లా ఇలాహ ఇల్లల్లాహ్ నిబంధనలు [వీడియో]

బిస్మిల్లాహ్

ప్రతి తాళంచెవికి దంతాలుంటాయి, అలాగే ‘లాఇలాహ ఇల్లల్లాహ్‌’ కి కూడా కొన్ని నిబంధనలున్నాయి. అవి తెలుసుకొని ఆచరించినప్పుడే స్వర్గపు ద్వారాలు తెరువబడతాయి

[సురక్షిత యూట్యూబ్ లింక్: https://safeYouTube.net/w/eIYq]
[22 నిమిషాల వీడియో]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


లాఇలాహ ఇల్లల్లాహ్‌ యొక్క నిబంధనలు:

ఈ పవిత్ర వచనం యొక్క నిబంధనలు ఏడున్నాయి. ఏ కొరత లేకుండా వాటన్నిటినీ పాటిస్తేనే వాస్తవంగా లాఇలాహ ఇల్లల్లాహ్‌ పఠించినట్లు.


1- ఇల్మ్‌ (జ్ఞానం): పవిత్ర వచనము యొక్క వాస్తవ భావ జ్ఞానం. అనగా (పైన తెలిపిన ప్రకారం) అనంగీకారం, అంగీకారం మరియు దాని ప్రకారం ఆచరించుట. ‘అల్లాహ్‌ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు, ఇతరుల ఆరాధన వ్యర్థము, తుచ్చము‘ అని తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించిన మానవుడే వాస్తవంగా దాని భావాన్ని తెలుసుకున్న జ్ఞాని.

అల్లాహ్‌ ఆదేశం:

conditions-of-laa-ilaaha-illahllaah

(తెలుసుకో! అల్లాహ్‌ తప్ప వేరు ఆరాధింపదగిన వాడెవడు లేడు అని)
(ముహమ్మద్‌ 47: 19).

ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః

conditions-of-laa-ilaaha-illahllaah

‘వాస్తవ ఆరాధ్యుడు ఎవడూ లేడు, కేవలం ఒక్క అల్లాహ్‌ తప్ప’ అని తెలుసుకొని మరణించిన వారు స్వర్గములో చేరుదురు“. (ముస్లిం 26).


2- యఖీన్‌ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకము మరియు మనుష్యులలో, జిన్నాతులలోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా గాఢ విశ్వాసముతో ఈ పవిత్ర వచనం పఠించాలి.

సూర హుజురాత్‌ (49: 15)లో అల్లాహ్‌ ఆదేశం:

إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا

(ఎవరు అల్లాహ్‌ యందు ఆయన ప్రవక్తల యందు విశ్వాసము కలిగిన పిదప సందేహములు వహింపరో వారే విశ్వాసులు).

conditions-of-laa-ilaaha-illallaah

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్‌ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ  లేడని మరియు నేను అల్లాహ్‌ ప్రవక్తనని సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు విషయాలతో (సాక్ష్యాలతో) అల్లాహ్‌ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 27).


3- ఖుబూల్‌ (సమ్మతించుట): ఈ పవిత్ర వచనం ద్వారా రుజువయ్యే విషయాలన్నిటినీ మనసావాచా సమ్మతించాలి. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపిన విషయాల్ని సత్యంగా నమ్మాలి. ఆయన తెచ్చిన ప్రతి దానిని విశ్వసించాలి, సమ్మతించాలి. అందులో ఏ ఒక్క దానిని విస్మరించకూడదు.

అల్లాహ్‌ ఇదే ఆదేశమిచ్చాడు:

آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

[ప్రవక్త తన ప్రభువు నుండి తనకు నొసంగబడిన గ్రంథమును విశ్వసించారు. విశ్వాసులు కూడా విశ్వసించారు. అందరు అల్లాహ్‌ను, అతని దూతలను, గ్రంథములను, ప్రవక్తలను విశ్వసిస్తూ ‘మేము ఆయన ప్రవక్తల మధ్య వ్యత్యాసము పాటించము, మేము వింటిమి విధేయులైతిమి, మా ప్రభువా! నీ మన్నింవును వేడుకొను చున్నాము, నీ వద్దకే మరలి వచ్చువారలము’ అని అంటారు]. (బఖర 2: 285).

ధర్మ శాసనాలను, హద్దులను ఆక్షేపించుట, లేక వాటిని నమ్మకపోవుట సమ్మతమునకు వ్యతిరేకం. ఉదాహరణకు: కొందరు దొంగ మరియు వ్యబిచారునిపై విధించిన హద్దులను లేక బహుభార్యత్వం, ఆస్తుల పంపకం లాంటి తదితర విషయాలను ఆక్షేపిస్తారు. (అయితే ఇలాంటి వారు అల్లాహ్‌ యొక్క ఈ ఆదేశం వినలేదా, చదవలేదా?)

وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَن يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ

(అల్లాహ్‌, ఆయన ప్రవక్త ఏ విషయములోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికి, విశ్వాసురాలైన ఏ స్త్రీకి, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీనుకునే హక్కు లేదు). (అహ్‌ జాబ్‌ 33: 36).


4- ఇన్‌ఖియాద్‌ (లొంగిపోవుట, శిరసావహించుట): పవిత్ర వచనం యొక్క అర్థభావాల పట్ల శిరసావహించాలి. ఇన్‌ ఖియాద్‌ మరియు ఖబూల్‌ లో తేడా ఏమనగా? ఖబూల్‌ అంటే నోటితో దాని భావాన్ని సమ్మతించుట. ఇన్‌ఖియాద్‌ అంటే సమ్మతంతో పాటు దాన్ని ఆచరణ రూపంలో తీసుకు వచ్చుట. ఒక వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్‌ అర్థభావాన్ని తెలుసుకొని, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దాన్ని సమ్మతించినప్పటికీ దానికి లొంగిపోయి, శిరసావహించి, దాని ప్రకారం ఆచరించకపోయినట్లైతే  అతను ఇన్‌ఖియాద్‌ యొక్క నిబంధన పాటించనట్లే.

అల్లాహ్‌ ఇలా సంభోదించాడు:

وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ

మీరు మీ ప్రభువు వైెవునుకు మరలి ఆయనకే విధేయత చూపండి. (జుమర్‌ 39: 54).

మరో చోట (నిసా 4: 65) లో ఇలా ఆదేశించాడు:

فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا

(నీ ప్రభువు సాక్షిగా! వారు తమలోని జగడముల తీర్పునకై నిన్ను న్యాయ నిర్ణేతగా మరియు నీవు చేయు తీర్పును గూర్చి వారుతమ మనున్సులో సంకట పడక సంతోషముతో అంగీకరించనంత వరకు వారు విశ్వాసులు కారు).


5- సిద్ఖ్ : (సత్యత): మనిషి తన విశ్వాసములో సత్యవంతుడై యుండాలి.

సూర తౌబా (9:119)లో అల్లాహ్‌ ఆదేశం:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ

(ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ కు భయపడండి. సత్యవంతులతో ఉండండి).

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారు:

conditions-of-laa-ilaaha-illallaah

“హృదయాంతర సత్యముతో ‘లాఇలాహ ఇల్లల్లాహ్‌’ పఠించినవారు స్వర్గంలో చేరుదురు”. (ముస్నద్ అహ్మద్ ).

ఎవరైనా ఈ పవిత్ర వచనం కేవలం నోటితో పలికి, దాని భావర్ధాలను మనస్ఫూర్తిగా నమ్మకుండా ఉన్నట్లయితే అతనికి ముక్తి ప్రాప్తించదు. అతడు కపట విశ్వాసులలో పరిగణించబడుతాడు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీసుకువచ్చిన వాటన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించడం కూడా సత్యతకు వ్యతిరేకంలోనే వస్తుంది. ఎందుకనగా మనము ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయులై ఉండాలని, ఆయన మాటల్ని సత్యంగా నమ్మాలని అల్లాహ్‌ ఆదేశించాడు, అంతే కాదు, ఆయన విధేయతను తన విధేయతతో కలిపి చెప్పాడు.

సూర నూర్‌ (24: 54)లో ఉంది:

 أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ

(అల్లాహ్‌ కు విధేయులు కండి, అల్లాహ్‌ ప్రవక్తకు విధేయులు కండి).


6- ఇఖ్లాస్‌: మనిషి తను చేసే ప్రతి పనిని సంకల్పపరంగా షిర్క్‌ దరిదాపులకు అతీతంగా ఉంచుటయే ఇఖ్లాస్‌, అంటే సర్వ పనులు, మాటలు కేవలం అల్లాహ్‌ సంతృప్తి కొరకు, ఆయన ప్రసన్నత పొందుటకే చేయాలి. అందులో ఏ మాత్రం ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ప్రాపంచిక లాభోద్దేశ్యం, స్వార్థం ఉండకూడదు. ఇంకా ఆ పని అల్లాహ్‌ యేతరుని ప్రేమలో, అల్లాహ్‌ మార్గానికి విరుద్ధంగా ధార్మిక లేదా తర వర్గాల పక్షంలో ఉండకూడదు. కేవలం అల్లాహ్‌ అభిష్టాన్ని మరియు పరలోక సాఫల్యాన్ని పొందుట కొరకే చేయాలి. ఎవరి నుండైనా ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలనుగానీ ఆశిస్తూ వారి వైపునకు మనుసు మరలకూడదు.

సూర జుమర్‌ (39: ౩)లో ఉంది:

أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ

(నిస్సందేహంగా, ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే) 

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ

(వారు అల్లాహ్‌కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆదేశించటం జరిగింది). (బయ్యిన 98: 5).

conditions-of-laa-ilaaha-illallaah

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఇత్బాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్‌ అభీష్టాన్ని పొందుటకు ‘లాఇలాహ ఇల్లల్లాహ్‌’ చదివిన వారిపై నిశ్చయంగా అల్లాహ్‌ నరకమును నిషేధించాడు“. (బుఖారి 425, మస్లిం 33).


7- ముహబ్బత్‌ (ప్రేమ): ఈ పవిత్ర వచనము మరియు దీనికి సంబంధించిన వాటి ప్రేమ.

ముస్లిం అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి, వారిద్దరి ప్రేమ అందరి ప్రేమకు మించియుండాలి. ప్రేమకు సంబంధించిన షరతులు వగైరా పూర్తిగా పాటించాలి. అల్లాహ్‌ను మరియు అల్లాహ్‌ ప్రేమించువాటిని గౌరవభావంతో, భయం మరియు ఆశలతో ప్రేమించాలి. ఉదా: స్థలాల్లో మక్కా, మదీన, మస్దిదులు. కాలాల్లో: రమజాను, జిల్‌ హిజ్జ మొదటిదశ వగైరా. మానవుల్లో: ప్రవక్తలు, దూతలు, సత్యవంతులు, అమరవీరులు, పుణ్యాత్ములు వగైరా. సత్కార్యాల్లో: నమాజు, జకాతు, ఉపవాసం (రోజా), హజ్జ్. వాచ సంబంధమైన: జిక్ర్ (అల్లాహ్‌ స్మరణ), ఖుర్‌ఆన్‌ పారాయణం వగైరాలు.

మనిషి అల్లాహ్‌ ప్రేమించువాటిని తన మనుసు, కోరికలు ప్రేమించే వాటిపై ఆధిక్యతివ్వాలి. ఇంకా అల్లాహ్‌ అసహ్యించుకునేవాటిని అసహ్యించుకోవాలి: అవిశ్వాసులను, అవిశ్వాసాన్ని, పాపాల్ని (అస్లీలతల్ని), అవిధేయతలను అసహ్యించుకోవాలి.

అల్లాహ్‌ ఆదేశం:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ

(ఓ విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలిగిపోతే, అల్లాహ్‌ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్‌ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్‌ మార్గంలో యుద్దం చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు). (మాఇద 5: 54).


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు:

 

 

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? – షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్

షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
2012 – 1433

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
ఇది షేఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉథైమిన్ (రహిమహుల్లాహ్) యొక్క ‘షర్హ్ హదీథ్ జిబ్రయీల్’ అనే అరబీ పుస్తకంలోని ఒక భాగం.

విషయసూచిక

1. మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ? అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ?
2.  సమాధి శిక్షలు మరియు దాని అనుగ్రహాలు : సమాధి శిక్షలు దేహానికా లేక ఆత్మకా ?
3.  పునరుత్థానం : మనిషి చనిపోయి ఉండవచ్చు, (అతని శరీరాన్ని) సింహం తినేసి ఉండవచ్చు. మరి అలాంటపుడు అతను తిరిగి ఎలా లేపబడతాడు ?
4. సూర్యుడు సృష్టికి అతి దగ్గరగా రావడం – అంతిమదినం నాడు సూర్యుడు, సృష్టికి ఒక మైలు దూరమంత దగ్గరికి రావడం ఎలా సాధ్యం ?
5. ప్రజల కర్మల పత్రం – ఈ లెక్క నుండి ఎవరైనా తప్పించుకోగలగుతారా ?
6. త్రాసు – త్రాసులో కర్మలు ఎలా తూచబడతాయి – అవి కర్తల లక్షణాలు మరియు పనుల రూపంలో ఉంటాయి కదా! – అక్కడ ఒకే త్రాసు ఉంటుందా లేక అనేక త్రాసులు ఉంటాయా ?
9. షఫా (విముక్తి, మోక్షం) – షఫా షరతులు
10.  పుల్ సిరాత్ (వంతెన)
11. స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం – స్వర్గం మరియు నరకం ఇపుడు ఉనికిలో ఉన్నాయా? – స్వర్గం మరియు నరకం శాశ్వతమా ?

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం

ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.

మానవ జీవితం వివిధ దశలలో ఉందా లేక అసలు దశలేమీ లేవా ?

“అల్లాహ్ పై విశ్వాసం” అంటే ఏమిటి ? – షేఖ్ ఇబ్నె ఉథైమీన్

 “అల్లాహ్ పై విశ్వాసం” అంటే ఏమిటి ?
షేఖ్ ఇబ్నె ఉథైమీన్

‘అల్లాహ్ పై నిజమైన విశ్వాసం చూపడం’ యొక్క అనేక శుభాల గురించి నేను చదివాను మరియు విన్నాను. స్పష్టంగా అర్థం చేసుకునేలా, చిత్తశుద్ధితో ఆచరించేలా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరుల పద్ధతికి భిన్నంగా ఉండే ప్రతి దాని నుండి నన్ను దూరంగా ఉంచేలా ‘అల్లాహ్ పై విశ్వాసం’ గురించి వివరించమని మిమ్ముల్ని వేడుకుంటున్నాను. 

అల్హందులిల్లాహ్.

‘అల్లాహ్ పై విశ్వాసం’ అంటే ఆయన ఉనికిని, ఆయన దైవత్వాన్ని, ఆయన శుభనామాలను మరియు దివ్యలక్షణాలను దృఢంగా విశ్వసించడం.

అల్లాహ్ పై విశ్వాసంలో నాలుగు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వీటిని విశ్వసిస్తారో, వారు నిజమైన విశ్వాసులు.

1 – అల్లాహ్ యొక్క ఉనికిని విశ్వసించడం. 

‘అల్లాహ్ యొక్క ఉనికి’ హేతుబద్ధంగా మరియు మానవ స్వభావసిద్ధంగా ధృవీకరించబడిన ఒక వాస్తవ విషయం. దీనిని షరిఅహ్ లో తెలుపబడిన అనేక వాస్తవాలు నిరూపిస్తున్నాయి.

(i)  అల్లాహ్ ఉనికిని నిరూపించే మానవ స్వాభావిక ఋజువు:

తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతి మానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరం లేక నేర్చుకోవలసిన అవసరం లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఫిత్రా (మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస) స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో చేసి వేస్తారు.”  [సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం.]

(ii) అల్లాహ్ ఉనికిని నిరూపించే హేతుబద్ధమైన ఋజువు:

భూత, భవిష్య మరియు వర్తమాన కాలాలలోని ఈ సృష్టితాలన్నీ తమను ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే అవి తమను తాము సృష్టించుకోలేవు లేదా ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాజాలవు.

అవి తమకు తాముగా ఉనికిలోనికి రావటం అసాధ్యం. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు: ఉనికి లోనికి రాక ముందు, అది సృష్టించబడనే లేదు. కాబట్టి, అదెలా తనను తాను సృష్టించుకోగలదు?! అలాగే, ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రావడం కూడా అసంభవమైనదే. ఎందుకంటే, ఏది సంభవించినా దానికొక కారణముంటుంది. అంతేగాక, ఈ సృష్టి అత్యాద్భుతమైన మరియు అత్యంత ఖచ్చితమైన విధంగా సృష్టించబడింది. మరియు ఇతర సృష్టితాల మధ్య ప్రతిదీ పొందికగా అమర్చబడింది. కారణానికి మరియు పర్యవసనానికి మధ్య దృఢమైన సంబంధం ఉంది. ఇవన్నీ నిరూపిస్తున్నది ఏమిటంటే ఈ సృష్టి ఏదో ఒక హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాలేదు. ఎందుకంటే ఏదైనా హఠాత్తుగా జరిగితే, దాని పర్యవసానం ఇంత ఖచ్ఛితంగా మరియు ఇంత పరిపూర్ణంగా ఉండదు. కాబట్టి ఇది అంత ఖచ్చితమైన సమతుల్యంలో ఎలా మిగిలి ఉంది?

ఒకవేళ ఇవి తమకు తాముగా సృష్టించుకోవడం లేక ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికి లోనికి రావడం జరగనట్లయితే, వీటిని ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉండి ఉండాలి. ఆయనే అల్లాహ్ – సకల లోకాల ప్రభువు.

అల్లాహ్ ఈ హేతుబద్ధమైన సాక్ష్యాన్ని మరియు తిరుగులేని ఋజువును సూరహ్ అత్తూర్ లో పేర్కొన్నాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం):

“ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా?” [అత్తూర్ 52:35]

అవి సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు. వాటికవే సృష్టించుకోవడమూ జరగలేదు. కాబట్టి, మహోన్నతుడైన అల్లాహ్ యే వాటి సృష్టికర్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అత్తూర్ పఠిస్తూ, ఈ ఆయతు వద్దకు వచ్చినపుడు, జుబైర్ ఇబ్నె ముతిమ్ దానిని విన్నాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం):

“ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా? లేదా భూమ్యాకాశాలను అవి సృష్టించాయా? లేదు, వారు దృఢమైన విశ్వాసం కలిగి లేరు. లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క భాండాగారాలేమైనా ఉన్నాయా? లేదా తమ ఇష్టానుసారం చేయగల అధికారం కలిగి ఉన్న నిరంకుశులా వారు? ”  [అత్తూర్ 52:35-37]

ఆ కాలంలో జుబైర్ అవిశ్వాసిగా జీవించేవాడు. ఖుర్ఆన్ వచనాలు విన్న తర్వాత అతడిలా పలికినాడు: “నా గుండె దాదాపు ఆగిపోయినట్లయింది. దైవవిశ్వాసం నా హృదయంలో ప్రవేశించిన మొట్టమొదటి క్షణమది.” సహీహ్ అల్ బుఖారీ.

మరింత స్పష్టంగా వివరించే ఒక ఉదాహరణ క్రింద పేర్కొంటున్నాము:

ఒక అందమైన రాజభవనం, దాని చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, వాటి మధ్య నదుల ప్రవాహం, సకల సౌకర్యాలు, అన్ని రకాల భోగభాగ్యాలతో కూడిన అలంకరణలు – ఇదంతా ఎవ్వరూ నిర్మించకుండా, హఠాత్తుగా దానికదే ఉనికిలోనికి వచ్చిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే, వెంటనే మీరు దానిని తిరస్కరిస్తారు, నోటి మీదే అది ఒక పచ్చి అబద్ధం అని చెప్పేస్తారు. మరియు అది ఒక మూర్ఖమైన మాటగా పరిగణిస్తారు. మరి, భూమ్యాకాశాలతో, నక్షత్రాలతో మరియు అత్యద్భుత, సవిశాల మరియు ఖచ్చితమైన సమతుల్యంతో కనబడుతున్న ఈ విశ్వం, దాని సృష్టికర్త ప్రమేయం లేకుండా దానికదే సృష్టించుకోవడం సాధ్యమా లేదా ఏదైనా హఠాత్పరిణామం వలన ఉనికిలోనికి రావడం సాధ్యమా?!

ఏడారిలో నివసించే ఒక పల్లెవాసి ఈ హేతుబద్ధమైన ఋజువును గ్రహించి, ఇతరులు అడిగిన ఈ ప్రశకు అతడు చాలా స్పష్టంగా బదులిచ్చిన ఈ సంభాషణను ఒకసారు పరిశీలిద్దాం. “నీ ప్రభువు గురించి నీవు ఎలా తెలుసుకోగలవు?” అతడి జవాబు: “ఒకవేళ ఒంటె పేడ నీకు కనబడితే, ఆ దారి గుండా ఏదో ఒక ఒంటె వెళ్ళిందని నీవు గ్రహిస్తావు. అలాగే ఒకవేళ మనిషి పాదాల గుర్తులు నీకు కనబడితే, ఆ దారి గుండా ఒక మనిషి వెళ్ళినట్లు నీవు గ్రహిస్తావు. మరి, నక్షత్రాలతో నిండిన ఈ ఆకాశం, పర్వత మార్గాలతో కూడిన ఈ భూమండలం మరియు ఎత్తైన అలలతో కూడిన ఈ సముద్రాలు – ఇవన్నీ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడి ఉనికిని నిరూపించడం లేదా?”

2 – అల్లాహ్ యొక్క సార్వభౌమత్వాన్ని విశ్వసించడం. 

అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ప్రభువు – ఆయనకు భాగస్వాములు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరు.

సృష్టించే, ఆధిపత్యం చెలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే ప్రభువు. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ యొక్క పలుకులు ఇలా పేర్కొనబడినాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“నిశ్చయంగా, ఈ సృష్టి మరియు శాసనం ఆయనదే”  [అల్ అరాఫ్ 7:54]

“ప్రకటించు(ఓ ముహమ్మద్): ‘భూమ్యాకాశాల నుండి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు? లేదా వినికిడి శక్తి మరియు దృష్టి ఎవరి అధీనంలో ఉన్నాయి? మరియు మరణించిన వారిని తిరిగి సజీవం చేసేది మరియు సజీవంగా ఉన్నవారిని మరణింపజేసేది ఎవరు? విశ్వవ్యవహారాలను నడిపేది ఎవరు?’ (అని ప్రశ్నిస్తే), వారు ‘అల్లాహ్’ అని బదులిస్తారు. అపుడు వారినిలా ప్రశ్నించు: ‘మరి మీకు అల్లాహ్ శిక్షల భయం లేదా (ఆయన ఆరాధనలలో భాగస్వాములను చేర్చినందుకు?’”  [యూనుస్ 10:31]

“భూమ్యాకాశాల మధ్య ఉన్న వాటి ప్రతి వ్యవహారాన్నీ ఆయనే నియంత్రిస్తాడు మరియు ఆయనే నడిపిస్తాడు; ప్రతిదీ ఆయన వైపుకే మరలుతుంది” [అస్సజదహ్ 32:5]

“ఆయనే అల్లాహ్, మీ ప్రభువు; విశ్వసామ్రాజ్యం ఆయనదే. ఆయనను వదిలి ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో, పిలుస్తున్నారో, అలాంటి వారు (విగ్రహాలు, అసత్యదైవాలు) ఖర్జురపు పండు పై నుండే పల్చటి దారం పోగుకు కూడా యజమానులు కారు.” [ఫాతిర్ 35:13]

సూరతుల్ ఫాతిహా లోని అల్లాహ్ పలుకులు (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“తీర్పుదినం (ప్రతిఫల దినం, అంతిమ దినం) యొక్క (ఏకైక) ప్రభువు [మాలికి యౌమిద్దీన్]” [అల్ ఫాతిహా 1:4]

మరో పద్ధతిలో ఇది మలికి యౌమిద్దీన్ అని పఠించబడుతుంది. ఒకవేళ మనం ఈ రెండు పఠనా పద్ధతులను జత చేస్తే, ఒక అద్భతమైన భావం మన ముందుకు వస్తుంది – మాలిక్ (యజమాని) కంటే మలిక్ (సార్వభౌముడు) ఎక్కువ శక్తి మరియు అధికారం కలిగి ఉంటాడు. అయితే ఒక్కోసారి పేరుకు మాత్రమే అతడు రాజుగా చెలామణీ అవుతాడు, రాజ్యవ్యవహారాలపై అతనికెలాంటి నియంత్రణా, ఆధిపత్యమూ ఉండదు. అలాంటి స్థితిలో అతడు కేవలం నామ మాత్రపు రాజే గాని యజమాని కాడు. అయితే, అల్లాహ్ సార్వభౌముడు మరియు యజమాని కూడా అయి ఉండటం వలన, ఆయన యొక్క సార్వభౌమత్వం మరియు విశ్వవ్యవహారాలన్నింటిపై ఆయన యొక్క సాటి లేని నియంత్రణను ఇది ధృవీకరిస్తున్నది.

3 – అల్లాహ్ యొక్క ఏక దైవత్వాన్ని విశ్వసించడం 

i.e., కేవటం అల్లాహ్ మాత్రమే నిజమైన ఏకైక ఆరాధ్యుడు, ఆయనకెవరూ సాటి లేరు మరియు ఆయనకెవరూ భాగస్వాములు లేరు.

అల్ ఇలాహ్ అంటే ప్రేమించబడేవాడు. ప్రేమ మరియు గౌరవాభిమానాలతో ఆరాధించబడేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప. అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“మరియు మీ ఆరాధ్యుడు – ఒక్కడే. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. అనంత కరుణా మయుడు మరియు అపార కృపాశీలుడు” [అల్ బఖరహ్ 2:163]

“ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు అనడానికి అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు, దైవదూతలు మరియు జ్ఞానం కలిగిన వారు కూడా. ఆయనే తన సృష్టిని న్యాయంగా నడుపుతున్నాడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడూను.” [ఆలె ఇమ్రాన్ 3:18]

అల్లాహ్ ను వదిలి, ఆరాధించే ప్రతి దాని యొక్క దైవత్వం అసత్యమైనదే. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“ఎందుకంటే అల్లాహ్ మాత్రమే సత్యం. ఆయనతో పాటు (లేక ఆయనను వదిలి) వారు ఆరాధిస్తున్న వన్నీ అసత్యమైనవే. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, ఘనమైన వాడూను.” [అల్ హజ్  22:62]

దేవుడిగా పిలవబడినంత మాత్రాన వాటికి దైవత్వం చేకూర్చదు. దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“అవన్నీ మీరూ మరియు మీ తాతముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఎలాంటి దైవత్వాన్నీ అల్లాహ్ వాటికి ప్రసాదించలేదు” [అల్ నజమ్ 53:23]

యూసుఫ్ అలైహిస్సలాం జైలులో ఉంచబడినపుడు, అక్కడి రక్షకభటుడితో ఇలా పలికినట్లు అల్లాహ్ మనకు తెలిపినాడు (ఖుర్ఆన్ ఆయతు యొక్క తెలుగు భావానువాదం:

“అనేక మంది దేవుళ్ళు ఉండటం మంచిదా లేక ఏకైకుడు మరియు తిరుగులేని వాడైన ఒక్క అల్లాహ్ మాత్రమే ఉండటం మంచిదా? ఆయనను తప్ప ఇంకెవ్వరినీ ఆరాధించవద్దు. ఆయనను వదిలి నీవూ మరియు నీ తల్లిదండ్రులు కొలుస్తున్న దేవుళ్ళ పేర్లకు అల్లాహ్ ఎలాంటి దైవత్వాన్నీ ప్రసాదించలేదు.” [12:39-40]

అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు. ఆయన హక్కులో ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యమూ లేదు – ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత అయినా, ప్రజలను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు పిలవటానికి ఆయన పంపిన ఏ ప్రవక్త అయినా. ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం:

“’లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు సందేశహరుడిని తప్ప, మేము మరే సందేశహరుడినీ నీకు పూర్వం పంపలేదు. కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించు” [అల్ అంబియా 21:35]

“నిశ్చయంగా మేము ప్రతి సమాజంలో ఒక సందేశహరుడిని (ఇలా పిలిచేందుకు) పంపాము: “అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, తాగూత్ (అసత్యదేవుళ్ళ) లకు దూరంగా ఉండండి.” [అన్నహల్ 16:36]

అయితే, బహుదైవారాధకులు ఈ పిలుపును తిరస్కరించి, అల్లాహ్ తో పాటు ఆరాధించడానికి, వేడుకోవడానికి మరియు అర్థించడానికి ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు.

4 – అల్లాహ్ యొక్క దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను విశ్వసించడం. 

i.e., తన దివ్యగ్రంథంలో మరియు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో (సున్నతులలో) స్వయంగా అల్లాహ్ ధృవీకరించిన తన యొక్క దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను ఆయన ఔన్నత్యానికి సరిపోయేటట్లుగా, ఆయనకు ప్రయోజనం కలిగేటట్లుగా, వాటి భావాలలో ఎలాంటి మార్పులు – చేర్పులు చేయకుండా, వాటిని సృష్టితాలతో పోల్చుతూ రకరకాల ప్రశ్నలు వేయకుండా మనం కూడా ధృవీకరించడం. ఖుర్ఆన్ ఆయతు యొక్క భావానువాదం:

“అత్యున్నతమైన నామాలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. కాబట్టి వాటి ద్వారా ఆయనను వేడుకోండి. ఆయన దివ్యనామాలను తిరస్కరించే వారిని, నమ్మని వారిని విడిచి పెట్టండి. వారు చేస్తున్న దానికి తగిన ప్రతిఫలం పొందుతారు.” [అల్ అరాఫ్ 7:180]

ఈ వచనం సూచిస్తున్నదేమిటంటే, అల్లాహ్ యొక్క నామాలు అత్యన్నతమైన దివ్యనామాలు.

మరియు అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు. (ఖుర్ఆన్ వచనం యొక్క తెలుగు భావానువాదం):

“భూమ్యాకాశాలలో ఆయన ప్రస్తావనయే అత్యున్నతమైన ప్రస్తావన. ఆయన మహోన్నతుడు, అత్యంత వివేకవంతుడు” [అర్రూమ్ 30:27]

పరిపూర్ణత్వపు లక్షణాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందునని ఈ వచనం సూచిస్తున్నది, ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని సూచించే లక్షణమే “మహోన్నతమైన లక్షణం”. ఈ రెండు వచనాలు సూచిస్తున్నదేమిటంటే, అత్యంత ఉన్నతమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు సాధారణంగా అల్లాహ్ కు మాత్రమే చెందును. ఖుర్ఆన్ మరియు సున్నతులలో దీనిని వివరంగా తెలిపే సమాయారం చాలా ఎక్కువ మోతాదులో ఉంది.

జ్ఞానం యొక్క ఈ విభాగం అంటే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను వివరించే జ్ఞానం గురించి సమాజంలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇది చాలా వివాదాస్పదమైన విభాగం. దీని విషయంలో సమాజం అనేక వర్గాలుగా విడిపోయింది.

దీని గురించి అల్లాహ్ పంపిన ఈ ఆదేశాలను తు.చ. తప్పక శిరసావహిచాలనేది మా అభిప్రాయం.  (ఖుర్ఆన్ ఆయతు యొక్క భావానువాదం) :

“ఏదైనా విషయం గురించి మీలో మీకు భేదాభిప్రాయాలు వస్తే, దానిని అల్లాహ్ మరియు ఆయన యొక్క సందేశహరుడి వైపుకు మరలండి – ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే వారే అయితే.” [అన్నిసాఅ 4:59]

మనం ఈ భేదాబిప్రాయాన్ని కూడా అల్లాహ్ యొక్క అంతిమ గ్రంథం మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకే మరలిద్దాం – సన్మార్గంలో నడిచిన సలఫ్ (ముందుతరం), సహాబాలు, తాబయీన్ ల నడిచిన మరియు ఈ ఖురఆన్ ఆయతులు మరియు హదీథులు అర్థం చేసుకున్న విధానం నుండే మనం కూడా ఉత్తమ మార్గదర్శకత్వాన్ని అన్వేషిస్తూ. ఎందుకంటే ఈ సమాజంలో వారు అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సంబంధించిన విషయాలలో అత్యుత్తమ జ్ఞానవంతులు. సహాబాల గురించి వివరిస్తూ, అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రదియల్లాహు అన్హు తన సత్యవాక్కులను ఇలా తెలిపారు: “ఎవరైనా సన్మార్గాన్ని అనుసరించాలనుకుంటే, (తమ జీవితాంతం సన్మార్గంపై నడుస్తూ) మరణించిన సజ్జనుల మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే ప్రస్తుతం జీవించి ఉన్న సజ్జనుల విషయంలో చివరి క్షణం లోపల వారు సన్మార్గాన్ని వదిలి పెట్టరనే గ్యారంటీ ఏదీ లేదు. సహాబాలు ఎంత గొప్ప వారంటే, వారి హృదయాలు మన సమాజంలో మిగిలిన వారందరి కంటే అతి స్వచ్ఛమైనవి, లోతైన అవగాహనను కలిగి ఉండినవి,  ఆడంబరాలకు దూరంగా ఉండినవి, అతి తక్కువ క్లిష్టమైనవి. అంతేగాక అల్లాహ్ వారిని తన ధర్మ స్థాపన కొరకు మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సహచరులుగా ఉండుట కొరకు ఎంచుకున్నాడు. కాబట్టి వారి హక్కును మనం తప్పక గుర్తించాలి. మనం వారి మార్గదర్శకత్వాన్ని తప్పక స్వీకరించాలి. ఎందుకంటే వారు నిజమైన మార్గదర్శకత్వాన్ని అనుసరించారు.” ఎవరైతే ఈ విషయంలో సలఫ్ మార్గాన్ని వదిలి, వేరే మార్గాన్ని అవలంబిస్తారో, వారు తప్పు చేసినట్లే మరియు తప్పుడు దారిని అవలంబించినట్లే. అంతేగాక విశ్వాసుల (మోమిన్ల) మార్గాన్ని వదిలి, వేరే మార్గంపై నడుస్తున్న వారవుతారు. అలాంటి వారిని అల్లాహ్ ఇలా హెచ్చరిస్తున్నాడు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):

“స్పష్టంగా సన్మార్గం చూపబడిన తర్వాత ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరుడితో విభేదిస్తారో, వారు విశ్వాసుల మార్గాన్ని కాకుండా వేరే మార్గంలో నడుస్తున్నట్లే. వారు ఎంచుకున్న (తప్పుడు) మార్గంలోనే మేము వారిని ముందుకు పోనిస్తాము మరియు నరకంలో శిక్షిస్తాము – ఎంత చెడు గమ్యం వారిది!” [అన్నిసాఅ 4:115]

సరైన మార్గదర్శకత్వాన్ని పొందాలంటే, సహాబాలు విశ్వసించినదే మనం కూడా తప్పకుండా విశ్వసించాలని అల్లాహ్ ఈ ఆయతులో స్పష్టంగా నిర్దేశిస్తున్నాడు. (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం):

“కాబట్టి మీరు (సహాబాలు) విశ్వసిస్తున్నట్లుగా ఒకవేళ వారు కూడా విశ్వసిస్తే, వారు సన్మార్గంపై ఉన్నట్లే” [అల్ బఖరహ్ 2:137]

ఎవరైతే సలఫ్ మార్గం నుండి దూరమవుతారో మరియు దాన్ని వదిలి వేరే మార్గాన్ని అవలంబిస్తారో అలాటి ప్రతి ఒక్కరూ సరైన మార్గదర్శకత్వాన్ని పొందే అవకాశం జారవిడుచుకున్న వారవుతారు మరియు దిక్కులేని వారవుతారు.

దీని ఆధారంగా, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాల విషయంలో దేనినైతే స్వయగా అల్లాహ్ యే ధృవీకరించాడో మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించారో, దానినే మనం అనుసరించాలి. ఖుర్ఆన్ మరియు సున్నతులను మనం ఆధారంగా తీసుకోవాలి, సహాబాలు వాటిని నమ్మినట్లుగా మనం కూడా నమ్మాలి. ఎందుకంటే ఈ విషయంలో వారు మన సమాజంలో అందరి కంటే ఎక్కువ జ్ఞానం మరియు ఉత్తమ జ్ఞానం కలిగి ఉండినారు.

అయితే మనం క్రింది నాలుగు విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా వీటిలో ఏ ఒక్క దానిని అనుసరించినా, అలాంటి వారు తమకు ఆదేశించబడిన దానిని శిరసావహించకుండా, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలపై తగిన విధంగా నిజమైన విశ్వాసం పొందని వారవుతారు. వీటికి దూరంగా ఉండకుండా, ఎవరైనా సరే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించలేరు. ఈ నాలుగు: తహ్రీఫ్ (మార్పుచేర్పులు), తఆతీల్ (తిరస్కారం), తమ్హీల్ (అల్లాహ్ ను సృష్టితాలతో పోల్చడం) మరియు తకైఫ్ (ఎందుకు, ఎలా అని చర్చించడం).

కాబట్టి, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించడమంటే “తన దివ్యగ్రంథంలో మరియు తన ప్రవక్త యొక్క సున్నతులలో అల్లాహ్ స్వయంగా ధృవీకరించిన తన దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను వాటి భావార్థాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా, తిరస్కరించకుండా లేదా ఎందుకు, ఎలా అని ప్రశ్నించకుండా లేదా వాటిని సృష్టితో పోల్చకుండా ఆయన స్థాయికి తగినట్లు మనం కూడా వాటిని యథాతథంగా ధృవీకరించడం.”

మనం దూరంగా ఉంచవలసిన ఈ నాలుగు విషయాల గురించి క్లుప్తంగా ఇక్కడ చర్చించుకుందాము:

(i) తహ్రీఫ్ (మార్పులు – చేర్పులు చేయడం) 

అంటే, ‘అత్యుత్తమమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును’ అనే వాస్తవ భావార్థానికి భిన్నంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆమోదయోగ్యం కాని విధంగా ఖుర్ఆన్ ఆయతుల మరియు సున్నతు వచనాల భావార్థాలలో మార్పులు – చేర్పులు చేయడం.

ఉదాహరణకు:

అనేక ఆయతులలో వచ్చిన ‘అల్లాహ్ చేయి’ అనే పదం యొక్క భావార్థాన్ని వారు ఆయన యొక్క అనుగ్రహాలను లేదా శక్తిని సూచిస్తుందని మార్చడం.

(ii) తఆతీల్ (తిరస్కరించడం) 

అంటే అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరిస్తూ, అవన్నీ అల్లాహ్ కు చెందవని లేదా వాటిలో కొన్ని అల్లాహ్ కు చెందవని చెప్పడం.

ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొనబడిన అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరించే ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను నిజంగా నమ్మనట్లే.

(iii) తమ్హీల్ (అల్లాహ్ ను ఆయన యొక్క సృష్టితాలతో పోల్చడం) 

అంటే, అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడం. ఉదాహరణకు, అల్లాహ్ చేయి కూడా మానవుడి చేతి లాంటిదే అనడం, అల్లాహ్ యొక్క వినికిడి శక్తి కూడా మానవుడి వినికిడి శక్తి లాంటిదే అనడం, అల్లాహ్ తన అర్ష్ పై అధిష్టించడం అంటే మానవుడు ఒక కుర్చీ పై కూర్చోవడం లాంటిదని చెప్పడం …. మొదలైనవి. నిస్సందేహంగా, అల్లాహ్ యొక్క దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడమనేది చాలా తప్పు మరియు ఒక పచ్చి అబద్ధం వంటిది. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయతులు ఇలా ఉన్నాయి, (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“ఆయనను పోలినదేదీ లేదు, మరియు ఆయన సర్వం వినేవాడూ, చూసేవాడూను.” [అష్షూరా 42:11]

(iv) తకైఫ్ (ఎలా సంభవమని చర్చించడం) 

అంటే, ఎవరైనా ఒక వ్యక్తి పరిమితమైన తన ఊహలకు లేక ఆలోచనలకు మాటల రూపాన్నిస్తూ, అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను ఎలా సాధ్యం అనే విషయం పై చర్చించడం.

ఖచ్చితంగా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. మానవుడికి వాటి గురించి తెలీదు. దీని గురించి అల్లాహ్ యొక్క ఆయతులు ఇలా ఉన్నాయి (ఖుర్ఆన్ ఆయతుల తెలుగు భావానువాదం):

“కానీ, ఆయన జ్ఞానంలో నుండి దేనినీ వారేనాడూ ఆవరించలేరు” [తాహా 20:110]

ఎవరైనా ఈ నాలుగు విషయాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారు నిజంగా అల్లాహ్ ను విశ్వసించనట్లే.

మన అంతిమ ఘడియ వరకు సన్మారంలోనే నిలకడగా నడుపమని మనం అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

మరియు అల్లాహ్ యే సమస్త విషయాలు ఎరుగును.

రిఫరెన్స్ : రిసాలత్ షరహ్ ఉసూల్ అల్ ఈమాన్ – షేఖ్ ఇబ్నె ఉథైమీన్.
అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్
రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

ఇస్లాం మూల సూత్రాలు (ఉసూల్ అత్ తలాత & ఖవాఇద్ అల్ ఆర్బా)

usool-thalatha-qawaid-alarba


త్రిసూత్రాలు మరియు షిర్క్ నాలుగు సూత్రాలు

మూలం: షేఖుల్ ఇస్లాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహమతుల్లా అలై)
అనువాదకులు: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
పుస్తకం నుండి:ఇస్లాం మూల సూత్రాలు (హదీసు పబ్లికేషన్స్)

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
[32 పేజీలు] [PDF][మొబైల్ ఫ్రెండ్లీ]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/usool-thalatha-qawaid-al-arba-mobile-friendly.pdf

బలవంతుడైన విశ్వాసి – బలహీనుడైన విశ్వాసి (Strong Believer – Weak Believer)

strong-believer-weak-believer-telugu-islam

పుస్తకం నుండి:  కలామే హిక్మత్ – 1(వివేక వచనం)
రచన: సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు: జమీ అతే అహ్ లె హదీస్, ఆంధ్రప్రదేశ్

 [ఇక్కడ చదవండి / PDF డౌన్ లోడ్ చేసుకోండి]

అంతిమ దైవప్రవక్త ప్రవచించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసికంటే మేలైనవాడు. ఇంకా – అతను-అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు. ఇంకా, ప్రతివాని లోనూ మంచి ఉంటుంది. మీ కొరకుప్రయోజనకరమయిన వాటిని ఆశించండి. ఇంకా, దైవ సహాయం కోరండి, నిస్పృహకులోనవబాకండి. మీకు ఏదయినా బాధ కలిగితే, ‘ఒకవేళ నేను అలాచేసి ఉంటేఇలా జరిగేది’ అని అనబాకండి. దానికి బదులు, ‘ఇది అల్లాహ్ నిర్ణయించిన విధి.ఆయన తలచినదే అయింది’ అని అనండి. ఎందుకంటే, ‘ఒకవేళ అలా జరిగిఉంటే…..’ (అనే ఊహాగానాలు) షైతాన్ మార్గాన్ని తెరచివేస్తాయి.’ (ముస్లిం)

ఈ హదీసులో దైవప్రవక్త (సఅసం) మూడు ముఖ్య విషయాలను ప్రబోధించారు :

“ఇక్కడ బలం అంటే అన్ని రకాల బలం అని భావం. ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు – “ఇక్కడ బలం అంటే మనో నిబ్బరం కలిగి ఉండి, పరలోక విషయాలలో ముందంజ వేయడం అని భావం. ఈ గుణాలున్న వ్యక్తి ధర్మ పోరాటంలో అందరికంటే ముందుకు పోయి శత్రువుపై దాడి జరుపుతాడు.అందరికంటే ముందు దైవాన్వేషణలో మునుముందు ఉంటాడు, మంచిని పెంచడంలో, చెడులను నిర్మూలించడంలో, సహనం వహించటంలో వజ్ర సంకల్పుడై ఉంటాడు. దైవ మార్గంలో ఎన్ని ఆపదలు ఎదురైనా ఓరిమిని ప్రదర్శిస్తాడు. నమాజ్, రోజా, జకాత్ తదితర ఆరాధనలకై, ఇంకా వాటి రక్షణకై అందరికంటే ఎక్కువగా చురుకుదనం కలిగి ఉంటాడు.”

శారీరక బలం లేదా శరీర దారుఢ్యం కూడా దైవానుగ్రహమే. హజ్రత్ దావూద్ (అలైహిస్సలాం) గురించి చెబుతూ అల్లాహ్ ఇలా అన్నాడు:

“అల్లాహ్ ఆయనకు బుద్ధిబలాన్ని, కండబలాన్ని సమృద్ధిగా ప్రసాదించాడు.” (అల్ బఖర : 247)

జ్ఞానశక్తి కూడా మహదానుగ్రహమే. తన అంతిమ గ్రంథంలో సర్వోన్నతప్రభువు ఏమన్నాడో చూడండి –

“మీరు (వారితో) అనండి, జ్ఞానులు, అజ్ఞానులు ఇద్దరూ ఒకటేనా? కేవలం బుద్ధిమంతులే హితబోధను స్వీకరిస్తారు.” (అజ్జుమర్ : 9)

ధనబలం కూడా దైవప్రసాదితమైన వరమే. అల్లాహ్ సెలవిచ్చాడు :

‘ఇంకా చూడండి. అల్లాహ్ మీలో కొందరికి కొందరికంటే ఉపాధివిషయంలో ఆధిక్యత ప్రసాదించాడు. అయితే ఎవరికయితే ఈ ఆధిక్యతఇవ్వబడిందో, వారు తమ ఉపాధిని తమ బానిసల వైపునకు మళ్ళించేవారు కాదు. ఇద్దరూ ఈ ఉపాధిలో సమానమైన భాగస్థులు అయ్యేందుకు.అయితే అల్లాహ్ ఉపకారాన్నే ఒప్పుకోవటానికి వీరు తిరస్కరిస్తున్నారా?” (అన్ నహ్ల్ – 71)

ఒక మనిషికి రెండో మనిషిపై ఆధిక్యతను ఇచ్చే, ఇంకా అతని వ్యవహారాలలో సరళతను సృష్టించే ప్రతిదీ బలంగానే పరిగణించ బడుతుంది. అటువంటి బలం గనక దైవ విధేయతలో, దైవ ప్రసన్నతను పొందే పనుల్లో వినియోగమైతే అది ఎంతో ప్రశంసనీయమైన దవుతుంది. ఈమాన్ (విశ్వాసం) అనేది ఎలాంటి ప్రేరణంటే అది మనిషి శక్తి సామర్థ్యాలు సరైన మార్గంలో వ్యయమయ్యేలా చేస్తుంది. తద్వారా మేలును, శుభాన్ని కలిగిస్తుంది. అందుకనే, “బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా మేలైనవాడు, అల్లాహ్ కు ప్రీతిపాత్రుడు” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు.

(2). “ప్రతి వానిలోనూ మంచి ఉంది.”

అంటే విశ్వాసి బలవంతుడైనా, బలహీనుడైనా అతను మంచివాడే. ఎందుకంటేఅతనిలో విశ్వాసం ఉంది. విశ్వాసం స్వతహాగా బలమైనది. అన్ని రకాల శక్తులు క్షీణించినా కనీసం విశ్వాస బలమైతే ఉండనే ఉంటుంది. కనుక ఏ విశ్వాసినైనా హీనుడుగా, అల్పుడుగా పరిగణించడం సమ్మతం కాదు.

(3). “మీ కొరకు మేలైన వాటిని ఆశించండి.”

ఇక్కడ ఆశించడమంటే భావం ప్రయత్నించడం, దానికోసం శక్తియుక్తులన్నీ ఒడ్డటం.ప్రాపంచికంగా నయినా, పారలౌకికంగా నైనా శ్రేయస్కరమైన ప్రతిదాన్నీ పొందమని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించారు. విశ్వాసి ప్రతి మంచినీ పొందే ప్రయత్నంలో ఉంటాడు. ఎందుకంటే అతను తన ప్రభువు అనుగ్రహానికి అతీతుడు కాలేడు. అల్లాహ్ సెలవిచ్చాడు:

“(ఓ ప్రవక్తా! అనండి) నాకే గనక అగోచరాల జ్ఞానం ఉండి ఉంటే,ప్రయోజనకరమైన వాటిని నేను పుష్కలంగా పొందేవాడిని. నాకు నష్టమే వాటిల్లేది కాదు.”(అల్ ఆరాఫ్ – 188)

  1. “దైవ సహాయం అడగండి”

లాభదాయకమైన వాటిని పొందమని ఆదేశించిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం),’లాభకరమైన వస్తువు దైవ ప్రమేయంతోనే ప్రాప్తిస్తుంద’ని కూడా చెప్పారు. అందుకే లక్ష్య సాధన కొరకు దైవ సహాయాన్నే వేడుకోవాలి. ప్రతి మేలు, ప్రతి సహాయంఆయన అనుగ్రహంతోనే లభిస్తుంది. అల్లాహ్ తలచనంతవరకూ ఏ కారణాలూఏమీ చేయలేవు. ఎందుకంటే కారణాలను పర్యవసానాలను సృష్టించిన వాడు అల్లాహ్ యే గనక. ధర్మసమ్మతమైన కోర్కెల సాధనకై విశ్వాసి ధర్మ సమ్మతమైనఒనరులనే వినియోగిస్తాడు. అయితే నమ్మకం మాత్రం లాభనష్టాలను చేకూర్చగలశక్తిని కలిగిఉన్న దైవంపై పెట్టుకుంటాడు.

  1. “నిస్పృహకు లోనవబాకండి”

అంటే దైవవిధేయతలో, దైవ సహాయం కోరే విషయంలో అలసత్వం, బద్దకంపనికిరావు. దానికి బదులు దైవాన్ని ఆశతో వేడుకోవాలి. వేడుకోవటంతో పాటు’సాధన’ చేయాలి. దైవానుగ్రహాలను పొందే విషయంలో మందకొడిగా ఉండటం, విముఖతను చూపటం ఎంతకీ మంచిది కాదు. అలా చేస్తే దైవానుగ్రహాలనుఆక్షేపించినట్లవుతుంది. విశ్వసించిన వ్యక్తి దైవానుగ్రహాలను ఎన్నడూ ఆక్షేపించడు.

  1. మీకేదయినా బాధ కలిగినపుడు, ‘మేము గనక అలాచేసి ఉంటే ఇలా జరిగిఉండేది’ అని అనటం ఎంతమాత్రం భావ్యం కాదు.

విశ్వాసి సమస్త ప్రయత్నాలను చేసిన తరువాత కూడా అనుకున్నది నెరవేరకపోతే,దాని నష్టం నుండి బయటపడకపోతే, అప్పుడు దైవ నిర్ణయానికి రాజీపడిపోవాలి.దైవచిత్తం కాని దాన్ని సాధించలేనని తెలుసుకోవాలి. ఫలానా కారణంగా ఈ పనికాలేదని నిందమోపటం, లేదా ఒకవేళ ఆ చర్య గైకొని ఉంటే అది నెరవేరేది అనికాకి లెక్కలు వేయటం మోమిన్ (విశ్వాసి) స్థాయికి ఎంతమాత్రం తగదు.

  1. ఈ హదీసులో “ఒకవేళ” అనే పదం ఉపయోగించరాదని చెప్పబడింది. అయితే కొన్ని ఇతర హదీసుల్లో ఈ “పదం” వాడినట్లు కూడా ఉంది. అంతిమ హజ్సందర్భంగా మహాప్రవక్త (సఅసం), ‘ఒకవేళ ఇప్పుడు నా దృష్టికి వచ్చిన విషయం ముందే తెలిసి ఉంటే ఖుర్బానీ పశువుల్ని తెచ్చేవాడ్ని కాను’ అని అన్నారు. అలాగేదివ్య ఖుర్ఆన్,

“ఒకవేళ నాకే గనక అగోచర విషయజ్ఞానం ఉంటే ప్రయోజనకరమైనవాటినెన్నో పొందేవాడిని, నాకు కష్టనష్టాలే రాకుండా ఉండేవి (అని ఓప్రవక్తా వారితో చెప్పివేయండి)” అని అనబడింది.

దీని భావం ఏమంటే భవిష్యత్తులో ఏదైనా మంచి పని చేయాలన్న సంకల్పం ఉంటే, ఉదాహరణకు, ‘ఒకవేళ వచ్చే సంవత్సరం దాకా నేను బ్రతికి వుంటే హజ్ చేస్తాను’ అనవచ్చు. అందులో తప్పులేదు. లేదా గత జీవితంలో దైవవిధేయత విషయంలో జరిగిన లోటుపాట్లను తల్చుకుని సిగ్గుపడుతూ, ‘ఒకవేళ నేను నమాజ్ను క్రమం తప్పకుండా చేసివుంటే ఎంత బాగుండేది!’ అని అనవచ్చు. ఇంకా, అల్లాహు అయిష్టం కాని రీతిలో ఏదన్నా వాక్యం పలికినా దోషం లేదు. ఉదాహరణకు హిజ్రత్సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రజిఅన్) సూర్ గుహలో, ఓ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)!బహు దైవారాధకులలో ఎవరయినా తల ఎత్తాడంటే చాలు, మిమ్మల్ని చూసేస్తాడు”అని అన్నారు.

అయితే గతంలో జరిగిపోయిన నష్టాన్ని తలచుకుని ‘అరె అలా చేసే బదులు ఇలాచేసి ఉంటే లాభదాయకంగా ఉండేదేమో!’ అని మాత్రం అనకూడదు. అలా అనటం వల్ల దైవంపై నమ్మకం సడలి పోయిన భావం వ్యక్తమవుతుంది. ఉదాహరణకు,“నేను ఫలానా వస్తువు తిని ఉంటే స్వస్థత చేకూరేదేమో” అని అనడం విశ్వాసరాహిత్యానికి ఆనవాలుగా ఉంటుంది.

ఈ హదీసులో ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. మొదటి విషయమేమంటే విశ్వాసులలో ఒకటికి రెండు కోవలకు చెందిన వారుంటారు. అయితే వారిలోనిబలవంతుడంటే అల్లాహ్ కు ఇష్టం. ఎందుకంటే దైవాజ్ఞాపాలనలో అతను తన బలాన్నిశక్తిని ధారపోస్తాడు. బలహీనుడైన విశ్వాసికన్నా సక్రమంగా ఎక్కువగా దైవాన్నిసేవిస్తాడు. అందుకే బలాన్ని, శక్తిని పొందడానికి ప్రయత్నించమని దైవప్రవక్త నొక్కిపలికారు. ఎందుకంటే ప్రతిదీ ప్రయత్నం ద్వారానే హస్తగతమవుతుంది. అలసత్వం సోమరితనాలవల్ల ఏదీ ప్రాప్తించదు. సోమరితనం, బద్దకాలను దూరంచేసి ధర్మసమ్మతమయిన ఒనరులను వినియోగించుకోవాలని చెప్పబడింది.

అయితే ఒక విశ్వాసి ప్రత్యేకత ఏమంటే అతని మనసు ఎంతసేపటికీ భౌతికవనరుల పైకాక, దైవ ప్రోద్బలంపై ఆధారపడి ఉంటుంది. మనిషి ఎన్ని ఒనరుల్నిసమకూర్చుకున్నా, ఎన్ని జాగ్రత్తలు గైకొన్నా నిర్ణీత లక్ష్యం నెరవేరి తీరుతుందన్ననమ్మకం లేదు. మనిషి విఫలుడవటం సంభవమే. ఒక్కోసారి అతను నిర్ణయించుకున్నలక్ష్యాన్ని అందుకోకపోవటంలోనే అతని శ్రేయస్సు ఇమిడి ఉండవచ్చు. ఎందులోఏం మేలుందో దైవానికే తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వాసి నిరాశకుగురికాకుండా తన ప్రభువేచ్ఛతో రాజీపడిపోతాడు. విధిని విదిలించే, ఒనరులనుతప్పుపట్టే బదులు ‘దైవచిత్తం ఇలా ఉంది కాబోలు. కనుక ఇది నాకు ఆమోదమే’అని అంటాడు. అలాగే అతని ఆంతర్యం ఈర్ష్య, అసూయ, కపటత్వం, ద్వేషంవంటి నకారాత్మక భావనల నుడి, తుచ్ఛమైన భావాల నుండి సురక్షితంగా ఉంటుంది.ఇంకా అతని ఆంతర్యంపై దైవ కారుణ్యం ప్రశాంతత అవతరిస్తాయి.

అల్ కుఫ్ర్ – అవిశ్వాసం (Kufr-Disbelief) – ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ

sad-tree-kufrరచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: అల్ కుఫ్ర్ అంటే అవిశ్వాసం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

అవిశ్వాసం (అల్ కుఫ్ర్)  – الـْــكُــفْــرْ 

అవిశ్వాసం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు

అవిశ్వాసం అంటే ప్రధానంగా ఇస్లాం ధర్మంలోని విశ్వాసపు మూలస్థంభము (అర్కానె ఈమాన్) లలో ఏ మూలస్థంభాన్ని అయినా విశ్వసించక పోవటం.

విశ్వాసపు మూలస్థంభములు (అర్కానె ఈమాన్) ఆరు : అవి

  1. అల్లాహ్ పై విశ్వాసం ఉంచటం,
  2. అల్లాహ్ యొక్క దైవదూతల పై విశ్వాసం ఉంచటం,
  3. అల్లాహ్ యొక్క సందేశహరుల పై విశ్వాసం ఉంచటం,
  4. అల్లాహ్ అవతరింపజేసిన దివ్యగ్రంథాల పై విశ్వాసం ఉంచటం,
  5. పునరుజ్జీవన దినం (తిరిగి లేపబడే తీర్పుదినం) పై విశ్వాసం ఉంచటం,
  6. అల్ ఖదర్ పై విశ్వాసం ఉంచటం – సర్వలోక సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడు (అల్లాహ్) మానవుల జాతకాలను ముందుగానే నిర్దేశించాడని నమ్మటం, దేనినైతే ఆయన ముందుగానే నిర్దేశించి ఉన్నాడో, మన జీవితంలో అది తప్పక అంటే నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుందని విశ్వసించటం.

ఈ అవిశ్వాసం రెండు రకాలు: –

  1. ఘోరమైన అవిశ్వాసం
  2. అల్పమైన అవిశ్వాలం

1) ఘోరమైన అవిశ్వాసం (అల్ కుఫ్ర్ అల్ అక్బర్): ఈ విధమైన అవిశ్వాసం ఇస్లాం నుండి పూర్తిగా బహిష్కరింపజేస్తుంది.  దీనిలో ఐదు రకాలు ఉన్నాయి.:

  • తిరస్కారపు అవిశ్వాసం – కుఫ్ర్ అత్తఖాదిబ్: దివ్యమైన సత్యసందేశాన్ని నమ్మకపోవటం లేదా విశ్వాసపు మూలస్థంభాలలో దేనినైనా నిరాకరించటం (త్రోసి పుచ్చటం) లేదా ఖండించటం. దివ్యఖుర్ఆన్ లోని 39వ అధ్యాయం 32వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “ఎవడు అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదిస్తాడో, సత్యం (దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానం) అతడి ముందుకు వచ్చినప్పుడు అది అబద్దమని దానిని తిరస్కరిస్తాడో, అతడి కంటే పరమ దుర్మార్గుడెవరు? అటువంటి వారికి నరకంలో స్థానమేమీ లేదా?” (V. 39:32)
  • అహంకారపు అవిశ్వాసం – కుఫ్ర్ ఇబావత్తకాబ్బుర్ మా అత్తస్ది: అల్లాహ్ ఆదేశాలు సత్యమైనవని తెలిసీ, అహంకారం వలన వాటికి సమర్పించుకోకుండా తిరస్కరించటం. దివ్యఖుర్ఆన్ లోని 2వ అధ్యాయం 34వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు – “మేము దైవదూతలకు: ‘మీరందరూ ఆదమ్ కు సజ్దా (సాష్టాంగం)చేయండి.’ అని ఆదేశించినప్పుడు, వారందరూ సాష్టాంగ పడినారు. కాని ఇబ్లీసు ధిక్కరించాడు. దురహంకారానికి గురి అయ్యాడు. అవిధేయులలో కలసి పోయాడు. (అల్లాహ్ కు అవిధేయుడైనాడు)”
  • ధిక్కారపు అవిశ్వాసం – కుఫ్ర్ అష్షక్కాజ్జాన్న్: విశ్వాసపు ఆరు మూలస్థంభాలపై సందేహం ఉంచటం లేక స్పష్టమైన అవగాహన లేకపోవటం. దివ్యఖుర్ఆన్ లోని 18వ అధ్యాయం 35 – 38వ వచనాలలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునే వాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: ‘ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను. మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను. ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీనికంటే మేలైన స్థానాన్నే పొందగలను.’ అతని పొరుగువాడు అతడితో మాట్లాడుతూ ఇలా అన్నాడు ‘నిన్ను మట్టితో, తర్వాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తర్వాత నిన్ను (సంపూర్ణ) మానవునిగా తీర్చిదిద్దిన ఆయన ను నీవు తిరస్కరిస్తున్నావా? కాని నిశ్చయంగా నాకు మాత్రం ఆయనే అంటే అల్లాహ్ యే నా ప్రభువు మరియు నేను ఎవ్వడినీ నా ప్రభువుకు భాగస్వామిగా కల్పించను”
  • సంకల్పంలో అవిశ్వాసం – కుఫ్ర్ అల్ ఇరాదహ్: తెలిసీ సత్యం నుండి తిరిగి పోవటం (ముఖం త్రిప్పుకోవటం) లేదా అల్లాహ్ అవతరింపజేసిన స్పష్టమైన చిహ్నాల నుండి  దృష్టి మళ్ళించటం (ఉల్లంఘించడం). దివ్యఖుర్ఆన్ లోని 46వ అధ్యాయం 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మేము ఆకాశాలను, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, సత్యంతో ఒక నిర్ణీతకాలం కొరకు మాత్రమే సృష్టించాము. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారు తమకు చేయబడిన హెచ్చరిక నుండి విముఖులవుతున్నారు.” (V. 46:3)
  • కపటత్వపు అవిశ్వాసం — కుఫ్ర్ అన్నిఫాఖ్: మోసపూరితమైన, వంచనతో కూడిన లేక కపటమైన అవిశ్వాసం. దివ్యఖుర్ఆన్ లోని 63వ అధ్యాయం 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “వారు తమ ప్రమాణాలను ఢాలుగా చేసుకున్నారు. ఆ విధంగా వారు (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి విరోధిస్తున్నారు. నిశ్చయంగా, వారు చేస్తున్న చేష్టలు ఎంతో నీచమైనవి. ఇది నిశ్చయంగా, వారు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అవటం మూలంగానే జరిగినది. కావున వారి హృదయాలు మీద ముద్ర వేయబడి ఉన్నది. కనుక వారు ఏమీ అర్థం చేసుకోలేరు.” (V. 63:2 – 3)

2) అల్పమైన (తక్కువ స్థాయి) అవిశ్వాసం (అల్ కుఫ్ర్ అల్ అస్గర్):

ఈ విధమైన అవిశ్వాసం ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేయదు. దీనినే కుఫ్ర్ అన్నిఆమాహ్ అని కూడా అంటారు. అల్లాహ్ ప్రసాదిస్తున్న దీవెనలు మరియు శుభాల పై అయిష్టంగా ఉండటం అంటే అల్లాహ్ కే కృతఘ్నత చూపటం. దివ్యఖుర్ఆన్ లోని 16వ అధ్యాయం 112వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు. మొదట అది శాంతి భద్రతలతో నిండి ఉండేది. దాని (ప్రజలకు) ప్రతి దిక్కు నుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత  వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు. కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు” (V. 16:112)

English Source: Appendix  from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

అన్నిఫాఖ్ – కపటత్వం [ముహ్సిన్ ఖాన్ & అల్ హిలాలీ]

hypocrisy-nifaqరచయిత : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: అన్నిఫాఖ్ అంటే కపటత్వం యొక్క నిర్వచనం మరియు దాని యొక్క భాగాల గురించి ఈ వ్యాసంలో క్లుప్తంగా చర్చించబడినది.

అన్నిఫాఖ్ – الــنــفـــاق

కాపట్యం మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు.

కాపట్యం రెండు రకాలు, అవి:

  1. విశ్వాసం (నమ్మకం) లో కాపట్యం
  2. ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

(1) విశ్వాసం (నమ్మకం)లో కాపట్యం: దీనిలో ఆరు రకాలున్నాయి.

  1. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తిరస్కరించటం
  2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన (ఆయన పై అవతరించిన లేక ఆయన బోధించిన) వాటిలో కొన్నింటిని తిరస్కరించటం (ఉదాహరణ – ఖుర్ఆన్, సున్నహ్, ఇస్లామీయ ధర్మశాస్త్ర నియమ నిబంధనలు)
  3. ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం ను ద్వేషించుట, అసహ్యించుట.
  4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన వాటిలో కొన్నింటిని ద్వేషించటం లేక అసహ్యించుకోవటం (ఉదాహరణ – ఏకదైవత్వం లేక ఏక దైవారాధన మొదలైనవి)
  5. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి ఏదైనా తాత్కాలిక పరాభవం గాని లేదా అపకీర్తి గాని కలిగినప్పుడు సంతోషపడటం.
  6. అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లాం ధర్మానికి విజయం కలిగినట్లయితే విచారపడటం. (ఇస్లాంధర్మపు సాఫల్యాన్ని చూసి అసంతృప్తి చెందటం)

ఎవరిలోనైతే పైన పేర్కొన్న ఆరు కపటపు గుణాలు ఉంటాయో, వారు నరకాగ్నిలోని అట్టడుగు పొరలలోనికి చేర్చబడతారు. (కపటులు నరకం లోని అట్టడుగు పొరలలోనికి పంపబడతారు – ఖుర్ఆన్ 4:145)

(2) ఆచరణలలో మరియు కార్యములలో (పనులలో) కాపట్యం.

అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వేర్వేరు ప్రకటనల ఆధారంగా, దీనిలో ఐదు పద్ధతులు ఉన్నాయి. కపటుల చిహ్నాలు –

  1. అతడు మాట్లాడినప్పుడు, అబద్ధం చెబుతాడు.
  2. అతడు వాగ్దానం చేసినప్పుడు, దానిని పూర్తిచేయడు.
  3. ఒకవేళ అతడిని నమ్మినట్లయితే (అతడిపై భరోసా చేసినట్లయితే), అతడు వంచకుడిగా, మోసగాడిగా తేలుతాడు. (మీరు దేనినైనా అతడి దగ్గర ఉంచినట్లయితే, దానిని తిరిగి వాపసు ఇవ్వడు).
  4. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇంకో హదీథ్ లో- ఘర్షణ పడినప్పుడల్లా (పోట్లాటకు దిగినప్పుడు) అతడు తెలివి లేని వాడిగా, అవివేకిగా, దుష్టుడిగా, చెడ్డవాడిగా, ఇతరులకు అవమానం, పరాభవం కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు.
  5. అతడు ఒప్పందం చేసినట్లయితే, స్వయంగా అతడు తనకు తానే విశ్వాసఘాతకుడిగా నిరూపించుకుంటాడు.

English Source: Appendix  from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

ప్రవక్తలను, సందేశహరులను عليهم السلام అల్లాహ్ ఎందుకు పంపెను?

prophets-telugu-islamరచయితలు : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్ & ముహమ్మద్ తకిఉద్దీన్ అల్ హిలాలీ
అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ ఈ ప్రపంచానికి ఎందుకు పంపెను అనే విషయం ఈ వ్యాసంలో స్పష్టంగా చర్చించబడెను.

ఎప్పుడైతే ప్రజలు సర్వలోక సృష్టికర్త యొక్క ఏకదైవారాధనను వదిలి, షిర్క్ (ఏకైక దైవారాధనలో ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేర్చటం) అనే అంధవిశ్వాసాల్ని, సహేతుకం కాని సిద్ధాంతాల్ని కనుగొన్నారో, అప్పటి నుండి తన భక్తులను కేవలం తనను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించటానికి, ఆరాధనలలో ఇతరులను తనతో జత పరచ వద్దని ఆజ్ఞాపించటానికి మరియు వారిని బహుదైవారాధనపు గాఢాంధకారంలో నుండి ఏకైక దైవారాధనపు వెలుగు లోనికి తీసుకు రావటానికి అల్లాహ్ తన ప్రవక్తలను మరియు సందేశహరులను పంపటం మొదలు పెట్టినాడు. ప్రవక్తలందరూ తౌహీద్ (ఏకైక దైవత్వం అంటే మహోన్నతమైన మరియు అత్యంత ప్రశంసనీయమైన అల్లాహ్ యొక్క ఏకైకత్వంలో విశ్వాసం)నే బోధించారు. ఖుర్ఆన్ లోని క్రింది వచనాలు ఈ వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి:

“వాస్తవంగా మేము నూహ్ ను అతని జాతి వద్దకు పంపాము. అతను వారితో ‘ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవానికి నేను మీపై రాబోయే ఆ గొప్ప దినపు శిక్షను గురించి భయపడుతున్నాను’అని అన్నాడు”(7:59)

“మరియు మేము ఆద్ జాతి వద్దకు, వారి సోదరుడైన హూద్ ను పంపాము. అతను:‘ఓ నా జాతి సోదరులారా! మీరు కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమిటీ? మీకు దైవభీతి లేదా?” (7:65) ఇది ఆద్ జాతి కు వచ్చిన ప్రవక్త సందేశం.

“మరియు మేము మద్యన్ జాతి వద్దకు వారి సహోదరుడు షుఐబ్ ను (పంపాము) అతను వారితో అన్నాడు: నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. వాస్తవంగా, మీ వద్దకు, మీ ప్రభువు దగ్గర నుండి స్పష్టమైన (మార్గదర్శకత్వం) వచ్చియున్నది. కొలిచేటప్పుడు మరియు తూచేటప్పుడు పూర్తి నిజాయితీతో ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిపై శాంతి స్థాపించబడిన తర్వాత మరల కల్లోల్లాన్ని రేకెత్తించకండి. మీరు విశ్వాసులే అయితే, ఇదే మీకు మేలైనది” (7:85). ఇది మద్యన్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించిన ప్రకటన.{మద్యన్ అనేది ఒక తెగ & నగరపు పేరు. వారి వద్దకు షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్త గా  పంపబడ్డారు. మద్యన్ యొక్క  మరొక పేరు అయ్ కహ్. మృత సముద్రానికి తూర్పున, అఖాభా అగాధం నుండి (Gulf of Aqaba) పడమటి వైపు ఉన్న సినాయి ద్వీపకల్పం మరియు మోఆబ్ పర్వతాల వరకు వ్యాపించి ఉన్నది. అక్కడ నివసించే వారు ఆమోరైట్ తెగకు చెందిన అరబ్బులు. షుఐబ్ మరో పేరు ఎత్రో (Jethro)}

ఇక సమూద్ జాతి వద్దకు వారి సోదరుడైన సాలెహ్ ను పంపాము. అతను వారితో:“నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్య దైవం లేడు”(7:73) ఇది సమూద్ జాతి వద్దకు పంపబడిన ప్రవక్త తన ప్రజలను అల్లాహ్ వైపునకు రమ్మని ఆహ్వానించిన ప్రకటన.{సమూద్ ప్రజలు ఆద్ జాతికి చెందిన నబాతియన్ తెగకు చెందిన వారు. రెండవ ఆద్ జాతిగా ప్రసిద్ధి చెందినారు. వారు హిజాజ్ ఉత్తర భాగంలో ఉండేవారు. ఆ ప్రాంతం వాది అల్ ఖురా అనబడుతుంది. వారు ఆ పర్వత ప్రాంతంలో కొండలను తొలిచి గుహలను నిర్మించారు. వాటి పేరు మదాయిన్ సాలెహ్. నేటికీ అవి ఆ పేరుతోనే పిలవబడుతున్నాయి. ఇది మదీనా పట్టణం మరియు తబూక్ పట్టణాల మధ్య ఉన్నది. ఇప్పటికీ వారు కొండలను తొలిచి నిర్మించిన కట్టడాలు ఉన్నాయి.}

మరియు వాస్తవానికి మేము ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపాము.(అతడన్నాడు): “మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి” (16:36)

అల్లాహ్ ప్రతి ప్రవక్తను ఆయన స్వంత జాతి వద్దకు  వారి మార్గదర్శకత్వం కోసం పంపెను. కాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మొత్తం మానవజాతి మరియు జిన్నాతుల మార్గదర్శతక్వం కోసం పంపెను. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ లోని (7:158) వచనం ధృవీకరుస్తున్నది-(ఓ ముహమ్మద్!) ఇలా ప్రకటించు:“మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను”

“మరియు నేను జిన్నాతులు మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాదించటానికే!” (51:56)

ఇంకా ఖుర్ఆన్ లోని అనేక వచనాల మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల వలన స్పష్టమవుతున్న దేమిటంటే, మానవాళికి మార్గదర్శకత్వపు అవసరం కలిగినప్పుడు,  అల్లాహ్ ప్రవక్తలను పంపినాడు.

English Source: Appendix II from the book: “Interpretation of the Meaning of The Noble Quraan” By Dr. Muhammad Taqiuddeen al-Hilaalee, Ph.D. and Dr. Muhammad Muhsin Khan .

దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [పుస్తకం]

Daiva Pravaktha dharmam - Telugu Islam


రచయిత
:ముహమ్మద్ ఖలీలుర్ రహ్మాన్
పునర్విచారకులు :హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రీ మదని, విజయవాడ
ప్రకాశకులు : అల్ అసర్ ఇస్లామిక్ సెంటర్, హైదరాబాద్

[ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి]
https://bit.ly/daiva-pravaktha-dharmam
[PDF] [250 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్]

ఆప్త వాక్కులు

బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం

“విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి” (దివ్వ ఖుర్ఆన్ 3:103)

“వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది. అల్లాహ్ పై, అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్ ను స్మరించే వ్యక్తికి“.(దివ్య ఖుర్ఆన్ 33:21)

ప్రస్తుతం ముస్లిం సమాజంలోని అధిక శాతం ప్రజలలో కానవచ్చే విశ్వాసాలు ఆరాధనా పద్ధతులు మరియు ఆచరణా వ్యవహారాలు అన్నీ ధర్మం పేరుమీద ధర్మ వ్యతిరేకమైన కొత్త పద్ధతులు కొనసాతున్నాయి. ఇందుకు కారణం ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ విధానాల గురించి ప్రజలలో నిజమైన అవగాహన లేకపోవటమే.

ప్రస్తుతం ముస్లిములలో తౌహీద్ (దేవుని ఏకత్వ) భావన అధిక శాతం లోపించింది. ఇందుకు భిన్నంగా షిర్క్ (బహుదైవారాధన) భావాలు ప్రజలలో పెరిగి పోతున్నాయి. తత్కారణంగా నేటి ముస్లిం సమాజంలో అనేక మూఢ విశ్వాసాలు, అనేక మూఢ నమ్మకాలు మరియు ఒళ్ళు గగ్గురపరిచే అనేక అజ్ఞానపు చేష్ఠలు సర్వసామాన్యం అయిపోయాయి.

ప్రపంచానికి మార్గదర్శకం వహించాల్సిన ముస్లిం సమాజంలోని అధిక ప్రజలు ప్రస్తుతం పతనావస్థకు చేరుకున్నారు.

ఇంతకంటే అనేక రెట్లు అజ్ఞానపు మూఢత్వంలో ఉన్న అరబ్బు జాతిని ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు తౌహీద్, ఆఖిరత్ అనే నినాదాన్ని పునాదిగా చేసుకుని పతనావస్థలో ఉన్న ఆ సమాజాన్ని విశ్వాసపరంగా మరియు నైతికపరంగా ఉన్నత స్థాయికి చేర్చి ప్రపంచానికి ఆదర్శంగా మలిచారు. అందుకు కారణం ఖుర్ఆన్లోని వాక్యాలు ఎలా అవతరించాయో అలానే ప్రజలలో సర్వసామాన్యం చేయటమే.

ఈ రోజు ఖుర్ఆన్ మరియు ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆచరణ యధాస్థితిలో ఉన్నా ముస్లిం సమాజం స్థితి మారకపోవటానికి కారణం, (ఎ) ఆహారం తమ దగ్గర ఉన్నా పస్తులుండే వానివలె (బి) మందులు తమ దగ్గర ఉన్నా అనారోగ్యాన్ని దూరం చేసుకోలేని వాని పరిస్థితి వలె దైవ మార్గదర్శకత్వాన్ని పొంది కూడా దానిని పెడచెవిన పెట్టి అంధకారంలో తచ్చాడుతున్న వారిలా మారిపోయారు ముస్లింలు. అందువల్లనే అల్లాహ్ తన గ్రంథంలో ఇలా అంటున్నాడు.

“ఇక నా తరఫు నుండి మార్గదర్శకత్వం మీ దగ్గరకు వస్తే ఎవడు ఈ మార్గదర్శ కత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గం తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకే అవుతుంది. ప్రళయంనాడు మేము అతన్ని అంధుడుగా లేపుతాము” (దివ్యఖుర్ఆన్ 20:123 124)

అందుకే ఈ రోజు ముస్లింలు ప్రపంచంలో తమ స్థితిని చక్కబరచుకోవాలంటే ఒక్కటే మార్గం. అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ బోధనలు మరియు దానిని ఆచరించి చూపిన ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) జీవిత విధానాలు సర్వసామాన్యం చేయటం తప్ప వేరే మార్గం లేదు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఈ పుస్తకం రచయిత జనాబ్ మహమ్మద్ ఖలీలుర్రహ్మాన్ గారు తౌహీద్ అంశంపై తెలుగు భాషలో సవివరంగా చర్చించటం జరిగినది. తౌహీద్ వాస్తవికతను అర్థం చేసుకోవ టానికి ఈ పుస్తకం ఉపకారి కాగలదు. పుస్తక రచనలో రచయిత సౌదీ అరేబియాలోని ప్రామాణిక రచయితల గ్రంథాల నుండి సేకరించిన అంశాలను పొందుపర్చటం జరిగినవి. తౌహీద్ తోపాటు ప్రజలు చేసే షిర్క్ దేవుని వేడుకోలు, గుణాలు, నామాలు సోదాహరణగా చర్చించటం జరిగినవి. విశ్వాసాలు, ఆరాధనలలో తౌహీద్ యొక్క వాస్తవ దృక్పథాన్ని వివరించడం జరిగినది. ఈ పుస్తకం దైవదాసులైన మానవాళికి మార్గదర్శి కావాలని, సందేశ దాతలకు సందేశ సామగ్రిగా ఉపయోగ పడాలని, పుస్తక రచయితకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ…

హాఫిజ్ అబ్దుల్ వాహెద్ ఉమ్రి మదని

విషయ సూచిక:

  1. తొలి పలుకులు [PDF]
  2. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ధర్మం [PDF]
  3. లా ఇలాహ ఇల్లల్లాహ్ మహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్షమివ్వడం [PDF]
  4. లా ఇలాహ ఇల్లల్లాహ్ సాక్ష్యం-నియమాలు [PDF]
  5. లా ఇలాహ ఇల్లల్లాహ్ వివరణ [PDF]
  6. తౌహీద్ ఆల్ రుబూబియాత్ [PDF]
  7. తౌహీద్ ఆల్ ఉలూహియాత్ [PDF]
  8. హృదయారాధనలు [PDF]
  9. నోటి ఆరాధనలు [PDF]
  10. ఇతర శారీరక ఆరాధనలు [PDF]
  11. తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ [PDF]
  12. తౌహీద్ ప్రయోజనాలు [PDF]
  13. షిర్క్ యెక్క ఆరంభము [PDF]
  14. దైవ ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కాలం నాటి ముష్రిక్కులు [PDF]
  15. ముహమ్మదుర్రసూలుల్లాహ్  సాక్ష్యం వాస్తవీకత [PDF]
  16. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )విధేయత లాభాలు [PDF]
  17. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) అవిధేయత నష్టాలు [PDF]
  18. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) సహచరుల విధేయత [PDF]
  19. నలుగురు ఇమాములు [PDF]
  20. సున్నత్-బిద్అత్ [PDF]
  21. సలఫ్ మరియు సున్నత్ [PDF]
  22. బిద్అత్ [PDF]
  23. యాసిడ్ టెస్ట్ [PDF]
  24. ఈమాన్ [PDF]
  25. ఇహ్ సాన్ [PDF]