దైవ విశ్వాసుల మధ్య సహకారం (cooperation among believers)

హదీథ్׃ 01

దైవ విశ్వాసుల మధ్య సహకారం التعاون بين المؤمنين

حدّثنا أَبُو بَكْرِ بْنُ أَبِي شَيْبَةَ و أَبُو عَامِرٍ الأَشْعَرِيُّ . قَالاَ: حَدَّثَنَا عَبْدُ اللّهِ بْنُ إِدْرِيسَ وَ أَبُو أُسَامَةَ وَحَدَّثَنَا مُحَمَّدُ بْنُ الْعَلاَءِ ، أَبُو كُرَيْبٍ . حَدَّثَنَا ابْنُ الْمُبَارَكِ وَ ابْنُ إِدْرِيسَ وَ أَبُو أُسَامَةَ . كُلُّهُمْ عَنْ بُرَيْدٍ عَنْ أَبِي بُرْدَةَ عَنْ أَبِي مُوسَى  قَالَ: قَالَ رَسُولُ اللّهِ ‏صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ *اَلْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ، يَشُدُّ بَعْضُهُ بَعْضاً * ثُمَّ شَبَّكَ بَيْنَ أَصَابِعِهِ رواة صحيح البخاري

హద్దథనా అబూబక్రి అబ్ను అబి షయ్బత వ అబూ ఆమిరిన్ అల్ అష్అరియ్యు ఖాల హద్దథనా అబ్దుల్లాహి అబ్నుఇద్రీస వ అబూ ఉసామత వ హద్దథనా ముహమ్మదు అబ్ను అల్ అలాయి అబూ కురైబిన్ హద్దథనా ఇబ్ను అల్ ముబారకి వ అబ్నుఇద్రీస వ అబూ ఉసామత కుల్లుహుమ్ అన్ బురైదిన్ అన్ అబీ బుర్దత అన్ ఇబీ ముసా ఖాల, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ “అల్ ముఁమిను లిల్ ముఁమిని కల్ బున్యాని యషుద్దు బఆదుహు బఆదన్” థుమ్మ షబ్బక బైన అశాబిఇహి. రవాహ్ సహీ బుఖారి.

అస్సనద్ (ఉల్లేఖకుల పరంపర) సహీ బుఖారీ హదీథ్ గ్రంధకర్త ← అబూబక్రి అబ్ను అబి షయ్బత ← అబూ ఆమిరిన్ అల్ అష్అరియ్యు ← అబ్దుల్లాహి అబ్నుఇద్రీస ← అబూఉసామత ←అన్ బురైదిన్ ←అన్ అబీబుర్దత ← అన్ అబీముసా (రదిఅల్లాహుఅన్హు)← ప్రవక్త సల్లల్లాహుఅలైహి వసల్లం ప్రకటించారు.

అల్ మతన్ (బోధించిన అసలు విషయం) “ఒక విశ్వాసికి, మరొక విశ్వాసికి, మధ్య సంబంధం ఎంత దృఢంగా ఉండాలంటే ఒకరి వలన మరొకరికి బలం, శక్తి చేకూరాలి” తరువాత వారు తన చేతి వ్రేళ్ళను ఒకదానిలో మరొకటి జొప్పించటం ద్వారా అవి ఎంత బలంగా మారతాయో ప్రదర్శించారు. సహీ బుఖారి హదీథ్ గ్రంధం.

హదీథ్ వివరణ

పరస్పరం ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకునే విశ్వాసులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకదానికొకటి బలాన్నిస్తూ కట్టడాన్ని (ఇంటిని) పటిష్టంగా ఉంచే వేర్వేరు ఇటుకరాళ్ళతో, ఇతర భాగాలతో పోల్చారు. ఎందుకంటే ఏ భవనమైనా (ఇల్లయినా) సరే దాని నిర్మాణం పూర్తియినదని మరియు నివాసయోగ్యంగా ఉందనీ చెప్పాలంటే, దానిలోని విభిన్న భాగాలు, కట్టడంలోని ఇటుకరాళ్ళు ఒకదానినొకటి గట్టిగా అంటిపెట్టుకుని ఉండి, భవనాన్ని దృఢ పర్చాలి. అలా కాని పక్షంలో, ఆ ఇంట్లోని గోడల్లో పగుళ్ళు వచ్చి కొంతకాలం తర్వాత మొత్తం భవనమే కూలిపోతుంది. ఒక ముస్లిం ఇతరుల తోడ్పాటు లేకుండా ఒక్కడే ఇస్లామీయ పద్ధతి ప్రకారం జీవించటం మరియు రోజువారి ఆరాధనలు చేయటం చాలా కష్టం.

హదీథ్ ఉల్లేఖకుడి పరిచయం

అబు మూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ బిన్ ముస్లిం అల్ అష్అరీ ప్రసిద్ధి చెందిన సహచరులలో ఒకరు. కూఫా పట్టణంలో నివసించేవారు. 50వ హిజ్రీ సంవత్సరంలో చనిపోయారు.

ఈ హదీథ్ యొక్క ప్రయోజనాలు (లాభాలు):

 1. కట్టడం, ఇటుకరాళ్ళు వంటి మామూలు ఉదాహరణలు ఇవ్వటం వలన అసలు విషయం సులభంగా అర్థం అవుతుంది. అందులోని సారం కూడా తేలికగా తెలుస్తుంది.
 2. ముస్లింల మధ్య సహాయసహకారములు ద్వారా వారి దైవవిశ్వసం (ఈమాన్) బలపడుతుంది మరియు వారిని బలవంతులుగా చేస్తుంది.
 3. ముస్లిం ల మధ్య సహాయసహకారముల బంధం కోసం ప్రయత్నించాలి మరియు స్థాపించాలి.

ప్రశ్నలు

 1. ప్రజలు ఎలా సహాయసహకారాలందించుకోవాలి?
 2. అబు మూసా అష్అరీ రదియల్లాహు అన్హు గురించి వ్రాయండి.
 3. ఈ హదీథ్ ద్వారా సమాజానికి కలిగే ప్రయోజనాలు వ్రాయండి.

Source : హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

హదీథ్ – రెండవ స్థాయి

హదీథ్ – రెండవ స్థాయి  [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  ముహమ్మద్ కరీముల్లాహ్

హదీథ్ – మొదటి స్థాయి [తెలుగు]

హదీథ్ – మొదటి స్థాయి [తెలుగు]
(రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

 1. చిత్తశుద్ధి తో పనిచేయటం – Performing Deeds with Sincerity

 2. మర్యాదపూర్వక సంభాషణ & స్నేహపూర్వక కలయిక

 3. ధర్మప్రచారం మరియు దాని ప్రతిఫలం

 4. అన్నపానీయములు సేవించే విధానం

 5. ఇస్లాం ధర్మంలో తుమ్మినప్పుడు ఆచరించవలసిన పధ్దతి

 6. సత్యం పలకటాన్ని ప్రోత్సహించటం-అసత్యం పలకటాన్ని నిరోధించటం

 7. అభివాదము & అన్నదానం యొక్క ఔన్నత్యం (Greeting with Salam & Feeding Poor)

 8. కాలకృత్యాలు తీర్చుకునే పద్ధతి (Dua while entering and exiting from toilet)

 9. కోపతాపాల గురించి హెచ్చరిక (warning about becoming angry)

 10. నైతిక ప్రవర్తన (నీతిబద్ధమైన నడవడిక) – Good Character

 11. క్షమాగుణం & సహనశీలత్వం (Patience & Forgiveness)

 12. స్నేహితుల ప్రభావం (Influence of friends)

 13. నాలుకతో & చేతితో ఇతరులకు కష్టం, నష్టం కలిగించకూడదు (Harming others with tongue and hands)

 14. ముస్లింలు విధిగా ఒకరినొకరు ప్రేమించాలి (Muslims loving each other)

ముస్లింలు విధిగా ఒకరినొకరు ప్రేమించాలి (Muslims loving each other)

హదీథ్׃ 14

وجوب محبة المسلم لأخيه

ముస్లింలు విధిగా ఒకరినొకరు ప్రేమించాలి (ప్రేమాభిమానలతో గౌరవించాలి)

عَنْ أَنَسٍ رضى الله عنه عَنِ النَّبِىِّ ^ قَالَ: لَا يُوْمِنُ أَحَدَكُمْ حَتَّى يُحِبَّ لِأَخِيْهِ مَا يُحِبُّ لِنَفْسِهِ (رواه البخاري)

అన్ అనస్ ఇబ్నె మాలికి రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఖాల, ″లా యూమిను అహదకుమ్ హత్తా యుహిబ్బ లిఅఖీహి, మా యుహిబ్బు లి నఫ్ సిహి″

తాత్పర్యం:- అన్ = ఉల్లేఖన, అనస్ ఇబ్నె మాలికి = ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క సహచరుడు(సహాబి), రదియల్లాహు అన్హు = అల్లాహ్ వారితో ఇష్టపడుగాక, అనిన్నబియ్యి = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రకటించారు,  ఖాల = తెలిపారు, లా = కాదు,  యూమిను = విశ్వాసి , అహదకుమ్ = మీలో ఎవరూ, హత్తా = అప్పటి వరకు,  యుహిబ్బ = కోరుకోవటం, లి = కోసం, అఖీహి = తోటి సోదరుడి, మా = ఏదైతే, యుహిబ్బు = కోరుకోవటం, లి = కోసం, నఫ్సిహి = తనకోసం .

అనువాదం:-అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా అన్నారు “మీలో ఒక్కరు కూడా అప్పటి వరకూ నిజమైన విశ్వాసి కాజాలరు. (ఎప్పటివరకూ అంటే) మీరు మీ కొరకు దేనినైతే ఇష్టపడతారో మీ తోటి ముస్లిం సోదరునికి కూడా (అలాంటిదే ఉండాలని) ఆవిధంగానే ఉండాలని (మనస్పూర్తిగా) కోరుకోనంతవరకు.” సహీబుఖారి హదీథ్ గ్రంథం

వివరణ:- ఈ హదీథ్, ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరులను విధిగా ప్రేమించాలనీ, గౌరవించాలనీ తెలియజేయు చున్నది. ఇస్లాంలో అనుమతించబడిన మేరకు – మన ముస్లిం సోదరుల ఆశలు, ఆశయాలు సాకారం అయ్యేలా మనం వారికి అన్ని విధాలా సహాయం చేయాలి, సహకరించాలి. ఈ హదీథ్ సోదర ముస్లింల పట్ల సమానత్వం వైపునకు, వారి పట్ల మసం చూపవలసిన పరస్పర గౌరవం, వినయం, వినమ్రత వైపుకు మన దృష్టిని మరల్చుచున్నది. మనలో నుండి తోటివారి పట్ల ద్వేషం, అసూయ, ఏహ్యభావం, హీనభావం మరియు మన తోటి ముస్లిం సోదరుల పట్ల మోసపూరిత ఆలోచనలను దూరం చేసుకోనంత వరకు, వారిపట్ల (సహజసిద్ధమైన) ప్రేమ, అభిమానం, గౌరవం మనలో పుట్టుకురావు అని గమనించాలి.

ఈ హదీథ్ ఆచరించడం వలన కలిగే లాభాలు:-

 1. మనతోటి ముస్లిం సోదరులను ప్రేమించడం లేక అసహ్యించుకోవడం (అంటే మన అంతరంగ మరియు బహిర్గత ప్రవర్తన) అనేవి అల్లాహ్ పట్ల మనలోని సంపూర్ణమైన విశ్వాసాన్ని పరీక్షించే గీటురాళ్ళ వంటి విషయాలలో ఇవి కూడా ఉన్నాయని గమనించాలి.
 2. తోటివారిపట్ల అసూయా, ద్వేషభావాలు – అల్లాహ్ పట్ల మనలోని విశ్వాసాన్ని తగ్గిస్తాయి.
 3. మన తోటివారు మంచిగా ఉండాలని కోరుకోవడం, అందుకని వారికి సహాయసహకారాలు అందజేయడం, వారిని చెడు మరియు తప్పుడు మార్గాల నుండి వారించడం అనేవి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే మనలో వారిపట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయనడానికి నిదర్శనం.
 4. ఇతరుల బాగోగుల గురించి ఆలోచించక, అన్ని మంచి విషయాలు మనకే సొంతం అవ్వాలనుకునే  స్వార్ధపరత్వం, నీచమనస్తత్వం గురించి ఈ హదీథ్ మనల్ని హెచ్చరిస్తున్నది.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:- ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పేరు అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహి అన్హు. వీరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) సేవలో తన జీవితాన్ని గడిపారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) యొక్క హదీథ్ లు ఎక్కువగా ఉల్లేఖించిన వారిలో వీరి పేరు కూడా ఉంది.

ప్రశ్నలు

 1. మీరు మీ కొరకు దేనినైతే ఇష్టపడతారో మీ తోటి ముస్లిం సోదరునికి కూడా     _____________________________________ (మనస్పూర్తిగా) కోరుకోవాలి.
 2. ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరులను_____ప్రేమించాలి మరియు గౌరవించాలి.
 3. సోదర ముస్లింల పట్ల సమానత్వం, పరస్పర గౌరవం, వినయం, వినమ్రతం చూపటమనేది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పాటించాలా? లేక వారి నుండి తమ అవసరాలు తీర్చుకోవడానికా?
 4. ఈ హదీథ్  అమలు చేయటం ద్వారా సమాజంలో ఎటువంటి మార్పులు వస్తాయి?

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

నాలుకతో & చేతితో ఇతరులకు కష్టం, నష్టం కలిగించకూడదు (Harming others with tongue and hands)

నాలుకతో & చేతితో  ఇతరులకు కష్టం, నష్టం కలిగించకూడదు : హదీథ్׃ 13

:  فظ اللسان واليد من التعدي

عَنْ  أَبِي مُوْسى  الْأَشْعَرِيِّ  رَضِي اللهُ عَنْهُ   قَالَ : قُلْتُ ” يَا  رَسُوْلُ  اللهِ ! أَيُّ الْإِسْلَامِ أَفْضَلُ؟

قَالَ : “مَنْ سَلِمَ الْـمُسْلِمُوْنَ مِنْ لِسَانِهِ وَيَدِهِ”. رَوَاهُ الْبُخَارِي

అన్ అబి మూస అల్అషఅరీ రదియల్లాహు అన్హు ఖాల : ఖుల్తు యా రసూలుల్లాహ్! ఐయ్యుల్ ఇస్లామి అఫ్దలు? ” ఖాల – మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహి, యదిహి ” రవాహ్ అల్ బుఖారి.

తాత్పర్యం : – అన్  =  ఉల్లేఖించారు, అబి మూస అల్అషఅరీ =  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు  =  అల్లాహ్ ఆయనను ఇష్టపడుగాక, ఖాల  =  చెప్పారు,  ఖుల్తు యా రసూలుల్లాహ్ =  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను వారిలా ప్రశ్నించారు, ఐయ్యుల్ ఇస్లామి =  ఇస్లాంలో ఏది, అఫ్దలు =  ఉత్తమమైనది,  ఖాల =  చెప్పారు, మన్ =  ఎవరు,  సలిమ  =  భద్రత కలిగించటం, అల్  ముస్లిమూన  =  (ఇతర) ముస్లింలకు, మిన్ = నుండి,  లిసానిహి  =  అతడి నాలుక,  వ  =  మరియు,  యదిహి  =  అతడి చేతి (నుండి).

అనువాదం :- అబిమూస అల్ అషఅరీ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను “ఇస్లాంలో ఉత్తమమైనది ఏది?” అని ప్రశ్నించగా, వారు ఇలా జవాబు చెప్పారు “ఇతర ముస్లింలు ఎవరి చేయి మరియు నాలుక నుండి భద్రత పొందుతారో (ఇతర ముస్లింలపై నోటితో మరియు చేతితో దాడి చెయ్యకపోవటం ఉత్తమమైనది)” సహీబుఖారి

వివరణ :- మన నాలుక (తిట్లు తిట్టడం,దుర్భాషలాటడం) ద్వారా ఇతర ముస్లింలకు ఎటువంటి కష్టం కలిగించకూడదనే విషయాన్ని ఈ హదీథ్ స్పష్టంగా తెలియజేస్తున్నది. మన హృదయభావాలను నిర్దిష్టంగా, స్పష్టంగా, ఖచ్ఛితంగా ప్రకటించే శక్తిసామర్ధ్యాలు ఒక్క నాలుకకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి  ఇక్కడ నాలుక ను ప్రత్యేకంగా పేర్కొన్నారు.  ఇంకా మన చేతుల ద్వారా ఇతర ముస్లింలకు ఎలాంటి కష్టం, నష్టం కలిగించకూడదని ఈ హదీథ్ స్పష్టంగా ప్రకటిస్తున్నది. మన ఆలోచనల, భావాల ఆచరణకు తరచుగా చేతులనే వాడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చేయి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఈ హదీథ్ ఆచరించడం వలన కలిగే లాభాలు:-

 1. ఎంత అల్పమైనవైనా సరే, ఇతరుల హక్కులను ఉల్లంఘించటం, అతిక్రమించడం ఎంత మాత్రమూ తగదు. “అల్లాహ్ జ్ఞానం నుండి మన ఆలోచనలు,మాటలు, చేతలు ఏ సమయంలోనూ తప్పించకోలేవు” అనే నగ్నసత్యాన్ని అన్నివేళలా గుర్తించుకోవలెను.
 2. ఇతరులకు హాని, అపాయం కలిగించనివారే ఉత్తమమైన ముస్లింలు.
 3. తిట్లు తిట్టడం, నిందలు మొపటం, శాపనార్ధాలు పెట్టడం, జుగుప్సాకరమైన కలహించే స్వభావం గల దుర్భాషలాడటం  తగదు.
 4. ఇతరులకు ఇష్టంలేని వాటిని ప్రస్తావించడం కూడా వారికి హాని కలిగించడమే.
 5. ఇతరుల అనుమతి లేకుండా వారి వస్తువులను తాకకూడదు, అస్సలు తీసుకోకూడదు.

హదీథ్ ను ఉల్లేఖించినవారి పరిచయం:

ఈ హదీథ్ ను ఉల్లేఖించిన వారి పూర్తి పేరు అబిమూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ బిన్ ముస్లిం అష్అరీ రదియల్లాహు అన్హు. బాగా ప్రసిద్ధి చెందిన ప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లమ్) సహచరులలో వీరు కూడా ఒకరు. కూఫా పట్టణానికి గవర్నర్ గా సేవలందించారు. 50వ హిజ్రీ సంవత్సరంలో  మరణించారు.

ప్రశ్నలు

 1. యా రసూలుల్లాహ్! ఐయ్యుల్ ఇస్లామి అఫ్దలు?” ఖాల – మన్ సలిమల్ ముస్లిమూన మిన్ ________, _________
 2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ను “ఇస్లాంలో ఉత్తమమైనది ఏది?” అని ప్రశ్నించగా, వారు ఇలా జవాబు చెప్పారు “ఇతరులు ఎవరి ______మరియు ______ నుండి భద్రత పొందుతారో.
 3. ఇతర ముస్లింల పై నోటితో మరియు చేతితో దాడి చెయ్యక పోవటం _________
 4. మన నాలుక (తిట్లు తిట్టడం) ద్వారా ఇతరులకు _________ కలిగించకూడదు.
 5. మన హృదయభావాలను నిర్దిష్టంగా, స్పష్టంగా, ఖచ్చితంగా ప్రకటించే శక్తిసామర్ధ్యాలు ఒక్క _________ మాత్రమే ఉన్నాయి.
 6. మన చేతుల ద్వారా ఇతర ముస్లింలకు ఎలాంటి _________ కలిగించకూడదు.
 7. మన ఆలోచనల, భావాల _________ కు తరచుగా చేతులనే వాడటం జరుగుతుంది.
 8. ఎంత అల్పమైనవైనా సరే, ఇతరుల హక్కులను ఉల్లంఘించటం, అతిక్రమించడం ఎంత మాత్రమూ _________.
 9. “అల్లాహ్ జ్ఞానం నుండి మన ఆలోచనలు, మాటలు, చేతలు _________________

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

స్నేహితుల ప్రభావం (Influence of friends)

friendsహదీథ్ ׃ 12

: స్నేహితుల ప్రభావం : تأثير الأصدقاء على الإنسان

عَنْ أَبِىْ مُوْسى الْأَشْعَرِي  رَضِي الله عَنْهُ قَالَ،  قَالَ رَسُوْلُ  اللهِ  صَلَّى اللهُ عَلَيهِ وَسَلَّمْ  : ” إِنَّمـَا مَثَلُ الْـجَلِيْسِ الصَّالِحِ وَ الْسُّوْءِ كَحَامِلِ  الـْمِسْكِ،  وَنَافِخِ الْكِيْرِ،  فَحَامِلُ  الْـمِسْكِ،  إِمَّا أَنْ يـُحْذِيَكَ،  وَ إِمَّا أَنْ  تَبْتَاعَ  مِنْهُ،  وَإِمَّا أَنْ تَـجِدَ مِنْهُ  رِيْـحًا طَـيِّـبـَةً،  وَنَافِخُ  الْكِيْرِ  إِمَّا أَنْ يـُّحْرِقَ  ثِيَابَكَ،  وَ إِمَّا أَنْ تـَجِدَ  رِيـْحًا خَبِيْثَةً “ .رواه البخارى

అన్ అబి మూసా అల్ అష్అరీ రదియల్లాహు అన్హు ఖాల, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం: “ఇన్నమా మథలుల్  జలీసిశ్శాలెహి వస్సూయి, కహామిలిల్ మిస్కి , వ నాఫిఖిల్ కీర్, ఫహామిలుల్ మిస్కి, ఇమ్మా ఐయుహ్ దియక, వ ఇమ్మా అన్   తబ్ తాఅ  మిన్ హు, వ ఇమ్మా అన్ తజిద మిన్ హు రీహన్ తయ్యిబ, వ నాఫిఖుల్ కీరి, ఇమ్మా అన్ యుహ్ రిఖ థియాబక్, వ ఇమ్మా అన్ తజిద రీహన్ ఖబీథతన్” బుఖారి.

తాత్పర్యం :- అన్ = ఉల్లేఖించారు, అబి మూసా అల్ అషఅరీ = ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం  యొక్క సహచరుడు. రదియల్లాహు అన్హు = అల్లాహ్ ఆయనను ఆమోదించుగాక, ఖాల = చెప్పారు, ఖాల  రసూలల్లాహ్ =  ప్రవక్త తెలిపారు, సల్లల్లాహు అలైహివసల్లం = అల్లాహ్ ఆయనపై శాంతి పంపుగాక,  ఇన్నమ =  నిశ్చయంగా, మథలుల్ = ఉదాహరణ,  జలీసి = తో ఉండటం (కలిసి), శ్శాలెహి = పుణ్యవంతులు, వస్సూయి = దుర్గుణాలు కలవారు(పాపాత్ములు), క = పోలిక, హామిలిల్ మిస్కి = కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారు, వ = మరియు, నాఫిఖిల్ కీరి =కమ్మరివాడు.

ఫ = అలాగే, హామిలుల్ మిస్కి = కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారు, ఇమ్మా = రెంటిలో ఒకటి (అదిగాని, ఇదిగాని), ఐ యుహ్ దియక = బహుమతిగా పొందటం, వ = మరియు, ఇమ్మా = లేక,  అన్ తబ్ తాఅ = కొనటం,  మిన్ హు = అతని వద్ద నుంచి, వ = మరియు, ఇమ్మా = లేక,  అన్ తజిద = పొందటం, లభించటం, మిన్ హు = అతని వద్ద నుంచి, రీహన్ = వాసన, తయ్యిబ = మంచి, వ = మరియు, నాఫిఖుల్ కీరి = కమ్మరివాడు, ఇమ్మా = లేక, అన్ యుహ్ రిఖ = కాల్చబడటం, థియాబక = దుస్తులు, వ = మరియు, ఇమ్మా = లేక, అన్ తజిద = పొందటం, లభించటం, రీహన్ = వాసన, ఖబీథన్ = దుర్వాసన

అనువాదం:-అబి మూసా అల్ అష్ అరీ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు “పుణ్యపురుషుల మరియు దుర్గుణాలు కలవారి సహచర్యం యొక్క ఉదాహరణ కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారి మరియు కమ్మరి పని చేసే వారి సహచర్యంతో పోలి ఉన్నది. కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారి నుండి బహుమతిగా (ఉచితంగా) మీకు కస్తూరి లభించవచ్చు లేక మీరు అతడి నుండి కస్తూరిని కొనుక్కోవచ్చు లేక మీకు సువాసన లభిస్తుంది (మీ దుస్తులు సువాసనను పీల్చుకుంటాయి). దీనికి భిన్నంగా కమ్మరి పని చేసే వారి దగ్గర ఉండటం (అగ్ని రవ్వలు పడటం) వలన మీ దుస్తులు కాలి పోతాయి లేక వాని నుండి చెడువాసన (దుర్గంధం) లభిస్తుంది.

వివరణ:- ఈ హదీథ్ లో మంచి గుణాలుకలవారి మరియు పుణ్యపురుషుల సహచర్యం యొక్క ఆవశ్యకత చాలా వివరంగా ఉదాహరణలతో తెలుపబడినది. ఇదేవిధంగా చెడు వారి (దుర్గుణాలు కలవారి) నుండి దూరంగా ఉండమనే హెచ్చరిక కూడా చేయబడినది. మంచివారితో చేసే స్నేహాన్ని సుగంధాలమ్మే వారి స్నేహంతో మరియు చెడువారితో చేసే స్నేహం కమ్మరిపని చేసేవారి స్నేహంతో పోల్చబడినది. అదేవిధంగా పుణ్యపురుషులతో ఉండటం వలన మంచి పనులు చేయటంలో ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే  చెడువారితో ఉండటం వలన చెడు పనులు చేయటంలో ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ హదీథ్ వలన కలిగే లాభలు:-

 1. మంచి వారితో కలసి ఉండవలెను మరియు మన పిల్లలను కూడా మంచి వాళ్ళతో కలసి ఉండేటట్లు చూడవలెను.
 2. మంచి మరియు చెడు అలవాట్లు అలవర్చుకోవటంలో మన మీద మన స్నేహితుల ప్రభావం ఉంటుంది.
 3. అల్లాహ్ చూపిన దారిలో నడిచేవారితో ఉండటం వలన మీకు ఉపయోగం కలుగుతుంది.
 4. పుణ్యపురుషులు మంచిపనులు చేయటానికి మరియు చెడు పనులు చేయకుండా ఉండటానికి సహాయం చేస్తారు.
 5. మనతోటి ముస్లిం సోదరులను నమాజు చదవకుండా ఉండేవాళ్ళ స్నేహం నుండి, సిగరెట్ తాగటం, జూదం ఆడటం వంటి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళ స్నేహం నుండి ఆపటం,కాపాడటం ప్రతి ముస్లిం బాధ్యత.

హదీథ్  ఉల్లేఖించినవారి పరిచయం:- అబు మూసా అబ్దుల్లాహ్ బిన్ ఖైస్ బిన్ ముస్లిం అల్ అషఅరీ రదియల్లాహు అన్హు ప్రసిద్ధి చెందిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని వారు. కూఫాపట్టణ గవర్నర్ గా  పనిచేసారు. 50హి సంవత్సరంలో చనిపోయారు. వీరు మృదుమధురంగా ఖుర్ఆన్ పఠనం చేసేవారు.

ప్రశ్నలు

 1. “ఇన్నమ మథలుల్  జలీసిశ్శాలెహి వస్సూయి, కహామిలిల్ మిస్కి , వ నాఫిఖిల్ కీరి, ఫహామిలుల్ మిస్కి, ఇమ్మా ఐ ________, వ ఇమ్మా అన్ ________మిన్ హు, వ ఇమ్మా అన్ తజిద మిన్ హు రీహన్ ________, వ నాఫిఖుల్ కీరి, ఇమ్మా అన్ ________ థియాబక, వ ఇమ్మా అన్ తజిద రీహన్ ________” బుఖారి.
 2. పుణ్యపురుషుల యొక్క స్నేహం ________ అమ్మేవారితోటి స్నేహం లాంటిది.
 3. ______________యొక్క స్నేహం కొలిమిలో పని చేసే కమ్మరివారి స్నేహం లాంటిది.
 4. కస్తూరి (వంటి సుగంధాలు) అమ్మేవారి నుండి మీకు ఏ ఏ లాభాలు కలగవచ్చు?
 5. కమ్మరి పని చేసే వారి దగ్గరకు పోవటం వలన మీకు ఏ ఏ నష్టాలు కలగవచ్చు?
 6. మంచి గుణాలుకలవారి స్నేహం మంచిదా లేక దుష్టుల స్నేహం మంచిదా?
 7. కనీసం 5 మంచిగుణాలను, 5 చెడుగుణాలను వ్రాయండి.
 8. మంచిగుణం మరియు చెడు గుణం నిర్వచించండి.
 9. చెడువారి (దుర్గుణాలు కలవారి) నుండి ________ ఉండవలెను.
 10. పుణ్యపురుషులతో ఉండటం వలన ________ చేయటం లో ప్రోత్సాహం లభిస్తుంది.
 11. చెడువారితో ఉండటం వలన ________ చేయటం లో ప్రోత్సాహం లభిస్తుంది.
 12. మంచి వారితో ________ ఉండవలెను మరియు మన పిల్లలను కూడా మంచి వాళ్ళతో _______  ఉండేటట్లు చూడవలెను.
 13. మంచి మరియు చెడు అలవాట్లు అలవర్చుకోవటంలో మన మీద మన స్నేహితుల ________  ఉంటుంది.
 14. అల్లాహ్ చూపిన దారిలో నడిచేవారితో ఉండటం వలన మీకు _____  కలుగుతుంది.
 15. పుణ్యపురుషులు మంచిపనులు చేయటానికి మరియు చెడు పనులు చేయకుండా ఉండటానికి ________  చేస్తారు.
 16. మనతోటి ముస్లిం సోదరులను నమాజు చదవకుండా ఉండేవాళ్ళ స్నేహం నుండి, సిగరెట్ తాగటం మరియు జూదం ఆడటం వంటి చెడు అలవాట్లు ఉన్నవాళ్ళ స్నేహం నుండి కాపాడటం ప్రతి ముస్లిం ________
 17. అబు మూసా అబ్దుల్లాహ్ అల్ అషఅరీ రదియల్లాహు అన్హు గురించి వ్రాయండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా

క్షమాగుణం & సహనశీలత్వం (Patience & Forgiveness)

హదీథ్׃ 11

క్షమాగుణం & సహనశీలత్వం العفو والتسامح

عَنْ عَاﺋِـشَةَ رضى الله عنها أَنَّهَا قَالَتْ : مَا خُيِّرَ رَسُوْلُ اللهِ ^  بَيْنَ أَمْرَيْنِ ﺇِلاَّ أَخَذَ أَيْسَرَهُمَا مَا لَـمْ يَكُنْ ﺇِثْماً ، فَإِنْ كَانَ ﺇِثْماً كَانَ أَبْعَدَ النَّاسِ مِنْهُ ، وَ مَا اَنْتَقَمَ رَسُولُ اللهِ ^ لِنَفْسِهِ ﺇِلاَّ أَنْ تُنْتَهَكَ حُرْمَةُ اللهِ فَيَنْـتَـقِمُ ِللهِ بِهَا (رواه البخارى)

అన్ ఆయిషత  రదియల్లాహు అన్హా  అన్నహా ఖాలత్ – మా ఖుయ్యిర ర్రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం,  బైన అమరైని, ఇల్లా అఖద ఐసర హుమా మాలమ్ యకున్ ఇథ్మన్, ఫఇన్ కాన, ఇథ్మన్, కాన అబ్ అదన్నాసి మిన్హు, వమా అన్ తఖమ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లినఫ్ సిహి, ఇల్లా అన్ తున్ తహక, హుర్ మతుల్లాహి ఫయన్ తఖిము లిల్లాహి బిహా” రవాహ్ బుఖారి మరియు ముస్లిం.

తాత్పర్యం:- అన్ =ఉల్లేఖన, ఆయిషత  రదియల్లాహు అన్హా = ఆయిష అనే పేరు గల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య, అన్నహా, ఖాలత్ = ఖచ్ఛితంగా ఆవిడ చెప్పారు, మా ఖుయ్యిర = ఎన్నుకునేవారు కాదు,  రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం = ప్రవక్త, బైన = మధ్య, అమరైని = రెండు విషయాల, ఇల్లా = కాని (తప్పక), అఖద = ఎన్నుకున్నారు, ఐసర హుమా = ఆ రెండు విషయాలలో తేలికైనది (సులభమైనది), మాలమ్ యకున్ = అప్పటివరకు జరగకపోవటం,  ఇథ్మన్ = అపరాథం, ఫఇన్ = కాని,  కాన = జరగటం , ఇథ్మన్ = అపరాధం, కాన = ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఉండేవారు, అబ్ అదన్నాసి = ప్రజలలో అందరికంటే దూరంగా, మిన్హు = దానినుండి , వ = మరియు ,  మా ఇన్ తఖమ = ప్రతీకారం తీసుకోలేదు, రసూలుల్లాహి = ప్రవక్త,  సల్లల్లాహు అలైహి వసల్లం  = అల్లాహ్ ఆయనను ఉన్నతస్థానానికి చేర్చుగాక, లి నఫ్ సిహి = తనకోసం, ఇల్లా = కాని, అన్ తున్ తహక = నష్టం కలిగించటం, హుర్ మతుల్లాహి = అల్లాహ్ ద్వారా నిషేధించబడినవి, ఫయన్ తఖిము = వారు ప్రతీకారం తీసుకునేవారు, లిల్లాహి బిహా = కేవలం అల్లాహ్ కోసం. సహీబుఖారి మరియు సహీముస్లిం హదీథ్ గ్రంథాలలో రికార్డుచేయబడినది.

అనువాదం:- ఆయిష రదియల్లాహు అన్హా  ఇలా ఉల్లేఖించారు – ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలలో ఏదో ఒకటి ఎన్నుకునే అవకాశం ఉన్నట్లైతే, అపరాధం (దైవశాసనానికి వ్యతిరేకం) కానంతవరకు వారు తేలికైన విషయాన్నే ఎంచుకునేవారు. కానీ ఒకవేళ అది అపరాధమైనదైతే (దైవశాసనానికి వ్యతిరేకమైన విషయమైతే), ప్రజలందరిలోను ఆయనే దానికి ఎక్కువ దూరంగా ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన (వ్యక్తిగత కారణాల) కోసం ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రతీకారం తీర్చుకోలేదు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఆదేశాలకు నష్టం కలుగుతుందో అటువంటి సందర్భాలలో వారు అల్లాహ్ కోసం ప్రతీకారం తీర్చుకునే వారు. [బుఖారి మరియు ముస్లిం ]

వివరణ:- ఇస్లాం సౌలభ్యతకు, తద్వారా శాంతికీ, సహనానికి ఉదాహరణ అని ఈ హదీథ్ తెలియపర్చుచున్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ ఉత్తమమైన విషయాలనే బోధించారు. అపరాధపు గుర్తులు ఏమాత్రం కనిపించినా మిగతా వారందరి కంటే ముందుగా అటువంటి విషయాలకు దూరమయ్యేవారు. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనపై జరిగిన ఏవిధమైన హింసాయుత సంఘటనకు, అందులో పాల్గొన్నవారిపై ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా వారిని శిక్షించే అవకాశమున్నా  వారిని క్షమించి వదిలివేసారు. తన పై కత్తి దూసి దుర్భాషలాడిన అరబ్ ఎడారి వాసినీ, తన మెడలో కండువా (అంగవస్త్రం)వేసి – కనుగ్రుడ్లు ఉబికి వచ్చేటంత విపరీతంగా చుట్టి (మెలివేసి), గుంజి, తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన మరో వ్యక్తినీ క్షమించి వదిలివేయడం – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క క్షమాగుణానికి, సహనానికి ప్రతీకలు.

అల్లాహ్ యొక్క పవిత్రతకు, ఔన్నత్యానికీ, గౌరవానికీ భంగం కలిగించిన వారి విషయంలో అల్లాహ్ కోసం తప్ప తన వ్యక్తిగత కారణాలకోసం ఎప్పుడూ ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోని కరుణామూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పై ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ హదీథ్ అమలు చేయడం వలన కలిగే లాభాలు :-

 1. ఇస్లాం – అపరాధం (అల్లాహ్ శాసనానికి వ్యతిరాకం) కానంతవరకూ, అన్ని విషయాల్లోనూ సౌలభ్యానికీ, సహనానికీ పెద్దపీట వేసే ధర్మం అని గమనించాలి
 2. క్షమాగుణం, సహనం ముస్లింలలో సామరస్యానికీ, భ్రాతృత్వానికీ దారి తీస్తాయి.
 3. క్షమాగుణం, సహనం, ఓర్పు పాటించడంలో  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను  ఉదాహరణగా తీసుకోవాలి.
 4. విశ్వాసులలో ఇతరులను క్షమించే గుణం కలవారు, సహనశీలురు అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం పొందుతారనే విషయాన్ని గర్తుంచుకోవాలి.
 5. క్షమాగుణం, సహనశీలత అనేవి మానవహక్కులకు సంబంధించినవే కానీ, భగవద్దత్తమైన (Divine Rights) హక్కులు కావు అని గమనించండి.
 6. క్షమాగుణం, సహనశీలత అనేవి చేతగానితనం, బలహీనత, పిరికితనం వల్ల బయటపడే గుణాలు కావు. కేవలం అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందే ఆకాంక్ష మాత్రమే వాటిని ప్రేరేపిస్తుంది.
 7. చెడును వ్యతిరేకించకపోవడం క్షమాగుణం, సహనశీలత కానేకావు.

హదీథ్  ఉల్లేఖించినవారి పరిచయం :- ఆయిషత  రదియల్లాహు అన్హా  విశ్వాసులందరికీ తల్లిలాంటివారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరు. వీరు అబూబకర్ సిద్ధీఖ్ రదియల్లాహు అన్హు కుమార్తె. ఇస్లాం కు సంబంధించిన విషయంలో వీరు ఒక గొప్ప విద్యావేత్త (ఫఖీ) గానూ, నిష్ణాతురాలిగానూ పేరు గాంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులలో చాలా వరకు వీరు ఉల్లేఖించినవే.

ప్రశ్నలు

 1. ఎప్పుడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలలో ఏ ఒక్కదానినైనా ఎన్నుకోవలసివస్తే, ______________________ కానంతవరకు వారు __________ విషయాన్నే ఎన్నుకునేవారు. కానీ ఒకవేళ అది ________________, దానిని పరిహరించడంలో (వర్జించు, దాని నుండి తొలగి ఉండు), చాలా__________ ఉండేవారు.
 2. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనపై ___________  అరేబియన్ ఎడారివాసినీ, తన మెడలో కండువా (అంగవస్త్రం)వేసి, కనుగ్రుడ్లు ఉబికి వచ్చేటంత కఠినంగా విపరీతంగా చుట్లుచుట్టి (మెలివేసి) గుంజి, తనను ___________  మరో వ్యక్తినీ క్షమించి వదిలివేశారు.
 3. తన మెడలో ________ వేసి, _________ ఉబికి వచ్చేటంత విపరీతంగా చుట్లుచుట్టి (మెలివేసి) గుంజిన మరో వ్యక్తినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షమించి వదిలివేశారు.
 4. ఇస్లాం – ___________ ___________  కానంతవరకూ, అన్ని విషయాల్లోనూ ___________, ___________  పెద్దపీట వేసే మతం అని గమనించాలి.
 5. _________, _________ముస్లింలలో సామరస్యానికీ, భ్రాతృత్వానికీ దారి తీస్తాయి.
 6. ______________, ______________ పాటించడంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఉదాహరణగా తీసుకోవాలి.
 7. విశ్వాసులలో – ఇతరులను ________గుణం కలవారు, _________ అల్లాహ్ వద్ద గొప్ప    _________  పొందుతారనే విషయాన్ని గర్తుంచుకోవాలి.
 8. క్షమాగుణం, సహనశీలత అనేవి ______________ సంబంధించినవే కానీ, భగవద్దత్తమైన  (Divine Rights) హక్కులు కావు అని గమనించండి.

Source : హదీథ్ – మొదటి స్థాయి (రబువ జాలియాత్ – రియాద్)
అనువాదం : –  సయ్యద్ యూసుఫ్ పాషా