్జిద్ నిర్మాణం గురించి తెలుపబడెను. 

4. జిబ్త్, తాగూత్లను విశ్వసించువారి గురించి తెలుపబడెను. 

5. తమ అవిశ్వాసము తెలిసిన అవిశ్వాసులు, విశ్వాసులకంటే ఉత్తములని యూదుల భావన. 

6. సత్యవంతులు ప్రతి కాలంలోను ఉన్నారు, ఉంటారు అని స్పష్టమవుతుంది. 

7. అనుచరులలో చాలా మంది బహుదైవారాధనకు పాల్పడతారు. 

8. ముఖ్తార్ అబూ ఉబైద్ సఖఫీ తాను ప్రవక్త అని వాదన చేసెను. అతడు ఏక దైవారాధన, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవక్త అని, ఖుర్ఆన్ సత్య సంబోధమని నమ్మెడివాడు. కాని ఖుర్ఆన్లో ముహమ్మద్ (సల్లల్లాహు వ అలైహి వ సల్లం) చివరి ప్రవక్త అని విశ్లేషించినప్పటికి, కొన్ని సమూహములు అతనిని అనుసరించిరి. 

9. సత్యవంతులు సాంతం నాశనము కారు. ప్రళయ దినం వరకూ ఒక సత్యవంతుల సమూహము ఉంటుంది. 

10. సత్యవంతులను విడిచిపెట్టి వెళ్ళేవారు వారికి ఏ విధమైన కీడు చేయలేరు. 

11. సత్యవంతులు ప్రళయ దినం వరకూ ఉంటారు. 

12. ఈ ఉత్తమ నిదర్శనములు తెలుపబడెను. అల్లాహ్ తన ప్రవక్త కొరకు భూమిని దగ్గరకు చేర్చెను. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తెలిపినవన్నీ నిజమని తెలిసినది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అల్లాహక్కు విన్నవించుకున్న రెండు దుఆలు స్వీకరించబడినట్లు తెలిపెను. మూడవ దుఆ స్వీకరించబడలేదు. తన ఉమ్మత్ లో  యుద్ధము ప్రారంభమై ప్రళయదినం వరకు అంతం కాదని తెలుపుట, నా ఉమ్మత్ లో  అసత్య ప్రవక్తలు వాదనలు చేయుదురు అని తెలిపెను. ప్రళయదినం వరకూ సత్య సమాజము అభివృద్ధి చెందుతుండు నని తెలుపుట. ఈ పైన తెలిపినవన్నీ సంభవించెను, ఏవైతే నమ్మశక్యము కానివో అవి జరిగెను. 

13. మార్గభ్రష్టత చెందిన నాయకుల వలనే ప్రవక్త అనుచర సమాజానికి అపాయము కలదని తెలుపబడింది. 

14. ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం)  విగ్రహారాధన యొక్క భావము విశదీకరించితెలిపెను. 

పాఠము- 24 : చేతబడి 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా పేర్కొనెను: 

وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَريهُ مَالَهُ فِي الآخِرَةِ مِنْ خَلَاقٍ 

“ఈ విద్యను నేర్చుకొనేవారికి పరలోకములో భాగము ఏ మాత్రం లేదని వారికి బాగా తెలుసును.” (2:102)

يُؤْمِنُونَ بِالجبت والطاغوت 

“వారు విగ్రహాలను, షైతానులను విశ్వసిస్తున్నారు. వారు జిబ్త్, తాగూత్ ను విశ్వసించారు.”(4:51) 

హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను. ‘జిబ్త్’ అనగా – చేతబడి (జాదూ), ‘తాగూత్’ అనగా షైతాన్.” 

హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: “తాగూత్ అంటే ఎవరిపై షైతాన్ వచ్చునో అటువంటి జ్యోతిష్యుడు, ప్రతి దేశములో వేరే జ్యోతిష్యుడు ఉండేవాడు.” 

హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: “ఏడు నాశనము చేయు పనుల నుండి తమను తాము కాపాడుకోండి.” అప్పుడు అనుచరులు ఆ ఏడు కార్యములు ఏవి అని ప్రశ్నించగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను: 

1. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుట. 

2. చేతబడి చేయుట, మంత్రములతో కనికట్టు చేయుట. 

3. అనవసరంగా ఎవరినైనా సంహరించుట. 

4. వడ్డీ వ్యాపారము చేయుట. 

5. అనాధల సొమ్ము తినుట. 

6. శత్రువులతో యుద్ధము చేయునప్పుడు వెనుదిరిగి పారిపోవుట. 

7. పతివ్రతలపై అభాండము మోపుట. 

హజరత్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను: “జాదు (చేతబడి) చేయువానికి మరణ శిక్ష విధించండి.” (దీనిని తిర్మిజీ పొందుపరచెను. ఇది దైవప్రవక్త సహచరుని ఉవాచ అన్న విషయం సరైనదని తెలిపెను. 

బజాల బిన్ అబ్దహు ఈ విధముగా పేర్కొనెను. “ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు), జాదు చేయువారికి మరణ శిక్ష విధించమని ప్రకటించినప్పుడు, మేము ముగ్గురు చేతబడి చేయువారికి మరణశిక్ష విధించితిమి. (సహీబుఖారీ) 

హఫ్సా (రదియల్లాహు అన్హు) తన సేవకురాలిని జాదు చేసిన కారణముగా మరణశిక్ష విధింపజేసెను. (ముఅత్తా ఇమాం మాలిక్) 

ఇదే విధముగా జుందుబ్ (రదియల్లాహు అన్హు) దీనిని ధృవీకరించెను. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లా అలై) జాదు చేయువారికి మరణశిక్ష విధించారన్న విషయాన్ని ముగ్గురు అనుచరులు ధృవీకరించారని తెలిపెను. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. వాక్యము (2:102)లో జాదు నేర్చుకొనేవారికి ప్రతిఫలము తెలుపబడెను. 

2. వాక్యము (4:51)లో జాదు చేయువారు విగ్రహాలను షైతానును విశ్వసిం చుదురని తెలుపబడెను. 

3. జిబ్, తాగూత్ యొక్క భావము మరియు వాటి మధ్య భేదము తెలుప బడెను. 

4. తాగూత్ జిన్నాతులు కూడా ఉంటారు. మానవులు కూడా ఉంటారు. 

5. వినాశము చేయు ఏడు కార్యములు తెలుపబడెను. వాటిని నివారించెను. 

6. జాదు చేయువాడు అవిశ్వాసి. 

7. జాదు చేసేవాడు క్షమాపణ కోరుకోకుండా చనిపోతే, అతడు నరకములోకి నెట్టివేయబడతాడు.

8. జాదు చేయువారు ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలములో కూడా ఉండిరి. ఇప్పటికీ ఉన్నారు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

పాఠము- 25 : జాదులోని కొన్ని విధానాలు 

ఇమాం అహ్మద్ బిన్ హంబల్, ముహమ్మద్ బిన్ జాఫర్ నుంచి, ఆయన అవుఫ్ బిన్ హిబ్బాన్ బిన్ అల్ అలా నుంచి, ఆయన ఖతన్ బిన్ ఖుబైసా నుంచి, ఆయన తన తండ్రి ఖుబైసా నుంచి, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుంచి ఈ విధముగా ఉల్లేఖించెను. 

“పక్షులను ఎగురవేసి శకునము తీయుట, భూమిపై రేఖలు గీసి ప్రశ్నలు తీయుట (ప్రశ్నశాస్త్రము), ఏదైనా అడ్డు వచ్చినచో చెడు అని భావించుట, ఇవన్నీ జాదు యొక్క విధాన ములు.” 

(దీనిని ముస్నద్ అహ్మద్, అబూదావూద్, నసాయి, ఇబ్నె హిబ్బాన్ సహీలో పొందుపరచెను.) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: 

“ఎవరైతే జ్యోతిష్యములో ఎంత భాగము నేర్చుకొనెనో, అంత జాదు నేర్చుకున్నట్లు, ఎంత ఎక్కువ నేర్చుకుంటే, దాని కారణముగా అంత (భాగము) ఎక్కువ పాపము పెరుగును.” (అబూదావూద్, సహీ సనద్ పొందుపరచెను) 

హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

“ఎవరైతే ముడివేసి దానిలోకి ఊదునో, నిశ్చయముగా అతడు జాదు చేసెను. ఎవరైతే జాదు చేసెనో అతడు బహుదైవారాధనకు పాల్పడెను, ఏ వ్యక్తి అయినా (తన నడుముకు, మెడకు, చేతికి) ఏదైనా (కట్టిన లేక) వ్రేలాడదీసిన యెడల అతనిని దానికి అప్పగించబడును”. (సునన్ నసాయి) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “నేను మీకు “ఇదతు” గురించి తెలుపనా? అది ఒక దాడి. దాని ద్వారా ప్రజలలో కలత రేపబడును.” (ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: కొన్ని ప్రసంగాలలో కూడా ‘జాదు’ లాంటి ప్రభావం ఉండును

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1. ‘తర్ ఖ్’, ‘తీయర’, ‘అయాఫ’, ‘జిబ్త్’ అన్నీ జాదు విధానములు. 

2. ఈ మూడింటి గురించి వివరముగా తెలుపబడెను. 

3. జ్యోతిష్యము కూడా జాదులో ఒక విధానము. 

4. ముడివేసి ఊదుట కూడా జాదు విధానము అని చెప్పబడింది. 

5. చాడీలు చెప్పి ప్రజలలో కలత రేపుట కూడా జాదు విధానము. 

6. కొంతమంది వాక్చాతుర్యము కొన్ని సమయాలలో జాదులాగ పని చేయును. 

పాఠము-26: జ్యోతిష్యుడు మరియు అతని కోవకు చెందిన వారి గురించి 

కొంత మంది ప్రవక్త సతీమణులు ముతహ్హరాత్ (రదియల్లాహు అన్హున్న) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పేర్కొన్నట్లు ఉల్లేఖించిరి: (సహీముస్లిం) 

ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు దగ్గరకు వెళ్ళి, ఏదైనా అడిగి తెలుసుకొని దానిని రూఢీ పరచినచో, 40రోజుల వరకు అతని నమాజు స్వీకరించబడదు.” (అబూదావూద్) 

అబూహురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: 

“ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యుడు లేదా గుప్త విద్యకలవాడి దగ్గరకు వెళ్ళి అతను తెలిపిన మాటలను ధృవీకరించినచో, ఈ వ్యక్తి మతము (ఇస్లాం)ను నిరాకరించిన వాడవుతాడు.” (అబూదావూద్, తిర్మిజీ, నసాయి, ఇబ్నెమాజ) (ఇమాం హాకిం దీనిని తన పుస్తకములో బుఖారీ, ముస్లింల సిద్ధాంతముల ప్రాతిపదికన సహీ అని తెలిపెను). 

హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను. 

“శకునము తీయువాడు, తీయించువాడు, గుప్తవిద్య చేయువాడు, చేయించువాడు, జాదు చేయువాడు, చేయించువాడు మనలోలేరు (అంటే ఇస్లాంలో లేరు). ఏ వ్యక్తి అయినా గుప్త విద్య చేయువాని వద్దకు వెళ్ళి అతడు చెప్పిన మాటలను ధృవీకరించిన ఎడల అతడు మతమును నిరాకరించిన వాడవుతాడు” (దీనిని ఉత్తమ సనద్ బజ్జార్ ఉల్లేఖించెను) 

ఇమాం బగ్వీ రహ్మతుల్లా అలైహ్ ‘అర్రాఫ్’ గురించి ఈ విధముగా తెలిపెను, కొన్ని మాటలతో కార్యముల విద్య యొక్క వాదన చేయుట, మాట ద్వారా తిరస్కరించబడిన, కోల్పోయిన వస్తువుల గురించి తెలుపుట, 

కొంతమంది విద్యావేత్తలు ‘అర్రాఫ్’ అనగా ‘కాహిన్’ అంటే భవిష్యత్తులో జరుగు వాటిని తెలుపువాడు అంటున్నారు. 

షేఖుల్ ఇస్లాం అబుల్ అబ్బాస్ ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలై), ‘అర్రాఫ్’, అనే పదము, అది కాహిన్, నుజూమి, రమ్మాల్, గుప్త విద్య వాదము చేయుదురో, వారందరి గురించి వాడబడుతుంది. 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా తెలిపెను: ఎవరైతే అక్షరములు (అబాజాద్) వ్రాసి లెక్క వేస్తారో, నక్షత్రముల ద్వారా లెక్క కడతారో నాకు తెలిసినంత వరకు ఈ విధముగా చేయువారికి అల్లాహ్ వద్ద ప్రళయ దినమున ఏ భాగ్యమూ లేదు. 

దీనిలో 7 ప్రకరణములు కలవు 

1. ఖుర్ఆన్ను విశ్వసించుట, కాహిన్ ను విశ్వసించుట ఈ రెండు ఒకే మనస్సులో జమ కాలేవు. 

2. కాహిన్ మాటను ధృవీకరించుట (కుఫ్ర) అవిశ్వాసానికి పాల్పడినట్లు. 

3. ‘కహానత్’ చేయించువాని గురించి నిషేధమని కూడా తెలుపబడెను. 

4. ‘ఫాల్’ (శకునము) తీయించుట కూడా నిషేధము. 

5. జాదు చేయించువాని పాపము తెలుపబడెను

6. “అబాజాద్” వ్రాసి లెక్క చేయువారి గురించి తెలుపబడెను. 

7. దీనిలో కాహిన్ మరియు అర్రాఫ్ మధ్య భేదము తెలుపబడెను. (వీరందరూ మతభ్రష్టులు. వీరికి ఇస్లాంతో ఎటువంటి సంబంధము లేదు) 

పాఠము – 27 : జాదు చేయబడిన వ్యక్తికి వైద్యము చేయుట

హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నషరహ్ (జాదుని జాదు ద్వారా తొలగించుట) గురించి ప్రశ్నించగా, ఆయన “అది షైతాను అమలు (పనులు) అని తెలిపిరి.” (అహ్మద్, అబూదావూద్ ఉత్తమ సనద్ పొందుపరచెను). 

ఇమాం అబూదావూద్ (రహ్మతుల్లాహ్ అలై) ఈ విధముగా తెలిపిరి: ఇమాం అహ్మద్ (రహమతుల్లాహ్ అలై)ను నషరహ్ గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధముగా తెలిపెను: 

“హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్షు) ఈ పనులన్నీ చెడ్డ పనులని అయిష్టత చూపేవారు.” 

ఇమాం ఇబ్నె ఖయ్యం (రహమతుల్లాహ్ అలై) ఈ విధముగా విశదీకరించిరి: 

“చేతబడితో నిరోధించుట. ఇది షైతాన్ కార్యము, నిషేధించబడినది. ఈ విషయంలో జాదును తొలగించువాడు, జాదు చేయబడినవాడు ఇద్దరూ షైతానికి ఇష్టమైన పనులు చేయుదురు. షైతాన్ సంతోషించే పనులు చేయుట ద్వారా షైతాన్ తన ప్రభావమును తొలగించును. దీనిలో 2 విధానములు కలవు. 

1. జాదును దాని ద్వారానే తొలగించుట. ఇది షైతాను పని. 

2. బహుదైవారాధనకు తావులేని ఖుర్ఆన్ వాక్యములు అల్లాహ్, దుఆ చేస్తూ జాదు యొక్క వైద్యము చేయవచ్చును. 

దీనిలో 2 ప్రకరణములు కలవు 

1. జాదు వైద్యము జాదు ద్వారా చేయుట నిషిద్ధము. 

2. ఖుర్ఆన్ ద్వారా జాదు వైద్యము చేయుట సరియైనది. 

పాఠము 28 : దుశ్శకున (అపశకున) దర్శనము 

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

 أَلَا إِنَّمَا طَائِرُهُمْ عِندَ اللَّهِ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

“నిశ్చయముగా వారి అపశకునం అల్లాహ్ అధీనంలో ఉంది. కాని వారిలో చాలా మంది జ్ఞానహీనులు.” (7:131) 

قَالُوا طَابِرُكُمْ مَعَكُمْ، اَبِنْ ذُكِرْتُم ، 

بل انتُم قَوْم مرفونَ ) 

అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు: “మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది. ఏమిటీ, మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అదికాదు. మీరసలు బరితెగించిపోయారు.” (36:19) 

హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖిం చారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “ఏ వ్యాధీ అల్లాహ్ ఆజ్ఞ లేకుండా సోకదు. దుశ్శకునం అనేది లేదు. గుడ్లగూబ కూతలు కూడా ఏ విధమైన అపశకునానికి దారితీయవు. ‘సఫర్’ నెలలో కూడా ఏ విధమైన అపశకునం లేదు.” (సహీబుఖారి,సహీముస్లిం) 

సహీ ముస్లింలో ఈ పదములు, అధికముగా పొందుపరచబడెను. 

“నక్షత్రముల బెడద మరియు భూతముల బెడద అనేవి అవాస్తవములు.” 

హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించెను: “ఏ వ్యాధి కూడా అందరికీ అంటదు. దుశ్శకునం అనేది లేదు. నాకు ‘ఫాల్’ అంటే ఇష్టం”. అప్పుడు అనుచరులు ప్రశ్నించారు: ‘ఫాల్’ అంటే ఏమిటి? అని.” “ఉత్తమమైన మంచి మాట” అని ప్రవక్త జవాబు ఇచ్చెను. 

ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను దుశ్శకునం గురించి ప్రశ్నించగా ఆయన ఈ విధముగా ప్రబోధించెను: 

“వీటన్నింటికంటే ఉత్తమమైన మంచిమాట మేలైనది. అది ఏ ముస్లించి కూడా అతని విధి నుండి నివారించలేదు. అందుచేత ఎవరైనా చెడును చూచినప్పుడు ఈ దుఆ చదవవలెను: “ఓ అల్లాహ్! నీవు తప్ప ఎవరూ మేలు చేకూర్చలేరు. నీవు తప్ప ఎవరూ కీడును నిర్మూలించలేరు. నీ అనుగ్రహము లేనిదే మాకు మేలు చేకూర్చుకునే శక్తిగాని లేదా కీడు నుండి రక్షించుకునే శక్తిగాని లేదు.” (దీనిని అబూదావూద్ సహీ సనత్తో పొందుపరచెను.) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: 

“అపశకునమును విశ్వసించుట అల్లాహు కు భాగస్వాములను కల్పించుట. మనలో ఎవరు (సృష్టి కారణముగా కొన్ని అనుమానాలు కలిగినా) అల్లాహ్ ను విశ్వసించి ఆయనపై నమ్మకము ఉంచిన కారణముగా అల్లాహ్ దానిని నిర్మూలించును.” (అబూదావూద్, తిర్మిజీ) 

హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: “అపశకునం అని ఎవరైతే తన కార్యమును మానుకొనెనో అతడు షిర్క్ చేసెను” అని ప్రవక్త తెలిపినప్పుడు అనుచరులు దానికి పాప పరిహారము ఏమిటి అని ప్రశ్నించిరి. దాని పాప పరిహారము ఈ దుఆ “యా, అల్లాహ్ ! నీవు అనుగ్రహించు మేలు తప్ప వేరే మేలు లేదు. నీవు విధించు కష్టము తప్ప వేరేకష్టము లేదు, నీవు తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారు.” (ముస్నద్ అహ్మద్) 

ముస్నద్ అహ్మద్ లో హజరత్ ఫజల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించారని పొందపరచబడినది: “నిన్ను ఏదైనా పని నుండి నివారించునది లేదా ప్రోత్సహించునది దుశ్శకునము.”

దీనిలో 11 ప్రకరణములు కలవు 

1. వాక్యములు (7:131) మరియు (36:19)ల భావము విశదీకరించి తెలుప బడెను.

2. అల్లాహ్ ఆజ్ఞ లేకుండా ఏ వ్యాధి సోకదని స్పష్టపరచబడెను. 

3. దుశ్శకునం అనేది ఒట్టి భ్రమ అని స్పష్టపరచబడెను. 

4. గుడ్లగూబ కూతలతో అపశకునం వాటిల్లును అని భావించుట కూడా నిరోధించబడినది. 

5. ‘సఫర్’ నెల అపశకునం కలదని భావించుట కూడా నిరోధించ బడింది.

6. ఉత్తమమైన మంచి మాటలు తెలుపవలెను.

7. చెడు మాటలు, మంచి మాటల గురించి విశదీకరించబడెను. 

8. మనస్సులో ఏమైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు అల్లాహ్ ను విశ్వసించుట వలన అవి దూరమగును

9. ఎవరికైనా మనస్సులో చెడు ఆలోచనలు వచ్చినప్పుడు హదీసులో తెలుపబడిన దుఆ, “యా, అల్లాహ్! నీవు తప్ప ఎవరూ మేలు చేకూర్చ లేరు. నీవు తప్ప ఎవరూ కీడును నిర్మూలించలేరు. నీ అనుగ్రహం లేనిదే మాకు మేలు చేసే శక్తి ఎవరికీ లేదు. లేదా కీడు నుంచి రక్షించు కునే శక్తిగాని లేదు” అని చదువవలెను. 

10. అపశకునాలను భావించుట షిర్క్క పాల్పడుట అని స్పష్ట పరచబడెను.

11. అపశకునం గురించి విశదీకరించి తెలుపబడెను. 

పాఠము – 29 : జ్యోతిష్యం గురించి 

ఇమాం బుఖారీ (రహమతుల్లాహ్ అలై) తన సహీ బుఖారీలో హజరత్ ఖతాదా (రదియల్లాహు అన్హు) వచనములను పొందుపరచెను: 

“అల్లాహ్ ఈ నక్షత్రములను మూడు కారణముల కొరకు సృష్టించెను. ఆకాశమును అలంకరించుట కొరకు, షైతానులను పారద్రోలుటకు, సముద్రము, భూమిపై దారి తెలుసుకొనుటకు. ఎవరైనా వీటిని మించి వేరే కారణములు భావించిన ఎడల అతను తప్పు దోవ పట్టును, ప్రతి మేలు నుండి తన భాగము కోల్పోవును. అతను తనకు తెలియని జ్ఞానభారాన్ని తనపై మోపుకున్నాడు. 

హజరత్ ఖతాదా, సుఫ్యాన్ చంద్రుని చలనము గురించి తెలుసు కొనుట సరికాదనిరి. కాని ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఇసఖ్ (రహమతుల్లాహ్ అలైహిమా) చంద్రుని ఘట్టములను తెలుసుకొనుటకు సమ్మతించెను. హజరత్ అబూ మూసా అష్రీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: మూడు రకాల ప్రజలు స్వర్గమున ప్రవేశింప లేరు. 

1. మత్తుపానీయములు సేవించుటకు అలవాటుపడినవారు.

2. బంధుత్వం త్రెంచుకొనువారు. 

3. ‘జాదు’ని విశ్వసించువారు. 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1. నక్షత్రముల సృష్టికి కారణములు తెలుపబడెను.

2. ఈ కారణములు తప్ప వేరే కారణములు భావించుట నిషేధించ బడినది. 

3. చంద్రుని చలనములను గురించి తెలుసుకొనుటలో విద్యావంతుల మధ్య విభేదము కలదు. 

4. జాదు చెడ్డ పాపమని తెలుసుకొని కూడా దానిని నేర్చుకొనుట నిషేధించ బడినదని తెలియుచున్నది. 

పాఠము 30 : నక్షత్రముల ప్రభావముతో వర్షం కురియునని నమ్ముట 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా సెలవిచ్చెను: 

وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

దీనిని తిరస్కరించుటయే మీ జీవనోపాధిగా చేసుకొన్నారా?” (56:82) 

హజరత్ అబూ మాలిక్ అష్రీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త ప్రబోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “మా సమాజములో ప్రజలు వీడని నాలుగు దురాచారములు కలవు. తమ వంశముపై గర్వపడుట, వేరే వంశములలో దోషములను వెలికితీయుట మరియు ఎత్తిపొడుచుట. నక్షత్రముల ప్రభావం వలన వర్షము కురియునని భావించుట. ఆప్తులు మరణించినప్పుడు బట్టలు చించుకొని రోదించుట. ఇంకా ఈ విధముగా పలికెను. ఈ విధముగా బట్టలు చించుకొని రోదించిన వారు తమ మరణమునకు ముందు అల్లాహ్ సమక్షములో క్షమాపణ కోరని ఎడల ప్రళయదినము రోజు వారికి గంధకము మరియు చర్మమును కష్టపరచు దుస్తులు తొడగింపబడును. 

హజరత్ జైద్ బిన్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా పేర్కొనెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం హుదైబియా వద్ద ఒక రాత్రి వర్షము కురిసిన తరువాత మాకు ఫజర్ నమాజు చదివించిరి. ఆయన సలాముచేసి నమాజు ముగించిన తర్వాత అనుచరులను ఉద్దేశించి ఈ విధముగా ప్రబోధించారు: అల్లాహ్ ఏమన్నాడో మీకు తెలుసా? అనుచరులు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే తెలుసును అని జవాబు పలికిరి. మరల ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పేర్కొనెను: అల్లాహ్ కృపతో మాపై వర్షము కురిసినది అని పలికిన వారు నన్ను విశ్వసించిరి. ఫలానా నక్షత్ర ప్రభావము వలన వర్షము కురిసినది అని పలికినవారు నన్ను నిరాకరించి నక్షత్రముల ప్రభావమును విశ్వసించిరి. (బుఖారి, ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా తెలిపెను: కొంతమంది ఫలానా నక్షత్రము వలన లాభం చేకూరెను అని పలికి నప్పుడు అల్లాహ్ ఖుర్ఆన్లో ఈ ఆయత్లను అవతరింపజేసెను. 

فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ  وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ فِي كِتَابٍ مَّكْنُونٍ لَّا يَمَسُّهُ إِلَّا الْمُطَهَّرُونَ تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أَفَبِهَٰذَا الْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

“నక్షత్రముల చలనముల ప్రమాణము, మీరు తెలుసుకుంటే ఇది చాలా పెద్ద ప్రమాణము. నిశ్చయముగా ఇది ఒక మహోన్నతమైన ఖుర్ఆన్. సురక్షిత పరచ బడినది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు. ఇది సకల లోకాలప్రభువు అవతరింపజేసినది. అయినా మీరు ఈ దైవవాణిని నిర్లక్ష్యము చేయుచున్నారా? దీనిని తిరస్కరించటమే మీ జీవిత లక్ష్యంగా చేసుకున్నారా?” (56:75-82) 

దీనిలో 10 ప్రకరణములు కలవు 

1. వాక్యము(56:82) (ఖుర్ ఆన్ ని తిరస్కరించేవారిని గురించి తెలుపబడెను.)

2. నాలుగు దురాచారాల గురించి విశదీకరించబడెను.

3. వీటిలో కొన్ని కుఫ్ర్కు దారితీయునవి.

4. కొన్ని రకాల కుఫ్ర (కృతఘ్నత) కారణముగా మానవుడు ఇస్లాం ధర్మము నుంచి వెలుపలకు రాడు.

5. అల్లాహ్, “నా దాసులలో కొంతమంది విశ్వాసులైరి. కొంతమంది అవిశ్వాసులైరి” అని తెలిపాడు. అల్లాహ్ అనుగ్రహం అవతరించిన మీదట ఈ సంఘటన జరిగింది.

6. విశ్వాసము గురించి క్షుణ్ణంగా పరిశీలించవలెను. 

7. అవిశ్వాసము గురించి క్షుణ్ణంగా పరిశీలించవలెను. (చిన్న వాక్కుతో విశ్వాసి అవిశ్వాసి అగును)

8. ఫలానా నక్షత్ర ప్రభావము సరియైనది అనుట అవిశ్వాసము. 

9. తెలియనివారు నీకు తెలుసునా అని అడిగి తెలుసుకొనవచ్చును.

10. ఎవరైనా మరణించినప్పుడు బట్టలు చించుకొని రోదించువారి శిక్ష తెలుప బడెను. “నా దాసులలో కొంతమంది విశ్వాసులైరి. మరి కొంతమంది అవిశ్వాసులైరి” అని తెలుపబడెను. 

పాఠము – 31 : అల్లాహ్ ను ప్రేమించుట – ధర్మమునకు పునాది 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రబోధించెను; 

وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُتِ اللهِ 

“కొంతమంది అల్లాహు కు సాటి మరియు భాగస్వాములను కల్పిస్తారు. అల్లాహ్ ని ప్రేమించవలసిన విధముగా వారిని ప్రేమిస్తారు.” 

قُلْ إِن كَانَ اَباؤُكُمْ وَابْنَاؤُكُم وَإخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ 

و اَمْوَالُ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَونَ كَسَادَهَا وَ 

مسكن تَرْضَوْنَهَا اَحَبَّ إِلَيْكُمْ مِنَ اللهِ وَ رَسُولِهِ وَجِهَادِ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّى يَأْتِيَ اللهُ بِأَمْرِهِ ، وَاللهُ لَا يَهْدِ الْقَوْمَ الْفَسِقِينَ 

“(ప్రవక్తా!) ఇలా పలుకుము: ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ బంధువులు, మీరు సంపాదించిన ఆస్తులు, మందగిస్తాయేమో అని మీరు భయపడే మీ వ్యాపారాలు, మీకు ఇష్టమైన మీ గృహాలు, అల్లాహకంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన మార్గంలో జిహాద్ చేయుటకంటే మీకు ఎక్కువ ప్రియమైనచో అల్లాహ్ తన తీర్పును ఇచ్చేవరకు నిరీక్షించండి. అల్లాహ్ దోషులకు సన్మార్గము చూపడు.” (9:24) 

హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “మీరు నన్ను మీ సంతానముకంటే, తల్లి దండ్రులందరికంటే ప్రియతమునిగా గ్రహించే వరకూ నిజమైన విశ్వాసులు కాజాలరు. (బుఖారీ, ముస్లిం) 

మూడు సుగుణములు ఎవరి వద్ద ఉండునో వారు విశ్వాస తియ్యదనము పొందుదురు. 

1. అల్లాహ్ ప్రవక్తను అందరికంటే ప్రియతములుగా గ్రహించినవాడు. 

2. స్వచ్ఛముగా అల్లాహ్ కొరకు వేరే వారిని ప్రేమించువాడు. 

3. అల్లాహ్ అతనిని అవిశ్వాసము నుండి రక్షించినప్పుడు అగ్నిలో ప్రవేశిం చుటకు అయిష్టపడునట్లుగా అతడు కుఫ్ర్ (అవిశ్వాసమున) కు అయిష్ట పడువాడు. 

ఇబ్నె జరీర్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఉల్లేఖనాన్ని ఈ విధముగా పొందుపరచెను: “ఎవరైతే స్వచ్ఛముగా అల్లాహ్ ఇష్టపడుట కొరకు వేరే వారిని ప్రేమించునో, (చెడుల కారణముగా) అసహ్యించు కొనునో, స్నేహం చేయునో, చెడుల కారణముగా విభేదించినచో నిశ్చయముగా అల్లాహ్ స్నేహం వాటి వలననే ప్రాప్తించును.” ఎవరూ ఈ పై విధానములతో తప్ప నిశ్చిత విశ్వాసము పొందజాలరు, వారు ప్రార్థనలు చేయు నప్పటికీ, ఉపవాసములు ఉండునప్పటికీ చాలా మంది తన స్నేహం ప్రపంచ విషయాల కారణముగా పెంచుకొందురు. ఈ స్నేహం వారికి లాభ దాయకము కాదు. 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) వాక్యము (2:166) “వారి సత్సంబంధాలు తెగిపోవును” ను విశదీకరిస్తూ ఈ విధముగా తెలిపెను: ఇచ్చట సత్సంబంధాలు అంటే, వారి స్నేహము, ప్రేమ, వారి సాధనముల సంబంధాలు అని అర్థము. 

దీనిలో 11 ప్రకరణములు కలవు 

1. వాక్యము (2:165) అర్థము (అవిశ్వాసులు అల్లాహ్ ను  కాదని వేరే వారిని ప్రేమించుట) గురించి తెలుపబడెను. 

2. వాక్యము (9:24) అర్థము (అల్లాహ్ ప్రవక్తతో కాకుండా వేరే వాటిని ప్రేమించుట వలన కలుగు ప్రతిఫలము) తెలుపబడినది. 

3. తమ ప్రాణము, సంతానము, సంపద అన్నింటికంటే ఎక్కువగా ప్రవక్తను ప్రేమించ వలయును. 

4. కొన్ని సమయములలో విశ్వాసము కోల్పోవుట అంటే పూర్తిగా అవిశ్వాసి అయినట్టు అర్థము కాదు. 

5. విశ్వాస తియ్యదనము కొన్ని సమయములలో తెలియును. 

6. నాలుగు మనసుకు సంబంధించిన కార్యముల కారణముగా మానవుడు అల్లాహ్ ప్రేమను పొందగలడు. అవి లేకుండా విశ్వాస రుచిని పొంద జాలడు. 

7. సాధారణంగా ప్రజల మధ్య స్నేహం ప్రాపంచిక ప్రయోజనాల నిమిత్తమే ఉంటుందని ప్రవక్త సహచరులు గ్రహించారు. 

8. ప్రళయ దినాన వారి సంబంధాలన్నీ తెగిపోవునని తెలుపుటను గ్రహించవలెను.

9. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించువారిలో కొంతమంది అల్లాహ్ ను అమితముగా ప్రేమించెదరు. 

10. వాక్యము (9:24)లో తెలిపినట్లు అవి అల్లాహ్ కంటే ప్రియమైనవైతే వారు నష్టము భరించుటకు సిద్ధపడవలెను. 

11. ఎవరైనా తన నిరాధారమైన విగ్రహమును అల్లాహ్ ను ప్రేమించినట్లు ప్రేమించిన యెడల అది షిర్క్ అగును. 

పాఠము-32 : అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండుట 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ప్రబోధించెను: 

إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيْطَـٰنُ يُخَوِّفُ أَوْلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ 

“నిశ్చయముగా షైతాను తన మిత్రుల గురించి మిమ్ములను భయ పెట్టును. మీరు నిజమైన విశ్వాసులైతే వారికి భయపడకండి. నాకుభయపడండి.” (3:175) 

إِنَّمَا يَعْمُرُ مَسَـٰجِدَ ٱللَّهِ مَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَقَامَ ٱلصَّلَوٰةَ وَءَاتَى ٱلزَّكَوٰةَ وَلَمْ يَخْشَ إِلَّا ٱللَّهَ ۖ فَعَسَىٰٓ أُو۟لَـٰٓئِكَ أَن يَكُونُوا۟ مِنَ ٱلْمُهْتَدِينَ 

“అల్లాహ్ ను  ప్రళయ దినమునూ విశ్వసించి, నమాజును స్థిరపరచువారు, జకాతు ఇచ్చేవారు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడనివారు మాత్రమే అల్లాహ్ మసీద్లలకు సేవకులూ, సంరక్షకులూ కాగలరు. వీరే మార్గ దర్శకత్వం పొందినవారని ఆశించవచ్చును.” (9:18) 

وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ فَإِذَآ أُوذِىَ فِى ٱللَّهِ جَعَلَ فِتْنَةَ ٱلنَّاسِ كَعَذَابِ ٱللَّهِ

“ప్రజలలో కొంతమంది మేము అల్లాహు విశ్వసించాము అని పలికేవారు న్నారు. కాని అల్లాహ్ మార్గంలో వారికి కష్టము కలిగినప్పుడు ప్రజలు పెట్టిన బాధలను అల్లాహ్ విధించిన శిక్షగా భావిస్తారు.” (29:10) 

హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా   ప్రబోధించెను: “నిశ్చయముగా నీవు అల్లాహ్ ను అయిష్టపరచి ప్రజలను ఇష్టపరచుకొనుట, అల్లాహ్ ప్రసాదించిన ఆహారమునకు ప్రజలను పొగడుట, అల్లాహ్ ప్రసాదించని ఎడల వేరేవారిపై నిందమోపుట ఇవన్నీ విశ్వాస క్షీణత వలనే! నిశ్చయముగా అల్లాహ్ ప్రసాదించిన ఆహారమును అత్యాశపరుని ఆశ పొందలేదు. ఇష్టపడని వారి అయిష్టత దానిని ఆపలేదు.” 

ఆయిషా రదియల్లాహు అన్హా ఈ విధముగా ఉల్లేఖించెను: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధముగా ప్రబోధించెను: “ఎవరైతే ప్రజలను అయిష్టపరచి అయినా అల్లాహ్ ను ఇష్టపరచిన ఎడల అల్లాహ్ దానిని స్వీకరించును. ప్రజలను కూడా ఈ విషయములో ఇష్టపడు నట్లు చేయును. కాని ఎవరైతే అల్లాహ్ ను అయిష్టపరచి ప్రజలను ఇష్టపరచదలచుకుంటే అల్లాహ్ అతనిని నిరాకరించి ప్రజలను కూడా అతనితో అయిష్టపడునట్లు చేయును.” (దీనిని ఇబ్నె హిబ్బాన్ సహీలో పొందుపరచెను.) 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. వాక్యము (3:175) భావము (ఒక్క అల్లాహ్ కే భయపడవలెనని) తెలుపబడెను. 

2. వాక్యము (9:18) యొక్క భావము (అల్లాహ్ మసీద్ సేవకుల గురించి) తెలుపడెను. 

3. వాక్యము (29:10) భావము (విశ్వాసము క్షీణించిన వారి గురించిన) తెలుపబడెను. 

4. విశ్వాసములో క్షీణత, పెరుగుదల కలదు. 

5. విశ్వాసము క్షీణించినటువంటి ఉదాహరణములు తెలుపబడెను. 

6. ఒక్క అల్లాహ్ భయపడుట ఇస్లాం విధులలో ఒకటి. 

7. ఒక్క అల్లాహ్ భయపడువాని యొక్క పుణ్యము తెలుపబడెను. 

8. ఎవరైతే ఒక్క అల్లాహ్ కే కాకుండా ఇతరులకు కూడా భయపడతాడో అతని శిక్ష తెలుపబడెను. 

పాఠము – 33 : ఒక్క అల్లాహ్ నే నమ్ముకోవలెను 


ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ప్రబోధించెను: 

وَعَلَى اللهِ فَتَوَكَّلُوا إِن كُنْتُمْ مُؤْمِنِينَ 

“మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఒక్క అల్లాహ్న నమ్ముకోండి.” (5:23) 

إنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ إِذَا ذُكِرَ اللهُ وَجِلَتْ قُلُوبُهُمْ وَإِذَا تُلِيَتْ 

عَلَيْهِمْ أَيْتُهُ زَادَتْهُمْ إِيمَانًا وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ 

“అల్లాహ్ ను ప్రస్తావించినప్పుడు నిజమైన విశ్వాసుల హృదయాలు కంపిం చును. వారి సమక్షములో అల్లాహ్ ఆయత్లు పఠించినప్పుడు వారి విశ్వాసము పెరుగును. వారు తమ ప్రభువు పట్ల నమ్మకము కలిగి ఉంటారు.” (8:02) 

يَايُّهَا النَّبِيُّ حَسُبُكَ اللهُ وَمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ 

“ఓ ప్రవక్తా! నీకు, నిన్ను అనుసరిస్తున్న విశ్వాసులకు అల్లాహే చాలు.” (8:64) 

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ. 

“ఎవరైతే అల్లాహ్ ను  నమ్ముకుంటారో వారికి అల్లాహ్ యే చాలును.” (65:03) 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా తెలిపెను: ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంను అగ్నిలో వేసినప్పుడు ఆయన ఇలా అన్నారు: 

حسبنا الله ونعم الوكيل 

“నాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ కార్యసాధకుడు.” అదే విధముగా ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో, “అవిశ్వాసులు మీపై దండయాత్రకు సైన్యము సమకూర్చుకొనిరి “మీరు వారికి భయపడండి అని చెప్పారు. కాని ఆ సమయంలో ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వారితో తలపడి నప్పుడు ఆయన విశ్వాసము ఇంకా పెరిగి ఆయన ఇలా అన్నారు: 

حَسبُنَا الله ونعم الوكيل 

“మాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ కార్యసాధకుడు” (3:173) 

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1. ఒక్క అల్లాహ్ నే నమ్ముకొనుట ఇస్లాం విధి. 

2. ఇది విశ్వాస నిబంధన. 

3. వాక్యము (8:2) భావము (విశ్వసించిన వారి గుణములు) తెలుప బడెను. 

4. “వారు తమ ప్రభువు పట్ల నమ్మకము కలిగి ఉంటారు”కు భావము విశదీకరించబడెను. 

5. వాక్యము (65:3) భావము (అల్లాహ్న నమ్ముకొనువారికి అల్లాహ్ యే చాలును.) 

6. వాక్యము (నాకు అల్లాహ్ యే చాలును. ఆయనే ఉత్తమ నేర్పరి)కు గల ప్రాముఖ్యత తెలుపబడెను. అల్లాహు ఇద్దరు స్నేహితులు. ఇబ్రాహీమ్ (అలై), ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) .

పాఠము 34 : అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందడం, అల్లాహ్ ఎత్తుగడ పట్ల నిర్భయంగా ఉండటం గురించి

ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

آقا مِنُوا مَكَرَ اللهِ فَلَا يَأْمَنُ مَكَرَ اللهِ إِلَّا القَوْمُ الخَيرُونَ 

“ఏమిటి మీరు అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉన్నారా? నిశ్చయముగా నాశనం కాబోయే వారు మాత్రమే అల్లాహ్ వ్యూహాలపట్ల నిర్భయముగా  ఉంటారు.” (7:99) 

قَالَ وَمَنْ يَقْنَطُ مِن رَّحْمَةِ رَبَّةٍ إِلا الضَّالُونَ : 

“మార్గభ్రష్టులే తమ ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు.” (15:56) 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను ఘోర పాపములు ఏమిటని ప్రశ్నించగా ఆయన ఈ విధముగా తెలిపెను: “అల్లాహ్ పట్ల ఘోర షిర్క్ కు పాల్పడుట. అల్లాహ్ కారుణ్యము పట్ల నిరాశ చెందుట. అల్లాహ్ ఉపాయములంటే నిర్భయముగా ఉండుట.” 

హజరత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఘోర పాపములు: అల్లాహు కు భాగస్వాములను కల్పించుట, అల్లాహ్ వ్యూహాల పట్ల నిర్భయముగా ఉండుట, అల్లాహ్ దయాకారుణ్యాల పట్ల నిరాశ చెందుట.  (దీనిని అబ్దుర్రజాక్ పొందుపరచెను) 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1. వాక్యము (7:99) భావము (అల్లాహ్ యొక్క ఉపాయముల పట్ల నిర్భయముగా ఉండకూడదని) తెలుపబడెను.  

2. వాక్యము (15:56) భావము (మార్గభ్రష్టులే అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందుతారు) అని తెలుపబడెను. 

3. అల్లాహ్ వ్యూహాలకు నిర్భయముగా ఉన్నవారు భయభ్రాంతులకు గురి అవుతారు.

4. అల్లాహ్ కారుణ్యానికి నిరాశ చెందిన వారు కూడా భయభ్రాంతులకు గురిఅవుతారు.  

పాఠము  35 : అల్లాహ్ నిర్ణయించిన విధిపై సహనం – ఈమాన్ లోని అంతర్భాగమే

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను. 

مَا أَصَابَ مِن مُّصِيبَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۗ وَمَن يُؤْمِن بِاللَّهِ يَهْدِ قَلْبَهُ ۚ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

“అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ఆపదా రాదు. ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో అతని హృదయానికి అల్లాహ్ (సరైన దిశలో) మార్గదర్శకత్వం వహిస్తాడు. అల్లాహ్ అన్ని విషయాలూ తెలిసినవాడు.” (64:11) 

హజరత్ అల్ ఖమా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా విశదీకరిం చిరి: “దీని అర్థం ఏ వ్యక్తికైన కష్టము కలిగినప్పుడు అతడు ఇది అల్లాహ్ (తీర్పు) ఉపాయమని గ్రహించి దానిని సమ్మతించి మనస్సుతో అంగీకరిస్తాడు.” 

హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను “ప్రజలలో ధిక్కరించే రెండు అలవాట్లు కలవు. వంశములను ఎత్తిపొడుచుట, మరణించినప్పుడు బిగ్గరగా ఏడ్చుట.” (ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్షు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “కష్ట సమయములలో తమను తాము హింసించు కొనువారు, బట్టలు చించుకొనువారు, అజ్ఞానపు మాటలు పలుకు వారు, మాలోని వారు కారు.” (బుఖారీ, ముస్లిం) 

హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి (తిర్మిజీ, హాకిం, తబ్రాని) “అల్లాహ్ తన దాసునికి మంచి చేకూర్చదల్చుకుంటే అతని పాపములకు ఇహలోకములోనే శిక్ష విధిస్తాడు, ఏ దాసునికి కీడు చేయదలచుకున్నాడో అతని పాపముల శిక్షను నిలిపివేస్తాడు. చివరికి ప్రళయ దినం రోజు అతని పాపములకు పూర్తి లెక్క కడతాడు.’ 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ఉపదేశిం చెను: “పెద్ద పరీక్ష, పెద్ద బహుమానము ఉండును. అల్లాహ్ ఏదైనా జాతిని ప్రేమించిన ఎడల వారిని పరీక్షించును. ఎవరైతే ఆ పరీక్షకు సమ్మతించునో అల్లాహ్ అతనిని అంగీకరిస్తాడు. ఎవరైతే ఈ పరీక్షకు సమ్మతించరో అల్లాహ్ వారిని నిరాకరిస్తాడు. ” (హసన్, తిర్మిజీ) 

దీనిలో 11 ప్రకరణములు కలవు 

1. వాక్యము (64:11) భావము (అల్లాహ్ విశ్వసించిన వారి హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదించును.) 

2. అల్లాహ్ విధించిన విధిపై ఓర్పు వహించుట అల్లాహ్ ను విశ్వసించుట లో భాగము. 

3. ఎవరి వంశమునైన ఎత్తిపొడుచుట ఇస్లాంను ఉల్లంఘించినట్లే.

4. కష్ట సమయములలో ఓర్పు వహించక హింసించుకొనుట, బట్టలు చించుకొనుట, అజ్ఞాన కాలమునాటి పలుకులు పలుకువారు హెచ్చరించబడును. 

5. అల్లాహ్ తన దాసుని మంచి కోరును. 

6. ఎవరినైతే శిక్షించునో వారి గురించి తెలుపబడినది. 

7. అల్లాహ్ ఎవరిని ప్రేమించునో వారి గురించి తెలుపబడినది. 

8. అల్లాహ్ విధిపై అసంతృప్తి చెందుట నిషేధించబడినది. 

9. పరీక్ష సమయములలో సమ్మతించుటలో చాలా పుణ్యము కలదు. 

పాఠము- 36 : ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యాలు షిర్కే 


ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను:

قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ يُوحَىٰ إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا

(ప్రవక్తా! ఇలా చెప్పండి: “నేను మీలాంటి మానవమాత్రుణ్ణే, నాకు వహీ ద్వారా ఇలా తెలుపబడింది. ‘మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒకే ఒక్కడు. కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి, ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు”) (18:110) 

హదీసే ఖుద్సీలో హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: 

ఎవరినైతే నాకు భాగస్వాములుగా చేస్తున్నారో నేను ఆ భాగస్వాములందరి నిరపేక్షాపరుణ్ణి. ఎవరైతే ఏదైనా కార్యము చేస్తూ అందులో మరెవరినైనా భాగస్వామిగా చేర్చితే నేను అతనిని, నాకు ఎవరినైతే భాగస్వామిగా నియమించాడో అతనికి ఆ కార్యాన్ని వదలి వేస్తాను (నాకు ఎటువంటి సంబంధము లేదు). 

హజరత్ అబూ సయీద్ ఖుద్రి (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రంబోధించెను: “నేను మీకు మసీహుద్దజ్జాల్ పీడ కంటే ఎక్కువ పీడ కలిగించే విషయము తెలుపనా?” తప్పక తెలుపండి ప్రవక్తా అని అనుచరులు జవాబు పలికారు, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా పలికెను: ‘షిర్కె ఖఫీ’. ఎవరైనా నమాజు చదువు చున్నప్పుడు తమ నమాజును ఇతరులకు చూపుటకు మంచిగా ఆచరించుట. 

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1. వాక్యము (18:110) భావము (అల్లాహ్ ను కలియుటకు సత్కార్య ములు చేయవలెను. అల్లాహు సాటిగాని, భాగస్వాములనుగాని కల్పించి ఉండకూడదు అని) తెలుపబడెను. 

2. సత్కార్యములు అల్లాహ్ తోపాటు ఇతరుల కొరకు కొంచెం చేసినా, అది స్వీకరించబడదు. 

3. ఏదైనా కార్యములో అల్లాహ్ కు భాగస్వాములను కల్పించుటతో అది కారణము అల్లాహ్ ఈ కార్యమును అసలు నిరాకరించబడుటకు అంగీకరించడు. 

4. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించబడిన కార్యములు నిరాకరించ బడుటకు వేరొక కారణము, అల్లాహ్ వారు కల్పించిన భాగస్వాముల బలహీనతలకు అతీతుడు. 

5. ప్రవక్త, అనుచరుల విషయములో “ప్రజలకు చూపుటకు చేయు సత్కార్యముల” గురించి కలత చెందెడివారు. 

6. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రదర్శనా బుద్ధితో చేయు సత్కార్యముల గురించి ఈ విధముగా తెలిపెను. ఒక వ్యక్తి నమాజును అల్లాహ్ కొరకు ఆచరిస్తూ ఎవరైనా చూస్తుంటే, నమాజును బాగా ఆచరిం చిన ఎడల అది ‘రియాకారి’ ప్రదర్శన అగును.  

పాఠము – 37 : ఇహలోక లబ్దికి చేయు సత్కార్యములు కూడా ‘షిర్క్’ లాంటివి 

ن كَانَ يُرِيدُ الحَياةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَقِ اِلَيْهِمْ اَعْمَا لَهُمُ 

مَنْ بهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ ) أو لَيْكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الأخرة إِلا النَّارُ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَيُطِل مَا كَانُوا 

يعملون 

“కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షణలను కోరుకొనేవారు చేసిన కార్యములకు పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడే ఇచ్చివేశాము. అందులో వారికి తగ్గించడమనేది జరుగదు. కాని పరలోకములో వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ప్రపంచంలో చేసినదంతా వ్యర్ధము. సత్కార్యములన్నీ నాశనం అగును.” (11:15-16) 

హజరత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించిన హదీసును ఈ విధముగా ఉల్లేఖించారు: 

“డబ్బు దాసుడు నాశనం అగును. బట్టల దాసుడు నాశనం అగును. అతనికి ఇవి లభించిన ఎడల సంతోషించును. లభించని ఎడల అసంతృప్తి చెందును. అతడు నాశనం అయ్యెను. బెంగపడిన వాడయ్యెను. అతనికి గ్రుచ్చుకొన్న ముల్లు కూడా తీయజాలదు. “ఎవరయితే గుర్రం కళ్లెం పట్టుకొని అల్లాహ్ మార్గంలో బయలుదేరాడో, ఎవరి తల మాసి వుంటుందో, కాళ్లు దుమ్ము కొట్టుకొని ఉంటాయో వారికి శుభవార్త. వారిని సైన్యం ముందు పంక్తుల్లో నిలబెడితే, అలాగే నిలబడతాడు. వెనుక పంక్తుల్లో నిలబెడితే, వెనుకే నిలబెడతాడు. అతను అనుమతి కోరినా అతనికి ఆ అనుమతి లభించదు. అతను ఎవరి గురించి అయినా సిఫారసు చేస్తే ఆ సిఫారసూ స్వీకరించబడదు.” 

దీనిలో 7 ప్రకరణములు కలవు 

1. మానవుడు, పరలోకము కన్న ఇహలోకానికి ప్రాముఖ్యత నిచ్చుట నివారించబడినది

2. వాక్యము (11:15-16) భావము (కేవలం ఇహలోకము కోరుకునే వారికి పరలోకంలో స్థానము లేదు అని) స్పష్టంగా తెలియచేయబడింది.  

3. దీనిలో ఒక ముస్లింను డబ్బు దాసునిగా పేర్కొనుట గమనార్హము.

4. అతనికి ఇవ్వబడినప్పుడు సంతోషించును. లేనిచో అసంతృప్తి చెందును. 

5. అతడే నాశనమగును. భంగపడునని శపించటము జరిగింది. 

6. అతనికి ఎవరూ సహాయపడలేరు (అతనికి ముల్లు గ్రుచ్చుకొన్నా ఎవరూ తీయలేరు). 

7. అల్లాహ్ మార్గమున ఎంతటి కష్టములనైనను భరించి, తన కర్తవ్యమును నెరవేర్చువాడు ప్రశంసించబడును.

పాఠము-38 : అల్లాహ్ చే పవిత్రము అనబడిన వాటిని నిషేధించుట మత గురువులను ప్రభువుగా చేసుకొనుట 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా పేర్కొన్నారు: “మీ పై రాళ్ళ వర్షం కురిసే సమయం ఆసన్నమైనది. నేను మీకు ప్రవక్త ప్రబోధనలు వినిపించుచున్నాను. మీరే దానికి వ్యతిరేకంగా అబూ బకర్, ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు చెప్తున్నారు అని పలుకుతున్నారు.” 

ఇమాం అహ్మద్ బిన్ హంబల్ (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా తెలిపారు: “నాకు వారిపై ఆశ్చర్యము కలుగుచున్నది.” హదీసు ఆధారము నిజమైనదని తెలిసి కూడా సుఘ్యాన్ సౌరి యొక్క అభిప్రాయముపై నడుచు చున్నారు. అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

فَلْيَحْذَرِ الَّذِينَ يُخَالِفُونَ عَنْ أَمْرة 

أن تَصِيبَهُم فِتْنَةٌ أو يُصِيبَهُمْ عَذَابٌ اليمن 

“దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించువారు తాము ఏవైనా బాధల్లో చిక్కుకుపోతామే మోనని, ఏదైనా శిక్ష అవతరిస్తుందేమోనని భయపడవలెను.” (24:63) 

“ఫిత్నా” అంటే తెలుసా? షిర్క్. ఎవరైతే ప్రవక్త మాటలను ఉల్లంఘించునో అతని మనస్సులో దుష్టము రేగుట వలన అతడు నాశనమైపోవును. 

హజరత్ అదీ బిన్ హాతిం (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ వాక్యము పఠించుచున్నప్పుడు విన్నారు: 

“వారు అల్లాహ్ ని కాదని తమ పండితులను, తమ సన్యాసులను తమ ప్రభువుగా చేసుకున్నారు. మరియమ్ కుమారుడు మసీహ్ (అలైహిస్సలాం) ను కూడా! వాస్తవానికి ఒకే దేవుడిని తప్ప మరెవరి దాస్యాన్ని చేసే ఆజ్ఞ వారికి ఇవ్వబడలేదు. అల్లాహ్ తప్ప ఆరాధనకు ఎవ్వరూ అర్హులుకారు. ఆయన పరిశుద్ధుడు. వారు కల్పించు భాగస్వాములకు అతీతుడు.” (9:31) 

ఈ ఆయతులు విని నేను “మేము పండితులు, సన్యాసులను ఆరాధించేవారము కాదు” అన్నాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా జవాబు పలికెను. “మీరు అల్లాహ్ హలాల్ చేసిన వాటిని వారి మాటలపై నిషేధించలేదా? అల్లాహ్ నిషేధించిన వాటిని వారి మాటలపై హలాల్ చేసుకో లేదా?” అప్పుడు ఆయన “అవును” అని పలికిరి. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ‘ఇదే వారిని ఆరాధించుట’ అని పలికారు. (మస్నద్ అహ్మద్, సునన్ తిర్మిజ) 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1. వాక్యము (24:63) భావము (ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించిన వారు భయపడవలెను) తెలుపబడెను. 

2. వాక్యము (9:31) భావము (దానిలో పండితులను, సన్యాసులను ప్రభువుగా చేసుకొనుట గురించి) తెలిపెను. 

3. “ఆరాధన అంటే ఒక్క ప్రార్థనయే కాదు. ఆరాధన అంటే విధేయత చూపుట, ఆజ్ఞలను పాటించుట” అని హజరత్ హాతిం (రదియల్లాహు అన్షు) హదీసులో తెలుపబడింది. 

4. ప్రవక్త ప్రవచనమునకు వ్యతిరేకముగా ఎవరి ప్రవచనమూ ఆమోద యోగ్యము కాదని స్పష్టపరచబడెను. హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు), హజరత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు), ఇమామ్ అహ్మద్ (రహిమహుల్లాహ్) మరియు సుఫ్యాన్ సౌరి పేర్లను ప్రస్తావించుటను నిరాకరించెను. 

5. ప్రస్తుత కాలములో ప్రజలు తమ పండితుల ఆరాధనను అన్నింటికంటే ఉత్తమమైన సత్కార్యమని భ్రమలో పడివున్నారు. దీనిని విలాయత్ (పూచి) అనబడుతుంది. అదే విధముగా విద్య, శాస్త్రజ్ఞుల పేరుతో విద్యావంతు లను కూడా ఆరాధించుచున్నారు. చివరికి వ్యవహారం చెడి అవిద్యా వంతుల ఆరాధన కూడా జరుగుచున్నది. వీటన్నింటి నుండి వారించబడినది. ఇవన్నీ షిర్క్ పనులే. 

పాఠము 39 : ‘విశ్వసించితిమి’ అను వారి వాస్తవము 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

الم تَرَ إِلَى الَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ أمَنُوا بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوا إلى الطَّاغُوتِ وَقَدْ أمِرُوا أَن تَكْفُرُوا بِه . وَيُرِيدُ الشَّيْطنُ اَنْ يُضِلَهُمْ ضَللًا بَعِيدًا وَإِذَا قِيلَ لَهُمْ تعالوا إلى مَا أَنْزَلَ اللهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنْفِقِينَ يَصُدُّونَ عَنْكَ صدُودًا نَ فَكَيْفَ إِذَا اَصَابَتْهُمْ مُصِيبَةٌ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ 

جَاءُوكَ يَحْلِفُونَ باللهِ اِنْ اَرَدْنَا إِلا إِحْسَانًا وَتَوْفِيقات 

…..వాదన అయితే చేసి తమ వ్యవహారముల పరిష్కారము కొరకు ‘తాగూత్’ వద్దకు పోవాలని కోరుకునేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి, వారికి తాగూత్ను తిరస్కరించమని ఆదేశించబడింది. షైతాన్ వారిని పెడదోవ పట్టించి సన్మార్గమునకు బహుదూరముగా తీసుకుపోవాలని చూస్తున్నాడు. “అల్లాహ్ అవతరింపజేసిన దాని (ఖుర్ఆన్) వైపునకు రండి. ప్రవక్త వైపునకు రండి” అని చెప్పినప్పుడు, ఈ కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకుపోవడాన్ని నీవు చూస్తావు. కాని వారు తమపై తెప్పించుకున్న ఆపద వారిపై వచ్చినప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు. దేవుని సాక్షిగా మంచినే కాంక్షించాము. వారిని రాజీవరచుటకు ఉద్దేశించాము అని పలుకుదురు. (4:60-61) 

“భూమిపై అశాంతి, సంక్షోభము కలిగించకండి” అని వారితో పలికినప్పు డల్లా వారు “మేము సంస్కర్తలము మాత్రమే” అని పలికెదరు. 

“భూమిపై సంస్కరణ జరిగిన తరువాత దానిపై సంక్షోభాన్ని, సృష్టించ కండి. భయంతోను, ఆశతోనూ ఆయననే వేడుకోండి. నిశ్చయముగా అల్లాహ్ కారుణ్యం ఉదారబుద్ధిగలవారి సమీపమున కలదు.” (7-57) 

افحكم الجَاهِلِيَّةِ يَبْغُونَ ، وَمَنْ اَحْسَنُ من الله حُكْنَا القَوْم يُوقِنُونَ : 

“(వారు అల్లాహ్ శాసనానికి విముఖులై) అజ్ఞానపు తీర్పు కావాలని కోరుకుంటున్నారా? కాని అల్లాహ్ పై నమ్మకము గలవారి దృష్టిలో అల్లాహ్ కంటే ఉత్తమమైన తీర్పు చేయగలవారెవ్వరూ లేరు.” (5-50) 

హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ విధముగా ప్రబోధించారు: “మీలో నాకు ప్రసాదించబడిన ఈ ధర్మశాస్త్రము లోబడి ఉండుటలో (తమ కోరికలన్నీ) వారు విశ్వాసులు కాజాలరు.” ( ఇమాం నవవీ దీనికి కితాబుల్ హజ్ సహీ సనద్ తో పొందుపరచెను.) 

షాబి (రహిమహుల్లాహ్)  ఈ విధముగా తెలిపెను: ఒక కపటుడు, ఒక యూదుని మధ్య వివాదము ఏర్పడెను. యూదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచం తీసుకోరు కాబట్టి ఆయన దగ్గర ఈ సమస్య తీర్పు కోరెదము అని పలికెను. కాని ఈ కపటుడు, కాదు, మనము ఈ సమస్య తీర్పు కొరకు ఒక యూదుని వద్దకు పోవుదుము అని పలికెను. అతనికి యూదుని వద్ద లంచముతో పని జరుగునని తెలుసును. చివరికి వారిద్దరు జుహైనా సంతతికి చెందిన ఒక కాహిన్ (గుప్తవిద్యావాదులు) వద్ద ఆ సమస్యకు తీర్ప కోరెదమనిరి. అప్పుడు ఈ వాక్యము (4:60) అవతరింపబడెను. 

కొంతమంది విద్యావేత్తలు ఈ విధముగా తెలిపిరి: “ఇద్దరి మధ్య ఒక విషయములో విభేదము ఏర్పడెను. అప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త దగ్గరకు ఈ సమస్యకు తీర్పు కోరుదుమని పలికెను. కాని వేరే వ్యక్తి కాబ్ బిన్ అషరఫ్ వద్దకు పోవుదుమని పలికెను. చివరికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  దగ్గర తీర్పు కోరబడెను. ప్రవక్త తీర్పు ఇచ్చిన తరువాత మరల ఉమర్ (రదియల్లాహు అన్హు) దగ్గరకు తీర్పు కొరకు తీసుకొని వెళ్ళెను. అప్పుడు ఆ వ్యక్తి జరిగినదంతా తెలిపి ప్రవక్త తన పక్షములో తీర్పు ఇచ్చెనని తెలిపెను. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) రెండవ వ్యక్తిని నిజమేనా అని అడిగినప్పుడు అతడు నిజమేనని తెలిపెను. అంతటితో ఉమర్ (రదియల్లాహు అన్హు) అతడిని అంతమొందించెను. అప్పుడు ఈ వాక్యము (4:60) అవతరించబడెను. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. వాక్యము (4:60) భావము మరియు తాగూత్ గురించి విశదీకరించ 

2. వాక్యము (2:11) భావము (సంక్షోభములు సృష్టించువారు తమను సంస్కర్తలు అని పలుకుదురు). 

3. వాక్యము (7-56) భావము (భూమిపై అల్లరి సృష్టించుట నివారించ బడెను). 

4. వాక్యము (5:50) భావము (అల్లాహ్ ను మించిన ఉత్తమ తీర్పు నిచ్చువాడు ఎవ్వరూ లేరు). 

5. వాక్యము (4-60)పై షాబీ (రహమతుల్లాహ్ అలై)ల విశదీకరణ తెలుపబడెను. 

6. స్వచ్ఛమైన విశ్వాసము, కపట విశ్వాసము గురించి తెలుపబడెను. 

7. కపటులతో హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) నడవడిక తెలుప 

8. తన కోరికలు ఇస్లాం ధర్మశాస్త్రమునకు లోబడి లేని పక్షంలో అతడు విశ్వాసి కాజాలడు అని స్పష్టపరచబడెను. 

పాఠము 40 : అల్లాహ్ నామములలో, గుణగణాలలో కొన్నింటిని తిరస్కరించటం 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

وَهُمْ يَكْفُرُونَ بِالرَّحْمَنِ، قُلْ هُوَ رَى لَا اله إلا هُوَة عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ مَتَابٍ . 

“వారు రహమాన్ (కరుణామయుడు)ని తిరస్కరించారు. వారితో ఇలా పలుకుము: ఆయనే(రహ్మన్) నా ప్రభువు. ఆయన తప్ప మరే దేవుడూలేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయనే నాకు ఏకైక ఆశ్రయం.” (13:30) 

హజరత్ అలీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: “ప్రజలకు వారు అర్థం చేసుకొనే విషయాలు మాత్రమే తెలుపండి. (వారికి అర్థం కాని విషయాలను తెలిపి) వారు అల్లాహ్ ప్రవక్తను తిరస్కరించవలెనని మీరు ఆశించుచున్నారా?” (బుఖారి) 

ఇమామ్ అబ్దుల్ రజాక్, మఅమర్ నుండి, ఆయన ఇబ్నె తావూస్ నుండి, ఆయన తండ్రి తావూస్ నుండి ఈ విధముగా ఉల్లేఖించెను: హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు మా) ఉల్లేఖనం: “ఒక వ్యక్తి అల్లాహ్ స్వభావమును గురించి ఒక హదీసు తెలుసుకొని చికాకుపడ్డాడు. అతనికి ఆ హదీసు నచ్చలేదు.” ఇది చూసి ఈ విధముగా తెలిపిరి: వీరి భయము విచిత్రమైనది. దృఢమైన స్పష్టమైన అల్లాహ్ వాక్యములు విన్నప్పుడు వీరిపై దుఃఖము తారసిల్లును. బహులార్థముగల వాక్యములు విని తిరస్కరించి) నాశనమగుదురు. (ముస్నద్ అబ్దురజ్జాఖ్). ఖురైష్ వంశస్థులు ప్రవక్త నోటి నుండి రహమాన్ (కరుణా మయుడు) అని విని వారు దానిని తిరస్కరించిరి. అప్పుడు అల్లాహ్ వాక్యము (13:10) అవతరించెను ముస్నద్ రజ్జాక్. 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1. అల్లాహ్ నామములు లేదా స్వభావములను తిరస్కరించిన ఎడల విశ్వాసము కోల్పోవుదురు. 

2. వాక్యము (13:10) భావము (రహమాన్ గురించి) తెలుపబడెను. 

3. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోలేని పక్షములో ఆ మాటను వదిలి వేయవలెను

4. ఏ మాట అయితే అల్లాహ్, ఆయన ప్రవక్తను తిరస్కరించినట్లు అగునో, అతని ఉద్దేశము తిరస్కరించుట కాకపోయినప్పటికీ అటువంటి మాటలకు దూరముగా ఉండవలెను. 

5. ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు మా తెలిపినట్లు ఎవరైనా అల్లాహ్ నామము లేదా స్వభావమును తిరస్కరించిన ఎడల అతడు నాశనం అయ్యే స్థితికి చేరును.

పాఠము 41 : అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించుట 

يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَـٰفِرُونَ

వారు అల్లాహ్ యొక్క భాగ్యమును గుర్తించి కూడా తిరస్కరిస్తారు. వారిలో చాలా మంది కృతఘ్నులు” (16:83)

పై వాక్యము వివరణలో ముజాహిద్ (రహమతుల్లాహ్ అలైహ్) ఈ విధముగా విశదీకరించెను: 

“ఏ వ్యక్తి అయినా ఈ ధనము నా పిత్రార్జితము అని పలుకుట, అల్లాహ్ ప్రసాదించిన భాగ్యమును తిరస్కరించి నట్లు.” 

ఔన్ బిన్ అబ్దుల్లా ఇలా తెలిపెను: “ఫలానా వ్యక్తి లేకపోతే అలా జరిగేది’ అని పలుకుట. అల్లాహ్ భాగ్యమును తిరస్కరించుట. ఇబ్నె ఖుతేబా ఈ విధముగా తెలిపెను: “ఇది మా పూజితుల యోగ్యత చూపుట వలన లభించినది అని పలుకుట కూడా” ఈ వాక్యములో కూర్చబడినది. 

షేఖుల్ ఇస్లాం అబుల్ అబ్బాస్ ఇబ్నె తైమియా (రహమతుల్లాహ్ అలై) జైద్ బిన్ ఖాలిద్ జహనీ (రదియల్లాహు అన్హు) హదీసు “ఈ ఉదయం నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసించినారు. కొంతమంది తిరస్క రించినవారాయెను” అని అల్లాహ్ తెలిపెను. (ఈ హదీసు ఇంతకు ముందు వివరించబడినది) తరువాత “ఎవరైతే అల్లాహ్ కృపాకారుణ్యాలను వేరే వారి వైపునకు అనుగుణ్యం చేస్తారో, అల్లాహ్ కు భాగ స్వాములను కల్పిస్తారో అటువంటివారిని అల్లాహ్ ఖుర్ఆన్లో, ప్రవక్త హదీసులో గట్టిగా వారించెను. 

ఈ విషయమును విశదీకరించుటకు పూర్వపు మత గురువులు (అస్లాఫ్) ఈ ఉదాహరణలు పేర్కొనిరి: “కొంతమంది గాలి బాగా వీచింది” అని పలుకు దురు. “నావికుడు మంచి ప్రావీణ్యుడు, నేర్పరి” అని చాలా మంది పలుకుదురు. ఇటువంటి పలుకుల వలన మనిషి సులభంగా షిర్క్ లోకి జారిపోతాడు. 

దీనిలో 4 అర్థ తాత్పర్యములు కలవు. 

1. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యములను గుర్తించి, తిరస్కరించుట. 

2. అల్లాహ్ ప్రసాదించిన భాగ్యములను తిరస్కరించే పలుకులు ప్రజల వాడుకలో ఉన్నవి. 

3. అల్లాహ్ భాగ్యములను తిరస్కరించునట్లు చేయు పలుకులు తెలుప బడెను

4. ఒకే మనస్సులో అల్లాహ్ ప్రసాదించిన భాగ్యముల అంగీకారము, తిరస్కారము ఉన్నట్లు తెలుస్తుంది. 

పాఠము 42 : అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే కొన్ని గుప్తరూపములు

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను;

فَلَا تَجْعَلُوا۟ لِلَّهِ أَندَادًۭا وَأَنتُمْ تَعْلَمُونَ

ఇక మీకు తెలిసినప్పుడు అల్లాహ్ కు సాటి కల్పించకండి.” (2:22) 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ వాక్యం తఫ్సీర్లో ఈ విధముగా తెలిపెను: “అన్-దాద్  అంటే భాగస్వాములను కల్పించుట” అని అర్థము. ఏదైతే చీకటి రాత్రిలో నల్లటి రాయిపై చీమ నడకకంటే గుప్తమైనది. భాగస్వాములను కల్పించుట అనేది ఈ విధముగా పలుకుట. “అల్లాహ్ యొక్క ప్రమాణము మరియు నీ జీవితముపై ప్రమాణము” లేదా ఇలా పలుకుట, “ఓ వ్యక్తి నా ప్రాణము యొక్క ప్రమాణము” లేదా ఇలా పలుకుట, “ఈ కుక్క లేనిచో మా ఇంటిలో దొంగలు పడేవారు” లేదా ఇలా పలుకుట, “అల్లాహ్ కోరుకున్నది, మీరు కోరుకున్నది” లేదా ఇలా పలుకుట “ఒకవేళ అల్లాహ్ లేకపోతే నీవులేవు” ఇటువంటి పలుకులలో అల్లాహ్ తోపాటు ఇతరులని చేర్చవద్దు. ఇవన్నీ అల్లాహ్ కు షిర్క్ వంటి మాటలు. (దీనిని ఇబ్నె అబీ హాతిం పొందుపరచెను) 

హజరత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

“ఎవరైతే అల్లాహ్ పేరును తప్ప ఇతరుల ప్రమాణము చేయునో వాడు తిరస్కరించిన వాడయ్యెను. లేదా షిర్క్క పాల్పడినట్లు చేసెను. (దీనిని తిర్మిజీ పొందుపరచి హసన్ అని తెలిపెను. హాకిం సహీ అని తెలిపెను) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: 

“నా వద్ద అల్లాహ్ కాక ఇతరులపై స్వచ్ఛమైన ప్రమాణము చేయుటకంటే అల్లాహ్ పై అసత్య ప్రమాణము చేయుట మేలు.” 

హజరత్ హుజైఫా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఇలా తెలిపారు: 

“అల్లాహ్ కోరునది మరియు మీరు కోరునది” అని పలకవద్దు. కాని ఈ విధముగా పలకండి, “ముందు అల్లాహ్ కోరుకున్నది ఆ తరువాత మీరు కోరుకున్నది.” (అబూ దావూద్, సనద్ సహీ) 

ఇబ్రాహీం నఖయి ఈవిధముగా విశదీకరించారు: “అవూజు బిల్లాహి వబిక” అని పలకరాదు. 

“అవూజు బిల్లాహి సుమ్మబిక” అని పలకవచ్చును. అదే విధముగా “లవ్ లా  అల్లాహు సుమ్మ ఫలానున్” అని పలకవచ్చును. “లవ్ లా అల్లాహు వఫులానున్” అని పలకరాదు. 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1.  అన్-దాద్ గురించి (2:22) వాక్యము భావము విశదీకరించబడెను. 

2. ‘షిర్కె అక్బర్’ గురించి అవతరించబడిన వాక్యములను అనుచరులు ‘షిర్కె అస్గర్’కి కూడా వివరిస్తూ విశదీకరించేవారని స్పష్టమగుచున్నది. 

3. అల్లాహ్ పేరుపై తప్ప ఇతరులపై ప్రమాణము చేయుట షిర్క్. 

4. అల్లాహ్ పేరున కాకుండా ఇతరుల పేరున చేయు సత్యమైన ప్రమాణము, అల్లాహ్ పేరున చేయు అసత్య ప్రమాణము కంటే పెద్ద పాపము

5. వావ్ (మరియు), సుమ్మ (తర్వాత) అనే  పదములు అర్థములో చాలా వ్యత్యాసము కలదు

పాఠము 43 : అల్లాహ్ పై ప్రమాణముతో సంతృప్తి చెందనివాడు 

హజరత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు మా) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించారు. 

“మీరు మీ తాతముత్తాతల పేర ప్రమాణములు చేయకండి. ఎవరైతే అల్లాహ్ పేరున ప్రమాణము చేయునో అతడు తప్పక సత్యము పలకవలెను. ఎవరి కొరకు అయితే అల్లాహ్ ప్రమాణము చేసెనో అతడు అంగీకారము తెలపడో అల్లాహు కు ఏ విధమైన సంబంధము లేదు.” (దీనిని ఇబ్నె మాజా హసన్ సనద్ పొందుపరచెను) 

దీనిలో 3 ప్రకరణములు కలవు 

1. తాతముత్తాతల పేర ప్రమాణము చేయుట నిషిద్ధము. 

2. ఎవరి కొరకు అయితే అల్లాహ్ పేరున ప్రమాణము చేయబడెనో అతడు అంగీకరించబడెను.

3. అల్లాహ్ పేరున ప్రమాణము చేసినప్పటికీ అంగీకరించని వారిని బెదిరింపబడెను. (జరగబోయే కీడు గురించి తెలుపబడెను.) 

పాఠము – 44 : అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది అని పలుకుట షిర్కే 

హజరత్ ఖుతైబ (రదియల్లాహు అన్హు)  ఈ విధముగా ఉల్లేఖించారు: ఒక యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం దగ్గరకు వచ్చి ఈ విధముగా పలికెను: “మీరు (ముస్లింలు) అల్లాహ్ తో షిర్క్ కు పాల్పడు తున్నారు. అదెలాగంటే ఈ విధముగా పలుకుతారు” అల్లాహ్ కోరినది మరియు మీరు కోరినది, ఇంకా కాబా గృహము ప్రమాణము అని, దానికి జవాబుగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ఆజ్ఞాపించెను: 

ప్రమాణము చేయదలచిన వారు కాబా గృహ ప్రమాణము చేయకండి. కాబా గృహము యొక్క ప్రభువు పేరిట ప్రమాణము చేయండి. “అల్లాహ్ కోరినది మరియు మీరు కోరునది అని పలక వద్దు. “అల్లాహ్ కోరునది ఆ తరువాత మీరు కోరునది అని పలకండి.” (దీనిని నసాయి సహీ సనత్తో పొందు పరచెను) 

నసాయిలో హజరత్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ఈ విధముగా ఉన్నది: ఒక వ్యక్తి ప్రవక్తకు ఈ విధముగా చెప్పెను: “అల్లాహ్ కోరునది మరియు మీరు కోరునది. అప్పుడు ప్రవక్త ఇలా పలికిరి. “ఏమిటి నీవు నన్ను అల్లాహ్ కు సమానంగా చేసితివా? ఈ విధముగా పలుకు, ఒక్కడైన అల్లాహ్ కోరినది” అని. 

హజరత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) సవతి సోదరుడు హజరత్ తుఫైల్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: “నేను నా కలలో యూదుల సమూహంలో పోవుచున్నట్లు చూశాను. నేను వారితో ఇలా అన్నాను. మీరు గనుక హజరత్ ఉజైర్ (అలైహిస్సలాం) ని అల్లాహ్ కుమారుడని పలకనిచో మీరు చాలా మంచివారు. అప్పుడు వారు ఇలా అన్నారు: ‘మీరు కూడా మంచి వాళ్ళే అయి ఉండేవారు. మీరు అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కోరునది” అని పలకనిచో.” తరువాత క్రైస్తవుల గుంపు పోవుచుండగా నేను ఈ విధముగా పలికితిని, “మీరు మంచివారు అయి ఉండే వారు, మసీహ్ (అలైహిస్సలాం)ని అల్లాహ్ కుమారుడని పలకనిచో.” అప్పుడు వారు “మీరు కూడా మంచి వాళ్ళేకాని మీరు అల్లాహ్ అనుకున్నది మరియు ప్రవక్త అనుకున్నది అని పలకనిచో.” ఉదయం నేను ఈ కలను కొంతమందికి తెలిపి తరువాత ప్రవక్త వద్దకు పోయి తెలిపాను. అప్పుడు ప్రవక్త నీవు ఈ కలను ఎవరికైనా తెలిపావా? అని ప్రశ్నించారు. నేను తెలిపానన్నాను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  లేచి, అల్లాహ్ ను స్తుతించి, ఈ విధముగా ప్రబోధించిరి: “జుబైర్ చూసిన కల మీకు తెలిపెను. మీరు ఒక వాక్యం పలుకుచున్నారు. నేను మిమ్ములను ముందుగానే నివారించి ఉండవలసినది. ఎప్పుడూ మీరు అల్లాహ్ అనుకున్నది మరియు ప్రవక్త అనుకున్నది అని పలకవద్దు. కాని, ఒక్క అల్లాహ్ అనుకున్నది అని పలకండి.” 

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1. యూదులకు ‘షిర్కె అస్గర్’ గురించి కూడా తెలుసును. 

2. మానవుడు తన ఇష్టానుసారంగా విషయాలను అర్థము చేసు కొనుటకు ప్రయత్నించును.

3. ఒక వ్యక్తి ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  వద్ద “అల్లాహ్ ఇష్టం మరియు మీ యొక్క ఇష్టం” అని పలికినప్పుడు-ప్రవక్త అతనిని “నీవు నన్ను అల్లాహ్ కు సమానం చేస్తు న్నావా?” అని పలికిరి. ఇటువంటప్పుడు ఎవరైనా “ఓ ప్రవక్తా నీవు తప్ప నాకు శరణు ఇచ్చేవారు ఎవరూ లేరు” అను పలుకువారు ముష్రిక్కులు అగుటలో ఎటువంటి సందేహం లేదు. 

4. అల్లాహ్ ఇష్టం మరియు నీ ఇష్టం అనుట ‘షిర్కె అక్బర్’ కాదు. లేనిచో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముందే నివారించి యుండేవారు. 

5. మంచి కల కూడా అల్లాహ్ సూచన.

6. మంచి కల ఒక్కొక్కసారి చట్టములను ప్రతిబింబించును.

పాఠము 45 : కాలాన్ని దూషిస్తే అల్లాహ్ కు బాధ కలిగించినట్లే 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను: 

وَقَالُوا مَا هِيَ الحَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنا إلا الدهرُه وَمَا لَهُمْ بِذلِكَ مِنْ عِلم، إن هُمْ إِلَّا يَظُنُّونَ : 

వారు ఇలా అటున్నారు:“మన జీవితం కేవలం ఈ ప్రాపంచిక జీవితమే. ఇక్కడే మన మరణం, ఇక్కడే మన జీవితం. మనలను నాశనం చేసేది కాలభ్రమణమే తప్ప మరేదీ కాదు. వాస్తవానికి వారి వద్ద ఈ విషయమునకు సంబంధించి జ్ఞానమేదీ. లేదు. కేవలం వారు తమ ఊహలకు లోనైయున్నారు. (45:24) 

అబూహురైరా (రదియల్లాహు అన్హు) హదీసె ఖుద్సీలో ఈ విధముగా ఉల్లేఖించెను: అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా ఉపదేశించెను: 

“ఆదం కుమారుడు కాలాన్ని దూషించి నాకు బాధ కలిగిస్తాడు. వాస్తవానికి నేనే కాలాన్ని సృష్టించాను. రాత్రింబవళ్ళను నేనే మార్చేవాడిని” (సహీ బుఖారి). వేరొక హదీసులో ఈ విధముగా పేర్కొనెను: “కాలమును చెడ్డది అని పలక వద్దు. అసలు కాలము అల్లాహ్ కొరకే.. 

దీనిలో 4 ప్రకరణములు కలవు

1. కాలాన్ని దూషించుట, చెడ్డది అనుట నిషేధించబడినది. 

2. కాలాన్ని చెడ్డది అని పలుకుట అల్లాహ్ ను బాధపెట్టుట అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తెలిపారు. 

3. “ఫఇన్నల్లాహ హువద్దహర్” గురించి ఆలోచించవలెను. 

4. కొన్ని సమయాల్లో మానవుడు తనకు తెలియకుండానే కొన్ని తప్పులు పలుకుతుంటాడు. 

పాఠము 46 : ఎవరినైనా రాజాధి రాజు అని పిలుచుట 

హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించెను: “తనకు తాను రాజాధిరాజు అని పలుకువాడు అల్లాహ్ వద్ద అందరికంటే నీచుడు. వాస్తవానికి అల్లాహ్ తప్ప ఎవరూ రాజాధిరాజు లేడు” (బుఖారి). 

హజరత్ సుఫ్యన్ సౌరి “మాలికు అలముల్క్” యొక్క అర్థము రాజాధిరాజు అని తెలిపిరి. మరొక హదీసులో ఈ విధముగా తెలుపబడింది: “ప్రళయదినం నాడు అల్లాహ్ వద్ద అందరికంటే నీచుడు (దౌర్జన్యపరుడు) తనకు తాను రాజాధిరాజు అని చెప్పించుకున్నవాడు.” 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1. ఎవ్వరినీ రాజాధిరాజు అనకూడదు. 

2. ఇటువంటి గౌరవనామాలు, బిరుదులతో కూడా పిలుచుట నిషేధము. 

3. ఇటువంటి నామాలతో పదాలు ఎప్పుడూ వాడకుండా, అందరూ జాగ్రత్త పడవలెను. మనస్సులో స్వచ్ఛందంగా వాటి భావములు తెలియకుండా చేసినను ఈ పదాలు వాడుట నిరోధించబడెను. 

4. ఈ పదాలు అల్లాహ్ ఘనత, మహత్యమునకు మాత్రమే వాడుట సముచితము. 

పాఠము 47 : అల్లాహ్ నామాలను గౌరవించుట

అల్లాహ్ ను అగౌరవపరచే పేర్లు దాసులకు ఉంటే వాటిని మార్చవలెను. హజరత్ అబూ షురైహ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: ఆయనను ప్రజలు అబుల్ హకం అని పిలిచెడివారు. దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయనతో ఈ విధముగా పలికెను: “నిర్ణయించువాడు అల్లాహ్ యే, శాసనము కూడా ఆయనదే.” అప్పుడు అబూ షురైహ్ (రదియల్లాహు అన్హు) ఇలా పలికారు: “నా సంతతి వారు తమ విభేదముల పరిష్కారానికి నా వద్దకు వచ్చినప్పుడు నేను వారి మధ్య విభేదము లను పరిష్కరించినప్పుడు వారు అంతా అంగీకరించెదరు.” అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను. “అది చాలా మంచి మాట. నీ సంతానములో ఎవరెవరు ఉన్నారు?” అని ప్రశ్నించిరి. అప్పుడు నేను “షురైహ్, ముస్లిం, అబ్దుల్లాహ్” అని తెలిపాను. ప్రవక్త పెద్ద కుమారుడెవరు అని అడిగెను. నేను “షురైహ్” అని తెలిపాను. అప్పుడు ప్రవక్త నన్ను “నీవు అబూ షురైహ్” అని (అబూదావూద్, ఇతరులు) పలికిరి. 

దీనిలో 3 ప్రకరణములు కలవు 

1. అల్లాహ్ నామములు మరియు స్వభావములను పూర్తిగా గౌరవించ వలెను. భావము తెలియకుండా ఇతరులకు ఆ పేర్లను వాడరాదు. 

2. అల్లాహ్ నామాల గౌరవార్థం షిర్క్క అనుగుణంగా ఉన్న పేర్లను మార్చి వేయవలెను. 

3. మారు పేరు (పిలువబడు పేరు) ‘కునియత్’ కొరకు పెద్ద కొడుకును ఎన్నుకొనుట. 

పాఠము 48 : అల్లాహ్ ను , ఖుర్ఆన్ ను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను హేళన చేసే వారి కొరకు శాసనము 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

ولين سالَتَهُمْ لَيَقُولُنَ إِنَّمَا كُنَّا نَخُوضُ وَتَلْعَبُ ، قُلْ آبِ اللهِ وَايَتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِرُونَ . 

(మీరు మాట్లాడుకుంటున్నదేమిటి?) అని ఒకవేళ వారిని అడిగితే “మేము సరదాగా వేళాకోళంగా మాట్లాడుకుంటున్నాము” అని పలుకుదురు. మీరు వారితో ఇలా పలకండి. “మీ వేళాకోళం అల్లాహ్ నా, ఆయత్లతోనా, ఆయన ప్రవక్తతోనా.’ (9:65) 

హజరత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ముహమ్మద్ బిన్ కాబ్, జైద్ బిన్ అస్లాం ఖతాదా (రహమతుల్లాహ్ అలైహి) ఈ విధముగా తెలిపారు:

తబూక్ యుద్ధ సందర్భంలో ఒక కపటుడు ఈ విధముగా పలికెను: “తిండికి ఎగబడువారు, అబద్ధము పలుకువారు, యుద్ధ సమయములో పిరికివారు ఈ విద్యావంతులను మించి మేము ఎవ్వరినీ చూడలేడు” అతడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  అనుచరుల వైపు సైగ చేసి ఇలా పలికెను. అప్పుడు ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) అతడితో నీవు అబద్ధమాడు కపటుడవని పలికి, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఈ మాటలు తెలిపెదనని బయలు దేరెను. కాని ఆయన చేరక ముందే ఈ విషయము ‘వహీ’ (ఆయతులు) అవతరింపబడెను. ఆ కపటుడు కూడా క్షమాపణ తెలుపుటకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరకు చేరెను. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఒంటెపై ప్రయాణించుచుండెను. అతడు ఈ విధముగా విన్నవించు కొనెను: ఓ ప్రవక్తా! మేము సరదాగా వేళాకోళానికి అటువంటి మాటలు మాట్లాడుకొంటిమి, ప్రయాణ బాధలను మరచుటకు. అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఈ విధముగా విశదీకరించిరి: 

 “ఆ దృశ్యం ఇంకా నా కళ్లకు కనిపిస్తోంది. ఆ వ్యక్తి దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  కూర్చున్న ఒంటె అంబారీ తాడు పట్టుకొని ఉన్నాడు. అతని కాళ్లు రాళ్లపై ఈడ్చుకుంటూ వెళ్తున్నాయి. “మేము కేవలం వేళాకోళానికి, పరాచికానికి అలా మాట్లాడుకుంటూ ఉన్నాం” అని అతను అంటున్నాడు. అప్పుడు దైవప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం) ”అల్లాహ్, అల్లాహ్ వాక్యాలతో, ఆయన ప్రవక్తతోనా మీ పరాచికాలు? ఇప్పుడు సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తర్వాత మళ్లీ అవిశ్వాసానికి పాల్పడ్డారు” అంటూ ముందుకు కదిలారు. అతని వంక చూడలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడనూ లేదు. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. ప్రవక్తను, ఆయన అనుచరులను, ఇస్లాం చిహ్నాలను హేళన చేసినవాడు అవిశ్వాసి అగును. 

2. ఎవరైనా అలా పలికితే, ఈ వాక్యం (9:65-66) అనుగుణంగా వారు అవిశ్వాసులుగా పరిగణించబడతారు. 

3. చాడీలు చెప్పుటకు, అల్లాహ్ మరియు ప్రవక్తల విషయంలో నిజా నిజాలు తెలుపుటకు భేదం కలదు. 

4. అల్లాహ్ అనంత కరుణామయుడైనప్పటికీ శిక్షల విషయంలో ఆయన విధానం విభిన్నంగా ఉంటుంది. 

5. కొన్ని పశ్చాత్తాపములు స్వీకరించబడేవిగా ఉంటాయి.

పాఠము – 49 : అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత 

ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

وَلَئِنْ أَذَقْنَاهُ رَحْمَةً مِّنَّا مِن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُ لَيَقُولَنَّ هَٰذَا لِي وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّجِعْتُ إِلَىٰ رَبِّي إِنَّ لِي عِندَهُ لَلْحُسْنَىٰ ۚ فَلَنُنَبِّئَنَّ الَّذِينَ كَفَرُوا بِمَا عَمِلُوا وَلَنُذِيقَنَّهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

కష్టాలు వచ్చిన తర్వాత మేమతనికి మా కారుణ్యం రుచిని చూపినట్లయితే “అదెలాగూ నాకు దక్కవలసిందే (ఆ యోగ్యత నాలో ఉంది గనక). ప్రళయ ఘడియ నెలకొంటుందని నేనైతే అనుకోను. ఒకవేళ నేను నా ప్రభువువద్దకు మరలించబడినా, నిశ్చయంగా ఆయన దగ్గర నాకు మంచి(స్థానమే) లభిస్తుంది” అని బీరాలు పలుకుతాడు. ఇలాంటి తిరస్కారులకు మేము తప్పకుండా వారు ఏమేమి చేశారో తెలియ పరుస్తాము. వారికి దుర్భరమైన యాతనను చవిచూపిస్తాము. (41:50) 

ముజాహిద్ రహమతుల్లాహ్ అలై “హాజా లీ” కి వివరణ ఇస్తూ ఈ విధముగా తెలిపిరి: “ఈ సంపద నా కష్టార్జితము, నేను దీనికే అర్హుడను ” ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఈ పదమునకు “ఈ సంపద అసలు నాదే” అని విశదీకరించిరి. “ఈ సంపద నాకు నా జ్ఞానము మూలముగా లభించినది’ అను వాక్యమునకు ఖతాదా రహమతుల్లాహ్ అలై “ఈ సంపద నాకు నా అనుభవము, నా జ్ఞానముల కారణముగా లభించెను” అని విశదీకరించిరి. వేరే విద్యావేత్తలు “నేను అల్లాహ్ వద్ద ఈ సంపదకు అర్హుడను. అందుచే నాకు ఈ సంపద లభించినది” అని విశదీకరించిరి. ముజాహిద్ రహమతుల్లాహ్ అలై తెలిపిన దాని అర్థము కూడా ఇదే. “ఈ సంపద నాకు నా విశేషత, గౌరవము  కారణముగా లభించెను.” 

హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం బోధను ఈ విధముగా ఉల్లేఖించారు: 

ఇస్రాయీల్ సంతతిలో ముగ్గురుని (ఒకడు తెల్ల మచ్చల రోగం గలవాడు, వేరొకడు బట్టతల గలవాడు, మూడవ వ్యక్తి అంధుడు) పరీక్షించుటకు, వారి వద్దకు అల్లాహ్ ఒక దైవదూతను పంపెను. దైవదూత తెల్లమచ్చల వాని వద్దకు వచ్చి నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటి అని అడిగెను. “నాకు ఈ వ్యాధి నుండి విముక్తి, అందమైన చర్మము ఇష్టము” అని పలికెను. దైవదూత అతనిపై తన చేతిని తాకెను. అంతటితో అల్లాహ్ అతని వ్యాధిని నయము చేసెను. మంచి అందమైన చర్మము లభించెను. మరల ప్రశ్నించెను “నీకు ఏ సంపద ఇష్టము” అని. అతడు “ఒంటెలు లేదా ఆవులు” అని జవాబు పలికెను. అతనికి ఒక సూడి ఒంటె ప్రసాదించబడెను. దైవదూత అతని కొరకు ఇలా ప్రార్థించెను: “అల్లాహ్! ఇతనికి ఈ ఒంటెలో భాగ్యము (సమృద్ధి) కలిగించుము.” తరువాత ఆ దైవదూత బట్టతలవాని వద్దకు వెళ్ళి నీకు “ఇష్టమైనది ఏమిటి!” అని ప్రశ్నించెను. దానికి అతడు “నాకు ఈ వ్యాధి దూరమై మంచి వెంట్రుకలు కావాలి” అని పలికెను. అప్పుడు దైవదూత అతనిపై తన చేతిని తాకెను. అంతటితో అల్లాహ్ అతని వ్యాధిని నయపరచి వెంట్రుకలు ప్రసాదించెను. తరువాత “నీకు ఏ సంపద ఇష్టము!” అని ప్రశ్నించెను. అతడు “నాకు ఒంటె లేదా ఆవు” అని జవాబు పలికెను. అతనికి ఒక సూడి ఆవు ప్రసాదించబడెను. దైవదూత అతని కొరకు ఈ విధముగా ప్రార్థించెను: “అల్లాహ్ ఇతనికి ఆవులో భాగ్యము (సమృద్ధి) కలిగించుము” అని. తరువాత ఆ దైవదూత అంధుని వద్దకు వెళ్ళి ‘నీకు ఇష్టమైనది ఏమిటి?’ అని ప్రశ్నించెను. అతడు ‘అల్లాహ్ నాకు చూపును ప్రసాదించుట’ అని జవాబు పలికెను. అప్పుడు దైవదూత తన చేత్తో అతన్ని తాకినప్పుడు అల్లాహ్ అతనికి చూపును ప్రసాదించెను. మరల “నీకు ఏ సంపద ఇష్టం” అని ప్రశ్నించెను. అతడు ‘మేకలు’ అని జవాబు పలికెను. అతనికి సూడి మేక ఇవ్వబడెను. చాలా కాలము తర్వాత ఒంటె, ఆవు, మేకల యొక్క సంతానము పెరిగి, వారి సంపద బాగా పెరిగెను. మరల ఆ దైవదూత మొదటి వ్యక్తి దగ్గరకు వచ్చి నేను బీదవాడిని, నా దగ్గర ఏమీ లేదు, నాకు ఒక ఒంటె దానము చేసిన ఎడల నేను దానిపై ప్రయాణము చేసి నా ఇంటికి చేరగలను. మీకు అందమైన చర్మము, ఈ సంపద ప్రసాదించిన అల్లాహ్ పేరుతో నేను మిమ్ములను అర్థిస్తున్నాను అని పలికెను. కాని అతడు నాకు చాలా అవసరాలు ఉన్నవి. నేను నీకు ఒంటెను ఇవ్వలేను అని పలికెను. దానికి దైవదూత “నీవు తెల్లమచ్చలతో ఉండేవాడివి, బీదవాడివి. నీకు ఇవన్నీ అల్లాహ్ ప్రసాదించెను. నాకు తెలుసును” అని పలికెను. దానికి అతడు “ఇది నా పిత్రార్జితము” అని పలికెను. మరల ఆ దైవదూత బట్టతల వాని దగ్గరకు వెళ్ళి మొదటివానితో పలికినట్లు పలికెను. అతడు కూడా అదే విధమైన సమాధానము పలికెను. అప్పుడు దైవదూత “నీవు అబద్ధము పలికేవాడివైతే అల్లాహ్ నిన్ను పాతస్థితికి చేర్చును” అని పలికెను. చివరికి దైవదూత మూడవ వ్యక్తి దగ్గరకు వెళ్ళి “నేను బీద బాటసారిని, నా దగ్గర దారి ఖర్చులు లేవు. అల్లాహ్ యొక్క దయ, పిదప మీరు సహాయము చేయకపోతే నేను ఇంటికి చేరలేను. ఏ అల్లాహ్ అయితే నీకు చూపును ప్రసాదించెనో ఆ అల్లాహ్ పేరుపై నేను నిన్ను ఒక్క మేకను కోరుచున్నాను” అని పలికెను. అతడు ఈ విధముగా జవాబు పలికెను: “నేను అంధుణ్ణి. అల్లాహ్ నాకు నా చూపు ప్రసాదించెను. నీకు కావలసినంత సంపాదన తీసుకొని నీకు ఇష్టము వచ్చినంత వదలి వెళ్ళుము, అల్లాహ్ పేరుపై నీవు ఎంత తీసుకొని వెళ్ళినను నిన్ను వారించను.” అప్పుడు దైవదూత, “నీ సంపద నీ దగ్గరే ఉంచుము, మీరు పరీక్షించబడిరి. అల్లాహ్ మీ పట్ల ప్రసన్నుడయ్యెను. నీ ఇద్దరి స్నేహితుల పట్ల అప్రసన్నుడయ్యెను” అని చెప్పాడు. (బుఖారి, ముస్లిం) 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1. వాక్యము (41:50) యొక్క భావము (కృతఘ్నుడు హెచ్చరించబడెను). 

2. “లయఖూలన్న హాజా లీ” యొక్క విశ్లేషణ తెలుపబడెను. 

3. “ఇన్నమా ఊతీతుహు అలా ఇల్మిన్ ఇందీ” యొక్క విశ్లేషణ తెలుపబడెను.

4. ముగ్గురి యొక్క సంఘటనలో దాగివున్న నీతిని గ్రహించవలెను. 

పాఠము 50 : అల్లాహ్ సంతానం ప్రసాదించినప్పుడు షిర్క్ కు  పాల్పడుట

ఖుర్ఆన్లో అల్లాహ్ విధముగా ఉపదేశించెను:

فَلَمَّا آتَاهُمَا صَالِحًا جَعَلَا لَهُ شُرَكَاءَ فِيمَا آتَاهُمَا ۚ فَتَعَالَى اللَّهُ عَمَّا يُشْرِكُونَ

أَيُشْرِكُونَ مَا لَا يَخْلُقُ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ

“అప్పుడు అల్లాహ్ వారికి చక్కని పవిత్రమైన సంతానము ప్రసాదించెను. కాని వారు ఆయన ప్రసాదించిన ఈ కానుకలో ఇతరులను సాటి కల్పించారు. వారు చేసే ఈ షిర్కు పనులకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడూను.” ఏమిటీ, ఏ వస్తువునూ సృష్టించలేని వారినీ, వారే స్వయంగా ఒకరి చేత సృష్టించబడిన వారిని వీళ్లు (అల్లాహ్ కు) భాగస్వాములుగా నిలబెడుతున్నారా?  (7: ఆరాఫ్: 190-191). 

ఇబ్నె హజం రహమతుల్లాహ్ అలై ఈ విధముగా తెలిపెను:

ఏదైనా పేరులో అల్లాహ్ దాస్యము కాకుండా ఇతరులకు దాస్యమని ఉన్న అది నిషిద్దము. ఈ విషయంలో మత గురువుల ఏకాభిప్రాయము కలదు. ఉదాహరణకు అబ్దుల్ అమర్, అబ్దుల్ కాబా, అబ్దుల్ ముత్తలిబ్ అటువంటి పేరు కాదు (దీని అర్థము బానిస అని వచ్చును, దాసుని పరిగణనలోకి రాదు). 

దీని విశ్లేషణలో హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపారు: “హవ్వా (అలైహిస్సలాం) గర్భవతి అయినప్పుడు, షైతాను వారి వద్దకు వచ్చి, నేను మిమ్ములను స్వర్గము నుండి బయటకు తీయించాను. మీరు నా మాట వినండి, లేకపోతే నీ గర్భములో ఉన్న శిశువునకు రెండు కొమ్ములు కల్పిస్తాను. ఆ శిశువు నీ గర్భమును చీల్చి బయటకు వచ్చును. మిమ్ములను అనేక విధాలుగా కష్టపెట్టును, అందుచే మీరు నా మాట విని మీకు కాబోయే సంతానాన్ని అబ్దుల్ హారిస్ అని నామకరణము చేయండి” అని వారిని భయ పెట్టెను. కాని ఆదం, హవ్వ (అలైహిస్సలాం) అతని మాటలను ఖాతరు చేయలేదు. వారికి ఒక చచ్చిన శిశువు పుట్టెను. మరల గర్భవతి అయినప్పుడు షైతాన్ వచ్చి మరల అదే విధముగా బెదిరించెను. ఈసారి వారి మనస్సుకు  సంతానముపై ప్రేమ ఆవరించింది. వారు తమ బిడ్డకు “అబ్దుల్ హారిస్” అని పేరు పెట్టారు. “వారు అల్లాహ్ ప్రసాదించిన సంతానము పై షిర్క్ కు పాల్పడిరి అన్న మాటకు భావం ఇదే. (దీనిని ఇబ్నె అబీహాతిమ్ నిజమైన ఆధారముతో హజరత్ ఖాతాదా రహమతుల్లాహ్ అలైహి ద్వారా పొందుపరచెను). 

ఆయన ఈ వాక్యము గురించి ఇలా వివరించెను: “ఆదం, హవ్వాలు షైతాన్ మాటలను మన్నించిరి, కాని షైతాన్ను ప్రార్థించలేదు మరియు ఇబ్నె అబీహాతిమ్ సపీసనద్ ముజాహిద్ (రహిమహుల్లాహ్)  యొక్క విశ్లేషణ ఈ విధముగా తెలిపెను: వారి సంతానము ఒక వేళ మానవుడి రూపమేమో అని భయపడిరి.” హజరత్ హసన్ బసరీ, సయీద్ (రహ్మతుల్లాఅలై) కూడా ఇటువంటి విశ్లేషణలు తెలిపిరి. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ కు తప్ప ఇతరులకు దాస్యము కలుగు ప్రతి నామము నిషేధించబడినది. 

2) వాక్యము (7:190) భావము (దానిలో బహుదైవారాధనకు తావు కల్పించు పేర్లు నిషేధించబడినవి) 

3) హదీసులో నామకరణములో గల షిర్క్ పదాలు తెల్పెను. కాని ప్రార్థనారాధనలలో కాదు. 

4) ఎవరికైనా చక్కని ఆరోగ్యవంతులైన సంతానము కలుగుట అల్లాహ్ ప్రసాదమే.

5) విధేయత చూపు భాగస్వామ్యమునకు, ప్రార్థనలు చేయుటకు మధ్య వ్యత్యాసమును మతపండితులు తెలిపిరి. 

పాఠము 51 : అల్లాహ్ మహోన్నత నామములు 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా ఉపదేశించెను;

وَلِلَّهِ الْأَسْمَاءِ الْحُسْنَى فَادْعُوهُ بِهَام 

وَذَرُوا الَّذِينَ يُلْحِدُونَ فِي أَسْمَابِ 

“అల్లాహ్ కు అందమైన యోగ్యత గల పేర్లు గలవు. మీరు ఆయన్ను ఆ పేర్లతోనే మొరపెట్టుకోండి. ఆయన నామములతో భక్తిహీనత చేయువారిని విడనాడండి.” 

బుఖారీలో అబూ హురైరా(రదియల్లాహు అన్హు) గారి ముర్సల్ ఉల్లేఖనం లో ఈ విధముగా తెలిపెను: 

అల్లాహ్ కు 99 అందమైన యోగ్యతగల నామములు కలవు. ఎవరైతే వాటిని కంఠస్తము చేయునో వాడు స్వర్గమున ప్రవేశించును. అల్లాహ్ బేసి (సంఖ్యలో ఉన్నాడు). బేసి సంఖ్యను ఆయన ఇష్టపడతాడు. తిర్మిజీలో అల్లాహ్ యొక్క 99 అందమైన నామములు పేర్కొనబడెను.) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ వాక్య విశ్లేషణలో ‘ఇల్హాద్’ అంటే షిర్క్ అని తెలిపెను. బహుదైవారాధకులు ‘అల్లాహ్ నుండి అల్లాత్ మరియు అల్ అజీజ్ నుండి ‘అల్ ఉజ్జా’ అను పదములను ఉత్పన్నము చేశారు. (ఇబ్నె అబీహాతిం) 

అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన యోగ్యతగల నామములలో వేరే నామము లను చేర్చుటను ఇల్హాద్ (భక్తి హీనత) అని ఆమష్ తెలిపిరి. 

దీనిలో 7 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ కు స్వచ్ఛమైన యోగ్యత గల పేర్లు కలవని స్పష్టపరచబడెను. 

2) అల్లాహ్ పేర్లన్నీ స్వచ్ఛమైనవి.

3) అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన నామములను తిరస్కరించువారిని లక్ష్య పెట్టరాదు. 

4) ఇల్హాద్ భావము తెలుపబడెను. 

5) భక్తిహీనత గురించి తెలుపబడినది. 

6) అల్లాహ్ ను స్వచ్ఛమైన, అందమైన యోగ్యతగల నామములతో ప్రార్థించ మని ఆజ్ఞ ఇవ్వబడింది.

పాఠము – 52 : అల్లాహ్ పై సలాము అని పలకరాదు 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: నమాజులో మేము “అల్లాహ్ పై శాంతి కలుగును, ఫలానా వారిపై శాంతి కలుగును” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సెలవిచ్చెను: “అల్లాహ్ పై శాంతి కలుగును అని పలకకండి. ఎందుకంటే, అల్లాహ్ యే స్వయంగా శాంతి కలిగించువాడు.” (బుఖారి, ముస్లిం)

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) సలాము గురించి విశ్లేషించబడింది. 

2) ఈ పదము (సలాము) ముస్లింలలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే బహుమతి. 

3) ఈ పదమును అల్లాహ్ పై అని పలకరాదు. 

4) అల్లాహ్ పై సలాము అని పలకరాదనుటకు కారణము తెలుపబడెను. 

5) అల్లాహ్ కొరకు చదవబడు సరియైన పదములు, చదవకూడదనే పదములు తెలుపబడెను. 

పాఠము – 53 : “అల్లాహ్ నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అనకూడదు 

హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధముగా ఉద్బోధించారు: 

మీలో ఎవ్వరూ “ఓ అల్లాహ్! నీకు ఇష్టమైతే నన్ను క్షమించు” అని లేదా “ఓ అల్లాహ్ ! నీకు ఇష్టమైతే నాపై దయతలుచు” అని ప్రార్థించరాదు. నిశ్చయముగా అల్లాహ్ ను స్థయిర్యము మరియు విశ్వాసముతో ప్రార్థించి వేడుకోండి. ఎందుకంటే, అల్లాహు ను వారించగల వాడెవ్వడూ లేడు. (సహీ బుఖారీ, సహీ ముస్లిం) 

మీరు అల్లాహు ను పెద్ద పెద్ద యోగ్యములు ప్రసాదించమని ప్రార్థించండి. ఎందుకంటే, అల్లాహ్ వద్ద ఏదీ పెద్దది కాదు. (సహీ ముస్లిం)

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ ను ప్రార్థించునప్పుడు షరతు పెట్టి ప్రార్థించరాదు. 

2) షరతులతో కూడిన ప్రార్థన నిషేధానికి కారణము తెలుపబడెను. 

3) స్థయిర్యముతో, విశ్వాసముతో అల్లాహు ప్రార్థించవలెను. వేడుకోవలెను. 

4) అల్లాహ్ ను పెద్ద పెద్ద యోగ్యములు ప్రసాదించమని వేడుకొనవలెను.

5) అల్లాహ్ ను పెద్ద యోగ్యములు ప్రసాదించమని వేడుకోవలెనని పలుకుటకు గల కారణము తెలుపబడెను. 

పాఠము 54 : ‘నా బానిస’ అని పలకరాదు 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను హజరత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు: 

“మీరెవరూ మీ సేవకులను, “నీ ప్రభువుకు అన్నం తీసుకొనిరా లేదా నీ ప్రభువుకు నీళ్ళు తీసుకొనిరా” అని పలకవద్దు. “అధికారి” అని పలకండి, మీ బానిసలను, “నా దాసుడు, నా దాసి ” అని పలకవద్దు. “నా సేవకులు” అని పలకండి”. (సహీ ముస్లిం) 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) ‘నా బానిస’ అనుట నిషిద్ధం. 

2) బానిసలు తమ అధికారిని ‘మా ప్రభువు’ అనుట నిషేధించబడింది. 

3) అధికారులు తమ సేవకులను “దాసులు, బానిసలు” అని పలుకుటకు బదులు సేవకులు అని పలకవలెనని బోధించబడెను.

4) బానిసలు తమ అధికారిని ‘మా అధికారి లేదా మా పెద్ద’ అని పలుకవలెను.

5) దీనికి అసలు కారణం, ఏకదైవారాధన శ్రేష్ఠతకు భంగము కలగకుండా ఉండటం. కనుక మాటలలో ఇతరులను, పిలుచుటలో కూడా ఏకదైవా రాధన శ్రేష్ఠతకు భంగం ఏర్పడకుండా జాగ్రత్త వహించవలెను. 

పాఠము 55 : అల్లాహ్ నామముతో యాచించువానిని ఒట్టి చేతుల్తో పంపరాదు 

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనలను ఈ విధముగా ఉల్లేఖించారు: 

“అల్లాహ్ నామముపై యాచించువారికి ఏమైనా తప్పకుండా ఇవ్వండి. అల్లాహ్ నామమున ఆశ్రయము కోరు వారికి ఆశ్రయము ఇవ్వండి. మిమ్ములను విందుకు ఆహ్వానించువారి విందును స్వీకరించండి. మీకు సహాయము చేసి లాభమును, మర్యాదను చేకూర్చిన వారికి, మీరు కూడా అతని సహాయమునకు సరిపడినంత సహాయమైనా చేయండి. లేక మీరు సహాయము చేయలేని పక్షములో వారి కొరకు అల్లాహ్ వారి మేలు తీర్చ గలిగాను అనుకున్నంత వరకు దుఆ చేయండి.” (అబూదావూద్, నసాయి-సహీ సనద్) 

దీనిలో 6 ప్రకరణమలు కలవు 

1) అల్లాహ్ నామముతో ఆశ్రయము కోరిన వారికి ఆశ్రయము ఇవ్వవలెను. 

2) అల్లాహ్ నామముతో యాచించిన వారికి ఏమైనా తప్పక ఇవ్వవలెను. 

3) ఆహ్వానమును స్వీకరించవలెను. 

4)సహాయము చేసిన వారికి ప్రతిఫలము ఇవ్వవలెను. 

5) సహాయము చేసిన వారికి ప్రతిఫలము ఇవ్వలేని వారు అతని మేలు కొరకు అల్లాహ్ తో దుఆ చేయవలెను.

6) సహాయము చేసిన వారి ప్రతిఫలముగా మేలు తీర్చగలిగాను అనుకున్నంత వరకు అల్లాహ్ దుఆ చేస్తుండవలెను. 

పాఠము 56 : అల్లాహ్ నామమున స్వర్గమును మాత్రమే కోరవలెను 

హజరత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సంబోధించారు: “అల్లాహ్ నామమున స్వర్గము తప్ప వేరేదీ యాచించవద్దు.” 

దీనిలో 2 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ ముఖము నిమిత్తము పలికినప్పుడు అన్నిటినీ మించిన ఉద్దేశితము స్వర్గము కాకుండా వేరే వాటిని యాచించరాదు. 

2) అల్లాహు ముఖము కలదని స్పష్టమగుచున్నది. అది ఎలాగున్నదో మనకు తెలియదు. 

పాఠము – 57 : కష్టనష్టాలు సంభవించినప్పుడు ‘ఒకవేళ ఇలా జరిగి ఉంటే’ అని పలుకుట 

ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الأمْرِ شَيء مَا قُتِلْنَا ههناء 

“….. (అల్లాహ్ మార్గములో వెళ్ళిన వారి గురించి) ఒకవేళ వీరు మా మాటలు విని ఉంటే చంపబడేవారు కాదని పలుకుచున్నారు.” (3:154) 

హజరత్ అబూహురైరా(రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: హజరత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా సంబోధించారు: 

నీకు లాభదాయకమైన దానినే కాంక్షించు. ఒక్క అల్లాహ్ శరణము మాత్రమే కోరుకో, చేతకానివాడి వలె కూలబడకు, నీకు కష్టనష్టములు వాటిల్లితే “ఒకవేళ నేను ఇలా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది” అని పలకకు, “ఇది అల్లాహ్ నిశ్చయించినది, ఆయన నిశ్చయము ప్రకారము జరిగినది” అని పలుకు. ఎందుకంటే, “ఒకవేళ అని” అనే పలుకు షైతాను అమలుకు దారితీస్తుంది. (సహీ ముస్లిం) 

దీనిలో 6 ప్రకరణములు కలవు 

1) వాక్యములు (3:154, 23:168) కు భావము (ఒకవేళ అనే పలుకు వారి గురించి తెలుపబడెను.) 

2) కష్టనష్టాలలో ఒకవేళ ఇలా చేస్తే ఇలా అయ్యేదేమో అనుట నిషిద్ధం. 

3) ఒకవేళ అని పలకకూడదు అనుటకు కారణము, షైతాన్ అమలుకు దారి తెరుస్తుంది. 

4) మంచి పలుకులు పలుకుటకు ప్రేరేపించబడెను. 

5) లాభదాయకమైన వాటినే కాంక్షించాలి, అల్లాహ్ సహాయము కోరాలి. 

6) చేతకానివాడి వలె కూలబడుట నివారించబడింది. 

పాఠము 58 : గాలిని తిట్టుట నిషిద్ధం 

హజరత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)  బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

“గాలిని తిట్టకండి. మీరు సుడిగాలిని చూసినప్పుడు ఇలా చదవండి: “ఓ అల్లాహ్ ! మేము ఈ గాలితో మంచిని కోరుచున్నాము, ఈ గాలిని ఆజ్ఞాపించబడిన దానిలో కూడా మంచిని కోరుచున్నాము. ఓ అల్లాహ్ ! మేము ఈ గాలిలోని చెడు నుండి నీ శరణు కోరుచున్నాము. ఈ గాలికి ఆజ్ఞాపించ బడిన చెడు నుండి కూడా నీ శరణు కోరుచున్నాము.” (తిర్మిజీ సహీ) 

దీనిలో 4 ప్రకరణములు కలవు

1) గాలిని తిట్టుట నివారించబడెను.

2) ఏదైనా అయిష్టమైనది కనపడినప్పుడు, అల్లాహు కు ఇష్టమైనది కోరుకోవలెను. 

3) గాలి తనంతట తాను వీయదు. అల్లాహ్ ఆజ్ఞ మేరకే వీయును. 

4) గాలి ఒక్కోసారి మంచి చేయుటకు ఆజ్ఞాపించబడును. ఒక్కోసారి చెడు చేయుటకు ఆజ్ఞాపించబడును.

పాఠము – 59 : అల్లాహ్ ను శంకించుట నిషిద్ధం 

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఈ విధముగా సంబోధించెను: 

“వారు అల్లాహ్ పట్ల అసత్య, అజ్ఞాన, అశుద్ధమైన అనుమానాలు వ్యక్తం చేయసాగారు. (వారితో) ఇలా పలుకుము: “ఈ విషయంలో (ఎవ్వరికీ అధికారము లేదు. సమస్త అధికారములు అల్లాహ్ అధీనంలో ఉన్నవి. వాస్తవానికి వారు తమ హృదయములలో దాచుకున్న వాటిని మీకు వ్యక్తం చేయడం లేదు. మేము స్వతంత్రాధికారములు కలిగి ఉంటే, మేము ఇచట చంపబడి ఉండే వారము కాదు అని పలుకుచున్నారు. వారితో ఇలా పలకండి, మీరు మీ ఇళ్ళల్లోనే ఉండినప్పటికీ మృత్యువు లిఖించబడి ఉన్నవారు స్వయంగా తమ ప్రాణాంతక స్థానాలకు తరలివచ్చి ఉండేవారు (ఈ వృత్తాంతము ఎందుకు జరిగిందంటే) అల్లాహ్ మీ హృదయాలలో దాగివున్న దానిని పరీక్షించుటకు, మీ మనస్సులలో ఉన్నదానిని స్వచ్చపరచుటకు. నిశ్చయముగా అల్లాహు కు ఆంతరంగిక స్థితి బాగా తెలుసును. వాస్తవానికి అల్లాహ్ ను శంకించువారిపైనే కష్టములు వచ్చిపడును.”

పై వాక్యములను గురించి ఇబ్నె ఖయ్యిం (రహమతుల్లాహ్ అలై) ఈ విధముగా విశదీకరించెను: 

“పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్తకు సహాయపడడు, ఆయన ధర్మము వైపునకు ఆహ్వానించుచున్న కార్యము సమసిపోవును” అని వారు శంకించిరి. ముస్లిములపై వాటిల్లిన ఆపద అల్లాహ్ విధి కాదని అనుమానపడిరి. అల్లాహ్ యొక్క విధి, నేర్పు, ప్రవక్త యొక్క సఫలతను వీరు శంకించిరి. ఇస్లాం అన్ని మతాలపై సఫలత పొందజాలదని అనుమానపడిరి. కపటుల, బహుదైవారాధకుల ఈ శంక వాక్యము (48:6)లో తెలుపబడినది. ఇటువంటి కుశంక అల్లాహ్ యొక్క గొప్పతనమునకు విరుద్ధము. ఎందుకంటే ఇది అల్లాహ్ యొక్క జ్ఞానము, ముక్తి, గుణము, గౌరవాధిక్యతకు విరుద్ధము. 

ఇబ్నె ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) ఈ ఆయత్ యొక్క తాత్పర్యము ఈ విధముగా చేయుచున్నారు: కపట విశ్వాసము గలవారు ఉహద్ యుద్ధము తర్వాత ఈ విధముగా అనుమానించసాగారు. అది ఏమిటంటే, అల్లాహ్ తన ప్రవక్తకు సహాయము చేయడు. అప్పుడు ప్రవక్త ప్రచార ఆర్భాటం అంతరించిపోతుంది. మరో తాత్పర్యము ఈ విధముగా ఉంది: ప్రవక్తకు, విశ్వాసులకు, కలిగించిన ఇబ్బందుల ద్వారా కపటులు ఇలా శంకించేవారు, విధి అనేది అల్లాహ్ యొక్క వివేకం కాదు. 

అందుచే, “అల్లాహ్ అసత్యమును సత్యముపై ఆధిక్యత కలిగించునని యదార్థము సమసిపోవునని ఎవరయితే భావించెదరో లేదా అల్లాహ్ నిర్ణయించిన విధికి అనుగుణముగా జరిగెనని విశ్వసించరో లేదా అల్లాహ్ నిర్ణయించిన విధి నమ్మశక్యము కాదని భావించెదరో, ఇది కేవలం అతని ఇచ్చ అనుకొనెదరో” ఈ విధమైన కుశంక కలిగివుండుట తిరస్కారుల విధానము. తిరస్కారుల కొరకు నరకము స్థిర నివాసము. చాలా మంది తమ పనులలో శంకిస్తుంటారు. కాని అల్లాహ్ ను విశ్వసించేవారు, ఆయన స్వభావములను విశ్వసించేవారు, ఆయన ద్వారా ముక్తి మరియు గౌరవాధిక్యతను విశ్వసించేవారు ఈ శంకల నుండి సురక్షితముగా ఉండగలరు. 

జ్ఞానోదయము కలిగిన ప్రతి వ్యక్తీ తన మేలు కోరుకొని అల్లాహ్ ను శంకించక అటువంటి కుశంకములు కలిగినప్పుడు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవలెను. 

ప్రజలు అల్లాహ్ నిర్ణయించిన విధిని శంకిస్తుంటారు. ఇలాగై ఉంటే బాగుండేది అని పలుకుదురు. తమకు ప్రసాదించబడిన దానిని అల్పముగా భావించెదరు. అందుచే మనము కూడా కుశంక నుండి దూరముగా ఉన్నామా? లేదా? అని పరిశీలించు కోవలెను. ఒక అరబీ లోకోక్తి: “నీవు దాని నుండి దూరముగా ఉన్న ఎడల పెద్ద సాఫల్యము పొందిన వాడవు, కాని దూరముగా ఉన్నావని నేను తలచుటలేదు.” 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1) వాక్యము (3:154) యొక్క భావము (కుళంకుల గురించి) తెలుపబడెను. 

2) వాక్యము (48:6) యొక్క భావము (శంకించువారికి చెడు జరుగును అని) తెలుపబడెను.

3) లెక్కలేనన్ని విధములుగా జనులు శంకించుదురు. 

4) ఈ కుశంక నుండి అల్లాహ్ యొక్క స్వభావములను గుర్తించి, తన మనస్సు యొక్క పరీక్ష చేసుకోగలిగిన వారు మాత్రమే సురక్షితముగా ఉండగలరు. 

పాఠము 60 : అల్లాహ్ నిర్ణయించిన విధిని తిరస్కరించే వారు 

హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉద్బోధించారు: 

నా ప్రాణము ఎవరి చేతిలో ఉన్నదో ఆయనపై ప్రమాణము, ఒకవేళ ఎవరి వద్దయినా కొండంత బంగారమున్నచో అతడు అల్లాహ్ మార్గములో దానము చేసినా అతని ఈ అమలు (దానము) అతడు విధిపై విశ్వసించనంత వరకూ స్వీకరించబడదు. 

తన బోధనకు ఆధారముగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఈ ఉపదేశమును ఉల్లేఖించెను. “విశ్వసించుట అనగా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, ప్రళయదినమును, అల్లాహ్ నిర్ణయించిన విధిని విశ్వసించుట”. (ముస్లిం, హజరత్ ఉబాదాబిన్) 

ఉబాద్ బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) తన కుమారునికి ఈ విధముగా బోధించిరి: 

“ప్రియమైన కుమారుడా! నీకు సంభవించబోవు కష్టము నుండి నీవు రక్షించబడలేవు, నీకు సంభవించబోని కష్టము ఎప్పటికీ నీ వద్దకు రాదు అని విశ్వసించనంత వరకు విశ్వాసపు రుచిని నీవు పొందజాలవు. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం నుంచి ఈ ఉపదేశమును వింటిని: అల్లాహ్ అన్నిటికంటే ముందు కలమును సృష్టించి, దానిని వ్రాయమని ఆజ్ఞాపించెను. అది, ఓ నా ప్రభూ! ఏమి వ్రాయవలెను? అని అడిగెను. “ప్రళయ దినం వరకూ వచ్చు ప్రతి ప్రాణి విధిని వ్రాయుము” అని అల్లాహ్ సమాధాన మిచ్చెను: కుమారా, నేను ప్రవక్తను ఆయన ఈ విధముగా ఉపదేశిస్తుండగా విన్నాను: “ఎవరైతే ఈ విశ్వాసము కాక వేరే విశ్వాసముపై మరణిస్తాడో అతడు నా అనుచరులలోని వాడు కాదు.” (అబూ దావూద్, ముస్నదె అహ్మద్) 

“అల్లాహ్ అన్నిటికంటే ముందు కలమును సృష్టించి దానితో ప్రళయ దినం వరకు సంభవించు నటువంటి వన్నీ వ్రాయించివేసెను.” (ముస్నదె అహ్మద్) 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఉపదేశమును ఇబ్నె వహబ్ ఈ విధముగా ఉల్లేఖించిరి: 

“ఎవరైతే మంచి లేదా చెడు విధిపై విశ్వసించరో, వారిని అల్లాహ్ నరకములో కాల్చును.” 

ఇబ్నె అద్ దైలమి ఈ విధముగా ఉల్లేఖించెను: 

నేను హజరత్ ఉబై బిన్ కాబ్ (రదియల్లాహు అన్హు) వద్దకు పోయి నా మనస్సులో విధి గురించి కొంత అనుమానము కలదు, మీరు ఏదైనా హదీసు బోధించండి, అల్లాహ్ నా మనస్సులో నుంచి అనుమానమును తీసివేయుటకు” అని విన్నవించుకున్నారు. 

అప్పుడు హజరత్ ఉబై బిన్ కాబ్ అబీ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా బోధించారు: 

“నీవు ధనమును దానము చేసినా, నీ ఈ అమలు (దానము) నీవు విధిపై విశ్వసించనంతవరకూ, నీకు ఏ కష్టము వాటిల్లబోతుందో అది వాటిల్లు తుందని, నీకు వాటిల్లబోని కష్టము వాటిల్లబోదని విశ్వసించనంత వరకూ స్వీకరించబడదు. నీ విశ్వాసము దీనికి భిన్నముగా ఉండి నీవు మరణించిన యెడల నీవు నరకమున చేరెదవు.” తరువాత నేను హజరత్ అబ్దులా బిన్ మసీద్, హజరత్ హుజేఫా బిన్ యమాన్, హజరత్ జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ల వద్దకు వెళ్ళినప్పుడు వారు కూడా ప్రవక్త యొక్క ఇదే హదీసును బోధించిరి. (హాకిం దీనిని తన సహీలో పొందు పరచెను. ఇది సహీ హదీసు). 

దీనిలో 9 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ నిర్ణయించిన విధిని విశ్వసించుట తప్పనిసరి. 

2) విధిని ఏ విధముగా విశ్వసించవలెనో విశదీకరించబడెను. 

3) విధిని విశ్వసించనివారి కార్యములు స్వీకరించబడవు.
4) విధిని విశ్వసించనివాడు ‘ఈమాన్’ మాధుర్యాన్ని పొందజాలడు.
5) అల్లాహ్ అన్నిటికంటే ముందు సృష్టించిన దానిని తెలుపబడెను.
6) కలము ప్రళయదినం వరకు సంభవించునటువంటివన్నీ వ్రాసివేసెను. 

7) విధిని విశ్వసించని వారికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో సంబంధము లేదు. 

8) ‘సలఫీలు’ అనుమానము కలిగినప్పుడు ఖుర్ఆన్, హదీసులు బాగా తెలిసిన వారిని సంప్రదించేవారు. 

9) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసుల ద్వారా విధి గురించి స్పష్టముగా విశదీకరించబడెను. 

పాఠము 61 : చిత్రాలు, శిల్పాలను చిత్రించుట ఒక దుష్టమైన పని 

హజరత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) హదీసు ఖుద్సీని ఈ విధంగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెనని సంబోధించెను: 

“నా సృష్టిలాంటి సృష్టిని తయారు చేయుటకు ప్రయత్నించిన వారికి మించిన దుష్టులెవరూ లేరు. వీరిని ఒక రవ్వంతటి వస్తువును చేసి చూపెట్ట మనండి.” (సహీ ముస్లిం, సహీ బుఖారి) 

హజరత్ ఆయిషా(రదియల్లాహు అన్హ) ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించెను. 

“సృష్టించుటలో అల్లాహ్ యొక్క సృష్టి ప్రతిరూపమును చేయువారు ప్రళయ దినాన అందరినీ మించి శిక్షించబడుదురు.’ (సహీ ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధంగా ఉల్లేఖించారు: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రబోధించిరి: 

ప్రతి శిల్పి, చిత్రకారుడు నరకములో ప్రవేశించును. అతడు తాను చేసిన ప్రతి చిత్రమునకు బదులుగా ఒక ప్రాణము చేసి, దాని ద్వారా ఆ చిత్రకారుడు నరకంలో శిక్షింపబడును. (బుఖారి, ముస్లిం) 

హజరత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు; ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

“ఇహలోకంలో చిత్రము చేసిన వారిని ప్రళయ దినం నాడు ఆ చిత్రములో ప్రాణము పోయమని ఆజ్ఞాపించబడును. కాని అతడు ఎప్పటికీ చేయలేక పోవును.” 

అబూ హయ్యాజ్ కథనం: అలీ (రదియల్లాహు అన్హు) నాతో ఇలా అన్నారు. “నన్ను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పంపిన పనిపై నిన్ను పంపనా? అది ఏమనగా ఏ శిల్పమునైనా లేదా ఎత్తుగా ఉన్న ఏ సమాధినా కూల్చకుండా వదలవద్దు.” (సహీ ముస్లిం) 

దీనిలో 7 ప్రకరణములు కలవు 

1) శిల్పములు, చిత్రపటములు చేసేవారిని హెచ్చరించబడెను. 

2) చిత్రించుటను నిషేధించటానికి కారణము, ఇది కూడా షిర్క్ జాతికి చెందినదే. 

3) అల్లాహ్ సృష్టికర్త. సృష్టి బలహీనమైనది. సృష్టిని అల్లాహ్ సృష్టించెను. సృష్టి దేన్నీ సృష్టించజాలదు. 

4) చిత్రకారుడు అందరికంటే ఎక్కువగా శిక్షించబడును. 

5) అల్లాహ్ ప్రతి చిత్రమునకు బదులు ఒక ప్రాణము సృష్టించి దాని ద్వారా చిత్రకారుణ్ణి నరకంలో శిక్షించును. 

6) చిత్రకారునికి అతడు వేసిన చిత్రములన్నింటిలో ప్రాణము పోయమని ఆజ్ఞాపించబడును. కాని, అతడు చేయలేడు. 

7) విగ్రహాలు, ఎత్తయిన సమాధులు నిర్మూలించుటకు ఆజ్ఞాపించబడును. 

పాఠము 62 : ఎక్కువగా ప్రమాణములు చేయుట 

ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

وَاحْفَظُوا اَيْمَانَكُمْ . 

మీరు మీ ప్రమాణాలను పదిలము చేసుకోండి.” (5:89) 

హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించెను: (బుఖారి, ముస్లిం) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

“(అసత్య) ప్రమాణము సరుకులను అమ్ముటకు పనికొచ్చునుగాని అది సమృద్ధిని హరించును.” 

హజరత్ సల్మాన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి : (తిబ్రాని, సహీ) 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: 

“మూడు రకాల జనులను అల్లాహ్ (ప్రళయ దినం) పలకరించడు. వారి పాపములను దూరము చేయడు, వారికి భయంకర శిక్ష విధించబడును.
1. వ్యభిచారము చేయు వృద్ధుడు.
2. గర్వము, అహంకారము గల బిచ్చగాడు.
3. అల్లాహ్ ను తన వ్యాపారముగా చేసుకొన్నవాడు. అల్లాహ్ పై ప్రమాణము చేసి సరుకును విక్రయించేవాడు, ప్రమాణము చేసి సరుకు అమ్మేవాడు. 

హజరత్ ఇమ్రాన్ బిన్ హుస్సేన్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించిరి: “అన్నింటికంటే ఉత్తమమైన కాలము నా తరువాత వచ్చునది. ఆ పిమ్మట వచ్చునది” హజరత్ ఇమ్రాన్ (రదియల్లాహు అన్హు)  “ప్రవక్త తన తరువాత రెండు కాలములు పలికారో లేక మూడు కాలములు పలకెనో నాకు గుర్తులేదు” అని తెలిపిరి. తరువాత ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  ఈ విధముగా తెలిపెను. “మీ తర్వాత కొందరు వస్తారు. వారు తమను సాక్ష్యానికి పిలవక ముందే సాక్ష్యం ఇస్తారు. నమ్మకద్రోహానికి పాల్పడతారు. నిజాయితీగా ఉండరు. మొక్కుబడులు చేస్తారు. కాని వాటిని పూర్తిచేయరు. వారిలో లావుతనం కనిపిస్తుంది” (సహీ ముస్లిం) 

అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త బోధనను ఈ విధముగా ఉల్లేఖించారు: 

“అందరికంటే ఉత్తమ ప్రజలు నా కాలపు ప్రజలు. పిమ్మట నా తరువాత వచ్చువారు. ఆ పిమ్మట తరువాత వచ్చువారు. తరువాత వచ్చువారు తమ ప్రమాణమునకు ముందే సాక్ష్యము పలుకుదురు. సాక్ష్యము ముందు ప్రమాణము చేయుదురు. (అంటే తమ ప్రమాణము చేయుటలోగాని, సాక్ష్యము పలుకుటలోగాని నిజాన్ని ఖాతరు చేయరు). ” 

హజరత్ ఇబ్రాహీం నఖయీ (రహమతుల్లాహ్ అలై) ఇలా తెలిపిరి: “మా చిన్న వయస్సులో మా పెద్దలు మమ్మల్ని వాగ్దానానికి, సాక్ష్యములకు కట్టుబడి ఉండవలెనని దండించెడివారు. 

దీనిలో 8 ప్రకరణములు కలవు 

1) ప్రమాణాలను పదిలము చేయుటకు ఆజ్ఞాపించబడినది. 

2) ప్రమాణము చేసి సరుకు అమ్ముటవలన దానిలోని సమృద్ధిని కోల్పోతారు. 

3) సరుకును కొన్నప్పుడు, అమ్మినప్పుడు అనవసర ప్రమాణములు చేయువారిని హెచ్చరించబడెను.

4) నేరములకు కారణములు చిన్నవి అయినప్పటికీ అభిముఖము చూపుట వలన అవి పెద్దవి అగును. 

5) కోరక ముందు ప్రమాణము చేయువారిని నివారించబడెను. 

6) ప్రవక్త మూడు, నాలుగు కాలముల పరిమితుల ప్రాముఖ్యతను తెలిపి తరువాత జరుగునది తెలిపెను. 

7) సాక్ష్యము కొరకు ముందే సాక్ష్యము ఇచ్చుటకు సిద్ధమగువారిని వారించబడెను. 

8) సలఫె సాలిహీన్ పిల్లలను వాగ్దానానికి, సాక్ష్యానికి కట్టుబడి ఉండనిచో దండించెడివారు. 

పాఠము – 63 : అల్లాహ్ ప్రవక్త పేర పూచీ ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండుట 

ఖుర్ఆన్ అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను: 

وَأَوْفُوا بِعَهْدِ اللَّهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ

“మీరు అల్లాహ్ వాగ్దానము చేసినప్పుడు దానిని నెరవేర్చండి. అల్లాహ్ సాక్షిగా చేసిన ప్రమాణాలను భంగపరచకండి. ఎందుకంటే మీరు అల్లాహ్ ను  తమపై పూచీ చేసుకున్నారు. అల్లాహ్ కు మీ పనులన్నీ తెలుసును.” (16:91) 


2. వారు ఏకదైవారాధనకు వ్యతిరేకిస్తే రక్షణ రుసుము కట్టమని అడగండి. వారు అంగీకరిస్తే మీరు కూడా ఆమోదము తెలుపండి. 

హజరత్ బురైదా(రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఏ అధికారినైనా నియమించి నప్పుడు అల్లాహ్ కు భయపడమని, తోటి ప్రజలతో సత్ప్రవర్తన పాటించమని అతనికి ఉపదేశించి ఈ విధముగా ప్రబోధించెడివారు: ‘అల్లాహ్ మార్గములో అల్లాహ్ పేరున యుద్ధము చేయుము. అల్లాహ్ ని తిరస్కరించిన వారిపై యుద్ధము చేయుము. యుద్ధము చేయుముగాని అన్యాయము చేయవద్దు, మాట తప్పవద్దు, ఎవరి అవయవములూ కోయవద్దు. పిల్లలను హతమార్చవద్దు. తిరస్కారులను మూడు విషయముల వైపునకు పిలవండి. 

1. ఒక్క అల్లాహ్ ఆరాధించమని కోరండి. వారు అంగీకరించిన పక్షంలో ఇస్లాం స్వీకరించి మదీనాకు వలస వెళ్ళమని వారిని కోరండి. వారు అంగీకరిస్తే వారందరికీ వలస వెళ్ళిన వాళ్ళ హక్కులన్నీ లభించునని తెలుపండి. వలస వెళ్ళని ఎడల ఆ హక్కులు లభ్యము కావని తెలపండి. 

3. వారు రక్షణ రుసుము కట్టుటకు నిరాకరిస్తే అల్లాహ్ సహాయమును యాచించి వారితో యుద్ధము చేయండి. మీరు కోటలోని శత్రువులను ముట్టడించినప్పుడు, శత్రువులు మిమ్మల్ని అల్లాహ్ తరువాత ప్రవక్త నామముల పూచీ కొరినచో మీరు వారికి అటువంటి పూచీలను ఇవ్వకండి. కాని మీరు మీ యొక్క సొంత పూచీ ఇవ్వండి. మీరు మీ పూచీని ఖాతరు చేయని యెడల అది అల్లాహ్ ఆ తరువాత ప్రవక్తల పేర ఇచ్చిన పూచీకంటే స్వల్పమైన పూచీ. మీరు కోటను ముట్టడించినప్పుడు వారు అల్లాహ్ పేర సంధి చేసుకొందురు అంటే మీరు సంధి చేయకండి. ఎందుకంటే మీరు చేయు సంధిలో అల్లాహ్ పరిష్కార మార్గము ఉన్నదో లేదో మీకు తెలియదు.’ 

దీనిలో 7 ప్రకరణములు కలవు. 

1) అల్లాహ్ నామమున ఇచ్చిన పూచీ, ప్రవక్త నామమున ఇచ్చిన పూచీ, ఇతరులు పూచీలో వ్యత్యాసము కలదు. 

2) రెండు కష్ట సమస్యలు ఎదురైనప్పుడు వాటిలోని సులభమైన దానిని స్వీకరించవలెను. 

3) అల్లాహ్ మార్గములో అల్లాహ్ కొరకు యుద్దము చేయవలెను.
4) అల్లాహ్ ను తిరస్కరించినవారిపై యుద్ధము చేయవలెను. 

5) అల్లాహ్ యొక్క సహాయము యాచించి యుద్ధము చేయవలెను.

6) అల్లాహ్ నిర్ణయము, ఇతరుల నిర్ణయములో వ్యత్యాసము కలదు. 

7) అనుచరులు తీసుకున్న నిర్ణయం అల్లాహ్ అంగీకార యోగ్యమైనదని అనుకొనుట సరికాదని స్పష్టమగును. 

పాఠము – 64 : అల్లాహ్ నామమున ప్రమాణము చేయుట 

హజరత్ జందుబ్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: 

ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రమాణము చేసి “అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు” అని పలికినప్పుడు అల్లాహ్ ఇలా తెలిపెను: అతడెవడు నా నామమున ప్రమాణము చేయువాడు, నేను ఫలానా వ్యక్తిని క్షమించనని. నేను అతనిని క్షమించితిని, ప్రమాణము చేసిన వ్యక్తి అమలు (కార్యములు) వృధా చేసితిని. (ముస్లిం) 

హజరత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) పై హదీసును ఈ విధముగా విశదీకరించిరి: 

“ఆ వ్యక్తి ఒక మంచి భక్తుడని, అతను పలికిన పలుకులు అతనిని ఇహపర లోకాలని నాశనము చేసివేసెను.’ 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) అల్లాహ్ ను పూచీ పెట్టి ప్రమాణము చేయుట నిషిద్దము. 

2) నరకము ప్రతి ఒక్కని సమీపములో ఉన్నది. 

3) స్వర్గము కూడా అదే విధముగా సమీపములో ఉన్నది. 

4) పై హదీసుతో ప్రవక్త ఈ హదీసు ధృవపరచబడెను: “కొన్ని సమయము లలో మానవుడు తన ఇహపర లోకములను నాశనము చేయుట (అగుట) కు కారణమైన పలుకులు పలుకును.” 

5) అల్లాహ్ మనలను కొన్ని సమయములలో మనము ఊహించని రీతిలో అ క్షమించును. 

పాఠము 65 : సృష్టిరాశులను సంతోషపెట్టటానికి అల్లాహ్ ను సిఫారసుదారుగా చేయరాదు 

హజరత్ జుబైర్ బిన్ ముత్యమ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఒక అజ్ఞాని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఈ విధముగా పలికెను: 

“ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రాణములు పోవుచున్నవి, పిల్లలు ఆకలితో అలమటించిరి, పంట నాశనమగుచున్నది. మీరు దయచేసి అల్లాహ్ ను వర్షము కొరకు ప్రార్థించండి. మేము అల్లాహ్ ను  మీ వద్ద, మిమ్ములను అల్లాహ్ వద్ద సిఫారసులుగా చేయుచున్నాము.” 

ప్రవక్త అతని మాటలు విని, “అల్లాహ్ పరిశుద్ధుడు, అల్లాహ్ పరిశుద్ధుడు అని చాలా సేపటి వరకు ఉచ్ఛరించుచుండిరి. సహచరులు దానిని గ్రహించిరి. చివరికి ప్రవక్త ఇలా ఉద్బోధించారు. “నీకై పశ్చాత్తాపము, అల్లాహ్ ఎవరో నీకు తెలియునా? అల్లాహ్ అతి ఉత్తముడు, ఆయనను ఎవరి ముందు సిఫారసు చేయువానిగా పలకరాదు.” 

దీనిలో 5 ప్రకరణములు కలవు 

1) ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మేము అల్లాహ్ ని మీ వద్ద సిఫారసు చేయువానిగా అనుదుము’ అనిన వారి కొరకు పశ్చా త్తాపము కోరిరి. 

2) అజ్ఞాని పలికిన పైపలుకులకు ప్రవక్త ముఖకవళికలు మార్పు చెందు టను సహచరులు గ్రహించారు. 

3) ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అజ్ఞాని పలికిన (మిమ్ములను అల్లాహ్ వద్ద సిఫారసుగా చేయుచున్నాము) దానికి ఏమీ ప్రస్తావించలేదు

4) సుబహానల్లాహ్ (అల్లాహ్ పరిశుద్ధుడు)కు విశ్లేషణము తెలుపబడెను. 

5) విశ్వసించినవారు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి వర్షము కొరకు ప్రార్థన చేయించేవారని స్పష్టమగును. 

పాఠము 66 : ప్రవక్త  (సల్లల్లాహు అలైహి వ సల్లం)  తౌహీదు పరిరక్షించారు షిర్క్ మార్గాలకు కళ్ళెం వేశారు 

హజరత్ అబ్దుల్లా బిన్ షిఖియ్యిర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: నేను ఒకసారి బనూ ఆమిర్ ప్రతినిధి సంఘముతో పాటు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వెళ్ళి, “మీరు మా సర్దారు” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త, “సర్దారు అల్లాహ్ ఒక్కడే” అని పలికిరి. అప్పుడు మరల మేము, “మీరు మాకంటే ఉత్తములు, మాకంటే ఎక్కువ దయగలవారు’ అని పలికితిమి. అప్పుడు ప్రవక్త, “ఇటువంటి అర్హత గల పలుకులనే పలకండి. షైతాను మిమ్మల్ని పెడత్రోవ పట్టించగలడు. జాగ్రత్త వహించండి” అని పలికిరి. (అబూ దావూద్) 

హజరత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: కొంతమంది ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను “ఓ అల్లాహ్ ప్రవక్తా! మాలో అందరికంటే ఉత్తముడా!, అందరికంటే ఉత్తముని కుమారుడా! ఓ సర్దార్, సర్దారు కుమారుడా” అని మేము పిలిచితిమి. ప్రవక్త ఈ విధముగా జవాబు పలికిరి. “ఓ ప్రజలారా! మీరు అర్హమైన మాటలే పలకండి, షైతాను మిమ్ములను పెడత్రోవ పట్టించగలడు. నేను ముహమ్మద్ ను  అల్లాహ్ దాసుడను, అల్లాహ్ ప్రవక్తను. మీరు నన్ను అల్లాహ్ నాకు ప్రసాదించిన నా స్థానము నుండి పెంచకండని నేను మిమ్మల్ని వారించుచున్నాను. (ఉత్తమసనద్ నసాయి పొందుపరచెను. ) 

దీనిలో 4 ప్రకరణములు కలవు 

1) హద్దు మీరి మాట్లాడువారు హెచ్చరించబడెను. 

2) “మీరు మా సర్దార్” అని అంటే చెప్పవలసిన జవాబు తెలుపబడెను. 

3) వారు మామూలు మాటలు పలికినప్పటికీ, షైతాను మిమ్మల్ని పెడత్రోవ పట్టించగలడు జాగ్రత్త” అని హెచ్చరించిరి. 

4) “అల్లాహ్ నాకు ప్రసాదించిన స్థానము నుండి నన్ను పెంచవద్దు” అని ప్రవక్త పలకటంతో మనము కూడా దానిని స్పష్టంగా అర్థం చేసుకోవలెను. 

పాఠము 67 : అల్లాహ్ ఘనత, గౌరవము (ఔన్నత్యము) 

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించెను; 

وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ وَالْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُ يَوْمَ الْقِيَامَةِ وَالسَّمَاوَاتُ مَطْوِيَّاتٌ بِيَمِينِهِ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ

“వారు అల్లాహ్ కనుగుణంగా అల్లాహు గౌరవించలేదు. ప్రళయ దినం నాడు యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఉండును. సమస్తాకాశములు ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉండును. వారు చేస్తున్న బహుదైవారాధనకు అల్లాహ్ అతీతుడు, పరిశుద్ధుడు.” (39:67) 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ఒక యూద పండితుడు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వద్దకు వచ్చి ఈ విధముగా పలికెను: “ఓ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)! మా పుస్తకాలలో ఈ విధముగా ఉన్నది: అల్లాహ్ ప్రళయ దినం నాడు సకలాకాశాలను ఒక వేలిపై, భూమండలమును ఒక వేలిపై, సకల వృక్షములను ఒక వేలిపై, ఒక వేలిపై బురదను, మిగిలిన సకల సృష్టిరాశుల్ని ఒక వేలిపై ఉంచి, తరువాత ‘నేనే మీ రాజును’ అని సెలవిచ్చును కదా!” అతని మాటలు విని ప్రవక్త చిరునవ్వు నవ్వి ఈ వాక్యమును పఠించెను: 

వారసలు అల్లాహ్ ను గౌరవించ వలసిన విధంగా గౌరవించలేదు. ప్రళయదినాన భూమి అంతా ఆయన గుప్పెట్లో ఉంటుంది. ఆకాశాలన్నీ ఆయన కుడిచేతిలో చుట్టబడి ఉంటాయి. ఆయన పవిత్రుడు. వీళ్లు కల్పించే భాగస్వామ్యాలకు అతీతుడు – ఎంతో ఉన్నతుడు. (39:67) 

(దీనిని సహీ ముస్లిం, సహీ బుఖారి, సునన్ తిర్మిజీ, సునన్ నసాయి, ముస్నదె అహ్మద్ పొందుపరచెను.) 

మరో హదీసులో ఈ విధముగా తెలుపబడినది: “అల్లాహ్ ప్రళయ దినం నాడు సమస్త కొండలను, వృక్షములను ఒక వేలుపై ఉంచి, వాటిని ఊపి ‘నేనే రాజును, నేనే అల్లాహ్ ను’ అని పలుకును.” 

(సహీ ముస్లిం) మరో హదీసులో ఈ విధముగా తెలుపబడినది: “అల్లాహ్ సమస్త ఆకాశాలను ఒక వేలిపై, నీటిని, బురదను ఒక వేలిపై, మిగిలిన సకల సృష్టిరాశిని ఒక వేలిపై ఉంచును.’ (బుఖారి) 

హజరత్ అబ్దులా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించిరి: ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: అల్లాహ్ ప్రళయదినం నాడు ఆకాశాన్ని చుట్టి తన చేతిలో తీసుకొని నేనే రాజును (భూమిపై) అహంకారులు ఎక్కడ ఉన్నారు? అని పలుకును. సమస్త భూమండలాలను చుట్టి తన ఎడమ చేతిలో తీసుకొని “నేనే రాజును! అహంకారము, గర్వము కలవారు (ఈ వేళ) ఎక్కడ ఉన్నారు?” అని పలుకును.  (సహీ ముస్లిం) 

హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపిరి: “మీ చేతిలో రాగి గింజ ఎలా ఉండునో ఆ విధముగా అలాహ్ చేతిలో సప్త భూమ్యాకాశాలుండును.’ 

ఇబ్నె జరీర్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: నాకు యూనుస్ ఒక హదీసు తెలిపెను. ఆయన ఇబ్నె వహబ్ నుంచి వినెను, ఆయన ఇబ్నె జైద్ నుంచి వినెను. ఆయన తండ్రితో వినెను. ఆయన తండ్రి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: “సప్త ఆకాశాలు, కుర్చీతో పోల్చి చూసినచో, ఒక పెద్ద ప్రదేశములో సప్తనాణెములు వేసినట్లుండును. 

అబూజర్ గిఫారీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త యొక్క బోధనను ఈ విధముగా ఉల్లేఖించిరి: “అల్లాహ్ యొక్క కుర్చీని ఆయన అర్హ్ను పోల్చి చూసినప్పుడు, ఒక పెద్ద ప్రదేశము (మైదానము)లో ఒక ఇనుప ఉంగరము వేసినట్లుండును.” 

హజరత్ అబ్దుల్లా బిన్ మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా తెలిపెను: మొదటి మరియు రెండవ ఆకాశముల మధ్య వేగవంతమైన గుర్రము ఐదువందల సంవత్సరముల ప్రయాణము చేయు (వ్యత్యాసము) దూరము కలదు. ఇదే విధముగా ప్రతి రెండు ఆకాశముల మధ్య ఇంతే దూరము కలదు. ఏడవ ఆకాశము మరియు కుర్చీకి మధ్య అంతే దూరము. కుర్చీ మరియు నీటికి మధ్య అంతే దూరము కలదు. నీటిపై అర్ష్ కలదు. అర్ష్ప అల్లాహ్ ఉన్నాడు. మీ ప్రతి కార్యము అల్లాహ్ కు తెలుసును.” (ఈ హదీసును ఇబ్నె మెహదీ హమద్ బిన్ సలమా నుంచి, ఆయన ఆసిం నుంచి, ఆయన జర్ నుంచి, ఆయన అబ్దుల్లా బిన్ మస్ ఊద్ నుంచి తెలిపెను. దీనిని మసూదీ ఆసిం నుంచి, ఆయన అబూ వాయల్ నుంచి, ఆయన అబ్దుల్లా నుంచి, ఆయన ప్రవక్త నుండి ఉల్లేఖించెను. హాఫిజ్ అద్ దహబి కూడా ఈ హదీసును పొందుపరచెను: హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ (రదియల్లాహు అన్హు) ఈ విధముగా ఉల్లేఖించారు: 

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధముగా ప్రబోధించెను: (భూమి మరియు ఆకాశానికి మధ్య ఎంత దూరమున్నదో తెలుసునా?” అని ప్రవక్త అడిగినప్పుడు, “అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసును” అని పలికితిమి. అప్పుడు ప్రవక్త “వాటి మధ్య ఐదు వందల సంవత్సరాల ప్రయాణము చేయునంత దూరము కలదు. ప్రతి ఆకాశమునకు వేరే ఆకాశము నకు మధ్య అంతే దూరము కలదు. ఆకాశము యొక్క మందము కూడా అంతే. ఏడవ ఆకాశము మరియు అర్ష్ మధ్య సముద్రము కలదు. దాని క్రింద మరియు పైభాగము మధ్య ఇంతే దూరము. అల్లాహ్ దానిపై ఉన్నాడు. ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము ఆయనకు తెలుసును.’ అని వివరించెను.(అబూదావూద్ పొందుపరచెను) 

దీనిలో 19 ప్రకరణములు కలవు 

1) వాక్యము (39:67) యొక్క భావము విశ్లేషించబడినది. 

2) హదీసులో తెలుపబడిన మాటలు యూదుల పుస్తకములలో కూడా కలవు. 

3) యూద పండితుని మాటలను ప్రవక్త స్వీకరించెను. ఖుర్ఆన్ వాక్యము కూడా అవతరించబడెను

4) యూద పండితుని స్వచ్ఛవచనములు విని ప్రవక్త నవ్వటం, ఆయన సంతోషానికి చిహ్నం.

5) అల్లాహ్ కు చేతులు ఉన్నవని స్పష్టమగుచున్నది. ఒక చేతిలో ఆకాశం, వేరొక చేతిలో భూమి ఉండును 

6) అల్లాహ్ కు ఎడమ చేయి అనునది ఉన్నట్టు అర్థమగును. 

7) మన చేతిలో రాగి గింజ ఉన్నట్లు, అల్లాహ్ చేతిలో భూమ్యాకాశాలు ఉండును. 

8) అల్లాహ్ ప్రళయదినం నాడు పొగరు మరియు అహంకారము చూపిన వారిని పిలుచును. 

9) అల్లాహ్ యొక్క కుర్చీ ఆకాశము కంటే పెద్దది.

10) అల్లాహ్ యొక్క అర్ష్  కుర్చీకంటే పెద్దది

11) అర్ష్, కుర్చీ, నీరు వేరు వేరు. 

12) ప్రతి రెండు ఆకాశముల మధ్య ఒక చురుకైన గుర్రము ఐదువందల సంవత్సరములు ప్రయాణించు దూరము కలదు. 

13. ఏడవ ఆకాశము మరియు కుర్చీ మధ్య దూరము తెలుపబడెను

14. కుర్చీ మరియు నీటికి మధ్య దూరము తెలుపబడెను.

15) అల్లాహ్ యొక్క అర్ష్ నీటిపై ఉన్నది. 

16) అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు. 

17) భూమ్యాకాశాల మధ్య దూరము తెలుపబడెను. 

18) ప్రతి ఆకాశము యొక్క మందము ఐదు వందల సంవత్సరములు ప్రయాణించినంత ఉన్నది. 

19) ఏడవ ఆకాశముపై ఉన్న సముద్రము యొక్క క్రింది మరియు పై భాగముల మధ్య కూడా ఐదువందల సంవత్సరములు ప్రయాణించి నంత దూరము కలదు. 

సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ యే స్తుతింపబడుటకు అర్హుడు. ప్రవక్తపై, తమ అనుచరులపై, విశ్వసించిన వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి చేకూరును. 

విశ్వాస మూల సూత్రాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

usul-al-aqidah-fundamental-beliefs-in-islam_img


ఉసూల్  అల్  అఖీదా (Fundamentals of Belief in Islam)

అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
క్లుప్త వివరణ
: ఇస్లామీయ మూల విశ్వాసం మరియు ఏకదైవారాధన గురించి ఈ పుస్తకంలో చర్చించబడినది.

 [ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [41 పేజీలు]

విశ్వాస మూల సూత్రాలు – యూట్యూబ్ ప్లేలిస్ట్ [14 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1tDmY3rwxlhOKdavXJOTGl

వీడియో పాఠాలు (క్రొత్తవి)

విషయ సూచిక :

  • తౌహీద్, దాని రకాలు
  • కలిమయే తౌహీద్ – లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావం
  • ‘ముహమ్మదుర్ రసూలిల్లాహ్’ భావం
  • విశ్వాసం, దాని ఆరు మూల సూత్రాలు
  • షిర్క్ (బహు దైవారాధన, దాని రకాలు)
  • ఫిర్ఖయే  నాజియ (ముక్తి పొందేవారు)

ఈ పుస్తకం మీదపాత వీడియోలు

ఈ పుస్తకానికి సంబంధించిన మరీ పాత వీడియోలు క్రింద చూడండి:

[పూర్తి పుస్తకాన్ని క్రింద చదవండి]

తౌహీద్ దాని రకాలు:

తౌహీద్ అంటే: విధిగా, అల్లాహ్ కు ప్రత్యేకంగా చేయబడే ప్రతి “ఆరాధన”లో అల్లాహ్ ను అద్వితీయునిగా నమ్మడం. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాల్లో ఇది చాలా గొప్పది. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[قُلْ هُوَ اللهُ أَحَدٌ] [الاخلاص:1]

{ఇలా చెప్పండి! ఆయన అల్లాహ్, అద్వితీయుడు}. (సూరె ఇఖ్లాస్ 112: 1).

మరోచోట ఇలా సెలవిచ్చాడు:

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] [الذاريات: 56]

{నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను}. (జారియాత్ 51: 56).

మరో ఆదేశం:

[وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا] [النساء:36]

{కేవలం అల్లాహ్ నే ఆఃరాధించండి, ఆయనకు ఎవరినీ సాటి కల్పించకండి}. (సూరె నిసా 4: 36).

తౌహీద్ మూడు రకాలుః (1) తౌహీదె రుబూబియత్, (2) తౌహీదె ఉలూహియత్, (3) తౌహీదె అస్మా వ సిఫాత్.

(1) తౌహీదె రుబూబియత్:

అంటేః సృష్టి, దాని నిర్వహణలో అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే. ఆయనే పోషకుడు, జీవన్మరణ ప్రధాత. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. దీనికి సంబంధించిన నిదర్శనాలు దివ్యగ్రంథం ఖుర్ఆనులో చదవండి:

[هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللهِ يَرْزُقُكُمْ مِنَ السَّمَاءِ وَالأَرْضِ لَا إِلَهَ إِلَّا هُوَ…] [فاطر:3]

{ఆకాశము నుండి భూమి నుండి అల్లాహ్ తప్పా వేరే సృష్టికర్త మీకు ఆహారము నొసంగువాడు గలడా? “ఆరాధనకు నిజమైన అర్హుడు ఆయన తప్ప మరొకడు లేడు”…}. (ఫాతిర్ 35: 3).

[تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ]

{ఎవని చేతిలో సమస్త లోకపాలన గలదో ఆ అల్లాహ్ చాలా శుభాలు గలవాడు, ఆయన సర్వం పై సంపూర్ణ శక్తి గలవాడు}. (ముల్క్ 67: 1).

అల్లాహ్ అధికారం విశ్వమంతటిలో ఉంది. అందులో తనిష్టానుసారం మార్పు చేస్తుంటాడు.

నిర్వహణలో అద్వితీయుడు కూడా కేవలం అల్లాహ్ మాత్రమే. సృష్టి కార్యాలు నెరవేర్చువాడు ఆయనే. ఈ ఆయతు చదవండిః

[أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ]

{వినండి! సృష్టించుట, ఆజ్ఞాపించుట ఆయన పనే. సర్వ లోకాలకు పోషకుడగు అల్లాహ్ ఎంతో శుభదాయకుడు}. (ఆరాఫ్ 7: 54).

అతని ఈ నిర్వహణ కార్యక్రమం సర్వసృష్టిలో అమలు చేయబడుతూ ఉన్నది.

తౌహీద్ యొక్క ఈ రకాన్ని తిరస్కరించిన-వారు చాలా అరుదు. వారు బాహ్యంగా తిరస్క- రించినా, వారి అంతరాత్మ మటుకు దాన్ని ఒప్పుకుంటుంది.  (ఫిర్ఔన్ వాళ్ళ గురించి) ఈ

ఆయతు చదవండిః

[وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا]  

[النمل 14]

{నిజానికి వారి మనస్సులు (సత్యాన్ని) నమ్మినప్ప- టికీ అన్యాయం, అహంకారంతో వారు దానిని తరస్కరించారు}. (27: నమ్ల్: 14).

తౌహీద్ యొక్క ఈ ఒక్క రకాన్ని నమ్మినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రవక్త కాలంలోని బహుదైవారాధకులు ఈ రకాన్ని నమ్మారు కాని అది వారికి ఏ లాభాన్నివ్వలేదు. ఖుర్ఆన్ సాక్ష్యం చదవండిః

[وَلَئِنْ سَأَلْتَهُمْ مَنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ فَأَنَّى يُؤْفَكُونَ] [العنكبوت 61]

{భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారని, సూర్యచంద్రుల్ని ఎవరు అదుపులో ఉంచ గలిగారని నీవు అడిగితే, అల్లాహ్ యే అని వారు తప్పకుండా అంటారు. అలాంటప్పుడు వారు ఎలా మోసపోతున్నారు?}. (అన్ కబూత్ 29:61).

(2) తౌహీదె ఉలూహియత్:

అంటే: ఆరాధనలకు అర్హుడయిన అద్వితీ- యుడు ఆ పరమ పవిత్రుడు మాత్రమే. పూజించుటకు మరియు సాన్నిధ్యము పొందుటకు అల్లాహ్ తో పాటు మరెవ్వరినీ సాటి కల్పించకూడదు. తౌహీద్ యొక్క 3 రకాల్లో ఇదే అతిముఖ్యమైనది, గొప్పది. దీని కొరకే అల్లాహ్ మానవులను సృష్టించాడు. అల్లాహ్ ఆదేశం:

[وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] [الذاريات: 56]

{నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను}. (జారియాత్ 51: 56).        ఈ విషయమే ప్రజలకు క్లుప్తంగా బోధించ- డానికి అల్లాహ్ ప్రవక్తలను పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. దీని సాక్ష్యాధారం దివ్య ఖుర్ఆనులో ఇలా ఉందిః

[وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ] [الأنبياء:25]

{మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా ‘నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి’ అనే విషయాన్ని తెలియజేశాము}. (అంబియా 21: 25).

తౌహీద్ యొక్క ఈ రకాన్నే బహుదైవా- రాధకులు తిరస్కరించారు, వారి ప్రవక్తలు ఈ తౌహీద్ యొక్క బోధ చేసినప్పుడు. దీనికి ఖుర్ఆన్ ఇలా సాక్ష్యమిస్తుందిః

[قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ]

{(బహుదైవారాధకులు తమ ప్రవక్తలకు ఇలా జవాబిచ్చారు): నీవు మా వద్దకు రావటానికి కారణం, మేము ఒక్క అల్లాహ్ నే ఆరాధించాలనా, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని విసర్జించాలనా?}. (ఆరాఫ్ 7: 70).

అందుకే ఇబాదత్ (ఆరాధన) యొక్క ఏ రకమూ కూడా అల్లాహ్ యేతరులకు చేయుట ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ అల్లాహ్ యేతరులు ఎవరైనా సరేః అతిసన్నిహితులైన దైవదూతలు, ప్రవక్తలు, మహా భక్తులు, సృష్టి- రాసుల్లో ఎవ్వరినీ కూడా అల్లాహ్ తో సాటి కల్పించకూడదు.

(3) తౌహీదె అస్మా వ సిఫాత్:

అంటేః అల్లాహ్ స్వయాన తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్ గురించి ఏ పవిత్ర నామముల, ఉత్తమ గుణముల గురించి తెలిపారో వాటిని అల్లాహ్ కు తగిన రీతిలో విశ్వసించాలి. ఏ మాత్రం ‘తహ్ రీఫ్’, ‘తఅతీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్’([1]) లేకుండా. ఆయన గుణ నామము- లను యథార్థంగా నమ్మాలి. యథార్థానికి విరుద్ధంగా కాదు. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్ అతీతుడని నమ్మాలి. వేటి గురించి అల్లాహ్ అర్హుడా, అతీతుడా అని స్పష్టం లేదో వాటిలో మౌనం వహించాలి అంటే వాటికి అల్లాహ్ అర్హుడని అనవద్దు అతీతుడనీ అనవద్దు.

పవిత్ర నామముల ఉదాహరణ: పవిత్రుడైన అల్లాహ్ ‘అల్ హయ్య్’ తన నామమని తెలిపాడు. అయితే ‘అల్ హయ్య్’ అల్లాహ్ నామాల్లో ఒకటని నమ్మాలి. ఇంకా ఆ పేరులో ఉన్న భావమును కూడా విశ్వసించాలి. అనగా ఆయన శాశ్వతముగా ఉండువాడు, ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు లేరు. (ఆయన సజీవుడు, నిత్యుడు). అదే విధముగా ‘సమీఅ’ ఆయన పేరు, ‘సమ్అ’ (వినుట) ఆయన గుణం అని నమ్మాలి.

గుణముల ఉదాహరణ: అల్లాహ్ ఆదేశం:

[وَقَالَتِ اليَهُودُ يَدُ اللهِ مَغْلُولَةٌ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنْفِقُ كَيْفَ يَشَاءُ]

{“అల్లాహ్‌ చేతులు కట్టివేయబడి ఉన్నాయి” అని యూదులు అన్నారు. నిజానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్‌ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా ఆయన ఖర్చుపెడుతున్నాడు.}. (మాఇద 5: 64).

పై ఆయతులో అల్లాహ్ తనకు రెండు చేతులున్నాయని, అవి విచ్చలవిడిగా ఉన్నాయని తెలిపాడు. అంటే వాటి ద్వారా తనిష్టానుసారం అనుగ్రహాలు నొసంగుతాడని తెలిపాడు. అయితే అల్లాహ్ కు రెండు చేతులున్నాయని, వాటి ద్వారా అనుగ్రహాలు నొసంగుతాడని విశ్వసించడం మనపై విధిగా ఉంది. ఆ చేతులు ఇలా, అలా ఉంటాయని మనుసులో ఊహించే, లేదా నోటితో పలుకే ప్రయత్నం కూడా చేయవద్దు. వాటిని మానవుల చేతులతో పోల్చకూడదు. ఎందుకనగా అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ البَصِيرُ]

{ఆయనకు పోలినది ఏదీ లేదు. మరియు ఆయన వినువాడు, చూచువాడు}. (షూరా 42:11).

ఈ తౌహీద్ యొక్క సారాంశమేమిటంటే: అల్లాహ్ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు ఏ ఏ గుణనామాల గురించి తెలిపారో వాటిని నమ్మాలి. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్ అతీతుడని నమ్మాలి. అయితే వాటిని తారుమారు చేయకుండా, ఇతరులతో పోల్చకుండా, నిరాకారునిగా భావించకుండా నమ్మాలి. ఏ గుణనామముల విషయములో, అవి అల్లాహ్  కు సంబంధించినవేనా, లేదా అని స్పష్టం లేదో ఆ పదాల భావం లో అల్లాహ్ పట్ల అగౌరవం ఉంటే వాటిని ఖండించాలి. వాటి భావం లో ఏలాంటి దోషం లేకుంటే వాటిని స్వీకరించవచ్చు.

కలిమయె తౌహీద్: లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావం

లాఇలాహ ఇల్లల్లాహ్, ఇస్లాం యొక్క పునాది. ఇస్లాములో దాని స్థానం చాలా గొప్పది. అది ఇస్లాం స్థంబాలలో మొదటిది. విశ్వాస భాగాలలో ఉన్నత భాగం. సత్కార్యాల అంగీకారం ఆ వచనాన్ని హృదయ పూర్వకంగా పఠించి దాని అర్థాన్ని తెలుసుకొని, దాని ప్రకారం ఆచరించడంపైనే ఆధారపడి ఉంది.

దాని వాస్తవ అర్థం: “ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు”. ఇదే సరియైన అర్థం. ఇది కాక అల్లాహ్ తప్ప సృష్టికర్త ఎవడు లేడు, అల్లాహ్ తప్ప శూన్యము నుండి ఉనికిలోకి తెచ్చే శక్తి గలవాడెవడు లేడు. లేక విశ్వంలో అల్లాహ్ తప్ప మరేమి లేదు అనే భావాలు (లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం) కావు.

ఈ పవిత్ర వచనములో రెండు మూల విషయా(రుకున్)లున్నాయిః

(1) నిరాకరించుట, ఇది ‘లాఇలాహ’ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధన అర్హత)ను ప్రతి వస్తువు నుండి నిరాకరించుట.

(2) అంగీకరించుట, ఇది ‘ఇల్లల్లాహ్’ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధన)కు అర్హతగల అద్వితీయుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకు భాగస్వాముడెవడు లేడని నమ్ముట.

అల్లాహ్ తప్ప మరెవ్వరని ఆరాధించరాదు. ఆరాధనలోని ఏ ఒక్క భాగాన్ని కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట ఆమోదయోగ్యం కాదు. ఏ వ్యక్తి ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క ఈ వాస్తవ భావాన్ని తెలుసుకొని దాన్ని పఠిస్తాడో, దాని ప్రకారం ఆచరిస్తాడో మరియు దృఢ విశ్వాసముతో బహుదైవారాధనను తిరస్కరించి, అల్లాహ్ ఏకత్వమును విశ్వసిస్తాడో అతడే వాస్తవ ముస్లిం (విధేయుడు). ఇలాంటి విశ్వాసం లేకుండానే ఆచరించువాడు మునాఫిఖ్ (కపటవిశ్వాసి, వంచకుడు). మరియు దీనికి వ్యతిరేకంగా ఆచరించువాడు అది అతను నోటితో పలికినా ముష్రిక్ (బహుదైవా- రాధకుడు), కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడు.

లాఇలాహ ఇల్లల్లాహ్ ఘనత:

ఈ పవిత్ర వచన ఘనతలు, లాభాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని క్రింద తెలుపబడ్డాయి:

1- తౌహీద్ గల వ్యక్తి నరక శిక్షకు గురి అయినా, అతను అందులో శాశ్వతంగా ఉండకుండా లాఇలాహ ఇల్లల్లాహ్ అడ్డు పడుతుంది.

 (يَخْرُجُ مِنْ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ شَعِيرَةٍ مِنْ خَيْرٍ وَيَخْرُجُ مِنْ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ بُرَّةٍ مِنْ خَيْرٍ وَيَخْرُجُ مِنْ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ ذَرَّةٍ مِنْ خَيْرٍ).

ప్రవక్త చెప్పారు: “లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించిన వ్యక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. ఏ వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని హృదయంలో గోదుమ గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని మనుస్సులో ఇసుమంత / రవ్వంత విశ్వాసమున్నా అతనూ నరకం నుండి వెలికి వస్తాడు”. (బుఖారి 44).

2- మానవులు, జిన్నాతులు దీని (లాఇలాహ…) కొరకే పుట్టించబడ్డారు. అల్లాహ్ ఆదేశం:

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] [الذاريات: 56]

{నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను}. (జారియాత్ 51:56)

పై ఆయతులో ‘యఅబుదూన్’ అన్న పదానికి అర్థం ఆరాధించుట. అంటే ఆరాధనలో అల్లాహ్ ఏకత్వాన్ని పాటించుట.

3- ప్రవక్తలను పంపబడింది, గ్రంథాలను అవతరింపజేయబడింది దీని ప్రచారం కొరకే. అల్లాహ్ ఆదేశం పై శ్రద్ధ వహించండి:

[وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ] [الأنبياء:25]

{మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా ‘నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి’ అనే విషయాన్ని తెలియజేశాము}. (అంబియా 21: 25).

4- ప్రవక్తల ప్రచార ఆరంభం ఇదే (లాఇలాహ ఇల్లల్లాహ్). ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇదే పిలుపునిచ్చారు. చదవండి అల్లాహ్ ఆదేశం:

[اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَهٍ غَيْرُهُ] (الأعراف 59)

{మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప వేరు దేవుడు మీకు లేడు}.  (సూరె ఆరాఫ్ 7: 59,  73, 85. హూద్ 11:26, 50, 61, 84).

లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిబంధనలుః

ఈ పవిత్ర వచనం యొక్క నిబంధనలు ఏడున్నాయి. ఏ కొరత లేకుండా వాటన్నిటినీ పాటిస్తేనే వాస్తవంగా లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించినట్లు.

1- ఇల్మ్ (జ్ఞానం): పవిత్ర వచనము యొక్క వాస్తవ భావ జ్ఞానం. అనగా (పైన తెలిపిన ప్రకారం) (1)నిరాకరించుట, (2)అంగీకరించుట మరియు దాని ప్రకారం ఆచరించుట. ‘అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు, ఇతరుల ఆరాధన వ్యర్థము మరియు తుచ్ఛము’ అని తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించిన మానవుడే వాస్తవంగా దాని భావాన్ని తెలుసుకున్న జ్ఞాని.

[فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ] [محمد:19]

{తెలుసుకో! “ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు”}. (ముహమ్మద్ 47: 19).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

(مَنْ مَاتَ وَهُوَ يَعْلَمُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ دَخَلَ الْـجَنَّةَ)

“ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు” అని తెలుసుకొని మరణించిన వారు స్వర్గములో చేరుదురు”. (ముస్లిం 26).

2- యఖీన్ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకం మరియు మనుషుల్లో, జిన్నాతులోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా దృఢ విశ్వాసంతో ఈ పవిత్ర వచనం పఠించాలి. సూర హుజురాత్ (49:15)లో అల్లాహ్ ఆదేశం:

[إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا]  [الحجرات 15]

{అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను (దృఢంగా) విశ్వసించిన తర్వాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉండేవారే నిజమైన విశ్వాసులు}.

عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ اللهِ r قَالَ: (أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنِّي رَسُولُ اللهِ لَا يَلْقَى اللهَ بِهِمَا عَبْدٌ غَيْرَ شَاكٍّ فِيهِمَا إِلَّا دَخَلَ الْجَنَّةَ)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరొకడు లేడని మరియు నేను అల్లాహ్ ప్రవక్తనని సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు సాక్ష్యాలతో అల్లాహ్ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 27).

3- ఖుబూల్ (సమ్మతించుట): ఈ పవిత్ర వచనం ద్వారా రుజువయ్యే విషయాలన్నిటినీ మనసావాచా సమ్మతించాలి. ప్రవక్త తెలిపిన విషయాల్ని సత్యంగా నమ్మాలి. ఆయన తెచ్చిన ప్రతి దానిని విశ్వసించాలి, సమ్మతించాలి. అందులో ఏ ఒక్క దానిని విస్మరించకూడదు. అల్లాహ్ ఇదే ఆదేశమిచ్చాడు:

[آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالْمُؤْمِنُونَ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ] [البقرة 285]

{తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.}. (బఖర 2: 285).

ధర్మ శాసనాలను, హద్దులను ఆక్షేపించుట, లేక వాటిని నమ్మకపోవుట సమ్మతమునకు వ్యతిరేకం. ఉదాహరణకుః కొందరు దొంగ మరియు వ్యబిచారునిపై విధించిన హద్దులను లేక బహుభార్యత్వం, ఆస్తుల పంపకం లాంటి తదితర విషయాలను ఆక్షేపిస్తారు. (అయితే ఇలాంటి వారు అల్లాహ్ యొక్క ఈ ఆదేశం వినలేదా, చదవలేదా?)

[وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَنْ يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ] [الأحزاب 36]

{అల్లాహ్, ఆయన ప్రవక్త ఏ విషయములోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికి, విశ్వాసురాలైన ఏ స్త్రీకి, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు}. (అహ్ జాబ్ 33: 36).

4- ఇన్ ఖియాద్ (లొంగిపోవుట, శిరసావహించుట): పవిత్ర వచనం యొక్క అర్థభావాల పట్ల శిరసావహించాలి. ఇన్ ఖియాద్ మరియు ఖబూల్ లో తేడా ఏమనగాః ఖబూల్ అంటే నోటితో దాని భావాన్ని సమ్మతించుట. ఇన్ ఖియాద్ అంటే సమ్మతంతో పాటు దాన్ని ఆచరణ రూపంలో తీసుకువచ్చుట. ఒక వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ అర్థభావాన్ని తెలుసుకొని, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దాన్ని సమ్మతించినప్పటికీ దానికి లొంగిపోయి, శిరసావహించి, దాని ప్రకారం ఆచరించకపోయినట్లైతే అతను ఇన్ ఖియాద్ యొక్క నిబంధన పాటించనట్లే. అల్లాహ్ ఇలా సంబోధించాడుః

[وَأَنِيبُوا إِلَى رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ] [الزمر 54]

{మీరు మీ ప్రభువు వైపునుకు మరలి ఆయనకే విధేయత చూపండి}. (జుమర్ 39: 54).

మరో చోట ఇలా ఆదేశించాడు:

[فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّى يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنْفُسِهِمْ حَرَجًا مِمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا] [النساء 65]

{నీ ప్రభువు తోడు! వారు తమ పరస్పర వివాదా- లన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంతవరకూ, తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పుపట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంతవరకూ – వారు విశ్వాసులు కాజాలరు.}. (నిసా 4: 65)

5- సిద్ఖ్: (సత్యత): మనిషి తన విశ్వాసములో సత్యవంతుడై యుండాలి. అల్లాహ్ ఆదేశం:

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا اتَّقُوا اللهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ] [التوبة:119]

{ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులతో ఉండండి}.  (తౌబా 9:119).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారుః

مَنْ شَهِدَ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ صَادِقًا بِهَا دَخَلَ الْجَنَّةَ

“హృదయాంతర సత్యముతో ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ పఠించినవారు స్వర్గంలో చేరుదురు”. (ముస్నద్ అహ్మద్).

ఎవరైనా ఈ పవిత్ర వచనం కేవలం నోటితో పలికి, దాని అర్థభావాలను మనస్ఫూర్తిగా నమ్మ- కున్నట్లయితే  అతనికి ముక్తి ప్రాప్తించదు. అతడు కపట విశ్వాసులలో పరిగణించబడుతాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన వాటన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించడం కూడా సత్యతకు వ్యతిరేకంలోనే వస్తుంది. ఎందుకనగా మనము ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయులై ఉండాలని, ఆయన మాటల్ని సత్యంగా నమ్మాలని అల్లాహ్ ఆదేశించాడు, అంతే కాదుః ఆయన విధేయతను తన విధేయతతో కలిపి చెప్పాడు. సూర నూర్ (24: 54)లో ఉందిః

[قُلْ أَطِيعُوا اللهَ وَأَطِيعُوا الرَّسُولَ] [النور:54]

{అల్లాహ్ కు విధేయులు కండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులు కండి}.

6- ఇఖ్లాస్: మనిషి తను చేసే ప్రతి పనిని సంకల్ప పరంగా షిర్క్ దరిదాపులకు అతీతంగా ఉంచుటయే ఇఖ్లాస్, అంటే సర్వ పనులు, మాటలు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయన ప్రసన్నత పొందుటకే చేయాలి. అందులో ఏ మాత్రం ప్రదర్శనాబుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ప్రాపంచిక లాభోద్దేశ్యం, స్వార్థం ఉండకూడదు. ఇంకా ఆ పని అల్లాహ్ యేతరుని ప్రేమలో, అల్లాహ్ మార్గానికి విరుద్ధంగా ధార్మిక లేదా ఇతర వర్గాల పక్షంలో ఉండకూడదు. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని మరియు పరలోక సాఫల్యాన్ని పొందుట కొరకే చేయాలి. ఎవరి నుండైనా ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలనుగానీ ఆశిస్తూ వారి వైపునకు మనుసు మరలకూడదు. సూర జుమర్ (39: 3)లో ఉందిః

[أَلَا للهِ الدِّينُ الخَالِصُ] [الزُّمر:3]

{జాగ్రత్త ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}.

[وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ]  [البينة 5]

{వారు అల్లాహ్ కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆదేశించటం జరిగింది}. (బయ్యిన 98: 5).

عن عِتْبَانَ بْنِ مَالِكٍ t قَالَ:  قَالَ رَسُولُ الله r: (فَإِنَّ اللهَ قَدْ حَرَّمَ عَلَى النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ يَبْتَغِي بِذَلِكَ وَجْهَ الله).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఇత్బాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివిన వారిపై నిశ్చయంగా అల్లాహ్ నరకమును నిషేధించాడు”. (బుఖారి 425, మస్లిం 33).

7- ముహబ్బత్ (ప్రేమ): ఈ పవిత్ర వచనము మరియు దీనికి సంబంధించిన వాటి ప్రేమ. ముస్లిం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి, వారిద్దరిపై ప్రేమ అందరి ప్రేమకు మించియుండాలి. ప్రేమకు సంబంధించిన షరతులు వగైరా పూర్తిగా పాటించాలి. అల్లాహ్ ను మరియు అల్లాహ్ ప్రేమించువాటిని గౌరవభావంతో, భయం మరియు ఆశలతో ప్రేమించాలి. ఉదాః స్థలాల్లో: మక్కా, మదీన, మస్జిదులు. కాలాల్లో: రమజాను, జిల్ హిజ్జ మొదటి దశ వగైరా. మానవుల్లో: ప్రవక్తలు, దూతలు, సత్యవంతులు, అమరవీరులు, పుణ్యాత్ములు వగైరా. సత్కార్యాల్లో: నమాజు, జకాతు, ఉపవాసం (రోజా), హజ్. వాచ సంబంధమైన: జిక్ర్ (అల్లాహ్ స్మరణ), ఖుర్ఆన్ పారాయణం వగైరాలు.

మనిషి అల్లాహ్ ప్రేమించువాటిని తన మనుసు, కోరికలు ప్రేమించే వాటిపై ఆధిక్యతివ్వాలి. ఇంకా అల్లాహ్ అసహ్యించుకునేవాటిని అసహ్యించు కోవాలి: అవిశ్వాసులను, అవిశ్వాసాన్ని, పాపాల్ని (అశ్లీలతల్ని), అవిధేయతలను అసహ్యించుకోవాలి. అల్లాహ్ ఆదేశం:

[يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَنْ يَرْتَدَّ مِنْكُمْ عَنْ دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ] [المائدة 54]

{ఓ విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలిగిపోతే, అల్లాహ్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు}. (మాఇద 5: 54).

‘ముహమ్మదుర్రసూలుల్లాహ్’ భావం:

మనోవాక్కుల ద్వారా ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు సర్వ మానవాళికి ప్రవక్త అని విశ్వసించాలి. దాని ప్రకారం ఆచరించాలి, అంటే: ఆయన ఆదేశాల పట్ల విధేయత చూపాలి, ఆయన తెలిపిన విషయాలన్ని సత్యం అని నమ్మాలి, నిషేధించిన, ఖండించిన వాటికి దూరంగా ఉండాలి, ఆయన చూపిన విధంగానే అల్లాహ్ ను ఆరాధించాలి.

‘ముహమ్మదుర్రసూలుల్లాహ్’ సాక్ష్యం పలికినప్పుడు అందులో ఉన్న రెండు మూల విషయాల(రుకున్)లను గ్రహించాలి. అవి: ‘అబ్దుహు వ రసూలుహు’. ఈ రెండు రుకున్లు ఆయన హక్కులో హెచ్చు తగ్గులు చేయుట నుండి కాపాడతాయి. ఆయన ‘అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త’. ఈ రెండు ఉత్తమ గుణాల ద్వారా ఆయన సర్వ మానవాళిలో గొప్ప విశిష్ఠత గలవారు. ఇక్కడ ‘అబ్ద్’ యొక్క అర్థం దాసుడు, ఉపాసకుడు అని. అంటే ఆయన మనిషి, ఇతర మనుషులు ఎలా పుట్టారో ఆయన కూడా అలాగే పుట్టారు. మానవులకు ఉన్నటువంటి అవసరాలే ఆయనకు ఉండేవి. సూర కహ్ ఫ్ (18:110)లో అల్లాహ్ ఆదేశం:

[قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِثْلُكُمْ] [الكهف 110]

{ప్రవక్తా ఇలా చెప్పుః నేను కేవలం ఒక మానవుణ్ణి. మీలాంటి వాణ్ణి}.

ఇదే సూరా మొదటి ఆయతులో ఇలా ఉందిః

[الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنْزَلَ عَلَى عَبْدِهِ الْكِتَابَ] [الكهف 1]

{అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన తమ దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు}.

‘రసూల్’ అనగా ఆయన సర్వ మానవాళి వైపునకు శుభవార్తనిచ్చు, హెచ్చరించు ప్రవక్త అని అర్థం. (దీనికి సంబంధించిన ఆధారాలు ఖుర్ఆనులో చాలా ఉన్నాయి. చూడండి సూర సబా (34:28), సూర అంబియా (21:107).

ఈ రెండు ఉత్తమ గుణాలు (రుకున్లు) ఆయన పట్ల అతిశయోక్తి (హెచ్చు) మరియు అమర్యాద (తగ్గు)ల నుండి కాపాడతాయి. ఎలా అనగా ఆయన అనుచరులు అని చెప్పుకునే కొందరు ఈ రోజుల్లో ఆయన స్థానాన్ని, హక్కును అర్థం చేసుకోక అతిశయమించి ఆయన్ని అల్లాహ్ తో సమానంగా పోలుస్తున్నారు. అల్లాహ్ ను వదలి ఆయనతో మొరపెడుతున్నారు. అవసరాలు తీర్చడం, కష్టాలు తొలగించడం లాంటి అల్లాహ్ శక్తిలో మాత్రమే ఉన్న వాటిని ఆయనతో కోరుతున్నారు. మరి కొందరు ఆయన గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఆయన్ను ప్రవక్తగా నమ్మడం లేదు. లేదా ఆయన అనుకరణలో కొరత చూపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన విషయాలకు వ్యతిరేకమైన వాటిని నమ్ముతున్నారు. ఇతరుల మాటలను ఆయన సున్నతలపై ప్రాధాన్యతనిస్తున్నారు, ఆయన సున్నతులను ఆచరించకుండా వదులుతున్నారు, ఆయన తీసుకువచ్చిన సత్య మాట/ బాటకు వ్యతిరేకమైన మాట/బాటలపై గుడ్డిగా మొండిపట్టుతో ఉన్నారు.

విశ్వాసం, దాని మూలసూత్రాలు:

వాచాకర్మను విశ్వాసం అంటారు. అది సత్కార్యాలతో పెరుగుతుంది, పాపాలతో తరుగుతుంది. హృదయం మరియు నాలుక మాటను ఇంకా హృదయం, నాలుక మరియు అవయవాల పనిని విశ్వాసం అంటారు. హృదయ మాట అంటే: హృదయ పూర్వకంగా విశ్వసించుట, సత్యపరచుట. నాలుక మాట అంటే: అంగీకరించుట. హృదయ పని అంటే: సమ్మతించుట, ఇఖ్లాస్, లొంగిపోవుట, ప్రేమ, సత్కార్యాల సంకల్పం. అవయవాల పని అంటే: ఇస్లాం ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చుట మరియు నిశిద్ధతలను విడనాడుట.

విశ్వాసానికి కొన్ని మూలసూత్రాలున్నాయని ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా రుజువైనది. అవిః (1) అల్లాహ్ ను, (2) ఆయన దూతలను, (3) ఆయన పంపిన గ్రంథాలను, (4) ఆయన ప్రవక్తలను, (5) ప్రళయదినాన్ని, (6) మంచి, చెడు తక్దీర్ (విధివ్రాత)ను విశ్వసించడం. అందు లో కొన్ని ఈ ఆయతులో ప్రస్తావించబడినవిః

[آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالْمُؤْمِنُونَ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ]  (البقرة 285)

{తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.}. (బఖర 2: 285).

సహీహ్ ముస్లింలో ఇలా ఉందిః అమీరుల్ మోమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విశ్వాసం (ఈమాన్) అంటేమిటి అని అడిగాడు. దానికి ప్రవక్త ఇలా జవాబిచ్చారు: “విశ్వాసం అంటే నీవు అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, పరలోకదినాన్ని మరియు మంచి చెడుల విధివ్రాతను విశ్వసించుట”. (ముస్లిం 8).

ఈ ఆరు విషయాలే సత్యవిశ్వాసం యొక్క మూలసూత్రాలు. వీటినే అల్లాహ్ ఖుర్ఆనులో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో ప్రస్తావించారు. వీటినే విశ్వాస మూలసూత్రాలు (అర్కానె ఈమాన్) అంటారు. వీటి వివరణ క్రింద చదవండిః

1- అల్లాహ్ పై విశ్వాసం:

అంటేః ఉలూహియత్, రుబూబియత్ మరియు అస్మా వ సిఫాత్ లో అల్లాహ్ అద్వి- తీయుడని విశ్వసించాలి. అల్లాహ్ పై విశ్వాసంలో ఈ క్రింది విషయాలు కూడా వచ్చును.

1- అల్లాహ్ యే వాస్తవ ఆరాధ్యుడు, సర్వ ఆరాధనలకు అర్హుడు. ఆయన గాక వేరే లేదా ఆయనతో పాటు మరొకడు ఏ మాత్రం అర్హుడు కాడు. ఎందుకనగా మానవుల సృష్టికర్త, వారికి మేలు చేయువాడు, వారికి ఆహారం నొసంగువాడు, వారి రహస్య, బహిరంగ విషయాలన్నీ తెలిసినవాడు, పుణ్యాత్ములకు సత్ఫలితం మరియు పాపాత్ములను శిక్షించు శక్తిగలవాడు ఆయన మాత్రమే.

ఈ ఆరాధన యొక్క వాస్తవికత ఏమిటంటేః సర్వ ఆరాధనలు వినయ వినమ్రతలతో, ఆయన ఔన్నత్యాల ముందు హీనభావంతో, పూర్తి ప్రేమతో, భీతిల్లుతూ, కారుణ్యాశలతో అద్వితీయుడైన అల్లాహ్ కే ప్రత్యేకించి చేయాలి. ఈ గొప్ప మౌలిక విషయంతోనే ఖుర్ఆన్ అవతరించింది. అల్లాహ్ ఆదేశాలు చదవండి:

[فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَهُ الدِّينَ * أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ] [الزمر 2-3]

{కనుక నీవు ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకిస్తూ, అల్లాహ్ కు మాత్రమే దాస్యం చెయ్యి. జాగ్రత్త! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}.  (జుమర్ 39: 2,3).

[وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ] [الإسراء 23]

{మీరు ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి అని మీ ప్రభువు ఆజ్ఞాపించాడు}. (బనీ ఇస్రాఈల్ 17:23). మోమిన్ 40:14లో ఉంది:

 [فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ]

{మీరు మీ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకం చేసుకుని ఆయన్నే వేడుకుంటూ ఉండండి – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే!}.

ఆరాధన యొక్క రకాలు అనేకమున్నాయి, అందులో కొన్ని ఇవిః దుఆ (ప్రార్థన, వేడుకోలు), ఖౌఫ్ (భయం), రజా (ఆశ), తవక్కుల్ (నమ్మకం), రగ్బత్ (ఆసక్తి), రహబ్ (మహాభీతి), ఖుషూఅ (నమ్రత), ఖషియత్ (గౌరవభావంతో భీతి), ఇనాబత్ (మరలుట), ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిఘాస (మొరపెట్టుకొనుట), జిబహ్ (బలిదానం), నజ్ ర్ (మ్రొక్కుబడి) తదితర ఆరాధన రకాలు. ఇవన్నియూ అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు చేయుట ఆమోదయోగ్యం కాదు. అలా చేయుట షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (సత్యతిరస్కారం)గా పరిగణించబడుతుంది.

దుఆ (ప్రార్థన, వేడుకోలు) యొక్క ఆధారం. అల్లాహ్ ఆదేశం చదవండి:

{నీ ప్రభువు ఇలా అంటున్నాడు, “నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. గర్వానికి లోనై నా ఆరాధనకు విముఖులయ్యేవారు తప్పని- సరిగా అవమానానికీ, పరాభవానికీ గురి అయి నరకంలో ప్రవేశిస్తారు”}. (మోమిన్ 40: 60).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిం- చారుః “దుఆయే ఆరాధనే”. (తిర్మిజి 2969).

ఖౌఫ్ (భయం) యొక్క ఆధారం. అల్లాహ్ ఆదేశం చదవండిః

[فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ] [آل عمران 175]

{మీరు మానవులకు భయపడకండి, నిజంగా మీరు విశ్వసించినవారయితే నాకే భయపడండి}. (ఆలి ఇమ్రాన్ 3: 175).

రజా (ఆశ) యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం:

[فَمَنْ كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا] [الكهف 110]

{తమ ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు}. (కహ్ ఫ్ 18:110)

తవక్కుల్ (నమ్మకం) యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశాలు చదవండి:

[وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ] [المائدة 23]

{మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్ పై మాత్రేమే నమ్మకం ఉంచండి}. (మాఇద 5: 23).

[وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ] [الطلاق 3]

{అల్లాహ్ ను నమ్ముకున్న వానికి అల్లాహ్ యే చాలు}. (తలాఖ్ 65: 3).

రగ్బత్, రహబ్, ఖుషూఅ యొక్క ఆధారాలు: అల్లాహ్ ఆదేశం

[إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا وَكَانُوا لَنَا خَاشِعِينَ] [الأنبياء 90]

{వారు మంచి పనుల కోసం ఎక్కువగా శ్రమించే వారు. ఆసక్తితోనూ, భయంతోనూ మమ్మల్ని అర్థించేవారు. మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు}. (సూరె అంబియా 21: 90).

ఖషియత్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي]  (البقرة 150)

{వారికి భయపడకండి, నాకు భయపడండి}. (సూరె బఖర 2: 150).

ఇనాబత్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం:

[وَأَنِيبُوا إِلَى رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ] [الزمر 54]

{మీరు మీ ప్రభువు వైపునకు మరలి ఆయనకు విధేయత చూపండి}.  (జుమర్ 39:54).

ఇస్తిఆనత్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ]  (الفاتحة 5)

{మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము}. (ఫాతిహ 1: 5). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(إذَا اسْعَنتَ فَاسْتَعِنْ بِالله)

“నీవు సహాయం అర్థించునప్పుడు కేవలం అల్లాహ్ తో మాత్రమే సహాయం అర్థించు”. (తిర్మిజి 2516).

ఇస్తిఆజ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ] [الناس 1]

{నేను ప్రజల ప్రభువుతో శరణు కోరుతున్నాను అని చెప్పండి}. (నాస్ 114:1).

ఇస్తిఘాస యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ] [الأنفال 9]

{మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న సందర్భాన్ని (జ్ఞాపకం తెచ్చుకోండి) ఆయన మీకు సమాధాన మిచ్చాడు}. (అన్ఫాల్ 8: 9).

జిబహ్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (162) لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ] [الأنعام 162-163]

{ఇలా చెప్పండి: నా నమాజ్, నా సకల ఖుర్బానీ (జిబహ్), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది. అందరికంటే ముందు విధేయతతో తలవంచేవాణ్ణి (ముస్లింని) నేనే}. (అన్ఆమ్ 6: 162, 163).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

(لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله).

“అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ చేసిన వారిని అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 163).

నజర్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا]

{మొక్కుబడి చెల్లించేవారు, నలువైపుల నుండి ఆపదలు కమ్ముకొని వచ్చే దినానికి భయపడే వారు}. (దహర్ 76: 7).

చివరికి అలవాటుగా చేసే పనులు వాటి ఉద్దేశం అల్లాహ్ విధేయతకు తోడ్పడాలని ఉంటే ఆరాధనలో లెక్కించబడతాయి, ఉదా: నిద్రించుట, తినుట, త్రాగుట, సంపాదించుట, వివాహం లాంటి తదితర అలవాట్లు సదుద్దేశ్యంతో చేస్తే అవి కూడా ఆరాధనల్లో పరిగణించబడతాయి. వాటి పుణ్యం ముస్లింకు లభిస్తుంది.

2- అల్లాహ్ పై విశ్వాసములో మరొకటి ఆయన తన దాసులపై విధిగా నిర్ణయించిన ఐదు ఇస్లాం మూల స్థంబాలను విశ్వసించుట. అవి: (1) అల్లాహ్ మాత్రమే వాస్తవ ఆరాధ్యుడు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని విశ్వసించుట. (2) నమాజు స్థాపించుట. (3) జకాత్ (విధి దానం) చెల్లించుట. (4) రమజాను మాసములో రోజా (ఉపవాసము) ఉండుట. (5) మక్కా యాత్ర చేయు శక్తి గలవాడు హజ్ చేయుట. వీటితో పాటు ఇస్లాం ధర్మం యొక్క ఇతర విధులను కూడా నమ్మాలి, ఆచరించాలి.

3- అల్లాహ్ పై విశ్వాసంలో మరొకటి అల్లాహ్ యే సర్వలోకాల సృష్టికర్త, తనిష్టానుసారం తన శక్తి మరియు జ్ఞానముతో సర్వ కార్యాలు నిర్వహించువాడు. ఇహపరలోకాల అధికారి. ఆయనే సర్వలోకాల పోషకుడు. ఆయన తప్ప మరెవ్వడు సృష్టికర్తనూ లేడు. పోషకుడునూ లేడు. ఆయన తన దాసులకు సన్మార్గం చూపుటకు, వారిని వారి ఇహపరాల సాఫల్యం వైపునకు పిలుచుటకు ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేశాడు. ఆయన పరమ పవిత్రుడు, అద్వితీయుడు, ఆయనకు సాటి ఎవ్వరూ లేరు.

[اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ وَكِيلٌ]

{ప్రతి వస్తువును సృష్టించినవాడు అల్లాహ్ యే. ప్రతి వస్తువునకూ సంరక్షకుడు కూడా ఆయనే}. (సూరె జుమర్ 39: 62).

4- ఆయన పై విశ్వాసములో మరొకటిః దివ్య ఖుర్ఆనులో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో అల్లాహ్ పవిత్ర నామములు, ఉత్తమ గుణాలు ఏ రీతిలో తెలుపబడ్డాయో అదే రీతిలో ఏ మాత్రం ‘తహ్ రీఫ్’, ‘తఅతీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్’([2]) లేకుండా విశ్వసించాలి. ఆ పవిత్ర నామముల భావము ద్వారా తెలిసిన గుణములను మానవుల గుణాలతో పోల్చకుండా విశ్వసించాలి. సూర షూరా 42:11లో చదవండి:

[لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ] [الشورى 11]

{ఆయనను పోలిన వస్తువు సృష్టిలో ఏదీ లేదు. ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడూను}.

2- అల్లాహ్ దూతలపై విశ్వాసం:

ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్ పుట్టించాడు. వారి స్వభావంలోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకనేక రకాలు గలవు. ‘అర్ష్’ (అల్లాహ్ సింహాసనము)ను మోసే వారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదాః జిబ్రీల్, మీకాఈల్, నరక పాలకుడు మాలిక్, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్. అల్లాహ్ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః

(خُلِقَتْ الْـمَلَائِكَةُ مِنْ نُورٍ وَخُلِقَ الْجَانُّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ وَخُلِقَ آدَمُ مِمَّا وُصِفَ لَكُمْ)

“అల్లాహ్ దూతలు నూర్ (కాంతి)తో పుట్టించ బడ్డారు. జిన్నాతులు అగ్ని జ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) పుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).

3- గ్రంథములపై విశ్వాసం:

గ్రంథములపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించుట విధిగా ఉందిః ప్రవక్తలు తమ తమ జాతులకు ధర్మం బోధించుటకు, వారిని దాని వైపునకు పిలుచుటకు అల్లాహ్ వారిపై (ప్రవక్తలపై) గ్రంథాల్ని అవతరింపజేశాడు. అల్లాహ్ ఏ గ్రంథముల పేరుతో సహా తెలిపాడో వాటిని వివరంగా విశ్వసించాలి. ఉదాః ప్రవక్త మూసా అలైహిస్సలాంపై ‘తౌరాత్’, ప్రవక్త దావూద్ అలైహిస్సలాంపై ‘జబూర్’, ప్రవక్త యేసు మస్సీహ అలైహిస్సలాంపై ‘ఇంజీల్’ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ‘దివ్య ఖుర్ఆన్’లు అవతరించాయి. అన్నిట్లో ఖుర్ఆన్ అతిగొప్పది మరియు చిట్టచివరిది. అది పూర్వ గ్రంథాలను రుజువు పరుచునది మరియు పరిరక్షించునది. దానిని అనుసరించుట, దాని ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీసుల ద్వారా తీర్పులు చేయుట తప్పనిసరి. ఎందుకనగా అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇరుజాతుల (మానవులు, జిన్నాతుల) వైపునకు ప్రవక్తగా పంపాడు. ఆయనపై ఈ దివ్య ఖుర్ఆనును అవతరింపజేశాడు, ఆయన (ప్రవక్త) దాని ద్వారా వారి మధ్య తీర్పు చేయుటకు. ఇంకా దానిని హృదయ వ్యాధులకు స్వస్థతగా చేశాడు. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇంకా అది సర్వ లోకాల కొరకు సన్మార్గం, కారుణ్యం. అల్లాహ్ ఆదేశాలు చదవండి:

[وَهَذَا كِتَابٌ أَنْزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ] [الأنعام 155]

{మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుగల గ్రంథం. కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబిం- చండి. తద్వారా మీరు కరుణింపబడవచ్చు}. (సూరె అన్ఆమ్ 6: 155).

[وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَى لِلْمُسْلِمِينَ] [النحل: 89]

{మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది.

విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త}. (నహ్ల్ 16: 89).

4- ప్రవక్తలపై విశ్వాసం:

ప్రవక్తలపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించాలిః అల్లాహ్ తన దాసుల వైపునకు ప్రవక్తల్ని శుభవార్త ఇచ్చువారిగా, హెచ్చరించువారిగా, ధర్మం వైపునకు పిలుచువారిగా జేసి పంపాడు.

[وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ] [النحل 36]

{మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింప- జేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి’}. (నహ్ల్ 16: 36).

ప్రవక్తల్ని విశ్వసించినవారే సాఫల్యం పొందువారు. వారిని తిరస్కరించినవారే నష్టం, అవమానం పాలయ్యేవారు.

ప్రవక్తలందరి పిలుపు ఒక్కటేనని మనం విశ్వసించాలి. అది అల్లాహ్ ఏకత్వం మరియు సర్వ ఆరాధనల్లో ఆయన్ని అద్వితీయునిగా నమ్మటం. అయితే వారికి నొసంగబడిన ధర్మ- శాస్త్రాలు, ఆదేశాలు, శాసనాలు వేర్వేరు. అల్లాహ్ కొందరికి మరి కొందరిపై ఘనత ప్రసాదించాడు. అందరిలోకెల్లా గొప్ప ఘనతగలవారు మరియు చిట్టచివరి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చదవండి అల్లాహ్ ఆదేశాలుః

[وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَى بَعْضٍ] [الإسراء 55]

{మేము కొందరు ప్రవక్తలకు మరికొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము}. (బనీ ఇస్రాఈల్ 17: 55). మరో చోట ఆదేశించాడుః

[مَا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِنْ رِجَالِكُمْ وَلَكِنْ رَسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ] [الأحزاب 40]

{(మానవులారా!) ముహమ్మద్ మీలోని ఏ పురుషునికీ తండ్రి కారు. కానీ ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు}. (33: అహ్ జాబ్: 40).

ఇక ఏ ప్రవక్తల పేర్లతో సహా అల్లాహ్ లేక ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వారిని అదే వివరంగా విశ్వసించాలి. ఉదాః నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం, వగైరా ప్రవక్తలు. అల్లాహ్ వారందరిపై అనేకానేక దయాకారుణ్యాలు కురిపించుగాకా! ఆమీన్.

5- పరలోక విశ్వాసం:

మరణానంతరం సంభవించే ఏ ఏ విషయాల గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో అవన్నీ ఇందులోనే వస్తాయి. ఉదా: సమాధి యాతన, పరీక్షలు, శుభాలు, ప్రళయదినం నాటి ఘోర సంఘటనలు, వంతెన, త్రాసు, లెక్క, ప్రతి కర్మ యొక్క ఫలితం, కర్మ పత్రాలు ప్రజల ముందు తెరువబడుట, వారు దాన్ని కుడి లేక ఎడమ చేతితో లేక వీపు వెనక నుంచి తీసుకొనుట, ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే హౌజె కౌసర్, స్వర్గం, నరకం, విశ్వాసులకు అల్లాహ్ దర్శనం, సంభాషణ. ఇంకా ఖుర్ఆను మరియు సహీహ్ హదీసుల్లో వచ్చిన విషయాలన్నిటినీ విశ్వసించాలి. అవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన ప్రకారమే సంభవించునని నమ్మాలి.

6- మంచి, చెడు ‘తఖ్దీర్’ (విధివ్రాత)పై విశ్వాసం:

‘తఖ్దీర్’పై విశ్వాసంలో నాలుగు విషయాలు వస్తాయిః

మొదటిదిః భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాధి, వారి చావు, వారు చేసే కర్మలన్నీ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ తెలియకుండా లేదు.

[إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ] [التوبة 115]

{నిశ్చయముగా అల్లాహ్ కు సర్వమూ తెలియును}. (సూరె తౌబా 9: 115).

రెండవదిః ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని విధివ్రాతను వ్రాసి పెట్టాడు.

[وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُبِينٍ] (يس 12)

{ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము}. (సూరె యాసీన్ 36: 12).

మూడవదిః ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడియుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[كَذَلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ] [آل عمران 40]

{అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరినదానిని చేస్తాడు}. (ఆలె ఇమ్రాన్ 3:40).

నాల్గవదిః అల్లాహ్ దేని తఖ్దీర్ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.

[وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ] [الصافات 96]

{వాస్తవానికి అల్లాహ్ యే మిమ్మల్నీ సృష్టించాడు, మీరు చేసేవాటన్నిటినీ సృష్టించాడు}. (సూరె సాఫ్ఫాత్ 37: 96).

షిర్క్ (బహుదైవారాధన), దాని రకాలు:

షిర్క్ అంటే: మనిషి అల్లాహ్ యొక్క రుబూబియత్ లో, లేదా ఉలూహియత్ లో లేదా అస్మా వ సిఫాత్ లో ఇతరులను భాగస్వామిగా చేయుట.

షిర్క్ రెండు రకాలు: చిన్న షిర్క్, పెద్ద షిర్క్.

మొదటిది: పెద్ద షిర్క్: ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైనా అల్లాహ్ యేతరుల కొరకు చేయుట పెద్ద షిర్క్ అవుతుంది. ఈ షిర్క్ చేసిన వ్యక్తి తౌబా చేయకుండా (పశ్చత్తాప పడి, క్షమాభిక్ష కోరకుండా) చనిపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ఇంకా ఇది సర్వ సత్కా- ర్యాలను నాశనం చేసేస్తుంది. అంటే ప్రళయదినాన సత్ఫలితం లభించదు. అల్లాహ్ ఆదేశం చదవండిః

[وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ] [الأنعام 88]

{ఒకవేళ వారు షిర్క్ చేసి ఉండినట్లయితే, వారు చేసిన సమస్తం నాశనం అయివుండేది}. (సూరె అన్ఆమ్ 6: 88).

పెద్ద షిర్క్ ను అల్లాహ్ స్వచ్ఛమైన తౌబా చేయనిదే క్షమించడు. చదవండి ఖుర్ఆన్ సాక్ష్యం:

[إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا] (النساء 48)

{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, వాస్తవానికి మహా పాపం చేసినవాడు}. (సూరె నిసా 4: 48).

పెద్ద షిర్క్ లోని కొన్ని రకాలు: అల్లాహ్ యేతరులతో దుఆ, అల్లాహ్ యేతరుల కొరకు మొక్కుబడి, జిబహ్ వగైరాలు చేయుట. అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కలిపి అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ వారి పట్ల ఉంచుట.

[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِلَّهِ]

{కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు}. (సూరె బఖర 2: 165).

రెండవదిః చిన్న షిర్క్: అంటే: ఖుర్ఆను, హదీసులో ఏ పనుల కొరకు షిర్క్ అనే పేరు వచ్చిందో కాని అవి పెద్ద షిర్క్ వరకు చేరవో వాటినే చిన్న షిర్క్ అంటారు. ఈ రకం ధర్మభ్రష్టతకు కారణం కాదు. కానీ దీని వల్ల తౌహీదు లో మాత్రం కళంకం, కొరత ఏర్పడుతుంది. ఉదా: ప్రదర్శనాబుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట. లేదా పెద్ద షిర్క్ కు తోడ్పడే ఏదైనా కార్యం. ఉదా: అల్లాహ్ కొరకు చేసే నమాజు ఏదైనా సమాధి వద్ద చేయుట. అల్లాహ్ యేతరులు లాభనష్టానికి అధికారులు కారని నమ్మి కూడా వారి మీద ప్రమాణం చేయుట. ఇంకా అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి తలచినట్లు అని పలుకుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمْ الشِّرْكُ الْأَصْغَرُ) قَالُوا: يَا رَسُولَ الله وَمَا الشِّرْكُ الْأَصْغَرُ؟ قَالَ: (الرِّيَاءُ).

“మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేదేమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారని”. చిన్న షిర్క్ అంటేమిటి? ప్రవక్తా అని అడిగారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “ప్రదర్శనాబుధ్ధి” అని. (ముస్నద్ అహ్మద్. దీని సనద్ ప్రమాణికమైనది).

(مَنْ حَلَفَ بِشَيْءٍ دُونَ الله فَقَدْ أَشْرَكَ).

“ఎవరైనా అల్లాహ్ తప్ప ఏదాని ప్రమాణం చేసినా అతడు షిర్క్ చేసినట్లు”. (ముస్నద్ అహ్మద్. దీని సనద్ ప్రమాణికమైనది).

తాయత్తులు వేసుకొనుట. రోగాలు, ఆపదలు రాకుండా లేదా వచ్చినా తొలిగిపోవుటకు కడియాలు, రింగులు సాధనం అని వేసుకొనుట లాంటి పనులు చిన్న షిర్క్ కు సంబంధించినవే. ఇక అవి సాధనమే కాదు, అందులో లాభనష్టాలు ఉన్నాయి, అంటే అవి వేసుకున్నప్పుడు లాభం ఉంటుంది వేసుకోకుంటే నష్టం ఉంటుంది అని  విశ్వసిస్తే అది పెద్ద షిర్కులో వస్తుంది. (అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి).

ఫిర్ఖయే నాజియ([3])

ఫిర్ఖయే నాజియ యొక్క విశ్వాసం ఇదిః అల్లాహ్, ఆయనే ప్రభువు, వాస్తవ ఆరాధ్యుడు. ఉత్తమోత్తముడు, దోషరహితుడు అని సత్య విశ్వాసి సాక్ష్యమిస్తాడు. ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించి ఆ అద్వితీయున్నే ఆరాధిస్తాడు. అల్లాహ్ యే సృష్టివ్యుహాన్ని రచించేవాడు, దానిని అమలు పరచేవాడు, ఆపై దాని ప్రకారం రూప కల్పన చేసేవాడు, ఉపాధి ప్రధాత, ఇచ్చేవాడు, ఆపేవాడు, సర్వ కార్యాల నిర్వహకుడు.

ఆయనే సత్య ఆరాధ్యుడు. ఆయనే ఆరంభము, ఆయనకు ముందు ఏదీ లేదు. ఆయనే అంతము, ఆయన తరువాత ఏదీ లేదు. ఆయనే బాహ్యము, ఆయనపై ఏదీ గెలవలేదు. ఆయనే గూఢము, ఆయనకు  తెలియనిది ఏదీ లేదు.

సర్వకాల సర్వావస్థలలో అన్ని విధాలుగా ఆయనే పరమోన్నతుడు, మహోన్నతుడు, గొప్పవాడు. సర్వ సృష్టి పై ఉన్న సింహాసనం (అర్ష్)పై ఆసీనుడైయున్నాడు. పరమ శ్రేష్ఠుడు అన్ని రకాల లోపాల, దోషాలకు అతీతుడు. ఆయనే అందరిపై అధికారం గలవాడు. ఆయన ఆధీనంలో నుండి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు.

ఆయన తన ఔన్నత్యం, గౌరవానికి తగిన రీతిలో అర్ష్ పై ఆసీనుడైయున్నాడు. అందరికి పైగా, ఉన్నతముగా ఉన్నప్పటికీ బాహ్యమూ, గూఢమూ, పైలోకం, క్రింది లోకం/ పాతాళం అంతయూ తెలిసినవాడు. ఆయన తన విద్యాజ్ఞానంతో మానవుల వెంట ఉన్నాడు. వారి సర్వ స్థితులను ఎరిగి ఉన్నాడు. ఆయన సమీపములో ఉన్నాడు. (ఆయన్ను ప్రార్థించేవారికి) సమాధానం ఇస్తాడు.

ఆయన ఏ అక్కరా లేనివాడు. ప్రజల నుండి ఆయనకి ఏ అవసరమూ లేదు. అందరూ తమ ఉనికి, మరియు తమకు అవసరమున్న ప్రతీ దానికి ఆయన పై ఆధారపడి యున్నారు. క్షణం పాటు / కను రెప్ప పాటు ఏ ఒక్కరూ ఆయన అవసరం లేనిది లేరు. ఆయన కనికరుడు, వాత్సల్యం కలవాడు. ప్రజల వద్ద ఉన్న ధార్మిక వరాలైనా లేదా ఐహిక వరాలైనా అన్నియూ ఆ పరమ పవిత్రుని తరఫునే. ఆయనే వరాలు ప్రసాదించువాడు. ఆపదలను దూరం చేసేవాడు.

ఆయన కారుణ్యమే ఇది: ఆయన ప్రతి రాత్రి మూడవ వంతు రాత్రి మిగిలి ఉండగా ప్రపంచ ఆకాశానికి దిగి వచ్చి “నన్ను అడిగేవారెవరు? అతనికి ప్రసాదిస్తాను. ఎవరు నాతో తన పాపాల మన్నింపు కోరుతాడో నేను అతన్ని క్షమిస్తాను” అని ఫజ్ర్ వరకు నినదిస్తాడు. అయితే ఆ దిగిరావడం తన ఔన్నత్యం, గౌరవానికి తగిన రీతిలో ఉంటుంది.

సంపూర్ణ వివేకం గల వివేచనా పరుడు ఆయన. ఆయన సృష్టించిన దానిలో ఏ ఒక్కటీ వృధాగా లేదు. ఆయన పంపిన ధర్మాల్లో మేళ్ళు ఉన్నాయి. అన్ని రకాల కీడులకు నివారణ ఉంది.

ఆయన తౌబా అంగీకరించువాడు, మన్నించేవాడు, క్షమించేవాడు. తన దాసుల్లో తౌబా చేసేవారి తౌబాలను అంగీకరిస్తాడు. పాపాల ప్రక్షాళన కోరే వారిని మన్నిస్తాడు. ఆయన వైపుకు మరలినవారి పెద్ద పెద్ద పాపాలను క్షమిస్తాడు.

ఆయన విలువనిచ్చేవాడు. ఓ చిన్న సత్కార్యానికైనా విలువనిస్తాడు. దానికి బదులు అధిక ఫలం నొసంగుతాడు. ఇంకా ఆయనకు కృతజ్ఞుడుగా ఉన్నవారికీ మరిన్ని అనుగ్రహాలు నొసంగుతాడు.

నిజమైన విశ్వాసి అల్లాహ్ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు తెలిపిన గుణనామాల్ని విశ్వసిస్తాడు. ఉదా: సంపూర్ణ జీవనం, వినుట, చూచుట. పరమ శక్తి, ఔన్నత్యము, గొప్పతనం, కీర్తి, మహిమాన్వితం, సౌందర్యం, పరిపూర్ణత. సర్వస్తోత్రం. అన్నిటికీ ఆయనే ఏకైక అర్హత గలవాడు.

ఖుర్ఆను మరియు హదీసుల ద్వారా రుజువైనవాటిలో ఒకటి: ‘విశ్వాసులు స్వర్గంలో తమ ప్రభువును ప్రత్యక్షంగా చూస్తారు’ అనే విషయాన్ని దృఢంగా విశ్వసిస్తాడు. ఆయన దర్శనం మరియు ఆయన సంతృప్తి వరాలు స్వర్గంలో లభించే సర్వ వరాల్లోకెల్లా అతి గొప్పవి.

తౌహీద్, విశ్వాస మార్గాన్ని వదలి చని- పోయినవారు శాశ్వతంగా నరకంలో ఉంటారు. ఘోర పాపాలు (కబీరా గునాహ్) చేసినవారు, తౌబా చేయకుండా చనిపోయి, లేదా వారి ఆ పాపాల మన్నింపు మార్గం లభించకుండా, లేదా సిఫారసు కూడా పొందకుండా ఒకవేళ నరకంలో ప్రవేశించినా అందులో శాశ్వతంగా ఉండరు. తన హృదయంలో రవ్వ గింజంత విశ్వాసం కూడా ఉన్న వ్యక్తి తప్పకుండా ఒక రోజు నరకం నుండి బైటికి వస్తాడు. 

హృదయాంతర నమ్మకం, హృదయపు వాచకర్మ అలాగే అవయవాల పనులు, నాలుక మాటలు, ఇవన్నియూ విశ్వాసంలో పరిగణించ బడతాయి. విశ్వాస బాధ్యతల్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడే నిజమైన విశ్వాసి. ప్రతిఫలానికి అర్హుడు, శిక్షకు దూరం ఉండువాడు. వాటిలో ఏ కొంత కొరత చూపినా అదే పరిమాణంలో అతనిలో నుండి విశ్వాసం తరుగుతుంది. అలా ఎందుకనగా విశ్వాసం విధేయత, సత్కార్యాలతో పెరుగుతుంది. అవిధేయత, దుష్కార్యాలతో తరుగుతుంది.

అలాగే విశ్వాసి ఈ సాక్ష్యం కూడా ఇస్తాడు: ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త. అల్లాహ్ ఆయనకు మార్గదర్శకత్వాన్నీ, సత్య ధర్మాన్నీ ఇచ్చి పంపాడు. దానిని సకల ధర్మాలపై ఆధిక్యం వహించే ధర్మంగా చేయటానికి. నిస్సందేహంగా ఆయన విశ్వాసులకు స్వయంగా తమకంటే కూడా ముఖ్యుడు. ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చిట్టచివరి ప్రవక్త. అల్లాహ్ వారిని మానవుల, జిన్నాతుల వైపునకు శుభవార్తనిచ్చే వారిగా, హెచ్చరిక చేసేవారిగా, అల్లాహ్ అనుమతితో ఆయన వైపునకు పిలుపునిచ్చేవారిగా చేసి, ప్రకాశించే దీపంగా చేసి పంపాడు. ఇహపరాల మేళ్ళతో ఆయన్ని పంపాడు. మానవులందరూ ఆ ఏకైక, ఏ భాగస్వామి లేని అల్లాహ్ ఆరాధన పై స్థిరంగా ఉండుటకు ఆయన నొసంగే ఉపాధిని, ఆయన ఆరాధన సహాయానికి ఉపయోగించుకోడానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంని పంపాడు.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సృష్టిలో అందరికన్నా గొప్ప జ్ఞాని, సత్యవంతుడు, ఉత్తమ సలహాకారుడు. మరియు అందరికన్నా స్పష్టంగా బోధించేవారు అని విశ్వాసి తెలుసుకుంటాడు. ఆయన్ని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. సర్వ సృష్టి ప్రేమ పై ఆయన ప్రేమకు ఆధిక్యతనిస్తాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం యొక్క మూల విషయాలను మరియు వాటి వివరాలన్నిటినీ అనుసరిస్తాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట, పద్ధతికి ఇతరుల మాట, పద్ధతిపై ప్రాధాన్యతనిస్తాడు.

అల్లాహ్ ఆయనకు నొసంగిన ఘనతలు, ప్రత్యేకతలు, పరిపక్వతలు సృష్టిలో ఏ ఒక్కరికీ నొసంగ లేదని విశ్వాసి నమ్ముతాడు. సృష్టిలోకెల్లా ఉన్నత స్థానం గలవారు, గొప్ప కీర్తి గలవారు, ప్రతీ దాంట్లో ఉన్నత, ఉత్తమ స్థాయిగలవారు ఆయనే సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన తెలుపనిది ఏ మేలు అంటూ లేదు. ఆయన నివారించనిది అంటూ ఏ చెడు లేదు.

విశ్వాసి అల్లాహ్ అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని, పంపిన ప్రతి ప్రవక్తను నమ్ముతాడు. వాటి / వారి వివరాలు తెలిసినా, తెలియక పోయినా. ఏ ఒక్కరిపై విశ్వాసంలో భేదభావం చూపడు. వారందరికీ ఇవ్వబడిన సందేశం ఒక్కటని నమ్ముతాడు. అదే: ఆ ఏకైక, ఏ భాగస్వామిలేని అల్లాహ్ ను ఆరాధించడం.

మంచి, చెడు విధివ్రాతను తూ.ఛ. తప్పకుండా నమ్ముతాడు. మానవుల మంచి, చెడు కర్మలన్నిటి గురించి అల్లాహ్ కు చాలా క్షుణ్ణంగా తెలుసు. అల్లాహ్ కలము వాటిని ముందే వ్రాసేసింది. వాటిలో అల్లాహ్ తలంపు వెడలింది. వాటిలో అల్లాహ్ వివేకం తప్పక ఉంది. తన దాసులకు శక్తి మరియు ఉద్దేశ్యం ప్రసాదించాడు. వారి శక్తి, కోరిక ప్రకారమే వారి నుండి మాటలు, చేష్టలు వెలువడుతాయి. అల్లాహ్ ఏ దాని గురించి వారిపై ఏ రకమైన ఒత్తిడి చేయలేదు. వారికి స్వయంగా అధికారం ఇచ్చాడు. అల్లాహ్ తన న్యాయం, వివేకంతో విశ్వాసులకు ప్రత్యేకంగా నొసంగిన వరం ఇదిః వారిలో విశ్వాసం పట్ల ప్రేమను కలగజేశాడు. దానిని వారికి ఇష్టమైనదిగా చేశాడు. అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల వెగటు కలగ జేశాడు.

విశ్వాసి ఎల్లప్పుడూ శ్రేయోభిలాషిగా ఉండాలి. ఈ శ్రేయోభిలాష అల్లాహ్ పట్ల, ఆయన గ్రంథం పట్ల, ఆయన ప్రవక్త పట్ల, మరియు మస్లిముల నాయకుని పట్ల మరియు వారి సామాన్య ప్రజల పట్ల. షరీఅత్ పరిధిలో ఉండి మంచిని ఆదేశించాలి.

చెడును నివారించాలి. తల్లిదండ్రులకు విధేయు- లుగా ఉండాలి. రక్త సంబంధాల్ని పెంచుకోవాలి. బంధువులకు, పొరుగువారికి, హక్కుగలవారికి, అందరికీ ఉపకారము చేయాలి. అందరితో సత్సంబంధాలుంచుకోవాలి. సద్వర్తన ప్రచారం చేయాలి. దుష్ప్రవర్తన రూపు మాపాలి.

విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవాడు వారిలో అందరి కన్నా మంచి సత్కార్యాలు, సత్ప్రవర్తనలు గలవాడు. వారిలో అందరికంటే ఎక్కువ సత్యసంధుడు, ప్రతి మంచికి అందరి- కంటే ఎక్కువ దగ్గరిగా, చెడుకు దూరంగా ఉన్నవాడు అని నమ్మాలి.

అల్లాహ్ మార్గంలో జిహాద్ ప్రళయం వరకు ఉండునని తెలుసుకోవాలి. అది ఇస్లాం ధర్మం యొక్క శిఖరం. అది విద్య ద్వారా, ఆధారం, నిదర్శనాల ద్వారా మరియు ఆయుధాల ద్వారా జరుగుతూ ఉండును. తన ధర్మం వైపు నుండి తన శక్తి ప్రకారం పోరాడుట ప్రతి ముస్లింపై విధిగా ఉంది. దానికి తగిన షరతులు, సాధనాలు పూర్తయినప్పుడు, నాయకుడు పుణ్యాత్ముడైనా, పాపాత్ముడైనా అతని వెంట ఉండి జిహాద్ చేయాలి.

ముస్లిములందరు ఏకత్రాటిగా ఉండేందుకు అధికంగా కాంక్షించాలి. అందుకు పరస్పరం ప్రోత్సహించాలి. వారిని కలపడానికి, వారి మనస్సులు పరస్పరం చేరువుగా కావడానికి పూర్తి ప్రయత్నం చేయాలి. విభేదం, పరస్పర శత్రుత్వం, కపటాలకు దూరంగా ఉండాలి. అలా ఉన్నవారిని హెచ్చరించాలి. ఐక్యమత్యానికి తోడ్పడే, విభేదాలను దూరం చేసే యోగ్యమైన ప్రతి సాధనాన్ని అవలంభించాలి. ప్రజలకు ఏ రకమైన హాని కలిగించవద్దు. అది వారి ప్రాణ, ధన, మాన సంబంధమైన లేదా మరే రకమైన హక్కులో గాని. ముస్లిములతో, ముస్లిమేతరులతో వారి వ్యవహారాల్లో న్యాయం పాటించాలి. దీని గురించే ఇతరులకు బోధించాలి.

సర్వ అనుచర సంఘాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సంఘం అతిఉత్తమమైనదని విశ్వసించాలి. అందులో ప్రవక్త సహచరులు, ప్రత్యేకంగా ఖులఫాఏ రాషిదీన్, స్వర్గ శుభవార్త పొందిన పది సహ- చరులు, బద్ర్ యుధ్ధ వీరులు, (హుదైబియాలో) రిజ్వాన్ శపథంలో పాల్గొన్నవారు, ముహాజిరీన్, అన్సారులో (విశ్వాస సందేశాన్ని స్వీకరించటానికి) ముందంజం వేసినవారు ఘునులు, శ్రేష్ఠులు. ప్రవక్త సహచరులను ప్రేమించాలి. దీన్ని కూడా అల్లాహ్ యొక్క ధర్మంగా భావించాలి. వారి సద్గుణాలను ప్రచారం చేయాలి. వారి గురించి లేపబడుతున్న అపోహాలు విన్నప్పుడు వాటిని ఆపాలి, లేదా మౌనం వహించాలి.

ధర్మవేత్తలను, ధర్మ నాయకులు మరియు ముస్లిములలో ధర్మపరంగా ఉన్నత స్థానంలో ఉన్నవారిని గౌరవించాలి. దీన్ని కూడా ధర్మంగా భావించాలి. అల్లాహ్ వారిని అనుమానం, షిర్క్, విభేదం, కపటం, దుర్గుణాల నుండి కాపాడాలని, జీవితాంతం సవ్యమైన ధర్మంపై స్థిరంగా ఉంచాలని అల్లాహ్ ను అర్థించాలి. ఫిర్ఖయే నాజియ అనుయాయులు అనుసరించే మౌలిక విషయాలు ఇవే. వీటి వైపునకే వారు ఇతరులను ఆహ్వానిస్తారు


[1] ‘తహ్ రీఫ్’ అంటేః ఏ ఆధారము లేకుండా నామ- గుణాల భావాన్ని మార్చుట.  తారుమారు చేయుట.

‘తఅతీల్’ అంటేః అల్లాహ్ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించుట. అల్లాహ్ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్ యీఫ్’ అంటేః అల్లాహ్ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్ సీల్’ అంటేః అల్లాహ్ గుణాలను సృష్టి గుణాలతో పోల్చుట.  లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.

[2] వీటి వివరాలు 8వ పేజి పాదసూచికలో చూడండీ.

[3]  మోక్షానికి, స్వర్గ ప్రవేశానికి అర్హత గల వారు అని భావం.

తౌహీద్ ప్రభోదిని (తఫ్ హీం తౌహీద్ ) – Shaykh Muhammad bin AbdulWahab

Tawheed Prabhodini  (Tafheem Tawheed)
Shaikhul-Islam Muhammad ibn Sulaiman at-Tamimi  rahimahullaah

tawheed prabhodini - telugu

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/tawheed-prabhodini
[PDF] [42 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ] [3.7 MB]

మూల రచయిత : ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్)
అనువాదం: హాఫిజ్ బద్రుల్ ఇస్లాం
ఎడిటింగ్: హాఫిజ్ అబ్దుర్ రవూఫ్ ఉమ్రి
హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్

Shirk – అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం

1. అష్షిర్క్ – దైవత్వంలో భాగస్వాములను చేర్చటం – الشرك

నిర్వచనం:

అల్లాహ్ యొక్క దైవత్వం (తౌహీద్ రుబూబియత్) లో మరియు అల్లాహ్ యొక్క ఏకత్వపు ఆరాధనల (తౌహీద్ ఉలూహియత్) లో ఇంకెవరినైనా చేర్చటం, అంటే ఇతరులను అల్లాహ్ యొక్క భాగస్వాములుగా చేయటం. తౌహీద్ ఉలూహియత్ (అంటే దైవారాధనలలో అల్లాహ్ యొక్క ఏకత్వానికి వ్యతిరేకంగా, ఇతరులను భాగస్వాములుగా చేర్చటం – ఇంకో మాటలో బహుదైవారాధన చేయటం)లో బహుదైవారాధన ఎక్కువగా జరుగుతుంది. అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా వేడుకోవటం, ప్రార్థించటం అనేది దీనిలోని ఒక విధానం. కేవలం అల్లాహ్ కే చెందిన ఏకదైవారాధనా పద్ధతులలో కొన్నింటిని ఇతరులకు ప్రత్యేకం చేయటం దీనిలోని మరొక విధానం. ఉదాహరణకు – బలి ఇవ్వటం, ప్రమాణం చేయటం, దిష్టి తీయటం, భయపడటం, ఆశించటం, భక్తి చూపటం (ప్రేమించటం) మొదలైనవి. క్రింద తెలుపబడిన కొన్ని ప్రత్యేక ఆధారాల మరియు మూలకారణాల వలన అష్షిర్క్ (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో భాగస్వామ్యం కల్పించటం) అనేది,  పాపాలన్నింటిలోను అత్యంత ఘోరమైన పాపంగా గుర్తింప బడినది.

1-   పోలిక: షిర్క్ అనేది దివ్యగుణాలలో సృష్టికర్తను తన సృష్టితాలతో పోలిక కల్పిస్తున్నది. ఎవరైనా అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధిస్తున్నట్లయితే, వారు అల్లాహ్ కు భాగస్వాములను చేర్చినట్లు అగును. ఇది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని). దివ్యఖుర్ఆన్ లోని లుఖ్మాన్ అధ్యాయం 13వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

(لقمان 13) “إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ” – భావం యొక్క అనువాదం – {ఖచ్ఛితంగా, అష్షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరమైన పాపిష్టి పని}. దౌర్జన్యం (పాపిష్టి పని) అంటే ఒకదానికి చెందిన స్థానంలో వేరేది ఉంచటం. అంటే దేనికైనా చెందిన స్థానంలో దానిని కాకుండా వేరే దానిని ఉంచటం. కాబట్టి ఎవరైనా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ఆరాధనలలో ఇతరులను కూడా చేర్చటమనేది, వారు తమ ఆరాధనలను తప్పుడు స్థానం లో ఉంచటమన్న మాట. ఇంకో మాటలో – అనర్హులైన వాటికి తమ ఈ ఉన్నతమైన బాధ్యతను (ఆరాధనను) సమర్పించటం. కాబట్టి, కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందిన ‘ఆరాధన’ అనే దివ్యమైన హక్కును, దాని స్థానం నుండి తప్పించి, వేరే స్థానంలో ఉంచటం అంటే అనర్హులైన, అయోగ్యులైన వేరే వాటికి సమర్పించటం అనేది అత్యంత ఘోరమైన మహాపాపంగా సృష్టకర్త ప్రకటించినాడు.

2-    క్షమింపబడని ఘోరాతి ఘోరమైన మహాపాపం: ఎవరైతే ఈ ఘోరమైన మహాపాపం నుండి పశ్చాత్తాపం చెందకుండా, క్షమాభిక్ష వేడుకోకుండా చనిపోతారో, అటువంటి వారిని అల్లాహ్ (ఎట్టి పరిస్థితులలోను క్షమించనని) ప్రకటించెను. ఖుర్ఆన్ లోని అన్నీసా (స్త్రీలు) అనే అధ్యాయంలోని 48వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(النساء 48) – “إِنَّ اللَّهَ لا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ”

భావం యొక్క అనువాదం – {తనకు భాగస్వాములను కల్పించటాన్ని (షిర్క్) అల్లాహ్ క్షమించడు; కాని ఇది (షిర్క్) కాక  ఇతర పాపలన్నింటినీ ఆయన క్షమించవచ్చును}

3-    స్వర్గం నిషేధించబడినది:  ఎవరైతే తన ఆరాధనలలో ఇతరులకు భాగస్వామ్యం కల్పిస్తారో (బహుదైవారాధన) చేస్తారో అటువంటి వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. మరియు వారిని అల్లాహ్ శాశ్వతంగా నరకంలోనే ఉంచును. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిదహ్ (వడ్డించిన విస్తరి) అనే అధ్యాయంలోని 72వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

”إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ “ (المائدة 72)

భావం యొక్క అనువాదం– {తనతో పాటు ఇతరులను ఆరాధిస్తున్న వారి పై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను మరియు నరకంలోనే వారు శాశ్వతంగా ఉండబోతున్నారు. అటువంటి పాపిష్టులకు సహాయపడే వారెవ్వరూ ఉండరు}.

4-   పుణ్యకార్యాలన్నీ వ్యర్థమవుతాయి: షిర్క్ (బహుదైవారాధన) కారణంగా చేసిన పుణ్యకార్యాలన్నీ నిష్ప్రయోజనమవుతాయి, వ్యర్థమవుతాయి, ఉపయోగపడకుండా పోతాయి. దివ్యఖుర్ఆన్ లోని అల్ అన్ ఆమ్ అధ్యాయంలోని 88వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

” ذَلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ- “ (الأنعام 88)

భావం యొక్క అనువాదం – {ఇది అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం: ఎవరి ఆరాధనలైతే తనను మెప్పిస్తాయో, వారికి అల్లాహ్ దీనిని ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు గనుక ఇతరులను అల్లాహ్ ఏకదైవత్వంలో భాగస్వాములుగా చేర్చితే, వారి చేసిన (కూడగట్టిన) పుణ్యకార్యాలన్నీ వ్యర్థమైపోతాయి}.

ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అజ్జుమర్ అధ్యాయంలోని 70వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు

(الزمر70) –  “وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنْ الْخَاسِرِينَ”

భావం యొక్క అర్థం – {కాని, ఏవిధంగా నైతే పూర్వికుల ముందు అవతరించినదో, అదే విధంగా మీ దగ్గర కూడా ఇది అవతరింపబడి ఉన్నది. ఒకవేళ మీరు ఎవరినైనా (అల్లాహ్ యొక్క ఏకదైవత్వంలో) చేర్చితే, నిశ్చయంగా మీ యొక్క (జీవితపు) ఆచరణలు నిష్ప్రయోజనమైపోతాయి మరియు మీరు తప్పక (అధ్యాత్మికంగా) నష్టపోయిన వారి పంక్తులలో చేర్చబడతారు}

5-  ప్రాణ సంపదలకు రక్షణ ఉండదు: ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతారో, వారి యొక్క రక్తం (జీవితం) మరియు సంపద నిషిద్ధం కాదు. దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయం లోని 5వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

(التوبة 5)-  “فَاقْتُلُوا الْمُشْرِكِينَ حَيْثُ وَجَدْتُمُوهُمْ وَخُذُوهُمْ وَاحْصُرُوهُمْ وَاقْعُدُوا لَهُمْ كُلَّ مَرْصَدٍ”

భావం యొక్క అనువాదం – {యుద్ధరంగంలో మీకు ఎదురైన ప్రతి బహుదైవారాధకుడితో (ఏకైక ఆరాధ్యుడైన సర్వలోక సృష్టికర్త యొక్క దైవత్వంలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్న వారితో) యుద్ధం చేయండి మరియు వారిని హతమార్చండి మరియు వారిని బంధించండి మరియు చుట్టుముట్టండి మరియు వారి ప్రతి యుద్ధతంత్రంలో, యుక్తిలో ఘోరవైఫల్యం నిరీక్షిస్తున్నది.}

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు

“أمرت أن أقاتل الناس حتى يقولوا لا إله إلا الله و يُقيموا الصلاة و يُؤتوا الزكاة” –

అనువాదం – “లా ఇలాహ్ ఇల్లల్లాహ్ (కేవలం ఒక్క అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు) మరియు ముహమ్మదుర్రసూలుల్లాహ్ (ముహమ్మద్ ^ అల్లాహ్ యొక్క సందేశహరుడు) అని సాక్ష్యమిచ్చి, నమాజు స్థాపించి, విధిదానం (జకాత్) ఇచ్చే వరకు ప్రజలతో పోరు జరపమని (అల్లాహ్ నుండి) నాకు ఆజ్ఞ ఇవ్వబడినది. కాబట్టి వారు పైవిధంగా ఆచరిస్తే, వారి రక్తం మరియు సంపదకు ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాల సందర్భంలో తప్ప,  నా తరపున గ్యారంటీగా రక్షణ లభిస్తుంది.

6-      ఘోరాతి ఘోరమైన మహాపాపం: షిర్క్ (బహుదైవారాధన, అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వంలో ఇతరులను చేర్చటం) అనేది మహా పాపములలో ఘోరాతి ఘోరమైనది.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా సంబోధించారు –  “ألا أنبئكم بأكبر الكبائر” – అనువాదం – “ఘోరాతి ఘోరమైన మహాపాపం గురించి మీకు తెలియజేయ మంటారా?” మేము (సహచరులం) ఇలా సమాధానమిచ్చాం, “అవును,  ఓ అల్లాహ్ యొక్క సందేశహరుడా r”, వారు ఇలా పలికారు, “الإشراك بالله وعقوق الوالدين” – అనువాదం – “అల్లాహ్ తో ఇతరులెవరినైనా జతపర్చటం, తల్లిదండ్రులకు అవిధేయత చూపటం

కాబట్టి షిర్క్ (బహుదైవారాధన) అనేది అత్యంత ఘోరాతి ఘోరమైన దౌర్జన్యం (పాపిష్టి పని) మరియు తౌహీద్ (ఏకదైవత్వం) అత్యంత స్వచ్ఛమైనది, న్యాయమైనది. మరియు ఏదైనా సరే అల్లాహ్ యొక్క ఏకదైవత్వాన్ని ఖండిస్తున్నట్లయితే, తిరస్కరిస్తున్నట్లయితే, నిరాకరిస్తున్నట్లయితే, వ్యతిరేకిస్తున్నట్లయితే అది అత్యంత ఘోరమైన దౌర్జన్యం (అన్యాయం) అవుతుంది. ఇంకా తన ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చే వారిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించెను. వారి జీవితం, సంపద, భార్య మొదలైనవి కేవలం తననే ఆరాధిస్తున్న ఏకదైవారాధకుల రక్షణ పరిధి లోనికి రావని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఇంకా తర్వాతి వారు మొదటి వారిని వారి బహుదైవారాధన కారణంగా ఖైదీ (దాసులుగా) చేయటానికి అనుమతి ఇవ్వబడుతున్నది. ఇంకా బహుదైవారాధకుల ఏ చిన్న మంచి పనినైనా సరే ఆమోదించటాన్ని లేదా ఎవరిదైనా సిఫారసు స్వీకరించటాన్ని లేదా పునరుత్థాన దినమున వారి పిలుపును అందుకోవటాన్ని అల్లాహ్ తిరస్కరించెను. ఎందుకంటే కేవలం అజ్ఞానం వలన, అల్లాహ్ కు భాగస్వామ్యం జతపర్చిన బహుదైవారాధకుడు అందరి కంటే ఎక్కువగా అవివేకుడు, మూఢుడు. అ విధంగా అతడు అల్లాహ్ పై దౌర్జన్యం (అన్యాయం) చెయ్యటమే కాకుండా స్వయంగా తనకు వ్యతిరేకంగా తానే దౌర్జన్యం (అన్యాయం) చేసుకుంటున్నాడు.

7-   ఒక లోపం మరియు తప్పిదం: షిర్క్ (బహుదైవారాధన)  అనేది ఒక లోటు, ఒక లోపం, ఒక దోషం, ఒక కళంకం, ఒక లొలుగు మరియు ఒక తప్పిదం – అల్లాహ్ యొక్క అత్యుత్తమమైన స్వభావం దీని (షిర్క్ భావనల) కంటే ఎంతో మహాన్నతమైనది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఇతరులను భాగస్వాములుగా చేర్చుతున్నారో, అలాంటి వారు కేవలం అల్లాహ్ కే చెందిన ప్రత్యేక ‘మహోన్నత స్థానాన్ని’ తాము ఖండిస్తున్నామని మరియు వ్యతిరేకిస్తున్నామని స్వయంగా అంగీకరిస్తున్నట్లవు తున్నది.

షిర్క్ (బహుదైవారాధన) లోని భాగాలు:

షిర్క్ (బహు దైవారాధన లేదా విగ్రహారాధన) ఎలా ప్రారంభమైనది ? (How shirk or idolatory started?)

షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించుట) గురించి తెలుసుకున్న తర్వాత, అది ఈ లోకంలో ఎలా ప్రారంభమైనదో తెలుసుకోవటం మంచిది. షిర్క్ మొట్టమొదట నూహ్ అలైహిస్సలాం కు పూర్వపుకాలంలో ప్రారంభం అయినది. అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం ను వారి సంతతి వద్దకు ప్రవక్తగా చేసి పంపినప్పుడు ఆయన వారిని విగ్రహారాధనను విడనాడవలసినదిగా ఉద్బోదించారు, సకలరాశి సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాహ్ యొక్క ఆరాధన వైపునకు పిలిచారు. దానితో వారు ఆయనను వ్యతిరేకించారు, విగ్రహారాధనకు కట్టుబడి ఉంటానికి పూనుకున్నారు, ఆయనను ఉపదేశాలను తిరస్కరించారు, ఆయనను కష్టపెట్టడం ప్రారంభించారు. ఇంకా వారు ఇలా ప్రకటించారు.

నూహ్ 71:23:- “ మరియు వాళ్ళు అన్నారు – ఎట్టి పరిస్థితిలోను మన దేవుళ్ళను (విగ్రహారాధన ను) వదలవద్దు. మరియు వద్ మరియు సువాఅ మరియు యగూస్ మరియు యఊఖ్ మరియు నసరా ని వదలవద్దు అన్నారు.”

పై వాక్యం యొక్క వివరణ (సహీ బుఖారీ) లో అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఉల్లేఖన లో ఇలా వివరించబడినది – ఈ పేర్లన్నీ నూహ్ అలైహిస్సలాం కాలంనాటి ప్రజలలోని పుణ్యపురుషుల పేర్లు. వీరు చనిపోయిన తర్వాత షైతాన్ ఇట్లా ఉసి కొల్పెను.” మీరు మీ సభలలో ఆ పుణ్యపురుషుల ఫొటోలు, విగ్రహములు చేసి ఉంచి వారి గురించి తెలియజేస్తుండండి” వారు అదే విధముగా చేయటం ప్రారంభించారు.  కాని ఆ ప్రజలు వారిని ఆరాధించలేదు. తర్వాత ఈ విధంగా విగ్రహాలు తయారు చేసి వారు చనిపోయారు. వారి తర్వాత వచ్చిన ప్రజలు ఆ విగ్రహాలను ఆరాధించటం (పూజించడం) ప్రారంభించారు.

హాఫిజ్ ఇబ్నె అల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా విశదీకరించారు – “చాలామంది మతగురువులు ఇలా తెలిపారు. ఆ పుణ్యపురుషులు చనిపోయినప్పుడు ప్రజలు వారి సమాధుల వద్ద గుమిగూడి తపస్సులు(ధ్యానం) చేసెడివారు. ఆ తర్వాత వారి ఫొటోలు(చిత్రపటాలు), విగ్రహాలు తయారు చేశారు. ఇంకా కాలం మారే కొద్దీ, వారి తరువాత ప్రజలు వాటిని పూజించటం ప్రారంభించారు.” కాబట్టి దీని వలన అర్థం మవుతున్నది ఏమిటంటే షిర్క్ (బహు దైవారాధన లేదా అల్లాహ్ కు సాటి కల్పించుట) ప్రారంభమగుటకు అసలు కారణం పుణ్యపురుషుల విషయంలో గులూ (హద్దు మీరటం) చేయటమే. పుణ్యపురుషుల విషయంలో హద్దు మీరి విధేయత చూపటం వలన ప్రజలలో షిర్క్ చోటు చేసుకుంటుంది.

Source: Tawheed Course – Level 01