ప్రళయ దినం మరియు దాని సూచనలు [ఆడియో, టెక్స్ట్]

ఇక్కడ వినండి లేదా ఆడియో డౌన్లోడ్ చేసుకోండి [37నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ

ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ
(యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్)
ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.

రెండో విషయం చెప్పాడు:

وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا
(వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా)
ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది

మూడో విషయం చెప్పాడు.

وَتَرَى النَّاسَ سُكَارٰى
(వ తరన్ నాస సుకారా)
జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.

وَمَا هُمْ بِسُكَارٰى
(వమా హుమ్ బిసుకారా)
కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)

ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.

وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ
(వలాకిన్న అదాబల్లాహి షదీద్)
ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.

ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.

అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.

ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:

فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا
(ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా)
ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)

ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.

اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ
(ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్)
ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)

ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.

అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.

ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ
(బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్)
నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.

అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.

ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.

ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:

أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا
(అన్ తలిదల్ అమతు రబ్బతహా)
బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.

మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.

ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.

మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.

ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.

وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ‏ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى
(వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా)
అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.

ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.

అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.

ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.

మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”

అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,

إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ
(ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్)
నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.

ఏంటి ఆ పెద్ద సూచనలు?

  1. అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
  2. అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
  3. దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
  4. సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
  5. ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
  6. య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
  7. మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
  8. యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.

వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:

“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.

మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.

ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?

వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.

సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.

దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.

కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,

اَللّٰهُمَّ إِنِّيْ أَعُوْذُ بِكَ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ الْمَسِيْحِ الدَّجَّالِ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్)

అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.

ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.

రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.

మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.

పరలోకం (The Hereafter)
https://teluguislam.net/hereafter/

[ముస్లింల ధార్మిక విశ్వాసం] అల్లాహ్‌ మనల్ని ఎందుకు పుట్టించాడు?

బిస్మిల్లాహ్

1. ప్రశ్న : అల్లాహ్‌ మనల్ని ఎందుకు పుట్టించాడు?

జవాబు:

ఆయన మనల్ని కేవలం తన ఆరాధన కొరకు సృష్టించాడు.

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

నేను జిన్నాతులనూ, మానవులనూ కేవలం నా ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాను.[1]
(సూరా అజ్‌ జారియాత్‌ 51:56)

హదీస్‌ : అల్లాహ్‌కు ఆయన దాసులపై ఉన్న హక్కు ఏమిటంటే, వారు ఆయన్నే ఆరాధించాలి. ఈ ఆరాధనలో మరెవ్వరినీ భాగస్వాములుగా చెయ్యకూడదు. (బుఖారీ, ముస్లిం)


ఈ పోస్ట్ ముస్లింల ధార్మిక విశ్వాసం – జమీల్ జైనూ అను పుస్తకం నుండి తీసుకోబడింది

[1] నోట్స్: ఆహ్సనుల్ బయాన్ నుండి:

మానవులను, జిన్నులను పుట్టించటంలోని తన ఉద్దేశ్యమేమిటో అల్లాహ్ ఈ వాక్యంలో తెలియపరచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులనుగానీ, జిన్నాతులనుగానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్రాలను హరించ లేదు. ఒకవేళ అదేగనక అయివుంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా  అల్లాహ్ ఆరాధనకు కట్టుబడి ఉండేవారు. కాని అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుకలోని పరమార్ధాన్ని వారికిక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్థాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.

“నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు”. (సూరా అజ్‌ జారియాత్‌ 51:57)

ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా నా పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో! అదేమీ కాదు. ప్రపంచంలో మీరు కల్పించే చిల్లర దేవుళ్ల లాంటి వాణ్ని కాదు నేను. ఆ మాటకొస్తే భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు నా అధీనంలోనే ఉన్నాయి. నా ఆరాధన వల్ల నా భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగాని నాకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.


మరింత సమాచారం కోసం క్రింది లింక్ సందర్శించండి:

మానవజాతి సృష్టి యెక్క ఉద్దేశ్యం ఏమిటి? (The Purpose of Creation)

తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారు | ఏకత్వపు బాటకు సత్యమైన మాట [వీడియో]

బిస్మిల్లాహ్

3వ అధ్యాయం
తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గంలో చేరుతారు
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ

అల్లాహ్ (త’ఆలా) ఆదేశం: “నిజానికి ఇబ్రాహీమ్‌ తనకు తానే ఒక సంఘం (ఉమ్మహ్). అల్లాహ్ కు పరమ విధేయుడు. ఆయన యందే మనస్సు నిలిపినవాడు. అతను ఎన్నడూ ముష్రిక్  గా ఉండలేదు?” (సూరహ్ నహ్ల్ 16:120).

وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ

“… మరియు ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వామ్యులుగా చేయరో (వారే మేళ్ళ వైపునకు పరుగులు తీసేవారు) (సూరహ్ మూ’మినూన్‌ 23:59).

హుసైన్‌ బిన్‌ అబ్దుర్ రహ్మాన్‌ కథనం: నేను సఈద్‌ బిన్‌ జుబైర్‌ వద్ద ఉండగా “నిన్న రాత్రి రాలి పడిన నక్షత్ర చుక్కను ఎవరు చూశారు?” అని అడిగారాయన. “నేను చూశాను. అప్పుడు నేను నమాజులో లేను, కాని విషపురుగు కాటేసినందున బాధతో ఉన్నాను”. అని చెప్పాను. “అయితే నీవు ఏమి చేశావు ?” అని ఆయన ప్రశ్నించారు. “రుఖ్యా (మంత్రం) చదివాను” అని జవాబిచ్చాను. “ఎందుకు అలా చేశావు?” అని ఆయనడిగారు. “షాతబి మాకు ఒక హదీసు వినివించారు (దాని ఆధారంగా నేను చదివాను)” అనిచెప్పాను. “ఆయన ఏ హదీసు మీకు వినిపించారు” అని ఆయన అడిగారు. నేను చెప్పాను: “బురైద బిన్‌ హుసయ్యిబ్‌ ఉల్లేఖించిన ఒక హదీసు మాకు వినిపించారు. ఆయన చెప్పారు: “దిష్టి  తగిలితే మరియు విషపురుగు కాటేస్తే తప్ప మంత్రించకూడదు” అని. “ఎవరు విన్న హదీసుపై ఆచరించారో   వారు మంచి పని చేశారు” అని సఈద్‌ చెప్పి. మాకు ఇబ్నె అబ్బాసు (రది అల్లాహు అన్హు) ఈ హదీసు వినిపించారు ” అన్నారు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. (వారికి సారథ్యం వహిస్తూ) ప్రవక్తలు నా ముందు నుంచి వెళ్ళసాగారు. అప్పుడు కొందరు ప్రవక్తల వెనక ఓ చిన్న సమూహం ఉంది. కొందరు ప్రవక్తల వెనక ఒక్కొక్క వ్యక్తి మాత్రమే ఉంటే, మరికొందరి ప్రవక్తల వెనక ఇద్దరేసి వ్యక్తులు ఉండేవారు. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని ప్రవక్తలు కూడా వారిలో ఉన్నారు. ఆ తరువాత నాకు ఒక పెద్ద జన సమూహము కన్పించింది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కాని ఆ సమూహం హజ్రత్‌ మూసా (అలైహిస్సలాం), ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. ఆ తరువాత జన సమూహం మరొకటి చూశాను. అప్పుడు ఈ జన సమూహం మీ అనుచర సమాజమే. వీరిలో డెబ్బయ్ వేల మంది ఎలాంటి విచారణ, శిక్ష లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు” అని తెలుపబడింది.

ఆ తరువాత ప్రవక్త లేచి వెళ్ళిపోయారు. (డెబ్బై వేల మంది ఎవరయి ఉంటారో) అని కొందరు అనుచరులు పరస్పరం మాట్లాడుకుంటూ “బహుశ వారు ప్రవక్త మైత్రిత్వం (స్నేహం) పొందిన వారు కావచ్చు” అన్నారు. మరి కొందరు “వారు ఇస్లాంలోనే పుట్టి ఏ మాత్రం షిర్క్‌ చేయని వారు కావచ్చు” అని అన్నారు. ఇలా చర్చించూకుంటూ ఉండగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వచ్చేశారు. వారందరూ చర్చించుకున్న విషయాలను ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వారు మంత్రాలు చేయించుకునేవారు కారు, దుశ్శకునాలను పాటించరు, వాతలతో చికిత్స చేయించుకోరు. వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని (ఏ కష్టమొచ్చినా) ఆయన మీదే ఆధారపడతారు” అని విశదీకరించారు.

ప్రవక్త అనుచరుల్లో ఉక్కాషా బిన్‌ మిహ్సన్‌ లేచి నిలబడి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అని కోరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నీవు వారిలో ఒకడివి”. ఇది చూసి మరో వ్యక్తి లేచి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అన అడిగాడు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఉక్కాషా నీ  కంటే ముందు ఈ సదవకాశాన్ని ఉపంయోగించుకున్నాడు”. (బుఖారి, ముస్లిం).

ముఖ్యాంశాలు:

1. తౌహీద్‌  విషయంలో ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు.

2. తౌహీద్‌ యొక్క భావం స్పష్టమయింది.

3. ప్రవక్త ఇబ్రాహీం ముష్రికులలోని వారు కారు అని అల్లాహ్ వారిని ప్రశంసించాడు.

4. షిర్క్‌ నుండి దూరమున్న ఔలియా అల్లాహ్ లను (అల్లాహ్  భక్తులను) ప్రశంసించబడింది.

5. మంత్రం చేయించుట, వాతలు వేయించుటను మానుకొనుట “తౌహీద్ యొక్క తహ్ఖీఖ్‌” చేసినట్టగును.

6. పై హదీసులో వచ్చిన గుణాలు అలవరచుకొనుట అల్లాహ్ పై “భరోసా” (నమ్మకం, ఆధారం) చాలా ఉన్నట్టు

7. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల అపారవిద్య తెలుస్తుంది. (ఆ డెబ్బై వేల మంది అల్లాహ్ దయ తరువాత) వారి సత్కార్యాలతోనే (విచారణ, శిక్ష లేకుండా) స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు.

8. సహాబీలు మంచి విషయాల్లో మున్ముందుగా ఉండడానికి ఎంతగా కాంక్షించేవారో తెలుస్తుంది.

9. ముహమ్మద్‌ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఉమ్మతీలు” (అనుచర సమాజం) ఉన్నత స్థానంలో, సంఖ్యలో ఇతర ప్రవక్తల “ఉమ్మతీల” (అనుచరుల) కంటే ఎక్కువగా, శ్రేష్ఠులుగా ఉన్నట్టు తెలుస్తుంది.

10. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) “ఉమ్మతీల” ఘనత కూడ తెలుస్తుంది.

11. ప్రవక్త ఎదుట గత “ఉమ్మతీలందరు” ప్రత్యక్షమయ్యారు.

12. ప్రతీ “ఉమ్మత్‌” తమ ప్రవక్త వెంట వచ్చును.

13. ప్రవక్తలను అనుసరించిన ప్రజలు అల్ప సంఖ్యాకులు అని తెలుస్తుంది.

14. ఏ ప్రవక్తను విశ్వసించిన వారు ఎవరూ ఉండరో, ఆ ప్రవక్త ఒంటరిగా వచ్చును.

15. దీని వల్ల తెలిసిందేమిటంటే: మెజారిటి ఉన్నప్పుడు విర్రవీగ వద్దు. మైనారిటిగా ఉన్నప్పుడు చింతించవద్దు.

16. విష పురుగు కాటు వేసినా, దిష్టి తగిలినా (రుఖ్యా) మంత్రం చేయించుట ధర్మసమ్మతం.

17. సఈద్ బిన్‌ జుబైర్‌ “ఎవరు విన్న హదీసుపై ఆచరించాలో వారు మంచి పని చేశారు” అని అన్న పదంతో పూర్వీకులు విద్యలో ఎంత ఆరితేరిన వారో తెలుస్తుంది. ఇంకా; వీరు చెప్పిన హదీసు మరియు హుసైన్‌ బిన్‌ అబ్దుర్  రహ్మాన్‌ చెప్పిన హదీసులో తేడా ఏ మాత్రం లేదు.

18. పూర్వ పండితులు అనవసర ప్రశంసల నుండి దూరంగా ఉుండేవారు.

19. ఉక్కాషాకు “నీవు వారిలో ఒకడివి అని ప్రవక్త చెప్పడం ప్రవక్త పదవి గుర్తుల్లో ఒకటి.

20. ఉక్కాషా ఘనత (అతడు స్వర్గవాసి అని తెలుపబడుట).

21. ఉక్కాషా తరువాత వ్యక్తికి ప్రవక్త చెప్పిన మాటల ద్వారా సందర్భాన్ని బట్టి స్పష్టంగా కాకుండా సైగల ద్వారా సంక్షిప్తంగా మాట్లాడడం యోగ్యం అని తెలుస్తుంది.

22. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నీతి, సత్ప్రవర్తన కూడా ఈ హదీసులో ఉట్టిపడుతుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఈ అధ్యాయం దీనికంటే ముందు అధ్యాయాన్ని సంపూర్ణ పరుస్తుంది. ఇది దానికి సంబంధించినదే.

తౌహీద్‌ యొక్క “నిర్ధారణ” అంటే: పెద్ద షిర్క్‌, చిన్న షిర్క్‌ నుండి, వాక్కులోనూ, విశ్వాసంలోనూ, కర్మలలోనూ అన్ని బిద్‌అత్‌ (కల్పిత ఆచారా)ల నుండి, పాపాల నుండి తౌహీద్‌ను కాపాడుట, శుద్ది పరుచుట. ఇవన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకు మాత్రమే చేయుట. ఎందుకనగా అత్యధికమైన షిర్క్‌ తౌహీద్‌కు విరుద్ధమైనది. అత్యల్పమైన షిర్క్‌ సంపూర్ణ తౌహీద్‌కు విరుద్దమైనది. బిద్‌అత్ , పాపాలు తౌహీద్‌ను కలుషితం చేసి, దాని సంపూర్ణత్వానికి అడ్డుపడతాయి. దాని లాభాల నుండి దూరం చేస్తాయి.

తౌహీద్‌ యొక్క నిర్ధారణ చేసిన వాని హృదయం విశ్వాసం, తౌహీద్‌, ఇఖ్లాస్ (సంకల్పశుద్ది)తో నిండిపోతుంది. తన ఆచరణ దాన్ని సత్యపరుస్తుంది. అది ఏ విధంగా అనగా: అల్లాహ్ యొక్క సమస్త ఆదేశాలకు అతడు శిరసావహిస్తాడు. అవిధేయతకు పాల్పడి విశ్వాసాన్ని నష్టపరుచుకోడు. అలాంటివాడే స్వర్గంలో విచారణ లేకుండా వెళ్లేవాడు. అందులో ప్రవేశించే మొదటి వ్యక్తి అయ్యేవాడు.

అల్లాహ్ కు పూర్ణ విధేయుడై, అల్లాహ్ పై ధృడమైన నమ్మకం ఉంచి, ఏ ఒక్క విషయంంలో కూడా అల్లాహ్ ను వదలి మానవుల వైపు మరలకుండా, వారిని అడగకుండా ఉండి, అతని బాహ్యం, ఆంతర్యం, మాటలు, చేష్టలు, ప్రేమ, ద్వేషం అన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట , ప్రవక్త అడుగుజాడల్లో నడుచుట తౌహిద్‌ యొక్క నిర్దారణకు ప్రత్యేక నిదర్శనం.

ఇక్కడ ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. “ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది.” (6: 132).

ఆశలతో, వాస్తవం లేని మాటలతో తౌహీద్‌ యొక్క నిర్ధారణ కాదు. మనస్సులో స్థిరమైన విశ్వాసం, ఇహ్సాన్‌ (ఆరాధనా సౌందర్యం) వాస్తవికతలతో, దానికి తోడుపడే సత్ప్రవర్తన, సత్కార్యాలతో అవుతుంది.

ఈ విధంగా తౌహీద్‌ యొక్క నిర్ధారణ చేసినవారు ఈ అధ్యాయంలో చెప్పబడిన ఘనతలకు అర్హులవుతారు.


నుండి: ఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

కుఫ్ర్‌ (అవిశ్వాసం, తిరస్కార వైఖరి) మరియు దాని రకాలు – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

కుఫ్ర్‌ (అవిశ్వాసం, తిరస్కార వైఖరి) , నిర్వచనం, దాని రకాలు

(అ) కుఫ్ర్‌ నిర్వచనం :

నిఘంటువు ప్రకారం కుఫ్ర్‌ అంటే కప్పి ఉంచటం, దాచి పెట్టడం అని అర్థం. అయితే షరీయత్‌లో “ఈమాన్‌‘ (విశ్వాసం)కు విరుద్ధమైన దానిని కుఫ్ర్‌ (అవిశ్వాసం లేక తిరస్కారం) అంటారు.

ఎందుకంటే – అల్లాహ్ యెడల, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల విశ్వాసం లేకపోవటమనే దానికి మరో పేరే కుఫ్ర్‌ (అవిశ్వాసం). అందులో ధిక్కరణా వైఖరి ఉన్నా, లేకున్నా అది అవిశ్వాసమే. విశ్వాసం (ఈమాన్‌)లో సందేహం సంశయమున్నా లేదా విముఖత ఉన్నా లేదా అసూయ ఉన్నా లేదా అహంకార భావమున్నా లేదా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానాన్ని అనుసరించకుండా మనోవాంఛలు అడ్డుపడినా – ఇవన్నీ కుఫ్ర్‌ (అవిశ్వాసం)లో అంతర్భాగాలే. కాకపోతే అల్లాహ్ యే లేడని, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) రాక అసత్యమని పూర్తిగా కొట్టివేసే వ్యక్తి అవిశ్వాసం చాలా తీవ్రమైనది, కరడుగట్టినది. అలాగే దైవప్రవక్తలు సత్యం అన్న విషయంపై విశ్వాసమున్నప్పటికీ కేవలం అసూయ వల్ల వారిని త్రోసిపుచ్చిన వ్యక్తి కూడా అవిశ్వాసియే (కాఫిరే). (మజ్మూఅ అల్‌ ఫతావా-షేఖుల్‌ ఇస్లాం ఇబ్నె తైమియ-12/335)

(ఆ) కుఫ్ర్‌ రకాలు :

కుఫ్ర్‌ (అవిశ్వాసం) రెండు రకాలు : (1) కుఫ్రె అక్బర్‌ (పెద్ద తరహా అవిశ్వాసం) (2) కుఫ్రె అస్గర్ (చిన్న తరహా అవిశ్వాసం).

మొదటి రకం – కుఫ్రె అక్బర్‌

ఇది మనిషిని ఇస్లామీయ సముదాయం నుండి బహిష్కృతం చేసేస్తుంది. ఇందులో కూడా ఐదు రకాలున్నాయి. అవేమంటే:

(1) కుఫ్రె తక్‌జీబ్‌ : (అబద్ధంతో కూడుకున్న కుఫ్ర్‌)

దీనికి ప్రమాణం ఈ అల్లాహ్ ఆదేశం :

وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ

“అల్లాహ్‌కు అబద్దాన్ని అంటగట్టేవానికన్నా లేదా తన వద్దకు సత్యం వచ్చినపుడు దానినీ అసత్యమంటూ ధిక్కరించే వానికన్నా పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఏమిటి, అటువంటి తిరస్కారుల నివాస స్ధలం నరకంలో ఉండదా?” (అల్‌ అన్‌కబూత్‌ 29:68)

(2) కుఫ్రె తకబ్బుర్‌ వ ఇన్‌కార్‌ (అహంకారం, నిరాకరణతో కూడుకున్న కుఫ్ర్‌):

ఒక విషయాన్ని సత్యమని ధ్రువీకరిస్తూనే అహంకారం కారణంగా త్రోసిపుచ్చటం.

దీనికి ఆధారం ఈ అల్లాహ్ సూక్తి :

وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ

“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు నిరాకరించాడు. అహంకారి అయి, అవిశ్వాసులలో చేరిపోయాడు.” (అల్‌ బఖర 2:34)

(3) కుఫ్రె షక్‌ (అనుమానంతో కూడుకున్న కుఫ్ర్‌)

దీనినే సంశయంతో, సందిగ్ధంతో కూడుకున్న కుఫ్ర్‌ అని కూడా అంటారు.

దీనికి ప్రమాణం అల్లాహ్ యొక్క ఈ సూక్తులు :

وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِّنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَن تَبِيدَ هَٰذِهِ أَبَدًا وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِن رُّدِدتُّ إِلَىٰ رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِّنْهَا مُنقَلَبًا قَالَ لَهُ صَاحِبُهُ وَهُوَ يُحَاوِرُهُ أَكَفَرْتَ بِالَّذِي خَلَقَكَ مِن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ سَوَّاكَ رَجُلًا لَّٰكِنَّا هُوَ اللَّهُ رَبِّي وَلَا أُشْرِكُ بِرَبِّي أَحَدًا

ఆ విధంగా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు: “ఏనాటికైనా ఈ తోట నాశనమవుతుందని నేననుకోను. ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ (అలాంటిదేదైనా జరిగి) నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను (ఆ మళ్ళింపు స్థానంలో) ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను.” అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఏమిటి, నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించి, ఆ పైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా? నా మటుకు నేను ఆ అల్లాహ్ యే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను.” (అల్‌ కహఫ్‌ 18:35-38)

(4) కుఫ్రె ఏరాజ్‌ (విముఖతతో కూడుకున్న కుఫ్ర్‌)

దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:

وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ

“అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.” (అల్‌ అహ్‌ఖాఫ్‌ 46:3)

(5) కుఫ్రె నిఫాఖ్ (కాపట్యంతో కూడిన కుఫ్ర్‌) :

దీనికి ఆధారం దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తి:

ذَٰلِكَ بِأَنَّهُمْ آمَنُوا ثُمَّ كَفَرُوا فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَفْقَهُونَ

“ఎందుకంటే వారు (మొదట) విశ్వసించి, ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయ బడింది. ఇక వారు ఏమీ అర్థం చేసుకోరు.”(అల్‌ మునాఫిఖూన్‌ 63:3)

రెండవ రకం – కుఫ్రె అస్గర్‌ (చిన్నతరహా కుఫ్ర్‌)

దీనివల్ల మనిషి తన సముదాయం నుండి వేర్పడడు. దీనినే ‘క్రియాత్మక కుఫ్ర్‌‘గా కూడా వ్యవహరిస్తారు. దైవగ్రంథంలో, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్‌లో ఇది కుఫ్ర్‌గా పేర్కొనబడి నప్పటికీ ఇది ‘కుఫ్ర్ అక్బర్‌’ (పెద్ద తరహా కుఫ్ర్ ) పరిధిలోనికి రాదు. ఉదాహరణకు దైవానుగ్రహాల పట్ల కృతఘ్నతా భావం (కుఫ్రానె నీమత్‌). ఉదాహరణకు:

وَضَرَبَ اللَّهُ مَثَلًا قَرْيَةً كَانَتْ آمِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

“అల్లాహ్‌ ఒక పట్టణం ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్టణం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుండీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. తరువాత ఆ పట్టణ వాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపారు (అల్లాహ్ చేసిన మేళ్లను మరచిపొయ్యారు).” (అన్‌ నహ్ల్‌ 16:112)

ఒక ముస్లిం సాటి ముస్లింతో యుద్ధం చేయటం కూదా ‘కుఫ్రె అస్గర్‌’ ఉపమానం లోకే వస్తుంది. దీనిని గురించి మహనీయ ముహమ్మద్  (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“ముస్లింను దూషించటం పాపం. అతనిపై కయ్యానికి కాలు దువ్వటం “’కుఫ్ర్‌”. (బుఖారీ, ముస్లిం)

ప్రవక్త మహనీయుల (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం కూడా ఈ సందర్భంగా గమనార్హమే:

“మీరు నా తదనంతరం ఒకరినొకరి మెడలు నరుక్కొని కాఫిర్లుగా మారకండి.” (బుఖారీ, ముస్లిం)

అల్లాహ్ యేతరుల పేర ప్రమాణం చేయటం కూడా ఈ కోవకు చెందినదే. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :

“అల్లాహ్ యేతరుని పేర ప్రమాణం చేసినవాడు కుఫ్ర్‌ (అవిశ్వాసాని)కి ఒడిగట్టాడు లేదా షిర్క్‌ (బహుదైవోపాసన)కి పాల్పడ్డాడు.” (ఈ హదీసును తిర్మిజీ-1535 పొందుపరచి, హసన్‌గా ఖరారు చేశారు. హాకిమ్‌ మాత్రం దీనిని సహీహ్‌ – ప్రామాణికం – గా పేర్కొన్నారు).

వేరొక చోట అల్లాహ్‌ పెద్ద పాపానికి ఒడిగట్టిన వానిని విశ్వాసి (మోమిన్‌)గా పేర్కొన్నాడు. ఇలా సెలవిచ్చాడు :

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُتِبَ عَلَيْكُمُ الْقِصَاصُ فِي الْقَتْلَى

“ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్‌) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది.” (అల్‌ బఖర 2:178)

పై సూక్తిలో అల్లాహ్‌ హంతకుణ్జి ‘విశ్వాసుల పరిధి నుండి వేరుచేయలేదు. పైగా అతన్ని హతుని తరఫు హక్కుదారునికి సోదరునిగా ఖరారు చేస్తూ అతనిపై ఖిసాస్‌ చెల్లింపు విధించాడు. తరువాత ఈ విధంగా ఆదేశించాడు :

فَمَنْ عُفِيَ لَهُ مِنْ أَخِيهِ شَيْءٌ فَاتِّبَاعٌ بِالْمَعْرُوفِ وَأَدَاءٌ إِلَيْهِ بِإِحْسَانٍ

“ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్జీ కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్త ధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి”. (అల్‌ బఖర 2:178)

ఇక్కడ ‘సోదరత్వం’ అంటే భావం నిశ్చయంగా ధార్మిక సోదరబంధమే. వేరొకచోట అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు :

وَإِن طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا

“ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాలు పరస్పరం గొడవపడితే వారి మధ్య సయోధ్య చేయండి.” (అల్‌ హుజురాత్‌ 49:9)

చివరకు అల్లాహ్‌ ఈ విధంగా కూడా సెలవిచ్చాడు :

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ

“(గుర్తుంచుకోండి) విశ్వాసులంతా అన్నదమ్ములు. కనుక మీ సోదరులిరువురి మధ్య రాజీ కుదుర్చండి.” (అల్‌ హుజురాత్‌ 49:10)

(పైన పొందుపరచబడిన విషయం “షరహ్ అత్ తహావియ్యహ్” నుండి సంక్షిప్తంగా సంగ్రహించబడినది).

కుఫ్రె అక్బర్‌ – కుఫ్రె అస్గర్‌ మధ్య గల తేడాలు:

(1) కుఫ్రె అక్బర్‌ (పెద్ద తరహా కుఫ్ర్‌) మనిషిని ఇస్లామీయ సముదాయం నుండి వేరుపరుస్తుంది. అతని ఆచరణలన్నీ దీని మూలంగా వృధా అయిపోతాయి. కుఫ్రె అస్గర్‌ (చిన్న తరహా కుఫ్ర్‌) వల్ల మనిషి ఇస్లామీయ సమాజం నుండి బహిష్కృతుడవడం గానీ, అతని ఆచరణలు వృధా అవటంగానీ జరగదు. అయితే అతనిలో ‘కుఫ్ర్‌’ మోతాదునుబట్టి అతని విశ్వాసం బలహీనమవుతుంది. దీనికి పాల్పడిన వ్యక్తిని అది శిక్షార్హునిగా నిలబెడుతుంది.

(2) కుఫ్రె అక్బర్‌ (పెద్ద తరహా కుఫ్ర్‌)కు పాల్పడిన వ్యక్తిని అది శాశ్వతంగా నరకానికి ఆహుతి చేస్తుంది. కుఫ్రె అస్గర్‌ (చిన్న తరహా కుఫ్ర్‌)కు పాల్పడిన వ్యక్తి ఒకవేళ నరకానికి ఆహుతి అయినప్పటికీ అందులో శాశ్వతంగా పడి ఉండడు. అల్లాహ్‌ అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతన్ని క్షమించి, నరకంలో వేయకపోవటం కూడా సంభవమే.

(3) కుఫ్రె అక్బర్‌ – దానికి పాల్చడిన వ్యక్తి ధన ప్రాణాలను అది సమ్మతంగా చేసి వేస్తుంది. కాగా కుఫ్రె అస్గర్‌ – దానికి పాల్పడిన వ్యక్తి ధన ప్రాణాలను సమ్మతం చేయదు.

(4) కుఫ్రె అక్బర్‌కు ఒడిగట్టిన వ్యక్తికి – విశ్వాసులకు మధ్య విరోధ భావం తప్పకుండా ఏర్పడుతుంది. కాబట్టి కుఫ్రె అక్బర్‌కి ఒడిగట్టే వారితో ముస్లింలు స్నేహం చేయటం ధర్మసమ్మతం కాదు – అతనెంత దగ్గరివాడయినాసరే! అయితే కుఫ్రె అస్గర్‌ ఎట్టి పరిస్థితిలోనూ స్నేహ బంధంలో అవరోధంగా ఉండదు. పైగా అలాంటి వ్యక్తితో – అతనిలో ఉన్న విశ్వాస (ఈమాన్‌) మోతాదును బట్టి స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవచ్చు. అతనిలో ఉన్న అవిధేయతా భావం, పాపం మోతాదునుబట్టి అతని పట్ల దూరంగా ఉండటం జరుగుతుంది.


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (101-105 పేజీలు)

విశ్వాస మూల సూత్రాలు: నాల్గవ పాఠం – షిర్క్, దాని రకాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[16 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

షిర్క్ (బహుదైవారాధన), దాని రకాలు:

షిర్క్ అంటే: ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పుట. ఉదాహరణకు విగ్రహాన్ని, మృతులను, సూర్యచంద్రులను, ప్రవక్తలను, వలీలను, సమాధి తదితరాలను పూజించుట. లేదా అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకొనుట, వారికి మ్రొక్కుబడులు చెల్లించుట లేదా వారి కొరకు నమాజు, ఉపవాసాలు పాటించుట, వారి కొరకు బలిదానమిచ్చుట. ఇవన్నీ అల్లాహ్ తో పాటు షిర్క్ లో వస్తాయి.

అలాగే విగ్రహానికి, సూర్యచంద్రులకు, సమాధివారికి ఇంకా ఇలాంటి వాటికి సజ్దా చేయుట (సాష్టాంగపడుట). ఇది కూడా షిర్క్, ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది. అల్లాహ్ కాపాడుగాక!

అలాగే సృష్టించటంలో అల్లాహ్ తో పాటు ఎవరైనా భాగస్వామి గలడని, లేదా అల్లాహ్ మాత్రమే శక్తిగలవాటి శక్తి అతనిలో ఉందని నమ్మడం కూడా షిర్క్ అవుతుంది.

షిర్క్ రెండు రకాలు: చిన్న షిర్క్, పెద్ద షిర్క్.

మొదటిది: పెద్ద షిర్క్: ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైనా అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. ఇలాంటి షిర్క్ చేసిన వ్యక్తి తౌబా చేయకుండా (పశ్చత్తాప పడి, క్షమాభిక్ష కోరకుండా) చనిపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ఇంకా ఇది సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది.

పద్దెనిమిది ప్రవక్తల ప్రస్తావన తర్వాత సూర అన్ఆమ్ ఆయతు 88లో అల్లాహ్ ఇలా హెచ్చరించాడు:

[وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُمْ مَا كَانُوا يَعْمَلُونَ] {الأنعام:88}

{ఒకవేళ వారు షిర్క్ చేసి ఉండినట్లయితే, వారు చేసిన సమస్తం నాశనం అయివుండేది}. (సూరె అన్ఆమ్ 6: 88).

వారితో షిర్క్ ముమ్మాటికీ జరగలేదు, వారిని ప్రస్తావించి మనల్ని హెచ్చరించడం జరిగింది.

పెద్ద షిర్క్ ను అల్లాహ్ స్వచ్ఛమైన తౌబా చేయనిది క్షమించడు. ఖుర్ఆన్ సాక్ష్యం చూడండి:

[إِنَّ اللهَ لَا يَغْفِرُ أَنْ يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَلِكَ لِمَنْ يَشَاءُ وَمَنْ يُشْرِكْ بِاللهِ فَقَدِ افْتَرَى إِثْمًا عَظِيمًا] {النساء:48}

{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడన్నమాట}. (సూరె నిసా 4: 48).

పెద్ద షిర్క్ లోని కొన్ని రకాలు: అల్లాహ్ యేతరులతో దుఆ, అల్లాహ్ యేతరుల కొరకు మొక్కుబడి, జిబహ్ వగైరాలు చేయుట. అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కలిపి అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ వారి పట్ల ఉంచుట.

[وَمِنَ النَّاسِ مَنْ يَتَّخِذُ مِنْ دُونِ اللهِ أَنْدَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللهِ] {البقرة:165}

{కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు}. (సూరె బఖర 2: 165).

రెండవది: చిన్న షిర్క్: ఖుర్ఆను, హదీసుల్లో ఏ పనుల కొరకు షిర్క్ అనే పదం వచ్చిందో కాని అవి పెద్ద షిర్క్ వరకు చేరవో వాటిని చిన్న షిర్క్ అంటారు. ఈ రకం ధర్మభ్రష్టతకు కారణం కాదు. కాని దీని వల్ల తౌహీదు లో మాత్రం కళంకం, కొరత ఏర్పడుతుంది. ఉదా: ప్రదర్శనాబుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట. లేదా షిర్క్ అక్బర్ కు చేర్పించే ఏదైనా కార్యం. ఉదా: ఏదైనా సమాధి వద్ద అల్లాహ్ కొరకు నమాజు చేయుట. అల్లాహ్ యేతరులు లాభనష్టానికి అధికారులు కారు అన్న విశ్వాసంతో వారి మీద ప్రమాణం చేయుట. ఇంకా అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి తలచినట్లు అని అనడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః

(إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمْ الشِّرْكُ الْأَصْغَرُ) قَالُوا: يَا رَسُولَ الله وَمَا الشِّرْكُ الْأَصْغَرُ؟ قَالَ: (الرِّيَاءُ).

“మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేదేమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారని”. చిన్న షిర్క్ అంటేమిటి? ప్రవక్తా అని అడిగారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “ప్రదర్శనాబుధ్ధి” అని. (ముస్నద్ అహ్మ్దద్ 23630. దీని సనద్ జయ్యిద్).

«مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ»

ఎవరు అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేశాడో అతడు షిర్క్ చేసినట్లే“. (అబూ దావూద్ 3251. సహీ హదీస్).

తాయత్తులు వేసుకొనుట: రోగాలు, ఆపదలు రాకుండా లేదా వచ్చినా తొలిగిపోవుటకు కడాలు, రింగులు సాధనం అని వేసుకొనుట లాంటి పనులు చిన్న షిర్క్ కు సంబంధించినవే. ఇక అవి సాధనమే కాదు, లాభనష్టాలు వాటిలో ఉన్నాయి, అంటే: అవి వేసుకున్నప్పుడు లాభం ఉంటుంది వేసుకోకుంటే నష్టం ఉంటుంది అని విశ్వసిస్తే అది పెద్ద షిర్కులో వస్తుంది. (అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి).

అలాగే జ్యోతిషుల వద్దకు వచ్చి ఏమైనా అడగడం కూడా షిర్క్ లో వస్తుంది, ఎలా అనగా అతడు మానవుల్లో కొందరు అగోచర జ్ఞానం గలవారని నమ్మినందుకు. ఇది అబద్ధం, భూటకం. అల్లాహ్ ఈ ఆదేశానుసారం:

[قُلْ لَا يَعْلَمُ مَنْ فِي السَّمَاوَاتِ وَالأَرْضِ الغَيْبَ إِلَّا اللهُ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ] {النمل:65}

“అల్లాహ్‌కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతారో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా వారికి చెప్పు. (నమ్ల్ 27:65).

అందుకే ప్రతి ముస్లం తప్పనిసరిగా తెలుసకోవాల్సిన విషయం ఏమిటంటే: స్వచ్ఛమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) కొరకే అల్లాహ్ మనల్ని పుట్టించాడు, స్వర్గనరకాలను సృష్టించాడు, ప్రవక్తల్ని పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. కర్మలన్నీ అల్లాహ్ కొరకే ప్రత్యేకించి చిత్తశుద్ధితో చేసినప్పుడే స్వీకరించబడతాయి, లేదా అంటే అవి రద్దు చేయబడతాయి.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

అల్లాహ్ పై విశ్వాసం [వీడియో]

బిస్మిల్లాహ్

[ 15 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

విశ్వాస మూల సూత్రాలు: మూడవ పాఠం – విశ్వాస మూల స్తంభాలు (అర్కానె ఈమాన్‌) [వీడియో]

బిస్మిల్లాహ్

[24 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


విశ్వాసం, దాని మూల స్తంభాలు :

వాచాకర్మను విశ్వాసం అంటారు. అది సత్కార్యాలతో పెరుగుతుంది, పాపాలతో తరుగుతుంది. హృదయం మరియు నాలుక మాటను ఇంకా హృదయం, నాలుక మరియు అవయవాల పనిని విశ్వాసం అంటారు. హృదయ మాట అంటే: హృదయపూర్వకంగా విశ్వసించుట, సత్యపరచుట. నాలుక మాట అంటే: అంగీకరించుట. హృదయ పని అంటే: సమ్మతించుట, ఇఖ్లాస్‌, లొంగిపోవుట, ప్రేమ, సత్కార్యాల సంకల్పం. అవయవాల పని అంటే: ఇస్తాం ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చుట మరియు నిశిద్ధతలను విడనాడుట.

విశ్వాసానికి కొన్ని మూలసూత్రాలున్నాయని ఖుర్‌ఆన్‌ మరియు సున్నతుల ద్వారా రుజువైనది. అవి: (1) అల్లాహ్‌ను, (2) ఆయన దూతలను, (3) ఆయన పంపిన గ్రంథాలను, (4) ఆయన ప్రవక్తలను, (5) ప్రళయదినాన్ని, (6) మంచి, చెడు తఖ్దీర్ (అదృష్టాాల)ను విశ్వసించడం. అందులో కొన్ని ఈ ఆయతులో ప్రస్తావించబడినవి:

آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

(ప్రవక్తతన ప్రభువు నుండి తనపై అవతరించి ప్రబోధాన్ని విశ్వసించాడు. ప్రవక్తను విశ్వసించినవారు కూడా దాన్ని మనసారా స్వీకరించారు. వీరంతా అల్లాహ్‌ ను, ఆయన దూతల్ని ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని నమ్ముతారు; వారిలా పలుకుతారుః ‘మేము అల్లాహ్‌ ప్రవక్తల్లో ఏ ఒక్కరి పట్లనూ తారతమ్యాన్ని పాటించము, మేము ఆజ్ఞ విన్నాము, దానికి విధేయులమయ్యాము, స్వామీ మేము క్షమాభిక్షను అర్ధిస్తున్నాము, మరి మేము నీ వైపునకే మరలవలసినవారము). (సూ. బఖర 2: 285).

సహీ ముస్లింలో ఉంది: అమీరుల్‌ మోమినీన్‌ హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: జిబ్రీల్‌ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో విశ్వాసం (ఈమాన్‌) అంటేమిటి అని అడిగాడు. దానికి ప్రవక్త ఇలా జవాబిచ్చారు: “విశ్వాసం అంటే నీవు (1) అల్లాహ్‌ను, ఆయన (2) దూతలను, ఆయన (3) గ్రంథాలను, ఆయన (4) ప్రవక్తలను, (5) పరలోకదినాన్ని మరియు (6) మంచి చెడు అదృష్టాన్ని విశ్వసించుట”. (ముస్లిం 8).

ఈ ఆరు విషయాలే సత్యవిశ్వాసం యొక్క మూలసూత్రాలు. వీటిని తీసుకొని ఖుర్‌ఆను అవతరించింది. ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. వీటినే విశ్వాస మూల సూత్రాలు (అర్కానె ఈమాన్‌) అంటారు. వీటి వివరణ క్రింద చదవండి:

1- అల్లాహ్‌ పై విశ్వాసం:

అంటే: ఉలూహియత్‌, రుబూబియత్‌ మరియు అస్మా వ సిఫాత్‌ లో అల్లాహ్‌ అద్వితీయుడని విశ్వసించాలి. అల్లాహ్‌ పై విశ్వాసంలో ఈ క్రింది విషయాలు కూడా వచ్చును.

అల్లాహ్‌ యే వాస్తవ ఆరాధ్యుడు, సర్వ ఆరాధనలకు అర్హుడు. ఆయన గాక వేరే లేదా ఆయనతో పాటు మరొకడు ఏ మాత్రం అర్హుడు కాడు. ఎందుకనగా మానవుల సృష్టికర్త, వారికి మేలు చేయువాడు, వారికి ఆహారం నొసంగువాడు, వారి రహస్య బహిరంగ విషయాలన్నీ తెలిసినవాడు, పుణ్యాత్ములకు సత్ఫలితం మరియు పాపాత్ములను శిక్షించు శక్తిగలవాడు ఆయన మాత్రమే.

ఈ ఆరాధన యొక్క వాస్తవికత ఏమిటంటేః సర్వ ఆరాధనలు వినయ నమ్రతలతో, ఆయన ఔన్నత్యాల ముందు హీనభావంతో, పూర్తి ప్రేమతో, కంపిస్తూ, కారుణ్యాశలతో అద్వితీయుడైన అల్హాహ్‌కే ప్రత్యేకించి చేయాలి. ఈ గొప్ప మౌలిక విషయంతోనే ఖుర్‌ఆన్‌ అవతరించింది. అల్లాహ్‌ ఆదేశం సూర జుమర్‌ 39: 2,3లో చదవండి:

فَاعْبُدِ اللَّهَ مُخْلِصًا لَّهُ الدِّينَ أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ

(కనుక నీవు ధర్మాన్ని అల్లాహ్‌ కే ప్రత్యేకిస్తూ, అల్లాహ్‌ కు మాత్రమే దాస్యం చెయ్యి. జాగ్రత్త ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్‌ కు చెందిన హక్కు మాత్రమే).

మరో ఆదేశం:

وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ

(మీరు ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి అని మీ ప్రభువు నిర్ణయం చేశాడు). (బనీ ఇస్రాఈల్‌ 17:23). మరో ఆదేశం మోమిన్‌ 40:14లో

فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

(అల్లాహ్‌ ను మాత్రమే వేడుకోండి. మీ ధర్మాన్ని ఆయనకై ప్రత్యేకించుకొని. మీరు చేసే ఈ పని అవిశ్వానులకు ఎంత అయిష్టంగా ఉన్నాసరే).

అరాధన యొక్క రకాలు అనేకమున్నాయి, అందులో కొన్ని ఇవి: దుఆ (ప్రార్ధన, వేడుకోలు), ఖౌఫ్‌ (భయం), రజా (ఆశ), తవక్కుల్‌ (నమ్మకం), రగ్బత్ (ఆసక్తి), రహబ్‌ (మహాభీతి), ఖుషూ (నమ్రత), ఖషియత్‌ (గౌరవభావంతో భీతి), ఇనాబత్‌ (మరలుట), ఇస్తిఆనత్‌ (సహాయం అర్థించుట), ఇస్తిఆజ (శరణు కోరుట), ఇస్తిఘాస (మొరపెట్టు కొనుట), జిబహ్‌ (బలిదానం), నజ్‌ర్‌ (మొక్కుబడి) తదితర ఆరాధన రకాలు. ఇవన్నియూ అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు చేయుట యోగ్యం లేదు. అలా చేయుట షిర్క్‌ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (సత్యతిరస్కారం)లో పరిగణించబడుతుంది.

2- అల్లాహ్‌ దూతలపై విశ్వాసం:

ఒక ముస్లిం సంక్షిప్త రూపంలో అల్లాహ్‌ దూతలను గురించి ఇలా విశ్వసించాలి: వారిని అల్లాహ్‌ పుట్టించాడు. వారి స్వభావం లోనే విధేయత వ్రాసాడు. వారిలో అనేకానేక రకాలు గలవు. ‘అర్ష్‌ (అల్లాహ్‌ సింహాసనము)ను మోసేవారు, స్వర్గనరక భటులు, మానవుల కర్మములను భద్రపరుచువారు. అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి పేర్లతో సహా ఏ వివరం తెలిపారో అలాగే వారిని విశ్వసించాలి. ఉదా: జిబ్రీల్‌, మీకాఈల్‌, నరక పాలకుడు మాలిక్‌, శంకు ఊదే బాధ్యత కలిగి ఉన్న ఇస్రాఫీల్‌. అల్లాహ్‌ వారిని కాంతితో పుట్టించాడు. ప్రవక్త సల్లల్హాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని, ఆయిషా (రది అల్లాహు అన్హా) ఉల్లేఖించారు:

pillars of iman angels

“అల్లాహ్‌ దూతలు నూర్‌ (కాంతి)తో వుట్టించబడ్డారు. జిన్నాతులు అగ్నిజ్వాలలతో మరియు ఆదము ముందే మీకు ప్రస్తావించ బడిన దానితో (మట్టితో) వుట్టించబడ్డారు”. (ముస్లిం 2996).

3- గ్రంథములపై విశ్వాసం:

గ్రంథములపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించుట విధిగా ఉంది: ప్రవక్తలు తమ తమ జాతులకు ధర్మం బోధించుటకు, వారిని దాని వైపునకు పిలుచుటకు అల్లాహ్‌ వారిపై (ప్రవక్తలపై) గ్రంథాల్ని అవతరింపజేశాడు. అల్లాహ్‌ ఏ గ్రంథముల పేరుతో సహా తెలిపాడో వాటిని వివరంగా విశ్వసించాలి. ఉదా: ప్రవక్త మూసా అలైహిస్సలాంపై ‘తౌరాత్‌‘, ప్రవక్త దావూద్‌ అలైహిస్సలాంపై ‘జబూర్‌‘, ప్రవక్త యేసు మసీహ్ అలైహిస్సలాంపై ‘ఇంజీల్‌‘ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ సల్హాహు అలైహి వసల్లంపై ‘దివ్య ఖుర్‌ఆన్‌‘లు అవతరించాయి. అన్నిట్లో ఖుర్‌ఆన్‌ అతిగొప్పది మరియు చిట్టచివరిది. అది పూర్వ గ్రంథాలను రుజువు పరుచునది మరియు పరిరక్షించునది. దానిని అనుసరించుట, దాని ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా తీర్పులు చేయుట తప్పనిసరి. ఎందుకనగా అల్లాహ్‌, ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఇరుజాతుల వైపునకు ప్రవక్తగా పంపాడు. ఆయనపై ఈ దివ్య ఖుర్‌ఆనును అవతరింపజేశాడు, ఆయన (ప్రవక్త) దాని ద్వారా వారి మధ్య తీర్పు చేయుటకు. ఇంక దానిని హృదయ వ్యాధులకు స్వస్థతగా చేశాడు. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఇంకా అది సర్వ లోకాల కొరకు సన్మార్గం, కారుణ్యం. అల్లాహ్‌ ఆదేశాలు చదవండి:

وَهَٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ

(మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఇది శుభాలుకల గ్రంథం. కావున మీరు దీనిని అనుసరించండి. భయభక్తుల వైఖరిని అవలంబించండి. మీరు కరుణింపబడటం సాధ్యం కావచ్చు). (సూరె అన్‌ఆమ్‌ 6: 155).

وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ

(మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింవజేశాము. అది ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరిస్తుంది. విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త). (సూరె నహ్ల్ 16: 89).

4- ప్రవక్తలపై విశ్వాసం:

ప్రవక్తలపై సంక్షిప్తంగా ఇలా విశ్వసించాలి: అల్లాహ్‌ తన దాసుల వైపునకు ప్రవక్తల్ని శుభవార్తనిచ్చువారిగా, హెచ్చరించువారిగా, ధర్మం వైపునకు పిలుచువారిగా జేసి పంపాడు.

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ

(మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘అల్లాహ్‌ ను ఆరాధించండి. మిథ్యా దైవాల ఆరాధనకు దూరంగా ఉండండి’). (సూరె నహ్ల్‌ 16: 36).

ప్రవక్తల్ని విశ్వసించినవారే సాఫల్యం పొందువారు. వారిని తిరస్కరించినవారే నష్టం, అవమానం పాలయ్యేవారు.

ప్రవక్తలందరి పిలుపు ఒక్కటేనని మనం విశ్నసించాలి. అది అల్లాహ్‌ ఏకత్వం మరియు సర్వ ఆరాధనల్లో ఆయన్ని అద్వితీయునిగా నమ్మటం. అయితే వారికి నొసంగబడిన ధర్మశాస్త్రాలు, ఆదేశాలు, శాసనాలు వేరు వేరు. అల్లాహ్‌ కొందరికి మరి కొందరిపై ఘనత ప్రసాదించాడు. అందరిలోకెల్లా గొప్ప ఘనతగల మరియు చిట్టచివరి, అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ స సల్లల్లాహు అలైహి వసల్లం. చదవండి అల్లాహ్ ఆదేశాలు:

وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَىٰ بَعْضٍ

(మేము కొందరు ప్రవక్తలకు మరికొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము). (సూరె బనీ ఇస్రాఈల్‌ 17: 55). మరో చోట ఆదేశించాడు;

مَّا كَانَ مُحَمَّدٌ أَبَا أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ

((మానవులారా) ముహమ్మద్‌ మీలోని ఏ వురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్‌ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు). (అహ్‌ జాబ్‌ 33: 40).

ఇక ఏ ప్రవక్తల పేర్తతో సహా అల్లాహ్‌ లేక ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వారిని అదే వివరంగా విశ్వసించాలి. ఉదా: నూహ్‌, హూద్‌, సాలిహ్‌, ఇబ్రాహీం, వగైరా ప్రవక్తలు. అల్లాహ్‌ వారందరిపై అనేకానేక దయాకరుణా మేఘాలు కురిపించుగాకా! ఆమీన్‌.

5- పరలోక విశ్వాసం:

అల్లాహ్‌, ఆయన ప్రవక్త సల్లల్హ్లాహు అలైహి వసల్లం మరణానంతరం సంభవించే ఏ ఏ విషయాల గురించి తెలిపారో అవన్నీ ఇందులోనే వస్తాయి. ఉదా: సమాధి యాతన, పరీక్షలు, శుభాలు, ప్రళయ దినం నాటి ఘోర సంఘటనలు, వంతెన, త్రాసు, లెక్క, ప్రతి కర్మ యొక్క ఫలితం, కర్మ పత్రాలు ప్రజల ముందు తెరువబడుట, వారు దాన్ని కుడి లేక ఎడమ చేతితో లేక వీపు వెనక నుంచి తీసుకొనుట, ఇంకా ప్రవక్త ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంకు లభించే హౌజె కౌసర్‌, స్వర్గం, నరకం, విశ్వాసులకు అల్లాహ్‌ దర్శనం, సంభాషణ. ఇంకా ఖుర్‌ఆను మరియు సహీ హదీసుల్లో వచ్చిన విషయాలన్నిటినీ విశ్వసించాలి. అవి అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త తెలిపిన ప్రకారమే సంభవించునని నమ్మాలి.

6- మంచి, చెడు ‘ తఖ్దీర్’ (అదృష్టం)పై విశ్వాసం:

‘తఖ్దీర్‌’ పై విశ్వాసంలో నాలుగు విషయాలు వస్తాయి:

మొదటిది: భూతకాలములో జరిగినది, భవిష్యత్తులో జరగబోయేది సర్వమూ తెలిసినవాడు అల్లాహ్‌. తన దాసుల పరిస్థితులు సయితం ఆయనకు తెలుసు. ఇంకా వారి జీవనోపాయం, వారి చావు, వారు చేసే కర్మలన్నియూ ఎరిగినవాడు ఆయనే. ఆ పరమ పవిత్రునికి వారి ఏ విషయమూ మరుగుగా లేదు.

إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

(నిశ్చయముగా అల్లాహ్‌ కు సర్వమూ తెలియును). (సూరె తౌబా 9: 115).

రెండవది: ఆయన సృష్టిలో ఉన్న ప్రతీ దాని అదృష్టాన్ని వ్రాసి పెట్టాడు.

وَكُلَّ شَيْءٍ أَحْصَيْنَاهُ فِي إِمَامٍ مُّبِينٍ

(ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసి పెట్టాము). (సూరె యాసీన్‌ 36: 12).

మూడవది: ప్రతి విషయం అల్లాహ్ ఇష్టముపై ఆధారపడి యుంది. ఆయన తలచినది తక్షణమే అవుతుంది. తలచనిది కానే కాదు అని విశ్వసించాలి. సూర ఆలి ఇమ్రాన్‌ (3:40)లో ఉంది:

كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ

(అలానే అవుతుంది. అల్లాహ్‌ తాను కోరినదానిని చేస్తాడు).

నాల్గవది: అల్లాహ్‌ దేని తఖ్దీర్‌ నిర్ణయించాడో అది సంభవించక ముందే దానిని పుట్టించి ఉన్నాడు.

وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ

(వాస్తవానికి అల్లాహ్‌ యే మిమ్మల్నీ మీరు చేసిన వాటినీ సృష్టించాడు). (సూరె సాఫ్ఫాత్‌ 37: 96).


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

విశ్వాస మూల సూత్రాలు: రెండవ పాఠం – రెండు సాక్ష్యాల భావం [వీడియో]

బిస్మిల్లాహ్

[34 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.


కలిమయె తౌహీద్‌: లాఇలాహ ఇల్లల్లాహ్‌ యొక్క భావం

లాఇలాహ ఇల్లల్లాహ్‌, ఇస్లాం యొక్క పునాది. ఇస్లాంలో దాని స్థానం చాలా గొప్పది. అది ఇస్లాం స్థంబాలలో మొదటిది. విశ్వాస భాగాలలో ఉన్నత భాగం. మరియు సత్కార్యాల అంగీకారము ఆ వచనాన్ని హృదయ పూర్వకంగా పఠించి దాని అర్దాన్ని తెలుసుకొని, దాని ప్రకారం ఆచరించడంపైనే ఆధారపడి ఉంది.

దాని వాస్తవ అర్థం: “వాస్తవంగా అల్లాహ్‌ తప్ప వేరెవరు ఆరాధనలకు అర్హులు కారు“. ఇదే సరియైన అర్థం. ఇది కాక ‘అల్లాహ్‌ తప్ప సృష్టికర్త ఎవడు లేడు’, ‘అల్లాహ్‌ తప్ప శూన్యము నుండి ఉనికిలోకి తెచ్చే శక్తి గలవాడెవడు లేడు’ లేక ‘విశ్వంలో అల్లాహ్‌ తప్ప మరేమి లేదు’ అనే భావాలు (లాఇలాహ ఇల్లల్లాహ్‌ యొక్క అర్థం) కావు.

ఈ పవిత్ర వచనములో రెండు విషయాలు (రుకున్‌ లు) ఉన్నాయి:

(1) నిరాకరించుట, ఇది ‘లాఇలాహ‘ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్‌ (ఈశ్వరత్వాన్ని, ఆరాధన అర్హతను) ప్రతి వస్తువు నుండి నిరాకరించుట.

(2) అంగీకరించుట, ఇది ‘ఇల్లల్లాహ్‌‘ అన్న పదంలో ఉంది. అనగా ఉలూహియ్యత్‌ (ఆరాధనల)కు అర్హత గల అద్వితీయుడు అల్లాహ్‌ మాత్రమేనని, ఆయనకు భాగస్వాముడెవడు లేడని నమ్ముట.

అల్లాహ్‌ తప్ప మరెవ్వరి ఆరాధన, ప్రార్థన చేయరాదు. ఆరాధన లోని ఏ ఒక్క భాగాన్ని కూడా అల్లాహ్‌ తప్ప ఇతరులకు చేయుట యోగ్యం లేదు.

ఏ వ్యక్తి ‘లాఇలాహ ఇల్లల్లాహ్‌‘ యొక్క ఈ వాస్తవ భావాన్ని తెలుసుకొని దాన్ని పఠిస్తాడో, దాని ప్రకారం ఆచరిస్తాడో మరియు దృఢ విశ్వాసముతో బహుదైవారాధనను తిరస్కరించి, అల్లాహ్‌ ఏకత్వమును విశ్వసిస్తాడో అతడే వాస్తవ ముస్లిం (విధేయుడు). ఇలాంటి విశ్వాసముంచకుండా ఆచరించువాడు మునాఫిఖ్‌ (కపటవిశ్వాసి, వంచకుడు). మరియు దీనికి వ్యతిరేకంగా ఆచరించువాడు అది అతను నోటితో పలికినా ముష్రిక్ (బహుదైవారాధకుడు), కాఫిర్‌ (సత్యతిరస్కారి) అవుతాడు.

లాఇలాహ ఇల్లల్లాహ్‌ ఘనత:

ఈ పవిత్ర వచన ఘనతలు, లాభాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని క్రింద తెలుపబడుతున్నని.

1- తౌహీద్‌ గల వ్యక్తి నరక శిక్షకు గురి అయినా, అతను అందులో శాశ్వతంగా ఉండకుండా లాఇలాహ ఇల్లల్లాహ్‌ అడ్డుపడుతుంది. ప్రవక్త సల్లల్హాహు అలైహి వసల్లం చెప్పారు:

లాఇలాహ ఇల్లల్లాహ్‌ ఘనత

“లాఇలాహ ఇల్లల్లాహ్‌ పఠించిన వక్తి హృదయంలో జొన్న గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. ఏ వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్‌ చదివాడో అతని హృదయంలో గోదుమ గింజంత విశ్వాసమున్నా నరకం నుండి వెలికి వస్తాడు. అలాగే ఎవరు లాఇలాహ ఇల్లల్లాహ్‌ చదివాడో అతని మనుస్సులో ఇసుమంత / రవ్వంత విశ్వాసమున్నా అతనూ నరకం నుండి వెలికి వస్తాడు”. (బుఖారి 44, ముస్లిం 193).

2- మానవులు, జిన్నాతులు దీని (లాఇలాహ ఇల్లల్లాహ్‌) కొరకే పుట్టించ బడ్డారు. సూరా జారియాత్‌ (51: 56)లో అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

(నేను మానవులను జిన్నాతులను నన్ను ఆరాధించుటకే సృష్టించాను).

పై ఆయతులో ‘యఅ౯ బుదూన్‌‘ అన్న పదానికి అర్థం ఆరాధించుట, అంటే ఆరాధనలో అల్లాహ్‌ ఏకత్వాన్ని పాటించుట.

3- ప్రవక్తలను పంపబడింది, గ్రంథాలను అవతరింప జేయబడింది దీని ప్రచారం కొరకే. అల్లాహ్‌ ఆదేశంపై శ్రద్ధ వహించండి:

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ

(నీకు పూర్వం మేము ప్రతి ప్రవక్తకు ‘నేను తప్ప వేరు ఆరాధింపదగిన దేవుడు లేడు, కావున నన్నే ఆరాధించండి’ అని సందేశం పంపియున్నాము). (అంబియా 21: 25).

4- ప్రవక్తల ప్రచార ఆరంభం ఇదే (లాఇలాహ ఇల్లల్లాహ్‌). ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఇదే పిలుపునిచ్చాడు. చదవండి అల్లాహ్‌ ఆదేశం:

يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ

(మీరు అల్లాహ్‌ నే ఆరాధించండి. ఆయన తప్ప వేరు దేవుడు మీకు లేడు). (సూరయే ఆరాఫ్‌ 7: 73).

లాఇలాహ ఇల్లల్లాహ్‌ యొక్క నిబంధనలు:

ఈ పవిత్ర వచనం యొక్క నిబంధనలు ఏడున్నాయి. ఏ కొరత లేకుండా వాటన్నిటినీ పాటిస్తేనే వాస్తవంగా లాఇలాహ ఇల్లల్లాహ్‌ పఠించినట్లు.


1- ఇల్మ్‌ (జ్ఞానం): పవిత్ర వచనము యొక్క వాస్తవ భావ జ్ఞానం. అనగా (పైన తెలిపిన ప్రకారం) అనంగీకారం, అంగీకారం మరియు దాని ప్రకారం ఆచరించుట. ‘అల్లాహ్‌ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు, ఇతరుల ఆరాధన వ్యర్థము, తుచ్చము‘ అని తెలుసుకొని దాని ప్రకారంగా ఆచరించిన మానవుడే వాస్తవంగా దాని భావాన్ని తెలుసుకున్న జ్ఞాని.

అల్లాహ్‌ ఆదేశం:

conditions-of-laa-ilaaha-illahllaah

(తెలుసుకో! అల్లాహ్‌ తప్ప వేరు ఆరాధింపదగిన వాడెవడు లేడు అని)
(ముహమ్మద్‌ 47: 19).

ఇంకా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారుః

conditions-of-laa-ilaaha-illahllaah

‘వాస్తవ ఆరాధ్యుడు ఎవడూ లేడు, కేవలం ఒక్క అల్లాహ్‌ తప్ప’ అని తెలుసుకొని మరణించిన వారు స్వర్గములో చేరుదురు“. (ముస్లిం 26).


2- యఖీన్‌ (నమ్మకం): మనశ్శాంతి కలిగే పూర్తి నమ్మకము మరియు మనుష్యులలో, జిన్నాతులలోగల షైతానులు కలుగ జేసే అనుమానాల్లో పడకుండా గాఢ విశ్వాసముతో ఈ పవిత్ర వచనం పఠించాలి.

సూర హుజురాత్‌ (49: 15)లో అల్లాహ్‌ ఆదేశం:

إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَرَسُولِهِ ثُمَّ لَمْ يَرْتَابُوا

(ఎవరు అల్లాహ్‌ యందు ఆయన ప్రవక్తల యందు విశ్వాసము కలిగిన పిదప సందేహములు వహింపరో వారే విశ్వాసులు).

conditions-of-laa-ilaaha-illallaah

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారని అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్‌ తప్ప సత్య ఆరాధ్యుడెవడూ  లేడని మరియు నేను అల్లాహ్‌ ప్రవక్తనని సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరు ఏలాంటి సందేహం లేకుండా ఈ రెండు విషయాలతో (సాక్ష్యాలతో) అల్లాహ్‌ ను కలుసుకుంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు“. (ముస్లిం 27).


3- ఖుబూల్‌ (సమ్మతించుట): ఈ పవిత్ర వచనం ద్వారా రుజువయ్యే విషయాలన్నిటినీ మనసావాచా సమ్మతించాలి. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తెలిపిన విషయాల్ని సత్యంగా నమ్మాలి. ఆయన తెచ్చిన ప్రతి దానిని విశ్వసించాలి, సమ్మతించాలి. అందులో ఏ ఒక్క దానిని విస్మరించకూడదు.

అల్లాహ్‌ ఇదే ఆదేశమిచ్చాడు:

آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

[ప్రవక్త తన ప్రభువు నుండి తనకు నొసంగబడిన గ్రంథమును విశ్వసించారు. విశ్వాసులు కూడా విశ్వసించారు. అందరు అల్లాహ్‌ను, అతని దూతలను, గ్రంథములను, ప్రవక్తలను విశ్వసిస్తూ ‘మేము ఆయన ప్రవక్తల మధ్య వ్యత్యాసము పాటించము, మేము వింటిమి విధేయులైతిమి, మా ప్రభువా! నీ మన్నింవును వేడుకొను చున్నాము, నీ వద్దకే మరలి వచ్చువారలము’ అని అంటారు]. (బఖర 2: 285).

ధర్మ శాసనాలను, హద్దులను ఆక్షేపించుట, లేక వాటిని నమ్మకపోవుట సమ్మతమునకు వ్యతిరేకం. ఉదాహరణకు: కొందరు దొంగ మరియు వ్యబిచారునిపై విధించిన హద్దులను లేక బహుభార్యత్వం, ఆస్తుల పంపకం లాంటి తదితర విషయాలను ఆక్షేపిస్తారు. (అయితే ఇలాంటి వారు అల్లాహ్‌ యొక్క ఈ ఆదేశం వినలేదా, చదవలేదా?)

وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى اللَّهُ وَرَسُولُهُ أَمْرًا أَن يَكُونَ لَهُمُ الْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ

(అల్లాహ్‌, ఆయన ప్రవక్త ఏ విషయములోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికి, విశ్వాసురాలైన ఏ స్త్రీకి, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీనుకునే హక్కు లేదు). (అహ్‌ జాబ్‌ 33: 36).


4- ఇన్‌ఖియాద్‌ (లొంగిపోవుట, శిరసావహించుట): పవిత్ర వచనం యొక్క అర్థభావాల పట్ల శిరసావహించాలి. ఇన్‌ ఖియాద్‌ మరియు ఖబూల్‌ లో తేడా ఏమనగా? ఖబూల్‌ అంటే నోటితో దాని భావాన్ని సమ్మతించుట. ఇన్‌ఖియాద్‌ అంటే సమ్మతంతో పాటు దాన్ని ఆచరణ రూపంలో తీసుకు వచ్చుట. ఒక వ్యక్తి లాఇలాహ ఇల్లల్లాహ్‌ అర్థభావాన్ని తెలుసుకొని, దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి, దాన్ని సమ్మతించినప్పటికీ దానికి లొంగిపోయి, శిరసావహించి, దాని ప్రకారం ఆచరించకపోయినట్లైతే  అతను ఇన్‌ఖియాద్‌ యొక్క నిబంధన పాటించనట్లే.

అల్లాహ్‌ ఇలా సంభోదించాడు:

وَأَنِيبُوا إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا لَهُ

మీరు మీ ప్రభువు వైెవునుకు మరలి ఆయనకే విధేయత చూపండి. (జుమర్‌ 39: 54).

మరో చోట (నిసా 4: 65) లో ఇలా ఆదేశించాడు:

فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا

(నీ ప్రభువు సాక్షిగా! వారు తమలోని జగడముల తీర్పునకై నిన్ను న్యాయ నిర్ణేతగా మరియు నీవు చేయు తీర్పును గూర్చి వారుతమ మనున్సులో సంకట పడక సంతోషముతో అంగీకరించనంత వరకు వారు విశ్వాసులు కారు).


5- సిద్ఖ్ : (సత్యత): మనిషి తన విశ్వాసములో సత్యవంతుడై యుండాలి.

సూర తౌబా (9:119)లో అల్లాహ్‌ ఆదేశం:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ

(ఓ విశ్వాసులారా! అల్లాహ్‌ కు భయపడండి. సత్యవంతులతో ఉండండి).

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారు:

conditions-of-laa-ilaaha-illallaah

హృదయాంతర సత్యముతో ‘లాఇలాహ ఇల్లల్లాహ్‌’ పఠించినవారు స్వర్గంలో చేరుదురు”. (ముస్నద్ అహ్మద్ ).

ఎవరైనా ఈ పవిత్ర వచనం కేవలం నోటితో పలికి, దాని భావర్ధాలను మనస్ఫూర్తిగా నమ్మకుండా ఉన్నట్లయితే అతనికి ముక్తి ప్రాప్తించదు. అతడు కపట విశ్వాసులలో పరిగణించబడుతాడు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీసుకువచ్చిన వాటన్నిటిని లేదా కొన్నిటిని తిరస్కరించడం కూడా సత్యతకు వ్యతిరేకంలోనే వస్తుంది. ఎందుకనగా మనము ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)కు విధేయులై ఉండాలని, ఆయన మాటల్ని సత్యంగా నమ్మాలని అల్లాహ్‌ ఆదేశించాడు, అంతే కాదు, ఆయన విధేయతను తన విధేయతతో కలిపి చెప్పాడు.

సూర నూర్‌ (24: 54)లో ఉంది:

 أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ

(అల్లాహ్‌ కు విధేయులు కండి, అల్లాహ్‌ ప్రవక్తకు విధేయులు కండి).


6- ఇఖ్లాస్‌: మనిషి తను చేసే ప్రతి పనిని సంకల్పపరంగా షిర్క్‌ దరిదాపులకు అతీతంగా ఉంచుటయే ఇఖ్లాస్‌, అంటే సర్వ పనులు, మాటలు కేవలం అల్లాహ్‌ సంతృప్తి కొరకు, ఆయన ప్రసన్నత పొందుటకే చేయాలి. అందులో ఏ మాత్రం ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల కాంక్ష, ప్రాపంచిక లాభోద్దేశ్యం, స్వార్థం ఉండకూడదు. ఇంకా ఆ పని అల్లాహ్‌ యేతరుని ప్రేమలో, అల్లాహ్‌ మార్గానికి విరుద్ధంగా ధార్మిక లేదా తర వర్గాల పక్షంలో ఉండకూడదు. కేవలం అల్లాహ్‌ అభిష్టాన్ని మరియు పరలోక సాఫల్యాన్ని పొందుట కొరకే చేయాలి. ఎవరి నుండైనా ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలనుగానీ ఆశిస్తూ వారి వైపునకు మనుసు మరలకూడదు.

సూర జుమర్‌ (39: ౩)లో ఉంది:

أَلَا لِلَّهِ الدِّينُ الْخَالِصُ

(నిస్సందేహంగా, ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే) 

وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ

(వారు అల్లాహ్‌కు దాస్యం చేయాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆదేశించటం జరిగింది). (బయ్యిన 98: 5).

conditions-of-laa-ilaaha-illallaah

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఉపదేశించారని ఇత్బాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: “అల్లాహ్‌ అభీష్టాన్ని పొందుటకు ‘లాఇలాహ ఇల్లల్లాహ్‌’ చదివిన వారిపై నిశ్చయంగా అల్లాహ్‌ నరకమును నిషేధించాడు“. (బుఖారి 425, మస్లిం 33).


7- ముహబ్బత్‌ (ప్రేమ): ఈ పవిత్ర వచనము మరియు దీనికి సంబంధించిన వాటి ప్రేమ.

ముస్లిం అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించాలి, వారిద్దరి ప్రేమ అందరి ప్రేమకు మించియుండాలి. ప్రేమకు సంబంధించిన షరతులు వగైరా పూర్తిగా పాటించాలి. అల్లాహ్‌ను మరియు అల్లాహ్‌ ప్రేమించువాటిని గౌరవభావంతో, భయం మరియు ఆశలతో ప్రేమించాలి. ఉదా: స్థలాల్లో మక్కా, మదీన, మస్దిదులు. కాలాల్లో: రమజాను, జిల్‌ హిజ్జ మొదటిదశ వగైరా. మానవుల్లో: ప్రవక్తలు, దూతలు, సత్యవంతులు, అమరవీరులు, పుణ్యాత్ములు వగైరా. సత్కార్యాల్లో: నమాజు, జకాతు, ఉపవాసం (రోజా), హజ్జ్. వాచ సంబంధమైన: జిక్ర్ (అల్లాహ్‌ స్మరణ), ఖుర్‌ఆన్‌ పారాయణం వగైరాలు.

మనిషి అల్లాహ్‌ ప్రేమించువాటిని తన మనుసు, కోరికలు ప్రేమించే వాటిపై ఆధిక్యతివ్వాలి. ఇంకా అల్లాహ్‌ అసహ్యించుకునేవాటిని అసహ్యించుకోవాలి: అవిశ్వాసులను, అవిశ్వాసాన్ని, పాపాల్ని (అస్లీలతల్ని), అవిధేయతలను అసహ్యించుకోవాలి.

అల్లాహ్‌ ఆదేశం:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا مَن يَرْتَدَّ مِنكُمْ عَن دِينِهِ فَسَوْفَ يَأْتِي اللَّهُ بِقَوْمٍ يُحِبُّهُمْ وَيُحِبُّونَهُ أَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِينَ أَعِزَّةٍ عَلَى الْكَافِرِينَ يُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَخَافُونَ لَوْمَةَ لَائِمٍ

(ఓ విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలిగిపోతే, అల్లాహ్‌ ఇంకా ఎంతో మందిని సృష్టిస్తాడు. అల్లాహ్‌ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్‌ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగానూ, అవిశ్వాసుల పట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్‌ మార్గంలో యుద్దం చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు). (మాఇద 5: 54).


‘ముహమ్మదుర్రసూలుల్లాహ్‌’ భావం:

మనోవాక్కుల ద్వారా ఆయన అల్లాహ్‌ దాసుడు మరియు సర్వ మానవాళికి అల్లాహ్‌ ప్రవక్త అని విశ్వసించాలి. దాని ప్రకారం ఆచరించాలి, అంటే:

  • (1) ఆయన ఆదేశాల పట్ల విధేయత చూపాలి,
  • (2) ఆయన తెలిపిన విషయాలన్ని సత్యం అని నమ్మాలి,
  • (3) నిషేధించిన, ఖండించిన వాటికి దూరంగా ఉండాలి,
  • (4) ఆయన చూపించిన విధంగానే అల్లాహ్‌ ను ఆరాధించాలి.

‘ముహమ్మదుర్రసూలుల్లాహ్‌’ సాక్ష్యం పలికినప్పుడు అందులో ఉన్న రెండు మూల విషయాల్ని (రుకున్‌ లను) గ్రహించాలి. అవి: ‘అబ్దుహు వ రసూలుహు‘. ఈ రెండు రుకున్లు ఆయన హక్కులో హెచ్చు తగ్గులు చేయుట నుండి కాపాడతాయి. ఆయన ‘అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త‘. ఈ రెండు ఉత్తమ గుణాల ద్వారా ఆయన సర్వ మానవాళిలో గొప్ప ప్రావీణ్యత గలవారు. ఇక్కడ ‘అబ్ద్‘ యొక్క అర్ధం దాసుడు, ఉపాసకుడు అని. అంటే ఆయన మనిషి, ఇతర మనుషులు ఎలా పుట్టారో ఆయన కూడా అలాగే పుట్టారు. మానవులకు ఉన్నటువంటి అవసరాలే ఆయనకు ఉండేవి. సూర కహ్‌ఫ్‌ (18:110)లో అల్లాహ్‌ ఆదేశం:

قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِّثْلُكُمْ

(ప్రవక్తా ఇలా చెప్పు: నేను కేవలం ఒక మానవుణ్ణి. మీలాంటి వాణ్ణి).

ఇదే సూరా మొదటి ఆయతులో ఇలా ఉంది:

الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنزَلَ عَلَىٰ عَبْدِهِ الْكِتَابَ

(అల్లాహ్‌ మాత్రమే స్తుతింపదగినవాడు, ఆయన తమ దాసునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ).

రసూల్‌‘ అనగా ఆయన సర్వ మానవాళి వైపునకు శుభవార్తనిచ్చు, హెచ్చరించు ప్రవక్త అని అర్థం. (దీనికి సంబంధించిన ఆధారాలు ఖుర్‌ఆనులో చాలా ఉన్నాయి. చూడండి సూర సబా (34:28), సూర అంబియా (21:107).

ఈ రెండు ఉత్తమ గుణాలు (రుకున్లు) ఆయన పట్ల అతిశయోక్తి (హెచ్చు) మరియు అమర్యాద (తగ్గు)ల నుండి కాపాడతాయి. ఎలా అనగా ఆయన అనుచరులు అని చెప్పుకునే కొందరు ఈ రోజుల్లో ఆయన స్థానాన్ని, హక్కును అర్థం చేసుకోక అతిశయమించి ఆయన్ని అల్లాహ్‌తో సమానంగా పోలుస్తున్నారు. అల్లాహ్‌ను వదలి ఆయనతో మొరపెడుతున్నారు. అవసరాలు తీర్చడం, కష్టాలు తొలగించడం లాంటి అల్లాహ్‌ శక్తిలో మాత్రమే ఉన్న వాటిని ఆయనతో కొరుతున్నారు. మరి కొందరు ఆయన గౌరవ మర్యాదలకు విరుద్ధంగా ఆయన్ను ప్రవక్తగా నమ్మడం లేదు. లేదా ఆయన అనుకరణలో కొరత చూపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన విషయాలకు వ్యతిరేకమైన వాటిని నమ్ముతున్నారు. ఇతరుల మాటలను ఆయన సున్నతల కంటే ప్రాధాన్యతనిస్తున్నారు, ఆయన సున్నతులను ఆచరించకుండా వదులుతున్నారు, ఆయన తీసుకువచ్చిన సత్య మాట/ బాటకు వ్యతిరేకమైన మాట/బాటలపై గుడ్డిగా మొండిపట్టుతో ఉన్నారు.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

విశ్వాస మూల సూత్రాలు: మొదటి పాఠం: తౌహీద్, దాని రకాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[18 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

తౌహీద్‌ దాని రకాలు:

తౌహీద్‌ అంటే విధిగా, అల్లాహ్‌ కు ప్రత్యేకంగా చేయబడే ప్రతి ఇబాదత్‌ (ఆరాధన)లో అల్లాహ్‌ ను అద్వితీయునిగా నమ్మడం. అల్లాహ్‌ ఇచ్చిన ఆదేశాల్లో ఇది చాలా గొప్పది. అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు:

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ

(ఇలా చెప్పండి! ఆయన అల్లాహ్‌, అద్వితీయుడు). (సూరె ఇఖ్లాస్‌ 112:1).

మరోచోట ఇలా సెలవిచ్చాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

(నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే పుట్టించాను). (సూరె జారియాత్‌ 51: 56)

మరో ఆదేశం:

وَاعْبُدُوا اللَّهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا

(కేవలం అల్లాహ్‌నే ఆరాధించండి, ఆయనతో ఎవరినీ సాటి కల్పించ కండి). (సూరె నిసా 4: 36)


తౌహీద్‌ మూడు రకాలు: (1) తౌహీదె రుబూబియత్‌, (2) తౌహీదె ఉలూహియత్‌, (3) తౌహీదె అస్మా వ సిఫాత్‌.

(1) తౌహీదె రుబూబియత్‌:

అంటే: సృష్టి, దాని నిర్వహణలో అద్వితీయుడు అల్లాహ్‌ మాత్రమే. ఆయనే పోషకుడు, జీవన్మరణ ప్రధాత. భూమ్యాకాశాల అధికారం ఆయన చేతిలోనే ఉంది. దీనికి సంబంధించిన నిదర్శనాలు దివ్యగ్రంథం ఖుర్‌ఆనులో చదవండి:

هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّهِ يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ

(ఆకాశము నుండి భూమి నుండి అల్లాహ్‌ తప్ప వేరే సృష్టికర్త మీకు ఆహారము నొసంగువాడు గలడా? ఆయన తప్ప వేరే ఆరాధింపదగిన వాడెవడు లేడు). (ఫాతిర్‌ 35: 3).

تَبَارَكَ الَّذِي بِيَدِهِ الْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

(ఎవని చేతిలో సమస్త లోకపాలన గలదో ఆ అల్లాహ్‌ చాలా శుభాలు గలవాడు, ఆయన సర్వముపై సంపూర్ణ శక్తి గలవాడు). (ముల్క్‌ 67: 1).

అల్లాహ్‌ అధికారం విశ్వమంతటిలో ఉంది. తనిష్టానుసారం అందులో మార్పు చేస్తూ ఉంటాడు. నిర్వహణలో అద్వితీయుడు కూడా కేవలం అల్లాహ్‌ మాత్రమే. సృష్టి కార్యాలు నెరవేర్చువాడు ఆయనే. ఈ ఆయతు చదవండి:

أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ

(వినండి! సృష్టించుట, ఆజ్ఞాపించుట ఆయన పనే. సర్వ లోకములకు పోషకుడగు అల్లాహ్‌ ఎంతో శుభదాయకుడు). (ఆరాఫ్‌ 7: 54).

అతని ఈ నిర్వహణ కార్యక్రమం సర్వసృష్టిలో నడుస్తూ ఉన్నది. తౌహీద్‌ యొక్క ఈ రకాన్ని తిరస్కరించినవారు చాలా అరుదు. వారు బాహ్యంగా తిరస్కరించినా, వారి అంతరాత్మ మటుకు దాన్ని ఒప్పుకుంటుంది. (ఫిర్‌ఔన్‌ వాళ్ళ గురించి) ఈ ఆయతు చదవండి:

وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا

(నిజానికి వారి మనస్సులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దానిని తిరస్కరించారు). (నమ్ల్‌ 27:14).

ఈ ఒక్క రకాన్ని నమ్మినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రవక్త కాలంలోని ముష్రికులు తౌహీదు యొక్క ఈ రకాన్ని నమ్మారు కాని అది వారికి ఏ లాభాన్నివ్వలేదు. ఖుర్‌ఆన్‌ సాక్ష్యం చదవండి:

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ

(భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారని, సూర్య చంద్రుల్ని ఎవరు అదుపులో ఉంచ గలిగారని నీవు అడిగితే, అల్లాహ్‌ యే అని వారు తప్పకుండా అంటారు. అలాంటప్పుడు వారు ఎలా మోనపోతున్నారు?). (అన్‌ కబూత్‌ 29:61)


(2) తౌహీదె ఉలూహియత్‌:

అంటే: ఆరాధనలకు అర్హుడయిన అద్వితీయుడు ఆ పరమ పవిత్రుడు మాత్రమే. పూజ చేయుటకు మరియు సాన్నిధ్యము పొందుటకు ఏ మానవుడూ అల్లాహ్‌ తో మరెవ్వరినీ సాటి కల్పించ కూడదు. తౌహీద్‌ యొక్క మూడు రకాల్లో ఇదే అతిముఖ్య మైనది, గొప్పది. దీని కొరకే అల్లాహ్‌ మానవులను సృష్టించాడు. అల్హాహ్‌ ఆదేశం చదవండి:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

(నేను మానవులను, జిన్నాతులను కేవలం నన్ను ఆరాధించుటకే వుట్టించాను). (జారియాత్‌ 51: 56).

ఈ విషయమే ప్రజలకు క్లుప్తంగా బోధించడానికి అల్లాహ్‌ ప్రవక్తలను పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. దీని సాక్ష్యాధారం దివ్య ఖుర్‌ఆనులో ఇలా ఉంది:

وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ

(మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా ‘నేను తప్ప వేరు పూజ్యుడు లేడు, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి’ అనే విషయాన్ని తెలియజేశాము). (అంబియా 21: 25).

తౌహీద్‌ యొక్క ఈ రకాన్నే బహుదైవరాధకులు తిరస్కరించారు, వారి ప్రవక్తలు ఈ తౌహీద్‌ యొక్క బోధ చేసినప్పుడు. దీనికి ఖుర్‌ఆన్‌ ఇలా సాక్ష్యమిస్తుంది:

قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا

((బహుదైవారాధకులు తమ ప్రవక్తలకు ఇలా జవాబిచ్చారు): నీవు మా వద్దకు రావటానికి కారణం, మేము ఒక్క అల్లాహ్‌ నే ఆరాధించాలనా, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని విసర్జించాలనా?). (ఆరాఫ్‌ 7: 70).

అందుకే ఇబాదత్‌ (ఆరాధన) యొక్క ఏ రకమూ కూడా అల్లాహ్‌ యేతరులకు చేయుట ఎంత మాత్రం సమంజసం కాదు. ఆ అల్లాహ్‌ యేతరులు ఎవరైనా సరే: అతిసన్నిహితులైన దైవదూతలు, ప్రవక్తలు, మహా భక్తులు, సృష్టి రాసుల్లో ఎవ్వరినీ కూడా అల్లాహ్‌ తో సాటి కల్పించకూడదు.


(3) తౌహీదె అస్మా వ సిఫాత్‌:

అంటే: అల్లాహ్‌ స్వయాన తన గురించి మరియు ప్రవక్త అల్లాహ్‌ గురించి ఏ పవిత్ర నామముల, ఉత్తమ గుణముల గురించి తెలిపారో వాటిని అల్లాహ్‌ కు తగిన రీతిలో విశ్వసించాలి. ఏ మాత్రం ‘తహ్‌ రీఫ్‌’,త’తీల్‌’, ‘తక్‌ యీఫ్‌’, ‘తమ్‌ సీల్‌'(1) లేకుండా. ఆయన గుణ నామములను యథార్థంగా నమ్మాలి. యథార్దానికి విరుద్ధంగా కాదు. వేటికి అల్లాహ్‌ అతీతుడని అల్లాహ్‌, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్‌ అతీతుడని నమ్మాలి. “వేటి గురించి అల్లాహ్‌ అర్హుడా, అతీతుడా అని స్పష్టం లేదో వాటిలో మౌనం వహించాలి అంటే వాటికి అల్లాహ్‌ అర్హుడని అనవద్దు అతీతుడనీ అనవద్దు.

1 ‘తహ్‌ రీఫ్‌’ అంటే: ఏ ఆధారము లేకుండా నామగుణాల భావాన్ని మార్చుట. తారుమారు చేయుట. ‘త’తీల్‌’ అంటే: అల్లాహ్‌ గుణనామాలన్నిటిని లేదా కొన్నిటిని తిరస్మరించుట. అల్లాహ్‌ ను నిరాకారునిగా నమ్ముట. ‘తక్‌ యీఫ్‌’ అంటే: అల్లాహ్‌ గుణాలను మాట, ఊహ ద్వారా ఏదైనా ఒక రూపం ఇచ్చే ప్రయత్నం చేయుట. అల్లాహ్‌ చేయి అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అనుట. ‘తమ్‌సీల్‌’ అంటే: అల్లాహ్‌ గుణాలను సృష్టి గుణాలతో పోల్పుట. లేదా సృష్టి గుణాల మాదిరిగా ఉంటాయని విశ్వసించుట.

పవిత్ర నామముల ఉదాహరణ: పవిత్రుడైన అల్లాహ్‌ ‘అల్‌ హయ్య్‌‘ తన నామమని తెలిపాడు. అయితే ‘అల్‌ హయ్య్‌’ అల్లాహ్‌ నామాల్లో ఒకటని నమ్మాలి. ఇంకా ఆ పేరులో ఉన్న భావమును కూడా విశ్వసించాలి. అనగా ఆయన శాశ్వతముగా ఉండువాడు, ఆయనకు ముందు ఎవరు లేరు, తరువాత ఎవరు లేరు. (ఆయన సజీవుడు, నిత్యుడు). అదే విధముగా ‘సమీ‘ ఆయన పేరు, ‘సమ’ (వినుట) ఆయన గుణం అని నమ్మాలి.

గుణముల ఉదాహరణ:

అల్లాహ్‌ ఆదేశం:

وَقَالَتِ الْيَهُودُ يَدُ اللَّهِ مَغْلُولَةٌ ۚ غُلَّتْ أَيْدِيهِمْ وَلُعِنُوا بِمَا قَالُوا ۘ بَلْ يَدَاهُ مَبْسُوطَتَانِ يُنفِقُ كَيْفَ يَشَاءُ

(యూదులు ‘అల్లాహ్‌ చేతులు కట్టుబడినవి’ అని పలుకు చున్నారు. వారి చేతులే కట్టుబడుగాక! వారు పలికిన దానికి వారికి శాపమున్నది. అల్లాహ్‌ చేతులు విచ్చలవిడిగా ఉన్నవి. తాను కోరునట్లు వినియోగ పరుచుచున్నాడు). (మాఇద 5: 64).

పై ఆయతులో అల్లాహ్‌ తనకు రెండు చేతులున్నవని, అవి విచ్చలవిడిగా ఉన్నవని తెలిపాడు. అంటే వాటి ద్వారా తనిష్టాను సారం అనుగ్రహాలు నొసంగుతాడని తెలిపాడు. అయితే అల్లాహ్‌ కు రెండు చేతులున్నాయని, వాటి ద్వారా అనుగ్రహాలు నొసంగుతాడని విశ్వసించడం మనపై విధిగా ఉంది. ఆ చేతులు ఇలా ఉంటాయని మనుసులో ఊహించే, లేదా నోటితో పలుకే ప్రయత్నం కూడా చేయవద్దు. వాటిని మానవుల చేతులతో పోల్చకూడదు. ఎందుకనగా అల్లాహ్‌ సూరె షూరా (42: 11) లో ఇలా ఆదేశించాడు:

لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ

(ఆయనకు పోలినది ఏదిలేదు. మరియు ఆయన వినువాడు, చూచువాడు).

ఈ తౌహీద్‌ యొక్క సారాంశమేమిటంటే: అల్లాహ్‌ తన కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ కొరకు ఏ ఏ నామ గుణాలను తెలిపారో వాటిని నమ్మాలి. వేటికి అల్లాహ్‌ అతీతుడని అల్లాహ్‌, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారో వాటి నుండి అల్లాహ్‌ అతీతుడని నమ్మాలి. అయితే. వాటిని తారుమారు చేయకుండా, ఇతరులతో పోల్చకుండా, నిరాకారునిగా భావించకుండా నమ్మాలి. ఏ గుణనామముల విషయములో, అవి అల్లాహ్‌ కు సంబంధించినవేనా, లేదా అని స్పష్టం లేదో ఆ పదాల భావం లో అల్లాహ్‌ పట్ల అగౌరవం ఉంటే వాటిని ఖండించాలి. వాటి భావం లో ఏలాంటీ దోషం లేకుంటే వాటిని స్వీకరించవచ్చు.


పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: [విశ్వాసము]

అల్లాహ్ పై విశ్వాసం యొక్క లాభాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[ 15 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు: