https://youtu.be/-_0DITGNGCo – [60 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దుఆ వినండి:
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الثَّبَاتَ فِي الْأَمْرِ، وَالْعَزِيمَةَ عَلَى الرُّشْدِ، وَأَسْأَلُكَ مُوجِبَاتِ رَحْمَتِكَ، وَعَزَائِمَ مَغْفِرَتِكَ، وَأَسْأَلُكَ شُكْرَ نِعْمَتِكَ، وَحُسْنَ عِبَادَتِكَ، وَأَسْأَلُكَ قَلْبَاً سَلِيمَاً، وَلِسَانَاً صَادِقَاً، وَأَسْأَلُكَ مِنْ خَيْرِ مَا تَعْلَمُ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا تَعْلَمُ، وَأَسْتَغْفِرُكَ لِمَا تَعْلَمُ، إِنَّكَ أنْتَ عَلاَّمُ الْغُيُوبِ
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకస్సబాత ఫిల్ అమ్ర్ – ఓ అల్లాహ్! నాకు ధర్మంపై నిలకడ
వల్ అజీమత అలర్రుష్ద్ – మరియు విధేయేతలో దృఢత్వం ప్రసాదించమని కోరుతున్నాను
వఅస్అలుక మూజిబాతి రహ్మతిక్ – నీ కారుణ్యం తప్పనిసరిగా ప్రాప్తించే సత్కార్యాలు
వఅజాఇమ మగ్ ఫిరతిక్ – నీ క్షమాభిక్ష కూడా తప్పనిసరిగా ప్రాప్తించాలని వేడుకుంటున్నాను
వఅస్అలుక షుక్ర నిఅ మతిక్ – నేను అర్థిస్తున్నాను నీ అనుగ్రహాల కృతజ్ఞత భాగ్యం మరియు
వహుస్న ఇబాదతిక్ – నీ ఆరాధన ఉత్తమ రీతిలో చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించమని
వఅస్అలుక ఖల్బన్ సలీమా – నిష్కల్మషమైన మనస్సు ప్రసాదించమని
వలిసానన్ సాదిఖా – సత్యం పలికే నాలుక ప్రసాదించమని వేడుకుంటున్నాను
వఅస్అలుక మిన్ ఖైరి మా తఅ లమ్ – నీకు తెలిసి ఉన్న ప్రతి మేలు నీతో కోరుతున్నాను
వఅఊజు బిక మిన్ షర్రి మా తఅ లమ్ – నీకు తెలిసి ఉన్న ప్రతి కీడు నుండి శరణు ప్రసాదించు
వ అస్తగ్ ఫిరుక లిమా తల్ లమ్, – నీకు తెలిసి ఉన్న నా పాపాలన్నీ క్షమించుమని కోరుతున్నాను
ఇన్నక అంత అల్లాముల్ గుయూబ్ – నిశ్చయంగా నీవు అగోచరాల పరిపూర్ణ జ్ఞానం గలవాడివి
[ముఅ జమ్ కబీర్ తబ్రానీ 7135 | సహీహా 3228]
మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1