విశ్వాస మూల సూత్రాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

usul-al-aqidah-fundamental-beliefs-in-islam_img


ఉసూల్  అల్  అఖీదా (Fundamentals of Belief in Islam)

అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)
క్లుప్త వివరణ
: ఇస్లామీయ మూల విశ్వాసం మరియు ఏకదైవారాధన గురించి ఈ పుస్తకంలో చర్చించబడినది.

 [ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [41 పేజీలు]

విశ్వాస మూల సూత్రాలు – యూట్యూబ్ ప్లేలిస్ట్ [14 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1tDmY3rwxlhOKdavXJOTGl

వీడియో పాఠాలు (క్రొత్తవి)

విషయ సూచిక :

  • తౌహీద్, దాని రకాలు
  • కలిమయే తౌహీద్ – లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావం
  • ‘ముహమ్మదుర్ రసూలిల్లాహ్’ భావం
  • విశ్వాసం, దాని ఆరు మూల సూత్రాలు
  • షిర్క్ (బహు దైవారాధన, దాని రకాలు)
  • ఫిర్ఖయే  నాజియ (ముక్తి పొందేవారు)

ఈ పుస్తకం మీదపాత వీడియోలు

ఈ పుస్తకానికి సంబంధించిన మరీ పాత వీడియోలు క్రింద చూడండి:

[పూర్తి పుస్తకాన్ని క్రింద చదవండి]

తౌహీద్ దాని రకాలు:

తౌహీద్ అంటే: విధిగా, అల్లాహ్ కు ప్రత్యేకంగా చేయబడే ప్రతి “ఆరాధన”లో అల్లాహ్ ను అద్వితీయునిగా నమ్మడం. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాల్లో ఇది చాలా గొప్పది. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[قُلْ هُوَ اللهُ أَحَدٌ] [الاخلاص:1]

{ఇలా చెప్పండి! ఆయన అల్లాహ్, అద్వితీయుడు}. (సూరె ఇఖ్లాస్ 112: 1).

మరోచోట ఇలా సెలవిచ్చాడు:

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] [الذاريات: 56]

{నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను}. (జారియాత్ 51: 56).

మరో ఆదేశం:

[وَاعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا] [النساء:36]

{కేవలం అల్లాహ్ నే ఆఃరాధించండి, ఆయనకు ఎవరినీ సాటి కల్పించకండి}. (సూరె నిసా 4: 36).

తౌహీద్ మూడు రకాలుః (1) తౌహీదె రుబూబియత్, (2) తౌహీదె ఉలూహియత్, (3) తౌహీదె అస్మా వ సిఫాత్.

(1) తౌహీదె రుబూబియత్:

అంటేః సృష్టి, దాని నిర్వహణలో అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే. ఆయనే పోషకుడు, జీవన్మరణ ప్రధాత. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. దీనికి సంబంధించిన నిదర్శనాలు దివ్యగ్రంథం ఖుర్ఆనులో చదవండి:

[هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللهِ يَرْزُقُكُمْ مِنَ السَّمَاءِ وَالأَرْضِ لَا إِلَهَ إِلَّا هُوَ…] [فاطر:3]

{ఆకాశము నుండి భూమి నుండి అల్లాహ్ తప్పా వేరే సృష్టికర్త మీకు ఆహారము నొసంగువాడు గలడా? “ఆరాధనకు నిజమైన అర్హుడు ఆయన తప్ప మరొకడు లేడు”…}. (ఫాతిర్ 35: 3).

[تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ]

{ఎవని చేతిలో సమస్త లోకపాలన గలదో ఆ అల్లాహ్ చాలా శుభాలు గలవాడు, ఆయన సర్వం పై సంపూర్ణ శక్తి గలవాడు}. (ముల్క్ 67: 1).

అల్లాహ్ అధికారం విశ్వమంతటిలో ఉంది. అందులో తనిష్టానుసారం మార్పు చేస్తుంటాడు.

నిర్వహణలో అద్వితీయుడు కూడా కేవలం అల్లాహ్ మాత్రమే. సృష్టి కార్యాలు నెరవేర్చువాడు ఆయనే. ఈ ఆయతు చదవండిః

[أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ]

{వినండి! సృష్టించుట, ఆజ్ఞాపించుట ఆయన పనే. సర్వ లోకాలకు పోషకుడగు అల్లాహ్ ఎంతో శుభదాయకుడు}. (ఆరాఫ్ 7: 54).

అతని ఈ నిర్వహణ కార్యక్రమం సర్వసృష్టిలో అమలు చేయబడుతూ ఉన్నది.

తౌహీద్ యొక్క ఈ రకాన్ని తిరస్కరించిన-వారు చాలా అరుదు. వారు బాహ్యంగా తిరస్క- రించినా, వారి అంతరాత్మ మటుకు దాన్ని ఒప్పుకుంటుంది.  (ఫిర్ఔన్ వాళ్ళ గురించి) ఈ

ఆయతు చదవండిః

[وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا]  

[النمل 14]

{నిజానికి వారి మనస్సులు (సత్యాన్ని) నమ్మినప్ప- టికీ అన్యాయం, అహంకారంతో వారు దానిని తరస్కరించారు}. (27: నమ్ల్: 14).

తౌహీద్ యొక్క ఈ ఒక్క రకాన్ని నమ్మినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రవక్త కాలంలోని బహుదైవారాధకులు ఈ రకాన్ని నమ్మారు కాని అది వారికి ఏ లాభాన్నివ్వలేదు. ఖుర్ఆన్ సాక్ష్యం చదవండిః

[وَلَئِنْ سَأَلْتَهُمْ مَنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ فَأَنَّى يُؤْفَكُونَ] [العنكبوت 61]

{భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారని, సూర్యచంద్రుల్ని ఎవరు అదుపులో ఉంచ గలిగారని నీవు అడిగితే, అల్లాహ్ యే అని వారు తప్పకుండా అంటారు. అలాంటప్పుడు వారు ఎలా మోసపోతున్నారు?}. (అన్ కబూత్ 29:61).

(2) తౌహీదె ఉలూహియత్:

అంటే: ఆరాధనలకు అర్హుడయిన అద్వితీ- యుడు ఆ పరమ పవిత్రుడు మాత్రమే. పూజించుటకు మరియు సాన్నిధ్యము పొందుటకు అల్లాహ్ తో పాటు మరెవ్వరినీ సాటి కల్పించకూడదు. తౌహీద్ యొక్క 3 రకాల్లో ఇదే అతిముఖ్యమైనది, గొప్పది. దీని కొరకే అల్లాహ్ మానవులను సృష్టించాడు. అల్లాహ్ ఆదేశం:

[وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] [الذاريات: 56]

{నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను}. (జారియాత్ 51: 56).        ఈ విషయమే ప్రజలకు క్లుప్తంగా బోధించ- డానికి అల్లాహ్ ప్రవక్తలను పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. దీని సాక్ష్యాధారం దివ్య ఖుర్ఆనులో ఇలా ఉందిః

[وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ] [الأنبياء:25]

{మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా ‘నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి’ అనే విషయాన్ని తెలియజేశాము}. (అంబియా 21: 25).

తౌహీద్ యొక్క ఈ రకాన్నే బహుదైవా- రాధకులు తిరస్కరించారు, వారి ప్రవక్తలు ఈ తౌహీద్ యొక్క బోధ చేసినప్పుడు. దీనికి ఖుర్ఆన్ ఇలా సాక్ష్యమిస్తుందిః

[قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِنْ كُنْتَ مِنَ الصَّادِقِينَ]

{(బహుదైవారాధకులు తమ ప్రవక్తలకు ఇలా జవాబిచ్చారు): నీవు మా వద్దకు రావటానికి కారణం, మేము ఒక్క అల్లాహ్ నే ఆరాధించాలనా, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని విసర్జించాలనా?}. (ఆరాఫ్ 7: 70).

అందుకే ఇబాదత్ (ఆరాధన) యొక్క ఏ రకమూ కూడా అల్లాహ్ యేతరులకు చేయుట ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ అల్లాహ్ యేతరులు ఎవరైనా సరేః అతిసన్నిహితులైన దైవదూతలు, ప్రవక్తలు, మహా భక్తులు, సృష్టి- రాసుల్లో ఎవ్వరినీ కూడా అల్లాహ్ తో సాటి కల్పించకూడదు.

(3) తౌహీదె అస్మా వ సిఫాత్:

అంటేః అల్లాహ్ స్వయాన తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్ గురించి ఏ పవిత్ర నామముల, ఉత్తమ గుణముల గురించి తెలిపారో వాటిని అల్లాహ్ కు తగిన రీతిలో విశ్వసించాలి. ఏ మాత్రం ‘తహ్ రీఫ్’, ‘తఅతీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్’([1]) లేకుండా. ఆయన గుణ నామము- లను యథార్థంగా నమ్మాలి. యథార్థానికి విరుద్ధంగా కాదు. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్ అతీతుడని నమ్మాలి. వేటి గురించి అల్లాహ్ అర్హుడా, అతీతుడా అని స్పష్టం లేదో వాటిలో మౌనం వహించాలి అంటే వాటికి అల్లాహ్ అర్హుడని అనవద్దు అతీతుడనీ అనవద్దు.

పవిత్ర నామముల ఉదాహరణ: పవిత్రుడైన అల్లాహ్ ‘అల్ హయ్య్’ తన నామమని తెలిపాడు. అయితే ‘అల్ హయ్య్’ అల్లాహ్ నామాల్లో ఒకటని నమ్మాలి. ఇంకా ఆ పేరులో ఉన్న భావమును కూడా విశ్వసించాలి. అనగా ఆయన శాశ్వతముగా ఉండువాడు, ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు లేరు. (ఆయన సజీవుడు, నిత్యుడు). అదే విధముగా ‘సమీఅ’ ఆయన పేరు, ‘సమ్అ’ (వినుట) ఆయన గుణం అని నమ్మాలి.

గుణముల ఉదాహరణ: అల్లాహ్ ఆదేశం:

[وَقَالَتِ اليَهُودُ يَدُ اللهِ مَغْلُولَةٌ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنْفِقُ كَيْفَ يَشَاءُ]

{“అల్లాహ్‌ చేతులు కట్టివేయబడి ఉన్నాయి” అని యూదులు అన్నారు. నిజానికి వారి చేతులే కట్టివేయబడ్డాయి. వారు అన్న ఈ మాట మూలంగా వారిని శపించటం జరిగింది. నిజానికి అల్లాహ్‌ చేతులు రెండూ విశాలంగా ఉన్నాయి. తాను తలచుకున్న విధంగా ఆయన ఖర్చుపెడుతున్నాడు.}. (మాఇద 5: 64).

పై ఆయతులో అల్లాహ్ తనకు రెండు చేతులున్నాయని, అవి విచ్చలవిడిగా ఉన్నాయని తెలిపాడు. అంటే వాటి ద్వారా తనిష్టానుసారం అనుగ్రహాలు నొసంగుతాడని తెలిపాడు. అయితే అల్లాహ్ కు రెండు చేతులున్నాయని, వాటి ద్వారా అనుగ్రహాలు నొసంగుతాడని విశ్వసించడం మనపై విధిగా ఉంది. ఆ చేతులు ఇలా, అలా ఉంటాయని మనుసులో ఊహించే, లేదా నోటితో పలుకే ప్రయత్నం కూడా చేయవద్దు. వాటిని మానవుల చేతులతో పోల్చకూడదు. ఎందుకనగా అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ البَصِيرُ]

{ఆయనకు పోలినది ఏదీ లేదు. మరియు ఆయన వినువాడు, చూచువాడు}. (షూరా 42:11).

ఈ తౌహీద్ యొక్క సారాంశమేమిటంటే: అల్లాహ్ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు ఏ ఏ గుణనామాల గురించి తెలిపారో వాటిని నమ్మాలి. వేటికి అల్లాహ్ అతీతుడని అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్ అతీతుడని నమ్మాలి. అయితే వాటిని తారుమారు చేయకుండా, ఇతరులతో పోల్చకుండా, నిరాకారునిగా భావించకుండా నమ్మాలి. ఏ గుణనామముల విషయములో, అవి అల్లాహ్  కు సంబంధించినవేనా, లేదా అని స్పష్టం లేదో ఆ పదాల భావం లో అల్లాహ్ పట్ల అగౌరవం ఉంటే వాటిని ఖండించాలి. వాటి భావం లో ఏలాంటి దోషం లేకుంటే వాటిని స్వీకరించవచ్చు.

కలిమయె తౌహీద్: లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క భావం

లాఇలాహ ఇల్లల్లాహ్, ఇస్లాం యొక్క పునాది. ఇస్లాములో దాని స్థానం చాలా గొప్పది. అది ఇస్లాం స్థంబాలలో మొదటిది. విశ్వాస భాగాలలో ఉన్నత భాగం. సత్కార్యాల అంగీకారం ఆ వచనాన్ని హృదయ పూర్వకంగా పఠించి దాని అర్థాన్ని తెలుసుకొని, దాని ప్రకారం ఆచరించడంపైనే ఆధారపడి ఉంది.

దాని వాస్తవ అర్థం: “ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు”. ఇదే సరియైన అర్థం. ఇది కాక అల్లాహ్ తప్ప సృష్టికర్త ఎవడు లేడు, అల్లాహ్ తప్ప శూన్యము నుండి ఉనికిలోకి తెచ్చే శక్తి గలవాడెవడు లేడు. లేక విశ్వంలో అల్లాహ్ తప్ప మరేమి లేదు అనే భావాలు (లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క అర్థం) కావు.

ఈ పవిత్ర వచనములో రెండు మూల విషయా(రుకున్)లున్నాయిః

(1) నిరాకరించుట, ఇది ‘లాఇలాహ’ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధన అర్హత)ను ప్రతి వస్తువు నుండి నిరాకరించుట.

(2) అంగీకరించుట, ఇది ‘ఇల్లల్లాహ్’ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్ (ఆరాధన)కు అర్హతగల అద్వితీయుడు అల్లాహ్ మాత్రమేనని, ఆయనకు భాగస్వాముడెవడు లేడని నమ్ముట.

అల్లాహ్ తప్ప మరెవ్వరని ఆరాధించరాదు. ఆరాధనలోని ఏ ఒక్క భాగాన్ని కూడా అల్లాహ్ తప్ప ఇతరులకు చేయుట ఆమోదయోగ్యం కాదు. ఏ వ్యక్తి ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ యొక్క ఈ వాస్తవ భావాన్ని తెలుసుకొని దాన్ని పఠిస్తాడో, దాని ప్రకారం ఆచరిస్తాడో మరియు దృఢ విశ్వాసముతో బహుదైవారాధనను తిరస్కరించి, అల్లాహ్ ఏకత్వమును విశ్వసిస్తాడో అతడే వాస్తవ ముస్లిం (విధేయుడు). ఇలాంటి విశ్వాసం లేకుండానే ఆచరించువాడు మునాఫిఖ్ (కపటవిశ్వాసి, వంచకుడు). మరియు దీనికి వ్యతిరేకంగా ఆచరించువాడు అది అతను నోటితో పలికినా ముష్రిక్ (బహుదైవా- రాధకుడు), కాఫిర్ (సత్యతిరస్కారి) అవుతాడు.

లాఇలాహ ఇల్లల్లాహ్ ఘనత:

ఈ పవిత్ర వచన ఘనతలు, లాభాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని క్రింద తెలుపబడ్డాయి:

1- తౌహీద్ గల వ్యక్తి నరక శిక్షకు గురి అయినా, అతను అందులో శాశ్వతంగా ఉండకుండా లాఇలాహ ఇల్లల్లాహ్ అడ్డు పడుతుంది.

 (يَخْرُجُ مِنْ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ شَعِيرَةٍ مِنْ خَيْرٍ وَيَخْرُجُ مِنْ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ بُرَّةٍ مِنْ خَيْرٍ وَيَخْرُجُ مِنْ النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ وَفِي قَلْبِهِ وَزْنُ ذَرَّةٍ مِنْ خَيْرٍ).

ప్రవక్త చెప్పారు: “లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించిన వ్యక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. ఏ వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని హృదయంలో గోదుమ గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివాడో అతని మనుస్సులో ఇసుమంత / రవ్వంత విశ్వాసమున్నా అతనూ నరకం నుండి వెలికి వస్తాడు”. (బుఖారి 44).

2- మానవులు, జిన్నాతులు దీని (లాఇలాహ…) కొరకే పుట్టించబడ్డారు. అల్లాహ్ ఆదేశం:

[وَمَا خَلَقْتُ الجِنَّ وَالإِنْسَ إِلَّا لِيَعْبُدُونِ] [الذاريات: 56]

{నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను}. (జారియాత్ 51:56)

పై ఆయతులో ‘యఅబుదూన్’ అన్న పదానికి అర్థం ఆరాధించుట. అంటే ఆరాధనలో అల్లాహ్ ఏకత్వాన్ని పాటించుట.

3- ప్రవక్తలను పంపబడింది, గ్రంథాలను అవతరింపజేయబడింది దీని ప్రచారం కొరకే. అల్లాహ్ ఆదేశం పై శ్రద్ధ వహించండి:

[وَمَا أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ] [الأنبياء:25]

{మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా ‘నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి’ అనే విషయాన్ని తెలియజేశాము}. (అంబియా 21: 25).

4- ప్రవక్తల ప్రచార ఆరంభం ఇదే (లాఇలాహ ఇల్లల్లాహ్). ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇదే పిలుపునిచ్చారు. చదవండి అల్లాహ్ ఆదేశం:

[اعْبُدُوا اللَّهَ مَا لَكُمْ مِنْ إِلَهٍ غَيْرُهُ] (الأعراف 59)

{మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప వేరు దేవుడు మీకు లేడు}.  (సూరె ఆరాఫ్ 7: 59,  73, 85. హూద్ 11:26, 50, 61, 84).

లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క నిబంధనలుః

ఈ పవిత్ర వచనం యొక్క నిబంధనలు ఏడున్నాయి. ఏ కొరత లేకుండా వాటన్నిటినీ పాటిస్తేనే వాస్తవంగా లాఇలాహ ఇల్లల్లాహ్ పఠించినట్లు.

1- ఇల్మ్ (జ్ఞానం): పవిత్ర వచనము యొక్క వాస్తవ భావ జ్ఞానం. అనగా (పైన తెలిపిన ప్రకారం) (1)నిరాకరించుట, (2)అంగీకరించుట మరియు దాని ప్రకారం ఆచరించుట. ‘అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు, ఇతరుల ఆరాధన వ్యర్థము మరియు తుచ్ఛము’ అని తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించిన మానవుడే వాస్తవంగా దాని భావాన్ని తెలుసుకున్న జ్ఞాని.

[فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ] [محمد:19]

{తెలుసుకో! “ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు”}. (ముహమ్మద్ 47: 19).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

(مَنْ مَاتَ وَهُوَ يَعْلَمُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اللهُ دَخَلَ الْـجَنَّةَ)

“ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు” అని తెలుసుకొని మరణించిన వారు స్వర్గములో చేరుదురు”. (ముస్లిం 26).

2- యఖీన్ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకం మరియు మనుషుల్లో, జిన్నాతులోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా దృఢ విశ్వాసంతో ఈ పవిత్ర వచనం పఠించాలి. సూర హుజురాత్ (49:15)లో అల్లాహ్ ఆదేశం:

[إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا]  [الحجرات 15]

{అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను (దృఢంగా) విశ్వసించిన తర్వాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉండేవారే నిజమైన విశ్వాసులు}.

عَنْ أَبِي هُرَيْرَةَ t أَنَّ رَسُولَ اللهِ r قَالَ: (أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنِّي رَسُولُ اللهِ لَا يَلْقَى اللهَ بِهِمَا عَبْدٌ غَيْرَ شَاكٍّ فِيهِمَا إِلَّا دَخَلَ الْجَنَّةَ)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ తప్ప మరొకడు లేడని మరియు నేను అల్లాహ్ ప్రవక్తనని సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు సాక్ష్యాలతో అల్లాహ్ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 27).

3- ఖుబూల్ (సమ్మతించుట): ఈ పవిత్ర వచనం ద్వారా రుజువయ్యే విషయాలన్నిటినీ మనసావాచా సమ్మతించాలి. ప్రవక్త తెలిపిన విషయాల్ని సత్యంగా నమ్మాలి. ఆయన తెచ్చిన ప్రతి దానిని విశ్వసించాలి, సమ్మతించాలి. అందులో ఏ ఒక్క దానిని విస్మరించకూడదు. అల్లాహ్ ఇదే ఆదేశమిచ్చాడు:

[آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالْمُؤْمِنُونَ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ] [البقرة 285]

{తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.}. (బఖర 2: 285).

ధర్మ శాసనాలను, హద్దులను ఆక్షేపించుట, లేక వాటిని నమ్మకపోవుట సమ్మతమునకు వ్యతిరేకం. ఉదాహరణకుః కొందరు దొంగ మరియు వ్యబిచారునిపై విధించిన హద్దులను లేక బహుభార్యత్వం, ఆస్తుల పంపకం లాంటి తదితర విషయాలను ఆక్షేపిస్తారు. (అయితే ఇలాంటి వారు అల్లాహ్ యొక్క ఈ ఆదేశం వినలేదా, చదవలేదా?)

[وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَنْ يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ] [الأحزاب 36]

{అల్లాహ్, ఆయన ప్రవక్త ఏ విషయములోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికి, విశ్వాసురాలైన ఏ స్త్రీకి, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు}. (అహ్ జాబ్ 33: 36).

4- ఇన్ ఖియాద్ (లొంగిపోవుట, శిరసావహించుట): పవిత్ర వచనం యొక్క అర్థభావాల పట్ల శిరసావహించాలి. ఇన్ ఖియాద్ మరియు ఖబూల్ లో తేడా ఏమనగాః ఖబూల్ అంటే నోటితో దాని భావాన్ని సమ్మతించుట. ఇన్ ఖియాద్ అంటే సమ్మతంతో పాటు దాన్ని ఆచరణ రూపంలో తీసుకువచ్చుట. ఒక వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్ అర్థభావాన్ని తెలుసుకొని, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దాన్ని సమ్మతించినప్పటికీ దానికి లొంగిపోయి, శిరసావహించి, దాని ప్రకారం ఆచరించకపోయినట్లైతే అతను ఇన్ ఖియాద్ యొక్క నిబంధన పాటించనట్లే. అల్లాహ్ ఇలా సంబోధించాడుః

[وَأَنِيبُوا إِلَى رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ] [الزمر 54]

{మీరు మీ ప్రభువు వైపునుకు మరలి ఆయనకే విధేయత చూపండి}. (జుమర్ 39: 54).

మరో చోట ఇలా ఆదేశించాడు:

[فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّى يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنْفُسِهِمْ حَرَجًا مِمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا] [النساء 65]

{నీ ప్రభువు తోడు! వారు తమ పరస్పర వివాదా- లన్నింటిలో నిన్ను తీర్పరిగా చేసుకోనంతవరకూ, తర్వాత నీవు వారి మధ్య చెప్పిన తీర్పుపట్ల వారు తమ మనసులలో ఎలాంటి సంకోచానికి, అసంతృప్తికి ఆస్కారం ఇవ్వకుండా మనస్ఫూర్తిగా శిరసావహించనంతవరకూ – వారు విశ్వాసులు కాజాలరు.}. (నిసా 4: 65)

5- సిద్ఖ్: (సత్యత): మనిషి తన విశ్వాసములో సత్యవంతుడై యుండాలి. అల్లాహ్ ఆదేశం:

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا اتَّقُوا اللهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ] [التوبة:119]

{ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. సత్యవంతులతో ఉండండి}.  (తౌబా 9:119).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారుః

مَنْ شَهِدَ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ صَادِقًا بِهَا دَخَلَ الْجَنَّةَ

“హృదయాంతర సత్యముతో ‘లాఇలాహ ఇల్లల్లాహ్’ పఠించినవారు స్వర్గంలో చేరుదురు”. (ముస్నద్ అహ్మద్).

ఎవరైనా ఈ పవిత్ర వచనం కేవలం నోటితో పలికి, దాని అర్థభావాలను మనస్ఫూర్తిగా నమ్మ- కున్నట్లయితే  అతనికి ముక్తి ప్రాప్తించదు. అతడు కపట విశ్వాసులలో పరిగణించబడుతాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన వాటన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించడం కూడా సత్యతకు వ్యతిరేకంలోనే వస్తుంది. ఎందుకనగా మనము ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయులై ఉండాలని, ఆయన మాటల్ని సత్యంగా నమ్మాలని అల్లాహ్ ఆదేశించాడు, అంతే కాదుః ఆయన విధేయతను తన విధేయతతో కలిపి చెప్పాడు. సూర నూర్ (24: 54)లో ఉందిః

[قُلْ أَطِيعُوا اللهَ وَأَطِيعُوا الرَّسُولَ] [النور:54]

{అల్లాహ్ కు విధేయులు కండి, అల్లాహ్ ప్రవక్తకు విధేయులు కండి}.

6- ఇఖ్లాస్: మనిషి తను చేసే ప్రతి పనిని సంకల్ప పరంగా షిర్క్ దరిదాపులకు అతీతంగా ఉంచుటయే ఇఖ్లాస్, అంటే సర్వ పనులు, మాటలు కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకు, ఆయన ప్రసన్నత పొందుటకే చేయాలి. అందులో ఏ మాత్రం ప్రదర్శనాబుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ప్రాపంచిక లాభోద్దేశ్యం, స్వార్థం ఉండకూడదు. ఇంకా ఆ పని అల్లాహ్ యేతరుని ప్రేమలో, అల్లాహ్ మార్గానికి విరుద్ధంగా ధార్మిక లేదా ఇతర వర్గాల పక్షంలో ఉండకూడదు. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని మరియు పరలోక సాఫల్యాన్ని పొందుట కొరకే చేయాలి. ఎవరి నుండైనా ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలనుగానీ ఆశిస్తూ వారి వైపునకు మనుసు మరలకూడదు. సూర జుమర్ (39: 3)లో ఉందిః

[أَلَا للهِ الدِّينُ الخَالِصُ] [الزُّمر:3]

{జాగ్రత్త ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}.

[وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ]  [البينة 5]

{వారు అల్లాహ్ కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆదేశించటం జరిగింది}. (బయ్యిన 98: 5).

عن عِتْبَانَ بْنِ مَالِكٍ t قَالَ:  قَالَ رَسُولُ الله r: (فَإِنَّ اللهَ قَدْ حَرَّمَ عَلَى النَّارِ مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ يَبْتَغِي بِذَلِكَ وَجْهَ الله).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, ఇత్బాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు లాఇలాహ ఇల్లల్లాహ్ చదివిన వారిపై నిశ్చయంగా అల్లాహ్ నరకమును నిషేధించాడు”. (బుఖారి 425, మస్లిం 33).

7- ముహబ్బత్ (ప్రేమ): ఈ పవిత్ర వచనము మరియు దీనికి సంబంధించిన వాటి ప్రేమ. ముస్లిం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి, వారిద్దరిపై ప్రేమ అందరి ప్రేమకు మించియుండాలి. ప్రేమకు సంబంధించిన షరతులు వగైరా పూర్తిగా పాటించాలి. అల్లాహ్ ను మరియు అల్లాహ్ ప్రేమించువాటిని గౌరవభావంతో, భయం మరియు ఆశలతో ప్రేమించాలి. ఉదాః స్థలాల్లో: మక్కా, మదీన, మస్జిదులు. కాలాల్లో: రమజాను, జిల్ హిజ్జ మొదటి దశ వగైరా. మానవుల్లో: ప్రవక్తలు, దూతలు, సత్యవంతులు, అమరవీరులు, పుణ్యాత్ములు వగైరా. సత్కార్యాల్లో: నమాజు, జకాతు, ఉపవాసం (రోజా), హజ్. వాచ సంబంధమైన: జిక్ర్ (అల్లాహ్ స్మరణ), ఖుర్ఆన్ పారాయణం వగైరాలు.

మనిషి అల్లాహ్ ప్రేమించువాటిని తన మనుసు, కోరికలు ప్రేమించే వాటిపై ఆధిక్యతివ్వాలి. ఇంకా అల్లాహ్ అసహ్యించుకునేవాటిని అసహ్యించు కోవాలి: అవిశ్వాసులను, అవిశ్వాసాన్ని, పాపాల్ని (అశ్లీలతల్ని), అవిధేయతలను అసహ్యించుకోవాలి. అల్లాహ్ ఆదేశం:

[يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَنْ يَرْتَدَّ مِنْكُمْ عَنْ دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ] [المائدة 54]

{ఓ విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలిగిపోతే, అల్లాహ్ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు}. (మాఇద 5: 54).

‘ముహమ్మదుర్రసూలుల్లాహ్’ భావం:

మనోవాక్కుల ద్వారా ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు సర్వ మానవాళికి ప్రవక్త అని విశ్వసించాలి. దాని ప్రకారం ఆచరించాలి, అంటే: ఆయన ఆదేశాల పట్ల విధేయత చూపాలి, ఆయన తెలిపిన విషయాలన్ని సత్యం అని నమ్మాలి, నిషేధించిన, ఖండించిన వాటికి దూరంగా ఉండాలి, ఆయన చూపిన విధంగానే అల్లాహ్ ను ఆరాధించాలి.

‘ముహమ్మదుర్రసూలుల్లాహ్’ సాక్ష్యం పలికినప్పుడు అందులో ఉన్న రెండు మూల విషయాల(రుకున్)లను గ్రహించాలి. అవి: ‘అబ్దుహు వ రసూలుహు’. ఈ రెండు రుకున్లు ఆయన హక్కులో హెచ్చు తగ్గులు చేయుట నుండి కాపాడతాయి. ఆయన ‘అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త’. ఈ రెండు ఉత్తమ గుణాల ద్వారా ఆయన సర్వ మానవాళిలో గొప్ప విశిష్ఠత గలవారు. ఇక్కడ ‘అబ్ద్’ యొక్క అర్థం దాసుడు, ఉపాసకుడు అని. అంటే ఆయన మనిషి, ఇతర మనుషులు ఎలా పుట్టారో ఆయన కూడా అలాగే పుట్టారు. మానవులకు ఉన్నటువంటి అవసరాలే ఆయనకు ఉండేవి. సూర కహ్ ఫ్ (18:110)లో అల్లాహ్ ఆదేశం:

[قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِثْلُكُمْ] [الكهف 110]

{ప్రవక్తా ఇలా చెప్పుః నేను కేవలం ఒక మానవుణ్ణి. మీలాంటి వాణ్ణి}.

ఇదే సూరా మొదటి ఆయతులో ఇలా ఉందిః

[الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنْزَلَ عَلَى عَبْدِهِ الْكِتَابَ] [الكهف 1]

{అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన తమ దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు}.

‘రసూల్’ అనగా ఆయన సర్వ మానవాళి వైపునకు శుభవార్తనిచ్చు, హెచ్చరించు ప్రవక్త అని అర్థం. (దీనికి సంబంధించిన ఆధారాలు ఖుర్ఆనులో చాలా ఉన్నాయి. చూడండి సూర సబా (34:28), సూర అంబియా (21:107).

ఈ రెండు ఉత్తమ గుణాలు (రుకున్లు) ఆయన పట్ల అతిశయోక్తి (హెచ్చు) మరియు అమర్యాద (తగ్గు)ల నుండి కాపాడతాయి. ఎలా అనగా ఆయన అనుచరులు అని చెప్పుకునే కొందరు ఈ రోజుల్లో ఆయన స్థానాన్ని, హక్కును అర్థం చేసుకోక అతిశయమించి ఆయన్ని అల్లాహ్ తో సమానంగా పోలుస్తున్నారు. అల్లాహ్ ను వదలి ఆయనతో మొరపెడుతున్నారు. అవసరాలు తీర్చడం, కష్టాలు తొలగించడం లాంటి అల్లాహ్ శక్తిలో మాత్రమే ఉన్న వాటిని ఆయనతో కోరుతున్నారు. మరి కొందరు ఆయన గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఆయన్ను ప్రవక్తగా నమ్మడం లేదు. లేదా ఆయన అనుకరణలో కొరత చూపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన విషయాలకు వ్యతిరేకమైన వాటిని నమ్ముతున్నారు. ఇతరుల మాటలను ఆయన సున్నతలపై ప్రాధాన్యతనిస్తున్నారు, ఆయన సున్నతులను ఆచరించకుండా వదులుతున్నారు, ఆయన తీసుకువచ్చిన సత్య మాట/ బాటకు వ్యతిరేకమైన మాట/బాటలపై గుడ్డిగా మొండిపట్టుతో ఉన్నారు.

విశ్వాసం, దాని మూలసూత్రాలు:

వాచాకర్మను విశ్వాసం అంటారు. అది సత్కార్యాలతో పెరుగుతుంది, పాపాలతో తరుగుతుంది. హృదయం మరియు నాలుక మాటను ఇంకా హృదయం, నాలుక మరియు అవయవాల పనిని విశ్వాసం అంటారు. హృదయ మాట అంటే: హృదయ పూర్వకంగా విశ్వసించుట, సత్యపరచుట. నాలుక మాట అంటే: అంగీకరించుట. హృదయ పని అంటే: సమ్మతించుట, ఇఖ్లాస్, లొంగిపోవుట, ప్రేమ, సత్కార్యాల సంకల్పం. అవయవాల పని అంటే: ఇస్లాం ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చుట మరియు నిశిద్ధతలను విడనాడుట.

విశ్వాసానికి కొన్ని మూలసూత్రాలున్నాయని ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా రుజువైనది. అవిః (1) అల్లాహ్ ను, (2) ఆయన దూతలను, (3) ఆయన పంపిన గ్రంథాలను, (4) ఆయన ప్రవక్తలను, (5) ప్రళయదినాన్ని, (6) మంచి, చెడు తక్దీర్ (విధివ్రాత)ను విశ్వసించడం. అందు లో కొన్ని ఈ ఆయతులో ప్రస్తావించబడినవిః

[آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالْمُؤْمِنُونَ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْ رُسُلِهِ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ]  (البقرة 285)

{తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించారు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.}. (బఖర 2: 285).

సహీహ్ ముస్లింలో ఇలా ఉందిః అమీరుల్ మోమినీన్ హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విశ్వాసం (ఈమాన్) అంటేమిటి అని అడిగాడు. దానికి ప్రవక్త ఇలా జవాబిచ్చారు: “విశ్వాసం అంటే నీవు అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, పరలోకదినాన్ని మరియు మంచి చెడుల విధివ్రాతను విశ్వసించుట”. (ముస్లిం 8).

ఈ ఆరు విషయాలే సత్యవిశ్వాసం యొక్క మూలసూత్రాలు. వీటినే అల్లాహ్ ఖుర్ఆనులో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో ప్రస్తావించారు. వీటినే విశ్వాస మూలసూత్రాలు (అర్కానె ఈమాన్) అంటారు. వీటి వివరణ క్రింద చదవండిః

1- అల్లాహ్ పై విశ్వాసం:

అంటేః ఉలూహియత్, రుబూబియత్ మరియు అస్మా వ సిఫాత్ లో అల్లాహ్ అద్వి- తీయుడని విశ్వసించాలి. అల్లాహ్ పై విశ్వాసంలో ఈ క్రింది విషయాలు కూడా వచ్చును.

1- అల్లాహ్ యే వాస్తవ ఆరాధ్యుడు, సర్వ ఆరాధనలకు అర్హుడు. ఆయన గాక వేరే లేదా ఆయనతో పాటు మరొకడు ఏ మాత్రం అర్హుడు కాడు. ఎందుకనగా మానవుల సృష్టికర్త, వారికి మేలు చేయువాడు, వారికి ఆహారం నొసంగువాడు, వారి రహస్య, బహిరంగ విషయాలన్నీ తెలిసినవాడు, పుణ్యాత్ములకు సత్ఫలితం మరియు పాపాత్ములను శిక్షించు శక్తిగలవాడు ఆయన మాత్రమే.

ఈ ఆరాధన యొక్క వాస్తవికత ఏమిటంటేః సర్వ ఆరాధనలు వినయ వినమ్రతలతో, ఆయన ఔన్నత్యాల ముందు హీనభావంతో, పూర్తి ప్రేమతో, భీతిల్లుతూ, కారుణ్యాశలతో అద్వితీయుడైన అల్లాహ్ కే ప్రత్యేకించి చేయాలి. ఈ గొప్ప మౌలిక విషయంతోనే ఖుర్ఆన్ అవతరించింది. అల్లాహ్ ఆదేశాలు చదవండి:

[فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَهُ الدِّينَ * أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ] [الزمر 2-3]

{కనుక నీవు ధర్మాన్ని అల్లాహ్ కే ప్రత్యేకిస్తూ, అల్లాహ్ కు మాత్రమే దాస్యం చెయ్యి. జాగ్రత్త! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే}.  (జుమర్ 39: 2,3).

[وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ] [الإسراء 23]

{మీరు ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి అని మీ ప్రభువు ఆజ్ఞాపించాడు}. (బనీ ఇస్రాఈల్ 17:23). మోమిన్ 40:14లో ఉంది:

 [فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ]

{మీరు మీ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకం చేసుకుని ఆయన్నే వేడుకుంటూ ఉండండి – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే!}.

ఆరాధన యొక్క రకాలు అనేకమున్నాయి, అందులో కొన్ని ఇవిః దుఆ (ప్రార్థన, వేడుకోలు), ఖౌఫ్ (భయం), రజా (ఆశ), తవక్కుల్ (నమ్మకం), రగ్బత్ (ఆసక్తి), రహబ్ (మహాభీతి), ఖుషూఅ (నమ్రత), ఖషియత్ (గౌరవభావంతో భీతి), ఇనాబత్ (మరలుట), ఇస్తిఆనత్ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిఘాస (మొరపెట్టుకొనుట), జిబహ్ (బలిదానం), నజ్ ర్ (మ్రొక్కుబడి) తదితర ఆరాధన రకాలు. ఇవన్నియూ అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు చేయుట ఆమోదయోగ్యం కాదు. అలా చేయుట షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (సత్యతిరస్కారం)గా పరిగణించబడుతుంది.

దుఆ (ప్రార్థన, వేడుకోలు) యొక్క ఆధారం. అల్లాహ్ ఆదేశం చదవండి:

{నీ ప్రభువు ఇలా అంటున్నాడు, “నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. గర్వానికి లోనై నా ఆరాధనకు విముఖులయ్యేవారు తప్పని- సరిగా అవమానానికీ, పరాభవానికీ గురి అయి నరకంలో ప్రవేశిస్తారు”}. (మోమిన్ 40: 60).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని, నౌమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిం- చారుః “దుఆయే ఆరాధనే”. (తిర్మిజి 2969).

ఖౌఫ్ (భయం) యొక్క ఆధారం. అల్లాహ్ ఆదేశం చదవండిః

[فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ] [آل عمران 175]

{మీరు మానవులకు భయపడకండి, నిజంగా మీరు విశ్వసించినవారయితే నాకే భయపడండి}. (ఆలి ఇమ్రాన్ 3: 175).

రజా (ఆశ) యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం:

[فَمَنْ كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا] [الكهف 110]

{తమ ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ చేర్చకూడదు}. (కహ్ ఫ్ 18:110)

తవక్కుల్ (నమ్మకం) యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశాలు చదవండి:

[وَعَلَى اللَّهِ فَتَوَكَّلُوا إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ] [المائدة 23]

{మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్ పై మాత్రేమే నమ్మకం ఉంచండి}. (మాఇద 5: 23).

[وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ] [الطلاق 3]

{అల్లాహ్ ను నమ్ముకున్న వానికి అల్లాహ్ యే చాలు}. (తలాఖ్ 65: 3).

రగ్బత్, రహబ్, ఖుషూఅ యొక్క ఆధారాలు: అల్లాహ్ ఆదేశం

[إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا وَكَانُوا لَنَا خَاشِعِينَ] [الأنبياء 90]

{వారు మంచి పనుల కోసం ఎక్కువగా శ్రమించే వారు. ఆసక్తితోనూ, భయంతోనూ మమ్మల్ని అర్థించేవారు. మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు}. (సూరె అంబియా 21: 90).

ఖషియత్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[فَلَا تَخْشَوْهُمْ وَاخْشَوْنِي]  (البقرة 150)

{వారికి భయపడకండి, నాకు భయపడండి}. (సూరె బఖర 2: 150).

ఇనాబత్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం:

[وَأَنِيبُوا إِلَى رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ] [الزمر 54]

{మీరు మీ ప్రభువు వైపునకు మరలి ఆయనకు విధేయత చూపండి}.  (జుమర్ 39:54).

ఇస్తిఆనత్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ]  (الفاتحة 5)

{మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము}. (ఫాతిహ 1: 5). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(إذَا اسْعَنتَ فَاسْتَعِنْ بِالله)

“నీవు సహాయం అర్థించునప్పుడు కేవలం అల్లాహ్ తో మాత్రమే సహాయం అర్థించు”. (తిర్మిజి 2516).

ఇస్తిఆజ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ] [الناس 1]

{నేను ప్రజల ప్రభువుతో శరణు కోరుతున్నాను అని చెప్పండి}. (నాస్ 114:1).

ఇస్తిఘాస యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[إِذْ تَسْتَغِيثُونَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ] [الأنفال 9]

{మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న సందర్భాన్ని (జ్ఞాపకం తెచ్చుకోండి) ఆయన మీకు సమాధాన మిచ్చాడు}. (అన్ఫాల్ 8: 9).

జిబహ్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (162) لَا شَرِيكَ لَهُ وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ] [الأنعام 162-163]

{ఇలా చెప్పండి: నా నమాజ్, నా సకల ఖుర్బానీ (జిబహ్), నా జీవనం, నా మరణం సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయనకు ఏ భాగస్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వబడింది. అందరికంటే ముందు విధేయతతో తలవంచేవాణ్ణి (ముస్లింని) నేనే}. (అన్ఆమ్ 6: 162, 163).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

(لَعَنَ اللهُ مَنْ ذَبَحَ لِغَيْرِ الله).

“అల్లాహ్ యేతరుల కొరకు జిబహ్ చేసిన వారిని అల్లాహ్ శపించాడు”. (ముస్లిం 163).

నజర్ యొక్క ఆధారం: అల్లాహ్ ఆదేశం

[يُوفُونَ بِالنَّذْرِ وَيَخَافُونَ يَوْمًا كَانَ شَرُّهُ مُسْتَطِيرًا]

{మొక్కుబడి చెల్లించేవారు, నలువైపుల నుండి ఆపదలు కమ్ముకొని వచ్చే దినానికి భయపడే వారు}. (దహర్ 76: 7).

చివరికి అలవాటుగా చేసే పనులు వాటి ఉద్దేశం అల్లాహ్ విధేయతకు తోడ్పడాలని ఉంటే ఆరాధనలో లెక్కించబడతాయి, ఉదా: నిద్రించుట, తినుట, త్రాగుట, సంపాదించుట, వివాహం లాంటి తదితర అలవాట్లు సదుద్దేశ్యంతో చేస్తే అవి కూడా ఆరాధనల్లో పరిగణించబడతాయి. వాటి పుణ్యం ముస్లింకు లభిస్తుంది.

2- అల్లాహ్ పై విశ్వాసములో మరొకటి ఆయన తన దాసులపై విధిగా నిర్ణయించిన ఐదు ఇస్లాం మూల స్థంబాలను విశ్వసించుట. అవి: (1) అల్లాహ్ మాత్రమే వాస్తవ ఆరాధ్యుడు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని విశ్వసించుట. (2) నమాజు స్థాపించుట. (3) జకాత్ (విధి దానం) చెల్లించుట. (4) రమజాను మాసములో రోజా (ఉపవాసము) ఉండుట. (5) మక్కా యాత్ర చేయు శక్తి గలవాడు హజ్ చేయుట. వీటితో పాటు ఇస్లాం ధర్మం యొక్క ఇతర విధులను కూడా నమ్మాలి, ఆచరించాలి.

3- అల్లాహ్ పై విశ్వాసంలో మరొకటి అల్లాహ్ యే సర్వలోకాల సృష్టికర్త, తనిష్టానుసారం తన శక్తి మరియు జ్ఞానముతో సర్వ కార్యాలు నిర్వహించువాడు. ఇహపరలోకాల అధికారి. ఆయనే సర్వలోకాల పోషకుడు. ఆయన తప్ప మరెవ్వడు సృష్టికర్తనూ లేడు. పోషకుడునూ లేడు. ఆయన తన దాసులకు సన్మార్గం చూపుటకు, వారిని వారి ఇహపరాల సాఫల్యం వైపునకు పిలుచుటకు ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేశాడు. ఆయన పరమ పవిత్రుడు, అద్వితీయుడు, ఆయనకు సాటి ఎవ్వరూ లేరు.

[اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ وَكِيلٌ]

{ప్రతి వస్తువును సృష్టించినవాడు అల్లాహ్ యే. ప్రతి వస్తువునకూ సంరక్షకుడు కూడా ఆయనే}. (సూరె జుమర్ 39: 62).

4- ఆయన పై విశ్వాసములో మరొకటిః దివ్య ఖుర్ఆనులో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల్లో అల్లాహ్ పవిత్ర నామములు, ఉత్తమ గుణాలు ఏ రీతిలో తెలుపబడ్డాయో అదే రీతిలో ఏ మాత్రం ‘తహ్ రీఫ్’, ‘తఅతీల్’, ‘తక్ యీఫ్’, ‘తమ్ సీల్’([2]) లేకుండా విశ్వసించాలి. ఆ పవిత్ర నామముల భావము ద్వారా తెలిసిన గుణములను మానవుల గుణాలతో పోల్చకుండా విశ్వసించాలి. సూర షూరా 42:11లో చదవండి:

[لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ] [الشورى 11]

{ఆయనను పోలిన వస్తువు సృష్టిలో ఏదీ లేదు. ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడూను}.

2- అల్లాహ్ దూతలపై విశ్వాసం:

ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్ పుట్టించాడు. వారి స్వభావంలోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకనేక రకాలు గలవు. ‘అర్ష్’ (అల్లాహ్ సింహాసనము)ను మోసే వారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదాః జిబ్రీల్, మీకాఈల్, నరక పాలకుడు మాలిక్, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్. అల్లాహ్ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించారుః

(خُلِقَتْ الْـمَلَائِكَةُ مِنْ نُورٍ وَخُلِقَ الْجَانُّ مِنْ مَارِجٍ مِنْ نَارٍ وَخُلِقَ آدَمُ مِمَّا وُصِفَ لَكُمْ)

“అల్లాహ్ దూతలు నూర్ (కాంతి)తో పుట్టించ బడ్డారు. జిన్నాతులు అగ్ని జ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) పుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).

3- గ్రంథములపై విశ్వాసం:

గ్రంథములపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించుట విధిగా ఉందిః ప్రవక్తలు తమ తమ జాతులకు ధర్మం బోధించుటకు, వారిని దాని వైపునకు పిలుచుటకు అల్లాహ్ వారిపై (ప్రవక్తలపై) గ్రంథాల్ని అవతరింపజేశాడు. అల్లాహ్ ఏ గ్రంథముల పేరుతో సహా తెలిపాడో వాటిని వివరంగా విశ్వసించాలి. ఉదాః ప్రవక్త మూసా అలైహిస్సలాంపై ‘తౌరాత్’, ప్రవక్త దావూద్ అలైహిస్సలాంపై ‘జబూర్’, ప్రవక్త యేసు మస్సీహ అలైహిస్సలాంపై ‘ఇంజీల్’ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ‘దివ్య ఖుర్ఆన్’లు అవతరించాయి. అన్నిట్లో ఖుర్ఆన్ అతిగొప్పది మరియు చిట్టచివరిది. అది పూర్వ గ్రంథాలను రుజువు పరుచునది మరియు పరిరక్షించునది. దానిని అనుసరించుట, దాని ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీసుల ద్వారా తీర్పులు చేయుట తప్పనిసరి. ఎందుకనగా అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇరుజాతుల (మానవులు, జిన్నాతుల) వైపునకు ప్రవక్తగా పంపాడు. ఆయనపై ఈ దివ్య ఖుర్ఆనును అవతరింపజేశాడు, ఆయన (ప్రవక్త) దాని ద్వారా వారి మధ్య తీర్పు చేయుటకు. ఇంకా దానిని హృదయ వ్యాధులకు స్వస్థతగా చేశాడు. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇంకా అది సర్వ లోకాల కొరకు సన్మార్గం, కారుణ్యం. అల్లాహ్ ఆదేశాలు చదవండి:

[وَهَذَا كِتَابٌ أَنْزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ] [الأنعام 155]

{మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుగల గ్రంథం. కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబిం- చండి. తద్వారా మీరు కరుణింపబడవచ్చు}. (సూరె అన్ఆమ్ 6: 155).

[وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَى لِلْمُسْلِمِينَ] [النحل: 89]

{మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది.

విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త}. (నహ్ల్ 16: 89).

4- ప్రవక్తలపై విశ్వాసం:

ప్రవక్తలపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించాలిః అల్లాహ్ తన దాసుల వైపునకు ప్రవక్తల్ని శుభవార్త ఇచ్చువారిగా, హెచ్చరించువారిగా, ధర్మం వైపునకు పిలుచువారిగా జేసి పంపాడు.

[وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ] [النحل 36]

{మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింప- జేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి’}. (నహ్ల్ 16: 36).

ప్రవక్తల్ని విశ్వసించినవారే సాఫల్యం పొందువారు. వారిని తిరస్కరించినవారే నష్టం, అవమానం పాలయ్యేవారు.

ప్రవక్తలందరి పిలుపు ఒక్కటేనని మనం విశ్వసించాలి. అది అల్లాహ్ ఏకత్వం మరియు సర్వ ఆరాధనల్లో ఆయన్ని అద్వితీయునిగా నమ్మటం. అయితే వారికి నొసంగబడిన ధర్మ- శాస్త్రాలు, ఆదేశాలు, శాసనాలు వేర్వేరు. అల్లాహ్ కొందరికి మరి కొందరిపై ఘనత ప్రసాదించాడు. అందరిలోకెల్లా గొప్ప ఘనతగలవారు మరియు చిట్టచివరి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చదవండి అల్లాహ్ ఆదేశాలుః

[وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَى بَعْضٍ] [الإسراء 55]

{మేము కొందరు ప్రవక్తలకు మరికొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము}. (బనీ ఇస్రాఈల్ 17: 55). మరో చోట ఆదేశించాడుః

[مَا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِنْ رِجَالِكُمْ وَلَكِنْ رَسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ] [الأحزاب 40]

{(మానవులారా!) ముహమ్మద్ మీలోని ఏ పురుషునికీ తండ్రి కారు. కానీ ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు}. (33: అహ్ జాబ్: 40).

ఇక ఏ ప్రవక్తల పేర్లతో సహా అల్లాహ్ లేక ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వారిని అదే వివరంగా విశ్వసించాలి. ఉదాః నూహ్, హూద్, సాలిహ్, ఇబ్రాహీం, వగైరా ప్రవక్తలు. అల్లాహ్ వారందరిపై అనేకానేక దయాకారుణ్యాలు కురిపించుగాకా! ఆమీన్.

5- పరలోక విశ్వాసం:

మరణానంతరం సంభవించే ఏ ఏ విషయాల గురించి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో అవన్నీ ఇందులోనే వస్తాయి. ఉదా: సమాధి యాతన, పరీక్షలు, శుభాలు, ప్రళయదినం నాటి ఘోర సంఘటనలు, వంతెన, త్రాసు, లెక్క, ప్రతి కర్మ యొక్క ఫలితం, కర్మ పత్రాలు ప్రజల ముందు తెరువబడుట, వారు దాన్ని కుడి లేక ఎడమ చేతితో లేక వీపు వెనక నుంచి తీసుకొనుట, ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే హౌజె కౌసర్, స్వర్గం, నరకం, విశ్వాసులకు అల్లాహ్ దర్శనం, సంభాషణ. ఇంకా ఖుర్ఆను మరియు సహీహ్ హదీసుల్లో వచ్చిన విషయాలన్నిటినీ విశ్వసించాలి. అవి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన ప్రకారమే సంభవించునని నమ్మాలి.

6- మంచి, చెడు ‘తఖ్దీర్’ (విధివ్రాత)పై విశ్వాసం:

‘తఖ్దీర్’పై విశ్వాసంలో నాలుగు విషయాలు వస్తాయిః

మొదటిదిః భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాధి, వారి చావు, వారు చేసే కర్మలన్నీ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ తెలియకుండా లేదు.

[إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ] [التوبة 115]

{నిశ్చయముగా అల్లాహ్ కు సర్వమూ తెలియును}. (సూరె తౌబా 9: 115).

రెండవదిః ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని విధివ్రాతను వ్రాసి పెట్టాడు.

[وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُبِينٍ] (يس 12)

{ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము}. (సూరె యాసీన్ 36: 12).

మూడవదిః ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడియుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. అల్లాహ్ ఇలా ఆదేశించాడు:

[كَذَلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ] [آل عمران 40]

{అలానే అవుతుంది. అల్లాహ్ తాను కోరినదానిని చేస్తాడు}. (ఆలె ఇమ్రాన్ 3:40).

నాల్గవదిః అల్లాహ్ దేని తఖ్దీర్ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.

[وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ] [الصافات 96]

{వాస్తవానికి అల్లాహ్ యే మిమ్మల్నీ సృష్టించాడు, మీరు చేసేవాటన్నిటినీ సృష్టించాడు}. (సూరె సాఫ్ఫాత్ 37: 96).

షిర్క్ (బహుదైవారాధన), దాని రకాలు:

షిర్క్ అంటే: మనిషి అల్లాహ్ యొక్క రుబూబియత్ లో, లేదా ఉలూహియత్ లో లేదా అస్మా వ సిఫాత్ లో ఇతరులను భాగస్వామిగా చేయుట.

షిర్క్ రెండు రకాలు: చిన్న షిర్క్, పెద్ద షిర్క్.

మొదటిది: పెద్ద షిర్క్: ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైనా అల్లాహ్ యేతరుల కొరకు చేయుట పెద్ద షిర్క్ అవుతుంది. ఈ షిర్క్ చేసిన వ్యక్తి తౌబా చేయకుండా (పశ్చత్తాప పడి, క్షమాభిక్ష కోరకుండా) చనిపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ఇంకా ఇది సర్వ సత్కా- ర్యాలను నాశనం చేసేస్తుంది. అంటే ప్రళయదినాన సత్ఫలితం లభించదు. అల్లాహ్ ఆదేశం చదవండిః

[وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ] [الأنعام 88]

{ఒకవేళ వారు షిర్క్ చేసి ఉండినట్లయితే, వారు చేసిన సమస్తం నాశనం అయివుండేది}. (సూరె అన్ఆమ్ 6: 88).

పెద్ద షిర్క్ ను అల్లాహ్ స్వచ్ఛమైన తౌబా చేయనిదే క్షమించడు. చదవండి ఖుర్ఆన్ సాక్ష్యం:

[إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ وَمَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا] (النساء 48)

{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, వాస్తవానికి మహా పాపం చేసినవాడు}. (సూరె నిసా 4: 48).

పెద్ద షిర్క్ లోని కొన్ని రకాలు: అల్లాహ్ యేతరులతో దుఆ, అల్లాహ్ యేతరుల కొరకు మొక్కుబడి, జిబహ్ వగైరాలు చేయుట. అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కలిపి అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ వారి పట్ల ఉంచుట.

[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللَّهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِلَّهِ]

{కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు}. (సూరె బఖర 2: 165).

రెండవదిః చిన్న షిర్క్: అంటే: ఖుర్ఆను, హదీసులో ఏ పనుల కొరకు షిర్క్ అనే పేరు వచ్చిందో కాని అవి పెద్ద షిర్క్ వరకు చేరవో వాటినే చిన్న షిర్క్ అంటారు. ఈ రకం ధర్మభ్రష్టతకు కారణం కాదు. కానీ దీని వల్ల తౌహీదు లో మాత్రం కళంకం, కొరత ఏర్పడుతుంది. ఉదా: ప్రదర్శనాబుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట. లేదా పెద్ద షిర్క్ కు తోడ్పడే ఏదైనా కార్యం. ఉదా: అల్లాహ్ కొరకు చేసే నమాజు ఏదైనా సమాధి వద్ద చేయుట. అల్లాహ్ యేతరులు లాభనష్టానికి అధికారులు కారని నమ్మి కూడా వారి మీద ప్రమాణం చేయుట. ఇంకా అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి తలచినట్లు అని పలుకుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمْ الشِّرْكُ الْأَصْغَرُ) قَالُوا: يَا رَسُولَ الله وَمَا الشِّرْكُ الْأَصْغَرُ؟ قَالَ: (الرِّيَاءُ).

“మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేదేమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారని”. చిన్న షిర్క్ అంటేమిటి? ప్రవక్తా అని అడిగారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “ప్రదర్శనాబుధ్ధి” అని. (ముస్నద్ అహ్మద్. దీని సనద్ ప్రమాణికమైనది).

(مَنْ حَلَفَ بِشَيْءٍ دُونَ الله فَقَدْ أَشْرَكَ).

“ఎవరైనా అల్లాహ్ తప్ప ఏదాని ప్రమాణం చేసినా అతడు షిర్క్ చేసినట్లు”. (ముస్నద్ అహ్మద్. దీని సనద్ ప్రమాణికమైనది).

తాయత్తులు వేసుకొనుట. రోగాలు, ఆపదలు రాకుండా లేదా వచ్చినా తొలిగిపోవుటకు కడియాలు, రింగులు సాధనం అని వేసుకొనుట లాంటి పనులు చిన్న షిర్క్ కు సంబంధించినవే. ఇక అవి సాధనమే కాదు, అందులో లాభనష్టాలు ఉన్నాయి, అంటే అవి వేసుకున్నప్పుడు లాభం ఉంటుంది వేసుకోకుంటే నష్టం ఉంటుంది అని  విశ్వసిస్తే అది పెద్ద షిర్కులో వస్తుంది. (అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి).

ఫిర్ఖయే నాజియ([3])

ఫిర్ఖయే నాజియ యొక్క విశ్వాసం ఇదిః అల్లాహ్, ఆయనే ప్రభువు, వాస్తవ ఆరాధ్యుడు. ఉత్తమోత్తముడు, దోషరహితుడు అని సత్య విశ్వాసి సాక్ష్యమిస్తాడు. ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించి ఆ అద్వితీయున్నే ఆరాధిస్తాడు. అల్లాహ్ యే సృష్టివ్యుహాన్ని రచించేవాడు, దానిని అమలు పరచేవాడు, ఆపై దాని ప్రకారం రూప కల్పన చేసేవాడు, ఉపాధి ప్రధాత, ఇచ్చేవాడు, ఆపేవాడు, సర్వ కార్యాల నిర్వహకుడు.

ఆయనే సత్య ఆరాధ్యుడు. ఆయనే ఆరంభము, ఆయనకు ముందు ఏదీ లేదు. ఆయనే అంతము, ఆయన తరువాత ఏదీ లేదు. ఆయనే బాహ్యము, ఆయనపై ఏదీ గెలవలేదు. ఆయనే గూఢము, ఆయనకు  తెలియనిది ఏదీ లేదు.

సర్వకాల సర్వావస్థలలో అన్ని విధాలుగా ఆయనే పరమోన్నతుడు, మహోన్నతుడు, గొప్పవాడు. సర్వ సృష్టి పై ఉన్న సింహాసనం (అర్ష్)పై ఆసీనుడైయున్నాడు. పరమ శ్రేష్ఠుడు అన్ని రకాల లోపాల, దోషాలకు అతీతుడు. ఆయనే అందరిపై అధికారం గలవాడు. ఆయన ఆధీనంలో నుండి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు.

ఆయన తన ఔన్నత్యం, గౌరవానికి తగిన రీతిలో అర్ష్ పై ఆసీనుడైయున్నాడు. అందరికి పైగా, ఉన్నతముగా ఉన్నప్పటికీ బాహ్యమూ, గూఢమూ, పైలోకం, క్రింది లోకం/ పాతాళం అంతయూ తెలిసినవాడు. ఆయన తన విద్యాజ్ఞానంతో మానవుల వెంట ఉన్నాడు. వారి సర్వ స్థితులను ఎరిగి ఉన్నాడు. ఆయన సమీపములో ఉన్నాడు. (ఆయన్ను ప్రార్థించేవారికి) సమాధానం ఇస్తాడు.

ఆయన ఏ అక్కరా లేనివాడు. ప్రజల నుండి ఆయనకి ఏ అవసరమూ లేదు. అందరూ తమ ఉనికి, మరియు తమకు అవసరమున్న ప్రతీ దానికి ఆయన పై ఆధారపడి యున్నారు. క్షణం పాటు / కను రెప్ప పాటు ఏ ఒక్కరూ ఆయన అవసరం లేనిది లేరు. ఆయన కనికరుడు, వాత్సల్యం కలవాడు. ప్రజల వద్ద ఉన్న ధార్మిక వరాలైనా లేదా ఐహిక వరాలైనా అన్నియూ ఆ పరమ పవిత్రుని తరఫునే. ఆయనే వరాలు ప్రసాదించువాడు. ఆపదలను దూరం చేసేవాడు.

ఆయన కారుణ్యమే ఇది: ఆయన ప్రతి రాత్రి మూడవ వంతు రాత్రి మిగిలి ఉండగా ప్రపంచ ఆకాశానికి దిగి వచ్చి “నన్ను అడిగేవారెవరు? అతనికి ప్రసాదిస్తాను. ఎవరు నాతో తన పాపాల మన్నింపు కోరుతాడో నేను అతన్ని క్షమిస్తాను” అని ఫజ్ర్ వరకు నినదిస్తాడు. అయితే ఆ దిగిరావడం తన ఔన్నత్యం, గౌరవానికి తగిన రీతిలో ఉంటుంది.

సంపూర్ణ వివేకం గల వివేచనా పరుడు ఆయన. ఆయన సృష్టించిన దానిలో ఏ ఒక్కటీ వృధాగా లేదు. ఆయన పంపిన ధర్మాల్లో మేళ్ళు ఉన్నాయి. అన్ని రకాల కీడులకు నివారణ ఉంది.

ఆయన తౌబా అంగీకరించువాడు, మన్నించేవాడు, క్షమించేవాడు. తన దాసుల్లో తౌబా చేసేవారి తౌబాలను అంగీకరిస్తాడు. పాపాల ప్రక్షాళన కోరే వారిని మన్నిస్తాడు. ఆయన వైపుకు మరలినవారి పెద్ద పెద్ద పాపాలను క్షమిస్తాడు.

ఆయన విలువనిచ్చేవాడు. ఓ చిన్న సత్కార్యానికైనా విలువనిస్తాడు. దానికి బదులు అధిక ఫలం నొసంగుతాడు. ఇంకా ఆయనకు కృతజ్ఞుడుగా ఉన్నవారికీ మరిన్ని అనుగ్రహాలు నొసంగుతాడు.

నిజమైన విశ్వాసి అల్లాహ్ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు తెలిపిన గుణనామాల్ని విశ్వసిస్తాడు. ఉదా: సంపూర్ణ జీవనం, వినుట, చూచుట. పరమ శక్తి, ఔన్నత్యము, గొప్పతనం, కీర్తి, మహిమాన్వితం, సౌందర్యం, పరిపూర్ణత. సర్వస్తోత్రం. అన్నిటికీ ఆయనే ఏకైక అర్హత గలవాడు.

ఖుర్ఆను మరియు హదీసుల ద్వారా రుజువైనవాటిలో ఒకటి: ‘విశ్వాసులు స్వర్గంలో తమ ప్రభువును ప్రత్యక్షంగా చూస్తారు’ అనే విషయాన్ని దృఢంగా విశ్వసిస్తాడు. ఆయన దర్శనం మరియు ఆయన సంతృప్తి వరాలు స్వర్గంలో లభించే సర్వ వరాల్లోకెల్లా అతి గొప్పవి.

తౌహీద్, విశ్వాస మార్గాన్ని వదలి చని- పోయినవారు శాశ్వతంగా నరకంలో ఉంటారు. ఘోర పాపాలు (కబీరా గునాహ్) చేసినవారు, తౌబా చేయకుండా చనిపోయి, లేదా వారి ఆ పాపాల మన్నింపు మార్గం లభించకుండా, లేదా సిఫారసు కూడా పొందకుండా ఒకవేళ నరకంలో ప్రవేశించినా అందులో శాశ్వతంగా ఉండరు. తన హృదయంలో రవ్వ గింజంత విశ్వాసం కూడా ఉన్న వ్యక్తి తప్పకుండా ఒక రోజు నరకం నుండి బైటికి వస్తాడు. 

హృదయాంతర నమ్మకం, హృదయపు వాచకర్మ అలాగే అవయవాల పనులు, నాలుక మాటలు, ఇవన్నియూ విశ్వాసంలో పరిగణించ బడతాయి. విశ్వాస బాధ్యతల్ని సంపూర్ణంగా నెరవేర్చేవాడే నిజమైన విశ్వాసి. ప్రతిఫలానికి అర్హుడు, శిక్షకు దూరం ఉండువాడు. వాటిలో ఏ కొంత కొరత చూపినా అదే పరిమాణంలో అతనిలో నుండి విశ్వాసం తరుగుతుంది. అలా ఎందుకనగా విశ్వాసం విధేయత, సత్కార్యాలతో పెరుగుతుంది. అవిధేయత, దుష్కార్యాలతో తరుగుతుంది.

అలాగే విశ్వాసి ఈ సాక్ష్యం కూడా ఇస్తాడు: ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త. అల్లాహ్ ఆయనకు మార్గదర్శకత్వాన్నీ, సత్య ధర్మాన్నీ ఇచ్చి పంపాడు. దానిని సకల ధర్మాలపై ఆధిక్యం వహించే ధర్మంగా చేయటానికి. నిస్సందేహంగా ఆయన విశ్వాసులకు స్వయంగా తమకంటే కూడా ముఖ్యుడు. ఆయన ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చిట్టచివరి ప్రవక్త. అల్లాహ్ వారిని మానవుల, జిన్నాతుల వైపునకు శుభవార్తనిచ్చే వారిగా, హెచ్చరిక చేసేవారిగా, అల్లాహ్ అనుమతితో ఆయన వైపునకు పిలుపునిచ్చేవారిగా చేసి, ప్రకాశించే దీపంగా చేసి పంపాడు. ఇహపరాల మేళ్ళతో ఆయన్ని పంపాడు. మానవులందరూ ఆ ఏకైక, ఏ భాగస్వామి లేని అల్లాహ్ ఆరాధన పై స్థిరంగా ఉండుటకు ఆయన నొసంగే ఉపాధిని, ఆయన ఆరాధన సహాయానికి ఉపయోగించుకోడానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంని పంపాడు.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సృష్టిలో అందరికన్నా గొప్ప జ్ఞాని, సత్యవంతుడు, ఉత్తమ సలహాకారుడు. మరియు అందరికన్నా స్పష్టంగా బోధించేవారు అని విశ్వాసి తెలుసుకుంటాడు. ఆయన్ని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. సర్వ సృష్టి ప్రేమ పై ఆయన ప్రేమకు ఆధిక్యతనిస్తాడు. ఆయన తీసుకొచ్చిన ధర్మం యొక్క మూల విషయాలను మరియు వాటి వివరాలన్నిటినీ అనుసరిస్తాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట, పద్ధతికి ఇతరుల మాట, పద్ధతిపై ప్రాధాన్యతనిస్తాడు.

అల్లాహ్ ఆయనకు నొసంగిన ఘనతలు, ప్రత్యేకతలు, పరిపక్వతలు సృష్టిలో ఏ ఒక్కరికీ నొసంగ లేదని విశ్వాసి నమ్ముతాడు. సృష్టిలోకెల్లా ఉన్నత స్థానం గలవారు, గొప్ప కీర్తి గలవారు, ప్రతీ దాంట్లో ఉన్నత, ఉత్తమ స్థాయిగలవారు ఆయనే సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన తెలుపనిది ఏ మేలు అంటూ లేదు. ఆయన నివారించనిది అంటూ ఏ చెడు లేదు.

విశ్వాసి అల్లాహ్ అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని, పంపిన ప్రతి ప్రవక్తను నమ్ముతాడు. వాటి / వారి వివరాలు తెలిసినా, తెలియక పోయినా. ఏ ఒక్కరిపై విశ్వాసంలో భేదభావం చూపడు. వారందరికీ ఇవ్వబడిన సందేశం ఒక్కటని నమ్ముతాడు. అదే: ఆ ఏకైక, ఏ భాగస్వామిలేని అల్లాహ్ ను ఆరాధించడం.

మంచి, చెడు విధివ్రాతను తూ.ఛ. తప్పకుండా నమ్ముతాడు. మానవుల మంచి, చెడు కర్మలన్నిటి గురించి అల్లాహ్ కు చాలా క్షుణ్ణంగా తెలుసు. అల్లాహ్ కలము వాటిని ముందే వ్రాసేసింది. వాటిలో అల్లాహ్ తలంపు వెడలింది. వాటిలో అల్లాహ్ వివేకం తప్పక ఉంది. తన దాసులకు శక్తి మరియు ఉద్దేశ్యం ప్రసాదించాడు. వారి శక్తి, కోరిక ప్రకారమే వారి నుండి మాటలు, చేష్టలు వెలువడుతాయి. అల్లాహ్ ఏ దాని గురించి వారిపై ఏ రకమైన ఒత్తిడి చేయలేదు. వారికి స్వయంగా అధికారం ఇచ్చాడు. అల్లాహ్ తన న్యాయం, వివేకంతో విశ్వాసులకు ప్రత్యేకంగా నొసంగిన వరం ఇదిః వారిలో విశ్వాసం పట్ల ప్రేమను కలగజేశాడు. దానిని వారికి ఇష్టమైనదిగా చేశాడు. అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల వెగటు కలగ జేశాడు.

విశ్వాసి ఎల్లప్పుడూ శ్రేయోభిలాషిగా ఉండాలి. ఈ శ్రేయోభిలాష అల్లాహ్ పట్ల, ఆయన గ్రంథం పట్ల, ఆయన ప్రవక్త పట్ల, మరియు మస్లిముల నాయకుని పట్ల మరియు వారి సామాన్య ప్రజల పట్ల. షరీఅత్ పరిధిలో ఉండి మంచిని ఆదేశించాలి.

చెడును నివారించాలి. తల్లిదండ్రులకు విధేయు- లుగా ఉండాలి. రక్త సంబంధాల్ని పెంచుకోవాలి. బంధువులకు, పొరుగువారికి, హక్కుగలవారికి, అందరికీ ఉపకారము చేయాలి. అందరితో సత్సంబంధాలుంచుకోవాలి. సద్వర్తన ప్రచారం చేయాలి. దుష్ప్రవర్తన రూపు మాపాలి.

విశ్వాసుల్లో సంపూర్ణ విశ్వాసం గలవాడు వారిలో అందరి కన్నా మంచి సత్కార్యాలు, సత్ప్రవర్తనలు గలవాడు. వారిలో అందరికంటే ఎక్కువ సత్యసంధుడు, ప్రతి మంచికి అందరి- కంటే ఎక్కువ దగ్గరిగా, చెడుకు దూరంగా ఉన్నవాడు అని నమ్మాలి.

అల్లాహ్ మార్గంలో జిహాద్ ప్రళయం వరకు ఉండునని తెలుసుకోవాలి. అది ఇస్లాం ధర్మం యొక్క శిఖరం. అది విద్య ద్వారా, ఆధారం, నిదర్శనాల ద్వారా మరియు ఆయుధాల ద్వారా జరుగుతూ ఉండును. తన ధర్మం వైపు నుండి తన శక్తి ప్రకారం పోరాడుట ప్రతి ముస్లింపై విధిగా ఉంది. దానికి తగిన షరతులు, సాధనాలు పూర్తయినప్పుడు, నాయకుడు పుణ్యాత్ముడైనా, పాపాత్ముడైనా అతని వెంట ఉండి జిహాద్ చేయాలి.

ముస్లిములందరు ఏకత్రాటిగా ఉండేందుకు అధికంగా కాంక్షించాలి. అందుకు పరస్పరం ప్రోత్సహించాలి. వారిని కలపడానికి, వారి మనస్సులు పరస్పరం చేరువుగా కావడానికి పూర్తి ప్రయత్నం చేయాలి. విభేదం, పరస్పర శత్రుత్వం, కపటాలకు దూరంగా ఉండాలి. అలా ఉన్నవారిని హెచ్చరించాలి. ఐక్యమత్యానికి తోడ్పడే, విభేదాలను దూరం చేసే యోగ్యమైన ప్రతి సాధనాన్ని అవలంభించాలి. ప్రజలకు ఏ రకమైన హాని కలిగించవద్దు. అది వారి ప్రాణ, ధన, మాన సంబంధమైన లేదా మరే రకమైన హక్కులో గాని. ముస్లిములతో, ముస్లిమేతరులతో వారి వ్యవహారాల్లో న్యాయం పాటించాలి. దీని గురించే ఇతరులకు బోధించాలి.

సర్వ అనుచర సంఘాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సంఘం అతిఉత్తమమైనదని విశ్వసించాలి. అందులో ప్రవక్త సహచరులు, ప్రత్యేకంగా ఖులఫాఏ రాషిదీన్, స్వర్గ శుభవార్త పొందిన పది సహ- చరులు, బద్ర్ యుధ్ధ వీరులు, (హుదైబియాలో) రిజ్వాన్ శపథంలో పాల్గొన్నవారు, ముహాజిరీన్, అన్సారులో (విశ్వాస సందేశాన్ని స్వీకరించటానికి) ముందంజం వేసినవారు ఘునులు, శ్రేష్ఠులు. ప్రవక్త సహచరులను ప్రేమించాలి. దీన్ని కూడా అల్లాహ్ యొక్క ధర్మంగా భావించాలి. వారి సద్గుణాలను ప్రచారం చేయాలి. వారి గురించి లేపబడుతున్న అపోహాలు విన్నప్పుడు వాటిని ఆపాలి, లేదా మౌనం వహించాలి.

ధర్మవేత్తలను, ధర్మ నాయకులు మరియు ముస్లిములలో ధర్మపరంగా ఉన్నత స్థానంలో ఉన్నవారిని గౌరవించాలి. దీన్ని కూడా ధర్మంగా భావించాలి. అల్లాహ్ వారిని అనుమానం, షిర్క్, విభేదం, కపటం, దుర్గుణాల నుండి కాపాడాలని, జీవితాంతం సవ్యమైన ధర్మంపై స్థిరంగా ఉంచాలని అల్లాహ్ ను అర్థించాలి. ఫిర్ఖయే నాజియ అనుయాయులు అనుసరించే మౌలిక విషయాలు ఇవే. వీటి వైపునకే వారు ఇతరులను ఆహ్వానిస్తారు


[1] ‘తహ్ రీఫ్’ అంటేః ఏ ఆధారము లేకుండా నామ- గుణాల భావాన్ని మార్చుట.  తారుమారు చేయుట.

‘తఅతీల్’ అంటేః అల్లాహ్ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించుట. అల్లాహ్ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్ యీఫ్’ అంటేః అల్లాహ్ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్ సీల్’ అంటేః అల్లాహ్ గుణాలను సృష్టి గుణాలతో పోల్చుట.  లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.

[2] వీటి వివరాలు 8వ పేజి పాదసూచికలో చూడండీ.

[3]  మోక్షానికి, స్వర్గ ప్రవేశానికి అర్హత గల వారు అని భావం.

దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం (Sweetness of Iman)

tree-iman-telugu-islamహదీథ్ ׃ 13

حلاوة الإيمان దైవవిశ్వాసపు తియ్యటి మాధుర్యం

حَدَّثَنا مُحَمَّدُ بْنُ المُثَنَّى قَالَ: حَدَّثَنَا عَبْدُ الْوَهَّابِ الثَّقَفِيُّ قَالَ: حَدَّثَنَا أَيُّوبُ عَنْ أَبي قِلابَةَ عَنْ أَنْسٍ عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: ”ثَلاثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاوَةَ الإِيمَانِ أَنْ يَكونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إلَيْهِ مِمَّا سِواهُمَا، وَأَنْ يُحِبَّ المَرْءَ لاَ يُحِبُّهُ إلاَّ للَّهِ ، وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ “ رواة صحيح البخاري

హద్దథనా ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ఖాల, హద్దథనా అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ఖాల హద్దథనా అయ్యూబు అన్ అబి ఖిలాబత అన్ అన్సిన్ అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వ సల్లమ ఖాల థలాథున్ మన్ కున్న ఫీహి వజద హలావత అల్ఈమాని అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా, వ అన్ యుహిబ్బ అల్మర్ఆ లా యుబ్బుహు ఇల్లల్లాహి, వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నారి రవాహ్ సహీ బుఖారి.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారి హదీథ్ గ్రంధంకర్త   ← ముహమ్మదుబ్ను అల్ ముథన్నా ← అబ్దుల్ వహ్హాబి అథ్థఖఫియ్యు ← హద్దథనా అయ్యూబు ←  అబి ఖిలాబత ← అన్సిన్ (రదియల్లాహుఅన్హు) ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం హితోపదేశం.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు మూడు (గుణములు) ఎవరి దగ్గరైతే ఉంటాయో వారు విశ్వాసం యొక్క తియ్యటి మాధుర్యాన్ని రుచి చూస్తారు – 1)వారు కేవలం అల్లాహ్ ను మరియు దైవప్రవక్తను మాత్రమే అన్నింటి కంటే ఎక్కువగా ఇష్టపడతారు. 2)మరియు ఎదుటి మనిషిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకే ప్రేమిస్తారు. 3)మరియు నరకాగ్ని భయంతో తిరిగి మళ్ళీ అవిశ్వాసిగా మారటాన్ని ఇష్టపడరు. సహీ బుఖారి హదీథ్ గ్రంధం

హదీథ్ వివరణ

విశ్వాసి యొక్క దైవవిశ్వాసపు కోరికను ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) తీపిదనపు మాధుర్యం కోసం తపించే ఆకాంక్షతో పోల్చినారు. ఒక వ్యాధిగ్రస్థుడి మరియు ఒక ఆరోగ్యవంతుడి మధ్య ఉండే తేడాని ఈ హదీథ్ జ్ఞాపకానికి తీసుకు వస్తున్నది. వ్యాధిగ్రస్థుడికి తేనె కూడా చేదుగా అనిపిస్తుంది, కాని అదే తేనెలోని తియ్యదనాన్ని ఆరోగ్యవంతుడు మాధుర్యంతో రుచిచూస్తాడు. ఎప్పుడైతే ఆరోగ్యం క్షీణిస్తుంటుందో, రుచి చూసే శక్తి కూడా క్షీణిస్తుంది. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) మాధుర్యం (తియ్యదనం) అనే పదాన్ని వినియోగించారు ఎందుకంటే దైవవిశ్వాసాన్ని ఒక చెట్టుతో అల్లాహ్ పోల్చినాడు. దివ్యఖుర్ఆన్ లోని సూరహ్ ఇబ్రహీం 14:24 లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:“అల్లాహ్ ఉపమానాలను ఎలా ముందు ఉంచుతున్నాడో మీరు చూడటం లేదా? ఒక మంచి మాట ఒక మంచి చెట్టు వంటిది, దేని వ్రేళ్ళు అయితే బాగా పాతుకుపోయి ఉంటాయో మరియు దేని కొమ్మలు అయితే ఆకాశానికి చేరి పోతాయో ఇక్కడ మంచి పదం అంటే చిత్తశుద్ధితో కూడిన హృదయపూర్వకమైన దైవవిశ్వాసం. అదే ఏకదైవత్వపు (తౌహీద్) ప్రకటన. ఇక్కడ చెట్టు అనే పదం దైవవిశ్వాసానికి మూలబిందువు వంటిది, దాని కొమ్మలు అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించటం మరియు ఏవైతే అల్లాహ్ నిషేధించాడో వాటి నుండి దూరంగా ఉండటం వంటిది, మరియు దాని ఆకులు దైవవిశ్వాసి జాగ్రత్త వహించే ప్రతి మంచి విషయం వంటిది, మరియు దాని ప్రతిఫలమే అల్లాహ్ కు విధేయత చూపటం. ఇంకా దాని పర్యవసానంలోని మాధుర్యమే దాని ఫలాలు మరియు ఆ ఫలాలలోని తియ్యదనం.

ఉల్లేఖకుని పరిచయం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సేవకుడిగా అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు తన సేవలందించారు. అనేక హదీథ్ లను ఉల్లేఖించారు. 92వ హిజ్రీ సంవత్సరంలో చనిపోయారు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

  1. సృష్టిలోని అన్నింటి కంటే అల్లాహ్ ను మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ను ప్రేమించటం యొక్క ఆవశ్యకతను ఈ హదీథ్ తెలుపుతుంది.
  2. అల్లాహ్ కు మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్తకు అవిధేయత చూపుతూ, ప్రజలకు విధేయులుగా ఉండటం తగదు.
  3. దైవవిశ్వాసం పరిపూర్తి కావటానికి ఒక మార్గం – ప్రతి ముస్లిం తన తోటి ముస్లిం సోదరుడిని కేవలం అల్లాహ్ కోసం తప్పక ప్రేమించ వలెను.
  4. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని నరకంలో పడవేయటాన్ని అసహ్యించుకున్నట్లుగా అసహ్యించుకో వలెను.
  5. ఎవరి దగ్గర అయితే పై మూడు మంచి లక్షణాలు ఉన్నాయో వారు శాంతియుతంగా మరియు సురక్షితంగా ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు.

ప్రశ్నలు

  1. దైవవిశ్వాసపు తీపిదనం ఎవరిలో ఉంటుంది?
  2. ప్రతి ముస్లిం అవిశ్వాసాన్ని ఏ విధంగా అసహ్యించుకోవలెను?
  3. ఈ హదీథ్ యొక్క ఉల్లేఖకుని గురించి క్లుప్తంగా వ్రాయండి?
  4. ప్రతి ముస్లిం తోటి ముస్లిం సోదరుడిని ఎవరి కోసం ప్రేమించాలి?
  5. శాంతియుతంగా మరియు సురక్షితంగా ఉండటానికి ఏ ఏ లక్షణాలు ఉండవలెను?

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

తౌహీద్ ప్రభోదిని (తఫ్ హీం తౌహీద్ ) – Shaykh Muhammad bin AbdulWahab

Tawheed Prabhodini  (Tafheem Tawheed)
Shaikhul-Islam Muhammad ibn Sulaiman at-Tamimi  rahimahullaah

tawheed prabhodini - telugu

[ఇక్కడ పుస్తకం చదవండి / డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/tawheed-prabhodini
[PDF] [42 పేజీలు] [మొబైల్ ఫ్రెండ్లీ] [3.7 MB]

మూల రచయిత : ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ (రహిమహుల్లాహ్)
అనువాదం: హాఫిజ్ బద్రుల్ ఇస్లాం
ఎడిటింగ్: హాఫిజ్ అబ్దుర్ రవూఫ్ ఉమ్రి
హదీస్ పబ్లికేషన్స్, హైదరాబాద్

ముస్లింల ధార్మిక విశ్వాసం – జమీల్ జైనూ [పుస్తకం]

Muslimula Dharmika Viswaasam
Muslimula Dharmika Viswasam – in Q&A format –
by Jemeel Zainoo [PDF]

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [ మొబైల్ ఫ్రెండ్లీ] [42 పేజీలు]
https://teluguislam.net/wp-content/uploads/2022/03/muslimula-dharmika-viswasam-cropped.pdf

విషయ సూచిక :

పుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలు:

  1. అల్లాహ్ మనల్ని ఎందుకు పుట్టించాడు?
  2. అల్లాహ్ దాస్యం మనం ఏ విధంగా చేయాలి?
  3. మనము అల్లాహ్ దాస్యం భయంతో, ఆశతో చేయాలా?
  4. ఆరాధనలో ‘ఇహ్సాన్’ అంటే ఏమిటి?
  5. అల్లాహ్ తన సందేశహరుల్ని ఎందుకు పంపాడు?
  6. ‘తౌహీదె ఉలూహియ్యత్’ అంటే ఏమిటి?
  7. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అర్ధం ఏమిటి?
  8. సిఫాతె ఇలాహీ (అల్లాహ్ గుణవిశేషాలు) లో తౌహీద్ అనగానేమి?
  9. తౌహీద్ (ఏకదైవారాధన) కు కట్టుబడిన ముస్లింకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
  10. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?
  11. మనతోపాటు అల్లాహ్ తన అస్థిత్వంతో ఉన్నాడా లేదా తన జ్ఞానంతో ఉన్నాడా?
  12. అతిపెద్ద పాపం ఏమిటి?
  13. షిర్కే అక్బర్ (అతిపెద్ద షిర్కు) అంటే ఏమిటి?
  14. అతిపెద్ద ‘షిర్కు’ కు ఒడిగడితే ఎలాంటి నష్టం కలుగుతుంది?
  15. ‘షిర్కు’ కు ఒడిగడుతూ సత్కార్యాలు ఆచరిస్తే ప్రయోజనం ఉంటుందా?
  16. ముస్లిముల్లో షిర్కు ఉందా?
  17. అల్లాహ్ తప్ప ఇతరులను వేడుకోవడం, అంటే వలి అల్లాహ్ లను వేడుకునే విషయమై ఎలాంటి ఆదేశం ఉంది?
  18. వేడుకోవడం (దుఆ) దైవారాధన అవుతుందా?
  19. మృతులు పిలుపును వింటాయా?
  20. మృతులను సహాయం కొరకు ప్రార్ధించవచ్చా?
  21. అల్లాహ్ తప్ప ఇతరులను సహాయం కోరడం ధర్మసమ్మతమేనా?
  22. బ్రతికి ఉన్న సృష్టి సహాయం కోరవచ్చా ?
  23. అల్లాహ్ తప్ప ఇతరులకు మొక్కుబడులు చెల్లించడం ధర్మసమ్మతమేనా?
  24. అల్లాహ్ తప్ప ఇతరులకోసం జిబాహ్ చేయడం ధర్మసమ్మతమేనా?
  25. సమాధుల ప్రదక్షిణం చేయటం ధర్మసమ్మతమేనా?
  26. సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం ధర్మసమ్మతం అవుతుందా?
  27. చేతబడి చేయటం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?
  28. జ్యోతిష్కుని మాటలను నమ్మవచ్చా ?
  29. అగోచర జ్ఞానం ఎవరికైనా ఉంటుందా?
  30. ముస్లిములు వేటిని తమ గీటురాయిగా చేసుకోవడం విధిగా చేయబడింది?
  31. ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేసే విషయమై ఎలాంటి ఆదేశం ఉంది?
  32. దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమేనా?
  33. తాయత్తులు, గవ్వలు వ్రేలాడదీసుకోవడం ధర్మసమ్మతమేనా?
  34. మనము అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి?
  35. అల్లాహ్ ను వేడుకొనడానికి ఎవరి సహాయమైనా అవసరమవుతుందా?
  36. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పని ఏమిటి?
  37. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసు ప్రసాదించమని మనం ఎవరిని వేడుకోవాలి?
  38. అల్లాహ్ ను ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మనం ఏవిధంగా ప్రేమించాలి?
  39. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశంసించే విషయంలో హద్దుమీరి ప్రవర్తించవచ్చా?
  40. అల్లాహ్ తన సృష్టిరాశుల్లో మొదటగా ఎవరిని సృష్టించాడు?
  41. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం గురించి ఎలాంటి ఆదేశం ఉంది?
  42. ‘విశ్వాసులతో స్నేహం’ అంటే ఏమిటి?
  43. వలీ అల్లాహ్ (అల్లాహ్ మిత్రుడు) ఎవరు?
  44. అల్లాహ్ ఖుర్ఆన్ ను ఎందుకు అవతరింపజేశాడు?
  45. ఖుర్ఆన్ ఎలాగూ ఉంది కదా! అని మనం హదీస్ పట్ల విముఖత చూపగలమా?
  46. అల్లాహ్ , ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలపై మనము ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?
  47. వివాదం తలెత్తినప్పుడు మనం ఏం చేయాలి?
  48. ‘బిద్అత్’ అంటే ఏమిటి?
  49. ఇస్లాంలో ‘బిద్అతె హసనా’ ఉందా?
  50. ఇస్లాంలో ‘సున్నతె హసనా’ (మంచి విధానం) ఉందా?
  51. మనిషి కేవలం స్వీయ సంస్కరణ చేసుకొంటే సరిపోతుందా?
  52. ముస్లింలకు ఎప్పుడు ఆధిపత్యం లభిస్తుంది?
  53. ముస్లింలపై ముస్లింల హక్కులు ఎన్ని ఉన్నాయి ?
  54. సందేశ ప్రచార విషయంలో ఎలాంటి  ఆదేశం ఉంది?
  55. ప్రపంచంలో సన్మార్గ గాములు ఉన్నారా?
  56. ఏ వర్గం వారు ధార్మిక సేవ అందరికంటే ఎక్కువ చేసారు?
  57. సత్యం ఎవరి పక్షాన ఉంది?ఎవరు సాఫల్యం పొందుతారు?
  58. సామూహిక ప్రాముఖ్యం తెలుపండి ?
  59. అన్నింటికన్నా ప్రాముఖ్యం గల విధి ఏది?
  60. ధర్మంలో నైతికతకు ఎలాంటి స్థానం ఉంది?
  61. ఇస్లామీ వ్యవస్థ లేని దేశంలో మనం ఏ విధంగా జీవించాలి?
  62. దాసులలో అందరికంటే అధికంగా హక్కుగల వారెవరు?
  63. దేవుని అవిధేయత జరిగే పక్షంలో మానవులకు విధేయత చూపవచ్చా?
  64. జీవితం అనగా నేమి?

షహాదహ్ – ఒక ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం

టైటిల్: షహాదహ్ – ఒక ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం
నిర్మాణం : ముహమ్మద్ ముహ్సిన్ ఖాన్

అనువాదకులు : ముహమ్మద్ కరీముల్లాహ్
పునర్విచారకులు : షేఖ్ నజీర్ అహ్మద్
క్లుప్త వివరణ: షహాదహ్ అంటే ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం ఎలా ఒక వ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవన మార్గం పై నడిపిస్తుందో, ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించబడెను. ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన పుస్తకమిది.

CONFESSION OF A MUSLIM

لا إلــه إلاالله محمد رسول الله

లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్

(అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు)

ఇస్లాం స్వీకరించిన అనేక మంది ప్రజలు ఇస్లాం యొక్క మొట్టమొదటి మూలస్థంభమైన – లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ యొక్క అసలు భావం గ్రహించటం లేదని తెలుస్తున్నది. కాబట్టి ఈ యొక్క మహోన్నత వచనం యొక్క భావాన్ని స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరం:

لا إلاه إالله محمد رسول الله

లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్

అనే పవిత్ర వాక్యాన్ని మూడు భాగాలలో అర్థం చేసుకోవచ్చును: a (మొదటి నియమం, రెండవ నియమం, మూడవ నియమం, నాలుగవ నియమం), b & c

a) క్రింద తెలిపిన నాలుగు నియమాల పై సర్వలోకాల సృష్టకర్త, ఉనికిలో ఉన్న ప్రతి దానికి ప్రభువు, ఏకైక మహోన్నతుడు మరియు తీర్పుదిన న్యాయాధిపతి అయిన అల్లాహ్ కు మీరు వాగ్దానం చేయవలసి ఉన్నది.

మొదటి నియమం: “కేవలం అల్లాహ్ మాత్రమే ప్రతిదాని సృష్టికర్త” అని హృదయపూర్వకంగా అంగీకరించటం. A confession with your heart that the Creator (of everything) is Allah; దీని కోసం మీరు ఇలా ధృవీకరించ వలసి ఉంటుంది: “నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, స్వర్గలోకాలు, ప్రపంచానికి తెలిసిన మరియు తెలియని అన్ని రకాల జీవరాశులతో నిండి ఉన్న భూలోకం మొదలైన సకల లోకాలను సృష్టించిన, సర్వలోక సమర్థుడు కేవలం అల్లాహ్ మాత్రమే” అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే ఈ విశాల విశ్వపు ప్రతిదీ నడిపేవాడు మరియు ప్లానింగ్ చేసేవాడు. ఆయనే జీవితాన్ని మరియు మరణాన్ని ఇస్తాడు, మరియు కేవలం ఆయనే పోషిస్తాడు, సంరక్షిస్తాడు” దీనిని “అల్లాహ్ యొక్క ఏకైక దైవత్వం” – తౌహీదుర్రుబూబియ్యహ్ అని అంటారు.

రెండవ నియమం: “ఇతరులెవ్వరూ ఆరాధ్యులు కారు, కాని ఒక్క అల్లాహ్ తప్ప” అని హృదయపూర్వకంగా సాక్ష్యమివ్వటం: ఇస్లామీయ భాషలో ఆరాధన అనే పదం అనేక విసృతార్థాలను ఇస్తుంది: అన్ని రకాల ఆరాధనలు కేవలం అల్లాహ్ కే చెందును అనే విషయాన్ని ఇది నొక్కి చెబుతున్నది. (అంటే ఇతరులెవ్వరూ – వారు దైవదూతలైనా, ప్రవక్తలైనా, సందేశహరులైనా, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా-జీసస్ అలైహిస్సలాం అయినా, ఉజైర్, ముహమ్మద్, సూర్యుడు, చంద్రుడు, విగ్రహాలు, సన్యాసులు అయినా, ఇంకా వేరే ఇతర అసత్యపు ఆరాధ్య దైవాలన్నీ ఆరాధించటానికి అస్సలు అర్హులు కారు) కాబట్టి కేవలం అల్లాహ్ నే ఆరాధించవలెను, అల్లాహ్ ను కాకుండా వేరే ఇతరులెవ్వరినీ వేడుకోరాదు, అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరులెవ్వరి పేరు మీదా పశువులను బలివ్వరాదు, … etc, మరియు దీని అర్థం ఏమిటంటే – ఖుర్ఆన్ లో మరియు సున్నహ్ (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు) లలో వేటినైతే ఆచరించమని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఆదేశించారో వాటిని మనం తప్పక ఆచరించ వలెను. మరియు ఏదైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేయవద్దని నిషేధించారో, వాటిని మనం అస్సలు చేయకూడదు. దీనినే “అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఏకైకత్వం” – తౌహీదుల్ ఉలూహియ్యహ్ అని అంటారు. కాబట్టి మనం అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ ను వదిలి ఇతరులెవ్వరినీ ఆరాధించరాదు.

Hypocrisy – అన్నిఫాఖ్ – కపటత్వం – النفاق

ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం కపటత్వం అంటే ఇస్లాం ధర్మ ఆచరణలను మరియు మంచి సంకల్పాన్ని ప్రదర్శిస్తూ, అవిశ్వాసాన్ని మరియు చెడు సంకల్పాన్ని దాచటం. దీనికా పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ దుష్టత్వం ఒక ద్వారం గుండా ప్రవేశించి, మరొక ద్వారం గుండా బయటకు పోతుంది.

దివ్యఖుర్ఆన్ లో అత్తౌబా అధ్యాయంలోని 68వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటించెను

.التوبة 68 “إِنَّ الْمُنَافِقِينَ هُمْ الْفَاسِقُونَ” –

అనువాదం {కపటులు నిశ్చయంగా తిరుగుబాటుదారులు మరియు మూర్ఖులు (మొండితనం వారు)}. ఇటువంటి వారే ఇస్లామీయ ధర్మశాసనం నుండి స్వయంగా బయటకు వచ్చిన వారు. ఇంకా, కపటులు అవిశ్వాసుల (బహుదైవారాధకుల) కంటే ఎక్కువ నీచమైనవారని అల్లాహ్ ప్రకటించెను. దివ్యఖుర్ఆన్ లోని అన్నిసా అధ్యాయంలో 145వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

“إِنَّ الْمُنَافِقِينَ فِي الدَّرْكِ الأسْفَلِ مِنْ النَّارِ” –

దివ్యవచనపు భాగం యొక్క అనువాదం – {కపటులు నరకాగ్ని యొక్క అట్టడుగు పొరలలో ఉంచబడతారు},

ఇంకా దివ్యఖుర్ఆన్ లోని అన్నిసా అధ్యాయంలోని 147వ వచనంలో ఇలా ప్రకటిస్తున్నాడు

“إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ” – దివ్యవచనం భావం యొక్క అనువాదం – అల్లాహ్ ను వెనుక వదిలేశామని కపటులు భావిస్తున్నారు, కాని వాస్తవానికి అల్లాహ్ కంటే కపటులే వెనుక బడిపోయారు

ఇంకా దివ్యఖుర్ఆన్ లో అల్ బఖరా అధ్యాయంలో 9,10 వ వచనాలలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

” يُخَادِعُونَ اللَّهَ وَالَّذِينَ آمَنُوا وَمَا يَخْدَعُونَ إِلا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ. فِي قُلُوبِهِمْ مَرَضٌ فَزَادَهُمْ اللَّهُ مَرَضًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْذِبُونَ –“ سورة البقرة : 9- 10

దివ్యవచనం యొక్క అనువాదం – {అల్లాహ్ నూ, విశ్వాసులనూ వారు మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. కాని యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరినీ మోసం చెయ్యటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారు హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు.వారు చెప్పే ఈ అబద్ధానికి గాను, వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది}.

కపటత్వంలోని రకాలు: కపటత్వం రెండు రకాలుగా విభజింపబడినది:

మొదటి రకం, సిద్ధాంత పరమైన (తాత్విక) కపటత్వం (ఘోరమైన కపటత్వం), ఇది ఘోరమైన కపటత్వం. ఈ రకానికి చెందిన కపటులు పైకి ఇస్లాం ధర్మం పై విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని చూపుతూ, తమలోని అవిశ్వాసాన్ని కప్పి ఉంచుతారు. ఈ విధమైన కపటత్వం ఇస్లాం నుండి పూర్తిగా బహష్కరింప జేస్తుంది. ఇటువంటి కపటులు నరకాగ్నిలోని అట్టడుగు భాగంలోనికి పంపబడతారు. ఏదేమైనా, అల్లాహ్ ఇటువంటి కపటులను అన్ని రకాల దుష్టత్వపు గుణాలు కలవారిగా వర్ణించినాడు – అవిశ్వాసం, దైవ విశ్వాసం లేకపోవటం, ఇస్లాం ధర్మాన్ని మరియు ముస్లింలను ఎగతాళి చేయటం, తిరస్కరించటం మరియు ఇస్లాం ధర్మ విరోధుల వైపుకు మొగ్గి, పూర్తి ఆసక్తితో శత్రుత్వంలో పాలుపంచుకోవటం. దౌర్భాగ్యం వలన, ఇటువంటి కపటులు ప్రతి కాలంలో జీవించి ఉన్నారు, ప్రత్యేకంగా ఇస్లామీయ సామ్రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఉండేవారు. వారు తమ చెడు తలంపులను పైకి చూపలేక ముస్లింలుగా ప్రవర్తిస్తూ, రహస్యంగా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా కుతంత్రాలు పన్నేవారు. కపటత్వాన్ని నింపుకుని, ముస్లింల మధ్య ఉంటూ తమ ప్రాణాన్ని మరియు సంపదలను కాపాడుకుంటూ ఉండేవారు. కాబట్టి, కపటులు అల్లాహ్ పై, దైవదూతలపై, దివ్యగ్రంథాలపై, దైవ ప్రవక్తలపై మరియు ప్రళయదినం పై విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, లోలోపల వీటిన్నింటినీ తిరస్కరిస్తూ అవిశ్వాసంతో ఉంటారు. వారు అల్లాహ్ పై అస్సలు విశ్వాసం ఉంచరు. ఇంకా అల్లాహ్ తన సందేశహరుల ద్వారా మార్గభ్రష్టత్వం మరియు కఠిన శిక్షల నుండి ప్రజలను కాపాడటానికి,  తన దివ్యసందేశాన్ని మార్గదర్శకత్వంగా పంపాడనే సత్యాన్ని కూడా నమ్మరు.

వాస్తవానికి, అల్లాహ్ ఆ కపటుల గురించిన నిజానిజాలను బట్టబయలు చేసి ఉన్నాడు, వారి రహస్యాలను తన దివ్యగ్రంథంలో అవతరింపజేసినాడు, ఇంకా వారి గుణగణాల గురించి వర్ణించినాడు. దీని ద్వారా విశ్వాసులు అలాంటి కపటులను కనిపెట్టి, వారి కుతంత్రాల నుండి కాపాడు కోవాలెను.  ఖుర్ఆన్ లోని రెండో అధ్యాయమైన అల్ బఖర ప్రారంభంలో మొత్తం మానవజాతిని మూడు విధాలుగా అల్లాహ్ విభజించెను – విశ్వాసులు, అవిశ్వాసులు మరియు కపటులు. అల్లాహ్ ఇక్కడ విశ్వాసుల గురించి నాలుగు వచనాలలో, అవిశ్వాసుల గురించి రెండు వచనాలలో మరియు కపటుల గురించి పదమూడు వచనాలలో తెలిపెను. కపటుల గురించి అంత ఎక్కువగా వర్ణించటానికి కారణం –  వారు అనేక విభిన్న లక్షణాలు కలిగి ఉండటం, ఇంకా ఇస్లామీయ సమాజానికి మరియు ముస్లింలకు వారు చేయటానికి ప్రయత్నించే అపాయం, హాని, అపకారం కూడా చాలా తీవ్రంగా ఉండటం.  ముస్లింలలో బాగా కలిసిమెలిసి ఉంటారు, కాని వాస్తవానికి వారు ముస్లింల బద్ధవిరోధులు.  వారి ఈ బద్ధశత్రుత్వాన్ని, ఏ సమయంలోనైనా ప్రదర్శించ వచ్చును. అయితే వారి గురించి తెలియని అజ్ఞానులు వీరిని శాంతిని స్థాపించటానికి ప్రయత్నిస్తున్న శాంతిదూతలుగా భ్రమ పడతారు. కాని అది అత్యంత ప్రమాదకరమైన అజ్ఞానం. ఈ రకమైన కపటత్వం ఆరు విధాలుగా విభజింపబడినది:

1-  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అసత్యం పలుకుతారని అభాండం వేయటం.

2-  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన వాటిలో కొన్నింటిని నిరాకరించటం.

3-  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అసహ్యించుకోవటం.

4-  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన వాటిలో కొన్నింటిని అసహ్యించుకోవటం.

5-  ఇస్లాం ధర్మపు తిరోగతి (declination) పై సంతోషపడటం మరియు సంతృప్తి చెందటం.

6-  ఇస్లామీయ ధర్మపు విజయాలను అసహ్యించుకోవటం, ఏవగించుకోవటం.

రెండో రకం, ఆచరణాత్మక కపటత్వం (అల్పమైన కపటత్వం), హృదయంలో కొంత దైవవిశ్వాసాన్ని ఉంచుకుని కూడా, కపటులు చేసే చెడు పనులు ఈ రకమైన కపటత్వాన్ని సూచిస్తుంది. ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింపజేయదు, కాని అటువైపుకు మార్గం చూపుతాయి. కపటత్వపు పనులు చేస్తున్నా కూడా ఇటువంటి వారిలో ఇంకా దైవవిశ్వాసం మిగిలి ఉంటుంది. కాని కపటత్వం అధికమైతే, పూర్తి కపటుడిగా మారిపోతారు.  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు,

قوله r :(أربع من كن فيه كان منافقاً خالصاً. ومن كانت فيه خصلة منهن كانت فيه خصلة من النفاق حتى يدعها. إذا أؤتمن خان وإذا حدث كذب وإذا عاهد غدر وإذا خاصم فجر) “ متفق عليه

అనువాదం – “ఎవరిలోనైనా నాలుగు లక్షణాలు ఉన్నట్లయితే వారు పూర్తిగా కపటత్వం కలిగి ఉన్నవారవుతారు. ఎవరైనా వాటిలో ఒక లక్షణం కలిగి ఉంటే, ఆ గుణాన్ని వదలనంత వరకు వారు కపటత్వాన్ని కలిగి ఉన్నవారవుతారు. ఆ లక్షణాలు – మాట్లాడినప్పుడు, అసత్యం పలకటం, చేసిన ఒడంబడికను వంచించటం, చేసిన వాదనను భంగపరచటం మరియు ఘర్షణ పడినప్పుడు, సత్యాన్ని ఉల్లంఘించటం”. కాబట్టి, ఎవరిలోనైనా ఈ నాలుగు లక్షణాలు ఉన్నట్లయితే, వారిలో అన్ని రకాల దుష్టత్వం మరియు కపటుల చిహ్నాలు ఉన్నట్లే. ఇంకా, ఎవరిలోనైనా వీటిలో ఏదైనా ఒక లక్షణం ఉన్నట్లయితే, వారు కపటత్వపు ఒక చిహ్నం కలిగి ఉన్నవారిగా గుర్తించ వలెను. వాస్తవానికి, మానవులలో కొన్ని మంచి,  దైవవిశ్వాసపు చిహ్నాలు మరియు కొన్ని చెడు, కపటత్వపు చిహ్నాలు ఉంటాయి. వీటిలో ఎక్కువ ప్రభావితం చేసి, ముందుకు నడిపించిన చిహ్నం ఏదైతే ఉంటుందో, దాని ప్రతిఫలం (అల్లాహ్ యొక్క అనుగ్రహం గాని ఆగ్రహం (శిక్ష) గాని) మానవులు పొందుతారు. ఉదాహరణకు మస్జిద్ లో నమాజు చేయటానికి వెళ్ళటంలో ఆలస్యం చేయటమనేది కపటత్వానికి ఒక చిహ్నం. వాస్తవానికి ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సహచరులు చాలా తీవ్రంగా భయపడిన కపటత్వపు అలవాట్లలోని ఒక ముఖ్యమైన దురలవాటు. ఇబ్నె ములైకాహ్ ఇలా తెలిపారు, “దాదాపు 30 మంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సహచరులు (సహాబాలు) ఇటువంటి కపటత్వం నుండి తీవ్రంగా భయపడటం నేను చూశాను”

సైద్ధాంతిక కపటత్వం మరియ ఆచరణాత్మక (అల్పమైన) కపటత్వం మధ్య ఉన్న భేదాలు:

1-     సైద్ధాంతిక (ఘోరమైన) కపటత్వం ఇస్లాం నుండి బహిష్కరింపజేస్తుంది కాని ఆచరణాత్మక (అల్పమైన) కపటత్వం అలా చేయదు.

2-     సైద్ధాంతిక (ఘోరమైన) కపటత్వం అంటే గుప్తంగానూ, మరియు బహిరంగంగానూ ఇస్లామీయ విశ్వాసాలను మరియు నియమనిబంధనలను ఖండించటం.  కాని ఆచరణాత్మక (అల్పమైన) కపటత్వం అంటే ఇస్లామీయ మూలవిశ్వాసాలను కాకుండా, కేవలం ఆచారాలను మాత్రమే వ్యతిరేకించటం.

3-     ఒక విశ్వాసిని సైద్ధాంతిక (ఘోరమైన) కపటుడిగా పరిగణించకూడదు. కాని అతడు కొన్ని ఆచరణాత్మక (అల్పమైన) కపటత్వపు పనులు చేస్తుండ వచ్చును.

4-     ఎవరైనా సైద్ధాంతిక (ఘోరమైన) కపటత్వానికి అలవాటు పడినవారు సాధారణంగా పశ్చాత్తాప పడరు మరియు క్షమాభిక్ష వేడుకోరు. ఒకవేళ వారు పశ్చాత్తాప పడినా, దానిని అల్లాహ్ స్వీకరిస్తాడా లేదా అనేది ఒక వివాదాస్పదమైన విషయం. ఇంకో వైపు, ఆచరణాత్మక (అల్పమైన) కపటత్వం ఉన్న వ్యక్తి పశ్చాత్తాప పడతాడు, క్షమాభిక్ష వేడుకుంటాడు. ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, అల్లాహ్ స్వీకరించవచ్చు. తీవ్రమైన కపటత్వం ఉన్న వారి గురించి దివ్యఖుర్ఆన్ లోని అల్ బఖర అధ్యాయంలోని 18వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

” صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لا يَرْجِعُونَ – “  سورة البقرة : 18

దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {చెవిటివారు, మూగవారు, మరియు గ్రుడ్డివారు, వారు ఎప్పటికీ మరలరు (సత్యమార్గం వైపునకు)}.

మరలటం అంటే ఇక్కడ ఇస్లాం వైపునకు హృదయపూర్వకంగా మరలిరావటం. వారి గురించి అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లోని అత్తౌబా అధ్యాయంలోని 126 వ వచనంలో ఇలా ప్రకటిస్తున్నాడు –

”أَوَلا يَرَوْنَ أَنَّهُمْ يُفْتَنُونَ فِي كُلِّ عَامٍ مَرَّةً أَوْ مَرَّتَيْنِ ثُمَّ لا يَتُوبُونَ وَلا هُمْ يَذَّكَّرُونَ “ سورة التوبة : 126

– దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {తాము ప్రతి సంవత్సరం ఒకటీ, రెండుసార్లు పరీక్షకు గురిచెయ్యబడటాన్ని వారు చూడటం లేదా? కాని దీని తర్వాత కూడా వారు పశ్చాత్తాప పడటం లేదు. ఏ గుణపాఠాన్నీ నేర్చుకోవటం లేదు}.

ఇస్లామీయ ధర్మపు ఒక ప్రఖ్యాత పండితుడు (షేఖుల్ ఇస్లాం) ఇబ్నె తయిమియా ఇలా తెలిపారు,“ ఎల్లప్పుడూ కపటులు ఇస్లాం ధర్మాన్ని మరియు దైవ విశ్వాసాన్ని ప్రదర్శించుతూ ఉండటం వలన, వారి పశ్చాత్తాపం స్వీకరించ బడుతుందా, లేదా అనే విషయం పై పండితులు చర్చించుకున్నారు”.

Disbelief – అల్ కుఫ్ర్ – అవిశ్వాసం – 

నిర్వచనం: దైవవిశ్వాసానికి బద్ధ విరుద్ధమైనది అల్ కుఫ్ర్ (అవిశ్వాసం). కాబట్టి కుఫ్ర్ (అవిశ్వాసం) అంటే అల్లాహ్ పై విశ్వాసాన్ని,  అల్లాహ్ యొక్క సందేశహరులపై విశ్వాసాన్ని నిరాకరించటం. అది అబద్ధాలతో, అపనిందలతో, అభియోగాలతో కూడినదైనా కావచ్చు లేదా అవి లేకుండా నిరాకరించటమైనా కావచ్చు. కాబట్టి ఇస్లాం ధర్మం పై ఎటువంటి సందేహం, అనుమానం ఉన్నా, దానిలోని కొన్ని నియమాలను విడిచి పెట్టినా, ఇస్లాం స్వీకరించీ శత్రుత్వం, గర్వం లేక తమ పూర్వపు జీవితం అసత్యమార్గం వైపుకు పోవటం జరిగినా అది అవిశ్వాసం క్రిందికే వస్తుంది. కాబట్టి ఎవరైనా అవిశ్వసకుడిగా మారిపోవటానికి ఇవి చాలు. ఇంకా, నిరాకరించటమనేది చాలా చాలా ఘోరమైనది.

విభజన: కుఫ్ర్ రెండు భాగాలుగా విభజింపబడినది: కుఫ్ర్ అక్బర్ (ఘోరమైన అవిశ్వాసం) మరియు కుఫ్ర్ అస్గర్ (అల్పమైన అవిశ్వాసం)

1) మొదటి భాగం: كفر أكبر కుఫ్ర్ అక్బర్ (ఘోరమైన అవిశ్వాసం), ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేస్తుంది. దీని ఐదు ఉపభాగాలుగా విభజింప బడినది:

a)       మొదటి ఉపభాగం: كفر التكذيب విరుద్ధమైన అవిశ్వాసం. దీనికి ఋజువు –

ఖుర్ఆన్ లోని అంకబూత్ అధ్యాయంలోని 68వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

العنكبوت 68“وَمَنْ أَظْلَمُ مِمَّنْ افْتَرَى عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِلْكَافِرِينَ”

దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {అల్లాహ్ వ్యతిరేకంగా అసత్యం పలికే వాడి కంటే లేదా తన దగ్గరకు వచ్చిన సత్యాన్ని తిరస్కరించిన వాడి కంటే ఎక్కువ పాపిష్టి ఎవరు? అటువంటి సత్యతిరస్కారులకు నరకంలో శాశ్వతమైన పక్కా నివాసం లేదా?}

b)                రెండవ ఉపభాగం: كفر الإباء లోలోపలి అవిశ్వాసంతో పాటు తిరస్కారం మరియు దురహంకారంతో కూడిన అవిశ్వాసం. దీనికి ఋజువు – దివ్యఖుర్ఆన్ లోని అల్ బఖర (ఆవు) అధ్యాయంలోని 34వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

البقره 34 “وَإِذْ قُلْنَا لِلْمَلائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلا إِبْلِيسَ أَبَى وَاسْتَكْبَرَ وَكَانَ مِنْ الْكَافِرِينَ”

దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {మేము దైవదూతలకు ఇలా ఆజ్ఞాపించాము: “ఆదం (అలైహిస్సలాం) కు సాష్టాంగ పడండి:” మరియు వారు సాష్టాంగ పడినారు: కాని, ఇబ్లీస్ మాత్రం పడలేదు: అతడు తిరస్కరించాడు మరియు దురహంకారి అయ్యాడు: అతడు సత్యతిరస్కారులలోని వాడై పోయాడు}.

c)  మూడవ ఉపభాగం: كفر الشك సందేహాస్పదమైన మరియు అనుమానంతో కూడిన అవిశ్వాసం. దీనికి ఋజువు – దివ్యఖుర్ఆన్ లోని అల్ బఖర (ఆవు) అధ్యాయంలోని 34వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَنْ تَبِيدَ هَذِهِ أَبَدًا. وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِنْ رُدِدْتُ إِلَى رَبِّي لأجِدَنَّ خَيْرًا مِنْهَا مُنقَلَبًا. قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِنْ تُرَابٍ ثُمَّ مِنْ نُطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلا. لَكِنَّا هُوَ اللَّهُ رَبِّي وَلا أُشْرِكُ بِرَبِّي أَحَدًا – الكهف 35 – 38

దివ్యవచనపు భావం యొక్క అనువాదం – {అతడు తన తోటలోప్రవేశించాడు: ” ఎన్నటికైనా ఈ సంపద నశిస్తుందని నేను భావించటం లేదు. ఎప్పటికైనా ప్రళయం ఘడియ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. అయినప్పటికీ, ఒకవేళ ఎప్పుడైనా నేను నా ప్రభువు సన్నిధికి మరలింపబడినట్లయితే తప్పకుండా దీనికంటే మహోజ్వలమైన స్థానాన్ని పొందుతాను.” అప్పుడు అతడి పొరుగువాడు అతనితో ఇలా పలికాడు ” నిన్ను మట్టితోనూ, తర్వాత వీర్యబిందువుతోనూ పుట్టించి, ఒక సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దిన ఆయనను నీవు తిరస్కరిస్తున్నావా?” ఇక నా విషయంలో, అల్లాహ్ యే నా ప్రభువు. నేను ఎవరినీ ఆయనకు భాగస్వామిగా చేయను}.

d)      నాలుగవ ఉపభాగం: كفر الإعراض దారి మరలించే అవిశ్వాసం.

దీనికి ఋజువు – ఖుర్ఆన్ లోని అల్ అహ్ ఖాప్ లోని 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

الاحقاف 3 “وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنْذِرُوا مُعْرِضُونَ”

దివ్యవచనపు భావం యొక్క అనువాదం–{ఎవరైతే దైవవిశ్వాసాన్ని తిరస్కరిస్తారో, వారు హెచ్చరింప బడిన తీవ్ర పరిమాణాల వైపుకు మళ్ళింపబడతారు}.

e)                 ఐదవ ఉపభాగం: كفر النفاق కపటత్వపు అవిశ్వాసం.

దీనికి ఋజువు – దివ్యఖుర్ఆన్ లోని అల్ మూనాఫిఖూన్ అధ్యాయంలోని 3వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు –

المنافقون 3“ذَلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلَى قُلُوبِهِمْ فَهُمْ لا يَفْقَهُونَ”

దివ్యవచనపు భావం యొక్క అనువాదం–{దీనికంతటికీ కారణం, వారు విశ్వసించిన తర్వాత తిరస్కరించటమే. అందుకని వారి హృదయాలపై ముద్రవేయబడినది, ఇక వారు దేనినీ అర్థం చేసుకోలేరు}.

2) రెండవ భాగం: كفر أصغر కుఫ్ర్ అస్గర్ (అల్పమైన అవిశ్వాసం) ఇది ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేయదు. కాని, ఇది ఆచరణలో ఉండే అవిశ్వాసం.(a practical disbelief). వాస్తవానికి, ఇవి ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో తెలుపబడిన ఘోరమైన అవిశ్వాసం వరకు చేర్చని చిన్న, చిన్న అల్పమైన అవిశ్వాసములు – ఉదాహరణకు అల్లాహ్ అనంతమైన దయామయుడు అనే సుగుణంలో అవిశ్వాసం కలిగి ఉండటం. దివ్యఖుర్ఆన్ లోని అన్నహల్ అధ్యాయంలోని 112వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు-

سورة النحل : 112 “وَضَرَبَ اللَّهُ مَثَلا قَرْيَةً كَانَتْ آمِنَةً مُطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ”

దివ్యవచనపు భావం యొక్క అనువాదం–{అల్లాహ్ ఒక పట్టణానికి సంబంధించిన ఉదాహరణ ఇస్తున్నాడు: ఆ పట్టణం శాంతిమయమూ, సంతృప్తికరమూ అయిన జీవితాన్ని గడుపుతూ ఉండేది. ప్రతి వైపు నుండి దానికి ఆహారం పుష్కలంగా చేరుతూ ఉండేది. అప్పుడు అది అల్లాహ్ ఆశీర్వాదాలకు కృతఘ్నత చూపటం ప్రారంభించినది}

ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం బోధించిన హదీథ్  {“سباب المسلم فسوق و قتاله كفر”  అనువాదం – “ఒక ముస్లిం ను దూషించటం, తిట్లు తిట్టడం, దుర్భాష లాడటం వంటివి దౌర్జన్యం, దురాగతం క్రిందకు వస్తుంది మరియు ముస్లింతో పోట్లాడటమనేది అవిశ్వాసం క్రిందకు వస్తుంది” (సహీహ్ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీథ్ గ్రంథాలలో నమోదు చేయబడినది)} ప్రకారం ముస్లిం తో పోట్లాడటమనేది, జగడం చేయటమనేది కూడా అల్పమైన అవిశ్వాసం క్రిందకు వస్తుంది}.

ఇంకో హదీథ్ లో (సహాబుఖారీ మరియు సహీ ముస్లిం హదీథ్ గ్రంథాలు) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు – “لا ترجعوا بعدي كفاراً يضرب بعضكم رقاب بعض ” – అనువాదం “నా తర్వాత ఒకరినొకరు గొంతులు కోసుకుంటూ అవిశ్వాసం వైపునకు మరలిపోవద్దు”.

అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయటం – కూడా అవిశ్వాసం క్రిందికే వస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా ఉపదేశించారు “من حلف بغير الله” – అనువాదం – “అల్లాహ్ పై కాకుండా వేరే ఇతర వాటిపై ప్రమాణం చేసేవారు అవిశ్వాసం  చేసిన దోషి అవుతారు (లేదా అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేసేవారు)”.

ఇలాంటివి అల్పమైన అవిశ్వాసపు పనులుగా గుర్తించబడినాయి. ముస్లింలు ఏదైనా ఘోర పాపం చేసినా కూడా, వారు విశ్వాసులుగానే ఉంటారు. దీనికి ఋజువు దివ్యఖుర్ఆన్ లోని అల్ బఖర అధ్యాయంలోని 178వ వచనంలో అల్లాహ్ యొక్క ప్రకటన.

178 البقره “يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمْ الْقِصَاصُ فِي الْقَتْلَى”

– దివ్యవచనపు అనువాదం – {ఓ విశ్వాసులారా! హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం సరిసమానంగా నిర్ణయించబడినది}. దీని నుండి తెలిసిన దేమిటంటే విశ్వాసులై ఉండీ హత్య చేసిన వారిని ధర్మశాసనం నుండి తప్పించ చేయలేదు. ఇంకా అల్లాహ్ వారిని, హత్య చేయబడిన వారి బంధువుల సోదరులుగా పరిగణించినాడు. దీనికి ఋజువు దివ్యఖుర్ఆన్ లోని అల్ బఖర అధ్యాయంలోని 178వ వచనంలో అల్లాహ్ యొక్క ప్రకటన.

178 البقره “فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ”

– దివ్యవచనపు అనువాదం – {ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే, న్యాయ సమ్మతంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు ఉత్తమమైన రీతిలో అతనికి రక్తధనాన్ని చెల్లించాలి.}. నిశ్చయంగా ఇది ఇస్లాం ధర్మంలోని  ఉత్తమమైన సోదర భావాన్ని తెలియజేస్తున్నది.

దివ్యఖుర్ఆన్ లోని హుజురాత్ అధ్యాయంలోని 9వ వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

سورة الحجرات : 9 “وَإِنْ طَائِفَتَانِ مِنْ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا”

అనువాదం – {ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం పోట్లాడుకుంటే వారి మధ్య రాజీ కుదర్చండి}.

దివ్యఖుర్ఆన్ లోని హుజురాత్ లోని 10వ వచనంలో చివరికి అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు.

سورة الحجرات :10 “إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ”

అనువాదం – {విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాహ్ కు భయపడండి. మీ పై దయచూపటం జరగవచ్చు} quoted from “The Explanation of the Tahawiah”, briefly.

మనం ఇప్పుడు ఘోరమైన అవిశ్వాసానికి (అష్షిర్క్ అల్ అక్బర్) మరియు అల్పమైన అవిశ్వాసానికి (అష్షిర్క్ అల్ అస్గర్) మధ్య గల భేదాలను క్లుప్తంగా గమనిద్దాం:

ఘోరమైన అవిశ్వాసానికి (అష్షిర్క్ అల్ అక్బర్) ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేస్తుంది మరియు పుణ్యాలను నిర్వీర్యం చేస్తుంది. అల్పమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అస్గర్) ఇస్లాం ధర్మం నుండి బహిష్కరింప జేయదు, పుణ్యాలను నశింపజేయదు కాని వాటి ప్రతిఫలాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరస్థుడిలో అల్లాహ్ యొక్క భయాన్ని కలుగజేస్తుంది.

ఘోరమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అక్బర్) వలన నరకాగ్నిలో శాశ్వతంగా ఉంచబడతారు. కాని అల్పమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అస్గర్) అలా చేయక, శిక్ష పూర్తయ్యే వరకు మాత్రమే నరకాగ్నిలో ఉంచుతుంది.

ఘోరమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అక్బర్) ప్రాణాన్ని మరియు సంపదను రక్షించదు. కాని అల్పమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అస్గర్) అలా చేయదు, అంటే సంరక్షిస్తుంది.

అవిశ్వాసికి మరియు విశ్వాసికి మధ్య శత్రుత్వాన్ని ఘోరమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అక్బర్) తప్పని సరి చేస్తుంది. ఈ విధంగా విశ్వాసులు అవిశ్వాసులను (ఎంత దగ్గరి బంధువులైనా సరే) ప్రేమించకుండా మరియు సహాయపడకుండా కట్టుదిట్టం చేస్తుంది (నిరోధిస్తుంది).  కాని అల్పమైన అవిశ్వాసం (అష్షిర్క్ అల్ అస్గర్) అవిశ్వాసిని ప్రేమించటం మరియు సహాయపడటం నుండి పూర్తిగా నిరోధించదు. అల్పమైన అవిశ్వాసం ఉన్న వారు తమ విశ్వాసాన్ని దాచి ఉంచినంత కాలం ఇంకా ఎక్కువగా ప్రేమించబడతారు. కాని విశ్వాసాన్ని బయటపెట్టి మరీ పాపాలు చేస్తున్నవారు, అవిధేయత చూపిస్తున్నవారు అసహ్యించుకోబడతారు మరియు శత్రుత్వాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.