నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు సుమా!
ఈ భావం గల ఆయతులు ఖుర్ఆన్ లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు చూడండి సూర రఅద్ 13:10-11 అలాగే సూర ఖాఫ్ 50:16-18.
వీటి ద్వార మనం నేర్చుకోవలసిన గుణపాఠం: ఎల్లవేళల్లో మన ప్రతి మాట, చేష్ట, వాచకర్మ మన ప్రతీ కదలిక మరియు మౌనం అంతా నమోదవుతున్నప్పుడు మనం క్షణం పాటు కొరకైనా మన సృష్టికర్త అయిన అల్లాహ్ కు అవిధేయత పాటించవచ్చా గమనించండి!
మనం ఖుర్ఆన్ శ్రద్ధతో చదువుతున్నామా?
ఒక్కసారి నాతో సూర జాసియా 45:29లోనీ ఈ ఆయతుపై లోతుగా పరిశీలించే అవగాహన చేసే ప్రయత్నం చేయండి
45:29 هَٰذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُم بِالْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ “ఇదిగో, ఇదీ మా రికార్డు. మీ గురించి (ఇది) ఉన్నదున్నట్లుగా చెబుతోంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించేవాళ్ళం”
ఎలా అనిపిస్తుంది? తప్పించుకునే మార్గం ఉందా ఏమైనా? ప్రళయదినాన ఆ కర్మలపత్రాన్ని చూసి స్వయం ఎలా నమ్మకుంటాడో, ఒప్పుకుంటాడో సూర కహఫ్ 18:49లోని ఈ ఆయతును గమనించండి:
కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఒకరోజు జిబ్రీల్ అలైహిస్సలాం మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూర్చొని ఉండగా పై నుండి ఒక ద్వారం తెరువబడే శబ్దం వినిపించింది. జిబ్రీల్ అలైహిస్సలాం తల పైకెత్తి, ‘ఆకాశంలోని ఒక ద్వారం తెరువబడింది, ఇది దాని శబ్దమే. ఇంతకు ముందు ఎన్నడూ ఆ ద్వారం తెరువబడలేదు’. అని అంటుండగా ఆ ద్వారం గుండా ఒక దైవదూత దిగాడు, ఆ దైవదూత గురించి చెబుతూ, ‘భూమిపైకి దిగిన ఈ దైవ దూత, ఇంతకుముందు ఎన్నడూ దిగలేదు,’ అని అన్నారు. వెంటనే ఆ దైవదూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సలామ్ చేసి, ‘మీకు రెండు కాంతులు ఇవ్వబడినందుకు సంతోషించండి, అవి ఇతర ప్రవక్త లెవ్వరికీ ఇవ్వబడ లేదు. అవి (1) సూరహ్ ఫాతిహా, (2) సూరహ్ బఖరహ్ లోని చివరి ఆయతులు. మీరు వీటిలోని ఏ అక్షరాన్ని పఠించినా, దాని పుణ్యం మీకు లభిస్తుంది లేక ఏ దు’ఆ చేసినా అది అంగీకరించబడుతుంది” అని చెప్పాడు.
ملخص الجواب : أن خواتيم سورة البقرة آيات مدنية ، وأن إعطاء الله تعالى هذه الآيات لنبيه صلى الله عليه وسلم ليلة المعراج ، يحتمل أنه أوحى بهما إليه بلا واسطة ، ثم نزلتا مرة أخرى في المدينة ، أو أن الله بشره بنزول هذه الآيات عليه ، ثم نزلتا حقيقة في المدينة ، وأما حديث ابن عباس فيحتمل أنه نزول بالآيات ، أو نزول بالفضل ومالثواب .
[ఈ హదీసు వివరణ:-] రెండు వెలుగులంటే సూరహ్ ఫాతిహా (1), సూరహ్ బఖరహ్(2) చివరి వాక్యాలు. తీర్పుదినం నాడు ఈ రెండు వెలుగుగా మారుతాయి. వీటి వెలుగులో ఖుర్ఆన్ పఠించేవారు నడుస్తూ ఉంటారు. ”నూరుహుమ్ యస్ఆ బైన అయ్దీహిమ్” (సూర తహ్రీమ్ 66:8). మరియు సూరహ్ బఖరహ్ చివరి భాగం అంటే ”ఆమనర్రసూలు’ నుండి చివరి వరకు.
సూరహ్ ఫాతిహా చాలాప్రాధాన్యత ఉంది. దీని పేరు ఉమ్ముల్ ఖుర్ఆన్, సబ్’ఉమసా’నీ, సూరహ్ షిఫా’ సూరతుల్ క’న్జ్, సూరతు ‘స్సలాహ్, దీన్ని పఠించనిదే నమా’జ్ నెరవేరదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,
”అల్లాహ్ ఆదేశం, ”నేను నమా’జ్ అంటే సూరహ్ ఫాతిహాను నాకూ నా దాసునికి మధ్య చెరిసగం పంచివేసాను. ఎవరు నన్ను ఏది కోరితే దాన్నే అతనికి ప్రసాదిస్తాను. ఒకవేళ దాసుడు, ‘అల్’హమ్దులిల్లాహి రబ్బిల్ ‘ఆలమీన్’ అని అంటే అల్లాహ్ ‘హమిదనీ అబ్దీ’ నా దాసుడు నన్ను స్తుతించాడు అని అంటాడు. దాసుడు ‘అర్ర’హ్మానిర్ర’హీమ్’ అని అంటే అల్లాహ్ ‘అస్నా’అలయ్య అబ్దీ’, నా దాసుడు నన్ను కీర్తించాడు అని అంటాడు. దాసుడు, ‘మాలికి యౌమిద్దీన్’ అంటే అల్లాహ్, ‘మజ్జదనీ అబ్దీ’, నా దాసుడు నా గొప్పతనాన్ని కొనియాడాడు, అని అంటాడు. దాసుడు, ‘ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్తయీన్,’ అని అంటే అల్లాహ్, ‘ఇది నాకు నా దాసునికి మధ్య ఉంది. దాసుడు ఏది కోరితే అది నేను ప్రసాదిస్తాను.’ ఆ తరువాత దాసుడు చివరి వరకు పఠిస్తే, అల్లాహ్, ‘ఇదంతా నా దాసునికోసమే ఉంది, అతడు ఏమి కోరితే అదే అతని కోసం ఉంది,’ అని అంటాడు.” (నిసాయి’)
ఈ సూరహ్ మొత్తం స్తోత్రం, కీర్తనం, ప్రార్థనలతో నిండి ఉంది. అందువల్లే దీన్ని వెలుగు అనడం జరిగింది. అదేవిధంగా సూరహ్ బఖరహ్ చివరి ఆయతులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ప్రార్థన, ప్రార్థనా ఫలితం రెండూ ఉన్నాయి. అది, ‘ఆమనర్రసూలు నుండి చివరి వరకు.
తఫ్సీర్ ఇబ్నె కసీ’ర్లో ‘స’హీ’హ్ బు’ఖారీ ఉల్లేఖనంలో ఈ రెండిటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఈ విధంగా ఉంది, ”ఎవరు ఈ రెండు ఆయతులను రాత్రి పఠిస్తే అతని కొరకు అవి సరిపోతాయి.”
ముస్నద్ అ’హ్మద్లో ఇలా ఉంది. “సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు దైవసింహాసనం క్రింద ఉన్న నిధిలో నుండి నాకు ఇవ్వ బడ్డాయి. నా కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవి ఇవ్వబడ లేదు.”
‘స’హీ’హ్ ముస్లిమ్లో ఇలా ఉంది, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ చేసినపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ”సిద్రతుల్ మున్తహా” వరకు వెళ్ళారు. అది ఏడవ ఆకాశంపై ఉంది. భూమి నుండి పైకి వెళ్ళే ప్రతి వస్తువు సిద్రతుల్ మున్తహా వద్దకు చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోవటం జరుగు తుంది. ఆకాశం నుండి వచ్చేది కూడా ఇక్కడి వరకే చేరుతుంది. ఇక్కడి నుండి తీసుకోబడుతుంది. దీన్ని బంగారు పిచ్చుకలు కప్పి ఉంటాయి. ఇక్కడ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు 3 వస్తువులు ఇవ్వ బడ్డాయి. (1) 5 పూటల నమా’జులు, (2) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, (3) ఏకదైవారాధకులందరి క్షమాపణ.
ముస్నద్లో ఇలా ఉంది, ” ‘ఉఖ్బహ్ బిన్ ‘ఆమిర్తో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు, ”సూరహ్ బఖరహ్ లో ఈ చివరి ఆయతులు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండు. నాకు అవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి.”
ఇబ్నె మర్ద్వైలో ఇలా ఉంది, “మాకు ఇతరులపై మూడు విధాలా ఆధిక్యత లభించింది. సూరహ్ బఖరహ్ చివరిఆయతులు, ఇవి దైవసింహాసనం క్రింది నిధి నుండి ఇవ్వబడ్డాయి. నా కంటే ముందు ఎవ్వరికీ ఇవ్వబడ లేదు. నా తరువాత కూడా ఎవ్వరికీ ఇవ్వబడవు.”
ఇబ్నె మర్ద్వైలో ఇలా ఉంది. ‘అలీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “ముస్లిముల్లోని ఎవరైనా ఆయతుల్ కుర్సీ మరియు సూరహ్ బఖరహ్ చివరి వాక్యాలు చదవకుండా పడుకుంటారని నేననుకోను. ఇవి మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు దైవసింహాసనం క్రింద ఉన్న నిధి నుండి లభించాయి.“
మరో తిర్మిజి 2882′ ‘హదీసు’లో ఇలా ఉంది, “అల్లాహ్ భూమ్యా కాశాలను సృష్టించడానికి రెండువేల సంవత్సరాల ముందు ఒక గ్రంథం వ్రాయబడింది. ఇందులో రెండు ఆయతులు లిఖించి సూరహ్ బఖరహ్ పూర్తి చేయబడింది. ఎవరి ఇంటిలో మూడు రోజుల వరకు పఠించబడుతుందో, ఆ ఇంటి సమీపానికి కూడా షై’తాన్ రాలేడు.” (షేక్ అల్బానీ సహీ అన్నారు.)
ఇబ్నె మర్ద్వైహ్లో ఇలా ఉంది, ”ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూరహ్ బఖరహ్ చివరి ఆయతులు, ఆయతుల్ కుర్సీ పఠిస్తే నవ్వుతారు, ఇంకా ఈ రెండు దైవసింహాసనం క్రింద నిధి నుండి లభించాయి,” అని అంటారు.
కొన్ని ‘హదీసు’ల్లో ఇలా ఉంది,
“దాసుడు, ‘గుఫ్రానక రబ్బనా,’ అని ప్రార్థిస్తే అల్లాహ్ , ‘నఅమ్, నేను నీ పాపాలను క్షమించాను,’ అని అంటాడు, ఒకవేళ దాసుడు ”రబ్బనా, లాతుఆ’ఖిజ్’నా,” – ‘ఓ అల్లాహ్ మా పాపాల పట్ల మమ్మల్ని విచారించకు,’ అని అంటే అల్లాహ్ సమాధానంగా, ‘నేనలాగే చేస్తాను,’ అని అంటాడు. ఒకవేళ, ”లాత’హ్మిల్ ‘అలైనా,” – ‘నాకు శక్తిలేని భారం వేయకు,’ అని అంటే అల్లాహ్, ‘నేనలాగే చేస్తాను, అంటే శక్తికి మించిన బరువు వేయనని’ అంటాడు, ఒకవేళ దాసుడు, ”వ ‘అఫు అన్నా” – ‘ఓ అల్లాహ్ నన్ను క్షమించు,’ అని అంటే అల్లాహ్, ‘నేను క్షమించివేస్తాను,’ అని అంటాడు. ఒక వేళ, ”వ’గ్ఫిర్లనావర్’హమ్నా,” – ‘మమ్మల్నిక్షమించు కరుణించు,’ అని అంటే అల్లాహ్ , ”మేము క్షమిం చాము, కరుణించాము,” అని అంటాడు. ఒకవేళ, ”ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్,” – ‘మాకు అవిశ్వా సులపై సహాయం చేయి,’ అని అంటే అల్లాహ్ , ”మేము మీకు సహాయం చేసాము అని అంటాడు.”
2) అప్పగింతలో ద్రోహం – అబద్ధం – వాగ్ధాన భంగం – మరియు దుర్భాషలాడటం ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉంటాయి?
C] మునాఫిక్
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:
”ఏ వ్యక్తిలో ఈ 4 గుణాలుంటాయో అతడు ఖచ్చితంగా కపటాచారియే. ఎవరిలోనైనా వీటిలోని ఒక్క గుణం ఉంటే అతడు దానిని వదలనంత వరకు అతనిలో ఒక కాపట్య చిహ్నం ఉన్నట్టే. ఆ 4 గుణాలు ఇవి: 1. అమానతు ఉంచబడితే ద్రోహం తలపెడతాడు; 2. మాట్లాడితే అసత్యం పలుకుతాడు; 3. వాగ్దానం చేస్తే వాగ్దానభంగం చేస్తాడు; 4. వివాదం తలెత్తితే తిట్లకు దిగుతాడు”. (బు’ఖారీ, ముస్లిమ్)
3) అల్లాహ్ వద్ద పుణ్య పరంగా అతి గొప్ప గుటక ఏది?
A) కోపం దిగమింగే గుటక
అల్లాహ్ కొరకు కోపాన్ని దిగమింగుట
ప్రవక్త ﷺ ఉపదేశించారని అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్ఠానికై దాసుడు మింగే కోపాగ్ని గుటక”. (ఇబ్ను మాజ 4189, అహ్మద్ 2/ 128, అదబుల్ ముఫ్రద్ 1318, సహీహుత్తర్గీబ్: అల్బానీ 2752).
ఇలాంటి ఎన్ని సందర్భాలు మనకు ఎదురవుతాయో, అప్పుడు మనం ఈ హదీసును, ఈ గొప్ప పుణ్యఫలితాన్ని గుర్తుకు తెచ్చుకుంటామా? అల్లాహ్ కొరకు మన కొపాన్ని మింగి పుణ్యాన్ని పొందుతామా?
కోపం వచ్చినప్పుడు కోపం ప్రకారం ఆచరించడానికి శక్తి ఉండికూడా కోపాన్ని దిగమ్రింగేవారిని అల్లాహ్ సుబ్ హానహు వతఆలా ప్రశంసించి, వారికి మన్నింపు, క్షమాపణ, స్వర్గప్రవేశ శుభవార్త ఇచ్చాడు.
“ఎవరు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు కోపాన్ని దిగమ్రింగుతారో ఇంకా ప్రజలను మన్నిస్తారో, (ఇలాంటి) సజ్జనులను అల్లాహ్ ప్రేమిస్తాడు. మరెవరైతే (వారి ద్వారా) ఏదైనా అశ్లీల పని జరిగితే లేదా వారు తమపై అన్యాయం చేసుకుంటే, వెంటనే అల్లాహ్ ను స్మరించి తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. –నిజానికి అల్లాహ్ తప్ప పాపాలను క్షమించేవాడెవడున్నాడు?- వారి ద్వారా జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు (మంకుపట్టు పట్టరు). ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసే వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది”. (ఆలె ఇమ్రాన్ 3:134-136).
ఈ ఘనమైన ఫలం పైన మరో ప్రతిఫలం ఏమిటంటే; అతనికిష్టమైన హూరె ఐన్ (అందమైన పెద్ద కళ్ళుగల స్వర్గపు సుందర కన్య)ను ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. సహల్ బిన్ ముఆజ్ తన తండ్రితో ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
“ఎవరు తన కోపాన్ని దిగమింగుతాడో, అతను దానిని అమలు పరచడానికి శక్తి ఉండి కూడా (దిగమింగుతాడో), అల్లాహ్ ప్రళయదినాన అతనిని ప్రజల ఎదుట పిలుస్తాడు, అతనికిష్టమైన హూరె ఐన్ ను ఎన్నుకునే అధికారం ఇస్తాడు”. (అబూదావూద్ 4777, తిర్మిజి 2493, ఇబ్నుమాజ 4186, అల్బానీ సహీహుత్తర్గీబ్ 2753లో హసన్ అని చెప్పారు).
ఏదైనా ప్రాపంచిక వృధాకార్యం కోసం నీవు ఇంతటి గొప్ప పుణ్యాన్ని వదులుకుంటావా? ప్రజల్ని ఓటమికి గురి చేసేవాడు శక్తిశాలి కాదు, తన కోపాన్ని దిగమ్రింగేవాడు అసలైన శక్తిశాలి. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
“ఎదుటి వానిని చిత్తుచేసినవాడు శూరుడు కాదు, తాను ఆగ్రహానికి గురైనప్పుడు తన్ను తాను అదుపులో ఉంచుకున్నవాడే అసలైన శూరుడు”. (బుఖారి 6114, ముస్లిం 2609, అహ్మద్ 2/ 236.).
وكان عند ميمون بن مهران ضيف، فاستعجل على جاريته بالعشاء، فجاءت مسرعة ومعها قصعة مملوءة، فعثرت وأراقتها على رأس سيدها ميمون، فقال: يا جارية أحرقتني، قالت: يا معلم الخير، ومؤدب الناس، ارجع إلى ما قال الله تعالى، قال: وما قال الله تعالى؟ قالت: قال: ﴿ وَالْكَاظِمِينَ الْغَيْظَ ﴾ [آل عمران: 134]، قال: قد كظمت غيظي، قالت: ﴿ وَالْعَافِينَ عَنِ النَّاسِ ﴾ [آل عمران: 134]، قال: قد عفوت عنك، قالت: زِد؛ فإن الله تعالى يقول: ﴿ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ ﴾ [آل عمران: 134]، قال: أنت حرة لوجه الله تعالى [إحياء علوم الدين].
رابط الموضوع:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
విశ్వాసం, దాని మూల స్తంభాలు :
వాచాకర్మను విశ్వాసం అంటారు. అది సత్కార్యాలతో పెరుగుతుంది, పాపాలతో తరుగుతుంది. హృదయం మరియు నాలుక మాటను ఇంకా హృదయం, నాలుక మరియు అవయవాల పనిని విశ్వాసం అంటారు. హృదయ మాట అంటే: హృదయపూర్వకంగా విశ్వసించుట, సత్యపరచుట. నాలుక మాట అంటే: అంగీకరించుట. హృదయ పని అంటే: సమ్మతించుట, ఇఖ్లాస్, లొంగిపోవుట, ప్రేమ, సత్కార్యాల సంకల్పం. అవయవాల పని అంటే: ఇస్తాం ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చుట మరియు నిశిద్ధతలను విడనాడుట.
విశ్వాసానికి కొన్ని మూలసూత్రాలున్నాయని ఖుర్‌ఆన్ మరియు సున్నతుల ద్వారా రుజువైనది. అవి: (1) అల్లాహ్‌ను, (2) ఆయన దూతలను, (3) ఆయన పంపిన గ్రంథాలను, (4) ఆయన ప్రవక్తలను, (5) ప్రళయదినాన్ని, (6) మంచి, చెడు తఖ్దీర్ (అదృష్టాాల)ను విశ్వసించడం. అందులో కొన్ని ఈ ఆయతులో ప్రస్తావించబడినవి:
(ప్రవక్తతన ప్రభువు నుండి తనపై అవతరించి ప్రబోధాన్ని విశ్వసించాడు. ప్రవక్తను విశ్వసించినవారు కూడా దాన్ని మనసారా స్వీకరించారు. వీరంతా అల్లాహ్ ను, ఆయన దూతల్ని ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని నమ్ముతారు; వారిలా పలుకుతారుః ‘మేము అల్లాహ్ ప్రవక్తల్లో ఏ ఒక్కరి పట్లనూ తారతమ్యాన్ని పాటించము, మేము ఆజ్ఞ విన్నాము, దానికి విధేయులమయ్యాము, స్వామీ మేము క్షమాభిక్షను అర్ధిస్తున్నాము, మరి మేము నీ వైపునకే మరలవలసినవారము). (సూ. బఖర 2: 285).
సహీ ముస్లింలో ఉంది: అమీరుల్ మోమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విశ్వాసం (ఈమాన్) అంటేమిటి అని అడిగాడు. దానికి ప్రవక్త ఇలా జవాబిచ్చారు: “విశ్వాసం అంటే నీవు (1) అల్లాహ్‌ను, ఆయన (2) దూతలను, ఆయన (3) గ్రంథాలను, ఆయన (4) ప్రవక్తలను, (5) పరలోకదినాన్ని మరియు (6) మంచి చెడు అదృష్టాన్ని విశ్వసించుట”. (ముస్లిం 8).
ఈ ఆరు విషయాలే సత్యవిశ్వాసం యొక్క మూలసూత్రాలు. వీటిని తీసుకొని ఖుర్‌ఆను అవతరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. వీటినే విశ్వాస మూల సూత్రాలు (అర్కానె ఈమాన్) అంటారు. వీటి వివరణ క్రింద చదవండి:
1- అల్లాహ్ పై విశ్వాసం:
అంటే: ఉలూహియత్, రుబూబియత్ మరియు అస్మా వ సిఫాత్ లో అల్లాహ్ అద్వితీయుడని విశ్వసించాలి. అల్లాహ్ పై విశ్వాసంలో ఈ క్రింది విషయాలు కూడా వచ్చును.
అల్లాహ్ యే వాస్తవ ఆరాధ్యుడు, సర్వ ఆరాధనలకు అర్హుడు. ఆయన గాక వేరే లేదా ఆయనతో పాటు మరొకడు ఏ మాత్రం అర్హుడు కాడు. ఎందుకనగా మానవుల సృష్టికర్త, వారికి మేలు చేయువాడు, వారికి ఆహారం నొసంగువాడు, వారి రహస్య బహిరంగ విషయాలన్నీ తెలిసినవాడు, పుణ్యాత్ములకు సత్ఫలితం మరియు పాపాత్ములను శిక్షించు శక్తిగలవాడు ఆయన మాత్రమే.
ఈ ఆరాధన యొక్క వాస్తవికత ఏమిటంటేః సర్వ ఆరాధనలు వినయ నమ్రతలతో, ఆయన ఔన్నత్యాల ముందు హీనభావంతో, పూర్తి ప్రేమతో, కంపిస్తూ, కారుణ్యాశలతో అద్వితీయుడైన అల్హాహ్‌కే ప్రత్యేకించి చేయాలి. ఈ గొప్ప మౌలిక విషయంతోనే ఖుర్‌ఆన్ అవతరించింది. అల్లాహ్ ఆదేశం సూర జుమర్ 39: 2,3లో చదవండి:
(అల్లాహ్ ను మాత్రమే వేడుకోండి. మీ ధర్మాన్ని ఆయనకై ప్రత్యేకించుకొని. మీరు చేసే ఈ పని అవిశ్వానులకు ఎంత అయిష్టంగా ఉన్నాసరే).
అరాధన యొక్క రకాలు అనేకమున్నాయి, అందులో కొన్ని ఇవి: దుఆ (ప్రార్ధన, వేడుకోలు), ఖౌఫ్ (భయం), రజా (ఆశ), తవక్కుల్ (నమ్మకం), రగ్బత్ (ఆసక్తి), రహబ్ (మహాభీతి), ఖుషూ (నమ్రత), ఖషియత్ (గౌరవభావంతో భీతి), ఇనాబత్ (మరలుట), ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిఘాస (మొరపెట్టు కొనుట), జిబహ్ (బలిదానం), నజ్‌ర్ (మొక్కుబడి) తదితర ఆరాధన రకాలు. ఇవన్నియూ అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు చేయుట యోగ్యం లేదు. అలా చేయుట షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (సత్యతిరస్కారం)లో పరిగణించబడుతుంది.
2- అల్లాహ్ దూతలపై విశ్వాసం:
ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్ పుట్టించాడు. వారి స్వభావం లోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకానేక రకాలు గలవు. ‘అర్ష్ (అల్లాహ్ సింహాసనము)ను మోసేవారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్, మీకాఈల్, నరక పాలకుడు మాలిక్, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్. అల్లాహ్ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త సల్లల్హాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఆయిషా (రది అల్లాహు అన్హా) ఉల్లేఖించారు:
“అల్లాహ్ దూతలు నూర్ (కాంతి)తో వుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్నిజ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) వుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).
3- గ్రంథములపై విశ్వాసం:
గ్రంథములపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించుట విధిగా ఉంది: ప్రవక్తలు తమ తమ జాతులకు ధర్మం బోధించుటకు, వారిని దాని వైపునకు పిలుచుటకు అల్లాహ్ వారిపై (ప్రవక్తలపై) గ్రంథాల్ని అవతరింపజేశాడు. అల్లాహ్ ఏ గ్రంథముల పేరుతో సహా తెలిపాడో వాటిని వివరంగా విశ్వసించాలి. ఉదా: ప్రవక్త మూసా అలైహిస్సలాంపై ‘తౌరాత్‘, ప్రవక్త దావూద్ అలైహిస్సలాంపై ‘జబూర్‘, ప్రవక్త యేసు మసీహ్ అలైహిస్సలాంపై ‘ఇంజీల్‘ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్హాహు అలైహి వసల్లంపై ‘దివ్య ఖుర్‌ఆన్‘లు అవతరించాయి. అన్నిట్లో ఖుర్‌ఆన్ అతిగొప్పది మరియు చిట్టచివరిది. అది పూర్వ గ్రంథాలను రుజువు పరుచునది మరియు పరిరక్షించునది. దానిని అనుసరించుట, దాని ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా తీర్పులు చేయుట తప్పనిసరి. ఎందుకనగా అల్లాహ్, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇరుజాతుల వైపునకు ప్రవక్తగా పంపాడు. ఆయనపై ఈ దివ్య ఖుర్‌ఆనును అవతరింపజేశాడు, ఆయన (ప్రవక్త) దాని ద్వారా వారి మధ్య తీర్పు చేయుటకు. ఇంక దానిని హృదయ వ్యాధులకు స్వస్థతగా చేశాడు. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇంకా అది సర్వ లోకాల కొరకు సన్మార్గం, కారుణ్యం. అల్లాహ్ ఆదేశాలు చదవండి:
(మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుకల గ్రంథం. కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. మీరు కరుణింపబడటం సాధ్యం కావచ్చు). (సూరె అన్‌ఆమ్ 6: 155).
(మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింవజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త).(సూరె నహ్ల్ 16: 89).
4- ప్రవక్తలపై విశ్వాసం:
ప్రవక్తలపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించాలి: అల్లాహ్ తన దాసుల వైపునకు ప్రవక్తల్ని శుభవార్తనిచ్చువారిగా, హెచ్చరించువారిగా, ధర్మం వైపునకు పిలుచువారిగా జేసి పంపాడు.
(మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి’). (సూరె నహ్ల్ 16: 36).
ప్రవక్తల్ని విశ్వసించినవారే సాఫల్యం పొందువారు. వారిని తిరస్కరించినవారే నష్టం, అవమానం పాలయ్యేవారు.
ప్రవక్తలందరి పిలుపు ఒక్కటేనని మనం విశ్నసించాలి. అది అల్లాహ్ ఏకత్వం మరియు సర్వ ఆరాధనల్లో ఆయన్ని అద్వితీయునిగా నమ్మటం. అయితే వారికి నొసంగబడిన ధర్మశాస్త్రాలు, ఆదేశాలు, శాసనాలు వేరు వేరు. అల్లాహ్ కొందరికి మరి కొందరిపై ఘనత ప్రసాదించాడు. అందరిలోకెల్లా గొప్ప ఘనతగల మరియు చిట్టచివరి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ స సల్లల్లాహు అలైహి వసల్లం. చదవండి అల్లాహ్ ఆదేశాలు:
((మానవులారా) ముహమ్మద్ మీలోని ఏ వురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు). (అహ్ జాబ్ 33: 40).
ఇక ఏ ప్రవక్తల పేర్తతో సహా అల్లాహ్ లేక ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వారిని అదే వివరంగా విశ్వసించాలి. ఉదా: నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం, వగైరా ప్రవక్తలు. అల్లాహ్ వారందరిపై అనేకానేక దయాకరుణా మేఘాలు కురిపించుగాకా! ఆమీన్.
5- పరలోక విశ్వాసం:
అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్హ్లాహు అలైహి వసల్లం మరణానంతరం సంభవించే ఏ ఏ విషయాల గురించి తెలిపారో అవన్నీ ఇందులోనే వస్తాయి. ఉదా: సమాధి యాతన, పరీక్షలు, శుభాలు, ప్రళయ దినం నాటి ఘోర సంఘటనలు, వంతెన, త్రాసు, లెక్క, ప్రతి కర్మ యొక్క ఫలితం, కర్మ పత్రాలు ప్రజల ముందు తెరువబడుట, వారు దాన్ని కుడి లేక ఎడమ చేతితో లేక వీపు వెనక నుంచి తీసుకొనుట, ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే హౌజె కౌసర్, స్వర్గం, నరకం, విశ్వాసులకు అల్లాహ్ దర్శనం, సంభాషణ. ఇంకా ఖుర్‌ఆను మరియు సహీ హదీసుల్లో వచ్చిన విషయాలన్నిటినీ విశ్వసించాలి. అవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన ప్రకారమే సంభవించునని నమ్మాలి.
6- మంచి, చెడు ‘ తఖ్దీర్’ (అదృష్టం)పై విశ్వాసం:
‘తఖ్దీర్’ పై విశ్వాసంలో నాలుగు విషయాలు వస్తాయి:
మొదటిది: భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాయం, వారి చావు, వారు చేసే కర్మలన్నియూ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ మరుగుగా లేదు.
إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
(నిశ్చయముగా అల్లాహ్ కు సర్వమూ తెలియును). (సూరె తౌబా 9: 115).
రెండవది: ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని అదృష్టాన్ని వ్రాసి పెట్టాడు.
وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ
(ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము). (సూరె యాసీన్ 36: 12).
మూడవది: ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడి యుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. సూర ఆలి ఇమ్రాన్ (3:40)లో ఉంది:
كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ
(అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరినదానిని చేస్తాడు).
నాల్గవది: అల్లాహ్ దేని తఖ్దీర్ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.
وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
(వాస్తవానికి అల్లాహ్ యే మిమ్మల్నీ మీరు చేసిన వాటినీ సృష్టించాడు).(సూరె సాఫ్ఫాత్ 37: 96).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
2- యఖీన్ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకము మరియు మనుష్యులలో, జిన్నాతులలోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా గాఢ విశ్వాసముతో ఈ పవిత్ర వచనం పఠించాలి.
(ఎవరు అల్లాహ్ యందు ఆయన ప్రవక్తల యందు విశ్వాసము కలిగిన పిదప సందేహములు వహింపరో వారే విశ్వాసులు).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడని మరియు నేను అల్లాహ్ ప్రవక్తనని సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు విషయాలతో (సాక్ష్యాలతో) అల్లాహ్ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 27).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
9వ అధ్యాయం – విశ్వాసం “లా ఇలాహ ఇల్లల్లాహ్” సమ్మతితో ప్రారంభం
16.హజ్రత్ ముసయ్యబ్ (రది అల్లాహు అన్హు) కథనం :- అబూతాలిబ్‌కు మరణ సమయం ఆసన్నమయినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని చూడటానికి వచ్చారు. ఆ సమయంలో అబూ తాలిబ్ దగ్గర అబూ జహల్ బిన్ హెషామ్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్య బిన్ ముగైరా కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అబూతాలిబ్‌ని ఉద్దేశించి “పెదనాన్నా! (ఇప్పటికైనా) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని అంగీకరించండి. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని ‘నేను అల్లాహ్ దగ్గర మీకు అనుకూలంగా సాక్ష్యమిస్తాను” అని అన్నారు.
అబూజహల్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యా ఈ మాటలు విని “అబూ తాలిబ్! మీరు అబ్దుల్ ముత్తలిబ్ అనుసరించిన మతాన్ని వదలిపెడ్తారా?” అని అడిగారు. ఆ తరువాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని అంగీకరించవలసిందిగా మాటిమాటికీ అబూతాలిబ్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే అబూజహల్, అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యాలు కూడా తమ మాటను అనేకసార్లు ఉద్ఘాటించారు. చివరికి అబూతాలిబ్ వారిద్దరితో “నేను అబ్దుల్ ముత్తలిబ్ మతాన్నే అంటిపెట్టుకొని ఉంటాను” అని చెప్పేశారు. అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని ఒప్పుకోవడానికి ఆయన నిరాకరించారు.
అయినప్పటికీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (పెదనాన్న మీది ప్రేమను చంపుకోలేక) “అల్లాహ్ సాక్షి! అల్లాహ్ నన్ను వారించనంతవరకు నేను మీ పాప క్షమాపణ కోసం ప్రార్ధన చేస్తూ ఉంటాను” అని అన్నారు. అప్పుడు ఈ ఆయత్ అవతరించింది:
“బహు దైవారాధకులు (సత్యాన్ని తిరస్కరించి) నరకానికి అర్హులయ్యారని స్పష్టంగా తెలిసిన తరువాత వారు దగ్గరి బంధువులయినా సరే, వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్ధించడం దైవప్రవక్తకు, విశ్వాసులకు ఎంత మాత్రం శోభించదు.”(ఖుర్ఆన్ : 9:113)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia
లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిబంధనలు:
ఈ పవిత్ర వచనం యొక్క నిబంధనలు ఏడున్నాయి. ఏ కొరత లేకుండా వాటన్నిటినీ పాటిస్తేనే వాస్తవంగా లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించినట్లు.
1- ఇల్మ్ (జ్ఞానం):పవిత్ర వచనము యొక్క వాస్తవ భావ జ్ఞానం. అనగా (పైన తెలిపిన ప్రకారం) అనంగీకారం, అంగీకారం మరియు దాని ప్రకారం ఆచరించుట. ‘అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు, ఇతరుల ఆరాధన వ్యర్థము, తుచ్చము‘ అని తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించిన మానవుడే వాస్తవంగా దాని భావాన్ని తెలుసుకున్న జ్ఞాని.
అల్లాహ్ ఆదేశం:
(తెలుసుకో! అల్లాహ్ తప్ప వేరు ఆరాధింపదగిన వాడెవడు లేడు అని)
(ముహమ్మద్ 47: 19).
ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః
‘వాస్తవ ఆరాధ్యుడు ఎవడూ లేడు, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప’ అని తెలుసుకొని మరణించిన వారు స్వర్గములో చేరుదురు“. (ముస్లిం 26).
2- యఖీన్ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకము మరియు మనుష్యులలో, జిన్నాతులలోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా గాఢ విశ్వాసముతో ఈ పవిత్ర వచనం పఠించాలి.
(ఎవరు అల్లాహ్ యందు ఆయన ప్రవక్తల యందు విశ్వాసము కలిగిన పిదప సందేహములు వహింపరో వారే విశ్వాసులు).
ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ లేడని మరియు నేను అల్లాహ్ ప్రవక్తనని సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు విషయాలతో (సాక్ష్యాలతో) అల్లాహ్ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 27).
3- ఖుబూల్ (సమ్మతించుట): ఈ పవిత్ర వచనం ద్వారా రుజువయ్యే విషయాలన్నిటినీ మనసావాచా సమ్మతించాలి. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపిన విషయాల్ని సత్యంగా నమ్మాలి. ఆయన తెచ్చిన ప్రతి దానిని విశ్వసించాలి, సమ్మతించాలి. అందులో ఏ ఒక్క దానిని విస్మరించకూడదు.
[ప్రవక్త తన ప్రభువు నుండి తనకు నొసంగబడిన గ్రంథమును విశ్వసించారు. విశ్వాసులు కూడా విశ్వసించారు. అందరు అల్లాహ్‌ను, అతని దూతలను, గ్రంథములను, ప్రవక్తలను విశ్వసిస్తూ ‘మేము ఆయన ప్రవక్తల మధ్య వ్యత్యాసము పాటించము, మేము వింటిమి విధేయులైతిమి, మా ప్రభువా! నీ మన్నింవును వేడుకొను చున్నాము, నీ వద్దకే మరలి వచ్చువారలము’ అని అంటారు]. (బఖర 2: 285).
ధర్మ శాసనాలను, హద్దులను ఆక్షేపించుట, లేక వాటిని నమ్మకపోవుట సమ్మతమునకు వ్యతిరేకం. ఉదాహరణకు: కొందరు దొంగ మరియు వ్యబిచారునిపై విధించిన హద్దులను లేక బహుభార్యత్వం, ఆస్తుల పంపకం లాంటి తదితర విషయాలను ఆక్షేపిస్తారు. (అయితే ఇలాంటి వారు అల్లాహ్ యొక్క ఈ ఆదేశం వినలేదా, చదవలేదా?)
(అల్లాహ్, ఆయన ప్రవక్త ఏ విషయములోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికి, విశ్వాసురాలైన ఏ స్త్రీకి, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీనుకునే హక్కు లేదు). (అహ్ జాబ్ 33: 36).
4- ఇన్‌ఖియాద్ (లొంగిపోవుట, శిరసావహించుట):పవిత్ర వచనం యొక్క అర్థభావాల పట్ల శిరసావహించాలి. ఇన్ ఖియాద్ మరియు ఖబూల్ లో తేడా ఏమనగా? ఖబూల్ అంటే నోటితో దాని భావాన్ని సమ్మతించుట. ఇన్‌ఖియాద్ అంటే సమ్మతంతో పాటు దాన్ని ఆచరణ రూపంలో తీసుకు వచ్చుట. ఒక వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ అర్థభావాన్ని తెలుసుకొని, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దాన్ని సమ్మతించినప్పటికీ దానికి లొంగిపోయి, శిరసావహించి, దాని ప్రకారం ఆచరించకపోయినట్లైతే అతను ఇన్‌ఖియాద్ యొక్క నిబంధన పాటించనట్లే.
అల్లాహ్ ఇలా సంభోదించాడు:
وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ
మీరు మీ ప్రభువు వైెవునుకు మరలి ఆయనకే విధేయత చూపండి. (జుమర్ 39: 54).
(నీ ప్రభువు సాక్షిగా! వారు తమలోని జగడముల తీర్పునకై నిన్ను న్యాయ నిర్ణేతగా మరియు నీవు చేయు తీర్పును గూర్చి వారుతమ మనున్సులో సంకట పడక సంతోషముతో అంగీకరించనంత వరకు వారు విశ్వాసులు కారు).
5- సిద్ఖ్ : (సత్యత):మనిషి తన విశ్వాసములో సత్యవంతుడై యుండాలి.
ఎవరైనా ఈ పవిత్ర వచనం కేవలం నోటితో పలికి, దాని భావర్ధాలను మనస్ఫూర్తిగా నమ్మకుండా ఉన్నట్లయితే అతనికి ముక్తి ప్రాప్తించదు. అతడు కపట విశ్వాసులలో పరిగణించబడుతాడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీసుకువచ్చిన వాటన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించడం కూడా సత్యతకు వ్యతిరేకంలోనే వస్తుంది. ఎందుకనగా మనము ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయులై ఉండాలని, ఆయన మాటల్ని సత్యంగా నమ్మాలని అల్లాహ్ ఆదేశించాడు, అంతే కాదు, ఆయన విధేయతను తన విధేయతతో కలిపి చెప్పాడు.
సూర నూర్ (24: 54)లో ఉంది:
أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
(అల్లాహ్ కు విధేయులు కండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులు కండి).
6- ఇఖ్లాస్:మనిషి తను చేసే ప్రతి పనిని సంకల్పపరంగా షిర్క్ దరిదాపులకు అతీతంగా ఉంచుటయే ఇఖ్లాస్, అంటే సర్వ పనులు, మాటలు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయన ప్రసన్నత పొందుటకే చేయాలి. అందులో ఏ మాత్రం ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ప్రాపంచిక లాభోద్దేశ్యం, స్వార్థం ఉండకూడదు. ఇంకా ఆ పని అల్లాహ్ యేతరుని ప్రేమలో, అల్లాహ్ మార్గానికి విరుద్ధంగా ధార్మిక లేదా తర వర్గాల పక్షంలో ఉండకూడదు. కేవలం అల్లాహ్ అభిష్టాన్ని మరియు పరలోక సాఫల్యాన్ని పొందుట కొరకే చేయాలి. ఎవరి నుండైనా ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలనుగానీ ఆశిస్తూ వారి వైపునకు మనుసు మరలకూడదు.
సూర జుమర్ (39: ౩)లో ఉంది:
أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ
(నిస్సందేహంగా, ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే)
(ఓ విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలిగిపోతే, అల్లాహ్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్ మార్గంలో యుద్దం చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు). (మాఇద 5: 54).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ (తెలుగులో) డాక్టర్. సయీద్ అ’హ్మద్ ఉమరీ మదని హఫిజహుల్లాహ్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
2012 – 1433
అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
ఇది షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ‘షర్హ్ హదీథ్ జిబ్రయీల్’ అనే అరబీ పుస్తకంలోని ఒక భాగం.
విషయసూచిక
1. మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ? అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
2. సమాధి శిక్షలు మరియు దాని అనుగ్రహాలు : సమాధి శిక్షలు దేహానికా లేక ఆత్మకా ?
3. పునరుత్థానం : మనిషి చనిపోయి ఉండవచ్చు, (అతని శరీరాన్ని) సింహం తినేసి ఉండవచ్చు. మరి అలాంటపుడు అతను తిరిగి ఎలా లేపబడతాడు ?
4. సూర్యుడు సృష్టికి అతి దగ్గరగా రావడం – అంతిమదినం నాడు సూర్యుడు, సృష్టికి ఒక మైలు దూరమంత దగ్గరికి రావడం ఎలా సాధ్యం ?
5. ప్రజల కర్మల పత్రం – ఈ లెక్క నుండి ఎవరైనా తప్పించుకోగలగుతారా ?
6. త్రాసు – త్రాసులో కర్మలు ఎలా తూచబడతాయి – అవి కర్తల లక్షణాలు మరియు పనుల రూపంలో ఉంటాయి కదా! – అక్కడ ఒకే త్రాసు ఉంటుందా లేక అనేక త్రాసులు ఉంటాయా ?
9. షఫా (విముక్తి, మోక్షం) – షఫా షరతులు
10. పుల్ సిరాత్ (వంతెన)
11. స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం – స్వర్గం మరియు నరకం ఇపుడు ఉనికిలో ఉన్నాయా? – స్వర్గం మరియు నరకం శాశ్వతమా ?
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.
మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.