ఈదుల్ అద్ హా (బక్రీద్) పండుగ – తెలుసుకోవలసిన విషయాలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ఖుత్బా అంశము: ఈదుల్ అద్హా (బక్రీద్)పండుగ –తెలుసుకోవలసిన విషయాలు                  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లిం లారా! ఒక గొప్ప దినము మనపై రాబోతున్నది. నిశ్చయంగా అది శుభకరమైనటువంటి ఖుర్బాని దినము. ఇది ఇస్లాం యొక్క గొప్ప విధి నెరవేర్చిన అనంతరం వస్తుంది. అనగా హజ్ తర్వాత వచ్చే పండుగ. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఈ విధంగా తెలియజేశారు: “అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత ఘనత కలిగినటువంటి దినము – ఖుర్బానీ  (నహ్ర్) దినము“. అనగా; జిల్ హిజ్జా మాసం యొక్క పదవరోజు. ఆ తరువాత يَوْمُ الْقَرَّ “ఖర్ర్ దినము” (స్థిరపడి ఉండే రోజు) అనగా; జిల్ హిజ్జ మాసం యొక్క పదకొండవ  రోజు. ఈ రోజున హజ్ చేసే వారందరూ మినా ప్రదేశంలో ఆగుతారు.

1. ఈ ఖుర్బానీ పండుగ రోజుకు ఇతర దినాలపై ప్రాధాన్యతను ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే; హజ్ కు సంబంధించినటువంటి ఎక్కువ ఆచరణలు ఇదే రోజున పాటించబడతాయి, ఉదాహరణకు; హజ్ చేసేవారు ఆ రోజు జమ్రా ఉఖ్బా (పెద్దదాని)పై రాళ్లు కొట్టాలి, ఖుర్బానీ ఇవ్వాలి, శిరోముండన చేయాలి, తవాఫె ఇఫాదా చేయాలి, సయీ చేయాలి. మరియు హజ్ చేయనటువంటి వారు ఆ రోజున ఖుర్బానీ జంతువు బలి ఇస్తారు. ఈ ఆచరణలన్నీ అదే రోజు చేయబడతాయి. ఈ విధముగా ఆచరణలు అన్నీ ఏకం అయ్యే మరొక రోజు లేదు అందుకే ఆ రోజుకి ఇంత ప్రాధాన్యత లభించింది.

2. ఇస్లామీయ పండుగలకు వేరే ఇతర పండుగలపై ఇంత ప్రాధాన్యత లభించడానికి గల కారణం ఏమిటంటే; ఈ పండుగలు ఎంతో వివేకాన్ని మరియు గొప్ప లక్ష్యాలను తీసుకుని వస్తాయి. అందులో నుండి ముఖ్యంగా అల్లాహ్ యొక్క ఆచారాలను గౌరవించడం, మరియు విశ్వాసులకు సంతోషాన్ని కలుగ చేయడం. ఇస్లాం యొక్క అనుయాయులు ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విధి విధానాలు, సౌలభ్యాలు గురించి ప్రజలకు తెలియపరచాలి.

అరఫా దినము (తొమ్మిదవ జిల్ హిజ్జా), ఖుర్బానీ దినం (పదవ జిల్ హిజ్జా), ఆ తరువాత “తష్ రీఖ్” దినాలు ఇస్లామియా పండుగ దినములు తిని త్రాగేటువంటి దినాలు (అబూ దావూద్)

3. ఓ విశ్వాసులారా! ఆ రోజు ఒక విశ్వాసి అల్లాహ్‌ యొక్క సామీప్యం పొందాలంటే దాని కొరకు అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ ఇవ్వాలి. ఇది అల్లాహ్ యొక్క “ఖలీల్” స్నేహితులైనటువంటి ఇబ్రహీం మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సున్నత్ విధానము.

4. ఖుర్బానీ చేయడానికి కొన్ని మర్యాదలు మరికొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకు; జంతువుని ఖిబ్లా వైపు తిప్పి జుబహ్ చేయాలి, మరియు దానిపై అల్లాహ్ నామాన్ని పఠించాలి. ఈ విధంగా అనాలి:

اللهم هذا منك ولك، اللهم هذا عني وعن أهل بيتي، اللهم تقبل مني
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్నీ వ అన్ అహ్ల్ బైతీ, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు. ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము. ఓ అల్లాహ్! నా వైపు నుండి మరియు నా కుటుంబం వైపు నుండి దీనిని స్వీకరించు)

5. ఖుర్బానీ ఇచ్చే వారు స్తోమత ఉంటే స్వయంగా జంతువుని జుబహ్ చేయాలి. దాని విధానం – నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి;  రక్తం వేగంగా ప్రవహించే రెండు రక్త నరాలు కోయాలి, ఇంకా శ్వాస నాళం మరియు ఆహారనాళం కోయాలి.

6. ఎవరైనా తన ఖుర్బానీ జంతువును వధించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగిస్తే, దానిని వధించే వ్యక్తి అతని తరపున ఈ దువాను పఠించాలి: 

اللهم هذا منك ولك، اللهم هذا عن فلان ، اللهم تقبل منه
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్ ఫులాన్, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ హు
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్!  ఇది ఫలానా (పేరు పలకాలి) వ్యక్తి తరుపు నుండి దీనిని స్వీకరించు).

7. కత్తిని లేక చాకుని ఖుర్బానీ జంతువు నుండి దాచి ఉంచాలి. దాని ముందు పదును పెట్టరాదు, మరియు ఇతర జంతువుల ముందు దానిని జబహ్ చేయరాదు. ఇందులో మనం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సూక్తిని అనుసరించాలి: అల్లాహ్ తఆలా ప్రతి దానిపట్ల ఉన్నతంగా వ్యవహరించాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు దేనినైనా వధించ వలసి వచ్చినప్పుడు దానిని ఉన్నతంగా వధించండి మరియు తమ ఆయుధానికి బాగా పొద్దున పెట్టండి .ఎందుకంటే వధించబడే జంతువును బాధించరాదు. (ముస్లిం)

8. ఖుర్బానీ ఇచ్చేటువంటి సమయం నాలుగు రోజుల వరకు ఉంటుంది. పండుగ రోజు ఆ తర్వాత మూడు “తష్ రీఖ్” దినాలు. ఇందులో మొదటి రోజు ఖుర్బానీ ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇది జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో ఉంది.

9. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు కొమ్ములు తిరిగిన తెల్లని రెండు పొట్టేళ్లను ఖుర్బానీగా ఇచ్చారు. మరియు ఎలాంటి జంతువుని ఖుర్బాని చేయకూడదో అది కూడా తెలియజేశారు. ఒంటి కన్ను కలిగిన దానిని ,రోగం ఉన్నట్లు స్పష్టంగా ఉన్న దానిని, కుంటిది, ఎముకల్లో సత్తువ లేని ముసలిది.(అహ్మద్)

10. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పండగ రోజున ఖుర్బానీ మాంసం తోనే భోజనాన్ని ప్రారంభించే వారు.

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కాలంలో ప్రజలు ఖుర్బానీ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు, మరియు ఉన్నవాటిలో అన్నింటికంటే మంచి జీవాలను కొనుగోలు చేసేవారు, ఎందుకంటే ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉంటే అది అల్లాహ్ వద్ద అంతే ప్రియమైనదిగా పరిగణించబడుతుంది, మరియు దాని ద్వారా ఖుర్బానీ చేసే వ్యక్తికి కూడా అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు: “సాదారణంగా ఖుర్బానీ యొక్క పుణ్యఫలం దాని ఖరీదును బట్టి ఉంటుంది”. (అల్ ఫతావా)

12. అల్లాహ్ దాసులారా! ఖుర్బాని జీవం పై ఖర్చు పెట్టడంలో ఎలాంటి పరిమితి లేదు. దాని మాంసం తినవచ్చు, ప్రయాణంలో తీసుకు వెళ్లొచ్చు ,మరియు పేదలలో పంచి పెట్టవచ్చు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

 فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి” (సూరా అల్ హజ్ 22:36)

హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు:
(తినండి తినిపించండి మరియు దాచుకోండి) (ముస్లిం)

13. జంతువును జూబహ్ చేసిన తర్వాత, దానిలోని ఏ భాగాన్ని కానీ, మాంసాన్ని గానీ, చర్మాన్ని గానీ, మరేదైనా అమ్మడానికి అనుమతి లేదు.

14.  అవిశ్వాసుల హృదయాలు ఇస్లాం వైపు మొగ్గడానికి వారికి ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వచ్చు.

15. ఖుర్బానీ మాంసాన్ని కసాయి వానికి కూలీగా ఇవ్వరాదు. ఎందుకంటే ధర్మం దీనికి అంగీకరించలేదు. కనుక అతనికి కూలీగా డబ్బులు మాత్రమె ఇవ్వాలి.

16. ఓ అల్లాహ్ దాసులారా! ఈ గొప్ప పండుగ తర్వాత ఘనత కలిగినటువంటి దినాలు కూడా వస్తాయి. వాటిని “తష్రీఖ్” దినాలు అంటారు ఆ దినములలో అతి ఎక్కువగా” జిక్ర్ “స్మరణ చేయమని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ
(గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్‌ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి.) (సూరా అల్ బఖర 2:203)

ఈద్ రోజులలో చేయవలసిన ముఖ్యమైన ఆచరణ ఇక్కడ తెలపడం జరుగుతుంది: “తష్రీఖ్” యొక్క మూడు రోజులలో అన్ని సమయాలలో సంపూర్ణ తక్బీర్ పటించాలి. మరియు మూడవరోజు మగ్రిబ్ నమాజ్ వరకు తక్బీర్ చదువుతూ ఉండాలి. అలాగే  “తష్రీఖ్” యొక్క మూడవ రోజున అసర్ వరకు రోజువారీ ప్రార్థనలలో ఐదు పూటల ఈ విధంగా తక్బీర్ పటించాలి:

(అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లాల్లాహ్,  వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్)
ఇందులో అల్లాహు అక్బర్ రెండుసార్లు లేదా మూడుసార్లు పటించవచ్చు

17. తష్రీఖ్” దినాలు వాస్తవానికి తిని త్రాగే మరియు అల్లాహ్ స్మరించుకునే రోజులు. ఈ రోజులలో ఉపవాసం ఉండడం అనుమతించబడలేదు, ఎందుకంటే అవి పండుగ రోజులు.

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “తష్రీఖ్” దినాలు తిని త్రాగేటువంటి రోజులు”.
మరో హదీసులో ఉంది: “అల్లాహ్ ను స్మరించే రోజులు”.

18. ఈద్ గొప్ప ప్రయోజనాల్లో ఒకటి: ముస్లింల మధ్య సంబంధాన్ని నెలకొల్పడం, ఒకరినొకరు కలిసే సద్భావం కలిగి ఉండటం. హృదయాలలో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవడం, భయం మరియు పేదరికాన్ని తొలగించడం, మరియు ద్వేషం మరియు అసూయలను నివారించడం, మరియు హృదయాలలో రగులుతున్న అసూయ అనే అగ్నిని ఆర్పడం. ఈద్ ప్రార్థనను నిర్వహించడానికి ముస్లింలను ఒకే చోట సమీకరించగల ఇస్లాం యొక్క సామర్ధ్యం మనకు కనిపిస్తుంది. అంతేకాదు భక్తి ప్రాతిపదికన వారిని సత్యం పై స్థిరంగా వారి హృదయాలను మార్గనిర్దేశం చేస్తుందనడానికి సంకేతం.

నౌమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “విశ్వాసుల ఉదాహరణ కరుణపరంగా, ఐక్యత పరంగా, ప్రేమ పరంగా ఒక శరీరం లాంటిది. కనుక శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి కలిగితే దాని ద్వారా జ్వరం వస్తుంది. అప్పుడు శరీరంలో ఉన్న అవయవాలన్ని ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి”. (ముస్లిం)

పండగ రోజున చేసేటువంటి మరొక అభిలషనీయమైన పని ఏమిటంటే; ఆ రోజున బంధుత్వాలను కలుపుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ తన దాసుడిపై దీనిని విధిగా చేశాడు. ముఖ్యంగా శుభ సందర్భాలలో కాబట్టి ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటారో అల్లాహ్ తఆల అతనికి దగ్గరవుతాడు, మరి ఎవరైతే బంధుత్వాన్ని తెంచుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ తన కారుణ్యం నుండి దూరం చేస్తాడు,

అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఎలా తెలియజేశారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు: “నేను కరుణామయుడును నేనే బంధుత్వాన్ని పుట్టించాను. మరియు దాని పేరును నా పేరుతో జోడించాను. కాబట్టి ఎవరైతే నీతో సంబంధం పెట్టుకుంటాడో అతనితో నేను సంబంధం పెట్టుకుంటాను, మరియు ఎవరైతే త్రేగదెంపులు చేసుకుంటాడో అతనితో నేను త్రేగదెంపులు చేసుకుంటాను“. (ముస్లిం)

ఓ అల్లాహ్ దాసులారా! కనుక ఎవరైతే తమ బంధువులతో స్నేహితులతో పోట్లాట కారణంగా విడిపోయారో వారు మన్నింపుల వైఖరిని అవలంబించండి. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు:

فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ
కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ( సూరా ఆష్ షూరా 42:40)

మరొకచోట ఇలా అంటున్నాడు:

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ
విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. (సూరా అల్ హుజురాత్ 49:10)

19. ఓ అల్లాహ్ దాసులారా పండుగ శుభాకాంక్షలు తెలుపడం ఒక మంచి పని. ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియ చేస్తున్నారు:  పండుగ నమాజ్ తరువాత ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు (تقبل الله منا ومنكم، وأحاله الله عليك) తెలుపుకునే విధానం కొందరి సహాబాల ద్వారా మనకు తెలుస్తుంది. మరియు కొంత మంది ధర్మ పండితులు కూడా దీనిని సమ్మతించారు. (అల్ ఫతావా)

20. అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు వ్యతిరేకంగా చట్ట విరుద్ధమైన నిషేధించబడిన విషయాలకు పాల్పడితే దానికి బదులుగా అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుతుంది అని భయపడండి.

చివరిగా నేను, నా కోసం మరియు మీ కోసం పాప క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా అతను క్షమించేవాడు మరియు దయగలవాడు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ విశ్వాసి స్త్రీలారా! అల్లాహ్ విశ్వాస మాతృమూర్తులకు ఆజ్ఞాపిస్తూ ఖురాన్ ఈ విధంగా అంటున్నాడు:

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ

మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

అల్లాహ్‌ను తమ ప్రభువుగా, ఇస్లాంను తమ మతంగా మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రవక్తగా అంగీకరించే ఓ ఇస్లాం మహిళ లా, తీర్పు దినం వరకు వారి అడుగుజాడల్లో నడిచే విశ్వాసుల తల్లులకు మరియు విశ్వాసులైన మహిళలకు ఈ దైవిక ఉపదేశం సాధారణంగా అందరికీ వర్తిస్తుంది, కాబట్టి అల్లాహ్ కు మరియు ప్రవక్త విధేయతకు కట్టుబడి ఉండాలి.

మానవులు మరియు జిన్నాతులు యొక్క చెడు విధానాల పట్ల తస్మాత్ జాగ్రత్త వహించాలి. నగ్నత్వం మరియు అశ్లీల ఉపద్రవం యొక్క ప్రలోభాలలో పడకండి. అల్లాహ్ ఇలా అంటున్నాడు;

وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ 
పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

భద్రతను, క్షేమాన్ని కోరుకునే స్త్రీ తనను తాను అవిస్వాసుల కార్యకలాపాలలో అనుసరించకూడదు, ఎందుకంటే వారిని అనుసరించడం వలన ఇది హృదయం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు మనలో కూడా ఆ అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

وَاللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا

అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. (సూరా అన్ నిసా 4:27)

మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు! అల్లాహ్ మీ అందరినీ ఎల్ల వేళలా సుఖ సౌఖ్యాలతో ఉంచుగాక. అందరి పై తన శుభాల వర్షాన్ని కురిపించు గాక. అందరి ఆరాధనలు స్వీకరించుగాక. పాపాలను మన్నించుగాక. అల్లాహ్ అందరి ధర్మ సమ్మతమైన కోరికలు తీర్చుగాక. సదా చరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు గాక!

చివరగా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపుతూ ఉండండి, ఎవరైతే ఒకసారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలు కురిపిస్తాడు.

اللهم صلِّ وسلِّم وبارك على عبدك ورسولك نبينا محمد، وعلى آله وصحبه أجمعين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

రమజాన్ పండుగ గురించి పది ముఖ్య విషయాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారిపద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి బిద్అత్ కార్యకలాపాలు. ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతి కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది. ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి  తీసుకువెళ్ళేదే.

1. ఓ అల్లాహ్ దాసులరా! అల్లాహ్ తో భయపడవలసిన విధంగా భయపడండి మరియు ఎల్ల వేళలా దైవభీతి కలిగి ఉండండి. ఇస్లాం పై స్థిరంగా ఉండండి. ఆయన మనందరినీ ఈ రమజాన్ చివరి వరకు చేర్చినందుకు అల్లాహ్ కు స్తోత్రాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. అల్లాహ్ సాక్షిగా ఇది ఆయన యొక్క గొప్పవరం. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.

وَلِتُكۡمِلُواْ ٱلۡعِدَّةَ وَلِتُكَبِّرُواْ ٱللَّهَ عَلَىٰ مَا هَدَىٰكُمۡ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ 
(మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నది తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పతనాన్ని కీర్తించి తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది ఆయన అభిలాష!)

కనుక మనందరము ఈమాసాన్ని పూర్తి చేసుకున్నందుకు గాను అల్లాహ్ ను కీర్తించాలి మరియు కృతజ్ఞతతో ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి.

2. ఓ ముస్లింలారా! నిశ్చయంగా అల్లాహ్ వాక్కు సత్యమైనది. (రమజాన్ కేవలం లెక్కించ బడిన దినాలే ) ఆ పగలు రాత్రి ఎంత వేగంగా గడిచి పోయాయో, అసలు ఎలా గడిచిపోయాయో మీకు తెలుస్తుందా?

3. ఓ విశ్వాసులారా! పూర్తి రమజాన్ ను పొందినందుకు  మరియు అందులో ఉపవాసాలు పాటించినందుకు మీకు అభినందనలు. మరియు ఈ రమజాన్ రాత్రులలో మేల్కొని ఆరాధనలు చేసినందుకు మీకు అభినందనలు. ఎందుకంటే ఎంతో మంది ఈ రమజాన్ మాసం రాక మునుపే వెళ్లిపోయారు. ఈ రమజాన్ చివరి దశను కూడా పొందలేక పోయారు. ఆయన తన వరాల జల్లును తన అనుగ్రహాలను మనపై కరిపించినందుకు వేయి నూళ్ళ కోటానుకోట్ల స్తుతులూ స్తోత్రాలు తెలియ చేస్తున్నాను.

4. ఓ ముస్లింలారా! మీ అందరికీ ఈ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇస్లాం మూలస్తంభాలలో ఒకటైన ఈ ఉపవాసాలు పూర్తి చేసుకున్నందుకు గాను నేను  అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అల్లాహ్ యొక్క గొప్పదనాన్ని కొనియాడుతూ ఉండండి. ఆయన ఏకత్వాన్ని గురించి చాటి చెప్పండి. అల్లాహ్ పట్ల దృఢమైన నమ్మకాన్ని కలిగి ఈ రమజాన్ లో మీ సత్కార్యాలను రెట్టింపు అయ్యి ఉండవచ్చు, పాపాలు క్షమించబడవచ్చు మరియు మీ అంతస్తులు కూడా పెంపొందించవచ్చు.

5. అల్లాహ్ దాసులారా! సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క వివేకం ఏమిటంటే ఆయన రెండు గొప్ప సందర్భాల తర్వాత మన కొరకు రెండు పండుగలను ప్రసాదించాడు. ఒకటి ఉపవాసాలు ముగించుకున్న తర్వాత రంజాన్ పండుగ. రెండు హజ్జ్  పూర్తి చేసుకున్న తర్వాత బక్రీద్ పండుగ జరుపుకుంటాము. మన ఈ పండుగలలో ఎన్నో గొప్ప ఆరాధనలు ఉన్నాయి – నమాజ్, రోజా, జిక్ర్, ఖుర్బానీ, ఫిత్రా దానం మొదలైనవి.

అంతేకాదు ఈ శుభసందర్భంలో బంధుత్వ సంబంధాలు పెరుగుతాయి. బంధుమిత్రుల కలయిక జరుగుతుంది. ఒకరినొకరు ప్రేమానురాగాలతో కలుసుకుంటారు, ఒకరి పట్ల మరొకరు మన్నింపుల వైఖరి అవలంభిస్తారు మరియు కుళ్ళు కుతంత్రాలు, ఈర్షద్వేషాలు అన్నింటిని మరిచిపోయి అందరూ కలిసిమెలిసిపోతారు. ఒకవేళ మనలో ఎవరైనా ఈ విధంగా సంబంధాలు తెంపుకొని ఉంటే వారు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరికొత్త రీతిలో సంబంధాలను బలపరచుకొని సంతోషాలను పంచాలి.

6. ఓ విశ్వాసులారా! బహుదైవారాలకులు మరియు అన్యమతస్తుల దేశాలలో కనిపించని మన ఈ స్వచ్ఛమైన పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. వారి పండుగలలో పాపము మరియు అల్లాహ్ అవిధేయత తప్ప మరి ఏమీ కానరావు. ఈ విధమైన దురాచరణల ద్వారా వారు అల్లాహ్ తో దూరం పెంచుకుంటున్నారు.

అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క ఈ కారుణ్యం పట్ల సంతోషంగా ఉండండి ఎందుకంటే అల్లాహ్  ఇలాఅంటున్నాడు

[قُلۡ بِفَضۡلِ ٱللَّهِ وَبِرَحۡمَتِهِۦ فَبِذَٰلِكَ فَلۡيَفۡرَحُواْ هُوَ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ]
(ఇలా అను: ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దాని కంటే ఎంతో మేలైనది.)   

7. ఓ ముస్లింలారా పండుగపూట అందంగా తయారవ్వండి మరియు సుగంధం పరిమళాలను పూసుకోండి మరియు ఇతరులకు కూడా పూయండి. ఇమామ్ మాలిక్ (రహిమహుల్లాహ్) గారు ఇలాతెలియజేస్తున్నారు “నేను అహ్లె ఇల్మ్ (పండితుల) ద్వారా విన్నాను. వారు తప్పనిసరిగా ప్రతి పండుగ రోజున అందంగా తయారై సుగంధ పరిమళాలను  పూసుకునేవారు”.(షరహ్ బుఖారి లిఇబ్నె రజబ్ 68/6)

8. ఓ విశ్వాసులారా! ఈ పండుగ రోజున మన ఇళ్ల ద్వారాలతో పాటు మన హృదయాల ద్వారాలను కూడా తెరిచి ఉంచండి, ఒకరి కొరకు మరొకరు తప్పక దుఆ చేయండి. అల్లాహ్ తఆలా అందరి సత్కర్మలను స్వీకరించుగాక. మరియు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోండి. మన సహాబాలు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకునేవారు. ఇలా అనేవారు  

(تقبل الله منا ومنكم)
అల్లాహ్ మా సత్కార్యాలను మరియు మీ సత్కార్యాలను స్వీకరించుగాక!

9. ఓ ముస్లింలారా! గడిచిపోయిన పొరపాట్లను మన్నించడం విధేయత యొక్క గొప్ప చర్యలలో ఒకటి.  అల్లాహ్ వద్ద దీనికొరకు గొప్ప ప్రతిఫలం ఉంది.  అల్లాహ్  ఇలా అంటున్నాడు.

[فَمَنۡ عَفَا وَأَصۡلَحَ فَأَجۡرُهُۥ عَلَى ٱللَّهِۚ]
(కానీ ఎవరైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతి ఫలం అల్లాహ్ దగ్గర ఉంది)

అల్లాహ్ వద్ద ప్రతిఫలం ఉందంటే వాస్తవంగా ఈ పని ఎంతోగొప్పది అన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది.

ఓ విశ్వాసులారా! హృదయాలను పరిశుభ్రపరచుకోండి. ఇది కూడా ఒక గొప్ప ఆచరణ. దీని కొరకు కూడా మంచి సాఫల్యం ఉంది. అల్లాహ్ ఇలా అంటున్నాడు.

[قَدۡ أَفۡلَحَ مَن زَكَّىٰهَا٩ وَقَدۡ خَابَ مَن دَسَّىٰهَا]
(వాస్తవానికి తన ఆత్మను శుద్దపరచుకున్నవాడే సఫలుడౌతాడు మరియు వాస్తవానికి దానిని అణగద్రొక్కిన వాడే విఫలుడౌతాడు)

అల్లాహ్ దాసులారా! సంతోషాన్ని కలుగజేసేటువంటి పనులలో ఒకటి సంబంధాలను కలుపుకోవడం. సంవంత్సరం మొత్తంలో మనిషి మనసులో ఉండేటువంటి ఈర్ష ద్వేషాల నుండి మనిషి తన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవాలి. ఆవ్యక్తి కొరకు శుభవార్త ఉంది ఎవరైతే ఈ పండుగ రోజున సద్వినియోగం చేసుకుని తెగిపోయినటువంటి బంధాలను కలుపుకుంటాడో మరియు విరిగిన హృదయాలను కలుపుతాడో. దానివలన కుటుంబంలో ఏర్పడిన కలహాలు దూరమైపోతాయి కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.

ఓ అల్లాహ్! సమస్త ప్రశంసలు మరియు సకల ఆరాధనలు అన్నీ కూడా నీకే శోభిస్తాయి. నీ కారుణ్యంతో మమ్మల్ని అందరినీ ఈ రమజాన్ మాసం చివరి వరకు చేర్చి పండుగను మాకు ప్రసాదించావు. ఓ అల్లాహ్ నీకు విధేయత చూపడంలో మాకు సహాయం చేయి. ఓ అల్లాహ్ మాకు నీ ప్రేమని ప్రసాదించు మరియు నీకు  దగ్గర చేసేటువంటి ప్రతి పనిపై మాకు ప్రేమను ప్రసాదించు. ఓ అల్లాహ్! మేము మా పాప క్షమాపణ గురించి నిన్ను  వేడుకుంటున్నాము. నిశ్చయంగా నువ్వు  ఎంతో క్షమాగుణం కలవాడవు. 

రెండవ ఖుత్బా

 స్తోత్రం మరియు దరూద్ తరువాత

10. ఓ అల్లాహ్ దాసులారా! అల్లాహ్  మిమ్మల్ని కరుణించుగాక. మీరు తెలుసుకోండి. అన్నిటికంటే గొప్ప ఆనందం అల్లాహ్ ను కలిసి ఆయన దగ్గర నుండి మనం చేసినటువంటి సత్కార్యాల ప్రతిఫలం పొందేటప్పుడు లభించేది.

అల్లాహ్ తఆల స్వర్గవాసులతో ఇలా అంటాడు “ఓ స్వర్గ వాసులారా! అప్పుడు స్వర్గవాసులు ఇలా సమాధానం ఇస్తారు – ఓ అల్లాహ్ మేము నీ సన్నిధిలో  హాజరయ్యాము. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు – మీరు సంతోషంగా ఉన్నారా! అప్పుడు వారు అంటారు- ఎందుకు కాదు అల్లాహ్!  మీరు ఈ  సృష్టిలో ఎవరికీ ప్రసాదించనివి మాకు ప్రసాదించారు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు- ఏమిటి దాని కంటే ఉత్తమమైనటువంటి దానిని మీకు ప్రసాదించనా! స్వర్గ వాసులు ఇలా ఉంటారు – ఓ మా ప్రభువా! దీనికంటే మేలైనది ఇంకేం ఉంటుంది. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు- ఇప్పటి నుండి నేను శాశ్వతంగా మీ పట్ల ఇష్టుడనయ్యాను ఇక ఎప్పటికీ మీపై కోపంగా ఉండను.(బుఖారి 6549 – ముస్లిం 2829)

11. ఓ విశ్వాసులారా! ఈ రమజాన్ మాసము సంస్కరణ కోసం అల్లాహ్ తో సంభందాన్ని దృడపరచుకోవడానికి అతి గొప్ప అవకాశం కనుక మీరందరూ కూడా ఆరాధనలో నిమగ్నమై ఉండండి ఎందుకంటే ఆరాధన రమజాన్ తో ముగిసిపోదు, మనిషి మరణం వరకు కూడా సదా చరణ చేస్తూఉండాలి  అల్లాహ్ ఇలా అంటున్నాడు

[وَٱعۡبُدۡ رَبَّكَ حَتَّىٰ يَأۡتِيَكَ ٱلۡيَقِينُ]
(మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాదిస్తూఉండు)

ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలియజేశారు:
అల్లాహ్ వద్ద అన్నిటికంటే ఇష్టమైనటువంటి ఆచరణ ఎల్లకాలం చేస్తూ ఉండేటువంటిది అది ఎంతచిన్న ఆచరనైనా సరే. (బుఖారి 5861)

ఓ ముస్లింలారా! రమజాన్ తర్వాత సదాచరణపై స్థిరంగా ఉండటం ఇది అల్లాహ్ వద్ద ఆచరణ స్వీకారయోగ్యం  పొందడానికి సూచన. దీనికి వ్యతిరేకంగా కేవలం రమజాన్ లో మాత్రమే చేసి మిగతా రోజుల్లో మానుకోవడం ఇది అజ్ఞానము. అల్లాహ్ యొక్క భాగ్యం నుంచి దూరం అవడానికి ఒక సూచన. ఎందుకంటే రమజాన్ ప్రసాదించిన ప్రభువే మిగతా నెలలు కూడా మనకు ప్రసాదించాడు. ఒక వ్యక్తి గురించి సలఫ్ ను ఈ విధంగా అడగడం జరిగింది. ఎవరైతే కేవలం రమజాన్ లో మాత్రమే ప్రార్థన చేస్తాడో మరియు  ఇతర దినాలలో ఆరాధనను వదిలిపెడతాడో ఆ వ్యక్తి గురించి చెప్పండి? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు – ఆ వ్యక్తి లేక ఆ జాతి చెడ్డది ఎవరైతే కేవలం అల్లాహ్ ని రమజాన్ లోనే గుర్తు చేసుకుంటారో.  

ఓ విశ్వాసులారా! ముస్లింల యొక్క ఒక ఉత్తమ గుణం ఏమిటంటే వారు విధేయతా పరులై ఉంటారు. విధేయత అంటే ఆరాధనపై స్థిరంగా ఉండటమే.  అల్లాహ్  విధేయత చూపేవారి గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు.

[إِنَّ ٱلۡمُسۡلِمِينَ وَٱلۡمُسۡلِمَٰتِ وَٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡقَٰنِتَٰتِ وَٱلصَّٰدِقِينَ وَٱلصَّٰدِقَٰتِ وَٱلصَّٰبِرِينَ وَٱلصَّٰبِرَٰتِ وَٱلۡخَٰشِعِينَ وَٱلۡخَٰشِعَٰتِ وَٱلۡمُتَصَدِّقِينَ وَٱلۡمُتَصَدِّقَٰتِ وَٱلصَّٰٓئِمِينَ وَٱلصَّٰٓئِمَٰتِ وَٱلۡحَٰفِظِينَ فُرُوجَهُمۡ وَٱلۡحَٰفِظَٰتِ وَٱلذَّٰكِرِينَ ٱللَّهَ كَثِيرٗا وَٱلذَّٰكِرَٰتِ أَعَدَّ ٱللَّهُ لَهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمٗا]

(నిశ్చయంగా ముస్లిం పురుషులు – ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు – విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు- విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు – సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు – సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు – అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు – దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు – ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు – కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.)

12. ఓ అల్లాహ్ దాసులారా! రమజాన్ తర్వాత షవ్వాల్ నెల యొక్క ఆరు ఉపవాసాలు ఉండటం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ వారి సాంప్రదాయం. అల్లాహ్  దీని కొరకు గొప్ప ప్రతిఫలం ఉందని వాగ్దానం చేశాడు.

అబూ అయ్యూబ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ గారు ఇలా తెలియజేశారు: “ఎవరైతే రమజాన్ యొక్క ఉపవాసాలు ఉంటారో మరియు ఆతర్వాత షవ్వాల నెల యొక్క ఆరు ఉపవాసాలు ఉంటారో  వారు పూర్తి సంవత్సరం యొక్క ఉపవాసాలు ఉన్నట్లే” (ముస్లిం-1164)

ఈ ఆరు ఉపవాసాలు  ప్రసాదించడానికి గల కారణం ఏమిటంటే రంజాన్ యొక్క విధి చేయబడినటువంటి ఉపవాసాలలో  ఏదైనా లోపం ఉండి ఉంటే ఈ నఫీల్ ఉపవాసాల ద్వారా అవి చెరిగిపోతాయి. ఎందుకంటే ఉపవాసి ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతనితో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుంది కనుక ఈ ఉపవాసాలు ఆ సమయంలో  ఏర్పడినటువంటి ఆ యొక్క కొరతని పూర్తి చేస్తాయి.

పండుగ గురించి ఇంకా ఎన్నో  విషయాలు ఉన్నాయి. కనుక ఒక విశ్వాసి రంజాన్ పండుగ సందర్భంగా వీటిని గుర్తు పెట్టుకోవాలి మరియు వాటిపై ఆచరించాలి. కేవలం వాటిని ఒక రివాజుగా భావించి వదిలి పెట్ట కూడదు.

ఓ అల్లాహ్! మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.

ఓ అల్లాహ్! మమ్ములను ఆ నరకాగ్ని నుంచి రక్షించు. మాకు మోక్షాన్ని ప్రసాదించు.

ఓ అల్లాహ్! మాకు స్వర్గాన్ని ప్రసాదించు మరియు ఫిర్దౌస్ యొక్క వారసులుగా చేయు మరియు ఎటువంటి లెక్కాపత్రం లేకుండా మరియు శిక్ష లేకుండా మమ్మల్ని స్వర్గంలోకి ప్రవేశింపచేయి.

ఓ అల్లాహ్! నువ్వు కరుణామయుడవు, కృపాశీలుడవు. మమ్మల్ని మా పాపాల నుండి పరిశుభ్రం చేయి, ఏ విధంగా అయితే తల్లి గర్భంలో నుండి వచ్చామో ఆ విధంగా మమ్మల్ని పరిశుభ్రపరుచు.

ఓ అల్లాహ్! మా అందరి ఈ సమావేశాన్ని స్వీకరించి మాకు పాపక్షమాపణ కలుగచేయి. మా ఆచరణలను స్వీకరించు.

ఓ అల్లాహ్! మా దేశంలో మరియు ముస్లిం దేశాలన్నింటిలో శాంతి భద్రతలను ప్రసాదించు.

ఓ అల్లాహ్! రమజాన్ తర్వాత కూడా సదాచరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు, నీకు విధేయత చూపే వారిగా చేయి, మరియు ఇలాంటి వరాల వసంతాలను మా జీవితంలో  మరెన్నో ప్రసాదించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

1.11 ఈద్ (పండుగ) నమాజ్ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

505 – حديث ابْنِ عَبَّاسٍ قَالَ: شَهِدْتُ الْفِطْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَبِي بَكْرٍ وَعُمَرَ وَعُثْمَانَ يُصَلُّونَهَا قَبْلَ الْخُطْبَةِ، ثَمَّ يُخْطَبُ بَعْد

خَرَجَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَأَنِّي أَنْظُرُ إِلَيْهِ حينَ يُجْلِسُ بِيَدِهِ، ثُمَّ أَقْبَلَ يَشُقُّهُمْ، حَتَّى جَاءَ النِّسَاءَ، مَعَهُ بِلاَلٌ فَقَالَ: (يَأَيُّهَا النَّبيُّ إِذَا جَاءَكَ الْمُؤمِنَاتُ يُبَايِعْنَكَ) الآيَةَ ثُمَّ قَالَ حينَ فَرَغَ مِنْهَا: آنْتُنَّ عَلَى ذلِكِ فَقَالَتِ امْرَأَةٌ وَاحِدَةٌ مِنْهُنَّ، لَمْ يُجِبْهُ غَيْرُهَا: نَعَمْ قَالَ: فَتَصَدَّقْنَ فَبَسَطَ بِلاَلٌ ثَوْبَهُ، ثُمَّ قَالَ: هَلُمَّ لَكُنَّ فِدَاءً أَبِي وَأُمِّي فَيُلْقِينَ الْفَتَخَ وَالْخَوَاتِيمَ فِي ثَوْبِ بِلاَلٍ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 19 باب موعظة الإمام النساء يوم العيد

505. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. అలాగే శ్రేష్ఠ ఖలీఫాలయిన అబూబక్ర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు), ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) గార్లతో కలసి కూడా ఈదుల్ ఫిత్ర్ నమాజు చేశాను. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), శ్రేష్ఠ ఖలీఫాలు కూడా మొదట నమాజు చేసి ఆ తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చేవారు. ఆనాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ఉపన్యాస వేదిక నుంచి) క్రిందికి దిగి, ప్రజలను కూర్చోమని చేత్తో సైగ చేస్తూ (పురుషుల) పంక్తులను చీల్చుకుంటూ స్త్రీల పంక్తుల సమీపానికి చేరుకున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదలుతోంది. ఆ సమయంలో హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “యా హయ్యుహన్నబియ్యు ఇజా జా అకల్ మూమినాతు యుబాయీనక అలా అల్లా యుష్రిక్ న” (ప్రవక్తా! విశ్వసించిన స్త్రీలు నీ దగ్గరికి వచ్చి తాము అల్లాహ్ కు (ఆయన దైవత్వంలో) మరెవరినీ సాటి కల్పించబోమని, దొంగతనం చేయబోమని, వ్యభిచారానికి పాల్పడబోమని, తమ సంతనాన్ని హతమార్చము అనీ, అక్రమ సంబంధాలను గురించిన అపనిందలు సృష్టించమని, మంచి విషయాల్లో నీకు అవిధేయత చూపమని ప్రమాణం చేస్తే, వారి చేత ప్రమాణం చేయించు. వారి పాప మన్నింపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు. అల్లాహ్ తప్పకుండా క్షమించేవాడు, కరుణించేవాడు.) ( ఖుర్ఆన్ : 60-12) అనే సూక్తి పఠించారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సూక్తి పఠించిన తరువాత “మీరీ విషయాలను గురించి నా ముందు ప్రమాణం చేస్తారా?” అని మహిళల్ని ప్రశ్నించారు. అప్పుడు వారిలో ఒక స్త్రీ మాత్రమే చేస్తానని సమాధానమిచ్చింది. మిగిలిన వారంతా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉండిపోయారు. “సరే మీరు సదఖా (విరాళాలు) ఇవ్వండి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) తన కండువా తీసి క్రింద పరుస్తూ “నా తల్లిదండ్రుల్ని మీ కోసం సమర్పింతు” అని అన్నారు. అప్పుడు స్త్రీలు తమ ఉంగరాలు, మెట్టెలు తీసి ఆ వస్త్రంలో వేయనారంభించారు.

సహీహ్ బుఖారీ: 13వ ప్రకరణం – ఈదైన్, 19వ అధ్యాయం – మౌయిజతిల్ ఇమామిన్నిసా (యౌముల్ ఈద్)

2.7 ఖుర్భానీ ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

1280 – حديث جُنْدَبٍ، قَالَ: صَلَّى النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، يَوْمَ النَّحْرِ ثُمَّ خَطَبَ ثُمَّ ذَبَحَ، فَقَالَ: مَنْ ذَبَحَ قَبْلَ أَنْ يُصَلِّيَ فَلْيَذْبَحْ أُخْرَى مَكَانَهَا، وَمَنْ لَمْ يَذْبَحْ فَلْيذْبَحْ بِاسْمِ اللهِ
__________
أخرجه البخاري في: 13 كتاب العيدين: 23 باب كلام الإمام والناس في خطبة العيد

1280. హజ్రత్ జుందుబ్ (రదియల్లాహు అన్హు) కథనం:-

ఈదుల్ అద్ హా (బక్రీద్ పండుగ) రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మొదట నమాజు చేశారు. తరువాత ఖుత్బా (ఉపన్యాసం) ఇచ్చారు. ఆ తరువాత బలి (ఖుర్బానీ) పశువుని జిబహ్ చేశారు. (ఆ సందర్భంలో) ఆయన ఇలా ప్రవచించారు: “ఎవరైనా నమాజుకు పూర్వం పశువుని జిబహ్ చేసి ఉంటే అతను దానికి బదులు మళ్ళీ మరొక పశువుని జిబహ్ చేయాలి. నమాజుకు ముందు ఖుర్బానీ ఇవ్వనివాడు (నమాజు తరువాత) అల్లాహ్ పేరుతో (అంటే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పఠించి) పశువుని జిబహ్ చేయాలి”.

(సహీహ్ బుఖారీ:- 13వ ప్రకరణం – ఈదైన్, 23వ అధ్యాయం – కలామిల్ ఇమామి వన్నాసి ఫీ ఖుత్భతిల్ ఈద్)

ఈదుల్ అద్ హా  ఖుత్బా  | జాదుల్ ఖతీబ్

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1. ఖుర్బానీ: ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ (అలైహిస్సలాం) సున్నత్
2. ఖుర్ఆన్ లో ఇబ్రాహీం (అలైహిస్సలాం) ప్రశంస. 
3. ఖుర్బానీ: ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) సున్నత్. 
4. ఖుర్బానీకి సంబంధించిన కొన్ని ప్రముఖ విషయాలు, మర్యాదలు. 
5. పండుగ దినాలలో కొన్ని చెడు కార్యాలు చేయడం! 

ఇస్లామీయ సోదరులారా! 

ఈరోజు ఈదుల్ అద్ హా అంటే ఖుర్బానీ దినం. ఈ దినం ఎంత మహోన్నతమైనదంటే – ప్రపంచంలోని ముస్లిములు ఈ రోజు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ (అలైహిస్సలాం) సున్నతును బ్రతికిస్తూ, తమ ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పద్ధతిని ఆచరిస్తూ లక్షల కొద్దీ పశువులను కేవలం అల్లాహ్ పేరుతో ఖుర్బానీ చేస్తారు. 

ఇబ్రాహీం (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క గొప్ప ప్రవక్త, అల్లాహ్ ఆయనను తన మిత్రునిగా చేసుకున్నాడు. దీని గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

وَاتَّخَذَ اللَّهُ إِبْرَاهِيمَ خَلِيلً
ఇబ్రాహీం (అలైహిస్సలాం) ను అల్లాహ్ తన మిత్రునిగా చేసుకున్నాడు.” (నిసా 4:125) 

ఈదుల్ ఫిత్ర్ ఖుత్బా – జాదుల్ ఖతీబ్

ఖుత్బా యందలి ముఖ్యాంశాలు 

1) పండుగ ఎవరి కోసం? 
2) (ఉపవాసాల) నిర్ణీత సంఖ్య పూర్తయ్యాక అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపడం. 
3) దుఆ స్వీకారము. 
4) సదాచరణలపై స్థిరంగా వుంటూ అవిధేయతకు దూరంగా వుండడం. 
5) పండుగ దినాల్లో ధర్మయుక్తమైన కార్యాలు. 
6) పండుగ దినాల్లో చెడు కార్యాలు చేయడం. 

[డౌన్ లోడ్ PDF]

ఇస్లామీయ సోదరులారా! 

ఈ రోజు ఈదుల్ ఫిత్ర్  రోజు. ఎంతో ఆనందకరమైన రోజు. 

ఈ రోజు ఎవరికి ఆనందకరమైనదంటే – ఎవరైతే శుభప్రద రమజాన్ మాసపు ఉపవాసాలన్నింటినీ పాటించారో మరియు సరైన షరీయత్తు పరమైన కారణం లేకుండా వాటిని విడిచిపెట్టలేదో ఆ వ్యక్తికి. ఎందుకంటే, అలాంటి వ్యక్తి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చి వున్నారు: “ఎవరైనా విశ్వాసస్థితిలో, అల్లాహ్ ద్వారా పుణ్యఫలాన్ని ఆశిస్తూ రమజాన్ మాసపు ఉపవాసాలు పాటిస్తారో, అతని గత పాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ, ముస్లిం) 

నిశ్చయంగా ఈ రోజు ఎవరికి ఆనందకరమైనదంటే – ఎవరైతే ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తూ క్రమం తప్పకుండా తరావీహ్ నమాజ్ చదివారో ఆ వ్యక్తికి. ఎందుకంటే, అలాంటి వ్యక్తి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా విశ్వాస స్థితిలో, అల్లాహ్ సంతృప్తిని అశిస్తూ రమజాన్ మాసంలో ఖియాం చేశారో, అతని గత పాపాలు మన్నించ బడతాయి.” (బుఖారీ: 37, 2008, ముస్లిం: 759) 

రమజాన్ ఉపవాసాలు పాటించి, దానిలో ఖియాం చేసిన అదృష్టవంతు లైన నా ముస్లిం సోదరులారా! మన ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మీకు పాపాల మన్నింపును గురించిన శుభవార్త వినిపించేశారు. ఈ రోజు మీ అందరికీ ఎంతో సంతోషకరమైన దినం. మీరు ఉపవాసాలన్నీ పాటించారు. దీనికి తోడు తరావీహ్ నమాజ్ కూడా చదివారు. అల్లాహ్ వీటన్నింటినీ స్వీకరించు గాక! 

ఈ రోజు నిజంగానే ఎవరు సంతోషపడాలంటే – ఎవరైతే లైలతుల్ ఖద్ర్ ఆరాధన పుణ్యఫలాన్ని ఆశిస్తూ ఆఖరి పదిరోజులు బేసి రాత్రులలో ఎంతో శ్రమించి, ఈ రాత్రులలో ప్రత్యేకంగా ఖియాం చేసారో వారు (సంతోషపడాలి). ఎందుకంటే, వీరి గురించే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరైనా విశ్వాస స్థితిలో, పుణ్యఫలాన్ని ఆశిస్తూ, లైలతుల్ ఖద్ర్ ఖియాం చేశారో అతని గతపాపాలు క్షమించబడతాయి”. (బుఖారీ: 2014, ముస్లిం: 760) 

ఈ రోజు నిజంగానే పండుగ రోజు ఎవరికంటే, ఎవరైతే రమజాన్ మాసంలో మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెంది, అల్లాహ్ ను సంతృప్తి పరచారో (వారికే ఈ రోజు పండుగ రోజు). 

ఈ రోజు నిజంగానే సంతోషకరమైన దినం ఎవరి కంటే, ఎవరైతే శు భప్రద రమజాన్ మాసాన్ని పొందారో మరియు దానిలో అల్లాహు కు క్షమాపణలు వేడుకొని తమ పాపాలను మన్నింపజేసుకున్నారో (వారికి నిజంగానే ఈ దినం (సంతోషకరమైనది). 

నిశ్చయంగా, అత్యంత దురదృష్టవంతుడెవరంటే, రమజాన్ లాంటి మహోన్నత మాసాన్ని పొంది కూడా తన పాపాలను మన్నింప జేసుకోలేక పోయాడో (అతనే అత్యంత దురదృష్టవంతుడు). 

ఒక వ్యక్తి పండుగ రోజు విశ్వాసులు నాయకుడు (అమీరుల్ మోమినీన్) అలీ బిన్ అబూ తాలిబ్ (రదియల్లాహుఅన్హు) సన్నిధికి రాగా, ఆయన ఎండిన రొట్టెను జైతూన్తో కలిపి తింటూ వుండడం చూసాడు. అతను- ఓ విశ్వాసుల నాయకా! పండుగ రోజు మీరు ఈ ఎండిన రొట్టెను (భుజిస్తున్నారు? అని అడిగాడు. అలీ (రదియల్లాహు అన్హు) జవాబిస్తూ – “ఓ ఫలానా వ్యక్తీ! పండుగ, మంచి బట్టలు తొడిగి, సరీద్ (మంచి ఆహారం) తినే వారిది కాదు. పైగా ఎవరి ఉపవాసాలు స్వీకరించబడ్డాయో, ఎవరి ఖియాములైల్ ఆమోదించ బడిందో, ఎవరి పాపాలు మన్నించబడ్డాయో మరియు ఎవరి శ్రమకు గౌరవం దక్కిందో వారిదే అసలైన పండుగ. మా కోసమైతే ఈ రోజూ పండుగే, రేపు కూడా పండుగే మరియు అల్లాహ్ అవిధేయతకు దూరంగా వున్న ప్రతి రోజూ పండుగే” అని అన్నారు. 

అలాగే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: “పండుగ – ఉత్తమ వస్త్రాలు ధరించిన వారిది కాదు, పైగా ప్రళయదినం గురించి భయపడేవారిదే పండుగ”. 

ఈదుల్ ఫిత్ర్ 1443 (2022) అరబీ ఖుత్బా తెలుగు అనువాదం – షేక్ రాషిద్ అల్ బిదా | నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో]

ఈదుల్ ఫిత్ర్ 1443 (2022) అరబీ ఖుత్బా తెలుగు అనువాదం – షేక్ రాషిద్ అల్ బిదా | నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/6rrR5PH8k4Y [26 నిముషాలు]

రమదాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/five-pillars/ramadhan-telugu-islam/

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

ఈద్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈద్ నమాజ్ & ఈద్ సున్నతులు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZEOdAJlFpkageyWnxdFM_

ఈద్ పండుగ మరియు రక్త సంబంధాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[34 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈద్ నమాజ్ & ఈద్ సున్నతులు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0ZEOdAJlFpkageyWnxdFM_

ఫిఖ్ హ్ (శుద్ధి, నమాజు) : పార్ట్ 13 – వ్యాదిగ్రస్తుని (రోగి) నమాజ్, జుమా నమాజ్, పండుగ నమాజ్ [వీడియో]

బిస్మిల్లాహ్

[32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియో క్రింది పుస్తక ఆధారంగా వివరించబడింది.
శుద్ధి & నమాజు [పుస్తకం]

వ్యాదిగ్రస్తుని నమాజ్:

నిలబడి నమాజ్ చేసే శక్తి రోగిలో లేనప్పుడు దేనికయినా ఆనుకొని నమాజ్ చేయాలి. ఈ శక్తి లేనప్పుడు కూర్చుండి చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు ప్రక్కన పడుకొని చేయాలి. ఈ శక్తి కూడా లేనప్పుడు వెల్లకిల పడుకొని పాదములను ఖిబ్లా వైపున ఉంచి నమాజ్ చేయాలి. సజ్దాలో రుకూ కంటే కొంచము ఎక్కువ తలను వంచాలి. రుకూ, సజ్దా చేయు శక్తి లేనప్పుడు తలతో సైగ చేయాలి. ఏ పరిస్థితిలోనయినా నమాజ్ విడనాడకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారుః

(صَلِّ قَائِمًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا فَإِنْ لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ).

“నీవు నిలబడి నమాజ్ చేయి. శక్తి లేనిచో కూర్చుండి చేయి. ఈ శక్తి లేనిచో పరుండుకొని చేయి”. (బుఖారిః 1117).

జుమా నమాజ్:

జుమా నమాజ్ వాజిబుంది. అది చాలా గొప్ప దినము. వారము రోజుల్లో అది చాలా ఘనతగల రోజు. అల్లాహ్ ఆదేశం:

[يَا أَيُّهَا الَّذِينَ آَمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِنْ يَوْمِ الجُمُعَةِ فَاسْعَوْا إِلَى ذِكْرِ اللهِ وَذَرُوا البَيْعَ ذَلِكُمْ خَيْرٌ لَكُمْ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ] {الجمعة:9}

{విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదలండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది}. (62: జుముఅహ్: 9).

జుమా ప్రత్యేకతలు:

స్నానం చేయుట, శుభ్రమైన మంచి దుస్తులు ధరించుట, దుర్వాసన నుండి అతి దూరంగా ఉండుట ఈ నాటి పత్యేక ధర్మాలు.

జుమా ప్రత్యేకతల్లోః జుమా నమాజ్ కొరకు మస్జిద్ కు శీఘ్రముగా వెళ్ళి, ఇమాం వచ్చే వరకు నఫిల్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, అల్లాహ్ స్మరణాల్లో గడుపుట. ఇమాం ఖుత్బ (జుమా ప్రసంగం) ఇస్తున్నప్పుడు ఏ పని చేయకుండా, నిశబ్దంగా ఉండి ఖుత్బ వినుట. నిశబ్దంగా ఉండనివారు వృధా పని చేసిన వారవుతారు. వృధా పని చేసిన వారికి జుమా ఫలితం లభించదు. ఖుత్బ సందర్భంలో మాట్లాడ్డం నిషిద్ధం.

జుమా ప్రత్యేకతల్లోః ఈ రోజు సూరె కహఫ్ పారాయణం పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారుః

(مَنْ قَرَأ سُورَةَ الْكَهفِ كَانَتْ لَهُ نُورًا يَومَ الْقِيَامةِ مِن مَقَامِهِ إِلى مَكَّةَ وَمَنْ قَرَأ عَشْرَ آيَاتٍ مِنْ آخِرِهَا ثُمَّ خَرَجَ

الدَّجَّالُ لَمْ يَضُرُّه).

“ఎవరు సూరె కహఫ్ పఠిస్తారో వారికి తనున్న ప్రాంతం నుండి మక్కా వరకు మరియు ప్రళయం నాటికీ కాంతియే కాంతి ఉండును. ఎవరు దాని చివరి పది ఆయతులు పఠిస్తారో వారికి దజ్జాల్ వచ్చినప్పటికీ ఏమి నష్టం జరగదు”. (అల్ ముఅజముల్ ఔసత్: తబ్రానీ 2/123).

ఇమాం ఖుత్బ ఇస్తుండగా మస్జిదులో ప్రవేశించువారు రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ సంగ్రహంగా చేసుకోవాలి. అప్పటి వరకు కూర్చోకూడదు.

(إِذَا جَاءَ أَحَدُكُمْ يَوْمَ الْجُمُعَةِ وَقَدْ خَرَجَ الْإِمَامُ فَلْيُصَلِّ رَكْعَتَيْنِ).

“మీలో ఎవరైనా మస్జిదులో ప్రవేశించినప్పుడు ఇమాం ఖుత్బా ఇస్తున్నచో రెండు రకాతులు సంగ్రహముగా చేసుకోవాలి” అని ప్రవక్త ఖుత్బ ఇస్తూ చెప్పారు. (ముస్లిం 875).

ఎవరికీ సలాం చేయకుండా నిదానంగా కూర్చోని ఖుత్బ వినాలి. ఖుత్బ తనకు తెలిసిన భాషలో కానప్పటికీ మౌనంగా ఉండాలి. ప్రక్కలో కూర్చున్న వారితో ముసాఫహ (కరచాలణం) చేయకూడదు.

ఇమాంతో జూమా నమాజ్ యొక్క ఒక రకాతు పొందినవారు జుమాను పొందినట్లే. అబూ హురైర ఉల్లేఖించిన హదీసులో ఇలా వచ్చిందిః “జుమా యొక్క ఒక రకాతును పొందినతను జుమాను పొందినాడు”. (బైహఖి). ఒక రకాతు కంటే తక్కువ పొందినతను అనగా ఇమాంతో రెండవ రకాతులోని రుకూ పొందనివాని జుమా కానట్లే. అతను జొహ్ర్ నమాజ్ నియ్యతుతో ఇమాం వెనక నమాజులో పాల్గొని ఇమాం సలాం తింపిన తరువాత జొహ్ర్ నమాజ్ పూర్తి చేసుకోవాలి.

పండుగ నమాజ్

పొద్దు పొడిసి సూర్యుడు బల్లెమంత (బారెడంత) పొడుగులో పైకి వచ్చిన తరువాత పండుగ నమాజ్ సమయం ప్రారంభం అవుతుంది. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండుగ) కొంచము ముందుగా మరియు ఈదుల్ ఫిత్ర్ (రమజాను పండుగ) కొంచము ఆలస్యంగా చేయుట మంచిది. ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళే ముందు ఖర్జూరపు పండ్లు తిని వెళ్ళుట, ఈదుల్ అజ్ హాకు వెళ్ళే ముందు ఏమీ తినకుండా వెళ్ళుట ధర్మం. బురైద రజియల్లాహు అన్హు కథనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కొంచమైనా భుజించని వరకు ఈదుల్ ఫిత్ర్ కు వెళ్ళకపోయేవారు. ఈదుల్ అజ్ హా చేసుకునెంత వరకు ఏమీ తినక పోయేవారు”. (అహ్మద్). పండుగ రోజు మంచి దుస్తులు ధరించుట అభిలషణీయం.

పండుగ నమాజ్ రెండు రకాతులు. ఇవి ఖుత్బకు ముందు చేయాలి. అందులో ఇమాం బిగ్గరగా ఖుర్ఆను పఠించాలి. పండుగ నమాజుకు అజాను, ఇఖామతు ఏదీ లేదు. ముందు తక్బీరె తహ్రీమ చెప్పి సనా చదవాలి. తరువాత ఏడు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. తరువాత అఊజు బిల్లాహి మినష్షైతా నిర్రజీం, బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం మరియు సూరె ఫాతిహ, దాని తరువాత ఏదైన సూర చదవాలి. మొదటి రకాతు యొక్క రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అంటూ నిలబడిన తరువాత ఐదు సార్లు అల్లాహు అక్బర్ అనాలి. ప్రతీ సారి చేతులు భుజాల వరకు ఎత్తాలి. సూరె ఫాతిహ మరో సూర చదివి రెండవ రకాతు పూర్తి చేయాలి. (మొదటి రకాతులో సూరె ఖాఫ్ లేదా సూరె అఅలా రెండవ రకాతులో సూరె ఖమర్ లేదా సూరె గాషియ చదవడం సున్నత్. (ముస్లిం 878, 891). (మొదటి రకాతులో ఏడు, రెండవ రకాతులో ఐదు తక్బీరుల విషయం అబూదావూదు 1149లో ఉంది).

పండుగ నమాజుకు ముందూ, వెనకా సున్నుతుగానీ, నఫిల్ గానీ ఏమీ లేవు. ఇమాంతో ఒక రకాతు పొందనివారు ఇమాం సలాం తింపిన తరువాత పూర్తి చేసుకోవాలి. ఇమాం ఖుత్బ ఇస్తున్న సమయంలో వచ్చినవారు కూర్చుండి ఖుత్బ వినాలి. ఖుత్బ ముగిసిన తరువాత పైన తెలిపిన విధానంలోనే నమాజ్ చేసుకోవాలి. ఒకరుంటే ఒంటరిగానే చేసుకోవాలి. ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే జమాఅతుతో (సామూహికంగా) చేసుకోవాలి.


ఈ పుస్తకం ఆధారంగా చెప్పిన ముందు వీడియో పాఠాలు